అప్పట్లో హీరోగా మెప్పించిన జగపతిబాబు.. సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అదరగొట్టేస్తున్నాడు. ప్రస్తుతం 'పెద్ది' లాంటి పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటుడు.. 'అరవింద సమేత' జ్ఞాపకాల్ని పంచుకున్నాడు. డబ్బింగ్ చెబుతున్నప్పుడు నోటిలో నుంచి రక్తం వచ్చిన విషయంపై మరోసారి స్పందించారు. అప్పుడు అసలేమైందనేది చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: అల్లు శిరీష్ పెళ్లి సందడి షురూ.. వీడియో వైరల్)
'అరవింద సమేత' సినిమాలో మీ గొంతు విషయంలో స్వరపేటిక కాస్త దెబ్బతిందని విన్నాను నిజమేనా? అని యాంకర్ ప్రశ్నించగా.. అవుననే సమాధానమిచ్చాడు. 'కాస్త మొరటుగా అనిపించేలా గంటలకొద్ది, రోజుల కొద్దీ డబ్బింగ్ చెప్పడంతో నా గొంతు మొరటుగా మారిపోయింది. ఓ సందర్భంలో నోటి నుంచి రక్తం వచ్చింది. షాకింగ్ వాయిస్ కావాలని అనుకొనే ఇలా చేశాను. ఆ ప్రయత్నంలో అలా జరిగిపోయింది. కాకపోతే మూవీ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఆ టైంలో పిచ్చి కసిమీద ఉన్నా. దానికి తగ్గట్లే త్రివిక్రమ్ కూడా అదరగొట్టేశాడు'
'క్లైమాక్స్ కూడా భలే మార్చాడు త్రివిక్రమ్. ఒరిజనల్‌గా అయితే క్లైమాక్స్‌లో రెగ్యులర్ ఫైటే చేశాం. ఎందుకో షూటింగ్‌లో బ్రేక్ వచ్చింది. ఏంటి శ్రీను, నువ్వు కూడా ఈ క్లైమాక్స్‌లు అని అన్నాను. బోర్ కొడతోంది. నువ్వైనా మార్చవయ్యా క్లైమాక్స్‌లు అని అన్నాను. దీంతో డైరెక్షన్ టీమ్, ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష‍్మణ్ కూర్చుని డిస్కషన్ పెట్టారు. రెండు రోజుల తర్వాత పూర్తిగా క్లైమాక్స్ మార్చేశారు. అదరగొట్టేశారు' అని జగపతిబాబు అన్నారు.
ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో 2018లో వచ్చిన సినిమా 'అరవింద సమేత'. పేరుకే మాస్ యాక్షన్ మూవీ అయిప్పటికీ.. కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ కావడంతో సూపర్‌హిట్ అయింది. ఇందులో జగపతిబాబు చేసిన బసిరెడ్డి పాత్ర అయితే అద్భుతంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా 'మచ్చల పులి గాండ్రిస్తే ఎట్టా ఉంటదో తెలుసా?' అంటూ వైవిద్యమైన వాయిస్‌తో చెప్పిన డైలాగ్‌కి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఆ డబ్బింగ్ వెనక రక్తం వచ్చేంత కష్టముందా అని తెలిసి నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి సంక్రాంతి హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)


