breaking news
Bigg Boss
-
బిగ్‌బాస్ సీజన్-9.. ఐదేళ్ల రికార్డ్ బ్రేక్..!
తెలుగు బుల్లితెర ప్రియులను అలరించే ఏకైక రియాలిటీ షో బిగ్‌బాస్. గతేడాది డిసెంబర్లో ముగిసిన ఈ సీజన్లో కామనర్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన పడాల కల్యాణ్ విజేతగా నిలిచాడు. దాదాపు వంద రోజులకు పైగా హౌస్‌లోఉన్న పడాల కల్యాణ్ తెలుగు బిగ్‌బాస్ సీజన్-9 ట్రోఫీతో పాటు క్యాష్‌ప్రైజ్‌ను సొంతం చేసుకున్నారు. ఈ సీజన్ రన్నరప్‌గా తనూజ నిలిచింది. ఈ సీజన్ టాప్-5లో డీమాన్ పవన్, ఇమ్మాన్యూయేల్, సంజనా గల్రానీ నిలిచారు.తెలుగు సినీ ప్రియులను అలరించిన ఈ రియాలిటీ షో అరుదైన రికార్డ్ సాధించింది. గతేడాది జరిగిన బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే అత్యధిక రేటింగ్ సాధించింది. గత ఐదేళ్లలో ఇదే అతిపెద్ద రికార్డ్ అని నాగార్జున ట్వీట్ చేశారు. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేను జియో హాట్‌స్టార్‌లో 285 మిలియన్ నిమిషాల పాటు వీక్షించారు. అంతేకాకుండా స్టార్ మా టీవీ రేటింగ్స్‌లో 19.6 సాధించింది. ఈ సందర్భంగా నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రేజీ రికార్డ్ సాధించిన ఈ షో యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రేమ, మద్దతుతో ఈ సీజన్‌ను చారిత్రాత్మకంగా మార్చిన లక్షలాది మంది ప్రేక్షకులకు కూడా కృతజ్ఞతలు చెప్పారు.UNBEATABLE!! UNREACHABLE!! 🔥🔥🔥🔥🔥19.6 TVR on StarMaa, 285 million minutes on Jiostar 💥🔥The #BiggBossTelugu9 Grand Finale stands tall as the BIGGEST in the last 5 years.A season filled with emotions, passion, conflicts, and unforgettable moments. 🔥My heartfelt thanks to… pic.twitter.com/HlR4B56XTy— Nagarjuna Akkineni (@iamnagarjuna) January 2, 2026 -
బిగ్‌బాస్ బ్యూటీకి 150 మంది బాడీగార్డ్స్?
కొందరు బిగ్‌బాస్ సెలబ్రిటీలు బయటకు రాగానే చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఏదైనా ఈవెంట్‌కు వెళ్లినా, ఫంక్షన్‌కు వెళ్లినా చుట్టూ బాడీగార్డులను వెంటేసుకుని వెళ్తుంటారు. గతంలో బిగ్‌బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్.. సోనియా-యష్ పెళ్లికి కూడా బాడీగార్డులను వెంటేసుకునే పోయాడు. నిన్నగాక మొన్న బిగ్‌బాస్ 9 విన్నర్ పవన్ కల్యాణ్ పడాల పదిమంది బాడీగార్డులతో ఓ ఈవెంట్‌కు హాజరయ్యాడు. 150 మంది బాడీగార్డులా?అయితే ఓ హిందీ కంటెస్టెంట్ మాత్రం ఏకంగా 150 మంది బాడీగార్డులను పెట్టుకుందంటూ ఓ వార్త వైరలవుతోంది. తను మరెవరో కాదు, తాన్య మిట్టల్. గొప్పలు చెప్పుకోవడంలో ఎప్పుడూ ముందుంటుందీ లేడీ కంటెస్టెంట్. పూటకో చీర కడతానని బిగ్‌బాస్ హౌస్‌కు దాదాపు 800 చీరలు తీసుకెళ్లింది. అలాగే 50 కిలోల నగలు కూడా పట్టుకెళ్లింది. లగ్జరీకి పెద్ద పీట వేసే ఈ బ్యూటీ తనకు 150మంది బాడీగార్డులున్నారన్న రూమర్‌పై తాజాగా స్పందించింది.అందులో నిజం లేదుతాన్య మిట్టల్ మాట్లాడుతూ.. నేను అలా ఎప్పుడూ చెప్పలేదు. ఇది కావాలని పుట్టించారు. నా కింద 150 మంది సిబ్బంది పనిచేస్తారని మాత్రమే చెప్పాను. దానికి బిగ్‌బాస్ హౌస్‌లోని ఓ కంటెస్టెంట్ జైషా ఖాద్రి.. వాళ్లందర్నీ నా బాడీగార్డ్స్ అని సరదాగా అన్నాడు. అంతకుమించి ఏమీ లేదు. అలా అని బాడీగార్డ్స్ లేరని చెప్పను. నాకంటూ కొంత సెక్యూరిటీ సిబ్బంది ఉంది.అబద్ధం చెప్పనుఎందుకంటే నాకు బట్టల పరిశ్రమ, ఫార్మా ఫ్యాక్టరీ, గిఫ్ట్ ఫ్యాక్టరీ ఉన్నాయి. అవన్నీ మీకు చూపించలేను. కానీ, నేనెప్పుడూ అబద్ధం చెప్పను. అబద్ధాలాడాల్సిన అవసరం నాకసలే లేదు అని పేర్కొంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తాన్య మిట్టల్.. హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్లో పాల్గొని మూడో రన్నరప్‌గా నిలిచింది. ప్రముఖ దర్శకనిర్మాత ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఓ ప్రాజెక్ట్‌లోనూ నటించే ఛాన్స్ దక్కించుకుంది.చదవండి: ప్రేయసిని పరిచయం చేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ -
ఎంతో బాధపెట్టా.. ఇకపై ఏ కష్టం రానివ్వనని మాటిస్తున్నా!
దగ్గరగా ఉన్నప్పుడు కాదు, దూరంగా ఉన్నప్పుడే ప్రేమ విలువ తెలుస్తుందంటారు. జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ విషయంలోనూ ఇదే నిజమైంది. అతడు కమెడియన్‌గా స్థిరపడటానికి ముందే ఓ అమ్మాయి తనను ప్రేమించింది. ఇమ్మూ కూడా తనతో చాటింగ్ చేస్తూ, ఫోన్లు మాట్లాడుతూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. చచ్చినా, బతికినా తనతోనే కలిసుండాలని నిర్ణయించుకున్నాడు.బిగ్‌బాస్ షోలో రియలైజేషన్కానీ ఇమ్మూ కమెడియన్‌గా ఫేమస్ అవడంతో షూటింగ్స్‌లో ఎక్కువ బిజీ అయ్యాడు. ఆ సమయంలో ప్రియురాలికి సరిగా టైమ్ ఇవ్వకపోగా చిరాకు, అసహనం, కోపం అన్నీ తనపైనే చూపించాడు. తానెంత తప్పు చేశాడన్నది తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్‌కు వెళ్లాక రియలైజ్ అయ్యాడు.బహుమతిగా బిగ్‌బాస్ ట్రోఫీ..ప్రేయసిని ఎంతో బాధపెట్టానని అర్థం చేసుకుని రోజూ రాత్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనకోసం బిగ్‌బాస్ ట్రోఫీ గెలిచి దాన్ని బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు. కానీ, అది కుదర్లేదు. అయితే షో నుంచి బయటకు వచ్చాక మాత్రం తనను కలిసి ప్రేమ కబుర్లు చెప్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.ఎంతో బాధపెట్టా..వేస్ట్ అమ్మా (ఇమ్మూ తన ప్రియురాలిని ప్రేమగా వేస్ట్ ఫెలో అని పిలుచుకుంటాడు).. నా జీవితంలోకి వచ్చినందుకు, నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు థాంక్యూ.. నిన్ను నేను చాలా బాధపెట్టాను. కానీ, ఈ సంవత్సరం నుంచి మనం ఇంకా స్ట్రాంగ్ ఉండి.. జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఇప్పటినుంచి నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని మాటిస్తున్నా..! నేను అడగకుండానే దేవుడు నాకు ఇచ్చిన పెద్ద బహుమతి నువ్వే.త్వరలోనే పరిచయం చేస్తా..నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నాకు ఎల్లప్పుడూ అండగా నిలబడ్డందుకు, అపారమైన ప్రేమను పంచినందుకు థాంక్యూ సో మచ్.. ఐ లవ్యూ సో మచ్ నా బుజ్జి ఫెల్లో.. నువ్వే నా సర్వస్వం.. హ్యాపీ న్యూ ఇయర్.. అని రాసుకొచ్చాడు. అతడి ప్రియురాలి పేరు రుచి అని తెలుస్తోంది. అయితే ఇమ్మూ షేర్ చేసిన ఫోటోలో ఆమె ముఖం దాచుకుంది. ఇది చూసిన అభిమానులు వదినను ఎప్పుడు చూపిస్తావ్? అని అడుగుతున్నారు. అందుకు ఇమ్మాన్యుయేల్.. త్వరలోనే చూపిస్తానని రిప్లై ఇచ్చాడు. View this post on Instagram A post shared by Nanduri Emmanuel (@jabardasth_emmanuel) చదవండి: మురారి క్లైమాక్స్.. పస్తులుండి మరీ ఆరోజు షూటింగ్.. దటీజ్ మహేశ్ -
కల్యాణ్, శ్రీజలకు 'ఇమ్ము' డైరెక్ట్ పంచ్.. వీడియో వైరల్
బిగ్‌బాస్ తెలుగు 9 ముగిసింది. విజేతగా కల్యాణ్ పడాల ట్రోఫీ అందుకున్న విషయం తెలిసిందే. అయితే, తొలిసారి ఈ సీజన్ కంటెస్టెంట్స్ అందరూ కలిశారు. 'ఆదివారం స్టార్ మా పరివారం' ప్రోగ్రామ్ కోసం వారందరూ సందడి చేశారు. ఈ వేడుకలో కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, భరణి, పవన్, రీతూ, శ్రీజ, సంజన, సుమన్ శెట్టి, రాము, దివ్య మాత్రమే కనిపించారు. ఈ సీజన్లో విన్నర్ రేసులో ఉన్న తనూజ మాత్రం ఈ కార్యక్రమంలో కనిపించలేదు. తాజాగా విడుదలైన ప్రోమోలో శ్రీజకు ఇమ్ము అదిరిపోయే పంచ్ వేశాడు. అదే సమయంలో రీతూ, పవన్‌లు మరోసారి ఈ షో కోసం తమ మ్యాజిక్ చూపించారు. వేదికపైనే పవన్‌కు రీతూ ముద్దు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. -
రోజుల తరబడి నటించే మహానటులు ఇంకా పుట్టలేదు: ఇమ్మాన్యుల్
బిగ్ బాస్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నాడు ప్రముఖ నటుడు ఇమ్మాన్యుల్. 'జబర్దస్త్'తో కోట్లాదిమంది అభిమానాన్ని దండిగా గెలుచుకున్న ఇమ్మాన్యుల్.... బిగ్ బాస్‌లోనూ తనదైన శైలిలో అలరించి టాప్ 4 ఫైనలిస్ట్ గా నిలిచాడు. ఈ సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించాడు. బిగ్ బాస్ అనుభవాన్ని తాను ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటానని పేర్కొన్న ఇమ్మాన్యుల్... అందులో తనతో పాల్గొన్న సహ పార్టిసిపెంట్స్ తో తన అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ముఖ్యంగా సంజనాతో తనకు ఏర్పడిన ప్రత్యేక అనుబంధం జీవితాంతం ఉంటుందని తెలిపాడు!!బిగ్ బాస్‌లో ప్రతి ఒక్కరూ నటిస్తారని అందరూ అనుకుంటారని, కానీ గంటల తరబడి, వారాల తరబడి, రోజుల తరబడి నటించగలిగే మహానటులు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరని వివరించాడు. బిగ్ బాస్ జర్నీలో తనకు బాసటగా నిలిచిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా "విజనరీ వౌస్" కి కృతజ్ఞతలు తెలిపాడు. బిగ్ బాస్ నుంచి నేర్చుకున్న ఎన్నో విలువైన విషయాలను తన కెరీర్ లో, జీవితంలో అనుసరించే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నాడు. బిగ్ బాస్ విజేతగా నిలిచిన కల్యాణ్ కు కంగ్రాట్స్ చెప్పిన ఇమ్మాన్యూల్... తనకు మొదటి స్థానం దక్కలేదనే అసంతృప్తి ఏ కోశానా లేదని అన్నాడు!! -
నా పేరు, మనీ ఉపయోగించుకుని వదిలేశాడు.. బిగ్‌బాస్ 'ఇనయా' కన్నీళ్లు
కొన్ని కథలను వెండితెరపై చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెడుతారు. ఒక్కోసారి అలాంటి జీవితాలే మన చుట్టూ కనిపిస్తూ ఉంటాయి. ఇదే కోవలో నటి, బిగ్‌బాస్ ఫేమ్ ఇనయా సుల్తానా లైఫ్ ఉంది. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి వార్తల్లోకెక్కింది ఇనయ. తర్వాత బిగ్‌బాస్ షోలోనూ అడుగుపెట్టింది. తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్లో పాల్గొని బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న ఇనయ సుల్తానా.. ఆ తర్వాత ఒక వ్యక్తితో ప్రేమలో పడింది. అయితే, తనతో బ్రేకప్ అయిందని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ క్రమంలో ప్రియుడు చేసిన మోసాన్ని బయటపెట్టింది.సినిమాల మీద పిచ్చితో కన్నవారిని, ఇంటిని వదిలేసి సింగిల్‌గా తన జీవితాన్ని కొనసాగిస్తున్న ఇనయా.. గౌతమ్ కొప్పిశెట్టి అనే యువకుడితో ప్రేమలో పడింది. అతను యోగా ట్రైనర్, జిమ్ కోచ్ అని సమాచారం. తనతో కొద్దిరోజులు ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ బ్రేకప్ చెప్పినట్లు పేర్కొంది. అయితే, తనను ప్రియుడు మోసం చేశాడని ఆమె పేర్కొన్నారు. ఫిజికల్‌గా కూడా కలిశాం..'స్నేహంతో మొదలైన మా పరిచయం ప్రేమగా మారింది. కొంత కాలం పాటు నాతో బాగానే ఉన్నాడు. మా ప్రేమ విషయం రెండు కుటుంబాలకు తెలుసు.. అందుకే సోషల్‌మీడియా ద్వారా అందరికీ తనను పరిచయం చేశాను. నాకు ఎవరూ లేరనుకున్న సమయంలో అతను పరిచయం అయ్యాడు. ఆపై ప్రేమలో పడ్డాం. కానీ, అతను కేవలం నా మనీ, పేరును మాత్రమే ఉపయోగించుకోవాలనుకున్నాడు. తనతోనే జీవితం అనకున్నాను కాబట్టి ఫిజికల్‌గా కూడా కలిశాం. అతని కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టాను. తను వ్యాపారం చేస్తానంటే భారీగా డబ్బు సాయం చేశాను. చివరకు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న గొల్డ్ గాజులు కూడా తనకోసం అమ్మేశాను. దేవుడా.. ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు (కన్నీళ్లు)..ఇప్పటికే ఎన్నో లక్షల రూపాయాలు ఇచ్చాను. నా బ్యాంక్ అకౌంట్ జీరో అయ్యాక వదిలేశాడు. ప్రస్తుతం రూ. 5 లక్షలకు పైగానే అప్పులో ఉన్నాను. ఎలాంటి పనిచేయకుండా ఇంట్లోనే ఉంటాడు. నేను షూటింగ్ వెళ్తున్నా సరే ఒకటే గొడవలు. నాపై అనుమానం పెంచుకున్నాడు. ప్రతిరోజు నరకంగా నా జీవితం మారింది. కేవలం మనీ కోసం మాత్రమే నన్ను ఉపయోగించుకున్నాడు. నేను ఏం చేసినా సరే తప్పుగానే చూస్తాడు. ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితాంతం ఎలా ఉండాలి అనిపించింది. విడిపోయాక రెండు నెలలు చాలా బాధపడ్డాను. ఇప్పుడు అలవాటు అయిపోయింది.మదం సినిమాలో అతనితోనే ఇంటిమేట్ సీన్.. ఆరోజే చచ్చిపోయానుమదం సినిమాలో ఇనయా కీలకమైన పాత్రలో నటించింది. జనవరి 1న ఈ మూవీ విడుదల కానుంది. ఇందులోఆమె చాలా బోల్డ్‌గా కనిపించనుంది. అయితే, ఇదే మూవీలో తనను మోసం చేసిన ప్రియుడు కూడా నటించాడని ఆమె తెలిపింది. తనతో బ్రేకప్ అయిన తర్వాత ఒక ఇంటిమేట్ సీన్లో ఇద్దరం కలిసి నటించామని ఆమె ఇలా చెప్పింది. మదం సినిమాలో మూడు ఇంటిమేట్ సీన్లు నాతోనే ఉన్నాయి. ఒక సీన్లో నా పర్సనే ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని మొదట ఓకే చెప్పాను. తర్వాత మేము బ్రేకప్ అయ్యాం. అయితే, సినిమా కోసం అతనితోనే ఇంటిమేట్ సీన్లో నటించాను. ఆరోజు ఒక మనిషిగా చచ్చపోయాను. ఆరోజు నిద్ర కూడా పట్టలేదు. ఎందుకు బతుకుతున్నానా అనే ప్రశ్న కూడా వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు. అని ఇనయా చెప్పింది. -
ఎన్నాళ్లయిందో.. ఇది నా లైఫ్‌లో మధుర జ్ఞాపకం: తనూజ
సీరియల్ నటి తనూజ పుట్టస్వామి బిగ్‌బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ రన్నరప్‌గా నిలిచిన ఆమె తాజాగా తన మంచి మనసు చాటుకుంది. షో అయిపోగానే తన ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన చిన్నపాటి పార్టీలో సందడి చేసిన ఆమె తాజాగా అనాథాశ్రమానికి వెళ్లింది. ఈ మేరకు ఒ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది.చిన్నారులతో సరదాగాఅందులో చిన్నారులతో కలిసి ముచ్చటించింది. వారు డ్యాన్స్ చేస్తుంటే చప్పట్లు కొట్టింది. తర్వాత పిల్లలందరికోసం పాట పాడింది. కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించింది. అనంతరం వారికి భోజనం వడ్డించింది. ఓ చిన్నారికి గోరుముద్దలు పెడుతూ తనూ వారితో కలిసి భోజనం చేసింది.మధురమైన జ్ఞాపకంవాళ్లందరినీ తన ఫ్యామిలీగా అభివర్ణించింది. 'నా కుటుంబాన్ని చూసి ఎన్నాళ్లయిందో! వాళ్ల ప్రేమలు, చిరునవ్వులు, జ్ఞాపకాలు.. మమ్మల్ని మళ్లీ ఒక్కటి చేశాయి. చాలాకాలం తర్వాత వారితో మళ్లీ కాలక్షేపం చేశాను. నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఇది నా జీవితంలో మర్చిపోలేని మధురమైన జ్ఞాపకాల్లో ఒకటిగా నిలిచిపోతుంది' అని తనూజ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Thanuja Puttaswamy (@thanuja_puttaswamy_) చదవండి: అభిమానుల అత్యుత్సాహం.. కిందపడ్డ విజయ్ -
గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన 'బిగ్‌బాస్' ఇమ్మాన్యుయేల్
రీసెంట్గా ముగిసిన బిగ్‌బాస్ 9వ సీజన్లో టాప్-5లో నిలిచిన వాళ్లలో ఇమ్మాన్యుయేల్ ఒకడు. కామెడీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు తన లవ్ స్టోరీ చెప్పాడు. బయటకు రాగానే ఆమెని పెళ్లి చేసుకుంటానని కూడా అన్నాడు. ఇప్పుడు అదే నిజం చేసేలా తన గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేశాడు! ఈ మేరకు తన ఇన్ స్టా స్టోరీలో పెట్టిన ఫొటో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఆకాశానికెత్తి నట్టేట ముంచారు.. ఇమ్మూ కన్నీళ్లకు కారణమెవరు?)ఇమ్మూ పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తుంటే ఇతడితో పాటు ఉన్నది ప్రియురాలేనా అనిపిస్తుంది. త్వరలో గుడ్ న్యూస్ చెబుతాడా అనిపిస్తుంది. ఆమె ఎవరు ఏంటనేది, ఫొటో లాంటి బయటపెట్టలేదు కానీ ఇన్ స్టా ఖాతా పేరు మాత్రం రుచి అని ఉంది. ఎవరో ఏంటనేది త్వరలో ఇమ్మాన్యుయేల్ బయటపెడతాడేమో చూడాలి?షోలో ఇమ్మూ చెప్పిన లవ్‌స్టోరీ'స్టాండప్ కమెడియన్‌గా చాలా షోలు చేశా కానీ ఎవరూ గుర్తుపట్టలేదు. ఓరోజు నా ఇన్ స్టాలో పెద్ద మెసేజ్ వచ్చింది. మీ స్టాండప్ కామెడీ నాకు బాగా నచ్చింది. ఓ వ్యక్తి ఇంతమందిని నవ్వించగలడా అనిపించింది అని ఓ అమ్మాయి మెసేజ్ చేసింది. థ్యాంక్యూ చెబితే.. మీకు ఓకే అయితే నెంబర్ ఇస్తారా? అని అడిగింది. నేను ఫోన్ నంబర్ ఇచ్చాను. తర్వాత ఇద్దరం మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. కొన్నాళ్ల తర్వాత తను డాక్టర్ కోర్స్ చేస్తున్నా అని చెప్పింది. ఏంటీ నేను డాక్టర్ని నవ్వించగలిగానా అనిపించింది. నా ఫేమ్ చూసి ఇష్టపడిందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అప్పటికి నాకంతా గుర్తింపు రాలేదు. పోనీ అందం చూసి ప్రేమించింది అనుకోవడానికి కూడా లేదు. నేను ఎలా ఉంటానో నాకు తెలుసు''ఆమెతో మాట్లాడిన తర్వాత.. ఈ అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నాకు ఫస్ట్ అనిపించింది. ప్రపోజ్ కూడా కాదు నేరుగా పెళ్లి చేసుకోవాలనిపించింది. అంతా ఫోన్లోనే. నేను కనీసం ఆమె ఫొటో కూడా చూడలేదు. ఎలా ఉంటుందో తెలీదు. తన ముఖం కూడా చూడకుండానే ప్రపోజ్ చేశా. నీకు ఇష్టమైతే చెప్పు.. మా అమ్మవాళ్లకు చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాను. దీంతో నాకు కాస్త టైమ్ కావాలి అని చెప్పింది. తర్వాత ఆమెని ఇంట్లో వాళ్లకు కూడా పరిచయం చేశాను. ఇదంతా ఓ వారంలోనే జరిగిపోయింది. కలుద్దాం అడిగితే అంత సీన్ లేదు గానీ.. మా ఊరు వెళ్తున్నా కారు ఉంటే తీసుకుని రా, కలిసి వెళ్దాం అని చెప్పింది'(ఇదీ చదవండి: ఓడినా.. రెమ్యునరేషన్లో 'ఇమ్మాన్యుయేల్' అదుర్స్)'నాకు అప్పటికి కారు లేదు. మా ఫ్రెండ్‌ని కారు అడిగి, పెట్రోలుకి డబ్బులు సెట్ చేసుకుని ఆమెని కలిశాను. నాలుగు గంటల పాటు వాళ్ల ఊరివరకు జర్నీ చేశాం. ఆ ప్రయాణంలో.. చచ్చినా బతికినా దీనితోనే బతకాలనుకున్నాను. తనని నేను వేస్ట్ ఫెలో అని పిలుచుకుంటా. ఏ రోజు తను, నా అందం చూడలేదు. ఆస్తి చూడలేదు. డబ్బు చూడలేదు. ఈ రోజుకి కూడా తనకి నేను ఒక్క రూపాయి పెట్టింది లేదు. కనీసం ఒక్క డ్రస్ కొనివ్వలేదు. ప్రతిసారి బర్త్ డేకి బట్టలు కొంటాం గానీ పెళ్లియ్యాకే కట్టుకుంటాం అని అంది. వాటిని నా బీరువాలోనే దాచుకున్నా. అంత మంచి వ్యక్తి ఆమె. షూటింగ్స్ బిజీలో పడి తనని సరిగా పట్టించుకునేవాడిని కాదు, చిరాకుపడేవాడిని, తిట్టేవాడిని. చాలా బాధపెట్టాను. కానీ ఇక్కడి వచ్చాక రియలైజ్ అయ్యాను. మనిషిని దూరం పెట్టి ఇంత బాధపెట్టానా అనిపిస్తుంది''ఈ నవంబరులో తను పీజీ చేయడం కోసం ఫారిన్ వెళ్లాలి. కానీ నేను బిగ్‌బాస్‌కి వెళ్తున్నానని ఆగిపోయింది. జీవితాన్ని త్యాగం చేసింది. తనకేం కర్మ.. నాకోసం ఎందుకింత చేస్తుందని చాలా బాధగా ఉంది. తనకోసమే ఆడుతున్నా.. గెలవాలనే ఆడుతున్నా. ఈ షో అవ్వగానే పెళ్లి చేసుకుంటాం. ఫారిన్ వద్దూ ఏమి వద్దూ. తనని జీవితాంతం హ్యాపీగా చూసుకుంటాం. తన విలువ ఏంటో ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది' అని ఇమ్మూ అప్పుడు చెప్పాడు. ఇప్పుడు పరోక్షంగా తన ప్రేయసిని పరిచయం చేశాడు. చూస్తుంటే కొత్త ఏడాదిలో పెళ్లి శుభవార్త చెప్పడం గ్యారంటీ అనిపిస్తుంది.(ఇదీ చదవండి: కష్టానికి విలువ లేదు.. ఇమ్మూ గురించి కమెడియన్ రోహిణి ఆవేదన) -
మందు మానేశా.. ఇండస్ట్రీలో తాగుబోతులు లేరిక!
ప్రముఖ నటుడు శక్తి కపూర్, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కలిసి ఎన్నో సినిమాలు చేశారు. జుడ్వా, చల్ మేరే భాయ్, హమ్ సాత్ సాత్ హే, హలో బ్రదర్, కహీ ప్యార్ నా హోజాయే.. ఇలా అనేక చిత్రాల్లో నటించారు. అయితే 2005లో శక్తి కపూర్ ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు ప్రలోభాలకు గురి చేశాడంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో సల్మాన్.. శక్తి కపూర్‌తో కలిసి నటించడం ఆపేశాడు.అవమానభారం2011లో శక్తికపూర్ హిందీ బిగ్‌బాస్ ఐదో సీజన్లో అడుగుపెట్టాడు. ఈ షోకి సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. రియాలిటీ షో సమయంలో సల్లూ భాయ్.. శక్తిని పెద్దగా పట్టించుకోలేదు. అతడిని కావాలనే పక్కనపెట్టేశాడు. దీంతో శక్తికి అవమానంతో తలకొట్టేసినట్లయింది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక ఆయన సల్మాన్‌పై ఎదురుదాడికి దిగాడు. ఆడవాళ్లను కొడతాడని నింద వేశాడు. అలా ఇద్దరి మధ్య అగాథం ఏర్పడింది.ఎవరితోనూ గొడవల్లేవ్దాదాపు 15 ఏళ్ల తర్వాత తమ మధ్య పరిస్థితులు చక్కబడ్డాయంటున్నాడు శక్తికపూర్. ఇప్పుడు తనకెవరితోనూ గొడవలు లేవు అని చెప్తున్నాడు. మద్యపానానికి కూడా దూరంగా ఉంటున్నానన్నాడు. మందు మానేసి ఐదేళ్లవుతోందని చెప్పాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మందుబాబులకన్నా ఆరోగ్యంపై ఫోకస్ చేసేవాళ్లే ఎక్కువున్నారు. గతంలో అయితే చాలామంది స్టార్స్ తాగి మరీ సెట్స్‌కు వచ్చేవాళ్లని గుర్తు చేసుకున్నాడు. శక్తి కపూర్ వందలాది సినిమాల్లో నటించగా ఆయన కుమారుడు సిద్దాంత్ నటుడిగా, శ్రద్దా కపూర్ స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది.చదవండి: రెండో బిడ్డకు జన్మనిచ్చిన దేవర నటి -
బిగ్‌బాస్ బజ్: సంజనాను ఆంటీ అన్న శివాజీ
బిగ్‌బాస్ ట్రోఫీ గెలుస్తానని తనూజ కాన్ఫిడెంట్‌గా ఉండేది. కానీ అది నిజం కాలేదు. టికెట్ టు ఫినాలే నాదే అని శపథం చేసిన పవన్.. మాట నిలబెట్టుకోలేకపోయాడు. అయితే సంజనా మాత్రం ఆత్మధైర్యంతో అనుకున్నది సాధించింది. బిగ్‌బాస్‌లో అడుగుపెట్టడానికి ముందే టాప్ 5 అని ఫిక్సయిపోయింది. అందుకోసం 100 రోజులకు సరిపడా బట్టలు రెడీ చేసుకుంది.గుడ్డు దొంగతనంతప్పోఒప్పో ఏదైనా ముఖం మీదే మాట్లాడేది. తను మాట్లాడింది తప్పని తెలుసుకున్నప్పుడు బేషరతుగా క్షమాపణలు చెప్పేది. ఒక్క గుడ్డు దొంగతనంతో సీజన్ 9పై బజ్ క్రియేట్ చేసింది. ఎన్నో అవమానాలు, గొడవల తర్వాత వెరీ గుడ్డు కంటెస్టెంట్‌గా ఫైనల్స్‌లో ఐదో స్థానంలో బయటకు వచ్చింది. ఫినాలే అయిపోయినవెంటనే బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఏ ఆంటీ కూడా టాప్5కి రాలేదుఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఏ ఆంటీ కూడా టాప్5కి రాలేదు. ఫైనల్స్‌కు వరకు ఉంటాననుకున్నారా? అని అడిగాడు. అందుకామె ఉంటాననుకున్నాను.. అందుకే కదా 15 వారాలకు సరిపడా డ్రెస్సులు బెంగళూరు నుంచి ప్యాకింగ్ చేసుకుని వచ్చాను అని బదులిచ్చింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. మన అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉన్నా.. చిన్న ఇంట్లో అయినా.. ఎక్కడైనా సంతోషంగా బతకొచ్చు. కానీ, మర్యాదకు భంగం కలిగితే ఎలా బతకగలం? నన్ను ఇలా గుర్తుపెట్టుకోవాలి2020లో నాపై పడ్డ నింద కారణంగా అందరూ నన్ను గుర్తు పెట్టుకోవద్దు.. బిగ్‌బాస్ 9లో టాప్ 5కి వెళ్లింది.. ఆవిడ సంజనా.. అని నన్ను గుర్తించాలి. నా పిల్లలు నన్ను అలాగే గుర్తుపెట్టుకోవాలి అని చెప్పింది. ఇక ప్రోమోలో శివాజీ ఆమెను ఆంటీ అనడంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అతడికంటే సంజనా వయసులో చిన్నదని, ఆమెను పట్టుకుని ఆంటీ అంటాడేంటని ఆగ్రహిస్తున్నారు. -
బిగ్‌బాస్ ప్లాన్ సక్సెస్.. అగ్నిపరీక్ష 2కి భారీ హైప్!
బిగ్‌బాస్ షోను ఇష్టపడేవాళ్లు, తిట్టేవాళ్లు.. ఇద్దరూ ఉన్నారు. తిడుతూనే చూసేవాళ్లు మూడోరకం! అయితే ఈ రియాలిటీ షోలో సెలబ్రిటీలకు పెద్దపీట వేస్తారు. ఎప్పుడో ఒకసారి మాత్రం ఒకరిద్దరు కామనర్లను దింపుతుంటారు. కొన్నిసార్లు వాళ్లు కూడా సోషల్ మీడియాలో సుపరిచితులైనవారే ఉంటారు! అయితే ఈసారి ఏకంగా ఏడుగురు మంది సామాన్యులు హౌస్‌లో అడుగుపెట్టారు. కాకపోతే అంత ఈజీగా కాదు, అగ్నిపరీక్షను దాటుకుని వచ్చారు.అగ్నిపరీక్షఎన్నడూ లేనిది ఈసారి షో ప్రారంభమవడానికి ముందు బిగ్‌బాస్ అగ్నిపరీక్ష అనే కార్యక్రమాన్ని కొత్తగా ప్రారంభించారు. దీనికోసం పెద్ద ప్రక్రియే జరిగింది. ముందుగా షోకి రావాలనుకునేవారు ఒక నిమిషం వీడియో షూట్ చేసి బిగ్‌బాస్ టీమ్‌కు పంపారు. వేలల్లో వచ్చినవాటిని ఫిల్టర్ చేసి వందల్లో ఎంపిక చేస్తారు. వారికి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, ఎగ్జామ్ ఇలా అన్నీ పెట్టి చివరకు 40 మందిని ఎంపిక చేశారు.అలాంటివారికి నో ఛాన్స్వారిలో నుంచి మంచి కంటెస్టెంట్లను జల్లెడ పట్టాల్సిన బాధ్యతను నవదీప్, బిందుమాధవి, అభిజిత్‌కు అప్పజెప్పారు. ఈ షోకి శ్రీముఖి యాంకరింగ్ చేసింది. బిగ్‌బాస్‌కు రావాలన్న పిచ్చితో కొందరు పాదయాత్రలు చేస్తారు, నిరాహార దీక్షలు, ధర్నాలు చేస్తారు. అలాంటివారికి షోలో చోటు లేదని అగ్నిపరీక్ష షోలో కరాఖండిగా చెప్పేశారు. ఆ కేటగిరీలో వచ్చిన అందర్నీ నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేశారు.తొలిసారి ఏడుగురు కామనర్స్మిగతావారి టాలెంట్, ఎక్స్ప్రెషన్స్, నాలెడ్జ్.. ఇలా అన్నింటినీ పరిశీలించి ఓ లిస్ట్ ఫైనల్ చేస్తారు. అలా కొందరు జడ్జిలను మెప్పించి, మరికందరు ప్రేక్షకుల ఓట్ల ద్వారా తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్లో అడుగుపెట్టారు. వాళ్లే ప్రియ, శ్రీజ, దివ్య, కల్యాణ్, పవన్, మనీష్, హరీశ్. వీరిలో కల్యాణ్ ఏకంగా టైటిల్ విన్నర్ కాగా పవన్ సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. సామాన్యుడి చేతికి ట్రోఫీసామాన్యుడు బిగ్‌బాస్‌కు వెళ్లడం కాదు, ఏకంగా ట్రోఫీ ఎత్తగలడని కల్యాణ్ నిరూపించాడు. అయితే అగ్నీపరీక్ష రెండో సీజన్ కోసమే అతడికి కప్పు కట్టబెట్టారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అగ్నిపరీక్ష ఫస్ట్ సీజన్‌పై పెద్దగా బజ్ లేదు. ఇప్పుడు కల్యాణ్ గెలుపు వల్ల అగ్నీపరీక్ష రెండో సీజన్‌పై భారీ హైప్ క్రియేట్ అయింది. బిగ్‌బాస్ ప్లాన్ సక్సెస్ఈసారి ఎవరు వస్తారు? ఎవర్ని తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది. కామనర్స్‌ను ఏదో కొన్నాళ్లపాటు హౌస్‌లో ఉంచి పంపించేయకుండా.. వారికి టాలెంట్ ఉంటే చివరి వరకు ఉంచుతారన్న నమ్మకం కుదిరింది. ఈ లెక్కన ఈసారి అగ్నిపరీక్షకు అప్లికేషన్లు భారీగా పోటెత్తే అవకాశముంది. అదే గనక నిజమైతే బిగ్‌బాస్ ప్లాన్ వర్కవుట్ అయినట్లే! ఈ అగ్నిపరీక్ష రెండో సీజన్ 2026 సెకండాఫ్‌లో ప్రారంభం కానుంది.చదవండి: వినాయకన్కు తీవ్ర గాయం.. కాస్త లేట్ అయ్యుంటే పక్షవాతం! -
'గీతూ రాయల్' దెబ్బకు దిగొచ్చిన సంజన
బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్ పూర్తి అయినప్పటికీ ఏదో రకంగా ట్రెండింగ్‌లోనే కొనసాగుతుంది. ఎపిసోడ్‌కు సంబంధించిన పలు వీడియోలను కంటెస్టెంట్స్ షేర్ చేసుకుంటూ మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో నటి సంజన గల్రానీ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో బిగ్‌బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్, రివ్యూవర్స్ ఆదిరెడ్డి, గీతూ రాయల్ ఫోటోలను మార్ఫింగ్ చేసిన వీడియోను షేర్ చేసింది. దీంతో గీతూ రాయల్ గట్టిగానే కౌంటర్‌గా ఇచ్చింది. సంజనకు సంబంధించిన ఒక వీడియోను తన స్టోరీస్‌లో పంచకుంది. అయితే, కొద్దిసేపటి తర్వాత సంజన తన తప్పును తెలుసుకుని తన పోస్ట్‌ను తొలగించడంతో.. రీతూ రాయల్ కూడా తను చేసిన పోస్ట్‌ను రిమూవ్ చేసింది.సంజన ఏం చేసింది..?బిగ్‌బాస్ రివ్యూవర్ మహిధర్ చేసిన ఒక వీడియోను మొదట సంజన షేర్ చేసింది. ఆ వీడియోలో సంజన బిగ్‌బాస్ కంటెంట్ క్రియేటర్ అంటూ అతను పేర్కొన్నాడు. ఆపై తనూజ, ఇమ్ము, డీమాన్ పవన్‌ల ఆట గురించి ప్రస్తావించాడు. అయితే, కేవలం రివ్యూవర్ల వల్లనే కల్యాణ్ హైలెట్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. దానిని కొందరు ట్రోలర్స్ వైరల్ చేశారు. ఈ క్రమంలో ఆదిరెడ్డి, రీతూ రాయల్ కల్యాణ్ కోసం ఓట్ల బిచ్చగాళ్లు మాదిరిగా క్రియేట్ చేసి ఉన్న ఒక ఫోటోను ఆ వీడియోకు కలిపారు. అదే వీడియోను సంజన షేర్ చేయడంతో గీతూ రాయల్‌కు చిర్రెత్తుకొచ్చింది. దీంతో వెంటనే తనదైన స్టైల్లో గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇంకేముంది సంజన తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఇంతలోనే ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అయిపోయింది.సంజనకు గీతూ రాయల్ కౌంటర్డ్రగ్స్ కేసులో నటి సంజనపై ఆరోపణలు అంటూ వచ్చిన ఒక వీడియో క్లిప్‌ను గీతూ పోస్ట్ చేసింది. ఇదీ నిజమా అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. సంజన గల్రానీ డ్రగ్స్ కేసు 2020లో కన్నడ సినీ పరిశ్రమను కుదిపేసిన విషయం తెలిసిందే. రెండు నెలల తర్వాత ఆమెకు బెయిల్ లభించింది. ఇదే కేసులో సుప్రీం కోర్టు కూడా కొద్దిరోజుల క్రితమే నోటీసులు జారీ చేసింది.#GeetuRoyal status on #Sanjana #BiggBossTelugu9 pic.twitter.com/kLMBYZfGBe— TeluguBigg (@TeluguBigg) December 24, 2025 -
ప్రమోషన్ పొందిన వితికా షెరు
బిగ్‌బాస్ ఫేం, నటి వితికా షెరు గుడ్‌న్యూస్ చెప్పింది. పెద్దమ్మగా ప్రమోషన్ పొందినట్లు వెల్లడించింది. వితికా చెల్లెలు కృతికా తాజాగా పండంటి కుమారుడికి జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. బాబు పుట్టిన శుభవార్తను అక్కాచెల్లెళ్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. హీరోయిన్గా కెరీర్తెలుగమ్మాయి వితిక హీరోయిన్గా టాలీవుడ్లో కెరీర్ మొదలుపెట్టింది. సినిమాలు చేస్తున్న సమయంలోనే హీరో వరుణ్ సందేశ్‌తో ప్రేమలో పడింది. అలా వీరిద్దరూ పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. జంటగా బిగ్‌బాస్ షో మూడో సీజన్‌కు సైతం వెళ్లొచ్చారు. పెళ్లయిన తర్వాత కూడా చెల్లి కృతికకు పెళ్లి చేసే బాధ్యతను తనే తీసుకుంది వితికా.చెల్లి పెళ్లి చేసిన వితికాఅక్కగా దగ్గరుండి 2022లో చెల్లి పెళ్లి చేసింది. కొద్ది నెలల క్రితమే కృతిక గర్భం దాల్చగా ఇటీవల తనే ఘనంగా సీమంతం కూడా చేసింది. ఇది చూసినవాళ్లంతా ఇలాంటి అక్క ప్రతి ఇంట్లో ఉండాలని వితికాపై ప్రశంసలు కురిపించారు. ఇకపోతే కృతిక - కృష్ణ దంపతులకు మంగళవారం (డిసెంబర్ 23న) బాబు పుట్టగా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Krithika Sheru (@krithikasheru) -
కల్యాణ్ విజయం వెనుక 'బిగ్‌బాస్' రివ్యూవర్స్.. ?
బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. పైనల్ ఎపిసోడ్ ముగిసి విజేతగా ప్రకటించినా సరే కల్యాణ్, తనూజ పేర్లు నెట్టింట ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్నాయి. అయితే, ఒక విజేతకు రావాల్సిన మైలేజ్‌ను ఎన్నడూ లేని విధంగా తనూజ కూడా హైజాక్ చేసింది. వాస్తవంగా 10 వారాల పాటు ఎలాంటి ఓటింగ్ పోల్స్ చూసినా సరే తనూజనే విన్నర్‌గా కనిపించేది. కానీ, ఆ తర్వాత సీన్ మారిపోయింది. హఠాత్తుగా ఓటింగులో దూసుకొచ్చాడు కల్యాణ్ పడాల.. తనూజ వెనుకబడిపోయింది. దీంతో CRPF జవాను కల్యాణ్ బిగ్‌బాస్ 9 విజేత అయ్యాడు. అయితే, కల్యాణ్ విజయంలో రివ్యూవర్ల పాత్ర ఎక్కువ ఉందని నెటిజన్లు చెబుతున్నారు. ఆపై మరికొందరు టీవీ యాక్టర్స్ కూడా తనూజ గురించి నెగటివ్‌గా చెప్పడంతోనే ట్రోఫీ జారిపోయిందనే వాదన కూడా ఉంది. మరికొందరు మాత్రం అగ్నిపరీక్ష-2 కోసం బిగ్‌బాస్ టీమ్ ప్లాన్ చేస్తుందని అందుకే ఒక కామనర్‌ను కావాలనే గెలిపించారనే వాదన కూడా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ కామెంట్లతో కల్యాణ్‌లో కూడా గెలుపు సంతోషం లేకుండా పోయింది.అర్జునుడిలా కల్యాణ్.. కృష్ణుడి స్థానంలో గీతూబిగ్బాస్ రివ్యూవర్లు ఆదిరెడ్డి, గీతూ రాయల్ సపోర్ట్ కల్యాణ్‌కు పుష్కలంగా దొరికిందని కొందరు నెటిజన్లు డీకోడ్ చేశారు. వారిద్దరితో పాటు మరికొందరు రివ్యూవర్లు కూడా కల్యాణ్‌కు పీఆర్ మాదిరిగా మారిపోయారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే, గీతూ రాయల్ మొదటి నుంచి ప్రతి ఎపిసోడ్‌ను చక్కగా రివ్యూ చెప్పింది. కానీ, ఫైనల్‌కు వచ్చేసరికి కల్యాణ్‌కు ఓటు వేయాలంటూ తనకు అనుకూలంగానే వీడియోలు పోస్ట్ చేసింది. ముమ్మాటికీ గీతూ ఇక్కడ తప్పు చేసిందనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒక రివ్యూవర్ ఎప్పుడూ కూడా ఒక కంటెస్టెంట్ కోసం స్టాండ్ తీసుకోకూడదని చెబుతున్నారు. ఈ విధానం రాబోయే సీజన్లలో వారు చెప్పే రివ్యూలకు క్రెడిబులిటీ ఉండదని పేర్కొంటున్నారు. ఈ పాయింట్‌ను గీతూ గ్రహించలేకపోయిందని చెప్పాలి. పైగా కల్యాణ్ గెలిచిన తర్వాత షేర్ చేసిన ఒక పోస్టర్ నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఒక రథంపై ఆర్జునుడి స్థానంలో కల్యాణ్ ఉంటే.. కృష్ణుడి స్థానంలో గీతూ రాయల్ ఉండేలా క్రియేట్ చేసిన పోస్టర్‌ను ఆమె షేర్ చేసింది. దీంతో ఇంతకంటే నీతితక్కువ పని ఏమైనా ఉంటుందా అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.మొదటిసారి గాడి తప్పిన ఆదిరెడ్డిబిగ్బాస్ రివ్యూ చెప్పడంలో ఆదిరెడ్డి దిట్ట... తను చెప్పే స్టైల్‌కు చాలామంది ఫిదా అయిపోతారు. బిగ్‌బాస్ ఎపిసోడ్‌కు ఉన్నంత రేంజ్లో ఆదిరెడ్డి రివ్యూకు ఉంటుంది. ముఖ్యంగా అతని రివ్యూ తీరు మన పక్కింటి అబ్బాయి చెబుతున్నంత దగ్గరగా ఉంటుంది. ఏ సీజన్లో లేని విధంగా ఈసారి ఆదిరెడ్డిపై కూడా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. కల్యాణ్ గెలుపు కోసమే రివ్యూలు చేశాడంటూ నెటిజన్లు వేల కొద్ది కామెంట్లు చేశారు. వాస్తవంగా అతని రివ్యూలు కూడా కల్యాణ పక్షం వైపే ఉన్నాయని సులువుగా అర్థం అవుతుంది. తనూజ ఏం చేసినా సరే తప్పు అనేలా చెప్పడం.. ఆదే టైమ్‌లో కల్యాణ్ ఏం చేయకున్నా సరే తోపు, తురుం అంటూ ఎలివేషన్ ఇవ్వడంతో బజ్ క్రియేట్ అయిపోయింది. చాలామంది రివ్యూవర్లు కూడా ఆదిరెడ్డిని కాపీ కొట్టి తమ స్టైల్లో రివ్యూ షేర్ చేశారు. అలా అని ఆదిరెడ్డి డబ్బులకు అమ్ముడుపోయాడని చెప్పడం తప్పే.. తను అనుకుంటే ఏదైన కంపెనీ బ్రాండ్ ప్రమోషన్ చేస్తే ఏడాదికి కోట్లలో సంపాదించగలడు. కానీ, మొదటిసారి తన రివ్యూలు గాడి తప్పాయని విమర్శలు రావడంతో తన క్రెడిబులిటికి ఒక మచ్చలా మిగిలిపోనుంది.కల్యాణ్ గెలుపులో ఐదుగురుబిగ్బాస్ 9 ట్రోఫీ కల్యాణ్ అందుకున్న తర్వాత తన స్నేహితులు శ్రీజ, ప్రియలను కలుసుకున్నాడు. ఆ సమయంలో కల్యాణ్‌తో శ్రీజ ఇలా అంటుంది. 'ఐదుగురు అమ్మాయిలు సపోర్ట్ చేయడం వల్ల కల్యాణ్ గెలిచాడు.' అంటూ ఓపెన్‌గా చెబుతుంది. అయితే ముగ్గురు ఉన్నారని మరో ఇద్దరు అందుబాటులో లేరని తెలుపుతుంది. ఆ ఐదుమంది పేర్లను కూడా నెటిజన్లు రివీల్ చేస్తున్నారు. శ్రీజ, ప్రియ, గీతూ రాయల్, సత్య, రేష్మి అంటూ కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు.#KalyanPadala fans should accept the fact that Kalyan won BB and good name using sympathy card Army card caste card language card region card etc but he is lossing very thing just because this 5 evil and negitive mindsets around him.accept the fact#BiggBossTelugu9 #Thanuja pic.twitter.com/a4czq9IMub— santhosh (@Santhoshh_99) December 23, 2025 View this post on Instagram A post shared by Geetu Royal (@geeturoyal_) View this post on Instagram A post shared by Geetu Royal (@geeturoyal_) -
టాప్ 2లో నా పక్కన ఇమ్మూ... తనూజతో ఆ బాండ్ లేదు!
అగ్నిపరీక్షలో కల్యాణ్ అందరికీ నచ్చాడు. కానీ బిగ్‌బాస్ 9వ సీజన్ ప్రారంభంలో ఎవరికీ నచ్చలేదు. కారణం.. ఆట పక్కనపెట్టి అమ్మాయిలపైనే ఎక్కువ ఫోకస్ చేశాడు. దీంతో అతడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. నాగార్జున కూడా అతడి తీరును ఎండగట్టాడు. ఇక ప్రియ, శ్రీజ ఎలిమినేషన్ తర్వాత కల్యాణ్‌కు బెస్ట్ ఫ్రెండ్‌లా మారి అన్నీ చూసుకుంది తనూజ. అతడి కోసం గేమ్స్‌లో కలబడింది, నిలబడింది.కల్యాణ్ కోసం నిలబడ్డ తనూజటికెట్ టు ఫినాలేలో ఇమ్మాన్యుయేల్‌ను పక్కనపెట్టి కల్యాణ్‌కే సపోర్ట్ చేసింది. అతడినెవరైనా టార్గెట్ చేస్తే వాళ్లను వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చి మరీ కల్యాణ్ కోసం టవర్ గేమ్‌లో చేయి నొప్పిని లెక్కచేయకుండా కష్టపడి ఆడింది. చాలా గేమ్స్‌లో అతడికే ప్రాధాన్యత ఇచ్చింది. కేవలం టాస్కులపరంగానే కాకుండా మాటలతోనూ సపోర్ట్ చేసింది. అతడి గెలుపును తన విజయంలా భావించి ఎన్నోసార్లు సంతోషించింది.చివరి ప్రాధాన్యతబిగ్బాస్ ఫినాలే స్టేజీపై కూడా కల్యాణ్ ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. అయితే ముందుగా ప్రియ, శ్రీజకు ప్రాధాన్యం ఇచ్చాడు. చివరగా తనూజ గురించి మాట్లాడుతూ.. కల్యాణ్గాడికి ధైర్యం ఇచ్చి ముందుకు పంపించిందే తనూజ అని ఒప్పుకుంటున్నా అని అందరిముందు చెప్పాడు. కానీ, బిగ్‌బాస్ బజ్‌లో, బయట ఇంటర్వ్యూలలో మాత్రం మాట మార్చాడు. టాప్ 2లో ఇమ్మూ..బజ్‌లో మాట్లాడుతూ.. ఫైనల్స్‌లో స్టేజీపై నా పక్కన ఇమ్మూ అన్న ఉంటాడనుకున్నాను. తనకు ఎక్కువ ఓట్లు వస్తాయనుకున్నా.. అయినా ప్రేక్షకులు ఎవరివైపు ఉన్నారన్నది మనకు తెలిదు. తను నాలా ఆలోచిస్తాడు, నాకు, ఇమ్మూ అన్నకు మధ్య బాండింగ్ బాగుంటుంది. మళ్లీ తనూజ, నాకు మధ్య ఆ బాండింగ్ లేదు అన్నాడు. మరో ఇంటర్వ్యూలో.. తనూజ గేమ్ పరంగా సపోర్ట్ ఇవ్వలేదు, ఉట్టి మాటలతోనే సపోర్ట్ చేసిందన్నాడు.బాగానే డ్రామాలు చేస్తున్నావ్..ఇది చూసిన తనూజ అభిమానులు కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు తనూజ నీ పక్కన లేకపోతే స్క్రీన్‌స్పేస్ కూడా దక్కేది కాదంటున్నారు. ఫ్రెండ్స్‌ను, నాన్న(భరణి)ని పక్కనపెట్టి మరీ నీకు కెప్టెన్సీ, టికెట్ టు ఫినాలేలో సపోర్ట్ చేస్తే కనీస కృతజ్ఞత లేదంటూ తిట్టిపోస్తున్నారు. క్రెడిట్ తనూజకు ఇవ్వొద్దని శ్రీజ ఏమైనా చెప్పిందా? అందుకే ఇలా మాట మార్చేశావా? అని అడుగుతున్నారు. ఈ ట్రోలింగ్ చూసిన కల్యాణ్.. వెంటనే మెట్టు దిగొచ్చాడు. టికెట్ టు ఫినాలేలో తనూజ తనకోసం ఆడిందని చెప్పాడు. అయినప్పటికీ తనూజ ఫ్యాన్స్ శాంతించలేదు. ఒక్కోదగ్గర ఒక్కో మాట మాట్లాడుతూ బాగానే డ్రామాలు చేస్తున్నావ్.. అని మండిపడుతున్నారు. -
'తనూజ'కు మర్యాద మనీష్ క్షమాపణలు
బిగ్‌బాస్ సీజన్-9లో కామనర్‌గా ఎంట్రీ ఇచ్చిన మర్యాద మనీష్ రెండో వారంలోనే ఎలిమినేట్ అయ్యాడు. కానీ, తనూజ మీద తను చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. నామినేషన్స్ ప్రక్రియ కోసం హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన మనీష్.. తనూజ గురించి చెప్తూ 'ముద్దు మాటలతో చెవిలో మందార పూలు పెడుతున్నారు' కొంతమంది అంటూ డైలాగ్ కొట్టాడు. దీంతో అతనిపై విమర్శలు కూడా వచ్చాయి. ఫైనల్ ఎపిసోడ్లో తనూజ కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ మనీష్ చేసిన వ్యాఖ్యలు తనను చాలా బాధించాయని పేర్కొంది. దీంతో తాజాగా మనీష్ క్షమాపణలు చెబుతూ ఒక పోస్ట్ చేశాడు.ఎవరైనా క్వీన్‌పై దాడి చేస్తారు.. 'ప్రియమైన తనూజ పుట్టస్వామి మీ ఆట గురించి ఎక్కడ ప్రారంభించాలి, ఏమి చెప్పాలి! 105 రోజులుగా, ఇంత తెలివైన, అద్భుతమైన ఆటను బయటకు తీయడం దాదాపు అసాధ్యం. కానీ, దానిని మీరు సాధించారు. మీరు చేసిన పోరాటం ఎప్పటికీ మరిచిపోలేరు. మీరు ఎల్లప్పుడూ ఈ సీజన్లో నా టాప్- 5 లిస్ట్‌లో ఉన్నారు. నేను కూడా కొన్నిసార్లు మీకు ఓటు వేసాను. నాకు చెస్ అంటే చాలా ఇష్టం. చెస్‌లో క్వీన్ బలమైనదిగా ఉంటుంది. అక్కడ ఆట గెలవడానికి అందరూ ముందుగా క్వీన్‌పై దాడి చేయాలి అనుకుంటారు. క్వీన్ పోతే గేమ్ కుడా పోయినట్లే. నేను తిరిగి హౌస్‌లోకి వచ్చినప్పుడు.. మీతో నా ఆట ఆడవలసి వచ్చింది. ఎందుకంటే మీరు క్వీన్ ఆపై ఈ సీజన్లో బలమైన ఆటగాళ్ళలో ఒకరు. ఇంటి లోపలే కాదు.. బయట కూడా మీరు బలంగానే ఉన్నారు.బహిరంగ క్షమాపణకానీ, మీరు ఫైనల్ వేదికపై నా మాటలకు చెడుగా భావించారని చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను. ఆ సమయంలో నాకు మైక్ దొరికితే షోలోనే హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పేవాడిని. కానీ, అవకాశం రాలేదు. అయితే, నిన్ను కలిసినప్పుడు నేను మొదట చేసిన పని క్షమాపణలు చెప్పడమే..! కానీ. మరోసారి ఇలా బహిరంగంగా క్షమాపణ చెప్పడం కూడా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మనమందరం చేసినదంతా ఆట కోసమే! క్షమాపణ చెప్పడం ద్వారా ఎవరూ చిన్నవారు లేదా పెద్దవారు కాలేరు. ఆరోగ్యకరమైన రేపటి కోసం హృదయపూర్వక హస్తాన్ని అందిస్తున్నట్లు అవుతుంది! ఇదే సమయంలో మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. 9వ రోజు నేను ఇంట్లో చాలా ఒంటరిగా ఉన్నట్లు అనిపించింది. మీరు దానిని గ్రహించి నాతో మాట్లాడారు. ఇవన్నీ ఎప్పటికీ మరిచిపోలేను. BB అభిమానులు చివరి వరకు గుర్తుంచుకునే ఆటను మీరు ఆడారు! ఆపై మీరు చాలా మందిని గెలుచుకున్నారు.' అంటూ తనూజతో దిగిన ఒక ఫోటోను షేర్ చేస్తూ మనీష్ పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Maryada Manish (@maryada.manish) -
బిగ్‌బాస్ బజ్: కల్యాణ్ పడాల నెక్స్ట్ టార్గెట్ అదే!
ఒక సామాస్యుడు బిగ్‌బాస్ ట్రోఫీ గెలిచినట్లు చరిత్రలోనే లేదు. కానీ ఆ చరిత్రను తిరగరాశాడు కామన్ మ్యాన్ పవన్ కల్యాణ్ పడాల. సీఆర్పీఎఫ్ జవాన్‌గా అగ్నిపరీక్షలో అడుగుపెట్టాడు. అక్కడ తన టాలెంట్‌తో జడ్జిలను మెప్పించి తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్లో అడుగుపెట్టాడు.21 మందిని వెనక్కు నెట్టి..హౌస్‌లో టైంపాస్ చేసేసరికి ఎక్కువరోజులు ఉండడులే అని అంతా అనుకున్నారు. కానీ నాగార్జున ఇచ్చిన వార్నింగ్‌తో కల్యాణ్ అలర్ట్ అయి గేమ్‌పై ఫోకస్ పెట్టాడు. గేమ్ కోసం ఏదైనా చేసేవాడు. అలా తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9లో పాల్గొన్న 21 మంది వెనక్కు నెట్టి బిగ్‌బాస్ ట్రోఫీని ఇంటికి తీసుకెళ్లిపోయాడు.కేక్ కటింగ్బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే బజ్ ఇంటర్వ్యూకి హాజరవ్వాల్సి ఉంటుంది. తాజాగా బజ్‌లో శివాజీతో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. అందులో శివాజీ మాట్లాడుతూ.. తననే తాను చెక్కుకున్న శిల్పి అని పొగిడాడు. తన గేమ్ ఛేంజ్ అవడానికి కారణం దివ్య అని గుర్తు చేశాడు. నీలో స్పిరిట్ రగిలించిందే తను అనడంతో కల్యాణ్ దివ్యకు కృతజ్ఞతలు తెలియజేశాడు.గ్రేట్ యాక్టర్ అవాలనుకుంటున్నాఎలాంటి సినిమాలు చేద్దామనుకుంటున్నావ్? అన్న శివాజీ ప్రశ్నకు కల్యాణ్ మాట్లాడుతూ.. స్టార్, హీరో అని కాకుండా గ్రేట్ యాక్టర్ అవాలనుకుంటున్నాను. నాలుగు నెలల క్రితం నేనెవరికీ తెలియదు. మా ఊర్లోనే ఎవరికీ తెలీదు. అలాంటిది ఈ అవకాశం ఇచ్చి అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్ వరకు నన్ను ప్రోత్సహించిన అందరికీ రుణపడి ఉంటాను అని చెప్పుకొచ్చాడు. -
బిగ్‌బాస్ ఓటమి తర్వాత తనూజ ఫస్ట్ పోస్ట్
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్ హోరాహోరీగా జరిగింది. అసలు సిసలైన పోటీ తనూజ, కల్యాణ్ మధ్యే జరిగింది. ఇద్దరికీ భారీగా ఓట్లు పడ్డాయి. చాలా తక్కువ పర్సంటేజ్‌తో తనూజ ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఓటమి తర్వాత తనూజ సోషల్ మీడియాలో ఫస్ట్ పోస్ట్ పెట్టింది.అందులో ఏం రాసిందంటే..బిగ్‌బాస్ సీజన్‌కు 9కి థాంక్స్.. ఈ జర్నీ అంత ఈజీ కాదు. కానీ బిగ్‌బాస్ ఇంటి లోపల నేనెన్నోసార్లు నవ్వాను, ఏడ్చాను, కిందపడ్డాను. తిరిగి లేచి నిల్చున్నాను. ప్రతిసారి బలంగా నిలబడ్డాను. ప్రతి టాస్కు నిజాయితీగా ఆడాను. నాకెదురైన సవాళ్లను ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నాను. పరిస్థితులు ఎంత కఠినంగా మారినా సరే నేను నాలాగే ఉన్నాను. మీ ప్రేమే నా నిశ్శబ్ధాన్ని శక్తిగా మార్చింది. అదే అతిపెద్దక్సెస్మీరు వేసిన ఓట్లే నా గొంతుకగా వినిపించాయి. మీరు నాపై పెట్టుకున్న నమ్మకమే అతి పెద్ద విజయం. ఈరోజు నేను బిగ్‌బాస్ హౌస్‌ను వీడానేమో కానీ.. దీనిద్వారా మీతో ఏర్పరుచుకున్న బంధాన్ని మాత్రం జీవితాంతం కొనసాగిస్తాను. ఇది ముగింపు కాదు.. కొత్త అధ్యాయానికి ప్రారంభం. మీ అందరికీ ఎప్పటికీ కృతజ్ఞురాలినై ఉంటాను. గుణపాఠం నేర్చుకున్నా..మీ ప్రేమాభిమానాలు చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ జర్నీలో నేను ధైర్యంగా ఉండటం నేర్చుకున్నాను. ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాను. జీవితానికి సరిపడా జ్ఞాపకాలు, ప్రేమను కూడబెట్టుకున్నాను. మీ ప్రతి ఓటు, మీ సపోర్ట్, నాకోసం చేసిన ప్రార్థనలు అన్నీ కూడా నాకెంతో విలువైనవి.నిజమైన ఫైటర్మీలో ఒకరిగా హౌస్‌లో అడుగుపెట్టాను. ఇప్పుడు మీ అందరినీ నా మనసులో నింపుకుని బయటకు వచ్చేశాను. బిగ్‌బాస్ 9కి ముగింపు పలుకుతున్నాను అని తనూజ (Thanuja Puattaswamy) రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు నువ్వు నిజమైన ఫైటర్‌వి అని కొనియాడుతున్నారు. నీ జర్నీతో ఎంతోమందిని ఇన్స్పైర్ చేశావు అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Thanuja Puttaswamy (@thanuja_puttaswamy_) -
లేడీ సెలబ్రిటీలు తస్మాత్ జాగ్రత్త.. మీ గతి కూడా ఇంతే!
అనుకుంటే అయిపోద్ది సామీ అంటుంటారు. అనుకోవడమే కాదు, గెలుపు కోసం అలుపెరగకుండా కష్టపడినా సరే లేడీ కంటెస్టెంట్లు విన్నర్ కాలేకపోతున్నారు. తెలుగు బిగ్‌బాస్ మొదటి సీజన్ నుంచి తొమ్మిదో సీజన్ వరకు ఇదే తంతు. పోనీ విన్నర్ క్వాలిటీస్ ఉన్న బలమైన కంటెస్టెంట్లు రాలేదా? అంటే అది తప్పుమాటే అవుతుంది.గీతామాధురి, శ్రీముఖి, తనూజ.. వీళ్లంతా బలంగా నిలబడ్డవాళ్లే.. గొంతెత్తి ప్రశ్నించినవాళ్లే! గెలుపు కోసం నిరంతరం శ్రమించినవాళ్లే! కానీ ఏం లాభం? విజయం వాకిటవరకు వచ్చి వెనక్కు వెళ్లిపోతున్నారు, కాదు కాదు ప్రేక్షకులే వాళ్లను కర్కశంగా వెనక్కు పంపించేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రాబోయే సీజన్స్‌లో అయినా బిగ్‌బాస్ ట్రోఫీని ఒక మహిళ గెలుస్తుందా? అన్న సందేహం తలెత్తక మానదు.సింపతీకే ఓటుతెలుగు బిగ్‌బాస్ మొదటి సీజన్లో కామెడీతో నవ్వించి, టాస్కులతో అదరగొట్టి చలాకీగా, హుషారుగా కనిపించిన హరితేజ సెకండ్ రన్నరప్ స్థానంతో సరిపెట్టుకుంది. తర్వాతి సీజన్లో గాత్ర మాధుర్యంతో మెప్పించింది గీతామాధురి. అంతేనా.. చాలా మెచ్యూర్డ్‌గా, బ్యాలెన్స్డ్గా ఆడుతూ కౌశల్‌కు గట్టి పోటీనిచ్చింది. ప్రేక్షకులు ఆమె మాటతీరుకు మురిసిపోయారు.. కానీ ట్రోఫీ ఇచ్చేందుకు మాత్రం ఇష్టపడలేదు. సింపతీ, సెంటిమెంట్‌తో కొట్టిన కౌశల్‌కు టైటిల్ కట్టబెట్టారు. దీంతో గీతా రన్నరప్ స్థానంతో సరిపెట్టుకుంది.పోరాడినా ఫలితం దక్కలేదుమూడో సీజన్లో యాంకర్ శ్రీముఖి అడుగుపెట్టగానే విన్నర్ నడిచొస్తుందనుకున్నారు. బిగ్‌బాస్ కోసం ఆమె చేతిపై పచ్చబొట్టు కూడా వేయించుకుంది. బయట ఎంత చలాకీగా ఉందో.. హౌస్‌లోనూ అంతే చలాకీగా ఉంది. కామెడీ చేస్తూ టాస్కులు ఆడుతూ తనవల్ల అయినంతవరకు పోరాడింది. అయినా జనాలకు ఆమెను గెలిపించబుద్ధి కాలేదు. సింగర్ రాహుల్ ట్రోఫీ గెలవగా శ్రీముఖి రన్నరప్ స్థానానికి పరిమితమైంది.ఇన్నాళ్లకు సరైన కంటెస్టెంట్!ఆ తర్వాత ట్రోఫీని గెలిచేంత బలమైన కంటెస్టెంట్లు ఎవరూ హౌస్‌కి రాలేదు. దాదాపు ఆరు సీజన్ల తర్వాత మళ్లీ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అడుగుపెట్టింది. తనే తనూజ పుట్టస్వామి. అందంతో పాటు తెలివి ఆమె సొంతం. తనకు గుర్తింపునిచ్చిన తెలుగు ప్రేక్షకులకు గుండెలో గుడి కట్టింది. అవకాశం దొరికినప్పుడల్లా వీరి వల్లే ఇక్కడున్నానని పదేపదే నొక్కి చెప్పింది. తెలుగు ప్రేక్షకులను తన సెకండ్ ఫ్యామిలీగా భావించింది.ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా..మొదటి రోజు నుంచే మాస్క్ లేకుండా తను తనలాగే ఉంది. కోపం, చిరాకు, అసహనం, బాధ, కన్నీళ్లు, అలక.. అన్నీ చూపించింది. వేటినీ దాచుకోలేదు. బంధాలకు పెద్దపీట వేసింది. అదే సమయంలో అబ్బాయిలకు ఎక్కువ చనువు ఇవ్వకుండా హద్దుల్లో పెట్టింది. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా పద్ధతైన సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపించింది. ఏ ఆటైనా ఆడతానని ముందుకు వచ్చింది. సీజన్ విజయానికి కారకురాలుఓడినా సరే గెలిచేవరకు శ్రమించింది. డబుల్ ఫేస్ లేకుండా అద్దంలా స్వచ్ఛంగా తనేంటో చూపించింది. మాస్టర్‌మైండ్‌తో ఆటను తిప్పింది. తెలుగు బిగ్‌బాస్ 9 విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. తను లేకపోతే ఈ సీజనే లేదు అన్నంతగా ప్రభావితం చేసింది. అయినా తనను విజయం వరించలేదు. ఇది తనూజ అభిమానులకే కాదు, ఎంతోమంది నెటిజన్లకు సైతం నచ్చలేదు. సీజన్ 9ను తన భుజాలపై మోసిన తనూజకు అన్యాయం జరిగిందంటున్నారు. లేడీ సెలబ్రిటీలు జాగ్రత్తఅమ్మాయిలను విజేతగా చూడటం మన జనాలకు నచ్చదా? ఇంకేం చేస్తే వారిని గెలిపిస్తారు? అసలు ఇంతకంటే ఇంకేం చేయగలరు? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇకముందు రాబోయే లేడీ సెలబ్రిటీలను సైతం హెచ్చరిస్తున్నారు. టీఆర్పీ కోసం మిమ్మల్ని వాడుకుంటారే తప్ప ట్రోఫీ మాత్రం ఇవ్వరని.. అది దృష్టిలో పెట్టుకుని షోకి రావాలా? వద్దా? అనేది ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోమని చెప్తున్నారు. బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ (ఓటీటీ సీజన్లో బిందుమాధవి గెలిచింది) మినహా తొమ్మిది సీజన్లలో ఒక్క లేడీ విన్నర్ లేకపోవడం నిజంగా విచారకరమే! -
కల్యాణ్ పడాల విజయంలో 'లేడీ క్వీన్'
బిగ్‌బాస్ సీజన్-9 గ్రాండ్ ఫైనల్లో తనూజ, కల్యాణ్‌లు చరిత్ర తిరగ రాశారు. ఫైనల్ వరకు చేరుకున్న వారిద్దరూ హౌస్‌లో మంచి బాండింగ్‌తో ఉంటూనే రేసులో ఉన్నారు. కామనర్‌గా ఎంట్రీ ఇచ్చిన కల్యాణ్ విజేతగా నిలవడం గొప్ప విషయమేనని చెప్పాలి. సీజన్-7లో కూడా శివాజీ, పల్లవి ప్రశాంత్‌లు కూడా ఇలాంటి బాండింగ్‌నే కొనసాగించారు. పల్లవి ప్రశాంత్ విజయంలో శివాజీ పాత్ర ఎంత కీలకమో తెలిసిందే.. అయితే, కల్యాణ్ గెలుపులో తనూజ పాత్ర కూడా అంతే రేంజ్లో ఉందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఇదే పాయింట్‌ను కల్యాణ్ కూడా స్టేజీపైనే ఒప్పుకున్నాడు. తన గెలుపులో ఆత్మవిశ్వాసం నింపిన వారిలో ఫస్ట్ ప్రియ, సెకండ్ శ్రీజ ఉంటారని చెబుతూ.. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లేడీ క్వీన్ తనూజకి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పడం విశేషం. ఈ క్రమంలోనే తనూజ గురించి కల్యాణ్ ఇలా చెప్పాడు. ' ఈ స్టేజ్ మీద నుంచి చెప్తున్నా ఒకానొక సందర్భంలో కల్యాణ్ గాడికి ధైర్యం ఇచ్చి ముందుకు పంపించింది తనూజానే.. నేను ఒప్పుకుంటా అది.." అంటూ క్లారిటీ ఇచ్చాడు.బిగ్‌బాస్ రివ్యూవర్లు కూడా చాలామంది ఇదే మాట చెప్పడం విశేషం. బిగ్‌బాస్ సీజన్-7లో కూడా ఇలాంటి మ్యాజిక్‌నే జరిగింది. పల్లవి ప్రశాంత్ కోసం శివాజీ చాలా బలంగా నిలిచారు. తను 2వ రన్నర్‌గా నిలిచినప్పటికీ ఎలాంటి బాధను చూపలేదు. హౌస్‌లో ప్రతిచోట పల్లవి ప్రశాంత్ కోసం స్టాండ్ తీసుకుంటూ తన గెలుపు కోసం రోడ్ క్లియర్ చేశారు. ఫైనల్‌గా అమర్‌దీప్‌కు ట్రోఫీ అందుతుందని అందరూ అనుకుంటే శివాజీ గేమ్ స్ట్రాటజీ వల్ల ప్రశాంత్ సులువుగా విన్నర్ అయిపోయాడు. అయితే, ఈ సీజన్లో కూడా తనూజ వరుసగా పదివారాల పాటు టాప్‌లో ఉంది. 11వ వారం నుంచి ఒక్కసారిగా కల్యాణ్ రేసులోకి వచ్చేశాడు. అందుకు కారణం తనూజానే అని తను కూడా పలుమార్లు చెప్పాడు. తన గెలుపు కోసం తనూజ ఇచ్చిన సలహాలు చాలా వున్నాయని కల్యాణ్ ఒప్పుకోవడం విశేషం.#KalyanPadala acknowledging his Sisters- Priya SrijaMentor- ThanujaThis is who he isHe never forgets to show gratitude ❤️❣️Thanks Kalyan for proving the Haters that we supported right person#BiggBossTelugu9pic.twitter.com/lMkB9P4qO1— Jeeva S (@JeevaS4853) December 21, 2025 -
ఛీ కొట్టినవారితో చప్పట్లు.. కల్యాణ్ విజయానికి కారణాలివే!
తప్పులు చేయని మనిషంటూ ఉండడు. కానీ ఆ తప్పులు తెలుసుకుని సరిదిద్దుకున్నవాడే జీవితంలో ముందుకు వెళ్తాడు. బిగ్‌బాస్ షోలోనూ ఇదే వర్తిస్తుంది. అగ్నిపరీక్షలో కల్యాణ్ దూకుడు, అతడిలోని కసి చూసి.. ఇలాంటి కంటెస్టెంట్ కదా బిగ్‌బాస్‌కు కావాల్సింది అనుకునేలా చేశాడు. అతడి ఆట, మాట తీరు చూసి విన్నర్ మెటీరియల్ అని ముందుగానే ఫిక్సయిపోయారు.(Kalyan Padala Bigg Boss Winning Reasons)అంతా తలకిందులుకట్ చేస్తే బిగ్‌బాస్ 9కి వచ్చాక పరిస్థితి తలకిందులైంది. పిక్నిక్కు వచ్చినట్లు ఓ మూలన కూర్చునేవాడు. ఏదో కరువులో ఉన్నట్లు అమ్మాయిలను ఓరగా చూస్తూ అదే పెద్ద పనిగా పెట్టుకున్నాడు. ఇతడు చేసిన పనులకు మూడోవారం ఎలిమినేట్ అయి వెళ్లిపోయేవాడే! కానీ నాగార్జున చెప్పిన హింట్లను గ్రహించాడు. ఎప్పుడూ ఆడాళ్ల చేతులు రాస్తూ కూర్చోవడమేనా? అని నాగ్ గడ్డి పెట్టడంతో తేరుకున్నాడు. ఇలాగే ఉంటే నీ ఆట ముగిసిపోతుందని వార్నింగ్ ఇవ్వడంతో అలర్ట్ అయ్యాడు.రూటు మార్చాడుఅప్పటికే వరుసగా కామనర్లు ఎలిమినేట్ అవుతుండటంతో ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు. ఆట, మాట, తీరు అన్నీ మార్చుకున్నాడు. అగ్నిపరీక్షలో కనిపించిన కల్యాణ్‌ను తిరిగి చూపించాడు. నాలుగోవారం నుంచి విజృంభించి ఆడాడు. టాస్కులు వస్తే గెలిచేవరకు వేటాడాల్సిందే అన్నంత కసిగా ఆడాడు. అందరితోనూ కలిసిపోయాడు. మనింటి కుర్రాడే అన్నంతగా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు.జనాలకు కనెక్ట్..తనకు ఇష్టమైనవాళ్లు ఎలిమినేట్ అయినా, బాధపడుతున్నా అస్సలు తట్టుకునేవాడు కాదు. వాళ్లకు ఏదైనా బాధ వచ్చిందంటే ఇతడే ఎక్కువ ఏడ్చేవాడు. అలా కల్యాణ్ స్వభావానికి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ఎన్నో అవమానాలు పడ్డ కల్యాణ్ పడ్డచోటే లేచి నిల్చున్నాడు. ఛీ కొట్టినవారితోనే శెభాష్ అనిపించేలా చేసుకున్నాడు. తనూజతో పోటీపడేవాళ్లే లేరా? అన్న సమయంలో అందరికీ ఓ ఆశాదీపంలా కనిపించాడు.కలిసొచ్చిన ప్రచారంకల్యాణ్ కోసం సోషల్ మీడియాలో బోలెడంత సింపతీ ప్రచారం జరిగింది. సోల్జర్ అని, పేదవాడు అని రకరకాలుగా ప్రచారం చేశారు. అది అతడికి బాగా కలిసొచ్చింది. అయితే హౌస్‌లో మాత్రం అతడెప్పుడూ ఆ కార్డులు బయటకు తీసి వాడుకోవాలని చూడలేదు. కానీ బిగ్‌బాస్ మాత్రం కుదిరినప్పుడల్లా అతడు జవాన్ అని గుర్తు చేశాడు. 'జై జవాన్' అన్న నినాదం అతడి విజయంలో కీలక పాత్ర పోషించింది. -
ఇది సార్ తనూజ బ్రాండు! ఎంత సంపాదించిందంటే?
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్లో బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమున్న ముఖం తనూజ పుట్టస్వామి. సీరియల్ నటిగా అందరికీ తను సుపరిచితురాలే! ఆమె హౌస్‌లో అడుగుపెట్టినప్పుడే విన్నర్ కదిలిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అరుపులు, కేకలు, ఏడుపులు చూసి ఈమేంట్రా బాబూ ఇలా ఉందని తల పట్టుకున్నారు. రానురానూ అవన్నీ తన ఎమోషన్స్ అని, తను నటించకుండా తనలాగే ఉందని జనాలు పసిగట్టారు. మనింటి అమ్మాయిఇంట్లో అమ్మలా వండిపెట్టడం, అక్కలా ఆజమాయిషీ చేయడం, చెల్లిలా అల్లరి చేయడం, అన్నింట్లో తానే ఆడతానంటూ ముందుకు రావడం, అలగడం.. ఇవన్నీ జనాలకు కనెక్ట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా తన డ్రెస్సింగ్ సెన్స్‌కు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఎప్పుడూ పద్ధతిగానే కనిపించేది. కొన్నిసార్లు మోడ్రన్ దుస్తులు వేసుకున్నా ఏరోజు కూడా గ్లామర్ షో చేయలేదు. అబ్బాయిలను హద్దుల్లో ఉంచుతుంది.ఫ్రెండ్ కోసం స్టాండ్అతి చనువుకు, లవ్ ట్రాక్‌కు ఛాన్సివ్వలేదు. అదే సమయంలో సెలబ్రిటీ అన్న గర్వం చూపించకుండా అందరితో ఇట్టే కలిసిపోయింది. స్నేహితుడిగా భావించిన కల్యాణ్ క్యారెక్టర్‌ను వక్రీకరించినప్పుడు అండగా నిలబడింది. తానే తప్పూ చేయలేదని అడ్డంగా వాదించింది. ఫ్రెండ్ రీతూని సేవ్ చేసి తనకు అండగా నిల్చుంది. ఇలా తను ఇష్టపడేవారికి తోడుగా ఉంది. తనలో ఉన్న ఓ గొప్ప లక్షణం. ఎంతటి శత్రువునైనా మిత్రువుని చేసుకుంటుంది. శత్రువు కూడా మిత్రువే!వైల్డ్‌కార్డ్‌గా వచ్చిన మాధురి, ఆయేషా.. తనూజపై నిప్పులు చెరిగి తొక్కేయాలని చూశారు. కానీ చివరకు తనూజ చేతిలో మాధురి పూర్తిగా బెండ్ అయిపోయింది. ఆయేషా ఫ్రెండ్ అయిపోయింది. భరణి నాన్నతో బంధం, మధ్యలో దివ్య రాక.. గొడవలు, దూరం.. వీటన్నింటివల్ల నలిగిపోయినా తిరిగి నిలదొక్కుకుంది.గెలిచేవరకు పోరాటంఅవసరమైనప్పుడు తనూజ అందరి సపోర్ట్ తీసుకున్న మాట వాస్తవం. కానీ హౌస్‌లో అందరూ ఏదో ఒక సందర్భంలో మిగతావారి సపోర్ట్ తీసుకున్నారు. అయితే తనూజనే ఎక్కువ హైలైట్ చేశారు.. షో మొదలైనప్పటినుంచి తనూజ చుట్టూనే గేమ్ అంతా సాగిందని బిగ్‌బాసే స్వయంగా ఒప్పుకున్నాడు. ఆమె ఎన్నోసార్లు మైండ్ గేమ్ ఆడింది. ఇమ్మాన్యుయేల్‌తో సమానంగా ఈ సీజన్‌ను తన భుజాలపై మోసింది. చాలా టాస్కుల్లో చివరి వరకు వచ్చి ఓడిపోయేది. అయినా గెలిచేవరకు పోరాడతా అన్న కసితో ముందడుగు వేసేది. పారితోషికం ఎంత?ఎవరితో గొడవలు జరిగినా సరే.. వాళ్ల గురించి చెడుగా మాట్లాడటం.. వెనకాల గోతులు తవ్వడమనే పనులు ఏరోజూ చేయలేదు. కానీ తనపై సోషల్ మీడియాలో ఎక్కడలేని నెగెటివిటీ.. ఫలితంగా టాప్ 2లో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. పోరాడి ఓడినా తలెత్తుకుని సగర్వంగా బయటకు వచ్చింది. తనూజ వారానికి రూ.2.50 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన 15 వారాలకుగానూ రూ.37,50,000 వెనకేసింది.చదవండి: తెలుగు బిగ్‌బాస్‌లో చరిత్ర సృష్టించిన కల్యాణ్ -
బిగ్‌బాస్ 9 విన్నర్‌గా కల్యాణ్.. రూ.50 లక్షలు సొంతం!
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్ ముగిసింది. 105 రోజుల యుద్ధానికి తెర పడింది. నేడు (డిసెంబర్ 21న) జరిగిన గ్రాండ్ ఫినాలేలో సంజనా ఐదో స్థానంలో, ఇమ్మాన్యుయేల్ నాలుగో స్థానంలో నిలవగా పవన్ సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. తనూజపై కామనర్ పవన్ కల్యాణ్ పడాల గెలిచాడు. బిగ్‌బాస్ షోలో అడుగుపెడ్తే చాలనుకున్న స్టేజీ నుంచి సీజన్ ట్రోఫీని ముద్దాడే స్థాయికి ఎదిగాడు. సామాన్యుడు తల్చుకుంటే జరనిదంటూ ఏమీ ఉండదని నిరూపించాడు. అతడి సంకల్ప బలానికి, ప్రేక్షకుల అభిమాన బలం తోడైంది. ఫలితంగా విజేతగా నిల్చాడు. సెలబ్రిటీ తనూజను ఓడించి మరీ విజయ పతాకం ఎగరవేశాడు. అతడి గెలుపును సామాన్యులందరూ తమ విజయంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తొలిసారి తెలుగు బిగ్‌బాస్ ట్రోఫీని అందుకున్న సామాన్యుడిగా చరిత్రకెక్కాడు.రెమ్యునరేషన్ ఎంత?సామాన్యులందరికీ ఒకటే రెమ్యునరేషన్ ఫిక్స్ చేసింది బిగ్‌బాస్ టీమ్. అలా అందరిలాగే కల్యాణ్‌కు సైతం ప్రతి వారానికి రూ.70,000 అందాయి. పదిహేను వారాలకుగానూ రూ.10.50 లక్షలు సంపాదించాడు. ట్రోఫీతోపాటు రూ.50 లక్షలు కూడా కైవసం చేసుకునేవాడే! కానీ, పవన్ రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకోవడంతో మిగిలిన రూ.35 లక్షలు తన సొంతం చేసుకున్నాడు. రాఫ్ టైల్స్ వారు మరో రూ.5 లక్షలు గిఫ్టిచ్చారు. అలా మొత్తంగా రూ.50 లక్షలకుపైగా సంపాదించాడు. డబ్బుతో పాటు మారుతి సుజుకికి చెందిన విక్టోరిస్ కారును సైతం తన సొంతం చేసుకున్నాడు. ఆరు వేరియంట్లలో లభించే ఈ కారు విలువ రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉంది. -
సూట్‌కేస్ తీసుకున్న పవన్.. మొత్తం ఎంత వెనకేశాడంటే?
బిగ్‌బాస్ 9 నుంచి డీమాన్ పవన్ ఎలిమినేట్ అయ్యాడు, కాదు తనంతట తానే తలెత్తుకుని బయటకు వచ్చాడు. అగ్నిపరీక్ష పోటీలో గెలిచి షోలో అడుగుపెట్టినప్పుడు అసలు ఇతడికి ఎలా అవకాశమిచ్చారని చాలామంది మాట్లాడుకున్నారు. కానీ తన ఎంపిక ఏదో అల్లాటప్పా కాదని పవన్ నిరూపించాడు. రీతూతో బంధంపై విమర్శలు వచ్చినప్పటికీ టాస్కుల పరంగా తన బెస్ట్ ఇచ్చాడు. సూట్‌కేస్‌తో బయటకురెండుసార్లు కెప్టెన్ కూడా అయ్యాడు. ఏకంగా టాప్-3లో చోటు దక్కించుకున్నాడు. తెలివిగా మాస్ మహారాజ రవితేజ ఆఫర్ చేసిన రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకుని బయటకు వచ్చేశాడు. సీజన్ అంతా పవన్‌ను తొక్కేసిన బిగ్‌బాస్.. జర్నీ వీడియోలో మాత్రం వేరే లెవల్ ఎలివేషన్ ఇచ్చాడు. మీ విల్ పవర్, ఫిట్నెస్ మాత్రమే కాదు, గెలుపు కోసం చివరివరకూ పోరాడే తత్వం మిమ్మల్ని నిజమైన యోధుడిగా మార్చేశాయి. ముందు తొక్కేసి తర్వాత పొగడ్తలుకామనర్గా అడుగుపెట్టిన పవన్ యోధుడిగా మారారు. అమాయకమైన చిరునవ్వు వెనకున్న డీమాన్ ఏంటో అందరికీ చూపించారు. నామినేషన్లలో ఎంతమంది మాటలతో దాడి చేసినా, మీరు మౌనంగా నిలబడ్డారు. అవసరమైనప్పుడు మాత్రమే ధీటుగా బదులిచ్చారు' అని చెప్పుకొచ్చాడు. ఓ దశలో రీతూతో బంధం కారణంగా డీమాన్ ఆటతీరుపై చాలానే విమర్శలు వచ్చాయి. టాస్కుల బాహుబలికానీ వాటిని తట్టుకుని నిలబడ్డాడు. రీతూ ఎలిమినేట్ అయి బయటకెళ్లిపోయిన తర్వాత డీమాన్ అసలు గేమ్ బయటపడింది. పంచ్‌లేస్తూ కామెడీ చేయడం, టాస్కుల్లో బాహుబలిలా ఆడటం, గేమ్‌పై ఫుల్ ఫోకస్ లాంటి అంశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ స్పీడ్ ముందు నుంచి ఉండుంటే కచ్చితంగా విన్నర్ అయ్యేవాడే అని కూడా మాట్లాడుకున్నారు. ఏదేమైనా సెకండ్ రన్నరప్‌గా బయటకు వచ్చాడు.సంపాదన ఎంతంటే?ఇతడి రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. కామనర్స్ అందరికీ ఒకే పారితోషికం ఇచ్చారు. అలా డీమాన్‌కి కూడా వారానికి రూ.70 వేల పారితోషికం ఇచ్చేలా డీల్ కుదిరింది. ఓవరాల్‌గా 15 వారాలకుగానూ రూ.10.50 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. దీనికి రూ.15 లక్షలు తోడవడంతో మొత్తం రూ.25 లక్షలకు పైగా సంపాదించాడు. మొత్తానికి పవన్‌కు ఈ షోతో డబ్బుకు డబ్బు, పేరుకు తగ్గ గుర్తింపు వచ్చింది. -
ఆకాశానికెత్తి నట్టేట ముంచారు.. ఇమ్మూ కన్నీళ్లకు కారణమెవరు?
కష్టపడితే ఫలితం దానంతటదే వస్తుంటారు.. ఏదీ? రాదే? అందరికంటే ఎక్కువ కష్టపడిన ఇమ్మాన్యుయ్యేల్ను నాగార్జున సీజన్ అంతా ఆకాశానికెత్తారు. గోల్డెన్ స్టార్.. ప్రేక్షకుల సపోర్ట్ నీకే అంటూ మురిపించారు. గెలుపు గురించి ఢోకా లేదు, తడిగుడ్డ వేసుకుని పడుకో అన్నచందంగా బీబీ టీమ్ బిల్డప్ ఇచ్చింది. ట్రోఫీని ముద్దాడటమే ఆలస్యం అని గంపెడాశతో ఉన్న ఇమ్మాన్యుయేల్‌ను చివరకు నట్టేట ముంచారు. తప్పెవరిది?విన్నర్ కాదు కదా రన్నర్వి కూడా కాలేవంటూ నాలుగో స్థానంలో పడేశారు. అతడు పడ్డ కష్టానికి, వచ్చిన నాలుగో ర్యాంక్‌కు అసలు సంబంధమే లేదు. ఇక్కడ తప్పెవరిది? బిగ్‌బాస్ టీమ్‌దా? ప్రేక్షకులదా? పోనీ ఇమ్మూ కేవలం కామెడీ మాత్రమే పంచాడా? అంటే కానే కాదు. తనకున్న తెలివితేటలు అమోఘం. నాగార్జున ఏం అడుగుతాడు? ఈ వారం జరగనుంది? అని ముందే ఊహించేవాడు. అతడు లెక్క ఎప్పుడూ తప్పవలేదు. తను ఊహించిందే జరిగింది. సంజనాను అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తిసంజనా గుడ్డు దొంగతనం చేసినప్పుడు అందరూ కయ్యిమని అరుస్తూ ఆమెను నానామాటలు అంటుంటే ఇమ్మూ (Emmanuel) ఒక్కడే ఆమె గేమ్‌ప్లాన్ అర్థం చేసుకున్నాడు. తాను తిట్లుపడ్డా తప్పులేదు, కానీ ప్రేక్షకుల్ని ఎలాగైనా అలరించాలన్న ఆమె కసిని గమనించి ఫిదా అయ్యాడు. చంటిపాపను, కొడుకును వదిలేసి వచ్చిన ఆమెకు కొడుకయ్యాడు. ప్రేమను పంచాడు. ఆమె తప్పులు చేసినప్పుడు వారించాడు. కెప్టెన్సీ త్యాగంమాటలు తూలినప్పుడు హెచ్చరించాడు. నాగార్జున ముందు కూడా తప్పును తప్పే అని వాదించాడు. కానీ, తనను ఎలిమినేషన్ నుంచి కాపాడుకునే ఛాన్స్ వచ్చినప్పుడు క్షణం ఆలోచించకుండా కెప్టెన్సీని త్యాగం చేశాడు. కావాలంటే కెప్టెన్సీని మళ్లీ సంపాదిస్తానన్న ధైర్యం, అమ్మ కావాలన్న తపన.. రెండూ అతడిలో కనిపించాయి. ఎమోషనల్, తెలివితేటలు, మంచితనం, స్నేహబంధం వంటివెన్నో ఉన్నా అతడిలో కొన్ని మైనస్ కూడా ఉన్నాయి. ఆటను చేజేతులా నాశనం చేసుకున్నాడా?మొదట నామినేషన్ అంటే భయం. ఆ భయమే తన ఓటమికి పునాది వేసింది. సీజన్ మొత్తంలో అందరికంటే ఎక్కువ టాస్కులు గెలిచిన ఇమ్మూ.. తన సత్తా ఏంటో చూపించాడు. టాస్కుల మాస్టర్‌గా పేరు తెచ్చుకున్న అతడు టికెట్ టు ఫినాలేలో మాత్రం కల్యాణ్‌తో చేతులు కలిపాడు. ఇది అతడికి మరో మైనస్‌గా మారింది. సింగిల్ సింహంలా ఎన్నో గేమ్స్ ఆడి గెలిచిన ఇమ్మూ చివరికొచ్చేసరికి ఇలా మరొకరితో జోడీ కట్టి పక్కవాళ్లను ఓడించాలని చూడటం చాలామందికి నచ్చలేదు. మరోసారి రుజువైంది!కానీ ఇంతమాత్రానికే అతడిని నాలుగో స్థానంలో పెట్టడం కరెక్ట్ కాదనే చెప్పాలి. ఏదేమైనా ఇక్కడ ఇమ్మాన్యుయేల్ ఓడిపోలేదు.. అందరూ కలిసి అతడిని ఓడించారు. కమెడియన్లు ప్రాణం పెట్టి ఆడినా, కట్టే కాలేవరకు నవ్విస్తామన్నా వాళ్లను కేవలం జోకర్స్లాగే చూశారు. ఇప్పుడు అందరిలో జోకర్‌గానే నిలబెట్టారు. కమెడియన్స్ కప్పు గెలవలేరని మరోసారి రుజువు చేశారు! -
టాప్-5 నుంచి 'సంజన' ఎలిమినేట్.. భారీగా రెమ్యునరేషన్
బిగ్‌బాస్ తెలుగు 9 నుంచి సంజనా గల్రానీ టాప్- 5 నుంచి ఎలిమినేట్ అయ్యారు. నాలుగో రన్నర్‌గా ఆమె నిలిచారు. నటుడు శ్రీకాంత్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ ఎలిమినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. సంజన 105 రోజుల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నారు. మొదట ఆమె టాప్-5లో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. అయితే, కోడిగుడ్లు దొంగతనం చేసి నెట్టింట వైరల్ అయిపోయింది. అలా తన ఆట నెటిజన్లకు సులువుగా చేరిపోయింది. ఆ తర్వాత తల్లీకొడుకు బంధంతో ఇమ్మానుయేల్‌తో కనెక్ట్ అయిపోయింది. ఈ క్రమంలో ఇమ్ము నామినేషన్‌కు రాకపోవడంతో అతని అభిమానులు కూడా సంజనకు ఓట్లు వేస్తూ కాపాడారు. దీంతో సంజన సులువుగా టాప్-5 వరకు చేరుకుంది.సంజన ఆటలో ఇమ్ము చాలా కీలకం. అయితే, ఆమె చివరి వారాల్లో మాట్లాడిన తీరు, ఆట ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయింది. బిగ్‌బాస్‌లో ఆమె ప్రయాణం ఎలాంటి అద్భుతాన్ని క్రియేట్ చేసిందో సంజన జర్నీ వీడియో చూస్తే అర్థం అవుతుంది. సంజనలోని ఫన్నీ, ఎమోషనల్, గొడవలు వంటి వాటిని బాగా బాగా చూపించారు.సంజన రెమ్యునరేషన్సంజన ఇప్పటికే సుమారు 50కి పైగా సినిమాల్లో నటించింది. దీంతో ఆమె రెమ్యునరేషన్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. టాప్-5 ఉన్నవారందరి రెమ్యునరేషన్ భారీగానే ఉంటుంది. ఈ క్రమంలో సంజన గల్రానీ బిగ్‌బాస్ హౌస్‌లో మొత్తం 15 వారాలు కొనసాగారు. ఆమెకు రోజుకు 40 వేల వరకు రెమ్యునరేషన్ వచ్చినట్లు టాక్. అంటే ఒక వారానికి సుమారుగా రూ. 2.80 లక్షలు ఉంటుంది. అలా 15 వారాలు బిగ్ బాస్‌లో ఉన్నారు. దీంతో సుమారుగా రూ. 42 లక్షల వరకు పారితోషికాన్ని సంజన తీసుకున్నట్లు తెలుస్తోంది. -
బిగ్‌బాస్ 9 ఫినాలే ప్రోమో: కల్యాణ్‌కు తన్నుకొచ్చిన దుఃఖం
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్‌కు మరికొద్ది గంటల్లో శుభం కార్డు పడనుంది. ఈ గ్రాండ్ ఫినాలే కోసం ఎంతోమంది గెస్టులు బిగ్‌బాస్ స్టేజీపైకి రానున్నారు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. ఇందులో మంగ్లీ, పాయల్ రాజ్‌పుత్ వంటి పలువురు తారలు డ్యాన్స్ పర్ఫామెన్స్తో అల్లాడించారు. అలాగే ఛాంపియన్, అనగనగా ఓ రాజు సినిమా హీరోహీరోయిన్లు కూడా సందడి చేశారు.బిగ్‌బాస్ హౌస్‌లో శ్రీకాంత్హీరో శ్రీకాంత్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి ఒకర్ని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. ఎవరి టీషర్ట్‌పై అన్‌సేఫ్ అని రాస్తారో వారు ఎలిమినేట్ అయినట్లు లెక్క! ఇక్కడ అందరికంటే ఎక్కువ కల్యాణ్ భయపడ్డాడు. తాను వెళ్లిపోతున్నానేమో అని ఊహించి ఏడుపు ముఖం పెట్టాడు. కానీ కొంత షూటింగ్ నిన్ననే అయిపోవడంతో ఫస్ట్ సంజనా ఎలిమినేట్ అయినట్లు లీక్స్ వచ్చాయి. రోబో ఎలిమినేట్!తర్వాత రోబోను పంపించగా ఆ రోబో ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించింది. ప్రోమో చూస్తుంటే మాత్రం ఓపక్క టెన్షన్, మరోపక్క ఎంటర్టైన్మెంట్కు ఢోకా లేనట్లే కనిపిస్తోంది. ఇక ఈ సీజన్ దేశంలోనే టాప్ 1లో ఉందన్నారు నాగార్జున. బిగ్‌బాస్ 9 ట్రోఫీని చూపించేటప్పుడు మగువా మగువా.. పాట బీజీఎమ్ వేశారు. అంటే తనూజ గెలుస్తుందని ఏమైనా హింట్ ఇచ్చారా? అని నెటిజన్లు గుసగుసలు మొదలుపెట్టారు. ఆ ప్రోమో మీరూ చూసేయండి..& -
కష్టానికి విలువ లేదు.. కమెడియన్ రోహిణి ఆవేదన
అసలు సిసలైన విందు అంటే ఎలా ఉంటుంది? అన్నం, భిన్న రుచుల కూరలు, పెరుగు, ఒక స్వీటు, ఒక హాటు.. ఇలా అన్నీ కలిస్తేనే కదా ఒక ఫుల్ ప్యాకేజ్ మీల్లా ఉండేది. బిగ్‌బాస్ షో కూడా అంతే! ఇక్కడ ఏది తక్కువైనా జనాలకు ఎక్కదు. ప్రేక్షకులు కోరుకునేది గొడవలే... అలా అని కేవలం గొడవలు మాత్రమే పడతామంటే అందరికీ బీపీలు పెరిగిపోతాయి. అందరికీ నచ్చేది ఒక్కరేఓన్లీ లవ్ ట్రాక్స్ అంటే యూత్‌కు నచ్చుతుందేమో కానీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు అంతగా ఎక్కదు. అందరికీ నచ్చేది.. అందర్నీ అక్కున చేర్చుకునేది ఒక్క కమెడియన్ మాత్రమే! చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందర్నీ నవ్వించగలడు. ఒత్తిడి నుంచి కాసేపైనా బయటకు తీసుకురాగలడు. అందుకే టీవీలో, ఓటీటీలో బోలెడన్ని కామెడీ షోలు వస్తున్నాయి. కానీ వీటి వెనక బోలెడంత హంగామా, ప్రాక్టీస్ ఉంటుంది. బిగ్‌బాస్‌లో కామెడీ అంత ఈజీ కాదు!మరి బిగ్‌బాస్‌లో? అప్పటికప్పుడు సహజంగా నవ్వించాలి. ఎవర్నీ నొప్పించకుండా, అందర్నీ మెప్పించేలా కామెడీ పంచాలి. అవినాష్, రోహిణి, తేజ.. ఇలా పలువురూ తెలుగు బిగ్‌బాస్‌లో అడుగుపెట్టి ప్రేక్షకులకు నవ్వుల్ని పంచారు. కేవలం కామెడీని నమ్ముకోకుండా ఆటలోనూ శివంగి అని నిరూపించింది రోహిణి. ఫస్ట్ ఫైనలిస్ట్‌గా నిలిచి తన దమ్ము చూపించాడు ముక్కు అవినాష్. నాలుగో స్థానం..కానీ, వీళ్లెవరూ ట్రోఫీని అందుకోవడం కాదుకదా.. కనీసం రన్నరప్ కూడా అవలేకపోయారు. ఈసారి మాత్రం ఆ లోటును ఇమ్మాన్యుయేల్ తీర్చబోతున్నాడని బలంగా ఫిక్సయ్యారు. కానీ ఇమ్మూ నాలుగో స్థానంలో ఎలిమినేట్ అయినట్లు లీక్స్ బయటకు వచ్చాయి. అది జీర్ణించుకోలేక ఇమ్మూ స్టేజీపై బోరుమని ఏడ్చాడట.. ఈ విషయంపై కమెడియన్ రోహిణి సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇమ్మూ గురించి తెలిసి ఎంతో నిరాశచెందాను. నువ్వే రియల్ విన్నర్అతడి విషయంలో బిగ్‌బాస్ టీమ్, ప్రేక్షకులు.. ప్రతి ఒక్కరూ ఫెయిల్ అయ్యారు అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టింది. బిగ్‌బాస్ 9 సీజన్ నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. కష్టపడినా విలువ ఉండదు, దానికి తగ్గ ఫలితం రాదు. మీ దృష్టిలో ఎంటర్టైనర్స్కు ఏ స్థానం ఉందో మళ్లీ నిరూపించారు. ఇమ్మూ.. ఈ సీజన్‌కు నిజమైన విజేత నువ్వే.. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది అని రాసుకొచ్చింది. బిగ్బాస్కో దండం అన్నట్లుగా చేతులెత్తి జోడిస్తున్న ఎమోజీలను జత చేసింది. -
'బిగ్‌బాస్' తెలుగు విన్నర్‌ను ప్రకటించిన వికీపీడియా
బిగ్‌బాస్ తెలుగు 9 విజేత ఎవరు అనే సస్పెన్స్ సోషల్‌మీడియాలో కొనసాగుతుంది. కొన్ని గంటల్లో అధికారికంగా హోస్ట్ నాగార్జున ప్రకటించనున్నారు. కానీ, వికీపీడియాలో విజేత ఎవరు అనేది లిస్ట్‌తో సహా ప్రకటించింది. ఓటింగ్ ప్రకారం కల్యాణ్, తనూజలలో ఒకరు విజేత అవుతారని బలంగా వార్తలు వస్తున్నాయి. 22 మంది కంటెస్టెంట్స్ 105రోజుల పాటు ఉండాలని కష్టపడ్డారు. కానీ, ఫైనల్‌గా 5మంది మాత్రమే చివరి వరకు బరిలో ఉన్నారు. నేడు రూ. 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీ ఎవరు అందుకుంటారో తేలనుంది.బిగ్‌బాస్ విజేత తనూజ అని, రన్నర్‌గా కల్యాణ్ నిలిచారంటూ వికీపీడియా అప్డేట్ చేసింది. అందుకు సంబంధించిన లిస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. అధికారికంగా ప్రకటన రాకుండానే ఇలా విన్నర్ పేరును తెలపడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే, వికీపీడియా అనేది ప్రపంచంలో ఎవరైన సరే ఒక గ్రూప్‌గా ఏర్పడి కలిసి రాసే, సవరించగలిగే ఒక ఉచిత ఆన్లైన్ విజ్ఞాన సూచక మాత్రమే. దీనిని వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తుంది. వికీపీడియాకు అధికారికంగా ఎలాంటి సంబంధాలు బిగ్‌బాస్ టీమ్‌తో ఉండవు.బిగ్‌బాస్ -9 విజేతగా నిలిచిన కల్యాణ్బిగ్బాస్9 విజేతను అధికారికంగా కల్యాణ్ పడాల అంటూ హౌస్ట్ నాగార్జున ప్రకటించారు. దీంతో వికీపీడియాలో వచ్చిన అప్డేట్ పూర్తిగా అవాస్తవమని తేలిపోయింది. దీంతో వికీపీడియా కూడా కొంత సమయం తర్వాత దానిని సవరిస్తూ మరో లిస్ట్‌ను విడుదల చేసింది. అందులో కల్యాణ్ విజేతగా పేర్కొంది. -
ఈసారి రికార్డులు బద్ధలు.. ఆ కంటెస్టెంట్‌దే గెలుపు!
బిగ్‌బాస్ షో.. వంద రోజుల యుద్ధానికి తెర దించే సమయం ఆసన్నమైంది. ఫైనల్ ఓటింగ్స్ నిన్నటితో ముగిశాయి. ఈసారి కామనర్ గెలుస్తాడా? లేదా తనూజ గెలిచి లేడీ విన్నర్‌గా చరిత్ర సృష్టించనుందా? ఆన్లైన్ పోల్స్ ఏమని చెప్తున్నాయి? ఓటింగ్ ట్రెండ్ ఎటువైపు బలంగా ఉంది ఓసారి చూసేద్దాం..టాప్ 5 ఫైనలిస్టులుతెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ మొదలైనప్పుడు విన్నర్ మెటీరియల్‌లా ఒక్కరూ కనిపించడం లేదని జనాలే అనుకున్నారు. అలాంటి సమయంలో తనూజ తన రియల్ ఎమోషన్స్ చూపిస్తూ.. కసిగా గేమ్ ఆడుతూ విన్నర్ రేసులో ముందుకొచ్చింది. కమెడియన్‌గా నవ్విస్తూనే, టాస్కుల్లో దులిపేస్తూ నేనున్నానంటూ ముందుకు దూసుకొచ్చాడు ఇమ్మాన్యుయేల్. కామనర్‌గా వచ్చిన కల్యాణ్ గెలిస్తే ఆ కిక్కే వేరని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అది సరిపోదుమొన్నటిదాకా రీతూతో గొడవ వల్ల కనిపించకుండా పోయిన డిమాన్ పవన్ ఫైనల్ వీక్‌లో మాత్రం తన టాలెంట్ అంతా చూపిస్తున్నాడు. కానీ కప్పు గెలిచేందుకు ఇది సరిపోదు. గేమ్స్ అందరూ ఆడతారు.. కానీ ఆడించడం తెలిసుండాలి... స్కోప్ లేని దగ్గర కూడా కంటెంట్ క్రియేట్ చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది సంజనా. అలా ఫైనల్స్‌లో చోటు దక్కించుకున్న ఆమె టాప్ 5లో చివరి స్థానంతోనే సరిపెట్టుకోనుంది.ఓట్లు గుద్దిపడేసిన అభిమానులుటాప్ 5లో ఉన్న ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్లుగా హౌస్‌లో కష్టపడ్డారు. వారికోసం బయట అభిమానులు కూడా బీభత్సంగానే కష్టపడ్డారు. మిస్డ్ కాల్స్, హాట్‌స్టార్‌లో ఓటింగ్‌తో దుమ్ము లేపారు. గత సీజన్స్ కంటే కూడా ఈసారి ఎక్కువ ఓటింగ్ నమోదైనట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. వారం ప్రారంభం నుంచి శుక్రవారం వరకు కూడా సంజనా చివరి స్థానంలోనే ఉంది. పవన్‌కు పెరిగిన ఓటింగ్మూడు, నాలుగు స్థానాలు మాత్రం మారుతూ వచ్చాయి. పవన్‌లో హుషారు చూసి అతడికి ఓట్లు గుద్దిపడేశారు. దీంతో అప్పటిదాకా మూడో స్థానంలో ఉన్న ఇమ్మూ సడన్‌గా నాలుగో స్థానానికి పడిపోయాడు. కానీ వీకెండ్ వచ్చేసరికి ఇమ్మూ మళ్లీ ఒక మెట్టు పైకి ఎగబాకినట్లు వినికిడి. అసలు సిసలైన విన్నర్ పోటీ తనూజ, కల్యాణ్ మధ్యే జరుగుతోంది. వీళ్లిద్దరికీ హోరాహోరీగా ఓట్లు నమోదయ్యాయి.ఈ ఇద్దరి మధ్యే పోటీఇద్దరి మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా స్పల్పంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొదట్లో తనూజకు భారీగా ఓట్లు పడగా.. తర్వాత కల్యాణ్‌కు సడన్‌గా ఓటింగ్ రేంజ్ పెరిగిందంటున్నారు. దీంతో ఈ ఇద్దరిలోనే ఒకరు విన్నర్, మరొకరు రన్నర్‌గా నిలవనున్నారు. ప్రతి సీజన్లో విన్నర్, రన్నర్ మధ్య గొడవలు జరిగాయి. కానీ, ఈ సీజన్లో మాత్రమే ఇద్దరూ కలిసికట్టుగా ఆడుకుంటూ, పాడుకుంటూ ఉన్నారు. వైరం పెట్టుకోకుండా ముందుకు సాగారు.తనూజపై అక్కసువాళ్లిద్దరూ బాగానే ఉన్నా.. వారి అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో బద్ధ శత్రువుల్లా కొట్టుకున్నారు. ఇక ఆడవారికి ఆడవాళ్లే శత్రువు అన్నట్లు తనూజపై చివరి వారంలో కొందరు సెలబ్రిటీలు విషం కక్కారు. అది కూడా ఆమెకు మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా పోల్స్‌లో కల్యాణ్ గెలిచే ఆస్కారం ఉందంటున్నారు. కొన్ని పోల్స్ మాత్రమే తనూజ గెలుపు తథ్యమని చెప్తున్నాయి. ఎవరు గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు!ఓటింగ్‌లో కూడా కల్యాణ్ బుల్లెట్ స్పీడ్‌లో దూసుకెళ్లాడని టాక్! మరి ఇదే నిజమై కల్యాణ్ కప్పు గెలుస్తాడా? లేదా తనూజ కోరుకున్నట్లుగా టైటిల్ ఆమె వశమవుతుందా? అనేది రేపటి గ్రాండ్ ఫినాలేలో చూడాలి! ఇది బిగ్‌బాస్ హౌస్.. ఇక్కడ ఏదైనా జరగొచ్చు. కొన్నిసార్లు లెక్కలు తారుమారు కూడా అవొచ్చు! -
కల్యాణ్ పడాల తలకు కట్టు... అతడికేమైంది?
బిగ్‌బాస్ హౌస్‌లో ఫైనలిస్టులు ఐదుగురు సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. ఈరోజు వారిని పలకరించేందుకు దాదాపు ఐదారుగురు సెలబ్రిటీలు హౌస్‌లో అడుగుపెట్టనున్నారు. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శివాజీ, లయ, చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ రోహన్ మొదటగా వచ్చారు. బుల్లితెర యాంకర్స్తర్వాత రాజాసాబ్ కోసం నిధి అగర్వాల్ ఎంట్రీ ఇచ్చింది. అనంతరం బుల్లితెరను ఏలుతున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు, క్వీన్ శ్రీముఖి అడుగుపెట్టారు. ఈ మేరకు వరుస ప్రోమోలు వదులుతున్నాడు బిగ్‌బాస్. బీబీ జోడీ రెండో సీజన్ మొదలు కాబోతోంది.. ఈ సీజన్ నుంచి కూడా జంటలు రావాలని కోరుకుంటున్నా అని ప్రదీప్ అనగానే కల్యాణ్.. వస్తాం అన్నా అంటూ సంతోషంగా ఆన్సరిచ్చాడు. ఎలాగో ఈ షోలో పవన్-రీతూ జంటగా కనిపించడం ఫిక్స్! కల్యాణ్ తలకు కట్టుమరి తనూజ- కల్యాణ్ కూడా జోడీగా వస్తారా? లేదా? అనేది చూడాలి! ఇక శ్రీముఖి వచ్చినప్పుడు ఇమ్మూ చేసిన కామెడీ అయితే నెక్స్ట్ లెవల్. పుష్ప స్కిట్లో భాగంగా కల్యాణ్.. తనూజను గిల్లేశాడు. ఈ ప్రోమోలో కల్యాణ్ తలకు కట్టుతో కనిపించాడు. అయితే అతడికి పెద్ద గాయం ఏమీ అవలేదు. నిధి వచ్చినప్పుడు కళ్లకు గంతలు కట్టి గేమ్ ఆడించింది. అప్పుడు కల్యాణ్ తలకు చిన్న దెబ్బ తగలడంతో కట్టు కట్టారు. కాబట్టి అభిమానులు కంగారుపడాల్సిన అవసరం లేదు. -
'బ్లాక్ అండ్ వైట్ బోర్'.. మరో లగ్జరీ కారు కొన్న లవ్ బర్డ్స్
బిగ్‌బాస్ 7 ఫేమ్ శుభ శ్రీ రాయగురు కాబోయే భర్తతో కలిసి షికార్లు తిరుగుతోంది. ఈ ఏడాది జూన్‌లో మనోభావాలు పాప.. నిర్మాత, నటుడు అజయ్ మైసూర్‌ను ఎంగేజ్మెంట్ చేసుకుంది. వీరిద్దరూ మేజెస్టీ సాంగ్‌లో జంటగా నటించారు. ఆ పాటతోనే ప్రేమలో పడి జంటగా కలిసుండాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ పెళ్లెప్పుడన్నది మాత్రం ఇంకా చెప్పనేలేదు.లగ్జరీ కారు కొనుగోలుఅయితే కొన్ని వారాల క్రితమే ప్రియుడి కోసం ఆస్ట్రేలియా చెక్కేసిందీ బ్యూటీ. అక్కడ కాబోయే భర్తతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఈ లవ్ బర్డ్స్ కొత్త కారు కొన్నారు. ఇప్పటికే అజయ్ దగ్గర 20కి పైగా కార్లున్నట్లు సమాచారం. ఇప్పుడు కొత్తగా మరో లగ్జరీ కారు చేరింది. అదే మెర్సిడిస్ బెంజ్ AMG45S స్పెషల్ ఎడిషన్. ఇకనైనా మారండిఈ మోడల్ కారు ఆస్ట్రేలియాలో కేవలం 20 మాత్రమే అందుబాటులో ఉండగా అందులో ఒకదాన్ని అజయ్ జంట సొంతం చేసుకుంది. అదే విషయాన్ని అజయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంటూ.. ఇకనైనా బోర్ కొట్టే బ్లాక్ అండ్ వైట్ కార్లకు స్వస్తి పలికి కలర్‌ఫుల్ కార్లను కొనుగోలు చేయండి అని ఉచిత సలహా ఇచ్చాడు. వీళ్లు కొన్న కారు గ్రీన్ కలర్లో ఉంది. దీని ధర కోటికి పైనే ఉంటుందంటున్నారు. కాగా అజయ్.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, 10th క్లాస్ డైరీస్, హ్యాంగ్‌మ్యాన్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ప్రైవేట్ సాంగ్స్, పలు షార్ట్ ఫిలింస్‌లో నటించాడు. View this post on Instagram A post shared by Ajay Mysore (@ajay_mysore__) -
బిగ్‌బాస్ 9కి ప్రాణం పోసింది.. సంజనా రియల్ గేమర్!
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్‌పై ఎటువంటి బజ్ లేనప్పుడు షోకి ప్రాణం పోసింది సంజన గల్రానీ. గప్‌చుప్‌గా గుడ్డు దొంగతనం చేసి అందదరూ గొడవపడేలా చేసింది. ఒక్కక్కరి నిజస్వరూపాలు బయటపడేలా చేసింది. తనను తాను మోటివేట్ చేసుకుంటూ ఫినాలేలో అడుగుపెట్టింది. అన్నింటికీ ధైర్యంగా నిలబడే సంజనా.. గార్డెన్ ఏరియాలో కొడుకు ఫోటోను చూడగానే ఏడ్చేసింది. కన్నీళ్లు పెట్టుకున్న సంజనాఅరగంటలో వస్తానని అబద్ధం చెప్పి బిగ్‌బాస్ హౌస్‌లో 100 రోజులు ఉన్నానని సారీ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తనకు మరో జీవితాన్నిచ్చిన బిగ్‌బాస్‌ను గాడ్ ఫాదర్‌గా అభివర్ణించింది. తర్వాత బిగ్‌బాస్ మాట్లాడుతూ.. టాప్ గేర్‌లో ఆట మొదలుపెట్టి టాప్ 5 వరకు చేరిన మీ ప్రయాణంలో మీలో ఉన్నంత డ్రామా ఉంది. దాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. మీ ధైర్యమే..సీజన్ 9 మొదటి కెప్టెన్‌గా నిలిచి ఆరంభం నుంచి ఆటను మీ చేతుల్లోకి తీసుకున్నారు. మొదటి వారం నుంచి 15వ వారం వరకు ఇంట్లో ఏది జరిగినా అది మీ వల్ల జరగాలి లేదా మీకోసం జరగాలి అనేలా ఆడారు. గుడ్డుతో మొదలైన మీ అల్లరి మీ కొడుకు(ఇమ్మాన్యుయేల్)తో కలిసి ఎన్నో రెట్లు పెరిగింది. ఇంట్లో అందరికీ ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. మీ ప్రతి ఎమోషన్ ఎలాంటి పరదా లేకుండా ప్రేక్షకులకు చూపాలన్న మీ నిర్ణయం, ధైర్యం వారిని మీకు మరింత చేరువ చేసింది. ఎవరికీ అర్థం కాని గేమర్అందరిలో ఒకరిగా ఉంటే ప్రత్యేకత ఏముంది? ఎవరి గుర్తింపు వారి చేతుల్లోనే ఉందని బలంగా నమ్మారు. టాస్కులో పోటీపడ్డా, సంచాలక్‌గా ఉన్నా, వంటగదిలో ఉన్నా, బెడ్ రూమ్‌లో కబుర్లు చెప్తున్నా.. సంజనా ఎక్కడుంటే అక్కడేదో జరగబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించారు. సంజనా సైలైన్సర్గా, సంజూ బాబాగా, మమ్మీగా ఎవరికీ అర్థం కాని గేమర్గా వివిధ పాత్రల్లో ప్రతి నిమిషం వినోదాన్ని పంచేందుకు ప్రయత్నించారు. మొండిధైర్యం మీ సొంతంఆటలో మిగతావారు మీకన్నా బలంగా ఉన్నా, వారికి మిగతావారి మద్దతు ఉన్నా మీరెప్పుడూ అధైర్యపడలేదు. ఎవరి మీద ఆధారపడి ఆడటానికి ఈ ఇంట్లోకి రాలేదు. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్నిక్కడి వరకు తీసుకొచ్చింది. ఒకసారి మీరు ఒక మాటపై నిలబడితే అవతలివైపు ఎవరున్నా వెనక్కు తగ్గని మొండిధైర్యం మీ సొంతం. అదే మీ కన్నీళ్లకు కారణంమీ దూకుడు మనస్తత్వం, మీ కత్తుల్లాంటి మాటలే మిమ్మల్ని చిక్కుల్లో పడేశాయి. అప్పుడు మీ మనసుకు దగ్గరైనవారితో అభిప్రాయభేదాలు వచ్చాయి. అది మీ మనసును ఎంతో బాధపెట్టింది. మీ కన్నీటికి కారణమైంది. కష్టాలెన్నో ఓర్చుకుని ఈ ఇంట్లో మీరు సాగించిన ప్రయాణాన్ని ఏదో ఒకరోజు మీ బాబు, ఐదు నెలల పాప చూసి ఎంతో గర్వపడతారు అని పొగిడాడు. తర్వాత జర్నీ వీడియో చూపించగా సంజనా ఉప్పొంగిపోయింది. అందులో తన అల్లరి, ప్రాంక్స్.. సీక్రెట్ రూమ్‌కు వెళ్లిరావడం.. గొడవలు.. ఇలా అన్నీ చూపించారు. -
సల్మాన్ ఒక్క ఎపిసోడ్‌కు అందుకునేది.. నాగ్‌కు మొత్తం సీజన్‌కు అందుతుంది..
నాటకీయ నామినేషన్ల నుంచి ఊహించని ఎలిమినేషన్ల వరకు, బిగ్ బాస్ అనే రియాల్టీ షో వీక్షకుల్లో ఎల్లప్పుడూ కుతూహలాన్ని రేకెత్తిస్తూ ఆదరణను కాపాడుకుంటూ వస్తోంది. ఈ షో విజయానికి దాని కాన్సెప్ట్‌తో పాటు దాని హోస్ట్‌లు కూడా ప్రధాన కారణమే అనేది నిస్సందేహం. ఆధిపత్యం చెలాయించే ప్రవర్తనతో సల్మాన్ ఖాన్ కావచ్చు, సహజసిద్ధమైన కూల్ అట్రాక్షన్‌తో నాగార్జున కావచ్చు, పెద్దరికపు ఆప్యాయత కనబరిచే మోహన్‌లాల్ కావచ్చు...దేశంలో పలు భాషల్లో ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షోకు తమదైన ప్రత్యేకతను తీసుకువచ్చారనేది వాస్తవం. అయితే ఆ పెద్ద ఇల్లును అంత బాధ్యతగా నిర్వహిస్తున్న, ఈ సెలబ్రిటీ హోస్ట్ లు తాజా సీజన్లో అందుకున్న పారితోషికం వివరాలు చూద్దామా?సహజంగానే అత్యంత భారీ స్థాయిలో వీక్షకులు ఉంటారు కాబట్టి బిగ్ బాస్ హిందీ వెర్షన్ హోస్ట్‌గా అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటూ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అందరిలోనూ ముందున్నారు. సుమారు 15 వారాంతాల్లో హోస్ట్‌గా ఆయన వ్యవహరిస్తారు. మొత్తం 13 సీజన్ల పైగా ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సల్మాన్ ఏకంగా రూ. 1000 కోట్లు వసూలు చేశారని వార్తలు వచ్చినప్పటికీ సల్మాన్ దాన్ని కొట్టిపారేశారు. అందుతున్న నివేదికల ప్రకారం, సల్మాన్ ప్రారంభంలో వారానికి సుమారు రూ. 12 కోట్లు పారితోషికం తీసుకున్నారు, ఆ తర్వాత దానిని ఎపిసోడ్‌కు రూ. 25 కోట్లకు పెంచారు. తాజా సీజన్ బిగ్ బాస్ 16 కోసం ప్రతి ఎపిసోడ్‌కు రూ. 43 కోట్లకు చేరినట్లు సమాచారం. ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ తమిళ బిగ్‌బాస్ రియాలిటీ టీవీ షో 7వ సీజన్‌కు తీసుకున్న పారితోషికం రూ. 130 కోట్లు అని సమాచారం. అయితే, గత రెండు సీజన్లకు హోస్ట్‌గా విజయ్ సేతుపతి కొనసాగుతున్నారు. తను కూడా సుమారుగా రూ. 50 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం.హిందీ వెర్షన్ విజయం తర్వాత, బిగ్ బాస్ కన్నడ వెర్షన్ 2013లో ప్రారంభమైంది. కన్నడ షో మొత్తం 11 సీజన్లకు కన్నడ సినీ నటుడు కిచ్చా సుదీప్ సంజీవ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గత 2015లో కలర్స్ ఛానెల్‌తో అతను కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, ఐదేళ్లకు గాను ప్రారంభంలో రూ. 20 కోట్లు పారితోషికం తీసుకున్నారట. అభిమానులు అతని పారితోషికాన్ని సల్మాన్‌తో పోల్చడం ప్రారంభించారు. ఇటీవలి సీజన్‌కు అతని పారితోషికం బాగా పెరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.దక్షిణాన కేరళలో, మోహన్‌లాల్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ ... దాని నాటకీయ ఎలిమినేషన్లు షాకింగ్ ట్విస్ట్‌లతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. దీని విజయంలో మోహన్‌లాల్ హోస్టింగ్ నైపుణ్యం ప్రధాన ఆకర్షణగా ఉంది, ఈ మలయాళ వెర్షన్ 2018లో ప్రారంభమై వేగంగా ప్రజాదరణ పొందింది. సీనియర్ నటుడు మోహన్‌లాల్ మొదటి సీజన్‌కు రూ. 12 కోట్లు, ఆయన తాజా సీజన్‌కు సుమారు రూ. 24 కోట్లు అందుకున్నారని అంచనా.తెలుగు వారి అభిమాన హీరో అక్కినేని నాగార్జున వరుసగా బిగ్‌బాస్ ఆరవ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు. నివేదికల ప్రకారం, ఆయన తొలిదశలోప్రతి ఎపిసోడ్‌కు రూ. 12 లక్షలు చొప్పున మొత్తం సీజన్‌కు రూ. 12 కోట్లను అందుకున్నారు.అయితే తాజా సీజన్‌కు ముందు ఆయనకు రూ. 15 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే, తాజా సీజన్ కోసం ఆయన తన ఫీజును అమాంతం 30 కోట్ల రూపాయలకు పెంచినట్లు సమాచారం. ఫరెవర్ కూల్‌గా, అదే సమయంలో ఖచ్చితత్వంతో వ్యవహరిస్తూ హౌస్‌లోని వారిని సమన్వయం చేయడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలోనూ నాగ్ విజయవంతం అవడంతో... ఈ షో పాప్యులారిటీకి ఆయన కీలకంగా మారారు. -
విన్నర్ రేంజ్ ఎలివేషన్...మీసం మెలేసిన కల్యాణ్
బిగ్‌బాస్ షోలో హౌస్మేట్స్ ఫైనల్ వీక్‌ను సరదాగా గడిపేస్తున్నారు. కాఫీ పంపిస్తే డిమాన్ పవన్‌కు చీర కట్టి అందంగా రెడీ చేసి డ్యాన్స్ వేయిస్తాం అన్నారు. అన్నట్లుగానే పవన్‌ను అమ్మాయిగా ముస్తాబు చేసి ఓ ఆటాడుకున్నారు. తర్వాత కల్యాణ్ జర్నీ వీడియో ప్లే చేశారు. ఆ విశేషాలు శుక్రవారం (డిసెంబర్ 19వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేయండి..ఆడవేషం కట్టిన పవన్ఆడవేషంలో ఉన్న పవన్ డ్యాన్స్‌తో ఎపిసోడ్ ఉత్సాహంగా మొదలైంది. వీళ్ల జోష్ చూసిన బిగ్‌బాస్ కాఫీ పౌడర్‌తో పాటు ఏకంగా మటన్ పంపించాడు. తర్వాత కల్యాణ్ గార్డెన్ ఏరియాలో తన కటౌట్ చూసుకుని మురిసిపోయాడు. బిగ్‌బాస్ మాట్లాడుతూ.. మీది ఒక సామాన్యుడి కథ.. కానీ సామాన్యమైన కథ కాదు. జీరో దగ్గర మొదలైన కథ.. కానీ, జీరోగా ముగిసిపోని కథ. కొన్ని కోట్ల మందిలో కొందరికి మాత్రమే కోట్ల మంది ప్రేమను పొందే అవకాశం లభిస్తుంది. దాన్ని మీరు అగ్నిపరీక్షను దాటి సొంతం చేసుకున్నారు.ఓనర్‌గా మొదలై...ఇప్పుడు వారి ప్రేమను పొంది ఈ స్థానంలో నిలిచి మీ ప్రయాణానికి గొప్ప అర్థాన్నిచ్చారు. ఓనర్‌గా ఇంట్లో మొదలైన మీ ప్రయాణం.. మొదట్లో సులువుగా అనిపించినా పోనుపోను ఎన్నో కఠినమైన పరీక్షలను మీ ముందుకు తీసుకొచ్చింది. వాటిని దాటితేకానీ, మీ వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులకు నిరూపిస్తే కానీ.. ముందుకు కదల్లేని పరిస్థితిలో ఒకరి స్నేహం మీకు బాసటగా నిలిచింది.కుంగదీసినా తేరుకున్నారుమీ తప్పొప్పులను స్పష్టంగా మీకు తెలిసేలా చేసింది. ధైర్యాన్ని నింపింది. వారికోసం ఎలాంటి త్యాగాలైనా అలవోకగా చేయగలిగే బంధం ఏర్పడింది. మీతో ప్రయాణం మొదలుపెట్టినవారందరూ ఒక్కొక్కరిగా ఇంటినుంచి బయటకు వెళ్లిన క్షణాలు మిమ్మల్ని కుంగదీసినా తేరుకున్నారు. తప్పులను సరిచేసుకున్నారు. సరైన దిశలో నడవడమే విజయాన్ని అందించే మార్గమని చూపించారు. గుండె బలంతో..బుద్ధి బలాన్ని, భుజ బలాన్ని మించినది గుండె బలం. అదే గుండె నిబ్బరంతో నిలబడ్డారు. గెలవాలనే కసిని ఒక్కోవారం నింపుకుంటూ కెప్టెన్‌గా నిలిచారు. కెప్టెన్సీ మీ ఆటకు మరింత వేగాన్ని జత చేసింది. స్నేహం మీ ప్రయాణానికి ఒక దిశను చూపింది. మీలోని యోధుడిని నిద్ర లేపింది. ఏకాగ్రత, అమాయకత్వం, పోరాట పటిమ అయిన మీ బలాలను ఎప్పుడూ వీడకుండా లోటుపాట్లన్నీ సరి చేసుకుంటూ చివరి కెప్టెన్‌గా నిలిచారు.ఎంతోమందికి దిక్సూచిలా..అంతేక కాక ఫస్ట్ ఫైనలిస్టుగా నిలిచి ఒక కామనర్ తల్చుకుంటే ఏం చేయగలడో ప్రపంచానికి తెలిసేలా చేశారు. లక్ష్మణ్ రావు- లక్ష్మీల కొడుకు కల్యాణ్ అనే మాట ఇప్పటివరకు! కానీ వీళ్లు కల్యాణ్ తల్లిదండ్రులు అనే గౌరవాన్ని, కాలర్ ఎగరేసే గర్వాన్ని అందించారు. గొప్ప కలలు కనేందుకు, వాటిని నిజం చేసుకునేందుకు మీలాంటి ఎంతోమంది కామనర్స్‌కు దిక్సూచిలా నిలిచి, స్ఫూర్తినిచ్చిన మీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం.. అంటూ జర్నీ వీడియో చూపించాడు. అది చూసిన కల్యాణ్ ఆనందంతో మీసం మెలేశాడు. అయితే తనూజ జర్నీ వీడియోలో హైప్ ఇచ్చే మూమెంట్ ఒక్కటి కూడా లేదు.. కానీ కల్యాణ్ వీడియో మొత్తం హైప్‌తో నిండిపోవడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. -
నా భార్య 4 రోజులు తినకుండా ఏడ్చింది: సుమన్
బిగ్‌బాస్ హౌస్‌లో సుమన్‌ను ఇష్టపడనివారు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షకుల దగ్గర నుంచి హౌస్మేట్స్ వరకు అందరికీ అతడంటే ఇష్టమే! తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ నవ్విస్తాడు. సూటిగా సుత్తిలేకుండా మాట్లాడే అతడి వైఖరికి అందరూ ఫిదా అవుతారు. కాకపోతే ఆటలో పెద్దగా సత్తా చూపించకపోయేసరికి ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఫ్యామిలీ వీక్‌లో సుమన్ కోసం అతడి భార్య ఇంట్లోకి వచ్చింది. వచ్చీరావడమే తనూజకు దూరంగా ఉండమని చెప్పింది. మాట మార్చేసిన సుమన్ఇది ఎపిసోడ్‌లోనూ టెలికాస్ట్ అయింది. కానీ, ఇప్పుడేమో తన భార్య అలా అనలేదని మాట మార్చేశాడు సుమన్. తనూజకు దూరంగా ఉండమని మీ భార్య ఎందుకు చెప్పింది? అని ఓ విలేకరి అడిగాడు. ఆ ప్రశ్నకు సుమన్ స్పందిస్తూ.. దూరంగా ఉండమని చెప్పలేదు. తనూజవాళ్లు బాగా ఆడుతున్నారు. మీరింకా బాగా ఆడండి అని చెప్పిందంతే! అంతే తప్ప జాగ్రత్త అని చెప్పలేదు. 4 రోజులు ఏడుస్తూనే..మీరు బాగా ఆడుతున్నారు, ఇంకాస్త ఎఫర్ట్స్ పెట్టి వాళ్లలా ఆడమని నా భార్య సలహా ఇచ్చింది. అది బయటకు తప్పుగా వెళ్లింది. దానివల్ల ఆమె నాలుగురోజులపాటు తినకుండా ఏడుస్తూ కూర్చుంది. నేను తప్పుగా ఏం చెప్పాను? అని చాలా బాధపడింది అన్నాడు. ఈ కామెంట్స్ విన్న జనాలు.. ఎపిసోడ్లో అందరం చూశాం.. ఎందుకు కవర్ చేయాలని చూస్తున్నావ్? ఆమెది ఏ తప్పూ లేకపోతే ఎందుకు ఏడవడం? అని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: పిల్లాడికి అబద్ధం చెప్పి బిగ్‌బాస్‌కు.. ఏడ్చేసిన సంజనా -
గేమ్ నీ చేతుల్లోకి తీసుకున్నావ్.. డ్రామా క్వీన్!
పెళ్లి చేసుకునే వయసొచ్చినా సరే అమ్మానాన్నను వదిలేసి ఉండాలంటేనే ఏడుస్తున్నారు కంటెస్టెంట్లు. కానీ సంజనా మాత్రం గుండె రాయి చేసుకుని పిల్లాడిని, చంటిబిడ్డను వదిలేసి వచ్చింది. తన గుండె ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుని తీరాల్సిందే! ఏ రోజు కూడా పిల్లల పేర్లు ఎత్తి సింపతీ కోసం ప్రయత్నించలేదు. ఈ విషయంలో ఆమెను కచ్చితంగా ప్రశంసించాల్సిందే! నేడు ఆమె జర్నీ వీడియో చూపించనున్నాడు బిగ్‌బాస్. అరగంటలో వస్తానని..ఈ మేరకు ఓ ప్రోమో వదిలాడు. అందులో సంజనా.. తన కొడుకు ఫోటో చూసి ఏడ్చేసింది. మమ్మీ ఇంట్లో లేనందుకు సారీ.. అరగంటలో వస్తానని చెప్పి 100 రోజులైనా ఇంటికి రాలేదు.. సారీ అని కన్నీళ్లు పెట్టుకుంది. బిగ్‌బాస్ మాట్లాడుతూ.. టాప్ గేర్‌లో ఆట మొదలుపెట్టి టాప్ 5 వరకు చేరిన ప్రయాణంలో.. మీలో ఉన్నంత డ్రామా ఉంది. సీజన్ 9 మొదటి కెప్టెన్‌గా గెలిచి ప్రారంభం నుంచే ఆటను మీ చేతుల్లోకి తీసుకున్నారు.తనకంటూ ఓ మార్క్ఇంట్లో ఏది జరిగినా అది మీవల్ల జరగాలి లేదా మీకోసం జరగాలి. గుడ్డుతో మొదలైన మీ అల్లరి మీ కొడుకు (ఇమ్మాన్యుయేల్)తో కలిసి ఎన్నో రెట్లు పెరిగింది. అందరిలో ఒకరిగా ఉంటే ప్రత్యేకత ఏముంది? టాస్కుల్లో మీరు పోటీపడినా.. సంచాలకులుగా ఉన్నా.. సంజనా ఎక్కడుంటే అక్కడేదో జరగబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించారు.మొండిధైర్యంఒకసారి మీరు ఒక మాటపై నిలబడితే అవతలివైపు ఎవరున్నా వెనక్కు తగ్గని మొండిధైర్యం మీ సొంతం. కష్టాలెన్నో ఓర్చుకుని ఈ ఇంట్లో మీరు సాగించిన ప్రయాణాన్ని చూసి ఏదో ఒకరోజు మీ బాబు ఎంతో గర్వపడతాడు అని చెప్పాడు. సీజన్‌పై ఆసక్తి క్రియేట్ చేసిందే సంజనా మరి! తనకు ఆ మాత్రం ఎలివేషన్ ఇవ్వాల్సిందే! -
ఒక కామనర్ తలుచుకుంటే.. కల్యాణ్‌పై 'బిగ్‌బాస్' ప్రశంసలు
బిగ్‌బాస్ తెలుగు 9 విజేత ఎవరనేది ఈ ఆదివారం ఎపిసోడ్‌తో తేలనుంది. అయితే, టాప్-5 కంటెస్టెంట్స్‌కు సంబంధించిన జర్నీ వీడియోలను బిగ్‌బాస్ చూపుతున్నాడు. ఇప్పటికే ఇమ్మాన్యుయేల్, తనూజ, పవన్‌ల బిగ్‌బాస్ ప్రయాణాన్ని చూపించారు. అయితే, శుక్రవారం ఎపిసోడ్స్‌లో కల్యాణ్ పడాల, సంజనల జర్నీ టెలికాస్ట్ చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా కల్యాణ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.బిగ్‌బాస్‌లో ఒక సామాన్యుడిలా కల్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇదే పాయింట్‌తో బిగ్‌బాస్ ఎలివేషన్ ఇచ్చారు. ఆటలో తనకు ఎదురైన కష్టాలను మరోసారి గుర్తుచేశాడు. గెలవాలనే కసితో ఒక్కోవారం పోరాడుతూ కెప్టెన్‌గా రెండుసార్లు నిలిచాడు.. ఆపై ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. తన బుద్ధి బలానికి కండ బలం తోడు కావడంతో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే గెలుపు వైపు అడుగులు వేశాడు. ఒక కామనర్ తలుచుకుంటే ఏం చేయగలడో బిగ్‌బాస్ షోతో కల్యాణ్ ఈ ప్రపంచానికి తెలిసేలా చేశాడంటూ.. బిగ్‌బాస్ భారీ ఎలివేషన్ ఇచ్చాడు. -
'పోతారు.. మొత్తం పోతారు' ఇక పవన్‌ను ఆపడం కష్టమే!
డిమాన్ పవన్‌ను అగ్నిపరీక్షలో చూసినవారంతా ఇతడు బిగ్‌బాస్‌కు సెలక్ట్ కాకపోయినా ఏం పర్లేదనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదవ సీజన్లో అడుగుపెట్టాడు. అసలు ఇతడేం చేస్తాడనుకునేవారికి తన కండబలం, బుద్ధిబలం కలగలిపిన వీరుడినని నిరూపించాడు. వరుసగా రెండుసార్లు కెప్టెన్ అయ్యాడు. అయితే రీతూతో లవ్ ట్రాక్ వల్ల కాస్త నెగెటివ్ అయ్యాడు. ఓటింగ్‌లో దుమ్ము రేపుతున్న పవన్ఎప్పుడూ గొడవపడటం, కలిసిపోవడం.. ఇదంతా చూసేవారికి చాలా చిరాకు పుట్టించింది. కానీ రీతూ ఎలిమినేట్ అయిన వెంటనే తనలో మరో యాంగిల్ చూపించాడు. పంచ్‌లు వేస్తూ కామెడీ చేస్తున్నాడు. టాస్కుల్లో బాహుబలిలా ఆడుతున్నాడు. ఫైనల్లో నాలుగో స్థానంలో ఉంటాడనుకున్న పవన్ ఇప్పుడేకంగా ఓటింగ్‌లో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ ఫైర్ ముందు నుంచి ఉండుంటే ఏకంగా విన్నర్ అయ్యేవాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి బిగ్‌బాస్ అతడి గురించి ఏమన్నాడో చూద్దాం..నిజమైన యోధుడివి"మీ విల్‌పవర్, ఫిట్నెస్.. మీ వ్యక్తిత్వంలో ఎంత ముఖ్యమో.. అలాగే ఒక బలమైన పోరాటానికి ఎంత అవసరమనేది మీ ప్రయాణామే నిరూపిస్తోంది. ఎవరితో తలపడ్డా, ఏ పోటీలో నిలబడ్డా.. గెలుపు గురించి మాత్రమే తపించే తత్వం ఒక నిజమైన యోధుడి గుణం. కామనర్‌గా అడుగుపెట్టిన ఈ పవన్ అమాయకమైన చిరునవ్వు వెనక ఉన్న డిమాన్ చేసే విధ్వంసం ఏంటో వాళ్లు దగ్గరుండి చూశారు. నామినేషన్లో మీపై ఎంతమంది మాటలతో దాడి చేసినా మీరు మౌనంగానే నిల్చున్నారు. అవసరమైనప్పుడు మాత్రమే ధీటుగా బదులిచ్చారు. చెమటోడ్చి గెలిచారుఎందుకంటే నోటిని అదుపులో పెట్టుకున్నవాడు తన జీవితాన్ని అదుపులో పెట్టుకోగలడని మీకు తెలుసు. పవన్ మీరెవరివైపు ఉంటే వారికి కొండంత బలం.. ఎవరితో పోరాడితే వారి ఆట కకావికలం. మాటల కన్నా చేతలు బలమైనవని నమ్మిన మీరు మీ చేతుల్లోకి వచ్చిన ప్రతి అవకాశాన్ని విజయం వైపు నడవడానికే ఉపయోగించి సఫలమయ్యారు. మీకు ఏ గెలుపూ సులువుగా లభించలేదు. ప్రతి ఒక్కటి మీరు మీ చెమటోడ్చి చివరి వరకు పోరాడి గెలిచినదే! మనసు మాత్రం..మీకోసం ఎవరూ నిలబడకపోయినా మీకోసం మీరు వన్ మ్యాన్ ఆర్మీలా నిలబడ్డారు. అయితే మీ మనసు మాత్రం మీకోసం తపించే మరొకరి (రీతూ) వెంట చక్కర్లు కొట్టింది. ఈ ఇంట్లో మీ గెలుపును పంచుకోవడానికి, ఓటమి నుంచి బయటకు రావడానికి ఆ బంధం తోడ్పడింది. మీలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకే గాక, మీక్కూడా పరిచయం చేసింది. కానీ, టాస్కుల్లో అయినా, తన మనుషుల్ని ప్రేమించడంలో అయినా పవన్ తీరు ఒక్కటే అనే మాట మీ ప్రయాణాన్ని బరువుగా మార్చింది. మిమ్మల్ని అమాంతం మోకాళ్లపై కూర్చోబెట్టింది.పట్టువదలని పవన్ఆ వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు మీ మనసు ఎంత నొచ్చుకుందో నాక్కూడా తెలుసు. కానీ, తన కోరిక కూడా మీ గెలుపే అనే విషయం మీలోని యోధుడిని తట్టిలేపింది. కర్తవ్యం వైపు నడిపించింది. సంచాలకుల తప్పు వల్ల కెప్టెన్సీ కోల్పోయినా రెట్టింపు ఉత్సాహంతో దాన్ని తిరిగి సంపాదించిన పట్టువదలని పవన్ సత్తాను మరోసారి అందరికీ గుర్తు చేశారు. పోతారు.. మొత్తం పోతారుస్నేహాన్ని, ఆటను బ్యాలెన్స్ చేస్తూ కామనర్‌గా మదలై టఫెస్ట్ కాంపిటీటర్‌గా తల్లి ఆశీస్సులతో ఎదురులేని యోదుడిగా టాప్ 5లో ఒకరిగా నిలిచారు" అని చెప్పాడు. అయితే మీ మనసంతా రీతూనే అని చెప్తుంటే పవన్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. జర్నీ వీడియో అంతా కూడా రీతూతో కలిసున్న క్షణాలే ఉన్నాయి. తను ఎదుర్కొన్న అవమానాలు, ఆడిన ఆటలు, అమ్మ వచ్చిన జ్ఞాపకాలను చూసి ఎమోషనలయ్యాడు. చివర్లో 'పోతారు.. మొత్తం పోతారు' అనే నాని డైలాగ్‌తో పవన్ రేంజ్ పెంచేశాడు బిగ్‌బాస్.చదవండి: సీజన్ అంతా మీ చుట్టూనే.. తనూజపై బిగ్‌బాస్ ప్రశంసలు -
సీజన్ అంతా తనూజ చుట్టూనే.. బిగ్‌బాసే ఒప్పుకున్నాడు!
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్ మరో మూడు రోజుల్లో ముగియనుంది. టాప్ 5లో చోటు కోసం అలుపెరగని పోరాటం చేసిన హౌస్మేట్స్ దిల్ ఖుష్ చేసేందుకు జర్నీ వీడియోలు చూపిస్తున్నాడు. ఇప్పటికే ఇమ్మాన్యుయేల్ ఏవీ అయిపోయింది. తనూజ, పవన్ జర్నీ వీడియోలను ప్లే చేస్తూ భారీ ఎలివేషన్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఆ విశేషాలను గురువారం (డిసెంబర్ 18) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం...నటనపై ప్రశంసలుముందుగా తనూజ టాలెంట్‌ను వర్ణించాడు బిగ్‌బాస్. తెరపై మీ నటన, మీరు పలికించిన భావాలతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు. మిమ్మల్ని వారింట్లో కూతురిగా మార్చారు. గొప్ప నటిగా పాత్రల్లో మీరు పరకాయ ప్రవేశం చేసే తీరుకు అది నిదర్శనం. కానీ, బిగ్‌బాస్ ఇల్లు మీకు పరిచయం లేని ప్రదేశం. నటనకు ఆస్కారం లేని చోటు.. మనుషుల్ని ఎలాంటి పరదా లేకుండా చూపించే వేదిక. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని టాప్ 5లో నిల్చుని మీరెంత చిచ్చరపిడుగో నిరూపించారు.గేమ్ అంతా మీ చుట్టూనే..నిజాన్ని ఎదుర్కోవడానికి భయపడని మీ తత్వం.. అందరితో కలిసి అల్లరిచేసే విధానం మీలోని అయస్కాంత శక్తికి ప్రేక్షకులతో సహా ఎవరూ అతీతులు కారని స్పష్టం చేశారు. ఈ ఇంట్లో ప్రతి విషయం మీ చుట్టే తిరిగిందంటే అతిశయోక్తి కాదు. ఈ ఇంట్లో అందరూ మీతో కలిసిపోయినవారు లేదా కలబడ్డవారు. భావోద్వేగాల గని మీరు. మనుషుల్ని మీవైపు తిప్పుకోవడంలో, ఆటను మీ నియమాలతో ఆడించడంలో నేర్పరి మీరు. నిందలతో నొచ్చుకున్న మనసుఈ రణరంగంలో ఎంతమంది బలమైన, తెలివైన యోధులున్నా ఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు స్పష్టంగా తెలిసిన సేనాధిపతి మీరు. వంటగది నుంచే ఇంటిని గెలిచినతీరు ఆటలో ఎంత బలమైనవారో స్పష్టం చేస్తుంది. రీల్, రియల్ పర్సనాలిటీతో అందరినీ ప్రేమలో పడేలా చేశారు. బంధాలను, బాధ్యతలను సమంగా మోశారు. కేవలం బంధాల పునాదులపై ఆటాడుతారని, అందరి మద్దతు కోసం పాకులాడతారని నిందించినప్పుడు మీ మనసెంతగానో నొచ్చుకుంది. అది మీ వ్యక్తిత్వంబంధాలకు అతీతులెవరూ లేరని మీకనిపించింది. నాన్న అనే ఎమోషన్ మీకు నిజంగా ఉన్నా మనసును రాయి చేసుకుని అవసరమైనప్పుడు అది పక్కనపెట్టి ఆట ముందుకు తీసుకెళ్లారు. చిన్న విషయానికి మనసు నొచ్చుకునే దూది లాంటి సున్నితత్వం.. కదనరంగంలో విరుచుకుపడే శివంగిలాంటి ధీరత్వం.. కత్తికి రెండువైపులా పదునైనది మీ వ్యక్తిత్వం. జర్నీ వీడియోమిగతా వారి ఆట టాస్కులో మాత్రమే బయటకు వస్తే మీ ఆట ప్రతి నిమిషం కొత్త మలుపులతో మరింత బలంగా ముందుకు సాగుతూ వచ్చింది. ఈ ఇంట్లో, ప్రేక్షకుల మదిలో ఓ కుటుంబసభ్యురాలిగా మారి అందరి ప్రేమను పొందిన విధానమే తనూజను ఈరోజు ఇక్కడ నిలబెట్టింది. ఎన్నో భావాలతో, బంధాలతో నిండిన మీ ప్రయాణం ఓసారి చూద్దాం.. అంటూ జర్నీ వీడియో ప్లే చేశారు.షాకైన తనూజఅందులో భరణితో నాన్న బంధాన్ని చూపించారు. అలాగే కల్యాణ్‌తో స్నేహాన్ని లవ్‌ట్రాక్ అన్న లెవల్లో చూపించారు. ఇదంతా చూశాక తనూజ సంతోషం పట్టలేకపోయింది. ఇదంతా ఒక కలలా ఉంది. ఎక్కడో పుట్టిపెరిగిన నన్ను ఇక్కడ నిలబడేలా చేసిన నా ఆడియన్స్‌కు థాంక్యూ అంటూ స్టేజీని ముద్దాడింది. కల్యాణ్‌తో.. వీడియో మొత్తం మనిద్దరిదే ఉందిరా, షాకైపోయానంది. అది తాను ముందే ఊహించానన్నాడు ఇమ్మాన్యుయేల్. తర్వాత పవన్ జర్నీ వీడియో ప్లే చేశారు. -
#Demonpavan: పోరాడి గెల్చావ్.. అసలైన యోధుడివి
బిగ్‌బాస్ ఫైనల్ వీక్ అంతా పిక్నిక్ హాలీడేలా సాగిపోతుంది. ఫైనలిస్టుల జర్నీ వీడియోలతో కాస్త ఎమోషనల్గానూ ఉంటుంది. ఇప్పటికే నిన్నటి ఎపిసోడ్లో ఇమ్మాన్యుయేల్ జర్నీ చూపించారు. నేడు తనూజ, పవన్ జర్నీ చూపించనున్నారు. ఈ మేరకు తాజాగా పవన్ కోసం ఓ ప్రోమో వదిలారు.యోధుడిగా నిలబడ్డావ్'మీరు ఎవరివైపు ఉంటే వారికి కొండంత బలం.. ఎవరితో పోరాడితే వారి ఆట కకావికలం.. మీకు ఏ గెలుపూ సులువుగా లభించలేదు. చెమటోడ్చి, చివరి వరకు పోరాడి గెలిచారు. స్నేహాన్ని, ఆటను బ్యాలెన్స్ చేస్తూ టఫెస్ట్ కాంపిటీటర్‌గా, తల్లి ఆశీస్సులతో ఎదురులేని యోధుడిగా టాప్ 5లో నిలబడ్డారు' అని పొగిడాడు. సీజన్ అంతా తిట్టు పడ్డ పవన్.. ఎట్టకేలకు బిగ్‌బాస్ నోటితో పొగడ్తలు అందుకుని శెభాష్ అనిపించాడు. అతడి ఫుల్ జర్నీ చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! -
చిచ్చర పిడుగు తనూజ.. భారీ ఎలివేషన్ ఇచ్చిన బిగ్‌బాస్
బిగ్‌బాస్ తెలుగు 9 సోషల్‌మీడియాలో ట్రెండిగ్ టాపిక్.. డిసెంబర్ 21న ఫైనల్ ఎపిసోడ్ జరగనుంది. టాప్-5లో తనూజ, కల్యాణ్, ఇమ్మన్యుయేల్, పవన్, సంజనలు ఉన్నారు. ఈ క్రమంలో వారి జర్నీ వీడియోలను బిగ్‌బాస్ చూపిస్తున్నారు. ముందుగా ఇమ్మన్యుయేల్ ప్రయాణాన్ని చూపించిన బిగ్‌బాస్.. గురువారం ఎపిసోడ్లో తనూజ గురించి జర్నీ ఉంది. ఈ క్రమంలో తనకు సంబంధించిన ప్రోమోను బిగ్‌బాస్ టీమ్ వదిలింది.బిగ్‌బాస్‌లో తన జర్నీ చూసుకున్న తనూజ చాలా ఎమోషనల్ అయిపోయింది. బిగ్‌బాస్ హౌస్‌లో తనూజ కన్నీళ్లు పెట్టుకున్నా, నవ్వినా సరే నటిస్తుంది అంటూ చాలామంది కామెంట్లు చేశారు. అయితే, అలాంటి విమర్శలు చేసినవారికి సమాధానంగా బిగ్‌బాస్ ప్రోమో ఉంది. బిగ్‌బాస్ ఇల్లు నటనకు ఎలాంటి ఆస్కారం లేని చోటు అంటూ క్లారిటీ ఇచ్చారు. కత్తికి రెండువైపులా పదునైన వ్యక్తిత్వంతో హౌస్‌లో కొనసాగారంటూ పేర్కొన్నారు.. క్లిష్టపరిస్థితిలో ఎన్నో ఒడిదిడుకులు ఎదుర్కొని చిచ్చరపిడుగులా టాప్-5లో చేరారని భారీ ఎలివేషన్ ఇచ్చారు. -
ఇమ్మూని ఆకాశానికెత్తిన బిగ్‌బాస్.. ఇది కదా జర్నీ అంటే!
కొన్ని ఫుడ్ ట్రీట్స్, ఇంటినుంచి సర్ప్రైజ్లు అందుకునేందుకు బిగ్‌బాస్ సరదా గేమ్స్ పెడుతూ వస్తున్నాడు. ఇందులో గెలిచిన పవన్‌కు ఇంటినుంచి వీడియో సందేశం రాగా తనూజకు ఫ్యామిలీ ఫోటో అందింది. మరి ఈసారి ఆ సర్ప్రైజ్ ఎవరు గెల్చుకున్నారో బుధవారం (డిసెంబర్ 17వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..సంజనాకు వీడియో మెసేజ్బాల్స్ విసిరే గేమ్‌లో కల్యాణ్ గెలిచి ఒక స్టార్తోపాటు స్వీట్ పొందాడు. ప్లేయర్ ఆఫ్ దిడేగా సంజనాను ఎంపిక చేయడంతో తన చెల్లెలు, హీరోయిన్ నిక్కీ గల్రానీ వీడియో మెసేజ్ ప్లే చేశారు. ఇక ఇమ్మాన్యుయ్యేల్ జ్యోతిష్యుడిగా మారి హౌస్మేట్స్ జాతకాలు చెప్పడంతో అందరూ పడీపడీ నవ్వారు. తర్వాత ఫైనలిస్టుల కోసం గ్రాండ్ జర్నీ వీడియోలు ప్లాన్ చేశారు. ముందుగా ఇమ్మాన్యుయేల్ వంతు వచ్చింది. గార్డెన్ ఏరియాలో తను ఆడిన టాస్కులు, వాటి ఫోటోలు చూసి ఎమోషనలయ్యాడు. అసలైన ఎంటర్టైనర్ఇక బిగ్‌బాస్ మాట్లాడుతూ.. బాధ, నిరాశ, ఓటమి.. ఎమోషన్స్ నుంచి మనుషులు పారిపోవాలని చూస్తారు. కానీ, అది సాధ్యం కాదు. వాటి నుంచి తేరుకునేందుకు మనుషులు కోరుకునేది ఆనందం. తనమన బేధం లేకుండా ఆనందాన్ని అందరికీ పంచేవారే ఎంటర్టైనర్స్. చిన్నప్పటినుంచి కష్టాలను అనుభవించినవారికే చిరునవ్వు బలమేంటో బాగా తెలుసు. అదే బలంగా మీరు ముందుకు సాగారు. నీ ఆటతో మిగతావారి ఆటస్థాయి పెంచారు. ఇమ్మూపై బిగ్‌బాస్ ప్రశంసలుఇంటిసభ్యులు మీకు దగ్గరైనవారి మీద మాటలదాడికి దిగినప్పుడు మీరు మాటమార్చలేదు, అలా అని వారి తోడు వీడలేదు. మీ ఆటలో, భావాల్లో నిజాయితీగా ఉన్నారు. మంచివైపే నిల్చున్నారు. మీకు దగ్గరైనవాళ్లు చేసింది తప్పనిపించినప్పుడు అంతే ధీటుగా నిలదీశారు. ఇంట్లో ఎన్ని జరిగినా ఆటపై ఏకాగ్రత కోల్పోలేదు. ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేయాలనేది ఇంట్లో మీకన్నా ఎక్కువగా ఎవరికీ తెలియదు.అమ్మ కల నెరవేరిందిప్రేక్షకుల మనసు గెలిచేందుకు, గొప్ప మనిషిగా ఎదిగేందుకు జుట్టు అక్కర్లేదు, గొప్ప చదువులూ, ఆడంబరాలు అక్కర్లేదు. వ్యక్తిత్వం ఒక్కటే అవసరం. ఇది మరోసారి మీ ప్రయాణంతో రుజువైంది. కమెడియన్‌గా అడుగుపెట్టిన మీరు హీరోగా రావాలన్న మీ అమ్మ కల నిజమైంది అని బిగ్‌బాస్ చెప్పడంతో ఆనందభాష్పాలు కార్చాడు. తర్వాత తన జర్నీ చూసుకుని ఓపక్క సంతోషిస్తూనే.. మరోపక్క గుక్క పెట్టి ఏడ్చాడు. కట్టకాలే వరకు అందర్నీ నవ్విస్తూనే ఉంటానని మాటిచ్చాడు. -
నవ్వులపాలైన చోటే పవన్‌కు చప్పట్లు.. ఏడ్చేసిన తనూజ
టాప్ 5 కంటెస్టెంట్లకు చిన్న చిన్న గేమ్స్ పెడుతూ.. వారికి కొన్ని సర్ప్రైజ్లు ఇస్తున్నాడు బిగ్‌బాస్. అయితే బిగ్‌బాస్ ఇస్తున్న సర్ప్రైజ్ కంటే పవన్ ప్రవర్తన, దూకుడే అన్నింటికన్నా పెద్ద సర్ప్రైజింగ్గా ఉంది. ఏ గేమ్ ఇచ్చినా ఈజీగా గెలిచేస్తున్నాడు.. అందరితో సరదాగా కలిసిపోయి జోకులేస్తున్నాడు. మంగళవారం (డిసెంబర్ 16) నాటి ఎపిసోడ్‌లోనూ అదే జరిగింది. ఆ విశేషాలు ఓసారి చూసేద్దాం..అదరగొట్టేసిన పవన్బిగ్బాస్ బెలూన్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో పవన్‌ను పక్కకు తప్పించి మిగతా అందరూ గేమ్ ఆడారు. ఈ ఆటలో తనూజ- కల్యాణ్ గెలిచారు. ఎక్కువ గేమ్స్ గెలిచిన పవన్‌ను హౌస్మేట్స్ ప్లేయర్ ఆఫ్ ది డేగా ప్రకటించారు. దీంతో అతడి అన్న వీడియో మెసేజ్ వచ్చింది. అగ్నిపరీక్షలో నిన్ను చూసి ట్రోల్ చేసినవాళ్లే ఇప్పుడు నిన్ను మెచ్చుకుంటున్నారు అని చెప్పాడు. ఆ మాటలు విని పవన్ ఉప్పొంగిపోయాడు.తనూజ గెలుపుమరుసటి రోజు పిక్ ద బోన్ అనే గేమ్ ఇచ్చాడు. ఇందులోనూ మళ్లీ పవనే గెలిచాడు. దీంతో అతడికి మళ్లీ ఓ స్టార్ వచ్చింది. అంతేకాకుండా.. మటన్ ఫ్రాంకీ పంపడంతో పవన్ ఆవురావురుమని ఆరగించాడు. అనంతరం బిగ్‌బాస్ టవర్ గేమ్ పెట్టాడు. ఈ ఆటలో ఇమ్మూ, తనూజ, సంజనా ఆడారు. వీరిలో తనూజ గెలిచి ఓ స్టార్ అందుకుంది. అలాగే తనకోసం బిగ్‌బాస్ పంపిన డ్రైఫ్రూట్ రబిడీని ఆరగించింది.తనూజకు చెల్లి పెళ్లి ఫోటోఅనంతరం ధమాకా కిక్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. గతంలో ఈ టాస్క్‌లోనే ఒక్క పాయింట్ కూడా స్కోర్ చేయకుండా కింద పడిపోయాడు పవన్. అప్పుడందరూ పగలబడి నవ్వారు. కానీ, ఈసారి మాత్రం అందరికంటే ఎక్కువ హైట్‌లో (ఏడున్నర అడుగులు) తన చెప్పును కాలితో అతికించి శెభాష్ అనిపించుకున్నాడు. ఒక స్టార్, తందూరీ చికెన్ గెలుపొందాడు. తర్వాత ప్లేయర్ ఆఫ్ ద డేగా తనూజను ప్రకటించారు. దీంతో ఆమెకు ఇంటినుంచి చెల్లి పెళ్లి ఫోటో వచ్చింది. ఆ ఫోటోలో తనూజను కూడా ఎడిట్ చేసి పెట్టారు. అది చూడగానే తనూజ కుటుంబాన్ని తల్చుకుని కన్నీళ్లు పెట్టుకుంది. -
స్క్రిప్టెడ్ కాదు.. పరోక్షంగా తనూజకు ప్రపోజ్ చేశాడా ?
బిగ్‌బాస్ అంటేనే నటనతో కూడిన బాండింగ్స్ ఉంటాయని తెలిసిందే. కొందరు స్క్రిప్టెడ్ లవ్‌ట్రాక్‌లో తమ ఆటను కొనసాగిస్తారు. ఈ సీజన్లో కూడా డీమాన్ పవన్-రీతూ చౌదరిల ట్రాక్‌తో పాటు తనూజ-కల్యాణ్‌ల ట్రాక్ కూడా కొనసాగింది. అయితే, తనూజ పట్ల కల్యాణ్ నిజంగానే కాస్త ఆసక్తి చూపుతున్నట్లు సులువుగా అర్థం అవుతుంది. కానీ, తనూజ మాత్రం తనతో ఫ్రెండ్‌గానే బంధాన్ని కొనసాగిస్తుంది. అయితే, సోమవారం జరిగిన ఎపిసోడ్లో నామినేషన్లు లేవు కాబట్టి బిగ్‌బాస్ వారికి ఒక టాస్క్ ఇచ్చాడు. తమ జర్నీ గురించి చెప్పాలంటూ ప్రతి ఒక్కరినీ బిగ్‌బాస్ అడిగాడు. ఈ క్రమంలోనే తనూజ గురించి కల్యాణ్ చెప్పిన మాటలు కాస్త ఆసక్తిగానే ఉన్నాయి.ఈ సీజన్ బిగ్‌బాస్ విన్నర్ అనేది తనూజ, కల్యాణ్‌ల మధ్యే ఉంది. టైటిల్ రేసులో ఉన్న వారిద్దరూ కూడా చాలా స్నేహంగా ఉన్నారు. బిగ్‌బాస్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి అని చెప్పాలి. అయితే, తన జర్నీ గురించి హౌస్‌మేట్స్‌తో కల్యాణ్ ఇలా చెప్పుకొచ్చాడు. తనకు 8 ఏళ్ల వయసు నుంచే సినిమాలంటే పిచ్చి అంటూ తెలిపాడు. వెండితెరపై తన పేరు కూడా కనిపించాలనే ఆశ ఎక్కువగా ఉండేదని గుర్తుచేసుకున్నాడు. బిగ్‌బాస్ జర్నీ తనకు గుర్తుండిపోయే సన్నివేశాలను చాలానే ఇచ్చింది అన్నాడు.తనూజపై కల్యాణ్ ప్రేమతనూజ, కల్యాణ్‌ల మధ్య ప్రేమ చిగురించిందని పలు యూట్యూబ్, సోషల్ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కల్యాణ్ బయటపడ్డాడు. తన జర్నీ గురించి చెప్పే క్రమంలో.. తనూజ వైపు కల్యాణ్ చూస్తూ ఇలా అన్నాడు 'జీవితాంతం ఈమె (తనూజ) ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నాను.. కాదు, ఫ్రెండ్షిప్ను మించి అంటూ స్ట్రెయిటుగా చెప్పేశాడు. తనూజతో ఉన్న ఈ బాండ్ ఇలాగే ఉంటుంది. ఉండాలని అనుకుంటున్నాను. ఈ పర్సన్ ఏంటంటే మనతో పాటు ఆలోచించి అవతలి వాళ్ల వైపు నుంచి కూడా ఆలోచించే గుణం తనూజలో ఉంది. అందుకే మోర్ దేన్ ఫ్రెండ్షిప్ తనూజతో ఉండాలని అనుకుంటున్నాను.' అని కల్యాణ్ అన్నాడు. అయితే, ఆమె నుంచి కూడా సానుకూల చూపులు కనిపించాయి. కాస్త సిగ్గుతో ఆమె తలదించుకుంది.ఇప్పుడు ఇద్దరూ సెలబ్రిటీలేకామనర్గా కల్యాణ్ బిగ్‌బాస్‌లోకి వచ్చాడు. కానీ, తనూజ అప్పటికే సెలబ్రిటీ. సిరీయల్స్‌తో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటించింది. అయితే, ప్రస్తుతం ఇద్దరూ సెలబ్రిటీలే. ఎవరూ తక్కువ కాదు. కొందరైతే మరో విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కల్యాణ్ మదర్ హౌజులోకి వచ్చి వెళ్తున్నప్పుడు తనూజ ఓ చీరెను గుర్తుగా ఇచ్చింది. దీని గురించి కల్యాణ్ కూడా తనూజను పలు ప్రశ్నలు అడిగాడు కూడా.. కానీ, ఆమె ఎలాంటి సమాధానం చెప్పలేదు. దీంతో వారిద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగిపోయింది. ఎంతలా అంటే తనూజ కోసం కప్ త్యాగం చేస్తావా అని బిగ్‌బాస్ అడిగితే.. వెంటనే కల్యాణ్ ఓప్పేసుకుంటాడేమో అనేలా తన పరిస్థితి ఉంది. -
నా కుటుంబం కన్నా తెలుగు ప్రేక్షకుల ప్రేమే ఎక్కువ!: తనూజ
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ చివరి వారం సరదాగా, భావోద్వేగంగా సాగిపోతుంది. చిన్న చిన్న టాస్కులిస్తుంటాడు బిగ్‌బాస్. అలాగే వారి జర్నీ వీడియోలు వేసి ఏడిపించేస్తాడు. తాజాగా బిగ్‌బాస్ జర్నీ అంటే మీ దృష్టిలో ఏంటో చెప్పమని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు.ఒక్కవారంలో అంతా అయిపోయిందా?అందులో ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. బయట ఎన్ని కామెడీ షోలు చేయలేదు? సింపుల్‌గా నవ్వించేయొచ్చు అనుకున్నాను. కానీ వచ్చిన మొదటివారమే మర్యాద మనీష్‌తో కామెడీ గురించి ఒక పెద్ద గొడవ జరిగింది. ఇన్నాళ్లు కష్టపడి కట్టుకున్న కోట ఒక్కవారంలో కూలిపోయిందా? అని నిద్రపట్టలేదు. ఆ సమయంలో మా మమ్మీ (సంజనా) పరిచయమైంది. ఊరికనే ఏడ్చేస్తానని నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది అన్నాడు.ఏడ్చేసిన డిమాన్ పవన్డిమాన్ పవన్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌కు వచ్చేముందు కెరీర్లో స్ట్రగుల్ అవుతున్నాను. అమ్మానాన్నను సరిగా చూసుకోలేకపోతున్నాను. అన్న, నాన్నపై ఆధారపడుతున్నాను అని చాలాసార్లు ఏడ్చాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనూజ మాట్లాడుతూ.. నా ఫ్యామిలీ కన్నా తెలుగు ప్రేక్షకులే ఎక్కువ ప్రేమను పంచారు. ఉన్నదాంట్లో సంతోషంగా గడపాలని ఇక్కడకు వచ్చాకే నేర్చుకున్నాను అంది.టాప్ 5 ఎమోషనల్కల్యాణ్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ అంటే కావాలనిపించే కష్టం. భోజనం, నిద్ర, మనుషులు ఏదీ కరెక్ట్‌గా ఉండదు. అయినా ఇది మనకు కావాలనిపిస్తుంది అన్నాడు. అలా అందరూ బిగ్‌బాస్ జర్నీని తల్చుకుని భావోద్వేగానికి లోనయ్యారు. -
టాప్ 5 ఛాన్స్ మిస్.. భరణి ఎలిమినేషన్‌కు కారణాలివే!
బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. మొదట్లో కామనర్స్‌ను అసహ్యించుకున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరు కామనర్స్ టాప్ 5లో ఉన్నారు. భరణి మెచ్యూరిటీ, ఆటను మెచ్చుకున్నారు. కానీ మధ్యలో ట్రాక్ తప్పడంతో ఆయన్ను ఆరువారాలకే ఎలిమినేట్ చేశారు. కామనర్ శ్రీజ, భరణిలో ఒకర్ని మళ్లీ తీసుకొస్తే.. జనం శ్రీజ ఓవరాక్షన్ తట్టుకోలేక భరణికి ఓటేశారు. అలా ఎనిమిదో వారం హౌస్‌లోకి వచ్చిన భరణి ఫైనల్స్‌కు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయాడు. పద్నాలుగో వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. అందుకు గల కారణాలేంటో చూద్దాం...నలిగిపోయిన భరణిభరణి మొదట ఎలిమినేట్ అయిందే బంధాల వల్ల! అటు తనూజ, ఇటు దివ్య మధ్య నలిగిపోయాడు. బంధాలు పెట్టుకోవడానికి రాలేదు, గేమ్ ఆడండి అని నాగార్జున వార్నింగ్ ఇచ్చినా పరిస్థితి మారలేదు. బంధాల వల్ల తనను తాను కోల్పోయినవాడిలా మిగిలిపోయాడు. ఎలిమినేషన్ తర్వాత తప్పొప్పులు తెలుసుకున్నాడు. స్ట్రాంగ్ రీఎంట్రీ ఇచ్చాడు. బంధాలు అడ్డు కాకూడదని భావించాడు. తనూజ, దివ్యను కాస్త దూరం పెట్టాడు.ఫ్యామిలీ వీక్‌తో మార్పుకానీ దివ్య ఫెవికాల్లా అతడికి అతుక్కుపోయింది. ఓపక్క సపర్యలు చేస్తుంది, మరోపక్క వెళ్లిపోమని నామినేషన్ చేస్తుంది. కానీ అతడిని ఆజమాయిషీ చేయడమే ఎవరికీ నచ్చలేదు. కొన్నివారాలపాటు భరణి దాన్ని మౌనంగానే భరించినా అది అతడి చేతకానితనంగా మారిపోయింది. అతడి అభిమానులకు అది నచ్చలేదు. ఫ్యామిలీ వీక్‌లో ఇంటిసభ్యులందరూ కూడా.. నీపై పెత్తనం చెలాయిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నావని కడిగిపారేశారు. దీంతో అప్పటినుంచి దివ్యను దూరం పెట్టాడు. కొన్నిసార్లు సంబంధం లేకపోయినా కోప్పడ్డాడు.విమర్శలుభరణి ధోరణి చూసిన వారికి అతడు సహజంగా ఉండట్లేదన్న అనుమానం మొదలైంది. మొదట్లో రేలంగి మామయ్యలా ఉన్న భరణి.. సెకండ్ ఎంట్రీలో మాత్రం ఫైర్ చూపించాడు. ఆ ఫైర్ మాటల్లో ఉంది కానీ గేమ్‌లో మాత్రం పెద్దగా చూపించలేకపోయాడు. అతడిని రికమండేషన్‌తో ఫైనల్‌కు తీసుకెళ్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అలా పలు కారణాల రీత్యా ఆయన్ను ఫినాలేకు ఒక వారం ముందు పంపించేశారు.చదవండి: కప్పు నువ్వే గెలవాలి: భరణి -
నేనంత దుర్మార్గుడిని కాదు, నువ్వే కప్పు గెలవాలి: భరణి
బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సుమన్, భరణి డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఒకే వారం వెళ్లిపోయారు. ఇప్పుడు హౌస్‌లో టాప్ 5 మిగిలారు. వీరిలో ఒకర్ని విజేతగా ప్రకటించే బాధ్యతను ప్రేక్షకుల చేతిలో పెట్టాడు బిగ్‌బాస్. ఈ మేకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఈ విషయం కాస్త పక్కనపెడితే ఆదివారం (డిసెంబర్ 14) ఎపిసోడ్లో ఏం జరిగిందో హైలైట్స్‌లో చూసేద్దాం..ప్రైజ్‌మనీతో ఏం చేస్తారు?బిగ్‌బాస్ 9వ సీజన్ ప్రైజ్‌మనీని రూ.50 లక్షలుగా ప్రకటించారు. ఈ ప్రైజ్‌మనీ మీ సొంతమైతే ఏం చేస్తారని నాగ్ అడిగాడు. భరణి వృద్ధాశ్రమానికి సాయం చేస్తానన్నాడు. ఇమ్మాన్యుయేల్.. తన ఇంటి అప్పు తీర్చేయడంతో పాటు ప్రియురాలిని బాగా చదివిస్తానన్నాడు. అలాగే తన అక్క పిల్లల చదువు, బాగోగులు అన్నీ చూసుకుంటానన్నాడు. డిమాన్ పవన్.. తండ్రికి క్యాన్సర్ ఉందని, ఆ ట్రీట్మెంట్ కోసం డబ్బు వాడతానన్నాడు. అలాగే అమ్మానాన్న కోసం ఓ ఇల్లు కడతానన్నాడు.విరాళంగా ఇస్తా..ప్రైజ్‌మనీని హౌస్‌మేట్స్‌లో ఒకరికి ఇవ్వాలంటే ఎవరికి ఇస్తావ్? అని అడగ్గా.. కల్యాణ్‌కు రూ.25 లక్షలు ఇస్తానన్నాడు. ఇద్దరం కామనర్స్ కాబట్టి తనతో పంచుకుంటానన్నాడు. తర్వాత సంజనా.. మా(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) సంఘానికి కొంత విరాళం ఇస్తాను. కాళ్లు లేని పిల్లల కోసం కృత్రిమ కాళ్లు కొనిస్తాను, నా పిల్లల కోసం రూ.10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను అంది. తనూజ పేద పిల్లల చదువుకు సాయం చేస్తానంది.బంగారం కొనిస్తాకల్యాణ్.. అనాథాశ్రమంలో ఒకరిద్దరిని దత్తత తీసుకుని వాళ్ల బాగోగులు చూసుకుంటాను. మా అమ్మకు వీలైనంత ఎక్కువ బంగారం కొనిస్తాను అని చెప్పాడు. తర్వాత తనూజను సెకండ్ ఫైనలిస్ట్‌గా, పవన్‌ను మూడో ఫైనలిస్ట్‌గా, ఇమ్మాన్యుయేల్‌ను నాలుగో ఫైనలిస్ట్‌గా ప్రకటించారు. చివరగా భరణి, సంజన మిగిలారు. వీరిలో భరణి ఎలిమినేట్.. సంజనా ఐదో ఫైనలిస్ట్ అని ప్రకటించగానే ఇమ్మూ ఆనందంతో చప్పట్లు కొట్టాడు. నాన్న దగ్గర ఆశీర్వాదంభరణి వెళ్లిపోయేముందు తనూజ అతడి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. గతంలో ఒకసారి ఎలిమినేట్ అయి మళ్లీ హౌస్‌లోకి వచ్చిన భరణి.. ఈసారి బాగానే ఆడాడు. కానీ, ఫైనల్స్‌లో అడుగుపెట్టేందుకు అది సరిపోలేదు. దీంతో అతడు ఎలిమినేట్ అయ్యాడు. స్టేజీపైకి వచ్చిన భరణి.. టాప్ 5లో ఉన్న ఐదుగురు ఫైటర్స్ అని ప్రశంసించాడు. కళ్యాణ్‌కు సైనికా, వందనం అంటూ సెల్యూట్ చేశాడు. కప్పు గెలవాలిసుమన్, కల్యాణ్‌ను ఏ రోజూ నామినేట్ చేయలేదు. కప్పు గెలిచే అర్హత నీకుంది అని బూస్ట్ ఇచ్చాడు. తనూజ.. నిన్ను కొన్నిసార్లు బాధపెట్టి ఉండవచ్చు. కానీ, నీకివ్వాల్సిన ప్రాధాన్యత నీకిచ్చాను. నాన్నా అని దగ్గరకు వస్తే దూరం తోసేంత దుర్మార్గుడిని కాదు. నువ్వు, దివ్య, సుమన్.. నాకు బెస్ట్ బెడ్డీస్ అన్నాడు. అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పిన భరణి.. తనూజ మాత్రం కప్పు గెలవాలని కోరాడు. -
అత్యధిక రెమ్యునరేషన్‌తో 'బిగ్‌బాస్' నుంచి భరణి ఎలిమినేట్..
బిగ్‌బాస్ తెలుగు సీజన్-9లో చివరి ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. దీంతో టాప్-5 ఎవరనేది తేలిపోయింది. తనూజ, కల్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, డిమోన్ పవన్, సంజన గల్రానీలు కప్ రేసులో ఉన్నారు. డిసెంబర్ 21న బిగ్‌బాస్ ట్రోఫీని అందుకునేది ఎవరనేది తేలనుంది. అయితే, శనివారం ఎపిసోడ్లో సుమన్ శెట్టి ఎలిమినేట్ కాగా.. ఆదివారం నాడు భరణి హౌస్ నుంచి వచ్చేశారు. అయితే, రీఎంట్రీ ఇచ్చిన భరణి రెమ్యునరేషన్ పరంగా భారీగానే అందుకున్నాడు.ఈ సీజన్లో ఎక్కువ పేరున్న సెలబ్రిటీగా భరణి ఎంట్రీ ఇచ్చారు. అందుకే ఈ సీజన్లో ఆయనకే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. వారానికి రూ. 3.5 లక్షలు పైగానే భరణికి బిగ్‌బాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన ఆరో వారమే ఎలిమినేట్ అయ్యారు. దీంతో 6వారాలకు గాను రూ. 21 లక్షలకు పైగానే రెమ్యునరేషన్‌గా వచ్చినట్లు సమాచారం. కానీ, భరణి 8వ వారంలో హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చి మళ్లీ మరో ఆరు వారాల పాటు కొనసాగారు. దీంతో అదే లెక్కన మరో రూ. 21 లక్షలు భరణి అందుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. రూ. 42లక్షలు రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్లు టాక్. ఈ సీజన్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్‌గా భరణి రికార్డ్ క్రియేట్ చేశారు. -
ఇది సుమన్‌కు మాత్రమే సాధ్యం.. మళ్లీ జరగదు, జరగబోదు!
కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. ఈ ట్యాగ్‌లైన్‌తోనే సీజన్ మొదలైంది. ఈ ట్యాగ్‌తోనే సీజన్ ముగింపు కాబోతోంది. కామనర్ కల్యాణ్, సెలబ్రిటీ తనూజలలో ఒకరు విన్నర్, మరొకరు రన్నర్ కాబోతున్నారు. సీజన్ ముగింపుకు చేరుకోవడంతో హౌస్‌లో డబుల్ ఎలిమినేషన్ ప్రకటించారు. అందులో భాగంగా సుమన్‌ను ఎలిమినేట్ చేశారు.. నేటి ఎపిసోడ్లో భరణిని పంపించేయనున్నారు.ఒక్క కారణం..సుమన్ ఇన్ని వారాలు కొనసాగడమనేది కొంత ఆశ్చర్యకరమనే చెప్పవచ్చు. ఎందుకంటే అతడు బలంగా గేమ్ ఆడింది లేదు, కన్నీళ్లు పెట్టుకుని డ్రామాలు చేస్తూ సింపతీకి ప్రయత్నించిందీ లేదు, కంటెంట్ కోసం ఓవరాక్టింగ్ చేసిందీ లేదు. అయినా 14 వారాలు హౌస్‌లో ఉన్నాడు. అందుకు గల ఏకైక కారణం అమాయకత్వం.నవ్విస్తాడనుకుంటే..సినిమాల్లో కమెడియన్‌గా నవ్వించిన సుమన్ శెట్టి బిగ్‌బాస్ హౌస్‌లో కూడా పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాడని అభిమానులు ఆశపడ్డారు. కానీ, అందుకు భిన్నంగా సైలెంట్‌గా ఉండిపోయాడు. సాధారణంగా అలా ముఖం పక్కకు తప్పుకుని కూర్చుంటే జనాలు వాళ్లను వీలైనంత త్వరగా హౌస్ నుంచి పంపించేస్తారు. కానీ, సుమన్‌ను ఎన్నో ఏళ్లుగా అభిమానించినవాళ్లకు అతడిని పంపించేసేందుకు మనసొప్పలేదు. అతడి ముఖంలో, ఆటలో, ప్రవర్తనలో అమాయకత్వాన్ని చూశారు.ఒక్క స్టెప్పేస్తే చాలువీలైనంత వరకు ఎవర్నీ నొప్పించకుండా మాట్లాడేవాడు. మాట్లాడింది తక్కువసార్లే అయినా.. అందులోనూ నీతి, నిజాయితీ వైపు నిలబడ్డ తీరుకు ఫిదా అయ్యారు. ఆయన ఒక్క స్టెప్పేస్తే చాలు.. జనం హాయిగా నవ్వుకునేవారు. తన బలం తనకు తెలియదన్నట్లు టికెట్ టు ఫినాలే రేసులో సుమన్ బాగా ఆడాడు. కానీ, అది సరిపోదు.. అంతా వదిలేసి చివర్లో కసితో ఆడితే ఏం లాభం.. అందుకే ఎలిమినేట్ అయ్యాడు.అందుకే 14 వారాలుకేవలం అమాయకత్వంతో 14 వారాలు హౌస్‌లో ఉండటం సుమన్ శెట్టి (Suman Shetty) కి మాత్రమే సాధ్యమైంది. ఆయన స్థానంలో ఎవరున్నా బిగ్‌బాస్ షోకి మీరు సెట్టవరు అని ప్రేక్షకులు నిర్దాక్షిణ్యంగా పంపించేసేవారు. సుమన్‌ను మాత్రం ఆరాధించారు, అభిమానించారు. ఇది గతంలో ఎన్నడూ జరగలేదు, జరగబోదు కూడా అన్నది సోషల్ మీడియాలో నెటిజన్ల వాదన! -
'బిగ్‌బాస్ తెలుగు 9' ప్రైజ్ మనీ ప్రకటించిన నాగార్జున
బిగ్‌బాస్ తెలుగు 9 ముగింపు దశకు చేరుకుంది. డిసెంబర్ 21న ఫైనల్ ఎపిసోడ్ జరగనుంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కానున్నారని నాగర్జాన ప్రకటించారు. భరణి ఎలిమినేట్ కావచ్చని వార్తలు వస్తున్నాయి. అప్పుడు రేసులో తనూజ, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, పవన్, సంజన మాత్రమే ఉంటారు. ఈ క్రమంలో తాజాగా విడుదలైన బిగ్‌బాస్ ప్రోమోలో విజేతకు అందే ప్రైజ్ మనీని నాగార్జున రివీల్ చేశారు.బిగ్‌బాస్ గత సీజన్ల మాదిరే ఈసారి కూడా విజేతకు రూ. 50 లక్షలు అందుతాయని హౌస్ట్ నాగార్జున ప్రకటించారు. అయితే, అందులో నుంచి ఎక్కువగా ట్యాక్స్ రూపంలో కట్ అవుతుందని అందరికీ తెలిసిందే. గెలుచుకున్న ప్రైజ్ మనీ ఎవరికైనా ఇవ్వాలని అనుకుంటే హౌస్‌లో ఎవరికి ఎంత ఇస్తావని భరణిని నాగార్జున అడిగారు. తాను గెలుచుకున్న డబ్బు ఎవరికైనా ఇవ్వాలనిపిస్తే ఆ లిస్ట్‌లో ఇమ్మాన్యుయేల్, పవన్‌లు ఉంటారని భరణి అన్నారు. తాను గెలిస్తే రీతూ కోసం రూ. 5 లక్షలతో గిఫ్ట్ కొంటానని పవన్ చెప్పారు. -
బిగ్‌బాస్ 'సుమన్ శెట్టి' ఎలిమినేట్.. ఆల్‌టైమ్ రికార్డ్‌గా రెమ్యునరేషన్
బిగ్‌బాస్ తెలుగు 9 నుంచి కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ వారమే ఆయన హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారని అందరూ భావించారు. కానీ, అంచనాలకు మించి ఏకంగా 14 వారాల పాటు ప్రేక్షకులను మెప్పించాడు. 97వ ఎపిసోడ్లో బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ప్రస్తుతం హౌస్‌లో కేవలం 6 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. నేడు ఆదివారం ఎపిసోడ్లో భరణి ఎలిమినేట్ కానున్నట్లు సమాచారం. అప్పుడు టాప్-5లో తనూజ, కల్యాణ్, ఇమ్మన్యూయేల్, పవన్, సంజన మాత్రమే ఉంటారు. అయితే, తాజాగా ఎలిమినేట్ అయిన సుమన్ శెట్టి భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.సుమన్ శెట్టి ఎలిమినేషన్ తర్వాత ప్రేక్షకులు అతని రెమ్యునరేషన్ గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. సుమన్ శెట్టి వారానికి రూ. 2.6 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది. 14 వారాలు హౌస్‌లో ఆయన కొనసాగడంతో సుమారుగా రూ.36 లక్షలకు పైగానే సంపాదించినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే టాప్ రెమ్యూనరేషన్ అందుకున్నవారిలో సుమన్ శెట్టి నిలిచారని చెప్పవచ్చు. గతంలో యాంకర్ రవి కూడా ఇదే రేంజ్లో రెమ్యునరేషన్ అందుకున్న విషయం తెలిసిందే. -
మనసులు గెలిచిన తనూజ.. విన్నర్ అవడం ఖాయం!
ప్రతి సీజన్లో ఒకే ఒక్క టికెట్ టు ఫినాలే ఉంటుంది. కానీ తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లో మాత్రం రెండో టికెట్ టు ఫినాలే ప్రవేశపెట్టడం.. దానికోసమే ఈ వారమంతా టాస్కులు ఆడించడం జరిగింది. తీరా ఫైనలిస్ట్ అయ్యే అవకాశం చేతిదాకా వస్తే తనకు అక్కర్లేదని తిరస్కరించింది తనూజ. ఆ విశేషాలు శుక్రవారం (డిసెంబర్ 12వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..బుర్ర ఉపయోగించిన భరణిలీడర్ బోర్డులో చివర్లో ఉన్న భరణి.. తన సగం పాయింట్స్ ఒకరికి ఇచ్చేయాలన్నాడు బిగ్‌బాస్. సంజనాకు పాయింట్స్ ఇచ్చేస్తే తనకు ఫినాలేకు వెళ్లే అవకాశాలు తగ్గిపోతాయని భావించి బుర్ర ఉపయోగించిన భరణి.. తనూజకు ఇచ్చాడు. కానీ, ఆ పాయింట్స్ ఇచ్చేటప్పుడు మాత్రం నువ్వు నా కూతురివి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.ఇమ్మూ గెలుపుతర్వాత మిగిలిన ముగ్గురు సంజనా, తనూజ, ఇమ్మాన్యుయేల్.. కీ టూ సక్సెస్ అనే గేమ్ ఆడారు. ఇందులో ముగ్గురూ కష్టపడ్డారు. సంజనా మాటలు జారడంతో ఇమ్మూ ఎమోషనలయ్యాడు. ఈ గేమ్‌లో ఇమ్మూ గెలవగా, సంజనా రెండో స్థానంలో, తనూజ మూడో స్థానంలో నిలిచింది. తర్వాత గేమ్‌లో అందరూ కలిసి సంజనాను ఆడకుండా సైడ్ చేశారు. చివరి గేమ్‌లో తనూజ విజయంఅలా ఇమ్మూ, తనూజకు బాల్ గేమ్ ఇచ్చారు. ఈ గేమ్‌లో ఇమ్మూ కాలు బెణకడంతో మెడికల్ రూమ్‌కు వెళ్లొచ్చాడు. నొప్పితో ఆడి మరీ ఇమ్మూ ఈ గేమ్ గెలిచాడు. అనంతరం తనూజ, సంజనా, ఇమ్మూకి చిట్టచివరి టాస్క్ ఇచ్చాడు. ఇందులో గెలిచినవారికి ఏకంగా 300 పాయింట్లు వస్తాయని బంపర్ ఆఫర్ ప్రకటించాడు బిగ్‌బాస్. ఈ గేమ్‌లో తనూజకు దెబ్బ తగిలిగినప్పటికీ పట్టించుకోకుండా ఆడి గెలిచింది. తనూజతో డీల్చివరి గేమ్‌లో ఎక్కువ పాయింట్స్ రావడంతో తనూజ ఏకంగా విజేతగా నిలిచింది. అన్ని గేమ్స్ గెలుచుకుంటూ వచ్చి చివర్లో ఓడిపోయానని ఇమ్మూ కంటతడి పెట్టుకున్నాడు. ఫైనల్‌గా లీడర్‌బోర్డులో 750 పాయింట్స్‌తో తనూజ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. ఇమ్మూ 520, సంజనా 320 పాయింట్లతో తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు. అనంతరం తనూజను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌కు పిలిచాడు.టికెట్ టు ఫినాలే అక్కర్లేదన్న తనూజమీ దగ్గరున్న రూ.3 లక్షలతో ఇమ్యూనిటీ కొనుగోలు చేసి సెకండ్ ఫైనలిస్ట్ అవొచ్చన్నాడు. ఆ డబ్బంతా విన్నర్ ప్రైజ్‌మనీ నుంచి కట్ చేస్తానన్నాడు. ఈ ఆఫర్‌ను తనూజ రిజెక్ట్ చేసింది. ప్రేక్షకుల ఓట్ల ప్రకారమే ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపింది. అలా ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేసి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. ఇది తనూజ విన్నింగ్ ఛాన్స్‌ను మరింత రెట్టింపు చేసే ఎపిసోడ్ అనే చెప్పవచ్చు. -
గేమ్‌లో సడన్‌గా కిందపడ్డ ఇమ్మూ.. మెడికల్ రూమ్‌కు!
టాస్కులు గెలవాలంటే కండబలం ఉండాలంటారు. కానీ, అదేం అవసరం లేదని, ఆత్మవిశ్వాసం ఉంటే చాలని నిరూపించాడు ఇమ్మాన్యుయేల్. తనకు ఇచ్చిన ప్రతి టాస్కులోనూ అద్భుతంగా ఆడాడు. అందరినీ వెనక్కు నెడుతూ మెజారిటీ గేమ్స్ అతడే గెలిచాడు. అందుకే ఇప్పుడు సెకండ్ టికెట్ టు ఫినాలే రేసులోనూ ధృడంగా నిలబడ్డాడు.నేనూ మనిషినే..కానీ శారీకరంగా, మానసికంగా ఇమ్మూ అలసిపోయినట్లు కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సంజనాతో గొడవపడ్డాడు. గేమ్‌లో మీరు ఫస్ట్ వచ్చి నాది లాగారు... ఎందుకు నన్ను తప్పుగా చిత్రీకరించాలని చూస్తున్నారు అని ఆవేదన చెందాడు. అటు గేమ్‌లో ఓడిపోయినందుకో ఏమో కానీ సంజనా బాధ తట్టుకోలేక ఏడ్చేసింది. నేనూ మనిషినే.. నాకూ ఫీలింగ్స్ ఉంటాయి. వారం రోజుల నుంచి నన్ను ఏం పోట్రేట్ చేయాలని చూస్తోంది. వారం నుంచి నా వైపు ఒక్కసారైనా చూసిందా? అని ఎమోషనలయ్యాడు.నొప్పితో విలవిలతర్వాత లీడర్ బోర్డులో చివర్లో ఉన్న సంజనాను అందరూ ఏకాభిప్రాయంతో తొలగించినట్లు కనిపిస్తోంది. అలా ఫైనల్‌గా ఇమ్మూ, తనూజ బాల్స్ గేమ్ ఆడారు. అయితే ఈ ఆటలో ఇమ్మూ కాలు బెణికి కిందపడిపోయాడు. నొప్పి తట్టుకోలేక గేమ్ కాసేపు ఆపమని కోరాడు. నొప్పితో విలవిల్లాడుతున్న అతడిని మెడికల్ రూమ్‌కు తీసుకెళ్లారు. ఇక ఈ గేమ్‌లోనే తనూజ గెలిచి సెకండ్ ఫైనలిస్ట్ అయింది. కాకపోతే తను ప్రేక్షకు ఓట్లతోనే కొనసాగాలనుకుంటున్నానంటూ ఇమ్యూనిటీని తిరస్కరించింది. -
మీ ఏడుపు ఫేక్.. ప్రేక్షకుల కామెంట్స్‌తో తనూజ షాక్!
లీడర్ బోర్డులో చివర్లో ఉన్న సుమన్ ఆటలో అవుట్ అయ్యాడు. అతడి దగ్గరున్న రూ.1 లక్షలో సగం, తన స్కోర్‌లో సగం ఎవరికైనా పంచొచ్చని బిగ్‌బాస్ చెప్పాడు. ఆయనకు వెంటనే భరణి పేరు తట్టింది.. కానీ, భరణి మాత్రం సంజనాకు ఇవ్వమని సలహా ఇచ్చి మంచి మనసు చాటుకున్నాడు. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో గురువారం (డిసెంబర్ 11వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..భరణిని సైడ్ చేశారుఅలా సుమన్ ఇచ్చిన పాయింట్ల దెబ్బకు సంజనా లీడర్ బోర్డులో మూడో స్థానంలోకి వచ్చింది. ఇక తర్వాత గేమ్‌లో మెజారిటీ ఇంటిసభ్యులు కలిసి భరణిని పక్కనపెట్టి గేమ్ ఆడారు. అలా జోకర్ గేమ్‌లో ఇమ్మూ, సంజనా గెలవగా మిగతావాళ్లు ఒక్క పాయింట్ కూడా స్కోర్ చేయలేకపోయారు. లీడర్ బోర్డులో చివర్లో ఉన్న పవన్.. తన దగ్గరున్న రూ.1,50,000 అలాగే 150 పాయింట్లలో సగం ఒకరికి ఇచ్చి ఆటలో నుంచి తప్పుకోవాలన్నాడు బిగ్‌బాస్. మళ్లీ భరణి టార్గెట్అతడు తన పాయింట్స్ అన్నీ తనూజకు ఇవ్వడంతో ఆమె లీడర్ బోర్డులో టాప్‌లో నిలిచింది. ఇక నెక్స్ట్ గేమ్‌లో ఒకర్ని తీసేయాలని బిగ్‌బాస్ చెప్పగానే మెజారిటీ ఇంటిసభ్యులు మళ్లీ భరణిని తీసేశారు. మిగిలిన సంజనా, తనూజ, ఇమ్మాన్యుయేల్ బ్యాలెన్స్ గేమ్ ఆడారు. ఈ ఆటలో ఇమ్మూ గెలవగా తనూజ, సంజనా తర్వాతి స్థానాల్లో వచ్చారు.ఓట్ అప్పీల్అయితే లీడర్ బోర్డులో మాత్రం తనూజ ఫస్ట్ ర్యాంక్‌లో ఉండగా.. ఇమ్మూ సెకండ్, సంజనా మూడో స్థానంలో ఉన్నారు. దీంతో బిగ్‌బాస్ ఓట్ అప్పీల్ కోసం తనూజతో పాటు ఇంకెవరు ముందుకు రావాలనే నిర్ణయాన్ని తనూజ చేతిలో పెట్టాడు. అలా తనూజ.. సంజనాను ఎంచుకుంది. వీరిద్దరూ గార్డెన్ ఏరియాలో ప్రేక్షకులను కలుసుకున్నారు. ప్రేక్షకులు తనూజకే ఓటేయడంతో ఆమె ఓట్ అప్పీల్ చేసుకుంది. తెలిసో తెలియక తప్పు చేసుంటే క్షమించమని కోరింది. మీ ఏడుపు ఫేక్తర్వాత జనాలడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. మీ ఏడుపు నిజమనిపించదు, ఫేక్ అని ఓ వ్యక్తి అనగా.. నేను కావాలని ఎమోషనల్ అవను, అది దానంతటదే వస్తుంది, ఇక్కడ ఏదీ ఫేక్‌గా ఉండదు అని చెప్పింది. భరణి నాన్న.. వైల్డ్‌కార్డ్స్ వచ్చాక భరణి సర్ ఎందుకయ్యారు? అన్న ప్రశ్నకు తనూజ.. మా మధ్య అనుబంధం ఇప్పటికీ అలాగే ఉంది. సింపతీకాకపోతే మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని వచ్చినప్పుడు ఆ నాన్న అనే పిలుపు చూసేవారికి సింపతీగా కనిపిస్తోంది. ఆయనకు ఎటువంటి ఇబ్బంది రావొద్దనే నాన్న అనే పిలుపును పక్కనపెట్టాను అని క్లారిటీ ఇచ్చింది. ఇమ్మాన్యుయేల్‌ను ముఖం మీదే ఫ్రెండ్ కాదని ఎలా అంటావని నిలదీశాడో వ్యక్తి. దానికి తనూజ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలింది. వాడికి సపోర్ట్ చేయలేదా? అని రివర్స్‌లో అంటే.. మీరెక్కడ చేశారు మేడమ్? మీరే అందరి సపోర్ట్ తీసుకుంటారు అని దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. ఆ మాటకు తనూజ ముఖం వాడిపోయింది. -
తనూజకు కల్యాణ్ ఫుల్ సపోర్ట్.. అయినా టాప్‌లో భరణి
బిగ్‌బాస్ 9 సీజన్ దాదాపు చివరకొచ్చేసింది. మరో పదిరోజులు మాత్రమే మిగిలున్నాయి. నేపథ్యంలో ఉండాల్సినంతా డ్రామా కనిపించట్లేదు. పైపెచ్చు టాప్ కంటెస్టెంట్స్ మధ్య పోటీ ఉండాల్సింది పోయి ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇదే కాస్త చిత్రంగా అనిపిస్తుంది. తాజా ఎపిసోడ్లో అయితే తనూజకు కల్యాణ్ ఫుల్ సరెండర్ అయిపోయాడు. ఇంతకీ బుధవారం ఏమేం జరిగింది?కల్యాణ్ తొలి ఫైనలిస్ట్ అయిపోయాడు. దీంతో రెండో ఫైనలిస్ట్ రేసులో తదుపరి గేమ్ ఆడకుండా ఒకరిని తప్పించాలని బిగ్‌బాస్ చెప్పడంతో హౌస్ మెజారిటీ ప్రకారం సంజన తప్పుకొంది. తర్వాత మిగిలున్న ఐదుగురికి 'పట్టుకో పట్టుకో' అనే పోటీ పెట్టారు. ఇందులో భాగంగా సంచాలక్స్ కల్యాణ్, సంజన వేసే బంతుల్ని.. జంబో ప్యాంట్స్ వేసుకున్న పోటీదారులు పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో తనూజకు కల్యాణ్ ఫుల్‌గా సపోర్ట్ చేశాడు. 10లో 7 బంతులు ఆమెకే వేయడం విశేషం. మరోవైపు సుమన్ పక్కనే నిలబడ్డ భరణి.. అతడి బంతుల్ని పట్టేసుకున్నాడు. అన్నా అది నా బల్ అని సుమన్ అంటున్నా గానీ భరణి సైలెంట్‌గానే ఉండిపోయాడు. ఈ పోటీలో తనూజ తొలి స్థానం దక్కించుకోగా భరణి, పవన్, ఇమ్మూ, సుమన్ మిగతా స్థానాల్లో నిలిచారు.గేమ్ తర్వాత తనూజ-కల్యాణ్ గురించి భరణి-సంజన మాట్లాడుకున్నారు. మరి అంత దారుణంగా.. కూర్చో అంటే కూర్చుంటున్నాడు నిలబడు అంటే నిలబడుతున్నాడు.. నేను రిలేషన్‌ని తప్పుబట్టను.. వాళ్లిద్దరూ ఎందుకో పాపం.. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అభిమానం కానీ తనూజ మరీ ఓవర్ కమాండ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది నాకు అని భరణి అన్నాడు. బాల్ టాస్క్ తర్వాత లీడర్ బోర్డ్‌లో ఇమ్మానుయేల్, డీమాన్ పవన్ టాప్-2లో ఉన్నారు. దీంతో ఈసారి ఇద్దరిని తర్వాత గేమ్ నుంచి తప్పించాలని బిగ్‌బాస్ పుల్ల పెట్టాడు. అలా కాసేపు హౌస్మేట్స్ తర్జన భర్జన తర్వాత వీళ్లిద్దరినీ తప్పించారు.తర్వాత 'పట్టు వదలకు' అనే టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా పజిల్ పూర్తి చేసి, రోల్ అవుతున్న తాడుని పట్టుకోవాల్సి ఉంటుంది. తొలి స్థానంలో నిలిచిన వాళ్లకు 100 పాయింట్లు వస్తాయని బిగ్‌బాస్ చెప్పాడు. ఈ గేమ్‌లో తనూజ, సంజన.. త్వరగానే పజిల్ పూర్తి చేశారు గానీ తాడుని ఎక్కువసేపు పట్టుకోలేక కింద పడేశారు. ఇక్కడే తెలివి చూపించిన భరణి.. ఆలస్యంగా పజిల్ పూర్తి చేసి తాడు చివరలో ఉండగా వెళ్లి, కాసేపు దాన్ని పట్టుకుని టాస్క్ పూర్తి చేశాడు. 100 పాయింట్లు సొంతం చేసుకున్నాడు. సుమన్ అయితే ఈ టాస్క్ పూర్తి చేయలేకపోయాడు.పట్టు వదలకు టాస్క్ పూర్తి చేసిన భరణి(230).. ఒకేసారి 100 పాయింట్లు రావడంతో లీడర్ బోర్డ్‌లో టాప్‌లోకి వచ్చేశాడు. తర్వాత తనూజ (220), ఇమ్మాన్యుయేల్ (170), డీమన్ పవన్ (150), సంజన (140), సుమన్ (100) వరసగా నిలిచారు. ఇక టాప్-2లో నిలిచిన భరణి, తనూజలో ఒకరికి ఓట్ అప్పీల్ ఛాన్స్ వస్తుంది. ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకోమని చెప్పగా.. హౌస్‌లోకి వచ్చిన ఆడియెన్స్, తనూజ పేరు చెప్పారు. దీంతో ఈమె ఓటు అప్పీలు చేసుకుంది. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. -
'బిగ్‌బాస్'ను తాకిన కులం, ప్రాంతపు రంగు
బిగ్‌బాస్ గేమ్ అంటేనే అందులోని కంటెస్టెంట్స్‌కు చాలా స్ట్రాటజీలు ఉంటాయి. కొందరైతే ముందుగానే బిగ్‌బాస్ టీమ్‌తో డీల్ సెట్ చేసుకుంటారు. తను ఎన్నివారాలు ఉండాలో దానికి తగినట్టు స్ట్రాటజీ ప్లాన్ చేసుకుంటారు. కానీ, కొందరు మాత్రం తమ పీఆర్ టీమ్స్‌తో ప్రేక్షకులను ముందుగా రెచ్చగొడతారు. ఆపై కులం, మతం, ప్రాంతం పేరుతో తమ కంటెస్టెంట్స్ కోసం నెట్టింట ట్రోలింగ్‌కు దిగుతారు. తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదవ సీజన్లో కూడా అదే జరగుతోంది. టాప్ 2పై ట్రోలింగ్కన్నడ అమ్మాయి అంటూ తనూజపై తీవ్రమైన ట్రోలింగ్ కొనసాగుతుంది. మరోవైపు కల్యాణ్ మా కులపోడు అంటూ కొందరు భుజాన ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతడి పీఆర్ టీమ్ దానిని వైరల్ చేస్తోంది. ఈ క్రమంలో కల్యాణ్‌పై కూడా ట్రోలింగ్ జరుగుతుంది. దీంతో కుల, ప్రాంతీయ జాడ్యం బిగ్‌బాస్‌ను కూడా తాకింది. కల్యాణ్ మా కులపోడు అంటూ ఇప్పటికే తన సామాజిక వర్గం పెద్దలు రంగంలోకి దిగారు. వేరేవాాళ్లను తొక్కితేనే..అతనిపై కామన్ మ్యాన్, ఆర్మీ మ్యాన్, తెలుగు వాడు అంటూ పీఆర్ టీమ్స్ వైరల్ చేస్తున్నాయి. దీంతో ఆయన అభిమానులు భారీ ఎత్తున సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్‌లో ఒక కంటెస్టెంట్‌ను పైకి లేపాలంటే వేరే కంటెస్టెంట్లపై దుష్ప్రచారాలు చేయాలి. ఇప్పుడు ఈ సీజన్లో కూడా అదే ఫార్ములా పాటిస్తున్నారు.కమ్యూనిటీ పేరెత్తితే ఏమైంది?బిగ్‌బాస్ టైటిల్ రేసులో కల్యాణ్, తనూజ ఉన్నారు. ఆమె కన్నడ అమ్మాయి కావడంతో తన భాష, ప్రాంతం గురించి చర్చ మొదలైంది. ఇది కేవలం ఒక గేమ్ అనే సోయి కూడా చాలామందికి లేదు. ఇక్కడ ప్రాంత, కుల, భాషాభేదాలు అవసరం లేదు. ఆటను ఆటగా చూడాలనే ఆలోచన ఎవరికీ లేదు. గతంలో మెహబూబ్ కూడా కమ్యూనిటీ వోటింగు చర్చకు తెరలేపాడు. లాస్ట్‌కు తనే ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు.ఐపీఎల్లో ఇలాంటివేం లేదేఇక్కడ కన్నడ, తెలుగు అనే ప్రాంతీయతతో పనేంటి..? ఐపీఎల్ మాదిరి బిగ్‌బాస్ కూడా ఒక గేమ్‌లా అనుకోవడమే బెటర్. ఐపీఎల్లో నగరాల పేర్లతో టీమ్స్ ఉన్నాయి. అనేక దేశాల నుంచి క్రికెటర్లు ఆయా జట్టులో ఉన్నారు. అక్కడ మనం ప్రాంతం, దేశం, కులం, భాష అనే తేడా లేకుండా చూస్తున్నాం అనే విషయాన్ని గుర్తుంచుకుంటే ఇలాంటి అభిప్రాయం రాదేమో..గత సీజన్ల నుంచి ఇదే ట్రోలింగ్ఇక్కడ చెప్పుకోవాల్సింది మరొక పాయింట్ ఉంది. కన్నడ, కన్నడ అంటూ తనూజ గేమ్‌ను టార్గెట్ చేస్తున్నారు. గతంలో కూడా యష్మి, శోభా శెట్టి, ప్రేరణ, నిఖిల్, పృథ్వి వంటి వారు కూడా ఇదే ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. వీళ్లందరూ కూడా చక్కగా తెలుగు మట్లాడుతారు. వాళ్లు అవకాశాలు అందిపుచ్చుకుని నటించేది, ఆధారపడి జీవిస్తుంది తెలుగు గడ్డపైనే.. వారికి ఆధారం కూడా తెలుగు సీరియళ్లే.. వాళ్లందరూ ఇదే విషయం పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. గేమ్ పక్కట్టి..కానీ, సోషల్‌మీడియాలో ఆవేశం, దూకుడు, పిచ్చి కూతలతో పీఆర్ టీమ్స్ వారిని ట్రోలింగ్ చేస్తున్నాయి. గత సీజన్లో శోభాశెట్టి, ప్రియాంక, అమర్‌దీప్‌లను స్టార్‌మా బ్యాచ్ అని ముద్రవేసి శివాజీ టార్గెట్ చేశారు. బయట తన పీఆర్ టీమ్ ఆటతో పనిలేకుండా ఆ గ్రూప్‌పై ఇలాంటి ఎదురుదాడితోనే విరుచుకుపడింది. పీఆర్ టీమ్‌లకు గేమ్‌తో పనిలేదు. ఇదేం బాగోలేదుకేవలం ఆడవాళ్లను అవమానించేందుకే ఉన్నామనేలా సెకనుకొక కామెంట్‌తో రెచ్చిపోతున్నారు. తమ కంటెస్టెంట్లో పాజిటివ్‌ను వెతుక్కుని హైలైట్ చేసుకోవడానికి బదులు అవతలివారిని నెగెటివ్ చేయడంపైనే స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. కానీ, ఇలా కుల, ప్రాంతీయ బేధాలు తీసుకురావడం ఏమాత్రం సబబు కాదని బిగ్‌బాస్ ఆడియన్స్ ఫీలవుతున్నారు. View this post on Instagram A post shared by Geetu Royal (@geeturoyal_) Mana Telaga Caste vadu kabatti Kalyan ki votes veyyandi ani beg chesukuntunnaru Caste Card use chesi ...🤮🤮Matladuthundhi Telaga Community President anta 👇👇#BiggBossTelugu9 #KalyanPadala pic.twitter.com/RIwmqK9pga— Arachakame (@Arachakame) December 7, 2025 -
కల్యాణ్ డ్యూటీ చేసేది మాతోనే.. తనను తొలగించలేదు!
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్లో అసలు సిసలైన పోటీ తనూజ, కల్యాణ్ మధ్యే ఉంది. అయితే తనూజ కన్నడ అమ్మాయి అని ట్రోల్ చేస్తుంటే పవన్ కల్యాణ్ పడాల అసలు ఆర్మీ జవానే కాదని విమర్శిస్తున్నారు. పవన్ కల్యాణ్.. ఇండియన్ ఆర్మీలో లేడని సీఆర్పీఎఫ్ (కేంద్ర రిజర్వు పోలీస్ దళం) అని ఓ సుందర్ అనే జవాన్ ఓ వీడియో చేశారు. కల్యాణ్ ఫ్రెండ్ క్లారిటీఅంతేకాకుండా కల్యాణ్ బయటకు వచ్చి 90 రోజులు అయిపోయింది కాబట్టి అతడిని విధుల నుంచి కూడా తొలగించి ఉంటారని పేర్కొన్నారు. ఈ వివాదంపై పవన్ కల్యాణ్ ఫ్రెండ్, సీఆర్పీఎఫ్ పోలీస్ మణికంఠ స్పందించాడు. కల్యాణ్ పడాలను ఎవరూ విధుల్లో నుంచి తీసేయలేదు. పర్మిషన్ తీసుకునే బిగ్‌బాస్‌కు వచ్చాడు. పెట్టిన లీవులన్నీ అయిపోయినా సరే ఏదైనా అత్యవసరం ఉందంటే దాన్ని పొడిగిస్తారు. కల్యాణ్‌ను తొలగించలేదుమాతో పాటు డ్యూటీ చేస్తున్నాడు కాబట్టి మాకు తెలుసు.. తనను తీసేయలేదు. తనను తీసేయాలంటే అతడి సంతకం కచ్చితంగా ఉండాలి. కల్యాణ్ వెళ్లిపోవాలన్నా సరే.. సోల్జర్ను తొలగించడం అంత ఈజీ అయితే కాదు. దానికి చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. పవన్ కల్యాణ్.. మొదట్లో తాను ఒక సోల్జర్ అని చెప్పుకున్నాడు. కానీ ఈ జర్నీలో తనెప్పుడూ సోల్జర్ అని చెప్పి, ఓట్లేయమని అడుక్కోలేదు. నాగార్జున అడిగితేనే..బిగ్‌బాస్ షోలో తన గేమ్, ప్రవర్తన చూసి ఓట్లేయండి. అతడెప్పుడూ సోల్జర్ అని చెప్పి సింపతీ కార్డు ఉపయోగించలేదు. నాగార్జున సార్.. కల్యాణ్, ఒకసారి సెల్యూట్ కొట్టి చూపించు అని అడిగాడు. అప్పుడు మాత్రమే కల్యాణ్ సెల్యూట్ కొట్టి చూపించాడు. అంతే తప్ప అందులో ఏం లేదు. తనను బ్యాడ్ చేయకండి. తను చాలా బాగా ఆడుతున్నాడు అని పేర్కొన్నారు. ఈ వీడియోను పవన్ కల్యాణ్ టీమ్ అతడి అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.యూటర్న్అలాగే కల్యాణ్ (Pawan Kalyan Padala)ను విమర్శించిన ఎస్జే సుందర్ అనే జవాన్ సైతం యూటర్న్ తీసుకున్నారు. ఇండియన్ ఆర్మీ అయినా, సీఆర్పీఎఫ్ అయినా, ఏ డిఫెన్స్ ఫోర్స్ అయినా.. చేసేది దేశసేవే. వన్స్ ఎ సోల్జర్.. ఆల్వేస్ సోల్జర్. వీలైతే గెలిపించండి అని వీడియో చేశారు. మొత్తానికి ఈ రెండు వీడియోలతో కల్యాణ్‌పై వివాదానికి ఫుల్స్టాప్ పడి, నెగెటివిటీ తగ్గుతుందని అభిమానులు ఆశపడుతున్నారు. కాగా సీఆ్పీఎఫ్.. దేశ అంత్గత భద్రతను కాపాడుతుంది. శాంతి భద్రతల విధుల్లో, నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లలో సీఆర్పీఎఫ్ను వినియోగిస్తారు. View this post on Instagram A post shared by Pavan Kalyan Padala (@kalyanpadala881) View this post on Instagram A post shared by Sundara Rao Jadde (@sj_______sundar) -
ఎంత దారుణం.. తనూజ ఏది చెప్తే అది చేస్తున్నాడు: భరణి
ఇమ్యూనిటీ + ఓట్ అప్పీల్ కోసం బిగ్‌బాస్ హౌస్‌లో టాస్కులు జరుగుతున్నాయి. లీడర్ బోర్డులో మొదటి స్థానంలో నిలబడి ప్రభంజనం సృష్టించిన ఇమ్మాన్యుయేల్ అందరికంటే మొదటగా ఓట్ అప్పీల్ గెలిచాడు. ఇప్పుడు మరో ఓట్ అప్పీల్ కోసం టాస్కులు జరుగుతున్నాయి. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది.బాల్ గేమ్అందులో సంజనా, కల్యాణ్ సంచాలకులుగా ఉండగా మిగతావారు గేమ్స్ ఆడారు. సంచాలకులు విసిరే బాల్స్‌ను తమ జంబో బ్యాగుల్లో పడేలా చూసుకోవాలి. ఈ గేమ్‌లో తనూజ గెలిచినట్లు సమాచారం. ఈ గేమ్ అయిపోయాక భరణి.. సుమన్‌తో మాట్లాడుతూ.. ఎంత దారుణం.. తనూజ కూర్చో అంటే (కల్యాణ్) కూర్చుంటున్నాడు, నిలబడమంటే నిల్చుంటున్నాడు. భరణిపై సెటైర్స్తనూజ ఎక్కువ కమాండ్ చేస్తున్నట్లు అనిపిస్తోంది అని ఫీలయ్యాడు. ఈ ప్రోమో కింద కొందరు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. దివ్య మిమ్మల్ని కమాండ్ చేసినప్పుడు ఏమైపోయారు? అని భరణిపై సెటైర్లు వేస్తున్నారు. ఇక ఈ రోజు ఎపిసోడ్లో తనూజ ఓట్ అప్పీల్ గెలిచినట్లు భోగట్టా! చదవండి: ఇమ్మాన్యుయేల్ ప్రభంజనం.. టాప్5లో ఉంచమని రిక్వెస్ట్ -
బిగ్‌బాస్ హౌస్‌లో ఆడియన్స్.. టాప్ 5కి చేర్చండి అన్న ఇమ్మూ
ఇది ఫెయిర్ కాదు బిగ్‌బాస్ పేరిట హౌస్‌లో ఇమ్యూనిటీ చాలెంజ్ నడుస్తోంది. ఇప్పటికే ఓ గేమ్ పూర్తవగా లేటెస్ట్ ఎపిసోడ్లో మరో రెండు గేమ్స్ పెట్టారు. అలాగే బిగ్‌బాస్ ప్రియులు హౌస్‌లోకి వెళ్లి మాట్లాడారు. ఆ విశేషాలేంటో మంగళవారం (డిసెంబర్ 9వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..సంజనాకు సీక్రెట్ టాస్క్మూడుసార్లు జైలు నుంచి బయటకు రావాలని సంజనాకు సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో ఆమె తెలివిగా ఆరోగ్యం బాలేదంటూ మూడుసార్లు జైలు ఓపెన్ చేయించింది. అలా ఆమె జైలు జీవితం రద్దవడంతో పాటు ఏ గేమ్ ఆడకుండానే 20 పాయింట్లు గెలుచుకుంది. ఇక ఇమ్యూనిటీ రేసులో భాగంగా రెండో గేమ్ పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో ఇమ్మూ గెలవగా డిమాన్ పవన్ రెండో స్థానంలో నిలిచాడు. సుమన్, తనూజ, సంజనా, భరణి తర్వాతి నాలుగు స్థానాల్లో నిలిచారు.గేమ్ నుంచి తప్పించే ఛాన్స్మూడో గేమ్‌లో ఒకరు ఆడకుండా సైడ్ చేయొచ్చన్నాడు బిగ్‌బాస్. ఇమ్మూ.. సంజనాను పక్కకి పిలిచి అదిరిపోయే సలహా ఇచ్చాడు. వాళ్లు ముగ్గురూ (భరణి, తనూజ, సుమన్) కచ్చితంగా మా ఇద్దరి (పవన్, ఇమ్మ)లో ఒకరి పేరు చెప్తారు. కాబట్టి నువ్వు ఆ ముగ్గురిలో ఒకరి పేరు చెప్తే, నేను, పవన్, కల్యాణ్ కూడా అదే చెప్తాం. దీనివల్ల లీడర్ బోర్డులో చివర్లో ఉన్న నువ్వు ముందుకొస్తావ్ అని ఐడియా ఇచ్చాడు. కానీ, సంజనా వింటేగా.. నేను నీ పేరు కాదు, పవన్ పేరు చెప్తున్నా అంది.ప్లేటు తిప్పేసిన సంజనానువ్వు పవన్ పేరు చెప్తే.. వాళ్లంతా నా పేరు చెప్తారు, అలా నేను బలవ్వాల్సి వస్తుంది అని మొత్తుకున్నా ఆమె వినిపించుకోలేదు. దీంతో భరణి, సుమన్, తనూజ.. ఇమ్మూ అనుకున్నారు. కానీ సంజనా ఒక్కరే డిమాన్ పవన్ పేరు చెప్పింది. పవన్, కల్యాణ్.. సంజనా పేరు చెప్పారు. దీంతో ఇమ్మూ.. తనను కాపాడుకోవడం కోసం సంజనా పేరు చెప్పక తప్పదన్నాడు. అలాగైతే తాను డేంజర్లో పడతానని అర్థమైన సంజనా.. వెంటనే తన నిర్ణయం మార్చుకుంది. తనూజ వర్సెస్ సంజనాపవన్కు బదులుగా ఇమ్మూని తీసేస్తానంది. అందుకు తనూజ ఒప్పుకోలేదు. అలాగైతే నేనూ నా నిర్ణయం మార్చుకుంటా.. అంటూ సంజనా పేరు చెప్పింది. ఇక్కడ వీళ్లిద్దరికీ గొడవ జరిగింది. చివరకు ఇమ్మాన్యుయేల్.. సంజనా పేరు చెప్పాడు. అలా సంజనాకు ఎక్కువ ఓట్లు రావడంతో ఆమె నెక్స్ట్ గేమ్ ఆడటానికి వీల్లేదని బిగ్‌బాస్ ప్రకటించాడు. ప్రస్తుతానికి లీడర్ బోర్డులో టాప్ 2లో ఉన్న ఇమ్మూ, పవన్.. గార్డెన్ ఏరియాలోకి వచ్చారు.ఇమ్మూ ఓట్ అప్పీల్వీరి కోసం కొందరు ప్రేక్షకులు బిగ్‌బాస్ హౌస్‌కి వచ్చారు. మెజారిటీ జనం ఇమ్మూ (Emmanuel) ఓట్ అప్పీల్ గెల్చుకోవాలని కోరారు. అలా ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటివరకు నాకు ఓటేస్తూ నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. మూడుసార్లు కెప్టెన్ అయ్యాను. ఇంట్లోని పరిస్థితులను తట్టుకుని అందర్నీ నవ్విస్తున్నాను. వీలైనన్ని గేమ్స్ గెల్చుకుంటూ వచ్చాను. ఓట్ అప్పీల్ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకనుంచి ఒక లెక్క. దయచేసి నాకు ఓటేయండి. ఒక్క ఎంటర్టైనర్ అయినా కప్పు గెలవాలని ఆడుకుంటూ వచ్చాను. నాకు ఓటేసి టాప్ 5లో ఉంచుతారని అనుకుంటున్నాను అని ఓట్ అప్పీల్ అడిగాడు. తర్వాత ప్రేక్షకులతో కాసేపు చిట్‌చాట్ చేశాడు. కప్పు గెలవగానే ఫస్ట్ అమ్మ చేతికి ఇస్తానని, తర్వాత ప్రేయసి చేతిలో పెడతానని చెప్పాడు.చదవండి: షూటింగ్‌కు ఫారెస్ట్ పోదాం చలోచలో -
పవన్ కల్యాణ్ అసలు ఆర్మీ జవానే కాదు: సైనికుడు
ఏంటో.. బిగ్‌బాస్ షోలో ఒక్క సీజన్లో ఒక్కో కార్డు వాడుతున్నారు. ఏడో సీన్లో రైతు బిడ్డ.. జై కిసాన్ అంటూ పల్లవి ప్రశాంత్‌ను పైకి లేపారు. ఈ సీజన్లో పవన్ కల్యాణ్‌ను ఆర్మీ జవాను.. జై జవాన్ అంటూ బోలెడంత హైప్ ఇస్తున్నారు. ఆఖరికి నాగార్జున సైతం రెండుసార్లు కల్యాణ్‌కు ఆర్మీ సెల్యూట్ చేశాడు. అతడు కూడా హోస్ట్‌కు రివర్స్‌లో సెల్యూట్ చేశాడు.డిపార్ట్మెంట్ నుంచి తీసేస్తారుఅయితే కల్యాణ్ ఆర్మీ జవానే కాదంటున్నాడో సైనికుడు అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎస్జే సుందర్ అనే జవాన్ మాట్లాడుతూ.. 89 రోజుల తర్వాత ఏ సోల్జర్ కూడా డిపార్ట్మెంట్లో ఉండడు. వారిని డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేస్తారు. కల్యాణ్ బిగ్‌బాస్‌కు వచ్చి 90 రోజులవుతోంది. అంటే అతడిని డిపార్ట్మెంట్ నుంచి తీసేస్తారు. ఈరోజుతో అతడు సోల్జర్ ఐడెంటిటీని కోల్పోయాడు. ఇప్పుడతడు కామన్ మ్యాన్ మాత్రమే!సెల్యూట్ కొట్టరు మరో ముఖ్య విషయం.. అతడు ఇండియన్ ఆర్మీ కాదు, సీఆర్పీఎఫ్ అని పేర్కొన్నారు. దీనిపై కల్యాణ్ (Pawan Kalyan Padala) ఫ్యాన్స్ మండిపడ్డారు. ఆయన లీవ్ పెట్టుకునే వచ్చాడు, మీరు కావాలనే నెగెటివ్ చేస్తున్నారని ఆగ్రహించారు. దీనికి సుందర్ స్పందిస్తూ.. నిజమైన ఆర్మీ జవాన్ ఎప్పుడూ బిగ్‌బాస్ లాంటి షోలో సెల్యూట్ కొట్టరు అని క్లారిటీ ఇచ్చారు. పెళ్లికే లీవ్ ఇవ్వరుమరో వీడియోలో ఆయన మాట్లాడుతూ.. సైనికుడికి లీవ్ దొరకడం చాలా కష్టం. తన పెళ్లి కోసం లీవ్ అడిగితే కూడా.. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఏమంత అవసరం లేదు, తర్వాత చేసుకోవచ్చు అని చెప్తుంటారు. మరో విషయం.. కల్యాణ్ ముందే రిజైన్ చేసి ఉండాలి, లేదంటే ఇప్పుడైనా తనన డిస్మిస్ చేసుండాలి. ఎవరికి పడితే వారికి సెల్యూటా?ఆయన మూడు సంవత్సరాలు సేవలందించానని చెప్పాడు. కానీ, అది నిజం కాదు.. తొమ్మిది నెలలు ట్రైనింగ్, ఆరు నెలలపాటు డ్యూటీ చేసి వచ్చేశాడు. సోల్జర్ భారతీయ జెండాకు లేదా కమాండర్‌కు మాత్రమే సెల్యూట్ కొడతాడు. ఎవరికి పడితే వారికి కాదు అన్నారు. మరి కల్యాణ్ బయటకు వచ్చాక ఈ వివాదంపై ఎలా స్పందిస్తాడో చూడాలి! View this post on Instagram A post shared by jadde sundara Rao (@sj_______sundar) చదవండి: నరసింహ మూవీలో ఐశ్వర్యరాయ్.. రజనీకాంత్ చెప్పిన విశేషాలు -
నన్నే టార్గెట్ చేస్తున్నారంటూ ఏడ్చిన సంజనా..
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ కల్యాణ్ పడాల ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. దీంతో అతడు మినహా మిగతా అందర్నీ ఈ వారం నామినేషన్లో వేశాడు బిగ్‌బాస్. వీరిలో ఎవరు ఎక్కువ గేమ్స్ గెలిచి లీడర్ బోర్డ్‌లో టాప్‌లో ఉంటారో వారికి ఇమ్యూనిటీ గెలిచే ఛాన్స్ ఉంది. నిజంగా ఇమ్యూనిటీ గెలిచిన కంటెస్టెంట్ నేరుగా ఫైనల్ వీక్‌లో అడుగుపెట్టినట్లే లెక్క! మరి ఆ గేమ్స్ ఎలా జరిగాయో సోమవారం (డిసెంబర్ 8) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..మనీ బాక్స్సడన్గా బిగ్‌బాస్‌కు ఏమనిపించిందో ఏమో కానీ, ఇంతవరకు కెప్టెన్ అవలేదు కదా.. అంటూ భరణిని కెప్టెన్ చేశాడు. కాకపోతే ఇమ్యూనిటీ లభించదని నొక్కిచెప్పాడు. తర్వాత గార్డెన్ ఏరియాలో బాక్సులు పెట్టారు. అందులో జీరో నుంచి రెండున్నర లక్షల రూపాయల వరకు అంకెలు రాసిపెట్టారు. ఇప్పటివరకు కంటెస్టెంట్ల జర్నీని బట్టి వారికి బాక్సులు ఇవ్వాల్సి ఉందన్నాడు. ఈ పాయింట్స్ విజేత ప్రైజ్‌మనీపై ఎఫెక్ట్ చూపిస్తాయన్నాడు.సంజనాకు అన్యాయం?అలా డిమాన్.. సుమన్‌కు లక్ష ఇద్దామనుకోగా అందుకు అందరూ ఓకే చెప్పారు. తర్వాత భరణి.. తనూజకు రూ.2 లక్షలు ఇచ్చాడు. అనంతరం కల్యాణ్ ఇమ్మూకి రూ.2.5 లక్షలు రాసి ఉన్న బాక్స్ ఇచ్చాడు. ఇమ్మాన్యుయేల్.. సంజనాకు రూ.1.50 లక్షల బాక్స్ ఇస్తే ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదు. అనంతరం సుమన్.. డిమాన్‌కు రూ.1.50 లక్షలిచ్చాడు. చివరగా భరణి, సంజన మిగిలారు. జైలుకు సంజనాసంజనాకు రూ.50 వేలు రావాలని ఇమ్మూ, పవన్ సపోర్ట్ చేస్తే మిగిలినవారు భరణికి సపోర్ట్ చేశారు. మెజారిటీ అతడివైపే ఉండటంతో భరణికి రూ.50 వేలు దక్కగా.. సంజనాకు జీరో లభించింది. దీంతో బిగ్‌బాస్ ఆమెను జైల్లో వేశాడు. తనకు జీరో రావడాన్ని సంజనా తట్టుకోలేకపోయింది. తల్లిలా ఆలోచించి ఎమోషనల్ ఫూల్ అవుతున్నా.. ప్రతివారం నన్నే టార్గెట్ చేస్తున్నారు అంటూ ఏడ్చేసింది.గెలిచేసిన ఇమ్మూతర్వాత ఈవారం ఇమ్యూనిటీ కోసం కొన్ని ఛాలెంజ్‌లు ఇవ్వబోతున్నట్లు తెలిపాడు బిగ్‌బాస్. లీడర్ బోర్డులో టాప్‌లో ఉండేవారు నామినేషన్స్ నుంచి సేవ్ అవడంతోపాటు ప్రేక్షకులను ఓటు వేయమని అభ్యర్థించే అవకాశం సంపాదిస్తారు. మొదటి గేమ్‌లో సంజనా పాల్గొనేందుకు వీల్లేదన్నాడు. అలా బిగ్‌బాస్ ఇచ్చిన ఫస్ట్ టాస్క్ 'స్వింగ్ జరా'లో ఇమ్మూ గెలవగా.. భరణి, పవన్, తనూజ, సుమన్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. మరి తర్వాతి టాస్కుల్లో ఎవరు గెలిచారు? ఎవరు టాప్‌లో ఉన్నారో చూడాలి! -
తల్లయిన బిగ్‌బాస్ సోనియా.. పోస్ట్ వైరల్
ప్రస్తుత బిగ్‌బాస్ షో చివరకొచ్చేసింది. మరో రెండు వారాల్లో పూర్తి కానుంది. ఇకపోతే గత సీజన్లో పాల్గొని ప్రశంసలు, విమర్శలు ఎదుర్కొన్న కంటెస్టెంట్ సోనియా ఆకుల. తెలుగులో పలు సినిమాలు చేసిన ఈమె.. బిగ్‌బాస్ షోలో పాల్గొని బాగానే గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈమె నుంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. తల్లయిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.గత సీజన్లో పెద్దోడు, చిన్నోడు అంటూ నిఖిల్, పృథ్వీతో సోనియా వ్యవహరించింది. అయితే చివరివరకు ఉంటుందనుకుంటే మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది. షోలో ఉన్నప్పుడే తన ప్రేమ విషయాన్ని వెల్లడించింది. బయటకొచ్చిన వెంటనే ఎంటర్ప్రెన్యూర్ యష్‌తో నిశ్చితార్థం చేసుకుంది. గతేడాది ఇదే టైంకి పెళ్లి కూడా చేసుకుంది.(ఇదీ చదవండి: ఎంపీ కుమార్తె పెళ్లిలో కంగన డ్యాన్స్.. వీడియో వైరల్)పెళ్లయిన కొన్ని నెలల తర్వాత సోనియా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. ఈ రోజు ఈమెకు ఆడపిల్ల పుట్టింది. పాపకు శిఖా అని పేరు కూడా పెట్టినట్లు సోనియా భర్త యష్.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో నెటిజన్లు సోనియాకు విషెస్ చెబుతున్నారు.అయితే యష్‌కి గతంలోనే పెళ్లయింది. విరాట్ అని ఓ బాబు కూడా ఉన్నాడు. కాకపోతే చాన్నాళ్ల క్రితమే భార్యకు విడాకులిచ్చేశాడు. గతేడాది సోనియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సోనియా.. టాలీవుడ్లో 'జార్జ్ రెడ్డి', 'కరోనా వైరస్', 'ఆశా ఎన్కౌంటర్' చిత్రాల్లో నటించింది.(ఇదీ చదవండి: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్) View this post on Instagram A post shared by Yash Veeragoni (@yashveeragoni) -
కొత్త కెప్టెన్‌గా భరణి.. ఆమె జైలుకు!
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. రెండు వారాల్లో ఈ సీజన్‌కు శుభం కార్డు పడనుంది. రీతూ ఎలిమినేషన్‌తో ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు మిగిలారు. సుమన్, ఇమ్మాన్యుయేల్, సంజనా, తనూజ, కల్యాణ్, పవన్.. వీరందరూ ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు. కానీ భరణి మాత్రం ఇంతవరకు ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేదు. కూతురి కోరిక నెరవేరినట్లేఫ్యామిలీ వీక్‌లో వచ్చిన కూతురు కూడా కెప్టెన్ అవు డాడీ అని అడిగింది. ఆమె కోరిక తీర్చలేకపోయినందుకు చాలా ఫీలయ్యాడు భరణి. కానీ ఎట్టకేలకు ఆమె కోరిక నెరవేర్చినట్లు కనిపిస్తోంది. తాజా ప్రోమోలో భరణి చేతికి కెప్టెన్ బ్యాండ్ ఉంది. అంటే ఈ పద్నాలుగో వారం భరణి కెప్టెన్ అయ్యాడన్నమాట! జైలుకు సంజనాఅలాగే బిగ్‌బాస్ ఇచ్చిన గేమ్‌లో సంజనా (Sanjana Galrani)కు జీరో ఉన్న బాక్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను జైల్లో వేశారని భోగట్టా! అదేంటో కానీ మొట్టమొదటిసారి ఇమ్మాన్యుయేల్.. సంజనా కోసం స్టాండ్ తీసుకున్నాడు. అయితే హౌస్ అందరూ దాన్ని వ్యతిరేకించడంతో ఆమె చేతికి జీరో బాక్స్ వచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: -
రీతూ ఎలిమినేషన్‌కు కారణాలివే! అదే ప్లస్సు, మైనస్!
అమ్మాయి నవ్వు ఎవరైనా బాగుందంటారు. కానీ రీతూ నవ్వు చూడగానే అమ్మో, ఇదేం నవ్వు అని జడుసుకుంటారు. మొదట్లో భయపడ్డా రానురానూ అలవాటైపోయి.. తను అరవడం, ఏడవడం కన్నా నవ్వితేనే బాగుందన్నారు. ఎలాగైనా టాప్ 5లో ఉండాలనుకుంది రీతూ.. కానీ బిగ్‌బాస్ తనను అక్కడివరకు రానివ్వకుండానే అడ్డుకట్ట వేశాడు. 13వ వారంలో ఎలిమినేట్ చేసి పంపాడు. రీతూ ఎలిమినేషన్‌కు కారణాలేంటో చూద్దాం..మొదట కల్యాణ్.. తర్వాతరీతూ టామ్ బాయ్‌లా ఉంటుంది. ఆడమగ అన్న తేడా లేకుండా అందరితోనూ కలివిడిగా మాట్లాడుతుంది. మొదట్లో కళ్యాణ్‌తో క్లోజ్‌గా ఉంది. తర్వాత పవన్‌కు దగ్గరైంది. ఈమె ప్రవర్తన చూసి జనాలు కూడా తిట్టుకున్నారు. ఆడటానికి వచ్చిందా? లవ్ట్రాకులు పెట్టుకునేందుకు వచ్చిందా? ఇలాంటివాళ్లను పంపించేయడమే మేలు అని అభిప్రాయపడ్డారు. కానీ రీతూ అదంతా కావాలని చేసిందైతే కాదని నెమ్మదిగా జనాలు రియలైజ్ అయ్యారు.కృత్రిమంగా మొదలైనప్పటికీ..బిగ్‌బాస్ హౌస్‌లో లవ్ ట్రాక్ పెట్టుకుంటే అటెన్షన్, ఫేమ్ వస్తుందని ఆలోచించింది రీతూ (Rithu Chowdary) కాదు, డిమాన్ పవన్. ఈ విషయాన్ని పవన్ కాలేజ్‌మేట్, కంటెస్టెంట్ శ్రీజ కూడా వెల్లడించింది. అలా మొదట్లో వీరి ట్రాక్ ఆర్టిఫిషియల్‌గా ఉన్నా రానురానూ వాళ్లిద్దరికీ తెలియకుండానే మరింత క్లోజ్ అయ్యారు. ఒకరికోసం ఒకరు నిలబడ్డ ప్రతిసారి హౌస్మేట్స్ టార్గెట్ చేసి మాటలనేవారు. అప్పుడు కూడా పవన్ కంటే రీతూయే ఎక్కువ స్టాండ్ తీసుకునేది.ఇలాగే ఉంటా!ఫైర్స్ట్రామ్గా వచ్చిన మాధురి అయితే మీది అన్‌హెల్తీ రిలేషన్షిప్ అని ముద్రేసింది. సంజనా అయితే.. అలా ఇద్దరూ అతుక్కుపోవడం చూడటానికి బాగోలేదు అంది. అయినా సరే రీతూ వెనక్కు తగ్గలేదు. తన స్నేహం చూసేవాళ్లకు తప్పుగా అనిపిస్తే తానేం చేయలేననంది. ఇక్కడ జనాలకు ఆ అమ్మాయి నచ్చేసింది. ఎవరైనా క్యారెక్టర్‌ను తప్పుపడుతున్నారనగానే కచ్చితంగా తమ తీరును ఎంతోకొంత మార్చుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ రీతూ అలాంటిదేం చేయలేదు. నేనింతే అంటూ మనసుకు నచ్చిందే చేసింది. పవన్ కోసం నిలబడింది. అలా తన లవ్ ట్రాక్.. తనకు కొంత ప్లస్ అయితే మరికొంత మైనస్ అయింది.తనపై తనకు నమ్మకం తక్కువటికెట్ టు ఫినాలేలో బాగానే ఆడింది కానీ మొదటి నుంచి గేమ్‌లో పెద్దగా ఎఫర్ట్స్ అయితే పెట్టలేదు. మొదటి నుంచి తనను తాను నమ్మకుండా అవతలివారిపైనే ఎక్కువ ఆధారపడింది. ఆత్మవిశ్వాసం పక్కనపెట్టి అందరినీ బతిమాలుకోవడం చూసేవారికి నచ్చలేదు. ఇకపోతే టికెట్ టు ఫినాలేలో సుమన్ కూడా బాగా ఆడాడు. దీంతో అతడి ఓటింగ్ పెరగడం రీతూకి మైనస్ అయింది. నిజానికి సుమన్ ఎలిమినేట్ అవుతాడని అందరూ ఫిక్సయ్యారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా అతడి ప్రభంజనానికి రీతూ బలైపోయింది!చదవండి: టాప్ 5 లో లేను, ఓడిపోయానంటూ ఏడ్చేసిన రీతూ చౌదరి -
ఓడిపోయానంటూ ఏడ్చిన రీతూ.. టాప్ 5 వీళ్లేనంటూ..
బిగ్‌బాస్‌కు వచ్చినవాళ్లు అంతో ఇంతో నెగెటివిటీ మూటగట్టుకుని వెళ్లిపోతుంటారు. కానీ రీతూ మాత్రం నెగెటివిటీతో వచ్చి పాజిటివ్‌గా బయటకు వెళ్లింది. డిమాన్‌తో తన అనుబంధంపై జనాల్లో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ.. ఎవరేం అనుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ నిజాయితీగా ఉందని ఫీలయ్యారు. అలా ఆమెకు కనెక్ట్ అయ్యారు. ఫైనల్స్‌లో ఉంటుందనుకుంటే ఊహించని విధంగా డిసెంబర్ 7న ఎలిమినేట్ అయింది. మరి ఎలిమినేషన్ తర్వాత ఏం జరిగిందో చూసేద్దాం..టాప్ 5లో ఉండట్లే, ఓడిపోయా..రీతూ ఎలిమినేట్ అనగానే తనూజ షాకైపోగా.. డిమాన్ పవన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనూజ, రీతూ ఒకరినొకరు పట్టుకుని ఏడ్చారు. టాప్ 5లో ఉండట్లేదు, ఓడిపోయానని చిన్నపిల్లలా ఏడ్చింది. పవన్‌ను అందరూ జాగ్రత్తగా చూసుకోండి, రెండు వారాలు వాడితో ఉండండి, మాట్లాడండి అంది. కల్యాణ్, నువ్వు ఎక్కువగా మాట్లాడట్లేదని పవన్ ఫీలవుతున్నాడు.. మాట్లాడు అని సూచించింది. వెళ్లిపోయేముందు రీతూ చెవిలో పవన్ కప్పు గెలిచి వస్తా.. అని గుసగుసలాడాడు. దీంతో ఆమె బాగా ఆడు అని మోటివేట చేసింది.రీతూ టాప్ 5 ఇదే..తర్వాత స్టేజీపైకి వెళ్లిన రీతూ (Rithu Chowdary).. తన అభిప్రాయం ప్రకారం హౌస్‌మేట్స్‌ను టాప్ 7లో పెట్టింది. పవన్‌ను ఫస్ట్ ప్లేస్‌లో, తనూజ, ఇమ్మాన్యుయేల్‌ను రెండు, మూడు స్థానాల్లో, కల్యాణ్‌ను నాలుగో స్థానంలో పెట్టింది. ఏదైనా హర్ట్ చేసుంటే సారీ అంటూ సంజనను ఐదో స్థానంలో పెట్టింది. ఆరో స్థానంలో సుమన్, ఏడో స్థానంలో భరణిని పెట్టింది.చదవండి: రీతూ ఎలిమినేట్.. ఎంత సంపాదించిందంటే? -
బిగ్‌బాస్ నుంచి 'రీతూ' ఎలిమినేట్.. విన్నర్ రేంజ్లో రెమ్యునరేషన్
బిగ్‌బాస్ తెలుగు 9 నుంచి రీతూ చౌదరి ఎలిమినేట్ అయ్యారు. హౌస్‌లోకి వెళ్తున్నప్పటికీ ఆమె చాలా నెగిటివిటీతోనే వెళ్లారు. అయితే, 13 వారాల పాటు తన గేమ్‌ను చూసిన వారందరూ ఫిదా అయ్యారు. దీంతో ఆమెపై ఇప్పటి వరకు ఉన్న నెగిటివిటీ చాలావరకు తగ్గిందని చెప్పవచ్చు. ఈ వారం నామినేషన్స్‌లో తనూజ, భరణి, డిమోన్ పవన్, సంజన, రీతూ చౌదరి, సుమన్‌శెట్టి ఉండగా ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన రీతూ ఎలిమినేట్ అయ్యారని నాగార్జున ప్రకటించారు. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు మాత్రమే ఉన్నారు. డిసెంబర్ 21న ఫైనల్ జరగనుంది.రీతూ రెమ్యునరేషన్రీతూ బిగ్‌బాస్‌లోకి వెళ్లక ముందు తనపై ట్రోలింగ్, నెగిటివిటీ వల్ల ఆమె కేవలం రెండు వారాలు మాత్రమే ఉంటారని నెటిజన్లు భావించారు. కానీ, తనలోని గేమ్ ఛాలెంజ్ ఏకంగా 13 వారాలపాటు హౌస్‌లో ఉండేలా చేసింది. అయితే, మంచి రెమ్యునరేషన్‌తోనే ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చారు. వారానికి రూ. 2.50 లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా రూ. 32 లక్షల మేరకు రెమ్యునరేషన్‌గా పొందినట్లు సమాచారం. ఒక విన్నర్ అందుకునే ప్రైజ్ మనీకి దగ్గరగా రీతూ రెమ్యునరేషన్ ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రీతూ కన్నీళ్లురీతూ ఎలిమినేషన్ తర్వాత డిమాన్ పవన్‌తో పాటు హౌస్‌లోని కంటెస్టెంట్స్ అందరూ ఆశ్చర్యపోయారు. పవన్‌ను హగ్ చేసుకుని రీతూ కన్నీళ్లు పెట్టుకుంది బయటకు వచ్చిన రీతూ నాగార్జునతో పాటుగా తన జర్నీ చూసుకుని భావోద్వేగానికి గురయ్యారు. టాప్-5 ఉండాలని కోరుకున్నానని ఆమె చెప్పారు. కానీ, ఇలా రావడంతో చాలా బాధపడ్డానన్నారు.నెగిటివిటీని దాటుకుని ఎలిమినేట్బిగ్బాస్ సీజన్-9లో రీతూ ప్రయాణం చూస్తే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే సమయానికి తనపై ఫుల్ నెగిటివిటీ ఉంది. నెటిజన్లు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఈ అంశానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఆమె ధైర్యంగా తనేంటో ప్రేక్షకులకు చూపించాలని వెళ్లారు. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత టాస్కుల విషయంలో రీతూ దుమ్మురేపింది. ఆమె పడుతున్న కష్టం, అల్లరి, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్వం జనాలకి అర్థమైంది. ఉన్న లేడీ కంటెస్టెంట్లో రీతూ గేమ్ కూడా చాలా స్ట్రాంగ్ అని నిరూపించుకున్నారు. ఫైనల్‌గా తనపై ఉన్న నెగిటివిటీని కాస్త తగ్గించుకునే ఎలిమినేట్ అయ్యారు. -
టార్గెట్ 'తనూజ'.. బిగ్‌బాస్ ఇదేం 'ట్రై యాంగిల్'
బిగ్‌బాస్ తెలుగు 9 చివరిదశకు చేరుకుంది. నేడు జరగనున్న ఎలిమినేషన్ తర్వాత టాప్-5లో ఉండే కంటెస్టెంట్స్ ఎవరు అనేది తేలనుంది. అయితే, శనివారం జరిగిన ఎపిసోడ్ గురించి సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. తనూజను కావాలనే బిగ్‌బాస్ టీమ్ టార్గెట్ చేస్తుందని స్టార్ మా విడుదల చేస్తున్న ప్రోమోల కింద నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, బిగ్‌బాస్ టీమ్ వాటిని కూడా హైడ్ చేయడం లేదా తొలగించడం చేస్తున్నట్లు స్క్రీన్ షాట్స్ కూడా ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.ట్రై యాంగిల్ (త్రిభుజాకారం)తో రచ్చబిగ్బాస్ గేమ్‌లో భాగంగా ట్రై యాంగిల్ ఆకారంలో ఉన్న వస్తువును ఒకే వరుసలో ఉంచాలని, అవన్నీ ఒకే సైజ్‌లో ఉండాలని రూల్ పెట్టారు. అయితే, రీతూ ఎంచుకున్న వస్తువు ట్రై యాంగిల్లో లేదని మొదట తనూజ పాయింట్ పెడుతుంది. దీంతో అదే గేమ్‌లో రీతూతో తలపడి ఓడిపోయిన భరణి ఫైర్ అయిపోతాడు. కానీ, తనూజ ఎక్కడా కూడా నోరు జారలేదు. తన సందేహం మాత్రమే చెప్పింది. అదే బిగ్‌బాస్‌కు నచ్చినట్లు లేదు.బిగ్‌బాస్‌ను తిట్టిపోస్తున్న నెటిజన్లుట్రై యాంగిల్ (త్రిభుజాకారం) పాయింట్ గురించి ఈ శనివారం ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున కూడా మాట్లాడారు. అయితే, తనూజను టార్గెట్ చేస్తూ బిగ్‌బాస్ టీమ్ రంగంలోకి దిగిందని ఆరోపణలు వస్తున్నాయి. తనూజ తప్పులేకున్నా సరే నాగార్జున చేత అనేక మాటలు అనిపించి బిగ్‌బాస్ టీమ్ రెచ్చిపోయిందని అంటున్నారు. గ్రూప్ గేమ్ ఆడిన ఇమ్ము, కల్యాణ్‌ల గురించి నాగ్ ప్రశ్నించలేదు. రింగ్ దాచేసిన రీతూను ఒక్కమాట కూడా అనలేదు. కానీ, తనూజ తప్పులు లేకున్నా సరే ఆమెను బిగ్‌బాస్ టార్గెట్ చేశారని పోస్టులు చేశారు. దీంతో తనూజ పేరు ఏకంగా ట్రెడింగ్‌లోకి వచ్చేసింది. ట్రై యాంగిల్‌ను తప్పుగా రెడీ చేశారని నాగార్జునే చెప్పారు. అలాంటప్పుడు తనూజను తిట్టడం ఎందుకు అంటూ నెటిజన్లతో పాటు ఆమె అభిమానులు కూడా భగ్గుమంటున్నారు. బిగ్‌బాస్ రివ్యూవర్లు కూడా తనూజను కావాలనే టార్గెట్ చేస్తున్నారని చెప్పడం విశేషం. ఒక టాస్క్‌లో కల్యాణ్ కన్నీళ్లు పెట్టుకుంటే .. చాలా ఎమోషనల్ అయ్యావ్ ఎందుకు అని నాగార్జున ప్రశ్నిస్తారు. మరి తనూజ కన్నీళ్లు పెట్టుకుంటే అదేదో చాలాతప్పు అన్నట్లుగా నాగార్జున అనడం ఎందుకు అంటూ సోషల్‌మీడియాలో ప్రశ్నిస్తున్నారు. తనూజ చేసిన చిన్నచిన్న తప్పులను వెతికి మరి బిగ్‌బాస్ టీమ్ టార్గెట్ చేస్తుందని అంటున్నారు. చివరకు ప్రోమోలలో కూడా తనూజను తప్పుగా చూపిస్తారని, ఎపిసోడ్స్‌లో చూస్తే ఏమీ ఉండదని అంటున్నారు. ఇదంతా కల్యాణ్‌ను గెలిపించేందుకే బిగ్‌బాస్ గేమ్ ఆడుతున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు. Even reviewer fraternity who worked day&night to pull down #ThanujaPuttaswamy is now talking about how she is being targeted by #BiggBossTelugu9 team to help their blue eyed boy #KalyanPadala Audience are watching & they will stand for Thanuja pic.twitter.com/t8myeDDwEC— VMR (@VMR199507) December 6, 2025Biggboss reviewer on How biggboss targeting Thanuja 🤷🙏#BiggBossTelugu9 #BiggBoss9Telugu #Thanuja #demonpavan #KalyanPadala #Reethu #bharani #SumanShetty #sanjana #Emmanuel pic.twitter.com/caO9luSpU7— Common Man (@commonmanfromTG) December 7, 2025https://x.com/phantom242628/status/1994974214286389755?s=20adi reddy about targeted negative promos on Thanuja by bb team finally he addressed it #thanuja #ThanujaPuttaswamy #BiggBossTelugu9 pic.twitter.com/vE0AjCeL0l— phantom (@phantom242628) November 30, 2025We are also seeing how much more bullying you will do. Tanuja is an example of how difficult it is for a woman to rise up in our India.#BiggBossTelugu9 #Thanuja🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹pic.twitter.com/LGr0XnARS0— karthi (@karthi129867) December 6, 2025 -
పెళ్లి చేసుకున్న తనూజ చెల్లి.. ఫోటో వైరల్
ఇంట్లో పెళ్లంటే ఆ హడావుడి మామూలుగా ఉండవు. అందులోనూ ప్రాణంగా ప్రేమించే చెల్లి పెళ్లంటే ఆ సందడి వేరే లెవల్లో ఉంటుంది. కానీ, ఈ పండగ వాతావరణాన్ని తనూజ మిస్ అయింది. తెలుగు బిగ్‌బాస్ 9లో అడుగుపెట్టిన తనూజ ఎంతోకాలం ఉండననుకుంది. ఇంట్లోవాళ్లు కూడా వెంటనే వచ్చేస్తుందిలే అని పంపించారు. తీరా తన గేమ్‌తో విన్నింగ్ రేస్‌లో ఉంది. 13 వారాలుగా టాప్ ఓటింగ్‌తో దుమ్ము లేపుతోంది.పెళ్లికూతురుకి ఆశీర్వాదంఅయితే కుటుంబాన్ని మాత్రం చాలానే మిస్ అవుతోంది. తను కెప్టెన్ అయినవారమే ఫ్యామిలీ మెంబర్స్ హౌస్‌లోకి వచ్చారు. అలా తనూజ కోసం ఆమె చెల్లి పూజ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. తనను చూడగానే తనూజకు కన్నీళ్లాగలేదు. వరుసకు చెల్లే అయినా తల్లిలా తనూజకు ఏడవద్దని సలహా ఇచ్చింది. 'ఓపక్క పెళ్లి పనులు.. మరోపక్క నువ్వు ఇక్కడ షోలో ఏడుస్తుంటే అక్కడ అమ్మ, అక్క ఏడుస్తున్నారు. నా పెళ్లి విషయం మర్చిపోయింది.వాళ్లని హ్యాండిల్ చేయలేకపోతున్నా.. నా పెళ్లికి కొద్దిరోజులే సమయం ఉంది. అన్నీ హ్యాండిల్ చేయాలి. ప్లీజ్, నువ్వు ఏడవకు' అని బతిమాలింది. 'నువ్వు ఒక్కసారి ఏడిస్తే అమ్మ రెండురోజులు ఏడుస్తుంది. నా పెళ్లి విషయం కూడా మర్చిపోయింది. ప్రతిరోజు బిగ్‌బాస్, రీల్స్ చూస్తుంది.. నువ్వేం చేస్తావో తెలీదు, విన్ అవ్వాలి. నేను ఏది కొన్నా ఫస్ట్ ఫోటో నీకు పెట్టేదాన్ని.. అది మిస్ అవుతున్నా.. అని భావోద్వేగానికి లోనైంది.శుభలేఖలో తనూజ పేరుతర్వాత గార్డెన్ ఏరియాలో చెల్లెల్ని తన చేతులతో పెళ్లికూతుర్ని చేసి ఆశీర్వదించింది. శుభలేఖలో తన పేరు చూసుకుని తనూజ మురిసిపోయింది. తన పెళ్లికి బిగ్‌బాస్ టైటిల్ గిఫ్ట్‌గా కావాలని చెప్పింది. అందుకోసం తనూజ కూడా బాగానే కష్టపడుతోంది. నవంబర్ 23 నాటి ఎపిసోడ్లో తన చెల్లి పెళ్లి జరిగిందన్న తనూజ.. నాగార్జునతో కొత్తజంటకు ఆశీర్వాదాలు ఇప్పించింది.పూజ పెళ్లి వీడియోఅలా నవంబర్ చివరి వారంలో తనూజ చెల్లి పూజ పెళ్లి జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. ఇవి చూసిన అభిమానులు పూజకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంత పెద్ద శుభకార్యంలో అక్క లేకపోవడం ఎంతైనా తీరని లోటే అని అభిప్రాయపడుతున్నారు.చదవండి: మనస్సాక్షి లేదా? ప్రజల బాధను అవమానిస్తారా? నటి ఫైర్ -
తనూజకు క్లాస్ పీకిన నాగ్.. వాళ్లు ట్రోఫీకి అనర్హులు!
టికెట్ టు ఫినాలేలో కంటెస్టెంట్లు చేసిన తప్పొప్పులను నాగార్జున ఎత్తిచూపాడు. ఇమ్మాన్యుయేల్ తాడు వదిలేయడం వీడియో వేసి చూపించాడు. అలాగే భరణి ట్రయాంగిల్ గోల గురించి చర్చించాడు. అనవసరమైన గొడవ మొదలుపెట్టిందే తనూజ అని క్లాస్ పీకాడు. అలాగే పవన్ ఓడిపోయిన ప్లాంకుల టాస్కు గురించి మాట్లాడుతూ.. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ప్రవర్తించావు. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో టికెట్ టు ఫినాలే గెలుస్తానని చెప్పి ఓడిపోయావ్ అని సెటైర్లు వేశాడు. మరి తర్వాతేం జరిగిందో శనివారం (డిసెంబర్ 6వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..సుమన్ అనర్హుడుబిగ్బాస్ ట్రోఫీకి తామెందుకు అర్హులో హౌస్మేట్స్ చెప్పాలన్నాడు. మొదటగా సుమన్.. గేమ్ బాగా ఆడుతున్నాను, ఆ మేరకు ఎఫర్ట్స్ పెడుతున్నాను అన్నాడు. ఆయనకు కప్పు గెలిచే అర్హత లేదని సంజనా, ఇమ్మాన్యుయేల్, రీతూ, పవన్ అభిప్రాయపడ్డారు. తనూజ, భరణి, కల్యాణ్ మాత్రం ఆయనకు గెలిచే అర్హత ఉందన్నారు. ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. జనాలను ఎంటర్టైన్ చేయాలన్నదే నా ఏకైక లక్ష్యం. ఏ సీజన్లోనూ కమెడియన్ గెలవలేదు. ఈ సీజన్లో నేను గెలవాలనుకుంటున్నా అని చెప్పాడు. ఆయన మాటలతో హౌస్మేట్స్ అందరూ ఏకీభవించారు. వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదుతర్వాత భరణి.. నాకు దెబ్బలు తగిలినా సరే ఎక్కడా తగ్గకుండా ఆడాను. కంటెంట్ కోసం నా వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న పవన్‌ను ఓడించాను. కచ్చితంగా కప్పుకు అర్హుడినే అన్నాడు. రీతూ, పవన్ మినహా మిగతా అందరూ ఆయన మాటలతో ఏకీభవించారు. సంజనా.. నేను మాస్క్ వేసుకోకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడాను. చూసిందే మాట్లాడాను. నిజాయితీగా ఉన్నాను అని చెప్పగా సుమన్, భరణి, పవన్ ఆమెకు కప్పు గెలిచే అర్హత లేదని భావించారు.కల్యాణ్‌కు ఫుల్ సపోర్ట్పవన్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ నా ఇల్లు అనుకున్నాను. ఏ పని చెప్పినా అన్నీ చేశాను. ఎక్కడా మాట తప్పలేదు. బంధాల వల్ల గేమ్ తగ్గిపోతుందని తెలిసినా నేనెలా ఉన్నానో అలాగే ఉన్నాను. అన్ని టాస్కుల్లోనూ బాగానే ఆడాను అని చెప్పుకొచ్చాడు. అతడికి రీతూ, ఇమ్మాన్యుయేల్, కల్యాణ్ మాత్రమే సపోర్ట్ చేశారు. అనంతరం కల్యాణ్ మాట్లాడుతూ.. డిసిప్లేన్, డిటర్మినేషన్, డెడికేషన్.. ఈ మూడింటితోపాటు కమిట్మెంట్తో ఆడాను.లేడీ విన్నర్అందరితో బాగున్నా.. జెన్యూన్‌గా ఆడా.. ఎవరికీ అన్యాయం చేయలేదు అని చెప్పగా అందరూ ఇతడు అర్హుడనే తలూపారు. తనూజ మాట్లాడుతూ.. నాకు కుటుంబం, వర్క్ ప్లేస్ తప్ప మిగతాది తెలియదు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నానంటే ఇప్పటికీ ఓ కలలా ఉంది. ఎక్కడా ఫేక్‌గా ఉండకుండా జెన్యూన్‌గా ఉన్నాను. నావల్ల అయినంతవరకు ఆడాను. లేడీ విన్నర్ అవ్వాలని, అది నేనే అవాలనుకుంటున్నా అని చెప్పింది. అందరూ ఆమె చెప్పింది కరెక్టేనన్నారు.ముగ్గురికే కప్పు గెలిచే అర్హతరీతూ మాట్లాడుతూ.. ప్రతి గేమ్‌లో ఎఫర్ట్స్ పెట్టి ఆడాను. నాకు ఏదనిపిస్తే అది చేశాను. గెలిచినా, ఓడినా.. ఎలా అయినా ఫైనల్స్‌లో ఉండాలన్న కసితోనే ఆడాను. ఏదో ఒకటి చేసి ముందుకెళ్లాలన్న తపనతోనే ఉన్నాను అని పేర్కొంది. సుమన్, భరణి తప్ప మిగతా అందరూ ఆమెకు అర్హత ఉందని ఓటేశారు. మొత్తానికి ఈ ఓటింగ్‌లో కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, తనూజ మాత్రమే అర్హులంటూ వారికి పూర్తిస్థాయిలో ఓట్లు పడ్డాయి.చదవండి: బిగ్‌బాస్ 9 షాకింగ్ ఎలిమినేషన్.. రీతూ అవుట్ -
బిగ్‌బాస్ 9లో షాకింగ్ ఎలిమినేషన్.. రీతూ ఇంటికి!
బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్ దాదాపుగా చివరకొచ్చేసింది. ప్రస్తుతం 13వ వారం నడుస్తోంది. అంటే మరో రెండు వారాల్లో షో పూర్తి కానుంది. సరే ఎప్పటిలానే వీకెండ్ వచ్చింది కాబట్టి ఎలిమినేషన్ ఎవరు అవుతారా అని అందరూ ఎదురుచూస్తుంటారు. అందుకు తగ్గట్లే ఈసారి ఆరుగురు నామినేట్ అయ్యారు. వీళ్లలో నుంచి షాకింగ్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోంది. ఆమెనే రీతూ చౌదరి.ఈ వారం నామినేషన్స్‌లో తనూజ, భరణి, సంజన, సుమన్ శెట్టి, పవన్, రీతూ చౌదరి ఉన్నారు. గత రెండు మూడు వారాల బట్టి చూసుకుంటే ఓటింగ్ తక్కువగా పడుతున్న సంజన లేదంటే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోవాలి. కానీ గత వీకెండ్ ఎపిసోడ్లో జరిగిన హంగామా వల్ల లెక్కలన్నీ మారిపోయినట్లు కనిపిస్తోంది. రీతూ-పవన్ మధ్య బంధం గురించి సంజన కొన్ని కామెంట్స్ చేసింది. హోస్ట్ నాగార్జున.. ఎలాగైనా సరే సంజనతో క్షమాపణ చెప్పించాలని చూశాడు. కానీ వల్ల కాలేదు.(ఇదీ చదవండి: ఇదో సైకో కథ, షాక్ ఇచ్చే క్లైమాక్స్.. ఓటీటీలో ఈ సినిమా చూశారా?) గత వీకెండ్లో సంజన చెప్పిన పాయింట్స్‌కి ఆడియెన్స్ ఫిదా అయిపోయారేమో గానీ ఈ వారం ఆమెకు ఓటింగ్ పరంగా టాప్‌కి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి బిగ్‌బాస్‌కి అవకాశం లేకుండా అయిపోయింది. ఈ విషయంలో రీతూపై కాస్త నెగిటివిటీ ఏర్పడినట్లు అనిపిస్తుంది. దీంతో ఈసారి ఈమెకు కాస్త ఓటింగ్ శాతం తగ్గినట్లు తెలుస్తోంది. అలా ఈమెని హౌస్ నుంచి బయటకు పంపేసినట్లు సమాచారం.అయితే రీతూ చౌదరి.. టాప్-5 వరకు వచ్చే ఛాన్స్ ఉందని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే ఓటింగ్ పరంగా కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ గేమ్స్ విషయంలో మాత్రం మిగతా వాళ్లకు మంచి పోటీ ఇచ్చేది. ఫినాలే కంటెండర్‌షిప్ పోటీల్లోనూ చివరివరకు వచ్చింది గానీ విజయం సాధించలేకపోయింది. అలానే పవన్‌తో ఈమె రాసుకుపూసుకు తిరగడం కూడా జనాలకు మొహం మొత్తేసినట్లు ఉంది. ఇలా పలు కారణాల వల్ల బిగ్‌బాస్, రీతూని సాగనంపేసినట్లున్నాడు! (ఇదీ చదవండి: ఏసియన్ పవర్ లిఫ్టింగ్‌లో గోల్డ్ మెడల్ గెల్చుకున్న నటి ప్రగతి) -
కల్యాణ్‌కు నాగ్ సెల్యూట్.. ఇమ్మూ చీటింగ్ బట్టబయలు!
వీకెండ్లో ముందు ఫైర్ చూపించి, తర్వాత సరదాగా ఉంటాడు కింగ్ నాగార్జున. కానీ, ఈసారి ఫైర్‌ను పక్కనపెట్టేసి అందరితో కబుర్లు చెప్తూ కూల్‌గా కనిపించాడు. ముందుగా పవన్‌ను లేపి అతడి డ్రెస్ బాగుందన్నాడు. అందుకు కారణం లేకపోలేదు. ఇమ్మాన్యుయేల్.. ఆ డ్రెస్‌లో పవన్ మ్యాజిక్ షోలు చేసేవాడిలా ఉన్నాడని కామెడీ చేశాడు. షర్ట్‌లో నుంచి పావురాలు, పాములు తీస్తాడని సెటైర్లు వేశాడు. కల్యాణ్‌కు సెల్యూట్ఆ సంగతిని నాగ్ గుర్తు చేస్తూ కాసేపు సరదాగా ముచ్చటించాడు. ఆ తర్వాత ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన కల్యాణ్‌ను అభినందించాడు. అతడు చివరి కెప్టెన్ అయినప్పుడు ఎలాగైతే సెల్యూట్ చేశాడో, ఇప్పుడు కూడా అలాగే మరోసారి సెల్యూట్ చేసి మరీ ప్రశంసించాడు. తర్వాత టికెట్ టు ఫినాలే రేసులో ఇమ్మాన్యుయేల్ చేసిన తప్పును వీడియో వేసి చూపించాడు నాగ్.తప్పును ఎత్తి చూపుతూనే పొగడ్తలుసంజనాతో ఇమ్మూ పోటీపడ్డ టాస్క్ అది. అందులో ఇమ్మాన్యుయేల్ తాడును మధ్యలో ఒకసారి వదిలేశాడు. గేమ్ రూల్స్ ప్రకారం తాడు వదిలేస్తే ఔట్.. కానీ దాన్ని సంచాలక్ రీతూ గమనించకపోయేసరికి అతడే గెలవడం.. అలా తర్వాతి టాస్కులు కూడా గెలిచి చివరి వరకు రావడం జరిగింది. అలా తాడును వదిలేయడాన్ని తప్పుపట్టిన నాగ్.. లెక్కల్లో మాత్రం ఇరగ్గొట్టేశావ్.. అని మెచ్చుకున్నాడు. చదవండి: సమంత పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది: రాజ్ పిన్ని -
రెండో పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ
బుల్లితెర నటి సారా ఖాన్ రెండో పెళ్లి చేసుకుంది. నటుడు క్రిష్ పాఠక్‌ను రెండు సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకుంది. రామాయణ సీరియల్లో లక్ష్మణుడిగా నటించిన సునీల్ లాహిరి కుమారుడే క్రిష్ పాఠక్. డిసెంబర్ 5న ఇరు కుటుంబసభ్యులు సహా బంధుమిత్రులు, బుల్లితెర తారల సమక్షంలో ఈ వివాహం ఎంతో ఘనంగా జరిగింది. రెండో పెళ్లిఇందుకు సంబంధించిన ఫోటోలను సారా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ఈ కొత్త జంట తమ సంగీత్‌లో కూలీ సినిమాలోని మోనికా సాంగ్‌కు స్టెప్పులేశారు. అలాగే హిందీ పాటలకు సైతం కాలు కదిపారు. కాగా సారా ఖాన్.. సాప్న బాబుల్ కా బిడాయి సీరియల్‌తో బుల్లితెరకు పరిచయమైంది. బుల్లితెరపై, వెండితెరపై..పలు సీరియల్స్‌తో పాటు జర నాచ్కే దిఖా, నాచ్ బలియే 4 వంటి డ్యాన్స్ రియాలిటీ షోలలోనూ పాల్గొంది. డార్క్ రెయిన్బో, సైనైడ్, హమారీ అధూరీ కహాని వంటి చిత్రాల్లోనూ నటించింది. ఓటీటీలో లాక్ అప్ షోలోనూ పార్టిసిపేట్ చేసింది. హిందీ బిగ్‌బాస్ నాలుగో సీజన్లో సారా (Sara Khan) పాల్గొంది. అదే షోలో నటుడు అలీ మర్చంట్ కూడా పాల్గొన్నాడు. బిగ్‌బాస్ షోలో ఉన్నప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.మొదటి పెళ్లిబయటకు వచ్చాక 2010లో పెళ్లి చేసుకున్నారు. కానీ, వివాహమైన కొన్ని నెలలకే విడాకులు తీసుకున్నారు. తర్వాత అలీ మర్చంట్ 2016లో అనమ్ మర్చంట్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ బంధం కూడా ఎక్కువకాలం నిలవలేకపోయింది. 2021లో దంపతులిద్దరూ విడిపోయారు. దర్వాత తన స్నేహితురాలు ఆండ్లీబ్ జైదీని ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Saaraa Khan (@ssarakhan) చదవండి: సమంత ఆ ఒక్క పని చేస్తే చాలు: హీరోయిన్ చిన్నత్త -
పవన్ కల్యాణ్.. బిగ్‌బాస్ చరిత్ర తిరగరాయనున్నాడా?
సామాన్యుడు బిగ్‌బాస్ ఇంటి కెప్టెన్ అయ్యాడు, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు, సీజన్ ట్రోఫీ కూడా గెలుస్తాడు అని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో హుషారుగా చెప్తున్న మాట! కానీ అది సాధ్యమవుతుందా? టికెట్ టు ఫినాలే గెలిస్తే విజయానికి అడుగు దూరంలో ఆగిపోతారా? లేదా గెలిచి ప్రభంజనం సృష్టిస్తారా? ఇంతకుముందు సీజన్స్ ఏమని చెప్తున్నాయి? అనేవి ఈ స్పెషల్ స్టోరీలో చూసేద్దాం...ఎప్పుడు మొదలైంది?జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఫస్ట్ తెలుగు బిగ్‌బాస్ సీజన్లో టికెట్ టు ఫినాలే అనే ప్రస్తావనే రాలేదు. నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన రెండో సీజన్ నుంచే ఇదంతా మొదలైంది. ఆ సీజన్లో సామ్రాట్ టికెట్ టు ఫినాలే గెలిచి అందరికంటే ముందు టాప్ 5లో అడుగుపెట్టాడు. గెలవడం పక్కనపెడితే ఫైనల్స్‌లో ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.టికెట్ టు ఫినాలే నాదే.. ట్రోఫీ నాదే!మూడో సీజన్ నుంచి బిగ్‌బాస్ బాధ్యతను నాగార్జున తన భుజాలపై వేసుకున్నాడు. ఈ సీజన్లోనే రాహుల్ సిప్లిగంజ్ టికెట్ టు ఫినాలే గెలిచాడు. ఫైనల్స్‌లో శ్రీముఖిని ఓడించి విజేతగా నిలిచాడు. ఫస్ట్ ఫైనలిస్ట్ అయి ట్రోఫీ కొట్టిన ఒకే ఒక్కడుగా తెలుగు బిగ్‌బాస్ చరిత్రకెక్కాడు. ఇంతవరకు దాన్నెవరూ టచ్ కూడా చేయలేకపోయారు. నాలుగో సీజన్లో అఖిల్ గెలిచినా రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఐదో సీజన్లో అందరికంటే ముందు ఫైనల్స్‌లో అడుగుపెట్టిన శ్రీరామచంద్ర.. సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. గెలుపును కాదనుకుని సూట్కేస్ఆరో సీజన్లో మాత్రం ఓ అద్భుతం జరిగింది. శ్రీహాన్ టికెట్ టు ఫినాలే గెలిచి ఫైనల్స్‌లో అడుగుపెట్టాడు. కానీ, నాగార్జున ఆఫర్ చేసిన రూ.40 లక్షలకు టెంప్ట్ అయిపోయి రన్నరప్ స్థానంతో సరిపెట్టుకున్నాడు. అలా రేవంత్ విజేతగా నిలిచాడు. ఇక్కడే నాగార్జున ఓ ట్విస్ట్ బయటపెట్టాడు. ప్రేక్షకులు ఎక్కువ ఓట్లేసి గెలిపించింది శ్రీహాన్‌నే అని వెల్లడించాడు. దీంతో ట్రోఫీ గెలిచిన రేవంత్ ముఖం వెలవెలబోగా.. అటు ప్రేక్షకుల అభిమానం, ఇటు డబ్బు రెండూ సొంతమయ్యేసరికి శ్రీహాన్ ముఖం కళకళలాడింది.చివరి స్థానాల్లోనే...ఇక ఏడో సీజన్లో టాస్కుల బాహుబలిగా పేరు తెచ్చుకున్న అంబటి అర్జున్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. కానీ, వైల్డ్‌కార్డ్‌గా రావడం వల్ల తనపై పాజిటివిటీ కన్నా నెగెటివిటీయే ఎక్కువ వచ్చింది. అలా టాప్ 6లో చివరి స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఎనిమిదో సీజన్లో కమెడియన్ అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయినప్పటికీ టాప్ 5లో చివరి స్థానంలోనే ఉండిపోయాడు.ఈసారం ఏం జరగనుంది?ఈ సారి కామన్ మ్యాన్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan Padala) ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. ఇతడికి భారీ ఓటింగ్ ఉంది. ఈ కారణంగా అతడు గెలిచి చరిత్ర సృష్టించనూవచ్చు. లేదంటే రన్నరప్ స్థానంతో సరిపెట్టుకోనూవచ్చు. ఇవేవీ కాకుండా సూట్‌కేస్ తీసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మరి కల్యాణ్ ఏం చేస్తాడో చూడాలి!చదవండి: టికెట్ టు ఫినాలే గెలిచిన కల్యాణ్ పడాల -
ఫస్ట్ ఫైనలిస్ట్‌గా కల్యాణ్.. ట్రోఫీకి దూరం.. తనూజ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
బిగ్‌బాస్ తెలుగు 9 ఫస్ట్ ఫైనలిస్ట్‌గా కల్యాణ్ పడాల నిలిచాడు. వరుస గేమ్స్‌లలో తన సత్తా చూపి ప్రేక్షకులను ఫిదా చేశాడు. బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో ఎప్పటికీ కల్యాణ్ పేరు నిలిచిపోతుంది. కామన్ మ్యాన్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టాడు. మూడోవారం డేంజర్ జోన్లోకి వెళ్లి ఎలిమినేట్ అవుతాడనుకున్నారు. అమ్మాయిల పిచ్చోడు అంటూ వచ్చిన నిందలు భరించాడు. అదే అమ్మాయి కల్యాణ్ గెలుపులో మూలస్థంభంగా నిలబడింది. కల్యాణ్ కేవలం సెలబ్రిటీల చుట్టు మాత్రమే తిరుగుతున్నాడని హేళన చేశారు. ఇలా ఎన్నో భరించిన కామన్ మ్యాన్ కల్యాణ్ రెండుసార్లు కెప్టెన్ అయ్యాడు. ఏకంగా ఫస్ట్ పైనలిస్ట్‌గా నిలిచి అదే సెలబ్రిటీల చేత శభాష్ అంటూ చప్పట్లు కొట్టించుకున్నాడు. కానీ, టికెట్ టూ ఫినాలే కల్యాణ్‌కు దక్కడం పెద్ద మైనస్ కానుంది. ఈ విజయం ఫైనల్ కప్‌కు దూరం చేసే ఛాన్స్ బలంగా ఉంది.భరణి, రీతూల మాటల యుద్ధంబిగ్బాస్ సీజన్-9లో ఫస్ట్ ఫైనలిస్ట్‌గా నిలిచేందుకు కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, రీతూ, భరణి గట్టిగానే ఫైట్ చేశారు. అయితే, రీతూ చేతిలో భరణి ఓడిపోయాడు. దీంతో ఆయన టాస్క్ నుంచి విరమించాల్సి వచ్చింది. గేమ్ పూర్తి అయిన తర్వాత సంచాలక్ సంజన తప్పుడు నిర్ణయం తీసుకుందని ఆధారాలతో సహా తనూజ చూపుతుంది. దీంతో భరణికి కోపం వచ్చి సంజన పట్ల తన అసంతృప్తిని వ్యక్తపరుస్తాడు. ఆపై రీతూతో పెద్దగొడవే జరిగింది. నేను గెలిచిన ప్రతిసారి ఇలా ఎదో ఒకటి చేస్తారని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇందులో భరణి వాదన కరెక్ట్‌గానే ఉంది. సంజన ఇచ్చిన తీర్పు కూడా కరెక్ట్‌గానే ఉంది. కానీ, టాస్క్‌లో భాగంగా ఇచ్చిన ట్రయాంగిల్ (త్రిభూజాకారం) వస్తువును కావాలనే బిగ్‌బాస్ టీమ్ అలా డిజైన్ చేసిందా... పొరపాటున తప్పిదం జరిగిందా తెలియాలంటే నాగార్జున చెప్పాల్సిందే. అయితే, ఈ టాస్క్‌లకు ఎలాంటి సంబంధం లేని కల్యాణ్‌ని భరణి లాగి గొడవపడ్డాడు. దీంతో కల్యాణ్‌తో కూడా గొడవ జరుగుతుంది.విన్నర్‌కు కల్యాణ్ దూరంకల్యాణ్కు బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచే అర్హత వంద శాతం ఉంది... అదే సమయంలో తనూజ నుంచి కూడా గట్టిపోటీ ఉంది. తనకు మహిళల బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. ప్రస్తుతం బిగ్‌బాస్‌లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే కల్యాణ్ విన్నర్ అవడం చాలా కష్టమనే చెప్పవచ్చు. ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీ తీసుకుని బిగ్‌బాస్ విన్నర్ ట్రోఫీ వదిలేశాడేమో అనిపిస్తుంది. రీతూ, కల్యాణ్‌ల మధ్య జరిగిన చివరి టాస్క్ కల్యాణ్‌ను గెలిపించేందుకే బిగ్‌బాస్ ఇచ్చాడనిపిస్తుంది. అతనొక ఆర్మీ సైనికుడు కావాలనే పూర్తి ఫిజికల్ టాస్క్ పెట్టినట్లు తెలుస్తోంది. అమ్మాయి ప్రత్యర్థిగా ఉంటే ఇలాంటి టాస్క్ అవసరం లేదు. ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచిన కల్యాన్ మరో రెండు వారాలు ఓటింగ్‌లో కనిపించడు. ఈ వారం కెప్టెన్ కావడంతో ఇప్పటికే ఓటింగ్‌లో లేడు. దీంతో టైటిల్ కోసం ఓటింగ్ రేసులో మాత్రమే కల్యాణ్ కనిపిస్తాడు. తనూజ దాదాపు ప్రతి వారం రేసులో ఉంటుంది. ఫస్ట్ ఫైనలిస్ట్‌గా కల్యాణ్ గెలుపులో తనూజ పాత్ర కూడా చాలా ఎక్కువగానే ఉంది. కల్యాణ్ కెప్టెన్ కావాలని ఆమె బలంగా కోరుకుంది. ఆపై అతనికి సపోర్ట్ కూడా చేసింది. ఇలా తనూజకే చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దీంతో దాదాపు బిగ్‌బాస్ విన్నర్ తనూజ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో రాహుల్ మినహా టికెట్ టూ ఫినాలే అందుకున్న ఎవరు కూడా బిగ్‌బాస్ ట్రోఫీ గెలవలేదన్నది గమనార్హం. -
కల్యాణ్ కోసం తనూజ.. తొక్క, తోటకూర అంటూ 'రీతూ' ఫైర్
బిగ్‌బాస్ సీజన్-9 ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం ముగ్గురు బరిలో ఉన్నారు. శుక్రవారం ఎపిసోడ్లో ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరనేది తేలిపోతుంది. అయితే, ఈ ముగ్గురికి కట్టు! నిలబెట్టు అనే టాస్క్‌ను బిగ్‌బాస్ ఇచ్చాడు. బ్రిక్స్‌తో వారు ఒక టవర్‌ను పేర్చి.. పడిపోకుండా దానిని కాపాడుకోవాలి. ఇదే సమయంలో బాల్స్‌తో ఇతర కంటెస్టెంట్స్ దాడి చేస్తుంటారు. సీజన్-7లో అమరదీప్ ఇదే టాస్క్‌తో బాగా వైరల్ అయ్యాడు. హౌస్మేట్స్ అందరూ అమర్‌ని టార్గెట్ చేయడంతో రేయ్ వద్దురా ప్లీజ్ అంటూ వేడుకుంటాడు. ఇప్పుడు రీతూ విషయంలో కూడా అదే జరిగింది. కానీ, ఇక్కడ తనూజ, సుమన్ మాత్రమే రీతూ టవర్‌ను టార్గెట్ చేశారు.'కట్టు నిలబెట్టు' టాస్క్‌కు సంచాలక్‌గా సంజనా ఉంటుంది. రీతూ కోసం డీమాన్ పవన్ ఒక్కడే నిలబడ్డాడు. అయితే, తను సైడ్ నుంచి కల్యాణ్ టవర్‌ను కూల్చేందుకు బాల్స్ విసురుతూ ఉంటాడు. దీంతో తనూజ ఫైర్ అవుతుంది. కల్యాణ్‌ను ఎవరు టార్గెట్ చేస్తారో వాళ్లని తాను టార్గెట్ చేస్తానంటూ రీతూ టవర్‌పై బాల్స్ విసురుతుంది. దీంతో రీతూ కూడా తనూజపై భగ్గుమంటుంది. తొక్క, తోటకూర అంటూ తనూజపై రీతూ విరుచుకుపడుతుంది. అయితే, డీమాన్ దూకుడుగా బాల్స్ విసురుతున్న క్రమంలో లైన్ దాటుతాడు. దీంతో అతను డిస్‌క్వాలిఫైడ్ అవుతాడు. ఇంకేముంది రీతూ టవర్‌ను సులభంగా కూల్చేశారు. -
ప్రియుడిని పరిచయం చేసిన 'బిగ్‌బాస్' పునర్నవి
బిగ్‌బాస్ తెలుగు 3వ సీజన్ పేరు చెప్పగానే చాలామందికి రాహుల్ సిప్లిగంజ్ పండించిన ఆన్ స్క్రీన్ లవ్ స్టోరీనే గుర్తొస్తుంది. అదే సీజన్లో పాల్గొన్న పునర్నవి భూపాలంతో ఓ రేంజ్ కెమిస్ట్రీ పండించాడు. దీంతో నిజంగానే వీళ్లు ప్రేమికులేమో అని అందరూ అనుకున్నారు. షో నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా పలు షోల్లో జంటగా కనిపించారు. కానీ అదంతా షో కోసమే.ఇకపోతే కొన్నిరోజుల క్రితమే రాహుల్ సిప్లిగంజ్.. హరిణ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు పునర్నవి కూడా త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు హింట్ ఇచ్చేసింది. తన ప్రియుడిని సోషల్ మీడియా వేదికగా అందరికీ పరిచయం చేసింది. కశ్మీర్లో అతడు తనకు ప్రపోజ్ చేయగా 'యస్' చెప్పినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. పునర్నవి ప్రియుడి పేరు హేమంత్ వర్మ. ఇతడో ఫొటోగ్రాఫర్ అని తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'అఖండ 2' విడుదల వాయిదాకు కారణాలివే!)తెనాలికి చెందిన తెలుగమ్మాయి పునర్నవి భూపాలం. రాజ్ తరుణ్ 'ఉయ్యాలా జంపాలా' సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, పిట్టగోడ, మనసుకు నచ్చింది, ఒక చిన్న విరామం, సైకిల్ తదితర చిత్రాల్లో నటించింది. అలానే 'కమిట్ మెంటల్' అనే ఓటీటీ సిరీస్‌లోనూ లీడ్ రోల్ చేసింది. అయితే వీటిలో దేనితోనూ రాని గుర్తింపు 'బిగ్‌బాస్' షోతో సంపాదించింది. కానీ తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయో లేదో తెలియదు గానీ పైచదువుల కోసం లండన్ వెళ్లిపోయింది. సైకాలజీ, జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.చివరకు 2020లో సినిమాల్లో కనిపించిన పునర్నవి.. తర్వాత అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేది. ఇప్పుడు సడన్‌గా తన ప్రియుడిని పరిచయం చేసింది. ఫొటోలు చూస్తుంటే త్వరలో పెళ్లి చేసుకుని గుడ్ న్యూస్ చెప్పేస్తారని తెలుస్తోంది. (ఇదీ చదవండి: 'కోర్ట్' బ్యూటీ కొత్త సినిమా.. ఈసారీ ప్రేమకథే) -
అంతా చీటింగే అన్న భరణి.. ఫస్ట్ ఫైనలిస్ట్‌గా కల్యాణ్
నామినేషన్స్‌లో కూడా నవ్వుతూ ఉన్న భరణి.. టాస్కుల్లో మాత్రం ఫైర్ చూపించాడు. ఇప్పుడేకంగా కయ్యానికి కాలు దువ్వాడు. నిన్నటి టాస్క్ కాస్త గందరగోళంగా నడిచిన సంగతి తెలిసిందే కదా! దానికి కొనసాగింపుగా తాజాగా ఓ ప్రోమో వదిలారు. అందులో భరణి.. సరిగా త్రిభుజాకారం లేని వస్తువుని ట్రయాంగిల్ అని ఎలా అంటారు? అని మండిపడ్డాడు. ఇప్పటికే కల్యాణ్, ఇమ్మూ కలిసి గ్రూప్గేమ్ ఆడుతున్నారని పసిగట్టిన భరణి.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటమిని ఒప్పుకునేందుకు సిద్ధపడలేదు.భరణి ఫ్రస్టేషన్సంజనా సంచాలకురాలిగా తప్పు చేసిందని వాదించాడు. మరోవైపు రీతూ.. ఎవరైనా ఒకరు గెలిస్తే దాన్ని రచ్చ చేయాలి, చెండాలం చేయాలి. ఒకరు హ్యాపీగా ఉండకూడదు! అని అసహనం వ్యక్తం చేసింది. సీజన్లో ఎక్కడెక్కడ చీటింగ్ జరిగాయి? ఎక్కడెక్కడ షూ చూపిస్తే మనుషుల్ని గుర్తుపట్టారు.. మొత్తం వీడియోలతో సహా బయటకు వచ్చాయి. అయినా సరే, ఇప్పటికీ నోరు మూసుకునే కూర్చున్నా అంటూ తన ఫ్రస్టేషన్ అంతా వెళ్లగక్కాడు. చీటింగ్‌తో కల్యాణ్ కెప్టెన్ఇంతకీ ఆ షూ గొడవేంటంటే.. కళ్లకు గంతలు కట్టి లైట్లు ఆఫ్ చేసే కెప్టెన్సీ టాస్క్‌లో కల్యాణ్ (Pawan Kalyan Padala) లైట్ ఆఫ్ చేసిందని భరణి అని పవన్.. అతడివైపు షూ చూపిస్తూ సిగ్నల్ ఇచ్చాడు. అలా ఆ వారం కల్యాణ్ కెప్టెన్ అయ్యాడు. దాన్నే తర్వాత తనూజకు కన్ఫెషన్ రూమ్‌లో వీడియో వేసి మరీ చూపించారు. భరణి బయటకు వెళ్లొచ్చాక ఆ ఎపిసోడ్ చూశాడు కాబట్టి తనకూ తెలిసిపోయింది. ఫస్ట్ ఫైనలిస్ట్‌గా కల్యాణ్మరి కల్యాణ్‌కి ఎలా తెలిసిందంటే.. శ్రీజ రీఎంట్రీ ఇచ్చి కల్యాణ్‌కు కావాల్సినన్ని ఇన్పుట్స్ ఇచ్చింది. అందులో భాగంగా ఈ తతంగాన్ని బయటపెట్టింది. కానీ ఇదే విషయాన్ని డిమాన్ పవన్‌తో మాత్రం చర్చించలేదు. అందుకే ప్రోమోలో కూడా వీళ్లు దేని గురించి అంటున్నారో తెలియక పవన్ సైలెంట్‌గా చూస్తూ ఉన్నాడు. భరణి, కల్యాణ్ మాత్రం కొట్టుకునేంతలా పైపైకి వెళ్లారు. ఈ గొడవను పక్కనపెడితే ఈ సీజన్లో కల్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయినట్లు తెలుస్తోంది. -
భరణికి అన్యాయం! కనిపెట్టేసిన తనూజ
టికెట్ టు ఫినాలే రేస్‌లో ఒక్కొక్కరూ అవుట్ అవుతూ రాగా చివరకు భరణి, సుమన్, పవన్ కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, రీతూ మిగిలారు. మరి వీరిలో ఎవరు గేమ్స్‌లో పాల్గొన్నారు. ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? అనేది గురువారం (డిసెంబర్ 4వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..కల్యాణ్ విన్నర్మొదటగా కలర్ గేమ్ ఛాలెంజ్‌లో భరణి, రీతూ, కల్యాణ్ ఆడారు. ఈ ఆటలో రీతూ గెలిచింది. అయితే రీతూ పూసిన పసుపు కలర్ ఎక్కువగా ఉన్నప్పటికీ తనూజ.. రెడ్ కలర్ ఎక్కువగా ఉదంటూ కల్యాణ్‌ను విన్నర్‌గా ప్రకటించింది. అతడు తన ప్రత్యర్థిగా సుమన్‌ను ఎంచుకున్నాడు. వీరికి వస్తువులు పగలగొట్టే గేమ్ ఇచ్చారు. త్రాసులో ఎవరి వస్తువులు ఎక్కువ బరువుంటే వారే గెలిచినట్లు! టార్గెట్ భరణిఈ ఆటలో కల్యాణ్ గెలవడంతో సుమన్ రేసు నుంచి అవుట్ అయ్యాడు. ఇమ్మూ, రీతూ, కల్యాణ్.. కలిసి భరణిని టార్గెట్ చేశారు. ఇమ్మూ, కల్యాణ్.. రీతూను గెలిపించి.. ఆమె భరణితో పోటీపడేలా ప్లాన్ చేశారు. వీళ్ల ప్లాన్ తిప్పికొట్టేందుకు బిగ్‌బాస్ బ్యాలెన్స్ గేమ్ ఇచ్చాడు. అయినా బిగ్‌బాస్‌నే బురిడీ కొట్టించారిద్దరూ. ఈ గేమ్‌లో కల్యాణ్, ఇమ్మూ, రీతూ స్టిక్స్ పట్టుకుంటే దానిపై హౌస్మేట్స్ కాయిన్స్ పెట్టాల్సి ఉంటుంది.ఫస్ట్ ఫైనలిస్ట్ అతడేనా?ఇమ్మూ, కల్యాణ్ ముందుగా అనుకున్నట్లుగానే ఓడిపోవడంతో రీతూ గెలిచింది. రీతూ.. భరణిని ప్రత్యర్థిగా ఎంచుకుంది. వీరికి ట్రయాంగిల్- స్క్వేర్ అంటూ ఓ గేమ్ పెట్టారు. సంజనా సంచాలకురాలిగా వ్యవహరించింది. ఈ గేమ్‌లో రీతూ గెలిచింది. అయితే తనూజ మాత్రం.. రీతూ పెట్టిన ఓ ట్రయాంగిల్ సరిగా లేదని చెప్తుండగా ఎపిసోడ్ ముగిసింది. అదే నిజమైతే భరణికి అన్యాయం జరిగినట్లే! ఇక ఈ టికెట్ టు ఫినాలే కల్యాణ్ గెలిచినట్లు తెలుస్తోంది. -
టికెట్ టు ఫినాలే: ముగ్గురి మధ్యే పోటీ!
టికెట్ టు ఫినాలే ఎవరికి అవసరం? ఆడగలిగే సత్తా ఉండి ఓట్ బ్యాంక్ లేనివారికి ఉపయోగకరం. తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లో టికెట్ టు ఫినాలే.. సుమన్, భరణి, సంజనా, రీతూ, పవన్.. వీరిలో ఎవరికి వచ్చినా ప్రయోజనం ఉండేది. వీరికి కాదని తనూజ, ఇమ్మాన్యుయేల్, పవన్ కల్యాణ్‌కు వస్తే పెద్ద యూజ్ ఏం ఉండదు. ఎందుకంటే వీళ్లకు భారీ ఓటింగ్ ఉంది. టికెట్ టు ఫినాలేవీళ్లు టికెట్ టు ఫినాలే కొట్టినా, కొట్టకపోయినా.. ప్రతివారం నామినేషన్స్‌లోకి వచ్చి సేవ్ అయి మరీ ఫైనల్లో చోటు దక్కించుకోగలరు. పైగా ఈ ముగ్గురూ టాప్ 3 అని ఈపాటికే అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే టికెట్ టు ఫినాలే రేసు నుంచి సంజనా, తనూజ, పవన్ సైడైపోయారు. తాజా ప్రోమో ప్రకారం సుమన్ కూడా ఈ రేసు నుంచి తప్పుకున్నట్లు కనిపిస్తోంది. ముగ్గురి మధ్యే పోటీఅలాగే భరణి కూడా ఔట్ అయ్యారట. ఈ లెక్కన రీతూ, ఇమ్మాన్యుయేల్, పవన్ కల్యాణ్ ఈ టికెట్ టు ఫినాలే కోసం పోటీపడుతున్నారు. వీరిలో కల్యాణ్, ఇమ్మూ ఇది గెలిచినా, గెలవకపోయినా వారు టాప్ 3లో ఉండటం ఖాయం. కానీ రీతూ గెలిచిందంటే మిగతా హౌస్మేట్స్ (సంజన, భరణి, సుమన్, పవన్)కి టాప్ 5లో ఉండే అవకాశాలు తగ్గిపోతాయి. మరి ఈ టికెట్ టు ఫినాలే ఎవరు గెలుస్తారు? టాప్ 5లో ఎవరు మొదట అడుగుపెట్టబోతున్నారో చూడాలి! -
ఛాలెంజ్ చేసిన పవన్‌ను ఓడించిన భరణి
టికెట్ టు ఫినాలే కోసం హౌస్‌లో టాస్కులు జరుగుతున్నాయి. తనూజ.. సుమన్‌ను ప్రత్యర్థిగా ఎంచుకోవడంతో మొన్నటి ఎపిసోడ్ ముగిసింది. మరి తర్వాతేం జరిగింది? ఎవరు గెలిచారు? మళ్లీ ఎలాంటి గేమ్స్ పెట్టారనేది బుధవారం (డిసెంబర్ 3వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం...సుమన్ చేతిలో ఓటమితనూజ, సుమన్‌కు బిగ్‌బాస్ వాటర్ ట్యాంక్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో కల్యాణ్, రీతూ, ఇమ్మాన్యుయేల్.. తనూజకు సపోర్ట్ చేశారు. భరణి, పవన్.. సుమన్‌కు మద్దతిచ్చారు. ట్యాంకు సగానికి పైగా నిండినా సరే సుమన్ కదలకుండా శిలావిగ్రహంలా నిల్చుని గెలిచాడు. టికెట్ టు ఫినాలే రేసు నుంచి అవుట్ అయిపోవడంతో తనూజ ఏడ్చేసింది.గెలిచిన పవన్తర్వాత బిగ్‌బాస్ ఇచ్చిన పవర్ బాక్స్ అనే ఛాలెంజ్‌ను కల్యాణ్, పవన్, సుమన్ ఆడారు. ఈ గేమ్‌లో పవన్ గెలిచి భరణిని ప్రత్యర్థిగా ఎంచుకున్నాడు. అలా వీరిద్దరికీ వారధి కట్టు- విజయం పట్టు అనే బ్రిడ్జి టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో పవన్‌పై భరణి గెలిచేశాడు. దీంతో పవన్ టికెట్ టు ఫినాలే రేసులో లేకుండా పోయాడు. మాట నిలబెట్టుకోలేని పవన్ఈసారి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యేది నేనే అని ఛాలెంజ్ చేసిన పవన్ ఆ మాట నిలబెట్టుకోలేకపోయేసరికి బాధపడ్డాడు. ప్రస్తుతానికి రీతూ, భరణి, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, సుమన్ టికెట్ టు ఫినాలే రేసులో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారో చూడాలి! -
సుమన్ చేతిలో ఓటమి.. తనూజకు ఏడుపే దిక్కు!
టికెట్ టు ఫినాలే ఎలాగైనా కొట్టాల్సిందే అన్న కసితో ఆడుతున్నారు హౌస్మేట్స్. ఇప్పటికే ఇమ్మాన్యుయేల్, తనూజ గేమ్స్ గెలిచి అందరికంటే దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా తనూజ సుమన్‌తో పోటీపడింది. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. ఇది బ్యాలెన్స్ గేమ్. తనూజకు సపోర్ట్ చేయని భరణిహౌస్మేట్స్ ఎవరిని రేసులో నుంచి తొలగించాలనుకుంటారో వారి ట్యాప్ తిప్పి ట్యాంకులో నీళ్లు నింపాల్సి ఉంటుంది. కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, రీతూ.. తనూజకు సపోర్ట్ చేయగా భరణి, పవన్.. సుమన్‌కు మద్దతిచ్చారు. ఈ గేమ్‌లో తనూజపై సుమన్ పైచేయి సాధించాడు. దీంతో తనూజ టికెట్ టు ఫినాలే రేసులో లేకుండా పోయింది. రేసు నుంచి అవుట్‌ఈ ఓటమిని తట్టుకోలేక తనూజ ఏడుస్తూ కూర్చుండిపోయింది. ఇక మరో గేమ్‌లో డిమాన్ పవన్ గెలవగా.. భరణితో తలపడినట్లు తెలుస్తోంది. ఈ ఆటలో భరణి గెలిచి పవన్‌ను రేసు నుంచి తప్పించాడని తెలుస్తోంది. ఇలా మలుపులు తిరుగుతూ పోతున్న ఈ ఆటలో ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ (Bigg Boss Telugu 9) అవుతారో చూడాలి! చదవండి: రీతూ పరువు తీసిన బిగ్‌బాస్ -
రీతూ పరువు పాయే.. దుమ్ము దులిపేసిన ఇమ్మూ, తనూజ
ఈ సీజన్లో ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యేందుకు అందరికీ సమాన అవకాశాలిస్తున్నానన్నాడు బిగ్‌బాస్. రణరంగంలో ఎవరెక్కువ గడులు (బాక్స్‌లు) గెల్చుకుంటే వారే ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారని చెప్పాడు. ఈ క్రమంలోనే హౌస్‌లో కొన్ని గేమ్స్ జరిగాయి. అందులో ఎవరు గెలిచారో మంగళవారం (డిసెంబర్ 2వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..రీతూ ఒకటే గొడవకంటెస్టెంట్లందరూ చదరంగంలాంటి బాక్స్‌లో ఒక్కో కలర్ ఎంచుకున్నారు. చివరకు ఆ బాక్స్‌లో ఎవరి కలర్ ఎక్కువ ఆక్రమించుకుంటుందో ఆ కంటెస్టెంట్లే ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారని చెప్పారు. ఫస్ట్ గేమ్‌లో కల్యాణ్, పవన్, ఇమ్మాన్యుయేల్ ఆడతారని తనూజ ప్రకటించింది. అందుకు రీతూ ఒప్పుకోలేదు. ఫస్ట్ గేమ్ నేనే ఆడతానని వాదించింది. దీంతో పవన్ తప్పని పరిస్థితిలో వెనకడుగు వేశాడు.పరువు పాయేఅలా ఇమ్మూ, కల్యాణ్, రీతూ.. మొదటి గేమ్ కనుక్కోండి చూద్దాం ఆడారు. మెదడుకు పదును పెట్టే ఈ గేమ్‌లో రీతూ ఒక్క పాయింట్ కూడా గెలవలేకపోయింది.. ఆడతా.. ఆడతానంటూ దూకుడు చూపించి మరీ బొక్కబోర్లా పడింది. ఆమె పరిస్థితి చూసిన బిగ్‌బాస్ తనకసలు లెక్కలు వచ్చా? రావా? అని టెస్ట్ చేసేందుకు రెండో ఎక్కం చెప్పమన్నాడు. దీనికి ఆలోచించుకుంటూనే సెకండ్ టేబుల్ కరెక్ట్‌గా చెప్పింది. ఈ గేమ్‌లో అంతో ఇంతో కల్యాణ్ నాలుగు పాయింట్లు గెలిచాడు. ఇమ్మూ ఆరు పాయింట్లతో ఈ రౌండ్ విజేతగా నిలిచాడు. సంజనా ఔట్తర్వాత ఇమ్మాన్యుయేల్, సంజనా (Sanjana Galrani)తో బాల్స్ గేమ్ ఆడి గెలిచాడు. ఆటలో ఓడిపోయినందుకు సంజనా బోరుమని ఏడ్చేసింది. ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యే రేసు నుంచి సంజనా వైదొలిగింది. తర్వాత పూల గేమ్‌లో భరణి, తనూజ, డిమాన్ పవన్ తలపడ్డారు. ఫిజికల్ అవుతున్నావ్, ఫిజికల్ అవుతున్నావ్ అని తనూజ పదేపదే అనేసరికి పవన్ కాస్త సైలెంట్ అయిపోయాడు. అలా తెలివిగా ఈ ఆటలో తనూజ గెలిచింది. తర్వాతి తన గేమ్ కోసం సుమన్ శెట్టిని ప్రత్యర్థిగా ఎంచుకుంది. ఈ గేమ్‌లో ఎవరు గెలిచారో చూడాలి! -
నువ్వు ఇంటికెళ్లిపో.. తనూజ, సుమన్ శెట్టి ఇలా షాకిచ్చారేంటి?
బిగ్‌బాస్ 9 హౌస్‌లో విజయవంతంగా 12 వారాలు పూర్తయ్యాయి. ఆదివారం ఎపిసోడ్లో దివ్య ఎలిమినేట్ అయి బయటకెళ్లిపోవడం చాలామంది ఊహించిందే. మరకొరు కూడా ఎలిమినేట్ అవుతారేమో అనుకున్నారు కానీ అలా జరగలేదు. ఇకపోతే 13వ వారానికిగానూ సోమవారం నామినేషన్స్ ప్రక్రియ చిత్రవిచిత్రంగా జరిగింది. అటు సుమన్ శెట్టి, ఇటు తనూజ.. డీమన్కి చిన్నపాటి షాక్‌లు ఇచ్చారు. ఇంతకీ సోమవారం ఎపిసోడ్లో ఏమేం జరిగింది? నామినేషన్స్‌లో ఎవరెవరున్నారు?(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన రష్మిక హారర్ సినిమా)ప్రతి సభ్యులు ఇద్దరి సభ్యులకు చెందిన బాటిల్స్ పగలగొట్టి నామినేట్ చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. తొలుత ఇమ్మాన్యూయేల్.. రీతూ, పవన్ పేర్లు చెప్పాడు. భరణి వచ్చి.. తన మెడిసన్స్‌తో ప్రాంక్ చేయడం నచ్చలేదని సంజనని, గతవారం సరిగా కనిపించలేదు అని పవన్‌ని నామినేట్ చేశాడు. రీతూ.. సుమన్, సంజనాని నామినేట్ చేసింది. తనూజ అయితే పవన్ పేరు చెప్పింది. కానీ ఈ డ్రామా కాస్త విచిత్రంగా నడిచింది.తనూజ.. తొలుత ఇమ్మూని నామినేట్ చేస్తున్నట్లు చాలాసేపు మాట్లాడింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిసారి నన్ను నామినేషన్లోకి లాగాడు. ఏదో మాట అన్నంత మాత్రాన ఫ్రెండ్‌ని విసిరి పారేశాం అని కాదు. ఇప్పటికీ నువ్వు నా ఫ్రెండ్ వే. ఏదన్నా ఉంటే ముఖం మీద చెప్పు అని అడిగింది. దీనికి ఇమ్మూ తనవైపు నుంచి సమాధానం ఇచ్చాడు. దీంతో ఇద్దరూ తమ మధ్య దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు సడన్‌గా డీమన్ పవన్ పేరు చెప్పి తనూజ షాకిచ్చింది. ఇప్పటివరకు నామినేషన్ పాయింట్ చెప్పి మారిస్తే జోక్‌లా అనిపించిందని పవన్ ఆశ్చర్యపోయాడు. అలానే సంజనని కూడా నామినేట్ చేసింది.(ఇదీ చదవండి: సమంతకు ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం అయిపోయిందా?)సుమన్ శెట్టి చేసిన నామినేషన్స్ అయితే వేరే లెవల్ కామెడీ అని చెప్పొచ్చు. నువ్వు హౌస్‌లో గట్టి గట్టిగా అరుస్తావ్, నాకు అది డిస్ట్రబెన్స్గా ఉందని చెప్పి రీతూని నామినేట్ చేశాడు. దీంతో రీతూ షాకయింది. మిగిలిన వాళ్లకు కూడా ఇబ్బందయితే వాళ్లు చెప్పుండేవాళ్లు కదా అని రీతూ అడిగితే.. వాళ్లకు భయమేమో చెప్పలేదు, నాకు భయం లేదు చెప్తున్నా అని వివరణ ఇచ్చాడు. తర్వాత డీమన్ పవన్ పేరు చెబుతూ.. నీకు దెబ్బ తగిలింది కదా, నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ కూడా, మాకంటే నువ్వే స్ట్రాంగ్ గనుక ఇంటికెళ్లిపోయి రెస్ట్ తీసుకో అని కారణం చెప్పాడు. దీనికి ఏమనలో తెలీక పవన్ నవ్వుకున్నాడు.ఇక సంజన.. పవన్, రీతూని నామినేట్ చేసింది. డీమన్ పవన్.. తొలుత ఇమ్మూ పేరు చెప్పి కాస్త నవ్వించి తర్వాత సంజన, తనూజ పేర్లు చెప్పాడు. చివరగా కెప్టెన్ కల్యాణ్.. భరణిని నామినేట్ చేశాడు. అలా ఈ వారం మొత్తంగా ఆరుగురు నామినేషన్లలో నిలిచారు. వారిలో సంజన, రీతూ, భరణి, పవన్, తనూజ, సుమన్ ఉన్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్) -
బిగ్‌బాస్ 9.. ట్రెండింగ్‌లో కల్యాణ్ పడాల
బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్ చివరకొచ్చేసింది. మరో మూడు వారాలు మాత్రమే మిగిలున్నాయి. దీంతో ఫైనల్‌కి ఎవరొస్తారు? ఎవరు విజేతగా నిలుస్తారు? అనే ఆసక్తి.. షో చూస్తున్న వారిలో నెలకొంది. మరోవైపు హౌస్‌కి చివరి కెప్టెన్‌గా కల్యాణ్ పడాల నిలిచాడు. దీంతో ఎక్స్(ట్విటర్)లో తెగ ట్రెండ్ అయిపోతున్నాడు. గతం వారం రోజుల్లో లక్షలాది ట్వీట్స్ ఇతడి గురించి రావడం వస్తుండటం విశేషం.స్వతహాగా ఆర్మీ జవాన్ అయిన కల్యాణ్.. బిగ్‌బాస్ షో అంటే ఇష్టంతో, ఈ సీజన్ కోసం వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని తనలాంటి చాలామంది సామాన్యులని దాటుకుని షోలో అడుగుపెట్టాడు. ప్రారంభంలో ఓ మాదిరిగా ఆకట్టుకున్నాడు. కానీ వారం వారానికి తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చాడు. ప్రస్తుతానికైతే ఫినాలే రేసులో ఉన్నాడు. తనూజతో నువ్వా నేనా అన్నట్లు కల్యాణ్ గేమ్ సాగుతోంది.ఈ వారం కల్యాణ్ కెప్టెన్ అయిపోయాడు. కాబట్టి నామినేషన్స్‌లో లేడు. వచ్చే వారంలో నామినేషన్స్ ఉన్నాసరే కల్యాణ్ బయటకు వచ్చే సూచనలు అయితే కనిపించట్లేదు. మరి కల్యాణ్.. ఈ సీజన్ విజేతగా నిలుస్తాడా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. -
ఆ రెండు తప్పుల వల్లే దివ్య ఎలిమినేట్!
తనూజ, దివ్య మధ్య యుద్ధం.. అదంతా చూడటానికి ప్రేక్షకులు సిద్ధం అన్న రేంజ్లో బిల్డప్ ఇచ్చాడు బిగ్‌బాస్. కేవలం ఆ యుద్ధం కోసమే అర్ధాంతరంగా నో ఎలిమినేషన్ ప్రకటించాడు. కానీ చివరకు ఏమైంది? ఈ ప్లాన్ పసిగట్టిన తనూజ గొడవకు ఫుల్స్టాప్ పెడదాం.. కలిసిపోదాం అనేసింది. ఇద్దరూ హగ్గిచ్చుకుని బిగ్‌బాస్ చెవిలో మందార పువ్వు పెట్టారు. దీంతో 11వ వారం తప్పించుకున్నా 12వ వారం తప్పక ఎలిమినేట్ అయింది దివ్య. ఆమె ఎలిమినేషన్‌కు కారణాలేంటో చూద్దాం..వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీతెలుగు బిగ్‌బాస్ 9 ప్రారంభమైన కొత్తలో కామన్‌మ్యాన్ కేటగిరీలో వచ్చినవాళ్లు చేసిన ఓవరాక్షన్‌కు జనాలకు బీపీ వచ్చింది. వీళ్లనెవరైనా ఆపండ్రా.. అంటూ టీవీల ముందు జనం మొత్తుకున్నారు. ఎట్టకేలకు బిగ్‌బాస్ ఆ మొర ఆలకించి మళ్లీ అదే అగ్నిపరీక్ష నుంచి ముగ్గుర్ని హౌస్‌లోకి పంపాడు. ఈ ముగ్గురిలో అందరూ వద్దనుకున్న దివ్యనే హౌస్‌లో వైల్డ్‌కార్డ్‌గా ప్రవేశపెట్టాడు.ముక్కుసూటితనానికి ఫిదాఆమె పదునైన మాటలకు, ఆటకు అందరూ ఫిదా అయ్యారు. తనూజలాంటివాళ్లే దివ్వెల మాధురికి గజగజ వణికిపోతుంటే దివ్య ఎదురెళ్లి నిలబడింది. తప్పును తప్పు అని గట్టిగా వాదించింది. ఇన్ని మంచి లక్షణాలున్న దివ్యకు రానురాను పొగరు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఆమె హౌస్‌లో చేసిన రెండే రెండు తప్పుల వల్లే తను బయటకు వచ్చేసింది. ఒకటి తనూజను టార్గెట్ చేయడం, రెండు భరణితో బంధుత్వం కలుపుకోవడం!పతనం మొదలైందిభారీ ఓటింగ్ ఉన్న తనూజను అవసరం ఉన్నా, లేకపోయినా టార్గెట్ చేయడం అనేది తనకు వ్యతిరేకంగా మారింది. అందులోనూ భరణి, తనూజ అప్పటివరకు నాన్నకూతురిగా కలిసిమెలిసి ఉన్నారు. ఎప్పుడైతే దివ్య ఎంటరయిందో ఈ బంధం మధ్య దూరం పెరిగింది. ఈ విషయంలో దివ్యపై తనూజ ఫ్యాన్స్ కోపంతో ఉన్నారు. భరణి నెం.1 అంటూ టాప్‌లో నిలబెట్టిన దివ్య.. అతడి ఎలిమినేషన్‌కు పరోక్షంగా కారణమైంది. భరణిపై పెత్తనంతీరా సెకండ్ ఛాన్స్‌తో హౌస్‌లోకి వచ్చిన భరణిపై ఆమె పెత్తనం చెలాయించడం ప్రేక్షకులకే కాదు, ఆఖరికి భరణి కుటుంబసభ్యులకు కూడా నచ్చలేదు. అది అందరూ చెప్తున్నా ఆమె చెవికెక్కించుకోలేదు. భరణి తనూజతో సన్నిహితంగా ఉంటే జీర్ణించుకోలేకపోవడం, ఆమెకు ప్రాధాన్యతనిస్తే తట్టుకోలేకపోవడం వంటివి ఆమెకే మైనస్ అయ్యాయి. పొగరుగాతెలుగురాని కంటెస్టెంట్ గౌరవ్‌ని చీపురుపుల్లలా తీసిపడేయడం, నానామాటలు అనడంతో తన గ్రాఫ్ మరింత పడిపోయింది. ఆట మీద కన్నా మనుషుల మీదే ఎక్కువ ఫోకస్ చేయడం వల్లే ఫినాలేలో ఉండాల్సిన దివ్య () ఇప్పుడింట్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.చదవండి: భరణి తనూజను ఎత్తుకుంటే నీకేంటి సమస్య? ఏడ్చిన దివ్య -
భరణి ఉగ్రరూపం.. నామినేషన్స్‌లో ఆరుగురు
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లో ప్రస్తుతం ఎనిమిది మంది మిగిలారు. సీజన్ ముగింపుకు వస్తున్నా సరే కొట్లాటలు మాత్రం తగ్గలేదు. అందుకు 13వ వారం నామినేషన్స్ ప్రోమోయే నిదర్శనం. ఇద్దరి తలపై బాటిల్ పగలగొట్టి హౌస్మేట్స్ నామినేట్ చేయాల్సి ఉంటుంది. మొదటగా ఇమ్మాన్యుయేల్.. రీతూ, పవన్‌ను నామినేట్ చేశాడు. సంజనాకు హెచ్చరికభరణి.. సంజనను నామినేట్ చేశాడు. నా మెడిసిన్స్ దాచేసి నాపైనే కామెడీ చేస్తావనుకోలేదు, ట్యాబ్లెట్సె్ దాయడం మీకు సరదాగా ఉందా? అని అడిగితే అందుకామె అవునని తేలికగా బదులిచ్చింది. ఈ ప్రాంకులు చేయడం ఆపండి అని హెచ్చరించాడు. అయితే ఇదే భరణి.. మొన్న ఎపిసోడ్లో మాత్రం.. ట్యాబ్లెట్స్ దాచేసినందుకు సంజనాతో మరేం పర్లేదన్నట్లుగా సంభాషించాడు. ఇప్పుడేమో ఉగ్రరూపం చూపించడం గమనార్హం. ఇదే నా ఛాలెంజ్భరణి.. పవన్ (Demon Pavan)ను నామినేట్ చేస్తూ.. నిన్ను వెనక్కులాగుతున్నదాన్ని పక్కనపెట్టు.. మానసికంగా వీక్ అయితే ఫిజికల్‌గా కూడా ఫోకస్‌గా ఆడలేం అని సూచించాడు. దీంతో పవన్.. ఈ వారం టికెట్ టు ఫినాలే కొట్టేది నేనే.. మీ అందరికీ ఇదే నా ఛాలెంజ్ అని సవాలు విసిరాడు. మరి ఆ మాటపై ఎంతవరకు నిలబడతాడో చూడాలి! ఇకపోతే ఇమ్మాన్యుయేల్, కెప్టెన్ కల్యాణ్ మినహా మిగతా ఆరుగురు ఈ వారం నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: భరణి తనూజను ఎత్తుకుంటే నీకేంటి సమస్య? ఏడ్చిన దివ్య -
తనూజను ఎత్తుకుని తిరిగితే నీకేంటి సమస్య? ఏడ్చేసిన దివ్య
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ నుంచి దివ్య ఎలిమినేట్ అయింది. ఎలిమినేట్ అయిన వెంటనే సరాసరి బజ్ ఇంటర్వ్యూకి హాజరైంది. అక్కడ శివాజీ ఏయే ప్రశ్నలడిగాడు? తను ఎలా సమాధానాలిచ్చిందో ప్రోమో వదిలారు. అది ఓసారి చూసేద్దాం..వాళ్ల చుట్టూయే ప్రశ్నలుదివ్య గురించి మాట్లాడాలంటే కచ్చితంగా రెండు పేర్లు ముందుకు వస్తాయి. అవే భరణి, తనూజ. బజ్ ఇంటర్వ్యూ మొత్తం కూడా ఈ రెండు పేర్ల చుట్టూనే తిరిగింది. దివ్య నిఖితలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌కు భరణి అవసరం ఏమొచ్చింది? ఆయన తనూజతో ఎలా ఉంటే నీకేంటి సమస్య అని శివాజీ నిలదీశాడు. నాకేం ప్రాబ్లం లేదని దివ్య చెప్తుంటే.. నీ పొసెసివ్‌నెస్ మాకు స్పష్టంగా కనిపిస్తోదన్నాడు శివాజీ. తనూజను ఎత్తుకుంటే నీకేంటి సమస్య?వాళ్లను విడగొట్టి నేనేం సాధిస్తాను? పోనీ.. నేను రాగానే విడిపోయారంటే వాళ్ల రిలేషన్ అంత వీకా? అని దివ్య తిరిగి ప్రశ్నించింది. భరణి.. తనూజను ఎత్తుకుని తింపుతాడు, ఆయింట్మెంట్ రాస్తాడు.. నీకేంటి ప్రాబ్లమ్? అని అడిగాడు. ఒకసారి బయటకు వెళ్లి వచ్చాక ఆయన నిన్ను అంతగా ఎంకరేజ్ చేయలేదు.. గమనించావా? అంటూ ఆమెను దూరంగా ఉంచిన విషయాన్ని గుర్తు చేశాడు. అందుకు దివ్య కూడా అవునని తలూపింది.వెక్కెక్కి ఏడ్చిన దివ్యనిన్ను భరణి (Bharani Shankar)కి దూరంగా ఉండమని చెప్పమని మీ తల్లి మాధురిని వేడుకుందన్న విషయం చెప్పాడు. అది విని దివ్య మౌనంగా కూర్చుండిపోయింది. ఇక భరణిని తల్చుకుని దివ్య ఎమోషనలైంది. భరణి నా అన్నయ్య.. మళ్లీ హౌస్‌లోకి వచ్చారు. ఆయనతో ఉండాలి, ఆయన్ని బాగా చూసుకోవాలి అనే అనుకున్నాను. బయటకు వచ్చాక ఆయన నాతో ఎలా ఉంటారో నాకు తెలీదు కానీ నేను మాత్రం ఎప్పుడూ ఆయన మంచి కోరుకునే శ్రేయోభిలాషిగానే ఉంటానని ఏడ్చేసింది. చదవండి: దివ్యను నామినేట్ చేసి ఇప్పుడేమో ఏడ్చేసిన భరణి -
దివ్య ఎలిమినేట్.. చిన్నపిల్లాడిలా ఏడ్చిన భరణి
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్లో 12 వారం ఎలిమినేషన్ జరిగింది. దివ్య ఎలిమినేట్ అయింది. మరి వెళ్లేముందు హౌస్‌లో ఏం జరిగిందో ఆదివారం (నవంబర్ 30వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..అనర్హురాలిగా సంజనాబిగ్బాస్ హౌస్‌లో ఉండేందుకు ఎవరికి అర్హత లేదో.. వారి ఫోటోను చెట్టు నుంచి తీసేయాలన్నాడు నాగ్. మొదటగా భరణి మాట్లాడుతూ.. హౌస్ హార్మోని దెబ్బ తింటోందంటూ సంజనా ఫోటో తీసేశాడు. రీతూ మాట్లాడుతూ.. ఎదుటివాళ్లు చెప్పేది అర్థం చేసుకోదంటూ దివ్యను అనర్హురాలిగా అభిప్రాయపడింది. దివ్య.. రీతూ ఫోటో తీసేసింది. పవన్, సుమన్, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, తనూజ.. సంజనాకు అర్హత లేదన్నారు.దేశముదురుగా ఇమ్మూఎక్కువమంది సంజనాకే బిగ్‌బాస్ హౌస్‌లో ఉండే అర్హత లేదని అభిప్రాయపడ్డారు. తర్వాత ఇమ్మాన్యుయేల్.. ఆడ గొంతుతో అమ్మా అని పిలిచి పిలిచి.. పాట పాడి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ పాట విని నాగ్ సైతం చప్పట్లు కొట్టాడు. హౌస్మేట్స్ కోసం బిగ్‌బాస్ కొన్ని పోస్టర్స్ వదిలాడు. ఇమ్మూని దేశముదురుగా.. తనూజని జగదేక వీరుడు అతిలోక సుందరిగా, పవన్- రీతూ గీతాగోవిందం, కల్యాణ్ రేసుగుర్రం, భరణి.. హాయ్ నాన్న, సంజనా.. చంద్రముఖి, సుమన్.. బాబు బంగారం, దివ్య.. భాగమతిగా పోస్టర్లు వేశారు.దివ్య ఎలిమినేట్నాగ్ అందర్నీ సేవ్ చేసుకుంటూ రాగా.. చివరకు సుమన్, దివ్య మిగిలారు. వీరిలో దివ్య ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. ఆమె ఎలిమినేట్ అవగానే భరణి (Bharani Shankar) చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. పవన్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. స్టేజీపైకి వచ్చిన దివ్య.. నేనైతే 100% ఇచ్చాను. రిలేషన్స్ పెట్టుకోవడం వల్ల నా గేమ్ దెబ్బ తింది అని పేర్కొంది. తర్వాత హౌస్మేట్స్ గేమ్‌పై రివ్యూ ఇచ్చింది.తనూజతో గొడవే లేదుపవన్.. నీకోసం నువ్వు ఆడు, త్యాగం చేయకు అని సలహా ఇచ్చింది. ఇమ్మాన్యుయేల్.. ఆల్‌రౌండర్, ఆలోచనలు తగ్గించుకుంటే నిన్ను ఆపే వాళ్లే లేరంది. సంజనా.. మనిషి మంచావిడ, కానీ మాటతో అంతా పోగొట్టుకుంటుందని, స్ట్రాంగ్‌గా ఉండమంది, తనూజ.. మేమిద్దరం కొట్టుకుంటాం, జుట్టు పట్టుకుని లాక్కుంటాం అని అందరూ అనుకుంటారు. కానీ మా మధ్య అలాంటిదేం లేదు. నువ్వింకా ఆడి ముందుకెళ్లు.. ఇంకా చెప్పడానికి ఏం లేదని పేర్కొంది.గెలవాలని కోరుకుంటాకల్యాణ్కు ఇండస్ట్రీ అంటే పిచ్చి, కచ్చితంగా నువ్వు హీరో అయిపోవాలి అంది. రీతూ.. బబ్లీ గర్ల్, చాలా చిన్న పిల్ల, ఎక్కువ ఎమోషనల్ అవకని సూచించింది. భరణి మా అన్నయ్య, తను గెలవాలని కోరుకుంటా.. గేమ్ బాగా ఆడండి, బయటకు వచ్చాక కూడా నేను మీ చెల్లినే అంటూ భావోద్వేగానికి లోనైంది. సుమన్.. ఎమోషనల్ అవకండి, గేమ్ గట్టిగా ఆడండి అని చెప్పుకొచ్చింది. చివరగా భరణి.. దివ్యను ఉద్దేశిస్తూ బిగ్‌బాస్ హౌస్ ఒక యోధురాలిని మిస్ అవుతుందన్నాడు.చదవండి: బిగ్‌బాస్ 9: దివ్య ఎలిమినేట్, ఎంత సంపాదించిందంటే? -
బిగ్‌బాస్ నుంచి దివ్య ఎలిమినేట్.. భారీగానే రెమ్యునరేషన్
బిగ్ బాస్ సీజన్ 9 నుంచి 12వ వారంలో దివ్య నిఖిత ఎలిమినేట్ అయింది. సెప్టెంబర్ 25న నాల్గవ వారంలో వైల్డ్ కార్డ్‌గా హౌస్‌లోకి ఆమె ఎంట్రీ ఇచ్చింది. సుమారు 65రోజుల పాటు హౌస్‌లో దివ్య కొనసాగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వారిలో ఎక్కువరోజుల గేమ్‌లో కొనసాగిన కంటెస్టెంట్‌గా ఆమె రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, బిగ్‌బాస్ నుంచి దివ్య భారీగానే రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.సెప్టెంబర్ 12న వైల్డ్ కార్డ్‌గా దివ్య నిఖిత బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చింది. అయితే, ఆమెకు వారానికి రూ.1.7 లక్షల మేరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. ఈ లెక్కన 9వారాలకు గానూ రూ. 15 లక్షల మేరకు సంపాదించినట్లు తెలుస్తోంది. సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా తన ఇన్‌స్టా పేజీలో సినిమా రివ్యూలు కూడా చెబుతూ ఉంటుంది. అలా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఏదేమైనా చాలా స్ట్రాంగ్‌గానే బిగ్‌బాస్‌లో దివ్య తన మార్క్ చూపింది.ఈ వారం అన్అఫీషియల్ పోల్స్ ప్రకారం తనూజ, కల్యాణ్ ఎక్కువగా ఓట్లు తెచ్చుకున్నారు. వారిద్దరిలో ఒకరు టైటిల్ గెలవడం దాదాపు ఖాయం అయిపోయింది. అయితే, దివ్య, సుమన్ అతి తక్కువ ఓట్లతో లాస్ట్ వరకు ఎలిమినేషన్లో నిలిచారు. ఫైనల్‌గా దివ్యకు తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేషన్ కావడం జరిగింది. View this post on Instagram A post shared by Divya Velamuri (@vegfrieddmomo) -
వెళ్లిపోతానన్న సంజనా.. బలవంతంగా సారీ చెప్పించిన నాగ్
కాదేదీ గొడవకు అనర్హం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు హౌస్మేట్స్. ప్రమోషనల్ టాస్కులో కూడా తనూజ గొడవపడటం చూసేవాళ్లకు సైతం చిరాకు పుట్టించింది. ఇక రీతూ క్యారెక్టర్‌ను తప్పుపట్టిన సంజనాకు నాగ్ క్లాస్ పీకాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో శనివారం (నవంబర్ 29వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..సంజనాపై సీరియస్పవన్, రీతూ.. అంటుకుని కూర్చుంటారు, అది నచ్చలేదని నామినేట్ చేశాను అని సంజనా మళ్లీ అదే వాదించింది. మీరు చేసేపనులకు కళ్లు మూసుకోవాల్సి వస్తుందన్నావ్.. అంతలా ఏం చేశారు? ఎందుకు పర్సనల్ టార్గెట్ చేశావ్? ఎందుకంత నింద వేశావ్? అని నాగార్జున సీరియస్ అయ్యాడు. హౌస్‌లో ఎవరికీ అసౌకర్యంగా లేనిది నీకు మాత్రమే ఎందుకు అనిపించింది? అంత ఇబ్బందిగా ఉంటే వెళ్లిపో అని గేట్లు తెరిచాడు.కన్నీళ్లతో అభ్యర్థించిన సంజనాదీంతో సంజనా (Sanjana Galrani) నేను వెళ్లను, ఉంటాను సర్ అని కన్నీటితో అడిగింది. ఇంతలో నాగ్.. గతంలో సంజనా ఎలిమినేట్ అవకుండా కాపాడిన నలుగురు.. ఇమ్మాన్యుయేల్, భరణి, రీతూ, తనూజను లేచి నిల్చోమన్నాడు. సంజనా హౌస్‌లో ఉండాలా? వద్దా? అనేది నిర్ణయించాలన్నాడు. ఇప్పటికే వాళ్ల త్యాగం, దయాదాక్షిణ్యాలతో బతుకుతున్నానన్న పేరుంది.పంపించేయండిమరోసారి వీరి కనికరంతో హౌస్‌లో ఉండలేను అనుకున్న సంజనా నాగార్జుతో.. వెళ్లిపోతాను, పంపించేయండి అని కోరింది. కానీ అప్పటికే నిర్ణయం ఆ నలుగురి చేతిలోకి వెళ్లిపోయిందన్నాడు నాగ్. ఆ నలుగురు.. సంజనా క్షమాపణలు చెప్తే హౌస్‌లో ఉండొచ్చన్నారు. అయినా సారీ చెప్పేందుకు తను ముందుకు రాలేదు. వెళ్లిపోవడానికే సిద్ధపడింది. బలవంతంగా సారీ..దీంతో నాగార్జున ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. కచ్చితంగా సారీ చెప్పాల్సిందేనని పట్టుబట్టాడు. దీంతో ఆమెకు ఇష్టం లేకపోయినా రీతూకి, ప్రేక్షకులకు సారీ చెప్పింది. నామినేషన్స్‌లో డిమాన్ పవన్.. కల్యాణ్ పీక పట్టుకోలేదని, అతడిని ఆపేందుకు ప్రయత్నించాడని క్లారిటీ ఇచ్చాడు నాగ్. అలాగే బూతు పదాలు మాట్లాడొద్దని కల్యాణ్‌ను హెచ్చరించాడు.చదవండి: బిగ్‌బాస్ 9: దివ్య ఎలిమినేట్ -
బిగ్‌బాస్ 9.. ఈసారి ఆమెతో పాటు మరొకరు ఎలిమినేషన్!?
బిగ్‌బాస్ 9 సీజన్ తుది అంకాని వచ్చేసినట్లు కనిపిస్తుంది. ఈ ఆదివారంతో 12 వారాలు పూర్తయిపోతాయి. అంటే మరో మూడు వారాలు మాత్రమే మిగిలుంటాయి. ప్రస్తుతం హౌస్‌లో తొమ్మిది మంది ఉన్నారు. అయితే ఫినాలేలో టాప్-5 ఉంటారా? టాప్-6 ఉంచుతారా? అనేది కొన్నిరోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. ఇకపోతే గతవారం మిస్ అయిన లేడీ కంటెస్టెంట్ ఈసారి ఎలిమినేట్ అయిందని, మరొకరిని కూడా హౌస్ నుంచి పంపించబోతున్నారని తెలుస్తోంది. ఇంతకీ ఏంటి సంగతి?ఈ వారం కెప్టెన్ రీతూ తప్పితే మిగిలిన వాళ్లంతా నామినేషన్లో ఉన్నారు. లెక్క ప్రకారం గతవారం దివ్య ఎలిమినేట్ అయిందని న్యూస్ తొలుత వచ్చింది. చివరి ప్లేసులో ఉండటంతో అంతా పక్కా అనుకున్నారు. కానీ ఇమ్మాన్యుయేల్ తన దగ్గరున్న పవర్ ఉపయోగించి ఎలిమినేషన్ లేకుండా చేశాడు. దీంతో దివ్య బతికిపోయినట్లుంది. ఈసారి మాత్రమే ఆమె తప్పించుకోలేకపోయిందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఫేక్ ఫెమినిజం, పెళ్లి జీవితంపై తీసిన కామెడీ సినిమా.. ఓటీటీ రివ్యూ)ఈ వారం నామినేషన్లకు సంబంధించి శుక్రవారం వరకు ఓటింగ్ జరగ్గా.. కల్యాణ్ తొలి స్థానంలో నిలిచాడని, తర్వాత స్థానంలో తనూజ ఉండగా.. అనంతరం వరసగా ఇమ్మాన్యుయేల్, పవన్, భరణి, సుమన్ శెట్టి, సంజన, దివ్య ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దివ్య ఎలిమినేట్ అయినట్లు సమాచారం బయటకొచ్చింది. గత వారం మిస్ అయినప్పటికీ ఈసారి ఈమె బయటకొచ్చేయడం గ్యారంటీ అని టాక్.ఇంకా మూడు వారాలే మిగిలున్న దృష్ట్యా.. ఈసారి మరొకరిని కూడా ఎలిమినేట్ చేయొచ్చని అంటున్నారు. అలా చూసుకుంటే సంజనని బయటకు పంపే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి. అయితే సుమన్ శెట్టి కూడా ప్రస్తుతం డేంజర్ జోన్లోనే ఉన్నాడని, ఒకవేళ అతడు ఎలిమినేట్ అయినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. గత కొన్ని వారాల నుంచి చూసుకుంటే సుమన్ శెట్టి గ్రాఫ్ చాలావరకు తగ్గిపోయింది. గేమ్స్ పరంగా కావొచ్చు, మిగతా విషయాల్లో కావొచ్చు.. తొలివారాలతో పోలిస్తే సుమన్ బాగా వెనకబడిపోయినట్లు టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఈ వారం దివ్యతో పాటు ఎలిమినేట్ అయ్యే హౌస్‌మేట్ ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.(ఇదీ చదవండి: దీపికా పదుకొణె చెల్లి పెళ్లి.. ఈమె కూడా సినీ ఫ్యామిలీలోకే!) -
బిగ్‌బాస్‌కే ఆర్డరేసిన తనూజ.. భరణిఫైర్..
బిగ్‌బాస్ హౌస్‌లో కొన్ని సరదా టాస్కులు, ప్రమోషనల్ టాస్కులుంటాయి. అవి ఎవరు గెలిచినా పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు. ఏదో ఫ్లోలో సరదాగా ఆడుకుంటూ పోవాలి. కానీ ఇక్కడ కూడా గొడవపడొచ్చని తాజా ప్రోమోతో రుజువైంది. ప్రోమోలో చూపించినదాని ప్రకారం.. భరణి, ఇమ్మాన్యుయేల్, సుమన్ ఒక టీమ్ అయితే రీతూ, తనూజ, కల్యాణ్ మరో టీమ్‌గా విడిపోయారు. బిగ్‌బాస్‌కే ఆర్డర్భరణి టీమ్‌లో ఉన్న దివ్య ఈ గేమ్‌కు సంచాలకురాలిగా వ్యవహరించింది. ఈ ఆటలో భరణి టీమ్ గెలవగా తనూజ టీమ్ ఓడిపోయింది. అది తనూజ జీర్ణించుకోలేకపోయింది. ఈ సీజన్ మొత్తం దివ్యనే సంచాలకురాలిగా పెట్టండి అని బిగ్‌బాస్‌కే ఆర్డరేసింది. అది చూసి చిరాకుపడ్డ భరణి.. రూల్స్ నీకు ఒక్కదానికే తెలిసినట్లు మాట్లాడతావేంటి? అని అసహనం వ్యక్తం చేశాడు.తనూజపై భరణి ఫైర్అప్పటికీ తనూజ (Thanuja Puttaswamy) తగ్గకపోయేసరికి.. నేను ఊరికే లొడలొడా వాగను.. అవసరమైనప్పుడు కచ్చితంగా మాట్లాడతా అన్నాడు. వాగుడు, పిచ్చి మాటలు అని మీరనకండి.. అంటూ భరణితో అడ్డంగా వాదించింది తనూజ. ఇది చూసిన జనాలు.. ఇక్కడ కూడా గొడవేంట్రా బాబూ అని కామెంట్లు చేస్తున్నారు. -
నొప్పితో విలవిల్లాడిన పవన్.. రీతూ, కల్యాణ్ కన్నీళ్లు
చివరి కెప్టెన్సీని హౌస్మేట్స్ చేతిలోనే పెట్టాడు బిగ్‌బాస్. కెప్టెన్సీ కంటెండర్స్ కోసం ఇతర ఇంటిసభ్యులు గేమ్ ఆడాలన్నాడు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తీసుకుంటూ వెళ్లగా చివరికి పవన్, కల్యాణ్ మిగిలారు. ఈ ఇద్దరూ ఆడిన ఆటలో కల్యాణ్ గెలిచి కెప్టెన్ అయ్యాడు. ఆ ప్రక్రియ ఎలా జరిగిందో శుక్రవారం (నవంబర్ 28వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..హౌస్మేట్స్ చేతిలో పవర్తనూజ, సుమన్, భరణిలలో ముందుగా డాగర్ అందుకున్నవారు కంటెండర్స్‌లో ఒకరిని సపోర్ట్ చేయవచ్చు. వీళ్లు ఎవరికైతే డాగర్ ఇస్తారో... ఆ వ్యక్తి మరో కంటెండర్‌ను రేసు నుంచి తీసేస్తారు. అలా సంజనా, దివ్య, ఇమ్మాన్యుయేల్, రీతూ వరుసగా అవుట్ అయ్యారు. చివరకు పవన్, కల్యాణ్ మాత్రం మిగిలారు.పవన్ వర్సెస్ కల్యాణ్వీరికి కంకర ఇచ్చి రోడ్డు వేసే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ గేమ్‌లో పవన్, కల్యాణ్ ఇద్దరూ చాలా బాగా ఆడారు. కల్యాణ్‌కు అందరూ సపోర్ట్ చేస్తుంటే.. పవన్‌కు రీతూ ఒక్కతే సపోర్ట్ చేసింది. అయితే పవన్ వెన్ను నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఆ నొప్పికి ఏడుపొక్కటే తక్కువ అంటూనే కష్టపడ్డాడు. ఏడ్చేసిన పవన్అతడి నొప్పి చూసి రీతూ (Rithu Chowdary), కల్యాణ్ ఏడ్చేశారు. గేమ్ అయిపోగానే అతడు మెడికల్ రూమ్‌కు వెళ్లివచ్చాడు. నొప్పి వల్ల ఆడలేకపోయా.. మా మమ్మీడాడీ కూడా బాధపడి ఉంటారు అని పవన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ, అంతలోనే.. పోనీలే, మనోడు కెప్టెన్ అయ్యాడు అని సంతోషించాడు. బిగ్‌బాస్ 9లో చివరి కెప్టెన్‌గా కల్యాణ్ జెండా ఎగరేశాడు. -
కల్యాణ్ పీక పట్టుకున్న పవన్.. 'రీతూ' వల్ల సేఫ్
బిగ్‌బాస్ సీజన్-9లో ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో కల్యాణ్-పవన్ మధ్య పెద్ద గొడవే జరిగింది. అదే సమయంలో రీతూపై సంజన చేసిన వ్యాఖ్యలు కూడా హైలైట్ అయ్యాయి. ఈ వారం నామినేషన్లో కల్యాణ్ అయితే పూర్తిగా కంట్రోల్ తప్పి రీతూపై రెచ్చిపోయాడు. తను అమ్మాయి అనే సంగతి కూడా మర్చిపోయి మీదకి దూసుకెళ్లాడు. దీంతో కల్యాణ్‌ను ఆపేందుకు డీమాన్ పవన్ మధ్యలో రావడంతో పరిస్థితి మరింత పెద్దదైంది.కల్యాణ్, డీమాన్ పవన్‌ల మధ్య మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో కల్యాణ్ పీకని డీమాన్ పట్టుకున్నాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కల్యాణ్.. ఎవడి నామినేషన్ ఎవడు లెగుస్తున్నాడు అని పక్కనే ఉన్న కుర్చీని తన్నేశాడు. ఈ ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ మాత్రం వీకెండ్లో నాగార్జున ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ప్రేక్షకులు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కల్యాణ్ పీకని డీమాన్ పట్టుకున్న ఘటన గురించి సంజన పదేపదే హౌస్‌లో తీసుకొస్తుంది. దీంతో పవన్‌కు ఎక్కువ బ్యాడ్ నేమ్ రావచ్చని మరుసటిరోజు రీతూ జోక్యం చేసుకుంది.గొడవ కల్యాణ్‌తో జరిగింది కాబట్టి అతనితోనే రీతూ మాట్లాడింది. 'అసలు డీమాన్ ఏం చేశాడు నీ దగ్గరకు వచ్చి అంటూ కల్యాణ్‌ను రీతూ ప్రశ్నించింది. దీంతో కల్యాణ్ కూడా ఇలా సమాధానం చెప్పాడు. 'గొడవ జరిగిన సమయంలో వాడు నా పీక పట్టుకున్నాడని చెబుతున్నారు.' అని తెలిపాడు. దానికి రీతూ కూడా ఇలా చెప్పింది. వాడి ఎమోషన్ గురించి నీతో పాటు హౌస్‌లో ఉన్న వారందరికీ తెలుసు. జరిగిన గొడవలో నీ మీద వాడికి (డీమాన్) కోపం లేదు. నిన్ను ఆపేందుకే మాత్రమే వాడు వచ్చాడు. అనుకోకుండా జరిగిన విషయాన్ని సంజన చెడుగా చూపుతూ మాట్లాడుతుంది. ఆమె అలా ఎందుకు చేస్తుందో తెలియడం లేదు. వాడిని ఇలా ఎన్నిసార్లు తొక్కేస్తారు రా..' అంటూ రీతూ బాధపడుతుంది. అయితే, కల్యాణ్ కూడా డీమాన్‌కు అండగా మాట్లాడాడు. వీకెండ్లో నాగార్జున గారు ఏదైనా అడిగితే పెద్ద గొడవ ఏం జరగలేదని చెబుతానంటూ వెళ్లిపోయాడు. View this post on Instagram A post shared by Uppala Pavan Kumar (@demon_pavan) -
బిగ్‌బాస్9: ఈసారి లేడీ విన్నర్? లేదా కల్యాణ్ గెలుస్తాడా?
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్లో ఫస్ట్ నుంచి బోలెడంత పాపులారిటీ ఉన్న వ్యక్తి తనూజ. అందుకే అందరికంటే ముందుగా ఈమె విన్నింగ్ రేసులోకి వచ్చింది. మిగతా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా తనకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. మరి నిజంగా వార్ వన్‌సైడ్ అయిందా? తనూజయే గెలుస్తుందా స్పెషల్ స్టోరీలో చూసేద్దాం.తనూజ చుట్టూ బిగ్‌బాస్ 9ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కానెక్టయిన వ్యక్తి తనూజ (Thanuja Puttaswamy). గేమ్స్ తనవరకు వస్తే బాగానే ఆడుతుంది. తన తప్పు ఉందని ఎవరైనా అంటే గట్టిగా వాదిస్తుంది. షో మొదటి నుంచి ఇప్పటివరకు చూస్తే గేమ్ అంతా తనచుట్టూనే ఎక్కువగా తిరిగింది. కాకపోతే తనపై తనకు నమ్మకం తక్కువ. బలమైన ఓటింగ్అన్నింటికీ సపోర్టింగ్ గేమ్ కావాలనుకుంటుంది. అలాగైతే ఈజీగా గెలిచేస్తానని తన అభిప్రాయం. కానీ వీకెండ్లో మాత్రం తనకెవరూ సపోర్ట్ చేయడంలేదని అవలీలగా అబద్ధం చెప్తుంది. ఇలా రెండు నాలుకల మాటలు తనకు వ్యతిరేకత తీసుకొచ్చాయి. అయినప్పటికీ తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో (ఓటీటీ సీజన్ మినహా) తొలి లేడీ విన్నర్ అయ్యే అవకాశాలు ఆమెకు పుష్కలంగా ఉన్నాయి. తనకు అభిమానులతో పాటు సీరియల్ ప్రేక్షకుల ఓటింగ్ ఆ రేంజ్లో ఉంది.నెక్స్ట్ పవన్ కల్యాణ్ పడాలమొదట్లో కల్యాణ్ (Pawan Kalyan Padala) ఎందుకున్నాడు? అని జనాలే విమర్శించారు. అమ్మాయిలను అదోలా చూస్తూ ఛాన్స్ దొరికితే వారి చేయి పట్టుకుంటూ కాస్త తేడాగా ప్రవర్తించాడు. కానీ, నాగ్ ఎప్పుడైతే చేతులు పిసకడం ఆపేయ్ అని ముఖం పట్టుకుని అన్నాడో అప్పుడే తన పంథా మార్చుకున్నాడు. కల్యాణ్ అంటే ఏంటో చూపించాడు. గేమ్సై్ బాగా ఆడాడు. కాకపోతే నామినేషన్స్ తీసుకునేవాడు కాడు. ఇది టాప్ 5కి సరిపోతుంది. గెలుపుకు కాదు. ఇక్కడ అతడి ఫ్యాన్స్ జవాన్ అన్న కార్డు ఉపయోగించారు. మరో పల్లవి ప్రశాంత్జై జవాన్ అంటూ కల్యాణ్‌ను ఆకాశానికెత్తారు. ఏడో సీజన్లో రైతు బిడ్డ అనే ఏకైక సింపతీ కార్డుతో పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడు. ఇప్పుడదే విధంగా సైనికుడు అనే కార్డుతో కల్యాణ్ టైటిల్ ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే అతడి పీఆర్ స్ట్రాటజీలు ఆ రేంజ్లో ఉన్నాయి. జై జవాన్ జై కిసాన్ అంటూ సోషల్ మీడియాలో ఆల్రెడీ నినాదాలు మొదలుపెట్టారు.మంచోడే కానీ ఎక్కువ హైప్కల్యాణ్కు యాక్టింగ్ అంటే ఇష్టం.. ఇక్కడ అవకాశాలు వస్తే సైనిక వృత్తిని వదిలేస్తా అని అతడు ఓపెన్‌గా చెప్పినాస సరే ఓ సైనికా.. అంటూ పాటలు, మీమ్స్‌తో కావాల్సినదానికంటే ఎక్కువ హైప్ తీసుకొస్తున్నారు. దీంతో ఓటింగ్‌లోనూ తనూజతో పోటీపడే స్థాయికి చేరుకున్నాడు. పైగా బిగ్‌బాస్ టీమ్ కూడా ఈ మధ్య కల్యాణ్‌ను పొగిడే ప్రోగ్రామ్ పెట్టుకుంది. ఇదంతా చూస్తుంటే బిగ్‌బాస్ అతడిని గెలిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.మిగిలింది ఇమ్మాన్యుయేల్ఇమ్మాన్యుయేల్ (Emmanuel) ఆల్‌రౌండర్. గేమ్స్ వచ్చాయంటే ప్రాణం పెట్టి ఆడతాడు. మిగతా సమయాల్లో కడుపుబ్బా నవ్విస్తాడు. కానీ, గెలవాలంటే ఇది సరిపోదు. భయపడకుండా ఆడాలి. అది ఇమ్మూకి లేదు. నామినేషన్స్ అంటే భయం. ఎవరైనా నామినేట్ చేస్తే నిలువెల్లా వణికిపోతాడు. దాదాపు 10 వారాలపాటు నామినేషన్స్‌లోకి రాకపోవడం మైనస్ అయింది. కొన్నిసార్లు సేఫ్ గేమ్ ఆడటం కూడా జనాల్లో కాస్త నెగెటివిటీ తీసుకొచ్చింది. అయినప్పటికీ అతడికి కూడా మంచి ఓట్లే పడుతున్నాయి. సూట్‌కేస్ తీసుకోవడం మేలుకానీ, గెలవాలంటే ఇది సరిపోదు. ఓట్ల సంఖ్య మరింత పుంజుకోవాలి. ఒకవేళ ఫైనల్లో తన స్థానం టాప్ 3 అని తెలిస్తే మాత్రం అతడు లక్షలు ఉన్న సూట్‌కేస్ తీసుకోవడమే ఉత్తమం. తన కష్టానికి ప్రతిఫలంగా ఆ డబ్బయినా పనికొస్తుంది. మరో మూడు వారాల్లో బిగ్‌బాస్ 9కు శుభం కార్డు పడనుంది. మరి ఈ లోపు ఓటింగ్‌ను తారుమారు చేసేలా ఏమైనా అద్భుతాలు జరుగుతాయేమో చూడాలి!చదవండి: బిగ్‌బాస్9 : చివరి కెప్టెన్‌గా కల్యాణ్? పవన్ ఓడించి మరీ.. -
టాస్క్‌లో ట్విస్ట్.. కల్యాణ్ రెండోసారి కెప్టెన్!
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో చివరి కెప్టెన్సీ జరుగుతోంది. దీనికోసం రీతూ, సంజన, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, పవన్, దివ్య పోటీపడుతున్నారు. రేసులో లేని ముగ్గురు భరణి, సుమన్, రీతూ వీళ్ల కోసం ఆడాల్సి ఉంటుంది. బజర్ మోగినప్పుడు ఈ ముగ్గురిలో ఎవరు ముందుగా డాగర్ తీసుకుంటారో.. తాము కెప్టెన్‌గా చూడాలనుకునే వ్యక్తికి ఆ డాగర్ ఇవ్వాలి.సంజనను తప్పించిన రీతూఅలా ముందుగా సుమన్.. రీతూకి డాగర్ ఇచ్చాడు. గేమ్ గురించి కాకుండా పర్సనల్ టార్గెట్ చేస్తున్నావంటూ సంజనను రేసు నుంచి తీసేసింది రీతూ. నీ గేమ్ ఏముంది?పొద్దున్నే లేచి నువ్వా మూలను, అతడు ఇంకో మూలకు పోతాడు. కాసేపటికి ఇద్దరూ ప్యాచప్ అవుతారు అని చెప్పింది. అవును, నేను రియల్‌గా, జెన్యూన్‌గా ఉన్నాను అంది రీతూ. ఇక సంజనా కోసం జుట్టు త్యాగం చేసి తప్పు చేశానని బాధపడింది.మండిపడ్డ ఇమ్మూతర్వాత భరణి.. పవన్‌కు డాగర్ ఇచ్చాడు. అతడు ఇమ్మాన్యుయేల్‌ను రేసు నుంచి తీసేశాడు. అది ఇమ్మూ తీసుకోలేకపోయాడు. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపొస్తుంది.. నువ్వు నవ్వితే నాకు నవ్వొస్తుంది.. ఇలాంటివి వద్దు.. అంటూ వేలు చూపించి మాట్లాడాడు. ఇకపోతే ఈ గేమ్‌లో డిమాన్ పవన్ కెప్టెన్ అయినట్లు తొలుత లీక్స్ బయటకు వచ్చాయి. కానీ, అందులో నిజం లేదని తెలుస్తోంది.చివరి కెప్టెన్‌గా కల్యాణ్ఈ గేమ్‌లో చివరగా పవన్, కల్యాణ్ మిగిలారట. వీరిద్దరికీ పెట్టిన గేమ్‌లో కల్యాణ్ గెలిచి కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. ఫైర్ స్ట్రామ్ వచ్చినప్పుడు కల్యాణ్ ఫస్ట్ టైమ్ కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు సీజన్లో చివరగా మరోసారి కెప్టెన్ అయ్యాడు. ఇది ఫ్యాన్స్ మంచి కిక్కిచ్చే వార్తే అవుతుంది! చదవండి: ఓవర్ చేసిన యావర్.. కెప్టెన్సీ కంటెండర్స్ వీళ్లే -
ఓవర్ చేసిన యావర్.. అతడే చిట్టచివరి కెప్టెన్!
యోధులొస్తున్నారు.. రణరంగంలోకి దిగండి, గెలిచి చూపించండి అని వీర లెవల్లో బిల్డప్ ఇచ్చాడు బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9). మొదటిరోజు నిజంగానే గట్టి పోటీనిస్తూ ఆడారు. కానీ తర్వాత వచ్చినవాళ్లంతా హౌస్‌మేట్స్‌ను గెలిపించడానికే ఓడిపోయినట్లుగా కనిపించింది. మరికొందరేమో ఈ ఆటలన్నీ మా వాళ్ల కాదు, చిల్ అవడానికే వచ్చామన్నట్లుగా ఉన్నారు. ఇంతకీ హౌస్‌లో ఏం జరిగిందో గురువారం (నవంబర్ 27వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..అతి చేసిన యావర్బిగ్బాస్ 7 నుంచి ప్రిన్స్ యావర్ వచ్చాడు. వచ్చీరావడంతోనే తనూజ నీకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా? అని సూటిగా అడిగాడు. ఆమె లేదని చెప్పగానే తనతో కలిసి రొమాంటిక్ పాటకు స్టెప్పులేశాడు. కాకపోతే సాల్సా డ్యాన్స్ చేసి తనను ఇబ్బందిపెట్టినట్లుగానే కనిపించింది. ఆ తర్వాత ఆమె కోసం ప్రేమ పాట పాడాడు. అనంతరం ఇమ్మాన్యుయేల్‌తో కలిసి గేమ్ ఆడాడు. ఈ ఆటలో ఇమ్మూ గెలిచాడు.భరణి వర్సెస్ దివ్యకొన్నివారాలుగా తన ఆట కనిపించడం లేదని నామినేట్ చేసేసరికి బాగా హర్టయింది సంజన (Sanjana Galrani). అందరికీ కనిపించాలి, అంతేగా.. అని భరణి ట్యాబ్లెట్లు దొంగిలించేసింది. దొంగతనాలు సంజనాకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి.. తీస్తే ఇచ్చేయండి అని వెళ్లి ఆమెనే అడిగాడు భరణి. ఇమ్మాన్యుయేల్ కూడా ఇది సరదా విషయం కాదని చెప్తే ఆమె మాత్రం ఏం పర్లేదంది. మధ్యలో దివ్య కలగజేసుకుని సంజనా ఎలాగో వినది.. ఇమ్మాన్యుయేల్ పడుకో, లైట్ తీసుకో అంది.శోభాపై గెలిచిన దివ్యదీంతో భరణి.. దివ్యపై అరిచాడు. మధ్యలో ఎందుకు మాట్లాడతావ్? ఆరిందలా దిగుతావ్.. అన్నాడు. అలా ఇద్దరూ గొడవపడ్డారు. అప్పటికీ అదంతా సైలెంట్‌గా చూస్తూ ఉండిపోయిన సంజనా.. ఉదయానికి టాబ్లెట్స్ ఇచ్చేసింది. అనంతరం బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ శోభా శెట్టి హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. శోభాతో పోటీపడి దివ్య గెలిచి కంటెండరయింది. తర్వాత బిగ్‌బాస్ 4 ఫైనలిస్ట్ సోహైల్ అడుగుపెట్టాడు. అతడి ఎంట్రీతో హౌస్‌లో కొత్త ఎనర్జీ వచ్చింది.అతడే చివరి కెప్టెన్కిలో చికెన్, రెండు పాల ప్యాకెట్స్, కాఫీ పౌడర్ పంపించమని బిగ్‌బాస్‌కే ఆర్డరేశాడు సోహైల్. కాసేపు అతడిని ఆటాడుకున్నప్పటికీ చివరకు సోహైల్ అడిగినవన్నీ పంపించాడు. తర్వాత రీతూ, సంజనాతో కలిసి సోహైల్ గేమ్ ఆడాడు. ఈ ఆటలో సంజన, రీతూ గెలిచారు. అలా చివరి కెప్టెన్సీ కోసం కల్యాణ్, పవన్, దివ్య, ఇమ్మాన్యుయేల్, సంజన, రీతూ పోటీపడనున్నారు. సోషల్ మీడియా లీక్స్ ప్రకారం కెప్టెన్సీ గేమ్‌లో పవన్ గెలిచాడని ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమో చూడాలి! -
కొడుకు సమక్షంలో బిగ్‌బాస్ బ్యూటీ మరో పెళ్లి
ప్రముఖ నటి, తమిళ బిగ్‌బాస్ ఫేమ్ సంయుక్త షణ్ముగనాథన్ మరో పెళ్లి చేసుకుంది. దిగ్గజ క్రికెటర్ క్రిష్ణమాచారి కొడుకు అనిరుధ్ శ్రీకాంత్‌తో ఏడడుగులు వేసింది. చెన్నైలో గురువారం ఉదయం చాలా సింపుల్‌గా ఈ శుభకార్యం జరిగింది. తన కొడుకు సమక్షంలోనే సంయుక్త ఈ వివాహం చేసుకోవడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.సంయుక్త విషయానికొస్తే.. తమిళంలో నటి-మోడల్‌గా కెరీర్ ఆరంభించింది. వరిసు, మై డియర్ భూతం, కారీ, తుగ్లక్ దర్బార్ తదితర సినిమాలు చేసింది. చంద్రముఖి సీరియల్లోనూ చేసింది. తమిళ బిగ్‌బాస్ 4వ సీజన్లో పాల్గొని మంచి ఫేమ్ తెచ్చుకుంది. గతంలో కార్తీక్ శంకర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ కొడుకు కూడా పుట్టాడు. తన భర్తతో మరో మహిళతో సంబంధం ఉందని తెలిసి సంయుక్త విడాకులు తీసుకుంది.(ఇదీ చదవండి: ప్రియురాలిని పెళ్లాడిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్)అనిరుధ్ శ్రీకాంత్ విషయానికొస్తే.. తండ్రి క్రిష్ణమాచారి శ్రీకాంత్లానే క్రికెట్‌ని కెరీర్‌లా ఎంచుకున్నాడు. తమిళనాడు తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. ఐపీఎల్లో 2008-13 వరకు సీఎస్కే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడాడు. 2019 తర్వాత నుంచి పెద్దగా క్రికెట్ ఆడట్లేదు. ఇతడు 2012లో మోడల్ ఆర్తి వెంకటేశ్‌ని పెళ్లి చేసుకున్నాడు. కానీ మనస్పర్థల కారణంగా రెండేళ్లకే విడిపోయారు.ఈ ఏడాది దీపావళి సందర్భంగా సంయుక్త-అనిరుధ్ కలిసి ఫొటోలు పోస్ట్ చేశాడు. దీంతో ఏమై ఉంటుందా అని నెటిజన్లు మాట్లాడుకున్నారు. ఇప్పుడు అందుకు తగ్గట్లే పెళ్లి చేసుకుని సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ జంటకు పలువురు నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. పెళ్లి ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by Samyuktha Shanmughanathan (@samyuktha_shan) -
నీకో దండం దివ్య.. చేతులెత్తి మొక్కిన భరణి
బిగ్‌బాస్ హౌస్‌లోకి యోధులు అంటూ మాజీ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇస్తున్నారు. వీరితో ఆడి గెలిచినవారు కెప్టెన్సీ కంటెండర్ అవుతున్నారు. ఓడినవారు చివరి కెప్టెన్సీ కోసం పోటీపడే అదృష్టాన్ని కోల్పోతున్నారు. మరి తాజాగా హౌస్‌లోకి ఎవరు వచ్చారు? ఎవరు కంటెండర్ అయ్యారనే విషయాలు బుధవారం (నవంబర్ 26వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..ఓడిన తనూజబిగ్బాస్ హౌస్‌లోకి గత సీజన్ టాప్ 4 కంటెస్టెంట్ ప్రేరణ (Prerana Kambam) అడుగుపెట్టింది. ఆమెను చూడగానే తనూజ.. నువ్వే స్ట్రాంగ్.. నీతో ఆడాలనుందని చెప్పింది. వీళ్లిద్దరూ గేమ్ బాగా ఆడారు. కానీ, తనూజపై సెకన్ వ్యవధిలో ప్రేరణ గెలిచేసింది. ఇక దివ్య, భరణి గొడవలు ఏరోజుకారోజు ఫ్రెష్‌గా జరుగుతూనే ఉన్నాయి. ఈ ఎపిసోడ్లో కూడా ఇద్దరూ తగవు పడ్డారు. నా ఏజ్ టాపిక్ తీయకు.. పదిసార్లు ఏజ్ గురించి మాట్లాడితే చిరాకుగా ఉంటుంది. దివ్యకు క్షమాపణలుమధ్యలో దూరి మరీ అది చెప్పాల్సిన పని లేదు. దేనికైనా లిమిట్ ఉంటుంది అని అసహనం వ్యక్తం చేశాడు. దానికి దివ్య.. నాకు నొప్పిగా ఉంటే నన్ను చూసి మీరు కుంటినప్పుడు లేదా? నాపై మీరు జోకులేయొచ్చు.. నేను జోకులేస్తే మాత్రం సీరియస్‌గా తీసుకుంటారని దివ్య మండిపడింది. దీంతో భరణి.. నీకో దండం దివ్య అని చెప్పి కాసేపటికి ఆమెకు చేతులు జోడించి మరీ సారీ చెప్పాడు.మానస్‌పై గెలిచిన పవన్తర్వాత దేత్తడి హారిక ఇంట్లోకి వచ్చింది. సుమన్‌తో ఆడి గెలిచింది. దీంతో అతడి కెప్టెన్సీ కంటెండర్ చేజారింది. అనంతరం మానస్ రాగా.. అతడు డిమాన్ పవన్‌ను ఎంచుకున్నాడు. వీరిద్దరూ ఆడిన ఆటలో పవన్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. ఈరోజు శోభాశెట్టి, ప్రిన్స్ యావర్ వంటివారు హౌస్‌లోకి రానున్నారట! ఇకపోతే సుమన్, తనూజ, భరణి తప్ప మిగతా అందరూ కంటెండర్లయినట్లు తెలుస్తోంది. -
టాప్ 5లో ఉండేది వీళ్లే.. ఆ కంటెస్టెంట్స్‌కు ఛాన్సే లేదు!
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ పెద్దగా అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏ యేటికాయేడు షోకి వచ్చే సెలబ్రిటీలు తగ్గిపోతున్నారు. ఈసారి కూడా అదే జరగబోతుందని ఊహించిన బిగ్‌బాస్ టీమ్ కామనర్స్‌కు వెల్కమ్ చెప్తూ అగ్నిపరీక్ష షో పెట్టింది. తద్వారా ఆణిముత్యాలను వెలికి తీసి బిగ్‌బాస్ 9కి పంపింది. ఒకరిద్దరు కాదు, ఏకంగా ఆరుగుర్ని హౌస్‌లోకి పంపింది. (Bigg Boss 9 Telugu Top 5 Contestants Prediction)కామనర్స్వాళ్లే కల్యాణ్, హరిత హరీశ్, డిమాన్ పవన్, శ్రీజ దమ్ము, ప్రియా శెట్టి, మర్యాద మనీష్. లెక్క సరిపోలేదనుకున్నాడో ఏమోకానీ బిగ్‌బాస్.. అగ్నిపరీక్ష నుంచి దివ్యను సైతం హౌస్‌లోకి వైల్డ్‌కార్డ్‌గా పంపించాడు. అయితే షో ప్రారంభంలో కామనర్లు మూటగట్టుకున్న నెగెటివిటీ అంతా ఇంతా కాదు. తామేదో తోపులం, బిగ్‌బాస్ ఇంటికి మహారాజులం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చేసరికి మనీశ్, ప్రియ, హరీశ్, శ్రీజను బయటకు పంపించేశారు. హౌస్‌లో 9 మందిదివ్య కూడా వెళ్లిపోయేదే కానీ గొడవలకోసం తనను ఆపేశాడు బిగ్‌బాస్. ఫైర్స్ట్రామ్స్ అయితే ఒక్కరూ మిగల్లేదు. ఇప్పుడు బిగ్‌బాస్ 12వ వారం నడుస్తోంది. ప్రస్తుతం హౌస్‌లో తొమ్మిది మంది మిగిలారు. వారే భరణి, కల్యాణ్, పవన్, తనూజ, సుమన్, ఇమ్మాన్యుయేల్, సంజన, రీతూ, దివ్య. వీరిలో తనూజ మొదటినుంచి విన్నింగ్ రేస్‌లో ఉంది. ఏడుపు గోల ఉన్నప్పటికీ సహనం కోల్పోకుండా అన్నింట్లోనూ ది బెస్ట్ ఇస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. నెగెటివిటీ నుంచి టాప్ 2కి..కల్యాణ్ (Pawan Kalyan Padala).. మొదటి మూడు వారాలు ఆడిందే లేదు. పైగా అమ్మాయిలను అదోలా చూస్తూ నెగెటివిటీ సంపాదించుకున్నాడు. ఎప్పుడైతే నాగార్జున హింట్స్ ఇచ్చాడో వెంటనే తీరు మార్చుకుని గేమ్‌పై ఫోకస్ పెట్టాడు. అలా ఇప్పుడేకంగా కప్పు కోసం పోటీపడుతున్నాడు. ఇమ్మాన్యుయేల్ విషయానికి వస్తే.. ఇతడు ఆల్‌రౌండర్. గేమ్స్ బాగా ఆడతాడు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. కానీ సేఫ్ గేమ్ ఒక్కటే అతడికి పెద్ద మైనస్. దానివల్లే కాస్త వెనకబడ్డాడు. 11వ వారాలు నామినేషన్స్‌లోకి రాకపోవడం కూడా అతడికి దెబ్బేసింది.(Bigg Boss Telugu 9 Top 5 Contestants Analysis) టాప్ 5లో ఎవరు?తనూజ, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్.. ఈ ముగ్గురు టాప్ 3లో ఉండటం ఖాయం. మరి తర్వాతి రెండు స్థానాల్లో ఎవరన్నది అసలైన ప్రశ్న. గుడ్డు దొంగతనంతో ఈ సీజన్‌పై బజ్ క్రియేట్ అయ్యేలా చేసిన సంజనా తర్వాత మాత్రం దారి తప్పింది. ఇటీవల జరిగిన నామినేషన్స్‌లో అయితే రీతూ క్యారెక్టర్‌ను తప్పు పడుతూ మాట్లాడింది. అసలే పెద్దగా ఫ్యాన్ బేస్ లేని తనకు ఇది కచ్చితంగా నెగెటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో ఆమె టాప్ 5 బెర్త్ గల్లంతయినట్లే!ఈ ముగ్గురు కష్టమే!దివ్య ఆల్రెడీ గతవారమే ఎలిమినేట్ అవాల్సిన క్యాండిడేట్.. పైగా తనూజను టార్గెట్ చేయడం సీరియల్ ఆడియన్స్‌కు అస్సలు నచ్చలేదు. పైగా భరణికి కనీస గౌరవం ఇవ్వకుండా నోరు పారేసుకోవడం చూసేవారికి కూడా కోపం తెప్పిస్తోంది. ఇవన్నీ దివ్యను టాప్ 5కి వెళ్లకుండా ఆపుతున్నాయి. సుమన్ కూడా టాప్ 5కి వెళ్లే అవకాశాలు చాలా తక్కువ. మిగతావారందరితో పోలిస్తే గేమ్‌లో సుమన్ చాలా వెనకబడి ఉన్నాడు. పైగా హౌస్‌లో మెరుపుతీగలా ఎప్పుడో ఒకసారి మాత్రమే కనిపిస్తూ ఉంటాడు. కేవలం ఫ్యాన్ ఫాలోయింగ్‌తో ఫైనల్స్‌కు వెళ్లడం కష్టమే!భరణికి ఛాన్స్తనూజ, దివ్య మధ్య నలిగియిన భరణి (Bharani Shankar)ని జనాలు పట్టించుకోవడం మానేశారు. అందుకే ఎలిమినేట్ అయ్యాడు. కానీ, రీఎంట్రీ తర్వాత తనలో కామెడీ యాంగిల్ చూపించాడు. తనూజ, దివ్యను నామినేట్ చేశి వారికే ఎదురెళ్లాడు. ఇది జనాలకు నచ్చింది. అతడిపై పాజిటివిటీ పెరుగుతోంది. కాబట్టి టాప్ 5లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. పవన్ - రీతూ.. ఏ సీజన్లో అయినా లవ్‌ట్రాక్ వల్ల పేరొస్తుంది. కానీ ఈ సీజన్లో మాత్రం బోలెడంత నెగెటివిటీ వచ్చింది. కొన్నివారాలపాటు వీళ్లిద్దరినీ విమర్శించనివాళ్లే లేరు. కానీ, రానురానూ ఆ నెగెటివిటీ పాజిటివిటీగా మారింది. ఎవరెన్ని మాటలన్నా కలిసే ఉండటంతో వీళ్ల బంధం నిజమైనదే అని జనాలు అభిప్రాయపడ్డారు. ఒకరి కోసం ఒకరు నిలబడటాన్ని మెచ్చుకున్నారు. దీంతో వీళ్లిద్దరు లేదా ఎవరో ఒకరు టాప్ 5కి వెళ్లే ఛాన్స్ ఉంది.అదే పవన్‌కు మైనస్నిజం చెప్పాలంటే పవన్ ఆటకు, మాటతీరుకు అతడు టాప్ 3లో ఉండాల్సినవాడు. కానీ, అతడికి రావాల్సినంత హైప్ రాలేదు. పైగా అతడేం చేసినా నెగెటివే అవుతోంది. పెద్దగా ఫ్యాన్ బేస్ లేకపోవడం కూడా అతడికి మైనస్‌గా మారింది. మరి అతడు ఈ అడ్డంకులను దాటుకుని ఫినాలేకు వెళ్తాడేమో చూడాలి! రానున్న రోజుల్లో కంటెస్టెంట్ల ఆటతీరు, మాట తీరును బట్టి టాప్ 5 స్థానాలు మారే ఛాన్స్ ఉంది!చదవండి: బిగ్‌బాస్: ప్రేరణతో తలపడి ఓడిపోయిన తనూజ -
ప్రేరణ ఎంట్రీ.. ధైర్యంగా ముందుకొచ్చి బొక్కబోర్లా పడ్డ తనూజ
Bigg Boss Telugu 9: ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వెళ్లాక హౌస్మేట్స్ ముఖాలు వెయ్యివాట్ల బల్బులా వెలిగిపోతున్నాయి. ఈవారం చివరి కెప్టెన్సీని చేజిక్కించుకునేందుకు అందరూ తమ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ముందుగా కెప్టెన్సీ కంటెండర్ అవడానికి మాజీ కంటెస్టెంట్లతో గేమ్ ఆడి గెలవాలి. అలా ప్రియాంకతో కలిసి గేమ్ ఆడి కల్యాణ్ గెలిచి కంటెండర్ అయ్యాడు. గౌతమ్‌తో ఆడి భరణి ఓడిపోయాడు.తనూజ అవుట్తాజాగా ప్రేరణ.. తనూజతో గేమ్ ఆడింది. ఈమేరకు ఓప్రోమో వదిలారు. మీరు టఫ్ ప్లేయర్.. మీతో ఆడాలని ఉంది అని చెప్పింది తనూజ. ఇద్దరూ గేమ్‌లో బాగా కష్టపడ్డారు. కానీ చివరకు ప్రేరణ తనూజను ఓడించినట్లు తెలుస్తోంది. దీంతో తనూజ కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం కోల్పోయింది. హౌస్‌లోకి మానస్, యావర్, శోభాశెట్టి వంటి సెలబ్రిటీలు కూడా రానున్నారు. వీరితో కంటెస్టెంట్లు గేమ్ ఆడి గెలిచిన డిమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్ కెప్టెన్సీ కంటెండర్లు అయినట్లు తెలస్తోంది. వీరి వీరిలో ఎవరు కెప్టెన్ అన్నది చూడాలి! చదవండి: గంటకు ఎంత? అని చీప్ కామెంట్స్: నటి -
కూతురికిచ్చిన మాట నిలబెట్టుకోపోయా.. భరణి భావోద్వేగం
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదవ సీజన్ (Bigg Boss Telugu 9) ముగింపుకు దగ్గరపడేకొద్దీ మరింత రంజుగా మారుతోంది. నామినేషన్స్ ఈసారి అగ్గిరాజుకున్నాయి. ముఖ్యంగా సంజన.. ప్లాన్ చేసి మరీ గొడవ పడింది. రీతూ క్యారెక్టర్‌ను తప్పు పట్టిన తను ఆమెకు సారీ చెప్పేందుకు కూడా ఇష్టపడలేదు. మరోవైపు మాజీ కంటెస్టెంట్లు బిగ్‌బాస్ హౌస్‌లో సందడి చేశారు. ఆ విశేషాలు మంగళవారం (నవంబర్ 25వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం...చూసిందే చెప్పా!రీతూ (Rithu Chowdary)- పవన్ ఫ్రెండ్స్‌కు ఎక్కువ, ప్రేమికుల కన్నా తక్కువ అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఈ విషయం అందరికీ తెలుసు. రాత్రిపూట ఒకే బెడ్‌పై కూర్చుని ముచ్చట్లు కూడా పెడుతుంటారు. కానీ, జరగరానిదేదో జరిగినట్లు దాన్ని చాలా చెండాలంగా చిత్రీకరించింది సంజన. తొమ్మిదివారాలుగా నేను కనబడలేనంటుందా? సంజనా ఉందని తనకివాళ తెలిసుంటుంది అని శాడిజం చూపించింది. సారీ చెప్పనుసారీ చెప్పమని ఎవరు అడిగినా కుదరదని కరాఖండిగా చెప్పింది. నేను చూసిందే చెప్పా.. అందులో తప్పేం లేదని అడ్డంగా వాదించింది. అంతగా కావాల్సి వస్తే ఆమె సారీ చెప్తేనే నేను చెప్తా అని మొండిగా వాదించింది. ఇదంతా చూస్తుంటే రీతూపై పగ తీర్చుకున్నట్లే కనిపిస్తోంది. ఇక హౌస్‌లో ఈసారి కెప్టెన్సీ టాస్క్ వెరైటీగా సాగింది. పాత సీజన్ల నుంచి కంటెస్టెంట్లు వస్తుండగా.. వారితో తలపడి ఆడి గెలిచి కెప్టెన్సీ కంటెండర్ అవాలి.బిగ్‌బాస్ హౌస్‌లో మాజీ కంటెస్టెంట్లుమొదటగా బిగ్‌బాస్ 7 ఫైనలిస్ట్ ప్రియాంక జైన్ (Priyanka Jain) హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. తను కల్యాణ్‌తో పోటీపడతానంది. వీరిద్దరికిచ్చిన చేప గేమ్‌లో కల్యాణ్ ప్రియాంకను ఓడించి ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. తర్వాత బిగ్‌బాస్ 8 రన్నరప్ గౌతమ్ కృష్ణ (Gautham Krishna) పంచెకట్టుతో హౌస్‌లో ప్రవేశించాడు. ఇప్పటివరకు కెప్టెన్ అవని భరణికి తనతో తలపడే ఛాన్స్ ఇచ్చాడు.భరణి ఎమోషనల్అసలే టాస్కుల్లో దిట్ట అయిన గౌతమ్.. భరణి (Bharani Shankar)ని ఇట్టే ఓడించేశాడు. కెప్టెన్ అయ్యే ఛాన్స్ పోయిందంటూ భరణి ఎమోషనలయ్యాడు. కెప్టెన్ అవాలి నాన్న అని కూతురు ప్రేమగా కోరిన ఒక్క కోరికను నెరవేర్చలేకపోయానని బాధపడ్డాడు. నాకు కెప్టెన్సీ రాసి లేదు. సారీ హనీ పాప, సారీ ఫ్రెండ్స్, సారీ అమ్మా.. అని బాధపడుతుంటే తనూజ అతడిని ఓదార్చింది. రేపు మరికొందరు మాజీ కంటెస్టెంట్లు హౌస్‌లోకి రానున్నారు. -
బిగ్‌బాస్ 9.. మళ్లీ ఈ ట్విస్టులేంటి?
ఈసారి బిగ్‌బాస్ ఎప్పుడేం చేస్తున్నాడో అస్సలు అర్థం కావట్లేదు. ఈ సీజన్లో ఆల్రెడీ ఎలిమినేట్ అయినోళ్లని ఓసారి తిరిగి తీసుకొచ్చి కొన్ని గేమ్స్ ఆడించాడు. వాళ్లలో గెలిచిన ఒక్కరిని రీఎంట్రీ చేయించాడు. అతడే భరణి. ఇదే కాదు రకరకాల ప్రయోగాలన్నీ ఈ సీజన్లోనే జరుగుతున్నట్లు అనిపిస్తున్నాయి. ప్రస్తుతం 12వ వారంలో కెప్టెన్ అయ్యేందుకు మరో కొత్త ప్రయోగం చేశాడు.(ఇదీ చదవండి: అఫీషియల్.. ఆస్కార్ బరిలో 'మహావతార్ నరసింహ')సోమవారం నామినేషన్ ప్రక్రియ మంచి రంజుగా సాగింది. కల్యాణ్-పవన్ ఒకరిపై ఒకరు రెచ్చిపోవడం, ఈ క్రమంలోనే కల్యాణ్ పీక పవన్ పట్టుకోవడం.. పవన్-రీతూ బంధం గురించి సంజన నోరు పారేసుకోవడం ఇలా మంచి మసాలా కనిపించింది. అలా కెప్టెన్ రీతూ తప్పితే మిగిలినోళ్లందరూ ఈసారి లిస్టులోకి వచ్చారు. మంగళవారం నుంచి చివరి కెప్టెన్సీ కోసం పోటీ మొదలైపోయింది. ఈసారి హౌస్మేట్స్ మధ్య కాకుండా ఓ హౌస్‌మేట్.. గత సీజన్లకు చెందిన ఓ కంటెస్టెంట్ వచ్చి పోటీ పడతాడు.ఈసారి భరణితో బయట నుంచి వచ్చిన గౌతమ్ కృష్ణ పోటీపడ్డాడు. బిగ్‌బాస్‌లో అశ్వద్ధామ అంటూ హడావుడి చేసి గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్.. ఏడో సీజన్లో ఓ మాదిరి ప్రదర్శన చేయగా, గత సీజన్లో రన్నరప్‌గా నిలిచాడు. ఇప్పుడు మళ్లీ కెప్టెన్సీ టాస్క్‌లో పోటీ పడేందుకు వచ్చాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో.. భరణి-గౌతమ్ పోటీ పడ్డారు. చివరగా భరణినే విజేతగా నిలిచాడు అన్నట్లు చూపించేశారు. మొత్తం ప్రోమోలోనే చూపించేస్తే ఇక ఎపిసోడ్లో ఏం చూపిస్తారా అనేది అర్థం కాలేదు. అయినా హౌస్‌లో ఉన్నవాళ్ల మధ్య పోటీపెడితే మజా ఉంటుంది గానీ బయటనుంచి తీసుకొచ్చి గేమ్స్ పెట్టడం ఎందుకో సరిగా అనిపించట్లేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మాస్ జాతర'.. అధికారిక ప్రకటన) -
కల్యాణ్ పీక పట్టుకున్న పవన్.. నోరు జారిన సంజన
గతవారం ఫ్యామిలీ వీక్ కావడంతో బిగ్‌బాస్ హౌస్ అంతా ప్రశాంతంగా కనిపించింది. హౌస్మేట్స్ కుటుంబ సభ్యులు, కన్నీళ్లు, భావోద్వేగాలు ఇలా చూడముచ్చటగా అనిపించింది. ఆదివారం దివ్య బయటకు వెళ్తుందని చాలామంది అనుకున్నారు. కానీ ఇమ్ము పవర్ వల్ల ఆమె సేవ్ అయిపోయింది. దీంతో ఎవరూ ఔట్ కాలేదు. సోమవారం వచ్చేసరికి ఎప్పటిలానే నామినేషన్స్ హడావుడి మొదలైంది. కాకపోతే ఈసారి అటు పవన్, ఇటు సంజన.. బిగ్‌బాస్ గీత దాటి ప్రవర్తించారు. ఒకరు నోరు జారితే మరొకరు ఫిజికల్ హ్యాండ్లింగ్ చేశారు. ఇంతకీ 78వ రోజు ఏం జరిగింది? నామినేషన్స్‌లో ఎవరెవరున్నారు?ఈసారి నామినేషన్స్ ప్రక్రియని కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. మొదటి సీక్రెట్‌గా ఒకరి పేరు రాసి, ఆ కార్డ్‌ని బాక్స్‌లో వేయాల్సి ఉంటుందని చెప్పగా అందరూ దీన్ని ముగించారు. ఇక సాధారణ నామినేషన్ ప్రక్రియ మాత్రం ఈసారి రచ్చ రచ్చ అనేలా సాగింది. కొట్టుకోవడం, నోరు జారడం లాంటివి చాలా జరిగాయి. మొత్తం ఎపిసోడ్లో కల్యాణ్-పవన్ వివాదం, సంజన-రీతూది మాత్రం హైలైట్ అయింది.(ఇదీ చదవండి: కాబోయే భార్యకు మర్చిపోలేని సర్ప్రైజ్ ఇచ్చిన రాహుల్)ఇమ్ముని పవన్ నామినేట్ చేశాడు. గతవారం కెప్టెన్సీ టాస్క్‌లో మనం మాట్లాడుకున్నాం, నేను నీకు సపోర్ట్ చేస్తాను.. నువ్వు నాకు సపోర్ట్ చేస్తానని అనుకున్నాం. కానీ నువ్వు అలా చేయలేదు అని డీమాన్ పవన్ తన పాయింట్ చెప్పాడు. వీళ్లిద్దరూ ఎవరికి వాళ్లు తమని డిఫెండ్ చేసుకుంటుండగా.. మధ్యలో కల్యాణ్ ఎంటరయ్యాడు. వేర్వేరు టీమ్స్‌లో ఉండగా.. పవన్ ఇలాంటి డీల్ చేసుకోవడం ఏంటని అడిగాడు. డీమన్-కల్యాణ్ మధ్య డిస్కషన్ జరుగుతుండగా.. రీతూ కూడా దీనిలోకి ఎంటరైంది. నువ్వు అరిచినంత మాత్రాన ఏం కాదు, ఆరోజు ఇమ్మూ అన్నతో డీల్ మాట్లాడుకున్నానని నా మీద నింద వేశావ్. మరి ఇప్పుడు డీమన్ చేసింది ఏంటి అని కల్యాణ్ రీతూపై రెచ్చిపోయాడు.కల్యాణ్ మాటలకు రెచ్చిపోయిన రీతూ.. గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. దీంతో కల్యాణ్ కూడా ఎక్కడా తగ్గలేదు. నువ్వు నీకు నచ్చినట్లు మాట్లాడకు.. ఏది పడితే అది వాగకు అంటూ రీతూ అనేసరికి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు శనివారం వచ్చినప్పుడు వీడియో ప్లే చేయించు.. నేను టీమ్ కోసం ఆడదామని చెప్పిన దానికి డీమన్ ఓకే చెప్పలేదని చూపించు. నేను షో నుంచి వెళ్లిపోతాను అని కల్యాణ్, రీతూకి సవాల్ చేశాడు. దీంతో మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు వెళ్లేందుకు యత్నించారు. దీంతో అడ్డుకునే క్రమంలో కల్యాణ్ పీకని డీమన్ పట్టుకున్నాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కల్యాణ్.. ఎవడి నామినేషన్ ఎవడు లెగుస్తున్నాడు అని పక్కనే ఉన్న కుర్చీని తన్నేశాడు.దీని తర్వాత కెప్టెన్ రీతూ.. సంజనని నామినేట్ చేసింది. దీంతో మరో గొడవ మొదలైంది. ఫైర్ స్ట్రామ్స్ వచ్చినప్పటి నుంచి మీ గేమ్ అసలు కనిపించడం లేదు. కెప్టెన్సీ టాస్క్‌లో ఇమ్మూ సపోర్ట్ చేయలేదని చాలా ఫీలయ్యారు. కానీ ఈరోజు ఇమ్మూని మీరు నామినేట్ చేసే అవకాశమున్నా చేయలేనని చెప్పారు అని రీతూ తన కారణాలు చెప్పింది. తర్వాత బూతులు మాట్లాడుతున్నారని ఒకరి గురించి ఒకరు కౌంటర్స్ వేసుకున్నారు. తర్వాత పవన్-రీతూ రిలేషన్ గురించి సంజన దారుణమైన కామెంట్స్ చేసింది. నీ అంత పెద్ద బూతులు ఎవరూ వాడలేదు, నీలాంటి స్ట్రాటజీలు ఈ హౌస్‌లో ఎవరికీ లేవు రీతూ. పవన్‌తో నువ్వు రాత్రి కూర్చుంటావ్.. కళ్లు మూసుకోవాల్సి వస్తుంది నేను అని సంజన అనేసింది. ఇలా అనకూడదని చెప్పి సంజనని హౌస్మేట్స్ అంతా సముదాయించారు. కానీ ఆమె వినలేదు. చివరగా రీతూ తప్పితే హౌస్‌లోని అందరూ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: ఐ బొమ్మ క్లోజ్ కావడం మాకు కలిసొచ్చింది) -
తనూజ, దివ్యలను చూస్తుంటే.. భరణి చెల్లెలు కామెంట్స్ వైరల్
బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్లో భరణితో తనూజ, దివ్యల బాండింగ్ బాగా వైరల్ అయింది. ఇవేం బాండింగ్స్ రా బాబు అంటూ నెటిజన్లు కూడా కామెంట్స్ చేశారు. తనూజతో భరణి క్లోజ్‌గా మాట్లాడితే చాలు దివ్యకు కోపం వచ్చేస్తుంది. తనూజ కాలికి నూనె రాసినప్పుడు, ఆమె కెప్టెన్ అయ్యాక భరణి ఎత్తుకున్నాడంటూ ఇలా పలు కారణాలు చూపుతూ తనూజ మీద దివ్య ఫైర్ అవుతూనే ఉంది. దీంతో గేమ్ పరంగా తనూజ కంటే దివ్యనే ఎక్కువగా నష్టపోయిందని చెప్పవచ్చు. భరణి విషయంలో ప్రతిసారీ ఆమె కావాలనే తనూజతో గొడవ పెట్టుకుంటుందని ప్రేక్షకుల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి.తనూజ, భరణి బంధంపై ఆయన చెల్లెలు ఆరతి పలు వ్యాఖ్యలు చేశారు. 'తనూజ- భరణిల మధ్య మంచి బాండింగ్ ఉంది. ఆమెను చూస్తుంటే నాకు సొంత మేనకోడలు మాదిరిగానే అనిపించింది. వారిద్దరిపై సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న రీల్స్ చూస్తుంటూ చాలా బాగున్నాయి.. వాటిని చూశాక నాకు చాలా సంతోషం అనిపించింది. తనూజ గేమ్ కూడా నాకు బాగా నచ్చింది. అయితే, ఫ్యామిలీ వారంలో హౌస్‌లోకి నేనే వెళ్లాల్సింది. కానీ, నా అన్న కూతురు వెళ్లింది. ఒకవేళ నేను వెళ్లింటే తనూజాను అభినందించేదానిని. కానీ, దివ్య, తనూజల మధ్య మా అన్నయ్య నలిగిపోతున్నాడు. దివ్య కూడా భరణి పట్ల మంచి అభిమానం చూపుతుంది. అయితే, ఆమె కాస్త గట్టిగా, డిమాండ్ చేసినట్లు భరణితో మాట్లడటం.. ఆపై కొంచెం ఎక్కువగా డామినేటెడ్‌గా మాట్లాడం వల్ల చూసేవారికి నచ్చడం లేదు. అంతేకానీ దివ్యతో ఎలాంటి సమస్య లేదు. దివ్య, భరణిలను ట్రోల్ చేసే వారు కాస్త ఆపండి. కానీ, తనూజ ఎప్పుడు కూడా భరణిని డిమాండ్ చేస్తూ మాట్లాడలేదు. తను చాలా క్యూట్‌గా అన్నయ్యతో మాట్లాడుతుంది.' అని ఆరతి పేర్కొంది. -
ఇదేమైనా చిన్నపిల్లల ఆటనా?: తనూజను నామినేట్ చేసిన భరణి
మండే వచ్చిందంటే నామినేషన్స్ పండగ. గొడవలు, అరుపులు, కేకలతో బిగ్‌బాస్ హౌస్ దద్దరిల్లుతుంది. గత వారం తనూజ, దివ్య ఎంతలా అరుచుకున్నారో అందరం చూశాం. మరి ఈ వారం ఎవరి మధ్య వార్ జరగనుందో చూడాలి! 12వ వారం నామినేషన్స్‌కు సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. 12వ వారం నామినేషన్స్ఈసారి నామినేషన్స్ రెండు లెవల్స్‌లో ఉంటుందన్నాడు బిగ్‌బాస్. మొదటగా ప్రైవేట్ నామినేషన్స్ జరుగుతాయన్నాడు. అలా ప్రతి ఒక్కరూ ఫేస్ టు ఫేస్ కాకుండా ప్రైవేట్‌గా నామినేట్ చేశారు. అలా ఇమ్మాన్యుయేల్.. పవన్‌ను, కల్యాణ్.. సుమన్‌ను, పవన్.. కల్యాణ్‌ను నామినేట్ చేశారు. 'ఇద్దరి గొడవల్లో తనూజ మళ్లీ నన్ను లాగింది. ఇదేదో చిన్నపిల్లల ఆటలా అయిపోతుంది. నామినేషన్స్‌లో ఎవరంటే?ఎన్నిసార్లు చెప్పినా ఇద్దరూ మెచ్యూర్డ్‌గా ప్రవర్తించట్లేదు' అంటూ భరణి.. తనూజను నామినేట్ చేశాడు. నావైపు నిల్చుంటారని కోరుకున్నప్పుడు ఆయన లేరు. అది నా గేమ్‌ను ఎఫెక్ట్ చేసిందంటూ దివ్య.. భరణిని నామినేట్ చేసింది. మొత్తానికి ఈ వారం కెప్టెన్ రీతూ తప్ప మిగతా 8 మంది నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఇమ్మూ బలవంతం.. ఫలించిన బిగ్‌బాస్ స్కెచ్ -
ఇమ్మూపై ఒత్తిడి.. దివ్య సేఫ్.. హర్టయిన తనూజ
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) భలే తెలివైనోడు.. ఇమ్మాన్యుయేల్‌తో కావాలని పవరాస్త్ర వాడించి ఎలిమినేషన్ రద్దు చేశాడు. తర్వాత మాత్రం ఒకరు వెళ్లిపోతే నీకు పోటీ తగ్గేది కదా అని నాగార్జునతో డైలాగులు కొట్టించాడు. మరి సండే ఎపిసోడ్(నవంబర్ 23)లో ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు? ఎవర్ని టాప్ 5లో పెట్టారో చూసేద్దాం..సుమన్ కోసం పిల్లలుసుమన్ శెట్టి కోసం అతడి పిల్లలిద్దరూ వచ్చారు. వాళ్లను చూడగానే సుమన్‌కు కళ్లలో నీళ్లు తిరిగాయి. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి వచ్చి.. గేమ్ బాగా ఆడాలని సుమన్‌కు సూచించాడు. సుమన్, ఇమ్మూ, తనూజా, భరణి, కళ్యాణ్‌ను టాప్ 5లో వరుసగా పెట్టారు. తర్వాత సంజన కోసం ఆమె తల్లి, మేనల్లుడు వచ్చారు. ఎవరి దగ్గరి నుంచి ఏమీ ఆశించకుండా సొంతంగా ఆడు, ఎక్కువ కంప్లైంట్స్ చేయొద్దని సలహా ఇచ్చారు. సంజన, ఇమ్మూ, కల్యాణ్, తనూజ, సుమన్‌ను టాప్ 5లో పెట్టారు.రీతూ కోసం అఖిలతర్వాత రీతూ కోసం ఆమె సోదరుడితో పాటు బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ అఖిల్ వచ్చారు. నెగెటివిటీ అంతా పోయి పాజిటివిటీతో బయటకు వస్తున్నావ్ అని అఖిల్ చెప్పడంతో రీతూ ఎగిరి గంతేసింది. రీతూ, తనూజా, కళ్యాణ్, ఇమ్మూ, డిమాన్ పవన్‌ను టాప్ 5లో పెట్టారు. అనంతరం తనూజ కోసం ముద్దమందారం సీరియల్ యాక్టర్స్ పవన్ సాయి, హరిత వచ్చారు. వాళ్లను చూడగానే తనూజ ఏడ్చేసింది. మనీష్‌కు కౌంటర్పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు.. నువ్వు ఎక్కడో పైనున్నావని అర్థం.. నిన్ను చూసి గర్వపడుతున్నాం అంది హరిత. అలాగే కొన్ని వారాల క్రితం మనీష్ వచ్చి.. ముద్దుముద్దు మాటలు చెప్పి చెవిలో మందారపూలు పెడుతున్నారు అని చెప్పిన డైలాగ్‌కు ఇప్పుడు కౌంటరిచ్చింది. ముద్దు మాటలతో మందారం చెవిలో పెడుతుందన్నారు. నీ చెవిలో పూలు పెట్టేవాళ్లు నీ చుట్టుపక్కలే ఉంటారు జాగ్రత్త.. ఆ పూలను మాల కట్టి వికసించేలా చేయాలి అని హరిత అంది.దివ్యను కాపాడేందుకు స్కెచ్డిమాన్ పవన్ (Demon Pavan) కోసం ఆయన తండ్రి, స్నేహితుడు స్టేజీపైకి వచ్చారు. నాకు నీతి, నిజాయితీగా ఉండటమే వచ్చు.. నా కొడుక్కి అదే నేర్పించా అన్నాడు తండ్రి. డెమోన్, ఇమ్ము, సంజన, తనూజా, రీతూను టాప్ 5లో పెట్టారు. అందర్నీ సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో దివ్య, సంజన మిగిలారు. ఇమ్మాన్యుయేల్ పవరాస్త్ర వాడితే ఈ వారం ఎలిమినేషన్ ఉండదన్నాడు నాగ్.నో ఎలిమినేషన్ఆ పవరాస్త్రకు ఉన్న శక్తి ఈవారంతో నిర్వీర్యం అయిపోతుందన్నాడు. దీంతో ఇమ్మూ పవరాస్త్ర వాడగా నో ఎలిమినేషన్ ప్రకటించాడు నాగ్. అనంతరం దివ్యకు తక్కువ ఓట్లు పడ్డాయని తెలిపాడు. దివ్య బతికిపోడంతో తనూజ ఫీలైనట్లు కనిపించింది. పవరాస్త్ర ఇప్పుడెందుకు వాడావు? తర్వాత ఫినాలే సమయంలో వాడుకోవచ్చుగా అంది. ఆల్రెడీ నాగ్.. దాన్ని తర్వాతి వారం నుంచి వాడేందుకు వీల్లేదన్నాడు. అయినా తనూజ అలాంటి కామెంట్ చేసిందంటే దివ్య సేవ్ చేసినందుకు కాస్త హర్ట్ అయినట్లే కనిపిస్తోంది!చదవండి: సిక్స్ ప్యాక్‌తో హీరో సెకండ్ ఇన్నింగ్స్ -
అది నా పిల్లరా..: ముద్ద మందారం హీరో
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) కంటెస్టెంట్ల కోసం వీకెండ్లో ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు సెలబ్రిటీలు వచ్చేస్తున్నారు. నిన్న భరణి కోసం నాగబాబు రాగా, నేడు తనూజ కోసం ముద్దమందారం సీరియల్ స్టార్స్ స్టేజీపైకి వచ్చేశారు. సుమన్ కోసం కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి వచ్చాడు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది.లేడీ సింగంసీరియల్ నటి హరితను చూడగానే తనూజ చాలా మిస్ అయ్యానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అటు హరిత కూడా ఎమోషనలైంది. ముద్దమందారం హీరో పవన్.. తనూజను లేడీ సింగంగా అభివర్ణించాడు. తర్వాత అర్జున్ రెడ్డి ఫోటో ఉన్న కార్డ్‌ను బయటకు తీశాడు. దీంతో నాగ్.. ఆ సినిమాలోని ఓ డైలాగ్ చెప్పమన్నాడు. అందుకు పవన్.. అది నా పిల్ల అని చెప్పాడు. నాన్నగారు జాగ్రత్తగా చూసుకోండి అని భరణికి సలహా ఇచ్చాడు.ఎమోషనల్ ప్రోమోనాన్నగారు చాలా సంతోషంగా ఉన్నారు. నిన్ను కప్పుతో చూడాలని ఆయన కోరుకుంటున్నారు అని హరిత చెప్పగానే తనూజ భావోద్వేగానికి లోనైంది. ఈ ప్రోమో చూసిన తనూజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అన్నింటికన్నా.. అది నా పిల్ల అనే డైలాగ్ బాగా హైలైట్ అయిందంటున్నారు. మరి దానికి కల్యాణ్ ఎలా ఫీలవుతున్నాడో? ఏంటో! చదవండి: ఈ వారం నో ఎలిమినేషన్.. దివ్యను కాపాడేందుకే! -
తప్పు చేశా.. నన్ను క్షమించండి: శివజ్యోతి
తిరుమలో ఇచ్చే దేవుని ప్రసాదంపై నోరుపారేసుకున్ని బిగ్‌బాస్ కంటెస్టెంట్ శివజ్యోతి తన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పింది. ఇటీవల తన సోదరుడు, భర్తతో కలిసి శివజ్యోతి.. తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లింది. అక్కడ భక్తుల కోసం ఇస్తున్న ప్రసాదాన్ని తీసుకున్న సోదరుడిని ఉద్దేశించి.. సోనీ కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాడు.. అని ఎగతాళి చసింది. ఆమె సోదరుడు కూడా.. జీవితంలో ఎప్పుడూ ఇలా అడుక్కోలేదు.. ఫస్ట్ టైమ్ ఇలా అడుక్కుంటున్నానని పేర్కొన్నాడు. నన్ను క్షమించండితిరుపతిలో రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం తామేనని భర్తతో ప్రసాదం గురించి కామెడీ చేసింది. దేవుని ప్రసాదం విషయంలో ఈ చిల్లర కామెంట్స్ ఏంటని సోషల్ మీడియాలో జనాలు మండిపడ్డారు. దీంతో శివజ్యోతి క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన మాటలు చాలామందికి తప్పుగా అనిపిస్తున్నాయి. నా వల్ల హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి. తప్పు జరిగిందినన్ను రెగ్యులర్‌గా ఫాలో అయేవారికి నాకు వెంకటేశ్వరస్వామి అంటే ఎంతిష్టమో బాగా తెలుసు. మూడు, నాలుగు నెలలుగా శనివారాల వ్రతం గురించి ప్రచారం చేస్తూనే ఉన్నా.. దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. దురదృష్టవశాత్తూ ప్రసాదం గురించి నేను అన్న కామెంట్స్‌పైనే మాట్లాడుతున్నారు. ఏదేమైనా నావైపు నుంచి తప్పు జరిగింది. నా మాటలు తప్పుగా ఉన్నాయి. కానీ, నా ఉద్దేశ్యం అయితే అదికాదు.ఆయన గురించి ఎలా..?కాస్ట్లీ లైన్లో నిలబడ్డామన్న ఉద్దేశంతో మేము రిచ్ అన్నాను. నా తరపున, నా తమ్ముడి తరపున అందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను. నా ఇంట్లో, నా చేతిపై వెంకటేశ్వరస్వామి ఉన్నాడు. అన్నింటికన్నా ముఖ్యంగా నా జీవితంలో అత్యంత విలువైనది నా బిడ్డ. నా బిడ్డను కూడా వెంకటేశ్వరస్వామే ఇచ్చిండు. ఆయన గురించి తప్పుగా ఎలా మాట్లాడతాను? వెంకటేశ్వరస్వామి నా జీవితాన్నే మార్చిండు. ఆయన దయ లేకపోతే నేను అనుభవించేదేదీ నాకు రాదు. తల్లి కాబోతున్న శివజ్యోతితెలిసో తెలియకో మా నోటి నుంచి పొరపాటు వ్యాఖ్యలు వచ్చాయి. అందుకు మన్నించండి అని పేర్కొంది. కాగా పెళ్లయిన 11 ఏళ్లకు శివజ్యోతి తల్లి కాబోతోంది. ఏడు శనివారాల వ్రతం చేయడం వల్లే తాను గర్భం దాల్చానని, జీవితాంతం స్వామివారి సేవలోనే ఉంటానని చెప్తూ పొంగిపోయింది. అంత భక్తితో వెంకన్ను కొలిచిన శివజ్యోతి ఇప్పుడాయన ప్రసాదం గురించి తప్పుగా మాట్లాడటం.. దానిపై విమర్శలు రావడంతో క్షమాపణలు చెప్పింది. చదవండి: ఈ వారం నో ఎలిమినేషన్ -
ఈ వారం నో ఎలిమినేషన్.. టాప్ 5లో వీళ్లేనా?!
సుమన్ చేసిన పొరపాటు వల్ల, తనూజ కంగారు వల్ల కెప్టెన్సీ చేతికి వచ్చినట్లే వచ్చి పోయింది. రీతూ కెప్టెన్‌గా గెలిచింది. ఇక ఈ వారమంతా ఫ్యామిలీ మెంబర్స్ రాగా వీకెండ్లో కుటుంబసభ్యులతో పాటు సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చారు. టాప్ 5లో ఎవరుంటారో తమ అభిప్రాయాలు చెప్పారు. ఆ విశేషాలు శనివారం (నవంబర్ 22వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..జీవితంలో ముఖం చూడను(Bigg Boss Telugu 9) తనూజతో జరిగిన గొడవ నుంచి ఇంకా బయటకు రాలేకపోతోంది దివ్య. మీకిష్టం లేకపోయినా మీ వెంటపడుతున్నానని కామెంట్స్‌తో బాధపెట్టింది. బయటకెళ్లాక జీవితంలో తన ముఖం చూడను అంది. నాగార్జున స్టేజీపైకి వచ్చి తనూజ- దివ్య గొడవ గురించి ప్రస్తావించాడు. కెప్టెన్ అవగానే కళ్లు నెత్తికెక్కాయా? అని తనూజకు క్లాస్ పీకాడు. పిచ్చిపిచ్చిగా మాట్లాడకు అంటూ గొడవకు పునాది వేసిందే నువ్వని దివ్యను తిట్టిపోశాడు. అలా ఇద్దరికీ కాస్త గడ్డి పెట్టాక ఫ్యామిలీ మెంబర్స్‌ను స్టేజీపైకి పిలిచాడు.తనూజ నా మనవరాలుమొదటగా భరణి (Bharani Shankar) తల్లితో పాటు నాగబాబు కూడా స్టేజీపైకి వచ్చాడు. తనూజ (Thanuja Puttaswamy)ను మనవరాలు అని పిలిచిన భరణి తల్లి.. దివ్యను మాత్రం పరోక్షంగా జాగ్రత్త అని హెచ్చరించింది. కొడుకుపై అరవొద్దు అన్నట్లుగా సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చింది. వీళ్లు.. భరణి, తనూజ, సుమన్, ఇమ్మాన్యుయేల్, సంజనను టాప్ 5లో వరుసగా పెట్టారు. కల్యాణ్ తండ్రి గొప్ప మాటలుతర్వాత కళ్యాణ్ కోసం తండ్రి లక్ష్మణ్‌రావు, తమ్ముడు బాలు వచ్చారు. కొడుకును చూసి ఎమోషనలైన తండ్రి.. నీనుంచి పదిమంది బతకాలి.. పదిమంది నుంచి నువ్వు బతక్కూడదు అంటూ గొప్ప మాటలు చెప్పాడు. కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, తనూజ, రీతూ, పవన్‌ను టాప్ 5 పెట్టారు. అనంతరం ఇమ్మాన్యుయేల్ అన్నతో పాటు కమెడియన్ అవినాష్ వచ్చారు. ఇమ్మూ, తనూజ, కల్యాణ్, పవన్, రీతూని టాప్ 5లో పెట్టారు. అవినాష్ తనూజకు మహానటి, కట్టప్ప అవార్డులు ఇచ్చాడు.టాప్5 చివర్లో దివ్యతర్వాత దివ్య తాతయ్య, స్నేహితురాలు వచ్చారు. వీళ్లిద్దరూ.. ఇమ్మాన్యుయేల్, తనూజ, భరణి, సుమన్, దివ్యను టాప్ 5లో పెట్టారు. దివ్యను చివర్లో పెట్టిన తాతయ్య.. నువ్వింకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలని సలహా ఇచ్చాడు. ఇకపోతే ఈ వారం దివ్య-తనూజ గొడవతో టీఆర్పీలు బద్ధలైపోయాయట. దీంతో బిగ్‌బాస్ టీమ్ దివ్యను ఎలిమినేషన్ నుంచి కాపాడేందుకు ఈ వారం నో ఎలిమినేషన్ అని ప్రకటించేందుకు సిద్ధమైందట! ఆ సంగతులు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.. -
బిగ్‌బాస్ 9: అనుకున్నట్లే ఈ వారం ఆమెనే ఎలిమినేట్!
ప్రతివారం బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతుంటారు. గతవారం గౌరవ్, నిఖిల్ బయటకొచ్చేశారు. దీంతో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ ఎలిమినేట్ అయిపోయినట్లు అయింది. మరి ఈ వారం ఎవరు ఔట్ అవుతారా అందరూ ఎదురుచూశారు. అందుకు తగ్గట్లే ఈ వారం ఆరుగురు నామినేషన్స్‌లోకి రాగా.. ఈమెనే ఎలిమినేట్ అవుతుందని చాలామంది ఊహించారు. ఇప్పుడు అలానే జరిగినట్లు తెలుస్తోంది.ఈ వారం నామినేషన్స్‌లోకి కళ్యాణ్, పవన్, ఇమ్మాన్యుయేల్, భరణి, సంజన, దివ్య వచ్చారు. ఇన్నివారాల పాటు మిస్ అవుతూ వచ్చిన ఇమ్ము.. తొలిసారి నామినేషన్స్‌లోకి వచ్చాడు. ఇదేమైనా ఇతడికి మైనస్ అవుతుందా అని అనుకున్నారు. కానీ అలాంటిదేం జరగలేదు. అభిమానులు గట్టిగానే ఓట్లు వేశారట. తద్వారా ఓటింగ్‌లో తొలిస్థానం కల్యాణ్ దక్కించుకోగా.. రెండో స్థానంలో ఇమ్ము నిలిచాడట.(ఇదీ చదవండి: 'వార్ 2' ఫలితంపై హీరో సెల్ఫ్ ట్రోలింగ్.. వీడియో వైరల్)తర్వాత స్థానాల్లో పవన్, భరణి నిలిచారు. డేంజర్ జోన్లో సంజన, దివ్య ఉన్నారు. సంజనతో పోలిస్తే దివ్యపై గత కొన్నివారాల నుంచి నెగిటివిటీ పెరుగుతూనే వచ్చింది. దీనికి కారణం తనూజ. ప్రతిసారి తనూజతో దివ్య గొడవ పడుతూ వచ్చింది. శుక్రవారం ఎపిసోడ్‌లోనూ కెప్టెన్సీ విషయమై వీళ్లిద్దరి మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. ఇప్పటికే కెప్టెన్సీ, ఇమ్మ్యూనిటీ ఉన్న కారణంగా తనూజని కెప్టెన్సీ రేసు నుంచి తొలగించేందుకు తాను ఓటు వేస్తున్నానని దివ్య చెప్పింది.ఇలా పలు కారణాలతో పాటు నామినేషన్స్‌లో ఉన్న మిగతా వాళ్లతో పోలిస్తే దివ్యకు ఓటు బ్యాంక్ తక్కువగా ఉండటంతో 11వ వారం ఈమెనే ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈమె బయటకొచ్చేస్తే.. హౌస్‌లో ఉన్న కామనర్స్ కల్యాణ్, పవన్ మాత్రమే అవుతారు. చూడాలి మరి ఈసారి ఊహించినట్లే దివ్య ఎలిమినేట్ అవుతుందా లేదంటే మరెవరైనా బయటకొచ్చేస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'రాజు వెడ్స్ రాంబాయి' తొలిరోజు కలెక్షన్ ఎంత?) -
ఏయ్, నువ్వేం పొడిచావ్? సీజన్లోనే పెద్ద లొల్లి!
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లోకి చివరగా ఇమ్మాన్యుయేల్ తల్లి వచ్చింది. నేను వద్దనుకున్న కొడుకే ఈరోజు నాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరు తెచ్చాడని తెగ మురిసిపోయింది. కొడుక్కి ప్రేమగా గోరుముద్దలు తినిపించింది. మరి ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో శుక్రవారం (నవంబర్ 21వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం...ఇమ్మూకి డబుల్ ధమాకాఇమ్మాన్యుయేల్ (Emmanuel)కు బిగ్‌బాస్ డబుల్ బొనాంజా ఇచ్చాడు. తల్లిని బయటకు పంపించేశాక ప్రియురాలు పంపిన లేఖ, ఎంగేజ్మెంట్ రింగ్‌ను ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. ఇది చూసి ఇమ్మూ తెగ సంబరపడిపోయాడు. తర్వాత ఈవారం కెప్టెన్సీ కోసం పోటీ జరిగింది. ముందుగా కెప్టెన్సీకి అనర్హులు అనుకున్నవారిని గేమ్‌లో నుంచి తీసేయాలన్నాడు. దాంతో మొదటగా దివ్య.. తనూజ పేరు చెప్పింది. పర్సనల్ అటాక్ఆల్రెడీ రెండు వారాల ఇమ్యూనిటీ వచ్చింది. మళ్లీ ఇంకో వారం ఇమ్యూనిటీ అవసరం లేదంటూ తనూజను తీసేసింది. అది తనూజకు నచ్చలేదు. ఎందుకు నా మీద పడి ఏడుస్తున్నావ్? అంటూ ఒంటికాలిపై లేచింది. దివ్య కూడా ఏమాత్రం తగ్గలేదు. ఇద్దరూ చాలాసేపు అరుచుకున్నారు. బయట రివ్యూలు సరిపోవన్నట్లు ఇక్కడికి వచ్చి చేస్తున్నావ్.. నువ్వే సింపథీ స్టార్ అంటూ తనూజ మరింత అగ్గిరాజేసింది.గేమ్ కోసం వాడుకోనునీలాగా మనుషుల్ని గేమ్ కోసం వాడుకోను అని దివ్య.. ఒక మనిషి ఇష్టం లేదంటున్నా వెంటపడుతున్నావ్.. అని తనూజ మధ్యలో భరణిని లాగారు. దాంతో ఆయన మధ్యలో నన్ను లాగొద్దని చెప్పానుగా అని అసహనం వ్యక్తం చేశాడు. నోరుందని పిచ్చిపిచ్చిగా మాట్లాడకు.. నేను నీకంటే బెటర్‌గా ఆడా.. అందరిదగ్గరికెళ్లి కెప్టెన్సీ అడుక్కోలేదు.. నిన్ను భరించలేక నన్ను గతంలో కెప్టెన్ చేశారు. నువ్వేం పొడిచింది లేదు. సీరియల్ స్టార్ అంటూ దివ్య తనూజను ఏకిపారేసింది. చివరకు ఆ ఇద్దరుఅలా వీరి గొడవతో హౌస్‌ను తగలబెట్టేసినంత పని చేశారు. దివ్య తర్వాత మెజారిటీ ఇంటిసభ్యులు తనూజను కెప్టెన్‌గా వద్దన్నారు. దీంతో ఆమె గేమ్‌లో లేకుండా పోయింది. అయితే హౌస్‌మేట్స్‌ను రెండు టీమ్స్‌గా విభజించే బాధ్యతను తనూజకు అప్పగించాడు బిగ్‌బాస్. దీంతో ఆమె పవన్, కల్యాణ్, రీతూ, సుమన్‌ను బ్లూ టీమ్‌గా మిగిలినవారిని రెడ్ టీమ్‌గా విభజించింది. వీరికి ఓ మాన్స్టర్ గేమ్ ఇచ్చాడు. ఇందులో చివరకు సుమన్, రీతూ మిగిలారు. అయితే రీతూ కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. -
నీలాగా గేమ్ కోసం వాడుకోను.. తనూజపై రెచ్చిపోయిన దివ్య
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో దివ్యకు తనూజ అంటే ఏమూలనో కోపం, ద్వేషం, అసూయ ఉన్నట్లు కనిపిస్తోంది. నిన్నటి ఎపిసోడ్లో తనూజ కాలికి వాపు వచ్చిందని భరణి ప్రేమగా ఆయింట్మెంట్ పూసి మసాజ్ చేశాడు. అది దివ్య తట్టుకోలేకపోయింది. మీ ఆరోగ్యమే బాగోలేదు. చేయి నొప్పి ఉన్నప్పుడు సేవలు చేయడం అవసరమా? అని అరిచింది. ఎవరో ఒకరు చేస్తారుగా.. మీరెందుకు చేయడం అని తిట్టేసింది.తనూజపై అక్కసుపోనీ నిజంగా తనకు భరణిపై అంత కేరింగ్ ఉందా? అంటే.. పోయినవారం బీబీ రాజ్యం గేమ్‌లో భరణితో మసాజ్ చేయించుకుంది. మరి అప్పుడు భరణి నొప్పి గుర్తురాలేదా? అన్నది తనకే తెలియాలి. ఇప్పుడు తనూజ (Thanuja Puttaswamy)పై కోపాన్ని మరోసారి బయటపెట్టింది. ఈమేరకు ఓ ప్రోమో రిలీజైంది. కెప్టెన్సీకి అనర్హులు అనుకుంటున్నవారిని రేసు నుంచి తప్పించాలన్నాడు బిగ్‌బాస్. ఒంటికాలిపై లేచిన తనూజదీంతో దివ్య.. నా దృష్టిలో కెప్టెన్ అంటే ఇమ్యూనిటీ. ఆల్రెడీ కెప్టెన్‌గా ఈ వారం ఇమ్యూనిటీ పొందావ్. మళ్లీ అది నీకు అవసరం లేదు అని తనూజను తీసేసింది. దాంతో తనూజ.. నేను కెప్టెన్సీ ఆడి గెలుచుకున్నా.. ఎవరూ నా చేతిలో పెట్టలేదు. నీకు నేనే కనిపిస్తున్నానా? వేరేవాళ్లు కనిపించట్లేదా? అని ప్రశ్నించింది. నువ్వు అరిస్తే నేను ఇంకా గట్టిగా అరుస్తా.. 100% నేను కరెక్ట్ ఆన్సరిచ్చా అని దివ్య సమర్థించుకుంది.గేమ్ కోసం వాడుకోనుబానే చెప్పుకున్నావ్ పో.. అని తనూజ వెక్కిరించడంతో దివ్యకు బీపీ లేచింది. నువ్వెవరు పో అనడానికి? రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అని వేలు చూపించి మాట్లాడింది. అయినా వెనక్కు తగ్గని తనూజ.. ప్రతిదానికి నామీద పడి ఏడుస్తావ్ అని వెటకారం చేసింది. గంటలో పదిసార్లు ఏడ్చేది నువ్వు.. నీలాగా అందర్నీ గేమ్ కోసం వాడుకోను అని దివ్య అంది. అలా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి పెద్ద గొడవే జరిగింది. నోరుందని పిచ్చిపిచ్చిగా మాట్లాడకు అంటూ కొట్టుకునే స్థాయికి వెళ్లారు. చదవండి: ఏడవద్దు డాడీ, హీరోగా బయటకు రా: ఇమ్మాన్యుయేల్ -
ఇమ్మూకి తల్లి ఊహించని గిఫ్ట్! కొత్త కెప్టెన్ ఎవరంటే?
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో ఫ్యామిలీ వీక్ ముగింపుకు వచ్చేసింది. తనూజ, కల్యాణ్, సుమన్, భరణి, దివ్య, డిమాన్ పవన్, రీతూ, సంజన.. ఇలా అందరి ఫ్యామిలీ మెంబర్స్ హౌస్‌లోకి వచ్చి వెళ్లారు. చివరగా ఇమ్మూ ఒక్కడే మిగిలాడు. ఈరోజు అతడి తల్లి బిగ్‌బాస్ ఇంట్లో అడుగుపెట్టనుంది. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజైంది.ఏడవద్దు డాడీఇమ్మూ తల్లి అంటూ కొడుక్కి ప్రేమగా నుదుటిపై ముద్దు పెట్టింది. తాను కొనిచ్చిన బంగారు గాజులు వేసుకుని రావడం చూసి ఇమ్మూ మురిసిపోయాడు. ఏ బంగారాన్ని వద్దనుకున్నానో.. ఆ బంగారం రెండు రాష్ట్రాల్లో నాకు పేరు తెస్తున్నాడు.. ఏడవద్దు డాడీ అంటూ కొడుకు కన్నీళ్లు తుడిచింది. కమెడియన్‌గా వచ్చావ్.. హీరోగా బయటకు రావాలంది.తల్లి కోసం పాటకొడుక్కి ఏమాత్రం తీసిపోదన్నట్లుగా అందరితో బాగానే కామెడీ చేసింది. చివర్లో ఇమ్మూ.. సువ్విసువ్వాలమ్మా పాట పాడి అందరి మనసులు పిండేశాడు. ఇక ఇమ్మూ తల్లి కొడుక్కి ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అదెంతవరకు నిజమో చూడాలి. అలాగే హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ జరగ్గా రీతూ చౌదరి కొత్త కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. చదవండి: దివ్యకు దూరంగా ఉండు: భరణికి కూతురి సలహా -
కల్యాణ్ తల్లికి చీర పెట్టిన తనూజ.. అంత స్పెషల్ ఏంటో?
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ఇంట్లోకి పవన్ కల్యాణ్, రీతూ, భరణి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. వారు ఏం మాట్లాడారు? హౌస్‌లో ఏమేం జరిగాయో గురువారం (నవంబర్ 20వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..కల్యాణ్ తల్లికి తనూజ గిఫ్ట్ఫ్యామిలీ వీక్ వద్దని బెట్టు చేసిన కల్యాణ్ (Pawan Kalyan Padala).. తల్లిని చూడగానే చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు. కప్పు తీసుకుని ఇంటికి రావాలని తల్లి కల్యాణ్ దగ్గర మాట తీసుకుంది. చివర్లో తనూజ.. కల్యాణ్ తల్లికి చీర పెట్టి సాగనంపింది. అది చూసిన కల్యాణ్ ఎందుకు స్పెషల్‌గా మా అమ్మకే చీర పెట్టావ్? అని అడిగాడు. అందుకామె.. నువ్వు నాపై ఎంతో కేర్ చూపించావ్, అందుకు బదులుగా తనకు చీర పెట్టాలనిపించింది, పెట్టాను అని సమాధానమిచ్చింది. రీతూ తల్లి ఎంట్రీఅలాగే తనపై లేనిపోని ఆశలు పెంచుకుంటున్న కల్యాణ్‌కు బిగ్‌బాస్ అయిపోయాక నీ జర్నీ నీది.. నా జర్నీ నాది అని క్లారిటీ ఇచ్చింది. అందుకు కల్యాణ్ నువ్వు సంతోషంగా ఉండటమే నాక్కావాలి అంటూ ప్రేమపిపాసిలా డైలాగులు కొట్టాడు. తర్వాత రీతూ తల్లి ఎంట్రీ ఇచ్చింది. ఆమెను చూడగానే రీతూ బోరుమని ఏడ్చేసింది. కానీ, ఆమె తల్లి మాత్రం నువ్వు నాకు నచ్చట్లేదంటూ చపాతీ కర్ర అందుకుని కొట్టబోయింది. కానీ కూతురి ఏడుపు చూసి కొట్టేందుకు చేతులు రాలేదు.మాడిపోయిన పవన్ ముఖంతనూజ, ఇమ్మూని పిలిచి మరీ మాట్లాడింది. కానీ డిమాన్ పవన్‌ను అసలు పట్టించుకోలేదు. దీంతో అతడి ముఖం వాడిపోయింది. గేమ్స్‌లో మాత్రమే ఫోకస్ చేయ్.. ఇంకేం వద్దు అని హెచ్చరించింది. మరి అది రీతూ తలకు ఎక్కించుకుందో? లేదో! ఇదంతా చూసిన పవన్.. రేపటినుంచి రీతూకి దూరంగా ఉండాలని మనసులో అనుకున్నాడు. తర్వాత భరణి కూతురు ఎంట్రీ ఇచ్చింది. తండ్రిని పట్టుకుని ఏడ్చేసింది. దివ్యకి దూరంగా ఉండుతనూజ-నాన్న బంధం తన ఫేవరెట్ అంది. నువ్వు కెప్టెన్ అయితే చూడాలనుందని తండ్రిని కోరింది. దివ్యను తన తండ్రిపై కమాండింగ్ కాస్త తగ్గించమని కోరింది. ఆమె అటు వెళ్లగానే కమాండ్ చేసేవాళ్లతో జాగ్రత్తగా ఉండండి. నీపై అరుస్తుంటే సైలెంట్‌గా ఉండకండి. అలా అరవడం నచ్చడం లేదని చెప్పండి అని తండ్రికి సలహాలు ఇచ్చింది. ఇక హౌస్‌లోకి అందరి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, ఒక్క ఇమ్మూకి తప్ప! రేపు అతడి తల్లి ఇంట్లో అడుగుపెట్టనుంది. ఆ విశేషాలు రేపటి ఎపిసోడ్ హైలైట్స్‌లో చూద్దాం.. -
ఇంత బాధేంట్రా పిచ్చోడా.. నాకో మాటివ్వు: కల్యాణ్ తల్లి
సామాన్యుడు బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)దాకా రావడమనేది చిన్న విషయం కాదు. షోలో అడుగుపెట్టడమే కాకుండా ఏకంగా టైటిల్ రేసులో ఉండటం అంటే చాలా గొప్ప విషయం! ట్రోఫీ గెలుస్తాడా? లేదా? అని పక్కనపెడితే టాప్ 3లో చోటు దక్కించుకున్నా సరే అతడు గెలిచాడనే చెప్పాలి. అతడే పవన్ కల్యాణ్ పడాల.విమర్శల నుంచి పొగడ్తల వరకుచిన్న పల్లెటూరు నుంచి ఆర్మీకి... అక్కడ బ్రేక్ ఇచ్చి బిగ్‌బాస్ హౌస్‌కి వచ్చాడు కల్యాణ్ (Pawan Kalyan Padala). మొదట్లో తనూజను చూసేవిధానం, మాట్లాడే విధానం ఎవరికీ నచ్చలేదు. అమ్మాయిల పిచ్చోడు అని తనపై ట్రోలింగ్ కూడా జరిగింది. కానీ తిట్టిన నోళ్లతోనే పొగిడించుకునేలా చేశాడు. తన తీరు మార్చుకున్నాడు, ఆట మార్చాడు.వద్దు వద్దంటూ..అందుకే ఇప్పుడు ఎంతోమందికి ఫేవరెట్ అయ్యాడు. చిన్నప్పుడు అమ్మానాన్న సావాసాన్ని మిస్ అయ్యానని చెప్తూ ఇటీవలి ఎపిసోడ్లో బోరుమని ఏడ్చాడు కల్యాణ్. కానీ, ఫ్యామిలీ వీక్ వచ్చేసరికి తనకు ఇంట్లోవాళ్లు రావొద్దని, కావాలంటే ఎవరికోసమైనా త్యాగం చేయడానికైనా రెడీ అంటూ పిచ్చిపట్లునట్లు ప్రవర్తించాడు. తీరా కళ్ల ముందు తల్లి కనిపించేసరికి చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు. మాటిచ్చిన కల్యాణ్ఇంత బాధ పెట్టుకున్నావేంట్రా పిచ్చోడా అని తల్లి అడిగేసరికి అమ్మ కొంగు పట్టుకుని తిరిగే పిల్లాడిలా మారిపోయాడు. కప్పు తీసుకుని ఇంటికి రావాలి అని తల్లి అడిగింది. అందుకు కల్యాణ్ తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తానంటూ ఆమె చేతిలో చేయేసి మాటిచ్చాడు. మొత్తానికి నేటి ఎపిసోడ్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ రాకతో ఎమోషనల్‌గా సాగనుంది. చదవండి: పెళ్లయి 9 ఏళ్లు.. నాకు తల్లవ్వాలని లేదు: నటి -
నాకు తల్లవ్వాలని లేదు, ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్!
కొందరు పెళ్లయిన వెంటనే పిల్లలు కావాలనుకోరు. ముందుగా కెరీర్లో స్థిరపడ్డాకే పిల్లలను ప్లాన్ చేసుకుంటారు. కానీ అసలు పిల్లలే వద్దనుకునేవారు చాలా తక్కువమంది. హిందీ బుల్లితెర నటుడు గౌరవ్ ఖన్నా (Gaurav Khanna) భార్య ఆకాంక్ష (Akanksha) ఈ కోవలోకే వస్తుంది. గౌరవ్ హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్లో పాల్గొన్నాడు.తల్లవ్వాలన్న ఆశ లేదుఫ్యామిలీ వీక్‌లో భాగంగా ఆకాంక్ష చమోలా హౌస్‌లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా వీరి తొమ్మిదో పెళ్లి రోజును హౌస్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో తనకు తల్లవ్వాలన్న ఆశ లేదంది ఆకాంక్ష. ఆ మాట విని గౌరవ్ నిశ్చేష్టుడయ్యాడు. అమ్మ అని పిలిపించుకోవాలని నాకెప్పుడూ అనిపించడలేదు. భవిష్యత్తులో కూడా పిల్లల్ని ప్లాన్ చేయాలనుకోవడం లేదు. చాలా కారణాలుపిల్లలుంటే బాగుండన్న ఆలోచన నాకెప్పుడూ రాలేదు. ఇలా పిల్లలు వద్దనుకోవడానికి నా దగ్గర చాలా కారణాలున్నాయి. అందుకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయలేదు. ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే ఏదో వంటకం చేసినంత ఈజీ కాదు. అది పెద్ద బాధ్యత. నేను దానికి న్యాయం చేయలేను అని నా ఫీలింగ్. ఇప్పుడే కాదు, ఇకముందు కూడా ఆ బాధ్యత నిర్వర్తించలేను. ప్రస్తుతం నాకు నా కెరీర్ ముఖ్యం. నాకు చాలా లక్ష్యాలున్నాయి. నా కెరీర్ ముఖ్యంజనాలు నన్ను స్వార్థపరురాలిని అనుకున్నా మరేం పర్లేదు. నాకు నా కెరీర్ ముఖ్యం అని చెప్పుకొచ్చింది. అది విన్న గౌరవ్.. నీ సమాధానం తనను మరింత భయపెడుతుందన్నాడు. గౌరవ్.. సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ ఇండియా రియాలిటీ షో విజేతగా నిలిచాడు. గౌరవ్ - ఆకాంక్ష 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.చదవండి: రీతూని నిలదీసిన తల్లి -
నేను చెప్పిందేంటి? నువ్వు చేస్తుందేంటి?: రీతూ తల్లి
పదివారాలుగా ఇంటిల్లిపాదికి దూరంగా ఉన్న హౌస్మేట్స్ ఈ వారం ఫుల్ జోష్‌లో ఉన్నారు. కారణం.. ఇది ఫ్యామిలీ వీక్. అమ్మానాన్న, చెల్లి, భార్య.. ఇలా ఎవరో ఒక రక్తసంబంధీకులు తమకోసం బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌కు రావడం చూసి ఆనందభాష్పాలు కారుస్తున్నారు. ఇప్పటికే సుమన్, తనూజ, పవన్, దివ్య ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఈరోజు రీతూ తల్లి హౌస్‌లోకి రానుంది.రీతూకి క్లాస్ఈమేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో రీతూ తల్లి హౌస్‌మేట్స్‌ను ఓ ఆటాడుకుంది. ఫాస్ట్ ఫార్వర్డ్, ఫ్రీజ్ అంటూ కంటెస్టెంట్లను ఓ ఆటాడించింది. తల్లిని చూడగానే మిస్‌యూ అంటూ రీతూ ఏడుపందుకుంది. కానీ ఆమె తల్లి మాత్రం.. నిన్ను కొడ్తా.. నేను చెప్పిందేంటి? నువ్వు చేసిందేంటి? అని పవన్‌తో లవ్ ట్రాక్ గురించి పరోక్షంగా నిలదీసింది.ఏడుపందుకున్న రీతూమనం పక్కకెళ్దాం అమ్మ.. అని రీతూ అడిగితే చపాతీ కర్ర అందుకుని కొట్టేందుకు సిద్ధమైంది. కానీ రీతూ ఏడుపు చూసి కొట్టలేక దగ్గరకు తీసుకుని హత్తుకుంది. ఎంతైనా తల్లి మనసు కదా.. కూతురి కన్నీళ్లు చూశాక కొట్టే సాహనం చేయలేకపోయింది. చదవండి: డిమాన్ పవన్ తండ్రికి క్యాన్సర్ -
నాకు క్యాన్సర్, అప్పటినుంచి తిండి మానేశా..: పవన్ తండ్రి
రీతూ చౌదరితో లవ్ ట్రాక్ వల్ల నెగెటివ్ అయ్యాడు కానీ టైటిల్ గెలవడానికి కావాల్సిన అన్ని అర్హతలు డిమాన్ పవన్ (Demon Pavan)కు ఉన్నాయి. ఆటల్లో గట్టిపోటీనిస్తాడు. ఎంతమందినైనా సరే ఒంటిచేత్తో ఆపగలడు. అతడు టాస్కులో దిగాడంటే ప్రత్యర్థులకు వెన్నులో వణుకు పుడుతుంది. ఆటలో రఫ్ అండ్ టఫ్ కానీ మాటలో మాత్రం ఉట్టి డొల్ల. గట్టిగా మాట్లాడటం చేతకాదు. వెనకబడ్డ పవన్తనను ఎవరైనా నిందిస్తున్నా అమయాకుడిలా పడతాడు, అలుగుతాడు తప్ప రివర్స్ కౌంటరివ్వడం, తిట్టడం చేతకాదు. అందుకే విన్నింగ్ రేస్‌లో లేకుండా పోయాడు. ఫ్యామిలీ టైమ్ కోసం ఇచ్చిన గేమ్‌లో పవన్.. తన ఆట మధ్యలో ఆపేసి దగ్గరుండి సుమన్ తాళ్ల చిక్కుముడులు విప్పుతూ అతడికి సాయం చేశాడు. కానీ, అదెవరికీ కనబడలేదు. తండ్రి కోసం బెంగపవన్కు ఎప్పుడూ ఇంతే! అతడు చేసిన మంచి కన్నా, తప్పులే పెద్దగా కనిపిస్తాయి. అదే అతడికి పెద్ద మైనస్. నిన్నటి ఎపిసోడ్లో పవన్ తల్లి హౌస్‌లోకి వెళ్లి కొడుక్కి గోరుముద్దలు తినిపించింది. ఆ సమయంలో తండ్రి గురించి తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు పవన్. అసలు పవన్ తండ్రికేమైందో? ఆయన మాటల్లోనే విందాం..క్యాన్సర్పవన్ తండ్రి ప్రసాద్ మాట్లాడుతూ.. ఓరోజు నా పన్ను నాలుకకి గుచ్చుకుని సెప్టిక్ అయింది. దీనికేం అవుతుందులే అనుకున్నాను. కానీ, తర్వాత సమస్య పెద్దదైంది. దాంతో పవన్ హైదరాబాద్ తీసుకొచ్చాడు. ఇక్కడ ఆస్పత్రిలో చూపిస్తే క్యాన్సర్ ప్రారంభ దశలో ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. అలా జూన్‌లో సర్జరీ జరిగింది. 4 గంటలపాటు ఈ ఆపరేషన్ జరిగింది.సరిగ్గా మాట్లాడలేని స్థితిలో..నాలుగు రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఐదో రోజు ఇంటికి వెళ్లిపోయాం. కాకపోతే నోటి లోపల చర్మం కట్ చేశారు. దీనివల్ల మాట సరిగా రావడం లేదు. భోజనం చేయడం కూడా మానేశాను. రోజూ జావ తాగుతున్నాను. కేవలం ద్రవపదార్థాలే తీసుకుంటున్నాను అని తెలిపాడు. అందుకే పవన్ తండ్రిపై బెంగ పెట్టుకున్నాడన్నమాట!చదవండి: భరణిని ఒకే ఒక్క కోరిక కోరిన కూతురు -
భరణిని ఒకే ఒక్క కోరిక కోరిన కూతురు
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో టాస్కులకు బ్రేక్ పడింది. ఫ్యామిలీ మెంబర్స్ రాకతో ఇల్లు భావోద్వేగాల నిలయంగా మారింది. ఇప్పటివరకు తనూజ, సుమన్, పవన్, దివ్య, సంజనల కుటుంబ సభ్యులు హౌస్‌లో అడుగుపెట్టారు. ఈరోజు భరణి ఫ్యామిలీ ఇంట్లోకి రానుంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. అందులో భరణి (Bharani Shankar) కూతురు ఇంట్లోకి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది.కూతుర్ని చూడగానే భరణికి కళ్లలో నీళ్లు తిరిగాయి. నీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ ఆమె భరణిని పట్టుకుని ఏడ్చేసింది. నిన్ను చూస్తే గర్వంగా ఉందని పేర్కొంది. అలాగే ఈ వారం కెప్టెన్‌గా చూడాలని మనసులోని కోరిక బయటపెట్టింది. మరి కూతురి కోరిక భరణి నెరవేరుస్తాడా? లేదా? చూడాలి! -
రీతూతో బంధం.. అమ్మతో పంచుకున్న డిమాన్ పవన్
బిగ్‌బాస్ 9 తెలుగులో ఫ్యామిలీ వీక్ కొనసాగుతుంది. కంటెస్టెంట్ల కుటుంబసభ్యులు వస్తున్నారు. బుధవారం ఎపిసోడ్లో డీమాన్ పవన్ తల్లి పద్మ, సంజన ఫ్యామిలీ, దివ్య అమ్మ శ్రీలక్ష్మీ సందడి చేశారు. పిల్లల మీద ఒక తల్లి ఎప్పటికీ స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తుంది. ఈ ఎపిసోడ్ అంతా తల్లుల ప్రేమ చుట్టూ తిరిగింది. వారి అల్లరి, ప్రేమ, కన్నీళ్లు అన్నింటికి ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయిపోయారు. ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా బిగ్‌బాస్ కూడా గట్టిగానే ప్లాన్ చేశాడని చెప్పాలి.రీతూతో ఉండటానికి కారణం ఇదే: పవన్డిమాన్ పవన్ మన ఇంట్లో పిల్లోడిలా ఉంటాడు. ఎలాగైనా సరే తన కలలు నెరవేర్చుకోవాలని పోరాడే మధ్యతరగతి కుర్రోడిలా కనిపిస్తాడు. రీతూ విషయంలో తనని మోకాళ్ల మీద నిల్చోపెట్టినా సరే జీవితంలో గెలవాలనే భరించాడు. బిగ్‌బాస్‌లో పవన్ ఆటను చూసి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అతని అమ్మగారు చాలా ఎమోషనల్ అయ్యారు. తన బిడ్డ ఇంట్లో ఉన్న సమయంలో ఎలాంటి పనిచేసేవాడు కాదంటూ ఒక మధ్యతరగతి తల్లిలా చెప్పే మాటలు మెప్పిస్తాయి. పవన్‌ను హగ్ చేసుకుని గోరుముద్దలు తినిపించడం.. తన తండ్రి ఆరోగ్యం ఎలా ఉందని పవన్ అడుగుతూనే.. ఆయన గురించే బెంగగా ఉందంటూ డిమాన్ ఎమోషనల్ అయ్యాడు. ఆ సమయంలో పవన్‌ను ఓదారుస్తూ.. లేదురా ఏం బాధపడకు.. మొన్నటి కంటే ఇప్పుడే బావున్నారని ఆమె ధైర్యం నింపింది. అయితే, రీతూతో బాండింగ్ పెరగడానికి కారణం ఇలా చెప్పాడు. ' ఇక్కడ మొదట్లో నాకు ఎవరూ సపోర్ట్ చేయకపోయినప్పటికీ రీతూ మాత్రమే ఫస్ట్ నుంచి నాతో ఉంది. ఆమె మాత్రమే నాకు సపోర్ట్‌గా నిలబడింది. ప్రతి టాస్క్‌లో నేను స్ట్రాంగ్ అంటూ ఇతర కంటెస్టెంట్స్ తీసేస్తున్నారు. అలాంటి సమయంలో రీతూ నాకోసం మాట్లాడేది. మనల్ని ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్లని మనమూ బాగా చూసుకోవాలి కదమ్మా.. అందుకే ఆమెతోనే ఎక్కువసేపు ఉంటున్నాను . అయితే, పవన్ మదర్ కూడా ఏం కాదులే అంటూ ఊ కొట్టారు. ఫ్యామిలీ ఫొటో టాపిక్ విషయంలో కూడా అర్థం చేసుకున్నాం అని ఆమె చెప్పింది. పవన్‌ను మోకాళ్ల మీద నిల్చోపెట్టడం కాస్త బాధగా అనిపించిందని ఆమె చివరగా చెప్పింది.సంజన ఫ్యామిలీ కోసం ఇమ్మానియేల్, కల్యాణ్ త్యాగంబిగ్ బాంబ్ వల్ల సంజనాకు ఫ్యామిలీ వీక్ లేదని నాగార్జున చెప్పారు. కానీ, హౌస్‌మేట్స్‌లో ఎవరైనా ముగ్గురి దగ్గరి నుంచి వారి ఫ్యామిలీతో గడిపపే టైమ్ నుంచి కొంత అడిగి తీసుకోవచ్చని బిగ్‌బాస్ ఆఫర్ ఇస్తాడు. దీంతో ఇమ్మానుయేల్ తన 45 నిమిషాల ఫ్యామిలీ టైమ్ నుంచి 15 నిమిషాలు త్యాగం చేశాడు. కల్యాణ్ కూడా తన 15 నిమిషాల నుంచి 5 నిమిషాలు ఇచ్చేందుకు సిద్ధపడితే.. సంజనా తన నుంచి ఒక్క నిమిషం మాత్రమే తీసుకుంది. అలా ఫైనల్‌గా సంజనా తన భర్తతో పాటు పిల్లలను కలుసుకుంది.తనూజ నా పెద్ద కూతురు: దివ్య అమ్మదివ్య మదర్ శ్రీలక్ష్మీ అదరగొట్టేశారు. అందరికంటే ఆమె చాలా ప్రత్యేకంగా కనిపించారు. హౌస్‌లోకి అడుగుపెట్టిన సమయం నుంచి అందరినీ తెగ నవ్వించారు. దివ్య కంటే ఇతర హస్మేట్స్తోనే ఆమె ఎక్కువగా మాట్లాడుతూ మెప్పించారు. దివ్య తల్లి మాటలకు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు. దివ్య తన అమ్మతో ఉన్న అనుబంధాన్ని చాలా రియలిస్టిక్‌గా చూపించింది. దివ్య చిన్నతనంలో చేసిన అల్లరి విశేషాలను వారితో సరదాగా పంచుకుంది. భరణి తనకు సొంత అన్నయ్య మాదిరి కనిపిస్తారని చెప్పింది. ఆపై తనూజ తనకు పెద్ద కూతరులాంటిదని హగ్ చేసుకుంది. ప్రతి ఇంట్లో పెద్ద కూతురులా తనూజ కనిపిస్తుందని మెచ్చుకుంది. తనూజ మాదిరే మా పెద్ద అమ్మాయి కూడా ఉంటుందని చెప్పింది. ఇక డిమాన్ పవన్-రీతూ రిలేషన్ గురించి మాట్లాడుతూ పంచ్‌లు వేసింది. ఈ ఎపిసోడ్ మొత్తం దివ్య మదర్ క్రాక్ చేసి రచ్చలేపిందని చెప్పాలి. దివ్య కంటే మరింత స్పోర్టివ్‌గా ఆమె ఉండటం విశేషం -
బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్: తనూజతో తగ్గించండి.. సుమన్‌కి భార్య సలహా
బిగ్‌బాస్ షోలో మిగతా అన్ని వారాలు ఎలా ఉన్నాసరే ఫ్యామిలీ వీక్ అంటే మాత్రం అటు హౌస్మేట్స్, ఇటు ప్రేక్షకులకు బోలెడంత ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఈ వారమంతా అందరూ ఒక్కటైపోతారు. ఈసారి కూడా ఫ్యామిలీ వీక్ మొదలైపోయింది. అంతకంటే ముందు సోమవారం నామినేషన్స్ ప్రక్రియ జరగ్గా.. దివ్య, పవన్, భరణి, ఇమ్ము, సంజనా, కల్యాణ్ నామినేట్ అయ్యారు. రీతూ కూడా అయ్యింది కానీ కెప్టెన్ తనూజ వల్ల ఆమె సేవ్ అయిపోయింది.ఈసారి ఫ్యామిలీ వీక్ నేరుగా మొదలుపెట్టేయకుండా బిగ్‌బాస్.. చిక్కుముడి అనే టాస్క్ పెట్టాడు. ఇందులో భాగంగా ఓ ఫ్రేమ్‌కి గజిబిజిగా కట్టున్న తాడుని విప్పి, ఒంటికి చుట్టుకుని.. చివరలో దాన్ని విప్పి మాగ్నెటిక్ బోర్డులో ఉన్న టైమ్ కార్డ్‌ని తీసుకోవాల్సి ఉంటుంది. బిగ్ బాంబ్ ఉన్న కారణంగా సంజనకు ఈసారి ఛాన్స్ లేదు. దీంతో ఆమెని ఈ టాస్క్ కోసం సంచాలక్‌గా పెట్టారు. కెప్టెన్ కావడంతో తనూజకు నేరుగా టైమ్ తీసుకునే ఛాన్స్ బిగ్‌బాస్ ఇవ్వడంతో 60 నిమిషాల టైమ్ కార్డ్ తీసుకుంది. తర్వాత పోటీ జరిగింది. ఇమ్మాన్యుయేల్ 45, పవన్ 30, కల్యాణ్ 20, దివ్య 20, సుమన్ 15, రీతూ 15, భరణి 15 నిమిషాల కార్డ్స్ తీసుకున్నారు.(ఇదీ చదవండి: నయనతార బర్త్ డే.. గిఫ్ట్‌గా ఖరీదైన రోల్స్ రాయిస్)తొలుత సుమన్ శెట్టికి అవకాశమొచ్చింది. 16వ పెళ్లిరోజు అని చెప్పి భార్య లాస్య నుంచి లెటర్ వచ్చింది. అలానే ఓ స్పెషల్ కోట్ కూడా వచ్చింది. దీంతో సుమన్ రెడీ కాగానే.. భార్య లాస్య లోపలికి వచ్చింది. చాలారోజుల తర్వాత కలిసేసరికి సుమన్, భార్యని పట్టుకుని పిల్లాడిలా ఏడ్చేశాడు. అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత చివరలో లాస్య.. 'టాప్-5లో ఉండాలి. గెలిస్తే ఇంకా హ్యాపీ. తనూజతో తగ్గించండి. హైప్లో ఉండేవాళ్లని దగ్గర చేసుకుంటుంది. ఏడవద్దు' అని చెప్పి వెళ్లిపోయింది.సుమన్ భార్య వెళ్లిపోయిన కాసేపటి తర్వాత తనూజ ఫ్యామిలీ నుంచి వచ్చారు. చెల్లితో పాటు అక్క కూతురు శ్రేష్ఠ హౌస్‌లోకి వచ్చింది. చెల్లి పూజ లోపలికి రాగానే.. పెళ్లి కూతురు పూజ అని చెబుతూ హౌస్మేట్స్ అందరికీ తనూజ తన చెల్లిని పరిచయం చేసింది. తనే చెల్లి, కానీ నాకు అమ్మ లాంటిది అని కూడా అందరితో చెప్పింది. ఇద్దరూ సెపరేట్‌గా వెళ్లి మాట్లాడుకున్నారు. 'ఎక్కువగా బాధపడకు, ఏడవుకు. అను, అమ్మని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంది. నా పెళ్లికి కొన్నిరోజులే ఉంది. నువ్వు గేమ్ ఆడేదంతా ఫెర్ఫెక్ట్గా ఉంది. నువ్వే చేస్తావో నాకు తెలీదు నువ్వే గెలవాలి. నా పెళ్లికి బిగ్‌బాస్ టైటిల్ కావాలి' అని పూజ, తనూజకి మంచి బూస్టప్ ఇచ్చింది. చివరికు పూజని పెళ్లి కూతురిని చేసి, ఆమెని హౌస్ నుంచి పంపించారు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: 'రాధేశ్యామ్' దర్శకుడి ఇంట్లో విషాదం) -
భార్యని పట్టుకుని పిల్లాడిలా ఏడ్చేసిన సుమన్ శెట్టి
బిగ్‌బాస్ షోలో ఫ్యామిలీ వీక్ కోసం ప్రతిఒక్కరూ ఎదురుచూస్తారు. ఎందుకంటే మిగతా రోజులు ఎంత గొడపడ్డా సరే 'ఫ్యామిలీ వీక్' వచ్చేసరికి హౌస్మేట్స్ అందరూ ఒక్కటవుతారు. చూస్తున్నంతసేపు నిజమైన ఎమోషన్స్ బయటకొస్తాయి. అందుకే ప్రేక్షకులు కూడా ప్రతి సీజన్లోనూ దీనికోసమే ఎదురుచూస్తుంటారు. ఈసారి 9వ సీజన్లో మొదలైపోయింది. ఇప్పటికే తనూజ కుటుంబ సభ్యులు రాగా.. సుమన్ శెట్టి భార్య కూడా హౌస్‌లోకి వచ్చింది. ఈ ప్రోమో చాలా బాగుంది.తొలుత సుమన్ శెట్టిని కన్ఫెషన్ గదికి పిలిచిన బిగ్‌బాస్.. మీరు పొందిన టైమ్ కార్డ్ ద్వారా మీ కుటుంబ సభ్యునితో 20 నిమిషాలు మాత్రమే గడపగలరు అని చెప్పారు. మరీ ఇంత తక్కువ సమయమేనా అని సుమన్ బాధపడ్డాడు గానీ గార్డెన్ ఏరియాలో ఉన్న తన భార్యని చూసి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెని గట్టిగా హత్తుకున్నాడు. బుగ్గపై ముద్దుపెట్టి మరీ ఎలా ఉన్నావ్ అని క్యూట్‌గా అడిగాడు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి పూజ.. కుంకుమ పెట్టి ఏడ్చేసిన 'తనూజ')అలానే అమ్మ ఆరోగ్యం ఎలా ఉందని సుమన్ చాలా బెంగపడుతూ భార్యని అడిగాడు. బాగానే ఉన్నారని చెప్పడంతో.. గౌతమ్ రాలేదేమీ అంటూ తన బిడ్డ గురించి సుమన్ అడిగాడు. ఒక్కరికే పర్మిషన్ ఇచ్చారని చెప్పడంతో ఊరుకున్నాడు. బాగా ఆడుతున్నానా అని తన ఆట గురించి భార్యని స్వీటుగా అడిగాడు. చాలా బాగా ఆడుతున్నావ్ అని చెప్పిన సుమన్ భార్య.. నీకు ఇష్టమని ఫుడ్ తెచ్చానని చెప్పింది. ఇది ఒకరికి ఒకరు తినిపించుకున్నారు.నువ్వు తిను, నువ్వు తిను అంటూ సుమన్, అతడి భార్య ఒకరికి ఒకరు ఆప్యాయంగా తినిపించుకున్నారు. ఇది అయిన తర్వాత గార్డెన్ ఏరియాలో ఇద్దరూ కలిసి చిన్న స్టెప్పులేస్తూ డ్యాన్స్ చేశారు. అదే టైంలో మిగిలిన హౌస్మేట్స్ కూడా వీళ్లని ఎంకరేజ్ చేస్తూ సంతోషంగా గంతులేశారు. ప్రోమోనే ఇంత బాగుందంటే.. ఎపిసోడ్ ఇంకెంత బాగుండబోతుందో?(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు డబ్బింగ్ సినిమా) -
బిగ్‌బాస్‌లోకి పూజ.. కుంకుమ పెట్టి ఏడ్చేసిన 'తనూజ'
బిగ్‌బాస్ 9 తెలుగులో ఈ వారం మొత్తం సందడిగా కనిపించనుంది. కంటెస్టెంట్స్‌కు సంబంధించిన కుటుంబ సభ్యులు హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. దీంతో ఎమోషన్స్‌తో పాటు సంతోష క్షణాలు కనిపిస్తాయి. సుమారు 70రోజుల తర్వాత తమ కుటుంబ సభ్యులను చూస్తుండటంతో అందరూ భావోద్వేగానికి లోనవుతారు. ఫ్యామిలీ వీక్‌లో భాగంగా ఫస్ట్ ఎంట్రీ తనూజ కుటుంబ సభ్యులు వచ్చారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ టీమ్ ప్రోమో వదిలింది.తనూజ చెల్లి పూజ బిగ్‌బాస్‌లోకి వచ్చింది. తనను చూడగానే ఒక్కసారిగా తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. కొద్దిరోజుల్లోనే తన పెళ్లి ఉందంటూ పూజను అందరికీ పరిచయం చేస్తుంది. తనూజ బిగ్‌బాస్‌లో ఉండటం వల్ల పెళ్లికి వెళ్లడం కుదరదు. దీంతో ఆమె మరింత ఎమోషనల్ అయిపోయింది. హౌస్‌లోనే పసుపు, కుంకుమతో పాటు బొట్టు పెట్టి ఆపై కొన్ని గాజులు, బట్టలు తన చెల్లి ఒడిలో పెడుతుంది. అక్కగా ఆశీర్వదించగా పూజ కూడా తనూజ కాళ్లకు నమష్కారం చేస్తుంది. తనూజ కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు.. అక్క అనూజ లాయర్ కాగా.. చెల్లి పూజ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అనూజకు ఇప్పటికే పెళ్లి అయిపోయింది. ఆమె కూతురు కూడా బిగ్‌బాస్‌లోకి వెళ్లింది. -
రీతూతో కల్యాణ్.. రెచ్చిపోయిన పవన్
బిగ్‌బాస్ తెలుగు 9లో సోమవారం నాడు నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. ఇందులో భాగంగా డెమాన్ పవన్, రీతూల మధ్య జరిగిన గొడవ ప్రధానంగా నిలిచింది. ఆపై సుమన్ శెట్టి, డెమాన్ పవన్‌లు ఇద్దరూ కల్యాణ్‌పై మాటల తూటాలు పేల్చారు. అయితే, ఈ వారం నామినేషన్స్‌లో ఒక్కోక్కరికి కల్యాణ్ అంతే రేంజ్లో తరిగిచ్చిపడేశాడు. కప్టెన్గా ఉన్న తనూజ నామినేషన్స్ విషయంలో ఫుల్ స్ట్రాటజీతో తన అభిమానులను మెప్పించింది.రీతూను కాపాడిన తనూజఈ వారం నామినేషన్ ప్రక్రియ మొత్తం తనూజ చేతిలో బిగ్‌బాస్ పెట్టాడు. ఎవరు ఎంతమందిని నామినేట్ చేయాలనేది తనూజకే ఆప్షన్ ఇచ్చాడు. ఇందులో భాగంగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడని ముద్రపడిన భరణి, ఇమ్మాన్యుయేల్‌కు షాకిచ్చింది. ఇద్దరిని నామినేషన్ చేయమని ఆమె కోరింది. కానీ, కల్యాణ్, సుమన్‌లకు మాత్రం సింపుల్‌గా ఒక్కరిని మాత్రమే నామినేషన్ చేయమని సూచిస్తుంది. ఫైనల్‌గా నామినేషన్లోకి 'దివ్య, రీతూ, డెమాన్ పవన్, భరణి, ఇమ్ము, సంజనా, కల్యాణ్'లు వస్తారు. నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎవరినైనా ఒక్కరిని సేవ్ చేయమని కెప్టెన్ తనూజను బిగ్‌బాస్ కోరుతాడు. దీంతో రీతూను సేవ్ చేస్తున్నట్లు తనూజ చెబుతుంది. అలా ఈ వారం నామినేషన్ నుంచి రీతూ బయటపడింది.డెమాన్లో మార్పు రాకుంటే ఇంటికేఎపిసోడ్ ప్రారంభం కాగానే డెమాన్ పవన్,రీతూ ఒకే బెడ్‌పై ఒకే బెడ్ షీట్లో ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైమ్‌లో వారి మద్యలోకి కల్యాణ్ రావడంతో డెమాన్ పవన్ ఫీల్ కావడమే కాకుండా లేచి వెళ్లిపోతాడు. మరుసటిరోజు పొద్దున్నే రీతూని కూర్చోబెట్టి క్లాస్ పీకుతాడు. మనం మాట్లాడుకుంటుంటే మధ్యలో వాడు (కల్యాణ్) వచ్చాడు. అప్పుడు వాడ్ని పంపించేయొచ్చు కదా అంటూ రీతూపై ఫైర్ అవుతాడు. అలా రావద్దని కల్యాణ్‌కు ఎలా చెబుతాను రా అంటూ పవన్‌ను తిరిగి ప్రశ్నిస్తుంది. ప్రతి చిన్నవిషయాన్ని బూతద్దంలో పెట్టి చూస్తున్నావ్ ఏంట్రా అంటూ గట్టిగానే రీతూ నిలదీస్తుంది. దాంతో పవన్ ఇంకా దిగజారిపోయేలా తిరిగి కౌంటర్ ఇస్తాడు. అలా ఎవరైనా మన మధ్యలోకి వచ్చినప్పుడు నన్ను వదిలేస్తానంటే నువ్వు నాకు వద్దుని రీతూపై మండిపడతాడు. ఇలాంటి చెత్త కారణాలు చూపుతూ ఫైనల్‌గా రీతూను పవన్ నామినేట్ చేయడం మరీ దారుణంగా అనిపిస్తుంది. ఇక్కడ రీతూ చాలా హుందాగా పవన్‌తో వ్యవహరించింది. కానీ, పవన్ ఈ ఎపిసోడ్‌తో చాలా డ్యామేజ్ చేసుకున్నాడు. ఈ వారం ఫ్యామిలీ వీక్‌లో భాగంగా పవన్ మదర్ వెళ్తున్నారట. ఆమె ఏమైనా సలహాలు ఇచ్చిన తర్వాత తన గేమ్‌ను మార్చుకునే ఛాన్స్ ఉంది. ఈ గొడవతో రీతూ, పవన్‌లలో ఒక్కరు మాత్రమే టాప్-5కు చేరుకుంటారని తెలుస్తోంది.కల్యాణ్ అదరగొట్టేశాడుఈ వారంలో కల్యాణ్‌ను సుమన్, పవన్, సంజనా నామినేట్ చేశారు. అయితే, పూర్తిగా కల్యాణ్ పైచేయి సాధించాడు. ముగ్గురికి సరైన కౌంటర్స్‌తో ఇచ్చిపడేశాడు. మొదట డెమాన్ పవన్ రంగంలోకి దిగి కల్యాణ్‌ను నామినేట్ చేస్తూ.. పాత విషయాలను తీసుకొస్తాడు. గతంలో జరిగిన సంఘటనలను తీసుకొచ్చి పిచ్చిపిచ్చి స్టేట్మెంట్స్తో కల్యాణ్‌పై మాటలు తూలుతాడు. నమ్మకం గురించి కొన్ని విషయాలను గుర్తూ చేస్తూ కల్యాణ్‌ను తప్పుబట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ, కల్యాణ్ ఎప్పుడు కూడా పవన్ విషయంలో మోసం చేయలేదు. ఇంకా చెప్పాలంటే గతంలో పవన్ చేతిలోనే కల్యాణ్ మోసపోయాడు. రీతూ కోసం అతన్ని ఆట నుంచే తప్పించేశాడు. ఇలా కొన్ని చెత్త రీజన్లతో పవన్‌కు బాగా మైనస్ అయిపోయింది. సుమన్ ఫైర్టవర్ టాస్క్‌లో వరస్ట్ సంచాలక్ అంటూ కల్యాణ్‌ను నామినేట్ చేస్తున్నట్లు సుమన్ చెప్తాడు. టవర్ స్ట్రైట్‌గా ఉండాలని ముందు చెప్పలేదని సుమన్ ఫైర్ అవుతాడు. అయితే, వీకెండ్లో నాగార్జున చూపించిన వీడియోతో తేలిపోయింది. నిజమైన విన్నర్ సంజనానే అని ప్రేక్షకులకు కూడా క్లారిటీ వచ్చేసింది. ఇదే విషయాన్ని కల్యాణ్ కూడా చాలా బిగ్గరగానే వినూ.. వినూ.. అంటూ వేలు చూపిస్తూ సుమన్ శెట్టి మీదికి వెళ్లాడు. దాంతో సుమన్ శెట్టి రిటర్న్‌గా వేలు దించూ కల్యాణ్ అంటూ ఊగిపోతాడు. ఆ తర్వాత కల్యాణ్ వేలు నీ వైపు చూపించడం లేదన్నా అంటూ చెప్పడంతో వాగ్వాదం ముగిసింది. ఇక సంజన కూడా సిల్లీ రీజన్‌తోనే కల్యాణ్‌ను నామినేట్ చేసింది. ఆ టాపిక్ గురించి చెప్పుకోవడం టైమ్ దండగ.. మొత్తానికి ఈ వారం నామినేషన్లో కల్యాణ్ దమ్మున్న పాయింట్లతో తిరిగి కౌంటర్ ఇచ్చాడు. -
నన్ను తొక్కుతూనే ఉన్నావ్.. రీతూ ఫ్రస్టేషన్
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో ఫైర్ స్ట్రామ్స్ అంటూ వచ్చిన ఆరుగురు వరుసగా ఎలిమినేట్ అయ్యారు. వీరికంటే ముందు వైల్డ్‌కార్డ్‌గా వచ్చిన దివ్య మాత్రం ఎలాగోలా నెట్టుకొస్తోంది. కానీ, ఈవారం ఆమెకు కష్టకాలంలాగే కనిపిస్తోంది. నేడు హౌస్‌లో నామినేషన్స్ జరగనున్నాయి. ఈ మేరకు రెండో ప్రోమో వదిలారు.అన్నీ రివేంజ్ నామినేషన్స్ఇందులో భరణి.. తాను బాగా ఆడలేదన్న ఇమ్మాన్యుయేల్‌ను నామినేట్ చేశాడు. టెడ్డీ బేర్ టాస్క్‌లో ప్రతి రౌండ్లో నువ్వు నాకంటే వెనకే ఉన్నావ్.. అని గుర్తు చేశాడు. కల్యాణ్ కూడా అదే పని చేశాడు. తనను నామినేట్ చేసిన పవన్ (Demon Pavan)ను తిరిగి నామినేట్ చేశాడు. ఇక రీతూ.. దివ్యను నామినేట్ చేసింది. నేను ఈ గేమ్‌లో గెల్చాను. నేను ఇందులో సూపర్.. అందులో సూపర్.. కానీ ఆమె ఏ గేమ్‌లో గెల్చింది? అంటూ నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నావ్ అంది. రీతూ వర్సెస్ దివ్యనీకంటే నేను ఎందుకు బెటరో చెప్తాను.. నీకు టాస్క్ అర్థమే కాదు. అలాంటిది నువ్వు గేమ్స్ గురించి మాట్లాడుతున్నావా? అని దివ్య ఇచ్చిపడేసింది. తర్వాత దివ్య రీతూని నామినేట్ చేసింది. ఈక్రమంలో 'ఇంకా ఎంతకాలం నన్ను తొక్కుతావ్?' అని రీతూ అసహనం వ్యక్తం చేసింది. మొత్తానికి ఈ వారం సంజన, దివ్య, పవన్, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, భరణి నామినేషన్స్‌లో ఉన్నారు. డేంజర్ జోన్లో దివ్యవీరిలో కల్యాణ్, ఇమ్మూలకు ఓట్లు భారీగా పడతాయి. అందులో డౌటే లేదు. పవన్, భరణి, సంజనకి కూడా ఈ మధ్యకాలంలో నెగెటివిటీ లేదు కాబట్టి కాస్త సేఫ్ జోన్లో ఉన్నారు. గత రెండు వారాలుగా దివ్య ఎక్కువ నెగెటివ్ అవుతూ వస్తోంది. ఈ వారం కూడా ఆ నెగెటివిటీ పాజిటివిటీగా మారకపోతే తను వెళ్లిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫ్యామిలీ వీక్ కోసం సంజనాను ఇంతవరకు తీసుకొచ్చారు. ఈ వారం ఆ అవసరం తీరిందని ఆమెను పంపించేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చదవండి: పుష్పను కాపీ కొట్టలేదు: మలయాళం హీరో -
రీతూ గుండె ముక్కలు చేసిన పవన్.. ఊహించని నామినేషన్స్
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లో రెండు ఊహించనివి జరగబోతున్నాయి. పదివారాలుగా నామినేషన్స్‌లోకి రాకుండా ఉన్న ఇమ్మాన్యుయేల్.. ఎట్టకేలకు పదకొండోవారం నామినేషన్స్‌లోకి వచ్చేశాడు. ఇక ఫ్రెండ్స్‌కు ఎక్కువ, ప్రేమికులకు తక్కువ అన్నట్లుగా ఉండే పవన్-రీతూల మధ్య పెద్ద అగాధం ఏర్పడనుంది. కారణం.. పవన్ రీతూని నామినేట్ చేశాడు. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది.నీకు కాన్ఫిడెన్స్ లేదురీతూ.. గేమ్‌లో వెనకబడిపోయింది. తనకు కాన్ఫిడెంట్ లేదు అని ఇమ్మాన్యుయేల్ నామినేట్ చేశాడు. కాన్ఫిడెన్స్ లేనిది నీకంటూ తిరిగి వాదించింది రీతూ. ఇమ్మూ.. భరణి ఆటలో పూర్తిగా ఎఫర్ట్స్ పెట్టడం లేదన్నాడు. నాకు తగిలిన దెబ్బలు నీకు తగిలితే ఇంతకుముందులా ఆడలగలవా? పర్ఫామెన్స్ అంటే కేవలం టాస్కులే కాదు. ప్రతి టాస్క్ నాకు సాధ్యమైనంతవరకు ఆడుతున్నా అని వివరణ ఇచ్చాడు.ఏడిపించేసిన పవన్ఇక పవన్ (Demon Pavan).. రీతూని నామినేట్ చేశాడు. నువ్వు అరవడం వల్ల నా తప్పు లేకపోయినా నాదే తప్పు అన్నట్లుగా బయటకు వెళ్తుంది. అది బాధగా ఉంది. ప్రతిసారి నీది తప్పు లేదని స్టాండ్ తీసుకుని మాట్లాడటానికి ప్రయత్నించాను. కానీ, నాపై నమ్మకం లేదంటూ హర్ట్ చేశావ్. ప్రతిసారి నీ మంచే కోరుకున్నా.. అంటూ కన్నీళ్లు దిగమింగుతూ పాయింట్లు చెప్పాడు.మౌనంగా రీతూతనకు ఎదురొచ్చే ఎవరి నోరైనా మూయించే రీతూ (Rithu Chowdary).. ఈసారి మాత్రం మూగబోయింది. అందరికంటే ఎక్కువ ఇష్టపడే పవన్ తనను నామినేట్ చేస్తుంటే తట్టుకోలేక కన్నీళ్ల రూపంలో తన బాధను వ్యక్తపరిచింది. నామినేషన్స్ అయ్యాక నాతో మాట్లాడొద్దని చెప్పాను కదా.. అని రెండు చేతులతో తల బాదుకుంది. ఎందుకరుస్తున్నావని పవన్ అడిగితే నా వల్ల కావడం లేదంది. నామినేషన్స్‌లో ఆరుగురుఅందుకు పవన్ కూడా.. నావల్ల కూడా కావడం లేదని అరిచి వెళ్లిపోయాడు. మొత్తానికి ప్రోమో అయితే రీతూ-పవన్ ఫ్యాన్స్‌ను హర్ట్ చేసేలాగే ఉంది. ఇకపోతే సంజన, రీతూ, దివ్య, డిమాన్, కల్యాణ్, ఇమ్మూ, భరణి నామినేషన్స్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. తనూజ కెప్టెన్సీ పవర్‌తో రీతూని సేవ్ చేసినట్లు భోగట్టా! చదవండి: నన్ను బ్యాడ్ చేయొద్దు.. ఇమ్మూపై గరమైన తనూజ -
సంజన కోసం రీతూ త్యాగం.. ఇలాగైతే తనూజ గెలవడం కష్టమే!
వారాలు గడిచేకొద్దీ ఎవరైనా తమను తాము సాన పెట్టుకుని ముందుకెళ్తారు. కానీ, తనూజ మాత్రం రివర్స్ గేర్‌లో వెళ్తోంది. చీటికిమాటికి నోరు పారేసుకుంటూ గొడవపడుతూ చికాకు పుట్టిస్తోంది. తనూజ నా బలహీనత అని ఇమ్మూ శనివారం ఎపిసోడ్లో చెప్పినందుకు అతడ్ని చెడుగుడు ఆడేసుకుంది. మరోవైపు రీతూ ఫేవరెట్ హీరో నాగచైతన్య స్టేజీపైకి వచ్చేసరికి తను గాల్లో తేలిపోయింది. హౌస్‌లో ఇంకా ఏం జరిగిందో ఆదివారం (నవంబర్ 16వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం...ఇమ్మూతో గొడవనీకు, నాకు మధ్య ఏ బాండింగ్ లేదు, ఫ్రెండ్షిప్ లేదు. నేనెలా నీకు బలహీనత అవుతాను అంటూ తనూజ (Thanuja Puttaswamy) ఇమ్మూని నిలదీసింది. అందుకతడు.. నువ్వేదైనా అంటే పర్సనల్‌గా ఫీలవుతా.. అది నా వీక్నెస్ అన్నాడు. అక్కడే ఉన్న రీతూ కూడా.. మేము బయట చాలా క్లోజ్ ఫ్రెండ్స్.. కాకపోతే నాకంటే వాడికి నువ్వే ఎక్కువని చెప్పాడు అంది. అప్పటికీ తనూజ తగ్గలేదు. నన్ను చెడ్డదానిగా చిత్రీకరించకుమూడు వారాల తర్వాత మేము మామూలుగా కూర్చుని మాట్లాడుకుందే లేదంటూ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లు వ్యవహరించింది. నాకైతే ఆ బాండ్ ఉంది అని ఇమ్మూ సింపుల్‌గా తేల్చేశాడు. ఇంకా ఏదో మాట్లాడుతుంటే.. నన్ను బ్యాడ్ చేయకు.. నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా.. నువ్వేదో నాకు సపోర్ట్ చేస్తున్నట్లు, నా మీద ప్రేమ చూపిస్తున్నట్లు చేయకు, నీ గేమ్ నువ్వు ఆడుకో, నా పేరు తేకు అని ఫైర్ అయింది. తనూజకు నాగ్ సలహాసారీ, నీ పేరు ఇంకెప్పుడూ తీసుకోను అని ఇమ్మూ అంటే థాంక్యూ, పాయింట్ ఉంటే నామినేట్ చేయ్ అని సవాలు విసిరింది. ఈ గొడవంతా విన్న నాగార్జున.. అవతలి వారి అభిప్రాయాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నావ్? వారి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, కానీ, సాగదీయకు అని సలహా ఇచ్చాడు. తర్వాత నాగ్ తనయుడు, హీరో నాగచైతన్య స్టేజీపైకి వచ్చాడు. రీతూ గెలిస్తేనే ఆఫర్ఈ మధ్యే హైదరాబాద్ రేసింగ్ టీమ్ కొనుగోలు చేశానంటూ తన టీమ్ అందర్నీ పరిచయం చేశాడు. ఇక చైతో రైడ్ అనగానే హౌస్ నుంచి బయటకు వచ్చేస్తానంది రీతూ. ఇప్పుడెందుకు? గెలిచిరా.. అప్పుడు రైడ్‌కు తీసుకెళ్తానన్నాడు చై. చివరగా దివ్యను సేవ్ చేసి గౌరవ్ (Gaurav Gupta) ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు నాగ్. తనూజ దగ్గరున్న గోల్డెన్ బజర్ ఉపయోగించి గౌరవ్‌ను సేవ్ చేసి దివ్యను ఎలిమినేట్ చేయొచ్చన్నాడు నాగ్.గౌరవ్ ఎలిమినేట్కానీ, తనూజ ప్రేక్షకుల ఓట్లకు గౌరవం ఇస్తున్నానంటూ తన దగ్గరున్న పవర్ వాడలేదు. దీంతో చిట్టచివరి ఫైర్ స్ట్రామ్ గౌరవ్ సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. తండ్రి షర్ట్ కోసం సంజనా చీరల్ని పంపించేసిన రీతూ యూటర్న్ తీసుకుంది. సంజనాకు చీరల్ని పంపించండి, నేను షర్ట్ వెనక్కు ఇచ్చేస్తానంది. అందుకు నాగ్ ఒప్పుకోవడంతో ఆమెకు చీరలు రానున్నాయి.చదవండి: గౌరవ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే? -
బిగ్‌బాస్ నుంచి 'గౌరవ్' ఎలిమినేట్.. రెమ్యునరేషన్ కూడా తక్కువే
బిగ్‌బాస్ తెలుగు 9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా గౌరవ్ హౌస్ నుంచి వచ్చేశాడు. ఇప్పటికే శనివారం ఎపిసోడ్లో నిఖిల్ నాయర్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. వీరిద్దరూ కూడా వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో వచ్చిన కంటెస్టెంట్స్ కావడం విశేషం. ఈ వారంలో 10 మంది నామినేషన్స్‌లో ఉండటంతో ఎలిమినేషన్ దెబ్బ వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో వచ్చిన వారిపై పడింది. ఎలిమినేషన్ రౌండ్లో చివరి వరకు దివ్య, గౌరవ్ ఉంటే ఫైనల్‌గా తక్కువ ఓట్లు తెచ్చుకున్న గౌరవ్ హౌస్ నుంచి బయటకు రావాల్సి ఉంటుందని హౌస్ట్ నాగార్జున ప్రకటించారు. అయితే, తన రెమ్యునరేషన్ కూడా ఇతర కంటెస్టెంట్స్‌తో పోలిస్తే కాస్త తక్కువేనని తెలుస్తోంది.అక్టోబర్ 12న వైల్డ్ కార్డ్‌గా హౌస్‌లోకి గౌరవ్ ఎంట్రీ వచ్చాడు. అయితే, అతడికి వారానికి రూ. 1.5 లక్షల మేరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. ఈ లెక్కన ఐదువారాలకుగానూ రూ.7.5 లక్షల మేరకు సంపాదించాడు. ప్రస్తుతం 'గీత ఎల్ఎల్బీ' అనే సీరియల్ గౌరవ్ నటిస్తున్నాడు. అతనితో పాటు ఎలిమినేట్ అయిన నిఖిల్ ఐదువారాలకు రూ. 12 లక్షలకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్ల తెలుస్తోంది.తనూజ సేవింగ్ పవర్ఆదివారం ఎపిసోడ్లో భాగంగా ఎలిమినేషన్ డేంజర్ జోన్లో ఉన్న దివ్య-గౌరవ్ ఇద్దరూ చివరి వరకు మిగిలారు. ఇందులో దివ్య సేఫ్ అయి గౌరవ్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే, తనూజ దగ్గరున్న సేవింగ్ పవర్‌ను ఉపయోగిస్తావా అని నాగార్జున అడుగుతూ అది ఈ వారంతో ఎక్స్పెయిర్ అవుతుందని గుర్తుచేస్తారు. ఒకవేళ ఉపయోగిస్తే ఓట్ల ద్వారా సేవ్ అయిన దివ్య ఎలిమినేట్ అవుతుందని క్లారిటీ ఇస్తారు. అప్పుడు మాత్రమే గౌరవ్ సేఫ్ అవుతాడని కండీషన్ పెడుతారు. దీంతో తనూజ కొంత సమయం ఆలోచించి ఆడియన్స్ ఇచ్చిన ఓటింగ్‌ను గౌరవిస్తున్నానంటూ తన వద్ద ఉన్న సేవింగ్ పవర్‌ను వాడటం లేదని చెప్పడంతో గౌరవ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. అలా దివ్య కూడా సేఫ్ అయిపోయింది. -
దివ్యకు తక్కువ ఓట్లు.. ఆ రెండు కారణాల వల్లే!
