breaking news
Suryapet District News
-
ఎన్నికలకు ఐదంచెల భద్రత : ఎస్పీ
మునగాల : ఈ నెల 14న జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఐదంచెల పోలీస్ భద్రత కల్పించాలని పోలీస్ అధికారులను ఎస్పీ నరసింహ ఆదేశించారు. ఆదివారం ఆయన మునగాల మండలం రేపాల క్లస్టర్లో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100మీటర్ల పరిధి ఆంక్షలు అమలు చేయాలని, అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే లోపలకు పంపించాలన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఘర్షణలకు తావివ్వొద్దన్నారు. ఆయన వెంట కోదాడ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరెడ్డి, మునగాల సీఐ డి.రామకృష్ణారెడడ, ఎస్ఐ బి.ప్రవీణ్‌కుమార్, ఎన్నికల సిబ్బంది ఉన్నారు. -
49 క్లస్టర్ కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ
భానుపురి (సూర్యాపేట), మునగాల : రెండో విడత పంచాయతీ ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా 49 క్లస్టర్ కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. ఆదివారం సూర్యాపేట మండలం ఇమాంపేట, మునగాల మండల కేంద్రంతోపాటు బరాఖత్‌గూడెంలో నామినేషన్ కేంద్రాలను సందర్శించారు. నామినేషన్ల ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల వద్ద కలెక్టర్ మాట్లాడుతూ పెన్‌పహాడ్, చివ్వెంల, మోతె, మునగాల, నడిగూడెం, కోదాడ, చిలుకూరు, అనంతగిరి మండలాల్లోని 181 పంచాయతీలు, 1,628 వార్డులకు నేటి నుంచి ఈ నెల 2వ తేదీ వరకు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. ఈనెల 14న పోలింగ్ జరగునుందన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా ఎన్నికల ప్రవర్తన నియమావళిని అందరూ పాటించాలని కోరారు. అభ్యర్థులు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ పత్రాలు సమర్పించాలన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సూర్యనారాయణ, ఎంపీడీఓలు బాలకృష్ణ, రమేష్ దీన్‌దయాళ్, మాల్సుర్నాయక్, ఆర్ఓలు, ఎంపీఓలు, కార్యదర్శులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
రెండో విడతకు సై..
భానుపురి (సూర్యాపేట) : రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. జిల్లాలోని కోదాడ రెవెన్యూ డివిజన్లోని కోదాడ, మునగాల, నడిగూడెం, అనంతగిరి, చిలుకూరు మండలాలతో పాటు సూర్యాపేట రెవెన్యూ డివిజన్లోని పెన్‌పహాడ్, చివ్వెంల, మోతె మండలాలకు ఆదివారం ఉదయం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ వెంటనే ఆయా మండలాల్లోని 181 గ్రామ పంచాయతీల్లోని 181 సర్పంచ్, 1,628 వార్డు స్థానాల ఎన్నికలకు సంబంధించి 49 క్లస్టర్ సెంటర్లలో ఆశావహుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పలు మండలాల్లో పర్యటించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. తొలి విడత మాదిరిగానే.. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి. మొదటి విడత 8 మండలాలు, రెండో విడత 8 మండలాలు, మరో 7 మండలాలకు మూడో విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. మొదటి విడత మాదిరిగానే రెండో విడతలోనూ నామినేషన్లు మందకొడిగా వస్తున్నాయి. తొలిరోజు కేవలం 105 రాగా, ఇందులో సర్పంచ్‌కు 67, వార్డు స్థానాలకు 38 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలుకూరు, పెన్‌పహాడ్ మండలాల్లో అసలు వార్డు సభ్యుల నామినేషన్లు ఖాతా కూడా తెరవలేదు. అత్యధికంగా సర్పంచ్‌కు చివ్వెంల మండలంలో 15, పెన్‌పహాడ్ మండలంలో 13 దాఖలయ్యాయి. వార్డు మెంబర్లలో అత్యధికంగా అనంతగిరి నుంచి 12, మునగాల మండలంలో 11 నామినేషన్లు వేశారు. బేరీజు వేసుకుంటూ.. సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికకు నోటిఫికేషన్ రావడంతో ఎనిమిది మండలాల్లో సందడి నెలకొంది. ఆయా గ్రామాల్లో సర్పంచ్ పదవుల కోసం పోటీ చేసే ఆశావహులు వివిధ పార్టీలు, ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు కోసం తపనపడుతున్నారు. లేదంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసే ఏర్పాట్లలో ఉన్నారు. ఇక వార్డు సభ్యుల ఎన్నిక ఇప్పటికే పార్టీలకు అతీతంగా కొన్నిచోట్ల, పార్టీల వారీగా పొత్తులు కుదుర్చుకుని అభ్యర్థిగా ఎవరైతే గెలుస్తామనే బేరీజు వేసుకుని ఇద్దరు ముగ్గురిని బరిలో నిలిపే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మొదటి రోజు నామినేషన్‌కు కావాల్సిన పత్రాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. చివరి రోజే అధికంగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఈ విడతలో నామినేషన్ల స్వీకరణకు మంగళవారం వరకు గడువు ఉండగా 14వ తేదీన పోలింగ్ జరగనుంది. మండలం జీపీలు సర్పంచ్ వార్డులు వార్డులకు నామినేషన్లు నామినేషన్లు చిలుకూరు 17 04 158 00 కోదాడ 16 06 158 08 అనంతగిరి 20 07 178 12 మునగాల 22 10 210 11 నడిగూడెం 16 03 148 02 మోతె 29 09 262 01 చివ్వెంల 32 15 258 04 పెన్‌పహాడ్ 29 13 256 00 మొత్తం 181 67 1,628 38 ఫ 181 గ్రామ పంచాయతీల్లో మొదలైన నామినేషన్ల ప్రక్రియ ఫ తొలి రోజు 105 నామినేషన్లు దాఖలు ఫ రేపటి వరకు గడువు -
సర్పంచ్‌కు 1,387.. వార్డులకు 3,791
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల లెక్క తేలింది. నవంబర్ 27వ తేదీ నుంచి శనివారం సాయంత్రం వరకు ఎన్నికల కమిషన్ నామినేషన్ల స్వీకరణకు అవకాశమిచ్చింది. ఈ క్రమంలో సర్పంచ్, వార్డు స్థానాలకు శనివారం సాయంత్రం పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు బారులుదీదారు. దీంతో రాత్రి 10 నుంచి 11గంటల వరకు పలు సెంటర్లలో ప్రక్రియ కొనసాగింది. దీంతో ఆదివారం తెల్లవారుజామున ఎన్నికల అధికారులు జిల్లాలో సర్పంచ్, వార్డులకు దాఖలైన నామినేషన్ల వివరాలను వెల్లడించారు. సర్పంచ్ స్థానాలకు 1,387, వార్డులకు 3,791 నామినేషన్లు దాఖలు అయ్యాయని ప్రకటించారు. చివరి రోజు 1,021 నామినేషన్లు తుంగతుర్తి, నాగారం, మద్దిరాల, తిరుమలగిరి, నూతనకల్, జాజిరెడ్డిగూడెం, సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్) మండలాల్లోని 159 గ్రామ పంచాయతీల్లో ఎన్నిలకు నవంబర్ 27న ఉదయం నోటికేషన్ విడుదలైంది. వెంటనే 159 సర్పంచ్, 1,442 వార్డు సభ్యులకు నామినేషన్లు స్వీకరించినా.. తొలి రోజు సర్పంచ్‌కు 207, వార్డు సభ్యులకు 38 నామినేషన్లు మాత్రమే వచ్చాయి. రెండో రోజు సర్పంచ్ స్థానాలకుకు 159, వార్డు సభ్యుల స్థానాల కోసం 142 నామినేషన్లతో కలిపి మొత్తంగా రెండు రోజుల్లో సర్పంచ్‌కు 366, వార్డు స్థానాలకు 180 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక చివరి రోజు సర్పంచ్ స్థానాలకు 1,021, వార్డులకు 3,611 నామినేషన్లు వేశారు. ఫ మొదటి విడత పంచాయతీ పోరుకు దాఖలైన నామినేషన్లు ఫ రాత్రి వరకు కొనసాగిన నామినేషన్ల పరిశీలన ఫ 3న విత్‌డ్రా.. అభ్యర్ధుల తుది జాబితామొదటి విడత ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఆశావాహులు దాఖలు చేసిన నామినేషన్లను ఆదివారం పరిశీలించారు. ఒక్కో నామినేషన్ పరిశీలనకు సమయం పట్టడంతో ఈ ప్రక్రియ కూడా ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. పరిశీలన పూర్తి చేసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్ధుల జాబితాను ప్రకటించనున్నారు. డిసెంబర్ 1న సోమవారం ఏదైనా కారణాలతో నామినేషన్లు తిరస్కరణకు గురైతే.. అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కల్పించి, డిసెంబర్ 2న అప్పీళ్లను పరిష్కరించనున్నారు. 3న అభ్యర్థుల నామినేషన్లను వెనక్కి తీసుకునేందుకు అవకాశం కల్పించి, అదేరోజు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధుల తుదిజాబితాను ప్రకటించనున్నారు. తదనంతరం గుర్తులను కేటాయిస్తారు. డిసెంబర్ 11న తొలి విడత పోలింగ్ జరగనుంది. -
పొంచి ఉన్న తుపానుతో అప్రమత్తంగా ఉండాలి
సూర్యాపేట టౌన్ : దిత్వా తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా సోమవారం సాయంత్రానికి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించినందున రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల పంట ఉత్పత్తులు తడవకుండా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. సిబ్బంది సెలవులు రద్దుచేసి విధుల్లో నియమించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రమాదాల స్థలాలు, నాలాలు, వంతెనలు, కల్వర్టుల వద్ద పికెట్ ఏర్పాటు చేశామని, వరద నీరు ప్రవహించే వాహనాలతో వంతెనల పైనుంచి వాహనదారులు రాకపోకలు సాగించవద్దని సూచించారు. అత్యవసర సమయంలో డయల్ 100, సూర్యాపేట పోలీస్ కంట్రోల్ రూమ్‌కు నంబర్ 8712686026 ఫోన్ చేయాలని కోరారు. వైభవంగా నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. అనంతరం ఎదుర్కోలు మహోత్సవం, నిత్యకల్యాణం నిర్వహించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో గరుడ వాహనంపై ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, పణిభూషణమగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. సూర్యక్షేత్రంలో పూజలుఅర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని చాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నప్రసాద వితరణ జరిపారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, యాదగిరి, బెలిదె లక్ష్మయ్య, అర్చకులు భీంపాండే, అంకిత్‌పాండే, శ్రీరాంపాండే పాల్గొన్నారు. శ్రీకాంతాచారి వర్ధంతికి తరలిరావాలిమోత్కూరు : తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతిని డిసెంబర్ 3న హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించ తలపెట్టిందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దామరోజు వీరాచారి తెలిపారు. ఆదివారం ఆయన మోత్కూరులో విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాంతాచారి వర్ధంతికి తరలి రావాలని పిలుపునిచ్చారు. -
అడ్డదారిన బోనస్ నొక్కేస్తున్నారు!
తిరుమలగిరి (తుంగతుర్తి) : సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం ఇచ్చే క్వింటాకు రూ.500 బోనస్ కాజేసేందుకు కొందరు వ్యాపారులు అడ్డదారిలో వ్యాపారం సాగిస్తున్నారు. తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డులో కొందరు వ్యాపారులు సన్న ధాన్యం (సాంబ మసూరి) క్వింటాకు రూ.2వేల నుంచి రూ.2,200 వరకు కొనుగోలు చేసి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో క్వింటా రూ.2,389కు అమ్ముతున్నారు. దీనికితోడు క్వింటాకు ప్రభుత్వం ఇచ్చే రూ.500 బోనస్ కూడా నొక్కేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కుమ్మకై ్క తెలిసిన రైతుల పేర్ల మీద ధాన్యం అమ్ముతూ క్వింటాకు రూ.500నుంచి రూ.600 లాభం గడిస్తున్నారు. కొన్ని రోజులుగా తిరుమలగిరి మార్కెట్లో రోజూ 500 నుంచి వెయ్యి బస్తాల వరకు కొనుగోలు చేసి ట్రాక్టర్లు, డీసీఎంల ద్వారా తిరుమలగిరి మండలం చుట్టుపక్కల ఉన్న మండలాల్లోని తమకు అనుకూలమైన ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో యథేచ్ఛగా అమ్ముతూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతున్నారు. వచ్చిన లాభాల్లో కేంద్రాల నిర్వాహకులకూ కొంత ముట్టజెబుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో కొనుగోలు చేసి.. కొందరు రైతులు వ్యవసాయ మార్కెట్లోనే సన్న ధాన్యాన్ని క్వింటాకు రూ.1,800 నుంచి రూ.2,200 వరకు అమ్ముకుంటున్నారు. రైతులు ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యం లేకపోవడంతోపాటు కొనుగోళ్లు జాప్యం కావడం, డబ్బులు ఆలస్యంగా వస్తాయని, తేమ శాతం కొర్రీల వంటి కారణాలతో రైతులు తక్కువ ధరకై నా మార్కెట్లోనే అమ్ముకుంటున్నారు. ఇలా రైతులు అమ్ముకుంటున్న ధాన్యాన్ని కొందరు వ్యాపారులు, బడా రైతులు కొని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధరతోపాటు బోనస్ పొందుతున్నారు. తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌తోపాటు మండల వ్యాప్తంగా గతం నుంచి కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో వ్యవసాయ మార్కెట్లో కందుల కొనుగోళ్లకు ప్రభుత్వం హాకా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కొందరు వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసిన కందులను ఈ కేంద్రం ద్వారా అమ్మి రూ.లక్షలు గడించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాంతోపాటు కొందరు మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కుమ్మకై ్క లేని భూమి ఉన్నట్లు, అందులో పంట పండినట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. దాని కొనసాగింపుగా ఐకేపీ కేంద్రాలకు ధాన్యం విక్రయించినట్లు, మిల్లుకు సరఫరా చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. ఇలా భూముల్లేని కొందరి బ్యాంకు ఖాతాల్లో లక్షల రూపాయలు జమ అయ్యాయి. వాటిని మిల్లర్లు, వ్యాపారులు, కేంద్రాల నిర్వాహకులు పంచకున్నారు. ఏటా ఇలాంటి అక్రమాలు జరుగుతున్నా అధికారులు దృష్టి పెట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. సన్న ధాన్యం వ్యాపారుల తప్పటడుగులు ఫ తిరుమలగిరి మార్కెట్లో తక్కువ ధరకు కొనుగోలు ఫ ప్రభుత్వ కేంద్రాల్లో యథేచ్ఛగా అమ్ముకం ఫ మద్దతుతోపాటు క్వింటాకు రూ.500 బోనస్ పొందుతూ.. ఫ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్న వ్యాపారులు -
గీతన్నల సంక్షేమానికి బడ్జెట్ కేటాయించాలి
సూర్యాపేట: కల్లుగీత కార్మికుల సంక్షేమానికి రూ.5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.వి.రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంతటి విజయ్ ఫంక్షన్ హాల్ (వర్ధిల్లి బుచ్చిరాములు నగర్)లో మూడు రోజులుగా జరుగుతున్న కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఈనెల 20న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. డిసెంబర్ 23న హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద మహాధర్నా చేపడతామన్నారు. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చినా గీత కార్మికుల సంక్షేమానికి ఏ ఒక్క పథకం ప్రవేశపెట్టలేదన్నారు. రాష్ట్రంలో 4వేల కల్లుగీత సొసైటీలు, 3,600 టీఎఫ్‌టీల్లో 2,23,000 మంది గీత కార్మికులు ఉన్నారన్నారు. టాడి కార్పొరేషన్‌కు రూ.70 కోట్లు మాత్రమే కేటాయించి కేవలం రూ.30 కోట్లే ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లోని నీరా కేఫ్ ప్రభుత్వ విధానాల మూలంగా మూతబడిందని ఆందోళన వ్యక్తం చేశారు. 50 సంవత్సరాలు పైబడిన గీత కార్మికుల పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నా అతీగతి లేదన్నారు. అంతకుముందు ప్రతినిధుల సభలో తొమ్మిది తీర్మానాలు ఆమోదించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్గూరి గోవింద్, రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి, జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబు, నాయకులు ఉయ్యాల నగేష్, గుణగంటి కృష్ణ, నోముల వెంకన్న, వల్లపు దాసు సాయికుమార్ పాల్గొన్నారు. ఫ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.రమణ -
కేసీఆర్ ఆమరణ దీక్షతోనే తెలంగాణ
సూర్యాపేటటౌన్ : తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ నాడు ఆమరణ దీక్ష చేయడం వల్లనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మూడు గంటల పాటు నిర్వహించిన దీక్షా దివస్‌లో ఆయన మాట్లాడారు. సాధించుకున్న తెలంగాణను ఏవిధంగా అభివృద్ధి చేయాలో పదేళ్లలో కేసీఆర్ చేసి చూపించారన్నారు. ప్రపంచం తెలంగాణ వైపు చూసేలా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. దీక్షా దివస్‌కు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, జెడ్పీ మాజీ చైర్ పర్సన్ గుజ్జా దీపిక, ఒంటెద్దు నరసింహారెడ్డి, వై.వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గోపగాని వెంకటనారాయణగౌడ్, గుజ్జా యుగేందర్‌రావు, పెరుమాళ్ల అన్నపూర్ణ, ఆకుల లవకుశ పాల్గొన్నారు. -
రూ.64లక్షలు కొల్లగొట్టారు
సైబర్ నేరానికి గురైన బాధితులు వెంటనే ఫిర్యాదు చేస్తే కోల్పోయిన నగదు రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. సైబర్ మోసాలు జరిగినప్పుడు 1930టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారం ఎవరికీ ఇవ్వొద్దు. ఫోన్లకు వచ్చే అనవసరమైన లింక్‌లను ఓపెన్ చేయకుండా జాగ్రత్తలు పాటించాలి. – లక్ష్మీనారాయణ, సైబర్‌క్రైం సీఐ సూర్యాపేటటౌన్ : సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త రూపంలో ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్లకు వచ్చే మెసేజ్‌లను క్లిక్ చేయడం వల్ల కొందరు మోసపోతున్నారు. బ్యాంకింగ్ యాప్స్, ఫేక్ లింక్‌లు, లక్కీ డ్రాలు, ఇన్వెస్ట్మెంట్ ఆఫర్లు, ఉద్యోగ ఆఫర్లు అంటూ అనేక మార్గాల్లో ఖాతాల్లోని నగదు మాయం చేస్తున్నారు. ఇలా జిల్లాలో ఎక్కడో ఒక చోట సైబర్ మోసానికి గురవుతూనే ఉన్నారు. విద్యా వంతులు సైతం సైబర్ వలలో చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కాగా కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే మరికొందరు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా... ఆన్లైన్ మోసాలపై పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తోంది. విద్యాసంస్థలు, గ్రామాల్లో అప్రమత్తం చేస్తున్నారు. అత్యాశకు పోయి ఎక్కడో ఒక చోట ప్రజలు సైబర్ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. సైబర్ మోసాలకు పాల్పడే వారు ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో కేసు నమోదు చేసిన వారిని ఛేదించడం సవాల్‌గా మారుతోంది. సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే ముందస్తు అప్రమత్తంగా ఉంటే మేలు అని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల బారిన సామాన్య ప్రజలతో పాటు విద్యావంతులు కూడా చాలా వరకు మోసపోయి రూ.లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.8కోట్లు.. ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 750పైగా సైబర్ కేసులు నమోదుకాగా రూ.8కోట్లకు పైగా డబ్బులను నేరగాళ్లు కొల్లగొట్టారు. అయితే ఈ ఒక్క నెల(నవంబర్)లోనే 127 కేసులు నమోదుకాగా రూ. 64,21,230 బాధితులు పోగొట్టుకున్నారు. ఇందులో రూ.13,14,163 ఫ్రీజ్ చేశారు. సైబర్ మోసానికి గురైన వెంటనే బాధితులు అప్రమత్తమై సైబర్ క్రైంకు ఫిర్యాదు చేస్తే కొంత అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏపీకే ఫైల్స్‌పై క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ ప్రస్తుతం వాట్సాప్‌లలో ఏపీకే ఫైల్స్ విపరీతంగా వస్తున్నాయి. అలాగే ఇతర బ్లూ లింక్స్ వస్తున్నాయి. వాటిని ఆదమరిచి క్లిక్ చేస్తే వెంటనే మీ ఫోన్ హ్యాక్ అయి మీ సమాచారం మొత్తం సైబర్ మోసగాళ్ల చేతికె వెళ్తుంది. దీంతో మీ ఖాతాలో ఉన్న డబ్బులు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. అలాగే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని అపరిచితులు చెప్పితే నమ్మవద్దని, వారు సైబర్ మోసగాళ్లని గ్రహించాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంకుల నుంచి వ్యక్తిగత వివరాలు అడగరు. అలాగే అడిగితే అది సైబర్ నేరస్తుల పనే. అనవసరమైన ఫోన్ కాల్స్, తెలియని లింకులను ఓపెన్ చేయకపోవడం మంచిది. బ్యాంక్ ఓటీపీ, పిన్, సీవీ వివివరాలను ఎవరికీ చెప్పవద్దు. రుణ యాప్స్ ఇన్వెస్ట్మెంట్ స్కీం, తదితర రకాల ఆఫర్ల పేరుతో వచ్చే ప్రకటనలు నమ్మొద్దు. ఫేక్ ప్రొఫైల్స్, క్యూ ఆర్ కోడ్స్, ఫేక్ జాబ్ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నవంబర్‌లో అత్యధికంగా 127 సైబర్ కేసులు ఫ రోజూ ఎక్కడో ఒక చోట మోసపోతున్న బాధితులు ఫ అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు సూర్యాపేట పట్టణానికి చెందిన ఓ క్యాబ్ డ్రైవర్‌కు ఇటీవల పార్ట్‌టైం జాబ్ అంటూ వాట్సాప్‌లో ఓ లింక్ వచ్చింది. దానిని ఓపెన్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఓ యాప్ డౌన్లోడ్ అయింది. ఈ యాప్‌లో రూ.100 పెట్టుబడి పెడితే రూ.200 వస్తాయని అందులో చూపించింది. అయితే అతను రూ.100 నుంచి రూ.10వేల వరకు పెట్టుబడి పెట్టగా రెండింతల డబ్బులు వచ్చాయి. దీంతో మరో సారి రూ.50వేలు పెడితే రూ.1లక్ష వచ్చాయి. దీంతో బయట వేరేవాళ్ల దగ్గర నుంచి రూ.9లక్షలు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ యాప్‌లో పెట్టుబడి పెట్టాడు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టగానే సైబర్‌మోసగాళ్లు వెంటనే డబ్బులు రాకుండా చేశారు. ఆ యాప్‌లో ఆ మొత్తం కనడుతుంది. కానీ అవి తీసుకోవడానికి వీల్లేకుండా చేశారు. దీంతో బాధితుడు మోసపోయానని గ్రహించి 1930కి కాల్చేసి సైబర్ క్రైంను ఆశ్రయించగా కేసు నమోదుచేశారు. ఇలా జిల్లాలో చాలామంది సైబర్ మోసానికి గురవుతూనే ఉన్నారు. -
దివ్యాంగులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు
భానుపురి (సూర్యాపేట) : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవద్ధుల శాఖ ఆధ్వర్యంలో శనివారం సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియ్ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న దివ్యాంగుల క్రీడా పోటీలను జిల్లా సంక్షేమ అధికారి నరసింహా రావు ప్రారంభించి మాట్లాడారు. దివ్యాంగులకు ఆటల ద్వారా మానసిక ఉల్లాసం, మనోధైర్యం కలుగుతుందన్నారు. ప్రతిభ కనబరిచిన వారికి డిసెంబర్ 3న నిర్వహించే జిల్లా స్థాయి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వెంకట రమణ, డీఈఓ అశోక్, జిల్లా యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేలా సహకరించాలి నూతనకల్: ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రజలు సహకరించాలని జెడ్పీ సీఈఓ అప్పారావు కోరారు. శనివారం నూతనకల్తో పాటు మండల పరిధిలోని మిర్యాలలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఆర్డీఓ వేణుమాధవ్‌తో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం. శ్రీనివాసరావు, ఎంపీడీఓ సునిత, అధికారులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా ఇన్చార్జుల నియామకంనల్లగొండ టూ టౌన్: బీజేపీని బలోపేతం చేయడానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు జిల్లా ఇన్చార్జులను నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఉదయ్ ప్రతాప్ నల్లగొండ జిల్లా ఇన్చార్జిగా, నల్లగొండ జిల్లాకు చెందిన టి.రవికుమార్‌ను సూర్యాపేట జిల్లా ఇన్చార్జిగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎన్.శ్రీనివాస్‌రెడ్డిని యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్చార్జిగా నియమించారు. ఈ నియామకం ద్వారా పార్టీ బలోపేతం అవుతుందని, పార్టీ కార్యక్రమాలు వీరు పర్యవేక్షిస్తారని తెలిపారు. పకడ్బందీగా ఆలయ భద్రతా వ్యవస్థ యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రతా వ్యవస్థను పకద్బందీగా అమలు చేయాలని ఆలయ ఈఓ వెంకట్రావ్ ఆదేశించారు. కొండపైన, కొండ కింద, భక్తుల ఎంట్రీ పాయింట్ వద్ద ఏర్పాటు చేస్తున్న బ్యాగేజీ స్క్రీనింగ్ యంత్రాల ఏర్పాటును శనివారం ఆయన పరిశీలించారు. ఎస్పీఎఫ్ అధికారులకు పలు సూచనలు చేశారు. భద్రతను మరింత పటిష్టం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్, ఎస్పీఎఫ్ అధికారులకు స్పష్టం చేశారు. వృద్ధులు, దివ్యాంగ భక్తుల సౌకర్యార్థం బ్యాటరీ వాహనాలను నిరంతరం నడిపించే విధంగా చూడాలని, ఆలయంలోని వివిధ ప్రదేశాల్లో వీల్చైర్లు అందుబాటులో ఉంచాలని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు సూచించారు. గిరి ప్రదక్షిణను విజయవంతం చేయాలి యాదగిరిగుట్ట: రాష్ట్రంలో అయ్యప్ప మాల ధరించిన భక్తుల కోసం యాదగిరిగుట్ట దేవస్థానం డిసెంబర్ 1న ప్రత్యేకంగా గిరిప్రదక్షిణ నిర్వహించనుందని ఆలయ ఈఓ వెంకట్రావ్, అయ్యప్ప సేవా సమితి నిర్వాహకులు శనివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఉదయం 5గంటలకు యాదగిరి కొండ చుట్టూ ప్రదక్షిణ ప్రారంభం అవుతుందన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం నేరుగా వెళ్లి కొండపైన శ్రీస్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. -
నామినేషన్ల జోరు
భానుపురి (సూర్యాపేట) : గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి దశ నామినేషన్ల ఘట్టం శనివారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు క్లస్టర్ కేంద్రాల వద్ద బారులుదీరారు. రాత్రి వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. రాత్రి 11గంటల వరకు అందిన సమాచారం మేరకు సర్పంచ్ స్థానాలకు 866 , వార్డు స్థానాలకు 4,506నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా చివరి రోజు మాత్రం సర్పంచ్‌కు 500, వార్డులకు 4326 మంది నామినేషన్ల వేశారు. సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ స్వీకరణ సెంటర్లకు వచ్చిన వారికి అధికారులు అవకాశం కల్పించారు. సమయం ముగిసిన తర్వాత కూడా.. సూర్యాపేట జిల్లాలోని 23 మండలాల పరిధిలోగల 486 గ్రామపంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో తుంగతుర్తి, నాగారం, మద్దిరాల, తిరుమలగిరి, నూతనకల్, జాజిరెడ్డిగూడెం, సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్) మండలాల్లోని 159 గ్రామాలు, 1,442 వార్డులకు తొలి విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ వచ్చిన 27వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నప్పటికీ మొదటి రోజు అభ్యర్థులకు 207, వార్డు సభ్యులకు 157 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. రెండోరోజు శుక్రవారం అష్టమి కారణంగా మంచిరోజు కాకపోవడమే కాకుండా నామినేషన్ దాఖలుకు బ్యాంక్ అకౌంట్‌తో పాటు పలు ధ్రువీకరణ పత్రాలు కావాల్సి ఉన్న కారణంగా కేవలం సర్పంచ్‌కు 159 , వార్డులకు 142 నామినేషన్ల వచ్చాయి. చివరి రోజు కావడం, పొత్తులు, హామీలు, సమీకరణలు చూసుకుని ఆయా పార్టీలు, వ్యక్తిగతంగా పెద్దగా ఆయా పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల కోసం నామినేషన్ల దాఖలుకు పోటీ పడ్డారు. ఆత్మకూర్ (ఎస్)లోని ఏపూరు, తుమ్మలపెన్‌పహాడ్ గ్రామాల్లో పోలింగ్ జరిగే సమయంలో ఉన్న మాదిరిగానే అభ్యర్థులు పెద్దఎత్తున క్యూలో నిల్చొని నామినేషన్లు వేశారు. తిరుమలగిరి మండలంలోని జలాల్పురం, తొండ, తుంగతుర్తి మండలంలోని పలుచోట్ల రాత్రి పొద్దుపోయే వరకు గ్రామపంచాయతీ ఆవరణల్లోనే ఉండి నామినేషన్లు వేశారు. రాత్రి సమయం కావడంతో క్యూలో ఉన్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్థానిక సిబ్బంది లైటింగ్‌తో పాటు మంచినీరు, తదితర సదుపాయాలు కల్పించారు.మండలం పంచాయతీలు వార్డులు క్లస్టర్లు అనంతగిరి 20 178 06 చిలుకూరు 17 158 05 చివ్వెంల 32 258 09 కోదాడ 16 158 04 మోతె 29 262 07 మునగాల 22 210 06 నడిగూడెం 16 148 05 పెన్‌పహాడ్ 29 256 07 మొత్తం 181 1,628 49మొదటి విడత ముగిసిన నామినేషన్ల స్వీకరణ ఫ పంచాయతీలకు 866, వార్డులకు4,506నామినేషన్లు దాఖలు ఫ క్లస్టర్ల వద్ద బారులుదీరిన అభ్యర్థులు ఫ చివరిరోజు కావడంతో రాత్రి వరకు సాగిన ప్రక్రియ ఫ నేటి నుంచి రెండో విడత 181 పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణరెండోవిడతలో చిలుకూరు, కోదాడ, అనంతగిరి, మునగాల, నడిగూడెం, మోతె, చివ్వెంల, పెన్‌పహాడ్ మండలాల్లోని 181 గ్రామపంచాయతీల్లో ఆదివారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. నామినేషన్ల స్వీకరణ కోసం క్లస్టర్ల వారీగా గ్రామాలను విభజించారు. ఈ మేరకు 181 గ్రామపంచాయతీలు, 1,628 వార్డులకు గాను నామినేషన్లు స్వీకరించేందుకు 49 నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిసెంబర్ 14వ తేదీన నిర్వహించే రెండో విడత పోలింగ్‌లో 2,52,745 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. -
కల్లుగీత వృత్తిని ఆధునీకరించాలి
సూర్యాపేట : కల్లు గీత వృత్తిని ఆధునీకరించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంతటి విజయ్ ఫంక్షన్ హాల్( వర్ధెల్లి బుచ్చిరాములు నగర్)లో నిర్వహించిన ప్రతినిధుల సభలో ఆమె మాట్లాడారు. తాటి, ఈత ఉత్పత్తులను ప్రోత్సహించి యువతకు ఉపాధి కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా నెరవేర్చలేదన్నారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కల్లుగీత వృత్తి చేసే వారందరికీ కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. రమణ, కౌడిన్య, అమెరికన్ ఆఫ్ నార్త్ ఇండియా అసోసియేషన్ చైర్మన్ నాతి శ్రీనివాస్ గౌడ్, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడత రవీందర్, బాలగాని జయరాములు, ఎస్.రమేష్ కుమార్, మడ్డి అంజిబాబు, బుర్ర స్వప్న, చౌగాని సీతారాములు, నాగరాజు, శాంత కుమార్, గౌని వెంకన్న, బాలే వెంకట మల్లయ్య, బూడిద గోపి, ఉషా గాని వెంకట నరసయ్య, ఎల్గూరి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. మహాసభలకు హాజరైన ప్రతినిధులకుహైదరాబాద్ కు చెందిన సుప్రజ హాస్పిటల్ ఎం.డి శిగ విజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించారు.ఫ ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి -
విధుల నిర్వహణలో పొరపాట్లుకు తావివ్వొద్దు
భానుపురి (సూర్యాపేట) : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా విధులు నిర్వర్తించాలని గ్రామపంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవి నాయక్ సూచించారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్లో కలెక్టర్ తేజాస్ నంద్లాల్ పవార్, జిల్లా వ్యయ పరిశీలకుడు హుస్సేన్‌తో కలిసి గ్రామపంచాయతీ ఎన్నికలపై ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ వ్యయ బృందాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవినాయక్ మాట్లాడుతూ ఎస్ఎస్టీ, ఎఫ్ఎఫ్టీ విధులు కేటాయించిన సిబ్బంది ఎన్నికల కమిషన్ రూల్స్ పాటిస్తూ బాధ్యతాయుతంగా, కచ్చితమైన సమాచారాన్ని మాత్రమే ఇవ్వాలన్నారు. సహాయక వ్యయ పరిశీలకులు ఎన్నికల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని, ఏ రోజు నివేదికలు ఆ రోజే పంపించాలని సూచించారు. నివేదికల్లో ఎలాంటి తప్పులు లేకుండా కచ్చితంగా ఉండాలన్నారు. అసిస్టెంట్ వ్యయ పరిశీలకులు మండలానికి ఒక బృందం చొప్పున ఉండాలని, సమావేశాలు, మీటింగ్‌లలో పీఎస్ సిస్టంతో సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ప్రతీది వీడియోగ్రఫీ చేయించాలని, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు తనిఖీల సందర్భంగా రూ.10వేలకు మించి ఆర్టికల్స్ తీసుకువెళ్తున్నా.. రూ.50 వేలకు మించి నగదును తీసుకువెళ్లే వారి వాహనాలను సీజ్ చేయాలన్నారు. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, అసిస్టెంట్ వ్యయ అధికారులు సర్పంచ్ వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు ఏదైనా నగదు, ఆర్టికల్స్, లిక్కర్స్ తరలిస్తే ఈ వ్యయాన్ని వారి ఖాతాలో జమ చేయాలన్నారు. లోకల్ ప్రింటింగ్ ప్రెస్ మీద నిఘా ఉంచాలని ఆదేశించారు. అలాగే వ్యయ పరిశీలకుడు బి.హుస్సేన్ మాట్లాడుతూ ఏఈఓలు ఎంపీడీఓలతో కలిసి వారికి కేటాయించిన గ్రామపంచాయతీలను తనిఖీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, డీపీఓ యాదగిరి, డీఆర్డీఓ అప్పారావు, డీసీఓ ప్రవీణ్ కుమార్, జిల్లా ఫారెస్ట్ అధికారి సతీష్, జోనల్ ఆఫీసర్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఫ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవినాయక్ -
నియమావళికి లోబడి నడుచుకోవాలి
ఫ ఎస్పీ నరసింహ అర్వపల్లి: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు, నాయకులు నియమావళికి లోబడి నడుచుకోవాలని జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు. శనివారం జాజిరెడ్డిగూడెం, కుంచమర్తి గ్రామాల్లో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. గొడవలు, విభేదాలకు పోకుండా ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. ఎన్నికల సమయంలో సమస్యలు సృష్టించకుండా పాత నేరస్తులు, గతంలో సమస్యలు సృష్టించిన వారిని రూ.5లక్షల పూచీకత్తుపై బైండోవర్ చేస్తున్నట్లు తెలిపారు. ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు నాగేశ్వరరావు, రామారావు, స్థానిక ఎస్ఐ ఈట సైదులు, స్థానిక దేవస్థాన చైర్మన్ అనిరెడ్డి రాజేందర్‌రెడ్డి, వజ్జె వీరయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
గీతన్నల సంక్షేమం పట్టని ప్రభుత్వాలు
సూర్యాపేట : కల్లుగీత కార్మికులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.రమణ అన్నారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాల్గవ మసహాసభల సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఆయన ముఖ్య అతిథిగా హారై మాట్లాడారు. నిత్యం స్వదేశీ వస్తువులను వాడాలని చెప్పే బీజేపీ నాయకులు స్వదేశీ కల్లును, నీరాను ఎందుకు ప్రచారం చేయడం లేదని ప్రశ్నించారు. సర్వాయి పాపన్న విగ్రహాలకు పూల మాలలు వేసి దండాలు పెడుతున్న పాలకులు పాపన్న వారసులైన కల్లుగీత కార్మికుల సంక్షేమాన్ని మాత్రం పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. గీత కార్మికుల ప్రతి సొసైటీకి రూ.20 లక్షలు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మికుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కల్లుగీత వత్తి చేసే వారందరికీ కాటమయ్య రక్షణ కిట్లు ఇవ్వాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మోకు, ముస్తాదులతో భారీ ప్రదర్శన కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు ప్రారంభం సందర్భంగా జిల్లా కేంద్రంలో కల్లుగీత కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎంవీ.రమణ రచించగా ప్రభుత్వ కళాకారుడు మానుకోట ప్రసాద్ పాడిన ‘మోకు పైలం మోయి గౌడ వెంకీ పైల మోయి గౌడ’ అనే పాటల సీడిని హైదరబాద్ సుప్రజ హాస్పిటల్ ఎండీ సిగ విజయ్‌కుమార్‌గౌడ్ ఆవిష్కరించారు. సంఘం ఉద్యమ నిర్మాత తొట్ల మల్సూర్ స్వగ్రామమైన నూతనకల్ మండలం చిల్పకుంట్ల నుంచి తీసుకొచ్చిన స్మారక జ్యోతిని రమణకు సభా వేదికపై అందజేశారు. కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలుగూరి గోవిందు అధ్యక్షతన జరిగిన ఈ సభలో సంఘం రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ చౌగాని సీతారాములు, బోలగారి జయరాములు, జయరాములు, గౌని వెంకన్న, బొల్లె వెంకట మల్లయ్య, ఎస్.రమేష్ గౌడ్, బూడిద గోపి, పామన గుండ్ల అచ్చాలు, ఉష గాని వెంకటనరసయ్య, బండకింది అరుణ, గౌరీ అంజయ్య, జిల్లా నాయకులు కక్కిరేణి నాగయ్య, బైరు వెంకన్న గౌడ్, టైసన్ శ్రీను, ఉయ్యాల నగేష్, మడ్డి అంజిబాబు, బత్తుల జనార్దన్, సైదయ్య పాల్గొన్నారు. ఫ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.రమణ ఫ సూర్యాపేటలో ఆ సంఘం రాష్ట్ర మహాసభలు ప్రారంభం ఈ నెల 29, 30వ తేదీల్లో కల్లుగీత కార్మిక సంఘం మహాసభల ప్రతినిధుల మహాసభ జిల్లా కేంద్రంలోని అంతటివిజయ్ ఫంక్షన్ హాల్( కల్లుగీత కార్మిక సంఘం వ్యవస్థాపక సభ్యుడు వర్ధెల్లి బుచ్చిరాములు నగర్)లో నిర్వహించనున్నారు. 30న రాష్ట్ర కమిటీ నూతన కార్యవర్గం ఎన్నికతో సభ ముగుస్తుంది. -
ఓవర్ లోడుతో రోడ్డెక్కితే సీజ్
సూర్యాపేట టౌన్ : రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంంది. రవాణా శాఖ అమలు చేస్తున్న సంస్కరణలను మరింత కఠినతరం చేసింది. ఇటీవల చేవెళ్ల బస్సు ప్రమాదం నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను అరికడుతూ మరణాల రేటును తగ్గించేందుకు రవాణా శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. వాహనాలు ఓవర్ లో డుతో రోడ్డెక్కితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు రూ.లక్షల్లో జరిమానా విధిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో మూడు విజిలెన్స్ అధికారుల బృందంతో పాటు ఉమ్మడి జిల్లాలో మూడు, జిల్లాలో మరో ఆరు టీంలతో పాటు ఏవీంఐలు తనిఖీలు విస్తృతం చేశారు. పన్నుల చెల్లింపులు, అనుమతి పత్రాలు, ఇన్సూరెన్స్, ఫిట్నెస్, ఓవర్‌లోడు అంశాలను పరిశీలిస్తూ ని బంధనలు పాటించని వాహనాలను పట్టుకొని భారీ జరిమానాతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. వందలాది వాహనాలపై కేసులు నమోదు రాష్ట్ర స్థాయిలో విజిలెన్స్ బృందాలతో పాటు జిల్లాలోని రవాణా శాఖ అధికారులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేస్తున్నారు. వీరు జిల్లాల్లో ఎక్కడైనా ఆకస్మిక తనిఖీలు చేస్తూ వాహనాల పత్రాలు పరిశీలించి తేడాలుంటే జరిమానా విధిస్తున్నాయి. ఇసుక, కంకర, మొరం లోడుతో వెళ్లే లారీలు, పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోలను పట్టుకొని ఫైన్లతో పాటు కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఇరవై రోజుల నుంచి చేపడుతున్న తనిఖీల్లో 342 వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఇందులో 64 వాహనాలు ఇసుక ట్రాక్టర్లు, కంకర లారీలు, ప్రయాణికులను పరిమితికి మించి ఎక్కించుకున్న ఆటోలు ఉన్నాయి. ఈ వాహనాలకు మొత్తం రూ.11.46లక్షలు జరిమానా విధించారు. అలాగే మిగతా 278 వాహనాలకు సరైన పత్రాలు, ఫిట్నెస్, ఇతర ధ్రువపత్రాలను లేనివిగా రవాణా శాఖ అధికారులు గుర్తించి కేసులు నమోదు చేశారు. వీటన్నింటికి మొత్తం రూ.54.82 లక్షల జరిమానాలు విధించారు. రెండో సారి దొరికితే అంతే సంగతులు.. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు ఓవర్ లోడు వల్లే అధికంగా జరుతుండడంతో వాటిమీదే యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఓవర్ లోడు అయిన వాహనాలు సీజ్ చేయడంతో పాటు రెండో సారి ఓవర్‌లోడుతో వాహనం పట్టుబడితే ఆ వాహనం పర్మిట్ రద్దు చేయడంతో పాటు వాహనం నడుపుతున్న డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాల, కళాశాల బస్సులు కూడా ఓవర్ లోడ్‌తో వెళితే కేసులు తప్పవని రవాణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రవాణా శాఖ తనిఖీలు ఫ నిబంధనల ఉల్లంఘనపై కొరడా ఫ సరైన పత్రాలు, ఫిట్‌నెస్‌లేని 278 వాహనాలకు జరిమానా ఫ 342 వాహనాలపై కేసులువాహనదారులు రోడ్డు నిబంధనలను ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నాం. ముఖ్యంగా ఓవర్ లోడుతో, పరిమితికి మించి వాహనదారులను తరలించే వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తాం. ఓవర్ లోడ్‌తో పాటు నిబంధనలు పాటించకుండా రెండో సారి కూడా పట్టుబడే వాహనాల పర్మిట్ రద్దుతో పాటు డ్రైవర్ లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తాం. – జయప్రకాష్‌రెడ్డి, ఇన్చార్జి జిల్లా రవాణా శాఖ అధికారి -
కేసుల పరిష్కారానికి కృషిచేయాలి
చివ్వెంల(సూర్యాపేట) : పెండింగ్ కేసుల పరిష్కారానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ మీడియేషన్ సభ్యులు శక్తివంచన లేకుండా కృషిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద సూచించారు. ఇటీవల ఎంపికై న జిల్లా న్యాయసేవాధికార సంస్థ మీడియేషన్ సభ్యులు శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారదను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సభ్యులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మీడియేషన్ సభ్యులు జె.శశిధర్, ఏడిండ్ల అశోక్, మంతపురం కిశోర్, మాండ్ర మల్ల య్య, పసల బాలరాజు, పోలోజు మధు, పల్లేటి రాముడు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా నామినేషన్ల స్వీకరణ
తుంగతుర్తి, మద్దిరాల : నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను రిటర్నింగ్ అధికారులు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం తుంగతుర్తి, మద్దిరాలలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో మొదటి విడత గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక నామినేషన్ స్వీకరణ ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. నామినేషన్ కేంద్రాలలోకి అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే అనుమతించాలన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా హెల్ప్ డెస్క్‌ను సంప్రదించాలన్నారు. అనంతరం మండల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీఓ వేణుమాదవ్‌రావు, తుంగతుర్తి తహసీల్దార్ దయానందం, ఎంపీడీఓలు శేషుకుమార్, సత్యనారాయణరెడ్డి, సీఐ నాగేశ్వరరావు సిబ్బంది ఉన్నారు. -
ఎలాంటి ఘర్షణలకు తావివ్వొద్దు
సూర్యాపేట : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు క్షణికావేశంలో ఘర్షణకు దిగి కేసుల పాలు కావొద్దని జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. శుక్రవారం డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ రాజశేఖర్, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ రవితో కలిసి సూర్యాపేట మండలం యర్కారం గ్రామంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. ఎన్నికల నియమావళిని పాటించాలని ప్రజలకు సూచించారు. ఓటర్లంతా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి పోలీస్ శాఖ పూర్తి భద్రత, రక్షణ కల్పిస్తుందన్నారు. ఓటర్లను ప్రభావితం చేసేలా డబ్బు, బహుమతులు, మద్యం, ఇతర ఉచితాలు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని, ఫలితాలు వెలువడిన రోజు ఎవరు కూడా ర్యాలీలు నిర్వహించొద్దన్నారు. అక్రమ రవాణా నిరోధం కోసం 24 గంటలకు తనిఖీలు ఉంటాయి అన్నారు. అంతరాష్ట్ర చెక్ పోస్టుల్లో పటిష్ట నిఘా ఉంచామన్నారు. ఆకస్మిక తనిఖీలకు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఎస్ఐలు బాలునాయక్, శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
30న ఉమ్మడి జిల్లా స్థాయి ఆర్చరీ ఎంపిక పోటీలు
భువనగిరి : ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి ఆర్చరీ ఎంపిక పోటీలు ఈ నెల 30న నిర్వహిస్తున్నట్లు ఆర్చరీ అసోసియేషన్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీగిరి విజయకుమార్‌రెడ్డి, తునికి విజయసాగర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్లో నిర్వహించే పురుషులు, మహిళల ఎంపీక పోటీలకు ఆసక్తి కలిగిన క్రీడాకారులు తమ వెంట ఆధార్‌కార్డుతో పాటు జనన ధ్రువీకరణ పత్రాలను తీసుకుని ఉదయం 10 గంటలకు వరకు హాజరై వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు కోచ్ సంపత్‌ను 9182842387లో సంప్రదించాలని కోరారు. అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలిమద్దిరాల : నామినేషన్ కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకుడు రవినాయక్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం మద్దిరాల మండల కేంద్రంలోని నామినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సీఐ నరసింహ, ఎంపీడీఓ సత్యనారాయణరెడ్డి, తహసీల్దార్ అయేషా పర్వీన్, ఎస్ఐ ఎం.వీరన్న, పీఓ, ఆర్ఓ, సిబ్బంది ఉన్నారు. వరికొయ్యలను కాల్చొద్దుమునగాల: పొలాలు కోసిన అనంతరం రైతాంగం వరికొయ్యలను కాల్చొద్దని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) శ్రీధర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం మునగాల మండల కేంద్రంలో వరికొయ్యలను కాల్చిన పలువురి రైతుల వ్యవసాయ భూములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వరికోతల తర్వాత మిగిలిన వరికొయ్యలు, గడ్డిని త్వరగా తొలగించేందుకు తగులబెట్టడం సాధారణమైందని, ఈ పద్ధతి వల్ల నేలకు, పంటకు, మన ఆరోగ్యానికి ఎంతో నష్టం జరుగుతుందన్నారు. నేల భూసారాన్ని కోల్పోతుందని, గాలిలో కాలుష్యం పెరగుతుందని, ఎరువుల ఖర్చు పెరుగుతుందని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఓ బి.రాజు, ఏఈఓలు నాగు, రమ్య, భవాని, మహిత, రైతులు పాల్గొన్నారు. భవిష్యత్ అంతా సైన్స్‌దే.. సూర్యాపేట టౌన్ : రేపటి భవిష్యత్ అంతా సైన్స్‌దేనని జన విజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ అందె సత్యం అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకులంలో ఆ వేదిక జిల్లా అధ్యక్షుడు గోళ్లమూడి రమేష్ బాబు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల్లో ఆయన మాట్లాడారు. నాలుగు విభాగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెమొంటోలు, పుస్తకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో విద్యా శాఖ సెక్టోరియల్ అధికారులు శ్రవణ్‌కుమార్, రాంబాబు, సూర్యనారాయణలు ప్రిన్సిపాల్ జీవీ.విద్యాసాగర్, డాక్టర్ విజయమోహన్, షేక్ జాఫర్, కలకుంట్ల సైదులు, డీఎన్ స్వామి, యాదయ్య, రామచంద్రయ్య, దయానంద్, సోమ సురేష్, క్రాంతికుమార్ పాల్గొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలినడిగూడెం: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని వాటి సాధనకు క్రమశిక్షణతో చదవాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల డీసీఓ సీహెచ్.పద్మ కోరారు. శుక్రవారం నడిగూడెం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులాన్ని తనిఖీ చేశారు. అనంతరం 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి, వైస్ ప్రిన్సిపాల్ విజయశ్రీ, సునిత, విద్యార్థులు పాల్గొన్నారు. -
నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా చూడాలి
● ఎన్నికల పరిశీలకుడు రవినాయక్అర్వపల్లి: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా చూడాలని సూర్యాపేట జిల్లా ఎన్నికల పరిశీలకుడు గుగులోతు రవినాయక్ ఆదేశించారు. జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్‌తో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. నామినేషన్ పత్రాలు పరిశీలించి ఆర్ఓకు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్పీ నరసింహ, డీఆర్డీఓ అప్పారావ్, డీపీఓ యాదగిరి, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ ఝాన్సీ, ఎంపీఓ గోపి, ఎస్ఐ సైదులు, పంచాయతీ కార్యదర్శులు నవీన్‌రెడ్డి, నెహ్రూనాయక్, ఆర్ఓ, ఏఆర్ఓలు పాల్గొన్నారు. -
ప్రీ ప్రైమరీ స్కూళ్లకు నిధులు
సూర్యాపేట టౌన్ : ప్రభుత్వ విద్యను బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. తాజాగా ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారుల కోసం బోధన సామగ్రి కొనుగోలు, తరగతి గదుల అలంకరణ, లెర్నింగ్ మెటీరియల్, మల్టీ మీడియా కిట్లు, శానిటేషన్ వంటి అవసరాల కోసం ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో విద్యార్థులకు ఆకర్షణీయమైన శ్రద్ధ పెంచేలా విద్యా వాతా వరణం అవసరమని భావించి ఈ నిధులను విడదల చేసింది. వీటితో చిన్నారులకు ఆట పాటలతో, చిత్రాలతో, రైమింగ్, లెర్నింగ్ కిట్లతో నేర్పే ప్లే–వే విధానం మరింత బలోపేతం కానుంది. 40 ప్రీప్రైమరీ పాఠశాలలు.. జిల్లాలో మొత్తం 30 ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఉన్నాయి. వీటితో మరో పది పీఎంశ్రీ పాఠశాలలను ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా ఎంపిక చేశారు. ఒక్కో పాఠశాలకు బోధన సామగ్రి, పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల అవసరాలకు రూ. 1.70 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో బోధన.. ప్రీ ప్రైమరీలో చేరే పిల్లలు నాలుగేళ్లు నిండిన వారై ఉండాలి. అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లలను ప్రీ ప్రైమరీకి పంపిస్తారు. ప్రీ ప్రైమరీ కోసం పాఠశాలలోనే ఒక గదిని కేటాయించి, గదిని ఆహ్లాదం పంచేలా అందంగా అలకరించడం, గోడలను అక్షరాలు, బొమ్మలతో తీర్చిదిద్దేందుకు ఈ నిధులు దోహదపడనున్నాయి. ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే విషయాలపై సమావేశాలు నిర్వహిస్తారు. ఇప్పటికే బోధన సిబ్బందిని ఎంపిక చేశారు. ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఇవే.. ఎంపీపీఎస్ ఎస్సీ కాలనీ తొండ(తిరుమలగిరి మండలం), ఎంపీపీఎస్ అమరవరం(హుజూర్నగర్ మండలం), ఎంపీయూపీఎస్ భీక్యాతండా(కోదాడ), ఎంపీపీఎస్ పూలగడ్డపస్త్యాల(నాగారం), ఎంపీపీఎస్ పోలుమల్ల(మద్దిరాల), ఎంపీపీఎస్ గోండ్రియాల(అనంతగిరి), ఎంపీపీఎస్ సోమవరం(నేరేడుచర్ల), ఎంపీపీఎస్ బొత్తలపాలెం(పాలకవీడు), ఎంపీయూపీఎస్ బుర్కచర్ల(మోతె), ఎంపీపీఎస్ రత్నవరం(నడిగూడెం), ఎంపీయూపీఎస్ సర్వారం(మోతె), ఎంపీయూపీఎస్ రత్నపురం(సూర్యాపేట), పీఎస్ మున్యానాయక్‌తండా(చివ్వెంల), ఎంపీపీఎస్ అలాంగ్పురం(పాలకవీడు), ఎంపీపీఎస్ మానాపురం(తుంగతుర్తి), ఎంపీయూపీఎస్ బక్కమంతులగూడెం(మఠంపల్లి, ఎంపీపీఎస్ శాంతినగర్(నాగారం), ఎంపీపీఎస్ తాళ్లఖమ్మంపహాడ్(సూర్యాపేట), ఎంపీపీఎస్ ముకుందాపురం(నేరేడుచర్ల), ఎంపీపీఎస్ తోల్తండా(మోతె), ఎంపీపీఎస్ లాల్‌తండా, ఎంపీపీఎస్ కొత్తగూడెం, ఎంపీపీఎస్ సిరిపురం(నడిగూడెం), ఎంపీపీఎస్ నరసింహపురం(మునగాల), ఎంపీపీఎస్ కలకోవ, ఎంపీపీఎస్ త్రిపురవరం(అనంతగిరి), ఎంపీపీఎస్ చెనుపల్లి, ఎంపీపీఎస్ నర్లెంగులగూడెం(పాలకవీడు), ఎంపీపీఎస్ కచ్చవారిగూడెం(గరిడేపల్లి), ఎంపీపీఎస్ కర్విరాలకొత్తగూడెం(తుంగతుర్తి), ఎంపీపీఎస్ గాజులమొల్కాపురం(పెన్‌పహాడ్), మొర్సకుంటతండా, రంగయ్యగూడెం, చినగారకుంటతండా, ఎంపీపీఎస్ జేత్యతండా(తిరుమలగిరి), ఎంపీపీఎస్ వడ్డరివాడ(అనంతగిరి), ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హుజుర్నగర్, ఎంపీపీఎస్ ఎన్ఎస్పీ క్యాంపు, ఎంపీపీఎస్ వెంపటి(తుంగతుర్తి మండలం) ప్రీప్రైమరీ కింద ఎంపికయ్యాయి.ఫ ఒక్కో పాఠశాలకు రూ.1.70లక్షల నిధులు మంజూరు ఫ జిల్లాలో 40 ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఫ విద్యారంగం బలోపేతమే లక్ష్యంగా.. ఫ ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన -
పల్లె ఓటర్లు 6,94,815
భానుపురి (సూర్యాపేట) : పల్లె ఓటర్ల లెక్క తేలింది. జిల్లా వ్యాప్తంగా 6,94,815 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో పురుషులు 3,40,743 మంది, మహిళలు 3,54,050 మంది, ఇతరులు మరో 22 మంది ఉన్నారు. మండలాల వారీగా చూస్తే అత్యధికంగా గరిడేపల్లి మండలంలో 46,796 మంది ఓటర్లు, అత్యల్పంగా తిరుమలగిరి మండలంలో 17,799 మంది ఓటర్లు ఉన్నారు. తిరుమలగిరి మినహా అన్ని మండలాల్లోనూ మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. ఈ తుది జాబితాతోనే జిల్లాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలో 486 పంచాయతీలుసూర్యాపేట జిల్లావ్యాప్తంగా 486 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గతేడాది ఫ్రిబవరిలో గ్రామపంచాయతీల పదవీకాలం ముగిసింది. అయితే అక్టోబర్ చివరి వారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచ్, వార్డుసభ్యులకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను సైతం విడుదల చేసింది. ఈ సమయంలో పంచాయతీ ఓటర్ల తుది జాబితాను అక్టోబర్ మొదటివారంలోనే ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం జిల్లాలో 6,82,882 మంది ఓటర్లు నమోదయ్యారు. నోటిఫికేషన్ రాగానే తుది జాబితా ప్రకటిస్తే 6,94,815 మంది ఓటర్లు ఉన్నారు. ఇదే జాబితాతో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.మండలం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం అనంతగిరి 12545 13343 01 25,889 ఆత్మకూర్ 21800 22252 01 44,053 చిలుకూరు 15915 16984 00 32899 చింతలపాలెం 13132 13700 00 26832 చివ్వెంల 14328 14882 01 29211 గరిడేపల్లి 22654 24135 07 46796 హుజూర్నగర్ 10287 10744 00 21031 జాజిరెడ్డిగూడెం 12157 12458 00 24615 కోదాడ 15462 16418 01 31881 మద్దిరాల 12569 12738 00 25307 మఠంపల్లి 18314 19349 00 37663 మేళ్లచెరువు 16740 17546 01 34287 మోతె 18731 19087 05 37823 మునగాల 17695 18699 00 36394 నడిగూడెం 12089 12481 01 24571 నాగారం 12227 12545 03 24775 నేరేడుచర్ల 10720 11422 00 22142 నూతనకల్ 14503 14563 00 29066 పాలకీడు 10358 11110 00 21468 పెన్‌పహాడ్ 16632 17445 00 34077 సూర్యాపేట 15652 15967 01 31620 తిరుమలగిరి 8925 8874 00 17799 తుంగతుర్తి 17308 17308 00 34616 మొత్తం 3,40,743 3,54,050 22 6,94,815 తుది ఓటరు జాబితా విడుదల అత్యధికంగా గరిడేపల్లి మండలంలో 46,796 మంది జిల్లాలో మహిళా ఓటర్లదే పైచేయి -
నేటి నుంచి కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు
సూర్యాపేట : తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలు శుక్రవారం నుంచి మూడు రోజులపాటు సూర్యాపేట పట్టణంలో నిర్వహించనున్నారు. దీనికోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిరోజు స్థానిక ప్రభుత్వ జూని యర్ కళాశాల ఆవరణలో బహిరంగ సభ నిర్వహిస్తారు. అంతకు ముందు పట్టణంలో ర్యాలీ కొనసాగుతుంది. ఈనెల 29,30 తేదీల్లో పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులోగల అంతటి విజయ్ ఫంక్షన్ హాల్(వర్ధెల్లి బుచ్చిరాములు నగర్)లో ప్రతినిధుల సభ ఉంటుంది. ఈ సభకు రాష్ట్రంలోని 31 జిల్లాలకు చెందిన 600 మంది కల్లుగీత కార్మికోద్యమ ప్రతినిధులు, పరిశీలకులు హాజరుకానున్నారు. రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.వి రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు కోరారు. తొలిరోజు బహిరంగ సభ 29, 30 తేదీల్లో ప్రతినిధుల సభ -
ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి
భానుపురి (సూర్యాపేట) : పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని జనరల్ పరిశీలకుడు గుగులోతు రవినాయక్ సూచించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ కె.నరసింహలతో కలిసి ఆయన గ్రామ పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్లకు అవగాహన కల్పించి తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుని ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియలో పాల్గొనేలా చూడాలన్నారు. ఓటర్ స్లిప్స్ పంపిణీలో ఎలాంటి పొరపాట్లు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలపై వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో నిజ నిర్ధారణ చేసిన తర్వాతనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులు ఎన్నికల్లో అభ్యర్థులకు మద్దతు తెలిపినా ప్రచారంలో పాల్గొన్నా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ మాట్లాడుతూ మొదటి విడతలో నామినేషన్ స్వీకరణ కేంద్రాలు మొదటి విడతలో 44 , రెండవ విడతలో 49 , మూడవ విడతలో 38 ఏర్పాటు చేశామని వివరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అభ్యర్థుల ఖర్చులు లెక్కించేందుకు 23 ఫ్లయింగ్ స్క్వాడ్లు,4 స్టాటిస్టిక్ టీములు నిరంతరం పర్యవేక్షణ చేస్తాయని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ కె.నరసింహ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ సాఫీగా సాగేందుకు పోలీసు శాఖ నామినేషన్ కేంద్రాల వద్ద, పోలింగ్ కేంద్రాలలో భద్రతకు బలగాలను ఏర్పాటు చేశామన్నారు. సోషల్ మీడియా, గ్రీవెన్స్ సెల్ ప్రారంభం సోషల్ మీడియాలో రాజకీయ ప్రచారం, అసత్య ప్రచారం, ద్వేషపూరిత పోస్టులు, ఓటర్లను ప్రభావితం చేసే సందేశాలు, ఉద్రిక్తతలను రేకెత్తించే వ్యాఖ్యలు నిషేధించామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సంబంధిత ఫిర్యాదులు, సూచనలు స్వీకరించి చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు వంటి అంశాలపై వెంటనే 6281492368 కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, డీఎస్పీ రవీందర్ రెడ్డి, జెడ్పీ సీఈఓ వి.వి. అప్పారావు, డీపీఓ యాదగిరి, డీఎల్పీఓలు నారాయణ రెడ్డి, పార్థ సారధి, నోడల్ అధికారులు పాల్గొన్నారు. జనరల్ పరిశీలకుడు రవినాయక్ -
జిల్లాకు ఇద్దరు పరిశీలకులు
భానుపురి(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లాకు పంచాయతీ ఎన్నికల కోసం ఇద్దరు పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించింది.వీరిలో సాధారణ పరిశీలకుడిగా గుగులోతు రవి నాయక్, వ్యయ పరిశీలకుడిగా హుస్సేన్ ఉన్నారు.మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి గురువారం నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం రక్తి కట్టించారు. అనంతరం విష్వక్సేనారాధన , పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ,తలంబ్రాలతో కల్యాణతుంతు ముగించారు. ఆలయ తిరుమాడ వీధుల్లో శ్రీస్వామి వారిని గరుడవాహనంపై ఊరేగించారు. అనంతరం మహానివేదనతో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, అర్చకులుపాల్గొన్నారు. బహిరంగ వేలం వాయిదామట్టపల్లి క్షేత్రంలో కొబ్బరికాయలు అమ్ముకునే హక్కుకోసం గురువారం స్తానికంగా నిర్వహించిన బహిరంగ వేలానికి సరైన పాటదారులు పాల్గొనక పోవడంతో వాయిదా వేస్తున్నట్లు ఆలయ ఈఓ బి.జ్యోతి తెలిపారు. త్వరలోనే మళ్లీ బహిరంగ వేలం నిర్వహిస్తామని చెప్పారు. 56 సర్పంచ్ స్థానాల్లో పోటీసూర్యాపేట అర్బన్ : పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ జిల్లాలోని 56 సర్పంచ్ స్థానాల్లో పోటీ చేస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి వెల్లడించారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవసరమైన చోట వామపక్షాలతో కలిసి ముందుకు సాగుతామన్నారు. మతోన్మాద బీజేపీని ఓడించేందుకు లౌకిక పార్టీలతో అవగాహన చేసుకుంటామన్నారు. ప్రస్తుతం చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. సర్పంచ్‌గా పోటీ చేయని గ్రామాలలో బీజేపీయేతర పార్టీలతో కలిసి సర్దుబాటు చేసుకుంటామన్నారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపెళ్లి సైదులు, చెరుకు ఏకలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు కందాల శంకర్ రెడ్డి, పులుసు సత్యం, వేల్పుల వెంకన్న, జె.నరసింహారావు, నాయకులు గుమ్మడవెల్లి ఉప్పలయ్య, మే రెడ్డి కృష్ణారెడ్డి, పోలోజుసైదులు, బత్తుల జనార్దన్ పాల్గొన్నారు. కొనసాగుతున్న మూసీ నీటి విడుదల కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు గురువారం ఎగువ నుంచి 724 క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. రిజర్వాయర్‌లో పూర్తిస్థాయిలో నీటి నిల్వ ఉండడంతో అధికారులు వరదను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు ఒక క్రస్టు గేటును అడుగున్నర మేర పైకెత్తి 988 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 44 క్యూసెక్కులు సీపేజీ, లీకేజీ, ఆవిరి రూపంలో తగ్గుతోంది. ఈఏడాది మొదటిసారిగా జూలై మాసంలో మూసీ గేట్లను అధికారులు పైకెత్తగా.. నాటి నుంచి నిర్విరామంగా దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. 62 ఏళ్ల మూసీ చరిత్రలో ఇన్నిరోజులపాటు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి. -
గెలుపు గుర్రం ఎవరు?
భానుపురి (సూర్యాపేట) : పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడం, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు కావడంతో ఇన్నాళ్లూ ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. ఎక్కడ చూసినా మన మనిషికి రిజర్వేషన్ అనుకూలించిందా..? గెలుపు గుర్రమేనా..? ఏ వార్డులో ఎవరు ఉన్నారన్న.. చర్చలు జోరుగా సాగుతున్నాయి. కొన్నిచోట్ల రాజకీయాలను పక్కనబెట్టి ఆశావాహుల వ్యక్తిగత చరిష్మా, గ్రామాల్లో మంచి పేరున్న వారిని రాజకీయాల్లో తీసుకొచ్చే మంతనాలు జోరుగా సాగుతున్నాయి. ఇక బరిలో ఉండాలనుకున్న ఆశావహులు గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు తమ గాడ్ఫాదర్ల మద్దతు కోసం క్యూ కడుతున్నారు. ఇక ఇప్పటికే గ్రామాల్లో పట్టున్న నాయకులు సైతం తమకు అనుకూలమైన వ్యక్తులను సర్పంచ్, వార్డుసభ్యులుగా ఎన్నుకునేలా పావులు కదుపుతున్నారు. ప్రధానంగా సర్పంచ్ ఎన్నిక కోసం సామాజిక వర్గం, ధనబలం, మంచి పేరున్న అభ్యర్థుల కోసం అన్వేషణ షురూ అయింది. పార్టీలతో సంబంధం లేకున్నా..వాస్తవానికి పంచాయతీ ఎన్నికలు పార్టీలతో ఎలాంటి సంబంధం ఉండదు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పార్టీల గుర్తులపై జరగవు. కానీ అన్ని రాజకీయ పార్టీలు సర్పంచ్ ఎన్నికలను ఈ సారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ, కొన్ని ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీలు సైతం తమవర్గం వ్యక్తి, తాము బలపర్చిన వ్యక్తులే సర్పంచ్‌గా గెలవాలన్న కసిలో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో తమకు అనుకూలమైన వ్యక్తి గెలిస్తేనే రానున్న రోజుల్లో జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను సైతం సులువుగా గెలుచుకునేందుకు వీలుంటుందన్న భావనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలే తమ ప్రచారాస్త్రాలుగా రంగంలోకి దిగింది. సన్నబియ్యం, రేషన్ బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఆ పార్టీ నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.గెలిస్తేనే నిలుస్తామని.. మొదడి విడత ఎన్నికలకు గురువారం నుంచే నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా మండలాలు, గ్రామాలు, వార్డుల్లో తమ కేడర్ నుంచి బలమైన వ్యక్తులను బరిలో ఉంచాలని ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిస్తేనే నిలుస్తామని బీఆర్ఎస్ ముఖ్య నాయకుల నుంచి అందిన ఆదేశాల మేరకు గెలుపు గుర్రాల వేట ముమ్మరంగా సాగుతోంది. నామినేషన్ల కోసం శుక్ర, శనివారాలు మాత్రమే అవకాశం ఉండడంతో ఈ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గ్రామాల్లో అభ్యర్థుల కోసం అన్వేషణ తాము బలపర్చిన అభ్యర్థే గెలవాలన్న కసిలో పార్టీలు మొదటి విడత ఎన్నికల పల్లెల్లో వేడెక్కిన రాజకీయం -
ఓట్ల జాతర
తొలి విడత ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ సూర్యాపేట : సంగ్రామానికి వేళయ్యింది. మొదటి విడత ఎన్నికలు జరిగే పంచాయతీలకు సంబంధించి గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇదే రోజు క్లస్టర్ గ్రామాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. జిల్లాలోని ఎనిమిది మండలాల్లోని 159 గ్రామాలతో పాటు 1,442 వార్డుల్లో డిసెంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు. 44 క్లస్టర్ల ఏర్పాటు తొలివిడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికలు జరిగే గ్రామాలలో నాలుగైదు ఊళ్లకు ఒక క్లస్టర్ చొప్పున మొత్తం 44క్లస్టర్లను ఏర్పాటు చేశారు. నామినేషన్ల స్వీకరణకు అవసరమయ్యే ఎన్నికల సామగ్రి అంతా జిల్లా కేంద్రం నుంచి ఆయా గ్రామాలకు చేరింది. కలెక్టర్ నేతృత్వంలో ఆర్వోలు, ఏఆర్వోలు, ఎంపీడీఓలకు బుధవారం శిక్షణ కూడా పూర్తి చేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమై ఈనెల 29వ తేదీ వరకు కొనసాగుతుంది. 30న నామినేషన్ల పరిశీలన, అదే రోజు సాయంత్రం అర్హత కలిగిన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. దీని పై డిసెంబర్ 1న అభ్యంతరాలు స్వీకరించి, 2న పరిష్కరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ డిసెంబర్ 3న ఉంటుంది. కాగా అదే రోజు ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తుది జాబితా వెల్లడించి గుర్తులు కేటాయిస్తారు. మొదటి విడత ఎన్నికలు డిసెంబర్ 11న జరగనుండగా మధ్యాహ్నం తర్వాత ఫలితాలు వెల్లడించనున్నారు. ఎనిమిది మండలాల్లో తొలివిడత ఎన్నికలు ఆత్మకూరు(ఎస్), జాజిరెడ్డిగూడెం, మద్దిరాల, నాగారం, నూతనకల్, సూర్యాపేట, తిరుమలగిరి, తుంగతుర్తి మండలాల్లోని 159 గ్రామాలు, 1,442 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మండలాలు : 08 గ్రామాలు: 159 వార్డులు : 1,442 క్లస్టర్లు : 44 మొత్తం ఓటర్లు 2,31,851 పురుషులు: 1,15,141 మహిళలు : 1,16,705 ఇతరులు: 05 ఫ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ ఫ 44 క్లస్టర్లలో ఏర్పాట్లు పూర్తిఫ డిసెంబర్ 11న 159 పంచాయతీలు, 1,442 వార్డులకు పోలింగ్ -
నియమావళిని పటిష్టంగా అమలు చేస్తాం
సూర్యాపేట టౌన్ : సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా జిల్లాలో ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తామని ఎస్పీ నరసింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోడ్ అమలులో ఉన్నందున ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని కోరారు. అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసు నిఘా ఉంటుందని తెలిపారు. మద్యం అమ్మకాలపై నిఘా ఉంచామని, రహదారుల వెంట హోటళ్లు, డాబాల్లో మద్యం అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక పండుగలా జరగాలని, అందరూ చట్టాన్ని గౌరవిస్తూ శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని కోరారు. జిల్లాలోకి అక్రమ రవాణా జరగకుండా, అక్రమంగా మద్యం ఇతర వస్తువులు రవాణా కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి నిఘా పెడతామని వెల్లడించారు. ప్రజలు ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, డయల్ 100 కు, పోలీస్ కంట్రోల్ రూం 8712686057 , సోషల్ బ్రాంచ్ కంట్రోల్ రూం 8712686026 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని సూచించారు. సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎన్నికల సమయంలో ఎన్నికల కేసులు నమోదైతే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
విద్య ఒక ఆయుధం
ఫ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ చివ్వెంల(సూర్యాపేట) : విద్య ఒక ఆయుధం అని దానిని సద్వినియోగం చేసుకుని గ్రామానికి, దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ కోరారు. బుధవారం జాతీయ న్యాయదినోత్సవం సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని జూనియర్ కళాశాలలో డీఎల్ఎస్ఏ, సంఘమిత్ర ఎడ్యుకేషనల్ చారిటబుల్ సొసైటీతో కలిసి విద్యార్థులకు చట్టాలపై అవగహన కల్పించారు. జాతీయ నాయకులను ఆదర్శంగా తీసుకుని, భావిభారతపౌరులుగా ఎదగాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పుస్తకాలు అందించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, ప్రిన్సిపల్ పెరుమాళ్ల యాదయ్య, చారిటబుల్ సోసైటీ అధ్యక్షుడు తల్లమళ్ల హస్సెన్, మీడియేషన్ సభ్యులు గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, న్యాయవాదులు నాతి సవీందర్ కుమార్, జ్యోతి, కోక రంజిత్, సుంకర రవి కిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
రెఫరెండం
సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికల్లో హామీలివ్వడం, ప్రజాప్రతినిధులుగా ఎన్నికవడం.. ఆ తర్వాత ఇచ్చిన హామీలను మరిచిపోవడం పరిపాటి. కానీ, కొద్దిమంది ప్రజాప్రతినిధులు తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయటంతోపాటు తమ పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుని.. అందుకు అనుగుణంగా పనిచేస్తుంటారు. అలా నల్లగొండ జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు తమ పాలనపై రెఫరెండం నిర్వహించుకుని.. ప్రజాభిప్రాయం తీసుకున్నారు. ఈ రెఫరెండంలో ప్రజలు వీరికి బ్రహ్మరథం పట్టారు. స్థానిక సంస్థల్లోఆలగడప మాజీ సర్పంచ్ వేనేపల్లి పాండురంగారావు తమ పాలనపై ప్రజాభిప్రాయం తీసుకున్న ఇద్దరు సర్పంచ్‌లు, ఒక ఎంపీటీసీ రెఫరెండంలో మరింత ఆదరణ పొందిన ఆ నాయకులు మిర్యాలగూడ : దేశంలో 22ఏళ్ల క్రితం ఆ గ్రామం పేరు మారుమోగింది. ప్రజాస్వామ్యానికి జీవం పోసే విధంగా అప్పటి సర్పంచ్ తన పాలనపై పెట్టుకున్న రెఫరెండం దేశ వ్యాప్తంగా ప్రచారం జరిగింది. దేశంలోనే మొదటిసారిగా తన పాలనపై రెఫరెండం పెట్టుకొని గెలిచి తనకంటూ ఒక ముద్ర వేసుకోవడంతోపాటు గ్రామానికి పేరు తెచ్చి పెట్టాడు. వారసత్వంగా వచ్చిన ఆస్తిని సైతం పుట్టిన గడ్డ కోసం ఖర్చు చేసి ‘తెలంగాణ మట్టి మనిషి’గా పేరుతెచ్చుకున్నాడు. మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామంలో ‘మనిల్లు’ అని పేరు పెట్టుకుని ఎవరొచ్చినా ఆప్యాయంగా పలకరిస్తుంటాడు వేనేపల్లి పాండురంగారావు. ప్రజలే నామినేషన్ వేయించారు.. ఊరి జనం మొత్తం పాండురంగారావును సర్పంచ్‌గా చేయాలని పలుమార్లు ఆయనను ఒప్పించేందుకు ప్రయత్నించారు. మూడుసార్లు పోటీ చేయకుండా నిరాకరించాడు. ఎట్టకేలకు 2001లో ప్రజలే ఆయనతో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయించారు. పాండురంగారావుకు కాంగ్రెస్, సీపీఎం మద్దతు తెలిపాయి. టీఆర్ఎస్ నుంచి ప్రత్యర్థి బరిలో ఉన్నాడు. పాండురంగారావు కేవలం రూ.200 ఖర్చు పెట్టి ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. గ్రామంలో అప్పుడు సుమారు 3,800 ఓట్లు ఉండగా 3,600 ఓట్లకు పైగా పోలయ్యాయి. అందులో పాండురంగారావుకు 2,800 ఓట్లు వచ్చాయి. ఇంకా 400 ఓట్ల పోలింగ్ చిట్టీలపై అభిమానులు నినాదాలు రాయడంతో అవి చెల్లలేదు. ప్రత్యర్థికి కేవలం 400 ఓట్లు వచ్చాయి. 1400 ఓట్ల మెజారిటీతో పాండురంగారావు గెలుపొందారు. సర్పంచ్ పదవి చేపట్టిన వెంటనే ఊరిలో సారా నిషేధం పెట్టాడు. ఎయిడ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా పెద్ద పోరాటమే చేశారు. బడికి దూరంగా ఉన్న పిల్లలను గుర్తించి చాలా మందిని సొంత ఖర్చులతో చదివించారు. 2003లో రెఫరెండం.. పాండురంగారావు సర్పంచ్‌గా తన రెండేళ్ల పాలనపై 2003లో రెఫరెండం పెట్టుకున్నాడు. అప్పట్లోనే దేశానికి ఆలగడప పేరును పరిచయం చేశాడు. ‘పదవిలో నేను ఉండాలా.. వద్దా..’ అని బ్యాలెట్లు ముద్రించి పోలింగ్ నిర్వహించగా 1710 మంది ఉండాలని, 70 మంది వద్దని తీర్పు ఇచ్చారు. అప్పట్లో ఆలగపడ గ్రామాన్ని జాతీయ మీడియా వెతుక్కుంటూ వచ్చింది. ఈ విజయం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో కూడా స్థానం దక్కించుకుంది. 2005లో పాండురంగారావు జాతీయ స్థాయిలో ఉత్తమ సర్పంచ్‌గా ఎంపికై కేంద్రం నుంచి అవార్డు అందుకున్నారు. అవినీతి రహిత పాలనపై దక్షిణాది రాష్ట్రాల తరఫున ఓ స్వచ్ఛంద సంస్థ బెస్ట్ సర్పంచ్ అవార్డుకు ఆయనను ఎంపిక చేసింది. పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయన మళ్లీ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. దేశంలోనే మొట్టమొదటగా ఆలగడప గ్రామంలో.. ‘సాక్షి’తో వేనేపల్లి పాండురంగారావు మా గ్రామంలో సేవా కార్యక్రమాలను చేస్తున్న సమయంలో ప్రజలు నన్ను సర్పంచ్‌గా పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. 2001లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి 1400 ఓట్ల మెజారిటీతో గెలుపొందాను. రెండు సంవత్సరాలు పదవిలో కొనసాగాక.. పదవిపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు రెఫరెండెం పెట్టాను. దానిలో 90శాతం మంది ప్రజలు పదవిలో ఉండాలని, పాలన బాగుందని తీర్పు ఇచ్చారు. ఈ రెఫరెండెం దేశ చరిత్రలో మొదటిసారి కావడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. -
ప్రజలు మద్దతుగా నిలిచారు
ప్రజల అవసరాలకు అనుగుణంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలి. అప్పుడే సమస్యలన్నీ పరిష్కరమవుతాయి. అందుకుగాను నేను ఎంపీటీసీగా పని చేస్తున్న క్రమంలో ప్రజల ఆలోచనల మేరకు పనిచేస్తున్నానా.. లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు రెఫరెండం నిర్వహించుకున్నాను. 95 శాతం మంది నాకు మద్దతుగా నిలవడం సంతృప్తినిచ్చింది. – దుబ్బాక నర్సింహారెడ్డి, నేరడ, చిట్యాల మండలంచిట్యాల : మండలం నేరడ గ్రామానికి చెందిన దుబ్బాక నర్సింహారెడ్డి. దుబ్బాక నర్సింహారెడ్డి 1999లో స్వగ్రామం నేరడ ఎంపీటీసీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి.. 200 ఓట్ల అత్యధికంతో గెలిచారు. గ్రామాభివృద్ధికిగాను శక్తివంచన లేకుండా పనిచేశారు. ఎంపీటీసీగా ఆయన పనితీరుపై మూడేళ్ల పదవీకాలం తర్వాత 2002లో స్వచ్ఛందంగా రెఫరెండం నిర్వహించుకున్నారు. మొత్తం 1600 మంది ఓటింగ్‌లో పాల్గొనగా.. 1510 మంది దుబ్బాక పాలనను మెచ్చుకున్నారు. 90 మంది మాత్రమే వ్యతిరేకించారు. అప్పట్లో ఓ పోటీ పరీక్షలో పార్టీ గుర్తుపై గెలిచి రెఫరెండం నిర్వహించుకున్న ప్రజాప్రతినిధి ఎవరని.. ప్రశ్న వచ్చింది. -
మూడేళ్లకు ప్రజాభిప్రాయం
కట్టంగూర్ : కట్టంగూర్ మండలం పందెనపల్లి గ్రామానికి చెందిన గద్దపాటి దానయ్య 2001లో టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి 100 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గ్రామంలో మొత్తం 800 ఓట్లు ఉండగా దానయ్యకు 450 ఓట్లు రాగా ప్రత్యర్ధి పులి నర్సింహకు 350 ఓట్లు వచ్చాయి. సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన మూడు సంవత్సరాల తర్వాత 2004లో తన పాలనపై రెఫరెండం నిర్వహించారు. మానవ హక్కుల వేదిక, జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గ్రామంలో రెఫరెండం చేపట్టారు. దానయ్య రైతు గుర్తుతో, వ్యతరేకంగా క్రాస్ గుర్తుతో ఎన్నికలు నిర్వహించారు. ఈ రెఫరెండం పోలింగ్‌లో మొత్తం 750 ఓట్లు పోలవ్వగా 110 ఓట్ల మెజార్టీతో గద్దపాటి దానయ్య గెలుపొందారు. తన పాలనపైనే ప్రజల తీర్పు కోరిన దానయ్య ఉత్తమ సర్పంచ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆగస్టు 15, 2004లో ఢిల్లీలో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఉత్తమ సర్పంచ్ అవార్డును అందుకున్నారు. ప్రజల ఆమోదంతో ఆయన ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేశారు. ప్రజాపాలనలో ఎన్నికై న ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలంటే రెఫరెండం విధానాన్ని అమలు చేయాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చట్టం తెస్తే ప్రజాపాలన, ప్రజా వ్యవస్థ మెరుగు పడుతుంది. గెలిచిన ప్రజా ప్రతినిధులు ప్రజలకు మేలు కలిగేలా పనులు చేయాలంటే ఈ విధానం కచ్చితంగా అమలు చేయాలి – గద్దపాటి దానయ్య, మాజీ సర్పంచ్, పందెనపల్లి -
సీఐటీయూ అధ్యక్షుడిగా వెంకటనారాయణ
కోదాడ: సీఐటీయూ జిల్లా అధ్యక్షుడిగా కోటగిరి వెంకటనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈనెల 24,25 తేదీల్లో నిర్వహించిన సీఐటీయూ జిల్లా సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వెంకటనారాయణ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తనను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్న కార్మికులకు, సహకరించిన నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టెట్ నుంచి మినహాయించాలినేరేడుచర్ల : టెట్ నుంచి సీనియర్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని టీఎస్ యూటీఎప్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ అనిల్‌కుమార్ కోరారు. బుధవారం ఈమేరకు ప్రధాని నరేంద్రమోదీకి మెయిల్ ద్వారా వినతిపత్రం పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ 2010 ఆగస్టు 23 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ తప్పని సరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి పార్లమెంటులో విద్యాహక్కు చట్టం సెక్షన్ 23ని సవరించడం ద్వారా ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో శ్రీనయ్య, అక్కయ్యబాబు, నాగేశ్వర్రావు, వెంకట్‌రెడ్డి, రవీందర్, వెంకటేశ్వర్రావు, కృష్ణయ్య తదదితరులున్నారు. -
మణిహారంలా ఔటర్ రింగ్ రోడ్
హుజూర్నగర్: ఔటర్ రింగ్ రోడ్ హుజూర్నగర్ పట్టణానికి మణిహారంలా ఉంటుందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రూ. 6 కోట్లతో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డును బుధవారం ప్రారంభించి మాట్లాడారు. 2013లో రూ. 22 కోట్లతో ఒక వైపు , ఇప్పుడు రూ. 6 కోట్లతో మరోవైపు రింగ్‌రోడ్డు నిర్మించామన్నారు. ఈ రోడ్డు వల్ల ట్రాఫిక్ సమస్య తీరుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఈఈ సీతారామయ్య, డీఈ రమేష్, వివిధ శాఖల అధికారులు రమేష్, రామకిషోర్, సత్యనారాయణ పాల్గొన్నారు. కోదాడ: విద్యార్థులకు క్రీడలపై ఆసక్తిని కలిగించడానికి పాఠశాలలు కృషి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. బుధవారం కోదాడపట్టణంలోని సీసీరెడ్డి విద్యానిలయంలో 19వ సీఎస్ఏ స్పోర్ట్స్‌మీట్‌ను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. 30 ఏళ్లుగా కోదాడలో తాను సీసీరెడ్డి విద్యానిలయాన్ని పరిశీలిస్తున్నానని, ఇందులో అన్ని రకాల వసతులను కల్పించడం అభినందనీయమన్నారు. విద్యార్థులను చదువుతో పాటు క్రీడల్లో రాణించే విధంగా పాఠశాల వాతావరణం ఉండాలని అందుకు ప్రతి స్కూల్ నిర్వాహకులు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఫ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
ధాన్యం తూకంలో అవకతవకలు
అనంతగిరి: ధాన్యం తూకంలో కేంద్రాల నిర్వాహకులు అవకతవకలకు పాల్పడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అనంతగిరి మండలంలోని అనంతగిరి, శాంతినగర్, ఖానాపురం కేంద్రాల్లో ప్రతి బస్తాకు తూకం 40కేజీల500గ్రాములు వేయాల్సి ఉండగా 41కేజీల200 గ్రాములు వేస్తున్నట్లు రైతులు తెలిపారు. ప్రతి బస్తాకు 700గ్రాముల ధాన్యాన్ని అదనంగా తూకం వేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. దీనిపై నిర్వాహకులను వివరణ కోరగా కొందరు 41 కేజీలు మాత్రమే వేస్తున్నామని, మరికొందరు తమకేమీ తెలియదని చెప్పారు. బస్తాకు 41కే జీల200 గ్రాములు తూకం వేస్తున్నట్లు హమాలీలు తెలపడం గమనార్హం. ఖానాపురంలో రైతులు ఽతెచ్చింది కాకుండా దళారులు తెచ్చిన ధాన్యాన్ని తూకం వేసేందుకు నిర్వాహకులు ప్రాధాన్యమిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ధాన్యం కొనుగోలులో అవకతవకలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఫ బస్తాకు 41కేజీల 200గ్రాములు తూకం వేస్తున్న నిర్వాహకులు ఫ అదనంగా 700గ్రాములు స్వాహా -
మహిళా సంఘాలకు చేయూత
కోదాడ: స్వయం సహయక సంఘాలకు వడ్డీలేని రుణాలను అందించి ప్రభుత్వం చేయూత నిచ్చింది. మంగళవారం జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో పండుగ వాతావరణంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయా సంఘాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు చెక్కులను పంపిణీ చేశారు. జిల్లాలో మొత్తం 9,323 సంఘాలకు రూ. 6.99 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. కోదాడలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామారావు, కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, తిరుమలగిరిలో ఎమ్మెల్యే మందుల సామేల్, సూర్యాపేటలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, హుజూర్‌నగర్‌లో డీఆర్డీఓ అప్పారావు రుణాలు అందజేశారు. నియోజకవర్గాల వారీగా.. కోదాడ నియోజకవర్గంలో మొత్తం 2,713 సంఘాలకు రూ. 2.10 కోట్లు, హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని 2,888 సంఘాలకు రూ. 2.12 కోట్లు, సూర్యాపేట నియోజకవర్గంలో 1,998 సంఘాలకు రూ. 1.51 కోట్లు, తుంగతుర్తి నియోజకవర్గంలో 1724 సంఘాలకు రూ. 1.24 కోట్ల చొప్పున రుణాలు మంజూరు కావడంతో పంపిణీ చేశారు. మండలం సంఘాలు అందించిన రుణాలు(రూ.లక్షల్లో) చింతలపాలెం 291 26.09 గరిడేపల్లి 717 49.06 హుజూర్నగర్ 360 34.06 మఠంపల్లి 423 38.07 మేళ్లచెరువు 367 20.09 నేరేడుచర్ల 390 24.09 పాలకవీడు 340 17.17 అనంతగిరి 496 41.96 చిలుకూరు 432 31.80 కోదాడ 547 51.68 మోతె 293 17.89 మునగాల 554 32.10 నడిగూడెం 391 35.53 ఆత్మకూరు (ఎస్) 537 41.87 చివ్వెంల 452 36.52 పెన్‌పహాడ్ 470 37.91 సూర్యాపేట 539 35.61 జాజిరెడ్డిగూడెం 310 23.61 మద్దిరాల 269 23.08 నాగారం 289 14.24 నూతనకల్ 348 29.32 తిరుమలగిరి 139 11.17 తుంగతుర్తి 369 23.33 ఫ రూ.6.99కోట్ల వడ్డీలేని రుణాలు పంపిణీ ఫ 9,323 సంఘాలకు లబ్ధి -
బాలికల విద్యకు బాసట
నాగారం : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదివే పేద, ప్రతిభ గల విద్యార్థినులకు ఉన్నత విద్యావకాశాలు దక్కేలా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విద్యార్థినులు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చేరేలా నైపుణ్యాల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాకు మూడు చొప్పున కేజీబీవీలను యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (వైఐఐఓఈ) కేంద్రాలుగా ఎంపిక చేసింది. ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల్లో చేరేందుకు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతారు. ఇందుకోసం కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల్లో వేల నుంచి లక్షల రూపాయలు చెల్లించి శిక్షణ తీసుకుంటారు. అలాంటి అవకాశాన్ని కేజీబీవీల్లో చదివే విద్యార్థినులకు అందించాలనే సంకల్పంతో ఉచిత శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతి శని, ఆదివారాల్లో పాఠశాల వేళలు ముగిసిన తర్వాత తరగతులు నిర్వహించేందుకు అందుబాటులో ఉన్న నిపుణులతో శిక్షణ ఇవ్వనున్నారు. ఎంబీబీఎస్‌లో చేరేలా నీట్, ఇంజినీరింగ్ విద్యను అభ్యసించేలా ఐఐటీ–జేఈఈ, న్యాయవాద వృత్తి చేపట్టేలా– క్లాట్‌కు విద్యార్థినులను సన్నద్ధం చేయనున్నారు. ఎంపిక చేసిన కేజీబీవీ విద్యార్థినులకే శిక్షణ ఇస్తారా? లేక ఆసక్తి గలవారికి పరీక్ష నిర్వహించి ఎంపికై న వారికి ఒకచోట శిక్షణ ఇస్తారా? అన్నది తేలాల్సి ఉంది. వైఐఐఓఈ కేంద్రాల్లో ఫర్నిచర్, కంప్యూటర్లను సమకూర్చి బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పించాల్సి ఉంది. నిపుణుల ఎంపిక, ఒత్తిడి నివారణకు సైకాలజిస్టుల నియామకం చేపట్టాల్సి ఉన్నందున మార్గదర్శకాలు విడుదల కాలేదు. వీరికి మేలు.. జిల్లాలోని మూడు పెన్‌పహాడ్, గడ్డిపల్లి, చింతలపాలెం కస్తూర్బా గాంధీ విద్యాలయాలు వైఐఐఓఈ కేంద్రాలుగా ఎంపికయ్యాయి. వీటిలో పెన్‌పహాడ్ కేజీబీవీలో ఐఐటీ జేఈఈ (ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి), గడ్డిపల్లి కేజీబీవీలో నీట్ (ఎంబీబీఎస్‌కు సంబంధించి), చింతలపాలెం కేజీబీవీలో క్లాట్(న్యాయవాద వృత్తికి సంబంధించి) ద్వితీయ సంవత్సరం చదివే బాలికలకు శిక్షణ ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పెన్‌పహాడ్ ఐఐటీ జేఈఈ గడ్డిపల్లి నీట్ చింతలపాలెం క్లాట్ ఫ కేజీబీవీల్లో ఐఐటీ, నీట్, క్లాట్‌కు ఉచితంగా శిక్షణ ఫ జిల్లాలో మూడు విద్యాలయాలు ఎంపిక ఫ ద్వితీయ సంవత్సరం చదవి విద్యార్థినులకు ప్రయోజనం -
మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
చివ్వెంల(సూర్యాపేట) : మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ సూచించారు. సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో మహిళలు, ట్రాన్స్ జెండర్లు, మహిళా కానిస్టేబుళ్లకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. సమాజంలో ట్రాన్స్ జెడర్లను ప్రత్యేకంగా గౌరవించాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో, కోర్టులో మహిళా కానిస్టేబుల్స్‌ను గౌరవించాలని సూచించారు. మహిళలకు ఎటువంటి సమస్యలు వచ్చినా జిల్లా న్యాయసేవాధికార సంస్థ ముందుండి, వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, ట్రాన్స్ జెండర్స్, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. కోదాడ డీఎస్పీగా శ్రీనివాసరెడ్డి బాధ్యతల స్వీకరణకోదాడ: కోదాడ సబ్ డివిజినల్ పోలీస్ ఆఫీసర్(డీఎస్పీ)గా ఆర్. శ్రీనివాసరెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీరించారు. కోదాడ డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇప్పటి వరకు ఇక్కడ డీఎస్పీగా పనిచేసిన శ్రీధర్‌రెడ్డి నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్బంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అందరి సహకారంతో డివిజన్లో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. ఇక్కడ పనిచేసిన శ్రీధర్‌రెడ్డి బదిలీపై హైదరాబాద్‌లోని పౌరసరఫరాల శాఖకు వెళ్లిన విషయం విదితమే. పిల్లల్లో క్రీడా నైపుణ్యాన్ని గుర్తించాలిసూర్యాపేట టౌన్ : పిల్లల్లో క్రీడా నైపుణ్యాన్ని గుర్తించాలని జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు. సూర్యాపేట పట్టణానికి చెందిన రాడికల్ చెస్ అకాడమీ విద్యార్థిని మాస్టర్ ఇందిర జాతీయస్థాయి చెస్ పోటీలకు ఎంపికై న సందర్భంగా చెస్ అకాడమీ నిర్వాహకులు అనిల్ కుమార్ విద్యార్థులతో కలిసి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ వారిని అభినందించి మాట్లాడారు. జాతీయ స్థాయిలో విజయం సాధించి జిల్లాకు పేరు తేవాలన్నారు. పిల్లల్లో నైపుణ్యాన్ని తల్లిదండ్రులు గుర్తించాలని, నైపుణ్యం ఉన్న రంగంలో ప్రోత్సహించాలని పేర్కొన్నారు. చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలిగరిడేపల్లి: చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ కోటిరత్నం సూచించారు. మంగళవారం గరిడేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్ నరేష్, వీసీసీఎం లతీఫ్ పాల్గొన్నారు. టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలిసూర్యాపేట టౌన్ : సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎన్.సోమయ్య కోరారు. సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించాలని కోరుతూ మంగళవారం టీఎస్ యూటీఎఫ్ సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రికి ఈ మెయిల్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ జె.యాకయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు కె. అరుణ భారతి, జిల్లా కార్యదర్శి వెలుగు రమేష్, చిలక రమేష్, ధరావత్ లాలు, సీహెచ్.వీరారెడ్డి, బి.పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్లను పునఃపరిశీలించాలి
హుజూర్నగర్ : పాలకవీడు మండలంలో పంచాయతీ రిజర్వేషన్లను అధికారులు పునః పరిశీలించాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు కోరారు. ఈ మేరకు మంగళవారం బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో హుజూర్నగర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు నల్ల కండువాలు మెడలో వేసుకొని మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీఓ శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకవీడు మండలంలో 22 గ్రామ పంచాయతీలు ఉండగా కనీసం బీసీలకు ఒక్క స్థానం కూడా రిజర్వేషన్ ద్వారా కేటాయించలేదన్నారు. ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాపోలు నవీన్ కుమార్, కొండమీది నరసింహారావు, పి. కనకయ్య, చిలకరాజు శ్రీను, కె. వెంకట్, ఎ. నాగేంద్రబాబు, ఎ. వెంకటేశ్వర్లు, కొండా నాయక్, నరసింహ, పి. నాగయ్య, ఎస్. కృష్ణ పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లా సాఫ్ట్‌బాల్ క్రీడాకారుల ఎంపిక
మేళ్లచెరువు : చింతలపాలెం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి నల్లగొండ జిలా అండర్ 14,అండర్ 17 బాలబాలికల సాఫ్ట్‌బాల్ సెలక్షన్స్ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీలను తహసీల్దార్ సురేందర్‌రెడ్డి, ఎంఈఓ శ్రీనివాస్‌లు ప్రారంభించి మాట్లాడారు. ఇక్కడ సెలక్ట్ అయిన జట్లు వచ్చే నెల జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. ప్రతి జట్టు నుంచి 16 మంది క్రీడాకారులను ఎంపికచేసినట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఈటీ ఉస్మాన్, పీఏసీఎస్ చైర్మన్ రంగాచారి, ఎస్జీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, వీరన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పాఠశాలలకు క్రీడా నిధులు
ఫ తొలి విడతగా 606 స్కూళ్లకు రూ 68.10 లక్షలు మంజూరు ఫ క్రీడా పరికరాల కొనుగోలుకు మార్గం సుగమం ఫ ఆటల్లో శిక్షణకూ తోడ్పాటు హుజూర్నగర్ : విద్యార్థులు క్రీడల్లో రాణించేలా ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ నిధులతో ఆటల్లో శిక్షణతో పాటు క్రీడా సామగ్రి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా 2025–26 విద్యా సంవత్సరానికి జిల్లాలోని 606 ప్రభుత్వ పాఠశాలలకు 50 శాతం క్రీడా నిధులు మంజూరు చేశారు. 606 పాఠశాలలకు.. జిల్లాలోని 606 పాఠశాలలకు తొలి విడతగా రూ 68.10 లక్షలు మంజూరు చేశారు. వీటిలో 369 ప్రాథమిక పాఠశాలలకు రూ 18.45 లక్షలు, 64 ప్రాథమి కోన్నత పాఠశాలలకు రూ 6.40 లక్షలు, 14 జెడ్పీ ఉన్నత పాఠశాలలకు రూ 39.25 లక్షలు, 16హయ్యర్ సెకండరీ (కేజీబీవీ, గురుకుల) స్కూళ్లకు రూ 4 లక్షల చొప్పున మంజూరు చేశారు. నిధుల వినియోగం ఇలా.. ఈ ఏడాది తొలి విడతగా మంజూరు చేసిన ఈ నిధులను ప్రాథమిక పాఠశాలలకు రూ. 5 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ. 10 వేలు, ఉన్నత పాఠశాలలు, హయ్యర్ సెకండరీ స్కూళ్లకు రూ. 25 వేల చొప్పున ఇస్తారు. ఈనిధులతో పాఠశాలల్లో క్రీడల్లో మెళకువలు నేర్పించడంతో పాటు క్రీడా సామగ్రి సమకూర్చ డానికి వినియోగించాలి. నిధులు అరకొరగా కేటాయించడంతో ఆట వస్తువులు ఎలా కొనుగోలు చేయాలా అని వ్యాయామ ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రారంభంలో కేటాయిస్తే మరింత ఉపయోగకరంగా ఉండేదని మరికొందరు అంటున్నారు. -
విత్తనాలు కొంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
త్రిపురారం : రైతులు వానాకాలం వరి కోతలు పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు రైతులు యాసంగి వరి సాగుకు నారుమడులు సిద్ధం చేసుకొని నారు పోసుకోవడానికి తయారవుతున్నారు. అయితే రైతులు విత్తనాల కొనుగోలులో తగిన జాగ్రత్తలు పాటించాలని త్రిపురారం మండల వ్యవసాయ అధికారి పార్వతి చౌహన్ సూచిస్తున్నారు. అనుమతులు లేని కంపెనీలకు చెందిన విత్తనాలు, కల్తీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉండటంతో.. రైతులు ఒకటికి రెండుసార్లు ఆలోచించి అన్ని వివరాలు పరిశీలించాకే విత్తనాలు కొనుగోలు చేయాలని ఆమె పేర్కొంటున్నారు. విత్తనాల కొనుగోళ్లలో పాటించాల్సిన జాగ్రత్తలు ఆమె మాటల్లోనే.. ఫ రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించడం ఉత్తమం. ఫ ఎలాంటి అనుమాలు తలెత్తినా వెంటనే వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు సమాచారం అందించాలి. ఫ మండల కేంద్రాలు, గ్రామాల్లో లైసెన్స్ లేని దుకాణాలు, దళారుల వద్ద విత్తనాలు కొనుగోలు చేయకూడదు. ఫ సరుకు లాట్ నంబర్, తయారీ తేదీ, రకం ఇలా అన్ని వివరాలు ఉండేలా చూసుకోవాలి. ఫ విత్తనాలు కొనుగోలు సమయంలో రశీదు తప్పకుండా తీసుకోవాలి. రశీదుపై డీలరు, రైతు సంతకం తప్పకుండా ఉండాలి. ఫ రశీదు పంటకాలం పూర్తయ్యేంత వరకు భద్రపర్చుకోవాలి. ఫ స్థానిక పరిస్థితులకు అనుకూలమైన, దిగుబడి ఇచ్చే నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి. ఫ విత్తన సంచుల సీల్ తీసినట్లు లేదా విప్పతీసి తిరిగి కుట్లు వేసినట్లు గమనిస్తే కొనుగోలు చేయొద్దు. ఫ వ్యవసాయ శాఖ అనుమతులు పొందిన డీలర్లు, మార్కెట్ కమిటీలు, ప్రాథమిక సహకార సంఘాలు, కృషి విజ్ఞాన కేంద్రం, వరి పరిశోధనా స్థానాల్లో మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయడం ఉత్తమం. -
చైనా మాంజా గొంతుకు తగిలి గాయాలు
భూదాన్‌పోచంపల్లి : బైక్‌పై వెళ్తున్న యువకుడికి చైనా మాంజా తగలడంతో గొంతుకు గాయాలపాలయ్యాడు. చౌటుప్పల్ మండలం తాళ్లసింగారం గ్రామానికి చెందిన షేక్ మదార్ వ్యక్తిగత పనిమీద సోమవారం బైక్‌పై పోచంపల్లికి వచ్చాడు. ఈ క్రమంలో పోచంపల్లి పట్టణ కేంద్రంలోని బాలాజీ స్వీట్హౌజ్ సమీపంలోకి రాగానే మెయిన్ రోడ్డుపై కరెంట్ తీగలపై నుంచి కిందికి వేలాడుతున్న చైనా మాంజా.. మదార్ గొంతుకు తగిలి కోసుకుపోయింది. వెంటనే అతను అప్రమత్తమై బైక్ బ్రేక్ వేయడంతో పెనుప్రమాదం తప్పింది. గొంతు కోసుకుపోయి రక్తస్రావం అవుతుండగా స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. -
కేవలం డబ్బు సంపాదనే రేవంత్ లక్ష్యం
సూర్యాపేట టౌన్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి విమర్శించారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం పెద్దఎత్తున భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇండస్ట్రియల్ కార్పొరేషన్‌కు కేటాయించిన భూముల్లో ప్రభుత్వ మోసం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కోకాపేటలో ఎకరం రూ.100కోట్ల నుంచి రూ.170 కోట్లు వేలంలో విక్రయించినట్లు చెబుతున్న ప్రభుత్వం.. ఇప్పుడు అదే ప్రాంతంలో అతి తక్కువ ధరకు విక్రయించడంలో అర్థమేమిటని ప్రశ్నించారు. ప్రజాధనం దోచుకోవడంపైనే రేవంత్ సర్కార్ దృష్టి పెట్టిందన్నారు. ప్రజల, ప్రభుత్వ ఆస్తులను దోచుకున్న వారు ఎవరైనా వదిలిపెట్టమని, భూ కుంభకోణంలో సహకరించిన వాళ్లంతా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలులో గోల్మాల్ జరుగుతోందని, ఐకేపీ సెంటర్లలో సరిగ్గా ధాన్యం కొనడం లేదన్నారు. దళారుల చేతుల్లో రైతులు తీవ్రంగా మోసపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ 2014కు ముందున్న సమస్యలే తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. బీసీలను పెద్దఎత్తున మోసం చేసిన పార్టీ కూడా కాంగ్రెస్సేనని, రేవంత్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చి విస్మరించిందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ ఉన్న రిజర్వేషన్లు పోగొట్టుకునే పరిస్థితి తెచ్చిందన్నారు. 29న దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా ముఖ్యనేతలతో సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రోజు నవంబర్ 29 అని, తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. అన్న నినాదమే ఉద్యమానికి ఊపిరి పోసిందన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్షతోనే కేంద్రం మెడలు వంచిందని, తద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్టానికే ఆదర్శంగా సూర్యాపేటలో దీక్షా దివస్ నిర్వహించుకుందామని చెప్పారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగులు లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, ఒంటెద్దు నర్సింహారెడ్డి, గుజ్జ యుగంధర్‌రావు పాల్గొన్నారు. ఫ కోకాపేటలో భూముల ధర ఇప్పుడు ఎందుకు తగ్గింది ఫ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శ -
కొనసాగుతున్న రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు
ఫ నేడు సెమీఫైనల్స్, ఫైనల్స్చౌటుప్పల్ రూరల్ : చౌటుప్పల్ మండలం పంతంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు సోమవారం రెండో రోజుకు చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 ఉమ్మడి జిల్లాల నుంచి బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. రెండో రోజు ప్రతి జట్టు 9 జట్లతో పోటీపడ్డాయి. మంగళవారం సెమీఫైనల్స్, ఫైనల్స్ జరగనున్నాయి. గెలుపొందిన జట్లకు కలెక్టర్ హనుమంతరావు బహుమతులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల విధ్యాధికారి గురువారావు, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి కె. దశరథరెడ్డి, ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి కృష్ణమూర్తి, తోట జయప్రకాష్, టోర్నమెంట్ ఆర్గనైజర్ కృష్ణమూర్తి, బిక్కునాయక్, ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, కూరెళ్ల శ్రీనివాస్, వేణుగోపాల్, టి. సురేందర్‌రెడ్డి తదితరులు పాల్డొన్నారు. -
ఏపూర్‌లో బ్యాటరీ ఇంధన ప్లాంట్
చిట్యాల : తక్కువ వ్యయంతో నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు కరెంట్ సరఫరాలో సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రెండు బ్యాటరీ ఇంధన ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ఇటీవల అనుమతులు జారీ చేసింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రాంతంలో, నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఏపూర్ గ్రామంలో 750 మెగావాట్ల సామర్ధ్యంతో బ్యాటరీ ఇంధన ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. ఏపూర్ గ్రామంలో మూడేళ్ల క్రితం సుమారు 109 ఎకరాల్లో తెలంగాణ ట్రాన్స్‌కో 440 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సబ్‌స్టేషన్‌కు ఖమ్మంతో పాటు త్వరలో విద్యుత్ ఉత్పత్తి జరగనున్న దామరచర్లలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ గ్రిడ్ల ద్వారా కరెంటు సరఫరా అవుతుంది. ఇక్కడి నుంచి చౌటుప్పల్‌తో పాటు గ్రేటర్ హైదరాబాద్ నగరానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తారు. అంతేకాకుండా అత్యవసర సమయంలో, రోజువారి విద్యుత్ వినియోగం పెరిగినప్పుడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా భారత ఇంధన ఎక్స్ఛేంజి(ఐఈఎక్స్) నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)కు అదనపు ఆర్థిక భారం పడుతుంది. దీనిని నివారించడానికి బ్యాటరీ ఇంధన ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. 10 నుంచి 15 ఎకరాలు కేటాయింపు.. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో బ్యాటరీ ఇంధన ప్లాంటు ఏర్పాటుకు అనువైన స్థలం లేకపోవడంతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో, చిట్యాల మండలం ఏపూర్‌లో రెండు బ్యాటరీ ఇంధన ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఏపూర్‌లోని 440 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో బ్యాటరీ ఇంధన ప్లాంట్ ఏర్పాటుకు పది నుంచి పదిహేను ఎకరాల భూమిని కేటాయించనున్నారు. ఇందులో 187.50 మెగావాట్ల సామర్ధ్యం గల నాలుగు బేస్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బ్యాటరీ ఇంధన ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం సుమారు రూ.250కోట్ల నుంచి రూ.300కోట్ల వరకు నిధులు కేటాయించనుంది. ఈ బ్యాటరీ ఇంధన ప్లాంట్ ఏర్పాటుతో అత్యవసర సమయాల్లో సుమారు పదహారు గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయవచ్చు. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌కు విద్యుత్ సమస్య లేకుండా చేసేందుకు వీలవుతుంది. ఫ ఏర్పాటుకు అనుమతులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఫ సుమారు రూ.250కోట్ల నుంచి రూ.300కోట్ల వరకు నిధులు కేటాయించే అవకాశం ఫ త్వరలో ప్రారంభంకానున్న పనులుఏపూర్లో బ్యాటరీ ఇంధన ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. త్వరలో ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించనుంది. ఆ తర్వాత నాలుగైదు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభం కావొచ్చు. – కిశోర్, ఏఈ(ఆపరేషన్), 440 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్, ఏపూరు -
బీబీనగర్ ఎయిమ్స్ పనులు ఇంకెన్నాళ్లు..!
సాక్షి,యాదాద్రి : అధునాతన వైద్యం, నాణ్యమైన వైద్య విద్య, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా చేపట్టిన బీబీనగర్ ఎయిమ్స్(ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఏడాదిలోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా నిధుల కేటాయింపుల్లో జాప్యంతో మందకొడిగా పనులు నడుస్తున్నాయి. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పనులు పూర్తిచేయాలని గడువు పొడిగించారు. 2023లో శంకుస్థాపన తెలంగాణకు కేంద్రం మంజూరు చేసిన ఎయిమ్స్‌కు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో 2023 ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ప్రధాన మంత్రి స్వాస్థ్ యోజనలో భాగంగా దీనికి రూ.1365.95కోట్లు మంజూరు చేశారు. ఈపీసీ విధానం ద్వారా ఏసీసీ కంపెనీకి టెండర్ ద్వారా పనులను అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వం 201.65 ఎకరాల స్థలాన్ని ఎయిమ్స్‌కు అప్పగించగా అందులో పనులు జరుగుతున్నాయి. 24 నెలల్లో అంటే 2024 జూనలై 13 నాటికి పనులన్నీ పూర్తిచేసి ఎయిమ్స్‌కు అప్పగించాలి. అయితే పనులు మందకొడిగా సాగుతున్నాయి. దీంతో 2025 నవంబర్ వరకు ఆస్పత్రి, సేవలకు చెందిన భవనాలు, ఇతర బ్లాక్‌లు సిద్ధం చేశారే కానీ పూర్తి పనులు కాలేదు. పనులు జాప్యం జరగడానికి కారణం నిధులు కేటాయింపు పూర్తిస్థాయిలో జరగలేదని తెలు స్తోంది. పనులు జరుగుతున్న విధంగా నిధులు ఇస్తున్నారు. ఇప్పటివరకు రూ.834.90 కోట్లు విడుదలయ్యాయి. వీటిలో రూ.805.59 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ.29.31 కోట్లు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని నిధులు రావాల్సి ఉంది. దీంతో పనుల గడువు పొడిగించారు. 2026 ఫిబ్రవరి నాటికి 390 బెడ్ల ఆస్పత్రి బ్లాక్‌లతో పాటు పూర్తిస్థాయి మెడికల్ పరికరాలతో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. నిర్మాణాలు ఇలా.. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఎయిమ్స్ వైద్య విద్యను అభ్యసించే విద్యార్థుల వసతి కోసం 24 అంతస్తుల్లో రెండు టవర్స్ నిర్మించారు. 750 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, 300 మంది పీజీ విద్యార్థులు ఇక్కడ చదువుకోనున్నారు. డాక్టర్లు, లెక్చర్ థియేటర్, ఎగ్జామ్ హాల్, రీసెర్చ్ ల్యాబ్, 22 ఫ్యాకల్టీల రీసెర్చ్ ల్యాబ్‌లు, నర్సింగ్, పారా మెడికల్ స్టాఫ్ వసతి గృహాలు నిర్మిస్తున్నారు. ఆస్పత్రి బిల్డింగ్, న్యూ ఆస్పత్రి బ్లాక్, అకడమిక్ బ్లాక్, ఆడిటోరియం, ఆయుష్ బ్లాక్, రోగుల వెంట వచ్చేవారి కోసం నైట్ షెల్టర్, మార్చురీ, డైరెక్టర్ రెసిడెన్స్, గెస్ట్‌హౌజ్ అండ్ క్లబ్, ఆరు రకాల క్వార్టర్స్, యూజీ బాలుర, బాలికల వసతి గృహాలు, పీజీ బాలుర, బాలికల వసతి గృహాలు, పీజీ వర్కింగ్ నర్సుల హాస్టల్, డైన్నింగ్ బ్లాక్, కమ్యూనిటీ బిల్డింగ్, సర్వీస్ బిల్డింగ్, అమృత్ ధార, అండర్‌గ్రౌండ్ వాటర్ ట్యాంక్, ప్యానల్ రూం, పార్కులతోపాటు పోస్టాఫీస్, బ్యాంకు ఇతర మౌలిక వసతులు తదితర పనులు చేపడుతున్నారు. ఫ రూ.1,365.95కోట్లతో నిర్మాణానికి శ్రీకారం ఫ నిర్దేశించిన గడువులోగా పూర్తికాని పనులు ఫ 2026 ఫిబ్రవరి వరకు గడువు పొడిగింపు ఫ అందని అత్యవసర వైద్యసేవలు రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్మించిన నిమ్స్ భవనాలలో ప్రస్తుతం 38 రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. ఎయిమ్స్‌లో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్ధోపెడిక్, న్యూరా లజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఈఎన్టీ, అప్తామాలజీ, రేడియాలజీ, డెర్మటాలజీ, స్కిన్ సర్జరీలు, ఆర్థోపెడిక్ సర్జరీలు, ఎంఆర్ఐ స్కాన్, లాప్రోస్కోపిక్, సీటీ స్కాన్, క్యాన్సర్ చికిత్సలు, ఆపరేషన్ ఽథియేటర్లు, పీడియాట్రిక్, డెలివరీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యవసర వైద్య సేవలు మాత్రం ప్రారంభం కాలేదు. -
94.698 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
నేరేడుచర్ల : ప్రస్తుత సీజన్లో జిల్లా వ్యాప్తంగా 346 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 94,698 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్ఓ) వి.మోహన్‌బాబు అన్నారు. ఆదివారం నేరేడుచర్ల మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయా కేంద్రాల ద్వారా రైతుల నుంచి 41.626 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం, 53.071 మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. 6,451 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యానికి రూ.3.22 కోట్లు బోనస్ కూడా చెల్లించామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 3,67,710 రేషన్‌కార్డుల్లో 10,71,021 మంది లబ్ధిదారులకు ప్రతినెలా 6,042 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ దుకాణాలకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆయన వెంట ఎంపీడీఓ సోమ సుందర్‌రెడ్డి, ఎంపీఓ నాగరాజు తదితరులు ఉన్నారు. సీపీఐ బహిరంగ సభను జయప్రదం చేయాలితుంగతుర్తి: ఖమ్మం జిల్లా కేంద్రంలో వచ్చేనెల 26 జరగనున్న సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలీఉల్లా ఖాద్రి పిలుపునిచ్చారు. ఆదివారం తుంగతుర్తిలో కొనసాగిన ప్రచార యాత్రలో ఆమె మాట్లాడారు. ఈ సభకు ప్రజాస్వామిక వాదులు, మేధావులు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి డీజీ.నరేంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షుడు ఉప్పలయ్య, నాయకులు ఎల్లంల యాదగిరి, గుగులోతు రాజారాం, కోట రామస్వామి, పున్నయ్య, ఫయాజ్, ఏక్ బాల్, శ్రీకాంత్, మల్లయ్య, మనోజ్‌కుమార్ పాల్గొన్నారు. ఉద్యోగాల కల్పనకు ఏటా జాబ్మేళాసూర్యాపేటటౌన్ : నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఏటా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని ఆ విశ్వవిద్యాలయ డైరెక్టర్ వై.వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర సార్వత్రిక అధ్యయన కేంద్రంలో విద్యార్థులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ను కళాశాల సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ ఎన్ఎస్ఆర్ శాస్త్రి, ఇన్చార్జి ప్రసాద్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. వైభవంగా నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆల య తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఇన్చార్జి ఈఓ బి.జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, ఫణిభూషణమంగాచార్యులు, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
బీపీ, షుగర్ పెరుగుతోంది..
సూర్యాపేటటౌన్ : జిల్లాలో అసాంక్రమిక వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రక్తపోటు (బీపీ), మధుమేహం(షుగర్)తో పాటు క్యాన్సర్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రభుత్వం 2018 నుంచి నిర్వహిస్తున్న అసాంక్రమిక వ్యాధుల నిర్ధారణ సర్వేలో ఈ వ్యాధుల గల వారు బయటపడుతున్నారు. బీపీ, షుగర్ వ్యాధి ఒకప్పుడు 30ఏళ్ల పైబడిన వారికే వచ్చేది. ప్రస్తుతం మారిపోయిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, పని ఉద్యోగం, ఇతరత్రా ఒత్తిడి వంటి వాటి కారణాలతో 25ఏళ్ల నుంచి 30ఏళ్లలోపు వారుకూడా వాటి బారిన పడుతున్నారు. ఇక 30ఏళ్లు దాటిన వారిలో సగం మందిని బీపీ, షుగర్ వదలడం లేదని వైద్యారోగ్యశాఖ, ప్రైవేట్ పరిశోధన సంస్థల సర్వేలు సైతం వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా శారీరక శ్రమ లేకపోవడం, ఒకేచోట కూర్చొని ఒత్తిడిలో పనిచేసే సాప్ట్వేర్, ఇతర రంగాలకు చెందిన ఉద్యోగులు కూడా వీటి బారిన పడుతున్నారు. అందుకే ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టి సారించింది. 30ఏళ్లు దాటిన వారిపై వైద్యారోగ్య శాఖ సర్వేఎన్సీడీ(నాన్ కమ్యునికేబుల్ డిసీజెస్) కార్యక్రమంలో భాగంగా 30ఏళ్లు దాటిన వారితో ఏటా వైద్యారోగ్యశాఖ సర్వే నిర్వహిస్తోంది. జిల్లాలో 303 మంది ఏఎన్ఎం, 100 మందికి ఎంఎల్‌హెచ్‌పీ, ఆశా కార్యకర్తలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి ఏఎన్ఎం రోజూ పది మందికి బీపీ, షుగర్, ఇతర పరీక్షలు నిర్వహిస్తున్నారు. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులే ఎక్కువ..ప్రభుత్వం నాన్ కమ్యునికేబుల్ డిసీజెస్(ఎన్సీడీ) స్క్రీనింగ్‌కు ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్‌తో పాటు బీపీ, షుగర్పరీక్షలను వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. ఇందులో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులే అత్యధికంగా ఉంటున్నట్టు వైద్యారోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. 30ఏళ్ల వయసు దాటిన వారికి మాత్రమే వైద్యారోగ్యశాఖ ఈ పరీక్షలను నిర్వహిస్తుంది. జిల్లాలో 30ఏళ్ల వయస్సు దాటిన 6,49,086 మందికి పరీక్షలు చేయగా 1,42,110 మంది బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులే ఉన్నట్లు తేలింది. వీరికి ప్రతినెలా పీహెచ్‌సీల్లో ఉచితంగా మందులు అందిస్తున్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా మొత్తం 997 మందికి వివిధ రకాల క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉన్నట్టు తేల్చారు. ఇంకా తమ దృష్టికి రాని బాధితులు అధిక సంఖ్యలో చికిత్స పొందుతున్నట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఎన్డీసీ సర్వేలో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులే అధికంగా ఉన్నారు.ఈ జాగ్రత్తలు తప్పనిసరి షుగర్, బీపీ సమ్యల బారిన పడకుండా ఉండాలంటే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా అవసరమంటున్నారు వైద్యులు. ముఖ్యంగా సమతుల పోషకాహారం తీసుకోవాలి. నూనెతో చేసిన ఆహార పదార్థాలు, జంక్, ప్యాకేజ్డ్ ఫుడ్స్‌ను వీలైనంత దూరం పెట్టాలి. మద్యం, దూమపానం చేయకూడదు. నిత్యం యోగా, ధ్యానం చేయాలి. నడక, వ్యాయామానికి రోజు గంట సమయం కేటాయించాలి. అన్నింటికంటే ముఖ్యంగా మీ వయస్సు, ఎత్తుకు తగ్గట్టు బరువు ఉండాలి. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.30 ఏళ్లలోపు వారికే అసాంక్రమిక వ్యాధులు ఫ క్యాన్సర్ కూడా విస్తరిస్తోంది ఫ వైద్యారోగ్య శాఖ సర్వేలో వెల్లడి ఫ శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లే కారణం ఫ నిత్యం వ్యాయామం చేయాలంటున్న వైద్యులుఎన్సీడీ సర్వే వివరాలు.. బీపీ ఉన్నట్లు గుర్తించిన వారి సంఖ్య : 86244షుగర్ బాధితులు : 55,866 సర్వైకల్ క్యాన్సర్ : 373బ్రెస్ట్ క్యాన్సర్ : 258ఓరల్ క్యాన్సర్ : 134ఇతర క్యాన్సర్ల బాధితులు : 232ప్రస్తుత జీవన విధానంలో ప్రతిఒక్కరూ వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయడం తప్పనిసరి. ఆరు నెలలకోసారి కచ్చితంగా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. బీపీ, షుగర్ ఉన్నవారు వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి. అలాగే తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. జంక్‌ఫుడ్, వేపుళ్లకు దూరంగా ఉంటే చాలా మంచిది. – డాక్టర్ పెండెం వెంకటరమణ, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి -
తేలిన రిజర్వేషన్ల లెక్క
భానుపురి (సూర్యాపేట) : గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రెండుమూడు రోజులుగా జిల్లా అధికార యంత్రాంగం తీవ్ర కసరత్తు చేపట్టింది. ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అన్ని రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా లెక్కించి కేటాయించారు. 2019 ఎన్నికల నాటి రిజర్వేషన్లతో రొటేషన్ పద్ధతిలో పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లను అమలు చేశారు. ఆదివారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆర్డీఓ కార్యాలయాల్లో సర్పంచ్ల రిజర్వేషన్లు, ఎంపీడీఓ కార్యాలయాల్లో వార్డు సభ్యుల రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను పూర్తిచేశారు. అర్ధరాత్రి అధికారికంగా ప్రకటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించి ఎన్నికలకు వెళ్లడం, హైకోర్టు రద్దు చేయడంతో రిజర్వేషన్ల కథ మళ్లీ మొదటికి వచ్చింది. తాజాగా ప్రకటించిన జాబితాలో ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో పెద్దగా మార్పు లేకపోగా.. బీసీలకు కేటాయించిన సీట్లు భారీగా తగ్గాయి. అయితే 2019 పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లతో పోలిస్తే బీసీలకు స్వల్పంగా మూడు స్థానాలు మాత్రమే పెరిగాయి. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం.. ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు రావడంతో వారం రోజులుగా కలెక్టరేట్లో యంత్రాంగం బిజీబిజీగా ప్రక్రియను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 2019 ఎన్నికల సమయంలో అమలైన రిజర్వేషన్ల వివరాలను రెండురోజులుగా అధికారులు సేకరించారు. ఈనెల 21న గ్రామ పంచాయతీల్లో ఓటరు జాబితాను ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక, గత ఎన్నికల రిజర్వేషన్లను రొటేషన్ చేస్తూ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేయగా.. ఇందులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా డ్రా పద్ధతిలో కేటాయించారు. తుది ఓటరు జాబితాను సోమవారం ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే అధికారులు జిల్లాలో అన్ని పోలింగ్ బూత్‌లు, బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకున్నారు. నోటిఫికేషన్ వస్తే పూర్తిస్థాయిలో ఎన్నికల విధుల్లో నిమగ్నం కానున్నారు. రిజర్వేషన్ల కేటాయింపు ఇలా.. జిల్లాలో 486 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎస్టీలకు 111 స్థానాలు, ఎస్సీలకు 91, బీసీలకు 68, జనరల్ కేటగిరీకి 216, ఇందులోనే మహిళలకు 215 స్థానాలు కల్పస్తూ రిజర్వేషన్లు ఖరారు చేశారు. అయితే ఇటీవల ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయగా అప్పుడు ఎస్టీలకు 111, ఎస్సీలకు 91, బీసీలకు 177, జనరల్ కేటగిరీకి 107 స్థానాలను కేటాయించారు. ప్రస్తుత రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకపోగా.. బీసీలకు మాత్రం సుమారుగా 109 సీట్లు తగ్గాయి. ఈ మేరకు జనరల్ కేటగిరీ స్థానాలు పెరిగాయి. కాగా 2019 పంచాయతీ ఎన్నికల సమయంలోనూ ఎస్టీలకు 111 స్థానాలు కేటాయించారు. ఎస్సీలకు 97, బీసీలకు 65, జనరల్‌కు 202 స్థానాల చొప్పున రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అయితే సారి జిల్లాలోని చివ్వెంల, పాలకవీడు మండలాల్లో బీసీలకు ఒక్క సీటు కేటాయించలేదు. హుజూర్నగర్, నడిగూడెం మండలాల్లో ఎస్టీలకు ఒక్కస్ధానం రిజర్వేషన్లో దక్కకపోవడం గమనార్హం. గతంతో పోలిస్తే ఈసారి బీసీలకు 3 స్థానాలు పెరగ్గా ఎస్సీలకు 6 స్థానాలు తగ్గాయి. ఇక జనరల్ కేటగిరీకి 14 స్థానాలు పెరిగాయి. గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు ఫ బీసీలకు మొత్తం 68 స్థానాలు ఫ గత ఎన్నికల కంటే 3 స్థానాలు అధికం ఫ ఎస్సీలకు తగ్గిన ఆరు స్థానాలు ఫ జనరల్‌కు 14 స్థానాలు పెరుగుదల ఫ రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా కసరత్తు ఫ రొటేషన్ పద్ధతిలో కేటగిరీ వారీగా కేటాయింపుసర్పంచ్ల పదవీకాలం ముగిసి రెండేళ్లు కావస్తున్నా.. ఎన్నికలు నిర్వహించకపోవడంతో నాయకుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. బీసీలకు 42 శాతం కేటాయిస్తూ ఇటీవల ముందుకెళ్లినప్పటికీ కోర్టు తీర్పుతో ఆగిపోయింది. ప్రస్తుతం మళ్లీ ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో ఏవైనా రిజర్వేషన్లు మారాయా..? అని ఆశావహులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో రాజకీయ నాయకుల సమక్షంలోనే రిజర్వేషన్లు తీయడంతో దాదాపు అందరికీ రిజర్వేషన్లు సైతం తెలిసిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి నెలకొంది. డివిజన్ పంచాయతీలు ఎస్టీ ఎస్సీ బీసీ జనరల్ సూర్యాపేట 249 73 46 27 103కోదాడ 91 09 19 20 43హుజూర్నగర్ 146 29 26 21 70మొత్తం 486 111 91 68 216 -
క్రిస్మస్ వేడుకలను విజయవంతం చేయాలి
సూర్యాపేట: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో డిసెంబర్ 16న జరగనున్న క్రిస్మస్ వేడులకను విజయవంతం చేయాలని పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ మామిడి శాంసన్ కోరారు. వేడుకల పోస్టర్‌ను ఆదివారం పాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సూర్యాపేటలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేడుకలకు సినీనటుడు రాజా హాజరు కానున్నారని తెలిపారు. ఇటీవల సికింద్రాబాద్ సెంటినరీ బాప్టిస్టు చర్చి 150వ వార్షికోత్సవంలో సూర్యాపేటకు చెందిన చర్చికాంపౌండ్ బాప్టిస్టు చర్చి పాస్టర్ ప్రభుదాస్‌కు రాష్ట్ర బాప్టిస్టు సంఘాల స్థాయిలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రావడంతో ఆయనను సత్కరించారు. కార్యక్రమంలో పాస్టర్లు సాల్మన్‌రాజు, మీసాల ప్రభుదాస్, డి ఫౌల్, జాన్ మార్క్, గాబ్రియల్, సాయిని జాకబ్, సామ్యూల్ కిరణ్, పుల్లూరు డానియల్, బాబురావు, హజార్య, పూర్ణ శశికాంత్ తదితరులు పాల్గొన్నారు. -
28న భగవద్గీత ప్రతిభా పోటీలు
సూర్యాపేట : గీతా జయంతిని పురస్కరించుకుని దేవాలయాలు, ధార్మిక సంస్థల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా స్థాయి పాఠశాల విద్యార్థులకు ఈనెల 28న జిల్లా కేంద్రంలోని భగవద్గీత మందిరంలో భగవద్గీత ప్రతిభా పోటీలు నిర్వహిస్తున్నట్లు పోటీల నిర్వాహకులు నాగవెల్లి ప్రభాకర్, పర్వతం శ్రీధర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 5 తరగతుల విద్యార్థులు నిర్దేశించిన 10 భగవద్గీత శ్లోకాలు కంఠస్థం చేయాలని, 6 నుంచి 10 తరగతుల విద్యార్థులు భగవద్గీతలోని 1 నుంచి 6 అధ్యాయాలపై ప్రతిభా పరీక్షకు సిద్ధం కావాలని పేర్కొన్నారు. పోటీలలో పాల్గొనేవారు 25 తేదీ లోపు పేర్లు నమోదు చేయించుకోవాలని, పూర్తి వివరాలకు 9848749022 మొబైల్ నంబర్‌ను సంప్రదించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషిసూర్యాపేటటౌన్ : రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషిచేస్తోందని, దీనిలో భాగంగా రాత్రింబవళ్లు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి–65 కొత్త వ్యవసాయ మార్కెట్ రోడ్డు జంక్షన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్లాక్ స్పాట్స్ వద్ద స్థానిక ప్రజలు జాగ్రత్తగా రోడ్లు దాటాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారులపై వాహన నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, రోడ్ల వెంట ఎక్కడపడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేయొద్దన్నారు. ప్రమాదాల నివారణ కోసం జిల్లా వ్యాప్తంగా 43 రోడ్డు ప్రమాద నివారణ కమిటీలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. హుజూర్‌నగర్‌కు రెండు కోర్టులు మంజూరుహుజూర్నగర్ : హుజూర్‌నగర్‌కు నూతనంగా రెండు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 142 ద్వారా శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కోర్టుల మంజూరుకు సహకరించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆయనతోపాటు బార్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. వీటి ఏర్పాటుతో హుజూర్‌నగర్‌లో న్యాయస్థానాల సంఖ్య ఆరుకు చేరింది. ఖైదీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధవహించాలి చివ్వెంల : ఖైదీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధవహించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ అన్నారు. శనివారం సూర్యాపేటలో సబ్ జైలును సందర్శించి మా ట్లాడారు. ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. ఖైదీలకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. కార్యక్రమంలో డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, భట్టిపల్లి ప్రవీణ్‌కుమార్, జైలు సూపరింటెండెంట్ బి.సుధాకర్‌రెడ్డి, న్యాయవాదులు కట్ట సుధాకర్, బానోతు మంగునాయక్, భావ్‌సింగ్ పాల్గొన్నారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శనివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఎదుర్కోలు మహోత్సవం, నిత్యకల్యాణం చేపట్టారు. ఆ తర్వాత ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఇన్చార్జి ఈఓ బి.జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, ఫణిభూషణమంగాచార్యులు, ఆంజనేయాచార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
ప్రతి విద్యార్థి ఆధార్ అప్డేట్ చేయాలి
సూర్యాపేటటౌన్ : జిల్లాలోని అన్ని పాశాలల విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన మండల ఆపరేటర్లకు నిర్వహించిన ఒకరోజు అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి మండలానికి ఒక ఆపరేటర్‌ను ఎస్ఎన్ఆర్ ఏజెన్సీ ద్వారా నియమించినట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 24,532 విద్యార్థుల ఆధార్ అప్డేట్ చేయాల్సి ఉందన్నారు. ఆపరేటర్లకు పాఠశాలల వారీగా ఉన్న వివరాలను ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రవీణ్, జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్, జిల్లా సెక్టోరియల్ అధికారులు శ్రవణ్ కుమార్, సూర్యనారాయణ, ఇ–డిస్ట్రిక్ట్ మేనేజర్ గఫార్ అహ్మద్, జిల్లా టెక్నికల్ పర్సన్ శ్రీధర్, ఆపరేటర్లు పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ సీతారామారావు -
ఇ–నామ్.. అమలేది?
తిరుమలగిరి (తుంగతుర్తి) : రైతులు పండించిన పంట ఉత్పత్తులను దేశంలో ఎక్కడి మార్కెట్లోనైనా విక్రయించేలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇ–నామ్ విధానం నామమాత్రంగానే కొనసాగుతోంది. ఈ విధానం జిల్లాలో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోక రైతులకు మద్దతు ధర అందడం లేదు. 2016 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఇ–నామ్ (ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్) విధానాన్ని తెచ్చింది. దేశంలోని 617 మార్కెట్లను దీని పరిధిలోకి తీసుకొచ్చి ఒక్కో యార్డులో రూ.5 లక్షల వ్యయంతో కంప్యూటర్లు, ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తొమ్మిది సంవత్సరాలు దాటినా ఇ–నామ్ యార్డులను జాతీయ సర్వర్‌తో అనుసంధానించలేదు. ఇప్పటికీ రైతుల పంట ఉత్పత్తులను ఆన్లైన్లో వేరే రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఎవరూ కొనుగోలు చేయడం లేదు. మొత్తంగా స్థానిక వ్యాపారులే కొనుగోలు చేస్తుండడంతో ధరల్లో పెరుగుదల పెద్దగా ఉండడం లేదు. కంప్యూటర్ ద్వారా ధరల నిర్ణయం ఒక్కటే మార్పు.. గతంలో మార్కెట్లలోని బీట్‌లో వేలం ద్వారా వ్యాపారులు ధరలు నిర్ణయించి రైతులు తెచ్చిన పంట ఉత్పత్తులను కొనుగోలు చేసేవారు. అయితే ఇ–నామ్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత కంప్యూటర్ల ద్వారా ధరలు కోడ్ చేస్తున్నారు. ఈ ఒక్క మార్పు తప్పితే ఈనామ్ విధానం వచ్చాక పంట ఉత్పత్తుల ధరల్లో కూడా ఏమాత్రం పెరుగుదల లేకపోవడంతో రైతులకు ఎలాంటి మేలు జరగడం లేదు. అమలైతే పదిశాతం అధికం ఇ–నామ్ మార్కెట్ల పరిధిలో గుర్తింపు పొందిన వ్యాపారులు దేశంలో ఎక్కడి నుంచైనా సరుకులు కొనుగోలు చేయవచ్చు. ఏ మార్కెట్లో సరుకులు కొనుగోలు చేసినా సదరు వ్యాపారి తమ ప్రాంతానికే తరలించుకోవచ్చు. ఈ పద్ధతి ప్రకారం మార్కెట్ కార్యదర్శి ద్వారా ఆన్లైన్లో చెల్లింపులు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు వ్యాపారులు పోటీలో ఉంటే కనీసం 10 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. జాతీయ ఏకీకృత మార్కెట్‌కు విస్తరిస్తే దూర ప్రాంతాల వ్యాపారులు ఆన్లైన్ ద్వారానే మన దగ్గరి మార్కెట్లలోని ఉత్పత్తులను కొనవచ్చు. దీని ద్వారా రైతులకు చాలా మేలు జరుగుతుంది. ఈ మేరకు అన్ని యార్డులను ఇ–నామ్ సర్వర్‌కు అనుసంధానించాల్సి ఉంటుంది. జిల్లాలో సూర్యాపేట, తిరుమలగిరి మార్కెట్ యార్డులను ఇ–నామ్ పరిధిలోకి చేర్చారు. ఇ–నామ్ పరిధిలోకి చేర్చినా స్థానిక వ్యాపారులు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దూరప్రాంతాలకు చెందిన వ్యాపారులెవరూ ఇక్కడి పంట ఉత్పత్తులను కొనడం లేదు. ఈ విధానంలో ఒక్క వేరుశనగ మాత్రమే వేరే ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడి వ్యాపారులతో కొనుగోలు చేయించి తీసుకెళ్తున్నారు. ఇప్పటికై నా జిల్లాలోని రెండు మార్కట్లలో ఇ–నామ్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి తమకు లబ్ధిచేకూరేలా చూడాలని రైతులు కోరుతున్నారు. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ విధానం నామమాత్రం ఫ దేశంలో ఎక్కడి నుంచైనా పంట ఉత్పత్తులు కొనేలా ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం ఫ అన్ని మార్కెట్లకు అనుసంధానించని జాతీయ సర్వర్ ఫ స్థానిక వ్యాపారులే కొనుగోలు చేస్తున్న పంట ఉత్పత్తులు ఫ రైతులకు చేకూరని ప్రయోజనం -
అస్తవ్యస్తం.. అగమ్యగోచరం!
మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా పనిచేయిస్తున్నాం. సిబ్బంది, వాహనాల కొరత వల్ల కొంత ఇబ్బంది కలిగిస్తుంది. సెగ్రిగేషన్ షెడ్ వద్ద రెండు కొత్త ట్రాక్టర్లను ఎందుకు ఉంచారో మాకు తెలియదు. వాటిని మాకు అప్పగించలేదు. – ఎం.సురేష్, శానిటరీ ఇన్స్పక్టర్, కోదాడ మున్సిపాలిటీ కోదాడ: కోదాడ మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం పరిస్థితి అస్తవ్యస్తంగా.. అగమ్యగోచరంగా కనిపిస్తోంది. 80 వేల జనాభా ఉన్న పట్టణంలో పారిశుద్ధ్య సమస్య పెను సవాలుగా మారింది. పారిశుద్ధ్య సిబ్బంది, వాహనాల కొరతతో ఇంటింటి చెత్త సేకరణ నాలుగైదు రోజులకు ఒకసారి చేయడమే గగనమైపోతుంది. మరోపక్క లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన కొత్త వాహనాలను మూలన పడేశారు. మున్సిపాలిటీలో ఎన్ని వాహనాలున్నాయి..? ఎన్ని పనిచేస్తున్నాయి...? రిపేర్‌కు ఇచ్చిన వాహనాలు ఎన్ని అనే లెక్కలే అధికారుల వద్ద లేవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సగం సిబ్బందితో సతమతం.. కోదాడ మున్సిపాలిటీలో ప్రస్తుతం 35 వార్డులున్నాయి. వార్డుకు ఐదుగురు సిబ్బంది, ఒక వాహనం, ఒక డ్రైవర్ చొప్పున ఆరుగురు పారిశుద్ధ్య విభాగానికే ఉండాలి. కానీ, ప్రస్తుతం సగం వార్డులకు ఇద్దరు.. సగం వార్డులకు ముగ్గురు చొప్పున మాత్రమే సిబ్బంది ఉన్నారు. 35 చెత్త సేకరణ ఆటోలు కావాల్సి ఉండగా కేవలం 18 మాత్రమే ఉన్నాయి. వీటిలో కొన్ని తరచూ రిపేర్‌కు వస్తున్నాయి. రిపేర్‌కు వెళ్లిన వాహనాలు మళ్లీ తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. గతంలో బ్యాటరీతో నడిచే ఐదు ఆటోలను మున్సిపాలిటీ కొనుగోలు చేసింది. అవి కనిపించకుండా పోయాయి. ప్రస్తుతం అవి ఎక్కడ ఉన్నాయో మున్సిపాలిటీ అధికారులే చెప్పలేక పోతున్నారు. చెత్తను డంపింగ్ యార్డులకు తరలించడానికి ఎనిమిది ట్రాక్టర్లు అవసరం కాగా ప్రస్తుతం నాలుగే పనిచేస్తున్నాయి. రెండు కొత్త ట్రాక్టర్లను రూ.16 లక్షలు పెట్టి కొనుగోలు చేసి సెగ్రిగేషన్ షెడ్లో పడేశారు. అక్కడెందుకు పెట్టారంటే మాకు తెలియదని.. మాకు అప్పగించలేదని శానిటేషన్ అధికారులు అంటున్నారు. సిబ్బందిని నియమించుకునే వెసులుబాటు ఉన్నా.. మున్సిపాలిటీలో పాలన గాడితప్పడంతో ఎవరిని ఎవరూ అజమాషీ చేయలేని పరిస్థితి నెలకొంది. గతంలో పారిశుద్ధ్య సిబ్బంది తక్కువగా ఉన్నారని 70 మందిని అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకున్నారు. వీరి నియామకం కోసం కౌన్సిలర్లు డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు రావడంతో రెండేళ్ల తర్వాత వారిని తొలగించారు. దీంతో అప్పటి నుంచి ఉన్న అరకొర సిబ్బందితో పనిచేయిస్తున్నారు. పారిశుద్ధ్య విభాగానికి మరో వంద మంది కార్మికులను పెట్టుకొనే వెసులుబాటు ఉన్నపటికీ ఎవరూ పట్టించుకోవడంలేదు. విచిత్రమేమిటంటే పనిచేసే వారికంటే పని చేయిస్తామని చెప్పుకొనే జవాన్ల సంఖ్య పెరిగి పోయింది. మరి కొందరు మున్సిపాలిటీ నుంచి వేతనం తీసుకుంటూ నేతలు, అధికారులు, మాజీ ప్రజాప్రతినిధుల ఇళ్లలో సేవకులుగా మారారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా మున్సిపల్ యంత్రాంగం స్పందించి సరిపడా సిబ్బందిని నియమించి రోజూ ఇంటింటా చెత్తను సేకరించాలని పట్టణ వాసులు కోరుతున్నారు. కోదాడ పట్టణంలో పడకేసిన పారిశుద్ధ్యం ఫ నాలుగు రోజులకు ఒకసారి ఇంటింటి చెత్త సేకరణ ఫ పనిచేసేవారు తక్కువ.. చేయించేవారు ఎక్కువ ఫ వాహనాల కొరతతోనూ సతమతం ఫ మూలనపడిన కొత్త వాహనాలు పారిశుద్ధ్య కార్మికులు (అవుట్ సోర్సింగ్) 146 ఎన్‌ఎంఆర్‌లు 11 రెగ్యులర్ కార్మికులు 21 చెత్త సేకరణ ఆటోలు 18 ట్రాక్టర్లు 04 జేసీబీ 01 వైకుంఠధామం వాహనం 01 ఈ ఫొటో కోదాడ మున్సిపాలిటీ రెండున్నరేళ్ల క్రితం రూ.16 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన కొత్త ట్రాక్టర్లు. వీటిని ఊరి చివరన ఉన్న సెగ్రిగేషన్ షెడ్డు వద్ద పడేయడంతో నిరుపయోగంగా మారాయి. వీటిని ఎందుకు కొనుగోలు చేశారు..? అక్కడ ఎందుకు ఉంచారు..? అంటే అధికారులు ఆ విషయం మాకు తెలియదంటున్నారు. మరోపక్క వాహనాల కొరతతో పట్టణంలో చెత్త తరలించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ అధికారులే చెప్పడం గమనార్హం. -
డీసీసీ అధ్యక్షుడిగా గుడిపాటి నర్సయ్య
సూర్యాపేట, తిరుమలగిరి(తుంగతుర్తి) : జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా గుడిపాటి నర్సయ్య నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల పీసీసీ, ఐఏసీసీ పరిశీలకులు జిల్లాలో పర్యటించి డీసీసీ పదవుల కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించడమే కాకుండా ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకుల అభిప్రాయాలను తీసుకున్నారు. డీసీసీ అధ్యక్ష పదవికి 12 మంది దరఖాస్తు చేసుకోగా.. పరిశీలకులు అధిష్టానానికి ఆరుగురి పేర్లతో కూడిన జాబితా పంపారు. ఇందులో ఎస్సీ(మాదిగ) వర్గానికి చెందిన గుడిపాటి నర్సయ్యకు పదవి దక్కింది. అజ్ఞాతం నుంచి రాజకీయాల్లోకి.. నిరుపేద కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగిన గుడిపాటి నర్సయ్య కాంగ్రెస్ పార్టీకి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి విధేయుడిగా ఉన్నారు. తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో జన్మించిన నర్సయ్య ప్రాథమిక విద్య స్వాగ్రామంలోనే పూర్తిచేశారు. తుంగతుర్తిలో ఇంటర్, వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. గుడిపాటి నర్సయ్య.. కళాశాల స్థాయి నుంచి రాజకీయాలపై ఆసక్తి చూపారు. విప్లవ పార్టీకి ఆకర్షితుడైన నర్సయ్య 1990 నుంచి 1995 వరకు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ చండ్రా పుల్లారెడ్డి వర్గంలో చేరి అజ్ఞాత జీవితం గడిపారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సూచనల మేరకు అప్పటి నల్లగొండ ఎస్పీ రవిగుప్త సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. ఆ తర్వాత ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుండగా దామోదర్‌రెడ్డి చెరదీసి జడ్పీటీసీగా అవకాశం కల్పించారు. 2001 నుంచి 2006 వరకు తుంగతుర్తి జడ్పీటీసీగా పనిచేశారు. 2006 నుంచి 2008 వరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 2009లో తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జిగా నియమితులయ్యారు. 2009లో తుంగతుర్తి నుంచి అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ నియోజకవర్గ ఇంచార్జిగా పనిచేస్తున్నారు. 2014 ఎన్నికల్లోనూ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినా.. చివరి నిమిషంలో అద్దంకి దయాకర్‌కు భీఫామ్ ఇచ్చింది. నర్సయ్య 2014 నుంచి 2018 వరకు టీపీసీసీ సభ్యుడిగా పనిచేశాడు. పార్టీలో చేరిన నాటినుంచి ఇప్పటి వరకు పార్టీకి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి విధేయుడిగా ఉన్నారు. దీంతో అధిష్టానం గుడిపాటి నర్సయ్యకు డీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టింది. ఫ ఐదేళ్లపాటు అజ్ఞాత జీవితం ఫ మాజీ మంత్రి ఆర్డీఆర్ సూచనతో రాజకీయాల్లోకి ఫ తుంగతుర్తి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ ఫ ప్రస్తుతం పీసీసీ సభ్యుడిగా ఉన్న నర్సయ్య -
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక
సూర్యాపేట : స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇటీవల నల్లగొండలో నిర్వహించిన క్రికెట్ సెలక్షన్స్‌లో జిల్లా కేంద్రానికి చెందిన ఎంఎస్కె ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 12 మంది క్రీడాకారులు వివిధ కేటగిరీల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారిలో అండర్–14 విభాగంలో జిల్లేపల్లి కనిష్క్, యర్రంశెట్టి రిశాంక్, కౌశిక్, తరుణ్, అండర్–16 విభాగంలో ఆహిల్ పాల్, అఖిలేష్ యాదవ్, కుశ్లేశ్వర్, అండర్–19 విభాగంలో విష్ణు, శివ, ధనుష్ పుష్కర్ ఎంపికయ్యారు. అలాగే, అండర్–17 విభాగంలో పల్లవి ఎంపికై నట్టు అకాడమీ హెడ్ కోచ్ షేక్ ఉస్మద్ తెలిపారు. -
ముగిసిన బాలోత్సవ్
కోదాడ: బాలల వికాసానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ సంఘం దివంగత నేతడు బజ్జూరి నర్సిరెడ్డి జ్ఞాపకార్థం నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోదాడ పబ్లిక్‌క్లబ్ ఆవరణలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న బాలోత్సవ్ ముగింపు కార్యక్రమం శనివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడారు. పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకుబహుమతులు అందజేశారు. నేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు పప్పుల వీరబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకుడు సుంకరి భిక్షం, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు వంగవీటి రామారావు, కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్, బజ్జూరి వెంకట్‌రెడ్డి, రావెళ్ల సీతారామయ్య, సాదె లక్ష్మీనారాయణ, కీతా వెంకటేశ్వర్లు, బజ్జూరి భాస్కర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం
చివ్వెంల : బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, ఎవరైనా చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా సంక్షేమ అధికారి కె.నర్సింహారావు అన్నారు. శనివారం బేటి పడావో–బేటి బాచావో కార్యక్రమంలో భాగంగా మున్యానాయక్ తండాలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలు చేయడం ద్వారా కలిగే అనర్థాలపై రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్ మంగతాయమ్మ, మండల వైద్యాధికారి భవాని, సిబ్బంది నాగరాజు, వినోద్ అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు. ఫ జిల్లా సంక్షేమ అధికారి కె.నర్సింహారావు -
ప్రజా ఉద్యమానికి ఊపిరిలూదిన చరిత్ర సీపీఐది
అనంతగిరి: ప్రజా ఉద్యమాలకు ఊపిరిలూదిన మహోన్నత చరిత్ర సీపీఐదని ఆ పార్టీ ఎమ్మెల్సీ, నల్లగొండ జిల్లా సీపీఐ కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. సీపీఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బస్సు జాతా శుక్రవారం అనంతగిరి మండలంలోని శాంతినగర్‌కు చేరుకుంది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. గ్రామంలో బైక్‌ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. వచ్చేనెల 26న ఖమ్మంలో ని నిర్వహించే ముగింపు ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బద్దం కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలనర్సింహ, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాస్, నారాయణరెడ్డి, మండవ వెంకటేశ్వర్లు, ఎస్కే అలీ, లతీఫ్, రాష్ట్ర మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సృజన, రవి, సహయ కార్యదర్శి లాలు, యువజన సంఘం అధ్యక్షుడు డేగ వీరయ్య, రైతు సంఘం నాయకులు వీరభద్రం, శాఖా కార్యదర్శి వీరబాబు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం -
వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి
సూర్యాపేట అర్బన్ : వ్యవసాయ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర చట్టం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో నిర్వహించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.12,000 ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయడం లేదని ఆరోపించారు. అంతకుముందు వ్యవసాయ కార్మిక సంఘం జెండాను సంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు ఆవిష్కరించారు. అనంతరం వ్యవసాయ కార్మిక ఉద్యమ నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య, మల్లు వెంకట నరసింహారెడ్డి, వర్ధిల్లి బుచ్చి రాములు చిత్రపటాలకు నివాళులర్పించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు ప్రిన్సిపల్‌గా వ్యవహరించగా.. జిల్లా ఆఫీస్ బేరర్స్ సోమపంగ జానయ్య, నల్ల మేకల అంజయ్య, జంపాల స్వరాజ్యం, వెంకటేశ్వర్లు గుంజ వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఇంకా నర్సరీల్లోనే మొక్కలు
కోదాడరూరల్ : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం అభాసు పాలవుతోంది. ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు నాటే కార్యక్రమానికి గత ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వనమహోత్సవం పేరిట మొక్కలు పెంచుతోంది. అయితే గ్రామాల్లోని నర్సరీల్లో లక్షల్లో మొక్కలు పెంచుతున్నా వాటిని నాటడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్ష్యం 1.69లక్షలు కోదాడ మండలంలోని 16 గ్రామాల్లో 1.69 మొక్కలను పెంచి నాటాలనే లక్ష్యాన్ని అధికారులు నిర్దేశించుకున్నారు. ఆ మేరకు నర్సరీల్లో మొక్కలను పెంచినా వాటిని నాటకుండా నర్సరీల్లోనే వదిలేశారు. 1.69 లక్షల మొక్కలకు ఒక్కో దానికి మట్టి నింపినందుకు రూ.0.90 పైసలు, విత్తనానికి రూ.0.30 పైసలు చెల్లించారు. ఆ తర్వాత మొక్కలను నాటేందుకు, గుంట తీసేందుకు ఉపాధి హామీ పనిలో భాగంగా ఒక్కో మొక్కకు రూ.100, వాటి సంరక్షణకు నీటి అందించేందుకు 400 మొక్కలకు 24 రోజులకుగాను రోజు రూ.300 లను కూలీలకు చెల్లిస్తున్నారు. అయితే ఇప్పటిరకు మండంలో 1.20లక్షల మొక్కలు నాటామని అధికారులు చెబుతున్నారు. అసలు గ్రామాల్లో సరిగ్గా మొక్కలే నాటనప్పుడు వాటి సంరక్షణ ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు. నాటిన మొక్కలపై నిరక్ష్యం వనమహోత్సవం పేరుతో గ్రామాల్లో తూతూ మంత్రంగా నాటిన మొక్కల సంరక్షణను అధికారులు పూర్తిగా వదిలేశారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నాటిన మొక్కలకు సంరక్షణ చేపట్టకపోవడంతో ఆ మొక్కలు ఎండిపోతున్నాయి. మరికొన్ని చోట్ల పశువులు మేస్తున్నాయి. తొగర్రాయి నర్సరీలో దర్శనమిస్తున్న మొక్కలుదోరకుంట నర్సరీలో ఉన్న మొక్కలు నాటకుండా వదిలేసిన మొక్కలు వానాకాలం ముగిసినా ముందుకు సాగని వనమహోత్సవం -
ఆదాయం చేకూర్చేలా ప్రణాళికలు రూపొందించాలి
భానుపురి (సూర్యాపేట) : వ్యర్థాల ద్వారా ఆదాయం చేకూర్చేలా మున్సిపల్ అధికారులు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ నుంచి జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లతో వ్యర్థాల నిర్వహణపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో సేకరించిన వ్యర్థాలను డంపింగ్ యార్డ్లు, వ్యర్థాలను వేరు చేసే కేంద్రాలకు తరలించాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో వ్యర్థాలను వేరు చేసే కేంద్రాలు కార్యకలాపాలు నిర్వహించేలా చూడాలని సూచించారు. పర్యావరణానికి హాని కలిగించే విష పదార్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు, కాలుష్య నీరు చెరువులు, కాలువల్లో కలవకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌కు అదనపు కలెక్టర్ సీతారామారావు, మున్సిపల్ కమిషనర్లు హన్మంత రెడ్డి, రమాదేవి, శ్రీనివాస రెడ్డి, మున్వర్ అలీ, ఇంజనీరింగ్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు హాజరయ్యారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
వేధిస్తే..ఊచలే!
ఆకతాయిల ఆటకట్టిస్తున్న షీటీమ్నిర్భయంగా పోలీసులను సంప్రదించాలి మహిళలు, యువతులు ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చు. వేధింపులు ఉపేక్షించకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. మహిళల రక్షణ కోసమే షీ టీమ్స్ కృషి చేస్తున్నాయి. మహిళలు, బాలికలపై ఆన్లైన్లో అసభ్యకర పోస్టులు పెట్టే వారు, సైబర్ నేరగాళ్లపై కూడా సైబర్, షీ టీమ్ సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. మహిళలు, బాలికలు, విద్యార్థులు షీటీమ్ సేవలు వినియోగించుకోవాలి. – నరసింహ, ఎస్పీసూర్యాపేటటౌన్ : మహిళలు, బాలికలకు షీటీమ్ భరోసా కల్పిస్తోంది. వారిపై ఆకతాయిల ఆగడాలకు చెక్ పెట్టేందుకు విస్తృతంగా పనిచేస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలల్లో ఈవ్ టీజింగ్, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. విద్యాసంస్థలు, కాలనీలు, రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో గస్తీ చేపట్టి ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. గత అక్టోబర్‌లో షీ టీమ్‌కు మొత్తం 21 ఫిర్యాదులు అందగా.. ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని 31 కేసులు నమోదు చేశారు. అదేవిధంగా 44 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు. రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా..షీటీమ్ బృందంలో ఒక ఎస్సై, ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు మహిళా పోలీసులు, ఇద్దరు సాధారణ కానిస్టేబుళ్లు ఉంటారు. ఈ బృందం జిల్లాలోని పట్టణ ప్రాంతాలతోపాటు, పలు మండల కేంద్రాల్లో నిఘా ఉంచి, మహిళలకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రద్దీగా ఉండే బస్టాండ్లు, కళాశాలలు, పాఠశాలలు తదితర ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత నెలలో కోదాడ డివిజన్ 21 ప్రాంతాల్లో, సూర్యాపేట డివిజన్లో 25 ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. మొత్తంగా ఈ ఏడాది కోదాడ డివిజన్లో 158 అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా.. సూర్యాపేట డివిజన్లో 188 కార్యక్రమాలు నిర్వహించారు. ధైర్యంగా ఫిర్యాదు చేయాలివిద్యార్థినులు, మహిళలు, యువతులు వేధింపులకు గురైతే నేరుగా షీటీమ్ వాట్సాప్ నంబర్ 87126 86056కు లేదా డయల్ 100 ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌లో ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసే సమయంలో మహిళలు తమ వ్యక్తిగత భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. బాల్య వివాహాలు, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, సెల్ఫ్ డిఫెన్స్, డయల్ 100, సోషల్ మీడియా నేరాలపై అవగాహన కల్పిస్తూ చైతన్య పరుస్తున్నారు. బస్టాండ్లు, కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన సదస్సుల నిర్వహణ వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయాలంటున్న పోలీసులు ఈ ఏడాదిలో ఇప్పటివరకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని 282 కేసులు నమోదు -
సూర్యాపేట మార్కెట్‌కు 40,659 బస్తాల ధాన్యం రాక
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు శుక్రవారం ధాన్యం భారీగా వచ్చింది. వరికోతలు ముమ్మరంగా సాగుతుండడంతో రైతులు అమ్మకానికి దాదాపు 40,659 బస్తాలు (26,428 క్వింటాల) ధాన్యాన్ని తీసుకువచ్చారు. ఇందులో అత్యధికంగా జైశ్రీరాం రకం 33,703 బస్తాలు వచ్చింది. బీపీటీ 3186 బస్తాలు, ఐఆర్ 64 2057 బస్తాలు, హెచ్‌ఎంటీలు 1637 బస్తాలు, బీపీటీ పాతవి 71 బస్తాలు, ఆర్ఎన్ఆర్లు 5 బస్తాల చొప్పున ధాన్యాన్ని రైతులు తీసుకువచ్చారు. ఈ సీజన్లో గురువారం దాకా 20వేల బస్తాల ధాన్యమే రాగా.. శుక్రవారం ఒక్కసారిగా ధాన్యం రాక పెరిగింది. దీంతో షెడ్లు అన్నీ నిండిపోయి ధాన్యం రాశులతో కళకళలాడుతున్నాయి. -
నేటి నుంచి రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్
సూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈ నెల 22, 23వ తేదీల్లో వాలీబాల్ ఫౌండేషన్ సూర్యాపేట ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి యూత్ బాలుర, అండర్ 17 బాలికల విభాగంలో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ నిర్వాహకుడు, వాలీబాల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఎడవల్లి ప్రవీణ్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ నెల 22న సాయంత్రం పోటీలు ప్రారంభమవుతాయని, 23న క్రీడల ముగింపు ఉంటుందని పేర్కొన్నారు. డిజిటల్ యుగంలో సరికొత్త సవాళ్లు : ఎస్పీ సూర్యాపేటటౌన్ : డిజిటల్ యుగంలో మానవాళి మునిపెన్నడూ చూడని సరికొత్త సవాళ్లను చూస్తోందని, కొత్త ఆన్లైన్ వ్యసనాలు ఆరోగ్యాన్ని, భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయని ఎస్పీ నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెట్టుబడి మోసాలు, నకిలీ లింకులు నమ్మదగినట్లుగా కనిపించే గ్రూపులు ఆర్థికంగా, మానసికంగా ప్రజలను కుంగ తీస్తున్నాయని పేర్కొన్నారు. ఆన్లైన్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో డబ్బు రెట్టింపు అవుతుందంటూ అత్యాశ చూపే సైట్స్, లింక్‌లు పెరుగుతున్నాయని తెలిపారు. ఇవి గమనించకపోతే తీవ్రమైన నష్టం తప్పదని పేర్కొన్నారు.శ్రీలక్ష్మీనారసింహుడి నిత్యకల్యాణం మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా నిత్యకల్యాణం విశేషంగా జరిపించారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్తిగావించారు. ఆలయ తిరుమాడ వీధుల్లో శ్రీస్వామి వారిని గరుడ వాహనంపై ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఇన్చార్జ్ ఈఓ జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి సూర్యాపేటటౌన్ : ప్రతి రోజు 120 మంది పిల్ల లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, స్క్రీనింగ్ చేసిన ప్రతి విద్యార్థినిని ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ అన్నారు. శుక్రవారం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ఆర్బీఎస్కే టీమ్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమయపాలన పాటించాలని, హాజరు కాని ప్రతి విద్యార్థిని కూడా గుర్తించి తప్పక స్క్రీనింగ్ చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్బీఎస్కే ప్రోగ్రాం అధికారి డాక్టర్ కోటి రత్నం, సంజీవరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఆండాళ్ దేవికి ఊంజల్ సేవ యాదగిరిగుట్ట: యాదగిరీశుడి సన్నిధిలో జరిగే నిత్యారాధనల్లో భాగంగా శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం నేత్రపర్వంగా జరిపించారు. అమ్మవారిని సుందరంగా అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్ సేవ నిర్వహించారు. అమ్మవారికి ఇష్టమైన నాధస్వరాన్ని వినిపించారు. ఇక ప్రధానాలయంలో వేకువజామున సుప్రభాతం, గర్భాలయంలోని స్వయంభూలకు అభిషేకం, సహస్రనామార్చన, ప్రాకారమండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, స్వామి, అమ్మవారికి నిత్య తిరుకల్యాణం, బ్రహ్మోత్సం తదితర పూజలు నిర్వహించారు. -
● చేప చిక్కింది.. ఆకలి తీరింది
సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలి సూర్యాపేటటౌన్ : అత్యాధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకొని కేసుల దర్యాప్తులో వేగంగా పనిచేయాలని ఎస్పీ నరసింహ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. గత నెలలో జరిగిన నేరాల స్థితిగతులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదులపై త్వరగా స్పందించాలన్నారు. రాత్రిళ్లు పెట్రోలింగ్ పటిష్టంగా ఉండాలని ఆదేశించారు. పోక్సో కేసుల్లో, మహిళా సంబంధ కేసుల్లో వేగంగా దర్యాప్తు చేయాలన్నారు. రోడ్డు భద్రతపై వాహనదారులను అప్రమత్తం చేయాలని తెలిపారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రజలను, వ్యాపారులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా అడ్మిన్ అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. సూర్యాపేట శివారులోని చెరువులో కొంగ చేపల కోసం మాటేసింది. చివరకు చేప చిక్కడంతో తన ఆకలి తీర్చుకుంది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సూర్యాపేట నాగారం : మహిళలు తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. అవకాశాలను అందిపుచ్చుకొని రాణిస్తున్నారు. ఇంటిని చక్కదిద్దడమే కాకుండా కుటుంబ పోషణకు కావాల్సిన ఆర్థిక సహకారాన్ని తమ వంతుగా అందిస్తున్నారు. పురుషులతో సమానంగా ఉద్యోగాల్లోనే కాకుండా వ్యవసాయం, కూలి పనుల్లోనూ చెమటోడ్చి కష్టపడుతున్నారు. ఉపాధి హామీ పనుల్లోనూ పార, గడ్డపార పట్టి పనులు చేస్తున్నారు. ఒకప్పుడు ఊరు వదిలి పట్టణాలకు వెళ్లి కూలి పనులు చేసుకునే వారు.. ఇప్పుడు ఉన్న ఊరిలోనే కూలి పనులు చేసుకుంటున్నారు. జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో పురుషుల కంటే మహిళలు ఎక్కువ పని దినాలను వినియోగించుకొని శభాష్ అనుపించుకుంటున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పనులకు వెళ్తున్న వారిలో పురుషుల కంటే మహిళల సంఖ్యే అధికంగా ఉంది. ఒక్కో మహిళ సరాసరి నిత్యం రూ.260–280 వరకు ఆర్జిస్తోంది. కొందరు మహిళలు నెలలో 20 రోజుల పాటు పనులకు వెళ్తున్నారు. ఈ డబ్బులతో వారి కుటుంబాలను పోషించుకుంటున్నారు. నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారు.. జిల్లాలోని 486 పంచాయతీల్లో ఉపాధి పనుల్లో అతివలదే జోరు కనిపిస్తోంది. పని ప్రదేశాల్లో వీరే అధికంగా ఉంటున్నారు. హాజరు సమయానికి పనికిరావడం, పని పూర్తయిన తర్వాతే వెళ్లడం వంటి నిబంధనలు మహిళలే అధికంగా పాటిస్తున్నారు. టీఏలు ఇచ్చిన కొలతల ప్రకారం పనులు పూర్తి చేస్తున్నారు. ఉపాధిహామీ పథకం నిబంధన ప్రకారం ఒక ఏడాదిలో ఒక కుటుంబానికి వంద రోజులు మాత్రమే పనులు ఉంటాయి. వంద రోజుల పని పూర్తయిన తర్వాత మళ్లీ వచ్చే ఏడాది వార్షిక సంవత్సరం ప్రారంభం వరకు నిరీక్షించాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా జిల్లాలో సుమారు 56 కుటుంబాలు వంద రోజుల పని దినాలను పూర్తి చేసుకున్నాయి. వీరు మళ్లీ ఉపాధి పనులకు వెళ్లాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ వరకు ఆగాల్సిందే. ఇలా క్రమం తప్పకుండా పనులకు వచ్చే మహిళలకు త్వరగా ఉపాధి పనిదినాలు అయిపోతున్నాయి. ఇలాంటి వారికి 150 రోజుల పనిదినాలు ఇవ్వాలనే డిమాండ్ గతం నుంచే ఉంది. జాబ్ కార్డులు పరిశీలిస్తే.. ఉపాధి హామీ పథకం ప్రారంభించిన కొత్తలో పురుషులే కూలి పనులకు వెళ్లేవారు. తర్వాత రోజుల్లో క్రమంగా మహిళలు ఆసక్తి చూపించారు. ఇప్పుడు ఎక్కువ పని దినాలను వినియోగించుకోవడంలో అతివలే ముందంజలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పనిదినాల్లో పురుషుల కంటే ఎక్కువగా మహిళలే వినియోగించుకున్నారు. జిల్లాలో మొత్తం 2.63 లక్షల జాబ్ కార్డులున్నాయి. వీటిలో 5.7లక్షల కూలీలు ఉన్నారు. ఇందులో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 3.33 లక్షల మంది కూలి పనులు చేశారు. ఇందులో మహిళలు 1.80 లక్షల మంది, పురుషులు 1.53 లక్షల మంది ఉన్నారు. పురుషుల కంటే ఎక్కువగా మహిళలు పని దినాలు చేసి మేం ఎందులోనూ తక్కువ కాదని నిరూపించుకున్నారు. ఉపాధి పనుల్లో ఆమెదే పైచేయిజాబ్ కార్డులు : 2.63లక్షలు మొత్తం కూలీలు : 3,33,433పనులు వినియోగించుకున్న మహిళలు : 1,80,235పురుషులు : 1,53,198పూర్తయిన పనిదినాలు: 29.58లక్షలు మహిళలు చేసినవి : 18.10లక్షలు పురుషుల పనిదినాలు : 11.48లక్షలుఫ ఎస్పీ నరసింహ ఉపాధి పనులను జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. 2025–26లో ఇప్పటి వరకు పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉపాధి పనులకు హాజరవుతున్నారు. ఇంకా ఎవరైనా ఉపాధి పని చేయాలనుకుంటే సంబంఽధిత క్షేత్ర సహాయకులను సంప్రదించాలి. – డి.శిరీష, ఇన్చార్జి డీఆర్డీఓ ఫ మహిళలు పలుగు పార పట్టి ఉపాధి హామీ బాట ఫ 2025–26లో ఇప్పటి వరకు 1.80 లక్షల మంది అతివలు హాజరు ఫ పురుషుల కంటే 27వేల మంది అధికం ఫ పనిదినాలు వినియోగించుకోవడంలోనూ ముందంజ -
వ్యర్థాలతో ఆదాయ మార్గం
కోదాడ: ఉపాయం ఉండాలేగాని ఇసుక నుంచి తైలం తీయవచ్చంటారు పెద్దలు. వ్యర్థాల నుంచి ఉత్పత్తులు తయారు చేసి ఆర్థికంగా లబ్ధిపొందుతున్నారు. కోదాడకు చెందిన ఓ పారిశ్రామికవేత్తకు వచ్చిన ఆలోచనల నుంచి పుట్టిందే ఈ వినూత్న వ్యాపారం. తాగిపడేసిన కొబ్బరి బోండాల నుంచి పరుపులు, వినాయక విగ్రహాల తయారీలో ఉపయోగించే కొబ్బరిపీచు, ఇండోర్ ప్లాంట్స్, ఇంటి ఆవరణలో పెంచుకునే మొక్కలకు ఉపయోగించే కోకోపిట్ తయారు చేస్తున్నారు. తద్వారా పట్టణంలో తాగి పడేసే కొబ్బరి బోండాల వ్యర్థాల నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తున్నారు. పట్టణంలో ఉచితంగా సేకరణ.. కోదాడకు చెందిన దివంగత అధ్యాపకుడు మధిర కృష్ణారెడ్డికి 2020లోనే మొదట ఈ పరిశ్రమ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. అనారోగ్యంతో ఆయన మృతి చెందడంతో కొంతకాలంపాటు ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఆయన కుమారులు శ్రావణ్‌కుమార్, విక్రమాదిత్యలు అమెరికాలో ఉండేవారు. తమ తండ్రి ఆశయమైన ఈ పరిశ్రమను 2024లో కోదాడ సమీపంలోని దోరకుంట ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఏర్పాటు చేశారు. శ్రావణ్‌కుమార్, విక్రమాదిత్యల మాతృమూర్తి మధిర హంసవేణి పరిశ్రమ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. గతంలో పట్టణంలో ప్రజలుతాగి పడేసే కొబ్బరి బోండాలను మున్సిపాలిటీ వారు ట్రాక్టర్ల ద్వారా సేకరించి డంపింగ్ యార్డ్‌లో పోసేవారు. కొంత మంది వ్యాపారులు వీటిని రోడ్లవెంట పడేసేవారు. వీటి వల్లదోమలు వ్యాప్తి చెంది పట్టణ ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడేవారు. వీటన్నింటికీ చెక్ పెడుతూ ఈ బోండాలను ప్రాసెస్ చేసి వాటి నుంచి పలు ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం ట్రాక్టర్ ద్వారా పట్టణంలో తాగి పడేసే కొబ్బరి బోండాలను వీరు సేకరిస్తారు. వీటిని పరిశ్రమ వద్దకు తరలించి ప్రాసెస్ చేస్తారు. మొదటి ఉత్పత్తిగా పీచును తయారు చేస్తారు. ఆ తరువాత ఇండోర్ప్లాంట్స్కు ఉపయోగించే కోకోపిట్‌ను తయారు చేస్తారు. పీచును పరుపులు, వినాయక విగ్రహాల తయారీలో ఉపయోగించేవారు కొనుగోలు చేస్తున్నారు. కోకోపి ట్ను ఇండోర్‌ప్లాంట్స్ పెంచుకునేవారు కొనుగోలు చేస్తున్నారు. తాగిపడేసిన కొబ్బరి బోండాల వల్ల పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా వాటిని ఉపయోగించాలనే ఆలోచన నుంచే ఈ పరిశ్రమ ఏర్పాటు చేశాం. ప్రస్తుతం వీటి వినియోగంపై స్థానికులకు అవగాహన లేదు. మొక్కలకు ఎరువుగా కోకోపిట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కేజీల లెక్కన విక్రయిస్తాము. ఇటుకల తయారీలో ఉపయోగించే అవకాశంపై ఆలోచన చేస్తున్నాం. – మధిర హంసవేణి, పరిశ్రమ నిర్వాహకురాలుఫ కొబ్బరిబోండాల వ్యర్థాలతో ఉత్పత్తులు ఫ కొబ్బరిపీచు, కోకోపిట్ తయారీ ఫ మార్కెట్లో మంచి డిమాండ్ ఫ ఆర్థికంగా లబ్ధిపొందుతున్న కోదాడ వాసి -
ఫ్యామిలీ కోర్టు మంజూరు చేయాలని వినతి
చివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేటకు ఫ్యామిలీ కోర్టును మంజూరు చేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, పోర్ట్ పోలియో జడ్జి జస్టిస్ మాధవి దేవి, జస్టిస్ కునూరు లక్ష్మణ్ గౌడ్, జస్టిస్ పంచాక్షరిచ, జస్టిస్ సుద్దాల చలపతిరావు లను బార్ అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈమేరకు సూర్యాపేట బార్అసోసియేషన్ సభ్యులు గురువారం హైదరాబాద్‌లో వారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందజేశారు. సూర్యాపేటకు ఎస్సీ, ఎస్టీ కోర్టు, వినియోగదారులు కోర్టు లను కూడా మంజూరు చేయాలని విన్నవించారు. దీనికి జడ్జిలు స్పందించి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, న్యాయవాదులు జే.శశిధర్, మోదుగు వెంకట్ రెడ్డి, బాణాల విజయ్ కుమార్, కాకి రాంరెడ్డి, దావుల వీర ప్రసాద్, అనంతుల సందీప్ కుమార్, మంచినీళ్ల లక్ష్మణ్, కట్ట సుధాకర్, కాసం సరిత పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలిచివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ సూచించారు. ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా గురువారం సూర్యాపేట మండల కాసరబాద గ్రామ శివారులోని అపూర్వ బధిరుల పాఠశాలను ఆమె సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆహారం, ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని హెచ్ఎం మదనా చారిని ఆదేశించారు. పిల్లల హక్కుల పరిరక్షణకు డీఎల్ఎస్ఏ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. సహకార రంగంలో అపార అవకాశాలునల్లగొండ టూటౌన్ : సహకార రంగంలో యువతకు అపార అవకాశాలు లభిస్తున్నాయని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటీవ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.గణేశన్ అన్నారు. గురువారం ఎంజీ యూలో విద్యార్థులకు సహకార రంగంలో అవకాశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో యూసీసీబీఎం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీదేవి, ప్రొఫెసర్ ఆకుల రవి, ప్రొఫెసర్ అంజిరెడ్డి, డాక్టర్ లక్ష్మీప్రభ, డాక్టర్ హరీష్ పాల్గొన్నారు. మాట్లాడుతున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ -
అర్వపల్లి దర్గా ఉర్సుకు వేళాయే..
అర్వపల్లి: మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన అర్వపల్లి శివారులో ఉన్న హజ్రత్ ఖాజా నసీరుద్దీన్ బాబా దర్గా ఉర్సు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇదే రోజు రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచి గంధం ఊరేగింపు ఉంటుంది. రాత్రి ఖవ్వాలీ కార్యక్రమం నిర్వహిస్తారు. శనివారం దీపారాధనతో ఉత్సవాలు ముగుస్తాయి. రెండు రోజుల పాటు నిర్వహించే ఉర్సుకు సంబంధించి దర్గాను విద్యుత్ లైట్లతో ముస్తాబుచేశారు. అలాగే దర్గాకు వచ్చే రోడ్డును తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. దర్గా పరిసరాలను శుభ్రం చేయించారు. నిరంతరం విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ను బిగించారు. దర్గా రోడ్డు వెంట, పరిసరాల్లో లైట్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు వక్ఫ్‌బోర్డు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల ఇన్స్పెక్టర్ ఎస్కే.మహమూద్, ముజావర్ సయ్యద్ అలీ తెలిపారు. కాగా ఉర్సు సందర్భంగా వివిధ రకాల దుకాణాలు వెలిశాయి. ఫ నేడు గంధం ఊరేగింపుతో శ్రీకారం ఫ రెండు రోజుల పాటు ఉత్సవాలు ఫ విద్యుత్‌దీపాలతో దర్గా ముస్తాబు ఫ భారీగా తరలిరానున్న భక్తులు -
పంచాయతీ పోరుకు సిద్ధం
భానుపురి (సూర్యాపేట) : పంచాయతీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల సిబ్బంది నుంచి బ్యాలెట్ బ్యాక్స్‌లు, బ్యాలెట్ పత్రాల వరకు అన్నీ పూర్తయ్యాయి. ఇంతలోనే రిజర్వేషన్ల అంశంపై కోర్టు కేసులు, తదితర కారణాలతో పరిషత్తు ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ నేపధ్యంలో ఈ ఎన్నికలతో సంబంధం లేకుండా గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఓటరు జాబితా సైతం ప్రకటించగా.. మరోమారు ఈ ఓటరు జాబితాను సవరించనున్నారు. ఇందుకు మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్ల నమోదుపై అధికారులు దృష్టి సారించారు. 4,388 వార్డులు.. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 486 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో 4,388 వార్డులు ఉండగా.. 6,94,815 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 3,40,743 మంది, మహిళలు 3,54,050 మంది ఉన్నారు. ఈ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 2వ తేదీన ప్రకటించింది. ఈ జాబితాలతోనే మొదటగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం, ఎన్నికల సంఘం భావించింది. 42 శాతం బీసీలకు రిజర్వేషన్ల కల్పించాలని, ఈ మేరకు రిజర్వేషను ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియను సైతం మొదలు పెట్టింది. కోర్టు కేసులతో.. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రాగా.. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఇవి నిలిచిపోయాయి. దీంతో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు బ్రేకులు పడ్డాయి. కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు నిలిచి పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మొదటగా 50 శాతం రిజర్వేషన్లుదాటకుండా గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం సైతం ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. అయితే ఓటర్ల మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. దాదాపు ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ స్టేషన్లు, ఎన్నికల సిబ్బంది నియామకం, వారికి కావాల్సిన శిక్షణ రెండువిడతల్లో జరగ్గా.. చివరి విడత మిగిలిపోయింది. కాగా ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించి.. 50 శాతం రిజర్వేషన్లు దాటకుండా బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే పూర్తయిన ఎన్నికల ఏర్పాట్లలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఇటు ప్రభుత్వం, అటు ఎన్నికల సంఘం భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర ఎన్నికల సంఘం అధికారులతో కలిసి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన వీడియోవీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎంపీడీఓలు తక్షణమే క్షేత్రస్థాయికి వెళ్లి గ్రామపంచాయతీ, వార్డు వారీగా ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలను ప్రత్యక్షంగా తనిఖీచేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలు అనుకూలంగా ఉన్నాయోలేవో గుర్తించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 2011 జనాభా ఆధారంగా తీసుకోవాలన్నారు. బీసీ రిజర్వేషన్ కు సంబంధించి సోషియో ఎకనామిక్ సర్వే–2024 ఆధారంగా చేపట్టాలన్నారు. కాన్ఫరెన్స్‌లో ఎస్పీ కె. నరసింహ, అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, డీపీఓ యాదగిరి, జిల్లా పరిషత్ డిప్యూటీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శిరీష, డీఎల్పీఓ నారాయణ రెడ్డి, పార్థసారధి పాల్గొన్నారు.ఫ ఎన్నికల ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం ఫ ఇప్పటికే ఓటరు జాబితా సిద్ధం ఫ మరోమారు ఓటరు జాబితా సవరణకు అవకాశం ఫ బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు రెడీ ఫ సిబ్బందికి శిక్షణ పూర్తిజిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన బ్యాలెటు బాక్సులు, బ్యాలెటు పేపర్లను అధికారులు సిద్ధం చేశారు. పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో నిర్వహించనున్నందున పోలింగ్ బాక్సులు జిల్లాలో ఉన్న వాటితో పాటు ఏపీ, గుజరాత్, మహారాష్ట్ర నుంచి తెప్పించి మరమ్మతులు చేసి సిద్ధంగా ఉంచారు. బ్యాలెట్ పేపర్లను ఇప్పటికే తెచ్చి సిద్ధంగా ఉంచారు. ఎన్నికల సిబ్బందికి కూడా గతంలోనే మొదటి విడత శిక్షణ ఇచ్చారు. -
వైభవంగా నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి గురువారం విశేషపూజలు చేశారు. ఈసందర్భంగా అర్చకులు వేదమంత్రాలతో కల్యాణం నిర్వహించారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం రక్తి కట్టించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం ,రక్షాబంధనం, మదుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. ఆలయ తిరుమాడ వీధుల్లో శ్రీస్వామి వారిని గరుడవాహనంపై ఊరేగించారు. అదేవిధంగా కార్తీక మాసం పురస్కరించుకుని శివాలయంలోని శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామికి పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఇన్చార్జి బి.జ్యోతి,కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు , ఆంజనేయా చార్యులు, దుర్గాప్రసాద్‌శర్మ పాల్గొన్నారు. -
లౌకికవాద పార్టీలన్నీ ఏకం కావాలి
హుజూర్నగర్ : దేశంలో లౌకిక భావజాలం ఉన్న పార్టీలు ఏకంకావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. గద్వాలలో ప్రారంభమైన సీపీఐ ప్రచారజాతా గురువారం హుజూర్ నగర్ చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నా ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా ఏర్పాటు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల్లో ఉన్నాయంటూ కార్పొరేట్ సంస్థలకు అప్పగించిందని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాలనరసింహ మాట్లాడుతూ బీజేపీ కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల దేశ సంపద కొన్ని వర్గాల వద్దనే కేంద్రీకృతం అయ్యిందన్నారు. కార్యక్రమంలో తొలుత ప్రచార జాతాకు బోనాలతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లావుల రాములు, కొప్పోజు సూర్యనారాయణ, ఉస్తేల నారాయణరెడ్డి, పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సజన, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరం మల్లేశ్వరి, జిల్లా కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాస్, నాయకులు జడ శ్రీనివాస్, గుండా రమేష్, టి వాసుదేవరావు, రమేష్, ఉమ, పద్మ, సంధ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఫ సీపీఐ జాతీయ కార్యదర్శి వెంకట్ రెడ్డి -
రైతుకు సాగు చట్టాలపై అవగాహన అవసరం
తుంగతుర్తి : ప్రతి రైతుకు సాగు చట్టాలపై అవగాహన కలిగి ఉండటం అవసరమని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు భూమి సునీల్ పేర్కొన్నారు. లిప్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ సాగు న్యాయ యాత్ర లో భాగంగా సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దళారీ వ్యవస్థ పూర్తిగా నిర్మూలించినప్పుడే సాగు న్యాయం సాధ్యమవుతుందన్నారు. రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు, నాణ్యతలేని విత్తనాలు, ఎరువుల మోసాలు, మార్కెట్లో అన్యాయం, పంటల బీమా వంటి కీలక అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో 200కుపైగా భూ చట్టాలు ఉన్నాయని, అవన్నీ రైతులకు ఉపయోగపడేలా అవగాహన కల్పించడమే ఈ యాత్ర లక్ష్యమని పేర్కొన్నారు. భూమి ఉండి పాసుపుస్తకం లేకపోయినా, ఇతర ఏ భూ సమస్య ఉన్నా ప్రభుత్వ నిర్దేశించిన నమూనాలో మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం గొట్టిపర్తి లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, తుంగతుర్తి లోని వరి పొలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దయానందం, లిప్స్ సంస్థ ప్రతినిధులు, అడ్వకేట్లు జీవన్,రవి, అభిలాష్, సందీప్, దాయం కరుణాకర్ రెడ్డి, కేతిరెడ్డి కరుణాకర్ రెడ్డి, ఏడీఏ రమేష్ బాబు, డిప్యూటీ తహసీల్దార్ యాదగిరి, ఆర్ఐ లు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఆందోళనలో రైతులు
వరుస వర్షాలతో చేనుపైనే పత్తి తడవడంతో పాటు పత్తిని ఆరబెట్టుకునే పరిస్థితి లేని కారణంగా పత్తిలో 20 శాతం వరకు తేమ ఉండటంతో సీసీఐ అధికారులు కొనడం లేదు. దీంతో రైతులు పత్తి అమ్మకం కోసం మిల్లుల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం జిన్నింగ్ మిల్లుల యజమాన్యాలు మిల్లులను బంద్ చేయడం వల్ల రైతులు పత్తిని ఎక్కడ అమ్ముకోవాలో అర్థం గాక ఆందోళన చెందుతున్నారు. సీసీఐ అధికారులు పెట్టిన నిబంధనను తొలగించి పత్తిని వెంటనే కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పత్తి రైతులు కోరుతున్నారు. మరోవైపు మద్దతు ధరకు తమ పత్తి అమ్ముకునేందుకు వచ్చిన రైతులకు ఒక్కసారిగా కొనుగోళ్లు నిలిచిపోయాయని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కిరాయి ట్రాక్టర్లలో పత్తిని తీసుకువచ్చిన రైతులు పత్తిని తీసుకొని తిరిగి వెనక్కు వెళ్లలేక, మరోమారు పత్తి ఎగుమతి చార్జీలు భరించలేక వెయిటింగ్ చార్జీలు మీదపడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. -
అర్జీల పరిష్కారానికి చొరవ చూపాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులు సత్వరమే పరిష్కారానికి చొరవ చూపాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణికి అధికారులు విధిగా హాజరై ఫిర్యాదులపై శాఖల వారీగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరించాలన్నారు. వారం రోజుల్లో ప్రజావాణి ఫిర్యాదుల స్టేటస్‌పై సమీక్ష నిర్వహిస్తానన్నారు. కోర్టు కేసులు ఏమైనా పెండింగ్ ఉంటే తదుపరి వాయిదా నాటికి కౌంటర్ ఫైల్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలకు స్థలం అవసరం ఉంటే తెలిపాలని, అలాగే ప్రభుత్వ కార్యాలయాల భూముల వివరాలు రికార్డుల్లో అప్డేట్ చేయాలన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు మంగళవారం జిల్లాలోని విద్యాసంస్థలు, గ్రామస్థాయిలో ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. 48గంటల్లో ధాన్యం డబ్బులు జమయ్యేలా చూడాలి సూర్యాపేట : రైతుల అకౌంట్లలో 48 గంటల్లో ధాన్యం డబ్బులు జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం సూర్యాపేట మండలం గాంధీనగర్, యర్కారం గ్రామాల్లోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు బాలెంల–1 ఐకేపీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. తేమ శాతాన్ని పరిశీలించారు. సీరియల్ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. తేమ శాతం 17 వచ్చిన ధాన్యాన్ని సీరియల్ ప్రకారం కాంటా వేసి మిల్లులకు తరలించాలన్నారు. వెంటనే ట్రక్ షీట్, ట్యాబ్ ఎంట్రీ చేసి రైతులకు డబ్బులు జమ చేసేలా చూడాలన్నారు. సరైన తేమ శాతం వచ్చినా ధాన్యం కాంటా విషయంలో జాప్యం చేస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరైన తేమ శాతం వచ్చేంతవరకు ధాన్యం ఆరబెట్టాలని, మట్టి, తాలు, దుమ్ము, గడ్డి లేకుండా శుభ్రం చేసి తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. కలెక్టర్ వెంట డీఎస్ఓ మోహన్ బాబు, డీఎం రాము, తహసీల్దార్ కృష్ణయ్య, ఏఓ సందీప్, ఏఈఓలు, ఏపీఎం, పీఏసీఎస్ కార్యదర్శిలు నాగరాజు, వెంకటరెడ్డి, నిర్వాహకురాలు వెంకటమ్మ ఉన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
పోస్టాఫీస్‌కు నూతన భవనాన్ని నిర్మించాలి
కోదాడ : కోదాడ పట్టణ నడిబొడ్డున ఉన్న పాత పోస్టాఫీస్ స్థలంలో తక్షణమే కొత్త భవనాన్ని నిర్మించాలని అఖిలపక్ష నాయకులు కోరారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారుల సహాయ సహకారాలు తీసుకోవాలని సోమవారం కోదాడ పబ్లిక్ క్లబ్ ఆవరణలో జరిగిన అఖిలపక్ష నాయకుల సమావేశంలో తీర్మానించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం కొత్త భవనం నిర్మిస్తామని పాత భవనాన్ని కూల్చివేశారని, కానీ నేటి వరకు కొత్తది నిర్మించలేదన్నారు. ఎంతో విలువైన స్థలం ఆక్రమణకు గురవుతోందని, ఈ విషయంలో ప్రజాప్రతినిధులు కలుగజేసుకొని బహుళ అంతస్తులతో నూతన భవనాన్ని నిర్మించాలని కోరారు. ఈ సందర్భంగా పోస్టాఫీస్ నూతన భవన నిర్మాణ సాధన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో అధికారులను దశల వారీగా కలవాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాలను సమన్వయం చేయడానికి గంధం బంగారును నియమించారు. ఈ సమావేశంలో నాయకులు జాస్తి సుబ్బారావు, పొడుగు హుస్సేన్, కుదరవెళ్లి బసవయ్య, రావెళ్ల సీతారామయ్య, రాయపూడి చిన్ని, పి.సత్యబాబు, ఎస్కే.నయీం, ముత్తవరపు రామారావు, కనగాల జనార్ధన్‌రావు, మిట్టగడుపుల ముత్యాలు, బాబు, బొల్లు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
చట్టాల అమలులో అలసత్వం వహించొద్దు
సూర్యాపేటటౌన్: చట్టాల అమలులో పోలీస్ సిబ్బంది అలసత్వం వహించవద్దని ఎస్పీ నరసింహ సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.ప్రతి కేసును పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. ఫిర్యాదుదారుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు. వయోవృద్ధుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలిచివ్వెంల(సూర్యాపేట) : వికలాంగులు, వయోవృద్ధుల ఆరోగ్యం విషయంలో నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూర్యాపేట జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ సూచించారు. సోమవారం సూర్యాపేట మండల పరిధిలోని గాంధీ నగర్లో గల స్నేహ నిలయం ఆశ్రమాన్ని ఆమె సందర్శించారు. సీనియర్ సిటిజన్లు, సంక్షేమ చట్టంపై అవగాహన కల్పించారు. ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వికలాంగులు, వృద్ధులకు పండ్లు, బ్రేడ్ పంపిణీ చేసి, వారితో కొద్దిసేపు ఆప్యాయంగా మాట్లాడారు. ఈకార్యక్రమంలో డీఎల్ఎస్ఏ నామినేటెడ్ సభ్యులు గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో కార్తీక ఆరాధనయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, అనుబంధ శివాలయంలో సోమవారం కార్తీక మాసం పూజలు కొనసాగాయి. కొండపైన గల శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో కార్తీక చివరి సోమవారం సందర్భంగా మహాశివుడికి రుద్రాభిషేకం, బిల్వా అర్చన పూజలు విశేషంగా నిర్వహించారు. ఆలయ యాగశాలలో రుద్ర యాగాన్ని జరిపించారు. సాయంత్రం శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి వారి సేవను ఆలయంలో ఊరేగించారు. ఇక ప్రధానాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు సంప్రదాయ పూజలను కొనసాగించారు. ఆలయంలో వైభవంగా శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణ వేడుక, జోడు సేవలు వంటి పూజలు అర్చకులు జరిపించారు. 19న జాబ్ మేళానల్లగొండ : నల్లగొండలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఐటీఐ క్యాంపస్‌లో ఈ నెల 19న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఎస్సీ నుంచి గ్రాడ్యుయేట్, పార్మసీ ఉత్తీర్ణులై 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, బయోడేటా తీసుకుని నేరుగా కార్యాలయానికి హాజరు కావాలని తెలిపారు. పూర్తి వివరాలకు 78934 20435 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. -
స్టడీ అవర్స్ సరే.. అల్పాహారమేదీ?
చిలుకూరు: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే 9, 10 తరగతుల విద్యార్థులకు అల్పాహారం అందడం లేదు. సెప్టెంబర్ నుంచి విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 4.20 నుంచి 5.20గంటల వరకు స్టడీ అవర్ కొనసాగుతోంది. అయితే పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నం తిని సాయంత్ర స్టడీ అవర్ వరకు ఏమీ తినకుండా ఉండాలంటే విద్యార్థులు నీరసించి చదువుపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు. అయినా నేటి వరకు ప్రభుత్వం అల్పాహారం అందించేందుకు నిధులు విడుదల చేయడం లేదు. ప్రతిరోజూ స్టడీ అవర్ ముగించుకుని ఇంటికెళ్లే సరికి 6 గంటలు అవుతుండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెండు నెలలు దాటినా.. జిల్లా వ్యాప్తంగా 229 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థులు 17వేల మంది ఉన్నారు. వీరికి ప్రత్యేక స్టడీ అవర్స్ ప్రారంభించి ఇప్పటికీ 76 రోజులు దాటినా ఎలాంటి అల్పాహారం పెట్టడం లేదు. గతంలో ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 విలువైన అల్పాహారం అందజేశారు. ఇందుకు కావాల్సిన నిధులను పాఠశాలల ఖాతాల్లో జమచేసి అల్పాహారం అందించారు. ఇందుకుగాను గతంలో అల్పాహారం మెనూను ప్రత్యేకంగా రూపొందించారు. గతంలో స్టడీ అవర్స్‌లో అల్పాహారం అందించి ఇప్పుడు పెట్టకపోవడంతో తమ పిల్లలు నీరసించి పోతున్నారని, ఇంటికొచ్చాక కనీసం హోం వర్క్ కూడా చేసుకోలేని పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు అంటున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి స్టడీ అవర్స్‌కు హాజరయ్యే 9, 10వ తరగతుల విద్యార్థులకు అల్పాహారం అందించాలని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఫ 9, 10 విద్యార్థులకు సెప్టెంబర్ నుంచి మొదలైన స్టడీ అవర్స్ ఫ సాయంత్రం 4.20 నుంచి 5.20 గంటల వరకు నిర్వహణ ఫ అల్పాహారం లేక నీరసించి పోతున్న విద్యార్థులు -
నిర్మించుకోకుంటే ఇల్లు రద్దే
ఫ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై కొనసాగుతున్న సర్వే ఫ నిర్మించని వాటిని గుర్తిస్తున్న అధికారులు ఫ వచ్చే నెలలో రెండో విడత లబ్ధిదారుల గుర్తింపుప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు మంజూరైన 45 రోజుల్లో నిర్మాణం ప్రారంభించాలి. అలా ప్రారంభించకపోతే రద్దు అవుతుంది ఆరు నెలలైనా 34శాతం మంది లబ్ధిదారుల నిర్మాణాలు ప్రారంభించలేదు. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తాం – సిద్ధార్థ్, హౌసింగ్ పీడీ, సూర్యాపేట సూర్యాపేట అర్బన్ : నిర్మానాలు ప్రారంభించని ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇల్లు మంజూరైన వారు 45 రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభించాలి. కానీ ఆరు నెలలుగా దాటుతున్నా జిల్లాలో రెండువేల మందికిపైగా లబ్ధిదారులు ఇంకా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో నిర్మాణాలు ప్రారంభించని వాటి రద్దుచేసి కొత్తవారికి కేటాయించేందుకు అంతటా సర్వే చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఎల్–1 కింద సొంత స్థలాలు ఉన్నవారు, ఎల్–2 కింద సొంత స్థలం కానీ ఇల్లు కాని లేనివారు, ఎల్–3 కింద ఇతరులు అని మూడు జాబితాలుగా అధికారులు నిర్ధారించి దరఖాస్తులు స్వీకరించారు. అప్పట్లో తమ పేర్లు ఎల్–1 కింద రావాల్సి ఉండగా ఎల్–2 కింద వచ్చాయని సరిచేసి ఎల్–1 కింద చేర్చాలని చాలామంది అధికారులకు అర్జీలు సమర్పించారు. ప్రస్తుతం నిర్మాణం మొదలుపెట్టని ఇళ్లను రద్దుచేసి నిర్మించుకునే వారికి ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. 67 శాతం ఇళ్ల పనులు ప్రారంభం జిల్లాలో మొతం 8,112 మందికి ఇళ్లు మంజూరు చేశారు. ఇందులో 5,494 మంది (67 శాతం) లబ్ధిదారులకు అధికారులు మార్క్ అవుట్ ఇవ్వగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. ఇందులో ఇప్పటి వరకు 72 ఇళ్లు నిర్మాణం పూర్తయినట్టుగా అధికారులు గుర్తించారు. మిగతా వాటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. కాని ఇప్పటి వరకు 2,618 లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదని అధికారులు గుర్తించారు. రద్దుకు అధికారుల సర్వే నిర్మాణాలు ప్రారంభించని ఇళ్ల రద్దు చేసేందుకు ఎంపీడీఓ, హౌసింగ్ ఏఈ, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో అధికారులు గుర్తిస్తున్నారు. తాము కట్టుకోలేని పరిస్థితి ఉందని లబ్ధిదారులు పేర్కొంటే వాటిని అధికారులు రద్దు చేస్తారు లేదా ప్రారంభించుకునేందుకు సిద్ధంగా ఉంటే మార్క్ అవుట్ ఇస్తారు. వచ్చే ఏడాది నిర్మించుకుంటామని పేర్కొంటే ప్రస్తుతం రద్దుచేసి వచ్చే ఏడాది మంజూరు చేయనున్నారు. రద్దు చేసిన ఇళ్లను నిర్మించుకునేందుకు సిద్ధంగా ఉన్న వారికి మంజూరు చేయనున్నారు. వచ్చే నెల మొదటి వారంలో రెండో విడత లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేయనున్నారు. బిల్లుల భయంతో అనాసక్తి నిర్మాణాలు చేపట్టినా బిల్లు రావన్న వదంతులు వినిపిస్తున్న కారణంగా చాలామంది ఇళ్ల నిర్మాణాలపై అనాసక్తి చూపుతున్నారు. తద్వారా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బేస్మెంట్ పూర్తయితే రూ.లక్ష, రూప్ లెవెల్‌కు రూ.లక్ష, ఆర్సీసీ పూర్తయితే రూ.2 లక్షలు నిర్మాణం పూర్తి చేసుకుని రంగులు వేశాక మరో రూ.లక్ష చొప్పున మొత్తం రూ.ఐదు లక్షలు చెల్లిస్తున్నారు. నిర్మించుకుని వివిధ దశలో ఉన్న లబ్ధిదారులకు డబ్బులను వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తున్నారు. -
చన్నీటిస్నానం.. పరుపులపై నిద్ర
హుజూర్నగర్ : హుజూర్‌నగర్‌లోని ఎస్సీ హాస్టల్లో 50 మంది విద్యార్ధులకు గాను ప్రస్తుతం 33మంది విద్యార్ధులు ఉన్నారు. ఈ హాస్టల్లో ఉన్న సోలార్ పవర్ ప్యానళ్లు పనిచేయడం లేదు. గీజర్ లేకపోవండతో విద్యార్దులు ఉదయం, సాయంత్రం వేళల్లో చన్నీళ్ల తోటే స్నానం చేస్తున్నారు. విద్యార్ధులకు దుప్పట్లు పంపిణీ చేసినప్పటికీ రగ్గులు, చలికోట్లు ఇవ్వకపోవడంతో చలికి వణకుతున్నారు. మంచాలు లేక నేలపైన పరులు వేసుకుని నిద్రిస్తున్నారు. అలాగే ఎస్టీ హాస్టల్లో 169 విద్యార్థులకు 132 మంది ఉన్నారు. చలికాలంలో పంపిణీ చేసే రగ్గులు, చలికోట్లు ఇంత వరకు పంపిణీ చేయలేదు. ఈ హాస్టల్‌కు హీటర్లు సప్లై చేయకపోవడంతో విద్యార్ధులు చలిలోనే చన్నీటితో స్నానాలు చేస్తున్నారు. -
తిరుమలగిరి బీసీ హాస్టల్లో మంచాలు లేక..
రెండు రోజులుగా చలి బాగా పెడుతోంది. హాస్టల్లో మంచాలు లేకపోవడంతో బండలపైన పడుకుంటున్నాం. ఉదయం పూట చన్నీళ్లతోనే స్నానం చేస్తున్నాము. మంచాలు, గీజర్లు ఏర్పాటు చేయాలి. – గౌతమ్ కృష్ణ, విద్యార్థి, బీసీ హాస్టల్, తిరుమలగిరితిరుమలగిరి(తుంగతుర్తి) : తిరుమలగిరిలోని బీసీ బాలురు, గిరిజన వసతి గృహాల్లో వేడి నీటితో స్నానం చేయడానికి గీజర్లు లేకపోవడంతో చలి నీళ్లతో స్నానం చేస్తున్నారు. బీసీ బాలుర హాస్టల్లో మంచాలు లేకపోవడంతో బండలపైనే పడుకుంటూ చలికి వణికిపోతున్నారు. -
లక్కీ లాటరీల పేరుతో మోసాలు చేయొద్దు
సూర్యాపేటటౌన్ : స్థిరాస్తి భూముల అమ్మకానికి లక్కీ లాటరీల పేరుతో ఆర్థిక మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో అక్కడక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మరికొంతమంది వ్యవస్థీకృతంగా ఏర్పడి రూ.వెయ్యి కట్టు, ప్లాట్ పట్ట్ఙు అంటూ లక్కీ లాటరీల పేరుతో స్థిరాస్తులు అమ్ముతున్నారని, ఇది చట్టపరంగా నేరమని పేర్కొన్నారు. పోలీసుల దృష్టికి రావడంతో ఇలాంటివి మోసపూరితమైన ఆర్థిక నేరమని కొందరిని హెచ్చరించామని, మళ్లీ ఇలాంటి నేరాలకు ఎవరైనా పాల్పడితే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని పేర్కొన్నారు. ఇలాంటి లాటరీలకు ప్రజలు డబ్బులు కట్టి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. వేతన సవరణ రిపోర్టు ప్రకటించాలిసూర్యాపేటటౌన్ : వేతన సవరణ కమిషన్ రిపోర్టును ప్రకటించి అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్.రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేటలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్.సోమయ్య అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన సవరణ కమిషన్ రిపోర్టును పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఎలను వెంటనే ప్రకటించాలని, రిటైరైన ఉద్యోగ, ఉపాధ్యాయుల పెన్షనరీ బెనిఫిట్స్, సరెండర్, టీఎస్జీఎల్ఐ, ఈ కుబేర్‌లో పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాస్‌రెడ్డి, కె.అరుణ భారతి, జిల్లా కోశాధికారి జి.వెంకటయ్య, జిల్లా కార్యదర్శులు ఆర్.దామోదర్, ఎన్.నాగేశ్వరరావు, బి.ఆడమ్, వెలుగు రమేష్, బాల సైదిరెడ్డి పాల్గొన్నారు. ఆధార్ కార్డుతో రావాలి సూర్యాపేట : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ఈనామ్ 2.0 ప్రారంభమవుతున్నందున పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు వచ్చే రైతులు తమ వెంట తప్పనిరిగా ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ తెచ్చుకోవాలని మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎండి.ఫసీయొద్దీన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు మార్కెట్ యార్డుకు వచ్చినప్పుడు గేట్ వద్ద లాట్ ఐడీ జనరేట్ చేసుకోవాలని కోరారు. మట్టపల్లి క్షేత్రంలో పంచామృతాభిషేకంమఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం విశేష పూజలు కొనసాగాయి. ఈ సందర్భంగా శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల నిత్యకల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని క్షేత్రంలోని శివాలయంలో గల శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామికి పంచామృతాభిషేకం, పూజలు, ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఇన్చార్జి ఈఓ బి.జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, ఆంజనేయాచార్యులు, దుర్గాప్రసాద్‌శర్మ, భక్తులు పాల్గొన్నారు. -
పత్తి కొనుగోళ్లు బంద్!
భానుపురి (సూర్యాపేట) : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తీరుతో జిల్లాలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ ఏడాది వరుసగా తీసుకొస్తున్న నిబంధనలు, కొర్రీల కారణంగా మిల్లర్లు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మిల్లర్లు, ప్రభుత్వం, సీసీఐ అధికారుల నడుమ ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగి.. ఇటీవలే సీసీఐ కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లు జరుపుతున్నారు. తాజాగా ఎకరానికి 7 క్వింటాల పత్తి దిగుమతి, తేమ శాతంలో కొర్రీల కారణంగా నెలకొంటున్న ఇబ్బందుల దృష్ట్యా నిబంధనలు సడలించాలన్న మిల్లర్ల విజ్ఞప్తిని సీసీఐ పట్టించుకోకపోవడంతో మిల్లర్ల అసోసియేషన్ కొనుగోళ్లను నిలిపివేసింది. దీంతో అధికార యంత్రాంగం రైతన్నలను అప్రమత్తం చేసి.. నేటినుంచి అమ్మకానికి రావొద్దంటూ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో ప్రకటనలు విడుదల చేసింది. 6వ తేదీ నుంచే బంద్‌కు పిలుపు..! వీటికి తోడు జిల్లాలోని అన్ని పత్తి మిల్లుల్లో సీసీఐ కేంద్రాలను ఒకేసారి తెరవకుండా దశలవారీగా తెరవాలని ఆదేశాలిచ్చారు. జిల్లాలో ఆరు జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలుగా ఏర్పాటు చేయగా.. వీటిని ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3, ఎల్ 4, ఎల్ 5, ఎల్ 6గా విభజించారు. ఇందులో ప్రస్తుతం ఎల్ 1, ఎల్ 2గా ఉన్న సూర్యాపేట సమీపంలోని బాలెంల, తిరుమలగిరి సీసీఐ కేంద్రాల్లోనే పత్తిని కొనుగోలు చేస్తున్నారు. వీటిల్లో కొనుగోలు సామర్థ్య పూర్తయ్యాకే మిగతా వాటిని తెరవాలంటూ సీసీఐ ఆంక్షలు విధించింది. దీంతో రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాటన్ మిల్లు యాజమాన్యాలకు పత్తి రైతులతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో నేటి నుంచి రాష్ట్ర కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ కొనుగోళ్లను నిలిపివేయాలని నిర్ణయించింది. వాస్తవంగా ఈనెల 6 నుంచే కొనుగోళ్లు నిలిపివేస్తామని అసోసియేషన్ ప్రకటిస్తే బిహార్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రి అందుబాటులో లేరని, కొద్దీ సమయం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. దీంతో తమ మూసివేతను తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే ఆ తర్వాత కూడా వీరి ఆందోళనను పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో మరోసారి ఆందోళనకు సిద్ధమవుతూ కొనుగోళ్లను సోమవారం నుంచి నిలిపివేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం స్పందించి సీసీఐ తీరును సరిదిద్ది పత్తి కొనుగోళ్లు కొనసాగేలా చూడాలని రైతులు, రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఫ నేటినుంచి మూతపడనున్న సీసీఐ కేంద్రాలు ఫ సీసీఐ నిబంధనలు సడలించే వరకూ ఇదే పరిస్థితి ఫ కొర్రీలతో కాటన్ మిల్లర్ల అసోసియేషన్ నిర్ణయం ఫ అమ్మకానికి పత్తిని తీసుకు రావొద్దని అధికారుల ప్రకటన జిల్లాలో 2025–26 సీజన్లో సుమారుగా 93వేల ఎకరాల్లో పత్తి సాగైంది. తుపాన్ కారణంగా కొంత పత్తి తడిసినా.. ఎక్కడా నష్టం వాటిల్లలేదు. దిగుబడి బాగానే రావడంతో రైతులు మద్దతు ధర ఒక్కటీ వస్తే లాభపడతామని సంబురపడ్డారు. ఈ తరుణంలో సీసీఐ పత్తి కొనుగోళ్ల విషయంలో మొదటినుంచి కొర్రీలు పెడుతూ కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నిబంధనలతో ఓ వైపు రైతులు, మరోవైపు జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పత్తి పంట చేతికొచ్చే సమయంలో కొనుగోళ్లకు కొత్తగా కపాస్ యాప్ పెట్టి అందులో నమోదైన రైతుల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ఇందుకు కొంత సమయం పట్టడంతో ఆలస్యంగా సీసీఐ కేంద్రాలను ప్రారంభించారు. అటు తర్వాత రైతులు ముందుగా స్లాట్‌బుక్ చేసుకుంటేనే.. కొనుగోలు చేస్తామని, అదీ ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తినే కొంటామన్న మరో కఠిన నిబంధన అమలులోకి తెచ్చారు. -
యాదాద్రిలో ఏకాదశి పూజలు
యాదగిరిగుట్ట: పంచ నారసింహులు కొలువైన యాదగిరి క్షేత్రంలో కార్తీక ఏకాదశి సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ప్రధానాలయ ముఖ మండపంలో యజ్ఞమూర్తులను కొలుస్తూ, వేద మంత్రాలు పఠిస్తూ తీరొక్క పూలు, తులసీ దళాలతో ఆగమశాస్త్రం ప్రకారం లక్ష పుష్పార్చన చేశారు. వేకువజామున సుప్రభాత సేవ, స్వయంభూలకు అభిషేకం, సహస్రనామార్చన, సుదర్శన హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తుల నిత్య తిరుకల్యాణోత్సవం తదితర నిత్యారాధనలు, దైవదర్శనాలతో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. కొంద కింద మండపంలో దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. -
వయోవృద్ధులకు సముచిత స్థానం కల్పించాలి
సూర్యాపేట అర్బన్ : సమాజంలో వయోవృద్ధులకు సముచిత స్థానం కల్పించాలని జిల్లా సంక్షేమ అధికారి కె. నరసింహారావు అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాల సందర్భంగా శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన వయోవృద్ధుల ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ గాంధీ పార్క్ నుంచి మినీ ట్యాంక్ బండ్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వయోవృద్ధులైన తల్లి దండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత వారి పిల్లలదే అన్నారు. తల్లిదండ్రుల సంరక్షణలో నిర్లక్ష్యం వహించే వారిపై చట్ట పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో వయోవృద్ధుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హమీద్ ఖాన్, సభ్యులు కృష్ణారెడ్డి, రామకృష్ణారెడ్డి, కాకి మల్లారెడ్డి, సీడీపీఓలు సుబ్బలక్ష్మీ, కిరణ్మయి, శ్రీజ, సూపర్ వైజర్ వినోద్‌కుమార్ పాల్గొనారు. వృద్ధులకు ఆటల పోటీలు మునగాల : మండలంలోని ముకుందాపురం శివారులో గల ఇందిర అనాథ వృద్ధాశ్రమంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వృద్ధులకు శని వారం ఆటలు, పాటల పోటీలు నిర్వహించారు. వృద్ధులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందించా రు. కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకురాలు నాగిరెడ్డి విజయమ్మ, కోఆర్డినేటర్ వాచేపల్లి జ్యోతి, సిబ్బంది పాల్గొన్నారు. ఫ జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు -
ఐదేళ్లక్రితం దరఖాస్తు
ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ఆవుల స్వర్ణ మానసిక దివ్యాంగురాలు. ఆమె సదరం సర్టిఫికెట్లో 100 శాతం వైకల్యం ఉన్నట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. దివ్యాంగుల పింఛన్ కోసం ఐదేళ్ల క్రితం గ్రామపంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. కానీ పింఛన్ మంజూరు కాలేదు. తన కూతురికి పింఛన్ ఇప్పించాలని కోరుతూ ఆమె తండ్రి ఆవుల సింహాద్రి ఏడాది కిందట సూర్యాపేట కలెక్టరేట్లో కూడా అర్జి అందించాడు. ఏళ్లు గడుస్తున్నాయే కానీ పింఛన్ మంజూరు కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
టెట్‌కు యువత సిద్ధం
సూర్యాపేటటౌన్ : టీటీసీ, బీఈడీ పూర్తి చేసిన వారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. శనివారం నుంచి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉద్యోగం రావాలంటే టెట్ క్వాలిఫై కావాల్సి ఉండడంతో అభ్యర్థులు భారీ సంఖ్యలోనే దరఖాస్తు చేసుకోనున్నారు. అందుకు గానూ జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరిలో పరీక్ష రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులుగా స్థిరపడాలనుకునే వారు టెట్‌కు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం కూడా శనివారం నుంచి టెట్‌కు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించింది. ఈ నెల 29 వరకు టెట్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 31 తేదీల మధ్య ఆన్లైన్లో టెట్ నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధ మవుతున్నారు. 8వేల వరకు దరఖాస్తులు గతేడాది జూన్ 18 నుంచి 30 వరకు టెట్ పరీక్ష నిర్వహించారు. నిబంధనల మేరకు సరిగ్గా ఆరు నెలల వ్యవధిలో వచ్చే ఏడాది జనవరిలో పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత టెట్ పరీక్షకు జిల్ల నుంచి 5వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రస్తుతం అభ్యర్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో డీఎడ్, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు సుమారు 6వేల మంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరందరూ టెట్ పరీక్షకు దరఖాస్తులు చేసుకోనున్నారు. దీంతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా టెట్ క్వాలిఫై కావాల్సిందేననే ప్రభుత్వ ఉత్వర్వుల మేరకు వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. గతంలో టెట్ క్వాలిఫై అయిన వారు మార్కులు మెరుగు పర్చుకునేందుకు మళ్లీ టెట్ రాసే అవకాశం ఉంది. దాంతో హాజరయ్యే వారి శాతం పెరుగనుంది. ఈ సారి జిల్లాలో అభ్యర్థులు, టీచర్లు కలిపి 8 వేల మంది వరకు టెట్‌కు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉపాధ్యాయులకు టెట్ భయం.. డీఎస్సీ 1995 నుంచి మొన్నటి డీఎస్సీ 2024 వరకు ఉపాధ్యాయులుగా నియమితులైన వారు టెట్ క్వాలిఫై కావాల్సిందేనని ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో మొత్తం 3800 మంది ఉపాధ్యాయులు ఉండగా ఇందులో 1800 మంది వరకు టెట్ క్వాలిఫై కలిగిన వారు ఉండగా మిగిలిన 2వేల మంది టెట్ అర్హత సాధించాల్సి ఉంది. ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్ సర్వీస్ టీచర్లు తప్పక పరీక్ష రాయాల్సిందేనని తేల్చిచెప్పింది. దాంతో ఉపాధ్యాయుల్లో ప్రస్తుతం టెట్ భయం పట్టుకుంది. ఇన్ సర్వీస్‌లో ఉన్న ఎస్టీజీటీలు పేపర్– 1, స్కూల్‌అసిస్టెంట్లు పేపర్– 2 రాయాల్సి ఉంది. అయితే ఎంత మంది ఉపాధ్యాయులు టెట్‌కు దరఖాస్తు చేసుకుంటారో చూడాల్సిందే. జిల్లాలో బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులు టెట్‌కు సన్నద్ధమవుతున్నారు. వారంతా ఇప్పటికే టెట్ రాసేందుకు కోచించ్ సెంటర్లను ఆశ్రయించారు. మరి కొందరు గ్రంథాలయాల్లో, ఇంటివద్ద సొంతంగా ప్రిపేర్ అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనుందనే ఊహాగానాల నేపథ్యంలో చాలా మంది టెట్‌లో స్కోరింగ్ మార్కులు తెచ్చుకోవాలనే తపనతో ప్రిపేర్ అవుతున్నారు. ఫ ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ ఫ 29వరకు తుది గడువు ఫ నిరుద్యోగుల్లో కొత్త ఉత్సాహం ఫ టీచర్లకు ఉత్తీర్ణత భయం ఫ ఈసారి పెరుగనున్న దరఖాస్తుల సంఖ్య -
మందులు కొనడానికి పైసల్లేవ్
మాది నిరుపేద కుటుంబం. కూలి పనులకు వెళ్తే గానీ కుటుంబం గడవదు. ఐదేళ్ల క్రితం వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న. కానీ నేటికీ మంజూరు కాలే. ఆరోగ్యం బాగాలేక రోజూ మందులు వేసుకోవాల్సి వస్తుంది. కూలికి వెళ్తే గాని మాత్రలు కొనలేని పరిస్థితి. పింఛన్ వస్తే కనీసం మందులకు ఆసరా అవుతాయని పలుమార్లు అధికారుల దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్న. కానీ ఇప్పటివరకు పింఛన్ మంజూరు చేయలే. బొడ్డు లచ్చమ్మ, ఆత్మకూర్(ఎస్) ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు మండల పరిషత్ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని గుర్తించి మంజూరు చేస్తాం. అప్పారావు, డీఆర్డీఓ, సూర్యాపేట -
తూకంలో తేడాలున్నాయని రైతుల ఆందోళన
నేరేడుచర్ల : మండలంలోని చిల్లేపల్లి వద్ద ఉన్న రైస్ మిల్లులో ధాన్యం ఒక్కో ట్రాక్టర్‌కు 95కిలోలు తక్కువగా వస్తున్నాయంటూ శనివారం రైతులు ఆందోళన నిర్వహించారు. రైతు కొండ ముసలయ్య చిల్లేపల్లి వద్ద గల రైస్ మిల్లుకు ట్రాక్టర్లో ధాన్యం తేగా మిల్లు ఆవరణలో ఉన్న వేబ్రిడ్జిలో తూకం వేస్తే 7,880 కిలోలు వచ్చింది. దాంతో ఆయన తన ట్రాక్టర్‌ను మరో మిల్లుకు తీసుకెళ్లి తూకం వేయగా 7,975 కిలోలు వచ్చింది. ఈ విషయమై రైతులు మిల్లు వద్ద ఆందోళన నిర్వహించారు. ఎస్ఐ రవీందర్‌నాయక్ విచారణ నిర్వహించారు. తూనికలు కొలతల అధికారితో తూకంలో తేడాను నిర్ధారించి రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. -
లోకల్ టు గ్లోబల్
ప్రతిష్టాత్మకమైన ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై కోదాడ యువకుడికి చోటు లభించింది.- 10లోడీఎంహెచ్ఓగా వెంకటరమణ బాధ్యతలుసూర్యాపేటటౌన్ : జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిగా డాక్టర్ పెండెం వెంకటరమణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం జిల్లా ప్రోగ్రాం అధికారిగా పని చేస్తున్న ఆయనను పదోన్నతిపై సూర్యాపేట డీఎంహెచ్‌ఓగా ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు చేపట్టిన వెంకటరమణను ఉద్యోగులు, సిబ్బంది సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవా ర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
23న నేషనల్ మీన్స్‌కం మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్‌ను ఈ నెల 23న నిర్వహించనున్నట్లు డీఈఓ కె.అశోక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1,262 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానుండగా వారికి సంబంధించిన హాల్‌టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. సూర్యాపేటలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, సిటీ హైస్కూల్, ప్రభుత్వ నం–2 ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఎంఏఎం పాఠశాల, కోదాడలోని కేబీఎస్‌ఎస్ జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల, ఎస్టీ జోసెఫ్ హైస్కూల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏది అక్రమ విజయంసూర్యాపేట అర్బన్ : బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రజల మధ్య కులం, మతోన్మాదం పేరుతో విద్వేశాలు సృష్టించి, అధికార యంత్రంగాన్ని వినియోగించుకొని అక్రమ పద్ధతిలో విజయం సాధించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. శనివారం సూర్యాపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధాని మోదీ, హోం మంత్రితో సహా ఎన్డీఏ నేతలు ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చి లబ్ధి పొందారని, దుర్మార్గమైన వారి ఎత్తుగడలకు కార్పోరేట్ మీడియా పూర్తి సహకారం అందించిందన్నారు. బిహార్‌లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న 85 లక్షల మంది ఓట్లను తొలగించిందన్నారు. బీజేపీ రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, నాయకులు మట్టిపల్లి సైదులు, కోట గోపి పాల్గొన్నారు. సకాలంలో సిలబస్ పూర్తి చేయాలి నడిగూడెం : ఇంటర్ సిలబస్‌ను త్వరగా పూర్తి చేయాలని డీఐఈఓ వి.భానునాయక్ ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభు త్వ జూనియర్ కళాశాల, కరివిరాల మోడల్ స్కూల్‌ను ఆయన తనిఖీ చేశారు. తరగతి గదులు, ల్యాబ్‌ను పరిశీలించారు. విద్యార్థులు, అధ్యాపకుల హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమై పలు అంశాలపై సూచనలు చేశారు. వార్షిక పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలన్నారు. ప్రాక్టికల్స్‌ను పకడ్బందీగా నిర్వహించాలని, అధ్యాపకులు సమయ పాలన పాటించాలని సూచించారు. ఉదయం స్టడీ అవర్స్ నిర్వహించి, చదువులో వెనుకబడిన విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఆయన వెంట ప్రిన్సిపాల్స్ డి.విజయనాయక్, సాయి ఈశ్వరి, అధ్యాపకులు ఉన్నారు. నేడు సూర్యక్షేత్రంలో కార్తీక వనభోజనాలు అర్వపల్లి : కార్తీక మాసం సందర్భంగా తిమ్మాపురం శివారులోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో ఆదివారం కార్తీక వన భోజనాల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా క్షేత్రంలో ప్రత్యేక పూజలు జరుపనున్నట్లు క్షేత్ర వ్యవస్థాపకురాలు కాకులారపు రజితజనార్దన్‌స్వామి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించి వనభోజన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. -
తిరుమలగిరి ఎస్ఐ అటాచ్?
తిరుమలగిరి ( తుంగతుర్తి): విధుల్లో అలసత్వం ప్రదర్శించడంతో తిరుమలగిరి ఎస్ఐ సీహెచ్. వెంకటేశ్వర్లును ఎస్పీ కార్యాలయానికి గురువారం అటాచ్ చేసినట్లు తెలిసింది. వెంకటేశ్వర్లు మార్చి 13న తిరుమలగిరిలో బాధ్యతలు స్వీకరించారు. వచ్చినపప్పటి నుంచి సివిల్ వివాదాలు, కుటుంబ పంచాయతీలలో తల దూర్చి ఇరువురి నుంచి మధ్య వర్తుల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీస్ స్టేషన్ లో సిబ్బందితో సఖ్యతగా లేనట్లు తెలుస్తోంది. వెంకటేశ్వర్లు కంటే ముందు పనిచేసిన ఎస్ఐ సురేష్ పీడీఎస్ బియ్యంకేసులో బాధితుడి నుంచి డబ్బులు వసూలు చేస్తూ కానిస్టేబుల్ తో సహా పట్టుబడ్డారు. తిరుమలగిరి పోలీస్‌స్టేషన్ కు వస్తున్న అధికారుల తీరుతో వరుస సంఘటనలు జరుగుతున్నా అధికారులు, సిబ్బందిలో మార్పు రావడంలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ధైర్యం కల్పించడమే ధ్యేయంసూర్యాపేటటౌన్ : వేధింపులకు గురైన మహిళలు, బాలలకు నైతిక ధైర్యం కల్పించడమే పోలీస్ భరోసా సెంటర్ ధ్యేయమని జిల్లా ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ భరోసా సెంటర్, షీ టీమ్స్ కార్యాలయాన్ని ఎస్పీ పరిశీలించారు. మహిళలు, పిల్లల రక్షణకు తీసుకుంటున్న చర్యలు, కౌన్సిలింగ్ నిర్వహణ, అవగాహన కార్యక్రమాలను పరిశీలించి సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. ఎవరైనా వేధింపులకు గురిచేస్తే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరారు. సాంకేతికత ఆధారాలతో నాణ్యమైన దర్యాప్తును చేస్తున్నామని, ఫాస్ట్ ట్రాక్ లో మాదిరిగా నేరాల్లో త్వరగా శిక్షలు అమలయ్యేలా పోలీస్‌శాఖ పని చేస్తోందన్నారు. ఎస్పీ వెంట భరోసా సెంటర్ మహిళా ఏఎస్ఐ సైదావి, సిబ్బంది ఉన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి కృషినేరేడుచర్ల : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా మత్స్యశాఖ అధికారి నాగులు పేర్కొన్నారు. గురువారం నేరేడుచర్ల మండలం పెంచికల్దిన్నలోని చెరువులో ఎంపీడీఓ సోమసుందర్రెడ్డితో కలిసి చేప పిల్లలు వదిలారు. అనంతరం నాగులు మాట్లాడుతూ చేపల పెంపకం తో జీవనోపాధి దొరుకుతుందన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు రోజా, సుమలత, సతీష్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఆర్కే, నాగరాజు, సైదులు, హరిబాబు, నాగేశ్వర్రావు, శ్రీధర్, నాగయ్య, లచ్చయ్య, మట్టయ్య, వెంకటయ్య, రాంబాబు పాల్గొన్నారు. ఎంజీయూ పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదలనల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో పీజీ రెండవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం ఎంజీయూ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ విడుదల చేశారు. సెప్టెంబర్‌లో నిర్వహించిన పరీక్షలకు 1,160 మంది విద్యార్థులు హాజరు కాగా 794 మంది ఉత్తీర్ణత సాధించినట్లు సీఓఈ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపర్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ అలువాల రవి, డెవలప్మెంట్ డైరెక్టర్ ఆకుల రవి, లక్ష్మీప్రభ, సంధ్యారాణి పాల్గొన్నారు. -
దేశభక్తిని పెంపొందించడంలో పటేల్ పాత్ర మరువలేనిది
సూర్యాపేట : దేశభక్తిని పెంపొందించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర మరువలేనిదని ఎంపీ కేశ్రీ దేవ్ సిన్హాజ్వాల కొనియాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా గురువారం సూర్యాపేట జూనియర్ కళాశాల మైదానంలో సర్దార్ @ 150 యూనిటీ మార్చ్‌ను ఆయన ప్రారంభించారు. పటేల్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అధికారులు, విద్యార్థులు ,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, సూర్యాపేట ఆర్డీఓ వేణు మాధవ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, తహసీల్దార్ కృష్ణయ్య, యూత్ కో–ఆర్డినేటర్ రాజేష్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి భానునాయక్ పాల్గొన్నారు. -
‘నీ వాహనం వేగంగా వెళుతుంది.. కానీ నీ జీవితం ఆగిపోతుంది’..
చిట్యాల: హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పక్కన చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో పోలీసులు వినూత్న రీతిలో హోర్డింగ్ ఏర్పాటు చేశారు. శ్రీనీ వాహనం వేగంగా వెళుతుంది.. కానీ నీ జీవితం ఆగిపోతుందిశ్రీ అని హోరింగ్పై పెద్ద అక్షరాలతో రాయించారు. దాని కింద శ్రీఎవ్రీ లైఫ్ కౌంట్–నల్లగొండ పోలీస్ కేర్శ్రీ అని రాసి ఉంది. అంతేకాకుండా.. రోడ్డు ప్రమాదానికి గురై తుక్కుగా మారిన కారును కూడా హోర్డింగ్‌కు ప్రత్యేకంగా అమర్చారు. ఈ హోర్డింగ్.. హైవే మీద ప్రయాణించే వారికి ఒక కిలోమీటర్ దూరం నుంచే కనిపించేలా 25ఫీట్ల ఎత్తులో ఏర్పాటు చేశారు. భారీ హోర్డింగ్‌ను గురువారం నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రారంభించారు. హైవేపై అతివేగంగా వెళ్లే వాహనదారులను హెచ్చరించేందుకు ఈ హోర్డింగ్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ప్రతి ఒక్క వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, రహదారి వెంట ఏర్పాటు చేసిన ప్రమాద సూచికలకు అనుగుణంగా నియమిత వేగంతో ప్రయాణిస్తూ గమ్యాన్ని చేరుకోవాలన్నారు. -
ప్రమాదాల నివారణ మార్గం
సూర్యాపేటటౌన్ : జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులపై నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి ఆ కుటుంబం చిన్నాభిన్నమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాలను కొంతవరకై నా నివారించాలనే ఉద్దేశంతో ఎస్పీ నరసింహ ప్రత్యేక చొరవతో 43 రోడ్డు భద్రతా కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు బ్లాక్ స్పాట్స్ వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాహనదారులకు అవగాహన కల్పించడంతో పాటు ప్రమాదం జరిగితే వెంటనే స్పందించేలా ప్రణాళిక రూపొందించారు. బ్లాక్ స్పాట్స్ ఇవీ.. జిల్లా వ్యాప్తంగా జాతీయ, గ్రామీణ రహదారులపై మొత్తం 43 బ్లాక్ స్పాట్లను పోలీసులు గుర్తించారు. వీటిలో.. ● ఎన్‌హెచ్ 65పై టేకుమట్ల నుంచి రామారం రోడ్డు వరకు 23 బ్లాక్ స్పాట్స్ ● ఎన్‌హెచ్ 167పై కోదాడ నుంచి చిల్లెపల్లి బ్రిడ్జి వరకు ఐదు బ్లాక్ స్పాట్స్ ● ఎన్‌హెచ్ 365పై అర్వపల్లి నుంచి బిక్కుమళ్ల వరకు ఒకటి ● ఎన్‌హెచ్ 365 బిపై జనగామ ఎక్స్ రోడ్డు నుంచి తిరుమలగిరి(ఈదులపర్రెతండా )వరకు ఏడు బ్లాక్ స్పాట్స్ ● ఎన్హచ్ 365పై టేకుమట్ల నుంచి మోతె వరకు నాలుగు బ్లాక్ స్పాట్స్ ● ఎన్‌హెచ్ 930పై తిరుమలగిరి బిగ్గేరు వాగు నుంచి మామిడాల క్రాస్ రోడ్డు వరకు మూడు బ్లాక్ స్పాట్స్ ఒక్కో కమిటీలో 11 మంది 43 బ్లాక్ స్పాట్ల వద్ద 43 రోడ్డు భద్రత కమిటీలను వారం పది రోజుల క్రితం ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో 11 మంది ఉన్నారు. వీరిలో స్థానిక పోలీస్ ఒకరు, రిటైర్డ్ టీచర్ ఒకరు, మహిళా ప్రతినిధులు ఇద్దరు, వ్యాపారుల నుంచి ఇద్దరు, స్వచ్ఛంద సంస్థల నుంచి ఇద్దరు, యూత్ ఆర్గనైజేషన్ నుంచి ఇద్దరు, రహదారుల సంస్థ ప్రతినిధుల నుంచి ఒకరు ఉన్నారు. ఈ కమిటీలు బ్లాక్స్పాట్ల వద్ద యాక్సిడెంట్లు జరగకుండా చర్యలు చేపడతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. పోలీసుల సూచనలు ● అతివేగంగా, నిద్రమత్తులో వాహనాలు నడపవద్దు. ● రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపవద్దు. ● హెల్మెట్, సీట్ బెల్ట్ విధిగా ధరించాలి. ● వాహన సామర్థ్యానికి మించి ప్రయాణికులను తీసుకెళ్లవద్దు. ● పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దు. ● మద్యం మత్తులో వాహనాలు నడపరాదు. ● ఓవర్టేక్ చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. ● రాంగ్రూట్లో వాహనాలు నడపవద్దు. ● వాహనాలకు లైటింగ్, సైడ్ మిర్రర్స్ ఉండాలి. ● డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు కమిటీలు ఏర్పాటు చేశాం. ఈ కమిటీల ద్వారా ప్రజలు, వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే ఈ కమిటీలు స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు ప్రథమ చికిత్స అందించడం, అంబులెన్స్‌లకు ఫోన్లు చేయడంలాంటి పనులు చేస్తున్నాయి. – కె.నరసింహ, జిల్లా ఎస్పీ, సూర్యాపేట హైవేలు, గ్రామీణ రహదారులపై 43 బ్లాక్ స్పాట్ల గుర్తింపు ఫ 43 రోడ్డు భద్రతా కమిటీల ఏర్పాటు ఫ ఒక్కో కమిటీలో 11మంది ఫ బ్లాక్స్పాట్ల వద్ద వాహనదారులకు అవగాహన సదస్సులు -
42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
సూర్యాపేట : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ చలమళ్ల నర్సింహ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రాజా, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు సూర్యాపేట వాణిజ్య భవన్ సెంటర్లో నిర్వహించిన బీసీల ధర్మ పోరాట దీక్షలో వారు పాల్గొని మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా వచ్చేవరకు పార్టీలకతీతంగా బీసీ కులసంఘాలు, ప్రజా సంఘాలు ఏకమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తలమల్ల హసేన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా నాయకుడు మట్టపల్లి సైదులు, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు గట్ల రమాశంకర్, నిద్ర సంపత్ నాయుడు, బండపల్లి శ్రీనివాస్ గౌడ్, బండారి డేవిడ్ కుమార్, డాక్టర్ బంటు కృష్ణ, భయ్యా మల్లికార్జున్, బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, నారా బోయిన వెంకట్ యాదవ్, రేణి కుంట్ల నరేందర్, కందాల భాస్కర్, జెల్లీ సత్యనారాయణ, సలిగంటి నాగయ్య, గిలకత్తుల నాగమణి, అమరవాది శ్రావణి, ఆకుల లవకుశ, నేరెళ్ల మధు, కోడి లింగ యాదవ్, కోడిదల రాంబాబు, దాసరి దేవయ్య, కొండగడపల సూరయ్య పాల్గొన్నారు. ధర్మ పోరాట దీక్షలో పాల్గొన్న బీసీ జేఏసీ, ఇతర సంఘాల నాయకులు -
మూడు వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్
సూర్యాపేట : జిల్లాలో 2025–26 సంవత్సరానికి 3వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ వెల్లడించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో పీఏసీఎస్ అధ్యక్ష, కార్యదర్శులు, ఉద్యాన, వ్యవసాయ, సహకార శాఖల అధికారులతో ఆయిల్ పామ్ సాగుపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఇప్పటి వరకు 2,011 ఎకరాలను గుర్తించి 1,139 ఎకరాలకు సబ్సిడీ మంజూరు చేయగా 696 ఎకరాల్లో మొక్కలు నాటినట్లు వివరించారు. అధిక లాభాలు చేకూర్చే ఆయిల్ పామ్ పంటను రైతులు సాగు చేసేలా చూడాలని కలెక్టర్ కోరారు. అనంతరం హార్టికల్చర్ టెక్నికల్ అధికారి మహేష్ పీపీటీ ద్వారా ఆయిల్ పామ్ సాగుకు సంబంధించిన అంశాలను వివరించారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి ప్రవీణ్, ఉద్యానవన అధికారి నాగయ్య, జిల్లా వ్యవసాయ అధికారి నివేదిత, నాబార్డ్ డీడీఎం వినయ్ కుమార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అంజయ్య, పీఏసీఎస్ అధ్యక్షులు, కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి సూర్యాపేటను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో డ్రగ్స్ నార్కోటిక్పై ఎస్పీ నరసింహతో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో మాట్లాడారు. డ్రగ్స్, మత్తు పదార్థాల వల్ల విద్యార్థుల జీవితాలు ఎలా పాడవుతున్నాయో తెలియజేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎస్పీ కె. నరసింహ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖలు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, డీఎఫ్ఓ సతీష్ కుమార్,డీఆర్డీఓ వి.వి. అప్పారావు, సీ్త్ర, శిశు సంక్షేమ అధికారి నరసింహారావు, డీఎస్పీ ప్రసన్నకుమార్, ఆబ్కారీ సూపరింటెండెంట్ లక్ష్మా నాయక్, డీపీఓ యాదగిరి, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సురేందర్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి భాను నాయక్, విద్యాశాఖ కోఆర్డినేటర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ఈసారి వారోత్సవాలు లేనట్టేనా?
చిలుకూరు: ఎంతో చర్రిత కలిగిన చిలుకూరు బాపూజీ శాఖా గ్రంథాలయంలో ఈ ఏడాది కూడా వారోత్సవాలు లేనట్టే కనిపిస్తోంది. శుక్రవారం నుంచి జరగాల్సిన వారోత్సవాలకు ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. గత ఏడాది కూడా ఉత్సవాలు నిర్వహించలేదు. అష్టాంధ్రమహాసభకు చిలుకూరు గ్రంథాలయం వేదికగా నిల్చింది. రెండేళ్ల క్రితమే నూతన భవనం నిర్మించారు. ఒకప్పుడు గ్రంథాలయ వారోత్సవాలు వచ్చాయంటే చిలుకూరులో పండుగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించేవారు. ఉదయం, సాయంత్ర వేళలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేవారు. ప్రముఖలతో సమావేశాలు ఏర్పాటు చేసేవారు. విద్యార్థులకు క్రీడా పోటీలు, మహిళలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు ఇచ్చేవారు. అలాంటి గ్రంథాయలం నేడు ఎలాంటి కార్యక్రమాలకు నోచుకోవడం లేదు. ఈ గ్రంథాలయానికి ప్రస్తుతం ఇన్చార్జి గ్రంథాలయ అధికారి ఉన్నారు. ఒక అటెండర్ ఉన్నారు. ఇప్పటికై నా ఈ గ్రంథాలయానికి పూర్వవైభం తేవాలని పాఠకులు కోరుతున్నారు.ఫ రెండేళ్లుగా వారోత్సవాలకు నోచని చిలుకూరు గ్రంథాలయం -
1.44లక్షలకు 13వేలే వచ్చాయి
నేరేడుచర్ల : ఉచిత చేప పిల్లల పంపిణీలో అవకతవకలు జరిగాయని నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి సహకార సంఘం సభ్యులు గురువారం ఆందోళనకు దిగారు. 1.44 లక్షల చేప పిల్లలకుగాను 13వేలు మాత్రమే వచ్చాయని పంపిణీ ప్రక్రియను అడ్డుకొని లారీని వెనక్కి పంపించారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు మాట్లాడుతూ చిల్లేపల్లి ఊర చెరువులో పోసేందుకు 1.44లక్షల చేప పిల్లలు పంపిణీ చేయాల్సి ఉందని, అయితే చేప పిల్లలతో లారీ రాగా అనుమానం వచ్చి డ్రమ్ములను పరిశీలించామన్నారు. ఒక్కో డ్రమ్ములో 1,300 చేప పిల్లల చొప్పున 10 డ్రమ్ముల్లో కలిపి 13వేలు మాత్రమే వచ్చాయన్నారు. దీంతో ఆ లారీని వెనక్కి పంపించామన్నారు. ఇప్పటికై నా అధికారులు చొరవ తీసుకొని తమ చెరువుకు కేటాయించిన చేప పిల్లలన్నింటినీ పంపించాలని కోరారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ నల్లమేకల వెంకయ్య, కార్యదర్శి పిట్టల గోవిందు, ఉపాధ్యక్షుడు బయ్య నర్సయ్య, సభ్యులు లచ్చయ్య, నాగరాజు, కృష్ణా, శంకర్ తదితరులు పాల్గొన్నారు. చేపపిల్లల పంపిణీలో అవకతవకలు ఫ చిల్లేపల్లి సహకార సంఘం సభ్యుల ఆందోళన బాట ఫ లెక్కతేల్చి చేపల లారీని వెనక్కి పంపిన సభ్యులు -
రోడ్డు భద్రతకు ప్రాధాన్యమివ్వాలి
భానుపురి (సూర్యాపేట): రోడ్డు భద్రతకు అధికారులు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో ఎస్పీ నరసింహతో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జాతీయ, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రహదారులపై ప్రమాదాలు జరగకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఎక్కువగా భద్రతా వైఫల్యం, రోడ్లు సరిగా లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదాలు ఎక్కువగా ఎక్కడ జరుగుతున్నాయో ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ అధికారులు గుర్తించి వారం రోజుల్లో మరమ్మతులు చేయించాలన్నారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి రేడియం స్టిక్కర్లు, స్టడ్స్ లైట్స్, బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. నేషనల్ హైవేలపై ప్రమాదాలు జరిగే చోట, సర్వీస్ రోడ్ల వెంట సూచిక బోర్డులు, డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని, 22చోట్ల ముందుజాగ్రత్తలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేవంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి మాధవి, డీపీఓ యాదగిరి, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్ అధికారులు, ఆర్ అండ్‌బీ అధికారులు, నేషనల్ హైవే అధికారి రత్న కుమార్ పాల్గొన్నారు. -
వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి
సూర్యాపేట : అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా వారోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం సీనియర్ సిటిజన్స్‌తో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. నవంబర్ 12 నుంచి 19 వరకు నిర్వహించే వారోత్సవాల్లో పోస్టర్ల ఆవిష్కరణ, జిల్లాస్థాయిలో వృద్ధుల చట్టాలపై అవగాహన, వృద్ధాశ్రమాల్లో ఆటల పోటీలు, సీనియర్ సిటిజన్స్ హక్కులపై అవగాహన ర్యాలీ నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, జిల్లా సంక్షేమ అధికారి కె.నరసింహారావు, వయో వృద్ధుల కమిటీ మెంబర్లు, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, సభ్యులు, జి.విద్యాసాగర్, హమీద్‌ఖాన్, రాంబాబు, కృష్ణారెడ్డి, కిరణ్మయి, జావిద్ ఖాన్, వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
‘తెలామిన్’.. పశుపోషకులకు వరం
కోదాడరూరల్ : రాష్ట్ర ప్రభుత్వం పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం నుంచి తెలామిన్ అని నామకరణం చేసి నాణ్యమైన ఖనిజ లవణమిశ్రమం(మినరల్ మిక్సర్) పశు పోషకులకు అందుబాటులోకి తీసుకరావడం ఓ వరమని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ దామచర్ల శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో తెలామిన్ మినరల్ మిక్సర్ లోగోతే వచ్చిన ప్యాకెట్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. విశ్వవిద్యాలయం వారు పశు పోషకులకు లాభసాటిగా ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ పేరు ప్రతిబింబించేలా ఈ తెలామిన్ను ఆవిష్కరించిందన్నారు. ఈ ఖనిజలవణ మిశ్రమం పశువులకు వాడటం ద్వారా పాలదిగుబడి పెరుగుతుందన్నారు. కోదాడ పశుఔషధ బ్యాంకుకు 9.5టన్నుల ఖనిజ మిశ్రమం రాగా 7.5టన్నులను కోదాడ పశువైద్యశాల నుంచి పశుపోషకులకు అందజేశారు. టన్ను నడిగూడెం, అర టన్ను హుజూర్‌నగర్‌కు పంపిణీ చేసినట్లు తెలిపారు. కోదాడ పశుఔషధబ్యాంకు స్ఫూర్తితో ఈ మిశ్రమాన్ని అందించడానికి రూ.5లక్షల రివాల్వింగ్ ఫండ్ కేటాయించిన కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్య క్రమంలో స్థానిక పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య, డాక్టర్ మధు, డాక్టర్ సురేంద్ర ఉన్నారు. -
విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం
హుజూర్నగర్ : పాలకవీడు మండలంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపబోతున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పాలకవీడు మండలంలోని యల్లాపురం గ్రామంలో రూ.3.20 కోట్లతో చేపట్టనున్న 33/11కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి, మూసీఒడ్డుసింగారం గ్రామం నుంచి రోళ్లవారిగూడెం వరకు రూ.1.80 కోట్లతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం బెట్టెతండా వద్ద మూసీ నదిపై రూ.33 కోట్లతో చేపడుతున్న సాగునీటి లిఫ్ట్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించి పురోగతిపై నీటిపారుదలశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల్లో కాంట్రాక్లర్లు నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ క్యాక్రమంలో ఎస్పీ నరసింహ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎన్వి.సుబ్బారావు, మాజీ ఎంపీపీ భూక్యా గోపాల్, మాళోతు మోతీలాల్, బైరెడ్డి జితేందర్‌రెడ్డి, గుత్తికొండ భూపాల్‌రెడ్డి, తీగల శేషురెడ్డి, బెల్లంకొండ నరసింహారావు, రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్, పంచాయతీరాజ్, వ్యవసాయశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
వేలకోట్లతో శరవేగంగా అభివృద్ధి
మఠంపల్లి: హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో వేల కోట్ల రూపాయతో శరవేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాత్రి మఠంపల్లి మండలం బక్కమంతుగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో డీఎంఎఫ్టీ నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆయా నియోజకవర్గాలను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానన్నారు. విద్యావకాశాల మెరుగు పర్చడానికి గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో రూ.200 కోట్లతో యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల, కోదాడలో రూ.50కోట్లతో నవోదయ పాఠశాల, హుజూర్నగర్ సమీపంలో రూ.100కోట్లతో వ్యవసాయ కళాశాల, ముఖ్యంగా కృష్ణానది నుంచి ఎత్తిపోతల పథకాల ద్వారా రూ.1500కోట్లతో 6వేల ఎకరాలకు సాగునీరందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. హుజూర్‌నగర్‌లో డిగ్రీ, జూనియర్ కళాశాలల నిర్మాణం, హుజూర్నగర్ నుంచి మఠంపల్లి మీదుగా మట్టపల్లి వరకు ఆంధ్రా ప్రాంతాన్ని కలుపుతూ నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.80కోట్లతో పనులు కొనసాగుతున్నాయన్నారు. ఇటీవల హుజూర్‌నగర్‌లో ఉమ్మడి జిల్లా స్థాయిలో 25వేల మంది నిరుద్యోగులతో జాబ్‌మేళా నిర్వహించి 4,500మందికి ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. మున్ముందు మరిన్ని జాబ్‌మేళాలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బక్కమంతులగూడెం పాఠశాలకు స్థలం ఇచ్చిన అంతిరెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఉత్తమ్‌ను నాయకులు, అదికారులు సన్మానించారు. ఈకార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ మగారాథోడ్, నాయకులు మంజీనాయక్, కిషోర్‌రెడ్డి, మల్లిఖార్జున్‌రావు, సీతారామిరెడ్డి, గోవిందరెడ్డి, వీరారెడ్డి, ఎల్లారెడ్డి, బాబు, శ్రీను, సక్రు, కరీమ్, అజీజ్‌పాషా, నాగరాజు, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.ఫ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
మైసమ్మ జాతరకు ముస్తాబు
మఠంపల్లి: మంచ్యాతండా దుబ్బలగట్టు బంగారు మైసమ్మతల్లి జాతరకు గిరిజనులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని రంగులతో తీర్చిద్దారు. ఈ ఆలయంలో ఈనెల 15నుంచి 17వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. అనునిత్యం మహిళా పూజారి పానుగోతు మిర్యాలీ.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బంగారుమైసమ్మ జాతరను గిరిజనులు పెద్దపోలిగ గా పిలుస్తారు. ఈజాతరకు నల్లగొండ, సూర్యాపేట జిల్లాలతోపాటు ఏపీలోని గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని తండాలకు చెందిన గిరిజనులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈనెల 15న రాత్రి 9గంటలనుంచి అర్ధరాత్రివరకు అమ్మవారి చరిత్ర పారాయణం చేస్తారు.16వ తేదీ తెల్లవారుజామున 3గంటలనుంచే ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అమ్మవారిని అదేవిధంగా దున్నపోతును భారీగా ఊరేగింపు నిర్వహిస్తారు. ఉదయం 10గంటలకు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. మధ్యాహ్నం భారీగా అన్నదానం చేస్తారు.17న అమ్మవారికి ప్రత్యేక పూజలతో ఉత్సవాలు ముగిస్తారు. ఈసందర్భంగా గిరిజన యువకులతో కోలాటం, భజనలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాలకు వచ్చేభక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగ కుండా నిర్వాహకులు అన్నిర్పాట్లు చేశారు. దుబ్బలగట్టు శ్రీబంగారు మైసమ్మ అమ్మవారు భక్తులు కోరిన కో ర్కెలు తీర్చే చల్లని తల్లి. చాలా కాలంగా అమ్మవారికి పూజలు సేవలు చేస్తున్నాను. ఇటీవల పెద్దలంతా ఆలయాన్ని లక్షల రూపాయలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయం ముందు దున్నను బలి ఇచ్చే విగ్రహం ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. –పానుగోతు మిర్యాలీ, ఆలయ మహిళా పూజారి. ఫ 15 నుంచి మూడురోజుల పాటు ఉత్సవాలు ఫ భారీగా తరలిరానున్న గిరిజనులు. -
ఇంటర్లో మంచి ఫలితాలు సాధించాలి
సూర్యాపేట : మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్మీడియట్లో మంచి ఫలితాలు సాధించాలని మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి సూచించారు. బుధవారం ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, మధ్యాహ్న భోజన కేంద్రాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయుల బోధన విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తీర్ణత శాతం పెంపునకు కృషి చేయాలిసూర్యాపేట: పదో తరగతి వార్షిక పరీక్ష ఉత్తీర్ణత శాతం పెంపునకు కృషిచేయాలని డీఈఓ అశోక్ ఉపాధ్యాయులను కోరారు. బుధవారం పెన్‌పహాడ్ మండలం గాజులమల్కాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చీదెళ్ల, దూపహాడ్ ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయా పాఠశాలల్లో బోధన తీరును పరిశీలించి మాట్లాడారు. విద్యార్థుల్లో ఉన్న భయాన్ని తొలగించి పాఠ్యపుస్తకాలపై ఆసక్తి కలిగేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలన్నారు. గ్రంథాలయాన్ని సందర్శించి 6, 7వ తరగతి విద్యార్థుల పఠనాశక్తి పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు వై. లింగయ్య, ఉపాధ్యాయులు వెంకట్‌రెడ్డి, జనార్దనాచారి, శ్రీనివాస్, అంజినికుమార్ పాల్గొన్నారు. మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగాలి నూతనకల్: మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక శక్తిగా ఎదగాలని సెర్ప్ రాష్ట్ర డైరెక్టర్ జాన్సన్ సూచించారు. బుధవారం నూతనకల్ మండల కేంద్రంలో వివిధ పథకాల ద్వారా బ్యాంకు లింకేజీతో ఏర్పాటు చేసిన వ్యవసాయేత ఉత్పత్తులను పరిశీలించారు. మిల్క్ ప్రాడక్ట్స్ యూని ట్స్, టీ పొడి, కిరాణషాపులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన మహిళలు ఏర్పాటు చేసుకున్న యూనిట్లను సక్రమంగా నిర్వహించి ఆర్థిక లాభాలను పొందాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డీఆర్డీఓ అప్పారావు, ఏపీడీ సురేష్, డీపీఎం అరుణ్‌కుమార్, లక్ష్మీనారాయణ, ఏపీఎం నగేష్, వెంకట్‌రెడ్డి, సీసీ సునిత, వీవోలు సత్తెయ్య , అనిల్, భాగ్యలక్ష్మి, పరుశరాములు, గీత, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి డిగ్రీ పరీక్షలు భువనగిరి : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. యూనివర్సిటీ పరిధిలో 84 కళాశాలలు, వాటిలో 16,867 మంది విద్యార్థులున్నారు. 1,3,5 సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు 30 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో నల్లగొండ జిల్లాలో 12, సూర్యాపేట జిల్లాలో 9, భువనగిరి జిల్లాలో 9 కేంద్రాలు ఉన్నాయి. సెమిస్టర్–1కు 5,400, సెమిస్టర్–3కి 5,830, సెమిస్టర్–5కు 5,597 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు డిసెంబర్ 1వ తేదీతో ముగియనున్నాయి. -
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయవద్దు
తిరుమలగిరి(తుంగతుర్తి) : ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడాలని, సరైన తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి మిల్లులకు పంపించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం తిరుమలగిరి మండలం తొండ, కోక్యానాయక్ తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రానికి ట్యాగింగ్ చేసిన మిల్లుల వివరాలు, ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఏఓ, ఏఈఓతో మాట్లాడి ధాన్యం కొనుగోళ్ల వివరాలను తెలుసుకున్నారు. టాబ్ ఎంట్రీని ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. అనంతరం తిరుమలగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతిలో మంచి మార్కులు, విషయపరిజ్ఞానాన్ని సంపాదిస్తే ఉన్నత చదువుల్లో రాణించేందుకు అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి మోహన్‌బాబు, జిల్లా మేనేజర్ రాము, తహసీల్దార్ హరిప్రసాద్, ఏఓ నాగేశ్వరరావు, ఎంపీడీఓ లాజర్, ఎంఈఓ శాంతయ్య, ప్రిన్సిపాల్ మృత్యుంజయ ఉన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
డిజిటల్ విద్యకు ఇంటర్నెట్ కొరత
ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాలిపెన్పహాడ్ : ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధన కోసం ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి అత్యాధునిక సౌకర్యాలు కల్పించినప్పటికీ, కేవలం ఒక వైఫై కనెక్షన్ లేకపోవడం వలన ఆ ప్రయత్నం అసంపూర్ణంగా మారింది. ఏడాది కాలంగా వైఫై సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో, ఉపాధ్యాయులే తమ సొంత సెల్ఫోన్ల డేటాను వినియోగించి విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. సౌకర్యాలున్నా... సౌలభ్యం లేదు గత ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యా విధానాన్ని అమలు చేసేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా పెన్‌పహాడ్ మండలంలోని పెన్‌పహాడ్, గాజులమల్కాపురం, అనంతారం, అన్నారం వంటి గ్రామాల్లోని పాఠశాలలతో పాటు ఆదర్శ పాఠశాల, కేజీబీవీ పాఠశాలల్లో కూడా ప్యానెల్ బోర్డులు, టీవీలతో కూడిన డిజిటల్ సామగ్రిని సరఫరా చేసింది. కొన్ని పెద్ద పాఠశాలల్లో 3 నుంచి 7 ప్యానెల్ బోర్డులను ఏర్పాటు చేయగా, లింగాల, చీదెళ్ల, భక్తాళాపురం, అనాజీపురం వంటి పాఠశాలలకు కూడా 2 చొప్పున బోర్డులను సమకూర్చారు. ఈ ప్యానెల్ బోర్డులన్నీ ఇంటర్నెట్ ఆధారిత విద్యాబోధన కోసమే అయినా వీటికి వైఫై కనెక్షన్‌ను ప్రభుత్వం నేటికీ కల్పించలేదు. ఉపాధ్యాయులపైనే భారం.. వైఫై సౌకర్యం లేకపోవడంతో, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత సెల్ఫోన్ల ద్వారా నెట్‌వర్క్‌ను కనెక్ట్ (హాట్‌స్పాట్) చేసుకుని తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తరచూ నెట్వర్క్ మధ్యలో నిలిచిపోవడం లేదా డేటా అయిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనివల్ల డిజిటల్ తరగతులు పూర్తిస్థాయిలో జరగడం లేదు. ఇది కేవలం బోధన నాణ్యతపైనే కాక, ఉపాధ్యాయులపై ఆర్థిక భారం కూడా మోపుతోంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల డిమాండ్లు.. ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యపై స్పందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. డిజిటల్ ప్యానల్ బోర్డులకు వెంటనే వైఫై కనెక్షన్‌ను ఏర్పాటు చేసి, డిజిటల్ బోధన సమర్థవంతంగా జరిగేలా చర్యలు చేపట్లాలని అంటున్నారు. ప్రస్తుతం 8–10 తరగతులకు మాత్రమే పరిమితమైన డిజిటల్ పాఠాలను 6, 7వ తరగతి విద్యార్థులకు కూడా బోధించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జాడలేని ఉన్నతాధికారుల తనిఖీ.. పాఠశాలల్లో రూ. లక్షలు వెచ్చించి సమకూర్చిన డిజిటల్ సామగ్రి సరిగా పనిచేస్తుందా లేదా, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం నెరవేరుతుందా లేదా అనే అంశాలను తెలుసుకునేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారుల తనిఖీలు పూర్తిగా కరువయ్యాయి అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెలకోసారైనా ఉన్నతాధికారులు పాఠశాలలను తనిఖీ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చి, సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డిజిటల్ తరగతులకు వైఫై సౌకర్యాన్ని కల్పించాల ని ప్రజలు, ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు.సూర్యాపేట : జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించి వాటిని బలోపేతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు డిమాండ్ చేశారు. మంగళవారం సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారం రోజులుగా జిల్లాలోని 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాలుగు ఏరియా ఆస్పత్రుల్లో సర్వే నిర్వహించినట్లు తెలిపారు. పీహెచ్‌సీల్లో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటిని పరిష్కరించాలని కోరారు. ఆస్పత్రులకు వచ్చిన రోగులకు తాగునీరు, కూర్చోవడానికి కుర్చీలు లేవన్నారు. ఎక్స్‌రే సౌకర్యం లేకపోవడంతో బయటకు వెళ్లి తీయించుకోవాల్సిన దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌కు, అనంతరం డీఎంహెచ్ఓకు అందించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శులు మట్టిపెల్లి సైదులు, నాయకులు పులుసు సత్యం, సోమపంగు జానయ్య, పోసనబోయిన హుస్సేన్, మట్టపల్లి లక్ష్మీ, గుంజ వెంకటేశ్వర్లు, కడెం కుమార్, పేరుమాండ్ల రాజారావు, లక్ష్మయ్య, రాములు, రామకష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల్లో అరకొరగా కొనసాగుతున్న డిజిటల్ క్లాస్‌లు వైఫై సౌకర్యం లేకపోవడంతో మొబైల్ నెట్‌వర్క్‌తో బోధిస్తున్న ఉపాధ్యాయులు డేటా సరిపోక తరగతులకు ఆటంకం నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం -
నేడు హుజూర్‌నగర్‌కు మంత్రి ఉత్తమ్
హుజూర్నగర్ : రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం హుజూర్నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం గరిడేపల్లి మండలం గడ్డిపల్లితో పాటు పలు గ్రామాల్లో, మేళ్లచెరువులో బీటీ రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పొనుగోడు ఊర చెరువులో చేప పిల్లలను వదలనున్నారు. యల్లాపురంలో నిర్మించనున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారు. మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో అదనపు తరగతి గదులను ప్రాంభించిన అనంతరం చింతలపాలెంలో పాఠశాల భవనాన్ని మంత్రి ఉత్తమ్ ప్రారంభించనున్నారు. లక్ష్మీనరసింహస్వామికి నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం స్వామివారికి అర్చకులు నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషే కం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి తమలపాకులతో అర్చనలు చేశారు.మట్టపల్లిలోని శివాలయంలో పార్వతీరామలింగేశ్వరస్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు పాల్గొన్నారు. గాలికుంటు వ్యాధిని సమూలంగా నిర్మూలిద్దాంకోదాడరూరల్ : పశువులకు వచ్చే గాలికుంటు వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు సిబ్బంది ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ దాచేపల్లి శ్రీనివాస్‌రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో కోదాడ, అనంతగిరి, చింతలపాలెం మండలాల పశువైద్య సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పశువుకు క్యూఆర్‌కోడ్‌తో కూడిన చెవిపోగును వేసి మరీ గాలికుంటు నివారణ టీకా వేయాలన్నారు. దాంతో టీకాలు వేయని పశువులను సులభంగా గుర్తించవచ్చన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకుతోడు సిబ్బంది కొరతతో చింతలపాలెం మండలంలో గాలికుంటు నివారణ టీకాలు వేయడం ఆలస్యమైందన్నారు. టీకాలు వేసేందుకు ఏడు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో స్థానిక వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి.పెంటయ్య, పశు వైద్యాధికారులు బి.మధు, సిరిపురపు సురేంద్ర పాల్గొన్నారు. -
సీఈఐఆర్‌తో 2,340 మొబైల్స్ రికవరీ
సూర్యాపేట : సీఈఐఆర్ ద్వారా ఇప్పటి వరకు 2,340 మొబైల్స్‌ను రికవరీ చేసినట్లు ఎస్పీ నరసింహ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేశారు. జిల్లాలో ప్రజలు పోగొట్టుకున్న 102 ఫోన్లను గుర్తించి రికవరీ చేసిన మొబైల్స్‌ను బాధితులకు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ ఏడాది 7వ దఫా మొబైల్ మేళా నిర్వహించి రికవరీ చేసిన మొబైల్స్‌ను బాధితులకు అందించినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ల పరిధిలోని సైబర్ వారియర్స్ నిరంతర కృషి ఫలితంగానే 102 మొబైల్స్‌ను గుర్తించి వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించామని చెప్పారు. రైతులు అప్రమత్తంగా ఉండాలి ప్రస్తుతం సైబర్ మోసగాళ్లు కొత్త ఎత్తులతో ప్రజలను మోసం చేస్తున్నారని, పంట చేతికొచ్చే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. పంట డబ్బులు బ్యాంక్ అకౌంట్లో వేస్తామంటూ అపరిచితులు ఫోన్ చేసి బ్యాంకు, ఓటీపీ వివరాలు అడిగితే ఇవ్వవద్దని సూచించారు. వరి ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. వాహన దారులు జాగ్రత్తలు తీసుకోవాలని, హెల్మెట్ ధరించాలని, సీట్‌బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, స్పెషల్స్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ సూర్యాపేట : ఎస్పీ సూర్యాపేట పేరుతో ఫేస్బుక్లో నకిలీ ప్రొఫైల్‌ను క్రియేట్ చేశారని, దీని నుంచి వచ్చే మెసేజ్‌లు, సమాచారానికి ఎవరూ స్పందించవద్దని ఎస్పీ నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. నకిలీ ఫేస్బుక్ ప్రొఫైల్నుంచి డబ్బులు అడిగినా, వ్యాపారం బాగుంది పెట్టుబడి పెట్టండి అని అడిగినా స్పందించవద్దని పేర్కొన్నారు. -
విద్యార్థులు లక్ష్య సాధనకు కృషి చేయాలి
చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధనకు కష్టపడి చదువాలని జిల్లా న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జీ ఫర్హీన్‌కౌసర్ అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాతీయ విద్యాదినోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మంచి విద్య ద్వారానే ఉన్నత స్థానానికి చేరుకోగలమన్నారు. న్యాయవిద్య ద్వారా మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల వంటి అంశాలపై బాలికలకు వివరించారు. ఆడపిల్లల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలని సూచించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. డీఎల్ఎస్ఏ బాలికల సంరక్షణ కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో బార్ అసోషి యేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, మీడియేషన్ సభ్యులు గుంటూరు మధు, అల్లంనేని వెంకటేశ్వర్రావు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్‌కుమార్, ప్రిన్సిపాల్ నాగేశ్వర్రావు పాల్గొన్నారు.ఫ జిల్లా న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ -
దొంగ అరెస్ట్
జల్సాలకు అలవాటుపడి, బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ హై అలెర్ట్పూర్తిస్థాయి నీటి మట్టం : 590 అడుగులు ప్రస్తుత నీటి మట్టం : 588.50 అడుగులు ఇన్‌ఫ్లో : 51,476 క్యూసెక్కులు అవుట్ ఫ్లో : 51,476 క్యూసెక్కులు విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా : 34,011 క్యూసెక్కులు కుడికాల్వ ద్వారా : 10,000 క్యూసెక్కులు ఎడమకాల్వ ద్వారా : 5,654 క్యూసెక్కులు ఏఎమ్మార్పీకి : 1800 క్యూసెక్కులు వరద కాల్వకు : నిల్- 8లో -
చలి మొదలాయే..
సూర్యాపేట : చలి మొలైంది. మూడు రోజులుగా చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. వానాకాలం సీజన్ ముగియడంతో వాతా వరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా చలి తీవ్రత అధికమైంది. ఈనెల 5వ తేదీన 23 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదుకాగా.. 8వ తేదీ నాటికి ఏకంగా 6 డిగ్రీల తగ్గి 17డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న మూడురోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువై చలి తీవ్రత మరింత అధికం కానుంది. మూడు రోజులుగా..గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ వానాకాలం సీజన్లో వర్షాలు కురిశాయి. జిల్లాలో దీపావళి పండుగ వచ్చిందంటే వర్షాల జాడే ఉండదు. అలాంటిది వానాకాలం సీజన్లో నవంబర్ మొదటి వారం వరకు భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ పరిస్థితి ఇలాగే ఉంటుందేమోనని అందరూ భావిస్తుండగా.. శనివారం నుంచి చలి పెడుతోంది. పగటి ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు లేకున్నా.. రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో రాత్రి సమయంలో ఫ్యాన్లు, కూలర్లు పనిచేస్తేనే నిద్రపట్టగా.. మూడురోజులుగా వాటిని బంద్ చేసే పరిస్థితి జిల్లాలో ఏర్పడింది. సాయంత్ర 5.30 గంటలు దాటితే..ప్రస్తుతం సాయంత్రం 5.30 గంటలు అయితే చాలు చలిగాలులు వీస్తున్నాయి. ఇక తెల్ల వారుజామున 3గంటల నుంచే చలి విపరీతంగా పెరుగుతోంది. దీనికి తోడుగా అక్కడక్కడ మంచు పడుతోంది. ప్రస్తుతం రాత్రి ఉష్ణోగ్రత 16 డిగ్రీలు ఉండగా రానున్న రెండు, మూడురోజుల్లో 15 డిగ్రీలకు చేరి చలి మరింత పెరగనుంది. ఈనెల 11వ తేదీన 16 డిగ్రీలు, 12న 16 డిగ్రీలు, 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉష్ణోగ్రతలు ఇలా ( డిగ్రీల సెంటీగ్రేడ్లలో ) జిల్లాలో మూడురోజులుగా పెరిగిన చలి తీవ్రత తగ్గుతున్న ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశంతేదీ గరిష్టం కనిష్టం 05 31 23 06 30 21 07 31 20 08 31 17 09 29 17 10 28 16 -
మొదటి అదనపు జడ్జిబాధ్యతల స్వీకరణ
చివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా కోర్టు మొదటి అదనపు న్యాయమూర్తిగా డాక్టర్ రాధాకృష్ణ చౌహాన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హూజూర్ నగర్ కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న ఆయన పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, గుంటూరు మధు, బాణాల విజయ్ కుమార్, రాచకొండ యాదగిరి, అనంతుల సందీప్ కుమార్, జవ్వాజీ సతీష్, కాసం సతీష్ తదితరులు పాల్గొన్నారు.26న భగవద్గీత కంఠస్థ పోటీలుసూర్యాపేట : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గీతా జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ సహకారంతో పాఠశాల విద్యార్థులకు భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించనున్నట్లు కార్యక్రమ ఉమ్మడి నల్లగొండ జిల్లా నిర్వాహకులు సేవాలా నాయక్, విశ్వహిందూ పరిషత్ సూర్యాపేట పట్టణ కార్యదర్శి బైరు విజయకృష్ణలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల్లో దైవభక్తిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. సూర్యాపేట పట్టణంలోని జనగామ క్రాస్‌రోడ్డులోగల టీటీడీ కల్యాణ మండలంలో ఈ కార్యక్రమం ఉంటుందని, దీనికి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఉదయం 9గంటల్లోపు ఆరోగ్య పరీక్షలు పూర్తి చేయాలిసూర్యాపేట : ఆర్బీఎస్కే బృందాలు ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6 నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు రోజూ ఉదయం 9 గంటల్లోపు కంటి పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి పి.చంద్రశేఖర్ సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్బీఎస్కే వైద్యులు, సిబ్బంది సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో డాక్టర్ కోటి రత్నం, ఆర్బీఎస్కే వైద్యులు, సిబ్బంది, డాక్టర్ అశ్రీత, డిప్యూటీ డీఎంఓ సంజీవరెడ్డి పాల్గొన్నారు. కేజీబీవీలో లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులుమఠంపల్లి: మఠంపల్లి మండలం బక్కమంతులగూడెం సమీపంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఇంటర్ సివిక్స్, ఇంగ్లిష్ లెక్చరర్ పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్ విజయకుమారి తెలి పారు. సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, బీఈడీ, టెట్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 12వ తేదీ వరకు నేరుగా విద్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎక్స్‌గ్రేషియా బకాయిలు విడుదల చేయాలిసూర్యాపేట : ప్రమాదవశాత్తు తాటి, ఈత చెట్లపై నుంచి పడి మరణించిన గీత కార్మికులకు చెల్లించాల్సిన రూ.13 కోట్ల ఎక్స్‌గ్రేషియా బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ గీత పనివారల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రేగటి లింగయ్య, కొండ కోటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ కె.సీతారామారావుకు వినతి పత్రాన్ని అందజేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బొమ్మగాని శ్రీనివాస్, పాలకూరి బాబు, దొరపెల్లి శంకర్, బూర వెంకటేశ్వర్లు, తొట్ల ప్రభాకర్, బొడ్డు రామచంద్రు, బండారు లక్ష్మయ్య, రెడ్డిమల్ల శ్రీను, పెద్ది వెంకన్న, బూర లింగయ్య, అయితే గాని వెంకన్న, పందుల జానయ్య పాల్గొన్నారు. అందుబాటులో కూరగాయలు, పూల నారుగరిడేపల్లి : గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లిలో గల కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో కూరగాయలు, పూల నారు అందుబాటులో ఉందని కేవీకే శాస్త్రవేత్త నరేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. టమాట, వంగ, పచ్చిమిర్చి, బంతి, చామంతి, పెరటి తోటల కూరగాయల విత్తనాల కిట్, కోకో పీట్ కావాల్సిన రైతులు గడ్డిపల్లి కేవీకేలో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సంప్రదించాలని పేర్కొన్నారు. రైతులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. -
న్యాయ సేవాధికార సంస్థ సేవలు వినియోగించుకోవాలి
చివ్వెంల(సూర్యాపేట) : కక్షి దారులు న్యాయసేవాధికార సంస్థ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద కోరారు. సోమవారం న్యాయసేవాధికార దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నిరుపేదలు, న్యాయవాదులను పెట్టుకునే స్థోమత లేని వారు డీఎల్ఎస్లో దరఖాస్తు చేసుకోవాలని, దీని ద్వారా ఉచితంగా న్యాయవాదులను నియమించనున్నట్లు ఆమె తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చట్టాలపై అవగాహన కల్పించేందుకు పారా లీగల్ వలంటీర్లను నియమించినట్లు చెప్పారు. ఈనెలల 15వ తేదీన నిర్వహించే స్పెషల్ లోక్ అదాలత్‌ను సద్వినియోగ చేసుకోవాలని కోరారు. ఇందులో సివిల్, క్రిమినల్, బ్యాంకు, విద్యుత్, గృహ హింస, మోటార్ వెహికల్ వంటి కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి రాధాకృష్ణ చౌహాన్, సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎన్, అపూర్వ రవళి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, మీడియేషన్ సభ్యులు గుంటూరు మధు, అల్లంనేని వెంకటేశ్వర్రావు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద -
బాల మేధావులు.. సృజనకు పదును
సూర్యాపేట : విద్యార్థులను భావిశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే కాకుండా వారిలోని సృజనాత్మకతను వెలికి తీయడానికి ఏటా కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ, రాష్ట్ర విద్యాశాఖ సంయుక్తంగా వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్స్పైర్ మనక్ పోటీలను నిర్వహిస్తోంది. సామాజిక సమస్యలకు పరిష్కారం చూపుతూ రెండు కార్యక్రమాల్లో వైజ్ఞానిక, గణిత, పర్యావరణ అంశాలపై రూపొందించిన నమూనాలను విద్యార్థులు ప్రదర్శించనున్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇన్స్పైర్ మనక్ పోటీల్లో జిల్లాలో 64 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. వీటితో ఈ నెల మూడో వారం లేక చివరి వారంలో జిల్లాలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. విద్యార్థుల ఖాతాల్లో రూ.10వేలు జమఇన్స్పైర్ మనక్ పోటీల్లో ఎంపికై న 64 ప్రదర్శనలకు సంబంధించి రూ.10వేల చొప్పున సంబంధిత విద్యార్థుల ఖాతాల్లో జమ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఆ నగదుతో ప్రాజెక్టులు రూపొందించి ప్రదర్శించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయిలో ఎంపికై న ఉత్తమ నమూనాలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. ఈ మేరకు వైజ్ఞానిక ప్రదర్శన రాష్ట్ర విద్య, పరిశోధన శిక్షణ మండలి, రాష్ట్ర బాల వైజ్ఞానిక ప్రదర్శన పేరుతో నమూనాలు ప్రదర్శించనున్నారు. అభివృద్ధి, స్వయం సమృద్ధి చెందే భారతదేశానికి శాస్త్ర సాంకేతిక రంగాలైన టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం ఆవశ్యకత అనే అంశాలతో నమూనాలు రూపొందించాల్సి ఉంటుంది. ఏడు అంశాల్లో జూనియర్ విభాగంలో (6 నుంచి 8వ తరగతి వరకు), సీనియర్ విభాగంలో 9 నుంచి 12వ తరగతుల విభాగాల్లో ఉత్తమమైన 20 ప్రాజెక్టులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నారు. మొత్తం ఏడు అంశాల్లో...జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన 2025–26లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొననున్నారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో ఏడు అంశాలు ఉన్నాయి. ఇందులో 1.సుస్థిర వ్యవసాయం, 2.వ్యర్థ పదార్థాల నిర్వహణ, 3.ప్రత్యామ్నాయ మొక్కలు, 4.హరితశక్తి(పునరుత్పాదక శక్తి), 5.అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, వినోదభరిత గణిత నమూనాలు, 6.ఆరోగ్యం, పరిశుభ్రత, 7.నీటి సంరక్షణ– నిర్వహణ అంశాలు ఉండనున్నాయి. ఒక పాఠశాల నుంచి గరిష్టంగా ఏడుగురు ఏడు ప్రాజెక్టులతో మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. ఏడు ప్రాజెక్టులు వచ్చినా ఒక గైడ్ టీచర్ మాత్రమే పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతి స్కూల్ నుంచి 1నుంచి 7ప్రాజెక్టుల వరకు.. జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ఈ నెల మూడో వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 180, ప్రైవేట్ పాఠశాలలు 250, ప్రాథమికోన్నత పాఠశాలలు 70, కేజీబీవీలు 18, మోడల్ స్కూల్స్ తొమ్మిది, అన్ని ప్రభుత్వ రెసిడెన్షియల్‌స్కూల్స్ 12 ఉన్నాయి. వీటిలో ప్రతి స్కూల్ నుంచి 1 నుంచి 7 ప్రాజెక్టుల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే జిల్లాలో మొత్తం 250 నుంచి 300 ప్రాజెక్టులు సైన్స్ ఫెయిర్‌లో ప్రదర్శించనున్నారు. ఈ నెల మూడో వారంలో జిల్లాలో సైన్స్ ఫెయిర్ సన్నాహాలు చేస్తున్న విద్యాశాఖ అధికారులు 300 ప్రాజెక్టులు ప్రదర్శించే అవకాశంజిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలతో పాల్గొనవచ్చు. ఉపాధ్యాయులు కూడా బోధనోపకరణాలు, నూతన ఆవిష్కరణలు ప్రదర్శించే అవకాశం ఉంది. వివరాల కోసం జిల్లా సైన్స్ అధికారి ఎల్.దేవరాజ్‌ను సంప్రదించాలి. – అశోక్, డీఈవో -
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసరావు
హుజూర్నగర్ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా హుజూర్‌నగర్‌కు చెందిన ధూళిపాల శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ నగరంలోని బీసీ భవన్లో ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు స్థానికంగా విలేఖరులతో మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడిగా నియమించిన ఆర్ కృష్ణయ్య, ఇతర నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు ఏర్పాటు చేసి మండల, గ్రామ స్థాయిలో బీసీల ఐక్యతకు కృషి చేస్తానని చెప్పారు. జిల్లాలో అన్ని కులాలకు ప్రాధాన్యమిస్తూ కమిటీ నిర్మాణం చేపడతామని ఆయన తెలిపారు. -
పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లొద్దు
సూర్యాపేట : వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లవద్దని ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో సూచించారు. ప్రజలు, కూలీలు, చిన్న పిల్ల లను గూడ్స్ వాహనాలలో రవాణా చేసినా, పరిమితికి మించి ప్యాసింజర్ వాహనాలలో రవాణా చేసిన కేసులు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే తమ లక్ష్యమని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నిత్యం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 70 వాహనాలను గుర్తించి జరిమానాతో పాటు కేసులు విధించినట్లు వివరించారు. సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలిఫిర్యాదుదారుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ నరసింహ అధికారులను కోరారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులనుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఎస్పీ నరసింహ -
అర్జీలు త్వరగా పరిష్కరించాలి
సూర్యాపేట : ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు ప్రాధాన్యం ఇచ్చి త్వరగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ కె. సీతారామారావు అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అదనపు కలెక్టర్ అర్జీలు స్వీకరించి మాట్లాడారు. ప్రతి కార్యాలయంలో ప్రజా వాణిలో వచ్చే దరఖాస్తుల నమోదుకు ఒక రిజిస్టర్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, తేమ శాతం 17 రాగానే కాంటా వేసి లారీల ద్వారా మిల్లులకు ఎగుమతి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ వీవీ అప్పారావు, డీఎఫ్ఓ సతీష్ కుమార్, డీపీఓ యాదగిరి, డీఈఓ అశోక్, సీపీఓ కిషన్,డీడబ్ల్యూఓ నరసింహారావు, సంక్షేమ అధికారులు శంకర్, శ్రీనివాస్, నరసింహారావు, దయానందరాణి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస్, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, జిల్లా స్పోర్ట్స్ అధికారి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. సాఫీగా ధాన్యం సేకరణజిల్లాలో వానాకాలం ధాన్యం సేకరణ సాఫీగా కొనసాగుతోందని అదనపు కలెక్టర్ కె. సీతారామారావు మంత్రులకు తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులు ధాన్యం, పత్తి , మొక్కజొన్న, సోయా తదితర పంటల సేకరణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లో ఈ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఇందులో డీఆర్డీఓ వి.వి. అప్పారావు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాము, డీఎస్ఓ మోహన్ బాబు, డీసీఓ పి.ప్రవీణ్ కుమార్, జిల్లా ఇన్చార్జ్ వ్యవసాయ అధికారి నివేదిత పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ సీతారామారావు -
పెరిగిన మెస్ చార్జీలు
చిలుకూరు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం ఇస్తున్న చార్జీలు సరిపోవడం లేదని, పెరిగిన సరుకుల ధరల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వంట ఏజేన్సీ మహిళలు ప్రభుత్వానికి విన్నవిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మెస్ చార్జీలు పెంచడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు మరింత నాణ్యమైన మధ్యాహ్న భోజనం లభించనుంది. 1435 ఏజెన్సీలకు లబ్ధి జిల్లాలో 600 ప్రాథమిక, 76 ప్రాథమికోన్నత, 182 ఉన్నత పాఠశాలలు మొత్తం 858 ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నాయి. ఇందులో చదివే పిల్లలకు మధ్యాహ్నం భోజనం వండి పెట్టేందుకు మొత్తం 1435 ఏజెన్సీలు ఉన్నాయి. ఆయా ఏజెన్సీ మహిళలు ప్రభుత్వం అందించే మెస్ బిల్లుల్లోనే బయటి నుంచి సరుకులు తీసుకు రావడంతో పాటు వంట చేసేందుకు అవసరమైన వంట సరుకు, తమ కూలి అన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దానికి తోడు ప్రస్తుతం పెరిగిన నిత్యావసరాల ధరలతో విద్యార్థులకు వంటచేసి పెట్టడం తలకు మించిన భారంగా మారుతోందని వంట కార్మికులు వాపోతున్నారు. వంట చార్జీలు పెంచాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి 74 పైసలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో రూ.1.12 పైసల చొప్పున వంట ధరలు పెంచింది. దాంతో వంట కార్మికులకు కొంత వరకు ఉపశమనం కలుగనుంది. 43,469 మంది విద్యార్థులకు భోజనం జిల్లాలో ఉన్న 858 ప్రభుత్వ పాఠశాలల్లో 43,469 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారికి వంట ఏజెన్సీ వారు ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనం వండి పెడుతున్నారు. స్కూళ్లలో మధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. దానికి తోడు వంట పాత్రలను కూడా సరఫరా చేసింది. మిగిలిన సరుకులను వంట ఏజెన్సీల నిర్వాహకులు కొనుగోలు చేసి వంట చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజూ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును బట్టి ప్రభుత్వం ప్రతినెలా భోజన బిల్లులను మంజూరు చేస్తోంది. ప్రస్తుతం పెరిగిన మెస్ చార్జీల వల్ల అటు వంట ఏజెన్సీలకు ఇటు విద్యార్థులకూ ప్రయోజనం కలుగనుంది. పెరిగిన వంట ధరలు (ఒక్కో విద్యార్థికి రూపాయల్లో) పాఠశాల పాత ధర కొత్త ధర ప్రాథమిక 5.45 6.19 ప్రాథమికోన్నత 8.17 9.29 ఉన్నత పాఠశాల 10.67 11.79 ఫ మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు లబ్ధి ఫ పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా పెంపు ఫ విద్యార్థులకు అందనున్న నాణ్యమైన భోజనం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల వివరాలు ప్రాథమిక పాఠశాలలు 600 ప్రాథమికోన్నత పాఠశాలలు 76ఉన్నత పాఠశాలలు 182 మొత్తం విద్యార్థులు 43,469 వంట ఏజెన్సీలు 1435 -
బీసీ రిజర్వేషన్లతోనే సామాజిక తెలంగాణ
సూర్యాపేట : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన సామాజిక తెలంగాణ నిర్మాణంలో కీలక ముందడుగు అని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం సూర్యాపేటలో పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సామాజిక తెలంగాణ– బీసీ రిజర్వేషన్లు– ప్రాతినిథ్యం ప్రజాస్వామ్యం’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. అనేక త్యాగాలతో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ భాగస్వామ్యం కల్పించాల్సి ఉందన్నారు. బీజేపీ మొదటి నుంచీ కుల గణనకు వ్యతిరేకమని, రాష్ట్ర ప్రభుత్వం కులగణనపై ముందడుగు వేయడం హర్షణీయమన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చి న్యాయసమీక్ష నుంచి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. శాసనసభ చట్టం చేసి పంపితే తిరస్కరించే అధికారం గవర్నర్లకు లేదన్నారు. గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నారబోయిన కిరణ్ అధ్యక్షతన జరిగిన సదస్సులో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు గట్ల రమాశంకర్, నాయకులు కుంట్ల ధర్మార్జున్, నాగరాజుగౌడ్, నరసింహ, వీరేశ్‌నాయక్, వినయ్‌గౌడ్, నారాయణ, సుమన్‌నాయక్, మురళి పాల్గొన్నారు. -
ప్యాడీ క్లీనర్లు ఉన్నా.. ప్రయోజనం సున్నా!
సూర్యాపేట జిల్లాలో 338 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా ఇప్పటివరకు కొనుగోళ్లలో వేగం పుంజుకోలేదు. ఇక ఆయా కేంద్రాల్లో 220 వరకు ప్యాడీ క్లీనర్లు పాతవి ఉండగా అవి ఏ మాత్రం పనిచేయడం లేదు. వాటి స్థానంలో ఇటీవల 100 ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లను కొనుగోలు చేశారు. ఒక్కో ప్యాడీ క్లీనర్‌కు రూ.40,000 చొప్పున వెచ్చించారు. రెండు లిఫ్టింగ్ కం ప్యాడీ క్లీనర్లను రూ.1.92 లక్షల చొప్పున వెచ్చించి కొనుగోలు చేశారు. మరో రెండు ప్యాడీ డ్రయర్లను రూ.14 లక్షలతో కొనుగోలు చేశారు. ప్యాడీ క్లీనర్లు ఉన్నా చాలా చోట్ల విద్యుత్ సదుపాయం లేకపోవడంతో రైతులే సొంతంగా విద్యుత్ సరఫరాను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. కేంద్రం నిర్వాహకులు కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. చాలా గ్రామాలో కొనుగోలు కేంద్రాలు దూర ప్రాంతంలో ఉండడంతో విద్యుత్ సదుపాయం లేక ప్యాడీ క్లీనర్లు రైతులకు ఉపయోగపడడం లేదు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తూర్పార పట్టేందుకు ఏర్పాటు చేసిన ప్యాడీ క్లీనర్లు నిరుపయోగంగా మారాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో వాటిని మూలన పడేశారు. కొన్నిచోట్ల విద్యుత్ సదుపాయం లేకపోవడంతో.. మరికొన్ని చోట్ల విద్యుత్ సదుపాయం ఉన్నా నిర్వాహకులు ఇవ్వకపోవడంతో అవి రైతులుకు ఉపయోగపడడం లేదు. కొన్ని కేంద్రాల్లో నిర్వాహకులే ప్యాడీ క్లీనర్లతో పనేంటి? ఓ రెండు బస్తాలు తగ్గిస్తారు.. అంతేకదా.. అమ్ముకోండంటూ రైతులకు ఉచిత సలహా ఇస్తున్నారు. దీంతో రైతులు ఏం చేయలేని పరిస్థితిలో పడ్డారు. మీ ధాన్యం తాలు ఉదంటూ మిల్లర్లు ఒకటీ రెండు బస్తాల వరకు కోత పెడుతున్నా గత్యంతరం లేక అమ్ముకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ సొమ్ము వృథా.. కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్యాడీ క్లీనర్లు రైతులకు ఉపయోగపడడం లేదు. కొన్ని చోట్ల రైతులు ప్యాడీ క్లీనర్లకు రైతులే విద్యుత్ సదుపాయాన్ని ఏర్పాటు చేసుకొని వినియోగించుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ సొమ్ముతో కొన్న యంత్రాలు రైతులకు ఉపయోగపడకపోగా, ప్రభుత్వ డబ్బు వృథా అవుతోంది. రైతులకు మద్దతు ధర ఇప్పిస్తున్నామని చెబుతున్న అధికారులు కొనుగోలు కేంద్రాలు, మిల్లుల్లో అడ్డగోలు కోతలను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో మరో 107 యంత్రాలకు ఇండెంట్ ఈ వానాకాలం సీజన్లో నల్లగొండ జిల్లాలో 356 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన యంత్రాంగం ఇప్పటివరకు 250 కేంద్రాలను తెరిచి, కొనుగోళ్లు ప్రారంభించింది. ధాన్యంలో తాలు, మట్టి, గడ్డి వంటివి లేకుండా, ధాన్యం తూర్పారా బట్టేందుకు ప్యాడీ క్లీనర్లను వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసింది. జిల్లాలో 388 ప్యాడీక్లీనర్లు ఇప్పటికే ఉన్నాయి. ఇంకా 107 ఆటోమెటిక్ మిషన్ల కోసం వ్యవసాయ శాఖ ఇండెంట్ పెట్టింది. ప్రస్తుతం ఏర్పాటు చేసే కేంద్రాల కంటే ప్యాడీ క్లీనర్లు ఎక్కువగా ఉన్నా వాటిని రైతులకు ఉపయోగపడేలా చేయడంతో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిరుపయోగంగా దర్శనం ఫ కొన్నిచోట్ల విద్యుత్ సదుపాయం లేదు.. మరికొన్ని చోట్ల సిబ్బంది సహకరించడం లేదు ఫ విద్యుత్ సౌకర్యం ఉన్నా.. బిల్లు ఎవరు చెల్లిస్తారంటున్న నిర్వాహకులు ఫ ఒకటి రెండు బస్తాలు తరుగు తీస్తే ఏం కాదంటూ ఉచిత సలహా -
పారిశుద్ధ్యానికి ప్రత్యేక వారం
సూర్యాపేట : పారిశుద్ధ్యానికి ప్రత్యేక వారం కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. పల్లెలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది వీధులను శుభ్రం చేయడంతో పాటు తాగునీటి సరఫరా పైపులకు ఉన్న లీకేజీలను సరి చేస్తున్నారు. ఈ నెల మూడవ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం వారం పాటు కొనసాగనుంది. పలు కార్యక్రమాల నిర్వహణ ప్రత్యేక వారం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను సేకరించడం, ట్రాక్టర్లతో దానిని డంపింగ్ యార్డుకు తరలించడం, సెగ్రిగేషన్ షెడ్లు, డంపింగ్ యార్డుల నిర్వహణను పరిశీలిస్తున్నారు. దాంతో పాటు ఖాళీ స్థలాల్లో ఉన్న చెత్త, వ్యర్ధాలు, పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలను తొలగిస్తున్నారు. మురుగు కాల్వలు, పల్లె ప్రకృతి వనంలో స్వచ్ఛతా కార్యక్రమం, తాగునీటి పైప్‌లైన్ లీకేజీలకు మరమ్మతులు వంటి పనులు చేపడుతున్నారు. దాంతో పల్లెలన్నీ పరిశుభ్రంగా మారుతున్నాయి. నిధుల లేమితో ఇబ్బందులు వారం పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న గ్రామ పంచాయతీ సిబ్బందికి నిధుల లేమి సమస్యగా మారుతున్నది. పారిశుద్ధ్య మెరుగు పర్చే పనులను సిబ్బంది చేపడుతున్నా పైప్లైన్ల లీకేజీతో పాటు ఇతర పనులు చేపట్టేందుకు అవసరమైన సామగ్రి కొనుగోలుకు వీలు లేకుండా పోతోంది. ప్రస్తుతం పాలవర్గం లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులే నిధులను సమకూర్చాల్సిన పరిస్థతి నెలకొంది. చాలాకాలంగా పంచాయతీల నిర్వహణకు కార్యదర్శులే చేతినుంచే డబ్బులు పెట్టాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఫ గ్రామాల్లో వారంరోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు ఫ పారిశుద్ధ్యంతో పాటు నీటి పైప్‌లైన్ లీకేజీలపై ప్రత్యేక దృష్టి ఫ పరిష్కారమవుతున్న సమస్యలు -
తరలిన కూలీలు.. నిలిచిన పనులు
కోదాడ: మన ప్రాంతంలోని వివిధ పనులు నిర్వహిస్తున్న బిహార్ కూలీలు స్వరాష్ట్రానికి వెళ్లారు. ఆ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వారంతా వెళ్లడంతో వివిధ రంగాల్లో కూలీల కొరత ఏర్పడింది. రోడ్ల విస్తరణ, నిర్మాణ రంగంతో పాటు పార్బాయిల్డ్ మిల్లులు తీవ్ర కూలీల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆయా పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు పనులను నిలిపివేశారు. 80శాతం మంది బిహారీలేసాగర్ ఆయకట్టులో ఉన్న పార్బాయిల్డ్ మిల్లుల్లో హమాలీలుగా 80 శాతం మంది బిహార్‌కు చెందిన వారు ఉన్నారు. ధాన్యం లోడ్, అన్లోడ్ వంటి కష్టమైన పనులను మిల్లర్లు బిహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కూలీలతో చేయిస్తున్నారు. స్థానిక కూలీలకు ఇచ్చే కూలి రేట్లలో సగానికే వీరు పని చేస్తుండడంతో పాటు ఎక్కువ గంటలు అందుబాటులో ఉంటుండంతో వీరినే పనిలో పెట్టుకుంటున్నారు. ధాన్యం మిల్లులో అన్లోడ్ చేయడంతో పాటు నెట్కట్టడం వంటి పనులు కూడా వారే చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ ఆయకట్టులో వరి కోతలు ప్రారంభమవుతున్నాయి. వారం పది రోజుల్లో భారీ ఎత్తున ధాన్యం మిల్లులకు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో బిహార్ కూలీలు స్వరాష్ట్రానికి వెళ్లడంతో ధాన్యం దిగమతిపై ప్రభావం పడే అవకాశం ఉందని మిల్లర్లు చెబుతున్నారు. నిలిచిన ఫ్లై ఓవర్ల నిర్మాణం 65వ నంబర్ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో వాటి నివారణకు అధికారులు బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించారు. చిట్యాల నుంచి కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు వరకు గుర్తించిన బ్లాక్‌స్పాట్స్ వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టారు. ఈ పనుల్లో కీలకంగా ఉన్న బిహార్ కూలీలు ఆ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో తమ ఓటు వేసేందుకు వెళ్లిపోయారు. దాంతో కాంట్రాక్టర్లు నిర్మాణ పనులను ఆపేశారు. వారు లేకుండా స్థానిక కూలీలతో పనులు చేయించలేమని పలువురు కాంట్రాక్టర్లు అంటున్నారు. ప్రైఓవర్ నిర్మాణంలో కీలకమైన రాడ్బెండింగ్తో పాటు భారీ యంత్రాలను నడపడం బిహార్ కూలీలు మాత్రమే చేస్తారని వారు చెబుతున్నారు.నెల రోజులు ఇదే పరిస్థితిబిహార్ రాష్ట్రంలో ఈ నెల 11తో ఎన్నికలు పూర్తి అవుతాయి. 14 వరకు ఫలితాలు వస్తాయి. ఐనప్పటికీ బిహార్‌కు వెళ్లిన కూలీలు రావడానికి మరో నెల రోజులు పట్టే అవకాశం ఉందని జాతీయ రహదారుల విస్తరణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు అంటున్నారు. వలస కూలీలు సాధారణంగా స్వరాష్ట్రానికి వెళితే అంత త్వరగా వెనక్కి రారని చెబుతున్నారు. వారు వచ్చే వరకు ఇదే పరిస్ధితి ఉంటుందని, వారు వచ్చిన తరువాతే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అంటున్నారు. హమాలీలుగా పని చేసే వారిని ఆయా రాష్ట్రాలనుంచి త్వరగా వెనక్కి రప్పించడానికి ట్రైన్ టికెట్స్ కూడ బుక్ చేస్తున్నామని ఓ మిల్లర్ తెలిపారు.ఫ ఎన్నికల కోసం స్వరాష్ట్రానికి బిహార్ కూలీలు ఫ రహదారి నిర్మాణ పనులపై తీవ్ర ప్రభావం ఫ పార్బాయిల్డ్ మిల్లుల్లో హమాలీల కొరత ఫ మరో నెల రోజుల వరకు ఇదే పరిస్థితి -
ప్రయోగాలతో పాఠాల బోధన సులువు
సూర్యాపేట : ప్రయోగాలతోనే విద్యార్థులకు పాఠాలు సులువుగా అర్థమయ్యేలా బోధించవచ్చని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మారం పవిత్ర అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్న పాఠశాలో సైన్స్ అకాడమీ బృందం ఆధ్వర్యంలో జీవశాస్త్ర ఉపాధ్యాయులకు 7 నుంచి 10వ తరగతి వరకు పాఠాలను సులభంగా బోధించే ప్రక్రియపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి 40 మంది జీవశాస్త్ర ఉపాధ్యాయులు హాజరు కాగా వారికి పలు అవయవాల గురించి ప్రయోగాత్మకంగా వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ బయాలజికల్ సైన్స్ ఫోరం అధ్యక్షుడు ఎల్.దేవరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డీఏలు, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలిసూర్యాపేట : ప్రభుత్వం నుంచి రావాల్సిన ఐదు డీఏలు, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి డి.మోతీలాల్‌నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి భగ్గులాల్నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన టీజీయూఎస్ జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లడారు. ప్రభుత్వం ఉద్యోగులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి నెలా విడుదల చేయాల్సిన రూ.700 కోట్లను కూడా సరైన సమయంలో విడుదల చేయడం లేదన్నారు. దాంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో సంఘం రాష్ట్ర సహ అధ్యక్షుడు డి.వస్రాంనాయక్, నాయకులు రాములునాయక్, మోతీలాల్, లింగానాయక్, హనుమంత్, ఉప్పయ్య పాల్గొన్నారు. దేశంలో పెరుగుతున్న పేదరికం, నిరుద్యోగం సూర్యాపేట అర్బన్ : ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం, పేదరికం, అధిక ధరలు, తీవ్ర అసమానతలు పెరిగి పోతున్నాయని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండాది డేవిడ్ కుమార్ అన్నారు. కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభను శనివారం జిల్లా కేంద్రంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం అభివృద్ధిలో దూసుకు పోతుందని ప్రధాని మోదీ ప్రచారం చేసుకుంటున్నారని, కార్పొరేట్ శక్తుల అభివృద్ధే దేశాభివృద్ధిగా చెబుతూ ప్రజల్ని ప్రక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. చండ్ర పుల్లారెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని యువత పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు కునుకుంట్ల సైదులు, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలెబోయిన కిరణ్, జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల నరసమ్మ, దేశోజు మధు, సామ నర్సిరెడ్డి, బొల్లె వెంకన్న పాల్గొన్నారు . -
వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలి
సూర్యాపేటటౌన్ : మహిళలు, యువతులు తమపై జరుగుతున్న వేధింపులను ఉపేక్షించకుండా ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ నరసింహ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. మహిళల రక్షణకు షీ టీమ్స్ కృషి చేస్తున్నాయని తెలిపారు. జిల్లాలో షీ టీం ఆధ్వర్యంలో స్కూల్స్, కాలేజీల్లో ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో వంటి వాటిపై అవగాహన కల్పిస్తునట్లు పేర్కొన్నారు. టీమ్ సభ్యులు ప్రత్యక్షంగా ఫిర్యాదులు తీసుకుంటారని, ఆన్లైన్, వాట్సాప్ ద్వారా కూడా స్వీకరిస్తారని తెలిపారు. గత నెలలో షీటీమ్స్‌కు 21 ఫిర్యాదులు అందాయని, 31 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారని, రెండు కేసులతో పాటు 5పెట్టీ కేసులు నమోదు చేశారని తెలిపారు. 44 కేసుల్లో కౌన్సెలింగ్ ఇచ్చారని, 6 కేసులను పోలీస్ స్టేషన్లకు పంపినట్లు పేర్కొన్నారు. మహిళలు షీ టీం నబర్ 8712686056కు కాల్ చేసి లేదా వాట్సాప్ ద్వారానైనా, డయల్ 100కు కాల్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. వైభవంగా లక్ష్మీనరసింహుడి నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని శనివారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను అందంగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం, నిత్యకల్యాణం చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ వీధుల్లో ఊరేగించారు. మట్టపల్లిలోని శివాలయంలో పార్వతీరామలింగేశ్వరస్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలిసూర్యాపేట అర్బన్ : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఐకేపీ కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చి నెలలు గడుస్తున్నా నేటికీ కాంటాలు వేయక పోవడంతో వర్షాలకు ధాన్యం తడుస్తున్నదని చెప్పారు. మోంథా తుపాన్ వల్ల వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు, కూరగాయల తోటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయాయరన్నారు. ప్రభుత్వం పంటనష్టపోయిన రైతుకు వరికి ఎకరాకు రూ.30వేలు, పత్తికి రూ.50 వేలు, ఇతర వాణిజ్య పంటలకు రూ.70 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్‌లను వెంటనే విడుదల చేయాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, కోట గోపి పాల్గొన్నారు. అమరుల ఆశయసాధనకు కృషి చేయాలి తిరుమలగిరి : భారత విప్లవోద్యమంలో భూమి, భుక్తి, విముక్తి కోసం అసువులు బాసిన అమరవీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలెబోయిన కిరణ్ అన్నారు. నవంబర్ 1 నుంచి 9 వరకు జరిగే అమరవీరుల వారోత్సవాలు, వర్ధంతి సభల సందర్భంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమక్రసీ ఆధ్వర్యంలో శని వారం నాగారం మండల పరిధిలోని ఈటూరులో అమరవీరుల స్థూపం వద్ద జెండావిష్కరించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆర్థిక అసమానతలు లేని సమసమాజ స్థాపన కోసం, నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను బలిదానం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు అంజయ్య, అంజయ్య, నాగరాజు, అంజయ్య, సోమన్న, పరశురాములు, వీరష్ పాల్గొన్నారు. -
తొలినాళ్లలో షేర్‌గోలా వస్త్రాల తయారీకి ప్రసిద్ధి
రఘునాథపురంలో పవర్లూమ్ పరిశ్రమ స్థాపించిన తొలినాళ్లలో షేర్‌గోలా వస్త్రాలను ప్రసిద్ధి. ఈ వస్త్రాలను హైదరాబాద్‌లోని రిక్షా కార్మికులు ఎక్కువగా ఉపయోగించేవారు. క్రమేణా హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ముంబయికి షేర్‌గోల వస్త్రాలు ఎగుమతి అయ్యేవి. కాలానుగుణంగా నక్కీ, జననీలు, అక్రాలిక్, ఎల్లో ట్రైప్, రీడ్ బైపిక్ వంటి రకరకాల కడలుంగీలను తయారు చేస్తున్నారు. రఘునాథపురానికి చెందిన కొందరు మాస్టర్ వీవర్స్ హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి కేంద్రాలుగా దుబాయ్, సౌదీ అరేబియా, ఒమన్ తదితర అరబ్ దేశాలతో పాటు ఆఫ్రికాలోని ఉగాండాకు ఎగుమతి చేస్తున్నారు. ఈ దేశాల్లో కడలుంగీలను పురుషులు లుంగీలుగా ఉపయోగిస్తే, మహిళలు డ్రెస్ మెటీరియల్‌గా వినియోగిస్తుంటారు. -
ప్రపంచ ఖ్యాతి పొందుతున్న మన వస్త్రాలు
ఫ అరబ్, ఆఫ్రికా దేశాలకు రఘునాథపురం కడలుంగీలు ఫ అమితంగా ఇష్టపడుతున్న ఆఫ్రికా మహిళలు ఫ పుట్టపాక వస్త్రాలకు సైతం విదేశాల్లో డిమాండ్ ఫ ఫ్రాన్స్ ప్రథమ పౌరురాలిని ఆకట్టుకున్న దుబీయన్ ప్రాంతానికో ప్రత్యేకత, ఊరికో వైవిధ్యం, ప్రతి దాని వెనకా ఓచరిత్ర.. అలాంటివెన్నో రఘునాథపురం, పుట్టపాక ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చాయి. ఇక్కడి చేనేత, పవర్లూమ్ కార్మికుల చేతిలో రూపుదిద్దుకున్న వస్త్రాలు ఎంతోమంది ప్రముఖులను ఆ‘కట్టు’కున్నాయి. జిల్లా కీర్తిని నలుదిశలా ఇనుమడింపజేస్తున్నాయి. రఘునాథపురం కడలుంగీలు, పుట్టపాక తేలియా రూమాల్, దుబీయన్ వస్త్రాలు నేతన్నల కళాప్రతిభకు నిదర్శనాలు రఘునాథపురంలో నిలువ ఉన్న కడలుంగీలు -
కూరగాయల ధరలు (కిలోలల్లో)
కూరగాయ వారం ప్రస్తుతం క్రితం టమాట 20 40 ఆలుగడ్డ 30 50 దోసకాయ 40 60 పచ్చిమిర్చి 50 80 సోరకాయ 40 80 కాకరకాయ 50 80 క్యారెట్ 40 80 బెండకాయ 50 80 వంకాయ 50 80 దొండకాయ 40 100 బీరకాయలు 50 100 చిక్కుడుకాయ 80 120 మునగకాయ 70 150 బీన్స్ 80 160వెజిటేబుల్.. రేటు డబుల్ ఫ బెంబేలెత్తుతున్న సామాన్య ప్రజలు ఫ మోంథా తుపాను ప్రభావంతో ధరలు పెరిగాయంటున్న వ్యాపారులు ఫ పేద, మధ్య తరగతి వారిపై అదనపు భారం సూర్యాపేట : మన పెరట్లో పెరిగిన దొండ కాయలను ఇరుగు పొరుగు వారికి ఉత్తిగనే ఇచ్చే వారు. మన డాబాపై కాసే సోర కాయలు బంధువులందరికీ పంచే వారు. బజారులో అయితే ఏ కాయ తీసుకున్నా రూ.10కి ఇచ్చే వారు. అలాంటి దొండ నేడు కిలో రూ.100 పలుకుతోంది. సోరకాయ కూడా కిలో రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక మిగతా కూరగాయలు కూడా కిలో రూ.100కు చేరువలోనే ఉన్నాయి. కూరగాయల ధరలు అమాంతం పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వారం రోజుల్లోనే వాటి రేట్లు రెట్టింపు కావడంతో సామాన్యులపై అదనపు భారం పడుతోంది. ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల రేట్లు రెట్టింపయ్యాయి. ఏ కూరగాయ కొన్నా కిలో రూ.100కు చేరువలోనే ఉంది. దాంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బడ్జెట్ తారుమారవుతోంది. నిన్నటి వరకు రూ.20కే కిలో అమ్మిన టమాట, ఆలుగడ్డలు నేడు రూ. 50 నుంచి 60 రూపాయలకు అమ్ముతున్నారు. పచ్చిమిర్చి, సోరకాయ, వంకాయ, బీర వంటివి కిలో రూ.100కు చేరువలో ఉన్నాయి. ఇక బీన్స్, చిక్కుడు, మునగ వంటివి కిలో వంద దాటి పోయాయి. దాంతో పేదలు కూరగాయలు కొనుగోలు తగ్గించేశారు. రోజుకు రెండు కూరలు వండే వారు ఒక దానితోనే సరిపెట్టుకుంటున్నారు. మిగతా పూటలు పచ్చడి, పప్పుచారుతో లాగించేస్తున్నారు.భారీ వర్షాలతోనే.. జిల్లాలో ప్రజల అవసరాలకు అనుగుణంగా కూరగాయల సాగు లేదు. దాంతో నిత్యం ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకుంటుంటారు. అయితే మోంథా తుపాన్ కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిశాయి. వర్షాలకు కూరగాయల తోటలు దెబ్బతిని దిగుబడి తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. మనకు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, విజయవాడతో పాటు హైదరాబాద్ నుంచి కూర గాయలు దిగుమతి అవుతుంటాయి. అయితే వర్షాల తరువాత అక్కడి వ్యాపారులే కూరగాయల రేట్లు పెంచి సరఫరా చేస్తున్నారని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్‌కు కూరగాయలు తక్కువగా రావడం, స్థానికంగా డిమాండ్ ఉండడంతో వ్యాపారులు కూరగాయల రేట్లను రెట్టింపు చేసి విక్రయిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యస్తం చేస్తున్నారు. కొన్ని కూరగాయల ధరలు తక్కువగా ఉన్నప్పటికీ వ్యాపారులు అధిక ధరలకు అమ్ముతున్నారని కొనుగోలు దారులు ఆరోపిస్తున్నారు. గత నెల 22 నుంచి ఈ నెల 19వరకు కార్తీక మాసం ఉంటుంది. ఈ నెలలో ప్రతి ఇంట్లో పూజలు, వ్రతాలు ఆచరిస్తారు. అయ్యప్ప, భవాని, ఆంజనేయస్వామి ఇలా వివిధ మాలలు ధరిస్తారు. స్వాములకు అన్నదానాలు నిత్యం కొనసాగుతాయి. ఎక్కువ మంది మాంసాహారం మానేసి శాకాహారం మాత్రమే తింటారు. దాంతో కూరగాయలకు డిమాండ్ పెరిగి ధరలు మండుతున్నాయి. ఏది కొనాలన్నా కిలో 100కు చేరువలో ఉన్నాయని, మార్కెట్‌కు రూ.500 తీసుకెళ్లినా సంచి నిండటం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలి
నడిగూడెం, తుంగతుర్తి: గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలని సాంఘిక సంక్షేమ గురుకులాల సంస్థ జోనల్ అధికారి హెచ్.అరుణ కుమారి ఆకాంక్షించారు. మూడు రోజులుగా నడిగూడెం, తుంగతుర్తి మండల కేంద్రాల్లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలల్లో జరుగుతున్న ఉమ్మడి జిల్లా స్థాయి 11వ జోనల్ స్పోర్ట్స్‌మీట్ శనివారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. ప్రభుత్వ గురుకులాల్లో చదివే విద్యార్థులకు ఉత్తమ విద్యతో పాటు అన్ని రంగాల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యాలను పెంపొందిచుకోవాలన్నారు. ఓవరాల్ చాంపియన్‌గా నడిగూడెంజోనల్ స్పోర్ట్స్ మీట్లో ఓవరాల్ చాంపియన్‌గా నడిగూడెం బాలికల గురుకుల పాఠశాల నిలిచింది. అండర్–14, అండర్–17 కబ్బడ్డీ, అండర్–19 వాలీబాల్‌లో ప్రథమ బహుమతి, అండర్–14 ఖోఖోలో ద్వితీయ, అండర్–19 టెన్నికాయిట్‌తో పాటు చెస్, క్యారమ్స్ అండర్–14, 17 విభాగాల్లో సైతం నడిగూడెం గురుకులం ప్రథమ బహుమతి గెలుచుకున్నట్లు ప్రిన్సిపాల్ వాణి తెలిపారు. కార్యక్రమంలో డీసీఓ పద్మ, కోదాడ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వేపూరి తిరపమ్మ, ఎస్ఐ గందమళ్ల అజయ్ కుమార్ పాల్గొన్నారు. తుంగతుర్తిలో..మూడు రోజుల పాటు కొనసాగిన 11వ జోనల్ లెవెల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగాం జిల్లాలకు చెందిన 765 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జోనల్ స్థాయి చాంపియన్స్‌గా పాలకుర్తి, అడ్డగూడూరు గురుకుల పాఠశాలలు నిలిచాయి. కార్యక్రమంలో పాఠశాల డీసీఓ శోభారాణి, ప్రిన్సిపాల్ కె.సంధ్యారాణి, స్పోర్ట్స్ ఇన్చార్జి జ్యోతిర్మయి, డాక్టర్ విజయ్‌కుమార్, హెచ్ఈఓ రవికుమార్, తల్లిదండ్రుల కమిటీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండగడుపుల ఎల్లయ్య, పీడీలు పాల్గొన్నారు. -
యాదగిరి క్షేత్రంలో సుదర్శన హోమం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనర్సింహ స్వామి క్షేత్రంలో బుధవారం ఉదయం నిత్యారాధనలో భాగంగా సుదర్శన నారసింహ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ అర్చకులు హవనం చేశారు. వేకువజూమున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి తిరువారాధన జరిపి ఆరగింపు చేపట్టారు. గర్భాలయంలో కొలువైన స్వయంభూలకు నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన చేసి భక్తులకు స్వామి,అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఉత్సవమూర్తులకు నిత్యతిరుకల్యాణ వేడుక ఘనంగా జరిపించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి వెండి జోడు సేవను ఆలయంలో ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.రాత్రి స్వామివారికి శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
సూర్యాపేట : పెండింగ్‌లో ఉన్న రూ. 8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్య యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల చేయక పోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పొనుగంటి రంగా, తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్, బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు పోలోజు మహేశ్ చారి, నాయకులు పరాల సాయి, రాజబోయిన సుమన్, శివ, సాయికుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.ఫ బీసీ విద్యార్థి సంఘాల భారీ ర్యాలీ -
పుట్టపాక ప్రత్యేకత.. దుబీయన్ వస్త్రం
సంస్థాన్‌నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామ చేనేత కళాకారులు రూపొందించిన వస్త్రాలను ఫ్రాన్స్, సింగపూర్, అమెరికా, జర్మనీ, జపాన్, నెదర్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, అరబ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఆ దేశ ప్రథమ పౌరురాలు బ్రిగిట్టే మెక్రాన్‌కు పుట్టపాక చేనేత కళాకారులు నేసిన దుబీయన్ సిల్క్ చీరను చందనం పెట్టెలో పెట్టి బహూకరించారు. చీరను చూసిన బ్రిగిట్టే మెక్రాన్ పుట్టపాక చేనేత కళాకారుల నైపుణ్యంపై అప్పట్లో ప్రశంసలు కురిపించారు. లండన్ మ్యూజియం, అమెరికా అధ్యక్షుని భవనంతో పాటు ముఖ్య కార్యక్రమాల్లో, విదేశాల్లోని ప్రముఖ మహిళలు పుట్టపాకలో తయారైన వస్త్రాలను ధరిస్తుంటారు. -
పుష్కరిణిలోకి భక్తులను అనుమతించాలి
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ సన్నిధిలోని విష్ణు పుష్కరిణిలోకి భక్తులకు అనుమతి ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈఓ వెంకట్రావ్ సూచించారు. ‘సాక్షి’ దినపత్రికలో శుక్రవారం ‘స్నాన సంకల్పానికి మంగళం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన ఈఓ విష్ణు పుష్కరిణిని పరిశీలించారు. పుష్కరిణిలో స్నాన సంకల్పంకు సంబంధించిన ఏర్పాట్లు చేసి, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరిణి ప్రదేశం వద్ద భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతకు ముందు విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్ప పూజలో పాల్గొన్నారు. అంతరాయం లేకుండా ప్రసాదం అందించాలి యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి వచ్చే భక్తులకు నిరంతరం పులిహోర ప్రసాదం ఉచిత పంపిణీ అంతరాయం లేకుండా చూడాలని ఆలయ ఈఓ వెంకట్రావ్ ఆదేశించారు. యాదగిరీశుడి ఆలయ సన్నిధిలోని ఉచిత ప్రసాద వితరణ, పుష్కరిణి, శివాలయం, క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్లు, దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యూలైన్ మూమెంట్‌కు భక్తులకు సంబంధించి ఇంజనీరింగ్ అధికారులకు, ఎస్పీఎఫ్ భద్రత సిబ్బందికి ఇబ్బందులు లేకుండా సూచించారు. కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీ ఉంటుందని, సోమవారాలు, మాస శివరాత్రి, ఏకాదశి రోజులలో శివాలయం ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రసాదం తయారీ, కౌంటర్స్ పరిశీలించి భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రసాదం తయారు చేయాలన్నారు. కొండపైన దుకాణాలలో దేవస్థానం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని, లేకుంటే టెండర్లు రద్దు చేస్తామన్నారు. ఆయన వెంట ఈఈ జె.దయాకర్‌రెడ్డి, ఇన్చార్జ్ డీఈఓ కృష్ణ, సహాయ కార్యనిర్వహణాధికారి నవీన్‌కుమార్, మహేష్, శంకర్ నాయక్, ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు తదితరులున్నారు. ఫ ‘సాక్షి’ కథనంతో విష్ణు పుష్కరిణిని పరిశీలించిన ఈఓ వెంకట్రావ్ -
ఫైనాన్స్ వ్యాపారి ఆత్మహత్య
చౌటుప్పల్ రూరల్: ఫైనాన్స్ వ్యాపారి గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడిపల్లి గ్రామానికి చెందిన చెందిన చీకూరి కృష్ణంరాజు(49) కొంతకాలంగా హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో గల హుడా సాయినగర్ కాలనీలో నివాసం ఉంటూ ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం దామెర గ్రామంలో తన వ్యవసాయ పొలానికి వచ్చాడు. అక్కడే ఉన్న పనిమనిషితో గడ్డిమందు తెప్పించుకున్నాడు. కృష్ణంరాజు తనతోపాటు తెచ్చుకున్న కూల్‌డ్రింక్‌లో గడ్డి మందు కలుపుకొని తాగాడు. అనంతరం సాయినగర్ కాలనీలోని తన ఇంటికి వెళ్లాడు. ఇంటికి చేరుకుని కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. కృష్ణంరాజు ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఫైనాన్స్ వ్యాపార లావాదేవీల్లో జరిగిన తేడాలతో మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని అతని స్నేహితులు చెబుతుండగా.. నడుమునొప్పితో విపరీతంగా బాధపడుతున్నాడని మరికొంత మంది చెబుతున్నారు. -
పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన
భువనగిరి: భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం ఆలయ అర్చకులు పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన సేవ నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, సహస్రనామార్చన సేవ, కార్తీక దామోదర హవనం, సత్యనారాయణ వ్రతం, రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని మదన వేణుగోపాల స్వామికి నవకలశ పూర్వక పంచామృతాభిషేకం, పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కల్యాణ మహోత్సవం జరిపించారు. సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
పామాయిల్ లోడ్‌తో వెళ్తున్న డీసీఎం బోల్తా
గరిడేపల్లి: పామాయిల్ లోడ్‌తో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడేనికి చెందిన షేక్ అస్గర్(40) హాలియా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలోని అంపాపురం పామాయిల్ ఫ్యాక్టరీకి డీసీఎంలో పామాయిల్ పంట లోడ్‌ను తరలిస్తున్నాడు. అప్పన్నపేట గ్రామ శివారులో ఇటీవల పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తప్పించే క్రమంలో డీసీఎం అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ తలకు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని 108 వాహనంలో హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్ ఢీకొని వ్యక్తికి గాయాలుమోటకొండూర్ : సైకిల్ నడిపించుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని ట్రాక్టర్ ఢీ కొట్టడంతో గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం మోటకొండూర్ మండలంలోని తేర్యాల గ్రామంలో చోటు చేసుకుంది. తేర్యాల గ్రామానికి చెందిన నల్ల శంకరయ్య వ్యవసాయ బావి వద్దకు సైకిల్‌ను నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఈక్రమంలో ఇసుక లోడ్‌తో వస్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న మరో ట్రాక్టర్‌ను తప్పించి వెనకాల వస్తున్న సైకిల్‌ను ఢీ కొట్టింది. దీంతో శంకరయ్యకు కాలికి బలమైన గాయమైంది. క్షతగాత్రుడిని ట్రాక్టర్ డ్రైవర్ పంజాల సాయి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుళ్లపై దాడి చేసిన నిందితుల అరెస్ట్చండూరు: ఇద్దరు కానిస్టేబుళ్లపై దాడి చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చండూరు మండల కేంద్రంలోని భవాని ఫంక్షన్‌హాల్ పక్కన కారుంగు క్రాంతికుమార్, మహమ్మద్ సాజిద్‌బాబా, మహమ్మద్ నాసర్‌పాషా అనే ముగ్గురు వ్యక్తులు ఈనెల 4న అర్ధరాత్రి సమయంలో మద్యం బాటిళ్లతో ఉన్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు వారికి సూచించగా సదరు వ్యక్తులు పోలీసులపై దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడుతూ దాడి చేశారు. ఈ విషయమై కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించినట్లు ఎస్ఐ కారింగు వెంకన్నగౌడ్ శుక్రవారం తెలిపారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత సూర్యాపేట : అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు పెన్‌పహాడ్ ఎస్ఐ గోపికృష్ణ శుక్రవారం తెలిపారు. పెన్‌పహాడ్ మండలంలోని దోసపహాడ్ మూసీ నుంచి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా దోసపహాడ్ గ్రామానికి చెందిన రెండు ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తుండగా గ్రామ శివారులో పట్టుకొని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అక్రమంగా ఇసుక విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు చౌటుప్పల్ : అక్రమంగా ఇసుకను నిల్వ చేసి అధిక ధరలకు అమ్ముతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ కేంద్రంలోని వలిగొండ క్రాస్‌రోడ్డులో ఇసుకను కుప్పలుగా పోసి అధిక ధరలకు అమ్ముతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీ నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన బలికె సత్యనారాయణ అనే వ్యక్తి నిల్వ చేసిన 15 టన్నుల ఇసుకను గుర్తించారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ఇసుకను సీజ్ చేసి సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. -
ఆయిల్ పామ్ సాగుపై శ్రద్ధపెట్టాలి
కోదాడరూరల్: రైతులు వరికి బదులుగా ఆయిల్‌పామ్ సాగుపై శ్రద్ధపెట్టాలని, అందుకు అధికారులు కూడా రైతులను ప్రోత్సహించాలని జిల్లా ఉద్యానవన అధికారి నాగయ్య, జిల్లా కోఆపరేటివ్ అధికారి పి.ప్రవీణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం కోదాడ మండలం గుడిబండ రైతువేదికలో పీఏసీఎస్ సీఈఓలు, ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఏసీస్ సీఈఓలు సంఘం పరిధిలో 100 ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేసేలా రైతులను గుర్తించి జాబితా ఇవ్వాలన్నారు. నీటి వసతి ఉన్న రైతులు ఈ పంటను సాగు చేస్తే రాయితీపై మొక్కలు, డ్రిప్‌తోపాటు మొక్కల పెంపకానికి పెట్టుబడి నిమిత్తం ఎకరాకు రూ.4,200 నగదు కూడా అందిస్తామన్నారు. సమావేశంలో కోదాడ పీఏసీఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి, టెక్నికల్ హెచ్ఈఓ మహేష్, అనిత, ప్రదీప్తి పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
సూర్యాపేట : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం–2025 సందర్భంగా రాష్ట్రస్థాయి పురస్కారాల కోసం అర్హులైన దివ్యాంగ వ్యక్తులు, సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి కె.నరసింహారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు, సంస్థలు ఈనెల 15వ తేదీ సాయంత్రం 5గంటలలోగా సూర్యాపేట లోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తులను రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలించి ఎంపిక చేయనుందని తెలిపారు. పూర్తి వివరాలకు జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు దివ్యాంగుల వయో వృద్ధులు, ట్రాన్స్‌జెండర్స్ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. జిల్లా మొదటి అదనపు జడ్జిగా రాధాకృష్ణ చౌహాన్సూర్యాపేట, హుజూర్నగర్ : సూర్యాపేట జిల్లా కోర్టు మొదటి అదనపు న్యాయమూర్తిగా ఎం.రాధాకృష్ణ చౌహాన్ నియమితులయ్యారు. హుజూర్నగర్ కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ఈయనకు జిల్లా మొదటి అదనపు జడ్జిగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ పనిచేసిన ఎం.శ్యామ్శ్రీ నా లుగు నెలల క్రితం బదిలీపై వెళ్లడంతో ఆ పోస్టులో రాధాకృష్ణ చౌహాన్‌ను నియమించారు. అలా గే హుజూర్నగర్ రెండవ అదనపు జిల్లా జడ్జిగా, పోక్సో కోర్టు న్యాయమూర్తిగా అదనపు పూర్తి బాధ్యతలు నిర్వర్తించాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. అయితే రెండు రోజుల్లో ఆయన నూతన బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి సూర్యాపేట : ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో కక్షిదారులకు చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. రాజీ పడే కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. బాల్య వివాహలు చట్టరీత్యా నేరమన్నారు. మహిళలకు డీఎల్ఎస్ఏ ద్వారా ఉచిత న్యాయసేవలతో పాటు, సలహాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ సదస్సులో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ బి.వెంకటరమణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, మిడియేషన్ సభ్యులు గుంటూరు మధు, అల్లంనేని వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ఇన్చార్జి డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా వేణుగోపాల్ హుజూర్నగర్ : మండలంలోని లింగగిరి ప్రాథమిక వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్ నాయక్ ఇన్చార్జి డిప్యూటీ డీఎంఎంహెచ్ఓగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు పనిచేసిన డాక్టర్ జయమనోరి పదోన్నతి పొందారు. దీంతో డాక్టర్ వేణుగోపాల్ నాయక్‌ను ఇన్చార్జి డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా నియమిస్తు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పి.చంద్రశేఖర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ వేణుగోపాల్ గతంలో ఆర్మీలో మేజర్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. 15 వరకు గాలికుంటు నివారణ టీకాలుహుజూర్నగర్ : జిల్లాలో ఈ నెల 15 వరకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయనున్నామని జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాస్‌రావు అన్నారు. శుక్రవారం నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. పశువులకు టీకాలు వేసే గ్రామాల్లో రైతులకు ఒకరోజు ముందే తెలియపర్చాలన్నారు. ఆయన వెంట పశు సంవర్ధకశాఖ సహాయ సంచాలకులు కందుల సత్యనారాయణ, ఎల్ఎస్ఏ దుర్గాభవాని, సిబ్బంది మహమ్మద్ ఇస్మాయిల్ ఉన్నారు. -
ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ
మిర్యాలగూడ టౌన్ : ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీ, ట్రాక్టర్ ఢీకొనడంతో ట్రాక్టర్ పల్టీకొట్టింది. దీంతో ట్రాక్టర్లో ఉన్న ధాన్యం చెల్లాచెదురుగా పడింది. ఈ సంఘటన శుక్రవారం మిర్యాలగూడ మండలంలో అవంతీపురం వద్ద చోటు చేసుకుంది. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన పొరెడ్డి అప్పిరెడ్డి ట్రాక్టర్లో ధాన్యాన్ని మిర్యాలగూడకు తీసుకువస్తున్నాడు. ఈక్రమంలో మిర్యాలగూడ మండలం అవంతీపురం వ్యవసాయ మార్కెట్ ఎదుటకు రాగానే మిర్యాలగూడ నుంచి మార్కెట్ యార్డు వైపు వెళ్తున్న ధాన్యం లారీ ట్రాక్టర్‌ను ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ పల్టీకొట్టింది. ట్రాక్టర్ ముందు భాగం దెబ్బతినగా రోడ్డుపై ధాన్యం చెల్లాచెదురుగా పడింది. ట్రాక్టర్ డ్రైవర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. కాగా.. లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఫ ట్రాక్టర్ పల్టీకొట్టడంతో చెల్లాచెదురుగా పడిన ధాన్యం -
పశుసంపదను కాపాడేందుకే టీకాలు
భూదాన్‌పోచంపల్లి: పశుసంపదను కాపాడేందుకే పశువైద్య, పశుసంవర్థక శాఖల ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నట్లు ఆ శాఖ రాష్ట్ర డైరెక్టర్, ఐఏఎస్ అధికారి డాక్టర్ గోపి తెలిపారు. శుక్రవారం భూదాన్‌పోచంపల్లి మండలంలోని జూలూరులో పీవీ నర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, పశుసంవర్థకశాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మెగా పశువైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గాలికుంటు వైరస్ వల్ల పశువుల్లో నోరు, గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి అనతి కాలంలోనే ఇతర పశువులకు వ్యాపిస్తుందన్నారు. వ్యాధి నివారణకే టీకాలు వేస్తున్నామని, రైతులు అపోహపడవద్దని సూచించారు. పశుసంపదను పెంచాలని, పశుసంవర్థకశాఖలో అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత వెటర్నరీ అధికారులపై ఉందన్నారు. గ్రామాలను దత్తత తీసుకొని రైతులకు మరింత చేరువ కావాలని సూచించారు. పశువులకు ఉచిత టీకాలు, ఫీడు అందజేయడంతో పాటు బీమా సౌకర్యం కల్పించేందుకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శిబిరంలో 700 పశువులకు గాలికుంటు నివారణ టీకాలు, 150 పశువులకు వైద్య చికిత్స, 800 మూగజీవాలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. అలాగే రైతులకు ఉచిత కిట్లు అందజేశారు. కార్యక్రమంలో వెటర్నరీ యూనివర్సిటీ డీన్ ఉదయ్‌కుమార్, అసోసియేట్ డాక్టర్లు డి.మాధురి, కల్యాణి, విశ్వేశ్వర్, కవిత, జిల్లా పశువైద్యాధికారి జానయ్య, జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి, పశువైద్యులు కిషోర్, రాంచంద్రారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, పృథ్వి, శ్రీకాంత్, అశోక్‌బాబు, శ్రీనివాస్, రఘు, ఏఓ శైలజ, జమీల్, గోపాలమిత్రలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
డీసీఎంఎస్ ఎత్తివేత!
ఎన్డీసీఎంఎస్కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం కోరిన విధంగా ఆస్తులు, ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులతో పాటు అన్ని వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. – నాగిళ్ల మురళి, డీసీఎంఎస్ మార్కెటింగ్ మేనేజర్ నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) దివాళా తీసింది. వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న డీసీఎంఎస్ నిర్వహణ కష్టంగా మారడంతో.. దాన్ని వేరే కార్పొరేషన్లో విలీనం చేయాలా.. పూర్తిగా రద్దు చేయాలా అనే ఆలోచన చేస్తోంది. రైతులకు విత్తనాలు, ఎరువుల సరఫరాతో పాటు ధాన్యం కొనుగోళ్లు తదితర సేవలు అందించేందుకు ప్రభుత్వం 1987లో డీఎసీఎంఎస్ను ఏర్పాటు చేసింది. కానీ దీనికి.. సరైన బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో అభివృద్ధి చెందలేదు. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టినా ఎక్కడా విజయవంతం కాలేదు. ఉద్యోగుల కొరత, పాలకవర్గాలు అనాసక్తితో వీటి నిర్వహణ భారంగా మారింది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉండడంతో.. వీటిని రద్దు చేసేందుకుగాను ఇప్పటికే పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం సేకరించింది. నిలిచిన ఎరువుల అమ్మకాలు డీసీఎంఎస్ ఆధ్వర్యంలో గతంలో యూరియా, కాంప్లెక్స్ ఎరువులు, విత్తనాలు అమ్మాకాలు సాగేవి. వాటి ద్వారా వచ్చే కమీషన్‌తో లాభాలు వచ్చేవి. కానీ ప్రభుత్వం రెండేళ్ల క్రితం యూరియా, ఎరువుల అమ్మకానికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ భారం డీసీఎంఎస్ మీదే వేసింది. ఎమ్మార్పీకే విక్రయించాలని నిబంధన పెట్టింది. కానీ, పీఏసీఎస్‌లకు మాత్రం ట్రాన్స్పోర్ట్ భారం ప్రభుత్వమే భరిస్తోంది. దీంతో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఎరువుల విక్రయాలు నిలిచిపోయాయి. రెండేళ్లుగా ఎలాంటి వ్యాపారాలు నిర్వహించకపోడంతో డీసీఎంఎస్ దివాళా తీసింది. ఉమ్మడి జిల్లాలో రూ.100 కోట్లకుపైగా ఆస్తులు.. డీసీఎంఎస్‌కు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో 3 ఎకరాల భూమి, యాదాద్రి జిల్లా భువనగిరిలో దుకాణాల సముదాయం ఉంది. ఈ ఆస్తుల విక్రయం గతంలో వివాదాస్పదంగా మారి కోర్టుల వరకు వెళ్లింది. నల్లగొండలోని గడియారం సెంటర్ సమీపంలో లతీఫ్ సాబ్ గుట్ట మెట్ల వద్ద విలువైన ఆస్తులతో పాటు నిడమనూరులో 3 ఎకరాలు, యాదాద్రి జిల్లా రామన్నపేటలో గోదాములు ఉన్నాయి. ఈ ఆస్తులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో డీసీఎంఎస్‌కు సంబంధించిన సమాచారాన్ని ఆ సొసైటీ నుంచి ప్రభుత్వం తీసుకుంది. ఉమ్మడి జిల్లాలోని ఆస్తుల వివరాలు, పని చేస్తున్న ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులు, జీత భత్యాలు తదితర వివరాలను ప్రభుత్వం సేకరించింది. ఫ నిర్వహణ కష్టంగా మారడంతో సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఫ కార్పొరేషన్లో విలీనం చేయాలా.. పూర్తిగా రద్దు చేయాలా అనే ఆలోచనలో ప్రభుత్వం -
ఎయిమ్స్‌లో మానవ, జంతు ఆరోగ్యంపై అవగాహన
బీబీనగర్: బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాలలో నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో మానవ, జంతు ఆరోగ్యం, పర్యావరణ పరస్పర అనుసంధానంపై ఎంబీబీఎస్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. జూనోటిక్ వ్యాధులను నివారించడానికి ఆహారభద్రతను నిర్ధారించడం, వ్యాధుల విచ్ఛిన్నం చేయడంపై వివరించారు. అనంతరం ఆరోగ్య విధానాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అదే విధంగా జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా రేడియేషన్, అంకాలజీ విభాగాల ఆధ్వర్యంలో క్యాన్సర్ నివారణపై వైద్య నిపుణులు అవగాహన కల్పించారు. క్యాన్సర్ నివారణకు వైద్యులు, నర్సులు కృషి చేయాలని డైరెక్టర్ అమితా అగర్వాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో మైక్రోబయాలజీ విభాగం అధిపతి డాక్టర్ రాహుల్‌నారంగ్, ప్రొఫెసర్ శ్యామల, వైద్యులు లక్ష్మీజ్యోతి, రుద్రేష్కుమార్, చావాన్ పాల్గొన్నారు. -
ఉత్సాహంగా యువజనోత్సవాలు
సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలు ఉత్సాహంగా కొనసాగాయి. వివిధ అంశాల్లో యువత పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ పోటీలను జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావు ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకొని యువత ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. వివిధ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలకు మెమొంటోలు, మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, జిల్లా యువజన, క్రీడల అధికారి బి.వెంకట్‌రెడ్డి, ప్రిన్సిపాల్ పెరుమాళ్ల యాదయ్య తదితరులు పాల్గొన్నారు. బహుమతులు సాధించింది వీరే.. జానపద నృత్యం గ్రూప్.. ప్రథమ స్థానం : టీజీటీడబ్ల్యూఆర్డీసీ, సూర్యాపేట ద్వితీయ స్థానం : జెడ్పీహెచ్ఎస్, ఏనుబాముల తృతీయ స్థానం : పాలిటెక్నిక్ కళాశాల సూర్యాపేట జానపద పాటలు గ్రూప్.. ప్రథమ స్థానం: టీజీటీడబ్ల్యూఆర్జేసీ, సూర్యాపేట ద్వితీయ స్థానం : జెడ్పీహెచ్ఎస్ కోదాడ తృతీయ స్థానం : జెడ్పీహెచ్ఎస్ జలాల్పురం ఉపన్యాసం.. ప్రథమ స్థానం: ఏఆర్ శారియా, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సూర్యాపేట ద్వితీయ స్థానం: క్రిషిత, పాలిటెక్నిక్ కళాశాల, సూర్యాపేట తృతీయ స్థానం:బి.మహాంత్రి, టీజీటీడబ్ల్యుయుఆర్జేసీ, చివ్వెంల కథా రచన.. ప్రథమ స్థానం: ఎం.రిధిర్న, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సూర్యాపేట ద్వితీయ : పి.కీర్తిన, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, సూర్పాయేట తృతీయ : డి.లోహిత, టీజీటీడబ్ల్యువీఆర్జేసీ చివ్వెంల పెయింటింగ్.. ప్రథమ స్థానం : ఎం.రిధిర్న, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సూర్యాపేట ద్వితీయ : పి.కీర్తన, పాలిటెక్నిక్ కళాశాల, సూర్యాపేట తృతీయ : కె.సుప్రియా, పాలిటెక్నిక్ కళాశాల, సూర్యాపేట వ్యాస రచన.. ప్రథమ స్థానం: ఆర్.సరిత, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సూర్యాపేట ద్వితీయ : కె.సుప్రియ, పాలిటెక్నిక్ కళాశాల, సూర్యాపేట తృతీయ : టి.గురుదీప్ కౌర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సూర్యాపేట సైన్స్మేళా.. ప్రథమ స్థానం: జెడ్పీహెచ్ఎస్ కోదాడ ద్వితీయ స్థానం: జెడ్పీహెచ్ఎస్, ఏనుబాముల తృతీయ స్థానం: జెడ్పీహెచ్ఎస్, జలాల్పురం. ఫ పోటీలను ప్రారంభించిన అదనపు కలెక్టర్ సీతారామారావు ఫ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతుల అందజేత -
కళాకారులను ఆదుకోవాలి
సూర్యాపేట అర్బన్ : యాభై ఏళ్లు నిండిన జానపద వృత్తి కళాకారులకు నెలకు రూ.4వేల పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని ప్రజా నాట్య మండలి (పీఎన్ఎం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ ప్రభుత్వానికి కోరారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ భవనంలో నిర్వహించిన పీఎన్ఎం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్లె సంస్కృతిని సంప్రదాయాలను కాపాడుతూ ప్రజలను చైతన్యపరుస్తున్న జానపద కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇచ్చి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. వచ్చే ఏడాది జనవరి 4 5 6 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న పీఎన్ఎం రాష్ట్ర మహాసభలు, జానపద సంబరాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న, అధ్యక్షుడు బచ్చలకూర రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు పిడమర్తి అశోక్, మామిడి నాగ సైదులు, బూరుగుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
పంట ఆగం..
భానుపురి (సూర్యాపేట) : అధిక వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. అతివృష్టి, అనావృష్టి కారణంగా ఏటా ఏదోవిధంగా పంటలు నష్టపోతూనే ఉన్నారు. ప్రధానంగా ఈ రెండేళ్ల కాలంలో అతివృష్టి కారణంగా చేతికి వచ్చిన పంటలను రైతులు కోల్పోవాల్సి వచ్చింది. ఇలాంటి విపత్తుల సమయంలో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు సకాలంలో పరిహారం అందజేయడం లేదు.. ఈ సీజన్లో పంటలు నష్టపోయిన వారికి ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం ఇస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇంకా అమలుకు నోచుకోవడం లేదు. దీంతో పంటల సాగుకు అయిన పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. జిల్లాలో 6లక్షల ఎకరాల సాగుభూమి ఉండగా దాదాపు 2.50 లక్షల మందికిపైగా రైతులు వ్యవసాయాన్నే నమ్ముకుని పంటలు సాగుచేస్తున్నారు. ఫసల్ బీమా లేదు.. పరిహారం రాదు! జిల్లాలో పంటల బీమా పథకాలు అసలు అమలు కావడమే లేదు. రైతుబంధు అమలు చేస్తున్నామని చెప్పి గత ప్రభుత్వం ఈ పంటల బీమా పథకాలకు మంగళం పాడింది. మధ్యలో ఓసారి ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసినా.. మండల యూనిట్‌గా పంటల నష్టాన్ని అంచనా వేయడంతో రైతులకు ఏ మాత్రం మేలు జరగడం లేదని వదిలేశారు. కనీసం పదేళ్ల కాలంలో పంటల నష్టాన్ని కూడా అంచనా వేసిన పాపాన పోలేదు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పినా.. ఇప్పటి వరకు ఫసల్ బీమా అమలు చేయకపోగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించడం లేదు. ముంచుతున్న అధిక వర్షాలు రెండు, మూడేళ్లుగా వర్షాలు ఏ సమయంలో వస్తున్నాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. వానాకాలం సీజన్ ప్రారంభంలో కనీసం సాధారణ వర్షాలు కూడా నమోదు కావడం లేదు. తదనంతరం పంటలు చేతికి వచ్చే సమయంలో అధిక వర్షాలు కురిసి అన్నదాతలు నష్టపోయేలా చేస్తున్నాయి. 2024–25 వానాకాలం సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలకు జిల్లాలో 25,967 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఎకరానికి రూ.10వేల పరిహారం ఇస్తామని చెప్పి 33 శాతానికి మించి నష్టం జరిగితేనే అన్న నిబంధన పెట్టారు. దీంతో ఈ సీజన్లో మొత్తం రూ.14.43 కోట్ల పంట నష్టం జరిగినట్లు అంచనా వేశారు. అంతకు ముందు 2023 ఏప్రిల్‌లో అకాల వర్షాల కారణంగా కోతదశకు వచ్చిన 26,177 ఎకరాల వరిపంటకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేసినా పైసా పరిహారం అందలేదు. అలాగే 2025–26 వానాకాలం సీజన్లో తుపాను ప్రభావంతో పెద్ద ఎత్తున రైతులు పంటలను నష్టపోవాల్సి వచ్చింది. ఓ వైపు కోతలు ప్రారంభమైన తర్వాత మోంథా తుపాను 64,939 ఎకరాల్లో పంటలకు నష్టాన్ని మిగిల్చింది. ఈ నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయగా.. 33శాతం నష్టం జరిగిన పంట లెక్కలు తేల్చే పనిలో అధికార యంత్రాగం ఉంది. ఇలా ఏటా ఏదోవిధంగా పంటను నష్టపోయినా పరిహారం అందక రైతులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పంటలు నష్టపోయిన వారికి ఎంతోకొంత పరిహారం ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. కోతకొచ్చిన వరిపొలం మోంథా తుపాను కారణంగా కురిసిన వర్షాలకు వరద నీటి పాలైంది. ఆత్మకూర్(ఎస్) మర్రికుంట కింద దాదాపు 7 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అలుగు నీరంతా పొలం గుండానే వెళ్లింది. ఇప్పటికీ నీరు పారుతూనే ఉంది. పరిహారం ఇస్తే పెట్టుబడిలో కొంతైనా వస్తోంది. – చిలుముల గోపాల్‌రెడ్డి, రైతు, ఆత్మకూర్(ఎస్) 2023 ఏప్రిల్‌లో కురిసిన అకాల వర్షానికి దాదాపు 8 ఎకరాల్లో వరిపంట నేలకొరిగి నష్టపోయా. ఈదురుగాలులు, వడగండ్ల కారణంగా పంట చేతికి రాకుండా పోయింది. బీమా పథకాలు లేకపోవడంతో పరిహారం అందలేదు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేల నష్టం పరిహారం కూడా రాలేదు. – విసవరం రాంరెడ్డి, రైతు, ఆత్మకూర్(ఎస్) దెబ్బతిన్న పంటలు 25,967 ఎకరాలు పంటనష్టం అంచనా విలువ రూ.14.43 కోట్లు మోంథా తుపానుతో పంటనష్టం 64,939 ఎకరాల్లో ఫ ప్రస్తుత సీజన్లో నిండా ముంచిన అధిక వర్షాలు ఫ 90వేల ఎకరాలకుపైగా పంట నష్టం ఫ సాయం అందక అప్పుల్లో కూరుకుపోతున్న రైతాంగం ఫ ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు -
ఇంటి ముందే మట్టి పోశారు
మ్యాన్ హోల్స్ కోసం గుంటలు తీశారు. తీసిన మట్టి ఇంటి ముందే పోయడంతో ఇబ్బందులు పడుతున్నాం. కనీసం ఇంట్లో నుంచి బయటికి వెళ్లే పరిస్థితి లేదు. ప్రత్యామ్నాయం కూడా చూపలేదు. అధికారులు స్పందించి యూజీడీ పనులను త్వరగా పూర్తిచేయించాలి. – కేశగాని సతీష్, బాలాజీ నగర్ రోడ్డు మధ్యలో తవ్వి పైప్‌లైన్ వేసిన తర్వాత మట్టితో పూడ్చి వదిలేశారు. అది కాస్త వర్షానికి కుంగి బురద మడుగులా తయారైంది. వీధుల్లో నడవడానికి, వాహనాలకు ఇబ్బందిగా ఉంది. అధికారులు స్పందించి రోడ్డు మధ్యలో ఉన్న గుంటలపై సిమెంట్ ప్యాచెస్ వేయాలి. – బొమ్మగాని లోకేష్, బాలాజీ నగర్ -
విద్యార్థినులు ఉన్నత స్థాయికి ఎదగాలి
కోదాడరూరల్: నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను విద్యార్థినులు ధైర్యంగా అధిగమిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్టినేటర్ చైతన్య అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీనగర్‌లో గల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారత కేంద్రం నిర్వహించిన బాలిక చైతన్యం కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని, వాట్సప్, ఇన్‌స్ట్రాగాం, స్నాప్చాట్లలో ఫొటోలను అప్లోడ్ చేయొద్దన్నారు. సైబర్ నేరగాళ్లు వాటిని మార్ఫింగ్ చేసి ఇబ్బందులకు గురిచేసే ప్రమాదం ఉందన్నారు. బేటీ బచావో బేటీ పడావో పథకంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కె.నాగజ్యోతి, భవ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.


