breaking news
Family
-
నటి సోనాలీ బింద్రే ఫిట్నెస్ సీక్రెట్..! ఆటోఫాగీ అంటే..
సినీ తారలు ఏం చేసినా ట్రెండే! వారు పాటించే ఆరోగ్య సూత్రాలు, తినడమూ, నిద్రించడమూ, వ్యాయామం ప్రతీదీ ఆసక్తిగొలిపే అంశమే. తాజాగా బాలీవుడ్ నటి సొనాలీ బింద్రే తన ఫిట్నెస్ రహస్యాన్ని బయటపెడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వెల్నెస్ ప్రపంచంలో పెద్ద చర్చను లేవనెత్తాయి. తాను రోజులో ఏకంగా 18 నుంచి 20 గంటల పాటు ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తాననీ, శరీరంలో ఆటోఫాగీ అనే కణాల రీసైక్లింగ్ ప్రక్రియను ప్రేరేపించడానికే ఈ కఠిన నియమం అని సోనాలీ చెప్పుకొచ్చారు.సోనాలి బింద్రే చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియా అంతా ఇపుడు ఆటోఫాగీ చర్చ నడుస్తోంది. 20 గంటలపాటు కడుపు మాడ్చుకుంటే కణాలు రీసైకిల్ అయి నిజంగానే యవ్వనంగా మారిపోతారా అనేది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది.ఆటో ఫాగీ( Autophagy) అంటే?మన ఇంట్లో పాత వస్తువులు, చెత్త పేరుకుపోతే ఏం చేస్తాం? బయట పడేస్తాం లేదా రీసైక్లింగ్‌కు పంపుతాం కదా! సరిగ్గా మన శరీరం కూడా కణాల స్థాయిలో ఇదే పని చేస్తుంది. దాన్నే సైంటిఫిక్ పరిభాషలో ‘ఆటోఫాగీ’ అంటారు. కణాల్లో దెబ్బతిన్న ప్రోటీన్లు, పాతబడిపోయిన భాగాలు, పనికిరాని వ్యర్థాలను గుర్తించి, వాటిని విచ్ఛిన్నం చేసి, మళ్ళీ కొత్త శక్తిగా మార్చుకునే సహజ సిద్ధమైన, అద్భుతమైన ప్రక్రియ ఇది. ఈప్రక్రియ వల్ల వృద్ధాప్య ఛాయలు ఆలస్యమవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుందని, నరాల బలహీనత వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయని కొందరు పరిశోధకులు చెబుతున్నారు.ఈ ఫాస్టింగ్ భ్రమేనా!ఖచ్చితంగా కాదు! కాకపోతే దీన్ని అర్థం చేసుకునే విధానంలోనే తేడా ఉంది. అధిక బరువుతో బాధపడేవారు, ఫ్యాటీ లివర్, ఇన్సులిన్ సమస్యలు, బిపి ఉన్నవారికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కొంతమేరకు పని చేస్తుందని కొన్ని పరిశోధనలలో తేలింది. అయితే, దీనికోసం 20 గంటలపాటు కడుపు మాడ్చుకోకుండారోజులో 8 నుంచి 10 గంటల వ్యవధి సరిపోతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆటోఫాగీ అనేది జీవశాస్త్రంలో ఒక అద్భుతమే అయినప్పటికీ.. అది ఆరోగ్యానికి, యవ్వనానికి ఒక్కరోజులో దొరికే షార్ట్‌కట్ మాత్రం కాదు. ఎక్కువ గంటలు పస్తులుండటం కంటే... క్రమం తప్పని వ్యాయామం, 7 నుంచి 8 గంటల ప్రశాంతమైన నిద్ర, ఒత్తిడి లేకుండా చూసుకోవడం, సమతుల ఆహారం వంటి రోజువారీ అలవాట్లే మనిషిని ఆరోగ్యంగా ఉంచుతాయి. సినీ తారలు, సెలబ్రిటీల ట్రెండ్స్ చూడటానికి, వినడానికి బాగానే ఉన్నా శరీరం మనది.. ఆరోగ్యం మనది. అందువల్ల నిపుణుల సలహాలు లేకుండా ఎటువంటి ప్రయోగాలు చేయకపోవడమే ఉత్తమం!ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్.. ట్రెండా.. సైన్సా..ఇరవై గంటల పాటు ఉపవాసం ఉండగానే శరీరంలో ఆటోఫాగీ స్విచ్ ఆన్ అయి΄ోతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ, డాక్టర్లు మాత్రం ఇది అందరికీ శ్రేయస్కరం కాదని, తొందరపడవద్దని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే వెల్నెస్ ట్రెండ్స్‌కు, సైంటిఫిక్ నిరూపణలకు మధ్య చాలా వ్యత్యాసాలుంటాయని సూచిస్తున్నారు. సరిగ్గా ఇన్ని గంటలు ఉపవాసం ఉంటేనే ఆటోఫాగీ మొదలవుతుందని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవని చెబుతున్నారు. ప్రతి ఒక్కరి వయస్సు, జీవక్రియ, జన్యువులు, శారీరక శ్రమ, ఉపవాసానికి ముందు తిన్న ఆహారాన్ని బట్టి ఈ ప్రక్రియ మారుతుందనీ.. అందరికీ ఒకే రకమైన టైమర్ పనిచేయదని అంటున్నారు. -
నందన్-రోహిణి నీలేకనిల ప్రేమ కథ: అలా మొదలైంది..!
గత రెండు రోజులుగా నందన్ నీలేకని పేరు వార్తల్లో హాట్‌టాపిక్‌గా మారింది. యూఐడీఏఐ (ఆధార్) వ్యవస్థాపక ఛైర్మన్ అయిన నందన్ నీలేకని నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక హైపవర్డ్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడంతో ఆయన పేరు వార్తలో మారుమ్రోగిపోతోంది. ఈ కమిటీ పోటీ పరీక్షలను మరింత పారదర్శకంగా, సురక్షితంగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించేందుకు పలు సిఫార్సులు చేయనుంది. ఈ నేపథ్యంలో ఆయనెవరు..ఆయన వ్యక్తిగత జీవితం గురించి సర్వత్ర చర్చలు మొదలయ్యాలయి. ఆయన భార్య సైతం దాతృత్వంలో మేటీ అని, పర్యావరణం, నీరు, విద్య కోసం పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చే గొప్య వ్యక్తి అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అంతేగాదు వారిద్దరి క్యూట్ లవ్ స్టోరీ కూడా తెరపైకి వచ్చింది. ఆయనే స్వయంగా ఒక పాడ్‌కాస్ట్‌లో వెల్లడించిన స్టోరీ వెలుగులోకి వచ్చి ఆసక్తికరంగా మారింది. మరి ఆ దంపతుల అందమైన ప్రేమ కథేంటో చూసేద్దామా.!.నందన్ నీలేకని నీలేకని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడుచ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కూడా. ఆయన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) - ఆధార్ వ్యవస్థకు మాజీ ఛైర్మన్, రూపకర్తగా ప్రసిద్ధి చెందారు. ఆయన 'పీపుల్ బై WTF' అనే పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ తన భార్యను ఎలా కలిశాను, ఎలా తమ మధ్య ప్రేమ మొదలైందో పంచుకున్నారు. తాను 1977లో జరిగిన ఒక క్విజ్ పోటీలో రోహిణిని మొదటిసారి కలిసినట్లు తెలిపారు. ఆ పోటీలో ఆయన తన కళాశాల ఐఐటి బొంబాయికి, రోహిణి ఎల్ఫిన్‌స్టోన్ కాలేజీకి ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపారు. అయితే ఆ క్విజ్‌లో తాను గెలిచాను కానే హృదయాన్ని కోల్పోయానని నవ్వుతూ చెప్పారు. ఆ తర్వాత తాము కొంతకాలం ప్రేమించుకుని, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నామని అన్నారు. ఇక తన భార్య రచయిత్రి, అత్యంత పరోపకారి అని చెప్పారు. ఆమె 2001లో అర్ఘ్యం ఫౌండేషన్‌ను స్థాపించిందని, అది నీరు, పారిశుధ్య సమస్యలపై పనిచస్తుందని అన్నారు. అలాగే అన్‌కామన్ గ్రౌండ్ (2011), ది హంగ్రీ లిటిల్ స్కై మాన్స్టర్ (2020), సమాజ్, సర్కార్, బజార్: ఎ సిటిజన్-ఫస్ట్ అప్రోచ్ (2022) వంటి అనేక పుస్తకాలను రాసినట్లు తెలిపారు. అయితే భావాల పరంగా తామిద్దరం పరస్పరం వ్యతిరేకంగా ఉంటామన్నారు. తనకూ, తన భార్యకూ మధ్య ఉన్న తేడాలు ఎంత భిన్నంగా ఉంటాయో కూడా వివరించారు. తననుతాను బోరింగ్ వ్యక్తిగా అభివర్ణించుకోగా, రోహిణి మ్రాతం ఆవేశపూరితమైన భావోద్వేగభరిత చంచల స్వభావం గల వ్యక్తి అని అన్నారు. అంతేగాదు ఆమె గురించి ఇంకా చెబుతూ..2017లో తనతో పాటు గివింగ్ ప్లెడ్జ్‌పై సంతకం చేయడం సహా, భారతదేశపు అతిపెద్ద పర్యావరణ దాతలలో ఆమె ఒకరని కూడా పేర్కొన్నారు.కాగా, భారతదేశ పరీక్షా విధానాన్ని సమూలంగా మార్చేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. దీనికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నాయకత్వం వహించనున్నట్లు తెలిపారు మోదీ. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. (చదవండి: నిశబ్ద నిస్వార్థ వీరుడు..! అతడి సాయానికి సెల్యూట్ చెప్పాల్సిందే..) -
నిశబ్ద నిస్వార్థ వీరుడు..! అతడి సాయానికి సెల్యూట్ చెప్పాల్సిందే..
ఎలాంటి ఫలాప్రేక్ష లేకుండా నిస్వార్థంగా చేసేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఒక్కొక్కరి ఒక్కో పద్ధతి. కొందరు దానధర్మాలు చేస్తే..ఇంకొందు సేవా మార్గం ఎంచుకుంటారు. అలాకాకుండా రోజువారీ సాదాసీదా విషయాల్లో తన వంతుగా సహాయ సహకారాలు అందించాలని భావించడమే గ్రేట్ అనుకుంటే..అందుకోసం సమయం కేటాయిస్తూ..నిస్వార్థంగా సేవ చేయడం అంటే మాటలు కాదుకదా..!. అలాంటి సేవతత్పతరతనే అందిస్తున్నాడు ఈ వ్యక్తి.ఆ మహానుభావుడే ముంబైకి చెందిన నరేంద్ర పాటిల్. లోకల్రైళ్లుపై ఆధారపడే ముంబై వంటి నగరాల్లో రైల్వే స్టేషన్లో ఎలాంటి గందరగోళ పరిస్థితి ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అలాంటి చోట గమ్యం తెలియక ఇబ్బంది పడుతున్నవాళ్లకు దారిచూపుతాడు ఆయన. చాలా ఓపిగ్గా నవ్వుతూ వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..మార్గనిర్దేశం చేస్తుంటాడు. సింపుల్‌గా చెప్పాలంటే మానవ సూచికగా అభివర్ణించొచ్చు. ఆయన ప్రతిరోజూ దాదర్ వంతెనపై రెండు గంటలు నిలబడి, గందరగోళానికి గురైన రైలు ప్రయాణికులను సరైన ప్లాట్‌ఫారమ్‌లకు మార్గనిర్దేశం చేస్తారు. ముఖ్యంగా ఎక్కడ ఎక్కాలో లేదా మారాలో తెలియని ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేలా సాయం అందిస్తారు. అందుకోసం రోజు రెండు గంటలపాటు అక్కడ ఉంటారు. పాటిల్ ఉదయం 9:30 నుండి 11:30 గంటల మధ్య అక్కడ నిలబడి ప్రయాణికులకు గైడెన్స్ ఇస్తుంటారు. ఉదయం రద్దీ తగ్గిన తర్వాత, పాటిల్ కూడా ఎవరినీ ఏమీ అడగకుండా తన పని ప్రదేశానికి వెళ్ళిపోతాడు. ఆయన ఏమి ఆశించకుండా నవ్వుతూ చేస్తారు ఈ పనిని. కొందరు ప్రయాణికులు ఆయన్ను గుర్తుపట్టి చేయి ఊపి వెళ్లిపోతుంటారు కూడా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అలాంటి నిశ్శబ్ద వీరులకు పెద్ద సెల్యూట్ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Trainmerijaan (@_trainsofindia_) (చదవండి: హ్యాట్సాఫ్ మేడం..! ఆ ఐడియాకి మాటల్లేవ్ అంతే..) -
మూసేసిన డీవీసీ కేసును పునరుద్ధరించుకోవచ్చా?
2024లో నేను నా భర్తపై గృహహింస కేసుతో సహా క్రిమినల్ కేసులు దాఖలు చేశాను. అప్పటి నుంచి నా పిల్లలతో కలిసి నా పుట్టింటిలోనే ఉంటున్నాను. 2025లో నా పిల్లల భవిష్యత్తు కోసం, అలాగే నా భర్త మాతో తిరిగి కలుస్తానని నమ్మించడంతో గృహహింస కేసు (డీవీసీ)ను ఎలాంటి షరతులు లేకుండా ఉపసంహరించుకున్నాను. కానీ, ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ మమ్మల్ని కాపురానికి తీసుకెళ్లలేదు. పైగా క్రిమినల్ కేసు 498 అ (సీసీ) ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు ఆ కేసును కూడా ఉపసంహరించుకుంటేనే మమ్మల్ని ఇంటికి తీసుకెళ్తానంటూ అర్థం లేని షరతులు పెడుతున్నాడు. తన మీద పెట్టిన కేసులు తీసేసేలా మమ్మల్ని నమ్మించి మోసం చేశాడని అర్థమయ్యింది. ఇప్పుడు నా సమస్య ఏమిటంటే...నేను షరతులు లేకుండా ఉపసంహరించుకున్న DVC కేసును పునరుద్ధరించుకునే అవకాశం ఉందా? నా వ్యక్తిగత వస్తువులు, కట్నం కింద ఇచ్చిన భూమి (పత్రాలు), ఇతర సామగ్రి ఇంకా నా భర్త వద్దే ఉన్నాయి. వాటిని కోర్టు ద్వారా తిరిగి పొందడానికి నాకు చట్టపరమైన వెసులుబాటు ఏమైనా ఉందా? దయచేసి నాకు తగిన న్యాయ సలహా అందించగలరు.– సూసన్, నెల్లూరుఏ కేసు అయినా ఉపసంహరించుకునేప్పుడు ఏదైనా సమస్య కొనసాగితే మరలా తిరిగి కేసు ఫైల్ చేసే స్వేచ్ఛ ఇవ్వాలి అని కోర్టుని కోరి ఉంటే – అలాంటి స్వేచ్ఛని కోర్టు మీకు ఇవ్వవచ్చు. కానీ మీ కేసులో మీరే స్వచ్ఛందంగా బేషరతుగా ఉపసంహరించుకున్నారు కాబట్టి మరలా అదే కేసును తిరిగి పునరుద్ధరించడం సాధారణంగా కుదరదు. అయితే, పరిస్థితులను బట్టి కొత్తగా గృహహింస కొనసాగితే లేదా కొత్త కారణాలు ఏర్పడితే తాజా డీవీసీ దాఖలు చేసే అవకాశం లేక΄ోలేదు. రెండవసారి డీవీసీ కేసు వేయడానికి ఎలాంటి అవరోధమూ లేదు. పైగా మీ భర్త ఉద్దేశపూర్వకం గా మోసగించి కేసు విరమించుకునేలా చేశాడని చెబుతూ, దానిని కోర్టులో నిరూపిస్తే, మీకు మేలు జరుగుతుంది. మీ వ్యక్తిగత వస్తువులు, నగలు, ఆస్తి పత్రాలు లేదా ఇతర సామగ్రిని భర్త అక్రమంగా తన వద్ద ఉంచితే, వాటి స్వాధీనం కోసం డీవీసీ కేసులోనే అదనపు మధ్యంతర ఉత్తర్వులు కోరవచ్చు.భర్త క్రిమినల్ కేసు ఉపసంహరణను షరతుగా పెట్టి కాపురానికి తీసుకెళ్తానని చెప్పడం చట్టపరంగా సమంజసం కాదు. గృహ హింస కేసులు, మెయింటైనెన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్నాగానీ కాపురం చేయటానికి అడ్డు కాదు. మీ భర్త ఇప్పటికైనా కాపురానికి తీసుకెళ్తారు అంటే, ఎవరైనా లాయర్ ద్వారా మధ్యవర్తిత్వం చేసి ఒప్పందం రాసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. కేసు ఉపసంహరణపై నిర్ణయం తీసుకునే ముందు తప్పనిసరిగా న్యాయవాది సలహా తీసుకోవడం అవసరం. పటిష్టమైన ఒప్పంద పత్రాలు రాసుకుని కేసులు ఉపసంహరించుకుంటే మీకు ఇలాంటి సమస్యలు రావు.– శ్రీకాంత్ చింతల(హైకోర్టు న్యాయవాది మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )(చదవండి: టీసీఎస్ ఉద్యోగాన్ని కాదనుకుని రైస్ వ్యాపారం..! కట్‌చేస్తే ఏడాదికి..) -
గూగుల్ ఉన్నప్పుడు... గురువు అవసరమా?
ఒక సందేహం వస్తే చాలు... చేతిలోని ఫోన్ తీసి గూగుల్‌లో సెర్చ్ చేస్తాం. ఇంకా కాస్త వివరంగా కావాలంటే AIని అడుగుతున్నాం. పుస్తకాల నుంచి క్లాస్‌రూమ్‌ల వరకు అన్నీ డిజిటల్ అవుతున్న కాలమిది. మరి ఇలాంటి రోజుల్లో గురువు అవసరం ఏముంది? అంటే.. ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా దీని గురువు ఆవశ్యకత గురించి సవివరంగా చూద్దామా. అంతేకాదండోయ్ దీని గురించి సోషల్ మీడియా మాత్రం దీనికి ఓ ఆసక్తికరమైన సమాధానం చెబుతోంది.ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్... ఏ వేదిక చూసినా ఒకే దృశ్యం. పాత స్కూల్ టీచర్‌తో దిగిన ఫొటో, కాలేజీ లెక్చరర్‌తో ఉన్న సెల్ఫీ, "మీరు లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు సార్", "హ్యాపీ గురు పౌర్ణమి మేడమ్" అంటూ పోస్టులు, వీడియోలు, జ్ఞాపకాలు. కొందరు ఏళ్ల తర్వాత తమ గురువులను నేరుగా కలిసి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. మరికొందరు తమ విజయాన్ని గురువులకు అంకితం చేస్తున్నారు. ఇది ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. సమాచారం కోసం గూగుల్‌ను ఆశ్రయించొచ్చు. కానీ జీవితానికి దిశ చూపిన వ్యక్తిని మాత్రం మనసు ఎప్పటికీ మర్చిపోదు.అవి గురువు దగ్గరే నేర్చుకోగలం..గూగుల్ సమాచారం ఇస్తుంది. AI సమాధానం చెబుతుంది. కానీ ఆ సమాధానాన్ని ఎప్పుడు, ఎలా ఉపయోగించాలో చెప్పేది గురువే. ఒక సబ్జెక్ట్ నేర్పడం కంటే ఎక్కువగా, ఓటమిని ఎలా ఎదుర్కోవాలి, విజయం వచ్చినప్పుడు ఎలా ఒదిగి ఉండాలి, మన సామర్థ్యాన్ని ఎలా గుర్తించాలి అనే విషయాలు గురువు దగ్గరే నేర్చుకుంటాం.అందుకే గురువు అంటే కేవలం పాఠశాలలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు మాత్రమే కాదు. జీవితంలో సరైన సమయంలో సరైన మాట చెప్పి దారి చూపిన ప్రతి ఒక్కరూ గురువులే. తల్లిదండ్రులు, కోచ్‌లు, సీనియర్లు, జీవితంలో స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు కూడా ఆ స్థానంలో నిలుస్తారు.AI ఎంత అభివృద్ధి చెందినా అది అనుభవాన్ని సృష్టించలేదు. గూగుల్ ఎంత వేగంగా సమాధానం ఇచ్చినా అది మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దదు. అందుకే సాంకేతికత ఎంత ముందుకు వెళ్లినా గురువు విలువ తగ్గలేదు. పైగా డిజిటల్ యుగంలో మంచి గురువు అవసరం మరింత పెరిగింది. ఎందుకంటే సమాచారం అపారంగా ఉన్న ఈ కాలంలో ఏది నిజం, ఏది అబద్ధం, ఏది ఉపయోగకరం అనే వివేకం నేర్పించేది గురువే.గురు పౌర్ణమి కూడా అదే విషయాన్ని గుర్తు చేస్తోంది. ఈ రోజు కేవలం సంప్రదాయ పూజలు చేసే రోజు మాత్రమే కాదు. మన జీవితంలో వెలుగు నింపిన వ్యక్తిని ఒక్కసారి గుర్తు చేసుకునే రోజు. చిన్నప్పుడు చేతి వేళ్లు పట్టుకుని అక్షరాలు దిద్దించిన గురువు నుంచి, జీవితంలో కష్టకాలంలో ధైర్యం చెప్పిన వ్యక్తి వరకు... ప్రతి ఒక్కరికీ కృతజ్ఞత చెప్పే సందర్భం.టెక్నాలజీ కాలాన్ని మార్చింది. నేర్చుకునే పద్ధతిని మార్చింది. కానీ గురువు స్థానాన్ని మాత్రం మార్చలేకపోయింది. అందుకే గూగుల్, AIల యుగంలో కూడా గురు పౌర్ణమి ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే ప్రతి విజయకథ వెనుక కనిపించని ఒక గురువు ఉంటాడు."గూగుల్ జవాబులు ఇస్తుంది... గురువు జీవితాన్ని మార్చే ప్రశ్నలు అడగడం నేర్పిస్తాడు. అందుకే గూగుల్ ఉన్నా... గురువు అవసరమే".(చదవండి: హ్యాట్సాఫ్ మేడం..! ఆ ఐడియాకి మాటల్లేవ్ అంతే..) -
కోడింగ్ టెస్ట్‌లు, ఇంటర్వ్యూలు వృథా.. టెకీ ఆవేదన!
బెంగళూరు: అమెరికాలో ఉద్యోగ వేట విఫలమై, నెలల తరబడి ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కక బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన మోహిత్ ఆర్. గౌడ అనే యువకుడు తన అనుభవాలను లింక్డ్ఇన్ వేదికగా పంచుకున్నారు. కష్టపడి చదివి, ఎన్నో త్యాగాలు చేస్తే భవిష్యత్తు బాగుంటుందని నమ్మిన తనకు, అక్కడి వాస్తవ పరిస్థితులు తీవ్ర నిరాశను మిగిల్చాయని ఆయన పేర్కొన్నారు.వందలాది ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తూ, కోడింగ్ పరీక్షలు, ఇంటర్వ్యూల కోసం రాత్రింబవళ్లు శ్రమించినా, చివరికి నిరాశే ఎదురైందని మోహిత్ తెలిపారు. స్వదేశానికి తిరిగి రావడం తన ప్రణాళికలో లేదని, ఈ నిర్ణయం ఎంతో వేదనను, అనిశ్చితిని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ వేటలో ఉన్న సమయంలో పొదుపు చేసుకున్న సొమ్మంతా క్రమంగా కగిపోవడం ఆర్థికంగా ఎంతో కుంగదీసిందని వాపోయారు. అయినప్పటికీ నిరాశను పక్కనపెట్టి, కృత్రిమ మేధస్సు , జనరేటివ్ ఏఐ, డేటా సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రంగాల్లో ఉద్యోగ అవకాశాల కోసం అన్వేషిస్తున్నట్లు ఆయన తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, తగిన అవకాశాలు ఉన్నవారు రిఫరల్స్ ద్వారా సహకరించాలని కోరారు.ఇది కూడా చదవండి: మోనాలీసాను బలవంతంగా తరలించొద్దు: హైకోర్టు -
బాస్కే బాస్ ఎవరు?
అడవిలో పులి అడుగుపెడితేనే చాలా జంతువులు అప్రమత్తమవుతాయి. నిశ్శబ్దంగా కదులుతూ.. క్షణాల్లో వేటను ముగించే సామర్థ్యం దాని సొంతం. బలమైన పంజా, పదునైన గోర్లు, శక్తివంతమైన దవడలతో పులి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వేటగాళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. కానీ అడవిలో అసలు నిజం వేరే ఉంది.. ఎంతటి శక్తివంతమైన జీవికైనా ప్రకృతిలో ఒక సవాల్ తప్పదు. అడవికి బాస్‌గా పేరున్న పులి కూడా కొన్ని జంతువుల ముందు ఆచితూచి అడుగు వేయాల్సిందే.భారీ శరీరం, అపారమైన బలం, సమూహంగా కదిలే శక్తి, ఊహించని దూకుడు.. ఇలా కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న జీవులు పులికి కూడా ఎదురుదెబ్బ ఇవ్వగలవు. అవసరం లేని పోరాటాలకు పులి కూడా దూరంగా ఉంటుంది.. ఎందుకంటే అడవిలో ప్రతి గాయం ప్రాణాలకే ముప్పు కావచ్చు. తన వేట నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచే ఈ ‘పెద్ద పిల్లి’కి సైతం కొన్ని జంతువులు గట్టి సవాల్‌గా నిలుస్తాయి. అంతర్జాతీయ పులుల దినోత్సవం(International Tiger Day, Global Tiger Day) సందర్భంగా.. పులిని కూడా వెనక్కి తగ్గించే ఆ జంతువులు ఏవో తెలుసుకుందాం.అడవిలో అత్యంత శక్తివంతమైన జీవుల్లో ఏనుగు ఒకటి. భారీ శరీరం, అపారమైన బలం, తెలివి కారణంగా ఏనుగులు చాలా జంతువులకు సవాల్ విసురుతాయి. సాధారణంగా పులులు పెద్ద ఏనుగులపై దాడి చేయవు. ముఖ్యంగా ఏనుగుల మందలోకి వెళ్లడం పులికి ప్రమాదకరం. చిన్న ఏనుగు పిల్లలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం జరిగినా.. తల్లి ఏనుగు, మొత్తం మంద కలిసి పులిని తరిమికొట్టగలవు. ఒక్కసారి ఏనుగు దాడి చేస్తే.. పులికి తీవ్ర గాయాలయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఏనుగుల సమూహాన్ని చూసినప్పుడు పులి కూడా తన వ్యూహాన్ని మార్చుకుంటుంది.పులికి అసలైన పరీక్ష ఇదే..పులికి ఇష్టమైన ఆహారాల్లో అడవి దున్న (గౌర్) ఒకటి. అయితే దాన్ని వేటాడటం అంత సులభమైన విషయం కాదు. భారీ శరీరం, బలమైన కాళ్లు, పదునైన కొమ్ములు అడవి దున్నకు ప్రధాన ఆయుధాలు. ఒక పెద్ద అడవి దున్న ఎదురుదాడికి దిగితే పులికే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే పులులు సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న పెద్ద అడవి దున్నలపై కాకుండా.. బలహీనంగా ఉన్నవి, ఒంటరిగా ఉన్నవాటిపై దృష్టి పెడతాయి.మొసలితో మామూలుగా ఉండదుభూమిపై పులి ఎంత శక్తివంతమైనదైనా.. నీటిలో పరిస్థితులు మారిపోతాయి. పెద్ద మొసళ్లు తమ పరిధిలో అత్యంత ప్రమాదకరమైనవి. నదులు, చెరువుల్లోకి దిగినప్పుడు పులి కూడా మొసలి దాడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నీటిలో మొసలి బలం, దాని ఆకస్మిక దాడి పులికి ముప్పుగా మారుతుంది. అయితే పులులు కూడా మంచి ఈతగాళ్లే. అవసరమైతే నదులను దాటి వేట కొనసాగించగల సామర్థ్యం వాటికి ఉంటుంది.ఊహించని ప్రత్యర్థికొన్ని అడవి ప్రాంతాల్లో పులులు, ఎలుగుబంట్లు ఒకే ఆవాసాన్ని పంచుకుంటాయి. ముఖ్యంగా స్లోత్ బేర్ (ఎలుగుబంటి) చాలా దూకుడుగా స్పందించే జంతువు. ఆహారం లేదంటే ప్రాంతం విషయంలో ఎదురుపడినప్పుడు ఎలుగుబంటి వెనక్కి తగ్గకపోవచ్చు. దాని బలమైన గోర్లు, దూకుడు స్వభావం కారణంగా పులి కూడా ఇలాంటి ఘర్షణలను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది.మరి సింహం పులిని ఓడించగలదా?పులి, సింహం మధ్య ఎవరు బలమైనవారు అనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. శారీరక బలం, ఒంటరి వేట విషయంలో పులికి కొంత ఆధిక్యత ఉంటుందని చెబుతారు. అయితే సింహం బలం వేరే. అది గుంపుగా జీవిస్తుంది. ఒక సింహం కంటే.. మొత్తం గుంపుగా ఉన్న సింహాలు చాలా ప్రమాదకరం. పులి, సింహం ఎదురుపడితే ఎవరు గెలుస్తారనే దానికి ఖచ్చితమైన సమాధానం లేదు. వాటి పరిమాణం, వయసు, ఆరోగ్యం, పరిస్థితులపై ఫలితం ఆధారపడి ఉంటుంది.పులి అసలు బలం ఏంటి?పులి గొప్పతనం కేవలం దాని బలంలో లేదు.. దాని వ్యూహంలో ఉంది. ఒంటరిగా జీవించే ఈ జంతువు సహనం, తెలివి, సమయస్ఫూర్తితో వేటాడుతుంది. తనకంటే పెద్ద జంతువులను కూడా సరైన సమయం చూసి ఎదుర్కోగలదు. కానీ అవసరం లేని పోరాటాలకు వెళ్లదు. ఎందుకంటే అడవిలో ప్రతి గాయం దాని ప్రాణాలకు ముప్పే. అడవిలో శాశ్వతంగా బాస్ ఎవరూ ఉండరు. ప్రతి జీవికి ఒక బలం ఉంటుంది.. అదే సమయంలో ఒక సవాలు కూడా ఉంటుంది. -
సాహో... టైగర్ ఉమన్
‘అమ్మో పులి’ అనుకునే రోజులు కావు. ‘పులి కనిపిస్తే వేటాడాలి’ అనుకునే రోజులు. కళ్ల నుండి పళ్ల వరకు పులి శరీరాన్ని డబ్బులు చేసుకోవాలనుకునే రోజులు. ‘ఆహా! పులి’ అనుకునే రోజులు. అయితే అందరూ అలా లేరు. ‘అయ్యో! పులి’ అని బాధ పడేవారు ఎంతోమందిఉన్నారు. అలాంటి వారిలో ఒకరు... హృషిత నేగి.పులుల సంరక్షణ కోసం నడుం బిగించిన హృషిత నేగి ‘టైగర్ ఉమన్’గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. గ్రౌండ్ బ్రేకింగ్ ఏఐ కెమెరా సిస్టమ్స్ ‘ట్రైల్గార్డ్ ఏఐ’తో పులుల రక్షణ కోసం పనిచేస్తోంది...పులితో పోల్చితే మిగతా జంతువులతో హృషిత నేగికి చాలా తక్కువ పరిచయం. మధ్య భారతదేశంలోని విశాలమైన గడ్డి మైదానాలు, అడవులతో కూడిన కన్హా రిజర్వ్‌లో పులుల మధ్య పెరిగింది. అడవి పులిని నాలుగు సంవత్సరాల వయసులో మొదటిసారి చూసింది. తండ్రి హిమ్మత్ నేగి కన్హా రిజర్వ్‌కు డైరెక్టర్‌గా ఉండేవారు. జీపులో పార్క్‌ను పరిశీలించడానికి హిమ్మత్ వెళ్లేటప్పుడు ఆయనతోపాటు హృషిత కూడా వెళ్లేది. పులులు ఎదురు పడడం అక్కడ సాధారణ విషయమే అయినప్పటికీ, పులిని ఎన్నిసార్లు చూసినా ఎప్పుడూ అద్భుతంగా ఉండేది. ‘అడవి పులిని చూడడం మరచిపోలేని అనుభవం. ఒక పులి మీ కళ్ల ముందు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు మీ మనసులో ఉన్నదంతా మరచిపోతారు. ఒకరకమైన తన్మయస్థితికి వెళతారు’ అంటుంది హృషిత.మిషన్ మొదలైంది....న్యూ ఢిల్లీ యూనివర్శిటీలో జీవశాస్త్రంలో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ చేసింది హృషిత. పులుల సంరక్షణపై పనిచేసే ‘గ్లోబల్ టైగర్ ఫోరమ్’కు హాజరైన హర్షిత అమెరికన్ టైగర్స్ యునైటెడ్ యూనివర్శిటీ కన్సార్టియం గురించి తెలుసుకుంది. పులుల సంరక్షణ కోసం పనిచేయాలనుకునే విద్యార్థులకు ఈ యూనివర్శిటీ సహకరిస్తుంది. స్కాలర్ షిప్‌లు అందజేస్తుంది. క్లెమ్సన్లోని టైగర్స్ యునైటెడ్ మిషన్‌లో చేరడం హృషిత జీవితంలో ఒక కీలకమైన మార్పు. విద్య, శిక్షణ, పరిశోధన, సాంకేతికత ద్వారా మన దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అడవి పులులను రక్షించడం ఈ మిషన్ లక్ష్యం.ట్రైల్గార్డ్ ఏఐతనతోపాటు పీహెచ్‌డి చేసిన, పోస్ట్–డాక్టోరల్ రిసెర్చర్ జెరిమీ డెర్టియన్తో కలిసి పులుల జాడను గుర్తించే సరికొత్త సాంకేతిక ఆవిష్కరణ చేసింది హృషిత. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించే కెమెరా ట్రాప్ సిస్టమ్‌ను వీరు రూపొందించారు. దీనికి ‘ట్రైల్గార్డ్ ఏఐ’ అని పేరు పెట్టారు. హృషిత, జెరిమీ కలిసి గ్లోబల్ టైగర్ ఫోరమ్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అండ్ రిసాల్వ్ల మధ్య భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చారు. భారతదేశంలోని రెండు ప్రముఖ పులి సంరక్షణ కేంద్రాలైన కన్హా, పెంచ్ల మధ్య ఉన్న కారిడార్‌లో పులులను తక్షణమే గుర్తించి, వాటి చిత్రాలను వేగంగా పంపేందుకు ఏఐ సామర్థ్యం ఉన్న ట్రెయిల్ కెమెరా సిస్టమ్స్‌ను ఏర్పాటు చేశారు.సెకన్ల లోపే...‘ట్రైల్గార్డ్ ఏఐ’ అనేది పులుల సంరక్షణకు సంబంధించిన మొదటి ఏఐ టైగర్ కెమెరా ట్రాప్. మిగతా కెమెరా ట్రాప్‌ల మాదిరిగానే ‘ట్రైల్గార్డ్ ఏఐ’ పులి కదలికలను పసికట్టి ఫొటో తీస్తుంది. అయితే, వేలకొద్దీ ఫొటోలను స్టోర్ చేయడానికి బదులుగా కేవలం పులుల చిత్రాలను మాత్రమే గుర్తించి స్టోర్ చేస్తుంది. ‘ట్రైల్గార్డ్ ఏఐ’ కెమెరా సిస్టమ్‌లో ఒక కమ్యూనికేషన్ బాక్స్ ఉంటుంది. అది సమీపంలోని సెల్ టవర్‌కు అనుసంధానమై చిత్రాలను అటవీశాఖ అధికారులకు అందిస్తుంది. భారతదేశంలోని మారుమూల ప్రాంతాలలో కూడా కనెక్టివిటీ బాగుంటుంది.అటవీశాఖ సిబ్బందికి 30 సెకన్ల లోపే ఫొటోలు చేరిపోతాయి. బ్యాటరీ లైఫ్, సైజుకు సంబంధించి ‘ట్రైల్గార్డ్ ఏఐ’ కెమెరాలు అత్యంత సమర్థమైనవి. అందువల్ల అవి దాదాపుగా వేటగాళ్లకు కనిపించవు. అడవులలో చాలాకాలం పాటు స్వయం సమృద్ధిగా పనిచేస్తాయి. ‘వేటగాళ్లను పట్టుకోవడానికి మా ఏఐ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుంది’ అంటుంది హృషిత. ఇప్పటివరకు ట్రైల్గార్డ్ ఏఐ సాంకేతికతతో ఇరవైమందికి పైగా వేటగాళ్లు అరెస్ట్ అయ్యారు.వారికి పులులంటే భక్తి‘కారిడార్ చుట్టూ ఉన్న గ్రామ ప్రజలు పులులతో కలిసి జీవించడానికి సహాయపడేందుకు నిధులు సేకరించడమే మా లక్ష్యం. ఈ గ్రామాల ప్రజలకు పులులు అంటే ఎంతో భక్తిభావం ఉంది. వారి సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలతో పులులకు అనుబంధం ఉంది. పులి అంటే వారి దృష్టిలో ప్రమాదకరమైన జంతువు కాదు’ అంటుంది హృషిత నేగి. పులులు నా ఆత్మీయులుపులుల సంరక్షణ అనేది నా దృష్టిలో జంతువులకు సంబంధించిన అంశం కాదు. పులుల సంరక్షణ అనేది నా ఆత్మీయుల సంరక్షణకు సంబంధించిన విషయం అనుకుంటాను. చిన్నప్పటి నుంచి నాకు పులులు అంటే చాలా ఇష్టం. వాటిని చూస్తూ పెరిగాను. జీవవైవిధ్యం మునపెన్నడూ లేనంతగా క్షీణిస్తున్న కాలంలో మనం ఉన్నాం. పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషించే కీలక జాతులను కాపాడుకోవాలి. వాటన్నింటిలో కెల్లా అత్యంత గంభీరమైన పులి జాతి గురించి ఆలోచించాలి.– హృషిత నేగి -
మురికి గోడలను బడిగా మార్చిన టీచర్!
‘‘మీ చేతిలో ఉన్న ఆ చెక్కని ఏమంటారు?’’ అని అడిగింది ఒక చిన్నారి. ఆ ప్రశ్న అర్థం కాక, ఆమె తన చేతిలోనే వస్తువును చూసుకొని ‘‘దీన్ని పెన్సిల్ అంటారు’’ అంది. ‘‘దాంతో ఏం చేస్తారు?’’ అని అమాయకంగా ప్రశ్నించింది ఆ చిన్నారి. ఆ ప్రశ్న ఆమెని క్షణం పాటు నిశ్శబ్దంగా నిలబెట్టింది. ప్రపంచంలో అతి సాధారణమైన ఒక పెన్సిల్ కూడా తెలియని స్థితిలో కొందరు పిల్లలు ఈ లోకంలో ఉన్నారన్న నిజం ఆమెని కలచివేసింది. ప్రతి పిల్లవాడి చేతిలో పెన్సిల్ ఉండాలి అన్న సంకల్పానికి ఆ క్షణమే అంకురం పడింది.ఆ సంకల్పంతో ఆమె మురికివాడల్లోకి వెళ్లినప్పుడు అక్కడ పాఠశాలలు లేవు, కేవలం పాడైపోయిన గోడలు మాత్రం ఉన్నాయి. ఆ గోడలను చూసి ఆమెకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది..!పాఠశాల అంటే నాలుగు గోడలు, ఒక నల్లబల్ల, ఎదురుగా పిల్లలు, వారికి పాఠం చెప్పే ఉపాధ్యాయుడు– ఇది మనందరికీ తెలిసిన నిర్వచనం. కానీ ‘రూబుల్ నాగి’ అనే మహిళకు పాఠశాల గురించి మరో ఆలోచన ఉంది. ‘‘పిల్లలు పాఠశాలకు రాలేకపోతే, పాఠశాలనే వారి దగ్గరకు తీసుకెళ్లాలి’’అన్న ఆలోచన అది..! ఒక పిల్లవాడికి చదువు చెప్పటం అంటే అతడి చేతిలో పుస్తకం పెట్టడం కాదు. అతడి భవిష్యత్తుకు ఒక తలుపు తెరవటం– అని నమ్మింది. ‘రూబుల్ నాగి’ ఒక చిత్రకారిణి. సాధారణ చిత్రకారుడు తన బొమ్మల కోసం మంచి కాన్వాస్‌ను వెతుకుతాడు. ఆమె మాత్రం ‘‘చదువుకు దూరమైన పిల్లల’’ను వెతికింది. నిన్నటి వరకూ నిర్లక్ష్యానికి గుర్తుగా నిలిచిన గోడలు, పిల్లలకు పాఠాలు చెప్పే సజీవ పుస్తకాలుగా మారాయి. ఒక గోడ మీద అక్షరాలు, మరో గోడ మీద అంకెలు, ఇంకో గోడమీద సైన్స్, ఆరోగ్యం, పరిశుభ్రత, పర్యావరణానికి సంబంధించిన రంగురంగుల బొమ్మలు ప్రత్యక్షమయ్యాయి.అర్బన్ ఆడిటోరియంలో ఖరీదైన కళాప్రదర్శనల కన్నా, మురికి వాడల గోడల మీద తన చిత్రకళకు ఎక్కువ ప్రయోజనం ఉందని నమ్మింది..! కేవలం ముప్పైమంది పిల్లలతో ప్రారంభమైన ఆమె ప్రయత్నం, క్రమంగా వందలాది ప్రాంతాలకు విస్తరించింది. పాఠశాల ముఖమే చూడని పిల్లలను చదువువైపు నడిపించడం, చదువులో వెనుకబడినవారికి సహాయం చేయడం, వారిలో ‘‘నేనూ నేర్చుకోగలను’’ అనే నమ్మకాన్ని కలిగించడం ఆమె లక్ష్యంగా మారింది.ఆమె శిక్షణ కేంద్రాల్లో చదువుకున్న కొందరు విద్యార్థులు బాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పట్టాలు సాధించగా, మరికొందరు సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్నారు. ఇంకొందరు భారతసైన్యంలో అధికారులుగా చేరేందుకు శిక్షణ పొందుతున్నారు. మురికివాడలో మొదలైన వారి ప్రయాణం, ఉన్నత విద్యాసంస్థల వరకూ చేరింది.ఒక పిల్లవాడికి అక్షరం నేర్పడం మనకు చిన్న విషయంగా కనిపించవచ్చు. కానీ అతడి కుటుంబంలో చదవడం వచ్చిన మొదటి వ్యక్తి అతడే అయితే, అది ఒక అక్షరం కాదు– ఆ కుటుంబ చరిత్రలో ప్రారంభమైన కొత్త అధ్యాయం..! ఒక అమ్మాయికి లెక్కలు నేర్పడం సాధారణంగా అనిపించవచ్చు. కానీ రేపు తన సంపాదనను తానే లెక్కపెట్టుకుని, ఎవరూ తనను మోసం చేయకుండా నిలబడగలిగితే, అది కేవలం గణితం కాదు– ఆత్మగౌరవం..! ‘నువ్వు పుట్టటం మురికివాడలో అయ్యుండొచ్చు. కానీ నీ కలలు అక్కడే ముగియాల్సిన అవసరం లేదు’ అంటుంది రూబుల్ నాగి.ఒక విద్యావేత్త భవనం కట్టి పాఠశాలను నిర్మించవచ్చు. కానీ చదువుకోలేని పిల్లవాడి మనసులో ‘‘నాకూ ఒక భవిష్యత్తు ఉంది’’ అనే నమ్మకాన్ని నిర్మించినవాడే నిజమైన ఉపాధ్యాయుడు..! రూబుల్ నాగి వేసింది గోడల మీద రంగులు కాదు. పిల్లల జీవితాల్లో రంగులు నింపే భవిష్యత్తు!ఈ అద్భుతమైన కృషికి గుర్తింపుగా ఆమెకి మిలియన్ డాలర్ల ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్’ లభించింది..! అంత భారీ బహుమతి (దాదాపు కోటి రూపాయలు) వచ్చిన తరువాత కూడా ఆమె తన సౌకర్యాల గురించి కాదు; నిరుపేద పిల్లలకు ఉచితంగా వృత్తివిద్య అందించే సంస్థను నిర్మించడం గురించి ఆలోచించింది. అందుకే ఆమెకు అవార్డు వచ్చిందని చెప్పడం కన్నా, ఆమె చేస్తున్న పనిని వెతుక్కుంటూ అవార్డే వచ్చిందని చెప్పడం సరైనది..!– యండమూరి వీరేంద్రనాథ్ -
పావ్ భాజీ, చోలే బటూరేలను తింటూనే బరువు తగ్గా..!
ఎన్నో వెయిట్‌లాస్ జర్నీల్లో మనం ఆరోగ్యకరమైన జీవనశైలి, చక్కటి వర్కౌట్లు, సరైన ఆహారం వంటివి కీలకం అని విన్నాం. చాలామంది ఆయిల్ ఫుడ్లు, జంక్ ఫుడ్లకు దూరంగా ఉంటేనే బరువు సాధ్యమని అనుభవపూర్వకంగా వెల్లడించారు. కానీ ఈ మహిళ మాత్రం నచ్చినవి తింటూనే హెల్దీగా బరువు తగ్గమని చెబుతుంది. ఆమె అలా చేసే ఏకంగా 95 కేజీల దగ్గర 55 కేజీలకు వచ్చానని, సుమారు 25కేజీలపైనే బరువు తగ్గానని చెప్పుకొచ్చింది. అదెలా సాధ్యమో చూద్దామా.!.ఆ మహిళే డైటీషియన్, యూట్యూబర్ సుమన్ పహుజా. తన వ్యక్తిగత జీవితంలో ఒక క్లిష్ట దశలో ఉన్నప్పుడు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టానని చెప్పుకొచ్చారు. తాను అప్పుడు సుమారు 99కిలోలు పైనే బరువు ఉండేదాన్ని అని అన్నారు. తీవ్రమైన డైటింగ్ కంటే, పట్టుదల, నిలకడ, ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలతో స్లిమ్‌గా మారినట్లు తెలిపింది. తన బరువు గురించి తండ్రి, భర్త చేసిన విమర్శలు తనను స్లిమ్‌గా మారేలా ప్రేరేపించాయని చెప్పుకొచ్చారు. అయితే క్రాష్ డైట్లకు బదులుకు నిలకడైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామా దినచర్యను పాటించినట్లు తెలిపారు. అలాగే తనకు ఇష్టమైన ఆహారాలను వేటిని వదులుకోలేదన్నారు. తాను ఇప్పటికీ పావ్ భాజీ, చోలే బటూరే వంటి వంటకాలను తింటానని అన్నారు. అయితే వాటిని ఇంట్లోనే తయారు చేసుకుంటానని, దీనివల్ల వాడే పదార్థాలు, పరిమాణాలపై మెరుగైన నియంత్రణ పాటిస్తూ వాటిని ఆస్వాదించగలుగుతున్నానని పహుజా చెప్పారు. ఎలాంటి ఆహారం అంటే..ఆమె రోజువారీ ఆహారంలో అల్పాహారంగా రెండు మల్టీగ్రెయిన్ పరాటాలు, ఒక గిన్నెడు కూరగాయలు, చక్కెర లేని టీతో మొదలవుతుందట. మధ్యాహ్న భోజనంలో సాధారణంగా పండ్లు లేదా సొరకాయ సలాడ్‌తో పాటు ఒక గ్లాసు కోల్డ్ కాఫీ తీసుకుంటానని చెప్పారు. ఇక రాత్రి భోజనంలో, ఉప్పు లేకుండా తయారు చేసిన బ్రోకలీ లేదా వేయించిన క్యాప్సికమ్‌తో పాటు రెండు గుడ్డు తెల్లసొనలు ఉంటాయి. కడుపు నింపే, పోషకమైన, తక్కువ కేలరీలు ఉండే చియా సీడ్ ఫుడ్డింగ్ను తీసుకుంటానని పేర్కొంది. ఇక తన బరువు తగ్గడంలో వ్యాయామం కూడా కీలక పాత్ర పోషించిందన్నారు. తాను వారానికి మూడు రోజులు వర్కౌట్లు చేస్తానని, ప్రధానంగా పరుగెత్తడం, దూకండ వంటి కార్డియో వ్యాయామాలపై దృష్టిపెడతానని అన్నారు. వీటన్నింటి తోపాటు సమయానికి భోజనం చేయడం, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యమని నొక్కి చెప్పారు. ఆమె నిద్రలేచిన గంటలోపే అల్పాహారం తినడాన్ని ఒక నియమంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే సాయంత్రం 5 గంటల తర్వాత కార్బోహైడ్రేట్లకు దూరంగా ఉంటానని, వారానికి రెండుసార్లు డిటాక్స్ వాటర్ తాగుతానని చెప్పారు. అలాగే డైట్ పాటించని రోజుల్లో కూడా ఇంట్లో వండిన భోజనానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చారు. ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగడంతోనే బరువు తగ్గానని అన్నారు పహుజా. పైగా ఈ రూపాంతరం తనలో ఆత్మవిశ్వాసాన్ని, ఏకాగ్రతను పెంచేందుకు దోహదపడిందని అంటోంది. చివరగా ఆమె భవిష్యత్తులో తానొక ఆరోగ్యకరమైన సంతోషకరమైన మహిళగా జీవించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. View this post on Instagram A post shared by SUMAN PAHUJA (@suman_sunshine)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: ఈ క్షణం కోసమే ఎదురుచూశా..! ఉప్పొంగి పోయిన తల్లిదండ్రులు..) -
హ్యాట్సాఫ్ మేడం..! ఆ ఐడియాకి మాటల్లేవ్ అంతే..
వృత్తి కొందరికీ ఒక ప్యాషన్ అయితే..వాళ్లు అందులో చూపించే క్రియేటివీ మాములగా ఉండదు. ఏ పనిచేసినా..అది అద్భుతంగా ఆలోచనాత్మకంగా ఉంటుంది. అందుకు ఉదాహరణ ఈ ఉపాధ్యాయురాలు. పెద్ద పెద్ద క్రియేటివిటీలతో పనిలేదు. కాస్త అభిరుచితో చాలా సింపుల్‌గా కూడా అద్భుతం సృష్టించొచ్చు. అదే చూపించింది ఈ ఢిల్లీ ఉపాధ్యాయురాలు. విద్యార్థులు రెగ్యులర్‌గా క్లాస్‌కి వచ్చేలా చేసేందుకు ఆమె సృజనాత్మకంగా ఆలోచించిన తీరు తెలిస్తే నోటమాటరాదు. అందుకోసం ఏం పెద్ద పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులేం ఉపయోగించలేదు. జస్ట్ ఒక పేపర్ బోర్డు, చిన్న చిన్న అగ్గిపెట్టెలతోటే అంతా చేశారామె. వాళ్లంతా తమ హాజరును తామే వేసుకునేలా అవకాశం ఇచ్చి..బాధ్యతగా వ్యవహరించేలా చేసింది. ముఖ్యంగా రోజూ వచ్చేలా నిబద్ధతను మెదళ్లులో నాటినట్లుగా చేసిన పని అందర్నీ అమితంగా ఆకర్షించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మొదట ఉపాధ్యాయురాలు తరగతి గదిలోకి ప్రవేశించగా..వెనుక విద్యార్థులు ఒక్కొక్కరుగా లోపలికి వచ్చారు.లోపలికి ప్రవేశించిన వెంటనే, ఆమె చేసిన మొదటి పని, చేతితో తయారు చేసిన ఆ స్వీయ-హాజరు బోర్డుపై తన హాజరును గుర్తించడం. ఆ టీచర్నే అనుసరిస్తూ..మిగతా విద్యార్థులంతా స్వీయంగా తమ హాజరును నమోదు చేసుకున్నారు. అందుకోసం ఒక పెద్ద బోర్డుపై చిన్న అగిపెట్టెలను పెట్టి..వాటిపై ప్రతి విద్యార్థి ఫోటో ఉండేలా చేశారు. దానిలోపల బాక్స్‌లో పీ "P" అనే అక్షరాన్ని ఉంచారు. క్లాస్‌కి వచ్చిన వాళ్లంతా ఆ బోర్డుపై ఉన్న అగ్గిపెట్టెని ఓపెన్ చేసి P" అనే అక్షరాన్ని బయటకు కనిపించేలా పెడతారు. రానివాళ్లు పెట్టేపై ఆటోమేటిగ్గా కనిపిస్తున్న "O" అనే అక్షరం కనిపిస్తుంది. ఆమె ఈ వీడియోని సోషల్ మీడియాలో పంచుకుంటూ నా చిన్నారులు బాధ్యత తీసుకుంటున్నారు అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. నెటిజన్లు కూడా అద్భుతమైన ఆలోచన..బాధ్యతా భావాన్ని పెంచేలా ప్రోత్సహిస్తున్నారంటూ పోస్టులు పెట్టారు.(చదవండి: ఈ క్షణం కోసమే ఎదురుచూశా..! ఉప్పొంగి పోయిన తల్లిదండ్రులు..) -
ఈ క్షణం కోసమే ఎదురుచూశా..! ఉప్పొంగి పోయిన తల్లిదండ్రులు..
మన కోసం ఎన్నో త్యాగాలు చేసే, సర్వసం మనకు ధారపోసే కన్నవాళ్లను ఎంతో బాగా చూసుకోవాలని కోరుకుంటారు చాలామంది పిల్లలు. అందుకోసం తమ వంతుగా చేయాల్సిదంతా చేస్తుంటారు బిడ్డలు. అలానే ఈ మహిళ కూడా తన పేరెంట్స్‌కి గొప్ప అనుభవం ఇవ్వాలని అనుకుంది. అందుకని వాళ్లని ఎప్పటికైన మంచి పర్యాట ప్రదేశానికి తీసుకువెళ్లాలనుకుంది. అనుకున్నట్లుగానే కల నేరవేర్చుకోవడంతో ఆ పట్టరాని సంతోషాన్ని ఇలా సోషల్ మీడియా వేదికగా వీడియో రూపంలో పంచుకుంది. ఆ మహిళా ప్రియాంక అనే ఎన్నారై. ఆమె ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. తన తల్లిదండ్రులను అమెరికాలోని ప్రసిద్ధ నయగరా జలపాతానికి తీసుకువెళ్లాలని అనుకుంది. ఆ జలపాతాన్ని దగ్గరగా వీక్షించే అనుభవం ఇవ్వాలని ఎన్నాళ్ల నుంచో అనుకుంది. ఆ డ్రీమ్ నెరవేరడమే గాక తన తల్లిదండ్రులు 'మెయిడ్ ఆఫ్ ది మిస్ట్' బోట్ టూర్లో పాల్గొంటూ ఉధృతంగా పడుతున్న జలపాతాన్ని చూస్తున్న వీడియోని ఇలా సోషల్ మీడియాలో పంచుకుంది. ఒక చల్లని తుంపర్లు, దట్టమైన పొగమంచు మధ్య అందమైన దృశ్యాన్ని వీక్షించారు. వర్షం నుంచి రక్షించే రెయిన్ పాంచోలు ధరించి ప్రియాంక తల్లిదండ్రులు పడవలో జలపాతం సమీపం వరకు వెళ్తున్న దృశ్యాలు స్ఫష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె పేరెంట్స్ కనువిందు చేస్తున్న ఆ దృశ్యాన్ని వీక్షిస్తూ..ఉప్పొంగిపోయారు. ఆ ప్రకృతి అందాన్ని అంత దగ్గర చూసి సంతోషం, ఆశ్చర్యం కలగలసిన భావాలు వాళ్ల ముఖాల్లో స్పష్టంగా కనిపించాయి వీడియోలో. ఆమె ఆ వీడియోని పోస్ట్ చేస్తూ..ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూశా. పేరెంట్స్‌ని కచ్చితంగా ఇక్కడ తీసుకురావాలని అనుకున్నా. ఆ కల ఈవేళ నిజమైంది. ఇది అత్యంత హృద్యమైన క్షణం అంటూ క్యాప్షన్ ఇచ్చి మరి పోస్ట్ చేసింది. నెటిజన్లు కూడా చాలా బాగుంది మేడం, నిజంగా ఇది హృద్యంగా ఉంది అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Priyanka | Indian in the US (@thatbrownbanni.usa) (చదవండి: మిస్ టీన్ యూనివర్స్ ఇండియా విజేతగా ప్రసుచి పాండా) -
ప్లీజ్ శరీరాన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు..! పాపం ఆ 26 ఏళ్ల మహిళ..
గత కొన్నేళ్లుగా చర్మ కేన్సర్‌పై అవగాహన కల్పిస్తున్న టెక్సాస్‌కు చెందిన 26 ఏళ్ల మహిళ చివరి సందేశం నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె కన్నీటి కథ నెటిజన్లను కదిలించింది. అంతేగాదు తనలా మరెవ్వరూ అలాంటి అనారోగ్య సమస్య బారిన పడకూడదని చివరి క్షణాల వరకు పడిన తపన ప్రతిఒక్కర్ని కదిలిస్తోంది. అంతేగాదు ప్రజలదర్నీ శరీరం విషయంలో బీకేర్‌ఫుల్‌గా ఉండమని కోరుతూ పంపిన సందేశం ఆ వ్యాధిపై అందరికీ అవగాహన ఉండాలనే విషయాన్ని నొక్కి చెప్పింది. ఇంతకీ ఎవరా మహిళ?, ఏ వ్యాధి గురించి ఇంతలా ఆమె మాట్లాడారు అంటే..గత కొన్నేళ్లుగా చర్మ కేన్సర్‌పై అవగాహన కల్పిస్తోంది టెక్సాస్‌కు చెందిన 26 ఏళ్ల మహిళ అలోండ్రా సియెర్రా. ఆమె తన మరణానికి ముందు వరకు ఆ వ్యాధిపై అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. అంతేగాదు వ్యాధిని ముందుగా గుర్తిస్తే..ఎంత బిగ్ రిలీఫ్ ఉంటుందో వివరించింది. అది మన మనుగడకు ఎంత కీలకమో కూడా నొక్కి చెప్పింది. సియెర్రా కేవలం 19 ఏళ్ల వయసులో నుదిటిపై మచ్చ ఏర్పడటం గమనించింది. కాలక్రమేణా, అది లేత రంగు నుంచి ముదురు రంగులోకి మారింది. కానీ అది కేన్సర్ కాగలదని ఎప్పుడూ ఊహించలేదు. ముఖ్యంగా మెలనోమా వచ్చే అవకాశం ఉందని కలలో కూడా ఊహించలేదని అంటోంది. కానీ ఈ ఏడాది చివరి నాటికి ఈ చికిత్స తను తీసుకున్నప్పటికీ.. విజయవంతం కాలేదని తెలిపింది. అంతేగాదు తనలా మరెవ్వరు ఈ వ్యాధి బారినపడకూడదనే ఉద్దేశ్యంతో గత నాలుగేళ్లుగా సూర్యరశ్మి నుంచి రక్షణ, క్రమం తప్పని చర్మ పరీక్షల ప్రాముఖ్యత గురించి సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తోంది. హానికరమైన యూవీ కిరణాల నుంచి తమను తాము రక్షించుకోవాలని ప్రోత్సహిస్తోంది కూడా. అలాగే కృత్రిమ యూవీ మూలాలతో ఉన్న ప్రమాదాల గురించి కూడా మాట్లాడారామె. అలాగే ఇలాంటి వాటిన బారినపడకుండా తీసుకోవాల్సిన చర్చలు, ముందస్తు పరీక్షల గురించి కూడా అవగాహన కల్పించే యత్నం చేసింది. అంతేగాదు తగ మే నెలలో మెలనోమా అవగాహన మాసం పురస్కరించుకుని పంచుకున్న వీడియో ప్రతి ఒక్కర్ని కదిలిస్తుంది. ఆ వీడియోలో సియెర్రా.. "నివారణ అనేది మనుగడకు సంబంధించిన విషయంగా అభివర్ణించింది. ఈ నెల వేడుకలకు ప్రతీక అయితే ఎంత బాగుండును, కానీ బదులుగా మనుగడకు ప్రతీకగా నిలుస్తోంది. దురదృష్టవశాత్తు, ప్రస్తుతం ఇదే నా వాస్తవికత. చాలామందికి మే 1వ తేదీ, మెలనోమా అవగాహన మాసం ప్రారంభం. అలాగే మరో నెల మాత్రమే. నాకు మాత్రం, ఇది నివారణ, ఇది ప్రచారం. ఇది జీవితం, ఇది మనుగడ అని భావోద్వేగంగా మాట్లాడింది వీడియోలో". తన పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతున్నా..తానెలాగో ఈ వ్యాధిని ముందుగా గుర్తించలేకపోయానని..కనీసం ఇతరులకకైన సహాయపడాలని..ప్రతి విషయాన్ని ప్రస్తావిస్తూ అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. అన్ని వయసుల వారు తన చర్మాన్ని జాగ్రత్తగా గమనించాలని చెప్పింది. పుట్టుమచ్చ రంగు, ఆకారం, పరిమాణంలోని తేడాలను నిర్లక్ష్యం చేయొద్దని కోరిందామె. ఒకవేళ ఆలస్యం చేస్తే..తల నుంచి చెవుల వెనుక వరకు..అలాగే రొమ్ము, పాదాలు, జననాంగాల వరకు ఎలా వ్యాపిస్తుందో వివరిస్తూ..తన సంభాషణను ముగించింది. కానీ అదే ఆమె చివరి వీడియోగా మిగిలింది. ఎందుకంటే..స్టేజ్ 4 మెలనోమా కేన్సర్‌తో సుదీర్ఘ పోరాటం చేసి ఈ నెల జూలె 17న మరణించింది. మందుగా ఈ వ్యాధిని ఎలా గుర్తించాలంటే..ఈ మెలనోమాను ముందుగా గుర్తించే హెచ్చరిక సంకేతాల కోసం చర్మవ్యాధినిపుణులు ABCDE అనే నియమాన్ని అనుసరించమని సూచిస్తున్నారు. A - అసమానతB – అంచులలో క్రమరాహిత్యంC - రంగులో వైవిధ్యంD - 6 మి.మీ కంటే పెద్ద వ్యాసంE – పరిమాణం, ఆకారం లేదా రంగులో మార్పులుకాగా సియెర్రా..అధునాతన కేన్సర్‌తో పోరాడుతున్నప్పటికీ, జీవితంలోని ముఖ్యమైన మైలురాళ్లను జరుపుకుంది. ఆమె 2024లో కళాశాల నుంచి పట్టభద్రురాలైంది, అదే ఏడాది ఆ వ్యాధి తన శరీరం అంతటా వ్యాపించిందని తెలుసుకుంది. ఈ ఏడాది మార్చిలో, రేడియేషన్ చికిత్స పూర్తి చేసిన కొద్ది రోజులకే, ఆమె అమెరికా పౌరసత్వం పొంది మరో కలను నెరవేర్చుకుంది. అంతేగాదు తన కథ ద్వారా, ఇతరులు కూడా తమ చర్మంలో అనుమానాస్పద మార్పులను ముందుగానే గుర్తించి, ఆలస్యం కాకముందే వైద్య సలహా తీసుకోవాలని సియెర్రా ఆశించింది. చివరి వరకు ఆమె ఆ లక్ష్యం కోసమే పోరాడిందని కన్నీటి పర్యంతమైంది ఆమె కుటుంబం. View this post on Instagram A post shared by Alondra Sierra (@alondrasierrat)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. ఈ వ్యాధి గురించి పూర్తి వివరాలను వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: హీర్ అజిత్ డైట్ సీక్రెట్..! ఆఖరికి పోషకాహార నిపుణుల సైతం..) -
హీర్ అజిత్ డైట్ సీక్రెట్..! ఆఖరికి పోషకాహార నిపుణుల సైతం..
తమిళ నటుడు అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలక్షణమైన సినిమాలతో వైవిధ్యభరితమైన నటనతో మెప్పిస్తుంటాడు ఈ సూపర్ స్టార్. ప్రముఖ హీరోయిన్ షాలిని పెళ్లాడిని ఆయన ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యత ఇస్తుంటారనేది.. పలు ఇంటర్వ్యూల్లో అజిత్ చెప్పిన మాటలే నిదర్శనం. ఆఖరికి ఇటీవల పద్మభూషణ్ అవార్డుని గెలుచుకున్నప్పుడూ కూడా ఆ క్రెడిట్ మొత్తాన్ని భార్యకే ఇచ్చేశారు. ఫ్యామిలీకి, కుటుంబ విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఆయన డైట్ విషయంలో ఎంత కేర్‌గా ఉంటారో తెలిస్తే విస్తుపోతారు. అందుకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఆయన వ్యక్తిగత పోషకాహార నిపుణురాలు దివ్య కె పురుషోత్తం అరవింద్ సురేష్ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. అవేంటంటే..తాను చాలామంది సెలబ్రిటీలో పనిచేశాను కానీ అజిత్ ఫ్యామిలీ ఆహారం విషయంలో పాటించే క్రమశిక్షణను చూసి ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటానని అన్నారు దివ్య. అది కేవలం అజిత్ సార్లోనే కాదు మేడమ్ షాలిని కూడా ఆహారం విషయంలో చాలా కేర్‌గా ఉంటారని చెప్పారు. తను నోట్లో పెట్టుకునే ప్రతి ఆహారానికి, తన పిల్లలకు, ఇంట్లో పనిచేసే వాళ్లకు కూడా మంచి ఆహారమే ఉండేలా చూస్తారు. శుభ్రంగా, ఆరోగ్యకరమైనది, పోషకాలతో కూడినదే తినడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. నిజంగా ఇది అందరూ నేర్చుకోవాల్సిన విషయం అని అన్నారామె. నిపుణులు ఏం అంటున్నారంటే..ఇంతలా ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమేనని, ముఖ్యంగా మితంగా తినడం మంచిదని అన్నారు. ఇలా ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటే దీర్ఘకాలంలో ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదన్నారు. ఇలాంటి శ్రద్ధ ఫలితం అధిక జంక్ ఫుడ్, చక్కెర, నూనె పదార్థాలకు దూరంగా ఉండగలుగుతారని అన్నారు. శ్రద్ధగా ఉండటం మంచిదే కానీ ప్రతి ముద్దను తనిఖీ చేసేంత అతి వద్దని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంట్లో వండిన తాజా ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి తప్ప..అందుకోసం ఆందోళనల, ఒత్తిడి వద్దన్నారు. క్లీన్ ఈటింగ్‌కి ప్రాధాన్యత ఇవ్వమని సూచించారు ఆరోగ్య నిపుణులు.“క్లీన్ ఈటింగ్” అంటే ..క్లీన్ ఈటింగ్ అనే భావనను తరచుగా ఖరీదైనదిగా లేదా పరిమితమైనదిగా తప్పుగా అర్థం చేసుకుంటారు. “క్లీన్ ఈటింగ్ అంటే పండ్లు, కూరగాయలు, పప్పులు, ధాన్యాలు, ఇంట్లో వండిన తాజా భోజనం వంటి సహజమైన ఆహారాన్ని తినడం. ఇది ఏమి ఠినమైన డైటింగ్ కూడా కాదు. కేవంల ఎక్కువగా ప్రాసెస్ చేసే జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉండటం లాంటిది. ఇంట్లో క్రమశిక్షణతో కూడిన జీవనశైలికి ప్రాధాన్యత ఇస్తే..పిల్లలు కూడా ఆటోమేటిగ్గా ఆ అలవాట్లకే ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. View this post on Instagram A post shared by Love Theory Media ™️ (@lovetheorymedia) (చదవండి: మిస్ టీన్ యూనివర్స్ ఇండియా విజేతగా ప్రసుచి పాండా) -
మిస్ టీన్ యూనివర్స్ ఇండియా విజేతగా ప్రసుచి పాండా
మిస్ టీన్ యూనివర్స్ ఇండియాగా ఒడిశాకు చెందిన ప్రసుచి పాండా కిరీటాన్ని దక్కించుకుంది. ఈ ఘన విజయం అనంతరం తొలిసారిగా భువనేశ్వర్‌కు వచ్చిన ఆమె అక్కడ స్థానిక మీడియాతో ముచ్చటించారు. ఇది తనకు ఎంతో భావోద్వేగంతో కూడిన క్షణంగా అభివర్ణించింది. అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం ఒక గౌరవం, గొప్ప బాధ్యతగా పేర్కొంది. ఇది తన ప్రయాణానికి ఆరంభం మాత్రమేనని అన్నారు. కచ్చితంగా తాను తన తల్లిదండ్రులు, ఒడిశా రాష్ట్రం, గర్వపడేలా కృషి చేస్తానని చెప్పారామె. అసలు ఇలా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం అనేది తన చిరకాల కోరిక అని, అందువల్ల నాదేశం మిస్ టీన్ యూనివర్సిటీ కిరీటాన్ని దక్కించుకునేలా తనవంతుగా పూర్తి అంకితభావంతో పనిచేస్తానని అన్నారామె. కాగా, టీనేజర్ల కోసం ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అందాల పోటీలలో ఒకటైన 'మిస్ టీన్ యూనివర్స్' అంతర్జాతీయ పోటీలో వచ్చే ఏడాది భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది ప్రసుచి. ఆమె ఎవరంటే..ధరణిధర్ పాండా, స్వప్న రాణి పాండాల కుమార్తె. ఆమె కుటుంబం ఒడిశాలోని గంజాం జిల్లా బెర్హంపూర్‌లోని హిల్పట్నాకు చెందినది. చదువుకునే రోజుల్లోనే ఆమెకు మోడలింగ్ పట్ల అమితాశక్తి ఉంది. అదే ఆమెను తన కలలను సాకారం చేసుకునేందుకు ఢిల్లీకి వెళ్లేలా ప్రేరేపించింది. అక్కడ ఆమె యువ మోడల్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రసూచి తన నాలుగేళ్ల వయసులోనే ఈ శిక్షణ ప్రారంభించి, 2026లో వృత్తిపరంగా ర్యాంప్‌వాక్‌లో అడుగుపెట్టింది. ఆమె నిరంత పట్టుదల, అంకితభావం, ఈ ప్రతిష్టాత్మకమైన మిస్‌టీన్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని దక్కించుకునేలా చేశాయి.(చదవండి: కంగనా రనౌత్ వైరల్ కేన్సర్ స్టోరీ..నిజంగానే అధిక ప్రోటీన్ ప్రమాదకరమా?) -
Health: 'నాలో సమస్య ఉండదు' అనేదే పెద్ద అపోహ!
ఇటీవల సంతానలేమి సమస్య బాగా పెరుగుతున్న నేపథ్యంతో పాటు ఈ నెల 25న ఐవీఎఫ్ / ఎంబ్రియాలజీ డే సందర్భంగా ‘సాక్షి’ వరుస కథనాలను వెలువరించింది. ప్రత్యేకంగా 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వచ్చిన వరుస కథనాల్లో సంతానలేమి కారణాలతో పాటు ఐవీఎఫ్ ప్రక్రియను ఎలా నిర్వహిస్తారు, అందులోని కాంప్లికేషన్లూ, నైతికాంశాలను విపులంగా చర్చించింది.ఈ నేపథ్యంలో అత్యంత సంక్లిష్టమైన హార్మోన్ సైకిళ్లు కొనసాగే మహిళల్లో వచ్చే సమస్యలపై మరింత వివరమైన కథనాలొచ్చాయి. అయితే పురుషుల్లో సంతానలేమికి కారణాలపై చిన్న ప్రస్తావనలకే పరిమితమైనందున ఈ కథనంలో పురుషుల్లో పెరుగుతున్న వంధ్యత్వ సమస్యలు దంపతుల సంతానలేమికి ఏ మేరకు కారణమవుతున్నాయనే అంశంపై ఓ వివరణాత్మకమైన కథనమిది. నిజానికి దంపతుల్లో సంతానలేమి సమస్య ఉన్నప్పుడు పురుషులే తొలి చొరవ తీసుకోవాలని చెప్పడంతో పాటు... అందుకు కారణాలేమిటో తెలిపే కథనమిది.సంతానలేమి సమస్య ఉన్న దంపతుల్లో మహిళలతో పాటు పురుషులూ అందుకు కారణం కావచ్చు. నిజానికి సంతానలేమికి మహిళలూ, పురుషులూ సమానంగా కారణం కావచ్చని గుర్తించాలి. అయితే పురుషాధిక్యత కారణంగా... ఇంత పురోగతీ, జెండర్ ఈక్వాలిటీ తర్వాత కూడా సమాజం ఇప్పటికీ మహిళలనే ఇందుకు బాధ్యులను చేస్తుండటం గమనించవచ్చు. పురుషులలో సంతాన లేమికి కారణాలుపురుషుల్లో సంతాన లేమికి కారణాలను ప్రధానంగా మూడు రకాలుగా చెప్పవచ్చు. అవి జీవనశైలికి సంబంధించినవీ, పర్యావరణ కారణాలూ, వైద్యపరమైన అంశాలు. వాటి గురించి వివరంగా... జీవనశైలికి సంబంధించినవి...పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లు. (ఇవి శుక్రకణాల సంఖ్య, నాణ్యత, కదలిక (మొటిలిటీ)ని తగ్గిస్తాయి. మరీ ముఖ్యంగా పొగతాగడమనే అలవాటు శుక్రకణాల మొటిలిటీని విపరీతంగా ప్రభావితం చేస్తుంది).కూర్చుని చేసే వృత్తులతో శారీరక శ్రమ లేకపోవడం, స్థూలకాయం (ఒబేసిటీ)ఆధునిక జీవనశైలిలో ఉండే తీవ్రమైన ఒత్తిడి.ఈ అంశాలన్నీ పురుషుల్లో హార్మోన్లపై దుష్ప్రభావం కలిగించి శుక్రకణాల (స్పెర్మ్) ఉత్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి/ చేస్తున్నాయి.పర్యావరణ అంశాలు...కాలుష్యం, వాతావరణంలోని విషపదార్థాలు (టాక్సిన్స్), భారలోహాల (హెవీమెటల్స్) తాలూకు దుష్ప్రభావాలు.పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, రకరకాల ఎలక్ట్రానిక్ ఉత్పాదనల ఉపయోగంతో వాతావరణంలోని రేడియేషన్... వంటి అంశాలూ స్పెర్మ్‌పై ప్రతికూలంగా పనిచేస్తుంటాయి. (ఉదాహరణకు సెల్‌ఫోన్ ప్యాంటు జేబులో పెట్టుకోవడం, ల్యాప్‌టాప్ ఒళ్లో పెట్టుకుని పనిచేయడం వంటివి స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తాయన్న పరిశీలనలూ, అధ్యయనాలూ ఉన్నాయి).వైద్యపరమైన అంశాలు...వృషణాల్లో రక్తనాళాలు ఉబ్బడం వల్ల కనిపించే వేరికోసీల్.టెస్టోస్టెరాన్ మొదలగు హార్మోన్ సమస్యలు.కొన్ని జన్యుపరమైన అంశాలు, పురుష ప్రత్యుత్పత్తి అవయవాల ఇన్ఫెక్షన్లుకారణాలు తెలుసుకోవడం కోసం...పురుషుల్లో సంతానలేమికి కారణాలను తెలుసుకోడానికి దంపతులకు మొట్టమొదటగా డాక్టర్ నుంచి కౌన్సెలింగ్ అవసరం. పరీక్షల కంటే ముందుగా ఇదే ఎందుకు అవసరమంటే... సాధారణంగా మన దేశంలో లైంగిక అంశాలపై విజ్ఞానం చాలా తక్కువ. పైగా లైంగికపరమైన సమస్యలూ, పరిష్కారాల కోసం నోరుతెరచి ఓపెన్‌గా మాట్లాడటానికి కొంత వెనకాడుతుంటారు. అందుకే దంపతులు మొట్టమొదట తమ మనసు విప్పి డాక్టర్ ఎదుటనైనా మాట్లాడేలా దంపతులను సంసిద్ధం చేయాలి. ఆ తర్వాత వారి లైంగిక జీవితం పై కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. నిజానికి లైంగిక జీవితంపై ప్రశ్నలు అనగానే దంపతులు సంకోచిస్తుంటారు. కానీ అవి వైజ్ఞానికంగానూ, ఏవైనా తప్పులు / లోపాలు ఉంటే కనుగొనేందుకు ఉపయోగపడేవిగానూ ఉంటాయని గుర్తించాలి. ఉదాహరణకు ఆ ప్రశ్నలెలా ఉంటాయంటే...పురుషుల్లో సంతానలేమికి కారణాలు కనుక్కునే ముందర అసలు ఆ పురుషుడిలో అంగస్తంభన సరిగా ఉందా, లేదా?ఒక నెలలో మహిళకు నెలసరి మొదలైన తర్వాత 10వ రోజు నుంచి 20వ రోజుల్లో ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా రోజూ గానీ లేదా రోజు తప్పించి రోజుగానీ క్రమం తప్పకుండా కలుస్తున్నారా?కలయిక తర్వాత పురుషుడి వీర్యం మహిళలోకి సక్రమంగానే చేరుతోందా అన్నది తెలుస్తోందా?పురుషుల్లో అంగస్తంభన సమస్య ఉన్నా, ఒకవేళ కలయిక సాధ్యమైనప్పటికీ... వీర్యం సక్రమంగా మహిళలోకి పూర్తిగా ప్రవేశించకపోయినా... ఆ మహిళకు ఎన్ని పరీక్షలు, చికిత్సలూ చేయించినా ప్రయోజనం ఉండదు. అందుకే పురుషుల్లో సాధారణంగా కనిపించే ఈ సమస్యలను యాండ్రాలజిస్ట్ / యూరాలజిస్ట్ ద్వారా ముందుగా పురుషుల విషయంలోనే తెలుసుకోవాలి.సమాజపరంగా అందరి బాధ్యత ఇది... ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఒకవేళ పురుషుల్లో ఏదైనా సమస్య ఉన్నప్పటికీ అది కూడా మిగతా సాధారణ ఆరోగ్య సమస్యల్లాంటిదే. నిజానికి దాన్ని లోపంగా కూడా చూడకూడదు. అన్నిసాధారణ ఆరోగ్య సమస్యలకు చికిత్స ఎలా చేయిస్తారో, ఈ సమస్యకూ అలాగే చికిత్స అందించాలి. నిజానికి ఈరోజు అందుబాటులో ఉన్న వైద్యపరిజ్ఞానంతో లైంగిక సమస్యలను చక్కదిద్దడం దాదాపు పూర్తిగా సాధ్యమేనని గుర్తించాలి. అంతేతప్ప ‘మగ’తనం లోపమంటూ, మరొకటంటూ ఈ లైంగిక సమస్యను సమాజం చిన్నచూపు చూడకూడదు. అలా చూడటమూ సరికాదు.తొలుత భౌతిక పరీక్షల (ఫిజికల్ ఎగ్జామినేషన్స్)తో మొదలు...పురుషులతో మాట్లాడాక... ఫిజికల్ ఎగ్జామినేషన్స్‌గా పిలిచే కొన్ని భౌతిక అంశాల పరీక్షలు నిర్వహించాలి. ఇందులో... పురుషుల్లో సెకండరీ సెక్సువల్ కారెక్టరస్టిక్స్ అన్నీ సరిగా అభివృద్ధి చెందాయా అని చూడాలి. సెకండరీ సెక్సువల్ కారెక్టరిస్టిక్స్ అంటే... ఆ వ్యక్తికి మీసాలూ గడ్డాలూ బాగానే ఉన్నాయా, అతడి ప్యూబిక్ హెయిర్ పెరుగుదల సాధారణంగానే ఉందా, పురుషాంగం పరిమాణం కనీసంగా ఉందా, వృషణాల సైజ్ సాధారణంగానే ఉందా... లాంటి అనేక అంశాలను ఫిజికల్ ఎగ్జామినేషన్స్‌లో పరీక్షిస్తారు. ఇవన్నీ చేశాక ఆ తర్వాతి పరీక్షలకు వెళ్తారు.తర్వాత నిర్ధారణ పరీక్షలు...వీర్యపరీక్ష (సెమెన్ ఎనాలసిస్ టెస్ట్) : ఈ పరీక్షలో వీర్యకణాల సంఖ్య (కౌంట్), నాణ్యత (క్వాలిటీ), కదలికలు (మొటిలిటీ), వీర్యకణాల ఆకృతి (మార్ఫాలజీ) వంటి అంశాలు తెలుస్తాయి. ఈ పరీక్షకు ముందుగా కనీసం మూడు రోజుల పాటు కలయికగానీ లేదా హస్తప్రయోగంగానీ కూడదు. ఒక్కోసారి ఒక పరీక్షకూ మరో పరీక్షకూ కూడా పొంతన లేని ఫలితాలు ఉండకపోవచ్చు. అందుకే కేవలం ఒక పరీక్షతోనే సెమెన్ ఎనాలసిస్‌పై ఒక నిర్ధారణకు రాకూడదు. చాలా రకాల అంశాలు వీర్యపరీక్ష ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు... కొందరిలో సాధారణ జ్వరం వచ్చినప్పుడు కూడా వీర్యకణాల ఉత్పత్తి పడిపోయి, వీర్యకణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లుగా ఫలితం వస్తుంది. అందుకే పూర్తి ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉన్నప్పుడే వీర్యపరీక్ష ఫలితాలు మెరుగ్గా వస్తాయి. అందుకే సెమెన్ టెస్ట్‌లో ఒక్కోసారి కేవలం పరీక్షకే పరిమితమయ్యే బదులు కొన్నిసార్లు డాక్టర్లు ఒకటికి రెండుసార్లు ఈ పరీక్ష చేయించే అవకాశం ఉండవచ్చు.చికిత్స ప్రక్రియలు...ఇన్ఫెక్షన్లు ఉండటం వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గితే... యాంటీబయాటిక్స్ ఇవ్వడం.హార్మోన్ల లోపం ఉంటే... దాన్ని భర్తీ చేసేందుకు అందుకు అవసరమైన హార్మోన్ చికిత్స అందిస్తారు.వీర్యంలో అసలు వీర్యకణాలే లేకపోతే : నిజానికి వీర్యం అనేది వీర్యకణాలు జీవిస్తూ, చురుగ్గా కదలడానికి అవసరమైన ఒక ద్రవపు మీడియం మాత్రమే. దీన్ని ప్రోస్టేట్ గ్రంథి అండ్ సెమినల్ వెసికిల్స్ తయారు చేస్తాయి. సంతానానికి కారణమయ్యే ‘వీర్యకణాలు’ వృషణాల్లో ఉత్పత్తి అవుతాయి. అక్కడ పుట్టిన ఆ కణాలు, వాస్ డిఫరెన్స్ అనే సన్నటి గొట్టం ద్వారా వీర్యంలోకి చేరి, అందులో ఈదుతూ ఉంటాయి.పురుషులకే తొలి పరీక్షలు మేలు... నిజానికి సంతాన లేమి సమస్యలు ఉన్నప్పుడు తొలి పరీక్షలు పురుషులు చేయించుకోవడమే మంచిది. ఇలా చెప్పడానికి అనేక కారణాలతో పాటు అనేక ప్రయోజనాలూ ఉన్నాయి. అవేమిటంటే... పురుషుల్లో కారణాలు కనుగొనడం చాలా సులువు. ఖర్చు కూడా చాలా తక్కువ. మొదటే మహిళల్లో సమస్యల కోసం పరీక్షలు చేయిస్తే... పురుషుల విషయంలో చేయించాల్సిన పరీక్షల కన్నా అవి చాలా ఎక్కువ. పైగా అవన్నీ చేయించాక మహిళల్లో సమస్య ఏదీ లేదని తేలితే ఎంతో డబ్బు, శ్రమ, సమయం... ఇవన్నీ వృథా అవుతాయి.మన సమాజంలోని పురుషాధిక్యతతో కూడిన వివక్ష, పురుషుడిలో సమస్య ఉందంటే... ముఖ్యంగా పల్లెల్లో పొరుగువారి నుంచి ఎదురయ్యే చిన్నచూపు వంటి అంశాలు పురుషుడు తన సమస్యను కప్పిపెట్టుకునేలా ప్రేరేపిస్తుంటాయి. నిజానికి సంతానలేమికి మహిళల్లో ఎన్ని కారణాలు ఉంటాయో వాస్తవానికి పురుషుల్లోనూ అన్నే ఉంటాయన్నది వైద్యపరంగా తేలిన సత్యం. అందుకే సంతానం లేని దంపతుల్లో... పురుషులే తొలి పరీక్షలు చేయించుకోవడం అని రకాలా ప్రయోజనకరం.ఈరోజు అందుబాటులో ఉన్న వైద్యపరిజ్ఞానంతో లైంగిక సమస్యలను చక్కదిద్దడం దాదాపు పూర్తిగా సాధ్యమేనని గుర్తించాలి. అంతేతప్ప ‘మగ’తనం లోపమంటూ, మరొకటంటూ ఈ లైంగిక సమస్యను సమాజం చిన్నచూపు చూడకూడదు. అలా చూడటమూ సరికాదు.కౌంట్‌ను ప్రభావితం చేసే దురలవాట్లుసిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉన్నవారిలో కూడా వీర్యకణాల సంఖ్య తగ్గుతుంది. ఒత్తిడి కూడా వీర్యకణాల సంఖ్యను ప్రభావితం చేస్తుంది. అంతెందుకు... తీవ్రఒత్తిడిలో పనిచేసే వారిలో అంగస్తంభన సమస్య కనిపించడమన్నది చాలా సాధారణం. అంతేకాదు... వీళ్లలో వీర్యకణాల సంఖ్య, నాణ్యత, కదలికలు చురుగ్గా ఉండవు. ఈ కారణం వల్ల కూడా వాస్తవానికి పురుషుల్లో పరీక్షల కంటే ముందుగా యాండ్రాలజిస్ట్ ఆ దంపతుల సెక్స్ జీవితానికి సంబంధించిన వివరాల సేకరణకే ఎక్కువ ్రపాముఖ్యత ఇస్తుంటారు.లైంగిక జీవితంపై ప్రశ్నలు అనగానే దంపతులు సంకోచిస్తుంటారు. కానీ అవి వైజ్ఞానికంగానూ, ఏవైనా తప్పులు / లోపాలు ఉంటే కనుగొనేందుకు ఉపయోగపడేవిగానూ ఉంటాయని గుర్తించాలి.హార్మోన్ పరీక్షలు...ఇందులో ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్,ప్రోలాక్టిన్, టెస్టోస్టెరాన్. ఈస్ట్రోడియల్ ఈ ఐదు పరీక్షలూ చేయించడం వల్ల హార్మోన్ సమతౌల్యత ఉందా లేదా అన్న సంగతి తెలుస్తుంది. (నిజానికి ఒక టెస్టోస్టెరాన్ మినహా మిగతా వైద్య పరీక్షలు మహిళలకే చేస్తారనేది సాధారణ అపోహ. కానీ ఈ హార్మోన్లు మహిళలూ, పురుషుల్లో వేర్వేరు మోతాదుల్లో వెలువడి ఒక క్రమమైన సమతౌల్యతను నిర్వహిస్తుంటాయి. ఆ సమతౌల్యత సక్రమంగానే ఉందా లేక అసమతౌల్యతా ఉందా అని తెలుసుకునేందుకు పురుషులకూ ఈ హార్మోన్ పరీక్షలు చేస్తారు). జన్యుపరమైన పరీక్షలు: సంతానలేమికి ఏవైనా జన్యుపరమైన కారణాలున్నాయా అని తెలుసుకునేందుకు చేసే పరీక్షలివి.ఇమేజింగ్ పరీక్షలు: వీర్యంలో వీర్యకణాల సంఖ్య తగ్గినా లేదా వీర్యకణాలు నార్మల్‌గానే ఉండి పిల్లలు పుట్టకపోయినా డాక్టర్లు ‘స్క్రోటల్ అల్ట్రాసౌండ్ డాప్లర్’ అనే స్కానింగ్ పరీక్ష నిర్వహిస్తారు. ఇది ఏమాత్రం నొప్పి ఉండని సాధారణ పరీక్ష. దీనివల్ల వృషణాల పరిమాణం, వేరికోసిల్ సమస్య ఏదైనా ఉందా అని తెలుస్తాయి.వేరికోసిల్ అంటే...వృషణాల్లోని రక్తనాళాల వాపు. ఇది ఉన్నవారిలో చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళాలు (సిరలు) ఉబ్బిపోయి రక్త ప్రవాహం సరిగా లేకపోవడం. దీనివల్ల వీర్యకణాల సంఖ్య, నాణ్యత తగ్గుతాయి. ఈ సమస్యను ఓ సాధారణ శస్త్రచికిత్సతో చక్కదిద్దాల్సి ఉంటుంది. వేరికోసిల్ ఆపరేషన్ పూర్తయ్యాక దాదాపు 70 శాతం మంది పురుషుల్లో వీర్యకణాల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉంటుంది. మైక్రోస్కోప్ ద్వారా గజ్జల్లో చిన్న కోతతో చేసే ఈ సర్జరీని అనుభవజ్ఞులు నిర్వహిస్తే ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయి. ఈ శస్త్రచికిత్స నిర్వహించిన మూడు నెలల తర్వాత ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు పెరుగుతాయి.వీర్యకణాలే లేని కండిషన్ ‘అజూస్పెర్మియా’ఏవైనా కారణాల వల్ల కొందరి వీర్యంలో అసలు వీర్యకణాలే ఉండకపోవచ్చు. ఈ కండిషన్‌ను అజూస్పెర్మియా అంటారు. ఈ సమస్య ఉంటే గర్భం రాదు. ఎందుకంటే... 60 లక్షల నుంచి కోటికణాలు ఉండాల్సిన చోట ఒక్క కణం కూడా లేకపోతే గర్భం వచ్చే అవకాశం ఉండదు. అయితే ఇందుకు కారణాలను కచ్చితంగా కనుగొంటే... దీన్ని అధిగమించడం సాధ్యమే. వీర్యకణాలు లేవని రిపోర్టు వచ్చినప్పుడు నిర్ధారణ కోసం ఒక నెల తర్వాత మళ్లీ పరీక్షలు చేయించాలి. అప్పుడు కూడా వీర్యకణాలు లేవని రిపోర్ట్ వస్తే అప్పుడు టెస్టిక్యులార్ బయాప్సీ అనే పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఇందులో వృషణాల్లోంచి ఒక చిన్న ముక్కను తీసి పరీక్షిస్తారు. అసలు వృషణాల్లో వీర్యకణాల ఉత్పత్తి జరుగుతుందో లేదో అన్నది ఈ పరీక్షతో తెలుసుకుంటారు.వాస్ రిపేర్ (వాసో వాసాస్టమీ) : కొందరిలో వృషణాల్లో వీర్యకణాల ఉత్పత్తి జరుగుతూ ఉండి, అవి వీర్యరాశిలోకి రాని కండిషన్ కూడా ఉంటుంది. టెస్టిక్యులార్ బయాప్సీలో వృషణాల్లో వీర్యకణాలను ఉత్పత్తి చేసే శక్తి ఉందని తెలిశాక... ఆ వీర్యకణాలను వీర్యరాశి వరకు తీసుకొచ్చే నాళాన్ని (వాస్)ని రిపేర్ చేసి, కలయిక సమయంలో అవి బయటకు వచ్చేలా చేయవచ్చు. అయితే ఇది కాస్త సంక్లిష్టమైన శస్త్రచికిత్స ప్రక్రియ. వృషణాల్లో వీర్యకణాల తయారీ నార్మల్‌గా ఉందని తెలిశాకే ఈ సర్జరీ గురించి ఆలోచించాలి.టెస్ట్‌ట్యూబ్ బేబీ కోసం : వీర్యకణాల తయరీ బాగుండి, మహిళలకు సమస్యలు ఉన్నప్పుడు... డాక్టర్లు వీర్యకణాల్లో నాణ్యమైన వాటిని సేకరించి, వాటిని ల్యాబ్ ఫ్రిజ్‌లో (క్రయో ప్రిజర్వేషన్ పద్ధతిలో) నిల్వచేసి నెలనెలా టెస్ట్‌ట్యూబ్ బేబీ ప్రక్రియ కోసం వీటిని ఉపయోగిస్తారు. సేకరించిన వీర్యకణలను కోల్డ్ స్టోరేజీలో పెట్టుకొని, ఇన్ఫెర్టిలిటీ సెంటర్లో టెస్ట్‌ట్యూబ్ బేబీ ప్రక్రియకు వెళ్తారు. ఇందులో వీర్యకణాన్ని, అండాన్ని టెస్ట్‌ట్యూబ్‌లో ఫలదీకరించి, ఆ పిండాన్ని మహిళ గర్భంలోకి ప్రవేశపెడతారు.చివరగా... ఆరోగ్యకరమైన జీవనశైలి; మంచి సమతులాహారం; పరిశుభ్రమైన వాతావరణంలో నివాసం; శారీరకంగా శ్రమ చేస్తూ దేహానికి తగినంత వ్యాయామం ఇవ్వడంతో పాటు పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం, మానసికంగా, శరీరకంగా ఒత్తిడికి దూరంగా ఉండటం వంటివి చేస్తుంటే... అసలు వైద్యపరీక్షలూ, చికిత్సలేమీ లేకుండానే సంతానాన్ని పొందే అవకాశాలుండవచ్చు. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉన్నప్పటికీ ఇప్పుడున్న వైద్యవిజ్ఞానంతో దాదాపు ప్రతి సమస్యకూ పరిష్కారముందని పురుషులు గుర్తుంచుకోవడం అవసరం. చాలా ముఖ్యం కూడా.- డా. రాఘవేందర్ కొస్గీ, సీనియర్ కన్సల్టెంట్, మైక్రో సర్జికల్ యూరో–యాండ్రాలజిస్ట్నిర్వహణ: యాసిన్ -
సహజమైనదే చేయాలి!
ఒక జెన్ గురువును ఓ కుటుంబం ఇంటికి ఆహ్వానించింది. ఆయన కోసం అద్భుతమైన విందు సిద్ధం చేశారు. సరిగ్గా పన్నెండు గంటలకు గురువు గారు వచ్చారు. ఇంట్లో ఉన్నవారంతా ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత భోజనం వడ్డించారు. ఎంతో శ్రద్ధతో వండిన వంటకాలను గురువుగారు బాగా ఆస్వాదిస్తూ తిన్నారు. చివరగా చేయి కడుక్కునే సమయంలో, ‘అన్నీ శాకాహారమే వండారేం? చిన్న చేప ముక్క అయినా కలిపి ఉంటే బాగుండేది కదా!’ అన్నారు.ఆహ్వానించిన వారు ఆలోచనలో పడ్డారు. ‘మీరు మాంసాహారం తినరని అనుకున్నాం’ అని నమ్రతగా చెప్పారు. గురువు తల పట్టుకున్నారు. ‘మీ ముందస్తు అంచనాల్లో నన్ను పెట్టి బంధించకండి. నాకు ఊపిరి ఆడదు’ అన్నారు. ‘మాకు అర్థం కాలేదు గురుదేవా! ఇతర మనుషులకు, జంతువులకు, చివరికి చెట్టు చేమలకు కూడా హాని చేయకూడదు అని జెన్ సిద్ధాంతం చెప్తోంది కదా?’ అని అడిగారు.‘అవును, దానికి నేను ఇప్పుడు చేప తినాలి... తినకూడదు అనుకోవడానికి సంబంధం ఏమిటి? మనం మనలాగే ఉండాలి. మనకు ఏది సహజమో అదే చేయాలి. అనవసరమైన నటనలు వద్దు. వదులుకోవాలనే ఆలోచన బలంగా ఉంటే, కాలక్రమేణా అనవసరమైన విషయాల నుండి బయట పడవచ్చు. ఇది నా అనుభవం కూడా. బలవంతంగా శాకాహారం మాత్రమే తింటూ లోపల బాధ పడటం కంటే, ఆశ కలిగినప్పుడు మాంసాహారం తినేసి, ఆ క్షణంలో జీవించడమే అసలైన జెన్. వదులు కోవాలనే సంకల్పం దృఢంగా ఉంటే చాలు, మిగిలినది సహజంగా దానికదే జరుగుతుంది’ అన్నారు గురువుగారు.– యామిజాల జగదీశ్ -
సౌరశక్తితో నడిచే విత్తన గుళికల యంత్రం!
సాధారణంగా చిన్నసైజులో ఉండే, తేలికపాటి విత్తనాలను రైతులు పొలంలో వెదజల్లి సాగు చేస్తుంటారు. విత్తనాలు వెద పెట్టిన తర్వాత నీరు పారించినప్పుడు లేదా పెద్ద వర్షం పడినప్పుడు అవి కొట్టుకుపోయి ఒకే చోట పోగుపడటం లేదా మట్టిలో ఎక్కువగా పూడిపోవడం జరుగుతుంటుంది. దీనివల్ల మొలకలు సరిగ్గా రాక దిగుబడి తగ్గుతుంది. ఈ సమస్యకు ఒడిశా, గుజరాత్ యూనివర్సిటీల పరిశోధకులు సులువైన పరిష్కారం కనుగొన్నారు. సౌరశక్తితో నడిచే విత్తనాల పెల్లెటింగ్ (కోటింగ్) యంత్రానికి రూపకల్పన చేశారు. క్యాబేజీ, ఉల్లి, నువ్వులు వంటి అతిచిన్న, తేలిక విత్తనాలతో పంటలు సాగు చేసే రైతులతో పాటు.. వానకు ముందే పొడి దుక్కిలో విత్తనాలు విత్తుకునే ‘ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్)’ పద్ధతిని అనుసరించే రైతులకు ఈ యంత్రం బాగా ఉపయోగపడుతుంది.రెండు యూనివర్సిటీల కృషికోరాపుట్లోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిశా(సీయూఓ), గుజరాత్‌లోని నవ్‌సరి అగ్రికల్చరల్ యూనివర్సిటీ(ఎన్‌ఏయూ) పరిశోధకులు డా. మంజుశ్రీ సింగ్, డా. విపుల్ టి. షిండే, డా. ఆశిష్ సొనావనే, ఎర్. సుభమ్ ధాకడ్ బృందం, విద్యార్థినులు స్వప్నరాణి బిస్వాల్, అభిసిక్త సాహు సహకారంతో ఈ వినూత్న యంత్రాన్ని రూపొందించారు. ఈ యంత్రానికి ఇటీవలే పేటెంట్ మంజూరైందని సీయూఓ వ్యవసాయ విభాగం అధిపతి డా. మంజుశ్రీ సింగ్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. దీనితో తయారు చేసిన విత్తన గుళికలను పొలంలో వెదజల్లి నీరు పెట్టినా కొట్టుకుపోకుండా ఉండి, పొలమంతా సరిగ్గా మొలుస్తాయన్నారు.క్యాబేజీ, ఉల్లి, నువ్వులు.. ఈ యంత్రం 330 వాట్ల సోలార్ ΄్యానెల్, 24 వీ డీసీ మోటార్, 35 ఏహెచ్ బ్యాటరీలు, లిక్విడ్ ట్యాంక్‌తో పనిచేస్తుంది. క్యాబేజీ, ఉల్లి, నువ్వులు వంటి చిన్న విత్తనాలకు అనువైన కోటింగ్ ఇవ్వటానికి దీన్ని రూపొందించారు. చిన్న విత్తనాల చుట్టూ మట్టి, పోషకాలతో లేపనం చేసి సీడ్ పెల్లెట్లు తయారు చేయటం వల్ల విత్తన పరిమాణం, బరువు పెరుగుతాయి.పోషకాల లభ్యత విత్తనానికి లేపనం చేసేటప్పుడే ఎరువులు, సూక్ష్మ పోషకాలు కలిపి కోటింగ్ చెయ్యటం వల్ల విత్తనం మొలకెత్తిన వెంటనే మొక్కకు అవసరమైన బలం లభిస్తుంది. విద్యుత్తు అందుబాటు లేని గ్రామీణ ప్రాంతాల్లో కూడా సోలార్ ఎనర్జీతో ఖర్చులేకుండా పర్యావరణహితంగా ఈ యంత్రాన్ని నడుపుకోవచ్చు.సమాన మొలక శాతంవిత్తన గుళికలు నీటి ఉధృతికి కొట్టుకుపోకుండా సరైన దూరంలో నిలిచి ఉండి సమానంగా మొలకెత్తుతాయి. నాణ్యమైన కోటింగ్ వల్ల విత్తనాలు వృథా కాకుండా పంట దిగుబడి పెరుగుతుంది. సాంప్రదాయ విద్యుత్‌పై ఆధారపడాల్సిన అవసరం లేకపోవటం వల్ల నిర్వహణ ఖర్చు ఉండదు. చిన్న, సన్నకారు రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడానికి, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించటానికి ఈ సోలార్ కోటింగ్ యంత్రం ఎంతగానో తోడ్పడుతుందని డా. మంజుశ్రీ సింగ్ తెలిపారు. ఇతర వివరాలకు అమెను సంప్రదించవచ్చు: జిౌఛీ.్చజటజీఃఛిఠౌ.్చఛి.జీn -
ఆకాశమే హద్దుగా స్కై ఫార్మింగ్!
తక్కువ భూమి, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, మట్టి ద్వారా వ్యాపించే తెగుళ్లు, ముఖ్యంగా అడవి పందుల దాడులు... చిన్న, సన్నకారు రైతులను నిరంతరం వేధించే ప్రధాన సమస్యల్లో ఇవి కొన్ని. వీటన్నింటికీ ఒకే ఒక్క సృజనాత్మక పరిష్కారం చూపారు రత్నం అనే మహిళా రైతు. కేరళలోని త్రిస్సూర్ జిల్లా ముల్లాస్సేరికి చెందిన ఆమె క్యాన్సర్ మహమ్మారినే కాదు సాగులో సవాళ్లనూ జయించారు. అడవిపందులు తదితర వ్యవసాయంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు ‘స్కై ఫార్మింగ్‘ విధానాన్ని రూపొందించారు. కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల దృష్టిని ఆమె కృషి ఆకర్షించింది. నేడు చిన్న రైతులకు, ఇంటిపంటలు, పెరటి/మిద్దె తోటలు పెంచే వారికి గొప్ప వరంగా మారింది.కొబ్బరి ఆకులతో కుండీలురత్నం ప్లాస్టిక్ గ్రో బ్యాగ్‌లకు స్వస్తి చెప్పి పూర్తిగా కుళ్లి మట్టిలో కలిసిపోయే పర్యావరణహిత కుండీలను తయారు చేశారు. స్థానికంగా విరివిగా దొరికే కొబ్బరి ఆకులతో కుండీలను అల్లారు. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ కుండీలకు లోపలి వైపు నాన్–వోవెన్ ఫ్యాబ్రిక్‌ను పరచి, దృఢత్వం కోసం స్వల్పంగా సిమెంట్‌తో లేపనం చేస్తారు. ఈ కుండీలు దాదాపు 5 సంవత్సరాల కాలం మన్నికగా ఉంటాయని ఆమె నిరూపించారు. సాధారణంగా 2–3 గ్రో బ్యాగ్‌లు పెట్టే చిన్న స్థలంలో కొబ్బరి ఆకుల కుండీలను నిలువుగా దృఢమైన స్తంభాలకు వేలాడదీయటం ద్వారా ఏకంగా 12 కుండీలను అమర్చవచ్చని రత్నం చెప్పారు.అడవి పందుల నుంచి రక్షణ నేలపైన కొన్ని అడుగుల ఎత్తులో వేలాడే కుండీల్లో పంటలు పండిస్తున్నారు. దీని వల్ల అడవి పందులు, ఇతర జంతువుల దాడి నుంచి పంటకు 100% రక్షణ లభిస్తోంది. అంతేకాదు, నేల ద్వారా వ్యాపించే అనేక తెగుళ్లు, శిలీంధ్ర వ్యాధులు రాకుండా పంటలు సురక్షితంగా పెరుగుతున్నాయి. రత్నం అభివృద్ధి చేసిన వినూత్న సాగు పద్ధతిలో సొంత ఆర్గానిక్ కంపోస్టు వాడతారు. కోళ్ల పెంట, మేకల ఎరువు, కొబ్బరి పొట్టు, ఎండిన/పచ్చి ఆకులు, ఆవు మూత్రంతో ఇంట్లోనే 45 రోజుల్లో అత్యంత పోషకాలతో కూడిన కంపోస్ట్ తయారు చేస్తారు. ఈ కంపోస్టును కుండీల్లో నింపి, అందులో ఆకుకూరలు, బెండ, వంగ, మిరప, సొర వంటి కూరగాయలతో పాటు కంద, ఔషధ గుణాలున్న అరుదైన బూడిద గుమ్మడి వంటి పంటలను రత్నం సాగు చేస్తున్నారు. వివిధ రకాల పంటలను ఏడాదంతా సాగు చేస్తున్నారు. నిరంతరం దిగుబడి పొందుతూ అదనపు ఆదాయంతో పాటు కుటుంబ పోషకాహార భద్రతను సాధిస్తున్నారు. రైతులకు మార్గదర్శనంరత్నం కేవలం తన పనులకే పరిమితం కాకుండా, ఊళ్లోని ఇతర రైతులకు, పెరటి/మిద్దె తోటల పెంపకం దారులకు తోడ్పాటునందిస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు, నారు అందిస్తూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. స్థలా భావం ఉన్న పట్టణ పరిసర ప్రాంత రైతులకు, టెర్రస్ గార్డెన్ ప్రియులకు, చిన్న రైతులకు ఆమె ఆవిష్కరించిన ‘స్కై ఫార్మింగ్’ ఒక విప్లవాత్మకమైన మార్గదర్శిగా మారిందని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. కేపీ స్మిత ప్రశంసించారు. -
జెన్ జీ క్వీన్
పదమూడేళ్ల వయసులోనే తన ప్రసంగంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది లియోనోర్. ‘బిడ్డా! భవిష్యత్తులో నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుంది’ అని భవిష్యత్ బాధ్యతల గురించి ఆరోజు చెప్పాడు తండ్రి. ఆ రోజు రానే వచ్చింది. 150 ఏళ్ల తరువాత స్పెయిన్ దేశాన్ని పరిపాలించబోయే తొలి మహారాణిగా చరిత్రపుటల్లో నిలవనుంది ఇరవై ఏళ్ల లియోనోర్....స్పెయిన్ రాజు ఫిలిప్, రాణి లెటిజియాల పెద్ద కుమార్తె లియోనోర్ స్పెయిన్ రాజ్యాంగ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని చేసిన ప్రసంగం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అప్పుడు ఆ అమ్మాయి వయసు పదమూడేళ్లు. ప్రసంగిస్తున్నంతసేపు లియోనోర్ ఎక్కడా భయపడినట్లు కనిపించలేదు. చాలా సహజంగా, ఆత్మవిశ్వాసంతో ప్రసంగించింది.ప్రశంసల వెల్లువలియోనోర్ ప్రసంగం ముగిసిన తరువాత తండ్రి ఫిలిప్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నారు. ‘లియోనోర్ మొట్ట మొదటి ప్రసంగం మహా అద్భుతం’ అని సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. పన్నెండేళ్ల వయసులోనే స్పెయిన్‌లోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గౌరవ పురస్కారాలలో ఒకటైన ‘ఆర్డర్ ఆఫ్ గోల్డెన్ ఫ్లీస్’ను అందుకుంది లియోనోర్. ఏడాది తరువాత ప్రత్యేక ప్రసంగం చేసింది. రాణిగా బాధ్యతలు చేపట్టే దిశగా రాకుమార్తె సాగిస్తున్న ప్రయాణంలో ఇది ఒక ప్రతీకాత్మక ఘట్టంగా నిలిచింది.సవాళ్లు ఎదురుచూస్తున్నాయి!ప్రతిష్ఠాత్మకమైన గౌరవ పురస్కారాన్ని కూతురికి అందిస్తూ రాజు ఫిలిప్ ఇలా అన్నారు...‘నువ్వు ఎదుర్కోవలసిన సమస్యలు, సవాళ్లు, భుజాలకెత్తుకోవలసిన బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. అవి చాలా ముఖ్యమైనవి. నీకు కష్టంగా అనిపించవచ్చు. కాని స్పెయిన్‌లో నీ శ్రేయస్సును కోరుకునే ఎంతోమంది నీ వెనుక ఉన్నారనే విషయం మరచిపోవద్దు’బహు భాషల్లో అనర్గళంగా...150 ఏళ్ల తరువాత స్పెయిన్‌ను పరిపాలించబోయే మొదటి రాణిగా చరిత్ర సృష్టించనున్నారు లియోనోర్. త్రివిధ దళాల్లో మూడు సంవత్సరాలు శిక్షణ పొందిన లియోనోర్ స్పెయిన్ సాయుధ దళాలకు మొదటి మహిళా సుప్రీం కమాండర్‌గా బాధ్యతలు చేపడతారు. ఫ్రెంచ్, అరబిక్, ఇంగ్లీష్, స్పానిష్, మాండరిన్లాంటి భాషలు ఎన్నో అనర్గళంగా మాట్లాడగలరు. మాడ్రిడ్‌లోని ఒక యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ చదవనున్నారు.మహిళా సాధికారతపై తీసిన సినిమాల నుంచి పర్యావరణ అంశాల వరకు లియోనోర్‌కు మంచి అవగాహన ఉంది.‘సరైన సమయంలో సరైన అవకాశాలు కల్పించడం ద్వారా యువ ప్రతిభను ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజానికి ఉంది’ అంటారు లియోనోర్. నా రోల్‌మోడల్స్ వారు కాదు...నా రోల్‌మోడల్స్ ప్రసిద్ధ వ్యక్తులు కాదు. ఆకర్షణీయమైన వ్యక్తులు కూడా కాదు. తమలోని నైతిక విలువలు, కష్టపడే తత్వం ద్వారా స్ఫూర్తినిచ్చే వ్యక్తులు, తమ ప్రతిభాసామర్థ్యాలతో లోకానికి కొత్త విషయాలు తెలియజేసే వ్యక్తులు, సమస్యలకు భయపడకుండా ముందుకువెళ్లే ధైర్యవంతులు నా రోల్‌మోడల్స్.– లియోనోర్ -
తన బరువుతోనే అసలు యుద్ధం
కామన్వెల్త్... గ్లాస్గో... ఆదివారం రాత్రి. 31 ఏళ్ల మీరాబాయి చాను మళ్లీ నిరూపించింది. 48 కిలోల బరువు విభాగంలో 190 కిలోలు ఎత్తి హ్యాట్రిక్ గోల్డ్‌మెడల్ సాధించింది. కానీ ఈ బంగారం వెనుక ఒక అదృశ్య పోరాటం ఉంది. అది తానెత్తే బరువులతో కాదు... తన బరువుతో. పన్నెండేళ్లుగా మీరాబాయి 48 కిలోల బరువునే మెయింటైన్ చేస్తోంది. 2014లో గ్లాస్గోలో ఏ బరువుతో కామన్వెల్త్లో మొదటిసారి పాల్గొందో, 2026లో గ్లాస్గోలో కూడా అదే బరువుతో పాల్గొని మూడో బంగారం తెచ్చింది. మహిళలకు వయసు పెరిగే కొద్దీ బరువు పెరగడం సహజం. కానీ మీరా మాత్రం ఒకే బరువు, ఒకే క్రమశిక్షణ. ఆమె ఫిట్నెస్ రహస్యం ఏమిటి?‘వెయిట్లిఫ్టర్లం అనగానే అందరూ మేము విపరీతంగా తినేస్తాం అనుకుంటారు. కానీ అది తప్పు, మేం చాలా తక్కువ తింటాం. బ్రెడ్, పాలు కూడా ముట్టలేము. ప్రతి గ్రాముకూ లెక్క ఉంటుంది’ అంటుంది మీరాబాయి చాను. బరువులెత్తడంలో ప్రపంచ విజేతగా నిలుస్తున్న మీరాబాయి తన బరువు విషయంలో కూడా అంతే విజేత. ‘బరువు తగ్గడం సాధ్యం కావడం లేదు’ అనేవారికి మీరాబాయి 12 ఏళ్లుగా స్థిరంగా మెయిన్‌టెయిన్ చేస్తున్న బరువు తప్పక స్ఫూర్తి కలిగించవచ్చు.ఆమె విజయం సులభం కాదుప్రపంచ వేదికల మీద పతకాలు సాధిస్తున్న మీరాబాయి జీవితం మనకు కనిపించేంత గ్లామరస్ కాదు. ‘ట్రైనింగ్‌లో పిచ్చిగా కష్టపడాలి. లేదంటే ఎప్పటికీ అలాగే ఉండిపోతాం’ అంటుందామె. సాధన ఒకటే కాదు గాయాలూ వెంటాడుతాయి. 2023లో తొడ గాయం. ఈ ఏడాది భుజం నొప్పి. పారిస్ ఒలింపిక్స్‌లో మహిళలకు సహజంగా వచ్చే మెన్స్ట్రువల్ పెయిన్‌తో బాధ పడుతూనే పోటీ రోజు వేదిక ఎక్కింది. గ్లాస్గో పోటీకి కొన్ని రోజుల ముందు శిక్షణలో చిన్న గాయం. అయినా సాధన ఆపలేదు. కోచ్ విజయ్‌శర్మతో ఉదయం 5 గంటల నుండి బరువు ఎత్తే సాంకేతికతను వేలాదిసార్లు ప్రాక్టీస్ చేయడం. ఒక మిల్లీమీటర్ తేడా వచ్చినా పతకం జారిపోతుందని ఆమెకు తెలుసు.చిన్నప్పటి నుంచి కష్టాలుమణిపూర్లోని నోంగ్‌పోక్ కచింగ్ గ్రామం మీరాబాయిది. పేద కుటుంబం. మీరాకు ఇద్దరు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్లు. తండ్రి రోజు కూలీ. తల్లి చిన్న టీ కొట్టు నడిపేది. చదువు 12వ తరగతితో ఆగిపోయింది. కానీ ఆమెకు బలం ఉండేది. ఆరేళ్ల వయసులో అన్నయ్య మోయలేని కట్టెల మోపును తనే మోసేది. ఇంట్లో బియ్యం బస్తాలు, నీళ్ల కుండలు లేవనెత్తేది. ‘ఈ పిల్లకు చేతుల్లో బలం ఉంది’ అని ఒక కోచ్ గుర్తించాడు. పన్నెండేళ్లకే ఇంటి నుండి ముప్పై కిలోమీటర్లు సైకిల్ తొక్కి ఇంఫాల్ స్టేడియానికి ప్రాక్టీసుకు వెళ్లేది. అమ్మ నగలు అమ్మి, అన్నయ్య జీతం నుండి డబ్బులు ఇచ్చి పోటీలకు పంపారు. 2016 రియో ఒలింపిక్స్‌లో విఫలమైనప్పుడు దేశమంతా విమర్శించింది. కానీ, ఆ విమర్శలనే ఇంధనంగా మార్చుకుని 2017లో ప్రపంచ ఛాంపియన్ గా, 2020 టోక్యోలో ఒలింపిక్ రజత విజేతగా నిలిచింది. ఈరోజు ఆమె ధరించే చెవిపోగులు రియోకు ముందు అమ్మ చేయించినవే. ‘అవి నాకు అదృష్టాన్ని తెస్తాయి’ అంటుంది.ముగింపుమీరాబాయి చాను మనకు నేర్పింది ఒకటే. బరువు తగ్గడం అంటే అందం కోసం కాదు. ఆత్మగౌరవం కోసం. ఆరోగ్యం కోసం. లక్ష్యం కోసం. శరీరం బరువు 48 కేజీలైనా ఆమె మనసు 140 కోట్ల భారతీయుల ఆశలను మోస్తోంది.‘నా శరీరం నా ఆలయం. దాన్ని బలంగా ఉంచుకోవడం నా బాధ్యత’ అంటుంది మీరాబాయి చాను. ఈ మాట ఒక్కటి చాలు. మనం కూడా మన శరీరాలయాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి. ఆహార నియమాలుఇక్కడే అసలు పరీక్ష మొదలవుతుంది. 48 కిలోల క్రీడాకారిణిగా ఉండాలంటే ప్రతి గ్రామూ లెక్కే. పండగ భోజనం, జిలేబి ముక్క కూడా బరువు పెంచేస్తుంది. పోటీకి ముందు రోజులలో నీళ్లు కూడా తక్కువ తాగుతుంది. చెమట పట్టించి, సౌనా బాత్‌లో కూర్చుని ఆవిరితో ఒక్కో గ్రాము తగ్గిస్తుంది. మీరాబాయి ఫిట్‌నెస్‌కు 3 స్తంభాలు ఉన్నాయి. ఆహారం, సాధన, మానసిక బలం.1. ఆహారంఉదయం: గోరువెచ్చని నీళ్లు, తేనె, గుడ్డు తెల్లసొన, ఓట్స్, పండ్లు.మధ్యాహ్నం: ఉడికించిన చికెన్ లేదా చేప, గోధుమ రొట్టెలు, పెద్ద సలాడ్.సాయంత్రం: పాలు, బాదం, ప్రోటీన్ పానీయం.రాత్రి: సూప్, ఉడికించిన కూరగాయలు, పప్పు.నూనె, తీపి, వేయించిన పదార్థాలకు దూరం. రోజుకు 4 నుండి 5 లీటర్ల నీళ్లు. ఆకలి వేసినా నీళ్లు తాగి కంట్రోల్ చేస్తుంది.2. సాధనఉదయం: జిమ్‌లో సాంకేతిక సాధన. బరువు ఎత్తడం, పట్టు.మధ్యాహ్నం: కార్డియో, పరుగు, సైక్లింగ్, తాడు దూకడం. సాయంత్రం: యోగా, స్ట్రెచింగ్. గాయాలు రాకుండా శరీరాన్ని సాగదీయడం.ఒక్కరోజు కూడా సెలవు లేదు. ‘నా క్లాస్రూమ్ జిమ్’ అంటుంది.3. మానసిక బలం‘నా కళ్ల ముందు ఎప్పుడూ దేశ జెండా ఉంటుంది’ అంటుంది మీరా. గ్లాస్గోలో మొదటి ప్రయత్నం విఫలమైనా ఆందోళన చెందకుండా, స్మైల్ ఇస్తూ తర్వాతి రౌండ్లో రికార్డు కొట్టడం ఆమె మానసిక బలానికి నిదర్శనం. -
కంగనా రనౌత్ వైరల్ కేన్సర్ స్టోరీ..నిజంగానే అధిక ప్రోటీన్ ప్రమాదకరమా?
50 ఏళ్లు లోపు వారిలో పెరుగుతున్న కేన్సర్ కేసుల గురించి నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ పెద్ద దుమారం రేపి.. వివిధ చర్చలకు దారితీసింది. ఆమె ఆ పోస్ట్‌లో ప్రోటీన్ సప్లిమెంట్ల పట్ల పెరుగుతున్న ప్రజాదరణ గురించి మాట్లాడారు. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్రోటీన్ షేక్‌లకు దూరంగా ఉండాలని అన్నారు. అవి కేన్సర్ వంటి ఆరోగ్య ప్రమాదాలను మరింత పెంచేస్తాయని నొక్కి చెప్పారు. దాంతో ఒక్కసారిగా శరీరానికి అవసరమైన దానికంటే అధిక మోతాదులో ప్రోటీన్ తీసుకుంటే చాలా ప్రమాదకరమా అని చర్చలు మొదలయ్యాయి నెట్టింట. నిజంగా ఇది ఎంతవరకు సమంజసం అంటే..కండరాల మరమ్మత్తు, కణజాల నిర్వహణ, హార్మోన్ల ఉత్పత్తి, రోగనిరోధక పనితీరుకు ప్రోటీన్ ఒక ముఖ్యమైన స్థూల పోషకం. ఇది గుడ్లు, చేపలు, చికెన్, పాల ఉత్పత్తులు, పప్పుధాన్యాలు, బీన్స్, నట్స్, విత్తనాలలో సహజంగా లభిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారికి ప్రోటీన్ చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది కండరాల పునరుద్ధరణకు, నిర్వహణకు తోడ్పడుతుంది. అలాగని అధికంగా తీసుకోవడం మంచిది కాదనే చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఏదైన సమతుల్యతకు ప్రాధాన్యత ఇవ్వమని నొక్కి చెబుతున్నారు.ప్రోటీన్ షేక్‌ల వల్ల కేన్సర్ వస్తుందా అంటే..ప్రోటీన్ షేక్‌ల వల్లనే కేన్సర్ వస్తుందనడానికి ఎలాంటి నిర్ధారిత ఆధారాలు లేవు. దీన్ని ఒక నిర్దిష్ట ఆహారానికి లేదా సప్లిమెంట్‌కు ముడిపెట్టలేమని అన్నారు. అయితే కొన్ని ప్రోటీన్ షేక్‌లు, బార్లు, ఇతర ఫిట్నెస్ ఉత్పత్తులలో అదనపు చక్కెరలు, అధిక కేలరీలు లేదా అధికంగా ప్రాసెస్ చేయబడిన పదార్థాలు ఉంటాయి. అందువల్ల అలాంటివి నిత్యం తీసుకుంటే బరువుని అదుపులో ఉంచుకోవడం కష్టతరమవుతుంది.ఎవరికీ మంచిది కాదంటే..ప్రోటీన్‌ను సరైన మోతాదులో తీసుకున్నప్పుడు ఆరోగ్యవంతులకు సాధారణంగా సురక్షితమే అయినప్పటికీ, కొన్ని వైద్య పరిస్థితులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముందు నుంచే కిడ్నీ వ్యాధి ఉన్న వ్యక్తులు వైద్య పర్యవేక్షణలో ప్రోటీన్ తీసుకోవడాన్ని మార్చుకోవలసి ఉంటుంది. ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారు కూడా తమ ఆహారంలో ముఖ్యమైన మార్పుల గురించి వైద్యులను సంప్రదించాలి.ఎంత ప్రోటీన్ అవసరం?ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ప్రోటీన్ అవసరాలు గణనీయంగా మారుతూ ఉంటాయి. ఈ క్రింది అంశాలు:వయస్సుశరీర బరువుశారీరక శ్రమవ్యాయామ తీవ్రతఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలుగర్భధారణ స్థితిఫిట్నెస్ లక్ష్యాలుతదితరాలు వ్యక్తిగత ప్రోటీన్ అవసరాలను ప్రభావితం చేయగలవు. శారీరకంగా చురుకుగా ఉండే లేదా బలం పెంచే శిక్షణ పొందుతున్న వారికి, నిశ్చల జీవనం గడిపే వ్యక్తి కంటే ఎక్కువ ప్రోటీన్ అవసరం కావొచ్చు. కేవలం ఫిట్నెస్ ట్రెండ్లను అనుసరిస్తూ కాకుండా, నిజమైన పోషకాహార అవసరం ఉన్నప్పుడు మాత్రమే సప్లిమెంట్లను ఉపయోగించాలి అని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.ప్రోటీన్ సప్లిమెంట్ల కంటే ఆహారమే మేలా?చాలా మందికి, ప్రోటీన్ అవసరాలను వైవిధ్యమైన, సమతుల్యమైన ఆహారం ద్వారా పొందొచ్చు. అవేంటంటే..గుడ్లుచేపలుచికెన్పాలు, పెరుగుపనీర్పప్పు, బీన్స్సోయా, టోఫుగింజలు, విత్తనాలుసంపూర్ణ ఆహారాలు ప్రోటీన్‌తో పాటు ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి ఇతర ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. కేవలం ఆహారం ద్వారా ప్రోటీన్ అవసరాలను తీర్చుకోవడంలో ఇబ్బంది ఉన్నవారిలో, కొన్ని పరిస్థితులలో ప్రోటీన్ సప్లిమెంట్లు ఉపయోగపడతాయి. అయితే, అవి ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రత్యామ్నాయంగా కాకుండా, దానికి అనుబంధంగా ఉండాలి.కేన్సర్ ప్రమాదాన్ని పెంచేవి ఏమిటి?కేన్సర్‌కు ఒకే ఒక్క కారణం లేదు. ఈ వ్యాధి రావడానికి అనేక కారకాలు దోహదపడతాయి, వాటిలో కొన్నింటిని మార్చవచ్చు, మరికొన్నింటిని మార్చలేము. ముఖ్యమైన ప్రమాద కారకాలు:పొగాకు, మద్యంఅధిక శరీర బరువుశారీరక శ్రమ లేకపోవడంకుటుంబ చరిత్ర, జన్యువులుపర్యావరణ కారకాలకు గురికావడంజీవనశైలి మార్పులతో కేన్సర్ ప్రమాదానికి చెక్..ప్రతి క్యాన్సర్‌ను నివారించలేనప్పటికీ, ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికలు అనేక కేన్సర్ల ప్రమాదాన్ని తగ్గించి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, తక్కువగా ప్రాసెస్ చేసిన ఇతర ఆహారపదార్థాల తోపాటుసమతుల్య ఆహారం తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. క్రమం తప్పని శారీరక వ్యాయామం, ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవడం, పొగాకుకు దూరంగా ఉండటం, మద్యపానాన్ని పరిమితం చేయడం తోపాటు తప్పనిసరిగా కేన్సర్ స్క్రీనింగ్ వంటి వైద్య పరీక్షలు చేయించుకోవడం తదితరాలతో ఆ కేన్సర్ ప్రమాదాన్ని నివారించొచ్చు. -
జస్ట్ రూ. 5వేలు, మొబైల్ ఫోన్‌తో.. రూ. 50 కోట్ల వ్యాపారం!
వ్యాపారం అనేది వినయోగదారుల అవసరం, నమ్మకం నుంచే పుడతాయని అంటారు పారిశ్రామిక నిపుణులు. ఏ బ్రాండ్ అయినా మొదట్లో చిన్నగా మొదలవుతుంది. అశేష ప్రజాదరణతోనే బ్రాండ్‌గా స్థిరపడుతుందని అంటారు. అచ్చం అలానే చాలామంది ఎదుర్కొనే, పెదవివిప్పని సమస్యను పరిష్కారం చూపుతూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది ఓ నటి. అంతేగాదు కేవలం చాలా తక్కువ మొత్తంతో పెట్టుబడి పెట్టి..కోట్లలో డబ్బులు ఆర్జిస్తూ..ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు గొప్ప వ్యాపార సూత్రాలను చెబుతోందామె. ఆ నటి ఎవరంటే..నటిగా కెరీర్ ప్రారంభించి, వ్యాపారవేత్తగా అవతరించిన పరుల్ గులాటికి తన బిజినెస్ జర్నీ ఎలా మొదలైందో ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. చాలామంది బహిరంగంగా చర్చించడానికి సిగ్గుపడే సమస్యను పరిష్కరించి..అత్యంత గుర్తింపు పొందిన నిష్ హెయిర్ బ్రాండ్ వ్యవస్థాపకురాలిగా మారింది. తాను దీన్ని కేవలం రూ. 5 వేలు పెట్టుబడితో మొదలుపెట్టి..ఇవాళ ఏకంగా రూ. 50 వేల కోట్ల టర్నోవర్ చేసే కంపెనీగా మార్చినట్లు వెల్లడించింది. ఆమె ప్రస్థానం మొదలైందిలా..తాను నటిగా పనిచేస్తూ, టెలివిజన్ వాణిజ్య ప్రకటనలలో నటిస్తున్నప్పుడు వ్యాపారం ప్రారంభించాలనే కోరిక తనలో పుట్టిందని వెల్లడించింది పరుల్. ఆ రోజు నుంచి తనకంటూ వ్యాపారం ఉండాలని నిశ్చయించుకుని..హెయిర్ ఎక్స్ టెన్షన్లపై దృష్టిసారించినట్లు తెలిపింది. ఆమె కేవలం జుట్టు సమస్యలకు పరిష్కారాలను అందరికీ అందుబాటులో, సరసమైన ధరలలో, ఆన్లైన్లో లభించేలా చేయడమే తన లక్ష్యంగా పెట్టుకుంది. అలా ఆమె కేవలం రూ. 5 వేలతో తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించింది. నిజానికి 2017లో 'నిష్ హెయిర్' ప్రారంభమైనప్పుడు, క్రియేటర్ ఎకానమీ ఇంకా శైశవ దశలోనే ఉంది. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ నేటిలా అభివృద్ధి చెందలేదు, అలాగే పరుల్ తన కొత్త బ్రాండ్ కోసం సెలబ్రిటీల ప్రచారాన్ని ఇష్టపడలేదు. బదులుగా ఆమెనే స్వయంగా కంపెనీ ప్రతినిధిగా మారింది. ఇది తాత్కాలికమేనని, ఆ తర్వాత ప్రముఖ తారలనే అంబాసిడర్లుగా నియమించుకోవాల్సిందేనని అనుకుంది. అప్పటి వరకు ఆమె తన ఫోన్లో వీడియోలను రికార్డు చేసి..క్రమం తప్పకుండా కంటెంట్‌ను పోస్ట్ చేయాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయమే ఆ తర్వాత బ్రాండ్ వృద్ధికి అతిపెద్ద కారణాలలో ఒకటిగా నిలిచింది. అలా ఆమె ఉదయం రాత్రి అని భేదం లేకుండా చాలా పోస్టులు చేసినట్లు తెలిపింది. చివరికి తాను నిష్ హెయిర్ మార్కెటింగ్ విభాగంగా మిగిలిపోయానని అంటోంది. వాళ్లకి తాను బడ్జెట్‌ని ఇవ్వనని, కేవలం రీల్స్ మాత్రమే చేస్తానని అన్నారు. ఎలా సక్సెస్ అయ్యిందంటే..ఆమె తరచుగా టెలివిజన్ వాణిజ్య ప్రకటనల ఆడిషన్లకు హాజరయ్యేది, అక్కడ డజన్ల కొద్దీ మోడళ్లు వెయిటింగ్ రూములలో కలిసి కూర్చునేవారు. అక్కడ, ఆమె ఉద్దేశపూర్వకంగా ప్రజల ముందు తన హెయిర్ ఎక్స్‌టెన్షన్‌ను తీసివేసి, వారిలో ఉత్సుకతను, సంభాషణను రేకెత్తించేది. ఆ వ్యూహం ఫలించి..త్వరలోనే, తోటి నటీనటులు, మోడళ్లు ఆ ఉత్పత్తి ఎక్కడ నుంచి వచ్చిందని, తాము కొనుగోలు చేయగలమా అని అడగడం ప్రారంభించారు. అలా మొదటి కస్టమర్‌ని సంపాదించుకుంది. అయితే ఈ ఉత్తత్తులు ప్రారంభ ధరే రూ. 10 వేలు నుంచి రూ. 12 వేలు మధ్య ఉంటుంది. కానీ ఆమె పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికి సహాయపడుతుందన్న ఉద్దేశ్యంతో రూ. 5,000కే అమ్మడానికి అంగీకరించింది. అంతేగాతు తన మొదటి అమ్మకం జరగడానికే నెల పట్టిందని అంటోంది. సోషల్‌మీడియాని ఉపయోగించుకోవడాని కంటే ముందు..పరుల్ వారాంతాల్లో ఫ్లీ మార్కెట్లలో గడుపుతూ, చాలామంది అంతకుముందెన్నడూ చూడని ఒక ఉత్పత్తిని వినియోగదారులకు పరిచయం చేసేది. అంతేగాదు కొనుగోలుదారులను కలసి..ఆ హెయిర్ ఎక్స్టెన్షన్లను ప్రయత్నించమని ప్రోత్సహించేది. ముఖ్యంగా కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకునే ప్రయత్నంపై ఫోకస్ పెట్టేది. ఈ వ్యూహం అమ్మకాలను పెంచేందుకు, అవగాహన కల్పించడానికి ఉపయోగ పడింది. అలా వివిధ నగరాల్లో సుమారు 12 ఫ్లీ మార్కెట్ ఈవెంట్లను పూర్తి చేసే సమయానికి, వ్యాపారం గణనీయమైన సామర్థ్యాన్ని చూపించడం ప్రారంభించింది. ఆ విధంగా పరుల్ అహ్మదాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో లక్ష రూపాయలు సంపాదించిన విషయాన్ని వెల్లడించింది. అంతేగాదు వైరల్ అయిన ప్రతీది అమ్మకాలను తీసుకు రాదు. అందుకు ప్రభావవంతమైన కంటెంట్ కావాలి. వీటన్నింటి తోపాటు అత్యంత ప్రభావవంతమైన కంటెంట్ వ్యూహం, కాబోయే కస్టమర్లకు ఉత్పత్తిని కొన్ని సెకన్లలోనే అర్థమయ్యేలా చేయడం అని చెబుతోంది. బ్రాండ్ వాల్యూ పెరిగే కొద్దీ..మార్కెటింగ్ చేసే విధానం మారాలి..బ్రాండ్ పెరిగేకొద్దీ, పరుల్ దానిని మార్కెట్ చేయడానికి అసాధారణమైన మార్గాలను అన్వేషించారు. అందుకోసం నిష్ హెయిర్ సరఫరా చేసిన నిజమైన మానవ జుట్టుతో తయారు చేసిన దుస్తులు ధరించి ఆమె కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. అంతేగాదు ప్రతి వ్యవస్థాపకుడు తనకు సాధ్యమైన చోటల్లా తన ఉత్పత్తిని ప్రోత్సహించేలా నమ్మకాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. చివరగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మిమ్మల్ని పూర్తిగా నమ్మండి, అలాగే మీ ఆలోచనను పదిమందితో పంచుకోండి అని చెబుతున్నారు. అంతేగాదు తన విజయం అనేది నిధుల సమీకరణతోనో లేదా ప్రకటనల బడ్జెట్లతోనో ప్రారంభం కాదు, నిజమైన సమస్యను పరిష్కరించడంతోనూ, ఉత్పత్తిని నమ్మడంతోనూ, అలాగే రోజు కెమెరా ముందు నిలబడటానికి సిద్ధంగా ఉండటంతో మొదలైందని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది పరుల్. View this post on Instagram A post shared by Parul Gulati 🤍 (@gulati06) (చదవండి: ప్లాస్టిక్ కవర్లలో పట్టు చీరలను పెడుతున్నారా..? జానపద గాయని శారీ టిప్స్..) -
కార్మికుల బిడ్డలు.. అంతరిక్షంలో దిట్టలు!
గ్రామీణ నేపథ్యం.. సామాన్య కుటుంబాలు.. కానీ వారి లక్ష్యాలు మాత్రం ఆకాశాన్ని దాటాయి. దేశ అంతరిక్ష రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన స్కైరూట్ ఏరోస్పేస్ ‘విక్రమ్–1’ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు కీలక పాత్ర పోషించారు. ఆర్టీసీ కార్మికుడి కుమారుడైన నార్కట్‌పల్లికి చెందిన ప్రజ్ఞాపురం వంశీ క్యాడ్ ఇంజనీర్‌గా వ్యవహరించగా.. సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుడి బిడ్డ, సూర్యాపేట జిల్లా చింతలపాలెంకు చెందిన గంధం లక్ష్మీనాథ్ ఎలక్ట్రికల్ కేబుల్ హర్నెస్ డిజైన్, ఇంటిగ్రేషన్ ఇంజనీర్‌గా తమ బాధ్యతలు నిర్వర్తించారు. డీఆర్డీవోలో విశేష అనుభవం గడించి, ప్రస్తుతం స్కైరూట్‌లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో పాలుపంచుకున్న ఈ యువ శాస్త్రవేత్తల స్ఫూర్తిదాయక ప్రయాణంపై ప్రత్యేక కథనం.నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన ప్రజ్ఞాపురం రవి వెంకట్‌పటేల్, సృజన దంపతుల కుమారుడు వంశీ అంతరిక్ష రంగంలో అరుదైన ఘనత సాధించారు. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన ‘విక్రమ్–1’ ప్రైవేట్ ఆర్బిటాయ్ రాకెట్ తయారీ బృందంలో వంశీ క్యాడ్ ఇంజనీర్‌గా తన వంతు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సుమారు నాలుగేళ్ల పాటు ఎంతో శ్రమించి, వివిధ హోదాల్లో పని చేసి సాధించిన ఈ చరిత్రాత్మక ఘటనలో నిపుణులైన బృందంతో పాటు వంశీ కూడా భాగస్వామి కావడం స్థానికంగా గర్వకారణంగా మారింది. వంశీ తండ్రి రవి వెంకట్‌పటేల్ ఆర్టీసీలో కండక్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించి, స్క్వాడ్ ఇన్చార్జ్గా ఉద్యోగ విరమణ పొందారు. వంశీ ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యతో పాటు ఇంటర్మీడియట్ విద్యను నల్లగొండలోనే ప్రైవేట్ కళాశాలలో పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ (2014) పూర్తి చేశారు.డీఆర్డీవో నుంచి స్కైరూట్ వరకు..బీటెక్ పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో)లో ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా దాదాపు 6 సంవత్సరాల పాటు ఆయన సేవలందించారు. ద్రవ చోదక వ్యవస్థ (లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్) విభాగంలో ఇంటిగ్రేషన్, డిజైన్ పనుల్లో సంపాదించిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని.. 2025 జనవరి 2న హైదరాబాద్‌కు చెందిన ‘సై్కరూట్ ఏరోస్పేస్’ ప్రైవేట్ సంస్థలో క్యాడ్ ఇంజనీర్‌గా చేరారు. ఆ అనుభవంతోనే ‘విక్రమ్–1’ రాకెట్ తయారీలో క్యాడ్ ఇంజనీర్‌గా పూర్తి బాధ్యతలు నిర్వర్తించి, రాకెట్ విజయవంతం కావడంలో తన వంతు పాత్ర పోషించారు. భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టుల్లోనూ సేవలందించే అవకాశం లభించిందని ఆయన తెలిపారు.ఇంటిగ్రేషన్ టెస్ట్ ఇంజనీర్‌గా లక్ష్మీనాథ్మేళ్లచెరువు : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలకేంద్రానికి చెందిన గంధం శ్రీను, శ్రీవాణి దంపతుల కుమారుడు లక్ష్మీనాథ్ ‘విక్రమ్–1’ ప్రైవేట్ ఆర్బిటాయ్ రాకెట్ తయారీ బృందంలో కీలకంగా పని చేశారు. ఎలక్ట్రికల్ కేబుల్ హెర్నెస్ డిజైన్, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టు ఇంజనీర్‌గా పనిచేసి యువతకు ఆదర్శంగా నిలిచాడు. వ్యవసాయ నేపథ్య కుటుంబానికి చెందిన లక్ష్మీనాథ్.. తండ్రి స్థానిక ఓ సిమెంట్ పరిశ్రమలో మిల్లర్‌గా, తల్లి ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తూ లక్ష్మీనాథ్‌ను చదివించారు. టెన్త్ వరకు స్థానిక సీతా పబ్లిక్ స్కూల్లో చదివిన లక్ష్మీనాథ్.. ఇంటర్, బీటెక్ (2023)హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. బీటెక్ తర్వాత డీఆర్డీఓలో ఇంటిగ్రేషన్ టెస్ట్ ఇంజనీర్‌గా ఏడాదిపాటు పనిచేశాడు.స్కైరూట్ ఏరోస్పేస్లో సంవత్సర కాలంగా పనిచేస్తూ ఎలక్ట్రికల్ కేబుల్ హర్నెస్ డిజైన్, ఇంటిగ్రేషన్ అండ్ టెస్ట్ ఇంజనీర్‌గా పనిచేస్తూ విక్రమ్–1 (మిషన్ ఆగమన్)లో కీలకంగా బాధ్యతలు నిర్వర్తించి ప్రయోగం విజయవంతం కావడానికి కృషిచేశారు. భవిష్యత్‌లో భారత అంతరిక్ష రంగ అభివృద్ధికి మరింత సేవలందిస్తూ మారుమూల గ్రామీణ ప్రాంతాల యువతకు స్ఫూర్తిగా నిలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు లక్ష్మీనాథ్ పేర్కొన్నారు. -
పిల్లలకు కాదు... పాఠం పెద్దలకే!
ఒక కాలానికి సరిపోయిన ఆలోచనలు, నేడు ప్రశ్నించకుండా సత్యాలుగా మిగిలిపోతున్నాయి. ఉదాహరణకు, పిల్లవాడు ఒక సమస్యకు కొత్త పరిష్కారం చెబితే, ‘మేం ఇన్నేళ్లుగా ఇలాగే చేస్తున్నాం’ లేదా ‘అందరూ ఇలానే చేస్తున్నారు’ అనే ఒక్క వాక్యంతో ఆ ఆలోచనను పక్కన పెట్టేస్తాం. ఆ పరిష్కారం సరైందా, కాదా అని పరిశీలించే ముందే, అది కొత్తదనే కారణంతో తిరస్కరిస్తాం. అలా ఓడిపోతు న్నది కొత్త ఆలోచన కాదు; గెలుస్తున్నది పాత అలవాటు.అందుకే ప్రపంచం మారుతున్నా, మన సమాధానాలు మాత్రం అలాగే మిగిలిపోతున్నాయి. ఫలితంగా అసలు ప్రశ్న పిల్లలు ఏమి నేర్చుకోవాలనేది కాదు; పెద్దలు ముందుగా ఏమి వదిలే యాలనేదే!‘పిల్లలు నేర్చుకున్నదాన్ని వదలాలి (ఆన్లెర్న్), కొత్తగా ఆలోచించాలి’– ఈ మధ్య విద్యా చర్చల్లో బాగా వినిపిస్తున్న మాట. ఇక్కడ ‘వదలడం’ అంటే నేర్చుకున్న జ్ఞానాన్ని మర్చిపోవడం కాదు; కాలం చెల్లిన ఆలోచనా విధానాలను ప్రశ్నిస్తూ కొత్త దృక్ప థాన్ని స్వీకరించడం. కానీ ఈ ఆలోచనను మరో కోణంలో చూడాల్సిన అవసరం ఉంది.పిల్లల దగ్గర వదిలేయాల్సినంత పాత నమ్మకాలు ఏము న్నాయి? వాళ్లు మొదటిసారి ప్రపంచాన్ని చూస్తున్నారు; పాత కళ్లద్దాలు మాత్రం మన పెద్దలవే. వాటిని వాళ్లకు అందించింది మనమే. కాబట్టి ఇప్పుడు ప్రశ్న– ‘పిల్లలు ఏం నేర్చుకోవాలి?’ అని కాదు; ‘మనం ముందుగా ఏ పాత నమ్మకాలను వదిలించు కోవాలి?’ అనేది. ఒకప్పుడు ఇవి విజయానికి మార్గదర్శకాలుగా ఉండి ఉండొచ్చు. కానీ వాటిని శాశ్వత సత్యాలుగా మార్చింది మనమే.ఇది ఎందుకు అంత కష్టం?ఒక నమ్మకాన్ని వదలడం అంటే, దాన్ని పట్టుకుని జీవించిన మన సొంత గతాన్నే ప్రశ్నించడం. ‘నేను ఇలా పెరిగాను, నేను బాగానే ఉన్నాను కదా’ అనే భావన మనలో బలంగా ఉంటుంది. ఆ నమ్మకాన్ని వదిలేస్తే, మన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, రాజీలు అన్నీ వృథా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇది దురుద్దేశ్యం కాదు; తెలిసిన దానిపై ఉండే భద్రతా భావం. తల్లిదండ్రులు, ప్రతి ఉపాధ్యాయుడు ఒకప్పుడు ఒక వ్యవస్థ గుండా వచ్చినవారే. వాళ్ల మీద కూడా ఎవరో ఒక ముద్ర వేశారు. ఇప్పుడు వాళ్లు చేస్తున్నది– తమకు వేసిన అదే ముద్రను, తెలియకుండానే, తర్వాతి తరానికి బదిలీ చేస్తున్నారు. ప్రతి కాలం తన సమస్యలకు తన సమాధానాలు సృష్టించుకుంటుంది. కలంతో పాటూ సమాధా నాలూ మారాలి.ప్రపంచ ఆర్థిక వేదిక ప్రకారం, 2030 నాటికి ఉద్యోగ నైపుణ్యాల్లో 39% మారిపోతాయి. ఈ రోజు నేర్పే సగం నైపుణ్యాలు అప్పటికి పనికిరాకపోవచ్చు. అందుకోసం సిలబస్ మార్చడం సరిపోదు; దాన్ని బోధించే వారి ఆలోచనా విధానం కూడా మారాలి. వ్యవస్థ ఎంత మారినా, దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చేది మను షులే– ఇంట్లో తల్లిదండ్రులు, తరగతి గదిలో ఉపాధ్యాయులు. వ్యవస్థ ఒక వైపు మారుతుంటే, పెద్దల ఆలోచనలు అక్కడే నిలిచి పోతే, ఆ మార్పు అసంపూర్ణంగా మిగిలిపోతుంది. కాబట్టి పిల్లల భవిష్యత్తును మార్చేది కొత్త సిలబస్ మాత్రమే కాదు; పెద్దల మనస్తత్వంలో వచ్చే చిన్న మార్పు కూడా. పిల్లలు రేపటి తరాన్ని నిర్మించాలంటే, ఈరోజు పెద్దలు నిన్నటి కళ్లద్దాలను వదిలించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.– వంగవోలు రవి, ఉపాధ్యాయుడు -
ప్లాస్టిక్ కవర్లలో పట్టు చీరలను పెడుతున్నారా..?
పట్టు చీర అనేది భారతీయ కుటుంబాల్లో అదొక శారీ మాత్రమే కాదు..ఎన్నో జ్ఞాపకాల మూట. అది మా అమ్మది, నానమ్మది.. అంటూ వాళ్లతో ముడివేసిన బంధాన్ని గుర్తుచేసేది. వారసత్వంగా భద్రపర్చుకునే గొప్ప జ్ఞాపకం. కుటుంబ చరిత్ర నింపుకున్న చీర. అలాంటి ఏళ్ల నాటి చీరలను రక్షించడం కోసం ఉపయోగించే పద్ధతులే వాటిని పాడైపోయేలా చేస్తున్నాయని అంటున్నారు ప్రముఖ జానపద గాయని, సాంస్కృతిక చిహ్నం మాలినీ అవస్థి. తాను 40 ఏళ్లు పైబడినా..తన సొంత పట్టు చీరలను ఎలా చెక్కుచెదరకుండా ఉంచారో వెల్లడించారు. వారసత్వ పట్టుచీరలను కాపాడుకోవడం అనేది ఏమి కష్టమైనది, ఖరీదైనది కాదు అంటూ పట్టుచీరలను సురక్షితంగా ఉంచుకునే చిట్కాలు పంచుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్లాస్టిక్ కవర్లలో ఉంచొద్దు..ప్లాస్టిక్ కవర్లలో చీరలు ఉంచితో ఏదోరకంగా గాలి వెళ్లిపోతుంది తద్వారా తేమ చీరల్లోకి చేరిపోతుంది. కానీ వాటిలో ఉన్న సమస్య ఏంటంటే ఒకసారి తేమ ప్రవేశించినా..బయటకు వెళ్లడానికి ఛాన్స్ ఉండదు. అది ఘనీభవించి బట్టపై మచ్చలుగా పేరుకుపోతుంది. అది పట్టు లేదా జరీని ఆక్సీకరణం చేసి తిరిగి మార్చలేని విధంగా పాడు చేస్తుంది. పట్టు చీరలను భద్రపర్చడానికి మస్లిన్ వంటి సహజమైన వస్త్రాలతో, గాలి ఆడే గార్మెంట్ బ్యాగులలో భద్రపర్చాలి. చీరలను దుమ్ము, కీటకాల నుంచి కాపాడుతూనే గాలి ప్రసరణకు అనుమతివ్వాలి. అందువల్ల ప్లాస్టిక్ సంచులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. అవి తేమను బంధించి త్వరితగతిన పాడేయ్యేందుకు కారణమువుతుంది.నాఫ్తలీన్ బిళ్లలు వద్దు..నాఫ్తలీన్ బిళ్లలు కీటకాల నుంచి రక్షిస్తాయని భావించి ఆ చీరల మధ్యలో ఉంచుతారు. అది కొంతవరకు నిజమే అయినా..పట్టు లేదా జరీకి ఆ నాఫ్తలీన్ బిళ్లలు నేరుగా తగలగానే అది వస్త్రంతో చర్య జరిపి..సున్నితమైన దారాల రంగు మారి దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల వేపాకులు లేదా లవంగాలు ఉంచితే చాలని. అవి సురక్షితంగా ఉంచడమే గాక ప్రభావవంతమైన ప్రత్యామ్నాయం అని అంటున్నారు.వస్త్రంలో చుట్టాల్సిందే..గాయని మాలినీ అవస్థి ఉపయోగించే పద్ధతి సాంప్రదాయబద్ధమైనది, వస్త్ర నిపుణులచే పూర్తిగా ఆమోదించబడింది. ప్రతి చీరను నిల్వచేసే ముందు విడివిడిగా ఒక శుభ్రమైన పత్తి వస్త్రంలో చుట్టండి. చీరలను చుట్టేటప్పుడు, దుమ్ము లేదా తేమ లోపలికి రాకుండా గాలి ప్రసరించేలా పత్తి లేదా మస్లిన్‌తో చేసిన మృదువైన వస్త్రాన్ని ఉపయోగించండి. ప్లాస్టిక్‌లా కాకుండా, గాలి ప్రసరించే వస్త్రం చీరను దుమ్ము, కీటకాల నుండి రక్షిస్తూ తాజాగా ఉంచుతుంది.అలాగే మడతలను క్రమం తప్పకుండా మార్చండి. ఒక చీర నెలలు లేదా సంవత్సరాల పాటు ఒకే స్థితిలో మడతపెట్టి ఉంటే..బలహీనపడుతుంది. అందువల్ల ప్రతి రెండు నెలలకు ఒకసారి చీరలను మళ్లీ మడతపెట్టడం మంచిదని అంటున్నారామె. అలాగే పట్టుచీరలను చెక్కపెట్టెలు లేదా ట్రంకులలో నిల్వ చేసే సంప్రదాయ పద్ధతే మంచిదని అంటున్నారు. పెట్టె అడుగ భాగంలో శుభ్రమైన పత్తి వస్త్రాన్ని పరచాలి..ఆ వస్త్రంపై చీరలను ఉంచి ఆ పై నుంచి మరో వస్త్రం కప్పాలి.అలాగే చీరలను చీకటి అల్మారాల్లోనే భద్రపర్చాలి. చల్లని పొడి ప్రదేశాన్నే ఎంచుకోవాలివీటి తోపాటు భద్రపర్చిన చీరలు గాలికి తగలడం కూడా అవసరం. అందువల్ల పట్టు చీరలను అప్పుడప్పుడు స్వచ్ఛమైన గాలి తగిలేలా ఉంచడం వల్ల మేలు జరుగుతుంది. ప్రతి కొన్ని నెలలకొకసారి వాటిని బయటకు తీసి, మెల్లగా గాల్లో విప్పండి, కొన్ని గంటలపాటు నీడలో ఆరబెట్టి తిరిగి పెట్టే ముందు వేర్వేరు వరుసలో మడతపెట్టండి. ఇలా చేస్తే ఎన్నాళ్లైనా పట్టు చీరలు రంగుతో సహా పాడవ్వకుండా సురక్షితంగా ఉంటాయి. ఇవన్నీ మన నానమ్మల కాలం నాటి చిట్కాలేనని అంటున్నారు మాలినీ అవస్థి. View this post on Instagram A post shared by HAUTERRFLY | A Fork Media Group Co. (@hauterrfly) (చదవండి: స్లిమ్‌గా అర్జున్ రణతుంగ..! ఊబకాయులకు ఇదే సరైనదా?) -
ఈ 5 ప్రదేశాలకు మీరు ఎప్పటికీ వెళ్లలేరు!
ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలు గూగుల్‌లో కనిపిస్తాయి, డాక్యుమెంటరీల్లో ఉంటాయి. కానీ రియల్ లైఫ్‌లో ఈ ప్రదేశాలకు డైరక్టుగా వెళ్లడం దాదాపు అసాధ్యం. కొన్ని ప్రదేశాలను వాటి నేచర్‌ని ప్రొటెక్ట్ చేయడానికి, కొన్ని తెగల గిరిజనుల మనుగడను కాపాడేందుకు, మరికొన్ని ప్రాంతాను మిలిటరీ రహస్యాల వల్ల సాధారణ ప్రజలకు దూరంగా ఉంచారు. మరి ఆ మిస్టరీ ప్రదేశాలు ఇవే..నార్త్ సెంటినల్ ఐలాండ్భారతదేశంలో ఉన్న అండమాన్ ద్వీప సమూహంలో ఈ చిన్న ద్వీపంలోనికి బయటి ప్రపంచం నుంచి ఎవరూ వెళ్లేందుకు అనుమతి లేదు. ఇక్కడ సెంటినెలీజ్ అనే ప్రపంచంతో సంబంధం లేని ప్రజలు ఉంటారు. వాళ్లను అంటువ్యాధుల నుంచి దూరంగా ఉంచేందుకు భారత ప్రభుత్వం ఈ ఐలాండ్ చుట్టూ స్ట్రిక్ట్‌గా నో–ఎంట్రీ జోన్ మెయింటైన్ చేస్తోంది.ఏరియా 51ఏలియెన్స్ ఉన్నారా? సీక్రెట్ వెపన్స్ తయారు చేస్తున్నారా? ఇలాంటి ఎన్నో పుకార్లకు కేరాఫ్ చిరునామాగా మారింది అమెరికాలోని ఏరియా 51 అనే ప్రాంతం. నిజం ఏంటి అనే విషయం కాస్త పక్కన పెడితేం ఇది అమెరికా మిలిటరీకి చెందిన హై–సెక్యూరిటీ జోన్ లేదా బేస్. సాధారణ ప్రజలు ఇక్కడికి వెళ్లడం పూర్తిగా నిషేధం.స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్దీనినే ప్రపంచ బ్యాకప్ లాకర్ అని కూడా అంటారు. ఈ ప్రదేశంలో లక్షలాది మొక్కల విత్తనాలను సంరక్షిస్తారు. భవిష్యత్తులో ఏదైనా తెలియని విపత్తు వచ్చినా కూడా వ్యవసాయం మళ్లీ ప్రారంభించేందుకు ఇది ప్రపంచానికి ఇన్సూరెన్స్ పాలసీలా పని చేస్తుంది. అందుకే సాధారణ ప్రజలను ఇక్కడికి వెళ్లేందుకు అనుమతించరు.లాస్కాక్స్17,000 ఏళ్ల నాటి పురాతనమైన పెయింటింగ్స్ ఉన్న ఈ గుహల్లోకి ఒకప్పుడు సందర్శకులు వెళ్లేవారు. అయితే కాల క్రమేన మనుషుల శరీరం నుంచి వెలువడే ఉష్ణోగ్రత, బయటి ప్రపంచం నుంచి వచ్చే కాలుష్యం వల్ల పెయింటింగ్స్‌కు డ్యామేజ్ అవ్వడం మొదలైంది.దీంతో కంప్లీట్‌గా పర్యాటకులను బ్యాన్ చేసేశారు.వాటికన్ సీక్రెట్ ఆర్కైవ్స్శతాబ్దాల నాటి పురాతనమైన, అత్యంత రహస్యాత్మక డాక్యుమెంట్స్, రాజపత్రాలు, చారిత్రాత్మక రికార్డులు అన్నీ కూడా ఇక్కడే దాచి పెడతారు. ప్రత్యేక అనుమతి తీసుకుని వెళ్లే పరిశోధకులకు త΄్పా ఇతరులకు ఎవరికీ ఇక్కడికి వెళ్లేందుకు పర్మిషన్ లభించదు.నిజానికి ప్రతీ అందమైన ప్రదేశం మనం విజిట్ చేయడానికి కాదు. కొన్ని ప్రదేశాలకు రహస్యమే అందం. ఇలా సీక్రెట్‌గా ఉండటం వల్లే వాటి ప్రత్యేకత అలాగే కంటిన్యూ అవుతుంది. ట్రావెల్ అంటే చెక్‌లిస్ట్ పూర్తి చేయడం కాదుం వెళ్లిన ప్రతీ ప్రాంతాన్ని, అక్కడి ప్రజలను గౌరవించడం. అలాగే వెళ్లకూడని ప్రదేశాలను అలా ఏకాంతంగా వదిలేయడం కూడా వాటిని గౌరవించడమే అవుతుంది. -
ఆలస్యంగా పెళ్లి.. సంతానంపై ఎలాంటి ప్రభావం?
అమ్మ అనే పిలుపు కోసం మహిళలు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఆధునిక జీవనశైలి వల్ల నేడు సంతానలేమి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు సంతానలేమి సమస్య ఏడు శాతం ఉండేదని నేడు రెట్టింపు అయినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. గుంటూరులో ప్రత్యేక ఆస్పత్రులు, ఐవీఎఫ్ సెంటర్స్ చాలా వచ్చాయి.పిల్లలు పుట్టకపోవటానికి కారణాలు... పెళ్ళైన ఏడాది పాటు ఎలాంటి గర్భనిరోధక పద్ధతులు పాటించకుండా దాంపత్య జీవితాన్ని కొనసాగించినా గర్భం రాకపోవటాన్ని వంధత్వం(ఇన్ఫెర్టిలిటీ) అంటారు. ఆడవాళ్లలో సంతాన లేమికి కారణా ల్లో ఆలస్యంగా అంటే 35 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకోవటం. ఆలస్యంగా రజస్వల అవ్వటం. అండం విడుదల అవ్వకపోవటం, హోర్మోన్ల సమస్య, గర్భసంచి, కడుపులో ఇన్ఫెక్షన్లు, గర్భసంచి ట్యూబ్ లు మూసుకుపోవటం, పీసీఓడీ, జునైటైల్ టీబీ, బీపీ, షుగర్, జీవనశైలి, అధిక మానసిక ఒత్తిడి, అధిక బరువు, అండం విడుదల జరిగే సమయంలో దాంపత్యంలో పాల్గొనకపోవటం, దాంపత్యం కోసం మూఢనమ్మకాలు పెట్టుకుని ఆచరించటం, సెక్స్‌పై అవగాహన లేకపోవటం తదితర కారణాలు ఉన్నాయి. మగవారిలో సంతానలేమికి కారణాలు.... మగవాళ్లలో దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్ సంతానలేమికి దారితీస్తాయి. స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్, కొన్ని రకాల మందులు వాడటం వలన కూడా సంతానలేని సమస్య ఉత్పన్నమవుతుంది. సుఖవ్యాధులు, టీబీ, బీర్జాలకు గాయాలు అవ్వటం, దెబ్బలు తగలటం, అంగం సైజుల్లో తేడాలు, పని ఒత్తిడి వలన సంతానలేమి సమస్యలు వస్తున్నాయి. కంప్యూటర్ను 6 నుంచి 8 గంటలపాటు వినియోగించటం, రాత్రివేళల్లో ఎక్కవగా సెల్‌ఫోన్ మాట్లాడటం, వీర్యకణాలు తక్కువగా ఉండటం, రాత్రివేళలో నిద్రపోకుండా ఉండటం, హార్మోన్ సమస్యలు, గర్భనిరోధక సాధనాలు ఎక్కువగా వాడటం వల్ల సమస్యలు వస్తున్నాయి. ఆధునిక చికిత్సలతో సంతానం.... సంతానం కోసం చింతించేవారికి నేడు అత్యాధునిక వైద్య పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. సంతానం కోసం ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) విధానంలో భార్య అండాన్ని, భర్త శుక్రకణాల్ని ఇంక్యుబేటర్‌లో పెట్టి రెండు నుంచి ఐదు రోజుల్లో పిండం తయారైయ్యాక ఇంజెక్షన్ రూపంలో భార్య గర్భంలో పిండాన్ని పెడతారు. భర్త శుక్రకణాల సంఖ్య తక్కవగా ఉంటే ఇక్సీ విధానం ద్వారా, సంఖ్య జీరో అయితే టీసా పద్ధతి ద్వారా బీర్జాల్లో నుంచి సిరంజి ద్వారా వీర్యకణాలు తీసి ఫలదీకరణం చెందించి పిండాన్ని తయారు చేసి గర్భంలో పెడతారు. ఇంట్రాయుటైన్ ఇన్సెమినేషన్(ఐయూఐ) విధానంలో భర్త శుక్రకణాలు తీసి ఇంజెక్షన్ రూపంలో భార్య గర్భంలో ప్రవేశపెడతారు. భార్య గర్భసంచి పిండం మోసే స్థితిలో లేకపోయినా, ఆమె ఆరోగ్యరీత్యా గర్భం రాకూడదని వైద్యులు నిర్ధారిస్తే సరోగసి ద్వారా(అద్దెగర్భం) సంతానం పొందవచ్చు. ఆరోగ్య కరమైన సంతానం కోసం..ఆరోగ్యకరమైన సంతానం పుట్టేందుకు 23 నుంచి 28 ఏళ్ల వయస్సు చాలా అనుకూలం. గర్భం దాల్చేందుకు ముందుగానే ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవటం చాలా మంచిది. గర్భం దాలి్చన 13 వారాలలోపు న్యూకల్ ట్రాన్స్ ల్యూసెన్సీ (ఎన్‌టి) స్కాన్ చేయించాలి. డబుల్మార్కర్ టెస్ట్, క్రోమోజోన్ ఎనాలసిస్ టెస్ట్, షుగర్ టెస్ట్, రక్తహీనత టెస్ట్ చేయించాలి. 18 వారాల నుండి ఐరన్‌మాత్రలు, ఫోలిక్‌యాసిడ్, క్యాల్షియం మాత్రలు, మూడు, ఐదు నెలల్లో టీటీ ఇంజెక్షన్లు చేయించాలి. – డాక్టర్ శ్రీహర్ష రావూరి, ఐవీఎఫ్ స్పెషలిస్ట్, గుంటూరు అందుబాటులో ఆధునిక వైద్యంనూతన వైద్య విధానంలో సంతానలేమి సమస్యతో వచ్చిన వారు ఆస్పత్రిలో వైద్యం పొందిన పిదప సంతానం పొందుతున్నారు. గుంటూరు నగరంలో అత్యాధునిక చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఐవీఎప్ చికిత్సల్లో ప్రస్తుతం రొ»ొటిక్ ఇక్సీ విధానం, నానో రోబోస్ సాంకేతిక పరిజ్ఞానం కూడా పలు దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా కచ్చితత్వం ఎక్కువగా ఉంది. –డాక్టర్ బూసిరెడ్డి దీప్తిరెడ్డి, స్త్రీ,ప్రసూతి, సంతాన సాఫల్య వైద్య నిపుణురాలు, గుంటూరు ఐవీఎఫ్‌తో త్వరగా సంతానం సంతానలేమి సమస్య ఆందోళన కలిగిస్తుంది. జిల్లాలో 300 మంది గైనకాలజిస్టులు ఉన్నారు. సంతాన సాఫల్య కేంద్రాలు 11 ఉన్నాయి. ఒక్కో వైద్యుడి వద్దకు ప్రతి రోజు ఒకరు సంతాన లేమి చికిత్స కోసం సంప్రదిస్తున్నారు. వివాహమైన ఏడాదిలోపు గర్భం దాల్చకపోతే వెంటనే ఐవీఎఫ్ నిపుణులను సంప్రదించటం ద్వారా త్వరగా సంతానం పొందే అవకాశం ఉంది. – డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, సీనియర్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్, గుంటూరు. -
స్లిమ్‌గా అర్జున్ రణతుంగ..! ఊబకాయులకు ఇదే సరైనదా?
సెలబ్రిటీలు, ప్రముఖులు, సాధారణ వ్యక్తుల అసాధారణ వెయిట్‌లాస్ జర్నీలు గురించి విన్నాం. కానీ ఊబకాయంతో బాధపడే వారు..డైట్లు, వర్కౌట్లు చేసినా..అంత సులభంగా బరువు తగ్గక ఇబ్బంది పడుతుండే వారికి ఉపయుక్తమైన ఓ క్రికెటర్ వెయిట్‌లాస్ స్టోరీ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఇది నిజంగానే ఊబకాయులకు అద్భుతమైన వరమా? అనే చర్చలు మొదలయ్యాయి. ఇంతకీ ఎవరీ వెయిట్‌లాస్ జర్నీ అంటే..ఆయనే శ్రీలంక మాజీ క్రికెట్ కెప్టెన్ అర్జున్ రణతుంగా. కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్, కొలంబోలో జరిగిన తొలి కొలంబో సాహిత్య ఉత్సవానికి హాజరైన సందర్భంగా, రణతుంగతో కలిసి దిగిన ఒక ఫోటోను నెట్టింట షేర్ చేయడతో..ఒక్కసారిగా ఆ క్రికెటర్ స్మార్ట్ లుక్‌పై సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. శశిథరూర్ ఆ ఫోటోని షేర్ చేస్తూ సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. ఆయన అద్భుతమైన మార్పు కారణంగా, ప్రపంచ కప్ గెలిచిన ఈ మాజీ కెప్టెన్‌ను చాలా మంది క్రికెట్ అభిమానులు గుర్తించలేకపోవచ్చు. ప్రస్తుతం 62 ఏళ్ల వయసున్న రణతుంగ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారని, అప్పటి నుంచి ఆయన చాలా స్లిమ్‌గా మారారని వెల్లడించారు. అంతేగాదు క్రికెట్ దిగ్గజం రణతుంగా క్రికెట్ ఆడే రోజుల్లో మూడు ఓవర్లకే అలిసిపోయేవాడినని, కానీ ఇప్పుడు ఛారిటీ మ్యాచ్‌లలో మూడు గంటల పాటు సునాయాసంగా బ్యాటింగ్ చేయగలనని సరదా అన్నారు. ఇక్కడ రణతుంగా శరీరాకృతి ఊబకాయంతో బాధపడుతున్న వారికి బేరియాట్రిక్ సర్జరీ, దాని ఆరోగ్య ప్రయోజనాలపై దృష్టిసారించేలా చేసింది.బేరియాట్రిక్ సర్జరీ అంటే?బేరియాట్రిక్ సర్జరీ అనేది శాశ్వత బరువు తగ్గడానికి సహాయపడే వెయిట్‌లాస్ సర్జరీల్లో ఒకటి. ఈ ఆపరేషన్‌లో కడుపు పరిమాణాన్ని తగ్గించడం, అలాగే చిన్న ప్రేగు పోషకాలను గ్రహించే విధానాన్ని మార్చేలా.. జీర్ణవ్యవస్థను సవరిస్తాయి.ఈ విధానం సాధారణంగా తీవ్రమైన ఊబకాయం ఉన్నవారికి, ముఖ్యంగా ఆహారం, వ్యాయామం, మందులు వంటి జీవనశైలి మార్పులు శాశ్వత ఫలితాలను ఇవ్వడంలో విఫలమైనప్పుడు సిఫార్సు చేయబడుతుంది.బేరియాట్రిక్ సర్జరీ రకాలు:గ్యాస్ట్రిక్ స్లీవ్ (స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ): కడుపులోని పెద్ద భాగాన్ని తొలగించి, ఆహార తీసుకోవడాన్ని పరిమితం చేస్తుంది.గ్యాస్ట్రిక్ బైపాస్ (రౌక్స్-ఎన్-వై గ్యాస్ట్రిక్ బైపాస్): ఒక చిన్న కడుపు సంచిని సృష్టించి, చిన్న ప్రేగులోని కొంత భాగాన్ని దారి మళ్లిస్తుంది.వ్యక్తిగత ఆరోగ్య అవసరాలను బట్టి మినీ గ్యాస్ట్రిక్ బైపాస్, ఇతర జీవక్రియ విధానాలను కూడా పరిగణించవచ్చు.బరువు తగ్గడంకి మించి ఆరోగ్య ప్రయోజనాలు..బేరియాట్రిక్ సర్జరీ అనేది సౌందర్య విధానం కాదని వైద్యులు నొక్కి చెబుతున్నారు. ఊబకాయ సంబంధిత సమస్యలను తగ్గించే మెరుగైన ఆరోగ్య విధానం. బారియాట్రిక్ సర్జరీ ఈ క్రింది విషయాలలో సహాయపడుతుందని పరిశోధనలో తేలిందిటైప్ 2 మధుమేహాన్ని మెరుగుపరచడం లేదా పూర్తిగా నయం చేయడంఅధిక రక్తపోటును తగ్గించడంగుండె జబ్బులు, పక్షవాతం ప్రమాదాన్ని తగ్గించడంస్లీప్ అప్నియాను మెరుగుపరచడంమోకాళ్లు, తుంటిపై ఒత్తిడిని తగ్గించడం ద్వారా కీళ్ల నొప్పులను తగ్గించడంఫ్యాటీ లివర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంచలనశీలత, ఓర్పు మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరచడంశస్త్రచికిత్స తర్వాత రణతుంగ గంటల తరబడి బ్యాటింగ్ చేయగలగడం అనేది, రోగులు తరచుగా నివేదించే అత్యంత గుర్తించదగిన ప్రయోజనాలలో ఒకటైన - పెరిగిన శారీరక ఓర్పు, మెరుగైన ఫిట్నెస్ను ప్రతిబింబిస్తుంది.ఎవరికి మంచిదంటే..నిపుణుల ప్రకారం, బారియాట్రిక్ సర్జరీ సాధారణంగా ఈ క్రింది లక్షణాలు ఉన్న పెద్దలకు సిఫార్సు చేస్తారు.బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 40 లేదా అంతకంటే ఎక్కువBMI 35 లేదా అంతకంటే ఎక్కువ ఉండి, మధుమేహం, అధిక రక్తపోటు లేదా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వంటి ఊబకాయ సంబంధిత సమస్యలు ఉన్నవారుశస్త్రచికిత్సకు ముందు, ఈ ప్రక్రియ సరైనదేనా అని నిర్ధారించడానికి రోగులకు వివరణాత్మక వైద్య, పోషకాహార మానసిక అంచనాలు నిర్వహిస్తారు.ముమ్మాటికీ షార్ట్‌కట్ కాదుబారియాట్రిక్ సర్జరీని ఎప్పుడూ తక్షణ పరిష్కారంగా చూడకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక విజయం అనేది శాశ్వత జీవనశైలి మార్పులపై ఆధారపడి ఉంటుంది. ఇందులో భాగంగా సమతుల్యమైన, అధిక ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం, వైద్యులు సూచించిన విటమిన్, మినరల్ సప్లిమెంట్లు తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, జీవితాంతం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం వంటివి ఉంటాయి.ఈ మార్పులు చేయకపోతే, రోగులు తిరిగి బరువు పెరగవచ్చు, పోషకాహార లోపాలు ఏర్పడవచ్చు. ఇక్కడ రణతుంగ రూపాంతరం ఊబకాయం అనేది కేవలం రూపానికి సంబంధించిన విషయం కాదని, అది ఒక దీర్ఘకాలిక వైద్య సమస్య అని వెల్లడైంది. అలాంటప్పుడు సమర్థవంతమైన చికిత్స అనేది ఆరోగ్యం, జీవననాణ్యతను గణనీయంగా మెరుపరుస్తుందని ఈ క్రికెటర్ వెయిట్‌లాస్ జర్నీ తెలుపుతోంది. అలాగే ఇది ఊబకాయాన్ని చక్కగా నిర్వహిస్తూనే ఆరోగ్యంగా ఉండే చికిత్స విధానాలపై అవగాహన కల్పిస్తోందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. -
మాన్సూన్ ట్రిప్‌లో ఈ 5 తప్పులు అస్సలు చేయకండి
వర్షాకాలం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పచ్చని పర్వతాలు, జలపాతాలు, మిస్ట్, చల్లని వాతావరణమే కదా. ఇలాంటి సీజన్ లో ట్రావెల్ చేయడం ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. కానీ కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల ఆ ఫన్ ట్రిప్ కాస్తా స్ట్రెస్ ట్రిప్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ జర్నీ స్టార్ట్ చేసే ముందు ఈ 5 కామన్ ట్రావెల్ మిస్టేక్స్ ఎవాయిడ్ చేస్తే మీ ట్రిప్ ఇంకా స్మూత్‌గా ఉంటుంది.బయల్దేరే ముందు వాతావరణం చెక్ చేయడంలొకేషన్ ఫోటోలు చూసి ఎగ్జైట్ అయిపోయి డైరెక్ట్‌గా జర్నీ స్టార్ట్ చేయకండి. ముందు ఒక్కసారి అక్కడి వాతావరణం, దారి మధ్యలో పరిస్థితులు చెక్ చేసుకోండి. భారీ వర్షాలు, ల్యాండ్‌స్లైడ్, రోడ్ బ్లాక్ లాంటి పరిస్థితులు ఎదురవ్వవచ్చు. ఒక 5 నిమిషాలు చెక్ చేస్తే అనవసరమైన ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు.తప్పుడు షూస్ వేసుకుని వెళ్లకండిమాన్సూన్ లో స్టైల్ కంటే కంఫర్ట్ ముఖ్యం. ఫ్లాట్ స్లిప్పర్స్ లేదా స్మూత్ సోల్ ఉన్న షూస్ వేసుకుని స్లిప్పరీ రోడ్‌పై వెళ్లి ఇబ్బంది పడకండి. మంచి గ్రిప్ ఉన్న షూస్ లేదా ట్రెక్కింగ్ శాండిల్స్ వేసుకుంటే నడవడం కాస్త ఈజీగా ఉంటుంది. దీంతో పాటు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.ఫోన్, కెమెరా సేఫ్టీ ఇష్యూట్రావెల్ అంటే ఫోటోలు తప్పనిసరి. కానీ వర్షంలో ఫోన్, కెమెరా, పవర్ బ్యాంక్ తడిసిపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే వాటర్‌ప్రూఫ్ పౌచ్ లేదా జిప్ కవర్ తీసుకెళ్లండి. బ్యాకప్‌లా రెయిన్ కవర్ ఉంటే మరీ మంచిది. చిన్న ప్రికాషన్ పెద్ద డ్యామేజ్‌ని సేవ్ చేస్తుంది.ఎక్స్ట్రా డ్రెస్ తీసుకెళ్లకపోవడంమాన్సూన్ లో ఎప్పుడు వర్షం పడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కసారి ఫుల్‌గా తడిస్తే జర్నీ మొత్తం చికాకుగా మారిపోతుంది. అందుకే ఒక ఎక్స్ట్రా టీ షర్ట్, సాక్స్, టవల్, రెయిన్ జాకెట్ బ్యాగ్‌లో తప్పకుండా పెట్టుకోండి. ఇవి చిన్నగా కనిపించినా బాగా యూజ్ అవుతాయి.ఎక్కువగా ప్లాన్ చేయకండిఒక రోజులో 5–6 ప్రదేశాలు కవర్ చేయాలని చాలా మంది ఓవర్ ప్లాన్ చేస్తుంటారు. ఇది ఒక కామన్ ట్రావెల్ మిస్టేక్. వర్షాకాంలో ట్రాఫిక్ స్లో అవ్వచ్చు, రోడ్డుపై జామ్ అవ్వొచ్చు. అందుకే కాస్త బఫర్ టైమ్ మెయింటైన్ చేస్తూ రిలాక్స్‌గా జర్నీ ప్లాన్ చేసుకోండి. గుర్తుంచుకోండి.. ట్రావెల్ అంటే చెక్‌లిస్ట్ పూర్తి చేయడం కాదు. -
'44 ఏళ్లకే జీవితం మొదలవుతుంది': ఓప్రా సలహాపై త్రిష రిప్లై ఇదే..!
వృద్ధాప్య, స్వీయ అభివృద్ధికి సంబంధించిన పోస్ట్‌ని త్రిషా కృష్ణన్ షేర్ చేశారు. ఆ పోస్ట్‌లో మీడియా ఐకాన్ ఓప్రా విన్ఫ్రే వృద్ధాప్యం, స్వీయ ఆవిష్కరణ, వ్యక్తిగత ఎదుగుదలపై ఆమె చర్చిస్తున్న వీడియో క్లిప్‌ని రీట్వీట్ చేస్తూ..ఇలా రాశారు. ఆ వీడియోలో క్లిప్‌లో ఓప్రా కీకీ పామర్ పాడ్‌కాస్ట్ 'బేబీ, దిస్ ఈజ్ కీకీ పామర్'కనిపిస్తారు. అక్కడ ఆమె, జీవితంలో తాను ఏ దశకు తిరిగి వెళ్లాలనుకుంటున్నారో తన అభిప్రాయాలను పంచుకుంటుంది. మళ్లీ 30 ఏళ్ల వయస్సులో ఉండాలనుకుంటున్నారా అని ప్రశ్నించగా, ఓప్రా ఇలా సమాధానమిచ్చారు. లేదు తాను తిరిగి 30 ఏళ్ల వయస్సులో ఉండాలనుకోవడం లేదన్నారు. ఎందుకంటే ఇతరులను మెప్పించడానికి ప్రయత్నించడం మానేసే విధంగా మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. తాను ఇప్పుడు మార్గదర్శకత్వం వహించిన 30 ఏళ్ల ప్రారంభంలో ఉన్న కొందరు అమ్మాయిలు ఇంతకంటే ముందే దీనిలోకి వచ్చారు, కానీ తన విషయానికొస్తే 44 ఏళ్ల వయసులో తెలుసుకున్నా. ఫలితంగా తన ఎదుగుదలను తానే స్వయంగా చూడగలిగానంటోంది. ఎందుకంటే ఇతరుల కోసం, ఇతరుల్లా కనిపించడం కోసం గానీ పనిచేయడం..పూర్తి పట్టుదలతో ఒక లక్ష్యంతో తన కోసం తను జీవించడం నేర్చుకున్నా.. అంటూ తన సంభాషణను ముగిస్తుంది ఓప్రా . ఈ వీడియో క్లిప్‌ని షేర్ చేస్తూ.."ఆమెన్" అనే ఒక్క పదంతో రీపోస్ట్ చేశారు. గత మే4నే ఈ బ్యూటీ 43వ పుట్టినరోజు జరుపుకుంది. అది జరిగిన రెండు నెలలకే ఈ పోస్ట్ రావడంతో సర్వత్రా ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది. కాగా, దక్షిణాది సినిమా రంగంలో అత్యంత ప్రసిద్ధి చెందిన తారలలో ఒకరైన త్రిష, రెండు దశాబ్దాలకు పైగా అగ్ర కథనాయికగా కొనసాగారు. అనేక విజయవంతమైన తెలుగు, తమిళ చిత్రాలలో మెరిశారు, అలాగే అత్యంత ప్రజాదరణ పొందిన కథనాయికగా వెలుగొందుతున్నారు.(చదవండి: ఫ్లైట్ జర్నీలో ఫేస్ షీట్‌మాస్క్‌తో త్రిష..ఇది చర్మానికి మంచిదేనా?) -
ఈ తొమ్మిది ప్రదేశాల్లో ప్రతి ఒక్క క్షణం ఓ అద్భుతం!
వర్షం అంటే కేవలం నేలంతా తడవడం మాత్రమే కాదు.. కొన్ని ప్రదేశాలు తమ అందాన్ని చూపించే కాలం కూడా. దక్షిణ భారతదేశంలో ఉన్న కొన్ని పర్వతాలు, పట్టణాలు వర్షాకాలం వస్తే చాలు మరింత అందంగా మారిపోతాయి. ప్రతీ మలుపు ఒక కొత్త చిత్రంలా అనిపిస్తుంది.తెలుగు రాష్ట్రాలకు చుట్టుపక్కనే ఉంటే కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఉన్న పర్వత ప్రాంతాల్లో మాన్సూన్ ట్రిప్ అనేది ఒక మరపురాని అనుభూతిగా మిగిలిపోతుంది. ఈ సీజన్ లో ఈ హిల్ టౌన్స్‌లో గాలి, మబ్బులు, పచ్చని అడవులు కలిసి ఒక మధురమైన అనుభవాన్ని అందిస్తాయి. ఈ తొమ్మిది ప్రదేశాల్లో ప్రతి ఒక్క ప్రాంతం చిరునవ్వుతో ప్రయాణికులను ఆహ్వానిస్తుంది.మబ్బుల్లో మధురమైన కూర్గ్, చిక్మగళూరుకర్ణాటకలో ఉన్న కూర్గ్, చిక్‌మగళూరు వర్షాకాలంలో కాఫీ సుగంధంతో మరింతగా అలరిస్తాయి. ప్రతీ ఉదయం మబ్బులు కాఫీ తోటల మధ్య నిలిచి ఉన్నట్టు కనిపిస్తుంది. చిన్న చిన్న జలధారలు, అడవి మార్గాలు, కొండల మధ్య పడిన చినుకులు అన్నీ కలిసి ఒక సినిమా ఫ్రేమ్‌లా ఉంటాయి.ఇక్కడ నడిచే ప్రతీ అడుగు ప్రకృతితో మాట్లాడినట్టు ఉంటుంది. కాఫీ ఎస్టేట్స్ మధ్య వాకింగ్, చిన్న చిన్న జలపాతాల వద్ద సమయం గడపడం, స్థానిక గ్రామాల్లో ప్రజల జీవితాన్ని దగ్గరి నుంచి చూడటం అనేది ఈ ప్రయాణంలో సహజంగా కలిగే అనుభవాలుగా మిగిలిపోతాయి.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి బెంగుళూరు, కోచి, కోయంబత్తూరు, మదురై, విశాఖపట్టణం లాంటి నగరాలకు ఫ్లైట్స్, ట్రైన్లు, బస్సులు ఈజీగా దొరుకుతాయి. అక్కడి నుంచి కొండ రహాదారుల్లో ప్రయాణం మొదలవుతుంది.ప్లెయిన్స్ నుంచి మెల్లగా కొండల మధ్యకి చేరేటప్పుడు గాలి మారడం, టెంపరేచర్ తగ్గడం, మబ్బులు దగ్గరవడం అనేది ప్రయాణంలో ఒక అందమైన మార్పుగా కనిపిస్తుంది.విజయవాడ నుంచి విశాఖపట్టణం, బెంగళూరు, కోయంబత్తూరు, కోచికి చేరుకుని అక్కడి నుంచి ఈ హిల్ టౌన్స్కి చేరుకోవచ్చు. జర్నీలో ప్రతీ క్షణం ప్రకృతి తన కొత్త రూపాన్ని చూపిస్తుంది.ఎక్కడ ఉండాలి?ఈ మౌంటెయిన్ టౌన్స్‌లో బోటీక్ హోమ్ స్టేలు, ప్లాంటేషన్ కాటేజీలు, హెరిటేజ్ బంగ్లాలు, నేచర్ రిసార్ట్స్, సింపుల్ హోటల్స్ అందుబాటులో ఉంటాయి. కిటికీ తెరవగానే టీ గార్డెన్స్ కనిపించే రూమ్ అయినా, కాఫీ ఎస్టేట్స్ మధ్య వెలిసిన కాటేజీలు అయినా, ఫారెస్ట్ ఎడ్జ్‌లో ఉన్న స్టేలు అయినా అకామిడేషన్ కూడా ప్రయాణంలో ఒక భాగంగా అనిపిస్తుంది.ఏం తినాలి?కూర్గ్‌లో పాండీ కర్రీ ఇష్టపడేవారికి ఫేమస్. కానీ వెజిటేరియన్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి. చిక్‌మగళూరు ఫ్రెష్ కాఫీని ఒక్కసారి రుచి చూస్తే ఇక ఎప్పుడూ మర్చిపోలేరు. ఊటీ హోమ్మేడ్ చాకొలేట్స్, మున్నార్ టీ, వాయనాడ్ స్పైసెస్, అరకు ఆర్గానిక్ కాఫీ, కొడైకనాల్ హోమ్మేడ్ చాకొలేట్స్, లోకల్ బేకరీ ఐటమ్స్ ఇలా ప్రతీ ఐటమ్ ఆ ప్రదేశానికి బ్రాండ్ ఎంబాసెడర్లా పని చేస్తుంది.నీలగిరి అందాలు..తమిళనాడులో నీలగిరి పర్వతాల మధ్య ఉండే ఊటీ, కూనూరు ఎప్పుడూ అందంగా ఉంటాయి. కానీ వర్షాకాలంలో ఈ అందాలు రెట్టింపు అవుతాయి. టీ గార్డెన్స్‌పై పడిన మబ్బులు, టాయ్ ట్రెయిన్ శబ్దం, యూకలిప్టస్ వాసన కలిసి ఒక నాస్టాల్జిక్ ఎట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాయి. ప్రతీ రోడ్డు మలుపు దగ్గర కొత్త లోయ కనిపిస్తుంది. చిన్న రైల్వే స్టేషన్స్, కాలనియల్ బిల్డింగ్స్, టీ ప్లాంటేషన్స్ మధ్య గడిపే సమయం ప్రయాణాన్ని స్లోగా ఆస్వాదించే అవకాశం ఇస్తుంది.ఆంధ్రప్రదేశ్ పర్వత శోభఆంధ్రప్రదేశ్లో ఉన్న అరకులోయ వర్షాకాలంలో ఒక హరిత వస్త్రాన్ని ధరించినట్టు గ్రీనరీతో నిండి ఉంటుంది. విశాఖపట్టణం నుంచి మొదలయ్యే ట్రైన్ జర్నీలో టన్నెల్స్, బ్రిడ్జిలు, లోయలు కలిసి ఒక మరపురాని అనుభూతిని అందిస్తాయి. కాఫీ ప్లాంటేషన్స్, ట్రైబల్ కల్చర్ ఇవన్నీ అరకుకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇస్తాయి.ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్కొడైకనాల్ని చాలా మంది ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని కూడా పిలుస్తారు. మాన్సూన్ లో ఆ పేరుకి తగ్గట్టే ఉంటుంది ఇక్కడి బ్యూటి. పైన్ ఫారెస్ట్ మధ్య చినుకులు పడుతుంటే, లేక్ పక్కనే గాలి మెల్లిగా వీస్తుంటే, సమయం కొంచెం మెల్లిగా సాగినట్టు, కొన్ని సార్లు క్షణం పాటు ఆగినట్టు అనిపిస్తుంది. మార్నింగ్ మిస్ట్‌లో వాకింగ్, స్మాల్ కేఫేలో హాట్ కాఫీ తాగడం, సాయంత్రం లేక్ రిఫ్లెక్షన్స్ చూడటంం ఈ అనుభవాలు ప్రయాణాన్ని మరింతగా గుర్తుండేలా చేస్తాయి.సందర్శనీయ ప్రదేశాలుఈ తొమ్మిది హిల్ టౌన్స్‌లో ప్రతీ ప్రదేశం ఒక డిఫరెంట్ అనుభవాన్ని అందిస్తుంది. కూర్గ్ కాఫీ ఎస్టేట్స్, చిక్‌మగళూరు ముల్లాయనగిరి పరిసర ప్రాంతాలు, ఊటీ బొటానికల్ గార్డెన్, కూనూరు టీ తోటలు, మున్నార్ టీ ప్లాంటేషన్స్, వాయనాడ్ అడవులు, అరకు కాఫీ గార్డెన్స్, మేఘమలై రోలింగ్ హిల్స్, యెర్కాడ్ లేక్, కొడైకనాల్ పైన్ ఫారెస్ట్ అన్నీ కలిసి సౌత్ ఇండియా బ్యూటీని ప్రపంచానికి మరింత అందంగా చూపిస్తాయి. ప్రతీ ప్రదేశంలో ప్రకృతి ఒక కొత్త రంగును చూపిస్తుంది.ఏం చూడాలి?మార్నింగ్ మిస్ట్‌లో లోయలను, వర్షం తరువాత మెరుసే జలపాతాలు, టీ, కాఫీ ప్లాంటేషన్స్, చిన్న రైల్వే స్టేషన్స్, ట్రైబల్ కల్చర్, లేక్స్, అడవిలో సాగే ప్రయాణం, సూరస్తమయంలో రంగు రంగులతో సందడి చేసే వ్యూ పాయింట్స్ ఈ అనుభవాలు ఒక్కో హిల్ స్టేషన్ లో ఒక్కోలా ఉంటాయి.లోకల్ మార్కెట్లలో నడవడం, ప్లాంటేషన్ విజిట్స్, సీనిక్ ట్రైన్ జర్నీస్, బోటింగ్, ఫోటోగ్రఫీ, విలేజ్ వాక్స్ లాంటివి ఈ ప్రయాణంలో సహజంగా కనిపిస్తాయి.కేరళ పచ్చదనంకేరళ అందాలు చూడాలి అనుకుంటే మున్నార్ లేదా వయనాడ్ వెళ్తే చాలు. ఇందులో ఏ ప్రాంతానికి వెళ్లినా కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని ఎందుకు అంటారో అర్థం అవుతుంది. మున్నార్ టీ గార్డెన్స్ వర్షంలో పచ్చని వెల్వెట్ బ్లాంకెట్లా కనిపిస్తాయి. వాయనాడ్ అడవుల్లో మబ్బులు దిగివచ్చి చెట్ల మధ్య ఆటలాడుతున్నట్టు ఉంటాయి.స్థానికుల జీవితం ఇక్కడ ప్రకృతి రిథమ్‌కి తగ్గట్టు ఉంటుంది. ప్లాంటేషన్ గ్రామాలు, చిన్న మార్కెట్లు, స్పైస్ ప్లాంటేషన్స్, వర్షంలో తడిసిన రహదారులు అన్నీ కలిసి ఒక ప్రశాంతమైన అనుభూతిని అందిస్తాయి.మేఘాల మధ్య మేఘమలై, యెర్కాడ్తమిళనాడులో మేఘమలై పేరు వినగానే మబ్బులు గుర్తొస్తాయి. పేరుకి తగ్గట్టే మబ్బులు ఇక్కడ కొండలకు దగ్గరగా చేరుకుంటాయి. యెర్కాడ్‌లో లేక్ పక్కనే వర్షం చినుకుల శబ్దం వినడం, నారింజ తోటల మధ్య నడవడం, ప్రశాంతతను ఆస్వాదించడం ఒక మెమొరబుల్ ఫీలింగ్‌ను కలిగిస్తుంది. టూరిస్టుల రష్ కన్నా నేచర్ సౌండ్స్ ఎక్కువగా వినిపించే ఈ ప్రదేశాలు స్లో ట్రావెల్ ఇష్టపడేవాళ్లకు బాగా నచ్చుతాయి.ఆసక్తికరమైన విషయాలు - వర్షాకాలంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ హిల్ టౌన్స్ అత్యంత అందంగా ఉంటాయి.- ఈ డెస్టినేషన్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలోనే ఉన్నాయి.- వర్షాకాలంలో ఈ ప్రదేశాలకు వెళ్తే చల్లని గాలితో పాటు, మబ్బులతో నిండిన ఆకాశం, పచ్చని ప్రకృతిని ఎంజాయ్ చేయవచ్చు.- ఇందులో మీరు ఏ ప్రదేశానికి వెళ్లాలి అనుకున్నా 5 రోజుల ట్రిప్ ప్లాన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు టీ లేదా కాఫీ ప్లాంటేషన్స్ మధ్యలో స్లో ట్రావెల్‌ను ఆస్వాదించవచ్చు.యాత్ర, బడ్జెట్ వివరాలుహైదరాబాద్ నుంచి 5 రోజుల మాన్సూన్ హిల్ స్టేషన్ ట్రిప్ బడ్జెట్ రేంజ్ అనేది మీ ట్రావెల్ స్టైల్‌ను బట్టి మారుతుంది. బడ్జెట్ ట్రావెల్‌ను సుమారు రూ.18,000 నుంచి రూ.25,000 మధ్య ప్లాన్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ కంఫర్ట్ ట్రిప్ కాస్ట్ సుమారు రూ.28,000 నుంచి రూ.40,000 మధ్యలో ఉంటుంది. ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్ కోసం రూ.45,000 నుంచి రూ.70,000 వరకు బడ్జెట్ అవవచ్చు.స్టే విషయానికి వస్తే ప్రతీ రాత్రికి రూ.1,500 నుంచి రూ.8,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఫుడ్ కోసం రోజుకు సుమారు రూ.600 నుంచి రూ.1,500 మధ్య ఖర్చు అవుతుంది.హైదరాబాద్ నుంచి ట్రాన్స్‌పోర్టేషన్ అనేది డెస్టినేషన్ ను బట్టి రూ.4,000 నుంచి రూ.15,000 మధ్య మారుతుంది. విజయవాడ నుంచి ట్రావెల్ కాస్ట్ కొంచెం తక్కువ లేదా దాదాపు సమానంగా ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రదేశాల్లో ప్లాంటేషన్ స్టే ΄్యాకేజీలు, హెరిటేజ్ స్టేస్, సీనిక్ ట్రైన్ ఎక్స్‌పీరియెన్స్ అన్నీ కలిపి ప్రయాణాన్ని మరింత స్పెషల్‌గా మార్చేస్తాయి.గమనిక: ఈ ట్రావెల్ గైడ్, బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు తాజా సమాచారం, స్థానిక పరిస్థితుల గురించి తెలుసుకుని, వెరిఫై చేసుకుని ప్లాన్ చేసుకోగలరు.– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
చిద్రూపమే జగత్తు!
దీర్ఘతముడనే ఒక ముని అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అతడికి ఇద్దరు కొడుకులు. తండ్రికి సపర్యలు చేయడం వారి దినచర్య. కాలం తీరి కొన్నాళ్ళకు దీర్ఘతముడు మరణించాడు. విధిగా నిర్వర్తించాల్సిన ఉత్తరకర్మలన్నిటినీ పెద్దకొడుకు భక్తితో నిర్వర్తించాడు. అంతా సజావుగా జరిగాక, తమ్ముడి కోసం చూడగా, అతడు ఆశ్రమంలో కనిపించలేదు. అడవిలో వెదికాడు. ఒక పెద్ద చెట్టు మొదట్లో కూర్చుని శోకిస్తూ కనిపించాడు తమ్ముడు. అన్న హృదయం ద్రవించింది. తమ్ముడి దగ్గరికి వెళ్ళి, ఆప్యాయంగా తల నిమిరి ఇలా చెప్పాడు:‘పూర్వం వైరోచనుడనే ఒక రాజు ఉండేవాడు. దీర్ఘకాలం వసుధను పాలించాడు. ప్రపంచంలో లభించే అన్ని సుఖాలను తృప్తి తీరా అనుభవించాడు. ఒకనాడు రాజప్రాసాదపు మేడపై నిలబడి ఆలోచిస్తూ ‘ముల్లోకాలలో అద్భుత కారణంబును, సకల భోగాలకు ఆలవాలము అయిన ఈ భూమిలో, సౌఖ్యాలు అస్థిరములైనవే! అనుభవించే పదార్థాన్నే మళ్ళీ మళ్ళీ అనుభవించి, దినదినమూ భ్రాంతుడనై తిరుగుతూ ఉండడమేగా ఇక్కడ ఎన్నాళ్ళైనా! రాత్రి, పగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఆగేవి కావు. చెప్పిందే చెప్పడం అన్నట్లుగా కాలం చర్వితచర్వణం. ఈ సుఖాలన్నీ ప్రాజ్ఞుల దృష్టిలో అల్పాలే’ అని తలచి బాల్యంలో తన తండ్రి చెప్పిన మాటలను మననం చేసుకున్నాడు.తే. కణగి యెల్ల చోట గలది చిద్రూపంబుఅదియ నీవు నేను నఖిలములునుఇదియ నిశ్చితార్థ మిది దప్ప మఱి లేదుసర్వశాస్త్రసార సంగ్రహంబు.‘ఈ విశ్వంలోని ప్రతి అణువు చిత్తమనే చేతనతో నిండి ఉంది. చేతనతో నిండినదైన చిద్రూపమే నీవు, నేను, అది, ఇది, ఇలలో అన్నీ. అదే నిశ్చయం. అది తప్ప మరొకటి లేదు. సర్వ విజ్ఞాన, వేదాంత శాస్త్రములు బోధించేది కూడా అదే! ఆ సత్యాన్ని గ్రహించిన చిత్తానికి చింత ఉండదు. అది తెలుసు కుని నీవు కూడా స్వస్థత చెందిన అంతరంగాన్ని పొందు’ అని అన్న చెప్పిన మాటలను ఆలకించాడు తమ్ముడు. శోకోపశమనం పొందాడు.– భట్టు వెంకటరావు -
నిజం ఒక్కటే!
