కాశీ విశ్వనాథునికి మధుర జైలు నుంచి గులాల్‌ | Sakshi
Sakshi News home page

Varanasi: కాశీ విశ్వనాథునికి మధుర జైలు నుంచి గులాల్‌

Published Thu, Mar 14 2024 7:08 AM

Gulal is Being Prepared for Baba Vishwanath in Mathura Jail - Sakshi

మహాశివుడు కొలువైన కాశీలో రంగ్‌భరి ఏకాదశి(మార్చి 20)రోజున హోలీ వేడుకలు జరగనున్నాయి. ఆ రోజున విశ్వనాథుడు, పార్వతిమాత భక్తుల నడుమ హోలీ ఆడనున్నారు. దీంతో కాశీ మొత్తం రంగులమయంగా మారనుంది. ఈసారి కాశీ విశ్వనాథుని హోలీ  వేడుకల కోసం మథురలో ప్రత్యేక గులాల్ సిద్ధం చేస్తున్నారు. 

మథుర జైలులోని ఖైదీలు కాశీలో కొలువైన పరమశివుని కోసం పండ్లు, పూలు, కూరగాయల రసాలతో హోలీ రంగులు తయారు చేస్తున్నారు. ఈ విధంగా తయారైన ఎరుపు, పసుపు గులాల్‌లను కాశీలో హోలీ వేడుకలకు వినియోగించనున్నట్లు సమాచారం. మథుర నుండి ఒక క్వింటాల్ హెర్బల్ గులాల్ కాశీకి రానున్నదని, ఈ గులాల్ తయారీలో సుగంధాన్ని కూడా ఉపయోగిస్తున్నారని  ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. 

అయోధ్య నుండి కూడా కాశీ విశ్వేశ్వరుని హోలీ వేడుకలకు హెర్బల్ గులాల్ రానుంది. అలాగే కాశీ వ్యాపారులు కూడా విశ్వేశ్వరునికి హెర్బల్ గులాల్ సమర్పించనున్నారు. హోలీ వేడుకల్లో మహాశివుడు, పార్వతిమాత ఆసీనులయ్యే సింహాసనం ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. హోలీ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement