breaking news
Trinidad & Tobago
-
ఎవరా 'బీహార్ కీ భేటీ'?.. మోదీ మనసులో కరేబియన్ ప్రధానికి ప్రత్యేక స్థానం
ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ట్రినిడాడ్ అండ్ టొబాగోకి చేరుకున్నారు. అక్కడ పోర్ట్ ఆప్ స్పెయిన్‌లోని పియార్కో అంతర్జాతీయ విమానశ్రయంలో ఆయనకు ఆ దేశ మిలటరీ సైనికులచే గౌరవ వందనం లభించింది. అంతేగాదు కరేబియన్ దేశ ప్రధాన మంత్రి కమలా పెర్సాద్-బిస్సేసర్(Kamla Persad-Bissessar)తో సహా 38 మంత్రులు, నలుగురు పార్లమెంట్ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ స్వాగత సమయంలో ట్రినిడాడ్ అండ్ టొబాగొ మంత్రి కమలా పెర్సాద్ భారతీయ దుస్తుల్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కానీ మన మోదీ ఆ దేశ ప్రధాని కమ్లా పెర్సాద్‌ను 'బిహారీకా బేటి' అని పిలవడం విశేషం. అంతేగాదు ఆ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ..భారత్‌కి ట్రినిడాడ్ అండ్ టొబాగోకి ఉన్న సంబంధబాంధవ్యాలతో సహా ఆ దేశ ప్రధాని భారత మూలాలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మరి ఆ విశేషంలేంటో సవివరంగా చూద్దామా..!.ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. ఈ కరేబియన్ దేశ ప్రధాని కమలా పెర్సాద్- మా బిహార్ కా భేటి అని సగర్వంగా చెప్పారు. ఆ ప్రధాని పూర్వీకులు బిహార్‌లోని బక్సర్‌కు చెందినవారని, ఆమె కూడా భారతదేశంలోని ఆ ప్రాంతాన్ని సందర్శించారని తెలిపారు. మాకు ఈ దేశంతో కేవలం రక్త సంబంధం లేదా ఇంటి పేరుతోనో బంధం ఏర్పడలేదని అంతకుమించిన బాంధవ్యం ఇరు దేశాల నడుమ ఉందని అన్నారు. స్నేహం చిగురించింది ఇలా..అలాగే ఇరు దేశాల మధ్య స్నేహం ఎలా చిగురించిందో కూడా గుర్తు చేసుకున్నారు. బనారస్, పాట్నా, కోల్‌కతా, ఢిల్లీ వంటి నగరాలు భారతదేశంలోనే కాకుండా ట్రినిడాడ్‌లో వీధి పేర్లుగా కూడా ఉన్నాయని చెప్పారు. అలా ఈ రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు అత్యంత బలంగా ఉన్నాయన్నారు. అందుకు నిదర్శనం ఇక్కడ జరుపుకునే నవరాత్రులు, మహాశివరాత్రి, జన్మాష్టమి వంటి పండుగలేనని అన్నారు. ఈ దేశ పురాతన చౌతల్(సంగీతం), భైతక్(వ్యాయామం) ఎంత ప్రాచుర్యం పొందాయో తెలుసనని అన్నారు. ఇక ఇక్కడ సుమారు 5 లక్షల మందికి పైనే భారత సంతతికి చెందినవారు నివసిస్తున్నారని, వారిలో దాదాపు 1800 మంది ప్రవాస భారతీయులని, మిగిలినివారు 1845, 1917ల మధ్య భారతదేశం నుంచి ఒప్పంద కార్మికులుగా వలస వచ్చిన స్థానిక పౌరులేనని గుర్తుచేశారు. అందువల్ల మిమ్మల్ని భారత్ జాగ్రత్తగా చూసుకుంటుందని హామీ ఇచ్చారు. అంతేగాదు మా దేశం మీకు సదా ఆహ్వానం పలుకుతుందని చెప్పారు. అలాగే బిహార్ కూడా శతాబ్దాలుగా వివిధ రంగాలలో ప్రపంచానికి మార్గం చూపించదని చెప్పారు. 21వ శతాబ్దంలో కూడా బీహార్ నుంచి కొత్త అవకాశాలు ఉద్భవిస్తాయని అన్నారు.ఎవరీ కమలా పెర్సాద్..కమలా పెర్సాద్ బిస్సేసర్ 1987లో రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. అనేక చారిత్రక నిర్ణయాలతో పేరుతెచ్చుకున్న మంత్రి. అంతేగాదు ఆమె కరేబియన్ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి, అటార్నీ జనరల్, ప్రతిపక్ష నాయకురాలు కూడా. అలాగే కామన్వెల్త్ దేశాలకు అధ్యక్షత వహించిన తొలి మహిళ. అదీగాక తొలి భారత సంతతి మహిళా ప్రధానిగా కూడా ఘనత దక్కించుకున్నారామె.ఇక ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో భారతదేశంలోని జోధ్‌పూర్ కంటే చిన్నదేశమే అయినా..మాన భారతదేశ సంస్కృతి, ఆర్థికవ్యవస్థలో కీలక పాత్ర పోషించడం విశేషం. కాగా, ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని నివశిస్తున్న ఆరవతరం భారతీయ ప్రవాసులకు ఓసీఐ(ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(OCI)) కార్డులు అదిస్తామని ప్రకటించారు మోదీ.#WATCH | Trinidad and Tobago | Addressing the Indian community, PM Modi says, "OCI cards will now be given to the 6th generation of the Indian diaspora in Trinidad and Tobago... We are not just connected by blood or surname, we are connected by belonging. India looks out to you… pic.twitter.com/hBU8tqCb9c— ANI (@ANI) July 4, 2025 (చదవండి: అమెరికా ఆఫీసులో భారతీయ మహిళ ఆకలి తిప్పలు..! పాపం ఆ రీజన్‌తో..) -
బిస్బేన్ హీట్‌పై ట్రినిడాడ్ గెలుపు
చాంపియన్స్ లీగ్‌లో భాగంగా ఆదివారమిక్కడ జరిగిన మ్యాచ్‌లో బిస్బేన్ హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రినిడాడ్ అండ్ టొబాగొ విజయం సాధించింది. 25 పరుగుల తేడాతో బిస్బేన్ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ట్రినిడాడ్ నిర్ణీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. కెప్టెన్ రామ్‌దిన్ 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బిస్బేన్ 18.4 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌటయింది. బర్న్స్(45) ఒక్కడే రాణించాడు. ట్రినిడాడ్ బౌలర్లలో రామ్‌పాల్ 4, ఎమ్రిట్ 2, నరైన్ 2 వికెట్లు పడగొట్టారు. రామ్‌దిన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు.