రూ.20 లంచం కేసులో 30 ఏళ్లు జైలు శిక్ష..! చివరికి.. | Gujarat Man spent 30 years in jail for accepting bribe of Rs 20 | Sakshi
Sakshi News home page

రూ.20 లంచం కేసులో 30 ఏళ్లు జైలు శిక్ష..! చివరికి..

Feb 8 2026 11:53 AM | Updated on Feb 8 2026 1:03 PM

 Gujarat Man spent 30 years in jail for accepting bribe of Rs 20

కొన్ని తలరాతలు దేవుడి అత్యంత నాటకీయం రాస్తాడని అంటుంటారు పెద్దలు. అబ్బాం ఇదేం చిత్రం అనేలా జీవితాన్ని ముగించేస్తాడు. అలాంటి కథ ఈ వ్యక్తిది. ఓ నిజాయితీపరుడు..ఏళ్ల తరబడి చేయని తప్పుకి జైలు శిక్ష అనుభవించిన కథ ఇది. పోనీ అదేమంత పెద్ద అవినీతి కేసు.. అంటే అదీ కాదు. కానీ అన్నేళ్లు ఆశతో తాను నిర్దోషిని అని నిరూపించేందుకు చేసిన ప్రయత్నం ఎవ్వరినైనా కదలిస్తుంది. అతడు నిలువెత్తు ఆత్మవిశ్వాసానికి, ఆశావాదానికి ప్రతీక. ఈ కథ చిన్న చిన్న కష్టాలకు హైరాన పడేవాళ్లకు ఓ స్ఫూర్తి. అలాగే ఆశావాదంగా బతకడం ఎలాగో నేర్పిస్తుంది కూడా.

ఆ వ్యక్తి కథ హాలీవుడ్‌ మూవీ ‘ది షాషాంక్ రిడెంప్షన్’ని తలపించే గాథ. అందులో ఓ నిర్దోషి ఎలా అయితే చేయని తప్పుకు జైలు శిక్ష అనుభవించాడో  అలానే గుజరాత్‌కు చెందిన బాబూభాయ్ ప్రజాపతి చాలాకాలంపాటు శిక్షను అనుభవించాడు. మొత్తం జీవితం అంతా జైలులోనే గడిపాడు ప్రజాపతి. ఇంతకీ అతడిపై మోపబడిన నేరం ఏంటంటే..రూ. 20ల లంచం కేసులో ఏకంగా 30 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. సింపుల్‌గా చెప్పాలంటే 1994 నాటి హాలీవుడ్‌ చిత్రం లాంటిది అతడి కథ.  

అసలేం జరిగిందంటే..1996లో పోలీస్‌ కానిస్టేబుల్‌ బాబూభాయ​ ప్రజాపతి అహ్మదాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు రూ. 20ల లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.  అవినీతి నిరోధక చట్టం కింద ఈ ఆరోపణలు చేశారు. 1997లో సెషన్స్‌ కోర్టులో ఆయనపై చార్జిషీట్‌ దాఖలు చేశారు. 2002లో అభియోగాలు మోపారు. 2003లో సాక్షుల విచారణ ప్రారంభమైంది. 2004లో సెషన్స్ కోర్టు ప్రజాపతికి నాలుగు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 3,000/- జరిమానా విధించింది. ప్రజాపతి సెషన్స్ కోర్టు నిర్ణయాన్ని గుజరాత్ హైకోర్టులో సవాలు చేశారు. ఆ తర్వాత, ఆయన అప్పీల్ 22 ఏళ్ల పాటు పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఆయన నిర్దోషి కోర్టు తీర్పు ఇవ్వడం విశేషం. 

అంతేగాదు హైకోర్టు ఈ కేసులో సాక్షుల వాంగ్మూలాల్లో తీవ్రమైన వైరుధ్యాలు ఉన్నాయని, అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొంది. ఇక ప్రజాపతి తరపున వాదించిన న్యాయవాది నితిన్ గాంధీ, ఈ కేసు మొత్తం అనుమానంతో చేసిన ఆరోపణలే తప్ప వాస్తవం లేదని కోర్టుకి నివేదించారు. కాగా, హైకోర్టు  ఎప్పుడైతే ప్రజాపతిని నిర్దోషిగా పేర్కొందే..తతక్షణమే ఆయన భావోద్వేగంగా విడుదలైనందుకు ఆనందంగా ఉంది, ఇక ఇప్పుడు హాయిగా చనిపోయినా పర్లేదని అన్నారు. 

ఆ తర్వాత ఇంటికి వెళ్లారు. అయితే న్యాయవాది గాంధీ ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోమని ప్రజాపతికి సూచించారు. ఆ మరుసటి రోజు ఆ విషయమై ఆయనకు ఫోన్‌ చేయగా, గుండెపోటుతో మరణించినట్లు కుటుంబసభ్యులు చెప్పారని న్యాయవాది గాందీ తెలిపారు. ఇన్నేళ్లు తన నిర్దోషిత్వం నిరూపించుకోవాడానికి పోరాడిని విధానం అసామాన్యమైనది. 

చివరికీ..తన నిజాయితీ నిరూపించుకుని మరీ కన్నుమూశాడు. అదీకూడా ఆయన నోటి నుంచి వెలువడినట్లుగానే జరిపోవడం బాధకరం. ఇన్నేళ్లు కోర్టులు చుట్టూ తిరుగుతూ పోరాడాడు..కనీసం కోన్నాళ్లు బతికి ఉన్నా బాగుండేదే అని అతడి కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు ఆవేదనగా అన్నారు. 

(చదవండి: ఆ గాయం జీవితాన్ని మార్చి..స్ఫూర్తిగా నిలిపింది..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement