రూ.10లకే కడుపునిండా భోజనం | Security Guard Shares Video of Corporate Offering Full Meal for Just Rs 10 | Sakshi
Sakshi News home page

రూ.10లకే కడుపునిండా భోజనం

Jul 31 2026 1:59 PM | Updated on Jul 31 2026 2:10 PM

Full Meal for Just Rs 10 Security Guard Reveals Corporate Model

మెట్రో నగరాల్లో ఒక్కపూట సాధారణ భోజనానికి కనీసం రూ.50-రూ.100 వరకు వెచ్చించాల్సి వస్తోంది. అయితే, కేవలం రూ.10లకే పౌష్టికాహారాన్ని అందిస్తూ ఓ సంస్థ తన ఉద్యోగుల పట్ల చూపుతున్న ఆదరణ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌గా మారింది. ఆనంద్ కుమార్ (@thenameisanand01) అనే సెక్యూరిటీ గార్డ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ వీడియో కార్పొరేట్ సంక్షేమంపై విస్తృత చర్చకు దారితీసింది.

నామమాత్రపు రుసుముతో ఆహారం

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఆనంద్ కుమార్ తన కంపెనీ క్యాంటీన్‌లో అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని చూపించారు. ఆ థాలీలో వేడివేడి అన్నం, పప్పు, సోయాబీన్ కూర, కాకరకాయ వేపుడు, అప్పడం, ఉల్లిగడ్డ ముక్కలు ఉన్నాయి. బయటి హోటళ్లలో ఇదే భోజనానికి రూ.50-రూ.100 వరకు అవుతుందని, కానీ తమ సంస్థ కేవలం రూ.10లకే నాణ్యమైన ఆహారాన్ని అందిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. రోజువారీ కార్మికులు, సెక్యూరిటీ గార్డుల వంటి తక్కువ ఆదాయ వర్గాలకు ఈ సబ్సిడీ భోజనం వల్ల నెలకు రూ.2,000-రూ.3,000 వరకు ఆదా అవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

నెటిజన్ల ప్రశంసలు

ఈ వీడియో లక్షలాది వీక్షణలు సాధించడంతోపాటు కార్పొరేట్ వర్గాలకు ఒక ఆదర్శ నమూనాగా నిలిచింది. కనీస వేతనాలపై పనిచేసే సిబ్బందికి ఇటువంటి సదుపాయాలు కల్పించడం వల్ల వారి ఆరోగ్యం మెరుగవ్వడంతోపాటు పని పట్ల వారి బాధ్యతాయుత వైఖరి పెరుగుతుందని నెటిజన్లు వ్యాఖ్యానించారు. కొందరు నెటిజన్లు వీడియోలో చూపించిన ప్లాస్టిక్ ప్యాకేజింగ్ స్థానంలో పర్యావరణహిత లేదా పునర్వినియోగ పాత్రలను వాడాలని సూచించినప్పటికీ సంస్థ యాజమాన్యం చూపిస్తున్న మానవీయ దృక్పథాన్ని కొనియాడారు.

ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్‌లో మార్పులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement