పవన్‌ కల్యాణ్‌ అసలు ఆర్మీ జవానే కాదు: సైనికుడు | Bigg Boss 9 Telugu: Pawan Kalyan Padala not a Army Soldier, he Was Dismissed | Sakshi
Sakshi News home page

Pawan Kalyan: ఆర్మీకి రిజైన్‌ లేదంటే డిస్మిస్‌ అయ్యాడు.. ఆర్మీ జవాన్‌

Dec 9 2025 12:36 PM | Updated on Dec 9 2025 1:07 PM

Bigg Boss 9 Telugu: Pawan Kalyan Padala not a Army Soldier, he Was Dismissed

ఏంటో.. బిగ్‌బాస్‌ షోలో ఒక్క సీజన్‌లో ఒక్కో కార్డు వాడుతున్నారు. ఏడో సీన్‌లో రైతు బిడ్డ.. జై కిసాన్‌ అంటూ పల్లవి ప్రశాంత్‌ను పైకి లేపారు. ఈ సీజన్‌లో పవన్‌ కల్యాణ్‌ను ఆర్మీ జవాను.. జై జవాన్‌ అంటూ బోలెడంత హైప్‌ ఇస్తున్నారు. ఆఖరికి నాగార్జున సైతం రెండుసార్లు కల్యాణ్‌కు ఆర్మీ సెల్యూట్‌ చేశాడు. అతడు కూడా హోస్ట్‌కు రివర్స్‌లో సెల్యూట్‌ చేశాడు.

డిపార్ట్‌మెంట్‌ నుంచి తీసేస్తారు
అయితే కల్యాణ్‌ ఆర్మీ జవానే కాదంటున్నాడో సైనికుడు అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎస్‌జే సుందర్‌ అనే జవాన్‌ మాట్లాడుతూ.. 89 రోజుల తర్వాత ఏ సోల్జర్‌ కూడా డిపార్ట్‌మెంట్‌లో ఉండడు. వారిని డిస్మిస్‌ ఫ్రమ్‌ సర్వీస్‌ చేస్తారు. కల్యాణ్‌ బిగ్‌బాస్‌కు వచ్చి 90 రోజులవుతోంది. అంటే అతడిని డిపార్ట్‌మెంట్‌ నుంచి తీసేస్తారు. ఈరోజుతో అతడు సోల్జర్‌ ఐడెంటిటీని కోల్పోయాడు. ఇప్పుడతడు కామన్‌ మ్యాన్‌ మాత్రమే!

సెల్యూట్‌ కొట్టరు 
మరో ముఖ్య విషయం.. అతడు ఇండియన్‌ ఆర్మీ కాదు, సీఆర్పీఎఫ్‌ అని పేర్కొన్నారు. దీనిపై కల్యాణ్‌ (Pawan Kalyan Padala) ఫ్యాన్స్‌ మండిపడ్డారు. ఆయన లీవ్‌ పెట్టుకునే వచ్చాడు, మీరు కావాలనే నెగెటివ్‌ చేస్తున్నారని ఆగ్రహించారు. దీనికి సుందర్‌ స్పందిస్తూ.. నిజమైన ఆర్మీ జవాన్‌ ఎప్పుడూ బిగ్‌బాస్‌ లాంటి షోలో సెల్యూట్‌ కొట్టరు అని క్లారిటీ ఇచ్చారు. 

పెళ్లికే లీవ్‌ ఇవ్వరు
మరో వీడియోలో ఆయన మాట్లాడుతూ.. సైనికుడికి లీవ్‌ దొరకడం చాలా కష్టం. తన పెళ్లి కోసం లీవ్‌ అడిగితే కూడా.. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఏమంత అవసరం లేదు, తర్వాత చేసుకోవచ్చు అని చెప్తుంటారు. మరో విషయం..  కల్యాణ్‌ ముందే రిజైన్‌ చేసి ఉండాలి, లేదంటే ఇప్పుడైనా తనన డిస్మిస్‌ చేసుండాలి. 

ఎవరికి పడితే వారికి సెల్యూటా?
ఆయన మూడు సంవత్సరాలు సేవలందించానని చెప్పాడు. కానీ, అది నిజం కాదు.. తొమ్మిది నెలలు ట్రైనింగ్‌, ఆరు నెలలపాటు డ్యూటీ చేసి వచ్చేశాడు. సోల్జర్‌ భారతీయ జెండాకు లేదా కమాండర్‌కు మాత్రమే సెల్యూట్‌ కొడతాడు. ఎవరికి పడితే వారికి కాదు అన్నారు. మరి కల్యాణ్‌ బయటకు వచ్చాక ఈ వివాదంపై ఎలా స్పందిస్తాడో చూడాలి!

 

 

చదవండి: నరసింహ మూవీలో ఐశ్వర్యరాయ్‌.. రజనీకాంత్‌ చెప్పిన విశేషాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement