ఇప్పటికీ ఇండియన్స్‌ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను | Indians are still referred as coolies, But I feel no shame: Trinidad PM | Sakshi
Sakshi News home page

ఇప్పటికీ ఇండియన్స్‌ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను

May 11 2026 12:47 PM | Updated on May 11 2026 12:53 PM

Indians are still referred as coolies, But I feel no shame: Trinidad PM

ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి, భారత సంతతికి చెందినకమలా ప్రసాద్-బిస్సెసర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోని తన పూర్వీకుల మూలాల పట్ల ప్రగాఢమైన గర్వాన్ని వ్యక్తం చేశారు.  భారత సంతతికి చెందిన ఆమె, తన మూలాలను గుర్తుచేసుకుంటూ, ఒకప్పుడు అవమానకరంగా భావించిన పదాన్ని ఆత్మగౌరవానికి చిహ్నంగా ఎలా మార్చుకున్నారో వివరించారు.

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ ట్రినిడాడ్‌లో  (మే 8-9 తేదీలలో) పర్యటన స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో  కమలా మాట్లాడుతూ, తన భారతీయ గుర్తింపు కారణంగా ఇప్పటికీ తనను అవమానించాలని ప్రయత్నిస్తున్న వారికి కమలా ప్రసాద్ తగిన విధంగా సమాధానమిచ్చారు.

ట్రినిడాడ్‌లో నేటికీ అనేక చోట్ల భారతీయులను 'కూలీలు' అని పిలుస్తారని, ఇది ఒక అవమానకరమైన పదంగా పరిగణించబడుతుందని కమలా ప్రసాద్ అన్నారు. "కానీ నేను ఈ విషయంలో ఏమాత్రం సిగ్గుపడటం  లేదు.  ఆ 'కూలీల' కష్టం, రక్తం, చెమట వల్లే ఈ దేశం అభివృద్ధి చెందింది. ఈ రోజు ఒక కూలీ కూతురు ట్రినిడాడ్ ప్రధానమంత్రి అయినందుకు  గర్వపడుతున్నాను" అని ఆమె ఎంతో గర్వంగా చెప్పారు. ఆమె ప్రకారం, తన భారతీయ గుర్తింపు పట్ల ఆమెకు ఎలాంటి కలత గానీ, సిగ్గు గానీ లేదు.


ట్రినిడాడ్‌లోని జనాభాలో సుమారు 45 శాతం మంది భారతీయ సంతతికి చెందినవారని ప్రధానమంత్రి కమలా ప్రసాద్ అన్నారు. బ్రిటిష్ వారు భారతీయ కార్మికులను బానిసలుగా ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు, వారు తమతో పాటు రామాయణం, గీత, ఖురాన్‌ను కూడా తీసుకొచ్చారని చెప్పారు. వారికి ఆంగ్లం తెలియకపోయినా, ఎన్నో అఘాయిత్యాలను ఎదుర్కొన్నప్పటికీ, వారు తమ ప్రాచీన భారతీయ నాగరికత, భాష, సంస్కృతిని పరిరక్షించుకున్నారని  ఆమె వెల్లడించారు.

అంతేకాదు చారిత్రాత్మక పర్యటన సందర్భంగా కమలా ప్రసాద్ ఒక  సంచలన ప్రకటన చేశారు. భారతీయుల గౌరవార్థం నెల్సన్ ఐలాండ్ పేరును మార్చనున్నట్లు తెలిపారు. 1866 నుండి 1917 వరకు, ఈ ద్వీపాన్ని భారతీయ ఒప్పంద కార్మికుల కోసం ఒక ల్యాండింగ్ స్టేషన్‌గా, క్వారంటైన్ కేంద్రంగా ఉపయోగించారు. భారతీయ పూర్వీకులను గౌరవిస్తూనే, ప్రజలను సంప్రదించి, కొత్త పేరును సూచించమని కోరతామని ఆమె అన్నారు. ప్రధానమంత్రి కమలా ప్రసాద్‌తో పాటు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా నెల్సన్ ఐలాండ్‌ను సందర్శించారు. భారత్-ట్రినిడాడ్ మధ్య 150 ఏళ్ల సంబంధాలకు ఇది కొత్త బలాన్ని చేకూరుస్తున్నందున, ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

కేంద్ర మంత్రి జై శంకర్‌ పర్యటన 
చారిత్రాత్మకమైన నెల్సన్ ద్వీపంలో ఉండటం నిజంగా చాలా ఆనందంగా   ఉందని కేంద్ర మంత్రి  జై శంకర్‌సంతోషం వ్యక్తం చేశారు. సరిగ్గా 180 సంవత్సరాల క్రితం, భారతదేశం మరియు ట్రినిడాడ్-టొబాగోల చరిత్రలో తొలి అడుగు ఇక్కడే పడిందని గుర్తు చేశారు.  ఇక్కడికి వచ్చినప్పుడు,  ధైర్యవంతులైన  భారతీయులు తమ అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొని, కొత్త జీవితాలను ఎలా నిర్మించుకున్నారో ఆలోచించడం సహజమనీ అంటూ  వారి ధైర్యసాహసాలకు, వారి సంకల్పానికి , వారి దృఢ నిశ్చయానికి   నమస్సులు అందజేశారు.

వారు జీవన విధానాన్ని, సంప్రదాయాలను , విశ్వాసాన్ని తమతో పాటు తీసుకువచ్చారు. నిజానికి, తమతో పాటు ఒక సంపూర్ణ నాగరికతను తీసుకువచ్చారు. వీటిని ఒక వారసత్వ ప్రదేశంగా భవిష్యత్ తరాల కోసం నమోదు చేయడం ఎంతైనా సముచితమని తెలిపారు. భారతదేశ  గ్రాంట్ సహాయంతో నెల్సన్ ద్వీపంలోని సాంస్కృతిక వారసత్వాన్ని ఉన్నతీకరించడానికి ఉద్దేశించిన ఒక క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలోకార్యక్రమంలో   జై శంకర్‌  పాల్గొన్నారు. 

కమలా ప్రసాద్ ఘనత
భారత సంతతికి చెందిన కమలా ప్రసాద్-బిస్సేసర్ 2010లో ట్రినిడాడ్ మరియు టొబాగోకు మొదటి మహిళా ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు. 2010లో మొదటిసారి,   ఆ తరువాత 2026లో కూడా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.ఆమె  వ్యక్తి.  బ్రిటీష్ పాలనలో భారతదేశం నుండి చెరకు తోటలలో పనిచేయడానికి 'గిర్మిటియా' కార్మికులుగా వెళ్లిన వారి వారసురాలు ఆమె. 19వ శతాబ్దంలో బ్రిటీష్ వారు భారతదేశం నుండి ఒప్పంద కార్మికులను (Indentured Labourers) కరేబియన్ దేశాలకు తరలించారు. వారిని తక్కువ చూపు చూస్తూ "కూలీ" అని పిలిచేవారు. ఇది ఒక జాతి వివక్షతో కూడిన పదంగా (Racial Slur) ఉండేది.

Advertisement
 
Advertisement
Advertisement