Tollywood
-
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్.. ఆ రోజే తుది నిర్ణయం!
జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేస్తామని ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో జూన్‌పై విడుదలయ్యే సినిమాలపై ఈ ప్రభావం ఉండనుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఈ విషయంపై సమావేశం నిర్వహించారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లపై ఫిల్మ్ ఛాంబర్లో చర్చించారు. ఈ నెల 23న మరోసారి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో సంయుక్త సమావేశం నిర్వహించాలని నిర్మాతలు నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో శుక్రవారం రోజైనా తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను అద్దె విధానంలో నడుపుతున్నారు. దీని వల్ల తాము నష్టపోతున్నామని ఎగ్జిబిటర్లు వాదిస్తున్నారు. అందుకే పర్సంటేజీ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విధానం అమలు చేయకపోతే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ప్రకటించారు. అయితే తాజా సమావేశంలో పర్సంటేజీ విధానంపై కొందరు నిర్మాతలు మొగ్గు చూపగా.. మరికొందరు ఓకే చేయలేదని సమాచారం. ఈ సమావేశంలో టాలీవుడ్ నిర్మాతలు దిల్ రాజు, సురేశ్‌బాబు, డీవీవీ దానయ్య, సాహు గారపాటి, బాపినీడు, నాగవంశీ పాల్గొన్నారు. -
మీ కుమారుడితో సినిమా తీస్తారా?.. కేజీఎఫ్ హీరో యశ్ తల్లి ఆసక్తికర సమాధానం..!
కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన హీరో యశ్. శాండల్‌వుడ్ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా యశ్‌కు గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాయి. కేజీఎఫ్, కేజీఎఫ్-2 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో యశ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్లో పెరిగిపోయింది. ప్రస్తుతం యశ్ టాక్సిక్ మూవీలో నటిస్తున్నారు.అయితే ఈ కన్నడ హీరో మాతృమూర్తి పుష్ప అరుణ్ కుమార్ నిర్మాతగా రాణిస్తున్నారు. ఆమె తాజాగా నిర్మించిన చిత్రం కోతలవాడి. ఈ మూవీకి శ్రీరాజ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన యశ్ తల్లి పుష్పకి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ కుమారుడితో మూవీ తీయాలనుకుంటే ఎలాంటి సినిమా తీస్తారు? అని ఆమెను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.అయితే దీనికి ఆమె చెప్పిన సమాధానం అందరికీ నవ్వులు తెప్పించింది. అసలు నేను యశ్‌తో సినిమా చేయనని షాకింగ్ సమాధానమిచ్చింది. ఎందుకంటే అన్నం లేనివాడికి పెట్టాలి కానీ.. అన్నీ ఉన్నవాడికి పెడితే వాటి విలువ తెలియదంటూ ఆమె మాట్లాడింది. నేను చెప్పేది నిజమా? కాదా? అంటూ అక్కడున్నవారిని అడిగింది. వాడికి అన్నీ ఉన్నాయి.. సినిమా కావాలనుకుంటే వాడే తీసుకుంటాడు.. నేను యశ్‌తో ఎలాంటి సినిమా చేయనంటూ ఖరాఖండిగా చెప్పేసింది ఆయన మాతృమూర్తి పుష్ప అరుణ్‌కుమార్. దీనికి అక్కడున్నవారంతా కాస్తా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే కన్నడకు చెందిన ఆమె అయినప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడడం విశేషం. -
గేమ్ ఛేెంజర్ హీరోయిన్‌పై ఆర్జీవీ పోస్ట్.. నెటిజన్ల దెబ్బకు డిలీట్ చేసిన డైరెక్టర్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం వార్-2. ఈ మూవీలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. ఈ ఫుల్ యాక్షన్ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. అయితే ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో హీరోయిన్ కియారా బికినీలో కనిపించి అభిమానులకు షాకిచ్చింది. ఆ హీరోయిన్ను అలా చూసిన నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు.అయితే ఈ టీజర్ చూసిన టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ సైతం టీజర్ చూసి ఓ పోస్ట్ పెట్టారు. అందులో కియారా అద్వానీ బికినీ డ్రెస్‌ను ఉద్దేశించి పోస్ట్ చేయడంతో అది కాస్తా వివాదానికి దారితీసింది. ఆర్జీవీ పోస్ట్ చూసిన నెటిజన్స్ చెత్త పోస్ట్ అంటూ రాం గోపాల్ వర్మపై విమర్శలు చేశారు. రామ్ గోపాల్ వర్మ భాయ్, ఏదైనా పోస్ట్ చేసే ముందు కాస్తా ఆలోచించండి.. అప్పుడు మీరు ఇలాంటివి పోస్ట్ చేయరంటూ ఓ నెటిజన్ సలహా ఇచ్చారు.తన ట్వీట్‌పై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఆర్జీవీ తన పోస్ట్‌ను సోషల్ మీడియాలో తొలగించాడు. కియారా అభిమానులు, నెటిజన్స్ నుంచి సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో పోస్ట్ డిలీట్ చేశాడు. కాగా.. వార్- 2 లో హృతిక్ రోషన్ రా ఏజెంట్ మేజర్ కబీర్ ధిలావాల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో విలన్‌గా నటించారు. ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
నేను క్లియర్‌గా చెప్పా.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌పైనే నా పోరాటం: పూనమ్ కౌర్ మరో పోస్ట్
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ ఎప్పుడు ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. సినిమా విషయాలే కాదు.. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మహిళలపై జరిగే అన్యాయాలను ఎప్పటికప్పుడు నిలదీస్తుంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తూనే ఉంది.ముఖ్యంగా టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తాజాగా మరోసారి గుర్తు చేసింది. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. నేను ఇంతకుముందే ఈ విషయాన్ని చెప్పాను.. మళ్లీ కూడా చెప్తున్నా.. నేను మెయిల్ ద్వారా ఇప్పటికే మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశానని తెలిపింది. ఆ తర్వాత ఝాన్సీ గారితో మాట్లాడానని.. కానీ మీటింగ్ కాస్తా ఆలస్యమవుతుందని చెప్పారని.. అప్పటివరకు తమను డిస్టర్బ్ చేయవద్దని చెప్పారని కోరింది.కానీ ఇక్కడ నేను ఎవరి పేరు చెప్పలేదని అనుకుంటున్నారు.. క్లియర్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్‌పైనే ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. అంతేకాదు రాజకీయ, సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరో కాపాడుతున్నారని కూడా చెప్పానని పూనమ్ కౌర్ ప్రస్తావించింది. ఈ విషయంపై నేను మహిళల గ్రూప్‌తో మాట్లాడతానని కూడా పూనమ్ వెల్లడించింది. అంతేకాకుండా తన మెయిల్‌కు రిప్లై కూడా వచ్చిన స్క్రీన్‌షాట్‌ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో మరోసారి పూనమ్ కౌర్- త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్యవహారం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. -
‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)
-
చిన్నప్పటి ఫోటోతో అక్కకు 'బర్త్‌డే శుభాకాంక్షలు' చెప్పిన స్టార్ హీరో
హీరో నాని తన సోదరి దీప్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అయితే, తమ చిన్ననాటి ఫోటోను షేర్ చేసి అభిమానులతో పంచుకున్నారు. ఈ ఏడాదిలో తమ సొంత ఫ్రాంచైజీలో భాగమై ‘హిట్ 3’లో నాని నటించారు. ఆపై కోర్టు సినిమాను సొంత బ్యానర్లోనే తెరకెక్కించి భారీ హిట్ అందుకున్నారు. అయితే, ఈ విజయాల్లో నాని సోదరి దీప్తి పాత్ర చాలా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఆమె సహ నిర్మాతగా కూడా కోర్టు సినిమాకు ఉన్నారు.నాని సోదరి దీప్తి గంటా ఒక డైరెక్టర్ కూడా.. గతంలో ‘మీట్ క్యూట్’ అనే చిత్రాన్ని ఆమె తెరకెక్కించారు. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని సమర్పిస్తుండగా ప్రశాంతి నిర్మించారు. గతంలోనూ 'అనగనగా ఒక నాన్న' అనే షార్ట్‌ఫిలిం కోసం ఆమె దర్శకత్వం వహించిన దీప్తి తన ప్రతిభ చూపారు. అలా సినిమాతో ఆమెకు మంచి కనెక్షన్ ఉంది. అ!, హిట్ ఫ్రాంచైజీ చిత్రాలు, కోర్టు వంటి సినిమాలకు దీప్తి పనిచేశారు. అలా తన అక్కతో నాని చిత్ర పరిశ్రమలో సూపర్‌గా విజయాలు అందుకుంటున్నారు. ఈరోజు ఆమె పుట్టినరోజు కావడంతో ఇలా ఫోటో షేర్ చేశారు. 'అక్కీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ వేడుకలు జరుపుకోవడానికి నేను వేచి ఉండలేను.' అంటూ తెలిపాడు.హీరో నాని ఫ్యామిలీ మ్యాన్‌గా ఇండస్ట్రీలో గుర్తింపు ఉంది. సినిమాకు ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో తన కుటుంబానికి కూడా అంతే సమయం కేటాయిస్తాడు. ఇప్పుడు సినిమాపై తనకున్న మక్కువతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్తవారికి ఛాన్సులు కల్పిస్తున్నాడు. వాస్తవానికి చిత్రపరిశ్రమకు నాని చాలామంది దర్శకులను పరిచయం చేశారు. వారితో విజయాలను కూడా అందుకున్నారు. View this post on Instagram A post shared by Nani (@nameisnani) -
‘ఒక బృందావనం ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అతని కాలి బూట్లకు ముద్దు పెట్టిన హీరో అజిత్.. వీడియో వైరల్
సినిమా హీరోలను దేవుడిలా అభిమానులు పూజిస్తారు. మరి ఆ హీరోలే మరోకరిని తమ జీవితానికి ఆదర్శంగా తీసుకుంటే అతనెంత గొప్పవాడై ఉంటాడో అని ఆలోచిస్తాం. సరిగ్గా అలాంటి సన్నివేశమే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ లైఫ్‌లో ఒకటి ఉంది. అజిత్ తాజాగా తన అభిమాన కార్ రేసర్‌కు నివాళులు అర్పించారు. ఆయనపై తన అభిమానం ఏపాటిదో వీడియోతో చూపాడు. దానిని చూసిన అజిత్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.అజిత్ తాజాగా ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్ అయర్టన్ సెన్నాకు నివాళులర్పించారు. ఇటలీ పార్క్‌లో ఉన్న ఆయన విగ్రహం పాదాలకు ముద్దు పెట్టి తన అభిమానం ఎలాంటిదో చూపాడు. అయర్టన్ సెన్నా విగ్రహాన్ని కొంత సమయం పాటు అలా చూస్తూ ఉండిపోయాడు. ఆ సమయంలో ఆయన చాలా ఎమోషనల్ అయ్యాడు. బ్రెజిల్ దేశానికి చెందిన అయర్టన్ సెన్నా మూడు సార్లు(1988,1990,1991) ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్‌గా గెలిచి రికార్డ్ క్రియేట్ చేశాడు. వరుసగా మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ సెట్ చేశాడు. 1994 కార్ రేసింగ్‌లో జరిగిన ప్రమాదంలో ఆయన మరణించారు.అజిత్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ప్రొఫెషనల్ రేసర్‌గానూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది. షూటింగ్స్‌లకు కాస్త విరామం దొరికితే చాలు రేసింగ్ బైక్స్, కార్లలో చక్కర్లు కొడుతుంటారు. అంతర్జాతీయ కార్ రేసింగ్లలో కూడా ఆయన పాల్గొని సత్తా చాటారు. ఆపై తన రేసింగ్ టీమ్‌ను కూడా కొద్దిరోజుల క్రితమే ఆయన ప్రకటించారు. ‘అజిత్ కుమార్ రేసింగ్’ పేరుతో టీమ్‌ను ఏర్పాటు చేశారు. View this post on Instagram A post shared by Ajith Kumar Racing Team (@ajithkumarracing) -
తమన్నాకు ఛాన్సులు తగ్గడం వెనుక కారణం ఇదేనా..?
పాన్ ఇండియా కథానాయకి నటి తమన్న. తన 15వ ఏటనే నటిగా రంగ ప్రవేశం చేసిన ఈమె తొలుత హిందీ చిత్రంలో నటించారు. ఆ వెంటనే తెలుగు, తమిళం భాషల్లో అవకాశాలు వరుసకట్టాయి. అయితే మొదట్లో గ్లామర్‌నే నమ్ముకున్న ఈ బ్యూటీ చివరి వరకూ ఆ గ్లామర్‌తోనే తమన్నాను స్టార్ హీరోయిన్ను చేసింది. మధ్యలో తనలోని నటనకు పదును పెట్టే పాత్రలు వచ్చినా అవి చాలా తక్కువగా పరిమితం అయ్యాయి. తమన్నా కూడా వాటి గురించి పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. ఇక అప్పుడప్పుడూ ఐటమ్ సాంగ్స్‌తో అందాలను వెండితెరపై ఆరబోస్తూ కుర్రకారు హాట్ బీట్‌ను పెంచేస్తూ తన క్రేజ్‌ను మరింతగా పెంచుకున్నారు. అలా ఐటమ్ సాంగ్స్‌కు స్పెషలిస్ట్‌గా ముద్ర వేసుకున్నారు. ఐతే కథానాయకిగా తమన్నా రెండు దశాబ్దాల మైలు రాయిని అవలీలగా టచ్ చేశారు. ఇప్పటికి ఈ బ్యూటీ వయసు జస్ట్ 35 ఏళ్లే. మొన్న జైలర్ చిత్రం, ఆ తరువాత హిందీ స్త్రీ2 వంటి చిత్రాలలో తమన్నా స్పెషల్ సాంగ్స్‌తో ఇరగదీశారు. అలాంటిది ఇప్పుడు దక్షిణాదిలో ఈ భామకు ఒక్కటంటే ఒక్క సినిమా లేక పోవడం నిజంగా ఆశ్చర్యమే. ఇటీవల సుందర్ సీ దర్శకత్వంలో నటించిన అరణ్మణై – 4 చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత కోలీవుడ్‌లో మరో అవకాశం రాలేదు. ఇదే విధంగా తెలుగులో విభిన్న పాత్రలో నటించిన ఓదెల – 2 చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. దీంతో అక్కడ మరో అవకాశం రాలేదు. అలా దక్షిణాది చిత్ర పరిశ్రమ తమన్నాను పూర్తిగా పక్కన పెట్టేసిందా? అన్న చర్చ జరుగుతోంది.ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమనే నమ్ముకున్నారీ భామ. అక్కడ ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా తమన్నా కన్నా వయసులో పెద్దవారైన నయనతార, త్రిష వంటి తారలు నాలుగు పదుల వయసు దాటేసినా ఇప్పటికీ అగ్ర కథానాయకిలుగా రాణిస్తున్నారు. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. కాగా ఇటీవల నటి తమన్నా విజయ్ వర్మ అనే హిందీ నటుడి ప్రేమలో పడడం, అది కొద్ది కాలానికే వికటించడం వంటి ఘటనలు ఈమె కెరీర్ కు ఎఫెక్ట్ అయ్యాయా? అనే చర్చ కూడా సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఏదేమైనా మిల్కీ బ్యూటీ మళ్లీ అవకాశాల వేటలో పడ్డారు. తన గ్లామరస్ ఫొటోలతో నెట్టింట్లో సందడి చేస్తున్నారు. -
ముంబైలో మిరాయ్
ముంబై గుహల్లో తేజా సజ్జా సాహసాలు చేస్తున్నారు. ఎందుకంటే యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘మిరాయ్’ కోసం. తేజా సజ్జా, రితికా నాయక్ జంటగా, మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్న సినిమా ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సూపర్యోధగా తేజ కనిపిస్తారు.తాజాగా ‘మిరాయ్’ కొత్త షెడ్యూల్ షూటింగ్ చిత్రీకరణ ముంబైలోని చారిత్రక గుహల్లో ప్రారంభమైంది. తేజ , ఇతర ప్రధాన పాత్రధారులు ఈ షూటింగ్లో పాల్గొంటున్నారని మేకర్స్ తెలిపారు.‘‘మిరాయ్’ కోసం తేజా సజ్జ పూర్తీగా మేకోవర్ అయ్యారు. 2డీ, 3డీ ఫార్మాట్స్‌లో ఎనిమిది భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: గౌరహరి, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, క్రియేటివ్ప్రోడ్యూసర్: కృతీ ప్రసాద్. -
మాయాబజార్‌ని థియేటర్స్‌లోనే చూడండి: ఎస్వీ కృష్ణారెడ్డి
‘‘ఎన్టీఆర్‌గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ‘మాయాబజార్’ సినిమాని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఈ చిత్రాన్ని రీ రిలీజ్ రోజున చూసేందుకు రెండు టికెట్స్ బుక్ చేసుకున్నాను. ఈ చిత్రాన్ని అందరూ థియేటర్స్‌లోనే చూడండి’’ అని డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు, సావిత్రి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మాయాబజార్’.కేవీ రెడ్డి దర్శకత్వంలో విజయాప్రోడక్షన్స్పై నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించిన ఈ సినిమా 1957 మార్చి 27న విడుదౖలñ ంది. ఈ నెల 28న ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ‘మాయాబజార్’ చిత్రాన్ని బలుసు రామారావు రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ‘మాయాబజార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ‘ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ’ చైర్మన్ టి.డి.జనార్ధన్ మాట్లాడుతూ– ‘‘రీ రిలీజ్లోనూ ‘మాయాబజార్’ గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.నిర్మాత రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ–‘‘మా నాన్న ఎల్వీ ప్రసాద్, రామారావుగారు తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారు’’ అని తెలిపారు. ‘‘అలనాటి క్లాసిక్ సినిమాలు మళ్లీ విడుదల చేయడం మన బాధ్యత’’ అన్నారు నిర్మాత అచ్చిరెడ్డి. ఈ వేడుకలో వీర శంకర్, భగీరథ, త్రిపురనేని చిట్టి, బలుసు రామారావు తదితరులు పాల్గొన్నారు. -
మంచు మనోజ్ బర్త్ డే.. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసిన హీరో
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తన 42వ బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు తమ హీరోకు బర్త్ డే విషెస్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన పిల్లలతో కలిసి ఈ పుట్టినరోజును ఆస్వాదించారు. కాగా.. మంచు మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన భార్య మౌనిక ఇప్పటికే శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేసింది. తన భర్త ప్రేమను తలచుకుంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.కాగా.. మంచు మనోజ్ ప్రస్తుతం భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చాలా రోజుల విరామం తర్వాత బిగ్ స్క్రీన్‌పై మంచు మనోజ్ సందడి చేయనున్నారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, నారా రోహిత్ కూడా నటించారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. మే 30న ప్రేక్షకుల థియేటర్లలో సందడి చేయనుంది. #TFNExclusive: Some lovely visuals of Rocking Star @HeroManoj1 celebrating his birthday with his kids and fans!!😍📸#ManchuManoj #Bhairavam #TeluguFilmNagar pic.twitter.com/bgEMWTV8Sp— Telugu FilmNagar (@telugufilmnagar) May 20, 2025 -
రానా నాయుడు సీజన్-2 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విక్టరీ వెంకటేశ్ (Venkatesh), రానా దగ్గుబాటి (Rana Daggubati) నటించిన డార్క్ కామెడీ వెబ్ సిరీస్ రానా నాయుడు. గతంలో విడుదలైన ఈ సిరీస్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ వెబ్ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్‌కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేశ్.. నాగ నాయుడు (తండ్రి), రానా.. రానా నాయుడు (కొడుకు) పాత్రలు పోషించారు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే.(ఇది చదవండి: వెంకటేశ్- రానా సూపర్ హిట్ కాంబో.. టీజర్ వచ్చేసింది)సీజన్-1 సూపర్ హిట్ కావడంతో మేకర్స్ సీజన్-2ను కూడా తెరకెక్కించారు. తాజాగా రానా నాయుడు సీజన్-2 స్ట్రీమింగ్ తేదీని రివీల్ చేశారు. ఈ వెబ్ సిరీస్‌ను జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ తన ట్విటర్ ద్వారా తెలియజేస్తూ రానా నాయుడు పోస్టర్‌ను పంచుకుంది. ఇప్పటికే రానా నాయుడు సీజన్-2 టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా.. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్‌కు రీమేక్‌గా రానా నాయుడు వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ఈ సిరీస్‌తో రానా, వెంకటేశ్ మొదటి సారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. యాక్షన్, క్రైమ్ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్‌లో వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించారు. Jab baat parivaar ki ho, Rana harr line cross karega ❤️🔥Watch Rana Naidu Season 2, out 13 June, only on Netflix. #RanaNaiduOnNetflix pic.twitter.com/NwhRM3MQcE— Netflix India (@NetflixIndia) May 20, 2025 -
మరో జన్మ ఉంటే నువ్వే నా భర్తగా రావాలని కోరుకుంటా: మంచు మనోజ్ భార్య ఎమోషనల్ పోస్ట్
చాలా రోజుల విరామం తర్వాత మంచు మనోజ్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం భైరవం. ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.అయితే ఇటీవల ట్రైలర్ ఈవెంట్లో సందడి చేసిన మంచు మనోజ్ ఇవాళ తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య భూమా మౌనిక తన భర్తకు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన పిల్లలు, భర్తతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో అభిమానులు సైతం మంచు మనోజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.మౌనిక తన ఇన్‌స్టాలో రాస్తూ..'నేను ప్రేమించే నా సోల్‌మేట్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మా జీవితాల్లో వచ్చి.. మీ జీవిత ప్రయాణాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీరు ఈ ప్రపంచాన్ని మధురమైన ప్రదేశంగా మార్చారు. మీ చేయబోయే అన్ని మంచి పనులను బాగా జరగాలి. మీ ప్రేమ, ఆనందాన్ని పంచడానికి మీ హృదయం వెయ్యేళ్లు బతకాలి. ఈ ఏడాది మాత్రమే అన్ని సంవత్సరాలు మీరు గొప్పగా ఉండాలి. మేము నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాం.. మీరు జీవితం మరింత ఎదగాలని కోరుకుంటున్నాం. మా ముగ్గురి ప్రేమ మీ కోసం మాత్రమే. మీరు నిజంగా మా రాకింగ్ స్టార్. ప్రియమైన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా ప్రతి పునర్జన్మలో నా స్నేహితుడిగా, భర్తగా మిమ్మల్నే ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Mounika Bhuma Manchu (@mounikabhumamanchu) -
సడన్‌గా ఓటీటీకి వచ్చేసిన దెయ్యం సినిమా.. ఎక్కడ చూడాలంటే?
ఈ మధ్య ఓటీటీల్లో సినిమాలు తెగ సందడి చేసేస్తున్నాయి. ఎప్పుడో రిలీజైన చిత్రాలు ఉన్నట్లుండి ఓటీటీల్లో దర్శనమిస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ థ్రిల్లర్ సినిమా భవానీ వార్డ్ 1997 సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. గాయత్రీ గుప్తా, గణేశ్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.అయితే ప్రస్తుతానికి ఈ మూవీ చూడాలంటే అద్దె చెల్లించాల్సిందే. రూ.99 అదనంగా చెల్లించి వీక్షించాల్సి ఉంటుంది. మనిషి చనిపోయిన తరువాత ఆత్మ దేవుడి దగ్గరకు వెళ్లాలి.. కానీ, అలా వెళ్లకుండా అదే ఆత్మ ఈవిల్ స్పిరిట్‌గా మారిపోతుందనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఆద్యంతం ఆడియన్స్‌ను భయపెట్టేలా ఈ సినిమా ఉండనుంది. కాగా.. ఈ సినిమాకు జీడీ నరసింహా దర్శకత్వం వహించారు. జీడీఆర్ మోషన్ పిక్చర్, విభూ మీడియా సమర్పణలో చంద్రకాంత సోలంకి, జీడీ నరసింహా నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైంది. హారర్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని చెప్పొచ్చు. -
‘23’ మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
'వార్ 2' మొదలైంది.. టీజర్లో ఈ షాట్స్ గమనించారా? (ఫోటోలు)
-
ఎన్టీఆర్ 'వార్ 2' టీజర్ విడుదల.. యుద్ధానికి సిద్ధమా..?
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుక వచ్చేసింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన హిందీ చిత్రం ‘వార్ 2’ నుంచి అదిరిపోయే టీజర్ విడుదలైంది. తారక్‌ను ప్రధానంగా హైలెట్ చేస్తూ వీడియో ఉండటంతో ఆయన ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఇందులో తారక్ కిల్లర్ బాడీకి హృతిక్ రోషన్ లుక్స్ తోడు కావడంతో అటు బాలీవుడ్‌ను కూడా ఊపేయడం ఖాయమని చెప్పవచ్చు. టీజర్‌ను చూస్తే భారీ యాక్షన్ సీన్స్‌తో ఆకట్టుకునేలా సినిమా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా తెలుగు, హిందీ, తమిళ్ వర్షన్లో టీజర్ విడుదలైంది. అయితే, అన్ని భాషల్లో కూడా తారక్‌నే డబ్బింగ్ చెప్పాడు.ఈ ఏడాది ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఆదిత్యా చోప్రా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తున్నారు.వార్తో ‘ఎన్టీఆర్ నీల్’కు బ్రేక్ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్) నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ‘వార్ 2’ నుంచి అప్డేట్ రావడంతో ‘ఎన్టీఆర్ నీల్’ అప్డేట్ని పోస్ట్‌పోన్ చేసినట్లు ప్రకటించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 జూన్ 25న రిలీజ్ కానుంది. -
నాట్య కళాకారిణితో ర్యాప్ సింగర్ పెళ్లి..
సౌత్ ఇండియా గాయకుడు విఘ్నేశ్ త్వరలో పెల్లి చేసుకోనున్నాడు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో పలు సాంగ్స్‌తో గాయకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన సంగీత దర్శకుడు, గీత రచయిత కూడా.. ముఖ్యంగా ర్యాప్ పాటల సంగీత దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. తమిళంలో హారీష్ జయరాజ్ సంగీత దర్శకత్వంలో ఎక్కువ పాటలు పాడారు.అదే విధంగా డి.ఇమాన్,సత్య సీ, తమన్, శ్యామ్ సీఎస్ జస్టిన్ ప్రభాకరన్ వంటి సంగీత దర్శకుల చిత్రాలకు సౌండ్ ట్రాక్స్ పాడారు. ముఖ్యంగా విఘ్నేశ్ తెలుగులో చాలా పాటలు పాడారు. కాగా ఈయనకు ఇప్పుడు పెళ్లి కళ వచ్చేసింది. శ్వేత ఆనంద్ అనే భరత నాట్య కళాకారిణిని వివాహమాడబోతున్నారు. ఈమె చెన్నైలో పుట్టి, కెనడాలో నివశిస్తున్న భారతీయ సంతతికి చెందిన యువతి అన్నది గమనార్హం. శ్వేత ఆనంద్ భరతనాట్య కళాకారిణి మాత్రమే కాకుండా, కాస్ట్యూమ్ డిజైనర్, గాయనీ,మృదంగ కళాకారిణి, వయోలిస్ట్ కూడా. కాగా విఘ్నేశ్, శ్వేత ఆనంద్‌ల వివాహం జూన్ నెల 5న చైన్నె సముద్రతీరంలోని దక్షిణ చిత్ర సాంస్కృతిక కళా ప్రాంగణంలో జరగనుంది. ఈ విషయాన్ని వారు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. -
ఎన్టీఆర్ పుట్టినరోజు ప్రత్యేకం.. అందుకే ఆల్‌రౌండర్ అయ్యాడు
జూనియర్ ఎన్టీఆర్‌కు ఒక చరిత్ర ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ అంశ ఈ తారకరాముడు. నందమూరి వంశంలో నేడు అత్యంత ప్రజాదరణ కలిగిన ఏకైక నటుడు.. ఒకరకంగా చెప్పాలంటే నందమూరి అనే బ్రాండ్‌కు తారక్ ఒక ఐకాన్ అని చెప్పవచ్చు. బాల నటుడిగా తెరంగేట్రం చేసి, నూనూగు మీసాల వయసులోనే బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డ్లను దాటుకుంటూ విరుచుకపడ్డాడు. ఇండస్ట్రీలో అందరూ తారక్‌ను ఆల్‌రౌండర్ అంటారు.. దానికి కారణం భారీ డైలాగ్స్, కళ్లు చెదిరే డ్యాన్స్, దుమ్మురేపే యాక్షన్ సీన్స్, కంటతడి పెట్టించే నటన ఇలా అన్నింటిలోనూ ఆయన అగ్రగామి. క్లాస్, మాస్ అంటూ తేడా ఉండదు. సినీ అభిమానులు అందరూ ఆయనకు ఫ్యాన్సే.. నటనలో తారక్ తర్వాతే ఎవరైనా.. అనేలా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని చిత్రపరిశ్రమలో సెట్ చేశాడు. నేడు ఎన్టీఆర్ (NTR) పుట్టిన రోజు (1983 మే 20).. ఈ సందర్భంగా ఆయన గురించి పలు విషయాలపై ఓ లుక్కేద్దాం (Happy Birthday NTR)..తారక్ @ 'మ్యాన్ ఆఫ్ మాసెస్'ఇండియన్ సినిమాలో ఎందరో సూపర్ స్టార్స్, మెగాస్టార్స్, పవర్ స్టార్స్ ఉన్నారు కానీ యంగ్ టైగర్‌కు మాత్రమే ఉన్న ఏకైక బిరుదు 'మ్యాన్ ఆఫ్ మాసెస్'. ఈ బిరుదుకు ప్రధాన కారణం ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ అలాంటిది. ఇండియన్ మార్కెట్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఆయన చేరుకున్న తీరు అందరనీ ఆశ్చర్యపరుస్తుంది. కింద పడిన ప్రతిసారి సాలిడ్ బౌన్స్ బ్యాక్‌తో తిరిగొచ్చాడు.తారక్ జీవితంలో ఇవన్నీ ప్రత్యేకం🎥 తారక్ 1983 మే 20న జన్మించారు. హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్లో చదివిన ఆయన సెయింట్ మేరీ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.🎥 పదేళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్రతో బాల నటుడిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా నుంచే జూనియర్ ఎన్టీఆర్ అని పిలిచేవారు.🎥ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం 'నిన్ను చూడాలని'. ఈ సినిమాకు ఆయన రూ.3.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్. ఆ మొత్తాన్ని తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చారట.🎥 యమదొంగ, కంత్రి, అదుర్స్, రభస, నాన్నకు ప్రేమతో సినిమాలతో గాయకుడిగానూ తారక్ మెప్పించారు.🎥 జపాన్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తెలుగు హీరో తారక్. బాద్షా సినిమా జపాన్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది.🎥 'ఆది' సినిమాలో భారీ డైలాగులు చెప్పగలడా? అని కొందరు పరుచూరి బ్రదర్స్ దగ్గర సందేహించారట. కానీ, ఎన్టీఆర్ వాటంన్నిటినీ సింగిల్ టేక్‌లో చెప్పడంతో తన స్టామినా ఏంటో నిరూపించారు. ఈ సినిమాకు తారక్ నంది అవార్డు సొంతం చేసుకున్నారు.🎥 నంబర్ 9 అంటే తారక్‌కు సెంటిమెంట్. ఆయన వాహనాల నంబర్లన్నీ 9తోనే ప్రారంభమవుతాయి. ఓ కారు కోసం 9999 అనే ఫ్యాన్సీ నంబర్‌ను రూ. 10లక్షలతో కొనుగోలు చేసి 9 అంటే ఎంత ఇష్టమో తెలిపారు.🎥 మాతృదేవోభవ చిత్రంలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాట అంటే ఎన్టీఆర్‌కు చాలా ఇష్టం.🎥 'ఫోర్బ్స్ ఇండియా' సెలబ్రిటీ లిస్ట్‌లో రెండు సార్లు నిలిచాడు.🎥 పూరీ జగన్నాథ్- ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన 'ఆంధ్రావాలా' సినిమా ఆడియో విడుదల వేడుక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ చెరగని రికార్డు నెలకొల్పింది. ఈ వేడుకలో దాదాపు 10లక్షల మంది తారక్ అభిమానులు పాల్గొన్నారు. నిమ్మకూరులో జరిగిన ఈ కార్యక్రమం కోసం రైల్వే అధికారులు కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.🎥సుమారుగా 8 భాషల్లో ఎన్టీఆర్ అనర్గళంగా మాట్లాడగలడు. తన వాగ్ధాటితో ఇప్పటికే అన్ని చిత్ర పరిశ్రమల వారిని ఆకర్షించాడు.🎥 2016లో వచ్చిన జనతా గ్యారేజ్‌తో కింగ్ ఆఫ్ బాక్సాఫీస్ అవార్డును IIFA నుంచి అందుకున్నాడు🎥కంత్రి, అదుర్స్,బృందావనం చిత్రాలకు గాను ఉత్తమ హీరోగా ఫిలింఫేర్ అవార్డులను అందకున్న తారక్🎥 బాల రామాయణము,ఆది నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందకున్నాడు 🎥తారక్‌కు ఫేవరెట్ సినిమా 'దాన వీర శూర కర్ణ'. ఇప్పటికి ఈ సినిమాను వందసార్లకు పైగా చూశారట🎥 తారక్- ప్రణతిలకు ఇద్దరు అబ్బాయిలు (అభయ్, భార్గవ్). కాగా, కూతురు లేదనే లోటు ఎప్పటికీ ఉంటుందని ఎన్టీఆర్ ఓ సందర్భంలో చెప్పారు.🎥 జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్, తారక్, దేవర అయనకున్న పేర్లు🎥అమ్మ (శాలనీ) చిరకాల కలను తీర్చిన తారక్.. ఆమె స్వగ్రామం కుందాపురంలో ఉన్న ఉడుపి శ్రీకృష్ణ ఆలయ దర్శనం చేసుకోవాలనే ఆమె కోరికను కొడుకుగా తీర్చాడు. -
జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)
-
కలెక్టర్ కావాలనుకున్న పేద విద్యార్థినికి కమల్ సాయం
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ తను చేసిన సాయాన్ని బయటిప్రపంచానికి పెద్దగా చెప్పుకోడు. అయితే, కొన్ని సందర్భాల్లో ఆ సాయం పొందిన వారు ఏదో వేదిక మీద చెప్పిన తర్వాత వైరల్ అవుతుంటుంది. ఈయన ఇప్పటికే కమల్ సాంస్కృతిక కేంద్రాలను ఏర్పాటు చేసి వందల మందికి విద్యాదానం చేస్తున్నారు. తాజాగా ఒక పేద విద్యార్థిని ఉన్నత విద్యకు సాయం అందించారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లా, పాంబన్ సమీపంలోని తెర్కువాడి మత్స్యకార గ్రామానికి చెందిన శోభన అనే విద్యార్ధిని ప్లస్ –2 పరీక్షల్లో 562 మార్కులు సాధించింది. ఈమె తండ్రి మత్స్యకారుడు. తల్లి పీతలు ఎగుమతి కంపెనీలో రోజువారీ కూలీ. కాగా తాను చదివిన ప్రభుత్వ పాఠశాలలోనే అత్యధిక మార్కులు సాధించిన విధ్యార్ధిని శోభన. ఈమెకు ఉన్నత విద్యను అభ్యసించి సివిల్ సర్వీస్ పరీక్షలు రాయాలన్నది ఆశ. అయితే కుటుంబ ఆర్థిక స్థోమత లేకపోవడంతో శోభన చదువు మానేసి ఒక బట్టల దుకాణంలో పనికి చేరింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కమలహాసన్ విద్యార్ధిని శోభనను తన కార్యాలయానికి పిలిపించి కమల్ సాంస్కృతి కేంద్రం ద్వారా ఆమె ఉన్నత విద్యకు అయ్యే ఖర్చులకు సాయం చేశారు. తను సివిల్ సర్వీస్ పరీక్షలు రాసేవరకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. తన సంరక్షణలోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆపై సివిల్ సర్వీస్‌కు కావాల్సిన వనరులు ఏర్పాటు చేస్తానని శోభనకు ఆయన మాట ఇచ్చారు. దీంతో శోభన కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. కమల్ సార్ చేసిన సాయాన్ని ఎట్టిపరిస్థితిల్లోనూ వృధా కానివ్వనని శోభన చెప్పింది. తాను సివిల్ సర్వీస్ సాధించి తప్పకుండా సమాజ శ్రేయస్సు కోసం పాటు పడుతానని మాటిచ్చింది. -
ఇక నాకు ఇది కొత్త జన్మ: మంచు మనోజ్
‘‘నాకు నా హార్డ్‌వర్క్‌పై పూర్తి నమ్మకం ఉంది. ఈ బర్త్ డే (మే 20) నుంచి నాకు ఇది కొత్త జన్మ. నా బర్త్ డే స్టార్ట్ కాక ముందే నేను ఏదైతే స్టేజ్ (సినిమా వేదిక) మిస్సవుతున్నానో ఆ స్టేజ్‌కు తీసుకువచ్చాడు దేవుడు. అంతకంటే పెద్ద బర్త్ డే గిఫ్ట్ ఏదీ ఉండదు’’ అని మంచు మనోజ్ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించిన చిత్రం ‘భైరవం’. జయంతిలాల్ గడా సమర్పణలో విజయ్ కనకమేడల దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. అలాగే నేడు (మంగళవారం) మంచు మనోజ్ బర్త్ డే. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశంలో మనోజ్ పంచుకున్న విశేషాలు.⇒ ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లో తమ్ముడు శ్రీనివాస్ (బెల్లంకొండ సాయి) నన్ను కలవడం, ‘గరుడన్ ’ సినిమా తెలుగు రీమేక్ ‘భైరవం’ గురించి దర్శకుడు విజయ్‌తో మాట్లాడమని చెప్పడం, కథ నచ్చి, నేనీ సినిమాకు ఓకే చెప్పడం చకా చకా జరిగిపోయాయి. ∙ఈ చిత్రంలో నేను గజపతి వర్మ అనే క్యారెక్టర్ చేశాను. ‘భైరవం’ని డైరెక్టర్ విజయ్ బాగా తీశాడు. యాక్టర్స్‌గా నాకు, శ్రీనివాస్, నారా రోహిత్‌గారికి కొంత స్క్రీన్ గ్యాప్ వచ్చింది. అయినా మాతో రాధామోహన్ గారు మంచి మూవీ నిర్మించారు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాల్సిన అవసరం ఉంది.⇒ నా జీవితంలో నాకు మా నాన్నే హీరో (ప్రముఖ నటుడు–నిర్మాత మోహన్ బాబు). నాన్నగారు కష్టపడి, పోరాడి ఇంత గొప్ప స్థాయికి వచ్చింది మనందరం చూశాం. ఆయన్ను చూస్తూ పెరిగాను. నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకున్నాను. నమ్మినవాళ్లను బాగా చూసుకోవడం, వాళ్లతోనే ఉండటం, పదిమందికి హెల్ప్ చేయడం, స్కూల్‌ని బిల్డ్ చేయడం... ఇలా నాన్నగారు చాలా చేశారు. ఇక దాన్నుంచి (ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల గురించి కావొచ్చు) నేను బయటకు రాలేకపోతున్నాను. విష్ణు అన్న నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అయితే ఏ సిట్యువేషన్ లోనైనా మాట్లాడి, ఆ పరిస్థితులను ఎలా సెట్ చేయవచ్చో విష్ణు అన్న దగ్గర్నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాను. అలాగే సమస్యలను పరిష్కరించడానికి మాట్లాడాలంటే నేను సిద్ధంగా ఉన్నాను.⇒ నేను తిరుపతిలో చదువుకున్నాను. తను (భార్య మౌనిక) ఆళ్లగడ్డలో చదువుకున్నారు. ఈ సిటీ జీవితమే కాకుండా మాకు పల్లె జీవితం కూడా ఉంది. అక్కడి ప్రజల ప్రేమాభిమానాలు, ఆదరణ మాపై ఉన్నాయి. మా పిల్లలకు ఏదైనా ఇవ్వగలను అంటే అది ఇదే.⇒ నేను సమస్యల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చాలామంది ఫోన్ చేశారు. కానీ నా ఇబ్బందుల్లో వారిని ఇన్ వాల్వ్ చేయాలనుకోలేదు. నా భార్య మౌనిక సపోర్ట్ సరిపోయింది. మనపై తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు గమ్మునుండిపోతే, తప్పు చేసిన వ్యక్తులుగా మిగిలిపోతాం. భవిష్యత్‌లో మా పిల్లలు ‘నువ్వు చేయనప్పుడు ఎందుకు గమ్మునున్నావ్’ అంటే, ఓ బ్యాడ్ ఎగ్జాంపుల్‌గా ఉండకూడదనిపించింది. తప్పు చేయనప్పుడు ఎక్కడైనా మాట్లాడగలను. -
రబ్బరు గాజులు సాంగ్.. థియేటర్లోనే ఇరగదీసిన ఫ్యాన్స్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్- దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం యమదొంగ. 2007లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. అప్పట్లో థియేటర్లలో ఓ రేంజ్లో వసూళ్లు రాబట్టింది. అయితే ఈ నెల 20న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. ఈ అత్యాధునిక టెక్నాలజీతో అభిమానులు సినిమాను ఈరోజు థియేటర్లలో ప్రదర్శించారు.అయితే ఈ సినిమాను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ హడావుడి మామూలుగా లేదు. ఈలలు, కేకలతో థియేటర్లను హోరెత్తించారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత యమదొంగ బిగ్ స్క్రీన్‌పై సందడి చేయడంతో అభిమానులు ఆనందంలో చిందులు వేశారు. రబ్బరు గాజులు పాట రాగానే పూనకంతో ఊగిపోయారు. ఈ సినిమా చూస్తూ థియేటర్లో రబ్బర్ గాజులు సాంగ్‌కు స్టెప్పులు వేస్తూ అలరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(ఇది చదవండి: ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్.. థియేటర్స్‌లో ‘యమదొంగ’)కాగా.. ఈ చిత్రంలో మోహన్ బాబు యమధర్మరాజు పాత్రలో మెప్పించారు. ఈ మూవీలో ప్రియమణి, మమత మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఇద్దరి ఇరగదీశారు మాటల్లేవ్ 💟💟❤️🔥❤️🔥ఇదేం క్రేజీ రా బాబు మామూలుగా లేదుగా సెలబ్రేషన్ 😍😍🥵🥵👌👌#Yamadonga4K @tarak9999 #ManOfMassesNTR pic.twitter.com/ZN1j0zj5kF— Shivam🐉🔱🚩 (@tarak9999SM) May 19, 2025 -
యంగ్ టైగర్ బర్త్ డే.. వార్-2 అప్డేట్ వచ్చేసింది!
బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలకు ముందే సంచలనాలు నమోదు చేయడం మొదలైంది. హృతిక్, ఎన్టీఆర్ కాంబినేషన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 14, 2025న విడుదల కానుంది. ఈ చిత్రంలో మొదటి సారిగా ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపించనుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో వార్ -2 మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా వార్-2 గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ పంచుకున్నారు. జూనియర్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ పోస్టర్ షేర్ చేశారు. ఈ తాజా ప్రకటనతో వార్-2 అప్డేట్స్ కోసం ఎదురు చూస్తోన్న యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో గేమ్ ఛేంజర్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.అత్యధిక ధరకు తెలుగు రైట్స్..తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వార్ 2 పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్, దేవర... ఎన్టీఆర్ నటించిన మూవీ కావడంతో సినిమా రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమా ప్రాంతీయ హక్కుల కోసం ఎదురైన గట్టి పోటీని తట్టుకుని చివరికి ప్రముఖ నిర్మాతలు నాగ వంశీ, సునీల్ నారంగ్ ఈ డీల్‌ను చేజిక్కించుకున్నారు. విడుదలకి ముందే ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ హక్కులు రూ. 85–100 కోట్ల మధ్య ధరల్లో అమ్ముడైపోయాయని వార్తలొస్తున్నాయి. #HappyBirthdayNTR Can’t wait for this BANGER 💥💥💥💥💥💥 pic.twitter.com/2hg9aAZgNJ— thaman S (@MusicThaman) May 19, 2025 -
నమ్రతా శిరోద్కర్ సిస్టర్‌కు కరోనా.. సోషల్ మీడియాలో పోస్ట్!
హిందీ బిగ్‌బాస్ షోలో ఫ్యాన్స్‌ను మెప్పించిన బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్. హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్లో టాప్ 5లో ఉంటుందనుకున్న ఆమె వంద రోజుల తర్వాత గ్రాండ్ ఫినాలే వీక్ మధ్యలోనే ఎలిమినేట్ అయింది. ఫైనలిస్ట్ అయ్యే అవకాశాన్ని ఒక్క అడుగు దూరంలోనే మిస్ చేసుకుంది. ఈ షో ద్వారా శిల్పా మరింత ఫేమస్ అయ్యారు. అయితే శిల్పా శిరోద్కర్ తాజాగా చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. తనకు కరోనా పాజిటివ్‌గా వచ్చిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇది చూసిన అభిమానులు స్టే సేఫ్.. టేక్ కేర్ మేడమ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్ట్‌పై ఆమె సిస్టర్, మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్ సైతం స్పందించింది. గెట్ వెల్ సూన్ అంటూ సోషల్ మీడియాలో రిప్లై ఇచ్చింది. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) -
ఆ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి.. త్వరలోనే ముహుర్తం ఫిక్స్!
కోలీవుడ్ స్టార్, నిర్మాత విశాల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. గతంలోనే పలు సార్లు ఆయన పెళ్లిపై వార్లలొచ్చినా ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదు. నడిగర్ సంఘం భవనం నిర్మించాకే తన పెళ్లి ఉంటుందని గతంలో విశాల్ ప్రకటించారు. అయినప్పటికీ ఆయన పెళ్లి చర్చ ఆగడం లేదు. తాజాగా ఆయన పెళ్లిపై కోలీవుడ్‌లో మరోసారి చర్చ మొదలైంది.విశాల్ త్వరలోనే హీరోయిన్ సాయి ధన్సికను పెళ్లాడబోతున్నారంటూ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కోలీవుడ్‌లో వార్త చక్కర్లు కొడుతోంది. అయితే తమపై వస్తున్న వార్తలపై ఇప్పటి వరకు సాయిధన్సిక కానీ.. విశాల్ కానీ స్పందిచంలేదు. దీనిపై వీరిద్దరిలో ఎవరో ఒకరూ స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది. కాగా.. కోలీవుడ్‌కు చెందిన సాయి ధన్సిక తెలుగులో తెరకెక్కిన షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించారు.ఇటీవల నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం కూడా పూర్తయింది. ఇటీవల ఓ సమావేశంలో తన పెళ్లి గురించి మాట్లాడారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని తెలిపారు. నాది ప్రేమ వివాహమేనని.. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తానని విశాల్ వెల్లడించారు. కాగా.. విశాల్‌కు గతంలో అనీషా అనే నటితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత వీరి నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. ఇవాళే ప్రకటిస్తాడా?..కోలీవుడ్‌లో రూమర్స్ వినిపిస్తోన్న వేళ విశాల్, సాయి ధన్షికతో వివాహం చేసుకోబోతున్నాడన్న వార్త నిజమేనని ఆయన సన్నిహిత వర్గాలు ధృవీకరించాయి. సోమవారం సాయంత్రం జరగనున్న సాయి ధన్షిక నటించిన యోగి దా సినిమా కార్యక్రమానికి విశాల్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ ఈవెంట్లోనే తనతో సాయి ధన్సిక వివాహ ప్రకటన ఉండొచ్చనే వార్తలొస్తున్నాయి. -
నాకు ఆ వ్యాధి.. అందుకే ఇలా కనిపిస్తున్నా: పూనమ్ కౌర్
అప్పట్లో తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన పూనమ్ కౌర్.. ప్రస్తుతం రాజకీయాలు అంటూ తిరుగుతోంది. ఇది కాకుండా ఎప్పుడో ఏదో ట్వీట్ వేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు తాను అనారోగ్య సమస్యతో బాధపడుతున్నానని, అందువల్లే ఇలా మారిపోయానని చెప్పుకొచ్చింది.తాజాగా ఓ ప్రైవేట్ ఈవెంట్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి పూనమ్ కౌర్.. ఆయనకు ఓ బహుమతిని అందించింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసి.. తన హెల్త్ ప్రాబ్లమ్ గురించి కూడా బయటపెట్టింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)'గత రెండు రోజులుగా ఫుడ్ ఎలర్జీతో బాధపడుతున్నాను. దీని వల్ల ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధి కూడా వచ్చింది. అందుకే శరీరం ఇలా ఉబ్బిపోయింది. యాంటీ బయోటిక్స్ కూడా వాడుతున్నా కదా. అందుకే ఇలా' అని పూనమ్ కౌర్ ట్విటర్ లో రాసుకొచ్చింది.పూనమ్ కౌర్ ఎప్పుడూ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ పై సెటైర్స్ వేస్తూ ట్వీట్స్ పెడుతూ ఉంటుంది. ఆ మధ్య మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోనూ త్రివిక్రమ్ పై ఫిర్యాదు చేసింది. కానీ ఇదెక్కడ వరకు వచ్చిందో తెలీదు. ప్రస్తుతానికైతే పూనమ్.. నటిగా ఎలాంటి సినిమాలు చేయట్లేదు. కాకపోతే అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.(ఇదీ చదవండి: నటుడు మాస్టర్ భరత్ ఇంట్లో విషాదం) -
ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
హైదరాబాద్ : 'సూర్య- వెంకీ అట్లూరి' కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)
-
'సూర్య- వెంకీ అట్లూరి' కొత్త సినిమా ప్రారంభం
కోలీవుడ్ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా పెట్టాలెక్కింది. సూర్యకు రెట్రో, వెంకీ అట్లూరికి లక్కీ భాస్కర్ చిత్రాలు మంచి విజయాన్ని ఇచ్చాయి. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్‌ను తాజాగా ప్రారంభించారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో మమితా బైజు హీరోయిన్గా నటిస్తుంది. జీవీ ప్రకాశ్ సంగీతం అందించనున్నారు.హిట్ ఫిల్మ్ ‘సార్’ (2023) (తమిళంలో ‘వాతి’), దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ సినిమాల కోసం ఇతర భాషలకు చెందిన హీరోలను ఎంపిక చేసుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి.. ఇప్పుడు మళ్లీ తమిళ హీరో సూర్యతో మరో సినిమా ప్లాన్ చేయడం విశేషం. త్వరలో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. -
స్టార్ డైరెక్టర్ సినిమాలో శోభితకు ఛాన్స్
నాగచైతన్యతో పెళ్లి తర్వాత ఇప్పుడిప్పుడే పలు కొత్త సినిమాలకు నటి శోభిత ధూళిపాళ ఓకే చెబుతుంది. పలు అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె టాప్ మోడల్‌గా గుర్తింపు పొందారు. అలా పలు వాణిజ్య ప్రకటనల్లో నటించిన శోభిత 2016లో రామన్ రాఘవన్ 2.0 అనే హిందీ చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత తెలుగులో మేజర్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు పొందారు. అలా హిందీ, తెలుగు, మలయాళం చిత్రాల్లో నటించిన శోభిత 2022లో మణిరత్నం సినిమా పొన్నియిన్ సెల్వన్ 1, 2 చిత్రాల్లో వానతి అనే పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా హాలీవుడ్లో మంకీ మాన్ చిత్రంలో నటించి పాన్ వరల్డ్ నటిగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా మరోసారి తమిళ ప్రేక్షకులను ఆలరించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దర్శకుడు పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న వెట్టువన్ చిత్రంలో హీరోయిన్గా ఆమె నటిస్తున్నట్లు తెలిసింది. ఇంతకుముందు అట్టకత్తి, కబాలి, సార్పట్టా పరంపరై వంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన పా.రంజిత్ ఇటీవల విక్రమ్ కథానాయకుడుగా తంగలాన్ చిత్రం చేశారు. తాజాగా వట్టువన్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గోల్డెన్ రేష్మియా ఫిలిమ్స్‌తో కలిసి నీలం స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఇందులో అట్టకత్తి దినేష్ కథానాయకుడుగా, ఆర్య ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం గ్యాంగ్ స్టర్స్ ఇతివృత్తంతో రూపొందుతున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ మొదటి షెడ్యూల్ ప్రారంభమైంది. ప్రస్తుతం కారైక్కుడి ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ నటిస్తున్న పాత్ర ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది. -
కాజల్ బర్త్‌డే స్పెషల్.. ఆ సినిమాతోనే స్టార్డమ్ (ఫొటోలు)
-
ఏపీలో నంది అవార్డులు ప్రకటిస్తాం: మంత్రి
ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డులను ప్రకటిస్తామని ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ఏలూరులో జరిగిన భైరవం సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ మాదిరిగానే విశాఖను అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. అక్కడ స్టూడియోల నిర్మాణంతో పాటు డబ్బింగ్, రీరికార్డింగ్ వంటి థియేటర్లు నిర్మించడానికి ప్రభుత్వం నుంచి ఒక కొత్త పాలసీ తెచ్చే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. కొద్దిరోజుల్లో సినిమా పరిశ్రమకు చెందిన పలు నిర్మాతలు, దర్శకులు, నటీనటులతో ఏపీ ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. ఆ సమయంలో చిత్రపరిశ్రమ అభివృద్ధి, నంది అవార్డుల గురించి చర్చిస్తామని తెలిపారు. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం సినీ రంగ ప్రముఖులకు ఇచ్చేందుకు గద్దర్ అవార్డులను ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసింది. వారు నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను చేర్చారు. కొద్దిరోజుల క్రితం పలు సినిమాల నుంచి నామినేషన్స్ కూడా తీసుకున్నారు. -
నవీన్ పోలిశెట్టికి లక్కీచాన్స్ వరించనుందా..?
టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి జాక్‌పాట్ కొట్టబోతున్నారా? ఈ యువ నటుడికి డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో నటించే లక్కీచాన్స్ వరించనుందా..? ఈ క్రేజీ చిత్రంలో ఆ స్టార్ కథానాయకి నటించి ఉన్నారా..? దీనికి సంబంధించిన వార్తనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇండియన్ సినిమా బుక్‌లో దర్శకుడు మణిరత్నం పేరు ఎప్పటికీ ప్రముఖంగానే ఉంటుంది. రజనీకాంత్, కమలహాసన్ వంటి ప్రముఖ నటులతో చిత్రాలు చేసి విజయాన్ని సాధించారు. ప్రస్తుతం కమలహాసన్, శింబు, త్రిష, అభిరామి వంటి ప్రముఖ నటీనటులు నటించిన థగ్ లైఫ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. దీంతో తర్వాత చిత్రం ఏమిటన్న ప్రశ్నలకు పలు రకాల ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో హాల్చల్ చేస్తున్నాయి. తాజాగా నవీన్ పోలిశెట్టి హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఒక యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి మణిరత్నం సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నవీన్ పోలిశెట్టి ఇంతకుముందు తెలుగులో సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి సక్సెస్ చిత్రాల్లో నటించారు. తాజాగా మణిరత్నం దర్శకత్వం వహించే ద్విభాషా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో విషయం ఏమిటంటే ఇందులో సాయిపల్లవి కథానాయకిగా నటింపచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఇందులో నిజం ఎంత అన్నది అధికారిక పర్యటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే. -
సరదాలే సరిగమలై...
‘‘వేయి వేణువుల నాదం మోగే హాయి హాయి హృదయాన... ప్రేమ మంత్రముల గానం సాగే ఈ ముహూర్త సమయాన.. సరదాలే సరిగమలై పలికిన శుభవేళ’’ అంటూ సాగేపాట ‘షష్టిపూర్తి’(Shashtipoorthi) సినిమాలోనిది. రాజేంద్ర ప్రసాద్, అర్చన కాంబినేషన్లో రూపేష్, ఆకాంక్షా సింగ్ ప్రధానపాత్రధారులుగా నటించిన చిత్రం ఇది. పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది.ఈ సినిమాలోని ‘వేయి వేణువుల నాదం మోగే...’పాటను దర్శకుడు నాగ్ అశ్విన్ విడుదల చేశారు. చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించిన ఈపాటను కార్తీక్, విభావరి ఆప్టే జోషి ఆలపించారు. స్వర్ణ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. ఈపాట గురించి పవన్ ప్రభ మాట్లాడుతూ– ‘‘ఈపాటను చైతన్య ప్రసాద్ అద్భుతంగా రాశారు.ఇకపై ఎవరు ‘షష్టిపూర్తి’ జరుపుకున్నా ఈపాటను ప్లే చేసి తీరాల్సిందే. ఇళయరాజాగారు స్వరపరిచిన ఈ సినిమాపాటల రికార్డింగ్‌ని ప్రత్యక్షంగా వీక్షించి, పులకించిపోయామను. ఈపాట కోసం తోట తరణిగారు ఓ మండువా లోగిలిని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. రాజేంద్రప్రసాద్, అర్చనగార్లు, రూపేష్–ఆకాంక్ష ఈ ΄పాటలో జీవించారు. చాలా కాలం గుర్తుండిపోయేపాట ఇది’’ అని తెలిపారు. -
మైథలాజికల్ మూవీగా 'వసుదేవ సుతం'.. ఆసక్తిగా గ్లింప్స్
మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటిస్తోన్న మైథలాజికల్ చిత్రం వసుదేవ సుతం. ఈ మూవీకి వైకుంఠ్ బోను దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ చైత్ర శ్రీ, మాస్టర్ యువాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో రెయిన్బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మణిశర్మ చేతుల మీదగా అదిరిపోయే గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.విశ్వాన్ని చూపించడం.. అందులోంచి భూమి.. భూమీ మీదున్న ఓ గుడి.. ఆ గుడిలో ఉన్న పాము.. ఆ తరువాత హీరో ఎంట్రీ ఇలా అన్నీ అదిరిపోయేలా ఉన్నాయి. గుడిలోని నిధి చుట్టూ ఈ కథ తిరిగేలా కనిపిస్తోంది. తాజాగా విడుదలైన గ్లింప్ చూస్తే ఈ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ, ఒరియా భాషల్లో రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో అంబికావాణి, జాన్ విజయ్, మిమ్‌గోపి, సురేష్‌చంద్ర మీనన్, ఐశ్వర్యలక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, బధ్రమ్, జబర్ధస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
చెల్లి పెళ్లిని గుర్తు చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ హరితేజ..!
అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై తనదైన ముద్రని వేసుకున్న నటి, యాంకర్ హరితేజ. గతేడాది బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి అభిమానులను అలరించింది. దాదాపు పదివారాల పాటు హౌస్‌లో ఉండి ఫ్యాన్స్‌ను అలరించింది. సీరియల్స్, సినిమాలతో పాపులర్ అయింది హరితేజ. బిగ్‌బాస్ మొదటి సీజన్లో అడుగుపెట్టి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఫిదా మీ ఫేవరెట్ స్టార్‌తో, పండగ చేస్కో, సూపర్ సింగర్, లక్కీ ఛాన్స్.. ఇలా పలు షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. గతేడాది రిలీజైన దేవర సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా మెప్పించింది.అయితే తాజాగా తన చెల్లి పెళ్లిలో సందడి చేసింది హరితేజ. వివాహా వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చెల్లి పెళ్లి వైభోగం అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది హరితేజ. అయితే తన సిస్టర్ పెళ్లి ఫిబ్రవరిలో జరగ్గా.. తాజాగా మరోసారి ఫోటోలను పంచుకుంది. కాగా.. హరితేజ కన్నడకు చెందిన దీపక్ అనే వ్యక్తిని 2015లో వివాహం చేసుకుంది. వీరిద్దరికీ 2021లో భూమి అనే కూతురు జన్మించింది. View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) -
ఈ హీరోని గుర్తుపట్టారా? మహేశ్ కి బంధువు, స్టేట్ ప్లేయర్ కూడా
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చాలామంది అంటూ ఉంటారు. అయితే ఇతడు మాత్రం స్వతహాగా బ్యాడ్మింటన్ ప్లేయర్.. స్టేట్ లెవల్ కి ఆడాడు. కానీ మరి మనసు ఎక్కడ మారిందో ఏమో గానీ హీరో అయిపోయాడు. ప్రస్తుతం నటిస్తూనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. ఇంతలా చెప్పాం కదా ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సుధీర్ బాబు. 'ఏ మాయ చేశావె'లో సమంతకు అన్నగా యాక్ట్ చేసి ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. 'ఎస్ఎమ్ఎస్' మూవీతో హీరోగా మారాడు. సమ్మోహనం, ప్రేమకథాచిత్రమ్ తదితర సినిమాలతో హిట్స్ కొట్టాడు. తర్వాత నుంచి చాలా మూవీస్ చేస్తున్నాడు గానీ ప్రేక్షకుల్ని అలరించలేకపోతున్నాడు.వ్యక్తిగత విషయానికొస్తే మహేశ్ బాబు సోదరి ప్రియదర్శినిని సుధీర్ బాబు.. సినిమాల్లోకి రాకముందే పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీళ్లలో పెద్దోడు తండ్రి బాటలో హీరో అయ్యే పనిలో బిజీ ఉన్నాడు. (ఇదీ చదవండి: నాలుగే సినిమాలు తీసిన తెలుగు దర్శకుడికి రజినీ ఛాన్స్?) మరోవైపు సుధీర్ బాబు నటుడి కాకముందు బ్యాడ్మింటన్ ప్లేయర్. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ప్రముఖ కోచ్ పుల్లెల గోపీచంద్ తో కలిసి అప్పట్లో డబుల్స్ ఆడాడు. తన స్నేహితుడు బయోపిక్ లో సుధీర్ బాబు నటిస్తాడనే రూమర్స్ వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్ట్ ఎందుకో అలా ఆలస్యమవుతూ వస్తోంది.సరే ఈ ఫొటో విషయానికొస్తే.. తన తొలి ఫొటోషూట్ లో తీసుకున్న పిక్ ఇది అని సుధీర్ బాబు తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దీన్ని చూసిన చాలామంది ఇప్పటికి అప్పటికీ ఎంత మార్పో అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్) -
తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు షాకింగ్ నిర్ణయం..!
తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో సమావేశమైన తెలంగాణ, ఆంధ్రా ఎగ్జిబిటర్లు థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, సురేశ్ బాబుతో పాటు 60 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.ఈ సమావేశంలో పాల్గొన్న ఎగ్జిబిటర్లు అద్దె ప్రాతిపాదికన సినిమాలను ప్రదర్శించలేమని తేల్చిచెప్పారు. పర్సంటెజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్ల తీర్మానం చేశారు. తాజా నిర్ణయంతో వచ్చేనెల విడుదలయ్యే చిత్రాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల నిర్ణయం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. -
నాలుగే సినిమాలు తీసిన తెలుగు దర్శకుడికి రజినీ ఛాన్స్?
ఒకప్పటితో పోలీస్తే సీనియర్ హీరోలు.. ప్రస్తుతం యువ దర్శకులతో పనిచేసేందుకే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ట్రెండ్ కి తగ్గ స్టోరీలతో మూవీస్ చేస్తుండటమే ఇందుకు కారణం. ఇప్పుడు అలా సూపర్ స్టార్ రజినీకాంత్.. ఓ తెలుగు యువ దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నారనే న్యూస్ బయటకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్) ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' చేస్తున్న రజినీకాంత్.. మరోవైపు నెల్సన్ తీస్తున్న 'జైలర్ 2' కూడా చేస్తున్నారు. దీని తర్వాత ఇంకా ఎవరికీ కమిట్ మెంట్ ఇవ్వలేదు. అలానే తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దగ్గర రజినీ డేట్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా వివేక్ ఆత్రేయ వెళ్లి ఆయనకు కథ చెప్పాడని తెలుస్తోంది.2017లో 'మెంటల్ మదిలో' అనే సినిమాతో వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమయ్యాడు. తర్వాత 'బ్రోచేవారెవరురా' తీశాడు. నానితో అంటే సుందరానికీ, సరిపోదా శనివారం చిత్రాల్ని తెరకెక్కించాడు. కేవలం నాలుగే సినిమాలు తీసిన అనుభవమున్న వివేక్.. ఒకవేళ రజినీతో మూవీ చేస్తే మాత్రం జాక్ పాట్ కొట్టినట్లే.(ఇదీ చదవండి: కోలుకున్న హీరో విశాల్.. విజయ్ సేతుపతితో కలిసి) -
కోట్ల విలువైన విల్లా కొనుగోలు చేసిన బిగ్‌బాస్ రోహిణి.. ధర ఎంతంటే?
గతేడాది బిగ్‌బాస్ సీజన్లో అభిమానులను అలరించిన టాలీవుడ్ నటి రోహిణి. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన రోహిణి.. బిగ్ బాస్ 8వ సీజన్లో దాదాపు 9 వారాల పాటు హౌస్‌లో ఉండి ఫ్యాన్స్‌ను అలరించింది. మొదటిసారి కంటే రెండోసారి బిగ్‌బాస్ ఛాన్స్ వల్ల రోహిణికి మరింత ఫేమ్ వచ్చింది. బిగ్ బాస్ షోతో రోహిణి దాదాపు రూ.18 లక్షల వరకు పారితోషికం అందుకుంది. రోహిణి టాలీవుడ్లో పలు సినిమాల్లో తన కామెడీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.అయితే తాజాగా రోహిణి తన సొంతింటి కలను నేరవేర్చుకుంది. హైదరాబాద్‌లో శివారు ప్రాంతంలో ఖరీదైన విల్లాను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఓ ప్రత్యేకమైన వీడియోను పోస్ట్ చేస్తూ వెల్లడించింది. తాను కొనుగోలు చేసిన విల్లా అత్యాధునిక వసతులు ఉన్నాయని వెల్లడించింది. ఈ విల్లా ధర రూ.1.7 కోట్లు అని రోహిణి తెలిపింది. మై న్యూ ఛాప్టర్ స్టార్ట్స్ నౌ అంటూ వీడియోను షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ రోహిణికి అభినందనలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Rohini (@actressrohini) -
ఫిల్మ్ మేకర్స్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తోంది: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐ మ్యాక్స్ వద్ద సందడి చేశారు. హాలీవుడ్ మూవీని థియేటర్లో వీక్షించేందుకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా సినిమాను చూసి బయటకు వచ్చిన ఆర్జీవీని మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. సినిమా ఎలా ఉందని అడగడంతో సూపర్‌గా ఉందంటూ రాం గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. టామ్ క్రూయిజ్ అద్భుతంగా చేశాడని కొనియాడారు. ఇప్పటి వరకు రిలీజైన వాటిలో ఇది చాలా బెస్ట్ అని అన్నారు. ఈ సినిమాను మించిన కథ రాదేమో అని అనుకుంటున్నట్లు ఆర్జీవీ మాట్లాడారు.కానీ ఈ సినిమా చూశాక ఆయన చేసిన ఓ కామెంట్ తెగ వైరలవుతోంది. మనం కూడా ఫిల్మ్ మేకర్స్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తోంది.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజమౌళి- మహేశ్ కాంబోలో వస్తోన్న మూవీలో స్టంట్స్ ఇలాగే ఉంటున్నాయని అంటున్నారని ఆర్జీవీ ప్రశ్నించగా.. ఆ విషయం తనకు తెలీదన్నారు. కాగా.. హాలీవుడ్ హీరో టామ్ క్రూయిజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకానింగ్ మే 17న ఇండియాాలో రిలీజైంది. ఈ సినిమా చూసిన రాం గోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. #MissionImpossibleTheFinalReckoning#MissionImpossibleMANAM KUDA FILM MAKERS ANI CHEPPU KOVADANIKI SIGGU ESTADI - @RGVzoomin 💥💥💥💥💥I don't think anyone can say like what RGV has said . A BRUTAL HONEST OPINION pic.twitter.com/OkrXxyEvva— EXISTENTIAL NIHILIST 👻 (@Forced_Existenc) May 17, 2025 -
స్పిరిట్ లో కల్కి జోడి..
-
ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రవితేజ..!
-
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్
ఈ వీకెండ్ ఓటీటీల్లో దాదాపు 25కి పైగా కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజయ్యాయి. మరికొన్ని సడన్ స్ట్రీమింగ్ అయ్యాయి. అలాంటి వాటిలో 'లవ్ డేల్' అనే సస్పెన్స్ థ్రిల్లర్ ఒకటి. పేరుకే మలయాళ సినిమా అయినప్పటికీ ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో రిలీజైంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి కన్నడ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) ఫిబ్రవరిలో మలయాళంలో థియేటర్లలో రిలీజైన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'లవ్ డేల్'. కాస్త హారర్ టచ్ ఇచ్చిన ఈ మూవీలో అందరూ కొత్త నటీనటులే ఉండటంతో ఓ మాదిరి రెస్పాన్స్ మాత్రమే సొంతం చేసుకుంది. ఇప్పుడీ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ యూకేలో స్ట్రీమింగ్ లోకి వచ్చింది.ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో మన దగ్గర కూడా అందుబాటులోకి రానుంది. 'లవ్ డేల్' అనేది ఊటీలోని ఓ ఊరి పేరు. ఈ మూవీ విషయానికొస్తే మోడల్ కమ్ ఫొటోగ్రాఫర్ అయిన ఓ అమ్మాయి.. తన ఫ్రెండ్స్ తో కలిసి ఈ ఊరికి వస్తుంది. ఓ బంగ్లాలో వీళ్లంతా ఉంటారు. కానీ ఓ రోజు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. ఇంతకీ వీళ్లని చంపుతున్నది ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి కల్యాణ్ రాణ్ కొత్త సినిమా) -
నటుడు మిథున్ చక్రవర్తికి నోటీసులు
సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty)కి మహారాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మలాడ్‌లో ఉండే ఎరంగేల్ ప్రాంతంలో తన సొంత స్థలంలో ఎలాంటి అనుమతి లేకుండా మిథున్ ఒక గ్రౌండ్ ఫ్లోర్, మూడు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. దీంతో బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వాటి నిర్మాణ పనులు తక్షణమే ఆపాలని అందులో పేర్కొంది. అయితే, తాను ఎలాంటి అక్రమమైన నిర్మాణాలు చేయలేదని ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు బీఎంసీకి అందిస్తానని మిథున్ చక్రవర్తి తెలిపారు.గత వారం రోజులుగా అదే ప్రాంతంలో అక్రమ భవన నిర్మాణాలను, బంగ్లాలను బీఎంసీ తొలగిస్తుంది. ఇప్పటికే దాదాపు 130 అనధికార నిర్మాణాలను గుర్తించి వాటిని తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించింది. మే 31లోపు ఆ ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాలను తొలగిస్తామని అధికారులు తెలిపారు. -
హీరోయిన్‌తో కమల్ ముద్దు సీన్.. ఏజ్ గ్యాప్‌పై విమర్శలు
కోలీవుడ్ స్టార్ హీరో హీరో కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. సోషల్‌మీడియాలో ట్రైలర్‌పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రంలో శింబు, త్రిషా కృష్ణన్, ఐశ్వర్యా లక్ష్మీ, జోజూ జార్జ్, అభిరామి ఇతర కీలక పాత్రల్లో నటించారు. కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్, మణిరత్నం, శివ అన్నాత్తే, ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. కమల్‌హాసన్ ‘విక్రమ్’, శివ కార్తికేయన్ ‘అమరన్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఎన్. సుధాకర్‌రెడ్డి, ఈ ‘థగ్ లైఫ్’ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై తెలుగులో విడుదల చేస్తున్నారు.ముద్దు సీనుతో వైరల్‘థగ్ లైఫ్’ ట్రైలర్లో కమల్ హాసన్(70), అభిరామి (41) మధ్య లిప్‌లాక్ సీన్ కనిపిస్తుంది. వారిద్దరి మధ్య వయసు 30ఏళ్లు గ్యాప్ ఉంది. దీంతో కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఆపై త్రిషతో కమల్ చెప్పిన డైలాగ్ కూడా చాలా బోల్డ్‌గా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. కమల్‌కు భార్యగా అభిరామి నటించింది. ఇద్దరి మద్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండటం ఆపై రొమాంటిక్ సీన్ తెరకెక్కించడంతో ట్రైలర్‌పై మిశ్రమ స్పందన వస్తుంది.అయితే, కమల్ అభిమానులు కూడా వాటిని తిప్పికొడుతున్నారు. మొత్తం ట్రైలర్లో కేవలం ముద్దు సన్నివేశాలు,సన్నిహిత సన్నివేశాలను తీసుకొని వాటిపై దృష్టి పెట్టడం కరెక్ట్ కాదన్నారు. సినిమాల్లో ఇవన్నీ చాలా కామన్‌గానే ఉంటాయి. వాటిపైన దృష్టి పెట్టడం మానేయండి అంటూ చెప్పుకొస్తున్నారు. మరొక నెటిజన్ ఇలా వ్రాశాడు.., తన వయసులో దాదాపు సగం వయసున్న హీరోయిన్లతో అలాంటి సన్నివేశాలు చేయడం సాధారణ విషయం కాదని, వాటిని ఎలా సమర్ధిస్తారని కౌంటర్ ఇస్తున్నారు.అభిరామి ఎవరు..?కేరళకు చెందిన అభిరామి తెలుగులో 'చెప్పవే చిరుగాలి'(2004) సినిమాలో నటించింది. ఆ తర్వాత అమర్ అక్బర్ ఆంటోని, మహారాజ, సరిపోదా శనివారం, భలే ఉన్నాడే, వెట్టైయన్ వంటి సినిమాల్లో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు సినిమా తర్వాత 2004లో ఉన్నత చదువులకు అమెరికాకు వెళ్లిన ఆమె 2013లో తిరిగి వచ్చింది. 'విశ్వరూపం', 'విశ్వరూపం 2' సినిమాలలో హీరోయిన్ పూజా కుమార్‌కు తమిళ వెర్షన్లో డబ్బింగ్ చెప్పింది. ఇప్పుడు మళ్లీ కమల్ సరసన అభిరామి ఛాన్స్ కొట్టేసింది. -
'షష్టి పూర్తి' పాటలో సందడిగా రాజేంద్ర ప్రసాద్, అర్చన
'షష్టి పూర్తి' సినిమా నుంచి క్రేజీ సాంగ్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. 'లేడీస్ టైలర్' సినిమాతో మెప్పించిన రాజేంద్రప్రసాద్, అర్చన సుమారు 38 ఏళ్ల తర్వాత మరోసారి వారిద్దరూ కలిసి ఇందులో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన పాట కూడా వారిద్దరి మధ్యనే తెరకెక్కించారు. ఈ మూవీని పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మించారు. రూపేష్, ఆకాంక్షా సింగ్ మరో జంటగా సందడి చేయనున్నారు. ఇప్పటికే మంచి లవ్ ట్రాక్‌తో పాటు చక్కటి మెలోడీనిచ్చే పాటలు ఈ మూవీ నుంచి విడుదలయ్యాయి. తాజాగా 'షష్టి పూర్తి' కార్యక్రమం తంతు గురించి మరో పాటను పంచుకున్నారు. సంగీతం ఇళయరాజా అందించారు. మే 30న ఈ చిత్రం విడుదల కానుంది. -
దేవర 2 లో మరో హీరో..!
-
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన స్టార్ హీరో కూతురు
ప్రముఖ కన్నడ హీరో, దివంగత పునీత్ రాజ్‌కుమార్ కూతురు ధృతి అమెరికాలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె పెదనాన్న శివరాజ్ కుమార్ తన సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. 2021లో చదువుకునేందుకు అమెరికాకు ధృతి వెళ్లింది. అత్యున్నతమైన మార్కులతో తన ఫ్యాషన్ డిజైనర్ కోర్సును ఆమె పూర్తి చేసిన ఆమె పట్టభద్రురాలైంది.ధృతి గురించి శివరాజ్ కుమార్ ఇలా చెప్పారు. 'హాయ్ టోటో (ముద్దుపేరు), నీకు అభినందనలు! ఈ రోజు మన కుటుంబానికి చాలా ప్రత్యేకమైనది, మనందరికీ చాలా గర్వకారణమైనది కూడా.. మీ నాన్నతో పాటు నన్ను కూడా చాలా గర్వపడేలా చేశావు. మీతో చాలా మంచి జ్ఞాపకాలు నా కళ్లముందు ఉన్నాయి. నువ్వు నవ్వినప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు, అప్పు(పునీత్ రాజ్‌కుమార్) వచ్చినట్లు ఉంటుంది. నువ్వు మీ నాన్నలాగే ఉన్నావు. అందుకే మా ప్రియమైన అప్పుకు మరోసారి అభినందనలు.' అని ఆయన అన్నారు. ధృతి తండ్రి పునీత్ రాజ్‌కుమార్ 2021లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.దింగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కుమార్తె ధృతి అమెరికాలోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుంచి ఫ్యాషన్ డిజైనర్‌గా పట్టభద్రురాలైంది. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ డిజైన్ స్కూల్‌గా ఆ యూనివర్శిటికి గుర్తింపు ఉంది. 1896లో విలియం మెరిట్ చేజ్ స్థాపించిన ఈ కాలేజీ 1941లో ఫ్రాంక్ అల్వా పార్సన్స్‌గా పేరు మార్చబడింది. ఈ సంస్ధ ఐదు విభాగాలలో మాస్టర్స్, బ్యాచిలర్ డిగ్రీలను అందిస్తుంది. ఆర్ట్, కమ్యూనికేషన్ డిజైన్, ఫోటోగ్రఫీ, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్లలో శిక్షణ ఇస్తుంది. ఫ్యాషన్ డిజైన్ రంగంలో పేరుగాంచిన మార్క్ జాకబ్స్, డోనా కరణ్ వంటివారు ఇక్కడే విద్యను అభ్యసించారు.Hi ಟೋಟೊ, Congratulations! ಈ ದಿನ ಬಹಳ ವಿಶೇಷವಾದ ದಿನ, ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಬಹಳ ಹೆಮ್ಮೆಯ ದಿನ. You made me and dodappa very proud. Lots of good memories with ಅಪ್ಪು, ಅಶ್ವಿನಿ, you and ನುಕ್ಕಿ. ನೀನು ನಗುವಾಗ, ನಡೆಯುವಾಗ ಅಪ್ಪು ಬಂದಂತೆ, ನಿನ್ನಲಿಯೇ ಅಪ್ಪು. ನಮ್ಮೆಲ್ಲರ ಪ್ರೀತಿಯ ಅಪ್ಪುಗೆ. Congratulations once… pic.twitter.com/JZOw2mkZXW— DrShivaRajkumar (@NimmaShivanna) May 17, 2025 -
మెగాస్టార్ కు జోడిగా లేడీ సూపర్ స్టార్
-
ఇది పనికిమాలిన చర్య.. మరోసారి చేయకండి: సూరి
తమిళ నటుడు సూరి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మామన్. నటి ఐశ్వర్య లక్ష్మి నాయకిగా నటించిన ఈ చిత్రం తాజాగా తమిళ్లో విడుదలైంది. మేనమామ, మేనల్లుడు అనుబంధం ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతోంది. ఇదిలా ఉంటే మామన్ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ సూరి అభిమానులు దేవాలయాల్లో పూజలు, అర్చనలు చేయిస్తున్నారు. అలా తిరుప్పాంగుడ్రంలో కుమారస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన సూరి అభిమానులు కొందరు మామన్ చిత్రం విజయం సాధించాలని మొక్కుకుని నేలపై భోజనం చేశారు. ఆపై వారు వందల సంఖ్యలో కొబ్బరికాయలు కొట్టారు. సినిమా కటౌట్లకు పాలతో అభిషేకం చేశారు. టపాసులు పేలుస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగించారు. ఈ విషయం తెలుకున్న సూరి తన అభిమానులపై ఫైర్ అయ్యారు. కథ, కథనం బాగుంటే సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్నారు. సినిమా చూసి కాస్త ప్రేమ చూపుతే చాలన్నారు. అంతే కానీ నేలపై భోజనం చేయడం పనికిమాలిన చర్య అని, సినిమా విడుదల సమయంలో ఇలా వృధాగా ఖర్చు చేయడం చాలా వేదన కలిగిస్తోందని అన్నారు. ఆ డబ్బుతో నలుగురికి భోజనం పెట్టించవచ్చని, నీళ్లు, మజ్జిగ వంటివి ఇచ్చి దాహం తీర్చవచ్చని అన్నారు. ఇలాంటి చెత్త పనులు చేసే వారు తన అభిమానులని చెప్పుకునే అర్హతే లేదని పేర్కొన్నారు. సూరి అభిప్రాయాన్ని ప్రముఖ గీత రచయిత వైరముత్తు ప్రశంసించారు. అభిమానుల అనైతిక చర్యలను ప్రతి నటుడు ఖండించాలని, తమ అభిమానులకు హిత వ్యాఖ్యలు చేయాలన్నారు. అప్పుడే సంస్కృతి సంప్రదాయాలు ఇంకా మెరుగు పడతాయనే అభిప్రాయాన్ని వైరముత్తు వ్యక్తం చేశారు. ( వీడియో సన్ న్యూస్ సౌజన్యంతో) -
తొలిసారి ఖాకీ డ్రెస్‌లో కనిపించనున్న నయనతార
సౌత్ ఇండియా స్టార్ నటి నయనతార మంచి విజయాన్ని చూసి చాలా కాలమే అయ్యింది. ఆ మధ్య హిందీలో షారుక్‌ఖాన్‌కు జంటగా నటించిన జవాన్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అయితే తమిళంలో ఈమె ఇటీవల నటించినా ఏ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అంతేకాదు నయనతారను ప్రేక్షకులు తెరపై చూసి చాలా కాలమే అయ్యింది. ఆ మధ్య ఉమన్స్ సెంట్రిక్ కథా పాత్రలో నటించినా అన్నపూరిణి చిత్రం, ఇటీవల మాధవన్, సిద్ధార్థ్‌తో కలిసి నటించిన టెస్ట్ చిత్రాలు ఓటీటీకే పరిమితం అయ్యాయి. అవి కూడా పూర్తిగా నిరాశ పరిచాయి. దీంతో ఆమెను వెండి తెరపై చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈమె చేతిలో ప్రస్తుతం అర డజన్‌కు పైగా చిత్రాలు ఉన్నా, ఇప్పట్లో ఏదీ తెరపైకి వచ్చేలా కనిపించడం లేదు. కాగా ప్రస్తుతం నయనతార నటిస్తున్న చిత్రాల్లో మూక్కుత్తి అమ్మన్ 2 (అమ్మోరు2) ఒకటి. సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు సుందర్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వేల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్నా రు. ఇది రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం అని సమాచారం. కాగా ఇంతకు ముందు మూక్కుత్తి అమ్మన్ చిత్రంలో నయనతార దేవతగా నటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న మూక్కుత్తి అమ్మన్2 చిత్రంలో నయనతార ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. అందులో ఒకటి దేవత పాత్ర కాగా, మరొకటి పోలీస్ అధికారి పాత్ర అని తెలిసింది. దీంతో ఈమె తొలిసారిగా ఖాకీ డ్రెస్‌లో కనిపించబోతున్నారన్నమాట. ఇంతకుముందు హిందీ చిత్రం జవాన్‌లో పోలీస్ అధికారిగా నటించిన అందులో ఖాకీ దుస్తులు ధరించలేదు. అలాగే నయనతార ద్విపాత్రాభినయం చేయడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఐరా చిత్రంలో ద్విపాత్రాభియం చేశారు. కాగా మూక్కుత్తి అమ్మన్ 2 చిత్రంలో నయనతారతో పాటు ఇండియా యోగిబాబు సింగం పులి కన్నడ నటుడు దునియా విజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్రంలో గ్రాఫిక్స్ సన్నివేశాలు మరో హైలెట్‌గా ఉంటాయని సమాచారం. -
నో అప్డేట్!
హీరోల పుట్టినరోజు వస్తోందంటే అభిమానుల జోష్ మామూలుగా ఉండదు. తమ అభిమాన హీరో నటిస్తున్న సినిమాల నుంచి కొత్తపోస్టర్, టైటిల్, టీజర్... ఇలా ఏదో ఒక అప్డేట్ వస్తుందని ఆశిస్తుంటారు. అయితే ఈసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఈ హీరో నటిస్తున్న తెలుగు సినిమా అప్డేట్ ఏమీ ఉండదు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్).ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. కాగా ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘ఎన్టీఆర్ నీల్’ నుంచి అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశించారు. అయితే.. ఆ రోజు ఎటువంటి అప్డేట్ ఉండదని మేకర్స్ స్పష్టం చేశారు.హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన హిందీ చిత్రం ‘వార్ 2’ నుంచి ఎన్టీఆర్ అప్డేట్ రానుండటంతో ‘ఎన్టీఆర్ నీల్’ అప్డేట్నిపోస్ట్΄ోన్ చేసినట్లు ప్రకటించారు. ఇక ‘వార్’ ఈ ఏడాది ఆగస్టు 14న, ‘ఎన్టీఆర్ నీల్’ 2026 జూన్ 25న రిలీజ్ కానున్నాయి. ఇదిలా ఉంటే... ఎన్టీఆర్, ప్రియమణి జంటగా, మోహన్‌బాబు, మమతా మోహన్‌దాస్ కీలకపాత్రల్లో రూపొందిన చిత్రం ‘యమదొంగ’. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఎన్టీఆర్ బర్త్ డేని పురస్కరించుకుని నేడు రీ రిలీజ్ చేస్తున్నారు. -
సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం
చిరంజీవి హీరోగా రూపొందనున్న తాజా చిత్రం ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్). అనిల్ రావిపూడి దర్శకత్వంలో అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నయనతారను ఖరారు చేసినట్లు ప్రకటించి, స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నయనతార... తన టీమ్‌తో తెలుగులో మాట్లాడటం, కారు ప్రయాణంలో చిరంజీవి క్లాసిక్పాటలు వినడం, ‘హలో మాస్టర్... కెమేరా కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా’ అని చెప్పడం ఆకట్టుకున్నాయి.ఫైనల్‌గా అనిల్ రావిపూడి, నయనతార కలిసి సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం అని చెప్పడంతో ఈ వీడియో ముగిసింది. ‘‘సైరా నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్’ చిత్రాల తర్వాత చిరంజీవి–నయనతార కలిసి మూడోసారి నటించనున్న చిత్రమిది. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ఉంటుంది. చాలాకాలం తర్వాత చిరంజీవి కంప్లీట్ హ్యూమరస్ రోల్లో కనిపించనున్నారు. త్వరలో షూటింగ్ ఆరంభిస్తాం’’ అని యూనిట్ తెలిపింది. 2026 సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమేరా: సమీర్ రెడ్డి. -
సాహసం శ్వాసగా సాగిపో...
లక్ష్య సాధన కోసం అడవికి వెళ్తున్నారు హీరోలు. ఒకరిది నిధి అన్వేషణ అయితే, మరొకరిదిపోరాటం. ఇంకొకరిది ఆధిపత్యం... ఇలా తెలుగు హీరోలు తమ తమ లక్ష్య సాధన కోసం అడవి బాట పట్టారు. సాహసమే శ్వాసగా ముందుకు సాగుతున్నారు. ఇలా అడవి మాదే... శత్రువుల వేట మాదే అంటున్న కొందరు తెలుగు హీరోలపై ఓ లుక్ వేద్దాం.ఫారెస్ట్‌లో అడ్వెంచర్ ఫారెస్ట్‌లో మహేశ్‌బాబు ఏదో నిధి కోసం అన్వేషించనున్నారట. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగుతుందని, ఈ చిత్రకథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. సో... ఈ సినిమాలోని మేజర్ కథను మలుపు తిప్పే కీలక సన్నివేశాలు ఫారెస్ట్ నేపథ్యంతోనే ముడిపడి ఉంటాయనే టాక్ వినిపిస్తోంది.అలాగే ఇటీవల ఈ సినిమాకు చెందిన ఓ భారీ షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో పూర్తయింది. ఓ భారీ సెట్లో ఈ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ షెడ్యూల్లో అడవి బ్యాక్‌డ్రాప్‌లో ఉండే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. ఇంకా ఈ సినిమా షూటింగ్‌కు ముందు రాజమౌళి కెన్యా వెళ్లి, అక్కడ కొన్ని లొకేషన్స్‌ను చూసి వచ్చారు. ఇలా ఈ సినిమా చిత్రీకరణ విదేశీ అడవుల్లోనూ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం మహేశ్‌బాబు, రాజమౌళి వేసవి బ్రేక్‌లో ఉన్నారు. ఈ బ్రేక్ పూర్తవగానే మళ్లీ ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తారు. జూన్ రెండో వారంలో ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం కావొచ్చు.నెక్ట్స్ షెడ్యూల్ కోసం వారణాసిని తలపించేలా హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్‌ను తీర్చిదిద్దుతున్నారని, ఈ సెట్లోనే ఈ సినిమా షూటింగ్ ఉంటుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్, దేవ కట్టా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇంగ్లిష్ డైలాగ్స్ కోసం ఓ హాలీవుడ్ రైటర్‌ను నియమించుకోవాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. భారీ బడ్జెట్‌తో కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా 2027లో విడుదల కానుందని సమాచారం.వీరమల్లు అన్వేషణ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హిస్టారికల్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’. 17వ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ చారిత్రాత్మక చిత్రంలో పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేయగా, పంచమి అనేపాత్రలో హీరోయిన్గా నిధీ అగర్వాల్ నటించారు. కాగా ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు అడవి నేపథ్యంతో ఉంటాయని తెలిసింది. ఓ నిధి అన్వేషణ కోసం వీరమల్లు తన బృందంతో కలిసి అడవికి వెళ్తాడని, ఆ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ‘హరిహర వీరమల్లు’ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం జూన్ 12న విడుదల కానుంది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఏఏమ్ రత్నం సమర్పణలో అద్దంకి దయాకర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అడవిలో డ్రాగన్ ఫారెస్ట్‌లో అదిరిపోయే చేజింగ్ ఫైట్ చేస్తున్నారు హీరో ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఇటీవల కర్ణాటక లొకేషన్స్‌లో ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణలో ఓ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ సీన్ తీశారని తెలిసింది. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో ఈ ఫారెస్ట్ చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఓ హైలైట్‌గా ఉంటుందని, హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఈ యాక్షన్ సీక్వెన్ని డిజైన్ చేశారని తెలిసింది. కాగా లండన్‌లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా స్క్రీనింగ్‌కి హాజరయ్యారు ఎన్టీఆర్, అలాగే ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే. సో... ఈ రెండు కారణాల వల్ల ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమా షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు.బర్త్ డే సెలబ్రేషన్స్ పూర్తి కాగానే ఎన్టీఆర్ తిరిగి ‘డ్రాగన్’ సినిమా షూటింగ్లోపాల్గొంటారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారని, రష్మికా మందన్నా ఓ కీలకపాత్ర చేయనున్నారని, మలయాళ నటుడు టొవినో థామస్ విలన్‌గా కనిపిస్తారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక కల్యాణ్‌రామ్, కె. హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జూన్ 25న విడుదల కానుంది. మరోవైపు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ సినిమాలో కొన్ని ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాలు ఉన్నట్లుగా చూశాం. ఇటీవల ‘దేవర 2’ సినిమాను ఓ సందర్భంగా కన్ఫార్మ్ చేశారు ఎన్టీఆర్. ఇలా వచ్చే ఏడాది ‘దేవర 2’ సినిమా కూడా సెట్స్‌పైకి వెళుతుందని ఊహింవచ్చు. సో... ‘దేవర 2’లోనూ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయని ఊహించవచ్చు.అడవిలో జాతర రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘మాస్ జాతర’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. రవితేజ కెరీర్‌లోని ఈ 75వ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో లక్ష్మణ్ భేరి అనే పవర్‌ఫుల్‌పోలీస్ ఆఫీసర్‌పాత్రలో రవితేజ కనిపిస్తారు. కాగా ఈ సినిమాలో కూడా అడవి నేపథ్యంతో కూడిన సన్నివేశాలు ఉన్నాయని సమాచారం. అరకు,పాడేరు, ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల లొకేషన్స్‌లో ‘మాస్ జాతర’ సినిమా చిత్రీకరణ జరిగిందని తెలిసింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా టాకీపార్ట్ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అతి త్వరలోనే ఈ సాంగ్ షూటింగ్స్ని కూడా పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘మాస్ జాతర’ సినిమా జూలై చివర్లో లేదా ఆగస్టులో రిలీజ్ కావొచ్చు.భక్త కన్నప్ప మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఈ సినిమాలో తిన్నడుపాత్రలో కనిపిస్తారు విష్ణు మంచు. దైవత్వాన్ని నమ్మని తిన్నడు శివుడికి ఎలా వీరభక్తుడు అయ్యాడు? భక్త కన్నప్పగా ఎలా ప్రఖ్యాతి చెందాడు? అనే అంశాల ఆధారంగా ‘కన్నప్ప’ సినిమా ఉంటుందని తెలుస్తోంది. కథ రీత్యా ఈ సినిమా మేజర్‌పార్ట్ అంతా అడవి నేపథ్యంతోనే ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్పోస్టర్స్.. వంటి ప్రమోషనల్ కంటెంట్... ‘కన్నప్ప’ సినిమా ఫారెస్ట్ నేపథ్యంతోనే సాగుతుందన్న విషయాన్ని మరింతగా స్పష్టం చేస్తున్నాయి. ప్రీతీ ముకుందన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. మోహన్‌బాబు, మోహన్‌లాల్, ఆర్. శరత్‌కుమార్, బ్రహ్మానందం, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మాజీ, రఘుబాబు తదితరులు ఇతర ప్రధానపాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ దర్శకత్వంలో మోహన్‌బాబు నిర్మించిన ‘కన్నప్ప’ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.నిధి వేట నిధి వేటలో ఉన్నారట అర్జున్. నాగచైతన్య హీరోగా ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో మిస్టిక్ థ్రిల్లర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘వృషకర్మ’తోపాటు మరో రెండు టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారట. ఈ చిత్రంలో నిధిని అన్వేషించే అర్జున్‌పాత్రలో నాగచైతన్య, పురావస్తు శాస్త్రవేత్తగా మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. ఇలా నిధి అన్వేషణలో భాగంగా అర్జున్ ఫారెస్ట్‌కి వెళతాడట. అక్కడ ఫారెస్ట్‌లో కొన్ని సాహసాలు చేస్తాడట. ఈ సినిమా కోసం ఓ గుహ సెట్‌ను రెడీ చేశారు మేకర్స్. ఈ గుహ సెట్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని, ఈ సీక్వెన్స్ దాదాపు ఇరవై నిమిషాలు ఉంటుందని తెలిసింది. బాపినీడు సమర్పణలో సుకుమార్, బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అరణ్యంలో భోగి హీరో శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్లో రూపొందుతున్న పీరియాడికల్ రూరల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ‘భోగి’. 1960 నేపథ్యంలో సాగే ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుండగా, డింపుల్ హయతి మరో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఉత్తర తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ సినిమా కోసం దాదాపు ఇరవై ఎకరాల్లో ప్రత్యేకమైన విలేజ్ సెట్‌ను ఏర్పాటు చేశారు మేకర్స్. కాగా ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు, కొంత భాగం అడవి నేపథ్యంలోనే ఉంటాయని తెలిసింది. ఈ మూవీ కోసం శర్వానంద్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితియార్ధంలో రిలీజ్ కావొచ్చు.పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.కిష్కింధపురిలో ఏం జరిగింది? ‘కిష్కింధపురికి’ ప్రేక్షకులను తీసుకు వెళ్లనున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మిస్టరీ అండ్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘కిష్కింధపురి’. ఇటీవల ‘కిష్కింధపురి’ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ రాత్రివేళ అడవిలోకి వెళ్లడం, అక్కడ వీరిద్దరూ ఎందుకోసమో వెతుకాలడంట వంటి విజువల్స్ కనిపించాయి. చూస్తుంటే... ‘కిష్కింధపురి’ మేజర్ సీన్స్‌లు అడవి నేపథ్యంలో ఉంటాయని, అది కూడా రాత్రివేళ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయనీ తెలుస్తోంది.అర్చన సమర్పణలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘హైందవ’ అనే మూవీ రూపొందుతోంది. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో మహేశ్ చందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాలుగువందల ఏళ్ల క్రితం నాటి గుడి నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందట. ఈ సినిమాలోనూ ఫారెస్ట్ ఎపిసోడ్స్ ఉన్నాయని తెలిసింది. ఈ ఏడాదే ఈ సినిమా విడుదల కానుంది.కింగ్డమ్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమా రెండు డిఫరెంట్ టైమ్ లైన్స్‌లో జరుగుతుందని, ఫ్లాష్ బ్యాక్ టైమ్‌లైన్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అడవి నేపథ్యంతోనే ఉంటాయని ఫిల్మ్ నగర్ సమాచారం. పైగా ‘కింగ్డమ్’ సినిమా టీజర్లోనూ అడవిని తలపించే కొన్ని షాట్స్ కనిపించాయి. అలాగే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూలై 4న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఇలా అడవి నేపథ్యం, అడవి సన్నివేశాలు కీలకంగా సాగే మరికొన్ని సినిమాలు ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
సోదరి కోసం ప్రీమియం ఇల్లు కొన్న తాప్సీ.. ధర ఎన్ని కోట్లంటే..
బాలీవుడ నటి తాప్సీ పన్ను ముంబైలో ఒక లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. తన సోదరి సోదరి షగున్‌తో కలిసి తాజాగా రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారని స్క్వేర్ యార్డ్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (IGR) పోర్టల్ ద్వారా సమాచారం వెలువడింది. ఇప్పటికే ఆమెకు ముంబైలో ఒక ఇల్లు ఉంది. అది ప్రాచీన పంజాబీ కళతో ఆకట్టుకుంటుంది. తన సోదరి వెడ్డింగ్ ప్లానర్ కావడంతో ఆ ఇంటిని చాలా అందంగా డెకరేషన్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.తాప్సీ పన్ను, ఆమె సోదరి షగున్ పన్నుతో కలిసి ముంబైలోని గోరేగావ్ వెస్ట్‌లో రూ.4.33 కోట్లతో ప్రీమియం అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ణు కొనుగోలు చేశారు. స్క్వేర్ యార్డ్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (IGR) పోర్టల్‌లో ఈ సమాచారం ఉంది. అందుకు సంబంధించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా పోర్టల్‌లో ఉన్నాయి. రెడీ-టు-మూవ్-ఇన్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కావడంతో వారు త్వరలోనే కొత్త ఇంట్లోకి వెళ్లనున్నారు. రిజిస్ట్రేషన్ కోసం రూ.21.65 లక్షల స్టాంప్ డ్యూటీతో పాటు అదనంగా రూ.30,000 ఛార్జీలను చెల్లించారు. ముంబైలోని ఇంపీరియల్ హైట్స్ ఇటీవలి కాలంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ చదరపు అడుగుకు రూ.32,170గా ఉంది. ఇది ఈ ప్రాంతంలో అత్యంత డిమాండ్ ఉన్న లగ్జరీ ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు ఉంది.కొత్త ఇల్లు తన సోదరి షగున్ కోసం తాప్సీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన తాప్సీ తన భర్త మథియాస్ బోతో పాత ఇంట్లోనే ఉంటుంది. అతను డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అని తెలిసిందే. కొన్నేళ్లుగా వారిద్దరూ అదే ఇంట్లో ఉంటున్నారు. పెళ్లి తర్వాత తన సోదరికి ఒక సొంత ఇల్లు ఉండాలని తాప్సీ కొన్నట్లు సమాచారం. -
గెస్ట్ ఎంట్రీలతో స్క్రీన్ షేక్ చేస్తున్న స్టార్ హీరోస్!
-
రాజా సాబ్ టీజర్ డేట్ ఫిక్స్!
-
కేరళలో 'అల్లు అర్జున్'ను స్టార్‌గా చేసిన ఖాదర్ ఎవరో తెలుసా?
అల్లు అర్జున్‌కు మలయాళంలో కూడా భారీగా అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. అక్కడ మన బన్నీకి అంతలా గుర్తింపు రావడం వెనుక ఒక నిర్మాత ఉన్నారని మీకు తెలుసా..? ‘ఆర్య’ సినిమా తర్వాత అల్లు అర్జున్‌కు మలయాళంలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. మలయాళీలు ఆయన్ను మల్లు అర్జున్ అరి ముద్దుగా పిలుచుకుంటారు. టాలీవుడ్లో ఆయన సినిమాలు ఎంతలా అలరిస్తాయో.. అందుకు ఏమాత్రం తగ్గకుండా.. కేరళలోనూ ఆడుతుంటాయి. పుష్ప విడుదల సమయంలో అక్కడ ఏ సినిమా కూడా పోటీకి దిగలేదు అంతలా స్టార్డమ్ క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. అయితే, మలయాళీ గడ్డమీద మన బన్నీ అడుగులు ఎలా పడ్డాయో తెలుసా.అల్లు అర్జున్ను మలయాళ ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయాణం గురించి నిర్మాత ఖాదర్ హసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, వ్యూహాలతో పాటు కేరళలో అల్లు అర్జున్‌కు వచ్చిన ప్రజాదరణ గురించి ఆయన మాట్లాడారు. నేను పేరుకే నిర్మాతను. కానీ, నాకు దర్శకత్వం చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే అన్ని భాషల సినిమాలను చూస్తుంటాను. అలా 2002లో జెమిని టీవీలో 'నువ్వే నువ్వే' సినిమా చూశాను. అందులో 'ఐ యామ్ వెరీ సారీ' పాట నా దృష్టిని ఆకర్షించింది. వెంటనే ఈ సినిమా డబ్బింగ్ వర్షన్ కేరళలో విడుదల చేయాలని హైదరాబాద్ వచ్చేశాను. నిర్మాత రవి కిషోర్‌ను కలిసి డబ్బింగ హక్కులను పొందాను. మలయాళంలో 'ప్రణయమయి' పేరుతో విడుదల చేశాను. అయితే, సినిమాకు పెద్దగా డబ్బులు రాలేదు. కానీ, మంచి పేరు వచ్చింది. అలా మొదటిసారి డబ్బింగ్ సినిమాలపై నా అడుగులు పడ్డాయి.'ప్రణయమయి' సినిమా తర్వాత మరోక ప్రాజెక్ట్‌ను కేరళలో విడుదల చేయాలని నిర్మాత ఖాదర్ హసన్ అనుకుంటున్న సమయంలో ఆర్య పాటలు ఆయన చెవున పడ్డాయి. 'ఆర్య సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్ తప్పకుండా కేరళలో స్థానం దక్కించుకుంటాడని నాకు అనిపించింది. 2004లో మళ్లీ హైదరాబాద్ వెళ్లి దిల్రాజును కలిశాను. ఆర్య డబ్బింగ హక్కులు కావాలని అడిగాను. మొదట్లో ఆయన ఒప్పుకోలేదు. చాలాకష్టపడి ఆయన్ను ఒప్పించి కేరళలో ఆర్య సినిమాను విడుదల చేశాను. అప్పటికి తెలుగు సినిమాలకు ఇక్కడ పెద్దగా మార్కెట్ లేదు. డబ్బింగ్ సినిమాలు అంటేనే చిన్నచూపు చూసేవారు. దానిని నేను ఎలాగైనా సరే మార్చాలని అనుకున్నాను. మలయాళీలకు తగ్గట్టుగా ఆర్య కోసం మంచి సంభాషణలు రాయించాను. మిక్సింగ్, ఇతర సాంకేతిక అంశాలను చెన్నైలోని భరణి వంటి ప్రఖ్యాత స్టూడియోలలో చేపించాను. ఆర్య పాటలను ప్రముఖ మలయాళ గాయకులు పాడారు. ఈ సినిమా కోసం నేను వ్యక్తిగతంగా చాలా రిష్క్ చేశాను. అప్పటికీ నేను అల్లు అర్జున్ను కనీసం కలవలేదు' అని అన్నారు.ఆర్య విజయం కోసం..ఆర్య సినిమా బాగుంది. కానీ, మలయాళీలకు పరిచయం చేయాలని తాను చాలా కష్టపడ్డానని నిర్మాత ఖాదర్ హసన్ అన్నారు. 'ఈ సినిమా పాటలు, ట్రైలర్లను విస్తృతంగా ప్రసారం చేయడానికి మేము ఆసియానెట్ కేబుల్ వారితో కనెక్ట్ అయ్యాం. లోకల్ కేబుల్ టీవీ నెట్‌వర్క్‌లను కూడా సంప్రదించాము. ఆపై సినిమా చూడటానికి విద్యార్థులను ఆహ్వానిస్తూ కళాశాలల్లోని యూనియన్లను సంప్రదించాం. అల్లు అర్జున్ స్టిక్కర్స్‌ను పంపిణీ చేశాం. పిల్లలకు అవి బాగా నచ్చాయి. బన్నీ మాస్క్‌లను కూడా ఉచితంగానే ఇచ్చాం. వాటితో పాటు మేము 3డి ఫ్యాన్ కార్డ్‌ను విడుదల చేశాం. ఇలా ఎన్నో ఆర్య సినిమా కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేశాం' అని ఆయన అన్నారు.ఆర్యతో అనుకున్నది చేశాను: ఖాదర్ఆర్య విడుదల తర్వాత తాము అనుకున్నది సాధించామని ఖాదర్ హసన్ అన్నారు. ఎవరూ ఊహించలేనంతగా తమకు లాభాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. కొన్ని చోట్లు ఈ చిత్రం వందరోజులు కూడా రన్ అయినట్లు పేర్కొన్నారు. ఈ మూవీ తర్వాత తాము బన్నీ, హ్యాపీ, దేశముదురు, పరుగు, ఆర్య2 ఇలా దాదాపు అన్ని సినిమాలు మలయాళంలో విడుదల చేశామన్నారు. ఆర్య విజయం తర్వాత కేరళ ప్రజలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఆ సమయంలో ఆయన మాట్లాడిన మాటలు మలయాళీలకు బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే ఇప్పటికీ ఆయనంటే అభిమానం చూపుతారు. 'ఈ ప్రయాణంలో, కేరళలో తన ఉనికిని స్థాపించడానికి నేను చేసిన ప్రయత్నాలకు అల్లు కృతజ్ఞతతో ఉన్నాడు. ఆయన మద్దతు మాపై ఎప్పటికీ ఉంటుంది. మలయాళీ ప్రజల పట్ల అల్లు అర్జున్ ఎప్పటికీ కృతజ్ఞతతోనే ఉంటాడు. ఇలా పరస్పర గౌరవం, అవగాహన వల్లే బన్నీతో వృత్తిపరమైన సంబంధాన్ని బలోపేతం చేసింది. నన్ను ఒక స్నేహితుడిగానే మల్లు అర్జున్ చూస్తాడు' అని ఖాదర్ అన్నారు. -
'బకాసుర రెస్టారెంట్' మూవీ ట్రైలర్ విడుదల వేడుక (ఫొటోలు)
-
పెళ్లి పాటలో సుహాస్, మాళవికా
టాలీవుడ్ హీరో సుహాస్, మాళవికా మనోజ్ జంటగా నటించిన చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. రామ్ గోధల దర్శకత్వంలో హరీష్ నల్ల నిర్మించారు. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని ఈ వేసవిలో విడుదల చేయనుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో పాటను విడుదల చేశారు. పెళ్లి బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగిన పాటలో సుహాస్, మాళవికా చాలా క్యూట్‌గా కనిపించారు. చిత్రసంగీత దర్శకుడు రథన్ స్వరాలందించిన ఈ పాటను టిప్పు, హరిణి ఆలపించారు. ఈ సినిమాను వీ ఆర్ట్స్ బ్యానర్‌పై హరీశ్ నల్లా నిర్మిస్తున్నారు. ఇందులో అనిత హాసానందని, అలీ, రవీందర్ విజయ్, బబ్లూ పృథివీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, మోయిన్, సాథ్విక్ ఆనంద్, నాయని పావని కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శ్రీవిష్ణు ‘#సింగిల్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
బర్త్‌డే స్పెషల్: 13 ఏళ్లకే హీరోయిన్.. ఛార్మి జీవితాన్ని మార్చేసిన సినిమా ఏదంటే?
-
రెమ్యునరేషన్ పెంచేసిన 'డ్రాగన్' బ్యూటీ.. ఎంతో తెలుసా..?
రంగుల ప్రపంచం, కలల ప్రపంచం, మాయాజాలం అంతా సినిమానే. ఇక్కడ ప్రయత్నాలు ఫలిస్తే వారి స్థాయి ఉన్నతంగా ఉంటుంది. అయితే అలాంటి విజయం ఎక్కడ నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. నటి కయ్యదు లోహర్(Kayadu Lohar)ది ఇదే పరిస్థితి. ఇండస్ట్రీలో సరైన ఛాన్స్ కోసం ఈ బ్యూటీ కూడా మూడు, నాలుగేళ్లు పోరాడిందనే చెప్పాలి. 2021లో కన్నడంలో ముకిల్ పేట్ అనే చిత్రంతో కథానాయకిగా పరిచయం అయ్యింది. ఆ చిత్రం పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. ఆ తరువాత మలయాళంలో పత్తొంబదామ్ నూట్రాండు చిత్రంతో అదృష్టాన్ని పరిక్షించుకుంది. ఆ తరువాత తెలుగులో అల్లూరి చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది. అలా మరాఠి భాషలోనూ నటించింది. వీటిలో ఏ ఒక్కటీ ఆశించిన విజయం సాధించకపోయినా, వరుసగా ఇతర భాషల్లో కూడా అవకాశాలు వరించడం ఈ అమ్మడి లక్కే అని చెప్పక తప్పదు. అలా ఇటీవల తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఈమెకు డ్రాగన్ చిత్రం రూపంలో అదృష్టం పట్టుకుంది. ఈ చిత్రంలో నటి అనుపమ పరమేశ్వరన్ కూడా ఒక నాయకిగా నటించింది. ఆమెనెవరూ పట్టించుకోలేదు. డ్రాగన్ చిత్రం సూపర్‌హిట్ కావడంతో నటి కయ్యదు లోహర్ వెంటే దర్శక నిర్మాతలు, కథానాయకులు పరిగెడుతున్నారనే చెప్పాలి. ఇక్కడ ఈమె నటించిన డ్రాగన్ చిత్రం ఒక్కటే విడుదలైంది. అయితే కయ్యదు లోహర్ రూ. 2 కోట్లకు పైగానే పారితోషికం డిమాండ్ చేసే స్థాయికి ఎదిగిందనే ప్రచారం జరుగుతోంది. డ్రాగన్ చిత్రానికి తను కేవలం రూ. 30 లక్షలు మాత్రమే తీసుకున్నట్లు సమాచారం. అయితే, సినిమాకు భారీ లాభాలు రావడంతో ఆమెకు మరో రూ. 70 లక్షలు ఇచ్చారని ప్రచారం ఉంది.అయితే, తన కొత్త సినిమాలకు రెమ్యునరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది. అందుకు కారణం సంచలన నటుడు శింబు, ధనుష్ వంటి వారు ఈ అమ్మడిని హీరోయిన్గా కోరుకోవడమే అంటున్నారు. ప్రస్తుతం నటుడు అధర్వకు జంటగా ఇదయం మురళి చిత్రంలో నటిస్తున్న కయ్యదు లోహర్ నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా ఇమ్మార్టల్ అనే చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా శింబు 49వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు ధనుష్‌తో జంటగా నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించనున్న చిత్రంలో కయ్యదు లోహర్‌ను హీరోయిన్గా ఎంపిక చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. అంతే కాకుండా లబ్బర్ బంతు చిత్రం ఫేమ్ తమిళరసన్ దర్శకత్వంలో ధనుష్ నటించనున్న చిత్రంలోనూ కయ్యదు లోహర్‌నే నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ధనుష్‌తో సినిమా ఛాన్స్ పూర్తి అయితే.. తన రెమ్యునరేషన్ మరో రూ. 3 కోట్లు పెరగొచ్చని పరిశ్రమ అంచనా వేస్తుంది. అదే సమయంలో టాలీవుడ్‌లోనూ మరో చిత్రం చేస్తోంది. ఇలా డ్రాగన్ అనే ఒక్క చిత్రం సక్సెస్‌తో ఇప్పుడు కోలీవుడ్‌లో కయ్యదు లోహర్ క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఇది కదా లక్కు అంటే. -
దెయ్యం కోరికను తీర్చే 'బకాసుర రెస్టారెంట్'.. ఆసక్తిగా ట్రైలర్
టాలీవుడ్ కమెడియన్స్ వైవా హర్ష, ప్రవీణ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'బకాసుర రెస్టారెంట్'. ఈ మూవీకి ఎస్జే శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఎస్జే మూవీస్ బ్యానర్లో లక్ష్మయ్య ఆచారి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. వైవా హర్ష, ప్రవీణ్ కామెడీ అభిమానులను ఓ రేంజ్లో అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్లో సీన్స్ హారర్ సినిమాను తలపించేలా ఉన్నాయి. ప్రేమకథా చిత్రమ్ పార్వతి కదూ? పదేళ్లయినా అదే దెబ్బ.. నువ్వు ఇంకా పోలేదా? అని ప్రవీణ్ చెప్పే డైలాగ్ మరింత ఆసక్తిని పెంచుతోంది. కాగా.. ఈ సినిమాకు వికాస్ బడిస సంగీతమందిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. -
అమ్మ కోరిక తీర్చిన విజయ్ దేవరకొండ.. ఇంతకీ అదేంటో తెలుసా?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ మూవీతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు అభిమానుల అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. ఇటీవల సాంగ్ రిలీజ్ చేయగా విజయ్ దేవరకొండతో కెమిస్ట్రీ ఫుల్ రొమాంటిక్‌గా సెట్ అయింది. అయితే ఈనెల 30న థియేటర్లలో విడుదల కావాల్సిన కింగ్డమ్ ఊహించని విధంగా వాయిదా పడింది. ఇండియా- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కింగ్డమ్ మూవీ రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జూలై 4న సినిమా థియేటర్లలోకి రానుందని వెల్లడించారు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే విజయ్ తన ఫ్యామిలీతో చాలా సరదాగా గడుపుతూ ఉంటారు. ఎక్కడికెళ్లినా సోషల్ మీడియాలో వేదికగా ఫోటోలు షేర్ చేస్తుంటారు. తాజాగా విజయ్ దేవరకొండ తన తల్లి కోరికను తీర్చాడు. ఈ వీకెండ్లో డిన్నర్ బయట ప్లాన్ చేద్దామని అమ్మ కోరడంతో వెంటనే విజయ్ డిన్నర్ ప్లాన్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అమ్మానాన్న, తమ్ముడు ఆనంద్‌తో డిన్నర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.(ఇది చదవండి: అటు రొమాన్స్.. ఇటు యాక్షన్.. 'కింగ్డమ్' తొలి పాట చూశారా?)విజయ్ తన పోస్ట్‌లో రాస్తూ..'అమ్మ అకస్మాత్తుగా మనం డిన్నర్ కి బయటకు వెళ్దామని అడిగింది. మేము బయటకు వెళ్లి చాలా కాలం అయింది. మనమందరం ఎప్పుడూ పని, లక్ష్యాల వెంట పరిగెడుతుంటాం. పనిలో బిజీగా ఉంటూ కొన్నిసార్లు జీవించడం మర్చిపోతాం. అందుకే నిన్న రాత్రి మేము బయటకు వెళ్లి చాలా సమయం గడిపాం. మీరు కూడా మీ అమ్మ, నాన్నలతో సమయం గడపడం మర్చిపోవద్దు. వారిని బయటకు తీసుకెళ్లండి, వారికి కొన్ని కౌగిలింతలు, ముద్దులు ఇవ్వండి. మీరు వారిని ప్రేమిస్తున్నారని చెప్పండి. మీ అందరికీ, మీ కుటుంబాలకు చాలా ప్రేమను పంపుతున్నా' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
మీరిద్దరు శుభంతో జర్నీ మొదలెట్టారు.. ఎప్పటికీ అలాగే ఉండాలి: సమంతపై టాలీవుడ్ నటి కామెంట్స్
ఇప్పుడు టాలీవుడ్లో హీరోయిన్ సమంత పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే తాను నిర్మాతగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తన సొంత బ్యానర్లో తెరకెక్కించిన శుభం మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీకి సూపర్ హిట్ టాక్ రావడంతో సామ్ ఫుల్ ఖుషీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తన టీమ్‌తో కలిసి సక్సెస్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు హాజరైన టాలీవుడ్ నటి మధుమణి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇంతకీ అదేంటో మీరు కూడా చూసేయండి.మధుమణి మాట్లాడుతూ..'నా 39 ఏళ్ల ప్రయాణంలో చాలా అవార్డులు గెలుచుకున్నా. ఎంతో హీరోలతో పాటు హీరోయిన్లకు తల్లిగా నటించా. కానీ సమంతతో ఒక్క సినిమా కూడా చేయలేదు. తనకు రంగస్థలంలో అమ్మగా నటించే అవకాశం చేజారిపోయింది. ఆ బాధ ఇప్పటికీ ఉంది. శుభం కోసం నన్ను సంప్రదించినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. నా అదృష్టం కలిసొచ్చి శుభం మూవీలో నటించా. నాకు ఈ అవకాశం ఇచ్చిన సామ్‌కు శుభం. రాజ్ మీరు కలిసి శుభంతో ప్రయాణం మొదలెట్టారు. మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. శతమానం భవతి అంటూ' అని ఇద్దరినీ దీవించింది.అయితే ఇది విన్న సమంత ఫ్యాన్స్ కాస్తా షాకింగ్‌కు గురవుతున్నారు. రాజ్ నిడిమోరు- సామ్ డేటింగ్‌పై చర్చ జరుగుతున్న వేళ మధుమణి చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. కాగా..ఇటీవల మరోసారి సమంత-రాజ్ నిడిమోరు గురించి మరోసారి చర్చ మొదలైన సంగతి తెలిసిందే. రాజ్ నిడిమోరు తెరకెక్కించిన ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీలో సమంత నటించిన సంగతి తెలిసిందే. సమంత నిర్మించిన శుభం చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. -
వీర జవాన్ మురళి నాయక్‌కు టాలీవుడ్ కమెడియన్ నివాళి
టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ శివారెడ్డి వీరజవాన్‌కు నివాళులర్పించారు. ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన వార్‌లో అమరుడైన మురళి నాయక్‌కు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. జవాన్ స్వగ్రామం శ్రీసత్యసాయి జిల్లా కల్లి తండాలో వెళ్లిన శివారెడ్డి వీర జవాన్‌ను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జవాన్ మాతృమూర్తి కాళ్లకు ఆయన నమస్కరించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు మరణించారు. ఆ తర్వాత పాకిస్తాన్‌పై భారత్ మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలపై వరుస దాడులతో విరుచుకుపడింది. ఈ యుద్ధ సమయంలోనే మన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. ఆ వీరుడిని తలచుకుంటూ భారతీయులంతా దేశవ్యాప్తంగా నివాళులర్పించారు. -
శుభం సక్సెస్ మీట్.. అసిస్టెంట్‌ను ఓదార్చిన సమంత!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవలే శుభం మూవీతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది. కొత్తవారితో తాను నిర్మించిన శుభం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీ సక్సెస్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది సామ్. తన సినిమాకు హిట్ టాక్ రావడంతో సెలబ్రేషన్స్ చేసుకుంది. శుభం మూవీ టీమ్‌తో కలిసి సక్సెస్ వేడుకలో పాల్గొంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.అయితే ఈవెంట్లో పాల్గొన్న సమంత అసిస్టెంట్ ఆర్యన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ఆర్యన్ వేదికపై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది చూసిన సమంత వెంటనే అతన్ని ఓదార్చింది. హృదయానికి హత్తుకుని మరి అసిస్టెంట్‌ను సముదాయించింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ఇది చూసిన పలువురు నెటిజన్స్ సమంత గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.అయితే ఈ మూవీ తర్వాత సమంతపై డేటింగ్ రూమర్స్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఆమె ఫోటోలు షేర్ చేయడంతో మరోసారి దీనిపై చర్చ మొదలైంది. ఈ విషయంపై రాజ్ నిడిమోరు భార్య కూడా స్పందించింది. Entha love unte ❤️ oka team member ki edupu ostadi 🙌 @Samanthaprabhu2 HEARTFUL MOMENT WITH HER TEAM 🥹❤️🔥👏#shubham #SamanthaRuthPrabhu#Samantha pic.twitter.com/UE58hUBJ4c— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) May 16, 2025 -
టాలీవుడ్ మూవీలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్.. ఈవెంట్లో సందడి!
గత కొద్దిరోజులుగా 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్ సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కాసారిగా వీళ్లు స్టార్స్ అయిపోయారు. పచ్చళ్ల బిజినెస్ మూతపడినప్పటికీ వీరికి ఫాలోయింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఓ కస్టమర్‌తో వీరి సంభాషణ వైరల్ కావడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వీరి మాట్లాడిన డైలాగ్స్‌పై మీమ్స్, ట్రోల్స్ ఓ రేంజ్లో వచ్చాయి.ఇదంతా పక్కనపెడితే అలేఖ్య సిస్టర్స్‌లో ఒకరైన రమ్య సడన్‌లో సినిమా ఈవెంట్లో కనిపించింది. టాలీవుడ్ హీరో అశ్విన్ బాబు నటించిన తాజా చిత్రం వచ్చినవాడు గౌతమ్. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఈవెంట్లోనే రమ్య సందడి చేసింది. వేదికపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పక్కనే కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను సైతం రమ్య సోషల్ మీడియాలో షేర్ చేసింది.అయితే ఈవెంట్‌కు రమ్య హాజరు కావడంపై భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. పచ్చళ్ల బిజినెస్‌తో ఫేమస్ అయి.. ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేసిందా అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో ఏకంగా సెలబ్రిటీ అయిపోయారా? అంటూ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఏదేమైనా రమ్య టాలీవుడ్ మూవీ ఈవెంట్లో కనిపించడంతో మరోసారి అలేఖ్య చిట్టి పికిల్స్ టాపిక్ తెరపైకి వచ్చింది. మరి అందరూ ఊహించినట్లుగానే రమ్య ఈ సినిమాలో నటించిందా? లేదా అన్నది తెలియాలంటే ఆమె దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిందే.గతంలో అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్‌లలో ఒకరికి తప్పుకుండా బిగ్‌బాస్‌లోకి ఛాన్స్ వస్తుందని నెట్టింట వైరలైంది. కానీ, రమ్యకు ఛాన్స్ దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపించింది. మోడ్రన్ డ్రెస్‌లతో ఆమె రీల్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి కూడా.. గతంలో జియోహాట్‌స్టార్‌లో పికిల్స్‌కు సంబంధించిన ఒక సీన్‌ను వారు షేర్ చేశారు. ప్రభాస్ ఛత్రపతి సినిమా నుంచి ఒక వీడియోను విడుదల చేశారు. ఇదే విషయంపై బిగ్‌బాస్ ఆదిరెడ్డి కూడా తన యూట్యూబ్ ఛానల్లో అభిప్రాయం చెప్పాడు. వారిలో ఒకరు బిగ్‌బాస్‌కు రావచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు. View this post on Instagram A post shared by Ramya moksha kancharla 👻🌸 (@ramyagopalkancharla) -
మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. కానీ
ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తుంటాయి. కొన్నిసార్లు థియేటర్లలో రిలీజైన కొన్ని వారాలకే స్ట్రీమింగ్ అయిపోతుంటాయి. ఇప్పుడు కూడా ఓ తెలుగు మూవీ అలానే ఓటీటీలోకి వచ్చింది. కాకపోతే ఇక్కడే ఓ ట్విస్ట్. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది?గత నెల 24న థియేటర్లలో రిలీజైన తెలుగు మూవీ 'చౌర్యపాఠం'. బ్యాంక్ దొంగతనం నేపథ్య కథతో తీశారు. బాగానే ప్రమోట్ చేశారు కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మూడు వారాలకే ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ప్రస్తుతం ఓవర్సీస్ (విదేశాల్లో) తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.(ఇదీ చదవండి: ఈ రోజుని ఎప్పటికీ గుర్తుంచుకుంటా.. అనసూయ పోస్ట్ వైరల్) బహుశా వచ్చే వారం మన దేశంలో తెలుగు వెర్షన్ అందుబాటులోకి రావొచ్చు అనిపిస్తుంది. ప్రముఖ దర్శకుడు నక్కిన త్రినాథరావు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. నిఖిల్ దర్శకత్వం వహించాడు. ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లు కాగా మస్త్ అలీ, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. చౌర్యపాఠం విషయానికొస్తే.. వేదాంత్ రామ్(ఇంద్రరామ్)కి దర్శకుడు కావాలనేది కల. నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోయేసరికి బ్యాంక్ దొంగతనం చేసి ఆ డబ్బులతో సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు. బబ్లూ, జాక్ డాన్ అనే ఇద్దరిని తన ప్లాన్ లో భాగం చేస్తాడు. అదే బ్యాంకులో పనిచేస్తున్న అంజలి(పాయల్ రాధాకృష్ణ) వీళ్లకు తోడవుతుంది. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి :రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) -
ఓటీటీలో 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'.. ఉచితంగానే స్ట్రీమింగ్
విజయశాంతి (Vijayashanthi), నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) తల్లీ కుమారులుగా నటించిన సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun son of Vyjayanthi) తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. భారీ యాక్షన్ కాన్సెప్ట్‌తో నూతన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అశోక్ వర్ధన్, సునీల్ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చు అని చెప్పే అర్జున్ సన్నాఫ్ వైజయంతిని ఈ వీకెండ్లో ఇంట్లోనే చూసేయండి.ఏప్రిల్ 18న విడుదలైన అర్జున్ సన్నాఫ్ వైజయంతి తాజాగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు భారత్‌లో ఉచితంగానే స్ట్రీమింగ్ అవుతుంది. కొద్దిరోజుల క్రితం యూకేలో ఉన్నవాళ్లు అద్దె విధానంలో మాత్రమే చూసే అవకాశం కల్పిస్తూ ఓటీటీలో విడుదల చేశారు. అయితే, ఇప్పుడు సడెన్‌గా భారత్‌లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. దీంతో అభిమానులు నెట్టింట షేర్ చేస్తున్నారు.అర్జున్ సన్నాఫ్ వైజయంతి కథ విషయానికొస్తే.. సీన్సియర్ పోలీస్ ఆఫీసర్ వైజయంతి (విజయశాంతి). ఈమెకు ఓ కొడుకు అర్జున్ (కల్యాణ్ రామ్). ఐపీఎస్ అవ్వడానికి రెడీగా ఉన్న ఇతడు.. తండ్రిని ఓ క్రిమినల్ చంపేశాడని పగతో రగిలిపోతుంటాడు. తల్లికి ఇదంతా ఇష్టముండదు. అనుకోని పరిస్థితిలో అర్జున్ ఆ హంతకుడిని అందరూ చూస్తుండగా చంపుతాడు. అప్పటి నుంచీ తల్లీకొడుకుల మధ్య దూరం పెరుగుతుంది. చివరకు వారిద్దరూ ఎలా కలుసుకున్నారు..? తల్లి కోసం కొడుకు చేసిన త్యాగం ఏంటి? అనేదే మిగతా స్టోరీ. -
రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో 'ఎలెవన్' అనే చిన్న సినిమా తప్పితే చెప్పుకోదగ్గ రిలీజులు ఏం లేవు. మరోవైపు ఓటీటీలో మాత్రం 24 కొత్త మూవీస్-వెబ్ సిరీసులు వచ్చేశాయి. ఇవన్నీ రెండు రోజుల్లోనే స్ట్రీమింగ్ కావడం విశేషం.(ఇదీ చదవండి: డేటింగ్లో సమంత.. స్పందించిన మేనేజర్)ఓటీటీల్లోకి వచ్చిన వాటిలో మరణమాస్, అర్జున్ సన్నాఫ్ వైజయంతి, గేంజర్స్, జాలీ ఓ జింఖానా చిత్రాలు ఉన్నంతలో చూడదగ్గవి. ఇవి కాకుండా మరికొన్ని ఇంగ్లీష్, హిందీ మూవీస్ కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన సినిమాలు (మే 16)అమెజాన్ ప్రైమ్అర్జున్ సన్నాఫ్ వైజయంతి - తెలుగు మూవీభోల్ చుక్ మాఫ్ - హిందీ సినిమాఏ వర్కింగ్ మ్యాన్ - తెలుగు డబ్బింగ్ మూవీగేంజర్స్ - తెలుగు డబ్బింగ్ సినిమాలవ్ ఆఫ్ రెప్లికా సీజన్ 1 - చైనీస్ సిరీస్వైట్ ఔట్ - ఇంగ్లీష్ మూవీ (రెంట్)వన్ ఆఫ్ దెమ్ డేస్ - ఇంగ్లీష్ సినిమాసలాటే సలనాటే - మరాఠీ మూవీవన్ లైఫ్ - ఇంగ్లీష్ సినిమామనడ కడలు - కన్నడ మూవీసోనీ లివ్ మరణమాస్ - తెలుగు డబ్బింగ్ సినిమానెట్ ఫ్లిక్స్ద క్విల్టర్స్ - ఇంగ్లీష్ మూవీబెట్ - తెలుగు డబ్బింగ్ సిరీస్ఐ సా ద టీవీ గ్లో - ఇంగ్లీష్ మూవీజానెట్ ప్లానెట్ - ఇంగ్లీష్ సినిమాసాసాకీ అండ్ పీప్స్ - జపనీస్ సిరీస్వినీ జూనియర్ - పోర్చుగీస్ మూవీహాట్ స్టార్డస్టర్ - ఇంగ్లీష్ సిరీస్హే జునూన్ - హిందీ సిరీస్వుల్ఫ్ మ్యాన్ - ఇంగ్లీష్ మూవీ (మే 17)సన్ నెక్స్ట్నెసిప్పయ - తమిళ మూవీఆపిల్ ప్లస్ టీవీడియర్ ప్రెసిడెంట్ నౌ - ఇంగ్లీష్ సినిమామర్డర్ బాట్ - ఇంగ్లీష్ సిరీస్ఆహాజాలీ ఓ జింఖానా - తెలుగు డబ్బింగ్ సినిమా(ఇదీ చదవండి: 'పద్మ భూషణ్' చేయాల్సిన పనులేనా..? బాలకృష్ణపై విమర్శలు) -
రాజమౌళి - మహేష్ బాబు సినిమాలో విలన్ గా విక్రమ్..?
-
'వచ్చినవాడు గౌతమ్' మూవీ ఈవెంట్లో మెరిసిన.. రియా సుమన్ (ఫొటోలు)
-
హాయ్.. తారక్, మే 20న నువ్వు ఊహించలేని గిఫ్ట్ ఉంది: హృతిక్
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న 'వార్2' సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారందరి కోసం తాజాగా హృతిక్ ఒక శుభవార్త చెప్పారు. టీజర్ ఎప్పుడు విడుదలౌతుందో ప్రకటించారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఆదిత్యా చోప్రా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తున్నారు. తన పాత్రకూ కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయని తెలిసింది.హృతిక్ రోషన్(Hrithik Roshan) తాజాగా తారక్‌ను ట్యాగ్ చేస్తూ సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. 'హాయ్.. తారక్ ఈ సంవత్సరం మే 20న ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా..? సిద్ధంగా ఉండు నువ్వు ఊహించలేని గిఫ్ట్ ఉంటుంది' అని ఆయన పంచుకున్నారు. ఈ సారాంశాన్ని చూస్తే వార్2 టీజర్ ఆరోజున విడుదల కావచ్చని తెలుస్తోంది. మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజు ఉంది. కాబట్టి ఆరోజు ఈ సినిమా నుంచి తప్పకుండా టీజర్ విడుదల కా 2019లో హిట్‌గా నిలిచిన హిందీ చిత్రం ‘వార్’కు సీక్వెల్‌గా ‘వార్ 2’ తెరకెక్కుతుంది. ఈ సినిమాపై టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఆగష్టు 14న విడుదల కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్‌గా నటించనున్నారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. గతంలో షారుక్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, హృతిక్ రోషన్లు రా ఏజెంట్ పాత్రలలో నటించి అక్కడ మంచి గుర్తింపుతో పాటు విజయాన్ని అందుకున్నారు. అయితే, వార్2లో వీటన్నింటికంటే భిన్నంగా ఎన్టీఆర్ పాత్ర ఉందని తెలుస్తోంది. ఆపై ఈ మూవీలో హృతిక్ - ఎన్టీఆర్‌లపై అదిరిపోయే సాంగ్‌ను ప్లాన్ చేశారట . దాదాపు 500మంది డ్యాన్సర్లుతో వారు స్టెప్పులేశారట.Hey @tarak9999, think you know what to expect on the 20th of May this year? Trust me you have NO idea what’s in store. Ready?#War2— Hrithik Roshan (@iHrithik) May 16, 2025 -
'పద్మ భూషణ్' చేయాల్సిన పనులేనా..? బాలకృష్ణపై విమర్శలు
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ (Balakrishna) పేరు సరసన కొద్దిరోజుల క్రితమే 'పద్మ భూషణ్' చేరిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. భారత రత్న, పద్మ విభూషణ్ తర్వాత ఈ అవార్డ్ ప్రాముఖ్యతలో దేశంలోనే మూడవ స్థానం ఉంది. ఏరంగంలోనైనా సరే ఉన్నత స్థాయి విశిష్ట సేవకు గుర్తుగా ఈ అవార్డుతో కేంద్రప్రభుత్వం గుర్తిస్తుంది. దేశంలో మూడో అత్యున్నత అవార్డును అందుకున్న బాలయ్య తాజాగా ఒక లిక్కర్ (మద్యం) కంపెనీకి సంబంధించిన యాడ్‌లో నటించడం సోషల్‌మీడియాలో విమర్శలకు దారితీసింది.తాను మద్యం తీసుకుంటానని పలు వేదికల మీద బాలకృష్ణ చెప్పిన విషయం తెలిసిందే. తన ఫేవరెట్ బ్రాండ్ ఏంటనేది కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ విషయాన్ని ఆయన చాలాసార్లు ప్రకటించారు కూడా.. పలుమార్లు సినిమా వేడుకల సమయంలో తన కుర్చీ పక్కనే మద్యం మిక్స్ చేసిన బాటిల్ కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఓటీటీలో బాలకృష్ణ చేసిన ఒక టాక్ షోకు కూడా తనకు ఇష్టమైన బ్రాండ్ కంపెనీనే స్పాన్సర్ చేసింది. అలా బాలయ్యకు ఆ బ్రాండ్‌తో చాలా అనుబంధం ఉంది. అంతవరకు ఫర్వాలేదు, దానిని ఎవరూ తప్పబట్టాల్సిన పనిలేదని చెప్పవచ్చు. కానీ, ప్రస్తుతం అదే బ్రాండ్‌కు ఆయన ప్రచార కర్తగా వ్యవహరించడాన్ని మాత్రం అంగీకరించలేం ఎందుకంటే ఒక సినీ నటుడిగా బాలకృష్ణ ఇలాంటి యాడ్ చేయడాన్ని ఎవరూ తప్పబట్టరు.. చాలామంది సినీ సెలబ్రిటీలు యాడ్స్ లో చేశారు. కానీ, ఇప్పుడు వారందరితో బాలయ్యను పోల్చలేం. ఆయనొక ఎమ్మెల్యే ఆపై అన్నింటికి మించి దేశంలోనే మూడో అత్యున్నత అవార్డు 'పద్మ భూషణ్'ను రీసెంట్‌గానే అందుకున్నారు. పేరు పక్కన అంతటి గౌరవం దక్కిన తర్వాత కనీసం కొంత అయినా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అభిమానులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఆశిస్తారు.కావాల్సినంత డబ్బు, పేరు ఉన్నాయి కదా.. మరీ ఇలాంటి మద్యం బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడం ఎందుకంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే విషయంలో బాలకృష్ణపై విమర్శలు వస్తున్నాయి. పద్మభూషణ్ అవార్డు అందుకొని నెల కూడా కాలేదు ఇంతలోనే ఒక లిక్కర్ కంపెనీ యాడ్ చేయడం ఏంటి అంటూ తప్పుబడుతున్నారు. బాలయ్య కాస్త అవార్డుకైనా విలువ ఇవ్వవయ్యా అంటూ ట్వీట్లు చేస్తున్నారుBalayya Mansion House Drinking Water Teaser 🔥#NandamuriBalakrishna pic.twitter.com/wJwqoRRH16— NBK Cult (@iam_NBKCult) May 15, 2025 -
'వచ్చినవాడు గౌతమ్' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
డేటింగ్లో సమంత.. స్పందించిన మేనేజర్
సౌత్ ఇండియా పాపులర్ నటి సమంత డేటింగ్లో ఉన్నారని జరుగుతున్న ప్రచారంపై తన మేనేజర్ స్పందించారు. తాజాగా తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌లో నిర్మించిన తొలి సినిమా ‘శుభం’ (Subham) విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సమంత అతిథి పాత్రలో నటించారు. మూవీ విడుదల సమయంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఆ చిత్ర యూనిట్‌తో పాటు దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. రాజ్- సమంత ఇటీవల తరచూ ఒకే చోట కనిపించడంతో కొద్దిరోజులుగా రూమర్స్ వచ్చాయి. తాజా ఫొటోతో నెట్టింట మళ్లీ చర్చ మొదలైంది. వారు డేటింగ్లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ రూమర్స్‌పై సమంత మేనేజర్ స్పందించారు.డైరెక్టర్ రాజ్ నిడమోరుతో సమంత డేటింగ్ చేస్తున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మేనేజర్ అన్నారు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనంటూ తెలిపారు. సమంత నిర్మించిన శుభం సినిమా ప్రమోషన్స్ సమయంలో తీసిన ఫోటోలను ఇలా తప్పుడు వార్తలకు లింక్ చేస్తూ వైరల్ చేస్తున్నారని పేర్కొన్నారు. రాజ్ తన కూతురితో పాటు సమంతతో కలిసి ఉండాలని అనుకుంటున్నాడని వచ్చిన ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు. అసలు ఆయనకు కూతురే లేదన్నారు. తనతో పాటు ఉన్న అమ్మాయి కోడైరెక్టర్ కృష్ణ డీకే కూతురని చెప్పుకొచ్చారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసి ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దని సమంత మేనేజర్ కోరారు. -
మహేశ్ - రాజమౌళి సినిమాలో మరో పాన్ ఇండియా హీరో!
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు- దర్శకుడు రాజమౌళి కలయికలో మొదలైన సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. భారీ బడ్జెట్‌తో కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే, తాజాగా కోలీవుడ్ నుంచి స్టార్ యాక్టర్ కూడా ఇందులో భాగం కానున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఆయన సెట్స్ పైకి కూడా వస్తాడనేది నెట్టింట వైరల్ అవుతుంది.‘ఎస్ఎస్ఎంబీ29’ వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌లోకి తమిళ స్టార్ హీరో విక్రమ్ జాయిన్ కాబోతున్నాడని సమాచారం. ఈమేరకు ఆయనతో ఇప్పటికే చర్చలు కూడా పూర్తి అయ్యాయట. గతంలో కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంట్రీ గురించి మొదట రూమర్స్‌తోనే ప్రారంభమయిన విషయం తెలిసిందే. కొంతకాలానికి అదే నిజమైంది. ఇప్పుడు విక్రమ్ విషయంలో కూడా ఇదే జరగబోతుందని ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. మే నుంచి జూన్ వరకు ఈ సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. దీనికోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారని సమాచారం. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ నేతృత్వంలో బిగ్ యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కించనున్నారని తెలిసింది. ఈ సీన్ నుంచే విక్రమ్ ఎంట్రీ ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.‘ఎస్ఎస్ఎంబీ29’లో విక్రమ్ నటించబోతున్నట్లు గతేడాదిలోనే ఈ రూమర్స్ వచ్చాయి. అప్పుడు స్వయంగా విక్రమ్ ఇలా స్పందించాడు. 'రాజమౌళి, నేను రెగ్యూలర్‌గానే టచ్‌లో ఉంటాం. రాజమౌళి దర్శకత్వంలో నా సినిమా తప్పకుండా ఉంటుంది. కానీ, మహేష్ మూవీ గురించి మా మధ్య ప్రస్తుతానికి చర్చలు జరగలేదు' అని ఆయన తెలిపారు. గతంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా తనపై రూమర్స్ వచ్చినప్పుడు ఇలానే రియాక్ట్ అయ్యాడు. కొంత కాలానికి మహేష్ సినిమాలో తాను భాగం కాబోతున్నట్లు ప్రకటించారు. కాబట్టి విక్రమ్ విషయంలో కూడా ఇదే జరుగుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. -
హిట్3 నటి 'కోమలి ప్రసాద్' ఎవరో తెలుసా..?
ఇప్పుడు నటీనటులు ఒక్క భాషలో నటిస్తే చాలు. ఇతర భాషల్లోనూ ఇట్టే ఛాన్సులు అందిపుచ్చుకుంటున్నారు. అలా ఇతర భాషల్లోనూ అవకాశాలు పొందుతూ తమ సత్తాను చాటుకుంటున్నారు. అలా కోలీవుడ్‌లో పాగా వేయాలని ఆశపడుతున్న టాలీవుడ్ నటి కోమలి ప్రసాద్(Komalee Prasad). పదహారణాల తెలుగు అమ్మాయి అయినా ఈమె ప్రతిభ పాటవాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కోమలి ప్రసాద్లో నటి మాత్రమే కాకుండా ఒక వైద్యురాలు (డెంటిస్ట్), జాతీయస్థాయి అథ్లెట్, క్లాసికల్ నృత్య కళాకారిణి అంటూ పలు రంగాల్లో ప్రతిభ కలిగి ఉన్నారు. అదేవిధంగా ఈమె రాష్ట్ర స్థాయి కోకో క్రీడాకారిణి. బ్యాడ్మింటన్ కళాకారిణి కూడా. విశ్వవిద్యాలయం స్థాయిలో బ్యాడ్మింటన్ క్రీడల్లో బంగారు పతకాలను గెలుచుకున్న క్రీడాకారిణి. ఇప్పటికే తెలుగులో నెపోలియన్,హిట్2, రౌడీ బాయ్స్, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి వంటి పలు చిత్రాల్లో నటించిన కోమలి ప్రసాద్ తాజాగా నాని కథానాయకుడిగా నటించిన హిట్–3 చిత్రంలో ఏఎస్పీ వర్షాగా చాలా కీలక పాత్రలో నటించి అందరి ప్రశంసలను అందుకుంటున్నారు. ఈ చిత్రంలో నటించిన అనుభవాలను కోమలి ప్రసాద్ పంచుకుంటూ హిట్–3 చిత్రంలో తాను పోషించిన ఎస్పీ వర్షా పాత్ర శారీరకంగానూ, మానసికంగానూ చాలెంజ్ అనిపించిందన్నారు. ఈపాత్ర కోసం జాతీయస్థాయి బాక్సర్ అనిల్ వద్ద శిక్షణ పొందినట్లు చెప్పారు. తన పాత్రకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణకు ఆనంద భాష్పాలు వచ్చాయన్నారు. ఈ చిత్రంలో నానితో కలిసి నటించడం మంచి అనుభవం అని, ఆయన చాలా సలహాలు, సూచనలు ఇచ్చారని చెప్పారు. అదేవిధంగా స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథా చిత్రంలోనూ నటించాలన్నది తన కలగా పేర్కొన్నారు. తమిళ చిత్రాలపై ఆశతో తమిళభాషను సరళంగా మాట్లాడడం నేర్చుకున్నానని చెప్పారు. సి. ప్రేమ్‌కుమార్, ఆల్ ఫోన్స్ పుత్తిరన్, మణికంఠన్, గౌతమ్‌మీనన్ వంటి దర్శకుల చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నట్లు, అజిత్ ఎప్పటికీ తన ఫేవరెట్ అని, ఆయనతో కలిసి నటించాలని కోరుకుంటున్నట్లు కోమలి పేర్కొన్నారు. -
బాక్సాఫీస్ సెంటిమెంట్ వెలుగు... జీవనజ్యోతి
సరిగ్గా యాభై ఏళ్ళ క్రితం... మండు వేసవి. దాదాపు 113 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రతతో బెజవాడ అక్షరాలా ‘బ్లేజ్‌వాడ’గా ఠారెత్తిస్తోంది. వడగాడ్పులు, ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. ఆ పరిస్థితుల్లో వాణిశ్రీ ప్రధానపాత్రలో, శోభన్‌బాబు హీరోగా కె. విశ్వనాథ్ దర్శకత్వంలో ‘జీవనజ్యోతి’ చిత్రం రిలీజైంది. ఆ సెంటిమెంటల్ కుటుంబ కథ ఆ మండుటెండల్లోనే బాక్సాఫీస్ మలయమారుతమైంది. దేశంలో ఇందిరాగాంధీ సర్కార్ ఎమర్జెన్సీ విధించడానికి 40 రోజుల ముందు విడుదలై అటు ప్రకృతి, ఇటు సమాజంలోని ఆటుపోట్లకు అతీతంగా అఖండ విజయం అందుకుంది. సిల్వర్‌జూబ్లీ సూపర్‌హిట్‌గానే కాక, ఆ ఏడాది అత్యధిక వసూళ్ళు సాధించిన అరుదైన చిత్రంగా చరిత్రకెక్కింది. నిర్మాత డి.వి.ఎస్. రాజు సహా చిత్ర యూనిట్ అందరికీ చిరస్మరణీయ చిత్రంగా మిగిలిపోయింది. ‘జీవనజ్యోతి’ విడుదలై నేటితో 50 ఏళ్ళు. ఆ చిత్ర విశేషాలు... ఎన్టీఆర్ కంపెనీలోకి... శోభన్బాబుడి.వి.ఎస్. ప్రొడక్షన్స్, నిర్మాత డి.వి.ఎస్. రాజు పేరు చెప్పగానే ఆయన ఎన్టీఆర్‌తో నిర్మించిన ‘మంగమ్మ శపథం’ (1965) లాంటి పలు హిట్ చిత్రాలు గుర్తుకొస్తాయి. ఆ సినిమాతో మొదలుపెట్టి వరుసగా పదేళ్ళ పాటు ఎన్టీఆర్తోనే సినిమాలు నిర్మిస్తూ వచ్చిన నిర్మాత ఆయన. అలాంటి డి.వి.ఎస్. రాజు తొలిసారిగా వేరే హీరోతో తీసిన సినిమా – ‘జీవనజ్యోతి’. నిజానికి, పంపిణీ సంస్థ ‘విజయా’ పిక్చర్స్ అధినేత పూర్ణచంద్రరావు చెప్పడంతో, దర్శకుడు విశ్వనాథ్ వద్దకు వెళ్ళి ఈ కథ విన్నారు రాజు. ఈ కథను కూడా ఆయన ఎన్టీఆర్తోనే తీద్దామనుకున్నారట. కానీ, ఫస్టాఫ్‌లో హీరో కాలేజీ విద్యార్థిగా కనిపించడం లాంటివి ఉన్నాయని తటపటాయించారు. చివరకు ఎన్టీఆరే ‘మనం మరో కథతో సినిమా చేద్దాం. శోభన్‌బాబు లాంటి నవ తరం హీరోతో ఈ కథ తెరకెక్కించమన్నార’ట. అలా రెగ్యులర్‌గా ఎన్టీఆర్‌తో సినిమాలు చేసే కంపెనీలోకి హీరోగా శోభన్‌బాబు వచ్చి చేరారు. అలా వచ్చింది – ‘జీవనజ్యోతి’. ఆ సూపర్‌హిట్ తర్వాత ఆ అందాల నటుడు ఆ బ్యానర్లోనే ‘జీవితనౌక’ (1977), ‘కాలాంతకులు’ (1978), ‘దోషి – నిర్దోషి’ (1990) చేశారు. ఇక, ‘జీవనజ్యోతి’ కన్నా ముందు నుంచే విశ్వనాథ్‌తో ‘చిన్ననాటి స్నేహితులు’ (1971) లాంటి చిత్రాలు నిర్మించిన డి.వి.ఎస్. రాజు అటు తర్వాత కూడా ఆ సృజనశీలికి పెద్దపీట వేశారు. 1980ల దాకా ఆయన నిర్దేశకత్వంలో పలు చిత్రాలు తీస్తూ వచ్చారు.అయిదేళ్ళలో 4 ‘బంగారాల’ క్రేజీ కాంబినేషన్కొన్ని కాంబినేషన్లు కుదిరిన వేళావిశేషం అంతే. విశ్వనాథ్ – శోభన్‌బాబుల కాంబినేషన్ ‘జీవనజ్యోతి’ ముందు నుంచీ సూపర్‌డూపర్ సక్సెసే. కాసులతో పాటు కావలసినంత పేరూ తెచ్చింది. 1971 నుంచి 1973 దాకా వరుసగా మూడేళ్ళూ వారిద్దరి కలయిక (‘చెల్లెలి కాపురం’, ‘కాలం మారింది’, ‘శారద’) కమర్షియల్ హిట్. ఆ చిత్రాలన్నీ ఉత్తమ చిత్రాలుగా రాష్ట్ర ప్రభుత్వ బంగారు నందులు సాధించినవే. ఒక్క ఏడాది గ్యాప్ తర్వాత 1975లో మళ్ళీ వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జీవనజ్యోతి’ కూడా బాక్సాఫీస్ వద్దే కాక అవార్డుల్లోనూ బంగారమే పండించింది. అదీ అప్పట్లో విశ్వనాథ్ – శోభన్‌బాబుల క్రేజీ కాంబినేషన్ ఘనత. మరో విశేషం ఏమిటంటే, మధ్యలో 1974లో వాళ్ళిద్దరి కలయికలో సినిమా రాలేదు కానీ, ఆ ఏడాది కూడా విశ్వనాథ్ దర్శకత్వంలోని ‘ఓ సీత కథ’ (1974) బంగారు నందిని కాకున్నా, ద్వితీయ ఉత్తమ చిత్రంగా వెండి నందిని గెలిచింది. ఆ 1974లో బంగారు నంది తెలుగు విప్లవవీరుడి జీవితకథా చిత్రమైన కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ను వరించింది.తెరపై ప్రతిభామూర్తుల త్రివేణీ సంగమం నిజానికి, ‘జీవనజ్యోతి’ సమయానికి శోభన్‌బాబు హీరోగా వరుస విజయాలతో తారాపథానికి ఎదిగారు. ప్రతిభాశాలి అయిన దర్శకుడు కె. విశ్వనాథ్ ఏమో మూడేళ్ళు వరుసగా ఉత్తమ చిత్రాలు అందించి, వాటికి రాష్ట్ర ప్రభుత్వ బంగారు నందులు సాధించి, మంచి ఊపు మీదున్నారు. పైగా, ఆ మూడు చిత్రాల్లోనూ హీరో శోభన్‌బాబే. హీరోయిన్ వాణిశ్రీ అప్పటికే సమకాలికులు అందరినీ దాటుకుంటూ ఆల్రెడీ అగ్రతారగా ఎదిగారు. ఆంధ్రుల అభిమాన నటీమణిగా మార్కెట్లో వెలిగారు. టాప్ హీరోలు ఎన్టీఆర్ (‘కోడలు దిద్దిన కాపురం’, ‘దేశోద్ధారకులు’, ‘మాయా మశ్ఛీంద్ర’), ఏయన్నార్ (‘దసరా బుల్లోడు’, ‘ప్రేమ్‌నగర్’) సరసన తీరిక లేనంత బిజీగా ఉన్నారు. అలాంటి సమయంలో ఈ సెంటిమెంటల్ కుటుంబ కథ ఆమెకు వచ్చింది. అందులోనూ మానసికంగా దెబ్బతిన్న ముసలి తల్లి పాత్ర, ఆ కన్నతల్లి కోసం చిన్నారి కొడుకును త్యాగం చేసే కూతురి పాత్ర... రెండూ పోషించాల్సిన డ్యుయల్ రోల్ ఆఫర్. అంతకు ముందే కన్నడంలో సంచలనం రేపిన ‘శరపంజర’ (1971) చిత్రానికి తెలుగు రీమేక్‌గా హీరో కృష్ణంరాజు తీసిన ‘కృష్ణవేణి’ (1974)లో మానసిక స్వస్థత కోల్పోయిన ఇల్లాలిగా నటించి పేరు తెచ్చుకున్నారు ‘కళాభినేత్రి’ వాణిశ్రీ. ఆ వెంటనే ఈ ‘జీవనజ్యోతి’లోని రెండు పాత్రలనూ మరో సవాలుగా తీసుకున్నారు. అలా అరుదైన దర్శకుడు, నాయికా నాయకుల కలయికలో నవరసాలూ రంగరించి, సప్తవర్ణాలతో ‘ఈస్ట్‌మన్ కలర్’లో తయారైంది – ‘జీవనజ్యోతి’.గోదావరి పొంగు లాంటి కోనసీమ పిల్ల లక్ష్మి (వాణిశ్రీ)ని చూసీచూడగానే ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు గుంటూరు పిల్లగాడు వాసు (శోభన్‌బాబు). అతనికీ, ఆ ఉమ్మడి కుటుంబానికీ జ్యోతిగా మెలుగుతున్న ఆమెకు అనుకోని ఓ విషాద ఘటనతో మతి చలిస్తుంది. ఆ విషాదాన్ని ఆమె మనసు నుంచి దూరం చేసి, ఆమెను ఎవరు, ఎలా మామూలు మనిషిని చేశారు? ఆ కుటుంబంలో మళ్ళీ ‘జీవనజ్యోతి’ ఎలా వెలిగిందన్నది ఈ సెంటిమెంట్ సినిమా. సినిమా ఫస్టాఫ్‌లో అల్లరిపిల్లగా కనిపించి, సెకండాఫ్‌లో పోగొట్టుకున్న తన బాబు కోసం ఆరాటపడే మతి భ్రమించిన మాతృమూర్తిగా కన్నీళ్ళుపెట్టించే లక్ష్మి పాత్రపోషణలోని రెండు విభిన్న ఛాయలను వాణిశ్రీ అద్భుతంగా అభినయించారు. అదే సమయంలో వయసు మళ్ళిన కన్నతల్లి కోసం తన ‘బాబు’ను త్యాగం చేసే కూతురు శోభ పాత్రనూ అంతే పరిణతితో పోషించారు. ‘సిన్ని ఓ సిన్నీ...’ అని పాటలు పాడే కోడెకారు కుర్రవాడి నుంచి మానసికంగా దెబ్బతిన్న భార్యను కాపాడుకోవడానికి తపించే భర్త వరకు జీవితంలోని వివిధ దశల్ని ప్రతిఫలించే వాసు పాత్రలో ఆ పరిణామాన్ని శోభన్‌బాబు తెరపై బాగా చూపారు. ముఖ్యంగా, చిన్నారి ‘బాబు’గా బేబీ వరలక్ష్మి కూడా రెండు పాత్రల్లో ఆ రోజుల్లో ప్రేక్షకుల మనసు చూరగొంది. రథం కింద బాబు పడిపోయే అత్యంత కీలకమైన దృశ్యం గగుర్పాటు కలిగించి, కన్నీరు తెప్పించింది. సినిమా కథను మలుపు తిప్పే ఆ సన్నివేశ చిత్రీకరణలో దర్శకుడి ప్రతిభ, జి.కె. రాము ఛాయాగ్రహణ నైపుణ్యం తెరపై సినిమా కాదు... నిజజీవిత ఘట్టం చూస్తున్నామన్నంత అనుభూతిని కలిగించాయి. డి.వి.ఎస్. ప్రొడక్షన్స్ సంస్థలో కలర్లో తీసిన తొలి సినిమా కూడా ఇదే. అందుకు తగ్గట్టే, నిర్మాత రాజు తాను పుట్టిపెరిగిన కోనసీమ ప్రాంత అందాలనూ, ఆహ్లాదం పంచే అరటి – కొబ్బరి తోటలనూ, గోదావరి నదీ తీర సౌందర్యాన్నీ పాటల్లో, సన్నివేశాల్లో చూపేలా గన్నవరం ఆక్విడెక్ట్ వద్ద, అమలాపురం దగ్గరలోని కోడూరుపాడు, అల్లవరం, వెన్నుమూరు లంక గ్రామాల్లో చిత్ర నిర్మాణం సాగించారు. ఆయన మేనమామ గారి ఊరైన కోడూరుపాడులోనే క్లిష్టమైన రథోత్సవం సీన్ చిత్రీకరణ సాగింది.అభిప్రాయ భేదాలున్నా... అదే అభిమానంసినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకుల్ని కథలో లీనమైపోయేలా తీసిన ప్రతిభ దర్శకుడిది. ప్రముఖ రచయిత ఆరుద్ర జీవిత భాగస్వామి – స్వయంగా ప్రఖ్యాత రచయిత్రి అయిన శ్రీమతి కె. రామలక్ష్మి ఈ చిత్రానికి మూలకథ సమకూర్చారు. దానికి విశ్వనాథ్ స్క్రీన్‌ప్లేతో సానపెట్టారు. (రామలక్ష్మి నవల ‘ఆడది’ ఈ చిత్రానికి మూలమని కొందరు రాస్తుంటారు. కానీ, 1967– ’68 ప్రాంతంలో ధారావాహికగా రాసిన ఆ చిన్న నవలకూ, ఈ సినిమాకూ పోలికే లేదు). అయితే, ఈ చిత్ర సందర్భంగా రామలక్ష్మి, విశ్వనాథ్‌ల మధ్య సృజనాత్మక అభిప్రాయభేదాలు వచ్చాయి. ఆ తరువాత వారిద్దరూ ఎప్పుడూ కలసి పనిచేయలేదు. కానీ, చివరి వరకు పరస్పర గౌరవాభిమానాలు మాత్రం ఎప్పటిలానే కొనసాగడం నేటి తరానికి ఓ గొప్ప జీవనపాఠం.‘జీవనజ్యోతి’లో కె. విశ్వనాథ్ ఎప్పటిలానే విలక్షణమైన క్యారెక్టర్లు, వాటికంటూ ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్లతో పాటు తనదైన మార్కుతో కథలో అంతర్భాగంగానే రాజబాబు, రమాప్రభ జంటతో హాస్యం చిలికించారు. ఆయన చిరకాల మిత్రుడు, సహాధ్యాయి అయిన సముద్రాల జూనియర్ సంభాషణల్లో తన పట్టును మరోసారి ఈ చిత్రంలో చూపారు. అఫ్కోర్స్... ఆ రచనలో విశ్వనాథ్ గారి అదృశ్యహస్తమూ ఉందనేది బహిరంగ రహస్యం. సాక్షాత్తూ చిత్ర నిర్మాత డి.వి.ఎస్. రాజు సైతం బాహాటంగా చెప్పిన సత్యం.ఇంటింటా మోగిన ఆ పాటలు‘ఇంత మంచి చిత్రం ఇటీవల రాలేదనీ, ఇది సినిమా కాదు... జీవితమనీ’ ఈ సినిమాకు జనం నీరాజనాలు పట్టారు. ఆ రోజుల్లో ‘ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు... సద్దు చేశారంటే ఉలికులికి పడతాడు...’ (గానం – పి. సుశీల) పాట మోగని ఇల్లు లేదు. పాడని తల్లి లేదు. ‘ఎక్కడ ఎక్కడ దాక్కున్నానో చెప్పుకో...’ (గానం – బి. వసంత, పి. సుశీల) అంటూ సినిమాలో కీలకమైన పిల్లాడి పాత్ర మీద వచ్చే పాట అప్పట్లో ఆబాలగోపాలానికీ ఆల్‌టైమ్ ఫేవరెట్. డ్యూయెట్లలో ‘సిన్ని ఓ సిన్నీ... ఓ సన్నజాజుల సిన్నీ...’ పాట అన్ని దిక్కుల ప్రేక్షకుల్నీ ఊపేసింది. కొత్తగా పెళ్ళయిన జంట మీద వచ్చే ‘ఎందుకంటే ఏమి చెప్పను... ఏమిటంటే ఎలా చెప్పను...’ గీతం యువ ప్రేక్షకుల్ని స్వానుభవాల ఊహలలో తేలియాడించింది. వెరసి, ‘పూతరేకుల తీయదనం... పాలమీగడ కమ్మదనం’ నిండిన సినారె సాహిత్యం, కె.వి. మహదేవన్ సంగీతం, విశ్వనాథ్ మార్కు సంగీత – సాహిత్యాభిరుచి త్రివేణీ సంగమమై, పాటల పల్లకీలో ఈ మ్యూజికల్ హిట్ చిత్రాన్ని ఊరూరా బాక్సాఫీస్ వద్ద ఊరేగించాయి.దర్శకేంద్రుణ్ణి వెనక్కి నెట్టిన కళాతపస్వి!సరిగ్గా ఆ ఏడాదే, అదీ శోభన్‌బాబు హీరోగానే ‘బాబు’ చిత్రంతో కె. రాఘవేంద్రరావు దర్శకుడయ్యారు. ‘జీవనజ్యోతి’కి సరిగ్గా 14 రోజుల ముందు 1975 మే 2న ఆ సినిమా రిలీజైంది. భారీ తారాగణం, ఖరీదైన సెట్లతో సహా అన్ని రకాల హంగులు, ‘ఒక జంట కలిసిన తరుణాన జేగంట మ్రోగెను గుడిలోన...’ లాంటి పాపులర్ పాటలతో ఆ చిత్రం రిలీజైంది. కొత్త దర్శకుడైనా, ఖరీదైన టేకింగ్‌తో సినిమా ఫరవాలేదని అనిపించుకుంటున్న తరుణంలో సరిగ్గా 2 వారాలకు శోభన్‌బాబే నటించిన కె.విశ్వనాథ్ ‘జీవనజ్యోతి’ అనుకోని పోటీగా అవతరించింది. మనసుకు పట్టే పాటలు, మహిళల్ని కట్టిపడేసే సెంటిమెంట్‌తో ‘జీవనజ్యోతి’ సమకాలపు సినిమాలన్నిటినీ చిత్తు చేసి, బాక్సాఫీస్ విన్నరైంది. ఇంకా చెప్పాలంటే, ఆ ఏడాది తెలుగులో వచ్చిన చిత్రాలన్నిటిలోకీ అత్యధిక వసూళ్ళు ఆ సినిమావే!‘‘అప్పట్లో విశ్వనాథ్ గారి ‘జీవనజ్యోతి’ హోరులో నా తొలిచిత్రం ‘బాబు’ అడ్రస్ గల్లంతైంది’’ అని రాఘవేంద్రరావే స్వయంగా అంగీకరించారు. కలెక్షన్ల రీత్యా ‘బాబు’ యావరేజ్ సినిమాగా నిలిచినా, మితిమీరిన చిత్ర నిర్మాణ వ్యయం కారణంగా ట్రేడ్ లెక్కలో ఆ సినిమా ఫెయిల్యూర్‌గా మిగిలింది. తర్వాతి కాలంలో అదే రాఘవేంద్రరావు వసూళ్ళవర్షం కురిపించే కమర్షియల్, మాస్ చిత్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అదే కె. విశ్వనాథ్ అభిరుచి గల కళాత్మక చిత్రాలతోనూ కాసులు కురిపించిన సినీ తపస్విగా సుస్థిరస్థానం సంపాదించుకున్నారు. అదీ విశేషం.సిల్వర్ జూబ్లీ సూపర్‌హిట్ ‘జ్యోతి’! ఆ రోజుల్లో ‘జీవనజ్యోతి’ మొత్తం 32 కేంద్రాల్లో రిలీజై, అశేష ప్రేక్షకాదరణతో ఏకంగా 31 సెంటర్లలో 50 రోజులు ఆడింది. అదే ఊపులో 12 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది. నిజానికి, మరిన్ని కేంద్రాల్లో నూరు రోజుల పండుగ చేసుకోవాల్సి ఉన్నా, దిగువ కేంద్రాలకు త్వరగా కొత్త సినిమా పంపడం కోసం పంపిణీదారులైన విజయా పిక్చర్స్ వారి పద్ధతైన 50 – 50 శాతం షేర్ వసూళ్ళ షరతు అవరోధమైంది. అలా కొన్ని సెంటర్లలో 80, 90 రోజులు పూర్తయ్యాక కూడా శతదినోత్సవ ఘనత రాకుండానే ‘జీవనజ్యోతి’ని థియేటర్ నుంచి తప్పించిన తార్కాణాలున్నాయి. ఏమైనా, హైదరాబాద్‌లో మాత్రం ఈ చిత్రం షిఫ్టులతో 25 వారాలు నడిచింది. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో విజయలక్ష్మీ టాకీస్‌లో ఆ ఏడాది నవంబర్ 6న అలా సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది. ‘జీవనజ్యోతి’ తర్వాత ఏడు నెలలకు 1975లోనే డిసెంబర్లో వచ్చిన శోభన్‌బాబు ‘సోగ్గాడు’ సైతం పెద్ద హిట్. అది కూడా 32 కేంద్రాల్లోనే రిలీజై, 31 కేంద్రాల్లో 50 రోజులు జరుపుకోవడం విశేషం. అయితే, ఆ చిత్రం 19 సెంటర్లలో వంద రోజులాడినా, రజతోత్సవ ఘనత దక్కలేదు. చాలామందికి తెలియనిదేమిటంటే, శోభన్ కెరీర్లో అతి పెద్ద కమర్షియల్ హిట్ అని అందరూ అనుకొనే ‘సోగ్గాడు’ కన్నా ‘జీవనజ్యోతి’దే వసూళ్ళలో పైచేయి. ఆశ్చర్యంగా అనిపించినా అదే నిజం. టికెట్ రేట్లు ఎక్కువుండే ఏసీ, డీలక్స్ థియేటర్లలో ‘సోగ్గాడు’ రిలీజైన కాకినాడ, నెల్లూరు టౌన్లను మినహాయిస్తే, మిగతా అన్ని కేంద్రాల్లోనూ ఎక్కువ వసూళ్ళు వచ్చింది – ‘జీవనజ్యోతి’కే! ‘జీవనజ్యోతి’ వసూళ్ళ రేంజ్ అదీ!ఈ చిత్రం హిట్ రేంజ్‌కు మచ్చుకు ఓ ఉదాహరణ – కీలకమైన గుంటూరు కేంద్రం బాక్సాఫీస్ కథ. చలనచిత్ర చరిత్రలో... గుంటూరు టౌన్లో రూ. 4 లక్షల పైచిలుకు వసూలు చేసిన మొట్టమొదటి సినిమా – ఈ ‘జీవనజ్యోతే’. ఆ తర్వాత మళ్ళీ రెండేళ్ళకు ఎన్టీఆర్ ‘దాన వీర శూర కర్ణ’ (1977) అంతటి వసూళ్ళతో, ఆ ఘనత సాధించిన రెండో సినిమా అయింది. విశేషం ఏమిటంటే, మిగతా హీరోలంతా గుంటూరులో ఆ మైలురాయి వసూళ్ళకు చేరుకోవడానికి దాదాపు అయిదారేళ్ళ సమయం పట్టింది. కృష్ణకు ‘ఊరుకి మొనగాడు’ (1981), కృష్ణంరాజుకి ‘సీతారాములు’ (1980), ఏయన్నార్‌కి ‘ప్రేమాభిషేకం’ (1981) వచ్చేవరకు గుంటూరులో ఆ 4 లక్షల మైలురాయి లేదన్నది బాక్సాఫీస్ విశ్లేషకుల మాట. సాక్షాత్తూ శోభన్‌బాబు సైతం ‘జీవనజ్యోతి’ తర్వాత ఏడేళ్ళకు ‘దేవత’ (1982 సెప్టెంబర్ 10 రిలీజ్) వచ్చేవరకు మరోసారి ఆ రూ. 4 లక్షల ఘనత గుంటూరులో సాధించలేదు. అయితే, ఆ నడిమధ్య కాలంలో ఎన్టీఆర్ నటించిన పలు సినిమాలు మాత్రం రూ. 4 లక్షల‡మైలురాయిని దాటి, వసూలు చేశాయి. అదీ ‘జీవనజ్యోతి’ హిట్ రేంజ్! శోభన్‌బాబు కెరీర్లో టాప్ ఇయర్!స్వీయ నిబంధనలకు తగ్గట్టు నటించి, ఇంకా క్రేజ్, ఇమేజ్ ఉన్నా సరే సొంత ఆలోచనలకు తగ్గట్టే నటన విరమించిన అందాల నటుడు, ‘నటభూషణ’ శోభన్‌బాబుది చిరస్మరణీయమైన సినీ జీవితం. అంతటి కెరీర్లోనూ ఆయనకు శిఖరాయమాన సంవత్సరమంటే – ‘జీవనజ్యోతి’ రిలీజైన 1975యే! టాప్ హీరో ఎన్టీఆర్ గణనీయమైన సంఖ్యలో సినిమాలు చేస్తున్నా, హిట్లూ – కలెక్షన్లూ వస్తూనే ఉన్నా, జనం ఆగి అబ్బురపడేటంత భారీ బాక్సాఫీస్ హిట్లు రాని ఏడాది అది. మరో అగ్రహీరో ఏయన్నార్ అంతకు ముందే అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకొని వచ్చారు. సినిమాలకు విరామమిచ్చి, పూర్తిగా విశ్రాంతి తీసుకోవడంతో, ఆ ఏడాది ఆయనకు రిలీజులే లేవు. శోభన్‌కు సాటివాడైన హీరో కృష్ణ చకచకా సినిమాలు చేస్తున్నప్పటికీ, క్రిందటేడు ‘అల్లూరి సీతారామరాజు’ (1974) తెచ్చిన ఇమేజ్ దెబ్బతో, ‘పాడిపంటలు’ (1976) వరకు సినిమాలన్నీ వరుసగా ఫ్లాపవుతున్న విచిత్రమైన సంవత్సరం అది.అలాంటి చిత్రమైన సందర్భంలో శోభన్‌బాబు పట్టిందల్లా బంగారమైంది. ఆ 1975లో శోభన్ సినిమాలు మొత్తం 8 రిలీజయ్యాయి. అందులో 5 (‘దేవుడు చేసిన పెళ్ళి’, ‘జీవనజ్యోతి’, ‘బలిపీఠం’, ‘జేబుదొంగ’, ‘సోగ్గాడు’) హిట్లు . రెండే (‘గుణవంతుడు’, ‘అందరూ మంచివారే’) ఫ్లాపులు. ఒకటి మాత్రం (‘బాబు’) యావరేజ్. అయిదు హిట్లలోనూ ‘జీవనజ్యోతి’ ఒకటే 25 వారాలు ఆడి, సిల్వర్‌జూబ్లీ చేసుకుంది. ఏయన్నార్‌కి పర్మినెంట్ నిర్మాతైన డి. రామానాయుడు తీసిన ‘సోగ్గాడు’ సైతం రజతోత్సవానికి ఒక వారం ముందే థియేటర్ల నుంచి వైదొలగింది. అలా ఒకే ఏడాది అధికశాతం కమర్షియల్ సక్సెస్‌లతో శోభన్‌బాబు క్రేజు పెరిగిపోయింది. పరిశ్రమలో ఆయన రేంజే మారిపోయింది.హిందీలోనూ హిట్టయిన మదర్ సెంటిమెంట్! బాక్సాఫీస్ రికార్డులే కాదు... విమర్శకుల రివార్డులు, ప్రభుత్వ – ప్రైవేటు అవార్డుల్లోనూ ‘జీవనజ్యోతి’కి అగ్రతాంబూలం దక్కింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే నంది అవార్డుల్లో ఆ ఏడాదికి బంగారు నంది అందుకున్న ఉత్తమ చిత్రం అదే! (అప్పటికింకా వ్యక్తిగత విభాగాల్లో ప్రత్యేకంగా నంది అవార్డులు ఇవ్వడమనే ఆనవాయితీ లేదు. ఉత్తమ చిత్రం అవార్డు కింద నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్లను అందరినీ గౌరవించేవారు. అలా ‘జీవనజ్యోతి’ ప్రధాన బృందం అంతటికీ గౌరవం దక్కింది). ఇక, పాపులర్ అవార్డులైన ‘ఫిల్మ్‌ఫేర్’లోనూ దక్షిణాదిన ఈ సినిమాదే హవా. ఉత్తమ తెలుగు సినిమా, ఉత్తమ దర్శకుడు (కె. విశ్వనాథ్), ఉత్తమ నటుడు (శోభన్‌బాబు), ఉత్తమ నటి (వాణిశ్రీ)... ఇలా అవార్డుల పంట పండింది. ఇదే సినిమా దశాబ్ద కాలం తర్వాత విశ్వనాథ్ దర్శకత్వంలోనే హిందీలో జితేంద్ర, జయప్రదలతో ‘సన్జోగ్’ (1985)గా రీమేకైంది. అక్కడా ఈ కథ హిట్. కథానాయికగా జయప్రదకు మంచి పేరు తెచ్చింది. ఉత్తమ నటిగా ఆమె ‘ఫిల్మ్‌ఫేర్’కు నామినేటైంది. చిత్రమేమంటే, ఈ తెలుగు సూపర్‌హిట్ సినిమా 21 ఏళ్ళ తర్వాత కన్నడంలోనూ వచ్చింది. విష్ణువర్ధన్, ఆమనితో ‘బాళిన జ్యోతి’ (1996)గా క్రాంతికుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. ‘లేడీస్ స్పెషల్ షో’ ట్రెండ్!విశేషమేమిటంటే, అదే ఏడాది ప్రపంచ మహిళా సంవత్సరం. ఈ సెంటిమెంట్ సినిమాకు స్త్రీలు పోటెత్తడంతో, కొన్ని తరగతుల టికెట్లు, కొన్ని షోలు ఆడవారికే ప్రత్యేకంగా కేటాయించేవారు. మూకీలు పోయి టాకీలొచ్చాక, తెలుగు సినిమా ఆధునికతను సంతరించుకున్నాక ఈ ‘లేడీస్ స్పెషల్ షో’ ట్రెండ్‌కూ ఈ ‘జీవనజ్యోతే’ నాంది!ప్రాంతాలు, భాషల తేడా లేకుండా ‘జీవనజ్యోతి’లోని సార్వత్రికమైన తల్లి సెంటిమెంట్ అన్నిచోట్లా పండింది. ఆ సింపుల్ సెంటిమెంట్ కథ... విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభ, వాణిశ్రీ అభినయ వైదుష్యం, అందాల శోభన్‌బాబు క్రేజీ ఇమేజ్, పదే పదే పాడుకోవాలనిపించే పాటలతో ఇవాళ తెరపై చూసినా తాజాగా అనిపించడం చెప్పుకోదగ్గ గొప్పదనం.– రెంటాల జయదేవ -
'ధర్మం దారి తప్పినప్పుడు.. వచ్చినవాడు గౌతమ్'.. ఆసక్తిగా టీజర్
అశ్విన్ బాబు లీడ్ రోల్ నటిస్తోన్న తాజా చిత్రం 'వచ్చినవాడు గౌతమ్'. ఈ చిత్రంలో రియా సుమన్, అయేషాఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి మామిడాల ఎం ఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో టి.గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. 'ధర్మం దారితప్పినప్పుడు.. ఏ అవతారం రానప్పుడు.. వచ్చినవాడు గౌతమ్' అనే డైలాగ్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ చిత్రంలో అజయ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, సాయి రోనక్, అభినయ, నెల్లూరు సుదర్శన్, వైవా రాఘవ, విద్యులేఖ, షకలకశంకర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు గౌర హరి సంగీతమందిస్తున్నారు. -
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో రష్మిక.. భారీ రెమ్యునరేషన్ డిమాండ్...
-
ఈ తీపి గుర్తులు మరిచిపోలేను.. ఫోటోలు విడుదల చేసిన శ్రీనిధి శెట్టి (ఫొటోలు)
-
ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లింగ్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు, దర్శకుడు సుందర్ సి కలిసి నటించిన 'గ్యాంగర్స్' చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోనే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. సుమారు 15 ఏళ్ల తరువాత వీరిద్దరూ కలిసి నటించడంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించేలా కలెక్షన్స్ రాబట్టింది. ఖుష్బు సుందర్ నిర్మించిన ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించారు.'గ్యాంగర్స్' తమిళ యాక్షన్ కామెడీ మూవీ తాజాగా 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో సడెన్‌గా స్ట్రీమింగ్కు వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీలోకి ఈ చిత్రం రావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా, మునిష్కాంత్, భగవతి పెరుమాల్ నటించగా వెంకట్ రాఘవన్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు.వినోదభరిత కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో వడివేలు సింగారన్ అనే పాత్రలో నటించారు. ఒక చిన్న పట్టణంలో ఉండే పాఠశాలలో ఒక బాలిక తప్పిపోతుంది, ఉపాధ్యాయురాలు సుజిత (కేథరిన్ థ్రెసా) ఆమెను కనుగొనమని పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. ఈ కేసును పూర్తి చేసేందుకు ఓ పోలీసు అధికారి రహస్యంగా అదే స్కూల్లో పీటీగా అండర్ కవర్లో నియమించబడతారు. పోలీస్ అధికారి రాకతో అసలు పీటీ (వడివేలు) పరిస్థితి ఏంటి..? ఇన్వెస్టిగేషన్ సాగుతున్న క్రమంలోనే కథ మరో మలుపు తిరుగుతుంది. స్థానికంగా ఉండే ముగ్గురు రౌడీల వద్ద ఉన్న డబ్బును దోచుకోవడానికి కొందరు ప్రయత్నిస్తారు. వీరికి, తప్పిపోయిన బాలికకు ఉన్న లింక్ ఏంటి..? వంటి అంశాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. -
ఏపీ పోలీస్ ఆఫీసర్‌గా బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ ఏపీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఎప్పుడూ ఫుల్ లెన్త్ సినిమాలు చేసే బాలయ్య తొలిసారి రజనీకాంత్ ‘జైలర్ 2’ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనువిందు చేయడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. సన్‌పిక్చర్స్ సంస్థ కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. 2023లో విడుదలైన జైలర్‌లో అతిథి పాత్రలు పోషించిన శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్‌ల పర్ఫామెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఇందులో కూడా వారందరూ నటించనున్నారు. ప్రస్తుతం వారి సరసన టాలీవుడ్ నుంచి బాలకృష్ణ చేరనున్నట్లు సమాచారం.రజనీకాంత్ కోసం జైలర్2లో నటించేందుకు బాలకృష్ణ ఒప్పుకున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చిత్ర యూనిట్ సంప్రదింపులు కూడా చేసిందని సమాచారం. ఈ చిత్రంలో బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోలీసు అధికారి పాత్రలో కనిపిస్తారని సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో పోలీస్ ఆఫీసర్‌గా రౌడీ ఇన్స్పెక్టర్, లక్ష్మీ నరసింహా వంటి సినిమాల్లో ఆయన మెప్పించారు. ఇప్పుడు చాలారోజుల తర్వాత జైలర్2 కోసం పోలీస్ యూనిఫామ్ ధరించనున్నారు. రజనీకాంత్, బాలయ్య మధ్య భారీ ఎలివేషన్ ఇచ్చే సీన్ ఉందని, అదికూడా సుమారు 5నిమిషాల పాటు ఉండనుందని తెలుస్తోంది.జైలర్2తో తాను నటించబోతున్నట్లు రీసెంట్గా శివరాజ్‌కుమార్ ఫైనల్ చేశారు. ఇందులో రమ్యకృష్ణ, మిర్నా మేనన్, ఫహాద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సీక్వెల్లో కన్నడ భామ శ్రీనిధి శెట్టి నటించనున్నట్లు తెలిసింది. ఈ ఏడాది డిసెంబర్లో జైలర్2 విడుదల చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారు. -
నటుడు సంతానంకు నోటీసులు
తమిళ నటుడు సంతానంకు తిరుపతికి చెందిన ఓ బీజేపీ నేత నోటీసులు పంపారు. సంతానం కథానాయకుడుగా నటించిన తాజా చిత్రం ‘డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవెల్’ నిహారిక ఎంటర్టెయిన్మెంట్ సంస్థ, ఆర్యకు చెందిన షో పీపుల్ సంస్థ కలిసి నిర్మించిన చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈచిత్రంలో శ్రీ వేంకటేశ్వరభక్తి గీతాలు శ్రీనివాస గోవిందా అనే పాటను పొందుపరిచారు. ఈ పాటలో నటుడు సంతానం నటించారు. కోట్లాది మంది భక్తులు ఆరాధించే శ్రీవేంకటేశ్వరస్వామి భక్తి గీతాన్ని డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవెల్ చిత్రంలో పొందుపరిచి భక్తుల మనోభావాలను గాయపరిచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా తిరుమల, తిరుపతి పోలీస్స్టేషన్లలో జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు సంతానంపై ఫిర్యాదు చేశారు. అదేవిధంగా తిరుపతి నియోజకవర్గానికి చెందిన ఓ బీజేపీ నేత దీనిపై తీవ్రంగా స్పందించారు. ఈ చిత్ర విడుదలను నిషేధించాలని, ఆ చిత్రంలో భక్తి గీతాన్ని తొలగించాలని, ఇప్పటికీ ఆ పాట యూట్యూబ్ చానళ్ల ద్వారా భక్తుల్లోకి వెళ్లి వారి మనోభావాలను గాయపరిచినందుకుగాను నష్టపరిహారం చెల్లించాలని సంతానానికి, నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టెయిన్మెంట్కు నోటీసులు పంపారు. నోటీసులపై 15 రోజుల్లోగా స్పందించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. -
విదేశాల్లో విహరిస్తున్న దిల్‌రాజు.. సతీమణితో అలా సరదాగా!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం వేసవి సెలవుల్లో ఉన్నారు. నిర్మాతగా ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే ఆయన.. కాస్తా గ్యాప్ రావడంతో విదేశాల్లో విహరిస్తున్నారు. తన కుటుంబంతో కలిసి వేకేషన్లో చిల్ అవుతున్నారు. తాజాగా తన భార్య తేజస్వినితో కలిసి సైకిల్ రైడింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన దిల్ రాజు ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. టాలీవుడ్లో అగ్ర నిర్మాతగా దిల్‌రాజు కొనసాగుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో పలు సినిమాలను తెరకెక్కించారు. ఈ ఏడాది విడుదలైన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీని దిల్‌రాజు నిర్మించారు. వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం కూడా ఆయనే నిర్మాత. ఈ మూవీ సంక్రాంతికి థియేటర్లలో విడుదలైన బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆయన బ్యానర్లో నితిన్ హీరోగా నటించిన తమ్ముడు జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. అంతేకాకుండా ఇటీవలే విజయ్ దేవరకొండతో మూవీ చేయనున్నట్లు దిల్ రాజు ప్రకటించారు. -
అలాంటి దేశాల్లో మన డబ్బులు ఖర్చు చేయకండి: టాలీవుడ్ హీరో సిద్ధార్థ్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం స్వయంభూ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇక సినిమాల సంగతి పక్కనపెడితే నిఖిల్ తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటో చూసేద్దాం.ఇండియా-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో నిఖిల్ సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. పాక్‌కు మద్దతుగా టర్కీ నిలవడంపై నిఖిల్ ఫైరయ్యారు. ఇకపై ఎవరూ కూడా టర్కీని సందర్శించవద్దని భారతీయులను కోరారు. టర్కీలో భారతీయులు ప్రతి సంవత్సరం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తారని.. భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. విహారయాత్రల కోసం అలాంటి దేశాలకు మనం వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. పాక్‌తో తాము సత్సంబంధాలు కొనసాగిస్తామని టర్కీ ప్రెసిడెంట్ ఎర్గోడాన్ చేసిన కామెంట్స్‌పై ఓ నెటిజన్స్ పోస్ట్ చేశాడు. దీనిపై టాలీవుడ్ హీరో నిఖిల్ రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండియా- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. ఆ సమయంలో పాకిస్తాన్‌కు మద్దతుగా టర్కీతో పాటు చైనా కూడా సాయం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే టర్కీ యాపిల్స్‌ను సైతం దిగుమతి చేసుకోవడం ఆపేశారు.Anyone still visiting Turkey ? Please read this Below Thread...Indians Spend Billions of Dollars Every year in Turkey. Please Stop giving your money to the Nations who are against us. #Tourism #India https://t.co/hUGq6MP6Pm— Nikhil Siddhartha (@actor_Nikhil) May 14, 2025 -
హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి బ్యూటిఫుల్ (ఫొటోలు)
-
ఏ క్షణమైనా 'రాజాసాబ్' టీజర్ రిలీజ్!
-
'పెద్ది'... ఈసారి రాసి పెట్టుకోండి: రామ్ చరణ్
రామ్ చరణ్ మైనపు విగ్రహం.. రీసెంట్ గా లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కోసం కుటుంబంతో కలిసి చరణ్ అక్కడికి వెళ్లాడు. విగ్రహావిష్కరణ పూర్తి కాగానే యూకేలోని తన అభిమానులని కలిసి ముచ్చటించాడు. 'పెద్ది' విశేషాలు చెప్పి హైప్ పెంచేశాడు.(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) అభిమానులతో మాట్లాడిన చరణ్.. 'పెద్ది' సినిమా రంగస్థలం కంటే గొప్పగా ఉండబోతుంది. మామూలుగా అన్ని సినిమాలకు ఇలా చెప్పను. కానీ ఈసారి రాసిపెట్టుకోండి' అని చెప్పాడు. దీంతో అక్కడున్న ఫ్యాన్స్ అరిచి గోలగోల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఇదివరకే రిలీజ్ చేసిన 'పెద్ది' గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా చివరలో వచ్చే క్రికెట్ షాట్ అందరికీ తెగ నచ్చేసింది. ఈ సందర్భంగా లండన్ లో ఫ్యాన్స్.. ఓ బ్యాట్ ని రామ్ చరణ్ కి బహుకరించారు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రానుంది. బుచ్చిబాబు దర్శకుడు కాగా.. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.(ఇదీ చదవండి: రోజుకు రూ.20 జీతానికి పనిచేశా.. హీరో ఎమోషనల్ వీడియో) Idhi nenu mamuluga anni cinemalaki cheppanu... Ee Cinema matram raasi pettukondi 💥💥💥@AlwaysRamCharan about #PEDDI ! pic.twitter.com/CPOKMjOwcl— Trends RamCharan ™ (@TweetRamCharan) May 13, 2025 -
6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. స్టార్ హీరోలు, యంగ్ హీరోల నటించిన చిత్రాలు వీలైనంత త్వరగా వచ్చేస్తాయి. కానీ కొన్ని చిన్న మూవీస్ కి మాత్రం చాన్నాళ్లకు స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా ఓ తెలుగు సినిమా దాదాపు ఆరు నెలల తర్వాత సడన్ గా వచ్చేసింది.గతేడాది నవంబర్ లో రిలీజైన తెలుగు మూవీ 'సినిమా పిచ్చోడు'. కుమారస్వామి హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. పెద్దగా ఆకట్టుకోని స్టోరీ, తక్కువ బడ్జెట్ తో తీసిన చిత్రం కావడంతో థియేటర్లలోకి వచ్చి వెళ్లిన సంగతి కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది.(ఇదీ చదవండి: రోజుకు రూ.20 జీతానికి పనిచేశా.. హీరో ఎమోషనల్ వీడియో) సినిమా పిచ్చోడు విషయానికొస్తే.. జోష్ అలియాస్ కుమారస్వామి గ్రామంలో పాలు అమ్ముతుంటాడు. కానీ సినిమాలంటే పిచ్చి. అందుకే ఊరిలో వాళ్లని పేరుతో కాకుండా సినిమా పేర్లతో పిలుస్తుంటాడు. ఓసారి భాను.. డెమో ఫిల్మ్ తీసేందుకు జోష్ ఉంటున్న ఊరికి వస్తుంది. ఈ క్రమంలో అనుకోకుండానే జోష్ కి నటించే అవకాశమొస్తుంది. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే.. మరణమాస్, భోల్ చుక్ మాఫ్, నెసిప్పయ అనే సినిమాలు రాబోతున్నాయి. గత వీకెండ్ లో రాబిన్ హుడ్, గుడ్ బ్యాడ్ అగ్లీ, జాక్, ఓదెల 2, కాలమే కరిగింది తదితర తెలుగు చిత్రాలు వచ్చాయి. ఈ వీకెండ్ మరి ఏమేం తెలుగు మూవీస్ ఓటీటీలోకి వస్తాయో చూడాలి?(ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు) -
గుడ్ న్యూస్.. సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు
'జబర్దస్త్' కామెడీ షో పేరు చెప్పగానే కొందరి పేర్లు గుర్తొస్తాయి. అందులో సుడిగాలి సుధీర్ ఒకడు. సాధారణ కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి.. టీమ్ లీడర్ గా ఎదిగి.. ప్రస్తుతం రియాలిటీ షోలకు యాంకర్ గా, మరోవైపు సినిమాల్లో హీరోగా చేస్తూ బిజీగా ఉన్నాడు. వయసు దాటిపోతున్నా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉన్నాడు. సరే ఇవన్నీ పక్కనబెడితే సుధీర్ ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటోంది.సుడిగాలి సుధీర్ తో పాటు అతడి కుటుంబం గురించి చాలామందికి తెలుసు. ఎందుకంటే గతంలో తాను యాంకర్ గా చేస్తున్న టైంలో ఒకటి రెండుసార్లు కుటుంబ సభ్యులు.. షోలో కనిపించారు. అసలు విషయానికొస్తే గుడ్ న్యూస్ సుధీర్ పెళ్లి గురించి అయితే కాదు. వీళ్ల ఇంట్లోకి వారసుడు వచ్చాడు. సుధీర్ తమ్ముడు రోహన్-రమ్య దంపతులకు బాబు పుట్టాడు. ఈ మేరకు రోహన్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: మళ్లీ రీమేక్ నే నమ్ముకున్న ఆమిర్.. మక్కీకి మక్కీ.. ట్రైలర్ రిలీజ్) సుధీర్ కి తమ్ముడు, చెల్లి ఉన్నారు. రోహన్ ఇక్కడే కుటుంబంతో కలిసి ఉండగా.. చెల్లి శ్వేత మాత్రం భర్తతో కలిసి విదేశాల్లో ఉంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. సుధీర్ తమ్ముడు రోహన్ కి రమ్యతో పెళ్లి కాగా కొన్నేళ్ల క్రితం పాప పుట్టింది. ఇప్పుడు బాబు పుట్టాడు. దీంతో సుధీర్ ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటోంది. అంతా ఓకే కానీ మరి సుధీర్ పెళ్లెప్పుడు చేసుకుంటాడో?సుధీర్ సినిమాల విషయానికొస్తే.. సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడు, గాలోడ్, కాలింగ్ సహస్ర అని మూవీస్ చేశాడు. ప్రస్తుతం G.O.A.T అనే చిత్రంలో నటిస్తున్నాడు. చాలారోజుల క్రితం దీన్ని ప్రకటించారు. ప్రస్తుతానికైతే ఎలాంటి అప్డేట్ లేదు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మరింత లేటుగా రీసెంట్ హిట్ సినిమా) View this post on Instagram A post shared by Rohan Bayana (@bayana.rohan) -
కింగ్ 100 నాటౌట్!
కొన్ని రోజులుగా తన వందో సినిమా కోసం నాగార్జున కథలు వింటున్నారు. ఈ క్రమంలో నాగార్జున వందో సినిమాకు ఈయనే డైరెక్టర్ అంటూ పలువురి దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇంకా ఎవరూ ఖరారు కాలేదు. అయితే తమిళ దర్శకుడు ఆర్.ఎ. కార్తీక్ చెప్పిన కథ నాగార్జునకు నచ్చిందని సమాచారం. దీంతో కథకు మరింత మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట కార్తీక్. ఈ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్ అతి త్వరలో పూర్తి స్థాయిలో మొదలవుతాయని, ‘కింగ్ 100 నాటౌట్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారని టాక్. ఇక నాగార్జునను అభిమానులు ‘కింగ్’ అని పిలుచుకుంటారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన నూరవ చిత్రానికి ‘కింగ్ 100 నాటౌట్’ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంటే... రజనీకాంత్ తాజా చిత్రం ‘కూలీ’, ధనుష్ ‘కుబేర’ సినిమాల్లో నాగార్జున లీడ్ రోల్స్ చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలోని ‘కుబేర’ జూన్ 20న, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోని ‘కూలీ’ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానున్నాయి. -
రామ్‌చరణ్‌పై డాక్యుమెంటరీ?
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు హీరో రామ్‌చరణ్. ఈ చిత్రం తర్వాత ఆయనకి వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని రామ్‌చరణ్ జీవితంపై ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ రూపొందించేందుకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ సన్నాహాలు చేస్తోందట. ఈ సంస్థ ఆరు నెలలుగా రామ్‌చరణ్ డాక్యుమెంటరీ పైన వర్క్ చేస్తోందని టాక్. ఈ హీరో కెరీర్, ఫ్యాన్స్‌తో ఉన్న అనుబంధం, అంతర్జాతీయ స్థాయిలో లభిస్తున్న గౌరవం, సాధించిన అవార్డులు... వంటి వాటన్నింటినీ ఈ డాక్యుమెంటరీలో పొందుపర్చనున్నారట మేకర్స్. త్వరలోనే ఈ డాక్యుమెంటరీకి సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కాగా నెటఫ్లిక్స్ సంస్థ డైరెక్టర్ రాజమౌళి, హీరోయిన్ నయనతారలపై డాక్యుమెంటరీ ఫిల్మ్స్ రూపొందించిన సంగతి తెలిసిందే. ఇక రామ్‌చరణ్ తాజా సినిమా విషయానికొస్తే.. బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. -
రాంగ్ రూట్ లో తెలుగు హీరో.. నిలదీసిన కానిస్టేబుల్
తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చాన్నాళ్లుగా తెరపై కనిపించలేదు. ఇతడి లేటెస్ట్ మూవీ 'భైరవం' మే 30న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ నడుస్తున్నాయి. మరోవైపు ఈ హీరో ఇప్పుడు అనుకోని విషయంలో చర్చనీయాంశమయ్యాడు. రాంగ్ రూట్ లో కారు నడపడమే ఇందుకు కారణం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్.. తెలుగులో నేరుగా రిలీజ్) హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ దగ్గర రాంగ్ రూట్ లో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్.. సదరు హీరోని నిలదీశాడు. దీంతో శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నిర్మాత కొడుకు అయిన సాయి శ్రీనివాస్.. 'అల్లుడు శ్రీను' మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. ఇది ఓ మోస్తరు హిట్ అనిపించుకుంది. మధ్య రాక్షసుడు అనే సినిమా కాస్త పర్వాలేదనిపించింది. ఈ రెండు తప్పితే మిగిలిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. ప్రస్తుతం 'భైరవం' కాకుండా కిష్కిందపురి, టైసన్ నాయుడు, హైందవ అని మరో మూడు చిత్రాలు షూటింగ్ జరుపుకొంటున్నాయి.(ఇదీ చదవండి: తిరుమల శ్రీవారికి అవమానం? వివాదంపై స్పందించిన హీరో) రాంగ్ రూట్ లో కార్ డ్రైవింగ్ నటుడు బెల్లంకొండ ను వెనక్కి పంపిన ట్రాఫిక్ పోలీస్..!నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ జూబ్లీహిల్స్ లో రాంగ్ రూట్ లో కారును తీసుకెళ్లడానికి యత్నించాడు... ఈ క్రమంలో కారు అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కు తాకినంత పనిచేసింది..!దీంతో… pic.twitter.com/BYcE9MA2lR— Telangana Awaaz (@telanganaawaaz) May 13, 2025 -
'మిస్ వరల్డ్'లో మన స్థానం ఎంత.. కిరీటం అందుకున్న బ్యూటీస్ ఎందరు..?
ప్రపంచ సుందరి- 2025 (Miss World Competitions 2025) పోటీలు హైదరాబాద్‌లో అట్టహాసంగా సాగుతున్నాయి. ఈ ఏడాది కిరీటాన్ని అందుకునే అందాల రాశి ఎవరా? అని ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. మిస్ వరల్డ్ అవ్వాలనే ఆశయంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటికి పైగానే అమ్మాయిలు ఈ పోటీలకు దరఖాస్తు చేసుకుంటారు. 160కంటే ఎక్కువ దేశాలే ఈ పోటీల్లో పాల్గొంటాయి. అందుకే బ్యూటీ వరల్డ్‌లో ఈ పోటీలకు అంత ప్రత్యేకత ఉంటుంది. ఇంతటి ప్రతిష్టాత్మకత కలిగిన ఈ పోటీలలో గెలుపొందిన మన భారతీయ సుందరిలు ఆరుగురు ఉన్నారు.భారత్ నుంచి ఆరుగురు అందాల భామలు ఈ కిరీటాన్ని అందుకున్నారు. మొట్టమొదటిసారి ముంబైకి చెందిన రీటా ఫరియా (1966)లో ఈ కిరిటాన్ని దక్కించుకుంది. మిస్ వరల్డ్‌గా ఎంపికైన తొలి మెడికల్ డాక్టర్ కూడా ఆమె కావడం విశేషం. గెలిచిన తర్వాత సినిమాల్లో ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ, ఆమె తన డాక్టర్ వృత్తిని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఆ తర్వాత ఐశ్వర్యా రాయ్ (1994), డయానా హెడెన్ (1997), యుక్తాముఖి (1999), ప్రియాంక చోప్రా (2000), మానుషి చిల్లర్ (2017) ప్రపంచ సుందరీమణులుగా నిలిచారు. ప్రపంచంలో ఇప్పటివరకూ అత్యధిక కిరీటాలు (6) గెలిచిన దేశాల జాబితాలో భారత్‌తో పాటు వెనిజులా ప్రథమ స్థానంలో ఉంది. ముఖ్యంగా 2000సంవత్సరంలో భారత్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఆ ఏడాదిలో ప్రియాంక చోప్రా(మిస్ వరల్డ్), లారా దత్తా (మిస్ యూనివర్స్) దియా మిర్జా (మిస్ ఆసియా పసిఫిక్)గా గెలవడంతో ఒకే ఏడాది మూడు ఇంటర్నేషనల్ బ్యూటీ పాజెంట్ టైటిళ్లు సాధించిన ఏకైక దేశంగా భారత్ నిలిచింది. అలా బ్యూటీ వరల్డ్‌లో భారత్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. -
డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ ఆఫీస్‌కు వెళ్లిన నాగార్జున
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవడానికి వెళ్లారు. ఆయన ఆర్టీఏ కార్యాలయంలో ఫోటోలు దిగి, సంతకం చేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఆర్టీఏ సిబ్బందితో ఆయన సెల్ఫీలు దిగి వారితో కొంత సమయం పాటు సరదాగ మాట్లాడి వెళ్లిపోయారు.. నాగ్ వస్తున్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు కూడా ఆర్టీఏ కార్యాలయానికి చేరుకున్నారు. వారితో కూడా అయన ఫోటోలు దిగారు. తన డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిందని అందుకే రెన్యువల్ కోసం వచ్చానని ఆయన చెప్పారు.నాగార్జున సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కుబేర' సినిమాలో ఆయన చాలా కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్- లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ సినిమా 'కూలీ'లో కూడా నాగ్ చాలా ప్రాముఖ్యత ఉన్న రోల్లో కనిపించనున్నారు. -
'భైరవం' మూవీ ప్రమోషన్ లో మెరిసిన అతిథి శంకర్ (ఫొటోలు)
-
ఖరీదైన ఇల్లు కొన్న 'అనసూయ'.. గృహ ప్రవేశం ఫోటోలు చూశారా?
-
కేంద్రం అంటే బాలీవుడ్‌కు భయం.. అందుకే నోరెత్తరు: రచయిత
హిందీ చిత్ర పరిశ్రమ గురించి బాలీవుడ్ ప్రముఖ గేయ రచయిత జావేద్ అఖ్తర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అంటే బాలీవుడ్‌కు భయం అని ఆయన అన్నారు. అందుకే ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు సాహసం చేయరని ఆయన తెలిపారు. ఒకవేళ ఎవరైన తెగించి విమర్శలు చేస్తే.. దర్యాప్తు సంస్థల నుంచి వేధింపులు ఎదుర్కోవాల్సి ఉంటుందనే అభద్రతాభావం బాలీవుడ్ హీరోలలో ఉందని అభిప్రాయపడ్డారు. ఈడీ, సీబీఐ దాడుల భయమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా నిరోధిస్తుందని ఆయన అన్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ వేదికగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్‌తో జరిగిన చర్చ సందర్భంగా జావేద్ అఖ్తర్ ఈ వ్యాఖ్యలు చేశారు.'బాలీవుడ్ తారలు గొప్ప పేరు ప్రఖ్యాతులతో విలాసవంతమైన జీవితాల్ని గడుపుతారు. కానీ, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే విషయాల్లో వారు కూడా సామాన్యుల తరహాలోనే ఆలోచిస్తారు. ఈ బడా హీరోలను వెనక నుంచి నడిపించేది మొత్తం పారిశ్రామికవేత్తలే. ఎట్టిపరిస్థితిల్లోనూ వారితో పోరాడేంత పెద్దవారు కాదు ఈ సినీ తారలు. ఈ క్రమంలోనే వారి వైఖరిపై పలుమార్లు విమర్శలు వచ్చాయి. అదే హాలీవుడ్ నటులు అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్భయంగా తమ భావాల్ని వ్యక్తం చేస్తారు. తాజాగా అమెరికన్ నటి మెర్లీ స్ట్రీప్ అక్కడి ప్రభుత్వాన్ని విమర్శించినా ఆమెకు ఎలాంటి వేధింపులు ఎదురుకాలేదు. అలాంటి వ్యాఖ్యలు ఇక్కడి ప్రభుత్వంపై చేస్తే ఈడీ, సీబీఐ దాడుల పేరుతో రంగంలోకి దిగుతారు. ఆ భయంతోనే బాలీవుడ్ చిత్రపరిశ్రమ ప్రభుత్వాన్ని ప్రశ్నించదు.' అని ఆయన జావేద్ అఖ్తర్ వ్యాఖ్యనించారు. అయితే, ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తాను నిరంతరం సోషల్‌మీడియాలో ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నానని జావేద్ అన్నారు. ఓ పౌరుడిగా సమస్యలపై స్పందించడం తన ధర్మమని ఆయన పేర్కొన్నారు.జావేద్ అఖ్తర్ ప్రతిభా వంతమయిన కవి, వక్త, స్క్రీన్ ప్లే రచయిత. సూటిగా తన భావాల్ని ఎలాంటి వెరపూ, బెదురూ లేకుండా ప్రకటిస్తున్న సామాజిక గొంతుక ఆయనది. ఇవ్వాళ మన దేశంలో అత్యంత ప్రభావవంతమైన స్వతంత్ర లౌకిక స్వరం, జావేద్ అఖ్తర్. భావుకుడు, ప్రగతిశీల వాది అయిన జావేద్ అఖ్తర్ ఏడు తరాల సాహిత్య చైతన్యమున్న కుటుంబంలో జన్మించారు. తన కవిత్వం మత తత్వానికి, సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా రాశారు. జాతీయ సమైక్యత, స్త్రీల హక్కుల కోసం మాట్లా డారు, రాశారు. తప్పు దోవ పట్టిన యువతను ద్దేశించి జావేద్ రాసిన గీతాన్ని 1995లో కేంద్ర మానవ వనరుల శాఖ యువతకోసం ‘జాతీయ గీతం’గా ప్రకటించింది. -
‘ఫ్రైడే’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
గురి తప్పదు తమ్ముడు
నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలకపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాలోని పాత్రల్ని పరిచయం చేస్తూ ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ అంటూ సోమవారం ఓ వీడియో విడుదల చేశారు మేకర్స్.రత్న అనేపాత్రలో సప్తమి గౌడ, చిత్రగా వర్ష బొల్లమ్మ, ఝాన్సీ కిరణ్మయిగా లయ, గుత్తిపాత్రలో స్వసిక విజయన్, అగర్వాల్‌గా సౌరభ్ సచ్దేవ్ కనిపించబోతున్నారు. ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ వీడియో చివర్లో నితిన్ ఎంట్రీ, బాణం వదిలిన తీరు ఆసక్తిగా ఉంది. ‘‘నితిన్, ‘దిల్’ రాజు, శిరీష్ కాంబినేషన్లో ‘దిల్, శ్రీనివాస కళ్యాణం’ సినిమాలొచ్చాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో శ్రీరామ్ వేణు ‘ఎంసీఏ, వకీల్ సాబ్’ వంటి చిత్రాలు తీశారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న ‘తమ్ముడు’ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది’’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: కేవీ గుహన్, సంగీతం: అజనీష్ లోకనాథ్. -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో టాలీవుడ్ మూవీ ప్రదర్శన
టాలీవుడ్ నిర్మాత మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'ఎంఫోర్ఎం' (Motive for Murder). తాజాగా ఈ చిత్రం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అరుదైన అవకాశం దక్కించుకుంది. మే 17న సాయంత్రం 6:00 గంటలకు కేన్స్‌లోని పలాయిస్ థియేటర్లో ప్రైవేట్ స్క్రీనింగ్ చేయనున్నారు. గొప్ప నిర్మాతగా గుర్తింపు పొందిన మోహన్ వడ్లపట్ల ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. ప్రముఖ అమెరికన్ నటి జో శర్మ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. విడుదలకు ముందే ఈ సినిమా అనేక అంతర్జాతీయ ప్రశంసలు, అవార్డులు సొంతం చేసుకుంది. ఇటీవలి కాలంలో జో శర్మ ప్రతిష్టాత్మక వేవ్స్ ఈవెంట్లో సందడి చేశారు. ఈవెంట్లో అమెరికన్ డెలిగేట్ నటిగా పాల్గొన్నారు. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులతో పాటు అత్యంత గౌరవాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంఫోర్ఎం టీమ్ ముంబయిలోని థియేటర్లో ప్రెస్ మీట్ నిర్వహించింది.మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ..'మా సినిమాను కేన్స్‌లో ప్రదర్శించడమన్నది ఒక గొప్ప అవకాశం, ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. మా టీమ్ అంతా చాలా ఉత్సాహంగా, ఆహ్లాదంగా ఉంది. త్వరలోనే ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నాం' అని తెలిపారు.ఈ సినిమా హత్యా కథాంశం ఆధారంగా రూపొందిన ఉత్కంఠభరిత థ్రిల్లర్‌గా రూపొందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రానికి అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇకపోతే, హంతకుడెవరో ఊహించిన వారికి ఒక లక్ష రూపాయల బహుమతి ఇవ్వనున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. కాగా.. మోహన్ వడ్లపట్ల టాలీవుడ్లో మల్లెపువ్వు, మెంటల్ కృష్ణ, కలవరమాయే మదిలో లాంటి చిత్రాలను నిర్మించారు. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా మారారు. -
'వేర్ ఆర్ యూ గోయింగ్ కారా..'.. రామ్ చరణ్ కూతురి క్యూట్ వీడియో చూశారా?
మెగాఫ్యామిలీ ప్రస్తుతం యూకేలో సందడి చేస్తున్నారు. చిరంజీవితో సహా రామ్ చరణ్ దంపతులు సైతం లండన్‌లో ఉన్నారు. ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహంతో పాటు పెట్ డాగ్ రైమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. మే 10న ఈ అరుదైన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ సమయంలో తన మైనపు విగ్రహంతో మెగా ఫ్యామిలీ ఫోటోలకు పోజులిచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. కాగా.. మేడమ్ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేసిన తొలి భారతీయ నటుడి విగ్రహం ఇదే కావడం విశేషం.అయితే విగ్రహం ఆవిష్కరణ తర్వాత రామ్ చరణ్ ఫోటోలు దిగారు. ఆ సమయంలో చెర్రీ-ఉపాసనల ముద్దుల కూతురు క్లీంకార సందడి చేసింది. రామ్ చరణ్ తన విగ్రహంతో ఫోటోలు దిగుతుండగా నాన్న వద్దకు వెళ్లింది. అక్కడే ఉన్న ఉపాసన కారా.. కారా.. అంటూ అరిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో థియేటర్లలోకి రానుంది.Most Beautiful Video on Internet today ❤️ #RamCharanWaxStatue ! pic.twitter.com/73mqiirlPA— Trends RamCharan ™ (@TweetRamCharan) May 12, 2025 View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
ఇంట్లోనే తల్లి విగ్రహం.. దిల్ రాజు కూతురి 'అమ్మ' ప్రేమ
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో ఏళ్లుగా సినిమాలు తీస్తున్నారు. ఈయన గతంలో అనిత అనే మహిళని పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు హన్షిత అనే కూతురు కూడా ఉంది. కొన్నేళ్ల క్రితం అనిత గుండెపోటుతో చనిపోయారు. అయితే తల్లి తనతో లేకపోయినా సరే ఎప్పటికీ గుర్తుండిపోయేలా విగ్రహం ఏర్పాటు చేసింది కూతురు హన్షిత.(ఇదీ చదవండి: మహేశ్ సినిమా ఛాన్స్.. సర్జరీ చేయించుకోమన్నారు: వెన్నెల కిశోర్) మదర్స్ డే సందర్భంగా తన ఇంట్లోనే తల్లి అనిత విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు హన్షిత చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా తల్లి విగ్రహాన్నిని హత్తుకుని తన ప్రేమని చూపించింది. హన్షితతో పాటు కూతురు ఇషితా, అమ్మమ్మతోనూ ఫొటోలు దిగి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. నాలుగు తరాలు అని క్యాప్షన్ రాసుకొచ్చింది.భార్య అనిత చనిపోయిన కొన్నాళ్ల పాటు ఒంటరిగానే ఉన్న దిల్ రాజు.. లాక్ డౌన్ టైంలో తేజస్విని (వైఘా రెడ్డి) అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఓ బాబు కూడా పుట్టాడు. ఇకపోతే దిల్ రాజు కూతురు హన్షిత.. ప్రస్తుతం నిర్మాతగా పలు సినిమాలు తీస్తున్నారు. 'బలగం'కి ఈమెని నిర్మాతగా వ్యవహరించడం విశేషం.(ఇదీ చదవండి: ట్విన్స్ కి జన్మనిచ్చిన ప్రముఖ నటి.. తండ్రి ఎలన్ మస్క్?) View this post on Instagram A post shared by Hanshithareddy (@hanshithareddy) -
స్పీడ్ పెంచిన మెగా స్టార్.. యంగ్ డైరెక్టర్స్ తో వరుసగా సినిమాలు
-
రాజమౌళి సెంటిమెంట్ కి భయపడుతున్న మహేష్ బాబు
-
'టూరిస్ట్ ఫ్యామిలీ'లో లిటిల్ ఎమర్జింగ్ స్టార్ గురించి తెలుసా..?
