Annamayya
-
మట్టి టిప్పర్ ఢీకొని దంపతులకు గాయాలు
మదనపల్లె టౌన్ : అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్ ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులు, వారి కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం మదనపల్లె మండలం సీటీఎం రోడ్డు తట్టివారిపల్లె సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అనపగుట్టకు చెందిన లక్కీరాజు(30), లక్ష్మి(25), వారి కుమారుడు గోవింద రాజుతో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా, మట్టిని అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ వీరిని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ముగ్గురూ రోడ్డుపై పడిపోయి తీవ్ర గాయాల పాలయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం అందించారు. ప్రస్తుతం భార్యాభర్తలు, వారి కుమారుడి పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఘటనపై మదనపల్లె తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అక్రమ మట్టి రవాణా చేస్తున్న టిప్పర్‌కు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో భవన కార్మికుడు తీవ్రంగా గాయపడి మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో చేరాడు. ఆదివారం కురబలకోట మండలంలో జరిగిన రోడ్డు ప్రమదానికి సంబంధించి బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. బి.కొత్తకోటకు చెందిన కె.రమణ (45) భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రోజూ మాదిరిగానే ద్విచక్ర వాహనంలో మదనపల్లెకు బయలు దేరాడు. స్కూటర్ మార్గంమధ్యలోని కురబలకోట మండలం అంగళ్లు గ్రామం చేనేత నగర్ వద్దకు రాగానే.. కారు వచ్చి వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కాళ్లు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డ రమణను వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం తిరుపతి రుయాకు వెళ్లాలని రెఫర్ చేశారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు ఎస్సై మధురామ చంద్రుడు తెలిపారు. -
హెచ్ఐవీ బాధితులకు భరోసా ఇద్దాం
మదనపల్లె టౌన్: హెచ్ఐవీ బాధితులకు భరోసా ఇద్దామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య పేర్కొన్నారు.ఆదివారం మదనపల్లె లో అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీహెచ్హెచ్ఓ మాట్లాడుతూ.. హెచ్ఐవీ బాధితులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని తెలిపారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి క్లస్టర్ మేనేజర్ భాస్కర్ మాట్లాడుతూ..‘హెచ్ఐవీ బాధితుల్లో మనోధైర్యం నింపేందుకు ఐసీటీసీ కేంద్రాల్లో కౌన్సెలింగ్ ఇన్నామని తెలిపారు.అనంతరం మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించి, జిల్లా ఆసుపత్రి నుంచి బెంగళూరు బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. -
నిధులున్నా.. నిర్వహణ లేక
మదనపల్లె సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూ.228 కోట్లు. అంటే ఆర్థికంగా ఎంతో పరిపుష్టి కలిగిన మున్సిపాలిటీ అనేది అందరికీ అర్థమవుతుంది. అయితే మున్సిపల్ పరిపాలన భవనం మాత్రం అధ్వానంగా ఉంది. కనీస నిర్వహణ లేదు. వర్షం వస్తే ఉరుస్తుంది. స్లాబ్ పెచ్చులు ఉడుతున్నాయి. పెయింటింగ్ కూడా లేకపోవడంతో పెచ్చులకు వేసిన సున్నం ఊడి పడుతోంది. అధికారుల స్థాయికి తగ్గట్టుగా కనీస చాంబర్లు. భవనానికి మరమ్మతులు, నిర్వణ లేకపోవడంతో కనీసం రంగులు వేయించడం లేదు. దాంతో ఇది సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ అన్న పేరు గొప్ప అయినా.. పరిపాలన భవనం మాత్రం నగర పంచాయతీ స్థాయికి తగినట్టుగా ఉంది. ఇప్పటికై నా దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. –సాక్షి, మదనపల్లె -
బొప్పాయి.. ధర పడిపోయి..
● మార్కెట్లో కిలో రూ.12 ● నెల రోజుల కిందట రూ.28 ● సగానికి పైగా తగ్గిన రేటు ● ఆందోళనలో రైతులుగుర్రంకొండ : ఆరుగాలం కష్టపడి సాగు చేసిన బొప్పాయి పంటకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. మార్కెట్లో ధరలు భారీగా పతనమయ్యాయి. ప్రస్తుతం కిలో ధర రూ.12 వరకు ఉంది. నెల రోజుల ముందు రూ.28 వరకు పలికింది. ప్రస్తుతం సగానికిపైగా ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇవే ధరలు కొనసాగితే కనీసం పెట్టుబడి ఖర్చు కూడా వచ్చే పరిస్థితి ఉండదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరం బొప్పాయి సాగుకు దుక్కులు దగ్గర నుంచి నారుమొక్కలు, ఎరువులు, మందుల ఖర్చు, పంట కోతకొచ్చే వరకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు వస్తుంది. బయటి రాష్ట్రాల్లో మొదలైన దిగుబడి ఇక్కడ బొప్పాయి ధరలు పతనం కావడానికి ప్రధాన కారణం బయటి రాష్ట్రాల్లో బొప్పాయి దిగుబడి ప్రారంభం కావడమేనని వ్యాపార వర్గాలు అంటున్నాయి. వర్షాల కారణంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బొప్పాయి దిగుబడి అంతంత మాత్రంగానే ఉండేది. ప్రస్తుతం వర్షాలు కుదట పడడంతో అక్కడి రాష్ట్రాల్లో బొప్పాయి కోతలు మొదలయ్యాయి. దీంతో ఢిల్లీ, ముంబయి వంటి ప్రాంతాలకు ఆ రాష్ట్రాల బొప్పాయే వెళుతోంది. దీంతో ఇక్కడి బొప్పాయికి డిమాండ్ తగ్గడంతో ధరల పతనానికి కారణంగా చెప్పవచ్చు. తరలిపోతున్న వ్యాపారులు సాధారణంగా ఈ సీజన్లో బయటి రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడే మకాం వేస్తుంటారు. సుమారు ఆరు నెలల పాటు ఇక్కడే ఉంటూ పడమటి మండలాల్లోని బొప్పాయి తోటల వద్దకే వెళ్లి రైతులతో మాట్లాడి అక్కడే బొప్పాయిని కొనుగోలు చేస్తుంటారు. కూలీలు, వాహనాలను వారే తీసుకొచ్చి తోటల వద్దనే బొప్పాయిని కోత వేసి బయటి రాష్ట్రాలకు తరలించేవారు. ప్రస్తుతం బయటి రాష్ట్రాల్లోనే బొప్పాయి పంట దిగుబడి ప్రారంభం కావడంతో వ్యాపారులు ఒక్కొక్కరు తరలిపోతున్నారు. రవాణా ఖర్చులు కలిసి వస్తుండడంతో వారు అటువైపే మొగ్గు చూపున్నారు. ప్రస్తుతం లోకల్ వ్యాపారులే బొప్పాయిని కొనుగోలు చేసి బెంగళూరు, చెన్త్నె వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. -
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి
వాల్మీకిపురం : వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి సంఘం రాష్ట్ర నాయకుడు విష్ణుచైతన్య డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఆర్ఎంఎం కింగ్ ప్యాలెస్‌లో రాయలసీమ జోన్ వాల్మీకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అంతకు ముందు స్థానిక టీటీడీ కల్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి, పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు వాల్మీకులను అవసరాలకు ఉపయోగించుకొని, ఎన్నికల తర్వాత పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు బ్యాంకుగా చూస్తున్నారే కానీ.. సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. వాల్మీకులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి కమిటీలను వేసి ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులి కొండన్న, భాస్కర్, సురేష్, వెంకటరెడ్డి, ఈశ్వరయ్య, నాగరాజు, ఆనంద, గోవిందు, శ్రీనివాసులు, టైలర్ రామక్రిష్ణ, రామచంద్ర, అనిల్, రాజు, శ్రీనాథ్, వంశీ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
రామసముద్రం : మండలంలోని పెద్దకురప్పల్లి పంచాయతీ బసవన్నకట్టలో ఓ వివాహిత కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ హృషికేశవరెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బసవన్నకట్టకు చెందిన విజయ్ కుమారుడు తేజకు 2021లో శివయ్య కుమార్తె రమ్యను(22) ఇచ్చి వివాహం చేశారు. కొంత కాలంగా సంసార జీవితంలో కుటుంబ కలహాలు రావడంతో.. మనస్తాపానికి గురైన రమ్య శనివారం ఇంట్లో ఎలుకల నివారణ మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే రమ్యను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి తండ్రి శివయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. పిడుగుపాటుకు వృద్ధుడు మృతి సదుం : పిడుగు పాటుకు వృద్ధుడు మృతి చెందిన సంఘటన సదుం మండలంలో ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గొంగివారిపల్లె పంచాయతీ పొట్టెంవారిపల్లెకు చెందిన మల్లయ్య (90), సుశీలమ్మ దంపతులు గ్రామ సమీపంలోని పొలం వద్దకు వెళ్లారు. ఐదు గంటల ప్రాతంలో వర్షం పడటంతో చింతచెట్టు కిందికి చేరారు. పిడుగుపాటుకు గురై మల్లయ్య అక్కడే మృతి చెందాడు. సుశీలమ్మ స్వల్పంగా గాయపడగా, తాళిబొట్టు ముక్కలు కావడంతోపాటు, ఫోన్ పగిలిపోయింది. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.కర్ణాటక యువకుడిపై దాడిమదనపల్లె టౌన్ : కర్ణాటక యువకుడిపై మదనపల్లెలో దాడి జరిగిన సంఘటన ఆదివారం స్థానిక జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు వివరాలు.. కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు చీకటివారిపల్లికి చెందిన రాజేంద్ర(33) పిన తల్లి జ్యోతి కురబలకోట మండలంలోని అంగళ్ళులో ఉంటోంది. ఆమె కుటుంబీకులతో గొడవ పడి పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో.. పినతల్లిని చూడటానికి రాజేంద్ర కర్ణాటక నుంచి మదనపల్లె జిల్లా ఆస్పత్రికి వచ్చాడు. జిల్లా ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న జ్యోతిని పలకరించి కారణాలు అడగి తెలుసుకున్నాడు. అనంతరం జ్యోతి భర్త నరేష్‌ను రాజేంద్ర నిలదీయడంతో ఆగ్రహించి నరేష్ బండరాయితో రాజేంద్ర తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితుడు జిల్లా ఆసుపత్రిలో చేరి చికిత్సలు పొందుతున్నాడు. స్థానిక రెండవ పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు. -
ఆళ్లగడ్డ ప్రమాదంలో సదుం వాసి మృతి
సదుం : నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సదుం మండల వాసి ఆదివారం మృతి చెందారు. గ్రామస్తుల కథనం మేరకు.. కంభంవారిపల్లె పంచాయతీ కురవపల్లెకు చెందిన సుబ్రమణ్యం(59 వ్యక్తిగత పనుల నిమిత్తం ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో హైదరాబాదుకు బయలుదేరారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో బస్సు లారీని ఢీకొన్న ప్రమాదంలో ఆయన మృతి చెందారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. స్విచ్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్మదనపల్లె టౌన్ : ఇంట్లో ఉన్న ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయబోయిన వృద్ధురాలికి కరెంట్ షాక్ కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఆదివారం పెద్దమండెం మండలంలో చోటు చేసుకున్న ఘటనపై బాధితురాలు కుటుంబీకుల కథనం.. మండలంలోని అవికేనాయక్ తండాకు చెందిన గోబ్రే నాయక్ భార్య రెడ్డమ్మ (62) ఇంటిలో ఉన్న ఫ్యాన్ స్విచ్ వేయడంతో ప్రమాదవశాత్తు కరెంటు షాక్ కొట్టి తీవ్రంగా గాయపడింది. కుటుంబీకులు గమనించి చికిత్స కోసం వెంటనే బాధితురాలిని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, చికిత్స అనంతరం తిరుపతి రుయాకు వెళ్లాలని రెఫర్ చేశారు. ఘటనపై పెద్దమండెం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. కరెంటు షాక్ సంభవించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నిర్మాణ పనులకు నష్టం కలిగించారని ఫిర్యాదు చింతకొమ్మదిన్నె : విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్ పనులకు నష్టం కలిగించారని రైతులపై పోలీస్‌స్టేషన్‌లో రేజోనియా సంస్థ ప్రాజెక్టు మేనేజర్ రాజ్‌కుమార్ ఆదివారం ఫిర్యాదు చేశారు. అనంతపురం–2 ఆర్ఈజెడ్ నుంచి చింతకొమ్మదిన్నె మండల పరిధిలో నిర్మాణం చేపడుతున్న 765 కేవీ విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్ పనులకు వ్యతిరేకంగా సంఘటితంగా రైతులు పోరాటం చేస్తున్నారు. ఆదివారం బోడెద్దుల పల్లెకు చెందిన రైతు అజ్మాత్ పొలంలో అనుమతి లేకుండా చేపడుతున్న నిర్మాణ పనులు ఆపాలని బాధిత రైతుతోపాటు మండలంలోని ఇతర ప్రభావిత రైతులు కోరారు. దీంతో అక్కడ పనులు చేస్తున్న కంపెనీ సూపర్వైజర్ పనులను ఆపించారు. భూమి యజమాని కోరిన మేరకు నిర్మాణాల తొలగింపు పనులు కంపెనీ వారే చేపట్టారు. అయితే తమ నిర్మాణ పనులకు రైతులు నష్టం కలిగించారని రేజోనియా సంస్థ ప్రాజెక్టు మేనేజర్ రాజ్‌కుమార్ చింతకొమ్మదిన్నె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సీఐ బాలమద్దిలేటిని సంప్రదించగా రాజ్‌కుమార్ ఫిర్యాదు మేరకు విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. బస్సులో ప్రయాణిస్తూ యువకుడి మృతిజమ్మలమడుగు రూరల్ : పెద్దపసుపల గ్రామానికి చెందిన భాస్కర్(32) అనే యువకుడు ఆదివారం తిరుపతి– జమ్మలమడుగు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా మృతి చెందాడు. ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దముడియం మండలం పెద్దపసుపల గ్రామానికి చెందిన భాస్కర్ స్వగ్రామం వదలి కొన్నేళ్లుగా తాడిపత్రిలోని కొండెపల్లి గ్రామంలో ఉన్నాడు. కాగా ఆర్థిక సమస్యలతో 8 నెలల క్రితం స్వగ్రామమైన పెద్దపసుపలకు చేరుకున్నాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం శనివారం కదిరికి వెళ్లాడు. ఆదివారం తిరిగి తిరుపతి నుంచి జమ్మలమడుగు వస్తున్న ఆర్టీసీ బస్సులో బయలుదేరాడు. బస్సు జమ్మలమడుగు పాతబస్టాండ్‌కు వచ్చినా.. సీటులో నుంచి లేవకపోవడంతో సిబ్బంది భాస్కర్‌ను లేపారు. కానీ లేవకపోవడంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. ఆ మేరకు తండ్రి స్వామిదాసు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మృతి చెందడానికి గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. వృద్ధురాలికి తీవ్ర గాయాలు -
రెడ్డెమ్మా.. చల్లంగా చూడమ్మా
గుర్రంకొండ: రెడ్డెమ్మతల్లీ చల్లంగా చూడమ్మా అంటూ భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల వచ్చారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కుబడులు చెల్లించుకొన్నారు. కర్ణాటక, తమిళనాడుతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. శ్రీ రెడ్డెమ్మకొండ ఆలయానికి విరాళం మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయ అభివృద్ధికి పలువురు దాతలు విరాళాలను అందజేశారు. వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టకు చెందిన సోమశెట్టి వెంకటేశ్వర్లు రూ.25 వేలు, ఇదే గ్రామానికి చెందిన సోమశెట్టి రెడ్డెయ్య, రెడ్డిమణిచందన, వరుణ్‌కుమార్‌లు రూ. 25 వేలు అందజేశారు. ఆదివారం ఆలయానికి చేరుకొన్న దాతలకు, వారి కుటుంబసభ్యులకు అధికారులు స్వాగతం పలికి అమ్మవారికి పూజలు చేయించి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. దాతలు రూ. 50వేలను ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ రాజన్న నాయుడు, ఈవో మంజులకు అందజేశారు. ఈమొత్తాన్ని వాల్మీకీపురం ఆంధ్రప్రదేశ్ గ్రామీణబ్యాంకు నందు జమ చేయనున్నట్లు ఈవో పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది బాలకృష్ణ, మహేష్, వెంకటరమణ పాల్గొన్నారు. -
ట్రాక్టర్ బోల్తా.. 9 మందికి గాయాలు
కేవీపల్లె : ట్రాక్టర్ బోల్తాపడి తొమ్మది మందికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని కలకటవారిపల్లె వద్ద ఆదివారం చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. మండలంలోని మారేళ్లలో మామిడికాయలు కోసి లోడు చేయడానికి తిరుపతి జిల్లా యర్రావారిపాళెం మండలం ఇర్లపాళెంకు చెందిన 12 మంది కూలీలు ఆదివారం ట్రాక్టర్లో బయలుదేరారు. అయితే మార్గంమధ్యలోని కలకటవారిపల్లె మలుపు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జింకల జ్యోతి (32), గౌరీ(22), రమేష్(43), రాజేశ్వరి(35), టి.సుగుణ(28), పి.మౌనిక(20), పి. మనోహర(25)తోపాటు పిల్లలు శ్రీనక్షత్ర(2), సిద్దు(9) తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ లక్ష్మయ్యతోపాటు మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ వాహనంలో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గృహ గణనలో నిర్లక్ష్యం వద్దు
సాక్షి, మదనపల్లె: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహ గణన సర్వేలో సంబంధిత సూపర్వైజర్లు, సిబ్బంది ఏ మాత్రం నిర్లక్ష్యం వహించడానికి వీలులేదని సెన్సెస్ అసిస్టెంట్ డైరెక్టర్ సుప్రజ్ అన్నారు. ఆదివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మదనపల్లె పట్టణానికి చెందిన గణన సూపర్వైజర్లు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల వారీగా ఇప్పటిదాకా పూర్తయిన శాతంపై సమీక్షించారు. గణన విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు, పనితీరులో జాప్యం, నిర్లక్ష్యంపై ప్రత్యేకంగా సమీక్షించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ గణన కార్యక్రమాన్ని ఈనెల 20వ తేదీలోగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి యాప్‌లో పేర్కొన్న సమగ్ర వివరాలను కచ్చితంగా నమోదు చేసి తీరాలని అన్నారు. గణన జరగని గృహాలు, అందుబాటులో లేని స్థానికుల సమాచార సేకరణ విషయంలో ఈ గడువును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సర్వేకు వెళ్లినప్పుడు తాళం వేసిన ఇళ్లకు సంబంధించిన యజమానులకు ఫోన్ ద్వారా సంప్రదించి వివరాలు తీసుకోవాలని సూచించారు. ఆయనతోపాటు జిల్లా సెన్సెస్ అధికారి రెడ్డి విష్ణుప్రియ, డివిజనల్ డెవలప్మెంట్ అధికారి లక్ష్మీపతి పాల్గొన్నారు. -
వీఆర్ఏ కుటుంబానికి ఎంపీ పరామర్శ
కేవీపల్లె : టీడీపీ నాయకుడి దాడిలో గాయపడ్డ వీఆర్ఏ కుటుంబ సభ్యులను రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించారు. ఈ నెల 14న మండలంలోని గర్నిమిట్ట పంచాయతీ బలిజపల్లెలో శ్రీరాములవారి ఆలయ అభివృద్ధి, గతంలో ఏర్పాటు చేసిన శిలాఫలకానికి సంబంధించి గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆలయ ధర్మకర్తగా ఉన్న వీఆర్ఏ చెంగల్రాయుడుపై గర్నిమిట్టకు చెందిన టీడీపీ నాయకుడు పార్థసారధి అలియాస్ ధనుంజయ కర్రతో దాడి చేయడంతో తలకు గాయమైంది. ఆ రోజు నుంచి చెంగల్రాయుడు పీలేరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎంపీ ఆదివారం చెంగల్రాయుడు కుమారుడు నాగకు ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. వీఆర్ఏ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు గజ్జెల శీన్‌రెడ్డి, నాయకులు శ్రీనివాసులు పాల్గొన్నారు. -
బైక్ అదుపు తప్పి.. కాలువలో పడి..
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని చిన్నదండ్లూరు గ్రామం పరిధిలో గోపులాపురం గ్రామ క్రాస్ రోడ్డు వద్ద బైక్ అదుపు తప్పి ఎన్.నరేంద్రకుమార్‌రెడ్డి(37) అనే వ్యక్తి కాలువలో పడి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. కలమల్ల ఎస్ఐ సునీల్ కుమార్‌రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని గార్లదిన్నె గ్రామానికి చెందిన నరేంద్రకుమార్‌రెడ్డి తాడిపత్రిలో మెడికల్ స్టోర్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆయన వైఎస్ఆర్ కడప జిల్లాలోని చాపాడు మండల పరిధిలో ఉన్న తమ చిన్నమ్మ వద్దకు వచ్చి తిరిగి స్వగ్రామానికి పయనమయ్యాడు. చాపాడు నుంచి ప్రొద్దుటూరు ఆర్టీపీపీ మీదుగా తాడిపత్రికి పోవడానికి స్కూటర్లో బయలు దేరాడు. అయితే ఆర్టీపీపీ రోడ్డున గోపులాపురం గ్రామ క్రాస్ రోడ్డు వద్దకు రాగానే స్కూటర్ అదుపు తప్పి కాలువలో పడ్డాడు. ఎవరూ గమనించకపోవడంతో కాలువలోనే నీటిలోనే ఉండిపోయాడు. కొంత సేపటి తర్వాత అటుపోతున్న స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చామని వారు వచ్చిన తర్వాత వారి ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తామని ఎస్ఐ తెలిపారు. -
కార్యకర్తలకు అండగా ఉంటాం
కలకడ: వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటామని , ఎవరూ అధైర్యపడొద్దని రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి, పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిలు పేర్కొన్నారు. ఆదివారం కలకడలో కార్యకర్తలను కలిసి మాట్లాడారు. గ్రామ, మండల, నియోజకవర్గ కమిటీల ఎంపిక పూర్తి చేయాలని, పరిశీలన పూర్తి చేసిన వారికి మాత్రమే గుర్తింపు కార్డులు అందుతాయని అందరూ త్వరిత గతిన పరిశీలన పూర్తి చేయాలని తెలిపారు. పోలింగ్‌బూత్ అధ్యక్షుల ఎంపిక పక్రియ వెంటనే పూర్తి చేసి వైఎస్సార్ సీపీ కేంద్రకార్యాలయానికి పంపాలని సూచించారు. పెట్రోల్, డీసిల్ ధరల పెంపు దారుణమన్నారు. ధరల పెంపునకు నిరసనగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన, ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కలకడ కన్వీనర్ కమలాకర్‌రెడ్డి, పీలేరు నియోజకవర్గ మేధావుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, కార్మిక సంఘం అధ్యక్షులు లక్ష్మన్న, ఎస్సీ సంఘం మండల ఉపాధ్యక్షుడు నటరాజ్, టెక్నికల్ అప్డేట్ సభ్యుడు జాఫర్,జిల్లా మైనార్టీ సంఘం ఉపాధ్యక్షుడు కరీముల్లా, మండల మైనార్టీ కమిటీ సభ్యుడు ఎంపీ బాషఖాన్, తదితరులు పాల్గొన్నారు. ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి -
హార్సిలీహిల్స్‌లో పర్యాటకుల ఆటో బోల్తా
మదనపల్లె టౌన్ : ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్ పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తున్న పర్యాటకుల ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా, నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం హార్సిలీ హిల్స్ మూడవ మలుపు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన పి.కార్తీక్(19)తో పాటు మరో ఆరుగురు స్నేహితులు హార్సిలీహిల్స్‌కు పర్యటనకు వచ్చారు. పర్యటన ముగించుకుని సాయంత్రం ఆటోలో తిరుగు ప్రయాణ మయ్యారు. మార్గంమధ్యలోని హర్సీలీ హిల్స్ 3వ మలుపు వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఏడుగురిలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను బయటికి తీసి మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. ఘటనపై బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హార్సిలీ హిల్స్ ఘాట్ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.ధర్మవరానికి చెందిన ఏడుగురికి గాయాలు -
మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో తాగునీటి కష్టాలు
మదనపల్లె టౌన్ : మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తాగునీటి కష్టాలు తారా స్థాయికి చేరాయి. గత మూడు నెలలుగా ఆస్పత్రిలో తాగు నీటి కష్టాలు తలెత్తడంతో రోగులు, వారి అటెండర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం వివిధ మండలాలు, ప్రాంతాల నుంచి జిల్లా ఆస్పత్రికి వచ్చిన రోగుల అటెండర్లు.. బయటి చిల్లర దుకాణాలలో బాటిల్ రూ.25తో కొనుగోలు చేస్తున్నామని ఆరోపించారు. నీళ్లు కూడా సరఫరా చేయలేని ఈ ఆసుపత్రికి మంచి రోజులు ఎప్పుడు వస్తాయన్నారు. తాగు నీటి సమస్య తీవ్రంగా ఉన్నా అధికారులు స్పందించక పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో నెలకొన్న తాగు నీటి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రసవత్తరంగా సాగిన సీపీఎల్–2 వాల్మీకిపురం : స్థానిక జీవీఎస్సీఎస్ క్రీడా మైదానంలో సీపీఎల్ 2 మ్యాచ్‌లు రసవత్తరంగా సాగాయి. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో స్పార్టన్ వారియర్స్, పాయ్ వైస్రాయ్ క్రికెట్ జట్లు తలపడ్డాయి. తొలుత టాస్ గెలిచిన పాయ్ వైస్రాయ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 229 పరుగులు తీసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన స్పార్టన్ వారియర్స్ జట్టు 17.5 ఓవర్లలో పది వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి ఓటమి పాలైంది. అలాగే మధ్యాహ్నం ఎన్కే స్పోర్ట్స్, ఆదిత్యా అండ్ బీఆర్ జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో.. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆదిత్య అండ్ బీఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 19.4 ఓవర్లు ఆడి పది వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఎన్కే స్పోర్ట్స్ క్రికెట్ జట్టు 19.5 ఓవర్లలో 150 పరుగులు చేసి ఒక పరుగుతో విజయకేతనం ఎగురవేసింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డులను కై వసం చేసుకున్న శశాంక్, హేమాద్రి నాయుడులకు ముఖ్య అతిథిగా హాజరైన విజయవాడ జిల్లా జడ్జి దివాకర్, సీడీసీఏ లీగల్ కమిటీ చైర్మన్ సత్యశ్రీనివాస్, పసుపులేటి శివ, వెంకటేష్‌లు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ విజయ్‌కుమార్, యోగేష్, చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీధర్ కుమార్, కోచ్ సునీల్‌కుమార్ పాల్గొన్నారు. -
నవనీతుడి చెంత.. నానా విధాల చింత!
కురబలకోట: కురబలకోట మండలంలోని తెట్టు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం అంటే భక్తి ప్రపత్తులకు, అపార విశ్వాసానికి ప్రతీక. సంతాన వరప్రసాదుడిగా పేరుగాంచిన ఈ స్వామివారికి ఆంధ్ర, కర్ణాటకతో పాటు వివిధ దేశాల్లో వేలాది మంది భక్తులు ఉన్నారు. ఒకప్పుడు నిత్య కల్యాణం పచ్చతోరణంలా, భక్తులతో కళకళలాడిన ఈ పురాతన చారిత్రక క్షేత్రం.. నేడు కూటమి ప్రభుత్వ పట్టింపులేనితనం, నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. గతంలో వైభవం.. నేడు నిర్వేదం! గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆలయ కమిటీ చైర్మన్‌గా కొరివి జగన్నాథరెడ్డి ఉన్నప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగేవి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏర్పాటు చేసిన బృందావన్ పార్కు నిర్వహణను గాలికొదిలేశారు. పిచ్చిమొక్కలు మొలిచి, కనీస పర్యవేక్షణ కరువై పార్కు అధ్వానంగా మారింది. రూ.90 లక్షల నిధులున్నా.. గత జగన్ ప్రభుత్వంలో ఆలయ సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధతో రూ. 90 లక్షల సీజీఎఫ్ నిధులు మంజూరు చేయించారు. అయితే, ఆ నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ కూటమి నేతలు వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో విఫలమయ్యారు. కొత్తగా నిర్మించిన రాజగోపురం పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు, కనీసం దానికి రంగులు వేద్దామన్న ధ్యాస కూడా అధికారులకు లేదు. ఆలయ ప్రాంగణంలో ఫ్లోరింగ్, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు ఇంకా మొదలుకానే లేదు. ● ఈ చారిత్రక ఆలయానికి ఏకంగా 147 ఎకరాల భూ మాన్యాలు ఉన్నాయి. దీని ద్వారా వచ్చే ఆదాయంతో పాటు నిత్యం భక్తులు హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు. వీటికి తోడు, ఇటీవల ముగిసిన తెట్టు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు వేసిన ప్రత్యేక హుండీ కానుకల ద్వారా ఎంత ఆదాయం వచ్చింది, దాన్ని ఏం చేశారనేది వెల్లడించే నాథుడే కరువయ్యాడు. ఆలయ అధికారి వివరణ తీవ్ర విమర్శలు, ఆరోపణలపై ఆలయ అధికారి మునిరాజను వివరణ కోరగా.. ఆలయంలో పనులు చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాంపౌండ్ వాల్ పనులు త్వరలోనే ప్రారంభించాల్సి ఉందన్నారు. అయితే, ఆలయ కమిటీ నియామకం అనేది ప్రభుత్వ పరిధిలోని అంశమన్నారు. అభివృద్ధికి కృషి చేశా! నేను చైర్మన్‌గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, సర్పంచ్ మనోహర్‌రెడ్డిల సహకారంతో ఆలయం చుట్టూ సీసీ రోడ్లు, రూ.9 లక్షలతో బృందావన్ పార్క్ ఏర్పాటు చేశాం. బ్రహ్మోత్స వాలను వైభవంగా నిర్వహించి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాం. ఎమ్మెల్యే చొరవతో రూ.90 లక్షల నిధులు కూడా మంజూరు చేయించాం. –కొరివి జగన్నాథరెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఆలయ అభ్యున్నతిని పర్యవేక్షించాల్సిన ‘ఆలయ కమిటీ’కాలపరిమితి ముగిసి రెండేళ్లు కావస్తున్నా కూటమి ప్రభుత్వం ఇంతవరకు కొత్త కమిటీని నియమించలేదు. స్థానిక అధికార పార్టీ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం కమిటీ నియామకాన్ని తొక్కిపెట్టారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కమిటీ లేకపోవడంతో ఆలయ నిర్వహణతో పాటు వివిధ ఆధ్యాత్మిక కార్య క్రమాలు పూర్తిగాకుంటుపడుతున్నాయి. కూటమి నిర్లక్ష్యంతో ప్రాభవం కోల్పోతున్న తెట్టు వేణుగోపాలుడి క్షేత్రం! రూ.90 లక్షల నిధులున్నా ఆగిన పనులు 147 ఎకరాల భూములున్నాకరువైన ఆలనా పాలన -
సోమేశ్వరస్వామి ఆలయంలో చోరీ
వాల్మీకిపురం : మండల పరిధి కొత్త మంచూరులోని సోమేశ్వరస్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు ఆదివారం ఉదయం చోరీకి పాల్పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఇదే ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి చొరబడి.. అదే సమయంలో అక్కడున్న పూజారి సీతారామయ్యను హతమార్చి దొంగతనానికి పాల్పడ్డారు. తాజాగా ఈ పురాతన సోమేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారి బంగారు మంగళసూత్రంతో పాటు హుండీలో ఉన్న దాదాపు రూ.20 వేల నుంచి రూ.25 వేలు ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అలాగే ఆలయంలోని బీరువాను పగలగొట్టి అందులో ఉన్న వస్తువులను చిందరవందర చేశారు. ఈ ఆలయంలో వరుస చోరీలతో మంచూరు గ్రామస్తులు హడలిపోతున్నారు. -
ఇళ్లగణన త్వరగా పూర్తి చేయండి
కలకడ : సెన్సెస్–2027 కార్యక్రమం నాలుగురోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర అసిస్టెంట్ డైరెక్టర్, జిల్లా ఇన్చార్జ్ విష్ణుప్రియ ఆదేశించారు. శనివారం స్థానిక వెలుగు కార్యాలయంలో డీడీఓ లక్ష్మిపతి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రసంగించారు. హౌసింగ్ ఆపరేషన్ పూర్తి చేసి, ఎన్యుమనేటర్లు, సూపర్వైజర్లు మిగిలిన డోర్‌లాక్ కుటుంబాలను మరొక్కమారు విజిట్ చేసి వివరాలు సేకరించాలని ఆదేశించారు. తహసీల్దార్ మహేశ్వరిభాయ్, ఎంపీడీఓ భానుప్రసాద్, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జ్విష్ణుప్రియ -
కొంటే మోసపోయినట్లే
అంగళ్లు పరిసర ప్రాంతాల్లో 1750/1, 1751, 850, 569, 543 సర్వే నంబర్లలోని వెంచర్లకు పంచాయతీ, పీకేఎం ఉడా నుంచి ఎలాంటి అనుమతులు లేవు. రియల్టర్లు స్వార్థమే పరమార్థంగా వ్యవహరిస్తున్నారు. వారి మాటలు నమ్మి ఇక్కడ ప్లాట్లు కొంటే మోసపోయినట్లే. ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు. కొన్నవారిని నట్టేట ముంచుతున్నారు. భవిష్యత్తు కోసం ఆశతో ఇక్కడ ప్లాట్లు కొంటే భంగపాటు తప్పదు. ఇంటి నిర్మాణానికి, విద్యుత్ కనెక్షన్‌కు అనుమతులు ఇవ్వరు. బ్యాంకులు రుణాలు ఇవ్వవు. విక్రయించాలన్నా రిజిస్ట్రేషన్ కాదు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవద్దు. ప్లాట్లు కొనేవారు జాగ్రత్త పడక పోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. –గంగయ్య, ఎంపీడీఓ, కురబలకోట -
పెట్రోల్ పట్టించే స్థోమత లేదండీ !
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పుణ్యమా అని పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటి డబుల్ సెంచరీ వైపు పరుగులు పెడుతున్నాయి. బంకుకు వెళ్లి ఇంధనం కొట్టించాలంటేనే గుండె గుభేల్మనేలా ‘చమురు’ వదిలిస్తున్నారు మన పాలకులు. ఈ నయా బాదుడును తట్టుకోలేక మదనపల్లె మార్కెట్ యార్డు వద్ద సీపీఎం శ్రేణులు వినూత్నంగా తలపట్టుకున్నాయి. ఆటోలో పెట్రోల్ పోయించే స్తోమత లేక, దానికి తాడు కట్టి రోడ్డుపై లాగుతూ ప్రభుత్వాల వైఫల్యాలను రోడ్డుకెక్కించారు. ఒకరు ‘అచ్చే దిన్’ అంటూ, మరొకరు ‘కూటమి’ స్వర్గం చూపిస్తామంటూ సామాన్యుడి జేబులకు రంధ్రాలు చేస్తున్న తీరుపై జనం ఈసడించుకుంటున్నారు. ఇప్పటికై నా ఇంధన ధరల ఇస్రో రాకెట్లను కిందికి దించకపోతే, భవిష్యత్తులో వాహనాలన్నింటికీ తాడు కట్టి లాక్కోవాల్సిందేనని బాధితులు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు! ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కన్వీనర్ శ్రీనివాసులు, నాగరాజు, రామకృష్ణ, శ్రీరాములు, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. – సాక్షి, మదనపల్లె. -
ప్లాస్టిక్ రహిత సమాజం లక్ష్యం
రాయచోటి: ప్లాస్టిక్ రహిత సమాజం.... ప్లాస్టిక్ రహిత జిల్లా మన లక్ష్యం కావాలని.. స్వచ్ఛతను ప్రజలు దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం రాయచోటి మున్సిపల్ ఆఫీసు నుంచి ఆర్టీసీ బస్టాండ్ కూడలి వరకు నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర ర్యాలీలో పారిశుధ్య కార్మికులు, అంగన్ వాడీ వర్కర్లు, ఉద్యోగులతోపాటు కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేయాలని కోరారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టడం, ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం రాయచోటి ఆర్టీసీ బస్టాండ్‌లోని పారిశుధ్య పనులు, మరుగుదొడ్లు, బస్టాండ్‌లోని వసతులను పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో భాగంగా ప్రజలకు కలెక్టర్ చేతులు మీదుగా క్లాత్ బ్యాగులను పంపిణీ చేశారు. అనంతరం మానవహారంగా ఏర్పడి ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంకోసం సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఆర్డీఓ శ్రీనివాస్, తహశీల్దార్ నరసింహ కుమార్, డీపీఓ రాధమ్మ, రాయచోటి మున్సిపల్ కమీషనర్ రమణారెడ్డి, ఆర్టీసీ డీఎం మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, పబ్లిక్ హెల్త్ వర్కర్స్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ -
సీమ రైల్వేకు నాలుగు రెట్ల జోష్ !
● రైళ్ల రద్దీకి బ్రేక్.. ‘ఫోర్‌లైన్’కు ట్రాక్ క్లియర్! ● పట్టాలెక్కుతున్న 20 ఏళ్ల కల! వేగంగా భూసేకరణ! ● పనులు పూర్తయితే పెరగనున్న రైళ్ల రాకపోకలు రాజంపేట: బంగాళాఖాతం–అరేబియా మహాసముద్రాలను అనుసంధానించే దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ముంబై–చైన్నె రైలు మార్గంలో కీలకమైన రేణిగుంట–గుంతకల్లు సెక్షన్‌కు ఎట్టకేలకు మహర్దశ పట్టింది. ఈ మార్గంలో కొత్తగా మూడు, నాలుగు రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందులో భాగంగా తొలిదశ స్థల సేకరణకు రైల్వే అధికారులు ప్రత్యేక ప్రాజెక్టును ప్రకటించి, చర్యలు వేగవంతం చేశారు. ఈ లైన్లు అందుబాటులోకి వస్తే ఉమ్మడి వైఎస్సార్ కడప, తిరుపతి, అనంతపురం జిల్లాల మీదుగా సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. ️ 7.5 °Ñ$Úë-ÌS-Mø OÆð‡Ë$.. ప్రస్తుతం ఈ 310 కిలోమీటర్ల పొడవైన మార్గంలో కేవలం రెండు లైన్లు (డబ్లింగ్) మాత్రమే ఉన్నాయి. వీటిపై రోజుకు ఏకంగా 190 రైళ్లు నడుస్తుండటంతో, ప్రతి 7.5 నిమిషాలకే ఒక రైలు ప్రయాణించాల్సి వస్తోంది. రైల్వే భద్రతా ప్రమాణాల ప్రకారం రెండు రైళ్ల మధ్య కనీసం 15 నిమిషాల వ్యవధి ఉండాలి. కానీ, ప్రస్తుత రద్దీ వల్ల ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను చిన్న చిన్న స్టేషన్ల లో, ఔటర్లలో గంటల తరబడి నిలిపివేస్తున్నారు. ఈ కొత్త లైన్ల నిర్మాణంతో దశాబ్దాలుగా వేధిస్తున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. వేగవంతంగా భూసేకరణ: ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం రైల్వే చట్టం 1989 సెక్షన్ 2 (37ఎ) కింద భూసేకరణ ప్రక్రియను ప్రారంభించారు. వైఎస్సార్ కడప, తిరుపతి, అనంతపురం జిల్లాల పరిధిలో అవసరమైన భూములను సేకరించేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. పెరగనున్న రైళ్లు.. ఈ రెండు అదనపు లైన్ల నిర్మాణం పూర్తయితే ముంబై–చైన్నె మధ్య సరుకు రవాణాకు మార్గం సుగమం అవుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి రవాణా అయ్యే సున్నపురాయి, సిమెంట్, ఇనుప ఖనిజం, ఉక్కు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువులు, ఆహార ధాన్యాల రవాణా వేగవంతం కానుంది. ఇది రైల్వే శాఖకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా, ఆధ్యాత్మిక నగరం తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాలకు వైఎస్సార్ కడప జిల్లా మీదుగా మరిన్ని కొత్త రైళ్లు నడవడానికి దోహదపడుతుంది. -
పంటల పరిశీలన
పెద్దమండ్యం: ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా సాగుచేసిన పంటలను జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివనారాయణ శనివారం పరిశీలించారు. మండలంలోని ముసలికుంట, రామానాయక్తండా గ్రామాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బీడు భూములలో అర్ధ చంద్రాకారం వేయడం ద్వారా భూమిని దుక్కులు చేయకుండా పంటలు సాగుచేసే విధానాల గురించి రైతులకు వివరించారు. ఒక అడుగు గుంతలో సజ్జ, మట్టిక, అలసంద, అనప, మధ్యలో కంది లేదా ఆముదం సాగు చేయవచ్చని తెలిపారు. రుతుపవనాలు రాకముందే పీఎండీఎస్ ( ప్రీమాన్ సూన్ డ్రై సోయింగ్) పంటవేసే విధానం గురించి ఆయన రైతులకు వివరించారు. ఈ విధానం ద్వారా 18 నుంచి 30 రకాల విత్తనాలను వేయవచ్చని వివరించారు. అనంతరం శిద్దవరం రైతు సేవాకేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఏవో సురేష్‌బాబు, ప్రకృతి వ్యవసాయసిబ్బంది శివయ్య, రామయ్య, రవీంద్ర, ఇమ్రాన్ పాల్గొన్నారు. -
ప్రహరీ కూల్చివేతపై ఉద్రిక్తత
మదనపల్లె టౌన్ : మదనపల్లె పట్టణం జన్మభూమి కాలనీలో 1996లో రిజిస్టర్ అయిన స్థలంలో నిర్మిస్తున్న ఇంటికి రక్షణ గోడను కూల్చేందుకు శనివారం మున్సిపల్, సచివాలయ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. నోటీసు ఇచ్చిన 12 గంటల్లోనే జేసీబీతో కూల్చివేతకు యత్నించారు. దీంతో ఇంటి యజమాని వాసుదేవ, సచివాలయ సిబ్బంది మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తతకు దారితీసింది. వాసుదేవ తన ఇంటి భద్రత కోసం ప్రహరీ నిర్మించుకున్నారు. గోడ హైటెన్షన్ విద్యుత్ లైన్ కింద నిర్మించారని, మున్సిపల్ అధికారులు కూల్చివేతకు ఉత్తర్వు ఇవ్వడంతో.. టిపిఎస్ రెడ్డెమ్మ, సచివాలయ సిబ్బంది, పోలీసులతో జేసీబీతో స్థలానికి చేరుకున్నారు. అయితే ఇంటి యజమాని వాసు, కుటుంబ సభ్యులు అడ్డుకుని సొంత స్థలంలో ప్రహరీ నిర్మించుకుంటుంటే ఎలా పడగొడతారని నిలదీశారు. బీసీ హక్కుల పోరాట సమితి నాయకుడు బిడేం రాజశేఖర్ అక్కడికి చేరుకుని మున్సిపల్ సిబ్బందిని ప్రశ్నించారు. కోర్టు ఉత్తర్వులు ఉంటే తప్ప కూల్చడానికి అధికారులకు హక్కు లేదని వాదించారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది వెళ్లిపోయారు. జేసీబీని ఢీకొన్న బైక్ పుంగనూరు : మండలంలోని సింగిరిగుంట గ్రామానికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు సంతోష్(18) అనే యువకుడు శనివారం ద్విచక్రవాహనంలో వెళ్తూ ఎదురుగా వస్తున్న జేసీబీ వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో సంతోష్‌కు తీవ్ర గాయాలై, ఎడమకాలు విరిగింది. అటుగా వెళ్తున్న హెల్పింగ్ లయన్స్ సభ్యుడు బషీర్ అలీ గమనించి బాధితున్ని తన ఆటోలో ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడిపై దాడి మదనపల్లె టౌన్ : యువకుడిపై దాడి జరిగిన సంఘటన శనివారం రాత్రి మదనపల్లెలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి బాధితుడు వన్‌టౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. పట్టణంలోని బుగ్గ కాలువలో కాపురం ఉంటున్న మణికంఠ బాబు(33) ఇంటి నుంచి మురుగు నీరు అదే వీధిలో ఉన్న వెంకటరమణ ఇంటి ముందుకు వచ్చాయని ఇరు వర్గాలు గొడవపడ్డారు. ఇద్దరి మధ్య మాటకుమాట పెరగడంతో వెంకటరమణ తన అనుచరులతో మణికంఠ బాబుపై విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కుటుంబీకులు బాధితుడిని చికిత్సల నిమిత్తం స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆగని కేబుల్ వైరు చోరీలు
రామసముద్రం : మండలంలో కేబుల్ వైర్ల చోరీలు వరుసగా జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఊలపాడులో రైతుల బోర్ల వద్ద కేబుల్ వైర్లు చోరీ కాగా.. శుక్రవారం రాత్రి ఆర్.నడింపల్లి పంచాయతీ బొంపల్లి గ్రామంలో పంచాయతీ తాగునీటి బోరు కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. రాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తులు వైర్లు అపహరించడంతో గ్రామంలో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఉదయం బోరు పనిచేయకపోవడంతో గ్రామస్తులు పరిశీలించగా కేబుల్ వైరు చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. కేబుల్ వైర్లు వరుస చోరీలకు కావడంతో ఈ ఘటనలపై రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
జిల్లాలో 51 స్పోర్ట్స్ సమ్మర్ క్యాంప్‌లు
పీలేరు రూరల్: జిల్లా వ్యాప్తంగా 1,800 మంది క్రీడాకారులతో 51 వేసవి శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ అధికారి జి. చంద్రశేఖర్ తెలిపారు. శనివారం పీలేరులోని బ్యాడ్మింటన్ క్యాంప్‌ను పరిశీలించిన ఆయన, శ్రీ భువన విద్యాలయం వద్ద వాలీబాల్, కోటపల్లెలో క్రికెట్ క్యాంప్‌లు కూడా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. క్రీడలపై ఆసక్తి ఉన్న యువత ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కిలో టమాట రూ.35 సాక్షి, మదనపల్లె: మదనపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డులో టమాట ధరలు దూసుకుపోతున్నాయి. పది రోజులుగా మెల్లగా పుంజుకుంటున్న టమాట ధరలు శనివారం ఒక్కసారిగా పెరిగాయి. కిలో అత్యధిక ధర రూ.35 పలికింది. రెండో గ్రేడ్ కిలో రూ.28 పలికింది. విక్రయానికి 410 టన్నుల టమాట వచ్చింది. పెరుగుతున్న ధరలను పరిశీలిస్తే 14వ తేదీ కిలో రూ.29, 15వ తేదీ కిలో రూ.30 పలికింది. శనివారం ఏకంగా రూ.ఐదు పెరిగి రూ.35 పలికింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతకాలం ధరలు ఇలాగే ఉండాలని ఆశిస్తున్నారు. ఇప్పటికే గిట్టుబాటు ధరలేక పెట్టిన పెట్టుబడి దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పలుకుతున్న ధరలతో రైతులు ఊరట చెందుతున్నారు. జలధార పనులు పూర్తి చేయాలి – డ్వామా పీడీ వెంకటరత్నం తంబళ్లపల్లె: జలధార పనులు త్వరితగతిన పూర్తి చేయాలని డ్వామా పీడీ వెంకటరత్నం ఆదేశించారు. శనివారం మండలంలోని కన్నెమడుగు, పరసతోపు, తంబళ్లపల్లె పంచాయతీల్లో సప్లై ఛానల్ పనులను పరిశీలించారు. పనుల నాణ్యతలో వేగవంతంగా పూర్తి చేసి ఆదర్శంగా నిలవాలన్నారు. కూలీలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పనులు కల్పించాలని ఉపాధి సిబ్బందిని ఆదేశించారు. ఎంపీడీఓ ప్రసాద్,ఏపీవో ఆంజనప్ప, పీఆఱ్ ఏఈ వెంకటరమణ, డిప్యూటీ ఎంపిడిఓలు మారుతీకుమార్, ఈసీ మహేష్ పాల్గొన్నారు. రుణాల పంపిణీకి బ్యాంకర్లు సహకరించాలి తంబళ్లపల్లె: పథకాల లక్ష్య సాధనలకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు చొరవ చూపాలని లీడ్ బ్యాంకు మేనేజర్ ఆంజనేయులు అన్నారు. ఽశనివారం స్థానిక వెలుగు కార్యాలయంలో బ్యాంకు అధికారులు, వెలుగు సీసీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో 2026–27 వార్షిక రుణ ప్రణాళికలపై చర్చించారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందిన వారు ఇన్సూరెన్సు బీమా తప్పనిసరిగా చేసుకునే విధంగా బ్యాంకు అధికారులు కృషి చేయాలన్నారు. వెలుగు ఏపీఎం రమేష్, ఏవో రమణకుమార్, ఏపీఎం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రెగ్యులర్ ట్రైన్‌గా నాందేడ్ ఎక్స్‌ప్రెస్ మదనపల్లె సిటీ: నాందేడ్–ధర్మవరం మధ్య నడుస్తున్న స్పెషల్ ట్రైన్‌ను రెగ్యులర్ వీక్లీ ట్రైన్‌గా కొనసాగించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 17635/17636 నంబర్లతో నడిచే ఈ రైలు ప్రతి శుక్రవారం సాయంత్రం 4.45 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి విజయవాడ, నెల్లూరు,తిరుపతి పాకాల జంక్షన్, మదనపల్లె రోడ్డు మీదుగా ప్రయాణించి శనివారం సాయంత్రం 4.30 గంటలకు ధర్మవరం జంక్షన్‌కు చేరుకుంటుంది. స్పెషల్ ట్రైన్‌ను రెగ్యులర్ ట్రైన్‌గా మార్చడంతో మదనపల్లె ప్రాంత ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుంది. -
ఒకే ఇల్లు.. రెండు వార్డులు!
సాక్షి, మదనపల్లె : మదనపల్లె సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. జనాభా ప్రాతిపదికన కాకుండా పూర్తిగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ (YSRCP) టార్గెట్‌గా ‘రాజకీయ విభజన’గా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 48 వార్డులతో కొత్త మున్సిపాలిటీ! 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపాలిటీ పరిధిలో 1,36,414 మంది జనాభా ఉండగా, ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 1,66,988కు చేరింది. ఈ లెక్కన పాత 35 వార్డులకు తోడుగా కొత్తగా మరో 13 వార్డులను ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం వార్డుల సంఖ్య 48కి చేరింది. కొత్త లెక్కల ప్రకారం ఒక్కో వార్డులో సగటున 3,478 మంది ఓటర్లు ఉండేలా మున్సిపల్ అధికారులు నివేదికలను సిద్ధం చేశారు. పాత 35 వార్డుల భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా ఈ విభజన జరగడంతో పాత వార్డులన్నీ పూర్తిగా రద్దు అయినట్లేనని, ఇది ఇప్పుడు కొత్త మున్సిపాలిటీగా రూపాంతరం చెందిందని స్పష్టమవుతోంది. ’రౌండ్ ది క్లాక్’ తిరకాసు.. ఒకే ఇంట్లో ముక్కలైన ఓట్లు! గతంలో చుట్టుపక్కల వీధులను కలిపి ఒక వార్డుగా చేసేవారు. కానీ ఇప్పుడు అధికారులు ’రౌండ్ ది క్లాక్’ (గడియారం తిరిగే) విధానాన్ని తెరపైకి తెచ్చారు. మున్సిపాలిటీ పరిధిలోని ఉత్తరం ప్రాంతం నుంచి ప్రారంభించి.. తూర్పు, దక్షిణం, పడమర వైపుగా సాగుతూ ఓటర్ల సంఖ్య ఆధారంగా గీతలు గీసుకుంటూ పోయారు. చివరకు ఒకటో వార్డు ప్రారంభమైన ప్రాంతానికే వచ్చి చివరి వార్డుతో ముగించారు. దీనివల్ల భౌగోళిక సరిహద్దులు పూర్తిగా ఛిన్నాభిన్నమయ్యాయి. గతంలో ఒకే వార్డులో ఉన్న ప్రజలు ఇప్పుడు నాలుగైదు వార్డుల పరిధిలోకి ముక్కలైపోయారు. చివరకు ఒకే ఇంట్లో ఉన్న ఓటర్లు కూడా రెండు, మూడు వేర్వేరు వార్డులకు విడిపోయే విచిత్ర పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. ప్రతిపక్షాలే లక్ష్యంగా టీడీపీ కుట్ర! మదనపల్లె మున్సిపాలిటీ ఏర్పాటైనప్పటి నుంచి కేవలం ఒక్కసారి మాత్రమే టీడీపీ అడ్డదారిలో, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కొనుగోలు చేసి చైర్మన్ పదవిని దక్కించుకుంది తప్ప.. నేరుగా మెజార్టీ సాధించిన చరిత్రే లేదు. ఈ నేపథ్యంలో, అందివచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ తమకు అనుకూలంగా, వైఎస్సార్సీపీని రాజకీయంగా ఇబ్బందులకు గురిచేసే విధంగా టీడీపీ నేతలు ఈ మున్సిపల్ వార్డుల విభజన చేయించుకున్నారని స్పష్టంగా తెలుస్తోంది. నేడే ’ఫామ్–11’ నోటిఫికేషన్.. అధికారిక ప్రక్రియ టైమ్‌లైన్ ఇదే! మదనపల్లె మున్సిపాలిటీలో కొత్తగా నిర్ణయించిన కౌన్సిల్ వార్డులకు సంబంధించి ఆదివారం సాయంత్రం మున్సిపల్ అధికారులు ’ఫామ్–11’ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆ రోజు నుంచే అధికారిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 18 నుండి 24 వరకు: కొత్త వార్డుల విభజనపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఈ నెల 25 నుండి వచ్చే నెల (జూన్) 5 వరకు: ప్రజల నుంచి అందిన సూచనల వివరాలతో కూడిన జాబితాను అధికారులు జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తారు. జూన్ 6 నుండి 11 వరకు: కలెక్టర్ దీనిపై క్షుణ్ణంగా పరిశీలన జరిపి మున్సిపల్ డీఎంఏకు నివేదిస్తారు. అనంతరం ఆ నివేదిక మున్సిపల్ శాఖ ద్వారా ప్రభుత్వానికి చేరుతుంది. జూన్ 12 నుండి 23 వరకు: ప్రభుత్వం ఈ నివేదికను తుదిసారిగా పరిశీలించి అధికారికంగా ఆమోద ముద్ర వేయనుంది. ఈ తికమక, రాజకీయ విభజనపై వైఎస్సార్సీపీ మరియు స్థానిక ప్రజలు అభ్యంతరాల స్వీకరణ సమయంలో ఏ విధంగా పోరాడతారో వేచి చూడాలి. మదనపల్లెలో ‘రాజకీయ’ విభజన! ‘రౌండ్ ది క్లాక్’ కుట్రతో పాత 35 వార్డులు రద్దు 48 స్థానాలతో కొత్త మున్సిపాలిటీ! వైఎస్సార్సీపీని దెబ్బతీసేందుకే సరిహద్దుల మార్పు టీడీపీ నేతల అడ్డదారి వ్యూహం నేడే ‘ఫామ్–11’ నోటిఫికేషన్ 18 నుంచి అభ్యంతరాల స్వీకరణ! -
ఇక్కడ ప్లాట్లు కొంటే పాట్లే
● రియల్టర్ల మాయాజాలం ● నోటీసులు ఇచ్చినా తగ్గేదేలా.. ● బరితెగించిన రియల్టర్లు ● అక్రమ వెంచర్లలో హెచ్చరిక బోర్డులుకురబలకోట : ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు కనికట్టు చేయడంలో.. అంగళ్లులోని రియల్టర్ల రూటే సపరేటు. మాయా మశ్చీంద్రను తలపిస్తున్నారు. ఆశావహులకు ఆశ చూపి పద్మ వ్యూహమనే ముగ్గులోకి దించుతున్నారు. సెలవు రోజుల్లో అయితే కొనుగోలుదారులను ఆహ్వానించి విందు భోజనాలు ఏర్పాటు చేసి ప్లాట్లు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మండలంలో అంగళ్లు బైపాస్, కురబలకోట, కడప రోడ్డులో 1750/1, 1751, 850, 569, 543 సర్వే నంబర్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనధికార లే అవుట్లను వేశారు. అంతేగాకుండా ప్లాట్లను అందంగా మార్చి విక్రయించసాగారు. వీటికి ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు లేవు. అయినా కొనుకోలుదారులను బురిడీ కొట్టించి ప్లాట్లు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో అక్రమ రియల్ దందాపై అధికారులు దృష్టి సారించారు. ఇదివరకే జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ సంబంధిత గ్రామ కార్యదర్శులకు మెమోలు జారీ చేశారు. అక్రమ రియల్ వెంచర్లపై చర్యలు తీసుకోవడం లేదని సీరియస్ అయ్యారు. అంతేగాకుండా పలుమార్లు రెగ్యులర్ చేసుకోవాలని హెచ్చరించినా బేఖాతార్ చేశారు. జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ ఆదేశాలతో అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. దీంతో అక్రమ లే అవుట్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అనుమతులు లేని ఈ వెంచర్లలో క్రయ, విక్రయాలు చేయరాదని రియల్ ప్లాట్లలోనే కాకుండా అంగళ్లు పోలీస్ స్టేషన్, స్థానిక బస్టాండ్‌లో కూడా ప్రజలు చూడటానికి వీటిని ఏర్పాటు చేశారు. వెంచర్ల నిర్వాహకులు అనుమతులు తీసుకోకపోతే వెంచర్లలో ఏర్పాటు చేసిన ప్లాట్లను, రోడ్లును కూల్చి వేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
చలివేంద్రానికే దాహం !
మదనపల్లె మున్సిపల్ ఆఫీసు ఆవరణలో సరికొత్త వింత ఒకటి వెలుగుచూసింది. ఎండ తీవ్రతకు జనం గొంతులు ఎండిపోతుంటే.. ఇక్కడ మాత్రం ప్రజల దాహం తీర్చాల్సిన ‘చలివేంద్రమే’ దాహంతో అల్లాడిపోతోంది! వేసవి రాగానే ఫొటోల కోసం ఆర్భాటంగా కుండలైతే పెట్టారు కానీ, అందులో నీళ్లు పోయడం మాత్రం మరిచిపోయారు. ఎండ దెబ్బకు కుండలు మాడిపోగా.. వాటి మూతల్లో నీళ్లకు బదులు మట్టి పేరుకుపోయింది. పన్నులు వసూలు చేయడంలో ఉండే శ్రద్ధ.. కనీసం కుండల్లో నీళ్లు నింపడంలో లేదంటూ వచ్చేపోయే జనం మున్సిపల్ ‘దొరల’పై వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. – సాక్షి, మదనపల్లె -
పోలీసుల విస్తృత తనిఖీలు
మదనపల్లె టౌన్/కలకడ : శాంతిభద్రతల పరిరక్షణ కోసం అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ శనివారం తెల్లవారుజామున రెండు భారీ ఆపరేషన్లను నిర్వహించింది. జిల్లాను నేర రహితంగా మార్చడానికి, సమాజానికి ముప్పుగా పరిణమిస్తున్న శక్తుల ఆటకట్టించడానికి జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో శనివారం మదనపల్లె, రాయచోటి ప్రాంతాల్లో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ నిర్వహించారు. రెండు సబ్ డివిజన్లలోని సమస్యాత్మక ప్రాంతాలే లక్ష్యంగా పోలీసులు దాడులు నిర్వహించారు. మదనపల్లె డీఎస్పీ పావని నేతత్వంలో 105 మంది, రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్.కష్ణమోహన్ నేతత్వంలో 61 మంది, మొత్తం 166 మంది పోలీసులు పాల్గొన్నారు. మదనపల్లె పరిధిలోని కోళ్లబైలు జగన్ కాలనీ, కలకడ మండలం బంగారువాండ్లపల్లి గ్రామాల్లో తనిఖీలు (కార్డన్ అండ్ సెర్చ్) నిర్వహించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న మొత్తం 133 వాహనాలను నిలిపి తనిఖీ చేశారు. ఆధారాలు లేని 78 వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇందులో 71 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 2 కార్లు, ఒక ట్రాక్టర్ ఉన్నాయి. చట్టపరమైన పూర్తి పత్రాలు సమర్పించిన తర్వాతే ఈ వాహనాలను విడుదల చేయడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. తనిఖీల అనంతరం మదనపల్లెలో 300 మంది, కలకడలో 210 మంది ప్రజలను ఒకచోటకు చేర్చి ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. ఊర్లోకి కొత్త వ్యక్తులు వచ్చినా, ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గమనించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. -
డెంగ్యూ నివారణ అందరి బాధ్యత
మదనపల్లె టౌన్: డెంగ్యూ నివారణ.. మనందరి బాధ్యత అని జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య తెలిపారు. జాతీయ కీటకజనిత రోగ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా శనివారం మదనపల్లెలో అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆఫీసు నుంచి పురవీధుల్లో సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జిల్లా మలేరియా అధికారి రామచంద్రా రెడ్డి మాట్లాడారు. జిల్లా ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు. అవగాహన ర్యాలీలో పాల్గొన్న డీఎంహెచ్ఓ -
టమాటల తరలింపులో ఘర్షణ
పుంగనూరు : పట్టణంలోని మార్కెట్ యార్డులో టమాటలు లారీలో తరలించే విషయంలో ఇద్దరు డ్రైవర్ల మధ్య జరిగిన ఘర్షణలో.. ఒకరు కత్తిపోట్లుకు గురైన సంఘటన శనివారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మార్కెట్ యార్డులో తమిళనాడు రాష్ట్రానికి చెందిన డ్రైవర్లు సురేష్, మాయ కన్నన్(45) టమాటలు తరలించే విషయంలో ఘర్షణ పడ్డారు. వీరి మధ్య మాటకుమాట పెరగడంతో డ్రైవర్ సురేష్ మరో డ్రైవర్ మాయకన్నన్‌ను కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, వ్యాపారులు వెంటనే సురేష్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మాయకన్నన్‌ను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.న్యాయం చేయాలని బాధితుడు వేడుకోలు -
అప్పుల బాధతో అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్ : నేటి కంప్యూటర్ యుగంలో కూడా కుల వృత్తినే నమ్ముకుని వినాయకుని బొమ్మలు తయారు చేస్తూ, వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్న ఓ కుటుంబం పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఎక్కువయ్యాయి. వ్యాపారం మందకొడిగా సాగడం, పెట్టుబడులు చేతికి అందకపోవడంతో.. అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేకపోయారు. రుణ దాతల ఒత్తిళ్ల నుంచి బయటపడలేక చావే శరణ్యం అనుకున్నారు. అన్నదమ్ములు ఇద్దరూ ఊరికి దూరంగా వెళ్లి.. మద్యంలో విషం కలిపి తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. శనివారం అన్నమయ్య జిల్లాలో కలకలం రేపిన ఈ సంఘటనకు సంబంధించి బాధిత కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాలు.. మదనపల్లె పట్టణం బికేపల్లి కాలనీలో కాపు రం ఉంటున్న అన్నదమ్ములు శ్రీనివాసులు (35), అనిల్ (30) కుమ్మర వృత్తిలో భాగంగా ఇంటి దగ్గరే వినాయకుడి బొమ్మలు తయారు చేసుకుంటూ అమ్మకాలు సాగించే వారు. ఈ క్రమంలో వారి వ్యాపారం మందకొడిగా సాగడంతో.. ఒక్కొక్కరు సుమారు 8 లక్షల నుంచి 11 లక్షల వరకు అప్పులు చేసినట్లు తెలిసింది. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక, రుణదాతల వేధింపులు అధికం కావడంతో జీవితంపై విరక్తి చెందారు. చనిపోవాలని నిర్ణయించుకుని ఇద్దరు అన్నదమ్ములు తంబళ్లపల్లి నియోజకవర్గంలోని పిటిఎం మండలం రంగసముద్రంలో ఉన్న అత్తగారి ఇంటికి వెళ్లారు. అక్కడ మద్యంలో విషం కలుపుకొని తాగి ఇద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, కుటుంబీకులు గమనించి బాధితులను వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, మెరుగైన వైద్య చికిత్సలు అందించినా వారి ఆరోగ్యం కుదుట పడలేదు. అనంతరం ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో.. కుటుంబ సభ్యులు బాధితులను తిరుపతికి తరలించారు. ఘటనపై పిటీఎం పోలీసులు విచారణ చేస్తున్నారు. అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నానికి గల మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. -
పంటను దున్నేసి భూ కబ్జాకు యత్నం
మదనపల్లె టౌన్ : పట్టా కలిగి ఎన్నో ఏళ్లుగా తమ సాగులో ఉన్న భూమిని అక్రమంగా ఆక్రమించుకోవాలని పంటను దున్నేశారని బాధితుడు జోహార్ బాషా ఆవేదన వ్యక్తం చేశాడు. మదనపల్లె ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండలంలోని చిప్పిలికి చెందిన సాబ్ జాన్‌కు తనతోపాటు మరో ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారని తెలిపారు. తమకు సర్వే నంబర్ 115/1లో 1.64 ఎకరాల వ్యవసాయ పొలం ఉందని, తాను కుటుంబ బాధ్యతలు మోయడంతో ఆ భూమి తన పేరున కుటుంబ సభ్యులందరి ఆమోదంతో రిజిస్టర్ అయిందన్నారు. అప్పటి నుంచి తన భూమిలో పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని చెప్పాడు. ఇంతలో తన తమ్ముడు అహ్మద్ బాషా తమ దాయాదులైన దాదాపీర్, ఖాజా పీర్, షాదాబిలతో కలిసి భూమిని ఆక్రమించుకునేందుకు దౌర్జన్యం చేస్తున్నారన్నారని ఆరోపించారు. అంతేకాకుండా భూమిలో తమకు భాగం ఉందంటూ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారని, ఆ మేరకు విచారణకు వచ్చిన రెవెన్యూ అధికారులు రికార్డులు పరిశీలించి ఈ భూమి జోహార్ బాషాకే చెందుతుందని తేల్చి చెప్పి వెళ్లిపోయారన్నారు. అయినప్పటికీ అహ్మద్ బాషా తన దాయాదులతో కలిసి తనను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. శుక్రవారం తాను ఊర్లో లేని విషయాన్ని పసిగట్టి తన భూమిలో సాగు చేసుకున్న అనుప పంటను పూర్తిగా దున్నేసి ధ్వంసం చేసి భూ కబ్జాకు పాల్పడ్డారని తెలిపారు. వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని అధికారులు స్పందించి తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఉన్నతాధికారులు విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు.న్యాయం చేయాలని బాధితుడు వేడుకోలు -
బెంబేలెత్తిస్తున్న క్షుద్ర పూజలు
అన్నమయ్య : రాయచోటి పట్ణణంలోని గున్నికుంట్ల రోడ్డులో సమాధులకు దగ్గరగా ఎవరో క్షుద్ర పూజలు నిర్వహించినట్లు ఆనవాళ్లు ఉండటంతో తెల్లవారు జామున అటువైపు వెళ్లే పాదచారులు ( వాకింగ్) భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొందరు అ దిశగా వెళ్లడం మానేశారు. ఇది ఇలా ఉండగా రాయచోటి పట్టణంలోని పట్టణ వైద్యారోగ్య కేంద్రం ( ఐదు పైసలు బావి) దగ్గరగా గత రాత్రి ఎవరో చేతబడి చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. తెల్లవారి ఆ దారిలో నడిచి వెళ్లే ( వాకింగ్) వారికి, క్రికెట్ ఆడకొనేందుకు వెళ్లే కుర్రాళ్లకు ఈ దృశ్యం కనిపించింది. దీంతో ఒక్క సారిగా భయంతో ఆ వైపు వెళ్లేందుకు జంకుతూ వెనుతిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. ఇలాంటి కార్యక్రమాలను చేపట్టే వారిపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
డ్రైవర్ ని అరెస్టు చేయాలని పోలీస్ స్టేషన్ వద్ద నిరసన
మదనపల్లె టౌన్: భవన కార్మికుడు నాగార్జున మృతికి కారణమైన లారీ డ్రైవర్‌ను వెంటనే అరెస్టు చేయాలని శుక్రవారం మదనపల్లి మండలంలోని వలసపల్లి గ్రామం, మొలకల దిన్నె గ్రామస్తులు తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భం గా మృతుని బంధువు జ్యోతి మాట్లాడుతూ.. నాగార్జున స్వగ్రామం రామసముద్రం మండలం, మినికి అన్నారు. మదనపల్లిలో పనులు ముగించుకుని మొలకలదిన్నెలో ఉన్న అత్తగారి ఇంటికి బైకులో వస్తుండగా లారీని నిర్లక్ష్యంగా నడిపి నాగార్జున మృతికి కారకుడయ్యాడని చెప్పారు. అలాంటి వ్యక్తిని పోలీసులు పట్టుకోకుండా వదిలేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే లారీ డ్రైవర్‌ను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. -
నోట్లు లెక్కిస్తూ... సొమ్ముతో ఉడాయించిన ఘనడు
● గ్రామీణ బ్యాంకులో ఘటన ● రూ:5200 నగదు అపహరణ ● లబోదిబో మంటున్న బాధితురాలు చౌడేపల్లె: ఓ మహిళ బ్యాంకులో తను డ్రా చేసుకున్న డబ్బును లెక్కపెట్టుకుంటుండగా .. ఓ వ్యక్తి వచ్చి నేను లెక్కపెట్టి ఇస్తాను అని ఆ డబ్బు లెక్కపెడుతూ అందులో కొంత నొక్కేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన శుక్రవారం గ్రామీణ బ్యాంకులో జరిగింది. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చౌడేపల్లె మండలం పెద్దకొండామర్రికు చెందిన తలారి పద్మావతమ్మ దుర్గా మహిళా సంఘం సభ్యురాలు. పొదుపు ఖాతాలో అప్పు రూ.30 వేలు కోరగా సభ్యుల తీర్మాణం మేరకు పద్మావతి వ్యక్తి గత ఖాతాకు రూ:30వేలు సొమ్ము జమఅయింది. కాగా ఈ సొమ్మును శుక్రవారం డ్రా చేసుకొనేందుకు వచ్చింది. డ్రా చేసుకొన్న సొమ్మును బ్యాంకులో కూర్చొని లెక్కిస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి తన వద్దకు వచ్చి నేను డబ్బు లెక్కపెట్టి ఇస్తాను అంటూ ఆమె వద్ద తీసుకుని క్షణాల్లో రూ.5200 నొక్కేసి అక్కడనుంచి ఉడాయించాడు. కాసేపటి తరువాత డబ్బులు లెక్కించగా తక్కువగా ఉండడంతో లబోదిబో మంటూ బాధిత మహిళ బ్యాంకు సిబ్బందికి మొరపెట్టుకొంది. బ్యాంకులోని సీసీ పుటేజీలు పరిశీలించి న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. కాగా అపరిచిత వ్యక్తులకు డబ్బులు ఇవ్వడం, లెక్కించమని చెప్పకూడదని.. మహిళలు బ్యాంకులకు వచ్చే సమయంలో తగిన జాగ్రత్తలతోపాటు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ చిన్నరెడ్డెప్ప హెచ్చరించారు. -
గుడిలో హుండీ చోరీకి యత్నం
పులిచెర్ల(కల్లూరు): పులిచెర్ల మండలం వగళ్ళవారిపల్లె సమీపంలోని శ్రీయల్లమ్మ దేవాలయంలో గురువారం అర్ధరాత్రి ఆలయంలోని హుండీ చోరికి యత్నించి ఆ సమయంలో ఇతరుల రాకతో హుండీ వదిలేసి ప్రహరీ దూకి దుండగుడు పరారయ్యాడు. వివరాలు... శ్రీయల్లమ్మ దేవాలయం కొత్తగా నిర్మించారు. గోటూరి మురళీ మోహన్‌రెడ్డి ఆలయ చైర్మన్‌గా ఉన్నారు. గతనాలుగు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి మాస్కు,గ్లౌజులు వేసుకొని హుండీ చోరీకి ప్రయత్నించారు. వీలుకాక పోవడంతో వదిలేసి పోయాడు. ఈ విషయం అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో గుర్తించారు. తిరిగి మళ్లీ వస్తాడన్న ఉద్దేశ్యంతో గురువారం రాత్రి చైర్మన్ మురళీ మోహన్‌రెడ్డి ముందు జాగ్రత్తగా కొందరిని గుడిపక్కన ఉన్నగదిలో ఉంచాడు. అదేరాత్రి దుండగుడు 12.30 గంటల సమయంలో గుడిలోకి రావడం, హుండీ తస్కరించి ప్రహరీ వైపు దూకి బయటకు వెళ్లే సమయంలో గుడి చైర్మన్ మురళీ మోహన్‌రెడ్డి పక్కనే ఉన్న తన ఇంటి నుంచి రావడం గట్టిగా అరవడం, పట్టుకోవడానికి ప్రయత్నించగా హుండీ అక్కడే వదిలేసి ప్రహరీ దూకి పరారయ్యాడు. దీనిపై కల్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వారు వెంటనే క్లూస్ టీంని పంపారు. రెండు సార్లు హుండీ లో డబ్బు కోసం వచ్చిన వాడు ఒకరేనా తెలియాల్సి ఉంది. పోలీసు విచారణలో పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది. కల్లూరు ఏఎస్ఐ సత్యనారాయణ, క్లూస్ టీం ఏఎస్ఐ రమేష్, కల్లూరు ఎస్బీఐ కానిస్టేబుల్ రఘు పాల్గొన్నారు. -
మాజీ సర్పంచ్ భర్తపై పోలీసులకు ఫిర్యాదు
పెద్దతిప్పసముద్రం: మండలంలోని రాపూరివాండ్లపల్లి పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ భర్తపై శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశామని ఎంపీడీఓ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఎంపీడీఓ మాట్లాడుతూ సదరు మాజీ సర్పంచ్ భర్త తన పదవీ కాలంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన 15వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్ నిధులను ఆన్లైన్ ద్వారా కాకుండా చెక్‌బుక్ ద్వారా రూ.లక్షల నిధులను ఇష్టారాజ్యంగా పలుమార్లు అనధికారికంగా డ్రా చేశారన్నారు. అంతేగాక పంచాయతీ నిధుల నుంచి తన కుమార్తె బ్యాంకు ఖాతాకు కూడా ఒకేసారి రూ.7 లక్షల నిధులను బదలాయించాడన్నారు. ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి రమేష్ ఈ విషయాన్ని గుర్తించి తనతో పాటు డీపీఓకు సైతం ఫిర్యాదు చేశారన్నారు. డ్రా చేసిన నిధులకు సంబంధించి ఎంబుక్ తదితర సమగ్రమైన రికార్డులను ఆధారాలతో అధికారులకు అందజేయాలని పలుమార్లు నోటీసులు అందజేసినా ఇంత వరకూ అతీగతీ లేకుండా పోయిందన్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని ఎంపీడీఓ వెళ్లడించారు. ద్విచక్రవాహనం బోల్తా ములకలచెరువు: ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాకొట్టడంతో ఒకరికి తీవ్రగాయాలైన సంఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, బాధితుల కథనం మేరకు... సత్యసాయి జిల్లా ముదిగుబ్బకు చెందిన ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంలో మదనపల్లెలో పరీక్ష రాసేందుకు వెళ్తూ టోల్గేట్ వద్ద అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం నడుపుతున్న నరేంద్రకు తీవ్రగాయాలయ్యాయి. అటువైపు వెళ్తున్న బి.కొత్తకోట మండలం అమరనారాయణపురానికి చెందిన సంషద్ తన కారులో బాధితుడిని తీసుకొని వెళ్తూ 108 వాహనానికి సమాచారం అందించాడు. అనంతరం మార్గ మధ్యలో బాధితుడిని 108 వాహనంలో ఎక్కించి మదనపల్లి ప్రభుత్వ హాస్పెటల్‌కు తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మృతి మదనపల్లె టౌన్: జిల్లా ఆర్మ్డ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.రంగారావు (52) అనారోగ్యంతో గురువారం రాత్రి కర్నూలులో కన్ను మూశారు. విధి నిర్వహణలో ఆయన చనిపోయారు. శుక్రవారం కర్నూలులోని సీతారాం నగర్లో రంగారావు మృతదేహాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో జిల్లా రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎం. రవికుమార్ పోలీస్ శాఖ తరపున పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్మశానవాటికలో పోలీస్ అధికారులు, సిబ్బంది, బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టారు. ఆర్థిక సాయం అందజేత: మృతుని భార్య చంద్రకళ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని రిజర్వ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ పరామర్శించారు. ఎస్పీ సూచనలతో తక్షణ సహాయంగా దహన సంస్కారాల నిమిత్తం లక్ష నగదు మృతిని భార్యకు అందజేశారు. ఆసుపత్రిలో ఆ నలుగురిని తొలగించే చర్యలు తీసుకోండి మదనపల్లె టౌన్: మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు మహిళలతో పాటు, వ్యక్తిగత విషయాలపై ఆసుపత్రి ఆవరణలో కొట్టుకున్న జూనియర్ అసిస్టెంట్లను విధుల నుంచి వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ ను ఆదేశించారు. శుక్రవారం ఎమ్మెల్యే జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందితో సమావేశమై ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. మృతుడి ఆచూకీ లభ్యం మదనపల్లె టౌన్: మదనపల్లె మండలంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం పాఠకులకు తెలిసిందే. ఘటనకు సంబంధించి స్థానిక తాలూకా పోలీసులు మృతుడి ఆచూకీ కనుగొన్నారు. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాలు.. రామసముద్రం మండలం, మినికి గ్రామానికి చెందిన నారాయణ స్వామి కొడుకు నాగార్జున (40) సొంత పని మీద ద్విచక్ర వాహనంలో మదనపల్లి వచ్చాడు. పని ముగించుకుని మండలంలోని వలసపల్లి గ్రామం మొలకల దిన్నెలో ఉన్న అత్తగారి ఇంటికి బైక్ లో వెళుతుండగా, మార్గ మధ్యంలోని బై పాస్ రోడ్డులో ఉన్న వెన్నెల రెస్టారెంట్ వద్ద లారీ మృత్యువు రూపంలో వచ్చి ఢీకొట్టడంతో నాగార్జున ప్రాణాలు విడిచాడు. సంఘటన సమాచారం అందుకున్న తాలూకా సీఐ కళా వెంకట రమణ, ఎస్సై చంద్రమోహన్ ఘటన స్థలానికి వెళ్లి మృత దేహాన్ని పరిశీలించారు. లారీ ఢీకొట్టడంతో మృతి చెందాడని గుర్తించామని తెలిపారు. పంచనామా అనంతరం పోస్టు మార్టం నిమిత్తం స్థానిక జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థులకు తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్: ఆర్టీసీ బస్సు ఢీకొని ఎంసెట్ పరీక్ష రాయడానికి వస్తున్న విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ములకలచెరువు మండలంలో చోటు చేసుకున్న ఘటనపై బాధితులు తెలిపిన వివరాలు.. సత్యసాయి జిల్లా, ముదిగుబ్బ మండలం, బుక్కపట్నం పంచాయతీ, యాతాల బంకకు చెందిన బాబు 19, నరేంద్ర 19 లు ద్విచక్ర వాహనంలో మదనపల్లిలోని ఓ సెంటర్లో ఎంసెట్ రాయడానికి బైక్ లో ఇంటి నుండి బయలుదేరారు. స్కూటర్ మార్గమధ్యంలోని ములకలచెరువు మండలం బురకాయలకోట వద్దకు రాగానే, ఆర్టీసీ బస్సు విద్యార్థుల బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ స్థానికులు చికిత్స కోసం మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ములకలచెరువు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. మదనపల్లె టౌన్: శుక్రవారం రాత్రి జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని భవన కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై స్థానికుల కథనం.. మదనపల్లె బసినికొండ నిర్మితి కేంద్రం వద్ద రోడ్డు దాటుతున్న భవన కార్మికున్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లి పోయిందన్నారు. వెంటనే బాధితు డిని స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించగా డాక్ట ర్లు వైద్యం అందిస్తున్నారు. ఘటనపై తాలూక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వాహనం ఢీకొని జింక మృతి పుంగనూరు: మండలంలోని బోడినాయునిపల్లె సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది. గ్రామం అటవీప్రాంతానికి దగ్గరగా ఉండటంతో జింకలు తరచుగా తిరుగుతున్నాయి. ఈ సమయంలో జాతీయ రహదారిపైకి జింక రావడంతో గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోవడంతో జింక అక్కడికక్కడే మృతి చెందింది. దీనిని గమనించిన ఆప్రాంత వాసులు ఫారెస్ట్ అధికారులకు తెలిపారు. ఫారెస్ట్ సిబ్బంది వెళ్లి జింకను పోస్టుమార్టంకు తరలించి, దహనక్రియలు నిర్వహించారు. -
ఖరీఫ్‌కు ప్రత్యామ్నాయం సిద్ధం చేయండి
వ్యవసాయ శాఖ జిల్లా సమీక్షలో శివనారాయణ సాక్షి, మదనపల్లె: జిల్లాలో ఖరీఫ్ వ్యవసాయానికి సంబంధించిన ప్రణాళికతో పాటు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి శివ నారాయణ ఆదేశించారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో జిల్లాలోని ఏవోలు, ఏడీఏలతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రత్యామ్నాయ ప్రణాళికలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని సూచనలు చేశారు. దీన్నిబట్టి చూస్తే ఖరీఫ్ వ్యవసాయం ఈసారి ఎలా ఉండబోతుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంవల్ల వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్నారు. దీనికి అనుగుణంగా ప్రత్యామ్నాయ ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకోవాలని తెలిపారు. రైతులు వినియోగిస్తున్న ఎరువుల వాడకాన్ని 50 శాతానికి తగ్గించాలని సూచించారు. భూసార పరీక్షలు పెంచడం ద్వారా ఎరువుల వినియోగం తగ్గించే ప్రయత్నం చేయాలన్నారు. రైతులు తప్పనిసరిగా ఏపీఎఫ్ఆర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని లేనిపక్షంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు రైతులకు ఆందవని స్పష్టం చేశారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని, ఈనెల 19వ తేదీ ఆఖరని తెలిపారు. జనుము, జీలుగ, పిల్లి పెసర, విత్తనాల పంపిణీ ప్రారంభించాలని తెలిపారు. సమావేశంలో ఏడీలు నవీన్ కుమార్ రెడ్డి, శ్రీలత, జయరాణి, శివకుమార్, నాగ ప్రసాద్, కరుణాకర్ రెడ్డి, మజీద్ అహ్మద్, డిపిఎం వెంకట మోహన్, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ శ్రీరాములు, మాలతి రెడ్డి పాల్గొన్నారు. -
బెంబేలెత్తిస్తున్న క్షుద్ర పూజలు
రాయచోటి టౌన్ : రాయచోటి పట్ణణంలోని గున్నికుంట్ల రోడ్డులో సమాధులకు దగ్గరగా ఎవరో క్షుద్ర పూజలు నిర్వహించినట్లు ఆనవాళ్లు ఉండటంతో తెల్లవారు జామున అటువైపు వెళ్లే పాదచారులు ( వాకింగ్) భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొందరు అ దిశగా వెళ్లడం మానేశారు. ఇది ఇలా ఉండగా రాయచోటి పట్టణంలోని పట్టణ వైద్యారోగ్య కేంద్రం ( ఐదు పైసలు బావి) దగ్గరగా గత రాత్రి ఎవరో చేతబడి చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. తెల్లవారి ఆ దారిలో నడిచి వెళ్లే ( వాకింగ్) వారికి, క్రికెట్ ఆడకొనేందుకు వెళ్లే కుర్రాళ్లకు ఈ దృశ్యం కనిపించింది. దీంతో ఒక్క సారిగా భయంతో ఆ వైపు వెళ్లేందుకు జంకుతూ వెనుతిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. ఇలాంటి కార్యక్రమాలను చేపట్టే వారిపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
సాలాబాదులో టీడీపీ నాయకుల దౌర్జన్యం
● వైఎస్సార్సీపీ మద్దతుదారుల స్థలం ఆక్రమణ ● చమర్తి జగన్ మోహన్ రాజు ప్రోద్బలంతోనే కబ్జా జరిగిందంటున్న బాధితులు ● ఆక్రమణను అడ్డుకోబోయిన మహిళలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసిన పోలీసులు సాక్షి టాస్కఫోర్స్: ఒంటిమిట్ట మండలం సాలాబాదులో టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. మండల పరిధిలోని సాలాబాదు గ్రామంలో నాలుగు రోజుల కిందట వైఎస్సార్సీపీ మద్దతురాలు తిప్పన పుల్లమ్మ కు సంబంధించిన 70 ఏళ్లుగా అనుభవంలో ఉన్న సర్వే నెంబర్ 833లోని ఒకటి ముక్కాల్ సెంటు స్థలాన్ని సాలాబాదు కు చెందిన కొంత మంది టీడీపీ నాయకులు ఆక్రమించాలని చూస్తున్నారు. పశువుల దొడ్డి అంటూ ఆ స్థలంలో టీడీపీ నేతలు ప్రహరీ నిర్మిస్తుండగా.. వైఎస్సార్సీపీ మద్దతుదారులకు, టీడీపీ నాయకులకు ఘర్షణ జరగడంతో నిర్మించిన ప్రహరీ పడగొట్టారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలు కూడా అయిన విషయం తెలిసిందే. అయితే ఇది ఇలా ఉండగా శుక్రవారం మధ్యాహ్నం మళ్లీ ఈ స్థలంలో టీడీపీ నాయకులు ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేశారు. ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఘర్షణ జరిగిన నాలుగు రోజులు మౌనంగా ఉన్న సాలాబాదు కు చెందిన టీడీపీ నాయకులు శుక్రవారం అదే గ్రామంలో ప్రజాదర్బార్ ముగించుకుని, వైఎస్సార్సీపీ మద్దతుదారుల స్థలానికి పక్కనే ఉన్న ఓ టీడీపీ నాయకుడి ఇంటికి రాజంపేట టీడీపీ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు భోజనానికి వచ్చారు. చమర్తి ప్రోద్బలంతోనే తమ స్థలానికి గ్రామానికి చెందిన పశువుల దొడ్డి అనే పేరు పెట్టి ఆయన ఘటనా స్థలానికి రాకుండా ఆయన వర్గీయులతోనే నిర్మాణ పనులు చేయించారని బాధితులైన వైఎస్సార్సీపీ మద్దతురాలు తిప్పన పుల్లమ్మ, ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రహరీ నిర్మాణ సమయంలో నిర్మాణాన్ని అడ్డుకోబోయిన స్థల యజమాని కుంటుంబ సభ్యులైన మహిళలను ఒంటిమిట్ట పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటన జరుగుతుండగా అక్కడి కి వచ్చిన సాక్షి టీవీ, పేపర్ విలేకరులు అక్కడే ఉన్న చమర్తి వాహనాన్ని చిత్రీకరిస్తుండగా సాలాబాదు పంచాయతీ, మలకాటిపల్లి గ్రామంలోని టీడీపీ కి చెందిన ఓ నాయకుడు ఎదైనా తీసుకో గానీ..చమర్తిని, ఆయన వాహనాన్ని చిత్రీకరించరాదని హుకుం జారి చేశారు. అలా కాదని చిత్రీకరిస్తే ‘మేము చేసే పని మేము చేస్తామని’ బెదిరింపులకు దిగాడు. ఈ విషయం తెలుసుకున్న సీఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని స్థలానికి సంబంధించి పత్రాలు ఏవైనా ఉంటే స్థానిక తహసీల్దార్ వద్దకు తీసుకెళ్లి చట్టపరంగా స్థలాన్ని పొందాలని స్థల యజమానులైన వైఎస్సార్సీపీ మద్దతురాలు తిప్పన పుల్లమ్మకు, ఆమె కుటుంబ సభ్యులకు ఆయన వివరించారు. వైఎస్సార్సీపీ మద్దతుదారుల స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న ప్రహరీ స్థల యజమానులతో మాట్లాడుతున్న సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్రీనివాసులు -
ఘనంగా గంధ మహోత్సవం
పెద్దమండ్యం: పెద్దమండ్యంలో మాసాబీబీ ఉరుసు ఉత్సవాలలో భాగంగా గురువారం రాత్రి గంధమహోత్సవం ఘనంగా జరిగింది. రాత్రి జరిగిన గంధం ఊరేగింపు సందర్భంగా ముఖ్య అతిథిగా తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, కలిచెర్ల సింగిల్ విండో ఛైర్మన్ కలిచెర్ల సుధాకరరెడ్డి, మాజీ ఎంపీపీ టి. రెడ్డిశేఖరరెడ్డిలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే దంపతులకు స్థానిక నాయకులు ఉరుసు ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ తాజామాజీ సర్పంచ్ సోదనపల్లె బాషాలు ఘనంగా స్వాగతం పలికారు. మాసాబావి వద్ద కడప అమీన్‌పీర్ దర్గా పీఠాధిపతి అరీఫుల్లా హుసేనీ ప్రత్యేక ఫాతేహా నిర్వహించారు. పీఠాధిపతికి ఉరుసు నిర్వాహక కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. శుక్రవారం రాత్రి ఖవ్వాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుర్రం పూర్ణచంద్రిక, జడ్పీటీసీ పీరమ్మ, మాజీ ఎంపీపీ టి రెడ్డిశేఖరరెడ్డి, తాజా మాజీ సర్పంచ్ సోదనపల్లె బాషా, ఎంపీటీసీ మంచూరి జయరాం, కో ఆప్షన్ మెబర్ ఖాదర్‌వలీ తదితరులు పాల్గొన్నారు. కురబలకోట; అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం ఈనెల 3 నుండి 9వ తేదీ వరకు 13 సెంటర్లలో ఐదు వేల మందితో నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ టెస్టు ఫలితాలను శుక్రవారం ప్రో చాన్స్‌లర్ నాదేళ్ల ద్వారకనాథ్ వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా విడుదల చేసిన ఈ ఫలితాలలో టాప్ 20 ర్యాంకులు సాధించిన వారికి మెరిట్ స్కాలర్షిప్లు అందజేయనున్నట్లు తెలిపారు. మదనపల్లికి చెందిన ఫఠాన్ జుల్పికర్ ఖాన్ మొదటి ర్యాంకు, పి. రిషిత రెడ్డి రెండో ర్యాంకు, ఎన్ రామ్ చరణ్ రెడ్డి మూడో ర్యాంకు, వి. రుషిక్ నాల్గవ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. మొదటి ర్యాంకర్‌కు వంద శాతం ఫీజు స్కాలర్ షిఫ్ నాలుగేళ్లు అందజేస్తామన్నారు. ర్యాంకు రెండు నుండి ఐదు వరకు 75 శాతం, ర్యాంకు ఆరు నుండి పది వరకు 50 శాతం,11 నుండి 20 ర్యాంకర్ వరకు 25 శాతం ఫీజు స్కాలర్షిప్ అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వీసీ యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ ప్రదీప్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మారుతీ ప్రసాద్ తదితరులు ర్యాంకర్లను అభినందించారు. -
ప్రజల నడ్డి విరచడం దుర్మార్గం
పేద ప్రజలపై భారం మోపుతూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం అత్యంత దుర్మార్గమైన చర్య. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడుతున్న సామాన్యులపై, వాహనదారులపై ఈ వడ్డన అన్యాయం. ఇంధన ధరల పెంపు వల్ల రవాణా ఖర్చులు పెరిగి, మార్కెట్లో నిత్యావసరాల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. – పి. ద్వారకనాథరెడ్డి, వైఎస్సార్సీపీ యూత్ జిల్లా వైస్ ప్రెసిడెంట్, కేవీపల్లె. సామాన్య, మధ్య తరగతిపై ప్రభావం డీజిల్ పెంపు వాహనదారులకే కాకుండా దీని ప్రభావం సామాన్య మధ్య తరగరతి వారిపై కూడా పడుతుంది. రవాణా ఖర్చులు పెరిగితే కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. చిన్న వ్యాపారులు, వాహనాలపై ఆధారపడే కుటుంబాలకు ఇది ఇబ్బందే. జీవన వ్యయం పెరుగుతుంది. –సునీల్, భవరధయ్యగారిపల్లి, కురబలకోట మండలం ట్రాక్టర్ యజమానులకు భారం నాకు ట్రాక్టర్ ఉంది. ఎక్కువగా వ్యవసాయ పనులతో పాటు రవాణా పనులపై వెవెళుతుంటా. పెరిగిన రేట్లతో డీజిల్ ఖర్చు ఎక్కువ వస్తుంది. దీంతో దున్నకం, లోడింగ్, రావాణా చార్జీలు పెంచక తప్పదు. దీని వల్ల రైతులపై అదనపు భారం పడుతుంది. వ్యవసాయ ట్రాక్టర్ రైతులకు డీజిల్ రేట్ల నుండి ఊరట కల్పించాలి. –మారసాని రామ్మోహన్ రెడ్డి, ట్రాక్టర్ నిర్వాహకులు, కనసానివారిపల్లి, కురబలకోట మండలం -
నవోదయలో 11వ తరగతికి దరఖాస్తులు
మదనపల్లె సిటీ: మదనపల్లె సమీపంలోని జవహర్ నవోదయ విద్యాలయంలోని 2026–27 విద్యా సంవత్సరానికి 11వ తరగతిలో ఖాళీగా ఉన్న కామర్స్ స్ట్రీమ్ సీట్లు భర్తీ చేయనున్నట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ ఎం.గీత తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పాసైన అర్హత గల విద్యార్థులు ఈనెల 23వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసక్తిగల విద్యార్థులు విద్యాలయ కార్యాలయం నందు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తును సమర్పించాలన్నారు. పుంగనూరు: పుంగనూరు సమీపంలోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు రెండేళ్ల వ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. నిరంతరం వైఫై తో పాటు డిజిటల్ తరగతులు, ల్యాబ్, అత్యాధునిక సదుపాయాలు, నిపుణులైన అధ్యాపకులతో క్లాసులు నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గల విద్యార్థులు 9381359956, 9010402068 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. పుంగనూరు: టమోటా పండించిన రైతులకు ధరలు ఊరటనిస్తున్నాయి. 10 కిలోల టమోట రూ.300లు కాగా, మూడో రకం రూ.260లు పలికింది. మార్కెట్ కమిటీకి 84 మెట్రిక్ టన్నుల టమోటాను రైతులు తరలించారు. టమోటాను చైన్నె, విజయవాడ, హైదరాబాద్‌కు వ్యాపారులు తరలించారు. రైతులు గిట్టుబాటు ధర లభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలు ఇలా కొనసాగితే అప్పుల ఊబిలో నుంచి బయట పడుతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, మదనపల్లె: జిల్లాకు చెందిన యువతకు జపాన్‌లో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు జపాన్ జాబ్ ఆపర్చునిటీ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి నాగార్జున శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులకు శ్రీ సిటీలో 6 నుంచి 8 నెలలు జపనీస్ భాష శిక్షణ, జపాన్ సంస్కృతి, ఉద్యోగ నైపుణ్యాలపై శిక్షణ, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, డొమైన్ స్కిల్స్, ప్లేస్మెంట్ సపోర్ట్ అందిస్తామన్నారు. అనంతరం తయారీ, కేర్ గివింగ్, నిర్మాణరంగం, హాస్పిటాలిటీ, ఆటోమొబైల్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలుంటాయని తెలిపారు. వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య, కనీస విద్యార్హత 10వ తరగతి, ఇంటర్ ఉండాలన్నారు. ఎంపికై న అభ్యర్థులకు నెలకు సుమారు రూ.1,03,996 నుంచి రూ.1,45,000 వరకు వేతనం పొందవచ్చని తెలిపారు. మదనపల్లె: బి.కొత్తకోట నగర పంచాయతీ కోసం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కింద రూ.1.52 కోట్లతో మంజూరైన చెత్త నిర్వహణ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులను శుక్రవారం అధికారులు పరిశీలించారు. బి.కొత్తకోట–చలిమామిడి మార్గంలోని డంపింగ్ యార్డ్‌లో కేటాయించిన 0.6 ఎకరాల స్థలంలో పనులు ప్రారంభం కాగా.. నగర పంచాయతీ కమిషనర్ రమాదేవి, ఏఈ లోకేష్ రెడ్డి, నిర్మాణ సంస్థ మేనేజర్ బ్రహ్మానందరెడ్డి పనుల పురోగతిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ రమాదేవి మాట్లాడుతూ.. ఈ యూనిట్ అందుబాటులోకి వస్తే పట్టణంలో సేకరించిన చెత్త నుంచి తడి, పొడి, ప్లాస్టిక్ వ్యర్థాలను శాసీ్త్రయంగా వేరు చేయడం సులువవుతుందని పేర్కొన్నారు. సాక్షి, మదనపల్లె: జిల్లాలో ఉపాధి హామీ కింద పనులు చేసే కూలీల సంఖ్యను తక్షణమే పెంచాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) వెంకటరత్నం హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కూలీల సంఖ్య 52 వేలకు చేరిందని, నెలాఖరుకల్లా దీన్ని 70 వేలకు చేర్చడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. ఏప్రిల్ మూడో వారం వరకు కూలీ సొమ్ము చెల్లించామని, నిర్లక్ష్యం వహిస్తే వెనుకబడిన మండలాల నివేదికను కలెక్టర్‌కు పంపుతామని పేర్కొన్నారు. -
జనరేటర్లు కాదు.. డెకరేటర్లు!
పెద్దతిప్పసముద్రం: ప్రభుత్వ కార్యాలయాల్లో పద్నాలుగేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జనరేటర్లకు భద్రత లేకుండా పోతోంది. డేటా ఎంట్రీ ఆన్లైన్ సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేందుకు 2012లో అప్పటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 66 మండలాల్లో జనరేటర్లను అమర్చారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం బయట అమర్చిన జనరేటర్ వాడుకలో లేనందున ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ దిష్టి బొమ్మల్లా దర్శనమిస్తున్నా పట్టించుకునేవారు లేరు. టెలి, వీడియో కాన్ఫరెన్స్‌లను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీటిని ఏర్పాటు చేసారు. అయితే ప్రభుత్వ లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. ఒక్కొక్క జనరేటర్‌కు రూ.లక్ష చొప్పున వెచ్చించి వీటిని ఏర్పాటు చేసారు. జనరేటర్ల సరఫరా, నిర్వహణ బాధ్యతలను ఏపి స్వాన్ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. ప్రారంభంలో సంస్థ నిర్వాహకులు జనరేటర్లకు కనెక్షన్ ఇవ్వడంతో అవి కొద్ది రోజులు మాత్రమే పని చేసాయి. అనంతరం కనెక్షన్ కూడా తొలగించేసినట్టు సమాచారం. జనరేటర్లు చిన్న, చిన్న మరమతులకు నోచుకోకపోవడంతో అవి కాస్త నిరుపయోగంగా మారిపోయాయి. ఫలితంగా జనరేటర్ల పరికరాలు తుప్పు పట్టి పాడైపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకున్న ఇన్వర్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లకు అంతరాయం కలగడం లేదు. దీంతో అధికారులు జనరేటర్ వుందనే విషయాన్నే మరచిపోతున్నారు. అయితే అప్పటి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రూ.లక్షల రూపాయల నిధులు వృధా అవుతున్నాయి. కనీసం ఇప్పటికై నా సంభంధిత జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నిరుపయోగంగా మారిన జనరేటర్లను వాడుకలోకి తేవాల్సిన అవసరం ఉంది. తహసీల్దార్ కార్యాలయంలో ఇంటర్నెట్ సౌకర్యం నిల్ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నాలుగైదు నెలలుగా ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ఏపీ స్వాన్ సంస్థ ప్రభుత్వ కార్యాలయాల వద్ద నెట్ వర్క్ కేబుల్ సౌకర్యం కల్పించినా ఫలితం లేకుండా పోయింది. నెట్వర్క్ సమస్య ఉందని తెలిసినా మండల స్థాయి అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారే గాని ఏపీ స్వాన్ సంస్థపై ఒత్తిడి తెచ్చి నెట్ వర్క్ అందేలా చేసేందుకు ఎలాంటి చొరవ చూపకపోవడం శోచనీయం. తద్వారా కంప్యూటర్ ఆపరేటర్లు వారి స్వంత మొబైల్లో అదనపు రోజువారి ఇంటర్ నెట్ డేటాతో పనులు చేయాల్సిన దౌర్భాగ్యస్థితి నెలకొంది. మిగిలిన మండలాల్లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొందని పలువురు పేర్కొంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తుప్పు పడుతున్న జనరేటర్లు నాలుగైదు నెలలుగా ఇంటర్నెట్ సౌకర్యం లేక సిబ్బంది పాట్లు పట్టించుకోని అధికారులు -
ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: డీపీటీఓ రాము
మదనపల్లె సిటీ: ఆర్టీసీ ఉద్యోగులు విధి నిర్వహణతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా ప్రజా రవాణా అధికారి (DPTO) రాము అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ–1 డిపోలో సిబ్బందికి నిర్వహించిన ఆరోగ్య అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నిరంతర విధుల్లో ఒత్తిడిని అధిగమించడానికి ప్రతిరోజూ యోగా చేయాలని సూచించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రీతి మాట్లాడుతూ.. ఉద్యోగులు బయటి ఆహారాన్ని నివారించి, ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇవ్వాలని, మంచి అలవాట్లను అలవర్చుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్లు ఎం. వెంకటరమణారెడ్డి, అమరనాథ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. -
పురాతన ఆలయాలకే ‘ధూపదీప నైవేద్యం’
గాలివీడు: జిల్లాలో నిత్య పూజలకు నోచుకోని పురాతన దేవాలయాలకు మాత్రమే ప్రభుత్వం ధూపదీప నైవేద్య పథకాన్ని మంజూరు చేస్తోందని జిల్లా దేవాదాయ శాఖాధికారి విశ్వనాథ్ తెలిపారు, శుక్రవారం తలముడిపి గ్రామంలోని శ్రీ భైరవేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన ఆయన, ఈ ఆలయానికి పథకం మంజూరైనట్లు వెల్లడించారు. గోపురం, మూలవిరాట్, ధ్వజస్తంభం ఉన్న పురాతన ఆలయాలకే ఇది వర్తిస్తుందన్నారు. మదనపల్లె టౌన్: జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా శనివారం మదనపల్లెలో నిర్వహించబోయే డెంగ్యూ అవగాహన ర్యాలీని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య, జిల్లా మలేరియా అధికారి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో మలేరియా విభాగం సిబ్బందితో కలిసి డెంగ్యూ నిర్మూలన కరపత్రాలు, బ్యానర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఈ అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. -
మహిళా సమస్యలపై పోరాటం
సాక్షి, మదనపల్లె: మహిళలకు ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాటాలు చేస్తామని ఐద్వా జిల్లా నూతన అధ్యక్షురాలు ఓబులమ్మ అన్నారు. ఐద్వా రెండోరోజు సభ శుక్రవారం స్థానిక ఎన్జీవో హోమ్‌లో జరిగింది. ఈ సందర్బంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా ఓబులమ్మ, ప్రధాన కార్యదర్శి భాగ్యమ్మ, కోశాధికారి రెడ్డిప్రసన్న, కమిటీ సభ్యులుగా ఎస్.షాహినా, పార్వతి, సంధ్య, ప్రశాంతి, శంకరమ్మ, ఫాతిమాలను ఎన్నుకున్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కన్వీనర్ పి.శ్రీనివాసులు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు, ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి భాగ్యలక్ష్మి, అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్షురాలు డీఆర్ మధురవాణి, ప్రధాన కార్యదర్శి రాజేశ్వరి పాల్గొన్నారు. -
జగనన్నను మళ్లీ సీఎం చేయాలి
సాక్షి, మదనపల్లె: దళిత సంక్షేమానికి మార్గదర్శకుడైన వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు దళిత శ్రేణులన్నీ ఐక్యంగా కదలిరావాలని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చుక్క అంజినప్ప పిలుపునిచ్చారు. శుక్రవారం మదనపల్లెలోని జీనత్ కళ్యాణమండపంలో జరిగిన పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రా మ్, వైఎస్సార్‌ల చిత్రపటాలకు నివాళులర్పించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కుట్ర సభలో చుక్క అంజినప్ప మాట్లాడుతూ.. దళితుల ఆత్మగౌరవం కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జగనన్న హయాంలో ఎస్సీలకు సామాజిక, ఆర్థిక, విద్యా రంగాలలో అగ్రతాంబూలం ఇచ్చారని గుర్తుచేశారు. పేద వర్గాల పిల్లల కోసం ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేస్తూ పేదలకు వైద్య విద్యను దూరం చేస్తోందని ఆరోపించారు. అమలు చేయలేని అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు జరుగుతున్నా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. అంబేద్కర్ విగ్రహంపై కక్ష ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణ మాట్లా డుతూ జగనన్న విజయవాడ నడిబొడ్డున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మహాత్మా అంబేద్కర్ విగ్రహాన్ని, ఆ స్మృతి వనాన్ని కూటమి ప్రభుత్వం కనీస నిర్వహణ లేకుండా గాలికి వదిలేసిందని మండిపడ్డారు. జిల్లా పరిశీలకులు రాజగోపాల్ మాట్లాడుతూ దళితుల ఆత్మగౌరవం, సంక్షేమం కేవలం జగనన్నతోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును గద్దె దించడానికి దళితులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ నేతలు హేమంత్, దండుగోపి, నక్కా రమాదేవి, జి.నాగమణి, సాక్సా రామాంజనేయులు, శ్రీహరి, రాజకుమార్, మహేష్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అందుకు దళితులంతా ఐక్యంగా పోరాడాలి వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా విస్తృత సమావేశంలో చుక్క అంజినప్ప గర్జన -
పెట్రో ధరల పెంపుపై ధర్నా
సాక్షి, మదనపల్లె: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సీపీఐ నాయకులు శుక్రవారం స్థానిక సుందరరాజు పెట్రోల్ బంక్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సాంబశివ, నియోజకవర్గ కార్యదర్శి కె. మురళి మాట్లాడుతూ ఎన్నికలు ముగియగానే పెట్రోల్‌పై రూ.3.14, డీజిల్‌పై రూ.3.11 పెంచి సామాన్యులపై మోయలేని భారం మోపారన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వత్తాసు పలుకుతూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి కె. మాధవ్ కుమార్, నాయకులు సురేష్, తిరుమలప్ప పాల్గొన్నారు. -
ఇసుక టిప్పర్లపై పోలీసుల దాడులు
గుర్రంకొండ: రక్షణ లేకుండా.. పట్టకట్ట కుండా వెళుతున్న ఇసుక టిప్పర్లపై ఎట్టకేలకు పోలీసులు దాడులు నిర్వహించారు. నిబంధనలు పాటించని ఇసుక టిప్పర్లకు జరిమానాలు విధించారు. బుధవారం ‘సాక్షి’లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై పోలీసులు స్పందించా రు. గురువారం ఎస్ఐ రవీంద్రబాబు ఆధ్వర్యంలోని పోలీసులు ఎన్‌హెచ్ 340 జాతీయ రహదారిపై ఇసుక టిప్పర్ల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇ సుకపై పట్టలుగానీ, ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా వెళుతున్న టిప్పర్లపై చర్యలు చేపట్టారు. రికా ర్డులు సరిగ్గాలేని ఇసుక టిప్పర్లను స్వాధీనం చేసుకొని పోలీసుస్టేషన్ వద్దే ఉంచేశారు. ఈసందర్బంగా డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇకపై నిబంధనలు పాటించకుండా ఇసుక రవాణా చేపట్టేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని ఎస్ఐ పేర్కొన్నారు. -
అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు
మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులు, గంజాయి ముఠాలు, రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్ పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే పీడీ యాక్టు ప్రయోగించాలని పేర్కొన్నారు. గురువారం మదనపల్లె లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాస్థాయి క్రైమ్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లాలోని వివిధ కేసుల పురోగతిని సమీక్షిస్తూ పోలీసు అధికారులకు దిశానిర్దేశం జారీ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాలు, వార్డుల స్థాయిలో పోలీసు పర్యటనలు పెంచాలని సూచించారు. గతంలో గొడవలకు పాల్పడిన వారు, శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను ముందుగానే గుర్తించి బైండోవర్ చేయాలన్నారు.జిల్లాలో గంజాయి విక్రయాలు, రవాణాపై రాజీలేని పోరాటం చేయాలన్నారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. వ్యాపార వర్గాలు, అపార్టుమెంట్ వాసులతో సమన్వయం చేసుకుని ప్రధాన కూడళ్లలో కెమెరాలు ఏర్పాటు చేయించాలని ఎస్పీ సూచించారు.దర్యాప్తులో పారదర్శకత కోసం ఈ–సాక్ష్య యాప్ వినియోగాన్ని పెంచాలని ఆదేశించారు. మిస్సింగ్ కేసులలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వినియోగించి బాధితులను త్వరగా గుర్తించే చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ స్పష్టం చేశారు. అలాగే మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, ట్రాఫిక్ ఉల్లం ఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హత్య, అత్యాచారం, పోక్సో, ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసుల దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి, రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ మదనపల్లి డీఎస్పీ బి.పావని, జిల్లాలోని పలువురు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. బయో–చెక్ కిట్లతో మందుబాబుల ఆగడాలకు చెక్ అన్నమయ్య జిల్లాను గంజాయి, మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దే సంకల్పంతో పోలీసు శాఖ మరో ముందడుగు వేసింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ చొరవతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి 500 కిట్లు, డీజీపీ కార్యాలయం నుంచి మరో 200 కిట్లు కలిపి మొత్తం 700 ‘బయో–చెక్ రాపిడ్ డ్రగ్ స్క్రీనింగ్ టెస్ట్ కిట్లు’ జిల్లాకు వచ్చాయి. ఇకపై మందుబాబుల ఆగడాలకు చెక్ పెట్టనున్నట్లు జిల్లా ఎస్పీ ధీర తెలిపారు. గురువారం అత్యాధునిక కిట్లను ఎస్పీ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం లో పోలీసు అధికారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిర్మూలనకోసం పోలీసులకు వెన్నుదన్నుగా నిలిచిన జిల్లా కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి హాజరైన ఫార్మసీ మెడికల్ ఆఫీసర్ వి.వేమారెడ్డి కిట్ల వినియోగంపై అధికారులకు అవగాహన కల్పించారు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి -
దారుణాలు అరికట్టడంలో ప్రభుత్వాల వైఫల్యం
సాక్షి, మదనపల్లె: మహిళలపై పెరుగుతున్న దాడులు, అత్యాచారాలను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సావిత్రి అన్నారు. మదనపల్లె ఎన్జీవో హోంలో గురువారం ఐద్వా జిల్లా ప్రథమ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో సావిత్రి మాట్లాడుతూ మహిళలపై దాడులు, అత్యాచారాలకు గంజాయి, మాదకద్రవ్యాల వినియోగమే కారణమన్నారు. ఏపీలో మద్యం ఏరులై పారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడులో అక్కడి సీఎం 780 మద్యం దుకాణాలను రద్దు చేశారని అన్నారు. చంద్రబాబు ముగ్గురు బిడ్డలకు జన్మనివ్వాలని కోరడమేటని ప్రశ్నించారు. వారిని పెంచి పోషించాలంటే ఎంత భారమో చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథుడు బాలికపై లైంగిక దాడి చేస్తే పోలీసులు అరెస్టు చేయకపోవడాన్ని నిలదీశారు అతన్ని అరెస్ట్ చేసి చట్టపరంగా కటడినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆదాని, అంబానీలకు ప్రభుత్వాలు సంపదను దోచిపెడుతున్నాయని అన్నారు. పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు సిద్దంగా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యతులో ఐద్వా చేపట్టే పోరాటాలకు సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘాలు, సీఐటియు, ఎస్ఎఫ్ఐ, అంగన్వాడీ, ఆశా సంఘాలు అండగా ఉంటాయని తెలియజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రాజేశ్వరి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరసింహ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఐద్వా జిల్లా కన్వీనర్ భాగ్యమ్మ, పట్టణ కార్యదర్శి రెడ్డి ప్రసన్న, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐద్వా సభ్యులు హాజరయ్యారు. -
కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ !
● మండీల్లో అమలు కానీ చిన్నక్రీట్లవిధానం ● 4 నెలలుగా కాలయాపన చేస్తున్న వైనంగుర్రంకొండ: స్వయానా జిల్లా కలెక్టర్ ఆదేశాలనే గుర్రంకొండ మార్కెట్‌యార్డులో మండీల యజమానులు భేఖాతర్ చేస్తున్నారు. జిల్లా అంతటా చిన్నక్రీట్ల (15కేజీలు) విధానం అమలులో ఉన్నా గుర్రంకొండలో మాత్రం నాలుగు నెలలు గడుస్తున్నా ఈ విఽధానం అమలు కాకపోవడం గమనార్హం. దీంతో మళ్లీ రైతులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దోపిడి విధానంతో తిరగబడిన రైతులు గుర్రంకొండ మార్కెట్‌యార్డులో ఐదునెలల క్రితం టమాటా మండీల యజమానులు జాక్ పాట్ పేరుతో నిలువుదోపిడీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనలు చేపట్టారు. రెండురోజుల పాటు మార్కెట్‌యార్డు గేటు తాళాలు వేసి ఎన్‌హెచ్ 340 జాతీయ రహదారిపై ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. మండీల్లో జాక్పాట్లపేరుతో వ్యాపారులు, దళారులు తమను నిలువునా దోచుకొంటున్నారంటూ పేర్కోన్నారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచనలం రేకెత్తించింది. వరుస ఆందోళనలతో ఓవైపు మార్కెట్ కమిటీ అధికారులు, మరోవైపు జిల్లా రెవెన్యూ అధికారులు విడతల వారీగా గుర్రంకొండలో పర్యటించారు. మండీలను ముమ్మరంగా తనిఖీలు చేసి రైతుల సమస్యలపై అధ్యయనం చేశారు. రైతులతోనూ, మండీల యజమానులతోను పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. జాక్‌పాట్‌ల పేరుతో వందకు పదిక్రీట్లు వ్యాపారులు దౌర్జన్యంగా లాక్కొంటున్నారని, వీటికి తోడు టమాటాల వేలం సమయంలో క్రీట్లపై రాశులగా పోస్తున్నారని, కమీషన్లు అధికంగా వసూలు చేస్తున్నారని రైతులు ఆధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి నెల ఒకటో తేది నుంచి చిన్నక్రీట్ల విధానం అన్ని మండీలల్లో ఆమలు చేయాలని అధికారులు వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు. నాలుగునెలలుగా అమలు కాని విధానం: నాలుగునెలలు గడుస్తున్నా చిన్నక్రీట్ల విధానం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. స్థానిక మార్కెట్‌కమిటీ అధికారులు నెలల తరబడి మండీల యాజమానులు, వ్యాపారులతో సమావేశాలు నిర్వహించి చిన్నక్రీట్ల విధానాన్ని అమలు చేయాలంటూ పలుమార్లు సూచించారు. అయితే పలువురు మండీల యజమానులు ఇటు జిల్లాకలెక్టర్, మరోవైపు స్థానిక మార్కెట్‌కమిటీ అధికారుల ఆదేశాలను భేఖాతర్ చేస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు. గుర్రంకొండ మార్కెట్‌యార్డు పరిధిలో మొత్తం 25 టమాటా మండీలను నిర్వహిస్తున్నారు. ఇందులో ఒకటి రెండు మండీలు మాత్రమే పూర్తిస్థాయిలో చిన్న క్రీట్లవిధానాన్ని అమలు చేస్తున్నాయి. మిగిలిన మండీల్లో 50 శాతం నుంచి 70 శాతం వరకు ఆమలు చేస్తున్నారు. ఈ విధానం అమలు ప్రక్రియ నెలల తరబడి సాగదీస్తుండడం గమనార్హం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చిన్న క్రీట్ల విధానం అమలు చేయకపోవడంపై టమాటా రైతులు జిల్లా కలెక్టర్‌ను కలిసి మరోసారి ఫిర్యాదు చేశారు. వ్యాపారులు లేనిపోని కుంటిసాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని రైతులు ఫిర్యాదు చేశారు. కొన్ని మండీలల్లో చిన్నక్రీట్లు, మరికొన్ని మండీల్లో 25కేజీల క్రీట్ల విధానం అమలు చేస్తుండడంతో పరిస్థితి తికమకగా మారుతోందని రైతులు పేర్కొన్నారు. ఈవిషయమై జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులను అప్పటికప్పుడు పిలిపించి జిల్లా కలెక్టర్ సంజాయిషీఅడిగినట్లు రైతులు పేర్కొన్నారు. గుర్రంకొండలోని అన్ని మండీలలో వందశాతం చిన్నక్రీట్ల విధానాన్ని త్వరలో అమలు చేయిస్తాం. రెండు మండీల్లో ఇప్పటికే వందశాతం చిన్నక్రీట్లను రైతులకు ఆందుబాటు లో ఉంచారు. మిగిలిన మండీల వారు చిన్నక్రీట్లను బుక చేసి డబ్బులు చెల్లించేశారు. త్వరలోనే మండీలకు స్టాకు వస్తుంది. అప్పటి నుంచి పూర్తి స్థాయిలో అన్నిమండీల్లో చిన్నక్రీట్ల విధానం అమలు చేస్తాం. – సునీల్‌కుమార్, మార్కెట్ కమిటీ కార్యదర్శి, వాల్మీకిపురం -
యువతి ఆత్మహత్య
గాలివీడు: మండలంలోని బండమీదపల్లెలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అన్నం వనిత(19) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు, పూలింకుంట పంచాయతీ పరిధిలోని హరినాథ రెడ్డి, కవిత దంపతుల కుమార్తె వనిత కడపలో డిగ్రీ చదువుతోంది. ఇటీవల సెలవుల నిమిత్తం స్వగ్రామానికి వచ్చింది.బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ నరసింహారెడ్డి తెలిపారు. జీవితంపై విరక్తితో భవన నిర్మాణ కార్మికుడు.. మదనపల్లె టౌన్: ఉరి వేసుకుని భవన కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన గురువారం ఉదయం మదనపల్లె పట్టణంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి రెండవ పట్టణ ఎస్ఐ నాగేశ్వర్ రావు, సీఐ మహమ్మద్ రఫీ తెలిపిన వివరాలు.. స్థానిక నిమ్మనపల్లె రోడ్డు, దిగువ కమ్మపల్లి ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న నరసింహులు కొడుకు అగరం సూరి (45), భవన కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఏం కష్టం వచ్చిందో ఏమో.. సూరి జీవితం పై విరక్తి చెందాడు. తాను ఉంటున్న ఇంటిలోనే ఉరి వేసుకున్నాడు. సూరి ఆత్మహత్యకు గల కారణాలపై కుటుంబీకులను ఆరా తీశామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య పిల్లలు ఉన్నారు. పాడి ఆవు అపహరణ పుంగనూరు: పట్టణంలోని మేలుపట్లకు చెందిన వెంకటేష్‌కు చెందిన లక్షరూపాయల విలువ చేసే పాడి ఆవును బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించి తీసుకెళ్లారు. గురువారం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.సీసీ కెమెరాలలో దొంగ తెల్లవారుజామున ఆవును దొంగలించుకెళ్లడం నమోదైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నా బిడ్డను చిత్రహింసలు పెడుతున్నారు మదనపల్లె టౌన్: నేరం చేశాడని ముదివేడు, మదనపల్లె పోలీసులు నా బిడ్డను చిత్రహింసలు పెడుతున్నారని గురువారం సాయంత్రం తల్లిదండ్రులు మదనపల్లె జిల్లా ఎస్పీ ఆఫీసు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పులిచెర్ల మండలం, కల్లూరు గ్రామం, ఉప్పుటూరుకు చెందిన శాంతమ్మ, రామకృష్ణల కుమారుడు హరిప్రసాద్ స్థానికంగా వైద్యం చేస్తుంటాడు. కోడలు ఉమా వాల్మీకిపురం ఆసుపత్రిలో జీడీఏ గా పనిచేస్తోంది. ఈ క్రమంలో తన కుమారున్ని 10రోజుల క్రితం మదనపల్లె, ముదివేడు పోలీసులమని పట్టుకెళ్లి తమకు అప్పగించ లేదని ఆరోపించారు. విడిచిపెట్టాలంటే 50,000 డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. తాము అంత డబ్బు కట్టలేమని, తమ బిడ్డను విడిపించాలని విజ్ఞప్తి చేశారు వ్యక్తి అదృశ్యంపై ఫిర్యాదు పెద్దతిప్పసముద్రం: మండలంలోని టి.సదుంకు చెందిన గోపోరుపల్లి వెంకట్రమణప్ప (63) రెండు నెలలుగా అదృశ్యమైనట్లు భార్య మునిలక్ష్మమ్మ గురువారం పేర్కొంది. తన భర్త మానసిక స్థితి సక్రమంగా లేకపోవడంతో ఈ ఏడాది మార్చి 19న ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇంత వరకు తిరిగి ఇంటికి రాలేదని ఆమె తెలిపింది. అప్పటి నుంచి చుట్టు పక్కల గ్రామాలు, బంధువుల ఊళ్లకు వెళ్లి విచారించినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. -
క్రికెట్ పోటీల్లో పాయి వైస్రాయ్ జట్టు విజయం
వాల్మీకిపురం: ఉమ్మడి చిత్తూరు జిల్లా వాల్మీకిపురం పట్టణంలోని జీవీఎస్సీఎస్ క్రీడా మైదానంలో సీసీఎల్– 2 క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. టోర్నమెంట్లో భాగంగా గురువారం ఉదయం నితిన్ వారియర్స్, పాయి వైస్రాయ్ జట్లు తలపడగా పాయ్ వైస్రాయ్ జట్టు గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వినయ్‌కుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అలాగే మధ్యాహ్నాం ఎన్కే స్పోర్ట్స్, హై పీరియన్ జట్ల మధ్య మ్యాచ్ కొనసాగింది. ఈ మ్యాచ్‌లకు క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యాక్షులు గుండ్లూరి శ్రీధర్ కుమార్, సెక్రటరీ సతీష్ యాదవ్, కోచ్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డుప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి మదనపల్లె టౌన్: మదనపల్లె మండలంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గుర్తుతెలియని వ్యక్తి అక్కడకక్కడే ప్రాణాలు విడిచాడు. స్థానికులు తెలిపిన వివరాలు. సుమారు 45 సంవత్సరాల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి మదనపల్లె మండలంలోని కొండా మరిపల్లి సమీపాన ఉన్న వెన్నెల రెస్టారెంట్ సమీపంలో బైక్ పై వెళుతుండగా గుర్తు తెలియని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడు అక్కడి కక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న తాలూకా సీఐ కళా వెంకటరమణ, ఎస్ఐ చంద్రమోహన్ ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు ఎవరనేది తెలియరాలేదన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యువకుడిపై హత్యాయత్నం మదనపల్లె టౌన్: భూ వివాదం తలెత్తి ఓ యువకుడి పై ప్రత్యర్థులు రాళ్లు, రాడ్లతో విచక్షణార హితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. గురువారం సాయంత్రం గుర్రంకొండలో చోటు చేసుకున్న ఘటనపై బాధితుని కథనం.. గుర్రంకొండలో నివాసం ఉంటున్న కేఎండీ వారిష్(30)కు ఊరికి సమీపంలో వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూమి, మామిడి తోట ఉంది. అదే ఊరికి చెందిన అస్కర్ అలీ ఖాన్, మహమ్మద్ ఫైజల్, బాష, రహమత్ మరి కొందరు వెళ్లి ఆ భూమిలో తమకూ వాటా రావాల్సి ఉందని దౌర్జన్యంగా మామిడికాయలు కోసి తరలిస్తుండగా, తోట యజమాని వారీష్ వెళ్లి వారిని అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహించిన ప్రత్యర్థులు రాళ్లు, రాడ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుర్రంకొండ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వీఆర్ఏపై దాడి: తలకు గాయం కేవీపల్లె : వీఆర్ఏపై కర్రతో దాడి చేయడంలో తలకు గాయమైన సంఘటన మండలంలోని గర్నిమిట్ట పంచాయతీ బలిజపల్లెలో చోటు చేసుకుంది. బాధితుని కథనం మేరకు వివరాలిలా వున్నాయి. బలిజల్లెకు చెందిన వీఆర్ఏ చెంగల్రాయుడు గ్రామంలో శ్రీరాములవారి ఆలయానికి కొన్నేళ్లుగా ధర్మకర్తగా ఉన్నాడు. ఆలయానికి సంబంధించి అభివృద్ధి, గతంలో ఏర్పాటు చేసిన శిలాఫలకానికి సంబంధించి గ్రామస్తుల మధ్య వాగ్వాదం చేసుకుంది. ఈ క్రమంలో గర్నిమిట్టకు చెందిన పార్థసారధి అలియాస్ ధనుంజయ కర్రతో దాడి చేయడంతో చెంగల్రాయుడు తలకు గాయమైంది. కుటుంబ సభ్యులు ఆయన్ను చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు వాల్మీకిపురం: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలోని గంగాదొడ్డి వద్ద చోటు చేసుకొంది. వివరాలు.. కూరపర్తికి చెందిన గౌతమ్ కుమార్‌రెడ్డి (20) ద్విచక్రవాహనంలో మదనపల్లె నుంచి సొంత గ్రామానికి తిరిగి వస్తుండగా గంగాదొడ్డి వద్ద ఎదురుగా టమాటా లోడుతో వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో గౌతమ్‌కుమార్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు అతన్ని 108లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మదనపల్లెకు రెఫర్ చేశారు. పోలీసుల అదుపులో క్రికెట్ బుకీలు ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో క్రికెట్ బుకీల ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. దాడిలో ముగ్గురు బుకీలను అదుపులోకి తీసుకోగా గాంధీరోడ్డులోని ప్రధాన క్రికెట్ బుకీ తప్పించుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. హిందూపురంలో క్రికెట్ నిర్వహిస్తూ అక్కడి బుకీలు కొందరు రెండు రోజుల క్రితం పోలీసులకు పట్టుబడ్డారు. పట్టుబడిన క్రికెట్ బుకీలకు ప్రొద్దుటూరులోని ఇద్దరు బుకీలకు సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరి ద్వారా గాంధీరోడ్డులోని ఒక ప్రధాన బుకీకి లింక్ ఉన్నట్లు పోలీసుల విచారణలో బహిర్గతమైంది. దీంతో రూరల్ పోలీసులు బుధవారం అర్దరాత్రి సమయంలో ఏక కాలంలో బుకీల ఇళ్లపై దాడులు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. పోలీసుల రాకను పసిగట్టిన గాంధీరోడ్డులోని క్రికెట్ బుకీ తప్పించుకున్నట్లు సమాచారం. పెద్ద మొత్తంలో డబ్బు కూడా దొరికినట్లు తెలుస్తోంది. పట్టుబడిన బుకీలను పోలీసులు విచారణ చేస్తున్నారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు కూపీ లాగుతున్నారు. -
బేనీషా @ రూ.35 వేలు
రొంపిచెర్ల: రొంపిచెర్ల క్రాస్ రోడ్డు సమీపంలోని గంగా డాబా ఎదురుగా ఏర్పాటు చేసిన మామిడి కాయల మండిలో మామిడి కాయలు కొనుగోలు ప్రారంభం అయింది. అన్నమ్మయ్య జిల్లా రాయచోటికి చెందిన మామిడి వ్యాపారులు ఇక్కడ మండి ఏర్పాటు చేశారు. నాణ్యతగా ఉన్న బేనీషా రకం మామిడి కాయలు టన్ను రూ.35 వేలు ధర పలికింది. దీంతో రైతులు సైజుకు వచ్చిన బేనీషా రకం మామిడి కాయలను మండికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రెండేళ్లుగా మామిడి పంటకు గిట్టుబాటు ధరలు లేక పొలాల్లోనే మామి డి కాయలను వదిలేయాల్సి వచ్చింది. గత సంవత్సరం టన్ను మామిడి కాయలు రూ.10 నుంచి 12 వేలు పలికింది. ఇప్పుడు బేనీషా రకం మామిడి కాయను బట్టి టన్ను రూ. 25 వేలు నుంచి 35 వేలు వరకు పలకడం విశేషం. ప్రస్తుతానికి ధర ఉందని మళ్లీ తగ్గి పోతుందేమోనని రైతులు వడివడిగా కోతలు కోస్తున్నారు. బెంగుళూరు రకం టన్ను రూ.10 వేలు నుంచి 20 వేలు వరకు పలుకుతోంది. మామిడి కాయలకు కవర్లు కట్టిన బేనీషాకు మాత్రం టన్నుకు రూ.60 వేలు నుంచి 70 వేల వరకు ఇస్తుండడం విశేషం. కవర్లు కట్టిన రైతులకు వ్యాపారులకు గిట్టుబాటు ధర వస్తుండడంతో రైతు లు, వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రొంపిచెర్ల క్రాస్ మండిలోమామిడి కొనుగోలు ప్రారంభం కవర్లు కట్టిన మామిడికి డిమాండ్ -
విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
కలెక్టర్ నిశాంత్ కుమార్ సాక్షి, మదనపల్లె: జిల్లాలో విద్యాభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపుపై విద్యాశాఖ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య, సమగ్ర శిక్ష, స్కిల్ డెవలప్మెంట్, అనుబంధ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడి పిలుస్తోంది కార్యక్రమంలో రాయ చోటి, పీలేరు, మదనపల్లి, వాయల్పాడు,గాలివీడు, పుంగనూరు మండలాల్లో నమోదు ప్రక్రియ తక్కువగా ఉందన్నారు. జిల్లాలోని 89 మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 60 కంటే తక్కువగా ఉందని, దీనిపై చర్యలు చేపట్టాలని సూచించారు. పదో తరగతి ఫలితాల్లో సైన్స్, తెలుగు సబ్జెక్టుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయినట్లు చెప్పారు. ఇంటర్మీడియట్ ఫలితాల శాతం పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించిన వారి నివేదిక సిద్ధం చేయాలని కోరారు. సమావేశంలో డిఐఈఓ రవి, డిఈవో సుబ్రహ్మణ్యం, సమగ్ర శిక్ష ఏపీసీ అనురాధ, స్కిల్ డెవలప్మెంట్ అధికారి నాగార్జున పాల్గొన్నారు. -
హుండీ ఆదాయం లెక్కింపు
ఒంటిమిట్ట (సిద్దవటం): మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి హుండీ ఆదాయాన్ని గురువారం టీటీడీ అధికారులు లెక్కించారు. ఈ సందర్భంగా నెల రోజులకుగాను భక్తులు వేసిన కానుకలను లెక్కించగా రూ.7,72,930ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. బ్రహ్మంగారిమఠం: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో భక్తులు సమర్పించుకున్న హుండీల సొమ్మును గురువారం లెక్కించారు. ఇందులో బ్రహ్మంగారిమఠంలో హుండీల ద్వారా రూ. 37,55,769 , పోలేరమ్మ గుడి దగ్గర గల హుండీ ద్వారా రూ. 2,74,699 లక్షలు. నాలుగు గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి వచ్చినట్లు మేనేజర్ ఈశ్వరాచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎండోమెంట్ అధికారి శంకర్ బాలాజీ, మఠాధిపతి వీర ధర్మజ వెంకటాద్రి స్వామి, మఠం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పీలేరు: రైతులు వ్యవసాయానికి రథసారథుల ని జిల్లా వ్యవసాయాధికారి డాక్టర్ శివనారనాయణ, శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.వి.ఎస్. నాయుడు అన్నారు. గురువారం శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల విద్యార్థులకు గ్రామీణ వ్యవసాయంపై అవగాహన, అనుభవం కోసం వేలపులబైలు రైతు సేవా కేంద్ర పరిధిలో క్షేత్రస్థాయి వ్యవసాయ ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహ న కల్పించారు. కలికిరి కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ కె. మంజుల, ఎస్వీ వ్వసాయ కళాశాల కీటక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ చలం, అసోసియేట్ డీన్ ప్రతినిధి డాక్టర్ నాగమణి, జిల్లా డీపీఎం వెంకటమోహన్, ఏడీఏ కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు. సాక్షి, మదనపల్లె: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. గురువారం కలెక్టరేట్లో పోలీస్, వైద్య, విద్యుత్, ఆరోగ్య, రవాణా, పోస్టల్ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 41 కేంద్రాలలో పరీక్షల నిర్వహణ జరుగుతుందని చెప్పారు. మొదటి సంవత్సర పరీక్షలకు 9,274 మంది, ద్వితీయ సంవత్సర పరీక్షకు 5,558 మంది, వోకేషనల్ 1,125 మంది హాజరవుతారని చెప్పారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లో అనుమతించేదిలేదని స్పష్టం చేశా రు. పరీక్ష కేంద్రాల్లో సమస్యలపై కంట్రోల్ రూమ్ నెంబర్ 9866112750కు తెలియ జేయాలన్నారు. జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణాధికారి రవి, డీఈవో సుబ్రహ్మణ్యం, సమగ్ర శిక్ష ఏపీసీ అనురాధ, మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమీల, మున్సిపల్ శాఖ డీఈఈ శ్రావణి, సర్వశిక్ష అభియాన్ అధికారిని డీపీఎమ్‌ఓ రమే ష్ బాబు, ఆర్టీసీ డీఎం ఎంవీఆర్.రెడ్డి, ఇన్స్పెక్టర్ రామాంజనేయులు పాల్గొన్నారు. -
జగనన్న పాలనలో జిల్లాలో గృహ వైభవం
(2019–24) మంజూరు: 78,221 చేపట్టిన ఇళ్లు: 76,626 పూర్తిచేసినవి: 34,906 మెటీరియల్ ఖర్చు: రూ.118,23,87,409 నగదుబిల్లులు: రూ.706,95,74,998 మొత్తం ఖర్చు: 826,74,05,202 చేపట్టిన ఇళ్లు రాయచోటి: 18,949 పీలేరు(రూరల్): 8,426 పీలేరు(అర్బన్): 3,529 రాజంపేట(రూరల్): 10,403 రాజంపేట(అర్బన్): 1,897 మదనపల్లె: 14,626 తంబళ్లపల్లె: 12,391 రైల్వేకోడూరు: 6,378 04–06–2024 నాటికి బిలో బేస్మెంట్ లెవల్: 9,993 బేస్మెంట్ లెవెల్: 19,138 లింటిల్ లెవల్: 886 రూఫ్ లెవల్: 5,681 రూఫ్‌కాస్ట్: 2,913 -
‘ఫేస్ ఐడీతో బురిడీ’పై కదలిక
మదనపల్లె టౌన్: ఫేస్ ఐడీతో మాయ చేస్తూ విధులకు డుమ్మా కొడుతున్న ఉద్యోగులపై ఉన్నతాధికారులు కన్నెర్ర చేశారు. సాక్షి జిల్లా ఎడిషన్ గురువారం ప్రచురితమైన ‘‘ఫేస్ ఐడి తో బురిడీ’’కథనాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాఽ దికారి డా.లక్ష్మీ నరసయ్య స్పందించారు. ఈ నేపథ్యంలో మదనపల్లెలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యా లయంలో వివిధ ప్రోగ్రామ్ అధికారులతో, కార్యాలయ సిబ్బందితో డీఎంహెచ్ఓ అత్యవసర సమావేశం నిర్వహించి కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎటువంటి నిర్లక్ష్యం, అలసత్వం, విధుల పట్ల బాధ్యతారాహి త్యం వహిస్తే సహించేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో క్రమశిక్షణతో వ్యవహరించాలని, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. ఫీల్డ్‌కు వెళ్లే సిబ్బంది తప్పనిసరిగా మూవ్మెంట్ రిజిస్టర్లో నమోదు చేసి పై అధికారులకు సమాచారం ఇవ్వాలని, ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే డ్యూటీ సమయాల్లో సిబ్బంది అందరూ తమ విధి స్థానాల్లో అందుబాటులో ఉండాలని, ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పూర్తి బాధ్యతతో పని చేయాలని సూచించారు. ఎఫ్.ఆర్.ఎస్ హాజరు వ్యవస్థలో ఇన్ పంచ్, మిడ్ పంచ్, ఔట్ పంచ్‌లను తప్పనిసరిగా సంబంధిత విధి ప్రాంతాల్లోనే నమోదు చేయాలని, ఎటువంటి అక్రమాలు, తప్పుడు హాజరు నమోదులు జరిగినా వాటిని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి హెచ్చరించారు. -
ఆశాజనకంగా టమాట
సాక్షి, మదనపల్లె: సాధారణంగా ఎండలు, ఉక్కపోత పరిస్థితులు టమాట పంట దిగుబడిపై ప్రభావం చూపిస్తాయి. ఈ సారి దిగుబడులపై ప్రభావం పడకుండా రైతులు ప్రత్యేక సాగు చర్యలు తీసుకున్నారు. ఫలితంగా టమాట దిగుబడి ఆశాజనకంగానే ఉంది. ఈనెలాఖరుకు దిగుబడి రెట్టింపుకానుంది. ఇప్పటికే టమాట సీజన్ మొదలైంది. మదనపల్లె మార్కెట్‌కి వస్తున్న టమాట దిగుబడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాగా ఈనెల ప్రారంభంలో టమాట ధరలు ఆశించినంత లేకున్నా.. ప్రస్తుతం మెల్లగా ఎగబాకుతున్నాయి. గత రెండురోజుల్లో ధర పెరగడంతో రైతుల్లో ఆశలు నెలకొంటున్నాయి. మదనపల్లె మార్కెట్‌కు ఈనెల ఏడున 303 టన్నుల టమాట రాగా మొదటి గ్రేడ్ కిలో రూ.27 పలికింది. 13న 398 టన్నులు రాగా కిలో రూ.28 పలికింది. 14న 437 టన్నులు రాగా కిలో రూ.29 పలికింది. ఇలా దిగుబడి పెరుగుతూ వస్తూనే ధరలు మెల్లగా పెరుగుతున్నాయి. -
● అర్హులైన రైతులకు అన్యాయం
సాక్షి ప్రతినిధి, కడప: ముద్దనూరు–బి.కొత్తపల్లె నేషనల్ హైవే (ఎన్‌హెచ్–716) రహదారి పరిహారం కొల్లగొట్టేందుకు తెలుగుతమ్ముళ్లు మాస్టర్ ప్లాన్ రచించారు. స్వల్పంగా భూమి కోల్పోతే సర్వం పోయినట్లు రికార్డుల్ని తారుమారు చేశారు. పైపులైన్ కోల్పోయినట్లు, బోరుబావులు గల్లంతవుతున్నట్లు రికార్డులు రూపొందారు. అంతేకాదు భవనాలు, పండ్లు, కూరగాయాల తోటలు కోల్పోయినట్లు పక్కాగా కథలల్లి ప్రజాధనం కాజేసే కుట్ర పన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే లేనిది ఉన్నట్లు రికార్డులు పుట్టించారు. ఆపై లక్షలాది రూపాయాలు కొల్లగొట్టే వ్యూహాన్ని ఎంచుకున్నారు. ● ముద్దనూరు–బి.కొత్తపల్లె రహదారిలో భూసేకరణలో అనేక వైఫల్యాలు వెలుగుచూశాయి. అక్రమాల నేపధ్యంలో ఇదివరకే తొండూరు విలేజ్ రెవెన్యూ అధికారి నరహరి సస్పెండ్ ఉదంతం వెలుగు చూసింది. నరహరి అవినీతి తీగలాగితే అధికార పార్టీ నేతల అక్రమాల డొంకంతా కదిలింది. తొండూరు, మల్లేల గ్రామాల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.కోటి పరిహారం తెలుగుతమ్ముళ్లకు భోజ్యంగా మారింది. వీఆర్ఓ సస్పెండ్‌తో బయటపడ్డ బాగోతం.... మల్లేల గ్రామంలో ఓ రైతుకు చెందిన కొంత భూమి ఎన్‌హెచ్ హైవే రోడ్డుకు కోల్పోయారు. ఆ కొద్ది భూమిలోనే వ్యవసాయబోర్లు, పైపులైన్లు, పండ్ల తోటలు ఉన్నట్లు రికార్డులు సృష్టించి దాదాపు రూ.10లక్షలకుపైగా పరిహారం అధికారులు మంజూరు చేసినట్లు సమాచారం. అలాగే తొండూరు గ్రామానికి చెందిన తెలుగుతమ్ముళ్లు కోల్పోతున్న భూముల్లో బోర్లు, బావులు, పండ్లతోటలు ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో లేవు. అయినప్పటికీ హైవే రోడ్డు ఏర్పాటు కారణంగా విద్యుత్ కనెక్షన్లు, పైపులైన్లు, బోర్లు, పండ్ల మొక్కలు కోల్పోతున్నట్లు రికార్డులు సృష్టించారు. జిల్లా స్థాయి రెవిన్యూ యంత్రాంగం రైతులతో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయగా వీఆర్ఓ నరహరి మాత్రమే సమాధానాలు ఇవ్వసాగారు. రైతులు లేకుండా వారి అభ్యర్థన తెలుసుకోకుండా మొత్తం వ్యవహారం నరహరి నడిపారనే అంచనాకు వచ్చిన అధికారులు ఈనెల 9న సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. నరహరి సస్పెండ్‌తో మొత్తం బాగోతం బహిర్గతమైంది. ఎన్‌హెచ్ పరిహారంలో అధికార పార్టీకి వారికే లక్షలకు లక్షలు పరిహారం మంజూరైనట్లు తెలిసింది. ఆమేరకు ఆయా రైతుల అకౌంట్లకు డబ్బులు జమ చేసేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఎన్‌హెచ్–716 రహదారి భూసేకరణలో అక్రమాలు అధికార పార్టీ నేతల అక్రమాలకు అండగా నిలుస్తోన్న యంత్రాంగం తొండూరు మండలంలో రెవెన్యూ అధికారుల చేతివాటం వీఆర్ఓ నరహరి సస్పెండ్‌తో బయటపడ్డ భాగోతం ప్రభుత్వ పరిహారాన్ని బొక్కేస్తున్న తెలుగుతమ్ముళ్లు అర్హులకు మొండిచేయి చూపడంతోనే అసలు సమస్య ఉత్పన్నమైంది. తొండూరు మండలం మల్లేల గ్రామానికి చెందిన రైతులు భూములు కోల్పోతున్నారు. కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి పండ్ల తోటలు పండించుకుంటున్నారు. అలాంటి రైతులకు నష్టపరిహారం మంజూరు చేయడంలో వివక్షత ప్రదర్శించారు. లేనిది ఉన్నట్లు రికార్డులు పొందుపర్చిన రెవెన్యూ యంత్రాంగం ఉన్నది ఉన్నట్లుగా రికార్డులు రాసేందుకు మనసొప్పడం లేదు. అర్హులైన సామాన్య రైతులకు అన్యాయం చేసేందుకే సిద్ధమయ్యారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న రైతులకు ఒక న్యాయం, సామాన్య రైతులకు మరొక న్యాయం చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం చర్యలుండిపోయాయి. ఇప్పటికై నా జిల్లా రెవెన్యూ అధికారులు ఎన్‌హెచ్ హైవే రోడ్డు పరిహారం అవకతవకలపై పునః పరిశీలించి అర్హులకు న్యాయం చేస్తూనే, అనర్హులను కట్టడి చేసి ప్రజాధనాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు. -
అనధికార లేఅవుట్లకు నోటీసులు
సాక్షి, మదనపల్లె: పీకేఎం ఉడా పరిధిలో అనుమతి లేకుండా లే అవుట్లను వేసిన వారికి సంబంధిత పంచాయతీ కార్యదర్శుల ద్వారా నోటీసులు జారీ చేయాలని సంస్థ వైస్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. గురువారం ఉడా పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆయన కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలోని గుండ్లసాగరం పంచాయతీలో ల్యాండ్ పూలింగ్ స్కీం ద్వారా లే అవుట్, మౌళిక సదుపాయాల కల్పనకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. లే అవుట్ ప్లానులు, వీటికి కావాల్సిన అంచనాలు తయారు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. కుప్పంలో నాలుగు, ములకలచెరువులో ఒకటి అన్నా క్యాంటీన్ల నిర్మాణానికి రూ.52.54 లక్షలను ప్రజారోగ్య శాఖకు చెల్లించామని వెల్లడించారు. సమావేశంలో సెక్రటరీ పీఆర్.మనోహర్, పరిపాలనాధికారి చిట్టిబాబు, ప్లానింగ్ అధికారి, అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, అసిస్టెంట్ ఇంజనీరు, ప్లానింగ్ సెక్రటరీలు హాజరయ్యారు. సమీక్షలో జేసీ శివ్ నారాయణ్ శర్మ -
ముగిసిన మహాకుంభాభిషేక మహోత్సవం
చక్రాయపేట: పవిత్ర పుణ్య క్షేత్రమైన గండి వీరాంజనేయ స్వామి నూతన ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవాలు బుధవారంతో అత్యంత వైభవంగా ముగిశాయి. సుమారు ఆరు రోజులపాటు నిర్విఘ్నంగా పలు హోమాలు నిర్వహించి వేడుకలను ముగించారు. చివరి రోజు శ్రీమద్రామాయణ పట్టాభిషేకం,మహపూర్ణాహుతి,దక్షిన రాజగోపుర విమా ణ కలిశాలు, దీపస్తంభ కలశం తదితర కార్యక్ర మాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు మూలవిరాట్ దర్శనం కల్పించారు, అహోబిల పీఠం నుంచి ప్రధాన అర్చకుడు రమేష్ చేతుల మీదుగా శ్రీకార్యం, పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామిలచే విమాన కలశ స్థాపన, భూమానందాశ్రమ పీఠాధిపతి మాతాజి ప్రతిభానందగిరి ఉత్తరాధికారి ప్రణవానంద స్వామి చేతుల మీదుగా ఈకార్యక్రమం జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి గురుప్రసాద్, చైర్మన్ వెంకటస్వామి ఆధ్వర్యంలో టీటీడీ ఆగమ శాస్త్ర సలహాదారులు రాజేష్ స్వామి, విజయ్ స్వామిల శిష్య బృందం ఆలయ అర్చకులు కేసరి, రాజారమేష్, రాజగోపాలాచార్యులు, రామమోహన్శర్మ పర్యవేక్షణలో ఈకార్యక్రమాలు జరిగాయి. చాలా రోజుల తర్వాత.. వీరాంజనేయ స్వామి మూల విరాట్ దర్శనం భక్తులకు సరిగ్గా నాలుగేండ్ల,ఆరు మాసాల ,పదిహేడు రోజులకు లభించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆలయ పునర్నిర్మాణానికి రూ.28.5 కోట్లు మంజూరు కావడంతో 2021లో పలు యజ్ఙ యాగాదులు నిర్వహించి బాలాలయంలో దారువుతో చేసిన స్వామి వారి ఽప్రతిమకు జీవం పోసి అక్కడ భక్తులకు దర్శన వసతిని కల్పించి ప్రధాన ఆలయాన్ని మూసి పగులగొట్టారు. అప్పటి నుంచి భక్తులకు మూల విరాట్ దర్శనం కరువైంది. తిరిగి బుధవారంతో భక్తులకు స్వామి మూలవిరాట్ దర్శనం లభించింది. హాజరైన కలెక్టర్,కమిషనర్ మహాకుంభాభి వేడుకలకు కలెక్టర్ చెరుకూరు శ్రీధర్, దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ హాజరయ్యారు. ఈసందర్భగా ఆలయ అర్చకులు వారికి పూర్ణఫలంతో స్వాగతించి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ,డ్వామా పీడీలు రాజ్యలక్ష్మి,ఆదిశేషారెడ్డి,ఆర్‌డబ్ల్యూస్ ఎస్ఈ ఏడుకొండలు.ఈఈ శ్రీనివాసులు,ఏఈ రమేష్‌రెడ్డి,దేవదాయశాఖ ఎస్ఈ సతీష్ జిల్లా సహాయ కమీషనర్ శంకర్ పాల్గొన్నారు. నాలుగేండ్ల ఆరు మాసాలపదిహేడు రోజుల తర్వాత భక్తులకు మూల విరాట్ దర్శనం తన్మయత్వంతో పరవశించిన భక్తులు హాజరైన పీఠాధిపతులు. కలెక్టర్ తదితరులు -
బొలెరో ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : ఆటో కోసం రోడ్డు పక్కన నిలుచుని ఉన్న వ్యక్తిని బొలెరో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం ఉదయం గుర్రంకొండ మండలంలో జరిగిన ఘటనపై బాధితుని కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాలు.. గుర్రంకొండ మెయిన్ బజార్లో నివాసం ఉంటున్న షేక్ మునీర్‌బాషా (52) గుర్రంకొండలోని మదనపల్లె రోడ్డులో ఉన్న పెట్రోల్ బంకులో పంపు ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం అర్థరాత్రి వరకు విధులు నిర్వర్తించి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు ఆటోకోసం వేచి ఉండగా బొలెరో ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని కుటుంబీకులు మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిక్షించి తిరుపతి రుయాకు వెళ్లాలని సూచించారు. కుటుంబీకులు బాధితున్ని రుయాకు తరలించారు. గుర్రంకొండ ఎస్సై రవీంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థులకు.. మదనపల్లె టౌన్ : ఆర్టీసీ బస్సు ఢీకొని సత్యసాయి జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం కురబలకోట మండలంలో చోటుచేసుకున్న ఘటనపై బాధితులు, ముదివేడు ఎస్ఐ మధురామచంద్రుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సత్యసాయి జిల్లా, కదిరి మండలం, పూటాగులకు చెందిన సంతోష్ (20), యస్వంత్ (20) ఎంసెట్ పరీక్ష రాయడానికి మదనపల్లె మండలం, పుంగనూరు రోడ్డులోని ఆదిత్య కళాశాలకు బైక్‌లో వచ్చారు. పరీక్ష రాసి ఇద్దరూ తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. కురబలకోట మండలం, చెన్నామర్రి మిట్టపై కి వెళ్లగానే ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో విద్యార్థులు ఇద్దరికి కాళ్లు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, తిరుపతి రుయాకు వెళ్లాలని వైద్యులు సూచించారు. కుటుంబీకులు బాధితులను వెంటనే సత్యసాయి జిల్లాకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ముదివేడు ఎస్ఐ మధురామ చంద్రుడు తెలిపారు. -
రెండు కార్లను ఢీకొన్న కారు
మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని భూమాయపల్లె – కేశ లింగాయపల్లె గ్రామాల మధ్యలో మైదుకూరు – పోరుమామిళ్ల రహదారిపై బుధవారం సాయంత్రం ఎదురుగా వస్తున్న రెండు కార్లను ఓ కారు ఢీకొన్న సంఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. వారిలో తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలను మెరుగైన చికిత్స కోసం కడపకు తరలించారు. బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆళ్లగడ్డకు చెదిన పోతులూరు ఆచారి తన కుమారుడు వేత విఖ్యాత్ పుట్టు వెంట్రుకలు తీయించేందుకు బ్రహ్మంగారిమఠానికి బంధుమిత్రులతో కలిసి ఓ కారు, లారీలో వెళ్లారు. కార్యక్రమం ముగియాగానే పోతులూరు ఆచారి, బంధువులైన ఈశ్వరమ్మ, వెంకటేశ్వర్లు, గోవిందయ్య, కుమారుడు వేద విఖ్యాత్ కారులో బయల్దేరారు. బంధువులు ఉన్న లారీ వెనుక అనుసరించింది. గిద్దలూరుకు చెందిన పల్లెపాల్ ప్రతాప్ అనే వ్యక్తి కడపలో ఉన్న తన కుమార్తె బ్యూలా గర్భిణిగా ఉండటంతో రెస్ట్ తీసుకునేందుకు తన బంధువు సుధీర్ బాబుతో కలిసి కడప నుంచి కారులో పిలుచుకొస్తున్నాడు. మైదుకూరు మండలం గంజికుంటకు చెందిన సునీల్, సునీత అనే భార్యాభర్తలు మల్లేపల్లెలో ఉన్న తన కుమార్తె వద్దకు కడప నుంచి కారులో బయలుదేరారు. ఈ మూడు కార్లు మైదుకూరు మున్సిపాలిటీలోని భూమాయపల్లె – కేశలింగాయపల్లె గ్రామాల మధ్యకు రాగానే ఆళ్లగడ్డకు చెందిన కారును డ్రైవింగ్ చేస్తున్న పోతులూరు ఆచారి తన ముందున్న ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేసి ఎదురుగా వస్తున్న రెండు కార్లను ఒకదాని తర్వాత ఒక దానిని ఢీకొట్టాడు. సంఘటనలో గంజికుంటకు చెందిన సునీల్, సునీత, గిద్దలూరుకు చెందిన పాల్ ప్రతాప్, ఆళ్లగడ్డ కారును డ్రైవింగ్ చేస్తున్న పోతులూరు ఆచారికి తీవ్ర గాయాలయ్యాయి. పాల్ ప్రతాప్ కారు డ్రైవర్.. ఓనర్ అయిన సుదర్శన్, వెంకటేశ్వర్లు, ఈశ్వరమ్మ, గోవిందయ్యలకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందగానే మైదుకూరు ఖాజీపేట 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మైదుకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తాను గర్భిణిగా ఉండటంతో తాము ప్రయాణిస్తున్న కారును నెమ్మదిగా పోనిస్తున్నామని, బ్రహ్మంగారిమఠం నుంచి వస్తున్న కారు ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేసి తమ కారును, మరో కారును ఢీకొట్టినట్టు గిద్దలూరుకు చెందిన బ్యూలా తెలిపారు. మైదుకూరు పోలీసులు ప్రభుత్వాస్పత్రికి చేరుకుని సంఘటన వివరాలను నమోదు చేసుకున్నారు.8 మందికి గాయాలు -
అడ్మిషన్.. టెన్షన్
సాక్షి అన్నమయ్య: ప్రైవేటు టీచర్లకు అడ్మిషన్ల అగ చాట్లు తప్పడం లేదు. అసలే మండే ఎండలకు తోడు ఉక్కపోతతో అల్లాడుతుంటే.. అడ్మిషన్ల టార్గెట్లు వారిలో మరింత వేడి పుట్టిస్తోంది. కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు టార్గెట్లు పెట్టి వీధుల్లో పరుగెత్తిస్తుంటే... మరికొన్ని పాఠశాలల యాజమాన్యాలు బస్సుల్లో టీచర్లకు పల్లెలకు తీసుకెళ్లి కరపత్రాల ద్వారా ప్రచారం చేయడంతోపాటు అడ్మిషన్లు చేయించేలా ఒత్తిళ్లు పెడుతున్నారు. లేకపోతే ఈ ఏడాది జూన్‌లో ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపాధ్యాయ పోస్టుకు రెన్యూవల్ ఉండదని భయపెట్టిస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవుల్లో విహార యాత్రలకు కుటుంబ సభ్యులతో వెళ్లి ఎంజాయ్ చేయాల్సిన సమయంలో... పల్లెలు, పట్టణాల్లో తిరగాల్సి వస్తోందని ప్రైవేటు టీచర్లు వాపోతున్నారు. అన్నమయ్య జిల్లాతోపాటు వైఎస్సార్ జిల్లాలో దాదాపు వెయ్యికి పైగా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు ఉపాధ్యాయులపై టార్గెట్లు విధిస్తున్నారు. ఒక్కో ఉపాధ్యాయుడికి 10–15 అడ్మిషన్లు చేయించాలని తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. ఇది తగునా! సమాజంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక స్థానం ఉంది. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. అలాంటి ఉపాధ్యాయులను వీధుల్లోకి పంపి అడ్మిషన్లకోసం ఇబ్బందులు పెట్టడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రైవేటు పాఠశాలల మధ్య పోటీతత్వం పెరగడంతో విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు ఎవరివారు తాపత్రయ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యలో ప్రైవేటు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడ్మిషన్లు చేయకపోతే ఉద్యోగం రెన్యూవల్ ఉండదన్న ఆందోళన ఉపాధ్యాయుల్లో వెంటాడుతోంది. ప్రైవేటు పాఠశాలల టీచర్లకు టార్గెట్ల తిప్పలు ఒక్కొక్కరికి 10–15 అడ్మిషన్లు అంటూ ఒత్తిడి రెన్యూవల్ ఉండదేమోనన్న భయంతో టీచర్ల పరుగులు -
పాముకాటుతో వృద్ధురాలు మృతి
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లాలో విషాదకర సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పడుకున్న చోటనే పాము కాటుకు గురై ఓ వృద్ధమహిళ ప్రాణాలు విడచింది. మృతురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. తంబళ్లపల్లె నియోజకవర్గం కురబల కోట మండలం, మట్లివారిపల్లి గ్రామం, కోణంగివారిపల్లికి చెందిన మునస్వామి భార్య ఈరమ్మ (70) రాత్రి అందరిలాగే ఇంట్లో నిద్రపోయింది. తెల్లవారు జామున ఓ పాము ఆమెను కాటేసింది. దీంతో బాధితురాలు కేకలు వేయడంతో కుటుంబీకులు గమనించి, చికిత్స నిమిత్తం మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. అయినా ఆమె ఆరోగ్యం కుదుటపడక చికిత్స పొందుతూనే ప్రాణాలు విడిచింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ముదివేడు ఎస్ఐ మధురామచంద్రడు తెలిపారు. మహిళకు అస్వస్థత మదనపల్లె టౌన్ : విష సర్పం కాటేసి వృద్ధ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన తంబళ్లపల్లె మండలంలో చోటు చేసుకుంది. బాధితురాలు కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని కోసువారిపల్లె పంచాయతీ, చిటికివారిపల్లికు చెందిన లేట్ వెంకటరమణ భార్య రెడ్డెమ్మ (65) ఉదయం ఇంట్లో చెత్త ఊడ్చుతుండగా విష సర్పం చేతిపై కాటేసింది. అస్వస్థతకు గురైన బాధితురాలని, కుటుంబీకులు 108లో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. అయినా ఆరోగ్యం కుదుటపడక పోవడంతో తిరుపతి రుయా ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. పేకాట రాయుళ్ల అరెస్టుతంబళ్లపల్లె : మండలంలోని కోటకొండ సమీపంలో పేకాట ఆడుతున్నట్లు సమాచార అందుకున్న స్పెషల్ బ్రాంచి సీఐ రాజారమేష్ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం దాడి చేశరు. పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.33,900 నగదు, 5 సెల్ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వారిని తంబళ్లపల్లె పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. బండలాగుడు పోటీలు చాపాడు : హనుమజ్జయంతి వేడుకలలో భాగంగా మండలంలోని విశ్వనాథపురంలో బుధవారం నిర్వహించిన బండలాగుడు పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీలలో కడప జిల్లా చాపా డు మండలం విశ్వనాథపురానికి చెందిన ఎస్ఎస్ఆర్ ఎడ్లు 3112 అడుగులు బండలాగి ప్రథమ స్థానంలో, బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన రామకృష్ణ ఎడ్లు 2884 అడుగులతో ద్వితీయ స్థానం, కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం చౌటపల్లెకు చెందిన మార్తల చంద్ర ఓబుళరెడ్డి ఎడ్లు 2786 అడుగులు లాగి తృతీయ స్థానం, మైదుకూరుకు చెందిన తిరుపాల్‌రెడ్డి, వెంకటేష్ ఎడ్లు 2774 అడుగులు లాగి నాలుగో స్థానంలో, విశ్వనాథపురానికి చెందిన లాస్యరెడ్డి ఎడ్లు 2537 అడుగులతో ఐదోస్థానం, కమలాపురం మండలం బాలయ్య గారిపల్లెకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి ఎడ్లు 2028 అడుగులతో ఆరోస్థానంలో నిలిచాయి. ఎడ్ల యజమానులకు వరుసగా రూ.లక్ష, రూ.80వేలు, రూ.60వేలు, రూ.40 వేలు, రూ.20వేలు, రూ.10వేలు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. -
సీటీఎం చెరువు వద్ద మృత శిశువు లభ్యం
మదనపల్లె టౌన్ : మదనపల్లె మండలంలోని సిటిఎం చెరువు వద్ద బాలుడి మృత దేహం బుధవారం సాయంత్రం లభ్యం కావడం కలకలం రేపుతోంది. మదనపల్లె– తిరుపతి హైవే పక్కన ముళ్ల పొదల్లో సుమారు ఏడాదిన్నర వయసున్న మృత శిశువును టవల్ లో చుట్టి పడవేసి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కళా వెంకటరమణ, ఎస్ఐ చంద్ర మోహన్ స్థానికుల సాయంతో మృత శిశువును మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతదేహం వద్ద లభించిన దుస్తులు, టవల్, నిక్కరు, టీషర్ట్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎవరైనా చంపి శిశువును పడేసి వెళ్లారా లేక అనారోగ్యం కారణంగా చనిపోతే తెచ్చి ముళ్లపొదల్లో పారేశారా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోందన్నారు. ఆచూకీ తెలిసిన వారు తాలూకా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. యువకుడు ఆత్మహత్యసంబేపల్లె : శాంతల హరి (20) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం సంబేపల్లె మండలంలో చోటు చేసకుంది. పోలీసుల వివరాలమేరకు.. మండల కేంద్రంలోని నామాలగుట్టకు చెందిన రమేశ్, కన్నమ్మల కుమారుడు హరి మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు కుటుంబీలకులు తెలిపారు. అప్పటి నుంచి రాలేదు. దీంతో హరి కోసం కుటుంబీకులు చుట్టుపక్కల గాలించారు. ఈ క్రమంలోనే బుధవారం మండల కేంద్రంలోని నల్లగంగమ్మ ఆలయం సమీపంలోని కొండపై ఉరికి వేలాడుతున్న హరిని గొర్రెల కాపరులు గుర్తించి పోలీసులకు, బంధువులకు సమాచా రం అందించారు. పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని కిందకు దించారు. పోస్టుమార్టం నిమిత్తం రాయ చోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కన్న మ్మ బతుకుదెరువుకోసం కువైట్‌కు వెళ్లినట్లు సమాచారం. కువైట్ నుంచి కుమారుడికి కొంత నగదు పంపించింది. అందులో కొంత మొ త్తం మిస్ అయిందని కుటుంబపెద్దలు మందలించారు. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయి ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆరోగ్యానికి కుండంత అండ!
పులివెందుల రూరల్: బయట ఎండకు తిరిగి అలసిపోయి వచ్చినప్పుడు కుండలోని గ్లాసు నీరు తాగితే దప్పిక తీరడమే కాదు.. ప్రాణమూ కుదుటపడుతుంది.. అవును.. ఫ్రిడ్జ్‌లోని ఐస్ నీరు కంటే మట్టి కుండలోని నీరు ఆరోగ్యానికి శ్రేష్టమంటున్నారు వైద్య నిపుణులు. ఫ్రిడ్జ్ నీళ్లు తాగితే గొంతు సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజలే కాదు.. డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లు ఉన్న వారు సైతం మట్టి కుండలను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత ఎండ తీవ్రత నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మట్టి కుండల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలోని ఆయా పట్టణాల్లో మట్టి కుండల విక్రయాలు రోజుకు వందల సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఒక్కో కుండ సైజును బట్టి రూ.150ల నుంచి రూ.200ల వరకు విక్రయిస్తున్నారు. కుళాయి అమర్చిన కుండలపై వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. గుజరాత్ రాష్ట్రం నుంచి కుండల దిగుమతి గుజరాత్ రాష్ట్రం నుంచి జామ్ అనే కొత్త కుండలను దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తున్నారు. వేసవి కాలంలో ఈ కుండలకు మంచి డిమాండ్ ఉంది. గుజరాత్‌కు చెందిన జాబ్ కుండలు ఒక్కొక్కటి రూ.200ల నుంచి రూ.300ల వరకు విక్రయిస్తున్నట్లు వ్యాపారస్తులు తెలిపారు. అలాగే కర్నూలు, కడప, కమలాపురం, మదనపల్లె తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసుకుని స్థానికంగా విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కుండనీళ్లు ఆరోగ్యానికి శ్రేష్టమంటున్న వైద్య నిపుణులు వేసవికాలంలోనే కుండలకు గిరాకీ -
‘ఎయిడ్స్ సురక్ష’ను విజయవంతం చేయండి
మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఉమ్మడి జిల్లాల ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రోగ్రామ్ అధికారి భాస్కర్ పేర్కొన్నారు. బుధవారం రాయచోటి ఏరియా ఆసుపత్రిలోని ఐసీటీసీ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. వివిధ విభాగాల నెలవారీ నివేదికలను పరిశీలించారు. నివేదికల్లో ఉన్న వ్యత్యాసాలను సరిదిద్దుకొని సేవలను మరింత మెరుగు పరచాలని సూచించారు. హెచ్ఐవీ పాజిటివ్‌గా ఉన్న వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు, క్రమం తప్పకుండా మందులు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని ఏఆర్టీ కేంద్రాలు, ఐసీటీసీలు, ఎన్జీవోలు సమన్వయంతో పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. ఐసీటీసీ కేంద్రాల్లో పరీక్షా కిట్లు, ఏఆర్టీ మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రతి సంవత్సరం మే నెల మూడో ఆదివారం నిర్వహించే కాండిల్ లైట్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కౌన్సిలర్ ఉమాదేవి, ఎల్టీ శంకర్ పాల్గొన్నారు. -
చీనీ తోటల పరిశీలన
తొండూరు: తొండూరు మండలం క్రిష్ణంగారిపల్లె, గుండ్లమడుగు గ్రామాల్లో బుధవారం విజయవాడ కేంద్ర సమగ్ర సస్యరక్షణ కేంద్ర ప్రతినిధులు ఎం.పి.గోస్వామి, జేడీ కె.వి. చౌదరి, ఉద్యాన శాఖ అధికారి మల్లేశ్వరరెడ్డిలు సర్వే నిర్వహించి చీనీ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు చీని తోటల్లో పొలుసు పురుగు అధికంగా ఉండటం గమనించారు. దీంతో చెట్టు వేరు వ్యవస్థ, ఎదుగుదల మందగించటంతో చెట్లు చనిపోతాయన్నారు. చీని చెట్లు దెబ్బ తినకుండా ఉండాలంటే రోజుకు 60లీటర్ల మించి నీరు ఉండకూడదని, వీటి నివారణకు గొనె సంచితో కాండం లేదా చెట్ల బేరడుపై బాగా రుద్దాలన్నారు. దీంతో పాటు పలు సూచనలు చేశారు. -
పారిశుద్ధ్య మెరుగుకే స్వచ్ఛపథం
సదుం: పారిశుద్ధ్యం మెరుగుకే స్వచ్ఛపథం కార్యక్రమం అమలుచేస్తున్నట్లు జిల్లా స్వర్ణ గ్రామ అధికారి అమర్నాథరెడ్డి తెలిపారు. సదుం మండల కేంద్రంలో స్వచ్ఛపథం కార్యక్రమంలో నిర్వహిస్తున్న పనులను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ప్రతి వారం రోడ్డుకిరువైపులా ఉన్న చెత్తను తొలగించాలని ఆయన సూచించారు. కల్లూరు రోడ్డులో చెత్తను గ్రీన్ అంబాసిడర్లు తొలగించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాధారాణి, డిప్యూటీ ఎంపీడీఓ నాగరాజు, ఇస్రతుల్లా పాల్గొన్నారు. సాక్షి, మదనపల్లె: జిల్లాలో నిరుద్యోగ యువతకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని జిల్లా నైపుణ్యాధికారి దాసరి నాగార్జున బుధవారం తెలిపారు. అరబ్, దుబాయ్ దేశాల్లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాల కోసం పదవ తరగతి పాసై, డ్రైవింగ్ నైపుణ్యంతో భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. ఎంపికై న వారు యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్ పొందే వరకు వసతి కల్పించి, లైసెన్స్ పొందే ప్రక్రియలో సహకారం అందిస్తామని తెలిపారు. లైసెన్స్ పొందిన తరువాత కమిషన్ ఆధారిత అధిక ఆదాయ అవకాశాలు ఉంటా యని తెలిపారు. దరఖాస్తులకు ఈనెల 19 ఆఖరని తెలిపారు. అలాగే ఇజ్రాయెల్ దేశంలో హోమ్ బేస్డ్ కేర్‌గివర్ ఉద్యోగాల కోసం 25 నుంచి 45 ఏళ్ల మహిళలు, పురుషులకు ఉపాధి అవకాశం ఉందని తెలిపారు. ఈనెల 15లోపు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. మదనపల్లె టౌన్: దేశవ్యాప్తంగా ఉన్న 12.40 లక్షల మంది కెమిస్టులు, డిస్ట్రిబ్యూటర్ల ప్రయోజనాలే లక్ష్యంగా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడి) ఈ నెల 20న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు ఆ యూనియన్ అన్నమయ్య జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు సూర్య ప్రకాష్, జిల్లా కార్యదర్శి టి. భూషణ్ గుప్తా, కోశాధికారి సుబ్రహ్మణ్యం, నటరాజ్ తెలిపారు. బుధవారం వారు మదనపల్లెలో విలేకరులతో మాట్లాడుతూ.. అక్రమ ఈ–ఫార్మసీల వల్ల ప్రజారోగ్యానికి పొంచి ఉన్న ముప్పును నిరసిస్తూ దేశవ్యాప్త బంద్‌కు పిలుపునివ్వటం జరిగిందన్నారు. మందులు అనేవి సాధారణ వినియోగ వస్తువులు కావని, అవి నేరుగా రోగి ప్రాణాలతో ముడిపడి ఉంటాయని, ప్రస్తుతం ఆన్లైన్లో సాగుతున్న మందుల విక్రయాల వల్ల అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యాంటీబయోటిక్స్, చెడు వ్యసనాలకు అలవాటు చేసే మందులు సులభంగా లభించడం వల్ల యువత ప్రమాదంలో పడుతోందన్నారు. పెద్ద కంపెనీలు డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ నిబంధనలను అతిక్రమిస్తూ భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయని, దీనివల్ల చిన్న కెమిస్టుల జీవనాధారం దెబ్బతింటోందన్నారు. మదనపల్లె సిటీ: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ జిల్లా కుర్సియాంగ్లో ఈనెల 11 నుంచి 15వతేదీ వరకు నిర్వహిస్తున్న ఐదు రోజుల జాతీయ అడ్వెంచర్ (సాహస కృత్యాల) శిక్షణా కార్యక్రమంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా విద్యార్థులు పాల్గొని విశేష ప్రతిభ కనబరిచారు. కార్యక్రమానికి నేతృత్వం వహించిన జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి మాట్లాడుతూ స్లైకింగ్, ట్రెక్కింగ్, షూటింగ్,హైకింగ్ అర్చరీ వంటి సాహస కృత్యాల్లో జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు చురుకుగా పాల్గొని తమ ప్రతిభ ప్రదర్శించి ప్రశంసాపత్రాలు అదుకున్నారన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, నాయకత్వ లక్షణాలు, సమయస్పూర్తి, క్రమశిక్షణ పెంపొందించేందుకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థ ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ఇలాంటి అడ్వెంచర్ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. స్కౌట్మాస్టర్లు ప్రేమ్‌సాగర్,మోహన్‌బాబు, గురునాథరెడ్డి, నితిన్‌రెడ్డి, గైడ్కెప్టెన్ పద్మజ, ఏడు మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
పులివెందుల రూరల్ : చైన్ స్నాచింగ్, బంగారు షాపుల్లో దొంగతనాలు ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడిన 13 మంది దొంగలను అరెస్టు చేసినట్లు వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. బుధవారం సీఐ, ఎస్ఐలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 19 ద్విచక్రవాహనాలు, రూ.2.79 లక్షల నగదు, కేజీ వెండి, 194గ్రాముల బంగారు వస్తువులు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టణంలోని కదిరి రోడ్డులో మున్సిపాలిటీ డంపింగ్ యార్డు వద్ద, కడప రింగురోడ్డు వద్ద ద్విచక్రవాహనాల దొంగలను, పార్నపల్లె బస్టాఫ్ వద్ద గోల్డ్ షాపులో బంగారు దొంగతనం చేసిన దొంగలను, ఉలిమెల్ల రింగ్ రోడ్డు వద్ద చైన్ స్నాచింగ్ పాల్పడే దొంగలు 13 మందిని 22 కేసుల్లో అరెస్టు చేసినట్లు చెప్పారు.ద్విచక్రవాహనాల దొంగల నుంచి రూ.2.79లక్షల నగదు, రూ.80వేలు విలువ చేసే కేజీ వెండి వస్తువులు, రూ.18.15లక్షల విలువ గల 19 బైక్‌లు, రూ.50వేలు విలువ చేసే రెండు సెల్ ఫోన్లు, చైన్‌స్నాచింగ్ దొంగల నుంచి రూ.13.52లక్షలు విలువ చేసే 91 గ్రాముల బంగారు వస్తువులు, బంగారు షాపుల్లో చోరీకి పాల్పడే దొంగల నుంచి రూ.15లక్షలు విలువ చేసే 103 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తం రూ.53.00,700ల విలువ గల బంగారు, వెండి, నగదు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. అరెస్టు చేసిన వారిలో నాగబాష. బూస్పాటి కుమార్, గంగయ్య, హుస్సేన్, మలికి విజయ్‌లను, అలాగే బీహార్ రాష్ట్రం భగల్పూర్ జిల్లాకు చెందిన చోటు కుమార్, నారాయణమ్మ, ఉమాదేవిలను అరెస్ట్ చేశామన్నారు. మిగిలిన ఐదుగురు పరారీలో ఉన్నారని, వారిలో త్వరలో ఆరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐ శ్రీరామ్, ఎస్ఐలు తిమోతి, మధుసూదన్‌రెడ్డి, పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.బంగారం, ద్విచక్ర వాహనాలు స్వాధీనం -
ఏపీఆర్జేసీలో ‘విశ్వం’ ఉత్తమ ఫలితాలు
తిరుపతి అర్బన్ : ఏపీఆర్జేసీ 2026లో ఫలితాల్లో తిరుపతిలోని విశ్వం విద్యాసంస్థ సత్తా చాటింది. విశ్వం విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించి ముందు వరుసలో నిలిచారు. రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ ప్రవేశాల కోసం ఏప్రిల్ 24న నిర్వహించిన ఏపీఆర్జేసీ ఎంట్రెన్స్న పరీక్ష ఫలితాల్లో తిరుపతి విశ్వం విద్యా సంస్థలో శిక్షణ పొందిన విద్యార్థులు ప్రత్యేక ప్రతిభ కనబరిచారు. విద్యార్థుల్లో వి.మోక్షిత్ రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకు సాధించగా, టి.శ్రీదర్శిని రాష్ట్రస్థాయి 8వ ర్యాంకు, కే.పవ్యశ్రీ 9వ ర్యాంకు, కే.హర్షవర్ధన్ 11వ ర్యాంకు, కే.జ్యోత్స్న 12వ ర్యాంకు, ఎన్.హాసిని 13వ ర్యాంకు, ఈ. మునిశంకర్ 14వ ర్యాంకు, బి. హర్షిత్ 15వ ర్యాంకు, పి.తేజస్వి 16వ ర్యాంకు, కే. హర్ష 17వ ర్యాంకు, వి.పూజ 18వ ర్యాంకు, ఎం. చారుణ్య, కే. గీతిక 19వ ర్యాంకు, ఏ. రితీష్ కుమార్, కే. ధోనీష్ 20వ ర్యాంకులు సాధించి విశేష ప్రతిభ కనబరిచారని విశ్వం విద్యా సంస్థల అధినేత ఎన్. విశ్వనాథ్ రెడ్డి బుధవారం వెల్లడించారు. ప్రతి ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులకు విశ్వనాఽథ్రెడ్డితోపాటు విశ్వం అకడమిక్ డైరెక్టర్ విశ్వచందన్‌రెడ్డి, విశ్వశ్రీ, కరస్పాండెంట్ తులసీ విశ్వనాథ్‌రెడ్డి అభినందనలు తెలిపారు. -
క్వారీ యజమాని నిర్లక్ష్యానికి కార్మికుడు బలి
పుంగనూరు : క్వారీలో పని చేస్తున్న కార్మికుడిపై బండరాళ్లు పడటంతో గాయాలపాలై ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పాలెంపల్లెకి చెందిన క్వారీలో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన జనార్ధన్‌నాయక్(35) క్వారీ కింద భాగంలో డ్రిల్లింగ్ చేస్తున్నాడు. పైన బండరాళ్లను క్రేన్లతో లారీలోకి ఎక్కిస్తుండగా రాళ్లు పడటంతో జనార్ధన్‌నాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితున్ని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసికి తీసుకెళుతుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు.. ఈ మేరకు సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా క్వారీ యాజమాన్యం సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడం, కార్మికులకు ఇన్సూరెన్స్ లేకపోవడంపై బాధిత కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేశారు.బండరాళ్లు పడటంతో మృతి -
శబ్ద కాలుష్య సైలెన్సర్లు వినియోగిస్తే చర్యలు
కలెక్టర్ నిశాంత్ కుమార్ సాక్షి, మదనపల్లె: ద్విచక్ర వాహనాలకున్న సైలెన్సర్లను తొలగించి, వాటి స్థానంలో అధిక శబ్దాలు వచ్చే సైలెన్సర్లు పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం హెచ్చరించారు. రోడ్డు భద్రతకు విఘాతం కలిగించే విధంగా వాహనాలకు అనధికారికంగా మార్పులు చేయడాన్ని అరికట్టేందుకు మదనపల్లె, పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల మెకానిక్ వర్క్‌షాప్‌లపై ప్రత్యేక తనిఖీలను నిర్వహించారు. రవాణా శాఖ అధికారులు దినేష్ చంద్ర, శివలింగ, శ్రీహరిలు మెకానిక్ షాపులు, షోరూంలో తనిఖీలు చేసి సైలెన్సర్లను మార్పులు చేయరాదని స్పష్టం చేశారు. అతిక్రమించి వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ ఆదేశాలతో 12 వర్క్‌షాప్‌లను తనిఖీ చేయగా, వాటిలో మూడు వర్క్‌షాపుల్లో వాహనాలకు అధిక శబ్దం వచ్చే విధంగా మార్పు చేసిన సైలెన్సర్లు అమర్చిన విషయాన్ని గుర్తించారు. ఇకపై అనధికారిక మార్పులు చేయరాదని ఆదేశించారు. -
ఒకే పరీక్ష పెట్టడం అన్యాయం
మదనపల్లె టౌన్ : ఒకే దేశం.. ఒకే పరీక్ష అంటూ విద్యార్థులను మోసగించడం అన్యాయం. నీట్ పరీక్ష స్కాంలతో 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతుందని ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మదనపల్లె కదిరి రోడ్డులో ధర్నా నిర్వహించారు. కేంద్ర పెట్టే పరీక్షను రద్దుచేసి రాష్ట్ర ప్రభుత్వాలే నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించాలని నినాదాలు చేశారు. వైద్య విద్యా ఆశావహులైన విద్యార్థులను మానసికంగా హింసించిన ఎన్డీయే సర్కార్ ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకులు మాధవ్, నరసింహ పేర్కొన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ నిరసన తెలిపారు. నీట్ స్కామ్ లకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్రన్ రాజీనామా చేయడంతో పాటు కేంద్రంలో ఉన్న ఎన్డీఎ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. కేంద్రంలోని జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించే ఎన్.టి.ఏను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలన్నారు. దేశంలో వైద్య విద్య సంపన్న వర్గాల వారికి మాత్రమే అందేవిధంగా, సామాన్య వర్గాలకు చెందిన విద్యార్థులతో చెలగాటమాడడం అన్యాయమన్నారు. నీట్ పేపర్ లీక్ పై కేంద్రప్రభుత్వ సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని, విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆఫ్రిద్, సుల్తాన్, యువరాజు, దినేష్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మెడికిల్షాపులు
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లాలో మెడికల్ షాపుల నిర్వాహకులు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మెడికల్ స్టోర్లపై డ్రగ్ కంట్రోల్ శాఖ నిఘా అంతంతమాత్రమే ఉండటంతో ప్రిష్కిప్షన్ లేకుండానే మందులు ఇష్టారాజ్యంగా అమ్మేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు పత్తా లేకుండా పోడంతో మెడికల్ మాఫియా పెట్రేగిపోతోందని, మందులు కొనుగోలు చేసిన ప్రజలను కిడ్నీ, షుగర్ వ్యాధుల భారిన పడేలా చేస్తున్నారని సీపీఐ, ఏఐటీయూసీ వంటి ప్రజా సంఘాల నాయకులు క్రిష్ణప్ప, సాంబశివ, మురళి ఆరోపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 500 కు పైగా మందుల దుకాణాలు ఉండగా, అధికారుల దాడులు, కేసుల నమోదు నామమాత్రంగా ఉన్నాయి. జిల్లాకు జరిమనాల రూపంలో వచ్చిన ఆదాయం ఇప్పటి వరకు సున్న శాతంగా ఉంది. నిబంధనల ఉల్లంఘన మెడికల్ షాపుల్లో ఫార్మసిస్ట్ సర్టిఫికెట్ ఒకరిదైతే కౌంటర్లో మందులు అమ్మేది మరొకరనే ఆరోపణలు ఉన్నాయి. కనీసం డీఫార్మసీ, బీఫార్మసీ లేకుండానే యాంటీ బయాటిక్స్, షెడ్యూల్–హెచ్, హెచ్1 డ్రగ్స్‌ను సైతం ప్రిస్క్రిప్షన్ లేకపోయినా దుకాణాలు, ఆస్పత్రులలో జోరుగా విక్రయాలు సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బ్రాండెడ్ మందుల పేరుతో అక్షరం తేడాతో కల్తీ మందులు, గడువు తీరిన మందులకు కొత్త లేబుల్స్ వేసి అమ్మకాలు చేస్తున్నా సంబంధిత అధికారులు దాడులు చేసిన దాఖలాలు లేవనే విర్శలు ఉన్నాయి. పర్మిషన్లు, రెన్యువల్స్ లేకుండానే ఇష్టారాజ్యంగా దుకాణాలు నడుపుతున్నట్లు అధికారిక గణాంకాలే బహిర్గతం చేస్తున్నాయి. కొరవడిన పర్యవేక్షణ జిల్లా డ్రగ్ కంట్రోల్ శాఖలో సిబ్బంది కొరత కారణంగా పర్యవేక్షణ కొరవడింది. అసిస్టెంట్ డైరెక్టర్–ఒకరు ఉన్నారు.జిల్లా పర్యవేక్షణ అధికారులు ముగ్గురు ఉండాలి. అయితే ఒకరే ఉన్నారు. జూనియర్ అసిస్టెంట్లు ఇద్దరు ఉండాలి. అదికూడా ఒకటే భర్తీ అయింది. ఆఫీస్ సబార్డినేట్ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. దీంతో డ్రగ్ ఇన్స్పెక్టర్ల తనిఖీలు నామమాత్రంగా జరుగుతున్నాయి. రికార్డుల నిర్వహణ, ఆఫీస్ సబార్డినేట్ ఫైల్ మూవ్మెంట్, ఆఫీస్ పనులు చేయడానికి ఏడుగురు సిబ్బంది ఉండాలి.అయితే ఇద్దరే ఉన్నారు.నిబంధనల ప్రకారం ఒక్కో డ్రగ్ ఇన్స్పెక్టర్ నెలకు 20 షాపులు, ఏడాదికి 240 షాపులను తనిఖీ చేయాలి. ముగ్గురు ఉంటే ఏడాదికి 720 తనిఖీలు జరగాలి. కానీ ఒక్క డ్రగ్ ఇన్స్పెక్టర్ మాత్రమే ఉండటంతో 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కేవలం 12 తనిఖీలు మాత్రమే జరిగాయి. టార్గెట్‌లో 5% కూడా పూర్తి కాలేదని తెలిసింది. తనిఖీలు లేకపోవడంతో కేసుల నమోదు శూన్యంగా మారింది. డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ యాక్ట్–1940 ప్రకారం ఫార్మసిస్ట్ లేకుండా మందులు విక్రయిస్తే రూ. 20 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించ వచ్చని చట్టాలు చెబుతున్నాయి. కల్తీ మందులు విక్రయిస్తే రూ.10 లక్షల వరకు జరిమానా ఉంటుంది. గత ఏడాది పొరుగున ఉన్న చిత్తూరు జిల్లాలో తనిఖీల ద్వారా రూ.18.7 లక్షల ఆదాయం వచ్చింది. అన్నమయ్య జిల్లాలో మాత్రం ఈ ఏడాది ఇప్పటి వరకు జరిమానాల రూపంలో వచ్చిన ఆదాయం రూ.0. సగటున ఏడాదికి రూ.15–20 లక్షల ఆదాయానికి గండి పడుతోందని సంబంధిత అధికారులే బహిరంగంగా చెబుతున్నారు. నిబంధనల ఉల్లాంఘనపై చర్యలేవీ? నిబంధనల ప్రకారం ఫార్మసిస్ట్ లేకుండా మందులు విక్రయిస్తే లైసెన్‌న్స్ రద్దు, ఏడాది జైలు శిక్ష. కల్తీ మందులు విక్రయిస్తే 10 ఏళ్ల వరకు జైలు, రూ.10 లక్షల జరిమానా ఉంటుంది. లైసెన్స్ లేకుండా షాపు నడిపితే 5 ఏళ్ల జైలు. అయినా జిల్లాలో ఒక్క షాపుపైనా చర్యలు లేవనే విమర్శలు ఉన్నాయి. అధికారులు మౌనం వీడాలి దాడుల వివరాలు, నమోదైన కేసుల లెక్క అడిగితే జిల్లా డ్రగ్ కంట్రోల్ అధికారి సంధ్య వెల్లడించడం లేదు. సిబ్బంది కొరత పేరు చెప్పి తప్పించు కుంటున్నారని, మామూళ్ల మత్తులో అధికారులు జోగుతుండటంతోనే చర్యలు తీసుకోవడం లేదని సీపీఐ, ఏఐటీయూసీ, ప్రజా సంఘాల నాయకులు కృష్ణప్ప, మురళి, సాంబశివలు ఆరోపిస్తున్నారు. డిమాండ్లు ఇవి.. ఖాళీగా ఉన్న 5 పోస్టులు వెంటనే భర్తీ చేయాలి, ప్రతి మండలంలో నెలకు రెండు సార్లు ఆకస్మిక దాడులు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘించిన షాపుల లైసెన్సులు రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా జోక్యం చేసుకుని డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం అధికారుల దాడులు నామమాత్రం ఫార్మసీ సర్టిఫికెట్ ఒకరిది.. అమ్మేది మరొకరు జరిమానాల రూపంలో జిల్లాకు వచ్చిన ఆదాయం: 0చర్యలు తీసుకోవాలి ప్రజలు, రోగుల జీవితాలతో చెలగాటం ఆడుతూ.. ప్రభుత్వ నిబంధనలు పాటించని మెడికల్ స్టోర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు క్రిష్ణప్ప డిమాండ్ చేశారు. కలెక్టర్‌తో పాటు ఆరోగ్య శాఖామంత్రి స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. క్రిష్ణప్ప,సీపీఐ నాయకుడు -
రసవత్తరంగా క్రికెట్ పోటీలు
వాల్మీకిపురం : క్రీడల్లో రాణించినప్పుడే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని స్థానిక సీఐ రాఘవ రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక సీడీసీఏ, జీవీఎస్సీఎస్ క్రికెట్ క్రీడా మైదానంలో జరుగుతున్న (చిత్తూరు ప్రీమియర్ లీగ్) సీపీఎల్–2 సీజన్ క్రికెట్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. మంగళవారం జరిగిన క్రికెట్ పోటీల్లో ఉదయం నితిన్ వారియర్స్, ఎన్కే స్పోర్ట్స్ క్రికెట్ జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. ఈ పోరులో నితిన్ వారియర్స్ క్రికెట్ జట్టు విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే మధ్యాహ్నం పాయ్ వైస్రాయ్ క్రికెట్ జట్టు, హై పెరియన్ క్రికెట్ జట్టు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో హైపెరియన్ జట్టు విజయం సాధించింది. నితిన్ వారియర్స్ జట్టులోని ఆల్ రౌండర్ ఆశిష్ రెడ్డి ప్రత్యర్థి జట్టుపై నాలుగు వికెట్లు తీయడంతో పాటు 54 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలచాడు. అనంతరం జరిగిన కార్యక్రమంలో స్థానిక సీఐ రాఘవ రెడ్డి పాల్గొని, ఆశిష్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డును అందించారు. కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ విజయ్‌కుమార్, చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీధర్ కుమార్, సెక్రటరీ సతీష్ యాదవ్, కోచ్ సునీల్ కుమార్, సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
ఆ తల్లికి ఎంత కష్టం వచ్చింది!
‘అడ్డాల నాడు బిడ్డలు కానీ.. గడ్డాల నాడు బిడ్డలు కాదు’ అనేది సామెత. అది అక్షర సత్యమవుతున్న సంఘటనలు అక్కడక్కడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఎర్రగుంట్ల పట్టణంలో జరిగింది. నవమాసాలు మోసి.. కనిపెంచిన తల్లికి కనీసం అన్నం పెట్టలేదు కన్న కొడుకులు. వృద్ధురాలైన అమ్మను, కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి.. పట్టించుకోవడం మానేశారు. చివరికి ఆమె పోలీసులను ఆశ్రయించి.. అనాథాశ్రమానికి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది.జమ్మలమడుగు(ఎర్రగుంట్ల) : ఎర్రగుంట్ల పట్టణానికి చెందిన సుగుణమ్మ అనే వృద్ధురాలు తన కుమారులు తనకు అన్నం పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయంపై ఆమె మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీఐ విశ్వనాథ్‌రెడ్డి సుగుణమ్మ బాధ అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఐ సుగుణమ్మ కుమారులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసిన తర్వాత వారిని పట్టించుకోకపోవడం సరైంది కాదన్నారు. తల్లిదండ్రులను పొషించే బాధ్యత పిల్లలపైనే ఉందన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. అనంతరం సుగుణమ్మ కోరిక మేరకు తిప్పలూరులో ఉన్న ఎద్దుల పెద్ద శేషయ్య అనాథాశ్రమానికి చెందిన నిర్వాహకుడు నాగేంద్రకు స్టేషన్‌కు పిలపించుకుని.. ఆమెను బాగా చూసుకోవాలంటూ సూచించారు. ఆమెను ప్రత్యేక ఆటోలో తిప్పలూరు అనాథశ్రమానికి తరలించి సీఐ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగమురళి, సిబ్బంది పాల్గొన్నారు. అందరూ ఉండి అనాథగా మిగిలిన అమ్మ కుమారులు అన్నం పెట్టడం లేదంటూ ఆవేదన పోలీసులను ఆశ్రయించిన వైనం -
రోబోటిక్స్‌పై అవగాహన
కురబలకోట : అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ మొదటి సంవత్సరం బీటెక్ విద్యార్థులు ఇండస్ట్రియల్ విజిట్ కింద మంగళవారం బెంగళూరులోని ట్రెసా మోటార్ సంస్థను సందర్శించారు. అక్కడ హ్యుమనాయిడ్ రోబోట్ల పనితీరు, కదలిక, నియంత్రణ తదితరాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా రోబోట్‌తో పరస్పర చర్య తదితర వాటిపై ప్రత్యక్ష అనుభవం పొందారు. ఇది ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆటోమేషన్, ఏఐ తదితర రంగాలపై కూడా వారికి అవగాహన కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. గుర్తు తెలియని వృద్ధుడి మృతి పీలేరు రూరల్ : గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందిన సంఘటన స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని ఏటీ నగర్లో చోటు చేసుకుంది. అధికారుల కథనం మేరకు వివరాలిలా వున్నాయి. 85 ఏళ్ల వయసు గల వృద్ధుడు మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి మంగళవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనాథ శ వంగా గుర్తించి పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది.. మేము సైతం సమాజం కోసం ఫౌండేషన్ సభ్యుల సహకారంతో దహన క్రియలు నిర్వహించారు. -
రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
గుర్రంకొండ : జిల్లాలో రాత్రింబవళ్లు ఇసుక అక్రమ రవాణా షరామామూలుగా మారింది. అక్రమణ రవాణాపై అడిగే వారు కానీ అడ్డుకునేవారు గానీ లేకపోవడంతో ఇష్టానుసారంగా ఇసుకాసురులు చెలరేగుతున్నారు. ఇసుక టిప్పర్ రోడ్డుపై వెళ్లిందంటే వాహనం వెనుక వెళ్లే ద్విచక్రవాహనదారుల కళ్లు మండిపోవాల్సిందే. గాలికి ఇసుక కొట్టుకువచ్చి కళ్లలో పడుతుండటంతో.. ద్విచక్రవాహనాలు ప్రమాదాలకు గురి అవుతున్నాయి. జనావాసాల మధ్యలో వెళ్లేటప్పుడు ఇసుకపై పట్టగానీ, నర్సరీ జాలీగానీ ఏర్పాటు చేసుకోక పోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇటీవల పోలీసులు పట్టుకుని ఇసుక టిప్పర్లకు జరిమానాలు విధించారు. మూడు రోజుల పాటు టిప్పర్లపై పట్ట కట్టి ఇసుక రవాణా చేశారు. అయితే గత రెండు రోజులుగా కథ షరామామూలుగా మారింది. అధికారులకు పోలీసులకు సవాల్ విసురుతూ మళ్లీ పట్ట కట్టకుండా జనావాసాల మధ్య రాత్రింబవళ్లు ఇసుక టిప్పర్లు యథేచ్ఛగా తిరుగుతుండటం గమనార్హం. కలెక్టర్ మందలించినా.. జిల్లా నలుమూలల నుంచి ఇసుక టిప్పర్లు గుర్రంకొండ మీదుగా మదనపల్లె వైపు, కర్ణాటక వైపు వెళుతున్నాయి. ప్రతి రోజు గంటకొకమారు ఇసుక టిప్పర్ వెళుతుండటంతో కష్టాలు తప్పడం లేదని జనం ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై వారం రోజుల కిందట ద్విచక్రవాహనదారుల కళ్లలో ఇసుక రాలిపడడంతో టిప్పర్‌ను అడ్డుకొని డ్రైవర్‌తో ఘర్షణ పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వాహనదారులు పేర్కొనగా.. మీకు దిక్కున్నచోట చెప్పుకోండని టిప్పర్ డ్రైవర్ సవాల్ విసరడం గమనార్హం. దీంతో సమస్యను ఎవరికి చెప్పుకోవాలో, ఎవరికి ఫిర్యాదు చేయాలో దిక్కుతోచని స్థితిలో ద్విచక్రవాహన దారులతోపాటు గ్రామస్తులు ఉన్నారు. గతంలో రెండు మార్లు స్వయంగా అప్పటి జిల్లా కలెక్టర్ ఎన్‌హెచ్ 340 జాతీయ రహదారిపై ఇలాగే వెళుతున్న ఇసుక టిప్పర్‌ను నిలిపి డ్రైవర్‌ను మందలించిన సంఘటనలు చోటు చేసుకొన్నాయి. ఇటీవల పోలీసులు ఇసుక టిప్పర్లపై మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు. పట్టకట్టని టిప్పర్లకు జరిమానాలు విధించారు. డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా టిప్పర్లను తిప్పారు. అయితే మళ్లీ రెండు రోజుల నుంచి కథ షరామామూలుగా మారింది. మళ్లీ పట్టకుండా, ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకుండా రాత్రింబవళ్లు ఇసుక టిప్పర్లను తిప్పుతుండటం గమనార్హం. దీంతో తాము తగ్గేదేలా మా దారి రహదారి అంటూ పట్టకుండా టిప్పర్లను తిప్పుతూ.. పోలీసులకు, అధికారులకు ఇసుకాసురులు సవాల్ విసురుతున్నారు. యథేచ్ఛగా అక్రమ రవాణా టిప్పర్లపై పట్ట కప్పకుండా వెళ్తున్న వైనం జనం కంట్లో పడుతున్న ఇసుక అధికారులకు సవాల్ విసురుతున్న ఇసుకాసురులు -
గర్భిణి ఆత్మహత్య
రాయచోటి : పెళ్లికి కట్నంగా తల్లిదండ్రులు ఇచ్చిన 50 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టడానికి ఒప్పుకోని గర్భిణి.. భర్త వేధింపులను భరించలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రాయచోటి పట్టణ పరిధిలోని రాజుల కాలనీలో మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. రాజుల కాలనీలోని రెడ్డి బాషా, షేక్ రిహాబ్జాన్(19)కు 10 నెలల కిందట వివాహం అయింది. రెడ్డి బాషా ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం రిహాబ్జాన్ 7 నెలల గర్భవతిగా ఉంది. వీరికి వివాహ సమయంలో రిహాబ్జాన్ తల్లిదండ్రులు 50 గ్రాముల బంగారు ఆభరణాలను ప్రేమగా పెట్టారు. ఆ బంగారాన్ని భర్త రెడ్డి బాషా బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవాలనే క్రమంలో.. ఇద్దరు గొడవ పడుతుండే వారని ఇరుగు పొరుగు వారు తెలిపారు. సోమవారం రాత్రి కూడా బంగారు విషయంగా ఇద్దరు గొడవపడ్డారన్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రిహాబ్జాన్ సోమవారం ఉదయం ఇంటిలో ఎవరూ లేని సమయంలో చీరతో మోల్డింగ్ రాడ్డుకు ఉరి వేసుకుని తనువు చాలించింది. ఇరుగు పొరుగు వారు ఈ విషయాన్ని గమనించి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. సంఘటనపై రాయచోటి అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రెడ్డి బాషాను పోలీస్‌లు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. -
లారీ దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం
కురబలకోట : మండలంలోని కంటేవారిపల్లి హైవేలో సిమెంట్ ఖాళీ బస్తాల లోడుతో వెళ్తున్న లారీ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కలకలం రేగింది. నడి రోడ్డుపై వెళుతున్న లారీ మంటల్లో చిక్కుకోవడంతో అక్కడి స్థానికులు, ప్రయాణికులు, వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. మంగళవారం రాత్రి పది గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనపై ఫైరింజన్‌కు సమాచారం ఇచ్చినా సకాలంలో రాకపోవడంతో లారీ మంటల్లో తగలబడిపోయింది. డ్రైవర్ సురేష్ గమనించి లారీ నుంచి వెంటనే దిగేయడంతో సురక్షితంగా బయటపడ్డాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చైన్నె నుంచి బెల్గాంకు సిమెంట్ ఖాళీ బస్తాల లోడుతో ఆ లారీ వెళ్తుండేది. లారీ కంటేవారిపల్లి వద్దకు రాగానే ఒక్కసారిగా వెనుక టైరు పగిలిన శబ్దం వచ్చింది. అనుమానం వచ్చి డ్రైవర్ సురేష్ బండి దిగి చూడగా అప్పటికే లారీ నుంచి మంటలు చెలరేగాయి. వెనుక టైరు పగిలి పక్కనే ఉన్న డీజిల్ ట్యాంకు దెబ్బతినడంతో మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు లారీని కమ్ముకున్నాయి. చూస్తుండగానే మంటలు లారీ మొత్తం వ్యాపించాయి. మంటలు నిలువునా ఎగసి పడుతుండడంతో ఆర్పడానికి ఎవరూ సాహసించలేకపోయారు. వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఫైరింజన్ రావడానికి ఆలస్యం అయ్యింది. అందరూ చూస్తుండగానే లారీ కాలిపోయింది. లారీతోపాటు సిమెంటు బస్తాలు పూర్తిగా కాలిపోవడంతో రూ. 50 లక్షలకు పైగా నష్టం సంభవించి ఉంటుందని ప్రాథమిక అంచనా. తర్వాత ఫైరింజన్ రావడంతో మంటలను అదుపులోకి తెచ్చారు. డ్రైవర్ సురేష్ సకాలంలో మంటలను గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే విషాదకర పరిస్థితులు చోటుచేసుకునేవని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు పోలీసులు తెలిపారు.ఫైరింజన్ సకాలంలో రాకపోవడంతో తీవ్ర నష్టం -
మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డికి రిమాండ్
కడప అర్బన్ : కడప నగరంలోని రిమ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 6వ తేదీన హత్యకు గురైన కల్లమల్ల పెద్ద దస్తగిరి (53) హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కడపలోని స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ మంగళవారం ఆదేశించారు. నిత్యానందరెడ్డి ఈ నెల 11వ తేదీన కడపలోని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఎదుట న్యాయవాది నాగిరెడ్డి ద్వారా లొంగిపోయారు. ఎస్పీ ఆదేశాల మేరకు నిత్యానందరెడ్డిని హత్య కేసు విచారణాధికారి ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. మంగళవారం నిత్యానందరెడ్డిని పోలీసులు కడప రిమ్స్‌కు వైద్య పరీక్షల నిమిత్తం తీసుకునివెళ్లారు. తరువాత కడపలోని కోర్టులో హాజరు పర్చగా మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారు. చిన్నచౌక్ పీఎస్ సీఐ రామకృష్ణారెడ్డి, రిమ్స్ పీఎస్ సీఐ రాజగోపాల్, ఎస్ఐ చంద్రమోహన్ తమ సిబ్బందితో కలిసి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. -
ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారుల మృతి
పుంగనూరు : వేసవి తీవ్రంగా ఉండటంతో చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలోని పట్రపల్లె తండాకు చెందిన గణేష్‌నాయక్ కుమారుడు వరుణ్‌నాయక్(14), మణి నాయక్ కుమారుడు నిలేష్‌నాయక్(8) కలసి బడిగిరెడ్డిపల్లె గ్రామ సమీపంలోని చెరువులో ఈత కొట్టేందుకు మధ్యాహ్నం వెళ్లారు. ప్రమాదవశాత్తు లోతైన ప్రాంతంలోకి వెళ్లి ఇద్దరూ మునిగిపోయారు. సమీపంలో బాతులు మేపుతున్న యువకులు గమనించి గ్రామస్తులకు తెలిపారు. అందరూ కలసి హుటాహుటిన వెళ్లి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఇద్దరూ మృతి చెందారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు చిన్నారులకు కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదు. -
ఘనంగా మహాకుంభాభిషేక మహోత్సవాలు
చక్రాయపేట : గండి ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో మంగళవారం రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఆయనకు దేవదాయ శాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్, ఆలయ కార్యనిర్వహణాధికారి గురుప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఆయన తెచ్చిన పట్టు వస్త్రాలను స్వామి వారికి సమర్పించారు. అనంతరం పలు పూజల్లో పాల్గొని గత ప్రభుత్వంలో గండి అభివృద్ధికి మంజూరు చేసిన రూ.28.5 కోట్ల పనులకు సంబంధించిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యేలు మాధవీరెడ్డి, ఆదినారాయణరెడ్డి, కృష్ణచైతన్యరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, బీటెక్ రవి, రితేష్రెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆలయాలకు పెద్ద పీట వేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకటస్వామి, పాలకమండలి సభ్యులు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పాల్గొన్నారు. సహజత్వం లేకుండా గోపురాలపై ఈ రంగులేంటి? సంస్కృతి సంప్రదాయాలతోపాటు సహజత్వం ఉట్టిపడేలా రాతితో నిర్మించిన ఆలయంలో గోపురాలకు ఈ రంగులేంటని రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవాలను పురస్కరించుకొని ఆయన మంగళవారం గండికి విచ్చేశారు. ఈ సందర్భంగా కుంభాభిషేక ఏర్పాట్లపై పరిశీలించారు. స్వామి వాహనమైన ఒంటె, బలిపీఠాలకు వేసిన రంగులపై కూడా ఆయన పెదవి విరిచారు. వెంటనే వాటికి రంగులను తొలగించి సహజత్వం కనిపించేలా చేయాలన్నారు. పారిశుధ్య చర్యలు కూడా అధ్వానంగా ఉన్నాయని ఆగ్రహించారు. ఈ సందర్భంగా పలువురు గండిలో జరుగుతున్న అక్రమాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏమైనా ఉంటే తనకు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి అని సూచించారు. ఆయన వెంట రాష్ట్ర స్థపతి పరమేశ్వరప్ప, కడప దేవదాయ శాఖ సహాయ కమిషనర్ శంకర్ బాలాజీ తదితరులు ఉన్నారు. -
‘పచ్చ’పైత్యంతో పిచ్చి రాతలు
సాక్షి ప్రతినిధి కడప: పచ్చ కామెర్లకు వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుగా ఎల్లో మీడియా తన పైత్యాన్ని అనునిత్యం ప్రదర్శిస్తుస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ రిమ్స్ ఆస్పత్రి కడప నగరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయడంతో రోగుల సహాయకులు ఎలాంటి ఇబ్బంది పడకూడదనే పోచంరెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ.1.2 కోట్లు సొంత నిధులు వెచ్చించి భవనం, వసతి, డైనింగ్ ఏర్పాటు చేశామన్నారు. 2019 నుంచి ఆరేళ్లుగా నిరాటంకంగా రోగుల సహా యకులకు భోజన వసతి కల్పించామన్నారు. ప్రతిరోజు ఉదయం 350–450 మంది వరకు, సాయంత్రం 220–250 మంది వరకు భోజనం చేసేవారన్నారు. తమ సిబ్బంది ఒక్క రూపాయి కూడా ఏ ఒక్కరితో వసూలు చేయకుండా, ముందస్తు టోకన్లు జారీ చేసి ఉచిత భోజనం కొనసాగించామని వివరించారు. ఆరేళ్లుగా నిరాంటకంగా ప్రతిరోజు భోజన వసతి దాదాపు 700 మందికి కల్పిస్తుంటే, ఒక్కరోజుగా గుర్తించని ఈనాడు పత్రిక ఎల్లో పైత్యాన్ని ఎక్కించుకుని అడ్డగోలు రాతలు రాసిందని మండిపడ్డా రు. అక్కడ నియమించిన మేనేజర్ భోజన, వసతిలో తప్పిదాలు చేయడం వల్ల తొలగించామన్నా రు. సిబ్బంది సమస్య కారణంగా తాత్కాలికంగా నిలిపి వేశామన్నారు. దానిని పట్టుకుని ఈనాడు తన పైత్యాన్ని ప్రదర్శించిందని ధ్వజమెత్తారు. ఛారిటబుల్ ట్రస్టుపై ఈనాడు అడ్డగోలు రాతలు ఆరేళ్లుగా నిరాటంకంగా రెండు పూటల భోజనం డైలీ 700 మందికి భోజన ఏర్పాట్లు ఈనాడు రాతలపై మండిపడ్డ పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి -
ఆశావహులకు నిరాశే..
నీట్ ప్రవేశ పరీక్ష బాగా రాశామనే ధీమాతో ఎదురుచూస్తున్న ఆశావహులకు ఇది నిరాశజనక వార్తే. పరీక్ష రద్దుకు కారణమైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే లక్షల మంది మానసికక్షోభకు గురిచేసిన వారికి ఇంక మళ్ళీ ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాటు చేయాలంటే భయం కలిగేలాగా శిక్ష ఉండాలి. అలాగే మళ్లీ పరీక్ష రాయనున్న విద్యార్థులు ఎలాంటి నిరాశ నిస్పృహలకు గురి కాకుండా రెట్టించిన ఉత్సాహంతో మరింత మెరుగైన ర్యాంకు సాధించేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలి. – డాక్టర్ ఓ వెంకటేశ్వర రెడ్డి, సైకాలజిస్ట్ -
విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమే
కేంద్ర ప్రభుత్వం నిర్లక్షం కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతోంది. నీట్ పరీక్షల నిర్వహణలో ప్రతి సారి వైఫల్యం కావడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షల్లో పారదర్శకత లేకపోవడంతో ఆక్రమాలు జరగడం, పేపర్లు లీక్ కావడం జరుగుతోంది. ఇకనైనా ప్రభుత్వం ఇలాంటి ఉన్నతమైన పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి. – బుడ్డన్న, ఎస్టీయు మండల అధ్యక్షుడు, పుంగనూరు గుణపాఠాలు నేర్వకపోవడం శోచనీయం మా పాప పేరు ఫిర్దోస్‌కు ఇంటర్లో 922 మార్కులు వచ్చాయి. నీట్ పై చాలా ఆశలు పెట్టుకున్నాం. దేశవ్యాప్తంగా జరిగే ప్రవేశ పరీక్షను ఇంత అధ్వానంగా నిర్వహించడం దారుణం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో జరిగిన సంఘటనల నుంచి కూడా గుణపాఠాలు నేర్చుకోకపోవడం శోచనీయం. ఇప్పటికై నా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య నీట్ పరీక్షను నిర్వహించాలి. – షేక్ బాషు, విద్యార్థిని తండ్రి, కమలాపురం నీట్ పరీక్షల్లో నిర్లక్షం నీట్ పరీక్ష రద్దు చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నీట్ పేపర్లు లీక్ అవుతున్నాయి. దీని కారణంగా నిజాయితీగా పరీక్షలు రాసిన విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.పదేపదే లీకేజ్ అవుతుండడం చాలా దారుణం. ఎన్టీఏ పనితీరుపై సందేహాలు వస్తున్నాయి. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. – కిషోర్‌కుమార్‌రెడ్డి, ఎస్టీయు అన్నమయ్య జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు, పుంగనూరు -
జిల్లాలో 316 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం
వాల్మీకిపురం: అన్నమయ్య జిల్లాలోని ఎండోమెంట్ పరిధిలో ఉన్న 316 ఆలయాలకు దూపదీప నైవేద్య పథకంను వర్తింపజేస్తున్నట్లు ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. మంగళవారం స్థానిక నిమ్మనపల్లి రోడ్డు లోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఆలయాలను పరిరక్షిస్తూ నిత్య పూజలు, కై ంకర్యాల కోసం నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఆలయాల్లో అర్చకులు నిర్లక్ష్యం వహిస్తే నిధులను రద్దు చేస్తామన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. అర్చకులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. సాక్షి, మదనపల్లె: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా విస్తత స్థాయి సమావేశం ఈనెల 15న నిర్వహించనున్నట్లు ఆ విభాగం రాష్ట్ర కార్యదర్శి కేవీ.రమణ మంగళవారం తెలిపారు. స్థానిక బైపాస్ రోడ్డులోని జీనత్ కళ్యాణ మండపంలో జరిగే ఈ సమావేశానికి ఎస్సీ విభాగం జిల్లా కమిటీ, ఎస్సీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీకి చెందిన వివిధ భాగాలకు చెందిన ఎస్సీ నాయకులు, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి ఎస్సీ విభాగాల కమిటీలు, నాయకులు హాజరుకావాలని కోరారు. సమావేశానికి రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు హాజరవుతున్నట్లు తెలిపారు. రామసముద్రం: రామసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌వో లక్ష్మీ నరసయ్య మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం రక్త పరీక్షల గది, ఫార్మసీ, వాక్సిన్ రూమ్, లేబర్ రూమ్, వార్డులను పరిశీలించారు. రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అనేసి అక్కడున్న రోగులు, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ఆసుపత్రిలో రోగులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. ప్రొద్దుటూరు: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని గోడౌన్లో నిల్వ ఉన్న రూ.కోటి 71 లక్షల విలువైన ఇనుపకడ్డీలు మాయమైనట్లు హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు గుర్తించారు. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గోడౌన్లో 270 టన్నుల ఇనుప కడ్డీలను నిల్వ ఉంచగా ప్రస్తుతం 2.3 టన్నులు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రకారం రూ.1.71 కోట్ల విలువైన 268.56 టన్నుల ఇనుప కడ్డీలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. మంగళవారం హౌసింగ్ డిపార్ట్మెంట్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ వి.రాజారత్నంతోపాటు ప్రొద్దుటూరు ఇన్చార్జి ఈఈ రాజశేఖర్, రాజంపేట ఈఈ ఎం.మురళి గోడౌన్‌ను పరిశీలించారు. -
జలధార పనులు వేగవంతం చేయండి
పీలేరురూరల్: జిల్లాలో జలధార పనులు, సాగునీటి వనరులు, ఉద్యాన పంటలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని రేగళ్లు పంచాయతీ కమ్మపల్లె వద్ద అమ్మచెరువు బోడిగుట్ట నుంచి వచ్చే ఫీడర్ ఛానల్, బాలంవారిపల్లె పంచాయతీ గుర్రంవారిపల్లె వద్ద కొత్తనకుంట నుంచి సెట్టిగుంటకు వచ్చే ఫీడర్ ఛానల్ ఉపాధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ గొలుసుకట్టు చెరువుల ద్వారా దాదాపు ఆరు చెరువులు నిండే అవకాశం ఉందని తెలిపారు. అగ్రహారం చెరువు అభివృద్ధికి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రాయితీలు, పంటల బీమా, ఉద్యాన అభివృద్ధి పథకాలు సద్వినియోగం చేసుకుని రైతులు అధిక ఆదాయం పొందాలన్నారు. అనంతరం కేవీపల్లె మండలం అడవిపల్లె రిజర్వాయర్ పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో హెచ్ఎన్ఎస్ఎస్ పనులు పూర్తి చేయడానికి అవసరమైన కార్యచరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్ ఎస్ఈ విఠల్ ప్రసాద్, రిటైర్డ్ ఎస్ఈ వెంకటరామయ్య, డ్వామా పీడీ వెంకటరత్నం, ఉద్యానశాఖ అధికారిణి సుభాషిణి, డీపీవో రాధమ్మ, తహశీల్దార్ శివకుమార్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ -
విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
మదనపల్లె సిటీ: విద్యార్థి దశ నుంచే క్రీడలపట్ల ఆసక్తి పెంచుకోవాలని డిఎస్డిఓ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం స్థానిక బెంగుళూరు రోడ్డులోని గురు హాకీ క్లబ్ వేసవి శిబిరాన్ని సందర్శించారు. వేసవి శిబిరంలో శిక్షణ లో మెళుకువలు నేర్చుకోవాలన్నారు. హాకీ క్రీడకు మదనపల్లెలో మంచి గుర్తింపు ఉందన్నారు. ఎంతో మంది జాతీయ,రాష్ట్ర స్థాయిలో రాణించారన్నారు. హాకీ పితామహుడు ధ్యాన్‌చంద్ మదనపల్లెలో హాకీ క్రీడను క్రీడాకారులను నేర్పించారన్నారు. కార్యక్రమంలో సీనియర్ కోచ్ గురుభాస్కర్,పి.ప్రసాదరెడ్డి, కోచ్‌లు నౌషాద్,గౌస్, విష్ణు, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. -
శాంతితోనే జిల్లా అభివృద్ధి సాధ్యం: ఎస్పీ
కడప కోటిరెడ్డిసర్కిల్: మనుషులంతా ఒక్కటేనని, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని చాటిచెప్పి శాంతితోనే జిల్లా అభివృద్ధి సాధ్యమని నిరూపించడం అభినందనీయమని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌లు తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం కడప నగరంలో జరిగిన శోభా యాత్రలో ముస్లిం సోదరులు హిందు సోదరులను ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. యాత్రలో పాల్గొన్న హిందూ సోదరులకు ఒకరికొకరు ఆప్యాయంగా మజ్జిగ, నీరు, పానీయాలు అందించారు. ఈ సందర్బంగా ఎస్పీ తదితరులు మాట్లాడుతూ ఇది హిందూ– ముస్లిం ఐక్యతను ప్రతిబింబిస్తుందన్నారు. హిందూ ముస్లిం అంతా ఒక్కటే అందరు కలిసి ముందుకు పోవాలన్నారు. కడప నగరంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ లు అందరు కలిసి మెలిసి ఉన్నారన్నారు. నగరంలో అందరూ కలిసి, మెలిసి ఉండాలనే భావనలో ఉన్నారని, కడపలో ఇటీవల జరిగిన ఘటనకు సంబంధించి తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, హిందూ ముస్లిం సోదరులలోని అమాయకులను జిల్లా పోలీస్ శాఖ పరిగణనలోకి తీసుకుని న్యాయం చేస్తుందని ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, మాధవిరెడ్డి, నేతలు అమీర్‌బాబు, అఫ్జల్ఖాన్, శ్రీనివాసులరెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, హిందూ, ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎస్పీ షెల్కే సచికేత్ విశ్వనాథ్, చిత్రంలో హిందూ, ముస్లిం నేతలు శోభాయాత్రలో స్వామి వారు -
అనిశ్చితిలో భవిష్యత్తు
రెండేళ్లుగా ఎంతో కష్టపడి చదివి నీట్ పరీక్ష రాశా. పేపర్ లీక్ వ్యవహారంతో రద్దు చేయడం విస్మయాన్ని కల్గించింది. ఇంటర్లో 92 శాతం మార్కులు వచ్చాయి. ఎంబీబీఎస్‌పై ఆసక్తితో విజయవాడ శ్రీ చైతన్య కళాశాలలో రెండేళ్ల పాటు నీట్‌పై ప్రత్యేక శిక్షణ తీసుకున్నా. నాతో పాటు తల్లిదండ్రులు వ్యయప్రయాసలకు గురయ్యారు. ఎగ్జామ్ కూడా బాగా రాశా. మళ్లీ ప్రిపేర్ కావడం ఆపై రీ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఆందోళన కల్గిస్తోంది. ఎన్టీఏ వైపల్యం కారణంగా లక్షలాది మంది నీట్ విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడింది. –టి.దీపాన్విత, ఆది కుమార్తె, కురబలకోట -
సకల సౌకర్యాలతో ఆదర్శ పాఠశాలను నిర్మించాలి
రొంపిచెర్ల: రొంపిచెర్ల ఆదర్శ పాఠశాల తరగతి గదులను నూతన వసతులతో నిర్మించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. అయన మంగళవారం ఆదర్శ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 12వ తేదికి విద్యార్థులకు సౌకర్యంగా మొదటి అంతస్తు తరగతి గదులను నూతన వసతులతో పూర్తి చేసి విద్యార్థులకు అప్పగించాలన్నారు. తరగతి గదుల కొరత వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వెంటనే పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. ఈ నెల 14న జిల్లా కలెక్టరేట్లో ఆదర్శ పాఠశాలపై అదర్శ పాఠశాల ప్రిన్సిపల్, ఎంఈవో, కాంట్రాక్టర్, ఇంజనీర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు.ఈ సమావేశానికి ఆదర్శ పాఠశాలకు కావాల్సిన సౌకర్యాలపై పూర్తి నివేదికలతో హాజరు కావాలని సూచించారు. ప్రిన్పిపాల్ రెడ్డిప్రదీప్, తహశీల్దార్ కిరణ్‌కుమార్, ఎంఈవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ భవన నిర్మాణ పనుల పరిశీలన పులిచెర్ల(కల్లూరు): మండల కేంద్రమైన పులిచెర్లలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ హాస్పిటల్ కొత్త భవన నిర్మాణ పనులను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం పరిశీలించారు. అనంతరం అక్కడి సిబ్బందితో మాట్లాడారు. భవన నిర్మాణం పనులు పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సురేంద్రనాథరెడ్డి, మెడికల్ ఆఫీసరు డా.వేణుగోపాల్‌రెడ్డి, స్థానిక నాయకులు ప్రభాకర్, తహసీల్దారు జయసింహ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఏపీ ఈఏపీసెట్ ప్రారంభం
కడప ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, పార్మసీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష(ఏపీఈఏపీసెట్)–2026 మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలు, 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, పార్మసీ(భైపీసీ) కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. జిల్లావ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, రాజంపేట పరీక్షా కేంద్రాలలో కంప్యూటర్ ఆధారిత(ఆన్లైన్)విధానంలో 9 పరీక్షా కేంద్రాలలో ఏపీ ఈఏపీ పరీక్షను నిర్వహించారు. ఇందులో ఉదయం, సాయంత్ర రెండు సెషన్స్‌కు సంబంధించి 1668 మందికిగాను 1567 మంది హాజరుకాగా 101 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో 9 కేంద్రాల్లో ఆన్లైన్ పరీక్ష నిర్వహణ జిల్లావ్యాప్తంగా తొలిరోజు 1567 మంది హాజరు -
ఇప్పటికే 11 లక్షలు ఖర్చయింది
మా పాప నందినిని విజయవాడలోని గోశాల శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్‌తోపాటు రెండు సార్లు లాంగ్‌టర్మ్ నీట్ కోసం రూ. 11 లక్షలు ఖర్చు పెట్టాను. ఈసారి నీట్ పరీక్ష బాగా రాసింది. ఫలితాలకు సంబంధించి విడుదలైన ప్రాథమిక కీలో 720 మార్కులకు 590 మార్కులు వచ్చాయి. కోచింగ్ సెంటర్ వాళ్లు కూడా మంచి కళాశాలలో సీటు వస్తుందని చెప్పారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మా ఆశలపైన నీళ్లు చల్లారు. మళ్లీ కోచింగ్‌కు పంపాలంటే ఆర్థికభారమే. – పోలిరెడ్డి, చిన్నాయపల్లె, బి. మఠం మండలం ప్రభుత్వం బాధ్యత వహించాలి నీట్ పేపర్ లీక్ విషయంపై ప్రభుత్వం బాధ్యత వహించాలి. నా కొడుకుచేతన్రెడ్డి నీట్ పరీక్ష రాశాడు. పిల్లలు ఆందోళనకు గురవుతారు. ఎంతో కష్టపడి చదివితే పరీక్ష రద్దు చేస్తున్ననట్లు ప్రకటించడం దుర్మార్గం. మళ్లీ పరీక్ష అంటే విద్యార్థులపై మానసిక ఒత్తిడి తీవ్రమవుతుంది. –నారాయణరెడ్డి, సప్తగిరినగర్, మదనపల్లె నీట్ రద్దు బాధాకరం నీట్ పరీక్షను రద్దు చేయడం బాధాకరం. నా కుమార్తె నీట్ పరీక్ష రాసింది. ఏడాదికాలంగా విద్యార్థులు అహర్నిశలు కష్టపడి చదివిన చదువుకు సార్థకత లభించకపోవడం పాటు తిరిగి మళ్లీ పరీక్షను రాయాల్సి అవసరం రావడం దురదృష్టకరం. విద్యార్థులపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. పరీక్షల నిర్వహణ సమయంలో ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలి. –పఠాన్ మహమ్మద్‌ఖాన్ -
హెడ్ నర్స్‌గా పదోన్నతులు
కడప రూరల్: వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో సోమవారం రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా స్టాఫ్ నర్స్ నుంచి హెడ్ నర్స్‌గా పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించారు. మొత్తం 24 మందికి గాను 21 మంది పదోన్నతులు పొందారు. ఈ సందర్భంగా ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనల ప్రకారం ప్రమోషన్లు కల్పించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ నాగరత్నమ్మ, సూపరిండెంట్ శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ వనిష తదితరులు పాల్గొన్నారు. కడప కోటిరెడ్డిసర్కిల్: గతంలో ఓకా–మధురై–ఓకా మధ్య స్పెషల్ రైలు నడిచేదని, దాని స్థానంలో ఓకా–తిరుపతి (19560), తిరుపతి–ఓకా (19559) వీక్లీ రెగ్యులర్ రైలుగా నడుపుతున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. ప్రతి సోమవారం ఓకాలో రాత్రి 11.35 గంటలకు బయలుదేరి ద్వారక, కంబాలియా, జామ్‌నగర్, రాజ్‌కోట్, సురేంద్రానగర్, అహ్మదాబాద్, వడోదర, సూరత్, అకోల, నాందేడ్, నిజామాబాద్, కరీంనగర్, కాచిగూడ, మహబూబ్‌నగర్, కర్నూలు, డోన్, తాడిపత్రి మీదుగా కడపకు మరుసటిరోజు సాయంత్రం 5.55 గంటలకు చేరుకుని, అక్కడి నుంచి రాజంపేట, రేణిగుంట మీదుగా తిరుపతికి రాత్రి 11.30 గంటలకు చేరుతుందన్నారు. ప్రతి గురువారం తిరుపతిలో ఉదయం 8.15గంటలకుబయలుదేరి ఇదే మార్గంలో శనివారం రాత్రి 11.50 గంటలకు ఓకా చేరుతుందన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కడప అర్బన్: రాష్ట్ర జైలు శాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే ములాఖత్‌కు అవకాశం ఉంటుందని కడప కేంద్రకారాగారం సూపరింటెండెంట్ రాజేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండుటెండల నుంచి రక్షణ పొందడానికి వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ములాఖత్‌కు వచ్చే వారు మారిన సమయాన్ని గుర్తించి, అధికారులకు సహకరించాలని కోరారు. చక్రాయపేట: గండి వీరాంజనేయ స్వామి నూతన ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవంలో భాగంగా నాలుగోరోజు సోమవారం పలు కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు.ఇందులో భాగంగా శ్రీమద్రామాయణ మహాయజ్ఙం, తుంబూర వేషాలంకారంతో పాటు నాగవళ్లి దళాలతో(తమలపాకులతో) సహస్ర నామార్చన నిర్వహించారు.అనంతరం శాత్తమొరై జరిపారు.భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రొద్దుటూరు కల్చరల్: భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్రచారార్థం జయహో బీమా సంకల్ప్ మెగా మేళాను ఈనెల 20 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు ప్రొద్దుటూరు డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ జి.కిరణ్ సోమవారం తెలిపారు. ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలోని అన్ని పోస్టాఫీసులలో జయ హో బీమా సంకల్ప్ నిర్వహించనున్నట్లు ఆయ న పేర్కొన్నారు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తక్కువ ప్రీమియంతో అధిక బోనస్ రేట్లు అందిస్తూ, ఇతర బీమా సంస్థలతో పోలిస్తే ప్రజ లకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రతి గ్రామస్తుడు తమ సమీపంలోని పోస్టా ఫీసు ద్వారా రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పథకంలో చేరవచ్చని పేర్కొన్నారు. -
సౌతాఫ్రికాలో కలిచెర్ల వాసి మృతి
పెద్దమండ్యం : మండలంలోని కలిచెర్లకు చెందిన ఓ యువకుడు సౌతాఫ్రికాలో ఆదివారం గుండెపోటుతో మృతిచెందాడు. ఈ మేరకు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. వివరాలలోకి వెళితే.. పెద్దమండ్యం మాజీ ఎంపీపీ పి. ప్రసాద్‌రెడ్డికి ఇద్దరు కుమారులు ఉన్నారు. బీటెక్ పూర్తి చేసిన కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి సౌతాఫ్రికాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో 8 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నా డు. ఇతనికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. అక్కడే కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడి, అలసటగా ఉందని చెప్పి కుప్పకూలినట్లు అతని స్నేహితుల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, గుండెపోటుకు గురి కావడంతో మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపినట్లు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మాజీ ఎంపీపీ తనయుని ఆకస్మిక మరణంతో కలిచెర్ల, యర్రగుట్టపల్లెలో విషాదం నెలకొంది. భార్య ఇటీవల స్వగ్రామానికి వచ్చి సౌతాఫ్రికాకు వెళ్లి 20 రోజులు అవుతోంది. మృతుని భార్య, బిడ్డను తిరిగి కలిచెర్లకు పంపించేందుకు అక్కడి కంపెనీ ప్రతినిధులు చొరవ తీసుకున్నట్లు సమాచారం. మాజీ ఎంపీపీ తనయుని అకస్మిక మృతిపట్ల తంబళ్లపల్లె ఎమ్యెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, కలిచెర్ల సింగిల్‌విండో మాజీ ఛైర్మన్ కలిచెర్ల సుధాహరరెడ్డి, ఎంపీపీ గుర్రం పూర్ణచంద్రిక, మాజీ ఎంపీపీ టి రెడ్డిశేఖరరెడ్డిలు దిగ్బాంతి వ్యక్తం చేశారు. -
ప్రభుత్వ స్థలం దర్జాగా కబ్జా
● రాత్రికి రాత్రే వెలుస్తున్న అక్రమ షెడ్లు ● పట్టించుకోని హౌసింగ్ శాఖ అధికారులుమదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె బసినికొండలో ప్రభుత్వ స్థలాలు కబ్జాదారుల పాలవుతున్నాయి. నిర్మిత కేంద్రం స్థలంలో రాత్రికి రాత్రే అక్రమ షెడ్లు వెలిసినా హౌసింగ్ శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది పట్టించు కోవడం లేదు.పేదలకు తక్కువ ధరకు ఇసుక, సిమెంట్, నిర్మాణ సామగ్రి అందించేందుకు ప్రభుత్వం 1990లో నిర్మిత కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సుమారు 80 సెంట్ల స్థలాన్ని కేంద్రానికి కేటాయించారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ స్థలం విలువ రూ.20 కోట్ల పైమాటే. గతంలో ఈ స్థలంలో నిర్మిత కేంద్రం కార్యాలయం, గోడౌన్ నడిచేవి. రాత్రికి రాత్రే షెడ్లు కొంతకాలంగా నిర్మిత కేంద్రం కార్యకలాపాలు నిలిచిపోవడంతో కబ్జాదారుల కన్ను పడింది. గత వారం రోజులుగా రాత్రి వేళల్లో మట్టితోలి జేసీబీతో స్థలాన్ని చదును చేసి రేకుల షెడ్లు, తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికే కొన్ని ఇళ్లు, ఐదు షెడ్లు, వాటర్ సర్వీస్ కేంద్రం వెలిశాయి. మరికొన్ని పునాదుల స్థాయిలో ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం నిర్మిత కేంద్రం స్థలం హౌసింగ్ శాఖ పరిధిలోకి వస్తుంది. కానీ జిల్లా హౌసింగ్ ఈఈ, డీఈలు క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే కబ్జాకు గురైన స్థలానికి ఆనుకునే బసినికొండ గ్రామ సచివాలయం ఉంది. సచివాలయ సిబ్బంది, వీఆర్వో కళ్లముందే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిన్నాయి. స్థానికులు ఫిర్యాదు చేసినా ‘మాకు సంబంధం లేదు‘ అని దాటవేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిబంధనలు గాలికి ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యత రెవెన్యూ, సచివాలయ సిబ్బందిపై ఉంది. అక్రమ నిర్మాణాలు చేపడితే వెంటనే తహసీల్దార్‌కు నివేదించి తొలగించాలి. ఏపీ ల్యాండ్ ఎన్న్క్రోచ్మెంట్ యాక్ట్–1905 ప్రకారం నోటీసు ఇచ్చి 7 రోజుల్లో ఖాళీ చేయించాలి. కానీ ఇక్కడ నెల రోజులుగా కబ్జా జరుగుతున్నా ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదు. ప్రజల ఆగ్రహం జిల్లా కేంద్రంలోనే ప్రభుత్వ స్థలం కబ్జాకు గురవుతుంటే మారు మూల గ్రామాల పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిర్మిత కేంద్రం స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. 24 గంటల్లో ఆక్రమణలు తొలగించకపోతే కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దీనిపై హౌసింగ్ ఈఈని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
విన్నపాలు.. వినవలె!
పీజీఆర్ఎస్కు 383 వినతులు స్పెల్ బీలో జాతీయస్థాయిలో రెండో స్థానం సాధించిన విద్యార్థి బి.శైలేష్‌ను కలెక్టర్ నిశాంత్‌కుమార్ ప్రశంసించారు. సోమవారం డీఈఓ సుబ్రమణ్యం, ఏసీపీ అనురాధలు శైలేష్‌ను కలెక్టర్ వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల విద్యార్థులతో పోటీపడిన పెద్దమండ్యం మండలం వెలిగల్లు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న శైలేష్ ఏప్రిల్ 22న ముంబైలో జరిగిన స్పెల్ బీ పోటీల్లో జాతీయస్థాయిలో రెండోస్థానం దక్కించుకుని పొందిన మెడల్, అవార్డు, కప్‌ను కలెక్టర్‌కు చూపించారు. దీనిపై ఆయన విద్యార్థి ప్రతిభను మెచ్చుకున్నారు మదనపల్లె/అర్బన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు ప్రజల నుంచి 383 వినతులు వచ్చినట్లు కలెక్టర్ నిశాంత్‌కుమార్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ఆయాశాఖల అధికారులు దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా అర్జీదారులతో నేరుగా మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఇందులో నిర్లక్ష్యం తగదన్నారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచరాదన్నారు. నాణ్యతగా, వేగంగా పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ శివ్‌నారాయణశర్మ, సబ్‌కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో చంద్రశేఖర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. కొన్ని అర్జీల వివరాలు.. ఆక్రమణదారులతో రెవెన్యూ అధికారులు కుమ్మకై ్క వారసత్వంగా సంక్రమించిన 15 ఎకరాల భూమిని ఆన్లైన్ నుంచి తొలగించి అన్యాయం చేశారంటూ కురబలకోట మండలం ఎర్రజేనుపల్లెకు చెందిన రెడ్డెమ్మ అర్జీ సమర్పించింది. తమ భూమిని ఆక్రమణదారుల పేరుమీద రాసి, అన్యాక్రాంతం చేశారంటూ బాధితురాలు వాపోయింది. ఆక్రమణదారులు తమ భూమిని కబ్జా చేశారంటూ కురబలకోట మండలం నందిరెడ్డిగారిపల్లెకు చెందిన ఫిరోజ్‌ఖాన్ అర్జీ సమర్పించాడు. గ్రామానికి చెందిన బాలకృష్ణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, జయారెడ్డిలు రెవెన్యూ అధికారుల అండతో 15 ఎకరాల భూమిని కబ్జా చేశారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రెవెన్యూ అధికారులు రీసర్వేలో తమకు చెందిన 90 సెంట్ల భూమిని మాజీ సర్పంచి ఎంజీ మల్లయ్య కోడలు సుజాత పేరుమీద ఆన్లైన్ చేసేశారంటూ నందిరెడ్డిగారిపల్లెకు చెందిన అమీర్‌బాషా అర్జీ సమర్పించాడు. కలెక్టర్ ఎండార్స్మెంట్ ఇచ్చిన స్థలాన్ని ఆన్లైన్ చేయడంతో బాధితుడు తన గోడును కలెక్టర్‌కు విన్నవించాడు. బి.కొత్తకోట పట్టణంలోని బీసీ కాలనీని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని స్థాని కులు వినతిపత్రం అందజేశారు. 35 ఏళ్ల క్రితం ఇక్కడ పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించారు. స్థలాల్లో గృహ నిర్మాణ పథకం కింద, సొంతంగా పేదలు ఇళ్లను నిర్మించుకున్నారు. అయితే ఈ కాల నీ పరిధిలోని సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో పెట్టారు. ప్రస్తుత పరిస్థితుల మేరకు ఈ నిషేధం తొలగించి క్రయ, విక్రయాలకు అవకాశం ఇవ్వా లని స్థానికులు అధికారులను కోరుతున్నారు. మదనపల్లె సీటీఎం రోడ్డును వ్యాపార సంస్థలు ఆక్రమించడంపై బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ కుమార్ ఫిర్యాదు చేశారు. -
నూతన ఆవిష్కరణల దిశగా యువత ఆలోచించాలి
కడప ఎడ్యుకేషన్ : నూతన ఆవిష్కరణల దిశగా యువత ఆలోచించి పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలని డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ బి. జయరామిరెడ్డి సూచించారు. కడప లోని డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో సోమవారం జాతీయ సాంకేతిక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ బి. జయరామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సాంకేతిక విజ్ఞానం ప్రాముఖ్యతను వివరించారు.ఆధునిక ప్రపంచంలో డిజిటల్ టెక్నాలజీ వేగంగా అభివద్ధి చెందుతోందని, విద్యార్థులు కాలానుగుణంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. క్వాంటమ్ ఇన్నోవేషన్ సెల్ కన్వీనర్ జి. ఫణీంద్ర రెడ్డి మాట్లాడుతూ సాంకేతిక, కృత్రిమమేధ వినియోగంపై విలువైన అవగాహనను పంచుకున్నారు. ప్రాజెక్ట్ ఆలోచన దశ నుంచి తుది రూపకల్పన వరకు ఆటోమేటెడ్ టూల్స్ ఉత్పత్తి ప్రక్రియను ఎలా వేగవంతం చేస్తున్నాయో వివరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఐఐసీ కన్వీనర్ డాక్టర్ వి.శివకష్ణారెడ్డి, క్వాంటమ్ ఇన్నోవేషన్ సెల్ కన్వీనర్ డాక్టర్ జి.ఫణీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని కదిరి రోడ్డులోని ఎస్సీఎస్ఆర్ కల్యాణ మండపం సమీపంలో సోమవారం గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు దుర్మరణం చెందాడు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని వెలమవారిపల్లె గ్రామానికి చెందిన కృష్ణయ్య కుమారుడు భరత్ (20) ద్విచక్ర వాహనంలో పులివెందులకు వెళ్లి పనులు ముగించుకొని స్వగ్రామానికి బయలుదేరాడు. కదిరి రోడ్డులో వస్తుండగా.. కదిరి నుంచి పులివెందుల వైపు వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో భరత్‌కు తీవ్ర గాయాల య్యాయి. యువకుడిని చికిత్స కోసం 108 వాహనంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భరత్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బైక్ డివైడర్‌ను ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థి..ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని జమ్మలమడుగు రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చెప్పలి నాగమల్లేష్ (22) దుర్మరణం చెందాడు. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన నాగమల్లేష్ బీటెక్ చదివాడు. సోమవారం పరీక్ష రాసి వచ్చిన అతను తన స్నేహితుడు తాళ్లప్రొద్దుటూరుకు చెందిన మహేష్‌ను బస్సు ఎక్కించేందుకు బైక్‌లో బయలుదేరాడు. ఈ క్రమంలో బుడ్డాయపల్లె సమీపంలోకి రాగానే బైక్ డివైడర్‌ను ఢీ కొంది. ఈ ఘటనలో నాగమల్లేష్ అక్కడిక్కడే మృతి చెందగా మహేష్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన అతన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. నాగమల్లేష్ తండ్రి చిన్న వెంకటేష్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో గుమస్తాగా పని చేస్తున్నాడు. కుమారుడు మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధించసాగారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పాము కాటుతో రైతు.. లింగాల : లింగాల మండలం పార్నపల్లె గ్రామానికి చెందిన బంగారంపేట ఆదినారాయణ (55) అనే రైతు పాము కాటుకు గురై మృతి చెందాడు. శుక్రవారం ఉదయం రైతు ఆదినారాయణ తన అరటి తోటకు వెళ్లాడు. అక్కడ పాము కాటుకు గురయ్యాడు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి వేలూరుకు, అనంతరం కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. రైతు ఆదినారాయణకు భార్య గంగమ్మ, పిల్లలు ఉన్నారు. -
ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు
పుంగనూరు : ప్రమాదవశాత్తు ఆటో చెట్టును ఢీకొని బోల్తా పడటంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈసంఘటన పట్టణ సమీపంలోని రాంపల్లె వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మదనపల్లె పట్టణం ఈశ్వరమ్మ కాలనీకి చెందిన నూర్‌బాషా(42), యాస్మిన్(35), స్థానిక యూబికాంపౌండుకు చెందిన సుమన్‌తాజ్(32)లు కలసి పుంగనూరుకు ఆటోలో వస్తుండగా రాంపల్లె వద్ద ఆటో చెట్టును ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు వీరిని 108లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంగారు, నగదు చోరీతంబళ్లపల్లె : ఇంటితలుపులు పగలగొట్టి నగదు, బంగారు చోరీ చేసిన సంఘటన మండలం కేంద్రంలో జరిగింది. బాధితులు జీ.రమణయ్య తెలిపిన వివరాలు.. ఆర్.ఎన్.తాండా పంచాయతీ బోనాసువారిపల్లెకు చెందిన రమణయ్యకు తంబళ్లపల్లె ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ఇళ్లు ఉంది. శనివారం ఇంటికి తాళం వేసి పనుల నిమిత్తం స్వగ్రామం బోనాసువారిపల్లెకు వెళ్లారు. ఎవరూ లేరని గుర్తించిన గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువా తాళాలు తీసి లోపల లాకర్ పగలగొట్టి 17గ్రాముల బంగారు నగలు, 20 తులాల వెండి గొలుసులు, రూ.20వేల నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం చేయాలి మదనపల్లె టౌన్ : ప్రజల సమస్యలను విని, వాటికి తక్షణ పరిష్కారం చూపించాలని, బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. సోమవారం మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. లైంగిక వేధింపులపై కేసు నమోదుఒంటిమిట్ట : మండల కేంద్రమైన ఒంటిమిట్టలో పారిశుధ్య కార్మికురాలైన ఓ మహిళను అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లైంగిక వేధింపులు చేస్తున్నాడని కేసు నమోదు చేశారు. ఒంటిమిట్ట ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. ఏడాది కాలం నుంచి లైంగికంగా, మానసికంగా వేదిస్తున్నాడని బాధితురాలు పిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
రేపు టీచర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సమావేశం
కడప ఎడ్యుకేషన్: కడపలోని సీఎస్ఐ ఉన్నత పాఠశాలలో ఈ నెల 13వ తేదీ ఉదయం 9.30 గంటలకు టీచర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విశ్వనాథరెడ్డి, బాలశౌరిరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో పబ్బాపురం ప్లాట్ల వ్యవహారంపై ప్రత్యేక చర్చలు జరిపి సమస్య పరిష్కారం కోసం సొసైటీ చేసిన, చేస్తున్న కృషి, అవరోదాలు,లబ్ధిదారుల అపార్థాలు,అభియోగాలు అన్నింటిపై చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి అందరూ తప్పకుండా హాజరు కావాలని వారు కోరారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: నగరంలోని వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 14న అండర్ 14 16, బాలుర క్రికెట్ ఎంపికలు నిర్వహించనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైయస్సార్ డిస్టిక్ కార్యదర్శి ఏ. రెడ్డి ప్రసాద్ తెలిపారు . ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్ కాపీ,బర్త్ సర్టిఫికెట్(ఫారం 5), లాస్ట్ 3 సంవత్సరాల మార్కులిస్ట్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోతో పాటు తమ కిట్ బ్యాగులు కూడా తీసుకురావాలని పేర్కొన్నారు. అండర్– 16 ఎంపికలకు 2010 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. అండర్ –14కి 2012 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన వారు అర్హులని వివరించారు. -
హత్యకేసులో నిందితులు అరెస్టు
లక్కిరెడ్డిపల్లి: మండలంలోని పందిళ్లపల్లి గ్రామం, బీసీ కాలనీకి చెందిన చిన్నక్క హత్యకేసులో తల్లీ, కొడుకులైన సావిత్రి, వేణులను సోమవారం అరెస్టు చేసినట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ పేర్కొన్నారు. పందిళ్లపల్లి కస్సాలోని పసుపులేటి చిన్నక్క (65) ఒకే బజారులో ఉన్న సావిత్రి, వేణులు ఏప్రిల్ 25న ఇంటిముందర గొడవపడ్డారు. తల్లీ కొడుకులు చిన్నక్కను గోడకేసి కొట్టడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో ఆమెను లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. చికిత్స చేస్తుండగా ఫిట్స్ రావడంతో తిరుపతికి తరలించారు.అక్కడ కూడా పరిస్థితి విషమించడంతో వైద్యులు ఇంటికి తీసుకెళ్లమని చెపారు. దీంతో ఆమెను ఈనెల 7న పందెళ్లపల్లికు తీసుకువచ్చారు.అదేరోజు రాత్రి మృతి చెందింది. సావిత్రి, వేణులు కొట్టిన దెబ్బలకు మా అత్త మృతి చెందిందని చిన్నక్క కోడలు రామాంజనమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు లక్కిరెడ్డిపల్లి సీఐ కృష్ణంరాజు నాయక్, ఎస్ఐ గోల్కొండ శోభలు కేసు నమోదు చేశారు. సోమవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు పంపుతున్నట్లు సీఐ, ఎస్ఐ తెలిపారు. అదుపు తప్పి కూలీల ఆటో బోల్తా వేంపల్లె : వేంపల్లె మండలం నందిపల్లె గ్రామ సమీపంలో వ్యవసాయ కూలీల ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్‌తోపాటు 15మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం వేంపల్లె పట్టణంలోని గౌరీ నగర్, సంఘం వీధి, కరణంవీధి తదితర ప్రాంతాల నుంచి నందిపల్లె గ్రామ పొలాల్లోకి వ్యవసాయ కూలీ పనికి ఆటోలో వెళ్లారు. మధ్యాహ్నం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఆటో డ్రైవర్ వేరే వాహనాన్ని తప్పించబోయి మట్టి కుప్పను ఎక్కించాడు. అధిక లోడు ఉండడంతో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో 8మందికి తీవ్రంగా, మిగిలిన వారందరికీ స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన డ్రైవర్ నిత్యానంద, వీరమ్మ, మహబూబ్ బీ, పద్మావతి, అమరావతి, అంజనమ్మ లక్ష్మీదేవిలను మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. మిగిలిన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. -
గంగలో రైల్వే పరువు!
రాజంపేట: భారతీయ రైల్వే పరువు గంగపాలవుతోంది. ప్రయాణికులకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో, ముఖ్యంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ సమయంలో బోగీల్లో నీటిని నింపడంలో రైల్వే యంత్రాంగం దారుణంగా విఫలమవుతోంది. అడిగే నాథుడు లేక, పట్టించుకునే అధికారులు లేక ప్రయాణికులు ’ఆపుకోలేని’ సమస్యతో నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రైవేటీకరణే అసలు గండం గతంలో రైళ్లలో నీటిని నింపే బాధ్యత రైల్వే అధికారుల పర్యవేక్షణలో ఉండేది. కానీ మూడేళ్ల క్రితం ఈ ప్రక్రియను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించిన నాటి నుంచి నిర్వహణ గాలికి వదిలేశారు. రైలు బయలుదేరే స్టేషన్లో ప్లాట్‌ఫామ్‌పై ఉన్న పైపుల ద్వారా ట్యాంకులను పూర్తిస్థాయిలో నింపడం లేదు. టైమ్ సరిపోలేదనో, పైపులైన్లలో ప్రెషర్ లేదనో సాకులు చెబుతూ సగమే నింపుతున్నారు. ఫలితంగా రైలు బయలుదేరిన నాలుగు గంటలకే ట్యాంకులు ఖాళీ అవుతున్నాయి. ఏసీ బోగీల్లో తప్ప స్లీపర్, జనరల్ బోగీల్లో కుళాయిలు వెక్కిరిస్తున్నాయి. దుర్గంధం.. అపరిశుభ్రత: టాయిలెట్లలో నీళ్లు రాకపోవడంతో ప్రయాణిలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నీరు లేకున్నా అలాగే వాడుతుండటంతో బోగీల్లో దుర్గంధం వెదజల్లి అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. మహిళలు, వృద్ధులు, పసిపిల్లలు ఈ దుర్భర పరిస్థితిని భరించలేక నరకం చూస్తున్నారు. రైలు ఏదైనా స్టేషన్లో ఆగగానే ఖాళీ సీసాలతో ప్లాట్‌ఫామ్ వైపు పరుగులు తీయడం నిత్యం కనిపిస్తున్న దృశ్యం. టీసీలకు ఫిర్యాదు చేసినా ‘మా చేతుల్లో ఏమీ లేదు‘ అనే సమాధానమే వస్తోంది. నందలూరుకు ‘నీటి’ మోక్షమెప్పుడో? చైన్నె–ముంబై రైలు కారిడార్‌లో నందలూరు అత్యంత కీలకమైన సెంటర్ పాయింట్. ఇక్కడ వాటరింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తే సగం రైళ్లలో నీటి సమస్య తీరుతుందని రైల్వే క్షేత్రస్థాయి వర్గాలు మొత్తుకుంటున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. ఇదే అంశంపై ఇటీవలే ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి రైల్వే మంత్రిని కలిసి విన్నవించారు. ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, మేడా రఘునాథరెడ్డి కూడా నందలూరులో వాటరింగ్ పాయింట్ పునరుద్ధరించాలని ఒత్తిడి తెచ్చారు. అయినా సరే, రైల్వే బోర్డు మొండివైఖరి ప్రయాణికులకు శాపంగా మారింది. మాకు ఫిర్యాదులేమీ రాలేదు.. అంతా బానే ఉంది‘ అంటూ అధికారులు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. బోగీల్లో నీళ్లు రానప్పుడు, అపరిశుభ్రత ఉన్నప్పుడు ప్రయాణికులు మౌనంగా ఉండకుండా తక్షణమే 139 నంబర్‌కు కాల్ చేయాలని లేదా రైల్వే యాప్ ద్వారా ఎస్ఎమ్ఎస్ ద్వారా ఫిర్యాదు చేయాలని రైల్వే వర్గాలే సూచిస్తున్నాయి. ప్రయాణికులు మేల్కొని ప్రశ్నిస్తేనే వారి యాతనకు ముగింపు లభిస్తుంది. మధ్యలోనే నీటి ట్యాంకులు ఖాళీ దుర్గంధంతో బోగీల్లోని మరుగుదొడ్లు రైళ్లకు నీళ్ల కోసం నందలూరే సెంట్రల్ పాయింట్ రైళ్ల వాటరింగ్కుకోవిడ్–19 ముందు సర్వే బోగీలోని ప్రయాణికులకు సమ్మర్ ప్రభావం ప్రధానరైలుమార్గం: ముంబాయి–చైన్నె రైళ్లు: 30 (అప్ అండ్ డౌన్) స్టేషన్లు: 25 ప్రతి రైలుల్లో నీటి సమస్య ఉత్పన్నం ప్రతి రైలుల్లో నీటి సమస్య ఉందనేది నిత్యసత్యం. నేను హరిప్రియలో ఇటీవల ప్రయాణిస్తే నీళ్లులేవు. లాంగ్ ట్రైన్స్ అయితే నీళ్లు అయిపోతే, అడిగే నాథుడే లేకుండా పోతున్నాడు. తిరుమల, ఇంటర్సిటీ, హరిప్రియ, చైన్నె–ముంబై రైళ్లలో నీటి నిల్వలు ఎప్పుడో అయిపోయింటాయి. నీటి వాడకం లేకపోవడంతో దుర్గంధపూరితంగా మారిపోతున్నాయి. గుత్తి–రేణిగుంట మధ్య అటు చైన్నె, ఇటు ముంబై రైళ్లకు సెంటర్‌పాయింట్‌గా నందలూరులో వాటరింగ్ సౌకర్యం కల్పిస్తే ప్రయాణికులకు నీటి సమస్య తీరుతుంది. –వేపగుంట శ్యామ్‌రాజ్, సంఘసేవకుడు, నందలూరు రైల్వేకేంద్రం దూరప్రాంత రైళ్లలో నీటి సమస్య ఽఅధికమే జిల్లా మీదుగా నడిచే దూరప్రాంత రైళ్లలో నీటి సమస్య అధికంగా ఉంది. ప్రయాణికులకు నీటి సమస్య లేకుండా చూద్దామనే ఆలోచన రైల్వే శాఖకు లేదు. ప్రయాణికుల నుంచి చార్జీలు ముక్కుపిండి వసూలు చేస్తారు. బోగీలలో మెరుగైన సౌకర్యాలు ఉండవు. గుత్తి–రేణిగుంట మధ్య రైళ్ల మరుగుదొడ్లలో నీళ్లుండవు. సెంటర్‌పాయింట్‌గా నందలూరులో రైళ్ల వాటరింగ్ పెడితే ఈ మార్గంలో బోగీలలో నీటి సమస్య తీరుతుంది. –సయ్యద్ జుల్ఫీకర్, వరల్డ్ హ్యుమన్ రైట్స్కౌన్సిల్ -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
కడప ఎడ్యుకేషన్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష (ఏపీఈఏపీసెట్)–2026 నేటి నుంచి జిల్లావ్యాప్తంగా ప్రారంభం కానుంది. సంబంధిత పరీక్షలను కంప్యూటర్ ఆధారిత(ఆన్లైన్)విధానంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలు, 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, పార్మసీ(భైపీసీ) కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. వైఎస్సార్ జిల్లాలో 9 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో 14846 మంది ఇంజనీరింగ్‌కు, 3985 మంది మంది అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షను రాయనున్నారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. జిల్లాలో పరీక్షా కేంద్ర వివరాలు ఇలా... ఏపీ ఈపీపీ సెట్ పరీక్ష కోసం జిల్లాలో 9 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో కడపలో ఆరు, ప్రొద్దుటూరులో రెండు, రాజంపేటలో ఒక్క పరీక్షా కేంద్రాన్ని సిద్ధం చేశారు. నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు -
పెన్షన్ పెంపు చేసి ఆదుకోరూ..
రామసముద్రం : తన భర్త కు నడుము విరిగిపోయి ఏడాదిగా మంచానికే పరిమిత మయ్యాడని బాధితుడు భార్య పర్వీన్ ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్వహించిన పీజీఆర్ ఎస్ కార్యక్రమానికి వచ్చిన ఆమె మాట్లాడుతూ కూలి చేసుకొని జీవనం చేస్తూ పిల్లలను పోషించుకుంటున్నామని తెలిపారు. ఏడాది క్రితం తన భర్త ఎద్దులబండిలో ఇసుక తోలుతుండగా ఇసుక గడ్డ విరిగిపడి వీపుపై పడటంతో నడుము విరిగిందన్నారు. అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వ పెన్షన్ రూ.6వేలు ఇస్తున్నారని, రోజుకు చికిత్సకే రూ.300లు ఖర్చు అవుతుందని తెలిపింది. తన భర్త మంచానికి పరిమితం కావడంతో తమ కుటుంబ జీవన పరిస్థితి కష్టంగా మారిందని, ప్రభుత్వం పెన్షన్ పెంపు చేసి ఆర్థికంగా ఆదుకోవాలని కోరింది. -
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
కలకడ : ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడు మృతిచెందిన సంఘటన సోమవారం జరిగింది. హెడ్‌కానిస్టేబుల్ ముజీర్ కథనంమేరకు వివరాలిలా ఉన్నాయి. కలకడ మండలం, ఎర్రకోటపల్లెపంచాయతీ, మల్లవరంవాండ్లపల్లె గ్రామానికి చెందిన మల్లూరి.రవీంద్రరెడ్డి కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి (22) స్వగ్రామం నుంచి ద్విచక్రవాహనంలో బొంతలవారిపల్లెలో జరిగే జాతరకు బయలుదేరాడు.మార్గమధ్యలో బైక్ అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన సూచికబోర్డును ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఇతన్ని చికిత్స కోసం తరలిస్తుండగా మృతిచెందాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ రామాంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ ముజీర్ తెలిపారు. -
రుణాల పేరిట మోసం
సాక్షి, మదనపల్లె : రుణాలు ఇప్పిస్తామని, అందుకు సంఘాలు ఏర్పాటు చేయాలని నమ్మించిన ఇద్దరు మహిళలు అందిన కాడికి దండుకున్నారని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సోమవారం బి.కొత్తకోట పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కథనం మేరకు వివరాలు. ఫరీదా అనే మహిళ, ఆమె కూతురు నస్రిన్ బి.కొత్తకోట పట్టణం, మండలానికి చెందిన మహిళలతో పరిచయాలు పెంచుకున్నారు. వారికి వివిధ పథకాలు మంజూరు చేస్తామంటూ నమ్మించారు. 13 నుంచి 15 మంది మహిళలను కలిపి ఒక సంఘంగా ఏర్పాటు చేసి 38 సంఘాలను ఏర్పరిచారు. వీరికి రూ.ఐదు లక్షల దాకా రుణాలు ఇప్పిస్తామని అందుకు రూ.3 వేల దాకా ఖర్చవుతుందని చెప్పి వసూలు చేశారు. తర్వాత కుట్టు మిషన్లు కూడా ఇప్పిస్తామని నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.1,200 వసూలు చేశారు. వారిని నమ్మి డబ్బు చెల్లించిన మహిళలకు రుణాలు అందక, కుట్టు మిషన్లు మంజూరు కాకపోవడంతో అనుమానం వచ్చింది. ఈ విషయమై వారిని నిలదీయగా సమాధానం లేదు. తాము చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరిన ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులు ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. దీనిపై స్టేషన్‌కు వచ్చిన మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించి న్యాయం చేయాలని కోరారు.పోలీసులను ఆశ్రయించిన బాధిత మహిళలు -
ఇల్లు కబ్జా చేశారని ఎస్పీకి ఫిర్యాదు
మదనపల్లె టౌన్ : మదనపల్లెలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్కు సోమల, గాలివీడు, కేవిపల్లె మండలాల నుంచి వచ్చిన బాధితులు తమ బాధను మీడియాకు తెలిపారు. ఇల్లు కబ్జా చేశారని కూతురు, అల్లునిపై అన్నమయ్య జిల్లా, కేవీపల్లె మండలం, నూతన కాలువకు చెందిన బాధితురాలు కాంతమ్మ జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లికి ఫిర్యాదు చేసింది. కూతురు, అల్లుడు శ్రీనివాసులు, నాగవేణితో ప్రాణహాణి ఉందని, ఇల్లు ఖాళీ చేయించి తనకు న్యాయం చేయాలని వేడుకొంది. అలాగే గాలివీడు మండలం, పందికుంట సుగాలి తాండాకు చెందిన శంకర్ నాయక్ కూలీ పనుల కోసం వేరే ఊరికి వెళ్లి కొన్ని రోజుల తర్వాత వచ్చేసరికి సోదరుడు హుక్కులే నాయక్ తాను ఉంటున్న ఇంటిని ఆక్రమించుకుని ఇప్పుడు తనను ఇంట్లోకి రానివ్వడం లేదని, ఇళ్లు విడించి న్యాయం చేయలనికోరాడు. సోమ మండలం, దొడ్డివారిపల్లెకు చెందిన మోహన, మునిలక్ష్మి 70 ఏళ్లుగా తమ అనుభవంలో ఉన్న ఇంటి స్థలంలో కొత్త ఇంటిని నిర్మిస్తుంటే అదే ఊరికి చెందిన రామకృష్ణ అడ్డుకుని బొలెరోతో గుద్దించి చంపేస్తానని బెదిరిస్తున్నట్లు బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలి కలకడ : నా ఇంటికి ప్రభుత్వం వదలిన దారిని చూపాలని 15నెలలుగా గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులకు విన్నవించినా న్యాయం జరగలేదని బాధితుడు లక్ష్మీపతి ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని ముడియంవారిపల్లె పంచాయతీ బీసీ కాలనీకి చెందిన రామలింగయ్య కుమారుడు లక్ష్మిపతి సోమవారం కలెక్టరేట్ వద్ద మాట్లాడుతూ 2018లో గ్రామంలోని బీసీలకు కేటాయించిన ఇంటి స్థలాలను అదే గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సర్వే నంబర్:93–2లో ఇంటిపట్టా మంజూరు చేశారని, నా ఇంటికి బీసీ కాలనీ నుంచి 30 లింకుల దారి ఉన్నా దారి వదలడం లేదన్నారు. తన ఇంటికి ఉన్న దారిని అక్రమార్కులు ఆక్రమించారని కలకడ రెవెన్యూశాఖ అధికారులకు విన్నవించినా న్యాయం జరగడంలేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. -
పోలీసుల రక్షణ కోరిన ప్రేమ జంట
మదనపల్లె టౌన్ : పెద్దల నుంచి ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించాలని ఓ ప్రేమ జంట సోమవారం జిల్లా ఎస్పీ ధీరజ్ ను మదనపల్లెలో కలిసి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ప్రేమ జంట మీడియాతో మాట్లాడుతూ.. పీలేరుకు చెందిన హేమకుమార్ రొంపిచర్లకు చెందిన నందిని గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిపారు. కులాలు వేరు కావడంతో తమ పెళ్లికి పెద్దలు అంగీకరించ లేదు. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయి ఈ నెల 9న సత్యసాయి జిల్లాలోని కదిరి లక్ష్మినరసింహస్వామి ఆలయంలో పెళ్లిచేసుకున్నామన్నారు. మేజర్లైన తమ ఇద్దరి పెళ్లి విషయం పెద్దలకు తెలిసిపోవడంతో వారి నుంచి ప్రాణహాని పొంచి ఉందని చేసేదిలేక జిల్లా ఎస్పీని ఆశ్రయించినట్లు తెలిపారు. -
కన్నీటి మడుగు
గాలివీడు : మండలం పరిధి గండిమడుగులో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మతి చెందాడు.పోలీసుల కథనం మేరకు.. పుట్టపర్తి నియోజకవర్గం ఓడీసీ మండలం టీ కుంట్లపల్లి గ్రామానికి చెందిన షేక్ నాసిర్ (25) వేసవి సెలవులు రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి గండిమడుగు వద్ద ఉన్న వెలుగల్లు పార్కును సందర్శించేందుకు వచ్చాడు. అనంతరం గండిమడుగులో ఈత కొట్టేందుకు దిగాడు. ప్రమాదవశాత్తు లోతైన నీటిలోకి వెళ్లి మునిగి పోయాడు. యువకుడు నీటిలో కనిపించక పోవడంతో అక్కడున్న వారు ఆందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే గాలివీడు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ నరసింహారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులు, ఫైర్ సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మతదేహాన్ని వెలికితీయించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.ఈతకు వెళ్లి యువకుడు మృతి -
గుండెపోటుకు గురై యువకుడు మృతి
చౌడేపల్లె : గుండెపోటుకు గురై యువకుడు వెంకటేష్(29)మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలాఉన్నాయి.. పరికిదొన పంచాయతీ ఎగువమల్లెలవారిపల్లెకు చెందిన శ్రీనివాసులు కుమారుడు వెంకటేష్ సహచర స్నేహితులతో కలిసి ఉదయంనుంచి 11 గంటల వరకు క్రికెట్ పోటీలో పాల్గొన్నారు.అనంతరం ఇంటికివచ్చిన వెంకటేష్ స్నానం చేసి విశ్రాంతి తీసుకొన్నాడు.అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు చౌడేపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యసిబ్బంది అప్పటికే వెంకటేష్ మృతిచెందినట్లు నిర్ధారించడంతో వెనుతిరిగారు.వెంకటేష్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకొన్నాయి. మృతుడి భార్య నాలుగునెలల గర్ణిణీ.భర్త మృతితో ఆమె, కన్న బిడ్డ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఆగి ఉన్న లారీని ఢీకొని.. రామాపురం : మండలంలోని బండపల్లి టోల్గేట్ సమీపంలో శనివారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని బైక్ ఢీకొనడంతో తీగల భార్గవాచారి(41) అక్కడిక్కడికే దుర్మరణం చెందినట్లు రామాపురం ఎస్సె శివకుమార్ తెలిపారు. పోలీసుల కథనం మేరకు రాయచోటి నుంచి కడప వెళుతున్న లారీకి పంచర్ కావడంతో బండపల్లి టోల్గేట్ సమీపంలో నిలిపి మరమతులు చేపడుతున్నారు. ఇదే సమయంలో రాత్రి 11 గంటలకు రాయచోటి నుంచి కడపకు వెళ్తున్న స్కూటీ ఆగి ఉన్న లారీ వెనుక భాగంలో బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న తీగల భార్గవాచారి(41)తలకు బలమైన గాయమై అక్కడిక్కడికే మృతి చెందాడు.మృతుడు రామాపురం మండలం సుద్దమల్ల గ్రామంలోని ఎర్రంరెడ్డిపల్లికి చెందిన వాడు కాగా, ప్రస్తుతం రాయచోటి పట్టణం కొత్తపేటలోని చౌడేశ్వరీ దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని..
వాల్మీకిపురం : గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో పోస్టల్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన ఆదివారం మండలంలోని చింతలవారిపల్లి సమీపంలోని నేషనల్ హైవేపై చోటు చేసుకొంది. వివరాలు.. సోమల మండలం, కందూరుకు చెందిన ప్రభాకర్ ఇదే పంచాయతీ కొమ్మిరెడ్డిగారిపల్లిలో పోస్ట్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం సొంత పనుల నిమిత్తం గుర్రంకొండ మండలం, రామాపురంలోని తన మేనమామ ఇంటికి ద్విచక్రవాహనంపై వచ్చి, తిరిగి ప్రయాణమయ్యాడు. మండలంలోని చింతలవారిపల్లి హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఢీకొన్న వాహనం లారీగా గుర్తించి, తిరుపతిలో సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కియా కంపెనీలో అట్లూరు మండలవాసి మృతి
అట్లూరు : విధి నిర్వహణలో భాగంగా అనంతపురం జిల్లా కియా కంపెనీలో అట్లూరు మండలం జొన్నవరం ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. అట్లూరు మండలం ముత్తుకూరు పంచాయతీ జొన్నవరం ఎస్సీ కాలనీకి చెందిన సొద్దల రామాంజనేయులు (24) కియా కంపెనీలో విధులు నిర్వహిస్తూ మూడు రోజుల క్రితం మృతి చెందాడు. మృతుని తల్లి, తమ్ముడు, చెల్లెలు ఇదివరకే మృతి చెందారు. తండ్రి లక్షుమయ్య ఉన్న ఒక్క కొడుకు రామాంజనేయులను కూలి పనులు చేసుకుంటూ బీటెక్ చదివించాడు. రామాంజనేయులు ఆరు నెలల కిందట కియా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు రామాంజనేయులు మిషనరీలో పడి మృతి చెందాడు. విషయాన్ని కియా కంపెనీ యాజమాన్యం బంధువులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం అనంతరం ఆదివారం జొన్నవరం ఎస్సీ కాలనీకి రామాజంనేయులు మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. -
ఆధునిక ప్రపంచ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి
కురబలకోట : జిడ్డు కృష్ణమూర్తి..ఈపేరు ఇప్పటి తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు..అదే పెద్దతరం వారు వింటే పులకరించిపోతారు. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచారు. కాలానికి పరిమితమైన వారు కాదు..తరతరాలకు గుర్తుండిపోయే మానవతావాది. గొప్ప దార్శనికుడిగా,రచయితగా అంతకు మించి విద్యావేత్తగా,ధార్మికుడిగా, తత్వవేత్తగా ఆయన ఫిలాసిపీ ఎందరినో కదిలించింది. జాతి, మత, దేశ,రాజకీయ ఆదర్శాలకు అతీతంగా విద్యార్థులకు విద్య నందించడమే నూతన ప్రపంచానికి మార్గమన్నారు. సత్యాన్వేషణతోనే జ్ఞానోదయం అని చాటి చెప్పిన ప్రపంచ తత్వవేత్తగా ఖ్యాతి గడించాడు. ఆయన జీవిత విశేశేషాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. మదనపల్లెలో పుట్టి మద్రాస్ అడయార్‌లో పెరిగి ఆపై ప్రపంచ మాస్టర్‌గా ఎదిగిన ఆయన 60 ఏళ్లకు పైగా ప్రపంచ దేశాలు పర్యటించారు. జీవన సందేశాన్ని వినిపించారు. విప్లవాత్మకమైన జీవన తాత్వికతను ప్రపంచానికి అందించాడు. ప్రదానంగా సత్యాన్ని తెలుసుకోడానికి దారులు లేవు. ఎవరికి వారు అన్వేషించి తెలుసుకోవాలన్నారు. ఎవరినో ఆదర్శంగా తీసుకోవడం కన్నా నిన్ను నీవు తెలుసుకోవడం వల్ల సత్యాన్ని తెలుసుకోగలరన్నారు. సాంప్రదాయ విద్య కన్నా స్వతంత్రాలోచన కల్గించే విద్య మనిషిని మేల్కొలుపుతుందన్నారు. సిద్దాంతాలకు కట్టుబడి ఉండరాదన్నారు. మనిషిని పరిపూర్ణుడిగా చేయడమే విద్య కర్తవ్యమని బోధించారు. విద్యార్థి నిరంతరం నేర్చుకునే వాడిగా ఉండాలి..టీచర్ విద్యార్థి లోని సృజనాత్మకతను తట్టి మేల్కొపేలా ఉండాలి. మనసు నిండా ప్రేమ ఉన్న వారు మంచి తప్ప చెడు చేయలేరని చెప్పారు. మనిషి సంపూర్డుడిగా ఎదగాలని పదేపదే చెప్పారు. పదవులను ఆయన తృణప్రాయంగా ఎంచారు. ఇప్పటితరం వారు చిన్న పదవులు లభిస్తే వదలమన్నా వదలరు. అనిబిసెంట్ అప్పట్లో ఆయన్ను ప్రపంచానికి జగద్దురువును చేయాలని ఆర్డర్ ఆఫ్‌ది స్టార్ అనే సంస్థకు అధినేతను చేశారు. అది నచ్చక 1926లో రద్దు చేయడంతో పాటు ఏకంగా దాని నుంచి వైదొలిగారు. వందల కోట్ల ఆస్తిని కూడా వదులుకున్నారు. ఈ ఆకస్మిక నిర్ణయంపై అప్పట్లో యావత్ ప్రపంచమే విస్తుపోయింది. ఇది అపూర్వ ఘట్టంగా చరిత్రలో నిలచిపోయింది.మానసిక విప్లవం, మనోభావ విచారణపై ఎన్నో ప్రసంగాలు చేశారు. ఎవరికి వారు మార్పు చెందాలన్నారు. మానసిక విప్లవం, మనోభావ విచారణపై ఎన్నో ప్రసంగాలు చేశాడు. మూడ నమ్మకాల నుంచి విముక్తి పొందాలనేవారు. జిడ్డు కృష్ణమూర్తికి చదువు సంధ్యల పట్ల పెద్దగా ఆసక్తిలేకపోయినా 15 ఏళ్లవయస్సులో అట్ ది ఫీట్ ఆఫ్‌ది మాస్టర్ అనే పుస్తకాన్ని ఆంగ్లంలో రాశారు. మదనపల్లె పట్టణంలో 1895 మే 11న తల్లితండ్రులు సంజీవమ్మ, నారాయణయ్యకు ఎనిమిదో సంతానంగా జన్మించి ఆయన 1986 ఫిబ్రవరి 17న శాశ్వత నిద్రలోకి వెళ్లారు. కృష్ణమూర్తి ఫౌండేషన్ పేరిట దేశ విదేశాల్లో విద్యాలయాలు నడుస్తున్నాయి. వీటన్నింటి కన్నా దేశంలోని మదనపల్లె దగ్గరున్న రిషివ్యాలీ స్కూల్ ప్రత్యేకతను సంతరించుకుంది. 1925లో సోదరుడు నిత్యానంద ఆకస్మిక మరణం ఆయనలో ఎనలేని మార్పునకు దారితీసింది. జిడ్డు కృష్ణమూర్తి బోధనలు సామాజిక అవసరాలను గుర్తించి మనిషిలో జ్ఞాన తృష్ణను రగిలిస్తాయి.ఆయన మన తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం.ఆధునిక తత్వవేత్తలలో ఆద్యుడిగా, ప్రపంచ జ్ఞానిగా పేరు గడించాడు. ప్రపంచానికి భారత దేశం అందించిన గొప్ప మహోన్నతుడిగా, విశ్వ మానవుడిగా జిడ్డు కృష్ణమూర్తి గురించి యావత్ ప్రపంచం కొనియాడుతోంది.నేడు జయంతి -
సుందరయ్య కుటుంబానికి న్యాయం చేయాలి
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా సోమల మండలం, ఆవులపల్లి పంచాయతీలో 75 ఏళ్ల వృద్ధ రైతు భూమిని ఆక్రమించేందుకు యత్నించి, కుటుంబ సభ్యులపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రత్యర్థులు దాడి చేయడంతో బాధితులు ఆదివారం మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చేరారు. వారిని పరామర్శించిన సీపీఐ నాయకులు కష్ణప్ప, సాంబశివ, శ్రావణ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. సోమల మండలం, ఆవులపల్లి పంచాయతీ, దేలకుప్పానికి చెందిన సుందరయ్యకు సర్వే నంబర్ 32/12లో 1.9 సెంట్ల పట్టా భూమి ఉందన్నారు. ఆదివారం ఉప్పరపల్లి పంచాయతీ నాగిళ్లవారిపల్లికి చెందిన యదుశేఖర్ నాయుడు, కోటినాయుడు తమ అనుచరులతో వచ్చి సుందరయ్య భూమిని జేసీబీతో ఆక్రమించేందుకు యత్నించారు. అడ్డు వెళ్లిన సుందరయ్య, ఆయన కుమారుడు, కోడలిని కొట్టి సెల్ ఫోన్లు లాక్కొని దుర్భాషలాడుతూ ‘‘అడ్డొస్తే జేసీబీతో తొక్కిస్తాం’’ అంటూ బెదిరించారన్నారు. భూమిలో ఉన్న మామిడి చెట్లు, ఫారం పాండ్ ట్యాంక్, రాతి కూసాలు, కంచె ధ్వంసం చేశారని ఆరోపించారు. దీంతో సుమారు రూ.10 లక్షల విలువైన ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. గాయపడతాము చేసేదిలేక మదనపల్లి ప్రభుత్వాసుపత్రుల చేరి చికిత్స పొందుతున్నామని వాపోయారు. -
బంగారు, వెండి నగల చోరీ
పెద్దతిప్పసముద్రం : మండలంలోని రాపూరివాండ్లపల్లి పంచాయతీ ఉప్పరవాండ్లపల్లిలో మావిళ్ల చెన్నకృష్ణ అనే వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. చెన్నకృష్ణ సోదరుడు లక్ష్మినారాయణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా.. చెన్నకృష్ణ బెంగళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ 15 రోజులకోసారి కుటుంబ సభ్యులతో కలసి స్వగ్రామానికి వచ్చి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 7న ఆయన ఎప్పటి లాగానే భార్యా, పిల్లలను వెంట బెట్టుకుని ఉద్యోగరీత్యా తిరిగి బెంగళూరుకు వెళ్లిపోయాడు. ఈ తరుణంలో ఈ నెల 8న గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న రూ.2.50 లక్షల నగదు, సుమారు 200ల గ్రాముల బంగారంతో పాటు వెండి నగలు అపహరించుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. విషయం తెలుసుకున్న ములకలచెరువు సీఐ దస్తగిరి, ఎస్ఐ పరమేశ్ నాయక్‌లు సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చోరీకి పాల్పడింది స్థానికులా, బయట వ్యక్తులా, అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.రైలు కింద పడి వ్యక్తి మృతిపీలేరు రూరల్ : రైలు కింద పడి గుర్తతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన స్థానిక చిత్తూరు రోడ్డు మార్గంలోని రాజీవ్‌నగర్ కాలనీ సమీపంలో జరిగింది. వివరాలిలావున్నాయి. ఆదివారం మధ్యాహ్నం ముంబై నుంచి నాగర్‌కోయిల్ వెళుతున్న రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు గుర్తించి రైల్వేపోలీసుల కు సమాచారం ఇచ్చారు. మృతుని వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. యువకుడు ఆత్మహత్యాయత్నంమదనపల్లె టౌన్ : ఒంటికి నిప్పు అంటించుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన ఆదివారం బి.కొత్తకోట మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడి కుటుంబీకుల కథనం మేరకు వివరాలు.. బి. కొత్తకోటకు చెందిన వై. వెంకటరమణారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి (30) కొంతకాలం క్రితం ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్లిపోయాడు. రెండేళ్ల తర్వాత ఇంటికి రావడంతో కుటుంబీకులు మహేందర్‌రెడ్డి తీరు మార్చుకొని బుద్ధిగా ఇంటివద్దే ఉండాలని మందలించారు. దీంతో అతను తీవ్ర మనస్థాపం చెంది, ఇంట్లో ఉన్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. కుటుంబీకులు గమనించి బాధితుడుని చికిత్స కోసం మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. దీంతో మహేందర్ రెడ్డిని ఓ ప్రైవేట్ వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. 13న రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలుకాశినాయన : మండలంలోని ఆనంవారిపల్లె గ్రామంలో సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈనెల 13న రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మొదటి బహుమతి హోండా యూనికాన్ బైక్, రెండో బహుమతి హోండా షైన్, మూడో బహుమతిగా రూ.80వేలు గెలుపొందిన ఎడ్ల యజమానులకు అందిస్తామని వారు వివరించారు. పోటీల్లో పాల్గొనదలచిన రై తులు 13న మధ్యాహ్నం తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 9441337657 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
భక్తిలో మునిగారు
ఆలయం లేదు..మూలవిరాట్టులు లేరు..ఆలయం సోమశిల వెనుక జలాల్లో మునిగింది..అయినా గ్రామస్తులు ఏటా ఉత్సవ విగ్రహాలతో కల్యాణం చేయించి.. భక్తిపారవశ్యంతో పరమానందం పొందుతున్నారు.. అదెక్కడో కాదు..సోమశిల బ్యాక్‌వాటర్ పరీవాహక గ్రామం యల్లంపేట. దీనిపై ప్రత్యేక కథనం.. రాజంపేట: అది సోమిశిల వెనుకజలాలల్లో మునిగి పోయిన గ్రామం..యల్లంపేట .. చుట్టూ పచ్చటి పొలాలు..ఆహ్లాదకరమైన వాతవరణం. ఏరు ఉంటుంది. ఈ గ్రామంలో అప్పట్లో 300 కుటుంబాలకుపైగా నివాసం ఉండేవారు. యల్లంపేట, ఓబులంపేట రెండు గ్రామాలు ఉండేవి.ఈ గ్రామానికి చెందిన ఆలయం మునకలోకి వెళ్లిపోయింది. గ్రామస్తులకు పునరావాసం లేదు..ఆలయం నిర్మించలేకపోయారు. గ్రామంలో రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న మాజీమంత్రి బండారు రత్నసభాపతి(ఓబులంపేట), ఎమ్మెల్యే లేని రోజుల్లో జిల్లా డిస్ట్రిక్బోర్డు మాజీ సభ్యుడు తాండ్ర పేరమనాయుడు (యల్లంపేట) పెద్ద కుటుంబాలు ఉండేవి. ● సోమశిల బ్యాక్‌వాటర్‌లో ఇప్పటికీ రుక్మిణ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. బ్యాక్‌వాటర్‌లో మునిగిపోయి, గోపురం కనిపిస్తుంది. ఈ గోపురం కనిపించగానే అధ్యాత్మికభావన మనుసులో పుట్టుకొస్తుంది. ప్రతి ఇంటిలో ఒకరికి స్వామిపేరు.. శ్రీ రుక్మిణి, సత్యభామ శ్రీ వేణుగోపాలస్వామిపై అపారమైన భక్తి భావం, ప్రగాఢ విశ్వాసం పెంచుకున్నారు. ఈ క్రమంలోని యల్లంపేటలో ప్రతి ఇంటిలో ఒకరికి స్వామి పేరుపెట్టుకోవడం గమనార్హం. ఏటా కల్యాణోత్సవం నిర్వహిస్తారు. గ్రామస్తులు ఒక్కటిగా స్వామి వారి ఎదుట కలుసుకొని పరస్పరం సంతోషాలతో గడుపుతారు. భక్తులకు అన్నప్రసాదాలను అందచేస్తారు. సోమశిల బ్యాక్‌వాటర్ మునిగిన యల్లంపేట రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం, యేటా గ్రామస్తులు నిర్వహించే కల్యాణంలో ఉత్సవమూర్తులు వేణుగోపాలస్వామిపై తరగని భక్తి గ్రామం మునిగిపోయి నాలుగుదశాబ్దాలు దాటుతున్నా యల్లంపేట వేణుగోపాలస్వామిపై భక్తిభావం తరగలేదు. ఆలయం మునిగిపోయింది, గ్రామం ఖాళీ అయింది. యల్లంపేటకు పునరావాసం లేదు. ప్రభుత్వాలు ఆలయం నిర్మాణంతోపాటు పునరావసం కల్పిస్తే, మళ్లీ గ్రామస్తులు ఒక్కచోట కలిసి ఉండేందుకు మార్గం సుగమమవుతుంది. –తాండ్ర రమేష్‌నాయుడు, యల్లంపేట, నందలూరు ● సోమశిల బ్యాక్‌వాటర్‌లో యల్లంపేట గ్రామంతోపాటు ఆలయం మునకకు గురైంది. ● గ్రామానికి 1986 ప్రాంతంలో నష్టపరిహారం చెల్లింపు ప్రక్రియను చేపట్టారు. 1990 నుంచి గ్రామాన్ని దశలవారీగా ముంపువాసులు వదలివెళ్లారు. తమకు అనుకూలమైన ప్రాంతాలకు, రాష్ట్రంలో నలుమూలలకు వెళ్లి స్థిరపడ్డారు. ● గ్రామం ఖాళీ అవుతున్న క్రమంలో, మరోవైపు నీళ్లు గ్రామానికి చేరువలో రావడంతో మానవసమాజం ఆలయానికి దూరమైంది. ఈ నేపథ్యంలో గుప్తనిధుల ముఠా ఆలయాన్ని తమ స్వార్థం కోసం ధ్వంసం చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని ఊరేగించే వాహనాలు, పంచలోహ విగ్రహాలు మాత్రం మిగిలాయి. ● దొరల కాలంలో యల్లంపేట శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం నిర్మితం చేశారు. ఆలయంలో రాతి విగ్రహామూర్తులు ఉండేవి. అయితే ఇక్కడ ఎక్కడాలేని విధంగా చెక్క విగ్రహాలే మూలవిరాట్టులు చేసి, పూజలు నిర్వహించేవారు. పంచలోహవిగ్రహాలే ఉత్సవ మూర్తులుగా నిర్వహించేవారు. ఏటా పెద్దఎత్తున యల్లంపేట తిరునాల జరిగేది. 8రోజుల పాటు తిరునాల నిర్వహించేవారు. ● ఆలయానికి సోమశిల నష్టపరిహారం చెల్లించారు. రెవెన్యూ డిపాజిట్ చేశారు. అప్పట్లో రూ.80లక్షలు ఉన్నట్లు సమాచారం. ● గ్రామాన్ని వదలివెళ్లినప్పటికి గ్రామస్తులు ఏటా శ్రీ రుక్మిణ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కల్యాణం రోజున అందరూ ఏకమవుతారు. గ్రామంలేకున్నా స్వామిని మాత్రం భక్తులు మరవేలదనడానికి ఇదే నిదర్శనం. మొన్నటి వరకు ఒంటిమిట్ట రామాలయంలో..ఇప్పుడు సౌమ్యనాథాలయం(నందలూరు)లో పంచలోహ విగ్రహాలు భద్రపరిచారు. ఈ విగ్రహాలతో స్వామివారి కల్యాణం నిర్వహించుకునేవారు. వాహన సేవలకు సంబంధించిన వాహనాలు కూడా ఉన్నాయి. ● రాజంపేట మండలంలో యల్లంపేట వేణుగోపాలస్వామి ఆలయం నిర్మాణానికి కేటాయించిన స్థలం వివాదంలో ఉందని భక్తులు చెబుతున్నారు. బ్యాక్‌వాటర్‌లో వేణుగోపాలస్వామి ఆలయం మునక అయినా యల్లంపేట గ్రామస్తుల్లో తరగని భక్తిభావం ఏటా ‘వేణు గోపాలస్వామి కల్యాణం -
భక్తుల వాహనాన్ని ఢీకొన్న లారీ
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఆదివారం వేకువజామున ముంబై టు చైన్నె జాతీయ రహదారిలో ఉన్న రాయల్ వుడ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండో పట్టణ సీఐ మహ్మద్ రఫి, తెలిపిన వివరాలు.. అనంతపురం జిల్లా, పుట్లూరు మండలం, కడవకల్లు గ్రామానికి చెందిన 60మంది భక్తులు బోయకొండకు ఐషర్, బొలెరో వాహనాల్లో వెళ్లే క్రమంలో మదనపల్లె బైపాస్ లో ఉన్న రాయల్ ఉడ్ దగ్గరకు ఐషర్ లారీ రాగానే వెనకనే వచ్చిన మరో లారీ ఐషర్ను ఢీకొంది. ఈ ఘటనలో 16 మందికి గాయాలు అయ్యాయి, మిగిలిన వారికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు వెంటనే చికిత్స అందించడంతో వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గాయపడిన వారు రోడ్డు ప్రమాదంలో రాజేశ్వరి (25), లక్ష్మీనారాయణ (42)లకు తీవ్ర గాయాలు కావడంతో డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. స్వల్పంగా గాయపడిన వారిలో సహస్ర (13), అశ్వని (28), లక్ష్మీదేవి (52), రమాశ్రీ (38), అరుణ (36), పుల్లమ్మ (35), గంగాధర్ (16), వెంకటరాయుడు (55), కుల్లాయమ్మ (42), శివశంకర్ (32), లక్ష్మి (31), రాజా (15), లక్ష్మీదేవి (32), భవ్యశ్రీ (13) మదనపల్లె ఆసుపత్రిలోనే చికిత్సలు పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ వాహనం వదిలేసి పరారయ్యాడు. టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి వద్దకు వచ్చి క్షతగాత్రులను విచారించారు. కేసు నమోదు అనంతరం సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ మహమ్మద్ రఫి, ఎస్ఐ నాగేశ్వర్ రావు తెలిపారు.16మందికి గాయాలు -
‘సీమ’ఎత్తిపోతలకు నీళ్లొదిలారు!
కడప సెవెన్‌రోడ్స్: సీమ ఎత్తిపోతల పథకంపై కూటమి సర్కార్ కుట్రలు పన్నుతోందన్న అనుమానం నిజమైంది. ఇరిగేషన్ క్యాలెండర్ సాక్షిగా సీమ ఎత్తిపోతల పథకానికి బాబు సర్కారు నీళ్లొదిలింది. రాయలసీమ వాసులకు మరోసారి మోసం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్ల సమావేశ సందర్భంగా ప్రభుత్వ ఇరిగేషన్ క్యాలెండర్‌ను ప్రకటించారు. రాష్ట్రంలోని 25 సాగునీటి ప్రాజెక్టులను ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తారో, ఎప్పుడు శంకుస్థాపనలు చేస్తారో గడువును నిర్ణయిస్తూ రూపొందించిన క్యాలెండర్‌ను ఆయన విడుదల చేశారు. ఇందులో రాయలసీమకు ప్రాణప్రదమైన ఎత్తిపోతల పథకం ఊసే లేదు. రాయలసీమకు తాగు, సాగునీరు అందించే గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్, వెలిగొండలతోపాటు చైన్నెకి తాగునీరు అందించడంలో అత్యంత కీలకమైన రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రస్తావన లేకపోవడంపై జిల్లాకు చెందిన పలువురు రైతు నాయకులు, వామపక్షాల నేతలు తప్పుబడుతున్నారు. ‘సీమ’ ప్రాజెక్టుల జీవనాడిగా ఉన్న ఎత్తిపోతల పథకాన్ని ఇరిగేషన్ క్యాలెండర్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నా అధికార టీడీపీ నేతలు పెదవి విప్పకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎత్తిపోతలు ఎందుకంటే.... శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు 7 వేల క్యూసెక్కులు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు డ్రా చేసుకునేందుకు వీలుంటుంది. శ్రీశైలంలో 880 అడుగుల నీటిమట్టం ఉంటే తప్ప సీమ ప్రాజెక్టులకు అవసరమైన సాగునీరు అందే వీలుండదు. ఇక 841 బెడ్లెవెల్లో ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఒక్కటే సీమ సాగునీటి అవసరాలు తీర్చలేదు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఇక చెప్పాల్సిన పనే ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం ఫోర్ షోర్లో 800 అడుగుల నుంచే రోజుకు మూడు టీఎంసీల నీటిని డ్రా చేసుకునేందుకు వీలుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టారు. సంగమేశ్వరం వద్ద నుంచి నీటిని తీసుకొచ్చి లిఫ్ట్ ద్వారా పోతిరెడ్డిపాడుకు దిగువన నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎస్ఆర్ఎంసీలో కలుపుతారు. ఈ పథకానికి సంబంధించి 2020 మే 5వ తేది ప్రభుత్వం జీఓఆర్టీ నెంబరు 203 విడుదల చేసింది. ఈ పథకాన్ని రూ. 3825 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చారు. శ్రీశైలం ఫోర్ షోర్ నుంచి నీటిని తీసుకొచ్చే ఇన్లెట్ కెనాల్ నిర్మించారు. అలాగే పంపుహౌస్, ఇతర నిర్మాణాలు దాదాపు 80 శాతం జగన్మోహన్రెడ్డి హయాంలో పూర్తయ్యాయి. ఈలోపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాయలసీమకు జీవనాడి అయిన ఈ పథకాన్ని పూర్తిగా నిలిపివేశారు. ‘సీమ’ ద్రోహి చంద్రబాబు అననుకూల పరిస్థితుల్లో కూడా రాయలసీమ దాహార్తి తీర్చడంలో ఎత్తిపోతల పథ కం జీవనాడిగా ఉంటుంది. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి. కూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంతంపై ఆయనకున్న వివక్ష వల్ల ఎత్తిపోతల పథకానికి మరణశాసనం వినిపించారు. దీంతో సీమ ద్రోహిగా నిరూపించుకున్నారు. ప్రభుత్వ ఇరిగేషన్ క్యాలెండర్లో సీమ ఎత్తిపోతల పథకానికి చోటు కల్పించకపోవడం ఈ ప్రాంతాన్ని శాశ్వత ఎడారిగా మార్చడమే. – గాలి చంద్ర, సీపీఐ జిల్లా కార్యదర్శి ‘సీమ’ ప్రాజెక్టులకు ప్రాణప్రదం రాయలసీమ ప్రాజెక్టులకు సాగునీరు అందించడంలో ఎత్తిపోతల పథకం ప్రాణప్రదమైనది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు ఒక్కటే రాయలసీమ అవసరాలు తీర్చలేదు. శ్రీశైలం ఫోర్‌షోర్‌లో 800 అడుగుల నుంచి నీటిని తీసుకొచ్చే ఈ పథకం ద్వారానే సీమ ప్రాజెక్టులకు నీళ్లందుతాయి. అలాంటి ప్రాజెక్టులు విస్మరించడం తగదు. ఈ విషయంలో అధికార టీడీపీ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. లేదంటే చరిత్ర క్షమించదు. – సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, అధ్యక్షులు, రాయలసీమ కార్మిక కర్షక సమితి, కడప -
ఆర్భాటం నమ్మొద్దు.. నాణ్యత మరవొద్దు
● ప్రవేశాల కోసం ప్రైవేటు విద్యా సంస్థల ప్రచారం ● అన్ని అంశాలు తెలుసుకుని విద్యార్థులను చేర్పిస్తేనే మేలుమదనపల్లె సిటీ : జిల్లాలో విద్యా సంవత్సరం ముగిసింది. మరో విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడయ్యాయి. విద్యార్థులను చేర్చుకునేందుకు జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల వారు ప్రచారం ముమ్మరం చేశారు. విద్యార్థులను ఆకర్షించేందుకు కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు పిల్లలు,వారి తల్లిదండ్రులను ప్రలోభపెట్టేలా ప్రచారం నిర్వహించే అవకాశముంది. ఈ నేపథ్యంలో వారి మాయమాటలు, ప్రచార ఆర్భాటాన్ని నమ్మకూడదని, విద్యార్థులకు నాణ్యమైన బోధన, మెరుగైన వసతులు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రైవేట్ విద్యా సంస్థల్లో చేర్పించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. అనుమతులు పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించే ముందు ఆయా విద్యా సంస్థలకు విద్యాశాఖ, ఇంటర్ బోర్డు నుంచి అన్ని రకాల అనుమతులు ఉన్నాయా? లేవా? అని తెలుసుకోవాలి. అగ్నిమాపకశాఖ అనుమతులు, పిల్లల రక్షణకు తీసుకుంటున్న భద్రతా ప్రమాణాలను పరిశీలించడం తప్పనిసరి. ఈ విషయాలు తెలుసుకునేందుకు విద్యాశాఖ, ఇంటర్ బోర్డు అధికారులను సంప్రదించాలి. ఫలితాల సరళి కొన్ని పాఠశాలలు, కళాశాలల్లో మెరుగైన ఫలితాలు రాకున్నా.. యాజమాన్యాలు ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాఽధించినట్లు తప్పుడు ప్రచారం చేస్తూ పిల్లల తల్లిదండ్రులను గందరగోళానికి గురి చేస్తాయి. ఆ విద్యా సంస్థల గత ఫలితాల సరళిని పరిశీలించాలి. ఆ పాఠశాలలు, కళాశాలలో విద్యతో పాటు ఏయే అంశాల్లో విద్యార్థులు రాణించేలా దృష్టి పెడుతున్నాయో పరిశీలించాలి. బోధన అర్హత ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో బోధించే ఉపాధ్యాయులు, అధ్యాపకుల అర్హత గురించి తెలుసుకోవాలి. ప్రధానంగా పాఠశాలల్లో బీఈడీ, డీఈడీ చదినవారు బోధిస్తున్నారా, అనర్హులతో బోధిస్తున్నారా? అన్న వివరాలను ఆరా తీయాలి. పలు పాఠశాలలు తక్కువ వేతనాలు ఇవాల్నన్న ఉద్దేశంతో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేయని వారితో బోధిస్తుంటాయి. అర్హులైన ఉపాధ్యాయులతో బోధించే పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలి. ఇరుకు గదులపై ఆరా జిల్లాలోని చాలా ప్రైవేట్ విద్యా సంస్థల్లో శిథిలావస్థకు చేరిన భవనాలు, ఇరుకిరుకు గదుల్లో బోధిస్తున్నారు. గాలి,వెలుతురు రాని గదుల్లో బోధిస్తుంటే విద్యార్థులు అసౌకర్యానికి గురవుతుంటారు. బోధకుల చెప్పే అంశాలు విద్యార్థుల చెవికెక్కవు. విశాలమైన గాలి, వెలుతురు ఉన్న గదుల్లో బోదించే బడుల్లో చేర్పించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మైదానం ఉందా? విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు కూడా ఎంతో ముఖ్యం. నిర్ణీత వేళల్లో పిల్లలను తప్పకుండా క్రీడలు ఆడించాలి. జిల్లాలో చాలా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో అసలు మైదానాలే లేవు. వ్యాయామ ఉపాధ్యాయులను నియమించరు. మైదానాలు, వ్యాయామ ఉపాధ్యాయులు ఉండి,ఆటలు ఆడించే విద్యా సంస్థలను ఎంచుకోవాలి. సంగీతం, పాటలు, భరతనాట్యం, కూచిపూడి నృత్యం తదితరాలు నేర్పిస్తూ పిల్లలకు సాంస్కృతిక అంశాలపై ఆసక్తి పెంపొందించే విద్యా సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలి.సౌకర్యాలు ఉన్న పాఠశాల్లో చేర్పించాలి ప్రభుత్వ అనుమతి పొంది, అన్ని సౌకర్యాలు ఉన్న పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి. ఒకసారి పాఠశాల,కళాశాలను పరిశీలించాలి. ఎవరో చెప్పిన మాటలు విని మోసపోకూడదు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాల, కాలేజీలను ఎంపిక చేసుకోవాలి. –జీవీ ప్రసాద్, విద్యావేత్త, మదనపల్లె -
ప్రాణం తీసిన ఈత సరదా
బద్వేలు అర్బన్ : ఈత నేర్చుకునేందుకు స్విమ్మింగ్‌పూల్‌కు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ బాలుడు మృతిచెందిన ఘటన ఆదివారం బద్వేలు పట్టణంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే పోరుమామిళ్ల మండలం దమ్మనపల్లె గ్రామానికి చెందిన దాసరినారాయణ, రమాదేవి దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. వ్యాపార నిమిత్తం గత కొన్నేళ్లుగా వీరు పట్టణంలోని మార్తోమానగర్లో నివసిస్తున్నారు. వీరి కుమారుడైన దాసరిఅర్జున్ (10) పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేశాడు. ఈత నేర్చుకునేందుకు ఆదివారం మధ్యాహ్నం పోరుమామిళ్ల బైపాస్‌రోడ్డులోని స్విమ్మింగ్‌పూల్‌కు అర్జున్ తన సోదరితో పాటు మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. నడుముకు ట్యూబ్ వేసుకుని నీటిలోకి దిగిన అర్జున్ కొద్దిసేపటికి ట్యూబ్ తీసేశాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వారించి మళ్లీ ట్యూబ్ వేసుకుని స్విమ్మింగ్‌పూల్‌లోకి దిగమని సూచించారు. అయితే కొద్దిసేపటికి మళ్లీ ట్యూబ్ తీసేసిన అర్జున్ లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి దిగడంతో నీటిలో మునిగిపోయాడు. కొద్దిసేపటికి గుర్తించిన కుటుంబ సభ్యులు అర్జున్ను స్విమ్మింగ్‌పూల్ నుంచి బయటికి తీసుకువచ్చి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సరదాగా ఈతకు వెళ్ళి ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని తల్లిదండ్రులు దమ్మనపల్లె గ్రామానికి తీసుకెళ్లారు. ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.స్విమ్మింగ్‌పూల్‌లో పడి బాలుడు మృతి -
వైఎస్సార్సీపీ సోషియల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసు
లక్కిరెడ్డిపల్లి : అన్నమయ్య జిల్లా అప్పకొండయ్యగారిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ సోషియల్ మీడియా కార్యకర్త లక్ష్మీరెడ్డిపై గిద్దలూరు పోలీసు స్టేషన్లో అక్రమంగా కేసు బనాయించి విచారణ నిమిత్తం విశాఖపట్నం నుంచి గిద్దలూరుకు తీసుకొచ్చి రాత్రంతా పోలీసు స్టేషన్లో పెట్టినట్లు తెలిపారు. మూడేళ్ల క్రితం జనసేన పార్టీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో లక్కిరెడ్డిపల్లి మండలంలోని అప్పకొండయ్యగారిపల్లికు వచ్చిన గిద్దలూరు పోలీసులు విచారణ నిమిత్తం లక్ష్మీరెడ్డి సోదరుడుని విచారించి విశాఖపట్నంలో ఉద్యోగం చేసుకుంటున్న లక్ష్మీరెడ్డిని శనివారం అరెస్టు చేసి తీసుకెళ్లినట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం గిద్దలూరు నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు కాకునూరి హిమశేఖర్ రెడ్డి ఆదివారం బాధిత వ్యక్తులకు బెయిల్ ఇప్పించారు. బెయిల్ పొందడానికి సహకరించిన కాకునూరి విక్రమాధిత్య రెడ్డి, గిద్దలూరు మండల యువజన విభాగ అధ్యక్షులు యర్రం వెంకటరామిరెడ్డి, సునీల్ కుమార్ రెడ్డి తదితరులకు లక్ష్మీరెడ్డి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. -
పాముకాటుతో మహిళ మృతి
వాల్మీకిపురం : పాము కాటుతో ఓ మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని ఫత్తేపురంలో ఆదివారం చోటు చేసుకొంది. వివరాలు.. వాల్మీకిపురం పంచాయతీ ఫత్తేపురానికి చెందిన అంజి భార్య యమున (38) ఆదివారం ఉదయం ఇంటి ముందు చెత్త ఊడుస్తుండగా పాము కాటేసింది. గమనించిన కుటుంబ సభ్యులు 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.అక్కడ నుంచి మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు తిరుపతి రుయాకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. యమున భర్త అంజి గతంలో మృతి చెందగా.. ఇద్దరి పిల్లల ఆలనాపాలనా చూసుకుంటుండగా యమున మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పాము కాటేసి వ్యక్తికి అస్వస్థతమదనపల్లె టౌన్ : పొలంలో దోస కాయలు కోస్తుండగా విష సర్పం కాటేసి కూలి పనులకు వచ్చిన సత్యసాయి జిల్లా వాసి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆదివారం జిల్లాలో చోటుచేసుకున్న ఘటనపై వివరాలు.. సత్యసాయి జిల్లా, తనకల్లు మండలం, కొక్కంటి క్రాస్ లో నివాసం ఉంటున్న గోపాల్ కుమారుడు రవి (48) ఈ ప్రాంతానికి చెందిన ఓ రైతు సాగుచేసిన దోసకాయ పంటను వడపడానికి ఓ టెంపోలో కూలీలను తీసుకొని చిత్తూరు జిల్లా, చౌడేపల్లి సమీపంలోని బోయకొండకు ఆదివారం ఉదయం వచ్చాడు. కూలీలతో దోస కాయలు కోయిస్తుండగా చెట్ల మధ్యన ఉన్న విష సర్పం రవి కాలిపై కాటేసింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుడిని సహచరులు వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించారు. దీంతో రవి ప్రాణాపాయం తప్పి కోలు కుంటూ ఉన్నాడు. -
ముగిసిన ఉరుసు
పుంగనూరు: పట్టణంలోని చెరువు కట్టపై గల సయ్యద్ నూర్షావలి బాబా దర్గా వారి ఉరుసు మహోత్సవం వైభవంగా జరిగింది. చివరిరోజు ఆదివారం రాత్రి ముస్లిం పెద్దలు, హజరత్‌లు దర్గాలోని మజార్‌పై చాదర్, పూలు సమర్పించి ప్రార్థనలు నిర్వహించారు. దర్గాను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు.నాగపూర్‌కు చెందిన ఇంతియాజ్‌సాబిరి, ముంబైకి చెందిన అంజాబ్‌సాబిరి , పూనేకు చెందిన తౌసిఫ్‌జునైది , కర్నాటకాకు చెందిన తౌసిఫ్‌ఖాదరి మధ్య ఖవ్వాలి ఆద్యంతం భక్తులను ఆలరించింది. ఉరుసు సందర్భంగా దర్గా వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ మదనపల్లె డీఎస్పీ పావని ఆధ్వర్యంలో సీఐ సుబ్బరాయుడు, ఎస్ఐలు అన్సర్‌బాషా, రమణ, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. -
అధికార పార్టీ నేతలకు కార్పొరేషన్ అధికారులు బందీగా మారారు. నిబంధనలకు పాతరేస్తూ.. పాలకుల అడుగులకు మడుగులొత్తుతూ పాలన గాలికొదిలేశారు.. కూటమినేతలు చెప్పిందానికల్లా తలాడిస్తూ.. చట్టాన్ని వారి చుట్టంగా మార్చేశారు.. ఫలితంగా వ్యవస్థ గాడితప్పింది.. సమాజంలో శాంతిభ
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లా అధికార యంత్రాంగం మొద్దునిద్ర పోతోంది. ఏదైనా సంఘటన జరిగేదాకా కళ్లు తెరవనంటోంది. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన కడపలో కార్పొరేషన్ అధికారుల అడ్డగోలు నిర్ణయాలతో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి పనిచేయాల్సిన వ్యవస్థలు గాడి తప్పుతున్నాయి. అధి కార పక్షం అభిమానం దక్కితే చాలన్నట్లుగా కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టాల్సిన జిల్లా సర్వోన్నతాధికారి చూస్తుండిపోతున్నారు. ఫలితంగా జిల్లా కేంద్రమైన కడపలో ఘర్షణలకు ఆస్కారం ఏర్పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఇలాగే వ్యవహరిస్తే సమాజానికి భారీ కీడు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ● కూటమి ప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుంచి కడప మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ఇష్టారాజ్యంగా పనిచేస్తోంది. నిబంధనలతో నిమిత్తం లేకుండా అధికారపార్టీని మెప్పిస్తే చాలన్నట్లు వ్యవహరిస్తోంది. అధికారపక్షం ఏం చేసినా వత్తాసుగా నిలవడం మినహా, నిబంధనలకు వ్యతిరేకమని చెప్పే సాహసం కూడా చేయలేని దుస్థితి నెలకొంది. చలానా స్వీకరణలో నిర్లక్ష్యం... కార్పొరేషన్ పరిధిలో ప్లెక్సీలను చలానా చెల్లించి ఏర్పా టు చేసుకోవాలి. ఎవరికి నచ్చినట్లు వారు ఇష్టానుసారం ప్లెక్సీలు ఏర్పాటు చేసుకోకూడదని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. 3రోజులకు 10/15 ప్లెక్సీకు రూ.15వందలు చలానా చెల్లించాలి. ఇతరులను రెచ్చగొట్టే ధోరణిలో కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో కంటెంట్ ఉందా లేదా పరిశీలించి అనుమతించాల్సిన బాధ్యత కూడా కేఎంసీదే. ఇవేవీ గత కొంతకాలంగా కేఎంసీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలాంటి ధోరణిలోనే తగిన చలానాలు స్వీకరించకుండా.. కంటెంట్‌ను పట్టించుకోకుండా అల్మాస్‌పేట సర్కిల్లో ఇబ్బడిముబ్బడిగా ఫ్లెక్సీలకు అవకాశమిచ్చారు. వెరసి రెండు వర్గాలు విడిపోయి ఘర్షణలు దిశగా అడుగులు పడ్డాయని పరిశీలకులు వివరిస్తున్నారు. ఇన్చార్జి కమిషనర్‌పై చర్యలు... అల్మాస్‌పేటలో శనివారం చోటుచేసుకున్న ఉద్రికత్తలు, ఘర్షణలకు ప్రధాన కారణం ప్లెక్సీలు అనుమతేనని ఓ నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం కడప ఇన్చార్జ్ కమిషనర్ రాకేష్చంద్రను బదిలీ చేసింది. ఆస్థానంలో రాజంపేట సబ్‌కలెక్టర్ హెచ్ఎస్ భావనాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మున్సిపల్ కార్పొరేషన్ గాడి తప్పుతున్నప్పుడే కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ దృష్టి సారించింటే ఇలాంటి విపత్కర పరిస్థితి చోటుచేసుకునేది కాదని పలువురు వాపోతున్నారు. జిల్లాలో అధికారులు ప్రజాస్వామ్యానికి విఘాతం కల్గిస్తూ, ఏకపక్ష చర్యలకు మొగ్గుచూపుతున్నప్పుడు కలెక్టర్ కర్రపెత్తనం చలాయించాల్సి ఉంది. అలా కాకుండా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనమేంటని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిబంధనలు అమలు చేయడంలోఅధికారయంత్రాంగం విఫలం అధికార పక్షానికి చుట్టంగామున్సిపల్ కార్పొరేషన్ అడ్డగోలు వ్యవహారమేఇరువర్గాల ఘర్షణలకు కారణం కడప కార్పొరేషన్ యంత్రాంగం నిబంధనలు పూర్తిగా గాలికొదిలేశారు. ముందే చేసిన పనులు టెండర్లు పిలిచి కాంట్రాక్టు పనులు అప్పగిస్తున్నారు. లెస్‌కు కోట్ చేసినా పనులు ఇవ్వకపోవడం.. అధికార పార్టీ నేతలు చెప్పిన వారికే టెండర్లు దక్కేలా ప్రణాళిక రచించడం వంటివి చేస్తున్నారు. దీనికి 4వ డివిజన్లో చంద్రవర్దిని నగర్ ఆర్చి నుంచి చివర వరకూ రోడ్డు నిర్మాణానికి(టెండర్ ఐడీ 903811) పిలిచిన టెండరే ఉదాహరణ. ఇలా కేఎంసీలో అన్నీ విభాగాల అధికారులు అధికార పక్షం మెప్పుకోసమే తాపత్రయం చూపుతున్నారని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ఇక వైరిపక్షం ఇళ్ల వద్ద, వ్యాపార సంస్థల వద్ద పుట్‌పాత్‌లు తొలగించడం కూడా కేఎంసీ చేస్తూ వచ్చింది. నగరమంతా అవే నిబంధనలు పాటించారా?అంటే అలాంటిదేమి లేదు. అయినవారికి ఆకుల్లో కానీ వారికి కంచాల్లో అన్నట్లుగా కేఎంసీ చర్యలుండిపోయాయి. కేఎంసీ చర్యలే ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. -
నమో.. నారసింహా
గుర్రంకొండ: మండలంలోని గుర్రంకొండ, తరిగొండ గ్రామాల్లో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో శనివారం టీటీడీ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి పలు రకాల నైవేద్యాలు సమర్పించి అభిషేకాలు, అర్చనలు జరిపారు. ఈసందర్భంగా స్వామివారిని రంగురంగుల పుష్పాలతో అందంగా అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని స్వామివార్లను దర్శించుకొన్నారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఘాట్ రోడ్డుపై ఆటో బోల్తా
సాక్షి, మదనపల్లె : పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ ఘాట్‌రోడ్డుపై శనివారం మధ్యాహ్నం ఓ ఆటో ప్రమాదానికి గురైంది. ఆటో ప్రొద్దుటూరు మలుపు వద్ద బోల్తా పడింది. అందులోని వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆటో ధ్వంసం అయింది. ఈ పర్యాటకులు ఎక్కడి వారు, ఎంత మంది ఉన్నారు అన్న వివరాలు తెలియరాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో కొండపై నుంచి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి కిందికి వస్తున్నారు. ప్రమాదం చూసి అక్కడ ఆగిన ఆయన బాధితులకు సహకారం అందించారు. భద్రత సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. తర్వాత ఆటోను ప్రమాద ఘటన నుంచి తీసుకువెళ్లిపోయారు. అయితే ఆటోకు సంబంధించి వివరాలు ఏవీ తెలియ రాలేదు. ఈ మలుపు వద్ద ఇటీవల ప్రమాదాలు అధికమవుతున్నాయి. ఇది మూడో ప్రమాదం. పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంటమదనపల్లె టౌన్ : పెద్దల నుంచి రక్షణ కల్పించాలని ఓ ప్రేమ జంట శనివారం మదనపల్లె డీఎస్పీ పావనిని కలిసి ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు.. సదుం మండలంతాటిగుంట పాళ్యంకు చెందిన రమణయ్య, చంద్రమ్మ దంపతుల కుమారుడు నాగార్జున మెడికల్ రిప్రజెంటేటివ్‌గా తిరుపతిలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మొలకలచెరువు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన సుధాకర్, మంజుల దంపతుల కుమార్తె కుంచపు హర్షిత బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ నాలుగేళ్లుగా ప్రేమించు కుంటున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో విడదీస్తారనే భయంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి శుక్రవారం పీలేరులోని ఒక గుడిలో వివాహం చేసుకున్నారు. అనంతరం తమకు పెద్దల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ శనివారం మదనపల్లె డీఎస్పీ కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డీఎస్పీ సదుం పోలీసులతో మాట్లాడి మేజర్లైన ఈ జంటకు రక్షణ కల్పించాలని, ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. డయాలసిస్ కేంద్రం మంజూరుపీలేరు : పీలేరు ఏరియా ఆస్పత్రికి డయాలసిస్ కేంద్రం మంజూరైనట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖ్ తెలిపారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు మంజూరు కాగా అందులో పీలేరుకు డయాలసిస్ కేంద్రం మంజూరైనట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా, స్థానికంగా డయాలసిస్ కేంద్రం అందుబాటులో రానున్నట్లు చెప్పారు. -
కారు ఢీకొని రైతు దుర్మరణం
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో కారు ఢీకొని రైతు దుర్మరణం చెందిన విషాదకర సంఘటన శనివారం అమ్మ చెరువుమిట్ట వద్ద చోటు చేసుకుంది. ముదివేడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కురబలకోట మండలం దాదంవారిపల్లికి చెందిన వెంకటరెడ్డి కుమారుడు, రైతు సుధాకర్‌రెడ్డి (50) సొంత పని మీద బైక్‌పై మదనపల్లెకు బయలుదేరాడు. మార్గంమధ్యలోని మదనపల్లె అమ్మచెరువు మిట్ట వద్ద, ఏసీ గోడౌన్ సమీపానికి రాగానే వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుధాకర్‌రెడ్డి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ముదివేడు ఎస్ఐ మధురామ చంద్రుడు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. రైతు మృతికి కారణమైన కారు డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే వాహనంతో పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా కారును గుర్తించే పనిలో ఉన్నామన్నారు. -
విద్యార్థి మృతిపై అన్నీ అనుమానాలే!
మదనపల్లె టౌన్ : మదనపల్లెలో మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి మిద్దె పై నుంచి పడి మృతి చెందడం పాఠకులకు విదితమే. ఎంబీఏ విద్యార్థి మృతిపై కేసు నమోదు చేసిన మదనపల్లె రెండవ పట్టణ సీఐ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ.. పుంగనూరు మండలం కుక్కలపల్లికి చెందిన గంగరాజు(24) కురబలకోట మండలం అంగళ్ళులోని మిట్స్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడని తెలిపారు. ఈ క్రమంలో తన స్వగ్రామానికి చెందిన స్నేహితుడు గోవర్ధన్ నాయక్ మదనపల్లె ఇందిరా నగర్లో బాడుగకు ఉంటూ, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆఫీస్ సబార్డినేట్‌గా పని చేస్తున్నాడు. గంగరాజు ఇంటికి వచ్చిన సమయంలో గోవర్ధన్ నాయక్ ఇంట్లో లేకుండా పోవడంతో.. అతని భార్యతో గంగ రాజు మాట్లాడుతుండగా సడన్‌గా వచ్చినట్లు సమాచారం. దీంతో గోవర్ధన్ నాయక్ భార్య దొంగా దొంగా అని కేకలు పెట్టడంతో.. భవనం మూడవ అంతస్తు పై నుంచి గంగరాజు తప్పించుకునే క్రమంలో కిందికి దూకి తీవ్రంగా గాయపడ్డాడని సీఐ తెలిపారు. ఆ సమయంలో తన వద్ద ఉన్న లాప్టాప్, సెల్‌ఫోన్ కూడా పగిలిపోయాయన్నారు. తీవ్రంగా గాయపడ్డ గంగరాజును విష్ణు నాయక్ వెంటనే స్థానిక జిల్లా ఆసుపత్రికి భార్యతో కలిసి తీసుకువెళ్లి ప్రథమ చికిత్సలు అందించినట్లు పేర్కొన్నారు. అయితే అతని పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతి చెందాడని, దర్యాప్తులో తేలినట్లు పేర్కొన్నారు. మృతుడి తండ్రి రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా గంగరాజు మృతి మిస్టరీని తేల్చునున్నామని చెప్పారు. -
స్వదేశ అభివృద్ధి కోసం పాటుపడాలి
రాయచోటి అర్బన్ : అమెరికా దేశంలోని పెన్సిల్వేనియా రాష్ట్ర రాజధాని హారిస్బర్గ్ నగరంలో ఎన్ఆర్ఐలు, తెలుగు ప్రజలలు, వైఎస్సార్సీపీ అభిమానులతో శుక్రవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి హృదయ పూర్వకంగా మమేకమయ్యారు. విదేశాల్లో స్థిరపడినా స్వదేశ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ భవిషత్యుపై తమకున్న అభిమానాన్ని, బాధ్యతను అక్కడి తెలుగు సమాజం మరోసారి స్పష్టంగా చాటి చెప్పింది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రవాస తెలుగు ప్రజలు అక్కడి స్థానిక జీవన విధానం, అధునిక అభివృద్ధి నమూనాలు, ప్రజలకు అందుబాటులో ఉన్న మౌలిక వసతులపై తమ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా భారతదేశంలో పేదరిక నిర్మూలనకు సమగ్ర ప్రణాళికలు, గ్రామీణ – పట్టణ ప్రాంతాల మధ్య సమాన అభివృద్ధి, యువతకు మెరుగైన అవకాశాలు కల్పించే విధానాలపై విలువైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడి, వారి అభిప్రాయాలను విన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారి అనుభవాలు, ఆలోచనలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా వినియోగించాలనే సంకల్పాన్ని ఆయన వ్యక్తం చేశారు. అదే విధంగా వైఎస్సార్సీపీ బలోపేతంపై శ్రీకాంత్ రెడ్డి చర్చించారు. -
కోట అందం.. చూసొద్దాం
● రాజరికానికి దర్పణం గుర్రంకొండ కోట ● అన్నమయ్య జిల్లాకు మణిహారం ● నిత్యం పర్యాటకుల సందడిగుర్రంకొండ : వేసవి సెలవుల్లో పిల్లలు, పెద్దలు చూడదగిన ప్రదేశం చారిత్రాత్మాక గుర్రంకొండ కోట. అన్నమయ్య జిల్లాలో రాచరికానికి, నవాబులు, రాజులు, బ్రిటీషు వారి పాలనకు నిలువుటద్దం ఈ కోట. జిల్లాకు నడిబొడ్డున ఒక మణిహారంలా, పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. 14 వ శతాబ్దం నుంచి ఈ కోటను పలు వంశాలకు చెందిన రాజులు, నవాబులు పరిపాలించారు. ముఖ్యంగా కడప నవాబు పరిపాలనలో ఇది పేరుగాంచింది. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి దేవాలయాలు, ఎన్నో చెరువులు ఉన్నాయి. మైసూర్ రాజు టిప్పు సూల్తాన్ బాల్యం, విద్యాభాస్యం ఇక్కడే గడిచింది. చివరగా బ్రిటీషు వారితో ఇక్కడ రాజరిక పాలనకు తెరపడింది. ఘన చరిత్ర కలిగిన ఈ కోటలో ఎన్నో విశేషాలు, చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి. వేసవి సెలవుల్లో ఇక్కడి విశేషాలను తిలకించడానికి మన రాష్ట్రం నుంచే కాక కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. మనం కూడా ఒకసారి చూసొద్దాం రండీ. రంగిణీ మహల్ గుర్రంకొంట కోటలో చూడదగిన ముఖ్య ప్రదేశం రంగిణీమహల్. పురాతన రాజభవనం. ముందువైపు నుంచి రెండు అంతస్తులుగానూ, వెనకవైపు నుంచి మూడు అంతస్తులు నూ కనిపించడం దీని ప్రత్యేకత. ఎన్నో గదులు, ఓ గదిలో భవనం లోపలి నుంచి సొరంగ మార్గం ఉంది. శత్రురాజులు దండెత్తినప్పుడు ఈ మార్గం గుండా కోట బయటికి వెళ్లేందుకు ఆస్కారం ఉండేది. పురాతన మెట్లు, సమావేశపు గదులు రాజరికానికి నిలుటద్దంగా నిలుస్తాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం గుర్రంకొండ కోటను విజయనగర రాజులు పాలించే కాలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని.. అప్పటి పాలకులు శ్రీకృష్ణ దేవరాయులు కోటలోని కొండపైభాగంలో నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. శిల్పకళాసౌందర్యంతో ఈ దేవాలయ స్తంభాలు ఇట్టే ఆకట్టుకొంటాయి. అన్ని దేవాలయాలు తూర్పుముఖంగా నిర్మిస్తే.. దీన్ని పశ్చిమముఖంగా నిర్మించడం విశేషం. ఇక్కడి నుంచి చూస్తే గుర్రంకొండ పట్టణంతోపాటు పరిసర గ్రామాల పచ్చటి పొలాలు, రాయల కాలం నాటి చెరువులు కనిపిస్తాయి. కోట ముఖద్వారం గుర్రంకొండను రాజులు పరిపాలించే కాలంలో కొండ చుట్టూ కోటగోడలను నిర్మించారు. కోటగోడల చుట్టూ కందకాలు తవ్వారు. ఈ కందకాల్లో నీటిని నింపేవారు. శత్రువులు కోటగోడలు ఎక్కకుండా ఆ నీటిలో మొసళ్లను వదిలేవారు. అలాంటి కోటకు ముఖద్వారాన్ని నిర్మించారు. ఈ ద్వారం నుంచే ఎవరైనా కోటలోకి ప్రవేశించే వారు. పురాతన కట్టడంగా ఇది నిలుస్తోంది. మగ్బీరా కోట పక్కనే మగ్బీరా ఉంది. పురాతన మహమ్మదీయుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కట్టడం ఇది. మగ్బీరా అంటే సమాధి. గుర్రంకొండ కోటను టిప్పుసుల్తాన్ మేనమామ మీర్రజాఆలీఖాన్ పాలించే వారు. అతను మృతి చెందిన తరువాత సమాధిని మగ్బీరాగా నిర్మించారు. డూమ్‌లో చేసే శబ్దాలు ప్రతి ధ్వనించడం(రీసౌండ్) ఇక్కడి ప్రత్యేకత. షాహజాదీ మసీదు టిప్పు సుల్తాన్ కాలంలో రాజవంశీయుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన మసీదు ఇది. పూర్తిగా రాతితోనే నిర్మించారు. ప్రస్తుతం దీన్ని పూర్తి స్థాయిలో ఆధునికరించారు. ఇలాంటివి కోట పరిసరాల్లో మరో రెండు ఉన్నాయి. షాకమాల్ దర్గా మైసూర్ పాలకులు, అప్పటి గుర్రంకొండ కోట పాలకులు అయిన టిప్పు సుల్తాన్ ఆస్థాన గురువు షాకమాల్ దువ్వమ్. ఆయన ఈజిప్టు దేశం నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన గొప్పతనం విన్న అప్పటి మైసూర్ పాలకులు హైదరాలీ తన కుమారుడు టిప్పుసుల్తాన్ను గుర్రంకొండలోని అతని మేనమామ మీర్రజా ఆలీఖాన్ వద్ద ఉంచి షాకమాల్ దగ్గర విద్యాబుద్ధులు నేర్పించారు. తదనంతర కాలంలో షాకమాల్ దువ్వమ్ టిప్పుసుల్తాన్ గురువుగా నియమింపబడ్డాడు. ఇతని సమాధినే ఇక్కడ గొప్ప దర్గాగా ప్రజలు కొలుస్తారు. ఇంకా చూడదగిన విశేషాలు ● కొండపైన కోట బురుజులు, పురాతన కట్టడాలు, పురాతన ఇళ్లు ఉన్నాయి. అక్కడికి చేరుకోవడానికి మెట్లమార్గం కూడా ఉంది. ● కోటలో శిథిలావస్థకు చేరుకొన్న అలనాటి ఆస్పత్రి భవనం ఉంది. ● శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ విఘ్నేశ్వరస్వామి ఆలయాలు, టిప్పుసుల్తాన్ కాలం నాటి ఈద్గాలు ఉన్నాయి. ● గుర్రంకొండ పట్టణంలో శ్రీ షాకమాల్ దర్గా దగ్గర టిప్పుసుల్తాన్ చదువుకొన్న పాఠశాల యూసూఫ్ సాహేబ్ తకియా ఉంది.ముందువైపు నుంచి రెండు అంతస్తులుగా కనిపిస్తున్న రంగిణీమహల్వెనుకవైపు నుంచి మూడు అంతస్తులుగా కనిపిస్తున్న రంగిణీ మహల్ -
అదనపు రైల్వేబోర్డు సభ్యుడిగా కె.వి.రెడ్డి
పీలేరు రూరల్ : భారతీయ రైల్వే బోర్డులో అత్యుతన్నత గ్రేడ్ 16 అదనపు రైల్వే బోర్డు సభ్యుడిగా పీలేరు ప్రాంతానికి చెందిన కె.వి.రెడ్డి (కె.వెంకటరమణారెడ్డి)కి పదోన్నతి లభించింది. కె.వి.రెడ్డి గుంతకల్లు డీఆర్ఎంగా, దక్షిణ మధ్య రైల్వేలో పీసీఎస్వోగా, ఐఆర్ఐఎస్ఈటీలో ప్రొఫెసర్‌గా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. పీలేరు రైల్వే స్టేషన్‌ను అమృత్ రైల్వే స్టేషన్‌గా అభివృద్ధి చేయడంలో, అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు పీలేరులో స్టాపేజీలకు విశేష కృషి చేశారు. ఆయన 1990 ఐఈఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. 11న కలెక్టరేట్ ముట్టడిమదనపల్లె సిటీ : సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11వ తేదీన జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంటీఎస్ ఉపాధ్యాయ సంఘ నాయకులు కృష్ణారెడ్డి, వివ్వనాథరెడ్డి, ఆదినారాయణ తెలిపారు. 25 ఏళ్లుగా సర్వీసు నష్టపోయిన తమను వెంటనే రెగ్యులర్ చేయాలని, ఉద్యోగ కాలపరిమితి 62 ఏళ్లకు పెంచాలని, 12 నెలల కాలానికి వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ అయిన వారికి నెలకు రూ.25 వేలు పెన్షన్ ఇవ్వాలని, హెల్త్‌కార్డులు జారీ చేయాలన్నారు. దూర ప్రాంతాలకు బదిలీ అయిన వారిని సొంత మండలాలు, దగ్గర ప్రాంతాలకు బదిలీ చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు అక్కులప్ప, రవి, జమాల్‌భాషా, వాసుదేవ తదితరులు పాల్గొన్నారు. పిడుగుపాటుతో ఆవు మృతి కలికిరి : పిడుగుపాటుతో పాడి ఆవు మృతి చెందిన ఘటన మండలంలోని పల్లవోలు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. పల్లవోలు గ్రామం లింగపల్లికి చెందిన ప్రభాకర పాడి ఆవులను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం పొలం వద్ద ఆవులను మేపుకొంటుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చింది. ఆవులకు సమీపంలో పిడుగు పడటంతో సుమారు రూ.లక్ష విలువ చేసే పాడి ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. పాడి ఆవుల పాల దిగుబడితో జీవనం సాగిస్తున్న పాడి రైతు ఆవు మృతి చెందడంతో ఆవేదన వ్యక్తం చేశాడు. బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. యువకుడు ఆత్మహత్యాయత్నంమదనపల్లె టౌన్ : ఎలుకల నివారణ మందు తాగి ఓ ప్రైవేటు వాహన డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం చౌడేపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని ఆమనకుంటకు చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు చందు(27) ప్రైవేట్ వాహనాలకు డ్రైవర్‌గా పని చేస్తూ, తల్లిదండ్రులతోపాటు భార్య శిల్పా, తన ముగ్గురు పిల్లలను పోషించుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో కుటుంబ సమస్యల కారణంగా మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న ఎలుకల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు బాధితుడిని వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అక్కడి వైద్యులు తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి అనంతపురం సెంట్రల్ : అనంతపురం నగరంలో చోటు చేసుకున్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్ జిల్లా కడప నగరం ఆజాద్‌నగర్‌కు చెందిన షేక్ కరీముల్లా కుమారుడు షేక్ మహబూబ్‌బాషా(20), అనంతపురంలోని రాణినగర్‌కు చెందిన బాబావలి కుమారుడు ఖాసీంవలీ(18) బంధువులు. రెండు రోజుల క్రితం మహబూబ్ బాషా అనంతపురానికి వచ్చాడు. శుక్రవారం ఖాసీంవలీతో కలిసి విద్యుత్‌నగర్ సర్కిల్ నుంచి సంఘమేష్ సర్కిల్ వైపుగా ద్విచక్ర వాహనంపై వెళుతూ.. రమణ రమేష్ థియేటర్ సమీపంలోకి చేరుకోగానే నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొన్నారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకులను స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇద్దరూ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఒమన్‌లో చిక్కుకున్న మహిళ సురక్షితంగా ఇంటికి..
మదనపల్లె టౌన్ : ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లి అక్కడ యజమానుల చేతిలో మోసపోయి, నరకయాతన అనుభవించిన అన్నమయ్య జిల్లా వాయల్పాడుకు చెందిన మహిళ షహానాజ్ ఎట్టకేలకు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. ఈ వివరాలను శనివారం మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ (పరిపాలన) వెల్లడించారు. వాయల్పాడుకు చెందిన షహానాజ్, అబూబకర్ దంపతులకు ముగ్గురు చిన్న పిల్లలు. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏజెంట్ల ద్వారా ఉపాధి కోసం షహానాజ్ ఒమన్ లోని మస్కట్‌కు వెళ్లారు. అక్కడ మొదటి నాలుగు నెలలు బాగానే ఉన్నప్పటికీ, గత రెండు నెలలుగా యజమానులు ఆమెతో అధికంగా పని చేయిస్తూ, కనీసం భోజనం కూడా పెట్టకుండా వేధించారు. అనారోగ్యంతో ఉన్న ఆమెను చీకటి గదిలో బంధించి, బయటికి వెళ్లనివ్వకుండా చిత్రహింసలు పెట్టారు. దీంతో ఆమె వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కుటుంబ సభ్యులకు తన దీనస్థితిని తెలుపుతూ రోదించారు. సోషల్ మీడియాలో వైరల్‌గా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పోలీసులు స్పందించారు. ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో స్పెషల్ బ్రాంచ్, వాయల్పాడు పోలీసులతో కూడిన ప్రత్యేక బృందం వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగంట్లకు వెళ్లి ఏజెంట్లను విచారణ చేశారు. ప్రభుత్వం తరఫున ఇండియన్ ఎంబసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ఒమన్‌లో ఆమె ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. అక్కడి అధికారుల సాయంతో ఆమెను రక్షించి, ముంబైకి తీసుకువచ్చారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు, తర్వాత విజయవాడ నుంచి వాయల్పాడులోని వారి ఇంటికి చేర్చారు. ప్రయాణ ఖర్చులను ఉప ముఖ్యమంత్రి భరించారు. ప్రభుత్వానికి, పోలీసు సిబ్బందికి షహానాజ్ దంపతులు ధన్యవాదాలు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్.కృష్ణమోహన్, కలికిరి సీఐ అనిల్ కుమార్, వాయల్పాడు ఎస్ఐ తిప్పేస్వామి పాల్గొన్నారు.ఎంబసీతో సమన్వయం చేసుకుంటూ రప్పించిన ఎస్పీ -
మాకు న్యాయం చేయండి
పుంగనూరు : మా భూమిని మాకు అప్పగించి న్యాయం చేయాలని బాధితురాలు కోరుతున్నారు. మండలంలోని రాగానిపల్లెకి చెందిన దళిత మహిళ లక్ష్మమ్మ శనివారం విలేకరులతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆమె కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నరాయప్ప పేరుతో ఉన్న భూమి రికార్డులను.. రెవెన్యూ అధికారులు ధనికుల పేరుతో మార్చారని లక్ష్మమ్మ ఆరోపించింది. రాగానిపల్లెలో నివాసం ఉన్న చెన్నరాయప్పకు అదే గ్రామంలో సర్వే నంబరు: 337/3, ఖాతా నంబరు: 113లో 2 ఎకరాల 45 సెంట్ల భూమికి ప్రభుత్వం గతంలో పట్టా మంజూరు చేసి, పాసుపుస్తకం జారీ చేసింది. ఇదిలా ఉండగా రెవెన్యూ అధికారులు చెన్నరాయప్ప, లక్ష్మమ్మలకు తెలియకుండా చంద్రప్ప, గౌరమ్మల పేరుతో 1బి రికార్డులు మార్చేశారని బాధితురాలు ఆరోపిస్తోంది. ఈ విషయమై బాధితురాలు జిల్లా కలెక్టర్ దగ్గరకు వెళ్లి పీజీఆర్ఎస్లో ఫిబ్రవరి 23న ఫిర్యాదు చేసింది. కానీ స్థానిక అధికారుల్లో చలనం లేకపోవడంతో ఆమె వీధిన పడింది. ఈ భూమికి సంబంధించి విచారణ చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఆమె ఆరోపిస్తోంది. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతోంది. -
పట్టించుకునే దిక్కులేదు
తాను చైర్మన్‌గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సహకారంతో 15 ఎకరాలకు పైగా స్థలాన్ని మార్కెట్ యార్డు నిర్మాణానికి సేకరించాం. రైల్వే ప్లై ఓవర్ దగ్గర చదును చేయడం లాంటి పనులు కూడా చేశాం. కమిటీకి రూ. 2 కోట్లకు పైగా ఆదాయం సమకూరేలా చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా మరుగునపడింది. రెండేళ్లవుతున్నా కొత్త కమిటీ ఊసే లేదు. జగన్ ప్రభుత్వం కొనసాగి ఉంటే మార్కెట్‌యార్డు పనులు పూర్తి చేసుకుని వినియోగంలోకి కూడా వచ్చి ఉండేది. –డీఆర్. ఉమాపతి రెడ్డి, అంగళ్లు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, కురబలకోట మండలం -
వైద్యసేవల్లో అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ కీలకం
రాజంపేట : వైద్యసేవల్లో అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ పాత్ర అత్యంత కీలకమని, అందువల్లనే ఆ కోర్సులకు డిమాండ్ పెరిగిందని అన్నమాచార్య యూనివర్సిటీ చాన్స్‌లర్ చొప్పాగంగిరెడ్డి అన్నారు. శుక్రవారం హెల్త్‌సైన్సెస్ ప్రెషర్స్డేలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నేటి సమాజంలో హెల్త్కోర్సులకు అధిక ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. ప్రముఖ జనరల్ సర్జన్ డా.శ్రీకృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో హెల్త్ సైన్సెస్ తీసుకొచ్చిన ఘనత ఏయూ అధినేత చొప్పాగంగిరెడ్డికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో వీసీ డా.సాయిబాబారెడ్డి, గెస్ట్ హాఫ్ ఆనర్ డా.రామ్నిఖి చక్రవర్తి, ఎఐటీఎస్ వైస్‌చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, అలైడ్ హైల్త్ ప్రొఫెషనల్స్ ఇన్చార్జి ద్వారకనాథరెడ్డిలతో పాటు అధ్యాపకులు, విద్యార్ధులు, తల్లితండ్రులు పాల్గొన్నారు. అనంతరం అతిథులను సన్మానించారు. -
యువకుడు ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్ : భూ వివాదం కారణంగా మనస్థాపం చెందిన ఓ యువకుడు విషపు ఆకులు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శుక్రవారం చోటు చేసుకున్న ఘటనపై బాధితుని కుటుంబీకుల కథనం.. మదనపల్లె పట్టణం, నీరుకుటివారిపల్లెలోని కట్లాటపల్లి రోడ్డులో నివాసం ఉంటున్న శివన్న (32)కు కర్ణాటకలోని మంచినీళ్ల కోట వద్ద కొంత ఇంటి స్థలం ఉంది. ఆ స్థలాన్ని అదే ఊరికి చెందిన కొందరు ఆక్రమించేందుకు యత్నించారు. వారితో గొడవపడ్డాడు. అనంతరం అక్కడే ఉన్న విషపు ఆకులు తిన్నాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూఉన్నాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
భార్య కాపురానికి రాలేదని..
మదనపల్లె టౌన్ : భార్య కాపురానికి రాలేదని భర్త చేతి నరాలు కోసుకుని ఆత్మహత్యకు యత్ని ంచిన సంఘటన శుక్రవారం మదనపల్లెలో జరిగింది. ఘటనపై జిల్లా ఆస్పత్రి అవుట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు.. మదనపల్లె కదిరి రోడ్డు, అమ్మచెరువు మిట్టలో కాపురం ఉంటున్న రహీముల్లా కొడుకు చాంద్ బాషా (27) చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటాడు. భార్య హసీనా ఇటీవల భర్తతో గొడవ పడి అలిగి తన పుట్టింటికి వెళ్లి పోయింది. కాపురానికి రావాలని శుక్రవారం అత్తగారి ఇంటికి వెళ్లి భార్యను కోరి నప్పటికీ, ఆమె రాలేదు. ఇంటికి వచ్చిన చాంద్ బాషా జీవితంపై విరక్తి చెందాడు. ఇంట్లో ఉన్న కత్తితో చేతి నరాలు కోసుకున్నాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు చికిత్సలు అందించడంతో కోలుకుంటూ ఉన్నాడు. వన్ టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..
● ఒక్క అడుగు ముందుకు పడని అంగళ్లు మార్కెట్ కమిటీ ● రెండేళ్లుగా కాలయాపన చేస్తున్న కూటమి ప్రభుత్వం ● ఆవిరైన రైతుల ఆశలుకురబలకోట : రైతులకు అండగా నిలవాల్సిన అంగళ్లు మార్కెట్ కమిటీ పేరుకు మాత్రమే పరిమితమైంది. ఆచరణకు ఆమడ దూరంలో ఉంది. కుర బలకోట, బి.కొత్తకోట మండలాల రైతుల కోసం ఏర్పాటైన ఈ మార్కెట్ కమిటీ కూటమి పాలనలో ఇంత వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి రైతులకు అనుకూలంగా ప్రత్యేక చొరవ చూపారు. ములకలచెరువు మార్కెట్ కమిటీ నుంచి 2022లో దీనిని భైఫర్ కేషన్ (విభజన) చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అంగళ్లు కేంద్రంగా ఏర్పాటైంది. తొలి చైర్మన్‌గా డీఆర్. ఉమాపతి రెడ్డి నియమితులయ్యారు. అప్పట్లో కురబలకోట రైల్వే ఫ్లై ఓవర్ (ఆర్ఓబీ) దగ్గర 15 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించారు. కొత్త మార్కెట్ యార్డు నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా వెళ్లాయి. అప్పట్లో రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. టమాటా రైతులకు ఊరటగా ఉండగలదని ఆశించారు. అయితే తర్వాత ఎన్నికలు రావడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ మార్కెట్ కమిటీ పూర్తిగా మరుగున పడింది. ఇది ఉందన్న సంగతిని కూడా అందరూ మరచిపోయారు. ఇదివరలో అంగళ్లులోని సతీష్ బిల్డింగ్‌లో ఉన్న మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని కూడా స్థానికంగా కమతంపల్లి మార్గంలోకి మార్చారు. దీని పరిధిలో రెండు చెక్‌పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం అంగళ్లు పంచాయతీ అధ్వర్యంలో నడుస్తున్న టమాటా మార్కెట్, రెండు చెక్ పోస్టులు, ఇతర వాణిజ్య కార్యకలాపాల ద్వారా ఏడాదికి రూ.60 లక్షలకు పైగా ఆదాయం కూడా వస్తోంది. అంగళ్లు, బి.కొత్తకోట ప్రాంతాల్లో విస్తారంగా టమాటా సాగు చేస్తారు. మార్కెట్ యార్డు ఏర్పాటైతే ఎంతో సౌకర్యం. అయినా రెండేళ్లుగా ఎలాంటి ప్రగతి లేకపోవడంతో ఇది ఉన్నా లేనట్టేనని రైతులు పెదవి విరుస్తున్నారు. ఈ విషయమై అంగళ్లు మార్కెట్ కమిటీ కార్యాలయ కార్యదర్సి మదన్‌మోహన్‌రెడ్డిని విచారించగా మార్కెట్ యార్డు నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని వివిధ కారణాలతో ఉన్నతాధికారులు రద్దు చేశారన్నారు. కొత్తగా అంగళ్లు, ముదివేడు మార్గ మధ్యలో 20 ఎకరాల భూ సేకరణకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. స్థలం కేటాయించగానే కొత్త మార్కెట్ యార్డు నిర్మాణానికి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. పాలక వర్గం నియామకం ప్రభుత్వ పరిధిలో ఉందని తెలిపారు. -
మిద్దైపెనుంచి పడి విద్యార్థి మృతి
మదనపల్లె టౌన్ : మిద్దైపె నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఎంబీఏ విద్యార్థి మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి మదనపల్లెలో చోటు చేసుకుంది. మదనపల్లె జిల్లా ఆసుపత్రి అవుట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పుంగనూరు మండలం, పాలెంపల్లి పంచాయతీ, కుక్కలపల్లికి చెందిన రామకృష్ణ కుమారుడు గంగరాజు (24) అంగళ్లు మిట్స్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామంలో ఉన్న తన స్నేహితుడు గోవర్ధన్ నాయక్ మదనపల్లె ఇందిరా నగర్లో ఉన్నాడు. అతని ఇంటికి వచ్చిన గంగరాజు స్నేహితునితో మిద్దైపెకి వెళ్లి మాట్లాడు తుంటుండగా.. ప్రమాదవశాత్తు కిందపడి తల, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు మెరుగైన వైద్యం అందించినప్పటికి పరి స్థితి విషమించి మృతి చెందాడు. సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగేశ్వర్ రావు తెలిపారు. అనుమానస్పద స్థితిలో యవకుడు..కేవీపల్లె : అనుమానస్పద స్థితిలో యువకుడి మృతి చెందిన సంఘటన మండలంలోని జిల్లేళ్లమంద పంచాయతీ కరణంవారిపల్లె సమీపంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్ఐ వెంకటశివకుమార్ కథనం మేరకు వివరాలిలా వున్నాయి. కరణంవారిపల్లె సమీపంలోని ఓ మామిడి తోటలో మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించగా మృత దేహం కుళ్లిన స్థితిలో ఉంది. అక్కడ లభించిన ఆధారాలతో సుండుపల్లె మండలం ముడుంపాడు నగిరికి చెందిన మల్లిఖార్జున నాయుడు (35)గా గుర్తించారు. ఐదు రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చునని ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
పొలాలకు వెళ్లే దారి కోసం రైతుల పాట్లు
రాయచోటి : వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు దారి కావాలంటూ రైతులు నాలుగు నెలలుగా అధికారుల చూట్టూ తిరుగుతూ పడరాని పాట్లు పడుతున్నారు. మండల పరిధిలోని దేవపట్ల గ్రామం కట్టుగుత్తపల్లెకు చెందిన 20 మంది రైతులు శుక్రవారం వీరు తహసీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చారు. అక్కడ తహసీల్దార్ సుబ్రమణ్యంరెడ్డి లేరు. సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ కట్టుగుత్తపల్లెకు చెందిన ఓ వ్యక్తి డీకేటీ పొలంలో కాలువ సైతం పూడ్చి దారికి అడ్డుపడుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 1340–7లో చెంచయ్య, సుబ్బమ్మ పేర్లమీద డీకేటీ పట్టాలు ఇచ్చారు. సుబ్బమ్మ వృత్తి రీత్యా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగికి ఎలా డీ పట్టా ఇచ్చారంటూ రైతులు ప్రశ్నించారు. ఇక్కడ పొలంలో దారి ఇస్తే తప్ప పైన ఉన్న రైతుల పొలాలకు వెళ్లే వీలుండదు. సర్వే నంబర్ 204లో రామ సుబ్బమ్మ పట్టాభూమి, 196–2లో జయరామ్‌కి సంబంధించి చుక్కుల భూమి ఉన్నట్లు తెలిపారు. వీరితో పాటు మరికొందరు రైతులు ఉన్నారు. పొలాల్లోకి దారి వేయకుండా అడ్డుపడుతున్న వ్యక్తిని అధికారులు పలు మార్లు పిలిచి మాట్లాడితే రైతులకు ఇక్కడ దారి ఇస్తే నేను పురుగుల మందుతాగి చనిపోతానని బెదిరిస్తూ అధికారు విధులకు భంగం కలిగిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని సమస్యను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని రైతులు ఉన్నతాధికారులను వేడుకొంటున్నారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులను వివరణ కోరగా అతను బెదిరింపులకు పాల్పడటం వాస్తవమేనని, అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వివరించారు. -
అధికారం అండతో నిర్మాణ పనులు పూడ్చివేత
సాక్షి, మదనపల్లె : సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు అన్న కారణంగా వైఎస్సార్సీపీ నిమ్మనపల్లె మండలం సోషల్ మీడియా ఇన్చార్జి టి.రవితేజ చేపట్టిన నీటితొట్టె నిర్మాణాన్ని శుక్రవారం అధికారులు ఏకపక్షంగా జేసీబీతో పూడ్చివేశారు. 2005లో నిమ్మనపల్లిలో రవితేజ తల్లి సుజాతకు ఒకటిన్నర సెంటు పట్టా ఇచ్చారు. ఈమెతోపాటు మరికొందరికి ఇచ్చారు. ఈ ఇంటి స్థలం ఆవరణలో నీటి తొట్టి, మరుగుదొడ్డికి పిట్ నిర్మాణం కోసం గుంతలు తవ్వారు. దీనికోసం రూ.లక్ష దాకా ఖర్చు పెట్టారు. నీటి తొట్టె నిర్మాణం కోసం పనులు చేపడుతున్నా అధికారులకు అది ఆక్రమించి చేస్తున్న పనులు అని అడ్డగించలేదు. స్థలం అక్రమించి చేస్తున్న నిర్మాణం కూడా కాదు. అయితే ఎలాగైనా వేధించాలన్న టీడీపీ నేతల కుతంత్రంతో అధికారులను శుక్రవారం రంగంలోకి దింపారు. ఎస్ఐ, ఎంపీడీవో, పంచాయతీ ప్రత్యేక అధికారి, మహిళా పోలీసులు రవితేజ ఇంటి వద్దకు చేరుకున్నారు. తవ్విన గుంత ప్రభుత్వ స్థలంలో ఉందని ఆరోపించారు. నిర్మాణం పూడ్చేందుకు ప్రయత్నిస్తుండగా వద్దంటూ కుటుంబీకులు వేడుకుంటున్నా పట్టించుకోలేదు. ఒకవేళ ఆక్రమణ ఉంటే తామే పూడ్చివేస్తామని రవితేజ అధికారులకు చెబుతున్నా వినకుండా మొత్తం నిర్మాణ పనులను దగ్గరుండి జేసీబీతో పూడ్చి వేయించారు. నిర్మాణం కోసం అక్కడ ఉంచిన ఇటుకలు, సిమెంట్ పాడయ్యాయి. వైఎస్సార్సీపీలో రవితేజ చురుగ్గా వ్యవహరించడం టీడీపీ నేతలు జీర్జీంచుకోలేకపోతున్నారు. దీంతో ఎలాగైనా ఇబ్బందులకు గురి చేయాలన్న లక్ష్యంతో ఇంటి కోసం చేపట్టిన నీటితోట్టి నిర్మాణ పనులపై కక్ష సాధించారు. ప్రభుత్వ స్థలం ఆక్రమించలేదని, ఆక్రమణ ఉంటే తామే పూర్తి చేస్తామని చెబుతున్నా అధికారులు కనీసం పట్టించుకోలేదు. వచ్చిన పని అయ్యిందంటూ గుంతను పూడ్చి వెళ్లిపోయారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంటి పనులపై కక్ష సాధిస్తారా అని ప్రశ్నిస్తున్నారు.వైఎస్సార్సీపీ నాయకుడిపై కక్ష సాధింపు