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో పది మంది మిగిలారు. వారిలో నుంచి ఒకరు (గౌరవ్) ఈరోజు ఎపిసోడ్లో ఎలిమినేట్ కానున్నారు. అంటే తొమ్మిది మంది మిగలనున్నారు. వచ్చేవారం వీరందరి కుటుంబసభ్యులు ఇంట్లోకి అడుగుపెట్టనున్నారు. అయితే ఈ వారం డేంజర్ జోన్లో నిఖిల్, గౌరవ్‌తో పాటు దివ్య కూడా ఉంది. తాజా ప్రోమోలోనూ అదే చూపించారు.ఆ రెండింటి వల్లే..నిఖిల్‌ను నిన్ననే పంపించేయగా నేడు గౌరవ్, దివ్య (Divya Nikhita)ను నిల్చోబెట్టారు. వీరిలో ఒకరే ఎలిమినేట్ అని నాగ్ ప్రకటించాడు. షూటింగ్ ఆల్రెడీ ముగియడంతో వెళ్లిపోయేది గౌరవ్ అని అందరికీ తెలిసిపోయింది. అయితే వైల్డ్ కార్డ్‌గా వచ్చిన దివ్యకు ఓట్లు తక్కువ పడి డేంజర్ జోన్లో ఉండటానికి రెండే రెండు కారణాలున్నాయి. ఒకటి తనూజను టార్గెట్ చేయడం, రెండు భరణిపై పెత్తనం చెలాయించడం.ఆ గేమ్ కొంప ముంచిందిగత వారం కెప్టెన్సీ గేమ్‌లో తనూజను తీసేయనని మాటిచ్చి ఆమెను సైడ్ చేయడంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నాగార్జున ఎదుట దోషిలా నిలబడాల్సి వచ్చింది. ఇక భరణి ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది ఆర్డర్లేస్తోంది. అతడు చేసింది ఏదైనా నచ్చకపోతే చాలు ఒకటే నస పెడుతోంది. ఎపిసోడ్లో ఆ సీన్లు కొన్ని ఎత్తేస్తున్నారు కానీ లైవ్ చూసేవాళ్లకు మాత్రం పిచ్చెక్కిపోతోంది.తనూజపై కుళ్లు?ఈ బంధాల్లో చిక్కుకుని బలైపోయిన భరణి.. తనూజ, దివ్యకు దూరంగా ఉండాలనుకున్నాడు. తనూజ దూరంగానే మెదులుతోంది, కానీ దివ్య మాత్రం ఫెవికాల్లా అతుక్కుపోయింది. పైగా ఈ వారం తనూజ కెప్టెన్ అయినప్పుడు భరణి సంతోషంతో ఆమెను ఎత్తుకున్నాడు. అది కూడా చూసి సహించలేకపోయింది దివ్య. నేను కెప్టెన్ అయినప్పుడు ఎందుకు ఎత్తుకోలేదు? అన్న ప్రశ్న లేవనెత్తింది. ఆమె సరదాగా అన్నా, సీరియస్‌గా అన్నా తనకు తనూజ అంటే ఈర్ష్య అని జనాలు బలంగా నమ్మారు.గండంబీబీ రాజ్యంలో కొన్ని సీక్రెట్ టాస్క్‌లు చేసినప్పటికీ ఆ క్రెడిట్ అంతా సుమన్‌కే పోయింది. అయినదానికి, కానిదానికి నోరేసుకుని పడిపోవడం కూడా తనకు మైనస్ అయింది. తన తీరు మార్చుకోకపోతే, మంచి ఎపిసోడ్ పడకపోతే మాత్రం వచ్చేవారం దివ్య ఎలిమినేట్ అవడం ఖాయం. మరి తనను తాను ఎలా కాపాడుకుంటుందో చూడాలి! చదవండి: రీతూని రైడ్‌కు తీసుకెళ్తానన్న చైతన్య -
చైతో బైక్ రైడ్ ఆఫర్.. ఇంట్లో నుంచి వచ్చేస్తానన్న రీతూ
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) స్టేజీపైకి కింగ్ అక్కినేని నాగార్జున తనయుడు, హీరో నాగచైతన్య (Naga Chaitanya) వచ్చేస్తున్నాడు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. అందులో చై ఫుల్ ఎనర్జీతో స్టేజీపై ఎంట్రీ ఇచ్చాడు. నాకు యాక్టింగ్‌తో పాటు రేసింగ్ అంటే పిచ్చి అని మీకు తెలుసు. నాలుగేళ్ల క్రితం ఇండియన్ రేసింగ్ లీగ్ అని ఓ ఫెస్టివల్ ప్రారంభించారు. మెలికలు తిరిగిన రీతూఅందులో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్ ఓనర్ని నేనే.. అని చై చెప్పడంతో నాగ్ (Nagarjuna Akkineni) సర్ప్రైజ్ అయ్యాడు. నాకు చెప్పకుండా ఎప్పుడు చేశావ్? అని అడిగాడు. చైని చూడగానే రీతూ మెలికలు తిరిగిపోయింది. మీరంటే పిచ్చి, ఒక శిల్పాన్ని చెక్కినట్లే ఉంటారు అని చెప్పింది. దీంతో నాగ్ రీతూకి ఓ బంపరాఫర్ ఇచ్చాడు. చైతూకి బైక్స్ అంటే చాలా ఇష్టం. నువ్వు హౌస్‌లో నుంచి బయటకు వస్తే చై నిన్ను బైక్ రైడ్‌కు తీసుకెళ్తాడు అని చెప్పాడు. రైడ్‌కు తీసుకెళ్తా..అంతే, రీతూ (Rithu Chowdary) ఎగిరి గంతేస్తూ సంతోషంగా బయటకు వచ్చేస్తానంది. అది చూసి ఆశ్చర్యపోయిన చై.. బిగ్‌బాస్ షో ఎందుకు వదులుకుంటావ్? గెలిచిన తర్వాత కూడా నిన్ను రైడ్‌కు తీసుకెళ్లొచ్చు అన్నాడు. అందుకు రీతూ.. మిమ్మల్ని జోష్ నుంచి గెల్చుకుందామనుకుంటున్నా అని అమాయకంగా ముఖం పెట్టింది. అది చూసి తండ్రీకొడుకులిద్దరూ ఏం మాట్లాడలేక నవ్వుకున్నారు. చదవండి: చిరంజీవితో సినిమా షూటింగ్.. నన్ను నేను థూ అని.. -
నేను చచ్చిపోతా.. నన్ను పంపించేయండి.. వెక్కెక్కి ఏడ్చిన సంజనా
Bigg Boss Telugu 9: ఫైర్ స్ట్రామ్స్ అంటూ ఆరుగారు వైల్డ్‌కార్డ్స్‌ను హౌస్‌లోకి తెచ్చారు. వచ్చినవాళ్లందరూ వరుసగా ఎలిమినేషన్ బండెక్కి ఇంటికి వెళ్లిపోయారు. నిన్నటి ఎపిసోడ్లో నిఖిల్ ఎలిమినేట్ అవగా ఈరోజు గౌరవ్‌ను పంపించేయనున్నారు. దీంతో ఫైర్ స్ట్రామ్ కాస్తా ఫెయిల్ స్ట్రామ్‌గా మిగిలిపోయింది. మరి శనివారం (నవంబర్ 15వ) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చూసేద్దాం..పవన్‌కు క్లీన్ చిట్బీబీ రాజ్యం అనే గేమ్‌లో రాణి దివ్య ఆదేశాల మేరకు పవన్.. తనూజను కాస్త తోసినట్లు చేశాడు. ఆమాత్రం దానికే తనూజ మ్యాన్ హ్యాండ్లింగ్ అంటూ పెద్ద నింద వేసింది. ఊరుకుంటే ఎత్తుకునేవాడివేమో అంటూ నానామాటలంది. దానిపై నాగ్ కాస్త సున్నితంగానే తనూజకు క్లాస్ పీకాడు. ఇక్కడ ఆడ,మగ తేడా లేదు. రాణి ఆదేశాలను పవన్ పాటించాడు తప్ప అతడు ఏ తప్పూ చేయలేదని క్లీన్ చిట్ ఇచ్చాడు.సంజనాపై బిగ్ బాంబ్ఇక హౌస్‌లో రెండు బిగ్బాంబ్స్ వేశాడు నాగ్. ఒకటి డబుల్ ఎలిమినేషన్ కాగా రెండోది చెప్పేముందు ఓ టాస్క్ ఇచ్చాడు. హౌస్‌లో మీకు సపోర్ట్‌గా ఉన్నదెవరు? మీ ఆటను ముంచుతోందెవరు? అనేది చెప్పాలన్నాడు. మెజారిటీ ఇంటిసభ్యులు సంజనా (Sanjana Galrani) వల్లే ఆట చెడిపోతుంది అని అభిప్రాయపడ్డారు. దాంతో రెండో బిగ్ బాంబ్ సంజన మీద పడుతుందని నాగ్ అన్నాడు. తీరా ఆ బాంబ్‌లో ఉన్నది మరేంటో కాదు, నో ఫ్యామిలీ వీక్.గుక్కపెట్టి ఏడ్చిన సంజనాఇప్పటికే చంటిపిల్లలకు దూరంగా ఉన్న సంజనా.. రాత్రిళ్లు దుప్పటి కప్పుకుని ఏడుస్తున్నా రోజంతా మాత్రం చలాకీగానే ఉంటోంది. ఫ్యామిలీ వీక్‌లో పిల్లలు వస్తారన్న ఆశతో వేయికళ్లతో ఎదురుచూస్తోంది. అలాంటిది తన కోసం ఎవరూ రారని అనడంతో గుక్కపెట్టి ఏడ్చింది. నేను ఇంటికెళ్లిపోతాను సర్.. నా వల్లకాదు, నేను చచ్చిపోతా.. రోజుకు ఆరుసార్లు ఏడుస్తున్నాను. ఇంక నావల్ల కాదు. నేనిక్కడ ఉండలేను అంటూ వెక్కెక్కి ఏడ్చింది.నన్ను ఇంటికి పంపించేయండి సార్ఇంట్లో మెజారిటీ హౌస్మేట్స్ నీవల్లే వాళ్ల ఆట మునిగిపోతుందన్నారు. వేరేవాళ్ల పేరు వచ్చుంటే ఆ బాంబ్ ఇంకొకరిపై పడేది. ఇది బిగ్‌బాస్ నిర్ణయం అన్నాడు నాగ్. ఇంతలో కల్యాణ్, భరణి.. సంజనా కోసం తమ ఫ్యామిలీ వీక్ త్యాగం చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ, అందుకు నాగ్ ఒప్పుకోలేదు. బాధను భరించలేకపోయిన సంజనా.. నన్ను ఇంటికి పంపించేయండి సార్, ఇది నేను పొగరుతో చెప్పడం లేదు అని బతిమాలుకుంది. అప్పటికీ నాగ్ మనసు కరగలేదు. నిఖిల్ ఎలిమినేట్అయితే నిజంగా ఫ్యామిలీ వీక్ లేకుండా పోయే ఛాన్సే లేదు. గతంలో కూడా తేజకు ఫ్యామిలీ వీక్ లేదన్నారు. కట్ చేస్తే చివర్లో అతడి తల్లిని పంపారు. ఇప్పుడు కూడా అలాగే చివర్లో సంజనా ఫ్యామిలీని పంపించి మరింత ఎమోషన్స్ రాబట్టి టీఆర్పీ దండుకునే ప్లాన్ చేస్తున్నారు. ఎపిసోడ్ చివర్లో నిఖిల్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. వారమంతా బాగానే కష్టపడ్డా సరే, ఇలా ఎలిమినేట్ చేశారేంటని నిఖిల్ షాక్ అయ్యాడు. అయినా చేసేదేం లేక సెలవు తీసుకుని బయటకు వచ్చేశాడు.చదవండి: బిగ్‌బాస్ 9.. నిఖిల్ పారితోషికం ఎంతో తెలుసా? -
'బిగ్‌బాస్' నుంచి నిఖిల్ ఎలిమినేట్.. భారీగానే రెమ్యునరేషన్
బిగ్‌బాస్ తెలుగు 9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ నాగార్జున షాక్ ఇచ్చారు. వాస్తవంగా ఆదివారం ఎపిసోడ్‌లోనే ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది. కానీ, ఈసారి కంటెస్టెంట్స్‌కు షాకిస్తూ శనివారం ఎపిసోడ్‌లోనే ఒకరిని ఎలిమినేట్ చేస్తున్నట్లు నాగార్జున ప్రకటించారు. ఆపై ఆదివారం ఎపిసోడ్లో మరోకరు ఎలిమినేట్ అవుతారని చెప్పారు. ఈ వారంలో 10 మంది నామినేషన్స్‌లో ఉండటంతో ఎలిమినేషన్ దెబ్బ వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో వచ్చిన వారిపై పడింది. ఫైనల్‌గా తక్కువ ఓట్లు తెచ్చుకుని నిఖిల్ ఎలిమినేట్ అయ్యాడు. ఆదివారం ఎపిసోడ్లో గౌరవ్ ఎలిమినేట్ కావచ్చని తెలుస్తోంది.అక్టోబర్ 12న వైల్డ్ కార్డ్‌గా హౌస్‌లో నిఖిల్ నాయర్ బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చారు. అయితే, అతడికి వారానికి రూ.2.5 లక్షల మేరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. ఈ లెక్కన ఐదువారాలకుగానూ రూ.12.5 లక్షల మేరకు సంపాదించాడు. అతనికి తెలుగు బుల్లితెరపై మంచి ఫేమ్ ఉండటంతో రెమ్యునరేషన్ బాగానే ఇచ్చారు. గృహలక్ష్మి సీరియల్లో ప్రేమ్ పాత్రలో నిఖిల్ నాయర్ ప్రతి ఒక్కరినీ అలరించారు.నిఖిల్ ఎలిమినేట్ అయి స్టేజ్ మీదకి రాగానే నాగార్జున ప్రశంసించారు. చాలా బాగా ఆడావ్ అంటూ అతని ఆట తీరును ప్రశంసించారు. హౌస్మేట్స్ అందరిలో నీకు నచ్చని విషయం ఏమైనా ఉంటే చెప్పాలని నాగ్ కోరడంతో నిఖిల్ ఇలా చెప్పాడు. తనూజలో ఏడుపు, రీతూలో కన్ఫ్యూజన్, దివ్యలో ఓవర్ కమాండింగ్, భరణిలో సైలెన్స్ తనకు నచ్చవని సింపుల్‌గా చెప్పేశాడు. -
సంతోషంలో పింకీ.. గ్రాండ్‌గా కొడుకు బారసాల ఫంక్షన్
తెలుగు సినీ నటి పింకీ సుదీప (Pinky Sudeepa) తల్లిగా ప్రమోషన్ పొందింది. తనకు కొడుకు పుట్టాడన్న శుభవార్తను ఆలస్యంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా బాబు బారసాల ఫంక్షన్ ఘనంగా చేసింది. ఈ మేరకు ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. అందులో బాబును నవమోసాలు మోసిన సుదీప పొట్టను ఆమె భర్త శ్రీరంగనాథ్ ఆప్యాయంగా ముద్దాడాడు. తర్వాత దంపతులిద్దరూ బాబును ఎత్తుకుని చూపించారు. ఇది చూసిన అభిమానులు ఆమెకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సినిమాసుదీప.. 1994లో ధర్మరాజు ఎం.ఏ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. మా అన్నయ్య, అల్లుడుగారు వచ్చారు, బొమ్మరిల్లు, స్టాలిన్, బిందాస్, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాల్లో నటించింది. నువ్వు నాకు నచ్చావ్ మూవీతో పింకీగా పాపులారిటీ తెచ్చుకుంది. తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్లోనూ పాల్గొంది. షోలో ఉన్నప్పుడు... తనకు గర్భ స్రావం అయిన విషయాన్ని చెప్తూ ఎమోషనలైంది. తాను 2015లో తొలిసారి గర్భం దాల్చానని, కానీ థైరాయిడ్ ఎక్కువవడం వల్ల బిడ్డను కోల్పోయానని కన్నీళ్లు పెట్టుకుంది. మళ్లీ పదేళ్ల తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. View this post on Instagram A post shared by Pinky Sudeepa (@pinky_sudeepaofficial) చదవండి: పెళ్లిరోజే గుడ్‌న్యూస్ చెప్పిన బాలీవుడ్ హీరో -
కల్యాణ్, ఇమ్మూ గుండెలో ఇంత బాధుందా?
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) రాజ్యంలో మహారాజుగా ఉన్న నిఖిల్, రాణులైన తనూజ, రీతూలకు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. ఇందులో తనూజ గెలిచి కెప్టెన్ అయింది. అది కూడా సరిగ్గా ఫ్యామిలీ వీక్‌లో కెప్టెన్ అవడం విశేషం! మరి తర్వాత హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో శుక్రవారం (నవంబర్ 14వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..నన్నెందుకు ఎత్తుకోలేదు?తనూజ కెప్టెన్ అవగానే భరణి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెను ఎత్తుకుని తిప్పారు. అది చూసిన దివ్య.. నేను కెప్టెన్ అయినప్పుడు నన్నెందుకు ఎత్తుకోలేదని ప్రశ్నించింది. దానికి సమాదానం చెప్పలేక భరణి నీళ్లు నమిలాడు. తర్వాత హౌస్మేట్స్ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ వారి చిన్నప్పటి ఫోటోలను పంపించాడు బిగ్‌బాస్. వాటిని చూసిన వెంటనే తనూజ ఎమోషనలైంది. అది గమనించిన కల్యాణ్.. ఏడవకు తనూజ అని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తే.. ఆవిడ మాత్రం చిటపటలాడింది.చస్తా.. ఏడుస్తా..నువ్వు ఏదైనా అడిగినప్పుడు నన్ను పూర్తిగా సమాధానం చెప్పనివ్వు అని మండిపడింది. నువ్వు ఆన్సర్ చెప్పట్లేదు, ఏడుస్తున్నావ్.. ఏడుపు ఆపేయ్ అనడం తప్పా? అని కల్యాణ్ (Pawan Kalyan Padala) అడిగాడు. ఇదే నీలో ఉన్న వరస్ట్ పార్ట్.. ఏదైనా అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పనివ్వు. నేను ఏడుస్తానా? చస్తానా? నీకు అనవసరం.. లేకపోతే వదిలెయ్ నన్ను అని చిరాకుపడింది.గుక్కపెట్టి ఏడ్చిన కల్యాణ్తర్వాత కల్యాణ్ కృష్ణుడి వేషంలో ఉన్న ఫోటో చూసి ఎమోషనలయ్యాడు. నేను పుట్టినప్పుడు నాన్నకు బిజినెస్‌లో అంతా కలిసొచ్చింది. కొన్నేళ్లకు వాళ్ల ఫ్రెండ్స్ వల్ల జీరోకు వచ్చేశాడు. నన్ను ఫస్ట్ క్లాస్‌లోనే అత్తయ్య దగ్గరకు పంపారు. తర్వాత హాస్టల్లో వేశారు. అమ్మానాన్నతో కలిసి తిరిగింది గుర్తు లేదు. వాళ్లు నా పక్కన లేరని బాధుండేది. నేనేం చేశానని ఇలా దూరం పెడుతున్నారో అర్థమయ్యేది కాదు. హాస్టల్ వార్డెన్ దగ్గర ప్రతి ఆదివారం వారి నుంచి ఫోన్ కోసం ఎదురుచూసేవాడిని. ఏడిపించేసిన ఇమ్మూకానీ నెలకోసారి మాత్రమే ఫోన్ వచ్చేది. నా 23 ఏళ్లలో నేను నాలుగేళ్లు మాత్రమే వాళ్లతో ఉన్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తర్వాత ఇమ్మాన్యుయేల్‌కి తన అన్నతో దిగిన ఫోటో వచ్చింది. మా ఇంట్లో తినడానికి తిండి ఉండేది కాదు. మాది పాక ఇల్లు. నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు నాన్న వద్దన్నాడట. అమ్మమ్మ మాత్రం.. పుట్టబోయే వాడి వల్ల మీ జీవితం మారుతుందని చెప్పి పట్టుబట్టి ఉంచింది. అప్పుడు తిండి లేక అమ్మ పొలం దగ్గర మట్టి బుక్కేది. నా జీవితంలో సూపర్ హీరోచిన్నప్పటినుంచే అన్న, నేను పొలం పనులు, పత్తి ఏరడం, సిమెంట్ పని.. ఇలా చాలా చేశాం. ఎంతో కష్టపడ్డాం. నా జీవితంలో మా అన్నే సూపర్ హీరో. ఇండస్ట్రీకి వచ్చాక నీ తమ్ముడు సక్సెస్ అయ్యాడు, నువ్వెందుకు కాలేదు అని అందరూ అనడంతో వాడు ఫీలైపోయేవాడు. కానీ, కచ్చితంగా ఒకరోజు డైరెక్టర్ అవుతాడు అంటూ ఏడ్చేశాడు. అంతా అమ్మ వల్లే..తనూజకు అక్కతో దిగిన ఫోటో వచ్చింది. ఆమె మాట్లాడుతూ.. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం.. ముగ్గురు ఆడపిల్లలంటే కష్టమే.. పెళ్లి చేసేయండి అని కొందరు నాన్నతో అనేవాళ్లు. నాన్న కూడా భయపడి వీళ్లను చదివించొద్దు, పెళ్లి చేసేద్దామన్నారు. కానీ, అమ్మ.. మా కోసం నాన్నకు దూరంగా ఉన్నా పర్లేదని హైదరాబాద్ వచ్చేసింది. నువ్వు చేయగలవు, ముందుకెళ్లు అని వెన్నుతట్టి ప్రోత్సహించింది. రౌడీగా దివ్యతర్వాత అమ్మానాన్న కలిసిపోయారనుకోండి. అయినా అమ్మ వల్లే నేనిక్కడ ఉన్నాను అంటూ తనూజ హ్యాపీగా ఫీలైంది. డిమాన్ పవన్.. చెస్ ఛాంపియన్‌గా మెడల్ అందుకున్న ఫోటో చూసి మురిసిపోయాడు. దివ్యకు చిన్నప్పుడు గుండుతో రౌడీగా రెడీ చేసినప్పటి ఫోటో వచ్చింది. రీతూ.. తన చిన్నప్పటి ఫోటో చూపిస్తూ భరణిలా విలన్ అవుతానంది. సుమన్‌కు చైల్డ్‌హుడ్ ఫోటో అందింది. కానీ గౌరవ్, సంజనా, భరణి, నిఖిల్ ఫోటో స్టోరీలను మాత్రం చూపించలేదు.చదవండి: తనూజకు భారీ ఓట్లు.. సీక్రెట్ ఇదే! -
తిండికి గతి లేక అమ్మ మట్టి తినేది.. ఏడిపించిన కంటెస్టెంట్స్
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9) మొదలై దాదాపు 10 వారాలు కావస్తోంది. మాటకు మాట, ఆటకు ఆట అంటూ గేమ్స్ ఆడుతున్న కంటెస్టెంట్లకు ఇంటి మీద బెంగ మొదలై చాలారోజులే అవుతోంది. ఆ బెంగతోనే కదా.. రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. ఈరోజు (నవంబర్ 14న) బాలల దినోత్సవం. ఈ సందర్భంగా హౌస్‌మేట్స్‌కు వారి చిన్ననాటి జ్ఞాపకాలను ఫోటోల రూపంలో అందించి సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్.లవ్యూ అమ్మా: తనూజవాటిని చూసి మురిసిపోయిన కంటెస్టెంట్లు వాటి వెనకాల కథను చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు. మొదటగా తనూజ మాట్లాడుతూ.. నా లైఫ్‌లో బెస్ట్ సూపర్ హీరో అమ్మ. నావల్ల కాదని వెనకడుగు వేసినప్పుడు.. నీవల్ల సాధ్యమవుతుంది అంటూ నన్ను ముందుకు నడిపించింది. నీవల్లే ఇక్కడున్నా సావిత్రి. లవ్యూ మమ్మీ అని ఎమోషనలైంది.తినడానికి తిండి లేక మట్టిఇక ఇమ్మాన్యుయేల్ (Emmanuel)కు తన అన్నతో దిగిన ఫోటో వచ్చింది. అది చూసిన ఇమ్మూ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. మా అమ్మకు నన్ను కనడం ఇష్టం లేదు. ఎందుకంటే అప్పటికి మా ఇంట్లో తినడానికి తిండి లేదంటా! తిండి లేక అమ్మ మట్టి తినేది.. మా అన్న, నేను చిన్నప్పటినుంచి కష్టపడ్డాం. మేము చేయని పనంటూ లేదు. నా జీవితానికి మా అన్నే హీరో. చిన్నపిల్లాడిలా ఏడ్చేసిన కల్యాణ్చిన్నప్పటినుంచి మరో నాన్నలా పెంచాడు. 20 మూటలు మోయాలంటే వాడు 15 మోసి, నన్ను 5 మాత్రమే మోయనిచ్చేవాడు అని భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక కల్యాణ్.. అమ్మానాన్నతో తిరిగింది గుర్తు లేదు. చిన్నప్పుడు ఏదీ అంత తెలిసేది కాదు. హాస్టల్లో జాయిన్ చేశారు. ప్రతి ఆదివారం ఫోన్ కోసం వార్డెన్ దగ్గర కూర్చునేవాడిని. కొన్ని నెలలవరకు ఫోన్ వచ్చేది కాదంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. మరి మిగతావారి స్టోరీలు తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! చదవండి: కల్యాణ్‌ను ఓడించి.. ఫ్యామిలీ వీక్‌లో కెప్టెన్‌గా -
తనూజకు భారీగా ఓట్లు.. సీక్రెట్ ఇదే
బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్లో తనూజ విన్నర్ అవుతుందని చాలామంది చెబుతున్న మాట.. అయితే, అదంతా పీఆర్ టీమ్ మాయా అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. బిగ్‌బాస్ కోసం దాదాపుగా ప్రతి కంటెస్టెంట్ పీఆర్‌ను పెట్టుకుంటారు. అలా అని కేవలం వారి మీదనే ఆదారపడితే కుదరదు. హౌస్‌లో కంటెస్టెంట్ సరైన కంటెంట్ ఇవ్వకుంటే ఎంతమంది పీఆర్ టీమ్‌లో ఉన్న సరే ఎలిమినేట్ అయి బయటకు రావాల్సిందే.తనూజ కోసం రూ. 100 కోట్లుబిగ్బాస్లో పది వారాలుగా తనూజ టాప్‌లో ఉంది. సోషల్‌మీడియా సర్వేలలో చాలామటుకు ఆమె విన్నర్ అంటూ ఓట్లు పడుతున్నాయి. కల్యాణ్ రెండో స్థానంలో ఉన్నాడు. అయితే, కొందరు తనూజను టార్గెట్ చేస్తూ పీఆర్ టీమ్ సాయంతో నెట్టుకొస్తుందని అంటుంటే... మరికొందరు మాత్రం తనకు బిగ్‌బాస్ టీమ్ సపోర్ట్ ఉందని అంటున్నారు. దాదాపు ఇందులో నిజం ఉండదనే వాదన షో గురించి తెలిసిన వారు చెబుతున్నమాట. ఆమెకు కప్ ఇచ్చేందుకు బిగ్‌బాస్ టీమ్ ఏకంగా రూ. 100 కోట్లకు పైగా ఖర్చు చేస్తుందా..? ఒకరి కోసం తమ ప్రతిష్టను దెబ్బతీసుకుంటుందా ..? ఒకవేళ తనూజకు సాయం చేయాలనుకుంటే మరో పది సీరియల్స్లలో అవకాశాలు కల్పిస్తారు. అంతే గానీ ఇలా కోట్లలో ఖర్చు పెట్టి ఆమెకు కప్ ఎందుకు ఇస్తారని వాదించేవారు కూడా ఉన్నారు.తనూజ ఓట్ల సీక్రెట్ ఇదేఅన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సీరియల్ 'ముద్దమందారం..' 2014 నుంచి 2019 వరకు జీతెలుగులో ఈ సీరియల్ ప్రసారమైంది. ఒకటి రెండు కాదు ఏకంగా 1580 ఎపిసోడ్లతో బుల్లితెర హిస్టరీలోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో పల్లెటూరి పేదింటి అమ్మాయి పాత్రలో తనూజ అదరగొట్టింది. ఈ సీరియల్ చూసిన ప్రతిఒక్కరు ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు. తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా చాలా హిట్ అయింది. సీరియల్స్ ఎక్కువగా గృహిణిలే ఫాలో అవుతుంటారు. దీంతో బిగ్‌బాస్‌లో ఆమెకు వారి నుంచే మద్ధతు లభించింది. ఆపై చాలా గ్యాప్ తర్వాత బిగ్‌బాస్ వల్ల తనూజ మళ్లీ కనిపించడంతో మొదటి ఎపిసోడ్ నుంచే ఆమెకు భారీగా ఓట్లు పడటం జరుగుతుంది. ఈ కారణం వల్లనే ఆమెకు ఎక్కువగా ఓట్లు పోల్ అవుతున్నాయి. కేవలం పీఆర్ వల్ల మాత్రమే ఇంత బజ్ క్రియేట్ అవుతుంది అనుకుంటే పొరపాటే.. ముఖ్యంగా ఈ సీజన్లో బలమైన కంటెస్ట్ట్స్ లేకపోవడం ఆపై చాలా పవర్ఫుల్ అనుకున్న భరణి ఆట పేలవంగా ఉండటంతో తనూజకు బాగా కలిసొచ్చింది. ఇమ్మాన్యుయేల్ సత్తా చాటుతున్నప్పటికీ అతను ఒక్కసారి కూడా నామినేషన్లోకి రాలేదు. దీంతో తనకూ ఫ్యాన్ బేస్ లేకుండా పోయింది. ఆపై ప్రేక్షకులను మెప్పిస్తుంది కల్యాణ్ మాత్రమే.. కానీ, అతను కూడా తనూజతో బాగా క్లోజ్‌గా ఉండటం వల్ల విన్నర్ అయ్యేంత రేంజ్లో ఓట్లు పెద్దగా అతనివైపు మొగ్గుచూపడం లేదు. ఇలా పలు కారణాల వల్ల ప్రస్తుతానికి తనూజ టాప్‌లో దూసుకుపోతుంది. పీఆర్ టీమ్ కారణంగానే బిగ్‌బాస్ విన్నర్‌గా ఎవరూ కాలేరనేది చాలామంది చెబుతున్నమాట.. అందుకోసం ధైర్యం చేసి అంత ఖర్చు ఎవరూ చేయరని కూడా తెలుపుతున్నారు. కానీ, వారి ఆటకు కాస్త బలాన్ని పీఆర్ టీమ్ ఇస్తుందనేది మాత్రం వాస్తవం అంటారు. -
Thanuja: కల్యాణ్‌ను ఓడించి ఫ్యామిలీ వీక్‌లో కెప్టెన్‌గా.
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) రాజ్యానికి వారెవ్వా చెఫ్ వచ్చి అందరికీ కడుపునిండా భోజనం పెట్టాడు. అయితే రాజుల- రాణిల కోసం ప్రత్యేకమైన వంటకాలను పట్టుకొచ్చాడు. ఇదేదో కల్యాణ్ కోరిక(చికెన్, మటన్ తినాలనుందన్న కోరిక)ను నెరవేర్చేందుకే ఆయన్ను హౌస్‌లోకి తీసుకొచ్చినట్లుగా ఉంది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో బుధవారం (నవంబర్ 13వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం...రాజావారి విందు భోజనంరాజులు కల్యాణ్ (Pawan Kalyan Padala), నిఖిల్, రాణి రీతూ కోసం మాస్టర్ చెఫ్ సంజయ్ అసిస్టెంట్ ప్రణవ్ నాన్‌వెజ్ వంటకాలు సిద్ధం చేశాడు. ఆకలి మీదున్న పులుల్లా వాటిని ఈ ముగ్గురూ ఆవురావురుమని ఆరగించారు. తర్వాత కమాండర్స్ తనూజ, డిమాన్ పవన్, దివ్య, సంజనకు వడ్డించారు. ప్రజలుగా ఉన్న సుమన్, భరణి, ఇమ్మాన్యుయేల్, భరణిలను పనోళ్లుగానే చూశారు. అందుకే వారిని కింద కూర్చోబెట్టి కేవలం శాఖాహార భోజనం మాత్రమే వడ్డించారు.కల్యాణ్‌ను ఓడించిన తనూజతర్వాత బిగ్‌బాస్.. రాజు, రాణిలకు చివరగా ఓ టాస్క్ ఇచ్చాడు. ఇందులో రాజు కల్యాణ్‌తో కమాండర్ తనూజ (Thanuja Puttaswamy) పోటీపడింది. ఈ గేమ్‌లో చురుకుగా, చకచకా ఆడి తనూజ గెలిచింది. అలా కల్యాణ్‌ను రాజు స్థానంలో నుంచి కిందకు దింపి తను రాణిగా మారిపోయింది. బిగ్‌బాస్ రాజ్యానికి మహారాణి అవడమే కాకుండా ఏకంగా పదోవారం కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. ప్రతిసారి కెప్టెన్సీ చేతిదాకా వచ్చినట్లే వచ్చి చేజారిపోయేది. ఈసారి ఏకంగా ఫ్యామిలీ వీక్‌లో కెప్టెన్ అవడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.చదవండి: నాతో నటించేందుకు ఎవరూ ముందుకు రాలేదు: హీరో -
ఉమెన్ కార్డ్ తీసిన తనూజ.. డీమాన్ పవన్ తప్పు చేశాడా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఎలాంటి కొత్తదనం లేదు. రణరంగం అంటూ ఊదరగొట్టారు. కానీ, కంటెస్టెంట్స్ పేలవమైన ఆటతీరుతో ప్రేక్షకులకు విసుగుతెప్పిస్తున్నారు. ఇప్పటికే 66 రోజులు పూర్తి అయింది. బుధవారం ఎపిసోడ్లో కాస్త నవ్వులతో పాటు నామామాత్రపు టాస్క్‌లు పెట్టి ముగించేశాడు. బీబీ రాజ్యం అంటూ జరుగుతున్న టాస్క్ పెద్దగా ఆకట్టుకోలేదు. మహారాణులుగా దివ్య-రీతూల కాంట్రవర్సీతో పాటు వారిద్దరూ కలిసి పదేపదే సుమన్ శెట్టి, భరణి, ఇమ్మానుయేల్‌ని టార్గెట్ చేసి ఆటాడుకున్నారనిపిస్తుంది. కమాండర్లుగా ఉన్న డీమాన్ పవన్-తనూజ మధ్య జరిగిన గొడవ మాత్రమే వివాదంగా మారింది.బిగ్‌బాస్ సీజన్-9 ప్రారంభం నుంచే తనూజ కాస్త హైలెట్ అవుతూ వస్తుంది. బుధవావరం ఎపిసోడ్లో డీమాన్ పవన్- తనూజ మధ్య జరిగిన గొడవ కూడా కంటెంట్ క్రియేట్ కోసం చేసినట్లు అనిపిస్తుంది. డిమాన్ పవన్ తప్పు అయితే ఎంతమాత్రం లేదు, కానీ అంత చిన్న విషయానికి తనూజ ఎందుకు రచ్చ చేసిందనేది ప్రేక్షకులకు కూడా అర్థం కాలేదు. కేవలం కంటెంట్ కోసమే ఆమె ఇలా చేసిందా అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే వెంటనే వారిద్దరూ మళ్లీ కలిసిపోయారు. మహారాజు-మహారాణుల పాత్రలో ఉన్న కళ్యాణ్, దివ్య, రీతూ కలిసి తనూజను ఆటపట్టించాలనుకుంటారు. ఈ క్రమంలో కిచెన్ దగ్గరికొచ్చి కమాండర్ తనూజని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టమని డీమాన్-నిఖిల్‌లకి చెప్పారు.దీంతో తనూజని ముందుగు నడవాలంటూ ఆమె భుజం మీద డీమాన్ పవన్ టచ్ చేశాడు. ఈ సమయంలో తనూజ ఫైర్ అయింది. చెయ్యి వేస్తున్నావేంట్రా.. అంటూ నో ఉమెన్ హ్యాండ్లింగ్.. అని ఫైర్ అయింది. ఇది రాణి ఆర్డర్ అని నిఖిల్ చెప్తాడు. అయితే, ఇలా హ్యాండిల్ చేస్తారేంటని తనూజ మళ్లీ అడుగుతుంది. అబ్బాయిల దగ్గర ప్రవర్థిస్తున్నట్లు చేస్తున్నారని తనూజ అంటుంది. కాదు కమాండర్స్లా చేస్తున్నారని రాణి పాత్రలో ఉన్న దివ్య కౌంటర్ ఇస్తుంది. మీ భుజాన్ని మాత్రమే పట్టుకున్నారు కదా అందులో ఏంటి తప్పు అని దివ్య కామెంట్ చేసింది. అయితే, తనూజ బాధ పడిందని డిమాన్ పవన్ క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించాడు. కావాలని నెట్టలేదని చెప్తాడు. అయితే, తనను చాలా ఫోర్స్‌గా తోసేశావ్ అంటూ తనూజ చెబుతుంది. తాను చాలా హర్ట్ అయ్యానని. ఒక ఫ్రెండ్‌గా చెప్పవచ్చు కదా అంటుంది. కొంత సమయం పాటు ఇద్దరి మధ్య మాటల యుద్దం నడిచింది. కానీ, ఎపిసోడ్ ప్రకారం ఇందులో ఎక్కువగా తప్పు తనూజదే కనిపిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. రీతూను గతంలో తోయడం వల్ల నాగార్జున ఇప్పటికే అతనికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు తనూజ కూడా మరోసారి అదేవిధంగా డీమాన్ పవన్‌ను చూపించే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది. వాస్తవంగా తనూజతో పాటు ఇతర ఏ కంటెస్టెంట్‌తో కూడా డీమాన్ పవన్ చెత్తగా ప్రవర్తించలేదు. అందుకే కామనర్‌గా వచ్చినప్పటికీ ఆటలో కొనసాగుతున్నాడు.ప్రజలకి మరోసారి కమాండర్లు అయ్యేందుకు బిగ్‌బాస్ ఛాన్స్ కల్పించాడు. కమాండర్లు నిఖిల్, పవన్‌లతో ప్రజలు గౌరవ్, భరణి పోటీ పడ్డారు. ఈ రెండు టీమ్స్ మధ్య 'నిలబెట్టు పడగొట్టు' అనే టాస్క్‌ను బిగ్‌బాస్ ఇచ్చాడు. అయితే, ఇందులో డీమాన్-నిఖిల్ బాగా ఆడారు. మరోవైపు గౌరవ్ కూడా పర్వాలేదనిపించాడు. కానీ భరణి పూర్తిగా ఫెయిల్ కావడంతో ప్రజలు జట్టు ఓడిపోయింది. కేవలం భరణి వల్ల ఈ టాస్క్‌లో ఓడిపోవడంతో గౌరవ్ తట్టుకోలేకపోయాడు. పదేపదే కెమెరా ముందుకు వచ్చి భరణి ఆట వల్ల నష్టం జరిగిందంటూ వాపోయాడు. ఫైనల్‌గా నిఖిల్- పవన్‌లు కమాండర్స్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. మరో రౌండ్లో నిఖిల్ సత్తా చాటి రాజుగా ప్రమోషన్ పొందాడు. రాణిగా ఉన్న దివ్యను ఓడించాడు. దీంతో ఆమె కమాండర్‌గా మిగిలిపోయింది. బుధవారం ఎపిసోడ్లో ఎక్కువగా నవ్వులు పూయించారని చెప్పాలి. -
కుటుంబంతో రాము రాథోడ్.. క్షమాపణలు చెబుతూ వీడియో
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి సింగర్ రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్‌తో బయటకొచ్చేశాడు. కుటుంబ సభ్యులు ఎక్కువగా గుర్తుకొస్తున్నారంటూ స్వచ్ఛందంగా షో నుంచి ఆయన వైదొలిగాడు. అయితే, తన అభిమానలు మాత్రం కాస్త నిరాశ చెందారు. సుమారు 60రోజుల పాటు తనకోసం అండగా నిలబడి ఓట్లు వేసిన వారందరికీ రాము రాథోడ్ తన కుటుంబంతో పాటు క్షమాపణాలు చెప్పాడు.బిగ్‌బాస్ గురించి రాము ఇలా చెప్పుకొచ్చాడు. ' నన్ను ఎంతగానో ఆదరించిన ప్రేక్షకుల దేవుళ్లు అందరూ క్షమించండి. ఇదంతా నా కుటుంబం. వీళ్లందరినీ వదిలేసి తొలిసారిగా అన్నిరోజుల పాటు బయటే ఉండటం జరిగింది. దీంతో కాస్త ఇబ్బంది పడ్డాను. కానీ, కేవలం మీ అభిమానం వల్ల మాత్రమే బిగ్‌బాస్‌లో కొంతకాలమైన ఉండగలిగాను. ముఖ్యంగా మా అమ్మ, పిల్లలు గుర్తుకు రావడంతో హౌస్ నుంచి వచ్చేశాను. నా చిన్నతనం నుంచి నేను ఎవరితోనూ గొడవ పెట్టుకోలేదు. కేవలం బిగ్‌బాస్ కోసం అక్కడ వాళ్లతో గొడవపడటం కూడా నాకు నచ్చలేదు. నా వ్యక్తిత్వానికి విరుద్ధంగా ఉండటం వల్ల హౌస్‌లో ఉండలేకపోయాను. కానీ, తనూజ మాత్రం చాలాసార్లు నన్ను ప్రోత్సహిస్తూ వచ్చింది. ప్రేక్షకుల నిర్ణయం వరకు ఉండాలని కోరింది. హౌస్‌లోని వారందరూ ఎంత ధైర్యం ఇచ్చినప్పటికీ అక్కడ ఉండటం ఇబ్బందిగానే ఉండేది. నా నిర్ణయాన్ని ప్రేక్షకులు గౌరవిస్తారని ఆశిస్తున్నాను.' అంటూ రాము తన ఫ్యామిలీతో ఒక వీడియో పంచుకున్నాడు. -
'బిగ్‌బాస్' కెప్టెన్సీ టాస్క్‌లో నటికి తీవ్ర గాయం (వీడియో)
బిగ్ బాస్ తమిళ సీజన్ 9లో VJ పార్వతి అనే కంటెస్టెంట్ తీవ్రంగా గాయపడింది. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా ఆమె కంటికి గాయం కావడంతో చాలా ఇబ్బంది పడింది. ‘BB బాటిల్ హంట్’ ఛాలెంజ్ సమయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే, ఆమె గాయపడినప్పటికీ హౌస్‌లో కొనసాగుతానని చెప్పడం విశేషం. ఈ షో తన కెరీర్‌కు చాలా అవసరమని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే పోరాడుతానని ఈ సీజన్లో కొనసాగుతుంది.బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా నటుడు శబరి నాధన్ చేతిలో పార్వతి గాయపడింది. టాస్క్‌లో భాగంగా పొరపాటున అతని మోకాలు పార్వతి కంటికి చాలా బలంగా తగిలింది. దీంతో ఆమె తీవ్రమైన నొప్పితో తల్లడిల్లింది. ప్రస్తుతం ఆమె కన్ను భాగం అంతా చాలా వాపు వచ్చినప్పటికీ హౌస్‌లో కొనసాగుతూనే ఉండటం విశేషం. ప్రస్తుతం బిగ్‌బాస్ టైటిల్ రేసులో టాప్-3లో పార్వతి ఉంది. పార్వతి తమిళనాడులో టీవీ యాంకర్‌గా పనిచేస్తుంది. ఆపై పాపులర్ రేడియో జాకీగా గుర్తింపు ఉంది. తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో చాలా కష్టాలు పడ్డామని హౌస్‌లోకి వెళ్లే సమయంలో హౌస్ట్ విజయ్ సేతుపతికి చెప్పింది. ముగ్గురు సంతానం కలిగిన కుటుంబాన్ని తన అమ్మగారే ఒక సూపర్ హీరోలా పోషించిందని చెప్పింది. అయితే, ప్రస్తుతం కుటుంబ బాధ్యతలన్నీ తనమీదే ఉన్నాయని పేర్కొంది. పార్వతికి గాయం తగిలినప్పుడు హౌస్ నుంచి వెళ్లిపోవాలని బిగ్‌బాస్ సూచిస్తాడు. కానీ, తనకు ఈ షో చాలా అవసరమని కొనసాగుతానని ఆమె చెప్పింది. ప్రస్తుతం గాయంతోనే ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది. తెలుగులో ఇమ్మాన్యూయేల్ ఎలాగో తమిళ్ బిగ్‌బాస్‌లో పార్వతి ఆట కూడా అంతే రేంజ్లో ఉంటుంది.Bloody CHEAP SABARI 🤮🤢😡🥵🥵🥵🤬🤬🤬🤬🤬😡😡😡😡🥵🥵🥵He is the Culprit Full Video and Proof 💯#saintsabari #VJParvathy #BiggBossTamil9 pic.twitter.com/kR0DXimj1t— Vishnu Deva (@iamvishnudeva) November 10, 2025Echcha paiya #Fj 💦💦💦#VJPaaru #VJParvathy #VJParvathi #BiggBossTamil #BiggBossTamil9 #BiggBoss9Tamil #BiggBossSeasonTamil9pic.twitter.com/1d9e5VB2HT— 🅐🅘🅢🅗🅤 (@AishGlowz) November 11, 2025 -
PR కోసం రూ.16 లక్షలు.. తెలుగులోనూ ఇదే జరుగుతోందా?
బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show)లో అడుగుపెట్టే కంటెస్టెంట్లు ముందుగానే పీఆర్ (పబ్లిక్ రిలేషన్ టీమ్)ను సెట్ చేసుకుని వస్తారు. అందుకోసం వేలల్లో కాదు, ఏకంగా లక్షల్లో ఖర్చు పెడతారు. అంత స్థోమత లేని వారు హౌస్‌లో ఉన్నన్నాళ్లుండి ఏదో ఒక వారం బయటకు వచ్చేస్తుంటారు. ఇటీవలే మలయాళ బిగ్‌బాస్ ఏడో సీజన్ విజయవంతంగా పూర్తయింది. ఈ సీజన్లో నటి అనుమోల్ విజేతగా నిలిచింది. ట్రోఫీతోపాటు రూ.42.5 లక్షలు, ఒక ఎస్యూవీ కారును గెల్చుకుంది.పీఆర్ కోసం రూ.16 లక్షలుకామన్ మ్యాన్ అనీష్ రన్నరప్‌గా నిలిచాడు. ఇక ఇదే సీజన్లో పాల్గొన్న బిన్నీ సెబాస్టియన్ అనే కంటెస్టెంట్.. అనుమోల్ (Anumol) పెద్ద పీఆర్‌ను పెట్టుకుందని, అందుకోసం ఏకంగా రూ.16 లక్షలు ఖర్చు చేసిందని బిగ్‌బాస్ హౌస్‌లోనే కామెంట్ చేశాడు. దీంతో ఆమె పీఆర్ వల్లే గెలిచిందంటూ విమర్శలు మొదలయ్యాయి. దీనిపై అనుమోల్ స్పందించింది. నేను రూ.16 లక్షలు పెట్టి పీఆర్‌ను సెట్ చేసుకోవడం వల్లే టైటిల్ గెలిచానంటున్నారు. అది ఏమాత్రం నిజం కాదు.అంత డబ్బు నాకెక్కడిది?అంత డబ్బు నా దగ్గర లేదు. అయితే ప్రతి కంటెస్టెంట్ పీఆర్‌ను పెట్టుకుంటారని నాతో చెప్పారు. అందుకే నేను కూడా ఓ వ్యక్తిని కలిశాను. అతడు రూ.15 లక్షలు అడిగాడు. అంత స్థోమత నాకు లేదని చెప్పాను. కేవలం రూ.1 లక్ష మాత్రమే ఇస్తానన్నాను. రూ.50 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చాను. షో అయిపోయాక మిగతా సగం ఇస్తానన్నాను. ఈ రూ.16 లక్షల స్టోరీ ఎవరు అల్లారో నాకు అర్థం కావడం లేదు. అంత డబ్బు ఖర్చు పెట్టే స్థోమత ఉంటే ఈ షోకి వచ్చేదాన్ని కాదు అని క్లారిటీ ఇచ్చింది.ఇక్కడా అదే రిపీట్?మలయాళ బిగ్‌బాస్ 7లో సెలబ్రిటీ విన్నర్ అయితే కామనర్ రన్నరప్ అయ్యాడు. దీంతో తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లోనూ ఇదే జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తనూజకు కప్పిచ్చేస్తారని, కల్యాణ్ రన్నరప్‌గా ఉంటాడని దాదాపు అందరూ ఫిక్సయ్యారు. పైగా పీఆర్ కోసం వాళ్లే అంత ఖర్చుపెడ్తే తెలుగు కంటెస్టెంట్లు ఇంకే రేంజులో ఖర్చు పెడుతున్నారో? అని గుసగుసలాడుతున్నారు. మరి ఫైనల్లో ఇదే జరుగుతుందా? లేదంటే కామనర్ విన్నింగ్ రేసులోకి వస్తాడా? చూడాలి!చదవండి: రీతూ మళ్లీ తొండాట? నోటికొచ్చినట్లు వాగితే కుదరదంటూ వార్నింగ్ -
రీతూ మళ్లీ తొండాట? నోటికొచ్చినట్లు వాగితే కుదరదంటూ కల్యాణ్ వార్నింగ్
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్ బీబీ రాజ్యంగా మారిపోయింది. ఈ రాజ్యంలో కల్యాణ్ రాజయితే, దివ్య, రీతూ మహారాణులు. వీళ్లు నలుగురు కమాండర్లను సెలక్ట్ చేసుకుంటే మిగతావాళ్లు ప్రజలుగా ఉంటారు. మరి ఎవర్ని కమాండర్లుగా తీసుకున్నారు? హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో మంగళవారం (నవంబర్ 11వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..వాళ్లదే రాజ్యంబీబీ రాజ్యంలో బిగ్‌బాస్‌కు బుద్ధి పుట్టినప్పుడల్లా గేమ్స్ పెడుతూ ఉంటాడు. వారం ముగిసేసరికి రాజు, రాణులు, కమాండర్స్, ప్రజలు.. వీరిలో ఒక్కరికే ఇమ్యూనిటీ గెలిచి నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. మొదటగా మహారాజు, రాణులతో చర్చించి తనూజ, సంజనా, పవన్, నిఖిల్‌ను కమాండర్లుగా ఎంచుకున్నారు. మిగిలిన భరణి, ఇమ్మాన్యుయేల్, సుమన్, గౌరవ్ ప్రజలుగా మిగిలిపోయారు. ఈ ప్రజలే అన్ని పనులు చేయాల్సి ఉంటుంది.రీతూ తొండాటమహారాణిగా ఆసీనురాలైన దివ్య.. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా భరణితో తలకు మసాజ్ చేయించుకుంది. తర్వాత కమాండర్స్‌కు ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ గేమ్‌కు రీతూ (Rithu Chowdary) సంచాలకురాలిగా వ్యవహరించింది. అయితే తను గతంలో చేసిన తప్పే మళ్లీ చేసింది. పవన్ ఔట్ అయినా సరే, కాలేదంటూ అతడిని గేమ్ ఆడించింది. ఈ క్రమంలో సంజనా, తనూజ.. రీతూపై ఎగబడ్డారు. అయినా ఆమె అస్సలు లెక్కచేయలేదు. చివరకు ఈ గేమ్‌లో సంజనా ఓడిపోయింది.కష్టపడ్డ సుమన్కమాండర్స్ నలుగురిలో ఓడిపోయిన సంజనా (Sanjana Galrani) తన పోస్టు కాపాడుకోవాలంటే ప్రజల్లో ఒకరితో తలపడి గెలవాల్సి ఉంటుంది. ఇందుకోసం సుమన్‌ను ఎంచుకుంది. ఈ ఇద్దరికీ కాటన్ డబ్బాలతో టవర్ కట్టే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. సుమన్‌కు మరీ ఎక్కువ ఎత్తులో డబ్బాలు పెట్టడమనేది తన హైట్‌కు కష్టమైన విషయమే! అయినప్పటికీ సంజనాకు గట్టి పోటీనిస్తూ బాక్స్ మీద బాక్స్ ఎగరేసి మరీ నిలబెట్టాడు. బజర్ మోగే సమయానికి సంజన-సుమన్ ఇద్దరి టవర్ ఒకే ఎత్తులో ఉంది. కాకపోతే సంజనా టవర్ నిటారుగా, పర్ఫెక్ట్గా ఉంది కనుక తనే గెలిచింది అని కల్యాణ్ ప్రకటించాడు. అందుకు తనూజ ఒప్పుకోలేదు.కల్యాణ్‌ను తిట్టిపోసిన తనూజటవర్ ఎలా ఉన్నా పర్లేదన్నారు కదా.. చివరి బాక్స్ సుమనే ముందు పెట్టాడుగా అని తనూజ, దివ్యలు నోరేసుకుని పడిపోయారు. అయినప్పటికీ కల్యాణ్ తన నిర్ణయంపై నిలబడి ఉన్నాడు. అప్పటికీ తనూజ ఒప్పుకోలేదు. ఇదంతా నువ్వు ముందు చెప్పాల్సింది. నచ్చినట్లు చెప్పి.. ఇప్పుడు మాట మారుస్తానంటే ఎలా కుదురుతుంది? చెప్పిన మాట మీద లేవు.. గేమ్ స్టార్ట్ అయ్యేముందు ఒకటి చెప్పావ్, అయిపోయాక ఒకటి చెప్తున్నావ్.. సంచాలక్‌గా ఫెయిల్ అని అరించింది. ఆ మాటతో ఆగ్రహించిన కల్యాణ్.. నోటికొచ్చినట్లు వాగితే బాగోదంటూ బాక్సుల్ని ఒక్కదెబ్బతో గుద్ది పడేసి తన కోపాన్ని తీర్చుకున్నాడు.చదవండి: నాగార్జున కుటుంబంపై మరోసారి స్పందించిన కొండా సురేఖ -
ఆఫ్ట్రాల్ నువ్వెవరు?.. రీతూపై ఓ రేంజ్లో రెచ్చిపోయిన సంజనా!
ప్రస్తుతం తెలుగు బిగ్‌బాస్ షో రసవత్తరంగా కొనసాగుతోంది. గతవారంలో కామనర్ రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్‌లో 11 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఇంకా ఆరు వారాల పాటు ఈ షో కొనసాగనుంది. ఈ పదో వారంలో నిఖిల్, గౌరవ్, సంజనా, రీతూ, భరణి, దివ్య నామినేట్ అయినట్లు తెలుస్తోంది.అయితే తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే ఇవాల్టి ఎపిసోడ్ ఫుల్ హాట్‌హాట్‌గా సాగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హౌస్‌లో కమాండర్స్, ప్రజలు అని కంటెస్టెంట్స్‌ను రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు. వీరిద్దరి మధ్య పోటీ పెట్టేందుకు బిగ్‌బాస్ సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగానే కమాండర్లకు ఓ చిన్న పరీక్ష పెట్టాడు. నలుగురు కమాండర్స్ మధ్య బాల్స్‌ను బుట్టలో వేసే గేమ్ పెట్టాడు. ఈ గేమ్‌లో ఓడిపోయినవారు ప్రజలతో పోటీ పడాల్సి ఉంటోంది. ఎవరి బుట్టలో తక్కువ బాల్స్ ఉంటే వారు సేఫ్ అవుతారని ప్రకటించారు. ఈ గేమ్‌లో సంజనా, డిమాన్ పవన్, తనూజ, నిఖిల్ పోటీపడ్డారు.ఈ గేమ్ సందర్భంగా రీతూ చౌదరి, సంజనా మధ్య మాటల యుద్ధం నడించింది. నీకు కావాల్సిన వాళ్లకు సపోర్ట్ చేస్తున్నావని సంజనా అనడంతో.. అందరూ నాకు కావాల్సిన వాళ్లే అంటూ రీతూ ఫైరయింది. నువ్వు గేమ్ సరిగ్గా ఆడలేదంటూ సంచాలక్ రీతూ మండిపడింది. దీనికి నా స్ట్రాటజీ నాది.. నా గేమ్ గురించి మాట్లాడానికి నువ్వెవరు అంటూ సంజనా అంతే రేంజ్లో ఇచ్చిపడేసింది. నా గేమ్ స్ట్రాటజీని ప్రశ్నించడానికి.. ఆఫ్ట్రాల్ నువ్వు ఎవరు? నీకేమి హక్కుంది అంటూ సంజనా శివంగిలా మాట్లాడింది. దీనికి రీతూ నేను ఆఫ్ట్రాల్ కాదు సంజనా గారు..ఐ యామ్ సంచాలక్ అంటూ రీతూ కూడా గట్టిగానే అరుస్తూ కౌంటరిచ్చింది. ఈ ప్రోమో చూస్తే ఈ రోజు ఎపిసోడ్ ఫుల్ హాట్‌గా సాగినట్లు తెలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ప్రోమో మీరు కూడా చూసేయండి. House is filled with tough tasks! Get ready for a blast episode! 💥Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar #BiggBossTelugu9 #StreamingNow pic.twitter.com/51OXUDOn8s— JioHotstar Telugu (@JioHotstarTel_) November 11, 2025 -
'బిగ్‌బాస్'కే చుక్కలు చూపుతున్న కంటెస్టెంట్స్.. అందరూ నామినేట్
బిగ్‌బాస్ సీజన్-9లో పదో వారం నామినేషన్స్ పూర్తి అయ్యాయి. సీజన్ కూడా అయిపోవస్తుంది. కానీ, హౌస్‌లోని కంటెస్టెంట్స్ మాత్రం నామినేషన్లో కూడా చెత్త పాయింట్లతోనే ముగించేశారు. దీంతో బిగ్‌బాస్‌కు కూడా చిరాకు అనిపించినట్లుంది. హౌస్‌లో వారి ఆటకు తిక్కరేగిన బిగ్‌బాస్ సూపర్ ట్విస్ట్‌తో అందరికీ షాకిస్తూ.. కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ మినహా ఈ వారం అందరినీ ఎలిమినేషన్లో నిలబెట్టాడు. 9 వారాలుగా ఇమ్ము ఎలిమినేషన్లో లేడంటూ రీసెంట్ ఎపిసోడ్లో నాగార్జున గుర్తుచేశారు. ఇదే క్రమంలో అతన్ని నామినేషన్లో పెట్టమని పరోక్షంగా బిగ్‌బాస్ రంగంలోకి దిగి ఛాన్స్ ఇస్తే దానిని కూడా హౌస్‌లో ఎవరూ ఉపయోగించుకోలేదు. ఇలా చెత్తగా నామినేషన్ ప్రక్రియను ముగించేశారు. తనూజ కోసం భరణి అంటూ ఇమ్మూ ఫైర్బిగ్బాస్ హౌస్‌లో ఆరు వారాల ఆట మాత్రమే ఉంది. ప్రస్తుతం హౌస్‌లో 11మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాలని.. అందుకోసం ఐదు నిమిషాల టైమ్ లిమిట్ ఇచ్చాడు. నామినేట్ అయిన వారు అక్కడొక కుర్చీలో కూర్చుంటే బురదనీళ్లు వచ్చి వారి మీద పడుతాయి. మొదట ఇమ్మాన్యుయేల్ నామినేషన్ ప్రక్రియ మొదలుపెడుతాడు. భరణిని నామినేట్ చేస్తూ.. కెప్టెన్సీ టాస్క్‌లో మీరు తనూజ కోసం గివప్ చేయడం నచ్చలేదనే పాయింట్ తెరపైకి తెస్తాడు. మీకంటే తనూజనే బెస్ట్ ప్లేయర్ అని ఒప్పుకోవడం ఏంటి అంటూ భరణిని ప్రశ్నిస్తాడు. ఈసారి కొత్త భరణిని చూస్తారన్నారని రీఎంట్రీ ఇచ్చారు. కానీ, రోజురోజుకి ఆ ఫైర్ కనిపించడంలేదంటూ ఇమ్మూ ఫైర్ అవుతాడు. అయితే, భరణి సరైన సమాధానాలు చెప్పలేకపోయాడు. అయితే, ఎక్కువ మంది గౌరవ్, నిఖిల్‌ను నామినేషన్ చేస్తూ సేఫ్ గేమ్ ఆడారు.దివ్యను నామినేషన్ చేసిన భరణిఈ వారం నామినేషన్లో ప్రత్యేకత ఏదైనా ఉందంటే.. దివ్యను భరణి నామినేట్ చేయడమని చెప్పాలి. ఈ క్రమంలో భరణి ఇలా చెప్తాడు. 'నా గేమ్ నీ వల్ల పాడవ్వలేదు.. నేను నీ వల్ల హౌస్ నుంచి బయటికి వెళ్లలేదనేది నాకు మాత్రమే తెలుసు. కానీ, హౌస్మేట్స్ మాత్రం దివ్య వల్లనే భరణి వెళ్లారు అనుకుంటున్నారు. అది తప్పని ప్రూ చేయాల్సిన బాధ్యత నీపైన కూడా ఉంది కదా.. కాబట్టి నువ్వు నామినేషన్‌కి వెళ్లి సేఫ్‌గా వచ్చి ప్రూ చేసుకో..' అంటూ భరణి చెప్పాడు. దీంతో దివ్య కౌంటర్ గట్టిగానే ఇస్తుంది. నా వల్ల మీ గేమ్ పాడైందా..? ఇది ఏ రకమైన కారణం..? అంటూ భరణిపై విరుచుకుపడింది. నా వల్ల మీరు హౌస్ నుంచి వెళ్లిపోలేదనే విషయంలో మీకు క్లారిటీ ఉన్నప్పుడు నన్ను ఎందుకు నామినేట్ చేస్తున్నారు. మీరు వెళ్లిపోయింది నా వల్లే అని ఎవరూ అనలేదు బాండింగ్స్‌లో నేను ఒక్కదాన్నే ఉన్నానా.. అని దివ్య ఫైర్ అయింది. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్దం గట్టిగానే నడిచింది.భరణి మాత్రమే ప్రత్యేకంనామినేషన్స్ తంతు ముగిసిన తర్వాత బిగ్ బాస్ ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తూ.. ఈ వారం హౌస్‌లో ఉన్న ప్రతి ఒక్కరినీ నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే, కెప్టెన్ ఇమ్మాన్యుయేల్‌కి మినహాయింపు ఇవ్వాలా, వద్దా అనేది సీక్రెట్ ఓటింగ్‌తో నిర్ణయించమని కోరుతాడు. అప్పటికీ కూడా ఎవరూ ఇమ్మూను నామినేట్ చేయలేదు. కేవలం భరణి మాత్రమే ఇమ్మాన్యుయేల్‌ను నామినేషన్లో ఉంచాలని ఓట్ వేస్తాడు. మిగిలిన అందరూ ఇమ్మూకు మద్దతు తెలుపుతూ నామినేషన్స్ నుంచి తప్పిస్తారు. దీంతో ఈ వారం ఇమ్మాన్యుయేల్‌ను మినహాయించి హౌస్‌లో ఉన్న అందరూ నామినేషన్ లిస్ట్‌లోకి వచ్చారు. -
బిగ్‌బాస్ విన్నర్‌గా బుల్లితెర నటి.. ప్రైజ్‌మనీ ఎన్ని లక్షలో తెలుసా?
ప్రస్తుతం బుల్లితెర ప్రియులను అలరిస్తోన్న ఏకైక రియాలిటీ షో బిగ్‌బాస్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సీజన్ సక్సెస్‌పుల్‌గా కొనసాగుతోంది. ఈ రియాలిటీ షోకు ఆడియన్స్‌ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా మలయాళ బిగ్‌బాస్ సీజన్-7 గ్రాండ్ ఫినాలే ముగిసింది. ఈ సీజన్ విజేతగా ప్రముఖ మలయాళ నటి, యాంకర్ అనుమోల్ నిలిచింది.మలయాళ బిగ్‌బాస్ హిస్టరీలో రెండోసారి మహిళ కంటెస్టెంట్ ట్రోఫీని కైవసం చేసుకుంది. విజేతకు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ట్రోఫీని అందించారు. అయితే ఈ సీజన్లో మొదటిసారి కామనర్‌గా అడుగుపెట్టిన అనీష్ రన్నరప్‌గా నిలిచాడు. ఈ సీజన్‌కు విజేతకు ట్రోఫీతో పాటు రూ.42.55 లక్షల నగదు, లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ సీజన్లో షానవాస్, అక్బర్, నెవిన్, అనుమోల్, అనీష్ టాప్-5లో నిలిచారు. చివరికీ నటి అనుమోల్ విన్నర్‌గా అవతరించింది. కాగా.. ఈ సీజన్‌కు మలయాళ స్టార్ మోహన్ లాల్ హోస్ట్‌గా వ్యవహరించారు. -
'పర్ఫామెన్స్ తక్కువ, డ్రామా ఎక్కువ'.. నామినేషన్స్‌లో ఎవరంటే?
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో నామినేషన్స్‌కు వచ్చినా కష్టమే, రాకున్నా కష్టమే! ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోతే, అందులోనూ పర్ఫామెన్స్ బాలేకపోతే ఓవరూ ఓట్లేయరు. అలాంటప్పుడు నామినేషన్స్‌లోకి వస్తే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి, బాగా గేమ్స్ ఆడుతున్నప్పటికీ నామినేషన్స్‌లోకి రాకపోతే అభిమానులందరూ ఎవరో ఒక కంటెస్టెంట్ వైపు మళ్లే అవకాశముంది. సదరు వ్యక్తికి ఓట్లేయడం మర్చిపోయే ఛాన్సుంది. భరణిని నామినేట్ చేసిన ఇమ్మూఅయితే తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో తొమ్మిదివారాలు నామినేషన్స్ నుంచి తప్పించుకున్న ఏకైక కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్. చూస్తుంటే ఈ వారం కూడా నామినేషన్స్‌కు దూరంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో ఇమ్మాన్యుయేల్ భరణిని నామినేట్ చేస్తూ.. మీరు చాలా విషయాల్లో వెనకాడుతున్నారు. ఫైర్ తగ్గిపోతోందని కారణం చెప్పాడు. ఎమోషనల్ డ్రామా ఎక్కువైందిరీతూ.. దివ్యను నామినేట్ చేస్తూ.. నువ్వొక గ్యాంగ్‌ను పెట్టుకుని వారిని బాణాల్లా వదులుతావ్.. అంది. వాళ్లేమైనా చిన్నపిల్లలా? అని దివ్య కౌంటరిచ్చింది. పర్ఫామెన్స్ లేదు కానీ ఎమోషనల్ డ్రామా ఎక్కువైందని సంజనాను నామినేట్ చేశాడు గౌరవ్. కల్యాణ్.. నిఖిల్‌ను నామినేట్ చేశాడు. మొత్తానికి ఈ వారం నిఖిల్, గౌరవ్, సంజనా, రీతూ, భరణి, దివ్య నామినేట్ అయినట్లు తెలుస్తోంది. చదవండి: బిగ్‌బాస్ చరిత్రలో రికార్డుకెక్కిన ఇమ్మూ.. వార్నింగ్ ఇచ్చిన నాగ్ -
బిగ్‌బాస్ చరిత్రలో రికార్డుకెక్కిన ఇమ్మూ.. వార్నింగ్ ఇచ్చిన నాగ్
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ముద్దుబిడ్డ తనూజ అంటున్నారు కానీ ఆమెకంటే ఎక్కువ హింట్లు, సూచనలు ఇమ్మాన్యుయేల్‌కు ఇస్తున్నారు. తన ఆట ఎలా ఉందో ప్రతిసారి ఆడియన్స్‌తో చెప్పిస్తున్నారు. ఈసారేకంగా నామినేషన్స్‌లోకి రావడం లేదు, ఇలాగైతే కష్టమని ఏకంగా నాగార్జునే అనడం గమనార్హం. ఇంతకూ హౌస్‌లో ఏం జరిగిందో నవంబర్ 9వ ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..ఇద్దరికీ సమాన ఓట్లుట్రోఫీకి ఎవరు దగ్గర్లో ఉన్నారు? ఎగ్జిట్‌కు ఎవరు దగ్గర్లో ఉన్నారో చెప్పాలన్నాడు నాగ్ (Nagarjuna Akkineni). ఐదురు హౌస్మేట్స్ తనూజను, మరో ఐదుగురు ఇమ్మాన్యుయేల్‌ను ట్రోఫీకి దగ్గర్లో పెట్టారు. సంజన.. డిమాన్ పవన్‌కి ట్రోఫీ గెలిచే అర్హత ఉందని చెప్పింది. ఇమ్మూ.. కల్యాణ్‌కు గెలిచే అర్హత ఉందన్నాడు. ఎగ్జిట్ విషయంలో అయితే మెజారిటీగా ఎనిమిది మంది సాయి వెళ్లిపోతాడని ముందే గెస్ చేశారు.దివ్యకు వాయింపులుఇక గతవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడాడు నాగ్. దివ్య స్ట్రాటజీ కరెక్ట్.. కానీ, ఒకరి గెలుపు కోసం కష్టపడాలి తప్ప ఒకరి ఓటమి కోసం కాదని చెప్పాడు. తనూజను తీయను అని తనకు, కల్యాణ్‌కు మాటిచ్చి దాన్ని తప్పితే నీ క్రెడిటిబులిటీ పోతుందని హెచ్చరించాడు. రెబల్‌గా దివ్య.. తనను ఆటలో నుంచి తీసేస్తే కల్యాణ్ ఫైట్ చేయడం మానేసి పకపక నవ్వడం.. అది కరెక్టే అని నాగార్జున చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.ఇమ్మూని హెచ్చరించిన నాగ్ఇక బిగ్‌బాస్ చరిత్రలో ఇన్నివారాలు (తొమ్మిది వారాలు) నామినేషన్స్‌లోకి రాకుండా ఉన్నది నువ్వు ఒక్కడివే.. అని ఇమ్మాన్యుయేల్‌తో అన్నాడు. అదే నాకూ భయమేస్తుంది సార్, నా ఫ్యాన్స్ అందరూ నిద్రపోయి ఉంటారేమో అనిపిస్తోంది. ఎవరికో ఒకరికి షిఫ్ట్ అయిపోయుంటారేమో, త్వరలోనే వస్తా.. నాకోసం వెయిట్ చేయండి అని ఇమ్మూ వేడుకున్నాడు. 10 వారాలు నామినేషన్స్‌లోకి రాకుండా సడన్‌గా వస్తే.. అప్పటికే ఓటింగ్ అంతా ఫామ్ అయిపోయి ఇంటికెళ్లే పరిస్థితి వస్తుంది. అర్థమైంది కదా.. అంటూ నామినేషన్స్‌లోకి రమ్మని వార్నింగ్ ఇస్తూనే డైరెక్ట్‌గా హింటిచ్చాడు.పవర్ వాడేందుకు ఒప్పుకోని తనూజఇక నాగ్ అందర్నీ సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో భరణి, సాయి మిగిలారు. వీరిలో సాయి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. నీ దగ్గరున్న పవర్ ఉపయోగించి సాయిని సేవ్ చేయొచ్చు, అప్పుడు భరణి ఎలిమినేట్ అవుతాడని నాగ్ చెప్పాడు. అందుకు తనూజ ఒప్పుకోకపోవడంతో సాయి ఎలిమినేట్ అయ్యాడు. అతడు స్టేజీపైకి వచ్చి హౌస్‌లో ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సుమన్ కరెక్ట్ అని, భరణి, రీతూ, దివ్య రాంగ్ అని పేర్కొన్నాడు.చదవండి: అందువల్లే సాయి ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే? -
అందువల్లే సాయి ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9) లో 9వ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఇంటి మీద బెంగతో రాము స్వయంగా ఇంటి నుంచి బయటకు వచ్చేస్తే సాయి శ్రీనివాస్ ప్రేక్షకుల ఓట్ల ప్రకారం ఎలిమినేట్ అయ్యాడు. మరి ఆయన ఎలిమినేషన్‌కు కారణాలేంటి? రెమ్యునరేషన్ ఎంత చూసేద్దాం..ఇమ్యూనిటీతో హౌస్‌లోకి..అక్టోబర్ 12న వైల్డ్ కార్డ్‌గా హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు సాయి శ్రీనివాస్ (Sreenivasa Sayee). ఇమ్యూనిటీ పవర్ ఉన్న వజ్రాన్ని అతడి చేతికిచ్చిన నాగ్ కావాల్సినప్పుడు వాడుకోమన్నాడు. అంతేకాదు, ఫస్ట్ వీక్‌లో వైల్డ్‌కార్డ్స్ నామినేషన్‌లోకే రాలేదు. తర్వాతి వారం నామినేషన్లోకి వచ్చినప్పటికీ సేవ్ అయిపోయాడు. కానీ, మరో వైల్డ్ కార్డ్ రమ్య ఎలిమినేట్ అయింది.కుంభస్థలాన్నే కొట్టాలనుకున్నాడుఆ తర్వాతి వారం తన ఇమ్యూనిటీ వాడుకుని నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు. గత వారం మాత్రం ఈ గండాన్ని తప్పించుకోలేకపోయాడు. తనూజను స్ట్రాంగ్ పాయింట్లు చెప్పి నామినేట్ చేసిన సాయి ధైర్యాన్ని కొందరు మెచ్చుకున్నారు. కానీ, తనూజ ఫ్యాన్స్‌కు మాత్రం గిట్టలేదు. తనూజతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపించాలనుకున్నారు. పోనీ, టాస్కుల్లో అరాచకంగా ఏమైనా ఆడాడా? అంటే అదీ లేదు. అవకాశాలు దక్కించుకోలేక..ఆడేంత సత్తా ఉన్నప్పటికీ అవకాశాన్ని చేజిక్కించుకునే తెలివి లేకుండా పోయింది. టీమ్‌లో ఉన్నాడే కానీ, ముందు వరుసలో ఆడలేకపోయాడు. దివ్య తెలివిగా అతడిని వెనకపడేయడం.. రీతూ మరింత తెలివిగా అతడ్ని ఆటలో తప్పించడంతో గేమ్స్ ఆడే ఛాన్సులు రాలేవు. హౌస్‌లో అడుగుపెట్టిన కొత్తలో అక్కడి మాటలు ఇక్కడ.. ఇక్కడి మాటలు అక్కడ చెప్పడంతో మానిప్యులేటర్ అన్న ముద్ర కూడా పడింది. రెమ్యునరేషన్ ఎంత?కెప్టెన్సీ గేమ్‌లోనూ తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడంలో తడబడ్డాడు. ఎక్కువ అయోమయానికి లోనయ్యాడు. అప్పటికీ నెమ్మదిగా తనను తాను మెరుగుపర్చుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ, అంత నెమ్మదితనం బిగ్‌బాస్ షోలో పనికిరాదు. ఫలితంగా సాయి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అతడికి వారానికి రూ.2 లక్షల మేర రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన నాలుగువారాలకుగానూ రూ.8 లక్షల మేర సంపాదించాడన్నమాట!చదవండి: Bigg Boss 9.. నాకు బయటే నెలకు రూ.కోటి వస్తుంది: మాధురి


