రూ. 51 లక్షలు, ఫార్చ్యూనర్ కారు కోసం దారుణం? | Gave 11 Lakhs Scorpio Father Of Woman dowry assassination | Sakshi
Sakshi News home page

రూ. 51 లక్షలు, ఫార్చ్యూనర్ కారు కోసం దారుణం?

May 18 2026 4:38 PM | Updated on May 18 2026 4:38 PM

Gave 11 Lakhs Scorpio Father Of Woman dowry assassination

కోటి కట్నం ఇచ్చినా....కడుపుశోకం తప్పలేదు

తమ బిడ్డ పెళ్లి కోసం దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేశారు.  రూ. 11 లక్షల నగదు,  రూ. 50 లక్షల విలువైన బంగారం, ఫర్నిచర్ , ఒక స్కోర్పియో (Scorpio) కారు లాంటి ఖరీదైన కానుకలను  కట్నంగా ఇచ్చారు. కానీ ఏం లాభం, పెళ్లైన  17 నెలలకే   తీరని కట్నం దాహానికి 25 ఏళ్ల  కొత్త కోడలు  బలైపోయింది. దీంతో  అమ్మాయి తల్లి దండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అత్యంత హృదయ విదారకమైన ఈ ఘటన, గ్రేటర్ నోయిడాలోని జల్‌పురా ప్రాంతంలో, Ecotech-III పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది.

ఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నోయిడా (జల్‌పురా ప్రాంతం)లో 25 ఏళ్ల దీపికా నాగర్ అనే వివాహిత తన అత్తవారింటి పైకప్పు (టెర్రస్) పైనుంచి పడి అనుమానాస్పద స్థితిలో మరణించింది. 2024 డిసెంబరులో దీపిక వివాహం జరిగింది. ఈ వివాహం కోసం దీపిక తండ్రి సంజయ్ నగర్ దాదాపు ఒక కోటి రూపాయలు ఖర్చు చేశారు. పెళ్లయిన 3-4 నెలల నుంచే అత్తవారింటి వేధింపులు మొదలయ్యాయని  దీపిక తల్లిదండ్రలు ఆరోపించారు. నిందితులు అదనంగా ఒక ఫార్చ్యూనర్ కారు, రూ. 51 లక్షల నగదు కావాలని దీపికను వేధించడం ప్రారంభించారు. కట్నం కోసమే ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించి, హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఎలాగైన తనబిడ్డ సంసారం నిలబడుతుందనే ఆశతో, సర్దుకుపోతుందని భావించి తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, కూతురి జీవితాన్ని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నించామని దీపిక తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. అంత కట్నం ఇచ్చినా  నా కూతురు నాకు దక్కలేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పడిపోయిందా? తోసేశారా? 
ఆదివారం నాడు దీపికా తన తండ్రికి ఫోన్ చేసి, భర్త మరియు అత్తవారింటి వారు తనను తీవ్రంగా కొడుతున్నారని ఏడుస్తూ చెప్పింది. దాంతో తండ్రి  బంధువులు ఆ సాయంత్రం అత్తగారింటికి వెళ్లి గొడవను సర్దిచెప్పి, వారు ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే, రాత్రి 12:30 గంటల ప్రాంతంలో దీపికా  మూడో అంతస్తునుంచి పైనుంచి కింద పడిందని సమాచారం అందింది.

అయితే ఇది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ హత్యేనని తండ్రి చెప్పారు. ఆమెను తీవ్రంగా కొట్టి, కడుపులో స్క్రూడ్రైవర్ లేదా కత్తితో పొడిచి, ఆపై పైనుంచి కిందకు తోసేసారని ఆరోపించారు. ఆసుపత్రిలో ఆమె శరీరంపై తీవ్ర గాయాలున్నాయని, ముక్కు, చెవులలోంచి  రక్తం కారుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెను కొట్టి, ఆపై అది ఒక ప్రమాదంలా కనిపించేలా చేయడానికి కిందకు విసిరేశారని దీపిక బాబాయ్‌ విశేష్ నాగర్‌ ఆరోపించారు

మామ, భర్త అరెస్ట్
సెంట్రల్ నోయిడా డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) శైలేంద్ర కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. యువతి పైకప్పు పైనుంచి దూకి మరణించినట్లు సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దీపిక భర్త రితిక్ తన్వర్,  మామ మనోజ్ లను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం శవపరీక్ష (Post-mortem) నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement