ఆ ఫోన్‌ రాకపోయుంటే చనిపోయేవాడిని: నాగమణికంఠ | Actress Sada Gets Emotional over Bigg Boss Naga Manikanta Past Hurdles, Read Story For More Details | Sakshi
Sakshi News home page

రెండేళ్లు ఖాళీగా.. చనిపోదామనుకున్నా.. మణి మాటలకు ఏడ్చేసిన సదా

Mar 8 2026 4:16 PM | Updated on Mar 8 2026 5:43 PM

Sada Gets Emotional over Bigg Boss Naga Manikanta Pas Hurdles

ఒక్క ఛాన్స్‌.. ఒకే ఒక్క ఛాన్స్‌ అంటూ ఎదురుచూసేవాళ్లు చాలామంది! ఆ ఛాన్స్‌ దొరక్క ఇక జీవితంపై ఆశలు వదిలేసుకుని తనువు చాలించాలనుకున్నాడు నాగమణికంఠ. అలాంటి సమయంలో బిగ్‌బాస్‌ షో నుంచి పిలుపు వచ్చింది. మళ్లీ గుండె నిండా ఆత్మవిశ్వాసం నింపుకుని షోలో అడుగుపెట్టాడు. ఒక్క పాటతో ఫుల్‌ ట్రోల్‌ అయ్యాడు. కానీ, తర్వాత నెమ్మదిగా ప్రేక్షకుల ఆదరణ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బీబీ జోడీ డ్యాన్స్‌ షోలో పార్టిసిపేట్‌ చేస్తున్నాడు.

రెండేళ్లపాటు..
ఈ సందర్భంగా మణికంఠ మాట్లాడుతూ.. మనలో వచ్చే నెగెటివ్‌ ఆలోచనలను అక్కడే చంపేయాలి. రెండేళ్లపాటు నేనేం సంపాదించలేదు, ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు. ఇక అయిపోయిందిరా భయ్‌ అనుకున్నాను. ఆ 10 నిమిషాల్లో నాకు ఫోన్‌కాల్‌ రాకపోయుంటే నా జీవితం ముగిసిపోయేది. సరిగ్గా అదే సమయంలో బిగ్‌బాస్‌ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. 

ఏడ్చేసిన సదా
అప్పుడు కన్నీళ్లు తుడుచుకుని ఇంటర్వ్యూకి వెళ్లాను అని పేర్కొన్నాడు. నీ వెనక ఇలాంటి గతం ఉందని తెలీదు, నాకు చాలా బాధగా అనిపిస్తోందంటూ నటి సదా కన్నీళ్లు పెట్టుకుంది. కాగా నాగమణికంఠ సీరియల్‌ నటుడు. చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో తల్లి రెండో పెళ్లి చేసుకుంది. కానీ, అతడిని తండ్రిగా స్వీకరించలేకపోయాడు. 

బిగ్‌బాస్‌ షోతో గుర్తింపు
ఇంతలో తల్లి క్యాన్సర్‌తో 2019లో మరణించింది. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చేసిన అతడు మంచి ఉద్యోగం సంపాదించాడు. పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయాడు. కూతురు పుట్టడంతో తల్లే తిరిగి వచ్చిందని సంతోషించాడు. కానీ, భార్యాభర్తల మధ్య కలహాలు మొదలవడంతో ఇండియాకు ఒంటరిగా తిరిగొచ్చేశాడు. తెలుగు బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌తో గుర్తింపు పొందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement