3 వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా | Godari Gattupaina Movie OTT Streaming Now | Sakshi
Sakshi News home page

OTT: ప్రేమకథా చిత్రం.. ఓటీటీలో సడన్ స్ట్రీమింగ్

May 29 2026 10:13 AM | Updated on May 29 2026 10:19 AM

Godari Gattupaina Movie OTT Streaming Now

ఓటీటీలోకి ఈ వారం చాలానే సినిమాలు వచ్చాయి. ధనుష్ 'కర', శరవణన్ 'లీడర్', సత్య 'జెట్ లీ', డ్రింకర్ సాయి, సచిన్ బయోపిక్ తెలుగు వెర్షన్‌తో పాటు హాలీవుడ్ హారర్ మూవీ 'ద మమ్మీ' అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు వీటికి తోడుగా ఇదే నెలలో రిలీజైన తెలుగు మూవీ కూడా సైలెంట్‌గా స్ట్రీమింగ్ అయిపోతోంది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో ఉంది?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన హరర్ సినిమా.. తెలుగులోనూ)

'మేమ్ ఫేమస్' సినిమాతో హీరో, దర్శకుడిగా ఆకట్టుకున్న సుమంత్ ప్రభాస్.. చాన్నాళ్లు గ్యాప్ తీసుకుని చేసిన మూవీ 'గోదారి గట్టుపైన'. నిధి ప్రదీప్ హీరోయిన్ కాగా 100కి పైగా షార్ట్ ఫిల్మ్స్ తీసిన సుభాష్ చంద్ర.. ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. జగపతిబాబు, లైలా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈనెల 08న థియేటర్లలో రిలీజ్ కాగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక ఫ్లాప్ అయింది. ఇప్పుడిది ఎలాంటి హడావుడి లేకుండానే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.

'గోదారి గట్టుపైన' విషయానికొస్తే.. రాజు (సుమంత్ ప్రభాస్) ఆటో డ్రైవర్. పదో తరగతి మధ్యలోనే ఆపేసి కుటుంబం, ఫ్రెండ్స్‌తో హ్యాపీగా బతికేస్తుంటాడు. తన చెల్లితో ఇంజినీరింగ్ చదువుతున్న మాయ(నిధి ప్రదీప్)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా రాజుని ప్రేమిస్తుంది. మరోవైపు తన కూతురు మాయ అంటే శ్యాంబాబు(జగపతిబాబు)కి ప్రాణం. సెక్యూరిటీ గార్డ్‌గా ప‌నిచేసే ఈయ‌న త‌న కూతురుకి త‌న‌కంటే ఉన్న‌త‌మైన స్థితిలో ఉన్న‌వాడితోనే పెళ్లి జ‌రిపిస్తాన‌ని చెబుతుంటాడు. మ‌రి ఇంజినీరింగ్ చ‌దువుతున్న కూతురు ఓ ఆటోడ్రైవ‌ర్‌ని ప్రేమించింద‌ని తెలిశాక శ్యాంబాబు ఏం చేశాడు? కూతురు ప్రేమ‌ని అంగీకరించాడా లేదా? చివరకు ఏమైందేనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లో 16 సినిమాలు స్ట్రీమింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement