breaking news
Suryapet District Latest News
-
సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలు
నల్లగొండ: జిల్లాలో 32 సంక్షేమ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు ఉండగా 30 అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారని, వాటికి స్థలాలు సేకరిస్తే నిధులు మంజూరు చేసి పక్కా భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం నల్లగొండ కలెక్టరేట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి నిర్వహించిన ఉమ్మడి జిల్లా అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాల వారీగా అధికారులు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న హాస్టళ్లు, పాఠశాలలకు స్థలాన్ని సేకరించి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. కుల వృత్తిని కాపాడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల ఈత మొక్కలు, 5 లక్షల తాటి మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఉమ్మడి జిల్లాకు మరో 10 వేల రక్షణ కిట్లు అందిస్తామన్నారు. జిల్లాకు 77 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేసి ప్రారంభించామన్నారు. ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భవనాలు నిర్మించాలని, తద్వారా అద్దె భారం తగ్గుతుందన్నారు. సాగర్ ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రులు గీత కార్మికులకు కాటమయ్య కిట్లను అందజేశారు. అంతకు ముందు కలెక్టరేట్ ప్రాంగణంలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు మొక్కలు నాటారు. సమావేశంలో నల్లగొండ , యాదాద్రి జిల్లాల కలెక్టర్లు ఇలా త్రిపాఠి, హనుమంతరావు, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, రవాణా శాఖ కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఫ స్థలాలు సేకరిస్తే నిధులు మంజూరు చేస్తాం ఫ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష ఫ హాజరైన మంత్రి కోమటిరెడ్డి, గుత్తా, ఎంపీ, ఎమ్మెల్యేలు రోడ్డు ప్రమాదాలను నివారించాలి : గుత్తా సుఖేందర్‌రెడ్డి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే సమయంలోనే కఠిన నిబంధనలు అమలు చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషిచేయాలని శాసన మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని దండుమల్కాపురంలో వాహనాల ఫిట్నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు.బస్సుల సంఖ్య పెంచాలి : మంత్రి కోమటిరెడ్డి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ, మిర్యాలగూడ, నార్కట్‌పల్లి బస్సుల సంఖ్యను పెంచాలని కోరారు. బీసీ సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించే విషయంపై దృష్టి సారించాలన్నారు. -
రేపు ప్రజావాణి రద్దు
భానుపురి (సూర్యాపేట) : తిరుమలగిరిలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ ఉన్నందున అదేరోజు కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ శనివారం ప్రకటనలో తెలిపారు. అధికారులు అందరూ సీఎం పర్యటనలో పాల్గొనాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజావాణి కోసం కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు. నాఫ్స్కాబ్ అసోసియేట్ మెంబర్‌గా శ్రీనివాస్రెడ్డినల్లగొండ అగ్రికల్చర్ : నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లిమిటెడ్(నాఫ్స్కాబ్) అసోసియేట్ మెంబర్‌గా నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం నాఫ్స్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ భీమా సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. డీసీసీబీని ప్రగతిపథంలో నడిపించేలా చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి చేసిన కృషికి తెలంగాణ నుంచి ఆయనకు నాఫ్స్కాబ్లో ప్రాతినిధ్యం కల్పించారు. ఇక నుంచి కోఆపరేటివ్ బ్యాంకులు రైతుల కోసం తీసుకునే నిర్ణయాలలో శ్రీనివాస్‌రెడ్డి కీలక భూమికను పోషించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని సహకార బ్యాంకుల బలోపేతానికి తన వంతు కృషిచేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అమానుష యుద్ధాలు ఆపాలిసూర్యాపేట : ‘పాలస్తీనాపై అమెరికా వత్తాసుతో ఇజ్రాయిల్ అమానుషమైన యుద్ధం చేస్తూ ఆ దేశ పౌరుల జీవించే హక్కును కాలరాస్తోంది.. దీనిని ఆపాలి’ అని మాసపత్రిక సంపాదకుడు వేణుగోపాల్ పేర్కొన్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని శ్రీ లక్ష్మీగార్డెన్స్‌లో వివేక్ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన స్మారకోపన్యాంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మధ్య భారతంలో అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పజెప్పడం కోసం ఆదివాసుల హననం సాగుతోందని, దీన్ని ఆపడానికి ప్రజా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ పౌర హక్కుల సంఘం అధ్యక్షులు లక్ష్మణ్, కార్యదర్శి నారాయణరావు మాట్లాడుతూ వందల సంవత్సరాలుగా బిర్సాముండా, కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజుల నుంచి నేటి దాకా ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారన్నారు. రేపు సూర్యాపేటకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాకకోదాడరూరల్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రాంచందర్‌రావు ఈ నెల14 సూర్యాపేట జిల్లాకు రానున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటే శ్వరరావు తెలిపారు. శనివారం కోదాడలో నిర్వహించిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో మాట్లాడారు. సోమవారం సాయంత్రం మూడు గంటలకు సూర్యాపేటలో పార్టీ నాయకుల సమావేశంలో రాంచందర్‌రావు పాల్గొంటారని ఆ తర్వాత సొంతూరు కోదాడ మండలం నల్లబండగూడెంలో నిర్వహించే పార్టీ కార్యక్రమాలతో పాటు అభినందన సభకు హాజరవుతారని వివరించారు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేసి మంగళవారం పార్టీ నేతల సమావేశంలో ప్రసంగిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రబారి రాజమౌళి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతరెడ్డి, బొబ్బా భాగ్యారెడ్డి, కనగాల నారాయణ, కనగాల వెంకట్రామయ్య, నూనె సులోచన, రాంచద్రయ్య, యశ్వంత్, హనుమంతరావు, కిట్టు, జనార్దన్ పాల్గొన్నారు. -
మరికొన్ని కథనాలు 9లో
పచ్చని పొదరిల్లుమొక్కలకు నీళ్లు పడుతున్న భాస్కర్ ఆత్మకూరు(ఎం): వివిధ రకాల మొక్కలతో ఆహ్లాదంగా కనిపిస్తున్న ఈ గృహం.. ఆత్మకూరు(ఎం)కు చెందిన సోలిపురం అరుణది. చిన్నప్పటి నుంచి ఆమెకు మొక్కల పెంపకం అలవాటుగా మారింది. ఆ.. అలవాటే తన ఇంటి ఆవరణను పూలు, పండ్లు, కూరగాయల చెట్లతో పార్కులా మార్చింది. భర్త సోలిపురం ఉపేందర్‌రెడ్డి ప్రోత్సాహంతో ఇంటి ఆవరణలో తీరొక్క మొక్కలు నాటింది. రోజూ చెట్లకు నీళ్లు పట్టడం, పాదులు చేయడం, మొక్క కత్తిరింపు పనులు స్వయంగా చేస్తుంది. తమది వ్యవసాయ కుటుంబం అని, ఎంత బిజీగా ఉన్నప్పటికీ రోజూ కనీసం గంట సమయమైనా మొక్కలు, చెట్ల సంరక్షణకు కేటాయిస్తానని అరుణ చెబుతుంది. మోత్కూరు : మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామానికి చెందిన రక్షణ శాఖ మాజీ ఉద్యోగి బిల్లకంటి లక్ష్మీనారాయణ హరిత సేవలోనూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఏడు సంవత్సరాల క్రితం ఉద్యోగ విరమణ పొందిన లక్ష్మీనారాయణ కుటుంబంతో కలిసి స్వగ్రామంలో ఉంటున్నాడు. ప్రకృతిపై ఉన్న మక్కువతో ఉద్యోగంలో ఉన్న సమయంలో తన క్వార్టర్స్ ఆవరణలో వివిధ రకాలు మొక్కలు పెంచి ఉన్నతాధికారులతో శభాష్ అనిపించుకున్నాడు. రిటైర్డ్ అయిన తరువాత అదే స్ఫూర్తితో స్వగ్రామంలో తన ఇంటి ఆవరణను నందనవనంగా మార్చేశాడు. 35 రకాల మొక్కలు ఔషధ రకాలకు సంబంధించి మారేడు, తులసీ, పూదీన, పారిజాతం, ఉసిరి, కలబంద.. పండ్ల మొక్కలు జామ, మామిడి, బత్తాయి, దానిమ్మ, ఉసిరి, కొబ్బరి ఉన్నాయి. వీటితో పాటు రాధామాధవ్ క్రొటేన్స్, 8 రకాల గులాబీలు, మల్లెలో లిల్లి, గోరింటాకు, నల్లేరు, ఎర్ర, పచ్చ మందారం, తెల్ల, పసుపు, చామంతి, నిత్య మల్లెపూలు, తమలపాకు, గన్నేరు, బిల్ల గన్నేరు, నూరుహారాలు ఇలా రకరకాల పూల మొక్కలు పెంచుతున్నారు. ఇంటి గేట్ పక్కన నాటిన తగజాతి పూలమొక్క పచ్చటి తోరణంలా ఆకర్షణీయంగా మారింది. మొక్కలను లక్ష్మీనారాయణ దంపతులు ప్రాణంగా చూసుకుంటారు. ఇంటి ఆవరణను హరితవనంగా తీర్చిదిద్దిన రక్షణ శాఖ మాజీ ఉద్యోగి లక్ష్మీనారాయణ దంపతులు ● -
మహిళా సాధికారతకు ప్రాధాన్యం
సూర్యాపేట : మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమి స్తోందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతారావు పేర్కొన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో పాల్గొన్న అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపులో మహిళల పాత్ర కీలకమని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించడం చరిత్రాత్మకమని గుర్తు చేశారు. గతబీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెడితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తోందని గుర్తు చేశారు. జీఎస్టీ పేరుతో ప్రధాని మోదీ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ ప్రజా వ్యతిరేక పాలన నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపులో మహిళలు ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్లు వేములకొండ పద్మ, బోయినపల్లి రేఖ, బోధ లక్ష్మమ్మ, కావ్య శ్రీ, పావని, ఊట్కూరీ దివ్య తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యానవనం.. ఆ నివాసం
రామగిరి(నల్లగొండ): పర్యావరణానికి మేలు కలిగేలా మొక్కలను పెంచుతున్నారు నల్లగొండ పట్టణానికి చెందిన వంగూరి భాస్కర్. ఆయన వృతిపరంగా ప్రభుత్వ ఉద్యోగి. 30 సంవత్సరాలుగా తన ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలను పెంచుతూ ఇంటిని ఉద్యానవనంగా మార్చారు. ఇంట్లో ఖాళీ స్థలం అంటూ కనిపించదు. దాదాపు 200 పైగా మొక్కలు పెంచుతున్నారు. అందులో కొన్ని ఔషధ మొక్కలు, ఎయిర్ ఫ్రెషనర్స్, పూల మొక్కలు, అరుదైన జాతుల మొక్కలు ఉన్నాయి. పర్యావరణానికి మేలు జరిగేలా మొక్కలు పెంచుతూ నలుగురికి స్ఫూర్తినిస్తున్నారు. మొక్కల పెంపకంతో మానసిక ప్రశాంతత మొక్కల పెంపకంతో మానసిక ప్రశాంతంగా లభిస్తుంది. చుట్టూ చెట్లు ఉంటే అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. రోజు ఉదయం పూట కాసేపు చెట్లకు నీరు పోయడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. సోషల్ మీడియాతో గడిపి సమయం వృథా చేయకుండా మొక్కలు పెంచితే మనకూ పర్యావరణానికి మేలు జరుగుతుంది. – వంగూరు భాస్కర్, నల్లగొండ -
వారికి ప్రకృతి అంటేప్రాణం.. పచ్చని చెట్లే నేస్తాలు.. వారి ధ్యాసంతా మొక్కల పెంపకంపైనే.. తమ ఇళ్ల ఆవరణలను పచ్చదనంతో నింపేశారు. పూలు, పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలు, ఎయిర్ ఫ్రెష్నర్లాంటి అరుదైన జాతుల మొక్కలు పెంచుతూ నందనవనాల్లా మార్చేశారు. ఆహ్లాదకర వాతావరణా
చిన్న అడవినే పెంచారు..భువనగిరి: ఇంటినిండా మొక్కలు పెంచుకుంటారు చాలా మంది. కానీ, ఆ ఇంట్లో మొక్కల వనాన్నే సాగు చేస్తున్నారు. ఒకటా, రెండా 68 రకాల మొక్కలకు నెలవు. భువనగిరిలోని స్రిగ్దకాలనీకి చెందిన దిడ్డి బాలాజీ– డాక్టర్ జయశ్రీ దంపతులు.. నర్సరీలు, మరెక్కడైనా కొత్త రకం మొక్కలు కనిపిస్తే వాటిని తీసుకువచ్చి తమ ఇంటి ఆవరణలో నాటుతారు. ఇందులో న్యూజిలాండ్ నుంచి తెచ్చిన మొక్కలు సైతం ఉన్నాయి. తమ ఇంటి స్థలంలో సుమారు 600 గజాలు మొక్కలకే కేటాయించడం విశేషం. వీరు పెంచుతున్న మొక్కల్లో పూలు, షో మొక్కలతో పాటు పండ్ల చెట్లు కూడా ఉన్నాయి. ప్రధానంగా జామ, నిమ్మ, ఆరెంజ్, ఆరటి, దానిమ్మ, మామిడి, సపోట, పనస, రామసీతాఫలం చెట్లు పెంచుతున్నారు. చెట్ల మధ్య నిత్యం పక్షులు కిలకిలరావాలతో సందడి చేస్తుంటాయి. భువనగిరిలోని స్రిగ్దకాలనీలో దిడ్డి బాలాజీ ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలు -
అత్యాశకు పోయి ఆర్థికంగా నష్టపోవద్దు
సూర్యాపేటటౌన్ : ప్రజలు అత్యాశకు పోయి ఆర్థికంగా నష్టపోవద్దని ఎస్పీ కె.నరసింహ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రస్తుత సమాజంలో సాంకేతికత బాగా అభివృద్ధి చెందిందని, ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ తో కూడిన అత్యాధునిక మొబైల్స్ అందుబాటులో ఉంటున్నాయని పేర్కొన్నారు. ప్రజల ఆశను, అవసరాలను, అవగాహన లోపాన్ని అవకాశంగా చేసుకుని కొత్త తరహాలో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తూ డబ్బులు దోచేస్తున్నారని తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్‌ను ఉపయోగించి ప్రముఖ వ్యక్తులు, ప్రజా ఆదరణ పొందిన వ్యక్తుల నకిలీ వీడియోలు సృష్టించి సైబర్ నేరగాళ్లు ప్రజలను ఆర్థిక మోసాలకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. నకిలీ వీడియోలను ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రామ్, ట్విట్టర్ , పబ్లిక్ యాప్‌లాంటి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. సీఎం సభకు పటిష్ట బందోబస్తు తిరుమలగిరి (తుంగతుర్తి) : ఈ నెల 14న తిరుమలగిరిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. శనివారం తిరుమలగిరిలో సీఎం సభా స్థలిని ఎస్పీ పరిశీలించారు. పార్కింగ్ ప్రదేశాలు, హెలిపాడ్, రోడ్డు మార్గాలు, గ్యాలరీలు, సభా ప్రాంగణం వద్ద రక్షణ చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, డీఎస్పీలు ప్రసన్నకుమార్, నర్సింహాచారి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
మొక్క‘రక్షణ’ మరువని లక్ష్మీనారాయణ
ప్రకృతి ప్రేమికుడు.. పొన్నూరు సుబ్బారావు మిర్యాలగూడ టౌన్ : రిటైర్డ్ అధ్యాపకుడు, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నేత పొన్నూరు సుబ్బారావు ఇల్లు వివిధ రకాల మొక్కలతో నందనవనంలా కనిపిస్తూ చూపరులకు ఆహ్లాదం పంచుతోంది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి విరమణ పొందిన సుబ్బారావు వయస్సు ప్రస్తుతం 91 ఏళ్లు. మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్‌లోని ఆయన నివాసంలో సుమారు 50 రకాలకు పైగా మొక్కలను పెంచుతూ ఇంటిని ఒక నందనవనంగా మార్చారు. వయో భారం అయినప్పటికీ కొంత స్వయంగా మొక్కలకు నీళ్లు పోయడంతో పాటు ఇతరులతో మొక్కల పనిచేయిస్తూ తన ఇంటిని నందనవనంలా మార్చేశారు. -
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు
తిరుమలగిరి (తుంగతుర్తి) : ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీఎం సభ ఏర్పాట్లు చేస్తున్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన సభా స్థలిని అధికారులతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 14న సీఎం చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని వెల్లడించారు. బహిరంగ సభ సందర్భంగా ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లు సరిగా ఉండాలని పోలీసులకు సూచించారు. ప్రజలందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచి నీటి వసతి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవరావు, డీఎస్పీ ప్రసన్నకుమార్, తహసీల్దార్ హరిప్రసాద్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
రేపు ఉమ్మడి జిల్లా చెస్ ఎంపిక పోటీలు
సూర్యాపేట : సూర్యాపేటలోని టీటీడీ కల్యాణ మండపంలో ఆదివారం ఉమ్మడి జిల్లా అండర్–13 బాలబాలికలకు చెస్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గండూరి కృపాకర్, ఎల్.సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. గెలుపొందిన వారిని హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు పేర్కొన్నారు. పోటీలకు వచ్చే విద్యార్థులకు ఉచిత భోజన సదుపాయాలు కల్పిస్తామనితెలిపారు. పూర్తి వివరాలకు సెల్: 9394753343 నంబర్ సంప్రదించాలని కోరారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. పేట మార్కెట్ కార్యదర్శిగా ఫసియుద్దీన్భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ నూతన కార్యదర్శిగా ఎండి ఫసియుద్దీన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న సంతోష్ కుమార్ బదిలీ కాగా ఆయన స్థానంలో వికారాబాద్ మార్కెట్ కార్యదర్శిగా పనిచేస్తున్న పసియుద్దీన్ సూర్యాపేటకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. దరఖాస్తు చేసుకోవాలిభానుపురి (సూర్యాపేట) : సదరం సర్టిఫికెట్ కలిగి ఉండి జూలై 2025లో గడువు ముగిసిన వారంతా దగ్గరలోని మీసేవా కేంద్రం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే స్వయంగా పీడబ్ల్యూడీ లాగిన్‌లో రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని డీఆర్డీఓ వీవీ.అప్పారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులకు మేసెజ్ ద్వారా క్యాంపు నిర్వహించే తేదీ తెలపనున్నట్లు పేర్కొన్నారు. అలాగే కొత్తగా యూడీఐడీ పోర్టల్‌లో రిజిస్టేషన్ చేసుకునే వారు ఎప్పుడైనా మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వీరికి కూడా సీరియల్ నంబర్ ఆధారంగా క్యాంపు తేదీని నిర్ణయించి మేసెజ్ పంపనున్నట్లు పేర్కొన్నారు. ప్రజా పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం చివ్వెంల : ప్రజా పోరాటాలతోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్.ప్రదీప్ అన్నారు. శుక్రవారం చివ్వెంల మండలం కుడకుడలో నిర్వహించిన ఆ సంఘం జిల్లా కమిటీ ఎన్నికల సమావేశానికి హాజరై మాట్లాడారు. అనంతరం జిల్లా కమిటీని ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా హుజూర్‌నగర్‌కు చెందిన వాసా కరుణాకర్, ప్రధాన కార్యదర్శిగా తుంగతుర్తికి చెందిన వేల్పుల పరశురామ్, ఉపాధ్యక్షుడిగా సూర్యాపేటకు చెందిన కట్టా రమేష్, కోశాధికారిగా చివ్వెంలకు చెందిన పాల్వాయి రవి, సహాయ కార్యదర్శిగా మోతెకు చెందిన వడకాల మహేష్‌తో పాటు మరో ఆరుగురు సభ్యులు ఎన్నికయ్యా రు. సమావేశంలో కర్ణాకర్, పరశురామ్, రమేష్, మహేష్, రవి, అర్జున్, సైదులు, వెంకన్న, నాగుల్‌మీరా, భవన్ కుమార్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. -
పశుపోషకులకు అందుబాటులో ఉండాలి
కోదాడరూరల్ : పశుపోషకులకు పశు వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ దాచేపల్లి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో నియోజకవర్గ పశువైద్య అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే సహకారంతో నియోజకవర్గంలోని 11 ప్రాథమిక, 19 ఆరోగ్య ఉపకేంద్రాల నూతన భవనాలు, మర్మతులకు రూ.6కోట్ల నిధులను ఎస్టిమేట్ చేసి ఉన్నతాధికారులకు పంపినట్లు తెలిపారు. అదేవిధంగా దశాబ్దకాలం కిందట రాష్ట్రం వ్యాప్తంగా నిలిచిపోయిన గొర్రెల పెంపెకందారులకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే సహాకారంతో తిరిగి నియోజకవర్గంలో త్వరలో ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమీక్షలో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య, ఆరోగ్య కేంద్రాల పశువైద్యులు పాల్గొన్నారు. ఫ జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసరావు -
నాణ్యతా ప్రమాణాలు పెరగాలి
డిగ్రీ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెరగాలని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ పేర్కొన్నారు. పూర్తిస్థాయి నీటి మట్టం : 590 అడుగులు ప్రస్తుత నీటి మట్టం : 545.30 అడుగులు ఇన్‌ఫ్లో : 1,24,800 క్యూసెక్కులు అవుట్ ఫ్లో : 5,244 క్యూసెక్కులు విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా : 4,144కుడికాల్వ ద్వారా : నిల్ ఎడమకాల్వ ద్వారా : నిల్ ఏఎమ్మార్పీకి : 1,100 క్యూసెక్కులు వరద కాల్వకు : నిల్- 8లో -
హాస్టల్ వార్డెన్లు స్థానికంగా ఉండాలి
భానుపురి (సూర్యాపేట) : హాస్టల్ సంక్షేమ అధికారులు స్థానికంగా నివాసం ఉంటూ బాధ్యతగా విధులు నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ సంక్షేమ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది తీసుకున్న చర్యల వల్ల మెరుగైన ఫలితాలు సాధించామని, తద్వారా ఈసారి హాస్టల్స్‌లో అడ్మిషన్లు పెరిగాయన్నారు. సంక్షేమ హాస్టల్స్ అంటే వసతి కాదని, చదువుకోవడానికి ప్రభుత్వం కల్పించిన విద్యా మందిరం అన్నారు. ప్రతి హాస్టల్ సంక్షేమ అధికారి స్టాక్ రిజిస్టర్‌తోపాటు అన్ని రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని, సమయపాలన పాటించాలన్నారు. బాలికల హాస్టల్లో శానిటేషన్ ప్యాడ్స్ అందుబాటులో ఉంచాలన్నారు. పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ అధికారులు దయానందరాణి, శంకర్ నాయక్, శ్రీనివాస్ నాయక్, హాస్టల్ సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలి అనంతరం జాతీయ ఆరోగ్య మిషన్ ప్రోగ్రామ్‌పై వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలని ఆదేశించారు. జిల్లా జనరల్ ఆసుపత్రిలోనే కాకుండా కోదాడ, హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రులు, పీహెచ్‌సీల్లోనూ ప్రసవాలు చేయాలన్నారు. సాధారణ ప్రసావాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ పి.చంద్రశేఖర్, డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ జయ మనోహరి, జి.చంద్రశేఖర్, ప్రోగ్రాం అధికారులు కోటి రత్నం, నాజియా, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ఆరు మండలాల్లో ఎంపీడీఓలు లేరు!
నాగారం : జిల్లాలోని ఆరు మండలాల్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీఓలు) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా మండలాల్లో ఇన్‌చార్జ్‌ల పాలన కొనసాగుతోంది. గ్రామీణ వ్యవస్థలో కీలకమైన ఎంపీడీఓలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో వచ్చే స్థానిక ఎన్నికల నేపథ్యంలో పాలనాపరంగా సమస్యలు రావొచ్చనే చర్చ మొదలైంది. ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ మొదలు ప్రభుత్వ పథకాలు గ్రామీణ స్థాయిలో అర్హులైన వారి దరిచేర్చడంలో ఎంపీడీఓలదే ముఖ్య భూమిక పోషిస్తారు. ప్రస్తుతం వర్షాకాల నేపథ్యంలో గ్రామాల్లో అంటురోగాలు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు చక్కదిద్దడం వంటి పనులు కూడా ఎంపీడీఓలే చూడాల్సి ఉంటుంది. దీనికితోడు ఎంపీడీఓ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా కేటాయించే ఉపాధి పనులు, ఇతర అభివృద్ధి పనుల పూర్తి పర్యవేక్షణ వీరిపైనే ఉంటుంది. ఎన్నికల విధుల్లో కీలకపాత్ర ఎన్నికల విధుల్లో ఎంపీడీఓలు కీలక పాత్ర పోషిస్తారు. ఇందులో భాగంగా ఇటీవల గ్రామ పంచాయతీ, ఎంపీటీసీల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. మ్యాప్‌ల తయారీ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వచ్చిన ఎన్నికల సామగ్రి సిద్ధం చేయడం వంటి పనులన్నీ ఎంపీడీఓలే దగ్గరుండి పర్యవేక్షించారు. అయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన అనంతరం ఈ పనిభారం మరింత పెరగనుంది. సర్పంచ్, ఎంపీటీసీ రిజర్వేషన్ల కేటాయింపులు, నామినేషన్ పత్రాల స్వీకరణ వంటి అంశాల్లో పైఅధికారులకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నికల నిర్వహణ విధుల్లో సమర్థవంతమైన పాత్ర పోషిస్తారు. త్వరలోనే భర్తీ అవుతాయి జిల్లాలో 23 మండలాలకు గాను 15 మంది ఎంపీడీఓలు రెగ్యులర్ వాళ్లు పనిచేస్తున్నారు. మరో ఆరు మండలాల్లో ఇన్‌చార్జ్‌లు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇద్దరు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. తర్వరలోనే రెగ్యులర్ ఎంపీడీఓలు వచ్చే అవకాశం ఉంది. – వీవీ.అప్పారావు, జెడ్పీ సీఈఓ, సూర్యాపేటఫ 23 మండలాలకు 15 చోట్లనే రెగ్యులర్ ఎంపీడీఓలు ఫ రెండుచోట్ల బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్న కొత్తవారు ఫ మిగతా మండలాల్లో ఇన్‌చార్జ్‌ల పాలనే ఫ అదనపు బాధ్యతలతో ఎంపీఓలకు తప్పని ఇక్కట్లు -
ఎనిమిది కళాశాలల్లో 1,500 అడ్మిషన్లు
నేరేడుచర్ల : జిల్లాలోని ఎనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 1,500 అడ్మిషన్లు వచ్చాయని డీఐఈఓ భానునాయక్ అన్నారు. శుక్రవారం ఆయన నేరేడుచర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమై మాట్లాడుతూ ఒక్క నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 122 అడ్మిషన్లు అయ్యాయని, ఇంకా ఆడ్మిషన్లు పెంచేందుకు కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కళాశాలలో అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. కొందరు పాఠాలను బోధిస్తుంటే మరికొందరు అధ్యాపకులు గ్రామాలను సందర్శించి విద్యార్థులను చేర్పించాలని సూచించారు. విద్యార్థుల టీసీలను తెప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట అధ్యాపకులు డాక్టర్ మద్దిమడుగు సైదులు, కేలెన్రావు, ప్రణతి, శ్రీనివాసులు, వెంకన్న, నరేందర్, నర్సింహాచారి, గణేష్, అంజయ్య, సునిత, వెన్నెల ప్రసాద్, వీరుఉ, అపర్ణ, వీరేష్ ఉన్నారు. ఫ డీఐఈఓ భానునాయక్ -
మహాగర్జనను విజయవంతం చేయాలి
నడిగూడెం : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ నెల 14న జరిగే చేయూత పింఛన్‌దారుల మహాగర్జనను విజయవంతం చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం కాశీం పిలుపునిచ్చారు. శుక్రవారం నడిగూడెంలో నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో మాట్లాడారు. వికలాంగులకు రూ.6,016, వృద్ధులు, ఒంటరి మహిళలు, కల్లు గీత కార్మికులకు రూ.4,016 పింఛన్ ఇవ్వాలన్నారు. సమావేశంలో సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్, జిల్లా అధ్యక్షుడు చింత సతీష్, ప్రతినిధులు రావి స్నేహలత చౌదరి, మోష, దున్నా రాజు, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, సైదులు, మహేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు. -
ఒక్కరు చాలనుకున్నాం
చిరుద్యోగులుగా పని చేస్తున్నందున మాకు ఒక్కరు చాలను కున్నాం. అమ్మాయి అయినప్పటికీ మరొకరిని కనలేదు. ఒక్క అమ్మాయికే మంచి విద్యాబుద్ధులు నేర్పించాలనుకున్నాం. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలో ఆరవ తరగతి చదివిస్తున్నాం. ఒంటరిగా పెరుగుతున్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది పడడం లేదు. చుట్టుపక్కల పిల్లలతో, పాఠశాలలో తోటి వారితో ఆనందంగా ఉంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యులు ఇద్దరు పిల్లలను పెంచాలంటే ఇబ్బందే. దానిని ముందే గుర్తించి ఒక్కరే చాలనుకున్నాం. ఒక్క కూతురితో ప్రస్తుతం ఆనందంగానే ఉన్నాం. కొడుకు లేడనే బాధ ఏమీలేదు. –కూతురు తేజశ్రీతో జీవిత–హుస్సేన్ దంపతులు, కోదాడ -
పకడ్బందీగా సీఎం పర్యటన ఏర్పాట్లు
తిరుమలగిరి (తుంగతుర్తి) : ఈనెల 14న సీఎం రేవంత్‌రెడ్డి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నట్లు ఎమ్మెల్యే మందుల సామేల్ తెలిపారు. తిరులగిరిలో కొనసాగుతున్న సీఎం సభ ఏర్పాట్లను సామేల్‌తో పాటు అదనపు కలెక్టర్ రాంబాబు వేర్వేరుగా పరిశీలించారు. అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు వై.నరేష్, పట్టణ శాఖ అధ్యక్షుడు వీరేష్, జమ్మిలాల్, లక్ష్మయ్య, హఫీజ్, ఆర్డీఓ వేణుమాధవరావు, తహసీల్దార్ హరిప్రసాద్, ఎంపీడీఓ లాజరస్, మున్సిపల్ కమిషనర్ మునవర్అలీ తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే సామేల్ -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని జీసీడీఓ (గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్) కె.దయానందరాణి ఆదేశించారు. ఆత్మకూర్(ఎస్) ఎస్సీ హాస్టల్లో అన్నం సరిపోవడం లేదని కొందరు విద్యార్థులు బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. దీంతో పోలీసులు వార్డెన్‌కు సమాచారం అందించి రాత్రి అన్నం వండించి విద్యార్థులకు పెట్టారు. ఈ వార్త పత్రికల్లో రావడంతో స్పందించిన జీసీడీఓ .. గురువారం ఉదయం ఆ హాస్టల్‌ను తనిఖీ చేశారు. హాస్టల్ వార్డెన్ రవికుమార్,ఇతర వర్కర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లో రాత్రి జరిగిన ఘటనపై వివరాలు అడిగారు. మెనూ పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఫ జీసీడీఓ దయానందరాణి -
ఇద్దరు పిల్లలు ఉంటే చాలు
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతీది డబ్బుతో ముడిపడి ఉంది. పెరిగిపోతున్న ఖర్చులతో భవిష్యత్‌లో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో పిల్లలను ఇద్దరు కంటే ఎక్కువగా కనడమంటే కత్తిమీదసామే. మాకు కొత్తగా పెళ్లయింది. మేము కూడా ఇద్దరు పిల్లలు చాలనుకున్నాం. అందులో ఒకరు బాబు, ఒక పాప అయితే బాగుంటుందని మా అభిప్రాయం. – బి. రంజిత్ –సంగీత, సూర్యాపేట అవునుఅవసరం లేదుకుటుంబ పెద్దలు ఎలా చెబితే అలా నడుచుకుంటాం..● -
పంద్రాగస్టు నాటికి భూ సమస్యలు పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : పంద్రాగస్టు నాటికి భూ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. గురువారం సూర్యాపేట కలెక్టర్‌లో అదనపు కలెక్టర్ పి. రాంబాబు తో కలిసి ఆర్డీఓలు, తహసీల్దార్ లతో వెబ్ ఎక్స్ ద్వారా కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి సదస్సుల్లో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీదారులకు నోటీసులను అందజేసి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఆ తర్వాత రికార్డులను క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు. ఆర్డీఓలు సమన్వయం చేసుకుంటూ తహసీల్దార్లతో వేగవంతంగా అర్జీలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ రాంబాబు మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన అర్జీలకు సంబంధించి గ్రామాల వారీగా సిబ్బంది ద్వారా అర్జీదారులకు నోటీసులు అందజేయాలన్నారు. నూతన రేషన్ కార్డులకు వచ్చిన దరఖాస్తులు వేగవంతంగా క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలన్నారు. కాన్ఫరెన్స్‌లో ఆర్డీఓ లు వేణుమాధవ్, సూర్యనారాయణ, శ్రీనివాసులు, సూపరింటెండెంట్ సాయి గౌడ్, తహసీల్దార్ లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
24 వేల కొత్త కార్డులు
అర్హులందరికీ కార్డులు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందించనున్నాం. ఇప్పటి వరకు కొత్తగా 24,082 మందికి కార్డులు మంజూరు కాగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా పంపిణీ ఉంటుంది. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. – మోహన్‌బాబు, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి భానుపురి (సూర్యాపేట) : నిరుపేద ప్రజల నిరీక్షణకు తెరపడనుంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికి ఆహార భద్రత కల్పించేందుకు మంజూరు చేసే రేషన్ కార్డుల జారీ దాదాపు పదేళ్లుగా నిలిచిపోయింది. కేవలం హుజూర్నగర్ ఉప ఎ న్నిక సమయంలో అక్కడి ప్రజలకు మాత్రమే కొన్ని కార్డులు మంజూరు చేశారు. నాటి నుంచి నేటి వరకు ఒక్క కార్డు ఇవ్వకపోవడంతో వేలాది మంది నిరుపేదలు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసింది. ఈనెల 14వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీని సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 3,26,057 రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా పేర్కొంది. జిల్లాలో ఇప్పటి వరకు 3,26,057 రేషన్ కార్డులు ఉన్నాయి. గత పదేళ్ల నుంచి మార్పులు, చేర్పుల నిమిత్తం 52వేల దరఖాస్తులు, కొత్త కార్డుల కోసం 32,641 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్డుల్లో దాదాపు 94,871 యూనిట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఏడాది దాటినా కార్డులను మంజూరు చేయకపోవడంతో చాలామంది వివిధ పథకాలకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా రేషన్ కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మే నెలలో అప్పటికే కార్డులు ఉండి మార్పులు, చేర్పుల కోసం చేసుకున్న దరఖాస్తులకు మోక్షం కల్పించారు. దాదాపు అన్ని దరఖాస్తులను అదే నెలలో పూర్తి చేశారు. చకాచకా కార్డుల మంజూరు ఇన్నాళ్లుగా మూలకు ఉన్న రేషన్‌కార్డు దరఖాస్తుల దుమ్మును అధికారులు దులుపుతున్నారు. రేషన్‌కార్డుల ప్రక్రియ నిరంతరం సాగేదైనా.. ఈనెల 14వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. దీంతో అర్హులైన అందరికీ రేషన్‌కార్డులను మంజూరు చేయాలని రాష్ట్ర సివిల్ సప్లయ్, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించడంతో ఈ ప్రక్రియ మరింత వేగవంతమైంది. క్షేత్రస్థాయిలో ఆర్ఐలు దరఖాస్తుల పరిశీలన చేపడుతుండగా.. తహసీల్దార్లు, అక్కడి నుంచి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఈ ప్రక్రియను ఎక్కడ ఆలస్యం లేకుండా చకాచకా పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 32,641 దరఖాస్తులకు గాను 24,082 దరఖాస్తులకు మోక్షం లభించింది. 24,082 కొత్త రేషన్ కార్డులతో దాదాపు 73,364 మందికి ప్రయోజనం చేకూరింది. 782 దరఖాస్తులను అధికారులు తిరస్కరించగా.. మరో 19,629 దరఖాస్తులు వివిధ దశల్లో ఉన్నాయి. నిరీక్షణకు తెర..! ఫ రేషన్ కార్డులు మంజూరు ఫ 14న తిరుమలగిరిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పంపిణీ ఫ ఈలోగా మరిన్ని కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వంమండలాల వారీగా కొత్త కార్డులు..మండలం కొత్త కార్డులు అనంతగిరి 799 ఆత్మకూర్ 881 చిలుకూరు 1147 చింతలపాలెం 929 చివ్వెంల 1339 గరిడేపల్లి 2308 హుజూర్నగర్ 1900 జాజిరెడ్డిగూడెం 577 కోదాడ 1101 మద్దిరాల 655 మఠంపల్లి 813 మేళ్లచెరువు 984 మోతె 308 మునగాల 738 నడిగూడెం 352 నాగారం 439 నేరేడుచర్ల 1159 నూతనకల్ 900 పాలకవీడు 595 పెన్‌పహాడ్ 1003 సూర్యాపేట 3386 తిరుమలగిరి 498 తుంగతుర్తి 1271 మొత్తం 24,082 -
నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
ఫ ఉమ్మడి జిల్లాలో 1991 తరువాత నుంచి క్రమంగా తగ్గుదల ఫ సంతాన పరిమితితో తగ్గుతున్న జనాభా శాతంఫ మరో 20 ఏళ్లలో యువత కంటే సీనియర్ సిటిజన్ల సంఖ్యే ఎక్కువకానుంది ఫ 2011 నాటికి క్షీణించిన జనాభా పెరుగుదల రేటుఉమ్మడి జిల్లాలో యువతరం తగ్గిపోతోంది. పెరుగుతున్న పోషణ భారం.. సంతాన పరిమితికి కారణమవుతోంది. 1951లో మొదటిసారిగా జనాభా లెక్కలు చేసిన తరువాత పదేళ్లపాటు పెద్దగా జనాభా పెరుగకపోయినా, ఆ తరువాత 30 ఏళ్ల పాటు అంటే 1971 వరకు జిల్లాలో జనాభా గణనీయంగా పెరిగింది. మళ్లీ 1991 తరువాత నుంచి జనాభా సంఖ్యా పరంగా పెరిగినా, అంతకుముందు సంవత్సరాలతో పోల్చుకుంటే పెరుగుదల రేటు మాత్రం క్రమంగా క్షీణిస్తోంది. దీంతో వచ్చే 20 ఏళ్లలో సీనియర్ సిటిజన్ల సంఖ్యే ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో ఒకరిద్దరు కాదు ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనాలన్న సూచనలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం పెరిగిన జీవన ప్రమాణాలు, వస్తున్న ఆదాయానికి, చేయాల్సిన వ్యయానికి పొంతన లేకపోవడం, తక్కువ ఆదాయం, ఎక్కువ ఖ ర్చుల కారణంగా పరిమిత సంతానికే నేటి యువత మొగ్గుచూపుతోంది. తక్కువ మందిని కని సక్రమంగా పెంచి, అన్నీ సమకూర్చగలిగితే చాలు అన్నట్లుగా భావిస్తుస్తోంది. సంపన్న వర్గాల నుంచి పేద, మధ్య తరగతి వరకు చిన్న కుటుంబాలకే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా జనాభా పెరుగుదల ఏటేటా తగ్గిపోతోంది. ఒకప్పుడు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఒకప్పుడు జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు ప్రభుత్వమే ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు అన్న నినాదాన్ని ప్రజల్లోకి తెచ్చింది. అయితే అదే నినాదం ఇప్పటికీ అమలవుతూనే ఉంది. 1970 తరువాత భారత ప్రభుత్వం దేశంలో జనాభా ఎక్కువ అవుతుందని, ఆహార పదార్ధాల కొరత ఏర్పడుతుందన్న ఆలోచనతో కుటుంబ నియంత్రణను అమల్లోకి తెచ్చింది. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేపట్టింది. రెట్టింపునకు మించి పెరిగిన జనాభా ఉమ్మడి జిల్లాలో 1951లో చేపట్టిన జనాభా లెక్కల ప్రకారం ఉన్న జనాభా కంటే ఇప్పుడు జనాభా రెండు రెట్లు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జనాభా 15,43,975 ఉండగా, 2011 సంవత్సరం నాటికే అది 34,88,809కు పెరిగింది. ఈ 15 ఏళ్లలో మరో 5 లక్షలకు పైగా పెరిగి ఉంటుందని భావిస్తున్నారు. సంఖ్యాపరంగా పెరిగినా.. పెరుగుదల రేటు మాత్రం క్షీణిస్తోంది. 1951 నుంచి 1961 వరకు 1.97 శాతమే పెరిగింది. ఆ తరువాత పదేళ్లలో 1971 నాటికి 13.45 శాతం పెరిగింది. 1981 నాటికి 20.18 శాతం, 1991 నాటికి 20.07 శాతం జనాభా పెరిగింది. ఇక తరువాత పెరుగుదల రేటు క్షీణిస్తూ వస్తోంది. తరువాత పదేళ్లకు అంటే 2001 నాటికి పెరుగదల రేటు 12.19 శాతానికి పడిపోయింది. 2011 నాటికి జనాభా పెరుగుదల రేటు 6.91 శాతానికి తగ్గింది.●ఉమ్మడి కుటుంబాలు లేక.. అప్పట్లో జనాభా పెరుగుదలను తగ్గించేందకు తీసుకువచ్చిన కుటుంబ నియంత్రణను ఇప్పటి దంపతులు పక్కాగా అమలు చేస్తున్నారు. ఒక్కరిద్దరితోనే సరిపెట్టుకుంటున్నారు. పెరుగుతున్న జీవన వ్యయంతో ఒకరిద్దరు పిల్లలను కనేందుకు నేటి యువత మొగ్గు చూపుతోంది. మరోవైపు ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు పుట్టిన బిడ్డను చూసుకునేందుకు ఉమ్మడి కుటుంబంలో నానమ్మ, తాతయ్య, పెద్దనాన్నలు, పెద్దమ్మలు, చిన్నాన్నలు, చిన్నమ్మలు, అత్తమ్మలు ఇలా చాలా మంది ఉండేవారు. కానీ ఇప్పుడు బతుకు పోరులో ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయాయి. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రోజుకు 32 జననాలు సూర్యాపేట జిల్లాలో రోజుకు సగటున 32 మంది జన్మిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 975 మంది, మేలో 922 మంది, జూన్‌లో 919 మంది జననాలు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ప్రతి పదేళ్లలో జనాభా పెరుగుదల ఇలా.. సంవత్సరం జనాభా పెరుగుదల వృద్ధి శాతం 1951 15,43,975 -- -- 1961 15,74,946 37,971 1.97 1971 18,19,738 2,44,792 13.45 1981 22,79,681 4,59,947 20.18 1991 28,52,092 5,72,407 20.07 2001 32,47,982 2,95,890 12.19 2011 34,88,809 2,40,827 6.91 -
నేడు మంత్రి ఉత్తమ్ రాక
తిరుమలగిరి (తుంగతుర్తి) : ఈ నెల 14వ తేదీన నూతన రేషన్ కార్డుల పంపిణీ కి సీఎం రేవంత్‌రెడ్డి తిరుమలగిరికి వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం రానున్నారు. ఈ సందర్భంగా సభాస్థలిని పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఏఐ జిల్లా కోఆర్డినేటర్ల నియామకంనడిగూడెం : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డిజిటల్ టెక్నాలజీ విస్తరణకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ఇద్దరు జిల్లా కోఆర్డినేటర్లను నియమిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. టీచింగ్ విభాగం నుంచి నడిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల సివిక్స్ అధ్యాపకుడు కొల్లు శ్రీనివాస్, నాన్ టీచింగ్ విభాగం నుంచి నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల సీనియర్ అసిస్టెంట్ భూక్యా అన్వేష్‌ను నియమించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొల్లు శ్రీనివాస్‌ను ప్రిన్సిపాల్ డి.విజయ నాయక్, అధ్యాపకులు అభినందించారు. పాలకుల వైఫల్యాలను యువత ప్రశ్నించాలిచివ్వెంల(సూర్యాపేట) : పాలకుల వైఫల్యాలను యువత ప్రశ్నించాలని ప్రగతి శీల యువజన సంఘం (పీవైఎల్) రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్. ప్రదీప్ అన్నారు. గురువారం చివ్వెంల మండల పరిధిలోని కుడకుడ గ్రామంలో నిర్వహించిన ఆ సంఘం జిల్లాస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. యువత ప్రశ్నించకుండా గంజాయి, డ్రగ్స్‌లాంటి మత్తులో మునిగి పోయేలా చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరుణాకర్, పరశురామ్, రమేష్ , సైదులు, రవి, మహేష్, శ్రవణ్, భవన్ కుమార్, నాగులు మీరా, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. సూపరింటెండెంట్‌గా బాధ్యతల స్వీకరణసూర్యాపేటటౌన్ : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ శ్రవణ్‌కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గాంధీ ఆసుపత్రిలో పని చేసిన డాక్టర్ శ్రవణ్‌కుమార్ ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇక్కడ సూపరింటెండెంట్‌గా పని చేసిన సత్యనారాయణ నల్లగొండ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా బదిలీపై వెళ్లిన విషయం విదితమే. వైభవంగా లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శ్రీరాజ్యలక్ష్మిచెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, పంచామృతాభిషేకం చేశారు. నూతన పట్టు వస్త్రాలంకరణ చేసి ఎదుర్కోళ్ల మహోత్సవం చేపట్టారు. అనంతరం కల్యాణవేడుకలో భాగంగా విష్వక్సేనారాధన , పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అంతేగాక శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్ కుమార్, రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. -
అందరి ఆమోదంతోనే డీసీసీ!
తొలుత గ్రామ, మండల కమిటీలు.. డీసీసీ అధ్యక్షుల నియామకం కంటే ముందే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మండల, గ్రామ కమిటీలను నియమించాలని పీసీసీ నిర్ణయించింది. అందుకోసం ఉమ్మడి జిల్లాకు ఇన్చార్జిగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ను నియమించింది. ఆయన నేతృత్వంలోనే జిల్లా పార్టీ ముఖ్య నేతలు సమావేశం అవుతారు. గ్రామాలు, మండలాల కమిటీలను నియమిస్తారు. గ్రామ, మండల స్థాయిలోనూ పార్టీ కోసం పని చేసే వారినే అధ్యక్షులుగా నియమించనున్నారు. ఈ ప్రక్రియ వచ్చే 10 –15 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తరువాత జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తారు. ఫ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుల నియామకానికి కసరత్తు ఫ ప్రజాక్షేత్రంలో పార్టీ కోసం పనిచేసే వారికే అవకాశం ఫ వారం పది రోజుల్లో రానున్న ఏఐసీసీ అబ్జర్వర్లు ఫ నెలాఖరులో డీసీసీ అధ్యక్షుల ఖరారు ఫ ఈలోగా గ్రామ, మండల కమిటీల ఎంపిక సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులను కార్యకర్తల అందరి ఆమోదంతోనే నియమించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెలాఖరులోగా ఉమ్మడి జిల్లాలో డీసీసీ అధ్యక్షులను నియమించేలా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పీసీసీ సిద్ధం చేసిన డీసీసీ అభ్యర్థుల జాబితాను పక్కకు పెట్టి పార్టీ కోసం పనిచేసే వారికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జిల్లాలో అధ్యక్ష పీఠం ఎవరికి దక్కనుందోనన్న చర్చ జోరందుకుంది. పీసీసీ జాబితా పక్కకు.. ఇప్పటివరకు పీసీసీ ఆమోదంతో జిల్లా అధ్యక్షులను పార్టీ నామినేట్ చేస్తోంది. అయితే ఆ విధానంపై అధిష్టానం అసంతృప్తిగా ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ అభివృద్ధి, విస్తరణ పక్కాగా జరగాలంటే క్షేత్రస్థాయిలో పనిచేసే వారికే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాన్ని ఈనెలాఖరులో చేపట్టనున్నారు. అయితే జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుల జాబితాలను పీసీసీ గతంలోనే సిద్ధం చేసింది. అయితే డీసీసీ అధ్యక్షుల నియామక విధానాన్ని మార్పు చేసిన నేపథ్యంలో ఆ జాబితాను పక్కన పెట్టినట్లు తెలిసింది. తాజాగా జిల్లాలోని అందరి నేతల అభిప్రాయాలతో అధ్యక్షుల నియామకం చేపట్టే విధంగా కసరత్తు చేస్తున్నారు. అభిప్రాయ సేకరణకు కసరత్తు క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణకు కృషి చేసినవారు, పార్టీ అధికారంలోకి రావడానికి పనిచేసిన వారినే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించాలని పార్టీ భావిస్తోంది. పదేళ్లు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ అంటిపెట్టుకుని, పార్టీ పటిష్టతకు కృషి చేయడడంతో పాటు కార్యకర్తలకు వెన్నంటి ఉన్న నాయకులకు అవకాశం కల్పించనుంది. ఈ క్రమంలో ఆయా జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతల అభిప్రాయాలను తీసుకొని జిల్లా అధ్యక్షులను నియమించేందుకు చర్యలు చేపడుతోంది. అన్ని విధాలుగా పరిశీలించాకే.. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడంలో కీలమైన డీసీసీ అధ్యక్షుల నియామకాన్ని ఏఐసీసీ పరిశీలకులు వచ్చాకే చేపట్టనుంది. ఇప్పటికే మధ్యప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాలకు ఏఐసీసీ పరిశీలకులను నియమించింది. తెలంగాణకు కూడా వారం పది రోజుల్లో పరిశీలకులకు అధిష్టానం నియమించే అవకాశం ఉంది. ఏఐసీసీ అబ్జర్వర్లు వచ్చాక వారితోపాటు ఇటీవల అధిష్టానం నియమించిన జిల్లా ఇన్చార్జిలు, పీసీసీ ప్రతినిధులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆమోదంతో పీసీసీ.. డీసీసీ అధ్యక్షులను ఖరారు చేసి జాబితాను అధిష్టానానికి పంపించనుంది. ఈ క్రమంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వారెవరు, అధ్యక్ష పదవికి పోటీ పడుతుంది ఎవరు, వారు ఏ మేరకు పార్టీకి పని చేశారు, వారికి ఇవ్వడం సమంజసమేనా అనే విషయాలను పరిశీలించి అవకాశం కల్పిస్తారు. -
పోలీస్ ప్రజా భరోసా.. మంచి ఆలోచన
సూర్యాపేటటౌన్ : జిల్లాలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహించడం మంచి ఆలోచన అని మల్టీజోన్ –2 ఐజీ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ముందుగా పోలీస్ గౌరవ వందనంతో ఐజీకి స్వాగతం పలికారు. జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో పోలీస్ అధికారులతో కలిసి ఐజీ మొక్కలు నాటారు. అనంతరం ఎస్పీతో కలిసి సీఐలు, డీఎస్పీలతో సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లా భౌగోళిక పరిస్థితులు, ప్రముఖ ప్రాంతాలు, వృత్తులు, జనాభా, రాజకీయ పరిస్థితులు, ఈ సంవత్సరంలో నమోదైన కేసుల తీరుతెన్నులు, నేరాల నివారణలో జిల్లా పోలీస్ ప్రణాళిక, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా తీసుకోబోతున్న చర్యలు, పోలీస్ ప్రజా భరోసా, ప్రజా చైతన్య కార్యక్రమాలు, కళాబృందం, షీ టీమ్స్, భరోసా టీమ్స్ పనితీరు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా ఎస్పీ నరసింహ.. ఐజీకి వివరించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ నేరాల నివారణలో ముందస్తు ప్రణాళికతో పని చేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికల సమయంలో గతంలో ఎలాంటి సమస్యలు వచ్చాయో పరిశీలించుకుని పని చేయాలన్నారు. సమస్యాత్మక విషయాలపై దృష్టి పెట్టాలని, గ్రామ పోలీస్ అధికారిని యాక్టివ్ చేసి పల్లెల్లో సమస్యలపై దృష్టి సారించాలన్నారు. చిన్న సమస్యలు కొన్ని సందర్భాల్లో తీవ్రంగా మారుతాయని, ఇలాంటి వాటిని ఆదిలోనే పరిష్కరించాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులను చైతన్య పరిచి రక్షణ కల్పించాలని, డ్రగ్స్ లాంటి వ్యసనాలకు లోను కాకుండా నిఘా ఉంచాలన్నారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ జరగకుండా విద్యాసంస్థల్లో కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ కె.నరసింహ, అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, ఏఆర్ అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్, కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరసింహా చారి, ఏవో మంజు భార్గవి పాల్గొన్నారు. ఫ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలి ఫ పోలీస్ అధికారుల సమావేశంలో మల్టీజోన్ –2 ఐజీ తఫ్సీర్ ఇక్బాల్ -
కదంతొక్కిన కార్మికలోకం
నెట్వర్క్: కార్మికలోకం కదంతొక్కింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఆర్టీయూ, ఐఎఫ్టీయూ, ఏఐకేఎంఎస్తో పాటు వివిధ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన సార్వత్రిక సమ్మె సూర్యాపేట జిల్లాలో విజయవంతం అయ్యింది. ఈ సందర్భంగా పలువురు కార్మిక, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు. నాలుగు లేబర్కోడ్లను రద్దు చేయాలని, జీవో నంబర్ 51ని రద్దుచేసి మల్టీపర్పస్ విధానాన్ని తొలగించాలని, సమాన పనికి సమాన వేతన చట్టాన్ని అమలు చేయాలని,స్కీం వర్కర్లకు నెలకు రూ.26వేల కనీస వేతనం ఇవ్వాలని, 8 గంటల పని దినాన్ని 10 గంటలకు పెంచుతూ తీసుకొచ్చిన జీఓ నంబర్.282ను వెంటనే రద్దు చేయాలని, రైతులకు మద్దతు ధర కల్పించాలని, ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.600 ఇవ్వాలని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని డిమాండ్ చేశారు. ● సూర్యాపేటలో ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, ఇఫ్ట్యూ జిల్లా కార్యదర్శి గంట నాగయ్య, ఏఐటీయూసీ ప్రాంతీయ కార్యదర్శి నిమ్మల ప్రభాకర్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. ●● సూర్యాపేట పట్టణంలో ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు ఆశా వర్కర్లు, టైలరింగ్ యూనియన్, రిక్షా కార్మికులు, హమాలీ యూనియన్, యువజన సంఘం, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఇందులో సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ● తిరుమలగిరిలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహించారు. ● అర్వపల్లిలో హైవేపై రాస్తారోకో చేశారు. ● తుంగతుర్తి, నాగారం, నేరేడుచర్లలో ర్యాలీలు నిర్వహించారు. ● ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్లులో పారిశుద్ధ్య కార్మికులు రాస్తారోకో చేశారు. ● కోదాడలో ఐక్యకార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ● మునగాలలో వ్యాపారసంస్థలు, పాఠశాలలు, బ్యాంకులు, మిల్లులు మూతపడ్డాయి. ● చిలుకూరు మండలంలోని సీతరాంపురంలో ఎఫ్‌సీఐ గోదాముల వద్ద సీపీఎం ఆధ్వర్యంలో కార్మికులు సమ్మె చేశారు. ● హుజూర్‌నగర్‌లో నిర్వహించిన ర్యాలీలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పాల్గొన్నారు. ఫ సార్వత్రిక సమ్మె విజయవంతం ఫ ర్యాలీలు, రాస్తారోకోలతో హోరెత్తించిన కార్మిక, ప్రజాసంఘాల నేతలు ఫ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ -
అంగన్వాడీల్లో పోస్టుల భర్తీకి సన్నాహాలు
నాగారం : చిన్నారులకు ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య, వారికి అవసరమైన పౌష్టికాహారం అందించడం, గర్భిణులు, బాలింతలకు అవసరమైన ఆరోగ్య సలహాలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటిని మరింత బలోపేతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఖాళీల భర్తీకి వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ఇటీవల రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశించడంతో ఈ ప్రక్రియ వేగం పుంజుకోనుంది. ఇన్చార్జిలతో ఇబ్బందులు.. ప్రస్తుతం ఖాళీలు ఉన్న కేంద్రాల బాధ్యతలను సమీపంలోని టీచర్‌కు అప్పగించారు. అయితే వీరు సరైన న్యాయం చేయలేకపోతున్నారు. నిత్యం అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన విద్యార్థుల హాజరు, గర్భిణులు, బాలింతల సంఖ్య, పౌష్టికాహారం వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న వారు తమ పరిధిలోని రెండు కేంద్రాల వివరాలు ఆన్లైన్ చేయడంలో ఆలస్యమవుతోంది. దీంతో కేంద్రానికి సంబంధించిన పౌష్టికాహారం సమయానికి రాకపోవడం తదితర సమస్యలు ఎదురవుతున్నాయి. కేంద్రానికి ఒక టీచర్‌ను నియమించడంవల్ల ఇబ్బందులు తొలగుతాయి. కార్యాచరణ రూపకల్పన జిల్లా వ్యాప్తంగా 5 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా వీటి పరిధిలోని 1,209 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో ఖాళీగా ఉన్న టీచర్, సహాయకుల పోస్టులను గుర్తించారు. జిల్లాలో 78 టీచర్, 274 సహాయక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పోస్టుల భర్తీకి కార్యాచరణ రూపొందించింది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఓ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో అంతకు ముందే పోస్టులను భర్తీచేయడం సరికాదని ప్రభుత్వం జాప్యం చేస్తోంది. వర్గీకరణ అంశం కొలిక్కి రాగానే నెలరోజుల్లో పోస్టులను భర్తీ చేయవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఖాళీల వివరాలు సేకరించింది. నోటిఫికేషన్ ఇవ్వడమే తరువాయి. గతంలో ఇంటర్ మార్కుల ఆధారంగా పోస్టులను భర్తీ చేశారు. ఇప్పుడు అలాగే చేస్తారా లేక రాత పరీక్ష నిర్వహిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఫ 83 టీచర్, 287 ఆయా పోస్టులు ఖాళీ ఫ ప్రభుత్వానికి వివరాలు పంపిన అధికారులు ఖాళీల వివరాలు అందజేశాం జిల్లాలో అంగన్వాడీ టీచర్లు, సహాయకుల పోస్టులకు సంబంధించి ఖాళీల వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు అందజేశాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే నిబంధనల ప్రకారం పోస్టులను భర్తీ చేస్తాం. – దయానందరాణి, జిల్లా ఇన్చార్జి సంక్షేమ అధికారిప్రాజెక్టులు 05అంగన్వాడీ కేంద్రాలు 1,209చిన్నారులు 45,177గర్భిణులు 5,220 బాలింతలు 4,236అంగన్వాడీ టీచర్ల ఖాళీలు 83సహాయకుల ఖాళీలు 287 -
చేపా.. చేపా.. ఎప్పుడొస్తవ్!
ఇంకా ఖరారు కాని టెండర్లు భానుపురి (సూర్యాపేట) : మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పదేళ్లుగా అమలు చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం ఊసేలేకుండా పోయింది. ఈ ఏడాది జూలై వచ్చినా టెండర్లు వేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారు. దీంతో అసలు చేప పిల్లల పంపిణీ ఉంటుందా..? లేదా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదును దాటాక చేపలు పోస్తే ఎదుగుదల ఉండదని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనువైన చెరువులు, కుంటలు 1,000 జిల్లాలో చేపల పెంపకానికి అనువైన చిన్న, పెద్ద చెరువులు, కుంటలు కలిపి వెయ్యికి పైగా ఉన్నాయి. ఈ వానాకాలం తీవ్ర వర్షాభావంతో ఇప్పటివరకు చెరువులు, కుంటల్లోకి ఏమాత్రం నీళ్లు చేరలేదు. అయితే చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చేలోగా ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. సమయానికి టెండర్లు పూర్తయితే చెరువులు నిండగానే చేప పిల్లలను వదిలితే మంచి ఎదుగుదల ఉంటుంది. కానీ మూడు నాలుగు సంవత్సరాలుగా టెండర్ల ప్రక్రియ సజావుగా సాగడం లేదు. తమకు కావాల్సిన వారికి టెండర్లు దక్కేలా చేయడం కోసం ఈ ప్రక్రియను ఒకటికి రెండుసార్లు రద్దు చేసిన సంఘటనలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో టెండర్ల నిర్వహణ నుంచి పంపిణీ వరకు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించినా వీటిని అరికట్టేలా చర్యలు తీసుకోవడంలో కొంత అలసత్వం చేస్తోంది. సమయానికి పకడ్బందీగా టెండర్లు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటివరకు ఈ అంశానికి సంబంధించి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో మత్స్యకారుల్లో ఆందోళన మొదలైంది. టెండర్ దాఖలు నుంచి బిడ్లు ఓపెన్, టెండర్ ఖరారు, క్షేత్రస్థాయి పరిశీలన ఇలా దాదాపు నెల రోజుల పాటు సమయం వీటికే సరిపోతుంది. ఆర్థికంగా నష్టపోతున్న మత్స్యకారులు చెరువుల్లోకి చేప పిల్లలను వదలడం ఆలస్యం కావడంతో ఎదుగుదల సరిగా ఉండడం లేదు. అలాగే నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా చేప పిల్లలను చెరువుల్లోకి వదులుతున్నారు. దీంతో మత్స్యకారులు అన్ని రకాలుగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండానే నష్టపోతున్నారు. ప్రధానంగా ఈ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో మధ్య దళారులే బాగుపడుతున్నారని, సామాన్య మత్స్యకారులకు ఒరిగిందేమీ లేదని చెబుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను త్వరగా ప్రారంభించి ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా నాణ్యమైన చేప పిల్లలను పంపిణీ చేయాలని మత్స్యకార్మిక సొసైటీలు కోరుతున్నాయి.ఫ ఏటా టెండర్ల నుంచి పంపిణీ వరకు జాప్యం ఫ చివరికి అదును దాటాక మొక్కుబడిగా ప్రక్రియ ఫ చేపల్లో ఎదుగుదల లేక ఆర్థికంగా నష్టపోతున్న మత్స్యకారులు పంపిణీచేసిన సంవత్సరం చెరువులు చేప పిల్లలు 2022–23 579 2.43 కోట్లు 2023–24 648 3.38 కోట్లు 2024–25 315 1.01 కోట్లు ఇంకా ఆదేశాలు రాలేదు ఈ ఏడాది జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లల పంపిణీకి సంబంధించి టెండర్ల విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టెండర్లు నిర్వహించి నాణ్యమైన చేప పిల్లలు పంపిణీ చేస్తాం. త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశం ఉంది. – నాగులు నాయక్, జిల్లా మత్స్యశాఖ అధికారి -
ఆయిల్‌పామ్ లక్ష్యం పూర్తి చేయాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యం పూర్తయ్యే విధంగా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ పి. రాంబాబు సూచించారు. ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ బి.బాబు తన సిబ్బందితో కలిసి కలెక్టరేట్లో అదనపు కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఆయిల్ పామ్ సాగు ఏవిధంగా ఉందని అదనపు కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాకు ప్రభుత్వం ఇచ్చిన 3,000 ఎకరాల లక్ష్యం పూర్తి అయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి తీగల నాగయ్య, ప్రాంతీయ ఉద్యాన అధికారులు మహేష్, ప్రమిత , ఆయిల్ ఫామ్ కంపెనీ జనరల్ మేనేజర్ బి. యాదగిరి, మేనేజర్ జె. హరీష్, ఫీల్డ్ ఆఫీసర్లు, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు. 31లోపు పూర్తి చేయాలి భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో రైతులకు అవగాహన కల్పించి ఈనెల 31లోగా ఆయిల్‌పామ్ సాగు లక్ష్యం పూర్తి చేయాలని రాష్ట్ర ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ బి.బాబు సూచించారు. బుధవారం సూర్యాపేట జిల్లా ఉద్యాన శాఖ కార్యాలయంలో అధికారులు, పతంజలి ఆయిల్ పామ్, డ్రిప్ కంపెనీ సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో బాబు మాట్లాడారు. జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా రైతులకు అందించే పథకాల లక్ష్యాలను పూర్తి చేసేందుకు అధికారులు, ఆయిల్ పామ్, డ్రిప్ కంపెనీ సిబ్బంది కృషి చేయాలని కోరారు. కావాల్సినంత యూరియా అందజేస్తాంకోదాడరూరల్ : వానాకాలం వ్యవసాయ సీజన్‌కు కావాల్సినంత యూరియాను దశల వారీగా రైతులకు అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి(డీఏఓ) శ్రీధర్‌రెడ్డి తెలిపారు. బుధవారం కోదాడ పట్టణంలోని పలు ఎరువుల దుకాణాల్లో స్టాక్‌తో పాటు రికార్డులను తనిఖీ చేసి మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం 16వేల మెట్రిక్ టన్నుల యూరియా, 38వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు తొందరపడి ఎక్కువ రేటుకు యూరియా కొనుగోలు చేయవద్దని సూచించారు. డీలర్లు ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ రేటుకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ ప్రశాంతి, ఎంఏఓ పాలెం రజిని పాల్గొన్నారు. బకాయిలు ఇవ్వాలిభానుపురి (సూర్యాపేట) : యాసంగి సీజన్ 2023– 24 లో ఎఫ్‌సీఐకి మిల్లర్లు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే ఇవ్వాలని అదనపు కలెక్టర్ పి. రాంబాబు సూచించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో మిల్లర్లు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో డీఎస్ఓ మోహన్ బాబు, ఏఎస్ఓ శ్రీనివాస్ రెడ్డి, డీటీలు, ఆర్ఐలు, మిల్లర్లు పాల్గొన్నారు. -
కొత్త ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ
అర్వపల్లి: కొత్త ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని అదనపు కలెక్టర్ రాంబాబు పేర్కొన్నారు. కొత్త ఓటర్ల నమోదు, ఎన్నికల ప్రక్రియ, రిజిస్టర్ల నిర్వహణ, ఫారం 6,7,8 తదితర అంశాలపై మంగళవారం జాజిరెడ్డిగూడెం మండలంలోని బీఎల్ఓలకు స్థానిక జెడ్పీహెచ్ఎస్లో ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణకు అదనపు కలెక్టర్ హాజరై బీఎల్ఓలకు తగు సూచనలు, సలహాలు ఇచ్చి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా బీఎల్ఓలు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్, సూపర్వైజర్లు జలేందర్‌రావు, వెంకట్‌రెడ్డి, ప్రసన్న, మాస్టర్ ట్రైనర్లు భాస్కర్, గోపయ్య, బీఎల్ఓలు, సిబ్బంది పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి సూర్యాపేట అర్బన్ : ప్రధాని మోదీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. శ్రమశక్తిని దోపిడీ చేసి కార్పొరేట్ కంపెనీలకు అధికలాభాలు కట్టబెట్టేలా నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. సమ్మెలో కార్మికులంతా పాల్గొనాలని కోరారు. మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణం మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శ్రీరాజ్యలక్ష్మిచెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, పంచామృతాభిషేకం చేశారు. నూతన పట్టు వస్త్రాలంకరణ చేసి ఎదుర్కోళ్ల మహోత్సవం చేపట్టారు. అనంతరం విష్వక్సేనారాధన , పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. అంతేగాక శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఆ తర్వాత మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అదేవిధంగా క్షేత్రపాలకుడైన శ్రీఆంజనేయస్వామికి నాగవల్లి దళాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్ కుమార్, అర్చకులు రామాచార్యులు , పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
సీఎం సభకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాం
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి పట్టణంలో ఈనెల 14న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. తిరుమలగిరిలో ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను తుంగతుర్తి శాసన సభ్యుడు మందుల సామేల్, ఎస్పీ నరసింహతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. వీఐపీ, అధికారుల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ హెలిపాడ్ నుంచి సభా వేదిక వరకు అప్రోచ్ రోడ్డు వేయాలని, డబుల్ బారి కేడ్లు నిర్మించాలని ఆదేశించారు. హెలిపాడ్, అప్రోచ్ రోడ్లను వెడల్పు చేయాలని సూచించారు. సభకు ప్రజలు ఎక్కువగా వస్తారు కాబట్టి ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలన్నారు. వీటిలో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని, ప్రతి పార్కింగ్ లోపలికి, బయటకు వెళ్లేలా రెండు దారులు ఏర్పాటు చేయాలన్నారు. మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రజల కోసం తాగు నీరు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీఓ వేణుమాధవ్, డీఎఫ్ఓ సతీష్‌కుమార్, డీఆర్డీఓ అప్పారావు, డీఏఓ శ్రీధర్‌రెడ్డి, డీఎంహెచ్ఓ చంద్రశేఖర్, డీపీఓ యాదగిరి, డీఎండబ్ల్యూఓ జగదీష్‌రెడ్డి, డీటీడీఓ శంకర్, విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రాంక్లిన్, తహసీల్దార్ హరిప్రసాద్, మున్సిపల్ కమిషనర్ మున్వర్‌అలీ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
కంది వైపు సాగుదాం!
సూర్యాపేట : జిల్లాలో ఏటా కంది సాగు క్రమంగా తగ్గుతూ వస్తోంది. కనీసం వెయ్యి ఎకరాలు కూడా రైతులు ఈ పంటను సాగు చేయడం లేదు. ఇదే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉండడంతో దిగుబడి తగ్గిపోతోంది. ఈ క్రమంలో పప్పు దినుసుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో కంది సాగు పెంచేలా కార్యాచరణ రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఆసక్తి ఉన్న రైతులకు ఉచితంగా కంది విత్తనాలను పంపిణీ చేశారు. ఈ విత్తనాలతో కంది సాగు పెరిగి దిగుబడి రావడమే కాకుండా రైతులకు ఆదాయం రానుంది. ఒక్కో కిట్‌లో నాలుగు కిలోల చొప్పున విత్తనాలు ఈ ఏడాది జిల్లాకు 900 కిట్ల కంది విత్తనాలను ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో కిట్ (సంచి)లో 4 కిలోల కంది విత్తనాలు ఉంటాయి. ఈ నాలుగు కిలోల సంచి దాదాపు రెండెకరాల విస్తీర్ణంలో సాగు చేసుకునే వీలుంటుంది. ఈ లెక్కన జిల్లాలో ఉచితంగా రైతులకు అందించిన కంది విత్తనాలతో 1,800 ఎకరాల్లో సాగు కానుంది. ఇప్పటికే ఈ కంది విత్తనాల పంపిణీ జిల్లావ్యాప్తంగా పూర్తి కావొచ్చింది. ఈ వానాకాలం కంది సాగు అంచనా 2,650 ఎకరాలుగా ఉంది. ఏటా 6వేల నుంచి 8వేల ఎకరాల వరకు రైతులతో సాగు చేయించాలని అధికారులు భావిస్తున్నారు. అయినా 100 ఎకరాలకు మించి సాగు కావడం లేదు. ఈ నేపథ్యంలో ఉచితంగా ప్రభుత్వం అందించిన విత్తనాలతోనైనా సాగు పెరగనుంది. సాగు చేస్తే రైతులకు మేలు రెండేళ్లుగా జిల్లాలో కంది పంటకు మంచి ధర పలుకుతోంది. కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.7,550 మద్దతు ధర చెల్లిస్తుండగా బహిరంగ మార్కెట్లోనూ దాదాపు రూ.8500 వరకు ధర పలికిన సందర్భాలు ఉన్నాయి. ఇతర పంటలతో పోల్చితే పెట్టుబడులు తక్కువగా ఉండి రైతులకు మంచి ధరతో మేలు జరుగుతుంది.ఫ కంది పంట విస్తీర్ణం పెంచేలా ప్రత్యేక ప్రణాళిక ఫ ఉచితంగా విత్తనాల పంపిణీ ఫ ఆసక్తిగల రైతులకు 900 కిట్లు అందజేత ఫ క్లస్టర్ల వారీగా సమావేశాలతో రైతులకు అవగాహన అవగాహన కల్పిస్తున్నాం పదేళ్ల క్రితం జిల్లాలో కంది సాగు బాగా ఉండేది. రానురాను వరి సాగు వైపు రైతులు మళ్లారు. కంది సాగు పడిపోయింది. ఈ పంట సాగు పెంచేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. కందులకు మద్దతు ధర రూ.7550 వరకు ఉంది. అందువల్ల రైతులకు ఉచితంగా కంది విత్తనాలను అందించాం. – శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సాగు అంచనా 2,650 ఎకరాలు పంపిణీ చేసిన కిట్లతో సాగయ్యే విస్తీర్ణం 1800 ఎకరాలు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు.. రూ.7,550 -
పశువుల వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
కోదాడరూరల్ : పాడి పశువుల్లో వచ్చే వ్యాధుల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ దాచేపల్లి శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీనగర్‌లో సత్యసాయి సేవా ట్రస్ట్, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పశు వైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని కోరారు. పాడి రైతులు తప్పనిసరిగా పచ్చిమేతను సాగు చేసుకోవాలన్నారు. పశువులు ఈనిన మూడు నెలల్లోపే తిరిగి కృత్రిమ గర్భధారణ చేయించాలన్నారు. పశువులు వెంటనే సూడి కడితే ఏడాది లోపు తిరిగి మరో దూడను ఇవ్వడంతో పాటు పాల ఉత్పత్తి కొనసాగుతుందని, మేత ఖర్చు కూడా తప్పుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పశువులకు వైద్యపరీక్షలు నిర్వహించి మందులు, ఖనిజ లవణ మిశ్రమాన్ని రైతులకు అందజేశారు. కార్యక్రమంలో కోదాడ ప్రాంతీయ పశువైద్యాధికారి డాక్టర్ పెంటయ్య, సేవా సమితి సేవకులు, ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మారెడ్డి, డాక్టర్స్ బి.మధు, కె.వీరారెడ్డి, శ్రీనివాస్, మమత, హరిత, శ్రీనివాసరెడ్డి, సురేంద్ర, సేవాసమితి జిల్లా ఇన్చార్జ్ బాబురావు, సిబ్బంది ఉన్నారు. ఫ జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాసరావు -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
ఆత్మకూర్ (ఎస్) : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా సెక్టోరియల్ అధికారి రాంబాబు పేర్కొన్నారు. మంగళవారం ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని ఏపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఆధారపడి ఉందన్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించి తమ పిల్లలను రోజూ పాఠశాలకు పంపించాలని కోరారు. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయుడు ఎం.డి. బాసిత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వేలానికి దొడ్డు బియ్యం
ప్రభుత్వానికి వివరాలు పంపించాం రేషన్‌షాపుల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం వివరాలను సేకరించి ప్రభుత్వానికి పంపించాం. రేషన్‌షాపుల్లో నిల్వ ఉన్న బియ్యం బాధ్యతలను డీలర్లకు అప్పగించాం. జిల్లాలో సుమారు 12వేల క్వింటాళ్లకు పైగా దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం రేషన్‌షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తుడడంతో దొడ్డు బియ్యాన్ని స్టాక్ చేశాం. – శ్రీనివాస్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్చార్జి అధికారిచిలుకూరు: రేషన్‌షాపుల ద్వారా ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో మిగిలిపోయిన దొడ్డు బియ్యాన్ని విక్రయించేందుకు పౌరసరఫరాల శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే నాలుగు నెలలు గడిచిపోయాయి. ఇక ఎక్కువ కాలం ఉంచితే అ బియ్యం చెడిపోయే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జిల్లాలోని 610 రేషన్ షాపుల్లో ఉన్న దొడ్డు బియ్యం నిల్వల వివరాలు పంపాలని రాష్ట్ర పౌరసరఫరా శాఖ ఆదేశించింది. దీంతో సంబంధిత అధికారులు ఆ వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సాఫ్ట్వేర్ మార్చడంతో. . . గతంలో ఎంత మేర నిల్వలున్నాయనేది ఈ పాస్ యంత్రాల్లో తెలిసేది. వాటిలో సాఫ్ట్వేర్ మార్చడంతో గతంలో ఉన్న నిల్వలు తెలియడం లేదు. కేవలం గోదాముల్లో మాత్రమే రేషన్ దుకాణాలకు సంబంధించిన నిల్వలు తెలుస్తున్నాయి. దీని ఆధారంగా ఏయే దుకాణాల్లో ఎంత మేర నిల్వలున్నాయి అనే దానిని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో పంపిణీ చేయగా మిగిలిన దొడ్డు బియ్యాన్ని దుకాణాల్లోనే నిల్వ చేయాలని అధికారులు ఆదేశించారు. నాలుగు నెలలుగా దొడ్డు బియ్యం నిల్వలు దుకాణాల్లోనే ఉన్నాయి. వాటిని కాపాడే బాధ్యతనూ డీలర్లకే అప్పగించారు. 12,084 క్వింటాళ్లు జిల్లా వ్యాప్తంగా 610 రేషన్ షాపుల్లో 12,084 క్వింటాళ్ల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. పౌర సరఫరాల శాఖ అధికారులు నిల్వలను సేకరించి ప్రభుత్వానికి పంపనున్నారు. జిల్లాలో 3,26,055 రేషన్‌కార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక కొత్త రేషన్‌కార్డులను మంజూరు చేయడంతో పాటు వాటికి కోటాను కూడా విడుదల చేసింది. ఫ సన్నాహాలు చేస్తున్న పౌరసరఫరాల శాఖ ఫ జిల్లా వ్యాప్తంగా రేషన్‌షాపుల్లో 12,084 క్వింటాళ్ల దొడ్డు బియ్యం నిల్వలు ఫ వీటిని కాపాడే బాధ్యత డీలర్లకు అప్పగింత -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
భానుపురి (సూర్యాపేట) : నూతన రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 14న తిరుమలగిరికి రానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులకు సూచించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం పర్యటనకు సంబంధించి అధికారులకు కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ వివి.అప్పారావు, డీపీఓ యాదగిరి, వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, డీఈఓ అశోక్, సీపీఓ కిషన్, సంక్షేమ అధికారులు దయానంద రాణి, శంకర్, శ్రీనివాస్ నాయక్, జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
వన మహోత్సవానికి సన్నద్ధం
భానుపురి (సూర్యాపేట) : వన మహోత్సవానికి జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. సమృద్ధిగా వర్షాలు వర్షాలు పడడంతో పాటు ప్రభుత్వ ఆదేశాలు రాగానే మొక్కలు నాటేందుకు వీలుగా ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఎంపిక చేసిన ప్రాంతాల్లో గుంతలు తీసే పనులను ఇప్పటికే ప్రారంభించారు. ఈ సారి జిల్లాలో సుమారు 59.88 లక్షల మొక్కలు నాటాలని వివిధ శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం విధించింది. నిర్దేశించిన లక్ష్య సాధనకు ఆయా శాఖలకు ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. లోటు వర్షపాతం కారణంగా..ఈ ఏడాది మే చివరి వారంలోనే వర్షాలు ప్రారంభమయ్యాయి. దీంతో సమృద్ధిగా వర్షాలు పడతాయని అంతా భావించారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం కూడా వర్షాలు కురిసిన సమయంలోనే మొక్కలు నాటితే బాగుంటుందన్న అభిప్రాయంతో ముందస్తుగానే జూన్ మాసంలోనే మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే జూన్ మాసంలో దాదాపు అన్ని మండలాల్లోనూ లోటు వర్షపాతమే నమోదైంది. దీంతో మొక్కలు నాటేందుకు వెనుకడుగు వేశారు. ఈనెలలో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రభుత్వ ఆదేశాలు ఎప్పుడు వస్తే అప్పుడు మొక్కలు నాటనున్నారు. జిల్లాలో డీఆర్డీఓ, ఎంపీడీఓ విభాగం అత్యధికంగా 28.87 లక్షల మొక్కలు నాటనుంది. తదనంతరం మున్సిపల్ శాఖ 15.53 లక్షలు, ఫారెస్ట్ 4.32 లక్షల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. ఇవే కాకుండా ప్రభుత్వం అన్నిశాఖలకు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేలా కసరత్తు చేస్తున్నాయి. 1,55,543 గుంతల తీత..ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇప్పటికే 1,55,543 గుంతలను జిల్లావ్యాప్తంగా కూలీలతో తీయించారు. అత్యధికంగా నాగారం మండలంలో 19,100 గుంతలు, అనంతగిరి మండలంలో 11,470 గుంతలు, గరిడేపల్లి మండలంలో 11,280 గుంతలు తీశారు. అత్యల్పంగా హుజూర్నగర్ మండలంలో కేవలం 575 గుంతలు తీయించారు. రోడ్ల వెంట నీడనిచ్చె మొక్కలతో పాటు పండ్ల మొక్కలు నాటనున్నారు. అలాగే జిల్లాలోని పల్లె ప్రకృతి వనాల్లో ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో 3 అడుగులకు పైగా ఉన్న మొక్కలను నాటనున్నారు. ఇక పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో మునగ, కరివేపాకు, ఉసిరి, మారేడు, వెలగ మొక్కలు నాటాలని నిర్ణయించారు.వర్షాలు కురవగానే నాటిస్తాం జిల్లాలో వన మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఏడాది లక్ష్యాన్ని చేరుకునేలా వివిధ శాఖలకు సూచనలు చేశాం. ఈ మేరకు ఇప్పటికే మొక్కలు నాటేందుకు గుంతలు తీయిస్తున్నాం. వర్షాలు కురిస్తే ప్రభుత్వ ఆదేశాల మేరకు మొక్కలు నాటిస్తాం. – వి.వి.అప్పారావు, డీఆర్డీఓఎన్ఆర్ఈజీఎస్లో గుంతలుతీసే పనులు ప్రారంభం ప్రభుత్వ ఆదేశాలు రాగానే మొక్కలు నాటేలా ప్రణాళిక 59.88 లక్షల మొక్కలు నాటనున్న వివిధ శాఖలుశాఖ లక్ష్యం (లక్షల్లో) ఫారెస్ట్ 4.32 డీఆర్డీఏ/ఎంపీడీఓ 28.87 ఎడ్యుకేషన్ 45వేలు ఆర్అండ్బీ 50వేలు ఇరిగేషన్ 2.57 అగ్రికల్చర్ 3.83 హార్టికల్చర్ 38వేలు ఎకై ్సజ్ 94వేలు రెవెన్యూ 1.00 మున్సిపల్ 15.53 హెల్త్ 22వేలు పోలీస్ 27వేలు ఇండస్ట్రీస్ 60వేలు సోషల్ వెల్ఫేర్ 7500 ట్రైబల్ వెల్ఫేర్ 10వేలు బీసీ వెల్ఫేర్ 4500 మైనార్టీ వెల్ఫేర్ 7500 పశువైద్యశాఖ 7500మొత్తం 59.88లక్షలు -
లేబర్ కోడ్లు రద్దయ్యే దాకా పోరాటం
సూర్యాపేట : లేబర్ కోడ్లు రద్దయ్యేదాకా పోరాటం ఆగదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. సోమవారం సూర్యాపేట మండలం రాయినిగూడెంలో పెయింటర్స్, భవన నిర్మాణ కార్మికులను ఆయన కలిసి మాట్లాడారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మికులను కట్టు బానిసలుగా చేస్తోందని, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా లేబర్ కోడ్లు తెచ్చిందని అన్నారు. ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు ఎం. శేఖర్, నాయకురాలు సైదమ్మ, కామల్ల లింగయ్య, చింతమల్ల వెంకన్న, కిరణ్, నవీన్, నాగయ్య, వీరారెడ్డి పాల్గొన్నారు. వైభవంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో సోమవారం శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించి నిత్య కల్యాణం జరిపారు. ఆ తర్వాత శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈవో నవీన్‌కుమార్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా సంపత్కుమార్నల్లగొండ : కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్ల గొండ జిల్లా ఇన్చార్జి గా.. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ నియామకమయ్యారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జి లను నియమించింది. ఈ మేరకు పది ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జి లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఏఐసీసీ సెక్రటరీ ఎస్.సంపత్‌కుమార్ నియమితులయ్యారు. -
రాజీ మార్గమే రాజమార్గం
చివ్వెంల(సూర్యాపేట) : రాజీ మార్గమే రాజమార్గమని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద పేర్కొన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోర్టులో నిర్వహించిన రెగ్యులర్ లోక్ అదాలత్‌లో భాగంగా మోటార్ వెహికిల్ కేసులో ఇన్సూరెన్స్ కంపెనీలతో రాజీపడిన బాధితులకు రూ.1.29 కోట్ల చెక్కులను ఆమె అందజేసి మాట్లాడారు. కక్షిదారులు రాజీ పడటం వల్ల సమయం, ధనం వృథాకాకుండా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, కక్షిదారుల తరఫు న్యాయవాది గోండ్రాల అశోక్, ఇన్సూరెన్స్ కంపెనీ న్యాయవాది జె.శశిధర్, కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద -
ఆర్టిజన్ కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలి
కోదాడరూరల్ : ఈ నెల 14 నుంచి చేపట్టనున్న విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలని టీవీఏసీ జేఏసీ(తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ) జిల్లా కన్వీనర్ కొండ నకులుడు పిలుపునిచ్చారు. సోమవారం కోదాడ పట్టణంలో సమ్మె పోస్టర్‌ను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. ఒకే వ్యవస్థలో రెండు రూల్స్ తీసుకురావడం అన్యాయమని స్టాడింగ్ ఆర్డర్స్‌ను రద్దు చేసి ఏపీఎస్ ఈబీ రూల్స్ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కన్వర్షన్ అనేది ఉద్యోగ భద్రత, ఆత్మగౌరవానికి సంబంధించిన అత్యంత కీలకమైన డిమాండ్ అని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టిజన్ అని ఓ ముద్దు పేరు పెట్టి కార్మికులను నట్టేట ముంచి పోయిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆర్టిజన్ కార్మకులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్లతో సంబంధం లేకుండా సమ్మెలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ డివిజన్ కన్వీనర్ పబ్బు మల్లయ్య, విడతల శ్రీనివాసరావు, సీహెచ్.రామచందు, బత్తిని రామారావు, సాయిచందు, సైదిరెడ్డి, లక్ష్మి ఉన్నారు. -
అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి
కోదాడ: రైతుల అవసరాలను తమకు అనుకూలంగా మార్చుకొని భారీగా దండుకోవాలని చూసిన ఎరువుల దుకాణాల యజమానులు ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో వెనకడుగు వేశారు. నిన్నటి వరకు యూరియా అమ్మితే నష్టపోతామని ఏకంగా తీర్మానాలు చేసిన దుకాణదారులు .. అలాంటిది ఏమీ లేదు.. ఎమ్మార్పీకే అమ్ముతామని ఆదివారం అధికారుల సమక్షంలో చెప్పడం గమనార్హం. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో నాగార్జునసాగర్ కాలువ ఆయకట్టులో యూరియాకు భారీగా డిమాండ్ ఉంటుందని ముందస్తుగానే అంచనా వేసిన ఎరువుల దుకాణ యజమానులు దానిని సొమ్ము చేసుకోవాలని చూశారు. దీనికి ముందస్తుగా ప్రణాళిక రచించారు. యూరియా అమ్మడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ఎట్టి పరిస్థితుల్లో యూరియా ఎమ్మార్పీకీ అమ్మలేమని, అసలు యూరియానే అమ్మబోమని ఏకంగా కోదాడలో ఎరువుల దుకాణదారులు తీర్మానం చేశారు. దేశ వ్యాప్తంగా ఈ సంవత్సరం యూరియా కొరత ఏర్పడే అవకాశం ఉందని ప్రచారం జరగడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ముందుగా యూరియా కొనుగోలు చేసి నిల్వ చేసుకోవాలని చూడడంతో ఎరువుల దుకాణాల వద్ద తీవ్ర రద్దీ ఏర్పడింది. దీన్ని సాకుగా చూపి తమ వద్ద ఉన్న స్టాక్‌ను ఇప్పటికే అధిక ధరలకు విక్రయించారు. మరికొంత మంది నిల్వ లను బ్లాక్ మార్కెట్లోకి తరలించారు. అధికార యంత్రాంగాన్ని కదిలించిన ‘సాక్షి’ కథనం..కోదాడ, మునగాలకు చెందిన ఎరువుల దుకాణ యజమానులు యూరియా ఎమ్మార్పీకి అమ్మడం కుదరదని తీర్మానం చేయడంతో ఇది జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వీరిని చూసి నేరేడుచర్లలో దుకాణదారులు కూడా ఇదే ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ‘ఎమ్మార్పీకి అమ్మలేం’ శీర్షికన ‘సాక్షి’ ఆదివారం కథనాన్ని ప్రచురితం చేసింది. అలాగే ఈ విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సాక్షి కథనాన్ని చూసిన కలెక్టర్ ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించి జిల్లా వ్యవసాయ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు ఆగమేఘాల మీద కోదాడకు వచ్చారు. స్థానిక దుకాణదారులను పిలిచి యూరియా అమ్మలేం అనే తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. దీంతో పాటు సోమవారం నుంచి యథావిధిగా యూరియా అమ్మకాలు చేయాలని లేని పక్షంలో లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. సాయంత్రం దుకాణదారులతో కలిసి జిల్లా వ్యవసాయఅధికారి సంయుక్తంగా సమావేశం ఏర్పాటు చేశారు. రైతుల అవసరాలను సొమ్ముచేసుకోవాలనుకున్న ఎరువుల దుకాణదారులు ఎమ్మార్పీకి యూరియా అమ్మలేమని తీర్మానం వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ వ్యవసాయ అధికారులపై కలెక్టర్ సీరియస్ ఎరువుల దుకాణదారులతో అధికారుల సమావేశం వెనక్కి తగ్గిన ఎరువుల దుకాణదారులుయూరియా అమ్ముతాం..ఎమ్మార్పీకి యూరియా అమ్మితే తాము తీవ్రంగా నష్టపోతామని చెప్పిన డీలర్లు ఆదివారం సాయంత్రం అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాత్రం రైతుల మీద తమకు ఎలాంటి కోపం లేదు.. యూరియా ఎమ్మార్పీకే అమ్ముతామని ప్రకటించడం గమనార్హం. కలెక్టర్‌తో పాటు ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించడంతోనే ఎరువుల దుకాణ దారులు దిగి వచ్చారని పలువురు రైతులు అంటున్నారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఎరువుల దుకాణాల యజమానులతో కుమ్మకై ్క ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఇక నుంచి ఎరువుల దుకాణాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
ఏసీబీకీ చిక్కుతున్నా లంచాలు ఆగట్లే
ఉమ్మడి జిల్లాలో నెలకొకరు చొప్పున పట్టుబడుతున్న అధికారులు అవినీతి అత్యధికంగా ఆ శాఖల్లోనే.. ఉమ్మడి జిల్లాలో పోలీసు, రెవెన్యూ, విద్యుత్, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు ఎక్కువగా ఏసీబీకి చిక్కుతున్నారు. కేసులు నమోదు చేసిన అనంతరం ప్రభుత్వం కొన్ని నెలల తర్వాత సదరు ఉద్యోగులకు బాధ్యతలు అప్పగిస్తోంది. కొంతమంది ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకొని పోస్టింగ్ పొందుతున్నారు. కోర్టుల్లో కేసుల విచారణకు సుమారు ఏడాది నుంచి రెండేళ్ల కాలం పడుతుండగా.. కొంత మందికి మాత్రమే శిక్షపడుతోంది. మరికొన్ని కేసులు కోర్టుల్లో నిలబడడం లేదు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రజల కోసం పని చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు లంచావతారులుగా మారుతున్నారు. అవినీతికి పాల్పడుతూ ఉమ్మడి జిల్లాలో నెలకొకరు ఏసీబీ వలకు చిక్కుతున్నారు. నెలవారీ వేతనాలు వస్తున్నా.. పనుల కోసం తమ వద్దకు వచ్చిన వారిని ఇబ్బందులకు గురి చేస్తుండటంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారిని ఏసీబీ అధికారులు పట్టుకొని అరెస్ట్ చేస్తున్నప్పటికీ అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. గడిచిన రెండేళ్లలో 18 వరకు ఏసీబీ కేసులు నమోదయ్యాయి. 2024లో 11 మంది అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు ఏడుగురు ఏసీబీ వలలో చిక్కారు. జిల్లాలో ఈ ఏడాది కేసులు ఇలా... ● తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌లో జనవరి 12వ తేదీన పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కేసులో లంచం తీసుకుంటూ ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు పట్టుబడ్డారు. ఈ కేసులో ఓ వ్యక్తి వద్ద రూ.1.40 లక్షల ముడుపులకు ఒప్పందం కుదుర్చుకొని రూ.70 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ● చౌటుప్పల్‌లో మార్చి 6వ తేదీన ట్రాన్స్‌కో ఏడీ శ్యాంప్రసాద్ రూ.70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఫార్మా పరిశ్రమకు విద్యుత్ బకాయిలు క్లీయరెన్స్ ఇవ్వడంతో పాటు మీటర్ పునరుద్ధరణకు లంచం డిమాండ్ చేయగా, బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో లంచం ఇస్తుండగా పట్టుకున్నారు. ● ఏప్రిల్ నెలలో రేషన్‌బియ్యం అక్రమంగా తరలిస్తున్న కేసులో చింతలపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఒక వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు రూ.10 వేలు లంచం తీసుకుంటున్న ఎస్ఐ అంతిరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ● సూర్యాపేట జిల్లా కేంద్రంలో నకిలీ వైద్యుల కేసులో సూర్యాపేట పట్టణ సీఐ వీర రాఘవులు, సూర్యాపేట డీఎస్పీ పార్థసారధి రూ.16 లక్షలు లంచం డిమాండ్ చేసినట్టు బాధితుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలతో మే 12వ తేదీన వారిని పట్టుకున్నారు. ● పెన్‌పహాడ్ మండలం నాగులపాటి అన్నారంలో పంచాయతీ కార్యదర్శి సతీష్‌కుమార్ ఒక వ్యక్తి నుంచి రూ.8 వేలు లంచం డిమాండ్ చేశాడని ఫిర్యాదు రావడంతో జూన్ 26న ఏసీబీ అధికారులు దాడి చేసి సతీష్‌ను పట్టుకున్నారు. ● గత నెల 28న హుజూర్నగర్ తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి కంప్యూటర్ ఆపరేటర్ (అవుట్సోర్సింగ్) విజేతారెడ్డి రూ.12 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. అత్యధికంగా రెవెన్యూ, పోలీస్, విద్యుత్, రిజిస్ట్రేషన్ శాఖల్లోనే..తాజాగా పట్టుబడిన మిర్యాలగూడ సివిల్ సప్లయీస్ డీటీ కేసులు నమోదు చేస్తున్నా మారని తీరు పీడీఎస్ బియ్యం రవాణా చేస్తూ పట్టుబడి సీజ్ అయిన లారీలను విడిపించేందుకు మిర్యాలగూడ సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్ జావెద్ రూ.70 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం జావేద్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు నల్లగొండ డీఎస్ఓ ఆపీస్ కార్యాలయంలో, జావెద్ ఇంట్లో సోదాలు చేశారు. సోమవారం జావేద్‌ను కోర్టులో హాజరు పరచనున్నారు. -
బేస్మెంట్, పిల్లర్ల దశలో పనులు
నేరేడుచర్ల : నేరేడుచర్ల మున్సిపాలిటీకి అమృత్ 2.0 పనుల నిమిత్తం రూ.11 కోట్లు మంజూరయ్యాయి. పట్టణంలోని మూడు ప్రాంతాలైన పద్మావతి వెంచర్ వద్ద నిర్మించే వాటర్ ట్యాంకు ప్రస్తుతం బేస్మెంట్ లెవల్లో పనులు జరుగుతున్నాయి. ఎస్కేఎస్ ఫంక్షన్‌హాల్ వద్ద నిర్మిస్తున్న వాటర్ ట్యాంకు పిల్లర్ల దశలో ఉంది. తహసీల్దార్ కార్యాలయ సమీపంలో వాటర్ ట్యాంకు రూఫ్ లెవల్లో ఉంది. ఈ మూడు ట్యాంకులకు పైపులైన్లు ఐదు కిలో మీటర్ల మేరకు పనులు చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా ప్రారంభం కాలేదు. మూడు వాటర్ ట్యాంకుల నుంచి మున్సిపాలిటీలోని 15 వార్డులకు నీటిని అందించేందుకు ఈ పనులు చేపడుతున్నారు. వీటి ద్వారా పూర్తి స్థాయిలో మంచినీటిని అందించనున్నారు. అదే విధంగా మురుగునీటి శుద్ధి(ఎస్టీపీ) ప్లాంటు, చెరువుల పునరుద్ధరణకు నిధులు మంజూరు అయినప్పటికీ టెండర్లు పూర్తికాకపోవడంతో పనులు నేటికీ ప్రారంభం కాలేదు. -
యూరియా ఎమ్మార్పీకి విక్రయిస్తాం
కోదాడ: హోల్‌సేల్ డీలర్లు తమ వద్ద ఎక్కువ ధర తీసుకుంటున్నారని వారిపై నిరసనగా తాము యూరియా అమ్మొద్దని నిర్ణయించుకున్నామని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అధికారులు చెప్పిన విధంగా సోమవారం నుంచి యూరియా ఎమ్మార్పీకి అమ్ముతామని డీలర్లు తెలిపారు. ఆదివారం ‘ఎమ్మార్పీకి అమ్మలేం’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్‌రెడ్డి స్పందించారు. ఈమేరకు ఆదివారం సాయంత్రం కోదాడలోని వర్తక సంఘం కార్యాలయంలో కోదాడ, మునగాల ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు, వ్యవసాయశాఖ అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని, ఈ విషయంలో రైతులు అధైర్యపడొద్దన్నారు. డీలర్లు, దుకాణాదారులు యథావిధిగా యూరియా అమ్మకాలు చేస్తారని, అలా చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొందరు కావాలనే రైతులను తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారం చేశారని దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సోమవారం నుంచి ఎమ్మార్పీకే యూరియా అందుబాటులో ఉంటుందని తెలిపారు. యూరియాను బ్లాక్ చేసినా, అధిక ధరకు అమ్మినా చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో స్థానిక వ్యవసాయశాఖ అధికారులతో పాటు పలువురు ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు తదితరులు పాల్గొన్నారు. ఫర్టిలైజర్ దుకాణాల యజమానులతో సమావేశమైన జిల్లా వ్యవసాయశాఖాధికారి -
25 శాతం పనులే పూర్తి
సూర్యాపేట అర్బన్ : అమృత్ 2.0లో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీలో రూ.316 కోట్ల అంచనా వ్యయంతో 295 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు చేపట్టారు. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ వారు టెండర్ దక్కించుకొని పనులు మొదలుపెట్టారు. ప్రస్తుతం 25 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. ఈ నిర్మాణ సంస్థ వారే అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పూర్తి అయిపోయిన తర్వాత రోడ్లను కూడా మరమ్మతులు చేసే విధంగా టెండర్లో ఉంది. డ్రెయినేజీ పేరుతో రోడ్లు ధ్వంసం సూర్యాపేట మున్సిపాలిటీలో అమృత్ 2.0 కింద అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ కోసం రోడ్లన్నీ తవ్వేస్తున్నారు. పనులు పూర్తికాకపోవడంతో కాలనీ వాసుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. మొదటగా రోడ్డు మధ్యలో ప్రాంతాన్ని నిర్ణయించి హోల్స్ పెట్టేది ఒకరు, పెట్టిన హోల్స్ ప్రకారం రోడ్డును రెండుగా చీల్చేది మరొకరు, తదుపరి పైపులు వేసే వారు తర్వాత అక్కడ నిర్మించాల్సిన మ్యాన్‌హోల్స్‌కు మార్కింగ్ ఇస్తూ కట్టేవారు మరొకరు. ఈ ముగ్గురి మధ్యన మూడు ముక్కలాటగా రోడ్డు పనులు నత్తనడకన నడుస్తున్నాయి. అసలే వర్షాకాలం. అందులోనూ అన్ని రోడ్లన్నీ తవ్వి ఉండటంతో ఈ రోడ్ల ప్రయాణం సాగించాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు.ఇబ్బందులు పడుతున్నాం అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పేరుతో రోడ్లన్నీ పగలగొట్టారు. పనులు పూర్తి చేయకుండా పెండింగ్‌లో ఉంచారు. బయటికి వెళ్లాలంటే ఏ గుంటలో పడతామోనని భయంగా ఉంది. వెంటనే పనులు పూర్తి చేయాలి. – కనకటి రవి -
మట్టపల్లిలో తొలి ఏకాదశి వేడుకలు
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం తొలిఏకాదశి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో మట్టపల్లికి చేరుకుని కృష్ణానదిలో పుణ్యస్నాణాలు ఆచరించారు. అనంతరం శ్రీస్వామివారిని, క్షేత్రంలోని శివాలయంలో గల శ్రీపార్వతీ రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మట్టపల్లి క్షేత్రాన్ని కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తలు, అర్చకులు ఆమెకు ఆలయ సంప్రదాయ పద్ధతులతో ఆహ్వానించారు. అనంతరం ధర్మకర్తలు, అర్చకులు ఆమెను సన్మానించారు. ఆలయ అభివృద్ధి పనులపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ ఆమెకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, చెన్నూరు మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి -
నిర్మాణ దశలోనే..
తిరుమలగిరి (తుంగతుర్తి) : అమృత్ 2.0 కింద 2 సంవత్సరాల క్రితం తిరుమలగిరి మున్సిపాలిటీలో వాటర్ ట్యాంక్ నిర్మాణం, నీటి సరఫరా, అంతర్గత పైప్‌లైన్ నిర్మాణానికి రూ.30 కోట్లు కేటాయించారు. 2024 మార్చిలో ఈ పనులు చేపట్టారు. మున్సిపాలిటీలో మొత్తం 5 వాటర్ ట్యాంకుల నిర్మాణాలకుగాను ప్రస్తుతం మూడు ట్యాంకు నిర్మాణాలు ప్రారంభించారు. మున్సిపాలిటీలోని సంత ఆవరణలో, ప్రభుత్వ ఆస్పత్రి పక్కన, మోత్కూరు రోడ్డు పక్కన వాటర్ ట్యాంకు నిర్మాణాలను చేపట్టారు. సంతలో చేపట్టిన పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రస్తుతం 25 శాతం మేర పూర్తయ్యాయి. మిగతా రెండు చోట్లా పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. పైప్‌లైన్ నిర్మాణ పనులు ఎక్కడా చేపట్టలేదు. -
మహిళా సంఘంలో అక్రమాలు
పాలకవీడు: పాలకవీడు మండలం ముసిఒడ్డుసింగారం గ్రామ పరిధి రోళ్లవారిగూడెం గ్రామంలోని దిల్వాలా మహిళా సంఘంలో అక్రమాలు వెలుగుచూశాయి. ఖాతాలోని పొదుపు డబ్బులు మాయం కావడంతో సంఘం సభ్యులు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి వీఓఏ రూ.10వేలు వాడుకున్నట్లు తేలడంతో విచారణకు ఆదేశించారు. కనిపించని 11 ఏళ్ల పొదుపు డబ్బు గ్రామంలోని దిల్వాలా సంఘం మహిళలు గత 11 సంవత్సరాలుగా ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున పొదుపు చేస్తూ వచ్చారు. అయితే వారి ఖాతాలో పొదుపు డబ్బులు రూ.లక్షా పదివేలు మాయమయ్యాయి. అంతేకాకుండా రూ.2లక్షల లోన్ తీసుకోకున్నా తీసుకున్నట్లు చూపిస్తోందని గత 20 రోజుల క్రితం సంఘం సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఉన్నతస్థాయి కమిటీ వేసి నిజానిజాలు తేల్చాలని కోరారు. ఈమేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో డీపీఎం విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా లోన్ విషయంలో వీఓఏ రూ.10వేలు అక్రమంగా వాడుకున్నట్లు తేల్చి రికవరీకి ఆదేశించారు. మినిట్స్ బుక్‌లో తప్పుగా నమోదు మినిట్స్ బుక్‌లో వాస్తవిక లావాదేవీలకు భిన్నంగా డేటాను నమోదు చేస్తున్నారని, అప్పు పూర్తిగా చెల్లించినా ఇంకా మిగిలిందంటూ తమపై ఒత్తిడి తెస్తున్నారంటూ సంఘం సభ్యులు వాపోతున్నారు. వీఓఏ సంఘం సభ్యులను సంప్రదించకుండానే తీర్మానాలు రాస్తున్నారని ఆరోపిస్తున్నారు. అదేవిధంగా సీఐఎఫ్, శ్రీనిధి, ఎస్బీ ఇలా అన్ని రకాల రుణాల్లో అక్రమాలు జరిగినట్లు సభ్యులు పేర్కొంటున్నారు. అసలు ఇన్ని అక్రమాలు జరుగుతున్నా విచారణకు వచ్చిన అధికారులు అవేమీ తేల్చకుండా నామమాత్రపు విచారణ చేపట్టి చేతులు దులుపుకున్నారని వాపోయారు. ఈమేరకు గత సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. సంఘానికి సంబంధించి పొదుపు డబ్బులు మాయం కావడంతో కలెక్టర్‌కు ఫిర్యాదు వీఓఏ రూ.10వేలు వాడుకున్నట్లు విచారణలో వెల్లడి రికవరీకి ఆదేశించిన డీపీఎంవిచారణ పూర్తయింది మహిళా సంఘాల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న సభ్యులు ఎవరైనా అవినీతికి, అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. ముసిఒడ్డు సింగారం గ్రామ పరిధి రోళ్లవారిగూడెంలోని దిల్వాలా సంఘంలో అవకతవకలు జరగడంపై ఇటీవల డీపీఎం ఇటీవల విచారణ చేపట్టారు. వీఓఏ అక్రమంగా డబ్బులు వాడుకున్నట్లు తేలింది. రికవరీకి ఆదేశించారు. – దుర్గాప్రసాద్, ఏపీఎం, పాలకవీడు మండలం -
కల సాకారమయ్యేనా..?
ఉమ్మడి జిల్లాలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ కలగానే మిగిలిపోతోంది.- 8లోమూడు చోట్ల మాత్రమే పనులు ప్రారంభం కోదాడ: అమృత్ 2.0 పథకం కింద కోదాడ మున్సిపాలిటీలో కేంద్ర ప్రభుత్వం రూ.20 కోట్ల 80 లక్షలను మంజూరు చేసింది. మున్సిపాలిటీలో తాగునీటి సమస్యను తీర్చడానికి ఈ నిధులతో ప్రస్తుతం మూడు చోట్ల వాటర్‌ట్యాంక్‌ల నిర్మాణానికి ప్రజారోగ్యశాఖ అధికారులు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. పట్టణంలో 3 కేఎల్, 5 కేఎల్, 7 కేఎల్ కెపాసిటీ గల ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులన్నీ పునాది దశలోనే ఉన్నాయి. మున్సిపాలిటీకి సంబంధం లేకుండా ప్రజారోగ్యశాఖ అధికారులు పనులు చేస్తుండడంతో పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ట్యాంకుల నిర్మాణం పూర్తయిన తరువాత దానికి అనుబంధంగా పైప్‌లైన్ పనులను చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలో పనులను వేగవంతం చేస్తామని ప్రజారోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. -
సాగర్‌కు తరలిరానున్న కృష్ణమ్మ
నాగార్జునసాగర్ : సాగర్ జలాశయానికి ఈ ఏడాది జూలై మొదటి వారంలోనే కృష్ణమ్మ తరలివస్తోంది. ఈ ఏడాది కృష్ణానదికి ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావంతో కృష్ణానదిలో వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి నీటి రాక పెరగడంతో శ్రీశైలం జలాశయం నీటిమట్టం గరిష్టస్థాయి చేరువలో ఉంది. దీంతో మంగళవారం (8న) శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తేందుకు ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. శ్రీశైలం గేట్లెత్తితే ఆ నీరంతా నాగార్జునసాగర్ జలాశయానికి చేరుకోనుంది. ఎగువ ప్రాజెక్టుల్లో జలకళకృష్ణానదిపైన కర్నాటక, మహారాష్ట్రలోని జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటికే దీంతో అదనంగా వస్తున్న నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ఎగువన గల జూరాల జలాశయం ఈ ఏడాది మే నెలలో కురిసిన వర్షాలకు గరిష్ట స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. జూన్‌లోనే రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం తుంగభద్ర ప్రాజెక్టు గరిష్ట స్థాయికి చేరడంతో మూడు రోజుల క్రితమే రేడియల్ క్రస్ట్‌గేట్లు ఎత్తారు. దీంతో ఇటు జూరాల, అటు తుంగభద్ర నుంచి శ్రీశైలానికి లక్షన్నర క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్టస్థాయి నీటిమట్టం 885.00అడుగులు (215.807 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం జలాశయ నీటిమట్టం 879.30అడుగులు (184.2774 టీఎంసీలు)గా ఉంది. ఇప్పటికే శ్రీశైలం కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 67,740 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ జలాశయం పెరుగుతోంది. సాగర్ గరిష్టస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 527.00 అడుగులు (162.3490 టీఎంసీలు)గా ఉంది. జూన్ 12 నుంచే నీటిరాక..సాగర్ కనీస నీటిమట్టం 510.00 అడుగులు. కాగా గతేడాది ఇదే రోజున కనీస నీటిమట్టానికి దిగువన 503.80అడుగులు (120.8990 టీఎంసీలకు)గా ఉంది. జూలై 24 వరకు అలాగే కొనసాగింది. 25వ తేదీ నుంచి శ్రీశైలం నుంచి విద్యుదుత్పాదన ద్వారా నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి వరద పెడరగడంతో జూలై 29వ తేదీన శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి సాగర్ జలాశయానికి నీటిని విడుదల చేశారు. ఆగస్టు 5వ తేదీన సాగర్ జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్లెత్తి దిగువకు నీటిని వదిలారు. ఈ ఏడాది సాగర్ జలాశయం కనీస నీటిమట్టానికి వెళ్లలేదు. 511 అడుగుల వద్ద ఆగింది. ఈ ఏడాది జూన్ 12వ తేదీ నుంచే శ్రీశైలం జలాశయం నుంచి విద్యుదుత్పాదన ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తూ వచ్చారు. క్రమంగా సాగర్ జలాశయం నీటిమట్టం పెరుగుతూ వచ్చింది. ఇదే రీతిలో ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగితే ముందస్తుగానే క్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశం ఉంటుంది. ఎగువన భారీగా వరద నీటి ప్రవాహం రేపు శ్రీశైలం క్రస్ట్ గేట్ల ఎత్తివేతకు సిద్ధమైన అధికారులు సాగర్ జలాశయంలో పెరగనున్న నీటిమట్టం -
దేశవ్యాప్త సమ్మెకు సీపీఐ మద్దతు
సూర్యాపేట అర్బన్ : ఈనెల 9న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిర్వహించనున్న సమ్మెకు సీపీఐ మద్దతు ఉంటుందని ఆపార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ధర్మభిక్షం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక చట్టాలను మార్చి 8 గంటల పని విధానాన్ని ఎత్తివేసి కార్మికుల సమ్మె హక్కును కాల రాసే కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలన్నారు. దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను నాలుగు కోడ్ లుగా మార్చటం సరికాదన్నారు. ఈనెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెకు సూర్యాపేట జిల్లా పార్టీ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థి యువజన సంఘ నాయకులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ ప్రాంతీయ కార్యదర్శి నిమ్మల ప్రభాకర్, ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్షుడు బూర సైదులు పాల్గొన్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయొద్దుసూర్యాపేటటౌన్ : మద్యం మత్తులో డ్రైవింగ్ చేయొద్దని ఎస్పీ కె.నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 1509 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందులో 15 మందికి జైలు శిక్షలు పడగా మొత్తం కేసుల్లో రూ.5 లక్షల41వేలు జరిమానా కట్టినట్లు పేర్కొన్నారు. మద్యంతాగి వాహనాలు నడిపిన సూర్యాపేట డివిజన్ పరిధిలో 957 కేసులు, కోదాడ డివిజన్ పరిధిలో 552 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లా ఆర్యవైశ్య క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా రాజా తాళ్లగడ్డ (సూర్యాపేట) : జిల్లా ఆర్యవైశ్య మహాసభ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా సూర్యాపేటకు చెందిన బండారు రాజా నియామకమయ్యారు. ఈమేరకు జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వరరావు ఆదివారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఆయనకు నియామకపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షుడు మాశెట్టి అనంత రాములు, మాజీ కార్యదర్శి గరినే శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. పీఆర్సీ అమలు చేయాలి సూర్యాపేటటౌన్ : ఉపాధ్యాయ, ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏలను మంజూరు చేస్తూ పీఆర్సీని అమలు చేయాలని టీపీటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నిమ్మల శ్రీనివాస్, కడపర్తి శ్రీనివాస్ నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీపీటీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లతో పాటు జీరో సర్వీస్‌తో బదిలీలకు అవకాశం ఇవ్వాలని కోరారు. తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయ పోస్టు ఉండాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎనుగుతల రమేష్, రాష్ట్ర సహాధ్యక్షులు బచ్చుపల్లి శంకర్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు ముంత శ్రీనివాస్, బత్తుల ఉపేందర్, సోమగాని రమేష్, వీసావరం శ్రీనివాసరెడ్డి, బుర్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పోయిన ఫోన్లు దొరుకుతున్నయ్!
సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుగోలు చేస్తే రశీదు తీసుకోవాలి సెల్‌ఫోన్ పోయినా, ఎవరైన దొంగలించినా వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.ఆ పోర్టల్ ద్వారా మొబైల్‌ను బ్లాక్ చేస్తారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా సరిపోతుంది. సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేస్తే షాపు యజమాని నుంచి రశీదు తీసుకోవాలి. దొంగలించిన ఫోన్ అని తెలిసి ఎవరైనా కొనుగోలు చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. – కె.నరసింహ, ఎస్పీ సూర్యాపేటటౌన్ : నిత్య జీవితంలో మొబైల్ ఫోన్ భాగమైపోయింది. ఎటు వెళ్లినా.. ఇంట్లో ఉన్నా చేతిలో ఫోన్ లేనిదే జీవనం కొనసాగని పరిస్థితి. ప్రస్తుత సమాజంలో నిత్యావసర వస్తువుగా మారింది. ప్రతి సమాచారంతో పాటు బ్యాంక్‌కు సంబంధించిన వివరాలను ఫోన్లో భద్రపర్చుకుంటున్నాం. అలాంటి మొబైల్‌ఫోన్ ఎక్కడైనా పడిపోతే.. లేక ఎవరైనా దొంగిలిస్తే ఎలాంటి టెన్షన్ పడకుండా వెంటనే సీఈఐఆర్(సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే చాలు. పోలీసులు వెతికి పట్టుకుని మీకు ఫోన్ అప్పగిస్తారు. అందుబాటులోకి సీఈఐఆర్ పోర్టల్ మిస్సింగ్ ఫోన్లను రికవరీ చేసేందుకు కేంద్ర టెలికం మంత్రిత్వశాఖ సీఈఐఆర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పోగొట్టుకున్న, చోరీకి గురైన సెల్ఫోన్లను ఈ ఆధునిక టెక్నాలజీ ద్వారా పోలీసులు గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు 1,137 ఫిర్యాదులు సూర్యాపేట జిల్లా పరిధిలో సీసీఎస్. ఐటీ సెల్ ఆధ్వర్యంలో మిస్సింగ్, చోరీకి గురైన మొబైల్స్‌ను రికవరీ చేసేందుకు స్పెషల్ టీంలు పని చేస్తున్నాయి. అంతేగాకుండా అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా పరిధిలో ఉన్న వివిధ స్టేషన్లలో మొబైల్స్ మిస్సింగ్, చోరీకి గురైనట్టు 1,137 ఫిర్యాదులు వచ్చాయి. అయితే వాటిలో ఇప్పటి వరకు 570 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు పోలీసులు అందజేశారు. ఫ సీఈఐఆర్ ద్వారా మిస్సింగ్ ఫోన్లు స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు ఫ ఇప్పటి వరకు జిల్లాలో 570 ఫోన్లు రికవరీ ఫ యజమానులకు అప్పగింత -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
సూర్యాపేట : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు తెలిపారు. శనివారం సూర్యాపేట మండలం బాలెంలలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, ఇంటర్, డిగ్రీ కాలేజీలను తనిఖీ చేశారు. ఈ సందర్భగా బియ్యం నాణ్యత, స్టాక్ వివరాలు, కూరగాయలు, వంట సామగ్రితో పాటు వంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వంట గదులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పౌష్టికాహారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించొద్దునూతనకల్: ప్రజలకు వైద్య సేవలు అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించవద్దని డీఎంహెచ్ఓ చంద్రశేఖర్ సూచించారు. శనివారం నూతనకల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు వెంకెపల్లి గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సకాలంలో ఆరోగ్య సంరక్షణ టీకాలు వేయాలన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి సందీప్‌కుమార్ పాల్గొన్నారు. 641 అడుగులకు మూసీ నీటిమట్టంకేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టులో 20 రోజులుగా నిలకడగా ఉన్న నీటిమట్టం క్రమంగా పెరుగుతూ 641 అడుగులకు చేరింది. రెండు రోజుల నుంచి మూసీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీకి వరద రాక ప్రారంభమైంది. శనివారం ఎగువ ప్రాంతాల నుంచి 280 క్యూసెక్కుల నీరు వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దీంతో 645 అడుగుల గరిష్ఠ నీటిమట్టం(4.66 టీఎంసీలు) గల మూసీ ప్రాజెక్టులో.. శనివారం సాయంత్రం నాటికి 641.60 (3.58 టీఎంసీలు) అడుగులకు చేరుకుంది. ఆవిరితో పాటు, సీపేజి, లీకేజీ రూపంలో 68 క్యూసెక్కుల నీరు వృథా అవుతోందని అధికారులు పేర్కొన్నారు. -
ఎమ్మార్పీకి అమ్మలేం!
కోదాడ: యూరియా 50కేజీల బస్తాను ఎమ్మార్పీకే అమ్మాలని అధికారుల ఆదేశాల అమలుపై డీలర్లు చేతులెత్తేస్తున్నారు. హోల్‌సేల్ డీలర్లు రూ.380కి బస్తా ఇస్తున్నారని, దీనికి ట్రాన్స్పోర్ట్ చార్జీలు అదనంగా ఉంటాయని అలాంటప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు విక్రయించడం అసాధ్యమని అంటున్నారు. ఈనేపథ్యంలో ఎమ్మార్పీకి అయితే ఈ సీజన్లో యూరియా అమ్మవద్దని కోదాడ పట్టణంలో డీలర్ల సంఘం నాలుగు రోజుల క్రితం తీర్మానించింది. ఇది ఈనెల 14 తర్వాత అమలులోకి వస్తుందని ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎరువుల డీలర్లు కూడా రెండు మూడు రోజుల్లో ఇదే బాట పట్టనున్నట్లు సమాచారం. ఎమ్మార్పీకి అమ్మితే నష్టం ఈ వ్యవసాయ సీజన్లో 50 కేజీల యూరియా బస్తాను రూ.266లకు అమ్మాలని ప్రభుత్వం నిర్దేశించింది. క్రిబ్కో, ఇఫ్కో, కోరమాండల్ కంపెనీలు యూరియాను ముందుగా హోల్‌సేల్ డీలర్లకు, అక్కడి నుంచి రిటెయిల్ డీలర్లకు సరఫరా చేస్తుంటాయి. హోల్‌సేల్ డీలర్లు సిండికేట్‌గా మారి రూ.266 ఎమ్మార్పీ ఉన్న యూరియా బస్తాను తమకు రూ.380 కి ఇస్తున్నారని, దీనికి ట్రాన్స్‌పోర్టు ఖర్చు అదనంగా పడుతుందని స్థానిక డీలర్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మార్పీకి అమ్మడం వల్ల తాము నష్టపోతామని అంటున్నారు. దీనికి తోడు పీఏసీఎస్‌లలో రూ.266లకు కొనుగోలు చేస్తున్న రైతులు తమ వద్ద ఎక్కువ ధర ఉందని గొడవకు దిగుతున్నందున గత్యంతరం లేక ఈ నెల 14 తర్వాత యూరియా అమ్మకాలను పూర్తిగా నిలిపివేస్తున్నామని ఎరువుల డీలర్ల అసోసియేషన్ ప్రకటించింది. అప్పటి వరకు డీలర్ల వద్ద పాతస్టాక్‌ను విక్రయిస్తారని తెలిపింది. నానో యూరియాతో నానా కష్టాలు యూరియాకు ప్రత్యామ్నాయంగా రైతులు నానో యూరియా (లిక్విడ్)ను వాడాలని కంపెనీలు, వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. కానీ దీని వాడకంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు అంటున్నారు. లీటర్ నానో యూరియా ధర రూ. 500 ఉంది. దీన్ని రెండు ఎకరాలకు వాడొచ్చు. దీనిని పొలంలో పిచికారీ చేయడానికి రూ. వెయ్యి ఖర్చు వస్తుందంటున్నారు. పొలం మొత్తం సమంగా పిచికారీ చేయలేక పోతున్నామని అందువల్ల నానో యూరియా వాడలేకపోతున్నట్లు రైతులు చెబుతున్నారు. సొసైటీలలో ఇతర ఎరువులు అంటగడుతున్నారు.. ప్రైవేట్ డీలర్లు ఎమ్మార్పీకి యూరియా అమ్మకాలను నిలిపివేయాలని నిర్ణయించడం, అధిక ధరలకు విక్రయిస్తుండడంతో రైతులు పీఏసీఎస్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా సొసైటీ అధికారులు కాంప్లెక్స్ ఎరువులతో పాటు, జింక్, కలుపుమందులు కొనుగోలు చేస్తేనే యూరియా ఇస్తామని షరతు విధిస్తుండడంతో రైతులకు దిక్కు తోచడం లేదు. రెండు లేదా మూడు బస్తాలు మాత్రమే ఇవ్వాలి..రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నా రెండు లేదా మూడు బస్తాల యూరియా మాత్రమే ఇవ్వాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఈ నెల 1న జిల్లాలోని అన్ని ఎరువుల దుకాణాలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఎరువులను కూడా ఈ– పాస్ మిషన్ ద్వారా మాత్రమే రైతులకు విక్రయించాలని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం రైతులు వరినాట్లు వేసిన 20 రోజుల తరువాత మాత్రమే యూరియా వాడాలని దానికి మాత్రమే ప్రస్తుతం యూరియా అమ్మాలని దానిలో పేర్కొన్నారు. ఏ డీలర్ అయినా ఒకే రైతుకు 10 బస్తాల యూరియా అమ్మితే స్థానిక అధికారులు తనిఖీ చేసి లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశించారు. ఫ యూరియా విక్రయించవద్దని కోదాడలో ఎరువుల డీలర్ల తీర్మానం ఫ ఈ నిర్ణయం 14 తర్వాత అమలులోకి వస్తుందని ప్రకటన ఫ జిల్లా వ్యాప్తంగా అదేబాట పట్టనున్న మిగతా డీలర్లు ఫ పీఏసీఎస్‌లో యూరియాతో పాటు ఇతర ఎరువులు అంటగడుతున్నారని రైతుల ఆరోపణ అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలి వానాకాలం సీజన్లో ఆయకట్టులో వరి సాగు చేసే రైతులకు అవసరమైన ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచాలి. విస్తీర్ణం ఆధారంగా ఎరువులను కొనుగోలు చేయడానికి రైతులకు అనుమతి ఇవ్వాలి. సొసైటీలలో ఆ ప్రాంత రైతులకు సరిపడా ఎరువులను అమ్మేవిధంగా చూడాలి. రైతులకు అవసరం లేని ఎరువులను అంటగట్టవద్దు. – కొల్లు వెంకటేశ్వరరావు, జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు 11 నుంచి యూరియా అమ్మకాలు నిలిపివేస్తున్నాం ఫ నేరేడుచర్ల ఎరువుల డీలర్ల సంఘం నిర్ణయం నేరేడుచర్ల : ఈనెల 11 నుంచి యూరియా అమ్మకాలు నిలిపి వేస్తున్నట్లు నేరేడుచర్ల ఎరువుల డీలర్ల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం స్థానికంగా సమావేశమై తీర్మానించింది. డీలర్ల సంఘం నేతలు మాట్లాడుతూ కంపెనీలు యూరియాను అధిక ధరకు డీలర్లకు అమ్ముతున్నారని అలాంటప్పుడు ఎమ్మార్పీకి ఇవ్వడం సాధ్యంకాదన్నారు. దుకాణాల్లో ఉన్న స్టాకును ఈనెల 10 వరకు విక్రయిస్తామన్నారు. సమావేశంలో డీలర్లు పోలా విశ్వనాథం, లచ్చయ్య, వెంకటేశ్వర్రావు, వెంకట్‌రెడ్డి, రాజేష్‌రెడ్డి, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలి
సూర్యాపేట : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వం తక్షణమే భర్తీ చేయాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపకుడు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు డిమాండ్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాల సాధనకు అనుములపురి జనార్దన్ ఆధ్వర్యంలో శనివారం సూర్యాపేట పట్టణంలోని పద్మశాలి భవన్లో ఏర్పాటుచేసిన నిరుద్యోగ విద్యార్థి మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి నిరుద్యోగులు సంఘటితమై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల ప్రభుత్వాలు వచ్చినప్పుడే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని, మౌలిక వసతులు కల్పించాలని ఈ సందర్భంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రాంతి దళ్ వ్యవస్థాపకుడు, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్, పాలకూరి అశోక్, ఓయూ జేఏసీ నాయకులు వేణుకుమార్, చామకూరి రాజు, జి.వి.గౌడ్, ఇంద్ర నాయక్, అర్జున్, దామోదర్ రెడ్డి, నరసింహ నాయక్, ఎల్. నాగేశ్వరరావు, సంజీవ్ నాయక్, నాయక్, భద్రు తదితరులు పాల్గొన్నారు. -
తక్కువ పెట్టుబడితో ఏర్పాటు
తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడినిచ్చే క్లౌడ్ కిచెన్ ప్రస్తుతం మన నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడకు కూడా విస్తరించింది. ఆన్లైన్ ఫుడ్‌కు అధిక ప్రాచుర్యం ఉండడంతో నల్లగొండ పట్టణంలోని వీటీ కాలనీకి చెందిన జ్యోతి ఇంట్లోని వంట గదిని ఫుడ్ డెలివరీ బిజినెస్‌కు అనుకూలంగా మలుచుకుంది. ‘నాటు.. యమ ఘాటు’ పేరుతో జొమాటో, స్విగ్గీ ద్వారా తన ఫుడ్‌ను ఆన్లైన్ ద్వారా సప్లయ్ చేస్తున్నారు. ఈమెతోపాటు నల్లగొండలో పలువురు మహిళలు క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేశారు. ఇంట్లో చేసిన వంట కావడంతో చాలా మంది క్లౌడ్ కిచెన్‌కు ఆర్డర్లు ఇస్తున్నారు. స్కిల్స్‌తో వ్యాపారం చేయవచ్చు వ్యాపారం చేయాలంటే విభిన్న ఆలోచనలతో పాటు అందుకు తగ్గట్టుగా స్కిల్స్ ఉండాలి. అప్పుడే అందులో రాణించ గలుగుతాం. ప్రస్తుతం మార్కెట్లో క్లౌడ్ కిచెన్‌కు మంచి స్పందన వస్తోంది. వంటలో ప్రావీణ్యం ఉండి సొంతంగా బిజినెస్ చేయాలనుకునే వారికి క్లౌడ్ కిచెన్ సదవకాశం. మూడు నెలల క్రితం నేను క్లౌడ్ కిచెన్ ప్రారంభించాను. ప్రస్తుతం రోజుకు 10 వరకు ఆర్డర్లు వస్తున్నాయి. దీనికి లొకేషన్‌తో సంబంధం లేదు. జనం రద్దీగా ఉండే ప్రాంతానికి దగ్గరగా ఉంటే మంచిది. జొమాటో, స్విగ్గీ డెలివరీ ఆప్షన్ ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం ఫుడ్, కిరాణా డెలివరీతో పాటు క్లౌడ్ కిచెన్ వ్యాపారం కూడా పుంజుకుంటోంది. – బి.జ్యోతి, క్లౌడ్ కిచెన్ నిర్వాహకురాలు, నల్లగొండఆన్లైన్ డెలివరీలు మాత్రమే.. సాధారణంగా రెస్టారెంట్ ఏర్పాటు చేయాలంటే.. వంట బాగా వచ్చిన వారిని పెట్టుకోవాలి. అది బోలెడంత ఖర్చుతో కూడుకున్న పని కావడంతో చాలా వరకు హోటల్ బిజినెస్ చేయాలనుకునే వారు వెనకడుగు వేస్తుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చినవే క్లౌడ్ కిచెన్లు. క్లౌడ్ కిచెన్ ద్వారా కేవలం ఆన్లైన్ డెలివరీ మాత్రమే ఉంటుంది. ఆన్లైన్ ఆర్డర్లకై తే పెద్ద భవనం అవసరం లేదు. ఖరీదైన ఫర్నిచర్, వెయిటర్లు.. ఇలాంటి ఖర్చులేవీ ఉండవు. ప్రస్తుతం హైదరాబాద్ లాంటి పెద్దపెద్ద నగరాల్లో క్లౌడ్ కిచెన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే చిన్నచిన్న పట్టణాలకు విస్తరిస్తున్నాయి. క్లౌడ్ కిచెన్‌లో బిర్యానీ దగ్గర్నుంచి కూరలు, టిఫిన్లు, స్వీట్లు ఇలా ఎన్నో రకాల వంటకాలు ఆన్లైన్ ద్వారా లభిస్తున్నాయి. -
ఆన్లైన్లో.. ఇంటి ఆహారం
ఫ చిన్న పట్టణాలకు విస్తరించిన క్లౌడ్ కిచెన్ ట్రెండ్ ఫ ఇంట్లో వంటచేసి స్విగ్గీ, జొమాటో ద్వారా సప్లయ్ ఫ వెజ్, నాజ్‌వెజ్ వంటకాలతోపాటు అల్పాహారం ఫ క్లౌడ్ కిచెన్ ఏర్పాటుకు మహిళల ఆసక్తిప్రస్తుతం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. ఇందులో క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్ ప్రజాదరణ పొందుతోంది. తక్కువ పెట్టుబడితో క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇంట్లోని వంటగదిని క్లౌడ్ కిచెన్‌గా మార్చుకోవచ్చు. రెస్టారెంట్ మాదిరిగా అధిక ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. రెస్టారెంట్‌తో పోల్చుకుంటే అతి తక్కువ ఖర్చుతో మన ఇంట్లోనే సెట్ చేసుకోవచ్చు. -
సర్కార్ బడిలో అడ్మిషన్ల సందడి
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు చేపట్టిన బడిబాట సత్ఫలితాలు ఇచ్చింది. వేసవి సెలవులు ముగియగానే ఉపాధ్యాయ బృందం ఏప్రిల్ చివరి వారం నుంచి బడి బాట నిర్వహించడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరారు. ఈ పాఠశాలలో జిల్లాలోనే అత్యధికంగా 203 మంది విద్యార్థులు నూతనంగా అడ్మిషన్లు తీసుకున్నారు. నాణ్యమైన బోధన, పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ, మధ్యాహ్న భోజనం అమలు వంటి పథకాలు ఆకర్శించాయి. కలెక్టర్, డీఈఓ, మండల విద్యాధికారులు, ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా అవగాహన కల్పించారు. నిర్వహించిన కార్యక్రమాలు ఇవే.. తిరుమలగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు నాలుగు బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటిని సందర్శించి బడి ఈడు పిల్లలను గుర్తించారు. కర పత్రాలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పాఠశాల మానేసిన వారిని సైతం గుర్తించి చేర్పించారు. పాఠశాలలో కొత్తగా 203 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఒక్క 6వ తరగతిలోనే 75 మంది విద్యార్థులు చేరారు. దీంతో మొత్తం విద్యార్థుల సంఖ్య 460కి చేరింది. మరికొన్ని అడ్మిషన్లు పెరుగుతాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రవేశాల్లో తిరుమలగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిల్లాలోనే మొదటి స్థానం నిలిచింది. అదే తీరులో తిరుమలగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో సైతం నూతనంగా 142 అడ్మిషన్లు వచ్చాయి. పాఠశాలలో ప్రస్తుతం 242 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఫ తిరుమలగిరి జెడ్పీ ఉన్నత పాఠశాలలో చేరేందుకు విద్యార్థుల ఆసక్తి ఫ 203కు చేరిన నూతన అడ్మిషన్లు ఫ ప్రవేశాల్లో జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచిన పాఠశాల సమష్టి కృషితోనే అధిక సంఖ్యలో అడ్మిషన్లు ఉపాధ్యాయుల సమష్టి కృషితో బడిబాట విజయవంతమైంది. జిల్లాలోనే ఎక్కువ 203 అడ్మిషన్లు పొంది ప్రథమ స్థానంలో చేరాం. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుంది. పదో తరగతి ఫలితాల్లో సైతం ఉత్తమ ఫలితాలు సాధించాం. – దామెర శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాఠశాలలో నూతన అడ్మిషన్ల వివరాలు తరగతి ప్రవేశాలు 6 78 7 38 8 38 9 39 10 10 మొత్తం 203 -
బాలల భవితకు బాటలు
బాలకార్మికులను పనిలో పెట్టుకుంటే కేసులు తప్పవు మెకానిక్ షాపులు, దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాలు, ఇటుక బట్టీల వద్ద బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా బాల కార్మికులను గుర్తించేందుకు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నాం. పట్టుబడిన బాలలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడంతోపాటు తిరిగి పనిలో పెట్టుకోకుండా అవగాహన కల్పిస్తాం. 18ఏళ్లలోపు చిన్నారులను పనుల్లో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేయిస్తాం. – రవికుమార్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి, సూర్యాపేట నాగారం : బందీగా మారిన బాల్యాన్ని స్వేచ్ఛ వైపు నడిపిస్తూ, చిన్నారుల మోములో చిరునవ్వే లక్ష్యంగా ప్రభుత్వం ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుంది. దీనిలో భాగంగా బాల కార్మిక వ్యవస్థను అరికట్టేందుకు, చిన్నారులను బడిబాట పట్టించేందుకు ఏటా జనవరి –1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్, జూలై–1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్‌ను ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రాథమిక విద్య బాల్యానికి పునాది. అది బలంగా ఉంటేనే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవచ్చు. కొందరు తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా బలపం పట్టాల్సిన చిన్నారులతో పనులు చేయిస్తున్నారు. పనుల నుంచి బాలలకు విముక్తి కల్పించేలా ఏటా ప్రభుత్వం ఆపరేషన్ ముస్కాన్ పేరుతో ప్రత్యేక తనిఖీలు చేపడుతోంది. దీనిలో భాగంగా జిల్లాలో ఈనెల1 నుంచి ఆపరేషన్ ముస్కాన్‌ను ప్రారంభించారు. ప్రత్యేక బృందాలు మహిళా, శిశు సంక్షేమ శాఖ (బాలల పరిరక్షణ విభాగం) (డీసీసీయూ), పోలీసు, కార్మిక, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉద్యోగులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. బడి మానేసి పనులు చేస్తున్న చిన్నారులను ఈ ప్రత్యేక బృందాలు గుర్తించనున్నాయి. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, హోటళ్లు, దుకాణాలు, ఆటోమొబైళ్లు, మెకానిక్ షెడ్లు, కర్మాగారాలు, ఇటుక బట్టీలు, వ్యవసాయ క్షేత్రాల్లో, ప్రమాదకరమైన పని ప్రదేశాల్లో పనులు చేస్తున్న బాలలను గుర్తిస్తారు. వారిని రక్షించడంతో పాటు పనిలో పెట్టుకున్న యాజమాన్యంపై చర్యలు తీసుకుంటారు. బాలల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తారు. వారు బడిబాట పట్టేలా చర్యలు చేపడతారు. తల్లిదండ్రులు లేని పిల్లలు తారసపడితే ప్రభుత్వ వసతి గృహాల్లో చేర్పిస్తారు. గుర్తించిన వారిలో 14 ఏళ్లలోపు పిల్లలు బాల కార్మికులుగా పనులు చేస్తుంటే బాధ్యులపై కార్మిక శాఖ బాండెడ్ లేబర్ చట్టం, 15–18 ఏళ్ల లోపువారు ఉంటే ప్రొబేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ చట్టం ప్రకారం పోలీసులు కేసులు నమోదు చేస్తారు. గుర్తించిన పిల్లల వయస్సు ఆధారంగా వారి భవితకు దిశా నిర్దేశం చేస్తూ తగిన చర్యలు తీసుకుంటారు. ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే.. ఏటా ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ పేరిట గుర్తించిన బాలల తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వడంతోనే సరిపెడుతున్నారు. తర్వాత వారు బడికి వెళ్తున్నారా, లేదా అని సమీక్షించడం లేదు. ప్రత్యేక తనిఖీలతో సరిపెట్టకుండా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తేనే ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఫ కొనసాగుతున్న ఆపరేషన్ ముస్కాన్ ఫ మహిళా, శిశు సంక్షేమ శాఖ, పోలీసు, కార్మిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఫ 31వ తేదీ వరకు బాల కార్మికుల గుర్తింపు ఫ బందీ నుంచి స్వేచ్ఛ వైపు నడిపించేలా ప్రణాళిక తనిఖీల్లో గుర్తించిన పిల్లల వివరాలు సంవత్సరం ఆపరేషన్ స్మైల్ ఆపరేషన్ ముస్కాన్ 2021 76 78 2022 79 142 2023 85 118 2024 120 140 2025 144 ప్రస్తుతం కొనసాగుతోంది -
హైకోర్టు జడ్జిగా కొండమడుగు వాసి
సాక్షి, యాదాద్రి, బీబీనగర్ : కృషి, పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు జిల్లాకు చెందిన పలువురు న్యాయవాదులు. తాము ఎంచుకున్న మార్గంలో నిరంతర శ్రమతో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి చేరుకున్నారు. బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన వాకిటి రామకృష్ణారెడ్డిని హైకోర్టు జడ్జిగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. త్వరలో ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం కానున్నారు. ఇప్పటికే ఆలేరుకు చెందిన కలాసికం సృజన, రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన కూనూరు లక్ష్మణ్‌గౌడ్ హైకోర్టు న్యాయమూర్తులుగా సేవలందిస్తున్నారు. అంతకుముందు వలిగొండ మండలం నెమలికాల్వ గ్రామానికి చెందిన వంగాల ఈశ్వర్యయ్యగౌడ్ హైకోర్టు జడ్జిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. రామకృష్ణారెడ్డి కుటుంబ నేపథ్యం, న్యాయవాదిగా ప్రస్థానం వాకిటి రామకృష్ణారెడ్డి 1970 సెప్టెంబర్ 14న జన్మించారు. బీబీనగర్ మండలం కొండమడుగు ఆయన స్వగ్రామం. వారిది వ్యవసాయ కుటుంబం. తండ్రి సర్పంచ్‌గా, జెడ్పీటీసీగా సేవలందించారు. తల్లి గృహిణి. అన్న, చెల్లి ఉన్నారు. 1998లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఆ తరువాత అనంతసేన్‌రెడ్డి అనే అడ్వకేట్ వద్ద జూనియర్‌గా పనిచేశారు. 2005 నుంచి సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. రంగారెడ్డి, సికింద్రాబాద్, సిటీ సివిల్ కోర్టులతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టుల్లో వాదనలు వినిపించారు. రామకృష్ణారెడ్డి గతంలో బీబీనగర్ మండలంలోని అక్కన్న మాదన్న ఆలయ భూముల కేసులో హైకోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించడంతో అనుకూల తీర్పువచ్చింది. సివిల్, క్రిమినల్, రెవెన్యూ, కుటుంబ కేసులు వాదించడంలోనూ సమర్థులుగా పేరుంది. ఇప్పటి వరకు ఆయన వెయ్యి వరకు పిటిషన్లు దాఖలు చేశారు. 2016–17లో తొలి తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. విద్యాభ్యాసం రామకృష్ణారెడ్డి 1నుంచి 7వ తరగతి వరకు కొండమడుగు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చదివారు. 8నుంచి 10వ తరగతి వరకు బీబీనగర్‌లోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యనభ్యసించారు. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని రెడ్డి కళాశాలలో పూర్తి చేశారు. న్యాయవాదిగా హైదరాబాద్‌లో ప్రాక్టీస్ చేశారు. రామకృష్ణారెడ్డిని హైకోర్టు జడ్జిగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ రామకృష్ణారెడ్డి పేరు సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం ఫ యాదాద్రి జిల్లా నుంచి ఇప్పటికే హైకోర్టు జడ్జిలుగా సృజన, లక్ష్మణ్‌గౌడ్ -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
తిరుమలగిరి (తుంగతుర్తి) : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ రాంబాబు సూచించారు. శుక్రవారం తిరుమలగిరి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం, స్టాక్ వివరాలు, రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ హరిప్రసాద్, ప్రిన్సిపాల్ సునీత ఉన్నారు. సీఎం సభా స్థలి పరిశీలనతిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరిలో ఈ నెల 14న నూతన రేషన్ కార్డుల పంపిణీని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభా స్థలిని సివిల్ సప్లయ్ డైరెక్టర్ ముజామిల్‌ఖాన్ శుక్రవారం పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. సభా స్థలిలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీఓ వేణుమాధవరావు, తహసీల్దార్ హరిప్రసాద్, స్థానిక నాయకులు ఉన్నారు. పీహెచ్‌సీల తనిఖీ మునగాల: మండల కేంద్రంలోని పీహెచ్‌సీతో పాటు రేపాలలో ఉన్న పీహెచ్‌సీని శుక్రవారం ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ చంద్రశేఖర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో రికార్డులను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వ్యాధి నిరోధక టీకాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. విధుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. త్వరలో చేపట్టబోయే వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా పీహెచ్‌సీల ఆవరణలో విరివిగా మొక్కలు నాటేందుకు గుంతలు తీయించి సిద్ధంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీఓ రమేష్‌దీనదయాళ్, మునగాల, రేపాల పీహెచ్సీ వైద్యాధికారులు డాక్టర్ రవీందర్, డాక్టర్ వినయ్‌కుమార్, సిబ్బంది ఉన్నారు. మొక్కలు నాటి సంరక్షించాలికోదాడరూరల్ : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని ఏరియా పశువైద్యశాలను సందర్శించి మొక్కలు నాటి మాట్లాడారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఏరియా వైద్యశాలలో పిచ్చిమొక్కలను తొలగించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ పెంటయ్య, సిబ్బంది అఖిల్, చంద్రకళ, కర్ణ ఉన్నారు. -
పట్టుదలతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలి
సూర్యాపేట : విద్యార్థులు పట్టుదలతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని ఎస్పీ కె.నరసింహ అన్నారు. శుక్రవారం సూర్యాపేట రూరల్ మండల పరిధిలోని ఇమాంపేటలో గల తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ బాలికల కళాశాలలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని, ఈ స్థాయికి ఎదగడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు సహాయ సహకారాలు అందించారని పేర్కొన్నారు. మంచి మనసు, మంచి ఆలోచనలు మంచి మార్గంలో నడిపిస్తాయని తెలిపారు. సమయాన్ని వృథా చేయకుండా, ఒత్తిడికి గురవకుండా చదువుకోవాలన్నారు. సమస్యలు ఉంటే ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు చెప్పాలని, క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫ ఎస్పీ కె.నరసింహ -
కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి
నడిగూడెం : కళాశాలలో ప్రథమ సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల సంఖ్య పెంచాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి భానునాయక్ అన్నారు. శుక్రవారం నడిగూడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన పరిశీలించారు. అనంతరం అధ్యాపకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కళాశాలలో ఉన్న మౌలిక వసతులను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వివరించి, కళాశాలలో చేర్పించేలా కృషి చేయాలన్నారు. నడిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇప్పటి వరకు 165 మంది విద్యార్థులు చేరినట్లు తెలిపారు. సమావేశంలో స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ డి.విజయ నాయక్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఫ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి భానునాయక్ -
అనర్హులకు పింఛన్లు కట్!
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో అనర్హులకు అందుతున్న పింఛన్లపై ప్రభుత్వం సోషల్ ఆడిట్ నిర్వహించనుంది. ఈ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ సోషల్ ఆడిట్‌తో పెద్దఎత్తున అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి. ఇదేవిధంగా పింఛన్లపైనా సోషల్ ఆడిట్ నిర్వహిస్తే అనర్హులకు అందకుండా చూడొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో జిల్లాలో ఏ కేటగిరి పింఛన్లు ఎన్ని ఉన్నాయి..? ఇందులో ఇంకా చనిపోయిన వారి పేరున పింఛన్లు అందుతున్నాయా..? లేదా అనే వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. భారీగా దరఖాస్తులు..! అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ప్రజా పాలనలో దరఖాస్తులు స్వీకరించగా దాదాపు 84 వేల దరఖాస్తులు పింఛన్ల కోసం వచ్చాయి. ఇందులో దివ్యాంగుల పింఛన్ల దరఖాస్తులే 10,623 ఉన్నాయి. ఇతర పింఛన్ దరఖాస్తులు మరో 74,465 ఉన్నాయి. ఈ దరఖాస్తులకు మోక్షం లభించాలంటే పాత వాటిలో అనర్హులకు అందుతున్న పింఛన్లు తొలగించాల్సి ఉంది. జిల్లాలో 1,45,682 పింఛన్లు జిల్లా వ్యాప్తంగా 1,45,682 మందికి వివిధ రకాల పింఛన్లు అందుతున్నాయి. ఇందులో అత్యధికంగా వృద్ధాప్య పింఛన్లు 53,205 ఉండగా తర్వాత వితంతు పింఛన్లు ఉన్నాయి. అయితే గత బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అర్హత లేకున్నా వివిధ రకాల పింఛన్లు ఆ పార్టీ కార్యకర్తలకు అందించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా వయస్సు లేకున్నా ఆధార్ కార్డుల్లో మార్పులు చేసుకుని ఈ పింఛన్లు పొందినట్లు ప్రభుత్వం భావిస్తోంది. అలాగే వికలాంగుల పింఛన్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటికీ చెక్ పడాలంటే సోషల్ ఆడిట్ జరగాల్సిందేనని ప్రభుత్వం భావిస్తుండగా.. ఏ విధంగా ఈ ఆడిట్ నిర్వహిస్తే బాగుంటుందన్న వివరాలను క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వం సేకరిస్తోంది. ముందుగా పింఛన్ల పంపిణీ పకడ్బందీగా జరగడంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. కొన్నిచోట్ల మృతిచెందిన వారి పేరున నాలుగైదు నెలల పాటు పింఛన్లు మంజూరు కాగా.. వీటిని అక్రమంగా పంచాయతీ కార్యదర్శి, పోస్టల్ సిబ్బంది కలిసి పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇలా మృతిచెందిన వారి పేర్లను వెంటనే తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు.ఎలాంటి ఆదేశాలు రాలేదు సోషల్ ఆడిట్‌పై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. వస్తే తప్పకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు అమలు చేస్తాం. జిల్లాలో పింఛన్ల పంపిణీని పకడ్బందీగా చేపడుతున్నాం. – అప్పారావు, డీఆర్డీఓ ఫ ఆసరా పింఛన్లపై సోషల్ ఆడిట్ నిర్వహించనున్న ప్రభుత్వం ఫ ప్రక్రియ అమలుపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్న అధికార యంత్రాంగం ఫ మొదటగా మృతిచెందిన వారి పేర్ల తొలగింపుపై దృష్టి జిల్లాలో పింఛన్లు ఇలా.. వృద్ధులు : 53,205 దివ్యాంగులు : 18,458 వితంతువులు : 56,277 ఒంటరి మహిళలు : 6795 చేనేత : 873 కల్లుగీత : 6552 ఎయిడ్స్ : 1205 ఫైలేరియా : 2109 డయాలసిస్ : 258 -
బాధితుల ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి
చిలుకూరు : పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదుపై వేగంగా స్పందించాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ ఆదేశించారు. బుధవారం చిలుకూరు పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. నమోదవుతున్న కేసుల స్థితిగతులు, ఫిర్యాదుల తీరుతెన్నులను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు.. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. రహదారి భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ వెంట ఎస్ఐ రాంబాబు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
ఎంజీయూ డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను వీసీ ఖాజాఅల్తాఫ్ హుస్సేన్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఈఓ డాక్టర్ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ డిగ్రీ మొదటి సెమిస్టర్లో 21.76 శాతం, రెండవ సెమిస్టర్ 23.56 శాతం, మూడో సెమిస్టర్లో 31.08 శాతం, నాలుగో సెమిస్టర్లో 36.05 శాతం, ఐదవ సెమిస్టర్లో 37.03 శాతం, ఆరవ సెమిస్టర్లో 46.07 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఫలితాల పూర్తి వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో ఉంచినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజి స్ట్రార్ అల్వాల రవి, కోఆర్డినేటర్లు లక్ష్మీప్రభ, ప్రవళిక, భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంఅనంతగిరి: ఆరోగ్య తెలంగాణే లక్ష్యమని ఆయుష్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రవి నాయక్ అన్నారు. అనంతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయుష్ కేంద్రానికి అనుసంధానంగా నిర్మించిన యోగా సెంటర్‌ను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో 12 ఆయుష్ యోగా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రాగా ప్రస్తుతం 11 యోగా కేంద్రాలను నిర్మించినట్లు వివరించారు. ఒక్కో యోగా కేంద్రానికి రూ.6లక్షల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణ, అనంతగిరి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, యోగా శిక్షకులు వినయ్, ఎమ్మార్పీఎస్ నాయకులు బొడ్డు కుటుంబరావు పాల్గొన్నారు.ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్యతిరుమలగిరి : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి భానునాయక్ పేర్కొన్నారు. బుధవారం తిరుమలగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి మాట్లాడారు. అడ్మిషన్లు పెంచడానికి అధ్యాపకులు కృషి చేయాలని కోరారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ రాజమోహన్, బాల్తా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హాస్టల్ విద్యార్థుల రక్షణ మన బాధ్యతసూర్యాపేటటౌన్ : హాస్టల్ విద్యార్థుల రక్షణ మన బాధ్యత అని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నిద్ర సంపత్ నాయుడు పేర్కొన్నారు. జిల్లాకు కేటాంచిన నూతన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లను బుధవారం సూర్యాపేట పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు హాస్టల్ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. ఉపాధ్యాయుడి సస్పెన్షన్ కోదాడరూరల్: విధులకు ఎగనామం పెట్టిన కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిపై డీఈఓ సస్పెన్షవేటు వేసినట్లు ఎంఈఓ సలీం షరీఫ్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఉపాధ్యాయుడు పోటు రవి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా గత నెల 21 నుంచి విధులకు హాజరు కావడం లేదనే విషయం పాఠశాల తనిఖీకి వెళ్లినప్పుడు తెలిసిందని తెలిపారు. దీనిపై డీఈఓకు లిఖితపూర్వకంగా నివేదిక అందజేయడంతో విచారణ చేపట్టిన ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
100 అడుగుల జెండా ఏర్పాటు అభినందనీయం
కోదాడరూరల్ : కోదాడ పట్టణంలో 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేయడం అభినందనీయమని ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్(ఐవీఓ) జాతీయ అధ్యక్షుడు జే.ఎస్. సెంగార్ అన్నారు. కోదాడలో ఐవీఓ ఆధ్వర్యంలో 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేసి ఏడాది పూర్తి అయిన సందర్భంగా బుధవారం నిర్వహించిన వార్షికోత్సవంలో ఐవీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఉజ్జిని రవీందర్, జిలా అధ్యక్షుడు గుండా మధుసూదన్‌రావులతో కలిసి సెంగార్ పాల్గొని మాట్లాడారు. మాజీ సైనికులు కలిసి ఏర్పాటు చేసిన జాతీయ జెండా రాష్ట్రంలో కోదాడదే ప్రథమం అని తెలిపారు. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు జాతీయ జెండా ఏర్పాటుకు ముందుకు వచ్చిన కోదాడవాసుల ఆర్థిక సహాయం ఎంతోగొప్పదని కొనియాడారు. అంతకుముందు కార్గిల్ యుద్ధవీరుడు గోపయ్య వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్సీసీ విద్యార్థినుల కవాతు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఐవీఓ వైస్ ప్రెసిడెంట్ రామారావు, జనరల్ సెక్రటరీ ఉపేందర్, ట్రెజరర్ వెంకన్న , మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సామినేని ప్రమీల, ప్రవళిక, నాగేశ్వరరావు, ఎంఈఓ సలీం షరీఫ్ పాల్గొన్నారు. -
అవినీతికి ఆస్కారం ఉండొద్దు
– మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి లక్ష్మణ్‌కుమార్.. మంత్రులు, ప్రజాప్రతినిధులు అధికారులను సమన్వయం చేసుకుంటూ జిల్లాను ఉన్నతస్థానంలో నిలపాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. పేదలకు సన్న బియ్యం ఇస్తున్న ఏకై క ప్రభుత్వం తమదే అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి కృషి చేస్తామన్నారు. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు పదేళ్లు నిర్లక్ష్యానికి గురైందని.. మంత్రి కోమటిరెడ్డి సహకారంతో త్వరలోనే పూర్తి చేసి లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఎస్ఎల్బీసీ పనులను పునః ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. డిండి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవని.. మేము వచ్చాకే నీటికేటాయింపులుచేసి నిధులు కూడా మంజూరు చేశామన్నారు. పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని కాల్వలతో పాటు లిప్టులు, హైలెవల్ కెనాల్ లైనింగ్‌కు రూ.400 కోట్లు మంజూరు చేశామన్నారు. అయిటిపాముల, గంధమల్ల రిజర్వాయర్లకు రూ.500 కోట్లు మంజూరు చేసి సీఎంతో పనులు ప్రారంభించామన్నారు. రాచకాల్వ మరమ్మతు పనులు చేయాలని ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారని వాటికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. -
ప్రజా ప్రభుత్వం.. సంక్షేమమే ధ్యేయం
పథకాల అమలు తీరును అధికారులు పర్యవేక్షించాలిఫ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఫ ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై నల్లగొండ కలెక్టరేట్లో సమీక్ష ఫ హాజరైన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫ ఆయా రంగాల్లో ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన కలెక్టర్లు నల్లగొండ : అధికారులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను పర్యవేక్షించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిపై బుధవారం నల్లగొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కలిసి సమీక్ష నమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ తమది ప్రజా ప్రభుత్వమని ప్రజల కోసం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ద్వారా అర్హులకు మేలు జరుగుతుందన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రైతులకు సంబంధించిన అంశాలను మండలస్థాయి అధికారులతో జిల్లా అధికారులు రోజూ పర్యవేక్షించాలన్నారు. రైతు భరోసా, బీమా, ఎరువులు, విత్తనాల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించి సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా అభివృద్ధికి 15 రోజులకోసారి సమావేశం ఏర్పాటుచేస్తామన్నారు. సమావేశంలో ఎంపీలు కిరణ్‌కుమార్‌రెడ్డి, కుందూరు రఘువీర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ అమిత్‌రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, యాదాద్రి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, నల్లగొండ ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ పాల్గొన్నారు. -
ఎత్తిపోసేది ఎప్పుడు..?
మంత్రి ఆదేశాలతోనైనా.. వారం రోజుల క్రితం లిఫ్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ ఏడాది అక్టోబర్ నాటికి పనులు పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తేవాలని అధికారులు, కాంట్రాక్టర్‌కు సూచించారు. అయితే అక్కడ వాస్తవ పరిస్థితిని చూస్తే మంత్రి ఇచ్చిన గడువులోపు పనులు పూర్తయ్యే పరిస్థితులు కనబడటం లేదు. వర్షాలు పడితే పనులు చేయడం కష్టంగా మారుతుంది. పనులు ఇలా నిదానంగా కొనసాగితే మరో ఏడాదైనా పూర్తి కాకపోవచ్చని రైతులు పేర్కొంటున్నారు. కోదాడరూరల్ : రైతులకు సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన రెడ్లకుంట ఎత్తిపోతల పథకం పనులు రెండడుగులు ముందుకు మూడడుగులు వెన్నక్కి అన్న చందంగా సాగుతున్నాయి. పనులు ప్రారంభించి ఏడాది గడిచినా ఎలాంటి పురోగతిలేదు. వారం రోజుల క్రితం పనులను పరిశీలించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టర్‌పై అసహనం వ్యక్తం చేశారు. మూడు నెలల్లో పూర్తి చేయాలని వారిని ఆదేశించారు. గత ఏడాది మార్చిలో శంకుస్థాపన నాగార్జున సాగర్ ఎడమ కాల్వపై ముక్త్యాల బ్రాంచ్ కెనాల్‌కు అనుసంధానంగా రెడ్లకుంట మేజర్ ద్వారా నల్లబండగూడెం, కాపుగల్లు, కూచిపూడి గ్రామాలకు నీరు అందాల్సి ఉంది. అయితే ఆయా గ్రామాలు మేజర్ కాల్వ ఆయకట్టు చివరన ఉండటంతో నీరందక రైతులు ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రెడ్లకుంటతో పాటు ఆయా గ్రామాల రైతులు గతంలో అనేక సార్లు సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు తమ సమస్యను తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డిల సహకారంతో ప్రభుత్వం రెడ్లకుంట వద్ద పాలేరు వాగుపై లిఫ్ట్ నిర్మాణానికి రూ.47.64 కోట్ల నిధులు మంజూరు చేసింది. గత ఏడాది మార్చిలో లిఫ్ట్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈపనులు పూర్తయితే ఆయా గ్రామాల్లో 4,600 ఎకరాలకు సాగునీటి సమస్య తీరనుంది. నత్తనడకన పనులు లిఫ్ట్ పనుల్లో భాగంగా పైప్‌లైన్ వేయాల్సి ఉంది. రెడ్లకుంట వద్ద పాలేరు వాగుపై నీళ్లు ఎత్తిపోసేందుకు విద్యుత్ మోటారు బిగించాల్సి ఉంది. విద్యుత్‌లైన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటి వరకు వాగు నుంచి 200మీటర్ల లోపు వరకు పైప్‌లైన్ కోసం గాతు తీసి వదిలేశారు. మిగతా పనులు అసలు మొదలే పెట్టలేదు. ఫ రూ.47.64కోట్లతో రెడ్లకుంట వద్ద పాలేరు వాగుపై ఎత్తిపోతల పథకం ఫ పనులు ప్రారంభించి ఏడాది దాటినా కానరాని పురోగతి ఫ జాప్యంపై మంత్రి ఉత్తమ్ అసహనం ఫ అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం -
సాగర్‌లో పెరుగుతున్న నీటిమట్టం
ఫ శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు నీటి విడుదల ఫ సాగర్ జలాశయానికి చేరుతున్న 50వేల క్యూసెక్కుల నీరు ఫ ఆయకట్టులో సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలునాగార్జునసాగర్, మిర్యాలగూడ : కర్నాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ జలకళ సంతరించుకుంది. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది మే నెలలోనే జూరాల ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి వరద కొనసాగుతుండడంతో ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి రోజూ లక్ష క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. శ్రీశైలం జలాశయ నీటిమట్టం క్రమంగా పెరుగుతుండడంతో అక్కడి కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా మంగళవారం నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నిత్యం సుమారు 50వేల క్యూసెక్కుల నీరు సాగర్ జలాశయానికి వస్తుండడంతో సాగర్ జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో సాగర్ ఆయకట్టుకు ఈ ఏడాది ముందుగానే నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జూన్ చివరి వారంలో నీటి విడుదలకు అవకాశం సాగర్ జలాశయ గరిష్టస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా.. జూన్ మొదటి వారంలో 511.80 అడుగులు (134.7466 టీఎంసీలు)గా ఉంది. బుధవారం నాటికి 517.60 అడుగులకు (144.9362టీఎంసీలు) చేరింది. సాగర్ నీటిమట్టం 540 అడుగులకు చేరి, ఎగువనగల జలాశయాలు గరిష్టస్థాయిలో ఉండి, నదిలో 70 నుంచి 100టీఎంసీల నీరు ఉంటే సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. సాగర్ కుడి, ఎడమ కాల్వల కింది 22,12,670 ఎకరాల ఆయకట్టు ఉంది. భూగర్భ జలాలు పెరిగి.. బోర్లు, బావులు, వాగుల ద్వారా మరో లక్ష ఎకరాలు సాగవుతుంది. కుడి, ఎడమ కాల్వల కింద సాగుకు 132 టీఎంసీల చొప్పున 264 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. గడిచిన పదేళ్లలో ఏడు సార్లు ఆగస్టు మాసంలోనే ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. 2017లో అక్టోబర్ నెలలో విడుదల చేశారు. 2015, 2023 సంవత్సరాల్లో కృష్ణాబేసిన్‌కు వరదలు రాక జలాశయాలకు నీరు చేరకపోవడంతో కాల్వలకు నీరివ్వలేదు. ఈ ఏడాది ముందుగానే జలాశయాలకు నీరు చేరుతుండటంతో జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో నీటిని విడుదల చేసే అవకాశాలున్నాయి.గత పదేళ్లుగా నీటి విడుదల వివరాలు ఇలా.. సంవత్సరం నీటిమట్టం విడుదల తేదీ 2014 515 ఆగస్టు 6 2015 510 నీటి విడుదల లేదు 2016 514 ఆగస్టు 26 2017 576 అక్టోబర్ 31 2018 555 ఆగస్టు 23 2019 556 ఆగస్టు 11 2020 556 ఆగస్టు 7 2021 585 ఆగస్టు 5 2022 555 ఆగస్టు 31 2023 506 నీటి విడుదల లేదు 2024 585 ఆగస్టు 2సాగు పనుల్లో ఆయకట్టు రైతులు సాగర్‌కు వరద వస్తుండడంతో సాగునీటి విడుదలకు ఢోకా ఉండదనే ధీమాతో ఆయకట్టు పరిధిలో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. దుక్కులు దున్ని నార్లు పోసుకుంటున్నారు. వరద ఇలాగే వస్తే ఈ వానాకాలం సీజన్‌తోపాటు యాసంగి సీజన్లో కూడా గట్టెక్కినట్లేనని రైతులు భావిస్తున్నారు. సాగర్‌కు నీటి రాక మొదలైంది నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీరు వస్తోంది. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి సుమారు 50 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. నీటి రాక మరింత పెరిగే అవకాశం ఉంది. ఎన్నడూ లేని విధంగా ముందుగానే సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు వస్తోంది. – మల్లికార్జున్, ఎస్ఈ, సాగర్‌డ్యాం -
నాణ్యమైన విద్య, వైద్యం అందించాలి
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడం మొదటి ప్రాధాన్యంగా తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆర్అండ్బీ శాఖ ద్వారా జిల్లాకు ఎక్కువ నిధులు తెచ్చామని.. భవిష్యత్‌లో మరిన్ని నిధులు తెస్తామన్నారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లను ఏర్పాటు చేస్తామన్నారు. సంగెం బ్రిడ్జికి రూ.45 కోట్లు మంజూరు చేశామన్నారు. ఎస్ఎల్బీసీ పూర్తికి చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. ఎస్డీఎఫ్ కింద ప్రతి ఎమ్మెల్యేకు వెంటనే రూ.5 కోట్లు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నల్లగొండ కలెక్టరేట్లో చేపట్టిన అదనపు బ్లాక్ నిర్మాణాన్ని ఎనిమిది నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ప్రగతిపై కలెక్టర్ల వివరణ సమావేశంలో ముందుగా నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్‌లాల్‌పవార్, యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు.. ఆయా జిల్లాలో నీటిపారుదల, విద్యా, వ్యవసాయం, వైద్యం, మహిళా శక్తి, సంక్షేమం తదితర అంశాల్లో ప్రగతి, చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులు, ప్రజాప్రతినిధులకు వివరించారు. -
ఉపాధ్యాయుల కృషి అభినందనీయం
భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు చేసిన కృషి అభినందనీయమని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమలగిరి జెడ్పీహెచ్ఎస్లో 190 మంది, కోదాడ బాలికల జెడ్పీహెచ్ఎస్లో 170 మంది, కోదాడ బాలుర జెడ్పీహెచ్ఎస్ 166 మంది చేరారని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 1 వ తరగతిలో 2,857 మంది కొత్తగా చేరారని, అన్ని పాఠశాలల్లో 9,582 మంది కొత్తగా చేరారని, ఇది త్వరలో 10,000కు చేరుకోవాలని ఆకాక్షించారు. మూతబడిన 11 పాఠశాలలు రీ ఓపెన్ చేసినట్లు తెలిపారు.సమావేశంలో డీఈఓ అశోక్, కో ఆర్డినేటర్లు జనార్దన్, శ్రవణ్ కుమార్, రాంబాబు, పూలమ్మ, ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
14 నుంచి విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె
సూర్యాపేట అర్బన్ : విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 14 నుంచి సమ్మె చేపట్టనున్నట్లు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల జేఏసీ చైర్మన్ మేడె మారయ్య పిలుపునిచ్చారు. జిల్లా ఆర్టిజన్ కార్మికులు మంగళవారం టీజీఎస్పీడీసీఎల్ సూర్యాపేట సర్కిల్ ఆఫీస్‌లో సర్వసభ సమావేశం నిర్వహించి మాట్లాడారు.ప్రతి ఆర్టిజన్ కార్మికుడు యూనియన్లకు అతీతంగా సమ్మెలో పాల్గొనాలని కోరారు. ఒకే సంస్థలో రెండు రూల్స్ తీసుకురావడం అన్యాయమని పేర్కొన్నారు. స్టాండింగ్ ఆర్డర్స్‌ను రద్దుచేసి ఏపీ ఎస్ ఈబీ రూల్స్ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఆర్టిజన్కార్మికుల జేఏసీ నాయకులు రెహమాన్, దయాకర్ రెడ్డి, మురహరి, రామస్వామి, రాఘవ గోపికృష్ణ, నాగయ్య, యాకయ్య, రమేష్, చారి, రవీంద్ర చారి, పరమేష్, సైదులు పాల్గొన్నారు. నేటి నుంచి మూడు రోజులు కళాశాలలు బంద్ చేయాలిసూర్యాపేట : పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని కోరుతూ ఈనెల 2, 3, 4 తేదీల్లో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కళాశాలలు బంద్ చేయాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి కోరారు. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో చేపట్టే కళాశాలల బంద్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను సంఘం నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.7200 కోట్ల స్కాలర్షిప్స్, ఫీజురీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్, మహేష్, నవీన్, వినయ్, సంధ్య, మానస, ప్రసన్న, పవన్, మనోజ్ పాల్గొన్నారు. 9న సమ్మెను జయప్రదం చేయాలి సూర్యాపేట : మోదీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వేంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మంగళవారం సూర్యాపేటలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో పెయింటర్స్ వర్కర్స్ పట్టణ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ పదేళ్ల పాలనలో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను అమలు చేస్తున్నారని అన్నారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి పెట్టుబడి దారులకు అనుకూలంగా ఉండే లేబర్ కోడ్లను తెచ్చారని ఆరోపించారు. ఈ సమావేశానికి పెయింటర్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పాముల ఉపేందర్ అధ్యక్ష వహించగా, యూనియన్ నాయకులు కృష్ణ, రఫి, మూర సైదులు, బాబా, మార్క్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి పనులు వినియోగించుకోవాలిమద్దిరాల : కూలీలు ఉపాధిహామీ పనులను వినియోగించుకోవాలని డీఆర్డీఓ వి.వి. అప్పారావు కోరారు. మద్దిరాల మండల పరిధిలోని పోలుమల్లలో కొనసాగుతున్న ఉపాధిహామీ పనులను మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఉపాధిహామీ పనులను సక్రమంగా చేసి ప్రభుత్వం అందించే కూలి పొందాలన్నారు. -
మోదీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదు
గరిడేపల్లి: ప్రధాని మోదీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. మంగళవారం గరిడేపల్లి మండల కేంద్రంలో చింతలపాలెం, మేళ్లచెరువు, గరిడేపల్లి, హుజూర్ నగర్ మండలాల సీపీఎం నాయకులు, కార్యకర్తలకు ఒక రోజు రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని ధ్వజమెత్తారు. ఈకార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నగరపు పాండు, ములకలపల్లి రాములు, జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకట్‌రెడ్డి, ఎస్కె యాకూబ్, బ్రహ్మం, సైదులు, మండల కమిటీ సభ్యులు తుమ్మల సైదయ్య, యానాల సోమయ్య, బోయిళ్ల అర్జున్ దోసపాటి భిక్షం, శ్రీనివాస్, వీరరాఘవులు, నందిపాటి మట్టయ్య, సుధాకర్, మండవ సైదులు, వెంకటేశ్వర్లు, శ్రీను, రామస్వామి, వెంకయ్య, వీరస్వామి పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి -
ఉపాధిలో రాణించారు
ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవా లి. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడునెలల్లోనే పురుషుల కంటే ఎక్కువగా మహిళలే ఉపాధి పనులకు హాజరవుతున్నారు. ఇంకా ఎవరైనా ఉపాధి పని చేయాలనుకుంటే సంబంఽధిత క్షేత్ర సహాయకులను సంప్రదించి జాబ్‌కార్డులను పొందవచ్చు. – వి.వి.అప్పారావు, డీఆర్డీఓ, సూర్యాపేట నాగారం : మహిళలు తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. అవకాశాలను అందిపుచ్చుకుని రాణిస్తున్నారు. ఇంటిని చక్కదిద్దడమే కాకుండా.. కుటుంబ పోషణకు కావాల్సిన ఆర్థిక సహకారం తమ వంతుగా అందిస్తున్నారు. పురుషులతో సమానంగా ఉద్యోగాల్లోనే కాకుండా వ్యవసాయం, కూలి పనుల్లోనూ చెమటోడ్చి కష్టపడుతున్నారు. ఉపాధి హామీ పనుల్లోనూ పార, గడ్డపార పట్టి పనులు చేస్తున్నారు. ఒకప్పుడు ఊరు వదిలి పట్టణాలకు వెళ్లి కూలి పనులు చేసుకునే వారు. ఇప్పుడు ఉన్న ఊరిలోనే కూలి పనులు చేసుకుంటున్నారు. జిల్లాలో ఈ(2025–26) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడు నెలల్లోనే పురుషుల కంటే మహిళలు ఎక్కువ పని దినాలను వినియోగించుకొని శభాష్ అనిపించుకున్నారు. జాబ్ కార్డులు పరిశీలిస్తే... ఉపాధి హామీ పథకం ప్రారంభించిన కొత్తలో పురుషులే కూలి పనులకు వెళ్లేవారు. తర్వాత రోజుల్లో క్రమంగా మహిళలు ఆసక్తి చూపించారు. ఇప్పుడు ఎక్కువ పని దినాలను వినియోగించుకోవడంలో అతివలే ముందంజలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో మూడునెలల్లోనే పనిదినాలను పురుషుల కంటే ఎక్కువగా మహిళలే వినియోగించుకున్నారు. జిల్లాలో మొత్తం 2.15లక్షల మంది కూలి పనులు చేస్తే వీరిలో మహిళలు 1.25 లక్షల మంది ఉన్నారు. పురుషుల కంటే ఎక్కువగా మహిళలు పని దినాలు చేసి తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపించుకున్నారు. ఉపాధి కూలీలు చేసిన మొత్తం పనిదినాలు 24.64లక్షల్లో 15.13లక్షల పనిదినాలను మహిళలు వినియోగించుకున్నారు. సాగుతున్న పనులు.. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడానికి గుంతలు తవ్వుతున్నారు. ఇంకుడు గుంతల నిర్మాణాలు, నర్సరీల పెంపకం పనులు కొనసాగుతున్నాయి. ఈ పథకంలో మేకలు, పశువుల షెడ్లు, కోళ్ల ఫారాల నిర్మాణాలు చేసుకోవచ్చు. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. రూ.6.19 కోట్లు ఖర్చు.. జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో మూడు నెలల్లోనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.6.19 కోట్లు ఖర్చు చేశారు. ఈ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణాలు, ఫాంపాండ్, ఫిష్ పాండ్, ఇంకుడు గుంతలు, పొలాల్లో కట్టలు, నర్సరీల నిర్వహణ, చెట్ల పెంపకం, ఇతరత్రా పనులు చేపట్టారు. 2025–26లో మూడునెలల్లోనే 1.25 లక్షల మంది మహిళలు ఉపాధి బాట పురుషుల కంటే అధికంగా పనులకు హాజరు ఎక్కువ పనిదినాలు సైతం వినియోగంఉపాధి పనుల వివరాలుజాబ్ కార్డులు : 2.63 లక్షలు కూలీలు మొత్తం : 5.70 లక్షలు ఖర్చయిన నిధులు : రూ.6.19 కోట్లు పనిచేసిన కూలీలు : 2.15 లక్షలు మహిళలు : 1.25 లక్షలు పురుషులు : 90 వేలు మొత్తం పని దినాలు : 24.64 లక్షలు మహిళ పనిదినాలు : 15.13 లక్షలు పురుషుల పనిదినాలు : 9.51 లక్షలు -
నకిలీ విత్తనాలు అంటగట్టారని రైతుల ఆందోళన
సూర్యాపేట : తనకు నకిలీ విత్తనాలు అంటగట్టారని ఆరోపిస్తూ ఓ రైతు మరి కొందరు కర్షకులతో కలిసి విత్తన దుకాణం ఎదుట ఆందోళన నిర్వహించాడు. ఈ సంఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మోతె మండలం కూడలి గ్రామానికి చెందిన భూక్య మహేందర్ మే 31వ తేదీన మూడు బస్తాల సాంబ మసూరి విత్తనాలను కొనుగోలు చేశాడు. ఈ విత్తనాలను గత నెల 23వ తేదీన నానబెట్టి మండె కట్టి అదే నెల 26న నారు చల్లాడు. మూడు రోజులపాటు చూసినా నారులో ఎదుగుదల లేకపోవడంతో మొలకశాతం తక్కువగా వచ్చిందని భావించాడు. వెంటనే వరి విత్తనాలు కొనుగోలు చేసిన సూర్య ఆగ్రో ట్రేడర్స్ ముందు కొందరు రైతులతో కలిసి ఆందోళనకు దిగాడు. దీనిపై సూర్యాపేట మండల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయగా స్పందించి విత్తన కంపెనీ ప్రతినిధి, సూర్య ఆగ్రో ట్రేడర్స్ యజమానితో మాట్లాడి మొలకశాతం తక్కువగా వచ్చినందున మూడు బస్తాలకు బదులుగా మరో మూడు బస్తాల కొత్త విత్తనాలను రైతుకు ఇచ్చే విధంగా ఒప్పించారు. ఈ విత్తనాలను వెంటనే మండల వ్యవసాయ అధికారి సమక్షంలోనే అందించారు. ఈ విషయమై రైతు భూక్య మహేందర్ మాట్లాడుతూ మండె కట్టిన సమయంలో వాతావరణ మార్పుల కారణంగా వరినారు సరిగా పెరగలేదన్నారు. నారు చల్లిన సమయంలో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఈ విధంగా జరిగిందని వ్యవసాయ అధికారులు చెప్పినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించి తాను కొలుగోలు చేసిన మూడు బస్తాల సాంబ మసూరి వరి విత్తనాల స్థానంలో తిరిగి మరోమూడు బస్తాలు ఇప్పించిన మండల వ్యవసాయ అధికారి, ఇచ్చిన సూర్య ఆగ్రో ట్రేడర్స్ కు ఆరైతు కృతజ్ఞతలు తెలిపారు. -
ఇబ్బందులు కలగకుండా సీఎం సభ ఏర్పాట్లు చేయాలి
తిరుమలగిరి (తుంగతుర్తి) : ఈనెల 14 రేషన్‌కార్డుల పంపిణీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తిరుమలగిరి మండల కేంద్రానికి రానున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సభా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. మంగళవారం తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాలిపురం శివారులోని స్థలంతో పాటు ఈదులపర్రె తండా సమీపంలోని స్థలాన్ని, తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న స్థలాన్ని ఎస్పీ నరసింహతో కలిసి కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ రాంబాబు, డీఆర్డీఓ అప్పారావు, ఆర్డీఓ వేణుమాధవరావు, డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ నాగేశ్వరరావు, తహసీల్దార్ హరిప్రసాద్, ఎస్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తం
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ప్రధానంగా మోత్కూరు–తొర్రూరు ప్రధాన రహదారిపై రెండేళ్లుగా రోడ్డు నిర్మాణ పనులు నత్త నడకన సాగుతుండటంతో ఇళ్లలోని మురుగు నీరంతా రహదారిపై చేరి దుర్గంధం వెదజల్లుతోంది. శివారు ప్రాంతాల్లో వారం రోజులకు ఒకసారి కూడా మురుగు కాల్వలు శుభ్రం చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల డ్రెయినేజీలు లేక ఖాళీ స్థలాల్లో మురుగు నీరు చేరి దోమలు, పందులకు ఆవాస కేంద్రాలుగా మారాయి. వర్షా కాలం ప్రారంభమైనా బ్లీచింగ్ చల్లడంలేదని, ఫాగింగ్ సరిగా చేయడం లేదని ప్రజలు చెబుతున్నారు. -
మూడు, నాలుగు రోజులకు ఒకసారి..
కోదాడ: కోదాడ పట్టణంలోని పలు ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉండి దోమల బెడద పెరిగింది. మూడు, నాలుగు రోజులకు ఒకసారి ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్‌లో కాకుండా కోదాడ పెద్దచెరువు, అనంతగిరి రోడ్డు, బైపాస్ సర్వీస్ రోడ్ల వెంట వేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో ఇక్కడ మార్నింగ్ వాక్కు వెళ్లేవారు ఇబ్బంది పడుతున్నారు. ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండి దోమలు, పందులకు నిలయంగా మారుతున్నాయి. ఈ సమస్య ప్రధానంగా భవానీనగర్, నయానగర్‌లో తీవ్రంగా ఉంది. ఇది కోదాడ పట్టణంలోని నయానగర్‌లో అనంతగిరికి వెళ్లే రోడ్డులో ఉన్న ఖాళీ స్థలం. చిన్న వర్షం వచ్చినా నీరు నిల్వ ఉండి మురికి కూపంగా మారుతుంది. దీనిపై అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కావడం లేదని ప్రజలు అంటున్నారు. స్థల యజమానులకు నోటీసులు ఇచ్చి నీరు నిల్వ ఉండకుండా మట్టిపోయించాలని కోరుతున్నారు. -
చెత్త సేకరణలో జాప్యం
సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట పట్టణంలో చెత్తను సేకరించడానికి మున్సిపాలిటీ సిబ్బంది పనిచేస్తున్నా, అధికారుల పూర్తిస్థాయి పర్యవేక్షణ లేక ప్రజలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు విజృంభించే ఈ తరుణంలో సూర్యాపేట మున్సిపాలిటీలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా నిత్యం చెత్త సేకరణ చేస్తున్నారు. కానీ శివారు ప్రాంతాలు, చిన్నచిన్న గల్లీలలో చెత్త సేకరణలో జాప్యం జరిగుతోంది. దీంతో ఇళ్లలో చెత్త పేరుకుపోతోందని ప్రజలు అంటున్నారు. శివారు ప్రాంతాల్లో చెత్తను రోడ్ల పక్కన ఖాళీ ప్లాట్లలోనే వేస్తున్నారు. ఈ క్రమంగా దోమలు, ఈగలు వ్యాప్తి చెంది అనారోగ్యం బారిన పడుతున్నామని శివారు కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడి, పొడి చెత్త వేరు చేయకుండా సేకరిస్తున్నారని చెబుతున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో చెత్తను పూర్తిస్థాయిలో సేకరించి శుభ్రంగా ఉంచుతున్నారు. -
కమలం చీఫ్ మనోడే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రాంచందర్‌రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి సోమవారం నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియలో ఆయనొక్కరే రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మంగళవారం ఆయన ఎన్నిక లాంఛనమే కావడంతో జిల్లాలోని ఆయన బంధువులు, కోదాడ ప్రాంతంతోపాటు జిల్లా బీజేపీ నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌లో స్థిరనివాసం రాంచందర్‌రావు తల్లిదండ్రులు కోదాడ ప్రాంతానికి చెందిన వారే. తండ్రి ప్రొఫెసర్ ఎన్వీఆర్ లక్ష్మీనారాయణరావు కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామానికి చెందినవారే. లక్ష్మీనారాయణరావు బాల్యం ఇక్కడే గడిచింది. ఉన్నత విద్యాభ్యాసం తరువాత ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్‌గా సేవలందించారు. రాంచందర్‌రావు చిన్నతనంలోనే తండ్రి లక్ష్మీనారాయణరావు, తల్లి రాఘవసీతమ్మ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. దీంతో రాంచందర్‌రావు బాల్యం, చదువు అంతా హైదరాబాద్‌లోనే కొనసాగింది. గతంలో ఉమ్మడి కుటుంబంగా ఉన్న సమయంలో నల్లబండగూడెంలో వారి కటుంబం నివసించిన ఇల్లు ప్రస్తుత శిథిలావస్థకు చేరుకుంది. రాంచందర్‌రావు అమ్మమ్మ ఊరు కూడా కోదాడ పక్కనే ఉన్న అనంతగిరి మండల కేంద్రమే. అక్కడ రాంచందర్‌రావు తరఫు బంధువులు ఉన్నారు. కుటుంబంలో పెద్దవాడు ఆయనే.. మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావుకు ఇద్దరు సోదరులు. వారిలో పెద్ద తమ్ముడు ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు. ఆయన జేఎన్టీయూ రిజిస్ట్రార్‌గా, వరంగల్ ఎన్ఐటీ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం రాయపూర్ ఎన్ఐటీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటీకి కూడా ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. రెండో తమ్ముడు హేమచందర్ అమెరికాలో స్ధిరపడ్డాడు. రాంచందర్‌రావు బాబాయి కుమారుడు నారపరాజు రాఘవరావు కోదాడలో చిన్న పిల్లలహాస్పిటల్ నిర్వహిస్తున్నారు. కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కానున్న రాంచందర్‌రావు ఫ ఆయన సొంతూరు కోదాడ మండలం నల్లబండగూడెం అంచెలంచెలుగా ఎదిగిన రాంచందర్‌రావు రాంచందర్‌రావు విద్యార్థి దశనుండే క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసించిన ఆయన 1980–85 కాలంలో యూనివర్శిటీలో ఏబీవీపీ నాయకుడిగా పనిచేశారు. న్యాయ విద్య పూర్తయిన తరువాత హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే బీజేపీ నాయకుడిగా ఎదిగారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా సేవలందించారు. ప్రస్తుతం బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం కాబోతున్నారు. ఆయనకు తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రావీణ్యం ఉండటంతో మంచి వక్తగా పేరుపొందారు. ఇప్పటికీ కోదాడ ప్రాంతంలో జరిగే వివిధ కార్యక్రమాలకు ఆయన తరచుగా హాజరవుతుంటారు. -
ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేయాలి
భానుపురి (సూర్యాపేట) : పనిప్రదేశాల్లో లైంగిక వేధింపుల నివారణకు కార్యాలయాల్లో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్ తేజస్ నంద్ పవార్ సూచించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారం రోజుల్లో జిల్లా, మండల స్థాయి కార్యాలయాల్లో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేసి వారం రోజుల్లో సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు. కమిటీ ఏర్పాటు చేయకపోతే వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రజావాణిలో పరిష్కరించిన దరఖాస్తులను అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ కొన్ని దరఖాస్తులు తిరిగి పరిశీలిస్తుందని, ఇందులో ఏమైనా తప్పులు జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ వి.వి అప్పారావు, డీపీఓ యాదగిరి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, డీఈఓ అశోక్, సీపీఓ కిషన్, సంక్షేమ అధికారులు దయానంద రాణి, శంకర్, శ్రీనివాస నాయక్, జగదీశ్వర్ రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ముగిసిన రేషన్ బియ్యం పంపిణీ
సూర్యాపేట : మూడు మాసాల రేషన్ పంపిణీ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. జిల్లాలో 86 శాతం మంది రేషన్‌షాపుల ద్వారా సన్న బియ్యం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంత ప్రజలు రేషనన్షాపులకు వెళ్లి బియ్యం తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ కోటాను జూన్ లోనే ఇచ్చింది. ఆ కోటా పంపిణీ ముగియడంతో రెండు నెలలపాటు రేషన్ దుకాణాలు మూతపడనున్నాయి. రెండునెలల తర్వాతే..జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించిన బియ్యం కోటా జూన్ మాసంలోనే రేషనన్ షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేశారు. ఆ ప్రక్రియ మొత్తం ముగిసిపోయింది. జిల్లాలో 86 శాతం మంది కార్డుదారులు జిల్లాలో రేషన్ తీసుకున్నారు. అయితే బియ్యం పంపిణీలో పోర్టబులిటీ ఉన్నందున ఇతర జిల్లాల్లో కూడా సూర్యాపేట జిల్లాకు సంబంధించిన కార్డుదారులు 10 శాతం వరకు బియ్యం తీసుకుని ఉండవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. మూడు నెలల కోటా జూన్‌లో ఇచ్చినందున జూలై, ఆగస్టు నెలల్లో రేషన్‌షాపులు మూత పడనున్నాయి. సెప్టెంబరు 1 నుంచి మళ్లీ రేషన్‌షాపులు తెరుచుకోనున్నాయి. సన్న బియ్యం తీసుకున్న 86 శాతం మంది లబ్ధిదారులు రెండు నెలలపాటు మూతపడనున్న రేషన్ షాపులురేషన్ పంపిణీ ఇలా.. రేషన్ దుకాణాలు : 601 మొత్తం కార్డులు : 3,24,158 బియ్యం తీసుకున్నవారు : 2,80 లక్షల మంది -
నేడు సూర్యాపేటకు మంత్రి వివేక్ వెంకటస్వామి రాక
సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రానికి రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం రానున్నట్లు మాల మహానాడు జేఏసీ సూర్యాపేట జిల్లా కోకన్వీనర్ కట్ల మురళి సోమవారం ప్రకటనలో తెలిపారు. కుల దురహంకార హత్యకు బలైన మాలబంటి (వడ్లకొండ కృష్ణ) జయంతి సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని జీవివి ఫంక్షన్ హాల్లో నిర్వహించే కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు నాయకులు కంచె ఐలయ్య, రేంజర్ల రాజేష్, మందాల భాస్కర్ పాల్గొంటారని వివరించారు. బంటి కుటుంబానికి న్యాయం జరిగేలా దోషులకు శిక్ష పడే వరకు కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు కదిలి రావాలని పిలుపునిచ్చారు. బాధితులకు అండగా ఉండాలిసూర్యాపేటటౌన్ : ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉండాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ పోలీస్ సిబ్బందికి సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని, ప్రతి అంశాన్ని చట్ట పరిధిలో పరిష్కరించాలన్నారు. డీసీసీబీ టర్నోవర్ రూ.598.16 కోట్లు పెరిగిందినల్లగొండ అగ్రికల్చర్ : డీసీసీబీలో తమ పాలకవర్గం ఏర్పడిన సంవత్సర కాలంలో ఎన్నడూ లేని విధంగా రూ.598.16 కోట్లకు టర్నోవర్ పెరిగి మొత్తం రూ.2940.29 కోట్లకు చేరుకుందని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి వెల్ల డించారు. పాలకవర్గం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సోమవారం డీసీసీ బీలో కేక్ కట్‌చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన వెంటనే పంట రుణాల గరిష్ట పరిమితిని రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలకు పెంచామన్నారు. పంట రుణాల బడ్జెట్‌ను రూ.100 కోట్లకు తెచ్చామన్నారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, గ్రామీణ ప్రాంతాల్లో గృహ రుణాలు, సొసైటీలకు గోడౌన్ల నిర్మాణం కోసం రుణాలు ఇస్తున్నామన్నారు. బ్యాంకు అభివృద్ధికి సహకరిస్తున్న పాలకవర్గం, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు పాశం సంపత్‌రెడ్డి, కొండా సైదయ్య, ఇరిగినేని అంజయ్య, గుడిపాటి సైదయ్య, దనావత్ జయరాం, బంటు శ్రీనివాస్, సుష్మ, కొమ్ము కరుణ, కె.వీరస్వామి, సీఈఓ శంకర్రావు, జీఎం నర్మద, డీజీఎంలు, ఏజీఎంలు, సిబ్బంది పాల్గొన్నారు. పప్పు దినుసుల సాగుకు ప్రోత్సాహంభానుపురి (సూర్యాపేట) : పప్పు దినుసుల సాగును ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతులకు వందశాతం రాయితీపై విత్తనాలు అందిస్తోందని మార్కెట్ చైర్మన్ వేణా రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జాతీయ ఆహార భద్రత మిషన్ పథకంలో భాగంగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డితో కలిసి సూర్యాపేట, చివ్వెంల, ఆత్మకూరు, పెన్‌పహాడ్ మండలాల రైతులకు వందశాతం రాయితీపై కంది విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ అబ్దుల్ రహీమ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజద్ అలీ, సూర్యాపేట, చివ్వెంల, ఆత్మకూరు, పెన్‌పహాడ్ మండలాల వ్యవసాయ అధికారులు కృష్ణసందీప్, వెంకటేశ్వర్లు, దివ్య, అనిల్, వ్యవసాయ విస్తరణ అధికారులు స్వాతి, అనూష, ముత్తయ్య, పవన్ రైతులు పాల్గొన్నారు. -
పేదల డాక్టర్.. రంగారెడి్డ
ఫ సామాన్యులకు వైద్యం అందుబాటులోకి తేవాలన్నదే ఆయన తపన ఫ సూర్యాపేటలో ఆస్పత్రి నెలకొల్పిన తొలుత రూ.5కే వైద్య సేవలు ఫ ప్రస్తుతం రూ.20లకే ఓపీ ఫ పూర్వవిద్యార్థుల సేవాసమితి ఏర్పాటు చేసి పలు కార్యక్రమాలు నేడు డాక్టర్స్ డే సూర్యాపేట అర్బన్: రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన ఓ వ్యక్తి కష్టపడి చదవి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. పేదలకు వైద్యం అందుబాటులో తీసుకురావాలనే ఆలోచనతో ఆస్పత్రి ఏర్పాటు చేశారు. నామమాత్రపు ఫీజుతో వైద్య సేవలు అందిస్తూ పేదల వైద్యుడిగా పేరుగాంచారు. పూర్వ విద్యార్థుల సేవా సమితి ఏర్పాటు చేసి అనేక సేవకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సూర్యాపేట పట్టణంలోని ఆదిత్య ఆస్పత్రి డాక్టర్ రంగారెడ్డి. నేడు డాక్టర్స్ డే సందర్భంగా వైద్యుడి జీవిత విశేషాలు, వైద్య రంగంలో చేస్తున్న సేవలు ఆయన మాటల్లోనే.. -
14న తిరుమలగిరికి సీఎం రాక: ఎమ్మెల్యే
తిరుమలగిరి : ఈనెల 14న సీఎం రేవంత్‌రెడ్డి తిరుమలగిరి మండలానికి రానున్నట్లు ఎమ్మెల్యే మందుల సామేలు తెలిపారు. తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాలిపురంలో సీఎం సభా స్థలాన్ని సోమవారం సామేలు పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తిరుమలగిరి మండల కేంద్రంలో సీఎం చేతుల మీదుగా రేషన్ కార్డులు అందజేయనున్నట్లు చెప్పారు. తిరుమలగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా మార్చేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా అంగీకరిచినట్లు తెలిపారు. కార్యక్రమానికి మంత్రులంతా హాజరవుతారని తెలిపారు. సమావేశంలో సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవరావు, డీఎస్పీ ప్రసన్నకూమార్, తహసీల్దార్ హరిప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు వై.నరేష్, జమ్మిలాల్, వీరేష్, లింగయ్య, గోవర్థన్ పాల్గొన్నారు. -
వానమ్మ.. ఒక్కసారి రావమ్మ
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం కొత్తగూడెం గ్రామంలో వానమ్మ.. వానమ్మ.. వానమ్మా ఒక్కసారైన వచ్చిపోవమ్మా అంటూ మహిళలు పాటలు పాడుతూ చుట్టు కాముడు ఆడుతూ వరుణదేవుడిని వేడుకున్నారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పత్తిచేలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వానదేవుడు కరుణించి వర్షాలు కురిపించి చెరువులు, కుంటలు నింపి పంటలు సమృద్ధిగా పండేలా చూడాలని చుట్టుకాముడు వేస్తూ పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన మహిళలు ఆకుల నాగమ్మ, ఆకుల లింగమ్మ, చల్లా మంగమ్మ, తాడూరి నర్సమ్మ, రామసాని రాధ తదితరులు పాల్గొన్నారు. -
ఫార్మర్ రిజిస్ట్రీ అంతంతే..
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ నామమాత్రంగానే కొనసాగుతోంది. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు ఆసక్తి చూపడం లేదు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కర్షకులు వివరాల నమోదుకు ముందుకు రాక ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. వ్యవసాయ అధికారులు సైతం పనిభారం కారణంగా అవగాహన కల్పించడంలో కొంత ఆలస్యమవుతోంది. జిల్లాలో 3,03,767 మంది రైతులు పట్టాదారు పాసు పుస్తకాలు పొంది ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 28.93శాతం మంది మాత్రమే తమ వివరాలు నమోదు చేయించుకున్నారు. మే 5 నుంచి ప్రారంభం..వ్యవసాయ రంగంలో రైతుల వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేయడానికి, వారి భూమి యాజమాన్యం, పథకాల లభ్యత అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో నమోదు చేసుకున్న రైతులకు ఆధార్ కార్డు లాగా.. 11 అంకెలతో కూడిన ఐడీని అందిస్తారు. ఈ ప్రక్రియను జిల్లాలో మే 5 నుంచి వ్యవసాయ శాఖ అధికారులు ప్రారంభించారు. ఆ సమయంలో రైతులు ధాన్యం అమ్మకానికి కొనుగోలు కేంద్రాలకు రావడం, వ్యవసాయ పనులు లేకపోవడంతో ఈ ప్రక్రియ చకాచకా సాగింది. ఆ తర్వాత వానాకాలం సీజన్ ప్రారంభం కావడం.. మెట్టపంటల సాగు వైపు రైతన్నలు మళ్లడంతో ఈ ప్రక్రియ ముందుకుసాగడం లేదు. జిల్లాలో రైతుల వివరాల నమోదులో నూతనకల్ మండలం మొదటిస్థానంలో నిలిచింది. అవగాహన కల్పిస్తేనే..ఫార్మర్ రిజిస్ట్రీలో రైతులకు అందించే ఐడీ కీలకంగా మారనుంది. ఈ ఐడీతోనే రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రైతుల పథకాలన్నీ దక్కనున్నాయి. త్వరలో అందించనున్న 20వ విడత కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు సైతం ఈ ఐడీ పొందిన రైతులకే అందనున్నట్లు ప్రచామవుతోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టే పంటల నమోదు కార్యక్రమంలోనూ ఈ ఐడీని తప్పనిసరి చేయొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఐడీ పొందని రైతులకు ఇబ్బందులు తలెత్తే అవకాశముంటుంది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు సైతం మరింతగా రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంది.రైతులు ముందుకు రావడం లేదు జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ సాగుతోంది. ఇప్పటి వరకు 87,881 మంది రైతులు వివరాలు నమోదు చేసుకున్నారు. వానాకాలం వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో రైతులు బిజీగా ఉన్నారు. ఎలాంటి చివరి తేదీ లేకపోయినా రైతులు ఐడీని పొందితే మేలు కలుగుతుంది. తప్పనిసరిగా ఏఈఓలను సంప్రదించి నమోదు చేసుకోవాలి. – శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారినమోదుకు ముందుకురాని రైతులు వ్యవసాయ సీజన్ కావడంతో అనాసక్తి 28.93శాతం మంది రైతులు మాత్రమే నమోదు పనిభారంతో అవగాహన కల్పించలేకపోతున్న అధికారులు -
కార్మికుల చట్టాలు, హక్కులను హరిస్తున్న కేంద్రం
సూర్యాపేట అర్బన్ : కేంద్ర ప్రభుత్వం కార్మికుల చట్టాలు, హక్కులను హరిస్తోందని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి ఆరోపించారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజా సంఘాల జిల్లా బాధ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణకు అప్పగించి కార్పొరేట్, పెట్టుబడిదారులకు ప్రయోజనం కలిగించే విధంగా లేబర్ కోడ్లలో చట్టాలను వారికి అనుకూలంగా మార్చారని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్లు అమలైతే కార్మికుల హక్కును కోల్పోతారన్నారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం రోజురోజుకు నిర్వీర్యం చేస్తోందన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెకు అన్ని ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయన్నారు. ఈ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ జూలై 3న జిల్లా కేంద్రంలో జరిగే కార్మిక, వ్యవసాయ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జిల్లా సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మడ్డి అంజిబాబు, గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా నాయకులు వీరబోయిన రవి, కడెం లింగయ్య, ఉప్పుల రమేష్ పాల్గొన్నారు. ఫ తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి -
స్నేహానికి షష్టిపూర్తి.. మరువలేని అనుభూతి
● మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి నార్కట్‌పల్లి: స్నేహానికి షష్టిపూర్తి.. మరువలేని అనుభూతి అని తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లోని జెడ్పీ హైస్కూల్లో 1965 విద్యాసంవత్సరంలో 10వ తరగతి చదివి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నార్కట్‌పల్లి మండలం గోపాలయపల్లి గ్రామ సమీపాన గల శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి దేవాలయ చైర్మన్, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పెద్దన్న కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి ఆహ్వానం మేరకు తన క్లాస్మేట్ అయిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో మరికొంతమంది మిత్రులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం పోచారం మాట్లాడుతూ.. పెళ్లికి షష్టిపూర్తి, వయస్సుకి షష్టిపూర్తి ఉంటుంది, కానీ స్నేహానికి షష్టిపూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆయన వెంట మరికొంత మంది మిత్రులు ఉన్నారు. -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
సూర్యాపేట : జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని టీయూసీఐ (ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా) జిల్లా అధ్యక్షుడు గొడ్డలి నర్సయ్య కోరారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను అంబానీ, అదానీలకు దోచిపెట్టేందుకు కార్మికుల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వర్గ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9న జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని, ఈ సమ్మెలో టీయూసీఐ కార్యకర్తలు క్రియాశీలకంగా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా సహాయ కార్యదర్శి గోగుల వీరబాబు, జిల్లా నాయకులు శేషగిరి, సాహెబ్ హుస్సేన్, పుప్పాల అంజయ్య, మోహన్, వెంకన్న, యాదగిరి పాల్గొన్నారు. -
కాలినడక తప్పింది
దాత సహకారంతో అల్లీపురం జెడ్పీహెచ్‌ఎస్‌కు హెచ్ఎం, ఉపాధ్యాయులు ఆటో సదుపాయం ఏర్పాటు చేశారు. - 8లోజ్యుడీషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక చివ్వెంల(సూర్యాపేట) : జ్యుడీషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక ఆదివారం సూర్యాపేట పట్టణంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, కోర్టు సూపరింటెండెంట్ దాసరి మధుసూదన్‌రావు, అసోసియేట్ అధ్యక్షుడిగా సంజయ్ కుమార్, కోశాధికారిగా జులైద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా బ్రహ్మారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మహేశ్వర్, ఉపాధ్యక్షులుగా సైదానాయక్, శ్రీకాంత్, ఉమ, జాయింట్ సెక్రటరీలుగా నాగాంజనేయులు. మధుకర్, నాగరాజును ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా వెంకట్‌రెడ్డి, శ్యాంసుందర్ వ్యవహరించారు. -
వృద్ధ మహిళలపై మతిస్థిమితం లేని యువకుడి దాడి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ కొండకు దిగువన ఉన్న లక్ష్మీ పుష్కరిణి సమీపంలో మతిస్థిమితం లేని యువకుడు ఇద్దరు భిక్షాటన చేసే వృద్ధ మహిళలపై దాడికి పాల్పడిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పట్టణ సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. కొంతకాలంగా లక్ష్మీ పుష్కరిణి చెంత ఇద్దరు వృద్ధ మహిళలు భిక్షాటన చేస్తున్నారు. అక్కడే మతిస్థిమితం లేని యువకుడు కూడా ఉంటున్నాడు. అతడికి చెవులు వినిపించవు. శనివారం ఇద్దరు వృద్ధ మహిళల్లో ఒకరు భిక్షాటన చేసేందుకు వస్తుండగా.. సదరు యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె కడుపులో తన్నాడు. వెంటనే ఆమె బీటీ రోడ్డుపై పడటంతో తలకు గాయమైంది. ఆమెకు కాపాడేందుకు వచ్చిన మరో వృద్ధ మహిళను సైతం ఆ యువకుడు కొట్టి గాయపరిచారు. స్థానిక హోటల్ నిర్వాహకులు, దుకాణదారులు, యువకులు ఆ మతిస్థిమితం లేని యువకుడిని తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. గాయపడిన వృద్ధ మహిళలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆదివారం సీఐ భాస్కర్‌ను వివరణ కోరగా.. గతేడాది సైతం ఆ యువకుడు పలువురిపై దాడి చేసి గాయపరిచాడని తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు. మహిళను కడుపులో తన్నుతూ, దాడి చేసిన వీడియో అక్కడే ఉన్న హోటల్ సీసీ కెమెరాలో రికార్డయ్యింది అన్నారు.విద్యుదాఘాతంతో రైతు మృతిచందంపేట: నేరెడుగొమ్ము మండలం బచ్చాపూర్ గ్రామానికి చెందిన కేతావత్ లష్కర్(34) ఆదివారం తన వ్యవసాయ పొలంలో బోరు మోటారు ఆన్ చేసేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఆటో వచ్చింది.. కాలినడక తప్పింది
మఠంపల్లి: మఠంపల్లి మండలం అల్లీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గతంలో చదివిన విద్యార్థులు చదువులో రాణించడంతో పాటు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ క్రీడా పోటీల్లో పాల్గొని పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చారు. ఈ పాఠశాలలో అల్లీపురంతో పాటు కాల్వపల్లి తండా, పాతదొనబండ తండా, కొత్తదొనబండ తండా, జామ్లా తండా గ్రామాలకు చెందిన విద్యార్థులు చదువుకునేవారు. కానీ ప్రస్తుతం సరైన రవాణా సౌకర్యం లేక ఆయా తండాల విద్యార్థులు పట్టణాల్లో బడులకు వెళ్తున్నారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా అల్లీపురం జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం మోదుగు శేషిరెడ్డి, ఉపాద్యాయులు ఎలాగైనా పాఠశాలకు పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పాఠశాల పరిధిలోని ఆయా తండాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి అల్లీపురం జెడ్పీహెచ్‌ఎస్‌కు తమ పిల్లలను పంపించాలని కోరారు. అయితే అల్లీపురం పాఠశాలకు గతంలో తమ తండాల నుంచి బస్సులు, ఆటోలు నడిచేవని, ప్రస్తుతం బస్సు లేకపోవడంతో 2 నుంచి 4 కిలోమీటర్ల దూరం ఉన్న తండాల నుంచి పిల్లలు పాఠశాలకు చేరుకోవాలంటే కాలినడకన రావాల్సి ఉంటుందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. దీంతో ఎలాగైనా విద్యార్థులకు వాహనం ఏర్పాటు చేస్తామని వారి తల్లిదండ్రులకు హెచ్ఎం, ఉపాధ్యాయులు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కాల్వపల్లితండా మాజీ సర్పంచ్ మాలోతు సుజాతాసక్రునాయక్ను హెచ్ఎం, ఉపాధ్యాయులు కలిసి.. పరిస్థితిని వివరించి, ఏడాది కాలానికి పాఠశాల పరిధిలోని తండాలకు చెందిన విద్యార్థులు పాఠశాలకు వచ్చి వెళ్లేలా ఆటో ఏర్పాటు చేశారు. దీంతో పాఠశాలలో 40మంది వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య 60కి పెరిగింది. ఇప్పటికీ నిత్యం అడ్మిషన్లు జరుగుతూనే ఉన్నాయని హెచ్ఎం తెలిపారు. ఆటో ఏర్పాటు చేసిన దాతను, హెచ్ఎం, ఉపాధ్యాయులను విద్యార్థుల తల్లిదండ్రులు అభినందిస్తున్నారు. దాత సహకారంతో అల్లీపురం జెడ్పీహెచ్‌ఎస్‌కు ఆటోను ఏర్పాటు చేసిన హెచ్ఎం, ఉపాధ్యాయులు చుట్టుపక్కల తండాల నుంచి వచ్చే విద్యార్థులతో పెరిగిన అడ్మిషన్లురోజూ ఆటోలోనే వచ్చివెళ్తున్నాం మా తండా నుంచి అల్లీ పురం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు సుమారు 3 కిలో మీటర్లు దూరం ఉండటంతో పాఠశాలకు కాలినడకన రాలేక ఇబ్బందులు పడేదాన్ని. ఇప్పుడు ప్రతిరోజు హెచ్ఎం సార్, టీచర్లు ఏర్పాటు చేయించిన ఆటోలోనే వచ్చివెళ్తున్నాం. ఎంతో ఆనందగా ఉంది. – భూక్యా శరణ్య, 7వ తరగతి, కాల్వపల్లితండాదాత సహకారం మరువలేనిది అల్లీపురం జెడ్పీహెచ్‌ఎస్‌కు విద్యార్థులను చేరవేయడానికి ఆటోను సమకూర్చిన కాల్వపల్లితండా మాజీ సర్పంచ్ మాలోతు సుజాతాసక్రునాయక్ సహకారం మరువలేనిది. ఆటో ఏర్పాటు చేయడంతో విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు ఇంకా అడ్మిషన్లు జరుగుతూనే ఉన్నాయి. – మోదుగు శేషిరెడ్డి, హెచ్ఎం -
ఎస్కేప్ షట్టర్లు బిగించేందుకు ఏర్పాట్లు
నడిగూడెం : నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురం వద్ద సాగర్ ఎడమ కాల్వకు 132, 133 కిలోమీటర్ల వద్ద గతేడాది రెండు గండ్లు పడ్డాయి. దీంతో వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ గండ్లు పడడానికి పాలేరు రిజర్వాయర్ బ్యాక్ వాటర్ కాల్వలోకి వెనక్కి రావడం, ఎస్కేప్ షట్టర్లు సరిగ్గా లేకపోవడమేనని అధికారులు గుర్తించారు. దీంతో నీటిపారుదల శాఖ ప్రత్యేక నిధులతో 133 కిలోమీటర్ వద్ద ఎస్కేప్‌కు పాత షట్టర్లు తొలగించి, కొత్త షట్టర్లు అమర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అత్యవసర సమయంలో నీటిని విడుదల చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. -
సంస్కృత విద్యా పీఠం సందర్శించిన ఈఓ
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలోని బస్టాండ్ సమీపంలో దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంస్కృత విద్యా పీఠాన్ని, వైటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిల్ప కళాశాలను ఈఓ వెంకట్రావ్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా శిల్ప కళాశాలలోని వసతులు, బోధన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం టెంపుల్ ఆర్కిటెక్చర్ కోర్సు వివరాలను ప్రిన్సిపాల్ మోతీ లాల్‌ను అడిగి ఈఓ తెలుసుకున్నారు. విద్యార్థులు తాము నేర్చుకున్న టెంపుల్ ఆర్కిటెక్చర్ డ్రాయింగ్, రాతి, సిమెంట్‌తో చేసే విధానాన్ని ఈఓకు వివరించారు. అనంతరం సంస్కృత విద్యా పీఠానికి వెళ్లి విద్యార్థులు, బోధకులతో మాట్లాడారు. ఈ విద్యా పీఠంలో ఎంతో సామాజిక స్పృహతో అన్ని కులాల వారికి సంస్కృత భాషా జ్ఞానం కల్పించి, దినదినాభివృద్ధి చెందుతుందని ఈఓ తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ ఈఓ భాస్కర్‌శర్మ, సంస్కృత విద్యా పీఠం, శిల్పా కళాశాల బోధకులున్నారు. -
యాదగిరిగుట్టలో ఆర్టీఏ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపాలిటిలోని పాతగుట్టలో 33 జిల్లాలకు చెందిన రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ(నాన్ అఫీషియల్) సభ్యుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్టీఏ సభ్యుడు ఆకుల నరసింహ మాట్లాడుతూ.. నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రయాణికులకు ప్రయోజనం కల్పించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా పరమైన సమస్యలు, రోడ్డు ప్రమాదాల నివారణ వంటి విషయాల్లో రవాణా శాఖ అధికారులతో కలిసి పనిచేస్తూ రాష్ట్ర రవాణా శాఖ గౌరవాన్ని పెంచేలా తమవంతు కృషి చేసేందుకు ప్రతిఒక్కరు ప్రయత్నించాలన్నారు. ఈ సమావేశంలో వివిధ జిల్లా సభ్యులు పడాల రాహుల్, జాఫర్, వెంకన్న, కృష్ణ, అభిగౌడ్, భూపాల్‌రెడ్డి, మురళీ తదితరులున్నారు. -
జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి
● కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ భానుపురి (సూర్యాపేట) : మండల స్థాయిలో సామాజిక, ఆర్థిక అంశాలపై విశ్లేషణ చేయాలని, భవిష్యత్ ప్రణాళికలు రూపొందించి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. పీసీ మెహలనోబిస్ జయంతి సందర్భంగా 19వ జాతీయ అర్ధ గణాంక దినోత్సవాన్ని ఆదివారం కలెక్టరేట్లో ముఖ్య ప్రణాళిక అధికారి కిషన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మహలనోబిస్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. గణాంకాధికారులు క్షేత్రస్థాయిలో కచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని, ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక పద్ధతులు నేర్చుకుంటూ, సమాచారాన్ని ఉన్నత అధికారులకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రామచంద్ర రావు, డివిజన్ పంచాయతీ అధికారి నారాయణ రెడ్డి, గణాంక అధికారి రమేష్, రిటైర్డ్ సీపీఓ ఎస్సీఎస్. రాజు, ఉపగణాంక అధికారులు రాజేష్, కోటేశ్వరరావు, రామారావు, లోక్య, విజయ కుమార్, దున్న శ్యామ్, రిటైర్డ్ ఎస్ఓ సీతారాములు పాల్గొన్నారు. -
వైద్యం వికటించి బాలుడి మృతి
సూర్యాపేట టౌన్: వైద్యం వికటించి మూడు నెలల బాలుడు మృతిచెందిన ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వైద్యుడి నిర్లక్ష్యంతోనే బాలుడు మృతిచెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆదివారం ధర్నా చేశారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగతుర్తి మండలం గుడితండాకు చెందిన జాటోత్ జలంధర్, మనీషా దంపతులకు మూడు నెలల క్రితం బాబు జన్మించాడు. నాలుగు రోజుల క్రితం బాలుడికి జ్వరం రావడంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రైమ్ చిన్నపిల్లల ఆస్పత్రికి తీసుకొచ్చారు. మొదటి రెండు రోజులు బాగానే ఉందని చెప్పిన వైద్యుడు.. ఆదివారం బాలుడి ఆరోగ్యం విషమించడంతో ఖమ్మం తీసుకెళ్లాలని చెప్పాడని, ఖమ్మం తీసుకెళ్లాక బాలుడు మృతిచెందాడని అక్కడి వైద్యులు తెలిపాడని బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు. ప్రైమ్ పిల్లల హాస్పిటల్ వైద్యుడి నిర్లక్ష్యంతోనే బాలుడు మృతిచెందాడని, తమకు న్యాయం చేయాలని బంధువులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళన చేశారు. హాస్పిటల్లో సరైన వసతులు లేకుండా వైద్యం నిర్వహిస్తున్నారని, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు హాస్పిటల్‌ను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డాక్టర్ నిర్లక్ష్యంతోనే మృతిచెందాడని కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోపణ ఆస్పత్రి ఎదుట ఆందోళన పోలీసులు రావడంతో ఉద్రిక్తత బాధితులు రాళ్లు రువ్వడంతో కానిస్టేబుల్‌కు గాయాలు -
దళారులను ఆశ్రయించొదు్ద
నాగారం : ‘ఈ ఏడాదికి సంబంధించి వార్షిక రుణ ప్రణాళిక రూ.11,866 కోట్లు లక్ష్యంగా విధించుకున్నాం. ఆర్బీఐ నిబంధనల మేరకే రుణాలు ఇస్తాం. రుణాల కోసం వచ్చే లబ్ధిదారులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా బ్యాంక్ మేనేజర్, క్షేత్రాధికారిని సంప్రదించాలి. దళారులను నమ్మి మోసపోవద్దు. రాజీవ్ యువవికాసం పథకానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి సిఫారసు లేకుండా రుణాలు అమలు చేస్తాం’ అని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ చింతల బాపూజీ స్పష్టం చేశారు. 2025– 26కు సంబంధించి వార్షిక రుణ ప్రణాళిక ఖరారు కావడంతో ఆయనతో ‘సాక్షి’ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ నిర్వహించింది. వివరాలు ఆయన మాటల్లోనే.. వ్యవసాయ రంగానికి పెద్దపీట వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తాం. ఆర్బీఐ నిబంధనల ప్రకారం అన్ని రకాల రుణాలిస్తాం. సిఫారసులు, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గం. జిల్లాలో జిల్లా, మండల స్థాయి బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి రుణాల పంపిణీలో కలిగే సమస్యలపై సిబ్బందితో మాట్లాడి పరిష్కరిస్తాం. గతేడాది రూ.10,425.41కోట్ల రుణాలు ఇచ్చాం గత ఏడాది 2024–25కు సంబంధించి వార్షిక రుణ ప్రణాళిక జిల్లాకు రూ.8994.61కోట్లుగా ఖరారు చేశాం. అయితే 100శాతం లక్ష్యం పూర్తి కావడంతో ఆయా రంగాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అదనంగా మరో రూ.1430.8 కోట్లు చెల్లింపులు చేశాం. మొత్తంగా జిల్లాలో రూ.10,425.41 కోట్ల రుణాలు ఇచ్చాం. వీటిలో వ్యవసాయ రంగానికి రూ.6,793 కోట్లు, చిన్నమధ్య తరహా పరిశ్రమలకు రూ.1,081 కోట్లు, విద్యారుణాలు రూ.36 కోట్లు, గృహ రుణానికి రూ.180, నాన్ ప్రియారటీ సెక్టార్ కింద రూ.2335.41 కోట్ల రుణాలు ఇచ్చాం. అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాంబీమా పథకాలపై ఖాతాదారులు, ప్రజలకు గ్రామాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. మున్సిపాలిటిల్లో పారిశుద్ధ్య సిబ్బంది, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య సిబ్బంది చేత బీమా చేయించాం. పీఎంఎంవై రుణాలు అత్యధికంగా ఇచ్చిన జిల్లాగా ఎంపిక ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) రుణాలు అత్యధికంగా ఇచ్చిన జిల్లాగా రాష్ట్రం నుంచి సూర్యాపేట జిల్లా ఎంపికై ంది. ఇందుకుగాను ఈ ఏడాది ఏప్రిల్– 6న ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్వయంగా నిర్వహించిన పీఎంఎంవై దశాబ్ది ఉత్సవాలకు హాజరయ్యాం. నేరుగా బ్యాంక్ మేనేజర్‌ను సంప్రదించాలి రుణాల కోసం వచ్చే బ్యాంక్ ఖాతాదారులు, లబ్ధిదారులు పైరవీకారులను, దళారులను ఆశ్రయించకుండా నేరుగా బ్యాంక్ మేనేజర్, క్షేత్రాధికారిని సంప్రదించాలి. దళారులను నమ్మి మోసపోవద్దు. ఏ రుణమైనా ఆర్బీఐ నిబంధనల మేరకే ఇస్తాం. ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులకు విద్యా రుణాలిస్తున్నాం. విద్యారుణం తీసుకున్న కుటుంబానికి అప్పు భారం కాకుడదన్న ఉద్దేశంతో క్రెడిట్ లింక్ టర్మ్ బీమా తప్పనిసరి. సంక్షేమం, రాజీవ్ యువవికాసం పథకాలకు సంబంధించి అర్హులైన లబ్దిదారులకు ఎలాంటి సిఫారసు లేకుండా రుణాలు అమలు చేస్తాం. రాజకీయ నాయకుల ప్రమేయానికి ఆస్కారం లేదు. పారదర్శకంగా రుణాల అందజేత ఏ రుణమైనా ఆర్బీఐ నిబంధనలే ప్రామాణికం 2025– 26కు సంబంధించి రుణ లక్ష్యం రూ.11,866 కోట్లు వ్యవసాయ రంగానికి రూ.3861.42 కోట్లు.. అనుబంధ రంగాలకు రూ.2,999.49 కోట్లు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ చింతల బాపూజీ చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.2418.38 కోట్లు ఈఏడాది జిల్లాలో వార్షిక రుణ ప్రణాళిక రూ.11,866 కోట్లు లక్ష్యంగా విధించుకున్నాం. వీటిలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తూ రూ.3861.42 కోట్లు రుణాలివ్వనున్నాం. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.2999.49 కోట్లు అందించనున్నాం. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.2418.38 కోట్లు, విద్యా రుణాలు రూ.36 కోట్లు, గృహ రుణాలు రూ.180 కోట్లు, నాన్ ప్రియారటీ రంగానికి రూ.2,370.71 కోట్లు ఇవ్వాలని లక్ష్యం విధించుకున్నాం. -
పెండెం జగదీశ్వర్ సాహిత్య సేవ చిరస్మరణీయం
రామగిరి(నల్లగొండ): బాల సాహితీరత్న పెండెం జగదీశ్వర్ బాల సాహిత్యానికి చేసిన కృషి చిరస్మరణీయమని ప్రముఖ బాల సాహితీవేత్త గరిపెల్లి అశోక్ అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పెండెం జగదీశ్వర్ స్మారక ఆరో జాతీయ పురస్కార ప్రదానోత్సవ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. పెండెం జగదీశ్వర్ సాహిత్యాన్ని ప్రతి పాఠశాలకు చేర్చవలసిన బాధ్యత ప్రభుత్వానికి, సమాజానికి ఉందన్నారు. జగదీశ్వర్ స్మారక జాతీయ పురస్కారాన్ని విజయవాడకు చెందిన ప్రముఖ బాల సాహితీవేత్త ముంజలూరి కృష్ణకుమారికి అందజేశారు. ఈ పురస్కారం కింద రూ.5వేల నగదు, ప్రశంసా పత్రంతో ఆమెను ఘనంగా సత్కరించారు. పురస్కార గ్రహీత ముంజులూరి కృష్ణకుమారి మాట్లాడుతూ.. జగదీశ్వర్ పేరిట వారి స్నేహితులు పురస్కారాన్ని ఏర్పాటు చేసి జాతీయస్థాయిలో బాల సాహిత్యంలో విశిష్ట కృషిచేసిన రచయితలకు అందజేస్తుండడం అభినందనీయమన్నారు. ప్రముఖ కథా రచయిత మేరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ.. జగదీశ్వర్ మరణం బాల సాహిత్యానికి తీరని లోటని అన్నారు. డాక్టర్ తండు కృష్ణకౌండిన్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహితీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్, సృజన సాహితీ అధ్యక్ష, కార్యదర్శులు పెరుమాళ్ల ఆనంద్, డాక్టర్ సాగర్ల సత్తయ్య, రచయితలు పుప్పాల కృష్ణమూర్తి, డాక్టర్ పగడాల నాగేందర్, డాక్టర్ ఉప్పల పద్మ, పెందోట సోము, దాసోజు శ్రీనివాస్, శంకర్, బాసరాజు యాదగిరి, బండారు శంకర్, శ్రవణ్ కుమార్, భీమార్జున్‌రెడ్డి, మాదగాని శంకరయ్య, మోత్కూరు శ్రీనివాస్, వడ్డేపల్లి వెంకటేష్, ముక్కామల జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు. -
మట్టపల్లిలో నిత్యారాధనలు
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శనివారం నిత్యారాధనలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రబాతసేవ, నిత్యాగ్నిహోత్రి, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేశారు. అనంతరం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామిని నూతన పట్టువస్త్రాలతో అలంకరించి ఎదుర్కోలు నిర్వహించారు. అనంతరం నిత్యకల్యాణం జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈవో సిరికొండ నవీన్‌కుమార్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
పోలీస్ శాఖపై నమ్మకం పెంచాలి
సూర్యాపేటటౌన్ : ప్రజా ఫిర్యాదులపై, సంఘటనలపై త్వరితగతిన స్పందించి బాధితులకు, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడం ద్వారా పోలీస్ శాఖపై మరింత నమ్మకం పెంచాలని ఎస్పీ నర్సింహ అన్నారు. శనివారం సూర్యాపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ స్టేషన్ బ్లూ కోట్స్, కోర్ట్ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి నిర్వహించిన ఒక రోజు శిక్షణలో ఆయన మాట్లాడారు. డయల్ 100 ద్వారా ఫిర్యాదుల పరిష్కారానికి అన్ని పోలీస్స్టేషన్న్లలో బ్లూ కోట్స్, కోర్టు డ్యూటీ సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలన్నారు. విధి నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఈ శిక్షణలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, బీసీఆర్‌బీ ఇన్స్పెక్టర్ హరిబాబు, టెక్నికల్ సిబ్బంది, బ్లూ కోట్స్, కోర్టు డ్యూటీ సిబ్బంది పాల్గొన్నారు.ఫ ఎస్పీ నర్సింహ -
ఉపాధిహామీ పనుల్లో అలసత్వం చేయొద్దు
కోదాడరూరల్ : ఉపాధిహామీ పనుల్లో సిబ్బంది అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని డీఆర్డీఓ వీవీ.అప్పారావు హెచ్చరించారు. కోదాడ మండల పరిధిలోని 16 గ్రామాల్లో గత వార్షిక ఏడాదిలో జరిగిన ఉపాధి పనులపై శనివారం పట్టణంలో ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొన్ని గ్రామాల్లో మస్టర్లలో సంతకాలు లేకుండా బిల్లులు డ్రా చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొన్ని గ్రామాల్లో తక్కువ పనులు చేసి ఎక్కువ పనులు చేసినట్లు కొలతలు తీశారని తనిఖీలో తేలడంతో ఆ నగదు రికవరీకి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ శిరీషా, ఎంపీడీఓ వీవీ.రాంచందర్‌రావు, ఎంపీఓ పాండురంగన్న, పీఆర్ఏఈ రాము, అంబుడ్స్‌మెన్ లచ్చిరాంనాయక్, డీవీఏ పద్మనాభరావు, ఏవీఓ ఆశా, ఏపీఓ ఠానియా ఉన్నారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం ఆపాలి సూర్యాపేట అర్బన్ : గోదావరి జలాల అక్రమ తరలింపునకు చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.కోటేశ్వరరావు అన్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు పోటు లక్ష్మయ్య అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి పంపకం కోసం కొత్త ట్రిబ్యునల్స్.. ప్రజా సంఘాలతో చర్చించి నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.డేవిడ్ కుమార్, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్, జిల్లా ఉపాధ్యక్షుడు పెద్దింటి రంగారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి అలుగుబెల్లి వెంకట్‌రెడ్డి, జిల్లా నాయకులు కాకి మోహన్‌రెడ్డి, ఎస్.కె జిలేరు, మేకల కనకారావు, దాసరి శ్రీనివాస్, భయ్యా లింగయ్య, సుంకిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జాజుల సామేలు, ఎస్.కె మైబెల్లి, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణహుజూర్నగర్ : మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని జిల్లా సహకార అధికారి (డీసీఓ) సువర్చల పద్మ అన్నారు. వన మహోత్సంలో భాగంగా శనివారం హుజూర్నగర్ మండలం లింగగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవణరలో, శ్రీనివాసపురం గ్రామంలోని గోదాం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు కట్ట గోపాల్‌రావు, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు రాంబాయి, అంజయ్య, ఆడిటర్ సంధ్యారాణి, రవికుమార్, డైరెక్టర్లు కోనుగంటి కోటిరెడ్డి, తిమ్మారెడ్డి కళావతి, అరబండి అప్పారావు, మాజీ అధ్యక్షుడు లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే నిర్వహించాలిమునగాల : సాగర్ ఎడమ కాలువపై ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాల బాధ్యతలను ప్రభుత్వమే చూడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి కోరారు. శనివారం మునగాల మండలం మాధవరంంలో శనివారం ఆ పార్టీ మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను అందించాలన్నారు. మండల కార్యదర్శి బుర్రిశ్రీరాములు అధ్యక్షన జరిగిన ఈ శిక్షణలో నెమ్మాది వెంకటేశ్వర్లు, ఎం.రాములు, షేక్ సైదా, జూలకంటి విజయలక్ష్మి, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, ఆరె రామకృష్ణారెడ్డి, జి.వెంకట్‌రెడ్డి, బచ్చలకూరి స్వరాజ్యం, చందా చంద్రయ్య, డి.స్టాలిన్‌రెడ్డి, వెంకన్న, జూలకంటి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రెండు రోజులే గడువు
గడువులోగా బియ్యం తీసుకోవాలి రేషన్ బియ్యం పంపిణీకి మరో రెండు రోజులే గడువు ఉంది. ఇంకా బియ్యం తీసుకోని లబ్ధిదారులు గడువులోపు తీసుకోవాలి. గడువు పెంచే అవకాశం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు 88శాతం బియ్యం పంపిణీ పూర్తయింది. మిగతా వారు కూడా గడువులోపు బియ్యం తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. – మోదుగు శ్రీనివాస్‌రెడ్డి, ఇన్చార్జి డీఎస్ఓ నాగారం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డుదారులకు మూడు నెలల (జూన్, జూలై, ఆగస్టు)కు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఈనెలలోనే ఒకేసారి పంపిణీకి శ్రీకారం చుట్టింది. అయితే మూడు నెలల బియ్యం తీసుకునేందుకు 30వ తేదీ వరకు (రెండు రోజులు) మాత్రమే గడువు ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 88శాతం మందికి పంపిణీ చేశారు. ఇంకా 12శాతం మంది బియ్యం తీసుకోలేదని పౌరసరఫరాల శాఖ గుర్తించింది. దీంతో పంపిణీ గడువుపై గ్రామాల్లో ప్రచారం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా పౌరసఫరాల శాఖ అధికారులు దీనిపై దృష్టి సారించారు. పలు కారణాలతో పంపిణీలో జాప్యం జిల్లాలోని 486 గ్రామ పంచాయతీల పరిధిలో 610 రేషన్ దుకాణాలు, 3.24లక్షల రేషన్ కార్డులున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో పేదలు నిత్యావసర సరకులకు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మూడు నెలల బియ్యాన్ని ప్రభుతం ఒకేసారి పంపిణీ చేస్తుంది. దీనిలో భాగంగా జిల్లాలకు మూడు నెలలకు గాను 1,78,000 క్వింటాళ్ల బియ్యాన్ని కేటాయించారు. కానీ పంపిణీకి ఉపయోగించే ఈపాస్ యంత్రాల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం, సర్వర్ బిజీగా ఉండటం, బ్లూటూత్ సక్రమంగా కనెక్ట్ కాకపోవడం వంటి కారణాల వల్ల పంపిణీలో జాప్యం జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు, ఇతర పనుల నిమిత్తం గ్రామాలు వదిలి వెళ్లడంతో కొంత మంది వినియోగదారులు ఇంకా తీసుకోలేదు. ఈ నేపథ్యం వంద శాతం బియ్యం పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. వంద శాతం ప్రశ్నార్థకం ఈనెల 1 నుంచి బియ్యం పంపిణీ ప్రారంభించాల్సి ఉన్నా షాపులకు సరఫరా కాకపోవడంతో జాప్యం చోటుచేసుకుంది. కొన్ని దుకాణాల్లో 5వ తేదీ నుంచి ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా పంపిణీ తీరును పరిశీలిస్తే శనివారం నాటికి 88 శాతం పూర్తయింది. రెండు రోజులే గడువుంది. సాధారణ రోజుల్లో బియ్యం పంపిణీ 1నుంచి 15వ తేదీ వరకు జరిగేది. ఈ సారి మూడు మాసాల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తుండడంతో నెలాఖరు వరకు గడువు విధించారు. అయినా వంద శాతం పంపిణీ ప్రశ్నార్థకం గానే మారింది. ప్రతినెలా 80 నుంచి 90శాతం మంది లబ్ధిదారులు మాత్రమే బియ్యాన్ని తీసుకుంటున్నారని అధికారులు పేర్కొంటున్నారు. రేపటితో ముగియనున్న రేషన్ బియ్యం పంపిణీ ఫ ఇప్పటి వరకు 88 శాతం పంపిణీ పూర్తి ఫ గడువులోగా తీసుకోవాలంటున్న పౌర సరఫరాల శాఖ అధికారులు ఫ గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సిబ్బందిరేషన్ దుకాణాలు 610రేషన్ కార్డులు 3.24 లక్షల పంపిణీ శాతం 88 శాతం -
ఫిట్‌లెస్ బస్సులపై నిఘా
సూర్యాపేటటౌన్ : పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కావడంతో ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులపై రవాణా శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు కొంత మంది తమ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించగా మరికొందరు చేయించకుండానే వాటిల్లో విద్యార్థులను పాఠశాలలు, కళాశాలలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిట్నెస్ లేని పాఠశాలలపై జిల్లా రవాణా శాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి ఆ శాఖ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో చాలా మంది ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమ బస్సులకు ఫిట్నెల్ పరీక్షలు చేయించుకోంగా ఇంకా కొంత మంది బస్సులను ఫిట్నెస్ చేయించకుండానే రోడ్లపై తిప్పుతున్నారు. ఫిట్నెస్ పరీక్షలు లేకపోతే సీజే.. జిల్లాలో 350 ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో 40వేలకుపైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే విద్యార్థులను తీసుకొచ్చేందుకు ఆయా ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు బస్సులను కొనుగోలు చేసి నడిపిస్తున్నారు. కాగా జిల్లాలోని అన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందినవి 570 బస్సులు ఉండగా అందులో 475 బస్సులను ఫిట్నెస్ చేయించారు. ఇంకా 95 బస్సులను ఫిట్నెస్ చేయించకుండా యాజమాన్యాలు తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి ఫిట్నెస్, సరైన ధ్రువపత్రాలు లేనివి, ఓవర్ లోడింగ్‌తో వెళ్లున్న 19 బస్సులను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఇలా.. ఫ ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమ బస్సులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏటా ఫిట్నెల్ పరీక్షలు చేయించాలి. ఫ స్కూల్ బస్సుకు తప్పనిసరిగా ఎల్లో కలర్ వేయించడంతో పాటు నాలుగు వైపులా పాఠశాల పేరు రాయించాలి. ఫ డ్రైవర్‌కు నాలుగేళ్ల సీనియారిటీతో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఫ బస్సులో సీటింగ్ సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించవద్దు. ఫ బస్సుల్లో కిటికీలు, సీట్లు సరిగ్గా ఉండేలా ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ప్రైవేట్ విద్యాసంస్థల వాహనాలపై రవాణా శాఖ ముమ్మర తనిఖీలు ఫ ఫిట్నెస్ లేకుండా రోడ్లపై తిరిగే వాటిపై ప్రత్యేక దృష్టి ఫ ఇప్పటికే 19 బస్సులను సీజ్ చేసిన అధికారులు మొత్తం విద్యాసంస్థల బస్సులు 570 ఫిట్నెస్ పరీక్షలు పూర్తయినవి 475పరీక్షలు చేయించనివి 95ఫిట్నెస్ ఉంటేనే రోడ్లపై తిప్పాలి ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమ బస్సులను ఫిట్నెస్ ఉంటేనే రోడ్లపై తిప్పాలి. లేకుండా సీజ్ చేస్తాం. విద్యార్థుల భద్రతలో నిర్లక్ష్యం వహించొద్దు. లైసెన్స్ ఉన్న వ్యక్తులనే డ్రైవర్లుగా నియమించాలి. వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు ఉండాలి. బస్సులో అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బస్సులను నడపాలి. స్సులపై నిరంతరం నిఘా ఉంటుంది. – జయప్రకాష్‌రెడ్డి, ఎంవీఐ, సూర్యాపేట -
అరచేతిలో అందం.. ఆరోగ్యం
సూర్యాపేట అర్బన్, రామగిరి(నల్లగొండ): ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు అతివలకు గోరింటాకు గుర్తుకువస్తుంది. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరాలంటూ పెద్దలు చెబుతారు. అతివలకు ఆరోగ్యంతోపాటు ఆధ్యాత్మికాన్ని పెంపొందించే గోరింటాకు సందడి జిల్లాలో మొదలైంది. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం సౌభాగ్యానికి, శ్రేయస్సుకు సంకేతంగా భావిస్తారు. గోరింటాకు మహిళల చేతులు, కాళ్లకు కొత్త అందాన్నిస్తుంది. యువతుల చేతికి గోరింటాకు ఎంత ఎర్రగా పండితే.. అంత మంచి భర్త దొరుకుతాడని విశ్వసిస్తారు. గోరింటాకు శుభానికి చిహ్నంగా భావిస్తారు. అనేక ఔషధ గుణాలు.. వేసవిలో మన శరీరం వేడితో కూడుకుని ఉంటుంది. ఆషాఢంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది. అలాంటి సమయంలో మన శరీరంలోని వేడి.. బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి ఉంటుంది. అంతేకాకుండా గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఆషాడంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకోవా లని డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు గోరింటాకు పెట్టుకోవడంతో అంటురోగాలు దరికి చేరవు. గోరింటాకు శరీరాన్ని చల్ల పరచడానికి సహాయపడుతుంది. జ్వరం, తలనొప్పిని తగ్గిస్తుంది. జుట్టును రాలకుండా సంరక్షిస్తుంది. కేశాల పెరుగుదలకు సహాయపడుతుంది. చుండ్రును తొలగించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రుతువు మారడంతో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఆరోగ్యానికి మంచిది. – డాక్టర్ పాల ఆనంద్, జనరల్ మెడిసిన్, సూర్యాపేట రవీంద్రనగర్‌లో గోరింటాకు పెట్టుకుంటున్న మహిళలు●ప్రయోజనాలు ఇలా.. ఫ చర్మ వ్యాధుల నుంచి రక్షణ ఫ ఒంట్లోని వేడిని తగ్గించడం ఫ రోగనిరోధక శక్తిని పెంచడం ఫ రక్త ప్రసరణను మెరుగుపర్చడం ఫ గోళ్లను ఆరోగ్యంగా ఉంచడంగోరింటాకును శుభకార్యాలు, పండుగలప్పుడు పెట్టుకోవడం ఆనవాయితీ. కొన్ని సంప్రదాయాల ప్రకారం గోరింటాకు గర్భాశయ దోషాలను తొలగిస్తుందని, సీ్త్ర ఆరోగ్యాన్ని కాపాడుతుందని నమ్ముతారు. ఆయుర్వేధంలో గోరింటాకు వేర్లు, బెరడు, ఆకులు, పూలు, విత్తనాలు అన్నీ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని చెబుతారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం సీ్త్రలకు సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు. ఇది సీ్త్ర తత్వానికి, అందానికి ప్రతీక అని నమ్ముతారు. ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యాన్ని పొందిన వారవుతారని జ్యోతిష్యులు అంటున్నారు. పట్టణాల్లో సామూహికంగా వేడుకపట్టణాల్లో పలు కాలనీలలో మహిళలు ఒక చోట చేరి గోరంటాకు సేకరిస్తారు. సంప్రదాయ పద్ధతిలో రోలులో గోరంటాకును నూరుతారు. అంతా ఒకచోట సమూహంగా కూర్చొని పాటలు పాడుతూ ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటారు. దోషాలను నివారిస్తుందిఆషాఢ మాసంలో అతివల గోరింటాకు సందడి ఫ సౌభాగ్యానికి, శ్రేయస్సుకు సంకేతంగా భావిస్తున్న మహిళలు ఫ పట్టణాల్లోని కాలనీల్లో సామూహికంగా వేడుకలు ఫ గోరింటాకు పెట్టుకుని మురిసిపోతున్న యువతులు -
సమగ్ర వ్యవసాయ ప్రణాళికను ప్రకటించాలి
సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్లో రైతాంగాన్ని ఆదుకునేందుకు సమగ్ర వ్యవసాయ ప్రణాళికను ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్లో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతున్నందున ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకొని ఏ భూమిలో ఏ పంట పండుతుందో, ప్రజలకు ఎంత పంట అవసరమో అంచనా వేసి వాటికి అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు, బ్యాంకు రుణాలు రైతాంగానికి అందించాలని కోరారు. ప్రతి సంవత్సరం కల్తీ విత్తనాలు, పురుగుల మందుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే నకిలీ పురుగుల మందులు, విత్తనాలు లేకుండా చూడాలన్నారు. బనకచర్ల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడాలన్నారు. రాజకీయ జోక్యం లేకుండా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరి రావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, నాగారపు పాండు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, ఏకలక్ష్మి పాల్గొన్నారు. -
రాష్ట్ర పండుగగా గుర్తించాలి
చివ్వెంల(సూర్యాపేట) : శ్రీ లింగమంతులస్వామి (పెద్దగట్టు) జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని గొర్రెల, మేకల పంపెకం దారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ కోరారు. గురువారం చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామ శివారులోగల శ్రీ లింగమంతుల స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఆ సంఘం జిల్లా మహాసభలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గొర్రెలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి ఆ ఊసే ఎత్తడంలేదన్నారు. సమావేశంలో కడం లింగయ్య, వీరబోయిన రవి, వట్టే వినయ్, కంచుగట్ల శ్రీనివాస్, బొల్లం గోపాల కృష్ణ, వీరబోయిన సైదులు, బట్టు కొమరయ్య, దాసరి లింగయ్య, మున్న భిక్షం, సింగం వెంకన్న, కన్నబోయిన ఎర్రయ్య, వెంకన్న, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
