ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. చంద్రుడు, శుక్రుడు, గురుడు ఒకే చోట కనబడుతూ త్రిభుజాకార కాంతి సమూహాన్ని సృష్టించబోతున్నాయి. మే 18 నుంచి ఉత్తరార్థగోళం (India, Europe, North America), దక్షిణార్థగోళం (Australia, New Zealand, South America) దేశాల్లోనూ సూర్యాస్తమయం తర్వాత పశ్చిమ ఆకాశంలో ఈ దృశ్యంగా స్పష్టంగా కనిపించనుంది.
త్రిగ్రహ సంయోగం (Triple Conjunction)లో.. పెరుగుతున్న దశలో ఉన్న చంద్రుడు.. అలాగే ప్రకాశవంతమైన శుక్రుడు సాయంత్రం ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తూ కనిపిస్తారు. అలాగే అతిపెద్ద గ్రహమైన గురుడు తక్కువ ప్రకాశం ఉన్నా కనిపించబోతున్నాడు. ఈ మూడింటి కలిసి వీక్షించేందుకు ఖగోళ ప్రేమికులకు మాత్రమే కాదు.. ఎవరికైనా ఒక అద్భుతమైన అవకాశం ఇది.
అయితే జ్యోతిష్యశాస్త్రం కోణంలో ఈ సంఘటనకు ప్రత్యేకమైన అర్థం ఉంది. ఈ మూడు గ్రహాలు కలిసినప్పుడు వ్యక్తి జీవితంలో భావోద్వేగ స్థిరత్వం, ప్రేమ, కళాత్మకత, జ్ఞానం, ఆర్థిక సుఖాలు, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ త్రిగ్రహ సంయోగం (Triple Conjunction) ప్రభావంతో ఏ రాశివారికి ఎలాగ ఉండబోతుందంటే..
మేషం (Aries):
కొత్త ఆర్థిక అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో లాభాలు సాధ్యమవుతాయి. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి.
వృషభం (Taurus):
శుక్ర ప్రభావం వల్ల ప్రేమ, సంబంధాల్లో ఆనందం పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం బలపడుతుంది. పెట్టుబడులు దీర్ఘకాలంలో లాభం ఇస్తాయి. విలాసవంతమైన ఖర్చులు పెరగవచ్చు. అవసరంలేని ఖర్చులను తగ్గించాలి.
మిథునం (Gemini):
విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కొత్త నేర్చుకునే అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా పెద్ద లాభం కాకపోయినా, జ్ఞానం పెరుగుతుంది.
కర్కాటకం (Cancer):
కుటుంబంలో శాంతి, ఆర్థిక లాభం ఉంటుంది. కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. సమతుల్యత అవసరం.
సింహం (Leo):
ఉద్యోగంలో గుర్తింపు, కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. ఆర్థిక లాభం కంటే కెరీర్ పురోగతి ఎక్కువగా ఉంటుంది.
కన్యా (Virgo):
ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. కానీ పెద్ద లాభాలు ఆశించకూడదు.
తుల (Libra):
శుక్ర ప్రభావం వల్ల ప్రేమ, కళారంగంలో విజయాలు సాధ్యమవుతాయి. ఆర్థిక లాభం కంటే వ్యక్తిగత ఆనందం ఎక్కువగా లభిస్తుంది.
వృశ్చికం (Scorpio):
ఆర్థిక లాభం ఉంటుంది. కానీ పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. తప్పు నిర్ణయాలు నష్టానికి దారితీసే అవకాశం ఉంది.
ధనుస్సు (Sagittarius):
గురు ప్రభావం వల్ల జ్ఞానం, విద్యా రంగంలో పురోగతి ఉంటుంది. ఆర్థిక లాభం పరిమితంగానే ఉంటుంది.
మకరం (Capricorn):
ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక లాభం కూడా ఉంటుంది. ఈ రాశివారు ఎక్కువగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది.
కుంభం (Aquarius):
సృజనాత్మకత పెరుగుతుంది. సంబంధాల్లో ఆనందం ఉంటుంది. ఆర్థిక లాభం పెద్దగా ఉండదు.
మీనం (Pisces):
గురు అధిపతి కావడంతో ఆధ్యాత్మిక పురోగతి, ఆర్థిక లాభం కలుగుతుంది. ఈ రాశివారు కూడా మంచి ఫలితాలు పొందుతారు.
ఈ త్రిగ్రహ కూటమి శాస్త్రీయంగా ఒక అద్భుతమైన దృశ్యం మాత్రమే కాకుండా.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి శుభప్రభావం చూపే సంఘటనగా భావిస్తున్నారు. మే 18 నుంచి 20 వరకు సాయంత్రం ఆకాశం మేఘావృతమై లేకుంటే.. పశ్చిమ దిశలో సాయంత్రం 7 నుంచి 8.30 మధ్య బైనాక్యులర్, టెలిస్కోప్ సాయం లేకుండానే ఈ దృశ్యాన్ని చూడొచ్చు.


