Dr B R Ambedkar Konaseema
-
బలభద్రపురంలో క్యాన్సర్ కేసుల కలకలం.. కలెక్టర్ క్లారిటీ, ఏమన్నారంటే..
తూర్పుగోదావరి: బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసుల కలకలంపై కలెక్టర్ ప్రశాంతి స్పష్టతనిచ్చారు. క్యాన్సర్ కేసులు విషయంలో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. జాతీయ సగటు కంటే తక్కువగా క్యాన్సర్ పాజిటివ్ కేసులను గుర్తించామన్నారు. జాతీయ సగటు ప్రతి 10 వేలకి 30 మందికి క్యాన్సర్ కేసుల నమోదు అవుతుండగా, బలభద్రపురం గ్రామంలో 23 కేసులను గుర్తించామన్నారు. గ్రామస్థులకు అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.ఇంటింటి సర్వే ద్వారా క్యాన్సర్ లక్షణాలున్నవారిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం, వైద్య నిపుణుల సూచనలు సలహాల మేరకు ప్రజలకు తగిన వైద్య చికిత్స అందజేస్తామని కలెక్టర్ అన్నారు. నిన్న (శనివారం) ఆమె బలభద్రపురంలోని ఇంటింటి సర్వేను క్ష్రేత స్థాయిలో కలెక్టర్ పర్యవేక్షించారు. గ్రామంలోని 2,492 గృహాల్లో సుమారు 10 వేలు జనాభా ఉన్నారన్నారు. వీరిలో ఎక్కువగా క్యాన్సర్ కేసుల నమోదు నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశామన్నారు.ఇందుకోసం ఏడుగురు స్పెషలిస్ట్ వైద్యులు, ఎనిమిది మంది డాక్టర్లు, 98 సిబ్బంది ఆధ్వర్యంలో 31 బృందాలను నియమించామన్నారు. వీరు ఇంటింటి ఆరోగ్య సర్వే ద్వారా ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. వైద్య నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అందుకు అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. క్యాన్సర్ వ్యాధి వైద్య నిపుణుల సూచనలు సలహాలను అనుసరించి క్యాన్సర్ కేసుల గుర్తించి తదుపరి వైద్య పరీక్షలను చేపట్టనున్నట్లు తెలిపారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల నుంచి స్పెషలిస్ట్ వైద్యులు, ఆంకా లజిస్టుల సూచనలను అనుసరించి వైద్య పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు. -
మండపేటలో మహిళల మండిపాటు
మండపేట: జనావాసాల నడుమ మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై మండపేట మహిళలు మండిపడ్డారు. ఆ షాపును తొలగించాలని డిమాండ్ చేస్తూ శనివారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. వివరాలివీ.. మండపేట 28, 29, 30 వార్డులకు అనుసంధానంగా ఉన్న సత్యశ్రీ రోడ్డులో గతంలో మద్యం షాపును తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేశారు. దీనిపై స్థానికులు ఆందోళన చేయడంతో అప్పట్లో ఎకై ్సజ్ అధికారులు ఆ షాపును తొలగించారు. ఇప్పుడు అదే రోడ్డులో సప్తగిరి థియేటర్ ఎదురుగా శాశ్వతంగా మద్యం దుకాణం పెట్టేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం పుణ్యమా అని పట్టణంలోని అనేక ప్రాంతాల్లో మద్యం షాపులు పెట్టి ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. అది చాలదన్నట్లు కొత్తగా కల్లుగీత కార్మికుల కోటాలో వచ్చిన మద్యం దుకాణాన్ని జనావాసాల నడుమ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై మండిపడుతున్న మహిళలు, స్థానికులు ఈ షాపు ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. సుమారు 50 మంది మహిళలు షాపు ఎదురుగా టెంట్ వేసి తొలి రోజు దీక్షల్లో కూర్చున్నారు. ‘మా ప్రాంతంలో మద్యం కొలిమి పెట్టొద్దని మూడు వార్డుల ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూంటే పట్టించుకోకుండా దుకాణం పెడతారా?’ అంటూ వారు ఫైరయ్యారు. ఇది నిత్యం వందలాది మంది ప్రయాణించే రోడ్డు అని, ఈ ప్రాంతంలో మూడు సినిమా థియేటర్లు కూడా ఉన్నాయని, సినిమాలకు వచ్చే ప్రేక్షకులతో ఈ మార్గం పగలు, రాత్రి రద్దీగా ఉంటుందని చెప్పారు. అలాగే, ఈ ప్రాంతంలో పాఠశాలలు కూడా ఉన్నాయని, తెల్లవారితే విద్యార్థులు ఈ రోడ్డు వెంబడే పాఠశాలలకు వెళ్లాలని, నివాస ప్రాంతాలు, జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న ఇటువంటి చోట ఏవిధంగా మద్యం దుకాణం పెడతారో చెప్పాలని మహిళలు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో అధికారులు మద్యం వ్యాపారులకు వత్తాసు పలకడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మద్యం షాపు తొలగించేంత వరకూ ఆందోళలన విరమించేది లేదని స్పష్టం చేశారు. రిలే దీక్షా శిబిరంలోని మహిళలతో సీఐ సురేష్ చర్చించారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం వెళ్తుందని, శాంతియుతంగా నిరసన తెలపాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీక్షల్లో షేక్ అప్రోజ్, పోతుల కీర్తి, తోట పార్వతి, వనపర్తి మౌనిక, తోట కనక మహాలక్ష్మి, వాసంశెట్టి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఫ జనావాసాల్లో మద్యం దుకాణంపై ఆగ్రహం ఫ రిలే నిరాహార దీక్షలు ప్రారంభం -
శివారు భూములకు నీరందించాలి
అమలాపురం రూరల్: ఆయకట్టు చివరి భూముల వరకూ సాగునీరు అందేలా క్రాస్బండ్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సాగునీటి ఎద్దడిపై జలవనరులు, డ్రైనేజీ, వ్యవసాయ అధికారులతో కలెక్టరేట్లో శనివారం ఆయన సమీక్షించారు. క్షేత్ర స్థాయి ఏఈలు ఏఓలు సమన్వయంతో పని చేసి, నీటి ఎద్దడి సమస్యను అధిగమించాలన్నారు. సాగునీటి సరఫరాపై ఏప్రిల్ 15 వరకూ అప్రమత్తంగా ఉండాలని, పంటలను కాపాడుకునేలా రైతులకు తోడ్పడాలని సూచించారు. ఆర్డీఓలు మండలాల వారీగా నివేదిక రూపొందించి, సాగునీరు సమృద్ధిగా అందేలా ప్రతి వారం రెండుసార్లు పర్యవేక్షించాలకాదేశించారు. రాజోలు మండలంలో సుమారు 70 ఎకరాలు, అమలాపురం 96 ఎకరాలు, ఉప్పలగుప్తం 100 ఎకరాలు, అల్లవరం 80 ఎకరాలు, మామిడికుదురు 100 ఎకరాలు, అంబాజీపేట మండలం చివరి ఆయకట్టులో 100 ఎకరాల్లో సాగునీటి సమస్య నెలకొందని కలెక్టర్ మహేష్ కుమార్ వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి, ఆర్డీఓలు దేవరకొండ అఖిల, కె.మాధవి, పి.శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. సీలేరు నుంచి 9,300 క్యూసెక్కులుసీలేరు: గోదావరి డెల్టాలో రబీ సాగుకు సీలేరు కాంప్లెక్స్ నుంచి 9,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏపీ జెన్కో అధికారులు తెలిపారు. రబీ నీటి ఎద్దడి నేపథ్యంలో గోదావరి డెల్టాకు సీలేరు జలాలను విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులు గతంలో కోరారు. ఈ మేరకు డొంకరాయి నుంచి 5 వేలు, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం నుంచి 4,300 క్యూసెక్కులు కలిపి మొత్తం 9,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని జెన్కో అధికారులు వివరించారు. గత ఫిబ్రవరి 10వ తేదీ నుంచి శనివారం వరకూ గోదావరి డెల్టాకు 10.19 టీఎంసీల నీటిని విడుదల చేశామన్నారు. ఈ నెల 31 వరకూ నీటిని విడుదల చేయనున్నామని వారు తెలిపారు. డీఆర్డీఏ పీడీగా జయచంద్రముమ్మిడివరం: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ప్రాజెక్టు డైరెక్టర్(పీడీ)గా టి.సాయినాథ్ జయచంద్ర శనివారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ డ్వామాలో పని చేస్తున్న ఆయన బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇప్పటి వరకూ పీడీగా పని చేసిన శివ శంకర ప్రసాద్ రాష్ట్ర డైరక్టర్‌గా పదోన్నతిపై వెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన జయచంద్రకు సెర్ప్ ఉద్యోగులు, జిల్లా యూనియన్ నాయకులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు దేవ వరాలబాబు, కార్యదర్శి ముత్తాబత్తుల వెంకటేశ్వరరావు, కోశాధికారి భూపతివర్మ, మహిళా విభాగం నాయకురాలు పాటి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ పేరు తొలగింపు దుర్మార్గం అల్లవరం: విశాఖపట్నంలోని క్రికెట్ స్టేడియానికి వైఎస్సార్ పేరును తొలగించడం దుర్మార్గమని మాజీ ఎంపీ చింతా అనురాధ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాసేవతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా యావత్తు దేశంలోనే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో కీర్తి పొందారని గుర్తు చేశారు. సంక్షేమ ప్రదాతగా, అపర భగీరథునిగా ప్రజల హృదయాల్లో చిరంజీవిగా స్థానం సంపాదించుకున్నారని అన్నారు. అధికారం చేతిలో ఉందనే అహంకారంతో వైఎస్సార్ పేరును ప్రభుత్వం కుట్రపూరితంగా తొలగించిందన్నారు. కడప జిల్లాకు ఎంతో గుర్తింపు తెచ్చిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహర్రెడ్డి ఎంతో గుర్తింపునిచ్చి, ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టారని గుర్తు చేశారు. వైఎస్సార్, ఎన్టీఆర్లకు సముచిత స్థానం కల్పించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా పేరు మార్చే దమ్ము చంద్రబాబుకుందా అని ప్రశ్నించారు. పేర్లు మార్చుతూ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, కూటమి ప్రభుత్వానికి వారు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందని అనురాధ పేర్కొన్నారు. -
పాఠశాల భవనం కూల్చివేత
అయినవిల్లి: పాత ప్రభుత్వ పాఠశాల భవనాన్ని కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా కూల్చివేసిన సంఘటన మండలంలోని వెలువలపల్లిలో చోటు చేసుకుంది. వివరాలివీ.. గ్రామంలోని పాత పోస్టాఫీసు వీధిలో పాత పాఠశాల భవనం ఉంది. నూతన పాఠశాల భవనం నిర్మించిన అనంతరం, మండల పరిషత్ నిధులతో పాత భవనానికి మరమ్మతులు చేశారు. అనంతరం ఆ భవనంలో మధ్యాహ్న భోజన పథకం వంటశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కొంత మంది స్థానికులు పాత భవనంలో పాడి గేదెలను కట్టి, పరిసరాలను పాడు చేశారు. దీనిపై స్థానిక అధికారులతో పాటు జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ స్థానిక ఎంపీడీఓ, ఎంఈఓలు ఈ విషయం తమ పరిధిలోనిది కాదని చెబుతూ సమస్యను పరిష్కరించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మోత బాబూరావు, తదితరులు శనివారం వచ్చి పాఠశాల భవనాన్ని దౌర్జన్యంగా కూల్చివేశారని, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి, సిమెంటు రేకులు, దూలాలు, ఇటుక తదితర మెటీరియల్‌ను ట్రాక్టర్‌పై తరలించుకుని పోయేందుకు ప్రయత్నించారని స్థానికులు తెలిపారు. వారికి అయినవిల్లిలంకకు చెందిన జేసీబీ ఆపరేటర్ సహకరించాడని చెప్పారు. దీనిపై స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనిపై ప్రధానోపాధ్యాయిని జి.లలితాదేవి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్పర్సన్ నూకపెయ్యి దుర్గాదేవి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అనంతరం, ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామని ఎస్సై హరికోటిశాస్త్రి చెప్పారు.ఫ మెటీరియల్ తరలించేందుకు యత్నం ఫ పోలీసులకు ఫిర్యాదు -
అక్కడ సరే... మరిక్కడ..!
సాక్షి, అమలాపురం: సముద్రం తీరం, నదీ గర్భాలను ధ్వంసం చేస్తూ పర్యావరణానికి పెను ముప్పుగా మారిన ఆక్వా చెరువులను ధ్వంసం చేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని తీర ప్రాంత ఆక్వా రైతుల్లో కొత్త ఆందోళనకు దారి తీస్తోంది. కోస్టల్ రెగ్యులైజేషన్ జోన్ (సీఆర్‌జెడ్) నిబంధనలకు విరుద్ధంగా సముద్ర తీరం, గోదావరి లంకలు, ఏటిగట్లను ఆనుకుని వందల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చెరువుల మీద కూడా ఎన్జీటీ కత్తి వేలాడుతోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అధికారికంగా 12 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. కానీ, అనధికారికంగా ఇంతకు రెండు రెట్లు సాగవుతోంది. వెనామీ రొయ్యల సాగుకు అనుమతి పొందాలంటే పలు నిబంధనలున్నాయి. చప్పనీటి చెరువుల సాగు పేరుతో (చేపల సాగు) అనుమతులు తెచ్చుకుని పలువురు అనధికారికంగా ఉప్పునీటి సాగు చేస్తున్నారు. డెల్టా ప్రాంతంలో అన్ని రకాల అనుమతులూ ఉన్న చెరువులు 10 శాతం కూడా ఉండవంటే అతిశయోక్తి కాదు. ఇవి కాకుండా సీఆర్‌జెడ్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా చెరువుల తవ్వకాలు పెద్ద ఎత్తున సాగాయి. గడచిన రెండున్నర దశాబ్దాల్లో అటు తీర ప్రాంతంలో శివారు ఏటిగట్లను, ఇటు గోదావరి ఏటిగట్లను ఆనుకుని ఆక్వా సాగు చేయడం పెను ప్రమాదానికి కారణమవుతోంది. రాజోలు దీవిలో సీఆర్‌జెడ్ పరిధిలో అనధికారికంగా సాగు జరుగుతున్న ప్రాంతాల పైనే ఆ ప్రాంత వాసులు ఎన్జీటీని ఆశ్రయించారు. అందువలన వాటిని తొలగించాలనే తీర్పు వచ్చింది. అయితే, ఇది మిగిలిన ప్రాంతాల్లో అక్రమంగా ఆక్వా సాగు చేస్తున్న రైతుల్లో ఆందోళనకు కారణమవుతోంది. తమ మీద కూడా ఎన్జీటీ పిడుగు పడుతుందేమోనని వారు కలవరపడుతున్నారు. గోదావరి గట్లను ఆనుకుని.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు అన్నపూర్ణగా పేరొందడానికి పావన జీవనది గోదావరే కారణం. అదే గోదావరి కన్నెర్ర చేసి వరదగా వచ్చి పడితే పెను విషాదాన్ని మిగులుస్తోంది. రక్షణగా ఉన్న ఏటిగట్లు తెగి పడి ఆస్తి, ప్రాణ నష్టాలు చోటు చేసుకున్న విషాద ఉదంతాలు పలు జరిగాయి. ఈ ముప్పును నివారించేందుకే ఏటిగట్లను పటిష్టపరచి, వాటికి రక్షణ కల్పిస్తూంటారు. బిటిష్ పాలనలోనే మద్రాస్ కన్జర్వెన్సీ యాక్టు ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఏటిగట్టు నుంచి నదీ గర్భంలో 100 నుంచి 150 మీటర్ల వరకూ ఎటువంటి తవ్వకాలూ చేయరాదు. నదీ ప్రవాహానికి అడ్డంగా నిర్మాణాలు చేయకూడదు. కానీ, ఉమ్మడి జిల్లాలో దీనిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఏటిగట్లను ఆనుకుని పెద్ద ఎత్తున ఆక్వా చెరువులు తవ్వేస్తున్నారు. ఐ.పోలవరం మండలం మురమళ్ల, ఎదుర్లంక, గోగుల్లంక, భైరవలంక; కాట్రేనికోన మండలం చింతపల్లిలంక, నడవపల్లి, పల్లంకుర్రు, బలుసుతిప్ప; ముమ్మిడివరం మండలం అన్నంపల్లి, లంకాఫ్ ఠాణేలంక; పి.గన్నవరం మండలం పి.గన్నవరం, కె.ఏనుగుపల్లితో పాటు అయినవిల్లి మండలం, కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గోవలంక పరిధిలోని అరటికాయ లంకల్లో సహితం ఏటిగట్లను ఆనుకుని అక్రమ చెరువులు పెద్ద ఎత్తున సాగవుతున్నాయి. దీనివల్ల గట్ల ఉనికి ప్రమాదకరంగా మారింది. అలాగే లంకల్లో చెరువు చుట్టూ వేస్తున్న గట్ల వలన ప్రవాహ దిశ మారి కూడా ఏటిగట్లు దెబ్బ తింటున్నాయి. దీనివలన వరదల సమయంలో గండ్లు పడే ప్రమాదం పొంచి ఉంది. మడ అడవుల ధ్వంసంఉమ్మడి జిల్లాలో మడ అడవులు విస్తారంగా ఉన్నాయి. తుపాన్లు, సునామీ వంటి విపత్తుల నుంచి ఇవి తీర ప్రాంతానికి ఎంతో రక్షణ కల్పిస్తాయి. అంతే కాదు.. సముద్రం ముందుకు చొచ్చుకుని రావడం వలన పెరుగుతున్న కోత నుంచి కూడా రక్షణ కల్పిస్తున్నాయి. తాళ్లరేవు మండలం కోరంగి, కాట్రేనికోన, అల్లవరం, సఖినేటిపల్లి మండలాల్లో అధిక సాంద్రతతో ఉన్న ఇటువంటి మడ అడవులను కూడా తొలగించి మరీ ఆక్వా చెరువులు తవ్వేశారు. కోరంగి అభయారణ్యంలో వందల ఎకరాల్లో మడ అడవులు ధ్వంసమయ్యాయి. అల్లవరం మండలం నక్కా రామేశ్వరం; ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం, వాసాలతిప్ప; కాట్రేనికోన మండలం పల్లం, నీళ్లరేవు, చిర్రయానాం, కొత్తపాలెం లైట్ హౌస్ వరకూ చెరువులు తవ్వి పీతలు, రొయ్యలు సాగు చేస్తున్నారు. ఈ చెరువులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ.. అధికారులు కళ్లు మూసుకోవడంతో ఈ చెరువులకు ప్రభుత్వం నుంచి రాయితీలు, బ్యాంకుల నుంచి రుణాలు, ఉచిత విద్యుత్ వంటివి అందుతున్నాయి. దీంతో అక్రమ ఆక్వా సాగుకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. దీనికి ఎన్జీటీ రూపంలోనైనా కళ్లెం పడితే తీర ప్రాంతానికి మేలు జరుగుతుందని ప్రకృతి ప్రేమికులు ఆశిస్తున్నారు. ఫ ఉమ్మడి జిల్లాలో తీరం పొడవునా అక్రమ ఆక్వా సాగు ఫ సీఆర్‌జెడ్ నిబంధనలకు అడుగడుగునా తూట్లు ఫ ఇసుక దిబ్బలు, సర్వే తోటలు, మడ అడవులు తొలగించి మరీ సాగు ఫ నదీ గర్భంలో సైతం దందా ఫ రాజోలు దీవిపై మాత్రమే ఎన్జీటీకి ఫిర్యాదు ఫ మిగిలినచోట్ల యథాతథంగా సాగు సముద్ర తీరాన్ని ఆనుకుని.. కాకినాడ జిల్లా తొండంగి నుంచి కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం వరకూ తీరం పొడవునా ఆక్వా చెరువులున్నాయంటే అతిశయోక్తి కాదు. సముద్ర తీరాన్ని ఆనుకుని గతంలో పెద్ద ఎత్తున వరి, సరుగుడు, కొబ్బరి సాగు జరిగేది. తరువాత కాలంలో వీటిని తొలగించి ఆక్వా చెరువులు తవ్వారు. అల్లవరం మండలం ఓడలరేవు, కొమరిగిరపట్నం, కాట్రేనికోన మండలం చిర్రయానాం, సఖినేటిపల్లి మండలం అంతర్వేది, మలికిపురం మండలం కేశనపల్లి వంటి ప్రాంతాల్లో నేరుగా సముద్రం నుంచి ఆక్వా చెరువుల్లోకి ఉప్పు నీరు తోడుతున్నారు. దీనినిబట్టి సముద్ర తీరంలో అక్రమ చెరువుల తవ్వకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చెరువులతో పాటు రొయ్యల సీడ్ ఉత్పత్తి చేసే కంపెనీలు సైతం సీఆర్‌జెడ్ పరిధిలో ఉన్నాయి. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో సుమారు 3 వేల ఎకరాల్లో ఈ సాగు జరుగుతోందని అంచనా. -
నేడు రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు
సిద్ధమైన 45 జతల ఎడ్లు సామర్లకోట: స్థానిక ఉండూరు రైల్వే గేటు వద్ద ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులో ఆదివారం రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు జరుగుతున్నాయి. ఈ మేరకు సీనియర్ విభాగం నుంచి 8 జతలు, జూనియర్ విభాగం నుంచి 37 జతల ఎడ్లు కృష్ణ, ప్రకాశం, నెల్లూరు, విశాఖ, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఉండూరుకు చేరుకున్నాయి. శ్రీ కుమారా రామ భీమేశ్వర ఎడ్ల పరుగు పోటీలు వల్లూరి సత్యేంద్రకుమార్ మెమోరియల్ పేరుతో ఎడ్ల పరుగు పోటీల్లో పాల్గొనే రైతులే ఏర్పాటు చేయడం విశేషం. మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ చందలాడ అనంత పద్మనాభం పోటీలను ప్రారంభిస్తారని నిర్వాహకులు వల్లూరి దొరబాబు, సీతారామరాజు, బిక్కిన రంగనాయకులు, చేకూరి రామకృష్ణ, మలిరెడ్డి వీరేంద్రలు తెలిపారు. సీనియర్ విభాగంలో మూడు, జూనియర్ విభాగంలో ఐదు బహుమతులను ఇవ్వనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. సీనియర్ విభాగంలో కిలోమీటరున్నర, జూనియర్ విభాగంలో కిలోమీటరు దూరాన్ని ఎడ్లు పరుగెత్తాల్సి ఉంటుందన్నారు. బాలికలపై అత్యాచారయత్నం పెద్దాపురం: ఇద్దరు బాలికలపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. స్థానికుల కథనం మేరకు శనివారం స్థానిక దర్గా సెంటర్లో వ్యాపారం చేసుకుంటున్న కామేశ్వరరావు రెండు, ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలికల అరుపులతో స్థానికు లు అక్కడికి చేరుకుని దేహశుద్ధి చేసి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడు అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఎస్ఐ మౌనికను వివరణ కోరగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
టెక్నిక్‌తో జీవితం సెట్
● ఏప్రిల్ 30న పాలిసెట్ ● జిల్లాలో 8 పాలిటెక్నిక్ కళాశాలలు ● అందుబాటులో 1820 సీట్లు రాజమహేంద్రవరం రూరల్: ప్రపంచం సాంకేతికంగా దూసుకుపోతోంది. ఆ వేగాన్ని అందుకోవాలనే లక్ష్యంతో నేటి యువత సైతం తత్సంబంధమైన విషయ పరిజ్ఞానాన్ని అభ్యసించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంజినీరింగ్‌లో సైతం కంప్యూటర్ ఆధారిత కోర్సుల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసే విద్యార్థుల కంటే ముందుగానే ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం పాలిటెక్నిక్ ఉత్తీర్ణులకు లభిస్తుంది. దీంతో పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సులపై దృష్టిపెడుతున్నారు. సాంకేతిక విద్యకు పునాది సాంకేతిక విద్యకు పునాది వేసే పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 30వ తేదీన పాలిసెట్ జరగనుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2025ను ప్రకటించింది. పాలిటెక్నిక్ ప్రవేశం ద్వారా తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య లభిస్తే దానిని పునాదిగా మార్చుకుని భావి జీవితానికి బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. గ్రామీణ పేద విద్యార్థులకు ఇంజినీరింగ్ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. వారికి పాలిటెక్నిక్ కోర్సులు చక్కని వేదికలని పలువురు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. పాలిసెట్ ద్వారా పలు కోర్సులతో సాంకేతిక విజ్ఞాన్ని సొంతం చేసుకుని సత్వర ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని సూచిస్తున్నారు. ఏప్రిల్ 15 తుది గడువు పాలిసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి ఈ నెల పదో తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి ఈ నెల 12వ తేదీ నుంచే ఫీజులను ఆన్లైన్లో గేట్‌వే ద్వారా చెల్లించే సౌకర్యం అందుబాటులో ఉంచారు. పాలిసెట్ ప్రవేశ పరీక్ష రాయదలుచుకున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 15వ తేదీ వరకు గడువు ఉంది. 10వ తరగతి, తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన వారు, ఈ ఏడాది అటువంటి పరీక్షలు రాస్తున్నవారు కూడా పాలిసెట్‌కు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్ష 120 మార్కులకు నిర్వహిస్తారు. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఈ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 30న పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష రాయడానికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100, ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లభించే కోర్సులు ఇవీ.. పాలిటెక్నిక్‌లో వివిధ కోర్సులను జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు అందిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆర్కిటెక్చర్ తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి. పలు చోట్ల ఒక్కో కోర్సులో ఒక్కో బ్రాంచికి 60 నుంచి 120 వరకు సీట్లు అందుబాటులో ఉంటాయి. పాలిటెక్నిక్ కోర్సుల కాల వ్యవధి మూడేళ్ల వరకు ఉంటుంది. ఆరు నెలల పాటు విద్యార్థులకు పారిశ్రామిక శిక్షణ కూడా ఉంటుంది. విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకునే శిక్షణ సైతం ఇస్తారు. జిల్లాలో 8 కళాశాలలు జిల్లాలో విద్యార్థులకు మొత్తం 8 పాలిటెక్నిక్ కళాశాలల్లో 1820 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీఎంఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అనపర్తిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, రాజానగరం గైట్ పాలిటెక్నిక్, రాజానగరం ఐఎస్టీఎస్ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, పిడింగొయ్యిలోని రైట్ పాలిటెక్నిక్, పాలచర్లలోని బీవీసీ పాలిటెక్నిక్, కొండగుంటూరు ఎస్ఎస్ పరిమళ పాలిటెక్నిక్, బూరుగపల్లి బెన్నయ్య పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. సద్వినియోగం చేసుకోవాలి పదో తరగతి ముగిసిన వెంటనే పాలిటెక్నిక్ చదివితే చిన్న వయసులోనే ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉన్నత విద్యతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు ఉంటాయి. పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు బొమ్మూరులోని జీఎంఆర్ పాలిటెక్నిక్‌లో ఉచిత శిక్షణ తో పాటు స్టడీమెటీరియల్ ఇస్తారు. పాలిటెక్నిక్ పూర్తయిన తరువాత ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరవచ్చు. లేదా ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు. – వి.నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్, బొమ్మూరు జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల, ఏపీ పాలిసెట్ జిల్లా కో–ఆర్డినేటర్ పాలిసెట్‌కు ఉచిత శిక్షణ బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఏప్రిల్ మూడో తేదీ నుంచి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఉచిత శిక్షణతో పాటు ప్రవేశపరీక్షకు సంబంధించి స్టడీ మెటీరియల్ సైతం ఉచితంగా అందజేస్తారు. ఆసక్తి గల విద్యార్థులు ముందుగా పాలిటెక్నిక్ కళాశాలలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. -
అనర్హులే పట్టు సాధించారు
ఫ అర్హులకు అందని ప్రోత్సాహం ఫ చేబ్రోలు పట్టు పరిశ్రమ అధికారుల మాయాజాలం ఫ ఆందోళన చేపట్టిన రైతులు పిఠాపురం: అనర్హులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నా రని మల్బరీ రైతులు ఆందోళనకు దిగారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు పట్టు పరిశ్రమ అధికారులు సిఫార్సులకు ప్రాధాన్యమిచ్చి అర్హులను విస్మరించారని రైతులు ఆరోపిస్తున్నారు. 53.19 ఎకరాల్లో 26 మంది రైతులను గుర్తించి, ఇందులో 20 ఎకరాలు దాటి మల్బరీ సాగు చేయలేదని రైతులు వాపోయారు. నువ్వులు ఇతర పంటలు సాగు చేసిన వారికి కూడా మల్బరీ నర్సరీ ప్రోత్సాహం ఎకరానికి 22,500 చొప్పు న ఇస్తున్నారని, ఇందులో అర ఎకరం సాగు చేసిన వా రికి కూడా రెండు నుంచి నాలుగు ఎకరాలలో వేసినట్టు నమోదు చేశారని పట్టు రైతులు ఆరోపించారు. అనర్హులకు పరిహారం గత ఏడాది గూళ్లు నష్టపోయిన వారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.11,30,000 సహాయం అందించినప్పటికీ అధికారులకు నచ్చిన రైతులకే పరిహారం అందించారని, మిగిలిన వారిని వదిలేసారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇన్సెంటీవ్లు కూడా సీరియల్ పాటించట్లేదని వారు పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా ఇష్టం వచ్చిన వారి పేర్లు నమోదు చేసి, అర్హులకు మొండిచేయి చూపారని రైతులు ఓరుగంటి చక్రధర్ రావు, సూరిబాబు, ఉలవల సురేష్, చక్రి వెలుగుల మాణిక్యం తదితరులు కోరుతున్నారు. అధికారులు అన్యాయం చేశారు గత ఏడాది నాలుగు ఎకరాల్లో మల్బరీ సాగు చేపట్టాను. గూళ్లు సక్రమంగా రాకపోవడంతో పట్టు పరిశ్రమ అధికారుల సూచనతో పంట తొలగించి నువ్వు చేను వేశాను. గుళ్లు కట్టిన రైతులకు అప్పటి ప్రభుత్వం నష్టపరిహారం అందించింది. అందులో కూడా తనను గుర్తించలేదు. నర్సరీ వేసిన వెంటనే ఎకరానికి 22,500 చొప్పున ఇవ్వాల్సిన ప్రోత్సాహం కూడా అందించలేదు. అధికారుల నిర్వాకం వల్ల రూ.మూడు లక్షల వరకు నష్టపోయాను. – ఓరుగంటి సూరిబాబు, పట్టు రైతు, చేబ్రోలు అర్హులకే ఇస్తున్నాం మల్బరీ సాగు చేసిన రైతులనే నర్సరీ ప్రోత్సాహకాలు అందించడానికి గుర్తించాం. అలాగే గూళ్లు నష్టం కూడా కొంతమంది రైతులకు అందకపోవటం వాస్తవమే. వారిని రెండో జాబితాలో పెట్టాము. అది ప్రభుత్వం నుంచి ఇంకా రాలేదని ఇన్సెంటీవ్ పాత సీరియల్ ప్రకారమే అందిస్తాం. ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో ఆ రైతులు ఎనిమిది ఎకరాలు మల్బరీ సాగు చేసినప్పటికీ ఇప్పుడు నువ్వు చేలు వేసుకున్నారు. – టి.మోసయ్య, పట్టు పరిశ్రమ అధికారి, చేబ్రోలు -
ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ
● ఐదు కాసుల బంగారు నగలు, ● 300 గ్రాముల వెండి వస్తువుల అపహరణ పి.గన్నవరం: మండలంలోని ఊడిమూడి శివారు ఆదిమూలం వారిపాలెంలో దొంగలు ఒక ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని ఐదు కాసుల బంగారు నగలు, 300 గ్రాము ల వెండి వస్తువులను చోరీ చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ఆదిమూలం రాజరాజేశ్వరి 15 రోజుల క్రితం హైదరాబాద్‌లోని కుమార్తె ఇంటికి వెళ్లారు. ఆమె సోదరుడు ఊడిమూడికి చెందిన కొండ్రెడ్డి కాశీ విశ్వనాథ్ అప్పుడప్పుడూ వచ్చి రాజరాజేశ్వరి ఇంటిని పరిశీలించి వెళ్తున్నారు. గత సోమవారం చివరగా ఆమె ఇంటిని చూసి వెళ్లాడు. ఇటీవల అదే గ్రామంలోని చింతావారిపేటలో దొంగతనం జరిగిన నేపథ్యంలో.. శనివారం ఉదయం సోదరి ఇంటిని పరిశీలించేందుకు కాశీ విశ్వనాథ్ ఆ ఇంటికి వచ్చి వెనుక తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గమనించి సోదరికి సమాచారం అందించారు. ఇంట్లోని బీరువాలు పగులగొట్టి, సామాన్లు చిందరవందరగా ఉండడం, బంగారు, వెండి వస్తువులతో పాటు, రూ.25 వేల నగదును తస్కరించినట్టు వారు గుర్తించారు. -
గాంధీకాలనీలో అంబేడ్కర్‌కు అవమానం
● విగ్రహానికి చెప్పుల దండ వేసిన దుండగులు ● ఆందోళన చేపట్టిన రిజర్వేషన్ల వ్యతిరేక పోరాట సమితి ● బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాజీ హోం మంత్రి వనిత డిమాండ్ నల్లజర్ల: మండలం దూబచర్ల శివారు గాంధీకాలనీలో రహదారి పక్కనున్న అంబేడ్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. శనివారం ఉదయం విగ్రహానికి చెప్పులదండ ఉండటం చూసి అంబేద్కర్ అభిమానులు, రిజర్వేషన్ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దూబచర్ల–లక్కవరం రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఆందోళన 11 గంటల వరకు జరుగుతూనే ఉంది. పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకొని చెప్పుల దండను తొలగించి క్లూస్ టీం, డాగ్స్కాడ్లను రంగంలోకి దింపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు అక్కడికి చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడి అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేయాలంటూ పిలుపునిచ్చారు. విద్వేషాలు రెచ్చగొట్టే వారిని అరెస్ట్ చేయాలని కోరారు. అనంతరం మాజీ హోంమంత్రి, గోపాలపురం నియోకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి తానేటి వనిత సంఘటనా స్థలానికి వచ్చి ఆందోళనకారులకు మద్దతు ప్రకటించారు. ఈ ఘటన హేయమైన చర్య అని, పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేయించి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ఇక్కడి విగ్రహాన్ని తొలగించి నూతన విగ్రహం ఏర్పాటు చేసి పైన రూఫ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వారు ఏర్పాటు చేయకపోతే తమ పార్టీ ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండలశాఖ అధ్యక్షులు వెల్లంకి వెంకట సుబ్రమణ్యం, నాయకులు బంక అప్పారావు, ముప్పిడివెంకటరత్నం, సాలి వేణు, తొమ్మండ్రు రమేష్, నక్కా పండు, పంది సత్యనారాయణ, తొమ్మండ్రు రవి, పెండ్యాల హరేరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.ఏఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీ దేవకుమార్, నల్లజర్ల, దేవరపల్లి, కొవ్వూరు సీఐల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నివాళులర్పించారు. -
భక్తులతో శోభిల్లిన వాడపల్లి
● వైభవంగా పూజాదికాలు ● ఏడు ప్రదక్షిణలు చేసిన భక్తులు కొత్తపేట: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర క్షేత్రం భక్తజనంతో శోభిల్లింది. ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు వేద పండితులు స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. తిరుప్పావై ద్రవిడ వేదపారాయణం చేసి సుందరంగా అలంకరించారు. వేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు మాడ వీదుల్లో ఏడు ప్రదక్షిణలు చేశారు. గోవింద నామస్మరణతో వాడపల్లి మార్మోగింది. 11 గంటల నుంచి నుంచి వేలాది మందికి అన్న సమారాధన చేశారు. దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎస్సై రాము ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రద్దీ మేరకు ఏర్పాట్లు వాడపల్లి క్షేత్రానికి పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సి ఉందని డీఎస్పీ సుంకర మురళీమోహన్ అన్నారు. శనివారం ఆయన క్షేత్రాన్ని సందర్శించి క్యూలైన్లను, పార్కింగ్ స్థలాలను పరిశీలించి భక్తులకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించారు. ఈఓ చక్రధరరావు, స్థానిక పోలీసు అధికారులతో ఈ మేరకు సమీక్షించి పలు సూచనలిచ్చారు. దేవస్థానం సెక్యూరిటీ పెంచాలని, బందోబస్తుకు అదనపు సిబ్బందిని పెంచే చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆయన వెంట రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్, ఎస్సై రాము ఉన్నారు. రూ.50.97 లక్షల ఆదాయం దేవస్థానానికి శనివారం సాయంత్రం 4 గంటల వరకూ విశిష్ట దర్శనం ద్వారా రూ.13,05,400, ప్రత్యేక దర్శనం ద్వారా రూ.8,63,900, వేదాశీర్వచనం ద్వారా రూ.16,76,232, లడ్డు ప్రసాదం ద్వారా రూ 6,11,100, శాశ్వత అన్నదానానికి రూ.83,428, నిత్యాన్నదానానికి రూ.1,45,341, ఆన్లైన్ టిక్కెట్ల ద్వారా రూ.1,57,048 పాటు వివిధ రూపాల్లో రూ.50,96,624 ఆదాయం వచ్చినట్టు ఈఓ చక్రధరరావు తెలిపారు. బాలబాలాజీ ఆలయంలో కోలాహలం మామిడికుదురు: పవిత్ర వైనతేయ గోదావరి నదీతీరం అప్పనపల్లిలో కొలువు తీరిన బాల బాలాజీ స్వామి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. తెల్లవారు జామున సుప్రభాత సేవ, తొలి హారతి అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామి వారి సన్నిధిలో శ్రీలక్ష్మీ నారాయణ హోమం నిర్వహించారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.2,58,570 ఆదాయం వచ్చిందని ఈఓ ఎం.సత్యనారాయణరాజు తెలిపారు. స్వామి వారి నిత్యాన్నదానం ట్రస్టుకు భక్తులు రూ.55,783 విరాళాలుగా అందించారన్నారు. నాలుగు వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని చెప్పారు. 2,300 మంది భక్తులు స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారన్నారు. -
మెగా డీఎస్సీపై మొదటి సంతకం ఏమైంది?
కూటమి హామీలపై ధ్వజమెత్తిన ఏఐవైఎఫ్ అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే తొమ్మిడి నెలలు గడస్తున్నా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు మాటే మరిచిందని ఏఐవైఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షుడు రెడ్డి సతీష్‌కుమార్ ధ్వజమెత్తారు. అమలాపురంలోని ఎస్టీయూ జిల్లా కార్యాలయంలో 17వ ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల లోగోను జిల్లా శాఖ ప్రతినిధులు శనివారం ఆవిష్కరించారు. సతీష్‌కుమార్, కార్యదర్శి యనమదల ఉమేష్ తదితరులు కూటమి ప్రభుత్వ హామీల వైఫల్యాలను ఎండగట్టారు. మెగా డీఎస్సీ అంటూ అధికారంలోకి వచ్చిన రోజు మొదటి సంతకంగా చేసినా నేటికీ చర్యలు లేవని ఆరోపించారు. నిరుద్యోగ భృతిపై ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాలోని ఓఎన్జీసీ వనరులను గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు తరలిస్తున్న పరిణామాలపై ఏఐవైఎఫ్ జిల్లా శాఖ ప్రతినిధులు దుయ్యబట్టారు. తిరుపతిలో వచ్చే మే 15వ తేదీ నుంచి ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహా సభల్లో కూటమి ప్రభుత్వం వైఫల్యాలను చర్చించనున్నట్టు వారు తెలిపారు. జతీయ మహాసభల లోగో ఆవిష్కరణలో ఏఐవైఎఫ్ జిల్లా కోశాధికారి యాండ్ర నాగరాజు, జిల్లా శాఖ సభ్యులు నిమ్మకాయల కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. -
శక్తి టీమ్‌లతో రక్షణ
వాహనాలను ప్రారంభించిన ఎస్పీ కృష్ణారావు అమలాపురం టౌన్: జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన అయిదు శక్తి టీమ్‌లను మహిళలు, బాలికలు సద్వినియోగం చేసుకుని రక్షణ పొందాలని ఎస్పీ బి.కృష్ణారావు సూచించారు. జిల్లాలో ఈ టీమ్‌లు ఆడ పిల్లలు, మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసినట్లు వివరించారు. స్థానిక ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో ఈ శక్తి టీమ్‌ల సభ్యులైన మహిళా పోలీసులకు వాహనాలను (స్కూటీలు) ఎస్పీ కృష్ణారావు జెండా ఊపి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో అయిదు శక్తి టీములను అమలాపురం పోలీస్ సబ్ డివిజన్‌కు రెండు, కొత్తపేట డివిజన్‌కు రెండు, రామచంద్రపురం డివిజన్‌కు ఒకటి చొప్పున కేటాయించామని చెప్పారు. మహిళా టీమ్‌ల సభ్యులైన మహిళా పోలీసులు, ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన మహిళలతో ఎస్పీ మాట్లాడారు. శక్తి వుమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ యాప్ ఉపయోగాలను ఎస్పీ వివరించారు. శక్తి టీమ్ ప్రతినిధులు తమకు కేటాయించిన ఏరియా పరిధిలోని ఆడపిల్లలు, మహిళలకు చేరువగా ఉండి వారితో సత్ సంబంధాలు నిర్వహించుకోవాలని సూచించారు. జిల్లాలోని మహిళల్లో ఎవరికై నా ఎలాంటి సమస్య ఎదురైనా ముందు ధైర్యంగా ఉండి తర్వాత శక్తి యాప్‌ను సద్వనియోగం చేసుకుని సమాచారం అందించి వారి సహాయం, సేవలు పొందాలని ఎస్పీ కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్, అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, ఆర్మ్డ్ డీఎస్పీ సుబ్బరాజు, పట్టణ సీఐ పి.వీరబాబు, సోషల్ మీడియా సీఐ జి.వెంకటేశ్వరరావు, ఎస్పీ కార్యాలయం ఏవో జగన్నాథం, మహిళా ఎస్సై గంగాభవాని పాల్గొన్నారు. -
ఉపాధి హామీలో కోనసీమ ఫస్ట్
అమలాపురం రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (నరేగా) పథకం అమలులో అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఈ ఆర్థిక సంవత్సరంలో 57 లక్షల పనిదినాలకు గాను 56 లక్షలు పని దినాల కల్పన సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్‌లు అమరావతి నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చిన్న, సన్నకారు రైతులకు చెందిన లక్ష ఎకరాల్లో పండ్ల తోటల పెంచడానికి ప్రణాళికలు సిద్ధం, పంట సేద్యపు నీటి కుంటల నిర్మాణం, పల్లె పండగ పనులైన గోకులాలు, సీసీ రోడ్లు నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో రోజువారీ సగటు వేతనాన్ని రూ.291.21 చెల్లిస్తూ కోనసీమ జిల్లా... రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. జిల్లా వ్యాప్తంగా పల్లె పండగలో 896 గోకులాలు మంజూరు చేయగా వీటిలో 720 గోకులాలు నిర్మాణాలు పూర్తి అయ్యాయన్నారు. జిల్లావ్యాప్తంగా 118 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు మంజూరు చేయగా వీటిలో 84 కిలోమీటర్లు అంతర్గత సీసీ రోడ్లు నిర్మాణం పూర్తయిందన్నారు. ఈ విభాగం బోగస్ మస్టర్లకు అడ్డుకట్ట వేయటంతోపాటు, పని వేళల్లో మార్పులు చేస్తూ కూలీలకు గిట్టుబాటు వేతనం అందించాలని సూచించారు. ఉద్యోగులు అవినీతికి పాల్పడితే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ అవసరాలకు ఈ కుంటలను వినియోగించుకుంటూనే వీటిలో చేపల పెంపకం ద్వారా అదనపు అదాయాన్ని సమకూర్చుకుంటున్నారని తెలిపారు. డ్వామా పీడీ ఎస్.మధుసూదన్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సీహెచ్ ఎన్వీ కృష్ణారెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ పి.రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
పారదర్శక ఎన్నికలకు సలహాలు
అమలాపురం రూరల్: ఓటరు జాబితా సవరణ, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి రాజకీయ పార్టీలు సూచనలు, సలహాలు తెలియజేయాలని జిల్లా రెవెన్యూ అధికారి బీఎల్ఎన్ రాజకుమారి కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లాస్థాయి సూచనలు సలహాల సమావేశాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణను మరింత పారదర్శకంగా, చేపట్టడానికి తరచూ సలహాలు ఇవ్వాలని ప్రతినిధులను కోరారు. ప్రతి మూడు మాసాలకు ఒకసారి 18 సంవత్సరాల నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకునే వెసులుబాటు ఉందని, గ్రామ సచివాలయాల్లో ఓటరుగా నమోదు చేసుకోవచ్చని అన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ఫారం 6, 7, 8 ల క్లెయిమ్‌లను పారదర్శకంగా పరిష్కరిస్తామన్నారు. టిడ్కో గృహాలలో ఉంటున్న వారికి స్థానికంగానే ఓటు హక్కు ఉందని, వీరి ఓట్లను టిడ్కో ప్రాంతానికి మార్పు చేయాలని ప్రతినిధులు కోరగా చర్యలు చేపడతామని ఆమె తెలిపారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, రాజకీయ పార్టీల నాయకులు దూరి రాజేష్, చిక్కాల సతీష్, వడ్డీ నాగేశ్వరరావు, భవాని, ఉప తహసీల్దార్ శివరాజ్, జూనియర్ అసిస్టెంట్ సాయిరాం పాల్గొన్నారు. విద్యా విజ్ఞాన అధ్యయన విహార యాత్ర కోనసీమ జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల విద్యా, విజ్ఞాన, అధ్యయన విహార యాత్ర బస్సులను కలెక్టరేట్ నుంచి శుక్రవారం జిల్లా రెవెన్యూ అధికారి రాజకుమారి జెండా ఊపి ప్రారంభిం చారు. ఈ విహారయాత్ర 23వ తేదీ వరకు 131 మంది 8 ,9 తరగతుల విద్యార్థులు, 20 మంది ఉపాధ్యాయులతో సాగుతుందన్నారు. ఈ యాత్రలో విద్యార్థులు తిరుపతిలోని ఐఐటీ తిరుపతి, రీజినల్ సైనన్స్ సెంటర్, తిరుపతి జూలాజికల్ గార్డెన్, చంద్రగిరికోట వంటి ప్రముఖ విద్యా, శాస్త్ర, సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించ నున్నారన్నారు. ఉమ్మడి జిల్లాలోని కోరింగ అభయారణ్యాన్ని పరిశీలించనున్నారన్నారు. విద్యార్థులకు శాసీ్త్రయ అవగాహన, ప్రకృతి పరిరక్షణ ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించేలా ఈ యాత్ర రూపొందించామన్నారు. డీఈవో షేక్ సలీం బాషా, ఉప విద్యాశాఖ అధికారులు జి.సూర్య ప్రకాశం, సుబ్రహ్మణ్యం, ఎంఈఓలు, జిల్లా సైన్‌న్స్ అధికారి సుబ్రహ్మణ్యం ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
25 నుంచి సీపీఎం ప్రజా చైతన్య సైకిల్‌యాత్ర
అమలాపురం టౌన్: కొన్ని నెలలుగా పరిష్కారం నోచుకోని ప్రజా సమస్యలపై ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకూ ప్రజలను చైతన్య పరిచే దిశగా పలు మండలాల్లో సీపీఎం ఆధ్వర్యంలో సైకిల్ యాత్రను నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రజా చైతన్య సైకిల్ యాత్రకు సంబంధించిన కర పత్రాలను పార్టీ నాయకులు శుక్రవారం విడుదల చేశారు. ఈ సైకిల్ యాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొంటారని పార్టీ జిల్లా కన్వీనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఏప్రిల్ ఒకటో తేదీన అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. పట్టణంతోపాటు అమలాపురం, ముమ్మిడిరం నియోజకవార్గాల్లోని నాలుగు మండలాల్లో 60 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు అండ్ర మాల్యాద్రి, జిల్లా కమిటీ ప్రతినిధులు జి.దుర్గా ప్రసాద్, టి.నాగ వరలక్ష్మి, శ్యామల, శివ తదితరులు సైకిల్ యాత్ర రూట్లను వివరించారు. జిల్లాలో భూస్వాముల ఆక్రమణల్లో ఉన్న కొబ్బరి చెట్లు పేదలకు పంచాలి, అక్రమ ఆక్వా చెరువులను అరికట్టాలి, కామనగరువులో ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రి ప్రభుత్వం అధీనంలో నిర్మించాలి, నడవాలి, అమలాపురంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలి వంటి డిమాండ్లను సైకిల్ యాత్రలో ప్రజలకు వివరించి చైతన్య పరచనున్నారు. -
మందలించాడని తండ్రిని హత్య చేసిన కూతురు
మండపేట: తనను మందలించాడన్న కోపంతో ఓ మహిళ ప్రియుడి సహాయంతో కన్న తండ్రినే కిరాతకంగా హత్య చేసింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాలను గురువారం టౌన్ సీఐ దారం సురేష్ మీడియాకు వెల్లడించారు. 22వ వార్డు మేదరపేట వీధిలో సూరా రాంబాబు అనే వ్యక్తి ఉంటున్నాడు. ఇతని కుమార్తె వస్త్రాల వెంకట దుర్గకు రామచంద్రపురం కొత్తూరుకు చెందిన ముమ్మిడివరపు సురేష్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసిన తండ్రి రాంబాబు కుమార్తెను మందలించాడు. దీంతో కోపోద్రిక్తురాలైన దుర్గ కన్న తండ్రిని చంపాలని నిర్ణయించుకుంది. ప్రియుడు సురేష్‌తో కలిసి హత్యకు పథకం వేసింది. ఈ నెల 16న తండ్రి ఒంటరిగా ఉన్న సమయం చూసి ప్రియుడు సురేష్‌కు ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. అతను తోడుగా తన స్నేహితుడు తాటికొండ నాగార్జునతో కలిసి వచ్చాడు. ఆ ముగ్గురూ కలిసి మంచంపై నిద్రిస్తున్న రాంబాబు ఛాతిపై కూర్చొని పీక నులిమి.. డొక్కల్లో తన్ని హత్య చేశారు. మృతుడి సోదరుడు సూరా పండు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తన సోదరుడు అనుమానాస్పదంగా మృతి చెందాడంటూ.. దుర్గపై అనుమానం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి.. విశాఖపట్నం పారిపోతున్న నిందితులు ముగ్గురినీ అరెస్ట్ చేశారు. విచారణలో నేరం అంగీకరించడంతో గురువారం వారిని రామచంద్రపురం కోర్టుకు తరలించగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. -
సైక్లోథాన్ పునఃప్రారంభం
అమలాపురం టౌన్: దేశ సమగ్రత, సమైక్యత కోసం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) ఆధ్వర్యాన దేశంలోని సముద్ర తీర నగరాలు, పట్టణాల మీదుగా సైక్లోథాన్ (సైకిల్ యాత్ర) చేపట్టడం అభినందనీయమని డీఆర్ఓ బీఎల్ఎన్ రాజకుమారి అన్నారు. బుధవారం సాయంత్రానికి అమలాపురం చేరుకున్న సైకిల్ యాత్రికులు రాత్రి ఇక్కడ బస చేసి, గురువారం ఉదయం స్థానిక గడియారం స్తంభం సెంటర్ నుంచి తమ యాత్రను పునఃప్రారంభించారు. డీఆర్ఓ రాజకుమారి, జిల్లా ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. నర్సాపురం, మచిలీపట్నం మీదుగా సైకిల్ యాత్ర సాగనుందని సీఐఎస్ఎఫ్ డిప్యూటీ కమాండర్ వీఏ ప్రభాకర్ తెలిపారు. ఈ సైకిల్ యాత్ర ఈ నెల 31న తమిళనాడులోని కన్యాకుమారిలో ముగుస్తుందని చెప్పారు. ఈ యాత్ర ద్వారా సీఐఎస్ఎఫ్ దళాల సభ్యులు దేశ సమగ్రత, సమైక్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. యాత్ర పునఃప్రారంభ కార్యక్రమంలో ఆర్మ్డ్ డీఎస్పీ సుబ్బరాజు, ఏఆర్ ఆర్ఐ ఎన్.బ్రహ్మానందం, తహసీల్దార్ పి.అశోక్ ప్రసాద్, వెటరన్ క్రీడాకారులు మెహబూబ్ సిస్టర్స్ షహీరా, షకీలా తదితరులు పాల్గొన్నారు. నేడు విద్యా విజ్ఞాన విహార యాత్ర అమలాపురం రూరల్: విద్యా విజ్ఞాన విహార యాత్రను శుక్రవారం కలెక్టరేట్ వద్ద ప్రారంభిస్తున్నట్లు జిల్లా విద్యా శాఖ అధికారి షేక్ సలీం బాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాత్రలో 131 మంది విద్యార్థులు, 20 మంది ఉపాధ్యాయులు పాల్గొంటున్నారని తెలిపారు. విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించేందుకు ఈ యాత్రను రూపొందించారన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు తిరుపతిలోని ఐఐటీ, రీజినల్ సైన్స్ సెంటర్, జూలాజికల్ గార్డెన్, చంద్రగిరి కోట వంటి వాటిని సందర్శిస్తారని వివరించారు. అనంతరం జిల్లాలోని కోరింగ అభయారణ్యాన్ని సందర్శిస్తారన్నారు. ఈ యాత్ర ఈ నెల 23న ముగుస్తుందని తెలిపారు. ఉచిత శిక్షణ అమలాపురం రూరల్: కొత్తపేటలోని వీకేవీ ప్రభు త్వ డిగ్రీ కళాశాల స్కిల్ హబ్‌లో త్వరలో ఆఫీస్ అసిస్టెంట్ ఉచిత శిక్షణ ప్రారంభిస్తున్నామని జి ల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డి.హరిశేషు గురు వారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ అనంతరం విద్యార్థులకు ఉద్యోగం కల్పిస్తారన్నారు. ఆసక్తి ఉన్న వారు ఆ కళాశాలలో దరఖాస్తులు అందించాలని, వివరాలకు 90008 31156 మొబైల్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
మహాశివరాత్రి ఆదాయం రూ 29.66 లక్షలు
సామర్లకోట: మహాశివరాత్రి సందర్భంగా స్థానిక పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయానికి రూ.29,66,406 ఆదాయం సమకూరిందని ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 6 నుంచి మార్చి 20 వరకూ ఆలయంలో హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని గురువారం లెక్కించారు. హుండీల ద్వారా రూ.16,15,788 ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. 67 గ్రాముల బంగారు, 600 గ్రాముల వెండి వస్తువులు లభించాయని ఈఓ తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 1 వరకూ దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.7,05,960, వివిధ సేవా టిక్కెట్ల ద్వారా రూ.65,747, ప్రసాద విక్రయాల ద్వారా రూ.2,66,215, అన్నదాన విరాళాలు రూ.3,12,696 వచ్చాయని వివరించారు. హుండీల ద్వారా గత ఏడాది కంటే రూ.6 లక్షలు అదనంగా ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. దేవదాయ శాఖ తనిఖీదారు ఫణికుమార్ పర్యవేక్షణలో హుండీల లెక్కింపు జరిగింది. ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే బాబు, ఆలయ సూపరింటెండెంట్ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అక్షర దీప్తి.. చైతన్య స్ఫూర్తి
కొరవడిన ప్రభుత్వ ప్రోత్సాహం ప్రచార మాధ్యమాలు పెరిగిన ప్రస్తుత తరుణంలో సాహిత్యం మరింతగా అందుబాటులోకి వస్తోంది. తెలుగు భాషపట్ల ఆసక్తి ఉన్నవారు కవితలు, కథలు రాసేందుకు ముందుకొస్తున్నారు. అయితే వారికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందడం లేదు. స్వశక్తితో తమ కవిత్వాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కవులు అనేక వ్యయప్రయాసలు ఎదుర్కొంటున్నారు.అద్దం అరచేతిలో ఇమిడిపోయేదే అయినా.. ఆకాశాన్ని చూపిస్తుంది. చూడటానికి చిన్నగానే కనిపించినా.. జాబిల్లి జగతికి చల్లని వెలుగులను పంచుతుంది. పుస్తకం చిన్నదే అయినా మస్తిష్కానికి వికాసాన్నిస్తుంది. అక్షరం చిన్నదే అయినా నిత్య చైతన్య దీప్తిని, స్ఫూర్తిని నింపుతుంది. కవితా వాహినిగా మారి.. మనిషి లోపల దాగున్న అసలు మనిషిని నిత్యం పరిచయం చేస్తుంది. అర్థం చేసుకునే మనసుతో చదివితే.. నడవడికలో లోపాలను చక్కదిద్ది మనిషిని మనీషిగా చక్కదిద్దుతుంది. మానవ సమాజాన్ని మరో ప్రపంచ వైపు నడిపిస్తుంది.ఇదీ నేపథ్యం ఐక్యరాజ్య సమితి విద్యా, శాసీ్త్రయ, సాంస్కృతిక సంస్థ మార్చి 21వ తేదీన ప్రపంచ కవితా దినోత్సవం నిర్వహించాలని 1999లో ప్రకటించింది. ఈ నేపథ్యంలో భాషా వైవిధ్యానికి మద్దతు పలికేందుకు, అంతరించిపోతున్న భాషలను ప్రోత్సహించేందుకు, కవిత్వాన్ని ప్రోత్సహించేందుకు 27 ఏళ్లుగా కృషి సాగుతోంది. కపిలేశ్వరపురం: గోదారి నేలపై పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలనే వస్తువుగా స్వీకరించి ఎంతో మంది కవులు అపార సాహిత్యాన్ని సృజించారు. సమాజోద్ధరణకు శ్రమించారు. ఆవంత్స సోమసుందర్, బోయి భీమన్న, అద్దేపల్లి రామమోహనరావు, దాట్ల దేవదానంరాజు వంటి ప్రముఖులతో పాటు.. ఎంతో మంది కవులు ప్రపంచం నలుమూలలా సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలకు గురైన పీడితులపై ద్రవించిన హృదయంతో స్పందించారు. నేడు ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. గోదారి తీరాన కవిచంద్రులు ● పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం 6వ అధిపతి కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా విశేషంగా సాహిత్యాన్ని సృజియించారు. 1885 ఫిబ్రవరి 28న ఆయన జన్మించారు. మాతృ భాష కానప్పటికీ తెలుగులో అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న కాకినాడలో ఆయన జయంతి ఘనంగా నిర్వహించారు. ● దేవులపల్లి కృష్ణశాస్త్రి సామర్లకోట మండలం చంద్రపాలెంలో 1897 నవంబరు 1న జన్మించారు. లలిత గీతాలు, నాటికలు, సినిమా పాటలు రాసి, ఎంతో ఖ్యాతి పొందారు. భావ కవిత్వానికి పెట్టింది పేరు. ● ‘బలం కలవాడు పులి, తెలివి కలవాడు నక్క, ఈ ఇరువర్గాలకో ఆహారంగా బతుకుతున్న వర్గాలు గొర్రెలు’ అంటూ చైతన్యపూరిత మాటలు రాసిన బోయి భీమన్న కోనసీమ జిల్లాలోని మామిడికుదురులో 1911 సెప్టెంబర్ 19న జన్మించారు. సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచయిత. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మభూషణ్‌తో పాటు లెక్కకు మిక్కిలిగా సన్మానాలందుకున్నారు. అంటరానితనం వంటి దురాచారాలను నిరసించారు. ● 1924 నవంబర్ 18న కాకినాడ జిల్లా శంఖవరంలో పుట్టిన ఆవంత్స సోమసుందర్ సాహిత్య రంగంలో అవిరళ కృషి చేశారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నాడు సాగిన ఉద్యమానికి మద్దతుగా ఆయన రచించిన ‘వజ్రాయుధం’ కవిత ఎంతో మందిని ఉత్తేజపరచింది. ● కాకినాడకు చెందిన అద్దేపల్లి రామమోహనరావు జిల్లా నలుమూలలా సాహిత్య సభలు, సమావేశాలు, కవి సమ్మేళనాలు నిర్వహించేవారు. తుది శ్వాస విడిచిన 2016 వరకూ సాహిత్య కృషి చేశారు. ‘అయినా ధైర్యంగానే’ పేరుతో అద్దేపల్లి రాసిన కవితలు సామాన్యుడి జీవన స్థితిగతులను తడుముతాయి. ● యానాంలో నివసిస్తున్న ప్రముఖ కవి, కథకుడు దాట్ల దేవదానం రాజు. అభ్యుదయవాది అయిన ఆయన అనేక కథలు, కవితా సంపుటాలు వెలువరించారు. ‘యానాం చరిత్ర’ వంటి గ్రంథాలను వెలువరించారు. అనేక పురస్కారాలు అందుకున్నారు. ● 1994 ప్రాంతంలో పాశర్లపూడిలో సంభవించిన బ్లో ఔట్‌నే వస్తువుగా చేసుకుని ఓ కవి ఆ రోజుల్లో అద్భుతమైన కవిత రాశారు. ‘సామ్రాజ్యవాద కాలధూమాల నీడల కింద శిరస్సు తెగి, మొండెంలోంచుబికిన నెత్తుటి ధార, ముద్దయి నింగికెగురుతున్న శైలంలాగ, రాత్రి సూర్యుడై ప్రజ్వలిస్తోంది, గ్యాస్ బావి పాదాల చెంత పారాడే చిత్తడి.. పోరాటానికి సిద్ధమైన ప్రత్యర్థిలా వేడి సెగ వాగయింది’ అంటూ ఆయన కవిత్వం సాగుతుంది. ఇలా ఎంతో మంది తమ కవితా ఝరులతో చైతన్య స్ఫూర్తిని నింపారు. సాహితీ ‘గోదారి’ ● గోదారి నేలపై ఎంతో మంది సాహితీ సేద్యం సాగిస్తున్నారు. ● ‘కవిత కోసమే నేను పుట్టాను.. క్రాంతి కోసము కలము పట్టాను.. ఎండమావులు చెరిపి.. పండు వెన్నెల నిలిపి.. గుండె వాకిలి తలుపు తట్టాను’ అన్న ఆరుద్రను సత్కరించిన ప్రాంతం రాజమహేంద్రవరం. ● అభ్యుదయ కవి డాక్టర్ అద్దేపల్లి రామమోహనరావు పేరిట అద్దేపల్లి ఉదయ భాస్కరరావు కన్వీనర్‌గా ‘అద్దేపల్లి సాహిత్య వేదిక’ను నిర్వహిస్తున్నారు. ఏటా సాహిత్య పురస్కారాలు అందజేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 8న రాజమహేంద్రవరానికి చెందిన ‘ప్రాణహిత’ కవి సాహితీవేత్త సన్నిధానం నరసింహశర్మకు ‘అద్దేపల్లి సాహిత్య పురస్కారం 2024’ను కాకినాడలో అందజేశారు. ● కొత్తపేటలో కళాసాహితి పేరుతో 37 ఏళ్లుగా సాహిత్య కృషి సాగిస్తున్నారు. 1989 నుంచి క్రమం తప్పకుండా ఉగాది రోజున కవి సమ్మేళనం నిర్వహిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ 7న నిర్వహించిన కార్యక్రమంలో కవి గిడ్డి సుబ్బారావును సత్కరించారు. ● కోనసీమకు చెందిన శ్రీశ్రీ కళావేదిక గత ఏడాది ఏప్రిల్ 7న అమలాపురంలో 132వ ఉగాది జాతీయ శతాధిక కవి సమ్మేళనం నిర్వహించగా పలు రాష్ట్రాల నుంచి 132 మంది కవులు పాల్గొన్నారు. 2024 సెప్టెంబర్ 21న కాకినాడలో 137వ జాతీయ కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ● రాజానగరం సమీపంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో గత ఏడాది మార్చి 16న కవి కుసుమ ధర్మన్న 125వ జయంతి సందర్భంగా కవితా గోష్టి నిర్వహించారు. ● గత ఏడాది ఏప్రిల్ 14న బండారులంకలో నిర్వహించిన అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జిల్లా మహాసభలో ప్రతిభ చూపిన కవులను ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకొన్న పెనుగొండ లక్ష్మీనారాయణ సత్కరించారు. ● కాకినాడకు చెందిన డాక్టర్ జోస్యుల కృష్ణబాబు పేరుగాంచిన పుస్తకాలకు సమీక్షలు రాస్తున్నారు. ● ఈ ప్రాంతానికి చెందిన ఎంతో కవులు వివిధ ప్రతిష్టాత్మక సంస్థల నుంచి పురస్కారాలు అందుకుంటున్నారు. నేడు ప్రపంచ కవితా దినోత్సవంకవుల సంఖ్య విస్తృతమైంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కవితలు రాసేవారి సంఖ్య పెరిగింది. ఆధునిక సాంకేతికత పెరిగిన నేపథ్యంలో ప్రాచుర్యం పొందిన కవితల పుస్తకాలు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిని అధ్యయనం చేస్తూ కవితలు రాసేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. వచన కవిత్వం ప్రాచుర్యంలో ఉంది. కాకినాడ, పెద్దాపురం తదితర ప్రాంతాల్లోని యువ కవులను ప్రోత్సహిస్తున్నాం. సామాన్యుల జీవన శైలినే కవితా వస్తువుగా తీసుకుని కవితలు రాయడం ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేయవచ్చు. – అద్దేపల్లి ప్రభు, కవి, కాకినాడ క్రమం తప్పకుండా.. యానాం వేదికగా కవి సంధ్య, స్ఫూ ర్తి సాహితీ సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో ఏడేళ్లుగా క్రమం తప్పకుండా ప్రపంచ కవితా దినోత్సవం నిర్వహిస్తున్నాం. కార్యక్రమ విస్తృతి ఆవశ్యకత నేపథ్యంలో ఈ నెల 23న హైదరాబాద్‌లో నిర్వహించనున్నాం. ఆధునిక కాలంలో సైతం కవిత్వ రచన పట్ల ఆసక్తి పుష్కలంగా ఉంది. అయితే పదబంధాలు, మెళకువలు నేర్పే యంత్రాంగం అందుబా టులో లేదు. సామాజిక పరిస్థితులను అర్థం చేసుకుంటూ ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూండాలి. పఠనాసక్తి పెంపొందించేందుకు కృషి చేయాలి. – దాట్ల దేవదానం రాజు, కవి, తెలుగు విశ్వ విద్యాలయం కీర్తి పురస్కార గ్రహీత, యానాం మనిషిలో మనీషిని పరిచయం చేస్తున్న కవులు గోదారి నేలపై కవితా వాహిని సామాజిక సమస్యలపై స్పందిస్తున్న కవులెందరో..సామాన్యుల జీవితాలే కవితా వస్తువు ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా మండపేటలో అరసం, సంగమం వేదిక సంయుక్త ఆధ్వర్యాన శుక్రవారం కవి సమ్మేళనం నిర్వహిస్తున్నాం. మనిషి శ్రమ నుంచి సాహిత్యం పుట్టింది. శ్రమకు విలువ ఉన్నంత కాలం కవిత్వానికి ప్రాధాన్యం తప్పనిసరిగా కొనసాగుతుంది. ప్రస్తుత కాలంలో యువతీ యువకులు సాహిత్య కృషిపై ఆసక్తి చూపుతున్నారు. – డాక్టర్ చల్లా రవికుమార్, సంగమం వేదిక నిర్వాహకుడు, మండపేట -
ఆలిండియా ఖోఖో జట్టుకు తులసి ఎంపిక
పెదపూడి: జి.మామిడాడ గ్రామంలో జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల్లో గ్రేడ్–2 ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కోరుమిల్లి తులసి ఆలిండియా సివిల్ సర్వీసెస్ గేమ్స్ జాతీయ స్థాయి ఖోఖో జట్టుకు క్రీడాకారిణిగా ఎంపికయ్యారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్తి వెంకటరెడ్డి గురువారం మాట్లాడుతూ ఆల్ ఇండియా సవిల్ సర్వీసెస్ గేమ్స్ మీట్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ఖోఖో జట్టుకు క్రీడాకారిణిగా ప్రాతినిధ్యం వహించనున్నారన్నారు. ఆమె ఈ నెల 19 నుంచి 24 వరకు ఢిల్లీలో జరుగుతున్న పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. ఆమె 2024 నవంబర్7న విజయవాడలో జరిగిన ఖోఖో పోటీల్లో ఉత్తమ ప్రతిభతో జాతీయ జట్టులో స్థానం సంపాదించారని తెలిపారు. ఆమెను పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. గేట్లో శ్రీగౌతమ్కు నాలుగో ర్యాంక్ పెదపూడి: జి.మామిడాడ గ్రామానికి చెందిన పోతురాజు శ్రీగౌతమ్ బుధవారం విడుదలైన గేట్–2025 ఫలితాల్లో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆల్‌ఇండియాలో నాలుగో ర్యాక్ సాధించాడని తండ్రి సాయి వెంకటేశం తెలిపారు. ఆయన గురువారం జి.మామిడాడలో మాట్లాడుతూ సెంట్రల్ గవర్నమెంట్లో మంచి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పట్టుదలగా చదివాడన్నారు. సంవత్సరం నుంచి చేస్తున్న ఉద్యోగానికి ఐదు నెలల క్రితం రాజీనామా చేసి ఇంటికి వచ్చాడన్నారు. ఈ ఐదు నెలలుగా ఇంటి వద్ద ఉండి ప్రణాళిక బద్ధంగా చదివి ఈ ర్యాంక్ సాధించాడన్నారు. తల్లి గృహిణి కాగా తాను పైన గ్రామంలో ఎస్జీటి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నానని తండ్రి తెలిపారు. వాసుకు పదో ర్యాంకు అమలాపురం రూరల్: అమలాపురం రూరల్ మండలం బండారులంక చెందిన చేనేత కుటుంబానికి చెందిన పిచ్చిక కుమార్ వాసు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)–2025 ఫలితాల్లో పదో ర్యాంకు సాధించాడు. జాతీయస్థాయిలో వాసు మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో 10 ర్యాంకు సాధించడంతో బండారులంకలో చేనేత కార్మికులు గురువారం బాణనంచా కాల్చి సంబరాలు చేశారు. చేనేత కార్మికులైన పిచ్చిక మల్లేశ్వరరావు, రేణుక వాణి కుమారుడు వాసు కష్టపడి రెండుసార్లు గేట్ రాసి ఈ ర్యాంకు సాధించాడు. 1 నుంచి 4వ తరగతి వరకు బండారులంక విజడమ్ స్కూలులో చదివి, భూపతిపాలెం గురుకుల పాఠశాలలో 10 తరగతి పూర్తి చేసి రాజమహేంద్రవరం శ్రీచైతన్యలో ఇంటర్మీడియెట్, నర్సారావుపేట జేఎన్టీయూలో బీటెక్ పూర్తిచేశానని వాసు తెలిపాడు. ఐఐటీ, ఎన్ఐటీలో ఎంటెక్ పూర్తిచేసి మంచి ఇంజీనీరుగా దేశానికి సేవలు అందిస్తానని అన్నాడు. గ్రామస్తులు వాసు తల్లిదండ్రులను ఊరేగించి వీరభద్రస్వామి ఆలయం వద్ద సత్కరించారు. శ్రీశైలం దేవస్థానం మాజీ ట్రస్టీ చింతా శంకర మూర్తి, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పిచ్చిక శ్యామ్, ఉప్పుగుంటి భాస్కరరావు బళ్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కోటనందూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ గురువారం తెలిపారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చినగొలుగొండేకు చెందిన కాళ్ల వెంకటేశ్వర్లు(59) డీజిల్ తెచ్చుకునేందుకు టీవీఎస్ మోపెడ్‌పై కోటనందూరు బయలుదేరాడు. అల్లిపూడిలో బర్ల వరలక్ష్మికి లిఫ్ట్ ఇవ్వడం కోసం బండి ఎక్కించుకున్నాడు. అల్లిపూడి–కాకరాపల్లి రోడ్డులో జీడిపిక్కల ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చేసరికి ఎదురుగా ధాన్యం లోడుతో వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందగా, వరలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను 108 అంబులెన్స్‌లో నర్సీపట్నంలో ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతుడి కుమార్తె బొడ్డు నారాయణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
రిలయన్స్ మార్ట్‌పై కేసు నమోదు
రాజమహేంద్రవరం సిటీ: నగరంలోని పుష్కర్ ఘాట్ వద్ద గల రిలయన్స్ మార్ట్ పై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా గురువారం లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ శామ్యూల్ రాజు ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. తయారీ తేదీ, గడువు తేదీని ట్యాంపర్ చేసినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. వినియోగదారులు వస్తువుల కొనుగోలు సమయంలో ప్యాకేజీ ఎక్స్‌పెయిరీ డేట్, ఎంఆర్పీ ధరను పరిశీలించాలని జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు విజ్ఞప్తి చేశారు. ఎంఆర్పీ కన్నా అధిక ధరలకు విక్రయించినా, యూజ్ బై డేట్ ముగిసినవి అమ్మినా లీగల్ మెట్రాలజీ అధికారులకు తెలియజేయాలని కోరారు. ఈ తనిఖీలో పాల్గొన్న అనంతరావు మాట్లాడుతూ వినియోగదారులు తగిన జాగ్రత్తలతో మెలగాలని, ఫిర్యాదులు ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఇటువంటి వ్యవహారాలపై అధికారులు కేసు నమోదు చేస్తారని తెలిపారు. -
మతాతీతంగా మాతకు ఆరాధన
దేవరపల్లి: ఉభయగోదావరి జిల్లాల్లో ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది నిర్మలగిరి పుణ్యక్షేత్రం. ఇక్కడి మేరీమాతను నిత్య నిష్కళంక మాతగా, మత భేదమెరుగని తల్లిగా అన్ని మతాల వారు ఆరాధిస్తున్నారు. ఈ నెల 22 నుంచి 25 వరకు మేరీ మాత ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఏలూరు పీఠాధిపతి జయరావు పొలిమెర పర్యవేక్షణలో పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఫాదర్ ఎస్.జాన్‌పీటర్, ఉత్సవాల నిర్వహణ కమిటీ, సహాయక ఫాదర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామానికి ఆనుకుని ఈ క్షేత్రం ఉంది. క్షేత్రం ఆవిర్భావానికి 1978లో అప్పటి ఏలూరు పీఠాధిపతి జాన్ ములగాడ నాంది పలకగా పలువురు ఫాదర్లు పుణ్యక్షేత్రం అభివృద్ధికి పాటుపడ్డారు. ప్రస్తుత డెరెక్టర్ ఫాదర్ జాన్‌పీటర్ పుణ్యక్షేత్రాన్ని సర్వాగ సుందరంగా తీర్చిదిద్దారు. కులమతాలకు అతీతంగా భక్తులు మేరీమాతను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చి తమ కోర్కెలను మరియతల్లికి విన్నవించుకుంటారు. 1978లో బిషప్ జాన్ములగాడ గౌరీపట్నంలో నిర్మలగిరి క్షేతాన్ని నిర్మించాలని సంకల్పించారు. 1976లో ఏలూరు బలిపీఠం ఏర్పడింది. జాన్ ములగాడ తొలి పీఠాధిపతిగా నియమితులయ్యారు. అనంతరం బిషప్ ములగాడ కారులో విశాఖపట్నం వెళుతుండగా గౌరీపట్నం వద్ద కారు మరమ్మతులకు గురైయింది. కారు దిగి జాన్ములగాడ చుట్టూ పరిశీలించారు. ఎత్తైన కొండలు, కారుచీకటి, ముళ్లపొదలతో నిండి ఉన్న చిట్టడవి. భయంకర వాతావరణం. అంతలోనే ములగాడ మనసులో ప్రేరణ. ఈ ప్రాంతంలో ఆలయం నిర్మించవా అంటూ ప్రేరణ కలిగింది. కారు మరమ్మతులు చేయించుకుని విశాఖపట్నం బయలుదేరారు. 1978లో గౌరీపట్నం ప్రాంతంలో మేరీమాత ఆలయం నిర్మణానికి సంకల్పం చేశారు. 1979లో ఆలయ నిర్మాణం చేసి ఫాదర్ మైకేల్‌ను తొలి డైరెక్టర్‌గా నియమించారు.1982 నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 1992లో ఫాదర్ దిరిసిన ఆరోన్ పుణ్యక్షేత్రం డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1995లో పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణం కల్పించడానికి ప్రేమసేవా ఆశ్రమం ఏర్పాటు చేశారు. 2000లో అఖండ దేవాలయం నిర్మాణం క్షేత్రంలో అఖండ దేవాలయం నిర్మాణానికి 1992లో శంకుస్థాపన చేశారు. 2000లో ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. ఒకేసారి దాదాపు 5,000 మంది ప్రార్థనలు చేసుకొనేందురు వీలుగా దేవాలయం నిర్మించారు. క్షేత్రంలో కళాత్మకంగా పలు కట్టడాలను ఏర్పాటు చేశారు. ప్రేమ సేవా ఆశ్రమం 1995 జూలైలో ప్రేమసేవా ఆశ్రమాన్ని నిర్మలగిరిలో నెలకొల్పారు. మఠవాసులను తీర్చిదిద్దే బాధ్యత జేసురాజన్ చేపట్టారు. బ్రహ్మచర్య వ్రత నియమాలు పాటిస్తూ ప్రభువు సువార్తను ప్రకటించే పరిచర్య ఇక్కడే ఆరంభమవుతుంది. సేవ చేయాలనే ఉత్సహం ఉన్న యువతీ, యువకులు ఏడాది పాటు మఠంలో ఉండవచ్చును. 1997లో నిర్మల హృదయ మహిళా కళాశాలను బిషప్ ములగాడ ప్రారంభించారు. అనురాగ ఆశ్రమం ఏర్పాటు నిర్మలగిరి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా పుణ్యక్షేత్రానికి ఎదురుగా సుమారు 100 అడుగుల ఎత్తున సుందరమైన క్రీస్తు మందిరాన్ని నిర్మాణం చేశారు. చరిత్రలోని వివిధ ఘట్టాలను కళాత్మకంగా గోపురంలో పొందుపర్చారు. నిత్య అన్నదానం పుణ్యక్షేత్రానికి నిరంతరం వస్తున్న భక్తులకు నిత్య అన్నదానం చేస్తున్నారు. ప్రతి రోజు సుమారు 2 వేల మంది భక్తులకు ఉచితంగా అన్నదానం చేస్తున్నారు. అన్నదానం కాంట్రాక్టర్ కళ్ళే నాగేశ్వరరావు పర్యవేక్షణలో జరుగుతుంది. గౌరీపట్నం నిర్మలగిరి పుణ్యక్షేత్రంలోని అఖండ దేవాలయం రేపటి నుంచి నిర్మలగిరి మేరీ మాత ఉత్సవాలు సుందరంగా ముస్తాబైన పుణ్యక్షేత్రం అఖండ దేవాలయం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు అగ్ర పీఠాధిపతుల రాక 10 లక్షల మంది భక్తుల వచ్చే అవకాశం వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏటా మార్చిలో ఉత్సవాలు ఏటా మార్చి 22 నుంచి 25 వరకు మేరీమాత ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో పుణ్యక్షేత్రంలోని పలు ప్రదేశాల్లో నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. భక్తుల రక్షణకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. మతాలకు అతీతంగా భక్తులు ఉత్సవాల్లో పాల్గొని కొబ్బరికాయలు కొట్టి, కొవ్వొత్తులను వెలిగించి, తలనీలాలు సమర్పించి దైవదూత అనుగ్రహం కోసం ప్రార్థిస్తారు. ఉత్సవాల్లో భాగంగా దివ్య బలిపూజలు, దివ్య సత్ప్రసాద ఆరాధనలు నిర్వహిస్తారు. వాటికన్ భారత రాయబారి, ప్రాన్సిస్ మోస్ట్ రెవరెండ్ లియోపోల్డో జిరెల్లి పుణ్యక్షేత్రంలో 2022లో జరిగిన ఉత్సవాల్లో పాల్గొని ప్రార్థనలు చేశారు. ఉత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. -
కువైట్‌లో గుండెపోటుతో యువకుడి మృతి
సఖినేటిపల్లి: మండల పరిధిలోని గొంది గ్రామానికి చెందిన చింతా సాగర్(34) ఈ నెల 18వ తేదీన గుండె పోటుతో కువైట్‌లో మృతి చెందారు. 19వ తేదీన ఆ దేశం నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. సాగర్‌కు భార్య, ఒక బాబు ఉన్నారు. సేఠ్ వద్ద కారు డ్రైవర్‌గా మొదటిగా 2022లో గల్ఫ్ వెళ్లారు. రెండేళ్లు అనంతరం స్వగ్రామం వచ్చిన సాగర్, గత జూలైలో తిరిగి రెండో దఫా గల్ఫ్ వెళ్లారు. ఎన్నో ఆశలతో బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లి ఎప్పటి మాదిరిగానే మళ్లీ తిరిగి వచ్చి తమను కలుస్తారు అనుకుంటున్న కుటుంబ సభ్యులు జరిగిన ఘటనతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చిన్న వయసులోనే తమకు అందనంత దూరాలకు వెళ్లిపోవడం జీర్ణించుకోలేక పోతున్నామని రోదిస్తున్నారు. మృతదేహం శనివారం నాటికి స్వగ్రామానికి రానున్నట్టు స్థానికులు తెలిపారు. వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు నిడదవోలు రూరల్: మండలంలోని పురుషోత్తపల్లి గ్రామంలో వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు సమిశ్రగూడెం ఎస్సై కె.వీరబాబు గురువారం తెలిపారు. పురుషోత్తపల్లికి చెందిన యడ్ల మధుసాగర్ ఈ నెల 15వ తేదీన శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని భార్య షేక్ చాందిని ఇచ్చిన ఫిర్యాదుపై మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
రైలు నుంచి జారి పడి మహిళ మృతి
సామర్లకోట: ఒడిశాకు చెందిన ఒక యువతి బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళుతున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ నుంచి గురువారం జారి పడి మృతిచెందిన సంఘటన ఇది. ఏసీ బోగీలో ప్రయాణం చేస్తున్న సుభాష్మిత దాసు (33) జి. మేడపాడు సమీపంలో బోగీ నుంచి పడిపోయింది. దీనిని గమనించిన ప్రయాణికులు వెంటనే రైలు చైన్ లాగారు. డ్రైవర్, గార్డులు రైలు నుంచి మహిళ పడిపోయిన విషయాన్ని సామర్లకోట స్టేషన్ మేనేజరు ఎం.రమేష్‌కు సమాచారం ఇచ్చారు. సుభాష్మిత కొన ఊపిరితో ఉన్న విషయాన్ని తెలుసుకొని వెనుక వస్తున్న సరార్ ఎక్స్‌ప్రెస్‌లో మహిళను ఎక్కించి సామర్లకోట తీసుకురావాలని మేడపాడులోని రైల్వే సిబ్బందికి సూచించారు. ఈ మేరకు స్టేషన్ మేనేజరు 108కు సామర్లకోట రైల్వే స్టేషన్‌కు వచ్చే విధంగా సమాచారం ఇచ్చారు. సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో సామర్లకోట చేరిన మహిళను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు 108 సిబ్బంది నిర్ధారించారు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె థర్డు ఏసీలో ప్రయాణం చేస్తున్నట్లు స్టేషన్ మేనేజరు తెలిపారు. సుభాష్మిత మృతిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని విజయవాడ డీఆర్ఎం కార్యాలయం నుంచి సూచనలు వచ్చినట్లు తెలిసింది. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 15,500 గటగట (వెయ్యి) 14,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 14,500 గటగట (వెయ్యి) 13,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
అమలాపురం జెడ్పీ హైస్కూల్‌కు 150 ఏళ్లు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్థాపించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వచ్చే ఆగస్టు నెలలో ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ పాఠశాల పూర్వపు విద్యార్థి, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు తెలిపారు. 1876లో ఈ పాఠశాలను స్థాపించారని పేర్కొన్నారు. పాఠశాల భవనాలు 1863లో నిర్మితమైనట్లు, ఈ ప్రదేశంలో గుర్రపు శాల, పెద్ద గంటతో చర్చి , పలు భవనాలు, ఖాళీ స్థలంతో ఉండేదని అప్పటి కలెక్టర్ పెడరిక్ రికెట్స్ హెమింగ్ తమ గెజిటీర్లో ప్రచురించారని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. 1876లో ఆ స్థలం, భవనాలు ఉన్నత పాఠశాలగా మార్పు చెందాయని పేర్కొన్నారు. పాఠశాల 150 సంవత్సరాల ఉత్సవాలను పలువురు ప్రముఖులు, పూర్వ విద్యార్థులతో ఘనంగా నిర్వహించాలనుకుంటున్నామని చెప్పారు. ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఎక్కడున్నా ఫోన్ల నంబర్లు పంపించాలని ఎమ్మెల్సీ విజ్ఞప్తి చేశారు. పాఠశాలకు సంబంధించి మీ దగ్గర పొటోల రూపంలో జ్ఞాపకాలు, పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుల పేర్లు ఉంటే వాటిని కూడా పంపించాలని కోరారు. 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముద్రించే సావనీర్లో వాటిని పొందపరిచాలని నిర్ణయించామని తెలిపారు. పూర్వ విద్యార్థుల వివరాలు, సమాచారాన్ని 63052 08010 ఫోన్ నంబర్‌కు వాట్సాప్ చేయాలని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు విజ్ఞప్తి చేశారు. కొంతమంది పాఠశాల పూర్వ విద్యార్థులు స్థానిక జెడ్పీ ఉన్నత బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల క్రీడా స్థలంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అధ్యక్షతన గురువారం ఉదయం సమావేశమై 150 సంవత్సరాల ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. వచ్చే ఆగస్టులో ఉత్సవాల నిర్వహణకు సన్నాహాలు పూర్వపు విద్యార్థి, ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు -
సీలింగ్ భూములు ఎస్సీ, ఎస్టీలకు పంచాలి
జైపాల్ సింగ్ ముండాకు ఆదివాసి మహాసభ నివాళులు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్రంలో భూసంస్కరణలు అమలు చేసి సీలింగ్ చట్ట ప్రకారం 50 శాతం భూమి ఎస్సీ, ఎస్టీలకు పంపిణీ చేయాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేసింది. భారత రాజ్యాంగ సభ సభ్యులు, ఆదివాసీ మహాసభ వ్యవస్థాపకుడు జైపాల్ సింగ్ ముండా 55వ వర్ధంతి సందర్భంగా గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయనకు ఆదివాసీ మహాసభ తరఫున ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసి మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 34,348 ఎకరాల సీలింల్ మిగులు భూములు ఉన్నాయని, వాటిలో 15,500 ఎకరాల పంపిణీ జరిగిందన్నారు. సుమారు 18,848 ఎకరాలు కోర్టు వివాదాలలో ఉన్నాయన్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభించిన భూ పంపిణీ కార్యక్రమంలో సీలింగ్ భూములు వెయ్యి ఎకరాలు పంచారన్నారు. ఇప్పటికై నా తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు బాధ్యత వహించి సీలింగు భూములన్నీ వేరే పార్టీకి రిజిస్ట్రేషన్న్ జరుగకుండా 22ఎ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేస్తోందన్నారు. నాయకులు జక్కల పాండవులు, సభ్యులు గూన అప్పన్న, అర్జన, మల్లేశ్వరి పాల్గొన్నారు. -
కన్న బిడ్డలను కాలువలో తోసేసిన తండ్రి లొంగుబాటు
రామచంద్రపురం రూరల్: కన్న బిడ్డలను తండ్రే కాలువలోకి తోసేసి ఊపిరి తీయాలని చూసిన ఘటన పాఠకులకు తెలిసిందే. ఈ సంఘటనలో ఏడేళ్ల కుమార్తె కారుణ్యశ్రీ మృతి చెందగా, 10 ఏళ్ల కుమారుడు రామ సందీప్ ప్రాణాలతో బయట పడ్డాడు.. ఆ తరువాత అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అందరూ భావించారు. పోలీసులూ అదే కోణంలో కాలువలు, గోదావరిలో గాలించారు. దీనికితోడు నిందితుడు పిల్లి రాజు ఉపయోగించే స్కూటర్ యానాం బ్రిడ్జిపై లభించడంతో గోదావరిలో దూకేశాడని మరింత తీవ్రంగా గోదావరిలో బోట్లు వేసుకుని గాలించారు. అయితే అనూహ్యంగా అతడు మండపేట రూరల్ పోలీస్ స్టేషన్లో బుధవారం లొంగిపోయాడు. దీంతో రామచంద్రపురం డీఎస్పీ బి.రఘువీర్ గురువారం తన కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టి నిందితుడిని మీడియా ముందుకు తీసుకువచ్చారు. డీఎస్పీ మాట్లాడుతూ అప్పుల ఒత్తిడితోనే తాను చనిపోతే తన పిల్లలు అనాథలు అయిపోతారని భావించి ముందుగా పిల్లలను నెలపర్తిపాడు శివారు గణపతినగరం వద్ద పంట కాలువలోకి తోసేసి, తానూ ఆత్మహత్య చేసుకోవడానికి యానాం గోదావరి బ్రిడ్జిపై నుంచి దూకేయాలని వెళ్లాడని, అయితే అక్కడ మనసు మార్చకొని రాథేయపాలెంలో బంధువుల ఇంటికి వెళ్లాడు. బంధువులు పోలీసులకు లొంగిపోవాలని సూచించడంతో మండపేట రూరల్ పోలీస్ స్టేషన్లో బుధవారం వెళ్లి లొంగిపోయాడు. ప్రెస్మీట్లో రామచంద్రపురం సీఐ ఎం.వెంకటనారాయణ, ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్, రామచంద్రపురం ఎస్సై ఎస్.నాగేశ్వరరావు, కె.గంగవరం ఎస్సై ఎస్కే జానీబాషా, సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు. మీడియా ముందుకు తీసుకుని వచ్చిన పోలీసులు అప్పుల బాధతోనే అఘాయిత్యానికి పాల్పడినట్లు వెల్లడి -
రెండో రోజూ ‘పది’ ప్రశాంతం
18,861 మంది విద్యార్థులు హాజరు ముమ్మిడివరం: పదో తరగతి పరీక్షలు రెండో రోజైన మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలోని 22 మండలాల్లో ఏర్పాటు చేసిన 110 పరీక్షా కేంద్రాల్లో మంగళవారం జరిగిన హిందీ పరీక్షకు 18,861 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 26 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. మొత్తం 98 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరిగాయి. మొత్తం 99.48 శాతం మంది హాజరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి డా.షేక్ సలీం బాషా తెలిపారు. పరీక్షా కేంద్రాలను ఆర్జేడీ జి.నాగమణి, డీవైఈవో జి.సూర్యప్రకాష్, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ బి.హనుమంతరావుతో పాటు, ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్ల వారు మొత్తం 54 పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసినట్టు డీఈఓ సలీం బాషా తెలిపారు. ఏకై క కేంద్రంలో ఇంటర్ పరీక్ష అమలాపురం టౌన్: ఇంటర్మీడియెట్ ఫస్టియర్ జాగ్రఫీ పరీక్ష ఆలమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో బుధవారం ప్రశాంతంగా జరిగిందని డీఐఈవో వనుము సోమశేఖరరావు తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 16 మందికి ఒక్క విద్యార్థి మాత్రం హాజరు కాలేదు. మిగిలిన 15 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని సోమశేఖరరావు చెప్పారు. ఇదే జాగ్రఫీ పరీక్ష గురువారం కూడా ఒకే ఒక పరీక్షా కేంద్రంలో సెకండియర్ విద్యార్థులకు జరుగుతుందని తెలిపారు. అభయాంజనేయుడికి వెండి కిరీటం సమర్పణ అమలాపురం టౌన్: పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద మెయిన్ రోడ్డులో ఉన్న అభయాంజనేయస్వామి ఆలయంలో స్వామికి భక్తులు వెండి కిరీటాన్ని బహూకరించారు. స్థానిక గాంధీనగర్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కొల్లాటి సాయిరామ్, వీరవేణి దంపతులు రూ.1.50 లక్షలతో తయారు చేయించిన వెండి కిరీటాన్ని బుధవారం సమర్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి, వేద మంత్రాల నడుమ స్వామికి కిరీటాన్ని అలంకరించారు. అమ్మవారి హుండీల ఆదాయం రూ.5.98 లక్షలు సఖినేటిపల్లి: కేశవదాసుపాలెం శివారు మెండుపాలెంలో ఉన్న పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయంలో వివిధ హుండీల ద్వారా మొత్తం రూ.5,98,613 ఆదాయం వచ్చింది. బుధవారం ఆలయం వద్ద ఎండోమెంట్స్ ఇన్స్పెక్టర్ జె.రామలింగేశ్వరరావు, అంతర్వేది ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ, ఎస్సై కె.దుర్గా శ్రీనివాసరావు సమక్షంలో హుండీలను తెరిచి 19 రోజుల ఆదాయాన్ని లెక్కించారు. విదేశీ కరెన్సీ పది దిర్హమ్స్ ఉన్నాయి. ఈ–కేవైసీ పూర్తి చేయాలి అమలాపురం రూరల్: ప్రభుత్వ పథకాల సమగ్ర అమలుకు నూరు శాతం ఈ–కేవైసీ పూర్తి చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ గోదావరి భవన్లో రేషన్ డీలర్లకు ఈ–కేవైసీపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ నెలాఖరులోగా ఈ–కేవైసీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అన్ని రేషన్ షాపుల్లో డీలర్లు ఈ–పాస్ యంత్రంతో ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు. మార్చి 20 నుంచి 31 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఈ–కేవైసీ చేయించవచ్చన్నారు. -
మాలలపై కక్ష గట్టిన చంద్రబాబు
అమలాపురం టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు మాలలపై కక్షతో ఎస్సీ వర్గీకరణను అడ్డగోలుగా చేయడానికి కుట్ర పన్నుతున్నారని జిల్లా మాల సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ జంగా బాబూరావు ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధంగా ఎస్సీల్లో ఓ వర్గానికి లబ్ధి చేకూర్చేలా పావులు కదుపుతున్నారని విమర్శించారు. స్థానిక ప్రెస్ క్లబ్ భవనంలో ఐక్య వేదిక ప్రతినిధులు బుధవారం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 22 మండలాల మాల ముఖ్య నాయకులు పాల్గొని, కార్యాచరణపై చర్చించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మరో పోరాటానికి సిద్ధం కావాలని సమావేశం పిలుపునిచ్చింది. దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించింది. 2021 జనాభా లెక్కల ప్రకారం ఏకసభ్య కమిషన్ నివేదికను రాజ్యాంగానికి విరుద్ధంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం సిగ్గుచేటని నాయకులు దుయ్యబట్టారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణే ధ్యేయంగా పనిచేస్తోందని ఆరోపించారు. వర్గీకరణ వల్ల మాల, ఎస్సీల్లోని 59 ఉప కులాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి ఇసుకపట్ల రఘుబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఏకసభ్య కమిషన్ నివేదికను రద్దు చేసి, హైకోర్టు సిట్టింగ్ జడ్జిలతో త్రిసభ్య కమిషన్‌ను నియమించి, న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 2025 కుల గణనను పరిగణనలోకి తీసుకుని, ఉప కులాల అభిప్రాయాలు విన్న తర్వాతే వర్గీకరణ జోలికి వెళ్లాలని సూచించారు. మాలల ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో తీవ్రతరం చేస్తామని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని ఐక్యవేదిక ప్రతినిధి, అముడా మాజీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్‌రాజు హెచ్చరించారు. కలెక్టరేట్ వద్ద ధర్నా అనంతరం ఐక్య వేదిక నాయకులు జిల్లా కలెక్టరేట్‌కు ప్రదర్శనగా వెళ్లి, అక్కడ ధర్నా నిర్వహించారు. మాలల పంతం.. చంద్రబాబు అంతం, ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు వినతిపత్రాన్ని డీఆర్వోకు అందజేశారు. ఐక్యవేదిక నాయకులు రేవు తిరుపతిరావు, గెడ్డం సురేష్‌కుమార్, పొలమూరి మోహన్‌బాబు, పెనుమాల చిట్టిబాబు, దేవరపల్లి శాంతికుమార్, జిత్తుక సత్యనారాయణ, ఉబ్బన శ్రీను, నెల్లి లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. కమిషన్ నివేదికను రద్దు చేయాలని డిమాండ్ కలెక్టరేట్ వద్ద జిల్లా మాల సంఘాల ఐక్య వేదిక ధర్నా -
ఈదరపల్లి నూతన వంతెన నిర్మాణం
అమలాపురం రూరల్: జిల్లా కేంద్రమైన అమలాపురంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించే దిశగా ఈదరపల్లి వద్ద నూతన వంతెన నిర్మాణాన్ని రూ.2 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నట్టు జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. వంతెనకు ఇరువైపులా ఆక్రమణలను తొలగించడానికి కమిటీని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ, పట్టణవాసుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ వంతెన నిర్మాణానికి తక్షణమే కలెక్టరేట్ నుంచి రూ.2 కోట్లు మంజూరు చేశామన్నారు. కోనసీమ జిల్లా కేంద్రంలో పురాతన వంతెనలు ట్రాఫిక్ రద్దీకి తగ్గట్టుగా లేని దృష్ట్యా వీటిని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిటిష్ వారు నిర్మించిన వంతెనలపైనే రాకపోకలు సాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందన్నారు. వాహన కమ్యూనికేషన్లు, డేటా ట్రాన్స్మిషన్, ట్రాఫిక్ సిగ్నల్స్ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని దశలవారీ చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఆర్డీఓ కె.మాధవి, ఆర్అండ్బీ ఎస్ఈ బి.రాము, జల వనరుల శాఖ డీఈ బి.శ్రీనివాసరావు ట్రాన్స్‌కో ఎస్ఈ ఎస్.రాజబాబు, మున్సిపల్ కమిషనర్ కేవీవీఆర్ రాజు తదితరులతో కమిటీ ఏర్పాటు చేశారు. త్వరితగతిన డ్రెడ్జింగ్ పూర్తి చేయాలి ఉప్పలగుప్తం: కూనవరం మేజర్ డ్రెయిన్ డ్రెడ్జింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. ఎన్.కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని రాఘవులపేట నుంచి గచ్చకాయలపొర వరకు కూనవరం మేజర్ డ్రెయిన్‌లో జరుగుతున్న డ్రెడ్జింగ్ పనులను బుధవారం అధికారులతో కలసి కలెక్టర్ పడవలో ప్రయాణించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పొలాలకు ముంపు బెడద నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. మేజర్ డ్రెయిన్ ఏటి గట్టును పటిష్టం చేసి, గట్లు దిగువకు జారిపోకుండా జియో టెక్స్టైల్ మ్యాట్లను, జియో సింథటిక్ పద్ధతిని వినియోగించేలా ఉపాధి హామీ పథకం అనుసంధానంతో ప్రతిపాదనలు చేయాలని డ్రైనేజీ విభాగం ఇంజినీర్లకు సూచించారు. రాబోయే కాలంలో ఎన్.కొత్తపల్లి పంచాయతీ పరిధి రాఘవులపేట నుంచి గచ్చకాయలపొర వరకు ఏటిగట్టు మీదుగా రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. డ్రెయిన్స్ ఈఈ ఎంవీవీ కిషోర్ మాట్లాడుతూ, రూ.3.5 కోట్ల నిధులతో రెండు కి.మీ. మేర డ్రెడ్జింగ్ పనులు చేపడుతున్నామన్నామని చెప్పారు. ఈ పనులు రెండు నెలల్లో పూర్తవుతాయన్నారు. రెండు వైపులా ఏటిగట్టును పటిష్టం చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని, వర్షాకాలం సమయానికి 600 మీటర్ల మొగ ప్రాంతంలో పూర్తి స్థాయి తవ్వకాలు చేపడతామని వివరించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ వీఎస్ దివాకర్, డ్రెయిన్స్ ఏఈ కె.సునీతాదేవి ఉన్నారు. ఈవీఎంలకు పటిష్ట భద్రత కల్పించాలి ముమ్మిడివరం: ఈవీఎంలను భద్రపర్చిన గోదాములకు పటిష్ట భద్రత కల్పించాలని, పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మహేష్‌కుమార్ సూచించారు. బుధవారం ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాల మూడో అంతస్థులో ఈవీఎం, వీవీ ప్యాట్లను ఉంచిన గోదాముల వద్ద భద్రతను పరిశీలించారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో గోదాముల తాళాలు తీసి, ఈవీఎం, వీవీ ప్యాట్లను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరు, అగ్ని నిరోధక పరికరాలను పరిశీలించారు. గోదాముల వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణలో గట్టి నిఘా ఉంచాలన్నారు. కలెక్టర్ వెంట డీఆర్ఓ బీఎల్ఎన్ రాజకుమారి, తహసీల్దార్ యూ.సుబ్బలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ శివరాజ్, పలువురు రాజకీయ ప్రతినిధులు ఉన్నారు. రూ.2 కోట్ల అంచనాతో ప్రణాళిక ఆక్రమణల తొలగింపునకు అధికారులతో కమిటీ జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్ -
త్వరలో అసంపూర్తి భవనాలను పూర్తి చేస్తాం
ఇన్ఫ్రా జాయింట్ డైరెక్టర్ రామలింగం రాయవరం: మనబడి–మన భవిష్యత్తు పథకంలో అసంపూర్తిగా ఉన్న భవనాలను త్వరలోనే పూర్తి చేయనున్నట్టు కమిషనర్ ఆఫ్ స్కూల్స్(ఇన్ఫ్రాస్ట్రక్చర్) ప్రోగ్రాం డైరెక్టర్ మువ్వా రామలింగం తెలిపారు. విద్యారంగ సంస్కరణల్లో భాగంగా ప్రాధాన్య క్రమంలో నిధులను కేటాయించి, పనులను పూర్తి చేయనున్నట్టు చెప్పారు. మండలంలో పదో తరగతి పాఠశాలల తనిఖీ సందర్భంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం సీబీఎస్ఈ, హైస్కూల్ ప్లస్ పాఠశాలలను విరమించుకునే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో, ప్రస్తుత సంస్కరణలకు అనుగుణంగా పనులను పూర్తి చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేసేందుకు శాయశక్తులా కృషి చేయనున్నట్టు తెలిపారు. మనబడి–మన భవిష్యత్తులో తాగునీరు, విద్యుద్దీకరణ, కిచెన్ షెడ్లు, టాయిలెట్లు, మేజర్, మైనర్ రిపేర్లు, గ్రీన్‌చాక్ బోర్డు, పెయింటింగ్ వంటి పనులను విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా పూర్తి చేస్తామని వివరించారు. అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పూర్తి చేస్తామన్నారు. సిమెంట్ అవసరమైన పాఠశాలల్లో నిర్మాణాలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జిల్లాలో పది పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేనట్టు నిర్వహిస్తున్నట్టు పరీక్షల రాష్ట్ర పరిశీలకుడు రామలింగం తెలిపారు. చెల్లూరు, పసలపూడి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారన్నారు. కింద కూర్చుని పరీక్షలు రాయకుండా, అన్నిచోట్ల ఫర్నిచర్‌ను ఏర్పాటు చేశారన్నారు. -
పోలీసుల అదుపులో కర్కశ తండ్రి!
రామచంద్రపురం రూరల్: కన్న బిడ్డలను పంట కాలువలోకి తోసేసిన కర్కశ తండ్రి పోలీసులకు లొంగిపోయినట్టు సమాచారం. రాయవరం మండలం వెంటూరుకు చెందిన పిల్లి రాజు సోమవారం రామచంద్రపురం మండలం నెలపర్తిపాడు శివారు గణపతినగరం సమీపంలోని పంట కాలువలో తన బిడ్డలు పదేళ్ల రామసందీప్, ఏడేళ్ల కారుణ్యశ్రీని తోసేసిన ఘటనలో, సందీప్ బతికి బయటపడగా, కారుణ్య నీటమునిగి చనిపోయిన సంగతి విదితమే. అప్పుల నేపథ్యంలో పిల్లలను చంపి, తానూ ఆత్మహత్య చేసుకునేందుకు ఇలా చేసి ఉండొచ్చనే కోణంలో పోలీసులు కాలువలు, గోదావరి వెంబడి పిల్లి రాజు ఆచూకీ కోసం రెండు రోజులుగా గాలించారు. ఈ క్రమంలో యానాం బ్రిడ్జిపై రాజు స్కూటర్ కనిపించడంతో, వారి అనుమానం బలపడింది. రామచంద్రపురం సీఐ వెంకటనారాయణ, ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ బోటుపై గోదావరిలో విస్తృతంగా గాలించారు. అయితే నిందితుడు రాజు మండపేట రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టు తెలిసింది. పోలీసులు దీనిని గోప్యంగా ఉంచడం గమనార్హం. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 15,500 గటగట (వెయ్యి) 14,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 14,500 గటగట (వెయ్యి) 13,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
వందేళ్ల వృద్ధురాలి కన్నుమూత
నల్లజర్ల: ప్రకాశరావుపాలెంలో వృద్ధురాలు గోగులమండ సుందరమ్మ(100) బుధవారం ఉదయం కన్నుమూశారు. మరణించే వరకూ ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని బంధువులు తెలిపారు. ఆమెకు ఐదుగురు మగ, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నలుగురు కుమారులు వివిధ శాఖల్లో గెజిటెడ్ హోదాల్లో పనిచేస్తున్నారు. నాలుగో కుమారుడు గోగుల మండబాబ్జీ వైఎస్సార్ సీపీ లీగల్‌సెల్ మండల అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆమె భర్త వీరాస్వామి కమ్యూనిస్టు ఉద్యమ నేతగా వ్యవహరించారు. మహిళ మెడలో గొలుసు చోరీ కొవ్వూరు: ఈవెనింగ్ వాకింగ్ చేస్తున్న మహిళ మెడ నుంచి బంగారు గొలుసును దొంగ అపహరించిన ఉదంతమిది. పట్టణంలోని 23వ వార్డుకు చెందిన కుందుల పద్మకుమారి స్థానిక బైపాస్ రోడ్డు బుధవారం ఈవెనింగ్ వాకింగ్‌కు బయలుదేరింది. మోటార్ బైక్‌పై వచ్చిన దొంగ ఆమె మెడలో ఉన్న ఆరున్నర కాసుల బంగారు గొలు సును తెంచుకుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ జి.దేవకుమార్, పట్టణ సీఐ పి.విశ్వం సంఘటన స్థలానికి చేరుకుని, బాధితు రాలి నుంచి వివరాలు సేకరించారు. ఆమె ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేశామని సీఐ విశ్వం తెలిపారు. గతంలో కొవ్వూరు పట్టణంలో రెండు చైన్ స్నాచింగ్ సంఘటనలు చోటుచేసుకున్నాయి. 23న జాతీయ సాహిత్య సదస్సు సఖినేటిపల్లి: మహాకవి, పద్మభూషణ్ బోయి భీమన్న జీవితం, సాహిత్యంపై ఈ నెల 23న రాజమహేంద్రవరంలో జాతీయ సాహిత్య సదస్సు నిర్వహిస్తున్నట్టు శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ సీఈఓ కత్తిమండ ప్రతాప్ బుధవారం ఇక్కడ తెలిపారు. ఆ సదస్సులో వంద మంది కవులు పత్ర సమర్పణ చేయనున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఈ సదస్సు ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యఅతిథిగా బోయి భీమన్న సతీమణి బోయి హైమవతి హాజరవుతారని తెలిపారు. సదస్సులో పాల్గొనే కవులందరినీ సత్కరిస్తామని చెప్పారు. -
నదీ పాయలో బాట నిర్మాణం
పి.గన్నవరం: పెదకందాలపాలెం ర్యాంపు నుంచి మానేపల్లి లంక వరకూ సుమారు 2 కి.మీ మేర నదీపాయలో తువ్వ మట్టి లారీల రాకపోకల కోసం పొక్లెయిన్లతో బాటలు నిర్మిస్తున్నారు. నేషనల్ హైవే పనుల కోసం తువ్వ మట్టిని తరలించేందుకు ఈ బాటలు ఏర్పాటు చేస్తున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఇందుకు ఉన్నతాధికారుల నుంచి అనుమతులు తెచ్చుకున్నామని చెబుతున్న నిర్వాహకులు మాత్రం వాటిని ఎవ్వరికీ చూపడం లేదు. ఇంతవరకూ స్థానిక రెవెన్యూ అధికారులకు కూడా అనుమతి పత్రాలు అందలేదు. కూటమి నేతల కనుసన్నల్లో మట్టి తరలింపునకు సన్నాహాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మూతపడిన ర్యాంపు! ఇటీవల పెదకందాలపాలెం నుంచి అనుమతులు లేకుండా కూటమి నాయకులు ఇసుక, మట్టిని కొల్లగొట్టడంపై పత్రికల్లో కథనాలు రావడంతో ఈ ర్యాంపు మూతబడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా పెదకందాలపాలెం ర్యాంపు నుంచి మానేపల్లి పల్లిపాలెం లంక వరకూ నదీపాయ వెంబడి పొక్లెయిన్లతో బాటలు వేస్తున్నారు. అనుమతులు లేకుండా టిప్పర్లలో తువ్వ మట్టిని తరలించుకుపోతున్నారని బుధవారం స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్ఐ వి.డాంగే, వీఆర్వో వి.సత్యనారాయణ ర్యాంపులోకి వెళ్లారు. నేషనల్ హైవే పనుల కోసం మట్టిని తరలించేందుకు అనుమతులు తెచ్చుకున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ర్యాంపులోకి వెళ్లే ముందు రోడ్డుపై మట్టి లోడుతో వెళ్తున్న లారీని అధికారులు నిలిపి వీఆర్ఏని కాపలా ఉంచారు. ఈలోగా ర్యాంపు నిర్వాహకులు అక్కడికి వెళ్లి బిల్లు ఉందంటూ లారీని పంపించేశారు. ఈ క్రమంలో స్వల్ప వివాదం కూడా జరిగింది. ఇలాఉండగా మానేపల్లిలంక నుంచి మట్టిని తీసే అనుమతులతో.. పెదకందాలపాలెం లంక పరిసరాల్లో కూడా పెద్దఎత్తున మట్టిని తరలించుకుపోయేందుకు కూటమి నేతలు సన్నాహాలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందుకే నదీపాయలో రెండు కి.మీ. మేర బాట నిర్మించారని చెబుతున్నారు. అనుమతి పత్రాలు రావాలి మానేపల్లి లంక నుంచి హైవే పనుల కోసం మట్టిని తరలించేందుకు అనుమతి ఇచ్చినట్టు మైన్స్ అధికారులు తనకు చెప్పారని తహసీల్దార్ పి.శ్రీపల్లవి తెలిపారు. వారి నుంచి సంబంధిత పత్రాలు రావాల్సి ఉందన్నారు. మానేపల్లిలంక వద్ద పొక్లెయిన్లతో 2 కి.మీ. ఏర్పాటు కూటమి నేతల కనుసన్నల్లో ర్యాంపు నిర్వహణ! -
ఐడీఎస్పీ బృందం పర్యటన
డయేరియా రోగుల నుంచి వివరాల సేకరణ గోపాలపురం: ‘పల్లెల్లో పారిచోద్యం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు బుధవారం వైద్యారోగ్య శాఖ, పంచాయతీ అధికారులు స్పందించారు. గోపాలపురం, పెద్దగూడెం, చిట్యాల, తొక్కిరెడ్డిగూడెం తదితర డయేరియా ప్రభావిత గ్రామాల్లో పారిశుధ్య పనులు వేగవంతం చేశారు. పెద్దగూడెం, ఉప్పరగూడెం గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాలను యంత్రాల సాయంతో ట్రాక్టర్లు, లారీలపై డంపింగ్ యార్డుకు తరలించారు. వివిధ గ్రామాల్లో శానిటేషన్ పనులు చేపట్టారు. నాలుగు రోజులుగా డయేరియా కేసులు నమోదైన నేపథ్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం వల్ల కొత్త కేసులు నమోదు కాలేదని గోపాలపురం సీహెచ్‌సీ సూపరింటెండెంట్ కె.చైతన్యరాజు తెలిపారు. ఐడీఎస్పీ బృందం పర్యటన అతిసారంతో సుమారు 30 మంది డయేరియా బారిన పడిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రాం బృందం(ఐడీఎస్పీ) గోపాలపురం సీహెచ్‌సీని సందర్శించింది. ఆస్పత్రిలో చికిత్స పొందిన వారి వివరాలు సేకరించి, బాధితుల ఇళ్లకు వెళ్లి ఆరా తీసింది. అతిసారానికి కారణాలు, పారిశుధ్యం, తాగునీరు వంటి అంశాలపై బృంద సభ్యులు ప్రజలతో మాట్లాడారు. గోపాలపురం, పెద్దగూడెం, వేళ్లచింతలగూడెం, చిట్యాల, గుడ్డిగూడెం, పెద్దాపురం గ్రామాల్లో స్థితిగతులను పరిశీలించారు. వీరి వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ కె.చైతన్యరాజు, వైద్యారోగ్య, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉన్నారు. -
త్వరలో అసంపూర్తి భవనాలను పూర్తి చేస్తాం
ఇన్ఫ్రా జాయింట్ డైరెక్టర్ రామలింగం రాయవరం: మనబడి–మన భవిష్యత్తు పథకంలో అసంపూర్తిగా ఉన్న భవనాలను త్వరలోనే పూర్తి చేయనున్నట్టు కమిషనర్ ఆఫ్ స్కూల్స్(ఇన్ఫ్రాస్ట్రక్చర్) ప్రోగ్రాం డైరెక్టర్ మువ్వా రామలింగం తెలిపారు. విద్యారంగ సంస్కరణల్లో భాగంగా ప్రాధాన్య క్రమంలో నిధులను కేటాయించి, పనులను పూర్తి చేయనున్నట్టు చెప్పారు. మండలంలో పదో తరగతి పాఠశాలల తనిఖీ సందర్భంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం సీబీఎస్ఈ, హైస్కూల్ ప్లస్ పాఠశాలలను విరమించుకునే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో, ప్రస్తుత సంస్కరణలకు అనుగుణంగా పనులను పూర్తి చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేసేందుకు శాయశక్తులా కృషి చేయనున్నట్టు తెలిపారు. మనబడి–మన భవిష్యత్తులో తాగునీరు, విద్యుద్దీకరణ, కిచెన్ షెడ్లు, టాయిలెట్లు, మేజర్, మైనర్ రిపేర్లు, గ్రీన్‌చాక్ బోర్డు, పెయింటింగ్ వంటి పనులను విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా పూర్తి చేస్తామని వివరించారు. అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పూర్తి చేస్తామన్నారు. సిమెంట్ అవసరమైన పాఠశాలల్లో నిర్మాణాలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జిల్లాలో పది పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేనట్టు నిర్వహిస్తున్నట్టు పరీక్షల రాష్ట్ర పరిశీలకుడు రామలింగం తెలిపారు. చెల్లూరు, పసలపూడి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారన్నారు. కింద కూర్చుని పరీక్షలు రాయకుండా, అన్నిచోట్ల ఫర్నిచర్‌ను ఏర్పాటు చేశారన్నారు. -
బాణసంచా తయారీలో నిబంధనలు పాటించాలి
కరప: బాణసంచా తయారీదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కాకినాడ ఏడీఎఫ్‌ఓ పి.ఏసుబాబు అన్నారు. వేళంగిలో బుధవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాణసంచా తయారీదారుల సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. బాణసంచా తయారీ, విక్రయదారులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. తయారు చేసే ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు, అగ్నిప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా బాణసంచా తయారీదారుల సంక్షేమ సంఘ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షునిగా వెలుగుబంట్ల సత్యనారాయణ, అధ్యక్షుడిగా కొప్పిశెట్టి శ్రీనివాసరావు, కోశాధికారిగా జీవీవీ సత్యనారాయణ, కార్యదర్శిగా కె.విజయ్‌కుమార్, కె.దుర్గారావు, ఉపాధ్యక్షులుగా విన్నకోటి శ్రీనివాసరావు, సయ్యద్ బాజీబేగ్, ఎన్.దుర్గాప్రసాద్ ఎన్నికయ్యారు. హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు ధవళేశ్వరం: నేరం రుజువు కావడంతో హత్య కేసులో నిందితుడు దాడి గణేష్‌కు జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా విధిస్తూ ఐదో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి డి.విజయగౌతమ్ బుధవారం తీర్పు ఇచ్చారు. పోలీసుల వివరాల మేరకు, నర్సిపట్నం మండలం చెట్టిపల్లి గ్రామానికి చెందిన దాడి గణేష్ 12 ఏళ్ల క్రితం ధవళేశ్వరం గ్రామానికి చెందిన వరలక్ష్మిని ప్రేమించి, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు. ధవళేశ్వరం ఎర్రకొండలో నివాసం ఉండేవారు. 2019 జనవరి 28న తన భార్య ఎవరితోనే ఫోన్ మాట్లాడుతుందనే అనుమానంతో పీటతో తలపై మోది, చాకుతో పొడిచి ఆమెను హతమార్చాడు. ఆమె సోదరుడు కుంచాల శ్రీను ఫిర్యాదు మేరకు అప్పటి సీఐలు బాలశౌరి, ఎ.శ్రీను, ఎస్సై ఎస్.వెంకయ్య చార్జిషీట్లు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున గ్రేడ్–1 స్పెషల్ పీపీ కె.లక్ష్మానాయక్ వాదించారు. కేసును పర్యవేక్షించిన ధవళేశ్వరం సీఐ టి.గణేష్ ,హెచ్‌సీ బి.జయరామ్రాజును ఎస్పీ బి.నరసింహ కిషోర్ అభినందించారు. రైతు బలవన్మరణం నల్లజర్ల: కారణమేంటో తెలియదు కానీ మండలంలోని తెలికిచెర్లలో బుధవారం తెల్లవారుజామున రైతు బుడిగిన శ్రీను(48) తన పొలంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. పొలంలో మామిడిచెట్టుకు ఉరి వేసుకున్నాడు. అతడికి భార్య, ఇద్దరు మగ పిల్లలున్నారు. అతడి మరణానికి కారణం తెలియదని బంధువులు తెలిపారు. పామాయిల్ తోట వద్ద మామిడి చెట్టుకు అతడి మృతదేహం వేలాడుతుండడాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్సై శోభనాద్రి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసుల అదుపులో కర్కశ తండ్రి!
రామచంద్రపురం రూరల్: కన్న బిడ్డలను పంట కాలువలోకి తోసేసిన కర్కశ తండ్రి పోలీసులకు లొంగిపోయినట్టు సమాచారం. రాయవరం మండలం వెంటూరుకు చెందిన పిల్లి రాజు సోమవారం రామచంద్రపురం మండలం నెలపర్తిపాడు శివారు గణపతినగరం సమీపంలోని పంట కాలువలో తన బిడ్డలు పదేళ్ల రామసందీప్, ఏడేళ్ల కారుణ్యశ్రీని తోసేసిన ఘటనలో, సందీప్ బతికి బయటపడగా, కారుణ్య నీటమునిగి చనిపోయిన సంగతి విదితమే. అప్పుల నేపథ్యంలో పిల్లలను చంపి, తానూ ఆత్మహత్య చేసుకునేందుకు ఇలా చేసి ఉండొచ్చనే కోణంలో పోలీసులు కాలువలు, గోదావరి వెంబడి పిల్లి రాజు ఆచూకీ కోసం రెండు రోజులుగా గాలించారు. ఈ క్రమంలో యానాం బ్రిడ్జిపై రాజు స్కూటర్ కనిపించడంతో, వారి అనుమానం బలపడింది. రామచంద్రపురం సీఐ వెంకటనారాయణ, ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ బోటుపై గోదావరిలో విస్తృతంగా గాలించారు. అయితే నిందితుడు రాజు మండపేట రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టు తెలిసింది. పోలీసులు దీనిని గోప్యంగా ఉంచడం గమనార్హం. -
గంజాయి విక్రేతల ముఠా అరెస్టు
నిడదవోలు: గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు యువకుల ముఠాను నిడదవోలు పోలీసులు అరెస్టు చేశారు. నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ బుధవారం విలేకర్లకు ఈ వివరాలు వెల్లడించారు. పట్టణంలో వైఎస్సార్ కాలనీలోని మానే గాంధీ పొలంలో పంపు షెడ్డు వద్ద కొందరు యువకులు గంజాయిని కలిగి ఉన్నారనే సమాచారంతో మంగళవారం సాయంత్రం పట్టణ ఎస్సై జీఎస్ఆర్కే పరమహంస తన సిబ్బందితో దాడి చేశారు. పట్టణానికి చెందిన కొందరు యువకులు ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా కామన్గూడ ప్రాంతం నుంచి కేజీ గంజాయిని రూ.3 వేల చొప్పున కొనుగోలు చేసి, నిడదవోలుకు తీసుకొచ్చారు. మానే గాంధీ పొలంలో పంపు షెడ్డు వద్ద వేయింగ్ మెషీన్‌పై తూచి, ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు దాడి చేసి, పట్టణంలోని కుమ్మరి వీధికి చెందిన దాసరి పృథ్వీవెంకటసాయి నితీష్, జగనన్న కాలనీకి చెందిన గడిచుకోట భానుప్రకాష్, వైఎస్సార్ కాలనీకి చెందిన షేక్ బషీర్, చర్చిపేటకు చెందిన అక్కాబత్తుల బాలు, సింగవరం గ్రామానికి చెందిన మద్దాల భానుప్రకాష్, తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన పడాల భాగ్య శివసుబ్రహ్మణ్యంను అరెస్టు చేశారు. నిందితులను రిమాండ్‌కు పంపించినట్టు సీఐ తిలక్ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.55 వేల విలువైన 11 కేజీల గంజాయి, నాలుగు సెల్ఫోన్లు, మోటార్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ నిడదవోలు పోలీసులను అభినందించారు. నిందితుల్లో ఆరుగురు యువకులు 11 కేజీల సరకు, ఇతర వస్తువులు స్వాధీనం -
చెత్త పనులను ప్రశ్నించే వారేరీ..?
పర్యావరణానికి ‘మంట’ జనసేన ఆవిర్భావ సభ అనంతరం పేరుకుపోయిన ప్లాస్టిక్ చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాల్సి ఉండగా, జనసేన నేతలు ఎక్కడికక్కడ పోగేసి, మంట పెట్టేశారు. దీంతో పచ్చని చెట్లతో ఆహ్లాదంగా ఉండే చిత్రాడ, పరిసర ప్రాంతాలు కాలుష్యంతో నిండిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుధ్య పనులకు కమిటీ వేసినట్టు చెప్పుకొన్న జనసేన నేతలు.. నిజానికి వారు పెత్తనం చేసి, ఇతరులతో పని చేయించడమే కాకుండా, పర్యావరణానికి మంట పెట్టారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించేస్తామని ఒంటికాలిపై నిలబడే నేతలున్న పార్టీ అది. అవసరమైతే నింగీనేలా ఏకం చేసేస్తామంటే.. జనాలు కూడా నిజమేననుకున్నారు. ఆ పార్టీ ఆవిర్భావ సభ ముగిస్తే కానీ వాస్తవం బోధపడలేదు ప్రజలకు. పార్టీ కార్యక్రమాలకు ప్రజాధనం దుర్వినియోగం, స్థానికసంస్థల సిబ్బందితో పారిశుధ్య పనులు.. తుదకు భావి పౌరులైన విద్యార్థులతో కూడా ‘చెత్త’ పనులు చేయించి.. వారి నిజ స్వరూపమేమిటో కళ్లకు కట్టినట్టు చూపించారు.పిఠాపురం: పాఠశాలల్లో పేరుకుపోయిన చెత్తను అపాయకర పరిస్థితుల్లో విద్యార్థులతో తొలగించిన అధికారుల తీరును మరువక మునుపే.. పిఠాపురంలో మరిన్ని వింత పోకడలు వెలుగుచూశాయి. ఇటీవల పిఠాపురం మండలం చిత్రాడలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభా ప్రాంగణంలో భారీగా చెత్త పేరుకుపోయింది. దీనిని తొలగించడానికి పార్టీ నేతలు శ్రమిస్తున్నట్టుగా ఫొటోలకు ఫోజులిస్తున్నారు. వాస్తవానికి పిఠాపురం మున్సిపల్ పారిశుధ్య కార్మికులను, ఉపాధి కూలీలను, మున్సిపల్ వాహనాలను వినియోగించి చెత్తను తొలగించారు. ఓ పార్టీ కార్యక్రమానికి పోగైన చెత్తను తొలగించడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడాన్ని వారు తప్పుబడుతున్నారు. పార్టీ కార్యక్రమానికి పారిశుధ్య కార్మికులతో పని చేయించడం స్వర్ణాంధ్ర.. పాఠశాల విద్యార్థులతో పారిశుధ్య పనులు చేయించడం స్వచ్ఛాంధ్ర అన్నట్టుగా ఉంది పిఠాపురంలో అధికారుల తీరు. రాజకీయ పార్టీ కార్యక్రమానికి వచ్చిన చెత్తను మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో తీయించి, పాఠశాలలో చెత్తను విద్యార్థులతో తీయించిన ఘనత పవన్ అడ్డాగా చెబుతున్న పిఠాపురం నేతలకే దక్కింది. ఇటీవల పిఠాపురం మండలం చిత్రాడలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా టన్నుల కొద్దీ చెత్త వెలువడింది. ఓ రాజకీయ పార్టీకి చెందిన కార్యక్రమం అయినందున, వారి సొంత సొమ్ముతో సభా ప్రాంగణాన్ని శుభ్రం చేయించాల్సి ఉంది. కానీ అధికార దుర్వినియోగం కావాల్సినంత చేసిన జనసేన నేతలు.. మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో, ఉపాధి కూలీలతో అంతా శుభ్రం చేయించడం విమర్శలకు దారితీసింది. పట్టణంలో పేరుకుపోయిన చెత్తను వదిలి, మున్సిపల్ సిబ్బంది జనసేన సభా ప్రాంగణంలో పేరుకున్న చెత్తను తొలగించడంపై పట్టణవాసులు మండిపడుతున్నారు. ఇంతవరకు ఎలా ఉన్నా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అడ్డాగా చెబుతున్న పిఠాపురంలో విద్యా ప్రదాతగా పేరొందిన పిఠాపురం మహారాజా కలల సౌధమైన ఆర్ఆర్బీహెచ్ఆర్ పాఠశాలలో విద్యార్థులతో పారిశుధ్య పనులు చేయించిన సంఘటనపై ఏ ఒక్క అధికారీ నోరు మెదపకపోవడాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఇదేనా అభివృద్ధి అంటే అంటూ ప్రశ్నిస్తున్నారు. చదువుకునే పిల్లలతో ప్రమాదకర పరిస్థితుల్లో పనులు చేయించినా.. ఏఒక్క అధికారి పట్టించుకోకపోవడమేనా పవన్ పర్యావరణ పరిరక్షణ సిద్ధాంతం అని స్థానికులు నిలదీస్తున్నారు. ఏం చేసినా మమ్మల్ని అడిగేదెవరు అన్నట్టుగా ప్రజాప్రతినిధుల తీరు ఉంటే, వారి అండ చూసుకుని ప్రవర్తిస్తున్నారు అధికారులు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి, ఎన్నికల ప్రచారం చేసిన మున్సిపల్ కమిషనర్ కనకారావుపై చర్యలు లేవు. ఉన్నతాధికారి నిర్వహించే గ్రీవెన్స్‌లో జనసేన నేతలు హల్చల్ చేసినా చర్యలు శూన్యం. ప్రమాదకర పరిస్థితుల్లో విద్యార్థులతో పని చేయించిన ఉపాధ్యాయులపై చర్యలు అసలు లేవు.. ఇలా ఒకటి కాదు, రెండు కాదు ప్రతి నేత చట్టాన్ని ఉల్లంఘిస్తున్నా.. అధికారులు తమ పరిధిని దాటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నా.. ఎవరూ పట్టించుకునే వారు లేరు. జనసేన బహిరంగ సభ తర్వాత కానీ బోధపడని వాస్తవం పార్టీ చెత్త.. కార్మికులతో, పాఠశాల చెత్త.. విద్యార్థులతో క్లీనింగ్ ఉపాధి కూలీలతో పారిశుధ్య పనులు మున్సిపల్ కార్మికులు, వాహనాల వినియోగం ప్రజాధనం దుర్వినియోగంపై పట్టణవాసుల మండిపాటు పార్టీ పనులకు ఉపాధి కూలీలు చిత్రాడ జనసేన సభా ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్త తొలగించడానికి రోజుకు 80 మంది చొప్పున ఉపాధి కూలీలను వినియోగించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఉపాధి కూలీలను ప్రైవేటు పనులకు ఉపయోగించరాదన్న కీలక నియమాన్ని తుంగలోకి తొక్కిన జనసేన నేతలు.. ఉపాధి కూలీలతో పారిశుధ్య పనులు చేయించారు. ఐదు రోజులుగా పని చేయించుకున్న జనసేన నేతలు కూలీలకు దగ్గరుండి మస్టర్లు వేయించడం, ఉపాధి సిబ్బందితో దగ్గరుండి పనులు చేయించడం వారి అధికార దుర్వినియోగానికి అద్దం పడుతోందని స్థానికులు పెదవి విరుస్తున్నారు. -
మహిళలను మోసగించిన సర్కార్ ˘
శాసన మండలిలో ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ అల్లవరం: అధికారంలోకి వస్తే 50 ఏళ్ల వయస్సు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నెలకు రూ.4 వేల పింఛన్ పథకాన్ని వర్తింపజేస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం విస్మరించిందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ అన్నారు. ప్రభుత్వ తీరును శాసన మండలిలో మంగళవారం ఆయన ఎండగట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలవుతున్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పింఛన్లు ఏవని ప్రశ్నించారు. ఈ పథకం కింద బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా మహిళలను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 65,49,864 మందికి పింఛన్లు పంపిణీ చేయగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంఖ్య 63,53,907కు తగ్గిందని తెలిపారు. రెండు లక్షల పెన్షన్లు కోత పెట్టారని విమర్శించారు. ప్రతి నెలా పెన్షన్లు తీసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో పింఛన్ల పంపిణీకి రూ.32,634 కోట్లు అవసరం కాగా, బడ్జెట్లో రూ.27,512 కోట్లు మాత్రమే కేటాయించారని, దీనినిబట్టి భవిష్యత్‌లో చాలా పెన్షన్లను తొలగించే అవకాశం ఉందని చెప్పకనే చెబుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలనే ఉద్దేశంతో చేయూత పథకం ద్వారా 45 ఏళ్లు దాటిన వారికి ఏడాదికి రూ.18,750 చొప్పున ఐదేళ్ల పాటు అందించి వేలాది కుటుంబాలకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించారని తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మహిళలను అన్ని విధాలా ఆదుకుంటే, కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేస్తోందని ఇజ్రాయిల్ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎస్, హెచ్‌ఎంలపై శాఖాపరమైన చర్యలు అమలాపురం రూరల్: పదో తరగతి పరీక్ష ప్రారంభానికి కొన్ని గంటల ముందు సోమవారం అమలాపురం నల్లవంతెన సమీపంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నుంచి సిమెంట్ బస్తాలు తరలించడంపై జిల్లా అధికారులు సీరియస్ అయ్యారు. ఈ విషయమై ఆర్డీఓ కె.మాధవి, జిల్లా విద్యా శాఖాధికారి (డీఈఓ) షేక్ సలీం బాషాను విచారణాధికారులుగా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ నియమించారు. ఈ విచారణలో పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ (సీఎస్) మీనాకుమార్, ప్రధానోపాధ్యాయుడు గౌరీశంకర్ అలసత్వం ప్రదర్శించినట్లు వెల్లడైంది. దీంతో వారిద్దరిపై శాఖాపరమైన చర్యలకు కలెక్టర్ ఆదేశించారని డీఈఓ తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని ఇద్దరినీ హెచ్చరించామని తెలిపారు.మూల్యాంకనంలో స్క్రూటినైజర్లు కీలకం అమలాపురం టౌన్: మూల్యాంకనంలో స్క్రూటినైజర్ల పాత్ర కీలకమని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యా శాఖాధికారి (డీఐఈఓ) వనుము సోమశేఖరరావు అన్నారు. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనంలో స్క్రూటినైజేషన్ మంగళవారం ఆరంభమైందని తెలిపారు. కళాశాలలో స్క్రూటినైజర్లతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. అసిస్టెంట్ ఎగ్జామినర్లు దిద్దిన పేపర్లను చీఫ్ ఎగ్జామినర్లు పరిశీలిస్తారని, తర్వాత అవే పేపర్లను మరోసారి స్క్రూటినైజర్లు ఆద్యంతం తనిఖీ చేస్తారని చెప్పారు. జవాబు పత్రంలో అన్ని జవాబులూ దిద్దారా, మార్కులు వేశారా, లేదా అనే అంశాలను నిశితంగా పరిశీలిస్తారని చెప్పారు. పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎటువంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత స్క్రూటినైజర్లదేనని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో మూల్యాంకన పర్యవేక్షకులు వై.లక్ష్మణరావు, అడబాల శ్రీనివాస్, స్కానింగ్ ఇన్చార్జి ఇ.సువర్ణకుమార్తో పాటు వివిధ కళాశాలలకు చెందిన అధ్యాపకులు పాల్గొన్నారు. -
ర్యాంపులతో పెరిగిన కోత
కపిలేశ్వరపురం మండలం కేదారిలంక వద్ద నదీకోత ఇది కపిలేశ్వరపురం మండలం కేదారిలంక ప్రాంతంలో నదీకోత ఉధృతి. ఈ గ్రామంలో ఇప్పటికే సుమారు 300 ఎకరాలు నదీగర్భంలో కలిసిపోయాయని స్థానిక రైతులు చెబుతున్నారు. గతంలో వరదల సమయంలోనే కాస్త నదీకోత ఉండేది. కానీ ఎగువన మందపల్లి (కేదారిలంక) ఇసుక ర్యాంపులో తవ్వకాలు మొదలైన తరువాత కోత ఉధృతి పెరిగింది. జియో కోట్స్‌లో కపిలేశ్వరపురం ర్యాంపు అని చూపిస్తారు కానీ మందపల్లి వైపు పెద్ద ఎత్తున తవ్వుతున్నారు. ప్రవాహానికి అడ్డంగా ఉన్న ఇసుక తిన్నెలు మాయం కావడంతో మామూలు రోజుల్లో కూడా నదీ ప్రవాహం నేరుగా ఈ గ్రామాలను తాకుతోంది. దీనివల్ల కోత ఉధృతంగా మారింది. దీనిపై స్థానికులు మైనింగ్, భూగర్భ జలాలు, రెవెన్యూ, హెడ్‌వర్క్స్, ఆటవీ శాఖలకు ఫిర్యాదు చేస్తున్నా ఫలితం లేదు. ఇక్కడ అనుమతుల కన్నా రెట్టింపు ఇసుక తవ్వడం, నీరున్న ప్రాంతంలో కూడా తవ్వేయడంతో కోత ప్రభావం మరింత పెరిగింది. ఇక్కడ తవ్వకాలపై అన్ని శాఖలూ కలిసి తనిఖీలు చేయాలని స్థానికులు కలెక్టరేట్లో పలు ఫిర్యాదులు చేస్తున్నా స్పందన లేదు. పదెకరాలకు.. 16 కుంచాలు మిగిలింది మా కుటుంబానికి పదెకరాల భూమి ఉండేది. ఇప్పుడు 16 కుంచాల భూమి మాత్రమే మిగిలింది. కొంత కాలం నుంచి నదీ కోత ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే మిగిలిన 16 కుంచాల భూమి కూడా నదిలో కలిసిపోతుంది. నదీ కోత సాధారణమే అయినా అధికారుల నిర్లక్ష్యంతోనే నా భూములు కోత బారిన పడుతున్నాయి. – యర్రంశెట్టి నాగేశ్వరరావు, కేదారిలంక -
ఎన్నికల హామీలు నిలబెట్టుకోవాలి
అమలాపురం టౌన్: ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు, పెన్షనర్లకు చంద్రబాబు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధి ఎం.సాయి ప్రసాద్ అధ్యక్షతన స్థానిక ఏవీఆర్ నగర్‌లోని సంఘం భవనంలో మంగళవారం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో జిల్లా అసోసియేషన్ పరిధిలోని 8 యూనిట్ల నేతలు పాల్గొని పెన్షనర్ల సమస్యలపై చర్చించారు. అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేకేవీ నాయుడు ప్రవేశపెట్టిన పలు తీర్మానాలను సమావేశం ఆమోదించింది. తక్షణమే 12వ పే కమిషన్ ఏర్పాటు చేయాలని, ఉద్యోగులు, పెన్షనర్లకు వెంటనే 30 శాతం ఇంటీరియం రిలీఫ్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పదో పీఆర్సీకి సమానంగా పెండింగ్‌లో ఉన్న అడిషనల్ క్వాంటం పునరుద్ధరించాలని కోరారు. 11వ పీఆర్సీలో ఒక నెల పెన్షన్ లేదా రూ.15 వేలు ఏది తక్కువైతే అది అనే దానికి బదులుగా రూ.25 వేలకు తగ్గించిన ఫ్యూనరల్ చార్జీలు పునరుద్ధరించాలని, మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను రూ.5 లక్షలకు పెంచాలని, పెండింగ్ డీఏలు తక్షణమే విడుదల చేయాలని కోరింది. రిటైరైన ఉద్యోగులకు తక్షణమే బెనిఫిట్స్ చెల్లించాలని, వెరిఫికేషన్ సర్టిఫికెట్ల సబ్మిషన్ గడువును ఏప్రిల్ 20 వరకూ పొడిగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా పెన్షనర్ల అసోసియేషన్ ప్రతినిధులు వై.సత్తిరాజు, ఏవీవీ సత్యనారాయణ, మండలీక ఆదినారాయణ, జి.నరసింహరావు, వైఎస్ జగన్మోహనరావు, టీవీ శర్మ తదితరులు పాల్గొన్నారు. ·˘ 12Ð]l õ³ MýSÑ$çÙ¯ŒS¯]l$ °Ä¶æ$Ñ$…^éÍ ·˘ IBÆŠ‡ {ç³MýSsìæ…^éÍ ·˘ ò³¯]lÛ¯]lÆŠ‡Þ AÝùíÜÄôæ$çÙ¯ŒS yìlÐ]l*…yŠæ -
ఆర్థిక ప్రగతికి బ్యాంకర్ల భాగస్వామ్యం
అమలాపురం రూరల్: జిల్లా ఆర్థిక ప్రగతికి, ప్రజల సంక్షేమానికి బ్యాంకర్ల భాగస్వామ్యం అవసరమని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. నాలుగో త్రైమాసికానికి సంబంధించి జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశాలు కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించారు. లీడ్ బ్యాంక్ ఆధ్వర్యాన జరిగిన ఈ సమావేశాలకు కలెక్టర్ అధ్యక్షత వహించారు. 2024–25 జిల్లా వార్షిక ప్రణాళిక లక్ష్య సాధన పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సంక్షేమ పథకాల లక్ష్యాలకు అనుగుణంగా రుణాలివ్వాలని బ్యాంకర్లను కోరారు. కౌలు రైతులకు తప్పనిసరిగా పంట రుణాలు అందించాలన్నారు. రూ.10 కోట్ల లోపు వ్యయంతో నిర్మించే వంతెనలకు రుణాలు అందించే యోచన చేయాలని, దీనిని టోల్ రూపంలో వసూలు చేసి, తిరిగి చెల్లిస్తారని చెప్పారు. వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి సంబంధించి గత డిసెంబర్ నాటికి 94.53 శాతం, ఎంఎస్ఎంఈలకు సంబంధించి 103.91 శాతం మేర లక్ష్యాన్ని సాధించారని తెలిపారు. వివిధ పథకాలపై కూడా ఈ సందర్భంగా కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో ఆర్బీఐ మేనేజర్ నవీన్, లీడ్ బ్యాంక్ కన్వీనర్ సాయి మనోహర్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ పి.కేశవవర్మ, డీఆర్డీఏ పీడీ శివశంకర ప్రసాద్, వ్యవసాయ అధికారి బోసుబాబు, ఈపీడీసీఎల్ ఎస్ఈ ఎస్.రాజబాబు, సిడ్బీ కో ఆర్డినేటర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జియో టెక్స్టైల్ మ్యాట్లు వేయాలి సెంట్రల్ డెల్టాలో భూ స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని రోడ్లు, ఏటిగట్లు, పంట కాలువలు, మురుగు కాలువల గట్లు జారిపోకుండా కొబ్బరి పీచుతో తయారు చేసిన జియో టెక్స్టైల్ మ్యాట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. వివిధ విభాగాల ఇంజినీర్లతో కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 1 నుంచి మంజూరయ్యే రోడ్ల నిర్మాణాల్లో అధునాతన సాంకేతికతను జోడించేలా ప్రతిపాదించాలని ఆదేశించారు. -
‘‘నాన్నా చంపొద్దు.. ప్లీజ్’’
రామచంద్రపురం రూరల్/రాయవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం నెలపర్తిపాడు సమీపాన కన్న తండ్రే తన బిడ్డలను పంట కాలువలోకి తోసేసిన ఘటన సోమవారం జరిగింది. బంధువులు, ద్రాక్షారామ పోలీసుల కథనం ప్రకారం.. రాయవరం మండలం వెంటూరుకు చెందిన పిల్లి రాజు గృహోపకరణాలను వాయిదాలపై అందించే వ్యాపారం చేస్తుంటాడు. ఇతడికి ఒక వ్యక్తి రూ.30 లక్షలు బాకీ పడ్డాడు. మరోవైపు అప్పులు అధికంగా ఉండడంతో ‘‘అందరం కలిసి చనిపోదామని’’ భార్య విజయతో తరచూ చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో బావమరిది సురేంద్ర కొంత ఆర్థిక సాయం చేశాడు. అయినా సరే చనిపోదామనే రాజు అంటూండేవాడు. ఉన్న కొద్దిపాటి ఆస్తులు అమ్మి అప్పులు తీరుద్దామని విజయ చెబితే పరువు పోతుందని అనేవాడు. పిల్లలను నమ్మించి.. రాజు కుమారుడు రామసందీప్ (10), కారుణ్యశ్రీ (6) రామచంద్రపురంలోని భాష్యం స్కూలులో నాలుగు, ఒకటో తరగతులు చదువుతున్నారు. సోమవారం పాఠశాలకు వెళ్లి పిల్లలను బైక్‌పై ఎక్కించుకున్న రాజు.. ఇంటికి కాకుండా, వెంటూరు నుంచి కాలువ గట్టు మీదుగా నెలపర్తిపాడు శివారు గణపతినగరం సమీపాన ఉన్న పంట కాలువ వద్దకు తీసుకెళ్లాడు. గట్టుపై దాదాపు 350 మీటర్ల దూరం వెళ్లాక పిల్లలను హఠాత్తుగా కాలువలోకి తోసేశాడు. సుడిలో చిక్కుకుని కారుణ్యశ్రీ గల్లంతవగా.. కాలువ గట్టున ఉన్న తుప్పలను పట్టుకుని వేలాడి సందీప్ ప్రాణాలు దక్కించుకున్నాడు. అతడు బయటకు వచి్చ, అటుగా వెళ్తున్నవారికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వారు ద్రాక్షారామ పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్ఐ ఎం.లక్ష్మణ్ ఫైర్ సిబ్బందిని రప్పించి, గాలింపు చేపట్టగా సాయంత్రానికి కారుణ్యశ్రీ మృతదేహం లభ్యమైంది. తల్లి విజయ, అమ్మమ్మ, మావయ్య ఘటనా స్థలికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, పిల్లలను కాలువలోకి నెట్టేశాక రాజు బైక్‌పై పరారైనట్లు సమాచారం. అతడి ఆచూకీ లేకపోవడంతో భార్య విజయ, బంధువులు ఆందోళన చెందుతున్నారు. ‘‘నాన్నా చంపొద్దు.. ప్లీజ్’’ రోజూ మాదిరిగానే తండ్రి రాజు తమను పాఠశాల నుంచి ఇంటికి తీసుకెళ్తున్నాడని చిన్నారులు భావించారు. అయితే, దారి మారడాన్ని గమనించిన కుమారుడు సందీప్ ‘నాన్నా ఎక్కడకు వెళ్తున్నాం?’ అని ప్రశ్నించగా.. ‘అప్పులున్నాయి. మనం చనిపోదాం’ అని రాజు చెప్పాడు. ‘నాన్నా చంపొద్దు ప్లీజ్’ అంటూ సందీప్ భయంతో ఏడుస్తూ వేడుకున్నా రాజు వినలేదు. కాగా, చెల్లెలి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో కుతుకులూరులో ఉండే సురేంద్ర ఆదివారం తమ ఇంటికి తీసుకెళ్లాడు. అమ్మవారి జాతరలో కారుణ్యశ్రీతో దుస్తులు, గాజులు పెట్టించాడు. ఇంతలోనే ఇలా జరగడంతో సురేంద్ర తీవ్రంగా కలత చెందాడు. -
కదిలిస్తే.. కన్నీటి వేదన
కూటమి నాయకులు మట్టి దోచుకుంటున్నారు మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం నుంచి సఖినేటిపల్లి మండలం మోరిపోడు వరకూ విస్తరించి ఉన్న డ్రెయిన్ తవ్వకాలు రూ.47 లక్షలతో చేపట్టారు. ఆ తవ్వకాల్లో వచ్చిన మట్టిని అక్రమంగా అమ్మేసుకుంటున్నారు. శ్మశాన వాటిక అభివృద్ధికని చెప్పి ఆరు ట్రాక్టర్లు మాత్రమే అక్కడ వినియోగించి, 400 ట్రాక్టర్లకు పైగా అమ్మేసుకున్నారు. దీనిపై పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశా. – ముత్యాల శ్రీనివాసరావు, మానవ హక్కుల వేదిక, మలికిపురం మండలం ● పీజీఆర్ఎస్లో ప్రజల గోడు ● కూటమి నేతల దౌర్జన్యాలు, అక్రమాలపై ఫిర్యాదులు ● గోదావరిలో ఇసుక, మట్టి అక్రమ విక్రయాలు అడ్డుకోవాలని అర్జీలు సాక్షి, అమలాపురం/అమలాపురం రూరల్/ఉప్పలగుప్తం: అనారోగ్యం బారిన పడి.. ఇంటి వద్దనే ఉండి.. మూడు నెలలు బయటకు రాలేకపోతే పింఛన్ తొలగించారని ఒక వృద్ధురాలు.. గోదావరి ఇసుక అక్రమ తవ్వకాల వల్ల తమ భూములు కోతకు గురవుతున్నాయని ఒక రైతు.. గోదావరి ఇసుక ఒక్కటే కాదు.. డ్రెయిన్‌లో మట్టి కూడా తవ్వేసి అమ్ముకుంటున్నారంటూ సమాజ హితం కోరే ఒక వ్యక్తి.. రెవెన్యూ సిబ్బంది తప్పుడు రికార్డు సృష్టించి తమ ఫలసాయం తినేస్తున్నారని ఒక బాధితుడు.. ఇలా అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టమ్ – పీజీఆర్ఎస్)కు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు తమ కష్టాలను అధికారులకు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమానికి 270 వరకూ అర్జీలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న దందాలపై సహితం పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా ఎవరిని కదిపినా కన్నీటి వేదనే వినిపించారు. తమ సమస్యలు పరిష్కరించేవారే లేరంటూ నిట్టూర్చారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 16,000 గటగట (వెయ్యి) 14,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
సమస్య పరిష్కారం కాలేదు
ఐ.పోలవరం మండలం గోగుల్లంకలో సర్వే నంబర్ 603 నుంచి 612 వరకూ సీఆర్‌జెడ్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా చెరువుల తవ్వకాలు చేపట్టారు. అక్రమ ఆక్వా చెరువుల కాలుష్యం వల్ల పంట చేలు, కొబ్బరి తోటలకు ముప్పు ఏర్పడుతోంది. దీనిపై రెండు నెలల క్రితం గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాను. అయినా సమస్య పరిష్కారం కాలేదు. మళ్లీ ఫిర్యాదు చేశా. – నడింపల్లి భరత్, రైతు, గోగుల్లంక, ఐ.పోలవరం మండలం ముంపు సమస్య పరిష్కరించాలి పేరూరు ఎఫ్‌సీఐ గోడౌన్స్ వద్ద లంక తోట శివారు 96 ఎకరాల్లో వరి సాగు చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఖరీఫ్‌లో వర్షాలు, వరదలకు డ్రైనేజీలో ముంపు వల్ల చేలు దెబ్బ తింటున్నాయి. జమీందారు ఇంటి సమీపాన డ్రెయిన్ వద్ద ఉన్న లాకు షట్టర్లు పాడైపోయాయి. ఈ సమస్య పరిష్కరించాలని విజ్ఞాపన చేసుకున్నాను. – డేగల వెంకట రమణ పేరూరు లంకతోట, అమలాపురం మండలం అమ్మ పింఛన్ తొలగించారు మా అమ్మ అక్షింతల సుబ్బరామలక్ష్మి కొత్తపేట మండలం పలివెలలో ఉంటారు. ఆమెకు వితంతు పింఛన్ వస్తోంది. అమ్మకు ఇటీవల తలకు, వెన్నెముక ఆపరేషన్ చేయించాం. ఆ సమయంలో మా ఇంటి వద్దనే ఉండి విశ్రాంతి తీసుకోవడంతో మూడు నెలల పాటు ఫించన్ తీసుకోలేదు. దీనిని సాకుగా చూపించి పింఛన్ తొలగించారు. దీనిని పునరుద్ధరించాలని పీజీఆర్ఎస్లో అర్జీ ఇచ్చాం. – కె.లలిత, రామలక్ష్మి, పలివెల, కొత్తపేట మండలం -
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
తుని: రేగుపాలెం–ఎలమంచిలి స్టేషన్ల మధ్య రైలు నుంచి జారిపడిన సంఘటనలో సుమారు 50 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు తుని జీఆర్పీ ఇన్చార్జి ఎస్సై ఎన్.రవికుమార్ తెలిపారు. సోమవారం ఆయనకు అందిన సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడు తెలుపు, నీలం, నలుపు గడుల పొట్టి చేతుల చొక్కా, నీలం రంగు ప్యాంటు ధరించి, మాసిన గెడ్డంతో ఉన్నాడు. మెడలో తాయెత్తులు ఉన్నాయి. మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. వివరాలు తెలిసిన వారు తుని జీఆర్పీ పోలీసులకు సమాచారం అందజేయాలని ఆయన కోరారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రశాంతంగా ప్రారంభం
టెన్త్ పరీక్షలకు పటిష్ట బందోబస్తుఅమలాపురం టౌన్: పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశించారు. తన కార్యాలయంలో సోమవారం జరిగిన జిల్లా నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, బందోబస్తుపై ఆయన చర్చించారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా బందోబస్తు ఉండాలని సూచించారు. జిల్లాలో క్రైమ్ రేటు తగ్గింపు, నేర పరిశోధనలో అధునాతన సాంకేతిక సహకారంతో మరింత ముందుకు వెళ్లడంపై జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ చర్చించారు. మహిళల భద్రత కోసం నిర్వహిస్తున్న శక్తి యాప్‌పై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వివిధ పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలను ఆదేశించారు. చోరీలు, రికవరీలు, అరెస్ట్‌లు తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్, అమలాపురం, రామచంద్రపురం, కొత్తపేట డీఎస్పీలు టీఎస్ఆర్కే ప్రసాద్, రఘువీర్, సుంకర మురళీమోహన్, స్పెషల్ బ్రాంచి సీఐ బి.రాజశేఖర్, డీసీఆర్బీ సీఐ వి.శ్రీనివాస్, జిల్లా ఐటీ కోర్, క్రైమ్ విభాగాల సిబ్బంది, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. వీరు పోలీస్ సబ్ డివిజన్లు, సర్కిళ్లు, స్టేషన్ల వారీగా క్రైమ్ నివేదికను ఎస్పీకి వివరించారు. ● తొలి రోజు టెన్త్ పరీక్షలకు 18,942 మంది హాజరు ● పరీక్ష కేంద్రాల్లో అధికారుల తనిఖీలు రాయవరం/ముమ్మిడివరం: పదో తరగతి పరీక్షలు సోమవారం జిల్లా వ్యాప్తంగా 110 కేంద్రాల్లో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి 8.30 గంటలకే విద్యార్థులు తమతమ పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. నోటీసు బోర్డులో ప్రదర్శించిన హాల్ టికెట్ నంబర్లు చూసుకుని తమకు కేటాయించిన రూముల్లోకి వెళ్లారు. విద్యార్థి దశలో తొలిసారి ఎదుర్కొనే పబ్లిక్ పరీక్షలు కావడంతో పలువురు కాస్త టెన్షన్ ఫీలయ్యారు. పలువురు విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళ్లే ముందు వరకూ కూడా పుస్తకాలతో కుస్తీ పట్టడం కనిపించింది. పరీక్షలు బాగా రాయాలంటూ పరస్పర్ విషెస్ చెప్పుకొన్నారు. పలువురు విద్యార్థులు పరీక్షలకు వెళ్లే ముందు తమ ఇష్టదైవాల ఆలయాల్లో పూజలు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్ష జరిగింది. తొలి రోజు తెలుగు, సంస్కృతం పరీక్షను 19,046 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా, 104 మంది గైర్హాజయ్యారు. 18,906 మంది రెగ్యులర్, 36 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాశారు. మొత్తం 99 శాతం మంది హాజరయ్యారని జిల్లా విద్యా శాఖాధికారి (డీఈఓ) డాక్టర్ సలీం బాషా తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. చాలాచోట్ల కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు తమ విద్యార్థులను తమ పాఠశాల వాహనాల్లో పరీక్ష కేంద్రాలకు తరలించాయి. సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు.. విద్యార్థుల వెంట ఉండి చివరి నిమిషం వరకూ తగు సూచనలిస్తూ కనిపించారు. పరీక్ష విధులకు హాజరైన చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), డిపార్ట్మెంటల్ అధికారులు (డీఓ), ఇన్విజిలేటర్లను సెల్ఫోన్లతో పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. పరీక్ష ప్రారంభం కాగానే తల్లిదండ్రులను, ఇతరులను పోలీసులు ఆయా కేంద్రాలకు దూరంగా పంపించేశారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. ఆకస్మిక తనిఖీలు పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్‌కుమార్ రావిరాల, ఇన్ఫ్రా జేడీ, పదో తరగతి పరీక్షల జిల్లా పరిశీలకుడు మువ్వా రామలింగం, డీఈఓ డాక్టర్ బాషా, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ బి.హనుమంతరావుతో పాటు ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్స్ తనిఖీ చేశాయి. వీరు మొత్తం 51 కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎక్కడా ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ తెలిపారు. ప్రశాంతంగా నిర్వహించాలి అమలాపురం టౌన్: పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని నిర్వహణాధికారులను జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్‌కుమార్ ఆదేశించారు. అమలాపురం పట్టణంలోని కొంకాపల్లి జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని ఆయన సందర్శించారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తరగతి గదుల్లోకి స్వయంగా వెళ్లి నిర్వహణ తీరును స్వయంగా పరిశీలించారు. పరీక్షల నిర్వహణపై ప్రధానోపాధ్యాయుడు, సీఎస్ కె.ఘన సత్యనారాయణకు, ఇన్విజిలేటర్లకు పలు సూచనలు ఇచ్చారు. కొంకాపల్లి మున్సిపల్ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ మహేష్‌కుమార్ -
‘పది’ పరీక్షల హాలులో సిమెంట్ బస్తాలు
అమలాపురం టౌన్: పదో తరగతి పరీక్షా కేంద్రంలోని ఒక గదిలో సిమెంటు బస్తాలు నిల్వ ఉంచడం.. విద్యార్థులు వచ్చిన తర్వాత వాటిని తొలగించడానికి చర్యలు చేపట్టడంపై వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలివీ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని నల్ల వంతెన వద్ద ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని రూమ్ నంబర్ ఏడులో 22 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేశారు. బ్లాక్ బోర్డు, బెంచీలపై నంబర్లు కూడా రాశారు. ఇదిలా ఉండగా పలు పాఠశాలల్లో నిర్మాణ పనులకు అవసరమైన సిమెంటు బస్తాలను ఈ స్కూలును స్టాక్ పాయింట్‌గా ఉపయోగిస్తూ, ఇదే గదిలో నిల్వ ఉంచారు. సోమవారం ఉదయం నుంచి టెన్త్ పరీక్షలు మొదలవుతున్నాయని తెలిసి కూడా వీటిని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పరీక్షల నిర్వహణాధికారులు అలాగే ఉంచేశారు. ముందు రోజో లేదా పరీక్షలు రాసేందుకు వచ్చేలోగానో ఆ బస్తాలను అక్కడి నుంచి తొలగించి ఉండాల్సింది. కానీ, పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఈ గదికి వచ్చేసరికి కూలీలతో సిమెంట్ బస్తాలను బయటకు తీసుకుని వస్తున్నారు. ఆ దృశ్యాలను చూసి, విద్యార్థుల తల్లిదండ్రులు అసహనానికి గురయ్యారు. పరీక్షల నిర్వహణపై ఇంత నిర్లక్ష్యమేమిటని ఆగ్రహించారు. పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులను తరగతి గది బయట నిలబెట్టి, సిమెంట్ బస్తాలు బయటకు తీసుకురావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విషయం తెలియడంతో జిల్లా విద్యా శాఖాధికారి షేక్ సలీమ్ బాషా వెంటనే ఈ పాఠశాలను సందర్శించారు. సిమెంట్ బస్తాలు పాడవకూడదనే ఉద్దేశంతోనే వాటిని ప్రధానోపాధ్యాయుడు తరగతి గదిలో ఓ మూల భద్రపరిచారని చెప్పారు. పరీక్ష ప్రారంభం కాకముందే సిమెంట్ బస్తాల తొలగింపు చేపట్టారని తెలిపారు. విద్యార్థులను నిలిపి, బస్తాల తొలగింపు నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం -
12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలి
అమలాపురం రూరల్: వెంటనే 12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలని, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం (ఏపీపీఆర్జీఏ) ఆధ్వర్యాన పెన్షనర్లు సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. 2023 జాలై 1వ తేదీ నుంచి పీఆర్సీ వేయాలని, ఐఆర్ ప్రకటించాలని, డీఏ, పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. డీఆర్, పీఆర్సీ బకాయిలు పొందకుండానే పెన్షనర్లు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈహెచ్ఎస్ కార్డులపై వైద్యం చేయబోమని ఆసుపత్రుల్లో చెబుతున్నారని అన్నారు. తక్షణమే మెడికల్ రీయింబర్స్మెంట్ అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతిపత్రం పంపించామన్నారు. అనంతరం కలెక్టర్ మహేష్‌కుమార్‌కు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జొన్నలగడ్డ గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి పీవీవీ సూర్యనారాయణరాజు, కార్యదర్శి ఎస్వీ నాయుడు, కోశాధికారి ఎం.ఆశీర్వాదం తదితరులు వినతిపత్రం సమర్పించారు. అప్రమత్తంగా ఇంటర్ మూల్యాంకనంఅమలాపురం టౌన్: స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని అత్యంత అప్రమత్తంగా నిర్వహించాలని జిల్లా ఇంటీర్మడియెట్ విద్యాశాఖాధికారి వనుము సోమశేఖరరావు ఆదేశించారు. మూల్యాంకనం నిర్వహిస్తున్న అధ్యాపకులు, జిల్లా పరీక్షల కమిటీ ప్రతినిధులతో సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 7 నుంచి కళాశాలలో సంస్కృతం, సోమవారం నుంచి తెలుగు, హిందీ, ఇంగ్లిషు, గణితం, పౌరశాస్త్రం జవాబు పత్రాల మూల్యాంకనం మొదలైందని చెప్పారు. మూల్యాంకనం నిర్వహిస్తున్న సిబ్బంది ఎవరూ సెల్ ఫోన్లు వాడరాదని స్పష్టం చేశారు. జవాబు పత్రాలను నిశితంగా పరిశీలిస్తూ దిద్దాలని సూచించారు. మార్కుల కేటాయింపులో అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. బ్రిడ్జి కోర్సు పరీక్షకు 428 మంది గైర్హాజరు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు పరీక్షలు జిల్లాలో సోమవారం ప్రశాంతంగా జరిగాయని సోమశేఖరరావు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 11 కేంద్రాల్లో మొత్తం 2,336 మంది విద్యార్థులకు గాను 1,908 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారన్నారు. 428 మంది పరీక్షలు రాయలేదని తెలిపారు. సుబ్బాలమ్మ తల్లికి రూ.26 లక్షలతో వెండి మకర తోరణం అమలాపురం టౌన్: పట్టణ దేవత సుబ్బాలమ్మ అమ్మవారికి పలువురు భక్తులు రూ.26 లక్షల విలువైన 26 కిలోల వెండి మకర తోరణాన్ని సోమవారం సమర్పించారు. దేవస్థానం అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, భక్తులు ఈ మకర తోరణాన్ని ఉదయం అంతా ఆలయం వద్ద ప్రదర్శనగా ఉంచి, పూజలు చేశారు. సాయంత్రం రెండు అశ్వాల రథంపై దీనిని ఉంచి మంగళ వాయిద్యాలు, బాణసంచా కాల్పుల నడుమ అత్యంత వైభవంగా ఊరేగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. గరగ నృత్యాలు, కేరళ డప్పుల వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాత్రి సుబ్బాలమ్మ తల్లి సన్నిధిలో మకర తోరణాన్ని ఉంచి పూజలు చేశారు. అమ్మవారి జన్మదినం, దేవస్థానం సప్తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వెండి మకర తోరణాన్ని అమ్మవారి వద్ద అలంకరించారు. -
అంధ విద్యార్థినికి వెలుగు రేఖగా..
కోటనందూరు: తల్లిదండ్రులు కడు పేదవారు. వారి కుమార్తె పుట్టుకతోనే అంధురాలు. కుటుంబ నిర్వహణే కష్టంగా ఉన్న ఆ తల్లిదండ్రులు తమ బిడ్డను ప్రభుత్వ బడిలోనే చదివిస్తున్నారు. చీకటి అలముకున్న బాలిక జీవితంలో ఓ ఉపాధ్యాయుడు కొత్త వెలుగులు నింపాడు. ఆమె విద్యాబుద్ధులను భుజాన వేసుకుని.. జీవితంలో నిలదొక్కుకునే వరకూ అండగా ఉంటానని భరోసా ఇచ్చి.. తన మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని బంగారయ్యపేట గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన కొమ్మాకుల వెంకట కుసుమదేవి పుట్టుకతోనే అంధురాలు. తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈమె ప్రస్తుతం బిళ్లనందూరు ఎంపీయూపీ పాఠశాల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. కోటనందూరులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న దాడి కొండబాబు వర్క్ అడ్జస్ట్మెంటులో భాగంగా ఈ ఏడాది బిళ్లనందూరు పాఠశాలకు వెళ్లారు. అక్కడ వెంకట కుసుమదేవి వైకల్యం, కుటుంబ ఆర్థిక పరిస్థితిని ఆయన తెలుసుకున్నాడు. దీంతో ఆమె చదువు బాధ్యతను కొండబాబు తన భుజాన వేసుకున్నారు. ఉన్నత చదువు పూర్తి చేసి, ఉద్యోగం సాధించే వరకూ ఆర్థికంగా అండగా ఉంటానని సంకల్పించారు. ఇందులో భాగంగా బ్రెయిలీ లిపి నేర్చుకోడానికి అవసరమైన బ్రెయిలీ స్లేట్, స్టైలస్ తదితర మెటీరియల్ కొనిచ్చి, నేర్పిస్తున్నారు. బ్రెయిలీ నిపుణుల సహకారంతో కుసుమకు ప్రత్యేకంగా విద్యా బోధన చేస్తున్నట్టు కొండబాబు మాస్టారు వివరించారు. ఆ బాలికను ఉన్నత స్థితికి చేర్చేందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్టు చెప్పారు. ఆ విద్యార్థినికి అండగా ఉంటూ, పలువురికి ఆదర్శంగా నిలిచిన కొండబాబు మాస్టారుని ఎంఈఓలు ఏవీఎస్ శ్రీనివాస్, ఎంవీ రామశేఖర్, ఎస్ఎంసీ కమిటీ సభ్యులు అభినందించారు. చదువుకు దత్తత తీసుకున్న ఉపాధ్యాయుడు జీవితంలో నిలదొక్కుకునే వరకూ అండగా ఉంటానని భరోసా -
30 సార్లు ఫిర్యాదు చేసినా..
ప్రభుత్వం మా కుటుంబానికి 2.50 ఎకరాల్లో ఇచ్చిన పట్టా భూమిని అప్పగించాలని కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో 30 సార్లు ఫిర్యాదు చేశాను. ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. 1973 నుంచి 2017 వరకూ భూమి మా అధీనంలో ఉంది. పంట బోదె అని అధికారులు తప్పుడు రికార్డులు సృష్టించారు. తహసీల్దార్, వీఆర్ఓలు భూమిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక అధికారులు వేలాది రూపాయల ఫలసాయాన్ని అనుభవిస్తున్నారు. సమస్య పరిష్కరించాలని అర్జీ సమర్పించాను. – కుంచే రాజేంద్ర ప్రసాద్, కుంచే వెంకన్నబాబు, జి.వేమవరం, ఐ.పోలవరం మండలం కూటమి పార్టీ వారు చంపుతామని బెదిరిస్తున్నారు అల్లవరం మండలం గోడిలంక గ్రామం రాజుగారి వీధిలో పంచాయతీ సిమెంటు రోడ్డును మూడు నెలలు క్రితం సర్పంచ్‌తో పాటు పలువురు కూటమి నాయకులు ధ్వంసం చేశారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాను. దీంతో నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. రోడ్డు తవ్విన వారితో పాటు కొంత మంది అర్ధరాత్రి సమయాల్లో నా ఇంటికి వచ్చి, తలుపులు కొట్టి, ఫిర్యాదులు ఉపసంహరించుకోవాలని, లేకుంటే చంపుతామని బెదిరిస్తున్నారు. నాకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీనిపై కలెక్టర్‌కు అర్జీ ఇచ్చాను. – రుద్రరాజు వెంకటరాజు (తాతాలు రాజు), రైతు, గోడిలంక, అల్లవరం మండలం ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేయాలి కపిలేశ్వరపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల పరిధిలోని కేదార్లంక, వాడపాలెం, తాతపూడి, కొత్తపేట ఇసుక ర్యాంపుల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. దీనివల్ల లంక భూములు కోతకు గురవుతున్నాయి. మైన్స్ అధికారులు వారి తాయిలాల కోసం ఇష్టానుసారం ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే అనుమతులు ఇచ్చేస్తున్నారు. దీనిపై మైన్స్, భూగర్భ జల, రెవెన్యూ, జలవనరుల శాఖలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులతో జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ వేసి, పరిస్థితులు బట్టి అనుమతులివ్వాలి. ఈ మేరకు వినతిపత్రం ఇచ్చాను. – పెదపూడి బాపిరాజు, రైతు, వాడపాలెం, కొత్తపేట మండలం. -
ఎస్సీ వర్గీకరణకు కేబినెట్ ఆమోదంపై.. భగ్గుమన్న మాల మహానాడు
అమలాపురం టౌన్: ఎస్సీ వర్గీకరణను, తప్పుల తడకలా ఉన్న రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ ఆమోదించడంపై జిల్లా మాల మహానాడు అమలాపురంలో సోమవారం రాత్రి భగ్గుమంది. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న టీడీపీ నియోజకవర్గ కార్యాలయాన్ని మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సీఎం చంద్రబాబు డౌన్ డౌన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డౌన్ డౌన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అసెంబీలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే తమతో ఫోన్లో మాట్లాడితే కానీ ముట్టడి విరమించబోమని భీష్మించి కూర్చున్నారు. రాష్ట్ర మాల సంఘాల జేఏసీ అధ్యక్షుడు పండు అశోక్‌కుమార్, రాష్ట్ర మాల మహానాడు ప్రధాన కార్యదర్శి నాతి శ్రీనివాసరావు, జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు జల్లి శ్రీనివాసరావు తదితరులు ఈ నిరసనకు నాయకత్వం వహించారు. ఎస్సీ వర్గీకకరణను, రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను ఆమోదించిన కేబినెట్ తక్షణమే దానిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం మాలలపై కక్ష కట్టిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాలలపై వ్యతిరేక ధోరణిలో ఉన్నారని ఆరోపించారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను రద్దు చేసి, హైకోర్టు జడ్జీలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి, న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అమరావతిలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఫోన్లో మాట్లాడాలని ఆందోళనకారులు పట్టుబట్టారు. తమ డిమాండ్లతో కూడిన ప్లకార్డులను చేతబూని ప్రదర్శన నిర్వహించారు. గంటకు పైగా టీడీపీ కార్యాలయ ముట్టడి కొనసాగుతుండగా, అమలాపురం పట్టణ, రూరల్ సీఐలు పి.వీరబాబు, డి.ప్రశాంత్‌కుమార్ ఆందోళనకారులతో చర్చించారు. ఎమ్మెల్యే అమరావతిలో బిజీగా ఉండడం వల్ల ఫోన్ మాట్లాడలేకపోతున్నారని సీఐలు వారికి నచ్చజెప్పేందుకు యత్నించారు. ఎమ్మెల్యే అమలాపురం వచ్చాక ఆయా డిమాండ్లపై మాట్లాడాలని సూచించారు. చివరకు ఆందోళనకారులు ఎమ్మెల్యే పీఏకు వినతిపత్రాన్ని అందించి ఆందోళనను విరమించారు. మాల మాహానాడు నేతలు పెయ్యల పరశురాముడు, కుంచే బాబులు, గిడ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అమలాపురంలో టీడీపీ కార్యాలయం ముట్టడి సీఎం, డిప్యూటీ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు -
అన్నా హజారే దృష్టికి పర్యావరణ విధ్వంసం
తాళ్లరేవు: రాష్ట్రంలోని విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు జరుగుతున్న తీవ్ర పర్యావరణ విధ్వంసాన్ని పరిష్కరించడంలో మార్గదర్శకత్వాలు ఇవ్వాలని కోరుతూ సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త అన్నా హజారేకు వైల్డ్కానోపి హేబిటాట్స్ ఓషన్స్ వలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు సంగాడి ధర్మారావు వినతిపత్రం అందజేశారు. పరిశ్రమలు, ముఖ్యంగా చమురు శుద్ధి, రసాయన కర్మాగారాలు చట్టాలను ఉల్లంఘిస్తున్నట్లు పేర్కొన్నారు. నియంత్రణలేని కాలుష్యం సముద్ర జలాలను కలుషితం చేయడం ద్వారా జీవ వైవిధ్యాన్ని నాశనం చేస్తూ, వేలాది తీరప్రాంత వర్గాల జీవనోపాధికి ప్రమాదం కలిగిస్తున్నాయని తెలిపారు. కాలుష్యం కారణంగా కోరింగ వన్యప్రాణుల అభయారణ్యం, కోస్టల్ రెగ్యులేటరీ జోన్, ఎకో సెన్సిటివ్ జోన్లో మడ అడవులను క్రమపద్ధతిలో నాశనం చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ ప్రాంతంలో సంచరించే ఆలివ్ రిడ్లే తాబేళ్ల సామూహిక మరణాలు, వలస పక్షుల క్షీణత, అరుదైన వృక్ష, జంతుజాలాలు అంతరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. దీని పరిష్కారానికి కృషి చేయాలని అన్నాహజారేను కోరినట్టు ధర్మారావు విలేకర్లకు తెలిపారు. -
పోలేరమ్మ తల్లికి వెండి కిరీటం
ఆలమూరు: పెదపళ్ల గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారికి దాతలు రూ.2.7 లక్షలతో వెండి కిరీటం తయారు చేయించి, సోమవారం సమర్పించారు. ఈ కిరీటానికి తొలుత గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రెండున్నర కిలోల బరువైన ఈ వెండి కిరీటాన్ని అమ్మవారికి అర్చకులు అలంకరించారు. గ్రామానికి చెందిన జాస్తి సుబ్బన్న, లక్ష్మీ నరసమ్మ, సూరన్న, సత్యవతి, శ్రీరాములు, సూరమ్మ దంపతులు, వారి వారసులు కలిసి ఈ కిరీటాన్ని తయారు చేయించారు. కార్యక్రమంలో జాస్తి వెంకటేశ్వరరావు, జాస్తి భాస్కరరావు, దాసరి శారదాదేవి, జాస్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి టెన్త్ పరీక్షలు
రాయవరం: జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా 9,624 మంది బాలురు, 9,593 మంది బాలికలు పరీక్షలు రాస్తారు. మూడు సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు జరిగే సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పరీక్షా కేంద్రానికి 200 మీటర్ల దూరం వరకు జిరాక్స్ సెంటర్లు మూసి వేసి ఉంచాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రానికి విద్యార్థులు గంట ముందుగానే చేరుకోవాలని సూచిస్తున్నారు. డీఈఓ డాక్టర్ షేక్ సలీం బాషా, జిల్లా ప్రత్యేకాధికారిగా నియమితులైన ఇన్ఫ్రా జాయింట్ డైరెక్టర్ మువ్వా రామలింగం ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సీఎస్, డీవోలు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులతో ఇప్పటికే గూగుల్ మీట్ నిర్వహించి, అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. కేటగిరీల వారీగా పరీక్షా కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా 110 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ‘ఏ’ సెంటర్ ఒక్కటి కూడా లేదు. 59 ‘బి’ సెంటర్లు, 51 ‘సి’ సెంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 19,217 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, వీరిలో 16,419 మంది రెగ్యులర్, 2,518 మంది రెగ్యులర్ ఒకేషనల్, ఓఎస్ఎస్సీ ప్రైవేట్ ఒక్కరు, ఓఎస్ఎస్సీ రెగ్యులర్ 73, ఫెయిల్డ్ విద్యార్థులు 206 మంది ఉన్నారు. గతేడాది మాదిరిగానే ఆరు సబ్జెక్టులకు ఏడు పరీక్షలు ఉంటాయి. పరీక్షకు పరీక్షకు మధ్య ఒక రోజు విరామం ఇచ్చారు. ఫిజికల్ సైన్స్, బయాలాజికల్ సైన్స్ పరీక్ష మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు కొనసాగుతుంది. నో మొబైల్ జోన్లుగా పరీక్షా కేంద్రాలు మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పరీక్ష పేపరుపై ఏడు అంకెల ిసిరీస్లో నంబర్‌ను ముద్రించారు. దీని వల్ల ఏ పరీక్షా కేంద్రంలో, ఏ ఇన్విజిలేటర్ ద్వారా. ఏ విద్యార్థి ద్వారా ప్రశ్నపత్రం బయటకు వెళ్లినా విషయం నిమిషాల వ్యవధిలో అధికారులకు తెలుస్తుంది. పది పరీక్షా కేంద్రాలను నో మొబైల్ జోన్లుగా ప్రకటించారు. పరీక్షా కేంద్రంలోకి సీఎస్, డీవోలు, ఇన్విజిలేటర్లు, విద్యార్థులు సెల్‌ఫోన్ తీసు కువెళ్లడానికి అనుమతి లేదు. వీరంతా పరీక్షా కేంద్రం వద్ద బందోబస్తు నిర్వహించే పోలీసుల వద్ద సెల్‌ఫోన్స్ డిపాజిట్ చేయాలి. అత్యవసరమైతే సీఎస్ పోలీసుల సమక్షంలోనే పై అధికారులతో ఫోన్ మాట్లాడి, తిరిగి మొబైల్ అక్కడే డిపాజిట్ చేయాలి. ప్రతి ఒక్కరూ విధిగా ప్రభుత్వ గుర్తింపు కార్డును దగ్గర ఉంచుకోవాలి. ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు సివిల్ డ్రెస్ ధరించి మాత్రమే పరీక్షకు హాజరు కావాలి. హాల్ టికెట్ చూపించి విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. హెల్ప్ డెస్క్ ఏర్పాటు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే విద్యార్థులు, తల్లితండ్రులు 9493819102 నంబరులో సంప్రదించవచ్చు. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం -
సచివాలయాలు 620వలంటీర్లు 12,272
కపిలేశ్వరపురం: సంక్షేమం, అభివృద్ధి కూటమి అజెండా, ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రానికి పేరుతెస్తా, పాతిక కేజీల బియ్యం కావాలా? పాతికేళ్ల భవిష్యత్ కావాలా... అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాల భర్తీ... ఏటా జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ విడుదల... వలంటీర్ల గౌరవ వేతనం రూ.10వేలకు పెంపు... ఇవీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి నేతలు చెప్పిన మాటలు.... ఆయా లక్ష్యాలను అప్పటి కే సాధించే క్రమంలో కొనసాగుతున్న వైఎస్సార్ సీపీ సంక్షేమ ప్రభుత్వాన్ని ఓడించేందుకు కూటమి పన్నిన కుట్రలో భాగంగా వెదజల్లిన హామీలు అవి. కారణాలేమైనా కూటమి ప్రభుత్వం వచ్చింది. ఉద్యోగాలు ఇవ్వడం సంగతి పక్కన పెట్టి అప్పటికే పేదలకు సేవలందిస్తున్న వలంటీర్లను విధుల నుంచి పక్కన పెట్టింది. రూ.10వేల వేతనం మాట దేవుడెరుగు ఉన్న ఉపాధినే ఊడపెరికేసారు. వలంటీర్ల తొలగింపు కేవలం వారి కుటుంబాలకే కాదు యావత్ ఆంధ్ర ప్రజలకూ యాతనే. తెల్లవారు జామునే పింఛను అందజేత నుంచి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, దరఖాస్తు చేయించడం, మొత్తంగా లబ్ది వారి ఖాతాలకు జమ చేయించడమూ... ఇలాంటి సేవలన్నీ మూలన పడ్డాయి. దీంతో వలంటీర్లు సంఘం కట్టి తమను విధుల్లోకి తీసుకోవాలంటూ పోరాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల మంది వలంటీర్లు విధులను నిర్వహించేవారు. సేవలు అమోఘం ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో 2,36,331 మంది, కాకినాడ జిల్లాలో 2,72,437, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2,37,244 మంది, మొత్తం 7,46,012 మంది వివిధ రకాల సామాజిక పింఛన్లు అందుకొంటున్నారు. వీరంతా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పింఛను మంజూరైనవారే. వారందరికీ ప్రతి నెలా 1వ తేదీ తెల్లవారు జామున ఆరు గంటలకే వలంటీర్లు పింఛన్లు అందజేసేవారు. కరోనా విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి ప్రభుత్వం అప్పగించిన సేవా కార్యక్రమాల్లో విధులు నిర్వహించారు. తుపాన్లు, వరదల సమయాల్లో కోనసీమ, తూర్పుగోదావరి నదీ తీర లంక గ్రామాల్లోని బాధితులకు తాగునీరు, నిత్యావసర సరకులు, ఆహార పొట్లాలు పడవల్లో దరి చేర్చేవారు. వలంటీర్ల తొలగింపు ప్రభావమిలా... ‘ఉమ్మడి’ జిల్లాలోని 1,644 వార్డు, గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా వలంటీర్లుండేవారు. వారు లేకపోవడంతో 7,46,012 మందికి ఒకటో తేదీ తెల్లవారుజామునే పింఛను అందజేయడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నెలలో వలంటీర్లు లేకుండానే పింఛన్లు పంచగలమన్నది ప్రకటనలకే పరిమితమైంది. అప్పుడు సైతం లబ్ధిదారులను పంచాయతీకి లేదా కూడలికి రమ్మని సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేశారు. ఇక రెండో నెల నుంచి వలంటీర్లు మాదిరిగా పింఛను ఇచ్చిన తీరు కానరాలేదు. వలంటీర్లు లేక సచివాలయ ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగింది. చేస్తున్న సర్వేల్లో సేవల్లో నాణ్యత కొరవడుతోందన్న వాదన ఉంది. వలంటీర్లను విస్మరించిన కూటమి ప్రభుత్వం రూ.5 వేల నుంచి రూ.10వేలకు గౌరవ వేతనాన్ని పెంచుతామన్న కూటమి హామీకి అధికారంలోకి వచ్చాక తూట్లు పొడిచింది. నెలకు రూ.10వేలు సంగతి ఎలా ఉన్నా ఒక్క రూపాయి కూడా మేలు చేసింది లేదు. ఐదేళ్లూ సేవలందించిన తమను విస్మరించవద్దంటూ ప్రభుత్వాన్ని వలంటీర్లు వేడుకున్నారు. ప్రభుత్వం వినకపోవడంతో పోరాటబాట పట్టారు. కూటమి అధికారంలోకి వస్తే కేవలం పాతిక కిలోల చొప్పున బియ్యం ఇవ్వడం కాదు పాతికేళ్ల భవిష్యత్ ఇస్తామన్న పవన్‌కల్యాణ్‌ను ప్రశ్నిస్తున్నారు. పిఠాపురంలో ఈ నెల 14న నిర్వహించిన జనసేన 12వ ఆవిర్భావ సభలో తమకు ఇచ్చిన హామీ గురించి ప్రస్తావించకపోవడంపై వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వలంటీర్లను విధుల్లోకి తీసుకుంటే చట్టపరమైన సమస్యలొస్తాయని మంత్రి లోకేశ్ అసెంబ్లీలో ప్రకటించడంపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చేటప్పుడు ఈ విషయం ఆయనకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. 2025–26 వార్షిక బడ్జెట్లో వలంటీర్లకు సంబంధించి నిధులను కేటాయించకపోవడంపై సీఎం చంద్రబాబుపై మండిపడుతున్నారు. ‘ఉమ్మడి’ జిల్లా వలంటీర్ల ఉద్యమాలిలా..2024 నవంబర్ 9న రాష్ట్ర రాజధానిలో ‘వలంటీర్ల ఆవేదన సదస్సు’ను నిర్వహించారు. అదే ఏడాది నవంబర్ 3న అమలాపురంలో జిల్లా స్థాయి నిరసన సమావేశం నిర్వహించారు. 2024 డిసెంబర్ 10న కాకినాడ సూర్యకళా మందిరంలో వైఎస్సార్ సీపీ ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశంలో వలంటీర్ల ఆందోళనకు పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ ఏడాది జనవరి 17న విజయవాడలో నిర్వహించిన సచివాలయ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనకుండా వలంటీర్లను కూటమి ప్రభుత్వం నిర్భంధించింది. 2025 ఫిబ్రవరి 5న అమలాపురం కలెక్టరేట్ ఎదుట వలంటీర్లు ధర్నా చేశారు. ఈ నెల 12న వైఎస్సార్ సీపీ యువతపోరులో వలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సోమవారం విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ వద్ద ఏపీ గ్రామ, వార్డు వలంటీర్స్ యూనియన్ ఆద్వర్యంలో తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ‘ఉమ్మడి’ జిల్లాలోని వలంటీర్లు సమాయత్తమయ్యారు. సచివాలయాలు 512వలంటీర్లు 9,034సచివాలయాలు 512వలంటీర్లు 9, 581ఇదీ వలంటీర్లకు జరిగిన నష్టంఫ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఒక్కో వలంటీర్‌కు ప్రతి నెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇచ్చేది. దీని ప్రకారం కాకినాడ జిల్లాలో 12,272 మంది వలంటీర్లు ప్రతి నెలా రూ.6,13,60,000, కోనసీమ జిల్లాలో 9,581 మంది వలంటీర్లు రూ.4,79,05,000, తూర్పుగోదావరి జిల్లాలో 9,034 మంది వలంటీర్లు రూ.4,51,70,000 చొప్పున అందుకునేవారు. మూడు జిల్లాలు కలిపి రూ.15,44,35,000 మేర వలంటీర్లకు వేతనం అందేది. దీని ప్రకారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడచిన 9 నెలల్లో వారు రూ.138,99,15,000 మేర నష్టపోయారు. ఫ అదే చంద్రబాబు అండ్ కో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెలా రూ.10 వేల వేతనం లెక్కేసుకుంటే 9 నెలల్లో కాకినాడ జిల్లా వలంటీర్లు రూ.110,44,80,000, కోనసీమ జిల్లా వలంటీర్లు రూ.86,22,90,000, తూర్పు గోదావరి జిల్లా వలంటీర్లు రూ.81,30,60,000 కలిపి మొత్తం రూ.277,98,30,000 మేర వేతనాలు కోల్పోయారు. జిల్లాల వారీగా వలంటీర్ల వివరాలు సచివాలయాలు 1,644వలంటీర్లు 30,887 వలంటీర్లకు కూటమి వంచన రూ.10 వేల గౌరవ వేతనమంటూ హామీ అధికారంలోకి వచ్చాక అమలు దాటవేత ఆవిర్భావ సభలో ప్రస్తావించని పవన్ పాతికేళ్ల భవిష్యత్ అంటే ఇదేనా అంటున్న వలంటీర్లు చట్టపరమైన సమస్యలొస్తాయంటున్న మంత్రి లోకేశ్ ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వలంటీర్ల ఉద్యమాలు నేడు ‘చలో విజయవాడ’ హామీని విస్మరించడం వలంటీర్లను వంచించడమే.. ఎన్నికల సమయంలో వలంటీర్లను కొనసాగిస్తామని, రూ.10వేలకు గౌరవ వేతనం పెంచుతామంటూ కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీని విస్మరించడం వలంటీర్లను వంచించడమే అవుతుంది. ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాల అమలుతో పాటు ప్రకృతి విపత్తుల సమయాల్లో వలంటీర్లు విశేష సేవలందించారు. వారి సేవలను గుర్తించైనా విధుల్లోకి తీసుకోవాలి. – నూకల బలరాం, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి, కోనసీమ జిల్లా -
శతాధిక వృద్ధురాలి మృతి
అమలాపురం టౌన్: స్థానిక 22వ వార్డు పరిధిలోని గొవ్వాలవారి వీధికి చెందిన శతాధిక వృద్ధురాలు గొవ్వాల సూర్యకాంతం (110) ఆదివారం మృతి చెందారు. ఈమె 22వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్, వైఎస్సార్ సీపీ నాయకుడు గొవ్వాల రాజేష్ నానమ్మ. మూడు నెలల కిందటి వరకూ నానమ్మ ఏ ఒక్కరి సాయం లేకుండానే తన పనులు తాను చేసుకుంటూ జీవించిందని రాజేష్ తెలిపారు. మూడు నెలలగా మంచాన పడి చివరకు వృద్ధాప్యంతో మృతి చెందిందన్నారు. సూర్యకాంతానికి ఐదుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు, కోడళ్లు, అల్లుళ్లు, దాదాపు 40 మంది వరకూ మనుమలు, ముని మనుమలు ఉన్నారు. అయినవిల్లికి భక్తుల తాకిడి అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామివారిని ఆదివారం ఆధిక సంఖ్యలో భక్తులు దర్శించుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీ గణపతి హోమం, గరిక పూజ వంటి విశేష పూజలు జరిపారు. ఆర్చకులు స్వామిని వివిధ పుష్పాలతో అలంకరించారు. స్వామికి మహానివేదన చేశారు. సాయంత్రం ఎనిమిది గంటలకు విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 56 మంది, శ్రీ లక్ష్మీగణపతి హోమంలో 31 జంటలు, స్వామివారి పంచామృతాభిషేకాలో ఒక జంట, స్వామివారి గరిక పూజలో రెండు జంటలు పాల్గొన్నాయి. పది మంది భక్తులు స్వామికి ఉండ్రాళ్ల పూజలు జరిపారు. స్వామి వారి సన్నిధిలో 11 మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు, ఐదుగురు చిన్నారులకు అన్న ప్రాసనలు, ముగ్గురు చిన్నారులకు నామకరణం, 13 మందికి తులాభారం, ఒకరికి నామకరణ చేశారు. స్వామికి 16 మంది తలనీలాలు సమర్పించారు. 25 నూతన వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. 3,510 మంది భక్తులు స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్కరోజు స్వామివారికి వివిధ పూజా టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.2,93,437 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. 21న విద్యా విజ్ఙాన విహార యాత్ర ముమ్మిడివరం: జిల్లా విద్యాశాఖ అధ్వర్యంలో ఈ నెల 21న విద్యా విజ్ఙాన విహార యాత్ర నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా తెలిపారు. విద్యార్థుల విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తిని పెంచడం లక్ష్యంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. డీఎస్ఓ జీవీఎస్ సుబ్రహ్మణ్యం, ఏఎంవో రాంబాబు, 116 మంది సెకండరీ విద్యార్థులు, 15 మంది ఉపాధ్యాయులతో కూడిన బృందం ఈ యాత్రలో పాల్గొంటుందన్నారు. తిరుపతి ఐఐటీ, తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్, తిరుపతి జంతు ప్రదర్శన శాలలు, తిరుపతి వెటర్నటీ యూనివర్సిటీ, చంద్రగిరి కోట, తూర్పు, పశ్చిమ గోదావరి పరివాహక ప్రాంతాలు, కోరంగి అభయారణ్యం, యానాం కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ యాత్ర ఉంటుందన్నారు. యాత్రలో పాల్గొనే విద్యార్థులు తల్లిదండ్రుల అనుమతి పత్రంతోనే రావాల్సి ఉంటుందన్నారు. విద్యార్థుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, మండల విద్యాశాఖాధికారులు ఈ పర్యటనను పర్యవేక్షిస్తుంటారన్నారు. ఈ యాత్ర విద్యార్థులకు వినూత్నమైన అవగాహనను అందించడంతో పాటు వారి భవిష్యత్ ప్రయాణానికి మార్గ దర్శకంగా నిలుస్తుందని విద్యాశాఖాధికారి షేక్ సలీం బాషా తెలిపారు. యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అమలాపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా కలెక్టరేట్ గోదావరిభవన్‌లో జరుగుతుందని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లాస్థాయితో పాటు డివిజన్, మండలం, మున్సిపల్ స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. రత్నగిరికి భక్తుల వెల్లువ అన్నవరం: రత్నగిరికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. స్వామివారిని మొత్తం 40 వేల మంది దర్శించగా, వ్రతాలు 1,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని అన్నప్రసాదాన్ని సుమారు 5 వేల మంది భక్తులు స్వీకరించారు. -
అమరజీవి త్యాగం చిరస్మరణీయం
అమలాపురం రూరల్: భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి కడలి కాశీ విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆదివారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదన్నారు. ఆయన పోరాట పటిమను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఆయన త్యాగ ఫలితంగా 1956 నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని కొనియాడారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు శ్రీరాములు ఆద్యులన్నారు. తెలుగు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు జీవితం అందరికీ ఆదర్శమన్నారు అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధన కోసం అందరం పునరంకితమవుదామన్నారు. రెవెన్యూ ఉద్యోగులు కృష్ణ కాంత్, శేఖర్ ప్రదీప్, జి.రాజు పాల్గొన్నారు. -
బాలాజీకి రూ.1.88 లక్షల ఆదాయం
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయానికి ఆదివారం భారీగా భక్తులు తరలి వచ్చారు. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. స్వామివారికి ముడుపులు, మొక్కుబడులు సమర్పించారు. ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి తమ కోర్కెలు నెరవేరాలని స్వామి వారిని వేడుకున్నారు. ఆపద మొక్కుల వాడా.. అనాథ రక్షకా.. గోవిందా, గోవిందా అంటూ శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువు తీరిన శ్రీబాల బాలాజీ స్వామిని దర్శించుకుని ఆనంద పరవశులయ్యారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.1,88,511 ఆదాయం వచ్చింది. స్వామి వారి నిత్య అన్నదానం ట్రస్టుకు భక్తులు రూ.43,277 విరాళంగా అందించారు. లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.27,600 ఆదాయం వచ్చింది. స్వామి వారిని 3,500 మంది భక్తులు దర్శించుకున్నారు. 1,500 మంది భక్తులు స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారని ఆలయ ఈఓ ఎం.సత్యనారాయణరాజు తెలిపారు. -
22 నుంచి నిర్మలగిరి మేరీమాత ఉత్సవాలు
దేవరపల్లి: మండలంలోని గౌరీపట్నం వద్ద ఉన్న నిర్మలగిరి మేరీమాత ఉత్సవాలు ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. దీనికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని ఏలూరు పీఠాధిపతి, విశాఖ అగ్రపీఠం అపోస్తోలిక పాలనాధికారి మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర చెప్పారు. పుణ్యక్షేత్రంలోని కొండపై ఉన్న క్రీస్తు దేవాలయం వద్ద మేరీ మాత పతాకాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించి, అఖండ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేసి, ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, గౌరీపట్నంలోని మేరీ మాత పుణ్యక్షేత్రానికి నాలుగు జిల్లాల నుంచి ఏడాది పొడవునా అశేషంగా భక్తజనం వస్తున్నారని, కుల మత వర్గ భావాలకు అతీతంగా ప్రార్థనలు చేస్తున్నారని తెలిపారు. ఈ పుణ్యక్షేత్రం వెలసి 40 సంవత్సరాలు కావస్తోందన్నారు. ఇక్కడ అఖండ దేవాలయం ప్రారంభించి 25 ఏళ్లు అయినందున ఈ ఏడాది సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ వేడుకలకు మద్రాసు అగ్రపీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ ఆంథోనీ స్వామి, వివిధ జిల్లాల నుంచి పీఠాధిపతులు హాజరు కానున్నారని తెలిపారు. భక్తులకు మజ్జిగ, నిత్యాన్నదానం, మంచినీటి సౌకర్యం కల్పించామన్నారు. ఈ ఏడాది మహోత్సవాలకు సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ అంగీకరించిందన్నారు. పుణ్యక్షేత్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని జయరావు తెలిపారు. ఉత్సవాలకు పోలీసు సిబ్బందితో పాటు సుమారు 250 మంది వలంటీర్లను ఏర్పాటు చేశామన్నారు. పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎస్.జాన్‌పీటర్ మాట్లాడుతూ భక్తులకు అన్ని సౌకర్యాలూ, కల్పిస్తున్నామని, సేద తీరడానికి ఏర్పాట్లు చేశామని చెప్పారు. వికార్ జనరల్ రెవరెండ్ ఫాదర్ పి.బాల కూడా మాట్లాడారు. కార్యక్రమంలో జయరావు పొలిమెరను రెవరెండ్ ఫాదర్ జాన్‌పీటర్, ఫాదర్లు సన్మానించారు. రెవరెండ్ ఫాదర్ మోజెష్, నిత్యాన్నదాన ట్రస్ట్ నిర్వాహకులు కళ్లే నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
గిరిపై భక్తజనసాగరం●
● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది ● రూ.40 లక్షల ఆదాయంఅన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుడు వెలసిన రత్నగిరి శనివారం భక్తజనసంద్రమే అయ్యింది. రత్నగిరితో పాటు వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు తమ బంధుమిత్రులతో కలసి సత్యదేవుని దర్శనానికి తరలి వచ్చారు. వీరికి వేలాదిగా వచ్చిన ఇతర భక్తులు కూడా తోడయ్యారు. వీరందరూ సత్యదేవుని దర్శించి, పూజలు, వ్రతాలు ఆచరించారు. దీంతో, ఆలయం వద్ద రద్దీ ఏర్పడింది. స్వామివారి ఉచిత దర్శనానికి గంటన్నర, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని మొత్తం 40 వేల మంది దర్శించుకున్నారు. రెండు వేల వ్రతాలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని అన్న ప్రసాదాన్ని సుమారు 5 వేల మంది భక్తులు స్వీకరించారు. నేడు కూడా రద్దీ సెలవు రోజు కావడంతో ఆదివారం కూడా రత్నగిరిపై భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు శనివారం రాత్రి కూడా వివాహ ముహూర్తాలున్నాయి. దీంతో, సత్యదేవుని సన్నిధిలో ఆదివారం రద్దీ ఏర్పడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. సత్యదేవుడు, అమ్మవారిని ఆదివారం ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాకారంలో టేకు రథంపై ఊరేగించనున్నారు. ఘనంగా ప్రాకార సేవ సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. ఉద యం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి తిరుచ్చి వాహనం మీద వేంచేయించారు. స్వామి, అమ్మవార్లకు పూజల అనంతరం అర్చకులు కొబ్బరి కాయ కొట్టి, ప్రాకార సేవను ప్రారంభించారు. ఆలయ ప్రాకారంలో మూడుసార్లు సేవ నిర్వహించి, స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. -
ప్లాస్టిక్ సంచుల వినియోగం వద్దు
అమలాపురం టౌన్: ప్లాస్టిక్ సంచులను వదిలేసి, జూట్, క్లాత్, పేపర్ సంచులు వినియోగిద్దామని జిల్లా ఇన్చార్జి అధికారి పి.రవిసుభాష్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా స్థానిక రైతు బజారును శనివారం ఆయన సందర్శించారు. ప్టాస్టిక్ సంచుల వినియోగాన్ని విడనాడాలని వినియోగదారులకు సూచించారు. జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి కూడా ప్లాస్టిక్ సంచుల నిషేధం గురించి వివరించారు. ఈ సందర్భంగా ‘సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం – పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించండి’ అనే థీమ్‌తో నిర్వహించిన స్వచ్ఛ దివస్ ర్యాలీని రవి సుభాష్, నిషాంతి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ మెయిన్ రోడ్డులో సాగింది. అనంతరం ‘పర్యావరణ పరిరక్షణకు పాటు పడతాం – ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని విరమిస్తాం’ అనే అంశంపై రైతు బజారులోని రైతులు, వినియోగదారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయని అధికారులు చెప్పారు. రైతు బజారులోని దుకాణాలన్నింటికీ వెళ్లి, ప్లాస్టిక్ సంచులకు బదులు మట్టిలో కలిసిపోయే సంచులను మాత్రమే ప్రోత్సహించాలని సూచించారు. డ్వాక్రా మహిళలు తయారు చేసిన జూట్ సంచులను పరిశీలించి, అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, అమలాపురం పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, మున్సిపల్ కమిషనర్ కేవీఆర్ఆర్ రాజు, జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బోణం సత్య వరప్రసాద్, తహసీల్దార్ అశోక్ ప్రసాద్, మున్సిపల్ కౌన్సిలర్లు అడ్డాల గోపాలకృష్ణ, బొర్రా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
శృంగార వల్లభుని సన్నిధిలో రద్దీ
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సుమారు 15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు. వివిధ సేవలు, కేశఖండన, అన్నదాన విరాళాలుగా స్వామి వారికి రూ.4,01,587 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఐదు వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశారు. -
పరీక్షలు ముగిశాయి.. ఫలితాలు మిగిలాయి
అమలాపురం టౌన్/రాయవరం: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు జిల్లావ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఈ నెల 1న ఫస్టియర్, 3న సెకండియర్ పరీక్షలు ప్రారంభమైన విషయం విదితమే. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించగా, శనివారం ఇంటర్ సెకండియర్ వాణిజ్య శాస్త్రం, రసాయ శాస్త్రం పరీక్షలతో మేజర్ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ పరీక్షలకు 584 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ పరీక్షలకు జిల్లాలో ఏర్పాటు చేసిన 40 కేంద్రాల్లో మొత్తం 9,927 మందికి గాను 9,617 మంది పరీక్షలు రాశారు. 310 మంది హాజరు కాలేదు. అలాగే ఒకేషనల్ పరీక్షలకు మొత్తం 1,891 మంది హాజరు కావాల్సి ఉండగా, 1,617 మంది పరీక్షలు రాశారు. 274 మంది హాజరు కాలేదు. కొత్తపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సిద్ధార్థ జూనియర్ కళాశాలల్లోని పరీక్ష కేంద్రాల్లో జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి వనుము సోమశేఖరరావు తనిఖీలు చేశారు. ఇదిలా ఉండగా, సోమ, మంగళవారాల్లో 11 కేంద్రాల్లో బ్రిడ్జి కోర్సు పరీక్షలు నిర్వహిస్తారు. 19, 20 తేదీల్లో ఆలమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాగ్రఫీ పరీక్ష నిర్వహిస్తారు. 20వ తేదీతో పరీక్షలు పూర్తి స్థాయిలో ముగుస్తాయి. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగియడానికి ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, వివిధ శాఖల అధికారులు సమన్వయంగా పని చేశారని ఇంటర్మీడియెట్ సోమశేఖరరావు తెలిపారు. ఫస్టియర్ 13,431 మంది, సెకండియర్ 13,881 మంది కలిపి మొత్తం 27,312 మంది పరీక్షలు రాశారు. ప్రధాన పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థులంతా ఆనందంగా ఇంటి బాట పట్టారు. కొనసాగుతున్న మూల్యాంకనం ఈ నెల 7 నుంచి జిల్లా కేంద్రమైన అమలాపురం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మూల్యాంకనం ప్రారంభమైంది. సంస్కృతం పేపరుతో మూల్యాంకనం ప్రారంభం కాగా, ఈ నెల 17 నుంచి తెలుగు, హిందీ, ఇంగ్లిషు, గణితం, పౌరశాస్త్రం సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభం కానున్నదని సోమశేఖరరావు తెలిపారు. -
అదో శక్తి.. రోగాల నుంచి విముక్తి
కూటమి ప్రభుత్వంలో నిలువెల్లా నిర్లక్ష్యం● 16 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు ● ప్రాణాంతక వ్యాధులు దూరం ● నేడు జాతీయ టీకాల దినోత్సవం రాయవరం: ఆడవారికి మాతృత్వం వరం. వివాహమైన ఏడాది నుంచి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అంతా ఆరా తీసేది మాతృత్వం గురించే. వివాహం అనంతరం గర్భం దాల్చిన వెంటనే వైద్యుల్ని సంప్రదించి, వారి సూచనలపై టీటీ ఇంజక్షన్లు వేయించాలి. ఇది తల్లికి, గర్భంలో ఉన్న శిశువుకు ఎంతో మేలు చేస్తుంది. ప్రసవించినప్పటి నుంచి క్రమం తప్పకుండా 16 ఏళ్లు వచ్చేంత వరకూ టీకాలు వేయాల్సిందే. లేదంటే శిశువు పెరుగుదల లేకపోవడంతో పాటు వ్యాధులు దాడి చేసే ప్రమాదముంటుంది. ఈ పరిస్థితిని నివారించేందుకు గర్భిణులకు మూడు టీటీ ఇంజక్షన్లు, శిశువు పుట్టినప్పటి నుంచి 16 ఏళ్ల వరకూ అవసరమైన టీకాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తి ఉచితంగా వేస్తున్నారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు చక్కగా వినియోగించుకుంటే కళ్ల ముందే శిశువులు ఆరోగ్యంగా ఎదుగుతారు. జిల్లాలో ప్రతి నెలా సుమారు 7 వేల మంది చిన్నారులకు వివిధ వ్యాధి నిరోధక టీకాలు అందిస్తున్నారు. నేడు జాతీయ వ్యాక్సినేషన్ డే సందర్భంగా తల్లులకు, శిశువులకు ఇచ్చే టీకాల ప్రాధాన్యంపై ప్రత్యేక కథనం. బీసీజీ అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఏడాది వయస్సు వరకూ చిన్న పిల్లల్లో వచ్చే ఊపిరితిత్తుల వ్యాధి, మెదడు, ఇతర అవయవాలకు వచ్చే క్షయను నివారిస్తుంది. పుట్టిన 24 గంటల్లోపు 0.05 ఎం.ఎల్. టీకా ఇస్తారు. నెల దాటితే 0.1 ఎంఎల్ మోతాదు ఎడమ భుజంపై ఇస్తారు. హెపటైటిస్–బి ఈ టీకా పచ్చకామెర్లు రాకుండా నివారిస్తుంది. జన్మించిన 24 గంటల్లోపు 0.5 ఎంఎల్ మధ్య తొడ పూర్వ పార్శ్వం వైపు వేస్తారు. ఓరల్ పోలియో వ్యాక్సిన్ (ఓపీవీ) చిన్న పిల్లల్లో వచ్చే పోలియో వ్యాధి నుంచి జీవితాంతం రక్షిస్తుంది. పుట్టిన వెంటనే, తిరిగి 6, 10, 14 వా రాలు, తిరిగి ఏడాదిన్నరకు పోలియో చుక్కలు నోట్లో వేస్తారు. ఏటా రెండుసార్లు నిర్వహించే పల్స్‌పోలియో కార్యక్రమంలో వేసే రెండు చుక్కలు దీనికి అదనం. రోటావైరస్ చిన్న పిల్లల్లో వచ్చే ప్రాణాంతకమైన నీళ్ల విరేచనాల నుంచి కాపాడటానికి రోటావైరస్ వ్యాక్సిన్ 6, 10, 14 వారాలకు వేస్తారు. ఐదు చుక్కల చొప్పున నోట్లో వేస్తారు. పెంటావాలెంట్ ఐదు ప్రాణాంతక వ్యాధులైన కంఠసర్పి, కోరింత దగ్గు, శిశు పక్షవాతం, పచ్చకామెర్లు, మెదడు వాపు, చెవిటితనం రాకుండా ఈ వ్యాక్సిన్ వేస్తారు. 6, 10, 14 వారాల్లో 0.5 ఎం.ఎల్ ఎడమ మధ్య తొడ పూర్వ పార్శ్వం వైపు వేస్తారు. పోలియో వ్యాక్సిన్ ఇంజక్షనన్ (ఐపీవీ) చిన్నారులకు పోలియో రాకుండా రెట్టింపు రక్షణ ఇస్తుంది. 6, 14 వారాల సమయంలో 0.01 ఎంఎల్ మందును ఇతర టీకాలతో పాటు కుడి జబ్బపై వేస్తారు. పీసీవీ వ్యాక్సిన్ న్యూమోనియా రాకుండా 6, 14 వారాల్లోను, 15–18 నెలల మధ్య వేస్తారు. తట్టు పిల్లలకు తట్టు వ్యాధి రాకుండా ఎంఆర్ వ్యాక్సిన్ వేయించాలి. మొదటి మోతాదు 0.5 ఎంఎల్ 9 నెలల నుంచి సంవత్సరం లోపు, రెండో మోతాదు 16 నెలల నుంచి 18 నెలల మధ్య కుడి భుజంపై ఇస్తారు. విటమిన్–ఎ ద్రావణం ఒక ఎంఎల్ నోట్లో వేస్తారు. దీనిని ప్రతి ఆరు నెలలకోసారి చొప్పున తొమ్మిది మోతాదులు వేయడం వలన రేచీకటి రాకుండా కాపాడుతుంది. కంటి చూపును వృద్ధి చేస్తుంది. 16 నెలల నుంచి 16 ఏళ్ల వరకూ.. ● డీపీటీ మొదటి బూస్టర్‌ను 16–24 నెలల్లో వేయాలి. ● ఓపీవీ బూస్టర్‌ను 16–24 నెలల్లో రెండు చుక్కల వంతున నోట్లో వేస్తారు. ● డీపీటీ రెండో బూస్టర్ ఐదు, ఆరు సంవత్సరాల్లో ఎడమ భుజంపై వేస్తారు. ● టీటీ ఇంజక్షన్‌ను 10, 16 సంవత్సరాల్లో భుజంపై ఇస్తారు. కపిలేశ్వరపురం: శిశు మరణాలను తగ్గించే లక్ష్యంతో పుట్టినప్పటి నుంచి ఐదేళ్ల వరకూ చిన్నారులకు ప్రభుత్వం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యాన వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు అందించాల్సి ఉంది. అయితే, దీనిపై కూటమి ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పలు రకాల టీకాల నిల్వలు నిండుకున్నాయి. దీంతో ప్రజలు అవస్థలు పడ్డారు. ● కోనసీమ జిల్లా పి.గన్నవరం, రాజోలు, కొత్తపేట నియోజకవర్గాల్లోని సుమారు 21 పీహెచ్‌సీల్లో జనవరి, ఫిబ్రవరి నెలల్లో పెంటావాలెంట్ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. దీంతో, అయినవిల్లి, వీరవల్లిపాలెం, ముక్కామల, నగరం, లూటుకుర్రు, తాటిపాక, లక్కవరం, కేశనపల్లి, మోరి, సఖినేటిపల్లి పీహెచ్‌సీల పరిధిలోని చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఆ రోజుల్లో ఈ వ్యాక్సిన్‌ను ప్రైవేటు ఆసుపత్రుల్లో వేయించేందుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకూ చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ● తూర్పు గోదావరి జిల్లాలోని గ్రామీణ పీహెచ్‌సీల్లో సైతం జనవరి, ఫిబ్రవరి నెలల్లో వ్యాక్సినేషన్లో సమస్యలు తలెత్తాయి. నెలలో మొదటి, రెండో బుధవారం, మూడు, నాలుగో శనివారాల్లో సచివాలయాల్లో నిర్వహించాల్సిన టీకాల కార్యక్రమంలో అరకొరగా వ్యాక్సిన్లు వేశారు. న్యుమోనియాను నివారించే న్యుమోకోకల్ వ్యాక్సిన్ గ్రామీణ పీహెచ్‌సీలతో పాటు అర్బన్ పీహెచ్‌సీల్లో సైతం అందుబాటులో లేకుండా పోయింది. ఫలితంగా ధవళేశ్వరం, రాజానగరం, దోసకాయలపల్లి, కోరుకొండ, పాలచర్ల సీతానగరం తదితర పీహెచ్‌సీల పరిధిలోని ప్రజలు అవస్థలు పడ్డారు. పోలియో నివారణకు వేసే ఓరల్ పోలియో వ్యాక్సిన్, గవద బిళ్లలు, కోరింత దగ్గు, మెదడు వాపు, కామెర్లు, ధనుర్వాతం సమస్యలు రాకుండా వేసే వ్యాక్సిన్ మూడు వారాల పాటు అందుబాటులో లేక ఇబ్బందులు పడ్డారు. ● కూటమి ప్రభుత్వం వైద్య, ఆరోగ్య సేవల్లో తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయడం మినహా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలూ నిర్వహించడం లేదు. ప్రతి నెలా 10న గర్భిణులకు పరీక్షలు చేయించడంతో మాత్రమే సరిపెడుతోంది. టీకాతో ఆరోగ్యం టీకాలు 11 రకాల ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడతాయి. గర్భిణులు, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలందరికీ ప్రభుత్వం సూచించిన టీకాలను తల్లిదండ్రులు క్రమం తప్పకుండా వేయించాలి. అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. టీకాల వలన శిశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి, బయటి వాతావరణంలోని సూక్ష్మక్రిముల బారిన పడకుండా సురక్షితంగా ఉంటారు. ఈ టీకాలు జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, సామాజిక ఆస్పత్రులతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో పూర్తి ఉచితంగా వేస్తున్నాం. ప్రతి బుధ, శనివారాల్లో నిర్వహించే టీకాల కార్యక్రమానికి తల్లిదండ్రులు తమ చిన్నారులను తప్పనిసరిగా తీసుకురావాలి. – డాక్టర్ బీవీవీ సత్యనారాయణ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి, అమలాపురం జిల్లాలో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ టీకాలు వేశారిలా.. లక్ష్యం 25,666 బీసీజీ 25472 ఓపీవీ 25,491 హెపటైటిస్ 25,460 వీఐటీకే 25,093 ఓపీవీ–1 25,448 ఐపీవీ–1 25,450 రోటా–1 25,452 ఓపీవీ–2 25,438 పెంటా–2 25,411 రోటా–2 25,408 ఓపీవీ–3 25,425 పెంటా–3 25,387 రోటా–3 25,414 ఐపీవీ–2 25,454 పీసీవీ–2 25,378 ఎంఆర్–1 25,232 పీసీబీ–బి 25,052 జిల్లావ్యాప్తంగా మొత్తం 97 శాతం మంది చిన్నారులకు టీకాలు ఇచ్చారు. మిగిలిన మూడు శాతాన్ని ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. -
కలెక్టర్లు హాజరు కాకుంటే ఎలా?
కాకినాడ సిటీ: జెడ్పీ సర్వసభ్య సమావేశంలో అజెండాలోని అంశాలపై జరిగే చర్చలకు తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీన జిల్లాల కలెక్టర్లు హాజరు కాకపోవడంపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరావులతో పాటు ఆయా జిల్లాల జెడ్పీటీసీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం పనుల ద్వారా సమకూరిన మెటీరియల్ కాంపోనెంట్ నిధులను, గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌ల తీర్మానాలతో ప్రమేయం లేకుండా కలెక్టర్లు తమ ప్రాధాన్యం ప్రకారం కేటాయించడంపై సభ్యులు అభ్యంతరం తెలుపుతూ, ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని చైర్మన్ వేణుగోపాలరావును కోరారు. మూడు జిల్లాలోని గోదావరి కాలువ చివరి ఆయకట్టు భూముల్లోని పంటలు సాగునీరు అందక ఎండిపోతున్న పరిస్థితిపై సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ, వంతుల వారీ విధానం, డ్రైన్ల నుంచి లిఫ్టింగ్ ద్వారా పంటలను కాపాడాలని కోరారు. కాలువల ఎగువ ప్రాంతాల్లోని రైతులకు సక్రమంగా నీటిని వదులుతున్నప్పటికీ అదనపు నీటిని అక్రమంగా తోడుతుండడం వల్ల శివారు భూములకు నీరు అందడం లేదని, ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ హెచ్చరించారు. తాళ్లరేవు జెడ్పీటీసీ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్ మాట్లాడుతూ యానాం–ద్రాక్షారామ ప్రధాన రహదారిలో ఆరేళ్లుగా వంతెన శిథిల స్థితికి చేరడం వల్ల కాలువకు తూరలు వేసి పైన సీసీ రోడ్డు వేశారని, ఫలితంగా నీరు సక్రమంగా పారకపోవడం, ఆ రహదారిలో రాకపోకలు సాగిస్తున్న సుమారు 40 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఇంజరం వద్ద పూర్తి స్థాయిలో వంతెన నిర్మించి రైతులను ఆదుకోవాలని, ప్రజల రాకపోకలలో ఇబ్బందులు తొలగించాలని కలెక్టర్ కోరారు. దీనిపై కలెక్టర్ షణ్మోహన్ స్పందించి ఈ విషయం పూర్తి స్థాయిలో అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే పౌరసరఫరాల ద్వారా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, హాస్టళ్లకు పంపిణీ చేస్తున్న నాసిరకమైన కొత్త బియ్యం వండినప్పుడు ముద్దవుతోందని, పిల్లలు తినడానికి ఇష్టపడడం లేదని కొందరు సభ్యులు ప్రస్తావించారు. మండలాల్లో నిర్వహించిన పనులకు చెల్లింపులు జాప్యం లేకుండా జరపాలని కోరారు. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమాలు జిల్లాలో విస్తృతంగా నిర్వహించాలని, ఆరోగ్యంపై వ్యయాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన జనరిక్ మందుల షాపులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు కోరారు. కారుణ్య నియామకాలను వేగవంతం చేయాలని, ఉద్యోగులకు జీపీఎఫ్ స్లిప్పులు జారీ చేయాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు. గిరిజన ప్రాంత ప్రజల సమస్యలపై చర్చ, పరిష్కారానికి ఐటీడీఏ సర్వ సభ్య సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్తో పాటు, ఏఎస్ఆర్ జిల్లా పరిధి జెడ్పీటీసీ సభ్యులు కోరారు. దీనిపై ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం స్పందిస్తూ ఏప్రిల్ చివరి లేదా మే తొలివారంలో తదుపరి సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. అలాగే గిరిజన ప్రాంత సమస్యలపై సభ్యులు ప్రస్తావించిన అంశాలకు ఆయన వివరణలు ఇచ్చి సమస్యలన్నింటినీ సత్వరం పరిష్కరిస్తామన్నారు. తమ జిల్లాలకు సంబంధించి సభ్యులు లేవనెత్తిన అంశాలపై చర్యలు చేపడతామని తూర్పుగోదావరి జిల్లా జేసీ చినరాముడు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డీఆర్వో రాజకుమారి సభ్యులకు వివరించారు. సమావేశం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన సభ్యులు, అధికారులకు జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన ప్రజాసమస్యలపై సత్వరం సమగ్ర పరిష్కారాలు అందించాలని నాలుగు జిల్లాల అధికారులను చైర్మన్ వేణుగోపాలరావు కోరారు. ఈ సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్లు బుర్రా అనుబాబు, మేరుగు పద్మలత, జెడ్పీ సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు, డిప్యూటీ సీఈవో రామ్‌గోపాల్, ఏవో ఎం.బుజ్జిబాబు, జెడ్పీటీసీ సభ్యులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని నాలుగు జిల్లాల అధికారులు పాల్గొన్నారు. రూ.70 లక్షల మిగులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.70 లక్షల మిగులుతో రూ.1,014 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించింది. ఉమ్మడి జెడ్పీ బడ్జెట్ సర్వసభ్య సమావేశం శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, తూర్పుగోదావరి జిల్లా జేసీ ఎస్ చినరాముడు, రంపచోడవరం జేసీ కట్టా సింహాచలం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డీఆర్ఓ బీఎల్ఎస్ రాజకుమారి పాల్గొన్నారు. సమావేశాన్ని జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ప్రారంభించగా తొలుత దివంగతులైన కాట్రేనికోన ఎంపీపీ పాలెపు లక్ష్మి మృతికి సంతాపం ప్రకటిస్తూ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సమావేశంలో 2024–25 సంవత్సరానికి సవరించిన బడ్జెట్‌ను, 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన అంచనా బడ్జెట్ ముసాయిదాను జెడ్పీ పరిపాలనాధికారి సభ్యులకు వివరించారు. అనంతరం బడ్జెట్లో పొందుపరిచిన ప్రతిపాదనలపై సమవేశం చర్చించి 2024–25 సంవత్సరానికి సవరించిన ఆదాయం రూ. 846.60 కోట్లు, సవరించిన వ్యయం రూ. 845.95 కోట్లతో రూ.65 లక్షలు మిగులుతో సవరించిన బడ్జెట్‌ను ఆమోదించారు. అదే విధంగా రానున్న 2025–26 ఆర్థిక సంవత్సరానికి అన్ని పద్దులు కలిపి మొత్తం ఆదాయం అంచనా రూ.1013.80 కోట్లు కాగా, అన్ని పద్దుల కింద అంచనా వ్యయం రూ. 1013.10 కోట్లతో, రూ.70 లక్షలు మిగులు బడ్జెట్‌ను సమావేశం ఆమోదించింది. ఆదాయంలో జెడ్పీ సాధారణ నిధులు రూ. 28 కోట్లు, ప్రభుత్వం నుంచి కేటాయించిన శాలరీ గ్రాంటులు రూ.10.48 కోట్లు, నిర్థిష్ట ప్రయోజన గ్రాంటు రూ.46.09 కోట్లు, డ్వామా, గ్రామీణ నీటి సరఫరా, ఇతర శాఖల ద్వారా వచ్చే గ్రాంటు రూ. 922.39 కోట్లుగా ఉన్నాయి. జెడ్పీ సాధారణ నిధుల నుంచి షెడ్యూల్ కులాల సంక్షేమానికి 15 శాతం కేటాయింపు రూ. 2.97 కోట్లు, షెడ్యూల్ తెగల సంక్షేమానికి 6 శాతం కేటాయింపు రూ.1.19 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి 15 శాతం కేటాయింపు, రూ.2.97 కోట్లు, అభివృద్ధి పనులకు 23 శాతంగా రూ.4.55 కోట్లు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పశుసంవర్థక, సాంఘిక సంక్షేమం తదితర సెక్టార్లకు 10 శాతంగా రూ. 2.97 కోట్లు కేటాయింపులను సర్వసభ్య సమావేశం ఆమోదించింది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఆస్తులను పరిరక్షిస్తూ, ఆదాయ వనరులను మరింత పెంచాలని సభ్యులు కోరారు. రూ.1014 కోట్లతో బడ్జెట్‌కు ఆమోదం తూర్పుగోదావరి, కోనసీమ జిల్లా అధికారులపై సభ్యుల ధ్వజం పలు అంశాలపై జెడ్పీ సమావేశంలో చర్చ -
రాజమండ్రిలో సీన్ తీస్తే సూపర్ హిట్టే
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): తను హీరోగా నటించిన రాబిన్ హుడ్ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు ఉన్నాయని, ఈ సినిమా అందరికీ నచ్చుతుందని హీరో నితిన్ అన్నారు. గతంలో వెంకీ కుడుముల దర్శకత్వంలో తను నటించిన భీష్మ సినిమా మంచి విజయం సాధించిందని చెప్పారు. ఆ సినిమాలో ఒక సన్నివేశం రాజమండ్రిలో చిత్రీకరించామని అది హిట్టని అన్నారు. ఆ సెంటిమెంటుతో రాబిన్ హుడ్ సినిమాలో ఒక సీన్ ఇక్కడ చిత్రీకరించామని, ఇది కూడా సూపర్ హిట్ అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నితిన్, శ్రీ లీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం ఈనెల 28 న విడుదల కానున్న సందర్భంగా చిత్ర ప్రమోషషన్ కోసం రాజమండ్రి వచ్చిన చిత్ర బృందం శనివారం మధ్యాహ్నం మంజీరా హోటల్లో మీడియాతో మాట్లాడింది. నితిన్ మాట్లాడుతూ దర్శకుడు వెంకీ కుడుముల తొలి చిత్రం చలో నుంచి తనకు పరిచయం ఉందని తర్వాత తమ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన భీష్మ చిత్రం మంచి విజయం సాధించిందని గుర్తు చేశారు. దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ ఇప్పటికే రాబిన్ హుడ్ టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన వస్తోందని సినిమా కూడా హిట్టవుతుందన్న నమ్మకం ఉందని చెప్పారు. నితిన్ యాక్షన్ సీన్లు, ఫన్ అందరినీ అలరిస్తాయని, సినిమాలో సర్ప్రైజ్ ట్విస్టులు కూడా ఉన్నాయని తెలిపారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ మంచి పాటలు కంపోజ్ చేశారని చెప్పారు. శ్రీలీల గత చిత్రాలలో ఆమె డ్యాన్స్ మాత్రమే చూశారని, ఈ చిత్రంలో పెర్ఫార్మెన్స్ కూడా చూస్తారని వెంకీ తెలిపారు. శ్రీలీల మాట్లాడుతూ తనకు రాజమండ్రి కొత్తకాదని తమ గ్రాండ్ ఫాదర్ ధవళేశ్వరంలో ఉండేవారని చెప్పారు. ఈ సినిమాలో పాత్ర తనకు చాలా నచ్చినదని, ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారని, పిల్లలతో కలిసి ఈ సినిమా చూడాలని ఆమె కోరారు. రాజమండ్రి రోజ్ మిల్క్ తనకు చాలా ఇష్టమని ఆమె అన్నారు. రాబిన్‌హుడ్ ప్రేక్షకులకు నచ్చుతుంది హీరో నితిన్ -
పదిలో పట్టు.. భవితకు మెట్టు
రాయవరం: విద్యార్థి ప్రగతికి పదో తరగతి తొలి మెట్టు. పరీక్షలు అనగానే సహజంగానే విద్యార్థులు భయం, ఆందోళన చెందుతూ ఉంటారు. ఆ భయాన్ని వీడి పరీక్షలను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంటే వారి భవిష్యత్ బంగారమవుతుంది. ఆత్మవిశ్వాసం..ఏకాగ్రత..మంచి ఆహారం..కొద్ది సేపు ధ్యానం అవసరం. సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. టెన్షన్ వద్దు పరీక్షలు ప్రారంభమవుతున్న తరుణంలో విద్యార్థులు టెన్షన్ వదిలి అటెన్షన్‌గా ఉండాలి. ప్రిపరేషన్ ఎంత అవసరమో దానిని పేపర్‌పై పెట్టగలగడమూ అంతే అవసరం. దానికి తోడు పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మనసు, శరీరమూ కూడా ప్రశాంతంగా ఉంటాయి. అలాగే పరీక్షలు రాసేముందు పునశ్చరణ ఉండాలే తప్ప కొత్త పాఠ్యాంశం జోలికి వెళ్లకూడదు. ప్రజెంటేషన్ చాలా ముఖ్యం పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు పాజిటివ్ థింకింగ్, ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రివ్యూ, ప్రజంటేషన్ అలవర్చుకోవాలి. వీటితో పాటు పరీక్ష ముందు రోజు తగినంత నిద్ర పోవాలి. నిద్ర మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. నేను బాగానే రాయగలను అనే పాజిటివ్ థింకింగ్‌తో పరీక్షా కేంద్రానికి వెళ్లాలి. ముందుగా బాగా వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాసి, తరువాత కష్టంగా అనిపించిన ప్రశ్నలకు జవాబులు రాయాలి. రేపటి పరీక్షను చక్కగా రాస్తున్నట్లుగా ముందుగానే మనసును సిద్ధం చేయాలి. కొత్త వాతావరణంలో పరీక్షలు రాస్తున్నామనే భయం వద్దు. జవాబు పత్రంలో కొట్టివేతలు, దిద్దుబాట్లు లేకుండా, చక్కటి దస్తూరీతో సమాధానాలు రాస్తే మంచిది. తల్లితండ్రుల పాత్ర కీలకం పరీక్షల సమయంలో మంచి ర్యాంకు, ఎక్కువ మార్కు లు తెచ్చుకోవాలనే ఒత్తిడిని పిల్లలపై రుద్దకూడదు. ఇతరులతో పోల్చడం, గతంలో మార్కులు తక్కువ వచ్చిన అంశాలతో వారిని తక్కువ చేయకూడదు. ఇవి పాటిస్తే మంచిది జవాబు పత్రంలో ఒక్కో పేజీపై 16 నుంచి 18 లైన్లకు మించకుండా సమాధానాలు రాయాలి. ముఖ్యమైన అంశాల కింద అండర్లైన్ చేయాలి. గణితంలో అంకెలు స్పష్టంగా వేసుకోవాలి. తెలుగులో అక్షరాలు స్పష్టంగా కనబడేటట్లుగా రాయాలి. నీలం లేదా నలుపు రంగు సిరా ఉన్న పెన్నులు లేదా బాల్‌పెన్నులు మాత్రమే వాడాలి. ఆందోళన లేకుండా పరీక్షలు రాయాలి ఆహార నియమాలతో మానసిక ప్రశాంతత తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరం విద్యార్థులూ.. విజయానికి సూత్రాలివిగో.. -
సానుకూల దృక్పథం అవసరం
ఎటువంటి ప్రశ్నలకై నా సమాధానాలు రాయగలననే సానుకూల దృక్పథాన్ని విద్యార్థులు కలిగి ఉండాలి. పరీక్ష ముగిసిన తర్వాత సమాధానాలు సరిపోల్చుకోకూడదు. అలా చేస్తే తరువాతి పరీక్షకు సరిగ్గా సన్నద్ధం కాలేరు. పరీక్షకు వెళ్లే ముందు వజ్రాసనం వేసుకుని ధ్యానం చేసుకుంటే ఎటువంటి ఒత్తిడినైనా అధిగమించవచ్చు. పరీక్షలకు ముందు అలసట, నిద్రలేమి లేకుండా చూసుకోవాలి. కనీసం ఆరు గంటల నిద్ర అవసరం. సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. రివిజన్‌కు అధిక ప్రాధాన్యతనివ్వాలి. – డాక్టర్ సౌమ్య పసుపులేటి, సైకియాట్రిస్ట్, ఏరియా ఆస్పత్రి, అమలాపురం ● -
వాడవాడలూ వాడపల్లివైపే..
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి వారి క్షేత్రానికి అత్యధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. పావన గౌతమీ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, భారీ క్యూ లైన్లలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించే భక్తులతో ఆలయ ప్రాంగణం పోటెత్తింది. ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో సుప్రభాత సేవతో సేవలు ప్రారంభించగా భక్తులు స్వామివారిని దర్శించి అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కూలర్లు ఏర్పాటు చేశారు. శనివారం స్వామివారికి వివిధ రూపాల్లో రూ. 42,59,486 ఆదాయం వచ్చినట్టు ఈఓ తెలిపారు. సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రించి, శాంతిభద్రతలను పర్యవేక్షించారు. ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి బస్సు సర్వీసులను నడిపింది. అప్పనపల్లిలో భక్తుల కోలాహలం మామిడికుదురు: పవిత్ర వైనతేయ గోదావరి తీరంలోని అప్పనపల్లి బాల బాలాజీ స్వామి క్షేత్రానికి శనివారం భారీగా భక్తులు తరలి వచ్చారు. తెల్లవారు జామున సుప్రభాత సేవ, తొలి హారతితో ఆలయంలో దర్శనాలు ప్రారంభమయ్యాయి. భక్తులు ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షణలు చేశారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.2,08,980 ఆదాయం వచ్చింది. స్వామి వారి నిత్య అన్నదానం ట్రస్టుకు భక్తులు రూ.59,926 విరాళంగా అందించారు. లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.41,205 ఆదాయం వచ్చింది. స్వామి వారిని నాలుగు వేల మంది భక్తులు దర్శించుకున్నారు. 2,500 మంది భక్తులు స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారని ఆలయ ఈఓ ఎం.సత్యనారాయణరాజు తెలిపారు. గోవింద నామాలతో మార్మోగిన ఆలయం ఆలయానికి పోటెత్తిన భక్తజనం శనివారం ఆదాయం రూ.42.59 లక్షలు -
ఉత్సాహంగా పవర్ లిఫ్టింగ్ పోటీలు
పి.గన్నవరం: పోతవరం గ్రామంలోని ఎస్ఎస్ ఫిట్నెస్ జోన్ ఆవరణలో శనివారం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పవర్ లిఫ్టింగ్ చాంపియన్, బెంచ్ ప్రెస్ 2025 పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. ఎస్ఎస్ ఫిట్జోన్ అధినేత, కార్యక్రమ నిర్వాహకుడు కత్తుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయడం ద్వారా మంచి ఆరోగ్యం చేకూరుతుందన్నారు. పవర్ లిఫ్టింగ్, బ్రెంజి ప్రెస్‌లో రాణించి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఎస్ఎస్ ఫిట్నెస్ జోన్, కోనసీమ పవర్ లిప్టింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో సుమారు 150 మంది క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. 10 కేటగిరీల్లో పురుషులు, మహిళలకు పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విజేతలకు బహుమతులు, మెరిట్ సర్టిఫికెట్లు, పతకాలు, షీల్టులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు యెనుమల కృష్ణపద్మరాజు, కార్యదర్శి ఒంటెద్దు వెంకన్నాయుడు, ఈవెంట మేనేజర్ కంకిపాటి వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ ఫిట్నెస్ అధినేత కత్తుల శ్రీనివాస్, దవులూరి వెంకట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వరి చేలలో మోటార్ సైకిల్‌తో రైతుల నిరసన
సాగు నీరందక బీడు వారుతున్నాయని ఆందోళన .ఉప్పలగుప్తం: కూనవరం పంచాయతీ గరువుపేటలో సాగు నీరందక చేలు బీడుగా మారుతున్నాయని రైతులు వరి చేలలో మోటార్ సైకిల్ నడుపుతూ శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల గోడును పట్టించుకునే నాథుడే లేడని వాపోయారు. ఈ ప్రాంతంలో సాగు నీరందక సుమారు 350 ఎకరాలు బీడుగా మారిందని, వెన్ను ఈనిక దశలో పంట ఉండగా, సాగు నీరందించకపోతే నిరుపయోగంగా మారి నష్టపోతున్నామన్నారు. ఈ విషయమై చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, వారి నుంచి స్పందన లేదని ఆవేదన చెందారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నీటి సంఘాలు లేనప్పటికీ సాగు నీరు అందేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో నీటి సంఘాలను ఏర్పాటు చేసినా ప్రయోజనం లేదని నిస్సహాయత వ్యక్తం చేశారు. కూనవరం మేజర్ డ్రెయిన్‌పై క్రాస్‌బండ్‌ను ఏర్పాటు చేయడంతో, ఉప్పు నీరు పోటెక్కి పంట కాలువల్లోకి చేరి, కనీసం చేనుకు సాగు నీరు పెట్టుకునే అవకాశం సైతం లేదని వివరించారు. తొలకరి సాగు నష్టపోయామని, అప్పు చేసి దాళ్వా సాగు చేస్తున్నామని, ఉన్నతాధికారులు స్పందించి సాగు నీరందించకపోతే భారీ నష్టాలు తప్పవని రైతులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో రైతులు చింతా నాగరాజు, వాకపల్లి దొరబాబు, పరమట నాగరాజు, పోద్దోకు బాబులు, బళ్ల నరసింహమూర్తి, వాకపల్లి చిట్టిబాబు, కోలా పల్లపురాజు, బళ్ల సత్యనారాయణ, పరమట సింహాద్రి పాల్గొన్నారు. -
భీమేశ్వరుని సన్నిధిలో తెలంగాణ హైకోర్టు జడ్జి
రామచంద్రపురం రూరల్: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామిని తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ శరవన్కుమార్ దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. జడ్జి దంపతులకు పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారిని, అమ్మవారిని వారు దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బేడా మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ సిబ్బంది స్వామివారి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికలను అందజేశారు. రామచంద్రపురం అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె.నాగేశ్వరరావు నాయక్, ఆర్డీఓ దేవరకొండ అఖిల తదితరులున్నారు. నేటితో వెబ్ ఆప్షన్ ముగింపు అమలాపురం రూరల్: జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగే డీఎస్సీ ఉచిత కోచింగ్ కోసం జ్ఞానభూమి వెబ్ పోర్టల్‌లో వెబ్ ఆప్షన్ల సర్వీసు ప్రారంభించినట్టు ఆ శాఖ మహిళా సాధికారత అధికారి ఎం.జ్యోతిలక్ష్మీదేవి శుక్రవారం ఇక్కడ తెలిపారు. వెబ్ ఆప్షన్లను శనివారంలోగా అభ్యర్థులు నమోదు చేసుకోవాలని కోరారు. షార్ట్ లిస్టులో ఉన్న వెయ్యి మంది అభ్యర్థులు ఇప్పటికే తమ వెబ్ ఆప్షన్లను పూర్తి చేశారని చెప్పారు. షార్ట్ లిస్ట్ చేసిన మిగిలిన అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్లను సమయానికి పూర్తి చేయాలని సూచించారు. గతంలో జ్ఞానభూమి పోర్టల్ కోచింగ్ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులూ వెబ్ ఆప్షన్లు పూర్తి చేసుకోవాలని కోరారు. అమ్మవారి పంచలోహ విగ్రహం సమర్పణ ఆలమూరు: చింతలూరులో వేంచేసిన నూకాంబిక అమ్మవారికి ఓ భక్తుడు పంచలోహ ఉత్సవ విగ్రహం సమర్పించారు. మండపేటకు చెందిన రామకృష్ణ బ్రాస్ అండ్ సిల్వర్ వర్క్స్ అధినేత, ప్రముఖ శిల్పి వాసా శ్రీనివాస్, లక్ష్మీపార్వతి దంపతులు సుమారు రూ.1.25 లక్షలతో 35 కిలోల బరువు కలిగిన పంచలోహాలతో ఈ విగ్రహాన్ని తయారు చేయించారు. దాతలైన శ్రీనివాసు దంపతులు శుక్రవారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని అమ్మవారి ఆలయానికి సమర్పించారు. అమ్మవారి విగ్రహ రూపకల్పన కోసం 30 రోజులు పట్టింది. అయోధ్య రామాలయంలో 25 కేజీల బాలరాముడి పంచలోహ మూర్తిని గతేడాది కార్తిక మాసంలో సమర్పించినట్టు దాత శ్రీనివాస్ తెలిపారు. -
కిం కర్తవ్యం స్వామీ!
ప్రస్తుతం డెడ్ స్టోరేజీకి చేరువగా ఉన్న పంపా నీటిమట్టం అన్నవరం: చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లనే చందంగా మారింది అన్నవరం దేవస్థానం అధికారుల వ్యవహారం. పోలవరం కాలువ పనులు, పంపా గేట్ల మరమ్మతుల పేరిట జనవరి నుంచి పంపా నీటిని సముద్రంలోకి వదిలేస్తూంటే చోద్యం చూశారు. వచ్చే నెలలో శ్రీరామ నవమి, మే నెలలో సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. దీంతో మేల్కొన్న అధికారులు.. ఈ ఉత్సవాల సందర్భంగా నిర్వహించే స్వామివార్ల చక్రస్నానాలకు ఏలేరు నుంచి పంపాకు నీరు ఇప్పించాలని జిల్లా కలెక్టర్‌కు నాలుగు రోజుల కిందట లేఖ రాశారు. చక్రస్నాన మహోత్సవాలకు ఏలేరు నుంచి రోజుకు 200 క్యూసెక్కుల నీటిని పంపాకు విడుదల చేయించాలని కోరారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ షణ్మోహన్ దేవస్థానం, ఇరిగేషన్, పోలవరం అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వివరాలు తెలుసుకున్నారు. అయితే, ఏలేరు నుంచి నీరు విడుదల చేస్తే పోలవరం కాలువ అక్విడెక్ట్ పనులకు ఆటంకం కలుగుతుందని పోలవరం అధికారులు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పంపా జలాశయాన్ని, పోలవరం కాలువ అక్విడెక్ట్ పనులను పరిశీలించడానికి ఈ నెల 18న వస్తానని, అప్పుడు దీనిపై పరిశీలించి, నిర్ణయం తీసుకుంటానని చెప్పారని అంటున్నారు. ముందే చెప్పిన ‘సాక్షి’ వాస్తవానికి ఈ సమస్యను ‘సాక్షి’ ముందే వెలుగులోకి తెచ్చింది. పంపా గేట్ల మరమ్మతులు, పోలవరం అక్విడెక్ట్ పనుల కారణంగా నీటిని దిగువకు వదిలేస్తూండడంతో పంపా రిజర్వాయర్‌లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయని గత నెల పదో తేదీన ‘అడుగంటినది’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనివలన శ్రీరామ నవమి, సత్యదేవుని కల్యాణోత్సవాల సందర్భంగా దేవస్థానానికి నీటి సమస్య ఉత్పన్నమవుతుందని పేర్కొంది. అలాగే, ఫిబ్రవరి నుంచి మే నెల వరకూ వివాహాల సీజన్, ఉత్సవాల కారణంగా ఎక్కువ మంది భక్తులు రత్నగిరికి వస్తారని, అందువలన దేవస్థానానికి నీటి అవసరం ఎక్కువవుతుందని తెలిపింది. అప్పట్లోనే దేవస్థానం అధికారులు స్పందించి, ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి ఉంటే.. పంపా నుంచి నీరు పోకుండా బండ్ వేయించి, ఉన్న నీటిని నిలుపుదల చేయిస్తే సరిపోయేది. అలాగే, పోలవరం కాలువ పనులకు అడ్డు లేకుండా దానికి ఇరువైపులా గట్టు వేయిస్తే బాగుండేది. తద్వారా పంపాలో నీరు నిల్వ ఉండేది. కనీసం గత నెల 24న దేవస్థానానికి కలెక్టర్ వచ్చినప్పుడైనా ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తే బాగుండేది. కానీ, ఈ సమస్యపై సుమారు నెల రోజులు ఆలస్యంగా దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు కలెక్టర్‌కు లేఖ రాశారు. డెడ్ స్టోరేజీకి చేరువలో.. పంపాలో ప్రస్తుతం నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి దగ్గరగా ఉన్నాయి. పంపా జలాశయంలో గరిష్ట మట్టం 103 అడుగుల వద్ద 0.43 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. ప్రస్తుతం నీటిమట్టం 82 అడుగులుంది. 0.014 టీఎంసీల నిల్వలున్నాయి. ఇది 0.007 టీఎంసీలకు తగ్గితే పంపా డెడ్ స్టోరేజీకి చేరుతుంది. పంపాకు నీరొచ్చే దారేదీ? శ్రీరాముని, సత్యదేవుని చక్రస్నానాలకు తప్పని ఇబ్బంది గత నెలలోనే వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ ఆలస్యంగా స్పందించిన దేవస్థానం అధికారులు ఏలేరు నుంచి పంపాకు నీరివ్వాలని ఈఓ లేఖ సంబంధిత అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 16,000 గటగట (వెయ్యి) 14,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
నేటి నుంచి ఒంటిపూట బడులు
రాయవరం/కొత్తపేట: జిల్లా అంతటా నేటి నుంచి పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. విద్యా శాఖ క్యాలండర్ ప్రకారం మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాల్సి ఉంది. అందులో భాగంగా శనివారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలంటూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వి.విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కారణంగా మండుతున్న ఎండల నుంచి విద్యార్థులకు ఉపశమనం లభించనుంది. విద్యా శాఖ క్యాలండర్ ప్రకారం ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, ఇతర ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలతో పాటు, ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలకు ఒంటిపూట బడుల నిబంధన వర్తిస్తుంది. పదో తరగతి పరీక్షలు ఈ నెల 17 నుంచి నిర్వహించనున్న నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఒంటి పూట బడులు వర్తిస్తాయి. పది పరీక్షా కేంద్రాలున్న పాఠశాలల్లో మాత్రం ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం పాఠశాల నిర్వహిస్తారు. ఒంటిపూట బడులు నిర్వహించాలంటూ జిల్లా విద్యా శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఒంటి పూట బడులను ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించాల్సి ఉంటుంది. ఉదయం 7.45 నుంచి ఎనిమిది గంటలకు అసెంబ్లీ నిర్వహించాలి. పాఠశాల ముగిసిన అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేసిన తర్వాత వారిని ఇళ్లకు పంపించాల్సి ఉంది. విద్యుదాఘాతంతో వివాహిత మృతి ముమ్మిడివరం: కర్రివానిరేవు పంచాయతీ శివారు చింతావానిరేవుకు చెందిన ఓ వివాహిత విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. గ్రామానికి చెందిన రేకాడి ధనకుమారి(23) శుక్రవారం ఉదయం నీళ్లు కాయడానికి వాటర్ హీటర్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురైంది. ఎవరూ గమనించకపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెకు భర్త కనకరాజు, మూడేళ్ల పాప ఉన్నారు. -
చిడిపిలో కుల బహిష్కరణ ?
● చెరువు గట్టు ఆక్రమణతో రెండు వర్గాల మధ్య వివాదం ● మాట్లాడితే రూ.2 వేల జరిమానాకు నిర్ణయం ● పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం కొవ్వూరు: ఆధునిక సమాజంలో కొన్ని పల్లెల్లో నేటికీ కుల బహిష్కరణ దూరాచారం పడగ విప్పుతోంది. కొవ్వూరు మండలం చిడిపి గ్రామంలో రెండు వర్గాల మధ్య కార్చిచ్చు రేగింది. గ్రామంలో ఉన్న రజకుల చెరువు గట్టు ఆక్రమణ వ్యవహారంతో రజకులు, గౌడ సంఘం మధ్య వివాదం తలెత్తింది. ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో, ఒక వర్గాన్ని మరో వర్గం వారు బహిష్కరించే వరకు వెళ్లింది. ఒకే ప్రాంతంలో కొన్నేళ్లుగా కులమతాలకతీతంగా, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న మిత్రులంతా ఇప్పుడు విరోధులుగా మారారు. రజకులతో మాట్లాడవద్దని, పెళ్లిళ్లు, విందులకు వెళ్లరాదని, మాట్లాడిన వారికి రూ.2 వేల జరిమానా విధిస్తామని, సమాచారం ఇచ్చిన వారికి రూ.200 బహుమానం ఇస్తామని గౌడ సంఘం తీర్మానం చేసినట్టు చెబుతున్నారు. చెరువు గట్టు ఆక్రమణలు తొలగించాలని ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిని సక్రమంగా అమలు చేయని అధికారులపై చర్యలు కోరుతూ కోర్టును ఆశ్రయిస్తామని అనంతపురం జిల్లాకు చెందిన రజక సంఘ నాయకులు, న్యాయవాది హనుమన్న తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాకు విడుదల చేసిన వీడియోతో కుల బహిష్కరణ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అసలు వివాదం ఇదీ.. గ్రామాన్ని ఆనుకుని రజకులకు 1.24 ఎకరాల వృత్తి చెరువు ఉంది. దీని గట్టు ఆక్రమించుకుని కొందరు గడ్డిమేనులు వేశారు. గౌడ సంఘం చెరువు గట్టున పాపయ్య గౌడ విగ్రహాన్ని నెలకొల్పింది. చిన్న షెడ్డు వేసి, అందులో దేవీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రజకులు ఆక్రమణలపై కోర్టును ఆశ్రయించారు. దీంతో అధికారులు కోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణల తొలగింపునకు పూనుకున్నారు. దీనిని గౌడ సంఘం అడ్డుకోవడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని, ఆక్రమణలను అసంపూర్తిగా తొలగించి అధికారులు చేతులు దులుపుకొన్నారు. అప్పటి నుంచి ఆయా వర్గాల మధ్య చిచ్చురేగింది. చివరికి రజకులను బహిష్కరించి, వారి వద్ద నుంచి క్రయవిక్రయాలు సైతం మానేశారు. ఈ దురాచారంపై ఏ ఒక్క అధికారి కానీ, రాజకీయ పార్టీలు కానీ పట్టించుకోవడం లేదని రజకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కోర్టుకు వెళ్లామని ఇబ్బంది
చెరువును 40 ఏళ్ల నుంచి కుల వృత్తికి వినియోగించుకుంటున్నాం. పంచాయతీ నుంచి లీజుకి తీసుకున్నాం. చెరువు గట్టు ఆక్రమణలు తొలగించాలని హైకోర్టుకు వెళ్లాం. కోర్టు ఆదేశించినా ఆక్రమణలు తొలగించడం లేదు. రజకులతో మాట్లాడకూడదని, మాట్లాడితే జరిమానా విధిస్తామని చెబుతున్నారు. – కొండపల్లి వెంకటరత్నం, చిడిపి ఒప్పకోవడం లేదు రెండు వర్గాల మధ్య మాటల్లేవు. 2011 నుంచి చెరువు ఆక్రమణ తొలగించాలని వివాదం నడుస్తుంది. గ్రామ పెద్దలంతా కలిసి ఇరు పక్షాల మధ్య సఖ్యత కుదిర్చేందుకు ప్రయత్నించాం. పలుమార్లు చర్చలు జరిపాం. రజకుల కుల బహిష్కరణ అంశం నా దృష్టికి వచ్చింది. పరిష్కారానికి ఇరు పక్షాలు ఒప్పుకోవడం లేదు. – పాలగుడుల లక్ష్మణరావు, సర్పంచ్, చిడిపి ● -
నువ్వులు.. రైతన్న మోములో నవ్వులు
పిఠాపురం: గతంలో ఖాళీగా ఉన్న భూముల్లో ప్రత్యామ్నాయంగా సాగు చేసే నువ్వుల పంటను ఇప్పుడు ప్రధానంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం నవ్వుల పంట ఆశాజనకంగా ఉందని రైతులు చెబుతున్నారు. గతంలో కేవలం ఎకరాకు రెండు బస్తాలు కూడా రాని దిగుబడి.. ఇప్పుడు ఎకరాకు 8 నుంచి 12 బస్తాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొక్కజొన్న, మిరప, వంగ, టమాటా వంటి పంటలను తగ్గించి, ఎక్కువ మంది రైతులు నువ్వుల సాగు చేపట్టారు. దీంతో కాకినాడ జిల్లాలో నువ్వుల సాగు గణనీయంగా పెరిగింది. గతంలో కేవలం 100 ఎకరాల్లో మాత్రమే ఉండే ఈ పంట సాగు, ప్రస్తుతం రికార్డు స్థాయిలో కేవలం ఒక్క గొల్లప్రోలు మండలంలోనే సుమారు 450 ఎకరాల్లో కొనసాగుతోంది. జిల్లాలో 590 ఎకరాల్లో సుమారు 350 మంది రైతులు నువ్వుల సాగు చేపట్టారు. సాధారణంగా ఏటా 3,540 క్వింటాళ్ల దిగుబడిని సాధిస్తున్నారు. ఉష్ణోగ్రతే దీనికి ప్రాధాన్యం ఈ పంటకు 25 డిగ్రీల నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరమవుతుంది. నీరు నిలవని, మురుగు నీరు రాని ప్రాంతాలు వీటికి అనుకూలం కావడంతో, రేగడి నేలలున్న ప్రాంతాల్లో 90 శాతం మంది రైతులు వీటిని సాగు చేస్తున్నారు. ఆమ్మ, క్షార నేలలు అంతగా అనుకూలం కాదు. గౌరి, మాధవి, వైఎల్‌ఎం 11, 17, 66 రకాలు మంచి దిగుబడులు ఇస్తాయని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రకాలనే జిల్లాలో అత్యధికంగా సాగు చేపట్టారు. కేవలం 85 నుంచి 90 రోజుల్లో పంట చేతికందుతుంది. ఇందులో 50 శాతం నూనె దిగుబడి వస్తుంది. ఎకరాకు వరుసల్లో విత్తుకుంటే 2 కిలోలు, వెదజల్లితే 4 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. విత్తన శుద్ధి చేయడం ద్వారా తెగుళ్లు, పురుగుల దాడి నుంచి పంటను కాపాడుకోవచ్చు. మొక్కలకు మధ్య కనీసం అరడుగు దూరం ఉండేలా నాటడం వల్ల అధిక దిగుబడి వస్తుందని అధికారులు సూచిస్తున్నారు. కలుపు నివారణకు ప్రాధాన్యమివ్వాలి. ఆకు ముడత, కాయ తొలుచు పరుగుల నుంచి రక్షణ ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించే అవకాశాలున్నాయి. ఆకు ఎండు, ఆకు కుళ్లు తెగుళ్ల దాడి చేసే అవకాశం ఉండడంతో, ముందుగానే సస్యరక్షణ చర్యలు పాటించాల్సి ఉంటుంది. ఆకు కాయలు 75 శాతం పసుపు రంగుకు మారితే కోత దశకు చేరుకున్నట్టు గుర్తించి, కోతలు చేపట్టాలని అధికారులు అంటున్నారు. కోసిన పంటను కట్టలుగా కట్టి, అదే పొలంలో ఎండకు ఎండేలా నిలబెట్టి, ఐదు రోజుల తర్వాత నూర్చుకోవాలి. ప్రస్తుతం క్వింటాల్ నువ్వుల ధర రూ.10 వేల నుంచి రూ.13 వేల వరకు ఉంది. ఎకరాకు ఆరు క్వాంటాళ్లకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్టు రైతులు చెబుతున్నారు. కేవలం ఆరుతడి, విత్తనం ఎరువులు తదితర అవసరాలకు ఎకరాకు రూ.20 వేల వరకు పెట్టుబడి అవుతున్నట్టు తెలిపారు. కరోనాతో నువ్వుల నూనెకు డిమాండ్ పెరిగిన నువ్వుల సాగు ఆశాజనకంగా పంట ఎకరాకు ఆరు క్వింటాళ్ల వరకు దిగుబడి! తెలుగు రాష్ట్రాల్లో నూనె గింజల పంటల్లో నువ్వులు ఒకటి. తక్కువ పెట్టుబడితో స్వల్ప కాలంలో అంది వచ్చే నూనె గింజల పంటల్లో నువ్వుల సాగు మేలైనది. ఖరీఫ్‌లో వేసిన వివిధ పంటలను తొలగించాక, రెండో పంటగా డిసెంబర్ నెలాఖరు నుంచి జనవరి చివరి వరకు రైతులు ఈ పంట సాగు చేపట్టారు. తక్కువ పెట్టుబడి, తక్కువ వనరులతో నికర లాభాలందించే పంటగా నువ్వులకు గుర్తింపు ఉంది. కేవలం రెండు, మూడు తడులు మాత్రమే ఇస్తే సరిపోయే పంట కావడంతో, వేసవిలో ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఆరుతడి పంటగా వేసవిలో వేయడం వల్ల చీడపీడల బెడద చాలా తక్కువ. కరోనా సమయంలో నువ్వుల నూనెకు డిమాండ్ పెరగడంతో, ఇప్పుడు నువ్వుల పంటను భారీగా సాగు చేస్తున్నారు.ఆశాజనకంగా ఉంది అన్ని పంటలు పూర్తయ్యాక మామూలుగా విత్తనాలు చల్లి వదిలేసేవాళ్లం. ఇప్పుడు ఇదే ప్రధాన పంటగా వేశాం. ప్రస్తుతం మార్కెట్లో నువ్వులకు మంచి డిమాండ్ ఉంది. వాతావరణం కలిసి రావడంతో ఈ ఏడాది మంచి దిగుబడి వచ్చేలా కనిపిస్తోంది. పెట్టుబడి తక్కువ కావడంతో పాటు, ఆరుతడి పంట కావడం వల్ల రేగడి నేలల్లో మంచి అనుకూలమైన పంట కావడంతో దీనిని సాగు చేస్తున్నాం. ఆదాయం బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. – సోమిశెట్టి జగ్గారావు, నువ్వుల రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం సాగు విస్తీర్ణం పెరిగింది ఈ ఏడాది నువ్వుల సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. గతంలో 100 ఎకరాలు కూడా ఉండని పంట, ఈ ఏడాది ఒక్క గొల్లప్రోలు మండలంలోనే 400 ఎకరాల వరకు వేశారు. ప్రస్తుతం ఎండలు బాగా ఉండడంతో పంట దిగుబడి పెరిగి, ఆదాయం బాగుంటుంది. ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు రైతులకు వివరిస్తున్నాం. నీటి వసతితో పెద్దగా పని లేకపోవడం వల్ల ఇతర పంటల కంటే పెట్టుబడి తక్కువ కావడంతో రైతులు ఎక్కువ మంది ఈ పంట సాగు చేశారు. పంట అన్నిచోట్లా ఆశాజనకంగా ఉంది. – సత్యనారాయణ, వ్యవసాయ శాఖాధికారి, గొల్లప్రోలు -
దైవ కార్యానికి బయలుదేరి.. తిరిగిరాని లోకాలకు
తాడేపల్లిగూడెం రూరల్: దైవకార్యంలో పాల్గొనా లన్న సంకల్పంతో కుటుంబ సమేతంగా పొరుగు రాష్ట్రం నుంచి కారులో బయలుదేరారు. అయితే.. లారీ రూపంలో మృత్యువు వారిని మార్గం మధ్యలోనే కబళించింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలు, వారి ఐదేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద సంఘటన శుక్రవారం తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఓ ఐటీ కంపెనీకి చెందిన హెచ్ఆర్ ఉద్యోగి భోగిళ్ల వెంకట సత్య సురేన్(37), తన భార్య నవ్య(35), కుమార్తె వాసుకి కృష్ణ(5), బంధువు కారులో కోనసీమ జిల్లా మండపేటలో జరగనున్న ఓ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి బయలుదేరారు. శుక్రవారం మధ్యాహ్నం 12.45 ప్రాంతంలో తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై సత్యసురేన్ డ్రైవ్ చేస్తున్న కారు హైవే మెయింటెనెన్స్ పనులు చేస్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. దీంతో సత్య సురేన్, అతని భార్య నవ్య అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తె వాసుకి కృష్ణ, బంధువు శ్రీరమ్యను తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వాసుకి కృష్ణ మృతి చెందగా, శ్రీరమ్యను మెరు గైన వైద్యం కోసం రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రూరల్ ఏఎస్సై పీవీకే దుర్గారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాస్పత్రికి తరలించి, రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విషాద ఛాయలు మండపేట: కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మండపేటకు చెందిన భార్యా భర్తలు, ఐదేళ్ల చిన్నారి మృతి చెందడంతో పట్టణంలో విషాద ఛాయలు అలముకున్నాయి. హైదరాబాద్ నుంచి మండపేటకు వస్తూ వీరు ఈ దుర్ఘటనలో మర ణించారు. సత్యసురేన్ తండ్రి భోగిళ్ల పాపారావు స్థాని క రావుపేటలో నివసిస్తున్నారు. ఆయన బీమా కంపెనీ రిటైర్డ్ ఉద్యోగి. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా, సత్య సురేన్ చిన్నవాడు. ఈ ఘటనలో పాపారావు చెల్లెలు కుమార్తె ఉప్పులూరి శ్రీరమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. యూఎస్‌లో ఉంటున్న ఈమె ఇటీవల గృహ ప్రవేశ శుభకార్యానికి హైదరాబాద్ వచ్చారు. ఆమె తండ్రి పాలచర్ల బాబ్జి మండపేటలో ఉంటున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురిని మృత్యువు కాటేయడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. కంచకచర్ల వద్ద రోడ్డు ప్రమాదం ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు ఒకే కుటుంబంలో ముగ్గురి దుర్మరణం మృతులు మండపేట వాసులు -
పొలంలో స్వల్పంగా గ్యాస్ లీక్
మామిడికుదురు: పాశర్లపూడి–43 బావి నుంచి తాటిపాక జీసీఎస్‌కు గతంలో వేసిన పైపులైన్ నుంచి శుక్రవారం స్వల్పంగా గ్యాస్ లీకై ంది. మామిడికుదురు గ్రామంలో ఏటిగట్టు పక్కన పొలాల్లో ఈ లీకేజ్ ఏర్పడింది. లీకేజ్ ఏర్పడిన చోట నుంచి స్వల్పంగా గ్యాస్ బయటకు వచ్చింది. దీంతో పాటు కొద్దిగా ముడి చమురు కూడా లీకై ంది. దీంతో ఆ ప్రాంతమంతా ముడి చమురు వాసన వ్యాపించింది. ముడి చమురు ప్రభావంతో పొలంలో నీరు తెట్టు కట్టింది. ఓఎన్జీసీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ బావి నుంచి ఎటువంటి ఉత్పత్తి జరగడం లేదన్నారు. చాలా కాలం క్రితం ఆ బావిలో ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. పైపులైన్లో ఉన్న గ్యాస్, ముడి చమురు బయటకు వచ్చి ఉంటాయన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తామని చెప్పారు. -
మాట్లాడితే జరిమానా
పదేళ్ల క్రితం యాక్సిడెంట్ అయింది. రజక వృత్తి కానీ, పొలం పని కానీ చేయలేని స్థితిలో ఉన్నాను. గ్రామంలో టిఫిన్ సెంటర్ పెట్టి జీవనం సాగిస్తున్నాను. గ్రామంలో అన్ని కులాల వాళ్లు టిఫిన్ పట్టుకెళ్లేవారు. ఇప్పుడు వివాదం కారణంగా రజకులతో గౌడ సంఘం వారు మాట్లాడడం లేదు. మాట్లాడితే జరిమానా అంటున్నారు. టిఫిన్ బకాయిల కోసం మాట్లాడలేని పరిస్థితి ఉంది. టిఫిన్ కొనుగోలుకూ ఒక వర్గం వారు రావడం లేదు. – ఆచంట వెంకటరమణ, చిడిపి, కొవ్వూరు మండలం ● -
తండ్రే.. కాలయముడు
● ఇద్దరు పిల్లలను చంపి.. తానూ ఆత్మహత్య ● కాకినాడ తోట సుబ్బారావునగర్‌లో ఘటన ● హోలీ పండగ పూట విషాదం కాకినాడ రూరల్: అభం శుభం తెలియని ఆ పసి పిల్లల పాలిట ఆ తండ్రి కాలయముడయ్యాడు. కారణమేంటో తెలియదు కానీ.. ఇద్దరు చిన్నారులను బలిగొన్నాడు. అంతటితో ఆగక తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉలిక్కిపడేలా చేసే ఈ సంఘటన కాకినాడలోని తోట సుబ్బారావు నగర్లో శుక్రవారం చోటు చేసుకుంది. భార్యా పిల్లలతో చీకూచింతా లేని కుటుంబం. ఆర్థికంగా దన్నుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీలో ఉద్యోగం. ఏమైందో ఏమో కానీ, అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన తండ్రే పిల్లలను నిర్దాక్షిణ్యంగా నీటిలో ముంచి, ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. ఆపై తాను ఉరి వేసుకున్నాడు. హోలీ పండగ పూట కాకినాడ రెండో డివిజన్లోని తోట సుబ్బారావు నగర్లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి సర్పవరం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్(37) వాకలపూడి ఓఎన్జీసీ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంట్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా భార్యాపిల్లలతో తోటసుబ్బారావు నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. పిల్లలు జోషిత్(7) ఒకటో తరగతి, నిఖిల్(6) యూకేజీ చదువుతున్నారు. ఇలాఉండగా తోట సుబ్బారావు నగర్లో తన ప్లాట్ నుంచి హోలీ పండగ వేడుకల కోసం భార్య తనూజ, పిల్లలతో కలిసి వాకలపూడిలో తాను పనిచేస్తున్న ఓఎన్జీసీ కార్యాలయం వద్దకు వెళ్లాడు. అక్కడ హోలీ వేడుకల్లో భార్యను ఉండమని చెప్పి, పిల్లలకు టైలర్ వద్ద కొలతలు తీయించి తెస్తానని ఇంటికి వచ్చాడు. ఇంట్లో బాత్రూం బకెట్ నీటిలో ఇద్దరు పిల్లలను ముంచి, ఊపిరాడకుండా చేసి హతమర్చాడు. తర్వాత బెడ్రూంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంట వరకూ భర్త, పిల్లలు రాకపోయేసరికి కంగారుపడిన భార్య ఫోన్ చేసినప్పటికీ సమాధానం రాలేదు. దీంతో ఓఎన్జీసీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది తోట సుబ్బారావునగర్‌లో చంద్రకిశోర్ ఇంటికి వచ్చారు. తలుపులు బలవంతంగా తెరిచేసరికి బెడ్రూంలో ఉరి వేసుకుని చంద్రకిశోర్ కనిపించాడు. పిల్లలు బాత్రూంలో విగతజీవుల్లా కనిపించారు. విషయం తెలుసుకున్న భార్య, ఇతర కుటుంబ సభ్యులు, ఓఎన్జీసీ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. కళ్లెదుటే భర్త, పిల్లలు శవాలుగా పడి ఉండడంతో భార్య తనూజ స్పృహ కోల్పోయింది. బంధువుల సపర్యలతో స్పృహలోకి వచ్చిన ఆమె రోదించిన తీరు చూపరులను కలచివేసింది. ఆమెను ఓదార్చడం బంధువులకు కష్టంగా మారింది. సర్పవరం ఎస్సై శ్రీనివాస్‌కుమార్ కేను నమోదు చేశారు. సీఐ పెద్దిరాజు విచారణ చేపట్టారు. చంద్రకిశోర్ బెడ్రూంలో సూసైడ్ నోట్‌ను పోలీసులు కనుగొన్నారు. ప్రస్తుత జనరేషన్లో తన పిల్లలు సరిగ్గా చదవడం లేదని మనస్తాపం చెంది చనిపోతున్నట్టుగా రాసి ఉందని తెలిసింది. ఈమధ్యే పిల్లల స్కూలు కూడా మార్చినట్టు బంధువులు తెలిపారు. -
ఇంటర్ పరీక్షలకు 892 మంది గైర్హాజరు
అమలాపురం టౌన్: జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు జనరల్, ఒకేషనల్ పరీక్షలు గురువారం జరిగాయి. ఆయా పరీక్షలకు మొత్తం 892 మంది గైర్హాజరయ్యారు. జనరల్ పరీక్షలకు మొత్తం 11,722 మందికి 11,263 మంది విద్యార్థులు హాజరై, పరీక్షలు రాశారు. 459 మంది పరీక్షలకు హాజరు కాలేదు. అలాగే ఒకేషనల్‌లో 2,458 మందికి 2,025 మంది హాజరయ్యారు. మొత్తం 433 మంది గైర్హాజరయ్యారు. డీఐఈవో వనుము సోమశేఖరరావు అమలాపురంలోని ఎస్కేబీఆర్, ఆదిత్య, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. టెన్త్ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం అమలాపురం రూరల్: పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రజా రవాణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ, పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు బస్సు పాస్ లేకపోయినా, వారి హాల్ టికెట్ ఆధారంగా జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు ఉచిత ప్రయాణం చేయవచ్చని వివరించారు. కోనసీమ జిల్లా పరిధిలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కూటమి తీరుపై ఇది జనం తిరుగుబాటు ● ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందే.. ● మాజీ ఎంపీ చింతా అనురాధ అల్లవరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి పది నెలలు గడవక మునుపే పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైందని మాజీ ఎంపీ చింతా అనురాధ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పేదల సంక్షేమం కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం రద్దు చేస్తూ, లబ్ధిదారులు, విద్యార్థులు, యువత భవిష్యత్తును నాశనం చేస్తోందన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన రూ.4,600 కోట్ల బకాయిలను తక్షణం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ నిరుద్యోగులకు ప్రకటించిన నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరించి, వైద్య విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. యువతకు, విద్యార్థులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన యువత పోరు కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టామని, ఇది సర్కార్‌పై తిరుగుబాటని తెలిపారు. యువత పోరును విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. 15న జెడ్పీ సమావేశం కాకినాడ సిటీ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం, బడ్జెట్ సమావేశం ఈ నెల 15న నిర్వహించనున్నారు. జిల్లా పరిషత్ సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు, అధికారులు విధిగా హాజరు కావాలని కోరారు. భావనారాయణ స్వామికి రూ.8.53 లక్షల ఆదాయం కాకినాడ రూరల్: సర్పవరంలోని రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణ స్వామి ఆలయంలో గురువారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. సీఎఫ్ఓ గ్రేడ్–1 ఈఓ వీరభద్రరావు పర్యవేక్షణలో గ్రామస్తులు, అర్చకులు, సిబ్బంది, సేవాదళ్ కార్యకర్తల సమక్షంలో 10 హుండీలు తెరచి, ఆదాయం లెక్కించారు. మొత్తం రూ.8,52,983 ఆదాయం లభించిందని ఈఓ మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు. నగదు రూపంలో రూ.7,53,512, నాణేలుగా రూ.99,471 వచ్చాయన్నారు. -
పొదుపు ఖాతాలో సొమ్ము మాయం
రెండు నెలల్లో దఫదఫాలుగా రూ.2.40 లక్షలు అదృశ్యం ప్రత్తిపాడు: మహిళా శక్తి సంఘం పొదుపు ఖాతా నుంచి యూపీఐ ద్వారా సొమ్ము మాయమైన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి స్టేట్ బ్యాంక్ నుంచి ఈ సొమ్ము మాయమైంది. ఆ గ్రామానికి చెందిన సదా శివ మహిళా శక్తి సంఘం (డ్వాక్రా గ్రూపు) పొదుపు ఖాతాలో జనవరి 14 నుంచి మార్చి 7 మధ్య దఫదఫాలుగా రూ.వెయ్యి నుంచి రూ.46 వేల వరకు 27 లావాదేవీల ద్వారా ఈ సొమ్ము కాజేసినట్టు బ్యాంకు అధికారులు గుర్తించారు. ప్రతి డ్వాక్రా గ్రూపు నుంచి సురక్ష, జీవన జ్యోతి యోజనలకు బ్యాంకు వారే రెన్యువల్ చేస్తారు. ఇందుకు పొదుపు ఖాతాలో కనీసం రూ.2 లక్షలైనా ఉండాలి. బ్యాంక్ మేనేజర్ లలిత్ ఈ పథకాలను రెన్యువల్ చేసేందుకు ఖాతాలను పరిశీలిస్తే, కేవలం రూ.760 ఉన్నాయి. దీంతో ఆయన డ్వాక్రా గ్రూపు సభ్యులకు సమాచారం అందించి, సైబర్ మోసం జరిగినట్టు గుర్తించారు. సదాశివ డ్వాక్రా గ్రూపు ఖాతా నుంచి రూ.2,40,180 యూపీఐ ద్వారా మోసం జరిగినట్టు వెల్లడైంది. దీంతో గ్రూపు అధ్యక్ష, కార్యదర్శులు కొట్టేటి పార్వతి, చింతల నాగమణి, ఇతర సభ్యులు ప్రత్తిపాడు వెలుగు ఏపీఎం వై.వెంకట్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు ఏపీఎం వెంకట్ తెలిపారు. -
ఆనంద డోలిక.. హోలీ వేడుక
బిక్కవోలు: ఫాల్గుణ మాసం పౌర్ణమి. లేలేత చిగుళ్లు, విరబూసిన పూరెమ్మలు, చెట్లు వసంత రాగం ఆలపిస్తున్న తరుణంలో, చిన్నాపెద్దా తేడా లేకుండా, ఆనందోత్సాహాలతో జరుపుకొనే పండగ హోలీ. పురాణ ప్రాశస్త్యం కలిగిన ఈ పండగను.. ముఖ్యంగా ఉత్తర భారతీయులు ఎంతో సంబరంగా చేసుకుంటారు. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ ఆనందోత్సాహాలతో ఈ సంబరాల్లో మునిగితేలుతున్నారు. పిల్లా, పెద్దా తేడా లేకుండా, రంగులు పులుముకొంటూ ఆనంద డోలికల్లో విహరిస్తున్నారు. శుక్రవారం హోలీ పండగ సందర్భంగా.. పురాణ కథ హోలీ పండగ వెనుక ఓ పురాణ కథ ఉంది. హోలీ అనే రాక్షసి పసిపిల్లల ప్రాణాలు హరిస్తూ కడుపు నింపుకొనేది. పిల్లల తల్లిదండ్రులు గర్భశోకంతో ఆగ్రహించి మూకుమ్మడిగా ఆ రాక్షసిని అంతమొందించారు. దాని మరణాన్ని వేడుకగా భావిస్తూ హోలీ పండగ నిర్వహిస్తారనేది కథనం. ఆనందంతో పాటు ఆరోగ్యం ఒకప్పడు పూలు, పండ్ల ద్వారా వచ్చిన రంగులనే వేడుకల్లో వాడేవారు. పండగకు ఒకరోజు ముందు అడవికి వెళ్లి మోదుగు పూలు సేకరించేవారు. వాటిని ఉడికించగా వచ్చిన ఎర్రటి ద్రావణంలో పసుపు, కుంకుమ కలిపి, ఒకరిపై ఒకరు చల్లుకుంటూ సంబరాలు జరుపుకొనేవారు. కాలక్రమంలో ఆ రంగులు పోయి, వార్నిష్, సింథటిక్ రంగులను చల్లుకోవడం ఆరంభించారు. అవి ప్రమాదకరమని తెలిసినా.. వాడుతూనే ఉండడం ఆందోళన కలిగించే విషయం. హోలీ ఆడటంలో జాగ్రత్తలు తీసుకోకతప్పదని చర్మ వ్యాధుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. రసాయన రంగులను కాకుండా, సహజసిద్ధ రంగులతో హోలీ జరుపుకోవడం ద్వారా చర్మానికి హాని జరగకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఈ సూచనలు పాటిస్తే మేలు ● పూర్వం ప్రకృతిలో దొరికే మొక్కలు, పూలతో తయారు చేసిన రంగులు చల్లుకోవడంతో చర్మ వ్యాధులు దరిచేరేవి కావు. ● రసాయన రంగులైన లెడ్ ఆకై ్సడ్, అల్యూమినియం, బ్రోమైడ్, మెర్క్యురీ సల్ఫేట్ వంటివి వినియోగించడం ఆందోళన కలిగించే విషయం. అవి కళ్లల్లో పడితే కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ● గులాల్ వంటివి వినియోగిస్తుండడం ప్రమాదకరమే. గులాల్ వంటి రంగులతో ఆస్తమా, చర్మ సంబంధ వ్యాధులు వస్తాయి. ● రసాయనాలు కలసిన రంగులతో హోలీ ఆడితే కనుక వాటిని శరీరంపై ఎక్కువ సమయం ఉండనీయరాదు. వెంటనే చల్లని నీటితో శరీరాన్ని శుభ్రం చేయాలి. ● ఎరుపు, గులాబీ రంగులనే హోలీ కోసం వాడాలి. ఇవి తక్కువ గాఢత కలిగి ఉండటం వల్ల శరరంపై నుంచి సులభంగా తొలగిపోతాయి. గ్రీన్, ఎల్లో, ఆరంజ్ రంగులు ఎక్కువ రసాయనాలను కలిగి ఉన్న కారణంగా సులభంగా తొలగిపోవు. ● హోలీ ఆడటానికి ముందు శరీరానికి మాయిశ్చరైజర్‌ని, తలకు నూనెను రాసుకోవాలి. దీనివల్ల రంగులు శరీరంలోకి ఇంకవు. రంగులను శుభ్రం చేయడం కూడా సులువవుతుంది. ● ముఖంపై పడిన రంగులను శుభ్రం చేసుకోవడానికి సబ్బు కన్నా, క్లీన్సింగ్ మిల్క్ ఉత్తమమైనది. ● చాలా మంది రంగుల్లో వివిధ ఆయిల్స్‌ను కలుపుతారు. ఈ కారణంగా రంగులను శుభ్రం చేయడానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. అందుకే రంగుల్లో ఆయిల్స్ లేదా నీటిని కలపకుండా హోలీ ఆడితే నీటి వృథాను అరికట్టవచ్చు. జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యానికి మేలు రసాయన రంగులకు దూరంగా ఉండాలి జాగత్తలు పాటించకపోతే కళ్లకు ముప్పే.. సంబరాలకు సిద్ధమైన పిల్లలు, పెద్దలు నేడే వసంతోత్సవం చిన్న పిల్లలను దూరంగా ఉంచండి చాలా మంది సరదా కోసం హోలీ పండగలో చిన్న పిల్లలు కూడా ఉండేలా చేస్తారు. కానీ చిన్న పిల్లలను దూరంగా ఉంచాలి. రంగులు వారిపై పడితే కంటి సమస్యలు, చర్మ వ్యాధులు, రంగులు నోట్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. కనుక వారిని జాగ్రత్తగా చూడాలి. – పులగం రామానందసాగర్, వైద్యుడు, అనపర్తి -
మట్టి దొంగలెవరయా..?
కొవ్వూరు: చిడిపి గ్రామంలో గోదావరి లంకలో అక్రమార్కులు మట్టిని కొల్లగొట్టారు. కూటమి నేతల అండదండలతో.. అనధికారికంగా నదీగర్భంలో పొక్లెయిన్లను ఉపయోగించి, లారీల్లో భారీగా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో స్థానికులు అక్కడకు వెళ్లి తవ్వకం పనులను అడ్డుకున్నారు. మట్టిని తరలిస్తున్న లారీలను, పొక్లెయిన్లను అడ్డగించారు. అనంతరం అధికారులకు సమాచారం అందించారు. తీరిగ్గా అధికారులు వచ్చే సమయానికి ఆ ప్రదేశంలో లారీలు, పొక్లెయిన్లు మాయమయ్యాయి. అక్రమంగా తవ్వి వదిలేసిన గోతులు మాత్రమే అక్కడ దర్శనమిచ్చాయి. వాస్తవానికి ఈ భూములను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో చిడిపి గ్రామానికి చెందిన 97 మంది పేదలకు పట్టాలుగా పంపిణీ చేశారు. దీంతో గ్రామస్తులు మట్టి తవ్వకం పనులను అడ్డగించి, తహసీల్దార్‌కి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. మట్టి తవ్వకానికి సంబంధించిన ఫొటోలనూ పంపించారు. అధికారులు సావధానంగా ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ గ్రామస్తులు అడ్డుకున్న లారీలు, పొక్లెయిన్లు మాయం కావడం చర్చనీయాంశమైంది. దీంతో టాస్క్‌ఫోర్స్ ఏఎస్సై జి.శ్రీనివాసరావు, వీఆర్వోలు మట్టి తవ్విన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ ఏ విధమైన వాహనాలు లేనట్టు చెబుతున్నారు. ఫిర్యాదుదారులు అధికారులకు పంపిన ఫొటోల్లో, మీడియాలో ప్రచురితమైన ఫొటోల్లో లారీ నంబర్ స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ అధికారులు మాత్రం వాహనాలపై చర్యలు తీసుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ అక్రమ వ్యవహారాన్ని ముందుగా ఫిర్యాదుదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వాటినే అధికారులకూ పంపించారు. తీరా విషయాన్ని సెటిల్మెంట్ చేసుకుని, ఏ విధమైన కేసుల్లేకుండా సహకరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు అధికారులు సైతం తమ వంతు సహకారం అందించినట్టు సమాచారం. అక్రమ తవ్వకాలపై చర్యలేవీ? తాళ్లపూడి మండలం బల్లిపాడు, కొవ్వూరు మండలం చిడిపి గ్రామాల మధ్య రెండు మండలాల సరిహద్దుల్లో ఈ తవ్వకాలు సాగుతున్నాయి. తమ పరిధి కాదంటూ ఒక మండలం అధికారులు మరో మండలం వారిపై నెట్టుకుంటూ, లోపాయికారిగా అక్రమార్కులకు సహకరిస్తున్నట్టు సమాచారం. అక్రమ తవ్వకాలు జరిగిన ప్రదేశంలో ఎన్ని క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వి, తరలించారన్నదీ లెక్క తేల్చాల్సిన అధికారులు, ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడాన్ని గ్రామస్తులు తప్పుపడుతున్నారు. రెవెన్యూ, టాస్క్‌ఫోర్స్ అధికారులు మట్టి తవ్వకాల ప్రదేశాన్ని పరిశీలించాక.. అసలు ఎవరి వాహనాలు తవ్వాయి, మట్టి తవ్వకాల వెనుక ఎవరున్నారు, ఎన్ని క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వారు, దాని విలువెంత, దానిని ఎవరి నుంచి రికవరీ చేయాలన్న అంశాలపై దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో చేతులు మారినట్టు చర్చించుకుంటున్నారు. కొందరు కూటమి నాయకుల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గి, ఈ అక్రమ బాగోతాన్ని సర్దుబాటు చేయడంపై జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటీవల దేచెర్ల గ్రామంలో ఎర్రమట్టి తవ్వకాలపై మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ సమయంలో మైనింగ్ అధికారులు ఆగమేఘాలపై వచ్చి, కొలతలు వేసి, అక్రమ తవ్వకాలు ఏ మేరకు సాగాయో నిర్ధారించారు. వాహనాలను సైతం సీజ్ చేశారు. తాజా వ్యవహారంలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం అధికారుల తీరుకు అద్దం పడుతోంది. చిడిపిలో అక్రమ మట్టి తవ్వకాలు వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులు సమాచారం ఇచ్చినా.. తాపీగా వచ్చిన అధికారులు తవ్విన పొక్లెయిన్, లారీలు మాయం కూటమి నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన యంత్రాంగం అక్రమార్కులపై కానరాని చర్యలు మాకు ఫిర్యాదు అందలేదు మట్టి తవ్వకాలపై మాకు ఏ విధమైన రాతపూర్వక ఫిర్యాదు అందలేదు. మాకు అందిన సమాచారం మేరకు మట్టి తవ్విన ప్రదేశానికి వీఆర్వో సుబ్రహ్మణ్యం, టాస్క్‌ఫోర్స్ ఏఎస్సై జి.శ్రీనివాసరావును పంపించాం. పని ప్రదేశంలో వాహనాలు ఏమీ లేవు. ముందుగా ఫిర్యాదు చేసిన స్థానికులెవరూ స్టేట్మెంట్(వాంగ్మూలం) ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. మైనింగ్ చేసిన ప్రదేశాన్ని టాస్క్‌ఫోర్స్ ఎస్సై, మైనింగ్ అధికారులు పరిశీలించారు. తదుపరి చర్యలు మైనింగ్ అధికారులు తీసుకోవాల్సి ఉంది. – ఎం.దుర్గాప్రసాద్, తహసీల్దార్, కొవ్వూరు -
కేఎంసీ రాజకీయ సేవ!
కాకినాడ రూరల్: నవ్వి పోదురు నాకేంటి అన్నట్టుగా ఉంది కూటమి పాలకుల తీరు. పిఠాపురం సమీపం చిత్రాడలో శుక్రవారం జరగనున్న జనసేన ప్లీనరీ కోసం కాకినాడను ఆ పార్టీ స్వాగత ద్వారాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లతో ముంచెత్తారు. సర్పవరం జంక్షన్ కూడలి వద్ద నాలుగు వైపులా భారీ స్వాగత ద్వారాలను గురువారం ఏర్పాటు చేశారు. ఇందుకు ఉదయం నుంచి రాత్రి వరకు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ)కి చెందిన ప్రజాధనంతో పనిచేసే రెండు భారీ క్రేన్లను వినియోగించారు. వీధి దీపాల ఏర్పాటుకు వాడే వీటిని జనసేన స్వాగత ద్వారాల కోసం వినియోగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పార్టీ కార్యక్రమాలకు కేఎంసీ క్రేన్ల వినియోగంపై సర్పవరం జంక్షన్ మీదుగా రాకపోకలు సాగించిన పలువురు నిర్ఘాంతపోయారు. అధికార కూటమి పార్టీ కావడంతో కార్పొరేషన్ అధికారులు నిబంధనలకు పాతర వేశారని పలువురు విమర్శలు గుప్పించారు. సర్పవరం జంక్షన్ వద్ద జనసేన స్వాగత ద్వారాల నిర్మాణంలో క్రేన్లు నిర్ఘాంతపోయిన ప్రజలు -
హోలీ వేడుకలపై ప్రత్యేక నిఘా
● ఇతరులకు ఇబ్బంది కలిగించ వద్దు ● రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో రంగులు జల్లవద్దు ● జిల్లా ఎస్పీ కృష్ణారావు అమలాపురం టౌన్: జిల్లా కంట్రోల్ రూమ్ నుంచి సీసీ టీవీల ద్వారా హోలీ వేడుకలపై ప్రత్యేక నిఘా పెట్టామని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. హోలీ వేడుకలను జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో ఇతరులకు ఇబ్బంది కలిగేలా లేదా రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో ఇతరులపై రంగులు జల్లడం వంటి చర్యలకు పాల్పడవద్దని హితవు పలికారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయం నుంచి గురువారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. హోలీ పేరుతో హానికర రసాయనాలతో కూడిన రంగులను వాడరాదని చెప్పారు. గీత దాటిన వారిపై జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. హోలీ సందర్భంగా ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు స్పష్టం చేశారు. ఆకతాయిలను గుర్తించేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. ప్రత్యేక మొబైల్ పార్టీలు గస్తీ తిరుగుతున్నాయని, ముఖ్య ప్రదేశాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. హోలీ రంగుల వల్ల జిల్లాలో ఎవరైనా ఇబ్బంది పడితే డయల్–112కి కాల్ చేయాలని లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. -
రామాయణాన్ని తెలుగులో సరళతరం చేసిన మొల్ల
– జాయింట్ కలెక్టర్ నిషాంతి నివాళి అమలాపురం రూరల్: విజయనగర సామ్రాజ్యానికి చెందిన ప్రముఖ కవులు, ఆస్థాన పండితుల సమక్షంలో, సంస్కృతంలో ఉన్న వాల్మీకి రామాయణాన్ని సులభతరంగా తెలుగులోకి అనువదించి కవయిత్రి మొల్ల ప్రశంసలు అందుకున్నారని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి కొనియాడారు. కవయిత్రి మొల్ల జయంత్యుత్సవాల సందర్భంగా గురువారం కలెక్టరేట్లో కవయిత్రి మొల్లమాంబ చిత్రపటానికి ఆమె నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ, ప్రముఖ కవయిత్రి ఆత్మకూరి మొల్లమాంబ(మొల్ల) జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సంస్కృతంలో ఉన్న వాల్మీకి రామాయణాన్ని తేనె లొలికే అచ్చ తెలుగులో రచించిన ఖ్యాతి మహా కవయిత్రి మొల్లమాంబకే దక్కుతుందన్నారు. తొలి తెలుగు కవయిత్రిగా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని మొల్ల పదిలపర్చుకుందన్నారు. రామాయణాన్ని మహా పండితులు అనేక మంది రచించినప్పటికీ, మొల్ల రామాయణానికి విశిష్ట స్థానం ఉందన్నారు. మహా పండితులు సైతం మొల్ల రామాయణాన్ని ప్రామాణికంగా చూపుతుంటారన్నారు. ఎంతో భక్తిభావం, ఆరాధనతో మొల్ల రచించిన రామాయణానికి ప్రత్యేక శైలి ఉందన్నారు. మొల్ల రామాయణం రచించి ఆమె శ్రీకృష్ణదేవరాయలు సన్మానం అందుకుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ రాజకుమారి, డీఈవో షేక్ సలీం బాషా, దేవదాయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రమేష్, ఏఓ కాశీవిశ్వేశ్వరరావు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ములికిపల్లి సర్పంచ్‌పై విచారణ
రాజోలు: అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ములికిపల్లి పంచాయతీ సర్పంచ్ గుబ్బల లక్ష్మీనీలిమ, ఆమె భర్త గుబ్బల రాజుపై పాలకవర్గ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం విచారణ జరిగింది. సర్పంచ్, ఆమె భర్త ఏకపక్ష నిర్ణయాలతో, తీర్మానాలు లేకుండా సుమారు రూ.3.28 లక్షల నిధులు దుర్వినియోగం చేశారని, పంచాయతీ పాత భవనం తొలగించడానికి బహిరంగ వేలం నిర్వహించకుండా, భవనం తొలగించి నిధులు పంచాయతీకి జమ చేయలేదని, పంచాయతీ చెరువులో వేలం వేయకుండా చేపలను విక్రయించారని, తమకు ఓటు వేయలేదనే అక్కసుతో మామిడిశెట్టి వారి గ్రూపులో జల్‌జీవన్ మిషన్ లో తాగునీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్నారని 12 అంశాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. వార్డు సభ్యులు కె.శ్రీనివాస్, వైఎస్‌కే చైతన్య ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేయాలని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, డీపీఓను కోరారు. డీపీఓ ఆదేశాల మేరకు సఖినేటిపల్లి ఈఓపీఆర్డీ కె.సూర్యనారాయణ, లక్కవరం పంచాయతీ కార్యదర్శి అబ్బాస్ ఆలీ ఈ విచారణ నిర్వహించారు. ములికిపల్లి పంచాయతీ రికార్డులను పరిశీలించారు. 2021 నుంచి ఏడుగురు పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్, ఆమె భర్త ఆగడాలు భరించలేక వెళ్లిపోయారని విచారణాధికారులకు వివరించారు. రూ.7.45 లక్షలతో పారిశుధ్య సామగ్రి కొనుగోలు చేసినట్టు తప్పుడు రికార్డులు చూపించారని, పంచాయతీ ఫర్నిచర్‌ను సర్పంచ్ ఇంటికి తీసుకెళ్లిపోయారని తెలిపారు. ఎంపీటీసీ సభ్యురాలు సోమిశెట్టి ధనలక్ష్మిని పంచాయతీ సమావేశాలకు ఆహ్వానించిన పంచాయతీ కార్యదర్శి ఓగూరి విజయభానుపై ఆగ్రహం వ్యక్తం చేసి, ఎంపీటీసీ సభ్యురాలిని పంచాయతీ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవాలని సర్పంచ్, ఆమె భర్త ఘర్షణ వాతావరణం సృష్టించారని అధికారులకు వివరించారు. ఈ విచారణ నివేదికను డీపీఓకు అందజేస్తామని ఈఓపీఆర్డీ సూర్యనారాయణ తెలిపారు. -
పటిష్టంగా పది పరీక్షల నిర్వహణ
– జాయింట్ కలెక్టర్ నిషాంతి అమలాపురం రూరల్: జిల్లాలో ఈ నెల 17 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. గురువారం పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఆమె సమీక్షించారు. చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరూ మొబైల్ ఫోన్‌ను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరాదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలకు వంద మీటర్ల పరిధిలో సెక్షన్–144 విధించాలని చెప్పారు. జిరాక్సు, నెట్ సెంటర్లు మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో కనీస వసతులు కల్పించాలన్నారు. వైద్య శిబిరాలు, సామగ్రి అందుబాటులో ఉంచాలన్నారు. ప్రశ్నా, జవాబుపత్రాల తరలింపులో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించి, పరీక్షా కేంద్రాల రూట్లలో సర్వీసులు నడపాలని ఆదేశించారు. ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించామన్నారు. సమస్యాత్మకమైన పసలపూడి, మొగలికుదురు, కొత్తపేట పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా 19,217 మంది విద్యార్థులకు 110 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డీఈవో షేక్ సలీం బాషా, పరీక్షల కంట్రోలింగ్ అధికారి హనుమంతరావు, డీఆర్ఓ రాజకుమారి, అధికారులు పాల్గొన్నారు. ధాన్యం సేకరణకు సర్వ సన్నద్ధం ప్రస్తుత రబీ సీజన్లో ధాన్యం సేకరణకు సర్వ సన్నద్ధం కావాలని జేసీ నిషాంతి అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ సౌరబ్ గౌర్, మేనేజింగ్ డైరెక్టర్ జిలానీ వివిధ జిల్లాల జేసీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. ధాన్యం సేకరణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
రోడ్డు ప్రమాదంలో నాయనమ్మ, మనవడి మృతి
దేవరపల్లి: ముందు వెళుతున్న లారీని మోటార్ బైక్ ఢీకొన్న ప్రమాదంలో నాయనమ్మ, మనవడు మృతి చెందిన విషాద సంఘటన ఇది. మండలంలోని దుద్దుకూరు వద్ద గుండుగొలను–కొవ్వూరు జాతీయ రహదారిపై గురువారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు, గోపాలపురానికి చెందిన షేక్ మీరా తున్నీషా(65) కుమార్తె ఇటీవల పంగిడి సమీపంలోని గోవర్థనగిరి మెట్టలో మరణించింది. కీడు దుస్తు లు కట్టుకోవడానికి తున్నీషా తమ్ముడు గోవర్థనగిరిమెట్ట పిలిచాడు. దీంతో తున్నీషా, తన మనవడు షేక్ సమీర్(20) గురువారం ఉదయం మోటార్ బైక్‌పై గోవర్థనగిరిమెట్టకు వెళ్లారు. దుస్తులు ధరించి, తిరిగొస్తుండగా దుద్దుకూరు వద్ద హైవేపై ముందున్న లారీని మోటార్ బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో నాయనమ్మ, మనవడికి తీవ్ర గాయాలు కాగా, హైవే అంబులెన్స్‌లో ఆస్పత్రులకు తరలించారు. వారు చికిత్స పొందుతూ కొవ్వూరు ప్రభుత్వాస్పత్రిలో నాయనమ్మ, రాజమ హేంద్రవరం జీజీహెచ్‌లో సమీర్ మృతి చెందారు. కాగా షేక్ సమీర్ గోపాలపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ సెకండియర్ చదువుతున్నాడు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు రాస్తు న్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అతడు శుక్ర వారం పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న బైక్ దుద్దుకూరు వద్ద ఘటన -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్త కొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 16,000 గటగట (వెయ్యి) 14,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 కిలో 260 -
ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జూట్ సంచులు
● సూపర్ మార్కెట్లు, రైతు బజార్లలో తప్పనిసరి ● వీటి తయారీకి డ్వాక్రా సంఘాలకు ప్రోత్సాహం ● కలెక్టర్ మహేష్‌కుమార్ అమలాపురం రూరల్: సూపర్ మార్కెట్లు, రైతు బజార్లు వంటి వ్యాపార, వాణిజ్య ప్రాంతాల్లో ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా జూట్ సంచుల వినియోగాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధికారులకు ఆదేశించారు. గురువారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర మూడో శనివారం కార్యక్రమ నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ సంచుల విక్రయదారులను గుర్తించి, విక్రయాలను నిలుపుదల చేయాలని, వాటి స్థానంలో ప్రత్యేకంగా ఎస్‌హెచ్‌జీల ద్వారా జూట్ బ్యాగులు తయారు చేయించి, సూపర్ మార్కెట్లు, రైతు బజార్ల వద్ద విక్రయించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తద్వారా డ్వాక్రా సంఘాలకు ఉపాధి, పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతాయన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తగులబెట్టకుండా రీ సైక్లింగ్ చేస్తూ, తిరిగి విక్రయించేలా కార్యాచరణ రూపొందించాలని మున్సిపల్, పంచాయతీ అధికార్లకు సూచించారు. దుకాణాలు, హోటళ్లలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, వాటి స్థానే అరిటాకులు, విస్తరాకులు, పేపర్ ప్లేట్లు, గ్లాసుల వినియోగాన్ని పెంచాలన్నారు. ఆయా ప్రభుత్వ శాఖల సమన్వయంతో దీనిని సమర్థంగా నిర్వహించాలన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కింద పట్టణాలు, గ్రామాల్లోని వివిధ పారిశ్రామిక సంస్థలు, వాణిజ్య ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపడతారన్నారు డీఈవో షేక్ సలీంబాషా, డీఎంహెచ్ఓ దుర్గారావు దొర, డీసీహెచ్ఎస్ కార్తీక్, డీపీవో శాంతలక్ష్మి, డీఆర్డీఏ పీడీ శివశంకర్‌ప్రసాద్, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్, మున్సిపల్ కమిషనర్లు, వీఐపీ నాయుడు, రవివర్మ తదితరులు పాల్గొన్నారు. రోడ్ల నిర్మాణంలో పీచు వినియోగంపై అధ్యయనం డెల్టా ప్రాంతమైన కోనసీమ జిల్లాలో గోదావరి వరద కట్టలు, రోడ్లు, డ్రైన్లు, పంట కాలువల గట్ల పటిష్టతకు దీర్ఘకాలిక మన్నిక పెంచేందుకు కొబ్బరి పీచు, జియో టెక్స్టైల్స్ మ్యాట్ల వినియోగం సాధ్యాసాధ్యాలపై పూర్తి స్థాయి అధ్యయనం చేయాలని కలెక్టర్ మహేష్‌కుమార్ సూచించారు. కలెక్టరేట్లో వివిధ విభాగాల ఇంజినీర్లకు క్వాయర్ పరిశ్రమల కేంద్రం ప్రతినిధి త్రిమూర్తులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రోడ్ల నిర్మాణంలో పటిష్టతకు శాసీ్త్రయపరంగా లేయర్ల నిర్మాణం, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నట్టు, ఇది విజయవంతమైతే జిల్లా అంతటా ఈ సాంకేతికతను జోడించేందుకు చర్యలు తీసుకుంటారన్నారు. డ్రైనేజీ విభాగం ఈఈ ఎంవీవీ కిషోర్, జల వనరుల శాఖ ఈఈ బి.శ్రీనివాసరావు, ఆర్అండ్బీ ఈఈ బి.రాము, పంచాయతీరాజ్ ఎస్ఈ రామకృష్ణారెడ్డి, డీఈఈ అన్యం రాంబాబు, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం పీకేపీ ప్రసాద్ పాల్గొన్నారు. -
ఆ ‘పప్పు’లేం ఉడకవు
● కందిపప్పు సరఫరాలో కూటమి సర్కారుది ఆరంభ శూరత్వం ● రేషన్ దుకాణాల్లో పూర్తిగా నిలిపివేత ● మూడు నెలల నుంచి బియ్యం, పంచదారతోనే సరి ! ● ఉగాదికీ పప్పన్నం పెట్టలేని పాలకులు ఆలమూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. నిత్యావసరాలను రాయితీపై అందిస్తామంటూ నేటి పాలకులు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. ప్రజలందరూ నిజమేనని నమ్మారు కూడా. తీరా కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి తొమ్మిది నెలలైనా, ఇంకా అనేక పథకాలు ఆచరణకు నోచుకోలేదు. అమలులో ఉన్న పథకాలూ ఇప్పటికే అర్థంతరంగా నిలిచిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ ఏడాది మార్చి నుంచి రేషన్ డిపోల ద్వారా కందిపప్పు సరఫరాను నిలిపివేసి ప్రభుత్వం తన అసమర్థతను చాటుకుంది. బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధరల నియంత్రణ కోసం కృషి చేయాల్సిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. రేషన్ దుకాణాల్లో కందిపప్పును కూడా రాయితీపై అందిస్తామన్న హామీనీ అపహాస్యం చేసింది. రేషన్ డిపోల పర్యవేక్షణలో ఎండీయూ వాహనాలు ప్రస్తుతం బియ్యం, పంచదార పంపిణీకే పరిమితమయ్యాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాదిరిగానే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కంది పప్పును కేజీ రూ.67కే ప్రతి నెలా పంపిణీ చేస్తామని గత ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించింది. ఈ నెలలో నిల్ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సుమారు 30 శాతం మందికి మాత్రమే సరఫరా చేసినట్టు తెలుస్తోంది. ఎండీయూ వాహనాల్లో ఈ ఏడాది మార్చి నెలలో కందిపప్పు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అలాగే నిత్యావసర సరకుల ధరల నియంత్రణ కోసం సివిల్ సప్లయిస్ శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లు దశలవారీగా మూతపడ్డాయి. ప్రజలపై తీవ్ర ప్రభావం రేషన్ దుకాణాల్లో కందిపప్పు సరఫరా నిలిచిపోవడంతో ఆ ప్రభావం పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్రంగా పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలను కూటమి ప్రభుత్వం ఏమాత్రం అదుపు చేయలేకపోవడం ప్రజలకు పెనుశాపంగా పరిణమించింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 22 మండలాలు, నగర పంచాయతీ, మూడు మున్సిపాలిటీల పరిధిలో 966 రేషన్ డిపోల ద్వారా 355 మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ల(ఎండీయూ)తో 5.48 లక్షల మందికి ప్రతి నెలా రేషన్ సరకులను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ప్రతి నెలా 20లోపు సరకుల కోసం రేషన్ డీలర్లు డీడీలు తీసి, అవసరమైన సరకులను దిగుమతి చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. జిల్లా పౌర సరఫరాల శాఖ మాత్రం గతేడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో సక్రమంగానే ఎండీయూ వాహనాల ద్వారా కందిపప్పును సరఫరా చేసింది. జనవరి, ఫిబ్రవరి నెలలకు కందిపప్పు కోసం డీలర్లు డీడీలు తీయగా, 523 టన్నులకు గానూ కేవలం 112 టన్నులే సరఫరా చేసినట్టు డీలర్లు చెబుతున్నారు. డీడీల్లో మిగిలిన సొమ్మును ఇతర సరకులకు సర్దుబాటు చేశారు. దీంతో ఆ రెండు నెలలు కూడా వినియోగదారులకు పూర్తి స్థాయిలో కందిపప్పు సరఫరా జరగలేదు. పంపిణీకి బ్రేక్..! రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో మార్చి నెల నుంచి కందిపప్పు సరఫరా నిలిచిపోయిందని తెలుస్తోంది. ఈ నెలలో కందిపప్పు కోసం డీడీలు తీయవద్దని పౌర సరఫరాల శాఖ అధికారులు ముందుగానే సమాచారం ఇచ్చినట్టు డీలర్లు చెబుతున్నారు. రెండు నెలలుగా పూర్తి స్థాయిలో కందిపప్పు రాకపోవడంతో ఆసరాగా తీసుకున్న కొందరు రేషన్ సరకులను పక్కదారి పట్టించారనే ఆరోపణలూ లేకపోలేదు. బియ్యం, పంచదారతో పాటు, కందిపప్పు కోసం ఎండీయూ వాహనాల ఆపరేటర్లను అడుగుతుంటే, నో స్టాక్ అనే సమాధానం వస్తుందని లబ్ధిదారులు చెబుతున్నారు. రేషన్ దుకాణాల్లో కందిపప్పు సరఫరా నిలిపివేయడంతో బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పును అధికంగా రూ.150 వరకూ కొనుగోలు చేయాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే కందిపప్పు పంపిణీని పూర్తిగా ఎత్తివేసేలా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. స్టాక్ కోసం ఎదురుచూస్తున్నాం జిల్లాలో రేషన్‌కార్డుదారులకు ఈ నెల కందిపప్పు సరఫరా నిలిచిపోయింది. ఈ నెల కేవలం అంగన్వాడీ కేంద్రాలకు 18.27 మెట్రిక్ టన్నుల కందిపప్పు మాత్రమే సరఫరా జరిగింది. ప్రస్తుతం జిల్లా గోదాముల్లో కందిపప్పు నిల్వలు అందుబాటులో లేవు. పౌర సరఫరాల శాఖ ఆదేశాల మేరకు కందిపప్పు సరఫరాపై చర్యలు తీసుకుంటాం. – ఎం.బాలసరస్వతి, జిల్లా మేనేజర్, జిల్లా పౌర సరఫరాల సంస్థ, అమలాపురం -
ప్రజలతో మరింతగా మమేకం
● జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం ● పార్టీ జెండా ఆవిష్కరణలు, కేక్‌లు కట్ చేసి ఆనందోత్సవాలు ● పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, కో ఆర్డినేటర్లతో నిర్వహణ అమలాపురం టౌన్: వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం జిల్లా వ్యాప్తంగా బుధవారం పార్టీ నాయకులు, కార్యకర్తల నడుమ ఆనందోత్సవాలతో సాగింది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పార్టీ కో ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో ఈ వేడుకలు సరి కొత్త చైతన్యంతో జరిగాయి. ప్రజలతో మరింత మమేకమై వారికి ఈ కూటమి ప్రభుత్వంలో అందని ద్రాక్షగా మిగిలిన సంక్షేమాన్ని అందేలా పోరాడదామని నాయకులు స్పష్టం చేశారు. పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్‌లు కట్ చేసి ఉత్సవాలు నిర్వహించారు. మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పలు వితరణ కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజారంజక పాలనతో ప్రజలు అందుకున్న సంక్షేమాన్ని పార్టీ కో ఆర్డినేటర్లు గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వాన్ని సంక్షేమ రాజ్యంగా కొనియాడారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు సంక్షేమ పథకాలు అందక పడుతున్న అవస్థలను ప్రస్తావించారు. మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించారు. తమ మండలాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించిన మండల పార్టీ నాయకులు ర్యాలీలు, ప్రదర్శనలతో నియోజకవర్గ కో ఆర్డినేటర్ చేపట్టిన వేడుకలకు హాజరయ్యారు. అమలాపురం హైస్కూలు సెంటర్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సెంటర్లో పార్టీ జెండాను ఆవిష్కరించి దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కొత్తపేట నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెంలోని కళా వెంకట్రావు సెంటర్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేశారు. దివంగత మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివంగత డాక్టర్ చిర్ల సోమసుందరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముమ్ముడివరంలోని పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ పార్టీ జెండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేశారు. రామచంద్రపురం గాంధీ సెంటర్లో పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కె.గంగవరం సెంటర్లో కేక్ కట్ చేశారు. రాజోలు పార్టీ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మామిడికుదురులోని బోయి భీమన్న కమ్యూనిటీ హాలు వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేశారు. మాజీ సీఎం దివంగత రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, పి.గన్నవరం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి పి.గన్నవరం, అంబాజీపేటల్లో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు. ఆ రెండు మండల కేంద్రాల్లో వారు పార్టీ జెండాలను ఆవిష్కరించారు. రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజోలు, మండపేట నియోజకవర్గాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. -
హోరెత్తిన యువత పోరు
గురువారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2025విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు వద్దు కూటమి పార్టీలు అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి, సూపర్ సిక్స్ హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను నట్టేటముంచుతున్నారు. 1.40 కోట్ల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం మీ ప్రజా వ్యతిరేకత విధానాలకు అద్దం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా యువత, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు చూసీ వైఎస్సార్ సీపీ యువత పోరు చేపట్టింది. గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి హోదాలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి విద్యావ్యవస్థను సమూలంగా మార్పు చేశారు. వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము సకాలంలో విడుదల చేసేవారు. పాఠశాల స్థాయిలో అమ్మ ఒడి ఇవ్వడంతోపాటు పాఠ్య, నోట్ పుస్తకాలు, బ్యాగులు, యూనిఫామ్ అందజేసిన ఘనత జగన్‌కు దక్కుతుంది. ఇటువంటి కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం చేయడం లేదు. – పినిపే విశ్వరూప్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు యువతను మోసం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఆచరణలో సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసింది. సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 9 నెలలైనా ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదు. తల్లి వందనం, 20 లక్షలు ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి అమ లు చేయకుండా యువతను మోసం చేస్తోంది. – పిల్లి సూర్య ప్రకాష్, వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడుసాక్షి, అమలాపురం: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి... వంచనకు గురి చేసిన కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా వైఎస్సార్ సీపీ శ్రేణులు కదం తొక్కాయి. విద్యార్థులు, నిరుద్యోగులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ మోసం చేస్తున్న కూటమి పాలనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనకు దిగారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను, భృతి అందించకుండా నిరుద్యోగులను తొమ్మిది నెలలుగా మోసగించడాన్ని ఎండగడుతూ జిల్లా పరిపాలనా కేంద్రమైన కలెక్టరేట్ వద్ద బుధవారం వైఎస్సార్ సీపీ నిర్వహించిన యువత పోరు హోరెత్తింది. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు యువత పోరు బాట పట్టారు. జిల్లా కేంద్రమైన అమలాపురంలో పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్చార్జిలు, నాయకులు, కార్యకర్తలతోపాటు నిరుద్యోగ యువకులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారితో అమలాపురం– ముక్తేశ్వరం కేఎన్ఎల్ఎఫ్ రోడ్డు వైఎస్సార్ సీపీ జెండాలలో నిండిపోయింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది. తొలుత పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలోని నల్లవంతెన వద్ద నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసుకుంటూ కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ‘పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేసే పనులు మానుకోవాలి, మెడికల్ కాలేజీ ప్రైవేటీ కరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నిరుద్యోగ భృతి ఇవ్వాలి’’ అనే ప్లకార్డులు పట్టుకుని పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. పోలీసుల ఆంక్షలు వైఎస్సార్ సీపీ చేపట్టిన యువత పోరుపై పోలీసులు ఆంక్షలు విధించారు. కలెక్టరేట్‌లోకి రాకుండా అడ్డుకునేందుకు గేట్లు వేశారు. పోలీసులు, రోప్ పార్టీలతో కలిసి పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు. గేటు వద్ద మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఈ సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు గేట్లు నెట్టుకుని కలెక్టరేట్ వైపు దూసుకుపోయారు. కలెక్టరేట్లో డీఆర్వో కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ‘ఫీజులు రీయింబర్స్మెంట్ సొమ్ము, నిరుద్యోగ భృతి వెంటనే విడుదల చేయాలి, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి, డీఎస్సీ వెంటనే ప్రకటించాలి’ అనే నినాదాలతో కలెకరేట్ హోరెత్తించింది. జై జగన్, జై వైఎస్సార్ సీపీ నినాదాలతో మారుమోగింది. డీఆర్వో బి.ఎల్.ఎన్.రాజకుమారికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యువతను మోసం చేస్తోందని నాయకులు వివరించారు. ఫీజుల రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయనందున విద్యార్థులు అవమానభారంతో కళాశాలలకు వెళ్లాల్సి వస్తోందని, ఇది వారిని మానసికంగా కుంగదీస్తోందని డీఆర్వోకు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు కల్పిస్తామనే హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కోరారు. నిరుద్యోగ భృతి నెలకు రూ.మూడు వేలు ఇవ్వాలని వారు డీఆర్వోను కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, పొన్నాడ వెంకట సతీష్ కుమార్, పాముల రాజేశ్వరిదేవి, రామచంద్రపురం పార్టీ ఇన్చార్జి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పిల్లి సూర్య ప్రకాష్, పి.గన్నవరం నియోజవర్గ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, అమలాపురం, మండపేట, రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్లు రెడ్డి నాగేంద్రమణి, పత్తివాడ నూకదుర్గారాణి, గాదంశెట్టి శ్రీదేవి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపా రాయుడు, చెల్లుబోయిన శ్రీనివాస్, దంగేటి రాంబాబు, రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అబ్ధుల్ ఖాదర్, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు కఠకంశెట్టి ఆదిత్యకుమార్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వంగా గిరిజాకుమారి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు మిండగుదిటి శిరీష్, ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు తోరం గౌతమ్‌రాజ్, పార్టీ నాయకులు వంటెద్దు వెంకన్నాయుడు, కాశి బాల మునికుమారి, పినిపే శ్రీకాంత్, కుడుపూడి భరత్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు. ఆంక్షలు అధిగమించి... ఆకాంక్షలకు ఉద్యమించి కదం తొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రాక మిన్నంటిన కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ కలెక్టరేట్ గేట్లు మూసేసిన పోలీసులు నెట్టుకు వచ్చిన పార్టీ శ్రేణులు -
క్లస్టర్ సమావేశాలతో విద్యావ్యవస్థలో మార్పులు
అమలాపురం టౌన్: రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో నిర్వహిస్తున్న క్లస్టర్ సమావేశాలతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు జరుగుతున్నాయని రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) జి.నాగమణి అన్నారు. అమలాపురంలోని కొంకాపల్లి జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ హైస్కూలులో బుధవారం జరిగిన క్లస్టర్ సమావేశాన్ని నాగమణి సందర్శించి మాట్లాడారు. క్లస్టర్ సమావేశాలకు తోడు ప్రతీ ఉపాధ్యాయుడు విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను పెంచే దిశగా ప్రచారం చేయాలని ఆమె సూచించారు. కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇచ్చే సూచనలను విధిగా పాటిస్తూ క్లస్టర్ కాంప్లెక్స్‌లను విజయవంతంగా నిర్వహించాలన్నారు. హైస్కూలు, క్లస్టర్ కాంప్లెక్స్ హెచ్ఎం కె.ఘన సత్యనారాయణ ఆర్జేడీకి క్లస్టర్ సమావేశాల నిర్వహణను వివరించారు. డీసీఆర్బీ సెక్రటరీ బి.హనుమంతరావు, ఏపీవో డాక్టర్ ఎంఏకే భీమారావు, ఏఎల్‌ఎస్‌వో రమేష్, సీఆర్పీ ఎం.అనూష పాల్గొన్నారు. పనులు వేగవంతం చేయాలి అమలాపురం టౌన్: కోనసీమలో చేపట్టిన కోటిపల్లి– నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్‌కు కోనసీమ రైల్వే సాధన సమితి (కేఆర్‌ఎస్‌ఎస్) ప్రతినిధులు బృందం విజ్ఞప్తి చేసింది. రాజమహేంద్రవరానికి బుధవారం వచ్చిన రైల్వే జనరల్ మేనేజర్‌ను కేఆర్‌ఎస్‌ఎస్ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యంతో కూడిన బృందం స్వయంగా కలసి నెమ్మదిగా సాగుతున్న కోనసీమ రైల్వే పనులను వేగవంతం చేయాలని అభ్యర్థించారు. ఈ మేరకు జనరల్ మేనేజర్‌కు ఓ వినతి ప్రత్రాన్ని అందజేశారు. అమలాపురంలో 2001 సంవత్సరంలో ఏర్పాటు చేసిన రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌ను ఏడాదిన్నర క్రితం మూసి వేశారని జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లారు. మూత పడిన ఆ రిజర్వేషన్ కౌంటర్‌ను తిరిగి తెరిపించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. కోనసీమకు ప్రస్తుతానికి రైలు మార్గం లేదు కాబట్టి రైల్వే ప్రయాణికులు పూర్తిగా ఈ రిజర్వేషన్ కౌంటర్‌పైనే ఆధారపడి ఉన్నారని గుర్తు చేశారు. సమస్యలపై దృష్టిపెట్టి పరిష్కరిస్తానని జీఎం చెప్పారని డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం ప్రకటనలో తెలిపారు. కేఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు సప్పా నాగేశ్వరరావు, ఎం.మురళీకృష్ణ, వి. కృష్ణారావు, మరువాడ శ్రీనివాస్ తదితరులు రై ల్వే జనరల్ మేనేజర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. హౌసింగ్ లబ్ధిదారులకు అదనపు సాయం : కలెక్టర్ అమలాపురం రూరల్: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అసంపూర్తిగా నిలిచిపోయిన గృహ నిర్మాణాలను పూర్తి చేయడం కోసం 10,767 మంది లబ్ధిదారులకు రూ.6.53 కోట్ల అదనపు సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించిందని కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్లో గృహ నిర్మాణ సంస్థ ఇంజినీర్లతో సమావేశం నిర్వహించి ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల మేరకు ఆన్లైన్ సర్వే ప్రక్రియపై లబ్ధిదారులకు అవగాహన అంశాలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ షెడ్యూల్ కులాల వారికి, వెనుకబడిన తరగతుల వారికి రూ.50 వేలు, గిరిజన తెగల వారికి రూ.75 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారన్నారు. త్వరగా భూ సేకరణ నరసాపురం బైపాస్ రోడ్డు భూ సేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి జాతీయ రహదారుల అభివృద్ధికి టెండర్లు జారీ చేసేందుకు వీలుగా అప్పగించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం అమలాపురం ఆర్డీవో జాతీయ రహదారులు ఇంజినీర్లు, మలికిపురం సఖినేటిపల్లి తహసీల్దార్లతో సమావేశం నిర్వహించి భూసేకరణ ప్రక్రియ అవార్డులు పాస్ చేయడం, నష్టపరిహారాల చెల్లింపు, భూముల సేకరణ.. అప్పగింత, కోర్టు కేసుల పెండింగ్ అంశాలపై సమీక్షించారు. ఆయన మాట్లాడు తూ 98శాతం భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, ఆర్డీవో కె. మాధవి, జాతీయ రహదారుల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టి.నిక్కి క్రెజ్, సఖినేటిపల్లి, మలికిపురం తహసీల్దార్లు వెంకటేశ్వర రావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో విదేశీ వ్యవహారాల హెల్ప్‌డెస్క్
కలెక్టర్ మహేష్‌కుమార్ అమలాపురం రూరల్: విదేశాలకు వలస వెళ్లినవారికి మార్గ నిర్దేశం చేసేందుకు కలెక్టరేట్లో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ పేరుతో విదేశీ వ్యవహారాల హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. మంగళవారం హెల్ప్ డెస్క్‌ను ఆయన, ఎస్పీ బీ.కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, డీఆర్ఓ బీఎల్ఎన్ రాజకుమారి, ఆర్డీవోలు కె.మాధవి, పి.శ్రీకర్, డి.అఖిల ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా నుంచి విదేశాలకు వలస వెళ్లి జీవనోపాధి పొందాలనుకునేవారికి పాస్‌పోర్టు, వీసాలు పొందేందుకు గల మార్గాలను సూచించడంతోపాటు అన్ని విధాలా గైడెన్స్ ఇస్తామన్నారు. ఈ ఈ కేంద్రాన్ని ఆరుగురు సిబ్బందితో నెలకొల్పామన్నారు. హెల్ప్ డెస్క్ నోడల్ అధికారి డీఎల్ఎన్ రాజకుమారి, సమన్వయకర్త గోళ్ళ రమేష్, పాల్గొన్నారు. వాడపల్లి వెంకన్న కళ్యాణ ఉత్సవాలకు ఏర్పాట్లు ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వరస్వామి తీర్థ కళ్యాణ మహోత్సవాలు ఏప్రిల్ 7 నుంచి 13వ తేదీ వరకు ఘనంగా నిర్వహిచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వేంకటేశ్వర స్వామి తీర్థ కళ్యాణ మహోత్సవాలపై దేవదాయ, పోలీసు రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 7వ తేదీన ధ్వజారోహణ, 8న స్వామి వారి తీర్థం, రథోత్సవం కళ్యాణం కార్యక్రమాలు, 9వ తేదీ పొన్న వాహన సేవ, 11వ తేదీ గోదావరిలో తెప్పోత్సవం, 12వ తేదీ మహా పూర్ణాహుతి, చక్రస్నానం కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈవో చక్రధరరావు, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఇంటికో ఉద్యోగం కల్పించాలి
టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించినట్టు ఇంటికో ఉద్యోగం కల్పించాలి. దీనికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. నిరుద్యోగులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి మంజూరు చేయాలి. అలా చేస్తే ఉద్యోగాల కోసం కోచింగ్ సెంటర్లకు వెళ్లే పేద విద్యార్థులకు వెసులుబాటుగా ఉంటుంది. – నేరేడుమిల్లి నరేష్, విద్యార్థి నాయకుడు, గంటి, కొత్తపేట మండలం. ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలి కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలన్నీ భర్తీ చేయాలి. అలాగే ప్రభుత్వ పోస్టులను సైతం నింపాల్సి ఉంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా పరిశ్రమల ఏర్పాటు చేయడం, చిన్న పరిశ్రమలతో చాలా వరకు నిరుద్యోగాన్ని తగ్గించవచ్చు. నిరుద్యోగ భృతి అందజేస్తే పోటీ పరీక్షలకు వెళ్లేవారికి మంచిది. – చెల్లంగి రామకృష్ణారావు, మాకనపాలెం, మామిడికుదురు మండలం. జాబ్ క్యాలెండ్ విడుదల చేయాలి ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. ఉపాధ్యాయ పోస్టులే కాదు.. ప్రభుత్వ శాఖల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటితోపాటు పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలి. – చప్పిడి రాజేష్, ఈదరపల్లి, అమలాపురం మండలం -
జిల్లా మలేరియా అధికారిగా వెంకటేశ్వరరావు
అమలాపురం రూరల్: అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలేరియా అధికారిగా నక్కా వెంకటేశ్వరరావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి డాక్టర్ ఎం.దుర్గారావు దొరకు జాయినింగ్ రిపోర్ట్ సమర్పించి పదవీ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్‌ను ఆయన చాంబర్లో మంగళవారం రాత్రి మర్యాద పూర్వకంగా కలిశారు. ఇంటర్ పరీక్షకు 907 మంది గైర్హాజరు అమలాపురం టౌన్: జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం జనరల్, ఒకేషనల్ పరీక్షలకు 907 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ పరీక్షలకు మొత్తం 11,984 మంది హాజరు కావాల్సి ఉండగా 11,462 మంది హాజరయ్యారు. 522 మంది రాలేదు. ఒకేషనల్ పరీక్షలకు మొత్తం 2,676 మందికి 2,291 మంది హాజరయ్యారు. 385 మంది రాలేదు. జిల్లాలోని 40 కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఐఈవో వనుము సోమశేఖరరావు తెలిపారు. విద్యార్థులలో సృజనను వెలికితీయాలి ముమ్మిడివరం: విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా పిలుపునిచ్చారు. ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పార్ట్ టైమ్ ఇనస్ట్రక్టర్లకు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రతి విద్యార్థికి ఏదో ఒక అంశంలో ప్రావీణ్యం ఉంటుందని అది వెలికి తీసే విధంగా బోధన ఉండాలన్నారు. బోధనా సిబ్బందితో పాటుగా బోధనేతర సిబ్బంది విధుల పట్ల అంకిత భావంతో పనిచేయడం ద్వారా జిల్లాను విద్యాపరంగా మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలన్నారు. ఫైనాన్స్ అకౌంట్స్ అధికారి జి.ప్రవీణ్‌కుమార్, జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రమణ్యం, ఐఈ కోఆర్డినేటర్ ఎంవీవీ సత్యనారాయణ, ఏఎంవో రాంబాబు పాల్గొన్నారు. 27 మందికి ఉద్యోగావకాశాలు ముమ్మిడివరం: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్ధ, జిల్లా ఉపాఽధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జాబ్‌మేళాలో 27 మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డి.హరిశేషు తెలిపారు. రెండు ప్రధాన కంపెనీలు పాల్గొన్న ఈ జాబ్ మేళాకు 52 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరుకాగా 27 మందిని ఎంపిక చేశారు. స్కిల్ హబ్ కోఆర్డినేటర్ శ్రీదేవి, ఎస్ఈడీఏపీ సిబ్బంది పాల్గొన్నారు. హై వే పనులు వేగవంతం చేయాలి అమలాపురం టౌన్: అమలాపురం– రావులపాలెం జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్ధనరెడ్డికి మంగళవారం లేఖ రాశారు. అమలాపురం ఎర్ర వంతెన, నల్ల వంతెన, ఈదరపల్లి వంతెనలను జిల్లా కేంద్రం అయ్యాక పెరిగిన ట్రాఫిక్‌కు అనుగుణంగా ఆధునీకరించాలని సూచించారు. అమలాపురం– రావులపాలెం జాతీయ రహదారి జిల్లా ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తున్న దృష్ట్యా ఆ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్యయ్యేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారి అనుసంధానిస్తే కోనసీమ ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని పేర్కొన్నారు. అమలాపురం పట్టణంలో ఆ మూడు వంతెనలు దాదాపు శిథిలావస్థకు చేరుకుని ట్రాఫిక్ అవసరాలను ఏ మాత్రం తీర్చలేకపోతున్నాయని పేర్కొన్నారు. ఈ మూడు వంతెనలపై నిత్యం ప్రజలు ట్రాఫిక్ సమస్యలతో సతమమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. -
భర్తీ లేదు.. భృతి రాదు
● యువతకు సర్కారు దగా ● కూటమి ప్రభుత్వంలో కొత్త కొలువులు లేవు ● సంతకం పెట్టినా డీఎస్సీ ద్వారా భర్తీ కాని 890 పోస్టులు ● 7,500 మంది ఆశలపై నీళ్లు ● ఇస్తానన్న నిరుద్యోగ భృతి అందలేదు ● సుమారు లక్ష మంది ఎదురుతెన్నులు ● రీయింబర్స్మెంట్ లేదు ● సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులకు అందని సొమ్ము ● నేడు వైఎస్సార్ సీపీ యువత పోరు సాక్షి, అమలాపురం: ‘అధికారంలోకి రాగానే వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పిస్తాము. ఆ పరిస్థితి లేకుంటే నెలనెలా నిరుద్యోగ భృతి అందిస్తాము’ ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఇవి. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము. మెగా డీఎస్సీ ఏర్పాటు చేస్తాము. వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాము. ప్రతి ఏటా జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము. జిల్లాల వారీగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తాము. స్థానికంగా వేలాది ఉద్యోగాలు కల్పిస్తాము. ఎంఎస్ఎంఈ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పోరేషన్లతో చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని నిరుద్యోగ యువతకు అయితే ఉద్యోగాలు, లేదా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీల వర్షం కురిపించారు. ఇవేమీ లేకుంటే నెలకు రూ.మూడు వేల నిరుద్యోగ భృతి అందజేస్తామన్నారు. ఇవే కాదు.. క్రమం తప్పకుండా ఫీజులు రీయింబర్స్మెంట్ అందించడం, వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడం, విద్యార్థులకు ఇవ్వాల్సిన సొమ్ము ఇస్తామని ఊదరగొట్టారు. సార్వత్రిక ఎన్నికల ముందు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలోనే కాదు. బాబు నిర్వహించిన బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారంటీ... పవన్ కళ్యాణ్ నిర్వహించిన వారాహీ యాత్రలలో యువత లక్ష్యంగా హామీల వర్షం కురిపించారు. తొమ్మిది నెలల కాలంలో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. వలంటీర్ల వ్యవస్థ ఎత్తివేత గత ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను కూటమి ప్రభుత్వం ఎత్తి వేసింది. గత ప్రభుత్వం వీరికి రూ.ఐదు వేలు గౌరవ వేతనం చొప్పున ఇచ్చేది. కూటమి ప్రభుత్వం రూ.పది వేలు ఇస్తామని మొత్తం వ్యవస్థను తీసివేసింది. బాబు వస్తే కొత్త జాబు రాలేదు సరికదా జిల్లాలో 9,581 మంది వలంటీర్లకు ఉన్న ఉద్యోగం కూడా పోయింది. సర్వేలకు మాత్రమే సచివాలయ సిబ్బంది గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయం, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే)ల ద్వారా సొంత జిల్లాలోనే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది. జిల్లావ్యాప్తంగా 512 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. 4,096 మందికి ఈ జిల్లాలోనే ప్రభుత్వ ఉద్యోగాలు అందించారు. కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థలను నిర్వీర్యం చేయాలని చూస్తోంది. భూముల రిజిస్ట్రేషన్లు సైతం చేసే స్థాయికి ఎదిగిన సచివాలయ వ్యవస్థను కూటమి ప్రభుత్వం సర్వేలకు మాత్రమే పరిమితం చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు గత ప్రభుత్వ హయాంలో విద్యాదీవెన 8,824 మంది విద్యార్థులకు రూ.6.14 కోట్లు విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దీని పేరు రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజుగా మార్చి (ఆర్టీఎఫ్) 2024,25 సంవత్సరానికి 7,210 మందికి రూ.8.33 కోట్లు విడుదల చేశారు. వసతి దీవెన పథకం పేరును మెయింటినెన్స్ ఆఫ్ ట్యూషన్ ఫీజు (ఎంటీఎఫ్)గా మార్చి రూ.1.39 కోట్లు విడుదల చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా 1.62 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.243 కోట్లు జమ అయ్యేవి. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకంగా పేరు మార్పు చేశారు. ఈ ప్రభుత్వ హయాంలో ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. నేడు యువత పోరు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా యువతను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ సమర శంఖం పూరించింది. బుధవారం జిల్లా కేంద్రం అమలాపురంలో కలెక్టరేట్ వద్ద యువత పోరులో భాగంగా ధర్నా చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమానికి పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తరలి రానున్నారు. డీఎస్సీ ప్రకటనేనా!సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేసిన వెంటనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. కాని ఇంత వరకు ప్రకటన వెలువడలేదు. పరీక్షలు నిర్వహించకుండా వాయిదాపై వాయిదాలు వేస్తున్నారు. జిల్లాలో కనీసం 840 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. ఇందుకు 8 వేల మందికి పైగా అర్హులు ఎదురు తెన్నులు చూస్తున్నారు. -
పచ్చని పొలాల్లో ఆక్వా చిచ్చు
● యథేచ్ఛగా సాగుతున్న అక్రమ తవ్వకాలు ● చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం ● కుదేలవుతున్న కోనసీమ కల్పవృక్షం ముమ్మిడివరం: పచ్చని పొలాలు ఆక్వా చెరువులుగా మారుతున్నాయి. నిబంధనలను తుంగలోకి తొక్కి అక్రమ చెరువుల తవ్వకాలతో పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారు. ఇటీవల ప్రకృతి వైపరీత్యాలు, అధిక పెట్టుబడి తదితర కారణాలతో వరుస నష్టాలకు గురవుతున్న బడా రైతులు.. వ్యవసాయాన్ని పక్కనబెట్టి చెరువుల సాగుపై దృష్టి సారిస్తున్నారు. పచ్చని పొలాలు, కొబ్బరి తోటలను సైతం తెగనరికి ఆక్వా చెరువులుగా మార్చేస్తున్నారు. గతంలో సముద్ర తీర ప్రాంతాల్లోను, చౌడు, బీడు భూముల్లో, ఎటువంటి పంటలు పండని భూముల్లో చెరువులు తవ్వి ఆక్వా సాగు చేసేవారు. ఇప్పుడు సారవంతమైన భూములు, పొలాలు, కొబ్బరి తోటలు ఆక్వా చెరువులుగా మారుతుండడంతో జల కాలుష్యం విచ్చలవిడిగా పెరిగిపోతోంది. ఎటువంటి అనుమతులు లేకుండా.. ఆక్వా సాగుకు చెరువులు తవ్వాలంటే రెవెన్యూ, ఫిషరీస్, వ్యవసాయ శాఖ, ఇరిగేషన్, డ్రైనేజీ, పొల్యూషన్ వంటి శాఖల అనుమతి తీసుకుని చెరువులు తవ్వాల్సి ఉంది. ముమ్మిడివరం నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో పంట కాలువలు, ఏటిగట్ల చెంతనే ఎటువంటి అనుమతులు లేకుండా, యథేచ్ఛగా చెరువులను తవ్వుతున్నప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల అక్రమ చెరువుల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పచ్చని చేలు, కొబ్బరి తోటలు చెరువులుగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ముమ్మిడివరం మండలంలోని అయినాపురం పంట కాలువ చెంతనే సర్వే నంబర్ 82/1, 79/1లో సుమారు ఏడు ఎకరాల్లో కొబ్బరి తోటల్లో చెట్లను నరికి, బొబ్బర్లంక–పల్లంకుర్రు ప్రధాన పంట కాలువను ఆనుకుని ఆక్వా చెరువులు తవ్వేస్తున్నారు. ఇదే మండలంలో సోమిదేవరపాలెం పంచాయతీ పరిధిలో కొబ్బరి తోటలను నరికి ఆక్వా చెరువుల తవ్వకాలు చేపట్టారు. చెరువుల్లో తవ్వుతున్న మట్టిని పక్కనున్న మురుగు డ్రెయిన్‌కు అడ్డంగా అడ్డుకట్ట వేసి, ట్రాక్టర్లపై మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నేలకొరుగుతున్న కల్పవృక్షం కోనసీమ కల్పవృక్షాలు నేలకొరుగుతున్నాయి. కన్నబిడ్డ కంటే అమితంగా ఆదరించే రైతులను కంటతడి పెట్టిస్తున్నాయి. నెలసరి ఆదాయం సమకూరుస్తూ జీవితాంతం ఫలసాయం అందించే కొబ్బరి చెటు్ట్ కోనసీమవాసుల జీవితాలతో ముడిపడి ఉంది. ఇంటి పెరట్లో, కాలువ గట్లు, మురుగు డ్రెయిన్లు, ప్రభుత్వ ఆక్రమిత భూముల్లో కొబ్బరి చెట్లను పెంచుతూ జీవనోపాధి పొందడం కోనసీమ ప్రజలకు పరిపాటి. ఏదో నెపంతో చెట్లను నరికి, వారి జీవనోపాధికి గండి కొడుతూనే ఉన్నారు. ఇప్పటికే రోడ్ల విస్తరణ, కాలువల ఆధునికీకరణ పేరుతో వేలాది కొబ్బరి చెట్లను నరికేశారు. గతంలో ఏటిగట్ల ఆధునికీకరణ పేరుతో వేలాది కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. కోనసీమలో 216 జాతీయ రహదారి విస్తరణ, బైపాస్ రోడ్డు నిర్మాణాల పేరుతో వేలాది చెట్లను నరికివేశారు. ఇప్పుడు కొంత మంది రైతులు లాభార్జనే ధ్యేయంగా కొబ్బరి తోటలను నరికి ఆక్వా చెరువులు తవ్వుతున్నారు. దీంతో భవిష్యత్తులో కోనసీమలో కొబ్బరి తోటల మనుగడే ప్రశ్నార్థకమవుతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయంపై దుష్ప్రభావం పలు ప్రాంతాలలో వరిచేలను చెరువులుగా మార్చేస్తుండడంతో సమీపంలోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మంచినీటి చెరువులకు బదులుగా ఉప్పునీటి చెరువులుగా మార్చడంతో తమ పంటచేలలోకి ఊటనీరు ప్రవేశించి పంట నాశనం అవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటేటా ఇలా చెరువులు తవ్వుకుంటూ పోతే వ్యవసాయం కనుమరుగయ్యే పరిస్థితి తలెత్తుతుందని, కనీసం తిండిగింజలు కూడా దక్కని దుస్థితి నెలకొంటుందని పలువురు రైతులు వాపోతున్నారు. అక్రమ తవ్వకాలను నిలువరించాలని కోరుతున్నారు. పర్యావరణానికి విఘాతం గ్రామంలో రోడ్లపై మట్టి ట్రాక్టర్లు విచ్చలవిడిగా సంచరించడంతో దుమ్ముధూళి చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పచ్చని పొలాల మధ్య ఆక్వా సాగు చేయడం వల్ల పచ్చదనం కరువై, పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులు తవ్వేందుకు ఎటువంటి అనుమతులు లేకపోయినా రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల అండదండలతో అక్రమ చెరువుల తవ్వకాలు సాగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
కలెక్టరేట్లో విదేశీ వ్యవహారాల హెల్ప్‌డెస్క్
కలెక్టర్ మహేష్‌కుమార్ అమలాపురం రూరల్: విదేశాలకు వలస వెళ్లినవారికి మార్గ నిర్దేశం చేసేందుకు కలెక్టరేట్లో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ పేరుతో విదేశీ వ్యవహారాల హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. మంగళవారం హెల్ప్ డెస్క్‌ను ఆయన, ఎస్పీ బీ.కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, డీఆర్ఓ బీఎల్ఎన్ రాజకుమారి, ఆర్డీవోలు కె.మాధవి, పి.శ్రీకర్, డి.అఖిల ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా నుంచి విదేశాలకు వలస వెళ్లి జీవనోపాధి పొందాలనుకునేవారికి పాస్‌పోర్టు, వీసాలు పొందేందుకు గల మార్గాలను సూచించడంతోపాటు అన్ని విధాలా గైడెన్స్ ఇస్తామన్నారు. ఈ ఈ కేంద్రాన్ని ఆరుగురు సిబ్బందితో నెలకొల్పామన్నారు. హెల్ప్ డెస్క్ నోడల్ అధికారి డీఎల్ఎన్ రాజకుమారి, సమన్వయకర్త గోళ్ళ రమేష్, పాల్గొన్నారు. వాడపల్లి వెంకన్న కళ్యాణ ఉత్సవాలకు ఏర్పాట్లు ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వరస్వామి తీర్థ కళ్యాణ మహోత్సవాలు ఏప్రిల్ 7 నుంచి 13వ తేదీ వరకు ఘనంగా నిర్వహిచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వేంకటేశ్వర స్వామి తీర్థ కళ్యాణ మహోత్సవాలపై దేవదాయ, పోలీసు రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 7వ తేదీన ధ్వజారోహణ, 8న స్వామి వారి తీర్థం, రథోత్సవం కళ్యాణం కార్యక్రమాలు, 9వ తేదీ పొన్న వాహన సేవ, 11వ తేదీ గోదావరిలో తెప్పోత్సవం, 12వ తేదీ మహా పూర్ణాహుతి, చక్రస్నానం కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈవో చక్రధరరావు, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మృతిరాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన
హైవేపై ఆందోళన చేసిన కట్టుంగగ్రామస్తులు, మృతురాలి బంధువులు రావులపాలెం: రోడ్డు ప్రమాదంలో లారీ ఢీ కొట్టడంతో మహిళ మృతి చెందింది. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు, గ్రామస్తులు రావులపాలెం వద్ద జాతీయ రహదారిపై కళావెంకట్రావు సెంటర్లో మంగళవారం ఆందోళన చేపట్టారు. సోమవారం సాయంత్రం స్థానిక ఊబలంక రోడ్డులో టిప్పర్ లారీ ఢీ కొట్టిన ఘటనలో మృతిచెందిన వందే విజయకుమారి బంధువులు, గ్రామస్తులు ఆత్రేయపురం మండలం కట్టుంగ గ్రామం నుంచి రావులపాలెం చేరుకుని స్థానిక కళావెంకట్రావు సెంటరులో జాతీయ రహదారిపై ఆందోళళన చేశారు. మృతురాలి పిల్లలకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. టౌన్ సీఐ శేఖరబాబు అక్కడి చేరుకుని వారితో మాట్లాడారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసి మృతదేహాన్ని అప్పగిస్తామని చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. దీంతో కాసేపటికి ఆందోళన విరమించారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. -
ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా
13 మంది విద్యార్థులకు గాయాలు జగ్గంపేట: జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామంలో మంగళవారం ఉదయం విద్యార్థులతో జగ్గంపేట వస్తున్న ఒక ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 13 మంది విద్యార్థులు ఉండగా వీరిలో 9 మందికి స్వల్పంగాను, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జగ్గంపేట ఎస్సై రఘునాథరావు తెలిపిన వివరాల మేర కు ఉదయం జగ్గంపేట వస్తున్న బస్సు కాండ్రేగుల గ్రామ శివారులో బోల్తాపడింది. స్థానికుల సహకారంతో విద్యార్థులను బయటకు తీసి జగ్గంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. వీరిలో 9 మందిని ప్రాథమిక చికిత్స అనంతరం ఇళ్లకు పంపించేశారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురు తోటకూర కార్తీక్ నాగేంద్ర, అనితా రామచక్ర, ద్వారపూడి ధనలక్ష్మి, బొదిరెడ్డి శ్రావణిలను మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. స్కూల్ కరస్పాండెట్, వైఎస్సార్ సీపీ జిల్లా బూత్ కమిటీల అధ్యక్షుడు ఒమ్మి రఘురాంఆస్పత్రికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విద్యార్థులందరూ 6 నుంచి 9 తరగతి చెందిన వారని, డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎస్సై తెలిపా రు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రణీత్ విద్యార్థులకు వైద్య సేవలందించారు. -
150 కేజీల గంజాయి పట్టివేత
● రూ.7లక్షల 50 వేలు విలువైన సరకు స్వాధీనం ● ఐదుగురి అరెస్టు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): లక్షల రూపాయల గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. వారి నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనిని రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి జైలుకు పంపారు. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ డి.నరసింహకిశోర్ మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ వివరాలను వెల్లడించారు. పట్టుబడిందిలా... ఉదయం 11 గంటల సమయం. ఏజెన్సీ నుంచి రాజమహేంద్రవరం మీదుగా గంజాయి రవాణా అవుతుందని పక్కా సమాచారం ఉండడంతో రూరల్ ప్రాంతంలోని కొంతమూరు గామన్ ఇండియా బ్రిడ్జి వద్ద పోలీసులు ముమ్మరంగా వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. అయితే నిందితులు ముందస్తుగా గంజాయి తరలించే వాహనానికి ఒక ఆటోను పైలట్‌గా ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఆటోలో వారు గంజాయి తీసుకెళ్తున్న మార్గంలో పోలీసులు తనిఖీలు చేస్తుంటే ఆ సమాచారాన్ని వారికి సమాచారం ఇస్తారు. అలా రంపచోడవరం నుంచి ఎయిర్‌పోర్టు రోడ్డులో వస్తూ వంతెన కింద నుంచి నేషనల్ హైవే 16 పైకి ఎక్కుతుండగా పైలట్ ఆటోలో వారు పోలీసులను గమనించి ఆ సమాచారం గంజాయి రవాణా అవుతున్న వాహనంలో ఉన్న వారికి సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన గంజాయి రవాణాదారులు పారిపోతుండగా రాజానగరం పోలీస్‌స్టేషన్ ఎస్సై మనోహర్, పోలీసు సిబ్బంది ఆ కారును, ఆటోను వెంబడించి పట్టుకున్నారు. మొత్తం రెండు కేజీల చొప్పున 75 ప్యాకెట్లలో కారు ఢిక్కీలో గంజాయి దొరికింది. పట్టుకున్న గంజాయి విలువ రూ.7 లక్షల 50 వేలు ఉంటుందని పోలీసుల తెలిపారు. దీనిని రవాణా చేస్తున్న ప్రకాశం జిల్లా కంభం గ్రామానికి చెందిన షేక్ ఇంతియాజ్, సింగరాయికొండకు చెందిన షేక్ అబ్దుల్, ఏఎస్ఆర్ జిల్లా రంపచోడవరం మండలం సీతంశెట్టినగర్కు చెందిన సంకురు బుచ్చిరెడ్డి, రెడ్డీపేట సంతమార్కెట్కు చెందిన ముర్ల చిన్నారెడ్డి, బూసిగ్రామానికి చెందిన ఉలుగుల రవికిరణ్రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5 సెల్ఫోన్లను స్వాఽఽధీనం చేసుకున్నారు. గంజాయి ఎవరు సరఫరా చేస్తున్నారు, ఎవరికి అమ్ముతున్నారు అనే విషయాలను దర్యాప్తు చేస్తామని ఎస్పీ డి.నరసింహాకిశోర్ తెలిపారు. నార్త్‌జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ పర్యవేక్షణలో గంజాయి పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన రాజానగరం సీఐ వీరయ్యగౌడ్, ఎస్సై పి.మనోహర్, కానిస్టేబుల్స్ రమణ, నాగేశ్వరరావు, కరీముల్లాఖాదర్లను ఎస్పీ అభినందించారు. -
బెట్టింగ్‌ల మోజులో యువత
జీవితాలు బలైపోతాయని హెచ్చరిస్తున్న పోలీసులు రాజానగరం: అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పొందుతున్న విజ్ఞానాన్ని సమాజ హితం కోసం కాకుండా తప్పుడు మార్గాలలో సంపాదనలకు కొంతమంది స్వార్థపరులు ఉపయోగిస్తుంటే, వాటికి ఆకర్షితులై కొంతమంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా తమ బిడ్డలు ఉన్నతంగా ఉండాలి, ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేయాలనే ఆశతో చాలామంది తల్లిదండ్రులు తమ కడుపులు మాడ్చుకుని, అప్పులు చేసి మరీ పిల్లలను చదివిస్తున్నారు. ఈ క్రమంలో దూర ప్రాంతాలలోని కళాశాలలలో చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు హాస్టల్స్‌లో ఉంటూ చదువులు సాగిస్తుంటారు. అయితే ఇటువంటి వారిలో కొంతమంది చెడు స్నేహాలతో కన్నవారి ఆశలను వమ్ము చేయడమే కాకుండా, తమ బంగారు జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. బ్రిడ్జి కౌంటీ కేంద్రంగా ... విద్యా, వ్యాపార రంగాలకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న రాజమహేంద్రవరం సమీపంలో ఇంజినీరింగ్, వైద్య కళాశాలలు అనేక ఉండటంతో యాప్‌ల ద్వారా బెట్టింగ్‌లు నిర్వహించే వ్యక్తులు ఈ ప్రాంతాన్నే తమ కేంద్రంగా చేసుకుని, బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న బ్రిడ్జి కౌంటీలో 12 మంది నిందితులు పట్టుబడ్డారు. చేపల చెరువుల ద్వారా ఆర్థికంగా నష్టపోయిన భీమవరానికి చెందిన దండు వెంకటవర్మ అనే సంతోష్ (31), కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్‌కు చెందిన ఇమ్మంది భరత్‌కుమార్ (34)తో కలిసి బ్రిడ్జి కౌంటీలోని బి–12 విల్లాను అద్దెకు తీసుకుని, కొన్ని నెలలుగా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాడు. వీరిద్దరినీ అడ్మిన్లుగా చేసుకుని, భీమవరం నుంచి దుబాయ్ వెళ్లిన వినీత్ అనే మరో వ్యక్తి కీ రోల్ పోషిస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బ్రిడ్జి కౌంటీలో ఇటువంటి కార్యకలాపాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి వాటి గురించి సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేసి, సహకరించాలని నార్త్ జోన్ డీఎస్పీ వై. శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. తప్పుడు మార్గాలలో పయనించి, జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు ఆయన హితవు పలికారు. హాస్టల్స్‌లో ఉంచి చదివిస్తున్న తమ పిల్లల ప్రవర్తనలపై తల్లిదండ్రులు కూడా నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. క్రికెట్ బెట్టింగ్‌లే అధికం సమాచారం కోసం కనుగొన్న సెల్‌ఫోన్ నేడు అందరికీ జీవితంలో ఒక భాగమైపోయింది. చిన్నపిల్లల నుంచి పండు ముదుసలి వరకు సెల్‌ఫోన్ ముట్టుకోకుండా రోజుగడవడం లేదనడం అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో ఇక విద్యార్థుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో పేకాట, గుండాటల తరహాలోనే ఆన్లైన్లో అనేక రకాల యాప్‌లు హల్చల్ చేస్తున్నాయి. అనేక మంది వాటికి ఆకర్షితులవుతున్నారు. తెలిసీ తెలియని పరిజ్ఞానంతో వారి బ్యాంకు అకౌంట్ల వివరాలు అపరిచితులకు తెలియజేయడమే కాకుండా తల్లిదండ్రుల అకౌంట్లను కూడా కొల్లగొట్టేందుకు తోడ్పడుతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది అమాయకులు భయంతో బయటకు చెప్పుకోలేక, తల్లిదండ్రులకు తెలిస్తే ఏమవుతుందోననే భయంతో జీవితాలను అర్ధంతరంగా ముగించుకునే పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. ఇటువంటి వాటిలో క్రికెట్ బెట్టింగ్‌లే ఎక్కువగా ఉన్నాయి. బార్బర్ షాపులలో కూడా టీవీలను పెట్టుకుని, యాప్‌ల ద్వారా బెట్టింగులు నిర్వహిస్తున్నారు. వీటిని నిరోధించేందుకు పోలీసులు ఎంతగా ప్రయత్నించినా, సరైన ఫలితాలు కనిపించడం లేదు. -
బ్లడ్ బ్యాంక్‌లో తనిఖీలు
కాకినాడ క్రైం: కాకినాడలోని శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. డీఎంహెచ్‌వో డాక్టర్ నరసింహనాయక్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాధారణ తనిఖీలలో భాగంగా బ్లడ్ బ్యాంక్‌ను పరిశీలించినట్లు తెలిపారు. రిజిస్టర్లు పరిశీలించామని, రిక్విజేషన్ ఫాంలోని వివరాల ఆధారంగా దాతలు, గ్రహీతలతో మాట్లాడి నిర్ధారించుకున్నట్లు తెలిపారు. బ్లడ్ స్టాక్ రికార్డు, డోనార్ రికార్డు, క్యాంప్ రిజిస్టర్స్, క్రాస్ మ్యాచింగ్, డిస్కార్ట్ రిజిస్టర్, బ్లడ్ ఇష్యూ రిజిస్టర్, పేమెంట్ రిక్విజేషన్ ఫాం, పేమెంట్ రిసీప్ట్స్, ఫిజికల్ స్టాక్, బ్లడ్ కలెక్షన్, మ్యాచింగ్, కాంపోనెంట్ ప్రిపరేషన్, వైరల్ స్క్రీనింగ్ రూంలను తనిఖీ చేసినట్లు తెలిపారు. శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్‌లో నిబంధనలకు అనుగుణంగానే రక్తదాన సేవలు కొనసాగుతున్నాయని నిర్ధారించినట్లు తెలిపారు. ఈ తనిఖీలలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ వ్యాధుల నియంత్రణాధికారి(డీఎల్వో) డాక్టర్ రోణంకి రమేష్ పాల్గొన్నారు. -
ద్రాక్షారామలో పేలుడు కలకలం
రామచంద్రపురం రూరల్: రామచంద్రపురం మండలంలోని ద్రాక్షారామలో పేలుడు కలకలం చోటు చేసుకుంది. ద్రాక్షారామ ఎస్సై ఎం. లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం బాధిత కుటుంబం ఎండీ జాఫర్ హుస్సేన్ అతని భార్య ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడుతో కలసి ద్రాక్షారామ నున్నవారి వీధిలో నివాసం ఉంటున్నారు. జాఫర్ మార్కెట్లో మటన్ దుకాణం నడుపుకుంటున్నాడు. సోమవారం రాత్రి భోజనం చేసి భార్య, కుమార్తెలు పెంకుటింటిలో నిద్రపోగా, జాఫర్, అతడి కుమారుడు ఇంటి పెరటిలో ఉన్న రేకుల షెడ్డులో నిద్రపోయారు. అర్ధరాత్రి 1.15 గంటలకు పేలుడు శబ్దం, మంటలు రావడంతో భయపడి లేచి బయటకు వచ్చి చూసేసరికి అదే గ్రామానికి చెందిన మహమ్మద్ రోషన్ అబ్బాస్, మరో ఇద్దరు గుర్తు తెలియని యువకులు వీరిని చూసి మోటారు సైకిళ్లపై పారిపోయారు. గాజు సీసాలకు చుట్టిన ఔట్లు, పేలుడు పదార్థాలతో ఇంటిపై దాడి చేశారని, గతంలో రోషన్ అబ్బాస్ బావ మహ్మద్ అలీహుస్సేన్కి తనకి మసీదు విషయంలో ఉన్న గొడవలను దృష్టిలో పెట్టుకుని తమ కుటుంబాన్ని చంపాలని, ఇంటిని నాశనం చేసి ఆస్తి నష్టం కలిగించాలనే ఉద్దేశంతో తమపై దాడికి పాల్పడ్డారని జాఫర్ హుస్సేన్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. ఘటనా స్థలాన్ని సీఐ వెంకట నారాయణ సిబ్బందితో కలసి పరిశీలించారు. -
మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో మండపేట యువకుడి మృతి
మండపేట: పొట్టకూటికి మహారాష్ట్ర పనికి వెళ్లిన మండపేట యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నాలుగు రోజలు క్రితం జరిగిన ఈ విషాద ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు, స్నేహితులు తెలిపిని వివరాలిలా వున్నాయి. పట్టణంలోని కొండపల్లివారి వీధికి చెందిన పరమటి జితేంద్ర (33) మహారాష్ట్రలోని ఉద్గార్లోని ఓ ఫైనాన్స్ సంస్థలో కొంత కాలంగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మార్చి 7వ తేదీ ఉదయం ద్విచక్ర వాహనంపై లైన్‌కు బయలుదేరాడు. హల్నీ రహదారిపై వెళ్తున్న జితేంద్ర గండోపత్ దప్కా ప్రాంతానికి వచ్చేసరికి ప్రమాదానికి గురయ్యాడు. ఎదురుగా వేగంగా వస్తున్న నాలుగు చక్రాల గూడ్స్‌వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రుణ్ణి స్థానికులు ఆసుపత్రికి చేర్చించారు. అక్కడ వైద్యం పొందుతుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడని చెప్పారు. ఘటనపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. పంచనామా పూర్తయ్యాక అక్కడి పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా మహారాష్ట్ర నుంచి అంబులెన్స్‌లో సోమవారం రాత్రి మండపేట తీసుకువచ్చారు. కాగా మృతునికి భార్య, మూడు నెలల పసిపాప వున్నారు. కుటుంబం కోసం కష్టపడటానికి వెళ్లి ఎప్పుడూ క్షేమంగా ఇంటికి చేరుకునే తన భర్త ఈసారి ఎవరికీ అందనంత దూరం వెళ్లిపోయారని గుండెలవిసేలా రోదించిన భార్యను చూటి చుట్టుపక్కల వారు కంటతడి పెట్టారు. ఉపాధి హామీ పని చేస్తూ మహిళా కూలి మృతి దేవరపల్లి: ఉపాధి పని చేస్తూ అస్వస్థతకు గురై పని ప్రదేశంలోనే మహిళా కూలీ మృతి చెందిన ఘటన దేవరపల్లి మండలం పల్లంట్లలో మంగళవారం జరిగింది. ఏపీఓ జీవీ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పల్లంట్లకు చెందిన బొందల చంద్రమ్మ(53) 15 ఏళ్లుగా ఉపాధి పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. మంగళవారం ఉదయం గ్రామంలోని రైతు పొలంలో ఫార్మ్ చెరువు తవ్వకం పనులకు వెళ్లిన చంద్రమ్మ కొద్దిసేపటికి అస్వస్థతకు గురైంది. వెంటనే వైద్యం కోసం గ్రామానికి తీసుకువస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. -
నిమ్మకు తెగుళ్ల బెడద
పెరవలి: జిల్లాలో నిమ్మపంట 720 హెక్టార్లలో సాగు జరుగుతుండగా వివిధ రకాల తెగుళ్లు ఆశించి ఉండటంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడి, తోటలు పాడైపోతున్నాయి. ముఖ్యంగా ఈ పంటపై ఆకు ముడత, పండ్ల రసాన్ని పీల్చే రెక్కల పురుగులు, బంక, వేరుకుళ్లు, గజ్జి, మొజాయిక్ తెగుళ్లు ఆశించి ఉన్నాయి. ఈ తెగుళ్ల నివారణకు రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలు గురించి కొవ్వూరు ఉద్యాన అధికారి (ఏడీఏ) సీహెచ్ శ్రీనివాస్ వివరించారు. ఆకుముడత : ఈ తెగులు ఎక్కువగా లేత చిగుర్లపై ఆశించి ఆకులపై తెల్లటి పొరలు వంకర టింకరగా ఏర్పడి ఆకులు ముడుచుకునేలా చేస్తుంది. తద్వారా ఆకులపై గజ్జి తెగులు ఎక్కువగా వ్యాప్తి చెంది ఆకులు రాలిపోతాయి. నివారణ చర్యలు : ఆకులు ముడతలు పడినట్లు గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. డైమిథోయేట్ 2 మిల్లీ లీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.5మిల్లీ లీటర్లు మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దీని ఉధృతి ఎక్కువగా ఉంటే 10 రోజుల వ్యవధిలో రెండవసారి పిచికారీ చేయాలి. తెల్లపొలుసు పురుగులు : ఈ పొలుసు పురుగులు ఎక్కువగా కాండంపై ఆశించి సున్నం పూసినట్లుగా కనపడతాయి. ఇవి కాండం, కొమ్మలలో రసాన్ని పీల్చివేయటం వల్ల అవి ఎండిపోతాయి. నివారణ చర్యలు : ఈ పురుగులు ఆశించిన చోట గోనె సంచితో బాగా రుద్ది మిధైల్డెమటాన్ లేదా డైమిథోయేట్ 2 మిల్లీ లీటర్లు మందును లీటరు నీటిలో కలిపి కాండం, కొమ్మలపై పిచికారీ చేయాలి. నల్లి పురుగులు : నల్లి పురుగుల్లో ఆకుపచ్చ నల్లి, మంగు నల్లి ముఖ్యమైనవి. ఆకునల్లి ఆకులపైన, మంగునల్లి కాయలపైన ఆశించి రసాన్ని పీల్చివేస్తాయి. దీనివల్ల కాయలపై చిన్న చిన్న తెల్లని మచ్చలు లేదా ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కాయ అంతటా మంగు ఏర్పడుతుంది. నివారణ చర్యలు : నీటిలో కరిగే గంధకం 3గ్రాములు లేదా డైకోఫాల్ 5.0 మిల్లీ లీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే నివారణ అవుతుంది. రసం పీల్చే రెక్కల పురుగులు : ఈ రెక్కల పురుగులు పండ్లపై రంథ్రాలు చేసి కాయలో ఉండే రసాన్ని పీల్చుతాయి. దీంతో కాయలకు చేసిన రంథ్రాల ద్వారా శిలీంద్రాలు, బ్యాక్టీరియా చేరి పండ్లు కుళ్లి, రాలిపోతాయి. పండ్లపై డాగు ఏర్పడుతుంది. నివారణ చర్యలు : ఈ పురుగులు ఆశించి కుళ్లి, రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. పురుగులను నాశనం చేయటానికి మలాథియాన్ ఒక మిల్లీలీటరు మందుకు ఒక శాతం పంచదార, పండ్ల రసం కలిపి చెట్ల కింద అమర్చాలి. పురుగులను ఆకర్షించటానికి బల్బులను ఏర్పాటు చేయాలి. దీని ద్వారా పురుగులను అరికట్టవచ్చు. పురుగుల నుంచి కాయలను రక్షించటానికి కాయలకు బుట్టలను ఏర్పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. బంక తెగులు : బంక తెగులు రెండు రకాలు ఒకటి ఫెటోఫ్తోరా, రెండు డిఫ్లోడియా. మొదటి తెగులు ఆశించిన చెట్టు నుంచి ధారాళంగా బంక కారుతుంది. ఇది చెట్టు వేళ్లకు, మొదలు కింది భాగానికి పరిమితమై ఉంటుంది. డిఫ్లోడియా బంక తెగులు చెట్టు మొదలు పైభాగాన కొమ్మల పంగల్లో ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు ఎక్కువగా ఉంటే బంక కారటం, బెరడు కుళ్లటం జరుగుతుంది. నీరు త్వరగా ఇంకని భూముల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుంది. నివారణ చర్యలు : బంక కారి కుళ్లిన బెరడును పూర్తిగా తొలగించి బోర్డోపేస్టు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ పేస్టు పూయాలి. ఈ పేస్టును మొదలు చుట్టూ పూయాలి. కొమ్మలపై వచ్చే బంక తెగులు నివారణకు లీటరు నీటికి 1గ్రాము కార్బండజిమ్ కలిపి చెట్టు మొత్తం తడిసేలా పిచికారీ చేయాలి. మెటలాక్సిల్ 2 గ్రాములు లీటరు నీటిలో కలిపి చెట్టు మొదలులో పోయాలి. వేరుకుళ్లు తెగులు : వేరుకుళ్లు తెగులు ఆశించిన చెట్టుకు పోషక పదార్థాలు అందక చెట్లు ఎండిపోతాయి. ఈ తెగులు ఆశించిన చెట్లు ఎక్కువ పూతపూసి కాయలు ముదిరే లోగా చెట్లు వాడి ఎండిపోతాయి. ఎండిన చెట్ల వేర్లను పరీక్షిస్తే కుళ్లిన వాసన వస్తుంది. నివారణ చర్యలు : వ్యాధి సోకిన తొలి దశలోనే గమనించి చెట్టుకు ఎక్కువగా నీరు కట్టి మరుసటి రోజు కార్బండజిమ్ 2 గ్రాములు లేదా మాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా చెషంట్ 3 గ్రాములు లేదా ఒక శాతం బోర్డో మిశ్రమాన్ని లీటరు నీటిలో కలిపి చెట్టు చుట్టూ నేల తడిసేలా పిచికారీ చేయాలి. చెట్టుకి కావలిసిన పోషక పదార్థాలు సేంద్రియ ఎరువులు, పచ్చి రొట్ట ద్వారా అందించాలి. ఒక కిలో ట్రైకోడెర్మా మందును 90 కిలోల పశువుల ఎరువు 10 కిలోల వేపపిండితో కలిపి 15 రోజులు మాగపెట్టి చెట్టు మొదలు చుట్టూ వేయాలి. ఇలా చేస్తే చెట్టును ఈ తెగులు నుంచి కాపాడవచ్చు. గజ్జి తెగులు (కాంకర్ మచ్చ) : నిమ్మ పంటపై ఎక్కుగా ఆశించే తెగులు ఈ గజ్జి తెగులు. ఇది కాయలు, ఆకులు, చిన్న, పెద్ద కొమ్మలను ఆశిస్తుంది. తెగులు ప్రభావం అధికంగా ఉంటే చెట్లు ఎండిపోయి చనిపోతాయి. నివారణ చర్యలు : ఈ తెగులు సోకి ఎండిన కొమ్మలను కత్తిరించి స్ట్రెప్టోసైక్లిన్ ఒక గ్రాము, 30 గ్రాములు బ్లైటాక్స్ మందును 10 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. గజ్జి ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని గోకి బెరడును తీసి వేసి బోర్డోపేస్టును పూయాలి. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,000 గటగట (వెయ్యి) 15,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
అప్పులతో అమరావతి అభివృద్ధి సరే..
అమలాపురం టౌన్: శాసన సభ సమావేశాల సాక్షిగా మంత్రి నారాయణ వరల్డ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఏసియా, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు రూ.48 వేల కోట్ల (అప్పు)తో రానున్న ఐదారు నెలల్లో అభివృద్ధి చేయనున్నామని చెప్పారు సరే.. మరి పర్యావరణం, ఉపాధి అవకాశాలను ఎందుకు ప్రస్తావించలేదని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు సూటిగా ప్రశ్నించారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు, వైఎస్సార్ సీపీ నాయకులు మాట్లాడారు. ఎక్కడైనా అభివృద్ధి పేరిట పనులు మొదలెడితే, ఆ ప్రాంతంలో పర్యావరణం దెబ్బతింటుంది, కూలీలకు ఉపాధి అవకాశాలు మృగ్యమవుతాయి, ఇలాంటి అభివృద్ధి పేరిట ఉత్పన్నమయ్యే సమస్యలపై యునైటెడ్ నేషనల్ ఆర్గనైజన్స్(యూఎన్వో) ద్వారా ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ లాలో ఎన్నో దేశాల్లో కేసులున్నాయని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. అమరావతి అభివృద్ధి పేరుతో భవిష్యత్తులో జరగనున్న పర్యావరణ, ఉపాధి అవకాశాలపై ఎదురయ్యే సమస్యలను ఛాలెంజ్ చేస్తూ వైఎస్సార్ సీపీ అనుమతితో పార్టీ తరఫున ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ లాలో కేసు వేస్తామని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. యూఎన్వో చార్టర్ ప్రకారం రిహాబిలిటేషన్, రీ షెటిల్‌మెంట్ పరంగా అమరావతి అభివృద్ధి పేరిట అక్కడి కూలీలు, రైతులు, కార్మికులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతి అభివృద్ధి మాటున జరగనున్న విధ్వంసాలపై పార్టీ తరఫునే కాకుండా, బీసీ సంఘాల తరఫున కూడా ఈ వైఫల్యాలను ఖండిస్తున్నామన్నారు. సమావేశంలో పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, లీగల్‌సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు కుడుపూడి త్రినాథ్, నాయకులు వాసర్ల సుబ్బారావు, అనంత్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణం, ఉపాధి అవకాశాల మాటేమిటి? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు సూటి ప్రశ్న -
విజ్ఞానాసక్తి ఉంటే భవిష్యత్తు శాస్త్రవేత్తలు మీరే..
ముమ్మిడివరం: విజ్ఞాన శాస్త్ర ఆలోచన విధానాలను పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశాలు మెండుగా ఉంటాయని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా అన్నారు. స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లా విజ్ఞాన శాస్త్ర సంబరాల ముగింపు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి డీఈఓ ముఖ్యఅతిథిగా హాజరై, విజ్ఞాన శాస్త్ర ప్రాముఖ్యాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా క్విజ్ పోటీలు నిర్వహించిన క్విజ్ మాస్టర్ పీవీ బ్రహ్మానందం, మేక రామలక్ష్మి, టీఆర్ఎస్ పద్మావతిని అభినందించారు. క్విజ్ పోటీలు, డ్రాయింగ్ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనాతవరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సర్ ఐజాక్ న్యూటన్, ఆర్యభట్ట వేషధారణ ఆకట్టుకుంది. జిల్లా విజ్ఞాన శాస్త్ర అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, విద్యార్థులు విజ్ఞాన శాస్త్ర ఆలోచన విధానాలను పెంపొందించుకోవాలని సూచించారు. సమగ్ర శిక్షా ఏఎంఓ రాంబాబు మాట్లాడుతూ, విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించడం ద్వారా ఉత్తమ పరిశోధకులుగా తీర్చిదిద్దవచ్చన్నారు. సమగ్ర శిక్షా ఎఫ్ఏఓ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ, సమగ్ర శిక్షా ద్వారా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి, విద్యార్థులను నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ గౌరీశంకర్, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. డీఈఓ షేక్ సలీం బాషా విజ్ఞాన శాస్త్ర సంబరాల ముగింపు -
నేనేమి చేశాను నేరం..!
సాక్షి, అమలాపురం: మనలో ఉంటారు. కాని ప్రపంచం తెలియదు. మనతో కలిసి జీవిస్తారు. కాని జీవనం అంటే ఏమిటో తెలియదు. మన మాటలు వింటారు కానీ, తిరిగి పూర్తిగా సమాధానం చెప్పలేరు. కనీసం తమకు ఏదైనా శారీర ఇబ్బంది తలెత్తినా.. బాధతో విలవిల్లాడుతున్నా భరించడమే కానీ నోరు తెరిచి చెప్పలేని దుస్థితి వారిది. శారీరక దివ్యాంగానికి, మానసిక దివ్యాంగత్వం కూడా తోడు కావడంతో చిన్నారులు, యువతీ యువకులు మంచాలకే పరిమితమవుతున్నారు. ఇటువంటి వారికి మంచాలపై ఉంటున్న దీర్ఘకాలిక రోగులకు ఇస్తున్నట్టుగా రూ.15 వేల పింఛను ఇవ్వాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇందుకు పలు అవాంతరాలూ ఏర్పడుతున్నాయి. మంచాలపై ఉన్న దీర్ఘకాలిక రోగులకు మాత్రమే రూ.15 వేల పింఛనుకు జీవో ఉంది. ఇలా శారీరక, మానసిక దివ్యాంగులు మంచాలకే పరిమితవుతున్నా, వీరికి మాత్రం కేవలం రూ.6 వేల పింఛను మాత్రమే లభిస్తోంది. పైగా సదరన్ సర్టిఫికెట్లో ఇలా రెండు రకాల దివ్యాంగత్వంతో ఇబ్బంది పడుతూ మంచానికే పరిమితమవుతున్నారనే ఆప్షన్ లేకపోవడం వీరికి ప్రధాన అవరోధంగా పరిణమించింది. మొత్తం 21 రకాల దివ్యాంగులున్నారు. కానీ సదరం వైబ్సైట్లో కేవలం ఐదు రకాల దివ్యాంగులనే చూపుతోంది. కోనసీమ జిల్లాలో ఇటువంటి వారు సుమారు 500 మంది వరకు ఉంటారని అంచనా. వీరిలో కొందరికి దివ్యాంగ పింఛను రూ.6 వేలు వస్తుండగా, మరికొంత మందికి అదీ లేదు. ఉన్నంత లోనే సరిపుచ్చుతూ.. ప్రతి నెలా రూ.వేలల్లో అవుతున్న వైద్యం.. తల్లిదండ్రులు సామాన్య కూలీలు. కౌలుదారులు కావడం వల్ల లక్షలాది రూపాయలు పోసి తమ పిల్లలకు మెరుగైన వైద్యం చేయించలేకపోతున్నారు. ఉన్నదానిలో కొంత సొమ్ము వెచ్చించి వైద్యం చేయించడం, నెల వారీ మందులు కొనడంతో సరిపుచ్చుతున్నారు. ప్రభుత్వం మంచానికి పరిమితమై, వైద్యం పొందుతున్న వారికి ఇస్తున్నట్టుగా తమ వారికి కూడా నెలకు రూ.15 వేల పింఛను ఇవ్వాలని సుదీర్ఘ కాలంగా మొరపెట్టుకుంటున్నారు. వీరంలో కొంతమంది కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక.. మీ కోసం కార్యక్రమానికి హాజరయ్యారు. తమ గోడును జాయింట్ కలెక్టర్ టి.నిషాంతికి మొరపెట్టుకున్నారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించారు. అక్షరం తప్పు ఉందని.. ఈ అబ్బాయి పేరు గంధం బాబి. వయస్సు 15 ఏళ్లు. రావులపాలెం మండలం దేవరపల్లి. తండ్రి లేడు. తల్లి గంధం కాసులమ్మ కూలీ పనిచేసి పెంచాల్సిందే. ఈ అబ్బాయిని కాసులమ్మ తల్లి అయిన వృద్ధురాలు సాకుతోంది. ప్రస్తుతం రూ.ఆరు వేల పింఛను ఇస్తున్నారు. ఇప్పుడు దానికీ ఇబ్బంది వచ్చి పడింది. సదరన్ సర్టిఫికెట్లో బీవోబీబీవై అని, ఆధార్‌లో మాత్రం బీవోబీవై అని ఉందని పింఛను ఆపేలా ఉన్నారని తల్లి కాసులమ్మ తల్లడిల్లుతోంది. తల్లి గర్భం నుంచి భూమిపై అవతరించిన శిశువుకు ఈ ప్రపంచమంటే ఏమిటో తెలియదు. తల్లి ఒడే ఆ పాపాయికి సర్వస్వం. ఆనందంగా ఉంటే కేరింతలు కొట్టడం.. ఆకలేస్తే ఏడుపు అందుకోవడం.. ఇదే తెలుసు. కాలక్రమంలో వయస్సును బట్టి తెలివితేటలు.. అవసరాన్ని బట్టి ప్రాపంచిక జ్ఞానం అలవడుతాయి. పెరిగి పెద్దవారై.. కుటుంబానికి చేదోడువాదోడై.. జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటారు. కానీ.. ఏ నేరానికి వీరు ఈ శిక్ష అనుభవిస్తున్నారో చెప్పడానికి కూడా వీల్లేకుండా.. పుట్టుకతో మంచానికే పరిమితమై జీవచ్ఛవంలా కాలం వెళ్లదీస్తున్నారు ఈ అభాగ్యులు. వయసు పెరుగుతున్నా.. సమాజంలో అందరిలా బతకలేక బతుకీడుస్తూ.. జీవితాన్ని చిదిమేస్తున్న కష్టాన్నీ గ్రహించలేక.. చెరగని చిద్విలాసాన్ని మోముపై చిందిస్తూ.. కనికరం లేని పాలకుల కరకు హృదయాలు వారి ఉనికిని అణచివేస్తున్నా.. కనీసం వేలెత్తి చూపలేని ఈ శారీరక, మానసిక దివ్యాంగుల అమాయకత్వంపై ఈ ప్రభుత్వం కరుణించడం లేదు. ఈమె పేరు మద్దింశెట్టి హారిక. వయస్సు 22 ఏళ్లు. ఆమెది రావులపాలెం మండలం గోపాలపురం. శారీరక, మానసిక వైకల్యం వల్ల ఇంటిలో మంచానికే పరిమితమైంది. ఇప్పుడు దివ్యాంగులకు ఇచ్చే రూ.6 వేల పింఛను మాత్రమే అందుతోంది. తండ్రి వ్యవసాయ కూలీ. వైద్యం పేరుతో ఆపరేషన్లు చేసినా, ఇప్పుడు మందులు వాడుతున్నా పింఛను సొమ్ము లేదా తండ్రి కూలీగా వచ్చే సొమ్ముతోనే. ఈ అబ్బాయి పేరు పితాని సిద్ధివిలాస్. రావులపాలెం మల్లయ్యదొడ్డి గ్రామం. వయస్సు 15 ఏళ్లు. తల్లి వెంటక లక్ష్మీ ఆలనాపాలనా చూస్తుంటే, తండ్రి శ్రీనివాస్ కూలీ పని చేస్తూ పోషిస్తున్నాడు. సిద్ధి విలాస్‌కు మాటలు రావు. అడుగు తీసి అడుగు వేయలేడు. కాలకృత్యాలు, ఇతర అవసరాలకు తల్లిదండ్రులు చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి చేయించాల్సిందే. పుట్టినప్పటి నుంచి మంచానికే.. గాడ సాత్విక్ కుమార్ వయస్సు ఏడు సంవత్సరాలు. కొత్తపేట పంచాయతీ పరిధిలోని గణేష్ నగర్ ప్రాంతానికి చెందిన గాడ రాజు, ఎస్తేరురాణి దంపతుల కుమారుడు. పుట్టినప్పటి నుంచీ మంచానికే పరిమితమైన దివ్యాంగుడు. రూ.6 వేల పింఛను మాత్రమే వస్తోంది. మంచానికే జీవితం పరిమితం పింఛను పెంచమన్నా.. ప్రభుత్వం చూపని కనికరం శారీరక దివ్యాంగత్వంతో పాటు మానసికంగానూ ఇక్కట్లు సదరన్‌లో లేని బహుళ దివ్యాంగత్వ ఆప్షన్ అందని రూ.15 వేల పెన్షన్ కుదేలవుతున్న కుటుంబాలెన్నో.. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ.. ఆదిమూలం నాగ సత్యవతికి 15 ఏళ్లు. ఆదిమూలం సత్యనారాయణమ్మకు 14 ఏళ్లు. వీరిద్దరూ అక్కా చెల్లెళ్లు. పి.గన్నవరం మండలం కుందాలపల్లి గ్రామానికి చెందిన వెంకటరత్నం, భాగ్యలక్ష్మి దంపతుల కుమార్తెలు. వీరిద్దరూ పుట్టుక నుంచే మంచానికి పరిమితమైన మానసిక దివ్యాంగులు. తండ్రి సత్యనారాయణ కౌలుదారుడు. అలాగే జీవనం కూలీ పని కూడా చేసి సాగిస్తున్నారు. వెబ్సైట్ ఓపెన్ కాలేదట..! కొత్తపేట పాత రామాలయం వీధికి చెందిన చోడపనీడి లక్ష్మణుడు వయస్సు ఆరేళ్లు. శివ నాగప్రసాద్, రాజేశ్వరి దంపతుల కుమారుడు. వీరికి ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు(కవలలు). వీరిద్దరిలో రెండో కుమారుడు లక్ష్మణుడు. ఈ బాలుడు మంచానికే పరిమితమైన దివ్యాంగుడు. కుమార్తె కూడా దివ్యాంగురాలే. వీరిద్దరికీ ఇంత వరకు ఎటువంటి పింఛనూ పొందలేకపోతున్నారు. దరఖాస్తు చేద్దామని వెళుతుంటూ సిబ్బంది వెబ్సైట్ ఓపెన్ కావడం లేదని చెబుతున్నారని ప్రసాద్ దంపతులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. -
సెక్టార్ సమావేశాలకు డుమ్మా !
ఆలమూరు: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సీఐటీయూ పిలుపు మేరకు అంగన్వాడీలు తలపెట్టిన ధర్నాను నిలువరించేందుకు ఐసీడీఎస్ అధికారులు సోమవారం మండల కేంద్రాల్లో సెక్టార్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలకు ఒక్క అంగన్వాడీ కార్యకర్త కూడా హాజరు కాలేదు. అంగన్వాడీ సహాయకులు కేంద్రాలను తెరవకుండా మూకుమ్మడి సెలవును ప్రకటించారు. దీంతో జిల్లాలోని ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన సెక్టార్ సమావేశాలకు అంగన్వాడీలు హాజరుకాకపోవడంతో ఐసీడీఎస్ అధికారులు మధ్యాహ్నం వరకూ ఎదురుచూసి వెనుదిరిగారు. నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అనేక మంది అంగన్వాడీ కార్యకర్తలు ఇప్పటికే విజయవాడ చేరుకోగా, కొంతమందిని మహిళా పోలీసుల సాయంతో ఇంటి వద్దే నిలువరించారు. మరికొంత మందిని మర్గం మధ్యలో అడ్డుకుని, వెనక్కు పంపేశారని అంగన్వాడీలు చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆశించినట్టుగా అంగన్వాడీల ఉద్యమాన్ని అణచివేయలేకపోయామనే ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది.ఆందోళనకే మొగ్గుచూపిన అంగన్వాడీలు -
మిత్రుల అంకురం.. రైతులకు సంబరం
పిఠాపురం: పంటకు మేలు చేసి, రైతులకు పురుగు మందుల ఖర్చు తగ్గించే మిత్రులుగా భావించే మిత్ర పురుగులు సేంద్రియ వ్యవసాయం పుణ్యమా అని మళ్లీ వాటికి జవజీవాలు సంతరించుకున్నాయి. విచ్చలవిడిగా రసాయనాల వినియోగంతో కనుమరుగైన మిత్ర పురుగులు.. సేంద్రియ వ్యవసాయంతో ఉనికిలోకి వస్తున్నాయి. వీటివల్ల పంటలకు ఎంతో మేలు కలిగి, రైతుకు పైసా ఖర్చు లేకుండానే క్రిమికీటకాలు నివారించబడతాయి. అలాంటి మిత్ర పురుగులు పొలాల్లో కనిపించకుండా పోవడంతో, కీటకాలు పెరిగి, పంటలకు తెగుళ్లు సోకి రైతుకు నష్టాలను మిగులుస్తున్నాయి. ఈ తరుణంలో ప్రకృతి వ్యవసాయం వల్ల పంటలకు మిత్రులు మళ్లీ వస్తుండడంతో రైతులను ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు మేలు సాలీడు, అక్షింతల పురుగు, తూనీగలు, అల్లిక రెక్కల పురుగు, గొల్లభామలను పంటలకు మిత్రులుగా చెబుతారు. ఇవి పంటలకు రక్షణ కవచాలుగా రైతులు పరిగణిస్తుంటారు. కొన్నేళ్లుగా సాగులో రసాయనాలను గణనీయంగా వినియోగించడంతో కనుమరుగైన ఈ పురుగులు.. ప్రకృతి వ్యవసాయం వల్ల, రసాయనాల వినియోగం తగ్గి, మళ్లీ భూమిపై సంచరిస్తూ పంటలకు మేలు చేస్తున్నాయి. ఈ మిత్ర పురుగులు పొలంలో లేకుంటే పంటకు కీడు చేసే పురుగుల తీవ్రత పెరిగి, పంటలకు తీవ్ర నష్టాలను కలిగిస్తాయి. పంటకు రక్షకులు.. ఇతర కీటకాలకు శత్రువులు రసాయనాల వినియోగంతో కనుమరుగు ప్రకృతి వ్యవసాయంతో మిత్ర పురుగులకు జీవం సేంద్రియ పంటల్లో వాటి ప్రాముఖ్యమెంతో.. అక్షింతల పురుగు పంటలకు అక్షింతల పురుగు (లేడీ బర్డ్ బీటిల్) చాలా ప్రయోజనకరంగా చెబుతారు. అనేక రకాల కీటకాలను, పేను బంక లాంటి రసం పీల్చే పురుగులకు ఇవి సహజ శత్రువులు. ఒక అక్షింతల పురుగు తన జీవిత కాలంలో సుమారు ఐదు వేల పేనుబంక పురుగులను తింటుంది. గుండ్రంగా కుంభాకారం కలిగి ఉంటుంది. పసుపు, గులాబీ, నారింజ, ఎరుపు, నలుపు రంగుల్లో మచ్చలు కలిగి ఉంటుంది. వీటి లార్వాలు సైతం కీటకాలను వేటాడుతాయి. ఆడ పురుగులు ప్రతి మూడు నెలలకోసారి సుమారు వెయ్యి గుడ్లు పెడతాయి. ఇవి ప్రకాశవంతమైన మచ్చలతో, నలుపు రంగులో ఉండి, ప్రమాదకరమైన దానిగా కనిపించినప్పటికీ పంటకు మాత్రం ఎంతో మేలు చేస్తుంది. ఇవి వదిలే లార్వా ఎటువంటి ప్రమాదకరం కాకపోవడంతో పంటకు మేలు మినహా, కీడు అనేది ఉండదు. అనేక వారాల పాటు పంటలపై ఉండి కీటకాలను తినడం ద్వారా రైతులు కీటకాల నివారణకు పురుగు మందులు పిచికారీ చేసే అవసరం లేకుండా, పెట్టుబడి, శ్రమ చాలా తగ్గుతుంది. అల్లిక రెక్కల పురుగు ప్రకృతిలో అల్లిక రెక్కల పురుగు (గ్రీన్ లేస్ వింగ్ బగ్) విరివిగా కనిపించే ఓ సాధారణ రెక్కల పురుగు. కానీ ఇది పంటలకు చేసే మేలు అంతా ఇంతా కాదు. గొంగళి పురుగులు, లీవ్ ఆఫర్స్, బిలివర్స్, వైట్ ఫ్లైస్ వంటి ఇతర మృదువైన శరీరం కలిగిన కీటకాలను నియంత్రించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. లేత ఆకుపచ్చ రంగులో, సున్నితమైన రెక్కలతో ఉండే ఈ పురుగు వదిలే లార్వా ఇతర కీటకాలను నాశనం చేస్తాయి. పంటలు నాశనం చేసే కీటకాలకు దీనిని బద్ధ శత్రువుగా చెబుతారు. తూనీగ పొడవైన శరీరం కలిగి, కళ్లు, రెండు జతల బలమైన రెక్కలు కలిగి, వివిధ రంగుల మచ్చలతో ఉండే తూనీగ (డ్రాగన్ ఫ్లై) 95 శాతం కీటకాలను వేటాడతాయి. అందుకే దీనిని డెడ్లీ హంటర్ అని కూడా అంటారు. కచ్చితమైన లక్ష్యాన్ని ఛేదించేవిగా చెబుతారు. ఇవి ఒకే వేసవిలో వేలాది కీటకాలను పట్టుకుని తింటాయి. దోమలు, ఈగలు, తెల్లదోమలను తిని పంటలకు మేలు చేకూరుస్తాయి. సాలీడు సాధారణ పంటలకు సోకే తెగుళ్ల నియంత్రణకు సాలీడు (స్పైడర్) జీవ ఏజెంట్లుగా పని చేస్తాయి. ఇవి అనేక సజీవ కీటకాలను తింటాయి. చీడపీడలను నియంత్రించడంలో వీటిని మించిన పురుగు మరొకటి లేదంటారు. కేవలం శత్రు కీటకాలను తినడం మినహా, పంటకు కానీ, మొక్కలకు కానీ ఎటువంటి హానీ చేయకపోవడం వల్ల మిత్ర పురుగుల్లో ఇది తొలి స్థానంలో ఉంది. దోమలు, ఈగలు, తెల్లదోమలు, ఎగిరే కీటకాలను పట్టుకుని తినడం ద్వారా ఇవి పంటలకు మేలు చేస్తాయి. గొల్లభామ పంటలకు గొల్లభామ (ప్రేయింగ్ మ్యాంటీస్)లను ఆస్తులుగా చెబుతారు. తెగుళ్ల నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. పునుబంక, ఆస్త్రరాగస్ బీటిల్స్, గొంగళి పురుగు, బీటిల్స్, తేనెమంచు పురుగు తదితర వాటిని తిని పంటలకు హాని కలగకుండా నివారిస్తాయి. ఇవి పుప్పొడి మకరందాన్ని తీసుకోవు. కానీ వీటిని ఉత్పత్తి చేసే మొక్కలు గొల్లభామలు తినే ఆహారాలైన కీటకాలను ఆకర్షిస్తాయి. వీటివల్ల పంటలకు చాలా మేలు కలుగుతుంది.మిత్ర పురుగులు మళ్లీ వచ్చాయి గతంలో ఎక్కడ చూసినా మిత్ర పురుగులు కనిపించేవి. కానీ రసాయనాల వినియోగం వల్ల అవి కనుమరుగయ్యాయి. ముఖ్యంగా పొలాల్లో అస్సలు కనిపించడం లేదు. కానీ సేంద్రియ వ్యవసాయం మొదలయ్యాక వాటి మనుగడ మళ్లీ ప్రారంభమైంది. రైతు ఎటువంటి పురుగు మందులు వాడకుండా, 70 శాతం వరకు ఇవి పంటలకు హాని చేసే కీటకాలను నాశనం చేసి, పంటకు మేలు చేస్తాయి. ఇప్పుడు ఇవి భారీగా కనిపిస్తున్నాయి. తెగుళ్లు తగ్గుముఖం పట్టాయి. రైతుకు పెట్టుబడి తగ్గింది. ఇది చాలా శుభపరిణామంగా చెప్పవచ్చు. – గుండ్ర శివచక్రం, ప్రకృతి వ్యవసాయ రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం ప్రకృతి వ్యవసాయ ఫలితమే.. కొన్నేళ్లుగా చేపట్టిన ప్రకృతి వ్యవసాయ సాగు ఫలితమే మిత్ర పురుగుల మనుగడకు అంకురం. ప్రస్తుతం సేంద్రియ పంటలన్నింటి పైనా ఈ పురుగులు సంచరిస్తున్నాయి. తద్వారా కీటకాల బెడద గణనీయంగా తగ్గింది. పురుగు మందుల అవసరం లేకుండా పోయింది. పంటలకు మంచి రోజులు వచ్చాయనడానికి నిదర్శనమే మిత్ర పురుగుల సంచారం. ఇది మారుతున్న వ్యవసాయ విధానాల్లో శుభపరిణామంగా చెప్పవచ్చు. – ఎలియాజరు, డీపీఎం, ప్రకృతి వ్యవసాయ శాఖ, కాకినాడ -
కమనీయం నరసన్న కల్యాణం
మధురపూడి: శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల సందర్భంగా కోరుకొండ గోవింద, హరి నామస్మరణతో మార్మోగింది. స్వయంభు శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం రథోత్సవం, రాత్రి 9 గంటలకు కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగాయి. దేవస్థానంలోని కల్యాణ మండపంలో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. కోరుకొండ నవనరసింహ క్షేత్రం కావడంతో సుదూర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కోరుకొండ పరిసరాలన్నీ భక్తజనంతో కిక్కిరిసింది. రథోత్సవంతో కోరుకొండ మీదుగా గోకవరం, భద్రాచలం, విశాఖపట్నం, విజయనగరం వెళ్లాల్సిన వాహనాలు నిలిచిపోయాయి. ప్రధాన వీధుల మీదుగా కొనసాగిన రథోత్సవం సాయంత్రం 5.30కు తిరిగి దేవస్థానానికి చేరింది. అక్కడ స్వామి, అమ్మవార్లను మేళతాళాలు, మంగళవాయిద్యాలతో ఆలయానికి తోడ్కొనివచ్చారు. వధూవరులకు మంగళస్నానాలు నిర్వహించారు. పట్టువస్త్రాలను అలంకరించిన స్వామి, అమ్మవారు దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. వధూవరులకు వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం వేద పండితులు పాణింగపల్లి పవన్‌కుమార్ ఆచార్యులు కల్యాణం నిర్వహించారు. దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త ఎస్పీ రంగరాజబట్టర్, అర్చకస్వాములు పెద్దింటి, పెదపాటి వారి పర్యవేక్షణలో కల్యాణ వేడుక కమనీయంగా జరిగింది. మాలధారణ భక్తుల ప్రదర్శనలు రథోత్సవంలో మాలధారణ చేసిన భక్తుల ప్రదర్శనలు ఆధ్యాత్మకతను సంతరించుకున్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన 220 మంది భక్తులు స్వామివారి మాలధారణ వేశారు. ఉత్సవాల సందర్భంగా స్వాములు 9 రోజుల పాటు నిష్ఠతో పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. వీరికి స్వామివారి మాలధారణ ట్రస్టు ద్వారా వడి, భిక్షలను ఏర్పాటు చేశారు. బుధవారం దీక్షను విరమిస్తారు. భక్తజన సందోహం నడుమ.. సోమవారం స్వామివారి రథోత్సవం భక్తజన సందోహం నడుమ వైభవంగా జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 1.56 గంటలకు వేద మంత్రోచ్ఛరణతో స్వామి, అమ్మవార్లు ఆశీనులైన రథం బయలుదేరింది. కొండ నుంచి ప్రారంభమైన రథం దేవస్థానం రోడ్డు, వాటర్ ప్లాంట్, రెడ్డి పంతులు సత్రం, పాత సంత మార్కెట్, వడ్టీలపేట, మత్స్యకారుల వాడ, ఎయిర్టెల్ టవర్, సాయిబాబా గుడి, అంకాలమ్మ గుడి, శివాలయం మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా గరగ నృత్యాలు, బ్యాండ్‌మేళాలు, కోలాటం, తీన్మార్, శక్తి వేషధారణలు, కేరళ డ్రమ్స్ వాయిద్యాలతో రథానికి స్వాగతం పలికారు. సాయంత్రం 5.40కు రథం తిరిగి దేవస్థానానికి చేరింది. భక్తులు అరటి పండ్లను స్వామి రథంపైకి వేస్తూ, దర్శించుకున్నారు. దేవస్థానానికి చేరుకున్న రథానికి ఎదుర్కోలు కార్యక్రమంలో భాగంగా మేళతాళాలతో నరసింహస్వామి, లక్ష్మీదేవిని ఆలయంలోకి తీసుకెళ్లారు. ఆయా కార్యక్రమాల్లో అన్నవరం దేవస్థాన ఈఓ వీర్ల సుబ్బారావు, దేవస్థానం అధికారులు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణచౌదరి, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, నార్త్‌జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్, కోరుకొండ తహసీల్దార్ సుస్వాగతం, ఎంపీడీఓ బత్తిన అశోక్‌కుమార్ పాల్గొన్నారు. కోరుకొండ సీఐ సత్యకిషోర్, ఎస్సై శ్యామ్‌సుందర్ బందోబస్తు నిర్వహించారు. శ్రీలక్ష్మీ నరసింహుని రథోత్సవం భక్తజన సందోహం కన్నుల పండువగా కల్యాణోత్సవాలు -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
రాజానగరం: జాతీయ రహదారిని ఆనుకుని చక్రద్వారబంధం సమీపంలో ఉన్న బ్రిడ్జి కౌంటీలోని బి–12 విల్లాలో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్‌లో 12 మందిని అరెస్టు చేశామని నార్త్ జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ తెలిపారు. దుబాయ్ కేంద్రంగా నడుస్తున్న ఈ క్రికెట్ బెట్టింగ్‌లో పట్టుబడిన వారంతా కర్నాటక, భీమవరం వారేనన్నారు. ఈ వివరాలను సోమవారం సాయంత్రం ఇక్కడ మీడియాకు వెల్లడించారు. భీమవరం మండలం బలుసుముడికి చెందిన దండు వెంకటవర్మ అలియాస్ సంతోష్ (31), కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్‌కు చెందిన ఇమ్మంది భరత్‌కుమార్(34)తో కలిసి బ్రిడ్జి కౌంటీలోని బి–12 విల్లాను అద్దెకు తీసుకున్నాడు. కొంతమందిని ఆఫీసు బుక్కీలుగా, కాంట్రాక్ట్ స్టాఫ్‌గా తీసుకుని కొన్ని నెలలు ఆన్లైన్ ద్వారా పంటర్స్(కస్టమర్స్)తో గెలుపు, ఓటములపై గేమింగ్ నడుపుతున్నాడు. ఈ బెట్టింగ్ ప్రక్రియ దుబాయ్ కేంద్రంగా జరుగుతోంది. భీమవరానికి చెందిన వినీత్ అనే వ్యక్తి దుబాయ్‌కి వెళ్లి, అక్కడి నుంచి కన్నడ, ఏపీబుక్.బర్లారి.కామ్లనే వెబ్సైట్లను నిర్వహిస్తుంటే, ఇద్దరు నిందితులు ఇక్కడి నుంచి అతనికి ఆడ్మిన్లుగా ఉన్నారు. గతేడాది జూలైలో అడ్మిన్లు ఇద్దరికీ కన్నడ 24.కామ్ అనే వెబ్సైట్ ద్వారా వైజాగ్‌లో 20 రోజుల శిక్షణ కూడా ఇచ్చాడు. ఆ తరువాత బి.కామ్ వెబ్ సైట్‌ని కొత్తగా ప్రారంభించి, ఈ బ్రిడ్జి కౌంటీలో అద్దెకు తీసుకున్న విల్లా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆదివారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌పై మధ్యాహ్నం 2 గంటల నుంచి మ్యాచ్ పూర్తయ్యే వరకు బెట్టింగ్‌లు నిర్వహించారు. ఈ మేరకు అందిన సమాచారంతో ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు ఎస్సై నాగార్జున ఆకస్మిక దాడి చేసి, నిందితులను అరెస్టు చేశారు. మొత్తం 12 మంది నిందితుల్లో ఇద్దరు ప్రధాన నిందితులు కాగా, మిగిలిన 10 మంది బుక్కీలు(ఆఫీస్ స్టాఫ్). వీరి నుంచి ఏడు ల్యాప్‌టాప్‌లు, 42 సెల్ఫోన్లు స్వాధీనపర్చుకున్నామని డీఎస్పీ తెలిపారు. బెట్టింగ్‌లకు వినియోగిస్తున్న వెబ్సైట్లను క్లోజ్ చేయించడంతో పాటు, వారి బ్యాంక్ ఖాతాలను కూడా సీజ్ చేయించేందుకు చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో సీఐ వీరయ్యగౌడ్, ఎస్సైలు మనోహర్, నాగార్జున, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. నిందితుల్లో మొత్తం 12 మంది దుబాయ్ నుంచి కీ రోల్ పోషిస్తున్న వినీత్ నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ వెల్లడి -
రహదార్లపై మృత్యు తాండవం
కిర్లంపూడి: ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఆగి ఉన్న టిప్పర్‌ను బైకిస్ట్ ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందినట్టు కేసు నమోదు చేశామని కిర్లంపూడి ఏఎస్సై కుమార్ తెలిపారు. ఆయన వివరాల మేరకు, చిల్లంగా గ్రామానికి చెందిన కొప్పన అప్పారావు(29) తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి వీరవరంలో అత్తారింటికి మోటార్ బైక్‌పై బయలుదేరాడు. రాజుపాలెం వంతెన అవతల వైపు మోటార్ బైక్ అదుపుతప్పి ఆగి ఉన్న టిప్పర్ వెనుక భాగంలో ఢీకొనడంతో, అతడి తలకు తీవ్ర గాయమైంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి భార్య, పాప, బాబు ఉన్నారు. భార్య విశాలాక్షి ఇచ్చిన ఫిర్యాదు మేకు కేసు నమోదు చేసినట్టు ఏఎస్సై తెలిపారు. రోడ్డుపై ఆందోళన కగా నిబంధనలకు విరుద్ధంగా టిప్పర్‌ను రోడ్డుపై ఆపడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని మృతుడి బంధువులు, గ్రామస్తులు ఆరోపించారు. మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ఆందోళనకు ఉపక్రమించారు. దీంతో కిర్లంపూడి–సామర్లకోట రోడ్డుపై సుమారు 4 గంటల సేపు ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పెద్దాపురం ఎస్డీపీఓ శ్రీహరిరాజు, జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్సై రాఘనాథరావు అక్కడకు చేరుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. బైక్ అదుపుతప్పి.. ముమ్మిడివరం: మోటార్ సైకిల్‌పై వెళుతున్న ఇద్దరు యువకులు రోడ్డుపై ఆబోతు అడ్డురావడంతో అదుపు తప్పి కిందపడ్డారు. దీంతో ఓ యువకుడికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని అనాతవరం 216 జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన మల్లిపూడి ప్రవీణ్‌కుమార్ (28), సత్యప్రకాష్ ద్విచక్ర వాహనంపై కాకినాడ నుంచి సొంతూరుకు పయనమయ్యారు. అనాతవరం వద్ద జాతీయ రహదారిపై అడ్డొచ్చిన ఆబోతును బైక్‌తో ఢీకొన్నారు. ఈ ఘటనలో ప్రవీణ్‌కుమార్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాల పాలైన సత్యప్రకాష్‌ను అమలాపురంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై డి.జ్వాలాసాగర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. లారీ ఢీకొని వివాహిత.. రావులపాలెం: ఊబలంకలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వందే విజయకుమారి(40) మృతి చెందారు. ఎస్సై నాయుడు రాము వివరాల మేరకు, ఆత్రేయపురం మండలంలోని కట్టుంగకు చెందిన విజయకుమారి భర్త రమేష్‌బాబుతో కలిసి అమలాపురంలో చదువుతున్న తన కుమార్తెను చూసేందుకు మోటార్ బైక్‌పై వెళ్లారు. సోమవారం సాయంత్రం తిరుగు పయనమయ్యారు, స్థానిక వినాయకుని ఆలయం వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి లారీ వారి బైక్‌ను ఢీకొంది. దీంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోగా, విజయకుమారి పైనుంచి లారీ దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. సీఐ సీహెచ్ విద్యాసాగర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో నలుగురి మృతి పరీక్ష రాయడానికి వెళ్తూ విద్యార్థి.. ఆబోతు అడ్డొచ్చి ఓ యువకుడు అత్తారింటికి వెళుతూ మరో వ్యక్తి పరీక్షకు వెళుతూ... సామర్లకోట: ఇంటర్మీడియెట్ పరీక్ష రాయడానికి సోమవారం ఇంటి నుంచి మోటార్ బైక్‌పై బయలుదేరిన విద్యార్థి మార్గం మధ్యలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన విషాద సంఘటన ఇది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు, మండలంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన ప్రగడ వంశీ(19) ఇంటర్ సెకండియర్ పరీక్ష రాయడానికి ఇంటి నుంచి కాకినాడకు బైక్‌పై బయలు దేరాడు. గొంచాల గ్రామంలోని మలుపులో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ అతడి బైక్‌ను ఢీకొనడంతో వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై రాంబాబు తన సిబ్బందితో సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. మృతుడి తండ్రి చనిపోవడంతో, ఒక్కగానొక్క కుమారుడిని తల్లి గారాబంగా పెంచుతూ, చదివిస్తోంది. పరీక్ష రాయడానికి వెళ్లిన కుమారుడు ఇక శాశ్వతంగా తిరిగిరాడని తెలుసుకుని ఆ తల్లి సంఘటన స్థలంలో గుండెలవిసేలా రోదించింది. తాను ఎవరి కోసం బతకాలంటూ ఆమె రోదించిన తీరు స్థానికుల హృదయాలను కలచివేసింది. అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఎస్సై రాంబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆకట్టుకున్న సూక్ష్మ బంగారు వరల్డ్ కప్
పెద్దాపురం: ఐసీసీ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా మూడోసారి విజేతగా నిలిచిన సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ అవార్డు గ్రహీత, పట్టణంలోని బంగారు శిల్పి తాళాబత్తుల సాయి సూక్ష్మ బంగారు వరల్డ్ కప్‌ను రూపొందించారు. కేవలం 40 నిమిషాల సమయంలో 0.100 మిల్లీ గ్రాముల బంగారంతో 10 మిల్లీమీటర్ల పొడవు కలిగిన వరల్డ్ కప్‌ను తయారు చేసి, పలువురి మనన్నలు అందుకున్నారు. మూల్యాంకన విధులపై సమావేశం బాలాజీచెరువు(కాకినాడ): పదో తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనంపై సోమవారం విద్యా శాఖ ఆర్జేడీ నాగమణి సమావేశం నిర్వహించారు. స్థానిక రామకృష్ణ పబ్లిక్ స్కూల్లో జోన్–2కు సంబంధించి కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల డీఈఓలు, పరీక్షల విభాగ ఏసీ, సీసీలతో సమావేశం జరిగింది. మూల్యాంకన విధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ సమావేశంలో డీఈవోలు పిల్లి రమేష్, నారాయణ పాల్గొన్నారు. పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్ నల్లజర్ల: తూర్పుచోడవరంలో నాలుగేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన ఇల్లెందుల నాగరాజు(34) అసభ్యంగా ప్రవర్తించాడు. శనివారం ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికను మభ్యపెట్టి, అసభ్యంగా వ్యవహరించాడు. ఈ మేరకు బాలిక తల్లి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని సోమవారం అరెస్టు చేసి, కోర్టుకు తరలించినట్టు ఏఎస్సై శోభనాద్రి తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,000 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
రెండో ర్యాంకుకు అన్నవరం దేవస్థానం !
ఇతర పుణ్యక్షేత్రాల స్థానం దిగజారడంతో ఎగబాకిన వైనం అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం భక్తులకు అందిస్తున్న సేవల్లో రెండో ర్యాంకును సాధించింది. గత నెలలో రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో చివరగా ఏడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 25 మధ్య సేకరించిన అభిప్రాయ సేకరణలో రెండో స్థానంలో ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన దేవస్థానాల భక్తుల అసంతృప్తి శాతం తక్కువగా ఉండడంతో రెండో స్థానంలో నిలిచినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గతంలో ఈ దేవస్థానం ఏడో ర్యాంకులో ఉండడంతో కలెక్టర్ షణ్మోహన్ గత నెల 24న అన్నవరం విచ్చేసి, విస్తృత తనిఖీలు నిర్వహించి, దేవస్థానం మొదటి ర్యాంకులో రావాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. భక్తులకు సేవలందించడం, ప్రసాదం నాణ్యత, ఇతర ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు సేకరించి తాజా ర్యాంకులు ప్రకటించింది. భక్తులకు దర్శనంలో రెండో ర్యాంకు, మౌలిక వసతుల్లో మూడో ర్యాంకు, ప్రసాదం రుచిలో రెండో ర్యాంకు సాధించింది. అన్నవరం దేవస్థానం -
12న యువత పోరు బాటకు తరలిరండి
వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీలు అమలాపురం రూరల్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 12వ తేదీన యువత పోరు బాట పేరిట కలెక్టరేట్ వద్ద జరిగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్ పిలుపునిచ్చారు. అమలాపురం మండలం భట్నవెల్లిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ స్వగృహం వద్ద ఆదివారం వైఎస్సార్ సీపీ యువత పోరు బాట పేరిట వాల్ పోస్టర్లను ఎమ్మెల్సీలు ఆవిష్కరించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు సంసాని వెంకట చంద్రశేఖర్(నాని) అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీలు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైనా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.వెయ్యి కోట్లు విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. దీనివల్ల పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని, అప్పు చేసి, ఫీజులు కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజు బకాయిలు కట్టకపోతే పరీక్షలకు అనుమతించడం లేదన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి మూడు నెలలకు ఫీజు రీయింబర్స్మెంట్ తల్లుల బ్యాంక్ ఖాతాల్లో వేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం లక్షలాది మంది విదార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజు బకాయిలు ఇచ్చే వరకూ వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందన్నారు. జిల్లాలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యువత పోరు బాటకు తరలిరావాలని పిలుపునిచ్చారు. పార్టీ రామచంద్రపురం, పి.గన్నవరం నియోజకవర్గాల ఇన్చార్జీలు పిల్లి సూర్యప్రకాశ్, గన్నవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోందని దుయ్యబట్టారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, ఎంపీపీ కుడిపూడి భాగ్యలక్ష్మి, పార్టీ నేతలు కోనుకు బాపూజీ, జున్నూరి వెంకటేశ్వరరావు, తోరం గౌతమ్, జాన్ గణేష్, వంటెద్దు వెంకన్నాయుడు, కుడుపూడి భరత్‌భూషణ్, వాసంశెట్టి తాతాజీ, కుంచె రమణారావు, చింతా రామకృష్ణ, దంగేటి రుద్ర, కౌన్సిలర్లు చిట్టూరి పెదబాబు, బండారుల గోవింద్ తదితరులు పాల్గొన్నారు. -
గొంతు దాటనినిరసన గళం
అంగన్వాడీల ధర్నాకు అనుమతి లేదు చలో విజయవాడ ధర్నాకు అంగన్వాడీ కార్యకర్తలు చేసుకున్న దరఖాస్తును ప్రభుత్వం ఆమోదించలేదు. సోమవారం నిర్వహించే ధర్నా, నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదు. అంగన్వాడీ కార్యకర్తలందరూ మండల కేంద్రాల్లో నిర్వహించే సెక్టార్ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలి. అంగన్వాడీ సహాయకులు అంగన్వాడీ కేంద్రాలను తెరచిఉంచాలి. అంగన్వాడీలు సరైన కారణం లేకుండా సెలవు తీసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – బి.శాంతకుమరి, పీడీ, ఐసీడీఎస్, అమలాపురం ● అంగన్వాడీల ఉద్యమంపై ఉక్కుపాదం ● చలో విజయవాడ భగ్నానికి ప్రభుత్వం కుట్ర ● సెక్టార్ సమావేశాలకు హాజరుకావాలని అధికారుల హుకుం ● విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరిక ● పోలీసుబెదిరింపులతో అణచివేసే యత్నం ఆలమూరు/రాయవరం: దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న తమ న్యాయబద్దమైన డిమాండ్ల సాధన కోసం రాజ్యాంగబద్ధంగా ధర్నా చేసేందుకు ఉపక్రమిస్తున్న అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన చలో విజయవాడను భగ్నం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కుయుక్తులు పన్నుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తొమ్మిది నెలల్లోనే ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుంది. దీంతో పాటు గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రకటించిన హామీలు అమలు చేయకపోవడంతో, ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే ఈ నెల ఆరున తమ న్యాయబద్ధమైన డిమాండ్లను ఆమోదించాలని కోరుతూ ఈ నెల ఆరున ఆశా కార్యకర్తలు ఇచ్చిన చలో విజయవాడకు పిలుపు విజయవంతం కావడంతో, అంగన్వాడీల ఆందోళనను ఉక్కుపాదంతో అణచివేయాలని కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా కుతంత్రాలు, కుట్రలను పన్నుతోంది. చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీలకు గతేడాది జూలై నెలలో వేతనాలు పెంచుతామంటూ గత ప్రభుత్వం జీవోను వెలువరించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అఽధికారం చేపట్టడంతో ఆ జీఓను అమలు చేయలేదు, కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో అంగన్వాడీలు ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చినా, పట్టించుకోకపోవడంతో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఈ నెల 10న చలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో ప్రభుత్వం అహం దెబ్బతినడంతో ఆ ఉద్యమాన్ని అణగదొక్కాలని నిర్ణయించుకుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,726 అంగన్వాడీ, మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. అందులో 86,296 మంది చిన్నారులు, ప్రీ స్కూల్ విద్యార్థులు, 15,743 మంది బాలింతలు, గర్భిణులున్నారు. వీరికి క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందజేయడంతో పాటు, చిన్నారులకు ఆటపాటలతో వినోద పరికరాలతో విద్యా బోధన చేస్తున్నారు. దీంతో పాటు నిమిషం ఖాళీ లేకుండా, యాప్‌లను పూరించడంతోనే సమయం సరిపోతోందని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాజరు కావాల్సిందే.. అంగన్వాడీలందరూ ఆయా మండల కేంద్రాల్లో సోమవారం నిర్వహించబోయే సెక్టార్ సమావేశాలకు హాజరు కావాల్సిందేనని ఐసీడీఎస్ శాఖ హుకుం జారీ చేసింది. సరైన కారణాలు లేకుండా గైర్హాజరైతే సంజాయిషీ ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు అంగన్వాడీ కార్యకర్తలు చెబుతున్నారు. విధిగా ప్రతి అంగన్వాడీ కేంద్రాన్ని ఆయాలు తెరచి ఉంచాలని స్పష్టం చేసినట్టు సమాచారం. చలో విజయవాడకు అనుమతి లేనందున ఎట్టి పరిస్థితుల్లోను సిబ్బంది ఆదేశాలు పాటించాల్సిందేనని సీడీపీఓలు, సూపర్వైజర్లు పరోక్ష హెచ్చరికలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో జిల్లా స్థాయి అధికారులు చేసేదేమీ లేక, సమావేశాలకు హాజరు కావాలని, తగిన కారణం లేనిదే సెలవు పెట్టకూడదంటూ అంగన్వాడీలకు, ఆయాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. చర్చలకు పిలిచారు కానీ.. అంగన్వాడీలు చలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి సీఐటీయూ నేతలను ఆదివారం చర్చలకు అహ్వానించినట్టు తెలిసింది. ప్రభుత్వం నుంచి సోమవారం సాయంకాలం వరకూ కబురు రాకపోవడంతో, సీఐటీయూ ఆదేశాల మేరకు చలో విజయవాడ నిరసన కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించాలని అంగన్వాడీలు నిర్ణయించుకున్నారు. జిల్లాలోని ఆయా గ్రామాల్లోని మహిళా పోలీసుల సహకారంతో అంగన్వాడీల కదలికలను తెలుసుకుని, విజయవాడకు వెళ్లకుండా పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పలుచోట్ల అంగన్వాడీలను గృహ నిర్బంధం కాగా, మరికొందరు అంగన్వాడీలు ఇప్పటికే విజయవాడ చేరుకున్నట్టు సమాచారం.హామీలను నెరవేర్చాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హామీలను పట్టించుకోవడం లేదు. అందుకే రాష్ట్ర నాయకత్వం మహా ధర్నాకు పిలుపునిచ్చింది. ఎన్నికల సమయంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. – డి.ఆదిలక్ష్మి, అధ్యక్షురాలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల సంఘం, మండపేట ప్రాజెక్టు, రాయవరం అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల డిమాండ్ల సాధనకు విజయవాడలో మహాధర్నాకు సిద్ధమయ్యాం. మహాధర్నాకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదెంత మాత్రం సమంజసం కాదు. బలప్రయోగంతో అడ్డుకునే ప్రయత్నాలు సరికావు. – కె.కృష్ణవేణి, జిల్లా ప్రధాన కార్యదర్శి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, మండపేట ప్రధాన డిమాండ్లివే.. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెర్పర్స్ వేతనాలను సత్వరం పెంచాలి. గ్రాడ్యుటీపై జీవోను వెంటనే విడుదల చేయాలి మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మార్చాలి. అంగన్వాడీలందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. పనిభారం తగ్గించి, యాప్‌లను కుదించాలి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కనీస వేతన చట్టం అమలు చేయాలి. -
మోరి చేనేత వస్త్రాలకు రాష్ట్రపతి ప్రశంస
సఖినేటిపల్లి: జిల్లాలోని మోరి చేనేత సొసైటీ వస్త్రాలను ఆదివారం న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. నేషనల్ డిజైన్ సెంటర్(సెట్ అప్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్) ఆధ్వర్యంలో సౌత్ ఇండియా అమృత్ మహోత్సవ్‌లో ఏపీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మోరి చేనేత స్టాల్‌ను న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోరి చేనేత సొసైటీ స్టాల్‌లోని చేనేత వస్త్రాలను రాష్ట్రపతి పరిశీలించారు. ఆమె వెంట ఏపీ గవర్నర్ ఉన్నారు. చేనేత చీరల తయారీలో కార్మికుల నైపుణ్యాన్ని రాష్ట్రపతి ప్రసంశించినట్టు స్టాల్ సేల్స్‌మన్, మోరికి చెందిన నల్లా ప్రసాద్ తెలిపారు. సుదర్శన హోమానికి రూ.లక్ష విరాళం సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివా రి ఆలయంలో నిత్యం నిర్వహిస్తున్న నారసింహ సుదర్శన హోమానికి హైదరాబాద్ షేక్‌పేటకు చెందిన అవసరాల సూర్య బాయన్నపంతులు రూ.లక్ష విరాళం ఆదివారం అందజేశారు. ఆలయంలో అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణకు ఈ మొత్తాన్ని అందజేశారు. ఆయనకు స్వామివా రి చిత్రపటం, లడ్డూ ప్రసాదాన్ని అందించారు. నిత్యాన్నదాన పథకానికి.. అంతర్వేది ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి ఏలూరుకు చెందిన మద్దిపట్ల ఆనంద్కుమార్శర్మ రూ.50 వేల విరాళం అందజేశారు. ఆలయంలో అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణకు విరాళాన్ని అందజేసి, స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం అందుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ విజయసారథి పాల్గొన్నారు. నేడు యథావిధిగా గ్రీవెన్స్అమలాపురం రూరల్: కలెక్టరేట్లో సోమవారం జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని డీఆర్వో రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిషత్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం ఎప్పటిలాగే జరుగుతుందన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిందన్నారు. దీంతో జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక యథావిధిగా నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా స్థాయి విజ్ఞాన సంబరాలు నేడు ముగింపు ముమ్మిడివరం: జిల్లా స్థాయి విజ్ఞాన శాస్త్ర సంబరాల ముగింపు వేడుకలు స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహిస్తున్నట్టు జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం తెలిపారు. జిల్లా విద్యా శాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా ఆధ్వర్యంలో విజ్ఞాన శాస్త్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గత నెల 28 నుంచి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సోమవారం ముగింపు వేడుకలను నిర్వహించి, వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. అనంతరం జిల్లా స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించనున్నారు. అలాగే ప్రాథమిక స్థాయిలో విజేతలైన విద్యార్థులకు ప్రత్యేకంగా డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. పిల్లల్లో పరిశోధన దృక్పథంపై, ఆవిష్కరణలపై ఆసక్తిని పెంపొందించడమే కార్యక్రమ ముఖ్యోద్దేశమని సుబ్రహ్మణ్యం తెలిపారు. లోవ దేవస్థానానికి తరలివచ్చిన భక్తులు రూ.3.65 లక్షల ఆదాయం తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో సందడి నెలకొంది. ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చిన 18వేల మంది భక్తులు క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకున్నట్టు ఇన్చార్జ్ డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయా ల ద్వారా రూ.1,39,305, పూజా టికెట్లకు రూ. 86,900, కేశఖండన శాలకు రూ.13,960, వాహ న పూజలకు రూ.3,890, వసతి గదులు, పొంగ లి షెడ్లు, కాటేజీల అద్దెలు రూ.43,756, విరాళా లు రూ.77,609 వెరసి మొత్తం రూ.3,65,420 ఆదాయం సమకూరినట్టు ఈఓ వివరించారు. -
సుంకరపాలెం ఘటనపై కేసు నమోదు
ఎకై ్సజ్ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు తాళ్లరేవు: మద్యం తరలిస్తున్నారన్న అనుమానంతో ఇద్దరు యువకులను వెంబడించిన ఎకై ్సజ్ కానిస్టేబుల్ బి.ఆనందరాజుపై ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ ఏనుగుల చైతన్య మురళి సస్పెన్షన్ వేటు వేశారు. సుంకరపాలెం చెక్‌పోస్టు వద్ద శనివారం జరిగిన ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో కోట శ్రీరామ్ అనే విద్యార్థి మృతిచెందడంతో బాధ్యులపై చర్యలు చేపట్టాలని, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ సుంకరపాలెం, పరిసర గ్రామాలకు చెందిన అనేక మంది సుంకరపాలెం చెక్‌పోస్టును ముట్టడించి, ఆందోళన చేశారు. అర్థరాత్రి రెండు గంటల వరకు ఆందోళన కొనసాగింది. ఈ నేపథ్యంలో ఎకై ్సజ్ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. యువకులను ఎకై ్సజ్ కానిస్టేబుల్ ఆనందరాజు వెంబడించినట్లు నిర్థారణ కావడంతో, అతడిపై చర్య తీసుకుంటున్నట్టు డీసీ చైతన్యమురళి తెలిపారు. ఆయన వివరాల మేరకు, ఐడియల్ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న నలుగురు విద్యార్థులు రెండు బైకులపై యానాం వచ్చి, తిరిగి వెళుతుండగా ఎకై ్సజ్ సిబ్బంది చెక్ పోస్టు వద్ద తనిఖీ కోసం ఆపారు. ముందుగా బైక్‌పై వెళుతున్న యువకులు ఒత్తిడికి గురై, బైక్‌పై వేగంగా వెళుతూ లారీని దాటే క్రమంలో వెనుకనున్న విద్యార్థి కిందకు దూకగా, శ్రీరామ్ అదుపుతప్పి లారీ కిందపడి మృతిచెందాడు. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ కానిస్టేబుల్ ఆనందరాజును సస్పెన్షన్‌కు ఆదేశించామని, ఇన్ఫార్మర్పై చర్యలకు నిర్దేశించినట్టు డీసీ తెలిపారు. కాగా, మృతదేహానికి ఆదివారం శవ పంచనామా నిర్వహించినట్టు కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపారు. -
జనసేన నేత వీరంగం.. వైద్యురాలిపై దౌర్జన్యం
సాక్షి, కాకినాడ జిల్లా: అధికారం చేతిలో ఉంది కదా అని కూటమి నేతలు బరితెగిస్తున్నారు. జనసేన నాయకుడు రెచ్చిపోయాడు. ప్రత్తిపాడు సిహెచ్సీ వైద్య సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేయాలంటూ వేలు చూపిస్తూ వైద్యులకు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు వార్నింగ్ ఇచ్చాడు.రోగులకు వైద్యం చేస్తున్న సమయంలో డాక్టర్ శ్వేతకు తమ్మయ్యబాబు ఫోన్ చేశారు. ఆయనెవరో తెలియదని.. వేరొకరికి వైద్యం చేస్తున్నానని వైద్యురాలు చెప్పారు. ఫోన్లో మాట్లాడడానికి వైద్యురాలు నిరాకరించడంతో తమ్మయ్య బాబు.. నేరుగా ఆసుపత్రికి వచ్చి డాక్టర్ శ్వేతతో పాటుగా అక్కడున్న వైద్య సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. జ్ఞానం ఉందా?.. నోర్మూయ్ అంటూ వైదురాలిపై అరుపులతో వీరంగం సృష్టించారు. -
చిరకాలం గుర్తుండేలా..
