సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు ఈ-కేవైసీ (E-KYC)పై కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాలు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ కారణంగా ఈ-కేవైసీ పూర్తి చేసే గడువును పొడిగించింది. ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు ఆగస్టు 31 వరకు అవకాశం కల్పించినట్లు పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఇప్పటివరకు E-KYC పూర్తి చేయని రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా.. ఆగస్టు 1 నుంచి 31 వరకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి తీసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. లబ్ధిదారులు సమీప రేషన్ దుకాణాలను సంప్రదించి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు.
లబ్ధిదారులు గమనించాల్సినవి..
రేషన్ కార్డు, ఆధార్ వివరాలు వెంట ఉండాలి.
కుటుంబ సభ్యులందరి ఈ-కేవైసీ పూర్తయిందో లేదో రేషన్ షాపులో తెలుసుకోవాలి.
బయోమెట్రిక్ సమస్యలు ఉంటే వెంటనే రేషన్ డీలర్ లేదా సంబంధిత పౌరసరఫరాల అధికారులను సంప్రదించాలి.


