దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మైథలాజికల్ టచ్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దాదాపు రూ.1300 కోట్లకు పైగా బడ్జెట్ కానుందని రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.
అయితే రాజమౌళి సినిమాలపై అభిమానులకు భారీ అంచనాలు ఉండడం సహజం. ముఖ్యంగా కథపై ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అసలు ఏ జానర్‌లో మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నారనే విషయంపై చర్చ నడుస్తోంది. అందుకే ఈ మూవీ జానర్‌ను ఎవరికీ తోచినట్లు వాళ్లు ఊహించుకుంటున్నారు. వారణాసి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ తర్వాత ఈ చర్చ మరింత ఎక్కువగా నడుస్తోంది.
కొందరు ఈ సినిమాను ఫిక్షన్ అని అంటున్నారు. మరికొందరేమో విలన్ పాత్రధారి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్‌లుక్ చూసి సైన్స్ ఫిక్షన్ అయి ఉంటుందని అంచనాకు వస్తున్నారు. దీంతో వారణాసి మూవీ జానర్‌పై ఆడియన్స్‌లో విపరీతమైన కన్‌ఫ్యూజన్ నడుస్తోంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ రాజమౌళినే క్లారిటీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే వారణాసి మూవీ జానర్‌పై దర్శకుడు రాజమౌళిని స్వయంగా స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో సైన్స్ ఫిక్షన్ ఫీల్ ఉంటుందన్నారు. కానీ ఆ జానర్‌లో తీయడం లేదని.. వారణాసి ఫాంటసీ మైథలాజికల్ ఫిల్మ్ అని దర్శకధీరుడు క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆడియన్స్ అనుమానాలకు చెక్ పడినట్లైంది.
కాగా.. వారణాసిలో మహేశ్‌బాబు రుద్ర అనే పాత్రలో నటిస్తున్నారు. విలన్ రోల్ కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ మెప్పించనున్నారు. ఈ మూవీలో మందానికిగా ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.


