ఫుడ్ డెలివరీ విభాగంలోకి ఫ్లిప్‌కార్ట్! | After E-Commerce, Flipkart May Dig Into Food Delivery Business In India, It Becomes Challenge To Zomato And Swiggy | Sakshi
Sakshi News home page

ఫుడ్ డెలివరీ విభాగంలోకి ఫ్లిప్‌కార్ట్!

Feb 12 2026 9:10 PM | Updated on Feb 13 2026 10:58 AM

Flipkart May Dig Into Food Delivery Business

ఈ కామర్స్ విభాగంలో ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తున్న ఫ్లిప్‌కార్ట్.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలో అడుగుపెట్టనుంది. కంపెనీ ఎప్పటి నుంచి ఫుడ్ డెలివరీ స్టార్ట్ చేయనుంది?,.. ఈ రంగంలో జొమాటో & స్విగ్గీ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తుందా? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్ 2026 మే-జూన్ నాటికి బెంగళూరులో ప్రయోగాత్మకంగా డెలివరీలను ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తరువాత ఈ ఏడాది చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ఫుడ్ డెలివరీ ప్రారంభించనున్నట్లు సమాచారం.

వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్.. ఫుడ్ డెలివరీ ప్రారభించినట్లయితే.. ఇప్పుడు ఈ విభాగంలో అగ్రగామిగా ఉన్న జొమాటో & స్విగ్గీ వంటి వాటికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ విలువ 2025 ఆర్థిక సంవత్సరంలో 9 బిలియన్ డాలర్లు, కాగా ఇది 2030 నాటికి 25 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.

ఫుడ్ డెలివరీ చేయడానికి ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే టీమ్ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా రెండేళ్ల క్రితమే ఈ కంపెనీ ఓలా, పేటీఎం సంస్థలతో కలిసి ఓఎన్డీసీ ద్వారా ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టాలని యోచించింది. అయితే ఈ చర్చలు ముందుకు సాగలేదు. ఇప్పుడు మళ్లీ ఫుడ్ డెలివరీ విషయం తెరమీదికి వచ్చింది. కానీ దీనిపై ఫ్లిప్‌కార్ట్ అధికారిక ప్రకటన వెల్లడించలేదు.

ఫుడ్ డెలివరీ చేయడానికి చాలా కంపెనీలే పుట్టుకొచ్చాయి. కానీ జొమాటో,స్విగ్గీ మాదిరిగా పాపులర్ కాలేదు. ఇప్పుడు ఈ రంగంలో అడుగుపెట్టనున్న ఫ్లిప్‌కార్ట్ సక్సెస్ సాధిస్తుందా?, లేదా? అనేది త్వరలోనే తెలుస్తుంది. కాగా.. ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీ విభాగంలో అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపించగానే జొమాటో, స్విగ్గీ షేర్స్ తగ్గుముఖం పట్టాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement