కార్మికులకు అండగా ఏఐటీయూసీ | - | Sakshi
Sakshi News home page

కార్మికులకు అండగా ఏఐటీయూసీ

Jul 26 2026 8:06 AM | Updated on Jul 26 2026 8:06 AM

నేరేడుచర్ల : వివిధ రంగాల్లో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికులకు ఏఐటీయూసీ అండగా ఉండి వారి హక్కుల కోసం పోరాడుతోందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్‌ అన్నారు. ఆగస్టు 1న సూర్యాపేటలో నిర్వహించ తలపెట్టిన ఏఐటీయూసీ జిల్లా మహాసభల వాల్‌ పోస్టర్‌ను శనివారం నేరేడుచర్లలో విడుదల చేసి మాట్లాడారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ధనుంజయనాయుడు, ప్రాంతీయ సహాయ కార్యదర్శి ముత్యాల భాస్కర్‌, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా గౌరవ అధ్యక్షులు చిలకరాజు శ్రీను, రఫి, సలీం, వెంకన్న, జానీ, పాష, నాగులు, సాయి పాల్గొన్నారు.

రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నాగేంద్రనాయక్‌

నేరేడుచర్ల : ట్రైబల్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (టీఐసీసీఐ) మీడియా, సాంస్కృతిక విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్‌గా రమావత్‌ నాగేంద్రనాయక్‌ను నియమిస్తూ ఆ సంస్థరాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో నియమక పత్రాన్ని అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా నాగేంద్రనాయక్‌ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

వరి సాగు తగ్గించాలి

గరిడేపల్లి : ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతున్న నేపథ్యంలో బోరుబావుల కింద వరి సాగును తగ్గించాలని కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్త ఎ.కిరణ్‌ సూచించారు. శనివారం గరిడేపల్లి మండలం పొనుగోడులో రైతులకు ఆరుతడి పంటల సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలో లోటు వర్షపాతం నమోదైందని, రైతులు వరి, పత్తికి బదులుగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో గ్రామ స ర్పంచ్‌ వేణు, కేవీకే ప్రోగ్రామ్‌ అసిస్టెంట్‌ ఎ.నరేష్‌, వ్యవసాయ విస్తరణ అధికారి మనోజ్‌ కుమార్‌, చైతన్య డీమ్డ్‌ టూ బీ యూనివర్సిటీ విద్యార్థినులు రితిక, స్నేహవల్లి, సుచరిత, అనూష, వినయశ్రీ, దివ్య, రైతులు పాల్గొన్నారు.

అర్హులంతా ఎన్యుమరేషన్‌ ఫారాలు నింపి ఇవ్వాలి

కోదాడరూరల్‌, గరిడేపల్లి : అర్హులైన ప్రతిఒ క్కరూ ఎన్యుమరేషన్‌ ఫారాలు నింపి బీఎల్‌ఓలకు అందజేసి ఓటు హక్కు ఉండేలా చూసుకోవాలని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ముత్తినేని వీరయ్య అన్నారు. శనివారం కోదాడ పట్టణంలో కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి సర్‌ సర్వే గురించి మాట్లాడారు. అంతకు ముందు గరిడేపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు త్రిపురం అంజన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీరయ్య మా ట్లాడారు. సర్‌ ప్రక్రియను వంద శాతం పూర్తి చేస్తామని పేర్కొనానరు. కోదాడలో జరిగిన కార్యక్రమంలో కందుల కోటేశ్వరరావు, కందుల చంద్రశేఖర్‌, రామినేని శ్రీనివాసరావు, పత్తిపాక జనా ర్దన్‌, బత్తిని కృష్ణమూర్తి, నాళం రాజన్న, గరిడేపల్లి మండల కేంద్రంలో నిర్వ హించిన సమావేశంలో గరేడేపల్లి సర్పంచ్‌ నాగేశ్వరరావు, ఉపసర్పంచ్‌ వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ బాల్దూరు సందీప్‌, ఎడవెల్లి ఉపేందర్‌రెడ్డి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement