మండుటెండలకు ఎలాంటి ఫుడ్‌ మంచిదంటే..! | Health Tips: Kitchen Swaps Your Body Needs Temperatures Cross 40C | Sakshi
Sakshi News home page

మండుటెండలకు ఎలాంటి ఫుడ్‌ మంచిదంటే..!

May 20 2026 11:40 AM | Updated on May 20 2026 12:37 PM

Health Tips: Kitchen Swaps Your Body Needs Temperatures Cross 40C

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అనేది కాలానుగుణంగా ఉంటేనే మంచిది. అందులోనూ భగభగలాడే ఈమండుటెండల్లో వేడిని తట్టుకోవాలంటే..వంటగదిలో ఈ చిన్నమార్పులు తప్పనిసరి. కొన్నిసార్లు ఆరోగ్యకరమైన ఆహారం వేసవి వేడికి ఇబ్బందికరంగా మారిపోతుంది. అలాగని ఆరోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండాలా? అంటే కాదనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతర్గత శరీర ఉష్ణోగ్రత అదుపు తప్పకుండా ఉండేలా తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలని అంటున్నారు. మరి అవేంటో చూద్దామా.!.

తీపి పదార్థాలు..
తేనె, బెల్లం 'ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు ఇవి తీసుకుంటే శరీరంలో వేడి అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఖర్జూరపు పొడి, స్టీవియా, మంక్ ఫ్రూట్ షుగర్ లేదా దాగా మిశ్రి వంటి వాటికి మారమని సూచిస్తున్నారు నిపుణులు.

చిరుధాన్యాలు
జొన్న, మక్కీ, రాగి, కుట్టు, బ్రౌన్ రైస్‌లు ఆరోగ్యకరమైనవే కానీ వేసవిలో మాత్రం అంత మంచివికావని అంటున్నారు. ఎందుకంటే వేసవిలో ఇవి జీర్ణం అవ్వడం కష్టంగా ఉంటుందట. అందుకు బదులుగా జొన్న, జౌ (బార్లీ), సమక్, కాంగ్ని, తెల్ల బియ్యం, ఓట్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు.

పప్పుధాన్యాలు
కందిపప్పు, మినపపప్పు, కుల్తీ, మోత్(మట్కీ), సోయాబీన్  తదితరాలుబరువుగా ఉండి, గ్యాస్‌ను ఏర్పరుస్తాయనిన్ హెచ్చరిస్తున్నారు నిపుణులు. వీటికి బదులుగా, పెసరపప్పు, మసూర్ పప్పు, లోబియా, కాబూలీ శనగలను తీసుకోండి.

కూరగాయలు
వంకాయ, బీట్‌రూట్, పాలకూర వంటివి శరీరంలో వేడిని పెంచి, జీర్ణక్రియకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నందున, వాటిని అధికంగా తీసుకోకపోవడమే మేలని చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా సొరకాయ, టిండా(ఇండియన్ బేబీ పంప్కిన్), కద్దు(ఆనపకాయ), పర్వాల్(దొంకాయ రకం), దోసకాయ వంటివి అధిక నీటి శాతం కలిగి ఉండటం వల్ల గొప్ప ప్రత్యామ్నాయాలుగా ఉంటాయి.

పాల ఉత్పత్తులు
గేదె పాలు వంటి బరువైన పదార్థాలు సహజంగానే జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. అదేవిధంగా, అధికంగా ఉండే పెరుగుకు - దాని శీతలీకరణ గుణాలు ఉన్నప్పటికీ ఇది కూడా మండుటెండలకు అస్సలు మంచిది కాదు. రైతా లేదా పులచటి మజ్జిగాలో తీసుకోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణుల.

మసాలాలు
సాధారణంగా, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పరిధిని దాటినప్పుడు, తేలికపాటి ఆహారం తీసుకోవడం, అధిక మసాలాలు ఉన్న వంటకాలకు దూరంగా ఉండటం మేలు. అయితే, ఎండు అల్లం (సౌంత్), దాల్చినచెక్క, లవంగాలు, నల్ల మిరియాలు, మెంతి గింజలు, పిప్పలి వంటి వేడి చేసే మసాలాలు అసిడిటీని మరింత తీవ్రతరం చేస్తాయి కాబట్టి, వాటి వాడకాన్ని పరిమితం చేయాలని నొక్కి చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వీటికి బదులుగా, రుచికోసం సోంపు, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా, లెమన్‌గ్రాస్ ఉపయోగించమని సూచిస్తున్నారు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: హెర్నియా: చొచ్చుకుపోయే చిచ్చు..! ఎవరిలో అధికం అంటే..)
 

Advertisement
 
Advertisement
Advertisement