‘ఇన్స్పైర్’ అవుదాం
ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి సమాజంలో నిత్యం ఎదుర్కొనే అనేక సమస్యలకు పరిష్కార రూపంలో ఆవిష్కరణలకు వేదికగా ఇన్స్పైర్ మనక్ నిలుస్తోంది. విద్యార్థులు తమ ఉపాధ్యాయుల సహకారంతో పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటాలి. ఉపాధ్యాయులు విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించాలి. విద్యార్థులు తమలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇన్స్పైర్ ఎంతగానో దోహదపడు తుంది. ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు పోటీల్లో పాల్గొనేలా సైన్స్ ఉపాధ్యాయులు కృషి చేయాలి. – దేవరాజు, జిల్లా సైన్స్ అధికారి ఫ ఇన్స్పైర్ మనక్ అవార్డులకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ఫ సెప్టెంబర్ 15 వరకు గడువు ఫ ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు పురస్కారాలు సూర్యాపేటటౌన్ : పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ప్రయోగాల వైపు నడిపించి, వారిలో వినూత్న ఆలోచనలకు పదును పెట్టి భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్సూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్’ (ఇన్స్పైర్) పేరుతో ఇన్స్పైర్ మనక్ పురస్కారాలను అందిస్తోంది. 2025–26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నెల 15న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 15వ తేదీ వరకు కొనసాగనుంది. ఎవరు అర్హులంటే.. 10 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 6 నుంచి 10వ తరగతి చదివే ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల, మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు అర్హులు. వీరు పాఠశాలలోని సైన్స్ ఉపాధ్యాయుడి గైడ్లైన్ పాటిస్తూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే విధానం.. ● ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ● www.inspireawards-dst.gov.in వెబ్సైట్లోకి వెళ్లి న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ● పాఠశాలకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకొని, సేవ్ చేసుకోవాలి. ఈ దరఖాస్తు జిల్లా అథారిటీకి వెళ్తుంది. ● వీరు ఆమోదిస్తే విద్యార్థికి సంబంధించి పొందుపర్చిన మెయిల్ ఐడీకి యూజర్ ఐడీతో కూడిన లింక్ వస్తుంది. అప్పుడు విద్యార్థి యూజర్ ఐడీకి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ● విద్యార్థి తన సమాచారంతో పాటు బ్యాంక్ అకౌంట్ నంబర్, ఆధార్ నంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. ● విద్యార్థి ప్రదర్శించాలనుకున్న ప్రాజెక్టును సంక్షిప్తంగా వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. ● ఎంపికై న ప్రాజెక్టు ప్రయోగ నిమిత్తం విద్యార్థి బ్యాంక్ ఖాతాకు రూ.10వేలు జమ చేస్తారు. ● రాష్ట్ర స్థాయికి ప్రాజెక్టు ఎంపికై తే రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అందిస్తారు. ● ఆన్లైన్లో ఉచితంగా విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ● 2024–25 విద్యా సంవత్సరంలో 950 పాఠశాలలకు సంబంధించి 88 నమూనాలు ఎంపికయ్యాయి. ఇందులో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించగా రాష్ట్ర స్థాయికి ఎనిమిది ప్రదర్శనలు ఎంపికయ్యాయి. విద్యార్థులకు ప్రోత్సాహకాలు ప్రాజెక్టులను డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రతినిధులు పరిశీలిస్తారు. ఎంపికైన ప్రాజెక్టు ప్రయోగ నిమిత్తం ఎంపిక చేసిన విద్యార్థి వ్యక్తిగత అకౌంట్లో రూ.10వేలు జమ చేస్తారు. రాష్ట్ర స్థాయి ప్రదర్శననకు ఎంపికై తే రూ.25వేలు, జాతీయ స్థాయిలో ఎంపికై తే రూ.40 వేల నుంచి రూ.60వేల వరకు నగదు ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందజేస్తారు. ప్రతిభావంతులకు ఐఐటీ, నీట్ ప్రవేశాల్లో రిజర్వేషన్ కల్పిస్తారు. ప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. -
ఏకత్వంలో భిన్నత్వం సృష్టిస్తున్న బీజేపీ
సూర్యాపేట : దేశంలో హిందుత్వం ముసుగులో ఏకత్వంలో భిన్నత్వాన్ని బీజేపీ సృష్టిస్తోందని శాసనసభ డిప్యూటీ స్పీకర్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచందర్ నాయక్ ఆరోపించారు. గురువారం ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ అధ్యక్షతన నిర్వహించిన ఆదివాసీ కాంగ్రెస్ బునియాది కార్యకర్తల సమ్మేళనం ముగింపు సభలో ఎమ్మెల్యేలు పద్మావతిరెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, శాసన మండలి సభ్యుడు కేతావత్ శంకర్ నాయక్ లతో కలిసి పాల్గొని మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఆదివాసీ, గిరిజనులకు ఏదైనా లబ్ధిచేకూరిందంటే అది కాంగ్రెస్ పార్టీతోనే అని చెప్పారు. ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టబెడుతోందని ఆరోపించారు. బీజేపీ కుటిల ప్రయత్నాలను ప్రశ్నించిన ఏకై క వ్యక్తి రాహుల్ గాంధీ అని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే వరకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలి అన్నారు. బీఆర్ఎస్ పాలకులు విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగాలు ఇవ్వకుండా గొర్లు, బర్లు ఇచ్చారని విమర్శించారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. గత పదేళ్లో ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల రూ.200 కోట్లు విడుదల చేసిందన్నారు. సభలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, ఆదివాసీ కాంగ్రెస్ బునియాది శిక్షణ శిబిరం జాతీయ కోఆర్డినేటర్ రాహుల్ బాల్, కాంగ్రెస్ ఎస్టీసెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోట్య నాయక్ భూక్య, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్, శిక్షణ శిబిరం ఇన్చార్జి లింగం, రాణా ప్రతాప్, కృష్ణ, శ్రీను, మల్లికార్జున్, మోహన్, గుగులోతు నాగు నాయక్ పాల్గొన్నారు. ఫ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రాంచందర్ నాయక్ -
ఆరుగురు ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి
సూర్యాపేటటౌన్ : జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న ఆరుగురు ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి లభించింది. ఎస్ఐలుగా ప్రమోషన్ పొందిన వారిలో బి.రామచందర్, హనుమాన్, వి.వెంకన్న , జి.చినమల్సూర్, పి.ముత్తయ్య, ఎస్కె.రహీమొద్దీన్ ఉన్నారు. పదోన్నతి పొందిన వారు గురువారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ వారికి మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగోన్నతితో పాటుగా బాధ్యతలు పెరుగుతాయని, అందుకనుగుణంగా విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలన్నారు. పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని కోరారు. మల్టీపర్పస్ సొసైటీలుగా అభివృద్ధి చేయాలిచిలుకూరు: పీఏసీఎస్‌లను మల్టీపర్పస్ సొసైటీలుగా అభివృద్ధి చేయాలని నల్లగొండ డీసీసీబీ ఏజీఎం పసుపులేటి వెంకటేశ్వర్లు సూచించారు. డెవలపింగ్ పీఏసీఎస్ ఇన్‌టూ మల్టీపర్పస్ సొసైటీ కార్యక్రమంలో భాగంగా గురువారం చిలుకూరు పీఏసీఎస్‌ను ఫ్యాకల్టీ సభ్యులతో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో 40 పీఏసీఎస్‌లను డెవలపింగ్ మల్టీపర్పస్ సొసైటీలుగా ఎంపిక చేశామని తెలిపారు. జిల్లాలోనే ఆదర్శవంతమైనది చిలుకూరు పీఏసీఎస్ అని కొనియాడారు. అనంతరం డెవలపింగ్ పీఏసీఎస్ ఇన్‌టూ మల్టీపర్పస్ సొసైటీపై సిబ్బందికి ఫ్యాకల్టీ సభ్యులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీ సభ్యులు విజయశేఖర్, సంపత్‌కుమార్, డీసీసీబీ డైరెక్టర్ కొండా సైదయ్య, చిలుకూరు ప్యాక్స్ చైర్మన్ అలసకాని జనార్దన్, సెక్షన్ మేనేజర్ అశోక్, కోదాడ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ రామకృష్ణ, సీఈఓ చిలువేరు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఐక్యంగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకుందాంసూర్యాపేట టౌన్: క్రైస్తవులంతా ఐక్యంగా ఉంటూ సమస్యలను పరిష్కరించుకుందామని జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు మీసాల గోవర్దన్ పేర్కొన్నారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని గ్రేస్ టెంపుల్లో ఏర్పాటు చేసిన జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రైస్తవు సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరారు. ఈ సందర్భంగా క్రైస్తవ సమాజానికి సేవలందించిన దళిత సంఘం జాతీయ నాయకుడు గుద్దేటి ఎల్లయ్య మాదిగను సన్మానించారు. అనంతరం ఆయన వైద్య ఖర్చులకోసం ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షుడు కాసర్ల శ్రవణ్ కుమార్, చీఫ్ అడ్వైజర్ కొత్తపల్లి సిల్వి, కమిటీ వైస్ ప్రెసిడెంట్ రెమిడాల ప్రకాష్, ప్రధాన కార్యదర్శి కాపర్తి సైమన్, కోశాధికారి పూజర్ల శామ్యూల్, కిరణ్, చంద్రశేఖర్ ,జలగం డేవిడ్ రాజ్, కరుణాకర్, రామారావు, జాషువా పాల్గొన్నారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిత్యకల్యాణం నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యఅగ్నిహోత్రి, పంచామృతాభిషేకం, నూతన పట్టు వస్త్రాలంకరణ చేశారు. అనంతరం ఎదుర్కోళ్లమహోత్సవ నిర్వహించారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలతో నిత్యకల్యాణతంతు ముగించారు. కార్యక్రమంలో విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, నవీన్‌కుమార్, రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. -
యువత డ్రగ్స్ జోలికి వెళ్లొద్దు
సూర్యాపేటటౌన్ : యువత డ్రగ్స్ జోలికి వెళ్లొద్దని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ , పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన ర్యాలీని ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ పి. రాంబాబుతో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సూర్యాపేటను డ్రగ్స్‌రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా కృషి చేయాలన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలు అవగాహన కల్పించాలన్నారు. మాదక ద్రవ్యాలు కనిపిస్తే వెంటనే 1908 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని లేదా 100కు డయల్ చేసి వివరాలు తెలియజేయాలన్నారు. రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ మన ప్రాంతాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ డ్రగ్స్ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు అందమైన జీవితాన్ని కూడా బలి తీసుకుంటుందన్నారు. డ్రగ్స్ కలిగి ఉండడం నేరం అందుకు చట్టరీత్యా శిక్ష తప్పదని చెప్పారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డీడబ్ల్యూఓ రూప , ఆర్డీఓ వేణుమాధవ్, తహసీల్దార్ కృష్ణయ్య, డీటీడీఓ శంకర్, డీవైఎస్ఓ రామచంద్రరావు, అడిషనల్ ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, డీఎస్పీ ప్రసన్న కుమార్, నరసింహా చారి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఫ సూర్యాపేటలో మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ ర్యాలీ -
మొలకెత్తని ఆశలు
విత్తనాలు మళ్లీ పెడుతున్నాం ఈసారి 20 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి గింజలు నాటాం. రూ.3.20 లక్షలు ఖర్చు చేశాం. వర్షాభావ పరిస్థితులతో పత్తి గింజలు మొలవ లేదు. ఎక్కడో ఒక చోట కొన్ని గింజలు మొలిచినా ఎండ వేడికి వాడి పోయాయి. రూ.30 వేలతో మళ్లీ పత్తి గింజలు తెచ్చి 9 ఎకరాలలో మళ్లీ విత్తుతున్నాం. –గుగులోతు కవిత, నెల్లిబండతండా, తిరుమలగిరి మండలం విత్తనాలు మొలకెత్తలేదు ఈనెల మొదట్లో వర్షాలు పడ్డాయి. మాకున్న 15 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశాం. పదును సరిపడలేకపోవడంతో విత్తనాలు సగానికి పైగా మొలకెత్తలేదు. వర్షం కోసం ఎదురుచూస్తున్నాం. మరో పది రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది. – పిట్టల సైదులు, జాన్‌పహాడ్, పాలకవీడు మండలం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తొలకరి వర్షంతో విత్తనాలు వేసిన రైతుల ఆశలు ఆడియాశలయ్యాయి. వర్షకాలం ప్రారంభమై 25 రోజులు గడుస్తున్నా వరుణుడు కరుణించక అన్నదాత ఆందోళనలో పడ్డాడు. ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాల్లో తీవ్ర వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. పత్తి, మక్క తదితర మెట్ట పంటల విత్తనాలు నాటినా వర్షాల్లేక మొలకత్తలేదు. అక్కడక్కడా మొలకెత్తినవి ఎండిపోతున్నాయి. దీంతో రైతులు వాటిని కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. బిందెలతో నీళ్లు పోస్తున్నా ప్రయోజనం లేకుండాపోయింది. మొదట్లో కాస్త ఊరించిన వరుణుడు నెల రోజులుగా ముఖం చాటేయడంతో రైతన్న వర్షాల కోసం ఆకాశంవైపు చూస్తున్నాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వివిధ మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారం, కనగల్, పెద్దపూర తదితర మండలాల్లో సుమారు 70 నుంచి 100 శాతం వరకు వర్షపాతం లోటు ఉంది. మిగితా మండలాల్లోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో కేవలం 0.3 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది..అంటే ఒక్క తుంపర కూడా లేదు. చింతలపాలెం, నేరేడుచర్ల, పెన్‌పహాడ్, చివ్వెంల మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట, అడ్డగూడూరు, భువనగిరి తదితర మండలాల్లోనూ వర్షాభావ పరిస్థితుల నెలకొన్నాయి. మొదట్లో ఊరించిన వానలు ఈ నెల మొదట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నైరుతి రుతు పవనాల ప్రభావంతో కొద్దిపాటి జల్లులు పడటంతో రైతులు ఆనందంతో పత్తి విత్తనాలు విత్తారు. ఆ తరువాత నుంచి మళ్లీ వర్షాలు పెద్దక పడకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా కొద్ది రోజులు ఇలాగే ఉంటే పెట్టిన పెట్టుబడి మొత్తం పోవడంతోపాటు మళ్లీ అదనంగా విత్తనాలకు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఈఫొటోలో కన్పిస్తున్న రైతు పేరు పేర్ల రామయ్య. సొంతూరు చివ్వెంల మండలం వట్టిఖమ్మం పహాడ్. ఈ రైతు తనకున్న మూడెకరాలతో పాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. మొత్తం 13 ఎకరాల్లో దాదాపు రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టి పత్తి గింజలు వేశాడు. విత్తనాలు నాటిన నాటి నుంచి ఇప్పటివరకు వర్షం లేక పోవడంతో మొలకెత్తలేదు. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపిండచం లేదు. ఇది జిల్లాలో పత్తి సాగు చేసిన రైతులందరి పరిస్థితికి నిదర్శనం.పత్తి విత్తనాలు మొలకెత్తక రైతుల ఆందోళన ఫ మొలకెత్తిన చోట వర్షాలు లేక వాడుబడుతున్నయ్ ఫ కాపాడుకునేందుకు నానాపాట్లు ఫ వానల కోసం ఆకాశంవైపు ఎదురు చూస్తున్న రైతాంగం -
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
మునగాల : జూలై 9న చేపట్టబోయే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.రాంబాబు కోరారు. బుధవారం మునగాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రామకృష్ణారెడ్డికి సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ అందజేసి మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి వాటి అమలుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. నాలుగు లేబర్ కోడ్లు అమలైతే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో కార్మికుల సమ్మె హక్కుకు సైతం పరిమితులు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని, ఉపాధి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని, కార్మికశాఖ నిర్వీర్యం అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్కోడ్లను రద్దు చేసి కార్మికచట్టాలను అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూరి రాంబాబు, హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు అనంతు మైసయ్య గౌడ్, మండల నాయకులు బి.వీరబాబు, నరేష్, బి.సైదులు తదితరులు పాల్గొన్నారు. ఫ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాంబాబు -
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
భానుపురి (సూర్యాపేట) : ఆరేళ్లుగా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని జీవనంసాగిస్తున్న పేదలకు శాశ్వతంగా పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ కోరారు. బుధవారం ఈ మేరకు సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట ఽసీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించి మాట్లాడారు. చివ్వెంల మండల పరిధిలోని కుడకుడ గ్రామశివారులో గల 126 సర్వేనంబర్‌లో, అలాగే నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్లు 243, 244లో గల ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆక్రమించుకోగా ఎన్నో నిర్బంధాలు, అరెస్టులను ఎదుర్కొని వాటిలో నిరుపేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారని తెలిపారు. ఈ విషయమై అధికారులు విచారణ చేసి గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న అర్హులైన పేదలందరికీ పట్టాలు ఇవ్వడమే కాకుండా వీలైనంత త్వరగా ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విచారణ చేపట్టి అర్హులైన వారికి పట్టాలు ఇచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్, పార్టీ జిల్లా నాయకులు వాస పల్లయ్య, టీయూసీఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ హుస్సేన్, సహాయ కార్యదర్శి గోగుల వీరబాబు, నాయకులు విజయ్, రజాక్, మరియమ్మ, సైదులు, సత్తెమ్మ, శ్యామల తదితరులు పాల్గొన్నారు. -
వీడిన ఉత్కంఠ
సూర్యాపేట : స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ తొలగింది. నేడోరేపో నోటిఫికేషన్ వస్తుందని కొందరు, ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ ఉండకపోవచ్చని మరికొందరు ప్రచారం చేస్తుండగా.. మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతోపాటు గ్రామ పంచాయతీ ఎన్నికలు సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి కానున్నా యి. జిల్లాలో 486 గ్రామపంచాయతీలు, 213 ఎంపీటీసీ స్థానాలు, 23 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. అయితే ఎన్నికల నిర్వహణపై ఓ స్పష్టత రాగా.. రాజకీయ పార్టీలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులతో పాటు ప్రజల్లోనూ ఇక రిజర్వేషన్లపై చర్చ మొదలైంది. ముందుగా సర్పంచ్ ఎన్నికలేనా..? జిల్లా వ్యాప్తంగా గతంలో 475గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా 11పంచాయతీలు ఏర్పడ్డాయి. దీంతో మొత్తం 486 గ్రామపంచాయతీలు అయ్యాయి. అయితే గతేడాది ఫిబ్రవరిలో సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది. తర్వాత జూలైలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, ఈ ఏడాది జనవరిలో మున్సిపాలిటీల పదవీకాలం ముగిసింది. ఈ క్రమంలో ఏడాదిన్నర కాలంగా గ్రామ పంచాయతీల్లో పాలన పడకేసింది. తీవ్ర నిధుల కొరత ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్నిరకాల నిధులు నిలిచిపోయాయి. దీంతో ముందుగా ఈ ఎన్నికలే నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వెంటనే అదే గుర్తులతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను సైతం 20రోజుల వ్యవధిలోనే నిర్వహిస్తారని సమాచారం. ఆశావహుల్లో ఉత్సాహం రాజకీయ పార్టీల్లో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న కోర్టు ఆదేశాలతో రాజకీయ పార్టీలు, ఆశావహులు పోటీకి సై అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయన్న ఆతృతతో ఎదురు చూస్తున్న ఆశావహులకు హైకోర్టు తీర్పు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. జిల్లాలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలతోపాటు, సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీలు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. అయితే రిజర్వేషనన్ ప్రక్రియ ఎలా ఉంటుందోనన్న ప్రధాన చర్చ జిల్లాలో ఇప్పుడు మొదలైంది. బీసీలకు 42శాతం రిజర్వేషనన్ అమలు అవుతుందా..? లేదంటే పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా అన్నది తేలాల్సి ఉంది. ఇదే ఉత్కంఠ ప్రస్తుతం రాజకీయ పార్టీలు, ఆసక్తి ఉన్న అభ్యర్థుల్లో నెలకొంది. అయితే పార్టీలే తాము ఇచ్చే టికెట్లలో 42 శాతం బీసీలకు ఇచ్చే ప్రతిపాదన కూడా వస్తోంది. ఫ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పుతో పల్లెల్లో సందడి ఫ సెప్టెంబర్ 30లోపు నిర్వహించాలని ఆదేశం ఫ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై చర్చ ఫ సన్నద్ధమవుతున్న ఆశావహులు -
డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దాం
భానుపురి (సూర్యాపేట) : మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రజలు యువత విద్యార్థులు కలిసికట్టుగా ముందడుగు వేసి సూర్యాపేటను డ్రగ్‌రహిత జిల్లాగా మారుద్దామని కలెక్టర్ తేజస్‌నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాలను పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ‘అయామ్ యాన్ యాంటీ డ్రగ్ సోల్జర్’ అనే సెల్ఫీ పాయింట్ వద్ద ఎస్పీ నరసింహతో కలిసి ఆయన సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ బారిన ఎవరూ పడకుండా పోలీస్ శాఖ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రతి అధికారి సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటో దిగి మాధ్యమాల్లో యువతకు అవగాహన కలిగేలా విస్తృత ప్రచారంలో అందరూ పాల్గొనాలన్నారు. గురువారం సూర్యాపేటలో జరగే ర్యాలీలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్, ఎస్పీలు కోరారు. -
పారిశుద్ధ్యం ఎలా..
గ్రామ పంచాయతీలకు నిధులు కరువు గురువారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 2025ఫ వానాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో అయోమయం ఫ ఏడాదిన్నరగా పెండింగ్‌లోనే బిల్లులు ఫ ఎన్నికలు జరిగి సర్పంచ్లొస్తే తగ్గనున్న భారం ఫ మరో మూడునెలల వరకు కార్యదర్శులదే బాధ్యతభానుపురి (సూర్యాపేట) : వానాకాలంలో పారిశుద్ధ్య సమస్య తలెత్తనున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణకు పంచాయతీ కార్యదర్శులు పెద్ద ఎత్తున ఖర్చు చేయగా.. నిధులు రాలేదు. ప్రస్తుత వానాకాలంలో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు మళ్లీ నిధులు అవసరం పడతాయి. ఈ నిధులు ఎక్కడినుంచి తేవాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 475 గ్రామ పంచాయతీలకు సంబంధించి సుమారు 2కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల స్థానిక ఎన్నికలు జూలైలోనే ఉండే అవకాశముందని ప్రచారం జరగ్గా.. అధికారులు, కార్యదర్శులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే సెప్టెంబర్ వరకు ప్రభుత్వం, ఎన్నికల సంఘం సమయం కోరడంతో తప్పనిసరిగా కార్యదర్శులే ఈ భారాన్ని మోయాల్సి వస్తుంది. నిధులు లేక.. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైనా ఇప్పటి వరకు వరుణుడి జాడ లేకపోవడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. వర్షాలు పడి ముసురు పెడితే పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతుంది. వీధులన్నీ చిత్తడిగా మారడం, చెత్తాచెదారంతో దోమలు వ్యాపించి అంటువ్యాధులు ప్రబలే అవకాశముంది. ఈ క్రమంలో పంచాయతీలు పారిశుద్ధ్య నిర్వహణకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా బ్లీచింగ్ పౌడర్, దోమల నివారణకు ఆయిల్ బాల్స్, ఫాగింగ్ మందు, మురుగు కాల్వల్లో పూడికతీత, ట్రాక్టర్ మెయింటెనెన్స్, పైప్లైన్ల లీకేజీలకు మరమ్మతులు ఉంటాయి. ఇప్పటికే ప్రభుత్వం వానాకాలం పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించినా.. ఎలాంటి నిధులు కేటాయించలేదు. పంచాయతీ కార్యదర్శులు దుకాణదారుల వద్ద అప్పు తేవాలన్నా.. గతంలో తీసుకొచ్చిన వాటికి బిల్లులు మంజూరు కాకపోవడంతో మళ్లీ ఇచ్చే పరిస్థితి లేకుండాపోయింది. న్యూస్రీల్పెండింగ్లో ఉన్న బిల్లులు సుమారు రూ.2కోట్లు మొత్తం గ్రామ పంచాయతీలు 475ఏడాదిన్నరగా ప్రత్యేక అధికారుల పాలన పారిశుద్ధ్య నిర్వహణకు కావాల్సిన నిధులు ప్రస్తుతం పంచాయతీల వద్ద లేవు. ఏడాదిన్నరగా సాగుతున్న ప్రత్యేకాధికారుల పాలనలో ఇంతవరకూ ఒక్క బిల్లు మంజూరు కాకపోవడమే ఇందుకు నిదర్శనం. అయితే జూన్ నెలాఖరుకు నోటిఫికేషన్ ఇచ్చి జూలై, ఆగస్టులో స్థానిక సంస్థలకు ఎన్నికలు పూర్తవుతాయన్న ప్రచారం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి కూడా మంత్రుల నుంచి ఈ మేరకు పలుమార్లు ప్రకటనలు రావడంతో పంచాయతీ కార్యదర్శులు తమ భారం తగ్గతుందని ఆశపడ్డారు. కానీ సెప్టెంబర్ నాటికి ఎన్నికలు పూర్తయ్యే అవకాశముండడంతో వర్షాలు పడే ఈ మూడునెలలు ఎలా వెళ్లదీయాలోనని మదనపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఒక్కో చిన్న పంచాయతీకి రూ.7లక్షల నుంచి రూ.8 లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.12లక్షల నుంచి రూ.15 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. పంచాయతీలు వసూలు చేసే ఇంటి, నల్లా బిల్లులు సైతం ఏడాదిగా డ్రా చేసుకునే వీలు లేకుండా ఫ్రీజింగ్ చేశారు. దీంతో నిధుల కొరత ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుకుంటున్నారు. -
అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి
సూర్యాపేటటౌన్ : విద్యార్థులు ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభనువెలికి తీయాలని జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ సూచించారు. హకీంపేట, ఆదిలాబాద్, కరీంనగర్ తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూళ్లలో నాలుగో తరగతిలో ప్రవేశాలకు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎంపిక లు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లా నలుమూలల నుంచి 34 మంది బాలురు, 16 మంది బాలికలలు ఎంపికలకు హాజరయ్యారు. వీరికి తొమ్మిది మోటార్ క్వాలిటీ టెస్టులు నిర్వహించారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి 10 మంది బాలురు, 10 మంది బాలికలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో జరిగే ఎంపికకు పంపనున్నట్టు జిల్లా స్పోర్ట్స్ అధికారి జి.రాంచందర్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమములో ఎస్జీఎఫ్సెక్రటరీ ఆజమ్ బాబా, బాక్సింగ్ కోచ్ లోకేష్ రాజ్, వ్యాయామ ఉపాధ్యాయలు పాల్గొన్నారు. -
మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలి
సూర్యాపేటటౌన్ : మాదక ద్రవ్యాల నిర్మూలనకు యువత కృషి చేయాలని ఎస్పీ నరసింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భావితరాలకు మంచి సమాజాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈనెల 26న యాంటీ డ్రగ్ డే ను పురస్కరించుకొని వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జిల్లాలో ఎవరైనా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను వినియోగించినా అక్రమ రవాణా చేసినా రాష్ట్ర పోలీస్ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908కు లేదా, సూర్యాపేట జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ 8712686026కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో జరిగే అవగాహన ర్యాలీలో పౌరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొని యాంటి డ్రగ్ సోల్జర్ గా నమోదు చేసుకోవాలన్నారు. ధర్నాను విజయవంతం చేయాలినూతనకల్ : తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పాని కృష్ణారెడ్డి కోరారు. బుధవారం నూతనకల్ మండల కేంద్రంలో ధర్నా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విద్యను విధ్వంసం చేసే విధానాలను ప్రతిఘటించాలని కోరారు. కార్పొరేటీకరణ, కేంద్రీకరణ, కాషాయీకరణను ప్రోత్సహించే జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇరుగు యాదగిరి, పద్మం మల్లయ్య, పీడీ నాగేందర్, నారాయణదాస్, శ్రీనివాస్, రాములు, ఇరుగు సోమయ్య, వంగపల్లి రమేష్, పులుసు శ్రీనివాస్, యాస రాంకుమార్‌రెడ్డి, ఝాన్సీ, ఎల్లమ్మ, ఉమేష్‌రెడ్డి పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్‌కు ఆహ్వానంహుజూర్నగర్ : హుజూర్నగర్ పట్టణంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న మొహర్రం (పీర్ల పండుగ) కు ముఖ్య అతిథులుగా హాజరు కావాలని కోరుతూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతికి ముజావర్లు బుధవారం హైదరాబాద్‌లో ఆహ్వాన పత్రిక అందజేశారు. వారితో పాటు రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ అసదుల్లా ఖాన్, తదితరులకు ఆహ్వాన పత్రికలు ఇచ్చారు. కార్యక్రమంలో ముజావర్లు ఎస్కే.సైదా, నాగుల్ మీరా, మీరాపాషా, హుజూర్నగర్ గౌడ్ సొసైటీ అధ్యక్షుడు వి.కృష్ణగౌడ్ పాల్కొన్నారు. -
వన మహోత్సవ లక్ష్యం సాధించాలి
భానుపురి (సూర్యాపేట) : వనమహోత్సవ లక్ష్యాన్ని అన్నిశాఖలు సాధించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. ఎన్ఆర్ఈజీఎస్లో వనమహోత్సవం వాటర్ రీచార్జి స్ట్రక్చర్స్, ఇతర అంశాలపై బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలు, ఈసీలు, టీఏలతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, ఈసారి వనమహోత్సవంలో ఈత, తాటి వనాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఎకై ్సజ్, హార్టికల్చర్, ఫారెస్ట్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు వారి పరిధిలోని స్థలాలను గుర్తించి మొక్కలు నాటాలని ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా గ్రామాల్లో కొనసాగుతున్న పనులను పర్యవేక్షించడానికి అధికారులు, బృందాలు రానున్నాయని తెలిపారు. ఎంపీఓలు పంచాయతీలోని టాక్స్ కలెక్షన్ల రికార్డులను పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. డైలీ శానిటేషన్ రిపోర్టును 100శాతం అమలయ్యేలా పనిచేయాలని తెలిపారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ వాల్‌పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వి.వి. అప్పారావు, డీపీఓ యాదగిరి, డిప్యూటీ సీఈఓ శిరీష, డీఎల్పీఓ నారాయణరెడ్డి, ఎస్బీఎం నరేందర్‌రెడ్డి. అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఉక్కుపాదం మోపాలి మాదక ద్రవ్యాల వినియోగంపై జిల్లాలో ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (జూన్ 26) సందర్భంగా విద్యార్థినులకు వ్యాసరచన, స్లోగన్, డ్రాయింగ్, పోస్టర్ మేకింగ్, ముగ్గుల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువతకు మంచి భవిష్యత్తు ఉందని మత్తు పదార్థాలకు బానిస కావొద్దని సూచించారు. ఎవరైనా మత్తు పదార్థాలు వినియోగిస్తున్నట్లు తెలిస్తే 1908 హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేయాలని కోరారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఉద్యోగులు, డాక్టర్లు, విద్యార్థులు, పలు రంగాలకు చెందిన వ్యక్తులు మెడికల్ కాలేజీ నుంచి సద్దల చెరువు వరకు గురువారం జరిగే ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. ఈ సమావేశంలో ఇన్చార్జి డీడబ్ల్యూఓ రూప, అధికారులు హుస్సేన్, చంద్రశేఖర్, వినోద్, సంజీవ్, చైతన్య, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
చివ్వెంల(సూర్యాపేట) : రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌ను చివ్వెల మండల పరిధిలోని జి.తిర్మలగిరి రైతువేదికలో కలెక్టర్ వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించి దిగుబడులు సాధించాలన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలతో పంటలు సాగు చేయాలన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన రైతు భరోసా పంటల సాగు పెట్టుబడులకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మండల ప్రత్యేకాఽధికారి జగదీశ్వర్ రెడ్డి, ఏఓ వెంకటేశ్వర్లు ఏఈఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 15నాటికి భూ దరఖాస్తుల పరిష్కారం భానుపురి (సూర్యాపేట) : భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా జిల్లావ్యాప్తంగా వచ్చిన 44,741 దరఖాస్తులను ఆగస్టు 15నాటికి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ తేజస్‌నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సీఎస్ కే.రామకృష్ణారావు.. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై సమీక్షించడానికి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూర్యాపేట కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రాంబాబు, జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యమివ్వాలని, ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమాలు నిర్వహించి పరిసరాలను పరిశుభ్రం చేయాలన్నారు. టీబీ ముక్త్ భారత్ లో భాగంగా స్క్రీనింగ్ పెంచాలని, అనుమానితులకు ఎక్స్‌రేలు తీసి లక్షణాలు బయట పడితే తక్షణం చికిత్సలు అందజేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వివి అప్పారావు, డీఎఫ్ఓ సతీష్‌కుమార్, డీఏఓ శ్రీధర్ రెడ్డి, డీహెచ్ఓ నాగయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చంద్ర శేఖర్, హౌసింగ్ పీడీ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఫొటొఫైల్నెం:24ఎస్పిటి252ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ బదిలీ
సూర్యాపేట అర్బన్: సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్ బదిలీ అయ్యారు. ఈమేరకు మంగళవారం సీడీఎంఏ నుంచి ఉత్వర్వులు వెలువడ్డాయి. శ్రీనివాస్ హైదరాబాద్‌లోని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో రిపోర్ట్ చేశారు. సూర్యాపేట కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. కాగా సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న హనుమంత రెడ్డి పదోన్నతిపై సూర్యాపేట గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్‌గా రానున్నారు. ఆయన 26న బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. పశువైద్యాధికారులు అందుబాటులో ఉండాలితుంగతుర్తి : వర్షాకాలంలో పశువైద్యాధికారులు.. రైతులకు అందుబాటులో ఉండాలని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పశు వైద్య శాలను తనిఖీ చేసి మాట్లాడారు. పశువులకు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు అందుబాటులో ఉంచి రైతులకు తగిన సలహాలు సూచనలు అందించాలన్నారు. అనంతరం పశు వైద్యశాలలోని రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట సహాయ సంచాలకుడు డాక్టర్ రవి ప్రసాద్, సిబ్బంది బుచ్చిబాబు తదితరులు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు టీజేఎస్ కసరత్తు సూర్యాపేట : రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ జన సమితి(టీజేఎస్) కసరత్తు చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల సబ్ కమిటీ సభ్యుడు కుంట్ల ధర్మార్జున్, నాయకులు గోపగాని శంకర్, రమేష్ తెలిపారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలో టీజేఎస్ నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కమిటీల అధ్యక్ష, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. సమావేశంలో రమాశంకర్, బొడ్డు శంకర్, సర్దార్ హుస్సేన్, రవి, దేవదానం, కరుణాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, నాగేశ్వరరావు, గిరిబాబు, సందీప్, పాపయ్య, వినయ్ గౌడ్, కృష్ణారెడ్డి, సుమాన్నాయక్, సైదానాయక్ పాల్గొన్నారు. హౌస్ వైరింగ్‌లో ఉచిత శిక్షణనల్లగొండ : ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ నిరుద్యోగులకు హౌజ్ వైరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నల్లగొండలోని ఎస్బీఐ ఆర్సెటీ డైరెక్టర్ ఇ.రఘుపతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాకు చెందిన నిరుద్యోగులు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 31 రోజుల ఉండే శిక్షణకు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. 19 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణులైన నిరుద్యోగ గ్రామీణ యువకులు అర్హులని తెలిపారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నాం
ఫ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఫ ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు ఏర్పాటు చేశాం ఫ హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా 10బెడ్ల చొప్పున కేటాయించాం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ వివిధ శాఖల అధికారుల సహకారంతో.. జిల్లాలో వివిధ శాఖల అధికారుల సహకారంతో సీజనల్ వ్యాధులు ప్రబల కుండా చర్యలు తీసుకుంటున్నాం. మే 30న కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ జిల్లా పంచాయతీరాజ్, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా విద్యాశాఖ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మురుగు గుంతల్లో మట్టి పోయించడం, డ్రెయినేజీలను శుభ్రం చేయించడం వంటివి వెంటనే చేపట్టాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మంచినీటి సరఫరా విషయంలో అప్రమత్తంగా ఉండాలని, మంచినీళ్లు కలుషితం కాకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశాలిచ్చారు. పాఠశాలల్లో విద్యార్థులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారికి సూచనలు చేశారు. ఆయా శాఖల అధికారుల సమన్వయంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా, మండల స్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు జిల్లా, మండల స్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశాం. ఈ టీమ్‌లలో ఫిజీషియన్, పీడియాట్రిక్ డాక్టర్లతో పాటు మరో ఇద్దరు వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఇతర సిబ్బంది ఉంటారు. జిల్లాలో ఎక్కడైనా విషజ్వరాలు, ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలినట్లు సమాచారం వస్తే వెంటనే ఆ టీమ్‌లు అక్కడికి చేరుకొని వైద్య సేవలను అందిస్తాయి. అక్కడ వ్యాధులు ఎలా ప్రబలాయి అనే విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాయి. వెంటనే టెస్టింగ్‌లు చేసి వారికి మందులు అందజేస్తాయి. అందుబాటులో టెస్టింగ్ కిట్లు జిల్లాలో సీజనల్ వ్యాధుల్లో భాగంగా డెంగీ, మలేరియా, ఇతర వైరల్ ఫీవర్‌ను తెలుసుకునేందుకు టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. డెంగీకి 28,701 ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే మలేరియాకు సంబంధించి ర్యాపిడ్ టెస్ట్ కిట్లు 38,717 ఉన్నాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అన్ని పీహెచ్‌సీలు, పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాల్లో అత్యవసరమైన మందులు సైతం అందుబాటులో ఉన్నాయి. 58,600 ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయి. దోమల నివారణకు మురుగు కాల్వల్లో పైరాత్రమ్ లిక్విడ్, ఆబేగ్ ట్యాబ్లెట్లను వేయాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాం. ప్రత్యేకంగా బెడ్లు రిజర్వ్‌లో ఉంచాం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో జిల్లాలోని హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రిలో 10 బెడ్లు, కోదాడ ఏరియా ఆస్పత్రిలో పది బెడ్లు, సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 10బెడ్ల చొప్పున అందుబాటులో ఉంచాం. అత్యవసర సమయంలో వాటిని వినియోగిస్తాం. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన వైద్య సేవలందిస్తాం. ప్రతి శుక్రవారం డ్రైడే ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని, దోమలకు ఆవాసాలైన నీటి గుంతలు, తొట్లు, కుండలు, చెడిపోయిన కూలర్లు, ఖాళీ కొబ్బరి బోండాలు, పాత టైర్లలో నిలిచిన నీటిని పారబోయించేలా అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్లి ఎవరైనా జ్వరం, ఇతర వ్యాధులతో బాధపడుతున్నారా అనే వివరాలను తెలుసుకొని వారికి అవసరమైన మందులు అందిస్తున్నాం. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి వర్షాకాలం ప్రారంభం కావడంతో ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. ఆహార పదార్థాలపై ఈగలు, దోమలు వాలకుండా మూతలు పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని వడబోసుకొని తాగాలి. వేడి వేడి పదార్థాలు తినాలి. అనారోగ్యానికి గురైతే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్యా కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. -
ఇసుక ఉచితమే..
ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం ఎక్కడ ఉంటే అక్కడి నుంచి.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమకు సమీపంలో వాగులు, వంకలు, చెరువులు, చెక్ డ్యాంలు ఇలా ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడి నుంచి ఇసుక పొందడానికి అవకాశం కల్పించారు. అంతకు ముందు కలెక్టర్ ఇసుక లభ్యత ప్రాంతాలపై సర్వే చేయించి వాటిని గుర్తించారు. లబ్ధిదారులకు అనుకూలమైన ప్రాంతం నుంచి ఇసుకను తీసుకెళ్లడానికి ప్రస్తుతం అవకాశం కల్పిస్తున్నారు. స్థానిక వాగుల్లో ఇసుక లేనట్లయితే క్వారీల నుంచి కూడా తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. స్థానిక మండలంలో ఇసుక లేకపోతే పక్క మండలం నుంచి తీసుకోవచ్చు. సూర్యాపేట : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా లబ్ధిదారులపై ఆర్థికభారం పడకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో జిల్లాలో 4,322 మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలగనుంది. ఇసుక రవాణా చార్జీలు మాత్రం లబ్ధిదారులే భరించాల్సి ఉంటుంది. జిల్లాలో 4,322 ఇళ్లు మంజూరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా పేదల సొంటికలను నెరవేర్చడానికి పూనుకుంది. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి చర్యలు చేపట్టింది. ఈనేపథ్యంలో గృహ నిర్మాణశాఖను బలోపేతం చేసింది. జిల్లా వ్యాప్తంగా 4,322 ఇళ్లు మంజూరు చేసింది. అందులో మొదటి విడతలో 1,210 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఇంటికి 6 నుంచి 10 కూపన్లు.. ఒక్కో ఇంటి నిర్మాణానికి కనీసం 6 నుంచి 10 ట్రాక్టర్ల ఇసుక అవసరమవుతుందని గృహ నిర్మాణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం ఇసుకను అధికారుల అనుమతి ద్వారా తెచ్చుకోవాలి. తొలుత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక అవసరమైతే పంచాయతీ కార్యదర్శులు ధ్రువీకరిస్తారు. పని జరిగింది లేనిది క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత అనుమతి ఇస్తారు. వీరిచ్చేధ్రువీకరణ పత్రాలతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే తహసీల్దార్ అనుమతి కూపన్లు అందజేస్తారు. ఈ కూపన్ల ఆధారంగా లబ్ధిదారు తమకు అనుకూలంగా ఉన్న చోట నుంచి ఇసుకను తెచ్చుకోవచ్చు. మొదట ఆరు కూపన్లు జారీ చేస్తారు. తర్వాత అవసరాన్ని బట్టి ఇసుక ఇస్తారు. మార్కెట్లో ఇసుక ధరను బట్టి చూస్తే రూ.25వేల నుంచి 30 వేల వరకు ఆదా అవుతాయి. లబ్ధిదారులకు తప్పనున్న ఆర్థికభారం ఫ రూ.30వేల నుంచి రూ.40 వేల వరకు ఆదా ఫ రవాణా ఖర్చులు మాత్రం భరించాల్సిందే.. ఫ తొలివిడతలో నిర్మాణ దశలో 1,210 ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు ప్రయోజనకరం లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా అందజేస్తాం. క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శి పరిశీలించి ధ్రువీకరణ పత్రం అందజేస్తే దాన్ని తహసీల్దార్ పరిశీలించి లబ్ధిదారులకు అనుకూలంగా ఉన్న వాగులు, వంకల నుంచి లేకపోతే ఇతర మండలాల్లో గుర్తించిన ప్రదేశాల నుంచి ఇసుకను తీసుకెళ్లడానికి అనుమతి ఇస్తూ కూపన్లను జారీ చేస్తారు. ఇది లబ్ధిదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. – ధర్మారెడ్డి, హౌసింగ్ పీడీ ఇందిరమ్మ ఇళ్ల వివరాలు మొత్తం మంజూరైన ఇళ్లు 4,322 తొలివిడత పనులు ప్రారంభమైనవి 1,210వీటిలో బేస్మెంట్ లెవల్ 796వాల్ లెవల్ 276 స్లాబ్ లెవల్ 106 -
కార్యకర్తలకు అండగా ఉంటా
తుంగతుర్తి : కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు అండగా ఉంటానని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. మంగళవారం తుంగతుర్తిలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిని అద్దంకి దయాకర్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేస్తాన్నారు. తనకు రాజకీయ ఓనమాలు నేర్పిన ప్రాంతం తుంగతుర్తి అని, ఈ ప్రాంతాన్ని ఎప్పటికీ మర్చిపోనని స్పష్టం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కరడుగట్టిన కాంగ్రెస్ వాది మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అని పేర్కొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన తనకు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి తండ్రిలా అండగా నిలిచారని గుర్తు చేశారు. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ అద్దంకి దయాకర్ తన కొడుకు లాంటివాడని, కాంగ్రెస్ పార్టీకి దయాకర్ సేవలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. మున్ముందు మంత్రి పదవితో పాటు ఉన్నతమైన పదవులను దయాకర్ అధిరోహించాలని ఆకాంక్షించారు. త్వరలో దయాకర్‌కు పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం దామోదర్ రెడ్డిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. వారి వెంట ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, నాయకులు గుడిపాటి నర్సయ్య, దొంగరి గోవర్దన్, కొండ రాజు, పెండెం రామ్మూర్తి, రామడుగు నవీన్ చారి, అనిల్ క్యాస్ట్రో, టైగర్ వెంకన్న, ప్రభు తదితరులు ఉన్నారు.ఫ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ -
మూడంచెల్లో ప్రగతి పరిశీలన
కనీస సామర్థ్యాలు సాధించేలా.. ఎస్సీఈఆర్టీ ఆదేశానుసారం జిల్లాలో పకడ్బందీగా బేస్ లైన్ పరీక్ష నిర్వహిస్తాం. విద్యార్థుల ప్రగతికి ఈ పరీక్షలు కొలమానంగా నిలుస్తాయి. బేస్‌లైన్ పరీక్షల ఆధారంగా కనీస సామర్థ్యాలు లేని విద్యార్థులను గుర్తిస్తాం. వీరు 45 రోజుల ప్రత్యేక కార్యాచరణ ద్వారా కనీస సామర్థ్యాలు సాధించేలా చూస్తాం. జిల్లాలో ఆగస్టు31 నాటికి విద్యార్థులందరికీ వంద శాతం కనీస సామర్థ్యాలు సాధించేలా చర్యలు చేపట్టాం. – దేవరశెట్టి జనార్దన్, జిల్లా కోఆర్టినేటర్ ఫర్ క్వాలిటీ ఎడ్యుకేషన్తిరుమలగిరి(నాగారం) : తరగతిలో చేరినప్పటి నుంచి విద్యా సంవత్సరం ముగిసే వరకు 1 నుంచి 9 తరగతుల విద్యార్థుల ప్రగతిని పరిశీలించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందుకుగాను అభ్యసన సామర్థ్యాలపై మూడంచెల్లో (ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపీ, బేస్‌లైన్) పరీక్షలు నిర్వహించనుంది. ప్రధానమైన బేస్‌లైన్ పరీక్షను బుధవారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) నుంచి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. సంబంధిత ప్రశ్నాపత్రాలను తరగతుల వారీగా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి అందజేశారు. ఆయా పరీక్షల మూల్యాంకన వివరాలను జూలై 15 నాటికి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో అప్లోడ్ చేయనున్నారు. సామర్థ్యాన్ని అనుసరించి ప్రణాళిక విద్యా సంవత్సరం ఆరంభంలో బేస్‌లైన్ పరీక్షను తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లోని అంశాలపై నిర్వహిస్తారు. ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షిస్తారు. ఫలితాల ఆధారంగా వారిని ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజిస్తారు. వెనుకబడిన వారికి ప్రత్యేక ప్రణాళిక ప్రకారం బోధన చేపడతారు. కరోనా తర్వాత విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు ప్రత్యేక బోధనా ప్రణాళికలుంటాయి. 6 నుంచి 9 తరగతుల వారికి లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (లిప్) కార్యక్రమాన్ని చేపడతారు. నవంబర్ 25 నుంచి 30వరకు రెండో (మిడ్ లైన్), విద్యా సంవత్సరం ముగింపున మార్చి5 నుంచి 7వరకు చివరి (ఎండ్‌లైన్ ) పరీక్షలుంటాయి. ఫలితాల ఆధారంగా విద్యార్థుల అభ్యసనను మెరుగుపరిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఇదే సమయంలో విద్యార్థుల ప్రగతి తీరుపై తల్లిదండ్రులతోనూ సమావేశాలు నిర్వహిస్తారు. ఫ నేటి నుంచి 30వ తేదీ వరకు విద్యార్థులకు అభ్యసన సామర్థ్య పరీక్షలు ఫ ఎస్సీఈఆర్టీ మార్గదర్శకాలు జారీ ఫ మూల్యాంకన వివరాలు స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో అప్లోడ్ -
మార్పు కోసమే జరిమానాలు
ఫ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని జాగ్రత్తగా ఉండాలి ఫ ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సులో ఎస్పీ నరసింహ సూర్యాపేటటౌన్ : వాహనాలకు జరిమానాలు విధించడం అనేది మార్పుకోసమేనని, తప్పుల నుంచి మంచి పాఠాలు నేర్చుకొని జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించారు. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లమని ఆటోడ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆటో డ్రైవర్లు వాహనాలు కండిషన్లో ఉంచుకోవాలని, వాహనాలు నడిపేటప్పుడు సౌండ్ బాక్స్‌లు వినియోగించొద్దన్నారు. ప్రతి ఒక్కరూ లైసెన్సు, వాహన రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని, నిబంధనల ప్రకారం డ్రైవర్ దుస్తులు ధరించి వాహనాలు నడపాలన్నారు. వ్యక్తిగత క్రమశిక్షణ, వ్యక్తిగత ఆత్మాభిమానం ఉన్నప్పుడే ఇతరుల పట్ల మర్యాదగా ఉండగలమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర పోలీస్ యాంటి నార్కోటిక్ బ్యూరో ఆదేశాల మేరకు జిల్లాలో డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాల నివారణకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం యాంటీ డ్రగ్స్ సోల్జర్ ఫ్లెక్సీ తో ఆటో డ్రైవర్లతో కలిసి ఎస్పీ, ఆర్టీఓ సెల్ఫీ ఫొటోలు దిగి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి సురేష్‌రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, సిబ్బంది, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. సదస్సుకు హాజరైన ఆటో డ్రైవర్లు -
ఇరాన్‌పై యుద్ధాన్ని ఆపాలి
సూర్యాపేట అర్బన్ : ఇరాన్‌పై అమెరికన్ సామ్రాజ్యవాదులు చేస్తున్న యుద్ధ దాడిని ఆపాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ డిమాండ్ చేశారు. ఇరాన్‌పై అమెరిక, ఇజ్రాయిల్ దాడులకు వ్యతిరేకంగా సోమవారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకుడు కారింగుల వెంకన్న, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్ కుమార్, నాయకులు పేర్ల నాగయ్య, సూరం రేణుక, ఎస్కె.సయ్యద్, ఐతరాజు వెంకన్న, శేషగిరి, ఐతరాజు పద్మ, కల్పన, పజ్జూరి రేణుక, అరుణ, పీవైఎల్ నాయకులు కట్ట రమేష్ పాల్గొన్నారు. -
బడుల పర్యవేక్షణకు టీచర్లు
సూర్యాపేటటౌన్ : రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు పలు మార్పులు తీసుకొస్తోంది. విద్యావ్యవస్థను గాడిలో పెట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు ఉన్న వ్యవస్థకు అదనంగా ఉపాధ్యాయులతోనే పాఠశాలలు తనిఖీలు చేయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక పాఠశాలలను ఎస్జీటీలతో, యూపీఎస్, ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లతో తనిఖీలు చేయనున్నారు. దీనిపై ఉపాధ్యాయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయుల సంఖ్యలో 2శాతం మందిని నియమించే యోచనజిల్లాలో 182 జెడ్పీ ఉన్నత పాఠశాలలు, 78ప్రాథమికోన్నత , 690ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 3,790 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. అయితే జిల్లాలో పని చేస్తున్న మొత్తం ఉపాధ్యాయుల్లో రెండు శాతం మందిని తనిఖీ అధికారులుగా నియమించాలనే నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఉపాధ్యాయులను తనిఖీ అధికారులుగా నియమించడం సరికాదంటున్నారు. ఏడాదిపాటు టీచర్లను బోధనకు దూరం చేసి తనిఖీ అధికారులుగా నియమిస్తే విద్యార్థులకు నష్టం కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు.రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ ఫ విద్యావ్యవస్థలో పెను మార్పులు తీసుకురావాలని సర్కారు యోచన ఫ ఈ ప్రకటనతో ఉపాధ్యాయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు -
ప్రజల గుండెల్లో నిలిచిన మహానేత వైఎస్సార్
కోదాడరూరల్ : అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో నిలిచిన మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి అని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి కొనియాడారు. సోమవారం కోదాడ పట్టణ పరిధిలోని గుడిబండ రోడ్డులో గల గోపిరెడ్డినగర్ వద్ద రైతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, రాజీవ్ఆరోగ్య శ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్, 108, వికలాంగులు, వృద్ధులకు పింఛన్ల వంటి అనేక సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ఆ పథకాలతోనే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో రెండో సారి అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప నాయకుడని అన్నారు. ఆయన ఆశయాలను కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందని తెలిపారు. విగ్రహం ఏర్పాటు చేసినవారిని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ కౌన్సిలర్లు కందుల కోటేశ్వరరావు, కొల్లా లక్ష్మీప్రసన్న కొటిరెడ్డి, వాచేపల్లి వెంకటేశ్వరరెడ్డి, అంచూరి వెంకట్‌రెడ్డి, పిన్నపురెడ్డి వీరారెడ్డి, కొనగళ్ల నారాయణరెడ్డి, రెడ్డిమళ్ల వెంకట్‌రెడ్డి, గాయం బ్రహ్మారెడ్డి ఉన్నారు. ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి -
బాధితులకు భరోసా కల్పించాలి
సూర్యాపేటటౌన్ : పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సెంటర్, ఫిర్యాదుల నిర్వహణ సిబ్బందికి, పోలీస్ స్టేషన్ సెక్షన్ ఇన్చార్జిలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. సమాజంలో పోలీస్ యూనిఫాంకు ప్రత్యేకత ఉందని, సిబ్బంది క్రమశిక్షణతో ఉండి ప్రజలు, పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులను గౌరవిస్తూ గర్వంగా పని చేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా పని చేస్తే సమాజంలో పోలీస్ శాఖపై నమ్మకం పెరుగుతుందన్నారు. ఆ దిశగా సిబ్బంది టీం వర్క్ చేయాలన్నారు. పోలీస్ విధుల్లో అత్యంత ప్రధానమైంది పోలీస్ స్టేషన్ రిసెప్షన్ విధులు, ఫిర్యాదుల నిర్వహణ అని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా విధిధర్మంతో వారికి కావాల్సిన సహాయాన్ని అందించాలని, వారితో మర్యాదగా మెలగాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో నమోదు చేసి రశీదు ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలు పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, డీసీఆర్బీ హరిబాబు, ఐటీకోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్, రిసెప్షన్ పని విభాగం కో ఆర్డినేటర్ మహిశ్వర్, టెక్నికల్ టీం, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ నరసింహ -
విద్యాభివృద్ధికి తిరోగమన చర్య
పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతను ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లకు అప్పగించడం సరైంది కాదు. విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులను ప్రైవేట్ వైపు మళ్లించడానికి చేస్తున్న చర్యగానే చూడాలి. ఎందుకంటే పాఠశాలల్లో పని చేస్తున్న ఎస్జీటీలను, స్కూల్ అసిస్టెంట్లను పర్యవేక్షణ అధికారులుగా నియమించి అక్కడ విద్యాబోధన చేయడానికి టీచర్లు లేకుండా చేయడమే. దాంతో పిల్లలు ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతారు. అంతేగాక ఒకే స్థాయి ఉన్న టీచర్ల మీదనే కాకుండా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల మీద పర్యవేక్షణ చేయడం ద్వారా విద్యా వ్యవస్థ మరింత దిగజారడానికి కారణమవుతుంది. అనాలోచిత చర్యలను విరమించుకొని పర్యవేక్షణ అధికారులైన ఎంఈఓలను, డిప్యూటీ డీఈఓలను, రెగ్యులర్ డీఈఓలను నియమించాలి. – పబ్బతి వెంకటేశ్వర్లు, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
రైతు భరోసా
రైతులతో మాట్లాడనున్న సీఎం హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వీడియో కాన్పరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడనున్నారు. రైతు వేదికల్లో మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించే వీడియో కాన్పరెన్స్‌లో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. జిల్లాలోని 93 రైతు వేదికల ద్వారా రైతులు ప్రత్యక్షంగా వీక్షించే ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. జిల్లాలోని 93 రైతు వేదికల పరిధిలోని రైతులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని పేర్కొన్నారు. ప్రతి రైతు వేదికకు ఒక నోడల్ అధికారిని నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. -
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాత సేవ, నిత్యహోమం, పంచామృతాభిషేకం, ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం చేపట్టారు. కల్యాణవేడుకలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గరుడవాహనంపై శ్రీస్వామివారిని ఆలయ తిరుమాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కాగా క్షేత్రంలోని శివాలయంలోగల శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామికి ఏకా దశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్ కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, దుర్గాప్రసాద్‌శర్మ పాల్గొన్నారు.ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా సుధాకర్సూర్యాపేట : ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా బత్తుల సుధాకర్ ఎన్నికయ్యారు. ఈనెల 21, 22 తేదీలో ఖమ్మం పట్టణంలో నిర్వహించిన స్టాఫ్వర్కర్స్ ఫెడరేషన్ 4వ రాష్ట్ర మహాసభలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని విమర్శించారు. కార్మిక వర్గం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.దేశ సమగ్రతకు కృషి చేసిన విద్యావేత్త శ్యామ్ప్రసాద్తాళ్లగడ్డ(సూర్యాపేట): దేశ సమగ్రత కోసం కృషి చేసిన విద్యావేత్త డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి కొనియాడారు. సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బూర శకుంతల ఆధ్వర్యంలో స్థానిక రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మొక్కల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ చాన్స్‌లర్‌గా నియమితులై విద్యారంగంలో నూతనోత్సాహాన్ని తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్ బూర మల్సూర్‌గౌడ్, జల్లా జనార్దన్, బీజేపీ నాయకులు కడియం రామచంద్రయ్య, జుట్టుకొండ సత్యనారాయణ, చల్లమల నరసింహ, రుక్మారావు, మన్మథరెడ్డి, గజ్జల వెంకటరెడ్డి, మహేష్, లింగారెడ్డి, కాశయ్య, ఫణినాయుడు, రవి, తాళ్ల నరేందర్‌రెడ్డి, శోభారెడ్డి, మౌనిక, దాసరి వెంకన్న, బైరు విజయ్‌కృష్ణ, వర్మ, గణేష్ పాల్గొన్నారు. -
రెగ్యులర్ ప్రాతిపదికన ఉంటే ఇంకా బాగుంటుంది
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పీఆర్టీయూ ఎప్పుడూ సమర్థిస్తుంది. పాఠశాలల్లో పర్యవేక్షణ ఉండడం ఆహ్వానించదగ్గ పరిణామమే. దీని ద్వారా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ పర్యవేక్షణ రెగ్యులర్ అధికారుల పోస్టులను భర్తీ చేయడం ద్వారా చేస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. విద్యా ప్రమాణాలు కూడా పెరగడానికి దోహద పడుతుంది. సర్వీసు రూల్స్ రూపకల్పన చేసి రెగ్యులర్ డీఈఓ, డిప్యూటీ డీఈఓ, మండల విద్యాధికారుల పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – తంగెళ్ల జితేందర్‌రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు● -
ఏఓ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా
మఠంపల్లి: మఠంపల్లిలోని మండల వ్యవసాయ కార్యాలయం సోమవారం మధ్యాహ్నం 12గంటల వరకు తెరుచుకోలేదు. దీంతో వివిధ పనుల నిమిత్తం వచ్చిన రైతులు ఆందోళనకు దిగారు. రైతు భరోసా, పట్టాదారు పాస్‌బుక్ వివరాల నమోదు, ఎరువులు, విత్తనాల స్లిప్పుల కోసం వ్యవసాయ కార్యాలయానికి వస్తే అధికారులు అందుబాటులో ఉండడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోందని గ్రహించిన ఏఈఓలు శ్రావ్యాంజలి,త్రివేణిలు అక్కడికి చేరుకుని ఆటోలో వస్తుండగా తమ వద్ద ఉన్న తాళంచెవిపోయిందని తెలిపారు. దీంతో తాము ఉదయం నుంచి కార్యాలయం బయటనే ఉన్నామని చెప్పారు. మధ్యాహ్నం వరకు కూడా కార్యాలయం తెరవడానికి ఎందుకు ప్రయత్నించలేదని రైతులు ఆగ్రహించారు. దీంతో ఏఈఓలు.. రైతుల సహకారంతో కార్యాలయం తాళాన్ని దగ్గరుండి పగులగొట్టించారు. అనంతరం కార్యాయంలో విధులు నిర్వహించారు. ఇంతజరిగినా కార్యాలయం వైపునకు వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రాలేదు. కానీ రైతులు తమకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పీఏసీఎస్ కార్యాలయంలో సిద్ధంగా ఉన్నాయని, రైతులు సబ్సిడీపై కొనుగోలుచేసుకోవాలన్న సమాచారాన్ని వాట్సప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. వ్యవసాయ సీజన్లో అందుబాటులో ఉండాల్సిన అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఉన్నతాధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. మధ్యాహ్నం 12 గంటల వరకు తెరుచుకోని మఠంపల్లి మండల వ్యవసాయ అధికారి కార్యాలయం అధికారుల తీరుపై కర్షకుల ఆగ్రహం ఆటోలో తాళంచెవి పోవడంతో తెరువలేకపోయామన్న ఏఈఓలు రైతుల సహకారంతో కార్యాలయ తాళం పగులగొట్టి విధులకు.. -
ఉపాధ్యాయులకు తనిఖీల బాధ్యతలు అప్పగించొద్దు
సూర్యాపేటటౌన్ : రాష్ట్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పనితీరును పర్యవేక్షించడానికి ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను పర్యవేక్షణ అధికారులుగా నియమించి బాధ్యతలు అప్పగించడం సరికాదని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పబ్బతి వెంకటేశ్వర్లు, వేణు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని నంబర్– 2 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఓ వైపు ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో విద్యా ప్రమాణాలకు చర్యలు తీసుకుంటామని చెబుతూనే ఇలాంటి చర్యలకు తీసుకోవడం అనాలోచితమైన చర్యగా పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు సీహెచ్ వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, రమణ, సింహాద్రి, క్రాంతి కుమార్, వెంకటయ్య, యాదగిరి, లింగయ్య, ప్రభాకర్, దేవేందర్, నాగన్న పాల్గొన్నారు. -
ముఖం చూపిస్తేనే సరుకులు
నాగారం : అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు పారదర్శకంగా సరుకులు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్ ) తీసుకొచ్చింది. సరుకులు పక్కదారి పట్టకుండా ముఖ గుర్తింపుతోనే అందజేస్తారు. గతంలో అంగన్వాడీ లబ్ధిదారులకు అందించే సరుకుల విషయంలో జాబితాలో పేర్లు ఒకరివి ఉంటే.. మరొకరికి సరుకులు ఇస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ పద్ధతికి స్వస్తి పలికేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ నుంచి ఆదేశాలు రావడంతో జిల్లాలో ఈ విధానం అమలుకు ఐసీడీఎస్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జూలై–1 నుంచి అంగన్వాడీ టీచర్లకు గతంలో అందజేసిన ఫోన్లలో పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా ఈ ముఖ గుర్తింపు విధానాన్ని అమలు చేయనున్నారు. దీనికి అనుగుణంగా యాప్‌ను అప్డేట్ చేశారు. మూడేళ్లలోపు చిన్నారులకు.. ప్రస్తుతం ముఖ గుర్తింపు విధానం 6 నెలల వయసు నుంచి 3ఏళ్ల లోపు చిన్నారులకు పంపిణీ చేసే అదనపు ఆహారమైన బాలామృతం, గుడ్లు పంపిణీకి మాత్రమే వర్తిస్తుంది. పోషణ్ ట్రాకర్ యాప్‌లో చిన్నారి లేదా తల్లి ఫొటో తీస్తారు. ఆధార్ కార్డులో ఉన్న వివరాలను పొందుపరుస్తారు. అలాగే 3ఏళ్లు దాటిన చిన్నారులకు ఇంటికి ఇచ్చే పోషకాహారాన్ని తల్లి ఫొటోను యాప్‌లో నమోదు చేసి పంపిణీ చేస్తారు. దీంతో పోషకాహారం పంపిణీ ఏమేర జరుగుతోందో అనే దానిపై జిల్లా, రాష్ట్రస్థాయి అధికారుల పర్యవేక్షణ సులువు కానుంది. కాగా జిల్లాలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా పోషణ్ ట్రాకర్ ద్వారా యాప్‌లో నమోదు చేస్తున్నారు. కాగా జూలై 1 నుంచి అధికారికంగా అమల్లోకి రానుంది. ప్రస్తుతానికి నమోదు ఒక్కటే అయినప్పటికీ రానురాను ముఖగుర్తింపును విస్తరింపజేయనున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే ఆహారానికి కూడా ముఖ గుర్తింపు తప్పనిసరి చేయనున్నారు. ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో.. జిల్లాలోని 5 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,209 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు కలిపి54,683 మంది నమోదై ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు. సరుకులు అసలైన లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాల్లో ముఖ గుర్తింపు హాజరును ప్రవేశపెట్టారు. ఫ అంగన్వాడీల్లో ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం ఫ జూలై 1 నుంచి అమలుకు సన్నాహాలు ఫ సరుకులు పక్కదారి పట్టకుండా కొత్త విధానం పారదర్శకత కోసమే.. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్‌ఆర్‌ఎస్‌తో లబ్ధిదారులకు పారదర్శంగా సరుకులు అందుతాయి. ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం ద్వారా 6నెలల నుంచి 3ఏళ్లలోపు చిన్నారులకు అందిస్తున్న టేక్ హోమ్ రేషన్‌ను నిర్ధారణ పూర్వకంగా లబ్ధిదారులకు అందుతుంది. వచ్చే నెల నుంచి లబ్ధిదారులకు అందజేసే సరుకులను ఎఫ్‌ఆర్‌ఎస్‌లో నమోదు చేస్తారు. – నర్సింహారావు, జిల్లా సంక్షేమ అధికారి, సూర్యాపేట. జిల్లాలో ఇలా... ఐసీడీఎస్ ప్రాజెక్టులు 05అంగన్వాడీ కేంద్రాలు 1,209చిన్నారుల సంఖ్య 45,177గర్భిణులు 5,220బాలింతలు 4,286 -
పక్కాగా ఎకో క్లబ్‌లు
విద్యార్థి దశ నుంచే పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ నిర్ణయం సూర్యాపేటటౌన్ : పచ్చదనం పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా మొక్కల ప్రాధాన్యంతోపాటు వివిధ అంశాలపై విద్యార్థి స్థాయి నుంచే అవగాహన కల్పించేందుకు కేంద్ర విద్యా శాఖ చర్యలు చేపట్టింది. పర్యావరణ సంబంధిత కార్యకలాపాల నిర్వహణలో విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం ఎకో క్లబ్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ క్లబ్‌లను ఈ విద్యాసంవత్సరం నుంచి ‘ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్’గా పిలవనున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లోనూ కొత్త క్లబ్‌ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది ఇవి ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడంతో ఈ సంవత్సరం పకడ్బందీగా నిర్వహించేలా జిల్లా అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. వచ్చే నెలాఖరులోగా.. వచ్చేనెల 29 వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఎకో క్లబ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16 నుంచి ఈ ప్రకియ మొదలుపెట్టారు. ప్రతి తరగతి నుంచి చురుగ్గా ఉన్న నలుగురు లేదా ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసి టీచర్లను, పాఠశాల కమిటీ చైర్మన్‌ను క్లబ్లో భాగస్వాములు చేయనున్నారు. పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉపాధ్యాయులు ఇందులో సభ్యులుగా ఉండాలి. ప్రధానోపాధ్యాయుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఏడు అంశాలకు సంబంధించిన యాక్టివిటీ ఫొటోలు, వీడియోలు తీసి ప్రత్యేక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ప్రతి స్కూల్ నుంచి ఒక కమిటీ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 950, మోడల్ స్కూల్స్ తొమ్మిది, కేజీబీవీలు 19, నాలుగు మినీ గురుకులాలు, ఎనిమిది రెసిడెన్షియల్స్ స్కూల్స్, 398 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో లక్ష మందికిపైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో ప్రతి పాఠశాల నుంచి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచ ప్రజా ఉద్యమంగా చేపట్టిన ఏడు అంశాల్లో ఎకో క్లబ్‌లను భాగస్వామ్యం చేస్తారు. ఏడు అంశాలు ఇవే.. ఇంధన పొదుపు నీటి పొదుపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దు సుస్థిర ఆహార వ్యవస్థ వృథాను అరికట్టడం ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడం వ్యర్థాల రీసైక్లింగ్ ఫ గతేడాది ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడంతో ఈసారి పక్కాగా చేపట్టేందుకు కార్యాచరణఫ జూలై 29లోపు కమిటీలు వేయాలని ఆదేశం ఫ ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ పేరుతో ఏడు అంశాలపై ప్రచారం ఫ ప్రతి పాఠశాల నుంచి ఒక కమిటీ ఏర్పాటు అన్ని స్కూళ్లలో ఎకో క్లబ్‌లు ఏర్పాటు చేయాలి పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఎకో క్లబ్‌లు ఎంతో ఉపయోగపడతాయి. అన్ని స్కూళ్లలో క్లబ్‌లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే హెచ్ఎంలకు ఆదేశాలు జారీ చేశాం. కేటాయించిన అంశాల వారీగా ఏడాదిపాటు కార్యక్రమాలు నిర్వహించాలి. రోజూ నిర్వహించే కార్యక్రమాల ఫొటోలు, వీడియోలను ప్రత్యేక పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. – దేవరశెట్టి జనార్దన్, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ పాఠశాలల వివరాలు ప్రభుత్వ పాఠశాలలు 950 మోడల్ స్కూల్స్ 9 కేజీబీవీలు 19 మినీ గురుకులాలు 4 రెసిడెన్షియల్స్ స్కూల్స్ 8 ప్రైవేట్ పాఠశాలలు 398 విద్యార్థుల సంఖ్య : లక్ష మందికిపైగా -
తాగి నడిపితే జైలుకే!
సూర్యాపేటటౌన్ : మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాగి నడిపేవారిని ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు కృషి చేస్తున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయకుండా రోడ్డు ప్రమాదాల నివారణకు పాటు పడాలని పోలీసులు అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. అయినా కొంతమంది మత్తులో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. ఈ ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎక్కడికక్కడ డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. పట్టుబడిన వారికి జరిమానాలతో పాటు జైలు శిక్షలు సైతం విధిస్తున్నారు. ఇటీవల ఎస్పీ పలు పోలీస్ స్టేషన్లకు అత్యాధునిక బ్రీత్ ఎనలైజర్లు పంపిణీ చేశారు. 200 పాయింట్లు దాటితే జైలు శిక్ష డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడిన వారిల్లో ఎక్కువగా యువతే ఉంటున్నారు. ఒక్కోసారి పిల్లలు చేసిన తప్పులకు తల్లిదండ్రులు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. సమాజంలో సైతం చెడు పేరు తెచ్చుకునే పరిస్థితి తలెత్తుతోంది. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన వారికి బ్రీత్ అనలైజర్‌తో టెస్టులు నిర్వహించి పాయింట్ల ఆధారంగా జరిమానాలు విధిస్తున్నారు. 50 నుంచి 100 పాయింట్ల వరకు రూ.వేయి వరకు జరిమానా, 100 నుంచి 200 పాయింట్లు వస్తే రూ.2వేల జరిమానా విధిస్తున్నారు. 200 పాయింట్లు దాటితే జైలు శిక్ష సైతం పడే అవకాశం ఉంది. జీవితాలను నాశనం చేసుకోవద్దు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వారితో పాటు ఇతరులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇలాంటి వారు పోలీసుల నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా పూర్తిస్థాయిలో నిఘా ఉంచాం. ప్రమాదాల నివారణకు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నాం. యువత మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దు. – నరసింహ, ఎస్పీ ఫ జిల్లాలోని పోలీస్స్టేషన్ల పరిధిలో విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ఫ పట్టుబడితే జరిమానాతోపాటు, జైలు శిక్ష నమోదైన కేసులు ఇలా.. సంవత్సరం కేసులు జైలు శిక్ష 2023 22,875 102024 12,940 152025(ఇప్పటి వరకు) 7500 30 -
రూ.327.39 కోట్ల రైతు భరోసా నిధులు జమ
భానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకు జిల్లాలోని 2,91,292 మంది రైతులకుగాను 2,76,787 మంది రైతుల ఖాతాల్లో రూ. 327.39 కోట్లు నిధులు జమయ్యాయి. ఈమేరకు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగుల నూతన వేతన సవరణ నివేదిక ప్రకటించాలిసూర్యాపేటటౌన్ : రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన సవరణ నివేదికను వెంటనే ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సోమయ్య అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి రెండు సంవత్సరాల కాలం పూర్తయినా ఇంతవరకు పీఆర్సీ రిపోర్టు ప్రభుత్వం విడుదల చేయలేదని, ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. వేతన సవరణ రిపోర్టును ప్రకటించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో మనఊరు –మనబడి పథకంలో మంజూరై మధ్యలో నిలిచిపోయిన పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని, పెండింగ్‌లో ఉన్న సప్లమెంటరీ బిల్లులను విడుదల చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ కుమార్, శ్రీనివాసరెడ్డి, అరుణ భారతి, వెంకటయ్య, నాగేశ్వరరావు, ఆడం, వెలుగు రమేష్, సోమయ్య, చిలక రమేష్, లాలు, పాండురంగా చారి, బాల సైదిరెడ్డి, సాంబయ్య, శ్రీనివాసచారి పాల్గొన్నారు. గిరిజనులను అన్ని రంగాల్లో చైతన్యం చేస్తాం సూర్యాపేట : ఆదివాసీలు, గిరిజనులను అన్ని రంగాల్లో చైతన్య చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్యనాయక్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రెడ్డి హాస్టల్ భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లాలోని అన్ని మండలాల నుంచి ఐదుగురు చొప్పున ఎంపిక చేసిన ఆదివాసీ, గిరిజనుల కాంగ్రెస్ ప్రతినిధులకు శిక్షణ తరగతులు ఈ నెల 24, 25, 26వ తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా గిరిజనులు, ఆదివాసీల చైతన్యం కోసం రాజకీయ శిక్షణా తరగతులు నిర్వ హించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. ఏఐసీసీ జాతీయ నేత రాహుల్‌గాంధీ పిలుపు మేరకు దేశంలో గిరిజన, ఆదివాసీల అభివృద్ధికి వారం రోజుల పాటు ట్రైనర్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. శిక్షణ తరగతుల ప్రారంభానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు హాజరవుతారని చెప్పారు. కార్యక్రమంలో సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
50ఏళ్ల అపూర్వ కలయిక
తుంగతుర్తి : మండల పరిధిలోని అన్నారం జెడ్పీహెచ్ఎస్లో 1974–1975లో 8వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆ పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 50 సంవత్సరాల తర్వాత కలుసుకొని ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రంగారెడ్డి, అహల్య, హసనాబాదు సోమయ్య, రేసు సత్తయ్య, సుదర్శన్, సోమయ్య, లక్ష్మయ్య, పూర్వ విద్యార్థులు శేఖర్‌రెడ్డి, సోమిరెడ్డి, గోవర్ధన్, వెంకట్ రెడ్డి, అమృతరెడ్డి, సత్తిరెడ్డి, సత్తయ్య, యాదగిరి, పాల్గొన్నారు. -
శ్రీలక్ష్మీ నారసింహుడికి విశేష పూజలు
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో అర్చకులు నిత్యకల్యాణం జరిపించారు. సుప్రభాత సేవ, నిత్యహోమం, పంచామృతాభిషేకం, ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. కల్యాణవేడుకలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్తిగావించారు. అనంతరం గరుడవాహనంపై శ్రీస్వామివారిని ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్ కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి భక్తులు పాల్గొన్నారు. -
ఉపాధి కూలీల కషా్టలు
నాగారం : ఉపాధి పనులు చేసే కూలీలకు అందించే వేతనాలను అధికారులు పోస్టాఫీసుల్లో జమ చేస్తున్నారు. అయితే పల్లెల్లో తపాలా సేవలు అందుబాటులో లేకపోవడంతో కూలీలకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు గ్రామాలకు పోస్టల్ సేవలు లేక ఉపాధి కూలీలు దూర ప్రాంతాలకు వెళ్లి వేతనాలు తీసుకోవాల్సి వస్తోంది. జనాభా పెరుగుతున్నా కొత్త వాటిని ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా.. ఆసరా పింఛన్లు, ఉపాధి కూలీ చెల్లింపులతో పాటు పలు రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాలను పోస్టాఫీసుల ద్వారా అందిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో పోస్టాఫీసులు లేకపోవడంతో పొదుపునకు అవకాశం ఉండడం లేదు. గ్రామాల్లో తపాలా సేవలు కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.ఫ పల్లెల్లో తపాలా సేవలు అందక అవస్థలు ఫ వేతనాలు తీసుకునేందుకు దూరప్రాంతాలకు జిల్లాలో ఇలా...గ్రామ పంచాయతీలు 486 బ్రాంచ్ పోస్టాఫీసులు 319 సబ్ పోస్టాఫీసులు 29 -
ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి
మోత్కూరు : ఉచిత పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ కడియం రామచంద్రయ్య పిలుపునిచ్చారు. ప్రధానిగా నరేంద్రమోదీ 11 ఏళ్లు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మోత్కూరు మండలంలోని పాటిమట్ల గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు గూదె మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం సంకల్ప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా పాలన కొనసాగిస్తూ రాష్ట్రాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దాహంతో ప్రజలను అభివృద్ధికి దూరం చేస్తూ ఉచితాల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి గ్రామంలో మొక్కలు నాటారు. అదేవిధంగా గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరారు. సమావేశంలో జిల్లా నాయకులు ఏనుగు జితేందర్‌రెడ్డి, అండెం సుధాకర్‌రెడ్డి, భీముడి తిరుమలరెడ్డి, ఉపాధ్యక్షులు లెల్లల బాలనర్సయ్య, రాదారపు మల్లేషం, ప్రధాన కార్యదర్శి వేముల దశరథ, మండల ఎస్సీ మోర్చా కొంపెల్లి గణేష్, కోశాధికారి కడమంచి సైదులు, కార్యదర్శి బత్తిని సతీష్, గ్రామ శాఖ అధ్యక్షులు ఈట్టబోయిన ఆంజనేయులు, నల్లపోగుల వెంకన్న, కక్కరేను మల్లేష్, ముక్కాముల గణేష్, ఆళ్ల శివప్రసాద్, నిలిగొండ జయమ్మ, మార్గం సుజాత, మహేశ్వరం నిఖిత, కల్పన, మహేష్, మచ్చగిరి, నరేష్, అజయ్, మత్స్యగిరి, కిరణ్, మౌలానా పాల్గొన్నారు. ఫ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి -
నేరస్తులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలకం
కోదాడరూరల్ : నేరాల నియంత్రణలో , నేరస్తులను గుర్తించడంతో సీసీ కెమెరాలు కీలకం అవుతున్నాయని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. శనివారం కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో రూ.27.50లక్షలతో ఏర్పాటు చేసిన 70 కెమెరాల పోలీస్ కంట్రోల్ రూంను ఎస్పీ నరసింహతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. కోదాడ పట్టణంలోని ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు తమ అపార్ట్మెంట్లు, గృహాలు, వ్యాపార సంస్థల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగిస్తూ నేరాలను కట్టడి చేస్తూ శాంతిభద్రతలను పరిరక్షించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతు నేరాల కట్టడికి సీసీ కెమెరాలను అన్నివిధాలుగా ఉపయోగించుకుంటున్నామని దీనిలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. సూర్యాపేటను పూర్తి స్థాయిలో రక్షణ జిల్లాగా చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, పట్టణ, రూరల్ సీఐలు శివశంకర్, రజితారెడ్డి, సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ దశరథ, భరత్‌రెడ్డి, రంగారావు, డాక్టర్ సురేష్, డాక్టర్ రామారావు, కోటేశ్వరరావు, ఆనంద్ పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే పద్మావతి