సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా | Vanaveera Movie OTT Streaming Now | Sakshi
Sakshi News home page

OTT: మైథలాజిక్ థ్రిల్లర్ మూవీ.. ఓటీటీలో ఇప్పుడు స్ట్రీమింగ్

Feb 13 2026 10:02 AM | Updated on Feb 13 2026 10:13 AM

Vanaveera Movie OTT Streaming Now

రీసెంట్ టైంలో తెలుగులో మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాలు చాలానే వస్తున్నాయి. అలాంటి వాటిలో 'వనవీర' కూడా ఒకటి. రామాయణంలోని కిష్కింధకాండ ఎపిసోడ్‌తో ముడిపడేలా దీన్ని తెరకెక్కించారు. థియేటర్లలో యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఎందులో స్ట్రీమింగ్ అవుతోందనేది ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: 'చికిరి చికిరి' బ్యాట్‌ స్టెప్‌ రామ్‌చరణ్‌దా?)

అవినాష్ అనే కొత్త కుర్రాడు.. హీరో కమ్ దర్శకుడిగా చేసిన సినిమా 'వనవీర'. తొలుత దీన్ని వానర పేరుతో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సెన్సార్ అభ్యంతరం వల్ల టైటిల్ మార్చారు. న్యూఇయర్ సందర్భంగా గత నెల 1వ తేదీన థియేటర్లలోకి తీసుకొచ్చారు. అదే రోజున చాలా తెలుగు చిత్రాలు రావడంతో దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడీ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి ఎలాంటి ప్రకటన లేకుండానే అందుబాటులోకి వచ్చేసింది. సిమ్రాన్ చౌదరి హీరోయిన్ కాగా నందు విలన్‌గా చేశాడు.

వనవీర విషయానికొస్తే.. వనపురానికి చెందిన మిడిల్ క్లాస్ కుర్రాడు రఘు(అవినాశ్). ఐఐటీ చదివినా ఊళ్లో ఖాళీగానే తిరుగుతుంటాడు. తండ్రి ప్రేమగా కొనిచ్చిన బైక్ అంటే చాలా ఇష్టం. దానిపై మరొకరు చేయి వేస్తే సహించడు. అలాంటిది తప్పని పరిస్థితుల్లో ఓసారి దేవా(నందు) రాజకీయ ర్యాలీ కోసం ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత బైక్ తన చేతికి రాకపోవడంతో రఘు.. తిరిగి దాన్ని తెచ్చుకునేందుకు దేవా ఇంటికి వెళ్తాడు. తర్వాత ఏమైంది? అసలు దేవాతో రఘుకి ఉన్న గొడవేంటి? ఈ కథకు రామాయణంలోని వానర జాతికి ఉన్న సంబంధమేంటి అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: రామ్‌చరణ్‌ కవలల బారసాల.. ఏం పేర్లు పెట్టారంటే?)

Advertisement
 
Advertisement
Advertisement