ఘోరరోడ్డు ప్రమాదం గాల్లోకి ఎగిరిన బైక్.. ఏడుగురు మృతి | Serious road accident in Bengaluru | Sakshi
Sakshi News home page

ఘోరరోడ్డు ప్రమాదం గాల్లోకి ఎగిరిన బైక్.. ఏడుగురు మృతి

Feb 13 2026 1:41 PM | Updated on Feb 13 2026 3:02 PM

Serious road accident in Bengaluru

సాక్షి బెంగళూరు : బెంగళూరు రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు ఉదయం దొబ్బాస్‌పేట-హోస్కోట్ శాటిలైట్ టౌన్ రింగ్ రోడ్ పై అతి వేగంతో వస్తున్న SUV, లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

బెంగళూరు అర్బన్ జిల్లా హోస్కోట్ తాలూకాలోని ఎం సత్యవారా గ్రామ సమీపంలో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న రెండు  SUVలు, ఒక క్యాంటర్ ట్రక్ , మోటార్ సైకిల్ పరస్పరం ఢీకొన్నాయి. పోలీసుల వివరాల ప్రకారం ఒక కాలేజ్ కు చెందిన ఆరుగురు యువకులు మహేంద్రా SUVలో అతివేగంగా వస్తున్నారు. అతివేగంతో వాహనం నడుపుతూ తొలుత బైక్ ను ఢీకొట్టి అదే స్పీడుతో అనంతరం ట్రక్కును ఢీకొట్టారు. SUV ఢీకొట్టిన వేగానికి  బైకునడుపుతున్న వ్యక్తి గాలిలోకి ఎగిరిపడ్డాడు. అనంతరం అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం ఆ ట్రక్కు సైతం బోల్తా పడింది.అధిక వేగంతో ఢీకొట్టడంతో SUV  గుర్తుపట్టలేకుండా నుజ్జునుజ్జయ్యింది.

ఇదిలా ఉండగా వెనుక వస్తున్న మరో కారు వెనక వస్తున్న మరో కారు SUVని ఢీకొట్టింది. మెుత్తంగా ఈ ప్రమాద ఘటనల SUVలో ప్రయాణిస్తున్న ఆరుగురితో పాటు బైక్ పై పయణిస్తున్న వ్యక్తి  మెుత్తంగా ఏడుగురు మృతిచెందారు. గాయపడిన వారిని స్థానికంగా గల ఎంవీజే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతిచెందిన వారు ఒకే కాలేజీకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు. విపరీతమైన వేగంతో ప్రయాణించడమే రోడ్డు ప్రమాదానికి కారణమని అధికారులు పేర్కొన్నారు. . 

Advertisement
 
Advertisement
Advertisement