వివాదంలో సీఎం హిమంత.. పాయింట్‌ బ్లాక్‌లో తుపాకీతో.. | Assam BJP Showing Himanta Biswa Sharma Point Blank Video Creates Controversy, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

వివాదంలో సీఎం హిమంత.. పాయింట్‌ బ్లాక్‌లో తుపాకీతో..

Feb 9 2026 7:32 AM | Updated on Feb 9 2026 9:32 AM

Assam BJP Showing Himanta point-blank Video

దిస్పూర్‌: అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వివాదంలో చిక్కుకున్నారు. ముస్లింలను తుపాకితో కాలుస్తున్నట్టుగా ఉన్న వీడియోను హిమంత షేర్‌ చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. దీనిపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో సోషల్‌ మీడియా నుంచి ఆ వీడియోను బీజేపీ తొలగించింది. ఈ విషయంలో సంచలనంగా మారింది.

వివరాల ‍ప్రకారం.. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్వ ఇప్పటికే ముస్లింల జనాభాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముస్లిం వర్గం ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా మరోసారి వివాద చర్యలకు దిగారు. అసోం బీజేపీ ట్విట్టర్‌ పేజీలో హిమంత.. ఓ వీడియోను షేర్‌ చేశారు. అందులో ముస్లింలను పాయింట్‌ బ్లాక్‌లో తుపాకితో కాలుస్తున్నట్టుగా ఉంది. దీంతో, ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు.. ఈ వీడియోపై ప్రతిపక్షాల, సోషల్‌ మీడియా నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో బీజేపీ దిద్దుబాటు చర్యలకు దిగింది. వెంటనే వీడియోను డిలీజ్‌ చేసింది. మరోవైపు.. ఈ చర్యతో ఆయనను అరెస్ట్‌ చేయాలని పలువురు విపక్ష నేతలు డిమాండ్‌ చేశారు.

అంతేకాకుండగా.. సీఎం శర్మ ఎయిర్‌ రైఫిల్‌ పట్టుకుని ఉన్న అసలు ఫుటేజ్‌ను ఏఐ ద్వారా సృష్టించిన వీడియోలకు కలిపారు. రైఫిల్‌ తూటాలు, పుర్రె టోపీలు, గడ్డాలు ఉన్న పురుషుల చిత్రాలను తాకుతున్నట్టు వీడియోలో కన్పించింది. కనికరం లేదు, మీరు పాకిస్థాన్‌కు ఎందుకు వెళ్లలేదు? వంటి అస్సామీ టెక్స్‌ మెసేజ్‌లు కూడా ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement