breaking news
telugu movie
-
చిరంజీవి వాట్సాప్ స్టేటస్ నా జీవితాన్ని మార్చేసింది
ప్రీతం కస్తూరి దర్శకత్వంలో సంకీర్త్ కొండ నిర్మాతగా చేసిన తెలుగు సినిమా 'డెలులు'. విజయ రాజ్ కుమార్, వేణి రావు, సాయి ప్రసన్న, అఖిల్ జాక్సన్, శ్రీరామ మండవ కీలక పాత్రలు చేశారు. ఆది చేబ్రోలు సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నేటి జెన్ జీ యువతకు దగ్గరగా ఉండేలా తీర్చిదిద్దారు. తాజాగా హైదరాబాద్‌లో టీజర్ లాంచ్ చేశారు.(ఇదీ చదవండి: కృష్ణాష్టమి రోజున శుభవార్త.. బిగ్‌బాస్ జంటకు మరో కూతురు)హీరో విజయ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. 'నేను 10 నిమిషాల కథ ఫోన్ కాల్లో చెప్పగానే సంకీర్త్ కొండ నిర్మించడానికి ముందుకొచ్చారు. ఇప్పటివరకు ఎవరూ సాహసించని కథని ‘డెలులు’ ద్వారా చెప్పబోతున్నాం. నా తొలి సినిమా సమయంలో మెగాస్టార్ చిరంజీవి నన్ను అభినందిస్తూ మెసేజ్ చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఒకసారి చిరంజీవి పెట్టిన వాట్సాప్ స్టేటస్ చూసి, “చిరంజీవి గారు నన్ను హీరోగా నమ్ముతున్నప్పుడు నేను కూడా నన్ను నమ్మాలి” అని భావించాను. ఆ ఆలోచనతోనే మళ్లీ కొత్తగా మొదలుపెట్టాను. ఇప్పుడు ‘డెలులు’తో వస్తున్నాను. చిరంజీవి వాట్సాప్ స్టేటస్ నా జీవితాన్ని మార్చేసింది" అని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: చాపచుట్టేసిన 'టాక్సిక్'.. 450 టికెట్స్ మాత్రమే విక్రయం) -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం అలానే కొరియన్ కనకరాజు, డిసి, ఉన్మాదం లాంటి పలు భాషల్లో హిట్ అయిన చిత్రాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. గాంధారి లాంటి ఓటీటీ మూవీతో పాటు జగమే సంగీతం, ద కోర్ట్ లాంటి డబ్బింగ్ సిరీసులు కూడా ఆసక్తి రేపుతున్నాయి. ఇవలా ఉండగానే హీరో నాగార్జున నిర్మించిన ఓ చిత్రం ఎలాంటి సౌండ్ లేకుండా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా)గత కొన్నేళ్లుగా తెలంగాణ నేపథ్యంగా పలు సినిమాలు వస్తున్నాయి. అలా అన్నపూర్ణ సంస్థ నిర్మించిన చిన్న మూవీ 'పళ్లబురుసు'. బలగం చిత్రంలో నటనతో ఆకట్టుకున్న సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ఇందులో ప్రధాన పాత్రలు చేశారు. గత నెలలో అంటే ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైంది. ప్రమోషన్లు పర్లేదనిపించారు గానీ కంటెంట్ ఓ మాదిరిగా ఉండేసరికి జనాలు దీన్ని పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు మూడు వారాల్లోపే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్ అవుతోంది.'పళ్లబురుసు' విషయానికొస్తే.. తెలంగాణలోని ఓ పల్లెటూరిలో ఉండే వృద్ధుడు శంభు(సుధ). ఓసారి పంటినొప్పితో ఆస్పత్రికి వెళ్లగా, చికిత్స చేసిన డాక్టర్.. వేపపుల్ల కాకుండా టూత్ బ్రష్ వాడాలని చెబుతుంది. దీంతో ఇది కొనివ్వమని శంభు, తన కొడుకు తిరుపతి(మురళీధర్ గౌడ్)ని అడుగుతాడు. కానీ వేరే పనుల్లో పడిపోయి తిరుపతి ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. దీంతో శంభుకి కోపమొస్తుంది.సరిగ్గా అదే టైంలో తనని పిలవకుండా మనవరాలి పెళ్లిని కొడుకు చేయడంతో శంభు అవమానంగా ఫీలవుతాడు. దీంతో పళ్లబురుసు కొనివ్వలేదని కొడుకుపై కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్‌కి వెళ్తాడు. ఈ కేసు వల్ల తండ్రీకొడుకుల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? అసలు తిరుపతి తన తండ్రిని పట్టించుకోకపోవడానికి కారణమేంటి? చివరకు ఏమైందనేది మిగిలిన స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఇరుముడి' వచ్చేది అప్పుడేనా?) -
నిద్రలో నడిచే హీరో.. ఇతడిని గుర్తుపట్టారా?
నిద్రలో నడిచే(స్లీప్ వాకింగ్) యంగ్ హీరో ఎవరు అని సోషల్ మీడియాలో వైరల్ అయిన సస్పెన్స్‌కు తెరదించుతూ మేకర్స్ ప్రకటన చేశారు. స్లీప్ వాకింగ్ చేస్తున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ కాగా ఇతడి కొత్త సినిమా "టార్టాయిస్" అని ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అమృత చౌదరి హీరోయిన్ కాగా అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు.ఈ సినిమాని విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. సస్పెన్స్, డ్రామా కలిసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రిత్విక్ కుమార్ దీనిని తెరకెక్కిస్తున్నారు. మానస కుమార్, సంతోష్ ఇమ్మడి కో ప్రొడ్యూసర్స్. రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్.. సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ఒక డెడ్ బాడీ పక్కన హీరో రాజ్ తరుణ్ రక్తపు మరకలతో కూర్చుని ఉండటం, ఆయన పక్కనే ఒక కత్తి పడి ఉండటం ఆసక్తి రేపుతోంది. -
సందడిగా 'ధర్మస్థల నియోజకవర్గం' ట్రైలర్ లాంచ్
సుమన్, సాయికుమార్, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహించారు. మేరుం భాస్కర్ నిర్మాత. పొలిటికల్ ఎంటర్టైనర్ కథతో తీశారు. సెప్టెంబర్ 4న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ వదిలారు. హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.హీరోయిన్ వితికా షేరు మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని పాటలు విన్న తర్వాతే కథ విన్నాను. పాటలు, కథ బాగా నచ్చి ఈ సినిమా చేసేందుకు ముందుకొచ్చాను. సినిమాలకు గ్యాప్ ఇచ్చాను కానీ ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ వచ్చింది కాబట్టే ఒప్పుకున్నాను అని చెప్పింది. -
రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం అలానే చెన్నై లవ్ స్టోరీ, శ్రీనివాస మంగాపురం, మిస్టర్ మిడిల్ క్లాస్ లాంటి తెలుగు మూవీస్‌తో పాటు జన నాయకుడు, ప్యార్ ప్రేమ కళ్యాణం లాంటి డబ్బింగులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. అయితే వీటికి తోడుగా ఓ తెలుగు చిత్రం కూడా సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)రుత్విక్ అనే కుర్రాడు హీరోగా పరిచయమైన సినిమా 'రాజా ది రాజా'. విశాఖ ధీమాన్ హీరోయిన్. గత నెల 17న థియేటర్లలో రిలీజైంది. కంటెంట్ పెద్దగా మెప్పించకపోవడంతో జనాలు దీన్ని పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు నెల పూర్తయ్యేసరికి సన్ నెక్స్ట్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లోకి సైలెంట్‌గా అందుబాటులోకి వచ్చేసింది. పునర్జన్మల బ్యాక్ డ్రాప్ స్టోరీతో రొమాంటిక్ కామెడీ డ్రామాగా దీన్ని తీశారు.'రాజా ది రాజా' విషయానికొస్తే.. సీనియర్ డాక్టర్ అయిన సత్యం (నరేష్) కొడుకు రాజా (రుత్విక్). తన కొడుకుని పెద్ద డాక్టర్ చేయాలని సత్యం అనుకుంటాడు. కొడుక్కి మాత్రం గొప్ప ఫ్యాషన్ డిజైనర్ కావాలనేది డ్రీమ్. అలా తండ్రికి తెలియకుండానే ఓ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. రాజా డిజైన్స్‌కి తగ్గ అమ్మాయిని అతడే వెతకాలని కంపెనీ బాస్ చెబుతాడు. ఈ క్రమంలోనే రాజాకు ఆద్య (విశాఖ ధీమాన్)కనిపిస్తుంది. ఈమెనే తన డిజైన్స్‌కి పర్ఫెక్ట్ అని రాజా భావించి ఆమెతో స్నేహం చేస్తాడు. పోటీకి రెడీ అవుతున్న టైంలో ఇదంతా రాజా తండ్రికి తెలుస్తుంది. తర్వాత ఏమైంది? ఇంతకీ ఆద్య ఎవరు? పునర్జన్మ కథేంటి? రాజాతో ఈమె గత జన్మలో పరిచయం ఉందా? ఆద్యకు మణిగడ్కి చెందిన రాజ్యానికి సంబంధమేంటి?అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: థియేటర్ రిలీజ్‌కి ఒక్కరోజు ముందే ఓటీటీలో వచ్చేసిన సినిమా) -
'పెద్ది' బుచ్చిబాబు రిలీజ్ చేసిన 'జయహో జనార్ధన' సాంగ్
'పెద్ది' డైరెక్టర్ బుచ్చిబాబు.. జయహో జనార్ధన సినిమాలోని 'చిందువేయవే చాందుక తుకడ' అనే పాటని రిలీజ్ చేశారు. 'ఆయా షేర్' పాడిన జంగి రెడ్డి దీనిని ఆలపించారు. చరణ్ అర్జున్ సంగీతమందించారు. పానుగంటి శరత్ రెడ్డి నిర్మాతగా దర్శకుడుగా వ్యవహరిస్తూ నిర్మిస్తున్న సినిమా ఇది. నరేష్ వాసం, రమ్యశ్రీ హీరో హీరోయిన్లు కాగా 30 ఇయర్స్ పృథ్వీ, రోలర్ రఘు, చలాకి చంటి తదితరులు ఇతర పాత్రలు చేశారు.ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ లాంచ్ డైరెక్టర్ సంపత్ నంది చేతుల మీదుగా జరిగింది. లవ్ కమర్షియల్ కామెడీ డ్రామాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది . త్వరలోనే టీజర్ , ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు నిర్మాత, దర్శకుడు అయిన పానుగంటి శరత్ రెడ్డి తెలిపారు. -
థియేటర్లలో అభిమానుల హారతులు
రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. నేడు( శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. మల్లెపూల పల్లకి పాట వచ్చిన సమయంలో అభిమానులు తెరలకు హారతులు ఇస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరలవుతున్నాయి. Swamy sharanam 🙏 #Irumudi pic.twitter.com/0Zlo9Mkz5G— RTR (@natweetsnaistm) August 21, 2026 -
సెప్టెంబర్ 4న థియేటర్లలోకి ‘ధర్మస్థల నియోజకవర్గం’
మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మిస్తోన్న ఈ పొలిటికల్ ఎంటర్టైనర్ చిత్రం సెప్టెంబర్ 4న థియేటర్లలోకి రానుంది. పివిఆర్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో దీనిని రిలీజ్ చేయనున్నారు.హీరోయిన్ వితికా షేరు మాట్లాడుతూ- నేను హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడం కంటే ఒక నటిగా మంచి గుర్తింపు పొందాలని కోరుకున్నాను. నటిగా నాకు మంచి పేరు తెచ్చే క్యారెక్టర్ ఈ సినిమాలో చేశానని పేర్కొంది. నటి కస్తూరి మాట్లాడుతూ - ఇలాంటి సినిమా ఇప్పుడున్న సమాజానికి కావాలి. ఈరోజు జెన్ జీ ఆటపాటలతో సరదాగా సమయం గడపడం లేదు. ఆలోచిస్తున్నారు. అలాంటి యువతకు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుందని చెప్పింది. -
'విలేజ్ స్టార్స్' సినిమా లాంఛనంగా ప్రారంభం
ఎన్ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న కొత్త సినిమా ‘విలేజ్ స్టార్స్’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని వెంకటగిరి వీరాంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నటుడు సమీర్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందాన్ని ఆశీర్వదించారు.నరేంద్ర, లిల్లీ బళ్ళు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనివాస్, సయ్యద్ అబ్జాల్, విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏ. నరేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నాగూర్ ఎన్జీఆర్ కథ అందిస్తున్నారు. నూతన కథాంశంతో రూపొందుతున్న ‘విలేజ్ స్టార్స్’ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. -
రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమా
ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు రాబోతున్నాయి. వీటిలో విజయ్ 'జన నాయగన్', కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ', మహేశ్ అన్న కొడుకు హీరోగా చేసిన 'శ్రీనివాస మంగాపురం', ప్యార్ ప్రేమ కల్యాణం, వెల్కమ్ టూ ద జంగిల్ తదితర తెలుగు స్ట్రెయిట్, హిందీ చిత్రాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇవలా ఉండగానే లేటెస్ట్ తెలుగు మూవీ సడన్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?శ్రీకాంత్ హీరోగా చేసిన కొత్త సినిమా 'మిస్టర్ మిడిల్ క్లాస్'. రాజేంద్ర ప్రసాద్, వేంకటేశ్వర స్వామి పాత్రలో నటించాడు. గత నెల 17న థియేటర్లలో రిలీజైంది. కానీ కంటెంట్ అంతంత మాత్రంగానే ఉండటంతో జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడు నెల పూర్తయ్యేసరికి ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది.'మిస్టర్ మిడిల్ క్లాస్' విషయానికొస్తే.. వెంకటరమణ (శ్రీకాంత్) మధ్యతరగతి వ్యక్తి. కుటుంబ బాధ్యతలు, డబ్బు సమస్యలు, రోజువారీ కష్టాలతో బతికేస్తుంటాడు. అలాంటి ఈయనకు ఓ రోజు ఊహించని విధంగా సాక్షాత్తూ వేంకటేశ్వరస్వామి (రాజేంద్ర ప్రసాద్) ప్రత్యక్షమై ఓ పుస్తకాన్ని ఇస్తాడు. అందులో ఏది రాస్తే అది నిజమవుతుంది. మొదట ఓ వరాన్ని తనకు నచ్చినట్టుగా ఉపయోగించుకుంటాడు. కానీ కోరికలు తీరుతున్నకొద్దీ రమణలో ఆశ కూడా పెరుగుతుంది. తాను రాసిన ప్రతి మాట నిజమవుతుందని నమ్మి తీసుకునే నిర్ణయాలు క్రమంగా కొత్త సమస్యలకు దారితీస్తాయి.ఇంతకీ ఆ పుస్తకానికి ఉన్న అసలు నిబంధన ఏంటి ? దేవుడు రమణకు ఆ వరాన్ని ఎందుకు ఇచ్చాడు? తన కోరికలను నిజం చేసుకునే క్రమంలో ఏ తప్పులు చేశాడు? చివరికి ఆ శక్తులున్న పుస్తకం రమణ కుటుంబానికి ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చింది? అనేది మిగతా స్టోరీ. -
ఇప్పటి ట్రెండ్‌కి తగ్గ సినిమా 'మోడ్రన్ మిస్సమ్మ'
చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్ కుమార్ నల్లూరి, స్రవంతి నంబూరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మోడ్రన్ మిస్మమ్మ'. సాయిబాబా దర్శకుడు. హర్ష నర్రా, తన్మయి ఖుషి హీరోహీరోయిన్లు. బుధవారం తొలిపాటని హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో గ్రాండ్‌గా విడుదల చేశారు.గీత దర్శకుడు గోపీ సుందర్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కిట్టు విస్సప్రగడ ఆకట్టుకునే సాహిత్యం అందించారు. ‘బెటర్ బీ ఏ మిస్సమ్మ’ అంటూ సాగిన పాటలో హీరో సంప్రదాయ పంచెకట్టులో కనిపిస్తుండగా, హీరోయిన్ తన్మయి ట్రెడిషనల్ డ్రెస్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. హీరోయిన్ పెళ్లి వద్దంటూ పాడుకునే ఈ పాట మహిళలకు కనెక్ట్ చేసేలా ఉంటుంది.డైరెక్టర్ సాయి బాబా మాట్లాడుతూ.. ‘మిస్సమ్మ’ లాంటి క్లాసిస్ టైటిల్ పెట్టాలంటే కొంచెం ధైర్యం కావాలి. గతంలో వచ్చిన ఎన్టీఆర్ ‘మిస్సమ్మ’, భూమిక ‘మిస్సమ్మ’ ఈ రెండు చాలా అడ్వాన్స్ మూవీస్. మా సినిమాలో కూడా అలాంటి దమ్ము ఉందని నమ్మాం. ఈ సినిమా ద్వారా పెళ్లి వద్దని చెప్పడం లేదు. పెళ్లి చేసుకోవాలంటే ఏం కావాలో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందేనని చెప్పారు. నిర్మాత చిరంజీవి పమిడి మాట్లాడుతూ.. ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్టుగా మూవీ తీయాలనుకున్నాం. మంచి అవుట్‌పుట్ వచ్చింది. అనుకున్న టైమ్‌లో అనుకున్న బడ్జెట్‌తో సినిమా పూర్తి చేశాం. అదే మా మొదటి సక్సెస్‌గా భావిస్తున్నాం. ఈ సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అని అన్నారు. -
'అగధ'తో సర్ప్రైజ్ చేస్తున్న శ్రవణ్ రెడ్డి!
'అగధ'.. మిస్టిసిజం, సూపర్ నేచురల్ అంశాలతో అల్లుకున్న ఒక అట్మాస్పియరిక్ థ్రిల్లర్ సినిమా. గత వీకెండ్ థియేటర్లలో రిలీజైంది. ఇందులో హీరో కమ్ యాంటీ హీరోగా శ్రవణ్ రెడ్డి పోషించిన పాత్రలో చాలా లేయర్స్ ఉన్నాయి. చాలా సహజంగా, మనకు తెలిసిన వ్యక్తిలా కనిపించే ఆ పాత్ర, కథ ముందుకు వెళ్లే కొద్దీ ఒక్కో కొత్త కోణాన్ని బయటపెడుతుంది. ఆ మార్పులను శ్రవణ్ చాలా సునాయాసంగా తన నటనలో తీసుకొచ్చాడు.పాజిటివ్, నెగిటివ్ షేడ్స్ మధ్య ఉండే ఆ క్లిష్టమైన గ్రే జోన్‌ని శ్రవణ్ ఎంతో సమర్థంగా పట్టుకున్నాడు. అతను ఏమీ చేయకుండా నిశ్శబ్దంగా ఉన్న క్షణాల్లో కూడా, ఆ పాత్రలో ఇంకేదో దాగి ఉందనే భావన మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. సినిమా మొదట్లో మనం చూసిన పాత్రను, చివరికి పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్తాడు. -
'2కె లవర్స్' సినిమా ఘనంగా ప్రారంభం
రాజేష్ నాయుడు దర్శకత్వలో బిచ్చు నాయక్ నిర్మిస్తున్న '2కె లవర్స్' సినిమా పూజా కార్యక్రమాలతో ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. మోహిత్ పెడాడ, శృతి శంకర్, సాయి కుమార్, తనికెళ్ల భరణి తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి మణిశర్మ, తనికెళ్ల భరణి, వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు.(ఇదీ చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. 27 ఏళ్లకే చనిపోయిన నటి)దర్శకుడు రాజేష్ నాయుడు మాట్లాడుతూ .. 'తెలంగాణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథతో పాటు, ఎమోషన్స్‌తో సినిమాని రూపొందిస్తున్నాం. ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది' అని చెప్పాడు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ రూ.35 లక్షలు.. కానీ మోసం చేశారు: పల్లవి ప్రశాంత్) -
‘కొత్త దర్శక,నిర్మాతలకు ఇంకా స్వాతంత్య్రం రాలేదు’!
తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త దర్శకులు, నిర్మాతలు, చిన్న బడ్జెట్ సినిమాలు స్వేచ్ఛగా ఎదిగే అవకాశం లేకుండా పోతోందని సినీ నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ ఆరోపించారు. చిన్న సినిమాల విషయంలో థియేటర్ల కేటాయింపు నుంచి ఓటీటీ, ఆడియో, శాటిలైట్, ఇతర భాషల హక్కుల వరకు అనేక సమస్యలున్నాయని, వీటిపై పరిశ్రమలోని పెద్దలు, స్టార్ హీరోలు స్పందించాలన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కొత్త దర్శకనిర్మాతలకు ఇంకా స్వాతంత్య్రం కాలేదన్నారు. ఈ సమస్యలను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. చిన్న సినిమాలకు థియేటర్లు కేటాయించకుండా అన్యాయం చేస్తున్న ఏషియన్ థియేటర్స్‌కు చెందిన సునీల్‌తో పాటు పీవీఆర్, ఐనాక్స్ యాజమాన్యాలకు లీగల్ నోటీసులు పంపినట్లు తెలిపారు. -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి చాలానే సినిమాలు వచ్చాయి. జగపతిబాబు 'వదలా', హార్టిన్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఫారెస్ట్ గార్డ్ లాంటి తెలుగు మూవీస్‌తో పాటు రష్మిక 'కాక్ టెయిల్ 2', కాటలన్, భారత భాగ్య విధాత, ఆరూపి లాంటి పరభాషా చిత్రాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటికి తోడుగా మరో తెలుగు మూవీ దాదాపు ఏడు నెలల తర్వాత అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ దీని సంగతేంటి?(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ)'పల్సర్ బైక్' పాటతో ఫేమస్ అయిన సింగర్ రమణ, ప్రశాంత్ ప్రధాన పాత్రలు చేసిన రూరల్ యాక్షన్ డ్రామా 'వినరా ఓ వేమ'. ఈ ఏడాది జనవరి 2న థియేటర్లలో రిలీజైంది. ప్రశాంత్ కల్యాణ్-రాజు మద్దెల సంయుక్తంగా దర్శకత్వం వహించారు. కంటెంట్ ఓ మాదిరిగా ఉండటం, స్టార్స్ లేకపోవడంతో దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడిది ఏడు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. కాకపోతే అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.గతేడాది నవంబరు 14న థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'గోపీగాళ్ల గోవా ట్రిప్'.రోహిత్ & శశి దర్శకత్వం వహించగా అజిత్ మోహన్, రాజు శివరాత్రి, క్యాంప్ శశి, సాయి కుమార్, పవోన్ రమేష్, మోనిక బుసం ముఖ్యపాత్రలు పోషించారు. ఇప్పుడీ కామెడీ చిత్రం ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. ఉచితంగానే స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ 'ఉయిర్' తెలుగు రివ్యూ) -
ఫాంటసీ థ్రిల్లర్ తెలుగు సినిమా 'కెరూబ్'
విహాన్ కార్తీక్, దివ్య విశ్వకర్మ హీరో హీరోయిన్లుగా చేసిన సినిమా 'కెరూబ్' బాలు బల్లెకారి నిర్మించారు. ఫాంటసీ థ్రిల్లర్ కథతో దర్శకుడు ఎం జె నాయుడు (జీవన్) తీశారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకొంటోంది. సెప్టెంబరులో థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు దర్శకనిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.ఇప్పటికే వచ్చిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. ఆహ్లాదకరమైన ప్రకృతిలో హీరో వేణువు వాయిస్తున్నట్లు ఇందులో చూపించారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో వెల్లడించనున్నారు. -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం అలా హార్టిన్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఫారెస్ట్ గార్డ్ లాంటి తెలుగు మూవీస్‌తో పాటు.. కాక్ టెయిల్ 2, కాటలన్, భారత భాగ్య విధాత, ఆరూపి లాంటి వేరే భాషల చిత్రాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటితో పాటు ఓ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: 'అగధ' మూవీ రివ్యూ)జగపతిబాబు, లయ, హృతిక శ్రీనివాస్ ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'వదలా'. ఆల్రెడీ పెళ్లి చేసుకున్న ఓ మగాడిపై అతి వ్యామోహం అనే కాన్సెప్ట్‌తో దీనిని తీశారు. గత నెల 17న థియేటర్లలో రిలీజైంది. ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడిది సడన్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.'వదలా' విషయానికొస్తే.. యోగి సిద్ధార్థ్ (జగపతిబాబు) ఓ డాక్టర్. భార్య ప్రియ (లయ). తన ఇద్దరు పిల్లలతో సంతోషంగా బతుకుతుంటాడు. 20 ఏళ్లుగా ఎలాంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా సాగిపోతున్న వీళ్ల దాంపత్య జీవితంలోకి అముద (హృతిక శ్రీనివాస్) అనే యువతి వస్తుంది. ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఈమెని సిద్ధార్థ్ చికిత్స చేసి కాపాడతాడు. అలా ఇతడిపై ఆరాధాన భావంతో ఆ కుటుంబానికి దగ్గరైన ఆమె.. తర్వాత సిద్ధార్థ్‌ని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది.ఈ క్రమంలోనే భార్యాభర్తల కాపురంలో చిచ్చుపెట్టేందుకు ఓ ప్లాన్ వేస్తుంది. గుర్తు తెలియని నంబర్ల నుంచి సిద్ధార్థ్.. అతని భార్యకి ఫోన్లు, సందేశాలు పంపుతూ సైకోలా వేధించడం మొదలు పెడుతుంది. మరి ఆ తర్వాత ఏమైంది? అసలు అముద ఎవరు? ఆమె కథేంటి? ఈ సైకో యువతి నుంచి తన కుటుంబాన్ని సిద్ధార్థ్ ఎలా కాపాడుకున్నాడు? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి రోజా రీఎంట్రీ సినిమా) -
'ఇంద్రపుత్ర'గా అబ్బవరం పాన్ ఇండియా ప్రయత్నం
తెలుగు యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకడు. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభించి, రాజావారు రాణిగారు' మూవీతో హీరో అయ్యాడు. తర్వాత పలు సినిమాలు చేశాడు గానీ చాలావరకు ఫ్లాపులే. ఎట్టకేలకు 'క' అనే థ్రిల్లర్ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. దీని తర్వాత వచ్చిన 'దిల్రుబా' డిజాస్టర్ కాగా.. కె ర్యాంప్, చెన్నై లవ్ స్టోరీ చిత్రాలు సక్సెస్ అయ్యాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్, దర్శకుడిగా ఓ మూవీ చేస్తున్న కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. 'ఇంద్రపుత్ర' పేరుతో మూవీని అనౌన్స్ చేశారు. సోమవారం ఈ టైటిల్ ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. కాటమరాయుడు, గాండీవధారి అర్జున, కుడి ఎడమైతే, కాంతార ఛాప్టర్ 1 సినిమాలకు పనిచేసిన శ్రీకాంత్ పుప్పాల దీంతో దర్శకుడిగా మారుతున్నాడు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా ప్రయత్నం మెచ్చుకోదగిందే గానీ అదెంత వరకు వర్కౌట్ అవుతుందనేది భవిష్యత్తులో తెలుస్తుంది. ఎందుకంటే పోస్టర్ చూస్తుంటే డివోషనల్ స్టోరీలా అనిపిస్తుంది. కానీ ఈ జానర్ ఇప్పుడు పాతబడిపోయింది. అదే టైంలో కిరణ్ మార్కెట్ కూడా టాలీవుడ్ వరకే పరిమితం. ఈ నిర్మాత గతంలో తెలుగు హీరో సుధీర్ బాబుతో 'జటాధర' అని ఓ మూవీ చేస్తే అది ఘోరంగా ఫెయిలైంది. మరి ఈసారి ఏం చేస్తారనేది చూడాలి?(ఇదీ చదవండి: ఆ ఒక్క కారణం వల్లే 'టెంపర్' రీమేక్ చేశా: విశాల్) -
'కింగ్డమ్' విలన్... తెలుగులోకి హీరోగా ఎంట్రీ
విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' సినిమాలో విలన్‌గా మెప్పించిన వెంకటేశ్ వీపీ.. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తొలి సినిమాతోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. పక్కా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్న 'డీజీపీ' (వర్కింగ్ టైటిల్) మూవీలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. గోదావరిఖనికి చెందిన సురేశ్ తేజ్ దర్శకుడు కాగా శివ బొమ్మక్ నిర్మాత.(ఇదీ చదవండి: లోకేశ్ 'డిసి'.. విజయ్ దేవరకొండే చేయాలి కానీ)ఈరోజు (ఆగష్టు 9) వెంకటేశ్ వీపీ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం అతడికి ఆహ్వానం పలుకుతూ వినూత్న రీతిలో వీడియో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వెంకీ.. మూవీ యూనిట్‌కు ధన్యవాదాలు తెలిపాడు. 'దాదాపు ఏడాది కాలంగా ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ఎట్టకేలకు ఇది జరిగింది. రుద్రాంశ్ సెల్యూలాయిడ్‌తో కలిసి పనిచేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకం. నా జీవితంలో దక్కిన ఈ సంతోషాలకు ఎంతో కృతజ్ఞుడిని. కొత్త ప్రయాణం మొదలు' అని వెంకీ భావోద్వేగానికి లోనయ్యాడు.కేరళకు చెందిన వెంకటేశ్ వీపీ బుల్లితెరపై యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుని ఒక్కోమెట్టు ఎక్కుతూ హీరోగా ఎదిగాడు. మలయాళంలో పలు సినిమాల్లో నటించిన అతడు కింగ్డమ్ మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. మురుగన్ అనే విలన్ పాత్రలో ఒదిగిపోయాడు. తెలుగులో రెండో సినిమాతోనే హీరోగా అవకాశం దక్కించుకున్నాడు.(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ) View this post on Instagram A post shared by Ruudranshcelluloid (@ruudranshcelluloid) -
నేరుగా ఓటీటీలోనే రిలీజైన తెలుగు సినిమా
ఈ వారం ఓటీటీల్లో చాలా సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో లెనిన్, ఓ సుకుమారి, ఎమ్మార్పీ లాంటి తెలుగు చిత్రాలు ఉండగా హృదయం మురళి, వంద దేవుళ్లు, ఉయిర్, మై వాపస్ ఆవుంగా లాంటి డబ్బింగ్‌లు.. వదంది 2, ఆపరేషన్ సఫేద్ సాగర్ తదితర తెలుగు డబ్బింగ్ సిరీస్‌లు కూడా వచ్చాయి. ఇలా చూసేందుకు బోలెడన్ని ఉండగా మరో తెలుగు మూవీ నేరుగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'ఉయిర్' తెలుగు రివ్యూ)రాము, శివకృష్ణ, ప్రదీప్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'పంచనామా'. లెక్క ప్రకారం గత నెలలో థియేటర్లలో రిలీజ్ కావాలి. కానీ అది జరిగినట్లు లేదు. దీంతో తాజాగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. కాకపోతే అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ స్టోరీతో తీసిన ఈ మూవీకి జాన్ రమేశ్ దర్శకత్వం వహించాడు.'పంచనామా' విషయానికొస్తే.. నగరంలో వరస హత్యలు జరుగుతాయి. ఇవి ఎవరు చేస్తున్నారో తెలీక పోలీసులు తలలు పట్టుకుంటారు. హంతకుడి గురించి ఒక్క క్లూ కూడా దొరకదు. దీంతో స్పెషల్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. ఇంతకీ ఈ హత్యలకు కారణం ఎవరు? పోలీసులు చివరకు నిందితుడిని పట్టుకున్నారా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కంగనా రనౌత్ థ్రిల్లర్ సినిమా.. అధికారిక ప్రకటన) -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ సినిమా
ఓటీటీల్లో ఈ వారం బోలెడన్ని కొత్త సినిమాలు వచ్చేశాయి. వీటిలో లెనిన్, ఓ సుకుమారి, హృదయం మురళి, వంద దేవుళ్లు, డార్క్ సీక్రెట్స్, వదంది 2, సఫేద్ సాగర్, ఉయిర్, మై వాపస్ ఆవుంగా లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు వీటికి తోడు ఓ తెలుగు క్రైమ్ కామెడీ చిత్రం ఎలాంటి ప్రకటన లేకుండా రెండు ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ దీని సంగతేంటి?నరేశ్ అగస్త్య, సుదర్శన్, రాజ్ కసిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఎమ్మార్పీ'. గత నెల 17న థియేటర్లలో రిలీజైంది కానీ సరైన కంటెంట్ లేకపోవడంతో దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో మూడు వారాలు తిరిగేసరికల్లా అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.'ఎమ్మార్పీ' విషయానికొస్తే.. మనోహర్(నరేష్ అగస్త్య), రవి(కసిరెడ్డి రాజ్ కుమార్), పరమేశ్వరరావు(సుదర్శన్) ఫ్రెండ్స్. కలిసి ఓ బిజినెస్ చేద్దామని ఓ రౌడీ షీటర్ రూ.50 లక్షలు అప్పు తీసుకుంటారు. బిజినెస్‌లో నష్టాలు రావడంతో వడ్డీ కూడా కట్టలేకపోతారు. అనుకోని పరిస్థితుల్లో వీళ్లు సదరు రౌడీ షీటర్ ఇంటికెళ్లిన టైంలో అతడి తండ్రి చనిపోతాడు. అయితే ఆ శవాన్ని కిడ్నాప్ చేసి డబ్బులు సంపాదించి తమ అప్పు తీర్చాలని వీళ్లు ముగ్గురు అనుకుంటారు. తీరా కిడ్నాప్ చేసిన తర్వాత చూస్తే ఓ మహిళ శవం ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరు? చివరకు వీళ్ల ముగ్గురి పరిస్థితి ఏమైందనేదే మిగతా స్టోరీ. -
'అబద్ధమేవ జయతే' సినిమా.. అమ్మ పాట రిలీజ్
విభిన్న కథాంశంతో తీస్తున్న సినిమా 'అబద్ధమేవ జయతే'. ఇందులోని 'అమ్మ కోసం' పాటను ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. 2026లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ వినోదాత్మక చిత్రానికి కార్తీక్ కొండ కథ, కథనం, దర్శకత్వం వహించారు. కొండ సందీప్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.గర్భవతిగా ఉన్న తన భార్యకు ఆడపిల్ల పుడితే అది అబద్ధాలు చెప్పిన వారికి శిక్ష అనే నమ్మకంతో, ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పకుండా నిజాయితీగా జీవించాలని ప్రయత్నించే ఓ భర్త చుట్టూ సాగే వినోదభరితమైన కథతో ఈ చిత్రం తీశారు. నవ్వులతో పాటు ఆలోచింపజేసే సందేశాన్ని కూడా ఈ సినిమా ప్రేక్షకులకు అందించనుంది. బాబు మోహన్, ప్రవణ్య రెడ్డి, సుశాంత్ యాష్కీ, భాను ప్రకాష్, వికాస్, విజయ ప్రధాన పాత్రల్లో చేస్తున్నారు. -
'ఆలోచన' టీజర్ రిలీజ్ చేసిన విజయేంద్ర ప్రసాద్
ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మించిన చిత్రం 'ఆలోచన'. సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి, మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ చాచా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు. ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు టీజర్‌ని ప్రముఖ రచయిత విజయేoద్ర ప్రసాద్ విడుదల చేశారు.'ఆలోచన' టీజర్ బాగుంది. వాస్తవ సంఘటనలని తీసుకొని చేసిన ఈ సినిమాని అద్భుతమైన నటుల కాంబినేషన్‌తో స్నేహం పై ఒక మంచి కాన్సెప్ట్‌తో చేశారు. ఈ సినిమా విజయం సాధించి, చిత్ర యూనిట్‌కు మంచి పేరు రావాలని కోరుకుంటున్నానని విజయేంద్రప్రసాద్ అన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి
పవన్ మహావీర్‌ని హీరోగా పరిచయం చేస్తూ, ప్రముఖ మహిళా వ్యాపారవేత్త శైలజ రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి'. పవన్ లండన్‌లో డాక్టర్ కోర్స్ చేస్తూ హీరోగా నటించాడు. శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్షిక, సుహానా హీరోయిన్లు. సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు.హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు, దర్శకుల సంఘం అధ్యక్షులు వి.ఎన్.ఆదిత్య ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ట్రైలర్ బాగుందని, పవన్ మహావీర్‌కి ఇది పరిచయ చిత్రమంటే నమ్మడం కష్టమని అతిధులు పేర్కొన్నారు. నిర్మాతగా శైలజ రెడ్డి, హీరోగా పవన్ మహావీర్‌కి ఉజ్వల భవిష్యత్ ఉండాలని ఆకాంక్షించారు. -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ సినిమా
ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలొచ్చాయి. వాటిలో నాగబంధం లాంటి స్ట్రెయిట్ తెలుగు మూవీతో పాటు కాన్ సిటీ, పల్లిచట్టంబి లాంటి డబ్బింగ్ చిత్రాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. మరోవైపు ముసాఫిర్ కేఫ్, ఆదర్శ్ బాలవిద్యాలయ లాంటి డబ్బింగ్ సిరీస్‌లు వచ్చాయి. వీటికి తోడుగా ఓ తెలుగు కామెడీ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి మృణాల్ థ్రిల్లర్ సినిమా)కమెడియన్స్ సప్తగిరి, రాజ్ కసిరాజుతో పాటు పవన్ కల్యాణ్ అనే కొత్త కుర్రాడు హీరోగా నటించిన కామెడీ మూవీ 'పురుషః'. ఈ ఏడాది మే 22న థియేటర్లలో రిలీజైంది. ఓ మాదిరిగా ఉన్నప్పటికీ జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం సడన్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.'పురుషః' విషయానికొస్తే..చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులైన గోవింద్ (పవన్ కల్యాణ్), సత్తిబాబు (సప్తగిరి), శ్రీను (కసిరెడ్డి రాజన్ కుమార్), కిస్ (వెన్నెల కిశోర్) ప్రతి విషయాన్ని పంచుకుంటూ ఉంటారు. పెద్దయ్యాక వీళ్లకు పెళ్లిళ్లు అవుతాయి. గోవింద్.. కమల (రాయంచ)ని ప్రేమించి పెళ్లి చేసుకోగా, సత్తిబాబుకు లక్ష్మి (హాసిని)తో, శ్రీనుకు గీత (విషిక)తో వివాహమవుతుంది. అయితే వీరి వైవాహిక జీవితం సవ్యంగా సాగదు. నిత్యం గొడవలతో విసిగిపోయిన భార్యలే.. తమకు విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కుతారు.విడాకుల కోసం భర్తలు కూడా కోర్టు చుట్టూ తిరుగుతుంటారు కానీ భార్యలు మాత్రం రారు. దీంతో కేసు వాయిదాల మీద వాయిదా పడుతుంటుంది. వీరి బాధను అర్థం చేసుకున్న జడ్జి (వీటీవీ గణేష్) అసలు సమస్య ఏంటో తెలుసుకోవాలని డిసైడ్ అవుతాడు. ఇంతకీ గోవింద్, కమల ప్రేమ కథ ఎలా మొదలైంది? ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు. సత్తిబాబు, శ్రీనులపై వారి భార్యలకు ఎందుకు అంత అనుమానం? వీరి కాపురం కూల్చడంలో స్నేహితుడు 'కిస్' పాత్ర ఏంటి? చివరికి ఈ భార్యాభర్తల కథ ఎలాంటి ముగిసిందనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ) -
'కళ్యాణం కమనీయం జీవితం' టీజర్ లాంచ్
ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్లుగా చేసిన సినిమా 'కళ్యాణం కమనీయం జీవితం'. రవి లోకిరెడ్డి దర్శకుడు. పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'బంగారం'.. సమంతకు సీమంతం)తాజాగా ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు వీఎన్ ఆదిత్య, రాంప్రసాద్, మల్లిడి సత్యన్నారాయణ రెడ్డి, జెమినీ సురేష్ అతిథులుగా హాజరయ్యారు. ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు.డైరెక్టర్ రవి లోకిరెడ్డి మాట్లాడుతూ - నా ఎన్నో ఏళ్ల కష్టం ఈ సినిమా వెనక ఉంది. నా నిజ జీవితంలోని కొన్ని సంఘటనలకు ఫిక్షనల్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని తీశాను. చాలా మంచి లవ్ స్టోరీ ఇది. మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది, ఎంగేజ్ చేస్తుందని చెప్పారు.(ఇదీ చదవండి: ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న ప్రముఖ నటి) -
'ఆడుకున్నదిక్కడే' పాట రిలీజ్
కుటుంబ బంధాలు, మానవ సంబంధాల విలువలు ఆవిష్కరిస్తూ తీసిన సినిమా 'వెంకట్రామయ్య గారి తాలుకా'. ఈనెల 17న థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీలోని మూడో పాట 'ఆడుకున్నదిక్కడే' లిరికల్ వీడియోని ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.(ఇదీ చదవండి: అఖిల్ హిట్ కొడితే శ్రీలీల టార్గెట్ అయింది)ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడు విడుదల చేసిన ఆడుకున్నదిక్కడే పాట కూడా ప్రతి ఒక్కరిని హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. కథలోని భావోద్వేగాలను ప్రతిబింబించే ఈ గీతం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని టీమ్ చెప్పింది. దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ హీరోహీరోయిన్లుగా నటించారు. సతీష్ ఆవాల దర్శకుడు. కోమలి మహేందర్, తొట్టె సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మించారు.(ఇదీ చదవండి: బెంజ్ కారు కొన్న నటి హేమ.. ఎన్ని కోట్ల ఖరీదంటే?) -
రొమాంటిక్ థ్రిల్లర్ 'అదే నీవు అదే నేను' టీజర్ రిలీజ్
'కమిటీ కుర్రోళ్లు' ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, 'సిద్ధార్థ్ రాయ్' ఫేమ్ తన్వీ నేగి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'అదే నీవు అదే నేను'. గోవిందు కాండ్రేగుల నిర్మిస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ కథతో యువ దర్శకుడు కొండల్ రూపొందిస్తున్నారు. త్వరలో మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఈ సినిమాకు A సర్టిఫికెట్ కూడా తక్కువే!)డైరెక్టర్ కొండల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజంలో భార్యలు భర్తల్ని చంపిన క్రైమ్ న్యూస్ చూస్తున్నాం. అలాంటి తరహాలో సాగే రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రమిది. మనం వేసే ఒక తప్పటడుగు, ఆవేశంలో చేసే నేరం.. జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుంది అనేది ఇందులో చూపించాం. థియేటర్లో మా సినిమా చూస్తున్నప్పుడు మీరు ఉలిక్కిపడటం ఖాయం అని అన్నారు.(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత తిరుపతికి వస్తా.. హింట్ ఇచ్చిన నిధి అగర్వాల్) -
కొత్త సినిమా.. 100 మంది కొత్త నటీనటులకు అవకాశం
కొత్త దర్శకుడు అజర్.. లోకల్ టాలెంట్‌తో స్థానికంగా తీసిన చిత్రం 'కొత్త సినిమా'. దీనితో వంద మంది కొత్త నటీనటులు టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. సురేశ్, రాకేష్ ప్రధాన పాత్రలు చేశారు. మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్ నిర్మాతలు. ఈ సినిమా కోసం చరణ్ అర్జున్.. లిరిక్స్ రాసి కంపోజ్ చేసిన 'మేము కూడా సినిమా తీసినామురో..' పాటను బుధవారం, హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ సాయిలు కంపాటి, నటుడు ఆర్కే సాగర్ అతిథులుగా పాల్గొన్నారు.డైరెక్టర్ అజర్ మాట్లాడుతూ - మేం కింద స్థాయి నుంచి వచ్చామని చాలామంది చెబుతుంటారు. మేము ఇంకా కింద స్థాయి నుంచి భూమి లోతుల్లోంచి, బొగ్గు బాయిలోంచి వచ్చాం. చీకటిలో వెలికితీసే బొగ్గు నుంచి వెలుగు పంచే ప్రాంతం రామగుండం నుంచి వచ్చిన వాళ్లం. ఎందరో గొప్ప తెలుగు దర్శకులు సినిమాను మన దగ్గరకు చేర్చారు, మనల్ని ఇన్స్ పైర్ చేశారు. నేను ఈ సినిమాను మరింత దగ్గరగా తీసుకెళ్లాలని అనుకున్నానని చెప్పుకొచ్చాడు. -
కోర్ట్ రూమ్ డ్రామా 'డ్యూ డేట్' ప్రారంభం
పీఆర్ఓ, జర్నలిస్ట్‌గా తెలుగు సినీ పరిశ్రమలో సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారి, పవన్ తరిగోపులతో కలిసి నిర్మిస్తున్న చిత్రం 'డ్యూ డేట్' హైదరాబాద్‌లో బుధవారం పూజా కార్యక్రమంతో లాంఛనంగా మొదలైంది. ఆనంద్.కె. దర్శకుడు. హీరో లోమేష్, హీరోయిన్ జయశ్రీతో పాటు కీలక పాత్రల్లో కనిపించబోతున్న ప్రణీత పట్నాయక్, విజ్క్షానిలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు మారుతి క్లాప్ నివ్వగా, సక్సెస్ఫుల్ నిర్మాత బన్నీవాస్ కెమెరా స్విచ్చాన్ చేశారు.ప్రస్తుత సమాజంలోని వివాదాస్పద అంశం ఆధారంగా అల్లుకున్న ఈ కమర్షియల్ కోర్ట్ రూమ్ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు. -
ఓటీటీలోకి వచ్చేసిన సింగర్ సునీత కొడుకు సినిమా
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే దాదాపుగా వీకెండ్లోనే రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ సింగర్ సునీత కొడుకు హీరోగా చేసిన ఓ మూవీ తాజాగా సోమవారం ఎలాంటి హడావుడి లేకుండా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా)టాలీవుడ్లో ఎన్నో ఏళ్లుగా అద్భుతమైన పాటలు పాడుతున్న సింగర్ సునీత.. పలువురు హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్పింది. ఈమె కొడుకు ఆకాశ్..'సర్కౌర్ నౌకరి' అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. తర్వాత 'కొత్త మలుపు' అనే మూవీ కూడా చేశారు. గత నెల 12న థియేటర్లలో రిలీజైంది. ఇదొచ్చిన సంగతి కూడా జనాలకు తెలియదు. ఇప్పుడు అలానే సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.'కొత్త మలుపు' విషయానికొస్తే.. బాధ్యతలు లేని హైదరాబాదీ కుర్రాడు కమల్ (ఆకాశ్).. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తూ బతికేస్తుంటాడు. ఓసారి ఫ్యామిలీలో జరిగే ఓ పెళ్లి కోసం కోనసీమ జిల్లాలోని ఓ పల్లెటూరికి వెళ్తాడు. అక్కడ వరలక్ష్మి (భైరవి ఆర్థ్యా)ని చూసి తొలి చూపులోనే మనసు పారేసుకుంటాడు. ఓరాత్రి అవమానకర పరిస్థితుల్లో చిక్కుకున్న కమల్ని గుర్తు తెలియని యువతి కాపాడుతుంది. ఆమెను వెతికి పట్టుకునేందుకు వరలక్ష్మితో కలిసి అన్వేషణ ప్రారంభిస్తాడు. అలా మొదలైన వీళ్లిద్దరి ప్రయాణం ఎన్ని మలుపులు తిరిగింది?ఈక్రమంలో కమల్‌కి కనిపించిన ఓ ఫొటో వల్ల వీళ్ల మధ్య ఎలాంటి అనుమానాలు, అపార్థాలు తలెత్తాయి? తాను వెతుకున్న అమ్మాయికి తను మనసు పారేసుకున్న వరలక్ష్మికీ ఏమైనా సంబంధం ఉందా? లేదా? ఆఖరికి ఈ ప్రేమకథ గెలిచిందా? అనేది మిగతా స్టోరీ. ఇద్దరి మధ్య ప్రేమలో ఓ అనుమానం మొదలైతే.. అదెంతటి ప్రమాదకర పరిస్థితులకు కారణమవుతుందో ఇందులో చూపించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
నేరుగా ఓటీటీలోకి తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రం థియేటర్లలో కాకుండా నేరుగా స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చేస్తుంటారు. అయితే ఇలాంటి వాటిలో చాలా తక్కువ వాటిలో మాత్రమే ఆకట్టుకునే కథాకథనాలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన ఓ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ సినిమా ఎప్పుడు రాబోతుందంటే?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హారర్ కామెడీ సినిమా.. తెలుగులోనూ)బ్రహ్మాజీ మాత్రమే ఈ 'హ్యాంగ్ మ్యాన్' మూవీలో తెలిసిన ముఖం కాగా.. వియన్, బన్నీ అభిరామ్ తదితరులు ఇతర పాత్రలు చేశారు. చాలా ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ మొదలైంది. ఇప్పటికి పూర్తి చేసి డైరెక్ట్ సన్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజ్ చేసేస్తున్నారు. ఈ శుక్రవారం నుంచే తెలుగులో స్ట్రీమింగ్ కాబోతుంది. ఉరి తీసే తలారి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.'హ్యంగ్ మ్యాన్' విషయానికొస్తే.. వారసత్వంగా వచ్చే తలారి పని చేస్తుండే ఓ వ్యక్తి (బ్రహ్మాజీ), ఉరిశిక్షలని అమలు పరుస్తూ ఉంటాడు. ఇతడి జీవితంలో ఉరిశిక్ష అనేది ఎలాంటి మానసిక సంఘర్షణకు కారణమైంది? చివరకు ఏం జరిగింది? అనేది స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్ చూడటానికి ఆసక్తికరంగానే ఉంది కానీ మూవీ ఏ మేరకు మెప్పిస్తుందనేది చూడాలి? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
'చంద్రప్పన్' సినిమా ట్రైలర్ లాంచ్
డా.పి.యష్మన్, సోనాలీ హీరో హీరోయిన్లుగా చేసిన సినిమా 'చంద్రప్పన్'. యష్మన్ హీరోగా నటించడంతో పాటు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, డైరెక్షన్ చేస్తున్నారు. జూలై 24న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. దర్శకుడు వి. సముద్ర, నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.(ఇదీ చదవండి: రవితేజ 'ఇరుముడి'.. అయ్యప్ప సాంగ్ రిలీజ్)హీరో, డైరెక్టర్ యష్మన్ మాట్లాడుతూ..మేం చాలా జాగ్రత్తగా మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల అభిరుచికి తగినట్లు మూవీ చేశాం. చాలా మంచి కాస్టింగ్ ఉంది. వాళ్లంతా డైరెక్టర్‌గా నేను ఎలా చెబితే అలా ఫెర్ఫార్మెన్ ఇచ్చారు. మా మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం. ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాం. జూలై 24న రిలీజ్ అవుతున్న మా సినిమాను కూడా ఇలాగే సపోర్ట్ చేయండి అని అన్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ సెన్సేషన్ 'అబ్సెషన్'.. అధికారిక ప్రకటన) -
'ఆలోచన' ఫస్ట్ లుక్ విడుదల చేసిన మురళి మోహన్
ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మించిన చిత్రం "ఆలోచన". సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి , మహర్షి రాఘవ, జయలలిత, సీనియర్ నటుడు సుధాకర్ కొడుకు బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సురేందర్ చాచా దర్శకుడు కాగా.. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని నటుడు మురళి మోహన్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా మురళి మోహన్ మాట్లాడుతూ.. అద్భుతమైన నటుల కాంబినేషన్‌తో స్నేహంపై ఒక మంచి కాన్సెప్ట్‌తో ఆలోచన చేశారు. మంచి సంకల్పంతో నిర్మాతలు ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన సినిమాను నిర్మించారు అని ప్రశంసించారు. మంచి కథాబలమున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది విజయం సాధించాలని కోరుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ , ట్రైలర్ త్వరలో విడుదల కానున్నాయి. -
శ్రీహరి కొడుకు కొత్త సినిమా.. టీజర్ రిలీజ్
దివంగత శ్రీహరి కొడుకు మేఘాంశ్ హీరోగా చేస్తున్న సినిమా 'స్టూడెంట్'. విజేత పరీక్ హీరోయిన్. బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్నారు. బాలు తత్వమసి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. దీనిబట్టి చూస్తే.. ఓ స్టూడెంట్ అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనేది స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: 'బాహుబలి ద టార్చ్ బేరర్' రివ్యూ.. 123 నిమిషాలు గూస్ బంప్స్)సరదాగా కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేసే స్టూడెంట్ భాను (మేఘాంశ్ శ్రీహరి).. ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ తరపున పాలిటిక్స్‌లోకి రావడం, అందులో ఉండే ప్రమాదాలను, ఎత్తులు పై ఎత్తులను త్వరగా అర్థం చేసుకోవడం లాంటివి చూపించారు. స్టూడెంట్, రాజకీయాల్లోకి వస్తే ఈ పొలిటికల్ ఆటను ఎలా మార్చేయగలడు అనేది సినిమాలో చూపించబోతున్నారు. (ఇదీ చదవండి: నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ నిశ్చితార్థం) -
'సోల్జర్-24×7 ఆన్ డ్యూటీ' ఫస్ట్ లుక్
కొనంకి ఎంటర్టైన్మెంట్స్ తమ యాక్షన్ థ్రిల్లర్ 'సోల్జర్ – 24×7 ఆన్ డ్యూటీ' సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అధికారికంగా విడుదల చేసింది. దేశభక్తి, ధైర్యం, త్యాగం, కర్తవ్య నిబద్ధతకు ప్రతీకగా ఈ మూవీ రూపొందిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో కొనంకి కార్తీక్ శక్తివంతమైన సైనికుడి పాత్రలో కనిపించారు. యుద్ధ వాతావరణం, పోరాట ఛాయలు, గర్వంగా రెపరెపలాడుతున్న భారత త్రివర్ణ పతాకం మధ్య ఆయన లుక్ వదిలారు."24×7 ఆన్ డ్యూటీ" ట్యాగ్‌లైన్‌తో దేశ సరిహద్దుల్లో నిరంతరం విధులు నిర్వహిస్తూ దేశ భద్రత కోసం అహర్నిశలు కృషి చేసే భారత సైనికులకు ఈ చిత్రం ఘన నివాళిగా నిలవనుంది. ఈ చిత్రంలో కొనంకి కార్తీక్, ప్రియాంక వర్మ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. శ్రద్ధ ఖత్రి దర్శకత్వం వహిస్తున్నారు. కె.వి.నాయుడు నిర్మిస్తున్నారు. యాక్షన్, భావోద్వేగాలు, దేశభక్తి, మానవీయ విలువల సమ్మేళనంగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది. -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా అవతార్ 3, బ్లాస్ట్, లింగం, దూరదర్శిని, రాజా శివాజీ తదితర చిత్రాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. అయితే వీటితో పాటు మరో తెలుగు మూవీ కూడా పెద్దగా హడావుడి లేకుండానే అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: అలాంటి సమాజంలో మనం ఉన్నాం.. సింగర్ సునీత క్లారిటీ)ఆర్కే మాస్టర్, లక్కీ, బాబా భాస్కర్ ప్రధాన పాత్రలు చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'మహాబలి 1980స్'కి బొమ్మ సాయికుమార్ దర్శకుడు. గతేడాది మే 10న థియేటర్లలో రిలీజైంది. కానీ పూర్ ప్రొడక్షన్ వాల్యూస్, పేరున్న నటీనటులు లేకపోవడంతో ఇదొచ్చిన సంగతి కూడా జనాలకు తెలిసిరాలేదు. ఇప్పుడు ఏడాది తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె విధానంలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఓ పల్లెటూరి బ్యాక్‌డ్రాప్ స్టోరీతో ఈ మూవీ తీశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్.. గొర్రెలు డిటెక్టివ్స్ అయితే?) -
ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా అలా అవతార్ 3, బ్లాస్ట్ తదితర చిత్రాలు రాబోతున్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు కూడా ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. ఇప్పుడు అలానే ఓ తమిళ రొమాంటిక్ డ్రామా మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఏం మాట్లాడాలన్నా భయమేస్తోంది.. రోజూ భయంతో: రష్మిక)'బ్రేక్ ఫాస్ట్' తమిళ రొమాంటిక్ డ్రామా సినిమా. రానవ్, రోస్మిన్, కృతిక్ మోహన్, అమిత రంగనాథ్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 24న థియేటర్లలో రిలీజైంది. ఓ మాదిరిగా ఆకట్టుకుంది. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. భార్యాభర్తల మధ్య వచ్చే ఈగోలు, మనస్పర్థలు జీవితాలని ఎలా నాశనం చేస్తాయనే విషయాన్ని ఇందులో చూపించారు.'బ్రేక్ ఫాస్ట్' విషయానికొస్తే.. లక్ష్మి, ఆమె భర్త (కృతిక్ మోహన్) పెళ్లయిన కొన్ని నెలలకే మనస్పర్థల కారణంగా విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతారు. న్యాయస్థానం వీళ్లని కౌన్సిలర్ (కస్తూరి) దగ్గరకు పంపిస్తుంది. అక్కడ కూడా వీరిద్దరూ విపరీతంగా గొడవ పడుతుంటారు. ఇది చూసిన కౌన్సిలర్.. వీరి కళ్ళు తెరిపించడం కోసం గతంలో ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ల స్టోరీ చెబుతుంది. అందులో శంతను (రానవ్) అనే యువకుడు జానవి(రోస్మిన్)ని ప్రేమిస్తాడు. ఈ క్రమంలోనే జానవి తన తండ్రి (సంపత్ రాజ్) కంపెనీలో ప్రియుడిని చేర్చుతుంది.తన ప్రేమ ఇష్టం లేని తండ్రిని జానవి జైలుకి పంపిస్తుంది. శంతనుని పెళ్లి చేసుకుంటుంది. మొదట్లో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య కొద్దిరోజులకే గొడవలు, శారీరక హింస వస్తాయి. ఒక బాబు పుట్టినప్పటికీ రిలేషన్ మరింత దారుణంగా తయారవుతుంది. ఇంతకీ కౌన్సిలర్ చెప్పిన ఆ పాత జంట కథకు, ప్రస్తుతం విడాకులకు సిద్ధమైన లక్ష్మి దంపతులకు సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'పెద్ది' సక్సెస్ ఈవెంట్.. జాన్వీతో పాటు వాళ్లెక్కడ?) -
'ది రెడ్ బ్యాగ్' టీజర్ విడుదల
హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన చిత్రం 'ది రెడ్ బ్యాగ్'. రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఆదివారం చిత్ర టీజర్‌ని ఏపీ మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'ఓజీ 2' అప్డేట్.. ఆ డైరెక్టర్ని పవన్ పక్కనబెట్టేశారా?)నలుగురు అమ్మాయిల జీవితం ఓ రెడ్ బ్యాగ్ వల్ల తలకిందులు అవుతుంది. అసలు ఆ రెడ్ బ్యాగ్‌లో ఏముంది? అమ్మాయిలకి ఆ బ్యాగ్‌కి ఉన్న సంబంధం ఏంటి? ఆ రెడ్ బ్యాగ్‌తో మాఫియాకి ఉన్న లింక్ ఏంటి? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా టీజర్ ఉంది. నలుగురు హీరోయిన్స్ ఎంత గ్లామరస్‌గా కనిపిస్తున్నారో.. అంత వయలెంట్‌గా తెరపై విధ్వంసం చేసినట్టు అనిపిస్తోంది. శేఖర్ మోపురి సంగీతమందించారు. త్వరలో చిత్ర రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మరో 'బాహుబలి') -
చిన్న సినిమాలపై పెద్ద కుట్ర జరుగుతోంది
తెలుగు సినీ పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలపై ఇండస్ట్రీలో పెద్ద కుట్ర జరుగుతోందని దర్శకుడు, నటుడు షెరాజ్ మెహదీ ఆరోపించారు. తన చిత్రం 'ఓ అందాల రాక్షసి' విడుదల, రీ రిలీజ్ టైంలో ఎదురైన ఇబ్బందులపై ఫిల్మ్ చాంబర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. నా సినిమా మీద మాత్రమే కాదు లో-బడ్జెట్ సినిమాల నిర్మాతలకు అన్యాయం చేస్తున్నారని చెప్పారు. చిన్న సినిమాలకు థియేటర్లు ఇస్తామని హామీ ఇచ్చి చివరి నిమిషంలో వెనక్కి తీసుకుంటున్నారని షెరాజ్ ఆరోపించారు. థియేటర్ల కేటాయింపు వ్యవస్థలో రాజకీయాలు పనిచేస్తున్నాయని, దీనివల్ల చిన్న చిత్రాలు నష్టపోతున్నాయని తెలిపారు.(ఇదీ చదవండి: షాకిచ్చిన సమంత 'బంగారం'.. తొలిరోజు కలెక్షన్స్ ఎన్నికోట్లు?)హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో చిన్న చిత్రాలకు పరిమిత సంఖ్యలో మాత్రమే షోలు ఇస్తున్నారని, అవి కూడా ప్రేక్షకులు తక్కువగా వచ్చే సమయాల్లో కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల సినిమాలు ప్రేక్షకుల దృష్టికి చేరకముందే విఫలమయ్యే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. థియేటర్లతో పాటు ఆడియో రైట్స్, శాటిలైట్ హక్కులు, ఓటీటీ ప్లాట్ఫార్మ్స్, ఓవర్సీస్ మార్కెట్ వంటి అన్ని విభాగాల్లోనూ చిన్న సినిమాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. కొత్త దర్శకులు, నిర్మాతలకు అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.‘ఓ అందాల రాక్షసి’ సినిమా చాలా బాగా వచ్చిందని ప్రివ్యూ చూసిన ప్రతి ఒక్కరూ చెప్పారు. అంత హిట్ సినిమాను కూడా ఇండస్ట్రీ పెద్దలు రానివ్వడం లేదు. ఈ సమస్యపై ఫిల్మ్ చాంబర్లో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన రాలేదన్నారు. భరత్ భూషణ్.. తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. థియేటర్ల కేటాయింపులో జరిగిన అన్యాయంపై పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ సినిమాస్ సంస్థలకు లీగల్ నోటీసులు పంపినట్లు వెల్లడించారు. మొదటి విడుదల సమయంలో సరైన అవకాశాలు లభించి ఉంటే రీ-రిలీజ్ అవసరం వచ్చేది కాదని పేర్కొన్నారు.ఇతర రాష్ట్రాల్లో సినిమాలకు సబ్సిడీలు అందుతున్నాయని, తెలుగు రాష్ట్రాల్లో కూడా చిన్న చిత్రాలకు ప్రత్యేక ప్రోత్సాహక విధానాలు తీసుకురావాలని షెరాజ్ కోరారు. ఇండస్ట్రీలో సమస్యలు ఉన్నప్పటికీ చాలామంది భయంతో బహిరంగంగా మాట్లాడడం లేదని, తాను మాత్రం నిజం కోసం పోరాడుతున్నానని షెరాజ్ తెలిపారు. పరిస్థితులు మారకపోతే తెలుగు చిత్ర పరిశ్రమను విడిచి ఇతర భాషా పరిశ్రమల్లో పనిచేయాలనే ఆలోచన కూడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.(ఇదీ చదవండి: ఇన్‌స్టా నుంచి సినిమాల్లోకి.. ఎవరయ్యా సమంత ఫ్రెండ్?) -
రేవంత్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం
ఆల్మైటి క్రియేషన్స్ ప్రొడక్షన్స్ నెంబర్-1 చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. వాల్లాల రమేష్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. రేవంత్, ఆద్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత విడిగేపల్లి కృష్ణ మొకిలా. విష్ణు మొలకలు నక్షత్ర, కాకర్లముడి రామకృష్ణ కో ప్రొడ్యూసర్స్. రామ్ భరదరం దర్శకత్వం వహిస్తున్నారు.లవ్, ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ సినిమా ఇది. యూత్, ఫ్యామిలీస్‌ని ఆకట్టుకొనేలా సినిమా తీయనున్నట్లు దర్శకుడు రామ్ భరదరం చెప్పుకొచ్చారు. సింగపూర్‌లో సాంగ్స్ చిత్రీకరించబోతున్నారు. హైదరాబాద్, చీరాలలో టాకీ పార్ట్ తీయబోతున్నారు. -
హీరోయిన్గా బుల్లితెర మెగాస్టార్ కూతురు.. సినిమా రెడీ
సతీష్ ఆవాల దర్శకత్వంలో దినేష్ కుమార్ హీరోగా, దివిజ ప్రభాకర్ (ఈటీవీ ప్రభాకర్ కుమార్తె) హీరోయిన్గా పరిచయం అవుతున్న సినిమా 'వెంకట్రామయ్య గారి తాలూకా' విడుదలకు సిద్ధమైంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దివిజ సోదరుడు చంద్రహాస్ ఇప్పటికే హీరోగా ఒకటి రెండు సినిమాలు చేశాడు.(ఇదీ చదవండి: 'వారణాసి' విలన్ కొత్త సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్)ఈ చిత్ర నిర్మాత, ఫోక్ సింగర్ కోమలి మాట్లాడుతూ.. నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని సినిమా రంగం మీద నాకున్న ఇష్టంతో నేను సినిమా తీయాలి అని ఒక ధ్యేయంతో చాలా ఒడుదుడుకులని ఎదుర్కొని వెంకట్రామయ్య గారి తాలూకా మూవీని పూర్తి చేసాం. ఈ సినిమా మొదలయినప్పటి నుంచి కంటినిండా నిద్ర కూడా పట్టేది కాదు. అన్ని కష్టాలు ఎదుర్కుని జులైలో మూవీ విడుదల చెయ్యడానికి రెడీ చేస్తున్నాం అని చెప్పింది.సినిమా విషయానికొస్తే.. అందమైన పల్లెటూరులో వెంకట్రమయ్య అనే పరువు గల కుటుంబంలో జరిగే కథ ఇది. ప్రస్తుతం మనుషుల మధ్య ఉన్న బంధాలు డబ్బుతో ముడిపడ్డాయి. మానవీయ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. తల్లి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను కడుపు కట్టుకుని ఎన్నో కష్టాలను భరిస్తూ పిల్లలను ఎంతో అల్లారు ముద్దుగా నలుగురు పిల్లలను పెంచి పెద్ద చేస్తున్నారు. కానీ తల్లి తల్లిదండ్రుల చివరి దశలో నలుగురు పిల్లలు కలిసి వాళ్ళని పెంచలేకపోతున్నారు. తల్లిదండ్రుల గొప్పతనం తెలియచేసే సినిమా ఇది అని దర్శకుడు సతీష్ ఆవాల చెప్పాడు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 16 సినిమాలు) -
'గాసిప్' నుంచి 'సిప్పు సిప్పు' సాంగ్ రిలీజ్
హీరోయిన్ రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా గాసిప్. వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై యతి నిర్మిస్తున్నారు. నేటి తరానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, అందమైన ప్రేమకథతో సోషల్ సెటైర్‌గా డైరెక్టర్ వైభవ్ కౌండిన్య ఈ చిత్రం తీస్తున్నారు. ఈ మూవీ నుంచి తాజాగా సిప్పు సిప్పు అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు.శక్తి కాంత్ కార్తీక్ స్వరపరిచిన ఈ డాన్స్ ట్రాక్‌కు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు. సింగర్ మాళవిక పాడింది. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి చుట్టూ తిరిగే కథతో యూత్, కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాని తీస్తున్నారు. -
'దేవుడు వరమందిస్తే' సాంగ్.. రీల్స్ చేస్తే ప్రైజ్‌మనీ
ఘంటాడి కృష్ణ దర్శకత్వంలో సందీప్ అశ్వ హీరోగా తెరకెక్కిన యూత్‌ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ 'రిస్క్'. జూన్ 26న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ ఆకట్టుకోగా ఇప్పుడీ చిత్రంలోని 'దేవుడు వరమందిస్తే' అంటూ సాగే మెలోడీ పాటని దర్శకుడు నక్కిన త్రినాథరావు చేతుల మీదుగా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది)ఈ పాటకు సంబంధించి హుక్ స్టెప్‌తో రీల్స్ లేదా డాన్స్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో #DevuduVaramandisthe #RISKMovie #SandeepAshwa ట్యాగ్ చేస్తే బెస్ట్ వీడియోలకు చిత్ర యూనిట్ ప్రత్యేక నగదు బహుమతులు అందజేయనున్నట్లు ప్రకటించింది. ప్రేమ, స్నేహం, యూత్ ఎమోషన్స్, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేసింది.(ఇదీ చదవండి: సిమ్రాన్-విజయ్.. 22 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు) -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వీకెండ్ కూడా అలా వీరభద్రుడు, దృఢం, భూత్ బంగ్లా, రమణి కల్యాణం తదితర చిత్రాలతో పాటు రాఖ్, ష్ సీజన్ 3 లాంటి డబ్బింగ్ సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. మరోవైపు ఓ తెలుగు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కూడా పెద్దగా హడావుడి లేకుండానే అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న రష్మిక.. కొత్త పేరు ఇదే!)2022 అక్టోబరు 28న థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'ఐటెంటిటి'. అమరేష్ రాజు, భాగ్యలక్ష్మి, కుషి ఆనంద్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తీసినప్పటికీ పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడంతో ఇదొకటి వచ్చిందనే సంగతి కూడా జనాలకు తెలిసిరాలేదు. ఇప్పుడీ మూవీ దాదాపు నాలుగేళ్ల తర్వాత అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.'ఐడెంటిటి' విషయానికొస్తే.. రిషిదేవ్ ఓ ఎన్సీబీ అధికారి. ఓ ప్రమాదంలో తన జ్ఞాపకశక్తి కోల్పోతాడు. అదే టైంలో హరన్ అనే వ్యక్తి డ్రగ్ రాకెట్ నడుపుతున్నట్లు అధికారులు గుర్తిస్తారు. అయితే హరన్ ఎవరో కాదు గతం మర్చిపోయిన రిషిదేవ్ అనే సంగతి తెలుస్తుంది. తర్వాత ఏమైంది అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘దృఢం’ రివ్యూ.. ఇదేం ట్విస్టులురా బాబు.. ఊహించడం కష్టం!) -
ఓటీటీలోకి తెలుగు సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా ధురంధర్, పేట్రియాట్, కేడీ, కార్మేని సెల్వం, 29, మా బెహన్, ద రైజ్ ఆఫ్ అశోక లాంటి తెలుగు డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. తాజాగా మరో తెలుగు చిత్రం ఓటీటీ రిలీజ్ గురించి అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా ఏంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: 'బ్లాస్ట్' సినిమా ఊహించని సక్సెస్.. అలానే కలెక్షన్స్ కూడా)జో శర్మ అనే ఇండో-అమెరికన్ నటి ప్రధాన పాత్ర పోషించిన తెలుగు సినిమా 'ఎమ్4ఎమ్'. మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించారు. సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీ మే 8న థియేటర్లలో రిలీజైంది. కానీ పేరున్న నటీనటులు లేకపోవడం, కథాకథనాలు ఏమంత గొప్పగా లేకపోవడంతో జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం ఈ నెల 19 నుంచి లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్‌లోకి కూడా రావొచ్చు.'ఎమ్4ఎమ్' విషయానికొస్తే.. హైదరాబాద్‌లో స్టార్ హీరో రంజిత్ (కృష్ణతేజ) హత్యకు గురవుతాడు. ఓ సీరియల్ కిల్లర్ ఇతడిని చంపేసి, పెయింటింగ్ ఆకారంలో న్యూడ్‌గా పెడతాడు. ఈ కేసుని ఏసీపీ కృష్ణ(సంబీత్ ఆచార్య) దర్యాప్తు చేస్తుంటాడు. ఇతడి భార్య రాధ (జో శర్మ) ఓ న్యూస్ ఛానెల్లో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా పనిచేస్తుంటుంది. భార్యభర్తలిద్దరూ కలిసి ఈ కేసులో విచారణ చేస్తుంటారు. కిల్లర్ మాత్రం వీళ్లకు దొరక్కుండా వరస హత్యలు చేస్తుంటాడు. ఎక్కడెక్కడ చంపబోతున్నానని చెప్పి ముందే పోలీసులకు వాయిస్ మెసేజ్ పంపి సవాలు విసురుతాడు. ఇంతకీ ఈ సీరియల్ కిల్లర్ ఎవరు? హత్యల వెనకున్న కారణమేంటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
3 వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
ఓటీటీలోకి ఈ వారం చాలానే సినిమాలు వచ్చాయి. ధనుష్ 'కర', శరవణన్ 'లీడర్', సత్య 'జెట్ లీ', డ్రింకర్ సాయి, సచిన్ బయోపిక్ తెలుగు వెర్షన్‌తో పాటు హాలీవుడ్ హారర్ మూవీ 'ద మమ్మీ' అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు వీటికి తోడుగా ఇదే నెలలో రిలీజైన తెలుగు మూవీ కూడా సైలెంట్‌గా స్ట్రీమింగ్ అయిపోతోంది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన హరర్ సినిమా.. తెలుగులోనూ)'మేమ్ ఫేమస్' సినిమాతో హీరో, దర్శకుడిగా ఆకట్టుకున్న సుమంత్ ప్రభాస్.. చాన్నాళ్లు గ్యాప్ తీసుకుని చేసిన మూవీ 'గోదారి గట్టుపైన'. నిధి ప్రదీప్ హీరోయిన్ కాగా 100కి పైగా షార్ట్ ఫిల్మ్స్ తీసిన సుభాష్ చంద్ర.. ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. జగపతిబాబు, లైలా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈనెల 08న థియేటర్లలో రిలీజ్ కాగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక ఫ్లాప్ అయింది. ఇప్పుడిది ఎలాంటి హడావుడి లేకుండానే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.'గోదారి గట్టుపైన' విషయానికొస్తే.. రాజు (సుమంత్ ప్రభాస్) ఆటో డ్రైవర్. పదో తరగతి మధ్యలోనే ఆపేసి కుటుంబం, ఫ్రెండ్స్‌తో హ్యాపీగా బతికేస్తుంటాడు. తన చెల్లితో ఇంజినీరింగ్ చదువుతున్న మాయ(నిధి ప్రదీప్)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా రాజుని ప్రేమిస్తుంది. మరోవైపు తన కూతురు మాయ అంటే శ్యాంబాబు(జగపతిబాబు)కి ప్రాణం. సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసే ఈయన తన కూతురుకి తనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడితోనే పెళ్లి జరిపిస్తానని చెబుతుంటాడు. మరి ఇంజినీరింగ్ చదువుతున్న కూతురు ఓ ఆటోడ్రైవర్ని ప్రేమించిందని తెలిశాక శ్యాంబాబు ఏం చేశాడు? కూతురు ప్రేమని అంగీకరించాడా లేదా? చివరకు ఏమైందేనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లో 16 సినిమాలు స్ట్రీమింగ్) -
'జాతిరత్నాలు' సినిమాలా ఇది గుర్తుండిపోతుంది
కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి నిర్మాతగా అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో మొదలైన సినిమా 'లఫూట్ గ్యాంగ్'. హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోస్‌లో బుధవారం ఉదయం పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు పవన్ సాధినేని, నిర్మాత బీవీఎస్ రవి, రాజ్ తరుణ్, ఆకాష్ పూరీ తదితరులు విచ్చేశారు.(ఇదీ చదవండి: చాలా భయమేస్తోంది.. ఇలానే అయితే ఏం సినిమాలు తీయాలి?)ఇందులో నటిస్తున్న అంటోనీ కార్తీక్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా 'జాతిరత్నాలు' తరహాలో అందరికీ గుర్తుండిపోతుందని అన్నారు. 1990ల్లో ఓ హాస్టల్లో జరిగే కథగా ఈ చిత్రం తెరకెక్కనుంది. అల్లరి చిల్లరిగా ఉండే యువకుల గ్యాంగ్.. హాస్టల్లో ఎలా ఉంటారు? వారి హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది అనే కథనాలతో ఈ సినిమా ఉండబోతుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.(ఇదీ చదవండి: 'పెద్ది' వివాదం.. చిరు జోక్యంతో సద్దుమణిగింది) -
తెలుగులో చాన్నాళ్ల తర్వాత పిల్లల సినిమా.. టీజర్ రిలీజ్
తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల మూవీస్ దగ్గర నుంచి పిల్లల చిత్రాల వరకు అన్ని రకాలవి వచ్చేవి. ప్రస్తుతం మాత్రం కమర్షియల్, రెగ్యులర్ సినిమాలే ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. వీటికి మొహం మొత్తేసిన ప్రేక్షకులు కూడా థియేటర్‌కి వచ్చే ఆసక్తి చూపించట్లేదు. అయితే చాన్నాళ్ల తర్వాత టాలీవుడ్లో ఓ పిల్లల మూవీ వచ్చేస్తోంది. దాని పేరు 'సమ్మర్ హాలీడేస్'. తాజాగా దీని టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. ఏడాదిన్నరకు స్ట్రీమింగ్)ఇప్పుడంటే వేసవి వస్తే పిల్లలందరూ సమ్మర్ క్యాంపుల పేరిట బిజీ అయిపోతున్నారు గానీ ఒకప్పుడు అమ్మమ్మ ఊరికి వెళ్లేవాళ్లు. ఆ జ్ఞాపకాలని గుర్తుచేసేలా ఈ సినిమాని తీసినట్లు తెలుస్తోంది. పట్నంలో ఉండే ఓ పిల్లాడు.. వేసవిలో అమ్మమ్మ ఉండే పల్లెటూరికి వెళ్తాడు. అక్కడ ఈ పిల్లాడికి మరో అల్లరి పిల్లాడు పరిచయమవుతాడు. తర్వాత వీళ్లిద్దరూ ఎలాంటి సందడి చేశారనేదే స్టోరీ అనిపిస్తుంది. రోహన్, అరుణ్ లీడ్ రోల్స్ చేశారు. త్వరలో థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.(ఇదీ చదవండి: కళ్లు తెరిపించే కోర్ట్ రూమ్ సినిమా.. ఓటీటీ తెలుగు రివ్యూ) -
టాలీవుడ్ హీరోగా.. హీరోయిన్ నివేదా థామస్ తమ్ముడు
తెలుగులో నిన్నుకోరి, జెంటిల్‌మేన్, 35 ఇది చిన్న కథ కాదు, జై లవకుశ తదితర సినిమాల్లో హీరోయిన్గా చేసి గుర్తింపు తెచ్చుకున్న నివేదా థామస్ తమ్ముడు ప్రస్తుతం తెలుగులో హీరోగా చేస్తున్నాడు. 'బెంగుళూరు మహానగరం లో బాలక'తో టాలీవుడ్లోకి వస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర మొదటి షెడ్యూల్ పూర్తయింది.(ఇదీ చదవండి: అదిరిపోయే శుభవార్త చెప్పేసిన సీఎం విజయ్)మంత్ర మూవీ మేకర్స్ , ఫాల్కన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మహి-రాజ్ ద్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఫస్ట్ లుక్‌ని ప్రియదర్శి చేతుల మీదుగా విడుదల చేశారు. తెలుగు కుర్రాడు.. బెంగళూరులో ఎదుర్కొనే కష్టాల నేపథ్యంతో వినోదభరితమైన కథగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. వరంగల్, హనుమకొండ పరిసర ప్రాంతాల్లోనూ షూటింగ్ చేశారు. (ఇదీ చదవండి: జాన్వీ కపూర్ బెస్ట్ వెయిట్ లాస్ టిప్.. పూటలోనే బక్కగా అయిపోతారు) -
'విశ్వంభర' డైరెక్టర్ సోదరుడు దర్శకుడిగా ఎంట్రీ
చిరంజీవితో 'విశ్వంభర' తీసిన దర్శకుడు వశిష్ట సోదరుడు కృష్ణ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'తక్షక'. కుశాల్ రాజు హీరోగా పరిచయమవుతున్నాడు. డా.లతారాజు నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ డ్రామా కథతో రూపొందుతున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర పోస్టర్ని స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ లాంచ్ చేశారు.(ఇదీ చదవండి: లేడీ యూట్యూబర్‌పై కేసు పెట్టిన యాంకర్ విష్ణుప్రియ)చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలిసిన కుర్రాడు కృష్ణ. ఫస్ట్ టైమ్ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీ చాలా బాగుండాలి, ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలి అని వినాయక్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా ఇంత త్వరగా పూర్తయి దర్శకుడిగా నేను మీ ముందుకు రావడం ఎగ్జైటింగ్‌గా ఉంది. సీజీ వర్క్ పూర్తిచేసి ఒక గొప్ప మూవీని మీకు అందించబోతున్నాం అని డైరెక్టర్ కృష్ణ మల్లిడి అన్నారు.(ఇదీ చదవండి: ఒకే ఓటీటీలోకి వచ్చిన మూడు తెలుగు సినిమాలు) -
చూపులేని హీరోయిన్.. నడవలేని హీరో
ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు భారీ యాక్షన్, హంగామా కంటే మనసుకు దగ్గరయ్యే కథలకే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండే క్లీన్ ఎమోషనల్ ఎంటర్టైనర్స్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటి ఓ మూవీ 'రమణీ కళ్యాణం'. ఇప్పటికే టీజర్, టైటిల్ సాంగ్‌తో ఆకట్టుకోగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఆస్పత్రిలో అమితాబ్? మౌనంగా ఉంటే ఇలాగే రెచ్చిపోతారు!)కోల్పోయిన ప్రతి వారి దగ్గర ఒక కథ ఉంటుంది అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. సంజన ఆర్జే & సింగర్. తనకి చుపులేదు. మరోవైపు నడవలేని స్థితిలో ఉంటాడు రాజ్. ఈ రెండు పాత్రల మధ్య ప్రేమ ఎలా పుట్టింది? చివరకు ఏమైందనేదే కాన్సెప్ట్. విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహించారు. సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్ హీరోహీరోయిన్లుగా నటించారు. 'కోర్ట్' ఫేం రామ్ జగదీష్ డైలాగ్స్ రాశారు. మే 22న అంటే ఈ శుక్రవారమే సినిమా థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: జూ.ఎన్టీఆర్ ఆస్తి ఎంత? ఖరీదైన కార్ల కలెక్షన్ ఏంటి?) -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారమైతే లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి'తో పాటు జ్యోతిక 'సిస్టమ్', మధువిధు, మేం కాప్‌లం లాంటి డబ్బింగ్ మూవీస్, సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. అలానే డ్రీమ్ క్యాచర్, భీంసేరి లాంటి చోటా చిత్రాలు అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడీ లిస్టులోకి మరో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా చేరింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: రాజకీయాల్లోకి నా భార్య.. మంచు మనోజ్ స్టేట్మెంట్)అధ్విక్ అలియాస్ రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనక్షిత తదితరులు ప్రధాన పాత్రలు చేసిన తెలుగు సినిమా 'పైసా వాలా'. కె.నవీన్ తేజస్ దర్శకత్వం వహించాడు. గతేడాది డిసెంబరు 12న థియేటర్లలోకి వచ్చింది. రూ.10 హవాలా నోటు చుట్టూ తిరిగే స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. కానీ స్టార్స్ లేకపోవడంతో దీన్ని జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె విధానంలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది.'పైసా వాలా' విషయానికొస్తే.. హవాలా నోటు తీసుకొస్తున్న ఎమ్మెల్యే బామ్మర్దికి యాక్సిడెంట్ అవుతుంది. తర్వాత అతడి ఫోన్, పర్స్ మిస్ అవుతుంది. అందులోనే హవాలా నోటు ఉంటుంది. పసుపు అంటిన సదరు పది రూపాయల నోటు కోసం వేరు వేరు గ్యాంగులు తిరుగుతుంటాయి. ఈ క్రమంలోనే బెరిదింపులు, హత్యలు కూడా జరుగుతాయి. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు) -
గర్ల్‌ఫ్రెండ్ బానిస కాదు.. కొత్త తెలుగు సినిమా
టాలీవుడ్ ప్రముఖ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకుడిగా మారారు. ఇప్పటివరకు పాటల రచయిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన టాక్సిక్ రిలేషన్స్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో వస్తున్నారు. ఆ మూవీ పేరే 'లలిత'. కాస్మిక్ పవర్ క్రియేట్స్ LLP బ్యానర్‌పై పి. సుధీర్ రాజు, డి.వైష్ణవి నేహా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో నందిని హీరోయిన్గా, అభిలాష్ పీలా, అఖిల్ వివాన్ హీరోలుగా పరిచయమవుతున్నారు.మణి, నాగరాజు సంయుక్తంగా సంగీతమందిస్తుండగా.. ఇందులో రఘుబాబు, పృథ్వీ రాజ్, తాగుబోతు రమేష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. తన వ్యక్తిత్వం కోసం నిలబడే ఓ మహిళ కథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 'గర్ల్‌ఫ్రెండ్ అంటే బానిస కాదు' అనే క్యాప్షన్ ఆసక్తి కలిగిస్తోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా తిమ్మరాజుపల్లి టీవీ, తెరచాప, బ్యాడ్ బాయ్ కార్తీక్, మిస్టర్ ఎక్స్, కాళిదాస్ 2, కర్తవ్య లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్‌తో పాటు ఎగ్జామ్ లాంటి డబ్బింగ్ సిరీస్ కూడా అందుబాటులోకి వచ్చింది. 'ధురంధర్ 2' అయితే విదేశాల్లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇప్పుడు వీటికి తోడుగా మరో తెలుగు చిత్రం కూడా వచ్చేసింది.(ఇదీ చదవండి: అర్ధరాత్రి నడిరోడ్డుపై దీన స్థితిలో పావలా శ్యామల)వజ్రయోగి, శ్రేయ భర్తీ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'Cమంతం'. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. సుధాకర్ పాణి దర్శకత్వం వహించాడు. గతేడాది నవంబరు 14న థియేటర్లలోకి వచ్చింది. కానీ స్టార్స్ లేకపోవడం స్టోరీ అంతంత మాత్రంగా ఉండేసరికి ఆడియెన్స్ దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం తాజాగా రెంట్ పద్ధతిలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.'Cమంతం' విషయానికొస్తే.. నగరంలో గర్భిణులని వరుసగా హత్య చేస్తుంటారు. ఈ దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారు? అనే విషయాలు పోలీసులకు కూడా అంతుచిక్కవు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ డిటెక్టివ్‌గా ఉన్న హీరో (వజ్రయోగి) ఈ కేసును ఎలా టేకప్ చేశాడు? అసలు హంతకుడు ఎవరు? వారి వెనుక ఉన్న ఫ్లాష్‌బ్యాక్ ఏమిటనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రవిని వదిలేస్తున్నా.. ట్రోలింగ్ తట్టుకోలేక హీరోతో సింగర్ బ్రేకప్!) -
నారా రోహిత్ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)
-
సైలెంట్‌గా మొదలు పెట్టేసిన కార్తి
ప్రస్తుతం తెలుగు దర్శకనిర్మాతలు తమిళ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటే.. తమిళ హీరోలు కూడా తెలుగు దర్శకులతో పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంలో శివకార్తికేయన్, ధనుష్, విజయ్ తదితరులు తెలుగు దర్శకులతో మూవీస్ చేశారు. సూర్య కూడా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'విశ్వనాధ్ అండ్ సన్స్'లో నటించారు. ఇది త్వరలోనే థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ఇకపోతే సూర్య తమ్ముడు కార్తీ ఇంతకు ముందే నాగార్జునతో కలిసి 'ఊపిరి'లో నటించారు. ఆ చిత్రం తమిళంలో తోళా పేరుతో విడుదలయ్యింది. కార్తీ ఇప్పుడు మరోసారి తెలుగు దర్శకుడితో కలిసి పని చేస్తున్నాడు. ప్రస్తుతం సర్ధార్ 2 పూర్తి చేసిన ఇతడు.. తమిళ్ దర్శకత్వంలో 'మార్షల్'లో నటిస్తున్నాడు. దీని తరువాత తెలుగు దర్శకుడు కల్యాణ్ శంకర్ తీస్తున్న ద్విభాషా చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యాడు.ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయని ఇందులో కార్తీకి జంటగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నట్లు తెలిసింది. యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి సంబంధించిన వివరాలను ప్రస్తుత తమిళ రాజకీయ పరిస్థితులు కారణంగా వెల్లడించలేదని తెలిసింది. ఈ సినిమా డీటైల్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారని తెలుస్తోంది.(ఇదీ చదవండి: రాధిక కంటే నేనే బాగా చేసేదాన్ని: షకీలా) -
'అరేయ్ ఆపండ్రా' ట్రైలర్ రిలీజ్
అశోక్ నిమ్మల నిర్మించిన కామెడీ థ్రిల్లర్ సినిమా 'అరేయ్ ఆపండ్రా'. తల్లాడ సాయి కృష్ణ లీడ్ రోల్ చేయడంతో పాటు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ట్రైలర్, పోస్టర్ని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తాజాగా విడుదల చేశారు.సుదర్శన్, భద్రం, తల్లాడ సాయి కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గణేష్ భారీ ద్వారా మే 15న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తమ ఆనందాన్ని పంచుకుంది.ఈ సమ్మర్లో అందరికీ మంచి కూల్ సినిమా ఇది అవుతుందని ఆశిస్తున్నాను. నవ్విస్తూనే భయపెట్టే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సస్పెన్స్, కామెడీ థ్రిల్లర్ ఇది. సెన్సార్ సభ్యులు కూడా సినిమాని చూసి ప్రత్యేకంగా మెచ్చుకున్నారని నటుడు-దర్శకుడు సాయికృష్ణ చెప్పుకొచ్చాడు. -
పవన్ కల్యాణ్ 'పురుషః' రిలీజ్‌కి రెడీ
పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'పురుషః'. బత్తుల కోటేశ్వరరావు నిర్మించగా వీరు వులవల దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్‌తో పాటు సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలు చేశారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు విడుదల తేదీని ప్రకటించారు. ఈ నెల 22న థియేటర్లలోకి రాబోతున్నట్లు ప్రకటిస్తూ ప్రెస్‌మీట్ నిర్వహించారు.హీరో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 'పురుష:' కోసం సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నేను ఇలా ఈ స్టేజ్ మీద నిల్చున్నానంటే దానికి మా నాన్న గారే కారణం. అందరూ మా సినిమాని చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానని అన్నాడు. ఇక దర్శకుడు వీరు మాట్లాడుతూ .. మళ్లీరావా, జెర్సీ, మసూద సినిమాలకు పనిచేశాను. నేను ఈ కథని ఎలా అనుకున్నానో అలానే తీశాను. వేసవి కానుకగా మా సినిమాని రిలీజ్ చేస్తున్నాం. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానని చెప్పాడు. -
హాలీవుడ్ మేకింగ్‌తో తెలుగు సినిమా 'ది మానిటి.ఇన్'
టాలీవుడ్ చిత్ర పరిశ్రమ స్థాయిని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లే లక్ష్యంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన 'ది మానిటి.ఇన్' చిత్రం పట్టాలెక్కడానికి సిద్ధమైంది. డైరెక్టర్ బీఎస్ రావు.. వందల కోట్లను మాత్రమే కాకుండా, వేల కోట్ల వసూళ్లను టార్గెట్ చేసుకుని ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ చిత్రాల తరహాలో ఉండబోయే ఈ సినిమా, టాలీవుడ్ మేకింగ్ స్టైల్‌ను పూర్తిగా మార్చేస్తుందని చిత్ర దర్శకుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీఎఫ్ఎక్స్ విభాగంలో అనుభవం ఉండడంతో టాలీవుడ్లో మొట్టమొదటిసారిగా ఈ చిత్రాన్ని ఐమాక్స్ 8K ఫార్మాట్లో రూపొందించాలని నిర్ణయించుకున్నారు.సాధారణంగా హాలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితమైన ఈ ఫార్మాట్‌ను ఇక్కడ పరిచయం చేయడం ద్వారా ప్రేక్షకులకు ఒక వినూత్నమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు. టెక్నాలజీ పరంగా రాజీ పడకుండా, ప్రతి ఫ్రేమ్‌ను ఒక విజువల్ పోయెట్రీలా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ చిత్ర కాన్సెప్ట్ గురించి దర్శకుడు బీఎస్ రావు మాట్లాడుతూ, మానవత్వం (Humanity) విఫలమైనప్పుడు 'మానిటీ' (MANITY) ఏం చేస్తుంది అనే ఒక విలక్షణమైన పాయింట్‌తో ఈ కథ సాగుతుందని వివరించారు. -
రాయవలస రాధిక అనిపించుకుంటాను
కార్తీక్‌ని హీరోగా పరిచయం చేస్తూ అతని తండ్రి నిర్మాతగా, తల్లి డైరెక్టర్‌గా 'రాయవలస' సినిమా చేయడం ఆనందంగా అనిపించింది. టీజర్ చాలా బాగుంది. కార్తీక్‌కి యాక్టింగ్, సింగింగ్, ప్రొడక్షన్... ఇలా అన్ని విషయాల్లో మంచి అవగాహన ఉంది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నానని హీరో ఆకాశ్ జగన్నాథ్ అన్నారు. కార్తీక్ జయంతిని హీరోగా పరిచయం చేస్తూ రాధిక జయంతి దర్శకత్వంలో గోపీకృష్ణ .జె నిర్మించిన చిత్రం 'రాయవలస'. ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆకాశ్ జగన్నాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.మరో అతిథిగా విచ్చేసిన కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. తల్లి డైరెక్షన్, తండ్రి ప్రొడక్షన్, కొడుకు హీరోగా చేయడం విశేషం. 11 ఏళ్లుగా వీళ్లు షార్ట్ ఫిలిమ్స్, మ్యూజిక్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఇప్పుడు సినిమాతో వస్తున్నారు. ఇలాంటి క్వాలిటీని ఈ పదిహేనేళ్లల్లో ఏ ఎన్నారైలోనూ చూడలేదు. వాళ్లు పడిన కష్టానికి ఫలితం దక్కుతుందని నమ్ముతున్నానని అన్నారు.నా కలను తమ కలగా మార్చుకుని, నాతో సినిమా చేసిన మా అమ్మానాన్నకు థ్యాంక్స్. నిజంగా జరిగిన ఒక ఘటనను ఆధారంగా చేసుకుని తీసిన ఈ సినిమాకి అందరూ కనెక్ట్ అవుతారని నమ్ముతున్నానని కార్తీక్ చెప్పారు. ఈ సినిమాకి మంచి కథ ఇచ్చిన రాఖీకి థ్యాంక్స్. కార్తీక్‌కి చిన్నప్పట్నుంచి సినిమాలంటే ఇష్టం. కథ నచ్చి, నా భర్త ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాతో 'రాయవలస' రాధికగా గుర్తింపు తెచ్చుకుంటాననే నమ్మకం ఉందని రాధిక జయంతి అన్నారు. పదేళ్ల క్రితమే షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు, ఇండిపెండెంట్ సాంగ్స్ చేశాం. ఇప్పుడు సినిమాతో వస్తున్నామని గోపీకృష్ణ .జె అన్నారు. -
'రాయవలస' మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఓటీటీలోకి వచ్చేసిన యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా
టీవీ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్.. చిత్రమైన మేనరిజంతో యాటిట్యూడ్ స్టార్‌గా సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్నాడు. 'రామ్‌నగర్ బన్నీ' అనే సినిమాతో కొన్నాళ్ల క్రితం హీరోగా పరిచయం కాగా అది ఘోరంగా ఫ్లాప్ అయింది. దీంతో ఈసారి విలేజ్ రొమాంటిక్ మూవీతో ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలోకి వచ్చాడు. దీన్ని జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం ఏ మాత్రం సౌండ్ చేయకుండా ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 10 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)చంద్రహాస్, మేఘనా ముఖర్జీ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'బరాబర్ ప్రేమిస్తా'. ఈ చిత్ర ప్రమోషన్లలో 'గుంజి గుంజి' అనే బూతు పాట పాడిన చంద్రహాస్.. ఓ జర్నలిస్టుతో సోషల్ మీడియా వేదికగా గొడవపడ్డాడు. దీంతో ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నాడు. అలా ఈ మూవీ వార్తల్లో నిలచింది. కానీ ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజైతే ఒక్కరు కూడా పట్టించుకోలేదు. దాదాపు మూడు నెలల తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది.'బరాబర్ ప్రేమిస్తా' విషయానికొస్తే.. రుద్రారం అనే ఊరిలో ధర్మాని, కర్మాని అనే రెండు కులాలు ఉంటాయి. కొన్ని దశాబ్దాలుగా వీళ్లకు పడదు. ఎప్పుడూ గొడవలే. ఇదే గ్రామానికి చెందిన చందు(చంద్రహాస్), బుజ్జమ్మ (మేఘన ముఖర్జీ) ప్రేమించుకుంటారు. బుజ్జమ్మ తండ్రి సర్పంచ్ కాగా చందు తండ్రి సర్పంచ్‌గా ఓడిపోతూ ఉంటారు. ప్రారంభంలో చందు- బుజ్జమ్మ కొట్టుకుంటారు కానీ తర్వాత ప్రేమించుకుంటారు. ఇదే ఊళ్ళో ఉంటే పెళ్లి జరగదు అని ఇద్దరూ లేచిపోయి కేరళ వెళ్తారు. మరి చందు – బుజ్జమ్మ కేరళలో పెళ్లి చేసుకుంటారా? మళ్ళీ రుద్రారంకు ఎందుకు తిరిగి వస్తారు? రెండు కులాల వాళ్ళు కలుస్తారా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఏడుగురు సీఎంలతో నటించిన ఏకైక నటి.. ఇంతకీ ఎవరీమె?) -
నవ్వడమే కాదు నవ్వించడం కూడా మరిచిపోతున్నారు
'నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వకపోవడం ఒక రోగం'.. ఈ సామెత మీలో చాలామంది వినే ఉంటారు. కానీ మీలో ఎంతమంది మనస్పూర్తిగా ఓ సినిమా చూసి నవ్వుతున్నారు? అని అడిగితే చాలామంది దగ్గర సమాధానముండదు. ఎందుకంటే జీవితంలో ఎవరికి వాళ్లు బిజీ అయిపోతున్నారు. నవ్వడం అనే విషయాన్ని రోజురోజుకీ మర్చిపోతున్నారు. ఒకప్పుడు బాధల్ని కాసేపు పక్కనబెట్టి మనసారా నవ్వుకునేందుకు సినిమాకు వెళ్లేవాళ్లు. ఎంజాయ్ చేసి వచ్చేవాళ్లు. కానీ ఇప్పుడొస్తున్న తెలుగు సినిమాల్లో కామెడీ అరుదుగా మారిపోయింది. దాదాపు కనుమరుగైపోయే స్థితికి వచ్చేసింది. ఇంతకీ అసలేం జరుగుతోంది?ఒకప్పుడు తెలుగులో ఏడాదికి కనీసం 20-30 సినిమాలైనా కామెడీవి వచ్చేవి. ఇప్పుడెన్ని వస్తున్నాయి అంటే ఒకటో రెండో అని వేళ్ల మీద లెక్కపెట్టే పరిస్థితి. దీనికి చాలా కారణాలున్నాయి. హీరోల దగ్గర నుంచి ప్రేక్షకుల వరకు ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యులే. ఎందుకంటే స్టార్ హీరోలైన చిరంజీవి, వెంకటేశ్, మహేశ్ బాబు, నాగార్జున, అల్లు అర్జున్, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు తమ తమ సినిమాల్లో కొంత మేర అయినా కామెడీ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ కత్తి పట్టి విలన్లని నరకడమే పనిగా పెట్టుకున్నట్లున్నారు. దర్శకులు కూడా అలానే తయారవడం ఆందోళన కలిగిస్తోంది.అహ నా పెళ్లంట, జంబలకడిపంబ, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మథుడు.. కామెడీ కోసం ఇప్పటితరం కూడా పాత సినిమాల్నే చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడొచ్చే వాటిలో సరైన కామెడీ ఉండట్లేదు. ఉన్నా సరే క్రింజ్, సిల్లీ కామెడీ ఉంటున్నాయి. వాటికి జనాలు నవ్వకపోగా దాన్ని చూసి కామెడీ ఇలా ఉందేంటి అని మరోలా నవ్వుకుంటున్నారు.ఒకప్పుడు బ్రహ్మానందం, అలీ, వేణు మాధవన్, ధర్మవరపు సుబ్రమణ్యం, ఈవీవీ, సునీల్.. ఇలా చెప్పుకొంటూ పోతే పదుల సంఖ్యలో హాస్య నటులు ఉండేవారు. వీళ్ల కోసం రచయితలు.. ఆయా సినిమాల్లో సెపరేట్‌గా కామెడీ ట్రాక్స్ రాసేవాళ్లు. అవి ఎంతలా వర్కౌట్ అయ్యేవి అంటే ఇప్పటికీ 'సొంతం' మూవీ అంటే సునీల్ మాత్రమే గుర్తొంచేంతలా. ఇందులో సునీల్ హీరో కాదు గానీ అంతలా అందరికీ గుర్తుండిపోయాడు.దూకుడు లాంటి సినిమాల్లోనూ హీరోకి సరిసమానంగా బ్రహ్మానందం పాత్ర ఉండే విషయం మర్చిపోకూడదు. ఇంకాస్త వెనక్కి వెళ్తే ఈవీవీ సత్యనారాయణ లాంటి దర్శకులు తమ సినిమాల్లో దాదాపు కమెడియన్లు అందరినీ పెట్టి అద్భుతంగా నవ్వించేవాళ్లు.కానీ ఇప్పటి దర్శకులకు సరైన కామెడీ రాయడం చేతకావట్లేదు! ఒకవేళ రాసినా సరే ఎక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతింటాయోనని భయపడి చస్తున్నారు. ఎందుకీ బాధ అని ప్రతిఒక్కరూ రక్తపాతం టైపు స్టోరీలే తీస్తున్నారు. ఒకప్పుడు కోన వెంకట్ లాంటి రచయితలు శ్రీనువైట్ల లాంటి దర్శకుల దగ్గర ఉండేవారు. కానీ ఇప్పుడొస్తున్న దర్శకులంతా క్రెడిట్ అంతా తమకే దక్కాలని చూస్తూ రైటర్స్‌ని పెద్దగా ప్రోత్సాహించకపోవడం కూడా కామెడీ తగ్గిపోవడానికి కారణమని చెప్పొచ్చు.ప్రేక్షకుల విషయానికొస్తే ఒకప్పుడు సినిమాలో కామెడీని కామెడీగా మాత్రమే చూసేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఏమైనా తేడా అనిపిస్తే ట్రోల్ చేసిపడేస్తున్నారు. లేదంటే క్రింజ్ కామెడీ అని ముద్రవేస్తున్నారు. మరోవైపు మొబైల్లోని యూట్యూబ్ షార్ట్స్, ఇన్ స్టా రీల్స్‌లో కనిపించే ఫాస్ట్ కామెడీకి అలవాటు పడిపోయి సినిమాల్లో నిదానంగా బిల్డ్ అయ్యే కామెడీని ఓపికతో చూడలేకపోతున్నారు. ఇలా అన్నివైపుల నుంచి పలు సమస్యల వల్ల హాస్యం అనేది ఎక్కడా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై తెలుగు దర్శకనిర్మాతలు కాస్త దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. లేదంటే కొన్నాళ్లకు పూర్తిగా కామెడీ ఇక కనిపించదేమో? -
విడుదలకు సిద్ధమైన 'కృష్ణావతారం పార్ట్ 1'
'కృష్ణావతారంపార్ట్ 1' సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమైంది. ఈ గురువారం(మే 07) థియేటర్లలోకి రానుంది. అత్యంత మహత్తరమైన దివ్యగాథతో తీసిన ఈ చిత్రంలో కృష్ణుడిగా సిద్ధార్థ్ గుప్తా సత్యభామగా సంస్కృతి జయన నటించారు. రాధగా సుస్మితా భట్, రుక్మిణిగా నివాసి కృష్ణన్ కనిపించబోతున్నారు.హార్దిక్ గజ్జర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సజన్ రాజ్ కురుప్, శోభాసాంత్, పూనం ష్రాఫ్, పార్థ్ గజ్జర్ నిర్మాతలుగా వ్యవహరించారు. నిర్మాతరాజ్ కురుప్ మాట్లాడుతూ.. ఈ చిత్రం ఆశయంతో పాటు బాధ్యతని మోసుకుని వస్తోంది. మనం లోతైన సాంస్కృతిక జ్ఞాపకాలలో ఉన్న కథని చెబుతున్నప్పటికీ, దాన్ని ఎంతో ఆత్మీయమైన మానవీయకోణంలో చూపించేందుకు ప్రయత్నిస్తున్నాం. కృష్ణుడి ప్రయాణాన్ని సత్యభామ కళ్ల ద్వారా అనుభవించి ప్రేక్షకులు బయటకు వస్తే ఈ మూవీకి మేము న్యాయం చేసినట్టే' అని చెప్పుకొచ్చారు. ఈ కథ సత్యభామ కళ్ల ద్వారా ఆవిష్కృతమవుతూ కృష్ణుడి ప్రయాణం, అతని సంబంధాలు, భావోద్వేగ ప్రపంచాన్ని ప్రేక్షకులకు కొత్తగా, ఆత్మీయంగా చూపిస్తుంది. -
వరలక్ష్మి 'పోలీస్ కంప్లైంట్' రిలీజ్ ఎప్పుడంటే?
విలనిజం, క్యారెక్టర్ రోల్.. ఏదైనా సరే తనదైన నటనతో ఆకట్టుకునే వరలక్ష్మి శరత్‌కుమార్ కొత్త సినిమా విడుదలకు సిద్ధమైంది. నవీన్ చంద్రతో కలిసి నటించిన 'పోలీస్ కంప్లైంట్'.. మే 22న థియేటర్లలోకి రానుంది. సంజీవ్ మేగోటీ దర్శకుడు. బాలకృష్ణ మహారాణా నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కృష్ణసాయి నటించారు. ఇతడి బర్త్ డే సందర్భంగా తన అభిమాన నటుడు సూపర్‌స్టార్ కృష్ణపై ఈ సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్‌ని విడుదల చేశారు.(ఇదీ చదవండి: లేటెస్ట్ తెలుగు సినిమాలు.. తొలిరోజు కలెక్షన్స్ ఎంత?)'చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ' కాన్సెప్ట్ ఆధారంగా సినిమా తీశాం. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్. దీనికి హారర్ థ్రిల్లర్ అంశాలను జోడించి మునుపెన్నడూ చూడని సరికొత్త అనుభూతిని అందించబోతున్నాం. ఈ చిత్రంలో రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్ తదితరులు కీలక పాత్రలు చేశారు. మొత్తం 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో భారీ స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కించారు.(ఇదీ చదవండి: ఆ డైరెక్టర్ 10 సార్లు లైంగికంగా వేధించాడు: మోనాలిసా) -
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా
హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి సినిమాలతో కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేశ్ బాబు.. ప్రస్తుతం నాని 'ప్యారడైజ్' మూవీలో బిర్యానీ అనే పాత్ర చేస్తున్నాడు. ఇది కాకుండా అడపాదడపా చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. అలా గతేడాది ఓ కామెడీ సినిమాతో రాగా అది ఇప్పుడు దాదాపు ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ దాని సంగతేంటి? ఎందులోకి రానుందనేది చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)సంపూర్ణేశ్ బాబు, సంజోష్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రొమాంటిక్ కామెడీ సినిమా 'సోదరా'. తెలంగాణలోని పల్లెటూరి నేపథ్యంగా సాగే కథతో దీన్ని తీశారు. గతేడాది ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాగా ప్రేక్షకుల్ని ఏ మాత్రం అలరించలేకపోయింది. తర్వాత అందరూ దీన్ని మరిచిపోయారు. ఇప్పుడీ చిత్రాన్ని మే 01 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించారు.'సోదరా' విషయానికొస్తే.. తెలంగాణలోని ఓ పల్లెటూరిలో చిరంజీవి (సంపూర్ణేశ్ బాబు), పవన్ (సంజోష్) అన్నదమ్ములు. చిరంజీవి కుటుంబం సోడా బిజినెస్ చేస్తుంటుంది. వయసు పెరిగిపోతున్నా పెళ్లి కావట్లేదని చిరు బాధపడుతుంటాడు. అలాంటి టైంలో ఎదురింట్లో దిగిన దివి(ఆర్తి గుప్తా)ని అన్నదమ్ములు ఇద్దరూ ప్రేమలో పడేయాలని చూస్తారు. దీంతో తమ్ముడిని చిరంజీవి వేరే ఊరికి పంపేస్తాడు. కట్ చేస్తే దివి, చిరంజీవిని రిజెక్ట్ చేస్తుంది. మరోవైపు పవన్.. కాలేజీలో భువి(ప్రాచీ బన్సాల్)ని ప్రేమిస్తాడు. ఓసారి సెలవులకు పవన్ ఇంటికి వచ్చినప్పుడు జరిగిన సంఘటనల వల్ల అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు వస్తాయి. మరి వీళ్లు ఎలా కలిశారు? చిరంజీవికి పెళ్లయిందా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: కాజల్ అగర్వాల్‌కి ఇది చివరి అవకాశం!) -
చిరంజీవికి కావాలి ఓ నిర్మాత?
చిన్న చిన్న హీరోల సినిమాలకు ఇబ్బందులు వచ్చాయంటే ఏదో అనుకోవచ్చు. స్టార్ హీరోల్లో ఒకరైన చిరంజీవి మూవీకి, అది కూడా ఇంకా మొదలవకముందే వస్తున్నాయంటే ఏమనుకోవాలి? ఈ ఏడాది సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్' మూవీతో హిట్ కొట్టిన చిరు.. లెక్క ప్రకారం డైరెక్టర్ బాబీతో ఈ పాటికే కొత్త ప్రాజెక్టుని మొదలుపెట్టేయాలి. కానీ ఎక్కడో సమస్యలు ఈ చిత్రానికి చుట్టుకుంటున్నాయి. దీంతో నిర్మాత విషయంలో లేనిపోని టెన్షన్స్ అన్నీ వస్తున్నాయి. ఇంతకీ అసలేం జరుగుతోంది?(ఇదీ చదవండి: తగ్గిపోయిన సినిమాల 'లైఫ్'.. ఎవరు దీనికి కారణం?)తమిళ స్టార్ హీరో విజయ్‌తో 'జన నాయగణ్' తీసిన నిర్మాత వెంకట్ కె నారాయణ.. ఈ సినిమాతో బోలెడన్ని లాభాలు అందుకోవచ్చని ఆశపడ్డారు. కానీ అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. సంక్రాంతికి థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం.. సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి.మరోవైపు కన్నడ స్టార్ హీరో యష్‌తో ఈయనే 'టాక్సిక్' నిర్మించారు. ఇది కూడా మార్చిలోనే విడుదలవ్వాలి. కానీ అనివార్య కారణాల వల్ల జూన్ 4కి వాయిదా పడింది. మరోవైపు ఈయనే నిర్మించిన 'కేడీ' అనే పాన్ ఇండియా సినిమాలోని పాట, కొన్నిరోజుల ముందు వివాదంలో ఇరుక్కుంది. తాజాగా ట్రైలర్ కూడా ఇలాంటి సమస్యే ఎదురవగా యూట్యూబ్ నుంచి తీసేశారు. ఇలా లెక్కకు మించిన సమస్యల కారణంగా ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు.ఇన్ని ఇబ్బందులు ఉండటంతో చిరు-బాబీ చేయాల్సిన కొత్త ప్రాజెక్టు సందిగ్ధంలో పడింది. చిరు సినిమా నుంచి కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మాతగా తప్పుకొందని కొందరు అంటున్నారు. లేదు లేదు ఈయనతో పాటు మరో నిర్మాత కావాల్సి ఉందని రూమర్స్ వస్తున్నాయి. అందుకు తగ్గట్లే చిరు తెలిసిన ఓ నిర్మాత.. ఈ మూవీ విషయంలో భాగస్వామిగా మారబోతున్నాడని మరో టాక్ వినిపిస్తుంది. ఏదో ఒకటి త్వరగా దీనిపై క్లారిటీ అయితే రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: 60 ఏళ్ల వయసులో స్టార్ హీరో సర్జరీ.. రిస్క్ చేశాడా?) -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా
ఈ వారం ఓటీటీల్లోకి బ్యాండు మేళం, లేచింది మహిళా లోకం, ప్రతిఛాయ, మెన్షన్ హౌస్ మల్లేష్, హ్యాపీరాజ్ తదితర స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వీటితో పాటు మరో తెలుగు మూవీ కూడా పెద్దగా హడావుడి లేకుండానే స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఓటీటీలో హార్డ్ హిట్టింగ్ కోర్ట్ రూమ్ సినిమా.. తెలుగు రివ్యూ) రాజేశ్ మేరు, నవ్య చిట్యాల హీరోహీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ కామెడీ సినిమా 'లగ్గం టైమ్'. ఈ ఏడాది ఫిబ్రవరి 6న థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా పేరున్న నటీనటులు ఎవరూ లేకపోవడంతో జనాలు తెలియకుండానే బిగ్స్క్రీన్పై నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు దాదాపు రెండున్నర నెలల తర్వాత ఆహా ఓటీటీలోకి వచ్చేసింది.'లగ్గం టైమ్' విషయానికొస్తే.. అనన్య(నవ్య) పెళ్లిరోజున బాయ్ ఫ్రెండ్ సూర్య(రాజేశ్).. పెళ్లి ఇంటి నుంచి ఈమెని తీసుకెళ్లిపోవాలని ప్లాన్ చేస్తాడు. కానీ అక్కడ జరిగిన ఓ అనుకోని సంఘటన వల్ల పరిస్థితులు మారిపోతాయి. మరోవైపు పెళ్లికొడుకు చంద్ర కిడ్నాప్ అవుతాడు. ఈ కేసులో సూర్యనే నిందితుడిగా అనుమానిస్తూ పోలీసులు పట్టుకుంటారు. అసలు పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసింది ఎవరు? పూణెలో మొదలైన సూర్య-అనన్య ప్రేమకథకు చివరకు శుభం కార్డు పడిందా లేదా?అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'ఠాగూర్' సినిమా నాదే.. కానీ వాళ్లు పట్టుకెళ్లిపోయారు: రాజశేఖర్) -
'సూర్య బీ పాజిటివ్' టీజర్ రిలీజ్
సుబ్బా మాధవరపు దర్శకత్వంలో చరణ్ పీసర్ల, యానీ డయానా, దివ్య విశ్వకర్మ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'సూర్య బీ పాజిటివ్'. తాజాగా ఈ చిత్ర టీజర్ లాంచ్ జరిగింది. 'దండోరా' దర్శకుడు మురళీకాంత్, 'కిష్కింధపురి' దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేశారు.హీరో చరణ్ మాట్లాడుతూ.. మా దర్శకులు అమెరికాలో ఉంటారు. ఈ సినిమా దర్శకత్వం చేసేటప్పుడు అక్కడ ఉద్యోగాన్ని అలాగే ఇక్కడే సినిమాను పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి చేశారు. నేను ఇప్పటికి మూడు సినిమాలలో చేశా. కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇది నాలుగో మూవీ. ఈ సినిమా ద్వారా నన్ను ప్రేక్షకులు అభినందిస్తారని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా బ్యాండు మేళం, లేచింది మహిళా లోకం లాంటి తెలుగు చిత్రాలతో పాటు ప్రతిఛాయ, హ్యాపీరాజ్ లాంటి డబ్బింగ్ మూవీస్ కూడా స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా అన్నట్లు ఓ తెలుగు సినిమా సడన్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటది? ఎందులో అందుబాటులో ఉంది?(ఇదీ చదవండి: కుడివైపు గుండె.. నీలం రంగు శరీరం.. 'చిరంజీవి' గ్లింప్స్)అనుదీప్, అజయ్ కుమార్, వేద్విక తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'మత్తురా'. గతేడాది సెప్టెంబరు 19న థియేటర్లలోకి వచ్చింది. పరిమిత బడ్జెట్, నటీనటులు కొత్తవాళ్లు కావడంతో ఇదొచ్చి వెళ్లిన సంగతి కూడా ఆడియెన్స్‌కి తెలీదు. ఇప్పుడీ మూవీ ఏడు నెలల తర్వాత స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అద్దె విధానంలో అందుబాటులో ఉంది.'మత్తురా' విషయానికొస్తే.. నలుగురు స్నేహితుల మధ్య జరిగే కథ ఇది. మద్యం అలవాటు వారి జీవితాలని ఎలా నాశనం చేసింది? ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కొనేలా చేసింది అనే అంశాలతో అడ్వెంచరస్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. పువ్వాళ చలపతి దర్శకత్వం వహించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్) -
కుడివైపు గుండె.. నీలం రంగు శరీరం.. 'చిరంజీవి' గ్లింప్స్
తెలుగులో ప్రయోగాత్మక సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇప్పుడు కూడా 'చిరంజీవి' పేరుతో ఓ సినిమా తీశారు. ఇందులో డెక్స్ట్రోకార్డియా అనే వ్యాధి.. హీరోకు ఉంటుంది. అంటే ఎడమ వైపు ఉండాల్సిన గుండె.. కుడివైపు ఉంటుందనమాట. దీని వల్ల అప్పుడప్పుడు శరీరంలోని ఆక్సిజన్ లెవల్స్ హెచ్చుతగ్గులు అవుతుంటాయి. అలా జరిగినప్పుడల్లా బాడీ నీలం రంగులోకి మారిపోతుంటుంది. ఈ మేరకు తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్)అయితే హీరోకి ఆక్సిజన్ సరిపోక స్పృహ తప్పి పడిపోయినప్పుడు హీరోయిన్ ఇచ్చి ముద్దుపెట్టి ఆక్సిజన్ అందించడం మాత్రం కాస్త సినిమాటిక్‌గా అనిపించింది. చివరలో మళ్లీ హీరోకి కుడివైపు కాదు ఎడమవైపే గుండె ఉంది అన్నట్లు చిన్న సస్పెన్స్ పెట్టడం ఆసక్తికరంగా అనిపించింది. గ్లింప్స్ అయితే బాగానే ఉంది గానీ పూర్తి మూవీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. హీరోహీరోయిన్, దర్శకుడు, నిర్మాత అందరూ కొత్తవాళ్లే కావడం విశేషం.(ఇదీ చదవండి: విజయ్ విడాకుల కేసులో కీలక పరిణామం)#Chiranjeevi glimpse out nowhttps://t.co/x0YvdWKISJ— Suresh PRO (@SureshPRO_) April 20, 2026 -
'చేతబడి'లో జేడీ చక్రవర్తి
ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో , నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీస్తున్న సినిమా 'చేతబడి'. ఎమ్3 మీడియా, మహా మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సూర్యాస్ దర్శకుడు కాగా మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతమందిస్తున్నాడు.(ఇదీ చదవండి: తల్లి కాబోతున్న 'వరూధిని పరిణయం' హీరోయిన్)బాణామతి బ్యాక్‌డ్రాప్‌లో హారర్ మిస్టరీ ఎలిమెంట్స్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది. గురువారం వెర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి పుట్టినరోజు సందర్భంగా ఇందులో ఆయన పోషిస్తున్న పాత్ర గురించి ప్రకటించారు. డిఫరెంట్ అవతార్‌లో హీరో, విలన్‌గా జేడీ చక్రవర్తి కనిపించనున్నారని చిత్ర యూనిట్ తెలియజేసింది.ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవకముందే ఐదు భాషల ఆడియో రైట్స్‌ని సరిగమ సంస్థ దక్కించుకుంది. ఓ పాటను ఐదు భాషల్లో విడుదల చేయడం కామన్‌గా జరుగుతుంది. కానీ ఇందులో తెలుగులో ఒక పాట, మిగిలిన భాషల్లో డిఫరెంట్ సాంగ్స్, సేమ్ విజువల్‌తో రావడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. (ఇదీ చదవండి: మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో) -
మౌళి-మైత్రీ మూవీస్.. ఇదేం టైటిల్?
యూట్యూబర్‌గా అందరికీ తెలిసిన మౌళి.. 'లిటిల్ హార్ట్స్' సినిమాతో గతేడాది హీరోగా హిట్ కొట్టాడు. అద్భుతమైన కలెక్షన్స్ అందుకున్న ఈ మూవీ.. మౌళికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. దీంతో ఇతడు తర్వాత ఎవరితో ఎలాంటి చిత్రం చేస్తాడా అని అంతా అనుకున్నారు. ఇప్పుడు ఆ విషయంపై కాస్త క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది.(ఇదీ చదవండి: నువ్వు లేవనే నిజం బాధపెడుతూనే ఉంది: సింగర్ చిత్ర)టాలీవుడ్లో ప్రస్తుతం బడా హీరోలందరితోనూ సినిమాలు చేస్తున్న మైత్రీ మూవీస్.. మౌళి రెండో మూవీని నిర్మిస్తోందట. శ్రీను అనే కొత్త దర్శకుడు.. ఈ చిత్రాన్ని తీయబోతున్నాడు. అయితే ఈ ప్రాజెక్టుకి 'దొంగ నా కొడుకు' అనే టైటిల్ పెట్టాలని ఫిక్సయ్యారట. ఈ మేరకు రిజిస్టర్ కూడా చేయించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం సోషల్ మీడియా జమానాలో ట్రెండీ జనరేషన్‌కి ఈ టైటిల్‌తో పెద్ద సమస్య లేకపోవచ్చేమో గానీ ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి ఈ టైటిల్‌కి ఆదరణ దక్కుతుందా అంటే సందేహమే. ఈ టైటిల్‌పైనా సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. మరి అంతా అనుకుంటున్నట్లు ఇదే టైటిల్ పెడతారా? లేదంటే ఏమైనా మారుస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: రాశీఖన్నా బ్లడీ యాక్షన్.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్) -
కుమారస్వామి కథతో సినిమా.. టైటిల్ ఫిక్సయిందా?
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో 'డ్రాగన్' చేస్తున్నాడు. లెక్క ప్రకారం ఈ ఏడాదిలోనే రిలీజ్ కావాలి. కానీ ఇప్పట్లో రావడం కష్టమే అనిపిస్తుంది. ఒకవేళ వచ్చేలా ఉంటే దానికి తగ్గట్లు రూమర్స్, హింట్స్ వచ్చేవి. అలాంటివేం లేవంటే వచ్చే ఏడాదే థియేటర్లలోకి రావొచ్చేమో అనిపిస్తుంది. వచ్చే నెలలో బయటకొచ్చే గ్లింప్స్, ఫస్ట్ లుక్ బట్టి రిలీజ్‌పై క్లారిటీ రావొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)తారక్ పుట్టినరోజునే మరో ప్రాజెక్టుపై కూడా పూర్తి క్లారిటీ వచ్చేలా కనిపిస్తుంది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో కొన్నాళ్ల క్రితం ఓ సినిమాని ప్రకటించారు. కుమారస్వామి కథతో దీన్ని తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం వెంకటేశ్‌తో 'ఆదర్శ కుటుంబం' తీస్తున్న దర్శకుడు త్రివిక్రమ్.. ఇది పూర్తవగానే ఎన్టీఆర్‌తో చేయాల్సిన సినిమాపై దృష్టి పెట్టనున్నారు. అయితే ఈ చిత్రానికి 'షణ్ముఖుడు' అనే టైటిల్ రిజిస్టర్ చేయించారని తెలుస్తోంది. వచ్చే నెలలో ఎన్టీఆర్ బర్త్ డే నాడు ఈ టైటిల్ ప్రకటించొచ్చని టాక్.ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ అయితే తారక్‌తో సినిమాలు చేయడం పక్కా. తర్వాత లైనులో ఎవరున్నారనేది మాత్రం తెలియాల్సి ఉంది. తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ పేరు వినిపించింది కానీ దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పుడు వినిపిస్తున్న రూమర్స్ అన్నింటికీ తారక్ పుట్టినరోజున క్లారిటీ ఇస్తారేమో చూడాలి?(ఇదీ చదవండి: తెలుగు బిగ్ పాన్ ఇండియా సినిమాలో అలియా భట్) -
ఎట్టకేలకు 'దేవర' నిర్మాత కొత్త సినిమా
రెండు నెలల క్రితం 'ఫంకీ'తో వచ్చిన హీరో విశ్వక్ సేన్ ఘోరమైన డిజాస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం ఒకటి రెండు చిత్రాలు సెట్స్‌పై ఉండగా తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించాడు. ఎన్టీఆర్‌తో 'దేవర' తీసిన నిర్మాణ సంస్థలో నటించేందుకు సిద్ధమైపోయాడు. ఈ మూవీ అధికారికంగా సోమవారం లాంచ్ అయింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ఐదేళ్ల క్రితం అల్లు అర్జున్-కొరటాల శివ కాంబోలో సినిమాని ప్రకటించి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన యువసుధ ఆర్ట్స్ నిర్మాణ సంస్థ.. దాన్ని అలా పక్కనబెట్టేసి ఎన్టీఆర్-కొరటాల శివతో 'దేవర'ని అనౌన్స్ చేసింది. 2024 సెప్టెంబరులో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ, బాక్సాఫీస్ దగ్గర బాగానే ఫెర్ఫార్మ్ చేసింది. దీని సీక్వెల్ అప్పుడు ఇప్పుడు అంటున్నారు గానీ అసలు వస్తుందా రాదా అనేది తెలియట్లేదు. అదలా ఉండగానే విశ్వక్ సేన్‌తో ఈ సంస్థ, కొత్త మూవీ ప్రకటించింది.రొమాంటిక్ కామెడీ స్టోరీతో తీసే ఈ సినిమాకు రజత్ రవిశంకర్ దర్శకుడు. కొరటాల శివనే ఈ మూవీకి క్లాప్ కొట్టారు. ఇకపోతే 'దేవర' రిలీజైన దగ్గర నుంచి కొరటాల ఖాళీగానే ఉన్నారు. దేవర సీక్వెల్ చేస్తారా వేరే హీరోతో మూవీస్ ఏమైనా చేస్తారా అనేది ఇప్పటివరకు క్లారిటీ అయితే లేదు.(ఇదీ చదవండి: హీరో రామ్‌కి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా?)The journey begins with divine blessings ✨Production No.3 of @YuvasudhaArts starring ‘Mass Ka Das’ @VishwakSenActor, a new-age rom-com, is officially launched ❤🔥▶️ https://t.co/K7l4o1nisTDirector – @RajathDirProducer – #SudhakarMikkilineniAn auspicious pooja ceremony… pic.twitter.com/AjVTprZ4Ep— Yuvasudha Arts (@YuvasudhaArts) April 13, 2026 -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా
ఈ వారం థియేటర్లలోకి వచ్చిన అడివి శేష్ 'డెకాయిట్', ప్రదీప్ రంగనాథన్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం బోలెడన్ని కొత్త మూవీస్ వచ్చాయి. వీటిలో తాయ్ కిళవి, శబ్దం, డార్క్ నైట్, ఓ రోమియో, తూ యా మై, త్రాష్ తదితర చిత్రాలున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా ఓ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఏంటది? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)ప్రభాస్ 'ఈశ్వర్' సినిమాలో నటించి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హను కోట్ల.. హీరోగా చేసి, దర్శకత్వం వహించిన మూవీ 'ద డీల్'. 2024 అక్టోబరులో థియేటర్లలోకి వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తీసినప్పటికీ పెద్దగా స్టార్స్ లేకపోవడం, సరైన స్టోరీ కూడా లేకపోవడంతో ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ఇప్పుడీ మూవీ అద్దె విధానంలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది.'ద డీల్' విషయానికొస్తే.. యాక్సిడెంట్ దెబ్బకు గతం మర్చిపోయిన భైరం(హను కోట్ల) మెలకువ వచ్చిన తర్వాత లక్ష్మి(ధరణి ప్రియా) అనే పేరు కలవరిస్తుంటాడు. ఈమె తన భార్య అని, కలవాలని అంటాడు. మరోవైపు తనని చంపాలని చూస్తున్నారనే విషయం తెలుసుకున్న భైరవ.. తాను అసలు ఎవరో అని కనుగొనే ప్రయత్నంలోనూ ఉంటాడు. మరి భైరవ జీవితంలో ఇందు, మాధవ్ పాత్రేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడు.. కంగారుపడ్డా: కాయదు లోహర్) -
ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా
ప్రస్తుతం అంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లలో రిలీజ్ కావడం ఆలస్యం.. నెల, నెలన్నరలో స్ట్రీమింగ్‌లోకి వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలు మాత్రం చాన్నాళ్ల తర్వాత అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు అలానే ఓ హారర్ థ్రిల్లర్ మూవీ తెలుగు వెర్షన్ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటి దీని సంగతి? ఎందులో ఉంది?స్వతహాగా తమిళ హీరో అయినప్పటికీ తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి.. 'శబ్దం' అనే హారర్ థ్రిల్లర్ చేశాడు. గతేడాది ఫిబ్రవరి 28న తెలుగు, తమిళంలో ఇది థియేటర్లలో రిలీజైంది. కానీ పెద్దగా మెప్పించలేకపోయింది. గతంలో ఆదితోనే 'వైశాలి' తీసిన అరివళగన్.. ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ సక్సెస్‌ని రిపీట్ చేయలేకపోయారు. ఇకపోతే ఈ మూవీ తమిళ వెర్షన్.. గత నెల 24న జీ5 ఓటీటీలోకి వచ్చింది. తర్వాత కొన్నిరోజులకు హిందీ వెర్షన్ తీసుకొచ్చారు. ఇప్పుడు తెలుగు డబ్బింగ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు.'శబ్దం' విషయానికొస్తే.. మున్నార్‌లోని ఓ మెడికల్ కాలేజీ. అందులోని విద్యార్థులు ఒకరు తర్వాత ఒకరు అనుమానస్పద రీతిలో చనిపోతుంటారు. పోలీసులు, మీడియాకు తెలిస్తే కాలేజీ పరువు పోతుందని యాజమాన్యం.. ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్‌తో కాలేజీ మొత్తం పరిశోధిన జరిపించి దెయ్యాలు, ఆత్మలు లేవని నిరూపించాలనుకుంటుంది. ఇందుకోసం పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ వ్యూమా వైద్యలింగం(ఆది పినిశెట్టి)ని తీసుకొస్తుంది. మనుషులకు కూడా వినిపించని శబ్దాలని తన దగ్గరున్న సాంకేతిక పరికరాలతో వింటూ, ఆత్మలతో మాట్లాడి ఆ కేసుల్ని పరిష్కరిస్తుంటాడు.అయితే ఈ కాలేజీలో పనిచేసే లెక్చరర్ అవంతిక(లక్ష్మి మేనన్)పై వ్యూమాకి అనుమానం మొదలవుతుంది.ఆ కాలేజీలోని సెంట్రల్ లైబ్రరీలోనే అవంతికపై ఓ ప్రయోగానికి సిద్ధపడగా, అక్కడే 42 ఆత్మలు ఉన్నట్లు కనిపెడతాడు. ఆత్మలుగా మారిన ఆ 42 మంది ఎవరు? వాళ్లకు కాలేజీలో జరుగుతున్న చావులకు సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా
తెలుగులో హీరోయిన్, సహాయ నటిగా సినిమాలు చేసిన పూర్ణ.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఈమె నటించిన తెలుగు థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా నెలలోనే స్ట్రీమింగ్‌లోకి రావడం విశేషం. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అది డోంట్ మిస్)పూర్ణ, విదార్థ్, త్రిగుణ్, బిగ్‌బాస్ ఫేమ్ శుభశ్రీ తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'డార్క్ నైట్'. గత నెల 13న థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ సంగతే జనాలకు పెద్దగా తెలియదు. అలాంటిది ఇప్పుడు సైలెంట్‌గా ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. ఎమోషనల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో దీన్ని తెరకెక్కించారు.'డార్క్ నైట్' విషయానికొస్తే.. అలెక్స్ (విదార్థ్), హేమ (పూర్ణ) భార్యభర్తలు. పెద్దల నిశ్చయించిన పెళ్లి చేసుకుంటారు. లాయర్ అయిన అలెక్స్.. తన ఆఫీసులోనే పనిచేసే సోఫియా(శుభశ్రీ)తో అక్రమ సంబంధంలో ఉంటాడు. ఇది తెలిసిన హేమ.. అలెక్స్‌ని వదిలేసి వెళ్లిపోతుంది. అలెక్స్‌తో పాటే జిమ్ ట్రైనర్తోనూ సంబంధం ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న అలెక్స్.. తిరిగి హేమ దగ్గరకు వస్తాడు. కానీ అప్పటికే రోషన్(త్రిగుణ్)తో హేమకు స్నేహం కుదురుతుంది. అలెక్స్, హేమ కలవడం రోషన్‌కి నచ్చదు. మరి తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'జన నాయగణ్' సినిమా మొత్తం లీక్.. ఇది ఎవరి పని?) -
అమెరికన్ నటి.. తెలుగు దర్శకుడు.. పాన్ ఇండియా సినిమా
ఉత్కంఠభరిత హత్యా కథాంశంతో తీసిన సస్పెన్స్ థ్రిల్లర్ 'ఎం4ఎం' (M4M – Motive for Murder) సినిమా మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు కాబోతోంది. అమెరికన్ నటి జో శర్మా, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. పాన్ ఇండియా వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. దర్శకుడు మోహన్ వడ్లపట్ల స్వీయ నిర్మాణంలో మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై, McWin Group USA సహకారంతో రూపొందించారు.(ఇదీ చదవండి: హీరోయిన్‌కు బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని)భారతదేశంలో ఈ చిత్రాన్ని పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ సంస్థ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తోంది. అమెరికాలో విడుదల బాధ్యతలను TekFlix Entertainment, ఉత్తర భారత విడుదలను JVEL Entertainment సంస్థలు తీసుకున్నాను. విడుదలకు ముందే ఈ మూవీ.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా పలాసిస్ సీ థియేటర్లో ప్రైవేట్ స్క్రీనింగ్ నిర్వహించగా, ముంబైలోని IMPPA ప్రివ్యూ థియేటర్లో ప్రత్యేక ప్రదర్శన జరిగింది. దీనికి మంచి స్పందన లభించింది.ఇక హీరోయిన్ జో శర్మా అమెరికా, భారత్‌లో విస్తృతంగా నిర్వహించిన ప్రమోషన్ టూర్.. సినిమాకు మరింత ప్రచారం తీసుకువచ్చింది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ..ప్రీమియర్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందని, థ్రిల్లింగ్ స్టోరీ, సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: ఆరు రోజుల్లో బర్త్ డే.. బుల్లితెర నటి బలవన్మరణం) -
'విచిత్ర' ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన విఎన్.ఆదిత్య
సిస్ ఫిలిమ్స్ బ్యానర్‌పై సైఫైద్దీన్ మాలిక్ దర్శకుడిగా నిర్మాతగా రూపొందించిన సినిమా 'విచిత్ర'. దీని ఫస్ట్ లుక్‌ని దర్శకుల సంఘం అధ్యక్షుడు విఎన్ ఆదిత్య చేతుల మీదుగా ఆదివారం రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ సినిమా)ఈ సినిమాలో జ్యోతి పూర్వజ్, రవి , శ్రేయ తివారి, బేబీ శ్రీ హర్షిణి, రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతికి శేఖర్, జబర్దస్త్ అప్పారావు, త్రినాథ్, సత్తిపండు, బాబీ తదితరులు నటించారు. నిజాని అంజన్ సంగీతమందించారు. వచ్చే నెల 22వ తేదీన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: రొమాన్స్ కష్టంగా అనిపించింది: మృణాల్) -
డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ సినిమా
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి చాలానే సినిమాలొచ్చాయి. మృత్యుంజమ్, సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని, ఎస్.సరస్వతి అనే తెలుగు చిత్రాలతో పాటు ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్', 4వ అధ్యాయం లాంటి డబ్బింగ్ మూవీస్ కూడా ఓటీటీల్లోకి వచ్చేశాయి. ఇప్పుడు వీటితోపాటు ఓ తెలుగు హారర్ సినిమా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్.. ప్రేమజంటని వెంటాడే మొసలి)మదనపల్లెలో తీసిన ఈ సినిమాలో సంతోశ్, సయ్యద్ ఆజం, గౌష్ బాషా, మళ్లీశ్వరమ్మ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. శివాజీ, సురేశ్ దర్శకత్వం వహించారు. ఇప్పుడీ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. కాకపోతే ప్రస్తుతం అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా) -
అమెరికా నుంచి వచ్చి దర్శకురాలిగా తెలుగు సినిమా
రేసన్ ప్రొడక్షన్స్ తమ తొలి సినిమా 'రాయవలస' ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఊరి జీవితం, నిజ సంఘటనల ఆధారంగా మనసును తాకే కథతో దీన్ని తీస్తున్నారు.గోపీ కృష్ణ జె నిర్మించగా.. అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ మహిళా దర్శకురాలు రాధిక తెరకెక్కిస్తున్నారు.ఒకే షెడ్యూల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఈ క్రమంలోనే కార్తిక్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అమెరికాలో పెరిగిన కార్తిక్, సింగర్‌గా ప్రదర్శనలు ఇచ్చాడు. వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్‌లోనూ నటించాడు. ఇతడు ఇప్పుడు 'రాయవలస' మూవీతో హీరోగా పరిచయమవుతున్నాడు.ఓ రైస్ మిల్ యజమాని రాజు జీవితం చుట్టూ కథ తిరుగుతుంది. కుటుంబం, స్నేహితులు, పిల్లలతో సాగుతున్న అతని జీవితంలో హీరోయిన్ ప్రవేశం అనూహ్య మలుపులు తీసుకువస్తుంది. భావోద్వేగం, యాక్షన్, సంగీతం కలగలిపిన కంప్లీట్ ఎంటర్టైనర్గా 'రాయవలస'ని ప్రేక్షకులను అలరించనుంది. హీరోయిన్గా శ్రీషా నూలు చేసింది. -
సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి మృత్యుంజయ్, సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని, ఎస్.సరస్వతి, సితారే జమీన్ పర్ తదితర తెలుగు సినిమాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. ఇవి కాకుండా పలు హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు, సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు వీటితో పాటు తమిళ డబ్బింగ్ మూవీ ఎలాంటి హడావుడి లేకుండా తెలుగులో స్ట్రీమింగ్ అయిపోతోంది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్.. ప్రేమజంటని వెంటాడే మొసలి)2024లో తమిళ వచ్చిన ఆంథాలజీ థ్రిల్లర్ మూవీ 'అధర్మ కదైగల్'. వెట్రి, అమ్ము అభిరామి, సాక్షి అగర్వాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కామరాజ్ వెల్ దర్శకుడు. ఇప్పుడీ ఈ సినిమానే '4వ అధ్యాయం' పేరిట తెలుగులో ఆహా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. తాజాగానే స్ట్రీమింగ్ అవుతోంది.'4వ అధ్యాయం' విషయానికొస్తే.. మొదటి కథలో నందిని అనే నర్స్, గాయపడిన ఓ రౌడీ విషయంలో సమస్యలు ఎదుర్కొంటుంది. రెండో కథలో ఆన్లైన్ జూదానికి బానిసైన ఓ యువకుడు.. డబ్బుల కోసం చిన్నపిల్లని కిడ్నాప్ చేస్తాడు. మూడో స్టోరీలో బీచ్ దగ్గర తిరిగే రౌడీలు వరసగా హత్యకు గురవుతుంటారు. నాలుగో కథలో దివ్య అనే అమ్మాయి, తన తండ్రి ఆపరేషన్ డబ్బులు చెల్లించేందుకు అద్దె గర్భానికి రెడీ అవుతుంది. ఈ నాలుగు చివరకు ఎలా ముగిశాయనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: తక్కువ టైంలో చాలామందిని కోల్పోయా.. భరించడం నా వల్ల కాలేదు) -
అప్పుడు దెయ్యంగా.. ఇప్పుడు రొమాంటిక్ సినిమాలో
తెలుగమ్మాయిలకు హీరోయిన్గా అవకాశాలు రావట్లేదని ఒకప్పుడు అనేవారు. కానీ రీసెంట్ టైంలో ఈషా రెబ్బా, అనన్య నాగళ్ల, వైష్ణవి చైతన్య తదితరులు అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉన్నారు. 'మసూద' చిత్రంలో దెయ్యం పాత్రలో మెప్పించిన ఓ నటికి ఇప్పుడు హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. ఆ చిత్రాన్ని శుక్రవారం లాంఛనంగా మొదలుపెట్టారు.(ఇదీ చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన బండ్ల గణేశ్.. త్వరలో కూతురి పెళ్లి)గతేడాది చివరలో 'శంబాల' అనే థ్రిల్లర్ మూవీతో చాన్నాళ్ల తర్వాత హిట్ కొట్టిన ఆది సాయికుమార్.. ఇప్పుడు 'సైరాభాను' అనే ఓ రొమాంటిక్ ప్రేమకథా సినిమాలో నటించేందుకు సిద్ధమైపోయాడు. రాజేశ్ దండా నిర్మిస్తున్న ఈ మూవీ తాజాగా ప్రారంభమైంది. హీరో కిరణ్ అబ్బవరం క్లాప్ కొట్టాడు. ఇందులో హీరోయిన్గా 'మసూద'లో దెయ్యంగా నటించి ఆకట్టుకున్న బాంధవి శ్రీధర్ని తీసుకున్నారు.'మసూద'లో సహాయ నటిగా ఆకట్టుకుని హిట్ కొట్టినప్పటికీ బాంధవి శ్రీధర్‌కి పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ హల్చల్ చేసేది. ఇప్పుడు హీరోయిన్గా అంటే పెద్ద ఛాన్సే అనే చెప్పొచ్చు. ఈ సినిమా హిందూ-ముస్లిం బ్యాక్‌డ్రాప్‌లో హైదరాబాద్-ఆంధ్రా కనెక్షన్‌తో రొమాంటిక్ కామెడీ కాన్సెప్ట్‌తో రాబోతుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు మిస్టిక్ థ్రిల్లర్.. డైరెక్ట్ స్ట్రీమింగ్) -
అల్లు అర్జున్-అట్లీ.. ప్లాన్ క్యాన్సిల్!
అల్లు అర్జున్ పుట్టినరోజు దగ్గరకొచ్చేసింది. దీంతో అట్లీతో చేస్తున్న మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందా అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లే స్పెషల్ పోస్టర్‌తో పాటు టైటిల్ ప్రకటన ఉంటుందని టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు బయటపెట్టారు. ఇదొచ్చిందని ఆనందించేలోపు మూవీ టీమ్‌కి ఓ బ్యాడ్ న్యూస్ కూడా ఎదురైనట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: OTTలోకి వచ్చేసిన పొలిటికల్ సెటైరికల్ సినిమా.. తెలుగులోనూ)ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుని.. తర్వాత దుబాయిలో కొత్త షెడ్యూల్‌ని ప్లాన్ చేసుకున్నారు. ఇందులో కొన్ని కీలక సన్నివేశాలని తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ యుద్ధ ప్రభావం ప్రస్తుతం పశ్చిమాసియా దేశాలపై బలంగా ఉంది. మరీ ముఖ్యంగా దుబాయిలో ఎప్పటికప్పుడు ఏదో బాంబు పేలుతూనే ఉన్నట్లు ఎప్పటికప్పుడు వార్తలొస్తున్నాయి. దీంతో దుబాయి షెడ్యూల్‌ని రద్దు చేశారట. మరి వేరే దేశానికి ఏమైనా దీన్ని షిఫ్ట్ చేస్తారా? లేదంటే పరిస్థితులు సద్దుమణిగాక దుబాయిలోనే చిత్రీకరిస్తారా అనేది తెలియాల్సి ఉంది.ఇప్పటివరకు అయితే ముంబైలోనే వేసిన సెట్స్‌లో అల్లు అర్జున్, దీపికా పదుకొణెలపై చాలావరకు సీన్స్ పూర్తి చేశారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా, థియేటర్లలోకి రావొచ్చని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు షూటింగ్ రద్దవడం లాంటి వార్తలు చూస్తుంటే.. థియేటర్లలోకి రావడం మరింత ఆలస్యమవుతుందా అనిపిస్తుంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా తమిళ యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నాడు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్-నీల్ సినిమాలో నేను చేయట్లేదు.. షాకిచ్చిన మలయాళ హీరో) -
ఓటీటీలోకి వచ్చేసిన పొలిటికల్ సెటైరికల్ సినిమా
తెలుగులో దాదాపుగా కమర్షియల్ సినిమాలే ఎక్కువగా వస్తుంటాయి. కాస్త డిఫరెంట్ చిత్రాలు చూద్దామనుకుంటే మన ప్రేక్షకులు చాలామంది తమిళ, మలయాళం వైపు చూస్తుంటారు. అందుకు తగ్గట్లే ఆయా ఇండస్ట్రీల నుంచి ఎప్పటికప్పుడు భిన్నమైన మూవీస్ వస్తుంటాయి. ఇవి ఓటీటీలోకి వచ్చిన తర్వాత మన దగ్గర ఆదరణ బాగుంటుంది. ఇప్పుడు కూడా అలా ఓ తమిళ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి సైలెంట్‌గా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: మార్చి రౌండప్: ముంచిన 'ఉస్తాద్'.. ఆదుకున్న 'ధురంధర్ 2')గతేడాది 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమాతో హిట్ కొట్టిన తమిళ నటుడు శశికుమార్ లేటెస్ట్ తమిళ మూవీ 'మై లార్డ్'. పొలిటికల్ సెటైరికల్ కాన్సెప్ట్‌తో తీసిన సోషల్ డ్రామా చిత్రమిది. చైత్ర ఆచార్ హీరోయిన్ కాగా రాజు మురుగన్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 13న థియేటర్లలో రిలీజైంది. మార్చి 20 నుంచి తమిళ వెర్షన్ మాత్రమే ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు తెలుగు, హిందీ కూడా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చాయి. కాస్త డిఫరెంట్ మూవీ చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు.'మై లార్డ్' విషయానికొస్తే.. అనాథలైన ముత్తుసిరిపి(శశికుమార్), సుశీల (చైత్ర ఆచార్) అగ్గిపెట్టెల కంపెనీలో పనిచేస్తుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఓరోజు గుడికి వెళ్లిన సుశీల కళ్లుతిరిగి పడిపోతుంది. ఆస్పత్రికి తీసుకెళ్తే ఏకంగా రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెబుతారు. అలానే తమకు తెలియకుండానే తమ శరీరంలోని కిడ్నీలు దొంగిలించారని వీళ్లకు తెలుస్తుంది. వీళ్లిద్దరూ చనిపోయారని ఏకంగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదవుతుంది. సరిగ్గా ఇదే సమయంలో ఓ కేంద్రమంత్రికి కిడ్నీ దానం చేయాలని కొందరు వీళ్లని బలవంతపెడుతూ ఉంటారు. దీంతో ఓ చిన్న జర్నలిస్టు సాయంతో ముత్తుసిరిపి, సుశీల.. తమకు జరిగిన అన్యాయంపై ఎలా పోరాడారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.థియేటర్లలో రిలీజైనప్పుడు మిశ్రమ స్పందన అందుకున్న ఈ చిత్రం.. ఓటీటీలో తెలుగు ప్రేక్షకులకు నచ్చే అవకాశముంది. హీరో సూర్య.. తన బ్యానర్‌పై 'మై లార్డ్'ని సమర్పించడం విశేషం. సెకండాఫ్‌లో కొన్ని అనవసర సీన్స్ ఉన్నప్పటికీ ఓవరాల్‌గా బాగుందనే టాక్ వినిపిస్తోంది. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
తెలుగు సినిమా 'చైనా పీస్'పై కేంద్రం నిఘా?
ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలతో వార్తల్లో నిలుస్తూ వచ్చిన టాలీవుడ్.. ఇప్పుడు అనుకోని విధంగా ఓ జియో పొలిటికల్ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీనికి 'చైనా పీస్' అనే తెలుగు మూవీ కారణం. ఈ చిత్రాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపినట్లు వార్తలొస్తున్నాయి. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో సాగే కథాంశం ఇందులో ఉండటమే ఇంత రచ్చ జరగడానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. బాలీవుడ్లో రీసెంట్గా వచ్చిన 'ధురంధర్', త్వరలో రాబోతున్న సల్మాన్ ఖాన్ 'మాతృభూమి' కూడా ఈ తరహా కాన్సెప్ట్‌లతోనే తీశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)యుద్ధ నేపథ్యంలో ఉండే భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే సాధారణంగా విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి వెళ్తుంటాయి కానీ పెద్దగా ప్రచారం లేని ఓ తెలుగు మూవీ ఈ రేంజ్లో హైలైట్ కావడంతో.. అందులో కంటెంట్ ఏంటనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. సరిహద్దు వివాదాలు లేదా అంతర్జాతీయ సంబంధాలకు భంగం కలిగించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్లో ఇలా ఓ సినిమా.. జియో పొలిటకల్ వివాదంలో ఇరుక్కోవడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు.ఈ సినిమా కేవలం యాక్షన్ డ్రామానా? లేక భారతదేశం- ఇతర దేశాల మధ్య ఉన్న రహస్య దౌత్య సంబంధాలను ఏమైనా టచ్ చేసిందా? అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా చూస్తుంటే దీని వెనుక ఏదో పెద్ద కథే ఉందని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది.కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నుంచి వచ్చే క్లియరెన్స్‌పై ఈ చిత్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్) -
రూమర్స్ నిజమయ్యాయి.. తెలుగు దర్శకుడితోనే సల్మాన్
స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హవా బాలీవుడ్లో చాన్నాళ్ల నుంచి తగ్గుతూ వస్తోంది. దాదాపు సరైన హిట్ కొట్టి పదేళ్లవుతోంది. గతేడాది 'సికందర్' అనే మూవీతో వచ్చాడు. ఘోరమైన డిజాస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం 'మాతృభూమి' అనే దేశభక్తి సినిమా చేస్తున్నాడు. దీనిపైనే ఎవరికి పెద్దగా నమ్మకాల్లేవు. అలాంటిది ఇప్పుడు తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో జట్టుకట్టాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.(ఇదీ చదవండి: విషాదం.. సముద్రంలో పడిపోయి హీరో కన్నుమూత)మున్నా, బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి, వారిసు (వారసుడు) సినిమాలతో ఓ మాదిరి హిట్స్ కొట్టిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి.. మూడేళ్ల తర్వాత ఇప్పుడు కొత్త సినిమాని ప్రకటించాడు. సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఏప్రిల్ రెండో వారం నుంచి షూటింగ్ కూడా మొదలు కానుంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇందులోనే నయనతార హీరోయిన్ అని అంటున్నారు కానీ క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి శివాజీ-లయ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన) View this post on Instagram A post shared by Vamshi Paidpally (@directorvamshi) -
నాగార్జున కోసం ముగ్గురు హీరోయిన్లు?
తెలుగు సీనియర్ హీరోల్లో నాగార్జున సరైన సక్సెస్ చూసి చాలాకాలమైంది. గతేడాది కుబేర్, కూలీ సినిమాల్లో కాస్త డిఫరెంట్ పాత్రలు చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం హీరోగా 100వ మూవీ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో తప్పితే అధికారికంగా ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ల గురించి డిస్కషన్ నడుస్తోంది. ఏకంగా ముగ్గురు బ్యూటీస్ నాగ్ సరసన నటించబోతున్నారట.(ఇదీ చదవండి: వివాదంలో మురుగ.. రూ.10 కోట్ల డిమాండ్.. చివరకు ఫ్రీగా)గతంలో నిన్నే పెళ్లాడతా లాంటి సినిమాలో కెమిస్ట్రీతో అదరగొట్టిన నాగ్-టబు.. ఈ సినిమా కోసం మళ్లీ కలుస్తున్నారట. చాన్నాళ్ల క్రితమే ఈ రూమర్ బయటకొచ్చింది. కానీ నిజమా కాదా అనేది మాత్రం క్లారిటీ రాలేదు. తాజాగా 'సంక్రాంతికి వస్తున్నాం' ఫేమ్ ఐశ్వర్య రాజేశ్ కూడా మరో కథానాయికగా ఎంపికైందని అంటున్నారు. వీళ్లిద్దరితో పాటు సుస్మితా భట్ అనే తమిళ బ్యూటీ కూడా ఇందులో ఉందని టాక్ వినిపిస్తోంది.తమిళ దర్శకుడు ఆర్.కార్తిక్ తీస్తున్న ఈ సినిమా లాటరీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్లా తీస్తున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్‌గా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ అనుకుంటున్నారట. ఈ స్టోరీని గట్టిగా నమ్మిన నాగ్.. తనే స్వయంగా నిర్మిస్తున్నారు కూడా. ఏదేమైనా నాగ్ సరసన ముగ్గురు హీరోయిన్లు అనే రూమర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: చిరంజీవి-ప్రభాస్ సినిమాలు.. అదొక్కటే సమస్య?) -
ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా.. అధికారిక ప్రకటన
టాలీవుడ్లో అడపాదడపా కామెడీ సినిమాలు వస్తూనే ఉంటాయి. అలా గత నెలలో సుహాస్ హీరోగా చేసిన ఓ మూవీ థియేటర్లలోకి వచ్చింది. కాస్త అడల్ట్ టచ్ ఉన్న కాన్సెప్ట్ కావడంతో కొందరికి నచ్చగా.. మరికొందరికి ఎబ్బెట్టుగా అనిపించింది. ఏమైనా సరే యావరేజ్ టాక్ అందుకుంది. ఇప్పుడు ఈ చిత్ర ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: తిరుపతిలో సింపుల్‌గా పెళ్లి చేసుకోనున్న తెలుగు హీరో)సుహాస్, శివాని నాగారం హీరోహీరోయిన్లుగా నటించిన కామెడీ సినిమా 'హే బల్వంత్'. తొలుత ఈ చిత్రానికి 'హే భగవాన్' అని టైటిల్ పెట్టారు. కానీ కంటెంట్ చూసిన సెన్సార్ టీమ్.. టైటిల్ మార్చమని చెప్పేసరికి ఇలా రిలీజ్ చేశారు. సీనియర్ నటుడు నరేశ్, సుదర్శన్ కీలక పాత్రలు చేశారు. ఫిబ్రవరి 20న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. ఈ నెల 31 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.'హే బల్వంత్' విషయానికొస్తే.. కృష్ణ(సుహాస్)కి చిన్నప్పటి నుంచి తన తండ్రిలా బిజినెస్‌మ్యాన్ అవ్వాలనేది కోరిక. కానీ నాన్న ఏం పనిచేస్తుంటాడనేది మాత్రం తెలీదు. ఇతడి నాన్నమ్మ(అన్నపూర్ణమ్మ) కూడా ఎందరో ఆడవాళ్లకి బతుకునిస్తున్నాడని చెబుతుంది. మొత్తానికి పెద్దయ్యాక కృష్ణకు తండ్రి బిజినెస్ ఏంటో తెలుస్తుంది. అయితే ఆ విషయాన్ని అంగీకరించాడనికే కృష్ణ చాలా ఇబ్బంది పడతాడు. అప్పటికే తాను ప్రేమిస్తున్న మిత్ర(శివాని)కి ఆ బిజినెస్ గురించి తెలియకుండా దాస్తాడు. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి? చివరకు కృష్ణ-మిత్ర ఒక్కటయ్యారా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఎట్టకేలకు కొత్త సినిమా రిలీజ్ డేట్.. ఈ హీరో గుర్తున్నాడా?) -
'తెరచాప' ట్రైలర్ రిలీజ్
అనన్య క్రియేషన్స్ బ్యానర్‌పై కైలాష్ దుర్గం నిర్మాతగా తీస్తున్న సినిమా 'తెరచాప'. జోయల్ జార్జ్ దర్శకత్వం వహించారు. నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు హీరోహీరోయిన్లుగా నటించారు. రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ తదితరులు ఇతర పాత్రలు చేశారు. ప్రజల్ క్రిష్, ఎం.ఎల్ రాజా సంగీతాన్ని అందించారు. విడుదల తేది దగ్గరవుతున్న సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు)తెరచాప ట్రైలర్ చూస్తుంటే సముద్రతీరంలో జరిగే ఒక ఊరి కథలా అనిపిస్తుంది. ఊరంటే మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలుతో పాటు రాజకీయాలు, భేద భావాలు ఉండడమూ సహజమే. అలాంటి పరిస్థితుల మధ్య ఒక యువకుడు తన ఊరిలో ఉన్న పరిస్థితులపై ఎలా పోరాడాడు? అనేదే స్టోరీ. (ఇదీ చదవండి: రికార్డులు బ్రేక్ చేసినా 'పుష్ప2'ని దాటలేకపోయిన ధురంధర్ 2) -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా
తెలుగు బిగ్‌బాస్ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ సాహ్ని నటించిన తెలుగు సినిమా ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇంతకీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? దీని సంగతేంటి?(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?)రోహిత్ సాహ్ని, రియా కపూర్, మేఘన రాజ్‌పుత్, అబిద్ భూషణ్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'మిస్టీరియస్'. మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించాడు. గతేడాది డిసెంబరు 19న థియేటర్లలోకి వచ్చింది. కానీ చిన్న సినిమా కావడం, నటీనటులు ఎవరనేది జనాలకు తెలియకపోవడంతో వచ్చినట్లే వెళ్లిపోయింది. ఇప్పుడు మూడు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతానికి అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.'మిస్టీరియస్' విషయానికొస్తే.. కొండాపూర్ ఎస్సై రాంఖీ(అబిద్ భూషన్) 15 రోజులుగా కనిపించకుండా పోతాడు. దీంతో రాంఖీ మిస్సింగ్ కేసుని ఏసీపీ ఆనంద్ సాయి(బలరాజ్ వాడి)కి అప్పగిస్తారు. విచారణలో భాగంగా ప్రముఖ ఆర్కిటెక్ట్ విరాట్(రోహిత్ సాహ్ని), అతని భార్య శిల్ప(మేఘన రాజ్‌పుత్)ని విచారించాల్సి వస్తుంది. రాంఖీ మిస్సింగ్‌కి వీళ్లకు ఉన్న సంబంధమేంటి? విరాట్ విల్లాకి రాంఖీ ఎందుకు వెళ్లాడు? అతను అక్రమంగా ఓ గన్ ఎందుకు కొన్నాడు? రాంఖీ బతికే ఉన్నాడా? లేదా? ఈ కేసుని ఏసీపీ ఆనంద్ ఎలా ముగించాడు? ఇందులో మిస్సిరా (రియా కపూర్) పాత్ర ఏంటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు) -
ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా
ఎప్పటిలానే మరో వీకెండ్ వచ్చేసింది. ఉగాది, రంజాన్ సెలవులు కలిసి రావడంతో చాలామంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. దానికి తోడు థియేటర్లలోకి ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు వచ్చాయి. వీటిలో ధురంధర్ 2కి అద్భుతమైన టాక్ రాగా.. 'ఉస్తాద్..'కి నెగిటివ్ టాక్ గట్టిగానే వినిపిస్తోంది. మరోవైపు ఓటీటీల్లోనూ ఈ వారం చెప్పుకోదగ్గ తెలుగు మూవీస్ స్ట్రీమింగ్ కావట్లేదు. ఉన్నంతలో సీతా పయనం అనే చిత్రంతో పాటు 'బోర్డర్ 2' అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడు వీటికి తోడు ఓ తెలుగు హారర్ మిస్టరీ థ్రిల్లర్ స్ట్రీమింగ్కి సిద్ధమైపోయింది.(ఇదీ చదవండి: అనుష్క పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన టీమ్)తెలుగులో సహాయ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సురేఖావాణి కూతురు సుప్రీత.. సోషల్ మీడియాలో బాగా ఫేమస్. ఇప్పుడిప్పుడే ఒకటి అరా సినిమాలు చేస్తోంది. అలానే ఈమె ఓ ప్రధాన పాత్రధారిగా నటించిన చిత్రం 'అమరావతికి ఆహ్వానం'. శివ కంఠమనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణన్ తదితరులు మిగతా లీడ్ రోల్స్ చేశారు. ఇందులో హారర్ ఎలిమెంట్స్ పర్లేదనిపించినప్పటికీ, కొన్నిచోట్ల ఊహకందేలా సీన్స్ ఉండడం పెద్ద మైనస్ అయిందని అంటున్నారు. గత నెల 13న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఈ శుక్రవారం(మార్చి 20) నుంచి ఆహా ఓటీటీలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు.'అమరావతికి ఆహ్వానం' విషయానికొస్తే.. ఈశ్వర్ (శివ కంఠమనేని) సస్పెండ్ అయిన సీఐ. ఇతడి భార్య భానుమతి (ధన్య బాలకృష్ణ). ఈమె చెల్లెళ్లు భార్గవి(సుప్రీత), విజ్జు. భార్గవి ఓ యూట్యూబర్. దెయ్యంతో డే అండ్ నైట్ అనే కాన్సెప్ట్‌తో వీడియోలు చేస్తుంటుంది. అలా పాతబస్తీలోని డెవిల్స్ హోమ్ భవంతిలో భార్గవి చేసిన వీడియో వైరల్ కావడంతో సెలబ్రిటీ అయిపోతుంది. సడన్‌గా భార్గవికి ఓ అజ్ఞాతవ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. నిజంగా దెయ్యాలు ఉన్నాయని, లైవ్‌లో నిరూపిస్తానని, వీడియో షూట్ చేస్తే ఇంకా ఫేమ్ వస్తుందని ఈమెకు చెప్తాడు. దీంతో భార్గవి.. తన కుటుంబంతో అమరావతి అనే గ్రామానికి వెళ్తుంది. అక్కడ వీళ్లకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' తెలుగు షోలన్నీ రద్దు.. ఏమవుతోంది?) -
డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా
ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు రాబోతున్నాయి. వాటిలో రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', విశ్వక్ సేన్ 'ఫంకీ', ప్రియాంక మోహన్ 'మేడిన్ కొరియా' తదితర మూవీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు జుటోపియా 2, ద తాజ్ స్టోరీ, పూకీ చిత్రాలు కూడా చూడొచ్చనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. వీటి సంగతి అలా ఉంచితే ఇప్పుడో తెలుగు సినిమా.. నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. హరర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది చూద్దాం.(ఇదీ చదవండి: వడివేలుని తట్టుకోలేను.. అందుకే 16 సినిమాలు తిరస్కరించా)ప్రశాంత్, అనుశ్రీ అనే కొత్తవాళ్లు హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'రవం'(Ravam Movie). శ్రీరామ్ మన్నార్ దర్శకత్వం వహించాడు. రీసెంట్‌గానే ఇది ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. సబ్స్క్రిప్షన్ లేకపోయినా సరే ఈ మూవీ చూడొచ్చు. 'రవం' విషయానికొస్తే.. ఓ ఈఎన్టీ డాక్టర్ భూషణ్, తన రీసెర్చ్ నిరూపించుకోవడం కోసం ఆత్మల మీద డాక్యుమెంటరీ తీయమని, తర్వాత నేను మీ సినిమాని నిర్మిస్తానని యువ దర్శకుడు మౌళికి చెప్తాడు. దీంతో మౌళి తన ప్రియురాలు పూజ, స్నేహితుడు రవితో కలిసి పింజర్లపల్లి అనే ఓ మారుమూల పల్లెటూరికి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత వీళ్లకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేదే స్టోరీ లైన్.(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ సినిమా.. తెలుగు రివ్యూ) -
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా
ఈ వారం ఓటీటీల్లోకి పలు తెలుగు సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి. ఓం శాంతి శాంతి శాంతిః, దేవగుడి, వంచన తదితర చిత్రాలు ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి రాగా.. మరికొన్ని మూవీస్ వీకెండ్లో అందుబాటులోకి రానున్నాయి. వాటిలో గాంధీ టాక్స్, కృష్ణ సదా సహాయతే, విత్ లవ్, తన్వి ది గ్రేట్ తదితర సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో తెలుగు థ్రిల్లర్ చేరింది. దాదాపు ఏడాది తర్వాత ఇది స్ట్రీమింగ్‌లోకి వస్తోంది. ఇంతకీ అదేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)తెలుగులో ఎప్పటికప్పుడు కొత్త హీరోహీరోయిన్లు నిర్మాతలు వస్తూనే ఉంటారు. అలా తీసిన ఓ సినిమా 'అనగనగా ఆస్ట్రేలియాలో'. జ్యోతినాథ్ గౌడ్, సాన్య భట్నాగర్ హీరోహీరోయిన్లుగా నటించగా.. తారకరామ దర్శకత్వం వహించారు. పేరుకు తగ్గట్లే పూర్తిగా ఆస్ట్రేలియాలోనే తీసిన ఈ మూవీ గతేడాది మార్చి 21న థియేటర్లలోకి వచ్చింది. అందరూ కొత్త నటీనటులే కావడంతో ఇదొకటి రిలీజైనట్లు కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడీ చిత్రం ఆహా ఓటీటీలోకి శుక్రవారం (మార్చి 06) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.'అనగనగా ఆస్ట్రేలియాలో' విషయానికొస్తే.. హీరో (జ్యోతినాథ్) ఆస్ట్రేలియాలో క్యాబ్ డ్రైవర్‌గా చేస్తుంటాడు. హీరోయిన్(సాన్య భట్నాగర్) అక్కడే చదువుకుంటూ ఉంటుంది. మరోవైపు భారత్‌లో ఓ రాజకీయ నేత తన వారసుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని చూస్తున్నప్పుడు.. ఆస్ట్రేలియా నుంచి ఒకరు ఫోన్ చేసి మీ రహస్యం నా దగ్గరుందని చెప్పి భయపెడతాడు. దీని పని తేల్చాలని సదరు నాయకుడు.. ఓ కిల్లర్‌కి అప్పజెబుతాడు. ఓ రోజు అనుకోకుండా ఆ రహస్యం హీరోయిన్ చేతిలో పడుతుంది. దీంతో కిల్లర్, రాజకీయ నాయకుడు.. ఈ అమ్మాయి వెంట పడతారు. తర్వాత ఏమైంది? మరి హీరోహీరోయిన్ ప్రేమకథ సంగతేంటి? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్'.. రిలీజ్‌కి ముందు భారీ మార్పులు?) -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా హనీ, అక్యూజ్జ్, హాట్ స్పాట్ 2 తదితర తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలతో పాటు తమిళ, మలయాళ మూవీస్ కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు, రోస్లిన్ లాంటి తెలుగు వెబ్ సిరీస్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అలానే విజయ్ సేతుపతి 'గాంధీ టాక్స్'.. అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడీ ఈ లిస్టులోకి మరో తెలుగు సినిమా కూడా వచ్చి చేరింది.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి 'గాంధీ టాక్స్'.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)'స్కూల్ లైఫ్' పేరుతో తీసిన తెలుగు మూవీ.. గతేడాది నవంబరు 28న అంటే మూడు నెలల క్రితం థియేటర్లలోకి వచ్చింది. సుమన్, ఆమని తదితరులు ఇందులో కీలక పాత్రలు చేశారు. కాకపోతే పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడం.. కంటెంట్ కూడా అంతంత మాత్రమే ఉండేసరికి ఇదొకటి బిగ్ స్క్రీన్‌పైకి వచ్చి వెళ్లిన సంగతి కూడా చాలామందికి తెలియదు. అలాంటిది ఇప్పుడు ఈ మూవీ.. అమెజాన్ ప్రైమ్‌లో అద్దె విధానంలో అందుబాటులో ఉంది.'స్కూల్ లైఫ్' విషయానికొస్తే.. 1990ల్లో రాయలసీమలోని ఓ పల్లెటూరి నేపథ్యంగా సాగుతుంది. స్కూల్ లవ్ స్టోరీతో మొదలై.. అక్కడి ప్రాంత ప్రజల మధ్య కులం, కుటుంబ గౌరవం, పగ తదితర అంశాలు ఎలాంటి పాత్ర పోషించాయి. ప్రేమతో మొదలై పగతో ఎలా ముగిసింది అనేదే ఈ సినిమా స్టోరీ. పులివెందుల మహేశ్ అనే కుర్రాడు.. హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించాడు.(ఇదీ చదవండి: రష్మిక రీల్ బ్రదర్ హీరోగా సినిమా.. ట్రైలర్ రిలీజ్) -
దర్శకుడు మారుతి 'హ్యాపీ పొంగల్'?
ఈ ఏడాది సంక్రాంతికి 'రాజాసాబ్' సినిమాతో వచ్చిన దర్శకుడు మారుతి.. ఘోరమైన డిజాస్టర్ అందుకున్నాడు. విడుదలకు ముందు ఇంటి అడ్రస్ కూడా చెప్పేసరికి.. ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అయ్యారు. తీరా మూవీ చూసి పూర్తిగా డిసప్పాయింట్ అయ్యారు. సోషల్ మీడియాలో మారుతిపై ఘోరంగా ట్రోల్స్, విమర్శలు చేశారు. దీంతో ఈ దర్శకుడి నుంచి తర్వాత మూవీ ఏం వస్తుందా అనే రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు దానికి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: అన్వేష్‌కి బిగ్ షాక్.. లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు)'రాజాసాబ్' ఫ్లాప్ అయినప్పటికీ మారుతి.. మెగాహీరోతో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడని కొన్నిరోజుల క్రితం రూమర్ వినిపించింది. వరుణ్ తేజ్‌తో ఇది ఉండొచ్చని అన్నారు. హీరో రామ్ పేరు కూడా వినిపించింది గానీ ఇవి ఫేక్ అని కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు ఏకంగా మూవీ టైటిల్ కూడా బయటకొచ్చింది. 'హ్యాపీ పొంగల్' పేరుతో మారుతి.. ఓ కామెడీ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారని, దీనికి తగ్గ హీరోని వెతికే పనిలో ప్రస్తుతం ఉన్నారని టాక్ వినిపిస్తుంది. టైటిల్‌కి తగ్గట్లే వచ్చే సంక్రాంతికి దీన్ని థియేటర్లలోకి తీసుకొస్తారేమో చూడాలి?మరోవైపు 'రాజాసాబ్' ఫెయిలైనప్పటికీ హీరో ప్రభాస్, మారుతికి భరోసా ఇచ్చారట. మరి ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది. మీడియం రేంజ్ హీరోలతో ఓ మాదిరి కామెడీ సినిమాలు తీసిన మారుతి.. పర్లేదనిపించే పేరు తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే 'రాజాసాబ్' చేశాడో అటు సమయం, ఇటు సినిమా రెండు కోల్పోయాడు. ఇప్పుడు మళ్లీ తనకు అచ్చొచ్చిన కామెడీ జానర్లోనే ఓ మిడ్ రేంజ్ హీరోతో మూవీ చేసి కమ్ బ్యాక్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: రష్మిక పెళ్లికి పిలిచిందా? రిషభ్ శెట్టి సమాధానమిదే) -
సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా
ఈ వారం ఓటీటీల్లో చెప్పుకోదగ్గ తెలుగు రిలీజులు అయితే లేవు. ఉన్నవి కూడా డబ్బింగ్, హిందీ చిత్రాలే. అలాంటిది ఇప్పుడు సడన్‌గా ఓ తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీలో అందుబాటులోకి ఉంది. ఇంతకీ ఏంటా మూవీ? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: తమిళ బోల్డ్ సినిమా.. ఒకేసారి ఆరు ఓటీటీల్లో స్ట్రీమింగ్)గతేడాది క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన హారర్ సినిమా 'ఈషా'. త్రిగుణ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు, అఖిల్ రాజ్ ప్రధాన పాత్రలు చేశారు. శ్రీనివాస్ మన్నె దర్శకుడు. అయితే ఎప్పటికప్పుడు హారర్ మూవీస్ చూసేవాళ్లకు ఇదేమంత గొప్పగా అనిపించలేదు. కొందరికి మాత్రం నచ్చింది. ఓవరాల్ గా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించుకున్నారు. ఇప్పుడీ చిత్రం దాదాపు రెండు నెలలకు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. కాకపోతే ప్రస్తుతానికి విదేశాల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మన దేశంలో ఈ శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశముంది.'ఈషా' విషయానికొస్తే.. కల్యాణ్(త్రిగుణ్), నయన (హెబ్బా పటేల్), అపర్ణ (సిరి హనుమంతు), వినయ్ (అఖిల్ రాజ్) చిన్నప్పటి నుంచి స్నేహితులు. దెయ్యాలు, ఆత్మలు లేవని బలంగా నమ్ముతుంటారు. ఓ బృందంగా ఏర్పడి దొంగ బాబాలు, స్వామిజీల బండారాల్ని బయటపెడుతుంటారు. అలా ఓసారి ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉంటున్న ఆదిదేవ్ (బబ్లూ పృథ్వీరాజ్) బాబా గురించి తెలుసుకుంటారు. అతడి బాగోతం బయటపెట్టాలని, అక్కడికే వెళ్లి బాబాని కలుస్తారు. మాటల సందర్భంలో ఆత్మల విషయంలో ఈ నలుగురికి బాబా ఓ ఛాలెంజ్ చేస్తాడు. ఇంతకీ ఆ సవాలు ఏంటి? చివరకు వీళ్లు ఏం తెలుసుకున్నారు? ఈ నలుగురిని చంపాలనుకుంటున్న పుణ్యవతి ఎవరు అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్) -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు
ప్రతి వీకెండ్ ఓటీటీల్లోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా అలా మన శంకరవరప్రసాద్, అనగనగా ఒక రాజు, వనవీర తదితర తెలుగు మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. అలానే తలైవర్ తంబి తలైమయిల్, ద కంజూరింగ్, బ్యాండ్ వాలే లాంటి డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీసులు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు కూడా డిజిటల్ ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమైపోయాయి. పెద్దగా హడావుడి లేకుండా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఇంతకీ అవేంటి? వేటిలో ఉన్నాయి?సాయిచరణ్, ఉషశ్రీ హీరోహీరోయిన్లుగా చేసిన తెలుగు సినిమా 'ఇట్స్ ఓకే గురు'. గత డిసెంబరు 12న థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా పేరున్న నటీనటులు కాకపోవడంతో ఇదెప్పుడు వచ్చివెళ్లిందనే విషయం కూడా తెలీదు. ఇప్పడీ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకుని చనిపోదామనుకున్న ఓ వ్యక్తి.. జీవితంలో అత్యున్నత శిఖరాలకు ఎలా వెళ్లాడు? ఈ ఎదుగులలో ప్రేమ ఎలాంటి పాత్ర పోషించింది అనేదే మూవీ స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)ఇక డిసెంబరులోనే థియేటర్లలోకి వచ్చిన తెలుగు సినిమా 'పతంగ్'. ఇదివరకే సన్ నెక్స్ట్ ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు ఆహా లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ అంతా పతంగుల పోటీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. ప్రేమకథ సినిమాలు ఏమైనా చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. కాన్సెప్ట్ కూడా పర్లేదు బాగానే ఉందనిపించేలా ఉంటుంది.గతేడాది తమిళంలో వచ్చిన హిట్ అయిన సినిమా 'గెవి'. ఇదివరకే సన్ నెక్స్ట్ ఓటీటీలోకి రాగా.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి కూడా వచ్చేసింది. అటవీ ప్రాంతంలోని ఓ ఊరిలో కొండచరియలు విరిగిపడటం, సరైన ఆస్పత్రి సౌకర్యాలు లేకపోవడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటారు. దీంతో అక్కడి ప్రజలు.. పోలీసులు, రాజకీయ నాయకులపై తిరగబడతారు. ఉద్యమం చేస్తారు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. షీలా, జాక్విలిన్ లిడియా ఇందులో ప్రధాన పాత్రలు చేశారు. దయాలన్ దర్శకుడు.(ఇదీ చదవండి: సోదరుడు లాంటి వ్యక్తి చనిపోయాడని రజనీకాంత్ సంతాపం) -
'రాయుడు గారి తాలూకా' ట్రైలర్
'సోగ్గాడే చిన్ని నాయన' ఫేమ్ దర్శకుడు కల్యాణకృష్ణ చేతులు మీదుగా 'రాయుడు గారి తాలూకా' ట్రైలర్ విడుదలైంది. హీరో కమ్ నిర్మాతగా ఉలిశెట్టి శ్రీనివాస్ చేశారు. కల్యాణ్ కృష్ణ మాట్లాడుతూ.. ట్రైలర్ అద్భుతంగా ఉంది. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ అని అన్నారు. హీరో నిర్మాత ఉలిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇది ఒక చక్కటి కుటుంబ చిత్రం, కుటుంబ విలువలు తెలిపే సినిమా, ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంటుంది. మార్చి 6న థియేటర్లలో రిలీజ్ కానుందని అన్నారు. -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
రీసెంట్ టైంలో తెలుగులో మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాలు చాలానే వస్తున్నాయి. అలాంటి వాటిలో 'వనవీర' కూడా ఒకటి. రామాయణంలోని కిష్కింధకాండ ఎపిసోడ్‌తో ముడిపడేలా దీన్ని తెరకెక్కించారు. థియేటర్లలో యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఎందులో స్ట్రీమింగ్ అవుతోందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: 'చికిరి చికిరి' బ్యాట్ స్టెప్ రామ్చరణ్దా?)అవినాష్ అనే కొత్త కుర్రాడు.. హీరో కమ్ దర్శకుడిగా చేసిన సినిమా 'వనవీర'. తొలుత దీన్ని వానర పేరుతో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సెన్సార్ అభ్యంతరం వల్ల టైటిల్ మార్చారు. న్యూఇయర్ సందర్భంగా గత నెల 1వ తేదీన థియేటర్లలోకి తీసుకొచ్చారు. అదే రోజున చాలా తెలుగు చిత్రాలు రావడంతో దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడీ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి ఎలాంటి ప్రకటన లేకుండానే అందుబాటులోకి వచ్చేసింది. సిమ్రాన్ చౌదరి హీరోయిన్ కాగా నందు విలన్‌గా చేశాడు.వనవీర విషయానికొస్తే.. వనపురానికి చెందిన మిడిల్ క్లాస్ కుర్రాడు రఘు(అవినాశ్). ఐఐటీ చదివినా ఊళ్లో ఖాళీగానే తిరుగుతుంటాడు. తండ్రి ప్రేమగా కొనిచ్చిన బైక్ అంటే చాలా ఇష్టం. దానిపై మరొకరు చేయి వేస్తే సహించడు. అలాంటిది తప్పని పరిస్థితుల్లో ఓసారి దేవా(నందు) రాజకీయ ర్యాలీ కోసం ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత బైక్ తన చేతికి రాకపోవడంతో రఘు.. తిరిగి దాన్ని తెచ్చుకునేందుకు దేవా ఇంటికి వెళ్తాడు. తర్వాత ఏమైంది? అసలు దేవాతో రఘుకి ఉన్న గొడవేంటి? ఈ కథకు రామాయణంలోని వానర జాతికి ఉన్న సంబంధమేంటి అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రామ్‌చరణ్ కవలల బారసాల.. ఏం పేర్లు పెట్టారంటే?) -
'అమరావతికి ఆహ్వానం' హారర్ థ్రిల్లర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'దేవగుడి' సినిమా రివ్యూ
బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శకత్వం వహించిన నిర్మించిన సినిమా 'దేవగుడి'. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రలు చేశారు. ఈరోజు(జనవరి 30) ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?దేవగుడికి చెందిన వీరారెడ్డి (రఘు కుంచె) ఫ్యాక్షన్ లీడర్. తన అనుచరులలో ఒకరి కొడుకు అయిన ధర్మ (అభినవ్ శౌర్య), తన కుమారుడితో (నరసింహ) స్నేహంగా ఉండడాన్ని సహించడు. తన కుమార్తె శ్వేత (అనుశ్రీ) ధర్మతో ప్రేమలో ఉందనే విషయం తెలిసి అతడిని ఊరు నుంచి గెంటేస్తాడు. వీరారెడ్డి అనారోగ్యం పాలవ్వగా ఇద్దరు అనుచరులని ప్రత్యర్థులు మట్టుపెడతారు. మరోపక్క శ్వేత కనిపించకుండా పోతుంది. శ్వేతకు ఏమైంది? ధర్మ-శ్వేత ఒక్కటయ్యారా? వీరారెడ్డి చివరికి ఏం చేశాడు? అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సమాజంలో ప్రధాన సమస్యల్లో ఒకటైన కుల వ్యవస్థని ప్రశ్నిస్తూ ఈ సినిమా ప్రారంభమవుతుంది. చిన్నప్పుడే అన్నాచెల్లెళ్లు.. తండ్రి అనుచరుడిగా పనిచేసే వ్యక్తి కొడుకుతో మంచి బాండింగ్ ఏర్పరచుకుంటారు. అబ్బాయిలు, స్నేహితులుగా మారితే.. అమ్మాయి మాత్రం ఆ కుర్రాడి మీద మనసు పడుతుంది. తక్కువ కులానికి చెందిన అతన్ని ప్రేమించడం నచ్చని ఆమె తండ్రి.. అతన్ని ఊరి నుంచి పంపేస్తాడు. ర్వాత ఏం జరిగింది అనేది మెయిన్ ఫ్లాట్.రాయలసీమలోని దేవగుడి అనే ఒక గ్రామం నేపథ్యంలో కథ అంతా సాగుతుంది. రాయలసీమ టచ్‌తో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. చంద్రమండలం వరకు వెళ్లి పరిశోధనలు చేస్తున్నారు కానీ ఇంకా రాతియుగపు నాటి కుల వ్యవస్థను మాత్రం వదలలేకపోతున్నారు. ఏదేమైనా చేయండి కానీ పెళ్లి విషయంలో చావు విషయంలో మాత్రం కులాల ప్రస్తావన కచ్చితంగా తీసుకొస్తున్నారు. ఇందులోనూ అదే అంశాన్ని చూపించారు.సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునేలానే సాగుతుంది. కాకపోతే స్టోరీలా ఊహించేయొచ్చు. తర్వాత ఏం జరుగుతుందో కూడా ప్రేక్షకుడికి తెలిసిపోతూ ఉంటుంది. కానీ ఉన్నంతలో బాగానే తీశారు.నటీనటుల విషయానికి వస్తే హీరోగా నటించిన అభినవ్ శౌర్య, హీరోయిన్గా చేసి అనుశ్రీ.. ఆమె సోదరుడి పాత్రలో నరసింహ ఆకట్టుకున్నారు. దేవగుడి వీరారెడ్డిగా రఘు కుంచె ఓకే. మిగతా పాత్రధారులు న్యాయం చేశారు. టెక్నికల్ టీమ్‌లో మదిన్ సంగీతం బాగుంది. నిడివి కూడా పర్లేదు. నిర్మాణ విలువలు ఓకే ఓకే. -
కొత్తవాళ్లతో నిర్మాత అనిల్ సుంకర సినిమా.. ఫన్నీగా ప్రకటన
ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర.. ఇటీవల మూవీ మేకింగ్ రియాలిటీ షో 'షో టైమ్-సినిమా తీద్దాం రండి' ప్రకటించారు. టాలెంట్ ఉన్నవారికి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రూపొందిన ఈ ప్రాజెక్ట్ విజన్‌ని మరింత ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడు తొలి ప్రకటన చేశారు. ఏటీవీ ఒరిజినల్స్ బ్యానర్‌పై కొత్త నటీనటులతో రూపొందే సినిమాకు 'ఎయిర్‌ఫోర్స్ బెజవాడ బ్యాచ్' అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఫన్నీ పోస్టర్ రిలీజ్ చేశారు.విజయవాడ నేపథ్యంగా సాగే ఈ చిత్రం.. నిరుద్యోగులైన నలుగురు యువకుల జీవితంలోని సంఘటనలు ఆధారంగా తీస్తున్నారు. వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే ప్రయాణంలో కష్టాలను దాటి ముందుకు సాగుతూ, ప్రతికూల పరిస్థితులను అధిగమించి చివరికి ఎలా సక్సెస్ అయ్యారు అనేది స్టోరీ. విజయవాడలోని ఓ ప్రముఖ జంక్షన్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యానర్లో సరదాగా, మట్టివాసనతో కూడిన సందేశంతో బ్యానర్ ఇప్పడు అందరిని ఆకట్టుకుంది.'అమెరికాకి వెళ్లి మా బెజవాడ బ్యాచ్‌ని ఖాళీగా తిరక్కండిరా, ఏదో ఒక పని చేసుకోమని సలహాలు ఇచ్చేంత స్థాయికి ఎదిగిన మా అర్జున్‌కు స్వదేశాగమన శుభాకాంక్షలు' అంటూ రూపొందించిన ఈ బ్యానర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. The Journey Begins!🎬@AnilSunkara1's all-newcomers filmATV Presents #AIRFORCE – Bezawada Batch has officially taken off with its first cast onboarding done in style!😎✈️Here’s the Grandest Welcoming Update🤩 Proudly on-boarding ARJUN,with love from all his beloved friends! pic.twitter.com/dhb3TuPbTw— ATV Originals (@ATVOriginals) January 26, 2026 -
రికార్డు స్థాయిలో థియేటర్ విడుదలకు 'త్రిముఖ' రెడీ
ఈనెల 30వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న తెలుగు సినిమా 'త్రిముఖ'. ఇది ఇప్పుడు విడుదలకు ముందే తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ మైలురాయిని నమోదు చేయబోతోంది. ఈ చిత్రాన్ని కొత్త హీరోతో తీశారు. అయినా సరే అత్యధికంగా 500 థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికే మంచి బజ్ సొంతం చేసుకున్న 'త్రిముఖ'... ప్రేక్షకుల అంచనాలను మించేలా బాక్సాఫీస్ వద్ద ప్రభావవంతమైన విజయాన్ని నమోదు చేస్తూ.. ఒక కొత్త హీరోకు ఘనమైన ఆరంభాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో సన్నీ లియోన్, అషూ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
గ్యాంగ్‌స్టర్ నేపథ్యంతో 'రిమ్జిమ్' మూవీ
1990ల్లో ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా తీసిన సినిమా 'రిమ్ జిమ్'. అజయ్ వేద్, వ్రజన హీరోహీరోయిన్లుగా నటించారు. బిత్తిరి సత్తి, రాజ్ తిరందాస్ కీలక పాత్రలు పోషించారు. రాహుల్ సిప్లిగంజ్ కీలక పాత్ర చేయడంతో పాటు పాటలు కూడా పాడాడు. హేమ సుందర్ దర్శకత్వం వహించారు. సచేతన్ రెడ్డి, డా. మానస, శ్రీనివాసరావు నిర్మించారు. స్నేహం, ప్రేమ కథగా రూపొందిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.దర్శకుడు హేమ సుందర్ మాట్లాడుతూ.. సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నామని చెప్పారు. సాంకేతిక విభాగం విషయానికొస్తే కొక్కిలగడ్డ ఇఫ్రాయిం సంగీతమందించగా.. వాసు పెండం సినిమాటోగ్రఫీ, పెనుమత్స రోహిత్ ఎడిటింగ్ చూసుకున్నారు. రియలిస్టిక్ టోన్, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన 'గ్యాంగ్‌స్టర్' ప్రేక్షకుల ముందుకు త్వరలో రానుంది. -
'పురుషః' నుంచి హీరోయిన్ విషిక ఫస్ట్ లుక్ రిలీజ్
భార్యాభర్తల పోరుని వినోదాత్మకంగా చూపిస్తూ తీసిన కామెడీ ఎంటర్టైనర్ సినిమా 'పురుష:' బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. పవన్ కల్యాణ్ బత్తుల హీరోగా పరిచయమవుతున్నాడు. వీరు వులవల దర్శకుడు. ఇప్పటికే కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేశారు. తాజాగా హీరోయిన్ విషిక ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.తొలుత హీరోయిన్ వైష్ణవి పాత్రని 'కంటి చూపుతో కాదు కన్నీళ్లతో చంపేస్తా' అని పరిచయం చేశారు. 'పాపం అల్లాడి పోతున్నాడమ్మ బిడ్డ' అనే క్యాప్షన్‌తో హాసిని పాత్రని పరిచయం చేశారు. ఇప్పుడు విషిక పోస్టర్ రిలీజ్ చేశారు. వైష్ణవి, హాసిని కంటే విషిక పాత్ర మరింత ఇంట్రెస్టింగ్గా ఉన్నట్లు అనిపిస్తుంది. .ఈ సినిమాలో వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్స్ ఉన్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే చిత్ర రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. -
'త్రికాల' నుంచి అనురాగ్ కులకర్ణి పాడిన పాట రిలీజ్
అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి పాన్ ఇండియా సినిమాలతో ఆకట్టుకున్న సంగీత దర్శకుడు హర్షవర్దన్ రామేశ్వర్ ... మైథలాజికల్ జానర్లో తీస్తున్న 'త్రికాల' సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మణి తెల్లగూటి దర్శకుడు. రాధిక శ్రీనివాస్ నిర్మాత. తాజాగా 'యాలో ఈ గుబులే ఎలో' పాటని రిలీజ్ చేశారు.ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్‌కు రెస్పాన్స్ బాగానే వచ్చింది. సినిమాపై హైప్ క్రియేట్ అయింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. -
ప్రేమలో మోసపోయే అమ్మాయి కథ.. ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా
ఎప్పుడూ పెద్ద సినిమాలే కాదు అప్పుడప్పుడు చిన్న మూవీస్ కూడా ఆశ్చర్యపరుస్తుంటాయి. రెగ్యులర్ స్టోరీలానే అనిపించినప్పటికీ సమాజంలో జరిగే విషయాల్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంటాయి. అలాంటి ఓ చిత్రమే 'బ్యూటీ'. ప్రేమలో మోసపోయే అమ్మాయి కథతో తీసిన ఈ మూవీలో తండ్రి ఎమోషన్స్ కూడా అద్భుతంగా పండాయి. ఇప్పుడీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్పై అధికారిక ప్రకటన వచ్చేసింది.అంకిత్, నీలఖి, నరేశ్, వాసుకి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'బ్యూటీ'. టీనేజీ ప్రేమకథకు తోడు తండ్రి ఎమోషన్స్‌తో తీశారు. సెప్టెంబరు 19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. దాదాపు మూడు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జనవరి 02 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చారు.(ఇదీ చదవండి: మహిళా అభిమాని పెళ్లి.. సర్ప్రైజ్ చేసిన హీరో సూర్య)'బ్యూటీ' విషయానికొస్తే.. నారాయణ (నరేశ్) మధ్య తరగతి వ్యక్తి. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. కూతురు అలేఖ్య(నీలఖి) అంటే నారాయణకు ప్రాణం. ఆమె అడిగింది కొనిస్తూ, అందులో తన ఆనందాన్ని వెతుక్కుంటుంటాడు. ఇంటర్ చదివే అలేఖ్య.. అనుకోకుండా పెట్ ట్రైనర్ అర్జున్ (అంకిత్)తో ప్రేమలో పడుతుంది. ఇంట్లో ప్రేమ విషయం తెలిసిపోవడంతో అర్జున్‌తో పాటు అలేఖ్య లేచిపోతుంది. అలా కూతురుని వెతుక్కుంటూ నారాణయ.. హైదరాబాద్ వెళ్తాడు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఈ మూవీ స్టోరీ అంతా మనం రోజూ చూసినట్లే ఉంటుంది గానీ.. చూపించిన విధానం, పాత్రల తీరుతెన్నులు కట్టిపడేస్తాయి. బ్యూటీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. కాలేజ్‌కి పంపిన 18 ఏళ్ల కూతురు ప్రేమలో పడుతుంది. దాని వల్ల కన్న తల్లితండ్రులు ఎంత బాధపడ్డారు? లేచిపోయిన కూతురు ఎలాంటి ఇబ్బందుల్లో పడిందీ అని కళ్లకు కట్టినట్లు చూపించారు. తండ్రిగా నరేశ్ ఆకట్టుకునే ఫెర్ఫార్మాన్స్ ఇచ్చాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ అందుకే చీర బహుమతిగా ఇచ్చాడు.. రాజాసాబ్ హీరోయిన్)A love story that turns into a mystery… 💔Beauty Trailer is here!Get ready for #BeautyPremieres 2nd January @AnkithKoyyaLive #NilakhiPatra @ItsActorNaresh @JSSVARDHAN @VijaypalreddyA @iamraj20 @shriesaidaara @__SaNaRe @VijaiBulganin @AdithyarkM @LakshmiMeghanaK pic.twitter.com/aZgbCRV6nw— ZEE5 Telugu (@ZEE5Telugu) December 30, 2025 -
రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా
చిన్న సినిమాలు థియేటర్లలోకి ఎప్పుడొచ్చి వెళ్తాయో కూడా తెలీదు. ఒకవేళ కంటెంట్ బాగున్నా సరే స్టార్స్ లేకపోవడం ప్రేక్షకులు కూడా చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించారు. వీటిలో కొన్ని తర్వాత ఎప్పుడో ఓటీటీలోకి వస్తుంటాయి. ఇప్పుడు అలానే ఓ తెలుగు మూవీ కూడా దాదాపు రెండేళ్ల తర్వాత స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులు చూడొచ్చు?సూర్య భరత్ చంద్ర, విషిక హీరోహీరోయిన్లుగా నటించిన థ్రిల్లర్ మూవీ 'అష్టదిగ్బంధనం'. 2023 సెప్టెంబరులో థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే దీని గురించి ప్రేక్షకులు పెద్దగా తెలియలేదు. ఇన్నాళ్లకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో ఉచితంగా చూసే అవకాశం రావొచ్చు.(ఇదీ చదవండి: కాబోయే భర్తతో సెలబ్రేషన్.. పెళ్లిపై హీరోయిన్ క్లారిటీ)'అష్టదిగ్బంధనం' విషయానికొస్తే.. ప్రజా సంక్షేమ పార్టీ పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు అలియాస్ రాములన్న దగ్గర శంకర్, నర్సింగ్ అనే రౌడీషీటర్స్ పనిచేస్తుంటారు. వచ్చే ఎన్నికల్లో నర్సింగ్, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని రాములన్న ప్రకటిస్తాడు. దీంతో శంకర్‌కి అసూయ ఏర్పడుతుంది. తాను కూడా ఎమ్మెల్యే కావాలనుకుంటున్నానని రాములన్నతో చెప్పగా.. రూ.50 కోట్లు ఇస్తే సీటు ఇస్తానని అంటాడు. దీంతో శంకర్.. బ్యాంకు దోపిడీ చేయాలనుకుంటాడు. తన మనుషులతో కలిసి పక్కా ప్లాన్ వేస్తాడు.మరి శంకర్ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఇతడి స్కెచ్‌లో హీరో హీరోయిన్లు ఎలా ఇరుక్కున్నారు? గౌతమ్(సూర్య భరత్ చంద్ర) గతమేంటి? ఎలక్షన్ ఫండ్ అని రాములన్న ఇచ్చిన రూ.100 కోట్లని శంకర్ ఎక్కడ దాచాడు? ఆ డబ్బు ఎవరు ఎలా కొట్టేశారు? అసలు 'అష్టదిగ్భంధనం' ప్లాన్ వేసిందెవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు) -
రిలీజ్‌కి ముందు టైటిల్ మార్పు.. ట్రైలర్ రిలీజ్
అవినాష్ హీరోగా పరిచయమవుతూ దర్శకత్వం వహించిన సినిమా 'వానర'. నిన్నటివరకు ఈ పేరుతోనే ప్రచారం చేశారు. ఇప్పుడు టైటిల్ మార్చినట్లు ప్రకటించారు. 'వనవీర' అనే పేరుని ఫిక్స్ చేశారు. జనవరి 1న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్ర ట్రైలర్ ఇప్పుడు విడుదల చేశారు.కులం, రాజకీయ అంశాలతో తీసిన ఈ సినిమాలో డివోషనల్ టచ్ కూడా ఉంది. ఈ మేరకు ట్రైలర్లో రాముడు, వానర సైన్యం, లంకకు వారధి కట్టడం లాంటి గ్రాఫిక్ విజువల్స్ చూపించారు. అయితే స్టోరీకి రాముడు, వానర సైన్యానికి లింక్ చేసి ఎలా చూపిస్తారో? ఇందులో సిమ్రన్ చౌదరి హీరోయిన్గా చేయగా.. వివేక్ సాగర్ సంగీతమందించాడు. -
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన 'బొమ్మ హిట్'
బాలనటుడిగా పలు సినిమాలు చేసిన అభినవ్ మణికంఠ హీరోగా చేస్తున్న కొత్త మూవీ 'బొమ్మ హిట్'. గుర్రాల సంధ్యారాణి నిర్మిస్తున్నారు. రాజేష్ గడ్డం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పూజా యడం హీరోయిన్. ఈ చిత్రం నేడు(డిసెంబరు 20) పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో ప్రారంభమైంది.హీరో అభినవ్ మణికంఠ మాట్లాడుతూ.. బొమ్మ హిట్ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్తో సిచ్యుయేషనల్ కామెడీతో వినోదాన్ని ఇస్తుంది. ఈ మధ్య కామెడీ చిత్రాల్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మా బొమ్మ హిట్ సినిమాను కూడా హిట్ చేస్తారని కోరుకుంటున్నా అని అన్నాడు. రాబోయే వేసవికి రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నామని దర్శకుడు రాజేష్ చెప్పుకొచ్చారు. -
యూట్యూబ్‌లో అలరిస్తున్న 'మెన్షన్ హౌస్ మల్లేష్' సాంగ్
హిట్, యానిమల్ లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించి ఆకట్టుకున్న నటుడు శ్రీనాథ్ మాగంటి. ఇతడి హీరోగా చేసిన సినిమా 'మెన్షన్ హౌస్ మల్లేష్'. కొన్నాళ్ల క్రితం సినిమా నుంచి టీజర్, సాంగ్స్ వచ్చాయి. థియేటర్లలో మూవీని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే సినిమాలోని పాట యూట్యూబ్‌లో ఆకట్టుకుంటోంది.'బంగారి బంగారి' అంటూ సాగే పాట కొన్నాళ్ల క్రితం రిలీజ్ చేయగా శ్రోతల్ని అలరిస్తూ ఇప్పుడు మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ రాశారు. ఈ సినిమాలో గాయత్రి రమణ హీరోయిన్గా చేస్తోంది. బాల సతీష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సురేశ్ బొబ్బిలి సంగీతమందించారు. రాజేష్ ఈ సినిమాను నిర్మించారు. -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా
ఈ వారం ఓటీటీల్లో పలు తెలుగు సినిమాలు వచ్చాయి. వీటిలో దుల్కర్ సల్మాన్ 'కాంత', అల్లరి నరేశ్ '12ఏ రైల్వే కాలనీ'తో పాటు డబ్బింగ్ చిత్రాలైన బ్రాట్, ఆరోమలేతో పాటు తెలుగు వెబ్ సిరీస్ త్రీ రోజెస్ రెండో సీజన్ కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. ఇప్పుడు వీటితో పాటు మరో తెలుగు హారర్ మూవీ కూడా సడన్‌గా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఆ సినిమా సంగతేంటి? ఏ ఓటీటీలో చూడొచ్చు.(ఇదీ చదవండి: ‘మోగ్లీ’మూవీ రివ్యూ)శ్రీజిత్, నిష్కల, రమ్య హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'చెరసాల'. ఈ ఏడాది ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైంది. కాకపోతే చిన్న సినిమా కావడం, యాక్టర్స్ ఎవరూ పేరున్న వాళ్లు కాకపోవడంతో ఇది వచ్చిన సంగతి కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడు దాదాపు ఎనిమిది నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం అద్దె విధానంలో అందుబాటులో ఉంది.'చెరసాల' విషయానికొస్తే.. వంశీ (శ్రీజిత్), ప్రియ (నిష్కల) కాలేజీ స్టూడెంట్స్. కలిసి చదువుకున్నప్పుడే ప్రేమలో పడతారు కానీ బయటకు చెప్పుకోరు. కాలేజీ చదువులు పూర్తయ్యాక స్నేహితులతో కలిసి వీళ్లిద్దరూ ఓ ట్రిప్‌కి వెళ్తారు. ఓ బంగ్లాలో ఉంటారు. కానీ ఈ భవంతిలో ఓ ప్రేతాత్మ ఉంటుంది. అసలు అక్కడ ప్రేతాత్మ ఎందుకు ఉంది. అక్కడికి వచ్చిన వాళ్లని ఎలాంటి ఇబ్బందులు పెట్టింది? చివరకు వంశీ, ప్రియ ఎలా బయటపడ్డారనేది స్టోరీ.(ఇదీ చదవండి: నటి పాకీజాకు ఆశ్రయం కల్పించిన కోనసీమ వాసి) -
కన్నడ యాక్షన్ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్
ప్రతివారం ఓటీటీల్లో కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అలానే ఇతర భాషల్లో ఆకట్టుకున్న మూవీస్ కూడా డబ్బింగ్ రూపంలో వస్తుంటాయి. ఇప్పుడు అలా ఓ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. కొన్నిరోజుల క్రితం ఒరిజినల్ వెర్షన్ స్ట్రీమింగ్‌లోకి రాగా.. ఇప్పుడు తమిళ, తెలుగు వెర్షన్స్‌ని తీసుకొచ్చేశారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో చూడొచ్చు?కన్నడ హీరో డార్లింగ్ కృష్ణ లేటెస్ట్ మూవీ 'బ్రాట్'. అక్టోబరు 31న థియేటర్లలోకి వచ్చింది. ఓ మాదిరి చిత్రం అనిపించుకుంది. క్రికెట్ బెట్టింగ్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఆసక్తి ఉంటే ఓ లుక్ వేయొచ్చు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)'బ్రాట్' విషయానికొస్తే.. క్రిస్టీ(డార్లింగ్ కృష్ణ) ఓ ఆకతాయి కుర్రాడు. సులభంగా డబ్బులు సంపాదించి కోటీశ్వరుడు అయిపోవాలని కలలు కంటుంటాడు. దీంతో ఈజీ మనీ కోసం క్రికెట్ బెట్టింగ్‌లోకి దిగుతాడు. అయితే క్రిస్టీ తండ్రి పోలీస్. దీంతో తండ్రి-కొడుకల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి? చివరకు ఏమైందనేదే స్టోరీ. ఫస్టాఫ్ బాగున్నప్పటికీ సెకండాఫ్‌లో ల్యాగ్ వల్ల యావరేజ్‌గా నిలిచింది.ఈ వారం దీనితో పాటు చాలా సినిమాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. అల్లరి నరేశ్ '12ఏ రైల్వే కాలనీ' సినిమా.. ఈరోజే అమెజాన్ ప్రైమ్‌లోకి రాగా.. దుల్కర్ సల్మాన్ 'కాంత' నెట్‌ఫ్లిక్స్‌లోకి శుక్రవారం రానుంది. అలానే 'ఆరోమలే' అనే డబ్బింగ్ సినిమా హాట్స్టార్లోకి, త్రీ రోజెస్ వెబ్ సిరీస్ రెండో సీజన్ ఆహా ఓటీటీలోకి, ఎఫ్ 1 అనే హాలీవుడ్ డబ్బింగ్ మూవీ ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీలోకి రానున్నాయి.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ హారర్ థ్రిల్లర్) -
నేరుగా ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా
టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న సినిమాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. థియేటర్లలోకి వచ్చి వీటిని చూసే ప్రేక్షకులు చాలావరకు తగ్గిపోయారు. అదే టైంలో ఓటీటీలో రిలీజైన తర్వాత మాత్రం బాగానే చూస్తున్నారు. ఈ క్రమంలోనే పలు చిన్న చిత్రాలు కొన్నిసార్లు నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ అయిపోతుంటాయి. అలాంటి ఓ తెలుగు థ్రిల్లర్ సినిమానే 'దివ్య దృష్టి'. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రాబోతుంది?'ప్రేమకావాలి' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈషా చావ్లా.. ఓవర్‌నైట్ గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత పలు మూవీస్ చేసినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో టాలీవుడ్‌కి దూరమైపోయింది. చిరంజీవి 'విశ్వంభర'లోనూ ఓ పాత్రలో నటించిందని అంటున్నారు గానీ క్లారిటీ రావాల్సి ఉంది. ఇకపోతే ఈమె లీడ్ రోల్ చేసిన చిత్రమే 'దివ్యదృష్టి'. సునీల్ విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని ఈనెల 19 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.(ఇదీ చదవండి: 'గుమ్మడి నర్సయ్య'గా శివన్న.. ఎందుకు చేస్తున్నారో తెలుసా?)'దివ్యదృష్టి' టీజర్ బట్టి చూస్తే.. ఓ అమ్మాయికి ప్రమాదవశాత్తూ కళ్లుపోతాయి. అయినా సరే బతుకుతుంది. తర్వాత తన దివ్యదృష్టిని ఉపయోగించి కొన్ని సంఘటనలని ముందుగానే చూస్తుంది. ఇంతకీ ఈమె కళ్లు పోవడానికి కారణమేంటి? ఈమె వెంటపడుతున్న వ్యక్తి ఎవరు? అనేదే స్టోరీలా అనిపిస్తుంది.ఈ వీకెండ్ ఓటీటీ సినిమాల విషయానికొస్తే రష్మిక 'ద గర్ల్‌ఫ్రెండ్' నెట్‌ఫ్లిక్స్‌లో, కామెడీ మూవీ 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' జీ5లో, 'స్టీఫెన్' అనే డబ్బింగ్ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో, సుధీర్ బాబు 'జటాధర'తో పాటు రష్మిక 'థామా' చిత్రాలు అమెజాన్ ప్రైమ్ వీడియోలో, 'డీయస్ ఈరే' అనే హారర్ డబ్బింగ్ సినిమా హాట్స్టార్లోకి వచ్చాయి. అలానే 'కుట్రం పురింధవన్' అనే తెలుగు డబ్బింగ్ థ్రిల్లర్ సిరీస్.. సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చింది.(ఇదీ చదవండి: ఇదో సైకో కథ, షాక్ ఇచ్చే క్లైమాక్స్.. 'స్టీఫెన్' సినిమా ఓటీటీ రివ్యూ)Every vision is a clue. Every clue is a threat. Divya Dristi, Direct on Sun NXT this Dec 19.@eshachawla63 @suniltollywood @kamalkamaraju @iam_kabirlal @lovelyworldentertainment @IamAjayKSingh#DivyaDristi #SunNxtExclusive #DirectToSunNxt #SunNxt #ThrillerMovie pic.twitter.com/EQXaHmD3Lr— SUN NXT (@sunnxt) December 4, 2025 -
'ఇట్స్ ఓకే గురు' అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా: మెహర్ రమేశ్
సాయి చరణ్, ఉషశ్రీ హీరో హీరోయిన్లు చేసిన సినిమా 'ఇట్స్ ఓకే గురు'. మణికంఠ దర్శకత్వం వహించగా.. క్రాంతి ప్రసాద్ నిర్మించారు. ఈనెల 12న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు మెహర్ రమేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్ మెహర్ రమేశ్ మాట్లాడుతూ.. 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాకు పూరి జగన్నాథ్ దగ్గర నేను అసిస్టెంట్‌గా పని చేశాను. బడ్జెట్‌తో సంబంధం లేకుండా సబ్జెక్ట్‌ని నమ్మి చేసిన సినిమా అది. దాని తర్వాత రవితేజ, పూరి జగన్నాథ్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ సినిమా చూస్తుంటే నాకు మంచి సబ్జెక్టు ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని చెప్పుకొచ్చారు. -
8 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
తెలుగులో పెద్ద సినిమాలకు ఓటీటీ డీల్స్.. విడుదలకు ముందే పూర్తయిపోతాయి. చిన్నచిత్రాలకు మాత్రం కొన్నిసార్లు రిలీజ్ తర్వాత లేదంటే ఎప్పటికో అవుతాయి. అలా కొన్నిసార్లు థియేటర్లలోకి వచ్చిన నెలల తర్వాత కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అలా ఓ తెలుగు చిత్రం దాదాపు 8 నెలల తర్వాత అందుబాటులోకి వచ్చింది.అప్పట్లో పలు తెలుగు సినిమాల్లో విలన్‌గా చేసిన సత్యప్రకాశ్.. ప్రస్తుతం ఒకటి అరా చిత్రాల్లో కనిపిస్తున్నారు. ఈయన ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'నాన్నా మళ్లీ రావా!'. ప్రభావతి, రిత్విక్, హారిక, శిరీష ఇతర పాత్రలు పోషించారు. నిర్దేశ్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజ్ కాగా ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. కాకపోతే ప్రస్తుతం అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: బోల్డ్ వెబ్ సిరీస్.. ఫైనల్ సీజన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)రిలీజ్ టైంలో ఈ సినిమా గురించి మాట్లాడిన సత్యప్రకాశ్.. నన్నెంతగానో కదిలించిన కథ ఇది. చిత్రీకరణలో ప్రతిరోజూ గ్లిజరిన్ అవసరం లేకుండానే కన్నీళ్లు వచ్చేవి. కథలోని ప్రతి సందర్భం వాస్తవంలా అనిపించేది అని చెప్పుకొచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ 'నాన్న చుట్టూ తిరిగే కథ ఇది. భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది' అని అన్నారు.ఇకపోతే ఈ వారం ఓటీటీల్లో బోలెడన్ని తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ విడుదలయ్యాయి. రష్మిక 'ద గర్ల్‌ఫ్రెండ్' నెట్‌ఫ్లిక్స్‌లో, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమా జీ5లో, స్టీఫెన్ అనే డబ్బింగ్ బొమ్మ నెట్‌ఫ్లిక్స్‌లో, సుధీర్ బాబు 'జటాధర'తో పాటు రష్మిక 'థామా' చిత్రాలు అమెజాన్ ప్రైమ్ వీడియోలో, 'డీయస్ ఈరే' అనే హారర్ డబ్బింగ్ సినిమా.. హాట్స్టార్లోకి వచ్చాయి. అలానే 'కుట్రం పురింధవన్' అనే తెలుగు డబ్బింగ్ థ్రిల్లర్ సిరీస్.. సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చాయి.(ఇదీ చదవండి: నాగార్జున గోవాకు పిలిచి మరీ వార్నింగ్..: దర్శకుడు) -
'ప్రేమలో రెండోసారి' త్వరలో ఓటీటీలో విడుదల
సిద్ధా క్రియేషన్స్ బ్యానర్‌పై రమణ సాకే, వనితా గౌడ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'ప్రేమలో రెండోసారి'. సాకే రామయ్య సమర్పించిన ఈ చిత్రాన్ని సత్య మార్క దర్శకత్వం వహించారు. నీరజ లక్ష్మి నిర్మించారు. జబర్దస్త్ శ్రీను, బాబీ, దుర్గారావు, ఫణి, సతీష్ సారేపల్లి, చిరంజీవి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ రొమాంటిక్ లవ్ స్టోరీ నవంబర్ 21న థియేటర్లలో విడుదలైంది. రెస్పాన్స్ బాగుంది. ఈ క్రమంలో దర్శకనిర్మాతలు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు.ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. చిన్న సినిమాగా విడుదలైన మా చిత్రానికి రోజూ థియేటర్లు పెరుగుతున్నాయి. అందుకు కారణం పాజిటివ్ టాకే. గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం తీశాం. త్వరలోనే మా చిత్రం ఓ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. చిత్రాన్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు మా టీమ్ తరపున థ్యాంక్స్ చెప్పుకుంటున్నామని తెలిపారు. -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు డబ్బింగ్ సినిమా
గత నెలలో దీపావళికి తెలుగులో పలు సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో 'కె ర్యాంప్' ఉన్నంతలో ఆకట్టుకుంది. ఇదే పండగకు తమిళంలో 'డ్యూడ్'తో పాటు బైసన్, డీజిల్ అనే మూవీస్ వచ్చాయి. వీటిలో మొదటి రెండు హిట్ కాగా 'డీజిల్' మాత్రం బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. ఇప్పుడీ చిత్రమే ఎలాంటి ప్రకటన ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే ఇక్కడే ఓ ట్విస్ట్.(ఇదీ చదవండి: రజనీ, చిరంజీవి యాక్టింగ్ గురువు కన్నుమూత)తెలుగులో నాని 'జెర్సీ'లో చిన్న పాత్రలో నటించిన హరీశ్ కల్యాణ్.. ప్రస్తుతం తమిళంలో హీరోగా సినిమాలు చేస్తున్నాడు. 'డీజిల్' ఇతడి లేటెస్ట్ మూవీ. క్రూడ్ ఆయిల్ స్మగ్లింగ్ అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర జస్ట్ యావరేజ్ అనిపించుకుంది. థియేటర్లలో కేవలం తమిళంలో మాత్రమే రిలీజ్ కాగా.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం యూకేలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వారమే మనదేశంలో కూడా రిలీజయ్యే అవకాశముంది. సడన్ స్ట్రీమింగ్ ఉండొచ్చు. మరోవైపు బయట దేశాల్లో సింప్లీ సౌత్ ఓటీటీలో ఈ శుక్రవారం (నవంబరు 21) రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటించారు.'డీజిల్' విషయానికొస్తే.. వాసు (హరీశ్ కల్యాణ్) తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతారు. దీంతో మనోహర్ అనే క్రూడ్ ఆయిల్ స్మగ్లర్, వాసుని పెంచి పెద్ద చేస్తాడు. కొడుకులా చూసుకుని కెమికల్ ఇంజినీరింగ్ చదివిస్తాడు. వాసు పెద్దయిన తర్వాత మనోహర్‌కి సాయపడుతుంటాడు. క్రూడ్ ఆయిల్‌ని వైట్ పెట్రోల్‌గా మార్చి, వాటిని చేపల కోసం ఉపయోగించే ఐస్ గడ్డల్లా తయారు చేసి స్మగ్లింగ్ చేస్తుంటాడు. అయితే బాలమురుగన్ అనే వ్యక్తి, డీసీపీతో చేతులు కలిపి మనోహర్ క్రూడ్ ఆయిల్ సామ్రాజ్యాన్ని దోచుకుందామని అనుకుంటారు. దీనికి అడ్డంగా ఉన్న మనోహర్ని చంపేయాలని వీళ్లు ప్లాన్ వేస్తారు. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి? దీన్ని వాసు ఎలా అడ్డుకున్నాడనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఒళ్లు జలదరించేలా 'ధురంధర్' ట్రైలర్) -
రవితేజతో సమంత.. ఓ క్రైమ్ థ్రిల్లర్!
ఫలితంతో సంబంధం లేకుండా వరస సినిమాలు చేసే టాలీవుడ్ హీరో రవితేజ.. కొన్నిరోజుల క్రితమే 'మాస్ జాతర'తో వచ్చాడు. కంటెంట్ మరీ తీసికట్టుగా ఉండేసరికి బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. ప్రస్తుతం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే ఫ్యామిలీ మూవీ చేస్తున్నాడు. ఇది సంక్రాంతికి రిలీజ్ కానుంది. రీసెంట్‌గానే గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయగా.. ఈసారి హిట్ కొట్టేలా ఉన్నాడనిపిస్తుంది.ఇప్పుడు రవితేజ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్గా సమంతని తీసుకోబోతున్నారనే రూమర్ తెగ వైరల్ అవుతోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం టాలీవుడ్లో ఇది ఫ్రెష్ కాంబో అవుతుంది. ఇకపోతే ఈ ప్రాజెక్టుకు 'నిన్ను కోరి', 'మజిలీ' ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తారని అంటున్నారు.(ఇదీ చదవండి: 'ఐ బొమ్మ' క్లోజ్.. మరి మిగతా వాటి సంగతి?)శివ నిర్వాణ సినిమాలు అనగానే దాదాపు ఫ్యామిలీ సబ్జెక్టులే గుర్తొస్తాయి. చివరగా తీసిన 'ఖుషి' లవ్ స్టోరీనే. అందులో హీరోయిన్ సమంతనే. అయితే శివ ఈసారి ఓ క్రైమ్ థ్రిల్లర్ కథ రాసుకున్నాడని.. దీనికి రవితేజ ఓకే చెప్పారని తెలుస్తోంది. ఇప్పుడు సమంత హీరోయిన్గా కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. ఈ నెలలోనే లాంచ్ ఉండొచ్చని టాక్.ఈ మధ్యే సమంత.. 'మా ఇంటి బంగారం' అనే సినిమా మొదలుపెట్టింది. హీరోయిన్ కమ్ నిర్మాత ఈమెనే. నందినీ రెడ్డి దర్శకురాలు. ఇప్పుడు రవితేజతోనూ మూవీ చేయనుందని టాక్ వచ్చిందంటే.. హీరోయిన్గా చేసేందుకు ఆసక్తి చూపిస్తుందనమాట. మరి వస్తున్న పుకార్లలో నిజమెంత అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్' ట్రైలర్ రిలీజ్
తెలుగు యంగ్ హీరో రాజ్ తరుణ్.. ఈ నెలలో ఓటీటీ సినిమా 'చిరంజీవ'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంది. ఒకప్పటితో పోలిస్తే ఇతడి నుంచి వచ్చే మూవీస్ తగ్గిపోయాయి. అలానే ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన ఏం రావట్లేదు. అలాంటిది ఇప్పుడు మరోసారి తన అదృష్టం పరీక్షించుకునేందుకు 'పాంచ్ మినార్' అనే చిత్రాన్ని సిద్దం చేశాడు.(ఇదీ చదవండి: రామ్ చరణ్ పెద్ది మూవీ.. చికిరి చికిరి సాంగ్ క్రేజీ రికార్డ్!)ఈ శుక్రవారం(నవంబరు 21) థియేటర్లలోకి సినిమా రాబోతుంది. ఈ క్రమంలోనే ఆదివారం, ట్రైలర్ లాంచ్ చేశారు. కామెడీగా నవ్వించే ప్రయత్నం చేశారు. 'పాంచ్ మినార్' విషయానికొస్తే.. ఆవారాగా తిరిగే హీరో, ఉద్యోగం చేసుకునే హీరోయిన్ ప్రేమలో పడతాడు. జాబ్ చేస్తేనే పెళ్లి అని చెప్పడంతో ట్యాక్సీ డ్రైవర్‌గా మారతాడు. తర్వాత అనుకోని పరిస్థితుల్లో మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఓవైపు పోలీసులు, మరోవైపు గుండాల మధ్య చిక్కుకున్న హీరో.. ఎలా బయటపడ్డాడు అనేదే స్టోరీలా అనిపిస్తుంది. దీంతోనైనా రాజ్ తరుణ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి?(ఇదీ చదవండి: మహేశ్ 'వారణాసి' ఈవెంట్‌కి అన్ని కోట్లు ఖర్చయిందా?) -
చంద్రబోస్ రిలీజ్ చేసిన 'వసుదేవసుతం' మెలోడీ సాంగ్
మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటిస్తున్న సినిమా 'వసుదేవసుతం'. వైకుంఠ్ బోను దర్శకుడు కాగా ధనలక్ష్మి బాదర్ల నిర్మాత. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్ రిలీజ్ అయ్యాయి. రీసెంట్గా ఈ మూవీ నుంచి ఓ మెలోడీ పాటని ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.మణిశర్మ సంగీతమందించిన 'ఏమైపోతుందో' అంటూ సాగే ఈ పాటకు శ్రీ హర్ష ఈమని సాహిత్యం అందించారు. పవన్, శృతిక పాడారు. ఈ లిరికల్ వీడియోలో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ, లవ్ ట్రాక్ అందంగా చూపించారు. పాట రిలీజ్ చేసిన తర్వాత చంద్రబోస్ మాట్లాడుతూ.. 'వసుదేవసుతం'లోని 'ఏమైపోతుందో' పాట చాలా బాగుంది. సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. రిలీజ్ డేట్‌కు సంబంధించిన వివరాల్ని త్వరలోనే చిత్రయూనిట్ ప్రకటించనుంది. -
బింధుమాధవి వేశ్య పాత్రలో.. 'దండోరా' రిలీజ్ డేట్ ఫిక్స్
కలర్ ఫోటో, బెదురులంక 2012 సినిమాలని నిర్మించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా 'దండోరా'. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే విడుదల తేదీని ప్రకటించారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబరు 25న మూవీ థియేటర్లలోకి వస్తుందని నిర్మాతలు ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 21 సినిమాలు)అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని 'దండోరా' సినిమా తీశారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూ దీన్ని తెరకెక్కించారు. శివాజీతో పాటు నవదీప్, బిందు మాధవి తదితరులు నటించారు. బిందుమాధవి ఇందులో వేశ్య పాత్రలో కనిపించనుంది.(ఇదీ చదవండి: బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్‌లో ఎవరంటే?) -
తెలుగు మూవీలో కుంభమేళా పూసల పిల్ల
-
చాందినీ చౌదరి కొత్త సినిమా గ్రాండ్ లాంచ్
చాందినీ చౌదరి, సుశాంత్ యాష్కీ హీరోహీరోయిన్లుగా కొత్త సినిమా మొదలైంది. సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ జానర్లో దీన్ని తెరకెక్కించనున్నారు. వికాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సహచారి క్రియేషన్స్ బ్యానర్‌పై సృజన గోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆదివారం (నవంబరు 02) ఘనంగా లాంచ్ అయింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ క్లాప్ కొట్టగా, గీతా భాస్కర్, చిత్ర యూనిట్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.సైన్స్ ఫిక్షన్, డార్క్ కామెడీతో పాటు ఈ చిత్రంలో ఒక సూపర్ నేచురల్ ఎలిమెంట్ కూడా ఉంది. ఈ చిత్ర కాన్సెప్ట్ వీడియోను టీమ్ త్వరలోనే విడుదల చేయనుంది. నవంబర్ చివరిలో హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో జీవన్ కుమార్, అజయ్ గోష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తుండగా, జితిన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు చాన్నాళ్ల క్రితం రిలీజైన చిత్రాల్ని కూడా ఎలాంటి హడావుడి లేకుండా స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తుంటారు. ఇప్పుడు అలానే గతేడాది రిలీజైన ఓ తెలుగు మూవీ.. ఇప్పుడు సడన్‌గా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆరు కథల ఆంథాలజీతో తీసిన ఈ చిత్రం.. ఏ ఓటీటీలో చూడొచ్చు? ఇంతకీ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.కొన్నేళ్ల క్రితం ఆంథాలజీ ట్రెండ్ బాగానే నడిచింది. తెలుగులోనూ కేరాఫ్ కంచరపాలెం, చందమామ కథలు, పంచతంత్రం లాంటి ఒకటి రెండు మూవీస్ వచ్చాయి. ఇదే జానర్లో గతేడాది సెప్టెంబరులో థియేటర్లలోకి వచ్చిన మూవీ 'లైఫ్ స్టోరీస్'. ఆరు కథలు, 11 మంది యాక్టర్స్ నటించిన ఈ సినిమాలో స్నేహం, సంతోషం, ఒంటరితనం, పశ్చాత్తపం, యవ్వనపు ప్రేమ, సాంగత్యం అనే కాన్సెప్ట్‌తో తీశారు. ఈ కథలన్నీ చివరలో లింక్ చేశారు.(ఇదీ చదవండి: నేను కూడా చిరుతో అప్పట్లో అనుకున్నా.. కానీ: మాళవిక మోహనన్)థియేటర్లలో రిలీజైనప్పుడు ఓ మాదిరి రెస్పాన్స్ అందుకున్న 'లైఫ్ స్టోరీస్'.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతానికైతే అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. కొన్నిరోజుల్లో ఉచితంగానూ అందుబాటులోకి రావొచ్చు. ఈ ఆంథాలజీ చిత్రంలో క్యాబ్ క్రానికల్స్, ది మామ్, గ్లాస్ మేట్స్, జిందగీ, బంగారం, ది వైల్డ్ హట్స్ అనే టైటిల్స్‌తో స్టోరీలని చూపించారు. అన్నీ కూడా డీసెంట్‌గానే ఉంటాయి. కుదిరితే ఓ లుక్కేయండి.'లైఫ్ స్టోరీస్' విషయానికొస్తే.. ఇంజినీర్‌గా జాబ్ చేసి మనశ్శాంతి లేకపోవడంతో ఓ వ్యక్తి డ్రైవర్‌గా మారతాడు. ఓ రోజు సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఈ క్యాబ్ ఎక్కుతాడు. వీళ్ల మధ్య జరిగిన సంభాషణ ఏంటి అనేది ఓ స్టోరీ. తల్లితో(దేవయాని) కలిసి ఆనందంగా గడపాలని ఓ చిన్నారి ఆశపడుతుంటాడు. కానీ ఉద్యోగం కారణంగా కొడుక్కి సదరు తల్లి అస్సలు సమయం ఇవ్వలేకపోతూ ఉంటుంది. కొడుకు ఆనందం కోసం తల్లి తీసుకున్న నిర్ణయం ఏంటనేది ఓ స్టోరీ.(ఇదీ చదవండి: ఎట్టకేలకు రజనీకాంత్ షాకింగ్ నిర్ణయం?)సతీష్.. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేందుకు భార్యతో కలిసి ఓ రిసార్ట్‌కి వెళ్తాడు. అక్కడ అనుకోకుండా తన చిన్ననాటి స్నేహితుడు మంగేశ్ కనిపిస్తాడు. మాట్లాడుతూ వీళ్లిద్దరూ బాల్యంలోకి వెళ్లిపోతారు. మరోవైపు వీళ్లిద్దరి భార్యల మధ్య సాగిన డిస్కషన్ ఏంటనేది మరో స్టోరీ. ఐటీ ఉద్యోగి పీయూష్.. తన ప్రియురాలితో కలిసి కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్లాన్ రివర్స్ అవుతుంది. దీంతో ఒంటరిగానే వికారాబాద్ వెళ్లాల్సి వస్తుంది. ఇంతకీ ఏమైందనేది ఓ స్టోరీ.మంగమ్మ.. రోడ్ పక్కన ఓ టీ దుకాణం నడుపుతూ ఉంటుంది. ఈమె ఒంటరి జీవితంలోకి ఓ కుక్క వస్తుంది. దీంతో ఆ శునకానికి బంగారం అని పేరు పెట్టి పెంచుకుంటుంది. మరి బంగారంతో మంగమ్మకు ఎలాంటి బాండింగ్ ఏర్పడింది? అనేది ఓ స్టోరీ. శ్రియా.. తన భర్తతో కలిసి న్యూఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటుంది. కానీ బాస్ పనిఅప్పజెప్పడంతో ఆఫీస్‌లోనే ఉండిపోతుంది. మరి భర్తతో కలిసి పార్టీ చేసుకోవాలనే కోరిక తీరిందా లేదా అనేది మరో స్టోరీ.(ఇదీ చదవండి: హీరోయిన్గా మహేశ్‌బాబు మేనకోడలు ఎంట్రీ) -
దక్షిణ భారత కథలతో...
ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఆరు కొత్త తెలుగు, తమిళ ఒరిజినల్ సినిమాలు, వెబ్ సిరీస్‌లను సోమవారం ప్రకటించింది. వాటిలో భాగంగా ఆనంద్ దేవరకొండ హీరోగా దర్శకుడు వినోద్ అనంతోజు తెరకెక్కించనున్న తెలుగు చిత్రం ‘తక్షకుడు’. ఈ సినిమాలో ఆనంద్ అంధుడి పాత్రలో కనిపించనున్నారు. అదేవిధంగా సందీప్ కిషన్ హీరోగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఓ తెలుగు వెబ్ సిరీస్ రూ పొందనుంది.అలాగే ప్రియాంక మోహన్, పార్క్ హై–జిన్ ప్రధాన పాత్రల్లో రా కార్తీక్ దర్శకత్వంలో ‘మేడ్ ఇన్ కొరియా’ అనే తమిళ చిత్రం తెరకెక్కనుంది. అదేవిధంగా ఆర్. మాధవన్, నిమిషా సజయన్ ముఖ్య తారలుగా చారుకేశ్ శేఖర్ దర్శకత్వంలో ‘లెగసీ’ (తమిళం), గోమతి శంకర్ ప్రధాన పాత్రలో మిథున్ డైరెక్షన్లో ‘స్టీఫెన్’(తమిళం) చిత్రాలు, అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి జంటగా బాలాజీ మోహన్ దర్శకత్వంలో ‘# లవ్’(తమిళం) అనే వెబ్ సిరీస్ రూ పొందనుంది. ‘‘పైన పేర్కొన్న సినిమాలు, సిరీస్‌ల ద్వారా దక్షిణ భారత భాషల్లోని కథలను ప్రోత్సహించడానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం’’ అని నెట్‌ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మోనికా శెర్గిల్ పేర్కొన్నారు. -
బాలల దినోత్సవం నాడు 'స్కూల్ లైఫ్' విడుదల
పులివెందుల మహేష్ హీరోగా, దర్శకుడిగా రూపొందించిన చిత్రం 'స్కూల్ లైఫ్'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 14న అంటే బాలల దినోత్సవం నాడు థియేటర్లలోకి రానుంది. నైనిషా క్రియేషన్స్ బ్యానర్లో గంగాభవని నిర్మాతగా వ్యవహరించారు. సావిత్రి, షన్ను, సుమన్, ఆమని, మురళి గౌడ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.మా 'స్కూల్ లైఫ్' నా ఒక్కడి కల కాదు, మా టీమ్ సభ్యులందరూ కలిసి కష్టపడి తీసిన చిత్రం. రాయలసీమ నేటివిటీకి పెద్దపీట వేస్తూ, ఒక స్కూల్ నేపథ్యంలోని చక్కటి ప్రేమ కథ, రైతుల కష్టాలు, స్నేహం తదితర అంశాలతో తెరకెక్కించాం. నవంబర్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అని పులివెందుల మహేశ్ చెప్పాడు. -
'ఫెయిల్యూర్ బాయ్స్' ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్
క్రాంతి, అవితేజ్, ప్రదీప్, సుపర్ణ, పవని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఫెయిల్యూర్ బాయ్స్'. శ్రీ గురుదక్షిణ మూర్తి ఫిలింస్ బ్యానర్‌పై వీవీఎస్ కుమార్, ధన శ్రీనివాస్ జామి, లక్ష్మి వెంకట్ రెడ్డి నిర్మించారు. వెంకట్ రెడ్డి ఉసిరిక దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఫిలింఛాంబర్లో శనివారం, ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు.నటుడు సూర్య మాట్లాడుతూ - 'ఫెయిల్యూర్ బాయ్స్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ చిత్రంలో సుమన్, నాజర్, తనికెళ్ల భరణి లాంటి మంచి నటులు ఉన్నారు. యంగ్ టీమ్ అంతా ఈ సినిమాకు వర్క్ చేసింది. ఫెయిల్యూర్ బాయ్స్ సినిమా పెద్ద సక్సెస్ అందుకుని దర్శక నిర్మాతలకు, మూవీ టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా అని అన్నారు. -
పెళ్లి తర్వాత శోభిత తొలి సినిమా.. నేరుగా ఓటీటీలో రిలీజ్!
నాగచైతన్య గతేడాది డిసెంబరులో శోభితని పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి వీళ్లిద్దరూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పటి నుంచి శోభిత కొత్త ప్రాజెక్టులు ఒప్పుకొన్నట్లు ఎలాంటి అప్డేట్ రాలేదు. రీసెంట్గా ఓ తమిళ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఇప్పటికే శోభిత.. ఓటీటీ మూవీని పూర్తి చేసిందని, వచ్చే నెలలోనే ఇది రిలీజ్ కానుందని ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: నాగార్జునతో టబు.. మళ్లీ ఇన్నేళ్లకు జంటగా!)వైజాగ్‌కి చెందిన శోభిత.. తొలుత మోడలింగ్ చేసింది. 2016 నుంచి సినిమాలు చేస్తోంది. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. మేడ్ ఇన్ హెవెన్, బార్డ్ ఆఫ్ బ్లడ్, ద నైట్ మేనేజర్ లాంటి వెబ్ సిరీసుల్లోనూ యాక్ట్ చేసింది. అయితే 'చీకట్లో' అనే ఓటీటీ మూవీలో శోభిత నటించింది. కానీ దీని గురించి ఎక్కడా చిన్న అప్డేట్ కూడా లేదు. సురేశ్ ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించాడట.'చీకట్లో' పేరుతో తీసిన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నవంబరు 18న రిలీజ్ చేయబోతున్నారట. అయితే ఈ మూవీని ఏకంగా 18 భాషల్లో డబ్బింగ్ చేసి స్ట్రీమింగ్‌లోకి తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ఇదంతా అనధికారికంగా బయటకొచ్చిన ఇన్ఫర్మేషన్. త్వరలో ఈ మూవీ గురించి అధికారిక ప్రకటనతో పాటు ఇతర వివరాలు కూడా రావొచ్చు. శోభిత భర్త, హీరో నాగచైతన్య ప్రస్తుతం హారర్ జానర్లో ఓ సినిమా చేస్తున్నాడు.(ఇదీ చదవండి: క్రేజీగా ప్రదీప్-మమిత 'డ్యూడ్' ట్రైలర్) -
నాగార్జునతో టబు.. మళ్లీ ఇన్నేళ్లకు జంటగా!
నాగార్జున పేరు చెప్పగానే మన్మథుడు అనే ట్యాగ్ లైన్ గుర్తొస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం 66 ఏళ్లు. అయినా సరే చాలామంది కుర్రహీరోలు అసూయ పడేలా ఫిజిక్ మెంటైన్ చేస్తుంటారు. అప్పట్లో పెళ్లికి ముందు నాగ్ తో పలువురు హీరోయిన్ల విషయంలో రూమర్స్ కూడా వచ్చాయి. అలాంటి బ్యూటీల్లో టబు ఒకరు. 'నిన్నే పెళ్లాడతా'లో అదిరిపోయే కెమిస్ట్రీ పండించిన ఈ జంట.. తర్వాత ఎందుకో కలిసి నటించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు జోడీ సెట్ అయినట్లు కనిపిస్తుంది.1995లో 'సిసింద్రీ' సినిమా కోసం తొలిసారి నాగార్జున, టబుతో కలిసి పనిచేశారు. ఇక తర్వాత ఏడాది అంటే 96లో వచ్చిన 'నిన్నే పెళ్లాడతా' మూవీ.. వీళ్ల జోడికి ఎక్కడలేని క్రేజ్ తీసుకొచ్చింది. దీంతో 98లో 'ఆవిడ మా ఆవిడే' అని ఓ చిత్రం చేశారు. కాకపోతే పెద్దగా వర్కౌట్ కాలేదు. దానికి తోడు వీళ్లిద్దరి మధ్య రిలేషన్ ఉందనే రూమర్స్ కూడా వినిపించాయి. కానీ తర్వాత కాలంలో వీళ్లు ఎవరికి వాళ్లు కెరీర్ పరంగా బిజీ అయిపోయారు. మళ్లీ ఇప్పుడు ఓ మూవీ కోసం జంటగా నటించనున్నారనే టాక్ వినిపిస్తుంది.(ఇదీ చదవండి: Bigg Boss 9: ప్రపోజ్ చేసిన కల్యాణ్.. కానీ చివరకు వరస్ట్ ఆటగాడిగా)ఈ ఏడాది 'కుబేర', 'కూలీ' చిత్రాల్లో డిఫరెంట్ పాత్రలు చేసిన నాగార్జున.. ఇప్పుడు హీరోగా తన 100వ చిత్రం చేస్తున్నారు. తమిళ దర్శకుడు కార్తిక్ ఈ మూవీ తీస్తున్నాడు. ఈ సోమవారం హైదరాబాద్‌లో సింపుల్‌గా లాంచ్ కూడా జరిగింది. 'లాటరీ కింగ్' అనే టైటిల్ కూడా అనుకుంటున్నట్లు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడీ ఈ చిత్రంలోనే నాగ్ సరసన టబు నటిస్తుందని, అంతా ఫైనల్ కూడా అయిపోయిందని మాట్లాడుకుంటున్నారు.టబు విషయానికొస్తే.. అప్పట్లో హీరోయిన్గా వరస సినిమాలు చేసింది. గత కొన్నాళ్ల నుంచి మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు భాషల్లో నటిస్తోంది. ఈ మధ్య కాలంలో తెలుగులో 'అల వైకుంఠపురములో' చేసింది. పూరీ-విజయ్ సేతుపతి ప్రాజెక్టులోనూ నటిస్తోంది. ఇప్పుడు నాగ్‌తో కాంబో ఫిక్స్ అయితే మాత్రం హైప్ రావడం గ్యారంటీనే.(ఇదీ చదవండి: సర్ప్రైజ్.. స్టార్ హీరోని మళ్లీ బతికించారు) -
హిట్ సినిమా.. ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడు ఒక దానిలో ఉన్న మూవీస్.. మరో ఓటీటీలోనూ అందుబాటులోకి వస్తుంటాయి. అలా ఇప్పుడు ఓ డబ్బింగ్ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. పెళ్లికి ముందే తొందరపడి పేరెంట్స్ అయిన ఓ జంట.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే పాయింట్‌తో ఎమోషనల్ గా తీసిన ఈ మూవీ సంగతేంటి? ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: వీడియో: పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ.. ముఖంలో పెళ్లికళ)2023లో తమిళంలో 'డాడా' టైటిల్‌తో ఓ సినిమా రిలీజైంది. హిట్ అయింది. కవిన్, అపర్ణా దాస్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఈ ఏడాది జూన్‌లో 'పాపా' పేరుతో థియేటర్లలో రిలీజ్ చేశారు. కాకపోతే డబ్బింగ్ బొమ్మ కావడం వల్ల ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఇది జరిగిన కొన్నాళ్లకు అంటే జూలై చివరలో ఆహా ఓటీటీలోకి వచ్చింది. తర్వాత మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.'పాపా' విషయానికొస్తే.. మణికంఠ (కవిన్), సింధు (అపర్ణ) క్లాస్మేట్స్. వీళ్ల మధ్య మొదలైన స్నేహం.. కొన్నాళ్లకు ప్రేమగా మారుతుంది. అయితే కాస్త తొందరపడేసరికి పెళ్లికి ముందే మణి వల్ల సింధు గర్భం దాల్చుతుంది. ఆ విషయం తెలిసిన కుటుంబ పెద్దలు వీళ్లని దూరం పెడతారు. దీంతో మణి- సింధు ఓ అద్దె ఇంట్లో ఉంటూ చదువు పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రయాణంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? జన్మనిచ్చిన వెంటనే బిడ్డను వదిలేసి సింధు ఎందుకు వెళ్లిపోయింది? ఆ చిన్నారిని పెంచేందుకు మణి ఎంతగా కష్టపడ్డాడు? మణి జీవితంలోకి మళ్లీ సింధు వచ్చిందా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్) -
ఓటీటీలోకి తెలుగు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
ఓటీటీల్లోకి ప్రతివారం కొత్త సినిమాలు, సిరీస్‌లు వస్తూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు థియేటర్లలో కాకుండా నేరుగా కొన్ని మూవీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిపోతుంటాయి. ఇప్పుడు అలానే ఓ తెలుగు థ్రిల్లర్ సిరీస్ డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు అధికారిక ప్రకటనతో పాటు పోస్టర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఏంటా సిరీస్? ఎందులోకి రానుంది?రాజీవ్ కనకాల, ఉదయభాను ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు సిరీస్ 'డాటరాఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు'. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ స్టోరీతో దీన్ని తీశారు. ఇది ఇప్పుడు నేరుగా జీ5 ఓటీటీలో ఈ నెల 31వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. రెక్కీ, విరాటపాలెం తదితర సిరీసులు తీసిన సౌతిండియన్ స్క్రీన్స్ దీన్ని నిర్మించింది. పోలూరు కృష్ణ దర్శకుడు. రాజీవ్ కనకాల తండ్రిగా చేయనుండగా.. అతడి కూతురు స్వాతిగా వాసంతిక నటించింది. ఉదయభాను పోలీస్ పాత్రలో కనిపించనుంది.(ఇదీ చదవండి: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బ్యాచిలర్ పార్టీ!)ఈ ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో తండ్రైన రాజీవ్ కనకాల.. కనిపించకుండా పోయిన తన కూతురు స్వాతి కోసం వెతుకుతుంటాడు. తండ్రికి ఏం చేయాలో తెలియక అన్వేషిస్తుంటాడు. ఈ క్రమంలో నిజానికి దగ్గరయ్యే కొద్ది తనకు తెలిసే రహస్యాలు, మోసాలు వెనుక దాగిన ఊహించని నిజాలు ఏంటి? ప్రేమ, కోల్పోయినప్పుడు ఉండే వెలితి, మోసం మధ్య ఉండే సన్నని సరిహద్దులు కనిపించకుండా పోతాయి. బాధ, భావోద్వేగం కలగలిసిన ఈ ప్రయాణమే అసలు స్టోరీ.ఇకపోతే ఈ వారం 20కి పైగా కొత్త చిత్రాలు, సిరీసులు పలు ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వీటిలో తేజా సజ్జా 'మిరాయ్', 'త్రిబాణధారి బార్బరిక్', ఎన్టీఆర్ 'వార్ 2', లీగల్లీ వీర్ అనే తెలుగు మూవీస్ ఉన్నాయి. వీటితో పాటు 'కురుక్షేత్ర' అనే యానిమేటెడ్ తెలుగు డబ్బింగ్ సిరీస్ కూడా ఈ వీకెండ్లోనే అందుబాటులోకి రానుంది. ఇవే కాకుండా శుక్రవారం నాడు ఏమైనా సడన్ సర్ప్రైజ్ ఉండొచ్చు! (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు) -
స్క్రిప్ట్ డిమాండ్ చేస్తేనే లిప్ కిస్.. ఈ రోజుల్లో పెద్ద జోక్!
ఒకప్పుడు అంటే తెలుగు సినిమాల్లో ముద్దు సన్నివేశాలు అంటే వామ్మో అన్నట్లు చూసేవారు. కానీ గత కొన్నేళ్లలో మాత్రం ఈ విషయం చాలా సాధారణమైపోయింది. ప్రేక్షకులు కూడా ముద్దు సన్నివేశాల్ని సాధారణంగానే తీసుకుంటున్నారు. ఒకవేళ హీరోయిన్లని ఈ సీన్స్ గురించి అడిగితే స్క్రిప్ట్ డిమాండ్ చేసింది అనే మాట అంటారు. అయితే అది ఇప్పుడు పెద్ద జోక్ అయిపోయింది అని హీరోయిన్ కోమలి ప్రసాద్ అంటోంది.(ఇదీ చదవండి: నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న మిరాయ్)రౌడీ బాయ్స్, హిట్ 2, హిట్ 3 సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కోమలి.. స్వతహాగా తెలుగమ్మాయి. సహాయ పాత్రలు చేస్తూ వచ్చిన ఈమె.. ఇప్పుడు హీరోయిన్గా 'శశివదనే' అనే మూవీ చేసింది. అక్టోబరు 10న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టగా ట్రైలర్ చూపించిన లిప్ కిస్ గురించి కోమలి మాట్లాడింది.'ఈ రోజుల్లో ముద్దు సన్నివేశంలో స్క్రిప్ట్ డిమాండ్ మేరకు నటించానని అనడం పెద్ద జోక్ అయిపోయింది. కానీ మా సినిమాలో ఈ సన్నివేశానికి బ్యాక్ స్టోరీ ఉంటుంది. నేను చేసిన శశి అనే అమ్మాయి పాత్ర.. అసలు ఏడుస్తూ రాఘవని ఎందుకు ముద్దు పెట్టుకోవాల్సి వచ్చిందనేది మూవీ చూస్తే అర్థమవుతుంది. అలా అని ఇదేదో కావాలని ఇరికిందింది అయితే కాదు' అని కోమలి ప్రసాద్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: పెళ్లయ్యాక ఎంజాయ్మెంట్ లేదు, డిప్రెషన్: నటి హేమ) -
పవన్ కళ్యాణ్ 'పురుష' షూటింగ్ పూర్తి
కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ఓ డిఫరెంట్ కామెడీ మూవీ తీస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ని తెలుగు తెరకు పరిచయం చేస్తూ 'పురుష' అనే సినిమాను నిర్మిస్తున్నారు. వీరు ఉలవల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ డైరెక్టర్ ఇంతకు ముందు మళ్లీ రావా, జెర్సీ, మసూద చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఈ చిత్రంలో సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు.ఈ సినిమా వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు హీరోయిన్లు. తాజాగా ఓ ప్రత్యేక గీతం పూర్తి చేసి షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేశారు. చిత్రీకరణ ముగియడంతో యూనిట్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసి రిలీజ్ తేదీని ప్రకటించనున్నారు. ఈ మూవీకి సినిమాటోగ్రఫర్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడుగా శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్ గా రవిబాబు దొండపాటి పని చేస్తున్నారు. -
కార్తీక్ రాజు హీరోగా 'విలయ తాండవం'.. పోస్టర్ లాంచ్
యువ హీరో కార్తీక్ రాజు, పార్వతి అరుణ్, పుష్ప ఫేమ్ జగదీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'విలయ తాండవం'. జీఎంఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద మందల ధర్మారావు, గుంపు భాస్కరరావు నిర్మిస్తున్నారు. వీఎస్ వాసు దర్శకత్వం వహిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన టైటిల్ పోస్టర్ బుధవారం (అక్టోబర్ 1) రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆకాశ్ పూరీ, దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు అతిథులుగా హాజరయ్యారు.ఆకాష్ పూరి మాట్లాడుతూ.. 'విలయ తాండవం' టైటిల్ పవర్‌ఫుల్‌గా ఉంది. టైటిల్ పోస్టర్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. కార్తీక్ రాజుకి మరోసారి ఈ చిత్రంతో మంచి పేరు రావాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 'కార్తీక్ రాజు నేను తీసిన 'కౌసల్యా కృష్ణమూర్తి' చిత్రంలో నటించారు. కార్తీక్ ఎప్పుడూ డిఫరెంట్ కథల్నే ఎంచుకుంటారు. ఈ 'విలయ తాండవం'తో మరోసారి కార్తీక్ రాజుకి హిట్ రావాలి అని అన్నారు. -
'తాళికట్టు శుభవేళ' సినిమా ప్రీ రిలీజ్ వేడుక
శ్రీ వెంకటా చలపతి ఫిలింస్ పతాకంపై బి. అరుణ్ కౌశిక్ నిర్మాణంలో, వి. జగన్నాధరావ్ దర్శకత్వంలో తీస్తున్న సినిమా 'తాళికట్టు శుభవేళ'. తిలక్ రాజ్, తుంగ హీరోహీరోయిన్. దేవరాజ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్లో శనివారం జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నటుడు తుమ్మలపల్లి ఆంజనేయులు గుప్త, నటుడు వినోద్ కుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై, వీడియో సాంగ్స్, ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. 'తాళికట్టు శుభవేళ సినిమా పేరు విన్నప్పుడే ఎంతో పాజిటివ్‌గా అనిపించింది. మూవీలో సంగీతం మధురంగా ఉంది. కొత్త తరానికి విలువలు నేర్పే మంచి కుటుంబ కథతో ఈ చిత్రం నిలిచిపోతుందని నమ్ముతున్నాను' అని చెప్పారు. -
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ సినిమా
మరో తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. థియేటర్లలోకి వచ్చిన నెలరోజుల్లోనే స్ట్రీమింగ్ కానుంది. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రానికి డీసెంట్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?మత్తు వదలరా, పంచతంత్రం, పరువు, వికటకవి లాంటి సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న నరేశ్ అగస్త్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మేఘాలు చెప్పిన ప్రేమకథ'. ఆగస్టు 22న థియేటర్లలో రిలీజ్ కాగా ప్రేక్షకుల్లో పెద్దగా రిజిస్టర్ కాకుండానే మాయమైపోయింది. ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ నెల 26 నుంచి అంటే శుక్రవారం నుంచే అందుబాటులోకి వచ్చేసింది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: రామ్ చరణ్ కోసం ఫ్లాప్ హీరోయిన్?) 'మేఘాలు చెప్పిన ప్రేమకథ' విషయానికొస్తే.. వరుణ్ (నరేశ్ అగస్త్య) విదేశాల్లో చదువుకుని తిరిగి ఇండియాకు వచ్చేస్తాడు. సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనేద ఇతడి కోరిక. దీని గురించి తండ్రికి(సుమన్) చెబితే కోప్పడతాడు. దీంతో వరుణ్ ఇంటి నుంచి బయటకొచ్చేస్తాడు. తమిళనాడులోని వాల్పరై అనే ఊరికి వెళ్తాడు. ఇక్కడ చిన్నప్పుడు నాయినమ్మ కాంచీపురం కామాక్షి శంకరమూర్తి(రాధిక శరత్ కుమార్)తో గడిపిన బంగ్లా, ఎస్టేట్ ఉంటాయి. మరోవైపు మేఘన(రబియా ఖాతూన్) కూడా ఈ ఊరికి వస్తుంది. అనుకోని పరిస్థితుల్లో వరుణ్-మేఘన ప్రేమలో పడతారు. మరి వీరిద్దరి మధ్య దూరం ఎందుకు పెరిగింది? గాయకుడు, సంగీత దర్శకుడిగా వరుణ్ సక్సెస్ అయ్యాడా లేదా అనేది మిగతా స్టోరీ.ఈ వారం ఓటీటీల్లో 'మేఘాలు చెప్పన ప్రేమకథ' కాకుండా జూనియర్, సుందరకాండ లాంటి స్ట్రెయిట్ తెలుగు మూవీస్ కూడా ఓటీటీలోకి వచ్చేశాయి. అలానే హృదయపూర్వం, ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా, సుమతి వళవు తదితర డబ్బింగ్ సినిమాలు కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితో పాటు సడన్ సర్ప్రైజులు లాంటి కొత్త చిత్రాలు కూడా ఏమైనా రావొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 27 సినిమాలు)Two worlds, one bond.Together, they find something greater 💖💫Meghalu Cheppina Prema Katha premieres 26th September on SunNXT.Watch the journey unfold!#MeghaluCheppinaPremaKatha #Premieres26thSeptemberOnSunNXT #LoveStory #MusicalRomance pic.twitter.com/qbHwqVq0ZX— SUN NXT (@sunnxt) September 22, 2025 -
'బ్యూటీ'.. మనసులని హత్తుకునే సినిమా: వీకే నరేష్
అంకిత్, నీలఖి, వీకే నరేష్, వాసుకి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'బ్యూటీ'. విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించారు. జెఎస్ఎస్ వర్దన్ దర్శకత్వం వహించాడు. గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకుల నుంచి స్పందన అందుకుంటోంది. ఈ క్రమంలోనే శనివారం సక్సెస్ మీట్ నిర్వహించారు.వీకే నరేష్ మాట్లాడుతూ.. 'బ్యూటీ'లోని సోల్ మా అందరితో ప్రమోషన్స్‌లో ఎక్కువ మాట్లాడించేలా చేసింది. అదే ఇప్పుడు ఆడియెన్స్‌కి కనెక్ట్ అవుతోంది. దర్శక, నిర్మాతలకు సినిమా రిలీజ్‌కంటే ముందే శాలువా కప్పేశాను. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని నాకు ముందే తెలుసు. అందరి మనసులకు హత్తుకునే మూవీని తీసిన వర్దన్‌ని చూస్తుంటే గర్వంగా ఉంది అని అన్నారు.అంకిత్ కొయ్య మాట్లాడుతూ.. మా సినిమా అందరికీ రీచ్ అయింది. క్లైమాక్స్ తర్వాత అందరూ కన్నీళ్లు తుడుచుకుంటున్నారు. అదే మా విజయం. మనం చేసే పని మాత్రమే కాదు.. మనం కూడా మాట్లాడాలి. నేను నటించిన ఏ మూవీ కూడా ఏ ఒక్కరినీ నిరాశపర్చలేదు. సినిమాను నిజాయితీగా తీస్తే సక్సెస్ అదే వస్తుంది అని చెప్పాడు. -
బుచ్చిబాబు రిలీజ్ చేసిన 'ఇట్లు మీ ఎదవ' గ్లింప్స్
త్రినాధ్ కఠారి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తీసిన సినిమా 'ఇట్లు మీ ఎదవ'. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బళ్లారి శంకర్ నిర్మించారు. తెలుగమ్మాయి సాహితీ అవాంచ హీరోయిన్. డైరెక్టర్ బుచ్చిబాబు ఈ చిత్ర గ్లింప్స్ రిలీజ్ చేశారు. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే ఇతర వివరాలు కూడా త్వరలో వెల్లడించనున్నారు. -
'ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు'.. టాక్ ఏంటి?
తెలుగులో అప్పుడప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్, ఎక్స్పరీమెంట్ మూవీస్ వస్తుంటాయి. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ఆకట్టుకుంటూ ఉంటాయి. కానీ ఇప్పుడు 100 నిమిషాల సింగిల్ టేక్ మూవీ అంటూ ఒకటి థియేటర్లలో రిలీజైంది. అదే 'ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు'. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది?సూపర్ రాజా అనే వ్యక్తి.. తాను తీసిన ఈ సినిమా గురించి తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఊళ్లు తిరుగుతూ గత ఏడాదిన్నరగా ప్రమోషన్ చేసుకున్నాడు. మధ్య తరగతి వ్యక్తి, సొంతంగా ఓ మూవీకి రైటర్, హీరో, నిర్మాతగా చేశాడు అనేసరికి సోషల్ మీడియాలో కాస్త ఆసక్తి కలిగింది. నిన్న అంటే శుక్రవారం (సెప్టెంబరు 19)న ఇది థియేటర్లలో రిలీజైంది. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేయడంతో కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అసలు 100 నిమిషాల సినిమాని సింగిల్ టేక్‌లో ఎలా తీసి ఉంటాడా అని ప్రేక్షకులు థియేటర్లకి వెళ్లారు. కానీ ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. కొందరైతే దారుణంగా తిడుతున్నారు.(ఇదీ చదవండి: కొంపముంచిన కామెడీ స్పూఫ్.. ఏకంగా రూ.25 కోట్ల దావా)ఈ సినిమా విషయానికొస్తే.. హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆమె ఇతడిని కాదనుకుని జర్మనీ వెళ్లేందుకు రెడీ అయిపోతుంది. దీంతో ఎలాగైనా సరే ఆమెని కలుసుకోవాలని హైదరాబాద్ సిటీలోని ప్యారడైజ్ నుంచి హీరో, అతడి ఫ్రెండ్... హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వరకు బైక్‌పైన వెళ్తారు. ఇదే స్టోరీ.ఓ మోటో వ్లాగింగ్ వీడియోని తీసుకొచ్చి దీన్ని సినిమా అని చెప్పడం విడ్డూరంగా ఉందని చాలామంది ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. బైక్‌కి గో-ప్రో కెమెరా తగిలించి ఓ వీడియో తీసి దాన్ని మూవీ అనేయడం ఏంట్రా బాబు అని విమర్శిస్తున్నారు. అసలు ఇదొక మూవీనా అని తిడుతున్న వాళ్లు కూడా ఉన్నారు. ఎందుకంటే సినిమా అనేసరికి థ్రిల్, కామెడీ, ఎమోషన్.. ఇలా ఏదో ఒకటి కోరుకుంటాడు. ఇందులో అలాంటివేం లేకపోవడంతో ప్రేక్షకుడు ఉసూరుమంటున్నాడు. మరోవైపు కొందరు ఇతడి కష్టాన్ని అభినందిస్తున్నారు తప్ప మూవీ బాగుందని మాత్రం చెప్పట్లేదు. ఇంకొందరేమో సినిమా అని చెప్పి సూపర్ రాజా.. భలే మోసం చేశాడని అంటున్నారు.(ఇదీ చదవండి: ఆస్కార్ రేసులో పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప) -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ సినిమా
టాలీవుడ్లో 'థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ' అనే డైలాగ్‌తో పాపులారిటీ తెచ్చుకున్న నటుడు పృథ్వీరాజ్... కెరీర్ ప్రారంభంలో విలన్ తరహా పాత్రలు చేశాడు. గత కొన్నాళ్ల నుంచి మాత్రం కమెడియన్‌గా పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇతడు దర్శకుడిగా మారి తన కూతురిని హీరోయిన్గా పరిచయం చేస్తూ ఓ మూవీ తీశాడు. గతేడాది ఇది థియేటర్లలో రిలీజైంది. కాకపోతే ఎప్పుడొచ్చి వెళ్లిందో కూడా జనాలకు తెలియలేదు. అలాంటి చిత్రం ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: మోదీ జీవితంపై మరో సినిమా.. హీరో ఎవరంటే?)పృథ్వీరాజ్ దర్శకుడిగా తీసిన సినిమా 'కొత్త రంగుల ప్రపంచం'. ఇతడి కూతురు శ్రీలు హీరోయిన్. క్రాంతి కృష్ణ హీరోగా నటించాడు. హారర్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రం.. గతేడాది జనవరి 20న థియేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకులు దీన్ని కనీసం పట్టించుకోలేదు. తర్వాత అందరూ ఈ మూవీ గురించి పూర్తిగా మరిచిపోయారు. అలాంటిది దాదాపు ఏడాదిన్నర తర్వాత అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. అయితే అద్దె విధానంలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.'కొత్త రంగుల ప్రపంచం' విషయానికొస్తే.. షూటింగ్ కోసం ఓ ఫామ్ హౌస్‌కు డైరెక్టర్ పృథ్వీ తన బృందంతో వెళ్తాడు. ఈయన తీసే సినిమాలో శ్రీలు, క్రాంతి కృష్ణ హీరోహీరోయిన్లు. ఫామ్ హౌస్‌కి గురువయ్య అనే మేనేజర్ ఉంటాడు. అయితే షూటింగ్ టైంలో ఆ ఇంట్లో ఏదో ఉందనే అనుమానం అందరికీ వస్తుంది. హీరోయిన్ శ్రీలు నటించేటపుడు వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇది గమనించిన పృథ్వీ.. ఓ గురువు దగ్గరకు వెళ్తే శ్రీలుని ఓ ఆత్మ ఆవహించిందని చెబుతాడు. అసలు ఆత్మ ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే)అమెజాన్ ప్రైమ్‌లో ఈ రోజు నుంచే 'కన్యాకుమారి' అనే తెలుగు సినిమా కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఆగస్టు 27న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఇప్పుడు మూడు వారాల్లోకి అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లోకి వచ్చింది. ఉచితంగానే చూడొచ్చు. -
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. మూడేళ్ల తర్వాత
ఈ వారం థియేటర్లలోకి వచ్చిన 'మిరాయ్', 'కిష్కింధపురి' చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. అందుకు తగ్గట్లే ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోంది. మరోవైపు ఓటీటీల్లోనూ కూలీ, సయారా, సు ఫ్రమ్ సో, పరదా లాంటి హిట్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇలా వీకెండ్‌ని ఆడియెన్స్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మరో తెలుగు మూవీ కూడా డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చింది. దాదాపు మూడేళ్ల తర్వాత స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.(ఇదీ చదవండి: 'కూలీ'లో నటించి తప్పు చేశా.. ఆమిర్ అంత మాటన్నాడా?)ప్రముఖ సంగీత దర్శకుడు కోటి.. గతంలో ఓ సినిమాలో ప్రతినాయకుడిగా చేశారు. అదే 'పగ పగ పగ'. 2022 సెప్టెంబరు 22న ఇది థియేటర్లలో రిలీజైంది. స్టార్స్ ఎవరూ లేకపోవడం, కథాకథనాలు ఓ మాదిరిగా ఉండేసరికి ఈ చిత్రంపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. తర్వాత ఇన్నాళ్లకు ఆహా ఓటీటీ దీన్ని కొనుగోలు చేసింది. ఇప్పుడు అంటే దాదాపు మూడేళ్ల తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.'పగ పగ పగ' విషయానికొస్తే.. జగదీశ్ (కోటి), కృష్ణ (బెనర్జీ) రౌడీలు. జగదీశ్ చెప్పడంతో కృష్ణ, ఓ కుర్రాడిని హత్య చేస్తాడు. జైలుకెళ్లిన కృష్ణకి జగదీశ్ ధైర్యం చెబుతాడు. కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇస్తాడు. కానీ కృష్ణ కుటుంబాన్ని జగదీశ్ గాలికొదిలేస్తాడు. మరోవైపు కృష్ణ కొడుకు అభి కాలేజీలో చదువుతుంటాడు. జగదీశ్ కూతురు సిరితో ప్రేమిస్తుంటాడు. కూతురి ప్రేమ విషయం జగదీశ్‌కి తెలుస్తుంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగదని కూతురితో చెబుతాడు. దాంతో లేచిపోయి వెళ్లిపోయిన సిరి, అభిని పెళ్లి చేసుకుంటుంది. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'మిరాయ్'తో పోటీ.. 'కిష్కింధపురి' తొలిరోజు కలెక్షన్ ఎంత?) -
టాలీవుడ్ రేంజ్ పెంచే సినిమా 'ఏ మాస్టర్ పీస్': మూవీ టీమ్
శుక్ర, మాటరాని మౌనమిది తదితర సినిమాలు తీసిన దర్శకుడు పూర్వాజ్ లేటెస్ట్ మూవీ 'ఏ మాస్టర్ పీస్'. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వజ్, అషు రెడ్డి లీడ్ రోల్స్ చేస్తున్నారు. శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ, ప్రజయ్ కామత్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. క్లైమాక్స్ సీన్స్ తీస్తున్నారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఈ సినిమాని మన పురాణ ఇతిహాసాల నుంచి స్ఫూర్తి పొంది తయారుచేశా. దశరథ మహారాజు మంత్రుల్లో ఒకరైన సుమంత్రుడికి శ్రీరాముడు వనవాసం వెళ్తున్న సమయంలో ఒక వరం లభిస్తుంది. ఆ వరం నేపథ్యంగా సూపర్ హీరో క్యారెక్టర్ని, హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి చెందిన ఓ అంశంతో సూపర్ విలన్ పాత్రను క్రియేట్ చేశాం. శ్రీరాముడి త్రేతాయుగానికి, హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి, ఇప్పటి కలియుగానికి అనుసంధానిస్తూ సాగే ఒక కొత్త తరహా స్క్రిప్ట్‌ని ఈ చిత్రంలో చూస్తారు. అన్ని అనుకున్నట్లు జరిగితే మహాశివరాత్రికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని డైరెక్టర్ పూర్వాజ్ చెప్పుకొచ్చారు. -
సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ తెలుగు సినిమా
సాధారణంగా వీకెండ్లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో గురువారం అందుబాటులోకి వస్తుంటాయి. కానీ కొన్నిసార్లు వారం మధ్యలోనే ఎలాంటి ప్రకటన లేకుండా వచ్చేస్తుంటాయి. ఇప్పుడు కూడా ఓ తెలుగు హారర్ కామెడీ మూవీ సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్ అయిపోతోంది. లెక్క ప్రకారం ఈ వారాంతంలోనే డిజిటల్ రిలీజ్ ఉంది. కానీ ఇప్పుడు మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో చూడొచ్చు?పలు సినిమాల్లో కమెడియన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ లీడ్ రోల్ చేసిన మూవీ 'బకాసుర రెస్టారెంట్'. గత నెల 8న థియేటర్లలో రిలీజైంది. ఓ మాదిరి రెస్పాన్స్ మాత్రమే వచ్చింది. దీన్ని సెప్టెంబరు 12న సన్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతం తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. క్షుద్ర పూజలతో నిద్రలేచే ఆత్మ వల్ల ఇబ్బందులు, దాంతో వచ్చే భయం తదితర అంశాలతో ఈ సినిమాని తెరకెక్కించారు.(ఇదీ చదవండి: నటి సుధ ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు లీక్.. పోలీసులకు ఫిర్యాదు!)'బకాసుర రెస్టారెంట్' విషయానికొస్తే.. పరమేశ్వర్ (ప్రవీణ్) సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఉద్యోగం కంటే వ్యాపారం చేయడంపై ఆసక్తి. రెస్టారెంట్ పెట్టాలనుకుంటాడు. దాని కోసం డబ్బులు సంపాదించేందుకు యూట్యూబ్ ఛానెల్ పెడతాడు. దెయ్యంపై చేసిన తొలి వీడియో వైరల్ కావడంతో రెండో వీడియో కోసం పాత బంగ్లాకు స్నేహితులతో కలిసి వెళ్తాడు. అక్కడ కనిపించిన పుస్తకంతో క్షుద్రపూజ చేస్తారు. దీంతో బక్క సూరి (వైవా హర్ష) అనే ఆత్మ బయటకొస్తుంది.బక్క సూరి ఆత్మతో వాళ్లంతా ఆడే ప్రయత్నం చేయగా.. పరమేశ్వర్ స్నేహితుడి శరీరంలోకి ఈ ఆత్మ ప్రవేశిస్తుంది. దాని ఆకలికి హద్దుండదు. ఆ ఆత్మని బయటకు పంపేందుకు పరమేశ్వర్ గ్యాంగ్ ఎలాంటి ప్రయత్నాలు చేసింది? అసలు ఆత్మ నేపథ్యమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
వివి వినాయక్ చేతుల మీదుగా 'విద్రోహి' పాట విడుదల
రవి ప్రకాష్, శివ కుమార్, చరిష్మా శ్రీఖర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'విద్రోహి'. విఎస్వి దర్శకుడు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని విజ్జన వెంకట సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా ఇప్పుడు తొలి సాంగ్ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దీన్ని లాంచ్ చేశారు. ఈ మధ్యే మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి.సాంగ్ విడుదల అనంతరం వినాయక్ మాట్లాడుతూ.. 'విద్రోహి ఫస్ట్ లుక్ చూశాను. అలాగే ఈ కథ గురించి కూడా విన్నాను. చాలా మంచి కథ. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నా. నేను విడుదల చేసిన సాంగ్ కూడా చాలా బాగుంది. దర్శక నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా చేసిన రవి ప్రకాష్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. మంచి ఆర్టిస్ట్. ఈ సినిమా, టీమ్ అందరికీ మంచి సక్సెస్‌ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని అన్నారు. -
'నువ్వే చెప్పు చిరుగాలి' పాట లాంచ్ చేసిన మంచు మనోజ్
నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఓ చెలియా'. రూపాశ్రీ కొపురు నిర్మించగా ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ప్రారంభించారు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీద 'ఓ చెలియా' నుంచి తొలి పాటని రిలీజ్ చేశారు.'నువ్వే చెప్పు చిరుగాలి' అని సాగే ఈ పాటని మంచు మనోజ్ రిలీజ్ చేసిన అనంతరం చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలియజేశారు. ఈ గీతాన్ని సాయి చరణ్ ఆలపించగా, ఎంఎం కుమార్ బాణీని అందించారు. సుధీర్ బగడి రాసిన సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ బాగుంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ తేదీని ప్రకటించబోతోన్నారు. -
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
రీసెంట్గా 'త్రిబాణధారి బార్బరిక్' సినిమా రిలీజైంది. పాజిటిక్ టాక్ వచ్చినా సరే దీన్ని జనాలు పట్టించుకోవట్లేదు. ఈ క్రమంలోనే చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవత్స.. తన చిత్రం చూసేందుకు ఎవరూ థియేటర్లలోకి రావట్లేదని బాధపడుతూ చెప్పుతో కొట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతడు గతంలో తీసిన మరో మూవీ మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.(ఇదీ చదవండి: 120 దేశాలు.. 100 కోట్ల మంది.. కెన్యా మంత్రితో రాజమౌళి)డైరెక్టర్ మోహన్ శ్రీవత్స 'బార్బరిక్' కంటే ముందు 'కరణ్ అర్జున్' అనే సినిమా తీశాడు. 2022 జూన్‌లో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. స్టార్స్ లేకపోవడం, కంటెంట్ కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో థియేటర్లలో పెద్దగా ఫెర్మార్మ్ చేయలేదు. జనాలు ఆ చిత్రం గురించి మర్చిపోయారు. అలాంటిది దాదాపు మూడేళ్ల తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.'కరణ్ అర్జున్' విషయానికొస్తే.. కరణ్ (నిఖిల్ కుమార్) తనకు కాబోయే భార్య వృషాలి(షిఫా)తో కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న జైసల్మేర్ ఎడారి ప్రాంతానికి వెళ్తాడు. ఆ దారిలో అర్జున్ (అభిమన్యు) వీళ్లిద్దరినీ వెంటాడుతూ ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. ఒకానొక సమయంలో అర్జున్ ఆ ఇద్దరిని షూట్ చేసి చంపాలనుకుంటాడు. అర్జున్ నుంచి తప్పించుకోవడానికి ఎడారి ప్రాంతంలో అనేక పాట్లు పడతారు కరణ్, వృషాలి. వీరిద్దరిని అర్జున్ ఎందుకు వెంబడించాడు? చివరకు ఏమైందనేదే మిగతా సినిమా.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలివే)


