Jail
-
4 లీటర్ల పెట్రోలు దాచాడని... 21 రోజుల జైలు, జరిమానా!
కొలంబో: పశ్చిమాసియా కల్లోలం పుణ్యమా అని పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ ఇప్పుడు బంగారం కంటే ప్రియంగా మారాయి. ఈ నేపథ్యంలో కేవలం 4 లీటర్ల పెట్రోలును ఇంట్లో దాచిన పాపానికి ఓ వ్యక్తి ఏకంగా కటకటాలపాలు కావాల్సి వచ్చింది! ఈ వింత ఉదంతం శ్రీలంకలో చోటుచేసుకుంది. ఉత్తర శ్రీలంకలోని నికవెరతియా ప్రాంతానికి చెందిన లసంత కుమార బాలసూర్య (48) ఇంట్లో సోదాల్లో 4 లీటర్ల పెట్రోల్ దొరికింది. దాంతో పోలీసులు మనవాడిని అరెస్టు చేసి బోనెక్కించారు. తల్లిదండ్రుల శ్రాద్ధకర్మ నిమిత్తం ఇంటి పరిసరాల్లోని చెత్తను కాల్చేందుకు ఆ పెట్రోలు తెచ్చుకున్నానని మొత్తుకున్నా లాభం లేకపోయింది.అతనికి 21 రోజుల జైలు శిక్ష, రూ.1,500 జరిమానా విధిస్తూ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన వెంటనే ఇంధన అక్రమ నిల్వలపై లంక కఠిన నిషేధం విధించింది. కనుక, దాచింది నాలుగు లీటర్లే అయినా నేరం నేరమే పొమ్మంటూ చట్టం ఇలా తన పని తాను చేసుకుపోయింది! పౌరుల పెట్రోల్, డీజిల్ వాడకంపై లంక ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. వాటి అమలుకు మార్చి 15 నుంచి క్యూఆర్ ఆధారిత విధానం తెచ్చింది. దాని ప్రకారం కార్లకు వారానికి 15 లీటర్లు, బస్సులకు 60 లీటర్లు మాత్రమే అనుమతిస్తారు. -
ఎట్టకేలకు వాంగ్‌చుక్ విడుదల
లేహ్/న్యూఢిల్లీ/జోద్పూర్: లద్దాఖ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని, ఆ ప్రాంతాన్ని రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ పరిధిలో చేర్చాలని ఉద్యమించి చివరకు జైలుపాలైన పర్యావరణ ఉద్యమకారుడు, సామాజికవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఎట్టకేలకు స్వేచ్ఛా వాయువులు పీల్చారు. గత ఆరునెలలుగా కారాగారానికే పరిమితమైన వాంగ్చుక్పై కొనసాగుతున్న నిర్బంధాన్ని తక్షణం రద్దుచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక ప్రకటన విడుదలచేసింది. తక్షణం ఆయనను విడుదలచేస్తున్నట్లు వెల్లడించింది. వెనువెంటనే ఆయనను జోధ్‌పూర్ కేంద్ర కారాగారం నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు విడుదలచేశారు. భర్త విడుదల కోసం కొంతకాలంగా న్యాయస్థానాల్లో పోరాడుతున్న గీతాంజలి ఆంగ్మో జోధ్‌పూర్ కేంద్ర కారాగారానికి వచ్చి ఆయనను వెంట తీసుకెళ్లారు.వాంగ్చుక్ను అరెస్ట్‌ను సవాల్‌చేస్తూ భార్య వేసి న పిటిషన్ మార్చి 17వ తేదీన సుప్రీంకోర్టులో తదుపరి విచారణకు రాబోతున్న వేళ కేంద్రం ఆయనను విడుదలచేయడం గమనార్హం. ‘‘తాజా పరిస్థితులు, లద్దాఖ్‌లో శాంతిస్థాపనే ధ్యేయంగా వాంగ్‌చుక్ నిర్బంధాన్ని రద్దుచేయాలని నిర్ణయించాం. లద్దాఖ్‌లో శాంతి, సుస్థిరత, పరస్పర విశ్వాసం పాదుగొల్పడమే మా లక్ష్యం. రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్ వంటి అంశాల్లో అన్ని భాగస్వామ్య పక్షాలతో అర్థవంతమైన చర్యల కోసం హైపవర్ కమిటీని ఏర్పాటుచేశాం. ఎన్ఏసీ చట్టం ద్వారా సంక్రమించిన అధికారాలతో ఆయనను తక్షణం వదిలేస్తున్నాం’’అని కేంద్రం శనివారం విడుదలచేసిన ప్రకటనలో పేర్కొంది.లద్దాఖ్‌కు రాష్ట్ర ప్రతిపత్తి, ఆరో షెడ్యూల్లో చేర్చడం సహా పలు డిమాండ్ల సాధన కోసం 59 ఏళ్ల వాంగ్‌చుక్ సారథ్యంలో యువత చేపట్టిన ఉద్యమం ఆనాడు లేహ్ పరిధిలో హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. ఉద్యమకారులతోపాటు 22 మంది పోలీసులు సహా ఆనాడు 90 మంది గాయపడ్డారు. చైనాతో సరిహద్దు పంచుకుంటున్న లద్దాఖ్‌లో ఉద్యమం లేవదీసి అత్యంత సున్నితమైన సరిహద్దు భద్రతా అంశాన్ని ఆయన ప్రమాదంలో పడేశారంటూ కఠినమైన జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద గత ఏడాది సెపె్టంబర్ 26వ తేదీన ఆయనను లద్దాఖ్ పాలనాయంత్రాంగం అదుపులోకి తీసుకుంది. భద్రతా కారణాలతో ఆయనను తర్వాత జోధ్‌పూర్ జైలుకు మార్చిన విషయం తెల్సిందే. మిగతా వారినీ విడుదలచేయండి వాంగ్‌చుక్ విడుదలను కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు స్వాగతించాయి. వాంగ్‌చుక్‌తోపాటు ఉద్యమించి జైలుపాలైన తమ తోటి వారిని తక్షణం విడుదలచేయాలని ఉద్యమకారుల నుంచి డిమాండ్లు ఊపందుకున్నాయి. ‘‘సోనమ్ రాక మాకు ఆనందమే. కానీ ఉద్యమం వేళ జైలుపాలైన ఉద్యమకారులనూ విడుదలచేయాలి. వాళ్లపై మోపిన అక్రమ కేసులను ఎత్తేయాలి. ఉద్యమం చేయడమనేది రాజ్యాంగబద్ధ హక్కు. మా రాష్ట్ర హోదా డిమాండ్‌ను మోదీ సర్కార్ నెరవేర్చాల్సిందే’’అని లద్దాఖ్ లోక్‌సభ సభ్యుడు మొహమ్మద్ హనీఫా డిమాండ్‌చేశారు.‘‘వాంగ్‌చుక్ విడుదల లద్దాఖ్ ప్రజల విజయం. లద్దాఖ్ వాసులపై మోపిన జాతీయవ్యతిరేక ముద్ర తప్పు అని వాంగ్‌చుక్ విడుదలతో తేలిపోయింది’’అని ది లేహ్ అపెక్స్ బాడీ(ఎల్ఏబీ) సహ చైర్మన్ చెరింగ్ డోర్జే అన్నారు. ‘‘దిల్దాన్ నామ్గియాల్, స్మాన్లా డోర్జీలనూ విడుదలచేయాలి. ఉద్యమం ఆగదు’’అని కార్గిల్ ప్రాంత రాజకీయనేత, కార్గిల్ డెమొక్రటిక్ అలయన్స్(కేడీఏ) సభ్యుడు సజ్జద్ కార్గిలీ అన్నారు. ‘‘లద్దాఖ్ భద్రత, సుస్థిరతలో జాతీయవాది వాంగ్‌చుక్ పాత్ర అత్యంత కీలకమైంది’’అని అతని లాయర్, కాంగ్రెస్ నేత వివేక్ తన్ఖా వ్యాఖ్యానించారు. వాంగ్‌చుక్ విడుదలను జమ్మూకశీ్మర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. హింసను ఆపేయాలి: ఎల్జీ ‘‘లద్దాఖ్ ప్రాంత సమస్యలను చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలి. వాంగ్‌చుక్ విడుదల తర్వాత మళ్లీ హింసాత్మక మార్గంలో ఉద్యమిస్తామంటూ ఊరుకునేది లేదు. ఉద్యమాలకు ఇక్కడ ఎలాంటి అనుమతులు లేవు. లద్దాఖ్ పౌరులు, నేతలు, వివిధ వర్గాల భాగస్వాములతో సంప్రదింపుల మార్గంలోనే సమస్యలకు పరిష్కారం వెతుకుదాం’’అని లద్దాఖ్ నూతన లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా వ్యాఖ్యానించారు. పది రోజుల క్రితం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సారథ్యంలోని హైపవర్ కమిటీ సమావేశం కాగా అందులో వాంగ్చుక్ను తక్షణం విడుదలచేయాలని ఎల్ఏబీ, కేడీఏ నేతలు కోరడం తెల్సిందే. -
షాకింగ్ : సవానీ గ్రూపు సోదరులకు 835 ఏళ్ల జైలు శిక్ష
అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన భారతీయ సంతతికి చెందిన సోదరులు భాస్కర్ సవానీ(60), అరుణ్ సవానీ(58)లకు 835 ఏళ్ల జైలు శిక్ష విధించారు. మనీలాండరింగ్, హెచ్1బీ వీసా, పన్ను ఎగవేత సహా వివిధ రకాల మోసాలకు పాల్పడ్డారన్న కేసులో సుమారు $30 మిలియన్ల (రూ. 250 కోట్లకు పైగా) కుంభకోణానికి పాల్పడి, రికార్డ్ స్థాయిలో సుదీర్ఘ జైలు శిక్షను ఎదుర్కొంటున్నారు. అసలేంటీ కుంభకోణం వివరాలు తెలుసుకుందాం.US అటార్నీ కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, భారతీయ సంతతికి చెందిన సోదరులు దంతవైద్యుడు భాస్కర్ సవానీ , అతని సోదరుడు అరుణ్ సవానీ "సవానీ గ్రూప్" పేరుతో పలు రకాల వ్యాపారాలు నడిపారు. తద్వారా మిలియన్ల డాలర్లను అక్రమంగా సంపాదించారు. వీటితోపాటు అమెరికాలో మెడికైడ్ ప్రోగ్రామ్ ద్వారా 30 మిలియన్ల డాలర్లకు పైగా మోసం, H-1B వీసా వ్యవస్థను దుర్వినియోగం చేసినందుకు దోషులుగా నిర్ధారించబడ్డారు ఈ కుంభకోణంలోని ప్రధానాంశాలను ఒక సారి పరిశీలిస్తే...హెచ్-1బి (H-1B) వీసా స్కాంవీరు 'సవాని గ్రూప్' పేరుతో ఒక నేరపూరిత సంస్థను నడిపారు. భారత్ నుండి విదేశీ కార్మికులను తీసుకురావడానికి తప్పుడు పత్రాలతో H-1B వీసాల కోసం దరఖాస్తు చేశారు. అక్కడికి వచ్చిన కార్మికులను వేధించి, వారికి ఇచ్చే జీతాల్లో కొంత భాగాన్ని తిరిగి తమకే ఇవ్వాలని (కిక్బ్యాక్స్) బలవంతం చేసేవారని ప్రాసిక్యూటర్లు తెలిపారు.మెడికేడ్ (Medicaid) కుంభకోణంభాస్కర్ సవాని ఒక దంతవైద్యుడు. వీరి దంత వైద్యశాలలను మెడికేడ్ ప్రోగ్రామ్ నుండి తొలగించినప్పటికీ, వీరు ఇతర వ్యక్తుల పేర్లతో (Nominee owners) దొంగ కంపెనీలను సృష్టించి ప్రభుత్వానికి తప్పుడు బిల్లులు పంపారు. ఈ విధంగా అమెరికా ప్రభుత్వ ఆరోగ్య పథకం ‘మెడికేడ్’ను ఉపయోగించుకొని సుమారు రూ. 250 కోట్లకు పైగా మోసం చేశారు.మనీ లాండరింగ్ , పన్నుల ఎగవేతవచ్చిన అక్రమ సొమ్మును దాచడానికి అనేక బ్యాంక్ ఖాతాలను ఉపయోగించి మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారు. దాదాపు 1.6 మిలియన్ల డాలర్లను వ్యక్తిగత ఆదాయాన్ని 1.1 మిలియన్ల డాలర్ల మేర ఉద్యోగుల ఆదాయాన్ని దాచిపెట్టి ప్రభుత్వానికి పన్నులు చెల్లించ కుండా ఎగవేశారు.దారుణమైన వైద్య ప్రయోగాలుఅంతేకాదు వీరు చేసిన అత్యంత దారుణమైన పని ఏమిటంటే, FDA అనుమతి లేని, "మనుషులపై వాడకూడని" (Not For Human Use) అని రాసి ఉన్న ప్రోటోటైప్ డెంటల్ ఇంప్లాంట్స్‌ను రోగులకు తెలియకుండానే వారి శరీరాల్లో అమర్చారు.మనీలాండరింగ్ ద్వారా కార్పొరేట్ బ్యాంక్‌ల్లోకి తరలించారని 2023లో వారిపై ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసు విచారణ తర్వాత, భాస్కర్ సవానీ అరుణ్ సవానీ రాకెటీరింగ్ కుట్రకు సంబంధించిన అనేక ఆరోపణలపై దోషులుగా తేలారు.వీరితో పాటు అలెగ్జాండ్రా రాడోమియాక్ (48)ని కూడా దోషిగా తేల్చింది కోర్టు.శిక్షలు ఇలా ఉండబోతున్నాయిభాస్కర్కు 420 ఏళ్లు, అరుణ్ సవానీకి 415 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానాలు ఎదుర్కొంటున్నారు. అలెగ్జాండ్రా రాడోమియాక్ కూడా 40 సంవత్సరాల వరకు జైలు శిక్ష , జరిమానాలు విధించింది. ఈ ఏడాది జూలో (2026) లో శిక్ష అమలు కానుంది. -
కల్వకుర్తి వ్యవసాయ ఏడీ జైలుకు తరలింపు
మహబూబ్‌నగర్ క్రైం/నేరేడుచర్ల, గరిడేపల్లి: కల్వకుర్తి వ్యవసాయశాఖ ఏడీ కిరణ్‌కుమార్ ఆస్తుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఏసీబీ నుంచి మొత్తం ఏడు బృందాలు వేర్వేరుగా చేసిన సోదాలలో కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించారు. శనివారం కల్వకుర్తిలోని ఆయన కార్యాలయంతో పాటు నివాసంలో సోదాలు నిర్వహించారు. కిరణ్‌కుమార్ స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని పొనుగోడు గ్రామంలో గల ఆయన ఇంట్లో తెల్లవారుజాము నుంచే తనిఖీలు ప్రారంభించారు.గడ్డిపల్లి గ్రామంలోని కిరణ్‌కుమార్ అత్తగారింటి వద్ద, అదేవిధంగా అనంతగిరి మండలం అమీనాబాద్, సూర్యాపేటలోని కిరాయి ఇళ్లలోనూ సోదాలు చేసినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌లో ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ మాట్లాడుతూ కల్వకుర్తి వ్యవసాయ శాఖ ఏడీ కిరణ్‌కుమార్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా చేసిన తనిఖీల్లో దాదాపు రూ.4 కోట్ల ఆస్తులను మొదటి రోజు గుర్తించినట్లు వెల్లడించారు. దీంట్లో ప్రధానంగా 97 ఎకరాల భూమి, ఓపెన్ ప్లాట్లు మూడు, ఐదు కార్లు, ఇన్సూరెన్స్ పాలసీలు రూ.5.5 లక్షలు, పలు రకాల పెట్టుబడులు రూ.50 లక్షలు, ఫ్లాట్లు రెండు, ఒక ఇళ్లు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.కిరణ్‌కుమార్‌పై అవినీతి చట్టం 1988 కింద కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచి, ఆ తర్వాత చర్లపల్లి జైలుకు తరలించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతుందని అన్ని రకాల వివరాలు సేకరించి ప్రత్యేక నివేదిక అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ శాఖలలో ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీతో పాటు 9440446106 వాట్సాప్‌కు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. -
పులిలా బయటకు వచ్చాడు.. విడుదలపై YSRCP నేతల రియాక్షన్
-
బాత్ రూమ్ లో జారి పడ్డ... జైల్లో పరిస్థితులపై అంబటి సెటైర్లు
-
అంబటి రాంబాబు జైలు నుంచి విడుదల
-
మెదక్ జిల్లా కలెక్టర్‌కు జైలుశిక్ష
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల్ సర్వే నంబర్ 284/ఏ/2లో 2.22 ఎకరాల భూ వివాదంలో తామిచ్చిన ఆదేశాలను అమలు చేయని కలెక్టర్, ఐఏఎస్ అధికారి శ్రీరాహుల్‌రాజ్‌కు హైకోర్టు ఆర్నెల్లు సాధారణ జైలు శిక్ష విధించింది. రూ.2 వేలు జరిమానా చెల్లించాలని చెబుతూ నాలుగు వారాలు గడువిచి్చంది. ఈ ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి నాలుగు వారాలు తీర్పు అమలును నిలిపివేసింది. మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల్ సర్వే నంబర్ 284/ఏ/2లో 2.22 ఎకరాల భూమికి తను వారసురాలినని, తన పేరుపై మార్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నాగవెల్లి లక్ష్మి 2024, ఏప్రిల్‌లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేశారు. లక్ష్మితో పాటు ప్రతివాది నారాయణ, మల్లయ్యలకు నోటీసులు ఇచ్చి మరోసారి పూర్తి విచారణ జరిపాలని ఆదేశించారు. సేల్‌డీడ్, సాదాబైనామా క్రమబదీ్ధకరణ చర్యలను పరిశీలించి చట్టప్రకారం ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు. దీని కోసం మూడు వారాలు గడువిచ్చారు. జూన్‌లో ఉత్తర్వులు జారీ చేసినా సెపె్టంబర్ వరకు అమలు చేయకపోవడంతో తిరిగి లక్ష్మి ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది.కోర్టు తీర్పునిచ్చినా కలెక్టర్ ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని, ధిక్కరణ చర్యలు తీసుకోవాలని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. కోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ ఏజీపీ(అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్) అందజేసిన రికార్డుల్లో తేదీ లేదని, పిటిషనర్‌కు నోటీసులు అందినట్లు నిర్ధారణ చేసుకోలేదని న్యాయమూర్తి గమనించారు. వాట్సాప్ ద్వారా పిటిషనర్‌కు పంపించామని ఏజీపీ పేర్కొన్నా ధిక్కార పిటిషన్‌లోని కౌంటర్లో ఈ విషయాన్ని ప్రస్తావించలేదని అభిప్రాయపడ్డారు. రెండెకరాల భూమి కోసం 51 ఏళ్ల మహిళలను పదేపదే కోర్టుల చుట్టూ తిరిగేలా చేయడం సరికాదని అధికారుల తీరును తప్పుబట్టారు. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే కలెక్టర్ ధిక్కరించినట్లు పేర్కొన్న న్యాయమూర్తి ఆర్నెల్లు జైలు విధిస్తూ తీర్పునిచ్చారు. -
స్పందించిన పాక్.. ఇమ్రాన్ ఖాన్ తరలింపు?
ఇటీవల పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యపరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. వైద్యవసతి సరిగ్గా లేక ఆయన 85శాతం చూపు కోల్పోయారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇమ్రాన్ ఖాన్ని సరైన వైద్యవసతులు కల మరో కొత్త జైలుకు తరలించనున్నట్లు పేర్కొందిప్రస్తుతం ఆడియాలో జైల్లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకర వార్తలు ప్రచురితమయ్యాయి. ఇప్పటికే ఎన్నో అనారోగ్య సమస్యలతో సతమవుతువుతున్న ఇమ్రాన్‌ఖాన్ ప్రస్తుతం కంటి చూపు సన్నగిల్లుతున్నట్లు ఆయన తరపు న్యాయవాది తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ తన కుడి కంటిలో 85% చూపు కోల్పోయి, ప్రస్తుతం కేవలం 15% మాత్రమే మిగిలి ఉందని వైద్య నివేదికలు తెలిపినట్లు పేర్కొన్నారు. దీంతో ఇమ్రాన్ పట్ల ఉద్దేశపూర్వకంగా అత్యంత అమానుషంగా అడియాలా జైలు అధికారులు వ్యవహరిస్తున్నారని పాక్‌లో ఆరోపణలు వెల్లడయ్యాయి.ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇమ్రాన్ ఖాన్‌ను త్వరలోనే ఇస్లామాబాద్‌లోని జైలుకు తరలిస్తామని ఆ దేశ మంత్రి మోసిన్ నఖ్వీ పేర్కొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితులు, కంటిచూపు కోల్పోవడం దృష్ట్యా ప్రత్యేక వసతులతో ఆయన సెల్ నిర్మిస్తామని తెలిపారు. అయితే గతేడాది అక్టోబర్ వరకు ఆయనకు సాధారణ చూపు ఉన్నప్పటికీ, తరువాత రక్తం గడ్డకట్టడం (blood clot) వల్ల తీవ్రమైన నష్టం జరిగినట్లు వైద్యులు తెలిపారు.ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి పాకిస్తాన్లో రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆయన చూపు కోల్పోవడం వైద్యపరమైన సమస్య మాత్రమే కాకుండా, జైలు పరిస్థితులు మరియు ప్రభుత్వ వైఖరిపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది దీంతో ప్రభుత్వం స్పందించినట్లు తెలుస్తోంది. -
జైల్లో అంబటి పరిస్థితి..! జడ శ్రవణ్ రియాక్షన్..
-
అంబటి రాంబాబు బెయిల్‌పై లాయర్లు రియాక్షన్
-
రాజమండ్రి జైల్ నుంచి రేపే అంబటి విడుదల
-
రూ.20 లంచం కేసులో 30 ఏళ్లు జైలు శిక్ష..! చివరికి..
కొన్ని తలరాతలు దేవుడి అత్యంత నాటకీయం రాస్తాడని అంటుంటారు పెద్దలు. అబ్బాం ఇదేం చిత్రం అనేలా జీవితాన్ని ముగించేస్తాడు. అలాంటి కథ ఈ వ్యక్తిది. ఓ నిజాయితీపరుడు..ఏళ్ల తరబడి చేయని తప్పుకి జైలు శిక్ష అనుభవించిన కథ ఇది. పోనీ అదేమంత పెద్ద అవినీతి కేసు.. అంటే అదీ కాదు. కానీ అన్నేళ్లు ఆశతో తాను నిర్దోషిని అని నిరూపించేందుకు చేసిన ప్రయత్నం ఎవ్వరినైనా కదలిస్తుంది. అతడు నిలువెత్తు ఆత్మవిశ్వాసానికి, ఆశావాదానికి ప్రతీక. ఈ కథ చిన్న చిన్న కష్టాలకు హైరాన పడేవాళ్లకు ఓ స్ఫూర్తి. అలాగే ఆశావాదంగా బతకడం ఎలాగో నేర్పిస్తుంది కూడా.ఆ వ్యక్తి కథ హాలీవుడ్ మూవీ ‘ది షాషాంక్ రిడెంప్షన్’ని తలపించే గాథ. అందులో ఓ నిర్దోషి ఎలా అయితే చేయని తప్పుకు జైలు శిక్ష అనుభవించాడో అలానే గుజరాత్‌కు చెందిన బాబూభాయ్ ప్రజాపతి చాలాకాలంపాటు శిక్షను అనుభవించాడు. మొత్తం జీవితం అంతా జైలులోనే గడిపాడు ప్రజాపతి. ఇంతకీ అతడిపై మోపబడిన నేరం ఏంటంటే..రూ. 20ల లంచం కేసులో ఏకంగా 30 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. సింపుల్‌గా చెప్పాలంటే 1994 నాటి హాలీవుడ్ చిత్రం లాంటిది అతడి కథ. అసలేం జరిగిందంటే..1996లో పోలీస్ కానిస్టేబుల్ బాబూభాయ ప్రజాపతి అహ్మదాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు రూ. 20ల లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అవినీతి నిరోధక చట్టం కింద ఈ ఆరోపణలు చేశారు. 1997లో సెషన్స్ కోర్టులో ఆయనపై చార్జిషీట్ దాఖలు చేశారు. 2002లో అభియోగాలు మోపారు. 2003లో సాక్షుల విచారణ ప్రారంభమైంది. 2004లో సెషన్స్ కోర్టు ప్రజాపతికి నాలుగు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 3,000/- జరిమానా విధించింది. ప్రజాపతి సెషన్స్ కోర్టు నిర్ణయాన్ని గుజరాత్ హైకోర్టులో సవాలు చేశారు. ఆ తర్వాత, ఆయన అప్పీల్ 22 ఏళ్ల పాటు పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఆయన నిర్దోషి కోర్టు తీర్పు ఇవ్వడం విశేషం. అంతేగాదు హైకోర్టు ఈ కేసులో సాక్షుల వాంగ్మూలాల్లో తీవ్రమైన వైరుధ్యాలు ఉన్నాయని, అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొంది. ఇక ప్రజాపతి తరపున వాదించిన న్యాయవాది నితిన్ గాంధీ, ఈ కేసు మొత్తం అనుమానంతో చేసిన ఆరోపణలే తప్ప వాస్తవం లేదని కోర్టుకి నివేదించారు. కాగా, హైకోర్టు ఎప్పుడైతే ప్రజాపతిని నిర్దోషిగా పేర్కొందే..తతక్షణమే ఆయన భావోద్వేగంగా విడుదలైనందుకు ఆనందంగా ఉంది, ఇక ఇప్పుడు హాయిగా చనిపోయినా పర్లేదని అన్నారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లారు. అయితే న్యాయవాది గాంధీ ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోమని ప్రజాపతికి సూచించారు. ఆ మరుసటి రోజు ఆ విషయమై ఆయనకు ఫోన్ చేయగా, గుండెపోటుతో మరణించినట్లు కుటుంబసభ్యులు చెప్పారని న్యాయవాది గాందీ తెలిపారు. ఇన్నేళ్లు తన నిర్దోషిత్వం నిరూపించుకోవాడానికి పోరాడిని విధానం అసామాన్యమైనది. చివరికీ..తన నిజాయితీ నిరూపించుకుని మరీ కన్నుమూశాడు. అదీకూడా ఆయన నోటి నుంచి వెలువడినట్లుగానే జరిపోవడం బాధకరం. ఇన్నేళ్లు కోర్టులు చుట్టూ తిరుగుతూ పోరాడాడు..కనీసం కోన్నాళ్లు బతికి ఉన్నా బాగుండేదే అని అతడి కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు ఆవేదనగా అన్నారు. (చదవండి: ఆ గాయం జీవితాన్ని మార్చి..స్ఫూర్తిగా నిలిపింది..!) -
మహిళలపై ఇరాన్ ప్రతీకారం.. జైళ్లలో అత్యాచారాలు?
ఇరాన్లో మహిళలపై జరుగుతున్న దారుణాలపై సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అక్కడి సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా ఆ దేశ మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో వారిని అక్కడి ప్రభుత్వం బంధించి జైళ్లలో వేసింది. అయితే కారాగారాలలో వారిపై అత్యాచారం చేసి హతమారుస్తున్నారని ఆ దేశానికి చెందిన ఓ జర్నలిస్టు సంచలన ఆరోపణలు చేస్తున్నారు.ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్లో పెద్దఎత్తున నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. లక్షల సంఖ్యలో అక్కడి ప్రజలు రోడ్లపైకి వచ్చి పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఇందులో మహిళలు అధికంగా ఉన్నారు. వారిలో కొంతమంది హిజాబ్ తొలగించి సిగరెట్‌తో ఖమేనీ ఫోటోకు నిప్పంటిస్తూ నిరసనలు తెలిపారు. దీంతో అక్కడి భద్రతా బలగాలు వారిని అరెస్టు చేశాయి. తాజాగా ఖమేనీ ప్రభుత్వం వారిపై ప్రతీకార చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తోంది.ఇరాన్-జర్మన్ జర్నలిస్టు మిచెల్ అబ్దోల్లాహి ఇరాన్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇరాన్ ప్రభుత్వంపై నిరసన చేసిన మహిళలపై జైళ్లలో అత్యాచారాలు చేస్తున్నారని, వారిని అంగవైకల్యానికి గురిచేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా సిగరెట్లతో కాల్చుతూ చిత్రవధలు చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు గర్భం దాల్చితే వాటిని తొలగిస్తున్నారని పేర్కొన్నారు.అయితే వారు పెడుతున్న హింసల్ని తట్టుకోలేక మరణిస్తే మరణిస్తే వారి మృత దేహాలను ఎవరికి తెలియకుండా కాల్చి వేస్తున్నారని తెలిపారు. జైళ్లలో హింస జరుగుతున్న సంగతి ఎవరికి తెలియకుండా ఉండడానికే ఈ విధంగా చేస్తున్నారని జర్నలిస్టు పేర్కొన్నారు. అయితే ఇరాన్లో జరిగిన ఆందోళనల కారణంగా దాదాపు ఐదువేల మంది పౌరులు మృతిచెందిన సంగతి తెలిసిందే. -
సౌదీలో అపరిచితుడికి లిఫ్ట్ ఇస్తే.. ఉన్న ఉద్యోగం ఊడింది
"కాపురం కాపాడడానికి పోతే కాలు తెగింది" అన్న నానుడి ఈ బాధితుడి వ్యవహారంలో సరిగ్గా సరిపోతుంది. పాపం రోడ్డుపై ఒంటరిగా ఉన్నాడనే ఒక వ్యక్తికి లిప్ట్ ఇచ్చాడు. తీరా చూస్తే అక్కడి అధికారులు చేసిన తనిఖీల్లో లిప్ట్ ఇచ్చిన వ్యక్తి అక్రమంగా సౌదీ అరేబియాలోకి ప్రవేశించాడని తేలింది. దీంతో నేరస్థునితో పాటు లిప్ట్ ఇచ్చిన వ్యక్తిని జైలులో తోశారు.సౌదీ అరేబీయాలోని జిజాన్‌లో ప్రసాద్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని విధి నిర్వహణలో భాగంగా వాహనంలో వెళుతున్నాడు. అయితే అప్పుడు రోడ్డుపై ఓ వ్యక్తి లిప్ట్ అడిగాడు. దీంతో అతనికి సహాయం చేద్దామనే ఉద్దేశంతో అతనిని వాహనంలోకి ఎక్కించాడు. తీరా కొద్దిదూరం వెళ్లేసరికి పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. వీరిద్దరిని ఆపి పత్రాలు చూపించమని అడగగా ఆవ్యక్తి వద్ద సరైన పత్రాలు లేవు. దీంతో అతను యెమన్‌కు చెందిన వ్యక్తి అని అతను అక్రమంగా సౌదీ అరేబియాలోకి ప్రవేశించాడని పోలీసులు గుర్తించారు.దీంతో యెమన్‌కు చెందిన వ్యక్తితో పాటు అతనికి లిప్ట్ ఇచ్చినందుకు ఆ డ్రైవర్‌ను అరెస్టు చేసి నెలరోజుల పాటు జైలులో ఉంచారు. అనంతరం ఆ సదరు ఉద్యోగి తను పనిచేసే సంస్థకు వెళ్లగా కంపెనీ వెహికిల్‌ను ప్రజలను ఎక్కించుకున్నారనే అభియోగంతో వారు ఉద్యోగంలో నుంచి తొలగించారు. అనంతరం అతనికి జీతంతో పాటు అతనికి రావాల్సిన కంపెనీ బెనిఫిట్స్‌ను కూడా ఇవ్వలేదు. దీంతో సదరు ఉద్యోగి తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు.విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. అక్కడి నుండి కేలి సాంస్కృతిక కేంద్రాన్ని సంప్రదించాడు. దీంతో వారు అతనిని తిరిగి భారత్‌కు పంపించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. అయితే ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని సరైన పత్రాలు లేని వారిని వాహనాల్లో ఎక్కించుకున్నందుకు ఇదివరకూ ఎంతో మంది జైలుపాలయ్యారన్నారు. కనుక సౌదీలో ఉండేవారు ఎవరినైనా వాహనంలో ఎక్కించుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా వారు సూచించారు. -
ఇమ్రాన్‌ను కలవనివ్వండి.. ఖురాన్‌తో సోదరిల నిరసన
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం మరోసారి ఆ దేశంలో చర్చనీయాంశమయ్యింది. ఆయనను కలవడానికి ఎవరికీ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో వారి కుటుంబసభ్యులతో పాటు ఆయన మద్ధతుదారులు నిరసనలు చేపడుతున్నారు. తాజాగా ఇమ్రాన్ సోదరిలు అడియాలా జైలు బయట ధర్నా చేపట్టారు.కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాఫిక్‌గా మారింది. ఆయనను జైలులోనే చంపేశారు అని పుకార్లు రావడంతో ఇమ్రాన్ వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైంది. ఆయన కుటుంబసభ్యులతో పాటు పీటీఐ మద్దతుదారులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో ఎట్టకేలకు అక్కడి ప్రభుత్వం ఆయనను కలవడానికి అనుమతిచ్చింది. దీంతో ఆయన సోదరి డా. ఖానుమ్ ఆయనను జైలులో కలిసింది. దీంతో ఆయన బ్రతికే ఉన్నాడని అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజాగా మరోసారి ఇమ్రాన్ వ్యవహారం పాక్‌లో చర్చనీయాంశమైంది.ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాల ప్రకారం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కలవడానికి మంగళ, గురువారాల్లో అనుమతి ఇవ్వాలి. అయితే ఈ ఆదేశాలను అక్కడి అధికారులు పాటించడం లేదు. ఆయనను కలవడానికి వారి సోదరిమణులు ఆలీమాఖాన్, ఉజ్మా ఖాన్‌లను వారిని కలవడానికి అనుమతించడం లేదు. దీంతో వారు జైలు బయిట ఆందోళన చేపట్టారు.దీంతో వారు జైలు బయిట ఖురాన్ చదువుతూ నిరసన చేపట్టారు. ఇమ్రాన్ సోదరి ఆలీమా ఖాన్ మాట్లాడుతూ.. మేము ఇక్కడ ఖురాన్ చదవడం పూర్తి చేస్తామని వారు భయపడుతున్నారు. ఎటువంటి మనుషులు వారు. అడియాలాకు వెళ్లే దారులన్నీ నిర్భందించారు. అని ఆమె తెలిపారు.అయితే మంగళ, గురవారాల్లో ఇమ్రాన్‌ను కలవడానికి అనుమతులివ్వాలని కోర్టు చెప్పడంతో ఆ రోజుల్లో అడియాలా జైలు ఎదుటు పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు. -
విజయవాడ జైలులో జోగి రమేష్ తో YSRCP నేతల ములాఖత్
-
జైల్లో గంజాయి ఘటన .. అధికారి సస్పెండ్
సాక్షి నిజామాబాద్: సెంట్రల్ జైల్లో అధికారుల నిర్లక్ష్యంపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇటీవల గంజాయి తీసుకున్నారనే నెపంతో ఇద్దరు ఖైదీలపై దాడి చేసిన జైలర్ ఉపేందర్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరో జైలర్ సాయి సురేశ్‌పై బదిలీ వేటు వేశారు. అంతేకాకుండా జైలు సూపరిండెంట్ దశరథంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు.ఇటీవల నిజామాబాద్ జైలులో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇద్దరు ఖైదీలు గంజాయికోసం ఘర్షణ పడుతుండడంతో వారిని గమనించిన జైలు అధికారి వారిపై దాడిచేశారు దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరికి ప్రక్కటెముకలు విరిగాయి. దీంతో ఈ విషయం అందరికీ తెలిసింది. ఈకేసును బోధన్ కోర్టు విచారించగా పోలీసులు తమను తీవ్రంగా కొట్టారని న్యాయమూర్తి ముందు ఖైదీలు తెలపారు. దీంతో ఈ కేసుపై కోర్టు విచారణకు ఆదేశించింది.ఆ నేపథ్యంలో ఉన్నతాధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా జైలులో గంజాయి, బీడీలు, ఇతర నిషేధిత వస్తువులతో అక్రమ వ్యాపారం చేస్తున్న ఏడుగురు ఖైదీలను సంగారెడ్డి, చర్లపల్లి, చంచల్‌గూడ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. -
ఫ్రెంచ్ అధ్యక్షుడి భార్యపై ట్రోల్స్.. జైలుశిక్ష
పారిస్: ఫ్రెంచ్ అధ్యక్షుడి సతీమణిని ట్రోల్ చేసినందుకు గాను అక్కడి పారిస్ కోర్టు పదిమందికి జైలుశిక్ష విధించింది. బ్రిగెట్టి మేక్రాన్ పురుషుడు అంటూ కొంతమంది ఆన్లైన్లో వేదింపులకు గురిచేశారు. దీంతో వారిపై కేసు నమోదు చేయగా తాజాగా ఆకేసును విచారించిన పారిస్ కోర్టు వారికి శిక్ష విధిస్తూ తీర్పుఇచ్చింది.ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భార్య బ్రిగిట్టే మాక్రాన్‌ను 2024లో కొంతమంది ఆకతాయిలు ఆన్లైన్లో ట్రోల్ చేశారు. వాస్తవానికి బ్రిగిట్టే మాక్రాన్ పురుషుడని ఆయన అసలు పేరు జీన్- మిచెల్-ట్రోగిక్స్ అని ఎగతాళి చేస్తూ కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్‌పై కలత చెందిన మాక్రాన్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ పుకార్ల వల్ల తమ కుటుంబం ఎంతో బాధపడిందని ఆమె కుమార్తె తెలిపింది.తాజాగా దీనిపై విచారించిన కోర్డు నిందితులు పదిమందికి ఎనిమిది నెలల జైలుశిక్షతో పాటు రూ. 63 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే వీరిలో కొంతమంది తాము కేవలం సరదాకు మాత్రమే అలా అన్నామని అనగా.. దేశ అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి కుటుంబం గురించి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని న్యాయమూర్తి వారిని హెచ్చరించారు.అమెరికాలో కూడా ట్రంప్ అనుకూల జర్నలిస్టులు కాండేస్ ఓవెన్స్, టక్కర్ గ్రావెన్స్ అనే ఇద్దరు జర్నలిస్టులు బ్రిగిట్టే మాక్రాన్ పురుషుడే అని వ్యాఖ్యలు చేశారు. బ్రిగిట్టే తన సోదరుడు జీన్-మిచెల్-ట్రోగన్స్ వాస్తవానికి ఒక్కరేనని మిచెల్ లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకొని బ్రిగిట్టేగా మారిందన్నారు. అయితే ఇవన్ని అసత్యపుకార్లని చాలా మంది కొట్టిపారేశారు. -
డేరాబాబాకు మరోసారి పెరోల్
ఆధ్యాత్మిక గురువు, డేరా స్వచ్ఛ సౌధా ఛీప్ గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్‌కు మరోసారి పెరోల్ మంజూరయ్యింది. దీంతో ఆయన 40 రోజుల పాటు సాధారణ జీవితం గడపనున్నారు. ఈ పెరోల్ కాలంలో గుర్మిత్ బాబా సిర్సా హెడ్‌క్వార్టర్స్‌లో ఉండనున్నారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్‌కు హర్యాణాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. అక్కడే కాకుండా పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాలలో సైతం ఆయనకు భక్తులు ఉన్నారు. డేరాబాబా నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవ తదితర వాటి రీత్యా ఆయనపై ప్రజలకు అభిమానం అధికంగా ఉండేది. అయితే 2017లో ఆశ్రమానికి చెందిన ఇద్దరు మహిళలపై డేరాబాబా లైంగికదాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ అంశం విచారించిన కోర్టు ఆయనను దోషిగా తేలుస్తూ 20 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు అయ్యారు.కాగా 2017లో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్న నాటి నుంచి ఇప్పటి వరకూ ఆయన దాదాపు 15సార్లు పెరోల్‌పై వచ్చారని నివేదికలు తెలుపుతున్నాయి. 2025లో జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగస్టు నెలలలో ,2024లో మూడు సార్లు ఫెరోల్‌పై బయిటకి వచ్చినట్లు పేర్కొన్నాయి. ఢిల్లీ, హర్యాణా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు డేరాబాబా ఫెరోల్‌పై బయిటకు వచ్చారు. 2002లో జరిగిన జర్నలిస్టు హత్య కేసులో సైతం డేరాబాబా నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. -
బంగ్లాలో ఎన్నికలు.. హసీనా పార్టీ లేకుండానే?
కొద్దికాలంగా రాజకీయ అనిశ్చితి, అశాంతితో రగిలిపోయిన బంగ్లాదేశ్ త్వరలో ప్రజస్వామ్య వేడుకకు సిద్దమవుతోంది. ఈ మేరకు ఆ దేశ ఎన్నికల కమిషనర్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆ దేశ మాజీ అధ్యక్షురాలు షేక్ హసినా దేశాన్ని వీడిన తర్వాత అక్కడ ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి.2024లో బంగ్లాలో జరిగిన అల్లర్లు ఆ దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసనలను అప్పటి ప్రభుత్వం హింసాత్మకంగా అణిచివేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రజలు మరింత ఉద్ధృతంగా ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనల్లో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశ ఆర్మీ రంగంలోకి దిగింది. అల్లర్లకు బాధ్యత వహిస్తూ ఆ దేశ ప్రధాని షేక్ హాసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసింది. అనంతరం ఆ దేశాన్ని వీడి భారత్‌లో తలదాచుకుంది. షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాలో మహ్మద్ యూనస్ అధ్యక్షతన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ ఎలక్షన్ కమిషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆ దేశంలో ఎన్నికలు జరుపుతున్నట్లు ఎలక్షన్ కమిషనర్ నసిరుద్దీన్ ప్రకటించారు. ఈమేరకు ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉందని తెలిపారు. అత్యంత పారదర్శకతతో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. దయచేసి ప్రజలెవరూ ఎటువంటి పుకార్లను నమ్మవద్దని ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 300 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. విదేశాలలో ఉన్న దేశీయులు ఓటుకోసం డిసెంబర్12 నుంచి 25వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.అయితే వివిధ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న షేక్ హసీనాకు ఆ దేశంలోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యూనల్ మరణ శిక్ష విధించింది. ఇతర న్యాయస్థానాలు 21 సంవత్సరాల జైలుశిక్ష విధించాయి. ఈ పరిస్థితుల్లో హాసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని అక్కడి ప్రభుత్వం భారత్‌ను అభ్యర్థిస్తుంది. అయితే బంగ్లాదేశ్ వెళ్లే నిర్ణయం స్వయంగా షేక్ హసీనానే తీసుకోవాలని భారత్ విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఇటీవల ఓ కార్యక్రమంలో అన్నారు.షేక్ హసీనా తొలిసారిగా 1996లో ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2009 నుంచి 2024లో రాజీనామా చేసే వరకూ వరుసగా 15 ఏళ్లు ప్రధానిగా కొనసాగారు. 2024లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో షేక్ హాసీనాకు చెందిన పార్టీ ఆవామీ లీగ్‌ను బంగ్లాదేశ్‌లో బ్యాన్ చేశారు. ఈ నేపథ్యంలో షేక్ హసీనానే కాకుండా ఆమె పార్టీ అభ్యర్థులు ఎవరూ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేరు. -
మాచర్ల కోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు సరెండర్
-
జైలులో నటుడు దర్శన్ గొడవలు
యశవంతపుర: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న ప్రముఖ నటుడు దర్శన్ తోటి ఖైదీలతో గొడవలు పడుతున్నట్టు తెలిసింది. తన సెల్లో ఉంటున్న ఇతర ఖైదీలను వేధిస్తున్నట్టు సమాచారం. దర్శన్ రెండోదఫా బెయిలు రద్దయి జైలుకు వచ్చాక నిబంధనలను కట్టుదిట్టం చేశారు.దీంతో దర్శన్‌లో అసహనం పెరిగిపోయినట్టు జైలు వర్గాలు చెబుతున్నాయి. దర్శన్ ఇతర ఖైదీలను దూషిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో దర్శన్‌కు తోటి ఖైదీ భోజనం తెచ్చి పెట్టేవారు. ఇటీవల కొందరు ఖైదీలు జల్సాలు చేసిన వీడియోలు రావడంతో ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. ఐపీఎస్ అంశుకుమార్ను జైలు అధికారిగా నియమించింది. -
పోలీసులూ జైలుకెళ్లారు!!
లంచాలు తీసుకుంటూ చిక్కి, ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టి, అవకతవకలకు పాల్పడి, నేరాలు చేసి, చివరకు రాజకీయ కక్షసాధింపుల వల్ల– రకరకాల కారణాలతో పోలీసులు జైలు పాలైన ఉదంతాలను వింటుంటాం. కొన్ని కేసుల దర్యాప్తులో భాగంగా నిందితులను విచారించడానికి కోర్టు అనుమతితోనూ పోలీసులు జైలు లోపలకు వెళతారు. అయితే ఎలాంటి ఆధారం లేకుండా, అగమ్యగోచరంగా ఉన్న ఓ కేసు దర్యాప్తుకు అవసరమైన సమాచారం సేకరించడానికి అరెస్టైన ఓ పోలీసు అధికారి కొన్ని రోజులు జైల్లో, ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైదీల మధ్య గడిపాడు. ఇది 2007 సెప్టెంబర్‌లో చోటు చేసుకుంది. గోకుల్‌చాట్, లుంబినీ పార్కు పేలుళ్ల కేసు దర్యాప్తు నేపథ్యంలో ఈ ఉదంతం జరిగింది. హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌ల్లో 2007 ఆగస్టు 25న సాయంత్రం జంట పేలుళ్లు జరిగాయి. అదే రోజు దిల్‌సుఖ్‌నగర్‌లోని వెంకటాద్రి థియేటర్ సమీపంలో మరో పేలని బాంబు పోలీసులకు దొరికింది. ఆ రెండు చోట్లా జరిగిన పేలుళ్లలో 45 మంది మరణించారు. దాదాపు మూడువందల మంది గాయపడ్డారు. ఈ ఘాతుకానికి సరిగ్గా వంద రోజుల ముందు 2007 మే 18 మధ్యాహ్నం హైదరాబాద్ పాతబస్తీలో ఉన్న మక్కా మసీదులో బాంబు పేలుడు జరిగింది. శుక్రవారం ప్రార్థనల్ని టార్గెట్‌గా చేసుకున్న ఉగ్రవాదులు రెండు బాంబులు ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి పేలగా, మరోదాన్ని స్వా«ధీనం చేసుకున్న పోలీసులు దాన్ని నిర్వీర్యం చేశారు. ఈ విధ్వంసంలో 11 మంది మరణించగా, 19 మంది గాయపడ్డారు.హైదరాబాద్‌లో వంద రోజుల వ్యవధిలో రెండు విధ్వంసాలు జరగడంతో పోలీసు విభాగం అప్రమత్తమైంది. అప్పటికే మక్కా మసీదు పేలుడు కేసు సీబీఐకి బదిలీ కాగా, గోకుల్‌చాట్, లుంబినీపార్క్ పేలుళ్ల కేసు దర్యాప్తునకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ (సిక్) ఏర్పాటైంది. ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందిలో ఉగ్రవాదంపై పట్టున్న అధికారులను డిప్యుటేషన్‌పై సిక్లో నియమించారు. అప్పటికే ఉగ్రవాద కేసుల్లో అరెస్టయి, బయటకు వచ్చిన వ్యక్తులు, అనుమానితులు, వారి అనుచరులు– ఇలా వందల మందిని అదుపులోకి తీసుకున్న సిక్ – వీరి విచారణ కోసం హైదరాబాద్ శివార్లలోని అనేక గెస్ట్ హౌస్‌లు, ఫామ్‌హౌస్‌లు ఇంటరాగేషన్ కేంద్రాలుగా ఉపయోగించుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పోలీసులు ఎలాంటి ఆధారం చిక్కలేదు. భారీ సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో వారి కుటుంబీకులు, న్యాయవాదులు, పౌరహక్కుల సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి పోలీసులపై ఒత్తిడి పెరిగింది.ఆధారాలు దొరక్కపోవడంతో సిక్ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది. అప్పట్లో హైదరాబాద్‌లోని జైళ్లల్లో ఖైదీల వద్ద సెల్ఫోన్లు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి తోడు అప్పటికే రిమాండ్‌లో ఉన్న ఉగ్రవాదులను కలవడానికి వారి సంబంధీకులు వచ్చిపోతుండే వాళ్లు. ఈ పరిణామాలను గమనించిన ఓ పోలీసు అధికారికి ఓ ఆలోచన వచ్చింది. గోకుల్‌చాట్, లుంబినీపార్క్ పేలుళ్లకు సంబంధించిన సమాచారం ఏదైనా జైల్లో ఉన్న ఉగ్రవాదులకు తెలిసే అవకాశం ఉంటుందని భావించారు. జైల్లో ఉన్న వారిని ప్రశ్నిస్తే ఏదైనా క్లూ దొరుకుతుందని అనుకున్నారు. ఈ ఆలోచన బాగానే ఉన్నా, వారిని ప్రశ్నించడం ఎలా అన్నదే ఎవరికీ అంతుచిక్కలేదు. న్యాయస్థానం అనుమతి లేకుండా జైల్లోకి వెళ్లి ప్రశ్నించలేరు. కస్టడీలోకి తీసుకోవడానికి వారిపై ఎలాంటి ఆరోపణలు, ఆధారాలు లేవు. పిటిషన్లు వేసినా, పెద్ద సంఖ్యలో ఖైదీలను ప్రశ్నించడానికి కోర్టు అనుమతి లభించదు. ఇవన్నీ బేరీజు వేసిన ఓ అధికారికి వచ్చిన ఆలోచనే– నమ్మకమైన సమర్థుడైన పోలీసు అరెస్టు. ఉగ్రవాదులు నమ్మే వర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేసుకుని, ఏదో ఒక కేసులో అరెస్టు చేసి జైలుకు పంపడానికి ఉన్నతాధికారులూ అంగీకరించారు. అంతే.. సిక్లో ఉన్న అధికారులంతా తమ వద్ద పని చేసిన, చేస్తున్న వారిలో అలాంటి పోలీసు కోసం వెతికారు. అప్పట్లో ఆంధ్రా ప్రాంతంలో పని చేస్తున్న ఓ పోలీసు దీనికి సమర్థుడని అంతా అంగీకరించారు. ఆలోచనను ఆచరణలో పెట్టడానికి పోలీసు సిద్ధంగా ఉన్నా, జైలులోకి ఎలా పంపాలన్న దానిపై భారీ తర్జనభర్జన జరిగింది. చివరకు గుడుంబా ప్యాకెట్లు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై హైదరాబాద్‌లోని ఓ పోలీసుస్టేషన్లో ఆ పోలీసుపై కేసు నమోదు చేయించారు. అందులో అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్ ఖైదీగా పంపారు. ఆ పోలీసు దాదాపు 15 రోజులు జైల్లో ఉండి సమాచార సేకరణకు ప్రయత్నించారు. జైల్లో ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సిక్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. చాకచక్యంగా జైల్లో గడిపిన సదరు పోలీసు అధికారి, ఈ పేలుళ్లపై వారికి ఎలాంటి సమాచారం లేదని నిర్ధారించుకున్నాక బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆపై ఈ కేసులు ఆక్టోపస్‌కు బదిలీ కావడంతో సిక్ కథ ముగిసింది. దీంతో ‘జైలుకు వెళ్లిన పోలీసు’ తాను పని చేసే ప్రాంతానికి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆపై కొన్నాళ్లకు నాటకీయ పరిణామాల మధ్య ఆ గుడుంబా కేసు క్లోజ్ అయింది. కొన్నాళ్లకు ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) హైదరాబాద్ జంట పేలుళ్లకు కారణమని తెలిసింది. 2007 సెప్టెంబరు 13న ఢిల్లీలో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దీనికీ ఐఎం బాధ్యత ప్రకటించుకుంది. ఈ కేసులను దర్యాప్తు చేసిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు నిందితుల షెల్టర్ గుర్తించారు. అక్కడి జామియానగర్‌లోని బాట్లాహౌస్ ఎల్–18 ఫ్లాట్‌లో 2008 సెప్టెంబర్ 15న జరిగిన ఎన్కౌంటర్లో ఆతిఖ్ అలియాస్ బషర్ సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా, ముగ్గురు పట్టుబడ్డారు. ఈ ఉదంతంతో ఐఎం డొంక కదిలింది. ఈ ఆధారాలతో ముందుకు వెళ్లిన ముంబై క్రైమ్ బ్రాంచ్ దేశ వ్యాప్తంగా 11 విధ్వంసాలకు పాల్పడిన ఉగ్రవాదులను అరెస్టు చేసింది. వీరిలోనే జంట పేలుళ్ల నిందితులు సైతం ఉండటంతో సిక్ డీల్ చేసిన కేసులు కొలిక్కి వచ్చాయి. వీరిని పీటీ వారెంట్లపై తీసుకువచ్చి అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఈ మూడు కేసుల్లో నిందితులుగా ఉండి, అరెస్టు అయిన ఐదుగురిలో అనీఖ్, అక్బర్‌లపై 2018 సెప్టెంబర్ 4న నేరం రుజువైంది. వీరికి అదే నెల 10న ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.శ్రీరంగం కామేష్ -
జైలులో ఇమ్రాన్ ఖాన్‌ను కలిసిన సోదరి
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ..ప్రస్తుతం ఈ మాజీ క్రికెటర్ అంశం పాకిస్థాన్ లోనే కాకుండా ఇతర దేశాలలోనూ చర్చనీయాంశం అయ్యింది. పాకిస్థాన్ మాజీ ప్రధానిని జైలులోనే చంపేశారని పుకార్లు రావడంతో ఆ దేశంలో నిరసనలు చెలరేగాయి. ఇమ్రాన్ ఖాన్ ని కలవడానికి అనుమతి ఇవ్వాల్సిందేనని ఆయన పార్టీ శ్రేణులు పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఇమ్రాన్ ఖాన్ ను ఆమె సోదరి ఉజ్మా ఖానుమ్ జైలులో కలిసింది.మాజీ క్రికెటర్, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ సజీవంగా ఉన్నాడా లేదా అనే అంశం ప్రస్తుతం ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జైలులో ఉన్న ఆయనను కలవడానికి కొంతకాలంగా అక్కడి అధికారులు నిరాకరించడం, దీనికి తోడు ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడని పుకార్లు రేగడంతో ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిపై వివరణ ఇవ్వాలని, ఆయనను కలవడానికి అనుమతించాలని పట్టుబట్టడంతో ఎట్టకేలకు పాకిస్థాన్ ప్రభుత్వం ఆయన కుటుంబ సభ్యులకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.మంగళవారం సాయంత్రం ఇమ్రాన్ ఖాన్ ని ఆమె సోదరి డాక్టర్ ఖానుమ్ జైలులో కలిసింది. అతనితో 20 నిమిషాల పాటు మాట్లాడిన తర్వాత ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ" దేవుడి దయ వల్ల ఇమ్రాన్ ఖాన్ బాగానే ఉన్నారు. కానీ మానసికంగా ఆయనను చాలా వేధిస్తున్నారు. ప్రతిరోజు సెల్ లో నిర్భంధిస్తున్నారు. ఆయనను ఎవరితోనూ కలవనివ్వడం లేదు. కేవలం కొద్దినిమిషాలు మాత్రమే ఆయనను బయిటకి వదులుతున్నారు". అని తెలిపింది.తాను జైలులో ఉండడానికి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కారణమని ఆయన ఇమ్రాన్ అన్నారని ఆమె తెలిపింది. మెుత్తానికి ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలతో ఉన్నాడని తెలియడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని 2023లో అరెస్టు చేశారు. దేశద్రోహం, హింస, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం ఇలా ఆయనపై 121 కేసులు మోపారు. ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పాకిస్థాన్ లో హింస చేలరేగింది. ఆయన మద్ధతు దారులు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపట్టడంతో 500మందికి పైగా పీటీఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ముస్కాన్ రస్తోగి
బ్లూ డ్రమ్.. ఈ పేరు వింటేనే భర్తల వెన్నులో వణకు పుడుతోంది. అందుకు కారణం.. మీరట్‌లో జరిగిన ఓ ఘటన. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్తను ప్రియుడి సాయంతో గంజాయి మత్తులో కిరాకతంగా హతమార్చింది ఓ భార్య. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కూడా. అయితే.. భర్త సౌరభ్ రాజ్‌పుత్ (మర్చంట్ నేవీ ఆఫీసర్)ను అత్యంత కిరాతకంగా కడతేర్చిన ముస్కాన్ రస్తోగి మళ్లీ తల్లైంది. ఆదివారం సాయంత్రం మీరట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సయమంలో ముస్కాన్ ప్రియుడు, ఈ కేసు సహ నిందితుడు సాహిల్ శుక్లా కూడా పక్కనే ఉన్నాడు. ఒకవేళ ఆ బిడ్డ తమ కొడుకుకే పుట్టినట్లు డీఎన్ఏ పరీక్షల్లో తేలితే.. తమ మనవడిగా స్వీకరిస్తామని సౌరబ్ కుటుంబం ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.మీరట్‌లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బ్లూ డ్రమ్ హత్యకేసు మరోసారి వార్తల్లో నిలిచింది. భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను క్రూరంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితురాలిగా అరెస్టైన ముస్కాన్ రస్తోగి, ఎనిమిది నెలలుగా జైలులో ఉన్న ఆమె.. ఆదివారం సాయంత్రం జైలు అధికారుల పర్యవేక్షణలో మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.ప్రియుడు సాహిల్ శుక్లా మోజులో పడి భర్త సౌరభ్ గుప్తను హత్య చేయించిన కేసులో మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ముస్కాన్ రస్తోగి అరెస్టు సమయంలోనే ఆమె గర్భవతిగా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆమెకు ప్రత్యేక వైద్య పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. గర్భధారణ చివరి దశకు చేరుకోవడంతో, భద్రతా ఏర్పాట్ల మధ్య ఆమెను మీరట్ మెడికల్ కాలేజీకి తరలించారు.ముస్కాన్ సాధారణ ప్రసవం ద్వారా ఆరోగ్యవంతమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది.తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రసవం అనంతరం, భద్రతా కారణాల వల్ల వారిని ప్రత్యేక వార్డులో ఉంచారు. ఈ కేసు 2024లో వెలుగులోకి వచ్చింది.సౌరభ్ రాజ్‌పుత్ హత్య అనంతరం, అతని శవాన్ని బ్లూ డ్రమ్‌లో నింపి మాయం చేసిన ఘటన ఉలిక్కిపడేలా చేసింది. పోలీసులు విచారణలో ముస్కాన్ రస్తోగి, ఆమె స్నేహితుడు సహా పలువురిని అరెస్టు చేశారు. శిశువు భవిష్యత్తుపై చర్చ ముస్కాన్ జైలులో శిశువుకు జన్మనివ్వడంతో, బిడ్డను ఎక్కడ ఉంచాలి? ఎవరు చూసుకుంటారు? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. చట్టం ప్రకారం, మహిళా ఖైదీలు తమ పిల్లలను ఆరు సంవత్సరాల వయస్సు వరకు జైలులోనే ఉంచుకునే అవకాశం ఉంది. ముస్కాన్ రస్తోగిపై హత్య, శవాన్ని మాయం చేయడం, కుట్ర వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ప్రసవం అనంతరం ఆమెను తిరిగి జైలుకు తరలించే ప్రక్రియను అధికారులు పరిశీలిస్తున్నారు. -
మళ్లీ జైలుకు ఆజం ఖాన్
రాంపూర్(యూపీ): సీతాపూర్ జైలు నుంచి విడుదలై రెండు నెలలయినా కాకమునుపే సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత మహ్మద్ ఆజం ఖాన్ మళ్లీ జైలుకు వెళ్లారు. రెండు వేర్వేరు పుట్టిన తేదీలతో రెండు పాన్ కార్డులను కలిగి ఉన్నట్లు నమోదైన 2019నాటి కేసులో సోమవారం కోర్టు ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష విధించడంతో ఊచలు లెక్కబెట్టక ఆయనకు తప్పింది కాదు. రాంపూర్‌లోని ఎంపీ/ఎమ్మెల్యే ప్రత్యేక న్యాయస్థానం ఆజం ఖాన్ కుమారుడు, ఎమ్మెల్యే అబ్దుల్లా ఖాన్‌కు కూడా ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆజం ఖాన్, అబ్దుల్లా ఖాన్లు తప్పు చేసినట్లు ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయని తీర్పు వెలువరించిన స్పెషల్ మేజిస్ట్రేట్ శోభిత్ బన్సాల్ పేర్కొన్నారు. తీర్పు అనంతరం పోలీసులు ఇద్దరినీ పటిష్ట బందోబస్తు నడుమ రాంపూర్ కోర్టు నుంచి జిల్లా జైలుకు తీసుకెళ్లారు. ‘ఇందులో చెప్పడానికి ఏముంటుంది? ఇది న్యాయస్థానం నిర్ణయం. తప్పుచేసినట్లు న్యాయమూర్తులు భావిస్తే జైలు శిక్ష వేస్తారు’అని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. కాగా, జ్యుడిషియల్ కస్టడీలో ఇప్పటికే ఆజం ఖాన్ చాలా సమయం గడిపినందున శిక్షా కాలం తగ్గొచ్చని లాయర్లు తెలిపారు. ఆయనకు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నారు. భూ ఆక్రమణ, లంచం, మోసం తదితర ఆరోపణలపై ఆజం ఖాన్‌పై మొత్తం 84 కేసులున్నాయి. ఆయన దోషిగా నిరూపితమైన నాలుగో కేసు ఇది. నాలుగు కేసుల్లో ఆయనకు విముక్తి లభించింది. మిగతా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఓ కేసులో 23 నెలలు జైలు జీవితం గడిపిన ఆజం ఖాన్ సెప్టెంబర్ 23వ తేదీన విడుదలయ్యారు. అంతకుముందు కూడా ఆయన 27 నెలలు జైలులోనే ఉన్నారు. పాన్ కార్డ్ కేసులో తమ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్, ఆయన కుమారుడికి ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించడంపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పందించారు. బీజేపీ పాలనలో అణచివేత, అన్యాయాలకు ఇది పరాకాష్ట అని ఆయన పేర్కొన్నారు. అధికారముందనే అహంకారంతో విర్రవీగే వారికి చివరికి దుర్గతే పడుతుందని, ప్రజలు అంతా గమనిస్తూనే ఉంటారని వ్యాఖ్యానించారు. -
జైలులో ఉండి ఎమ్మెల్యేగా విక్టరీ.. బిహార్ లో అసెంబ్లీ రౌడీ సీన్ రిపీట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ మెుకామా నియోజకవర్గం నుంచి సంచలన విజయం సాధించారు. ఇందులో ఆశ్చర్యమెముంది అనుకుంటున్నారా. ఆయన ఎటువంటి ప్రచారం లేకుండా ఎన్నికల సమయంలో జైలులో ఉండి తన ప్రత్యర్థిని మట్టికరిపించారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ అనంతరం హత్యా కేసులో ఆరోపణలతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో జైలులో ఉండడంతో ఆయన సరైన ప్రచారం కూడా నిర్వహించలేదు. అయినప్పటీకీ అనంత్ సింగ్ తన ప్రత్యర్థిపై 28 వేల మెజార్టీతో గెలుపొందారు.జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ మెుకామా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. నామినేషన్ సైతం దాఖలు చేసి ప్రచారం చేపట్టారు. ఇంతలోనే జన సూరజ్ పార్టీనేత హత్యకు సంబంధించి అనంత్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేసి జైలులో వేశారు. దీంతో అనంత్ సింగ్ ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయన గెలుపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయినప్పటికీ ఆయన ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి వీణా దేవిపై 28 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది మెుకామా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో రాజకీయ నాయకులు ప్రజలలో ఆయనకున్న ఆదరణను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.జేడీయూ నేత అనంత్ సింగ్ పై దాదాపు 28కిపైగా క్రిమినల్ కేసులున్నాయి. ఆయన ప్రాతినిథ్యం వహించే మెుకామా నియోజకవర్గం బిహార్ రాజధాని పాట్నా జిల్లాలో ఉంటుంది. అక్కడి పొలిటికల్ హీట్ సెంటర్లలో మెుకామా ఒకటి. ఆ నియోజకవర్గంలో అనంత్ సింగ్ చాలా ప్రభావవంతమైన లీడర్ అనంత్ సింగ్ ఇదివరకూ ఐదుసార్లు అక్కడినుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2022లో అక్రమ ఆయుధాల కేసులో ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం రద్దవగా తన భార్య మెుకామా నుండి పోటీ చేసి గెలిచింది. -
జైలు నుంచే జడ్జికి బెదిరింపు
లక్నో: సుమారు రూ.3,700 కోట్ల సైబర్ నేరానికి పాల్పడిన ఆరోపణలపై జైలులో ఉన్న ఓ వ్యక్తి..పోలీస్ కానిస్టేబుల్ ఫోన్ నుంచి అలహాబాద్ హైకోర్టు జడ్జికి బెదిరింపు మెయిల్ పంపించడం సంచలనం రేపింది. అనుభవ్ మిట్టల్ అనే వ్యక్తి ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో దాదాపు 7 లక్షల మందిని మోసం చేశాడు. ప్రస్తుతం లక్నో జైలులో ఉన్న ఇతడిపై ఈ మేరకు కేసు నమోదైంది. ఇతడు అజయ్ అనే పోలీస్ కానిస్టేబుల్ సెల్ ఫోన్ ద్వారా అలహాబాద్ హైకోర్టు జడ్జికి బెదిరింపు మెయిల్ పంపాడు. మరో ఖైదీని ఇరికించేందుకు మారుపేరుతో ఇతడు.. ‘లక్నో బెంచ్‌లోని ఓ జడ్జిని చంపేస్తాం’అంటూ మెసేజీ పంపాడు.దీనిపై శుక్రవారం కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కానిస్టేబుల్ అజయ్‌ని ప్రశ్నించారు. ఈ నెల 4వ తేదీన కోర్టు విచారణకు వచ్చిన మిట్టల్ వెంట కానిస్టేబుల్ అజయ్ ఉన్నాడు. తన కేస్ స్టేటస్ చూస్తానంటూ ఫోన్‌ను తీసుకున్న మిట్టల్ కొత్త మెయిల్ ఐడీ సృష్టించి బెదిరిస్తూ మెయిల్ పంపించాడు. హత్య కేసులో అదే జైలులో 2023 నుంచి ఉంటున్న తన విరోధి ఆనందేశ్వర్ అగ్రహారీని ఈ కేసులో ఇరికించేందుకు మిట్టల్ కుట్ర పన్నినట్లు తెలిందని అధికారులు తెలిపారు. -
ఈ బామ్మ రోజూ జైలుకు!
ఎనభై మూడు సంవత్సరాల అరుణ సరీన్ రోజూ జైలుకు వెళుతుంది. అలాగని ఆమె బంధువులు ఎవరూ జైలులో లేరు. గత పాతిక సంవత్సరాలుగా అరుణ జైలుకు వెళ్లడానికి కారణం ఖైదీలకు యోగా నేర్పించడం, సాధనం చేయించడం!‘చాలా మంది ఉదయం ఆలయానికి వెళ్లినట్లే నేనూ జైలుకు వెళుతుంటాను’ నవ్వుతూ అంటుంది మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు చెందిన అరుణ. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న అరుణ విపశ్యన ధ్యానప్రక్రియను సాధన చేసేది. ఆ సమయంలో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ కోర్సులకు సంబంధించి కరపత్రం ఒకటి చదివింది. ఆ కోర్సులు నేర్చుకోవడానికి రెడీ అయింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్యాంపస్‌లో ఎన్నో కోర్సులు నేర్చుకుంది. ఆ తరువాత ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్‌గా కొత్త ప్రయాణం ప్రారంభించింది.‘తొలిసారిగా జైలుకు వెళ్లినప్పుడు భయంగా ఏమీ అనిపించలేదు. జైలులో ఎలా ఉంటుందో ఆసక్తికరంగా పరిశీలించాను. ఖైదీలతో వివరంగా మాట్లాడాను. వారితో కలిసి భోజనం చేశాను. ప్రతి నిమిషం హాయిగా గడిచినట్లు అనిపించింది. యోగా, «ధ్యానం ప్రాముఖ్యత గురించి వారికి తెలియజేశాను’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటుంది అరుణ.ఆనాటి నుంచి ప్రతిరోజూ ఉదయం జైలులో నాలుగు గంటల పాటు యోగా సెషన్లు నిర్వహిస్తోంది. జబల్పూర్ మాత్రమే కాదు ఇండోర్, సాత్న, భోపాల్‌లతో పాటు మధ్యప్రదేశ్‌లోని పది కారాగారాలలో యోగా సెషన్లు నిర్వహిస్తోంది.‘హ్యాపీనెస్ ప్రోగ్రామ్’ పేరుతో తాను నిర్వహించే కార్యక్రమాల వల్ల ఖైదీల ఆలోచనా ధోరణిలో మార్పు రావడాన్ని ఆమె గ్రహించింది. చాలామంది ఖైదీలు ఎప్పుడు చూసినా నిరాశ, నిస్పృహలతో కనిపించేవారు. అలాంటి వారికి జీవనోత్సాహాన్ని కలిగించడంలో ‘హ్యాపీనెస్ ప్రోగ్రామ్’ ప్రభావం ఎంతోఉంది.‘కోర్స్ పూర్తి చేసుకున్న ఖైదీలలో ఎంతో మార్పు వచ్చింది. తగాదాలు తగ్గాయి. కొద్దిమంది ఖైదీలలో విపరీతమైన కోపం ఉండేది. ఆ కోపంలో బ్లేడ్‌తో కోసుకొని తమకు తాము హాని చేసుకునేవారు. అలాంటి వారిలో పూర్తిగా మార్పు వచ్చింది’ అంటుంది అరుణ. గతంలో కొందరు ఖైదీలు జైలు నుంచి పారి΄ోవడానికి ప్రయత్నం చేసేవారు. అలాంటి వారిలో కూడా ‘హ్యాపీనెస్ ప్రోగ్రామ్’ మార్పు తీసుకువచ్చింది. మాదకద్రవ్యాల కేసులో జైలుకు వెళ్లాడు రాజు. జైలు నుంచి విడుదలయ్యాక కూడా మళ్లీ అదే అక్రమ వ్యాపారం చేయాలనుకునేవాడు. అయితే అరుణ నిర్వహించే హ్యాపీనెస్’ కార్యక్రమంతో అతడిలో మార్పు వచ్చింది.జైలు నుంచి విడులైన రాజు మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా కూలి పనులు చేసుకొని బతుకుతున్నాడు. స్థూలంగా ‘హ్యాపీనెస్ ప్రోగ్రాం’ ద్వారా ఖైదీలకు యోగా, ధ్యానం మాత్రమే పరిచయం కాలేదు. ఉత్సాహంతో కూడిన కొత్త జీవన విధానం పరిచయం అయింది. జైలు బయట రెడ్ క్రాస్ స్వచ్ఛంద సేవకులతో కలిసి ఎన్నో సేవాకార్యక్రమాలలో పాల్గొంటుంది అరుణ. మద్యం బారిన పడిన ఎంతోమందిని ఆ దురలవాట్ల నుంచి బయటకు తీసుకువచ్చింది. ‘జైలులో నిర్వహించే హ్యాపీనెస్ ప్రోగ్రాం వల్ల ఖైదీలలో క్రమశిక్షణ పెరిగింది’ అంటున్నాడు జబల్పూర్ సెంట్రల్ జైలు సూపరిండెంట్ అఖిలేష్ తోమర్. -
మేకులు మింగిన ఖైదీలు.. వైద్యానికి సహకరించకుండా హల్చల్
చోరీ కేసుల్లో అరెస్టై సంగారెడ్డి కారాగారాంలో ఉన్న ఇద్దరు ఖైదీలు.. మేకులు,బ్యాటరీలు మింగి హల్చల్ చేసిన ఉదంతం ఇది. వివరాల్లోకి వెళితే.. చోరీ కేసులో జైలుకొచ్చిన ఛావుస్,మధు ట్రబుల్ మేకర్లుగా ఉన్నారు. రెండురోజుల క్రితం అందుబాటులో ఉన్న మేకులు, టీవీరిమోట్కు ఉండే బ్యాటరీలు మింగి గుడ్లు తేలేశారు. అప్రమత్తమైన సిబ్బంది వారిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పతత్రికి తరలించారు. ఇద్దరూ రెండ్రోజులుగా వైద్యానికి సహకరించడం లేదని దగ్గరకు వచ్చేవారిపై ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వారి కడుపులో ఉన్న బ్యాటరీలు,మేకులను శస్త్ర చికిత్స ద్వారా తొలగించాలని లేదంటే సెప్టిక్ సమస్య తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు. కడుపులో ఉంటే బ్యాటరీలు పగిలితే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని ఆస్పత్రి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయమై జైలు సూపరిటెండెంట్ కళాసాగర్ను వివరణ కోరేందుకు సాక్షి ప్రయత్నించగా ఆయన ఫోన్లో అందుబాటులో లేరు. -
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడికి 27 ఏళ్ల జైలు శిక్ష
-
జైల్లో ఉండలేకపోతున్నా.. ఒక చుక్క విషమివ్వండి: స్టార్ హీరో
కన్నడ స్టార్ హీరో దర్శన్.. జడ్జి ముందు బోరున విలపించాడు. తన అభిమాని రేణుకస్వామి అనే వ్యక్తిని హతమార్చిన కేసులో జైల్లో ఉన్న దర్శన్.. నెలవారీ హియరింగ్‌లో భాగంగా మంగళవారం జైలు నుంచే వీడియో కాల్ ద్వారా కోర్ట్ హియరింగ్‌లో పాల్గొన్నాడు. జైల్లో అస్సలు ఉండలేకపోతున్నానని, తన జీవితం దుర్భరంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు విషమివ్వాలని జడ్జిని అభ్యర్థించాడు.'నెల రోజులకు పైనే అవుతుంది. ఎండ అన్నది చూడలేదు. దీంతో నా చేతులకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేశాయి. బట్టలు కంపు కొడుతున్నాయి. ఇలా నేను బతకలేను. ఒక్క చుక్క విషం ఇవ్వండి నేను చనిపోతా. నా జీవితం దారుణంగా తయారైంది' అని దర్శన్ ముందు విలపించాడు. దీనిపై స్పందించిన జడ్జి.. 'అలాంటివి మీరు అడగకూడదు. ఇది జరగదు' అని సమాధానమిచ్చారు.(ఇదీ చదవండి: మంచు ఫ్యామిలీ నుంచి కొత్త సినిమా.. ట్రైలర్ రిలీజ్)గతేడాది తన అభిమాని రేణుకస్వామిని.. హీరో దర్శన్ హత్య చేశాడు. తన రూమర్ గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడకు సదరు రేణుకస్వామి అసభ్యకర మెసేజులు పంపుతుండటమే దీనికి కారణం. తొలుత అతడిని కిడ్నాప్ చేసిన దర్శన్.. బెంగళూరులోని ఓ షెడ్లో పెట్టి చిత్రహింసలు చేశాడు. తర్వాత రేణుకస్వామి బాడీ.. దగ్గరలోని ఓ నాళాలో దొరికింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్శన్‌తో పాటు పవిత్ర గౌడ తదితరుల్ని గతేడాది జూన్‌లో అరెస్ట్ చేశారు.అయితే కొన్ని నెలల పాటు దర్శన్ జైల్లో ఉన్నాడు. గతేడాది డిసెంబరులో కర్ణాటక హైకోర్ట్ బెయిల్ మంజూరు చేయడంతో బయటకొచ్చాడు. కానీ సుప్రీం కోర్ట్ ఆ బెయిల్‌ని రద్దు చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శన్.. బయట ఉంటే సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని, అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో మళ్లీ దర్శన్ అరెస్ట్ అయ్యాడు. తాజాగా తనకు జైలులో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని బోరున ఏడ్చేశాడు. కనీసం తలగడ, బెడ్ షీట్స్, ఇంటిలో తయారు చేసిన ఆహారం లాంటివి అయినా సరే అనుమతించాలని దర్శన్.. జడ్జిని కోరాడు.(ఇదీ చదవండి: అందుకే తమిళ సినిమాలకు రూ.1000 కోట్లు రావట్లేదు: హీరో శివకార్తికేయన్) -
అక్రమ నిర్బంధం: ఆ ఖైదీకి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వండి: సుప్రీంకోర్టు
న్యాయం దక్కడం ఆలస్యం ఐతే అసలు అది న్యాయమే కాదు.. అది దక్కినట్లే కాదన్నది భారత న్యాయ సూత్రం.. బాధితులు.. పీడితులు.. ఎవరైనా సరే వారికి సమయాన్ని బట్టి న్యాయం అందాల్సిందే.. లేకుంటే వారికి జరిగే నష్టానికి ప్రభుత్వమే పరిహారం చెల్లించాల్సి ఉంటుందని గతంలో ఎన్నోసార్లు సుప్రీం కోర్టు పేర్కొంది. ఇప్పుడు అదే క్రమంలో ఒక కేసు విషయంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఒక ముద్దాయికి న్యాయం సరిగా అందనందుకు ఏకంగా రూ. 25 లక్షల పరిహారం చెల్లించేలా ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది.తన శిక్షా కలం పూర్తయినా విడుదల కాకుండా నాలుగేళ్ల ఏడు నెలలు అదనంగా జైల్లో మగ్గిపోయిన ఒక ఖైదీకి సుప్రీంకోర్టు న్యాయం చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆ నేరస్తుడికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2005లో జరిగిన అత్యాచార కేసులో సోహన్ సింగ్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే, 2017లో మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు మార్చి, సాక్ష్యాలలో లోపాలు ఉన్నందున అతని శిక్షను కేవలం 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షగా తగ్గించింది.అయినప్పటికీ, హైకోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో సింగ్ జూన్ 2025 వరకు జైల్లోనే ఉండిపోయాడు. బెయిల్ కాలాన్ని పరిగణనలోకి తీసుకున్నా, అతను నాలుగేళ్ల ఏడు నెలలు ఎక్కువ శిక్ష అనుభవించినట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.జస్టిస్ జె.బి. పార్డివాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం మధ్యప్రదేశ్ రాష్ట్ర నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఈ కేసు దర్యాప్తు సమయంలో ప్రాసిక్యూషన్ తరఫున వకీళ్లు తప్పుడు అఫిడవిట్లు సమర్పించడం పైనా కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ నిర్లక్ష్యం ప్రజల ప్రాథమిక హక్కులకు భంగకరంగా వ్యాఖ్యానించింది.అలాగే, రాష్ట్రంలోని అన్ని జైళ్లను సమగ్రంగా పరిశీలించి, మరెవరూ ఇలాంటి అక్రమ నిర్బంధానికి గురికాకుండా చూడాలని మధ్యప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయన జైల్లో కోల్పోయిన జీవిత కాలాన్ని ఎవరూ తిరిగి తెచ్చివ్వలేరని పేర్కొంటూ ప్రభుత్వం ఆయనకు పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది.. ఈ క్రమంలో ఆయనకు రూ. 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని మధ్య ప్రదేశ్ రాష్ట్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే ఈ తీర్పును ఒక మైలు రాయిగా న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. ప్రాథమిక హక్కుల పరిరక్షణ దిశగా సుప్రీం కోర్టు వేసిన అడుగు ఒక గొప్ప ముందడుగు అని వారు అంటున్నారు.. , సిమ్మాదిరప్పన్న -
అనకాపల్లి: ఖైదీల పరారీ కేసు.. వెలుగులోకి కీలక అంశాలు
సాక్షి, అనకాపల్లి: చోడవరం జైలు నుంచి రిమాండ్ ఖైదీలు పరారీ కేసులో కీలక అంశాలు వెలుగులోకి కీలక వస్తున్నాయి. జైలు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఖైదీలు పరారీ అయినట్టు అనకాపల్లి జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా వెల్లడించారు. ఖైదీలు తప్పించుకోవడానికి సహాయం చేసిన మరో ఖైదీపై కేసు నమోదు చేశారు.చోడవరం సబ్ జైలు నుంచి పరారైన ఖైదీలను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు ఖైదీలను విశాఖలో గుర్తించిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరికి సహకరించిన రిమాండ్ ఖైదీ ఏకస్వామిపై కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. జైలు సిబ్బంది నిర్లక్ష్యంపై అధికారులు విచారణ చేపట్టారు.సినీ ఫక్కీలో వార్డెన్‌పై దాడి చేసి.. సబ్ జైలు నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీలు పరారైన సంగతి తెలిసిందే. ఐదుగురు జైలు వార్డర్లు, రక్షణ గేట్లు తప్పించుకుని వారు పారిపోయారు. పింఛన్ డబ్బులు కాజేసిన కేసులో పంచాయతీ సెక్రటరీ నక్కా రవికుమార్, చోరీ కేసులో ఖైదీలుగా అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలులో ఉన్నారు. వీరిద్దర్నీ జైలులో ఖైదీలకు వంట చేయడానికి వినియోగిస్తున్నారు. రోజూలాగే శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సబ్ జైలులో వంట చేసేందుకు వీరిని జైలు గదిలోంచి బయటకు తీసుకొచ్చారు. వంటకు ఉపక్రమించే సమయంలో ముగ్గురు వార్డర్లు లోపల, ఒక వార్డరు మెయిన్ గేటు వద్ద సబ్ జైలర్ తన గదిలో విధి నిర్వహణలో ఉన్నారు.ఆ సమయంలో నక్కా రవికుమార్ మెయిన్ గేటుకు లోపల గ్రిల్ గేటుకు మధ్య విధి నిర్వహణలో ఉన్న వార్డర్ వీర్రాజుపై సుత్తితో దాడి చేశాడు. అనంతరం ఆయన జేబులో ఉన్న తాళాలు లాక్కొని.. మెయిన్ గేటు తాళం తీసి పారిపోతుండటం చూసి, మరో ఖైదీ రాము కూడా పరారయ్యాడు. పారిపోతున్న వారిని పట్టుకునేందుకు జైలు వార్డర్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చోడవరం తహసీల్దార్ కార్యాలయం ఆవరణ మీదుగా ఖైదీ లు మెయిన్ రోడ్డుకు చేరుకుని పరారయ్యారు. అనంతగిరి మండలం బోకూరు పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌లో పింఛన్ డబ్బులు కాజేసిన కేసులో రవికుమార్ కు పాడేరు కోర్టు రిమాండ్ విధించించింది. బెజవాడ రాము ఈ ఏడాది జులై 23వ తేదీన మాడుగులలో దొంగతనం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. -
ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరైనా ఒక్కటే రూల్ : మోదీ
-
Peddireddy: చెప్పినా పోలీసులు వినట్లేదు జైల్లో మిథున్ రెడ్డి పరిస్థితి..
-
దివ్యాంగుడి కుమార్తెకు ఎస్ఐ బెదిరింపులు
సాక్షి, చిత్తూరు జిల్లా: ‘ఏయ్.. ఎందుకు వీడియోలు తీస్తావ్.. పో.. చెప్పుకో పో.. నా విధులకు ఆటంకం కలిగిస్తే.. నీకు మెడికల్ సీటు రాదు.. జైలుకు పంపిస్తా. తమాషా అనుకుంటున్నావా’.. అంటూ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఎస్ఐ ఓ దివ్యాంగుడి కుమార్తెను బెదిరించారు. వివరాలివీ.. బంగారుపాళ్యం మండలం కరిడివారిపల్లికి చెందిన సుందరరాజు అనే దివ్యాంగుడుకి, హోంగార్డు కన్యాకుమార్ అనే వ్యక్తి మధ్య భూవివాదం తలెత్తింది. ఈ క్రమంలో పోలీసులు హోంగార్డుకు వత్తాసు పలుకుతున్నారని దివ్యాంగుడి కుమార్తె వాణి ఆగ్రహం వ్యక్తంచేసింది. పోలీసులు వచ్చే క్రమంలో వీడియో తీసింది. దీంతో ఎస్ఐ.. ‘ఏయ్ ఎందుకు వీడియోలు తీస్తున్నావ్..’ అంటూ వాణిని అడ్డుకోబోయారు. ఎందుకు నా ఫోన్ లాక్కున్నారంటూ వాణి పోలీసులను ప్రశి్నంచింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాననడంతో.. ‘పో.. చెప్పుకో.. పో.. నా విధులకు ఆటంకం కలిగిస్తే నీకు మెడికల్ సీటు రాకుండా చేస్తా. జైలుకు పంపిస్తా. తమాషా చేస్తున్నావా’.. అంటూ ఆ యువతిపై ఎస్సై మండిపడ్డారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎస్ఐ తీరుపై వికలాంగుల సంఘాలు మండిపడుతున్నాయి. -
జైలుకు పంపిస్తా.. మెడికల్ సీటు రాకుండా చేస్తా..!
-
గుంటూరు జైలు నుంచి తురకా కిషోర్ విడుదల
సాక్షి, గుంటూరు: జిల్లా జైలు నుంచి వైఎస్సార్సీపీ నాయకుడు, మాచర్ల మునిసిపాలిటీ మాజీ చైర్మన్ తురకా కిషోర్ శుక్రవారం విడుదలయ్యారు. 215 రోజుల నుంచి కిషోర్‌ను జైల్లో ఉంచిన కూటమి ప్రభుత్వం. ఆయనపై మొత్తం 12 అక్రమ కేసులు బనాయించింది. మొత్తం 12 కేసుల్లో 11 కేసులు హత్యయత్నం కేసులు, ఒక పీడీ యాక్ట్‌ను చంద్రబాబు సర్కార్ బనాయించింది.ఆరేళ్ల క్రితం జరిగిన ఘటనపై తాజాగా కిషోర్‌పై కేసు నమోదు చేసి పీటీ వారింట్ ద్వారా అరెస్టు చూపించిన ప్రభుత్వం.. జైలు నుంచి బయటికి రానివ్వకుండా చేసింది. కిషోర్‌పై పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెంట చింతల పోలీసులు నమోదు చేసిన కేసులో కిషోర్‌ది అక్రమ అరెస్టు అని హైకోర్టు తేల్చి చెప్పింది.తురకా కిషోర్‌పై కేసుల మీద కేసులు పెడుతూ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎప్పుడో ఏడాదిన్నర క్రితం ఘటన జరిగితే ఇప్పుడు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన వ్యవహారంలో అటు పోలీసులు, ఇటు మేజిస్ట్రేట్ తీరును హైకోర్టు తప్పుపట్టింది. కిషోర్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. ఆయన అరెస్ట్ సీఆర్పీసీ, బీఎన్ఎస్ఎస్ నిబంధనలతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాలకు సైతం విరుద్ధమని తేల్చిచెప్పింది. ఇందులో ఎలాంటి సందేహం లేదంది.కిషోర్ రిమాండ్ విషయంలో మేజిస్ట్రేట్ మెదడు ఉపయోగించలేదని ఆక్షేపించింది. బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయలేదు కాబట్టి, రిమాండ్ విధిస్తున్నట్లు పేర్కొన్న మేజి్రస్టేట్, ఈ విషయంలో తన సంతృప్తిని ఎక్కడా రికార్డ్ చేయలేదని పేర్కొంది. కిషోర్ విడుదల ఈ వ్యాజ్యంలో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్‌తో కూడిన ధర్మాసనం గురువారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో గుంటూరు జిల్లా జైలు నుంచి ఇవాళ(శుక్రవారం) తురకా కిషోర్ విడుదలయ్యారు. -
తురుకా కిషోర్ విడుదల
-
విమానాశ్రయంలో చేతివాటం : అమెరికన్ డెంటిస్ట్, ఇంజనీర్ భార్యకు జైలు
సింగపూర్‌లోని విమానాశ్రయంలో లగ్జరీ వస్తువులను దొంగిలిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా ఒక అమెరికన్ జంట పట్టుబడింది. పైగా వీరిద్దరూ మామూలు సిటిజన్స్కాదు, ఇద్దరూ గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నవారు. కానీ కక్కుర్తి పడ్డారు అదీ కఠినమైన చట్టాలు, జీరో టోలరెన్స్ నియమాలకు పెట్టింది పూరైన సింగపూర్ విమానాశ్రయంలో. చివరకు పోలీసులక చిక్కి కటాకటాల ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.కపాడియా హుస్సేన్ జోహెర్ (35), కపాడియా అమతుల్లా (30) ఇద్దరూ భార్యాభర్తలు. జోహెర్ దంతవైద్యుడిగా పనిచేస్తుండగా, అమతుల్లా ఇంజీనీర్గా ఉన్నారు. ఈ జంట సింగపూర్ విమానాశ్రయంలో విలాసవంతమైన వస్తువులను దొంగిలిస్తూ దొరికి పోయారు. అమెరికా జాతీయులైన ఈ జంట జూన్ 23న చాంగి విమానాశ్రయంలోని చాంగి విమానాశ్రయం టెర్మినల్ 1లోకి ప్రవేశించిన తర్వాత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చోరీకి పాల్పడ్డారు. భారతదేశానికి కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కడానికి ముందు విమానాశ్రయంలో లూయిస్ విట్టన్ అండ్ డియోర్ నుండి 750 డాలర్లు (సుమారు రూ.65,790) ఎక్కువ విలువైన వస్తువులను దొంగిలించారని పోలీసుఅధికారులు తెలిపారు. విమానాశ్రయం లోపల ఉన్న సీసీటీవీ ఆధారంగా ఇద్దరిని విచారించి దొంగతనం చేసిన అధికారులు జైలు శిక్ష ఖరారు చేశారు. జొహెర్కు 18 రోజుల జైలు , అతని భార్యఅమతుల్లాకు వారం రోజుల జైలు శిక్ష విధించారు.చదవండి: 5 నెలల్లో 28 కిలోలు : అమీర్ ఖాన్ అద్భుత చిట్కాలు600 డాలర్ల విలువైన క్రెడిట్ కార్డ్ హోల్డర్‌ను, ది షిల్లా బ్రాండ్ కాస్మెటిక్స్ & పెర్ఫ్యూమ్స్ షాపులో డియోర్ సావేజ్ పెర్ఫ్యూమ్ బాటిల్‌ను జేబులో వేసుకున్నాడు. డబ్బు చెల్లించకుండా దుకాణం నుండి వెళ్లిపోయాడు. తన చోరీని ఎవరు చూడకుండా ఉండేందుకు భార్యను కాపాలాగా ఉంచాడు. తమ పని కానిచ్చి, ఏమీ తెలియనట్టు ముంబై విమానం ఎక్కి కామ్‌గా కూర్చుకున్నారు. కానీ పోలీసులకు చిక్కక తప్పలేదు. విమానం టేకాఫ్‌కు ముందే పోలీసులు వారిని అరెస్ట్ చేయడం విశేషం. జోహెర్ ఎక్కువ ఖర్చు చేసే అలవాటు ఉందనీ, దురాశతో దొంగతనం చేశాడని ప్రాసిక్యూటర్ తెలిపారు. దొంగిలించబడిన రెండు వస్తువులను స్వాధీనం చేసుకుని సంబంధిత దుకాణాలకు తిరిగి ఇచ్చారు. కాగా సింగపూర్లోచట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. కఠినమైన చట్టాల కారణంగా సింగపూర్ ప్రపంచంలోనే అత్యల్ప నేరాల రేటు కలిగిన దేశాలలో ఒకటి. చూయింగ్ గమ్, ఇ-సిగరెట్లు, పబ్లిక్ టాయిలెట్‌ను ఫ్లష్ చేయకపోవడం లాంటివి కూడా ఇక్కడ నేరంగా పరిగణిస్తారు. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన వారికి సుదీర్ఘ జైలు శిక్ష, 24 కొరడా దెబ్బలు శిక్ష అనుభవించాలి. చట్టవిరుద్ధమైన పదార్థాలను విక్రయించే ఎవరికైనా ఇక్క మరణశిక్ష తప్పదు.ఇదీ చదవండి: Sravana Sukravaram: ‘శ్రావణ లక్ష్మీ రావే మా ఇంటికి’... సెల్ఫీ షేర్ చేయండి! -
జైలు గోడల మధ్య ప్రజ్వల్..‘నేను హైకోర్టుకు వెళతా’అంటూ ఆవేదన..
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ కీలక నేత హెచ్డీ రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణకు జీవితఖైదు విధిస్తూ ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం జీవితఖైదు విధిస్తూ తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుతో ప్రజ్వల్ బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. శిక్షలో భాగంగాప్రజ్వల్ తొలిరోజే.. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. తాను హైకోర్టును ఆశ్రయిస్తానని జైలు సిబ్బందితో అన్నట్లు తెలుస్తోంది.జైలు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..జీవిత ఖైదు శిక్షలో భాగంగా తొలిరోజు రాత్రంతా ఒత్తిడితో గురయ్యారు. వైద్య పరీక్షల సమయంలో తనకు జైలు శిక్ష పడడంపై కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. ఇక, ప్రజ్వల్ రేవణ్ణకు జైలు అధికారులు ఖైదీ నంబర్ 15528 కేటాయించారు. రోజువారీ వేతనం రూ. 524 చెల్లించనున్నారు. రోజుకు ఎనిమిది గంటల పాటు జైల్లో బేకరీ, తోటపని, హస్తకళలు వంటి విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది.ఇక జైలు నిబంధనల ప్రకారం ప్రజ్వల్‌కు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల సమయంలో ఆయన తీవ్ర వేదనకు గురైనా.. ఆరోగ్యం బాగుందని వైద్యులు వెల్లడించారు. మాజీ ఎంపీ కాబట్టి హై-సెక్యూరిటీ సెల్లో ఉంచారు. ప్రిజన్ యూనిఫాం ధరించారు.ప్రజ్వల్ రేవణ్ణ కేసు ఏంటంటే?కాగా ప్రజ్వల్ రేవణ్ణకు జీవితఖైదు విధిస్తూ ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. ప్రజ్వల్‌పై రూ.11.50 లక్షల జరిమానా సైతం కోర్టు విధించింది. ఈ రూ.11.50 లక్షల్లో బాధిత మహిళకు రూ.11.25 లక్షలు చెల్లించాలని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ ఆదేశించారు.పలు ఐపీసీ సెక్షన్లతోపాటు ఐటీ చట్టం కింద నిందితుడిని ఈ శుక్రవారం దోషిగా నిర్ధారించిన కోర్టు శనివారం శిక్షను ప్రకటించింది. మైసూరు జిల్లా కేఆర్ నగర ప్రాంతానికి చెందిన 48 ఏళ్ల మహిళపై 34 ఏళ్ల ప్రజ్వల్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆ దారుణాన్ని సెల్ఫోన్లో చిత్రించి బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. హోలెనరసింహపుర జిల్లాలోని హాసన పట్టణంలోని గన్నికడ ఫామ్‌హౌస్‌లో ఈ దారుణం జరిగిందని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదుచేసిన పోలీసులు దాదాపు 14 నెలల క్రితం ప్రజ్వల్‌ను అరెస్ట్చేయడం తెల్సిందే.కోర్టు ఏకంగా జీవితఖైదు విధించడంతో కోర్టు హాల్లోనే ఉన్న దోషి ప్రజ్వల్ ఒక్కసారిగా ఏడ్వడం మొదలెట్టాడు. ‘‘నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన మెరిట్ విద్యార్థిని. పార్లమెంట్ సభ్యునిగా మంచి పనులు చేశా. నాపై ఇంతవరకు నమోదైన రేప్ కేసుల్లో ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి నాపై కేసు వేయలేదు. వేగంగా రాజకీయాల్లో పైకి ఎదిగానన్న కక్షతో నాపై కేసులు మోపారు. నేనింతవరకు ఏ తప్పూ చేయలేదు. రాజకీయాల్లో ఎదగడమే నేను చేసిన తప్పు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికలకు కేవలం ఆరు రోజుల ముందు దురుద్దేశంతో నాపై లైంగిక ఆరోపణలు మొదలయ్యాయి.బాధితురాలిగా చెబతున్న మహిళ తన భర్త, కుటుంబసభ్యులకు కూడా తనకు అన్యాయం జరిగిందని అసలు చెప్పనే లేదు. ఉద్దేశపూర్వకంగా నాపై తప్పుడు ఫిర్యాదుచేశారు. నాకూ కుటుంబం ఉంది. కనీసం ఆరు నెలల నుంచి కన్న తల్లిదండ్రులను చూడలేకపోయా. నాకు తక్కువ శిక్ష విధించండి’’అని ప్రజ్వల్ ఏడుస్తూ జడ్జీని వేడుకున్నాడు. కేసు నమోదువేళ జర్మనీకి పారిపోయిన ఆనాటి ఎంపీ ప్రజ్వల్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పోలీసులు గత ఏడాది మే 31వ తేదీన బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్‌చేశారు. 113 మంది సాక్షుల నుంచి వాంగ్మూలాలు తీసుకుని బలమైన ఆధారాలు సంపాదించారు. 1,632 పేజీలతో చార్జ్‌షీట్‌ను గతంలో కోర్టుకు సమర్పించారు. ఐటీ చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద నమోదైన అన్ని అభియోగాలపై కోర్టు ఏకీభవించిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ నాయక్, అదనపు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీఎన్ జగదీశ చెప్పారు. -
జైల్లో మిథున్ రెడ్డి పరిస్థితిని చూసి కన్నీటి పర్యంతమైన తల్లి స్వర్ణలత
-
Pakistan: ఇమ్రాన్ ఖాన్‌కు కోలుకోలేని దెబ్బ.. ఏడుగురు పీటీఐ నేతలకు పదేళ్ల జైలు
ఇస్లామాబాద్: పాక్ న్యాయస్థానం నుంచి పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ ఇమ్రాన్‌కు కోలుకోలేని దెబ్బ పడింది. దేశంలో గతంలో జరిగిన అల్లర్ల కేసుల్లో ఏడుగురు పీటీఐ నేతలకు పదేళ్ల జైలు శిక్ష విధించారు. 2023, మే 9న పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్టు దరిమిలా దేశంలోని సైనిక స్థావరాలు, ప్రభుత్వ యాజమాన్యంలోని భవనాలపై పీటీఐ నేతలు దాడులకు తెగబడ్డారు. ఈ నేపధ్యంలో పలువురు నేతలతో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ అల్లర్ల కేసులో లాహోర్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు (ఏటీసీ) తాజాగా పీటీఐకి చెందిన ఏడుగురు సీనియర్ నేతలకు పదేళ్ల జైలుశిక్ష విధించింది. కోర్టు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం జైలు శిక్ష పడిన నేతలలో సెనేటర్ ఎజాజ్ చౌదరి (పార్టీ సీనియర్ మహిళా నేత) సర్పరాజ్ చీమా (పంజాబ్ మాజీ గవర్నర్), డాక్టర్ యాస్మిన్ రషీద్ (పంజాబ్ మాజీ ఆరోగ్య మంత్రి) , మెహమూదూర్ రషీద్ (మాజీ మంత్రి) న్యాయవాది అజీమ్ పహత్ (పార్టీ న్యాయ సలహాదారు) ఉన్నారు. మరో ఇద్దరు నేతలు కూడా శిక్ష పడినవారిలో ఉన్నారు. అయితే పలు మీడియా నివేదికలు ఐదుగురి పేర్లను హైలైట్ చేశాయి. ఈ కేసులో పీటీఐ వైస్ చైర్మన్, మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.మరో కేసులో పంజాబ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత మాలిక్ అహ్మద్ ఖాన్ భచర్, పీటీఐ పార్లమెంటేరియన్ అహ్మద్ చట్టా, మాజీ శాసనసభ్యుడు బిలాల్ ఎజాజ్లకు పదేళ్ల జైలు శిక్ష విధించారు. నాడు జరిగిన అల్లర్ల తర్వాత పోలీసులు వేలాది మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు. ఇమ్రాన్‌ఖాన్ 2023, ఆగస్టు నుండి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. పీటీఐ నేతలకు విధించిన శిక్షను ఫెడరల్ ప్రభుత్వం స్వాగతించింది. దీనిని సానుకూల చర్యగా అభివర్ణించింది. కాగా పీటీఐ పంజాబ్ చాప్టర్ హెడ్ అలియా హంజా, సీనియర్ నేత బాబర్ అవాన్, శాసనసభ్యుడు అసద్ కైసర్ ఈ శిక్షలను ఖండించారు. ఈ కేసులలో చట్టపరమైన విధానాలను అనుసరించలేదని, విశ్వసనీయ సాక్షులను హాజరుపరచలేదని వారు ఆరోపించారు. -
కనిపించని పశ్చాత్తాపం.. జైలు జీవితం బాగుందంటున్న సోనమ్
షిల్లాంగ్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయా హనీమూన్ కేసులో నిందితురాలు సోనమ్ రఘవంశీకి జైలు జీవితం బాగుందని సమాచారం.పెళ్లైన 11 రోజులకే హనీమూన్ పేరుతో మేఘాలయకు తీసుకెళ్లిన భర్త రాజా రఘువంశీని అప్పటికే మాట్లాడి పెట్టుకున్న సుపారీ గ్యాంగ్‌తో సోనమ్ రఘువంశీ హత్య చేయించింది. ఇదే కేసులో మేఘాలయా షిల్లాంగ్ జైలులో శిక్షను అనుభవిస్తోంది.నెల రోజుల జైలు శిక్ష పూర్తి చేసుకున్న క్రమంలో ఈక్రమంలో జైల్లో ఉన్న సోనమ్ రఘువంశీ గురించి ఆరా తీయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. జైలు నిబంధనల ప్రకారం.. జైల్లో ఉన్న సోనమ్‌ను చూసేందుకు ఆమె కుటుంబసభ్యులకు అనుమతి ఉంది. కానీ ఆమెను చూసేందుకు ఎవరూ రాలేదు. భర్తను చంపేశానన్న పశ్చాత్తాపం సోనమ్‌లో లేదు. జైలు వాతావరణానికి తగ్గట్లు తనని తాను మార్చుకుంది. ఇతర మహిళా ఖైదీలతో కలిసిపోతుంది. జైలు నిబంధనల ప్రకారం.. సమయపాలన పాటిస్తోంది. ప్రతి రోజూ టైం ప్రకారం నిద్ర లేస్తోంది. అయితే, తన వ్యక్తిగత జీవితం, భర్తను హత్య చేయించిన విషయాల గురించి జైలు సిబ్బందితో,తోటి ఖైదీలతో మాట్లాడడం లేదని సమాచారం.ఇక సోనమ్‌ను జైలు అధికారులు జైలు వార్డెన్ సమీపంలో ఆమెకు గదిని కేటాయించారు. ఆ గదిలో ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళ ఖైదీలు రూమ్‌ను షేర్ చేసుకుంటున్నారు. సోనమ్ కుట్టుమిషను ఇతర స్కిల్ సంబంధిత పని నేర్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ప్రతి రోజు తప్పని సరిగా టీవీ చూస్తున్నట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. షిల్లాంగ్ జైలులో మొత్తం 496 మంది ఖైదీలు ఉన్నారు. వారిలో 20 మంది మహిళలు. సోనమ్ జైలులో హత్య కేసులో నిందితురాలైన రెండవ మహిళా ఖైదీ.ఆమెను సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. -
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావుకు జైలుశిక్ష
-
జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదల
-
Vallabhaneni Vamsi: అన్ని కేసుల్లో బెయిల్.. నేడే విడుదల..!
-
విజయవాడ: జైలులో వల్లభనేని వంశీకి అస్వస్థత
సాక్షి, విజయవాడ: జిల్లా జైలులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. జిల్లా జైలు అధికారులు.. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వంశీని తరలించారు. వాంతులు, విరోచనాలు, డీ హైడ్రేషన్‌తో వంశీ బాధ పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వంశీ ఆరోగ్య విషయమై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. ఆయన గత నెలలో కూడా తీవ్ర అస్వస్థత గురయ్యారు. ఆయుష్ ఆసుపత్రిలో వల్లభనేని వంశీకి చికిత్స అందించిన ఆయుష్ ఆస్పత్రి వైద్యులు పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, కార్డియాలజీకి సంబంధించిన టెస్టులు చేశారు. పలు రక్త పరీక్షలతో స్లీప్ మానిటరింగ్ టెస్ట్, ఎమ్మారై నిర్వహించారు. అయితే, ఆయుష్ ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన టెస్టుల్లో వంశీ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల నీరు చేరినట్లు నిర్థారించారు.ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల వంశీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన వల్లభనేని వంశీ ఆస్పత్రి నుంచి సోమవారం (జూన్2న) డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం వంశీని పోలీసులు జిల్లా జైలుకు తరలించారు.కాగా, వల్లభనేని వంశీకి వైద్య సాయం అందకుండా ఇబ్బందులు పెడుతున్న పోలీసులకు, జైలు అధికారులకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వంశీకి ప్రభుత్వ ఆసుపత్రిలో కాకుండా విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో వైద్య సాయం అందించాలని స్పష్టం చేసింది. వంశీ ఆరోగ్య పరిస్థితిపై పూర్తిస్థాయి నివేదిక తమకు ఇవ్వాలని ఆయుష్ ఆసుపత్రి డైరెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. -
పాకిస్తాన్ జైలు నుంచి 216 మంది ఖైదీలు పరార్
కరాచీ: పాకిస్తాన్‌లోని కరాచీలో మాలిర్ జైలు నుంచి 216 మంది ఖైదీలు తప్పించుకున్నారు. వీరిలో 80 మందిని తిరిగి అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా మంగళవారం వెల్లడించింది. కరాచీ ప్రాంతంలో భూకంపం సంభవించడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం రాత్రి మాలిర్ జైలు నుంచి ఖైదీలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండగా తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక ఖైదీ మరణించాడు. ముగ్గురు భద్రతా సిబ్బందితోపాట జైలు అధికారి ఒకరు గాయపడ్డారు. భూకంపం తర్వాత జైలు బ్యారక్ల నుంచి 600 మందికిపైగా ఖైదీలను బయటకు తీసుకురాగా, 216 మంది పరారయ్యారు. 80 మందిని మళ్లీ అదుపులోకి తీసుకోగలిగారు. పరారీలో ఉన్న మిగతా ఖైదీల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇంకా 136 మందిని పట్టుకోవాల్సి ఉందని అధికారులు చెప్పారు. అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన మాలిర్ జైలులో మొత్తం 6,000 మంది ఖైదీలు ఉన్నారు. -
అప్పుడు రూ. 3500కోట్ల వ్యాపార సామ్రాజ్యం: ఇప్పుడు 20ఏళ్ల జైలు జీవితం
కృషి, పట్టుదలతో సాధించిన విజయాలు ఎందరికో మార్గదర్శకం అవుతాయి. మరికొన్ని సంఘటనలు ఊహకందని మలుపులు తిరుగుతూ అదఃపాతాళానికి తొక్కేస్తాయి. కారణం ఏదైనా.. కర్త మాత్రం ఫలితాన్ని తప్పకుండా అనుభవించాల్సిందే. ఇలాంటి కోవకు చెందిన ఓ వ్యక్తి గురించి ఈ కథనంలో చూసేద్దాం.ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి 'సుబ్రమణియన్' ఒక ప్రతిభావంతులైన ఇంజనీర్.. బ్యాంకర్ కూడా. జీరోతో మొదలై వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన ఈయన కారాగారంలో ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది. 1991లో విశ్వప్రియ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీని స్థాపించిన ఈయన.. లాభాలను గడించారు.రూ. 137 కోట్ల పెట్టుబడిసుబ్రమణియన్ ప్రారంభించిన విశ్వప్రియ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫైనాన్షియల్ సంస్థ.. ప్రైమ్ ఇన్వెస్ట్, అసెట్ బ్యాక్డ్ సెక్యూరిటీ బాండ్, లిక్విడ్ ప్లస్, సేఫ్టీ ప్లస్ వంటి పథకాలను ప్రసిద్ధి చెందింది. ఈ పథకాలన్నీ ఇతర బ్యాంక్ డిపాజిట్లు లేదా పెట్టుబడి ఎంపికల కంటే గణనీయంగా అధిక రాబడికి హామీ ఇచ్చాయి. వీటన్నింటికీ ఆకర్షితులైన.. సుమారు 587 మంది పెట్టుబడిదారులు ఏకంగా రూ. 137 కోట్ల పెట్టుబడిగా పెట్టారు. ఇందులో ఎక్కువగా మధ్యతరగతి వ్యక్తులు, చిన్న వ్యాపార యజమానులు, పదవీ విరమణ చేసినవారే ఉన్నారు.సుభిక్షకు మద్దతువిశ్వప్రియ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫైనాన్షియల్ సంస్థను ప్రారంభించిన తరువాత 1997లో 'సుభిక్ష' అనే రిటైల్ సంస్థను సుబ్రమణియన్ స్టార్ట్ చేశారు. ఇది భారతదేశంలో ఏకంగా 1600 కంటే ఎక్కువ అవుట్లెట్లకు విస్తరించింది. కంపెనీ విలువ రూ. 3,500 కోట్లకు చేరుకుంది. అజీమ్ ప్రేమ్‌జీ, ఐసిఐసిఐ వెంచర్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి హై-ప్రొఫైల్ పెట్టుబడిదారులు కూడా సుభిక్షకు మద్దతు ఇచ్చారు.ఇదీ చదవండి: 'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకిఅన్నీ సవ్యంగా సాగుతున్నాయనుకుంటున్న సమయంలో.. పెట్టుబడిదారుల నిధులను సుబ్రమణియన్ షెల్ కంపెనీలకు మళ్లించారు. ఇదే ఈయన జీవితాన్ని మలుపుతిప్పి కష్టాల సుడిగుండంలోకి తీసుకెళ్లింది. 2008లో సుబ్రమణియన్ తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరుకున్నారు. దీంతో పెట్టుబడిదారులకు కూడా రిటర్న్స్ ఇవ్వలేకపోయాడు. దీంతో వారంతా కోర్టును ఆశ్రయించారు. 2009లో సుభిక్ష క్లోజ్ అయింది. దీంతో సుబ్రమణియన్ విశ్వసనీయత కుప్పకూలింది.20 సంవత్సరాల జైలు శిక్ష10 సంవత్సరాలుగా స్వచ్ఛంద డిపాజిట్లు చేయడంలో విఫలమయ్యారని, అన్ని కార్యక్రమాలలో డిపాజిటర్లకు చెల్లించాల్సిన రూ.137 కోట్లకు పైగా చెల్లింపులు చేయలేకపోయారని తెలిసింది. దీంతో నవంబర్ 2023లో, తమిళనాడులోని చెన్నైలోని ఒక ప్రత్యేక కోర్టు వందలాది మంది పెట్టుబడిదారులను మోసం చేసినందుకు 'సుబ్రమణియన్'ను దోషిగా నిర్ధారించి.. అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. -
బాంబులు గుర్తింపు.. జమ్ముకశ్మీర్‌లో జైళ్లకు భద్రత పెంపు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉన్న జైళ్లపై ఉగ్ర దాడికి కుట్ర జరుగుతున్నట్టు సమాచారం. జైళ్లపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. తాజాగా పూంజ్ జిల్లాలో ఉగ్రవాదులు అమర్చిన ఐదు ఐఈడీ బాంబులను భద్రతా బలగాలు గుర్తించాయి. వాటిని నిర్వీర్యం చేశాయి. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్, శ్రీనగర్‌లో భద్రతను ప్రభుత్వం పెంచింది. జైళ్ల భద్రతపై ఉన్నతాధికారులతో సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ సమీక్ష నిర్వహించారు. కాగా, 2023 నుంచి CISF జైళ్ల భద్రతను పర్యవేక్షిస్తోంది. కాగా, కశ్మీర్ జైళ్లలో ఉన్న హైప్రొఫైల్ ఉగ్రనాయకులను విడిపించేందుకు భారీ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. ఈక్రమంలో శ్రీనగర్ సెంట్రల్ జైల్, కోట్ బాల్వాల్ జైల్, జమ్మూలోని జైళ్లకు భారీఎత్తున భద్రత కల్పించారు. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా చాలామంది స్లీపర్ సెల్స్, ఓవర్ గ్రౌండ్ వర్కర్లను తీసుకొచ్చి ఈ జైళ్లలో ఉంచారు. వీరితోపాటు ఆర్మీ వాహనంపై దాడి కేసులో నిందితులైన నిస్సార్, ముష్తాక్ సహచరులను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది. ఈనేపథ్యంలో జైళ్లపై దాడి జరగొచ్చనే సమాచారం నిఘా వర్గాలకు చేరింది.ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఏమాత్రం చల్లారడం లేదు. దాయాది కవ్వింపు చర్యలు ఆగడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం వరుసగా కాల్పులకు తెగబడింది. జమ్ము కశ్మీర్లో కుప్వారా, పూంచ్, రాజౌరీ, మేంధార్, నౌషేరా, సుందర్బనీ, అఖ్తర్ తదితర 8 ప్రాంతాల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. వాటిని సైన్యం గట్టిగా తిప్పికొట్టింది.దీర్ఘకాల సెలవులు రద్దుఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల సిబ్బందికి దీర్ఘకాల సెలవులు రద్దు చేస్తూ మ్యునీషియన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్) ఆదేశాలు జారీ చేసింది. ఎంఐఎల్ పరిధిలో 12 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలున్నాయి. సైన్యానికి అవసరమైన ఆయుధాలు వాటిలో తయారవుతాయి. ఆయుధ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికే సెలవులు రద్దు చేసినట్లు ఎంఐఎల్ అధికారి ఒకరు చెప్పారు. -
జైల్లో వల్లభనేని వంశీకి అస్వస్థత
సాక్షి, విజయవాడ: జైలులో వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. జిల్లా జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి జైలు సిబ్బంది తీసుకొచ్చారు. గుండె సంబంధిత టెస్టులతో పాటు, బ్లడ్ టెస్ట్‌లను ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చేశారు. వైద్య పరీక్షల అనంతరం జిల్లా జైలుకు తరలించారు. -
మీరట్ కేసు.. నిందితురాలికి జైల్లో స్పెషల్ సదుపాయాలు
మీరట్: మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న నిందితురాలు, అతడి భార్య ముస్కాన్ రస్తోగిని జైల్లోని ప్రత్యేక ప్రసూతి బ్యారక్‌లోకి మార్చడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆమెతో పాటు గర్భంతో ఉన్న మరో మహిళా ఖైదీని కూడా తరలించనున్నారు.ప్రస్తుతం ఆరు వారాల గర్భవతిగా ఉన్న ముస్కాన్ రాస్తోగిని గర్భిణీ ఖైదీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యారక్‌లోకి పంపనున్నట్లు జైలు అధికారి తెలిపారు. బిడ్డ జన్మించేంత వరకు ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ముస్కాన్ రస్తోగికి ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమె గర్భం దాల్చినట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. దీనిపై హత్య గావించబడ్డ సౌరభ్ సోదరుడు మాత్రం.. ముస్కాన్‌కు పుట్టబోయే బిడ్డ సౌరభ్ రక్తం అయితే తాము తప్పకుండా పెంచుకుంటామన్నాడు.సౌరబ్ రాజ్‌పుత్ సోదరుడు బబ్లూ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. ముస్కాన్ కు పుట్టబోయే బిడ్డ మా అన్నకు సంబంధించిన బేబీ అయితే మేము కచ్చితంగా పెంచుకుంటాం. అన్నీ చూసుకుంటాం.’ అని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ముస్కాన్, సాహిల్‌లు ఇద్దరూ మీరట్ జిల్లా జైల్లో వేర్వేరు బారక్‌ల్లో ఉంటున్నారు. తాము కలిసి ఉంటామని ఒకే బారక్ ఇవ్వమని డిమాండ్ చేసినా జైలు రూల్స్ ఒప్పుకోవమని చెప్పి వారికి సెపరేట్ రూమ్‌లే కేటాయించారు అధికారులు.కాగా, సౌరభ్ రాజ్‌పుత్, ముస్కాన్‌లు 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు మర్చంట్ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత సాహిల్(25)తో ముస్కాన్ వివాహేతర సంబంధం పెట్టుకొంది. దీనిపై వారు విడాకుల వరకు వెళ్లారు. కానీ, కుమార్తె కోసం సౌరభ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తర్వాత ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిన అతడు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమార్తె పుట్టినరోజు కోసం తిరిగొచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అతడి శరీరాన్ని ముక్కలు చేసి.. వాటిని ఓ డ్రమ్ములో వేసి సిమెంట్‌తో సీల్ చేసింది. -
అమ్మా.. కాసేపు పడుకుంటా! అని శాశ్వత నిద్రలోకి..
‘‘అమ్మా.. ఇక సెలవు.. శాశ్వతంగా నిద్రలోకి జారుకుంటున్నా’’ అంటూ ఓ కొడుకు రాసిన సూసైడ్ లెటర్ ఆ తల్లిని తల్లడిల్లిపోయేలా చేసింది. ఉత్తర ప్రదేశ్ బరేలీలో బుధవారం ఘోరం జరిగింది. భర్తపై కక్ష గట్టి మరీ ఆ భార్య అతని కటకటాలపాలు చేసింది. అది భరించలేకపోయిన ఓ భర్త.. పైగా ఆ విషయం సోషల్ మీడియాకు కూడా చేరడంతో అఘాయిత్యానికి పాల్పడ్డాడు.రాజ్ ఆర్య, సిమ్రాన్లకు ఏడాది కిందట వివాహం జరగ్గా.. ఈ జంటకు నెలల బాబు ఉన్నాడు. అయితే గతకొంతకాలంగా ఆ కాపురంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో తన సిమ్రాన్ పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఓ వివాహ వేడుకకు భార్యతో పాటు హాజరు కావాల్సిన పరిస్థితి రావడంతో రాజ్, అతని తండ్రి షాహ్జన్పూర్లోని సిమ్రాన్ ఇంటికి వెళ్లాడు. అయితే సిమ్రాన్‌ను పంపించేందుకు ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుని సిమ్రాన్ సోదరులంతా రాజ్, అతని తండ్రిపై దాడి చేశారు. దీంతో చేసేది లేక ఆ ఇద్దర బరేలీకి తిరిగి వచ్చారు. ఈలోపు..ఇంటికొచ్చి మరీ తన కుటుంబ సభ్యులపై దాడి చేశారంటూ రాజ్, అతని తండ్రిపై సిమ్రాన్ కేసు పెట్టింది. దీంతో విచారణ పేరిట బుధవారం రాజ్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిచారు. గురువారం ఉదయం ఇంటికి వచ్చిన రాజ్.. తనకు నిద్రగా ఉందంటూ గదిలోకి వెళ్లి పడుకున్నాడు. స్టేషన్లో తనకు తీవ్ర అవమానం జరిగిందని, అది భరించలేక పోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసి ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.అయితే.. సిమ్రాన్ వివాహేతర సంబంధమే దీనంతటికి కారణమని రాజ్ సోదరి అంటోంది. పైగా రాజ్‌పై ఫిర్యాదు చేయడానికి ముందు.. చేశాక.. ‘ఇక ఊచలు లెక్కపెట్టు’ అంటూ ఇన్‌స్టాలో సిమ్రాన్ చేసిన పోస్టులను ఆమె బయటపెట్టింది. అంతేకాదు పోలీస్ అధికారి అయిన సిమ్రాన్ సోదరుడు రాత్రంతా రాజ్‌ను పీఎస్‌లో ఉంచి చితకబాదాడని, ఆ అవమానాన్ని తన సోదరుడు భరించలేకపోయాడని ఆరోపించిందామె. ఇక ఈ ఘటనపై రాజ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. In the suicide case of #RajArya, a resident of #AkankshaEnclave under the #Izzatnagar police station area in #UttarPradesh's #Bareilly, an FIR has been registered against seven individuals, including his wife #Simran.The report was filed by the deceased's brother, Suresh,… https://t.co/Z4MGrKhyEt pic.twitter.com/otNGtaMmvs— Hate Detector 🔍 (@HateDetectors) April 10, 2025 ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు. తీవ్ర నిర్ణయాలు తీసుకునే ముందు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
రాణాకు వీఐపీ ట్రీట్మెంట్.. బిర్యానీలతో మేపొద్దు
న్యూఢిల్లీ: 26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి,లష్కరే తోయిబా ఉగ్రవాది తహవుర్ రాణా (Tahawwur Hussain Rana) భారత్‌కు చేరుకున్నాడు. అమెరికా నుంచి వచ్చిన తహవుర్ రాణాను తీసుకు వచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యింది. ఈ తరుణంలో రాణాకు జైల్లో వీఐపీ ట్రీట్మెంట్ అంటే ప్రత్యేక సెల్, బిర్యానీ వంటి వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వకూడదని, అతన్ని ఉరితీయాలని దేశ ప్రజలు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.తహవూర్ రాణాను ఉరితీయాలివారిలో 2008లో ముంబై ఉగ్రవాద దాడుల నుండి అనేక మందిని ప్రాణాలు కాపాడిన స్థానిక టీసెల్లర్ ఛోటు చాయ్ వాలా అలియాస్ మహ్మద్ తౌఫిక్ సైతం ఉన్నారు. ఉగ్రవాదులను అంతం చేయాలంటే దేశంలో కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పీటీఐతో మాట్లాడారు. అజ్మల్ కసబ్‌కు ఇచ్చినట్లుగా తహవూర్ రాణాకు ప్రత్యేక సెల్ లేదా, బిర్యానీ, ఇతర సౌకర్యాలు అందించాల్సిన అవసరం లేదన్నారు#WATCH | Mumbai: On 26/11 Mumbai attacks accused Tahawwur Rana's extradition to India, Mohammed Taufiq, a tea seller known as 'Chhotu Chai Wala' whose alertness helped a large number of people escape the attack, says, "...For India, there is no need to provide him with a cell.… pic.twitter.com/zLqHEt7sHs— ANI (@ANI) April 9, 2025‘రాణాను భారత్‌కు తీసుకుని రావడం శుభపరిణామం. కానీ అతనిని 15 రోజుల్లో లేదా రెండు మూడు నెలల్లో బహిరంగంగా ఉరితీయాలి. ఇలాంటి ఉగ్రవాదులకు ఎటువంటి ప్రత్యేక వసతులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అజ్మల్ కసబ్‌కు జైల్లో అందించిన వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. ఇలాంటి వారిపై కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వృధా. రాణాను ఉరితీసేవరకు తాను ఎదురు చూస్తాను. నాటి ఉగ్రదాడి బాధితులకు ప్రభుత్వం సహాయం అందించింది. కానీ డబ్బుతో ప్రాణాల్ని తిరిగి తెచ్చుకోలేం కదా?’ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రమూకల నుంచి ప్రజల్ని కాపాడి2008 నవంబర్‌లో ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు దక్షిణ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ సమీపంలో మహ్మద్ తౌఫిక్ టీ స్టాల్ నడుపుతున్నారు.ఆ సమయంలో ఉగ్రవాదులు దాడిలో ప్రాణాలు కోల్పోతున్న ప్రజల్ని చూసిన తౌఫిక్ అప్రమత్తమయ్యారు.వెంటనే వారిని ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారని,జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారిని సురక్షితంగా ఉగ్రవాదుల నుంచి తప్పించారు. అప్పటికే ముష్కరుల చేతిలో గాయపడిన బాధితుల్ని ఆస్పత్రి తరలించారు. -
పోక్సో కేసులో నిందితుడికి టీచర్ ఉద్యోగం, లైసెన్స్ ఇచ్చినట్టా..!?
జైలు నుంచే బీపీఎస్సీ (బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడో వ్యక్తి. సంకెళ్లున్న చేతులతోనే ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా అప్పాయింట్మెంట్ లెటర్‌ను అందుకున్నాడు. ఈ అసాధారణమైన, దిగ్భ్రాంతికరమైన ఉదంతంతో ఎక్కడ చోటుచేసుకుంది. అసలేంటీ స్టోరీ తెలుసుకుందాం.బిహార్‌లో గయలో సంఘటన జరిగింది. గత 18 నెలలుగా జైలులో ఉన్న విపిన్ కుమార్ ఉపాధ్యాయ పదవికి నియామక లేఖ అందుకున్నాడు. పట్నాలోని బూర్ జైలులో ఉండగానే, TRI-3 పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు. దీంతో ప్రభుత్వం అతన్ని ఉపాధ్యాయుడిగా నియమించింది. గయా జిల్లాలోని మోహన్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఎర్కి గ్రామానికి చెందిన విపిన్ కుమార్ గతంలో పాట్నాలోని దనాపూర్లోని ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో టీచర్‌గా పనిచేసేవాడు. దాదాపు ఒకటిన్నర సంవత్సరాల క్రితం, అదే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్న ఒక మైనర్ బాలిక అతనిపై పోక్సో చట్టం కింద దానాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనపై అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపణలు నమోదు చేసింది. ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పోక్సో చట్టం కింద పోలీసులు వెంటనే విపిన్‌ను అరెస్టు చేశారు అప్పటి నుండి అతను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.ఉన్న నిందితుడు విపిన్ కుమార్ బీపీఎస్సీ పరీక్ష రాసి విజయం సాధించాడు. ఒకటి నుండి ఐదు తరగతుల వరకు జనరల్ సబ్జెక్టులను బోధించేందుకు పాఠశాల ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. దీంతో చేతులకు బేడీలతోనే పోలీసు కస్టడీలో బుద్ధ గయలోని మహాబోధి సాంస్కృతిక కేంద్రంలో జరిగిన నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యాడు. తాత్కాలిక నియామక లేఖను అందుకున్నాడు.18 నెలల జైలు శిక్ష సమయంలో, అనేక సవాళ్లను మధ్య ఈ పరీక్షలో విజయవంతం కావడం విశేషంగా నిలిచింది. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన విపిన్ తన భవితవ్యం ఆందోళన వ్యక్తం చేశాడు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవన్నాడు. కోర్టు తనను దోషిగా గుర్తిస్తే, ఈ ఉద్యోగం రద్దవతుందని వాపోయాడు అయితే జైలులోని ఇతర ఖైదీలకు విద్యను అందించాల భావిస్తున్నానని, తద్వారా వారిలో విద్య వెలుగులను వ్యాప్తి చేయాలనేది తన లక్ష్యమని పేర్కొన్నాడు. ఇదీ చదవండి: సునీతా విలియమ్స్ మీద సింపతీలేదు : యూఎస్ ఖగోళ శాస్త్రవేత్తభిన్న వాదనలుపోక్సో నిందితుడు విపిన్ కుమార్ టీచర్ ఉద్యోగానికి అర్హత సాధించి జాయినింగ్ లెటర్ అందుకోవడంపై వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. తన ఇంటికి ట్యూషన్ కోసం వచ్చే మైనర్ బాలికను అత్యాచార చేశాడన్న ఆరోపణలపై జైలులో ఉన్నఅతనికి టీచర్ ఉద్యోగమా; అంటే వేధింపులకు లైసెన్స్ ఇచ్చినట్టా? అతన్ని ఎలా నమ్మాలి? అంటూ మరికొంత మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనికి శిక్షపడుతుందా? లేదంటే నిర్దోషిగా బైటపడి, తన ప్రభుత్వ ఉద్యోగాన్ని నిలబెట్టుకుంటాడా? అనేదే సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. -
పుట్టిన ఏడాదికే తల్లి వెంటే జైలుకు పసిబిడ్డ.. పాపం ఈ చిన్నారికి ఎంత కష్టమొచ్చిందో
బెంగళూరు : ప్రసవించిన 14రోజులకే అనివార్య కారణాలతో రూ.60వేలకు విక్రయమైన ఏడాది వయస్సున్న పసిబిడ్డ ప్రస్తుతం తల్లితో పాటు జైలు చేరిన విషాదం ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. బళ్లారి గౌతం నగర్ నివాసి యల్లమ్మ గతేడాది ఫిబ్రవరిలో బీఎంసీఆర్‌సీలో పసిబిడ్డకు జన్మనించింది. ఈమె భర్త చనిపోయాడు. తనకు ఆ బిడ్డ వద్దని రూపనగుడి రోడ్డు నివాసి నవీన్ కుమార్‌కు రూ.60వేలకు విక్రయించింది.ఈ విషయాన్ని తెలుసుకున్న బాలలరక్షణ శాఖ సహాయ వాణికి గత ఆగస్ట్ 5న సమాచారం రావడంతో వారు బళ్లారి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి పసిబిడ్డను ఆంధ్రప్రదేశ్‌లోని ఆలూరు నుంచి తీసుకొచ్చారు. బిడ్డను కొనుగోలు చేసిన నవీన్ కుమార్, విక్రయించిన బిడ్డ తల్లి యల్లమ్మను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ బిడ్డను బళ్లారి జైల్లో ఉన్న సొంత తల్లి వద్దకే చేర్చారు.ఈ కేసులో విక్రయించిన,కొనుగోలు చేసిన వారికి 10ఏళ్ల శిక్ష ఉంటుంది. కోర్టులో నేరం రుజువైతే తల్లితో పాటు బిడ్డ కూడా శిక్ష అనుభవించాలా? లేక బాలల రక్షణ శాఖలోని అమ్మఒడి ఆశ్రమంలో ఉంటుందా? అనే సందేహం తలెత్తుతోంది. కాగా, తల్లి వద్దు అనుకున్న బిడ్డను సంతానం లేని దంపతులు గత ఏడాది నుంచి పెంచి పోషించి తల్లి ప్రేమకు నోచుకునేలా చేసిన ఆ తల్లిదండడ్రులకే దత్తత ఇస్తే బాగుంటుందని సమాజ శ్రేయోభిలాషులు అభిప్రాయపడ్డారు. -
గుంటూరు జైల్లో పోసానిని కలిసిన వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేతలు
సాక్షి, గుంటూరు: గుంటూరు జైల్లో పోసాని కృష్ణమురళిని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేతలు శనివారం కలిశారు. రిమాండ్‌లో ఉన్న పోసానితో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, లీగల్ సెల్ ప్రతినిధులు ములాఖాత్ అయ్యారు. అనంతరం మీడియాతో మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ, పోసాని అనారోగ్యంతో ఉన్నారని.. కూటమి ప్రభుత్వం పోసానిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు.‘‘2016లో నంది అవార్డుల కమిటీలో ఏకపక్షంగా ఉందని మాట్లాడినందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై 12 కేసులు పెట్టారు. మీడియాతో మాట్లాడితే కేసులు పెడతారా?. మరోసారి ప్రెస్ మీట్ పెడితే మరో 6 కేసులు పెట్టారు. ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించి రాష్ట్రవ్యాప్తంగా పీటీ వారెంట్ల పేరుతో తిప్పి హింసిస్తోంది. పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పోసానిపై పెట్టిన నాలుగు కేసుల్లో 111 సెక్షన్లు పెట్టి బయటికి రానివ్వకుండా కుట్ర చేశారు.’’ అని మనోహర్‌రెడ్డి మండిపడ్డారు.‘‘కోర్టు పోలీసులకు చివాట్లు పెడుతున్న మారటం లేదు. రెడ్ బుక్కు టీడీపీకే కాదు. మాక్కూడా బుక్కులు ఉన్నాయి. మేము కూడా పేర్లు నమోదు చేసుకుంటున్నాం. ఇప్పటివరకు నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా కేసులు పెడుతున్న 62 మందిని గుర్తించాం. చంద్రబాబు జైలుకెళ్లినప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగాలేదని పిటిషన్ల మీద పిటిషన్ల వేశారు. అమ్మో ఇంకేముంది అని హడావుడి చేశారు. అందరివి చంద్రబాబు లాంటి ప్రాణాలే. పోలీసులు ఆర్గనైజర్ క్రైమ్ చేస్తున్నారు. కేసులు పెట్టి పోలీసులు వాటి సమాచారాన్ని దాచేస్తున్నారు. ఒక కేసులో బెయిల్ రాగానే మరొక కేసుని బయటికి తీస్తున్నారు’’ అంటూ మనోహర్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
గుంటూరు జైలులో పోసాని కృష్ణమురళికి అంబటి రాంబాబు పరామర్శ
-
47 ఏళ్ల క్రితం ఆఖరి ఉరి
ప్రణయ్ హత్య కేసులో తీర్పు వెలువడింది. ఏ2గా సుభాష్ శర్మను కోర్టు దోషిగా నిర్ధారిస్తూ మరణశిక్ష విధించింది. అయితే శిక్ష అమలు కావడానికి మూడు అంకాలు దాటాల్సి ఉంటుంది. ఇక్కడ తెరపైకి వచ్చే అంశం ఏమిటంటే.. ప్రస్తుతం రాష్ట్రంలోని ఏ జైలులోనూ గ్యాలోస్ (ఉరికంబం ఉండే ప్రాంతం సాంకేతిక నామం) లేదు. తలారులుగా పిలిచే హ్యాంగ్ మన్ పోస్టులు అసలే లేవు.రాష్ట్రపతి వరకు అప్పీల్‌కు చాన్స్..ప్రస్తుతం ట్రయల్ కోర్టు సుభాష్ శర్మకు మరణశిక్ష విధించింది. అతను ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేసే అస్కారం ఉంది. అంతేకాదు ట్రయల్ కోర్టు కూడా ఈ శిక్ష విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తుంది. ఈ క్రమంలో ‘రిఫర్డ్ ట్రయల్’గా పిలిచే విధానంలో హైకోర్టు విచారణ చేయవచ్చు. మరణశిక్షను హైకోర్టు సమర్థిస్తే.. సుప్రీంకోర్టులో అప్పీల్ చేయవచ్చు. అక్కడా చుక్కెదురైతే క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయవచ్చు. రాష్ట్రపతి తిరస్కరిస్తే.. దోషులకు విధించిన మరణశిక్ష పూర్తిగా ఖరారైనట్లే. దీంతో శిక్ష విధించినన్యాయస్థానానికి సంబంధించిన రాష్ట్రంలో.. మరణశిక్షను అమలు చేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో 47 ఏళ్ల క్రితం..ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఆఖరి ఉరిశిక్షను 47 ఏళ్ల క్రితం ముషీరాబాద్ సెంట్రల్ జైలులో అమలు చేశారు. 1978లో భారత వైమానిక దళంలో పనిచేసిన ఎయిర్‌మన్ రామవతార్ యాదవ్‌పై హత్య కేసు నిరూపితమై, మరణశిక్ష ఖరారు కావడంతో ఉరి తీశారు. అప్పట్లో ముషీరాబాద్ సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్‌గా ఉన్న సుబ్బారెడ్డి పర్యవేక్షణలో శిక్షను అమలైంది. తర్వాతి కాలంలో ముషీరాబాద్ సెంట్రల్ జైలును చర్లపల్లి ప్రాంతానికి మార్చారు.ఇక్కడ జైలు నిర్మిస్తున్నప్పుడు గ్యాలోస్ (ఉరికంబం) కోసం ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసినా ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉరికంబం ఉన్న జైలు ఒక్క రాజమండ్రి సెంట్రల్ జైలు మాత్రమే. ఇక తెలంగాణ జైళ్ల శాఖలో హ్యాంగ్‌మన్‌గా పిలిచే తలారీ పోస్టులు లేవు. చాలా ఏళ్లుగా ఉరిశిక్ష అమలు లేకపోవడంతో కొందరు హెడ్–వార్డెర్లకే ఈ అంశంలో ప్రాథమిక శిక్షణ ఇస్తున్నారు.రాజమండ్రి జైల్లో 49 ఏళ్ల క్రితం...రాజమండ్రి సెంట్రల్ జైలులో చివరిసారిగా 1976 ఫిబ్రవరిలో ఉరిశిక్షను అమలు చేశారు. ఓ హత్య కేసులో దోషిగా తేలిన అనంతపురం జిల్లాకు చెందిన నంబి కిష్టప్పను ఉరి తీశారు. తర్వాత కొందరు ఖైదీలను ఉరిశిక్ష అమలు కోసం ఈ జైలుకు తరలించినా అమలు కాలేదు. 1875 నుంచీ గ్యాలోస్ ఉండి, ఇప్పటికీ కొనసాగుతున్న కేంద్ర కారాగారం రాజమండ్రి సెంట్రల్ జైల్ మాత్రమే.స్వాతంత్య్రం అనంతరం దేశవ్యాప్తంగా వివిధ కారాగారాల్లో దాదాపు 100 మందిని ఉరితీశారు. అందులో అత్యధికంగా 42 శిక్షలను రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే అమలు చేశారు. ఉరి అమలుకు ముందు సదరు ఖైదీని ఆఖరి కోరిక ఏమిటని అడగటం ఆనవాయితీ. కిష్టప్ప తన ఆఖరి కోరికగా లడ్డూ తింటానని కోరగా.. జైలు అధికారులు అతడికి లడ్డూలు అందించారు. రాజమండ్రి జైలు తలారీ ధర్మరాజు ఆ ఉరి తీశారు.అదో ప్రత్యేకమైన గ్యాలోస్..రాజమండ్రి సెంట్రల్ జైల్లోని గ్యాలోస్ 1980 వరకు ప్రధాన ద్వారం పక్కనే బహిరంగ ప్రదేశంలో ఉండేది. ఉరిశిక్ష అమలు తర్వాత మృతదేహాన్ని ఉరికంబం కింద ఉండే ప్రత్యేక చాంబర్లో దింపుతారు. అక్కడి నుంచి నేరుగా ట్రే ద్వారా సంబంధీకులకు అప్పగించాలని, మృతదేహాన్ని జైలుగదుల మీదుగా బయటికి తీసుకురావద్దనే ఉద్దేశంతో అలా ఏర్పాటు చేశారు. 1980 తర్వాత గ్యాలోస్‌ను అడ్మినిస్ట్రేటివ్ భవనం పరిసరాల్లోకి మార్చారు.2013లో ఈ గ్యాలోస్ ఉన్న ప్రాంతంలోనే రూ.7.5 కోట్లతో కొత్తగా పరిపాలనా భవనాన్ని నిర్మించారు. అయితే గ్యాలోస్‌ను అక్కడి నుంచి మార్చడం ఇష్టం లేక భవనం కింద భూగర్భంలో ఏర్పాటు చేశారు. ఈ తరహా గ్యాలోస్ కలిగిన కారాగారం దేశంలో మరోటి లేదు. అంతేకాదు నిర్మాణాలు ఎన్ని మారినా ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి ఇనుప ఉరికంబాన్నే వినియోగిస్తున్నారు. తరచూ దీనికి నూనె రాస్తూ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
నన్ను అందరూ ఉన్న సెల్‌లోకి మార్చండి
విజయవాడ లీగల్ : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మూడ్రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు వంశీని గురువారం రెండవ అదనవు జిల్లా మరియు సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వద్ద ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జైలు బ్యారక్‌లో తనను ఒంటరిగా ఉంచారని, ఆస్తమా సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపారు. భద్రతాపరంగా తనకు ఇబ్బంది లేనప్పటికీ అందరూ ఉన్న సెల్‌లోకి తనను మార్చాలని కోరారు. తాను ఇన్‌ఛార్జి న్యాయమూర్తిగా ఉన్నందున వేరేవారిని సెల్లో ఉంచేందుకు ఉత్తర్వులు ఇవ్వలేనని న్యాయమూర్తి తెలిపారు. సెల్ మార్చాలనే అంశంపై రెగ్యులర్ కోర్టులో మెమో దాఖలు చేసుకోవాలని సూచించారు. ఇక తనను కేసుతో సంబంధంలేని ప్రశ్నలు అడిగారని.. సత్యవర్థన్‌కు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తే అసలు నిజాలు బయటకొస్తాయని న్యాయమూర్తికి వంశీ చెప్పారు. కాగా.. వంశీ ఆరోగ్యం దృష్ట్యా ఒక వార్డెన్‌ను ఏర్పాటుచేయడానికి తమకు అభ్యంతరంలేదని.. ఆయన భద్రత దృష్ట్యా మాత్రమే ఆయన్ను సెల్లో ఒంటరిగా ఉంచినట్లు ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు: వంశీ సతీమణిఈ కేసుకు సంబంధించి వంశీని ఎందుకు అరెస్టుచేశారో ఇంతవరకు తమకు తెలీదని.. ఇప్పటివరకు తమకు ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వలేదని, ఏ విషయంలో అరెస్టుచేశారో కూడా తెలీడంలేదని వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ మీడియాకు తెలిపారు. మూడ్రోజుల కస్టడీలో పోలీసులు తన భర్తను అర్థంపర్థంలేని ప్రశ్నలతో విసిగించారని ఆమె తెలిపారు. వంశీని ప్రభుత్వం టార్గెట్ చేసింది.. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు మాటా్లడుతూ.. ప్రభుత్వం కావాలనే వంశీని టార్గెట్ చేసిందని, అందులో భాగంగానే అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలందరికీ ఈ విషయం అర్థమైందన్నారు. న్యాయవాది తానికొండ చిరంజీవి మాట్లాడుతూ.. కేసుకు సంబంధించిన సమాచారం లేకుండా కేవలం సెక్షన్లు మాత్రమే పెట్టారని.. ఏ విషయంలో పెట్టారో తమకు సమాచారం ఇవ్వకపోవడం కూడా అక్రమ నిర్బంధం కిందకు వస్తుందన్నారు. వంశీ కస్టడీకి మళ్లీ పిటిషన్ వేస్తాం : ఏసీపీ వంశీ, అతని అనుచరులు సత్యవర్థన్‌ను బెదిరించి, భయపెట్టి కేసును తారుమారు చేయాలని చూసినట్లు సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక ఆధారాలను సేకరించామని ఏసీపీ దామోదర్ మీడియాకు వివరించారు. విచారణలో కొన్ని ప్రశ్నలకు అవునని చెప్పిన వంశీ, మరికొన్నింటికి తెలీదని, గుర్తులేదని చెప్పారన్నారు. తమకు పూర్తి సమాచారం రావాల్సి ఉన్నందున కస్టడీ కోరుతూ మరోసారి పిటిషన్ వేస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే.. సత్యవర్థన్ కేసులో మరో ఇద్దరు నిందితులు వంశీబాబు వీర్రాజులను 10 రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు గురువారం పిటిషన్ వేశారు. -
బందీల విడుదలకు మార్గం సుగమం
జెరూసలెం: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య బందీల విడుదలకు మార్గం సుగ మం అయ్యింది. ఇరు వ ర్గాలు తాజాగా ఓ ఒప్పందానికి వచ్చాయి. నలుగురు ఇ జ్రాయెల్ బందీల మృతదదేహాలను అప్పగించేందుకు హ మాస్ అంగీకరించగా, 600 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించిందని ఈజిప్టు తెలిపింది. తొలి దశ కాల్పుల విరమణ ఒ ప్పందంలో భాగంగా బం«దీల మా ర్పిడి సమయంలోనూ,మృతదేహాలను విడుదల చేసినప్పుడు హమాస్ అవమానకరంగా వ్యవహరించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి దశలోని పాలస్తీనా ఖైదీల విడుదల విషయంలో ఇజ్రాయెల్ కాలయాపన చేసింది. ఈ జాప్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని హమా స్ పేర్కొంది. వారిని విడుదల చేసేవరకు రెండో దశ చర్చలు సాధ్యం కాదని పేర్కొంది. మొదటి దశ ఒప్పందం ఈ వారంతో ముగియనుండటంతో బం«దీల మార్పిడిపై ఈజిప్టు పర్యవేక్షణలో మంగళవారం రాత్రి చర్చలు జరిగాయి. ఖైదీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్, మృతదేహాలను అప్పగించేందుకు హమా స్ అంగీకరించాయి. గురువారం నాటికి మారి్పడి జరిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ బంధీల మృతదేహాలను ఎటువంటి బహిరంగ వేడుకలు లేకుండా ఈజిప్టు అధికారులకు అప్పగించనున్నారు. గాజా కాల్పుల విరమణ..జనవరి 19న కాల్పుల విరమణ అమల్లోకి వచి్చనప్పటి నుంచి హమాస్ 25 మంది ఇజ్రాయెల్ బందీలను బహిరంగ వేడుకల ద్వారా విడుదల చేసింది. హమాస్ చర్యలను ఇజ్రాయెల్‌తో పాటు రెడ్‌క్రాస్, ఐక్యరాజ్యసమితి అధికారులు ఖండించారు. ఈ నేపథ్యంలో ఖైదీలు, బందీల మారి్పడిని హుందాగా, వ్యక్తిగతంగా చేపట్టాలని అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ ఇరు వర్గాలను కోరింది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా 1,100 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. మొదటి దశ ముగింపు తాజా ఒప్పందంతో దాదాపు 2000 మంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా ఎనిమిది మృతదేహాలు సహా 33 మంది ఇజ్రాయెల్ బందీల విడుదల ఒప్పందం ముగిస్తుంది. రెండో దశ చర్చలు కొన్ని వారాల కిందటే జరగాల్సి ఉండగా.. ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో అమెరికా మిడిల్ ఈస్ట్‌రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఈ ప్రాంతంలో పర్యటించున్నారు. హమాస్ చెరలో ఉన్న మిగిలిన బందీలందరినీ విడుదల చేయాలని, యుద్ధానికి ముగింపు పలకడానికి రెండో దశ చర్చలకు వెళ్లాలని ఇరు పక్షాలను కోరనున్నారు. -
Mahakumbh: 75 జైళ్లలో ఖైదీల పవిత్ర స్నానాలు
లక్నో: యూపీలోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో మహాకుంభమేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. కోట్లాదిమంది భక్తులు పవిత్ర సంగమస్థలిలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. తాజాగా యూపీలోని 75 జైళ్లలో గల ఖైదీలు కూడా త్రివేణీ సంగమంలోని నీటితో పవిత్ర స్నానాలు చేశారు. యూపీ జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రయాగ్‌రాజ్ నుంచి పవిత్ర జలాలను రాష్ట్రంలోని 75 జైళ్లకు తీసుకువచ్చారు. జైళశాఖ మంత్రి దారా సింగ్ నేతృత్వంలో ఖైదీల పుణ్యస్నానాల కార్యక్రమం సాగింది. లక్నో(Lucknow)లో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ‘ప్రపంచంలోని ప్రజలంతా కుంభమేళాలో స్నానాలు చేయాలని ఉత్సాహం చూపిస్తుంటే, ఇక్కడి ఖైదీలకు ఎందుకు ఆ అవకాశం కల్పించకూడదని అనిపించింది. అందుకే ఖైదీలకు కూడా పుణ్యస్నానాలు చేసే అవకాశం కల్పించాలని అనుకున్నాం’ అని అన్నారు. జైలు అధికారులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 75 జైళ్లలో మొత్తం 90 వేల మంది ఖైదీలున్నారన్నారు. జైళ్ల డైరెక్టర్ జనరల్(డీజీ) పీవీ రామశాస్త్రి మాట్లాడుతూ పవిత్ర సంగమం నుంచి తీసుకువచ్చిన జలాలను అన్ని జైళ్లకు పంపించామని, ఆ నీటిని స్నానాలకు ఉపయోగించే నీటిలో కలిపి, తరువాత డ్రమ్ములలో నింపారన్నారు. ఆ తరువాత ఖైదీలంతా ప్రార్థనలు చేసి, పుణ్యస్నానాలు చేశారన్నారు. ప్రయాగ్‌రాజ్ నుంచి తెచ్చిన అమృత కలశంతో పూజలు చేసిన తర్వాత ఖైదీలు పుణ్యస్నానాలు ఆచరించారని బాగ్పట్ జిల్లా(Baghpat District) జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రశాంత్ కుమార్ మీడియాకు తెలిపారు. ఖైదీలు గంగామాతను కొనియాడుతూ ఎంతో ఉత్సాహంగా స్నానాలు చేశారని, ఈ అవకాశం కల్పించిన జిల్లా జైలు యంత్రాంగానికి ఖైదీలు కృతజ్ఞతలు తెలిపారని ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: Sambhal: లౌడ్ స్పీకర్ బ్యాన్ చేశారని.. -
చీటింగ్ కేసులోమంత్రికి రెండేళ్ల జైలు శిక్ష
నాసిక్: 30 ఏళ్ల నాటి చీటింగ్, ఫోర్జరీ కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్‌రావు కొకాటేకు నాసిక్ జిల్లా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, యాభైవేల జరిమానా విధించింది. ఈ కేసులో మంత్రి సోదరుడు సునీల్ కోకాటేను కూడా దోషిగా పేర్కొంటూ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కోకాటే సోదరులు 1995లో తాము తక్కువ ఆదాయ వర్గానికి (ఎల్ఐజీ) చెందినవారమని పేర్కొంటూ ముఖ్యమంత్రి విచక్షణ కోటా కింద ఇక్కడి యోలకర్ మాలలోని కాలేజీ రోడ్డులో రెండు ఫ్లాట్లను పొందారు. దీనిపై మాజీ మంత్రి, దివంగత టీఎస్ ఢిఘోల్ ఫిర్యాదు మేరకు అప్పట్లో సర్కార్వాడ పోలీస్ స్టేషన్లో కోకాటే సోదరులు, మరో ఇద్దరిపై చీటింగ్, ఫోర్జరీ కే సు నమోదైంది. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం కొకాటే సోదరులకు శిక్ష, జరిమానా విధించిన కోర్టు మరో ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేసింది. కాగా ఈ కేసులో తనకు బెయిల్ లభించిందని, ఉత్తర్వులపై పైకోర్టులో అప్పీలు చేస్తానని మంత్రి కొకాటే తెలిపారు. -
జగన్ మాట్లాడుతుంటే సీఎం సీఎం అంటూ నినాదాలు
-
వంశీతో వైఎస్ జగన్ ములాఖత్..మీడియాపై ఆంక్షలు
-
Supreme Court: నిందితుల్ని జైల్లోనే ఉంచడానికి పీఎంఎల్ఏ కేసులా?
న్యూఢిల్లీ: నిందితులను జైలులో ఉంచడానికి మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ)ను ఉపయోగిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వరకట్న చట్టం మాదిరిగా పీఎంఎల్ఏ నిబంధనలను కూడా దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మాజీ ఎక్సైజ్ అధికారి అరుణ్ పతి త్రిపాఠీకి బుధవారం బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. త్రిపాఠీపై చేసిన ఆరోపణలను ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కొట్టివేసిన తర్వాత కూడా జైలులోనే ఉంచడంపై విస్మయం వ్యక్తం చేసింది. ‘ఓ వ్యక్తిని జైలులో ఉంచేందుకు పీఎంఎల్ఏను వాడుకోరాదు. ఆరోపణలను కోర్టు కొట్టివేసిన తర్వాత కూడా ఆయన్ను విడుదల చేయకుండా జైలులో ఉంచడాన్ని ఏమనాలి?. సెక్షన్ 498ఏ కింద పెళ్లయిన మహిళలు భర్త, అతడి కుటుంబీకులపై కట్నం వేధింపుల కేసులు ఎడాపెడా పెట్టినట్లే పీఎంఎల్ఏను కూడా దుర్వినియోగం చేయాలనుకుంటున్నారా?’అంటూ తలంటింది. ఇందుకు కారణమైన అధికారులకు సమన్లు జారీ చేస్తామంది. అయితే, సాంకేతికపరమైన కారణాలతో నేరగాళ్లకు బెయిలివ్వడం సరికాదని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఈడీ తరఫున వాదించారు. -
డేరాబాబాకు మళ్లీ పెరోల్.. జైలుకొచ్చి స్వాగతించిన హనీప్రీత్
రోహ్తక్: హర్యానాకు చెందిన డేరా సచ్చా సౌదా చీఫ్ రామ్ రహీమ్‌కు మరోమారు పెరోల్ లభించింది. దీంతో ఆయన ఈరోజు (మంగళవారం) ఉదయం జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయనను స్వాగతించేందుకు ఆయన ప్రధాన శిష్యురాలు హనీప్రీత్ స్వయంగా కారులో జైలుకు వచ్చారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం డేరా చీఫ్ రామ్ రహీమ్‌కు 30 రోజుల పెరోల్ లభించింది. ఈ నేపధ్యంలో రామ్ రహీమ్ నేరుగా సిర్సా డేరా సచ్చా సౌదాకు చేరుకుంటారని తెలుస్తోంది. ఆయనను స్వాగతించేందుకు ఆశ్రమంలో ఘనమైన ఏర్పాట్లు చేశారు. కాగా రామ్ రహీమ్ దీనికిముందు 2024 అక్టోబర్‌లో పెరోల్‌పై బయటకు వచ్చారు. అప్పుడు ఆయన 20 రోజుల పెరోల్‌పై విడుదలయ్యారు. అప్పుడు ఆయన యూపీలోని బర్నావా ఆశ్రమానికి వెళ్లారు.నాటి పెరోల్ సమయంలో రామ్ రహీమ్ ఎన్నికల సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనకుండా, హర్యానాలోకి ప్రవేశించకుండా నిషేధించారు. 2017లో ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేసిన కేసులో రామ్ రహీమ్‌కు కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇదేవిధంగా 16 సంవత్సరాల క్రితం ఒక జర్నలిస్టు హత్య కేసులో రామ్ రహీమ్‌తో పాటు మరో ముగ్గురు కూడా దోషులుగా తేలారు.ఇది కూడా చదవండి: ఒక్క రోజులో 1.5 కోట్ల మంది పుణ్యస్నానాలు -
Bangladesh: ఆ 700 మంది ఖైదీలు ఎక్కడ?
ఢాకా: బంగ్లాదేశ్‌లో రాజకీయ గందరగోళం కొనసాగుతోంది. గత ఏడాది(2024) జూలై-ఆగస్టులలో బంగ్లాదేశ్‌లో ఆందోళనలు చెలరేగిన సమయంలో జైళ్ల నుంచి తప్పించుకున్న దాదాపు 700 మంది ఖైదీలు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం గతంలో వివిధ జైళ్ల నుంచి పరారైన ఖైదీలకు సంబంధించి ఒక ప్రకటన చేసింది. సుమారు 700 మంది ఖైదీలు జైళ్ల నుంచి పరారయ్యారని బంగ్లాదేశ్ హోం వ్యవహారాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జహంగీర్ ఆలం చౌదరి ఢాకాలో విలేకరులకు తెలిపారు. వారిని వెదికి పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.దేశంలోని వివిధ జైళ్ల నుంచి తప్పించుకున్న వారి వివరాలను పూర్తిగా వెల్లడించకుండానే.. ఈ తరహా ఖైదీలలో కొందరిని అరెస్ట్ చేశామని, మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. గత ఏడాది ఆగస్టు ఐదు తర్వాత సాధారణ క్షమాభిక్ష కింద ఏ దోషి కూడా జైలు నుండి విడుదల కాలేదని అన్నారు. అయితే బెయిల్‌పై విడుదలైన వారు ఏదైనా నేర కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలితే, వారిని అరెస్టు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. కాగా దాదాపు 700 మంది ఖైదీలు, దోషులుగా తేలిన ఇస్లామిక్ ఉగ్రవాదులు, మరణశిక్ష పడిన ఖైదీలు పరారీలో ఉన్నారని గతంలో బంగ్లాదేశ్ జైలు అధికారులు ప్రకటించారు. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: 10 ప్రత్యేక ఆకర్షణలు.. సోషల్ మీడియాలో చక్కర్లు -
పాక్ జైలులో భారత యువకుడు విలవిల.. ప్రేమే కారణం
‘నాన్నా.. ఆ అమ్మాయి నాకోసం ఎంతగానో పరితపిస్తోంది... అందుకే నేను పాకిస్తాన్ వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇస్లాంను స్వీకరించాను. నేను ఇంటికి తిరిగి వస్తానో లేదో నాకే తెలియదు. దయచేసి నా కోసం చింతించకండి’.. ఇవి యూపీలోని అలీఘర్కు చెందిన బాదల్ బాబు అనే యువకుడు వీడియో కాల్లో తన తండ్రితో పలికిన మాటలు.సోషల్ మీడియా వేదికగా ఓ అమ్మాయిని ప్రేమించి, సరిహద్దులు దాటి, శత్రు దేశానికి చేరుకున్న ఓ యువకుడు వీడియో కాల్లో తన తల్లిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం పాక్ పోలీసులు అతనిని కోర్టులో హాజరుపరిచారు. అక్కడ అతనికి బెయిల్ లభించలేదు. పాక్ యువతి ప్రేమలో పడిన భారతీయ యువకుడు ఇప్పుడు ఆ దేశంలో పడరానిపాట్లు పడుతున్నాడు.అలీఘర్కు చెందిన బాదల్ బాబు 2024 అక్టోబర్‌లో అక్రమంగా సరిహద్దులు దాటి పాక్ చేరుకున్నాడు. తరువాత జరిగిన పరిణామాలతో డిసెంబర్ నుంచి జైలులోనే ఉన్నాడు. జనవరి 24న బాదల్ బాబును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. చార్జిషీట్ అందకపోవడంతో అతని బెయిల్ పిటిషన్ విచారణకు రాలేదు. దీంతో తిరిగి అతడిని జైలుకు తరలించారు. ఈ కేసు తరుపరి విచారణ ఫిబ్రవరిలో ఉండనుంది.బాదల్ తండ్రి కృపాల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తాను వీడియో కాల్లో న్యాయవాది ఫయాజ్‌తో మాట్లాడినట్లు భావోద్వేగానికి గురవుతూ తెలిపారు. పాకిస్తాన్ నివాసి సనా రాణి, ఆమె తల్లి ఆహ్వానించడంతోనే తన కుమారుడు పాకిస్తాన్ వెళ్లి , అక్కడ చిక్కుకుపోయాడని కృపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సనాను కలుసుకునేందుకు బాదల్ పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని మండి బహావుద్దీన్ జిల్లాలోని మాంగ్ గ్రామానికి చేరుకున్నాడు.అయితే సనా అతనిని వివాహం చేసుకునేందుకు నిరాకరించింది. కాగా బాదల్ బాబు వీసా, పాస్‌పోర్ట్ లేకుండా అక్రమంగా పాకిస్తాన్‌కు చేరుకున్నాడు. దీంతో పాక్ పోలీసులు అతనిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు. మీడియా దగ్గరున్న వివరాల ప్రకారం బాదల్ బాబు యూపీలోని అలీఘర్‌లోని నాగ్లా ఖట్కారి గ్రామ నివాసి. అతనికి ఫేస్బుక్లో పాకిస్తాన్‌కు చెందిన ఒక యువతితో స్నేహం ఏర్పడింది. వారిద్దరూ రోజూ చాటింగ్ ద్వారా మాట్లాడుకునేవారు. ఈ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది.బాదల్ బాబు 2024 అక్టోబర్‌లో పాకిస్తాన్ చేరుకున్నాడు. తన గుర్తింపును మార్చుకుని అక్కడే ఉన్నాడు. అయితే గత డిసెంబర్లో స్థానికులకు అనుమానం వచ్చి బాదల్ బాబు గురించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అతనిని బహావుద్దీన్ నగరంలో అరెస్టు చేసి, తరువాత కోర్టులో హాజరుపరిచి, జైలుకు పంపారు. విచారణలో బాదల్ బాబు తన నేరాన్ని అంగీకరించాడు. తాను గతంలో రెండుసార్లు సరిహద్దులు దాటడానికి ప్రయత్నించానని, మూడోసారి విజయం సాధించానని బాదల్ బాబు తెలిపాడు.ఇది కూడా చదవండి: Mahakumbh: మౌని అమావాస్యకు ఎందుకంత ప్రత్యేకత? -
బాబా ఆశారాంకు మధ్యంతర బెయిల్
న్యూఢిల్లీ:అత్యాచార కేసులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న బాబా ఆశారాం(Asaram Bapu)నకు మధ్యంతర బెయిల్ లభించింది. సుప్రీంకోర్టు(Supreme court) ఆయనకు మార్చి 31 దాకా మధ్యంతర బెయిల్(Interim Bail) ఇచ్చింది. గుండె సంబంధిత వ్యాధికి చికిత్స తీసుకునేందుకు బెయిల్ మంజూరు చేసింది. అయితే మరో అత్యాచార కేసులోనూ మధ్యంతర బెయిల్ వచ్చేదాకా ఆయన జైలులోనే ఉండనున్నారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆయన తన అనుచరులను కలవడానికి వీళ్లేదని కోర్టు ఆదేశించింది. ఆశారాం ఆస్పత్రికి వెళ్లేటప్పుడు ఎస్కార్ట్ ఇవ్వాలే తప్ప ఆయన ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించ వద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. గుజరాత్ మోతేరాలోని ఆశ్రమంలో పనిచేస్తున్న సమయంలో తనపై ఆయన పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు సూరత్‌కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2001 నుంచి 2006 మధ్య తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆశారాంతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు.ఈ కేసులో గాంధీనగర్ సెషన్స్ కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. ఈ కేసులో మిగిలిన నిందితులకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో వారిని విడుదల చేశారు. అనంతరం ఆశారాంకు జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. జోధ్‌పూర్‌లోని మరో ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులోనూ ఆయన దోషిగా తేలారు.ఈ కేసులోనూ ఆయనకు జీవితఖైదు పడింది. రెండు కేసుల్లో ఆశారం ఒకేసారి శిక్ష అనుభవిస్తున్నారు.ఇదీ చదవండి: 16 ఏళ్లకే ఇంటిని వదిలి..తాళాల బాబా సాధన ఇదే -
మదురై అసిస్టెంట్ జైలర్ వేధింపులు..
అన్నానగర్: అసిస్టెంట్ జైలర్ వేధింపులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మదురై అరసరడిలోని సెంట్రల్ జైలులో బాలగురుసామి అనే వ్యక్తి అసిస్టెంట్ జైలర్‌గా పనిచేసేవాడు. కొన్నాళ్ల కిందట సెంట్రల్ జైలులో ఉన్న ఓ ఖైదీని కలవడానికి అతని భార్య పిటిషన్ దాఖలు చేసింది. ఆమెను పరిచయం చేసుకున్న అసిస్టెంట్ జైలర్ ఆమెతో పాటు వచ్చిన యువతిని లైంగికంగా వేధించాడు. ఆ మహిళ మదురై మహిళా పోలీస్ స్టేషన్లో ఈ విషయమై ఫిర్యాదు చేసింది.విచారణ నిమిత్తం తల్లి, కూతుళ్లు అసిస్టెంట్ జైలర్‌పై దాడికి పాల్పడిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై శాఖాపరమైన విచారణలు జరిపారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అసిస్టెంట్ జైలర్ బాలగురుస్వామిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో బాలగురుసామిని సస్పెండ్ చేస్తూ మదురై జైళ్ల శాఖ డీఐజీ పళని ఆదేశాలు జారీ చేశారు. బాలగురుసామిని విచారించగా పలు రకాల సమాచారం బయటకు వచ్చింది. దీంతో అతడిని మదురై సెంట్రల్ జైలుకు తరలించారు. అమ్మాయిలను టార్గెట్ చేసి సాన్నిహిత్యం ప్రదర్శించి పలువురు మహిళలను అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. அவரு ஆபீசரா இருக்கலாம்.. அதுக்காக மகளை கேட்பாரா..? மத்திய சிறை உதவி ஜெயிலர் பாலகுருசாமி மீது வழக்குப்பதிவு pic.twitter.com/YMRXLMv97a— Mahalingam Ponnusamy (@mahajournalist) December 22, 2024 -
Bangladesh: జనవరి 2 వరకూ జైల్లోనే చిన్మయ్ దాస్
ఢాకా: బంగ్లాదేశ్‌లోని హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ కేసులో ఆయన తరపున వాదించేందుకు చిట్టగాంగ్ కోర్టులో న్యాయవాది ఎవరూ లేరు. ఈ నేపధ్యంలోనే విచారణ జనవరి 2కు వాయిదా పడింది. బంగ్లాదేశ్‌లోని హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభు తరపు న్యాయవాది రమణ్ రాయ్‌పై దాడి జరిగిందని ఇస్కాన్ కోల్‌కతా ప్రతినిధి రాధారమణ్ దాస్ తెలిపారు. ఆయన ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారని, చిన్మయ్ ప్రభు తరపున వాదించడమే ఆయన చేసిన తప్పులా ఉందని దాస్ పేర్కొన్నారు.ఐసీయూలో ఉన్న రాయ్ ఫోటోను ఇస్కాన్ కోల్‌కతా ప్రతినిధి దాస్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. న్యాయవాది రమణ్ రాయ్ కోసం ప్రార్థించాలని ఆయన హిందువులను కోరారు. ఇస్లామిక్ ఛాందసవాదులు అతని ఇంటిని ధ్వంసం చేసి, అతనిపై దాడి చేశారని దాస్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ సమిత సనాతనీ జాగరణ్ జోట్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభును ఢాకాలోని హజ్రత్ షాజాలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ కోర్టు అతనికి బెయిల్ మంజూరును నిరాకరించి, జైలుకు తరలించింది.ఇది కూడా చదవండి: సీఎం పదవిపై వీడని ఉత్కంఠ.. వేర్వేరు నగరాల్లో ముగ్గురు నేతలు -
సవతి కుమార్తెపై అత్యాచారం.. 141 ఏళ్ల జైలు శిక్ష
మలప్పురం: మైనర్ అయిన సవతి కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి కేరళ కోర్టు 141 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పోక్సో చట్టం, ఐపీసీ, జువెనైల్ జస్టిస్ చట్టం కింద వివిధ నేరాలకు గాను దోషి ఏక కాలంలో ఈ శిక్ష అనుభవించాలంటూ మంజేరి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి అష్రాఫ్ ఏఎం నవంబర్ 29వ తేదీన తీర్పు వెలువరించారు. అయితే, దోషి 40 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అతడికి విధించిన శిక్షల్లో ఇదే అత్యధికమని ఆయన ఆ తీర్పులో పేర్కొన్నారు. అదేవిధంగా, బాధితురాలికి పరిహారంగా రూ.7.85 లక్షలు చెల్లించాలని కూడా దోషిని ఆదేశించారు. బాలికపై ఆమె తల్లి ఇంట్లో లేని సమయాల్లో 2017 నుంచి సవతి తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసు అధికారి ఒకరు తెలిపార -
జైలులో బీడీలు, గుట్కా ఇవ్వాలని ఖైదీల డిమాండు
దొడ్డబళ్లాపురం: బీడీలు, గుట్కా ఇవ్వాలని డిమాండు చేస్తూ కలబుర్గి జైలులో ఖైదీలు ధర్నా చేశారు. ఇటీవల జైలులో అన్నీ నిలిపివేసారని ముస్తఫా అనే ఖైదీ ఆధ్వర్యంలో సుమారు 70 మంది ధర్నా చేసినట్లు తెలిసింది. కొత్తగా వచ్చిన జైలు అధికారి అనిత లంచం అడిగారని ముస్తఫా ఒక మహిళ ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు ఇప్పించాడు. డబ్బులు ఇస్తేనే పొగాకు, గుట్కాలను అనుమతిస్తానని ఆమె స్పష్టం చేసిందన్నారు. అతడు, మిగతా ఖైదీలు తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని జైలర్ అనిత సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడు సోదరితో మాట్లాడిన ఆడియోలో తనకు బెదిరింపులు ఉన్నాయని అనిత చెబుతున్నారు. గుట్కా తదితరాలను అడ్డుకోవడంతో తనపై కక్ష గట్టారని ఆమె చెప్పారు. -
ప్రభుత్వాలు మేల్కొనాలి!
స్వేచ్ఛ నిజమైన విలువేమిటో గుర్తించాలంటే కారాగారం గురించి కాస్తయినా తెలిసి వుండాలంటారు. జైలంటే కేవలం అయినవాళ్లకు దూరం కావటమే కాదు... సమాజం నుంచి పూర్తిగా వేరుపడి పోవడం, పొద్దస్తమానం తనలాంటి అభాగ్యుల మధ్యే గడపాల్సిరావటం. అటువంటివారిలో విచా రణ ఖైదీలుగా ఉన్నవారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన తాజా ప్రకటన ఊరటనిస్తుంది. కేసు విచారణ పూర్తయి పడే గరిష్ట శిక్షలో కనీసం మూడోవంతు కాలం జైల్లో గడిపి ఇంకా న్యాయం కోసం ఎదురుచూస్తూనేవున్న ఖైదీలను ఈనెల 26న జరగబోయే రాజ్యాంగ దినోత్సవానికి ముందు విడుదల చేస్తామని అమిత్ షా తెలియజేశారు. విచారణ కోసం దీర్ఘకాలం ఎదురుచూస్తూ గడిపే ఖైదీ ఒక్కరు కూడా ఉండరాదన్నది తమ ఉద్దేశమని చెప్పారు. ఇది మంచి నిర్ణయం. ప్రజాస్వామిక వాదులు ఎప్పటినుంచో ఈ విషయంలో ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తూనేవున్నారు. కఠిన శిక్షలుపడి దీర్ఘకాలం జైల్లో వున్నవారిలో సత్ప్రవర్తన ఉన్నపక్షంలో జాతీయ దినోత్సవాల రోజునో, మహాత్ముడి జయంతి రోజునో విడుదల చేయటం ఆనవాయితీగా వస్తోంది. అయితే విచారణలోవున్న ఖైదీల విషయంలో ప్రభుత్వాలు క్రియాశీలంగా ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. తగిన విధానం రూపొందించ లేదు. ఇందువల్ల జైళ్లు కిక్కిరిసి ఉంటున్నాయి. వాటి సామర్థ్యానికి మించి ఖైదీల సంఖ్య ఉండటంతో జైళ్ల నిర్వహణ అసాధ్యమవుతున్నది. అసహజ మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఖైదీల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి. ఖైదీల్లో అత్యధికులు అట్టడుగు కులాలవారూ, మైనారిటీ జాతుల వారూ ఉంటారు. వీరంతా నిరుపేదలు. కేవలం ఆ ఒక్క కారణం వల్లే వీరి కోసం చొరవ తీసుకుని బెయిల్ దరఖాస్తు చేసేవారు ఉండరు. కనీసం పలకరించటానికి రావాలన్నా అయినవాళ్లకు గగన మవుతుంది. రానూ పోనూ చార్జీలు చూసుకుని, కూలి డబ్బులు కోల్పోవటానికి సిద్ధపడి జైలుకు రావాలి. అలా వచ్చినా ఒక్కరోజులో పనవుతుందని చెప్పడానికి లేదు. రాత్రి ఏ చెట్టుకిందో అర్ధాకలితో గడిపి మర్నాడైనా కలవడం సాధ్యమవుతుందా లేదా అన్న సందేహంతో ఇబ్బందులుపడే వారెందరో! బెయిల్ వచ్చినా ఆర్థిక స్తోమత లేక కారాగారాల్లోనే ఉండిపోతున్న ఖైదీల కోసం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023 బడ్జెట్లో ఒక పథకాన్ని ప్రతిపాదించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీల సిఫార్సుతో ఈ పథకం వర్తిస్తుంది. విచారణలోవున్న ఖైదీకి రూ. 40,000, శిక్షపడిన ఖైదీకి రూ. 25,000 మంజూరుచేసి బెయిల్‌కు మార్గం సుగమం చేయటం దాని ఉద్దేశం. బెయిల్ వచ్చినా జామీను మొత్తం సమకూరకపోవటంతో 24,879 మంది ఖైదీలు బందీలుగా ఉండి పోయారని మొన్న అక్టోబర్‌లో సుప్రీంకోర్టు పరిశోధన విభాగం సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ (సీఆర్పీ) వెల్లడించింది. అయితే దీనివల్ల లబ్ధి పొందినవారు ఎందరని తరచి చూస్తే ఎంతో నిరాశ కలుగుతుంది. ప్రముఖ డేటా సంస్థ ‘ఇండియా స్పెండ్’ ఢిల్లీతోపాటు ఎనిమిది రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరు ఎలావున్నదో ఆరా తీస్తూ సమాచార హక్కు చట్టంకింద దరఖాస్తులు చేస్తే ఇంతవరకూ కేవలం ఆరు రాష్ట్రాలు జవాబిచ్చాయి. అందులో మహారాష్ట్ర 11 మందిని, ఒడిశా ఏడుగురిని విడు దల చేశామని తెలపగా 103 మంది అర్హులైన ఖైదీలను గుర్తించామని ఢిల్లీ తెలిపింది. మూడు బిహార్ జైళ్లు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా విడుదలైనవారి వివరాలిచ్చాయి తప్ప పథకం లబ్ధిదారు లెందరో చెప్పలేదు. పథకం ప్రారంభం కాలేదని బెంగాల్ చెప్పగా, బీజేపీ రాష్ట్రాలైన యూపీ, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లు డేటా విడుదల చేయలేదు. కేరళ స్పందన అంతంతమాత్రం. ఫలానా పథకం అమలు చేస్తే ఇంత మొత్తం గ్రాంటుగా విడుదల చేస్తామని కేంద్రం ప్రకటిస్తే అంగలార్చుకుంటూ తొందరపడే రాష్ట్రాలకు దిక్కూ మొక్కూలేని జనానికి తోడ్పడే పథకమంటే అలుసన్న మాట!ఒక డేటా ప్రకారం దేశవ్యాప్తంగా ఖైదీల సంఖ్య 5,73,220 కాగా, అందులో 75.8 శాతంమంది... అంటే ప్రతి నలుగురిలో ముగ్గురు విచారణలో ఉన్న ఖైదీలే. మొత్తం 4,34,302 మంది విచారణ ఖైదీలని ఈ డేటా వివరిస్తోంది. విచారణ ఖైదీల్లో 65.2 శాతంమందిలో 26.2 శాతంమంది నిరక్షరాస్యులు. పదోతరగతి వరకూ చదివినవారు 39.2 శాతంమంది. రద్దయిన సీఆర్పీసీలోని సెక్షన్ 436ఏ నిబంధనైనా, ప్రస్తుతం వున్న బీఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 479 అయినా నేరానికి పడే గరిష్ట శిక్షలో సగభాగం విచారణ ప్రారంభంకాని కారణంగా జైల్లోనే గడిచిపోతే బెయిల్‌కు అర్హత ఉన్నట్టే అంటున్నాయి. అయితే మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడే నేరాలు చేసినవారికి ఇది వర్తించదు. బీఎన్ఎస్ఎస్ అదనంగా మరో వెసులుబాటునిచ్చింది. తొలి నేరం చేసినవారు విచారణ జరిగితే పడే గరిష్ట శిక్షలో మూడోవంతు జైలులోనే ఉండిపోవాల్సి వస్తే అలాంటి వారికి బెయిల్ ఇవ్వొచ్చని సూచించింది. బహుళ కేసుల్లో నిందితులైన వారికిది వర్తించదు.నిబంధనలున్నాయి... న్యాయస్థానాలు కూడా అర్హులైన వారిని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. నిరుడు కేంద్రమే ఖైదీల కోసం పథకం తీసుకొచ్చింది. పైగా బీఎన్ఎస్ఎస్ 479 నిబంధనను ఎందరు వర్తింపజేస్తున్నారో చెప్పాలని సుప్రీంకోర్టు 36 రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతా లకూ మొన్న ఆగస్టులో ఆదేశాలిస్తే ఇంతవరకూ 19 మాత్రమే స్పందించాయి. ఇది న్యాయమేనా? పాలకులు ఆలోచించాలి. ఈ అలసత్వం వల్ల నిరుపేదలు నిరవధికంగా జైళ్లలో మగ్గుతున్నారు.కేంద్రం తాజా నిర్ణయంతోనైనా ప్రభుత్వాలు మేల్కొనాలి. విచారణలోవున్న ఖైదీల్లో ఎంతమంది అర్హుల్లో నిర్ధారించి, కేంద్ర పథకం కింద లబ్ధిదారుల జాబితాను రూపొందించాలి. వారి విడుదలకు చర్యలు తీసుకోవాలి. -
చిన్నారిపై లైంగికదాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
నెల్లూరు (లీగల్): నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మిక్కిలింపేట గ్రామానికి చెందిన బాలిక 2020 ఫిబ్రవరి 16వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఇంటిముందు ఆడుకుంటుండగా సమీపంలోని ఇంట్లో నివసించే ఉప్పు రవికుమార్ అనే యువకుడు బాలికను ఇంటికి తీసుకుపోయి లైంగిక దాడికి పాల్పడ్డాడు.బాలిక తల్లి అదేరోజు కొడవలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు రవికుమార్‌ను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారణలో నిందితుడిపై నేరం రుజువు కావడంతో నెల్లూరు పోక్సో ప్రత్యేక కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 20 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు. -
గంజాయి సరఫరా చేస్తున్న ఫార్మసిస్ట్ అరెస్టు
ఆరిలోవ: విశాఖ కేంద్రకారాగారంలో ఖైదీలకు గంజాయి సరఫరా చేసే యత్నంలో ఓ ఉద్యోగి అధికారులకు చిక్కాడు. జైలు సిబ్బంది తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది. జైలు సూపరింటెండెంట్ ఎస్.కిశోర్‌కుమార్ వివరాలు ప్రకారం.. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో కడియం శ్రీనివాస్ ఫార్మసిస్ట్‌గా ఏడాది నుంచి డిప్యుటేషన్‌పై విశాఖ కేంద్ర కారాగారం ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఈ జైలుకు సంబంధించి ప్రత్యేకంగా నియమించిన వైద్యులు, ఫార్మసిస్టులు లేకపోవడంతో డిప్యూటేషన్‌పై వచ్చినవారే పనిచేయాల్సి ఉంటుంది.శ్రీనివాస్ మంగళవారం డ్యూటీకి వచ్చేటప్పుడు భోజనం క్యారేజీ తీసుకొచ్చారు. అందులో గంజాయి ఉన్నట్లు జైలు ప్రధాన ద్వారంవద్ద సిబ్బంది తనిఖీల్లో బయటపడింది. ప్రధాన ద్వారం సెక్యూరిటీ సిబ్బంది జైలులో పనిచేస్తున్న ఉద్యోగుల రాకపోకల సమయంలో తనిఖీలు చేస్తుంటారు. దీన్లోభాగంగా చేపట్టిన తనిఖీల్లోనే శ్రీని వాస్ క్యారేజీలో 90 గ్రాముల గంజాయి పట్టుబడింది. దీంతో శ్రీనివాస్‌పై ఆరిలోవ పోలీసులకు సూపరింటెండెంట్ ఫిర్యాదు చేశారు. గంజాయి స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. రిమాండ్‌పై సెంట్రల్ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. -
పాపం నాగమ్మ!
రాయచూరు రూరల్: క్షణికావేశంలో ఏదో తెలిసీ, తెలియక చేసిన తప్పిదానికి 34 ఏళ్లకు పైగా శిక్ష అనుభవిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఉప లోకాయుక్త చొరవతో కలబుర్గి చెరసాల నుంచి 93 ఏళ్లున్న వృద్ధురాలి విడుదలకు ప్రతిపాదనలు సిద్ధమైన ఘటన చోటు చేసుకుంది. కలబుర్గి జిల్లా కేంద్ర కారాగారాన్ని రాష్ట్ర ఉప లోకాయుక్త న్యాయమూర్తి బి.వీరప్ప సందర్శించారు. వయస్సు మీరిన వారిని చెరసాలలో ఉంచరాదనే విషయం తెలుసుకున్న వీరప్ప కలబుర్గి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవా ప్రాధికార సభ్యుడు శ్రీనివాస నవలిని సుప్రీం కోర్టుకు అప్పీలు చేసి విడుదలకు అనుమతి కోరాలన్నారు. కలబుర్గి జిల్లా జేవర్గి తాలూకాకు చెందిన నాగమ్మపై 1995లో వరకట్నం కేసులో నిందితురాలిగా కేసు పెట్టారు. నాటి నుంచి నేటి వరకు శిక్షను అనుభవిస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఉప లోకాయుక్త బి.వీరప్ప చలించి పోయారు. సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ జనరల్ శశిధర్ శెట్టిని ఫోన్లో సంప్రదించి మాట్లాడారు. పండు వృద్ధురాలు నాగమ్మకు నడవడం కూడా చేత కాదని, ఆరోగ్య సమస్యలను జైల్ అధికారులు, సిబ్బంది అంతగా పట్టించుకోవడం లేదు కనుక ఆమెను చెరసాల నుంచి విడుదల చేసి విముక్తి కల్పించాలని కోరారు. -
లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ: పోలీసు అధికారులపై సస్పెన్షన్
చండీగఢ్: పంజాబ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కస్టడీలో ఉండి ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూపై రాష్ట్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇంటర్వ్యూపై విచారణ జరిపిన పంజాబ్ హోంశాఖ.. ఇంటర్వ్యుకు సహకరించిన పోలీసులు అధికారులపై చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీలు)సహా ఏడుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. అయితే ఈ ఇంటర్వ్యూ 2023లో పంజాబ్ జైలులో ఖైదీగా ఉన్న సమయంలో జరగటం గమనార్హం. ఈ ఇంటర్వ్యులో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యలో లారెన్స్ బిష్ణోయ్ పాత్రపై ప్రశ్నించారు. ఇంటర్వ్యూ ప్రసారమైన అనంతరం సెప్టెంబరు, 2023లో పంజాబ్ , హర్యానా హైకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. పోలీసు కస్టడీలో ఉన్న ఖైదీకి ఇంటర్వ్యూ ఎలా ఏర్పాటు చేశారని మండిపడింది. ఇక..ఈ సంఘటన పంజాబ్ జైలు వ్యవస్థలో భద్రతా ప్రోటోకాల్‌లకు సంబంధించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తింది. జైలు నుంచి రికార్డ్ చేసిన ఇంటర్వ్యూను అనుమతించిన వైఫల్యాలపై పోలీసు శాఖ అంతర్గత దర్యాప్తును ప్రారంభించింది.చదవండి: దావూద్ బాటలో.. బిష్ణోయ్ నేరసామ్రాజ్యం -
జైలు నుంచి విడుదలైన జానీ మాస్టర్!
లైంగిక వేధింపుల కేసులో జైలులో ఉన్న జానీ మాస్టర్ ఇవాళ విడుదలయ్యారు. గురువారం ఆయనకు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంతో చంచల్ గూడ జైలు నుంచి బయటకొచ్చారు. దాదాపు 36 రోజులుగా జానీమాస్టర్ జైలులోనే ఉన్నారు.కాగా.. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో ఆయిన అరెస్టైన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి సెప్టెంబర్ 15న నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పైగా మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి కూడా చేశారని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుల మేరకు జానీ మీద పోక్సో చట్టం కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి.. గత నెల గోవాలో అరెస్టు చేశారు. -
4 గంటల భేటీకి రూ. 5 లక్షలు.. జైలులో కలుసుకోనున్న ఆశారాం-నారాయణ్
సూరత్: మైనర్ విద్యార్థినిపై అత్యాచారం కేసులో 11 ఏళ్లుగా జైల్లోనే ఉంటున్న ప్రవచనకర్త ఆశారాం ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. ఇటీవలే ఆయనకు కోర్టు ఆదేశాలతో మహారాష్ట్రలో చికిత్స అందించారు. కాగా గుజరాత్ హైకోర్టు అనుమతితో ఆయన తన కుమారుడు నారాయణ్ సాయిని జోధ్‌పూర్ జైలులో కలుసుకోనున్నారు. అయితే ఇందుకోసం ఆశారాం కుమారుడు రూ.5 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.ఆశారాం కుమారుడు నారాయణ్ సాయి గుజరాత్‌లోని సూరత్ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్నాడు. కొన్ని షరతులతో తన తండ్రి ఆశారాంను 4 గంటల పాటు కలిసేందుకు గుజరాత్ హైకోర్టు నారాయణ్ సాయికి అనుమతినిచ్చింది. ఈ భేటీలో ఆశారాం, నారాయణ్ మినహా కుటుంబ సభ్యులెవరూ ఉండరు. శుక్రవారం గుజరాత్ హైకోర్టులో నారాయణ్ సాయి పిటిషన్‌పై విచారణ జరిగింది. నారాయణ్ సాయి అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో సూరత్‌లోని లాజ్‌పూర్ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్నాడు. తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని, ఆయనను కలవాలని అనుకుంటున్నానని నారాయణ్‌సాయి తన పిటిషన్లో పేర్కొన్నాడు.మైనర్‌పై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడిన ఆశారాం దాదాపు 11 ఏళ్లుగా జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉంటున్నాడు. ఈ కాలంలో తండ్రీ కొడుకులు ఎప్పుడూ కలుసుకోలేదు. పెరోల్ కోసం ఆశారాం పలుమార్లు కోరినప్పటికీ మంజూరు కాలేదు. కాగా గుజరాత్ హైకోర్టు తన ఆదేశాలలో నారాయణ్ సాయిను అసిస్టెంట్ పోలీస్ కమిషనర్, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్ల పర్యవేక్షణలో విమానంలో జోధ్‌పూర్ జైలుకు పంపాలని పేర్కొంది. నాలుగు గంటల పాటు జైలులో ఉన్న తన తండ్రిని నారాయణ్ సాయి కలుసుకోనున్నాడు. ఇందుకోసం ఆయన సూరత్‌లోని పోలీస్ స్టేషన్‌లోని ప్రభుత్వ ఖజానాకు రూ.5 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.ఇది కూడా చదవండి: కేసుల పరిష్కారానికి గడువు పెట్టలేం -
నందిగం సురేష్‌కు వైద్య పరీక్షలు
సాక్షి, గుంటూరు : వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. జిల్లా జైలులో ఉన్న ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో జైలు అధికారులు గురువారం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు నందిగం సురేష్..లో-బీపీతో పాటు భుజం నొప్పితో బాధపడుతున్నట్లు గుర్తించారు. -
జైలులో రామలీల.. ఖైదీల ఆనంద తాండవం
హరిద్వార్: నవరాత్రి రోజుల్లో ఉత్తరాదిన ‘రామలీల’ వేడుకలు నిర్వహిస్తుంటారు. ఈ నేపధ్యంలోనే ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా కారాగారంలోనూ ‘రామలీల’ వేడుకలు జరుగుతున్నాయి. ఈ నాటకంలోని పాత్రలన్నింటినీ ఖైదీలే పోషిస్తున్నారు. రామ్‌లీల సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో ఖైదీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. డప్పుల దరువులకు అనుగుణంగా నృత్యం చేశారు. ఈ సందర్భంగా జైలు సీనియర్ సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ ఆర్య మాట్లాడుతూ ‘రామలీల’ కోసం జైలులోని ఖైదీలు నెల రోజులపాటు ప్రాక్టీస్ చేశారన్నారు. ఈ నేపథ్యంలో రామబరాత్ను నిర్వహించామని, దీనిలో పాల్గొన్న ఖైదీలంతా ఆనందంలో మునిగితేలారని అన్నారు. జైల్లో ఇలాంటి కార్యక్రమాలు ఖైదీలలో పాజిటివ్ ఎనర్జీని పెంపొందిస్తాయని అన్నారు. రామబరాత్ అనంతరం రామ పట్టాభిషేకం కూడా నిర్వహించామన్నారు.ఇది కూడా చదవండి: బస్సులోకి ఎక్కేందుకు చిరుత ప్రయత్నం -
జైళ్లలో కుల వివక్ష వద్దు
న్యూఢిల్లీ: కులం ఆధారంగా మనుషులపై వివక్ష చూపడం అనే సామాజిక నేరం దేశంలో శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఆధునిక యుగంలోనూ సమాజంలో కుల వివక్ష కనిపిస్తోంది. ఆఖరికి ఖైదీలను సంస్కరించడానికి ఉద్దేశించిన జైళ్లలోనూ కుల వివక్ష తప్పడం లేదు. కింది కులాల ఖైదీలకు కష్టమైన పనులు అప్పగించడం, వేరే వార్డులు కేటాయించడం, వారిపై దాడులు, హింస సర్వసాధారణంగా మారిపోయింది. ఈ పరిణామంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కుల ఆధారంగా ఖైదీలపై వివక్ష చూపడడం తగదని తేల్చిచెప్పింది. కారాగారాల్లో ఖైదీలందరినీ సమానంగా చూడాలని ఆదేశించింది. వివిధ రాష్ట్రాల్లోని కారాగారాల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, కులం ఆధారంగా ఖైదీలపై వివక్ష చూపుతున్నారని పేర్కొంటూ మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతానికి చెందిన జర్నలిస్టు సుకన్య శాంత సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిట్) దాఖలు చేశారు. స్టేట్ ప్రిజన్ మాన్యువల్ నిబంధనలను పిటిషనర్ సవాలు చేశారు. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేపీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఖైదీలను కులం ఆధారంగా విభజిస్తున్న మాన్యువల్‌లోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. మూడు నెలల్లోగా నిబంధనల్లో సవరణలు చేయాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. ఖైదీలపై వివక్షను అంతం చేసేలా అన్ని రాష్ట్రాలూ జైలు మాన్యువల్ నిబంధనలు మార్చాల్సిందేనని తేల్చిచెప్పింది. జైళ్లలో చోటుచేసుకున్న కుల వివక్ష ఘటనలను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. మూడు నెలల తర్వాత వీటిని ‘విచారించాల్సిన కేసుల జాబితా’లో చేర్చాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. తమ తీర్పుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదిక సమర్పించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. నిర్బంధంలో ఉన్నవారికి సైతం గౌరవంగా జీవించే హక్కు ఉందని ధర్మాసనం ఉద్ఘాటించింది. మానవులంతా సమానంగా జన్మించారని ఆర్టికల్ 17 చెబుతున్నట్లు గుర్తుచేసింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో జైలు మాన్యువల్ నిబంధనలు మార్చాలని స్పష్టంచేసింది. పని విషయంలో సమాన హక్కు ఉండాలి ‘‘జైలు మాన్యువల్‌లో కులం కాలమ్ అవసరం లేదు. చిన్న కులాల ఖైదీలతో మరుగుదొడ్లు కడిగించడం, ట్యాంక్‌లు శుభ్రం చేయించడం వంటి పనులు, అగ్ర కులాల ఖైదీలకు సులభమైన వంట పనులు అప్పగించడం ముమ్మాటికీ వివక్షే అవుతుంది. ఇలాంటి చర్యలు అంటరానితనం పాటించడం కిందకే వస్తాయి. కులం ఆధారంగా ఖైదీలను వేరే గదుల్లో ఉంచడం సమంజసం కాదు. వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించడం వలసవాద వ్యవస్థకు గుర్తు. షెడ్యూల్డ్ కులాల ఖైదీలకే పారిశుధ్య పనులు అప్పగించడం తగదు. పని విషయంలో అందరికీ సమాన హక్కు ఉండాలి. కేవలం ఒక కులం వారినే స్వీపర్లుగా ఎంపిక చేయటం సమానత్వ హక్కుకు వ్యతిరేకం. కింది కులాల ఖైదీలకు మాత్రమే ఇలాంటి పనులు అప్పగించడం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 15ను ఉల్లంఘించడమే అవుతుంది’’ అని సుప్రీంకోర్టు తీన తీర్పులో వెల్లడించింది. -
జైల్లో టార్చర్ చేశారు: కేజ్రీవాల్
చండీగఢ్:ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)చీఫ్,ఢిల్లీమాజీసీఎం అరవింద్కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.ఆదివారం(సెప్టెంబర్29)హర్యానాలో జరిగిన బహిరంగసభలో కేజ్రీవాల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ‘జైలులో నన్ను మానసికంగా,శారీరకంగా చిత్రహింసలు పెట్టేందుకు ప్రయత్నించారు.నేను షుగర్ పేషేంట్‌ను.నాకు రోజుకు నాలుగు ఇన్సులిన్ ఇంజెలిక్షన్లు అవసరం. జైలులో నాకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు అందకుండా చేశారు.అయితే వారికి తెలియని విషయం ఏంటంటే.వాళ్లు నన్ను ఏమీ చేయలేరు.ఎందుకంటే నేను హర్యానా బిడ్డను’అని కేజ్రీవాల్ అన్నారు.లిక్కర్ స్కామ్ కేసులో ఐదు నెలలు జైలులో గడిపిన తర్వాత కేజ్రీవాల్‌కు సుపప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన సెప్టెంబర్ 13న తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు.ఢిల్లీ ప్రజలు మళ్లీ ఆమ్ఆద్మీపార్టీకి అధికారం ఇస్తేనే తాను సీఎం పదవి తీసుకుంటానని తెలిపారు. ఇదీ చదవండి: సభా వేదికపై ఖర్గేకు అస్వస్థత -
హర్యానా ఎన్నికలకు పెరోల్‌పై డేరా బాబా రాక?
రోహ్తక్: ఇద్దరు మహిళా శిష్యురాళ్లపై అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మరోసారి 20 రోజుల తాత్కాలిక పెరోల్ కోసం అభ్యర్థించారు. అక్టోబర్ 5న జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఆయన పెరోల్‌కు అభ్యర్థించారు. దీంతో ఈ ఎన్నికలకు ముందే రామ్ రహీమ్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.రామ్ రహీమ్ ఈ ఏడాది ఆగస్టు 13న 21 రోజుల పెరోల్‌పై రోహ్తక్ జిల్లాలోని సునారియా జైలు నుంచి బయటకు వచ్చారు. గుర్మీత్ రామ్ రహీమ్‌కు హర్యానాలో లక్షలాదిమంది అనుచరులున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామ్ రహీమ్ జైలు నుంచి బయటకు వస్తే, అది ఎన్నికలపై పెను ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హర్యానాలో అక్టోబరు 5న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇది కూడా చదవండి: పదేళ్ల ‘మన్ కీ బాత్’లో.. ప్రధాని మోదీ భావోద్వేగం -
చంపడానికి వచ్చారు.. ధర్మవరంలో రెచ్చిపోయిన కూటమి నేతలు.. కేతిరెడ్డి ఫైర్
-
బెయిల్ కాదు.. జైలు
సాక్షి, హైదరాబాద్: ‘జైలు కాదు.. బెయిల్’అన్న సుప్రీంకోర్టు న్యాయసూత్రం ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. దేశంలోని జైళ్లలో మగ్గుతున్న వారిలో రెండింట మూడో వంతు విచారణ ఖైదీలే. బెయిల్ లాంటి అంశాల్లో సత్వర విచారణ జరపాలని న్యాయ కోవిదులు చెబుతున్నా అమలు మాత్రం ఆమడ దూరం అన్నట్టుగానే ఉంది. బెయిల్ వచ్చినా ఆర్థిక స్తోమత లేక, పూచీకత్తు ఇచ్చేవారు లేక విడుదలకు నోచుకోని వారు కూడా ఉండటం మరింత దారుణం.విచారణ జరిగి శిక్షపడే నాటికి.. వారికి పడే శిక్షాకాలం కూడా పూర్తవుతున్న వారు కొందరు ఉండగా, ఆ తర్వాత నిర్దోషులుగా విడుదలవుతున్న వారు మరికొందరు. అంటే నేరం చేయకున్నా కొందరు జైళ్లలో మగ్గుతున్నారన్న మాట. ఏళ్లుగా జైళ్లలో ఉండి ఆ తర్వాత నిర్దోషులుగా విడుదలైనా.. వారి జీవితం, కుటుంబాలు ఆగమైనట్టే కదా అనేది బాధితుల వాదన. మరి ఈ విచారణ ఖైదీల సమస్యకు పరిష్కారం ఎప్పుడు.. ఎలా.. అన్నది ప్రశ్నార్థకం. అయితే గత నెల జైలు అధికారులకు సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు కొంత ఉపశమనం కలిగించనున్నాయి. యువతే అధికం... విచారణ ఖైదీల్లో అత్యధికం యువతే. 2022 గణాంకాలను పరిశీలిస్తే.. 18–30 ఏళ్ల మధ్య ఖైదీలు 2,15,471 మంది ఉండగా, 30–50 ఏళ్ల మధ్య 1,73,876 మంది ఉన్నారు. మొత్తం 4,34,302 విచారణ ఖైదీల్లో రెండింట మూడోవంతు(66శాతం) యువతే ఉండటం గమనార్హం.విచారణా ఖైదీల హక్కులు.. ⇒సత్వర విచారణ పొందేందుకు అర్హులు ⇒హింస, అమానవీయ ప్రవర్తనకు గురికాకుండా హక్కు ఉంటుంది ళీ సరైన కారణాలను అందించకపోతే జైలు నుంచి కోర్టుకు తరలించేటప్పుడు సంకెళ్లు వేయడానికి వీలులేదు. ⇒కేసు విషయంలో కోర్టుకు దరఖాస్తు చేసుకొని ఉచిత న్యాయ సేవలు పొందవచ్చు. ⇒అరెస్టు చేసే సమయంలో వారి కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడికి తెలియజేయాలి. ⇒నిర్దిష్ట భద్రతా ప్రమాణాలకు లోబడి కుటుంబ సభ్యులకు ఖైదీని సందర్శించే అవకాశం.సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. 2023లో, అంతకుముందు.. ‘జైలు కాదు.. బెయిల్’అనే సూత్రం ప్రమాణంగా విచారణ సాగాలి. విచారణ ఖైదీలతో జైళ్లు కిక్కిరిసిపోవడం న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఒక వ్యక్తిని కోర్టులో నిలబెట్టి, దోషిగా నిరూపించాలని పోలీసులు ఎక్కువగా భావిస్తున్నారు. ఇలాంటి ఏకపక్ష నిర్ణయం ప్రమాదకరం. ఇది పేద, బలహీన వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బెయిల్ పొందినా ఆర్థిక స్తోమత, పూచీకత్తు ఇచ్చేవారు లేక చాలా మంది జైళ్లలోనే మగ్గుతున్నారు. ఈ కారణాలతో జైళ్లలో సంఖ్య పెరిగిపోతోంది. 2024, ఆగస్టులో... దేశవ్యాప్తంగా ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోతున్న అండర్ ట్రయల్ ఖైదీలను త్వరితగతిన విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్ని జైళ్ల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేస్తున్నాం. కొత్త క్రిమినల్ న్యాయచట్టం భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని సెక్షన్ 479 ప్రకారం సాధ్యమైనంత త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలి. మూడు నెలల్లోగా అండర్ ట్రయల్ ఖైదీల దరఖాస్తులను ప్రాసెస్ చేయాలి. అయితే, ఈ నిబంధన మరణశిక్ష లేదా జీవిత ఖైదు వంటి ఘోరమైన నేరాలకు పాల్పడిన అండర్ ట్రయల్‌లకు వర్తించదు. – సుప్రీంకోర్టుఅండర్ ట్రయల్ ఖైదీలకు లీగల్ డిఫెన్స్ కౌన్సిల్స్ ద్వారా న్యాయ సాయం అందిస్తాం. దీని కోసం జైళ్లకు కూడా వెళతాం. న్యాయ సాయం కావాల్సిన వారికి న్యాయవాదులను ఏర్పాటు చేస్తాం. బెయిల్ వచి్చన తర్వాత ఒకవేళ పెద్ద మొత్తంలో షూరిటీలు చెల్లించలేని వారు ఉంటే.. కోర్టును సంప్రదించి ఆ మొత్తాన్ని తగ్గించేలా తోడ్పాటునందిస్తాం. –తెలంగాణ లీగల్ సరీ్వసెస్ అథారిటీ -
జైల్లో ఉన్న నిందితుడు మరో కేసులో ముందస్తు బెయిల్ కోరొచ్చు
న్యూఢిల్లీ: జైల్లో ఉన్న నిందితుడు వేరొక కేసులో ముందస్తు బెయిల్ కోరవచ్చని సుప్రీంకోర్టు తేలి్చచెప్పింది. వేరొక కేసులో అతను అరెస్టు కానంతవరకు దాంట్లో ముందస్తు బెయిల్ కోరడానికి అర్హుడేనని వివరించింది. ఒక కేసులో నిందితుడు కస్టడీలో ఉన్నాడనేది.. రెండో కేసులో అతని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సెషన్స్ కోర్టు, హైకోర్టులు నిర్ణయం తీసుకోవడానికి అడ్డంకి కాదని స్పష్టం చేసింది. కస్టడీలో ఉన్నంతమాత్రాన మరో కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని చట్టంలో ఎక్కడా లేదని చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ‘అరెస్టు చేస్తారనే భయమున్నపుడు ముందస్తు బెయిల్‌ను కోరే హక్కును సీఆర్పీసీ సెక్షన్ 438 కలి్పంచింది. ప్రజాస్వామ్యదేశంలో వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ప్రాధాన్యతను గుర్తించడానికే ఈ సెక్షన్ ఉంది. 438 సెక్షన్‌కు ఆంక్షలను పెట్టకూడదు. అలాచేస్తే అది ఈ సెక్షన్ సారాంశానికి, చట్టం ఉద్దేశానికి వ్యతిరేకమే అవుతుంది’ అని పేర్కొంది. వివిధ హైకోర్టులు ఈ అంశంలో భిన్న వైఖరులు తీసుకోవడంతో సర్వోన్నత న్యాయస్థానం సోమవారం స్పష్టతనిచి్చంది. జైళ్లో ఉన్న నిందితుడు మరోకేసులో ముందస్తు బెయిల్‌ను కోరలేడని రాజస్తాన్, ఢిల్లీ, అలహాబాద్ హైకోర్టులు తీర్పులిచ్చాయి. బాంబే, ఒడిశా హైకోర్టులు ముందస్తు బెయిల్ కోరవచ్చని అభిప్రాయపడ్డాయి. ‘నిందితుడికి ముందస్తు బెయిల్ కోరే చట్టబద్ధమైన హక్కుని నిరాకరించడం తగదు. మొదటి కేసులో కస్టడీ నుంచి విడుదలయ్యే దాకా మరో కేసులో ముందస్తు బెయిల్ కోరలేరనడంలో అర్థం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
జైల్లోంచి పనిచేయకుండా కేజ్రీవాల్‌పై నిషేధం ఉందా?
సాక్షి, న్యూఢిల్లీ: జైలులో నుంచి విధులు నిర్వర్తించకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై నిషేధమేమైనా ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఖైదీల ముందస్తు విడుదలకు సంబంధించిన ఫైళ్లపై సంతకం చేయడంలో జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు అవరోధాలేమిటని నిలదీసింది. ముందస్తు విడుదలకు సంబంధించి ఫైళ్లపై నిర్ణయాలు ఆలస్యం కావడం సరికాదని అభిప్రాయపడింది. ఓ ఖైదీ ముందస్తు విడుదలకు సంబంధించిన కేసును శుక్రవారం జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జిలతో కూడిన ధర్మాసనం విచారించింది. సాధారణంగా ఓ ఖైదీ ముందస్తు విడుదలకు సంబంధించిన ఫైలు లెఫ్టినెంట్ గవర్నర్‌ను చేరాలంటే తొలుత ముఖ్యమంత్రి సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే, ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ సదరు ఫైలుపై సంతకం చేయడం ఆలస్యం కావడాన్ని కోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో ‘‘జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ ముందస్తు విడుదల ఫైళ్లపై సంతకం చేయకూడదని ఏమైనా నిబంధన ఉందా? స్వయంగా ఓ కేసులో విచారణ ఖైదీగా ఉన్న సీఎం సదరు ఫైలుపై సంతకం చేయకుండా నిషేధం ఏమైనా ఉందా?’’అని ఢిల్లీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకుంటామని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యభాటి, సీనియర్ న్యాయవాది అర్చనా దవేలు కోర్టుకు తెలిపారు. ఇప్పటివరకూ ఇలాంటి ఘటన ఎదురు కాలేదని వివరించారు. ఒకవేళ అలాంటి నిబంధన ఏమైనా ఉంటే చెప్పాలని లేదంటే ఆరి్టకల్ 142 ఇచి్చన అధికారాలతో కోర్టు పరిశీలన చేస్తుందని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి కేసులు ఎక్కువ కాలం వేచి ఉండరాదని అభిప్రాయపడుతూ ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. -
పరారీకి యత్నం.. 129 మంది ఖైదీలు మృతి
కిన్సాసా: డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని సెంట్రల్ మకాల జైలులో విషాద ఘటన జరిగింది. జైలులో నుంచి పారిపోయేందుకు ప్రయత్నించి 129 మంది ఖైదీలు మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని కాంగో అంతర్గత వ్యవహారాల మంత్రి షబానిలుకో మంగళవారం(సెప్టెంబర్3) ఎక్స్(ట్విటర్)లో తెలిపారు.ఖైదీల్లో 24 మంది మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినట్లు మంత్రి తెలిపారు. మకాల జైలు నుంచి తప్పించుకొనేందుకు ఖైదీలు ప్రయత్నించారని, దీంతో గార్డులు అప్రమత్తమై రంగంలోకి దిగడంతో జైలులో తొక్కిసలాట జరిగిందని చెప్పారు. తొక్కిసలాటకు తోడు జైలు కిచెన్‌లో చెలరేగిన మంటల్లో మొత్తం 129 మంది మరణించారు. మరో 59 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఖైదీలు ఎవరూ తప్పించుకోలేదని.. తప్పించుకొనేందుకు ప్రయత్నించినవారు మరణించారని జైలు అధికారులు చెప్పారు. జైలు నుంచి కాల్పుల శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు కొందరు చెబుతున్నారు. -
రోజూ రోటీయేనా ?
కోల్‌కతా: దేశమంతటా కలకలం సృష్టించిన కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలి హత్యోదంతంలో నిందితుడు సంజయ్ రాయ్ జైళ్లోనూ తన మొండితనం చూపిస్తున్నాడు. ప్రతి రోజూ చపాతి ఏం తింటామని జైలు అధికారులపైనే ఆగ్రహం వ్యక్తంచేశాడు. అయితే జైలు నిబంధనల ప్రకారం ఖైదీలతోపాటే విచారణ ఖైదీలకు ఒకేరకమైన భోజనం వడ్డిస్తారు. వైద్యురాలి హత్యకేసులో అరెస్ట్‌చేశాక పోలీసులు సంజయ్‌ను కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కారాగారంలో పడేశారు. అయితే కస్టడీలో ఉన్నప్పటి నుంచి ఒకే తరహా చపాతి, కూరనే రోజూ వడ్డిస్తున్నారని సంజయ్ ఆగ్రహంగా మాట్లాడారు. ‘‘ రోజూ రోటీయేనా?. నాకు కోడిగుడ్డు ఫ్రైడ్రైస్లాంటి ఎగ్ చావ్మీన్ పెట్టండి’ అని జైలు సిబ్బందిని బెదిరించినట్లు విశ్వస నీయ వర్గాల సమా చారం. అయితే విచారణ ఖైదీ తనకిష్టమొచ్చింది తింటానని తెగేసి చెప్పడంపై జైలు యాజమాన్యం సీరియస్ అయింది. అతి చేయొద్దని హెచ్చరించి అధికారులు సంజయ్ నోరు మూయించారు. దీంతో పెట్టింది తింటానని సంజయ్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. అయితే జైలుకు వచ్చిన కొత్తలో తనకు నిద్ర పట్టట్లేదని, నిద్ర సరిపోవడం లేదని, నన్ను కాస్తంత పడుకోనివ్వండి అని సంజయ్ తెగ ఫిర్యాదులు చేసేవాడని ఇప్పుడు సాధారణ స్థాయికి వచ్చాడని తెలుస్తోంది. -
త్వరలో బళ్లారి జైలుకు దర్శన్ !
బొమ్మనహళ్లి : అభిమాని రేణుకాస్వామి హత్యకేసుకు సంబంధించి పరప్పన అగ్రహార జైలులో న్యాయ నిర్బంధంలో ఉన్న నటుడు దర్శన్‌కు అక్కడ రాచ మర్యాదలు లభించడం పెను సంచలనమైన విషయం తెలిసిందే. రాచమర్యాదులు అందుతున్న ఫొటోలు వెలుగులోకి రావడంతో జైళ్లశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దర్శన్‌ను పరప్పన ఆగ్రహార జైలు నుంచి బళ్లారి జైలుకు తరలించాలని జైళ్ల శాఖ నిర్ణయించింది. ఈమేరకు బెంగళూరు 24వ ఏసీఎంఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దర్శన్‌ను బళ్లారి జైలుకు తరలించేందుకు కోర్టు కూడా అనుమతి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రెండు మూడు రోజుల్లో దర్శన్‌ను బళ్లారికి తరించనున్నట్లు సమాచారం. భవిష్యత్‌లో విచారణ నిమిత్తం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బళ్లారి జైలు నుంచే కోర్టు ఎదుట హాజరు పరచనున్నట్లు సమాచారం. రాచమర్యాదల కేసుపై దర్యాప్తు దొడ్డబళ్లాపురం: దర్శన్‌కు రాచమర్యాదులు అందిన ఘటనలో పరప్పన అగ్రహార పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదు కాగా రెండింటిలో దర్శన్ మొదటి నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసుల దర్యాప్తునకు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ సారా ఫాతిమా మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. బేగూరు పోలీస్‌స్టేషన్ సీఐ క్రిష్ణకుమార్ దర్యాప్తు ప్రారంభించనున్నారు. జైలు లాన్లో కూర్చుని దర్శన్ రౌడీషిటర్ ఇతర ఖైదీలకు ఆ ఏర్పాటు ఎవరు చేశారు?, సిగరెట్లు జైల్లోకి ఎలా వచ్చాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తారు. ఈ దృశ్యాలు ఫొటో, వీడియో ఎలా తీశారనే విషయంపై హుళిమావు సీఐ దర్యాప్తు చేస్తారు. జైలు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అధికార దురి్వనియోగం తదితర అంశాలపై మూడవ కేసును ఎల్రక్టానిక్ సిటీ పోలీస్‌స్టేషన్ ఏసీపీ మంజునాథ్ దర్యాప్తు చేస్తారు.దర్శన్ ఉదంతంపై సీఎం సమీక్ష దర్శన్, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణలకు జైలులో రాచ మర్యాదలు దక్కుతున్న అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రులతో సమావేశమయ్యారు. మంగళవారం ఉదయం హోంమంత్రి పరమేశ్వర్ ముఖ్యమంత్రిని కలిసి జైల్లో జరుగుతున్న అక్రమాలు, లోపాల గురించి వివరించారు. ఇప్పటికే ఉన్నతాధికారులతో కలిపి మొత్తం 9 మందిని సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఐపీఎస్ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీ జరుగుతోందని చెప్పారు. ఆలోపు కోర్టు అనుమతి తీసుకుని దర్శన్‌ను వేరే జైలుకి తరలించే ఏర్పాటు చేస్తామన్నారు. కోర్టు అనుమతిస్తే దర్శన్‌ను బళ్లారి లేదా హిండలగా జైలుకి తరలించే అవకాశాలు ఉన్నాయి.తనిఖీకి ఐపీఎస్ అధికారులతో కమిటీ దొడ్డబళ్లాపురం: పరప్పన అగ్రహార జైల్లో దర్శన్, ప్రజ్వల్ రేవణ్ణ, రౌడీ షీటర్లకు రాచ మర్యాదలు ఇస్తున్న విషయానికి సంబంధించి తనిఖీ చేయడానికి ఐపీఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని హోంమంత్రి జీ పరమేశ్వర్ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జైల్లో దర్శన్, ఇతర ఖైదీలు ఒక బ్యారక్ నుంచి మరో బ్యారక్‌లోకి తిరగడానికి అవకాశం కలి్పంచినట్టు సీసీటీవీలో స్పష్టంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న పలు జైళ్లలో ఇదే పరిస్థితి ఉందన్నారు. జైలును సందర్శించిన పోలీస్ కమిషనర్ బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ పరప్పన అగ్రహార జైలును సందర్శించారు. జైలులో గంజాయి, మద్యం, సిగరెట్లు, మొబైళ్లు అన్నీ ఇస్తున్నారని ఇటీవల పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలై వచ్చిన ఒక ఖైదీ మీడియా ముందు వెల్లడించాడు. దీంతో కమిషనర్ దయానంద్ జైలుని సందర్శించారు. ఫొటోలు, వీడియోలపై జైలు అధికారులను ప్రశ్నించారు. -
కన్నడ నటుడు దర్శన్ కు జైల్లో వీఐపీ ట్రీట్ మెంట్
-
‘కోల్‌కతా’ నిందితునికి ముగిసిన లై డిటెక్టర్ పరీక్ష
న్యూఢిల్లీ: కోల్‌కతాలో ఆర్జీ కర్ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యురాలి దారుణ హత్యోదంతంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు ఆదివారం లై డిటెక్షన్ పరీక్ష నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. కోల్‌కతాలో ప్రెసిడెన్సీ కారాగారంలోనే పరీక్ష పూర్తిచేసినట్లు తెలిపారు. ఇందుకోసం ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లే»ొరేటరీ నుంచి పాలిగ్రఫీ నిపుణులు కోల్‌కతాకు వచ్చారు.మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు హతురాలితో పాటు పనిచేసే నలుగురు వైద్యులకు శనివారమే లై డిటెక్షన్ టెస్ట్ చేశారు. ఆ పరీక్షలో వాళ్లు ఏమేం చెప్పారనే వివరాలను పోలీసులు బయట పెట్టలేదు. సత్యశోధన పరీక్షలో వీళ్లు చెప్పిన అంశాలను సాక్ష్యాధారాలుగా కోర్టులో ప్రవేశపెట్టేందుకు చట్టపరంగా అనుమతి లేనప్పటికీ కేసు దర్యాప్తులో ఆ వివరాలు ఎంతో ఉపయోగపడతాయి.ఘోష్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు కర్ వైద్య కళాశాలకు ప్రిన్సిపల్‌గా ఉండగా సందీప్ ఘోష్ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ ఆదివారం ఆకస్మిక సోదాలు చేపట్టింది. ఉదయమే కేంద్ర బలగాలతో ఘోష్ ఇంటికి వెళ్లిన అధికారులు డోర్లు తెరవకపోవడంతో చాలాసేపు వేచి చూడాల్సి వచి్చంది. మాజీ మెడికల్ సూపరింటెండెంట్, వైస్ ప్రిన్సిపల్ సంజయ్ వశిష్్ట, మరో ప్రొఫెసర్, ఇంకో 12 మందికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు చేశారు. ఆస్పత్రికి ఔషధాలు, ఇతర ఉపకరణాలను సరఫరాచేసే వారి ఆఫీసుల్లో సోదాలు చేశారు. -
ఫర్లో తో డేరా బాబా బయటకు?
హర్యానాలోని సునారియా జైలు నుంచి డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్(డేరా బాబా)కు 21 రోజుల పాటు ఫర్లో లభించింది. ఈ సమయంలో ఆయన ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లాలో గల బర్నావా ఆశ్రమంలో ఉండనున్నారు. రామ్ రహీమ్ తన ఇద్దరు అనుచరులపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గత జనవరి 19న రామ్‌రహీమ్‌కు 50 రోజుల పెరోల్ లభించింది. ఈ దరిమిలా అతనికి పదేపదే పెరోల్ లేదా ఫర్లో లభించడంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) దాఖలు చేసిన పిటిషన్‌ను పంజాబ్-హర్యానా హైకోర్టు కొట్టివేసింది. కాంపిటెంట్ అథారిటీ నిబంధనల ఆధారంగా గుర్మీత్ రామ్ రహీమ్‌కు పెరోల్ లేదా ఫర్లో మంజూరు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని హర్యానా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణలో హర్యానా ప్రభుత్వం కేవలం రామ్ రహీమ్ మాత్రమే కాకుండా హత్య, అత్యాచారం కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న 80 మందికి పైగా ఖైదీలకు పెరోల్ లేదా ఫర్లో సౌకర్యం అందజేస్తున్నట్లు స్పష్టం చేసింది.ఫర్లో అంటే ఏమిటి?ఫర్లో అంటే ఎవరైనా ఖైదీ అతని కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు హాజరు కావడం లేదా అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యుడిని పరామర్శించడం లాంటి నిర్దిష్ట ప్రయోజనం కోసం జైలు నుండి తాత్కాలికంగా విడుదల చేయడం. ఫర్లో సాధారణంగా స్వల్ప కాలానికి మాత్రమే ఇస్తారు. ఈ గడువు ముగిసిన తర్వాత, ఖైదీ తిరిగి జైలుకు వెళ్లవలసి ఉంటుంది. ఫర్లో షరతులను జైలు అధికారులు నిర్ణయిస్తారు. ఎవరైనా ఖైదీకి ఫర్లో మంజూరు చేసేటప్పుడు అధికారులు సదరు ఖైదీ చెప్పే కారణం, అతని ప్రవర్తన, అతను తప్పించుకునే అవకాశం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.పెరోల్ అంటే ఏమిటి?పెరోల్ అంటే ఖైదీ తన జైలు శిక్షలో కొంత భాగాన్ని పూర్తి చేసిన చేసిన అనంతరం షరతులతో కూడిన విడుదలకు అనుమతి కల్పిస్తారు. ఇది ఖైదీ ప్రవర్తనను గుర్తించి ఇస్తారు. ఇది ఖైదీని సమాజంలో తిరిగి చేర్చేందుకు ఉపకరిస్తుంది. పెరోల్ సమయంలో ఖైదీ జైలు అధికారులు పర్యవేక్షణలో ఉంటాడు. అలాగే నిర్ధిష్ట ప్రాంతంలో ఉంటూ, నేర కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. -
పాక్ సైన్యం క్షమాపణ చెప్పాలి: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అక్కడి సైన్యంపై విమర్శల యుద్ధానికి దిగారు. కోర్టు నుంచి పలు కేసుల్లో ఉపశమనం లభించడంతో ఇమ్రాన్‌లో నైతిక స్థైర్యం పెరిగినట్లు కనిపిస్తోంది. గత ఏడాది మే 9న అరెస్టయిన మాజీ ప్రధాని ఇమ్రాన్ నాడు చెలరేగిన అల్లర్లకు బాధ్యత వహిస్తూ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. అయితే హింసాకాండ జరిగిన రోజున పాక్ రేంజర్లు తనను కిడ్నాప్ చేసినందున ఆర్మీ తనకు క్షమాపణ చెప్పాలని ఖాన్ డిమాండ్ చేశారు.ఇమ్రాన్ అరెస్టు తర్వాత పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు నిరసనలకు దిగారు. ఇది దేశవ్యాప్తంగా పౌర, సైనిక సంస్థలకు నష్టం కలిగించింది. నాడు ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ పీటీఐ (ఇమ్రాన్ పార్టీ) అరాచక రాజకీయాలకు పాల్పడినందుకు క్షమాపణలు కోరితే చర్చలు జరపవచ్చని అన్నారు. ఈ ప్రకటన తరువాత బ్లాక్ డే హింసకు ఖాన్ పార్టీ క్షమాపణ చెప్పాలని వివిధ వర్గాల నుండి డిమాండ్లు వచ్చాయి.డాన్ వార్తాపత్రిక తెలిపిన వివరాల ప్రకారం రావల్పిండిలోని అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ఒక ప్రశ్నకు సమాధానంగా మే 9న చెలరేగిన హింస విషయంలో క్షమాపణ చెప్పడానికి తన దగ్గర ఎటువంటి కారణం లేదని అన్నారు. నాడు ఇస్లామాబాద్ హైకోర్టు కాంప్లెక్స్ నుండి మేజర్ జనరల్ నేతృత్వంలోని రేంజర్లు తనను అరెస్టు చేశారని ఖాన్ ఆరోపించారు. హింస జరిగిన రోజున తనను పాక్ రేంజర్లు కిడ్నాప్ చేశారని, అందుకు ప్రతిగా ఆర్మీ తనకు క్షమాపణలు చెప్పాలని ఖాన్ డిమాండ్ చేశారు. -
ఇక ర్యాలీని మళ్లీ జైలు వైపు తిప్పండి
-
తీహార్ జైలులో ఖైదీల ఘర్షణ.. ఇద్దరికి గాయాలు
ఢిల్లీలోని తీహార్ జైలులో మరోమారు గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఖైదీల మధ్య మరోసారి ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు. జైలులోని ఫోన్ రూమ్‌లో ఈ గొడవ జరిగింది. లవ్లీ, లావిష్ అనే ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు.వివరాల్లోకి వెళితే లోకేష్ అనే ఖైదీ ఈ దాడికి పాల్పడ్డాడని సమాచారం. లోకేష్ సోదరుని హత్య కేసులో లవ్లీ, లావిష్ జైలులో ఉన్నారు. జైలులోనే దాడికి ప్లాన్ చేసిన లోకేష్ తన సహచరులు హిమాన్ష్, అభిషేక్‌ల సాయం తీసుకున్నాడు. అవకాశం చూసుకున్న లోకేష్, అతని సహచరులు కలసి లవ్లీ, లావిష్‌లపై దాడి చేశారు. గాయపడిన ఖైదీలిద్దరినీ జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఒక ఖైదీని ఆస్పత్రి నుంచి తిరిగి జైలుకు తీసుకువచ్చారు. మరొక ఖైదీ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తీహార్ జైలులో గతంలోనూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. -
US: అమ్మాయి అనుకుని చాటింగ్.. భారత విద్యార్థికి 12 ఏళ్ల జైలు
న్యూయార్క్: ఉన్నత చదువులు చదవడానికి అమెరికా వెళ్లి బుద్ధి వక్రీకరించి 12 ఏళ్ల జైలు శిక్షకు గురయ్యాడు ఓ భారత విద్యార్థి. స్టూడెంట్ వీసా మీద అమెరికా వెళ్లిన ఉపేంద్ర ఆడూరు(32) భారత విద్యార్థి సోషల్ మీడియాలో 13 ఏళ్ల బాలిక అనుకుని ఓ వ్యక్తితో చాటింగ్ మొదలుపెట్టాడు. తన లైంగిక వాంఛ తీర్చుకునేందుకు మభ్యపెట్టే విధంగా సందేశాలు పంపాడు. అంతటితో ఆగకుండా ఆ ఖాతాకు అశ్లీల చిత్రాల మెసేజ్‌లు కూడా పెట్టాడు. ఏకంగా ఓ రోజు టైమ్ ఫిక్స్ చేసుకుని ఆ బాలికను కలవడానికి వెళ్లాడు. ఇక్కడే అతడికి ఎదురైంది పెద్ద ట్విస్టు. ఉపేంద్ర అనుకున్నట్లు ఆ ఖాతా 13 ఏళ్ల బాలికది కాదు.మైనర్ల మీద లైంగికనేరాలకు పాల్పడే వారిని వలపన్ని పట్టుకునేందుకు ఓ ప్రైవేట్ డిటెక్టివ్ క్రియేట్ చేసిన నకిలీ ఖాతా. ఉపేంద్ర బాలికను కలిసేందుకు మీటింగ్ స్పాట్‌కు వెళ్లగానే పోలీసులు పట్టుకున్నారు. అతడి ఫోన్ లాక్కుని అందులోని అశ్లీల వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారమంతా 2022 సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 6 మధ్యలో జరిగింది. ఈ కేసులో ఉపేంద్రకు 12 ఏళ్ల జైలు శిక్షతో పాటు రిలీజ్ అయిన తర్వాత మరో 10 ఏళ్లు పోలీసుల పర్యవేక్షణలో ఉండాలని కోర్టు తీర్పిచ్చింది. -
జైలు నుంచి విడుదలైన కాసేపటికే మళ్లీ అరెస్టైన గ్యాంగ్‌స్టర్.. ఎందుకంటే!
ఓ గ్యాంగ్‌స్టర్ అత్యుత్సాహంతో లేనిపోని కష్టాలు కొనితెచ్చుకున్నాడు. ఇటీవల జైలు నుంచి విడుదలైన ఆనందంలో జైలు నుంచి అతని అనుచరులు భారీ ర్యాలీ చేపట్టారు. రోడ్డుపై కార్లలో ఊరేగించారు. దీంతో పోలీసులు మళ్లీ గ్యాంగ్‌స్టర్‌పై చర్యలు చేపట్టారు. అతడిపై కేసు నమోదు చేసి మళ్లీ జైలుకు తరలించారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ హర్షద్ పాటంకర్ హత్యాయత్నం, దొంగతనాలు, డ్రగ్స్ వంటి కేసుల్లో గతంలో అరెస్టయ్యాడు. జులై 23న అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి మద్దతుదారులు భారీ ర్యాలీ చేపట్టారు. బేతేల్ నగర్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకూ ‘కమ్ బ్యాక్’ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హర్షద్ సన్‌రూఫ్ కారులో వెళ్తుండగా.. పలు కార్లు, సుమారు 15 ద్విచక్ర వాహనాలు అతడిని అనుసరించాయి. ఈ సందర్భంగా కారు రూఫ్ నుంచి హర్షద్ తన మద్దతుదారులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.ఇందుకు సంబంధించిన వీడియోని అతడి మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అదికాస్తా వైరల్‌గామారి పోలీసుల దృష్టికి చేరింది. దీంతో పోలీసులు హర్షద్‌పై చర్యలు చేపట్టారు. అనధికారిక ర్యాలీని నిర్వహించి రోడ్డుపై గందరగోళం సృష్టించినందుకు గానూ హర్షద్‌తోపాటు ఆరుగురు మద్దతుదారులపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు వారందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు. -
కేజ్రీవాల్‌ను జైల్లోనే చంపేందుకు బీజేపీ కుట్ర: ఆప్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను జైలులోనే చంపేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. జూన్ 3–జూలై 7వ తేదీల మధ్య కేజ్రీవాల్ షుగర్ స్థాయిలు 26 రెట్లు పడిపోయినట్లు ఆరోగ్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాలు కేజ్రీవాల్ జీవితంతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. కేజ్రీవాల్‌కు ఏ క్షణమైనా ప్రమాదం జరగొచ్చని అధికారిక నివేదికలే చెబుతున్నాయన్నారు. కేజ్రీవాల్ ఆరోగ్యంపై బీజేపీ, ఎల్జీ పదే పదే వెలువరిస్తున్న తప్పుడు నివేదికలు, చేస్తున్న తప్పుడు వ్యాఖ్యలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయన్నారు. ‘కేజ్రీవాల్ పూరీలు, స్వీట్లు తదితరాలను అతిగా తింటున్నారని, అవసరం లేకున్నా ఇన్సులిన్ అడుగుతున్నారని వీరే గతంలో ఆరోపించారు. కోర్టు జోక్యంతో ఎయిమ్స్ వైద్యులు పరీక్షలు జరిపి ఆయనకు ఇన్సులిన్ ఇచ్చారు. ఇప్పుడేమో కేజ్రీవాల్ వైద్యులు సూచించిన మోతాదు కంటే తక్కువగా తింటున్నారని, అందుకే షుగర్ లెవెల్స్ పడిపోయాయని అంటున్నారు’అని సంజయ్ సింగ్ వివరించారు. దీని వెనుక కేజ్రీవాల్ ప్రాణాలు తీసేలా భారీ కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. -
నేరస్తుడా? నిరపరాధుల పాలిట దైవమా.. ! ఏకంగా 50 ఏళ్లు జైల్లోనే..
ఓ వ్యక్తి కరుడుగట్టిన నేరస్తుడి మాదిరిగా దారుణమైన జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అంటరానివాడిలా ఒక ప్రత్యేక భద్రతతో కూడిన సెల్లో ఉన్నారు. అతడికి ఆహారం సైతం ఓ రంధ్రం గుండా పంపిస్తారు జైలు అధికారులు. కానీ అతడి నేరాల చరిత్ర వింటే..నేరస్తుడా లేదా నిరపరాధిల పాలిట రక్షకుడా అన్న ఫీలింగ్ వస్తుంది. లేక వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడంతో చట్టాన్ని చేతిల్లోకి తీసుకుని దుర్మార్గులని దునుమాడిన మహోన్నత వ్యక్తి ఏమో..! అనే భావన కలుగుతుంది. పైగా బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం ఒంటిరిగా నిర్భంధంలో ఉన్న ఖైదీగా నిలిచిపోయాడు. అతడెవరంటే..బ్రిటన్‌లో అత్యంత ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్‌గా పేరు తెచ్చుకున్నాడు రాబర్ట్ మాడ్స్లీ. ప్రస్తుతం అతడు వేక్ఫీల్డ్ జైలులో ఉన్నాడు.అతని జైలు గది 18 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు ఉండి, 17 ఉక్కు తలుపుల వెనుక ఉంటుంది.ఈ గది కాల్పులు తట్టుకునేంత దృఢంగా ఉంటుంది.“ఇన్సైడ్ వేక్ఫీల్డ్ ప్రిజన్” అనే పుస్తకంలో జోనాథన్ లెవి, ఎమ్మా ఫ్రెంచ్‌లు రాసినట్లుగా, మాడ్స్లీ జైలు గదిలోని టేబుల్, కుర్చీలు కార్డ్‌బోర్డ్‌తో తయారు చేశారు.టాయిలెట్, సింక్ నేలకు బిగించబడి ఉంటుంది. అతనికి అందించే భోజనం కూడా ఒక చిన్న రంధ్రం గుండా పంపిస్తారు. నిజానికి మాడ్సీ 21 ఏళ్ల వయసు నుంచి జైలు జీవితం గడుపుతున్నాడు. అతడి నేరాలు గురించి తెలుసుకుని విస్తుపోతారు. ఎందుకంటే అతడు ఖైదీనా నిరపరాధుల పాలిట దైవమా..!అనిపిస్తుంది. చేసిన నేరాలు..1974లో, చిన్న పిల్లలపై లైంగిక దాడి చేసిన 30 సంవత్సరాల వ్యక్తి జాన్ ఫారెల్ని అతను చంపేశాడు.ఆ తర్వాత 1977లో, అతను మరో ఖైదీతో కలిసి, చిన్నపిల్లలపై లైంగిక దాడి నేరానికి జైలు శిక్ష అనుభవిస్తున్న డేవిడ్ ఫ్రాన్సిస్( David Francis )ని చంపేశాడు.వేక్ఫీల్డ్ జైలులో కూడా మాడ్స్లీ నేరాలు కొనసాగాయి.1978 జులై 29న, తన భార్యను హత్య చేసిన ఖైదీ సల్నీ డార్వడ్ని హతమార్చాడు.అంతేకాకుండా, ఏడేళ్ల బాలికపై అత్యాచార చేసిన బిల్ రాబర్ట్స్‌ను కూడా చంపేశాడు.ఈ హత్యల కారణంగా, అధికారులు మాడ్స్లీని ఇతర ఖైదీలతో కలిపి ఉంచడం చాలా ప్రమాదకరమని భావించారు.ఫలితంగా, 1983లో అతని కోసం ప్రత్యేక అద్దాల గదిని నిర్మించారు. అప్పటి నుంచి, అతను అదే గదిలో ఉన్నాడు. తన జైలు జీవితాన్ని మాడ్స్లీ ఒకసారి నరకంలో బంధించడం లాగా ఉందని వర్ణించాడు. ప్రస్తుతం అతని వయసు 71 సంవత్సరాలు. ఇప్పటికీ అదే జైలులో ఉండడం వల్ల, అతన్ని నేరస్తుడిగా చూడాలా లేక నిరపరాధుల రక్షకుడిగా భావించాలా అనే సందేహం బ్రిటన్ ప్రజల్లో కలుగుతుంటుంది. కనీసం ఇప్పుడైనా మాడ్స్లీ క్షమాభిక్ష పెట్టి స్వేచ్ఛగా జీవించేలా చేస్తే బాగుండనని కొందరూ భావిస్తుండటం విశేషం. (చదవండి: ఆ ఫోబియాకు పుస్తకాలతో చెక్‌పెట్టి..స్ఫూర్తిగా నిలిచిన ట్రాన్స్‌విమెన్!) -
లోయలోకి దూసుకెళ్లిన కారు కేసు: ‘భారత సంతతి డాక్టర్‌కు జైలు శిక్ష విధించలేం’
న్యూయార్క్: భార్య, పిల్లలను ఉద్దేశపూర్వకంగా హత్య చేసేందుకు కారును లోయలోకి నడిపారనే కేసులో భారత సంతతి డాక్టర్ ధర్మేష్ పటేల్ జైలు శిక్ష విధించలేదని కాలిఫోర్నియ కోర్టు ప్రకటించింది. ధర్మేష్ పటేల్ తీవ్రమైన ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారని, ఆయన మానసిక అనారోగ్యం కారణంగా జైలు శిక్ష విధించటం లేదని జడ్జి సుసాన్ జకుబోవ్స్ తెలిపారు. ఆయన మానసిక ఆరోగ్యానికి చికిత్స అందించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఆయన విడుదల, అనారోగ్యానికి సంబంధించి చికిత్స వివరాలను జూలై 1న వెల్లడిస్తామని కోర్టు పేర్కొంది. గతేడాది కాలిఫోర్నియాలో ఉండే డాక్టర్ ధర్మేష పటేల్.. పిల్లలతోపాటు తన భార్య ప్రయాణం చేస్తున్న కారు శాన్ మాటియోలోని హైవే పక్కన ఉన్న భారీ లోయలో పడిపోయింది. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న 4 ఏళ్ల అమ్మాయి, 9 ఏళ్ల బాలుడు సహా ధర్మేష్, ఆయన భార్య ప్రాణాలతో భయటపడ్డారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు.. ధర్మేష్ కావాలనే కారును లోయలో పడేశాడని అనుమానిస్తూ ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ధర్మేష్‌ను శాన్ మాటియో కౌంటీలోని జైలుకు తరలించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంతో కేసుపై విచారణ జరిపిన కోర్టు జైలు శిక్ష విధించటంలేదని పేర్కొంది. -
హత్య కేసులో.. అన్నదమ్ములకు యావజ్జీవం!
కరీంనగర్: తమపై పెట్టిన హత్యాయత్నం కేసు ను రాజీ కుదర్చుకోవడం లేదనే కారణంతో ఓ వ్యక్తి ని హత్య చేసిన అన్నదమ్ములకు యావజ్జీవ శిక్షతోపా టు రూ.5వేల చొప్పున జరిమానా విధిస్తూ జగిత్యా ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.నీలిమ మంగళవారం తీర్పు చెప్పారు.పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్లికా ర్జున్ కథనం ప్రకారం.. మెట్పల్లి మండలం వేంపేట కు చెందిన ధనరేకుల రాజేందర్ వ్యవసాయంతోపా టు ఉపాధిహామీలో మేట్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడంటూ సదరు మహిళ భర్త జెల్ల రమేశ్, అతని తమ్ముడు జెల్ల మహేశ్ 2020 మార్చి 3న కత్తితో రాజేందర్‌పై దాడి చేశారు. దీంతో రాజేందర్ మెట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అన్నదమ్ములపై కేసు నమోదైంది.ఇద్దరూ జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చారు. ఆ కేసును రాజీ చేసుకోవా లంటూ పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీ జరిగింది. రాజీకి రాజేందర్ ససేమిరా అన్నాడు. దీంతో అతడిని ఎలాగైనా చంపాలని అన్నదమ్ములు నిర్ణయించుకున్నారు. 2020 మే 19న గ్రా మ శివారులో ఉపాధి హామీ పనులకు వెళ్లిన రాజేందర్‌పై జెల్ల రమేశ్, జెల్ల మహేశ్ విచక్షణరహితంగా కత్తులతో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందా డు.రాజేందర్ భార్య హరిణి ఫిర్యాదు మేరకు అప్ప టి మెట్పల్లి ఎస్సై ఎన్.సదాకర్ కేసు నమోదు చేశా రు. అప్పటి సీఐలు రవికుమార్, ఎల్.శ్రీనివాస్ దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధి కారులు కిరణ్‌కుమార్, రంజిత్‌కుమార్ సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టారు. వాటిని పరిశీలించిన జడ్జి రమేశ్, మహేశ్‌కు యావజ్జీవ శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. -
బాలికపై లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
విజయవాడస్పోర్ట్స్: ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు ఇన్చార్జ్ న్యాయమూర్తి తిరుమల వెంకటేశ్వర్లు సోమవారం తీర్పు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన మహిళకు, నున్న గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. భర్తతో మనస్పర్థల కారణంగా ఆమె పిల్లలను తీసుకుని ఇబ్రహీంపట్నంలోని పుట్టింట్లో ఉండేది.కొన్నాళ్ల తరువాత భర్త వచ్చి తన ఐదేళ్ల పెద్ద కుమార్తెను నున్నలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో వాంబేకాలనీకి చెందిన 20 ఏళ్ల కుంచాల దుర్గారావు అలియాస్ తమ్మిశెట్టి దుర్గారావు అలియాస్ దుర్గా ఆ పాపను డాబాపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరుసటి రోజు పాపకు స్నానం చేయిస్తుండగా మర్మాంగాల వద్ద ఇన్ఫెక్షన్ రావడాన్ని గమనించిన తల్లి ఆరా తీయగా దుర్గారావు చేసిన అత్యాచారం బయటపడింది.వెంటనే పాపను చికిత్స నిమిత్తం విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పాపపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించడంతో పాప తల్లి ఇచి్చన ఫిర్యాదు మేరకు 2019 ఏప్రిల్ ఆరో తేదీన నున్న పోలీసులు కేసు నమోదు చేసి 2020 ఆగస్టు 12వ తేదీన నిందితుడు దుర్గారావును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. నేరం రుజువు కావడంతో నిందితుడు దుర్గారావుకు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
చేయని నేరానికి ఏకంగా 40 ఏళ్లు..!ఆ మందుల ప్రభావంతో..
టైం బాగోకపోతే ఎంతటి వారైన దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోవాల్సిందే. అంతేగాదు చేయని తప్పులకు బాధ్యత వహించాల్సి వస్తుంది, నిందలు కూడా పడాల్సి వస్తుంటుంది. శిక్ష అంత అనుభవించాక గానీ అసలు నిజం వెలుగులోకి రాదు. తీరా వచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదు కూడా. ఎందుకంటే దాని తాలుకా చేదు అనుభవాలన్ని భరించేసి ఉంటారు బాధితులు. ఇక వాస్తవం ఏంటో తేలినా..చివరికి సమాజం నుంచి వచ్చే టన్నుల కొద్ది జాలి బాధిస్తుందే తప్ప ఓదార్పునివ్వదు. పైగా అవేమీ వారి కోల్పోయిన సంతోషాన్ని, పరువును తెచ్చి ఇవ్వలేవు. 'నాకే ఎందుకు ఇలా'.. అన్న మాటలకందని వేదనే మిగులుతుంది. ఇలాంటి బాధనే ఫేస్ చేసింది యూఎస్‌కి చెందిన ఓ మహిళ. చేయని నేరానికి ఎన్నేళ్లు కటకటాల్లో మగ్గిందో వింటే కంగుతింటారు. అసలేం జరిగిందంటే..సాండ్రా హెమ్మె అనే 64 ఏళ్ల మిస్సౌరీ మాజీ పోలీసు అధికారి. తన సహ పోలీసు అధికారిణి జెష్కేని హత్య చేసిన కేసులో ఏకంగా 40 ఏళ్లకు పైగానే జైల్లో గడిపింది. అంతేగాదు యూఎస్ చరిత్రలోనే ఎక్కువకాలం తప్పుగా ఖైదు చేయబడిన మహిళగా నిలిచింది. ఆమె ఎన్నో ఏళ్ల నుంచి నిర్ధొషిగా విడుదలవ్వటం కోసం ఆశగా పోరాడుతోంది. ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు ఏమీ లేవు. కేవలం హెమ్మె నుంచి తీసుకున్న వాగ్మూలం ఒక్కటే ఆధారం చేసుకుని దోషిగా నిర్థారించి కోర్టు శిక్ష విధించినట్లు పిటిషన్లో ఉంది. నిజానికి ఆమె మానసిక అనారోగ్యంతో బాధపడుతుంది. వాటికోసం వాడిన బలమైన మందులు ప్రభావంతో పోలీసులు అడిగిన ప్రశ్నలకు అస్ఫష్టంగా ఇచ్చిన సమాధానాలనే బేస్ చేసుకుంది కోర్టు. అసలైన ట్విస్ట్ ఏంటంటే ఈ కేసుకి సంబంధించి సాక్ష్యాలు, కొన్ని భౌతిక సాక్ష్యాలు చాలా విరుద్ధంగా ఉన్నాయి. అలాగే హెమ్మె ఇచ్చిన సమాధానాల్లో నేరానికి లింక్ అప్ అయ్యేలా ఎలాంటా సమాధానాలు కూడా ఇవ్వలేదని బాధితరుపు న్యాయవాది హార్స్‌మన్ పిటిషన్లో పేర్కొన్నారు. పైగా కోర్టు మాత్రం ఆమె వాగ్ములాన్నే ప్రధానంగా తీసుకుని ఇంతలా శిక్ష విధించడం అమానుషమని వాదించారు కూడా. అంతేగాదు న్యూయార్క్‌లో ఉన్న ఇన్నోసెన్స్ ప్రాజెక్ట్ హెమ్మీ కేసును స్వీకరించి ఆమెకు న్యాయ చేసేందుకు ముందుకొచ్చింది. అంతేగాదు ప్రాజెక్ట్‌కి సంబంధించిన పోలీసులు హెమ్మెని ఈ కేసులో ఇరికించేలా సాక్ష్యాధారాలను సృష్టించారని ఆరోపణలు చేశారు. ఎందుకంటే..ఇన్నోసెన్స్ చేసిన దర్యాప్తులో.. హత్య జరిగిన తరువాత రోజే తన సహ పోలీసు అధికారి క్రెడిట్ కార్డుని హెమ్మె ఉపయోగించిందని, అలాగే ఆమె ట్రక్ చనిపోయిన బాధితురాలి ఇంటి వద్ద పార్క్ చేసి ఉందని పిటిషన్లో పోలీసులు చెప్పారు. అలాగే ఆ ప్రదేశంలోనే బాధితురాలి చెవిపోగులు గుర్తించినట్లు కూడా తెలిపారు. అయితే ఇవేమీ క్లియర్‌గా హెమ్మెనే ఈ హత్య చేసిందనేందుకు కచ్చితమైన సాక్ష్యాధారాలు కావు. పైగా బాధితురాలు పోలీసు అధికారి జెష్కే హత్యకు ముందు తర్వాత కూడా ఇలాంటి నేరాలు మహిళలపై చాలా జరగాయని, అందువల్ల ఈ నేరం హెమ్మె చేసే అవకాశం లేదని వెల్లడించింది. దీంతో కోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. ఏదీఏమైనా చేయని నేరానికి మానసిక సమస్యల రీత్యా ఓ అమాయకురాలు ఏకంగా 40 ఏళ్లుకు పైగా జైలు శిక్ష అనుభవించి రావడం నిజంగా చాలా బాధకర విషయం. వందమంది దోషులు తప్పించుకున్న పర్లేదు గానీ ఒక్క నిర్దోషికి అన్యాయంగా శిక్షపడకూడదు అన్న మాట ఈమె విషయంలో రివర్స్ అయ్యింది కదూ!.(చదవండి: మిస్ ఏఐ అందాల పోటీలో టాప్ 10 ఫైనలిస్ట్‌గా జరా శతావరి! ఎవరీమె..?) -
రష్యా జైలులో ‘ఐసిస్’ కలకలం
మాస్కో: రష్యాలోని ఓ డిటెన్షన్ సెంటర్లో కొంతమంది విచారణ ఖైదీలు సిబ్బందిని బందీలుగా పట్టుకోవడం సంచలనం రేపింది. ఈ షాకింగ్ ఘటనతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జైలు సిబ్బందిని నిర్బంధించిన ఖైదీల్లో కొందరిని అంతమొందించారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రోస్తోవ్-ఆన్-డాన్ నగరంలో ఉన్న ప్రీ-ట్రయల్ డిటెన్షన్ సెంటర్లో ఆరుగురు ఖైదీలు ఇద్దరు జైలు గార్డులను బందీలుగా పట్టుకున్నారు. ఆ ఖైదీలకు ఉగ్రవాదసంస్థ ఇస్లామిక్ స్టేట్ గ్రూపు(ఐసిస్)తో సంబంధాలున్నట్లు ఆరోపణలున్నాయి. వారి వద్ద మారణాయుధాలున్నట్లు అధికారులు తెలిపారు.ఖైదీల బారి నుంచి ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, వారికి ఎలాంటి గాయాలు కాలేదని రష్యా మీడియా తెలిపింది. ఈ ఘటనలో ఎంతమంది ఖైదీలు మృతి చెందారనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, ఈ ఏడాది మార్చిలో మాస్కోలోని ఓ మ్యూజిక్ కన్సర్ట్ హాల్‌పై ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 145 మంది ప్రాణాలు కోల్పోయారు. -
చైనాలో మహిళా జర్నలిస్టుకు ఐదేళ్ల జైలు
చైనాలో ‘మీటూ’ఉద్యమంలో పాల్గొన్న మహిళా జర్నలిస్టు హువాంగ్ షుకిన్‌పై దేశద్రోహం ఆరోపణలు చేస్తూ, ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. చైనా జర్నలిస్టుల సంఘం ఈ వివరాలను తెలియజేసింది. ‘ది అసోసియేటెడ్ ప్రెస్’ వెల్లడించిన వివరాల ప్రకారం షుకిన్‌కు ఒక లక్ష యువాన్ (రూ. 1,155,959) జరిమానా కూడా విధించారు. మూడు సంవత్సరాల క్రితం షుకిన్‌లో పాటు మరో కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మీటూ ఉద్యమం చైనాలో గతంలో ఉధృతంగా సాగింది అయితే ప్రభుత్వం దానిని అణిచివేసింది. ఇలా ఉద్యమాల్లో పాల్గొనే నేతలను, కార్యర్తలను చైనా అజ్ఞాతంలో ఉంచడం గానీ లేదా వారికి జైలు శిక్ష విధించడం గానీ చేస్తుందనే ఆరోపణలున్నాయి. కాగా మహిళా జర్నలిస్టు షుకిన్ విడుదల తేదీ 2026, సెప్టెంబర్ 18గా కోర్టు ప్రకటించింది. ఇదే ఆరోపణలపై ఆమె స్నేహితుడు వాంగ్ జియాన్‌బింగ్‌కు మూడేళ్ల ఆరు నెలల శిక్ష విధించారు. షుకిన్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. మహిళా హక్కుల కార్యకర్తగానూ పనిచేస్తున్నారు. కోర్టు తీసుకున్న నిర్ణయంపై అప్పీల్ చేస్తామని ఆమె అభిమానులు మీడియాకు తెలిపారు.ప్రస్తుతం ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తున్న షుకిన్ 2018లో తాను యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నప్పుడు, అక్కడి సూపర్వైజర్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ మీటూ ఉద్యమం బాట పట్టారు. షుకిన్‌కు జైలు శిక్ష విధించడాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు చెందిన చైనా యూనిట్ డైరెక్టర్ సారా బ్రూక్స్ ఖండించారు. ఇది చైనాలో మహిళల హక్కులపై దాడి అని ఆరోపించారు. -
బిహార్ జైలులో చైనీయుడి మృతి
పాట్నా:బిహార్‌లోని ఓ జైలులో ఆత్మహత్యాయత్నం చేసిన చైనీయుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. చైనాలోని షాండాంగ్ ప్రావిన్సుకు చెందిన లీ జియాకీ సరైనా పత్రాలు లేకుండా భారత్‌లోకి ప్రవేశించాడు. జూన్6వ తేదీన బ్రహ్మపురలోని లక్ష్మీచౌక్ వద్ద తిరుగుతుండగా సరైన వీసా పత్రాలు లేకపోవడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఫారనర్స్ యాక్ట్ కింద లీపై కేసు నమోదు చేశారు. అరెస్టు సమయంలో లీ వద్ద చైనా మ్యాపు, మొబైల్ ఫోన్, చైనా, నేపాల్, ఇండియా కరెన్సీలు దొరికాయి. అరెస్టు తర్వాత లీని ముజఫర్‌పూర్ జైలుకు తరలించారు. జూన్7న జైలులో లీ ఆత్మహత్యాయత్నం చేశాడు.తన కళ్లద్దాలను పగులగొట్టి గాజుతో శరీరాన్ని గాయపరుచుకున్నాడు. తీవ్ర రక్త స్రావంతో అపస్మారకస్థిలో జైలు గదిలోని బాత్రూమ్లో పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు లీని ముజఫర్‌పూర్‌లోని శ్రీ కృష్ణా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లీ మంగళవారం(జూన్11) మరణించాడని పోలీసులు తెలిపారు. -
వరుసగా మూడోసారి బీజేపీ క్లీన్‌స్వీప్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోమారు భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్‌ను సాధించింది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు ఏడింటినీ గెలుచుకుంది. జైలు నుంచి వచ్చి ప్రచారం చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సానుభూతితో ఓట్లు తెచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు. 2009లో ఢిల్లీలో ద్వితీయ స్థానంలో నిలిచిన బీజేపీ 2014, 2019తోపాటు ప్రస్తుత ఎన్నికల్లో ఏడు స్థానాల్లోనూ గెలిచి సత్తా చాటింది.ఓట్లు రాబట్టని ప్రసంగంఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు బెయిలిచ్చింది. తనను అక్రమంగా అరెస్టు చేశారని, ఇండియా కూటమిని గెలిపిస్తే కేజ్రీవాల్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండదంటూ ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నించారు. ప్రతిచోటా ఇదే ప్రసంగంతో ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ, అవి ఫలించలేదు.తగ్గిన బీజేపీ ఓటింగ్ శాతంవరుసగా మూడు పర్యాయాలు ఢిల్లీలో బీజేపీ తన అధిపత్యాన్ని కనబరిచింది. 2009 ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ 35.23% ఓట్లు తెచ్చుకుంది. 2014లో 46.40శాతం, 2019లో 56.85 శాతం ఓట్లతో వరుసగా విజయం సాధించింది. తాజా ఎన్నికల్లో మాత్రం బీజేపీ 54.30 శాతం ఓట్లను మాత్రమే తన ఖాతాలో వేసుకుంది. అంటే గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో బీజేపీ 2.55శాతం ఓట్లను కోల్పోయింది. డీలా పడ్డ కాంగ్రెస్ గ్రాఫ్2009 ఎన్నికల్లో 57.11 శాతం ఓట్లతో కాంగ్రెస్ ఏడు స్థానాలను కైవసం చేసుకుని అగ్రస్థానంలో నిలిచిన కాంగ్రెస్, 2014కు వచ్చేసరికి ఓటమిని చవి చూసింది. కేవలం 15.10% ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచిన కాంగ్రెస్ 2019 ఎన్నికల్లో 22.63% ఓట్లతో పుంజుకుంది. తాజా ఎన్నికల్లో 19.11% ఓట్లతో తృతీయ స్థానానికి చేరింది. ఇక 24.02% ఓట్లతో ఆప్ ద్వితీయ స్థానంలో నిలిచాయి. ఈ రెండు పార్టీలు ఓట్ల శాతాన్ని పెంచుకున్నా సీట్ల సాధనలో విఫలమయ్యాయి. -
జూన్-2న తీహార్ అధికారుల ఎదుట లొంగిపోనున్న కేజ్రీవాల్
-
చిన్నారులపై అత్యాచారం కేసుల్లో జైలు
విశాఖ లీగల్/విజయవాడ స్పోర్ట్స్: వావి వరసలు మరచి అభంశుభం తెలియని చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులకు వేర్వేరు కేసుల్లో జైలుశిక్ష, జరిమానా విధిస్తూ.. ఆయా న్యాయమూర్తులు సోమవారం తీర్పునిచ్చారు. సొంత మనవరాలిపై అత్యాచారానికి పాల్పడిన వృద్ధుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తూ విశాఖ నగరంలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనంది తీర్పు చెప్పారు. అలాగే 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి యత్నం చేసిన మేనమామకు ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు ఇన్చార్జ్ న్యాయమూర్తి తిరుమల వెంకటేశ్వర్లు తీర్పు వెల్లడించారు.కేసుల పూర్తి వివరాల్లోకి వెళితే.. విశాఖ నగరంలోని మల్కాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్కాపురం జాలరి వీధిలో ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన వాడమొదుల శ్యాంసుందరరావు (70) నివాసం ఉంటున్నాడు. అతనికి ఇద్దరు కొడుకులు. బాధితురాలు (ప్రస్తుతం 19) పెద్దకొడుకు చంద్రశేఖర్ కూతురు. చంద్రశేఖర్ వృత్తిరీత్యా కారు డ్రైవరు. నిత్యం బయటకు వెళ్లేవాడు. బాధితురాలి తల్లి సత్యవతి, తన ఇద్దరు పిల్లలు, అత్తమామలతో కలిసి ఉంటుంది. ఆ ఇల్లు రెండంతస్తుల భవనం. గ్రౌండ్ ఫ్లోర్లో బాధితురాలు, వారి కుటుంబ సభ్యులు ఉంటున్నారు.రెండో అంతస్తులో నిందితుడు శ్యాంసుందరరావు, అతని భార్య ఉంటున్నారు. 2017 అక్టోబర్ ఒకటో తేదీకి ముందు నిందితుడు బాలికను భయపెట్టి లోబర్చుకుని ఆమెపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించాడు. అక్టోబర్ ఒకటో తేదీన బాలిక పాఠశాల నుంచి ఇంటికి వచి్చన వెంటనే సుమారు మూడున్నర గంటల సమయంలో వృద్ధుడు బాలికపై మళ్లీ లైంగిక దాడికి యతి్నస్తుండగా ఆ బాలిక గట్టిగా అరిచింది. ఆ కేకలు విన్న ఆమె చెల్లెలు కింద ఫ్లోర్లో ఉన్న తల్లికి చెప్పింది. అది విన్న తల్లి మేడ మీద మొదటి అంతస్తుపైకి వెళ్లి చూడగా నిందితుడు చేస్తున్న అకృత్యాన్ని కళ్లారా చూసింది. వెంటనే మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేరం రుజువు కావడంతో వృద్ధుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఐదు లక్షల రూపాయలను బాధితురాలికి ఇవ్వాలని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు.కసాయి మేనమామకు ఐదేళ్ల జైలు.. ఖమ్మం జిల్లాకు చెందిన బాలిక (12) తల్లితో కలిసి పండుగలకు విజయవాడ వన్‌టౌన్‌లోని అమ్మమ్మ ఇంటికి వస్తుంటుంది. 2017న దసరా పండుగకు వచ్చిన బాలిక పట్ల ఆమె మేనమామ లైంగికదాడికి యతి్నంచడమే కాకుండా ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అప్పటినుంచి మానసికంగా కుంగిపోయిన బాలిక 2018 జనవరిలో మేనమామ తన పట్ల ప్రవర్తించిన తీరును తల్లికి వివరించింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు 2018 జనవరి 9న వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడుగురు సాక్షులను విచారించిన అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.15 వేలు జరిమానా విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు ఇన్చార్జ్ న్యాయ మూర్తి తిరుమల వెంకటేశ్వర్లు తీర్పు చెప్పారు. -
విశాఖ జైలులో ఈ–ములాఖత్‌లు ప్రారంభం
ఆరిలోవ: విశాఖ జైలులో ఖైదీలు వారి కుటుంబ సభ్యులందరినీ ఒకేసారి చూసుకునే వెసులుబాటు లభించింది. ఇందుకోసం సోమవారం నుంచి ప్రత్యేకంగా ఈ–ములాఖత్‌ల విధానాన్ని జైలు అధికారులు అందుబాటులోకి తెచ్చారు. సాధారణంగా జైలులో ఉన్న ఖైదీలను వారి కుటుంబ సభ్యులు వారానికి రెండుసార్లు కలిసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల్లో కొందరికే ఈ అవకాశం ఉండేది. ములాఖత్‌కు వెళ్లిన వారి ద్వారానే మిగిలిన కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని తెలుసుకోవాల్సి వచ్చేది. ఇకపై స్వయంగా ములాఖత్‌లతో పాటు ఈ–ములాఖత్ విధానాన్ని కూడా అందుబాటులోకి తేవడంతో ఖైదీలు ఇంట్లో వారందరిని చూస్తూ వారితో మాట్లాడే అవకాశం కలుగుతుంది. ప్రత్యేక వెబ్సైట్లో దరఖాస్తు ఈ – ములాఖత్ కోసం అధికారులు ప్రత్యేకంగా వెబ్సైట్లో అప్లికేషన్‌ను రూపొందించారు. ఖైదీ కుటుంబ సభ్యులు ముందుగా ఆ వెబ్సైట్ ద్వారా ములాఖత్‌కు దరఖాస్తు చేసుకోవాలి. జైలు అధికారులు వాటిని పరిశీలించి వారికి నిర్దిష్టమైన తేదీ, సమయాన్ని కేటాయిస్తారు. ఆ వివరాలను ఖైదీకి కూడా తెలియజేస్తారు. ఆ సమయానికి ఖైదీ కంప్యూటర్లో కుటుంబ సభ్యులను చూస్తూ వారితో ముచ్చటించొచ్చు.ఇందుకోసం జైలులో కూడా ప్రత్యేకంగా కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. భౌతికంగా ములాఖత్‌కు రాలేని వారు ఇకపై ఆన్లైన్ ద్వారా అయినా వారానికి రెండుసార్లు మాట్లాడుకునే వెసులుబాటు లభించింది. ఈ–ములాఖత్ ద్వారా సోమవారం పలువురు ఖైదీలు వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించినట్లు విశాఖ జైలు సూపరింటెండెంట్ ఎస్.కిశోర్‌కుమార్ తెలిపారు. -
రాజ్యాంగ పరిరక్షణే ప్రధానం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: తాను మళ్లీ జైలుకెళ్తే ఎలాగ అనే విషయం వదిలేసి రాజ్యాంగ పరిరక్షణ మీదే దృష్టిపెట్టాలని, అది మీ బాధ్యత అని ఓటర్లకు ఆప్ కనీ్వనర్ కేజ్రీవాల్ హితవు పలికారు. బుధవారం చాంద్నీ చౌక్, నార్త్‌వెస్ట్ ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచార రోడ్‌షోలో కేజ్రీవాల్ ప్రసంగించారు. ‘ హరియాణా, ఉత్తరప్రదేశ్.. ఇలా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వాకబు చేశా. దేశవ్యాప్తంగా చూస్తే బీజేపీ గెలవబోయే సీట్లు బాగా తగ్గిపోతున్నాయి. విపక్షాల ‘ఇండియా’ కూటమి అధికారంలోకి రాగానే దేశాభివృద్ధి కోసం పని మొదలుపెడతాం. దీంతో నియంతృత్వం అంతమవుతుంది. నేను మళ్లీ జైలుకెళ్తే ఎలాగ అన్న ఆలోచనలు పక్కనపడేయండి. రాజ్యాంగ పరిరక్షణే అత్యవశ్యకం. అది మీ బాధ్యత’’ అని ఓటర్లకు హితవు పలికారు. -
బాంబే హైకోర్టు షాక్.. జైలుకు చంద్రబాబు?
-
‘జైలును తప్పించుకునేందుకే పార్టీ ఫిరాయించాను’
ముంబై: మహారాష్ట్రలోని ముంబై వాయువ్య లోక్‌సభ నియోజకవర్గ శివసేన అభ్యర్థి రవీంద్ర వైకర్.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్, జైలును తప్పించుకునేందుకే తాను శివసేన (యూబీటీ) నుంచి ఫిరాయించానని ప్రకటించి తన పార్టీని ఇరుకున పడేశారు. జోగేశ్వరిలోని సివిక్ ప్లాట్‌లో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి సంబంధించి ఈడీ ఆయనపై పీఎంఎల్ఏ కేసు నమోదు చేసింది.ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరడం మినహా తనకు వేరే మార్గం లేదని ఒక మరాఠీ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవీంద్ర వైకర్ పేర్కొన్నారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరేకు అత్యంత విధేయుడిగా రవీంద్ర వైకర్ పేరుగాంచారు. ఉద్ధవ్ థాకరే స్వయంగా వైకర్ నివాసానికి వెళ్లి బుజ్జగించారంటేనే ఆయనకు శివసేన (యూబీటీ) ప్రాధాన్యత ఇస్తోందో అర్థం చేసుకోవచ్చు.తన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగడంతో రవీంద్ర వైకర్ దిద్దుబాటుకు ప్రయత్నించారు. ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. శివసేన (యూబీటీ) నుండి వైదొలగే ముందు తాను ఉద్ధవ్‌తో మూడు సార్లు సమావేశమయ్యానని, తన ఇబ్బందులను తెలియజేశానని చెప్పారు.కాగా ముంబై నార్త్-వెస్ట్ స్థానంలో శివసేన (యూబీటీ)కి చెందిన అమోల్ కీర్తికర్‌తో వైకర్ పోటీలో ఉన్నారు. అమోల్ తండ్రి కీర్తికర్ ప్రస్తుతం ఇక్కడ సిటింగ్ ఎంపీ. ఈ లోక్‌సభ స్థానానికి ఐదో దశలో మే 20న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
వైద్యో నారాయణో హరిః అంటాం. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం.అలాగే రోగులకు సేవచేసే నర్సులని దైవదూతలుగా భావిస్తాం. నిస్సార్థంగా, కుటుంబ సభ్యులకంటే మిన్నగా వారు చేసే సపర్యలు రోగులకు ఎక్కడలేని ఊరటనిస్తాయి. కానీ ఒక నర్సుమాత్రం దీనికి పూర్తి భిన్నంగా ప్రవర్తించింది. రాక్షసిలా మారి రోగులను పొట్టన బెట్టుకుంది. ఎక్కడ ఏంటి వివరాల కోసం ఈ కథనాన్ని చదవండి..!అమెరికాలోని పెన్సిల్వేనియాలో హీథర్ ప్రెస్డీ (41) అనే నర్సుకు ఏకంగా 760 సంవత్సరాల జైలు శిక్ష పడింది. మూడు హత్య కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. మూడు జీవిత కాలాలు అంటే 760 సంవత్సరాల జైలు శిక్షను విధించారు.మూడేళ్ల పాటు ప్రాణాంతకమైన ఇన్సులిన్ ను అధిక మోతాదులతో ఇవ్వడంతో 17 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్టుప్రెస్డీపై ఆరోపణలు నమోదైనాయి. మూడు హత్యలు, 19 హత్యాయత్నాల్లో నేరాన్ని అంగీకరించింది. ఈ కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు.ప్రెస్డీ 22 మంది రోగులకు అధిక మొత్తంలో ఇన్సులిన్ ఇచ్చినట్లు అభియోగాలు మోపారు. వీరిలో చాలా మంది రోగులు మోతాదు తీసుకున్న వెంటనే లేదా కొంత సమయం తరువాత మరణించారు. బాధితులు 43 నుండి 104 ఏళ్ల వయసు ఉంటుంది.ఇద్దరు రోగులను చంపినందుకు ఆమెపై తొలుత గత ఏడాది మేలో అభియోగాలు నమోదు కాగా, తర్వాత జరిగిన పోలీసు విచారణలో మరిన్ని విషయాలు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక అభియోగాలు నమోదు చేసిన అనంతరం ఆమె నర్సింగ్ లైసెన్స్ రద్దు చేశారు. ‘‘ఆమెకు ఏ జబ్బూ లేదు. మతిస్థిమితమూ లేదు. ఆమెది దుష్ట వ్యక్తిత్వం. ఆమె నా తండ్రిని చంపిన రోజు ఉదయం ఆమె కూృరమైన ముఖంలోకి చూశాను'’ అంటూ బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరు కోర్టుకు తెలిపారు.రోగులు, సహోద్యోగులు పట్ల కూడా ఆమె దురుసుగా ప్రవర్తించేదని విచారణ అధికారులు గుర్తించారు. అంతేకాదు ప్రెస్డీ తన తల్లికి ఏప్రిల్ 2022 – మే 2023 మధ్య కాలంలో రోగుల పట్ల తన అసంతృప్తిని మెస్సేజ్‌లను పంపించిందట.ఇన్సులిన్ అధిక మోతాదు హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది, హృదయ స్పందనను పెంచుతుంది. గుండెపోటుకు కూడా దారితీస్తుంది. చివరికి ప్రాణాలను కూడా తీస్తుంది. -
ఖైదీల మధ్య ఘర్షణ.. ఇద్దరు మృతి!
పంజాబ్‌లోని సంగ్రూర్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం అర్థరాత్రి ఘర్షణ జరిగింది. ఈ నేపధ్యంలో తీవ్రంగా గాయపడిన నలుగురు ఖైదీలను ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో ఇద్దరు ఖైదీల పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన చికిత్స కోసం వారిని పాటియాలా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా డాక్టర్ కరణ్‌దీప్ కహెల్ మాట్లాడుతూ తీవ్రంగా గాయపడిన నలుగురు ఖైదీలను జైలు నుంచి ఇక్కడికి తీసుకు వచ్చారని, వారిలో ఇద్దరు మృతి చెందారని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వారిని పటియాలాకు రిఫర్ చేశామని తెలిపారు. మరణించిన ఖైదీల పేర్లు హర్ష్, ధర్మేంద్ర అని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘర్షణలో గగన్‌దీప్ సింగ్, మహ్మద్ హరీష్, సిమ్రాన్ గాయపడ్డారు. ఖైదీలు నిద్రించడానికి తమ బ్యారక్లకు వెళుతుండగా సిమ్రంజీత్ తన సహచరుల సహాయంతో హర్ష్, ధర్మేంద్రలపై దాడి చేశాడు. నిందితులు ధర్మేంద్ర, హర్షలపై కట్టర్‌తో మెడ, ఛాతీ, నోటిపై దాడి చేశారు. సిమ్రంజీత్‌పై హత్యతో పాటు 18 కేసులు ఉన్నాయి. ఇతను ఆరేళ్లుగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ఘర్షణ తర్వాత జైలు అధికారులు ఈ రెండు గ్రూపుల ఖైదీలను వేర్వేరు బ్యారక్‌లలో ఉంచారు. -
మూడు మామిడి పండ్లే తిన్నా.. ఢిల్లీ కోర్టులో కేజ్రీవాల్ వాదన
న్యూఢిల్లీ: జైలులో తాను తీసుకుంటున్న ఆహారాన్ని ఈడీ రాజకీయం చేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విమర్శించారు. డయాబెటిస్ బాధితుడినైన తనకు జైలులో ఇన్సులిన్ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ రౌస్అవెన్యూ కోర్టులో శుక్రవారం వాదనలు కొనసాగాయి. మెడికల్ బెయిల్ పొందడానికి లేదా చికిత్స పేరిట ఆసుపత్రిలో చేరడానికి వీలుగా రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుకోవడానికి కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని ఈడీ గురువారం కోర్టు దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈడీ వాదనపై కేజ్రీవాల్ శుక్రవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జైలులో ఉన్న తనకు ఇప్పటిదాకా 48 సార్లు ఇంటి నుంచి భోజనం పంపగా, కేవలం మూడుసార్లు మాత్రమే మామిడిపండ్లు తిన్నానని కేజ్రీవాల్ తెలిపారు. కేవలం ఒకే ఒక్కసారి ఆలూ పూరీ తీసుకున్నానని, అది కూడా నవరాత్రి ప్రసాదంగా స్వీకరించానని కోర్టుకు తెలియజేశారు. వైట్ రైస్, బ్రౌన్ రైస్ కంటే మామిడి పండ్లలో చక్కెర స్థాయి తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. షుగర్ లేని స్వీట్లు ఆరుసార్లు తిన్నానని, షుగర్ లేకుండా టీ తాగుతున్నానని వెల్లడించారు. తనకు చికిత్స అందించే రెగ్యులర్ వైద్యుడు సూచించిన డైట్ చార్ట్ ప్రకారమే ఆహారం తీసుకుంటున్నానని వివరించారు. ప్రతిరోజూ 15 నిమిషాలపాటు డాక్టర్‌ను సంప్రదించడానికి అనుమతి ఇవ్వాలంటూ శుక్రవారం మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇన్సులిన్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు ఈ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. -
‘కేజ్రీవాల్‌ను మూడోసారీ ఓడించలేకపోతే చంపేద్దాం.. ఇదీ వారి కుట్ర’
న్యూఢిల్లీ, సాక్షి: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను జైల్లో చంపే కుట్ర జరుగుతోందని ఆ పార్టీ నాయకురాలు, రాష్ట్ర మంత్రి అతిషి ఆరోపించారు. టైప్ 2 డయాబెటిస్ పేషెంట్ అయిన కేజ్రీవాల్ పదేపదే అభ్యర్థనలు చేసినప్పటికీ ఆయనకు ఇన్సులిన్ ఇవ్వడం లేదని తెలిపారు. మద్యం పాలసీ స్కామ్ ఆరోపణలతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. తాజాగా కేజ్రీవాల్ తన రెగ్యులర్ డాక్టర్‌తో వీడియో సంప్రదింపుల కోసం చేసిన అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించిన అనంతరం ఆప్ నేతల నుంచి ఈ ఆరోపణలు వచ్చాయి. ‘అరవింద్ కేజ్రీవాల్‌ను మూడు ఎన్నికల్లో (మూడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు) బీజేపీ ఓడించలేకపోతే, ఆయన్ను జైల్లో ఉంచి చంపేందుకు పథకం పన్నుతోంది’ అని అతిషి అన్నారు. "అరవింద్ కేజ్రీవాల్ తీవ్రమైన మధుమేహంతో బాధపడుతున్నారని అందరికీ తెలుసు. ఆయనకు గత 30 సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది. తన చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి రోజూ 54 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటారు" అని ఆమె పేర్కొన్నారు. ‘ఇంత తీవ్రమైన మధుమేహం ఉన్న వ్యక్తి మాత్రమే అంత ఇన్సులిన్ తీసుకుంటాడు. కావాలంటే ఏ డాక్టర్నైనా అడగండి.. అందుకే అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో వండిన ఆహారాన్ని తినడానికి, డాక్టర్ సూచించిన ఆహారాన్ని తినడానికి కోర్టు అనుమతించింది’ అన్నారు. అయితే బీజేపీ తన అనుబంధ సంస్థ (ఈడీ) ద్వారా కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని, ఈడీ పదే పదే అబద్ధాలు చెబుతోందని అని ఆమె కోర్టులో ఏజెన్సీ వాదనలను తిప్పికొట్టారు. తన వైద్యుడితో సంప్రదింపు కోసం చేసిన అభ్యర్థనను వ్యతిరేకిస్తూ, మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని మామిడిపండ్లు, స్వీట్లను కేజ్రీవాల్ తింటున్నారని, చక్కెర కలిగిన టీ తాగుతున్నారని ఈడీ వాదించింది. దీనికి కౌంటర్ ఇస్తూ ఇది పూర్తిగా అబద్ధమని, డాక్టర్ సూచించిన స్వీటెనర్ తోనే టీ, స్వీట్లను కేజ్రీవాల్ తీసుకున్నారని అతిషి చెప్పుకొచ్చారు. -
సౌదీ జైల్లో భారతీయుడు.. విడుదలకు రూ.34 కోట్ల నిధుల సేకరణ
కోజికోడ్: ప్రపంచంలో ఏమూల ఉన్నాసరే విపత్కర సమయాల్లో కేరళ ప్రజలంతా ఒక్కటవుతుంటారు. ఈ క్రమంలో సౌదీ అరేబియాలో మరణ శిక్ష పడిన ఓ వ్యక్తి కోసం ఇప్పుడూ వాళ్లంతా ఏకం అయ్యారు. ఓ హత్య కేసులో మరణశిక్ష పడ్డ వ్యక్తి జైల్లో మగ్గుతున్న ఆ వ్యక్తిని కాపాడటానికి ఏకంగా రూ. 34 కోట్లు నిధుల సేకరణకు ముందుకొచ్చారు. కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్.. 2006లో సౌదీలో ఓ బాలుడికి అబ్దుల్ రహీమ్ కేర్‌టేకర్‌గా చేరారు. అయితే ప్రమాదవశాత్తు ఆ బాలుడు రహీమ్ సంరక్షణలో మృతి చెందాడు. దీంతో ఈ కేసులో అక్కడి న్యాయస్థానం రహీమ్‌కు మరణశిక్ష విధించింది. సుమారు 18 ఏళ్ల నుంచి సౌదీ అరేబియాలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసులో రహీమ్‌కు క్షమాభిక్ష ప్రసాదించడానికి బాధిత కుటుంబం తొలుత నిరాకరించింది. అయితే.. బ్లడ్‌మనీ (నష్ట పరిహారం రూపంలో) చెల్లిస్తే క్షమించేందుకు ఎట్టకేలకు ఒప్పుకుంది. బ్లడ్ మనీ కింద రూ.34కోట్లు చెల్లించాలని ఆ బాలుడి కుటుంబం షరతు విధించింది. అయితే రహీం ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే కదా!. ఈ క్రమంలో సౌదీలోని కేరళీయులు అంతా ఏకమై నిధలు సేకరించడానికి ఓ కమిటిగా ఏర్పడ్డారు. ముందుగా నిధులు సమీకణకు పెద్దగా స్పందన రాలేదు. కొన్ని రోజుల అనంతరం కేరళీయుల నుంచి భారీ విరాళాలు రావటం ప్రారంభమైందని నిధుల సేకరణ కమిటీ మీడియాకు వెల్లడించింది. రియాద్‌లోని సుమారు 75 సంస్థలు, కేరళకు వ్యాపారవేత్తలు, స్థానిక రాజకీయ సంస్థలు విరాళాలు అందిచినట్లు తెలుస్తోంది. విరాళాల్లో పారదర్శకత కోసం సదరు కమిటి ప్రత్యేక నిధులకు సేకరణకు యాప్‌ను కూడా తయారు చేసింది. ‘ఇంత పెద్ద భారీ నిధులు సేకరణ సాధ్యం అవుతుందని అస్సలు ఊహించలేదు. రూ. 34 కోట్లు సేకరిస్తామన్న నమ్మకం మొదట్లో లేదు. కానీ మెల్లగా విరాళాలు పెరగటంతో సాధ్యం అయింది’ అబ్దుల్ రహీం తల్లి సంతోషం వ్యక్తం చేసింది. త్వరలోనే రహీమ్ జైలు నుంచి విడుదల కానున్నాడని అతని కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది. -
ఆ ‘ఆప్’ నేతలు ఎక్కడ? నిరసనలకు ఎందుకు దూరం?
లోక్‌సభ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ చిక్కుల్లో పడింది. పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉండటం పార్టీకి పెద్ద సమస్యగా పరిణమించింది. సీఎంను జైలుకు పంపడాన్ని నిరసిస్తూ పార్టీ చేపడుతున్న నిరసన ప్రదర్శనలకు కొందరు పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీలోని మొత్తం 10 మంది ఎంపీల్లో ముగ్గురు పార్టీ కోసం తమ గొంతు వినిపిస్తుండగా, ఏడుగురు ఎంపీలు ఏమయ్యారో ఎవరికీ తెలియడం లేదు. కాగా ఆప్‌కి చెందిన ఏకైక లోక్‌సభ ఎంపీ సుశీల్ కుమార్ రింకూ బీజేపీలో చేరారు. ఈ విషయమై ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన పార్టీ నేత సంజయ్‌సింగ్‌ను ప్రశ్నించగా, ఈ అంశాన్ని పార్టీ పరిశీలిస్తుందని చెప్పారు. ఇతనితోపాటు ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్, ఎన్డీ గుప్తా నిరసన ప్రదర్శనల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే పార్టీలో ఇంత జరుగుతున్నా ముఖం చాటేస్తున్న కొందరు కీలక నేతలున్నారు. రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా పంజాబ్‌కు చెందిన ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా గత నెలలో కంటి ఆపరేషన్ కోసం లండన్ వెళ్లారు. ఆయన మార్చి చివరిలో తిరిగి రావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ లండన్‌లోనే ఉన్నారని సమాచారం. మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన తర్వాత రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. స్వాతి మలివాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ కూడా ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. తన సోదరి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమెకు అండగా ఉండేందుకు అక్కడే కొన్నాళ్లు ఉండాల్సివస్తున్నదని స్వాతి మలివాల్ తెలిపారు. మలివాల్ ఆప్ పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హర్భజన్ సింగ్ క్రికెటర్ హర్భజన్ సింగ్ పంజాబ్ ఆప్ ఎంపీ అయినప్పటి పార్టీ కార్యకలాపాల్లో అప్పుడప్పుడు పాల్గొంటున్నారు. కేజ్రీవాల్ అరెస్టుపై కూడా హర్బజన్ స్పందించలేదు. ఆప్ నిర్వహించే నిరసన కార్యక్రమంలో పాల్గొంటారా? అని మీడియా ప్రశ్నించగా అందుకు సమాధానం చెప్పేందుకు హర్బజన్ నిరాకరించారు. అశోక్ కుమార్ మిట్టల్ పంజాబ్‌కు చెందిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ వ్యవస్థాపకుడు, ఆప్ ఎంపీ అయిన మిట్టల్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పార్టీ నిరసనల గురించి మాట్లాడే అధికారం తనకు లేదని ఆయన పేర్కొన్నారు. ఏం చేయాలో పార్టీ అధిష్టానం చూసుకుంటుందని, ఇటీవల పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి కూడా తనను ఆహ్వానించలేదని ఆయన ఆరోపించారు. సంజీవ్ అరోరా పంజాబ్‌కు చెందిన మరో ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా సీఎం కేజ్రీవాల్ అరెస్టు తర్వాత మార్చి 24న కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్‌ను కలుసుకున్నారు. అయితే, రాంలీలా మైదాన్‌లో జరిగిన నిరసనల్లో ఆయన పాల్గొనలేదు. లూథియానాలో పార్టీ అసైన్మెంట్తో బిజీగా ఉన్నందున నిరసనలకు హాజరు కాలేకపోయానని అరోరా తెలిపారు. బల్వీర్ సింగ్ పంజాబ్‌కు చెందిన ఆప్ రాజ్యసభ ఎంపీ బల్వీర్ సింగ్ కూడా పార్టీ నిరసన ప్రదర్శనల్లో కనిపించలేదు. ఆయనను గైర్హాజరు గురించి ప్రశ్నించగా తాను తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నానని, పార్టీ ఆదేశిస్తే నిరసనల్లో పాల్గొంటానని తెలిపారు. -
‘సందేశ్‌ఖాలీ’ అరాచకాలు.. షేక్ షాజహాన్ మళ్లీ అరెస్టు
కలకత్తా: పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాలీ కేసుల్లో ప్రధాన నిందితుడు తృణమూల్ మాజీ నేత షేక్ షాజాహన్ను మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం(మార్చ్ 30) అరెస్టు చేసింది. సందేశ్‌ఖాలీలో భూములు కబ్జాలకు పాల్పడి మహిళలపై లైంగిక దాడులు చేసిన కేసులో షాజాహాన్‌ను సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది. ప్రస్తుతం బసిర్హట్ జైలులో ఉన్న షాజాహాన్‌ను మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ శనివారం జైలులోనే ప్రశ్నించింది. అనంతరం అరెస్టు చేసింది. షాజాహాన్‌ను కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఈడీ బసిర్హట్ కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. సందేశ్‌ఖాలీ ఆందోళనలకు కారణమయ్యారన్న కారణంతో టీఎంసీ షాజహాన్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. సందేశ్ ఖాలీలో షేక్ షాజహాన్ ఆగడాలకు వ్యతిరేకంగా ఉద్యమించన రేఖా పత్ర అనే మహిళకు బీజేపీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ కూడా ప్రకటించింది. ఇదీ చదవండి.. ఇండియా జిందాబాద్ నినాదాలు చేసిన పాకిస్తానీలు -
భర్తలు జైల్లో.. భార్యలు రాజకీయాల్లో..
మనదేశంలో కొందరు రాజకీయ నేతలు జైలుకు వెళ్లిన సందర్భంలో వారి భార్యలు రాజకీయాల్లోకి ప్రవేశించడాన్ని చూస్తుంటాం. ఇటువంటి దృశ్యం రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ కనిపించనుంది. జైల్లో ఉన్న తమ భర్తల రాజకీయ వారసత్వాన్ని కాపాడుకునేందుకు వారి భార్యలు సిద్ధమయ్యారు. ఈ జాబితాలో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారే జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత, యూపీ మాజీ ఎంపీ ధనంజయ్ సింగ్ భార్య శ్రీకళ. వీరి భర్తలు వేర్వేరు కేసుల్లో అరెస్టయ్యారు. వారు లోక్‌సభ ఎన్నికల్లోగా బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. దీంతో తమ భర్తల రాజకీయ పలుకుబడిని కాపాడేందుకు ఈ ముగ్గురూ రాజకీయాల్లోకి దిగారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే జైలులో ఉన్న ఈ ముగ్గురు నేతలు ప్రతిపక్ష శిబిరానికి చెందినవారే. భూ కుంభకోణం ఆరోపణలపై జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు. అతనిని జ్యుడీషియల్ కస్టడీ కింద రాంచీ జైలులో ఉంచారు. హేమంత్ జైలుకు వెళ్లిన తర్వాత ఆయన భార్య కల్పనా సోరెన్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్ మాజీ ఎంపీ ధనంజయ్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. కిడ్నాప్ కేసులో దోషిగా తేలిన ధనంజయ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఈసారి కూడా ధనంజయ్ జౌన్పూర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అయితే జైలులో ఉండటంతో ఆయన ఆశలు నెరవేరలేదు. ఈ నేపధ్యంలో ఆయన భార్య శ్రీకళారెడ్డి జౌన్పూర్ నుంచి పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ఎన్నికల వేళ కేజ్రీవాల్ అరెస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీని ఉలిక్కిపడేలా చేసింది. అయితే కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పార్టీ తరపున ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. -
Delhi liquor scam: ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్ పరిపాలన
న్యూఢిల్లీ: జైలులో ఉన్నా, బయట ఉన్నా ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తానని చెప్పిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆ దిశగా తొలి ఉత్తర్వు జారీ చేశారు. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, మురుగునీటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి నుంచి శనివారం రాత్రి ఆదేశాలు అందాయని ఢిల్లీ నీటి మంత్రి అతీషి చెప్పారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్ పంపించిన నోట్‌ను చూసిన తర్వాత తనకు కన్నీళ్లు వచ్చాయంటూ భావోద్వేగానికి గురయ్యారు. అరెస్టై ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజల బాగు కోసం ఆయన ఆలోచిస్తున్నారని తెలిపారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తగినన్ని వాటర్ ట్యాంకర్లు పంపించాలంటూ కేజ్రీవాల్ ఆదేశించారని పేర్కొన్నారు. వేసవి ఎండలు ముదురుతుండడంతో నీటి సరఫరాను మెరుగుపర్చాలని చెప్పారని అన్నారు. ఈ విషయంలో చీఫ్ సెక్రటరీతోపాటు సంబంధిత అధికారులకు సీఎం ఈడీ కస్టడీ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. అవసరమైతే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సాయం తీసుకోవాలని సూచించారని మంత్రి అతీషి చెప్పారు. కస్టడీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ జారీ చేసిన ఉత్తర్వుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్పందించింది. ఈ ఉత్తర్వు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ పీఎంఎల్ఏ కోర్టు జారీ చేసిన ఆర్డర్‌కు అనుగుణంగా ఉందా? లేదా? అనేది పరిశీలించనున్నట్లు ఈడీ అధికార వర్గాలు ఆదివారం తెలియజేశాయి. -
జైలు నుంచే కేజ్రీవాల్ పరిపాలన..
-
మారుతున్న ఢిల్లీ రాజకీయాలు.. ఎల్జీ నిర్ణయంపై ఉత్కంఠ
దేశ రాజకీయాల్లోనే పెను సంచలనం చోటు చేసుకుంది. తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. అదీ అవినీతి ఆరోపణల మీద ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం రాత్రి అరెస్టు చేసింది. తద్వారా పదవిలో ఉండగా అరెస్టయిన మొదటి ముఖ్యమంత్రిగా నిలిచారాయన. అయితే ఆయన అరెస్ట్ నేపథ్యంలో.. ఢిల్లీకి నెక్ట్స్ సీఎం ఎవరనే చర్చ సాధారణంగానే తెరపైకి వచ్చింది. ఆప్ మాత్రం మరో మాట చెబుతోంది. ‘‘అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పూర్తిగా రాజకీయ కుట్ర. ఢిల్లీకి కేజ్రీవాలే ముఖ్యమంత్రి. ఆయనే మా పార్టీ కన్వీనర్‌గా కొనసాగుతారు. జైలుకు వెళ్లినా అక్కడి నుంచే ఆయన పాలన కొనసాగిస్తారు. ఆప్ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏం లేదు..’’ ఇది ఇప్పుడు ఆప్ కీలక నేతలు చెబుతున్న మాట. ఇప్పుడే కాదు.. గత నవంబర్‌లో లిక్కర్ స్కాంలో తొలిసారి ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన అరెస్ట్ అవుతారనే ప్రచారం నడుస్తూ వచ్చింది. అయితే ఆ సమయంలోనూ ఆప్ ఒక్కటే ప్రకటన చేసింది. కేజ్రీవాల్ ఎట్టిపరిస్థితుల్లో రాజీనామా చేయబోరని.. అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లినా ఆయనే సీఎంగా పాలన కొనసాగిస్తారని. అంతేకాదు ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే గనుక రాజీనామా చేయాలా? లేదంటే సీఎంగా కొనసాగొచ్చా? అంటూ.. ‘మై బీ కేజ్రీవాల్’ పేరుతో ఈ జనవరిలో ఏకంగా ఓ పబ్లిక్ సర్వేను సైతం చేపట్టింది ఆప్. అయితే.. ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యి ముఖ్యమంత్రి హోదాలో జైలు నుంచే పాలన నడిపించేందుకు వీలుందా?అందుకు భారత రాజ్యాంగం అనుమతిస్తుందా? చట్టాలు ఏం చెబుతున్నాయి?.. రాష్ట్రపతి, గవర్నర్ పోస్టులు మాత్రమే రాజ్యాంగం పరిధిలోని పోస్టింగులు. చట్టం ప్రకారం.. వీళ్లకు మాత్రమే అరెస్ట్ నుంచి రక్షణ ఉంటుంది. వాళ్ల పదవీకాలం ముగియడం లేదంటే స్వచ్ఛందంగా రాజీనామా చేసేదాకా వాళ్లకు ఊరట లభిస్తుంది. అప్పటిదాకా ఆర్టికల్ 361 ప్రకారం వాళ్లకు కల్పించిన రక్షణ ప్రకారం.. న్యాయస్థానాలకు వాళ్లు జవాబుదారీలుకారు. అయితే.. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి లాంటి పదవులకు మాత్రం ఎలాంటి రక్షణ ఉండదు. అందుకే ఢిల్లీ హైకోర్టు సైతం కేజ్రీవాల్‌కు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు విముఖత వ్యక్తం చేసింది. అలాగని కేవలం అరెస్ట్ అయినంత మాత్రానా వాళ్లు(పీఎం, సీఎంలాంటి పదవుల్లో ఉన్నవాళ్లు) ఆ పదవులకు అనర్హులైపోరు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం కచ్చితంగా శిక్ష పడితేనే పదవుల్ని కోల్పోతారు. కేజ్రీవాల్‌కు జైలుకెళ్తే.. తాజా పరిణామాల్ని పరిశీలిస్తే.. జైలు నుంచి కేజ్రీవాల్ ఢిల్లీని పాలించడాన్ని ఏ చట్టం అడ్డుకోదు. ఒకవేళ ఆయనకు శిక్ష పడితే మాత్రం అనర్హతకు గురవుతారు. ఇప్పటివరకైతే ఆయనకు శిక్ష పడలేదు. కాబట్టి ఆయన పాలన కొనసాగించేందుకు ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అలాగని జైలు నుంచే సీఎంగా బాధ్యతలు నిర్వర్తించడం అంత సులువైన పనీ కాదని కూడా అభిప్రాయపడుతున్నారు. అందుకు జైలు అధికారులు ఆయనకు పలు సడలింపులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు అక్కడి జైళ్ల శాఖ నిబంధనలపై స్పష్టత రావాల్సి ఉంది. స్వచ్ఛందంగా రాజీనామాను మినహాయిస్తే ఒక ముఖ్యమంత్రి తన పదవిని కోల్పోయేది అసెంబ్లీలో మెజారిటీని కోల్పోవడమో లేదంటే అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడం వల్లనో. కేజ్రీవాల్‌కు కలిసొచ్చే మరో అంశం ఏంటంటే.. ఇప్పటి వరకు ఆప్ మంత్రులు ఇద్దరు మనీశ్ సిసోడియా , సత్యేందర్ జైన్ అరెస్టై జైలుకు వెళ్లారు. కానీ, కేజ్రీవాల్ కేవలం ముఖ్యమంత్రిగానే ఉన్నారు. ఆయన వద్ద ఎలాంటి పోర్ట్‌ఫోలియో లేదు. లెఫ్టినెంట్ గవర్నర్దే నిర్ణయం? ప్రస్తుతం ఉన్న ఢిల్లీ అసెంబ్లీ కాలపరిమితి వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. అయితే.. ఢిల్లీ అధికార నిర్మాణం చాలా భిన్నంగా ఉంటుందన్నది తెలిసిందే. ప్రజలు ఎన్నుకునే ముఖ్యమంత్రి.. కేంద్రం ఎంపిక చేసే లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఢిల్లీ ఎల్జీగా వినయ్ కుమార్ సక్సేనా ఉన్నారు. ఆయనతో కేజ్రీవాల్ సర్కార్‌కు అంత సత్సంబంధాలు కూడా ఏం లేవు. దీంతో.. ఇప్పుడు కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా? లేదా?.. ఎల్జీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. రాజధాని రీజియన్‌లోని ఢిల్లీకి మాత్రమే వర్తించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 239 ఏఏ ప్రకారం.. కేజ్రీవాల్ జైలుకు వెళ్తే గనుక ఆయన్ని అధికారం నుంచి తొలగించమని ఎల్జీ రాష్ట్రపతిని కోరేందుకు అవకాశం లేకపోలేదు. ఒకవేళ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ జైలుకు గనుక వెళ్లాల్సి వస్తే.. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని పేర్కొంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని గవర్నర్ రద్దు చేయించొచ్చు. ఆర్టికల్ 239ఏబీ ప్రకారం ఎల్జీ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయవచ్చు. తద్వారా బలవంతంగా అయినా కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సి వస్తుంది. అప్పుడు రాష్ట్రపతి పాలన కింద ఢిల్లీ కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది. రిమాండ్ పిటిషన్‌పై తీర్పు, బెయిల్ ఏదో ఒకటి వచ్చేదాకా ఎదురుచూసే అవకాశం లేకపోలేదు. -
‘స్వర్గంలో ఎంజాయ్ చేస్తున్నా’.. జైలు నుంచి హత్య కేసు ఖైదీ వీడియో
లక్నో: ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ జైలు నుంచి సోషల్ మీడియాలో లైవ్ వీడియో స్ట్రీమింగ్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. ‘జైలు స్వర్గంలా ఉందని, తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చెబుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారింది. . ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలి సెంట్రల్ జైలులో ఈ ఘటన వెలుగు చూసింది. వివరాలు.. బరేలీ సెంట్రల్ జైలులో సోషల్ మీడియా ద్వారా ఆసిఫ్ అనే ఖైదీ వీడియో స్ట్రీమింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రెండు నిమిషాల ఈ వీడియోలో ‘జైలు స్వర్గంలా ఉంది. ఇక్కడ జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. త్వరలోనే బయటికి వస్తా’ అంటూ అతడు పేర్కొన్నాడు. కాగా 2019 డిసెంబర్ 2న ఢిల్లీలోని షాజహాన్‌పూర్‌లోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో. రాకేష్ యాదవ్ అనే కాంట్రాక్టర్‌ను హత్య చేసిన కేసులో ఆసిఫ్ శిక్ష అనుభవిస్తున్నాడు. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ చేతికి ఫోన్ రావడంతో అక్కడి సిబ్బంది పనితీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాకేష్ సోదరుడు జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జైలు అధికారులు ఆసిఫ్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా మేజిస్ట్రేట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై యూపీ జైళ్లశాఖ డీఐజీ కుంత్ కిశోర్ స్పందించారు. ఈ వీడియో తమ దృష్టి వచ్చిందని.. దర్యాప్తు జరుగుతున్నట్లు వెల్లడించారు. పూర్తి విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చదవండి: కాంగ్రెస్‌కు సవాల్.. బీజేపీలో చేరిన ప్రణీత్ కౌర్ रामराज्य हैं उत्तर प्रदेश बरेली जेल में बन्द जेल में बंद आरोपी का वीडियो वायरल PWD ठेकेदार हत्याकांड का आरोपी जेल में है बंद जेल में बंद आरोपी का लाइव वीडियो चैट वायरल,, pic.twitter.com/8yZOg1m2xK— Mαɳιʂԋ Kυɱαɾ αԃʋσƈαƚҽ 🇮🇳🇮🇳 (@Manishkumarttp) March 14, 2024 -
కాశీ విశ్వనాథునికి మధుర జైలు నుంచి గులాల్
మహాశివుడు కొలువైన కాశీలో రంగ్భరి ఏకాదశి(మార్చి 20)రోజున హోలీ వేడుకలు జరగనున్నాయి. ఆ రోజున విశ్వనాథుడు, పార్వతిమాత భక్తుల నడుమ హోలీ ఆడనున్నారు. దీంతో కాశీ మొత్తం రంగులమయంగా మారనుంది. ఈసారి కాశీ విశ్వనాథుని హోలీ వేడుకల కోసం మథురలో ప్రత్యేక గులాల్ సిద్ధం చేస్తున్నారు. మథుర జైలులోని ఖైదీలు కాశీలో కొలువైన పరమశివుని కోసం పండ్లు, పూలు, కూరగాయల రసాలతో హోలీ రంగులు తయారు చేస్తున్నారు. ఈ విధంగా తయారైన ఎరుపు, పసుపు గులాల్‌లను కాశీలో హోలీ వేడుకలకు వినియోగించనున్నట్లు సమాచారం. మథుర నుండి ఒక క్వింటాల్ హెర్బల్ గులాల్ కాశీకి రానున్నదని, ఈ గులాల్ తయారీలో సుగంధాన్ని కూడా ఉపయోగిస్తున్నారని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. అయోధ్య నుండి కూడా కాశీ విశ్వేశ్వరుని హోలీ వేడుకలకు హెర్బల్ గులాల్ రానుంది. అలాగే కాశీ వ్యాపారులు కూడా విశ్వేశ్వరునికి హెర్బల్ గులాల్ సమర్పించనున్నారు. హోలీ వేడుకల్లో మహాశివుడు, పార్వతిమాత ఆసీనులయ్యే సింహాసనం ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. హోలీ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. -
ప్రేయసిని పెళ్లాడిన ఖైదీ.. జైల్లో జరిగిన వివాహం
భువనేశ్వర్: పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయన్నది నిజమే కానీ, ఇది మాత్రం జైలులో భిన్నంగా జరిగిన పెళ్లి. ప్రియురాలి వర్గాల నేరారోపణతో జైలు పాలైన ప్రేమికుడితో చట్టపరమైన లాంఛనాలతో పెళ్లి జరిగింది. జైలు అధికారుల అనుమతి మేరకు వీరి వివాహం సనాతన ధర్మం, ఆచారాల ప్రకారం వేడుకగా జరిపించారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ఝరపడా ప్రత్యేక జైలు సోమవారం పెళ్లి కళతో కళకళలాడింది. ఈ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వధూవరుల కుటుంబాల మధ్య కొన్ని మనస్పర్థల కారణంగా అమ్మాయి తరపువారు ఇదివరకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కాలానుక్రమంగా వివాదాలతో సతమతమైన వీరి ప్రేమ కథకు సంతోషకరమైన మలుపు దక్కింది. ఇరువురి కుటుంబాలు తమ మనసు మార్చుకుని సమస్యకు పరిష్కారం చూపించారు. ప్రేమికులకు పెళ్లి జరిపించేందుకు హృదయపూర్వకంగా ముందుకొచ్చారు. దీంతో యువతి తన ప్రియుడితో వివాహం కోసం ఖుర్దా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించింది. ఈ క్రమంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న యువకుడు ప్రియురాలితో పెళ్లి కోసం జైలు అధికారుల ఆధ్వర్యంలో ఖుర్దా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని అభ్యర్థించాడు. వీరి అభ్యర్థనపై జైలు, న్యాయ శాఖ అధికార వర్గాలు సానుకూలంగా స్పందించాయి. పెళ్లి తంతుని మరింత ప్రోత్సహించి ముందుకు నడిపించారు. చట్టపరమైన నిబంధనల మేరకు వీరి వివాహాన్ని అత్యంత ఆనందోత్సాహాలతో జరిపించారు. -
కేటీఆర్ కడుపు సల్లగుండాలి...
మల్యాల(చొప్పదండి): పెళ్లైన ఏడాదికే ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి.. అక్కడ హత్యకేసులో ఇరుక్కుని జైలుకెళ్లి 18 ఏళ్ల తర్వాత ఇంటికి చేరాడు జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాల గ్రామానికి చెందిన శివరాత్రి హనుమంతు. గ్రామానికి చెందిన శివరాత్రి హనుమంతుకు బుగ్గారం మండలం గోపులాపురానికి చెందిన పద్మతో 20ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన ఏడాదికే ఉపాధి కోసం హనుమంతు దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. పాప పుట్టిన తర్వాత పురుడు చేసిన మరునాడే దుబాయ్ వెళ్లాడు. మూడు నెలలకే హత్య కేసులో జైలుకెళ్లాడు. అప్పటి నుంచి ఆయన భార్య పద్మ భర్త కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఆమె 18ఏళ్ల నిరీక్షణ ఫలించాయి. దుబాయ్ జైలు నుంచి విడుదలై ఇంటికి చేరిన భర్త హనుమంతును చూసి కడుపులో దాచుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంది. ‘మాది రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద వడ్డెర కుటుంబం. ఉపాధి కోసం ఆయన (హనుమంతు) దుబాయ్ పోయిండు. అక్కడ జైలులో పడ్డడు. పద్దెనిమిదేళ్లుగా భర్త కోసం ఎదురుచూసిన. నా ఐదుగురు అన్నలు, ఇద్దరు తమ్ముళ్ల సహకారంతో తల్లిగారింట్లో ఉంటూ.. బీడీలు చేస్తూ, వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ కాలం వెళ్లదీసిన. మూడు, నాలుగు నెలలకు ఒకసారి భర్తతో ఫోన్లో మాట్లాడిన. భర్తను తలుచుకుని ఏడుస్తూ నిద్రలేని రాత్రులు గడిపిన. కూతురు గౌతమిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన. హనుమంతును ఇంటికి రప్పించేందుకు కేటీఆర్ సారును కలిసినం. కేటీఆర్ సారు కడుపు సల్లగుండ ఆయన చేసిన మేలుతో దుబాయ్ జైలు నుంచి నా భర్త బయటపడి ఇంటికి చేరిండు. ఆయన చేసిన మేలు జీవితకాలం మరిచిపోను..’ అని తన భర్త జైలు నుండి విడుదల కోసం కృషి చేసిన మాజీ మంత్రి కేటీఆర్‌కు హనుమంతు భార్య పద్మ కృతజ్ఞతలు తెలిపింది. -
బండ్లగణేశ్‌కు బిగ్ షాక్.. ఆ కేసులో జైలు శిక్ష!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతకు బండ్లగణేశ్‌కు జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పు వెలువరించింది. అంతే కాకుండా శిక్షతో పాటు బండ్లగణేశ్‌కు రూ.95 లక్షల జరిమానా విధించింది. జరిమానాతో పాటు కోర్టు ఖర్చులు కూడా బండ్ల గణేష్ చెల్లించాలంటూ తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం ఈ టాపిక్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. 2019లో మద్దిరాలపాడుకు చెందిన జానకిరామయ్య అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేశ్ రూ. 95 లక్షల అప్పు తీసుకున్నారు. అయితే జానకి రామయ్య మరణాంతరం ఆయన తండ్రికి బండ్ల గణేశ్ రూ.95 లక్షల చెక్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో జానకి రామయ్య తండ్రి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. గతంలో ఆరునెలల జైలు శిక్ష గతంలో 2017లో సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా కూడా విధించింది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు కోర్ట్ ఈ శిక్ష విధించింది. కానీ వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. కాగా.. ఎన్టీఆర్, కాజల్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమాను బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు. చిన్న చిన్న పాత్రలతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్, రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారాడు. తరువాత వరుసగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించారు. -
పాక్ యువతకు ఇమ్రాన్ ‘అవినీతి’ పట్టలేదా?
పాకిస్తాన్లో నేషనల్ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం పలు అవినీతి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ ‘పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతు కలిగిన స్వతంత్ర అభ్యర్థులు కింగ్ మేకర్లుగా కనిపిస్తున్నారు. నవాజ్ షరీఫ్ పార్టీ ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) మూడో స్థానంలో ఉంది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉన్నాయి. వీటిలో 265 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పలు వార్తా సంస్థల కథనాల ప్రకారం పాకిస్తాన్ యువ ఓటర్లు ఇమ్రాన్ ఖాన్ పార్టీకి మద్దతు పలికారు. దీని వెనుకనున్న కారణమేమిటనే దానిపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇమ్రాన్‌ఖాన్ జైల్లో ఉన్నారు. ఈ నేపధ్యంలో అతని పార్టీ పేరు, గుర్తును రద్దు చేశారు. అయితే ఈ పార్టీకి చెందిన నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగారు. వీరు స్వతంత్ర అభ్యర్థుల కంటే మెరున ఫలితాలు దక్కించుకోవడం విశేషం. 2022లో ఇమ్రాన్‌ఖాన్‌ను అధికారం నుంచి తొలగించారు. ఆయనపై అనేక అవినీతి కేసులు ఉన్నాయి. 2023 ఆగస్టులో ఇమ్రాన్‌ను జైలుకు తరలించారు. దీనితోపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్ ఖాన్‌పై కొన్నాళ్ల పాటు నిషేధం విధించారు. అయితే ఈ ఎన్నికల్లో పాక్ యువత ఇమ్రాన్‌కు మద్దతు పలికింది. పాక్‌లో సైనిక మద్దతుతో అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న యువ ఓటర్లు ఇమ్రాన్‌కు అండగా నిలిచారు. అయితే ఈ వాదనను పాక్ ఆర్మీ ఖండించింది. మరోవైపు రాజకీయాలలో మిలటరీ ప్రమేయంపై పాక్ యువతకు అవగాహన ఏర్పడిన కారణంగా వారు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులకు ఓటు వేశారని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా ద్రవ్యోల్బణం పెరగడం, ఇమ్రాన్‌ఖాన్‌ను జైలుకు పంపడంపై పాక్ యువత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. పాక్‌కు చెందిన న్యాయ విద్యార్థి నైలా ఖాన్ మార్వాత్ మాట్లాడుతూ ‘నేను 2016లో పీటీఐ పార్టీలో చేరాను. 2018లో నా మొదటి ఓటు ఈ పార్టీకే వేశాను. ఇమ్రాన్ ఖాన్ మాటలు నన్ను, నా సహోద్యోగులను ఎంతగానో ఉత్సాహపరిచాయి. నెల్సన్ మండేలా లాంటి పలువురు నేతలు జైలులో ఉంటూనే తమ సత్తా చాటారు’ అని పేర్కొన్నారు. -
ప్రేమికుల రోజుని జైల్లో సెలబ్రేట్ చేసుకోవడం గురించి విన్నారా?
వాలెంటైన్స్ డేని కేవలం ప్రేమికులే గాక పెద్దల అంగీకారంతో చేసుకున్న జంటలు కూడా హ్యాపీగా చేసుకుంటారు. అంతేగాదు మనల్ని ఎంతగానో ప్రేమించే మన ఆత్మీయులు, స్నేహితులు కూడా ఆ రోజుని ఎంతగానో సెలబ్రెట్ చేసుకుంటారు. అయితే ఆ రోజు కచ్చితంగా చాలమంది బయటే డిన్నర్ చేసేందుకు ప్లాన్లు చేస్తుంటారు. ఇది కామన్. అయితే విలక్షణతను ఇష్టపడే వాళ్లు మర్చిపోలేని గుర్తులా ఉండేలా వెరైటీగా చేసుకునేందుకు ఆరాటపడుతుంటారు. అలాంటి వాళ్లు ఈ జైల్లోని ఖైదీల సెల్లో చేసుకోండి. అంతేగాదండోయ్! ప్రేమికుల రోజు సందర్భంగా విభిన్న రుచులతో కూడిన మెనూని కూడా ఆ జైలు అందిస్తోంది. ఖైదీలు ఉంచే సెల్లో డిన్నర్ చేస్తే ఎలా ఉంటుంది? అనే అనుభూతి కూడా పొందొచ్చు. ఎక్కడ? ఏ జైలు ఈ ఆఫర్ అందిస్తోందంటే..? వివరాల్లోకెళ్తే..బ్రిటన్ ఆక్స్ఫర్డ్ జైలు ప్రేమికులకు గొప్ప ఆఫర్ అందిస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా సరదాగా సెల్లో డిన్నర్ చెసేలా వసతులు ఏర్పాటు చేసింది. పైగా అందుకోసం ప్రత్యేకమైన మూడు విధాన మెనూని కూడా ఏర్పాటుచేసింది. అంతేగాదు ఆ జైలులో ఖైదీలు ఉండే సెల్లో తినాలనుకుంటే సుమారు 17 వేల రూపాయాలు వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఘోరమైన హత్యానేరాలకు పాల్పడ్డ ఖైదీలసెల్లో తినాలనుకుంటే ఏకంగా 19 వేలు వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ జైల్లో భోజనం చేయడానికి వచ్చే అతిథుల కోసం క్యాండిల్స్, పువ్వులతో అలంకరించిన డైనింగ్ టేబుల్ ఆహ్వానం పలుకుతుంది. మాంసాహారు కోసం బ్రైజ్డ్ బీఫ్ బ్లెడ్, షార్ట్ రిబ్ పిరోగి, వైన్ తదితర పానీయాలను అందిస్తారు. అలాగే శాకాహరలు కోసం టొమాటో టార్టేర్, కాల్చిన చీజ్ సౌఫిల్, బ్రైజ్డ్ క్యాబేజీ, చాక్లెట్, రాస్బెర్రీస్, పిస్తాతో డెకరేట్ సిన కేక్, కాక్టైల్ వంటి పానీయాలు కూడా ప్యాకేజ్‌లో ఉన్నాయి. ఇక్కడకు వచ్చే అతిథులు తమకు నచ్చిన ప్యాకేజ్ని ఎంపిక చేసుకోవచ్చని అని ఆక్స్ఫర్డ్ జైలు తన వెబ్సైట్లో పేర్కొంది. నిజానికి ఈ జైలు సుమారు వెయ్యి ఏళ్ల నాటి చారిత్రాత్మక కోట. 1073లో ఈ కోటని వైద్యశాలగా నిర్మించారు. అయితే 1642 నుంచి 1651ల మధ్య బ్రిటీషర్ల అంతర్యుద్ధం కారణంగా గణనీయమైన నష్టాన్ని ఎదుర్కొని 1786లో జైలుగా మార్చబడింది. అలా జైలుగా 1996 వరకు పనిచేసింది. ఆ తర్వాత ఆ ఆక్స్ఫర్డ్ జైలుని ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మార్చేశారు. (చదవండి: ఆసియాలోనే ఉత్తమ మహిళా చెఫ్‌గా 'పిచాయా పామ్') -
మహిళా ఖైదీల గర్భంపై హైకోర్టు సీరియస్!
సంస్కరణా కేంద్రాలుగా ఉండాల్సిన జైళ్లో మహిళల పరిస్థితి దారుణంగా మారిన ఘటన కలకలం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ దిద్దుబాటు కేంద్రాల్లో మహిళా ఖైదీలు గర్భం దాల్చడం, 196 మంది పిల్లలు జన్మించడంతో మహిళా ఖైదీల దుస్థితికి బాధ్యులెవరు అనే చర్చకు దారి తీసింది. జైళ్లలో ఉన్న కొంతమంది మహిళా ఖైదీలు గర్బం దాల్చిన ఘటన పశ్చిమ బెంగాల్లో పెను దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై కోలకత్తా హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. రాష్ట్రంలోని వివిధ జైళ్లను పరిశీలించి అమికస్ క్యూరీ గురువారం అందించిన నివేదికపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జైళ్లలో మహిళా ఖైదీలు గర్భం దాల్చి, బిడ్డల్ని కంటున్న ఘటనలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానం, జస్టిస్ సుప్రతిమ్ భట్టాచార్యలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం జైలు సంస్కరణలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని తీవ్రమైన సమస్యగా పరిగణిస్తున్నట్టు వ్యాఖ్యానించింది. మహిళా జైళ్లలోకి పురుష ఉద్యోగుల ప్రవేశాన్ని నిషేధించాలని కోలకత్తా హైకోర్టు కోరింది. అలాగే ఈ విషయాన్ని క్రిమినల్ కేసులు విచారించే బెంచ్‌కు బదిలీ చేయడం సరైందని భావించిన ధర్మాసనం ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమస్యను తీవ్రమైందిగా పరిగణిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతం ఈ అంశాన్ని హైకోర్టులోని మరో డివిజన్ బెంచ్‌కు అప్పగించారు. ఈ కేసులో తదుపరి విచారణ సోమవారం జరగనుంది. ఈ వ్యవహారంలో 2018లో అమికస్ క్యూరీగా ఎంపికైన న్యాయవాది తపస్ కుమార్ భంజా తన నివేదికను కోర్టుకు సమర్పించారు. పశ్చిమ బెంగాల్‌లోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న మహిళలకు రాష్ట్రంలో గత ఏడాది నుంచి ఇప్పటివరకు 196 మంది పిల్లలు పుట్టారని అమికస్ క్యూరీ కోర్టుకు వివరించారు. కస్టడీలో ఉండగానే మహిళా ఖైదీలు గర్భం దాల్చి, జైళ్లలోనే ప్రసవించినట్లు గుర్తించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో మహిళా ఖైదీలుండే ఎన్క్లోజర్లలో, కరెక్షన్ హోమ్స్‌లో పురుష ఉద్యోగులు, ఇతర పురుషుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించాలని తపస్ ధర్మాసనాన్ని కోరారు. ఇటీవల తాను దిద్దుబాటు గృహాల ఇన్స్పెక్టర్ జనరల్ (స్పెషల్), జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శితో కలిసి మహిళా దిద్దుబాటు గృహాన్ని సందర్శించాననీ ఈ సమయంలో ఒక గర్భవతిని, దాదాపు15 మంది ఇతర మహిళా ఖైదీలు వారి పిల్లలతో ఉన్నట్టు కోర్టుకు నివేదించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ కరెక్షనల్ సర్వీసెస్‌కు చెందిన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ఈ ఘటనపై స్పందించారు. శిక్ష పడిన మహిళకు ఆరేళ్ల లోపు వయసున్న పిల్లలు ఉంటే వారిని తల్లితో ఉండేందుకు అనుమతి ఉంమటుందని తెలిపారు. కానీ పశ్చిమ బెంగాల్‌లోని జైలులో మహిళలు గర్భవతులు కావడం తన దృష్టికి రాలేదని, వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
జైలులో హెచ్ఐవీ కలకలం.. 63 మందికి పాజిటివ్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జిల్లా జైలులో ఖైదీల ఆరోగ్యానికి సంబంధించి సంచలన విషయం బయటపడింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా జైలులోని 63 మంది ఖైదీలకు హెచ్ఐవీ(ఎయిడ్స్) ఉన్నట్లు తేలింది. గత ఏడాది డిసెంబర్ నెలలో నిర్వహించిన పరీక్షల్లో 36 మందికి హెచ్ఐవీ సోకినట్లు తేలగా తాజా పరీక్షల్లో ఈ సంఖ్య 63కు చేరింది. వైరస్ ఇంత పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడానికి గల స్పష్టమైన కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. హెచ్ఐవీ సోకిన ఖైదీల్లో చాలా మందికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉండటంతో ఒకరు వాడిన ఇంజెక్షన్లతో మరొకరు డ్రగ్స్ ఎక్కించుకునే సమయంలో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే వీరిందరికీ ముందే హెచ్ఐవీ ఉందని, జైలులోకి వచ్చిన తర్వాత ఎవరికీ వైరస్ సోకలేదని మరో వాదన వినిపిస్తోంది. హెచ్ఐవీ సోకినట్లు తేలిన వారందరికీ లక్నోలోని ఒక ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో హెచ్ఐవీ కేసులు బయటపడిన నేపథ్యంలో జైలులో వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇదీచదవండి.. రిసార్ట్ పాలిటిక్స్.. తొలిసారి ఎక్కడ..ఎప్పుడంటే -
జార్ఖండ్ సర్కార్‌ను కూల్చే కుట్ర: రాహుల్
పాకూర్(జార్ఖండ్): హేమంత్ సోరెన్‌ను అక్రమంగా జైలుకు పంపి జార్ఖండ్‌లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయాలని బీజేపీ కుట్ర పన్నిందని, ప్రజాతీర్పుకు భంగం కల్గకుండా తాము అడ్డుకున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. శుక్రవారం జార్ఖండ్‌లోకి భారత్ జోడో న్యాయ్ యాత్ర అడుగుపెట్టిన సందర్భంగా పాకూర్ జిల్లాలో కార్యకర్తలనుద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ‘‘ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజాతీర్పును బీజేపీ పరిహసించాలని చూసింది. మేం దానిని అడ్డుకున్నాం. ధనం, దర్యాప్తు సంస్థల అండతో బీజేపీ చెలరేగుతోంది’’అని రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు తాను కట్టుబడిఉంటానన్నారు. ‘‘ అస్సాంలో యాత్రకు అడ్డుపడిన సీఎం హిమంత బిశ్వ శర్మ, మహారాష్ట్రలో పార్టీ మారిన మిలింద్ దేవ్రా వంటి నేతలతో పార్టీకి పనిలేదు’’ అని రాహుల్ అన్నారు. నకిలీ రాహుల్ ఆచూకీ దొరికింది: హిమంత మరోవైపు, అస్సాంలో న్యాయ్‌యాత్ర వేళ బస్సులో రాహుల్ స్థానంలో కూర్చుని అభివాదం చేస్తున్న నకిలీ రాహుల్ ఆచూకీ తామ గుర్తించామని హిమంత చెప్పారు. ‘‘ అస్సాంలో మోదీ పర్యటన ముగిశాక పత్రికా సమావేశం ఏర్పాటుచేసి మరో రాహుల్ వివరాలు బహిర్గతం చేస్తా. జనానికి చేతులు ఊపుతూ, యాత్ర బస్సులో ఉన్నది రాహుల్ కాదు’’ అని హిమంత అన్నారు. -
ఇమ్రాన్‌కు పదేళ్ల జైలు
ఇస్లామాబాద్: ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో విజయం సాధించి, మళ్లీ అధికార పగ్గాలు చేపట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(71)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధికార పత్రాల లీకేజీ కేసులో ఆయనతో పాటు మాజీ విదేశాంగ మంత్రి మహ్మూద్ ఖురేషీకి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి అబ్దుల్ హస్నత్ మంగళవారం తీర్పు వెలువరించారు. రావల్పిండిలోని అడియాలా జైలులో కేసు విచారణ జరిగింది. అవినీతి ఆరోపణలపై ఇప్పటికే ఇమ్రాన్ మూడేళ్ల జైలు శిక్ష అనుభవించారు. ఒకవైపు, ఆయన పార్టీ ఎన్నికల గుర్తు క్రికెట్ బ్యాట్‌ను వాడరాదంటూ ఎన్నికల సంఘం నిషేధం విధించగా మరోవైపు ఇమ్రాన్, ఖురేషిలతోపాటు పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతల నామినేషన్ పత్రాలు సైతం తిరస్కరణకు గురయ్యాయి. గత ఏడాది ఆగస్ట్‌లో తోషఖానా అవినీతి కేసును విచారించిన కోర్టు ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ 2022 మార్చి 7వ తేదీన జరిగిన బహిరంగ సభలో ఒక లెటర్‌ను ప్రజలకు చూపుతూ..తన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు రాజకీయ విరోధులు ఓ విదేశంతో చేతులు కలిపారనేందుకు సాక్ష్యం ఇదేనని పేర్కొన్నారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అమెరికా ప్రభుత్వం తనపై కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అనంతరం ఆయన పదవీచ్యుతు డయ్యారు. పాక్ మాజీ రాయబారి అమెరికా ఉన్నతాధికారితో జరిపిన భేటీకి సంబంధించిన ఆ పత్రాన్ని ఇమ్రాన్ బహిరంగంగా చూపడాన్ని రహస్య పత్రాల లీకేజీ నేరంగా పేర్కొంటూ గత ఏడాది ఆగస్ట్‌లో ఇమ్రాన్‌తోపాటు అప్పటి విదేశాంగ మంత్రి ఖురేషిపై కేసు నమోదైంది. మరో 9 రోజుల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో ఇమ్రాన్, ఖురేషిలు జైలులోనే ఉన్నారు. తాజా తీర్పుతో వీరిద్దరూ అయిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోనున్నారు. -
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. ప్రభుత్వ రహస్యాలను లీక్ చేసిన కేసు(సైఫర్)లో న్యాయస్థానం ఈ మేరకు శిక్షను ఖరారు చేసింది. పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్, వైస్ ఛైర్మన్ షా మహమూద్ ఖురేషీలకు పాకిస్థాన్‌లోని ప్రత్యేక కోర్టు మంగళవారం ఈ తీర్పును వెలువరించింది. సైఫర్ కేసు.. సైఫర్ కేసు అనేది దౌత్య పరమైన సమాచారానికి సంబంధించినది. గత ఏడాది మార్చిలో వాషింగ్టన్‌లోని రాయబార కార్యాలయం పంపిన రహస్య దౌత్య కేబుల్ (సైఫర్)ను బహిర్గతం చేశారని ఇమ్రాన్ ఖాన్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. ఈ సైఫర్ కేసులో తనను ప్రధాని పదవి నుంచి తప్పించడానికి కుట్ర జరుగుతోందని అప్పట్లోనే ఖాన్ ఆరోపించారు. ఏప్రిల్ 2022లో అవిశ్వాస తీర్మానంలో ఓడి పాకిస్తాన్ ప్రధానమంత్రి పదవి నుండి ఇమ్రాన్ ఖాన్ వైదొలిగారు. తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ కోర్టు ఆయనకు మూడు ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆగస్టు 5, 2023న ఇమ్రాన్ జైలు పాలయ్యారు. పోలీసులు ఆయన్ని అటాక్ జైలులో ఉంచారు. అయితే.. ఇస్లామాబాద్ హైకోర్టు ఈ శిక్షను రద్దు చేసింది. కానీ ఇతర కేసులలో ఇమ్రాన్‌ను నిర్బంధంలో ఉంచారు. ఇదీ చదవండి: పాకిస్థాన్ నావికుల్ని కాపాడిన భారత నేవీ -
వేధింపుల కేసులో భారతీయ అమెరికన్ జంటకు 20 ఏళ్ల జైలు?
అమెరికాలోని వర్జీనియా ఫెడరల్ జ్యూరీ రెండు వారాల విచారణ అనంతరం ఒక భారతీయ అమెరికన్ జంటను దోషులుగా నిర్థారించింది. ఈ దంపతులు తమ బంధువును వేధించారని స్పష్టమైన నేపధ్యంలో జ్యూరీ వారిని దోషులుగా తేల్చిచెప్పింది. ఆ భారతీయ అమెరికన్ జంట తమ గ్యాస్ స్టేషన్, కన్వీనియన్స్ స్టోర్‌లో తమ బంధువును కార్మికునిగా నియమించుకునేందుకు బలవంతంగా ప్రయత్నించిందని ఫెడరల్ జ్యూరీ నిర్ధారించింది. ఈ కేసులో హర్మన్‌ప్రీత్ సింగ్(30), కుల్బీర్ కౌర్(43)లు దోషులుగా తేలడంతో వారికి 2024, మే 8న శిక్ష ఖరారు చేయనున్నారు. హర్మన్‌ప్రీత్ సింగ్, కుల్బీర్ కౌర్ దంపతులు తమ బంధువు చేత ఆహారాన్ని వండించడం, క్యాషియర్‌గా పని చేయించడం, స్టోర్ రికార్డులను శుభ్రపరచడం, నిర్వహించడం తదితర పనులు బలవంతంగా చేయించారు. ఇటువంటి కేసులలో గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష విధించేందుకు అవకాశం ఉంది. అలాగే 2,50,000 అమెరికన్ డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జస్టిస్ డిపార్ట్మెంట్, పౌర హక్కుల విభాగానికి చెందిన అసిస్టెంట్ అటార్నీ జనరల్ క్రిస్టెన్ క్లార్క్ మాట్లాడుతూ ఈ దంపతులు.. యునైటెడ్ స్టేట్స్లో పాఠశాలకు వెళ్లాలనే బాధితుని ఆశను అణగార్చారని, శారీరక, మానసిక వేధింపులకు గురి చేశారని అన్నారు. బాధితుని ఇమ్మిగ్రేషన్ పత్రాలను దాచేయడం, తీవ్రమైన హాని కలిగించే ఇతర బెదిరింపులకు గురిచేయడం, కనీస వేతనం కూడా చెల్లించకపోవడం, అధికంగా పనిచేయించడం లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని అసిస్టెంట్ అటార్నీ జనరల్ పేర్కొన్నారు. యూఎస్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియా అటార్నీ జెస్సికా డి'అబెర్ మాట్లాడుతూ ఈ కేసులో నిందితులు తప్పుడు హామీలతో బాధితుని ఇక్కడకు తీసుకువచ్చి, మానసిక, శారీరక వేధింపులకు గురిచేశారన్నారు. మానవ అక్రమ రవాణా అనేది సమాజంలో అత్యంత జుగుప్సాకరమైన నేరమని, అయితే ఈ కేసులో బాధితునికి న్యాయం జరిగేలా హామీ ఇచ్చినందుకు ప్రాసిక్యూటర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఫెడరల్ ప్రాసిక్యూటర్లు తమ వాదనలో.. 2018లో నిందితులు.. ఆ సమయంలో మైనర్‌గా ఉన్న బాధితుని స్కూల్లో చేర్పిస్తామంటూ తప్పుడు వాగ్దానాలతో యునైటెడ్ స్టేట్స్కు తీసుకువెళ్లారని పేర్కొన్నారు. బాధితుతుడు అమెరికా వచ్చాక అతని ఇమ్మిగ్రేషన్ పత్రాలను తీసుకొని, తమ పనులలో నియమించుకున్నారు. బాధితుని దుకాణం పర్యవేక్షణలో నియమించారు. కొద్దిపాటి ఆహారాన్ని మాత్రమే అందించారు. బాధితుడు కోరినప్పటికీ వైద్య సంరక్షణ, విద్యను అందించడానికి నిరాకరించారు. బాధితునిపై నిరంతర నిఘా ఉంచారు. భారతదేశానికి వెళ్లిపోతాననే బాధితుని అభ్యర్థనను సింగ్ దంపతులు తిరస్కరించారు. వీసా గడువు దాటినా బాధితుని పనులలో కొనసాగేలా నిర్బంధించారు. బాధితుడు తన ఇమ్మిగ్రేషన్ పత్రాలను తిరిగి అడిగినపుడు సింగ్.. బాధితుని జుట్టు పట్టుకుని లాగి, చెంపమీద కొట్టి, కాలితో తన్నాడు. బాధితుడు తనకు ఒక రోజు సెలవు కావాలని అడిగితే రివాల్వర్‌తో బెదిరించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. -
నీళ్లలాంటి ఆహారం.. టాయిలెట్ పక్కనే పడుకున్నా..: హీరోయిన్
బాలీవుడ్ నటుడు, ఎంఎంస్ ధోని హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. యంగ్ హీరో సూసైడ్ చేసుకోవడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అయితే సుశాంత్ ప్రియురాలు, నటి రియా చక్రవర్తిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నెల రోజుల పాటు జైలులో ఉన్న రియా ఆ తర్వాత బెయిల్‌పై రిలీజై బయటికొచ్చారు. తాజాగా ఓ షోకు హాజరైన రియా జైలులో ఉన్నప్పటి చేదు అనుభవాలను పంచుకున్నారు. రియా మాట్లాడుతూ.. 'నాకు జైలులో ఎక్కువగా రోటీ, క్యాప్సికం పెట్టేవాళ్లు. కేవలం అవీ పేరుకే గానీ మొత్తం నీళ్లలాగే ఉండేది. అయినప్పటికీ ఆకలిగా ఉండటంతో గతిలేక తినేసేదాణ్ని. నేను పడుకునే ప్లేస్ పక్కనే బాత్రూమ్ ఉండేది. ఇలాంటివి దుర్భర పరిస్థితులు జైలులో చవిచూశా. ఆ సమయంలో పడిన శారీరక బాధల కన్నా.. మానసిక క్షోభనే ఎక్కువ అనుభవించా. కానీ మిగిలిన వారితో పోలిస్తే నా పరిస్థితి కాస్తా ఫరవాలేదనిపించేది. కొందరు బెయిల్ వచ్చినా రూ.5 వేలు, రూ.10 వేలు కూడా కట్టలేక అక్కడే ఉండేవారు. నాకు బెయిల్ వచ్చినప్పుడు.. మీరు హీరోయిన్ కదా.. మీ సంతోషాన్ని డ్యాన్స్ చేసి చూపిచండని కొందరు అడిగారు. అందుకే ఆ సమయంలో నాగిని పాటకు డ్యాన్స్ చేశా' అని జైలులోని అనుభవాలను చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) -
జైలులో ఖైదీ బర్త్‌డే పార్టీ.. విచారణకు ఆదేశాలు!
పంజాబ్‌లోని లూథియానా సెంట్రల్ జైలులో కలకలం చెలరేగింది. ఖైదీలంతా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వీడియో ఆన్లైన్లో కనిపించడంతో, దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రెండు రోజుల క్రితం లూథియానాలోని సెంట్రల్ జైలులోని ఖైదీలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అయ్యింది. ఆ క్లిప్‌లో కొందరు ఖైదీలు ఒక చేతితో గ్లాసులు పట్టుకుని, మరో చేతితో పకోడీలు తింటూ కనిపిస్తున్నారు. ఆ ఖైదీలు ‘నేడు మణి భాయ్ పుట్టినరోజు’ అని పాడటం కూడా ఆ వీడియోలో వినిపిస్తోంది. జైలులోని ఖైదీలు అరుణ్ కుమార్ అలియాస్ మణి రాణా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారని తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో 2019లో జరిగిన దోపిడీ కేసులో మణి అండర్ ట్రయల్‌గా ఉన్నాడు. వీడియో రికార్డు చేసి, అప్లోడ్ చేయడానికి ఉపయోగించిన మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు. అయితే ఆ ఫోన్ పగిలిపోయిందని, పూర్తి డేటా వెలువడలేదని వారు పేర్కొన్నారు. ఈ ఉదంతంలో 10 మంది ఖైదీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. ఈ ఖైదీలపై జైలు చట్టంలోని సెక్షన్ 52ఏ (జైలు నిబంధనల ఉల్లంఘన) కింద కేసు నమోదు చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లూథియానా ఈస్ట్) గుర్దేవ్ సింగ్ తెలిపారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఇన్స్పెక్టర్ జనరల్ (జైలు) ఆర్కే అరోరా, పాటియాలా రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) సురీందర్ సింగ్ సైనీ ఈ ఘటనపై సమగ్ర విచారణ ప్రారంభించారు. ఇటువంటి ఉదంతాలతో పంజాబ్ జైళ్లు వార్తల్లోకి రావడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో జైళ్ల భద్రతను మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నదని పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఇటీవల వ్యాఖ్యానించారు. -
జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి: కేజ్రీవాల్
ఢిల్లీ: ప్రజా క్షేమమే లక్ష్యంగా.. పనే ధ్యేయంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలు చేసిందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆ కారణంగానే ఆప్‌కు ప్రజాధరణ లభించిందని చెప్పారు. ప్రజలకు మంచి చేయడానికి తాము ఎంచుకున్న మార్గం కోసం జైలుకు వెళ్లడానికైనా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణం ఆరోపణలపై ఐదుగురు ఆప్ నేతలు జైలులో ఉన్నందుకు గర్విస్తున్నట్లు చెప్పారు. జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పార్టీ నేతలను ఉద్దేశించి ఆప్ అధినేత ఈ మేరకు మాట్లాడారు. "పిల్లలకు మంచి చదువులు చెప్పాలని, పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని మాట్లాడితే జైలుకు పంపిస్తారా?. అందుకు ఎప్పుడైనా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. మేము పోరాటాన్ని ఎదుర్కొంటున్నాం. మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు జైలులో ఉన్న మా ఐదుగురు నాయకులు హీరోలే. వారందరినీ చూసి మేము చాలా గర్వపడుతున్నాం. ఏ ఇతర పార్టీలు దృష్టి సారించని విషయాలను పట్టించుకున్నందుకే ఆప్ రాజకీయాల్లోకి ఎదిగింది." అని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో జనవరి 3న హాజరుకావాలని ఈడీ సమన్లు పంపిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ ఈడీ రెండు సార్లు కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. కానీ ఆయన గౌర్హాజరయ్యారు. ఇదీ చదవండి: PM Narendra Modi Wishes: దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు! -
నేరాలకు దూరంగా... ఉపాధికి దగ్గరగా..!
ఆరిలోవ(విశాఖ తూర్పు): వివిధ కేసుల్లో శిక్ష పడి జైలులో ఉన్న ఖైదీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఖైదీలకు ఆరోగ్యశ్రీ సౌకర్యం కల్పించి కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తోంది. తాజాగా ఖైదీల ప్రవర్తనలో మార్పు తీసుకురావడంతోపాటు జైలు నుంచి విడుదలయ్యాక నేర ప్రవృత్తిని విడనాడి అందరిలాగే పనిచేసుకుని ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని కేంద్ర కారాగారాల్లో సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఇటీవల విశాఖ కేంద్ర కారాగారంలో సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో వివిధ విభాగాలకు చెందిన సోషల్ వర్కర్లను సభ్యులుగా నియమిస్తారు. దీనికోసం ఈ నెల 5న సోషల్ కౌన్సెలర్, ఎన్జీవోలు, సోషల్ వర్కర్లు, సైకాలజిస్ట్‌లు, వెల్ఫేర్ ఆఫీసర్లు, బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా స్కిల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులతో కేంద్ర కారాగారంలో సమావేశం నిర్వహించారు. వారిలో ఐదుగురిని ఉన్నతాధికారులు ఎంపిక చేస్తారు. సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా ఏం చేస్తారంటే... ► ఖైదీలకు సైకాలజిస్టులు కౌన్సిలింగ్ ఇచ్చి వారి ప్రవర్తనలో మంచి మార్పు తీసుకువస్తారు. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కృషి చేస్తారు. ► ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రతినిధులు వచ్చి ఖైదీలకు వివిధ చేతివృత్తుల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయినవారికి సర్టీఫికెట్ అందజేస్తారు. ► ఈ శిక్షణ వల్ల ఖైదీలు జైలు నుంచి విడుదలైన తర్వాత సమాజంలో పని చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ► ఏపీఎస్ఎస్డీసీ ఇచ్చిన సర్టిఫికెట్ ఉన్న ఖైదీలు ఆర్థికంగా ఎదిగేందుకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తారు. ► ఈ చర్యల వల్ల ఖైదీల్లో నేరప్రవృత్తి తగ్గుతుందని, ఆర్థికంగా ఎదిగి కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశం ఉంటుందని జైలు అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
‘నిర్భయ’కు 11 ఏళ్లు... మహిళల భద్రతకు భరోసా ఏది?
అది దేశరాజధాని ఢిల్లీ.. 2012, డిసెంబరు 16.. రాత్రివేళ ఓ ప్రైవేట్ బస్సులో చోటుచేసుకున్న దారుణ అత్యాచార ఘటన భారతదేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్నీ కుదిపేసింది. ఈ నేపధ్యంలో ఢిల్లీని అత్యాచారాల క్యాపిటల్‌గా అభివర్ణించారు. నాడు అత్యంత క్రూరంగా జరిగిన అత్యాచార ఘటన దేశంలోని ప్రతీఒక్కరినీ కంటతడి పెట్టించింది. డిసెంబరు నాటి వణికించే చలిలో పారామెడికల్ విద్యార్థిని నిర్భయ కామాంధుల చేతుల్లో చిగురుటాకులా వణికిపోయింది. ఈ నేపధ్యంలో బాధితురాలికి న్యాయం చేయాలంటూ దేశంలోని ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. ఈ దారుణ అత్యాచారం దరిమిలా దేశంలో మహిళల రక్షణ విషయంలో పెను మార్పులు వచ్చాయి. దేశవ్యాప్తంగా మహిళల భద్రత కోసం అనేక చర్యలు చేపట్టారు. నిర్భయ అత్యాచార ఘటన దర్యాప్తు అనంతరం జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సిఫార్సులు అమలయ్యాయి. దేశంలోని ప్రతీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అత్యాచార బాధితుల కోసం వన్ స్టాప్ సెంటర్లు, హెల్ప్లైన్లు ప్రారంభించారు. నిర్భయ ఫండ్ విడుదల చేశారు. నిర్భయ స్క్వాడ్, నిర్భయ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఎనిమిదేళ్ల పాటు నిర్భయ కేసు విచారణ కొనసాగగా దోషులైన ముఖేష్, పవన్, అక్షయ్, వినయ్‌లను 2020, మార్చి లో ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరితీశారు. ఒక మైనర్‌కు విముక్తి లభించగా, మరో నిందితుడు రామ్ సింగ్ విచారణ సమయంలో జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్భయ ఘటన, కేసు దర్యాప్తు, దోషులకు శిక్ష అమలు తర్వాత దేశంలో అత్యాచార ఘటనలు తగ్గుముఖం పట్టివుంటాయని అందరూ భావించివుంటారు. అయితే దీనికి భిన్నమైన పరిస్థితులు దేశంలో తాండవిస్తున్నాయి. ప్రముఖ జాతీయ ఏజెన్సీ ఎన్సీఆర్బీ.. నిర్భయ ఘటన అనంతరం గత 11 ఏళ్లలో దేశంలో చోటుచేసుకున్న అత్యాచార గణాంకాల వివరాలను విడుదల చేసింది. ఇవి మరింత ఆందోళన కలిగించేలా ఉన్నాయని పలువురు అంటున్నారు. సంవత్సరం అత్యాచారం కేసులు 2022 31,516 2021 31,677 2020 28,046 2019 32,032 2018 33,356 2017 32,559 2016 38,947 2015 34,651 2014 36,735 2013 33,707 2012 24,923 నిర్భయ లాంటి హృదయ విదారక అత్యాచార ఘటనల తర్వాత కూడా దేశంలో మహిళల భద్రత విషయంలో ఆశించినంత మార్పు రాలేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల విడుదల చేసిన 2022 సంవత్సరానికి సంబంధించిన నివేదిక ప్రకారం.. గత ఏడాది దేశంలో మొత్తం 31,516 అత్యాచార కేసులు నమోదయ్యాయి. అంటే ప్రతిరోజూ దాదాపు 87 మంది , ప్రతి గంటకు మూడు నుంచి నలుగులు బాలికలు లేదా మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. ఈ నివేదిక ప్రకారం అత్యాచార ఘటనల విషయంలో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంది. గత ఏడాదిలో అత్యధికంగా 5,399 అత్యాచార కేసులు ఇక్కడ నమోదయ్యాయి. ఢిల్లీలో 1212 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఇది కూడా చదవండి: కరడుగట్టిన నియంత ఏడ్చిన వేళ.. -
Kathleen Folbigg: కన్నబిడ్డల మృతి కేసులో ఆస్ట్రేలియా మహిళ.. 20 ఏళ్లకు విముక్తి
సిడ్నీ: కన్నబిడ్డల మృతి కేసులో 20 ఏళ్లపాటు కారాగారంలో మగ్గిన ఆf స్ట్రేలి యా మహిళకు ఎట్టకేలకు విముక్తి లభించింది.న్యూ సౌత్ వేల్స్ లోని క్రిమినల్ కోర్టు ఆదేశాలతో గురువారం ఆమె విడుదలయ్యారు. కాథ్లీన్ ఫాల్బిగ్కు జన్మించిన నలుగురు సంతానం 1989–1999 సంవత్సరాల మధ్య వివిధ కారణాలతో చనిపో యారు. అయితే, వారి మరణాలకు తల్లి కాథ్లీనే కారణమంటూ పోలీసులు 2003లో హత్య కేసు నమోదు చేసి, జైలు శిక్ష విధించారు. తాను అమాయకురాలినని, తన బిడ్డల మరణాలు సహజంగానే జరిగినవని ఆమె ఎంతగా చెప్పినా ఎవరూ వినలేదు. మీడియా ఆమెను వరస్ట్ ఫిమేల్ సీరియల్ కిల్లర్‌గా అభివర్ణించింది. 2019లో మరోసారి జరిగిన దర్యాప్తులోనూ ఆమెనే దోషిగా తేలింది. 2022లో మాజీ న్యాయాధికారి జరిపిన విచారణలో మాత్రం..చనిపోయిన నలుగురు బిడ్డల్లో ఇద్దరు జన్యు సంబంధ వ్యాధులతోనే చనిపోయి ఉండొచ్చంటూ తెలిపింది. దీంతో, ఈ ఏడాది జూన్‌లో ఆమెకు కోర్టు క్షమాభిక్ష ప్రకటించింది. ఆమెపై వచ్చిన ఆరోపణలను న్యూ సౌత్ వేల్స్ కోర్టు కొట్టివేస్తూ జైలు నుంచి విడుదల చేసింది. జైలు నుంచి విడుదలైన కాథ్లీన్ ఫాల్బిగ్ హర్షం వ్యక్తం చేశారు. 1999లోనే తనపై మోపిన ఆరోపణలకు జవాబులు దొరికినా, నిరపరాధినని నిరూపించుకోలేకపోయాను. పిల్లలు ఆకస్మికంగా, గుర్తు తెలియని కారణాలతో చనిపోయే అవకాశం ఉందని భావించని యంత్రాంగం నన్ను దోషిగా చూసింది’అని పేర్కొన్నారు. రెండు దశాబ్దాలపాటు తనను నిర్బంధించిన యంత్రాంగం నుంచి భారీగా పరిహారం కోరుతూ దావా వేస్తానన్నారు. ఫాల్బిగ్ను విడుదల చేయాలంటూ పలువురు వైద్య నిపుణులు, వైద్యులు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను సైతం చేపట్టారు.