కోలీవుడ్‌లో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న సినిమా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. మే 1న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు సుమారు రూ. 45 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. కొత్త దర్శకుడు అభిషాన్ జీవింత్ దర్శకత్వంలో శశికుమార్, సిమ్రన్ జంటగా నటించారు. అయితే, ఈ చిత్రంలో నటించిన బాలనటుడు కమలేష్ జగన్‌ను తమిళ ప్రేక్షకులు అభినందిస్తున్నారు. సినిమాలో ఈ బాలుడే ప్రధాన ఆకర్షణగా ఉన్నాడంటూ మెసేజ్‌లు పెడుతున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఎవరీ కమలేష్ అంటూ నెట్టింట వెతుకుతున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితమే ఈ చిత్రాన్ని చూసిన హీరో శివకార్తికేయన్ చిత్రబృందాన్ని నేరుగా పిలిపించి అభినందించారు. ప్రత్యేకంగా కమలేష్‌ను మెచ్చుకున్నారు. తాజాగా రజనీకాంత్ కూడా ఈ చిత్రం సూపర్ అంటూ తెలిపారు.‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రంలో శశికుమార్, సిమ్రన్‌ల కుమారుడి పాత్రలో కమలేష్ నటించాడు. ఇందులో విజయ్ దళపతి అభిమానిగా కనిపించి తన నటనతో కోలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు. వాస్తవంగా కమలేష్ నటుడు కాదు.. ఒక సింగర్. 'స రే గ మ ప లిల్ చాంప్స్ సీజన్ 2'లో మొదటిసారి తెరపై మెరిశాడు. ఆ రియాలిటీ షోకు అతిథిలుగా త్రిష కృష్ణన్, నయనతార, అమలా పాల్ హాజరయ్యారు. ఆ సమయంలోనే తన టాలెంట్‌ను చూసి వారు ఫిదా అయ్యారు. అలా వారి నుంచి ప్రశంసలు అందుకున్న తర్వాత కాస్త గుర్తింపు వచ్చింది. అలా కమలేష్‌కు జ్యోతిక సినిమాలో మొదటిసారి ఛాన్స్ దక్కింది.జ్యోతిక నటించిన తమిళ చిత్రం ‘రాచ్చసి’లో కమలేష్ నటించాడు. ఇందులో ఒక స్కూల్ టీచర్ పాత్రలో ఆమె నటించగా.. కమలేష్ స్టూడెంట్‌గా కనిపించాడు. ఈ మూవీ తర్వాత నయనతార, సమంత, విజయ్ సేతుపతి నటించిన 'కణ్మనీ రాంబో ఖతీజా' చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్నాడు. విజయ్ దళపతి కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన తొలి సినిమాలో కూడా కమలేష్ నటిస్తున్నాడు. ఆపై కాంచన 4లో కూడా ఛాన్స్ కొట్టేశాడు.'జ్యోతిక మేడం బిర్యానీ పెట్టారు'రాచ్చసి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన గురించి కమలేష్ ఇలా చెప్పాడు. ' నా పుట్టినరోజు నాడు జ్యోతిక మేడమ్ సెట్స్‌లోని అందరికీ బిర్యానీ తెప్పించారు. తన సొంత కొడుకు మాదిరి ఆమె నాపై చూపిన ప్రేమ చూసి ఆశ్చర్యపోయాను. ఈ క్రమంలోనే ఒకరోజు సూర్య సార్ కూడా సెట్స్‌కి వచ్చారు. అప్పుడు ప్రత్యేకించి నన్ను పిలిపించుకొని మాట్లాడారు. జ్యోతిక మేడమ్ ప్రతిరోజు ఇంట్లో నా గురించి చెబుతుందని అన్నారు. ఇంతకీ నువ్వు ఏం చేశావ్ అంటూ సరదా పట్టించారు.' అని గుర్తుచేసుకున్నాడు. -
అనగనగా మూవీ టీమ్ తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
-
ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఇవే
మరో వారం వచ్చేసింది. కాకపోతే ఈసారి థియేటర్లలో పెద్దగా సినిమాలు రిలీజ్ కావట్లేదు. దీంతో గతవారం రిలీజైన సింగిల్, శుభం చిత్రాలే ఉండనున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ చెప్పుకోదగ్గర మూవీస్ ఏం లేవు.(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమా) ఉన్నంతలో 8 సినిమాలు-సిరీసులు మాత్రమే ప్రస్తుతానికి స్ట్రీమింగ్ కానున్నాయి. వీకెండ్ వచ్చేసరికి సడన్ సర్ ప్రైజ్ అన్నట్లు రిలీజులు ఉండొచ్చు. ఈ వారం చూడదగ్గ వాటిలో మరణమాస్, నెసిప్పయ, భోల్ చుక్ మాఫ్ చిత్రాలు ఉన్నంతలో చూడొచ్చని అనిపిస్తున్నాయి.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మే 12-18 వరకు)నెట్ ఫ్లిక్స్సీ4 సింటా (తమిళ సినిమా) - మే 12హాట్ స్టార్ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ద వార్ ఆఫ్ ద రోహ్రిమ్ (ఇంగ్లీష్ సినిమా) - మే 13హై జునూన్ (హిందీ సిరీస్) - మే 16వూల్ఫ్ మ్యాన్ (ఇంగ్లీష్ సినిమా) - మే 17అమెజాన్ ప్రైమ్భోల్ చుక్ మాఫ్ (హిందీ మూవీ) - మే 16సోనీ లివ్మరణమాస్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 15సన్ నెక్స్ట్ నెసిప్పయ (తమిళ సినిమా) - మే 16బుక్ మై షో స ల టే స ల న టే (మరాఠీ సినిమా) - మే 13మనోరమ మ్యాక్స్ప్రతినిరపరాధి యానో (మలయాళ మూవీ) - మే 12(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'రాబిన్ హుడ్' సినిమా) -
నేడు ఈడీ విచారణకు సినీ నటుడు మహేష్ బాబు
-
నందమూరి తారక రామారావు ఎంట్రీ సినిమా పూజా కార్యక్రమం (ఫోటోలు)
-
నటుడు విశాల్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన టీమ్
కోలీవుడ్ నటుడు విశాల్ మరోసారి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యంపై తన పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. తమిళనాడులోని విల్లుపురంలో ఆదివారం రాత్రి జరిగిన ఈవెంట్లో హీరో విశాల్ స్పృహ తప్పి పడిపోవడంపై వారు వివరణ ఇచ్చారు. మధ్యాహ్నం ఆహారం తీసుకోకపోవడం వలనే విశాల్ అస్వస్థతకు గురయ్యారని వారు చెప్పారు. దీంతో వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతం విశాల్ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని, అభిమానులు ఎవరూ ఆందోళ చెందాల్సిన అవసరం లేదన్నారు.తమిళనాడు విల్లుపురంలో ఉండే కూవాగం గ్రామంలో ఉన్న ఆలయంలో కొద్దిరోజులుగా చిత్తిరై (తమిళమాసం) వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో విశాల్ అతిథిగా పాల్గొన్నారు. ఆదివారం నాడు మిస్ కువాగం ట్రాన్స్‌జెండర్ బ్యూటీ కాంటెస్ట్‌ను నిర్వాహుకులు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న విశాల్ కొద్దిసేపట్లోనే ఉన్నట్టుండి వేదికపై స్పృహ తప్పి పడిపోయారు. ఈ క్రమంలోనే ఆయన్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. -
అతని సాయం వల్లే నా కూతురి పెళ్లి చేశాను: స్టార్ డైరెక్టర్
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్( Anurag Kashyap) నటుడిగానూ వెండితెరపై మెప్పిస్తున్నాడు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో తనకు ఎంతో పెరు తెచ్చిన మహారాజ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించినప్పటికీ రాని పేరు మహారాజ( Maharaja) సినిమాతో వచ్చిందన్నాడు. విజయ్ సేతుపతి( Vijay Sethupathi) చెప్పడం వల్లే తనకు ఈ చిత్రంలో అవకాశం వచ్చిందని గుర్తుచేసుకున్నారు. మూవీ విడుదలైన తర్వాత తనకు అవకాశాలు పెరిగాయన్నారు. ఈ క్రమంలో భారీగా డబ్బు వచ్చిందని, దాంతోనే తన కూమార్తె పెళ్లి చేశానని ఆయన పేర్కొన్నారు.విజయ్ సేతుపతి గురించి అనురాగ్ కశ్యప్ ఇలా చెప్పారు. 'దక్షణాది నుంచి నాకు చాలా సినిమా ఆఫర్స్ వచ్చాయి. కానీ, నాకు యాక్టింగ్‌పై పెద్దగా ఆసక్తి లేదు. దీంతో వాటిని వదులుకున్నాను. అయితే, నేను డైరెక్ట్ చేసిని కెన్నెడీ చిత్రం పనుల్లో భాగంగా విజయ్ సేతుపతిని కలిశాను. ఆ మూవీ గురించి ఆయన ద్వారా కొన్ని సలహాలు తీసుకున్నాను. అలా మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలోనే నా కుమార్తె పెళ్లి గురించి ఆయనతో చెబుతూ.. వివాహం కోసం కావాల్సినంత డబ్బులేదన్నాను. క్షణం ఆలస్యం లేకుండా సాయం చేస్తానని మాట ఇచ్చారు. అప్పుడే మా ఇద్దరి మధ్య మహారాజు సినిమా గురించి చర్చ వచ్చింది. అందులోని రోల్ కోసం గతంలోనే నన్ను సంప్రదించాలని అనుకున్నట్లు తెలిపారు. మొదట ఆ సినిమాలో నటించలేనని చెప్పాను. కానీ, విజయ్ సేతుపతి చెప్పడం వల్లే ఓకే అనేశాను. అలా వచ్చిన డబ్బుతోనే నా కూతురి పెళ్లి చేశాను. ఆ సమయంలో విజయ్ నాకెంతో సాయం చేశారు. మహారాజ తర్వాత నాకు చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. 2028 వరకు నా డేట్స్ ఖాళీగా లేవు. ఇదంతా విజయ్ సేతుపతి వల్లే అని' అనురాగ్ కశ్యప్ తెలిపారు.గతేడాదిలో విడుదలైన ‘మహారాజ’ చిత్రంలో నెగటివ్ పాత్రలో అనురాగ్ కశ్యప్ నటించారు. నిథిలన్ స్వామినాథన్ రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అనురాగ్ కశ్యప్.. రైఫిల్ చిత్రంతో పాటు డకాయిట్ సహా పలు సినిమాలు చేస్తున్నాడు. డైరెక్టర్‌గా ఆయన చేతిలో ఐదు సౌత్ చిత్రాలు ఉన్నాయి. అందుకే ఆయన రీసెంట్గా బాలీవుడ్ వదిలేసి పూర్తిగా ఇక్కడే స్థిరపడిపోయాడు. -
వై.వి.ఎస్. చౌదరి- తారక రామారావు సినిమా ప్రారంభం
నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు (Nandamuri Taraka Ramarao) హీరోగా నటిస్తున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. వై.వి.ఎస్.చౌదరి (YVS Chowdary) ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. 'న్యూ టాలెంట్ రోర్స్' పతాకంపై ఆయన సతీమణి గీతఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. ఎన్టీఆర్ సరసన వీణారావు హీరోయిన్గా నటిస్తోంది. కూచిపూడి డ్యాన్సర్ అయిన ఆమె తెలుగమ్మాయి కావడం విశేషం. హీరోహీరోయిన్లుగా వారిద్దరిని వై.వి.ఎస్.చౌదరి చిత్రపరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. ‘దేవదాసు’ మూవీతో రామ్‌ని, ‘రేయ్’ చిత్రంతో సాయిధరమ్ తేజ్‌ని హీరోలుగా పరిచయం చేశారు. ఇప్పుడు నందమూరి కుటుంబంలో నాలుగో తరానికి చెందిన తారక రామారావుని ప్రపంచానికి పరిచయం చేస్తుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.1980 నేపథ్యంలో ఈ కథ జరుగుతుంది. తెలుగు భాష, సంస్కృతి, తెలుగు జాతి నేపథ్యం వంటి అంశాలను ప్రతిబింబించేలా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే డైరెక్టర్ వైవీఎస్ చౌదరి అన్నారు. ఆస్కార్ విజేతలు ఎం.ఎం. కీరవాణి (MM Keeravani), చంద్రబోస్ (Chandra Bose) సంగీత, సాహిత్యాలను అందిస్తున్నారు. ఆపై సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. నందమూరి తారకరామారావు నటించిన 'తోడు నీడ' సినిమా విడుదలై మే 12వ తేదీకి 60 యేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమం జరగడం అభిమానుల్లో సంతోషాన్ని నింపుతుంది. -
భారత రక్షణశాఖకు ఇళయరాజా విరాళం
ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఎంపీ ఇళయరాజా భారత రక్షణశాఖకు తన ఒక్క రోజు పారితోషకాన్ని విరాళంగా ప్రకటించారు. దీని గురించి ఆయన తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ పహల్గామ్లో మన దేశ పర్యాటకులపై ఉగ్రమూక దాడిచేసిందని, మన దేశ సైనికులు దీనికి తప్పక ప్రతీకారం తీర్చుకోవాలన్నారు. వారి ధైర్య సాహసాలు అభినందనీయం అని తెలిపారు. మన సైనికులు ఆత్మస్థైర్యంతో వారిని మట్టు పెడతారనే నమ్మకంతో,మన దేశ రక్షణ శాఖకు దేశ పౌరుడిగా, ఎంపీగా తన ఒక్క రోజు పొరితోషికాన్ని విరాళంగా ప్రకటిస్తున్నట్లు ఇళయరాజా పేర్కొన్నారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్– పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో దేశం మొత్తం హై అలెర్ట్ ప్రకటించడం, తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఇరుదేశాల సరిహద్దుల్లో శాంతి నెలకొనడం తెలిసిందే. -
‘లెవన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
డైరెక్షన్... యాక్షన్... కల్ట్ స్టార్ట్
మాస్ యాక్టర్‌గా విశ్వక్ సేన్‌కి మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. దర్శకునిగా తొలి చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’తోనే తన ప్రతిభను నిరూపించుకున్నారు విశ్వక్. ఆ తర్వాత ‘దాస్ కీ దమ్కీ’ చిత్రంలో నటించి, దర్శకత్వం వహించారు. ఇప్పుడు విశ్వక్ సేన్ హీరోగా ఆయన డైరెక్షన్లోనే ‘#కల్ట్’ చిత్రం ఆరంభమైంది. ఈ చిత్రానికి కథ కూడా రాసుకున్నారు విశ్వక్. 40 మంది నూతన నటీనటులను పరిచయం చేస్తూ, కరాటే రాజు, సందీప్ కాకర్ల నిర్మిస్తున్న ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చిన్నబాబు) టైటిల్ లోగోను లాంచ్ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముహూర్తపు షాట్‌కు కెమెరా స్విచ్చాన్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. ఆదివారమే రెగ్యులర్ షూటింగ్ ఆరంభించారు. ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా న్యూ ఏజ్ పార్టీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. తెలుగు, హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. నటుడు–దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: అరవింద్ విశ్వనాథన్. -
టాలీవుడ్ ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్.. సెన్సార్ పూర్తి
రుత్విక్, ఇక్రా ఇద్రిసి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతోన్న చిత్రం వైభవం. ఈ ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ సినిమాకు సాత్విక్ దర్శకత్వం వహిస్తున్నారు. నూతన నిర్మాణ సంస్థ రమాదేవి ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.తాజాగా ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్కు క్లీన్ యూ సర్టిఫికేట్ లభించింది. ఇదివరకే విడుదలైన రెండు పాటలకీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న వైభవం మూవీ ఈనెల 23న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఆ సినిమా వల్లే బాలీవుడ్లో ఆఫర్ వచ్చింది: శ్రీ విష్ణు
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు సింగిల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ నెల 9 నుంచి సింగిల్ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా తొలిరోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మొత్తం రెండురోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ. 11.2 కోట్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీవిష్ణు కెరీర్లో మరో భారీ హిట్‌గా సింగిల్ మూవీ నిలిచింది.సింగిల్ రిలీజ్ నేపథ్యంలో శ్రీ విష్ణు వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రతి సినిమాతో ఏదో ఒక అనుభవాన్ని ఇచ్చిందని అన్నారు. ప్రారంభంలో చిరంజీవి, వెంకటేశ్ లాంటి పెద్ద హీరోలు ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలా ఎనర్జీ ఇచ్చేదన్నారు. బ్రోచెవారేవరురా లాంటి సినిమాకు చాలా ప్రశంసలు వచ్చాయి.. ఆ సమయంలో గొప్ప ఫీలింగ్ కలిగిందని తెలిపారు. బన్నీ, రవితేజ నా ప్రతి సినిమాకు సపోర్ట్ చేస్తుంటారని వెల్లడించారు.ఇక స్వాగ్ సినిమా విషయానికొస్తే.. తమిళం నుంచి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. అలాగే మొదటిసారి స్వాగ్ మూవీ తర్వాత బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చిందని శ్రీ విష్ణు వెల్లడించారు. కాగా.. సింగిల్ మూవీలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా దర్శకుడు కార్తీక్ రాజు ఈ మూవీని తెరకెక్కించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు. -
నాన్న మరణించిన రోజు.. నవ్వుతూ ఫోటోలు దిగా: సమంత
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇప్పుడు హీరోయిన్ మాత్రమే కాదు.. నిర్మాత కూడా. శుభం మూవీతో నిర్మాతగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె నిర్మించిన శుభం సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పుడు నిర్మాతగా మారిపోయిన సామ్.. ఇటీవల పలు ఇంటర్వ్యూలకు హాజరైంది. ఈ నేపథ్యంలో ఓ బాధాకర సంఘటనను వెల్లడించింది. తన తండ్రి అంత్యక్రియలకు వెళ్తంటే కొంతమంది సెల్ఫీలు అడిగారని గుర్తు చేసుకుంది.సమంతా తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'అభిమానులు తన దగ్గరికి ఫోటోలు తీయడానికి వచ్చినప్పుడు తాను ఎప్పుడూ నో చెప్పలేదు. చెన్నైలో తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలోనే కొంతమంది అభిమానులు ఫోటో తీయడానికి తన దగ్గరికి వచ్చారు. అయినా నేను వారికి నో చెప్పలేదు. ఎందుకంటే తన విజయానికి కారణం తన అభిమానులే. మనం సెలబ్రిటీలు ఎలాంటి బాధలు అనుభవిస్తున్నామో వారికి తెలియకపోవచ్చు. అందుకే నేనెప్పుడూ అభిమానుల ఫోటోలకు నో చెప్పను' అని ఆ సంఘటనను గుర్తు చేసుకుందిఆ రోజును గుర్తుచేసుకుంటూ.. 'డిసెంబర్లో నాన్న మరణించారని నా తల్లి నుంచి ఉదయం నాకు ఫోన్ వచ్చింది. నేను వెంటనే ముంబయి నుంచి చెన్నైకి విమానంలో ప్రయాణించాల్సి వచ్చింది. కొంతకాలంగా నాన్నతో మాట్లాడకపోవడంతో నేను షాక్‌కు గురయ్యాను. నాలో ఎలాంటి స్పందన లేకుండా విమానంలో కూర్చుండిపోయా. ఆ సమయంలో కొందరు నా ఫోటో కోసం అడిగిన విషయం నాకు గుర్తుంది. నేను నిలబడి వారితో ఫోటోలకు నవ్వుతూ ఉన్నా" అని తెలిపింది. మనం ఏ స్థితిలో ఉన్నారో వారికి తెలియదు.. తెలియనివారితో ఫోటో అడగడానికి చాలా ధైర్యం అవసరం.. అందుకే నో చెప్పి వారిని బాధపెట్టాలని అనుకోలేదని సమంత వెల్లడించింది.ఆ సంఘటన తనను ఒక సెలబ్రిటీగా ఉండటంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి ఆలోచించేలా చేసిందని సమంత పేర్కొంది. వారితో సెల్ఫీల కోసం నేను నవ్వుతున్నప్పుడు అది నా మనసును తాకిందని.. ఎందుకంటే తండ్రి మరణించిన రోజున ఏ వ్యక్తి నవ్వాలని అనుకోడని వివరించింది. ఇది పూర్తిగా వేరే ప్రపంచమని సమంత తెలిపింది. ఇక సినిమాల విషయానికొస్తే సమంత 'బంగారం' అనే మూవీలో కనిపించనుంది. -
లవ్ ఎంటర్టైనర్గా టాలీవుడ్ మూవీ.. టైటిల్ ఫిక్స్!
సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'ప్రేమిస్తున్నా'. ఈ సినిమాకు భాను దర్శకత్వం వహించారు. వరలక్ష్మీ పప్పుల సమర్పణలో కనకదుర్గారావు పప్పుల నిర్మిస్తున్నారు. ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.తాజాగా ఈ మూవీ టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ప్రేమిస్తున్నా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సిద్ధార్థ్ సాలూరి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఐదు సూపర్బ్ సాంగ్స్ అందించారు. ఈ మూవీ మ్యూజికల్ లవ్ స్టొరీ కాబోతోంది. ఈ చిత్రంలో ఇద్దరు ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో నటించారు. -
పుష్ప రాజ్ తో కేజీఎఫ్ 2 భామ
-
వరస సినిమాలతో అలరిస్తున్న రాగ్ మయూర్
'సివరపల్లి' సక్సెస్ తర్వాత వైవిధ్యమైన పాత్రల్లో ఒదిగిపోతూ తనదైన నటనతో రాగ్ మయూర్ మెప్పిస్తున్నాడు. రీసెంట్గా సమంత నిర్మించిన 'శుభం'లోనూ రాగ్ మయూర్ పాత్రకు చాలా మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు ఈ విషయమై మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: ఆ హీరోయిన్ తో అస్సలు నటించను: టాలీవుడ్ హీరో) నేను ఇంతకు ముందు చేసిన 'సినిమా బండి' ఎంత మంచి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. అందులో నేను పోషించిన మరిడేష్ బాబు పాత్రకు కొనసాగింపుగా శుభం సినిమాలో నా రోల్ ఉంటుంది. నా పాత్రను దర్శకుడు ప్రవీణ్ చాలా సరదాగా డిజైన్ చేశారు. ఆయన కథ నెరేట్ చేసిన తర్వాత నా రోల్‌లోని కామెడీ ప్రేక్షకులను మెప్పిస్తుందని అర్థమైంది. అందుకే 'శుభం' అవకాశాన్ని కాదనలేకపోయాను. నా నమ్మకం నిజమైంది. నా పాత్రకు చాలా మంచి స్పందన వస్తోంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సమంత, ప్రవీణ్ కి థాంక్స్. సినిమా చాలా మంచి విజయాన్ని సొంతం చేసుకోవటం సంతోషంగా ఉందని అన్నాడు. ప్రవీణ్ కండ్రేగుల తీస్తున్న మూడో సినిమా 'పరదా'లోనూ రాగ్ మయూర్ నటిస్తున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్తో కలిసి కనిపించబోతున్నాడు. 'పరదా'లో పూర్తి నిడివి పాత్ర చేశానని చెప్పాడు. జీఏ2 తీస్తున్న బడ్డీ కామెడీ చిత్రంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తీస్తున్న గరివిడి లక్ష్మి సినిమాలోనూ మయూర్ నటిస్తున్నాడు.(ఇదీ చదవండి: దర్శకుడి డ్రీమ్ కార్.. గిఫ్ట్ ఇచ్చిన సూర్య-కార్తీ) -
భారీ ప్రాజెక్ట్.. 'మహావతార్: నరసింహ' గ్లింప్స్ విడుదల
హోంబలే ఫిల్మ్స్ సంస్ధ నిర్మిస్తున్న భారీ యానిమేటెడ్ చిత్రం 'మహావతార్: నరసింహ'.. తాజాగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ విడుదలైంది. ఆపై సినిమా రిలీజ్ తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. కేజీఎఫ్,సలార్,కాంతార వంటి భారీ ప్రాజెక్ట్‌లను నిర్మించిన ఆ సంస్థ దర్శకుడు అశ్విన్ కుమార్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ప్రీమియర్‌ను గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(ఇఫ్ఫీ)లో ప్రదర్శించారు.పాన్ ఇండియా రేంజ్లో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో జులై 25న ఈ చిత్రం విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. సామ్ సీఎస్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్‌లు నిర్మిస్తున్నారు. మహావతార్ సిరీస్‌లో భాగంగా వస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. అయితే, ఈ కథకు సీక్వెల్‌గా ఇతర అవతారాలతో పలు సినిమాలు రానున్నాయన మేకర్స్ హిట్ ఇచ్చారు. యానిమేషన్లో ఈ చిత్రం ఒక బెంచ్ మార్క్‌ను సెట్ చేస్తుందని దర్శకుడు తెలిపారు.ప్రహ్లాదుడి చరిత్ర, విష్ణువుకు, హిరణ్యకశిపునికి మధ్య జరిగిన యుద్ధాన్ని ఇందులో చూపిస్తున్నట్లు అశ్విన్ చెప్పారు. దీన్ని రూపొందించడానికి సుమారు నాలుగు సంవత్సరాలు పట్టింని ఆయన చెప్పారు. మహావతార్ సిరీస్‌లో రానున్న తొలి సినిమాగా 'మహావతార్: నరసింహ' తెరకెక్కింది. దీనికి కొనసాగింపుగా ఇతర అవతారాలతో మరో రెండు సినిమాలు రాబోతున్నట్లు తెలుస్తోంది. -
ఉ అంటావా సాంగ్ మీరు మిస్ చేసుకోవడం వల్లే సమంత చేసిందా?
-
'మాతృదేవోభవ'తో కన్నీళ్లు పెట్టించిన మాధవి ఏం చేస్తుందో తెలుసా..?
‘మాతృదేవోభవ’ 1993లో వచ్చిన మేటి చిత్రాల్లో బ్లాక్‌బస్టర్ అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో హీరోయిన్ మాధవి నటనకు ప్రేక్షకులు జేజేలు కొట్టడంతో పాటు కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతలా ఆ పాత్రకు ఆమె కనెక్ట్ అయ్యారు. ఆమె భర్తగా నాజర్ చాలా కీలకమైన భూమిక పోషించారు. అయితే నేడు ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన కొన్ని సినిమాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో నటి మాధవి ప్రస్తుతం ఎలా ఉందొ చూడండి అంటూ కొన్ని ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.80,90లో తన అందం, అభిమనయంతో ఆకట్టుకున్న నటి మాధవి చాలా ఏళ్ల క్రితమే వెండతెరకు దూరమయ్యారు. అందంలో జయసుధ, జయప్రద వంటి హీరోయిన్స్‌కి పోటినిచ్చిన ఆమె ప్రస్తుతం గుర్తు పట్టలేకుండా మారిపోయారంటూ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఆమె లేటెస్ట్ ఫొటోలు చూసి అభిమానులంతా షాక్ అవుతున్నారు. తన తెనె కళ్లతో మాయ చేసిన ఆమె ఇంతలా మారిపోయారేంటంటూ సర్ప్రైజ్ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి అగ్ర హీరోల సరసన నటించిన మెప్పించిన మాధవి దాదాపు 300 సినిమాల వరకు చేశారు. చిరంజీవి ‘ఇంట్లో రామయ్యా వీధిలో కృష్ణయ్య’ చిత్రంలో హీరోయిన్గా పరిచయమైన ఆమె ఆ తర్వాత కోతల రాయుడు, ప్రాణం ఖరీదు, కుక్కకాటుకు చెప్పు దెబ్బ, ఖైది వంటి సినిమాల్లో ఆమె చిరంజీవికి జోడికట్టారు.చెప్పాలంటే అప్పట్లో చిరు-మాధవి పెయిర్ అంటే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉండేది. ఇక మాధవి గ్లామర్, అందానికి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. ముఖ్యం తన కళ్లంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. అందులో లేడి ఫ్యాన్స్ కూడా ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. 13 ఏళ్లకే సినీరంగ ప్రవేశం చేసిన ఆమె దాదాపు 17 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగారు. ఇక ఆమె కెరీర్లో ఎప్పటికి గుర్తుండిపోయే చిత్రం ‘మాతృదేవోభవ’. ఇందులో ముగ్గురు పిల్లల తల్లిగా ఆమె చేసిన పోరాటం, ఎమోషన్స్ ఇప్పటికి ప్రతి ఒక్కరి మదిలో నిలిచిపోయింది.ముఖ్యం ఈ సినిమా పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టకున్నాయి. అలా నటిగా కెరీర్ పీక్‌లో ఉండగానే మాధవి సడెన్‌గా వెండితెరకు దూరమయ్యారు. అమెరికాకు చెందిన బిజినెస్ మెన్ రాల్ఫ్ శర్మని పెళ్లి చేసుకుని ఫారిన్లో సెటిలైపోయారు. ప్రస్తుతం వీరికి ముగ్గురు కూతుళ్లు. పిల్లలు ఎదగడంతో భర్తకు సాయంగా బిజినెస్ వ్యవహరాలను చూసుకుంటున్న మాధవి తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేస్తు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె లెటెస్ట్ ఫొటోలు చూసి నెట్టింట వైరల్‌గా మారాయి.'మాతృదేవోభవ'ను వదులుకున్న జీవితమాతృదేవోభవ సినిమాలో నటించాలని మొదట సీనియర్ నటి జీవితా రాజశేఖర్‌కు చిత్రయూనిట్ సంప్రదించింది. అయితే, ఆమెకు అప్పటికే పెళ్లి కావడంతో గృహిణిగా ఉండాలని నటనకు దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో ఆమె సున్నితంగా కాదని చెప్పారు. దీంతో ఆ పాత్ర మాధవి చేసింది. తర్వాత సినిమా భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ ఆమె బాధపడలేదు. భర్త, పిల్లలే తన ప్రపంచం అంటూ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 1990లో 'మగాడు'లో ఆమె చివరిసారిగా నటించారు. మళ్లీ 33 ఏళ్ల తర్వాత ఇటీవల ‘లాల్ సలాం’లో కనిపించారు. -
'అమ్మ' ప్రేమను ప్రతిబింబించే ఈ సినిమాలను చూశారా..?
నిస్వార్థ ప్రేమకు చిరునామ అమ్మ. తొమ్మిది నెలలు కడుపున మోసి, ప్రాణాలు పోయేంత నొప్పులను భరించి, ప్రాణం పోసిన తర్వాత బిడ్డ కోసం తల్లి చేసే త్యాగాలు అన్ని ఇన్ని కాదు. మన ఎదుగుదలలో అడుగడుగునా తోడుండే ఏకైక వ్యక్తి అమ్మ. మనకు ఏ చిన్న కష్టం వచ్చినా.. విలవిలలాడి పోయేది మొదటి వ్యక్తి అమ్మ. అలాంటి అమ్మ ప్రేమకు గుర్తుగా ప్రతి ఏడాది మే రెండో ఆదివారం ప్రపంచవ్యాప్తంగా మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన కొన్ని టాలీవుడ్ సినిమాలపై లుక్కేద్దాం.మాతృదేవోభవ(1993)- యూట్యూబ్అమ్మ ప్రేమను చక్కగా చూపిన సినిమాల్లో మాతృదేవోభవ ఎవర్గ్రీన్ అని చెప్పవచ్చు. 1993లో వచ్చిన ఈ మూవీలో నాజర్, మాధవి ప్రధాన పాత్రల్లో కె. అజయ్ కుమార్ తెరకెక్కించిన సినిమా ఇది. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్. రామారావు నిర్మించారు. అప్పట్లో ఈ సినిమా చూసిన వాళ్లు కన్నీళ్లు పెట్టకుండా ఎవరూ బయటకు రాలేదు. అంతలా ప్రేక్షకులకు ఈ చిత్రం దగ్గరైంది. భర్తను కోల్పోయి, క్యాన్సర్ బారిన పడిన మహిళ తన పిల్లల భవిష్యత్తు కోసం పడిన ఆరాటమే ఈ సినిమా కథ.అమ్మ రాజీనామా (1991) - యూట్యూబ్దాసరి నారాయణరావు తెరకెక్కించిన 'అమ్మ రాజీనామా' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. తల్లిగా శారద నటనను చూసిన ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేరు. ఈ సినిమాను దేవీవరప్రసాద్, టి. త్రివిక్రమరావు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మించారు. కుటుంబం కోసం తల్లి చేసే త్యాగాన్ని చూపే ఈ చిత్రానికి ప్రత్యేకస్థానం ఉంది. 2001లో ఈ సినిమా కన్నడలో 'అమ్మ' పేరుతో పునర్నిర్మించారు. ఇందులో లక్ష్మి ప్రధాన పాత్ర పోషించింది.ఒకే ఒక జీవితం(2022)- సోనీలివ్శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అతని తల్లిగా సీనియర్ హీరోయిన్ అక్కినేని అమల నటించింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌కి మదర్ సెంటిమెంట్‌ని యాడ్ చేసి అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శ్రీకార్తిక్. 20 ఏళ్ల క్రితం తల్లిని కోల్పోయిన ఓ బిడ్డకి.. తిరిగి అమ్మను చూసే అవకాశం వస్తే..? గతంలో చేసిన తప్పుల్ని సవరించుకునే చాన్స్ లభిస్తే..? ఇది వినడానికే ఆశ్చర్యంగా, ఆసక్తికరంగా ఉంది. అంతే ఆసక్తికరంగా తెరపై చూపించాడు దర్శకుడు శ్రీకార్తీక్. టైమ్ మిషన్ కథని అమ్మ ఎమోషన్ తో ముడి పెట్టి ‘ఒకే ఒక జీవితం’చిత్రాన్ని తెరకెక్కించాడు. జీవితం ఎవరికీ రెండో అవకాశం ఇవ్వదు. ఒకవేళ ఇస్తే... విధి రాతని మార్చగలమా? అనే పాయింట్‌ని ఆసక్తికరంగా చూపించాడు.'బిచ్చగాడు'(2016)- సన్ నెక్స్ట్తమిళ నటుడు విజయ్ ఆంటోని నటించిన చిత్రం బిచ్చగాడు. 2016లో విడుదలైన పిచ్చైకారన్ అనే తమిళ చిత్రానికి తెలుగు రీమేక్. తమిళ దర్శకుడు శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ, సట్నా టైటస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒక కోటీశ్వరుడు తన తల్లి ఆరోగ్యం కోసం కొద్ది రోజులు బిచ్చగాడిగా మారడం ఈ సినిమా కథాంశం. తెలుగులో మే 13, 2016న విడుదలైంది.లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్(2012)- ఆహా, అమెజాన్2012లో విడుదలైన చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగున్, జరా షా, రష్మీ, కావ్య, నవీన్ పోలిశెట్టి, అమల ప్రధాన పాత్రలో నటించారు. తల్లి పాత్రలో అమల మెప్పించింది. ప్రస్తుతం ఈ చిత్రం హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.నిజం(2003 )- జీ5కొడుకు సాయంతో భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకునే తల్లి కథే నిజం. ఈ సినిమాను తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు, రక్షిత, రామేశ్వరి, గోపీచంద్, రంగన్నాధ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2003లో విడుదలైంది. ఉత్తమ నటుడిగా మహేష్ బాబు, సహాయ నటిగా రామేశ్వరి నంది అవార్డులను గెలుచుకున్నారు. ఈ సినిమా ప్రస్తుతం జియో సినిమా, సన్ నెక్ట్స్‌లో అందుబాటులో ఉంది. వీటితో పాటుఅమ్మ చెప్పింది (2006)- నెట్‌ఫ్లిక్స్2006లో విడుదలైన చిత్రం ‘అమ్మ చెప్పింది’. శర్వానంద్, శ్రియా రెడ్డి, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. గంగరాజు గుణ్ణం దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది. సంగీతాన్ని ఎమ్ఎమ్ కీరవాణి అందించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.ప్రభాస్ 'ఛత్రపతి'(2005)- జియోహాట్‌స్టార్, అమెజాన్రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'ఛత్రపతి'. 2005లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో భానుప్రియ ప్రభాస్‌కు తల్లిగా నటించింది. తల్లి, కుమారుల మధ్య అనుబంధం ఈ సినిమాలో చూపించారు. శ్రియ శరణ్ హీరోయిన్ పాత్ర పోషించింగి.అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి(2003)- సన్ నెక్స్ట్2003లో దర్శకుడు పూరీ జగన్నాధ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన చిత్రం అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎమోషనల్‌గా టచ్ చేసింది. ఒక తల్లి తన కొడుకు కోసం తన భర్తతో సహా సర్వస్వం త్యాగం చేస్తుంది. ఈ సినిమాలో రవితేజ, ఆసిన్, జయసుధ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు.సింహరాశి- యూట్యూబ్2001లో విడుదలైన 'సింహరాశి' అమ్మ ప్రేమకోసం తపించే కుమారుడి పాత్రలో రాజశేఖర్ నటించారు. ఆయన కెరీర్లో ఇదొక బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా కోసం మొదట బాలకృష్ణను సంప్రదించారు. కానీ ఆయన దానిని తిరస్కరించడంతో రాజశేఖర్‌తో దర్శకులు వి. సముద్ర తెరకెక్కించారు. ఆర్బి చౌదరి నిర్మించారు. ఇది తమిళ చిత్రం మాయికి రీమేక్ అని తెలిసిందే.అమ్మ, యమలీల, మాతృదేవోభవ, లోఫర్, చిరుత, అమ్మ రాజీనామా, పెదబాబు లాంటి సినిమాలు కూడా మదర్ సెంటిమెంట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించాయి. -
మృణాల్ ఠాకూర్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సుమంత్
హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌తో సుమంత్ (Sumanth) పెళ్లి.. కొద్దిరోజులుగా వస్తున్న ఈ వార్తలపై తాజాగా సుమంత్ రియాక్ట్ అయ్యాడు. ఆయన నటించిన కొత్త సినిమా ‘అనగనగా’ (Anaganaga) ఓటీటీలో డైరెక్టగా మే 15న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. మృణాల్ ఠాకూర్, సుమంత్ కలిసి దిగిన ఫోటో వెనుక ఉన్న అసలు విషయం చెప్పాడు.అక్కినేని కుటుంబంలో మరో పెళ్లి బాజా మోగబోతోందని, హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ను సుమంత్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. వారిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వాటిపై ఇద్దరూ మౌనంగా ఉండటంతో నెటిజన్లలో అనుమానాలు మరింత పెరిగాయి. అయితే, ఎట్టకేలకు హీరో సుమంత్ క్లారిటీ ఇచ్చేశాడు. మృణాల్తో తనకు ఎలాంటి రిలేషన్ లేదని కుండ బద్దలు కొట్టేశాడు. ఒక సినిమా సమయంలో తీసుకున్న ఫోటో కొద్దిరోజులుగా వైరల్ అవుతుందంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తనను ఎక్కడా కూడా కలిసింది లేదన్నాడు. 'సీతా రామం' సినిమాలో మృణాల్ ఠాకూర్, సుమంత్ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీ టైమ్‌లోనే వారిద్దరిలో స్నేహం మొదలైంది.పెళ్లి గురించి క్లారిటీపెళ్లి మీద తనకు ఎలాంటి ఆసక్తి లేదని సుమంత్ చెప్పాడు. ఇలా సింగిల్‌గా ఉండడమే లైఫ్ బాగుందని తెలిపాడు. ఈ క్రమంలో తానెప్పుడు ఒంటరితనాన్ని ఫీలవ్వలేదని క్లారిటీ ఇచ్చేశాడు. జీవితంలో ఒక తోడు కావాలని కూడా ఎప్పుడూ అనిపించలేదని చెప్పుకొచ్చాడు. అసలు లైఫ్‌లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదని సుమంత్ హింట్ ఇచ్చేశాడు. సుమంత్‌కు గతంలో పెళ్లి అయి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయం నుంచి ఆయన సింగిల్‌గానే ఉంటున్నాడు. -
క్రేజీ సినిమా.. రూ. 600 కోట్ల కలెక్షన్స్.. ఛాన్స్ వదులుకున్న సాయిపల్లవి
ప్రతిభకు అదృష్టం తోడైతే అది నటి సాయి పల్లవి అవుతుంది. డాక్టర్ అయ్యి యాక్టర్ అయిన భామ ఈమె. సినిమాలపై ఆసక్తితో మొదట్లో ప్రయత్నాలు చేసిన ఆశించిన ఫలితం దక్కకపోవడంతో వైద్య విద్యపై పూర్తిగా దృష్టి సారించిన సాయి పల్లవి మధ్యమధ్యలో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ తన కలలబాటలో పయనించిన సాయి పల్లవికి మలయాళ చిత్రం ప్రేమమ్‌తో విజయం వరించింది. ఆ ఒక్క విజయం ఆమె కెరీర్‌నే మార్చేసింది వరుసగా అవకాశాలు రావడం, అందులో బలమైన, నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకొని నటించడంతో సాయి పల్లవి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలాంటి పాత్రలు తెలుగులోనే ఎక్కువగా రావడం విశేషం. కాగా ఇటీవల తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా నటించిన అమరన్ చిత్రంలో సాయి పల్లవి నటన మరోసారి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా తాజాగా ఈమె బాలీవుడ్‌ని కూడా టచ్ చేసింది. అక్కడ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న రామాయణం చిత్రంలో సీతగా నటిస్తోంది. ఈ సినిమాపై చాలా అంచనాలు నెలకొంటున్నాయి. ఇందులో సాయి పల్లవి నటించిన కొన్ని గ్లింప్స్ విడుదలై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కాగా ఈమె ఈ చిత్రానికి భారీ మొత్తంలో పారితోషకం పుచ్చుకుంటున్నట్లు, ఎంత అంటే ఇప్పటి వరకు ఏ దక్షిణాది హీరోయిన్ తీసుకోనంత అనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఇకపోతే ఈమె కథ, తన పాత్ర నచ్చితే కానీ చిత్రాలను అంగీకరించరన్నది తెలిసిందే. ఇంతకు ముందు చిరంజీవితో నటించే అవకాశాన్ని తిరస్కరించింది. అదేవిధంగా తమిళంలో నటుడు విజయ్ సరసన లియో చిత్రంలో నటించే అవకాశం ముందు సాయిపల్లవికే వచ్చిందట. అందులో ఆమె నటించడం దాదాపు ఖరారు అయ్యిందని, అయితే అందులో పాత్ర తనకు సంతృప్తిని కలిగించకపోవడంతో నిరాకరించినట్లు తాజాగా ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.ఆ తరువాత ఆ పాత్రను నటి త్రిష పోషించింది. -
ర్యాంప్ ఆరంభం
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కె–ర్యాంప్’. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తున్నారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్‌పై రాజేష్ దండా, శివ బొమ్మకు నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓపోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. ‘‘కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 11వ చిత్రమిది. త్వరలో ఫస్ట్ లుక్‌ని విడుదల చేస్తాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి కెమేరా: సతీష్ రెడ్డి మాసం, సంగీతం: చేతన్ భరద్వాజ్, కో ప్రోడ్యూసర్: బాలాజీ గుట్ట. -
వేసవొచ్చింది... సెలవులు తెచ్చింది
వేసవి వచ్చిందంటే చాలు... స్కూల్స్, కాలేజీలు క్లోజ్ అవుతాయి. స్టూడెంట్స్‌కు సెలవులొచ్చేస్తాయి. అలాగే ప్రతి ఏడాది సినిమా స్కూల్స్‌కు కూడా వేసవి సెలవులు వస్తుంటాయి. ఈ సెలవుల్లో మెజారిటీ స్టార్ హీరోలు షూటింగ్ నుంచి బ్రేక్స్ తీసుకుంటుంటారు. అలా ఈ ఏడాది షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చిన కొందరు తెలుగు హీరోలపై ఓ లుక్ వేయండి.లండన్‌లో ల్యాండ్ నిన్న మొన్నటివరకు ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్న చిరంజీవి ఇటీవలే లండన్‌లో ల్యాండ్ అయ్యారు. ఆయన తనయుడు, హీరో– నిర్మాత రామ్‌చరణ్ మైనపు విగ్రహం లండన్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమం కోసం చిరంజీవి ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లారు. ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తాను హీరోగా నటించనున్న సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు చిరంజీవి. ఈ నెల మూడో వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలిసింది.ఈ మూవీలో నయనతార, కేథరీన్ హీరోయిన్లుగా నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. సాహు గార పాటి, సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ‘విశ్వంభర’ సినిమాకు చిన్న పాటి ΄్యాచ్ వర్క్, ఓ స్పెషల్ సాంగ్ బ్యాలెన్స్ ఉన్నాయట. వీలు చూసుకుని, ‘విశ్వంభర’ సినిమా షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టే ఆలోచనలో ఉన్నారు చిరంజీవి. ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తుండగా, యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, విక్రమ్, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిషా, ఆషికా రంగనాథన్ హీరోయిన్లుగా నటిస్తారు. ఇక ‘విశ్వంభర’ సినిమా కొత్త విడుదల తేదీపై అతి త్వరలోనే ఓ స్పష్టత రానుంది.ఓవర్ టు ఓజీ కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉంటూ, సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉంటున్న పవన్ కల్యాణ్ ఇటీవలే ‘హరిహర వీరమల్లు’ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ ఇది. దీంతో ‘హరిహర వీరమల్లు’ సినిమాలో పవన్ కల్యాణ్ వంతు షూటింగ్ పూర్తయింది. జాగర్లమూడి రాధాకృష్ణ, జ్యోతికృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఏయం రత్నం సమర్పణలో అద్దంకి దయాకర్ నిర్మించారు. అయితే ఈ సినిమాను తొలుత మే 30న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ...పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాని నేపథ్యంలో రిలీజ్‌ను వాయిదా వేశారని, అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత రానుందని తెలిసింది. రెండు భాగాలుగా ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల కానుంది.తొలి భాగంగా ‘హరిహర వీరమల్లు: స్పిరిట్ వర్సెస్ స్వార్డ్’ విడుదలవుతుంది. ఇలా ‘హరిహర వీరమల్లు’ చిత్రీకరణ పూర్తి కావడంతో, ఇక పవన్ ఫోకస్ అంతా ‘ఓజీ’ సినిమాపైనే. అయితే ‘హరిహర వీరమల్లు’ సినిమా చిత్రీకరణను పూర్తి చేసిన పవన్ కల్యాణ్ షూటింగ్‌కు చిన్న విరామం ఇచ్చారు. అతి త్వరలోనే ఆయన ‘ఓజీ’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, బాబీ డియోల్, నాజర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తారు.ఫారిన్ వెకేషన్ ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్తుంటారు హీరో మహేశ్‌బాబు. అయితే ఈ ఏడాది రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు సినిమాప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మహేశ్‌బాబుకు ఈ ఏడాది ఫారిన్ హాలిడే బ్రేక్ దొరక్కపోవచ్చని కొందరు అనుకున్నారు. కానీ మహేశ్‌బాబుకు ఆ అవకాశం లభించింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా లాంగ్ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసిన తర్వాత ఫారిన్ ఫ్లైట్ ఎక్కారు మహేశ్‌బాబు. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీతో కలిసి యూఎస్‌లో ఉన్నారని సమాచారం.ఇంకా రెండు వారాలు మహేశ్‌బాబు అక్కడే ఉంటారట. వచ్చిన తర్వాత రాజమౌళి సినిమా షూటింగ్‌ను మళ్లీ షురూ చేస్తారు. కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2027 వేసవిలో ఈ చిత్రం విడుదలవుతుందనే ప్రచారం సాగుతోంది.ఇటలీలో... ‘ది రాజా సాబ్, ఫౌజి’ సినిమాల చిత్రీకరణలతో కొన్ని రోజులు క్రితం బిజీ బిజీగా గడి పారు ప్రభాస్. దాంతో ఈ సినిమా చిత్రీకరణలకు బ్రేక్ ఇచ్చి, ఇటీవల ఫారిన్ వెళ్లారు ప్రభాస్. దాదాపు ఇరవై రోజుల నుంచి ప్రభాస్ ఇటలీలోనే ఉంటున్నారని తెలిసింది. అతి త్వరలోనే ప్రభాస్ ఇండియాకు తిరిగి రానున్నారు. వచ్చిన తర్వాత ‘ది రాజా సాబ్, ఫౌజి’ సినిమాల చిత్రీకరణలనుప్రారంభిస్తారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.మరో నటి రిద్దీ కుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్ డేట్‌పై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ ‘ఫౌజి’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్లు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2026లో ‘ఫౌజి’ సినిమా విడుదల కానుంది.లండన్‌లో... లండన్ వెళ్లారు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే హై ఓల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ చిత్రకరణ కర్ణాటకలో జరిగింది. ఎన్టీఆర్ పాల్గొనగా, యాక్షన్ సీక్వెన్స్‌లు, కొంత టాకీ పార్టును చిత్రీకరించారు ప్రశాంత్ నీల్. కాగా ఈ కర్ణాటక షూటింగ్ షెడ్యూల్ తర్వాత ఎన్టీఆర్ లండన్ వెళ్లారని తెలిసింది. లండన్‌లోని ప్రముఖ రాయల్ ఆల్బర్ట్ హాల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా స్క్రీనింగ్ జరగనుందని తెలిసింది. అలాగే ఈ చిత్రం సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి లైవ్ కాన్సెర్ట్ కూడా ఉంది.ఈ కార్యక్రమం కోసం ఎన్టీఆర్ లండన్ వెళ్తున్నారని తెలిసింది. ఈ వేడుకలో ‘ఆర్ఆర్ఆర్’లో హీరోలుగా నటించిన ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఈ చిత్రదర్శకుడు రాజమౌళిలతో పాటు ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్‌లోని మరికొందరు పాల్గొంటారట. తిరిగొచ్చిన తర్వాత మళ్లీ ‘డ్రాగన్’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు ఎన్టీఆర్. కల్యాణ్‌రామ్, కె. హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘డ్రాగన్’ సినిమాను 2026 జూన్ 25న రిలీజ్ చేయనున్నట్లుగా ఆల్రెడీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.విదేశాల్లో వెరీ బిజీ ‘పెద్ది’ సినిమా చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చి, లండన్ వెళ్లారు రామ్‌చరణ్. లండన్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ, ‘ఆర్ఆర్ఆర్’ వేడుకల్లో పాల్గొనేందుకు రామ్‌చరణ్ ఆల్రెడీ లండన్‌లోనే ఉన్నారు. ఈ రెండు కార్యక్రమాలతో ప్రస్తుతం రామ్‌చరణ్ బిజీగా ఉన్నారు. తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత ‘పెద్ది’ సినిమా చిత్రీకరణలో ఆరంభిస్తారు రామ్‌చరణ్. బుచ్చిబాబు దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ల సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ‘పెద్ది’ చిత్రం వచ్చే ఏడాది రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న రిలీజ్ కానుంది. ఈ మల్టీ స్పోర్ట్స్ డ్రామా మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, జగపతిబాబు, దివ్యేందు, శివ రాజ్‌కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు మరికొందరు హీరోలు ఈ వేసవికి షూటింగ్ బ్రేక్స్ ఇచ్చారు.– ముసిమి శివాంజనేయులువేసవి తర్వాతే... ఈ వేసవికి కొందరు హీరోలు షూటింగ్స్‌కు బ్రేక్ ఇవ్వగా, ఈ వేసవి తర్వాతనే కొత్త సినిమా షూటింగ్లనుప్రారంభించాలని మరి కొందరు హీరోలు ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వెంకటేశ్ నెక్ట్స్ సినిమాపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. వెంకటేశ్ కూడా చాలా కథలు వింటున్నారు. కాగా వెంకటేశ్ నెక్ట్స్ మూవీ దర్శకుడు త్రివిక్రమ్‌తో ఉంటుందని, హారిక అండ్ హాసినీ క్రియేషన్స్‌పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారని, వేసవి తర్వాత అధికారిక ప్రకటన రానుందని తెలిసింది.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయట. ఇక మరో సీనియర్ హీరో నాగార్జున సోలో హీరోగా కొత్త సినిమాపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. అయితే తమిళ దర్శకుడు ఆర్. కార్తీక్ చెప్పిన ఓ కథ నాగార్జునకు నచ్చిందని, త్వరలోనే ఈ మూవీ గురించిన అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. వేసవి తర్వాతనే ఈ సినిమా చిత్రీకరణను ఆరంభించాలని నాగార్జున భావిస్తున్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. మరోవైపు అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. వేసవి తర్వాతే ఈ సినిమా చిత్రీకరణనుప్రారంభించాలని అట్లీ అండ్ టీమ్ ప్లాన్ చేసిందట. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇలా మరికొంతమంది తెలుగు హీరోలు ఈ వేసవి సెలవుల తర్వాత తమ కొత్త సినిమాల సెట్స్‌లోకి అడుగుపెట్ట నున్నారని తెలిసింది. -
ఆగస్టులో శక్తిమతి
హెబ్బా పటేల్, సుమన్, శ్రావణ్, శ్రీధర్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘శక్తిమతి’. డి. రామకృష్ణ దర్శకత్వంలో హనీ బన్నీ క్రియేషన్స్ పతాకంపై వెంకటేశ్ గౌడ్ నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను డైరెక్టర్ వీవీ వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా డి. రామకృష్ణ మాట్లాడుతూ– ‘‘మా గురువు వినాయక్‌గారి చేతుల మీదుగా ‘శక్తిమతి’ మోషన్‌పోస్టర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది.ఈ చిత్రంలో దాదాపు 30 నిమిషాలు వీఎఫ్ఎక్స్ ఉన్నాయి. దాని వల్లపోస్ట్ప్రోడక్షన్కు చాలా టైమ్ పట్టింది. ఆగస్టులో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’’ అన్నారు. వెంకటేశ్ గౌడ్ మాట్లాడుతూ– ‘‘మా డైరెక్టర్ రామకృష్ణగారు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా తీశాను. నేటితరం వాళ్లు తప్ప కుండా చూడాల్సిన చిత్రమిది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: పి. రమణా రెడ్డి, సంగీతం: భీమ్స్, కెమేరా: కె. చిట్టిబాబు. -
క్రైమ్ థ్రిల్లర్ షురూ
బ్రహ్మాజీ, యశ్వంత్ పెండ్యాల ప్రధానపాత్రల్లో ‘కథకళి’ అనే సినిమా షురూ అయింది. ప్రసన్న కుమార్ నాని దర్శకత్వంలో రవికిరణ్ కలిదిండి నిర్మిస్తున్న ఈ చిత్రం శనివారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హర్షిత్ రెడ్డి కెమేరా స్విచ్చాన్ చేయగా, నిహారిక కొణిదెల క్లాప్ ఇచ్చారు. ఫస్ట్ షాట్‌కి డైరెక్టర్ ప్రసన్నకుమార్ నాని దర్శకత్వం వహించగా, బ్రహ్మాజీ స్క్రిప్ట్‌ని యూనిట్‌కి అందించారు.అనంతరం ప్రసన్న కుమార్ నాని మాట్లాడుతూ– ‘‘ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్‌గా ‘కథకళి’ ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో కథే హీరో’’ అన్నారు బ్రహ్మాజీ. ‘‘బ్రహ్మాజీగారు ఈ చిత్రంలో ముఖ్యమైనపాత్ర చేస్తున్నారు. మంచి టీమ్‌తో కలిసి ఈ సినిమా చేస్తున్నాం’’ అన్నారు రవికిరణ్ కలిదిండి. ‘‘ఈ సినిమాలో హీరో లంటూ ఎవరూ ఉండరు. కథను నడిపించేపాత్రలు ఉంటాయి’’ అని యశ్వంత్ పెండ్యాల చెప్పారు. మధు దామరాజు, మైమ్ మధు కీలకపాత్రలుపోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: పవన్, కెమేరా: జితిన్ మోహన్. -
ఇప్పుడు అంతా బోనస్: ‘వెన్నెల’ కిశోర్
‘‘నా కెరీర్లో కామెడీపాత్రలు చాలా చేశాను. వీటిలో నా ఫేవరెట్ రోల్స్ చాలానే ఉన్నాయి. కానీ ‘వెన్నెల, బిందాస్, దూకుడు’ సినిమాల్లో చేసినపాత్రలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. నాకు డ్రీమ్ రోల్స్ అంటూ ఏవీ లేవు. ‘దూకుడు’ సినిమాలో నేను చేసిన రోల్ (ఎమ్ఎస్. రామానుజమ్ శాస్త్రి)తోనే నా డ్రీమ్ నెరవేరిపోయింది. ఇప్పుడు అంతా బోనస్’’ అన్నారు ‘వెన్నెల’ కిశోర్. శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సింగిల్’లో ‘వెన్నెల’ కిశోర్ ఓ కీలకపాత్ర చేశారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న (శుక్రవారం) విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో ‘వెన్నెల’ కిశోర్ మాట్లాడుతూ – ‘‘సింగిల్’లో నేను చేసిన అరవింద్పాత్రకు మంచి స్పందన లభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా సినిమాలను నేనెక్కువగా థియేటర్స్‌లో చూసుకోను. కానీ ఈ సినిమాను థియేటర్స్‌లో చూశాను. నాపాత్రను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్న తీరు నాకు సంతోషాన్నిచ్చింది. నేను ఏపాత్ర చేసినా ఆపాత్ర వల్ల సినిమా కథ ముందుకెళితే చాలు.ప్రస్తుతం రచయితలకు సరైన గౌరవం,పారితోషికం లభించడం లేదు. అందుకే వాళ్లు డైరెక్టర్స్ అయిపోతున్నారు. ఇక హీరోగా ఒకట్రెండు సినిమాలు చేశాను. కానీ ఎక్కువగా లవ్‌స్టోరీ సినిమాలు వస్తున్నాయి. రొమాన్స్, సాంగ్స్ నాకు నప్పవు. అలాగే నాపాత్ర చనిపోయే కథలు కూడా వచ్చాయి. కానీ అలాంటిపాత్ర చేయడం నాకు ఇష్టం లేదు. ఇక మంచి కామెడీ కథ కుదిరితే హీరోగా చేస్తా. ‘జఫ్ఫా’ సినిమాతో దర్శకుడిగా ఫెయిల్ అయ్యాను. భవిష్యత్‌లో దర్శకత్వం చేస్తాను. థ్రిల్లర్ మూవీస్ చేయాలని ఉంది’’ అన్నారు. -
ఈ స్థాయి విజయాన్ని ఊహించలేదు: నాని
‘‘హిట్ 3’ సినిమా సక్సెస్ అవుతుందనుకున్నాను. కానీ... ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఊహించలేదు. ఒక క్రైమ్ థ్రిల్లర్‌ని పెద్ద మాస్ కమర్షియల్ సినిమాలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. ప్రేక్షకుల స్పందన చూస్తే అద్భుతంగా అనిపించింది. మాకు ఇంతటి విజయాన్నిచ్చిన వారికి ధన్యవాదాలు’’ అని నాని తెలిపారు. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని, శ్రీనిధీ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’.యునానిమస్ ప్రోడక్షన్స్, వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 1న విడుదలైంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్లో నాని మాట్లాడుతూ– ‘‘శైలేష్‌తో నేను చేయబోయే తర్వాతి సినిమా మంచి వినోదాత్మక చిత్రం అవ్వాలని కోరుకుంటున్నాను. ఓ ఆలోచన చెప్పాడు... చాలా బాగుంది’’ అన్నారు. శైలేష్ కొలను మాట్లాడుతూ– ‘‘మంచి కంటెంట్‌ని ఆదరిస్తారని ‘హిట్ 3’తో ప్రేక్షకులు మరోసారి నిరూపించినందుకు వారందరికీ «థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు.‘‘హిట్ 3’లో నేను చేసిన అతిథిపాత్రకి ప్రశంసలు రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు అడివి శేష్. ‘‘నాని ఎప్పటి కప్పుడు తనని కొత్తగా మలుచుకుంటున్నందుకు గర్వంగా ఉంది’’ అని నిర్మాత దీప్తి చెప్పారు. ‘‘ఈ చిత్రంలో మృదులపాత్రకి నన్ను ఎంచుకున్నందుకు శైలేష్‌కి ధన్యవాదాలు’’ అని శ్రీనిధీ శెట్టి చెప్పారు. -
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అలా ఈ శుక్రవారం 30కి పైగా కొత్త చిత్రాలు స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. శనివారం నాడు సడన్ గా మరో తెలుగు మూవీ ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి వచ్చింది. ఇంతకీ ఏంటా? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది చూద్దాం.(ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకున్నా.. హీరోయిన్ అమలాపాల్)గతేడాది డిసెంబరు 27న థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'కర్ణ పిశాచి'. ఈ హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని భరత్ సిగిరెడ్డి నిర్మించగా, విజయ్ మల్లాది దర్శకత్వం వహించారు. ప్రణవి, రమ్యశ్రీ, నిఖిల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాని నిర్మించిన భరత్ సిగిరెడ్డి.. కీలక పాత్రలోనూ నటించారు. ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉంది.కర్ణ పిశాచి విషయానికొస్తే.. ప్రేమతో పాటు జీవితంలోనూ ఓ యువకుడు ఫెయిల్ అవుతాడు. దీంతో తాగుబోతుగా మారిపోతాడు. ఓ సందర్భంలో అనుకోకుండా తన పూర్వీకులకు సంబంధించిన ఓ గ్రంథం ఈ కుర్రాడికి దొరుకుతుంది. ఆ పుస్తకం కారణంగా యువకుడి జీవితం ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్) -
మెగాస్టార్ తో హీరోయిన్ దీపికా పడుకోణె మూవీ..!
-
'ఆపరేషన్ సిందూర్'పై బుద్దిలేని వ్యాఖ్యలు.. నటిపై భగ్గుమన్న నెటిజన్లు
ఆపరేషన్ సిందూర్ గురించి మలయాళ నటి చేసిన కామెంట్ విమర్శలకు దారి తీస్తుంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. అందులో సుమారు 100 మందికి పైగానే ఉగ్రవాదులు మరణించారు. దీంతో సోషల్ మీడియా అంతా భారత సైన్యానికి జేజేలు పలికింది. ‘భారత్ మాతా కీ జై’ అంటూ తాము ఆర్మీ వెంటే అంటూ నెటిజన్లు, ప్రముఖులు పోస్ట్‌లు పెట్టారు. అయితే, కేరళకు చెందిన నటి అమీనా నిజమ్.. ఆపరేషన్ సిందూర్ కోసం భారతదేశం 'సిగ్గుపడుతుందని' పోస్ట్ చేసింది.అమీనా తన సోషల్‌మీడియాలో ఇలా రాసుకొచ్చింది 'ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్‌లోని ప్రజలను చంపడంపై నేను సిగ్గు పడుతున్నాను. చంపుకోవడం ఒక్కటే మార్గం కాదు. దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతుంది. యుద్దం శాంతిని తీసుకురాదు, ప్రాణాలను తీస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి పరిణామాన్ని ఎవరూ సపోర్ట్ చేయకండి. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్నామని భావించే వ్యక్తులను మోసగిస్తున్నారు. మనం చేస్తున్న యుద్ధం వల్ల నష్టపోయేది పౌరులే. నేను నా ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే భారతీయురాలిని, అహం దెబ్బతిన్నప్పుడు మాత్రమే మాట్లాడేదానిని కాదు.' అంటూ ఆమె షేర్ చేసింది.నటి అమీనాపై నెటిజన్లు ఒక్కసారిగా విరుచుకు పడ్డారు.. అదే పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో అమాయకులైన ఇండియన్స్ కూడా చనిపోయారనే విషయం మీకు గుర్తుచేయాలా..? అంటూ ఫైర్ అవుతున్నారు. ఆమెను దేశ వ్యతిరేకి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులను పాపం అనడం, వారిపై సానుభూతి చూపించడం ఏ మాత్రం మెచ్చుకోదగ్గ విషయం కాదని ఇది మీ కెరీర్‌కు కూడా అంత మంచిది కాదంటూ చిన్నపాటి వార్నింగ్‌లు కూడా నెటిజన్లు ఇస్తున్నారు.ఎవరీ అమీనా..?అమీనా నిజమ్ కేరళకు చెందిన నటి, ఆమె ప్రముఖ మలయాళ టీవీ రియాలిటీ షో అయిన నాయక నాయకన్ ద్వారా పరిశ్రమలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె అనేక సినిమాలతో పాటు పలు షోలలో తన నటనకు ప్రసిద్ధి చెందింది. శంకర్ రామకృష్ణన్ దర్శకత్వం వహించిన గ్యాంగ్స్ ఆఫ్ 18 (2018) సినిమాతో అలరించింది. ఆ తర్వాత ఆమె పతినేట్టం పడి, అంజామ్ పాతిర, పట్టాపాకల్, టర్కిష్ తర్కం, టర్బో వంటి సినిమాల్లో నటించింది. View this post on Instagram A post shared by KRISHNA | KOCHI BRIDAL MEHNDI ARTIST (@mehndibykrish) -
‘#సింగిల్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
సైఫ్ అలీఖాన్ కత్తిపోటు కేసు.. బెయిల్ వద్దంటూ పోలీసులపై నిందితుడి ఆరోపణలు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై (Saif Ali Khan) ఈ ఏడాది ప్రారంభంలో దాడి జరిగిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను(30) అరెస్ట్ చేశారు. ఇప్పటికే అతనిపై కోర్టులో చార్జ్‌షీట్‌ను కూడా దాఖలు చేశారు. అయితే, తన అరెస్ట్ చట్టవిరుద్ధమని ప్రకటించాలని, తనను జైలు నుంచి వడుదల చేయాలని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును నిందితుడు ఆశ్రయించాడు. ఆపై ఏప్రిల్ నెలలో సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కూడా అతను ఉపసంహరించుకున్నాడు.ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న నిందితుడు మొహమ్మద్ తన న్యాయవాది అజయ్ గావ్లి ద్వారా, తన అరెస్టును చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరుతూ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (బాంద్రా) ముందు దరఖాస్తు చేసుకున్నాడు. ఆపై తనను జైలు నుండి విడుదల చేయాలని కోరాడు. ఆ పిటిషన్లో, పోలీసులు తనను అరెస్టు చేసేటప్పుడు చట్ట నిబంధనలను పాటించలేదన్నాడు. వారిపై మరికొన్ని ఆరోపణలు చేశాడు. దీంతో వాటికి సమాధానం చెప్పాలని పోలీసులను కోర్టు కోరింది. విచారణను మే 13కి వాయిదా వేసింది.జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. అతని మెడపై కత్తిపోట్లు కూడా పడ్డాయి. దీంతో ఆసుపత్రిలో అత్యవసర శస్త్రచికిత్స తీసుకున్న ఆయన సుమారు ఐదు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే అతడు సైఫ్ నివాసంలోకి వెళ్లాడని పోలీసులు గుర్తించారు. -
'ఆపరేషన్ సిందూర్' సినిమా పోస్టర్ విడుదల.. వెనక్కి తగ్గిన రిలయన్స్
'ఆపరేషన్ సిందూర్' (Operation Sindhoor) పేరుతో సినిమా పోస్టర్ వచ్చేసింది. ఈ టైటిల్ కోసం బాలీవుడ్ బడా దర్శకనిర్మాతలు కూడా పోటీ పడ్డారు. అయితే, ఒక నిర్మాణ సంస్థ తమ బ్యానర్ పేరుతో ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌లోని వారి స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ దాడులు చేసింది. దీంతో ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు ఇదే బ్యాక్‌డ్రాప్‌తో బాలీవుడ్లో సినిమా రానుంది.‘ఆపరేషన్ సిందూర్’ టైటిల్ కోసం సినీ దర్శక నిర్మాతలు పోటీపడ్డారు. కేవలం రెండు రోజుల్లోనే 30కి పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో జీ స్టూడియోస్, టీ-సిరీస్ లాంటి కొన్ని బాలీవుడ్ బడా నిర్మాణసంస్థలు కూడా ఈ పేరు కోసం పోటీపడ్డాయి. అయితే, నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్ పతాకం, ది కంటెంట్ ఇంజనీర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కనుందని ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్లో యూనిఫాం ధరించి.. రైఫిల్ పట్టుకొని నుదుటన సిందూరం పెట్టుకుంటోన్న మహిళను చూపారు. ఉత్తమ్, నితిన్ దర్శకత్వంలో ఈ సినిమా రానుందని ప్రకటించారు. ఇందులో నటిస్తున్న నటీనటులను వారు ప్రకటించలేదు.ఆపరేషన్ సిందూర్, మిషన్ సిందూర్, సిందూర్ : ది రివెంజ్అంటూ ఆపరేషన్ కోడ్‌నేమ్ స్ఫూర్తితో సినిమా టైటిల్స్ రిజిస్టర్ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఆపరేషన్ తరువాత ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐఎంపీపీఏ), ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (ఐఎఫ్‌టీపీసీ), వెస్ట్రన్ ఇండియా ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (డబ్ల్యూఐఎఫ్పీఏ)లకు సినిమా టైటిల్స్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులు పెరిగాయి. ఈ మెయిల్ ద్వారా ఇప్పటికే 30కి పైగా టైటిల్ అప్లికేషన్లు అందగా, ఈ సంఖ్య 50–60 వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఒక్కసారి టైటిల్ వచ్చిన తరువాత సినిమా తీసేందుకు మూడేళ్ల కాలపరిమితి ఉంటుంది. మూడేళ్లలో సినిమా రెడీ కాకపోతే టైటిల్ తీసేసుకుంటారు.టైటిల్ విషయంలో వెనక్కి తగ్గిన రిలయన్స్ఈ పేరుతో ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తోపాటు మరో ఐదు సంస్థలు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ అండ్ ట్రేడ్‌మార్క్‌ను సంప్రదించాయి. అయితే దేశానికి గర్వకారణమైన విషయంతో తాము వ్యాపారం చేయబోమని, తమ ఉద్యోగి పొరపాటున చేశారని చెప్పిన రిలయన్స్.. దరఖాస్తును వెనక్కి తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ టైటిల్ కోసం బాలీవుడ్ బడా నిర్మాతలు పోటీ పడటం చూసి నెటిజన్లు ఫైర్ అయ్యారు. సెన్సిటివ్ విషయాన్ని ఇలా వ్యాపారంగా మలుచుకుంటారా అంటూ విమర్శలు చేస్తున్నారు. అలాంటి వారందూరు కూడా రాబందులతో సమానమని చెబుతున్నారు. -
HIT3 సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఇది మా దేశం.. మా బాధ్యత.. ఎవరూ ప్రశ్నించకండి: రష్మిక
ఆపరేషన్ సిందూర్‌పై పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న రియాక్ట్ అయ్యారు. ఈమేరకు సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ చేశారు. 'ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకునే హక్కును కూడా కొందరు తప్పుపడుతున్నారని, దానిని యుద్ధ దాహమంటూ తప్పుగా అర్థం చేసుకోకూడదని ఆమె అన్నారు. అన్యాయానికి బదులు తీర్చుకునే దేశాన్ని ఎవరూ ప్రశ్నించొద్దని రష్మిక (Rashmika) కోరారు."ఉగ్రవాదం నుంచి రక్షణ కోసం చేసే పోరాటం యుద్ధం కాదు. ఈ పోరాటానికి మద్ధతిచ్చే వారు యుద్ధోన్మాదులు కాదు. వారందరూ దేశ భద్రత, న్యాయం విలువైనవిగా భావించే పౌరులు. మేము శాంతిని కోరుకుంటాం.., అలా అని మాకు తలపెట్టిన హానిని అంగీకరించడానికి సిద్ధంగా ఎంతమాత్రం లేము. రెచ్చగొట్టే దురాక్రమణకు, ఆత్మ రక్షణకు మధ్య లోతైన నైతిక వ్యత్యాసం ఉంది. కుట్రలు పన్ని ఉద్దేశపూర్వకంగా జరిగిన ఉగ్రవాద చర్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవడం మా దేశ బాధ్యతే అవుతుంది. అది ఎంతమాత్రం అవకాశం కాదు. శాంతిని కోరుకోవడం అంటే మౌనంగా హానిని అంగీకరించడం కాదు. మాకు జరిగిన అన్యాయాన్ని బదులు తీర్చుకుంటున్న దేశాన్ని ఎవరూ ప్రశ్నించొద్దు.. మీకు చేతనైతే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని ప్రశ్నించండి. మా దేశ సరిహద్దుల మీదుగా ఉగ్రవాదులను పంపుతున్న దేశాన్ని ప్రశ్నించండి.' అని రష్మిక రాసుకొచ్చారు. -
డ్రాగన్ బ్యూటీకి అదృష్టం.. బిగ్ ఛాన్సులతో బిజీ
చిత్రపరిశ్రమలో ఎవరికి ఎప్పుడు అదృష్టం వరిస్తుందో తెలియదు. అలా ఒక్క సక్సెస్ వచ్చిందంటే ఆ తరువాత అవకాశాలు వరుసకడతాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే స్టార్డమ్ వచ్చేస్తుంది. నటి కయదు లోహర్ పరిస్థితి అంతే. గత ఏడేళ్ల క్రితం మాతృభాషలో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ ఈమె. అప్పటి నుంచి మంచి అవకాశాల కోసం పోరాడుతునే ఉంది. కాగా ఏడాది క్రితం తన పోరాటానికి ఫలితం దక్కింది. తమిళంలో ప్రదీప్ రంగనాథన్‌తో డ్రాగన్ చిత్రంలో నటించే లక్కీచాన్స్ వరించింది. ఈ ఏడాది ప్రథమార్థంలో తెరపై వచ్చిన డ్రాగన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం అంత పెద్ద హిట్టు అవుతుందని, తనకు క్రేజ్ తెచ్చిపెడుతుందని బహుశా కయదు లోహర్ కూడా ఊహించి ఉండదు. అంతే ఇప్పుడు కోలీవుడ్‌లోనే కాదు దక్షిణాది చిత్ర పరిశ్రమ అంతా ఈమెను గుర్తించింది. అవకాశాలను అందిస్తోంది. నాని సినిమా "ది ప్యారడైజ్"లో కయదు లోహర్ హీరోయిన్గా నటిస్తోంది. అధికారికంగా ప్రకటన రావడమే ఇక మిగిలి ఉంది. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఆపై కోలీవుడ్‌లో నటుడు అధర్వకు జంటగా హృదయం మురళి చిత్రంలో నటిస్తోంది. తాజాగా శింబు సరసన ఆయన 49వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోంది. అంతేకాదు సంగీత దర్శకుడు, జీవీ ప్రకాష్‌కుమార్‌తో జతకట్టే లక్కీచాన్స్ వరించింది. ఈ చిత్రాన్ని మారియప్పన్ చిన్నా దర్శకత్వం వహించనున్నారు. అరుణ్‌కుమార్ ధనశేఖరన్ నిర్మించనున్న ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందించనున్నారు. కాగా జీవి ఇంతకుముందు తన 25 చిత్రం కింగ్స్టన్ చిత్రంతో తెరపైకి వచ్చారు. తాజాగా ప్రస్తుతం ఇడిముళక్కం, 13, బ్లాక్మెయిల్ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిని పూర్తి చేసిన తరువాత కయాడులోహర్తో జతకట్టే ప్రయత్నం చేస్తారో, వాటితో పాటు ఈ చిత్రాన్ని చేస్తారో తెలియాల్సి ఉంది.