దేశమంత అంబరాన్నంటేలా వినాయక చవితి వేడుకల సంబరాలతో సందడిగా ఉంది. ఎటూ చూసి కొలువుదీరిన రకరకాల వినాయక రూపాలు, పిల్లలు, పెద్దలు కోలహాలమే కనిపిస్తుంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న స్వీట్ షాపులు గణేశుడికి ప్రీతీకరమైన ప్రసాదాల అమ్మకాలతో రద్దీగా ఉన్నాయి. అయితే ఓ స్వీట్ షాపు మాత్రం అందర్నీ ఆకర్షించడమే కాదు నెట్టింట వైరల్‌గా మారింది. వినాయకుడు ఎంతో మెచ్చే ‘గోల్డెన్ మోదక్’తో అందర్నీ ఆశ్చర్యపర్చింది ఈ స్వీట్ షాపు.
తినదగిని ఈ మోదకాలు ఎంతో ఆకర్షణీయంగా చూపురులను కట్టిపడేస్తున్నాయి. తినదగిన విధంగా బంగారు పొతతో తయారు చేసిన ఈ మోదకాలు నాసికాలో విద్యా వికాస్ సర్కిల్ వద్ద ఉన్న ‘సాగర్ స్వీట్స్’ షాపు వారు తయారు చేశారు. వినాయక చవితి పర్వదినాన్ని ఈ మోదకాలు అందరీ మనసుల్ని దోచడమే కాదు, కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. నెట్టింట ఈ బంగారు మోదకాలు వైరల్ కావడంతో ఇది చర్చనీయాంశంగా మారింది.
వినాయకుడికి అమిత ప్రీతీపాత్రమైన మోదకాలకు తమ సృజనాత్మకతను జోడించి సరికొత్త ఆకర్షణను ఇచ్చి అమ్మకాలు పెంచుకునే ప్రయత్నం చేయడం విశేషం. ఇంతకీ ఈ బంగారు మోదకాలు కిలో ఎంత ధర పలుకుతున్నాయో వింటే విస్తుపోవడం ఖాయం. ఇవి కిలో అక్షరాల రూ. 27 వేలు పైమాటే.
Ganesh Chaturthi Special: 'Golden Modaks' Worth Rs 27,000 Per Kg Draw Buyers In Nashik#GaneshChaturthi pic.twitter.com/VUtO0u9Dvu
— NDTV (@ndtv) September 14, 2026


