breaking news
Suryapet
-
రేవంత్ వ్యాఖ్యలు.. జగదీష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ది కంపు నోరు.. మురుగు కాల్వ కంటే అధ్వాన్నం అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బూతులు మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ..‘రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ, చంద్రబాబు అవసరం ఉండొచ్చు.. కానీ, తెలంగాణ ప్రజలకు లేదు. కేసీఆర్ స్ట్రీట్ ఫెలోస్ గురించి మాట్లాడలేదు. రేవంత్ రెడ్డిది కేసీఆర్ స్థాయి కాదు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి బండ రాయి కట్టి మూసీ నదిలో పడేస్తారు. కేసీఆర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బూతులు మాట్లాడి తప్పుదోవ పట్టిస్తున్నారు. రేవంత్ తోలు కాదు, ప్రభుత్వం తోలు వలుస్తాం.కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తే తమ బట్టలు ఇప్పుతాడనే భయంతోనే ఫ్రస్టేషన్లో రేవంత్ మాట్లాడుతున్నాడు. రేవంత్ భాషకి ప్రజాక్షేత్రంలో తప్పక శిక్ష పడుతుంది. ప్రజలే రాజకీయ సమాధి చేస్తారు. కేసీఆర్ ముందు రేవంత్ బచ్చా. ఇరిగేషన్ మంత్రి ఒక అజ్ఞానపు మంత్రి. ఉత్తమ్ కుమార్‌కు కనీస అవగాహన లేదు. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రజా సమస్యలపై ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత’ అని వ్యాఖ్యలు చేశారు. -
కేసులు సత్వరం పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : డిజిటల్ న్యాయ వ్యవస్థ ద్వారా త్వరితగతిన వినియోగదారుల కేసులు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కె.సీతారామారావు సూచించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ వినియోగదారుల దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వినియోగదారుడు మార్కెట్లో వస్తువు కొనుగోలు చేసే సమయంలో ఏది మంచో ఏది చెడో గ్రహించాలన్నారు. వ్యాపారులు తమ లాభార్జన కోసం తప్పుడు ప్రకటనలు, ఆఫర్లు ప్రకటిస్తారని, వాటిని చూసి అత్యాశకు పోయి మోసపోవద్దని సూచించారు. ప్రస్తుతం డిజిటల్, ఆన్లైన్ నేరాలు పెరిగిపోయాయని, వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వినియోగదారుడు మోసపోయినట్లయితే వినియోగదారుల ఫోరంను ఆశ్రయించి సత్వర న్యాయం పొందాలన్నారు. డీసీఐసీ కమిషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వినియోగదారులు నేరుగా కేసును దాఖలు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ జిల్లా అధికారి మోహన్‌బాబు, ఆర్టీఓ జయప్రకాశ్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వర్ శర్మ, సివిల్ సప్లయ్ మేనేజర్ రాము, డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, కమిషన్ సభ్యుడు ప్రేమ్‌సాగర్ తదితరులు పాల్గొన్నారు.ఫ అదనపు కలెక్టర్ సీతారామారావు -
బిల్లులిస్తారా సారూ!
భానుపురి (సూర్యాపేట) : పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. పాలకవర్గాలు కొలువు దీరాయి. గ్రామాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి ఆశలు చిగురించాయి. కానీ రెండేళ్ల పాటు ప్రత్యేక అధికారుల పాలనలో అప్పులు చేసి గ్రామాభివృద్ధిలో నిధులు ఖర్చు చేసిన పంచాయతీ కార్యదర్శులకు మాత్రం ఈ ఎన్నికలు ఆర్థిక భారాన్ని మిగిల్చాయి. పంచాయతీ ఎన్నికల్లో మౌలిక వసతుల కల్పనకు పంచాయతీ కార్యదర్శులు రూ.15నుంచి రూ.40వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. కానీ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు మాత్రం రూ.5నుంచి రూ.7వేల వరకే చెల్లించారు. మిగతా డబ్బంతా తాము జేబు నుంచి పెట్టుకోవాల్సివచ్చిందని కార్యదర్శులు వాపోతున్నారు. ఖర్చు చేసిన ప్రతి పైసాకు లెక్కలు ఉన్నాయని, ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేయకుండా బిల్లులు చెల్లించాలని వారు కోరుతున్నారు. మూడు విడతల్లో ఎన్నికలు.. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 486 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో మొదటి విడత 159 జీపీలు, రెండోవిడతలో 181, మూడోవిడతలో 146 జీపీల చొప్పున ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పన బాధ్యత ఆయా గ్రామపంచాయతీ కార్యదర్శులదే. పోలింగ్ కేంద్రాల్లో శానిటేషన్ నుంచి విద్యుత్, తాగునీరు, పోలింగ్ సిబ్బందితో పాటు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టెంట్లు, టేబుళ్లు.. ఇలా ప్రతిదీ పంచాయతీ కార్యదర్శులే చూసుకోవాల్సి ఉంటుంది. ఇవే కాకుండా పోలింగ్‌కు ముందురోజు రాత్రే పోలింగ్ కేంద్రాలకు వచ్చే పోలింగ్ సిబ్బందికితిరిగి వెళ్లే వరకూ టీ నుంచి టిఫిన్లు, భోజనాల బాధ్యతలూ వీరివే. ఓటర్ల ఆధారంగా సిబ్బంది.. గ్రామంలో ఉండే ఓటర్ల ఆధారంగా పోలింగ్ సిబ్బందిని ఎన్నికల సంఘం నియమిస్తోంది. పోలింగ్ స్టేషన్లో 200 మంది ఓటర్ల కన్నా తక్కువ ఉంటే ఇద్దరు, ఎక్కువ ఉంటే ముగ్గురు చొప్పున పీఓ, ఏపీఓలను నియమించారు. ఇలా చిన్న గ్రామపంచాయతీలో 6 వార్డులు ఉంటే పీఓలు, ఏపీఓలే కాకుండా వెబ్ కాస్టింగ్, స్టేజ్ –2 అధికారి, పోలీస్ సిబ్బంది ఇలా 25 మంది దాకా ఎన్నికల విధుల్లో ఉంటారు. అదే మేజర్ గ్రామపంచాయతీ అయితే ఒక్కో గ్రామంలో 12 వార్డులైతే 48 మంది, 14 వార్డులైతే 60 మంది ఉంటారు. ఎన్నికల నిర్వహణ లో భాగంగా పోలింగ్ కేంద్రాల్లోవసతులు కల్పించ డం, పోలింగ్ సిబ్బందికి భోజనాల, స్నాక్స్ ఖర్చుల కింద ఎన్నికల సంఘం, ఉన్నతాధికారులు పోలింగ్ కేంద్రానికి రూ.500 చొప్పున కేటాయించారు.జిల్లాలోని 486 గ్రామపంచాయతీల్లో ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్రధానంగా లైటింగ్ సమస్యలు లేకుండా చూసుకోవాల్సి ఉంది. అలాగే శానిటేషన్, టెంట్లు, మంచినీరు, టేబుళ్లు ఇలా ఇవే దాదాపు రూ.10వేల వరకు పంచాయతీ కార్యదర్శులు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక పోలింగ్ రోజుకు ముందు రాత్రి వచ్చే ఎన్నికల సిబ్బందికి రాత్రి భోజనం, ఉదయం ఆరుగంటలకే టీ, టిఫిన్, తిరిగి 11 గంటలకు టీ, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం 5గంటలకు బిస్కెట్స్, టీ అందించారు. ఈ భోజనాలు, టీ, టిఫిన్, స్నాక్స్ ఖర్చు భారీగా వచ్చినట్లు పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. చిన్న గ్రామపంచాయతీలకు రూ.10వేల దాకా, మేజర్ గ్రామపంచాయతీలకు రూ.20నుంచి రూ.30వేల వరకు వీటికే ఖర్చు చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం వార్డుకు రూ.500ల చొప్పున లెక్క కట్టి రూ.6నుంచి రూ.7వేల వరకు ఎంపీడీఓల చేతుల మీదుగా కార్యదర్శులకు అందించి చేతులు దులుపుకున్నారు. దీంతో పంచాయతీ కార్యదర్శులపై దాదాపు రూ.10 నుంచి రూ.20వేల వరకు అదనపు భారం పడినట్లయింది. ఫ పంచాయతీ ఎన్నికల్లో రూ.15వేల నుంచి రూ.40వేల వరకు ఖర్చు ఫ మౌలిక వసతుల కల్పన, భోజనాలు, టీ, స్నాక్స్‌కు వినియోగం ఫ చేతినుంచి పెట్టుకున్న పంచాయతీ కార్యదర్శులు ఫ ఒక్కో పంచాయతీకి కేవలం రూ.5వేలు చెల్లింపు ఫ ఇప్పటికే అప్పుల పాలయ్యాం.. మిగతావి చెల్లించాలని వేడుకోలు -
ఏరు.. తోడేస్తుండ్రు
మోతె: ఇసుక దందా ఆగడంలేదు. కొందరు అక్రమార్కులు కూడలి గ్రామంలోని ఏరును తోడేస్తున్నారు. ఇసుకను యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. కూడలి గ్రామ సమీపంలో.. కూడలి గ్రామం సమీపంలో ఏరు ఉంది. ఇందులో నీరు నిల్వ ఉన్నప్పటికీ కొందరు అక్రమార్కులు అందులోకి దిగి ఇసుకను తవ్వుతున్నారు. ఏరుకు చుట్టు పక్కల ఉన్న నర్సింహాపురం, రంగాపురంతండా, సర్వారం, రావికుంటతండా తదితర గ్రామాలకు చెందిన కొందరు ఇసుకదందాకు అలవాటు పడి ప్రకృతి సందపను దోచుకుంటున్నారు. మోతె మండలానికి సరిహద్దున ఉన్న జిల్లాలకు.. కొందరు ఈ ఇసుకను ఏరు ఒడ్డున కుప్పగా పోసి ఆ తర్వాత ట్రాక్టర్లలో నింపుతుండగా ఇంకొందరు డైరెక్ట్‌గా ట్రాక్టర్లలో నింపి తరలిస్తున్నారు. రోజూ 90 ట్రాక్టర్ల వరకు ఇసుకను తరలించి జేబులు నింపుకుంటున్నారు. మోతె మండలానికి సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, వరంగల్ పరిధిలోని గ్రామాలతో పాటు సూర్యాపేట పట్టణానికి ఇసుక తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ.7వేల వరకు విక్రయిస్తున్నారు. అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా రెవెన్యూ, పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చినప్పుడు మాత్ర హడావుడి చేసి నామమాత్రంగా రెండు, మూడు ట్రాక్టర్లు పట్టుకొని కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారు. ఆ తర్వాత పరిస్థితి షరామామూలే. అతివేగంతో ట్రాక్టర్లు కూడలి–సూర్యాపేట రోడ్డుపై ప్రయాణించాలంటేనే వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా రోడ్లపై ఇసుక ట్రాక్టర్లు తీవ్ర వేగంతో ప్రయాణించడంతో ఎదురుగా వచ్చే వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సి వస్తోంది. అధికారులు చొరవ చూపి ఇసుక అక్రమ రవాణాను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేయాలి కూడలి ఏరు నుంచి అక్రమంగా ఇసుక తరలించకుండా ప్రభుత్వం ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తద్వారా ఇసుకను ప్రభుత్వ నిబంధనల మేరకు సరఫరా చేయాలంటున్నారు.ఫ కూడలి గ్రామంలోని ఏరు నుంచి యథేచ్ఛగా ఇసుక రవాణా ఫ రోజూ 80 ట్రాక్టర్ల వరకు తరలింపు ఫ ఒక్కో ట్రాక్టర్ ఇసుక రూ.7వేలకు విక్రయం కూడలి గ్రామంలోని ఏరులో ఇసుక రీచ్‌ల ఏర్పాటుకు కృషి చేస్తాం. తద్వారా వినియోగదారులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక సరఫరా చేయడానికి సులువు అవుతుంది. ఇసుక రీచ్‌ల ఏర్పాటుకు గతంలో ప్రభుత్వం నుంచి గానీ మైనింగ్ శాఖ నుంచి గానీ ఎలాంటి ఉత్తర్వులు రాలేదు – ఎం. వెంకన్న, తహసీల్దార్, మోతె -
సమాజంలో నాణ్యమైన విద్య, వైద్యం అవసరం
కోదాడ: సమాజంలో నాణ్యమైన విద్య, వైద్యం అవసరమని పాలక ప్రభుత్వాలు ఈ రెండింటినీ ఉచితంగా అందించాలని పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కోరారు. బుధవారం కోదాడ పబ్లిక్‌క్లబ్ ఆవరణలో వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యలో అంతరాలకు పాలకుల విధానాలే కారణమన్నారు. కవులు, రచయితలు ఈ విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. ప్రైవేట్ విద్యాసంస్థలపై నియంత్రణ కొరవడిందన్నారు. సమాజాని నాణ్యమైన విద్య, వైద్యం అందించడానికి పౌరస్పందన వేదిక కృషి చేస్తోందన్నారు. దీనికి రచయితలు, కవులు తమ సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. పలువురు కవులు, రచయితలు కవితలను వినిపించారు. ఈ సమావేశంలో పౌరస్పందన వేదిక జిల్లా అధ్యక్షుడు ఆర్. ధనమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. ఏ. మంగ, రమణ, రామ్మూర్తి, అనిల్‌కుమార్, శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరావు, ఆంజనేయులు, పుప్పాల కృష్ణమూర్తి, వీరాచారి, ఖాజామియా, దండాల మధుసూధన్‌రెడ్డి, హమీద్ పాల్గొన్నారు. -
మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు
సూర్యాపేటటౌన్ : క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్శాంతి, సామరస్యాలకు ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో క్రీస్తు బోధనలు మానవాళికి ఆచరణీయమన్నారు. ఏసుప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలన్నారు. ఎల్లప్పుడూ ఆ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలకు ఉండాలని కోరారు. ప్రశాంతవతావరణంలో ఐక్యతతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఖైదీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలిచివ్వెంల(సూర్యాపేట) : ఖైదీల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ కోరారు. బుధవారం సూర్యాపేట సబ్ జైలును ఆమె తనిఖీ చేశారు. జైలు పరిసరాలు, మధ్యాహ్న భోజనం, ఖైదీల గదులను పరిశీలించారు. అనంతరం వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఖైదీలు డీఎల్ఎస్లో దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా న్యాయవాదులను ఏర్పాటు చేస్తామన్నారు. ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని బుధవారం అర్చకులు వేదమంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం చేపట్టారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం , రక్షాబంధనం, మదుఫర్కపూజ, మాంగళ్యధారణ,తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు.ఆలయ తిరుమాడ వీధుల్లో శ్రీస్వామి వారిని గరుడవాహనంపై ఊరేగించారు.అనంతరం మహానివేదనతో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీచేశారు. ఈ కార్య క్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు ,పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. జలవనరుల శాఖ సీఈకి ఈఎన్సీగా పదోన్నతిఖమ్మంఅర్బన్ : సూర్యాపేట జిల్లా జలవనరుల శాఖ సీఈగా, ఖమ్మం ఇన్చార్జి సీఈగా విధులు నిర్వర్తిస్తున్న వెంకటరమేష్బాబుకు పదోన్నతి లభించింది. ఆయనకు జల వనరుల శాఖలో ఈఎన్సీ(అడ్మిన్)గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆయన త్వరలోనే కొత్త బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. ఆయన పదోన్నతితో రెండు జిల్లాల సీఈ పోస్టులు ఖాళీ కాగా, త్వరలోనే మరో అధికారిని నియమించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మద్యం మత్తులో ఏఎన్ఎంపై సీహెచ్ఓ దాడిచివ్వెంల(సూర్యాపేట) : మద్యం మత్తులో ఏఎన్ఎంపై సీహెచ్ఓ దాడి చేశాడు. ఈ ఘటన చివ్వెంల మండలం జి.తిర్మలగిరి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. చివ్వెంల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్‌ఓగా విధులు నిర్వహిస్తున్న ఆవుల వెంకటేశ్వర్లు జి.తిర్మలగిరి గ్రామంలోని సబ్ సెంటర్లో పనిచేస్తున్న ఏఎన్ఎం పట్ల మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తించాడు. కొంతమంది స్థానికులు గమనించి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్టు వైరల్ కావడంతో మండల వైద్యాధికారి జి. భవాని జిల్లా వైద్యాధికారికి సమాచారం అందించారు. దీంతో సీహెచ్ఓ ఆవుల వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ జిల్లా వైద్యాధికారి పెండెం వెంకటరమణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
భువనగిరి : వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన యువకుడు అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన బీబీనగర్ మండల పరిధిలోని మాదారం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదారం గ్రామానికి చెందిన శ్రీరాం కుమార్ మూడో కుమారుడు రామకృష్ణ(22) బుధవారం ఉదయం తెల్లవారుజామున తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. అక్కడ గేదెలకు పాలు పితికి ఇంటికి వెళ్లి పాలు పెట్టిన తర్వాత మళ్లీ వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. బావి వద్ద పశువులను మేత కోసం వదిలి వాటి వెనుక నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతడు కిందపడి ఉండటాన్ని సోదరుడు గమనించాడు. వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తీసుకెళ్లారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ కృష్ణ తెలిపారు. -
పాఠశాల నుంచి విద్యార్థి అదృశ్యం
● టీచర్లు దండించే ప్రయత్నం చేయగా గేటు దూకి పారిపోయిన చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన విద్యార్థి ● మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఘటన చిట్యాల : హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన విద్యార్థి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకాపర్తి గ్రామానికి చెందిన మహేశ్వరం నిర్మలకు ఇద్దరు కుమారులున్నారు. ఆమె భర్త కొంతకాలం క్రితం మృతిచెందాడు. పిల్లలకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో నిర్మల తన పెద్ద కుమారుడు కార్తీక్‌ని గతేడాది మేడ్చల్‌లోని జాన్సన్ అకాడమీలో చేర్పించింది. కార్తీక్ స్కూల్ ఆవరణలోని హాస్టల్లో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 14న కార్తీక్ తరగతులకు హాజరుకాకపోవడంతో నిర్మలకు పాఠశాల ఉపాధ్యాయురాలు ఫోన్ చేసి చెప్పింది. నిర్మల అదే రోజు పాఠశాలకు వెళ్లగా.. కార్తీక్ కన్పించకుండా పోయాడని ఉపాధ్యాయులు చెప్పారు. దీంతో తన కుమారుడు ఎక్కడికి వెళ్లాడని నిర్మల ఉపాధ్యాయులను నిలదీయగా.. క్రమశిక్షణతో లేని కారణంగా కార్తీక్‌తో పాటు మరో ముగ్గురు విద్యార్థులకు దండించే ప్రయత్నం చేశామని, ఈ క్రమంలో కార్తీక్ పాఠశాల గేటు దూకి పారిపోయాడని వివరించారు. దీంతో నిర్మల మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే తన కుమారుడు కార్తీక్‌ను పాఠశాలలోని వంట గదిలో ఉపాధ్యాయులు దండించినట్లు పలువురు విద్యార్థులు తనకు చెప్పారని నిర్మల పేర్కొంది. పెన్షనర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలిఫ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి నాగార్జునసాగర్ : రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నాగార్జునసాగర్‌లో నూతనంగా నిర్మించిన రిటైర్డ్ ఉద్యోగుల భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. 30, 40 ఏళ్ల పాటు ప్రభుత్వానికి సేవలందించి తాము దాచుకున్న డబ్బులను అవసరాల మేరకు వెంటనే విడుదల చేయాలని కోరారు. పెన్షన్ అనేది ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన సేవకు పొందే లబ్ధి హక్కు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గానోతుల వెంకట్‌రెడ్డి, శ్రీశైలం, నారాయణరెడ్డి, పల్రెడ్డి నర్సింహారెడ్డి, గోవర్థన్‌రెడ్డి, సాంబశివరావు పాల్గొన్నారు. చిట్యాలలో పత్తి రైతుల ఆందోళన చిట్యాల : పత్తి కొనుగోళ్లు వేగవంతం చేయాలని చిట్యాల పట్టణ శివారులో సీసీఐ ఏర్పాటు చేసిన క్రిష్ణ కాటన్ మిల్లు వద్ద బుధవారం రైతులు ఆందోళనకు దిగారు. కాటన్ మిల్లు వద్ద సుమారు రెండు కిలోమీటర్ల మేర పత్తి లోడు ట్రాక్టర్లు ఉండడంతో చిట్యాల నుంచి మునుగోడు వెళ్లే వాహనాలతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఇదే సమయంలో పత్తి కొనుగోళ్లు ఆలస్యం అవుతుండడంతో రైతులు చిట్యాల–ఉరుమడ్ల రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో రైతులు సీసీఐ కేంద్రం అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఐదు క్వింటాళ్ల పత్తికి స్లాట్ బుక్ చేసుకుని అదనంగా పత్తిని రైతులు తీసుకురావడంతో కొనుగోళ్లలో ఆలస్యమై ట్రాక్టర్లు బారులదీరినట్లు తెలుస్తోంది. పోలీసులు కాటన్ మిల్లు వద్దకు చేరుకుని రైతుల ఆందోళనను విరమింపజేశారు. సీసీఐ కేంద్రం అధికారి కోటేశ్వరరావు, కాటన్ మిల్లు నిర్వాహకులు రైతులు తీసుకొచ్చిన పత్తిని కొనుగోలు చేస్తామని చెప్పడంతో శాంతించారు. సాంకేతిక సమస్యలతో అదనంగా స్లాట్ బుక్ అయినట్లు సీసీఐ కేంద్రం అధికారి పేర్కొన్నారు. లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణంకోదాడరూరల్ : బైక్‌పై వెళ్తూ రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్‌లో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలంలోని దోరకుంటకు చెందిన జక్కుల శివ(45) పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై కోదాడ బస్టాండ్ వద్దకు వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా. ఖమ్మం క్రాస్‌రోడ్ వద్ద మేళ్లచెర్వు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి తమ్ముడు కొండలు ఫిర్యాదు మేరకు సీఐ కె. శివశంకర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళా సౌరభం
మోత్కూరు : తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వినియోగంలో లేని ప్రభుత్వ, అటవీ, దేవాదాయ, బంజరు భూములతో లీజు ఒప్పందం చేసుకొని పరస్పర అంగీకారంతో మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామంలో దేవాదాయ భూములను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సేకరించారు. ఈ భూమిలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) డి. వీరారెడ్డి, ఆర్డీఓ ఎం. కృష్ణారెడ్డి, డీఆర్డీఓ కె. నాగిరెడ్డితో కలిసి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఈ నెల 19న శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోనే బుజిలాపురం సోలార్ పవర్ ప్లాంట్ మొదటిదని అధికారులు చెబుతున్నారు. బుజిలాపురంలోని 8 ఎకరాల దేవాదాయ భూమిలో రూ.6 కోట్లతో రెండు మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో వామన సోలార్ ఈపీసీ కంపెనీ ద్వారా ఈ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒక్కో ఎకరాకు రూ.15వేల చొప్పున డీఆర్డీఏ ద్వారా చెల్లించడానికి మహిళా సంఘాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ డబ్బులు దేవాదాయ శాఖ ఖాతాలో జమవుతాయి. జిల్లా మహిళా సమాఖ్య, మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల మండలాల మహిళా సమాఖ్యలు కలిసి రెండు మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక మెగావాట్‌కు రూ.3 కోట్ల చొప్పున 2 మెగావాట్లకు కలిపి రూ.6 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో 10 శాతం అనగా రూ.60 లక్షలు, మహిళా సంఘాల వాటా 1 మెగావాట్ యూనిట్‌కు రూ.కోటి ప్రభుత్వ రాయితీ లభిస్తుంది. 2 మెగావాట్ల యూనిట్లకు గాను రూ.2కోట్ల రాయితీ లభిస్తుంది. 2 మెగావాట్ల ద్వారా సంవత్సరానికి రూ.16.60 లక్షల విలువైన విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 1 యూనిట్ విద్యుత్‌కు రూ.3.13 చెల్లించి తెలంగాణ రెడ్కో కొనుగోలు చేస్తుంది. దీంతో ప్రతి సంవత్సరం రూ.52 లక్షల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంతో మహిళా సంఘాలు బ్యాంకు రుణం, వాయిదాలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. సోలార్ పవర్ ప్లాంట్ జీవిత కాలం 25 సంవత్సరాల వరకు ఉంటుంది. అన్ని ఏర్పాట్లు చేశాం బుజిలాపురంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. రెవెన్యూ అధికారుల సహకారంతో 8 ఎకరాల దేవాదాయ శాఖ భూమిని లీజుకు తీసుకున్నాం. జిల్లా మహిళా సమాఖ్య ద్వారా వాటా ధనం చెల్లించాం. అన్నిరకాల ఒప్పందాలను కంపెనీతో కుదుర్చుకున్నాం. సోలార్ పవర్ ప్లాంట్‌తో మహిళా సంఘాలకు పెద్దఎత్తున ఆదాయం చేకూరనుంది. – టి. నాగిరెడ్డి, డీఆర్డీఓ, యాదాద్రి భువనగిరి జిల్లా జీవనోపాధి పొందుతాం సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుతో జీవనోపాధి పొందుతాం. మహిళల ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని సక్రమంగా చెల్లిస్తున్నాం. దీంతో ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి అన్ని రంగాల్లో నిర్వహణ బాధ్యతలను అప్పజెప్పడం సంతోషంగా ఉంది. – మిడిదొడ్డి శైలజ, మోత్కూరు మహిళా సమాఖ్య అధ్యక్షురాలుఅదృష్టంగా భావిస్తున్నాం యాదాద్రి జిల్లా మహిళా సమాఖ్యకు సోలార్ పవర్ ప్లాంట్ మంజూరు కావడం అదృష్టంగా భావిస్తున్నాం. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా బుజిలాపురంలోనే సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో జిల్లా కలెక్టర్, డీఆర్డీఓ అధికారుల కృషి ఎంతో ఉంది. జిల్లా అధికారులకు మహిళా సంఘాల పట్ల చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. – కందుకూరి రేణుక, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, యాదాద్రి భువనగిరి ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం రాష్ట్రంలోనే రప్రథమంగా మోత్కూరు మండలం బుజిలాపురంలో శంకుస్థాపన -
యాదగిరిగుట్టకు బ్యాటరీ వెహికిల్ అందజేత
యాదగిరిగుట్ట : భువనగిరి మండలం అనాజీపురం గ్రామానికి చెందిన పన్నాల సుభాషిని, వెంకట్రాంరెడ్డి దంపతులతో పాటు కుటుంబ సభ్యులు పన్నాల జగన్మోహన్రెడ్డి జ్ఞాపకార్థం రూ.7.50లక్షలు విలువ చేసే బ్యాటరీ వాహనాన్ని యాదగిరిగుట్ట ఆలయ అధికారులు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా బ్యాటరీ వాహనానికి ఆలయాధికారులు, దాతలు సుభాషిని, వెంకట్రాంరెడ్డి, కుటుంబ సభ్యుల సమక్షంలో పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగుల కోసం ఈ బ్యాటరీ వాహనాన్ని వినియోగించాలని దాత ఆలయాధికారులను కోరారు. అనంతరం వారు యాదగిరీశుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వెండి ఆరాధన పాత్రలు బహూకరణ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధంగా కొనసాగుతున్న పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం సికింద్రాబాద్‌లోని వారాసిగూడకు చెందిన బూస కృష్ణ, కుటుంబ సభ్యులు వెండి ఆరాధన పాత్రలను బహూకరించారు. స్వామిని దర్శించుకున్న అనంతరం రూ.2.50లక్షలు (2 కిలోల 106 గ్రాములు) విలువ చేసే 5 పాత్రలతో పాటు ఒక ప్లేట్‌ను ఆలయ అర్చకులు, అధికారులకు అందజేశారు. అంతకుముందు బూస కృష్ణ, కుటుంబ సభ్యులకు అర్చకులు ఆశీర్వచనం చేశారు. పోలీస్ క్రికెట్ టోర్నీలో నల్లగొండ జట్టు విజయంరామగిరి(నల్లగొండ) : మండలంలోని అన్నెపర్తి బెటాలియన్‌లో బుధవారం నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ డీఎస్పీ పరిధిలో మూడు, ఏఆర్, డీపీఓ జట్లు మొత్తం ఐదు జట్లకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీల్లో నల్లగొండ జట్టు విన్నర్, ఏఆర్ జట్టు రన్నర్‌గా నిలిచాయి. అనంతరం విన్నర్ జట్టుకు ఏఎస్పీ జి.రమేష్ టోర్నీ కప్ అందజేశారు. -
హత్య కేసులో నిందితుడి రిమాండ్
నకిరేకల్ : నకిరేకల్ పట్టణంలో మూడు రోజుల క్రితం మేనమామను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. నకిరేకల్ పట్టణంలోని తిప్పర్తి రోడ్డులో కోడి గుడ్ల వ్యాపారం చేసుకుంటున్న యలగందుల వెంకన్న(50) తన కుమారుడు రాకేష్‌తో కలిసి స్థానికంగా మిల్క్ సెంటర్ నడుపుకుంటున్న తన మేనల్లుడు గట్టు శ్రీకాంత్ వద్దకు ఈ నెల 21న రాత్రి వెళ్లారు. వెంకన్న కూమారుడు రాకేష్ శ్రీకాంత్ వద్ద పాల వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీకాంత్ షాపులోనే అతడి స్నేహితుడైన చీమలగడ్డకు చెందిన పుట్ట కిరణ్ కూడా ఉన్నాడు. అందరూ కలిసి మద్యం సేవించారు. వెంకన్న తన కుమారుడు రాకేష్‌కు రావాల్సిన జీతం డబ్బుల గురించి శ్రీకాంత్‌ను ప్రశ్నించగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన శ్రీకాంత్ అసభ్య పదజాలంతో వెంకన్నను దూషిస్తూ డబ్బులు ఇవ్వనని బెదిరించాడు. దీంతో వెంకన్న తన మేనల్లుడు శ్రీకాంత్‌పై చేయి ఎత్తడానికి ప్రయత్నించగా.. రాకేష్ అడ్డుగా వచ్చి గొడవను ఆపేందుకు ప్రయత్నించాడు. మరింత ఆగ్రహానికి గురైన శ్రీకాంత్ పక్కనే ఉన్న పాల ట్రేతో రాకేష్‌పై దాడి చేయబోగా.. వెంకన్న అడ్డురావడంతో అతడి తలపై పాల ట్రేతో కొట్టి గాయపర్చాడు. అంతేకాకుండా సిమెంట్ ఇటుకతో వెంకన్న ముఖంపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆ తర్వాత వెంకన్న కుమారుడు రాకేష్, పుట్ట కిరణ్ గట్టిగా కేకలు వేయడంతో చుట్టపక్కల వారు వచ్చి వెంకన్నను అంబులెన్స్‌లో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంకన్న కుమారుడు రాకేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం గట్టు శ్రీకాంత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ శివరాంరెడ్డి వివరించారు. ఈ సమావేశంలో శాలిగౌరారం, నకిరేకల్ సీఐలు కొండల్‌రెడ్డి, వెంకటేశం, ఎస్ఐ వీరబాబు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
అర్చక ఉద్యోగ సంఘం ఉమ్మడి జిల్లా కమిటీ ఎన్నిక
కనగల్ : కనగల్ మండలం దర్వేశిపురంలో బుధవారం అర్చక ఉద్యోగ సంఘం ఉమ్మడి జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన అర్చక సంఘం అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలన్నారు. ఫ అర్చక సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా గాద ఉమామహేశ్వరశర్మ, ఉపాధ్యక్షులుగా శ్రీనివాసచార్యులు, మహంకాళి కిరణ్‌శర్మ, లహరి నరసింహాచార్యులు, బ్రాహ్మణపల్లి రవీందర్‌శర్మ, ప్రధాన కార్యదర్శిగా జీడికంటి అనంతాచార్యులు, సంయుక్త కార్యదర్శిగా కంభంపాటి రమణ, కోశాధికారిగా కారంపూడి మోహన్, సహాయ కార్యదర్శులుగా ఫణికుమారాచార్యులు, వలివేలు, విద్యాధరశర్మ, హరీష్‌శర్మ, ముడుంబై దామోదరచార్యులు, అత్తాంశ గోపాలచార్యులతో పాటు ఐదుగురిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఫ ఉద్యోగ సంఘం ఉమ్మడి జిల్లా గౌరవాధ్యక్షుడిగా జినుకుంట్ల చంద్రయ్య, గౌరవ సలహాదారులుగా రాజ్యలక్ష్మి, అధ్యక్షుడిగా అలుగుబెల్లి సత్తిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మహేందర్‌రెడ్డి, కోశాధికారిగా కె. ఉపేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎన్. అంజనేయులు, కొండారెడ్డి, డి. శ్రీనివాస్, సమన్వయ సభ్యులుగా ఎన్. రమణ, గోవిందరెడ్డి, వీరయ్య, ప్రచార కార్యదర్శిగా ఎస్బీవీ యోగానందంతో పాటు 12 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, అర్చక సంఘం జేఏసీ అధ్యక్షుడు పరాశరం రవీంద్రాచార్యులు, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు కృష్ణమాచారి, జేఏసీ కన్వీనర్ డీవీకే శర్మ, ఉద్యోగుల వెల్ఫేర్ కమిటీ సభ్యుడు శ్రవణ్‌కుమారాచార్యులు, జక్కాపురం నారాయణస్వామి, దిండిగల్ ఆనంద్‌శర్మ, అర్చక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పెన్నా మోహన్‌శర్మ, బండారు శ్రీనివాస్, అనిల్‌కుమార్, ట్రిపుల జై శర్మ తదితరులు పాల్గొన్నారు. -
టెట్ వాయిదా వేయాలి
సూర్యాపేట టౌన్ : ప్రభుత్వం జనవరి 3వ తేదీ నుంచి నిర్వహించతలపెట్టిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)ను తాత్కాలికంగా వాయిదా వేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పబ్బతి వెంకటేశ్వర్లు, వేణు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పూర్తిగా నిమగ్నమయ్యారని, కొందరు ఉపాధ్యాయులు మూడు దశల ఎన్నికల విధులను కూడా నిర్వర్తించారని తెలిపారు. ఈ ఎన్నికల విధుల కారణంగా టెట్‌కు సన్నద్ధమయ్యే సమయం దక్కలేదని వారు పేర్కొన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని టెట్‌ను కొన్ని రోజుల పాటు వాయిదా వేసి ఉపాధ్యాయులు ప్రిపేర్ అయ్యేందుకు కొంత గడువు ఇవ్వాలని విన్నవించారు. విద్యారంగాన్ని రక్షించుకుందాంతుంగతుర్తి : ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులందరిపై ఉందని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం తుంగతుర్తిలోని షేక్ సయ్యద్ ప్రాంగణం (బండారు ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో)లో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నన్నెబోయిన సోమయ్య అధ్యక్షతన జరిగిన ఆ సంఘం జిల్లా కమిటీ విస్త్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆ సంఘం ప్రతినిధులు భీమిరెడ్డి సోమిరెడ్డి, జోగునూరి దేవరాజు, ఓరుగంటి అంతయ్య, సీహెచ్.రాములు, సిరికొండ అనిల్‌కుమార్, పి.వెంకటేశం, ఎడ్ల సైదులు, పి.శ్రీనివాస్‌రెడ్డి, కె.అరుణ భారతి, జి.వెంకటయ్య, జె.కమల, ఇతర సంఘాల నాయకులు వై.వెంకటేశ్వర్లు, కేఏ.మంగ, ఆర్.ధనమూర్తి, బుర్ర శ్రీనివాస్, టి.యాదగిరి, ఆర్.దామోదర్, ఎన్.నాగేశ్వరరావు, ఎస్.సోమయ్య, వి.రమేష్, బి.ఆడమ్, సీహెచ్.రమేష్ పాల్గొన్నారు. సూర్యక్షేత్రంలో ప్రత్యేక పూజలుఅర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయా సమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహా సౌరహోమాన్ని నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, యాదగిరి, అర్చకులు భీంపాండే, అంకిత్‌పాండే, శ్రీరాంపాండే, భక్తులు పాల్గొన్నారు. నృసింహుడికి నిత్యారాధనలుయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రబాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, సహస్రనామార్చనతో కొలిచారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. -
ద్వేషపూరిత నేరాలకు వ్యతిరేకంగా చట్టం తేవాలి
● జమియత్ ఉలేమాయే హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ఎహసానుద్దీన్ ఖాస్మీరామగిరి(నల్లగొండ) : కర్ణాటక తరహాలో తెలంగాణలో కూడా ద్వేషపూరిత నేరాలకు వ్యతిరేకంగా చట్టం చేయాలని జమియత్ ఉలేమాయే హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ఎహసానుద్దీన్ ఖాస్మీ డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జమియత్ ఉలేమాయే హింద్ కోరిన విధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన హామీని నెరవేర్చాలన్నారు. భారతదేశంలో ముస్లింలపై వివక్ష, మైనారిటీలను ప్రజల నుంచి వేరుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశంలో ఈ బిల్లును వెంటనే ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరారు. ఈ సమావేశంలో జమియత్ ఉలేమాయే హింద్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఏ. హఫీజ్‌ఖాన్, జనరల్ సెక్రటరీ మౌలానా అక్బర్ ఖాన్, మౌలానా యాసిర్, అబ్దుల్ రెహమాన్, జియాఉద్దీన్, హఫీజ్ ఫుర్ఖాన్, సమీ, హఫీజ్ శంషుద్దీన్, హఫీజ్ అయూబ్ పాల్గొన్నారు. -
సరికొత్తగా సాగు.. దిగుబడులు బాగు
నడిగూడెం : గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో సాగు నీటి లభ్యత ఎక్కువగా పెరగడంతో ఎక్కువ శాతం రైతులు వరి సాగుపై దృష్టి సారించారు. అయితే కూలీల కొరత రైతులను వేధిస్తోంది. దీంతో నారుమడి అవసరం లేకుండా పంట కాలాన్ని తగ్గించడానికి వెదజల్లే పద్ధతిలో, డ్రమ్‌సీడర్ పద్ధతిలో వరి సాగుపై రైతులు దృష్టి సారిస్తున్నారు. నారు పోయడం, నీరు పెట్టడం, నాట్లు వేయించడం.. ఇవన్నీ పాత తరం వరి సాగు పద్ధతులు. రైతులు ఆధునిక వ్యవసాయం వైపు ఆసక్తి చూపుతున్నారు. రోజురోజుకు సాగుపై చేసే ఖర్చు పెరగడం, మరో వైపు కూలీల కొరతను అధిగమించేందుకు రైతులు డ్రమ్‌సీడర్ పద్ధతిని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పద్ధతి ద్వారా రైతులకు తక్కువ ఖర్చు అవుతుంది. ప్రస్తుత యాసంగి సీజన్లో నడిగూడెం మండల వ్యాప్తంగా దాదాపు 18,500 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఇందులో దాదాపు 20 శాతం డ్రమ్‌సీడర్, 70 శాతం వెదజల్లే పద్ధతిలోనే పంట సాగు చేపట్టారు. డ్రమ్‌సీడర్‌ను రూ.4వేల నుంచి రూ.5వేల వరకు వెచ్చించి రైతులు కొనుగోలు చేస్తున్నారు. డ్రమ్‌సీడర్‌తో విత్తనాలు వెదజల్లడంతో నిర్ధిష్టమైన అంతరంలో సాళ్లు వస్తాయి. డ్రమ్‌సీడర్ విధానంతో 20 రోజుల ముందే పంట చేతికి వస్తుంది. 3 నుంచి 4 బస్తాల దిగుబడి అదనంగా వస్తుంది. డ్రమ్ సీడర్, వెదజల్లే పద్ధతులపై రైతుల్లో పెరుగుతున్న అవగాహన -
ఏఐలో నార్కట్‌పల్లి వాసికి అంతర్జాతీయ గుర్తింపు
నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి మండలం మాధవ యడవెల్లి గ్రామానికి చెందిన కందగట్ల యాదవరెడ్డి, రజిత దంపతుల కుమారుడు జయచందర్‌రెడ్డి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. జయచందర్‌రెడ్డి ప్రస్తుతం అమెరికాలోని ఓ ప్రముఖ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఏఐ రంగలో చేస్తున్న కృషికి గాను 4 ప్రతిష్టాత్మక మార్కమ్ గోల్డ్ అవార్డులు, డావీ సిల్వర్ అవార్డులు పొందారు. గ్రామీణ ప్రజలు ఇంగ్లిష్ వైద్య నివేదికలు అర్థం చేసుకోవడంలో పడుతున్న ఇబ్బందులను గమనించిన ఆయన హెల్త్ నీమ్ అనే ఏఐ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు. ఈ ప్లాట్‌ఫామ్ సంక్షిప్త వైద్య సమాచారాన్ని తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లోకి అనువదించి సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా వివరిస్తుంది. అంతేకాకుండా గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్, నాసా వ్యోమగాములు సభ్యులుగా ఉన్న ప్రతిష్టాత్మకమైన ఐఈఈఈహెచ్‌కెఎన్ హారన్ సొసైటీలో జయచందర్‌రెడ్డికి సభ్యత్వం లభించడం విశేషం. తనకు వచ్చిన అవార్డులు, గుర్తింపును తన తల్లిదండ్రులు, సొంతూరికి అంకితమిస్తున్నట్లు జయచందర్‌రెడ్డి తెలిపారు. -
4,146 కేసులు పరిష్కారం
ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారదచివ్వెంల (సూర్యాపేట) : పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికే జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. ఆదివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి కోర్టుల్లో ఏర్పాటు చేసిన లోక్‌అదాలత్‌లలో మొత్తం 4,146 కేసులు పరిష్కంచామన్నారు. ఇందులో ఒక్క సూర్యాపేటలోనే కోర్టులో 2,226 కేసులు ఉన్నాయన్నారు. ఒక్కసారి లోక్ అదాలత్‌లో పరిష్కారమైన కేసుల్లో అప్పీల్‌కు అవకాశం ఉండదన్నారు. ఈ సందర్భంగా కొద్దికాలంగా వేరుగా ఉంటున్న భార్యభర్తలు కోర్టు ద్వారా కలిశారు. వీరిచే కోర్టు ప్రాంగణంలో మొక్కను నాటించారు. సీనియర్ న్యాయవాది ఈశ్వర్ కుమార్ సహకారంతో లయన్స్ క్లబ్ సూర్యాపేట ఆధ్వర్యంలో 500 మంది కక్షిదారులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎన్.అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత, సెకండ్ క్లాస్ మేజిస్ట్రీట్ బి.వెంకటరమణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, డీఎస్పీ ప్రసన్నకుమార్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బాల్య వివాహాలను అడ్డుకోవాలి
భువనగిరిటౌన్ : బాల్య వివాహాలను అడ్డుకునేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. జయ రాజు అన్నారు. ఆదివారం జిల్లా కోర్టు ఆవరణలో వంద రోజుల బాల్య వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేయడం వల్ల కలిగే అనర్ధాల గురించి వివరించి అందుకు చట్టపరంగా తీసుకునే చర్యల గురించి చెప్పారు. బాల్య వివాహాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి. ముక్తిదా, పోఫోక్సో కోర్టు స్పెషల్ జడ్జి మిలింద్ కాంబ్లీ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవీలత, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి ఉషశ్రీ,, అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్యాంసుందర్, ప్రధాన జూని యర్ సివిల్ జడ్జి జి. స్వాతి, డిప్యూటీ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ వెంకటేశం, అసిస్టెంట్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ రాజశేఖర్, నాగరాజు సాయి శ్రీనివాస్, సరిత తదితరులు పాల్గొన్నారు. -
సల్లోనిగూడెం, వంకమామిడిలో విషాదఛాయలు
భూదాన్‌పోచంపల్లి : మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా శామీర్‌పేట సమీపంలో ఔటర్ రింగ్‌రోడ్డుపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భూదాన్‌పోచంపల్లి మండలం సల్లోనిగూడెం, వంకమామిడి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. దీంతో ఆ రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలు.. సల్లోనిగూడేనికి చెందిన సామ లింగారెడ్డి బోరు బండిపై అదే గ్రామానికి చెందిన అంతటి శ్రీనివాస్‌గౌడ్(50), వంకమామిడి గ్రామానికి చెందిన మచ్చ సురేశ్(36) డ్రైవర్ కమ్ డ్రిల్లర్‌గా పనిచేస్తున్నారు. శనివారం బోరు బండిపై కామారెడ్డి నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. శామీర్‌పేట సమీపంలో ఔటర్ రింగ్‌రోడ్డు పైన కొద్ది దూరం రాగానే బోరు బండి కింద శబ్దం వస్తుండగా బండిని రోడ్డు పక్కన ఆపారు. కిందికి దిగి టార్చిలైట్ వేసుకొని చెక్ చేస్తుండగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బోరు బండిని ఢీకొట్టడంతో మచ్చ సురేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. అంతటి శ్రీనివాస్‌గౌడ్ రెండు కాళ్లు విరిగిపోగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు వారిద్దరి మృతదేహాలను మేడ్చల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు అంతటి శ్రీనివాస్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అతడి కుమార్తె అమెరికాలో ఉండటంతో ఆమె వచ్చిన తర్వాత మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. వంకమామిడి గ్రామానికి చెందిన మృతుడు మచ్చ సురేశ్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం రాత్రి సురేశ్ మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. బోరు బండి యజమాని సామ లింగారెడ్డి మృతుల కుటుంబాలకు రూ.18లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు పెద్దమనుషుల సమక్షంలో అంగీకారం తెలిపాడు. ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయా గ్రామాలకు చెందిన ఇద్దరు మృతి -
పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను సవరించాలి
సూర్యాపేటటౌన్ : పదో తరగతి వార్షిక పరీక్షల మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యామ రమేశ్, జూలకంటి వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంఘం సమావేశంలో వారు మాట్లాడారు. పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన పరీక్షల టైం టేబుల్ ప్రకారం ప్రతి రెండు సబ్జెక్టుల పరీక్షల మధ్య నాలుగు నుంచి ఆరు రోజుల వ్యవధి ఉందన్నారు. దాంతో పరీక్షలు పూర్తి కావడానికి నెల రోజుల సమయం పడుతుందని, విద్యార్థులపై ఒత్తిడి పెరిగి ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రతి రెండు పరీక్షల మధ్య వ్యవధిని రెండు రోజులకు తగ్గించాలని కోరారు. -
ప్రొటోకాల్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రొటోకాల్ దర్శనాలలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఈఓ వెంకట్రావ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రొటోకాల్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. దాతలకు, ఆర్మీ అధికారులకు కల్పిస్తున్న ప్రొటోకాల్ దర్శన సదుపాయాలు, దర్శనం సమయంలో అనుసరిస్తున్న మార్గదర్శకాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దర్శనాల్లో సాధారణ భక్తులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి అసౌకర్యం కలగకూడదని ఆదేశించారు. ప్రొటోకాల్ విభాగం సిబ్బంది పూర్తిస్థాయి బాధ్యతతో, పారదర్శకంగా విధులు నిర్వహించాలని, అన్ని దర్శనాలు నిబంధనల ప్రకారం ఉండాలని, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా క్రమశిక్షణతో పని చేయాలన్నారు. అనంతరం వైదిక కమిటీ, వివిధ విభాగాల అధికారుల సమీక్షలో మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని గిరి ప్రదక్షిణ ప్రారంభమయ్యే వైకుంఠద్వారం స్థలం వద్ద నృసింహస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దేవస్థానానికి సంబంధించిన అద్దెలు, లీజులు తదితర ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. దేవస్థానం ప్రాంగణంలో ఎలక్ట్రికల్ వాహన చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ ఈఓ దోర్బాల భాస్కర్‌శర్మ, ప్రధానార్చకులు కాండూరి వెంకటచార్యులు, సురేంద్రచార్యులు, అధికారులు దయాకర్‌రెడ్డి, జి. రఘు, రాజన్‌బాబు, ఆర్ఐ శేషగిరిరావు తదితరులున్నారు. యాదగిరిగుట్ట ఆలయ ఈఓ వెంకట్రావ్ -
చిన్నారుల్లో దృష్టిలోపం నివారించేలా..
