ఫుడ్‌తో కొంగొత్త పరిచయాలే కాదు..ఓ దేశాన్నే మైమరిపించొచ్చు. ఎంతటి శత్రుత్వాలు, కోపతాపలు..ఒక్క విందుతో సమసిపోతాయి. అలాంటి టేస్టీ ఫుడ్‌తో ఇతర దేశాల మనసును దోచుకుని కోట్లు ఆర్జించడం మాటలు కాదుకదా. అలాంటి ఘన విజయాన్నే అందుకుంది ఈ భారత సంతతి మహిళ. మన భారతీయ రుచులను జోడించి తయారు చేసిన ఐస్‌క్రీమ్ బ్రాండ్‌తో దూసుకుపోతూ..శెభాష్ అనిపించుకుంటోంది పూజా బావిషి. ఎవరామె అంటే..
భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త పూజా బావిషి, 'మలై' అనే ఐస్ క్రీమ్ బ్రాండ్‌తో అమెరికన్లను ఆకట్టుకుంటోంది. ఇది ఏడాదికి రూ. రెండు వేల కోట్లు టర్నోవర్‌ని ఆర్జిస్తోంది. ప్రస్తుతం ఇద హోల్సేల్ ఈ కామర్స్ వ్యాపారంగా మారింది. 46 ఏళ్ల వ్యవస్థాపకురాలు, సీఈఓ 2015లొ ఈ మలైని ప్రారంభించారు.
ఈ వ్యాపారం న్యూయార్క్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీలలో నాలుగు దుకాణాలను నిర్వహిస్తోంది. చాలామటుకు ఐస్‌క్రీమ్‌లలో చాక్లెట్, వెనిలా వంటి ఫ్లేవర్‌లు చూశాం. కానీ అంతకుమించిన రుచి కోసం మలై వంటి వెరైటీ టేస్ట్‌ని పరిచయం చేశారు. దీని తయారీలో ఉపయోగించిన యాలకులు, గులాబీ, కుంకుమపువ్వు, జాజికాయ వంటి రుచులను జోడించడంతో అమెరికా వాసుల మనసులను దోచుకుంది ఈ మలై ఐస్ క్రీమ్.
ఈ కంపెనీ 2025లోనే సుమారు రూ. రెండు వేల కోట్లు పైనే ఆర్జించేలా అమ్మకాలు ఊపందుకున్నాయి. అంతకుముందు ఏడాది 2024, 2025 సంత్సరాలలో సంస్థ లాభదాయకంగా సాగింది. ఇక పూజా విద్యా నేపథ్యం వచ్చేసి..బావిషి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి అర్బన్ ప్లానింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అలాగే ఆమె ఆమె వాషింగ్టన్ డిసి-ఆధారిత లాభాపేక్షలేని సంస్థ అయిన ఈక్వల్ రైట్స్ సెంటర్‌లో పౌర హక్కుల ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు.
వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చిందిలా..
స్నేహితులకు ఇంట్లో తయారు చేసిన ఐస్‌క్రీంల రుచి చూపించినప్పుడు వ్యాపారం చేయాలనే ఆలోచనకు అంకురార్పణ చేసినట్లు గుర్తు చేసుకుంది. అల్లం-స్టార్ సోంపు ఐస్ క్రీమ్ - ఒక డిన్నర్ పార్టీలో తక్షణమే అందర్నీ ఆకట్టు కోవడంతో..ఇలాంటి టేస్టే టేస్టీ ఐస్‌క్రీం షాపు పెట్టాలని భావించారట ఆమె.
అయితే తన ఉత్పత్తులు మార్కెట్లో క్లిక్ అవుతాయో లేతో అన్న సందేహం మాత్రం బాగా ఉండేదని చెప్పుకొచ్చారామె. అయితే తన షాపుకు వచ్చే కస్టమర్ ఎలాంటి ఫ్లేవర్ కోరుకుంటున్నారు అనేది నిశితంగా గమనిస్తూ..టేస్టీ, టేస్టీ..మలై ఐస్‌క్రీమ్‌ని తీసుకొచ్చినట్లు తెలిపారు. అలాగే తన షాపు కి వచ్చే కస్టమర్ ఎవరు?, వాళ్లకేం కావాలన్నదే పూర్తిగా అవగాహన ఉండాలని, లేదంటే వ్యాపారం లాభదాయకంగా ఉండదని అంటోంది.
అలాగే తాను కేవలం లాభాల మీదే గాక, వ్యాపార విస్తరణపై కూడా దృష్టిపెట్టానని అన్నారు. అలాగే తాను వ్యాపారాన్ని చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి..అన్ని విధాల క్లిక అవుతుందని నమ్మకం కొనసాగేక ముందుకు తీసుకెళ్లానని అన్నారు. అలాగే భారతీయ రుచులు ప్రయోగాత్మకమైనవి కావు, ఈ రుచులను ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలు ఎంతో ఇష్టంగా ఆస్వాదించడం విశేషం. పైగా మార్కెట్ పరంగా అగ్రస్థానంలో ఉంది. అందుకు చాలా గర్వకారణంగా ఉందంటోంది పూజ.
(చదవండి: సూటు వేసుకుని వంట..! నెలకు ఏకంగా రూ. 7 లక్షలు..)


