హైదరాబాద్ : హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఎకో సస్టెయిన్, ఐపీఈసీ ఎక్స్‌పో కాన్ఫరెన్స్ గురువారం ప్రారంభమయ్యాయి.
శనివారం వరకు జరిగే ఈ ప్రదర్శనను తెలంగాణ పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ మధుకర్ బాబు తదితరులు ప్రారంభించారు.
సుస్థిర పారిశ్రామిక అభివృద్ధి, వనరుల సమర్థ వినియోగంపై ఏర్పాటు చేసిన ఈ వేదికలో 140కి పైగా సంస్థలు తమ ఆధునిక ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి.