పెళ్లి విషయంలో తల్లిదండ్రులు, పిల్లల అభిరుచులు మారుతున్నాయి. జీవితంలో పెళ్లి అరుదైన ఘట్టం. చిరకాలం గుర్తుండిపోయేలా ఘనంగా చేసుకుంటున్నారు. అధునాతన సెట్టింగులు, కొత్త పోకడలకు అనుగుణంగా పెళ్లి మంటపాలను సిద్ధం చేయాలని కోరుతున్నారు. – రాకుర్తి ప్రసాద్, సత్యనారాయణ గార్డెన్స్ యజమాని, అమలాపురం అభిరుచికి తగినట్టుగా.. పెళ్లిళ్లు చేసే తీరు మారిపోతోంది. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేదు. పెళ్లి తంతులో ప్రతి సందర్భం అద్భుతంగా గుర్తుండిపోవాలని కోరుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో పెళ్లిళ్ల సెట్టింగులను చూసి, తమకు కూడా అలాగే చేయాలని కోరుతున్నారు. పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడిని చేయడం, ఊరేగింపు, సంగీత్, బరాత్.. ఇలా అన్ని కొత్తదనం, ఆర్భాటం కనిపించాలని కోరుకుంటున్నారు. – కొవ్వూరి ధర్మారెడ్డి, ఎస్వీ ఈవెంట్స్, రావులపాలెం -
ఇంటర్ పరీక్షలకు 787 మంది గైర్హాజరు
అమలాపురం టౌన్: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు శనివారం జనరల్, ఒకేషనల్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ రెండు పరీక్షలకు జిల్లాలో 787 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం గణితం, జంతు శాస్త్రం, చరిత్ర పరీక్షలకు 10,911 మంది హాజరు కావాల్సి ఉండగా 10,519 మంది రాశారు. ఒకేషనల్ పరీక్షలకు 2,734 మంది హాజరు కావాల్సి ఉండగా 2,339 మంది హాజరయ్యారు. డీఐఈవో వనుము సోమశేఖరరావు ముమ్మిడివరం ప్రభుత్వ, తార, రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లోని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లాలోని 40 పరీక్షా కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్లు, జిల్లా పరీక్షల కమిటీ ప్రతినిధులు పర్యవేక్షిస్తూ తనిఖీలు నిర్వహించారు. బాల బాలాజీకి రూ.3.36 లక్షల ఆదాయం మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి ఆలయానికి శనివారం భారీగా భక్తులు తరలి వచ్చారు. తెల్లవారు జామున సుప్రభాత సేవ, తొలి హారతితో దర్శనాలు ప్రారంభమయ్యాయి. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామి వారికి తల నీలాలు, ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. లక్ష్మీ నారాయణ హోమాన్ని దర్శించుకున్నారు. గోశాలను సందర్శించి, పూజలు చేశారు. వివిధ సేవల ద్వారా రూ.3,36,594 ఆదాయం వచ్చింది. స్వామి వారిని ఐదు వేల మంది భక్తులు దర్శించుకున్నారు. మూడు వేల మంది అన్న ప్రసాదం స్వీకరించారు. లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.65,670 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ఎం.సత్యనారాయణరాజు తెలిపారు. నిత్య అన్నదానం ట్రస్టుకు భక్తులు రూ.77,414 విరాళాలుగా అందించారు. సువర్ణ ఇండియా బాధితులకు న్యాయం చేయాలి అమలాపురం రూరల్: అమరావతి హైకోర్టు గతేడాది నవంబర్‌లో ఇచ్చిన తీర్పు ప్రకారం సువర్ణ ఇండియా డిపాజిట్ బాధితులకు న్యాయం చేయాలని బాధితుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కాశీ వెంకట్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం త్రిరత్న బుద్ధ విహార్ హాలులో సువర్ణ ఇండియా బాధితుల సమావేశం జరిగింది. వెంకట్రావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల పరిధిలో 24 బ్రాంచీల ద్వారా రూ.12 కోట్ల డిపాజిట్ల సేకరించి 2014లో ముంచేశారన్నారు. అమలాపురం ప్రధాన కేంద్రంగా 2011లో సువర్ణ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని ప్రారంభించి డిపాజిట్లు సేకరించారన్నారు. 2016లో కంపెనీకి చెందిన ఆస్తులు, డైరెక్టర్ల పేరు మీద ఉన్న ఆస్తులను అప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధికారులు సీజ్ చేశారని తెలిపారు. సీజ్ చేసిన ఆస్తులకు సంబంధించి రాజమహేంద్రవరంలోని న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే కంపెనీ ఎండీ బూసి వెంకట నాగవేణు, ఇతర డైరెక్టర్లు కలిసి ఏపీలో పలుచోట్ల సీజ్ చేసిన ఆస్తులను విక్రయించారన్నారు. 2024లో హైకోర్టు తీర్పు ప్రకారం కంపెనీకి చెందిన భూములను నగదు రూపంలో డిపాజిట్ దారులకు చెల్లించాలన్నారు. సమావేశంలో డిపాజిట్‌దారులు పాల్గొన్నారు. -
అన్ని రంగాల్లో మహిళల విజయబావుటా
అమలాపురం రూరల్: మహిళలు అన్ని రంగాల్లో విజయబావుటా ఎగురవేస్తున్నారని ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్ అన్నారు. అమలాపురం మండలం భట్నవిల్లిలోని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటి వద్ద శనివారం వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వంగా గిరిజా కుమారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్సీలు సూర్యనారాయణరావు, ఇజ్రాయిల్ మాట్లాడుతూ మహిళా సాధికారత అనేది నాణ్యమైన జీవితానికి దారితీసే అన్ని రంగాల నిర్ణయాత్మక ప్రక్రియలో మహిళల భాగస్వామ్య శక్తిని సూచిస్తుందన్నారు. జిల్లా అధ్యక్షురాలు గిరిజా కుమారి మాట్లాడుతూ ప్రతి రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, వారి హక్కులను తెలిపేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించామన్నారు. ఎమ్మెల్సీలు కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వైఎస్సార్ సీపీ మహిళా నాయకులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, ఎంపీపీలు కుడిపూడి భాగ్యలక్ష్మి, దంగేటి అచ్యుత జానకి, జెడ్పీటీసీలు పందిరి శ్రీహరి రామ్‌గోపాల్, గెడ్డం సంపద రావు, పట్టణ అధ్యక్షుడు సంసాని బుల్లినాని, ఉప్పలగుప్తం మండల అధ్యక్షుడు బద్రి బాబ్జీ, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరు వెంకటేశ్వరరావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, హ్యాండి క్రాఫ్ట్ మాజీ డైరెక్టర్ ఉండ్రు బేబీ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారతతోనే అభివృద్ధి అమలాపురం రూరల్: మహిళా సాధికారతతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర వ్యవసాయశాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్‌లో శనివారం జిల్లా స్థాయి మహిళా దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నారన్నారు. ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణ రావు మాట్లాడుతూ ప్రతి పురుషుడి విజయం వెనుక మహిళలు కీలక పాత్ర పోషించారనడం అతిశయోక్తి లేదన్నారు. కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, జేసీ టి.నిషాంతి, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఆర్డీవో కె.మాధవి పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు సూర్యనారాయణరావు, ఇజ్రాయిల్ ఘనంగా మహిళా దినోత్సవం -
యాన్యువల్ డేకి వెళ్లాలి డాడి లే..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోకవరం మండలం కొత్తపల్లి శివారున పెట్రోల్‌బంక్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో(road accident) ఉపాధ్యాయుడు(Govt School Teacher) మృతి చెందగా అటవీశాఖ ఉద్యోగిని తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవరం మండలం దొలిపాడుకు చెందిన వలాల చిన్నబ్బాయి (52) జగ్గంపేట మండలం గోవిందపురం జిల్లా పరిషత్ హైసూ్కల్లో 2023 నుంచి సాంఘిక శాస్తం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. కొంత కాలంగా గోకవరంలో నివాసం ఉంటూ బైక్‌పై వెళ్లి వస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆయన వెళ్తుండగా అటవీశాఖలో గార్డుగా పని చేస్తున్న రెడ్డి విజయదుర్గ లిఫ్ట్ అడగడంతో ఆమెను ఎక్కించుకుని మళ్లీ ముందుకు సాగిపోయారు. కొత్తపల్లి శివారున పెట్రోల్ బంకు సమీపంలో వారు ప్రయాణిస్తున్న బైక్‌ను జగ్గంపేట వైపు నుంచి ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నబ్బాయి అక్కడికక్కడే మృతి చెందగా విజయదుర్గ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న గోకవరం ఎస్సై పవన్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. పిల్లలను పాఠశాల వద్ద దించి.. చిన్నబ్బాయికి భార్య పార్వతి, తొమ్మిదో తరగతి చదువుతున్న మేఘవర్షిణి, ఎనిమిదో తరగతి చదువుతున్న స్నేహిత ఉన్నారు. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న వారిని పాఠశాల వద్ద దించి, అనంతరం ఇంటి నుంచి బయలుదేరి కొద్దిసేపటికే ఆయన మృత్యువాతపడ్డారు. యాన్యువల్ డేకి వెళ్లాలి డాడి లే.. ఆ చిన్నారులు చదువుతున్న పాఠశాల వార్షికోత్సవం శనివారం జరగనుంది. తన పిల్లలు ఆ కార్యక్రమానికి రావాలి డాడీ అని పిలవగా నేను రాను అన్న ఆయన మాటే నిజమైందని చిన్నబ్బాయి భార్య రోదించారు. యాన్యువల్డేకి వెళ్లాలి లే డాడీ అంటూ చిన్నారులు పోలీసులు వద్ద రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పోలీస్‌స్టేషన్ వద్ద నుంచి ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించడానికి వాహనాన్ని నిలపగా భార్య, కుమార్తెలు మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. ఈ క్రమంలో వారిని ఎవరూ వారించలేకపోయారు. హెల్మెట్ ఉన్నా.. బైక్ నడిపే సమయంలో చిన్నబ్బాయి హెల్మెట్ కచ్చితంగా వాడతారు. ప్రమాదం జరిగినపుడు కూడా హెల్మెట్ ధరించినప్పటికీ కారు ఢీకొట్టిన వేగానికి హెల్మెట్ ముక్కలైపోయి తలకు గట్టి దెబ్బ తగలడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఉపాధ్యాయుడి మృతి విషయం తెలుసుకున్న సహచర ఉపాధ్యాయులు భారీగా అక్కడకు చేరుకుని విచారం వ్యక్తం చేశారు. -
గేట్లు.. పాట్లు
త్వరలోనే కొత్త గేట్లు నీటి సంఘాల ఎన్నికలు తదితర కారణాలతో పంపా రిజర్వాయర్ కొత్త గేట్ల ఏర్పాటుకు టెండర్లు పిలవడం ఆలస్యమైంది. గత నెలలోనే టెండర్లు పిలిచాం. వాటిని ఖరారు చేసి పనులు ప్రారంభించాల్సి ఉంది. మార్చి నెలాఖరులోగా ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. అందువలన త్వరలోనే పనులు ప్రారంభించి కొత్త గేట్లు ఏర్పాటు చేస్తాం. – జి.శేషగిరిరావు, ఇరిగేషన్ ఈఈఅన్నవరం: పంపా రిజర్వాయర్ వద్ద కొత్త గేట్ల ఏర్పాటుకు రూ.3.36 కోట్లు మంజూరై దాదాపు మూడు నెలలైనా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. నెలాఖరులోగా ఖర్చు చేయకపోతే ఈ నిధులు మురిగిపోయే అవకాశం ఉండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇదీ పరిస్థితి పంపా జలాశయం కింద తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో 12,500 ఎకరాల ఆయకట్టు ఉంది. ఒకసారి ఆయకట్టు మొత్తం సాగు జరగాలంటే 1.5 టీఎంసీల నీరు అవసరం. పంపా గర్భంలో నుంచి పుష్కర కాలువ నిర్మాణం జరగక ముందు ఈ రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 105 అడుగులుండేది. 105 ఆ స్థాయికి నీటిమట్టం చేరితే రిజర్వాయర్‌లో 0.5 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. అయితే పుష్కర కాలువను రిజర్వాయర్‌కు 103 అడుగుల ఎత్తులో నిర్మించారు. దీంతో పంపా రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టాన్ని 103 అడుగులకు పరిమితం చేశారు. దీంతో దీని నీటినిల్వ సామర్థ్యం 0.44 టీఎంసీలకు పరిమితమైపోయింది. ఇప్పుడు పంపా బ్యారేజీ గేట్లు బలహీనంగా ఉండటంతో నీటిమట్టాన్ని 99 అడుగులకే పరిమితం చేశారు. దీంతో రిజర్వాయర్‌లో 0.26 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయడం సాధ్యమవుతోంది. ఫలితంగా ఖరీఫ్ పంట కాలంలో రిజర్వాయర్ నాలుగుసార్లు నిండితే తప్ప ఆయకట్టు రైతులు గట్టెక్కలేని దుస్థితి ఏర్పడింది. తాత్కాలిక మరమ్మతులతో సరి అన్నవరం వద్ద పంపా రిజర్వాయర్ నిర్మించి దాదాపు 56 ఏళ్లు పూర్తయింది. అప్పట్లో ఏర్పాటు చేసిన ఐదు గేట్లకు సమస్యలు ఎదురైనపుడు ఎప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతులు మాత్రమే చేస్తున్నారు. రిజర్వాయర్ గేట్లను అప్పటి సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం అర్ధచంద్రాకారంగా అంటే సినిమా స్కోప్ తెర మాదిరిగా నిర్మించారు. ఈ గేట్లు కాస్త వంపుగా ఉండటంతో భారీ వర్షాలు, తుపాన్ల సమయంలో రిజర్వాయర్ నుంచి మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేయడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గేట్లు ఎత్తడం, దించడం సమస్యగా మారింది. ఈ పరిస్థితుల్లో పాత గేట్లు మార్చాలనే ప్రతిపాదన సుమారు పదేళ్లుగా ఉంది. వైఎస్సార్ సీపీ హయాంలోనే మంజూరు రైతుల ఇబ్బందిని గుర్తించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పంపా బ్యాకేజీకి పాత గేట్ల స్థానంలో కొత్తవి అమర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు 2023 జూలై నెలలో ఇరిగేషన్ అధికారులు బ్యారేజీ గేట్లు పరిశీలించారు. వీటిని మార్చి కొత్త గేట్లు అమర్చాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీనికి నాటి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2023 డిసెంబర్లోనే కొత్త గేట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తరువాత ఎన్నికల కోడ్ కారణంగా నిధులు విడుదల కాలేదు. ఆ తరువాత ఏర్పడిన కూటమి ప్రభుత్వం మళ్లీ ఈ ప్రతిపాదనలను పరిశీలించి కేంద్రానికి పంపించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఏడాది డిసెంబర్లో విపత్తు రక్షణ నిధుల నుంచి రూ.3.36 కోట్లు విడుదల చేశాయి. మరోవైపు గేట్ల పనులకు ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో రిజర్వాయర్‌లోని నీటిని దిగువకు వదిలేశారు. దీంతో జలాశయం అడుగంటి కనిపిస్తోంది. మళ్లీ వర్షాలు కురిస్తే తప్ప నిండే పరిస్థితి కనిపించడం లేదు. ఫ పంపా రిజర్వాయర్ కొత్త గేట్లకు ఖరారవని టెండర్లు ఫ నీరుగారుతున్న రూ.3.36 కోట్లు ఫ నెలాఖరులోగా ఖర్చు చేయకపోతే మురిగిపోయే అవకాశం -
కృషితో నాస్తి దుర్భిక్షం
ఫ ఇంటికి ఆర్థిక తోడ్పాటు ఫ తక్కువ పెట్టుబడితో అధికాదాయం ఫ ప్రకృతి సేద్యంలో నారీ విప్లవం ఫ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మామిడికుదురు/కొత్తపేట: నారీమణులకు సాధ్యం కాని రంగం అంటూ ఏదీలేదు. ప్రతి రంగంలోను వారు రాణిస్తూ ఔత్సాహికులకు అన్నింటా ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలో ప్రత్యేకంగా ప్రకృతి వ్యవసాయ విధానంలో 28 మంది మహిళా రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో కొబ్బరి, అరటిలో అంతర పంటలు పండిస్తూ అధిక దిగుబడులు, అదనపు ఆదాయం ఆర్జిస్తున్నారు. ప్రకృతి సేద్యంలోనూ పురుషులతో సమానంగా రాణిస్తూ అధికారుల ప్రశంసలందుకుంటున్నారు. ఒకే సమయంలో పలు పంటలు పండిస్తూ ప్రతిభను చాటుకుంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మామిడికుదురు, కొత్తపేట ప్రాంతాల మహిళల విజయగాధలను పరిశీలిద్దాం... స్వశక్తిపై ఆధారపడాలన్నదే లక్ష్యం రాజోలు మండలం కడలి గ్రామానికి చెందిన కుసుమ పద్మావతి బీఏ, బీఈడీ, అగ్రికల్చర్ జనరల్ పూర్తి చేశారు. ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా నలుగురికి ఆదర్శంగా నిలవాలన్న సంకల్పంతో ఆమె వ్యవసాయ రంగం వైపు అడుగులు వేశారు. రసాయనిక ఎరువులు, క్రిమి సంహారకాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించారు. 2019 నుంచి ఆమె ప్రకృతి సాగు చేస్తున్నారు. తమ పూర్వీకులు కూడా వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ దిశగా ముందడుగు వేశారు. ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని.. రసాయనిక, క్రిమి సంహారక ఎరువులతో వ్యవసా యం చేయడం వల్ల అనేక దుష్పరిణాలు ఏర్పడుతున్నాయి. దీని వల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. దీని నుంచి విముక్తి పొందాలన్న ఉద్దేశంతో ఈదరాడ గ్రామా నికి చెందిన చెల్లుబోయిన రాధ ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపించారు. ఆమె బీఏ చదివారు. అధికారుల సూచనలు, సలహాలతో 2021 నుంచి నిరంతరాయంగా కూరగాయల పంటలతో పాటు వరి, కొబ్బరిలో అంతర పంటలు సాగు చేస్తున్నారు. పశువుల పెంట, మూత్రంతో జీవామృతం తయారు చేస్తూ సాగులో వినియోగిస్తున్నారు. క్రిముల నివారణకు వేపాకుతో తయారు చేసిన నీమాస్త్రం వినియోగించి విజయవంతంగా పంటలను సాగు చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో.. ఈదరాడ గ్రామానికి చెందిన కుడుపూడి జానకి ఇంటర్ బైపీసీ చదువుకున్నారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, కూరగాయలు వినియోగంతో ఆమె కుటుంబ సభ్యులకు షుగర్ వ్యాధి అదుపులోకి వచ్చింది. దీంతో పాటు వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరిగింది. దీంతో ఆమె ప్రకృతి వ్యవసాయం పట్ల ఆసక్తి చూపించారు. 2018 నుంచి ఆమె ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. దీని ద్వారా కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తున్నారు. తక్కవ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిస్తూ ఆమె ముందుకు వెళ్తున్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని ఈ ప్రాంతంలో పలువురు మహిళా మణులు ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండిస్తున్నారు. అంతర పంటలతో అదనపు ఆదాయం కొత్తపేట మండలం బిళ్లకుర్రు శివారు కముజువారిపాలేనికి చెందిన కముజు అరుణకుమారి ప్రకృతి వ్యవసాయం చేస్తూనే, ఫార్మర్ సైంటిస్టుగా పనిచేస్తూ మహిళలను ఈ రంగంలో చైతన్యవంతులను చేస్తున్నారు. తమ 1.50 ఎకరాల విస్తీర్ణం (కౌలు భూమి) లో ప్రధాన పంటగా అరటి పంట సాగు చేస్తూ దానిలో పంట తీసి పంట వేసే పద్ధతిలో అంతర పంటలుగా చెట్టు చిక్కుడు, వంగ, బీర, ఆనబ, పచ్చిమిర్చి, బొబ్బర్లు, బంతి, నిమ్మ, జామ, సపోట, మునగ పంటలు సాగు చేస్తున్నారు. ఘన, ద్రవ పదార్థాలు, జీవామృతం, నీరు నిమిత్తం నెలకు రూ.2 వేలు ఖర్చు పోను అరటి కాకుండా అంతర పంటల ద్వారా రూ.10 నుంచి రూ.12 వేల అదనపు ఆదాయం లభిస్తోంది. ఇలా కొత్తపేట మండలం వానపల్లి ప్రకృతి వ్యవసాయం యూనిట్ పరిధిలో 10 మంది మహిళా రైతులు, సిబ్బంది లబ్ధి పొందుతున్నారు. ఈదరాడలో ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్న నారీమణులుఆర్థిక అభివృద్ధి సాధనే లక్ష్యం మహిళల ద్వారా ఆర్థిక అభివృద్ధి గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయాధారంగా కుటుంబాలు ఆర్థిక అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయ రంగంలో మహిళలను ప్రోత్సహిస్తున్నాయని జిల్లా పాయింట్ పర్సన్ (డీపీపీ) సీహెచ్ సంధ్య తెలిపారు. ఫార్మర్ సైంటిస్ట్లకు హెడ్‌గా పనిచేస్తున్న ఆమె జిల్లాలో ప్రకృతి వ్యవసాయం, ప్రభుత్వాల ప్రోత్సాహం, మహిళల ఆర్థిక ప్రగతి గురించి వివరించారు. జిల్లాలో 22 ప్రకృతి వ్యవసాయ యూనిట్లు (గ్రామాలు) ఏర్పాటుచేసి అతి తక్కువ పెట్టుబడితో ప్రకృతి వ్యవసాయం చేయిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ రంగంలో పొదుపు దగ్గర నుంచి మహిళలను చైతన్యవంతం చేయడంలో భాగంగా ముందుగా కిచెన్ గార్డెన్స్ అబివృద్ధి చేయడం ద్వారా ఒక్కో కుటుంబానికి కూరగాయలు, ఆకు కూరలు పండించి, నెలకు కనీసం రూ.2 వేలు ఆదా చేసుకునేలా ప్రోత్సహించాం. 20 సెంట్ల స్థలం ఉంటే నెలకు రూ.25 వేలు ఆదాయం ఆర్జిస్తున్నారు. కోర్సు నేర్చుకుంటూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మహిళలకు రూ.10 వేలు స్టైఫండ్ ఇస్తున్నాం. ఇలా జిల్లాలో 28 మంది మహిళా రైతులు ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్నారని విరించారు. -
న్యాయ సేవాధికార కమిటీకి మధ్యవర్తుల నియామకం
అమలాపురం టౌన్: అమలాపురం న్యాయ సేవాధికార కమిటీకి మధ్యవర్తులుగా ముగ్గురిని నియమిస్తూ ఆ కమిటీ చైర్మన్, రెండో అదనపు కోర్టు జిల్లా న్యాయమూర్తి వి.నరేష్ ఉత్తర్వులు జారీ చేశారు. విశ్రాంత స్పెషల్ మెజిస్ట్రేట్ ఎం.రామభద్రరావు, సీనియర్ న్యాయవాది, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ వీకేఎస్ భాస్కరశాస్త్రి, మరో సీనియర్ న్యాయవాది కేవీవీ శ్రీనివాసరావులు మధ్యవర్తులుగా నియమితులయ్యారు. జిల్లా ప్రధాన మండల న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు గతంలో ఈ ముగ్గురూ రాజమహేంద్రవరం జిల్లా ప్రధాన కోర్టులో 40 గంటల పాటు మధ్యవర్తిత్వంపై శిక్షణ పొందారు. ఇప్పడు ఈ ముగ్గురిని మధ్యవర్తులుగా నియమించారు. పీఎం ఇంటర్న్‌షిప్ కోసం రిజిస్ట్రేషన్లు అమలాపురం రూరల్: భవన, ఇతర నిర్మాణ, అసంఘటిత రంగ కార్మికులకు చెందిన 21–24 మధ్య వయస్సు గల పిల్లలకు పీఎం ఇంటర్న్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాలని కోనసీమ జిల్లా ఉప కార్మిక కమిషనర్ టి.నాగలక్ష్మి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భవన నిర్మాణ, ఆసంఘటిత రంగ కార్మికుల పిల్లలు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అభ్యర్థులు ఐటీఐ నుంచి సర్టిఫికెట్, పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ నుంచి డిప్లొమా, బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ, బీ ఫార్మ్ వంటి డిగ్రీ కలిగి ఉండాలన్నారు. ఆన్లైన్, దూర విద్య ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. మార్చి 12 వరకు గడువు ఉందని తెలిపారు. డీఎస్సీ ఆన్లైన్ శిక్షణకు దరఖాస్తులు అమలాపురం రూరల్: అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని బీసీ, ఈబీసీ కులాలకు చెందిన అభ్యర్థులకు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో డీఎస్సీ–2024 పరీక్షలకు ఉచిత ఆన్లైన్ శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం అమలాపురంలో కోనసీమ జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసు కోవాలని సంబంధిత అధికారి పి. సత్య రమేష్ కోరారు. అభ్యర్థులు ఏపీ టెట్‌లో అర్హత సాధించి ఉండాలన్నారు. ఏపీ టెట్‌లో అత్యధిక మార్కులు పొందిన అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ బయోడేటా 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీఈడీ, టీటీసీ, టెట్ మార్కుల జాబితా, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్, బ్యాంకు పాస్ పుస్తకం, రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోలతో ఈ నెల పదో తేదీ నుంచి అమలాపురంలో కోనసీమ జిల్లా బీసీ సంక్షేమ సాధికరత అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలకు 9398973754, 9440403629 సెల్ నంబర్లను సంప్రదించాలన్నారు. ‘ఇంటర్’ మూల్యాంకనం ప్రారంభం● అప్రమత్తంగా నిర్వహించాలని సిబ్బందికి డీఐఈవో సూచన అమలాపురం టౌన్: అమలాపురంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరాల సంస్కృతం జవాబు పత్రాలను దిద్దే ఏర్పాట్లు జరిగాయి. ప్రధమ సంవత్సరం 5,540, ద్వితీయ సంవత్సరం 4,929 జవాబు పత్రాలను ఇక్కడ దిద్దాల్సి ఉందని డీఐఈవో వనుము సోమశేఖరరావు తెలిపారు. అంతకు ముందు నిర్వహించిన సమావేశంలో మూల్యాంకనాన్ని అత్యంత అప్రమత్తంగా నిర్వహించాలని ఆయన సూచించారు. ఈనెల 17వ తేదీ నుంచి ఇంగ్లిషు, తెలుగు, హిందీ, గణితం, పౌర శాస్త్రం, 22 నుంచి రసాయనశాస్త్రం, చరిత్ర, 26 నుంచి వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం, వాణిజ్య శాస్త్రం జవాబు పత్రాల మూల్యాంకనాలు మొదలవుతాయని చెప్పారు. 543 మంది విద్యార్ధులు పరీక్షలకు గైర్హాజరు జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం జనరల్, ఒకేషనల్ పరీక్షలకు 543 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,379 మంది విద్యార్థులకు 10 వేల మంది విద్యార్ధులు హాజరుకాగా 379 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షలలో 2456 మంది విద్యార్థులకు 2,292 మంది హాజరు కాగా, 164 మంది గైర్హాజరయ్యారని డీఐఈవో తెలిపారు. పామర్రులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, రామచంద్రపురం ప్రభుత్వ, మోడరన్, వికాస్ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటైన పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీలు చేశారు. -
24, 25 తేదీల్లో బ్యాంకుల సమ్మె
అమలాపురం టౌన్: ఈనెల 24, 25 తేదీల్లో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో జిల్లాలో వాణిజ్య బ్యాంక్‌లు సమ్మె చేపడుతున్నట్లు ఈ యూనియన్ కోనసీమ చైర్మన్ పీవీవీ సత్యనారాయణ తెలిపారు. ఈ సమ్మెకు సమాయత్తమవుతున్న కోనసీమలోని దాదాపు 300 మంది బ్యాంక్ అధికారులు, ఉద్యోగులు స్థానిక యూనియన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచి వద్దకు శుక్రవారం సాయంత్రం చేరుకుని తమ డిమాండ్ల సాధనకు నినాదాలు చేశారు. సమ్మె సన్నద్ధతపై యూనియన్ కోనసీమ చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ కొత్త సిబ్బందిని అన్ని కేడర్లలో నియమించాలని, తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, 5 రోజుల పని దినాలను అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ కన్వీనర్ గణేష్‌కుమార్, సెక్రటరీ బి.శ్రీనివాస్, ఎల్డీఎం వర్మ, వివిధ బ్యాంకుల అధికారులు బి.వెంకటేశ్వరరావు, రమేష్, సురేష్‌కుమార్, కె.ఈశ్వరరావు తదితరులు ప్రసంగించారు. -
మహిళా సమానత్వంతో సమాజ వికాసం
ఫ మహిళా దినోత్సవంలో జేసీ నిశాంతి ఫ అవగాహన ర్యాలీ, మానవహారం అమలాపురం టౌన్: సమాజ నిర్మాణంలో సగ భాగంగా ఉన్న మహిళలు అన్నింటిలోనూ సమానత్వంతో ముందుకు సాగుతూ సమాజ వికాసానికి మూలమవుతున్నారని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురంలో శుక్రవారం జరిగిన వేడుకల్లో ఆమె మాట్లాడారు. తొలుత కలెక్టరేట్ నుంచి నల్లవంతెన వరకూ మహిళా చైతన్యంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. మనమంతా దేవతగా కొలిచే సీ్త్ర మూర్తిపై జరుగుతున్న అత్యాచార సంస్కృతికి చరమ గీతం పాడేలా ప్రతి ఒక్కరూ ప్రతిన పూనాలని పిలుపునిచ్చారు. విద్య, వైద్య, వ్యాపార, రాజకీయ, ఉద్యోగ, అంతరిక్షం, సాంకేతక విప్లవం తదితర రంగాల్లో మహిళలు దూసుకువెళ్లుతున్న పరిణామాలే మహిళా సాధికార ప్రగతికి మెట్లు అవుతున్నాయన్నారు. కలెక్టరేట్ నుంచి దాదాపు కిలోమీటరు మేర మెయిన్ రోడ్డుపై మహిళలు, పోలీసులతో ర్యాలీ నల్లవంతెన వరకూ సాగింది. నల్ల వంతెన వద్దకు ర్యాలీ చేరుకున్నాక అక్కడ మానవ హారం నిర్వహించి మహిళలకు అన్ని విధాల రక్షణగా ఉంటామని అందరూ ప్రతిజ్ఞ చేశారు. ర్యాలీలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంతకుమారి, రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్, అమలాపురం పట్టణ, రూరల్ సీఐలు పి.వీరబాబు, డి.ప్రశాంత్‌కుమార్, పట్టణ ఎస్సై కిషోర్‌బాబుతో పాటు మహిళా పోలీసులు, డీఆర్డీఏ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)ల మహిళా సిబ్బంది పాల్గొన్నారు. మహిళా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అమలాపురం రూరల్: స్థానిక సత్యనారాయణ గార్డెన్స్‌లో శనివారం జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఏర్పాట్లకు సర్వం సిద్ధం చేసినట్లు జేసీ టి.నిశాంతి తెలిపారు. శుక్రవారం అక్కడి ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సాస్కృతిక కార్యక్రమాలు, సత్కారాలు, అవగాహన కార్యక్రమాలు, వివిధ శాఖలకు సంబంధించి ఉత్తమంగా నిలిచిన సంక్షేమ పథకాల స్టాల్స్, పథకాల నిర్వహణపై లబ్ధిదారుల అభిప్రాయ సేకరణ ఉంటాయని ఆమె తెలిపారు. అదే విధంగా వేదిక సౌకర్యాలు, భద్రతా చర్యలు, ఇతర ప్రాధాన్య ఏర్పాట్లను సమీక్షించి, వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మార్పులను చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారత దిశగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకొని జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ డాక్టర్ శివశంకర్ ప్రసాద్, ఐసీడీఎస్ పీడీ శాంత్ కుమారి, డీపీఎం విజయకుమార్, మెప్మా, పరిశ్రమల కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో విదేశీ వ్యవహారాల హెల్ప్ డెస్క్
కలెక్టర్ మహేష్ కుమార్ సాక్షి, అమలాపురం: ఉపాధి, ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇతర దేశాలకు వెళ్లాలనుకునే వారి కోసం కలెక్టర్‌లో విదేశీ వ్యవహారాల హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. వారం రోజులలో నలుగురు సిబ్బందితో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించేలే ఈ డెస్క్ పని ప్రారంభిస్తుందని తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం కో ఆర్డినేషన్ సెక్షన్ పోస్టల్ సూపరింటెండెంట్లతో ఆయన సమావేశం నిర్వహించి డెస్క్ విధివిధానాలను వివరించారు. ఏజెంట్ల, సంప్రదింపుదారుల ద్వారా విదేశాలకు వెళ్లి మోసపోకుండా ఈ విభాగం తోడ్పడుతుందన్నారు. హెల్ప్ డెస్క్‌ను ఆశ్రయిస్తే 18 దేశాలలో విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పనకు మార్గ నిర్దేశం చేస్తూ ప్రభుత్వపరంగా పాస్‌పోర్ట్ వీసా అనుమతులకు సహకరిస్తుందన్నారు. అక్కడి ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలు, భౌగోళిక స్థితిగతులు, అత్యవసర సందర్భంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ముందుగా కరపత్రాన్ని ముద్రించి ఇవ్వనున్నట్టు కలెక్టర్ తెలిపారు. సంబంధిత సమాచారంతో జాగృతం చేస్తూ హెల్ప్ డెస్క్ తపాలా శాఖకు సిఫారసు చేస్తుందన్నారు. జిల్లా ప్రజలు విదేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు సామాజిక ప్రసార సాధనాలలో వచ్చే వదంతులను నమ్మవద్దని స్పష్టం చేశారు. సందేహాలుంటే 08856–236 388 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జేసీ టి.నిశాంతి, డీఆర్వో బిఎల్ఎన్ రాజకుమారి, సమన్వయకర్త జి.రమేష్, పోస్టల్ సూపరింటెండెంట్ ఆర్.నవీన్ కుమార్, పోస్టల్ అధికారి అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారుల 2కె రన్ కాకినాడ క్రైం: మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు. శుక్రవారం నాగమల్లితోట నుంచి ప్రారంభమైన ఈ రన్ భానుగుడి కూడలి వరకు సాగింది. అక్కడ మానవహారాన్ని ఏ ర్పాటు చేసి మహిళల భద్రత, రక్షణపై నినాదాలు చేశా రు. కార్యక్రమంలో పోలీస్‌శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పిచ్చిగీతలంటూ హేళన
1982లో ఇంటర్మీడియెట్ అయిన తరువాత అటవీ ప్రాంతానికి వెళ్లాను. అక్కడి వారిని చూసి, వారి కోసం ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను. ఉద్యోగం వచ్చిన తరువాత వాచకంగా ఉన్న భాషకు లిపిని అందించాలనే సంకల్పించాను. శూన్యం నుంచి ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని ఎదగడానికి ప్రయత్నించాను. నా ప్రయత్నాన్ని కొందరు ఉన్నతాధికారులు, నాయకులు ప్రోత్సహించకపోగా ఏమిటీ పిచ్చి గీతలు, ఎవరిని ఉద్ధరించాలని అంటూ అవమానించారు. ఆ సమయంలో నిజంగా నరకం చూశాను. చాలా బాధ వేసేది. వాటన్నిటినీ భరిస్తూనే నా ప్రయత్నాన్ని వదలలేదు. మనిషి మనుగడ అభివృద్ధి వైపు అడుగులు వేయాలంటే అక్షరం అవసరం. దానిని గుర్తించి, నా ప్రయత్నాన్ని కొనసాగించాను. అటవీ ప్రాంతంలో తిరుగుతూ.. -
మృత్యు శకటం
పల్లిపాలెంలో విషాద ఛాయలుకాజులూరు: ఏలూరు బస్సు ప్రమాదంలో జుత్తుగ భవాని దుర్మరణం పాలవడంతో ఆమె స్వగ్రామం కాజులూరు మండలం పల్లిపాలెం శివారు కళావారిపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన జుత్తుగ అప్పారావు, భవాని దంపతులకు ఇద్దరు కుమారులు. భార్యాభర్తలిద్దరూ జీవనోపాధి నిమిత్తం కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. అప్పారావు ఒక అపార్టుమెంట్లో వాచ్‌మన్‌గా చేస్తూండగా భవాని పలువురి ఇళ్లలో పని చేస్తోంది. పెద్ద కుమారుడు ఇంజినీరింగ్, చిన్న కుమారుడు ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. బంధువుల ఇంట్లో వివాహ వేడుకకు భవాని కాకినాడ బయలుదేరింది. ఈ క్రమంలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె మరణ వార్త తెలియగానే గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. హైదరాబాద్‌లో ఉంటున్నప్పటికీ భవాని తరచూ గ్రామానికి వచ్చి వెళ్లేదని, వచ్చిన ప్రతిసారీ అందరితో కలివిడిగా మసులుతూండటంతో అసలు ఆమె ఎప్పుడూ గ్రామంలోనే ఉన్నట్టుండేదని స్థానికులు చెబుతున్నారు. బస్సును పక్కకు తీస్తున్న క్రేన్ ● ఏలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ● లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు ● వేకువజామున ఘటన ● ఘటనా స్థలంలో ముగ్గురు, చికిత్స పొందుతూ మరొకరు మృతి ● 21 మందికి గాయాలు ● మృతులు, క్షతగాత్రుల్లో అత్యధికులు ఉమ్మడి జిల్లా వాసులు ఏలూరు రూరల్: తెల్లవారకముందే వారి జీవితాలు తెల్లారిపోయాయి. కొద్ది గంటల్లోనే గమ్య స్థానాలకు చేరుకోవాల్సిన వారిని మృత్యువు కబళించింది. జిల్లా కేంద్రం ఏలూరులోని చొదిమెళ్ల వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై రత్నాస్ హోటల్ సమీపాన ఆగి ఉన్న ఓ లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సంఘటన స్థలంలోనే ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రుల్లో అత్యధికులు కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన వారు. ప్రమాదం అనంతరం బస్సు నుంచి కారిన రక్తధారలు చూసిన వారు భయభ్రాంతులకు గురయ్యారు. సంఘటన స్థలంలో క్షతగాత్రుల హాహాకారాలు మిన్నంటాయి. ప్రమాదం జరిగిందిలా.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న సిమెంట్ లారీ మరమ్మతులతో నిలిచిపోయింది. గురువారం వేకువజామున 5 గంటల సమయంలో రమణ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తోంది. బస్సును అతి వేగంగా నడుపుతున్న డ్రైవర్ మధు.. పొగమంచు కమ్ముకోవడంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న సిమెంట్ లారీని గుర్తించలేకపోయాడు. చివరి నిమిషంలో గమనించి, తప్పించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో లారీ వెనుక భాగాన్ని బస్సు ఢీకొంది. ఆ వేగానికి కండక్టర్ వైపు భాగాన్ని బస్సు చీల్చుకుంటూ వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో బస్సులో నిద్రిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. ఘోర ప్రమాదంతో ఉలిక్కిపడిన స్థానికులు, ఇతర వాహనాల డ్రైవర్లు హుటాహుటిన వచ్చి ప్రయాణికులను రక్షించేందుకు ప్రయత్నించారు. హైవే పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. గాయపడిన వారిని 108 అంబులెన్సులో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాదంతో ఘటనా స్థలం రక్తసిక్తం కాగా.. పరిసరాల్లో బస్సులోని విడి భాగాలు చెల్లాచెదురుగా పడి, ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. శకలాల మధ్య ఇరుక్కుపోయి.. నుజ్జునుజ్జయిన బస్సులో కండక్టర్ సీటు వైపు కూర్చున్న మహిళలు మట్టపర్తి భవాని, జుత్తుగ భవాని (38), బొందు భీమేశ్వరరావు చిక్కుకుపోయి విలవిలలాడారు. బస్సు డ్రైవర్ మధు సైతం స్టీరింగ్ వద్ద ఇరుక్కుపోయాడు. పోలీసులు క్రేన్‌తో బస్సును లేపి పక్కకు చేర్చారు. బస్సులో చిక్కుకుపోయిన ఈ నలుగురినీ ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మట్టపర్తి భవాని, జుత్తుగ భవాని, భీమేశ్వరరావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డ్రైవర్ మధుకు అత్యవసర చికిత్స అందించారు. నాలుగు గంటల పాటు మృత్యువుతో పోరాడిన అనంతరం అతడు మృతి చెందాడు. మధు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. క్షత్రగాత్రులు వీరే.. ఈ ప్రమాదంలో కాకినాడకు చెందిన కోలా సురేఖ, కోలా రాజబాబు, కోలా లిఖిత, వనమనీడి ఆదిలక్ష్మి, పి.అక్కమ్మ, కోట వేణి, రాజమహేంద్రవరానికి చెందిన పి.హేమలత, మాచర్ల సుజాత, పాలకొల్లుకు చెందిన మండపాక శ్రీదేవి, మండపాక శశిరేఖతో పాటు మద్దాల కీర్తి, మాచర్ల సుజాత, మండపాక బాలాజీ, మండపాక హరిణి, ఆర్నాలకంటి శ్రీలక్ష్మి, పువ్వుల శ్యామ్‌కుమార్, శీలం ప్రకాష్, ఎం.ప్రతాప్, గోణజ విజయకుమార్, రామిశెట్టి సోమ సత్యనారాయణ, టి.రవికుమార్, జి.మణికంఠ (క్లీనర్) ఉన్నారు. క్షతగాత్రులకు అధికారులు చికిత్స చేయించి గమ్యస్థానాలకు పంపించారు. శోకసంద్రంలో భవానీ కుటుంబం జగ్గంపేట: ఈ ప్రమాదంలో మృతురాలు మట్టపర్తి భవానీ స్వస్థలం కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఆమె తండ్రి రాజు కౌలు రైతు. ఆమెకు ఓ తమ్ముడు ఉన్నాడు. కష్టపడి చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన భవాని.. వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా స్వగ్రామానికి వస్తోంది. ఈ క్రమంలో ఏలూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృత్యువాత పడింది. తమ గారాలపట్టి అయిన భవాని.. తమ కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉంటుందనుకుంటే.. దేవుడు తమపై దయ చూపలేదంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భవానీ మృతితో ఆమె కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. -
విపత్కర పరిస్థితిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి
అమలాపురం టౌన్: ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలని విద్యార్థినులకు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు సూచించారు. పోలీసు విధులు, ఆయుధాలు, మహిళా పోలీసు స్టేషన్ పనితీరు, ఎఫ్ఐఆర్ నమోదు, దర్యాప్తు, విచారణలపై విద్యార్థినులు, మహిళలు అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినులకు తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. పోలీసు విధుల పట్ల అవగాహన కల్పించారు. సమస్యల్లో చిక్కుకున్న మహిళలు, యువతులు మహిళా పోలీస్ స్టేషన్ సేవలను సద్వినియోగం చేసుకునే విధానాన్ని వివరించారు. పోలీసు విధులపై జిల్లా ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్ కూడా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచి సీఐ బి.రాజశేఖర్, డీసీఆర్బీ సీఐ వి.శ్రీనివాస్, అమలాపురం పట్టణ సీఐ కిషోర్‌బాబు పాల్గొన్నారు. మహిళల సమగ్రాభివృద్ధికి కృషిఅమలాపురం రూరల్: ప్రభుత్వ పథకాల ద్వారా మహిళల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. డీఆర్డీఏ, మెప్మా, వైద్య, ఆరోగ్యం, సీ్త్ర, శిశు సంక్షేమం, పరిశ్రమల శాఖల అధికారులతో కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సత్యనారాయణ గార్డెన్స్‌లో నిర్వహించే జిల్లా స్థాయి మహిళా దినోత్సవాన్ని ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని సూచించారు. మహిళా సాధికారతను ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యాన సూర్యఘర్, డ్వాక్రా ఉత్పత్తులు, విశ్వకర్మ యోజన, పోషకాహారం వంటి ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. స్వీయ రక్షణపై మహిళలకు అవగాహన కల్పించడంపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ శివశంకర్ ప్రసాద్, జిల్లా పరిశ్రమల కేంద్రం ఏడీ శివరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కూటమి సిండికేట్‌కే గీత కార్మికుల మద్యం షాపులు అమలాపురం రూరల్: జిల్లాలో కల్లు గీత కార్మికులకు కేటాయించిన మద్యం షాపులను కూటమి సిండికేట్లే దక్కించుకున్నారు. జిల్లాలో మొత్తం 13 మద్యం షాపులను గీత కార్మికులకు కేటాయించారు. అమలాపురం మున్సిపాలిటీ, అమలాపురం మండలం, ఆలమూరు, అయినవిల్లి, ఐ.పోలవరం, కె.గంగవరం, కపిలేశ్వరపురం, కొత్తపేట, మండపేట మున్సిపాలిటీ, ముమ్మిడివరం రూరల్, పి.గన్నవరం, రామచంద్రపురం మున్సిపాలిటీ, రామచంద్రపురం రూరల్ ప్రాంతాల్లోని ఈ షాపుల్లో ఒకటి గౌడ కులస్తులకు, 12 శెట్టిబలిజలకు కేటాయించి, టెండర్లు పిలిచారు. గీత కార్మికుల ముసుగులో కూటమి సిండికేట్లు ఒక్కో దుకాణానికి 5 నుంచి 15 వరకూ టెండర్లు వేశారు. మొత్తం 261 టెండర్లు దాఖలయ్యాయి. వీటికి కలెక్టరేట్లో జేసీ నిషాంతి, డీఆర్ఓ రాజకుమారి, అమలాపురం ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎస్కేడీవీ ప్రసాద్ పర్యవేక్షణలో గురువారం లక్కీ డ్రా తీసి, షాపులు కేటాయించారు. గ్రహణం మొర్రికి నేడు ఉచిత వైద్య శిబిరం ముమ్మిడివరం: ఏపీ సమగ్ర శిక్ష, హైదరాబాద్ బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యాన గ్రహణం మొర్రి, గ్రహణ శూలతో బాధ పడుతున్న చిన్నారులకు శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్ష అదనపు పథక సంచాలకుడు షేక్ సలీం బాషా గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిర్వహించే ఈ శిబిరంలో చిన్నారులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయనున్నారు. శిబిరానికి వచ్చే చిన్నారులకు ఉచిత రవాణా ఖర్చులు ఇస్తారు. జిల్లాలోని చిన్నారుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అదనపు సమాచారానికి జిల్లా సహిత విద్య కో ఆర్డినేటర్ మర్రెడ్డి వెంకట సత్యనారాయణను 99636 54283 మొబైల్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
బతుకు పూలబాట కాదు..
● నా దారిలో ఎన్నో ముళ్లు గుచ్చుకున్నాయి ● ఎవరిని ఉద్ధరించాలని అంటూ హేళన చేశారు ● అయినా వెనుకడుగు వేయలేదు ● అలా 19 గిరిజన భాషలకు లిపి రూపొందించా.. ● ‘నన్నయ’ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ పోలీసు ఇన్ఫార్మర్ అనుకునే వారు మొదట్లో గిరిజనులు నాతో మాట్లాడేవారు కాదు. బయటి నుంచి వచ్చానని, నన్నో పోలీసు ఇన్ఫార్మర్గా భావించి భయపడేవారు. రకరకాలుగా ఇబ్బంది పెట్టేవారు. వారు చెప్పేది అర్థమయ్యేది కాదు. ఆ సమయంలోనే ముందుగా వారి భాష నేర్చుకోవాలని అనుకున్నాను. అలా వారి భాష నేర్చుకుని వారిలో ఒకరిగా కలిసిపోయాను. ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలనే తపనతో పని చేశాను. ‘ఈ పని నేనే చేయగలనని అనుకుంటే ఏదైనా సాధించగలరు. నేను చేయగలనా? అనుకుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు’. నా ద్వారా ఆ గిరిజనులకు భాషాపరంగా మేలు జరగాలనే తలంపుతోనే ముందుకు వెళ్లాను. ఆ సమయంలో ప్రొఫెసర్ సింథియా వెస్లీతో పాటు చాలా మంది విదేశీయుల నుంచి ప్రోత్సాహం నన్ను మరింత కార్యోన్ముఖురాలిని చేసింది. ఆల్ఫా, బీటా ఏవిధంగా రాయాలో వారి నుంచి నేర్చుకున్నాను. అంతరించి పోతున్న బగత, గదబ, కొలామి, కొండదొర వంటి 19 గిరిజన భాషలకు లిపిని రూపొందించడంలో విజయం సాధించాను. తద్వారా 2022లో అప్పటి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారం అందుకున్నాను.వ్యక్తిగతం.. గుంటూరు జిల్లా సీతానగరంలో 1964 సెప్టెంబరు 2న జన్మించాను. నాన్న సత్తుపాటి ప్రసాదరావుది రైల్వేలో ఉద్యోగం కావడంతో విజయవాడ, కోల్‌కతా, మిరాజ్(మహారాష్ట్ర)లో చదువుకున్నాను. విజయవాడలో పదో తరగతి, కేబీఎన్ కళాశాలలో ఇంటర్, మాంటిస్సోరి మహిళా కళాశాలలో డిగ్రీ (1982–84) చదివాను. తరువాత విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ(ఏయూ)లో ఎంఏ, తిరుపతి పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేశాను. అమ్మ వసుంధరాదేవి గృహిణి. అయినా పేపర్, పుస్తకాలు ఎక్కువగా చదివేది. నాకు ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. పెద్ద చెల్లెలు విజయవాడ, చిన్న చెల్లెలు కాకినాడ, తమ్ముడు రామచంద్రపురంలో ఉద్యోగాలు చేస్తున్నారు. వృత్తిగతం.. 1987లో పద్మావతి మహిళా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బోధనా వృత్తి చేపట్టి, 14 ఏళ్లు పని చేశాను. అక్కడి నుంచి విశాఖపట్నం ఏయూకు వచ్చాను. పాత సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవడంతో 2002లో అక్కడ ప్రొఫెసర్ చేరాను. ఆవిధంగా ప్రొఫెసర్‌గా ఆంధ్రప్రదేశ్‌లో 23 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించిన ఏకై క మహిళగా గుర్తింపు పొందాను. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 10 సెమినార్లు నిర్వహించి, 60 సెమినార్లలో పాల్గొన్నాను. నేను రాసిన 125 పరిశోధన వ్యాసాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రచురితమయ్యాయి. అలా.. గోదారి బిడ్డనయ్యా.. నా భర్త హరి వెంకట లక్ష్మణ్, మాది ప్రేమ వివాహం. మమ్మల్ని ఏయూనే కలిపింది. నేను ఇంగ్లిష్, ఆయన సోషియాలజీలో పీజీ చేస్తూండగా మా మనసులు కలిశాయి. మొదట పెద్దలు అంగీకరించకపోయినా, తరువాత ఓకే అన్నారు. ఆవిధంగా ఈ ప్రాంతానికి చెందిన అల్లు ఎరకయ్య కోడలిగా గోదావరి ప్రాంత బిడ్డనయ్యాను. మా అమ్మాయిని కూడా ఈ ప్రాంతంలోనే ఇచ్చాం. గోదావరి వాసే. నా ఎదుగుదలకు ఆయన దివిటీ ప్రస్తుతం నేనీ ఉన్నత స్థితిలో ఉండటానికి ప్రధాన కారణం నా భర్త హరి వెంకట లక్ష్మణ్ అని గర్వంగా చెబుతా. ఆయన ఓ కొవ్వొత్తిలా కరిగిపోతూ నా ఎదుగుదలకు దివిటీలా నిలిచారు. గిరిజన భాషలకు లిపిని రూపొందించే క్రమంలో ఎంతో బిజీగా ఉండేదాన్ని, ఆ సమయంలో మాకున్న ఒకే ఒక్క పాప హర్షిత ఆలనా పాలనా ఆయనే చూసుకుంటూ, కార్యోన్ముఖురాలిని కావాలని ప్రోత్సహించారు. హర్షిత ప్రస్తుతం మెకానికల్ ఇంజినీర్‌గా వర్క్ ఫ్రమ్ హోం చేస్తోంది. ఒక బాబు ఉన్నాడు. పుట్టింటి వారు ఉన్నత స్థాయిలో ఉన్నవారే.. అమ్మ, నాన్న వైపు వారంతా ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్–1 ఉద్యోగాలు చేసిన వారే. నలుగురు మావయ్యలలో ఇద్దరు ఐపీఎస్, ఒకరు ఐఏఎస్. చిన్నమ్మలిద్దరూ వైద్యులు. మా తాతయ్య వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు, ధనవంతుడు కూడా. ఆ సమయంలో ధనాన్ని బానల్లో దాచుకునేవారంటారు. ఒక విద్యార్థి నమ్మకంగా ఉంటూనే కొంత ధనాన్ని దోచుకున్నాడట. నాకు 6 నెలల వయసులోనే తాతయ్య చనిపోయారు. నా ఎదుగుదల ఎక్కువగా కోల్‌కతాలోనే. ఆ తరువాత మహారాష్ట్ర, విజయవాడల్లో పెరిగాను. అందుకనే 23 భాషలు మాట్లాడతాను. అన్నయ్య ఆశయం నెరవేరింది మా అన్నయ్య (కజిన్) ఐజీగా పని చేస్తూ చనిపోయా రు. కొన్నేళ్ల క్రితం ఆయన నాకు ఒక చీర బహుమతిగా ఇస్తూ, ‘నువ్వు కచ్చితంగా వైస్ చాన్సలర్ అవుతావు. అప్పుడు కట్టుకో’ అన్నాడు. ఆయన నమ్మకం నిజమైంది. అందుకే ఆ చీరను నన్నయ వీసీగా బాధ్యతలు తీసుకునే సమయంలో కట్టుకున్నాను. స్టూవర్టుపురం అంటూ ఇంకా వదిలిపెట్టరా? తాతగారి ఊరి పేరు స్టూవర్టుపురం అని చెప్పడమే గానీ, నేను ఏనాడూ అక్కడ లేను. ఊహ తెలిసిన తరువాత స్టూవర్టుపురం అంటే దొంగల ఊరు అంటారని కాస్త భయపడ్డాను. కానీ అక్కడి వారు చాలా మంచివారు. నిజానికి ఏ ఊళ్లో దొంగలు లేరు చెప్పండి? ‘పూర్వం చదువుకోనందు వల్లనే చాలా మంది దొంగలుగా తయారయ్యారు. కానీ నేటి కాలంలో చదువుకున్న వాళ్లు కూడా దొంగలుగా మారుతున్నారు, దీన్ని ఏమనాలి?’ అని మా నాన్నమ్మ అంటూండేది. ఆచార్య ప్రసన్నశ్రీ ఎలా ఎదిగిందనేది వదిలేసి, స్టూవర్టుపురానికి చెందిన.. అంటూ ఆ గ్రామం మూలాలున్న వారిని ఇంకా వదిలిపెట్టరా? భగత గిరిజన భాషకు ఆచార్య ప్రసన్నశ్రీ రూపొందించిన లిపి ‘జీవితం పూలబాట కాదు. దారిలో ఎన్నో ముళ్లు గుచ్చుకున్నాయి. ఏనాడూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ఎంచుకున్న లక్ష్యం వైపు అడుగులు వేశాను. ఆడ పిల్లలకు పెద్ద చదువులు ఎందుకనే సమాజం నుంచి.. ఆడపిల్లలు తలచుకుంటే దేనిలోనూ తీసిపోరనే నమ్మకంతో పయనించాను. ఉనికి కోల్పోతున్న 19 గిరిజన భాషలకు లిపి రూపొందించి.. ఆయా వర్గాలకు ఎంతో కొంత మేలు చేసేందుకు ప్రయత్నించాను. ఈ క్రమంలో కన్నవారితో పాటు కట్టుకున్న భర్త ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. గిరిజన భాషలకు లిపిని కూర్చే క్రమంలో ఒకసారి నాటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్‌ను కలిసే అవకాశం వచ్చింది. నా ప్రయత్నం గురించి తెలుసుకున్న ఆయన.. ‘నీ కాళ్లలో ఎన్ని ముళ్లు గుచ్చుకున్నాయ్ ప్రసన్నా’ అని అన్న మాటలు మరువలేను’ అన్నారు ‘నారీ శక్తి’ పురస్కార గ్రహీత.. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సత్తుపాటి ప్రసన్నశ్రీ. ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది, సమాజానికి అందించే నన్నయ వర్సిటీకి ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన ఈ తొలి గిరిజన మహిళ.. మార్చి 8– అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన జీవనపథంలోని వెలుగుచీకట్లను తనను కలసిన ‘సాక్షి’తో పంచుకున్నారు. – రాజానగరం