కోదాడరూరల్ : కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ భవన్‌లో శనివారం నిర్వహించనున్న మెగా ఉచిత వైద్యశిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పెన్షనర్ల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య అన్నారు. గురువారం పట్టణంలోని సంఘం భవనంలో వైద్యశిబిరం కరపత్రాన్ని సంఘ సభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రి వారి సౌజన్యంతో నిపుణులైన వైద్యం బృందంతో ఈ వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శిబిరంలో న్యూరో, గుండె, ఆర్థోపెడిక్ వైద్యులు ఉంటారని, ఈసీజీ, టూడీ ఎకో, ఎముకల సాంద్రత పరీక్షలు ఉచితంగా చేస్తారన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు సామాన్య ప్రజలు కూడా ఈ వైద్యశిబిరానికి హాజరు కావచ్చని తెలిపారు. కార్యక్రమంలో యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు, శ్యాంసుందర్‌రెడ్డి, రఘువరప్రసాద్, జానయ్య, విద్యాసాగర్, భ్రమరాంబ ఉన్నారు.


