ఎల్పీజీ గ్యాస్‌ కొరత..ఆ స్టవ్‌లకు పెరుగుతున్న డిమాండ్‌.. | LPG shortage spurs demand for Bengaluru Ashok Urs low fuel rocket stove | Sakshi
Sakshi News home page

ఎల్పీజీ గ్యాస్‌ కొరత..ఆ స్టవ్‌లకు పెరుగుతున్న డిమాండ్‌..

Mar 17 2026 10:23 AM | Updated on Mar 17 2026 3:10 PM

LPG shortage spurs demand for Bengaluru Ashok Urs low fuel rocket stove

యుద్ధం కారణంగా సిలిండర్ల దిగమతులకు అంతరాయం ఏర్పడటంతో దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ గ్యాస్‌ కొరత చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఆ నేపథ్యంలో పలువురు తమ సృజనాత్మకతకు పదును పెట్టి మరి సరసమైన ధరలో కొంగొత్త స్టవ్‌లను అందిస్తున్నారు. ఎల్‌పీజీకి పత్యామ్నాయంగా అందిస్తున్న ఈ స్టవ్‌లకు ఒక్కసారిగా మార్కెట్‌లో అనుహ్యమైన డిమాండ్‌ పెరిగింది కూడా. అందుకు నిదర్శనమే బెంగళూరు వాసి ఆశోక్‌ ఉర్స్‌ రాకెట్‌ ‍స్టవ్‌. 

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) మాజీ ఉద్యోగి అయిన 65 ఏళ్ల ఆశోక్‌ ఉర్స్‌ ఆరేళ్ల క్రితం గ్రామీణ ప్రజల కోసం ఇంధనాన్ని ఆదా చేసే స్టవ్‌ని రూపొందించారు. దానికి ఇప్పుడు అధిక మొత్తం ఆర్డర్లు..అలాంటి స్టవ్‌లు కావాలంటూ వాణిజ్య పరిశ్రమలో డిమాండ్‌ ఊపందుకుంది. కళ్లకు, ఊపరితిత్తులకు చికాకు కలిగించే వంటచెరుకుకి ప్రత్యామ్నాయంగా, అలాగే కలప తక్కువగా లభించే ప్రాంతాలకు వెసులుబాటుగా దీనిని రూపొందించారు. తక్కువ ఇంధనంతో వంటచేసుకునేలా రూపొందించిన స్టవ్‌ ఇది. 

సింపుల్‌గా చెప్పాలంటే కట్టెలపొయ్యి సంక్షిప్త నమునా, తక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తూనే అధిక ఉష్ణ సామర్థ్యం కోసం రూపొందించింది. ఇన్సులేషన్‌తో కప్పబడిన L-ఆకారపు దహన గది గాలి ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. కొబ్బరి చిప్పలు, పుల్లలు, కర్రలు, ఎండు ఆకులు లేదా వ్యవసాయ వ్యర్థాలు వంటి చిన్న జీవపదార్థపు ముక్కలు అధిక తీవ్రతతో కూడిన వేడితో మండుతాయి. 

సాంప్రదాయ కట్టెల పొయ్యిలతో పోలిస్తే..ఇది కట్టెల అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో జరిగే బహిరంగ కార్యక్రమాల్లో ఈ కట్టెల పొయ్యిల పై అవగాహన కల్పిస్తున్నారు ఉర్స్‌. ఈ పొయ్యి ధర వచ్చేసి కేవలం రూ. 3000/-.

(చదవండి: గ్యాస్‌ కొరతకు..వంటగది వ్యర్థాలతో చెక్‌!)

 

 

Advertisement
 
Advertisement
Advertisement