నో వీసా, నో సిటిజన్‌షిప్‌ : స్కాట్లాండ్‌లో సంచలనం ఎవరీ మణివణ్ణన్‌? | Scottish parliament election No visa no citizenship Trans Tamil immigrant backlash | Sakshi
Sakshi News home page

నో వీసా, నో సిటిజన్‌షిప్‌ : స్కాట్లాండ్‌లో సంచలనం ఎవరీ మణివణ్ణన్‌?

May 12 2026 6:02 PM | Updated on May 12 2026 6:09 PM

Scottish parliament election No visa no citizenship Trans Tamil immigrant backlash

ఎంపీగా గెలిచి.. వివాదంగా నిలిచి 

స్టూడెంట్‌ వీసా, ఎన్నికల నిబంధనావళిలో 

మార్పులపై చర్చను లేవదీసిన తమిళనాడు విద్యార్థి 

లండన్‌: విద్యాభ్యాసం కోసం స్టూడెంట్‌ వీసాపై స్కాట్లాండ్‌కు వచ్చిన తమిళనాడు విద్యార్థి క్యూ మణివణ్ణన్‌ రాజకీయపథంలో పయనించి పార్లమెంట్‌లో అడుగుపెట్టడం ఇప్పుడు అక్కడ సరికొత్త చర్చకు దారితీసింది. విదేశీ విద్యార్థులు విదేశీగడ్డపై చదువుకుని ఉన్నతస్థాయిలో స్థిరపడాల్సిందిపోయి విదేశీ రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే గతేడాది తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలతో విదేశీ విద్యార్థులూ ఎన్నికల రణక్షేత్రంలో పోటీపడేందుకు అవకాశం చిక్కింది. ఈ సువర్ణావకాశాన్ని మణివణ్ణన్‌ అందిపుచ్చుకుని స్కాటిష్‌ గ్రీన్‌పార్టీ తరఫున ఎడిన్‌బర్గ్‌ అండ్‌ లూథియన్స్‌ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. దీంతో మెంబర్‌ ఆఫ్‌ స్కాటిష్‌ పార్లమెంట్‌(ఎంఎస్‌పీ) సభ్యుడయ్యాడు. 

తాత్కాలిక వీసాపై వచ్చి ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన తొలి విదేశీ అభ్యర్థిగా మణివణ్ణన్‌ చరిత్రసృష్టించాడు. తమిళనాడులో పుట్టిన ఇతను 2021లో స్కాట్లాండ్‌కు వచ్చాడు. ఆండ్రూస్‌ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాలు కోర్సులో పీహెచ్‌డీ విద్యారి్థగా చేరాడు. కనీసం మూడేళ్లుగా బ్రిటన్‌లో ఉంటున్న, శాశ్వత స్థిరనివాస హోదా లేని విదేశీ పీహెచ్‌డీ విద్యార్థులూ స్కాట్లాండ్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీచేయొచ్చని గతేడాది చట్టసవరణ తీసుకొచ్చారు. దీంతో పరిపాలనలో వైవిధ్యం చూపేందుకు తానూ ఎన్నికల యుద్ధక్షేత్రంలోకి అడుగుపెట్టానని ట్రాన్స్‌జెండర్‌ అయిన మణివణ్ణన్‌ తన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చెప్పారు. గ్రీన్స్‌ పార్టీ పాలస్తీనా సంఘీభావ విభాగానికి కో–కన్వీనర్‌గా పనిచేశాడు. గతంలో ఐక్యరాజ్యసమితి ఆరోగ్య, దివ్యాంగ కార్యకర్తగా పనిచేశాడు. తానో తమిళ వలసదారుడినని ప్రచారం చేసుకున్నాడు. 

ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్‌ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను

విదేశీయుడు మనకు ఎలా ప్రాతినిథ్యం వహించగలడని ప్రత్యర్థి పార్టీల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీగా కాలపరిమితి ముగిసేలోపే అతని వీసా గడువు ముగిస్తే బ్రిటన్‌ గడ్డపై ఉండేందుకు అతను అర్హత కోల్పోతాడు. అప్పుడు అతను స్కాట్లాండ్‌ను వీడక తప్పదు. అప్పుడు ఎడిన్‌బర్గ్, లూథియన్స్‌ ప్రాంతవాసుల బాగోగులను ఎవరు పట్టించుకుంటారు? ఎంపీ లేకుండా ఒక నియోజకవర్గం అలా నిస్సహాయంగా మిగిలిపోవాలా? దీనిని పరిష్కారం ఏంటి? స్కాట్లాండ్‌ స్థానిక ప్రజల సంస్కృతి, సంప్ర దాయాలు, అవసరాలకు అనుగుణంగా జరిగే చట్టాలు, విధాన నిర్ణయాల్లో మణివణ్ణన్‌ మేరకు క్రియాశీలక పాత్ర పోషించగలడు? అంటూ ప్రశ్నల విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 

విదేశీ విద్యార్థుల మార్గదర్శకంలో నడవడమేంటి? అంటూ వలసల వ్యతిరేక యూకే విభాగ షాడో చాన్స్‌లర్, మాజీ ఎంపీ రాబర్ట్‌ జెన్‌రిక్‌ అన్నారు. అయితే ఈ అంశంలో మణివణ్ణన్‌కు గ్రీన్స్‌ పార్టీ అండగా నిలిచింది. అతని వీసా ఖచి్చతంగా రెన్యూవల్‌అయ్యేలా చూస్తామని పార్టీ నేత గిలియన్‌ మెకే తెలిపారు. వామపక్ష భావాలున్న గ్రీన్స్‌ పార్టీ తాజా ఎన్నికల్లో గతంతో పోలిస్తే ఎక్కువ స్థానాల్లో గెలిచింది.  

ఇదీ చదవండి: విజయ్‌ ఎత్తులు : పళని స్వామికి షాక్‌, కొత్త నాయకత్వం

Advertisement
 
Advertisement
Advertisement