ఎవరో వస్తారని...ఏదో చేస్తారని ఎదురుచూస్తూ కూచుంటే జీవితం ముందుకు సాగదు. అందుబాటులో ఉన్న వనరులనే ఉపయోగించుకొని అడుగు ముందుకు వేయాలి. మన ప్రయత్నాలకు అదృష్టం కూడా కలిసి వస్తే..ఇంకేముంది విజయం మనముందు సాగిల పడుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టోరీ ఈ విషయాన్నే స్పష్టం చేస్తుంది.. ఒక మధ్య తరగతి జంట ఆలోచనా దృక్పథంలో వచ్చిన మార్పు గొప్ప విజయానికి నాంది పలికింది. ఎవరా జంట? ఏమా బిజినెస్ తెలుసుకుందాం.
నళిని ఉనగర్ అనే కంటెంట్ క్రియేటర్ 'ఎక్స్' వేదికగా తాను క్రమం తప్పకుండా సందర్శించే డ్రై-క్లీనింగ్ దుకాణం యజమానితో జరిగిన సంభాషణను వివరించారు. డ్రై క్లీనింగ్ వ్యాపారాన్ని భార్యాభర్తలిద్దరూ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. వీరికి తోడు మరో ఇద్దరు అదనపు ఉద్యోగులున్నారు. ఇండియాలో సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌తో సమానమైన నెలవారీ ఆదాయాన్ని పొందుతున్నారని ఉనగర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనికి వారికి ఖర్చులన్నీ పోను నెలవారీ లాభం రూ.2.37 లక్షల లాభం వస్తుంది. సగటున, వారు ప్రతి నెలా రూ. 2 లక్షలకు పైగా సంపాదిస్తారట.
Yesterday, I was talking with the dry cleaning shop owner near my house, where I regularly go. He and his wife both work together, and they have two helpers on salary. I was shocked when they said they earn around ₹2,00,000 per month, which is equal to a 10+ years experienced… pic.twitter.com/BjPddpb9Me
— Nalini Unagar (@NalinisKitchen) February 9, 2026
నెటిజన్ల స్పందన
హైదరాబాద్‌లోని ఇడ్లీ-దోస విక్రయించే అనేకమంది విజయగాథలను చూశాను. తన ఏరియాలో అలాంటి ఒక వ్యక్తి ఇంటి ఖరీదు కోటికిపైమాటేననీ, తాను గల్ఫ్‌లో దశాబ్దాలు కష్టపడినా అద్దె ఇల్లే. స్వంత వ్యాపారం చేయడం చాలా గ్రేట్ అని ఒకరు వ్యాఖ్యానించారు. వైట్-కాలర్ ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు అనే చట్రంలో ఇరుక్కుపోయాం. కానీ ఇలాంటి కథలు చిన్నదో పెద్దదో ఒక వ్యాపారాన్ని కలిగి ఉండటం నిజమైన సంతృప్తితోపాటు, కొన్నిసార్లు చాలా ఎక్కువ ప్రతిఫలదాయకం కూడా అని ఒకరు, ఇందులో ఆశ్చర్య పోవాల్సింది ఏముంది అనుకూలమైన వ్యాపార వాతావరణం ఉంటే చిన్న వ్యాపారమైనా, లాభాలు మెండు అని మరొకరు కామెంట్ చేశారు.
కాగా ఈ లెక్కలపై పెదవి విరిచిన వారు లేకపోలేదు. ‘‘నేను నా ఇంటి దగ్గర దుకాణం నడుపుతున్న నా డ్రై-క్లీనింగ్ భయ్యాతో కూడా మాట్లాడాను. అతను ఆ వైరల్ పోస్ట్ పూర్తిగా తప్పుదారి పట్టించేది అని చెప్పాడు. రూ. 2.37 లక్షల లాభం గురించి కలలు కనకండి. వాస్తవానికి, అన్ని ఖర్చుల పోనూ వాస్తవ లాభం నెలకు దాదాపు రూ. 60వేలు ఉంటుందని ఒక యూజర్ లెక్కలు చెప్పారు.
ఇదీ చదవండి: ప్రియురాలు రిజెక్ట్ చేసిందని..శపథం చేసి కొట్టాడు సక్సెస్!
వైట్ కాలర్ జాబ్స్ అని, మంచి ఆదాయం అని మన గొప్ప వాళ్లం అని మురిసిపోవాల్సిన అవసరం లేదు. కష్టపడే తత్వం, వ్యాపార మెళకువలు ఉంటే ఏ పనైనా గౌరవప్రదమే, లాభదాయకమే. భారీ ఆదాయం మాట ఎలా ఉన్నా.. ఉద్యోగ భయం. ఆందోళన, అధికార్ల వేధింపులు. శని, ఆదివారాలు కూడా లాప్‌టాప్ ముందు కూర్చోవాల్సిన అవసరం లేదు. ఏమంటారు..!


