ఫ్యాషన్ ప్రపంచంలో అంబానీ వారసురాలు, వ్యాపారవేత్త ఇషా అంబానీ మరోసారి తన ఫ్యాషన్ స్టైల్‌ను చాటుకున్నారు. ఆధునిక హంగులతో వింటేజ్ గ్లామర్‌ను ప్రదర్శిస్తూ, కార్ల్ లాగర్‌ఫెల్డ్ 1996 కలెక్షన్‌కు చెందిన అరుదైన ఆర్కైవల్ షానెల్ హాట్ కౌచర్ దుస్తులలో అద్భుతమైన లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు.
వ్యాపార ప్రపంచం నుండి అంతర్జాతీయ కార్యక్రమాలలో రెడ్ కార్పెట్ దాకా, ఇషా అంబానీ శైలి ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ఆమె తన విలక్షణమైన ఫ్యాషన్ అభిరుచికి మాత్రమే కాకుండా, తన రాజసం ఉట్టిపడే శైలికి కూడా ప్రసిద్ధి చెందారు. ఇటీవల, ఇషా అంబానీ ధరించిన ఒక దుస్తులు చూసి అందరూ 'వావ్' అన్నారు. తాజాగా 90వ దశకపు హాలీవుడ్ గ్లామర్‌ను గుర్తుచేసే ఒక అందమైన బంగారు రంగు వింటేజ్ దుస్తులను ధరించి మోడ్రన్ మహారాణిలా మెరిసారు.
2026లో ఫ్యాషన్ ప్రపంచంలో ఒక సరికొత్త మార్పు కనిపిస్తోంది. పాత తరం నాటి క్లాసిక్ డిజైన్లు (Vintage Couture) మళ్లీ రెడ్ కార్పెట్స్ పైకి వస్తున్నాయి. ఈనేపథ్యంలోనే ఇషా అంబానీ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ కార్ల్ లాగర్‌ఫెల్డ్ రూపొందించిన 'చానెల్ (Chanel) ఆటమ్/వింటర్ 1996 హాట్ కోట్యూర్' కలెక్షన్ నుండి గోల్డ్ కలర్ వింటేజ్ దుస్తులను ధరించారు.
ఆమె హిప్స్ వరకు సాగే పూర్తి చేతుల బంగారు రంగు (Gold) 'బంధ్‌గలా' సూట్‌ను ధరించారు. నడుము భాగంలో రత్నాలతో పొదిగిన బెల్ట్‌తో దీనిని స్టైల్ చేశారు. బంగారు రంగు లేస్ క్విల్టెడ్ ప్యాంట్‌సూట్. దీనికి ఆమె టాబ్‌వింటేజ్ వారి సిగ్నేచర్ గ్రిపాయిక్స్ బెల్ట్‌ను జతచేసింది. ఈ బెల్ట్ ధర సుమారు రూ.31,56,800 ఉంటుంది ఈ లుక్‌లో దాని అద్భుతమైన ఎంబ్రాయిడరీ మరియు ఆకర్షణీయమైన డిజైన్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ దుస్తులకు బంగారు రంగు డీటైలింగ్‌తో పాటు, రంగురంగుల రాళ్లను అమర్చారు.

ఈ లుక్ కోసం ఆమె చానెల్ క్రూయిజ్ 2025/26 కలెక్షన్‌కు చెందిన స్వెడ్ మినీ పౌచ్, మనోలో బ్లాహ్నిక్ శాండల్స్, సెయింట్ లారెంట్ సన్‌గ్లాసెస్‌ను ధరించారు. మేకప్ విషయానికి వస్తే బేక్డ్ న్యూడ్-టోన్డ్ మేకప్, వింగ్డ్ ఐస్, లూజ్ హెయిర్‌తో సింపుల్‌గా కనిపించారు. 2011లో లేడీ గాగా 1996 నాటి అరుదైన షానెల్ గోల్డ్ ప్యాంట్‌సూట్‌ను ధరించారు.

అంతేనా సెయింట్ లారెంట్ వారి SL M161 సన్‌గ్లాసెస్ మరో ప్రత్యేకత. వీటి ఖరీదు సుమారు దాదాపు రూ. 32,000 ఉంటుందని అంచనా. షానెల్ బ్రాండ్‌కు చెందిన క్రూజ్ 2025/26 కలెక్షన్‌లోని ఒక స్టైలిష్ స్వెడ్ మినీ పౌచ్‌ను ధరించారు. తన లుక్‌ను పూర్తి చేయడానికి, ఆమె లగ్జరీ బ్రాండ్ మనోలో బ్లానిక్‌కు చెందిన కల్లాస్లీ 90 లెదర్ స్లింగ్‌బ్యాక్ శాండల్స్‌ను ధరించారు. సుమారు రూ. 1,29,156 ఖరీదు చేసే ఈ స్టైలిష్ హీల్స్, ఆమె మొత్తం లుక్‌కు మరింత రాజసం ఉట్టిపడేలా చేశాయి.
రాజసం ఉట్టిపడే, ఆకర్షణీయమైన లుక్‌ను చాలా హుందాగా తీర్చిదిద్దుకోవడంతోపాటు, తన మొత్తం లుక్‌కు మరింత క్లాసీ లుక్‌ను జోడించారు. ఇషా తన గ్లామరస్ దుస్తులకు తగ్గట్టుగాఎంచుకున్న తేలికపాటి మేకప్ ఆమె లుక్‌కు చక్కగా సరిపోయింది.
ఇదీ చదవండి: వివాదంలో యాసిడ్ దాడి బాధితురాలు : అసలు ఏమైంది?