సూర్యాపేట టౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఉన్న దృష్టిలోపం నివారణకు కంటి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి ప్రభుత్వం పాఠశాలల్లోని చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బాల్య దశ నుంచే పిల్లల్లో వచ్చే అంధత్వ నివారణకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ గత ఏడాది రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) సమన్వయంలో రెండు విడతలుగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో కొంత మందికి దృష్టి లోపం ఉన్నట్లు వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. వీరికోసం మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మూడో విడతగా.. ప్రస్తుతం మూడో విడతగా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ ఆధ్వర్యంలో జిల్లా వైద్యారోగ్యశాఖ సమన్వయంతో మరోసారి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వచ్చే ఫిబ్రవరి 10వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందుకోసం జిల్లాలో నాలుగు ప్రత్యేక వైద్య బృందాలను నియమించారు. ప్రతి బృందం రోజుకు సుమారు 500 నుంచి 1000 మంది వరకు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించనుంది. పరీక్షలు ఎవరికంటే.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలతోపాటు సాంఘిక సంక్షేమ గురుకులాలకు చెందిన 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వీరికి ప్రాథమికంగా పరీక్షలు నిర్వహించిన అనంతరం దృష్టి లోపుం ఉన్నట్లు గుర్తించేందుకు జిల్లాలో ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఆయా కేంద్రాల్లో దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించిన వారికి ఉచితంగా కళ్లజోళ్లు ఇవ్వనున్నారు. తద్వారా ఆయా పాఠశాల్లో మొత్తం 50వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. విద్యార్థుల్లో దృష్టి లోపం గుర్తించేందుకు నేటి నుంచి జిల్లాలో కంటి పరీక్షలు నిర్వహిస్తాం. ఇందుకు ప్రత్యేకంగా నాలుగు వైద్య బృందాలను నియమించాం. రోజూ పాఠశాలలకు వెళ్లి కంటి పరీక్షలు నిర్వహిస్తాయి. అవసరమైన విద్యార్థులకు కళ్లజోళ్లు అందిస్తాం. – డాక్టర్ వెంకటరమణ, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఫ రోజూ 500 నుంచి వెయ్యి మంది విద్యార్థులకు.. ఫ పరీక్షల నిర్వహణకు నాలుగు వైద్యబృందాలు ఫ 50 వేల మందికి ప్రయోజనం -
గ్రామాల అభివృద్ధికి కృషిచేయాలి
కోదాడ: కొత్త సర్పంచ్‌లు శక్తివంచన లేకుండా గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తేనే చిరస్థాయియిగా పేరు నిలిచిపోతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కోదాడ నియోజవకర్గ పరిధిలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్ల సన్మానం కార్యక్రమం ఆదివారం కోదాడలోని డేగబాబు పంక్షన్హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతితిగా హాజరైన మాట్లాడుతూ కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల అభివృద్ధికి తాను, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి శక్తిమేర కృషి చేస్తున్నామన్నారు. ఇదేస్ఫూర్తితో కొత్త సర్పంచ్‌లు కూడా పనిచేసి మంచిపేరు తెచ్చుకోవాలని కోరారు. ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలని.. ఎన్నికల అనంతరం అందరిని కలుపుకొని పోతూ అభివృద్ధే ఎజెండాగా పనిచేయాలని సూచించారు. కోదాడ ఎమ్మల్యే పద్మావతి మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఘన విజయం సాధించడం అభినందనీయమని, వచ్చే పరిషత్ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలను సాధిద్దామని పిలుపునిచ్చారు. అనంతరం నూతన సర్పంచ్, ఉప సర్పంచ్‌లను మంత్రి, ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవేటి రామారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, ఏర్నేని బాబు, కందుల కోటేశ్వరరావు, బుర్రా సుధారాణి, చింతలపాటి శ్రీనివాస్, వరప్రసాదరెడ్డి, డేగ కొండయ్య, ముస్కు శ్రీనివాసరెడ్డి, జైపాల్‌రెడ్డి, వెంపటి వెంకటేశ్వరరావు, మాతంగి బసవయ్య, ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు. ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
56 ఏళ్ల అ‘పూర్వ’ సమ్మేళనం
హుజూర్నగర్ : హుజూర్నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1969లో ఎస్ఎస్సీ మొదటి బ్యాచ్ చదివిన విద్యార్థులు 56 ఏళ్ల తర్వాత ఆదివారం పాఠశాలలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయుడైన అర్వపల్లి రంగారావును ఘనంగా సన్మానించారు. అనంతరం ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముడుంబ జగన్నాథచార్యులు, వర్ర వెంకట్‌రెడ్డి, మూసం సత్యనారాయణ, కోట హరిప్రసాద్, కె. నాగేశ్వరరావు, వీర్లపల్లి రామారావు, ఓరుగంటి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
పెన్షనర్లపై నిర్లక్ష్య వైఖరి సరికాదు
మిర్యాలగూడ అర్బన్: పెన్షనర్లపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోషియేషన్ నల్లగొండ జిల్లా తృతీయ మహాసభలో వారు పాల్గొని మాట్లాడారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. రాజ్యాగం ప్రకారం పాలకులు నడుచుకోవడం లేదని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ నైతిక విలువలు పాటించడం లేదని, దీంతో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. విద్యారంగాన్ని సంస్కరించి ప్రభుత్వ విద్యారంగాన్ని, ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాలని కోరారు. ఉచిత పథకాల వలన ప్రయోజనం లేదని వాటి స్థానంలో ఉత్పాదక శక్తిని పెంచే పథకాలను ప్రవేశపెట్టి నిరుద్యోగ సమస్యను తీర్చాలని కోరారు. పెన్షనర్లకు 5 డీఏలు పెండింగ్‌లో పెట్టి ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తుందని, రెండో పీఆర్సీని ప్రకటించడంలో నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. ప్రతిఒక్కరు సామాజిక బాధ్యతగా ప్రభుత్వాలపై పోరాడి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పోతుల నారాయణరెడ్డి, పాలకుర్తి కృష్ణమూర్తి, సీనియర్ నాయకులు పాదూరి విద్యాసాగర్‌రెడ్డి, వి. బంగారయ్య, నూకల జగదీష్‌చంద్ర, అనుముల మధుసూదన్‌రెడ్డి, ఎం. జనార్దన్‌రెడ్డి, కడారి ప్రేమ్‌చంద్, వెంకటేశం, రాఫెల్, శ్యాంసుందర్, వాడపల్లి రమేష్, కృష్ణారెడ్డి, సత్తిరెడ్డి, ప్రకాశరావు, రామావతారం, శంకర్‌రెడ్డి, శ్రీనిసరెడ్డి, అంజిరెడ్డి, పులి కృష్ణమూర్తి, రమణారెడ్డి, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారులను ఉదయం ఎండలో ఉంచాలి
● చలికాలంలో పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం, శాస కోశ సంబంధిత సమస్యలు, జ్వరం, శరీరంపై దద్దుర్లు వస్తాయి. దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి, తుమ్ములు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి లక్షణాలు ఉన్న చిన్నారుల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడి నిమోనియా బారిన పడే ప్రమాదం ఉంది. ● చిన్న పిల్లలకు స్వెటర్లు వేసి చెవులకు మంకీ క్యాపు పెట్టాలి. కాళ్లకు చేతులకు సాక్సులు, గ్లౌజ్‌లు వేయాలి. ● పాలు తాగే నెలల వయసు గల చిన్నారులను తల్లి పొత్తిళ్లలో పడుకోబెట్టాలి. ● ఉదయం ఎండలో ఉంచాలి. ● చిన్నారులతో ఉదయం సమయంలో ప్రయాణం చేయొద్దు. ● రాత్రి వేళల్లో ఇంటి కిటికీలు, తలుపులు మూసి ఉంచి.. వెచ్చదనం కోసం వేడినిచ్చే హైవోల్టేజీ బల్బులు వేయాలి. ● కాచి చల్లార్చిన నీటిని తాగించాలి. వేడి ఆహారం తినిపించాలి. కూల్ డ్రింక్స్, చల్లని పానీయం తాగించొద్దు. – డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, పిల్లల వైద్యుడు, నల్లగొండ -
10 నుంచి 13వరకు టీసీసీ పరీక్షలు
సూర్యాపేటటౌన్ : టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు(టీటీసీ)కు సంబంధించి లోయర్, హయ్యర్ డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ పరీక్షలు జనవరి 10 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ శనివారం ఒకప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి 12.30గంటల వరకు, మధ్యాహ్న 2 నుంచి 4.30గంటల వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. టైలరింగ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు వారి వెంట కుట్టు మిషన్ తీసుకొని రావాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్స్‌ను సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. 23న గడ్డిపల్లి కేవీకేలో కిసాన్ మేళాగరిడేపల్లి: గరిడేపల్లి మండలం గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఈ నెల 23న కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు కేవీకే సీనియర్ సైంటిస్ట్, హెడ్ డి. నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, హైదరాబాద్‌లోని అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ జోన్ –10 డైరెక్టర్ షేక్ ఎన్. మీరా, శాస్త్రవేత్తలు హాజరుకానున్నట్లు వివరించారు. వివిధ కంపెనీల ఉత్పత్తులు, నూతన యాంత్రీకరణ పరికరాలు, క్షేత్రాల ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇందులో రైతులు, రైతు సంఘాలు, యువకులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మట్టపల్లి హుండీల ఆదాయం రూ.16.35లక్షలుమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హుండీలను నల్లగొండ ఏసీ కార్యాలయ సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి పర్యవేక్షణలో శనివారం లెక్కించారు. రూ.16,35,064 ఆదాయం వచ్చింది. వివరాలను ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూ రు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి స్థానికంగా విలేకరులకు వెల్లడించారు. 2025 సెప్టెంబర్ 9 నుంచి 19 డిసెంబర్ వరకు 101 రోజులకు సంబంధించి హుండీలను లెక్కించినట్లు తెలిపారు. ప్రధాన హుండీల ద్వారా రూ.15,25,604, అన్నదాన హుండీ ద్వారా రూ.1,09,460 ఇలా మొత్తం రూ.16,35,064లు ఆదాయం సమకూరినట్లు చెప్పారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ రామిశెట్టి విజయశాంతి అప్పారావు, అర్చకులు, ఆలయ సిబ్బంది, శ్రీసాయిసేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఎన్జీ కళాశాల పరీక్ష ఫలితాలు విడుదలరామగిరి(నల్లగొండ) : నల్లగొండ ఎన్జీ కళాశాల పరీక్ష ఫలితాలను ఎంజీ యూనివర్సిటీ సీఓఈ జి.ఉపేందర్‌రెడ్డి, ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.ఉపేందర్‌తో కలిసి శనివారం విడుదల చేశారు. 2025 నవంబర్‌లో డిగ్రీ మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాల్లో మూడవ సెమిస్టర్ 31శాతం, ఐదవ సెమిస్టర్ 60 శాతం ఉత్తీర్ణత సాధించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పి.రవికుమార్, అంతటి శ్రీనివాసులు, సీఓఈ డి.మునిస్వామి, అకడమిక్ కోఆర్డినేటర్ బి.నాగరాజు, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, జే.నాగరాజు, అడిషనల్ కంట్రోలర్ ఎస్.వాసుదేవ్, ఎన్.వేణు తదితరులు పాల్గొన్నారు. -
డ్రైవింగ్.. అలర్ట్
●రాత్రి/తెల్లవారుజామున ప్రయాణాలు చేయవద్దు ● ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. ● హై–బీమ్ వాడకండి, లో–బీమ్ లైట్లు మాత్రమే ఉపయోగించాలి. ● రిఫ్లెక్టివ్ జాకెట్లు, స్టిక్కర్లు వాడుకోవాలి. ● సడెన్ బ్రేకులు వేయవద్దు. ● టర్నింగ్ అయ్యే ముందు ఇండికేటర్ ఇవ్వాలి. ● గ్లౌజెస్ తప్పనిసరిగా ధరించాలి. చేతులు చల్లబడితే వాహన నియంత్రణ తగ్గుతుంది. ● ఫాగ్ ల్యాంప్స్ లేదా లో–బీమ్ లైట్లు వాడాలి. ● వేగం తగ్గించి నెమ్మదిగా, జాగ్రత్తగా నడపాలి. ● ముందున్న వాహనానికి సాధారణ దూరం కంటే 3–4 రెట్లు ఎక్కువ దూరం ఉంచాలి. ● డిఫాగర్ ఉపయోగించాలి. విండోలను కొద్దిగా ఓపెన్ చేసి ఫాగింగ్ నివారించాలి. ● కర్వ్ ప్రాంతాల్లో ఓవర్టేక్ చేయవద్దు. ● లైన్ మార్కింగ్‌లు, రోడ్ రిఫ్లెక్టర్లను గమనిస్తూ నడపాలి. ● వైపర్స్, లైట్లు, బ్రేకులు సరిగా పనిచేస్తున్నాయో లేదో ముందుగానే చెక్ చేసుకోవాలి. – నరసింహ, ఎస్పీ, సూర్యాపేట -
– సాక్షి నెట్వర్క్
తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, చల్లని గాలులతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. సాయంత్రం నుంచి తెల్లవారుజామువరకు వణుకు పుట్టిస్తోంది. మంచు కురుస్తుండడంతో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటలు దాటినా చలి తీవ్రత తగ్గడం లేదు. చలి నుంచి ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో ఊపిరితిత్తులు, గుండె సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. చల్లదనంతో ఆస్తమా కూడా పెరుగుతుంది. వైరస్ వ్యాప్తి వేగంగా జరిగి నిమోనియా కేసులు నమోదవుతాయి. రద్దీగా ఉండే విహార యాత్రలకు వెళ్లవద్దు. రోగులు సక్రమంగా మందులు వేసుకోవాలి. ఏమైనా సమస్యలు వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ రాఘవేందర్‌రెడ్డి, పల్మనాలజిస్ట్, నల్లగొండ చలి కాలంలో ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. ఫైబర్, రాగి జావ, సూప్‌లు ఎక్కువగా తీసుకోవాలి. నారింజ, బత్తాయి పండ్లతో పాటు ఆకు కూరలు తినాలి. చిరు ధాన్యాలతో తయారు చేసిన ఆహారం ఉత్తమం. విటమిన్–డి అందేలా సూర్యరశ్మిలో నిల్చోవాలి. జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లకపోవడమే మంచిది. ఐస్‌క్రీమ్‌లకు దూరంగా ఉండాలి. మధుమేహం ఉన్నవారు తక్కువ మోతాదులో ప్రొటీన్ తీసుకోవడం మంచిది. విటమిన్–సి, జింక్ ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. – ఎం. శ్రీనివాసరావు, డైటీషియన్, ప్రభుత్వ ఆసుపత్రి, నల్లగొండవృద్ధులు మరింత జాగ్రత్త -
క్రమశిక్షణ రాహిత్యం సహించేది లేదు
హుజూర్నగర్ : ‘పంచాయతీ ఎన్నికల్లో గ్రామ, మండల స్థాయి నాయకుల అనైక్యత వల్ల కొంత ఇబ్బంది పడ్డాం.. నాయకుల్లో క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించేది లేదు’ అని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (కాంగ్రెస్ బలపరిచిన) గెలిచిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమాన్ని శనివారం హుజూర్‌నగర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వారికి అభినందనలు తెలియజేస్తూ ఓడిన వారికి తన అండదండలు ఉంటాయన్నారు.గ్రామపంచాయతీల్లో అత్యధిక శాతం గెలిచామని ఓడిన చోట నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని సూచించారు. కొన్ని గ్రామాల్లో అభివృద్ధి చేసినా ఓడి పోయామని ఈ విషయాన్ని గమనించాలన్నారు. చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పనులు చేపట్టడం సంతోషకరంగా ఉందన్నారు. బీడు భూములకు నీరందించేందకు పలు చోట్ల లిఫ్టులు, పేదలకు ఉన్నత విద్య అందించేందుకు జూనియర్, డిగ్రీ కాలేజీ బిల్డింగ్లు, ఐటీఐ, ఏటీసీ (అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్), యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఆధునికి వైద్య సదుపాయాలు కల్పించినట్లు వివరించారు. అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు సర్పంచ్‌లు కలిసిరావాలిహుజూర్ నగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు నూతన సర్పంచ్‌లు అందరూ కలిసి రావాలని ఉత్తమ్ కోరారు. సర్పంచ్‌లు శాంతిభద్రతలు కాపాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని హితవుపలికారు. తొలి విడతగా కొత్త సర్పంచ్‌లకు గ్రామానికి 25 నుంచి 30 ఇళ్లను మంజూరు చేస్తున్నామని హామీ ఇచ్చారు. వాటిని అర్హులైనవారికి ఇవ్వాలని కోరారు. మరి కొన్నింటిని మార్చి, ఏప్రిల్‌లో మంజూరు చేస్తామన్నారు. తన జీవితంలో మరువలేని సంఘటన ఏదంటే రాష్ట్రంలోని పేదలకు సన్నబియ్యం పంపిణీని సీఎం చేతుమీదుగా హుజూర్ నగర్ నుంచి ప్రారంభించుకోవడం అని మంత్రి పేర్కొన్నారు. ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
యువత చెడువ్యసనాలకు దూరంగా ఉండాలి
చివ్వెంల(సూర్యాపేట) : యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూర్యాపేట జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి ఎస్. రాధాకృష్ణ చౌహాన్ సూచించారు. శనివారం సూర్యాపేట పట్టణంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ, హోలి క్రాస్ ఫౌండేషన్–జనబంధు పౌండేషన్ ఆధ్వర్యంలో డ్రగ్ డీ– అడిక్షన్‌పై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. పిల్లలు చెడుఅలవాట్లతో తల్లి దండ్రుల కష్టాన్ని వృథా చేయవద్దని హితవుపలికారు. మంచి స్నేహితులను, మంచి అలవాట్లను అలవర్చుకోవడం వల్ల జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవచ్చన్నారు. డ్రగ్స్, మద్యపానంతో యువత జీవితాలు చెడిపోవద్దన్నారు. సోషల్ మీడియా, సినిమాలు వంటి వాటితో యువత ఆకర్షితులు కావడం బాధాకరమన్నారు. మాదక ద్రవ్యాల జోలికి పోమంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి పర్హీన్ కౌసర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, నామినేటెడ్ సభ్యులు గుంటూరు మధు, అల్లంనేని వెంకటేశ్వర్రావు, ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జి.సత్యనారాయణ పాల్గొన్నారు.ఫ జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి రాధాకృష్ణ చౌహాన్ -
యూరియా.. ఇక సులువయా
తిరుమలగిరి (తుంగతుర్తి): గత సీజన్లో రైతులు యూరియా కోసం నానా పాట్లు పడ్డారు. ఒక్క యూరియా బస్తా దొరికితే చాలు అన్నట్లుగా పరిస్థితి ఉండేది. ఇక నుంచి రైతులకు ఇలాంటి బాధలు లేకుండా రాష్ట్ర వ్యవసాయ శాఖ ఫర్టిలైజర్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఎక్కడి నుంచైనా యూరియాను బుక్ చేసుకోవచ్చు. కొత్త విధానం ఈనెల 22 నుంచి అమల్లోకి రానుంది. దీనిపై రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఎలా నమోదు చేసుకోవాలంటే.. యాప్‌ను ఓపెన్ చేసి పట్టాదారు పాస్ పుస్తకం నంబర్, భూమి లేని కౌలు రైతులైతే ఆధార్ నంబర్ సహాయంతో లాగిన్ కావాలి. అందులో నమోదు చేసే సెల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాని సహాయంతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం పంటల వివరాలు నమోదు చేయాలి. సాగు భూమిని బట్టి ఎన్ని బస్తాల యూరియా రైతుకు ఇవ్వాలో యాప్ చూపిస్తుంది. ఆన్డ్రాయిల్ ఫోన్లు వాడే వారి సంఖ్య తక్కువ రైతుల్లో ఆన్‌డ్రాయిడ్ సెల్ ఫోన్ వాడే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. వీరికి యూరియా ఎలా సరఫరా చేయాలన్నది ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది. ఎక్కడి వారు అక్కడే.. సాగు భూమి ఉన్న జిల్లా నుంచే బుక్ చేసుకోవాలి. ఒకసారి తీసుకున్నాక మళ్లీ 15 రోజుల వరకు అవకాశం ఉండదు. సమీపంలో ఉండే డీలర్ల పేర్లు కనిపిస్తాయి. అందులో ఒకరిని ఎంపిక చేసుకుంటే 48 గంటల్లోపు బస్తాలు తీసుకోవచ్చు. ఈ సమయం దాటితే మాత్రం రైతు పేరు తొలగి పోతుంది. మరోసారి బుక్ చేసుకోవాల్సిందే. కౌలు రైతులు బుక్ చేసుకుంటే సదరు భూమి యజమాని సెల్ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. 0–1 ఎకరం వరకు ఒకసారి 1–5 ఎకరాల వరకు 2 సార్లు 5–20 ఎకరాలు 3 సార్లు 20 ఎకరాల పైన 4 సార్లు వినియోగం ఇలా.. వరి ఎకరాకు 3 బస్తాలు మొక్కజొన్న ఎకరానికి 4 బస్తాలు మిగతా వాటికి ఎకరాకు 2 బస్తాలు ఫ ఆన్లైన్లో బుకింగ్ ఫ అందుబాటులోకి ఫర్టిలైజర్ యాప్ ఫ 22 నుంచి నూతన విధానం అమలు ఫ అవగాహన కల్పిస్తున్న వ్యవసాయశాఖ -
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళిక
భానుపురి (సూర్యాపేట) : రోడ్డు ప్రమాదాల నివారణకు వచ్చే సంవత్సరానికి సంబంధించి అన్ని శాఖలను సమన్వయము చేసుకుంటూ ప్రత్యక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ, జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు –2026కు సంబంధించి హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రవాణా శాఖ కమిషనర్ వికాస్ రాజ్ లతో కలిసి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రవాణా శాఖ, ఎడ్యుకేషన్, వెల్ఫేర్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రికి తెలిపారు. జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్లను గుర్తించామన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జిల్లాలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 26శాతం మరణాలు, 9శాతం రోడ్డు ప్రమాదాలను తగ్గించగలిగామని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ కె.నరసింహ, అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, ఆర్టీఓ జయప్రకాశ్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఈ ఈ సీతారామయ్య, పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాసరావు, ఇండస్ట్రియల్ జీఎం సీతారాం, వెల్ఫేర్ అధికారులు శంకర్, నరసింహారావు, దయానందరాణి, డీఈఓ అశోక్ తదితరులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
జాగ్రత్తలు పాటిద్దాం..
చలిలో బీపీ పెరిగి రక్తనాళాలు ముడుచుకుపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఆస్తమా రోగులు శ్వాస సక్రమంగా తీసుకోలేరు. ఒకవేళ అలాంటి ఇబ్బంది ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. ● చలికి చర్మం పొడిబారి చర్మ వ్యాధులు వస్తాయి. ● ఉదయం, రాత్రి వేళల్లో చర్మం పొడిబారకుండా కోల్డ్ క్రీములు లేదా కొబ్బరి నూనె రాయాలి. ● ఎప్పటికప్పుడు వేడి ఆహారం తీసుకోవాలి. ● ఉదయం పూట పది నిమిషాలైనా ఎండలో ఉండాలి. ● ఉదయం 7 గంటల తర్వాతే వ్యాయామం చేయాలి. ● చలికి మఫ్లర్, ఉన్ని దుస్తులు ధరించి బయటకు రావాలి. – డాక్టర్ వూర రామ్మూర్తి, జనరల్ ఫిజీషియన్ , సూర్యాపేట -
లెక్కలు చెప్పాల్సిందే
నాగారం : గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు తాము చేసిన ఖర్చులను అధికారులకు సమర్పించాల్సి ఉంది. అందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆన్లైన్ విధానం అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు బుక్‌లెట్‌లో పొందిపర్చిన ఎంపీడీఓలకు సమర్పించిన వివరాలను, అధికారులు టీఈ–పోల్ వెబ్ పోర్టల్‌లో అప్లోడ్ చేయనున్నారు. ఈ నివేదికలను 2026 ఫిబ్రవరి 15లోగా పంపాలని స్టేట్ ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశాలు జారీ చేసింది. దీని వల్ల పారదర్శకత పెరుగుతుందని పేర్కొంది. గెలిచినా.. ఓడినా లెక్కలు ఇవ్వాలి ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమకు గుర్తులు కేటాయించిన నాటి నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు అయిన ఖర్చుల వివరాలు ఎంపీడీఓలకు సమర్పించాలి. గెలిచినా, ఓడినా ఖచ్చితంగా లెక్కలు చెప్పాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ఆమేరకు ఎంపీఓలు ఇప్పటికే అభ్యర్థులకు సూచనలు చేస్తున్నారు. జనాభా ఆధారంగా ఖర్చులు 2011 జనాభా లెక్కల ప్రకారం 5వేలు, అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థికి రూ.2.50 లక్షలు, వార్డు సభ్యుడికి రూ.50 వేలు ఖర్చు చేయాలి. 5వేల కన్నా తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థికి రూ.1.50 లక్షలు, వార్డు సభ్యుడు రూ.30 వేల వరకు ఖర్చు చేయవచ్చు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన నాటి నుంచి 45 రోజుల లోపు సర్పంచ్, వార్డు మెంబర్‌కు పోటీ చేసిన అభ్యర్థులు ఎంపీడీఓకు లెక్కలు చెప్పాలి. ఆలా చెప్పని వారికి మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంటుంది. గెలిచిన వారు పదవి కోల్పోయే అవకాశం ఉంటుంది. బాధ్యతలు గుర్తెరగాలి సర్పంచ్‌లు తమ బాధ్యతలను గుర్తెరిగి ఆ ప్రకారం పని చేయాల్సి ఉంటుంది. నెలకోసారి పంచాయతీ పాలకవర్గ సమావేశం, రెండు నెలల కోసారి గ్రామసభ నిర్వహించాలి. పంచాయతీ వార్షిక ఆడిట్లు, లెక్కలు పూర్తి చేయకపోయినా, అవినీతికి పాల్పడినా పదవి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ మేరకు కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లకు అవగాహన కల్పించేందుకు అధికారులు సమాయత్త మవుతున్నారు. మొదట వారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం సర్పంచులు, వార్డు సభ్యులకు అవగాహన కల్పించనున్నారు. ఫ అభ్యర్థుల ఎన్నికల వ్యయం నమోదుకు ‘టీఈ–పోల్’ ఫ నూతన విధానం తెచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఫ గడువులోపు పంపాలని అభ్యర్థులకు ఆదేశాలు -
ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్ర
సూర్యాపేట అర్బన్ : ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని, అందులో భాగంగానే కొత్త బిల్లు తీసుకొచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని ఎంవీఎన్ భవన్లో జరిగిన పార్టీ జిల్లా, మండల కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలకు చెందిన 30 కోట్లమందికి పైగా పేదలకు ఉపాధిని కల్పిస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తుందని ఆరోపించారు. ఇప్పుడున్న చట్టంలో 90 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండగా, దానిని 60 శాతానికి తగ్గించి 40 శాతం నిధులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని బిల్లులో పేర్కొన్నారని అన్నారు. దాంతో నిధుల కొరత ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని ఎత్తివేసే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, ములకలపల్లి రాములు, నాగారపు పాండు, శేఖర్‌రావు, మట్టిపెల్లి సైదులు పాల్గొన్నారు.ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి -
కళలకు పుట్టినిల్లు పేట
సూర్యాపేట టౌన్ : సూర్యాపేట కళలకు పుట్టినిల్లు అని, జిల్లాకు చెందిన ఎందరో కళాకారులు ఉన్నత స్థాయికి ఎదిగి వారి ప్రతిభతో పేటకు వన్నె తెచ్చారని డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్ అన్నారు. పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 103వ జయంతి సందర్భంగా జ్ఞాన సరస్వతి కళావేదిక ఆధ్వర్యంలో జిల్లా బాలభవన్ ఆవరణలో శుక్రవారం రాష్ట్ర స్థాయి పాటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటసాల చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ రామ్మూర్తి యాదవ్ మాట్లాడుతూ జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లను పాటలు వినడం వల్ల కొంత వరకు తగ్గించుకోవచ్చన్నారు. సంగీతంతో కొన్ని రకాల మానసిక రోగాలు నయమవుతాయనే మాటలో వాస్తవం ఉందన్నారు. కార్యక్రమంలో సుమారు 50 మంది కళాకారులు పాల్గొని పాటలు పాడారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. బూర వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భూపతి రాములు, జైలర్ సుధాకర్‌రెడ్డి, చిన్న శ్రీరాములు, డాక్టర్ రంగారెడ్డి, హమీద్‌ఖాన్, నన్నెపంగు సైదులు, బాల భవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ పాల్గొన్నారు. -
త్వరలో సహకార ఎన్నికలు!
డీసీసీబీ, పీఏసీఎస్ పాలకవర్గాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీసీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాలకు త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏడాదిన్నర కిందటే వాటి పాలకవర్గాల గడువు ముగిసిపోయింది. అయితే ప్రభుత్వం ఆరు నెలలకోసారి ఆయా పాలకవర్గాల గడువును పొడిగిస్తూ వస్తోంది. ప్రస్తుత పాలవర్గాల గడువును ఈసారి గడువును పొడగించకుండా ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా ఆయా పాలకవర్గాలను రద్దు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. డీసీసీబీల పర్సన్ ఇన్చార్జిలుగా కలెక్టర్లు, సొసైటీలకు సహకార ఆఫీసర్లను నియమించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. సొసైటీ ఎన్నికలు నిర్వహించేంత వరకు వీరి ఆధ్వర్యంలో డీసీసీబీ, సహకార సంఘాలు పని చేస్తాయి. గతేడాది కాంగ్రెస్ చేతికి వచ్చిన డీసీసీబీ జిల్లాలో 2020 ఫిబ్రవరిలో డీసీసీబీ, సొసైటీలకు ఎన్నికలు జరిగాయి. గతేడాది ఫిబ్రవరిలోనే పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. బీఆర్ఎస్ పాలనలో డీసీసీబీ చైర్మన్‌గా గొంగిడి మహేందర్‌రెడ్డి వ్యవహరించారు. అయితే ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. డీసీసీబీలోని కొందరు డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు చూపారు. దీంతో చైర్మన్‌గా ఉన్న మహేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. మునుగోడు పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్లతో పాటు బీఆర్ఎస్కు చెందిన డైరెక్టర్లు కూడా మద్దతు పలికారు. 20 మంది డైరెక్టర్ల సహకారంతో కుంభం శ్రీనివాస్‌రెడ్డి డీసీసీబీ చైర్మన్‌గా గతేడాది జూలై 1వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఏడాదిన్నర పాటు చైర్మన్‌గా వ్యవహరించారు. బాధ్యతలు స్వీకరించిన తరువాత రెండోసారి ఆగస్టు 14వ తేదీన గడువు పొడిగించింది. రాష్ట్రంలోనే రెండో స్థానంలో మన డీసీసీబీ నల్లగొండ డీసీసీబీ దాదాపు రూ.3 వేల కోట్ల టర్నోవర్‌తో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. పంట రుణాలు, కొత్త బ్రాంచీలు ఏర్పాటు, బ్రాంచీల్లో అధునాతన సౌకర్యాలు, డీసీసీబీ ఆధునీకరణ, విదేశీ రుణాలు, గోల్డ్ లోన్స్ ఇవ్వడంలో అగ్రస్థానం సాధించింది. రుణాల రికవరీలోనూ ముందంజలో ఉంది.ఫ పీఏసీఎస్‌లకు పర్సన్ ఇన్చార్జిలుగా సీఈఓలు ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠికి నల్లగొండ డీసీసీబీ బాధ్యతలు జిల్లాల వారీగా పీఏసీఎస్‌లు ఇలా.. సూర్యాపేట 47 నల్లగొండ 42యాదాద్రి 21 మొత్తం 110 -
నేడు హుజూర్‌నగర్‌కు మంత్రి ఉత్తమ్ రాక
హుజూర్నగర్ : రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి శనివారం హుజూర్‌నగర్‌కు రానున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో ఎన్నికై న నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సర్పంచ్‌లు, వార్డు సభ్యలను పట్టణంలోని కౌండిన్య ఫంక్షన్హాల్లో మంత్రి ఉత్తమ్ పఆర్ఓ వెంకటరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్య క్రమానికి కాంగ్రెస్ బ్లాక్, మండల, గ్రామ శాఖల అధ్యక్షులు పాల్గొనాలని ఆయన కోరారు. జిల్లా మొదటి అదనపు న్యామూర్తి బదిలీచివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి ఎం.రాధాకృష్ణ చౌహన్ సికింద్రాబాద్ జ్యూడీషియల్ అకాడమీకి బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల క్రితం ఆయన పదోన్నతిపై హుజూర్నగర్ కోర్టు నుంచి సూర్యాపేట జిల్లా కోర్టుకు వచ్చారు. సాధారణ బదిలీల్లో భాగంగా అకాడమీకి వెళ్లారు. అక్కడ సీనియర్ ఫ్యాకల్టీగా విధులు నిర్వహించనున్నారు. సీఐ సస్పెన్షన్కోదాడ రూరల్ : కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ రిమాండ్ ఖైదీగా ఉంటూ మృతిచెందిన కేసులో పోలీసులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. కోదాడ రూరల్ సీఐ ప్రతాప్ లింగంను సస్పెండ్ చేయగా.. చిలుకూరు ఎస్సై సురేష్‌రెడ్డిని ఎస్పీ కార్యాలయనికి అటాచ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేసినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజేష్ కేసులో పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చినందున అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజేష్ మృతికి కారకులైన పోలీసుల పై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మరికొంత మంది పోలీసులపై కూడా వేటు పడే అవకాశం ఉంది. ఉద్యోగుల డీఏ బకాయిలు విడుదల చేయాలిమోతె : ఉద్యోగులకు రావాల్సిన ఐదు డీఏల బకాయిలను, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి డి.లాలు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మోతె మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో సంఘం సమావేశానికి సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ నెల 21న తుంగతుర్తిలో జరిగే టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశాల్లో రాష్ట్రంలో విద్యారంగా సమస్యలతో పాటు పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సంఘం మండలాధ్యక్షుడు డి.నరేందర్, ఉపాధ్యక్షులు యాదయ్య, సాయిశ్యాం, ఉషారాణి, గురులక్ష్మి, పాఠశాల ప్రధానో పాధ్యాయుడు శోభాబాయి పాల్గొన్నారు. సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు భానుపురి (సూర్యాపేట) : అల్ప సంఖ్యాక వర్గాల (ముస్లిములు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, పార్శీలు) వారు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం అందిస్తున్న ‘సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం’ కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎల్.శ్రీనివాస్‌నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, న్యూజిలాండ్, సింగపూర్ దేశాల్లో చదువుకునేందుకు ఈ స్కాలర్షిప్ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఒకటి జూలై 2025 నుంచి 31 డిసెంబర్ 2025 మధ్య కాలంలో (ఫాల్ సీజన్ 2025) అడ్మిషన్ తీసుకున్న అర్హత కలిగిన అభ్యర్ధులు www.telanganaepass.cgg.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయములో అందించాలన్నారు. విద్యార్థుల తల్లితండ్రుల వార్షిక ఆదాయం రూ.5లక్షల లోపు ఉండేవారు అర్హులని తెలిపారు. ఈ పథకం కింద ఎంపిక చేయబడిన విద్యార్థికి స్కాలర్ షిప్ కింద రూ.20 లక్షలు రెండు విడతల్లో ప్రభుత్వం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. విమాన చార్జీలు రూ. 60వేలకు మించకుండా చెల్లిస్తుందని తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 20 నుంచి వచ్చేనెల 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
గోదారి.. నీరేది!
ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీటి విడుదలపై కొరవడిన స్పష్టతశనివారం శ్రీ 20 శ్రీ డిసెంబర్ శ్రీ 2025భానుపురి (సూర్యాపేట), అర్వపల్లి : యాసంగి సీజన్ ప్రారంభమైనా ఎస్సారెస్పీ కాల్వలకు సాగునీటి విడుదలపై స్పష్టత రాలేదు. యాసంగి పంటల సాగుకు నీళ్లిస్తారా లేదా తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. జిల్లా ఇరిగేషన్ అధికారులు నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించకపోవడంతో నార్లు పోసుకోవాలా.. వద్దా అనే విషయాన్ని తేల్చుకోలేక పోతున్నారు. యాసంగి సాగు షురూ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్లో 5,19,220 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో వరి 4,96,100 ఎకరాల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఎస్సారెస్సీ ఆయకట్టు కిందే 2 లక్షల ఎకరాల వరకు వరి సాగు ఉండనుంది. ప్రస్తుతం బోరుబావుల కింద అక్కకక్కడ నాట్లు వేస్తున్నారు. చాలావరకు నార్లు పోయడంతో పాటు దుక్కులు కూడా సిద్ధం చేసే పనిలో రైతులు ఉన్నారు. జిల్లాలోని మూసీ ఆయకట్టుకు సైతం ఇటీవలే సాగు నీటిని విడుదల చేయడంతో అక్కడ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. షెడ్యూల్ ఊసెత్తని అధికారులు జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలతో పాటు కోదాడలోని మోతె, నడిగూడెం, మునగాల మండలాల వరకు ఎస్సారెస్పీ ఆయకట్టు వ్యాపించి ఉంది. ప్రస్తుతం యాసంగి సీజన్ ప్రారంభమైనా ఎస్సారెస్పీ ఆయకట్టు కింద పంటల సాగుకు నీటిని విడుదల చేస్తారా లేదా అన్న విషయాన్ని అధికారులు స్పష్టం చేయడం లేదు. తరి పంటలకు నీటిని విడుదల చేస్తే ఇప్పటికే రైతులు నార్లు పోసుకోవాల్సి ఉంటుంది. అధికారులు నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించక పోవడంతో రైతులు అయోమయంలో ఉన్నారు. కొందరు రైతులు ధైర్యం చేసి బోర్ల కింద నారు పోసుకున్నారు. మరికొందరు నీటి విడుదల తేలకుండా నార్లు పోస్తే ఆగం అవుతామనే భావనలో ఉన్నారు. ఇరిగేషన్ అధికారులు ఎస్సారెస్పీ నీటి విడుదలపై స్పష్టత ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ గోదావరి జలాల కోసం రైతుల ఎదురుచూపు ఫ సీజన్ ప్రారంభమైనా షెడ్యూల్ ప్రకటించని అధికారులు ఫ జిల్లాలో 2.20 లక్షల ఎకరాల్లో ఎస్సారెస్పీ ఆయకట్టు -
విపత్తు సమయంలో సేవలందించాలి
భానుపురి (సూర్యాపేట) : విపత్తు సమయంలో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వరదలు, పరిశ్రమల్లో ప్రమాదాల నివారణపై ఈ నెల 22న నిర్వహించనున్న ముందస్తు ప్రణాళికపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ డైరెక్టర్ సుధీర్బాల్, రాష్ట్ర ఫైర్ సర్వీస్ డైరెక్టర్ నారాయణరావు, వివిధ శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం కలెక్టర్ అధికారులతో సమావేశమై మాట్లాడారు. వరదలు, విపత్కర పరిస్థితుల్లో అగ్నిమాపక, పోలీస్, రెవెన్యూ శాఖలు అప్రమత్తంగా ఉండి తగిన విధంగా సాయం అందించాలన్నారు. వరదలు వచ్చినప్పుడు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వైపు వెళ్లాలి, ఉపశమన శిబిరం ఎక్కడ పెట్టాలనేది ముందుగానే చూసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, అదనపు ఎస్పీలు రవీందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ వీవీ అప్పారావు, డీపీఓ యాదగిరి, పరిశ్రమలశౠఖ జీఎం సీతారాం, ఆర్డీఓలు సూర్యనారాయణ, వేణుమాధవ్, మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి, డీఎంహెచ్ఓ వెంకటరమణ, డీఎస్ఓ శోభన్‌బాబు, డీఎం రాము, పశు సంవర్ధకశాఖ అధికారి శ్రీనివాసరావు, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ ఈఈలు సీతారామయ్య, వెంకటయ్య, మాధవి, డీవైఎస్ఓ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాం : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : జిల్లాలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పనిచేసినట్లు ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో మూడు విడతల్లో 23 మండలాల్లో జరిగిన ఎన్నికలకు పోలీస్ సిబ్బంది ఒక జట్టుగా సమన్వయంతో పనిచేశారని కొనియాడారు. సిబ్బంది ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. సహకరించిన ఇతర శాఖల అధికారులు, ఓటర్లకు పోలీస్ శాఖ తరపున ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల్లో తనిఖీలు నిర్వహించడం ద్వారా ఇప్పటి వరకు రూ.1.20 లక్షల నగదుతో పాటు, 144 కేసుల్లో సుమారు రూ.10.53 లక్షలు విలువ గల 1,740 లీటర్ల మద్యాన్ని పోలీసులు వివిధ ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఎన్నిక సందర్భంగా లెసెన్స్ కలిగి ఉన్న 79 తుపాకులను తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవడంతో పాటు, గతంలో ఎన్నికల్లో గొడవలకు పాల్పడిన వ్యక్తులు, రౌడీ షీటర్లు, అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించి ముందస్తుగా 429 కేసుల్లో 1488 మందిని బైండోవర్ చేసినట్లు వివరించారు. మట్టపల్లిలో ధనుర్మాస పూజలుమఠంపల్లి: మట్టపల్లి దేవాలయంలో ధనుర్మాసోత్సవంలో భాగంగా శ్రీలక్ష్మీనరసింహస్వామికి, గోదాదేవి అమ్మవారికి గురువారం తెల్లవారుజామున పాశురాలు పారాయణం చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు కుమ్మరికుంట్ల బదరీనారాయణాచార్యులు ఆధ్వర్యంలో ధనుర్మాస పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, కృష్ణమాచార్యులు , పద్మనాభాచార్యులు, బ్రహ్మాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, చైన్నెకి చెందిన పలువురు భక్తులు పాల్గొన్నారు. యువజన సంఘాల నుంచి దరఖాస్తుల ఆహ్వానంభువనగిరి: 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి క్రీడా సామగ్రి పంపిణీ కోసం యువజన సంఘాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మేరా యువ భారత్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికారి గంట రాజేష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసుకుని నెహ్రూ యువ కేంద్రంలో అనుసంధానమైన యువజన సంఘాల వారు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తుతోపాటు గత 5 సంవత్సరాల నుంచి సంఘాలు చేసిన కార్యక్రమాల వివరాలు, రిజిస్ట్రేషన్ కాపీని జత పర్చాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 91338 96009, 90597 98602 నంబర్లను సంప్రదించాలని సూచించారు. అధ్యయనోత్సవాల ప్రచార పోస్టర్లు ఆవిష్కరణయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఈ నెల 30న నిర్వహించే ముక్కోటి ఏకాదశి, అధ్యయనోత్సవాలకు సంబంధించిన ప్రచార పోస్టర్లను ఆలయ ఈఓ వెంకట్రావ్, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి గురువారం ఆవిష్కరించారు. పోస్టర్లను గర్భాలయంలో, ముఖ మండపంలోని సువర్ణ పుష్పార్చన మూర్తుల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈఓ మాట్లాడుతూ... ముక్కోటి ఏకాదశి వేడుకలకు భక్తులందరిని ఆహ్వానించేందుకు ప్రచార పోస్టర్లను రాష్ట్ర వ్యాప్తంగా పంపిస్తున్నామన్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో నిర్థిష్ట తేదీల్లో శ్రీస్వామి వారి కల్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయాధికారులు రఘు, రాజన్‌బాబు, ఆర్ఐ శేషగిరిరావు, ప్రధానార్చకులు–2 సురేంద్రచార్యులు, అర్చకులు లక్ష్మణాచార్యులు తదితరులున్నారు. -
జిల్లాలో 32.30శాతం సర్పంచ్ స్థానాల్లో బీసీల జయకేతనం
భానుపురి(సూర్యాపేట) : పంచాయతీ ఎన్నికల్లో 157 (32.30 శాతం)మంది బీసీ సర్పంచ్‌లు జయకేతనం ఎగురవేశారు. రిజర్వేషన్ స్థానాలతో పోల్చితే జనరల్ కేటగిరీలోనే 91(42.52 శాతం) మంది గెలుపొందారు. జిల్లా వ్యాప్తంగా 486 గ్రామ పంచాయతీలకు గాను బీసీ రిజర్వేషన్లలో 66 మంది, జనరల్ కేటగిరీలో 91 మంది బీసీలు సర్పంచ్ స్థానాలు దక్కించుకున్నారు. కోర్టు ఆదేశాలతో.. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 486 గ్రామపంచాయతీలు ఉన్నాయి. రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దన్న కోర్టు ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా ఎస్టీలకు 111 స్థానాలు, ఎస్సీలకు 91, బీసీలకు 66 స్థానాలు, జనరల్ కేటగిరీ కింద 218 స్థానాలను రిజర్వ్ చేశారు. 2019 ఎన్నికలతో పోల్చితే నూతన గ్రామపంచాయతీలు ఏర్పడడంతో ప్రస్తుత రిజర్వేషన్లతో ఐదు బీసీ స్థానాలు పెరిగాయి. అయితే ప్రభుత్వపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చే అవకాశం లేకపోగా.. పార్టీలు సైతం పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేసేందుకు వీలు లేకుండా పోయింది. ప్రధానంగా సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో రాజకీయ పార్టీల గుర్తులపై, బీ ఫామ్‌లపై జరగనందున రిజర్వేషన్ల ఆధారంగా తమ మద్దతుదారులను మాత్రమే బరిలో నిలిపే అవకాశం ఉంది. అయితే జనరల్ స్థానాల్లో బీసీలకు అవకాశం కల్పించి... ఆయా పార్టీలు బీసీలకు న్యాయం చేయాల్సి ఉన్నా బీఫామ్‌లు, పార్టీ గుర్తులు లేకపోవడంతో ఈ మేరకు బీసీలకు ఏ రాజకీయ పార్టీ 42 శాతం రిజర్వేషన్ కల్పించిన దాఖలాలు లేవు. 218 జనరల్ కేటగిరీ స్థానాల్లో.. జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల పరిధిలో బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా బలంగా ఉన్నారు. గ్రామస్థాయిల్లో బీసీలకు ఆర్థిక వనరులు సైతం ఉన్నాయి. జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు తమను ఓటర్లుగానే కాకుండా రాజకీయంగానూ గుర్తించేలా ఎన్నికల్లో గెలిచి సత్తాచాటారు. తమకు కేటాయించిన 66 రిజర్వ్ స్థానాలనే కాకుండా బీసీలు పోటీ చేసేందుకు వీలున్న జనరల్ స్థానాల్లోనూ దాదాపు సగం సీట్లను కై వసం చేసుకుని ఔరా అనిపించారు. జిల్లాలో జనరల్ కేటగిరీకి 218 స్థానాలను కేటాయించగా 42.52 శాతంతో 91 స్థానాలను దక్కించుకున్నారు. మొత్తంగా 486 గ్రామపంచాయతీలకు గాను 157 స్థానాల్లో బీసీలే గ్రామ ప్రథమ పౌరులుగా ఉండనున్నారు.మండలాల వారీగా బీసీలకు లభించిన స్థానాలు మండలం జీపీలు జనరల్ జనరల్‌లో బీసీ బీసీ రిజర్వు తిరుమలగిరి 16 05 04 01 నేరేడుచర్ల 19 09 02 04 మునగాల 22 11 06 05 చిలుకూరు 17 09 03 03 తుంగతుర్తి 24 09 00 03 జాజిరెడ్డిగూడెం 17 08 06 03 మఠంపల్లి 29 13 01 02 నూతనకల్ 17 10 05 02 నాగారం 14 07 04 02 చివ్వెంల 32 10 03 00 హుజూర్నగర్ 11 06 03 02 మేళ్లచెరువు 16 07 02 03 చింతలపాలెం 16 08 03 03 పెన్‌పహాడ్ 29 07 04 02 గరిడేపల్లి 33 16 12 08 మద్దిరాల 16 07 04 03 అనంతగిరి 20 09 02 02 మోతె 29 13 03 03 కోదాడ 16 08 03 04 నడిగూడెం 16 08 07 04 ఆత్మకూర్ (ఎస్) 30 12 06 04 సూర్యాపేట 25 13 05 03 పాలకవీడు 22 13 03 00 మొత్తం 486 218 91 66 రిజర్వుడ్ స్థానాలతో పాటుగా జనరల్ కేటగిరీ కింద ఉన్న సర్పంచ్‌లను బీసీ అభ్యర్థులు సగం మేర కై వసం చేసుకున్నారు. దీంతో రానున్న అన్ని ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు ఈ పదవులు ప్రచార అస్త్రాలుగా మారనున్నాయి. తమ పార్టీల వైపు బీసీలను మళ్లించేందుకు రిజర్వేషన్లను కచ్చితంగా పెంచాలన్న నినాదాన్ని తెరమీదకు తీసుకు రానున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్లు బలంగా బీసీ వాదాన్ని ఎత్తుకున్నాయి. ఈ ఫలితాల నేపథ్యంలో మరింతగా బీసీవాదంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించకున్నా.. పార్టీపరంగా ఇచ్చేందుకు ముందుకు వస్తాయని చర్చించుకుంటున్నారు.ఫ జనరల్ స్థానాల్లో 42.52 శాతం బీసీ అభ్యర్థుల గెలుపు ఫ బీసీలకు దక్కిన సీట్లపై జోరుగా చర్చ -
వచ్చేనెలలో పోరాటం ఉధృతం
సూర్యాపేట అర్బన్: మోదీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జనవరి నెలలో అన్ని జాతీయ కార్మిక సంఘాలను కలుపుకొని పోరాటాలు ఉధృతం చేయనున్నట్లు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. ఈశ్వరరావు తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోనీ సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లను తెచ్చి కార్పొరేట్ కంపెనీలకు కార్మికులను కట్టు బానిసలుగా చేస్తోందని మండిపడ్డారు. దేశంలో నయా ఫాసిస్టు విధానాలు అమలు చేస్తూ కార్మికులను మతం పేరుతో విభజిస్తూ లౌకిక విధానాలను తుంగలో తొక్కుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రోజుకూ 12 గంటల విధానాన్ని ప్రవేశ పెట్టి వేతనాలు పెంచకుండా కార్మికుల నిజ వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం శ్రమ దోపిడీ చేస్తోందన్నారు. దేశంలో స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయనిది మోదీ ప్రభుత్వమని విమర్శించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె. వెంకటనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, చెరుకు ఏకలక్ష్మి,ఎం. రాంబాబు, శీలం శ్రీను, వటేపు సైదులు పాల్గొన్నారు. ఫ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈశ్వరరావు -
పెన్షనర్ల ఆరాధ్యుడు డీఎస్ నకారా
భానుపురి (సూర్యాపేట) : పెన్షనర్ల ఆరాధ్యుడు డీఎస్ నకారా అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.సీతారామయ్య పేర్కొన్నారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో సంఘం సూర్యాపేట జిల్లాశాఖ, నోడల్ మండల శాఖ సంయుక్తంగా నిర్వహించిన పెన్షనర్స్ డే సమావేశానికి హాజరై మాట్లాడారు. పెన్షనర్ల తరఫున సుప్రీం కోర్టులో కొట్లాడి పెన్షన్ సాధించిన ఘనత డీఎస్ నకారాకు దక్కుతుందన్నారు. పెన్షన్ ప్రతీ ఉద్యోగి ప్రాథమిక హక్కు అని, పెన్షన్ గత సేవలకు ప్రతిఫలం మాత్రమేనని తెలిపారు. పెన్షన్ రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదన్నారు. అనంతరం పలువురు పెన్షనర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు, సూర్యాపేట డీటీఓ ఎస్.రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి దండ శ్యాంసుందర్ రెడ్డి, కోశాధికారి ఎస్.ఏ.హమీద్‌ఖాన్, అసోసియేట్ అధ్యక్షుడు కె.రవీందర్ రెడ్డి, టి.లక్ష్మీకాంతారెడ్డి, గౌరవ అధ్యక్షుడు కె.రవీందర్‌రెడ్డి, ఎస్.యాదగిరి, ఎస్.నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, విట్టల్ రెడ్డి పాల్గొన్నారు. -
పదికి మూడు నెలలే కీలకం
నాగారం : పదో తరగతి వార్షిక పరీక్షలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉంది. మార్చి 14 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే విద్యా శాఖ టైంటేబుల్ విడుదల చేసింది. గతంలో ఎన్నడూలేని విధంగా నాలుగు రోజులకో పరీక్ష చొప్పున నిర్వహించనున్నారు. దీంతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గనుందని విద్యా శాఖ భావిస్తోంది. అయితే విద్యార్థులు, ఉన్న ఈ కాస్త సమయాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రణాళిక ప్రకారం చదవడం, పునశ్చరణ, సాధనతో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. ‘సంకల్పం’ పేరుతో ప్రత్యేక తరగతులు పదో తరగతిలో మెరుగైన ఫలితాల సాధనకు జిల్లా విద్యా శాఖ ఇప్పటికే ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ‘సంకల్పం’ పేరుతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. రోజూ సాయంత్రం 4.15 నుంచి నుంచి 5.15 వరకు గంటపాటు ఉన్నత పాఠశాలల్లో టెన్త్ విద్యార్థులకు వీటిని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఒక టైం టేబుల్‌ను సైతం సిద్ధం చేశారు. ఏ రోజు ఏ సబ్జెక్టు బోధించాలనేది అందులో పేర్కొన్నారు. జనవరి నుంచి రెండు పూటలా తరగతులు నిర్వహించనున్నారు. గతేడాది ఉత్తీర్ణత.. 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో 96.81 శాతం ఉత్తీర్ణత సాధించింది. రాష్ట్ర స్థాయిలో జిల్లా 14వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జిల్లాలో 5,345 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యను అభ్యసిస్తున్నారు. వీరంతా ఉత్తమ మార్కులు సాధించేలా మిగిలిన ఈ మూడు నెలల సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా ఉపాధ్యాయులు, విద్యార్థులు సన్నద్ధం కావాలి. ప్రత్యేక శ్రద్ధ.. ఉపాధ్యాయలు సీ–గ్రేడ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు. అలాగే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందేలా చేయడంతోపాటు, సిలబస్ త్వరితగతిన పూర్తిచేసి పునశ్చరణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణులను చేయడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు ముందుకు వెళ్లాలి. ప్రత్యేక తరగతులకు తప్పనిసరిగా రిజిస్టర్ నిర్వహించాలి. పర్యవేక్షణ అధికారుల సలహాలు, సూచనలు సేకరించాలి. సబ్జెక్టు టీచర్లు సమన్వయంతో లక్ష్యం సాధించేందుకు శ్రమించాలి. –అశోక్, జిల్లా విద్యా శాఖ అధికారి ఫ మార్చి 14 నుంచి టెన్త్ వార్షిక పరీక్షలు ఫ ఇప్పటికే టైంటేబుల్ విడుదల చేసిన విద్యా శాఖ ఫ మెరుగైన ఫలితాల సాధనకు ‘సంకల్పం’ ఫ జనవరి నుంచి రెండు పూటలా ప్రత్యేక తరగతులుజెడ్పీహెచ్ఎస్లు 182కేజీబీవీలు 18ఆదర్శ పాఠశాలలు 09టెన్త్ విద్యార్థుల సంఖ్య 5,345 -
ఉపాధి.. ఊరభివృద్ధికి హామీ
గ్రామాల్లో చెరువులు, చెక్ డ్యాంలు, ఊట కుంటలు, ప్రాజెక్టు కాల్వల్లో నుంచి పూడిక తీసుకునేందుకు అవకాశం ఉంది. కూలీలతో పనులు చేయిస్తే అటు వారికి ఉపాధి చూపడంతో పాటు నీటి వనరులను బాగు చేసుకోవచ్చు. గ్రామం నుంచి ఇతర గ్రామాలకు, పంట పొలాలకు దారులు లేని ప్రాంతాలకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద పొలం బాటలు వేసుకోవచ్చు. ఎడ్లబండ్లు, ఇతర వాహనాలు వెళ్లేందుకు వీలవుతుంది. గ్రామంలో పంచాయతీ, అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనం లేకుంటే ఉపాధి హామీ పథకంలో నిర్మించుకునే వీలుంది. నాగారం : జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. కొత్తగా పంచాయతీ పాలకవర్గం కొలువుదీరనుంది. సర్పంచ్‌గా ఎన్నికై నందుకు సంబరంగా ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీలను నిధుల కొరత వెంటాడుతుండటంతో గ్రామాన్ని అభివృద్ధి చేయడం సవాలే. ఈ పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం అండగా నిలువనుంది. పక్కాగా, ప్రణాళికబద్ధంగా పనులు చేయించగలిగితే కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు, పల్లెలను ప్రగతి దిశగా తీసుకుపోవచ్చు. గతంతో పోలిస్తే పథకంలో కొన్ని మార్పులు చేశారు. పథకం పేరు మార్చడంతో పాటు పని దినాలు 100 నుంచి 125కి పెంచారు. 266 పనులను గుర్తించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిపై సర్పంచులు దృష్టి సారించాలి. స్వచ్ఛ గ్రామాలుగా.. గ్రామాలను సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఉపాధి పథకంలో అవకాశం ఉంది. మరుగుదొడ్ల నిర్మాణంలో అవసరమైన గుంతలను కూలీలతో తవ్వించి, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించవచ్చు. నీటిని నిల్వ చేసుకునేలా.. సాగు భూముల్లో కాంటూరు కందకాలు, ఊట కుంటలు, ఫాంపాండ్స్, చెక్ డ్యాంలు, రాళ్లకట్టలు తదితర వాటిని ఏర్పాటు చేసుకోవడానికి వీలుంది. ముందుగా ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని పక్కాగా పనులు పూర్తి చేస్తే భూగర్భ జలమట్టం పెరుగుతుంది. మొక్కలు నాటుదాం.. గ్రామాల్లో మొక్కలు నాటి హరితవనం పెంపొందించేందుకు వీలుంది. పంచాయతీల్లో నర్సరీ అందుబా టులో ఉంది. గుంతలు తవ్వడం మొదలు, మొ క్కలను నాటేందుకు, పోషణకు డబ్బులు ఇస్తున్నారు. ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసేందుకు మండల స్థాయిలో ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారు. జిల్లాలో పీడీతో పాటు ఏపీడీ, మండలాల్లో ఏపీఓ, సాంకేతిక సహాయకులు, గ్రామాల్లో క్షేత్ర సహాయకులు ఉంటారు. మండల అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో పనుల గుర్తింపు, ఎంపిక, ఆమోదం, మంజూరు ఉంటాయి.సర్పంచ్‌లకు అండగా ఉపాధిహామీ పథకం ఫ సద్వినియోగం చేసుకుంటే ఎంతో మేలు ఫ ప్రణాళికాబద్ధంగా పనులు చేయిస్తే ప్రగతి పథంమండలాలు 23గ్రామ పంచాయతీలు 486జాబ్ కార్డులు 2.63 లక్షలు కూలీలు 3.33 లక్షలు -
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గోరి కడతాం
సాక్షి, యాదాద్రి : రానున్న జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్, శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గోరి కడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నూతన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులకు గురువారం భువనగిరిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు చెప్పారు. కేసీఆర్ అనుమతితో జనవరి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామన్నారు. పార్టీ సభ్యత్వ సేకరణ, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిహిస్తామన్నారు. రానున్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో భువనగిరి జిల్లాపై బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలన్నారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల్లో జిల్లాకు చెందిన మంత్రులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలో 30 మంది సర్పంచ్‌లను అక్రమంగా ఓడించారని, కోర్టుకు వెళ్లి న్యాయం పొందుతామన్నారు. సీఐలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా, ఎస్ఐలు మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. పల్లెల్లో బీఆర్ఎస్ పార్టీ చెక్కు చెదరలేదని పంచాయతీ ఎన్నికలు రుజువు చేశాయన్నారు. అధికార పార్టీ ఎన్ని రకాల కుట్రలు పన్నినా క్యాడర్ వెన్ను చూపకుండా విజయం సాధించిందన్నారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ.. ఆలేరు ఎమ్మెల్యే ఎన్ని భయభ్రాంతులకు గురిచేసినా బీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేకపోయారన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్యగౌడ్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, క్యామా మల్లేష్, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, గొంగిడి మహేందర్‌రెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డి, దూదిమెట్ల బాల్‌రాజ్‌యాదవ్, కొలుపుల అమరేందర్, ఎడ్లసత్తిరెడ్డి పాల్గొన్నారు. ఫ వచ్చే నెల నుంచి సంస్థాగత ప్రక్రియ ప్రారంభం ఫ భువనగిరి ఖిలాపై గులాబీ జెండా ఎగరాలి ఫ నూతన సర్పంచ్ల సన్మాన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
పంచాయతీ హస్తగతం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ మద్దతుదారులకే అత్యధిక సర్పంచ్ స్థానాలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. ఆ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి 63.90 శాతం స్థానాలు లభించగా, బీఆర్ఎస్కు 26.71 శాతం స్థానాలు, బీజేపీకి 1.23 శాతం స్థానాలు వచ్చాయి. సీపీఐ/సీపీఎం/ఇతరులకు 8.15 శాతం స్థానాలు దక్కాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెల రోజులపాటు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం బుధవారంతో ముగిసింది. ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో గ్రామ పంచాయ తీ ఎన్నికలను నిర్వహించింది. ఈ నెల 11, 14వ తేదీల్లో ఒకటి, రెండు విడతల ఎన్నికలు జరగ్గా, మూడో విడత ఎన్నికలు బుధవారం ముగిశాయి. 1779 పంచాయతీల్లో ఎన్నికలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు విడతల్లో 1782 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. అయితే, నల్లగొండ జిల్లాలోని అనుముల మండలం పేరూరు, మాడుగులపల్లి మండలం అభంగాపురంలో సర్పంచి అభ్యర్థుల్లేక సర్పంచ్ స్థానాలకు, అదే మండలంలోని ఇందుగులలో న్యాయ వివాదంతో సర్పంచ్‌తో సహా వార్డుల సభ్యుల స్థానాల ఎన్నికలు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని 1779 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు, 1781 గ్రామాల్లో వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాగా, యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామంలో రాత్రి 11:30 గంటల వరకు కూడా లెక్కింపు పూర్తి కాలేదు. వివిధ పార్టీల మద్దతుదారులకు ఇలా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు వితల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే అత్యధిక స్థానాలు దక్కాయి. సర్పంచి ఎన్నికలు జరిగిన 1779 స్థానాల్లో (జనగాం మినహా) కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు 1136 స్థానాలు దక్కాయి. బీఆర్ఎస్ మద్దతుదారులకు 475 స్థానాలు వచ్చాయి. బీజేపీకి 22 స్థానాలు రాగా, సీపీఐ/సీపీఎం/ఇతరులకు 145 స్థానాలు లభించాయి. అందులో స్వతంత్ర అభ్యర్థులే అత్యధికంగా ఉండటం గమనార్హం. నల్లగొండలోనే కాంగ్రెస్‌కు అత్యఽధిక సర్పంచ్ స్థానాలు నల్లగొండ జిల్లాలో 869 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో కాంగ్రెస్ మద్దతుదారులకు 68.23 శాతం స్థానాలు లభించాయి. బీఆర్ఎస్ మద్దతుదారులకు 23.24 శాతం సర్పంచ్ స్థానాలు దక్కాయి. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ మద్దతుదారులకు 64.60 శాతం, బీఆర్స్ మద్దతుదారులకు 25.51 శాతం దక్కాయి. యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్ మద్దతుదారులకు 53.75 శాతం, బీఆర్ఎస్ మద్దతుదారులకు 34.97 శాతం సర్పంచి స్థానాలు లభించాయి. -
పల్లె పాలనకో పాఠం
తిరుమలగిరి (తుంగతుర్తి): రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొన్నది. మూడు విడతల్లో పోలింగ్ పూర్తయింది. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పల్లె పాలనపై అందరూ చర్చించుకుంటున్నారు. గ్రామ పాలనపై పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించేలా 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో ఓ పాఠం చేర్చారు. సర్పంచ్‌లు, వార్డు సభ్యుల అధికారాలు, విధులు, బాధ్యతలు, ప్రజల కర్తవ్యం, ప్రజాస్వామ్యం తది తర విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా పాఠ్యాంశంలో వివరాలు పొందుపర్చారు. ఓటు హక్కు పదవీ బాధ్యతలు గ్రామ సభ, సమస్యల పరిష్కారం, పౌరుల బాధ్యతలు తదితర అంశాలను విద్యార్థులకు అవగాహన కల్పించేలా వివరాలు చేర్చారు. గ్రామ పంచాయతీలకు ఆదాయం, వ్యయం, పన్నుల రకాలు, సర్పంచ్ కృషి చేస్తే గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్ద వచ్చన్న సూచనలు ఉన్నాయి.పంచాయతీల పాలనపై విద్యార్థులు అవగాహన పెంచుకొని తల్లిదండ్రులకు వివరిస్తే ప్రజా సమస్యలు పరిష్కారం కావడంతో పాటు పారదర్శకమైన పాలన అందించ వచ్చు. పాఠ్యాంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే కాకుండా గ్రామ సభలు కూడా నిర్వహించి అవగాహన కల్పించారు. ఫ గ్రామ స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించేలా రూపకల్పన ఫ 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశం ఫ వివరంగా సర్పంచ్ల విధులు, బాధ్యతలు -
ఊరు.. ఓటరు జోరు
తుది విడతలో ఓటేసేందుకు కదిలిన పల్లెలు భానుపురి (సూర్యాపేట) : మూడోవిడత పంచాయతీ ఎన్నికల్లో పల్లె జనం ఓటెత్తారు. తుదిశలో గ్రామ పాలకవర్గాన్ని ఎన్నుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే బారులుదీరారు. ఈ క్రమంలో ఏకగ్రీవాలు పోను 124 గ్రామపంచాయతీలు, 1061 వార్డుల్లో బుధవారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్ నుంచి కౌంటింగ్ ప్రక్రియ వరకు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. చాలావరకు ఒంటిగంటకే పోలింగ్ ముగియగా.. అక్కడక్కడ ఈలోగా వచ్చిన వారికి అవకాశం కల్పించారు. అత్యధికంగా చింతలపాలెం మండలంలో 90.99 శాతం, అత్యల్పంగా మేళ్లచెర్వు మండలంలో 86.59 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తంగా ఈ విడతలో 89.25 శాతం పోలింగ్ నమోదు కాగా.. 1,71,903 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నరసింహ, జనరల్ అబ్జర్వర్ రవినాయక్ విస్తృతంగా పర్యటించి పోలింగ్ సరళి, ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. 1,176 పోలింగ్ కేంద్రాలలో.. మూడో విడత హుజూర్నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని చింతలపాలెం, గరిడేపల్లి, హుజూర్నగర్, మఠంపల్లి, మేళ్లచెరువు, నేరేడుచర్ల, పాలకవీడు మండలాల్లో ఎన్నికలు జరిగాయి. దాదాపు 1,92,617 మంది ఓటర్లు ఉండగా 1,176 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు గంటలకోసారి.. ఏడు మండలాల పరిధిలో 124 గ్రామపంచాయతీలు, 1061 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 7గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. కాగా ప్రతి రెండు గంటలకోసారి అధికారులు పోలింగ్ శాతాన్ని ప్రకటించారు. ఉదయం 9గంటల వరకు 24.83 శాతం, 11 గంటల వరకు 60.13 శాతం, ఒంటి గంట వరకు 86.19 శాతం పోలింగ్ నమోదైంది. ఒంటిగంట లోపు పోలింగ్ సెంటర్లో ఉన్న వారికి ఓటువేసేందుకు అవకాశం ఇవ్వగా.. చివరగా 89.25 శాతంగా పోలింగ్ నమోదైంది. పోలింగ్ విషయంలోనూ మహిళలే ముందున్నారు. పురుషులు 83,390 మంది ఉండగా 89.04 శాతం, మహిళలు 88,507 ఉండగా 89.44 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అత్యల్పంగా మేళ్లచెరువు మండలంలో 86.59శాతం మండలాల వారీగా చూస్తే చింతలపాలెం మండలంలో అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. చింతలపాలెంలో 90.99 శాతం అనగా 26,056 ఓట్లకు 23,709 ఓట్లు పోలైనట్లు అధికారులు ప్రకటించారు. అత్యల్పంగా మేళ్లచెరువు మండలంలో 86.59 శాతమే పోలింగ్ నమోదైంది. 29,678 ఓట్లకు 25,698 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. రెండో విడత కన్నా తుది దశలో అధికం మూడోవిడత పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత కన్నా తక్కువ, రెండోవిడత కన్నా అధికంగా పోలింగ్ శాతం నమోదైంది. మొదటి విడతలో 89.69 శాతం,రెండోవిడతలో 86.78 శాతం, చివరి దశలో 89.25 శాతం పోలింగ్ నమోదైంది.రెండో విడత మండలం ఓటర్లు మొత్తం శాతం పోలైవని చింతలపాలెం 26,056 23,709 90.99 గరిడేపల్లి 41,985 37,301 88.84 హుజూర్నగర్ 20,467 18,579 90.78 మఠంపల్లి 35,266 31,708 89.91 మేళ్లచెరువు 29,678 25,698 86.59 నేరేడుచర్ల 20,550 18,104 88.10 పాలకవీడు 18,616 16,804 90.27 మొత్తం 1,92,617 1,71,903 89.25ఫ హుజూర్నగర్ రెవెన్యూ డివిజన్లోని ఏడు మండలాల్లో 89.25 శాతం పోలింగ్ ఫ అత్యధికంగా చింతలపాలెం మండలంలో 90.99 శాతం ఫ ఉదయం నుంచే బారులుదీరిన జనం -
ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
నేరేడుచర్ల : సూర్యాపేట జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 86.25 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. అదేవిధంగా పెంచికల్‌దిన్న గ్రామ పంచాయతీ పరిధిలోని తెలగరామయ్యగూడెంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ అనూష పరిశీలించారు. వారి వెంట తహసీల్దార్ సురగి సైదులు, ఎంపీడీఓ సోమ సుందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. పెన్షనర్ల వ్యతిరేక జీఓను రద్దుచేయాలిభానుపురి (సూర్యాపేట) : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షనర్ల వ్యతిరేక జీఓను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.సీతారామయ్య డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో ఏఓ సుదర్శన్‌రెడ్డికి ఈ మేరకు సంఘం సూర్యాపేట జిల్లా శాఖ తరఫున వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల రిటైర్డ్ ఉద్యోగులకు వ్యతిరేకంగా జీఓను తీసుకొచ్చిందన్నారు. ఈ జీఓ ప్రకారం 2026 జనవరికి ముందు రిటైర్డ్ అయ్యే వారికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఉండకుండా చేసిందన్నారు. పెన్షనర్ల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తెచ్చిన ఈ జీఓను వెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ రద్దు చేయాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిటైర్డ్ ఉద్యోగులకు కావాల్సిన ఏరకమైన బెనిఫిట్స్ రాకుండా అడ్డుకుంటున్నాయని, మెడికల్ బిల్లులు రావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు, ప్రధాన కార్యదర్శి దండా శ్యాంసుందర్ రెడ్డి, కోశాధికారి ఎస్.ఏ. హమీద్ ఖాన్, మండల అధ్యక్షుడు ఎస్.యాదగిరి, కోదాడ యూనిట్ అధ్యక్షుడు వి.శ్రీనివాసరావు, సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్) కార్యదర్శులు సుదగాని నాగేశ్వర్ రావు, ఎస్ఏ అబ్దుల్లా పాల్గొన్నారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని బుధవారం అర్చకులు వేదమంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు,అభిషేకాలు చేశారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం రక్తి గట్టించారు. అవిష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. -
కొలువుదీరనున్న పాలకవర్గాలు
కోదాడ: జిల్లా వ్యాప్తంగా మూడు దశల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికలు బుధవారంతో పూర్తి అయ్యాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త పాలక వర్గాలు కొలువు దీరడానికి సిద్ధమవుతున్నాయి. దీని కోసం మొదట ఈ నెల 20వ తేదీని ఎంపిక చేసినప్పటికి ముహూర్తం బాగా లేదని విజ్ఞప్తులు రావడంతో ఈ నెల 22వ తేదీని జిల్లా అధికారులు ఖరారు చేశారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఉప సర్పంచ్ ఎన్నికలు కూడాపూర్తి కావడంతో పూర్తిస్థాయి పాలక వర్గాల చేత ఈ నెల 22న ప్రమాణం చేయించడానికి అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 486 పంచాయతీలు ఉండగా ఈ నెల 11న మొదటి విడత 159 పంచాయతీలకు, 14న రెండవ విడత 181 పంచాయతీలకు, 17న మూడవ విడత 146 పంచాయితీలకు ఎన్నికలు పూర్తి చేశారు. ఎన్నికలు మొత్తం పూర్తి అయిన రెండు రోజుల తరువాత మూడు విడతల్లో గెలుపొందిన అందరిని కలిపి ఈ నెల 22వ తేదీన ప్రమాణం చేయించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు విడతల్లో గెలిచిన వార్డు సభ్యులు పరోక్ష పద్ధతిలో ఆయా గ్రామాలలో ఉపసర్పంచ్‌లను ఇప్పటికే ఎన్నుకున్నారు. ఫ 22న ముహూర్తం ఖరారు ఫ బాధ్యతలు చేపట్టనున్న 486 మంది సర్పంచ్‌లు ఫ ఏర్పాట్లు చేస్తున్న పంచాయతీ అధికారులునూతనంగా సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులుగా ఎన్నికై నవారు ఈ నెల 22వ తేదీన ఉదయం ఆయా పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసే తొలి పంచాయతీ సమావేశంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి వీరి చేత నిబంధనల ప్రకారం ప్రమాణం చేయించిన అనంతరం ప్రమాణ పత్రంపై సంతకాలు చేసి అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం సర్పంచ్ అధ్యక్షతన జరగే సమావేశంలో గ్రామాభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. -
మూడో విడతలో కాంగ్రెస్ 78
భానుపురి (సూర్యాపేట) : మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ పల్లె ఓటర్లు అధికారపార్టీ మద్దతుదారులకు జైకొట్టారు. రెండు విడతలతో పోల్చితే తుదిదశ ఎన్నికలు ఏకపక్షంగా సాగాయి. హుజూర్నగర్ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులకు తిరుగు లేకుండా పోయింది. ఇప్పటికే ఏకగ్రీవంగా 20 పంచాయతీలను గెలుచుకున్న ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు మరో 78 స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. 10 స్థానాల్లో ఆ పార్టీకి చెందిన రెబల్ అభ్యర్థులే గెలుపొందారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు 29 మంది మాత్రమే గెలిచారు. ఇక స్వంతంత్ర అభ్యర్థులు ఏడు స్థానాలు గెలవగా.. బీజేపీ బలపర్చిన అభ్యర్థులు ఖాతా తెరవలేకపోయారు. ఏకపక్షంగా కాంగ్రెస్.. హుజూర్నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో 146 గ్రామపంచాయతీలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 20 స్థానాలను కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. మరో రెండింటిని స్వంతంత్ర అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మిగిలిన 124 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా అధికార కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు 78 స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక శాఖలను నిర్వహిస్తుండడం ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థుల గెలుపునకు బాటలు వేసింది. అదే పార్టీలో నాయకులుగా కొనసాగి సర్పంచ్ పదవి ఆశించినా.. సీటురాకపోవడంతో రెబల్ అభ్యర్థులుగా నిలిచి గెలిచారు. నాయకత్వ లేమి.. బీఆర్ఎస్ 29స్థానాల్లో గెలిచింది. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీచేసిన శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరగా.. నాటినుంచి నియోజకవర్గంలో నాయకత్వ లేమి కనిపిస్తోంది. గరిడేపల్లి, మఠంపల్లి మండలాలు మినహా ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. మొదటి విడతలో కాస్త పోటీ ఇచ్చినా.. రెండు, మూడోవిడత పంచాయతీ ఎన్నికల్లో ఏ మాత్రం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ఊసేలేని బీజేపీ.. హుజూర్నగర్ నియోజకవర్గానికి చెందిన చల్లా శ్రీలతారెడ్డి ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అయినా ఈ ప్రాంతంలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఒక్కటంటే ఒక్క స్థానం కూడా ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలవలేకపోయారు. ఓ వైపు జిల్లా అధ్యక్షురాలు, మరో వైపు గతంలో హుజూర్నగర్ ఎమ్మెల్యేగా పనిచేసిన శానంపూడి సైదిరెడ్డి కూడా తన అనుచర వర్గాన్ని గెలిపించుకోలేకపోవడంతో ఖాతా తెరవలేకపోయింది. ఫ రాష్ట్ర మంత్రి ఇలాఖా హుజూర్‌నగర్‌లో దూసుకెళ్లిన పార్టీ ఫ 29చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారుల విజయం సీపీఐ బలపర్చిన అభ్యర్థులు రెండు స్థానాలను కై వసం చేసుకున్నారు. ఈ రెండు స్థానాలు కూడా గరిడేపల్లి మండలంలోని ఆ పార్టీ చేజిక్కించుకుంది. స్వతంత్ర అభ్యర్థులు ఐదుచోట్ల ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
ప్రణాళికా బద్ధంగా పంచాయతీ ఎన్నికలు
నేరేడుచర్ల: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రజాస్వామ్యయుతంగా, ప్రణాళికా బద్ధంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ తేజస్ నంద్ లాల్‌పవార్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం నేరేడుచర్ల మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్‌ను పరిశీలించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అంతా సిద్ధం చేశామన్నారు. తక్కువ ఓటర్లు ఉన్న కేంద్రాల్లో పోలింగ్ పూర్తి అయినప్పటికీ కేంద్రాన్ని మూసివేయవద్దని కేటాయించిన సమయం వరకు తెరుచుకొని ఉండాలన్నారు. పోలింగ్ సమయం లోపు కేంద్రాల్లోని క్యూలైన్లో ఉన్న ఓటర్లుకు టోకెన్లు జారీ చేయాలన్నారు. కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రం, లెక్కింపు కేంద్రం వేరువేరుగా ఉన్న ప్రాంతాల్లో పోలింగ్ పూర్తి కాగానే లెక్కింపు కేంద్రానికి బ్యాలెట్ పేపర్లు పోలీస్ భద్రత మధ్య తరలించాలన్నారు. మధ్యాహ్నం 2గంటలకు తప్పనిసరిగా వీడియో తీస్తూ బ్యాలెట్ పేపర్లు తెరిచి లెక్కింపు ప్రక్రియను ప్రారంభించాలన్నారు. అదే విధంగా కౌంటింగ్ టెబుల్‌కు రెండు, మూడు అడుగుల దూరంలో అభ్యర్థులు ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రాష్ట్ర ఎన్నికల క మిషన్ ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తరువాత స్టేజ్–2 అధికారులు ముందుగా జిల్లా ఎన్నికల అధికారితో గానీ, జనరల్ అబ్జర్వర్తోగానీ అనుమతి తీసుకొని ఫలితాలు ప్రకటించాలన్నారు. ఫలితాల అనుమతి కోసం కలెక్టరేట్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సిబ్బంది ఎన్నికల కేంద్రాల వద్ద పరిస్థితిని గమనించి జిల్లా టీమ్‌కు గానీ, మండల టీంకు గానీ సమాచారం అందిస్తే అవసరమైన అదనపు సిబ్బందిని పోలీస్ భద్రతను సకాలంలో పంపిస్తామన్నారు. లెక్కింపు పూర్తయి ఫలితాలు ప్రకటించిన తరువాత ఉప సర్పంచ్ ఎన్నిక కోసం నోటీసులు జారీ చేసి సంతకాలు తీసుకోవాలన్నారు. సాధ్య మైనందత వరకు అదే రోజు పూర్తి చేయాలని, అవసరమైతే రెండవ సారి నోటీసులు జారీ చేయాలన్నారు. సమావేశంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ అనూష, మండల ప్రత్యేక అధికారి మోహన్‌బాబు, తహసీల్దార్ సైదులు, ఎంపీడీఓ సోమ సుందర్‌రెడ్డి, ఎంపీఓ నాగరాజు, ఎస్ఐ రవీందర్‌నాయక్‌తో పాటు పోలింగ్ సిబ్బంది ఉన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారు
మునగాల: మునగాలలో ఈనెల 14న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యే అండదండలతో ఎన్నిల ఫలితాలను తారుమారు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆరోపించారు. మంగళవారం మునగాలలో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి వేట నాగలక్ష్మి నివాసానికి చేరుకొని పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. మునగాల మేజర్ గ్రామపంచాయతీలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి వేట నాగలక్ష్మికి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి నల్లపాటి ప్రమీల కంటే మెజార్టీ ఓట్లు వచ్చినప్పటీకీ ప్రమీల భర్త శ్రీనివాస్ తన సతీమణి అప్రజాస్వామికంగా విజయం సాధించేలా ఎన్నికల సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి ఫలితాలను తారుమారు చేయించారని ధ్వజమెత్తారు. ఎన్నికల సిబ్బంది, పోలీస్ యంత్రాంగంతో కుమ్మకై ్క వ్యవహరించిన తీరుపై తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. అంగబలం, అర్ధబలంతో కాంగ్రెస్ నాయకులు అర్ధరాత్రి పోలీసులు, ఎన్నికల సిబ్బందిని ప్రలోభాలకు గురిచేసి ఫలితాలను తారుమారు చేసి ఐదుఓట్ల మెజార్టీతో గెలిచినట్లు ప్రకటింపజేయడం హాస్యాస్పదమన్నారు. రిటర్నింగ్ అధికారి, కోదాడ డీఎస్పీ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి, బీఆర్ఎస్కు చెందినవారిని ఓట్లు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. రీకౌంటింగ్ కోరినా అవకాశం ఇవ్వకుండా ఎన్నికల అధికారి ఏకపక్షంగా ప్రమీల గెలిచినట్లు ప్రకటించారన్నారు. ఈ విషయమై కలెక్టర్, ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేయడమే కాక, బీఆర్ఎస్ లీగల్ సెల్‌ను ఆశ్రయించి నాగలక్ష్మి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నైతిక విజయం వేట నాగలక్ష్మిదే అని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్, నాయకులు సుంకర అజయ్‌కుమార్ , కందిబండ సత్యనారాయణ, ఎల్పి.రామయ్య, ఎల్.నాగబాబు, వేట శివాజీ, నల్లపాటి నాగేశ్వరరావు, దొంగరి శ్రీనివాసరావు, సీతరాములు, వసంత్‌కుమార్, అమర్నాథ్, జానీ, సైదా, వెంకన్న పాల్గొన్నారు.ఫ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ఆరోపణ -
సమస్యలు పరిష్కరించాలి
మఠంపల్లి: ఆలయాల్లో భక్తులకు సేవలందిస్తున్న అర్చక, ఉద్యోగ, సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డీవీఎస్శర్మ, దేవాదాయశాఖ వెల్ఫేర్‌బోర్డు మెంబర్ శ్రవణ్‌కుమారాచార్యులు కోరారు. మంగళవారం మట్టపల్లిలో నిర్వహించిన సంఘం సమావేశంలో మాట్లాడారు. ఈనెల 24న దర్వేశిపురం క్షేత్రంలో అర్చక, ఉద్యోగ సంఘం చైర్మన్ ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి జిల్లాలో 6ఏ,6బీ,6సీ ఆలయాల్లో పనిచేస్తున్న స్వీపరు నుంచి ప్రధాన అర్చకుల వరకు హాజరుకాలని కోరారు. సమావేశంలో దామోదర్‌రావు, ఉపేందర్‌రెడ్డి, కృష్ణమాచార్యులు, శ్రీనివాసాచార్యులు, పద్మనాభా చార్యులు, మార్తిదుర్గాప్రసాద్, కుమ్మరికుంట్ల బదరీనారాయణా చార్యులు, ఆంజనేయాచార్యులు, రాజేష్, రమేష్, అంజి పాల్గొన్నారు. -
నేడు ఏడు మండలాల్ల్లో సెలవు
భానుపురి (సూర్యాపేట) : మూడో విడత హుజూర్నగర్ నియోజకవర్గంలో బుధవారం మూడో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో స్థానిక సెలవుగా ప్రకటించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద్లాల్ పవార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చింతలపాలెం, గరిడేపల్లి, హుజూర్నగర్, మఠంపల్లి, మేళ్లచెర్వు, నేరేడుచర్ల, పాలకవీడు మండలాల పరిధిలో పోలింగ్ రోజు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించినట్లు పేర్కొన్నారు. పటిష్ట పోలీస్ బందో బస్తుహుజూర్నగర్ : హుజూర్నగర్ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హుజూర్నగర్, కోదాడ సీఐలు చరమందరాజు, ప్రతాపలింగం తెలిపారు. రెండు సర్కిళ్ల పరిధిలోని ఏడు మండలాలకు ఎన్నికల విధుల కోసం ఇద్దరు అడిషినల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 17 మంది సీఐలు, 50 మంది ఎస్ఐలు, సుమారు 800మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, ప్రత్యేక పోలీసులు, ఇతర సిబ్బంది మొత్తం కలిపి విధులు నిర్వహించనున్నట్లు వివరించారు. కేసుల పరిష్కారానికి కృషి చేయాలి చివ్వెంల(సూర్యాపేట) : జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈనెల 21న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా న్యాయవాదులు కృషిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సూర్యాపేట బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి రాధాకృష్ణ చౌహాన్, సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు న్యాయవాదులు పాల్గొన్నారు,. కోర్టు భవన నిర్మాణానికి కృషి చేయాలని వినతి చివ్వెంల(సూర్యాపేట): మాజీ మంత్రి కేటీఆర్‌ను మంగళవారం సూర్యాపేట పట్టణానికి చెందిన న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిశారు. గత ప్రభుత్వం కొత్త కోర్టు కోసం ఇచ్చిన స్థలంలో భవన నిర్మాణానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, న్యాయవాదులు తల్లమళ్ల హస్సెన్, నల్ల గుంట్ల అయోధ్య, నంద్యాల దయాకర్ రెడ్డి, మోదుగు వెంకట్ రెడ్డి, మీలా రమేష్, గోండ్రాల అశోక్, అల్లంనేని వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. -
ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
హుజుర్నగర్(గరిడేపల్లి) : ఎన్నికల విధుల నిర్వహణలో పోలీస్‌సిబ్బంది నిర్లక్ష్యం వహించొద్దని జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు. మూడో దశ గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గరిడేపల్లి మండల పరిధిలో ఎన్నికల విధులు నిర్వర్తించనున్న పోలీస్ సిబ్బందికి మంగళవారం గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్ సిబ్బంది పాత్ర కీలకమన్నారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దన్నారు. విధులు పూర్తయ్యే వరకు కేటాయించిన ప్రాంతాలను విడిచిపెట్టవద్దని, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను క్రమపద్ధతిలో ఉంచాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు కఠినంగా అమలు చేయాలన్నారు. ఓటర్లు సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకువస్తున్నారా అనే అంశంపై నిఘా ఉంచాలన్నారు. ఎన్నికల కోడ్ (ఎంసీసీ) నియమాలను కచ్చితంగా పాటిస్తూ, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. విధుల నిర్వహణలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఉన్నత అధికారులకు తెలియజేయాలని, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. గరిడేపల్లి మండలంలోని పొనుగోడు, వెలిదండ, గడ్డిపల్లి, కుతుబ్షాపురం, గానుగబండ, గారకుంట తండా, కల్మలచెరువు, శీత్ల తండా, సొమ్ల తండా, లుంబ తండా, రాయనిగూడెం, రంగాపురం, కీతవరిగూడెం గ్రామాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ బి. శ్రీనివాస్ రెడ్డి, హుజూర్నగర్ సీఐ జి. చరమంద రాజు, మునగాల సీఐ రామకృష్ణా రెడ్డి, గరిడేపల్లి ఎస్ఐ నరేష్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
చివరి సంగ్రామం
హుజూర్నగర్ నియోజకవర్గంలో 124 పంచాయతీలు, 1,061 వార్డులకు నేడు ఎన్నికలు ఫ ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ఫ సాయంత్రానికి తేలనున్న అభ్యర్థుల భవితవ్యం ఫ ఓటు హక్కు వినియోగించుకోనున్న 1,92,617 మంది ఓటర్లు ఫ ఇప్పటికే 22 జీపీలు, 257 వార్డులు ఏకగ్రీవంసూర్యాపేట / హుజూర్నగర్ : పంచాయతీ పోరు చివరి అంకానికి చేరింది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మూడో విడతలో హుజూర్నగర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఏకగ్రీవమైనవి పోగా మిగిలిన 124 గ్రామపంచాయతీలు, 1,061 వార్డులకు బుధవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. 2గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలు వెల్లడిస్తారు. చివరి విడతలో 1,92,617 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మంగళవారం మధ్యాహ్నం నుంచే సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎన్నికల సామగ్రి తీసుకొని వెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. ఏడు మండలాల్లో.. మూడో విడతకు సంబంధించి హుజూర్నగర్, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకవీడు మండలాల పరిధిలోని 146 గ్రామపంచాయతీలు, 1,318 వార్డులకు ఈనెల 2వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించగా 9వ తేదీన విత్‌డ్రాకు అవకాశమిచ్చి అదేరోజున అభ్యర్థుల తుది జాబితాను ప్రదర్శించారు. ఇందులో 22 పంచాయతీలు, 257 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన 124 సర్పంచ్ స్థానాలకు 371 మంది అభ్యర్థులు, 1,061 వార్డులకు 2,452 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల విధుల్లో సిబ్బంది.. మూడో విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిబ్బంది నియామకం నుంచి బ్యాలెట్ పత్రాల వరకు అన్నింటినీ సమకూర్చుకున్నారు. ఏడు మండలాల్లో ఏర్పాటు చేసిన 7 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి 45 రూట్ల ద్వారా మంగళవారం మధ్యాహ్నం నుంచే ఎన్నికల సిబ్బందితో పాటు పోలింగ్ సామగ్రిని 116 పెద్దవాహనాలు, మరో 64 చిన్న వాహనాల్లో గ్రామాలకు తరలించారు. 259 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 1,176 పోలింగ్ కేంద్రాల్లో బుధవారం 1,92,617 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1,538 మంది పీఓ (ప్రిసైడింగ్ అధికారి), 2026 మంది ఓపీఓలు, 183 మంది స్టేజ్ –2 అధికారులు, 50 మంది రూట్ ఆఫీసర్లు, 57 మంది మైక్రో అబ్జర్వర్లు తమకు కేటాయించిన విధుల్లో చేరారు. మరో ఏడుగురు వ్యయ పరిశీలకులు ఉన్నారు. వీరే కాకుండా జోనల్ ఆఫీసర్లు 26 మంది, 14 ఎఫ్ఎస్టీ, మరో ఎస్ఎస్టీ బృందం విధుల్లో చేరారు. ఇప్పటికే తమకు కేటాయించిన పంచాయతీలకు చేరుకున్న వీరంతా తెల్లవారుజాము నుంచే పోలింగ్‌కు అనుగుణంగా 1,294 బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేసుకున్నారు. ఉదయం 7గంటల నుంచే పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టంగా.. ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ఇదేవిధంగా చివరి దశను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పనిచేస్తోంది. ప్రధానంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. ఇక్కడ అదనపు బలగాలు, సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ నడుమ పోలింగ్ జరగనుంది. మూడో విడతలోఉన్న 7 మండలాల్లో 234 సమస్యాత్మక ప్రాంతాలను అధికారులు గుర్తించారు. వెబ్ కాస్టింగ్ కోసం 105 గ్రామపంచాయతీలు, 220 ప్రాంతాలను గుర్తించి ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. అత్యధికంగా గరిడేపల్లి మండలంలో41,985 మంది ఓటర్లు హుజూర్నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో ఉన్న గ్రామపంచాయతీల్లో దాదాపు 1,92,617 మంది ఓటర్లు ఓటు వేసి అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇందులో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. ఓటర్లలో పురుషులు 93,658 మంది, మహిళలు 98,952 మంది, ఇతరులు ఏడుగురు నమోదై ఉన్నారు. అత్యధికంగా గరిడేపల్లి మండలంలో 41,985 మంది ఓటర్లు ఉన్నారు. చింతలపాలెంలో 26,056 మంది, హుజూర్‌నగర్‌లో 20,467 మంది, మఠంపల్లిలో 35,265 మంది, మేళ్లచెర్వులో 29,678 మంది, నేరేడుచర్లలో 20,550 మంది, పాలకవీడు మండలంలో 18,616 మంది చొప్పున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని సర్పంచ్, వార్డు సభ్యులను ఎన్నుకోనున్నారు. మండలం ఏకగ్రీవం ఎన్నికలుజరిగే పోలింగ్ ఓటర్లు గ్రామాలు స్టేషన్లు చింతలపాలెం 01 15 140 26,056 గరిడేపల్లి 08 25 252 41,985 హుజూర్నగర్ 01 10 102 20467 మఠంపల్లి 03 26 230 35265 మేళ్లచెరువు 03 13 141 29678 నేరేడుచర్ల 03 16 151 20550 పాలకవీడు 03 19 160 18616 మొత్తం 22 124 1,176 1,92,617 -
మిట్టగూడెంలో ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రం
హుజూర్నగర్ : హుజూర్నగర్ మండలం వేపలసింగారం పరిధిలోని మిట్టగూడెంలో ఏర్పాటు చేసిన ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మంగళవారం పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. వేపల సింగారం గ్రామంలోని 14 వార్డుల్లో 4,396 మంది ఓటర్లు ఉన్నారని, ఓటు వేసేందుకు వచ్చిన వారికి అన్ని మౌళిక వసతులు కల్పించాలన్నారు. దివ్యాంగులకు వీల్ చైర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటేయాలని కోరారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది, ప్రజలందరూ సహకరించాలన్నారు. పటిష్ట బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్టీఓ శ్రీనివాసులు, ఎంపీడీఓ సుమంత్ రెడ్డి, తహసీల్దార్ కవిత, ఎంపీఓ లావణ్య, పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్, ఆర్ఓలు, ఎన్నికల సిబ్బంది తదితరులు ఉన్నారు. -
మట్టపల్లిలో ధనుర్మాసోత్సవాలు ప్రారంభం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మంగళవారం ధనుర్మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారు జామునే శ్రీలక్ష్మీనరసింహస్వామి తో పాటు శ్రీగోదాదేవి రంగనాయకుల స్వామి వార్లకు ప్రత్యేక పూజలు, మహానివేదనతో వేడుకలకు శ్రీకారం చుట్టారు. జనవరి 11న కూడారై ఉత్సవం,14న శ్రీగోదాదేవి రంగనాయకులస్వామి కల్యాణం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నిత్యకల్యాణంమట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని మంగళవారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం చేపట్టారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. ఆలయ తిరుమాడ వీధుల్లో శ్రీస్వామి వారిని గరుడవాహనంపై ఊరేగించారు. -
కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేస్తున్న పోలీసులు
గరిడేపల్లి: హుజూర్నగర్ నియోజకవర్గంలో కొందరు పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, పోనుగోడు, గడ్డిపల్లి, కుత్భుషాపురం గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొందరు ఎస్ఐలు చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. చింతలపాలెం, గరిడేపల్లి పరిధిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, బైండోవర్ కేసులు పెడుతున్నారని తెలిపారు. తమ నాయకులపై అక్రమ కేసులు పెడితే సహించబోమని హెచ్చరించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ప్రజలకు కళ్లముందే కనిపిస్తోందన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలనే కాంగ్రెస్ సరిగా అమలు చేయలేకపోతోందని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి పోలీసు స్టేషన్‌కు పిలిపించి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వాలు ఎక్కువ కాలం నిలవవని పేర్కొన్నారు. కేసీఆర్‌ను వదులుకున్నామన్న ప్రశ్చాత్తాపం ప్రజల్లో మొదలైందన్నారు. మరో రెండేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ప్రజలే చెబుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ బీఆర్ఎస్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, కడియం వెంకట్‌రెడ్డి, మాశెట్టి శ్రీహరి, నల్లపాటి భాస్కర్, మేళ్లచెర్వు వెంకటరమణ పాల్గొన్నారు. మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఆరోపణ -
నిషేధాజ్ఞలు అమలు
● కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ భానుపురి (సూర్యాపేట) : గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద్ లాల్ పవార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాశాంతికి, ప్రశాంతతకు భంగం కలించే, పంచాయతీ ఎన్నిలకు అడ్డంకులు, అసౌకర్యం అల్లర్లు లేదా ఘర్షణ కలిగించే అవకాశం ఉన్న వాటిని నివారించడానికి ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ముందస్తు రాతపూర్వక అనుమతి లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ సమావేశాలు, ప్రదర్శనలు, ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించకూడదని సూచించారు. ఈ నిషేధాజ్ఞలు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తాయని, పురపాలక ప్రాంతాలకు వర్తించవని ఆయన స్పష్టం చేశారు. ఏ వ్యక్తి తన వద్ద ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఈ ఉత్తర్వు అమలులో ఉన్న కాలంలో బహిరంగ ప్రదేశాలలోకి తీసుకొని వెళ్లకూడదని సూచించారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలి సూర్యాపేటటౌన్ : పద్నాలుగేళ్ల వయసు కలిగిన బాలికలకు సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లా వైద్యాధికారులకు హెచ్‌పీవి వ్యాక్సిన్ సన్నద్ధతపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ దేశంలోసర్వైకల్ క్యాన్సర్ అధికంగా ఉందని, మరణాలు కూడా అధికంగా సంభవిస్తున్నాయన్నారు. హెచ్‌పీవి(హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ ద్వారా 83శాతం సర్వైకల్ క్యాన్సర్ రాకుండా నియంత్రించవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ కోటి రత్నం, డాక్టర్ జి.చంద్రశేఖర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రదీప్, డాక్టర్ అశ్రిత, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో సోమవారం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం చేపట్టారు. అనంతరం కల్యాణం జరిపి స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో గరుడ వాహనంపై ఊరేగించారు. ఆ తర్వాత మహానివేదనతో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీచేశారు. అలాగే క్షేత్రంలోని శివాలయంలో శ్రీపార్వతీ రామలింగేశ్వరస్వామికి ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, దుర్గాప్రసాద్‌శర్మ, సీతారామాచార్యులు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో ఏకాదశి పూజలుయాదగిరిగుట్ట : ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో వజ్రవైడూర్యాలతో అలంకృతులైన ఉత్సవమూర్తులకు ఆగమశాస్త్రం ప్రకారంగా వూదమంత్ర పఠనాలతో అర్చకులు లక్ష పుష్పార్చన చేశారు.ఈ వేడుకలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం చేసి, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకారమండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, స్వామి, అమ్మవారికి నిత్య తిరుకల్యాణం, బ్రహ్మోత్సవం, ఆరాధనలు చేపట్టారు. -
సర్పంచ్‌లకు హరీష్‌రావు సత్కారం
నాంపల్లి, మర్రిగూడ : నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన సర్పంచ్, ఉస సర్పంచ్, వార్డు సభ్యులను మాజీ మంత్రి హరీష్‌రావు సోమవారం ఘనంగా సత్కరించారు. కొత్తగా గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని మాజీ మంత్రి హరీష్‌రావ్ దిశానిర్ధేశం చేశారు. అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్ మాతృమూర్తి, సోదరుడి ప్రథమ వర్ధంతికి హజరయ్యారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నోముల భగత్, నాయకులు పాల్వాయి స్రవంతి, నర్సింహారావు, సర్పంచ్ నక్క చంద్రశేఖర్, ఇట్టెం వెంకట్‌రెడ్డి, రోరె ప్రమీల, రాములు, చరణ్, కర్నె యాదయ్య, మాల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంటు జగదీశ్వర్, సర్పంచ్‌లు రొక్కం భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్, ఆంబోతు తులసీరామ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
భానుపురి (సూర్యాపేట) : అధికారులు గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవి నాయక్ ఆదేశించారు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌తో ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మూడవ విడత ఎన్నికలు జరిగే చింతలపాలెం, గరిడేపల్లి, హుజూర్నగర్, మఠంపల్లి, మేళ్లచెరువు, నేరేడుచర్ల, పాలకవీడు మండలాల్లో పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించామన్నారు. 124 సర్పంచ్, 1,176 వార్డుల ఎన్నికల నిర్వహణకు 30 శాతం రిజర్వ్ సిబ్బంది కలుపుకుని ప్రిసైడింగ్ అధికారులు 1,538, ఓపీఓలు 2026 మందిని ర్యాండమైజేషన్ చేశారు. ఈ ప్రక్రియలో జెడ్పీ సీఈఓ వి వి అప్పారావు, డీపీఓ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.ఫ ఎన్నికల పరిశీలకుడు రవి నాయక్ -
మునగాలలో రీకౌంటింగ్ చేయాలి
కోదాడ: మునగాలలో రీకౌంటింగ్ చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం కోదాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు. అక్రమ సంపాదనతో మునగాల మండలంలో మాఫియాడాన్‌గా మారిన వ్యక్తికి లబ్ధి చేకూర్చడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో గెలుపుకోసం పోరాడిన నిరుపేద మహిళకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిలు అన్యాయం చేశారని ఆరోపించారు. అధికారుల అండతో కౌంటింగ్‌ను హైజాక్ చేసి మాఫియాడాన్ ఐదు ఓట్లతో గెలిచినట్లు ప్రకటింప జేశారని పేర్కొన్నారు. కోదాడ నియోజకవర్గంలో తాను ఎంపిక చేసిన అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే ప్రాధేయపడినా అన్ని చోట్లా ఓడిపోయారని, కాంగ్రెస్ పని ఐపోయిందని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా గెలిచిన తమ పార్టీ మద్దతుదారులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ అద్యక్షుడు ఎస్కె. నయీం, తొగరు రమేష్, కందిబండ సత్యనారాయణ, శెట్టి సురేష్‌నాయుడు, మీసాల శోభారాణి, కర్ల సుందర్‌బాబు, మాదాల ఉపేంధర్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ -
ఎవరైతే అభివృద్ధి చెందుతుందో ఆలోచించండి
హుజూర్నగర్ : ఎవరు సర్పంచ్ అయితే గ్రామం అభివృద్ధి చెందుతుందో ప్రజలు ఆలోచించాలని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. సోమవారం హుజూర్నగర్ పట్టణంలో జర్నలిస్టులు, స్థానిక నాయకులతో కలిసి మంత్రి మార్నింగ్ వాక్ నిర్వహించారు. అనంతరం మంత్రి నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో నిలబడిన వ్యక్తి గుణగణాలు, సత్ప్రవర్తన, సేవా గుణం కలిగి అభివృద్ధి చేసేవ్యక్తిత్వం పరిశీలించి ఓటు వేయాలని కోరారు. ప్రలోభాలకు లోనైతే ఆ తర్వాత బాధపడేది మీరేనని ఆయన చెప్పారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సులభం అవుతుందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా రెండేళ్లలో వందల కోట్ల రూపాయలతో నూతనల్ లిఫ్ట్ ఏర్పాటుతోపాటు పాత లిఫ్టులు మరమ్మతులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తున్నామన్నారు. మార్నింగ్ వాక్‌లో పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ మున్సిపల్ మాజీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, డీసీసీ కార్యదర్శి గెల్లి రవి, నాయకులు దొంగరి వెంకటేశ్వర్లు, జక్కుల మల్ల య్య, ముషం సత్యనారాయణ, ఆదెర్ల శ్రీనివాసరెడ్డి, కోడి ఉపేందర్ యాదవ్, కుక్కడపు మహేష్, యోహాన్, బెల్లకొండ శ్రీనివాస్ పాల్గొన్నారు. సూర్యాపేటలో స్థలం కేటాయించాలి సూర్యాపేట పట్టణంలో ప్రభుత్వ పెన్షనర్ల సంఘానికి స్థలం కేటాయించాలని రాష్ట్ర పెన్షనర్ల సంఘం ఉపాధ్యక్షుడు రావిళ్ల సీతారామయ్య, జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు కోరారు. సోమవారం హుజూర్ నగర్లో మంత్రి ఉత్తమ్‌ను కలిసి పెన్షనర్ల సంఘం నేతలు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థలం కేటాయిస్తే కార్యాలయం నిర్మించు కోవటానికి సిద్ధంగా ఉన్నా మన్నారు. కలెక్టర్‌కు సిఫార్సు చేయాలని కోరారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని, హెల్త్‌కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఐదు డీఏలు పెండింగ్ లో పెట్టడం విచారకరం అని అన్నారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం నేతలు ఎంఎస్ఎ రాజు, వీరారెడ్డి పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
పల్లెల్లో పాగా
రెండు విడతల్లోనూ అధికార పార్టీకే పట్టంరెండో విడత ఎన్నికల్లో భాగంగా నల్లగొండ జిల్లాలోని మాడుగులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో న్యాయ వివాదంతో ఎన్నికలు ఆగిపోయాయి. అదే మండలంలోని అభంగాపురంలో సర్పంచ్ స్థానం, అనుముల మండలంలోని పేరూరులో సర్పంచ్ స్థానం ఎస్జీలకు రిజర్వ్ కావడంతో.. అభ్యర్థుల్లేక ఎన్నికలు జరుగలేదు. దీంతో 3 గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ఆగిపోయాయి. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రెండు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రెండు విడతల్లో మూడు గ్రామాలు మినహా 1240 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 772 స్థానాలను కై వసం చేసుకుని నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట అని మరోసారి నిరూపించారు. ఇక, బీఆర్ఎస్ పార్టీ రెండు విడతల్లో 355 స్థానాలను దక్కించుకుని రెండో స్థానంలో ఉంది. బీజేపీ 13 స్థానాల్లోనే గెలుపొంది ప్రభావం చూపలేకపోయింది. అధికార పార్టీకే అందలం.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు అధికార పార్టీనే అందలం ఎక్కించారు. మొదటి విడతలో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల పరిధిలో 630 పంచాయతీల్లో, రెండో విడతలో 610 స్థానాల్లో.. రెండూ కలిపి 1240 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు మొదటి విడతలో 394 మంది, రెండో విడతలో 378 స్థానాల్లో విజయం సాధించారు. రెండు విడతల్లో 772 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు రెండు విడతల్లో 62.25 శాతం సర్పంచ్ స్థానాలు కై వసం చేసుకున్నారు. బీఆర్ఎస్కు 28.63 శాతం స్థానాలు.. రెండు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు ఉమ్మడి జిల్లాలో 355 స్థానాలను దక్కించుకున్నారు. మొదటి విడతలో 186, రెండో విడతలో 169 స్థానాల్లో సర్పంచ్‌లుగా గెలుపొందారు. రెండు విడతల్లో బీఆర్ఎస్ మద్దతుదారులకు 28.63 శాతం స్థానాలు లభించాయి. ఇక, సీపీఎం, సీపీఐ, స్వతంత్రులకు వంద స్థానాలు (8.07 శాతం) లభించాయి. అందులో స్వతంత్రులే అత్యధికంగా ఉన్నారు. ఇక బీజేపీ మద్దతుదారులకు 13 స్థానాలు (1.05 శాతం) లభించాయి. మొదటి విడతలో వివిధ పార్టీల మద్దతుదారులకు లభించిన స్థానాలు జిల్లా జీపీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సీపీఐ/సీపీఎం/ ఇతరులు నల్లగొండ 318 213 79 3 23 సూర్యాపేట 159 92 55 3 9 యాదాద్రి 153 89 52 3 9 మొత్తం 630 394 186 9 41 రెండో విడతలో జిల్లా జీపీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సీపీఐ/సీపీఎం/ ఇతరులు నల్లగొండ 282 194 67 1 17 సూర్యాపేట 181 114 40 2 25 యాదాద్రి 150 70 62 1 17 మొత్తం 613 378 169 4 59 ఫ 1,243 పంచాయతీల్లో 871 స్థానాలు దక్కించుకున్న హస్తం పార్టీ మద్దతుదారులు ఫ మరోసారి కాంగ్రెస్‌కు కంచుకోట అని నిరూపించిన ఉమ్మడి జిల్లా ఫ 355 స్థానాలతో రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ ఫ బీజేపీకి వచ్చింది 13 స్థానాలే.. ఫ సీపీఐ, సీపీఎం, స్వతంత్రులకు నామమాత్రంగానే.. -
ప్రచారానికి తెర.. ప్రలోభాల ఎర
హుజూర్నగర్ : తుది దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో పరిసమాప్తం అయ్యింది. హుజూర్నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో బుధవారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి అభ్యర్థులు ఎవరికివారు గప్‌చుప్‌గా ప్రలోభాల ఎరకు తెరలేపారు. డబ్బు, మద్యం, చికెన్ పంపిణీతో పాటు విందులు సన్నాహాలు చేస్తున్నారు. చివరి రోజు ప్రచారం హోరాహోరీగా సాగింది. తమ పార్టీ మద్దతుదారులను గెలిపించేందుకు ప్రధాన పార్టీల నేతలు జోరుగా ప్రచారం నిర్వహించారు. విజయమే లక్ష్యంగా..హుజూర్నగర్, చింతలపాలెం, గరిడేపల్లి, మఠంపల్లి, మేళ్లచెరువు, నేరేడుచర్ల, పాలకవీడు మండలాల్లో సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఆయా గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. చివరి రోజు సోమవారం సైతం తమ గుర్తుల ప్రచారంతో హోరెత్తించారు. బహిరంగ ప్రచారం ముగిసిన వెంటనే అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపారు. ప్రధానంగా జనరల్, బీసీ స్థానాల అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ప్రచారం ముగియగానే సాయంత్రం, రాత్రి వేళల్లో అభ్యర్థులు.. తమ ప్రత్యర్థులు ఓటుకు ఎంత ఇస్తున్నారో తెలుసుకుని అంతకంటే కొంత ఎక్కువ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎలాగైనా గెలిచితీరాలని డబ్బు, మద్యంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు తమ వంతు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో ఓటుకు రూ. వెయ్యి నుంచి రూ. 3 వేలకు పైగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితా ఆధారంగా తమకు పడే ఓట్ల కోసం తమ నమ్మకస్తులతో గుట్టుచప్పుడు కాకుండా డబ్బుల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా.. ఏ దారిలో ఓటరుకు డబ్బులు చేరవేయాలని అభ్యర్థులు చూస్తుంటే.. డబ్బులు ఎవరు? ఎంత పంచుతున్నారు అని ఓటర్లు ఆరా తీస్తుండటం గమనార్హం. ఖర్చుకు వెనుకాడకుండా..నామినేషన్ల ఉపసంహరణ రోజు నుంచి కొందరు నాయకులు, సానుభూతిపరులను మద్యం మత్తులో ముంచేశారు. ఇప్పుడు ఓటర్లు చేజారకుండా ఉండేందుకు అభ్యర్థులు ఆయా ఓటర్లను వారి వాడలో ప్రత్యేక సిట్టింగులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం మద్యం పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి వారికి తాగినంత అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదే వాతావరణం నేడు, రేపు రెండు రోజుల పాటు పోటీలో ఉన్న అభ్యర్థులకు తప్పేలా లేదని తెలుస్తోంది. తొలుత ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకే ఆలోచించిన అభ్యర్థులు పోలింగ్ సమయం దగ్గర పడటంతో అప్పుతెచ్చిమరీ ఒకరిని మించి మరొకరు ఖర్చు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. పలువురు అభ్యర్థులు తమకు వచ్చిన ఎన్నికల గుర్తులను ఓటర్లకు పంచుతున్నారు. ప్రధానంగా ఉంగరం గుర్తు వచ్చిన అభ్యర్థులు కొందరు వెండి, రాగి ఉంగరాలు అందజేస్తున్నట్లు సమాచారం. స్టూలు గుర్తు వచ్చిన వారు వాటిని పంచుతున్నట్లు తెలిసింది. ఇంకా మిక్సీలు, చీరలు, సెల్ఫోన్లు, క్రికెట్ బ్యాట్లు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.జోరుగా ఎన్నికల ప్రచారం.. మూడో విడత ఎన్నికలు జరుగుతున్న హుజూర్నగర్, చింతలపాలెం, గరిడేపల్లి, మఠంపల్లి, మేళ్లచెరువు, నేరేడుచర్ల, పాలకవీడు మండలాల్లో చివరి రోజైన సోమవారం ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి తమను గెలిపిస్తే గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని హామీల వర్షం కురిపించారు. అంతే కాకుండా తమ గ్రామాల పరిధిలో ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక మేనిఫెస్టోను కూడా ఓటర్లకు పంచారు. ముగిసిన మూడో దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం మద్యం, డబ్బు, మాంసం పంపిణీ ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి అభ్యర్థుల పాట్లు రేపే హుజూర్నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో పోలింగ్ -
యాసంగి పంటకు మూసీనీటి విడుదల
కేతేపల్లి : యాసంగి సాగు కోసం మూసీ ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వల ఆయకట్టుకు సోమవారం అధికారులు నీటిని విడుదల చేశారు. 645 అడుగుల(4.46టీఎంసీలు) గరిష్ఠ నీటిమట్టం గత మూసీ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 644.70 అడుగుల(4.38 టీఎంసీలు) నీరు ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని 35 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఏటా యాసంగి పంటకు మూసీ ప్రాజెక్టు నుంచి డిసెంబర్ 18న కాల్వలకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు ఈ ఏడాది మూడు రోజుల ముందుగానే నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ యాసంగి సీజన్లో ఆరుతడి పంటలకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నాలుగు విడతలుగా సాగు నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. మొదటి విడత 25 రోజుల పాటు నిరంతరాయంగా కాల్వ లకు నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు. నీటిని రైతాంగం పొదుపుగా వాడుకుని చివరి ఆయకట్టుకు చేరే విధంగా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మూసీ ఏఈలు ఉదయ్, మమత, కీర్తి, ఉమామహేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఓటెత్తిన పల్లె జనం
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 89.55 శాతం పోలింగ్ కోదాడ : రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. కోదాడ నియోజకవర్గ పరిధిలోని ఆరు, సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని 2 మండలాల్లోని 158 పంచాయతీలు, 1287 వార్డుల్లో పోలింగ్ జరగగా 2,10,576 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 89.55 శాతం పోలింగ్ నమోదైంది. ఆయా మండలాల్లో 23 పంచాయతీలు, 166 వార్డులు ఏకగ్రీవమైన విషయం విదితమే. ఎన్నికలు జరిగిన అన్ని గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘనలు చోటుచేసుకోలేదు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్‌తోపాటు ఎస్పీ నరసింహ మండలాల్లో పర్యటించి ఎన్నికలు జరుగుతున్న తీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓటేయని 24,561 మంది ఓటర్లు రెండో విడత ఎన్నికలు జరిగిన 8 మండలాల్లో 2,35,137 మంది ఓటర్లుండగా వీరిలో 2,10,576 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. 24,561 మంది ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఎన్నికలు జరిగిన గ్రామాల్లో ఓటర్లు ఉదయం నుంచే తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు బారులుదీరారు. ఓటు వేసేందుకు దూర ప్రాంతాల నుంచి ఓటర్లు గ్రామాలకు తరలిరావడంతో అంతటా సందడి నెలకొంది. పోలింగ్ కేంద్రాల సమీపంలో తమ అభ్యర్థులకు ఓటు వేయాలని పలువురు గుర్తులు పట్టుకొని అభ్యర్థించడం కనిపించింది. చలి ఉన్నప్పటికి లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు తరలివచ్చారు. 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా 9 గంటల వరకు 59,196 మంది (25.18) శాతం తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 9 నుంచి 11 గంటల మధ్యలో 82,047 మంది (34.89) శాతం ఓటుహక్కు వినియోగించకోగా చివరి రెండు గంటల్లో 69,333 మంది (29.48 శాతం) ఓటర్లు ఓటెత్తారు. మొత్తంగా 2,10,576 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోగా 89.55 శాతం పోలింగ్ నమోదైంది. చివ్వెంల మండలంలో అత్యధికంగా.. రెండో విడత ఎన్నికలు జరిగిన 8 మండలాల్లో సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల మండలంలో అత్యధికంగా 91.99 శాతం పోలింగ్ నమోదైంది. 28,155 మంది ఓటర్లు ఉండగా వీరిలో 25,901 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోదాడ నియోజకవర్గ పరిధిలో ఉన్న మోతె మండలంలో అత్యల్పంగా 86.90 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 31,907 మంది ఓటర్లు ఉండగా వీరిలో 27,726 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లలో పురుషులు 89.84 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా మహిళలు 89.28 శాతం మంది ఓటేశారు. ఇతరులు 8 మంది ఉండగా ఐదుగురు మాత్రమే ఓటేశారు. మండలం మొత్తంఓట్లు పోలైనవి శాతం అనంతగిరి 24,294 22,113 91.02 చిలుకూరు 29,790 26,511 88.99 నడిగూడెం 22,862 20,393 89.20 మునగాల 35,945 31,912 88.78 కోదాడ 28.107 25,026 89.04 మోతె 31,907 27,726 86.90 చివ్వెంల 28,155 25,901 91.99 పెన్‌పహాడ్ 34,077 30,994 90.95 మొత్తం 2,35,137 2,10,576 89.55ఫ తొలి విడతకన్నా 0.14 శాతం తక్కువ.. ఫ ఓటేసిన 2,10,576 మంది ఓటర్లు ఫ పురుషులు 89.84 శాతం, మహిళలు 89.28 శాతం ఫ చివ్వెంలలో అత్యధికం.. మోతెలో అత్యల్పం -
మల్లయ్య కుటుంబానికి అండగా ఉంటాం
నూతనకల్ : మల్లయ్య కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. నూతనకల్ మండలంలోని లింగంపల్లిలో ఇటీవల హత్యకు గురైన ఉప్పుల మల్లయ్య కుటుంబ సభ్యులను ఆదివారం ఆయన.. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డితో కలిసి పరామర్శించారు. తుంగతుర్తిలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పదేళ్ల పరిపాలనలో హత్యా రాజకీయాలకు స్వస్తి పలికి పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలు, కార్యకర్తలు కాబోయే సీఎం కేటీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, కంచర్ల భూపాల్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, ఒంటెద్దు నర్సింహారెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, మున్న మల్లయ్య, రజాక్, లింగారెడ్డి, బిక్కి బుచ్చయ్య, మహేశ్వరం మల్లికార్జున్, బత్తుల సాయిలుగౌడ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ వెంకన్న పాల్గొన్నారు. ఫ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ -
అధికార పార్టీదే హవా
