కొరియా కార్యాలయాల్లో.. బయటకు చెప్పుకోలేని ఐదు నిజాలు! | Korean corporate life 5 unspoken rules of traditional offices | Sakshi
Sakshi News home page

కొరియా కార్యాలయాల్లో.. బయటకు చెప్పుకోలేని ఐదు నిజాలు!

Aug 11 2026 11:34 AM | Updated on Aug 11 2026 11:34 AM

Korean corporate life 5 unspoken rules of traditional offices

దక్షిణ కొరియాకు చెందిన కే డ్రామాలు, అక్కడి లైఫ్‌ స్టయిల్‌ చూసి, ఇతర దేశాలకు చెందిన వారు అద్భుతం.. మహా అద్భుతం అని అనుకుంటారు. అయితే అక్కడి కార్యాలయాల్లో అమలయ్యే ఐదు విచిత్రమైన నిబంధనల గురించి తెలిస్తే షాకవుతారు. వీటి గురించి ‘ఫైనాన్స్‌మ్యాన్ కొరియా’ పేరిట ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేటర్‌ రే కిమ్(31) తమ దేశంలోని ఆఫీసుల్లో అమలవుతున్న ఐదు నిబంధనలను వెల్లడించారు. ఫైనాన్స్, బ్యాంకింగ్ వంటి సంప్రదాయ రంగాల్లో ఇప్పటికీ పాత పద్ధతులే కొనసాగుతున్నాయని తెలిపారు.

ఐదు నిబంధనలు..
బాస్ వెళ్లేవరకు ఇంటికి వెళ్లకూడదు: ఆఫీసులో మీ పని పూర్తయినప్పటికీ, బాస్ ఆఫీసు విడిచి వెళ్లే వరకు ఉద్యోగులు అక్కడే ఉండాలి. ఇతరుల ముందు బిజీగా ఉన్నట్లు నటించాల్సి ఉంటుంది.

రంగుల దుస్తులు ధరించకూడదు: వ్యక్తిగత వేషధారణపై కఠిన నిబంధనలు ఉంటాయి. తోటి ఉద్యోగుల కంటే భిన్నంగా కనిపించకూడదు. ముఖంపై గడ్డం లేదా మీసాలు పెంచేందుకు కూడా అనుమతి ఉండదు.

సెలవులు పరిమితం: ఒకేసారి మూడు రోజులకు మించి సెలవులు తీసుకోవడానికి వీలులేదు. అంతకంటే ఎక్కువ రోజులు సెలవు పెడితే మీ పనిని తోటి ఉద్యోగులు మోయాల్సి వస్తుంది కాబట్టి, వారిని బాధ్యతారహితులుగా చూస్తారు.

సీనియర్లను ఎదురించకూడదు: కొరియాలో అధికార శ్రేణికి అత్యంత ప్రాధాన్యత ఉంది. బాస్‌తో విభేదించడం అంటే సంస్థకు ద్రోహం చేయడంతో సమానంగా భావిస్తారు.

టీమ్ డిన్నర్ తప్పనిసరి: బాస్ ‘ఈరోజు రాత్రి డిన్నర్‌కు వెళ్దాం’ అని చెబితే, దానిని ఎవరూ తిరస్కరించకూడదు. ఇది విధిగా పాటించాల్సిన బాధ్యతగా పరిగణించాలి.

ఇది కూడా  చదవండి: బొద్దింకల్లో ‘బ్లింకిట్‌’ స్టాక్‌.. లైసెన్స్ రద్దు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement