సూర్యాపేట అర్బన్ : ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని 29వ వార్డులో సర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసి, వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. ప్రతి రోజు కనీసం 2500 ఫారాలు సేకరించే లక్ష్యంతో పని చేయాలన్నారు. నిర్దేశిత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటర్లు సకాలంలో ఫారాలు పూర్తి చేసి అందించేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడా నిర్లక్ష్యం లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఫారాలు నింపే విషయంలో బీఎల్‌ఓలు ఓటర్లకు సహకారం అందించాలని, మ్యాపింగ్ ప్రక్రియను కరెక్ట్‌గా చేయాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ వేణు మాధవరావు, తహసీల్దార్ సాయిగౌడ్, బీఎల్‌ఓలు, తదితరులు ఉన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