కోదాడ: రెండో విడత ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులదే హవా కొనసాగింది. కోదాడ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో అనంతగిరి, మునగాల మినహా మిగతా మండలాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతుదారులు నామమాత్రంగా కూడా పోటీ ఇవ్వలేక పోయారు. మునగాల మండలంలో సీపీఎం అభ్యర్థులు కూడా గట్టిపోటీ నిచ్చారు. కోదాడ నియోజకవర్గ పరిధిలో బీజేపీ అభ్యర్థులు ఎక్కడా గెలవలేదు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు, సమన్వయ కమిటీలు నిర్ణయించిన అభ్యర్థులపై తలపడిన రెబల్స్ పలుచోట్ల విజయం సాధించారు. మొత్తం 181 పంచాయతీలకు 22 కాంగ్రెస్ ఏకగ్రీవం కాగా 91 చోట్ల బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఇక బీఆర్ఎస్కు ఒక పంచాయతీ ఏకగ్రీవమై 39 పంచాయతీల్లో విజయం సాధించింది. బీజేపీ రెండు, సీపీఐ నాలుగు, సీపీఎం 6, ఇండిపెండెంట్ అభ్యర్థులు 15 పంచాయతీల్లో విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యేలకు మోదం.. ఖేదం.. కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు తన స్వంతగ్రామమైన అనంతగిరిలో తాను ఏరికోరి నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించలేక పోయారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి విజయం సాధించారు. మరో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ తన స్వగ్రామం నడిగూడెం మండలం కరివిరాలలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకున్నారు. అనంతగిరి మండలం అనంతగిరి, మొగలాయికోట, వెంకట్రాంపురం, కొత్తగోల్‌తండా, కోదాడ మండలం గణపవరం, బీక్యాతండా, రామలక్ష్మీపురం, ఎర్రవరం, మంగలితండా, రెడ్లకుంట మునగాల మండలం కోదండరామాపురం, నడిగూడెం మండలం సిరిపురం, చిలుకూరు మండలం పోలేనిగూడెం గ్రామాల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు విజయం సాధించారు. పోరాడి గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులు.. కోదాడ నియోజకవర్గ పరిధిలోని కోదాడ మండలంలో అతిపెద్ద గ్రామమైన కాపుగల్లులో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి విజయబావుటా ఎగురవేశారు. అనంతగిరి మండలంలో బీఆర్ఎస్ గట్టిగానే పోటీనిచ్చింది. ఈ మండలంలోని చనుపల్లి, అమీనాబాద్, బొజ్జగూడతండా, త్రిపురవరం గ్రామాల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. మునగాల మండలంలో నేలమర్రి, రేపాల, బరాఖత్‌గూడెం, తిమ్మారెడ్డిగూడెం, వెంకట్రాంపురం, మాధవరం గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. చిలుకూరు మండలం దూదియతండాలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల మండలంలో 10 గ్రామాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇదే నియోజకవర్గ పరిధిలోని పెన్‌పహాడ్ మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఆరు గ్రామాల్లో విజయ దుందుభి మోగించారు. కోదాడ మండలం అళ్వాలపురం, అనంతగిరి మండలం శాంతినగర్‌లో సీపీఐ విజయం సాధించగా, మునగాల మండలం కొక్కిరేణి, నారాయణగూడెం, నర్సింహులగూడెం, జగన్నాథపురం, కలకోవ గ్రామాల్లో సీపీఎం బలపరిచిన అభ్యర్థులు విజయ కేతనం ఎగురవేశారు. బీజేపీ మద్దతుదారులు చివ్వెంల మండలం తుల్జారావుపేట, పెన్‌పహాడ్ మండల పరిధిలోని అన్నారం బ్రిడ్జి గ్రామ పంచాయతీల్లో విజయం సాధించారు. రెండు విడతల్లోనూ.. జిల్లాలోని 8 మండలాల్లో ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు మొదటి విడత ఫలితాలనే పునరావృతం చేశాయి. రెండు విడతల్లోనూ అధికార పార్టీ మద్దతుదారులదే పైచేయిగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మొదటి విడతలో 90 పంచాయితీలను కై వసం చేసుకోగా, రెండో విడతలో 91 స్థానాలను కై వసం చేసుకున్నారు. బీఆర్ఎస్ మొదటి విడతలో 50 పల్లెల్లో పాగా వేయగా రెండో విడతలో 39 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ రెండు విడతల్లోనూ కేవలం 5 పంచాయతీల్లో గెలిచింది. వామపక్షాలు తొలి విడతలో 9, రెండో విడతలో పది స్థానాల్లో విజయం సాధించింది. ఇక మొదటి విడతలో స్వతంత్రులు ఇద్దరు, రెండో విడతలో 15 మంది గెలిచారు. వీరిలో ఎక్కువ మంది కోదాడకు చెందిన కాంగ్రెస్ రెబల్స్ ఉన్నారు. తొలివిడత మలివిడత ఎన్నికలు జరిగినవి 159 158 (ఏకగ్రీవాలుపోను) కాంగ్రెస్ 90 91 బీఆర్ఎస్ 55 39 బీజేపీ 03 02 సీపీఐ 02 04 సీపీఎం 07 06 స్వతంత్రులు 02 15 రెండో విడతలో పార్టీల వారీగా గెల్చుకున్న స్థానాలు మండలం జీపీలు ఏ/కా కాంగ్రెస్ ఏ/బీ బీఆర్ఎస్ బీజేపీ సీపీఐ సీపీఎం ఇండి అనంతగిరి 20 03 11 00 04 00 01 00 01 చిలుకూరు 17 04 08 01 01 00 02 01 00 నడిగూడెం 16 03 08 00 03 00 00 00 02 మునగాల 22 01 08 00 06 00 00 05 01 కోదాడ 16 02 12 00 01 00 01 00 00 మోతె 29 07 10 00 08 00 00 00 04 చివ్వెంల 32 02 14 00 10 01 00 00 05 పెన్‌పహాడ్ 29 00 20 00 06 01 00 00 02 మొత్తం 181 22 91 01 39 02 04 06 15 (మునగాల పంచాయతీ ఫలితం వెలువడాల్సి ఉంది.)రెండో విడత పల్లె పోరులో అధిక సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్‌కే.. ఫ 91 పంచాయతీల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపు ఫ 15 చోట్ల సత్తాచాటిన కాంగ్రెస్ రెబల్స్ ఫ 39 గ్రామాల్లో బీఆర్ఎస్ మద్దతుదారుల విజయం -
వైభవంగా శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు,అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం చేపట్టారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణం నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి వార్లనుఆలయ తిరుమాడ వీధుల్లో గరుడ వాహనంపై ఊరేగించారు. మహానివేదనతో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. హైకోర్టు అడ్వకేట్‌గా పిడమర్తి వేణుఆత్మకూర్ (ఎస్) : హైకోర్టు అడ్వకేట్‌గా ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని తుమ్మలపెన్‌పహాడ్ గ్రామానికి చెందిన తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడు పిడమర్తి వేణు ప్రమాణం చేశారు. వేణు పాఠశాల విద్యాభ్యాసం సొంత గ్రామంలో, కళాశాల, న్యాయ విద్య కొత్తగూడెం, హైదరాబాద్‌లో పూర్తిచేశారు. తుమ్మల పెన్‌పహాడ్ గ్రామానికి చెందిన దివంగత సీపీఐ ఎంఎల్ జిల్లా నాయకుడు బొర్ర వీరన్న కుమారుడైన వేణు మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో క్రియాశీలకంగా పనిచేశారు. వేణు న్యాయవాదిగా ప్రమాణం చేసిన సందర్భంగా పలువురు అభినందనలు తెలియజేశారు. పటిష్ట బందోబస్తుతోనే పోలింగ్ ప్రశాంతం మునగాల: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 8 మండలాల్లో ఐదంచెల భద్రతతో పటిష్ట బందోబస్తు నిర్వహించడం ద్వారానే ఆదివారం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ నరసింహ తెలిపారు. ఆదివారం ఆయన మునగాల మండలం మాధవరం, మునగాల, కలకోవ, ముకుందాపురం గ్రామాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలకోవలో ఎస్పీ మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గ పరిధిలోని ఆరు, సూర్యాపేట పరిధిలో రెండు మండలాల్లో మొత్తం 158 గ్రామాల్లో ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. సమస్యాత్మక గ్రామాల్లోనూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట కోదాడ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరెడ్డి, పలువురు అధికారులు, పోలీసు సిబ్బంది ఉన్నారు. సూర్యక్షేత్రంలో పూజలు అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యజ్ఞశాలలో మహా సౌరహోమాన్ని నిర్వహించారు. ఆయా పూజా కార్యక్రమాల్లో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితాజనార్దన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, యాదగిరి, అర్చకులు భీంపాండే, అంకిత్‌పాండే, శ్రీరాంపాండే, భక్తులు పాల్గొన్నారు. మూడు ఓట్లతో విజయంపెన్పహాడ్ : పెన్‌పహాడ్ మండల పరిధిలోని భక్తాళాపురంలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి జుట్టుకొండ యమున మూడు ఓట్లు తేడాతో సర్పంచ్‌గా విజయం సాధించింది. యమునకు 501, కాంగ్రెస్ మద్దతుదారు నల్లపు శేషలక్ష్మికి 500 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ చేయాలని అధికారులను శేషలక్ష్మి కోరారు. దీంతో రీ కౌంటింగ్ నిర్వహించారు. ఇందులో శేషలక్ష్మికి వచ్చిన ఓట్లులో రెండు చెల్లనివి గుర్తించారు. దీంతో మూడు ఓట్ల తేడాతో యమున గెలుపొందినట్లు తహసీల్దార్ తెలిపారు. -
నేటితో మూడో విడత ప్రచారానికి తెర
హుజూర్నగర్ : ఈ నెల 17న మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న హుజూర్నగర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. మొత్తం 124 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మండల కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్్ సెంటర్లను ఏర్పాటు చేసి.. పోలింగ్ సామగ్రిని పంపించారు. పోలింగ్ సిబ్బందిని నియమించి రెండు విడతల్లో శిక్షణ పూర్తిచేశారు. ఏడు మండలాల్లో ఎన్నికలు జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గంలో హుజూర్నగర్, చింతలపాలెం, గరిడేపల్లి, మఠంపల్లి, మేళ్లచెరువు, నేరేడుచర్ల, పాలకవీడు మండలాల్లోని తుది విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 146 గ్రామ పంచాయతీలు, 1,316 వార్డులకు 22 పంచాయతీలు, 256 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 124 గ్రామపంచాయతీలు, 1,060 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించగా ప్రచారం హోరాహోరీగా నిర్వహించారు. 16న పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ఈనెల 17న మూడో విడత ఎన్నికల నిర్వహణకు మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషనన్ సెంటర్లకు పోలింగ్ సామగ్రి చేరుకుంది. 16వ తేదీన ఉదయం 7 గంటల నుంచి డిస్ట్రిబ్యూషన్‌న్ సెంటర్ల వద్ద నుంచి సిబ్బంది ఎన్నికల సామగ్రిని తీసుకుని పోలీస్ బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టి గెలిచిన అభ్యర్థులను ప్రకటించి అధికారులు వారికి ధ్రువపత్రాలు అందజేయనున్నారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ పూర్తిచేస్తారు. ఈ నెల 17న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో 48 గంటల ముందే ప్రచారం ముగియనుంది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులకు మిగిలిన రెండు రోజులు కీలకంగా మారాయి. దీంతో అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. తమ అనుచరగణం ఓటర్లకు రహస్యంగా తాయిలాలు, మద్యం, మాసం పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరి కొన్నిచోట్ల పైచేయి సాధించేందుకు నగదు పంపిణీకి ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. మేజర్ గ్రామ పంచాయతీలలో కొందరు ఓటుకు రూ.వెయ్యి నుంచి రెండు వేల వరకు ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో చికెన్, మద్యం పంపిణీ చేసినట్లు తెలిసింది. ఫ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరిన పోలింగ్ సామగ్రి ఫ ఇప్పటికే సిబ్బందికి రెండు విడతల్లో శిక్షణ పూర్తి ఫ 16న పోలింగ్ కేంద్రాలకు తరలనున్న సిబ్బంది ఫ 124 పంచాయతీల్లో ఈనెల 17న తుది దశ పోలింగ్ -
ఫ బరువు..బాధ్యత
ఆర్టీసీ కాదు.. ఎన్నికల బస్సు తిరుమలగిరి(సాగర్) : గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో భాగంగా తిరుమలగిరి(సాగర్) మండల కేంద్రలో ఏర్పాటు చేసిన డిస్టిబ్యూషన్ సెంటర్ నుంచి సిబ్బందిని పాఠశాల బస్సుల్లో వివిధ గ్రామాలకు తరలించారు. బస్సుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఎన్నికల సిబ్బంది నిల్చునే ప్రయాణించాల్సి వచ్చింది. ఒక చేత్తో సామాగ్రిని పట్టుకొని ఒంటికాలిపై నిలబడి ప్రయాణించాల్సి రావడంతో వారు ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల వేళ చికెన్ కొరత!పెద్దవూర: గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు గాను అభ్యర్థులు చాలా గ్రామాలలో చికెన్, కూల్‌డ్రింక్స్, మద్యం పంపిణీ చేస్తున్నారు. పెద్దవూర మండలంలో ఏ గ్రామంలో చూసినా చికెన్ దుకాణాలలో శనివారం మధ్యాహ్నం కోళ్లు అయిపోయాయి. ఎన్నికల వేళ చికెన్ దుకాణాలు, కూల్‌డ్రింక్స్ దుకాణాల్లో భారీగా వ్యాపారం సాగింది. నాలుగోసారి వరించిన విజయంతిప్పర్తి : మూడు సార్లు సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయినా నాలుగోసారి విజయం సాధించాడు తగుళ్ల శ్రీనయ్య. మండలంలోని సర్వారం గ్రామానికి చెందిన తగుళ్ల శ్రీనయ్య 2006లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్వారం సర్పంచ్ స్థానానికి సీపీఎం బలపర్చిన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశాడు. 2013లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా ఓడిపోయాడు. 2019లో జరిగిన ఎన్నికల్లోనూ సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయాడు. అయినా నిరాశ చెందకుండా ప్రజలతో మమేకమవుతూనే వారి నమ్మకాన్ని సంపాదించాడు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థిగా పోటీ చేసి మండలంలోనే అత్యధికంగా 834 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు.రాజీనామా చేశారు.. సర్పంచ్‌గా గెలిచారుఆత్మకూరు(ఎం) : మండలంలోని మొదుగుకుంటకు చెందిన సోలిపురం ఎల్లారెడ్డి, పల్లెపహాడ్‌కు చెందిన సుంకరి మంజుల గ్రామ వీఓఏలుగా పని చేస్తున్నారు. ఈ సారి గ్రామపంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు తమకు అనుకూలించడంతో సర్పంచ్ స్థానానికి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకే తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి నామినేషన్ దాఖలు చేశారు. గురువారం జరిగిన ఎన్నికల్లో మోదుగుకుంట సర్పంచ్‌గా సోలిపురం ఎల్లారెడ్డి, పల్లెపహాడ్ సర్పంచ్‌గా సుంకరి మంజుల విజయం సాధించారు. నాడు వార్డు మెంబర్.. నేడు సర్పంచ్రాజాపేట : మండలంలోని బసంతపురం గ్రామానికి చెందిన మెండు రత్నమాల మూడు పర్యాయాలు వార్డు సభ్యురాలిగా విజయం సాధించాగా.. ఈ సారి సర్పంచ్‌గా గెలుపొందారు. బసంతపురం గ్రామపంచాయతీకి 2006లో జరిగిన ఎన్నికల్లో 4వ వార్డు సభ్యురాలిగా పోటీ చేసి విజయం సాధించారు. 2011లో 5వ వార్డు సభ్యురాలిగా, 2019లో 6వ వార్డు సభ్యురాలిగా గెలిచారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో బసంతపురం గ్రామ సర్పంచ్‌గా పోటీచేసి 88 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. -
నేడు 158 గ్రామ పంచాయతీల్లో పోలింగ్
కోదాడ: జిల్లాలో ఆదివారం జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలో ఎనిమిది మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా మండలాల పరిధిలో మొత్తం 181 పంచాయతీలు, 1,628 వార్డులుండగా ఇప్పటికే 23 పంచాయతీలు, 339 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 158 పంచాయతీలు, 1,287 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు మొత్తం 1,462 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం ఆయా మండల కేంద్రాల్లో సిబ్బందికి అధికారులు ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయగా సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. కోదాడ నియోజకవర్గ పరిధిలో.. రెండో విడత ఎన్నికలు జరిగే 8 మండలాల్లో 6 మండలాలు కోదాడ, 2 మండలాలు సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. ఏకగ్రీవ పంచాయతీలు, వార్డులు పోను మిగతా పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అనంతగిరి మండలంలో మిగిలిన 17 పంచాయతీలు 139 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. చిలుకూరు మండలంలో 12 పంచాయతీలు, 114 వార్డులు, కోదాడ మండలంలో 14 పంచాయతీలు, 118 వార్డులు, మోతె మండలంలో 22 పంచాయతీలు, 193 వార్డులు, మునగాల మండలంలో 21 పంచాయతీలు, 192 వార్డులు, నడిగూడెం మండలంలో 13 గ్రామాలు, 124 వార్డులకు ఎన్నికలు జరగునున్నాయి. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో.. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల మండలంలో ఏకగ్రీవాలు పోను మిగిలిన 30 పంచాయతీలు, 181 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. పెన్‌పహాడ్ మండలంలో 29 పంచాయతీలు, 226 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 258 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే 8 మండలాల పరిధిలోని 258 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు గట్టి బందోబస్తుతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ఎనిమిది మండలాల పరిధిలో 25 గ్రామాల్లో 61 చోట్ల వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నారు. 287 ప్రదేశాలు..60 రూట్లు ఎనిమిది మండలాల పరిధిలో రెండో విడత పంచాయతీ పోలింగ్‌కు అధికారులు 1,462 పోలింగ్ కేంద్రాలను 287 ప్రదేశాలలో ఏర్పాటు చేశారు. దీనికోసం 60 రూట్లను 63 మంది రూట్ ఆఫీసర్స్‌ను నియమించారు. వీరంతా 125 బస్సులు, 35 కార్లలో ఎన్నికల సిబ్బంది, సామగ్రిని పంపిణీ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు శనివారం మధ్యాహ్నం నుంచి తరలించారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహించడానికి స్టేజీ–1 ఆర్వోలుగా 57 మందిని, వ్యయపరిశీలకులుగా 08, స్టేజీ–2 ఆర్వోలుగా 175 మందిని, ఏఆర్వోలుగా 28 మందిని, జోనల్ అధికారులుగా 30 మందిని, సూక్ష్మ పరిశీలకులుగా 61 అధికారులను నియమించారు. ఎన్నికల కోసం 1,609 బ్యాలెట్ బాక్స్‌లను ఎన్నికల సిబ్బందికి అందించారు. ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపు కోసం 165 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫ 1,287 వార్డుల్లో కూడా.. ఫ ఎనిమిది మండలాల్లో 1,462 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు ఫ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు.. ఫ 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం.. సాయంత్రం ఫలితాల వెల్లడి ఫ ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు మండలం జీపీలు ఏకగ్రీవం ఎన్నికలు పోలింగ్ ఓటర్లు జరిగేవి కేంద్రాలు అనంతగిరి 20 03 17 156 24,294 చిలుకూరు 17 05 12 125 29,790 నడిగూడెం 16 03 13 128 22,862 మునగాల 22 01 21 202 35,945 కోదాడ 16 02 14 138 28,107 మోతె 29 07 22 213 31,907 చివ్వెంల 32 02 30 244 28,155 పెన్‌పహాడ్ 29 00 29 256 34,077 మొత్తం 181 23 158 1,462 2,35,137 -
అన్నపై తమ్ముడి విజయం
బొమ్మలరామారం : మండలంలోని తిమ్మాపూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి అన్నదమ్ములు పోటీ పడగా అన్నపై తమ్ముడు విజయం సాధించాడు. తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ ఇస్లావత్ ఈర్యానాయక్ కుమారులు ఇస్లావత్ పాండు అతడి తమ్ముడు ఇస్లావత్ కృష్ణానాయక్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. తిమ్మాపూర్‌కు చెందిన కుతాడి యాదగిరి కూడా సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. గురువారం జరిగిన ఎన్నికల్లో ఇస్లావత్ కృష్ణానాయక్‌కు 567 ఓట్లు, ఇస్లావత్ పాండుకు 361, కుతాడి యాదగిరికి 351 ఓట్లు వచ్చాయి. దాంతో ఇస్లావత్ కృష్ణానాయక్ తన అన్న పాండునాయక్పై 206 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. నాడు భర్త ఓటమి.. నేడు భార్య గెలుపుకేతేపల్లి : గత ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీచేసిన భర్య ఓటమి పాలయ్యాడు. అయినా ఆయన ప్రజలతోనే ఉండి వారి నమ్మకాన్ని కూడగట్టుకొని ప్రస్తుత ఎన్నికల్లో భార్యను పోటీ చేయించగా ఆమె విజయం సాధించింది. 2019లో కేతేపల్లి మండలం ఇప్పలగూడెం గ్రామ సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. దాంతో అదే గ్రామానికి చెందిన వంటల చేతన్‌కుమార్ పోటీ చేశాడు. కేవలం రెండు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. అయినా చేతన్‌కుమార్ వెనుకడుగు వేయకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి మన్ననలు పొందాడు. ఈ సారి సర్పంచ్ పదవి జనరల్ మహిళకు కేటాయించగా చేతన్ భార్య సాహితి సర్పంచ్ స్థానానికి పోటీ చేశారు. గురువారం జరిగిన పోలింగ్‌లో 133 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు. అప్పుడు భార్యలు.. ఇప్పుడు భర్తలుబొమ్మలరామారం : గత ఎన్నికల్లో భార్యలు సర్పంచ్‌లుగా ఉండగా ప్రస్తుత ఎన్నికల్లో వారి భర్తలు పోటీ చేసి విజయం సాధించారు. మండలంలోని బండకాడిపల్లికి 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి లావణ్య సర్పంచ్‌గా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం రిజర్వేషన్ మారడంతో ఆమె భర్త పెద్దిరెడ్డి మల్లారెడ్డి పోటీ చేసి సర్పంచ్‌గా గెలుపొందారు. మైసిరెడ్డిపల్లి గ్రామంలో.. మండలంలోని మైసిరెడ్డిపల్లిలో 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గ్రామానికి చెందిన నోముల రమాదేవి సర్పంచ్‌గా విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆమె భర్త నోముల రాంరెడ్డి సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందారు. పాతికేళ్లకే సర్పంచ్..రాజాపేట : రాజాపేట మండలం బేగంపేట గ్రామానికి చెందిన పాతికేళ్ల యువతి ఇండ్ల అనూష గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీచేసి గెలుపొందింది. బేగంపేట గ్రామానికి చెందిన ఇండ్ల(మంత్రాల) సుమన్‌తో 2019లో అనూషకు వివాహం జరిగింది. అత్తగారింటికి వచ్చాక సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపింది. అదేవిధంగా దూదివెంకటాపురం గ్రామానికి చెందిన 28 ఏళ్ల నడిమింటి నరేష్, రాజాపేటకు చెందిన 29 ఏళ్ల కోయ మధు కూడా సర్పంచులుగా గెలుపొందారు. -
వర్టికల్ గార్డెన్ వెలవెల!
సూర్యాపేట జిల్లాకేంద్రంలోని మినీట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేసిన వర్టికల్ గార్డెన్ మూణ్నాళ్ల ముచ్చట మారింది. రెండేళ్ల క్రితం పచ్చదనంతో కళకళలాడుతూ సందర్శకులను ఆకట్టుకున్న ఈ గార్డెన్లో నేడు మొక్కలన్నీ ఎండిపోయి వెలవెలబోయి కనిపిస్తోంది. సంబంధిత అధికారులు స్పందించి మళ్లీ గ్రీనరీగా మార్చి ఆహ్లాదం పంచేలా చేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సూర్యాపేటమినీ ట్యాంక్‌బండ్ వద్ద కళకళలాడుతున్న వర్టికల్ గార్డెన్ (ఫైల్) నేడు మొక్కలు ఎండిపోయి కనిపిస్తున్న గార్డెన్ -
గుండెపోటుతో వార్డు అభ్యర్థి మృతి
భువనగిరి : భువనగిరి మండల పరిధిలోని బస్వాపురం గ్రామంలో వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తున్న మహిళ శనివారం గుండెపోటుతో మృతిచెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బస్వాపురం గ్రామానికి చెందిన వనగంటి లక్ష్మి(58) ఆ గ్రామంలోని 9వ వార్డు నుంచి కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిగా పోటీలో నిలబడింది. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తూ తనను గెలిపించాలని శుక్రవారం వరకు ప్రచారం నిర్వహించింది. శనివారం ఆమె ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆటో● డ్రైవర్‌కు తీవ్ర గాయాలుకేతేపల్లి : ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టిన ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై కేతేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలం కొండకిందిగూడెం గ్రామానికి చెందిన కోట్ల శివ ఆటోలో శుక్రవారం రాత్రి సూర్యాపేట నుంచి నకిరేకల్‌కు వెళ్తున్నాడు. మార్గమధ్యలో కేతేపల్లి మండల కేంద్రంలోని బస్ స్టేజీ సమీపంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి ఆటోతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటో నడుపుతున్న శివ తలకు బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శివ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తాళం వేసిన ఇంట్లో చోరీకేతేపల్లి : తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కేతేపల్లి మండల కేంద్రంలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన మారగోని సైదులు ఈ నెల 11న ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలసి తన బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు సైదులు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని రూ.70వేల నగదు, 6 గ్రాముల బంగారు చెవుల పట్టీలు, 20 తులాల వెండి పట్టీలు ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం ఇంటికి తిరిగొచ్చిన సైదులు తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి పోలీసులు సందర్శించి క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. -
ఆలయంలో హుండీ అపహరణ
మేళ్లచెరువు : మేళ్లచెరువు మండల పరిధిలోని వెల్లటూరు గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మించిన శ్రీగోపయ్య సమేత శ్రీలక్ష్మీతిరుపతమ్మ అమ్మవారి దేవాలయంలో హుండీని శుక్రవారం రాత్రి ఓ దుండగుడు అపహరించాడు. శనివారం ఉదయం గ్రామస్తులు దేవాలయానికి వచ్చి చేసేసరికి హుండీ కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు గ్రామానికి చేరుకుని దేవాలయంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అందులో ఓ దుండగుడు హుండీని ఎత్తుకెళ్తున్నట్లు గుర్తించారు. కాగా గత నెల 27నే ఈ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. శుక్రవారం 16 రోజుల పండగను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అదేరోజు రాత్రి హుండీని చోరీకి గురికావడం కలకలం రేపింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
యాదగిరి ఆలయంపై డ్రోన్ ఎగరేసిన వ్యక్తి అరెస్ట్
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంపై నో ఫ్లయింగ్ జోన్లో శనివారం ఓ వ్యక్తి డ్రోన్ ఎగురవేశాడు. ఎస్పీఎఫ్ పోలీసులు గుర్తించి ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిస్సాకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లోని గాజులరామారంలో నివాసముంటున్నాడు. శనివారం స్వామివారి దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాడు. స్వామిని దర్శించుకున్న అనంతరం ఆ వ్యక్తి కొండ కిందకు వెళ్లి డ్రోన్ ఎగురవేసి కొండ పైన పరిసరాలు, నో ఫ్లయింగ్ జోన్‌ను చిత్రీకరిస్తుండగా.. స్థానికుల ద్వారా ఎస్పీఎఫ్ పోలీసులు సమాచారం తెలుసుకున్నారు. వెంటనే అతడి వద్దకు ఎస్పీఎఫ్ పోలీసులు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్లో ఆ వ్యక్తిని అప్పగించడంతో పట్టణ సీఐ కేసు నమోదు చేశారు. -
సగం రోడ్డు..షాపులకే!
సూర్యాపేట అర్బన్ : జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించినా కూరగాయల దుకాణాలు మాత్రం రోడ్డుపైనే కొనసాగుతున్నాయి. దీంతో రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత మార్కెట్ ప్రస్తుతం అలంకారప్రాయంగా మారింది. నాన్ వెజ్, పూల అమ్మకాలు మినహా పండ్లు, కూరగాయల దుకాణాలు మళ్లీ రోడ్డెక్కాయి. దీంతో ఆయా దుకాణాలే సగం వరకు రోడ్డును ఆక్రమించడంతో వాహనదారులు, సాధారణ ప్రజలు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికితోడు మార్కెట్ లోపల ఉన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా మార్కెట్ ప్రాంతంలోనే ఎరువులు, పురుగు మందుల షాపులు ఉండడంతో నిత్యం రైతులు వస్తుండడంతో భారీ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య నుంచి జనానికి ఉపశమనం కలిగించేందుకు గత ప్రభుత్వ హయాంలో రోడ్డుపై ఒక వ్యాపారి కూడా వ్యాపారం చేయకుండా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించింది. గతేడాది ఈ మార్కెట్‌ను ప్రారంభించినా అందరు వ్యాపారులు అందులో తమ వ్యాపారాలు చేయడం లేదు. అయితే మార్కెటింగ్ శాఖ, ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో రోడ్లపైనే కూరగాయల వ్యాపారం సాగుతోంది. నడవాలంటే నరకం ప్రస్తుతం సమీకృత మార్కెట్ రోడ్డుపై ఇరుపక్కలా నాలుగడుగుల మేర కూరగాయలు, ఇతర సామగ్రి దుకాణాలు పెడుతున్నారు. మధ్యలో మిగిలిన నాలుగైదు అడుగుల రోడ్డులోనే పాదాచారులు, వాహనదారులు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఒక్క వాహనం ఆగినా మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. వెనుక ఉన్న వాహనదారులు పాదాచారులు వాహనాల మధ్యలో నుంచి నడవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శంకర్ విలాస్ సెంటర్ నుంచి కూరగాయల మార్కెట్ మీదుగా ఎంజీ రోడ్డు వరకు నిత్యం రద్దీగా ఉంటుండడంతో ఆ రోడ్డు వీదుగా వెళ్లాలంటే వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఖాళీగా సమీకృత వెజ్ నాన్, వెజ్ మార్కెట్ సూర్యాపేట పట్టణంలో నిర్మించిన సమీకృత మార్కెట్ ప్రస్తుతం ఖాళీగానే ఉంది. అందులో కూరగాయలు, ఇతర వ్యాపారులకు అవకాశం కల్పిస్తే రోడ్డుపై దుకాణాలు పెట్టకుండా అడ్డుకోవచ్చు. దీంతో ట్రాఫిక్ సమస్యతోపాటు చిన్న చిన్న ప్రమాదాలకు పరిష్కారం దొరుకుతుంది రూ.కోట్లు వెచ్చించిన నిర్మించిన మార్కెట్లో స్టాళ్లు ఉండగా రోడ్డుపై కూరగాయల వ్యాపారులు వ్యాపారం చేస్తున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరో పక్క రోడ్డుపై వ్యాపారంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని మార్కెట్ లోపల వ్యాపారులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే సమీకృత మార్కెట్ లోకి గాలి వెలుతురు రాకుండా ఉందని అందులోకి వెళ్లి వ్యాపారాలు చేయబోమని కొందరు అంటున్నారు. అధికారులు స్పందించి వ్యాపారులకు వెసులుబాటుగా ఉండేలా మార్కెట్లో దుకాణాలు ఏర్పాటు చేస్తే మంచిదని ప్రజలు భావిస్తున్నారు. ఫ సూర్యాపేట సమీకృత మార్కెట్ అలంకారప్రాయం ఫ మార్కెట్ బయటే కూరగాయల వ్యాపారం ఫ రోడ్డుకు ఇరువైపులా దుకాణాలతో ట్రాఫిక్ తిప్పలు -
ఆడపిల్లలంతా చదువుకోవాలి
ఆత్మకూర్ (ఎస్) : ఆడపిల్లలంతా చదువుకుని అన్ని రంగాల్లో ముందుండాలని ఎంవీ ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ భాస్కర్ అన్నారు. శనివారం ఆత్మకూర్ (ఎస్)మండల కేంద్రంలోని పూర్వ విద్యార్థుల భవనంలో నిర్వహించిన కిశోర బాలికల జిల్లాస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఆడపిల్లలు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా చదువును ఆపకూడదన్నారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ ఆడపిల్లల పట్ల వివక్ష నిర్మూలన, వారి సర్వతోముఖాభివృద్ధికి ఎంవీ ఫౌండేషన్ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో భరోసా ఇంచార్జి జ్యోతి, శ్రీజ, భావన, వైష్ణవి, తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమైక్య స్టేట్ కమిటీ ఎంవీఫ్ ఇంచార్జి వత్సవాయి లలిత, సైదులు, జయలలిత, మంజుల పాల్గొన్నారు. -
మీ ఓటు చెల్లదు
ముద్ర సరిగా వేయకుంటే..ఫ మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో వందల సంఖ్యలో చెల్లని ఓట్లు ఫ ఓటర్లకు అవగాహన లేకనే ఇబ్బందులు కేతేపల్లి : బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్‌పై గ్రామీణ ప్రాంత ప్రజలకు సరైన అవగాహన లేక పోవడం వల్లే పంచాయతీ ఎన్నికల్లో చెల్లని ఓట్ల సంఖ్య పెరుగుతోంది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది. దాంతో పోటీలో ఉన్న అభ్యర్థుల గెలుపోటములు తారుమారవుతున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యుడికి వేర్వేరుగా బ్యాలెట్ పత్రాలు ఉన్నాయి. ఒక ఓటు సర్పంచ్ అభ్యర్థికి, మరో ఓటు వార్డు సభ్యుడికి వేయాల్సి ఉన్నప్పటికీ కొందరు ఓటర్లు సర్పంచ్ బ్యాలెట్‌పైనే రెండు గుర్తులకు ఓటు వేసి వార్డు సభ్యుడి బ్యాలెట్‌పై ఓటు వేయకుండానే బ్యాలెట్ బాక్స్‌లో వేశారు. మరి కొందకు గుర్తులపై వేలిముద్రలు కూడా వేశారు. ఇంకొందరు బ్యాలెట్ పేపర్‌పై ఓటువేసి సరిగా మడత పెట్టక పోవడంతో వేరొక వైపు కూడా స్వస్తిక్ గుర్తు పడి ఓటు చెల్లకుండా పోయింది. చెల్లని ఓట్లు 462 మొదటి విడుత పంచాయతీ ఎన్నికల్లో కేతేపల్లి మండల వ్యాప్తంగా 27,260 ఓట్లు పోలవ్వగా అందులో 462 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఒక్క కేతేపల్లిలోనే 101 ఓట్లు చెల్లకుండా పోయాయి. దాంతో పాటు చెర్కుపల్లిలో 59, భీమారంలో 62, ఇనుపాములలో 30, కొత్తపేటలో 28, తుంగ తుర్తిలో 27, గుడివాడలో 40, కొప్పోలులో 33, కొర్ల పహాడ్‌లో 21, మిగతా అన్ని గ్రామాల్లోనూ 10 నుంచి 20 ఓట్లు చెల్లకుండా పోయాయి. మెజార్టీ కంటే చెల్లని ఓట్లే అధికం యాదగిరిగుట్ట రూరల్ : మొదటి విడుత పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే ఆయా గ్రామాల్లో చెల్లని ఓట్లు సర్పంచ్ అభ్యర్థుల విజయంపై ప్రభావం చూపాయన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ● యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో 19 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించాడు. ఇక్కడ 26 ఓట్లు చెల్లకుండా పోగా 6 ఓట్లు నోటాకు వచ్చాయి. ● మసాయిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి 18 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా 23 ఓట్లు చెల్లకుండా పోయాయి. -
శాశ్వత పరిష్కారం చూపాలి
అందరు వ్యాపారులు సమీకృత మార్కెట్లోనే తమ వ్యాపారులు చేసుకునేలా చూడాలి. ప్రస్తుతం కూరగాయలు, పండ్ల దుకాణాలు, తోపుడు బండ్లు రోడ్డుమీదికి రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలి. – ములకలపల్లి రమణమ్మ, సూర్యాపేట కోట్ల రూపాయలతో నిర్మించిన మార్కెట్ పూర్తిస్థాయిలో వినియోగించుకోకుండా రోడ్డుపై కూరగాయలు అమ్ముతుండడంతో ట్రాఫిక్ సమస్య పెరిగింది. అధికారులు స్పందించి మార్కెట్లో ఉన్న స్టాళ్లను రైతులు, చిరు వ్యాపారులకు కేటాయించాలి. – బోల్క సురేష్ సూర్యాపేట -
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం చూపొద్దు
చివ్వెంల, పెన్‌పహాడ్ : ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం చూపకుండా పోలీస్ సిబ్బంది అంతా సమన్వయంతో ఒకే జట్టుగా పనిచేయాలని ఎస్పీ నరసింహ అన్నారు. శనివారం చివ్వెంల, పెన్‌పహాడ్ మండల కేంద్రాల్లో పోలీస్ సిబ్బందికి నిర్వహించిన అవగాహన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఎన్నికల విధుల్లో పోలీసుల పాత్ర కీలకమని, పూర్తి అంకితభావంతో విధులు నిర్వహించాలన్నారు. విధులు పూర్తయ్యే వరకు కేటాయించిన స్థలాలు వదలవద్దన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూపద్ధతి పాటించేలా చూడాలన్నారు. ఓటర్లకాని వారిని పోలింగ్ స్టేషన్ల పరిసరాల్లోకి రానివద్దన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు రవీదర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, సీఐలు రాజశేఖర్, వెంకటయ్య, రామారావు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. 1,500 మంది సిబ్బందితో బందోబస్తు సూర్యాపేట టౌన్ : జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న చివ్వెంల, పెన్‌పహాడ్, మోతె, మునగాల, నడిగూడెం, అనంతగిరి, కోదాడ, చిలుకూరు మండలాల్లో 1,500 మంది పోలీస్ సిబ్బందితో ఐదంచెల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ నరసింహ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఇద్దరు ఏఎస్పీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, 15 మంది ఇన్స్పెక్టర్లు, 50 మంది ఎస్ఐలు, అసిస్టెంట్ ఎస్ఐలు, హెచ్కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఉన్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాపై జిల్లా పోలీస్ శాఖ నిఘా ఉందని, ఎవరైనా ఎన్నికల విధానానికి అటంకం కలిగించేలా ప్రవర్తించినా, తప్పుడు సమాచారం ప్రచారం చేసినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ లొకేషన్ల వద్ద సంబంధిత సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపారు. గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఆన్లైన్ వెబ్ కాస్టింగ్ ఉంటుందని పేర్కొన్నారు. ఓటర్లు కానివారు ఈ ఎనిమిది మండలాల్లో ఉండకూడదని సూచించారు. ఓటర్లంతా స్వేచ్ఛగా ఓటేయాలని కోరారు. ఫ ఎస్పీ నరసింహ -
నవోదయ ప్రవేశ పరీక్షకు 74.71 శాతం హాజరు
పెద్దవూర : మండలంలోని చలకుర్తి క్యాంపు జవహర్ నవోదయ విద్యాలయంలో (జేఎస్వీ) 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు గాను శనివారం నిర్వహించిన ప్రవేశపరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 74.71 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు. 80 సీట్లకు నిర్వహించిన పరీక్ష కోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 26 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 4,338 మంది విద్యార్థులకుగాను 3241 మంది పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు. దీంతో ఒక్క సీటుకు 40 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారని తెలిపారు. అన్ని కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా సాగిందని పేర్కొన్నారు. సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలిపెన్పహాడ్ : ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. శనివారం పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఓలు, ఏపీఓలు పోలింగ్ సామగ్రిని, బ్యాలెట్ బాక్స్‌లను పరిశీలించి తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్‌రావు, మండల ప్రత్యేకాధికారి రాము, ఎంపీడీఓ జానయ్య, తహసీల్దార్ లాలు, సిబ్బంది పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల తనిఖీ చివ్వెంల : మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను శనివారం రాత్రి ఏఎస్పీ రవీందర్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ.. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని సూచించారు. ఆయన వెంట ఎస్ఐ మహేశ్వర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. 16 నుంచి ధనుర్మాస ఉత్సవాలుహుజూర్నగర్ : పట్టణంలోని శ్రీవేణుగోపాల శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈనెల 16 నుంచి వచ్చేనెల 16వ తేదీ వరకు ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ గుజ్జుల కొండారెడ్డి తెలిపారు. శనివారం హుజూర్నగర్ పట్టణంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల కరపత్రం ఆవిష్కరించి మాట్లాడారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రతిరోజూ సుప్రభాతం, ప్రాతకాలార్చన, విష్ణు సహస్రనామార్చన, గోదాష్టోత్తరం తదితర పూజలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ పూజారులు, సిబ్బంది పాల్గొన్నారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో శనివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు జరిపారు. అనంతరం ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్స వం చేపట్టారు. ఆ తర్వాత కల్యాణం జరిపి స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు. -
ఎన్నికల విధులు జాగ్రత్తగా నిర్వహించాలి
కోదాడ: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సిబ్బంది ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆదివారం పోలింగ్ విధులను జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు. శనివారం కోదాడలోని సీసీరెడ్డి పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్స్‌లు, పేపర్లను క్షుణంగా పరిశీలించి తీసుకోవాలన్నారు. కేటాయించిన పోలింగ్ కేంద్రానికి జోనల్ అధికారితో కలిసి వెళ్లి అక్కడే బస చేసి ఆదివారం ఉదయం 7 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ పూర్తిచేయాలన్నారు. అప్పటి వరకు ఓటర్లు ఇంకా మిగిలి ఉంటే వారికి టోకెన్లు ఇచ్చి ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత జిల్లా ఎన్నికల అధికారి, జనరల్ అబ్జర్వర్ అనుమతి తీసుకున్న తర్వాతే స్టేజ్–2 రిటర్నింగ్ అధికారి తుది ఫలితాలు ప్రకటించాలన్నారు. పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చిలుకూరు : రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లుగా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శనివారం చిలుకూరులో ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. ఆయన వెంట ఆర్డీఓ సూర్యనారాయణ, మండల ఎన్నికల ప్రత్యేక అధికారి దయానందరాణి, ఎంపీడీఓ గిరిబాబు, తహసీల్దార్ ధ్రువకుమార్, ఎంపీఓ ముక్కపాటి నరసింహారావు ఉన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
రోడ్డు ప్రమాదంలో బీఎస్ సీడ్స్ అధినేత దుర్మరణం
చౌటుప్పల్ : చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఎస్ సీడ్స్ అధినేత బొమ్మిడి నర్సిరెడ్డి(67) మృతిచెందారు. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం పీపల్‌పహాడ్ గ్రామానికి చెందిన బొమ్మిడి నర్సిరెడ్డి చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో స్థిరపడ్డారు. స్థానికంగా బంగారిగడ్డ కాలనీ శివారులో బీఎస్ సీడ్స్ పేరుతో వరి విత్తనాల ఉత్పత్తి పరిశ్రమను నెలకొల్పారు. శనివారం స్వగ్రామం పీపల్పహాడ్లోని తన వ్యవసాయ క్షేత్రానికి ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి చౌటుప్పల్‌కు వస్తుండగా.. పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద విజయవాడ–హైదరాబాద్ హైవేపై వెనుక నుంచి లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సిరెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మేనబావ అవుతారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గంజాయి పట్టివేతభువనగిరి : బీబీనగర్ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. శనివారం భువనగిరి ఎక్సైజ్ సీఐ రవిచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం ఓ వ్యక్తి గంజాయి విక్రయించేందుకు వస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో భువనగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన పండుగ భానుచందర్ గంజాయి విక్రయిస్తుండగా అతడిని పట్టుకున్నారు. అదే గ్రామానికి చెందిన బొబ్బల నరేందర్‌రెడ్డి అక్కడి నుంచి పరారయ్యాడు. 1.120 కిలోల గంజాయి, బైక్ స్వాధీనం చేసుకుని భువనగిరి ఎకై ్సజ్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. -
కంగ్రాట్స్ డాడీ..
సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ సర్పంచ్‌గా గెలుపొందిన గుంటకండ్ల రామచంద్రారెడ్డికి తన కుమారుడైన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి శుక్రవారం నాగారంలోని తన నివాసంలో శుభాకాంక్షలు తెలిపారు. జగదీష్‌రెడ్డి తన తండ్రి రామచంద్రారెడ్డికి పుష్పగుచ్చాలు అందించి, శాలువాతో సన్మానించారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌తో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు రామచంద్రారెడ్డిని సన్మానించారు. -
మొదటి విడత ప్రశాంతం
అర్వపల్లి : మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. జాజిరెడ్డిగూడెం మండలంలోని అడివెంల, రామన్నగూడెం పోలింగ్ కేంద్రాలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్, ఎంపీడీఓ ఝాన్సీ, ఎస్ఐ ఈట సైదులు పాల్గొన్నారు. నాగారం : మండలంలోని నాగారం, శాంతినగర్, పస్తాల గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను గురువారం కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో నిషేధిత ఆజ్ఞలు అమలు చేయాలని, కౌంటింగ్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు ఎలాంటి ఘర్షణలకు పాల్పడవద్దని తెలిపారు. -
రెండో విడత ప్రచారానికి నేటితో తెర
కోదాడ: జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికలు జరిగే ఎనిమిది మండలాల పరిధిలోని 181 గ్రామపంచాయతీల్లో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారానికి తెరపడనుంది. ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుండడంతో అభ్యర్థులకు శుక్ర, శనివారం ఈ రెండు కీలకం కానున్నాయి. శుక్రవారం గ్రామాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి బలప్రదర్శన చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. ర్యాలీలో ఎక్కువ మంది పాల్గొనేలా చేయడానికి ఒక్కొక్కరికి ముఖ్యంగా మహిళలకు రూ.400 నుంచి రూ.500వరకు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. శుక్రవారం రాత్రి ఓటర్లకు మద్యం, మాంసం పంపిణీ చేయడానికి ఆర్డర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. కోదాడలోని పలు చికెన్ సెంటర్ల నిర్వాహకులకు వందల కేజీల ఆర్డర్లు రావడంతో రోజువారీగా వచ్చేవారికి కేజీ, అరకేజీ ఇవ్వడం లేదు. ఇక మద్యం పంపిణీ కోసం క్వార్టర్ బాటిల్స్ ఎక్కువగా అభ్యర్థులు కొనుగోలు చేస్తుండడంతో మద్యం దుకాణాల్లో వీటి కొరత ఏర్పడింది. ఎక్కడ ఉన్నా రప్పిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కావడంతో దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను రప్పించడానికి అభ్యర్థులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కార్లు ఏర్పాటు చేస్తున్నారు. కొందరు యువకులు బెంగళూరులో ఉండడంతో వారికి ఫ్లైట్, రైల్ టికెట్లను కూడా బుక్ చేసి పిలిపిస్తున్నారు. కోదాడ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 8 మంది యువకులు పూణేలో ఉండడంతో వారిని రప్పించడానికి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. అభ్యర్థులు శుక్రవారం ఓటర్లకు మద్యం పంపిణీ పూర్తిచేసి శనివారం డబ్బు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రత్యర్థి ఇచ్చేదాన్ని బట్టి తాము ఇస్తామని రెండు వర్గాలు వేచి చూస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో ఓటుకు రూ.1000 నుంచి రూ.2వేల వరకు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. కోదాడ నియోజకవర్గ పరిధిలో పోటాపోటీగా ఉన్న మునగాల, బేతవోలు, చిలుకూరు, గుడిబండ, గణపవరం, రెడ్లకుంట, వాయిల సింగారం గ్రామాల్లో రూ.3వేల వరకు పంచడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ అయిన గ్రామాల్లో కూడా ఓటుకు రూ.2వేల వరకు పంచడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఫ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు ఫ డబ్బు, మాంసం, మద్యం పంపిణీకి కసరత్తు ఫ దూరప్రాంతాల్లోని ఓటర్లను రప్పించేందుకు అభ్యర్థుల ప్రయత్నం -
పెన్షనర్ల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
కోదాడ: పెన్షనర్లు పోరాడి సాధించుకున్న హక్కులను అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని విశ్రాంత ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి సుధాకర్ ఆరోపించారు. గురువారం కోదాడ పెన్షన్ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభత్వం చేసిన చట్టానికి వ్యతిరేకంగా త్వరలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వచ్చే మార్చిలో పెన్షనర్లతో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి పెన్షనర్లు పూర్తి మద్దతు ఇచ్చి అధికారంలోకి రావడానికి పూర్తిగా సహకరించామని, కాని కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్‌దారుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విశ్రాంత ఉద్యోగులందరికీ నగదు రహిత వైద్యసేవలు అందించాలన్నారు. 2024 తరువాత ఉద్యోగ విరమణ చేసిన వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య, జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు, కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి సీతరామయ్య, రాజేంద్రబాబు, లింగన్న, ప్రభాకర్, జానయ్య, రఘువరప్రసాద్, విద్యాసాగర్, భ్రమరాంబ, శోభ పాల్గొన్నారు. కోడ్ ముగిసే వరకు విజయోత్సవాలు నిషేధం సూర్యాపేటటౌన్ : ఎన్నికల ఫలితాలు వచ్చినా ర్యాలీలు, విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ నరసింహ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. మూడు దశల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో కొనసాగుతుందని పేర్కొన్నారు. తొలి దశ ఫలితాలు వచ్చినా గెలిచిన అభ్యర్థులు లేదా వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, భారీ సభలు, బైక్ ర్యాలీలు, శోభాయాత్రలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు. ఎన్నికల నియమాలను అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, శాంతియుత వాతావరణం కోసం ప్రజలు, నాయకులు, అభ్యర్థులు పూర్తి సహకారం అందించాలని కోరారు. విశేషంగా శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి గురువారం నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో విశేషంగా నిర్వహించారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు జరిపించారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ వైభవంగా నిర్వహించారు. ఆలయ తిరుమాడ వీధుల్లో శ్రీస్వామి వారిని గరుడవాహనంపై ఊరేగించారు. అనంతరం మహానివేదనతో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు భక్తులు పాల్గొన్నారు. తైక్వాండో పోటీల కోచ్‌గా యూనుస్ కమాల్ నల్లగొండ టూటౌన్ : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు రెఫరీగా నల్లగొండ పట్టణానికి చెందిన సీనియర్ కోచ్ ఎండీ.యూనుస్ కమాల్ ఎంపికయ్యారు. తన మీద నమ్మకంతో జాతీయ రెఫరీగా ఎంపిక చేసిన రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌కు యూనుస్ కమాల్ కృతజ్ఞతలు తెలిపారు. -
యాదగిరీశుడి సన్నిధిలో నిత్యారాధనలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిత్యారాధనలను అర్చకులు ఆగమ శాస్త్రానుసారంగా నిర్వహించారు. వేకువజామున ఆలయాన్ని తెరచిన అర్చకులు.. శ్రీస్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళ అర్చనతో కొలిచారు. ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వార బంధనం చేశారు. -
కాంగ్రెస్ మద్దతుదారుల విజయకేతనం
భానుపురి (సూర్యాపేట) : మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల హవా కొనసాగింది. 152 గ్రామ పంచాయతీలకు 90 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ప్రజావ్యతిరేకతతో తమకు కలిసొస్తుందని భావించిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఆశించిన స్థానాలు కై వసం చేసుకోలేకపోయారు. కేవలం 52 స్థానాల్లోనే బీఆర్ఎస్ మద్దతుదారులు రాణించారు. ఇక బీజేపీ బలపరిచిన అభ్యర్థులు మూడు స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఇతరులు ఆరు స్థానాల్లో గెలుపొందారు. చాలా చోట్ల ఉపసర్పంచ్ ఎన్నికలు వాయిదాలు పడ్డాయి. కలిసొచ్చిన పథకాలు ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీకి పథకాలు కలిసొచ్చాయి. రెండేళ్లుగా పంచాయతీలకు ఎన్నికలు జరగపోవడంతో కొంత వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకత రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో భర్తీ చేసినట్లయింది. సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఉచిత కరెంట్ పథకాలే పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతుదారులు గెలిచేందుకు దోహదపడినట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లోనే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల ప్రభావం కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్రామీణ ప్రాంతాల్లో వ్యతిరేకత ఉందని, ఇదే అదునుగా అత్యధిక స్థానాల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలిస్తే.. రానున్న రోజుల్లో పార్టీకి పూర్వవైభవం వస్తుందని బీఆర్ఎస్ భావించింది. అయితే ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో ప్రజల్లో మద్దతు లేకపోయింది. కొన్ని ప్రాంతాల్లోనే ప్రభావం చూపించింది. అది కూడా ఇతర పార్టీలు, వ్యక్తులతో పొత్తులే ఆ పార్టీకి కలిసొచ్చినట్లు చర్చించుకుంటున్నారు. సూర్యాపేట నియోజకవర్గంలోనూ ఆ పార్టీని ప్రజలు ఆదరించలేదన్న భావన ఈ ఎన్నికల్లో స్పష్టమైనట్లు తెలుస్తోంది. ఒక్కో గ్రామంలో కనీసం మూడునాలుగు వార్డు మెంబర్లను గెలిపించేందుకు కూడా కష్టపడాల్సి వచ్చిందని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఫ నాగారంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్‌గా గెలుపొందారు. ఫ మద్దిరాల మండలం తూర్పు తండాలో సర్పంచ్ ఫలితాలు తీవ్ర ఉత్కంఠ నడుమ జరిగాయి. ఇందులో బీఆర్ఎస్ అభ్యర్థి భూక్య వీరన్న సమీప ప్రత్యర్థిపై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఫ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సొంత గ్రామం బాలెంలలో బీఆర్ఎస్ పార్టీ దాదాపు 260 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. ఫ ఆత్మకూరు మండలం కోటినాయక్తండాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి తులసికి, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ధరావత్ చిట్టికి సమానంగా ఓట్లు రాగా టాస్ వేశారు. ఇందులో ధరావత్ చిట్టికి అదృష్టం కలిసి రావడంతో సర్పంచ్‌గా గెలుపొందారు. మండలం జీపీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు ఆత్మకూర్ (ఎస్) 30 15 12 02 01 తుంగతుర్తి 24 15 05 01 03 తిరుమలగిరి 16 12 03 00 01 మద్దిరాల 16 08 07 00 00 నూతనకల్ 17 07 07 00 01 నాగారం 14 10 02 00 01 సూర్యాపేట 25 15 08 00 01 జాజిరెడ్డిగూడెం 17 08 09 00 00 మొత్తం 159 90 53 03 08 (నాగారం మండలం ఈటూరులో అర్థరాత్రి దాటే వరకు రీకౌంటింగ్ కొనసాగింది)ఫ మొదటి విడతలో 90 సర్పంచ్ స్థానాలు అధికార పార్టీ మద్దతుదారులు కై వసం ఫ 53 స్థానాలకే పరిమితమైన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఫ ఏమాత్రం ప్రభావం చూపని బీజేపీ -
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 89.69 శాతం పోలింగ్
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఎనిమిది మండలాల్లో 152 పంచాయతీలు, 1,241 వార్డులకు పోలింగ్ జరిగింది. ఉదయం 7గంటల నుంచే ఓటర్లు ఓటు వేసేందుకు బారులుదీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించగా.. క్యూలైన్లలో ఉన్నవారికి అవకాశం కల్పించారు. దాదాపు 89.69 శాతం పోలింగ్ నమోదైందని, 2,05,583 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పలు మండలాల్లో పర్యటించి పోలింగ్ సరళి, లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. గ్రామాల్లో పండుగ వాతావరణం ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. చాలామంది ఓటర్లు బుధవారం రాత్రికే వివిధ ప్రాంతాల నుంచి పల్లెలకు చేరుకున్నారు. అభ్యర్థులు వలస ఓటర్లకు ప్రత్యేకంగా చార్జీలు చెల్లించి మరీ రప్పించారు. ఇక గురువారం ఉదయం నుంచే పోలింగ్ బూత్‌ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు భిన్నంగా పెద్దఎత్తున ఓటర్లు తరలివచ్చారు. హైదరాబాద్, చైన్నె తదితర పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్ల వాహనాలతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. ఉదయం వేళ ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద ఉన్న టిఫిన్ సెంటర్లు కళకళలాడాయి. అభ్యర్థులు ఓటర్లను ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఎన్నికల సిబ్బంది వికలాంగులు, వృద్ధులను వీల్చైర్లలో తీసుకెళ్లారు. పోలింగ్ సరళి ఇలా.. తుంగతుర్తి, నాగారం, మద్దిరాల, తిరుమలగిరి, నూతనకల్, జాజిరెడ్డిగూడెం, సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్) మండలాల్లో 2,29,222 మంది ఓటర్లు నమోదై ఉన్నారు. వీరి కోసం 1,403 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బుధవారం మధ్యాహ్నం నుంచే పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పంచాయతీలకు చేరుకుని పోలింగ్‌కు ఏర్పాట్లు చేసుకున్నారు. గురువారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రక్రియ చేపట్టారు. ప్రతి కేంద్రం వద్ద ఓటర్లు బారులుదీరారు. ఉదయం 9గంటలకు 62,367 మంది ఓటు వేయగా 27.21 శాతం పోలింగ్ నమోదైంది. 11గంటల వరకు 61.75 శాతంతో 1,39,745 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఒంటి గంటవరకు 87.77 శాతంతో 2,01,184 మంది, మొత్తంగా 89.69 శాతం నమోదైంది. పురుషుల కంటే మహిళల పోలింగ్ అధికం పురుష ఓటర్లు 1,13,812 మంది, మహిళా ఓటర్లు 1,15,410 మంది ఉన్నారు. మొదటి విడతలో మొత్తం 2,05,583 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 1,02,631 మంది ఓటు వేయగా 90.18 శాతం పోలింగ్ నమోదైంది. మహిళలు 1,02,948 మంది ఓటు వేయగా 89.20 శాతం పోలింగ్ నమోదైంది.ఫ ఓటు హక్కు వినియోగించుకున్న 2,05,583 మంది ఓటర్లు ఫ ఉదయం ఏడు గంటల నుంచే కేంద్రాల వద్ద బారులు ఫ తిరుమలగిరి మండలంలో అత్యధికం, తుంగతుర్తిలో అత్యల్ప ఓటింగ్ మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో మండలాల వారీగా చూస్తే తిరుమలగిరి మండలంలో అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 15,979 మంది ఓటర్లు ఉండగా 14,549 మంది ఓటు వేశారు. పోలింగ్ శాతం 91.05 నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జాజిరెడ్డిగూడెం మండలంలో 22,330 ఓట్లు పోలవ్వగా 90.72 శాతం పోలింగ్ నమోదైంది. ఆత్మకూర్‌లో 39,565 మంది ఓటువేయగా 89.81 శాతం, సూర్యాపేటలో 28,225 మంది ఓటువేయగా 90.30 శాతం, మద్దిరాలలో 22,467 మంది ఓటువేయగా 89.75 శాతం, నాగారంలో 22,091 మంది ఓటువేయగా 89.17 శాతం, నూతనకల్‌లో 26413 మంది ఓటువేయగా 90.87 శాతం, తుంగతుర్తిలో 29,943 మంది ఓటువేయగా 89.69 శాతం ఓట్లు పోలయ్యాయి. మండలం ఓటర్లు పోలైనవి శాతం ఆత్మకూర్ (ఎస్) 44,053 39,565 89.81 సూర్యాపేట 31,256 28,225 90.30 జాజిరెడ్డిగూడెం 24,615 22,330 90.72 మద్దిరాల 25,032 22,467 89.75 నాగారం 24,775 22,091 89.17 నూతనకల్ 29,066 26,413 90.81 తిరుమలగిరి 15,979 14,549 91.05 తుంగతుర్తి 34,451 29,943 86.91 మొత్తం 2,29,227 2,05,583 89.69 -
ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
సూర్యాపేటటౌన్ : పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలిదశ పోలింగ్ విధుల్లో పాల్గొనే పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా, క్రమశిక్షణతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు. మొదటి విడత ఎన్నికలను పురస్కరించుకొని సూర్యాపేట రూరల్ పరిధిలో ఎన్నికల విధులు నిర్వర్తించనున్న సిబ్బందికి పట్టణంలో బుధవారం సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమన్నారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా, పూర్తి అంకితభావం, క్రమశిక్షణతో తమ బాధ్యతలను నిర్వహించాలని స్పష్టం చేశారు. విధులు పూర్తయ్యే వరకు కేటాయించిన ప్రాంతాలు వదలవద్దన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను క్రమపద్ధతిలో ఉంచాలని, అనుమతిలేని వ్యక్తులను ఓటరు కాని వారిని పరిసరాల్లో రానివ్వొద్దని, 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఓటర్లు సెల్ ఫోన్న్, ఎలక్ట్రానిక్ వస్తులు ఏమైనా వెంట తెస్తున్నారా అనేదానిపై నిఘా ఉంచాలన్నారు. ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది ఎన్నికల కోడ్ (ఎంసీసీ) నియమాలను కచ్చితంగా పాటిస్తూ, ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో సిబ్బందికి ఏవైనా ఇబ్బందులు లేదా ఆకస్మిక సమస్యలు ఎదురైతే, వాటిని వెంటనే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
ఆరు సబ్జెక్టులు.. నెల రోజులు
సూర్యాపేట టౌన్: పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా ప్రతి సబ్జెక్టు మధ్య నాలుగు రోజుల గ్యాప్ రానుంది. దీని వల్ల రివిజన్‌కు సమయం ఉండటంతో పాటు విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలకు సన్నద్ధం కావడానికి అవకాశం ఉండనుంది. చదువులో వెనుకబడిన విద్యార్థులు కూడా కనీస ఉత్తీర్ణత మార్కులు సాధించేందుకు వీలుంటుంది. మార్చి 14నుంచి పరీక్షలు పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. షెడ్యూల ప్రకారం మార్చి 14న పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 16న ముగియనున్నాయి. గత సంవత్సరం మాదిరిగానే ప్రతి సబ్జెక్టుకు 20 ఇంటర్నల్ మార్కులు ఉండనున్నాయి. వీటి ఆధారంగా సబ్జెక్టుల వారిగా గ్రేడింగ్ ఇవ్వనున్నారు. 12,325మంది విద్యార్థులు జిల్లాలో పదో తరగతి వరకున్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 354 ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే టెన్త్ విద్యార్థులు 7,000, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులు 5,325 మంది ఉన్నారు. వీరంతా వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు. ఉత్తమ ఫలితాల సాధనకు నూతన విధానం ఎంతగానో దోహదపడుతుందని డీఈఓ సత్యనారాయణ తెలిపారు.టెన్త్ వార్షిక పరీక్షల విధానంలో మార్పులు ఫ ప్రతి సబ్జెక్టు మధ్య నాలుగు రోజుల గ్యాప్ ఫ పరీక్షల షెడ్యూల్ విడుదల -
విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
చివ్వెంల: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూర్యాపేట జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి రాధాకృష్ణ చౌహాన్ సూచించారు. జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా బుధవారం సూర్యాపేట పట్టణంలోని ప్రతిభా జూనియర్ కళాశాలలో విద్యార్థులకు చట్టాలపై నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. తల్లిదండ్రులు, గురువులను గౌరవించడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకుంటారన్నారు. మన హక్కులతో పాటు విధులను కూడా సక్రమంగా నిర్వహించాలన్నారు. విద్యార్థులు వివాహ వయస్సు రాకముందే పెళ్లి చేసుకుంటే పోక్సో చట్టం ద్వారా శిక్ష విధిస్తారన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపెల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, మీడియేషన్ సభ్యులు గుంటూరు మధు, అల్లంనేని వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ సత్యంబాబు పాల్గొన్నారు. -
ఊరూరా కిక్కు
నాగారం : జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. మూడు విడతల్లో ఎన్నికలు జరుతున్నాయి. తొలివిడత ఎనిమిది మండలాల్లో గురువారం పోలింగ్ జరగనుంది. ఇక రెండు, మూడు విడత ఎన్నిల ప్రచారం జోరుగా సాగుతోంది. బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం ఎరగా వేస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా సిట్టింగ్‌లు పెట్టించి మరీ మద్యం పోయిస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లోని బెల్ట్ దుకాణాల్లో పెద్ద ఎత్తున డంప్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మకాలు మూడింతలు పెరిగినట్లు సమాచారం. ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్న లిక్కర్ గోదాములు కిక్కిరిసి ఉంటున్నాయి. ఈనెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకుసూర్యాపేట జిల్లాలో రూ.61.91 కోట్ల విలువ గల మద్యం విక్రయాలు జరిగాయి. తొలిరోజు నుంచే... జిల్లా వ్యాప్తంగా 93 మద్యం దుకాణాలు, 19 బార్లు ఉన్నాయి. ఈ నెల 1వ తేదీ నుంచి కొత్త వారికి ట్రేడ్ లైసెన్స్‌లు మంజూరు చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వారికి తొలి రోజు నుంచే కాసుల వర్షం కురుస్తోంది. కొత్త దుకాణదారులకు గ్రామాల నుంచి భారీ మొత్తంలో ఆర్డర్లు వస్తున్నాయి. అభ్యర్థులు కొందరు ఏకంగా ఉద్దెర ఖాతాలు పెట్టేశారు. ప్రధానంగా బెల్ట్ దుకాణాలకు ఎక్కువగా సరఫరా అవుతోంది. ఈనెల 17వ తేదీ వరకు ఎన్నికల సందడి ఉండటంతో మద్యం భారీగా అమ్ముడుకానుంది. ఈ విషయంపై సంబంధిత ఎకై ్సజ్ శాఖ అధికారులను వివరణ కోరగా.. మద్యం దుకాణాల నుంచి పెద్ద మొత్తంలో ఎవరు కొన్నా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు తమ సిబ్బందితో నిఘా పెట్టామని వెల్లడించారు. ఫ ఈనెల 1 నుంచి 9 వరకు జిల్లాలో రూ.61.91 కోట్ల మద్యం అమ్మకాలు ఫ పంచాయతీ ఎన్నికలే కారణం -
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి బుధవారం నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం చేశారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం , రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. ఆలయ తిరుమాడ వీధుల్లో శ్రీస్వామి వారిని గరుడవాహనంపై ఊరేగించారు.అనంతరం మహానివేదనతో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు , పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. విద్యార్థులు లక్ష్య సాధనకు శ్రమించాలి దేవరకొండ : విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్య సాధనకు నిరంతరం పట్టుదలతో శ్రమించాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ సూచించారు. బుధవారం ్చదేవరకొండ పట్టణంలోని ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన 11వ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కళాశాలలో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు కృషిచేసిన ప్రిన్సిపాల్ రవితోపాటు అధ్యాపకులను ఆయన అభినందించారు. అనంతరం 2024–25 విద్యాసంవత్సరానికి గాను వివిధ సబ్జెక్టులలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆయన బంగారు పతకాలు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి.ఉపేందర్‌రెడ్డి, అధ్యాపకులు కోటయ్య, లింగమయ్య, లింగారెడ్డి, పృథు, ధనుంజయ పాల్గొన్నారు. పంచ నారసింహుడికి నిత్యారాధనలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. బుధవారం వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు. -
మానవ హక్కుల పరిరక్షణకు కృషి
కోదాడ: సమాజంలో మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని తెలంగాణ పోలీస్ కంప్లెయింట్ అథారిటీ మెంబర్ వర్రె వెంకటేశ్వర్లు యాదవ్ అన్నారు. మానవహక్కుల దినోత్సవం సందర్భంగా సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో మంగళవారం కోదాడ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి పౌరుడు నైతిక విలువలతో జీవించి మానవహక్కుల రక్షణలో భాగస్వామి కావాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే సమాజంలో ప్రతి పౌరుడు తమ హక్కులను స్వేచ్ఛగా పొందగలరన్నారు. విద్యాహక్కు కోసం పిల్లలు ఎదురు చూస్తున్నారని భద్రత కోసం మహిళలు పోరాడుతున్నారని అన్నారు. ఇండియన్ జస్టిస్ రిపోర్టు 2024 ప్రకారం దేశంలోనే తెలంగాణా రాష్ట్రం పోలీసింగ్ వ్యవస్థలలో నంబర్ 1 స్థానంలో నిలవడం ఇక్కడి పోలీసులు పనితీరుకు నిదర్శనం అని అన్నారు. రాబోయే రోజుల్లో శాంతిభద్రతల విషయంలో తెలంగాణ పోలీసులు మరింత సమర్థంగా పని చేసి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని కోరారు. తన విధులు సక్రమంగా నిర్వర్తించి పోలీస్ వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం సమాచార హక్కువికాస సమితి అధ్యక్షుడు ఎర్రమాద కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పోలీస్ కంప్లెయింట్ అథారిటీ మెంబర్‌గా డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లును ప్రభుత్వం నియమించడం అభినందనీయం అని అన్నారు. కార్యక్రమంలో వికాస సమితి జిల్లా అధ్యక్షుడు శివ, సత్యనారాయణ, వెంకటరెడ్డి, సైదులు, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు. ఫ తెలంగాణ పోలీస్ కంప్లెయింట్ అథారిటీ మెంబర్ వర్రె వెంకటేశ్వర్లు -
నేడు 152 సర్పంచ్ స్థానాలు, 1,241 వార్డులకు ఎన్నికలు
భానుపురి (సూర్యాపేట) : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలిదశ పోలింగ్‌కు వేళయ్యింది. జిల్లాలోని ఎనిమిది మండలాల్లో ఏకగ్రీవాలతో పాటు నామినేషన్దాఖలు కానివి పోగా మిగిలిన 152 గ్రామపంచాయతీలు, 1,241 వార్డులకు గురువారం ఉదయం 7గంటల నుంచి పోలింగ్ జరగనుంది. సాయంత్రం 4నుంచి 5గంటల వరకు బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రి తరలింపు ప్రక్రియ బుధవారం రాత్రే పూర్తయ్యింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2,31,851 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఎనిమిది మండలాల్లో.. జిల్లాలో మొత్తం 486 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటికి మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత తుంగతుర్తి, నాగారం, మద్దిరాల, జాజిరెడ్డిగూడెం, తిరుమలగిరి, నూతనకల్, సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్) మండలాల్లోని 159 గ్రామపంచాయతీలు, 1,442 వార్డుల ఎన్నికలకు గత నెల 27న నోటిఫికేషన్ జారీఅయ్యింది. అయితే సర్పంచ్‌లకు 1,387, వార్డులకు 3,791 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 7 సర్పంచులు, 198 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 3 వార్డులకు ఒక్క నామినేషనూ దాఖలు కాలేదు. ఈ క్రమంలో మొదటి విడత 152 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 471 మంది బరిలో ఉన్నారు. 1,241 వార్డులకు పోలింగ్ జరగనుండగా 2,736 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 4,356మంది సిబ్బందితో.. మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిబ్బంది నియామకం నుంచి బ్యాలెట్ పత్రాల వరకు అన్నింటినీ సమకూర్చుకున్నారు. 58 రూట్లను ఏర్పాటు చేసి బుధవారం మధ్యాహ్నం నుంచే పోలింగ్ సిబ్బంది, పోలింగ్ సామగ్రిని 133 పెద్దవాహనాలు, మరో 59 చిన్న వాహనాల్లో ఆయా మండలాల్లో ఉన్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి గ్రామాలకు తరలించారు. గురువారం 232 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 1,403 పోలింగ్ కేంద్రాల్లో 2,31,851 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జోనల్ అధికారులు 28 మంది, 1,683 మంది పీఓ (ప్రొసైడింగ్ అధికారి), 2,260 మంది ఓపీఓలు, స్టేజ్–1 ఆర్ఓలు 104, 178 మంది స్టేజ్ –2 అధికారులు, 65 మంది రూట్ ఆఫీసర్లు, 38 మంది మైక్రో అబ్జర్వర్లు తమకు కేటాయించిన విధుల్లో చేరారు. మరో ఎనిమిది మంది వ్యయ పరిశీలకులు ఉన్నారు. వీరితో పాటు అదనంగా 16ఎఫ్ఎస్టీ బృందాలు ఎన్నిల విధుల్లో ఉంటాయి. ఇప్పటికే తమకు కేటాయించిన పంచాయతీలకు చేరుకున్న వీరంతా తెల్లవారుజాము నుంచే పోలింగ్‌కు అనుగుణంగా 1,543 బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేసుకున్నారు. ఉదయం 7గంటల నుంచే పోలింగ్ జరగనుంది. 2,31,851 మంది ఓటర్లు.. మొదటి విడతలో మొత్తం 2,31,851 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 1,16,705 మంది, పురుషులు 1,15,141 మంది, ఇతరులు మరో ఐదుగురు నమోదై ఉన్నారు. అత్యధికంగా ఆత్మకూర్ (ఎస్)లో 44,053 మంది ఓటర్లు, తుంగతుర్తిలో 34,616 మంది ఓటర్లు ఉన్నారు. జాజిరెడ్డిగూడెం 24,615, మద్దిరాల 25,307 మంది, నాగారం 24,775 మంది, నూతనకల్ 29,066 మంది, సూర్యాపేట 31,620 మంది, తిరుమలగిరి 17,799 మంది చొప్పున ఓటర్లు ఉన్నారు. వీరికి బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి పోల్‌చిట్టీలు పంపిణీ చేశారు. ఈ పోల్ చిట్టీలతో పాటు ఏదైనా గుర్తింపు కార్డులను వెంట తీసుకెళ్లి ఓటువేయాల్సి ఉంటుంది. ఓటింగ్ అనంతరం మధ్యాహ్నం 2గంటల నుంచి 154 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఫలితాలు వెల్లడించి.. ఉపసర్పంచ్ ఎన్నిక చేపట్టనున్నారు.మండలాలు 08 పోలింగ్ సిబ్బంది : 4,356 రూట్లు : 58 బ్యాలెట్ బాక్సులు : 1,543 కౌంటింగ్ కేంద్రాలు : 154మొదటి విడత ఎన్నికలు జరగనున్న ఎనిమిది మండలాల్లో 264 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సీసీ కెమెరాలను బిగించారు. అవే కాకుండా 24 సమస్యాత్మక గ్రామాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. ఫ ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఫ 4గంటల వరకు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం ఫ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఫ ఓటుహక్కు వినియోగించుకోనున్న 2,31,851 మంది ఓటర్లు -
బీఆర్ఎస్ నేత దారుణహత్య
నూతనకల్: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో బీఆర్ఎస్ నేత ఉప్పుల మల్లయ్య (55) దారుణ హత్యకు గురయ్యాడు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఆధిపత్యపోరులో ఈ ఘర్షణ జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లి సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. బీఆర్ఎస్ మద్దతుదారుగా మాదాసు వెంకన్న, కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా దేశపంగు మురళి సర్పంచ్ బరిలో నిలిచారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత ఉప్పుల మల్లయ్య కోడలు ఉప్పుల శైలజ 4వ వార్డు నుంచి బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థిగా పోటీలో ఉంది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఇరు పార్టీల వారు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు ప్రచారం ముగించుకొని గ్రామంలోని పార్టీల జెండా దిమ్మెల సమీపంలో కూర్చున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ వారు ఓటర్లను కలిసివస్తున్న సమయంలో.. శైలజకు ప్రత్యర్థిగా ఉన్న ఆకుల రజిత వర్గానికి చెందిన ఉప్పుల సతీశ్, కొరివి గంగయ్య, వీరబోయిన సతీశ్, ఉప్పుల గంగయ్య, ఉప్పుల ఎలమంచి, వీరబోయిన లింగయ్య, కారింగుల రవీందర్, దేశపంగు అవిలయ్యలు గొడవ పడడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చేసుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు.. బీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మున్నా మల్లయ్యపై దాడి చేయగా, అడ్డుకోవడానికి వెళ్లిన ఉప్పుల మల్లయ్యపై కూడా కర్రలతో దాడి చేశారు. దీంతో మల్లయ్య తలకు తీవ్రగాయాలై కిందపడిపోయాడు. ఇదే సమయంలో తలపై బండరాయితో మోపడంతో అపస్మారకస్థితికి చేరుకున్నాడు. అతడిని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో సూర్యాపేటకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి ఉప్పుల మల్లయ్య మృతి చెందినట్టు చెప్పారు. ఈ దాడిలో మున్నా మల్లయ్యతోపాటు అతని సోదరుడు లింగయ్య, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మల్లయ్య మృతదేహానికి సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం భారీ పోలీస్ బందోబస్తు మధ్య గ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా, రాజకీయ కక్షలతోపాటు దాయాదుల గొడవలు కూడా ఈ దాడికి కారణమైనట్టు తెలిసింది. ఎనిమిది మంది నిందితుల అరెస్ట్ఉప్పుల మల్లయ్య హత్య కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్టు సూర్యాపేట జిల్లా అడిషనల్ ఎస్పీ రవీందర్‌రెడ్డి తెలిపారు. మృతుడి భార్య లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దాడికి పాల్పడి, మృతికి కారకులైన ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు వివరించారు. -
పంచాయతీ ప్రచారంలో మహిళలు...ఖాళీగా పల్లె వెలుగు బస్సులు
సూర్యాపేట జిల్లా: నిత్యం రద్దీతో ఉండే పల్లె వెలుగు బస్సు లకు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రయాణి కుల సంఖ్య తగ్గింది. పది రోజుల క్రితం వరకు కాలు పెట్టడానికి కూడా స్థలం ఉండేది కాదు. గ్రామా ల్లో ఎన్నికల ప్రచారంలో మహిళలు ముమ్మరంగా పాల్గొంటుండటంతో బస్సుల్లో ప్రయాణించేవారు బాగా తగ్గిపొయారు. ప్రచారానికి వెళ్లేవారికి రోజు కు రూ.500 వరకు ఇస్తుండడం కూడా ఓ కారణం. పంచాయతీ ఎన్నికల హడావుడి ప్రారంభం కాక ముందు సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్టీసీ డిపోలో ఉన్న పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో వంద శాతం ఆక్యుపెన్సీ రేషియో ఉండేదని.. ప్రస్తుతం అది సగానికి పడిపోయిందని ఆర్టీసీ వర్గాలు అంటు న్నాయి. ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో ఆర్టీసీ అధికారులు రోజువారి ట్రిప్పుల సంఖ్యను కూడా కుదించారు. -
పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోవాలి
భానుపురి (సూర్యాపేట) : గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండు, మూడు విడతల్లో విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద్లాల్ పవార్ ఒక ప్రకటనలో కోరారు. రెండవ విడత అనంతగిరి, చిలుకూరు ,చివ్వెంల, కోదాడ, మోతె, మునగాల, నడిగూడెం, పెన్‌పహాడ్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయని, ఇందుకు సంబంధించి అక్కడ విధులు నిర్వహించే ఉద్యోగులు ఈ నెల 7నుంచి 10వ తేదీ వరకు ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే మూడవ విడత ఎన్నికలు జరిగే చింతలపాలెం, గరిడేపల్లి, హుజూర్నగర్, మఠంపల్లి, మేళ్లచెరువు, నేరేడుచర్ల, పాలకవీడు మండలాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు ఈనెల 10,12,13,15 తేదీలలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను వినియోగించుకోవాలని సూచించారు. వైభవంగా సుబ్రహ్మణ్యస్వామి కల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని శివాలయంలో మంగళవారం సాయంత్రం శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యస్వామి భక్త కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఏకాదశరుద్రాభిషేకం చేపట్టారు. అనంతరం గణపతిపూజ, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్యప్రాశన, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తాలిబొట్టు తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, అర్చకులు దుర్గాప్రసాద్‌శర్మ, లక్ష్మీనరసింహ మూర్తి, నాగభూషణం, సీతారామాచార్యులు, శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు. ఎంజీయూ ఫారెన్ రిలేషన్స్ ఆఫీస్ డైరెక్టర్‌గా శ్వేతనల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫారెన్ రిలేషన్స్ ఆఫీస్ డైరెక్టర్‌గా ఎంజీయూ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ సూరం శ్వేతను నియమిస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అలువాల రవి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది పాటు శ్వేత ఈ పదవిలో కొనసాగనున్నారు. దేశ, విదేశాల్లోని యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు, ఎంజీయూకు అనుసంధాన పర్చేందుకు కృషి చేయనున్నారు. ఈ సందర్భంగా శ్వేతను వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అలువాల రవి అభినందించారు. ఆంజనేయస్వామికి నాగవల్లి దళార్చనయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో మంగళవారం క్షేత్ర పాలకుడైన శ్రీఆంజనేయస్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విష్ణు పుష్కరిణి ఆవరణలో ఉన్న శ్రీఆంజనేయ స్వామికి అర్చకులు అభిషేకం జరిపించారు. హనుమంతుడిని సింధూరంతో అలంకరించి నాగవల్లి దళార్చన చేపట్టారు. పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
కాంగ్రెస్ పాలనలో అరాచకాలు
సూర్యాపేట : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి పాలనలో అరాచకాలు చూస్తున్నామని, కేసీఆర్ అంటే అభివృద్ధి.. రేవంత్ అంటే దందాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని తాళ్ల ఖమ్మంపహాడ్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పదేండ్లు కేసీఆర్ పాలన ఎంతో ప్రశాంతంగా ఉందన్నారు. రేవంత్ మాయమాటలకు మోసపోయామని తేలిపోయిందని, కేసీఆర్‌ను దూరం చేసుకున్నామని అంతా ఇప్పుడు బాధపడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ మంత్రులంతా కమీషన్లు, కబ్జాల పనిలో పడ్డారని విమర్శించారు. నిరంతరం అభివృద్ధి పనులకు కేసీఆరే చిరునామా అని, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్పా.. కొత్తగా చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల వల్లనే ఏ అభివృద్ధి జరగడం లేదని, ఇక ఆ పార్టీ సర్పంచ్‌లను గెలిపిస్తే మాత్రం ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ పార్టీయేనని, అందుకే బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్, వార్డు మెంబర్లను గెలిపించాలని కోరారు.ఫ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి -
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
సూర్యాపేటటౌన్ : ‘మొదటి విడత ఎన్నికలు జరిగే ఎనిమిది మండలాల్లో మంగళవారం సాయంత్రం నుంచి ప్రచార ముగిసింది. ఎవరు కూడా ఇక ప్రచారం చేయవద్దు.. డబ్బు, మద్యం, బహుమతులు అంటూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేయవద్దు’ అని ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోషల్ మీడియాపై జిల్లా పోలీస్ శాఖ నిశిత పరిశీలన ఉందని, ఎవరైనా ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించినా, తప్పుడు సమాచారం ప్రచారం చేసినా అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 1500 మంది సిబ్బందితో ఐదెంచల భద్రత సూర్యాపేట, ఆత్మకూరు, నూతనకల్, మద్దిరాల, తుంగతుర్తి, అర్వపల్లి, నాగారం, తిరుమలగిరి మండలాల్లో 1,500 మంది పోలీస్ సిబ్బందితో ఎన్నికలకు ఐదెంచల పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఆన్లైన్ వెబ్ కాస్టింగ్ ఉంటుందని, దీని ద్వారా ఈ కేంద్రాలలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. కేసులు.. మూడు విడతల్లో 170 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. గత ఎన్నికల్లో కేసుల్లో ఉన్నవారు, రౌడీలు, పాత నేరస్తులు, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న 1,284 మందిని ముందస్తుగా బైండోవర్ చేసినట్లు వివరించారు. 136 కేసుల్లో రూ.9.50 లక్షలు విలువైన 1,425 లీటర్ల మద్యం సీజ్ చేశామని 53 లైసెన్స్డ్ ఆయుధాలు డిపాజిట్ చేయించినట్లు పేర్కొన్నారు. ఓటర్లు, అభ్యర్థులకు సూచనలు.. ఫ మీ పేరు తాజా ఓటర్ జాబితాలో ఉన్నదా, లేదా నిర్ధారించుకోండి. ఫ పోలింగ్ సెంటర్ కు సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావొద్దు, సెల్ఫీలు దిగవద్దు. ఫ మీ పోలింగ్ స్టేషన్ వివరాలు ముందుగానే చూసుకోండి. ఫ పోలింగ్ రోజున ఎన్నికల సంఘం చూపిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఒకటైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురండి. ఫ వేరొక ఓటరు పేరు మీద ఓటు వేయడానికి ప్రయత్నించడం చట్టరీత్యా నేరం. దీనికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఫ కౌంటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి తప్పనిసరి. ఫ ఎస్పీ నరసింహ -
ఇక.. ప్రలోభాల ఎర
సూర్యాపేట : మొదటి విడత ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో పరిసమాప్తం అయ్యింది. ఇక గప్‌చుప్‌గా ప్రలోభాల ఎరకు అభ్యర్థులు తెరలేపారు. డబ్బు, మద్యం, విందులు, చికెన్ పంపిణీకి కసరత్తు చేస్తున్నారు. చివరి రోజు ప్రచారం హోరాహోరీగా సాగింది. తొలిదశ పోలింగ్ గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. సాయంత్రం ఫలితాలు వెల్లడికానున్నాయి. తమ ప్రధాన మద్దతుదారులను గెలిపించేందుకు ప్రధాన పార్టీల నేతలు జోరుగా ప్రచారం నిర్వహించారు. గెలుపే లక్ష్యంగా.. తుంగతుర్తి, జాజిరెడ్డిగూడెం, తిరుమలగిరి, నూతనకల్, నాగారం, మద్దిరాల, సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్) మండలాల్లో సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. చివరి రోజు మంగళవారం సైతం ప్రచారంతో హోరెత్తించారు. బహిరంగ ప్రచారం ముగిసిన వెంటనే అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపారు. మరోవైపు రెండో విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లోనూ ప్రచారం జోరందుకుంది. ప్రధానంగా జనరల్, బీసీ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉంది. ప్రచారం ముగియగానే అభ్యర్థులు తమ ప్రత్యర్థులు ఓటుకు ఎంత ఇస్తున్నారో తెలుసుకుని అంతకంటే కొంత ఎక్కువ ఇచ్చేలా ప్రణాళికలు చేసుకుంటున్నారు. ఎలాగైనా గెలిచితీరాలని డబ్బు, మద్యంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు పంచేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితా ఆధారంగా తమకు పడే ఓట్ల కోసం గుట్టుచప్పుడు కాకుండా డబ్బుల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా.. ఏ దారిలో ఓటరుకు డబ్బులు చేరవేయాలని అభ్యర్థులు చూస్తుంటే.. డబ్బులు ఎవరు పంచుతున్నారంటూ ఓటర్లు ఇప్పటికే ఆరా తీస్తున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా.. నామినేషన్ల ఉపసంహరణ రోజు నుంచి కొందరు నాయకులు, ఓటర్లు సానుభూతిపరులను మద్యం మత్తులో ముంచేశారు. ఇప్పుడు ఓటర్లు చేజారకుండా ఉండేందుకు అభ్యర్థులు ఏ వాడ ఓటర్లను ఆ వాడలో ప్రత్యేక సిట్టింగులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం మద్యం డంప్ చేసి వారికి తాగినంత అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదే వాతావరణం నేడు, రేపు రెండు రోజుల పాటు అభ్యర్థులకు తప్పేలా లేదు. ముందు ఖర్చు పెట్టేందుకే ఆలోచించిన అభ్యర్థులు పోలింగ్ సమయం దగ్గర పడటంతో ఒకరిని మించి మరొకరు ఖర్చు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. పలువురు అభ్యర్థులు తమకు వచ్చిన ఎన్నికల గుర్తులను ఓటర్లకు పంచుతున్నారు. ప్రధానంగా ఉంగరం గుర్తు వచ్చిన అభ్యర్థులు సిల్వర్, రాగి ఉంగరాలు అందజేస్తున్నారు. స్టూలు గుర్తు వచ్చిన వారు వాటిని పంచుతున్నారు. ఇంకా మిక్సీలు, చీరలు, సెల్ఫోన్లు, క్రికెట్ బ్యాట్లు పంపిణీ చేస్తున్నారు. రెండో విడత ఎన్నికలు జరుగుతున్న కోదాడ, మునగాల, నడిగూడెం, అనంతగిరి, చిలుకూరు, మోతె, చివ్వెంల, పెన్‌పహాడ్ మండలాల్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి తమను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని హామీల వర్షం కురిపిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు తమ మద్దతు దారుల కోసం రోడ్‌షోలు, గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఈనెల 14న రెండో విడత ఎన్నికల్లో మెజార్టీ స్థానాల విజయంపై ప్రధాన పార్టీలు కన్నేశాయి. ఫ మద్యం, డబ్బు పంపిణీ.. విందులు ఫ ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి అభ్యర్థుల తంటాలు ఫ రేపే మొదటి విడత పోలింగ్.. కౌంటింగ్ -
కేజీబీవీలకు బంకర్ బెడ్లు
నాగారం : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినుల కష్టాలు ఎట్టకేలకు తీరనున్నాయి. కొన్నేళ్లుగా రాత్రి సమయంలో విద్యార్థినులు నిద్రించేందుకు మంచాలు లేకపోవడంతో నేలపై చాపలు, దుప్పట్లు వేసుకొని కాలం వెల్లదీశారు. ఈ సమస్యను పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు బంకర్ బెడ్లు (డబుల్ డెక్కర్, డార్మిటరీ మంచాలు) అందించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర సమగ్రశిక్ష రాష్ట్ర సంచాలకులు ఉత్తర్వులను జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపించారు. ఇప్పటికే విద్యార్థినుల వివరాలు, ఎన్ని బంకర్ బెడ్లు అవసరమో ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించారు. ఇద్దరికి ఒకటి చొప్పున.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 18 కేబీబీవీలు ఉన్నాయి. వీటిలో కొన్ని చోట్ల ఆరు నుంచి పదోతరగతి వరకు.. మరికొన్నింట్లో ఇంటర్మీడియట్ కళాశాలలు నిర్వహిస్తున్నారు. ఈ విద్యాలయాల్లో 3,409 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థినులకు ఇద్దరికి చొప్పున వీటిని అందజేయనున్నారు. మొత్తం 1,700 వరకు బంకర్లు రానున్నాయి. ఇందులో కింద ఒకటి, పై భాగంలో మరో బెడ్ ఉండనుంది. రాత్రి సమయంలో పిల్లలు నిద్రించిన తరువాత కింద పడకుండా చుట్టూ రక్షణ ఉండేలా వాటిని తీర్చిదిద్దారు. సులభంగా పైకి ఎక్కేందుకు అవరమైన ఏర్పాట్లతో రూపొందించినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కేజీబీవీల్లో సరైన వసతులు లేక విద్యార్థినులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రభుత్వం ఎట్టకేలకు బంకర్ బెడ్లు అందించడానికి నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే సరఫరా అయ్యే అవకాశం ఉందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఫ ఇద్దరికి ఒకటి చొప్పున అందించేందుకు కసరత్తు ఫ తీరనున్న విద్యార్థినుల కష్టాలు ఫ వివరాలు సేకరించి నివేదిక సమర్పించే పనిలో అధికారులు కస్తూర్బా విద్యాలయాలు: 18 విద్యార్థినులు: 3,409 రానున్న బంకర్బెడ్లు: 1,700 -
పక్కా వ్యూహం.. గెలుపే లక్ష్యం
భానుపురి (సూర్యాపేట) : పల్లె రాజకీయం మరింత వేడెక్కింది. పార్టీలతో సంబంధం లేకున్నా పంచాయతీ సమరంలో విజయమే లక్ష్యంగా వివిధ పార్టీల నేతలు, అభ్యర్థులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. పక్కా ప్రణాళికతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. ఉదయం గుర్తులతో ప్రచారం చేయడంతో పాటు సాయంత్రం విందులు ఇస్తూ మచ్చిక చేసుకుంటున్నారు. ప్రధానంగా ఈనెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న మండలాల్లో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. నువ్వానేనా అన్నట్లుగా అభ్యర్థులు ఖర్చుకు వెనకాడకుండా ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. ఉదయం పూట ప్రచారం..మొదటి విడత ఎన్నికలు జరగనున్న 159 గ్రామపంచాయతీల్లో సర్పంచ్, వార్డుసభ్యులకు పోటీ చేసిన అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఉదయం పూట ఇంటింటికీ తిరిగి ఎన్నికల సంఘం తమకు కేటాయించిన గుర్తులపై ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీలో ఉన్న అభ్యర్థులు ఒకేసారి పెద్దఎత్తున మద్దతుదారులతో కలిసి ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఒక్కో గ్రామంలో ఉన్న వార్డులను విభజించి రోజుకు నాలుగైదు వార్డుల్లో ప్రచారం చేస్తున్నారు. రాత్రికి పసందైన విందులురెండు రోజులుగా గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. ఉదయం ఇంటింటి ప్రచారం చేస్తున్న అభ్యర్థులు రాత్రికి ఇంటింటికీ మద్యం పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా సామాజిక వర్గాలు, ప్రాంతాల్లో ఉన్న తమ వార్డు ప్రజలను ఏకం చేస్తూ పసందైన మందుతో విందులు ఇస్తున్నారు. అక్కడక్కడ మద్యమే కాకుండా ఇంటింటికీ అరకిలో చికెన్ పంపిస్తూ వినూత్నంగా ఓటర్ల మనసును గెలుచుకునే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎత్తుగడలు ఉదయం పూట ప్రచారం ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా రాత్రికి విందులు మొదటి విడతలో జోరుగా మద్యం పంపిణీప్రత్యేక వాహనాలు పంపించి..ఎన్నికలకు రెండురోజులే సమయం ఉండడంతో అభ్యర్థులు వలస ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కానున్న నేపథ్యంలో గ్రామంలోని వివిధ వార్డులకు చెందిన ప్రజలు హైదరాబాద్, ఖమ్మం, చైన్నె, ఇలా నగరాల్లో ఉన్న వారికి రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మొదటి విడతలో ఈనెల 11న పోలింగ్ ఉండడంతో ఆయా మండలాలకు చెందిన ఓటర్లు ఈనెల 10నే సొంత గ్రామాలకు చేరేందుకు కావాల్సిన ఏర్పాట్లను అభ్యర్థులు చేస్తున్నారు. కొందరు రవాణాకు కావాల్సిన డబ్బులను పంపిస్తుండగా.. మరికొందరు పెద్ద ఎత్తున ఓటర్లు ఉన్న చోటకు ప్రత్యేక వాహనాలను సైతం పంపించేలా చూస్తున్నారు. -
నిబంధనల మేరకు ప్రచారం చేసుకోవాలి
పెన్‌పహాడ్ : సర్పంచ్, వార్డు స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నిబంధనల మేరకు ప్రచారం చేసుకోవాలని ఎస్పీ నరసింహ సూచించారు. సోమవారం పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని రైతువేదిక కార్యాలయంలో సర్పంచ్, వార్డు స్థానాల్లో పోటీచేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల నియమావళి, వ్యయం, ప్రచారం, సమయపాలన అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. పరిమితికి మంచి ఖర్చు పెట్టవద్దని ప్రతి విషయాన్ని పరిశీలకులు గమనిస్తూ ఉంటారన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయవద్దని, మద్యం డబ్బు, ఉచితాలు, బహుమతులు లాంటి వాటిపై పోలీసు నిఘా ఉందన్నారు. సమయపాలన ముఖ్యమని సూచించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల బరిలో అంతా సొంత ఊరు వారే ఉంటారు కాబట్టి వ్యక్తిగత విమర్శలు చేసుకోవద్దని ప్రచారం సమయంలో ఒకరినొకరు ఎదురుపడే సమయంలో గొడవలు పెట్టుకోవద్దన్నారు. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని సూచించారు. బాణాసంచా పేల్చ డం, డీజేలు ఉపయోగించడం నిషిద్ధమని స్పష్టం చేశారు. సమస్యలు సృష్టించే వారిని ముందస్తుగా బైండోవర్ చేశామని బైండోవర్ అనేది కేసు కాదు అది వ్యక్తిగత సత్ప్రవర్తన కోసం స్వతహాగా ఇచ్చే హామీ పత్రమని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, రూరల్ సీఐ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, తహసీల్దార్ లాలు, ఎంపీడీఓ జానయ్య, ఎస్ఐ గోపికృష్ణ, అధికారులు పాల్గొన్నారు. నియమావళి పాటించాలిమునగాల: పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ నియమావళి పాటించాలని జిల్లా ఎస్పీ నరసింహ కోరారు. సోమవారం రాత్రి మునగాల మండలం కలకోవలో ఎన్నికల నిబంధనలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ప్రతి గ్రామం శాంతి కోవెలగా వెలగాలని, ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించి సామరస్యంగా ఉండాలని సూచించారు. సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తులను ముందస్తుగా బైండోవర్ చేస్తామన్నారు. గ్రామం నుంచి ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావాలని, దీనికోసం భవిష్యత్‌లో కలకోవ గ్రామంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.ఈ సదస్సులో కోదాడ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరెడ్డి, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.రామకృష్ణారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, మునగాల, నడిగూడెం, మోతె ఎస్ఐలు బి.ప్రవీణ్‌కుమార్, అజయ్‌కుమార్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ నరసింహ -
విత్తన బిల్లును ఉపసంహరించుకోవాలి
సూర్యాపేట అర్బన్ : 2025–విత్తన, విద్యుత్ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) జిల్లా కన్వీనర్లు మండారి డేవిడ్ కుమార్, వరికుప్పల వెంకన్న, మట్టిపల్లి సైదులు, దంతాల రాంబాబు డిమాండ్ చేశారు. ఎస్కేఎం జాతీయ కమిటీ పిలుపుమేరకు సోమవారం సూర్యాపేటలో 2025–విత్తన, విద్యుత్ బిల్లుల పత్రాలను దహనం చేసి నిర్వసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేశంలో వ్యవసాయ సంక్షోభం తీవ్రమవుతున్న సమయంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల ఈ బిల్లులను తీసుకువస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ కేఎం జిల్లా నాయకులు షేక్ నజీర్, కునుకుంట్ల సైదులు, పెరుమాళ్ల రాజారావు, నారబోయిన వెంకట్ యాదవ్, పుల్లూరి సింహాద్రి, ప్రవీణ్, చారి, ఇందిరా, ప్రమీల పాల్గొన్నారు. -
బృందావనపురం పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం
నడిగూడెం : నడిగూడెం మండల పరిధిలోని బృందావనపురం పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవమైంది. సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ గ్రామ జనాభా 2,200 మంది ఉన్నారు. ఓటర్లు మొత్తం 1,501 మంది ఉన్నారు. వార్డులు 10 ఉన్నాయి. ఈ గ్రామ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది. రెండో విడత ఈనెల 14న ఎన్నికలు జరగాల్సి ఉంది. పార్టీలకు అతీతంగా గ్రామ పెద్దలు ఏకతాటిపైకి వచ్చి చర్చలు జరిపి సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపర్చిన విద్యావంతురాలు కంభంపాటి సరితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ ఉప సర్పంచ్‌గా మూడవ వార్డు సభ్యురాలు పుట్ట సైదమ్మను అధికారుల సమక్షంలో ఎన్నుకున్నారు. మొత్తం ఈ గ్రామంలో 10వార్డుల్లో సీపీఎం బలపర్చిన ముగ్గురిని, బీఆర్ఎస్ మద్దతురాలు ఇద్దరు, టీడీపీ బలపర్చిన ఇద్దరిని, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ముగ్గురిని సభ్యులుగా ఎన్నుకున్నారు. వార్డు సభ్యులుగా ఎన్నికై న వారిలో గోలి వెంకటేశ్వర్లు, కంభంపాటి నాగేశ్వరావు, పుట్ట సైదమ్మ , పుట్ట ఆంజనేయులు, కాసాని వీరమ్మ, కాసాని కిషోర్, నారా ఇందు, మాధ వీరబాబు, నోసిన త్రివేణి , మాధవరావు ఉన్నారు. సర్పంచ్‌గా కంభంపాటి సరిత ఎన్నిక -
స్కూల్లో ఫర్నిచర్ ఉందా!
నాగారం : పాఠశాలలో అవసరానికి మించి బెంచీలు, ఫర్నిచర్ ఉంటే.. అవసరం ఉన్న పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం పంపించండి.. ఇది రాష్ట్ర పాఠశాల విద్యా సంచాలకుడు నవీన్ నికోలస్ ఇటీవల జారీ చేసిన ఆదేశాలు. 2024–25 యూడైస్ గణాంకాలను పరిశీలిస్తే కొన్ని పాఠశాలల్లో ప్రస్తుత విద్యార్థుల సంఖ్యకు అదనంగా డ్యూయల్ డెస్కు లు ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. కొన్ని పాఠశాలల్లో బెంచీలు లేక విద్యార్థులు నేలపైనే కూర్చోవాల్సి వస్తోంది. దీంతో ఫర్నిచర్ విషయంలో సర్దుబాటు చర్యలు చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఎన్ని పాఠశాలల్లో మిగులు డ్యూయల్ డెస్క్‌లు ఉన్నాయి.. ఎన్ని అవసరం అనే విషయాలను గుర్తించే పనిలో విద్యాశాఖ అధికారులు ఉన్నారు. జిల్లాలో ఇలా...జిల్లాలోని కొన్ని పాఠశాలలకు పూర్వ విద్యార్థులు, దాతలు తమ కుటుంబ సభ్యుల పేరిట బెంచీలు, కుర్చీలు తదితర సామగ్రిని అందజేశారు. బెంచీలు ఎక్కువగా ఉండి విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలలు కూడా ఉన్నాయి. గతంలో మన ఊరు–మన బడి పథకం ద్వారా కొన్ని పాఠశాలలకు డ్యూయల్ డెస్కులు కూడా పంపిణీ చేశారు. ఈ విద్యాసంవత్సరంలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో బడిబాట నిర్వహించినా ఆశించిన విధంగా విద్యార్థులు చేరలేదు. అలాంటి పాఠశాలల్లో ఫర్నిచర్ మిగులుగా ఉంది.వివరాలు ఇలా పంపాలి..ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలకు దాతలు లేదా స్వచ్ఛంద సంస్థల ద్వారా అందించిన ఫర్నిచర్ వివరాలను పరిశీలించాలి. మిగులు ఫర్నిచర్ ఉంటే ఆ వివరాలను ఎంఈఓకు తెలియజేయాలి. వారు పరిశీలించి ఆ వివరాలను డీఈఓకు పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పూర్తి చేసి డిసెంబర్ 15 వరకు నివేదికను విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. వివరాలు పంపించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశం లెక్కలు తేల్చే పనిలో అధికారులు అదనంగా ఉంటే ఫర్నిచర్ కొతర ఉన్నబడికి పంపించేలా ప్రణాళిక 15 వరకు ఉన్నతాధికారులకు నివేదిక -
తొలిదశ ప్రచారం నేడు ఆఖరు
సూర్యాపేట : పంచాయతీ మొదటి విడత ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెర పడనుంది. ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అయితే 48 గంటల ముందు ప్రచారాన్ని ఆపాల్సి ఉండడంతో ఆ గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. వారం రోజులుగా నామినేషన్లు, ప్రచారాలతో సందడి నెలకొన్న గ్రామాల్లో మంగళవారం సాయంత్రంతో బ్రేక్‌పడనుంది. ఇక, పోలింగ్‌కు అధికారులు అంతా సిద్ధం చేశారు. మండల కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్‌న్ సెంటర్లను ఏర్పాటు చేసి.. పోలింగ్ సామగ్రిని పంపించారు. పోలింగ్ సిబ్బందికి కూడా రెండు విడతల్లో శిక్షణ పూర్తి చేశారు. 159 పంచాయతీల్లో ఎన్నికలుసూర్యాపేట జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడత తుంగతుర్తి, మద్దిరాల, నాగారం, జాజిరెడ్డిగూడెం, తిరుమలగిరి, నూతనకల్, సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్) మండలాల్లోని 159 గ్రామ పంచాయతీలు, 1,442 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీనికోసం గత నెల 27న నోటిఫికేషనన్ విడుదలైన నాటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. నవంబర్ 29తో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నవంబర్ 30న స్క్రూట్నీ నిర్వహించి డిసెంబరు 1న అప్పీల్‌కు అవకాశం ఇచ్చారు. 2న వాటిని పరిష్కరించి.. 3వ తేదీన 3 గంటల వరకు ఉపసంహరణలు కొనసాగాయి. ఆ తర్వాత రంగంలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటించి గుర్తులు కేటాయించారు. 10వ తేదీన పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది..11న మొదటి విడత పోలింగ్ జరగనున్నందున.. మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్‌న్ కేంద్రాలకు పోలింగ్ సామగ్రి చేరుకుంది. పోలింగ్ బాక్సులు కూడా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకున్నాయి. 10వ తేదీన ఉదయం 10 గంటల నుంచి డిస్ట్రిబ్యూషనన్ కేంద్రాల వద్ద నుంచి సిబ్బంది ఎన్నికల సామగ్రిని తీసుకుని పోలీస్ బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత అదేరోజు 2 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టి గెలిచిన అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇలా మొదటి విడత ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.11న ఎనిమిది మండలాల్లో పోలింగ్ మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరిన పోలింగ్ సామగ్రి సిబ్బందికి రెండు విడతల్లో శిక్షణ పూర్తి 10వ తేదీన పోలింగ్ కేంద్రాలకు తరలనున్న సిబ్బంది -
కేసులతో ఇబ్బందిపెడుతున్న కాంగ్రెస్
హుజూర్నగర్ : బీఆర్ఎస్ శ్రేణులను బైండోవర్ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ ఆరోపించారు. సోమవారం హుజూర్నగర్ వచ్చిన ఆయన సీఐ చరమంద రాజుతో మాట్లాడిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులను బైండోవర్ కేసులతో ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. పోలీసులు కూడా చట్టపరంగా వ్యవహరించాలని కోరారు. అధికారం శాశ్వతం కాదని తాము కూడా 10 ఏళ్లు అధికారంలో ఉన్నా ఎప్పుడు కూడా ఎవరినీ వ్యక్తిగతంగా వాడుకోలేదని ఆయన తెలిపారు. ప్రజా క్షేత్రంలో ఎవరికి నచ్చినట్లు వారు పోటీ చేస్తారని, ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తే వారు గెలుస్తారని చెప్పారు. అంతేకానీ భయపెట్టి ఇబ్బందులకు గురిచేసే స్వభావం మానుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రస్తుతం గ్రామాల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత ఉండటంతో బీఆర్ఎస్ పార్టీవారిని భయభ్రాంతులకు గురిచేసి కాంగ్రెస్‌పార్టీ తరఫున పోటీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. బీఆర్ఎస్ శ్రేణులకు ఏ ఇబ్బందులు ఎదురైనా పార్టీ పరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు వై.వి.ఆర్, కేఎల్ఎన్రెడ్డి, అప్పిరెడ్డి, జక్కుల నాగేశ్వరావు, సైదిరెడ్డి, అమర్, ఉపేందర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల -
కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
చివ్వెంల : కేసుల పరిష్కారంలో మీడియేషన్, ప్యానల్ న్యాయవాదులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. లక్ష్మీశారద సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో మీడియేషన్, ప్యానల్ న్యాయవాదులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసుల విషయంలో కక్షిదారులతో మాట్లాడేటప్పుడు వ్యవహరించాల్సిన తీరుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి రాధాకృష్ణ చౌహాన్, సీనియర్ సివిల్ జడ్జి పర్వీన్కౌసర్, న్యాయవాదులు పాల్గొన్నారు.మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి సోమవారం నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు,అభిషేకాలు చేశారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం రక్తి కట్టించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం , రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. ఆలయ తిరుమాడ వీధుల్లో శ్రీస్వామి వారిని గరుడవాహనంపై ఊరేగించారు. అనంతరం మహానివేదనతో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కాగా క్షేత్రంలోని శివాలయంలో శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభా చార్యులు, దుర్గాప్రసాద్‌శర్మ, సీతారామా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. శివుడికి సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట: యాదగిరి క్షేత్రానికి అనుబంధంగా యాదగిరికొండపై ఉన్న శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు నిర్వహించారు. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో బిల్వార్చన, రుద్రాభిషేకం, ఆలయ ముఖమండపంలోని స్పటిక లింగానికి అభిషేకం చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రధానాలయంలో..సోమవారం వేకువజామున ప్రధాన ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రఽభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి ఆరాధనలు చేశారు. అనంతరం గర్భాలయంలో కొలువైన స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళ సహస్రనామార్చనతో కొలిచారు. ఇక ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని ఆగమశాస్త్రం ప్రకారం పూర్తి చేశారు. గజవాహనసేవ.. స్వామి, అమ్మవారికి నిత్య తిరుకల్యాణం కనుల పండువగా నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, సువర్ణ పుష్పార్చన , సాయంత్రం వెండిజోడు సేవను ఘనంగా ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం నిర్వహించి ఆలయ ద్వార బంధనం చేశారు. -
పోలింగ్ కేంద్రాల్లో సమస్యలు లేకుండా చూడాలి
● కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ మద్దిరాల : ఈనెల 11న జరిగే సర్పంచ్ ఎన్నికల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం మద్దిరాల మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని చిన్ననెమిల, మామిండ్లమడవ, జి.కొత్తపల్లి, కుంటపల్లి, కుక్కడం, గుమ్మడవెల్లి గ్రామాల్లోని పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి మాట్లాడారు. ఈనెల 10వతేదీన పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది చేరుకుంటారని వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆయేషా పర్వీన్, ఎంపీడీఓ సత్యనారాయణరెడ్డి, ఎస్ఐ ఎం.వీరన్న, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అఖిల్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలితుంగతుర్తి : ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. సోమవారం తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కోరారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు ఆయనతోపాటు తహసీల్దార్ దయానందం, ఎంపీడీఓ శేషు కుమారు ఉన్నారు. -
ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయండి
భానుపురి (సూర్యాపేట) : ఈనెల 11న మొదటి విడత ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులంతా ముందస్తుగానే పోస్టల్ బ్యాలెట్ ద్వారా విధిగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నంద్లాల్ పవార్ ఒక ప్రకటనలో కోరారు. ఎన్నికల విధులు కేటాయించి ఉద్యోగులు ఈనెల 6 నుంచి 9వ తేదీ వరకు సూర్యాపేట, ఆత్మకూరు (ఎస్), జాజిరెడ్డిగూడెం, నాగారం, నూతనకల్, మద్దిరాల, తిరుమలగిరి, తుంగతుర్తి మండలాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో విధిగా పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించిన ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీయూపీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ఎన్నికసూర్యాపేట టౌన్ : జిల్లా కేంద్రంలోని సరస్వతి విద్యా నిలయంలో ఆదివారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీయూపీఎస్) జిల్లా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్నారు. ఆ సంఘం జిల్లా ప్రస్తుతం అధ్యక్షురాలు పర్వతం సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యనిర్వాహకవర్గ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా యామా రమేష్, ప్రధాన కార్యదర్శిగా జూలకంటి వెంకట్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు ఎన్నికల అధికారి లింగంపల్లి హరిప్రసాద్ ప్రకటించారు. ఈ సమావేశానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నల్లగొండ విభాగ్ భౌద్దిక్ ప్రముఖ్ బంటు జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు నైతిక విలువలు నేర్పాలన్నారు. ఈ సమావేశంలో బెల్లంకొండ రామమూర్తి, బ్రహ్మచారి, రామారావు, శ్రీనివాసరావు, సుధాకర్‌రావు, నాగేశ్వర్రావు, జితేందర్‌రెడ్డి, కోటిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్, పూల్‌సింగ్, శ్రీనివాస్, శ్రీదేవి, రజని, ధనేశ్వర్రావు, శ్రీనివాసరావు, ఆంజనేయులు, ఉపేందర్ పాల్గొన్నారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఎదుర్కోలు మహోత్సవం, కల్యాణం చేపట్టి శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను గరుడ వాహనంపై ఉంచి ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. మహానివేదనతో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. సూర్యక్షేత్రంలో ప్రత్యేక పూజలుఅర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని చాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. అలాగే క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. స్వామి క్షేత్రానికి తరలివచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, యాదగిరి, అర్చకులు భీంపాండే, అంకిత్‌పాండే, శ్రీరాంపాండే, భక్తులు పాల్గొన్నారు. -
నేడు సాగర్‌కు విదేశీ ప్రతినిధులు
నాగార్జునసాగర్ : తూర్పు, పశ్చిమ ఆసియా దేశాల బౌద్ధ ప్రతినిధులు సోమవారం నాగార్జునసాగర్‌ను సందర్శించనున్నారు. వీరికి మూడు రోజులపాటు ఆతిథ్యం ఇచ్చేందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఏర్పాట్లు చేసింది. విజయవిహార్ ప్రాంగణం, బుద్ధవనం పరిసరాలు, లాంచీ స్టేషన్ దారి తదితర ప్రాంతాలు ముస్తాబు చేశారు. ప్రతినిధులు ముందుగా హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి విజయవిహార్‌కు రానున్నారు. డ్యామ్‌ను సందర్శించి లాంచీలో జలాశయంలో విహరించనున్నారు. విమానాల రద్దుతో అయోమయం కొన్ని అంతర్జాతీయ విమానాలు రద్దు కావడంతో ఏ దేశాల నుంచి ఎంతమంది ప్రతినిధులు వస్తారన్న వివరాలు పర్యాటక శాఖ వద్ద స్పష్టంగా లేవు. విదేశీ అతిథులు హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాతే తుది టూర్ షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. -
యాదగిరీశుడి క్షేత్రంలో కోలాహలం
యాదగిరిగుట్ట: నిత్యపూజలు, భక్తుల రద్దీతో పంచనారసింహుడి క్షేత్రంలో కోలాహలం నెలకొంది. ఆదివారం వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రఽభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి ఆరాధనలు చేశారు. అనంతరం గర్భాలయంలో కొలువైన స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తులసీదళ సహస్రనామార్చనతో కొలిచారు. ఇక ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని ఆగమశాస్త్రం ప్రకారం పూర్తి చేసి, గజవాహనసేవ.. స్వామి, అమ్మవారికి నిత్య తిరుకల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు, సువర్ణ పుష్పార్చన , సాయంత్రం వెండిజోడు సేవను ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం నిర్వహించి ఆలయ ద్వార బంధనం చేశారు. -
ఈశ్వరాచారి త్యాగం మరువలేనిది
హుజూర్నగర్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలులో అన్యాయం జరిగింద ట హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిన సాయి ఈశ్వరాచారి త్యాగం మరువలేనిదని బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు ధూళిపాల శ్రీనివాసరావు అన్నారు. సాయి ఈశ్వరాచారిని త్యాగాన్ని స్మరిస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హుజూర్‌నగర్‌లోని మిర్యాలగూడ రోడ్డు చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయి ఈశ్వరాచారి త్యాగం ప్రతి బీసీ బిడ్డ గుండెలో చిరస్థాయిగా నిలిచి పోతుందన్నారు. ఆత్మహత్యలకు పాల్పడొద్దు.. పోరాడి మన హక్కులు సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఈశ్వరాచారి కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా అందించాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు ఓరుగంటి మధు, చేపూరి నరసింహాచారి, చిలకరాజు అజయ్ కుమార్, కర్నె కృష్ణ, శెట్టి శ్రీనివాస్, వట్టికూటి శ్రీనివాస్‌గౌడ్, కొట్టు శేఖర్, ఎస్కే.హసన్మియా, జి.సైదులు యాదవ్, కాలువ పెదవెంకటేశ్వరావు, బ్రహ్మచారి, తదితరులు పాల్గొన్నారు. -
మలి విడత బరిలో 456 మంది
సర్పంచ్ అభ్యర్థులుగా పోటీలో ఉన్న వారు ఆదివారం ఉదయమే ప్రత్యేక ప్రచార వాహనాలను సిద్ధం చేసుకొని దేవాలయాలు, చర్చీల వద్ద ప్రత్యే పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. రంగురంగుల కరపత్రాలను ముద్రించి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. యువకులు వాట్సప్ గ్రూప్‌ల్లో ఓటర్లకు సందేశాలను పంపుతూ తమ అభ్యర్థికి ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. కోదాడ : రెండో విడత ఎన్నికలు జరిగే ఎనిమిది మండలాల్లోని 181 పంచాయతీల్లో 23 పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 158 పంచాయతీలో 456 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. ఇక 181 పంచాయతీల్లో మొత్తం 1,628 వార్డులు ఉండగా వాటిలో 336 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 1,292 వార్డుల్లో 2,790 మంది పోటీలో నిలిచారు. సర్పంచ్, వార్డు అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు. దీంతో ఆదివారం నుంచి గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పెన్‌పహాడ్‌లో అత్యధికం.. రెండో విడత ఎన్నికలు జరిగే 8 మండలాల్లో పెన్పహాహడ్ మండలంలోని 29 పంచాయతీల్లో 91మంది సర్పంచ్ అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. ఈ మండలంలో ఒక్క పంచాయతీ కూడా ఏకగ్రీవం కాలేదు. చిలుకూరు మండలంలోని 17 పంచాయతీల్లో ఐదు ఏకగ్రీవం కాగా 12 పంచాయతీల్లో అత్యల్పంగా 30మంది పోటీలో ఉన్నారు. అలాగే అనంతగిరిలో 54 మంది, కోదాడలో 45 మంది, నడిగూడెంలో 40 మంది, మోతెలో 63 మంది, మునగాలలో 58 మంది, చివ్వెంలలో 87మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అసలెవరో.. రెబల్ ఎవరో! ఎన్నికలు జరుగుతున్న పలు గ్రామాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో అసలెవరో.. రెబల్స్ ఎవరో తెలియని గందరగోళ పరిస్ధితి నెలకొంది. పలు గ్రామాల్లో పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థులు ఒకే పార్టీ కండువాలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితి అధికార పార్టీలో ఎక్కువగా కనిపిస్తోంది. మునగాల మండలం ముకుందాపురంలో ఇద్దరు కాంగ్రెస్ కండువాలతో ప్రచారం చేస్తున్నారు. ఇదే విధమైన పరిస్థితి చిలుకూరు మండలం బేతవోలు, కోదాడ మండలం గణపవరం, గుడిబండ గ్రామాల్లోనూ నెలకొంది. ఆయా గ్రామాల్లో నాయకులు కూడా రెండు గ్రూపులుగా విడిపోయి కొందరు ఒకరికి.. మరికొందరు ఇంకొక్కరికి మద్దతు నిస్తూ ప్రచారం సాగిస్తుండడంతో పంచాయతీ రాజకీయం వేడెక్కింది. కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ ఉద్యోగులు తెర వెనుక ఉండి తమ బంధువులను ఎన్నికల బరిలో దింపారు. కోదాడ మండలం గుడిబండలో నీటిపారుదలశాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తన భార్యను పోటీగా నిలపగా, ఆమైపె పోలీస్ శాఖలో సీఐగా పనిచేస్తున్న ఒకరు తనతల్లిని పోటీకి దింపారు. ముకుందాపురంలో ఇద్దరు పోలీస్ అధికారులు సర్పంచ్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. ఫ 158 గ్రామాల్లో తేలిన సర్పంచ్ అభ్యర్థుల లెక్క ఫ మొత్తం 181 పంచాయతీలకు 23 ఏకగ్రీవం ఫ ఎనిమిది మండలాల్లో 336 వార్డులు కూడా.. ఫ 1,292 వార్డులకు 2,790 మంది పోటీ -
చిత్ర విచిత్రాల పొత్తులు..!
భానుపురి (సూర్యాపేట) : తొలి, మలి విడతల పల్లెపోరులో చిత్ర విచిత్రాల పొత్తులు తెరపైకి వచ్చాయి. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో కత్తులు దూసుకునే పార్టీలు సైతం పంచాయతీ పోరులో కలిసి ముందుకు సాగుతున్నాయి. గ్రామాన్ని బట్టి ఒక్కో పార్టీలో మూడు నాలుగు చీలికలు వచ్చి పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు పోటీకి సై అంటే సై అంటున్నారు. వార్డులు తగ్గినా.. ఉపసర్పంచ్ ఇవ్వకున్నా మరోవర్గాన్ని ఏర్పాటు చేసుకుని ప్రత్యర్థి పార్టీ బలపర్చిన అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు. దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. గెలుపే లక్ష్యంగా.. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై నిర్వహించరు. కేవలం అభ్యర్థిని చూసే ఆయా పార్టీలు బలపర్చి మద్దతు ఇస్తుంటాయి. అయితే పార్టీలు సైతం తమ పార్టీలో ఉన్న ముఖ్య కార్యకర్తలనే సర్పంచ్ అభ్యర్థులుగా నిలబెడుతున్నాయి. వార్డు సభ్యుల పరిస్థితీ ఇలాగే ఉంటుంది. ఈ క్రమంలో జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరగనున్న తుంగతుర్తి, నాగారం, మద్దిరాల, జాజిరెడ్డిగూడెం, తిరుమలగిరి, నూతనకల్, సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్) మండలాల్లోని 159 గ్రామపంచాయతీలు, 1,442 వార్డులతోపాటు రెండో విడత ఎన్నికలు జరిగే చిలుకూరు, కోదాడ, అనంతగిరి, మునగాల, నడిగూడెం, మోతె, చివ్వెంల, పెన్‌పహాడ్ మండల్లాలోని 181 గ్రామాలు, 1,628 వార్డుల్లో పార్టీలతో సంబంధం లేకుండా పొత్తులు కుదిరాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు పలుచోట్ల ఒకే అభ్యర్థిని బలపర్చడం గమనార్హం. కొన్నిచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్లు.. ఇంకొన్నిచోట్ల బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు ఇలా.. రాజకీయాలతో సంబంధం లేకుండా తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పొత్తులు పెట్టుకున్నాయి. తొలి విడత పల్లెల్లో ఇలా.. ● తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో కుంభం మంజులను కాంగ్రెస్ పార్టీ బలపరిచి బరిలో నిలిపింది. ఇదే గ్రామంలో జేఏసీలో ఉన్న కాంగ్రెస్ వర్గీయులు, బీఆర్ఎస్, ఇతర పార్టీలు కలిసి మాడిశెట్టి వేదవాణిని నిలబెట్టాయి. ● తుంగతుర్తి మండలం అన్నారంలో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీచేశాయి. వెలుగుపల్లిలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి బరిలో నిలిచాయి. ● ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీలు పొత్తు పెట్టుకున్నాయి. ఏపూరులో బీఆర్ఎస్, సీపీఎం, బీజేపీ పొత్తు పెట్టుకోగా గట్టికల్లు గ్రామంలో బీజేపీ, బీఆర్ఎస్, సీపీఎం.. కందగట్ల, పాత సూర్యాపేట గ్రామాల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో ఉన్నాయి. తుమ్మల పెన్‌పహాడ్, ఇస్తాళ్లాపురం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మద్దతిస్తోంది. ● జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీమంత్రి దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే సామేలు ఇరు వర్గీయులు వేర్వేరుగా సర్పంచ్ బరిలో ఉన్నారు. దామోదర్‌రెడ్డి వర్గీయుల అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. అలాగే జాజిరెడ్డిగూడెం, కుంచమర్తి, అడివెంల, తిమ్మాపురం, వేల్పుచర్ల, రామన్నగూడెం, కాసర్లపహాడ్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. జాజిరెడ్డిగూడెంలో ఎమ్మెల్యే సామేలు వర్గీయునికి సీపీఎం, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ మద్దతు తెలిపాయి. కత్తులు దూసుకునే పార్టీలు సైతం మిత్రులుగా ఫ పార్టీల్లో వర్గాలుగా చీలికలు ఫ పంచాయతీ ఎన్నికల్లో వెలుగు చూస్తున్న పొత్తుల చిత్రాలు ఫ కలిసి ప్రచారం చేస్తుండడంతో ముక్కున వేలేసుకుంటున్న ఓటర్లుపంచాయతీల్లో ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మంది తమ పార్టీ మద్దతుదారులు గెలిచేలా ప్రణాళికలు రూపొందించింది. బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐలు సైతం తమతమ పార్టీలు బలంగా ఉన్నచోట సత్తాచాటాలని భావిస్తూ పోటీలో నిలిచాయి. అయితే స్థానిక పరిస్థితుల్లో బలంగా లేని పార్టీలు సర్పంచ్ అభ్యర్థిగా తమ పార్టీ వ్యక్తిని బలపర్చి ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దని పొత్తులకు వెళ్లాయి. ఈ పొత్తుల కారణంగా పార్టీలో ఉన్న ముఖ్య నాయకుల మధ్య విభేదాలు వచ్చి ఎవరి దారివారు చూసుకునే పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షంలో మొదటినుంచి వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు నచ్చకపోవడం మరో పార్టీతో జతకట్టి ఎన్నికల బరిలో నిలిచారు. ఈ పొత్తులు ఇలా ఉండగా.. రెండు రోజులుగా ప్రచారాలకు వెళుతున్న నాయకులను చూసి ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. -
రిజర్వేషన్ కలిసిరాలేదు..
భానుపురి (సూర్యాపేట) : శ్రీఅన్ని కలిసొస్తే సర్పంచ్ అవుదామకున్నా.. పార్టీ అండదండలు ఉన్నాయి.. జనంలోనూ పార్టీపై సానుకూలత ఉంది. అన్నింటికీ మించి ఇరుగు పొరుగువారితో, ఊరిలోనూ అన్నివర్గాలతో మంచి సంబంధాలు ఉన్నాయి.. కానీ తీరా చూస్తే రిజర్వేషన్ మారింది. ఇక సర్పంచ్ అయ్యే అవకాశం చేజారింది..శ్రీఅంటూ గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీ చేయాలనుకున్న ఆశావాహులు కొందరు అక్కడక్కడ తమ ఆవేదన వెల్లబుచ్చుతున్నారు. సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఆశావహులు ప్రస్తుతం వ్యూహం మార్చుతున్నట్లు తెలుస్తోంది. సర్పంచ్ కాకపోయినా.. చెక్ పవర్ ఉన్న ఉప సర్పంచ్ పదవి దక్కించుకుందామని పథకాలు రచించుకుంటున్నారు. ఆయా రిజర్వేషన్లకు చెంది.. తమ వెంటే ఉండే వారు, చెప్పినమాట వినే అనుచరుడు.. లేదంటే అనుచరుడి సతీమణిని ఇలా.. ఏదోవిధంగా తన మనిషినే సర్పంచ్‌గా బరిలోకి దింపి గెలిపించేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆర్థికంగా అండగా..! సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలవాలన్నా.. ఉప సర్పంచ్‌ను ఎన్నుకోవాలన్నా డబ్బే ప్రధానం. ఒక్కో గ్రామంలో ఒకలా ఖర్చు ఉంటుంది. జనాభా బట్టి ఒక్కో గ్రామంలో రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని పోటీలో ఉన్న అభ్యర్థులు పేర్కొంటున్నారు. కొన్ని గ్రామాల్లో ఓ సామాజిక వర్గం రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉండగా.. అక్కడ సర్పంచ్ స్థానం బలహీన వర్గాలవారికి రిజర్వేషన్ అయింది. ఈ క్రమంలో రిజర్వేషన్ వచ్చిన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి అంత భారీగా డబ్బులు ఖర్చు చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో గ్రామంలో అన్ని విధాలుగా ఉన్న సామాజిక వర్గం నాయకులు తమ ఇంట్లోని కుమారుడు, కోడళ్లను వార్డు మెంబర్ బరిలో ఉంచుతున్నారు. వార్డు మెంబర్‌గా గెలిచి.. ఉప సర్పంచ్‌గా గ్రామంలో తమ బలాన్ని చాటాలని చూస్తున్నారు. ఇందుకోసం సర్పంచ్ అభ్యర్థికి ఎన్నికల్లో అయ్యే ఖర్చును భరిస్తూ.. గెలిచాక పనులు అప్పగించేలా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వార్డు సభ్యుల ఎంపికే కీలకం ఉప సర్పంచ్‌గా బరిలో ఉండే నాయకుడు తమ ప్రధాన అనుచరులను వార్డుల్లో మెంబర్లుగా నిలిపేందుకు ఎంపిక చేసుకుంటున్నారు. ఉప సర్పంచ్ కావాలంటే వార్డు సభ్యుల పాత్ర కీలకం. దీంతో చెప్పిన మాట వినే వారితోనే నామినేషన్ వేస్తున్నారు వారికి అవసరమైన నామపత్రాలు, పన్ను చెల్లింపు, ధ్రువపత్రాలు తీసుకోవడం వంటి పనులన్నీ ఆ నాయకులే చూసుకుంటున్నారు.ఉప సర్పంచ్‌గా ఉందాం..! ఫ సర్పంచ్ పదవులు ఆశించినవారి మనోగతం ఫ వార్డు మెంబర్‌గా బరిలో ఉండేందుకు నామినేషన్లు ఫ అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు భరించేందుకు ముందుకు -
సమస్యాత్మక పల్లెలపై పక్కా నిఘా
అర్వపల్లి : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలపై పక్కా నిఘా ఉంచినట్లు జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావు తెలిపారు. సమస్యాత్మక గ్రామమైన జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో ఆదివారం పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సమాగ్రిని ఆయన పరిశీలించారు. అనంతరం అర్వపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ రిజిస్టర్లు పరిశీలించి ఓటింగ్ ప్రక్రియపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఝాన్సీ, తహసీల్దార్ శ్రీకాంత్, ఎస్ఐ సైదులు, ఎంపీఓ గోపి, సీనియర్ అసిస్టెంట్ నర్సింహరాజు, సిబ్బంది సైదులు, నాగరాజు, వెంకన్న, మల్లయ్య, స్టేజ్–2 అధికారులు పాల్గొన్నారు. -
ఏఎస్ రావు జ్ఞాపకార్థమే టాలెంట్ టెస్ట్
సూర్యాపేట టౌన్ : ఈసీఐఎల్ వ్యవస్థాపకుడు ఏఎస్ రావు జ్ఞాపకార్థమే ఆదివారం సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో 35వ సైన్స్ టాలెంట్ సెర్చ్ టెస్ట్ నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. పరీక్ష అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ టెస్ట్ నిర్వహిస్తున్నామని, ఈ సారి జిల్లా నుంచి 1000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదుతోపాటు 25 మందికి మెరిట్ సర్టిఫికెట్లు అందజేస్తున్నామని పేర్కొన్నారు. సహకరించిన కళాశాల యాజమాన్యానికి, ప్రిన్సిపాల్ డాక్టర్ వి.వెంకటేశులుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వేణుగోపాలరావు, కేకేబీఏ.శర్మ, వైవీ.సుబ్బారావు, ఆర్.కృష్ణమూర్తి, కె.సత్యనారాయణ, పి.రాజు పాల్గొన్నారు. -
ఎస్ఎల్బీసీ పూర్తిచేస్తాం
దేవరకొండ, కొండమల్లేపల్లి : ‘నల్లగొండ జిల్లా అంటేనే చైతన్యం.. నిజాం పాలనకు చరమగీతం పాడింది ఈ జిల్లానే. గత పాలకులు జిల్లా ప్రజలపై కక్షగట్టి శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) పనులను పక్కన బెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయించే బాధ్యత తీసుకుంటాం’ అని ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి అన్నారు. దేవరకొండ పట్టణంలో శనివారం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే బాలునాయక్ అధ్యక్షతన నిర్వహించిన ‘ప్రజాపాలన–ప్రజా విజయోత్సవాలు’ సభలో ప్రసంగించారు. రెండేళ్ల క్రితం ఓటు అనే ఆయుధంతో గడీల పాలన బద్దలు కొట్టి ప్రజలు ప్రజాపాలన ప్రభుత్వానికి పట్టం కట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో సమర్థులను.. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసే వారినే సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలన్నారు. గత ప్రభుత్వం ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు చేపట్టలేదని, ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి రాగా నే టన్నెల్ పనులకు నిధులు కేటాయించామన్నారు. రాబోయే రెండేళ్లలో దేవరకొండ నియోజకవర్గ పరి ధిలోని పెండింగ్ ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణ పనులు పూర్తిచేస్తామన్నారు. ఎమ్మెల్యే బాలునా యక్ చొరవతో ఒక్క దేవరకొండ నియోజకవర్గానికే అత్యధికంగా 14వేల రేషన్‌కార్డులు మంజూరయ్యాయనితెలిపారు. దేవరకొండకు నర్సింగ్ కాలేజీ మంజూరు చేస్తామని, అందుకు అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచిస్తామన్నారు. స్థానిక వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధులలు మంజూరు చేస్తామని, దేవరకొండలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి చదువుకున్న పాఠశాల అభివృద్ధికి రూ.5కోట్లు కావాలని ఎమ్మెల్యే బాలునాయక్ అడగగా.. రూ.6 కోట్ల మంజూరు చేయిస్తానన్నారు. ఎన్నికల కోడ్ ముగిశాక దేవరకొండ ప్రాంతానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్కను పంపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. మద్దిమడుగులో గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో రూ.20 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి సభా ప్రాంగణం సమీపంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. మహిళా సంఘాలకు రూ.11.33కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్‌రెడ్డి, వంశీకృష్ణ, మధుసూదన్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, మందుల సామేల్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్, గుత్తా అమిత్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, సిరాజ్‌ఖాన్, మాధవరెడ్డి, వేణుధర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, యూనూస్, ఏవిరెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, మాధవరెడ్డి, దూదిపాళ్ల రేఖ, దేవేందర్, ఆలంపల్లి నర్సింహ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ అంటే.. చైతన్యానికి ప్రతీక ఫ మంత్రులను పంపి సమీక్షలు నిర్వహిస్తాం ఫ పంచాయతీ ఎన్నికల్లో సమర్థులను ఎన్నుకోవాలి ఫ దేవరకొండలో నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తాం ఫ ‘ప్రజాపాలన విజయోత్సవాలు’ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫ సభకు భారీగా తరలివచ్చిన జనం -
దేవరకొండతో ప్రత్యేక అనుబంధం ఉంది
– మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దేవరకొండ ప్రాంతంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తన అమ్మమ్మ ఊరు దేవరకొండ మండలంలోని ముదిగొండ అని, అలాగే దేవరకొండ ఎమ్మెల్యే స్వగ్రామం ముదిగొండే అన్నారు. నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా తాను పోటీ చేసిన సమయంలో దేవరకొండ ప్రాంత ప్రజలు తనకు అత్యధిక మెజార్టీ అందించారని, ఈ ప్రాంతం వాసులు తనపై చూపే అప్యాయతను ఎప్పటికీ మరువలేనన్నారు. జిల్లాలో 2.50లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని.. జిల్లా వ్యాప్తంగా 15.63 లక్షల మందికి సన్న బియ్యం అందుతుందని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో ముందున్నామని, దేవరకొండ నియోజకవర్గంలో ధాన్యం అమ్మిన రైతులకు రూ.45 కోట్లు చెల్లించామన్నారు. దేవరకొండ నియోజకవర్గంలోని అంభభవాని, కంబాలపల్లి, పొగిళ్ల, ఏకేబీఆర్, పెద్దగట్టు లిఫ్టు ఇరిగేషన్ పనులకు రూ.440 కోట్లు మంజూరు చేశామని, ఈ లిఫ్టు ఇరిగేషన్ పనులు పూర్తయితే 37వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. పెండ్లిపాకల ప్రాజెక్టు ఎత్తు పెంపు పనులను పూర్తి చేస్తామని, డిండి ఎత్తిపోతల, మిర్యాలగూడ నియోజకవర్గంలో నెల్లికల్ లిఫ్ట్‌తోపాటు మిగతా ప్రాజెక్టులన్నీ ఎన్నికల నాటికి పూర్తి చేస్తామన్నారు. -
మూడో విడతకు ఏర్పాట్లు చేసుకోవాలి : కలెక్టర్
భానుపురి (సూర్యాపేట) : మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్లతో శనివారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వెబెక్స్ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోలింగ్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు చూసుకోవాలన్నారు. పోలింగ్ తర్వాత ఓట్లు లెక్కింపు ప్రక్రియను జాగ్రత్తగా చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, డీపీఓ యాదగిరి, డీఆర్డీఓ వీవీ.అప్పారావు, డివిజనల్ ప్రిసైడింగ్ అధికారి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రెండో విడత ఉపసంహరణ
కోదాడ : రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ శనివారం ముగిసింది. బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. శనివారం సాయంత్రం 3 గంటల వరకు పలు పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్ధానాలకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు పలువురు ఉపసంహరించుకున్నారు. కోదాడ నియోజకవర్గంలో కోదాడ, అనంతగిరి, నడిగూడెం, మోతె, మునగాల, చిలుకూరు మండలాలతోపాటు సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పెన్‌పహాడ్, చివ్వెంల మండలాల్లో మొత్తం 181 పంచాయతీలు ఉండగా ఇందులో 23 పంచాయతీల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకున్నారు. ఇక 158 పంచాయతీల్లో సర్పంచ్ స్ధానాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికి బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్యను అధికారికంగా ప్రకటించలేదు. ఇక, వీటి పరిధిలోని 1,628 వార్డులకు గాను 256 వార్డులు ఏకగ్రీవం కాగా 1,372 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. చివరి క్షణం వరకు సాగిన బుజ్జగింపులు సర్పంచ్ ఎన్నికల్లో ఒకే పార్టీకి చెందిన వారు ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో వారిని బుజ్జగించి రంగం నుంచి తప్పించడానికి ఆయా పార్టీల పెద్దలు తీవ్రంగా శ్రమించారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావులతో పాటు ముఖ్యనాయకులు కోదాడ నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల నాయకులతో చివరి క్షణం వరకు మంతనాలు జరిపి బుజ్జగించి చాలాచోట్ల నామినేషన్లను ఉపసంహరింప జేశారు. కానీ, కొన్నిచోట్ల వారి ప్రయత్నాలు ఫలించలేదు. గుర్తుల కేటాయింపు.. శనివారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కాగానే అభ్యర్ధులకు గుర్తులను కేటాయించారు. గుర్తులు పొందిన అభ్యర్ధులు కరపత్రాలు, మోడల్ బ్యాలెట్ పత్రాల ముద్రణకు ప్రింటింగ్ ప్రెస్‌ల బాటపట్టారు. కాగా రెండో విడత 8 మండలాల్లో ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారానికి మరో 7 రోజులు మిగిలి ఉండడంతో అభ్యర్థ్ధులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. 23 సర్పంచ్, 256 వార్డు స్థానాలు ఏకగ్రీవం ఫ బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించిన అధికారులు ఫ 158 గ్రామాల్లో ఈనెల 14న పోలింగ్ పంచాయతీలు వార్డులు 181 1,628 23 ఏకగ్రీవాలు 256 158 ఎన్నికలు జరిగేవి 1,372 -
సర్పంచ్ పదవులకు 1,052.. వార్డు స్థానాలకు 3,493
ఫ మూడో విడత పంచాయతీ పోరుకు భారీగా నామినేషన్లు ఫ హుజూర్నగర్ డివిజన్లో శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగిన ప్రక్రియభానుపురి (సూర్యాపేట) : జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే హుజూర్నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో చివరి రోజు నామినేషన్ల స్వీకరణ శుక్రవారం అర్ధరాత్రి ముగిసింది. ఈ నెల 3వ తేదీనుంచి డివిజన్లోని ఏడు మండలాల పరిధిలో 146 గ్రామ పంచాయతీలు, 1,318 వార్డుల్లో నామినేషన్లు స్వీకరించారు. మొదటి రోజు సర్పంచ్‌కు 107 నామినేషన్లు, వార్డు సభ్యులకు 116 నామినేషన్లు వచ్చాయి. ఇక రెండోరోజు సర్పంచ్‌కు 196, వార్డు సభ్యులకు 589 నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం చివరి రోజు నామినేషన్లు దాఖలు చేసేందుకు క్లస్టర్ల సెంటర్లకు అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి క్యూలైన్లలో నిల్చున్నారు. దీంతో సాయంత్రం 5.30గంటల వరకు లైన్లో ఉన్న ఆశావహులకు టోకెన్లు జారీచేసి రాత్రి పొద్దుపోయే వరకు నామినేషన్లు స్వీకరించారు. చివరి రోజు సర్పంచ్ పదవులకు 749, వార్డులకు 2,788 నామినేషన్లు వచ్చాయి. అత్యధికంగా సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు గరిడేపల్లి మండలం నుంచి దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. మండలం జీపీలు వార్డులు సర్పంచ్ వార్డు నామినేషన్లు నామినేషన్లు చింతలపాలెం 16 148 113 422 గరిడేపల్లి 33 300 228 785 హుజూర్నగర్ 11 110 76 323 మఠంపల్లి 29 254 255 775 మేళ్లచెరువు 16 152 82 356 నేరేడుచర్ల 19 168 132 365 పాలకవీడు 22 186 166 467 -
హోంగార్డుల సేవలు వెలకట్టలేనివి
సూర్యాపేట టౌన్ : శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల సేవలు వెలకట్టలేనివని ఎస్పీ నరసింహ అన్నారు. హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన హోంగార్డ్ ఆఫీసర్స్ పరేడ్‌కు ఎస్పీ హాజరై గౌరవ వందనం స్వీకరించారు. క్రీడాపోటీలు, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. హోంగార్డు ఆఫీసర్స్ సంక్షేమానికి ఎంతగానో కృషిచేస్తున్నామన్నారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ చూపిన హోంగార్డు ఆఫీసర్స్‌కు ప్రశంసా పత్రాల అందించి అభినందించారు. కార్యక్రమంలో ఆర్ముడ్ ఏఎస్పీ జనార్దన్‌రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, హోంగార్డు ఇన్చార్జి, ఆర్ఎస్ఐ అశోక్, ఇతర ఆర్ఎస్ఐలు సురేష్, సాయిరాం, రాజశేఖర్ పాల్గొన్నారు. -
మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం
భానుపురి (సూర్యాపేట) : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల (మైక్రో అబ్జర్వర్ల) పాత్ర చాలా కీలకమైందని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు జి.రవినాయక్ అన్నారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్లో సూక్ష్మ పరిశీలకులు, జోనల్ ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్‌తో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. మూడు విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఒకరోజు ముందుగానే మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ స్టేషన్‌కు చేరుకుని పరిశీలించాలన్నారు. అలాగే జోనల్ అధికారులు 7, 8 గ్రామ పంచాయతీలకు ఒక రూట్ మ్యాప్ ఏర్పాటు చేసుకుని సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు చేర్చేలా బాధ్యత తీసుకోవాలన్నారు. ఏమైనా పోలింగ్ మెటీరియల్ కావాలన్నా, సిబ్బందికి భోజనాలు చూసే బాధ్యత జోనల్ అధికారులదేన న్నారు. అనంతరం కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లు బాధ్యతగా పనిచేయాలన్నారు. శిక్షణలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, డీపీఓ యాదగిరి, డీఆర్డీఓ వీవీ.అప్పారావు, లీడ్ బ్యాంక్ మేనేజర్, ట్రైనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవినాయక్ -
రాజ్యాంగ రచనలో అంబేడ్కర్ కృషి శ్లాఘనీయం
సూర్యాపేట టౌన్ : భారత రాజ్యాంగ రచనలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కృషి శ్లాఘనీయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి కొనియాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం ఎమ్మార్పీఎస్, ఇతర సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్ వర్ధంతిని నిర్వహించారు. ఖమ్మం క్రాస్ రోడ్లో గల అంబేద్కర్ విగ్రహానికి జగదీష్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు యాతాకుల రాజన్న మాదిగ, చిన్న శ్రీరాములు మాదిగ, ఎర్ర వీరస్వామి మాదిగ, బోడ శ్రీరాములు మాదిగ, వల్లపట్ల దయానంద్, అమరారపు, పద్మభూషణం మాదిగ, చింత జాన్ విల్సన్ మాదిగ, మల్లేష్ మాదిగ, డాక్టర్ బట్టు గోపి, మాలమహానాడు నాయకులు తల్లమల్ల హస్సేన్, బొల్లెద్దు వినయ్, గాలి వికాస్, ఇతర ప్రజా, కుల సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి -
నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయండి
భానుపురి (సూర్యాపేట) :గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నా.. ఎవరైనా నియమావళిని ఉల్లంఘించినా, ఇతరాలపై ఫిర్యాదులను నేరుగా తన ఫోన్ నంబర్ 9676845846కు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవినాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిఒక్కరూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచ తప్పకుండా పాటిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు. కోడ్ ముగిసేంత వరకు ప్రజావాణి రద్దు భానుపురి (సూర్యాపేట) : గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి(కోడ్) అమలులో ఉన్నందున ఈ నెల 17వ తేదీ వరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఫిర్యాదులు సమర్పించేందుకు ప్రతి సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌కు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ప్రజావాణి తిరిగి యథావిధిగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. కోర్టుల భవన నిర్మాణం త్వరగా పూర్తిచేయాలికోదాడ: కోదాడ పట్టణంలో నూతనంగా చేపట్టిన నాలుగు కోర్టుల భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద కోరారు. శనివారం ఆమె కోదాడ కోర్టును అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.రాధాకృష్ణతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో నిర్మాణలో ఉన్న నాలుగు కోర్టుల నూతన భవనాన్ని పరిశీలించారు. అనంతరం కోదాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం కోర్టులు నడుస్తున్న భవనాల్లో కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదరవుతున్నందున సదరు కాంట్రాక్టర్ పనుల్లో వేగం పెంచాలన్నారు. మోతె మండలాన్ని కోదాడ కోర్టు పరిధిలో కలపాలని న్యాయవాదులు ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో కోదాడ కోర్టు న్యాయమూర్తులు కె.సురేష్, భవ్య, ఎండి.ఉమర్, కోదాడ బార్ అధ్యక్ష, కార్యదర్శులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ, రామిశెట్టి రామకృష్ణ, ఉపాధ్యక్షుడు ఉయ్యాల నర్సయ్య, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. విత్తన, విద్యుత్ బిల్లులను వ్యతిరేకించాలిఅర్వపల్లి : దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు నష్టం చేకూర్చేలా తీసుకొచ్చిన ముసాయిదా విత్తన, విద్యుత్ బిల్లులు–2025ను వ్యతిరేకించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వక్కవంతుల కోటేశ్వరరావు కోరారు. శనివారం తిమ్మాపురంలో జరిగిన ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 8న చేపట్టనున్న ఆయా బిల్లల కాపీల దహన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్‌కుమార్, జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, గంట నాగయ్య, సాగర్, ఉదయగిరి, కునుకుంట్ల సైదులు, పి.కిరణ్, చిరంజీవి, రవి, ఉపేంద్ర, వెంకట్‌యాదవ్ పాల్గొన్నారు. -
కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం చేయాలి
సూర్యాపేట అర్బన్ : పోలీసుల దాడి కారణంగా మరణించిన కోదాడకు చెందిన కర్ల రాజేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని, అతడి మృతికి కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న మాదిగ, టీజేఎస్ జిల్లా ఇన్చార్జి కుంట్ల ధర్మార్జున్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తల్లమల్ల హసేన్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, మాస్‌లైన్ నేత నరసన్న డిమాండ్ చేశారు. సూర్యాపేటలో శుక్రవారం జరిగిన అఖిల పక్ష నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. సమావేశంలో నాయకులు ఎల్గూరి గోవింద్ గౌడ్, సట్టు నాగన్న, బొల్లెద్దు వినయ్ మాల, అంబేద్కరిస్టు కాశిమల్ల వెంకట నరసయ్య, దైద శీను, మేడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పల్లెపోరుకు పటిష్ట భద్రత
సూర్యాపేట టౌన్ : ‘జిల్లాలో ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి గ్రామంపై పోలీస్ నిరంతరం నిఘా ఉంటుంది’ అని జిల్లా ఎస్పీ కె.నరసింహ వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లపై శుక్రవారం ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు వివరాలు వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగే ప్రజలంతా సహరించాలని, ఘర్షణలకు పాల్పడితే కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. పలు వివరాలు ఆయన మాటాల్లోనే.. 173 సమస్యాత్మక గ్రామాల గుర్తింపు జిల్లాలో మొత్తం 486 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా ఇందులో మొదటి విడత 159 గ్రామాలకు గాను 47 సమస్యాత్మక గ్రామాలుగా, రెండవ విడతలో 181 గ్రామాలకు 65, మూడవ విడతలో 146 గ్రామాలకు 58 గ్రామాలు సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించాం. ఆయా గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ సిబ్బంది నిత్యం తిరుగుతూ ప్రజలకు ఎన్నికల నియమాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా సమస్యలు సృష్టిస్తే భవిష్యత్తులో ఇబ్బంది ఎదుర్కొంటారని వివరిస్తున్నాం. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి. ఐదంచెల భద్రత.. జిల్లాలోని 23 మండలాల్లో మూడు విడతల్లో జరగనున్న ఎన్నికలకు ప్రతి విడతకు 1,500 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. అందులో గ్రామ పంచాయతీలో భద్రత, రెండు మూడు గ్రామ పంచాయతీల పరిధిలో ఒక ఎస్ఐ లెవల్ అధికారి రూట్ మొబైల్స్, మండలానికి సీఐ, డీఎస్పీ ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్, ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ ట్రైకింగ్ ఫోర్స్ పనిచేస్తుంది. పోలింగ్ కేంద్రాలను ఇద్దరు ఏఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 55 మంది ఎస్ఐలు నిరంతరం పర్యవేక్షిస్తారు. 97 కేసులు నమోదు జిల్లాలో నిరంతర తనిఖీలు చేస్తున్నాం. ఇప్పటి వరకు 97 కేసులు నమోదు చేశాం. అలాగే ఎన్నికల సామగ్రిని తరలించేందుకు మొదటి విడత రూట్ మొబైల్స్ 58, రెండవ విడతకు 47, మూడవ విడత రూట్ మొబైల్స్ 45 ఏర్పాటు చేశాం. నిరంతర పర్యవేక్షణకు నాలుగు ఎస్ఎస్ టీంలు, 23 ఎంసీసీ టీంలు, 23 ఎఫ్ఎస్టీలు, ఎనిమిది పోలీస్ స్పెషల్ స్టైకింగ్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశాం. 9వ తేదీ సాయంత్రం వరకే ప్రచారం ఈ నెల 11వ తేదీన జరగనున్న తొలి విడత ఎన్నికలకు 9వ తేదీ సాయంత్రం వరకు గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారం చేసుకోవచ్చు. ఆ తర్వాత అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం చేయకూడదు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ బహుమతులు, మద్యం, డబ్బు పంచకుండా నిఘా ఉంచాం. జిల్లాలోకి అక్రమంగా వస్తువులను రవాణా చేయకుండా జిల్లా సరిహద్దుల వెంట ఏడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. మూడు విడతల్లో పోలింగ్ అనంతరం మధ్యాహ్నం 2గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. గెలుపొందిన అభ్యర్థులు ఎవరూ కూడా విజయోత్సవాలు, బాణసంచాలు కాల్చేందుకు అనుమతి లేదు. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు సభ్యులకు అవగాహన సదస్సులు నిర్వహించాం. ఎన్నికల నియమ నిబంధనలకు సంబంధించి బుక్లెట్ సైతం ఇచ్చాం. ఎన్నికల నిబంధనలు ఎవరూ ఉల్లంఘించినా చర్యలు తప్పవు. ఫ ప్రతి విడతకు 1,500 మందితో బందోబస్తు ఫ సమస్యాత్మక గ్రామాలపై నిఘా ఫ నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు ఫ ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటెయ్యాలి ఫ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలి ఫ ఘర్షణలు సృష్టిస్తే కేసులు నమోదు చేస్తాం ‘సాక్షి’తో ఎస్పీ కె.నరసింహ గతంలో నేరాలకు పాల్పడిన వారిని, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వారిని గుర్తించి మళ్లీ ఎలాంటి నేరాలకు పాల్పడొద్దని, సమస్యలు సృష్టించమని రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు ముందస్తు పూచీకత్తుతో బైండోవర్ చేస్తున్నాం. అలాగే జిల్లాలో లైసెన్స్డ్ గన్లను కూడా డిపాజిట్ చేయిస్తున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో 59 గన్లను ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో డిపాజిట్ చేయించాం. -
ఎన్నికల విధులు బాధ్యతగా నిర్వహించాలి
భానుపురి (సూర్యాపేట) : అధికారులు గ్రామ పంచాయతీ ఎన్నికల విధులను బాధ్యతగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవినాయక్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్‌తో కలిసి నిర్వహించారు. మొదటి విడత ఎన్నికలు జరిగే ఆత్మకూర్(ఎస్), సూర్యాపేట, జాజిరెడ్డిగూడెం, నాగారం, నూతనకల్, మద్దిరాల, తిరుమలగిరి, తుంగతుర్తి మండలాల్లోని సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సిబ్బందికి పోలింగ్ విధులను కేటాయించారు. జిల్లాలో మొదటి విడతలో 159 సర్పంచ్, 1,442 వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం 20 శాతం రిజర్వ్ సిబ్బంది కలుపుకుని ప్రిసైడింగ్ అధికారులు 1,683, ఓపీఓలు 2,260 పోలింగ్ కోసం ర్యాండమైజేషన్ జరిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, జెడ్పీ సీఈఓ వీవీ.అప్పారావు, డీపీఓ యాదగిరి, డీఎల్పీఓ నారాయణరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఫ జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవినాయక్ -
సమగ్ర వ్యవసాయ పద్ధతులు పాటించాలి
గరిడేపల్లి : రైతులు సమగ్ర వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ నేల కోతను అరికట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి జి.శ్రీధర్‌రెడ్డి, కేవీకే సీనియర్ శాస్త్రవేత్త, హెడ్ ఇన్చార్జి డి.నరేష్ అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్భంగా ప్రకృతి వ్యవసాయంపై ఏర్పాటు చేసిన కిసాన్ మేళాకు హాజరయ్యారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన డెమోస్ని చూసి రైతులకు ఉపయోగపడే ప్రకృతి వ్యవసాయాన్ని తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు నరేష్, కిరణ్, పి.అక్షిత్‌సాయి, సుగంధి, నూతనకల్ మండల వ్యవసాయ అధికారి మల్లారెడ్డి, కంప్యూటర్ ప్రోగ్రామర్ నరేష్ రైతులు పాల్గొన్నారు. ఫ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి -
నామినేషన్ల ఎంట్రీలో తప్పులు దొర్లొద్దు
మేళ్లచెరువు : నామినేషన్ల వివరాలను తప్పులు దొర్లకుండా టీపోల్ యాప్‌లో ఎంట్రీ చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ సూచించారు. శుక్రవారం ఆయన మేళ్లచెరువు, చింతలపాలెం మండల కేంద్రాల పాటు రామాపురం, దొండపాడు గ్రామాలలోని క్లస్టర్ నామినేషన్ కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తేజస్ నంద్లాల్ మాట్లాడుతూ సర్పంచ్, వార్డు సభ్యులు వేసే నామినేషన్ పత్రాల విషంయలో ఏమైనా సందేహలుంటే హెల్ప్ డెస్క్‌ల సిబ్బంది తీర్చాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్లు రాజేందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, ఎంపీడీఓలు అస్గర్‌అలీ, రామచంద్రరావు, మండల పంచాయతీ అధికారి, భూపాల్‌రెడ్డి, ఎస్ఐ పరమేష్, ఆర్ఓలు ఉన్నారు. -
రూ.కోటైనా.. పోటీకి సై!
అత్యధిక ఓటర్లు ఉన్న గ్రామాల్లో ఖర్చు కూడా ఎక్కువే..రెండో విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన పూర్తికావడంతో బరిలో ఉన్న రెబల్స్‌ను తప్పించడానికి భారీ ఎత్తున బేరసారాలు సాగుతున్నాయి. ఎన్నికలకు పెట్టిన ఖర్చు మొత్తం ఇస్తామని, బరిలోనుంచి తప్పుకుని ఏకగ్రీవానికి సహకరించాలని కొందరు పోటీదారులను బతిమిలాడుతున్నారు. చివరి నిమిషం వరకు పోటీలో ఉంటే కలిసి వస్తుందని, అప్పటివరకు వేచి చూడాలని కొందరు భావిస్తున్నారు. తాము గెలవలేకపోయినా ఓడించడానికి పనికివస్తానని కొందరు ప్రత్యర్థులను భయపెడుతూ ధర పెంచుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కోదాడ: జిల్లా పరిధిలో అత్యధిక ఓటర్లు కలిగిన పది గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి. ఆయా గ్రామాల్లో రిజర్వేషన్లతో సంబంధం లేకుండా, ఖర్చుకు వెనుకాడకుండా ఆశావహులు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. ఒక్కొక్కరు కోటి రూపాయలకు మించి ఖర్చు చేయడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో అత్యధిక సిమెంట్ ఫ్యాక్టరీలు కలిగిన మేళ్లచెరువు, దొండపాడు గ్రామాల్లో రూ.కోటిన్నర వరకు ఖర్చు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓటర్లు అధికంగా ఉన్న గ్రామాలను పరిశీలిస్తే.. మేళ్లచెరువు (10,567), దొండపాడు (6,737), బేతవోలు (6,468), మఠంపల్లి (6,317), చిలుకూరు (6,041), తుంగతుర్తి (5,338), పొనుగోడు (5,161), రామాపురం (4,797), నూతన్‌కల్ (4,568), మునగాల పంచాయతీలు ఉన్నాయి. ఈ పది గ్రామాల్లో 7 గ్రామాలు హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లోనే ఉన్నాయి అప్పు చేసైనా సరే.. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టులో ఉండడంతో ఇక్కడ భూములకు ఎక్కువ ధరలున్నాయి. పెద్ద గ్రామాల్లో పోటీ చేస్తున్నవారు అవసరమైతే నాలుగు ఎకరాలైన అమ్ముతామని, అప్పు తెచ్చయినా సరే ఖర్చు పెడతామని చెబుతుండడంతో తీవ్ర ఆసక్తి నెలకొంది. చిలుకూరు మండలం బేతవోలు పంచాయతీలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. ఇద్దరు రూ.కోటిన్నర వరకు ఖర్చు చేయడానికి సిద్ధపడే ఈ ఎన్నికల బరిలోకి దిగుతున్నారని గ్రామస్తులు అంటున్నారు. ఇక మునగాల గ్రామపంచాయతీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కోదాడ మండలం గుడిబండ, నల్లబండగూడెం, గణపవరం పంచాయతీల్లో కూడా ఖర్చు రూ.కోటి పైమాటేనని పలువురు అంటున్నారు. విచ్చలవిడిగా మద్యం.. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారైనప్పటి నుంచి ఆశావహులు మద్యానికి విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. కోదాడ మండల పరిధిలోని ఓ గ్రామంలో సోమవారం నామినేషన్ వేయడానికి వెళ్తున్న సందర్భంగా మద్యానికి రూ.లక్ష ఖర్చు చేసినట్లు అభ్యర్థి ఒకరు చెప్పారు. ఎన్నికల బరిలో ఉండేవారు మద్యం కోసం అప్పుడే కొత్త దుకాణదారులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. పెద్ద గ్రామాల్లో రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు మద్యానికి ఖర్చు చేయాల్సిందేనని, ఆశావహులు అందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. -
ముగిసిన మూడవ విడత నామినేషన్లు
హుజూర్నగర్ : హుజూర్నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో శుక్రవారం మూడవ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ముగిశాయి. చివరి రోజు కావడంతో అభ్యర్థులు భారీ సంఖ్యలో తరలి వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. హుజూర్నగర్, చింతలపాలెం, నేరేడుచర్ల, పాలకవీడు, గరిడేపల్లి, మఠంపల్లి, మేళ్లచెరువు మండలాల్లోని ఆయా క్లస్టర్ సెంటర్లలోకి సాయంత్రం ఐదు గంటలకు వరకు చేరుకున్న వారి నామినేషన్లను అర్ధరాత్రి వరకు అధికారులు స్వీకరించారు. పలు కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకులు రవినాయక్, శ్రీను, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సందర్శించి పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాత్రి 11.30 గంటల వరకు హుజూర్నగర్, పాలకవీడు, గరిడేపల్లి మండలాల్లోనే నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా మిగతా నేరేడుచర్ల, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లో కొనసాగుతూనే ఉంది. మండలం సర్పంచ్ వార్డులు హుజూర్నగర్ 73 324 పాలకవీడు 166 467 గరిడేపల్లి 228 785 (మిగతా మండలాల్లో ప్రక్రియ కొనసాగుతూనే ఉంది)ఫ హుజూర్నగర్ డివిజన్లో చివరి రోజు భారీగా దాఖలు ఫ అర్ధరాత్రి వరకు క్యూకట్టిన అభ్యర్థులు -
హోంగార్డుల సంక్షేమానికి కృషి
సూర్యాపేట టౌన్ : హోంగార్డ్ సిబ్బంది సంక్షేమానికి కృషిచేస్తామని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. ఈ నెల 6న హోంగార్డుల వ్యవస్థ 63వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో చేపట్టిన రక్తదాన శిబిరం, హోంగార్డు ఆఫీసర్స్‌కు క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. హోంగార్డు ఆఫీసర్స్ పోలీస్ సిబ్బందితో సమానంగా శాంతి భద్రతల పరిరక్షణలో పనిచేస్తున్నారని అభినందించారు. రక్తదాన శిబిరం అనంతరం కబడ్డీ, వాలీబాల్, చెస్, క్యారమ్స్ క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు రవీందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, హోంగార్డ్ ఇన్చార్జి ఆర్ఎస్ఐ అశోక్, సాయిరాం, సురేస్, సిబ్బంది పాల్గొన్నారు. మీ సేవలపై కమిషనర్ ఆరాకోదాడ: పట్టణంలోని మీ సేవ కేంద్రాలను శుక్రవారం రాష్ట్ర ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ కమిషనర్ రవికుమార్ తనిఖీ చేశారు. పలు కేంద్రాల్లో సేవల నిర్వహణ, రుసుముల వసూలు, టోకెన్ విధానం తదితర అంశాలను పరిశీలించారు. మీసేవ కేంద్రానికి వచ్చిన ప్రజలను సేవలపై ఆరా తీశారు. నాగార్జున మీ సేవ కేంద్రం అందిస్తున్న సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేసిన నిర్వాహకుడిని అభినందించారు. ఆయన వెంట కోదాడ ఆర్డీఓ సూర్యానారాయణ, తహసీల్దార్ వాజిద్ అలీ, ఈడయం గపూర్అహ్మద్, జిల్లా మేనేజర్ సైదానాయక్ మీసేవ నిర్వాహకుడు కె.ప్రవీణ్ ఉన్నారు. దండు మైసమ్మ ఆలయ హుండీ లెక్కింపు ఆత్మకూర్ (ఎస్) : మండల పరిధిలోని నెమ్మికల్ దండు మైసమ్మ దేవాలయ హుండీని శుక్రవారం లెక్కించారు. 120 రోజులకు గాను భక్తులు కానుకలు సమర్పించుకోగా రూ.7,32,310 వచ్చినట్లు ఆలయ అధికారి జయరామయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ తంగెళ్ల కరుణాకర్‌రెడ్డి, సర్వయ్య, జిల్లా దేవాదాయ శాఖ పరిశీలకురాలు సుమతి, సిబ్బంది, అర్చకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ‘వీఎన్’ జీవితం స్ఫూర్తిదాయకంసూర్యాపేట అర్బన్ : జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత మల్లు వెంకటనరసింహారెడ్డి (వీఎన్) జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మల్లు వెంకటనరసింహారెడ్డి 21వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ పీడిత తాడిత ప్రజల హక్కుల సాధన కోసం వీఎన్ పోరాటం మరుమలేనదన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు అధ్యక్షతన జరిగిన ఈ సభలో నాయకులు కోట గోపి, వేల్పుల వెంకన్న,ఎల్గూరి గోవింద్, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, మేకనబోయిన శేఖర్, వీరబోయిన రవి, మద్దెల జ్యోతి, కొప్పుల రజిత, వల్లపు దాసు సాయికుమార్, పిండిగా నాగమణి, మేరెడ్డి కృష్ణారెడ్డి, సైదమ్మ, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
పోస్టల్ బ్యాలెట్లను జాగ్రత్తగా జారీ చేయండి
అర్వపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లను అధికారులు జాగ్రత్తగా జారీ చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. గురువారం అర్వపల్లిలోని మండల పరిషత్ కార్యాలయంలో స్టేజ్–1, 2 అధికారులకు గ్రామ పంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడత ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి ఎంపీడీఓ కార్యాలయాల్లో ఈ నెల 6 నుంచి 9 వరకు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి స్టేజ్–1 ఆర్ఓలు 37ఏ రిజిస్టర్లో సర్వీస్ ఓటర్ల వివరాలు నమోదు చేయాలని, స్టేజ్–2 ఆర్ఓలు 37సీ రిజిస్టర్లో ఎన్నికల్లో విధులు నిర్వర్తించేవారి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. రిటర్నింగ్ అధికారులు సంబంధిత గ్రామ పంచాయతీల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి మౌలిక వసతులను పరిశీలించాలన్నారు. పోలింగ్ తర్వాత ఓట్లను కౌంటింగ్ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ ఝాన్సీ, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీఓ గోపి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
తప్పుల తడకగా జాబితా
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో పంచాయతీ ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉంది. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా క్షేత్రస్థాయిలో సిబ్బంది జాబితా సవరణలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. గతంలో ఉన్న ఓటర్ జాబితాలోనే కొత్తగా నమోదైన ఓటర్లను జతచేసి.. అస్తవ్యస్తంగా జాబితా తయారు చేశారు. రెండు, మూడేళ్ల క్రితం మృతిచెందిన వ్యక్తుల పేర్లు ఓటర్ జాబితాలో ఉండడం చూస్తుంటే అధికారుల పనితీరు ఎలా ఉందో తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు పలుమార్లు అవకాశం కల్పించినా.. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జిల్లాలో మొత్తం 6,94,815 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 3,54,050 మంది, పురుషులు 3,40,743 మంది. సవరణలకు అవకాశం ఇచ్చినా.. గతేడాది ఫిబ్రవరిలో పంచాయతీల పాలకవర్గం పదవీ కాలం ముగిసింది. వీటికి ఎన్నికలు నిర్వహించేందుకు 2024 సెప్టెంబర్ నుంచే ఎన్నికల సంఘం కసరత్తు చేసింది. ఇందుకోసం జిల్లా అధికారులతో ఓటర్ల జాబితా రూపొందించింది. ఆ సమయంలో 2024 అసెంబ్లీ ఎన్నికలనాటి ఓటర్ జాబితా ఆధారంగా ముసాయిదా జాబితా రూపొందించి.. అక్టోబర్ 1వ తేదీన తుది జాబితాను ప్రకటించారు. ఈ జాబితా ప్రకారం జిల్లాలో 6,82,882 మంది ఓటర్లు ఉన్నారు. మహిళలు 3,47,320 మంది, పురుషులు 3,35,542 మందిగా అధికారులు ప్రకటించారు. పలు కారణాలతో ఎన్నికలు వాయిదా పడగా.. 2025 జూన్ నుంచి కసరత్తు చేస్తూ సెప్టెంబర్‌లో పంచాయతీ ఓటర్ల తుది జాబితాను మరోసారి ప్రకటించింది. మార్పులు, చేర్పులకు అవకాశం ఇచ్చినా బీఎల్ఓలు ఎక్కడా ఇంటింటికి తిరిగిన పాపాన పోలేదు. గతంలో ఉన్న జాబితానే ముందు ఉంచి ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం కల్పించారు. దీంతో పల్లె ఓటర్ల సంఖ్య 6,94,815 మందికి చేరింది. అందరి ఓట్లు ఒకేచోట ఉండాలని సూచించినా.. 2019 పంచాయతీ ఎన్నికల సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల ఓట్లు ఒక్కొక్కరివి ఒక్కో వార్డులో నమోదై ఉన్నాయి. దీంతో ఓటర్లు ఓటు వేసేందుకు వెళ్లిన సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో గతంలో మాదిరిగా ఇబ్బందులు తలెత్తకుండా ఇంటింటికీ బీఎల్ఓలు తిరిగి కుటుంబంలోని ఓట్లన్నీ ఒకేవార్డులో ఉండేలా చూడాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయినా జిల్లాలో అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో తూతూమంత్రంగానే బీఎల్ఓలు ఈ ప్రక్రియను చేపట్టారు. కుటుంబంలో మూడు ఓట్లు ఉంటే.. రెండు ఓట్లు ఓ వార్డులో, ఇంకో ఓటు మరో వార్డులో ఉన్నాయి. ● తుంగతుర్తి మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల ఓటరు జాబితాలో తప్పులు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు కొత్తగూడెం గ్రామంలో ఒకే కుటుంబ సభ్యులు వేరువేరు వార్డుల్లో ఉన్నారు. కొత్తగూడెంలో గొల్లపల్లి లక్ష్మయ్య కుటుంబంలో ముగ్గురు ఓటర్లు ఉండగా.. తల్లి కొడుకుది మూడో వార్డులో ఓటు ఉంది. తండ్రి లక్ష్మయ్య ఓటు ఒకటో వార్డులో ఉంది. ఇలా అనేక తప్పిదాలతో అస్తవ్యస్తంగా జాబితా ఉంది. ● చిలుకూరు మండలంలోని జానకీనగర్ గ్రామంలో ఒక మహిళకు రెండు ఓట్లు ఉన్నాయి. ఒకే మహిళకు ఇంటి పేరు, భర్త పేరు మార్చారు. అదే మహిళను గుర్తు పట్టకుండా ఒకటి కలర్ ఫొటో, మరొకటి బ్లాక్ అండ్ వైట్ ఫొటోగా మార్చారు. గ్రామానికి చెందిన 6వ వార్డులో 514, 518 నంబర్లలో ఒకే మహిళకు రెండు ఓట్లు వచ్చాయి. ● చిలుకూరులో గుండు పద్మ, గుండు రామయ్య వీరిద్దరికి సంబంధించి గుండు పద్మ ఫొటోనే ఉంది. చిలుకూరు మండలం నారాయణపురంలో కొంద ఉదయ్‌కిరణ్‌కు రెండు ఓట్లు వచ్చాయి. ఫ చనిపోయిన వారి పేర్లు ఓటరు జాబితాలోనే.. ఫ భర్తది ఓ వార్డు, భార్యది మరో వార్డులో ఓటు ఫ ఎన్నిమార్లు సవరణలకు అవకాశమిచ్చినా అంతే.. ఫ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు తిప్పలేఈ ఓటరు జాబితాలో ఉన్న వ్యక్తి పేరు గుద్దేటి మల్లారెడ్డి. ఇతడిది ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రం. ఏడాది క్రితమే మల్లారెడ్డి మృతి చెందాడు. కానీ పంచాయతీ ఎన్నికల తుది ఓటరు జాబితాలో గ్రామంలోని 8వ వార్డులో ఇతడి పేరు ఉంది. ఈ ఏడాది రెండుమూడుసార్లు ఓటరు జాబితా సవరణకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చినా.. మల్లారెడ్డి పేరును తొలగించకపోవడం క్షేత్రస్థాయి అధికారుల పనితీరుకు నిదర్శనం. గ్రామపంచాయతీలు : 486వార్డులు : 4,332ఓటర్లు : 6,94,815మహిళలు : 3,54,050పురుషులు : 3,40,743 -
కూరగాయల సాగుకు ప్రోత్సాహం
సూర్యాపేట : బరిలో నిలిచిన అభ్యర్థులు క్రమశిక్షణ కలిగి ఉండాలని ఎన్నికల పరిశీలకుడు రవినాయక్, ఎస్పీ నరసింహులు అన్నారు. మొదటి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్న సూర్యాపేట మండల పరిధిలోని సర్పంచ్, వార్డు అభ్యర్థులకు గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల నియమావళిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ఖర్చులు పెట్టాలని సూచించారు. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ, ఎస్ఐ బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు. గుర్రంపోడు : కూరగాయల సాగుకు ఉద్యానవన శాఖ ప్రోత్సాహం అందిస్తోంది. కొత్తగా కూరగాయలు సాగుచేసే రైతులకు రాయితీలు అందించాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 10 వేల ఎకరాల్లో కూరగాయల సాగు పెంచేందుకు ప్రణాళికలు రచించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 350 ఎకరాల్లో సాగు పెంచనుంది. హెక్టార్‌కు గరిష్టంగా రూ.24 వేలు, ఎకరాకు రూ.9,600 రాయితీ అందించనుంది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి ఎన్ఐఎన్ లెక్కల ప్రకారం ప్రతి వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 300 గ్రాముల కూరగాయలు వినియోగించాలి. కానీ, జిల్లా ప్రజల అవసరాలకు తగ్గట్టుగా కూరగాయలు, ఆకుకూరలు సాగు కావడం లేదు. జిల్లాలోని అన్ని రకాల కూరగాయల సాగుకు నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. సరైన ప్రోత్సాహం లేక సాగు విస్తీర్ణం పెరగడం లేదని అధికారులు భావిస్తున్నారు. అయితే కర్నూలు నుంచి టమాట, మహారాష్ట్ర నుంచి ఉల్లిగడ్డ, పంజాబ్ నుంచి ఆలుగడ్డ, బెంగళూరు నుంచి క్యారెట్, బీట్రూట్ దిగుమతి చేసుకుంటున్నారు. కోతులతో సాగుకు వెనుకంజ చాలా ప్రాంతాల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసినా కోతులు బతకనివ్వడం లేదని భయాందోళనతో రైతులు కూరగాయల సాగుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కోతులను నివారించేందుకు టపాసులు పేల్చడం, మంకీగన్స్ ఉపయోగించడం, పంట చుట్టూ జే వైర్ లాంటివి కట్టాలంటే.. అధిక శ్రమకు గురికావాల్సి వస్తోందని అంటున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ఇళ్ల ఆవరణలో సొరకాయ ఇతర కూరగాయ పంటలు సాగు చేసుకునేవారు. ఇప్పుడు కోతుల వల్ల ఇంటి ఆవరణల్లో కూరగాయలు సాగు చేయడం లేదు. రాయితీ పొందడం ఇలా.. కూరగాయల పంటలను సాగు చేసుకునే రైతులు ముందుగా ప్రాంతీయ ఉద్యానవనశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతి ఇస్తారు. కూరగాయల నారును హైదరాబాద్‌లోని జీడిమెట్లలో గల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో పెంచుతున్నారు. అక్కడి నుంచి నారు పొందితే రాయితీ డబ్బును.. నారు అందించిన కంపెనీకి చెల్లిస్తారు. కూరగాయల విత్తనాలను అధీకృత డీలర్ల వద్ద నుంచి రైతులు నేరుగా కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో 250 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 50, యాదాద్రి భువనగిరి జిల్లాలో 50 ఎకరాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించాలని ఉద్యానవన శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఉమ్మడి జిల్లాలో కూరగాయల సాగును పెంచేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. పందిరి సాగుతోపాటు ఇతర కూరగాయల సాగును ప్రోత్సహించేలా అవగాహన కల్పిస్తున్నాం. మార్కెట్లో డిమాండ్ ఉన్నవి పండించేలా రైతులను చైతన్యపరుస్తున్నాం. రాయితీలతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. – కె.సుభాషిణి, జిల్లా ఉద్యాన అధికారి, నల్లగొండ ఉమ్మడి జిల్లాలో కొత్తగా 350 ఎకరాల్లో సాగు చేయించాలని లక్ష్యం ఫ విత్తనాలు, నారు కొనుగోలుకు ఉద్యానశాఖ రాయితీ ఫ కూరగాయలు, ఆకుకూరల సాగు విస్తీర్ణం పెంచేలా ప్రణాళిక


