రామసముద్రం : తన భర్త కు నడుము విరిగిపోయి ఏడాదిగా మంచానికే పరిమిత మయ్యాడని బాధితుడు భార్య పర్వీన్ ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్వహించిన పీజీఆర్ ఎస్ కార్యక్రమానికి వచ్చిన ఆమె మాట్లాడుతూ కూలి చేసుకొని జీవనం చేస్తూ పిల్లలను పోషించుకుంటున్నామని తెలిపారు. ఏడాది క్రితం తన భర్త ఎద్దులబండిలో ఇసుక తోలుతుండగా ఇసుక గడ్డ విరిగిపడి వీపుపై పడటంతో నడుము విరిగిందన్నారు. అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వ పెన్షన్ రూ.6వేలు ఇస్తున్నారని, రోజుకు చికిత్సకే రూ.300లు ఖర్చు అవుతుందని తెలిపింది. తన భర్త మంచానికి పరిమితం కావడంతో తమ కుటుంబ జీవన పరిస్థితి కష్టంగా మారిందని, ప్రభుత్వం పెన్షన్ పెంపు చేసి ఆర్థికంగా ఆదుకోవాలని కోరింది.