ఓ ప్రకృతి ప్రేమికుడు తన అన్వేషణలో భాగంగా తుంగభద్రా నది వద్ద ఉన్న ఒక ఊరికి వెళ్ళాడు. అతడు నదికి ఉత్తర దిక్కున నిలబడి ఉన్నాడు. నదికి ఆవల దక్షిణ దిక్కున మరో ఊరు కనిపించింది. ఆ ఊరు ఎలా ఉందో చూసి వద్దామని ఒక పడవ మాట్లాడుకున్నాడు. ఇంతలో ఇద్దరు మధ్యవయస్కులు కూడా ఆ పడవలో ఎక్కారు.వారి మాటల ద్వారా అతడు తెలుసుకున్నదేమిటంటే, దక్షిణ దిక్కున ఉన్న ఊర్లో అరటి పండ్లు రుచిగా ఉంటాయని. ఆ ఊరికి వెళ్ళి అరటిపండ్లు కొనుక్కుందామని వారు వెళ్తున్నారు. చిన్నగా పడవ ఆ ఊరు చేరింది.ప్రకృతి ప్రేమికుడు అక్కడ దిగి, కనిపించిన మనోహర దృశ్యాలను చూసి పరవశించిపోయాడు. గంటసేపు ఆ చుట్టుప్రక్కల తిరిగి మళ్ళీ పడవ దగ్గరకు వచ్చి చేరాడు. అదే పడవ వాడు నవ్వుతూ పలకరించి అతడిని పడవలో ఎక్కించుకున్నాడు. అప్పుడు కూడా దక్షిణదిక్కున ఉన్న గ్రామస్తులు నలుగురు పడవ ఎక్కారు. పడవ బయలుదేరింది. పడవ వాడు చిన్న రాగాలు తీస్తూ పడవను నడుపుతూ ఉన్నాడు. ఆ రాగాలను వింటూ, చల్లటి గాలికి పరవళ్ళు తొక్కుతున్న నది అలలను చూస్తూ ప్రకృతి ప్రేమికుడు మైమరిచిపోయాడు.పడవ తీరం చేరింది. పడవ దిగుతున్న నలుగురి చేతుల్లోనూ పెద్దపెద్ద సంచులున్నాయి. ప్రకృతి ప్రేమికుడు ఆసక్తిగా వాటి వైపు చూశాడు. ఆ నలుగురు నవ్వుతూ ‘‘మా ఊర్లో అరటిపండ్లు పెద్ద తియ్యగా ఉండవు, ఈ ఊర్లో పండ్లు చాలా తియ్యగా ఉంటాయి, అందుకని కొనుక్కుని వెళ్ళడానికి వచ్చాము’’ అని చెప్పి వెళ్ళిపోయారు.వారి మాటలకు ఆశ్చర్యపోయాడు ప్రకృతి ప్రేమికుడు. అందరూ వెళ్ళాక పడవ వాడిని ఇలా అడిగాడు ‘‘అసలు ఏ ఊర్లో అరటిపండ్లు తియ్యగా ఉంటాయి?’’ అని. వాడు పడీపడీ నవ్వుతూ ‘‘రెండు పండ్ల రుచీ ఒక్కటే. అయితే దక్షిణ దిక్కున ఉన్న వాళ్ళు ఉత్తరదిక్కున ఉన్న ఊరి పండ్లు తియ్యగా ఉంటాయని అనుకుంటారు. వాళ్ళేమో దక్షిణ దిక్కున ఉన్న వారి పొలంలో కాచే అరటి పండ్లు తియ్యగా ఉంటాయని భావిస్తారు’’ అని చెప్పాడు.‘నిజమే, నీళ్ళలో ఉన్నవాడు ఒడ్డున ఉన్నవాడు సుఖంగా ఉన్నాడని అనుకుంటాడు. ఒడ్డున ఉన్నవాడు నీళ్ళలో ఉన్నవాడు సుఖంగా ఉన్నాడని అనుకుంటాడు. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా నిజం మాత్రం ఒక్కటే కదా. ఎక్కడైనా రూపాయికి నాలుగు పావలాలే కదా’ అనుకుంటూ అక్కడినుంచి కదిలాడు ప్రకృతి ప్రేమికుడు. అమృత బిందువులు→ ప్రతి కోపం వెనుక ఒక బాధ ఉంటుందిప్రతి అనుమానం వెనుక ఒక మోసం ఉంటుంది.ప్రతి దూరం వెనుక ఒక గాయం ఉంటుంది.అందుకే మోసపోయిన వారు, గాయపడిన వారు... అన్యాయానికి గురైన వారు తొందరగా ఎవరిని నమ్మలేరు.→ స్నేహం, అనుబంధం జీవితాన్ని హాయిగా చేస్తాయి. మనస్ఫూర్తిగా మాట్లాడే వారు ఉంటే బాధ తగ్గుతుంది. అసలైన అనుబంధాలే ఆనందానికి మూలం.భగవద్ధ్యానం–ఆత్మధ్యానంఅంతటా భగవంతుని దర్శించాలంటే మొదట మనస్సులో భగవంతుని భావించడం నేర్చుకోవాలి. అలా భావన చెయ్యడమే ధ్యానం.→ ధ్యానం అనుభూతికి దారితీస్తుంది అనుభూతి ఆత్మలో కలుగ వలసినదే. భగవద్ద్యానమైనా, ఆత్మ ధ్యానమైనా రెండింటి లక్ష్యం ఒక్కటే! – ఆర్.సి.కృష్ణస్వామి రాజు -
యుయుత్సుడు... కౌరవులలో శ్రేష్ఠుడు
మహాభారతంలో కౌరవులు అనగానే దుర్యోధనుడు, దుశ్శాసనుడితో కలిపి 100 మంది గురించి చెప్తాము. మిగిలిన 98 పేర్లు చాలా మందికి తెలియకపోవచ్చు. వారిలో యుయుత్సుడు కూడా ఒకడు. ఇతనిని కౌరవులలో శ్రేష్టుడిగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మహాభారత యుద్ధానంతరం కౌరవులలో బతికిన ఒకే ఒక్కడు కూడా యుయుత్సుడే.యుయుత్సుని జననం, ధర్మనిరతిధృతరాష్ట్రుని పట్టమహిషి గాంధారి గర్భం దాల్చి రెండు ఏళ్లు గడిచినా సంతానం కలగపోవడంతో గాంధారి చెలికత్తె అయిన వైశ్యకన్య సుఖదను వివాహమాడి యుయుత్సుని పుత్రుడిగా పొందాడు ధృతరాష్ట్ర్రుడు.యుయుత్సుడు కౌరవులలో ఒకడైనప్పటికీ ధర్మనిరతుడు... మహావీరుడు... అతిరథులలో ఒకడు. ఆది నుండి ధర్మం వైపే నిలబడ్డాడు. అలనాడు నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణాన్ని ఒక్క యుయుత్సుడే వ్యతిరేకించాడు. భీముడిని విషపు నీటి ప్రయోగం నుండి కాపాడాడు. కౌరవుల యుద్ధ వ్యూహాలను ఎదుర్కోవడంలో పాండవులకు సహాయం చేశాడు.కురుక్షేత్ర సంగ్రామం అనివార్యం కావడంతో యుద్ధం ప్రారంభం కాకమునుపే, ధర్మరాజు మాట్లాడుతూ యుద్ధంలో అస్త్ర శస్త్రాలు చేపట్టింది, ధర్మాన్ని రక్షించడానికి... ధర్మం వైపు నిలబడి పోరాడాలనుకునే వారికి స్వాగతం... అని చెప్పడంతో, ధర్మం పాండవుల వైపే ఉందని యుయుత్సుడు గ్రహించి కౌరవుడైనప్పటికీ పాండవుల పక్షాన చేరి కౌరవులపై యుద్ధం సాగించాడు.కౌరవులలో మిగిలిన ఒకే ఒక్కడైన యుయుత్సుని కౌరవ సామ్రాజ్యానికి రాజును చేస్తామని, దీనివల్ల ధృతరాష్ట్రునికి మనశ్శాంతి కలుగుతుందని ధర్మరాజు ప్రకటించడంతో అప్పటి ధర్మవేత్తలు అడ్డుపడి, అభ్యంతరం చెబుతూ క్షత్రియ సంతానానికి చెందని యుయుత్సుడు రాజు కావడానికి అనర్హుడని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ధర్మరాజు యుయుత్సుని పాండవ సామ్రాజ్యానికి సైన్యాధ్యక్షుడిగా నియమించి అభిమన్యుడి కుమారుడైన పరీక్షిత్ సంరక్షణ బాధ్యతను కూడా యుయుత్సునికే అప్పగించాడు. అనంతరం పాండవులు స్వర్గం వైపు పయనమయ్యారు.– సి. ఎన్. మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
గురవే సర్వలోకానాం..
జ్ఞానం అనే చీకటిని పారద్రోలి, జీవితానికి దిశానిర్దేశం చేసే మహనీయుడే గురువు. అటువంటి గురువులను స్మరించుకుని, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకునే పవిత్రమైన రోజే గురు పౌర్ణమి. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమి రోజున ఈ పండుగను దేశమంతటా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. దీనినే వ్యాసపౌర్ణమి అని కూడా పిలుస్తారు.గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని ఎందుకు అంటారో తెలుసుకుంటే ఈ రోజు ప్రాముఖ్యత మరింత అర్థమవుతుంది. మహాభారతం, పద్దెనిమిది పురాణాలు, బ్రహ్మసూత్రాలు రచించిన మహర్షి వేదవ్యాసుడు. వేదాలను నాలుగు భాగాలుగా విభజించి లోకానికి అందించిన మహానుభావుడు ఆయనే. ఆయన జన్మదినమే ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి. అందుకే ఈ రోజును వ్యాసుని జన్మదినంగా జరుపుకుంటూ, ఆయన ద్వారా మనకు అందిన జ్ఞాన సంపదకు కృతజ్ఞతలు తెలుపుకుంటాం. వ్యాసుడే మానవాళికి మొదటి గురువుగా భావిస్తారు. ఆయన నుండి ప్రారంభమైన గురు పరంపర ఈనాటికీ కొనసాగుతోంది. నారాయణుడు, బ్రహ్మ, వశిష్టుడు, శక్తి, పరాశరుడు, వ్యాసుడు, శుకుడు, గౌడపాదుడు, గోవిందుడు, శంకరాచార్యుల వరకు సాగిన ఈ పరంపరకు ఈ రోజు నమస్కరిస్తాం.ఈ రోజు ఆధ్యాత్మికంగా కూడా చాలా విశేషమైనది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహాన్ని దేవగురువు అంటారు. నవగ్రహాలలో గురువు స్థానం చాలా బలంగా ఉంటే విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం అన్నీ శుభంగా జరుగుతాయని నమ్మకం. జాతకంలో గురు దోషం ఉన్నవారు ఈ రోజు గురు పూజ చేస్తే ఆ దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా చాతుర్మాస దీక్షలకు ఈ రోజే బీజం పడుతుంది. సాధువులు, సన్యాసులు ఈ రోజు నుండే ఒక చోట స్థిరంగా ఉండి చాతుర్మాస వ్రతం ప్రారంభిస్తారు.గురు పౌర్ణమి రోజున భక్తులు తమ గురువులను దర్శించుకుని పాదపూజ చేస్తారు. కొత్త వస్త్రాలు, పుష్పాలు, ఫలాలు, దక్షిణ తాంబూలాలతో గురువును సత్కరిస్తారు. గురు గీత, గురు స్తోత్రం, దత్తాత్రేయ స్తోత్రం పారాయణ చేస్తారు. విద్యార్థులు ఈ రోజు ప్రత్యేకంగా సరస్వతీ దేవితో పాటు హయగ్రీవ స్వామిని పూజిస్తారు. ఎందుకంటే హయగ్రీవుడు జ్ఞానానికి అధిపతి. ఈ రోజు సత్యనారాయణ వ్రతం చేయడం, దానధర్మాలు చేయడం, అన్నదానం చేయడం వల్ల విశేష ఫలితం వస్తుందని పెద్దలు చెబుతారు. రాత్రి సమయంలో చంద్రుని కిరణాలలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణ చేస్తే మానసిక ప్రశాంత లభిస్తుందని కూడా ఒక నమ్మకం. గురు పౌర్ణమి అనేది మన సంస్కృతి, మన సంప్రదాయం, మన కృతజ్ఞతా భావానికి నిదర్శనం. ఈ రోజు మనం గురువులకు నమస్కరించడం ద్వారా జ్ఞానానికి, విద్యకు, సంస్కారానికి నమస్కరిస్తున్నాం. గురువు చూపిన బాటలో నడవాలని, ఆయన ఆశీస్సులు పొందాలని ప్రతి ఒక్కరూ సంకల్పం చేసుకునే రోజు ఇది. గురువుల ఆశీర్వాదం ఉంటే జీవితంలో ఎటువంటి ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమించవచ్చు. అందుకే ప్రతి సంవత్సరం వచ్చే ఈ పవిత్రమైన గురు పౌర్ణమిని మనం భక్తిశ్రద్ధలతో జరుపుకుని, గురు తత్వాన్ని మన జీవితంలో ఆచరించాలి. గురువు అంటే కేవలం పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు మాత్రమే కాదు. మన జీవితంలో మంచి మార్గం చూపిన ప్రతి ఒక్కరూ గురువే. తల్లిదండ్రులు మొదటి గురువులు. వారు మనకు నడవడం, మాట్లాడడం నేర్పుతారు. ఆ తరువాత బడిలో టీచర్లు, జీవితంలో ఎదురయ్యే కష్టాలు, ప్రకృతి కూడా మనకు గురువులే. 29, బుధవారం గురుపౌర్ణమి– కుందా శ్రీ కృష్ణ శాస్త్రి. -
ఫ్లైట్ జర్నీలో ఫేస్ షీట్‌మాస్క్‌తో త్రిష..ఇది మంచిదేనా?
చర్మసంరక్షణ అనేది కేవలం ఉదయం లేదా సాయంత్రం దినచర్యకు మాత్రమే పరిమితం కాదు. ఎప్పుడు, ఎక్కడ ఉపయోగిస్తున్నారు, పరిసరాలు, ఆహారం వంటి వాటిపై కూడా ఆధారపడి ఉంటుందట. జస్ట్ ఇంట్లోనే సీరమ్‌లు, మాయిశ్చరైజర్లు, మాస్క్‌లు, సన్స్క్రీన్లు వంటి చర్మసంరక్షణ చర్యలు పరిమితం కాదని అంటున్నారు నిపుణులు. విమాన ప్రయాణాల్లో కూడా చర్మ సంరక్షణ తప్పనిసరని చెబుతున్నారు.ఇటీవల నటి త్రిష కృష్ణన్ విమానంలో షీట్ మాస్క్‌తో కనిపించిన ఒక రీల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇలా ప్రియాంక చోప్రా వంటి అనేకమంది సెలబ్రిటీలు గతంలో మాస్క్‌తో తమ సెల్ఫీలను పోస్ట్ చేశారు కూడా. ఇలా ఫ్లైట్జర్నీలో ఫేస్ మార్క్షీట్లు ఉపయోగించడం తప్పనిసరా? అంటే..విమాన ప్రయాణాలలో షీట్ మాస్క్‌లను ఉపయోగించడం సురక్షితమేనని చెబుతున్నారు డెర్మటాలజిస్టులు. అయితే ముఖానికి వేసుకునే మాస్క్ రకంపై శ్రద్ధ వహించాలని తెలిపారు. ముఖ్యంగా విమానం క్యాబిన్ లోపల ఉండే పొడి వాతావరణంలో, హైడ్రేటింగ్ షీట్ మాస్క్‌లు లేదా జెల్ ఆధారిత మాస్క్‌లు చర్మానికి తాత్కాలికంగా తేమను అందిస్తాయని అన్నారు. హైలురోనిక్ యాసిడ్, సెరామైడ్స్, గ్లిజరిన్, అలోవెరా, పాంథెనాల్ వంటి పదార్థాలు ఉన్న మాస్క్‌లను ఉపయోగించాలని సూచిస్తున్నారు. ప్రయాణ సమయంలో ఎక్స్‌ఫోలియేటింగ్ రసాయనాలు, చార్కోల్ మాస్క్‌లు, బలమైన క్రియాశీల పదార్థాలు, పీల్-ఆఫ్ మాస్క్‌లు, క్లే మాస్క్‌లను ఉపయోగించవద్దని ఈ చర్మవ్యాధి నిపుణురాలు సలహా ఇచ్చారు.కలిగే లాభాలు..ఇది చర్మానికి తేమను అందించి, పొడిబారకుండా చేస్తుంది. చర్మం బిగుతుగా ఉందన్న భావనను తగ్గిస్తుంది. అలాగే చర్మాన్ని మృదువుగా, సౌకర్యవంతంగా ఉంచుతుంది. విమానం క్యాబిన్‌లోని తక్కువ తేమ వల్ల డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలాంటివి చర్మసంరక్షణకు ఎంతో మంచివి. అలాగే వాటిపై సూచించిన విధంగా అన్ని నిమిషాలే ఉంచాలని, ఆ తర్వాత మిగిలిని సీరమ్ చర్మంలోకి వెళ్లేలా సున్నితంగా మసాజ్ చేయాలని అంటున్నారు. దీంతోపాటు రెండు చుక్కల ఫేషియల్ సీరమ్‌ను అప్లై చేసి, ఆ తర్వాత మాయిశ్చరైజర్‌ను వాడితో మంచిది. ఎవరికి మంచిది కాదంటే..ఏమైనా చర్మ సమస్యలు ఉంటే ఉపయోగించకపోవడమే మంచిది. సున్నితమైన చర్మం ఉన్నవారు షీట్ మాస్క్‌ల జోలికి వెళ్లకపోవడమే మంచిదిఅలాంటి వాళ్లు మాయిశ్చరైజర్‌ను మాత్రమే ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది.చివరగా విమాన ప్రయాణంలో ఇలాంటి చర్మ సంరక్షణ దినచర్య కొంచెం అదనంగా అనిపించవచ్చు, కానీ ఇది చర్మాన్ని చికాకు, చర్మ సమస్యలు, పర్యావరణ కారకాల నుంచి రక్షించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు చర్మ వ్యాధి నిపుణులు.(చదవండి: అరుదైన 'మెదడు'ని పోలిన తల చర్మ వ్యాధి..! చివరికి లైఫ్‌నే..) -
అరుదైన 'మెదడు'ని పోలిన తల చర్మ వ్యాధి..! చివరికి లైఫ్‌నే..
కొన్ని అరుదైన వ్యాధులు ఎందువల్ల వస్తాయనేది అంతుచిక్కదు. పోనీ నయం చెయ్యొచ్చ అంటే అదికూడా కష్టమే. అలాంటి వ్యాధిని నయం చేసి అతడి రూపాన్నే మార్చేసి బాధపెట్టిన మనోవ్యధకు ఉపశమనం కలిగించారు వైద్యలు. ఇంతకీ అతడికి వచ్చిన రుగ్మత ఏంటంటే..చైనాలోని హునాన్ ప్రావిన్స్‌కు చెందిన లీ అనే 23 ఏళ్ల యువకుడు మానవ మెదడు ఉపరితలాన్ని పోలిన లోతైన మడతల తల చర్మవ్యాధితో బాధపడుతున్నాడు. అతుడు ఈ సమస్యను చిన్నతనంలో గమనించాడు. తన చర్మం గట్టిపడటాన్ని గమనించాడు. చూస్తుండగానే మందంగా మారి పెద్ద అసమాన మడతలు వచ్చేశాయి. అతనికి 14 ఏళ్లు వచ్చేసరికి, ఈ అసాధారణ పెరుగుదల అతని తల చర్మంలో దాదాపు సగానికి వ్యాపించి అతడి రూపురేఖల్నే మార్చింది. అది కాస్తా అతడి ఆత్మవిశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపింది. ఏళ్ల తరబడి పలు ఆస్పత్రులలో చికిత్స పొందాడు. ఫలితంగా ఆరోగ్యకరమైన తల చర్మం కణజాలం చాలా తక్కువగా మిగిలి, విపరీతమైన మచ్చలను మిగిల్చింది. పైగా పెద్దగా ఫలితం లేదు. దాంతో పలు ఆస్పత్రులను సంప్రదించగా..ఆరోగ్యకరమైన చర్మ కణజాలం లేనందున సర్జరీ ప్రమాదకరమని నిరాకరించాయి. లీ చివరకు జోంగ్నాన్ ఆసుపత్రిలోని ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో డాక్టర్ జౌ బృందాన్ని సంప్రదించారు. ఆ వైద్యులు వీలైనంత ఎక్కువ ఆరోగ్యకరమైన తల చర్మాన్ని కాపాడటానికి వారు అతని ఇప్పటికే ఉన్న మచ్చల రేఖలను ఉపయోగించుకున్నారు. గతేడాది వైద్యులు అతని తల చర్మంలోని రెండు ప్రాంతాల కింద టిష్యూ ఎక్స్పాండర్లను అమర్చారు.తదుపరి 11 నెలల పాటు, వారు క్రమంగా ఎక్స్పాండర్లలోకి ద్రవాన్ని ఎక్కించి, పునర్నిర్మాణం కోసం తగినంత కణజాలాన్ని సృష్టించడానికి ఆరోగ్యకరమైన చర్మాన్ని నెమ్మదిగా సాగదీశారు. ఫలితంగా తగినంత ఆరోగ్యకరమైన తల చర్మం అభివృద్ధి చెందింది. ఆ తర్వాత వైద్యులు అసాధారణ కణజాలాన్ని తొలగించి, ప్రభావిత ప్రాంతాన్ని బాగుచేయడానికి మూడు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం లీ తల చర్మం సాధారణంగా కనిపించడమే గాక, చర్మంపై జుట్టు సాధారణంగా పెరగగలదని వైద్యులు తెలిపారు. దీంతో ఇన్నాళ్ల నుంచి లీ అనుభవించిన మనోవ్యధకు మగింపు పలికినట్లయింది. (చదవండి: ఆ గ్రామం కనుమరుగ్వకుండా పోరాడిన ఒకేఒక్కడు..! ఇవాళ ప్రపంచమే..) -
త్వరపడండి.. ఈ లోగో క్రియేట్కి బహుమతి రూ.20 వేలు!
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) అధికారిక లోగో రూపకల్పనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ (ఎన్ఐయూఎం) సహకారంతో ప్రత్యేక డిజైన్ పోటీ ప్రకటించింది. విద్యార్థులు, ఆర్కిటెక్ట్‌లు, గ్రాఫిక్ డిజైనర్లు, విజువల్ ఆర్టిస్టులు, సృజనాత్మక రంగ నిపుణులు పాల్గొనవచ్చని తెలిపింది. ప్రథమ బహుమతిగా రూ.20 వేలు, ద్వితీయ రూ.15వేలు, తృతీయ రూ.10 వేలు అందజేయనున్నారు.ఎంట్రీల సమర్పణకు ఆగస్టు 5 చివరి తేదీ. ఆగస్టు 10న విజేతలను ప్రకటిస్తారు. ఎంపికైన లోగోను స్వాతంత్య్ర దినోత్సనాన ఆవిష్కరించనున్నారు. ఆసక్తి ఉన్నవారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆన్లైన్లో ఎంట్రీలు సమర్పించాలి. సైబరాబాద్‌కు శాశ్వత గుర్తుగా నిలిచే లోగో రూపకల్పనలో భాగం కావడానికి ఇదో అరుదైన అవకాశమని కమిషనర్ సృజన పేర్కొన్నారు. సుపరిపాలన, సుస్థిర, అభివృద్ధి చెందుతున్న నగర దృక్పథాన్ని ఆవిష్కరించాలని సూచించారు.లోగో పూర్తిగా ఒరిజినల్ సృష్టి అయి ఉండాలని స్పష్టం చేశారు. ఏఐ, ఈపీఎస్ లేదా ఎస్వీజీ వెక్టర్ ఫార్మాట్లో రూపొందించిన డిజైన్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, అధిక నాణ్యత గల పీఎన్జీ లేదా జేపీఈజీ ఫైల్‌తో పాటు, గరిష్ఠంగా 250 పదాల్లో డిజైన్ వెనుక ఉన్న భావనను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థికి ఒక ఎంట్రీ మాత్రమే. కాపీరైట్ ఉల్లంఘన లేదా కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా నకలు చేసిన డిజైన్లను పరిగణనలోకి తీసుకోరు. డిజిటల్, ప్రింట్ వినియోగానికి అనువుగా ఉండేవాటినే పరిశీలిస్తారు. -
కుంచె పట్టి..ఆ గ్రామాన్ని రక్షించిన ఒకేఒక్కడు..!
ఒక్కడిగా పోరాడితే ఫలితం ఏం ఉంటుంది అనిపిస్తుంది. ఓ పదిమంది కలిసి ఐక్యంగా చేస్తేనే ఏదైనా సాధ్యం అనుకుంటాం. కానీ అవన్ని కరెక్ట్ కాదని నిరూపించాడు ఈ తాత. అంతేగాదు మనసుపెట్టి..పోరాడితే ఒక్కడే ఏదైనా సాధించగలడు అని నిరూపించాడు. యావత్తు ప్రపంచం తలెత్తి తనవైపు చూసేలా చేశాడు. అది కూడా కేవలం కాలక్షేపం కోసం చేసిన కళతోనే ఈ ఘనత సృష్టించడం విశేషం. పైగా సృజనాత్మకత గొప్పతనం, కళతో ఏం చేయొచ్చో.. కనవిప్పు కలిగించాడు. ఇంతకీ ఆ తాత ఏం చేశాడంటే..తైవాన్‌లోని తైచుంగ్‌లో శిథిలావస్థలో ఒక సైనిక స్థావరం ఉంది. అక్కడ హువాంగ్ యుంగ్-ఫు అనే మాజీ అధికారి ఒక్కే నివాసం ఉంటున్నాడు. అతడి కారణంగా ఆగ్రామం ఉనికి నిలిచింది, యావత్తు ప్రపంచానికి తెలిసింది. ఆ తాత అసాధారణ కథ వింటే విస్తుపోవడం ఖాయం. అద్భుత పాఠాన్ని నేర్పించిన తాత..ఆ గ్రామాన్ని 1940 చివరలో నిర్మించారు. దీన్ని చైనా అంతర్యుద్ధం తర్వాత తైవాన్‌కు తరలివచ్చిన కువోమింటాంగ్ (జాతీయవాద సైన్యం) సైనికులకు తాత్కాలిక నివాసంగా ఇచ్చారు. ఈ నివాస ప్రాంతంలో సుమారు 1,200 ఇళ్లు ఉండేవి. వాటిల్లో వేలాది కుటుంబాలు ఉండేవి. అయితే, దశాబ్దాలు గడిచేకొద్దీ, యువ తరాలు వలస వెళ్లిపోయాయి, భవనాలు శిథిలమయ్యాయి. దాంతో డెవలపర్లు పునరాభివృద్ధి కోసం ఆ భూమిని కొనుగోలు చేయడం ప్రారంభించారు. 2000వ దశాబ్దం చివరి నాటికి, దాదాపు ప్రతి నివాసి వెళ్లిపోయారు, కేవలం కొన్ని ఇళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. దాంతో దశాబ్దాలుగా అక్కడే నివసిస్తున్న హువాంగ్ యుంగ్-ఫు, తైవాన్‌లో తనకు తెలిసిన ఏకైక ఇంటిని విడిచి వెళ్లడానికి నిరాకరించాడు. నిజానికి అతడొక్కడే మిగిలాడు అక్కడ. ఒంటరిగా ఏం పాలుపోక.. 86 ఏళ్ల వయసులో ఒక పెయింట్ బ్రష్ తీసుకుని తన ఇంటి లోపల గోడపై ఒక చిన్న పక్షి చిత్రాన్ని గీశాడు. ఆ ఒక్క చిత్రం త్వరలోనే గ్రామం అంతటా గోడలు, కాలిబాటలు, తలుపులు, కిటికీలను కప్పివేసేలా వేలాది రంగురంగుల కుడ్యచిత్రాలుగా విస్తరించింది.నిజానికి ఆయన చిత్ర కళాకారుడు కాదు. తన రోజులని చక్కగా గడిచిపోయేలా కాలక్షేపం కోసం చేసి పని మంచి ఉద్దేశ్యాన్నిచ్చే అభిరుచిగా మారిందని అన్నారు. ఆయన విలక్షణమైన శైలి, ప్రకాశవంతమైన రంగులు, బాల్యపు ఊహశక్తితో గీసిన చిత్రాలు ఒక్కసారిగా ఆ గ్రామాన్ని రంగులుమయంగా చేశాయి. ఆ కళే గ్రామానికి రక్షగా..సమీప విశ్వవిద్యాలయాల విద్యార్థులు ప్రొఫెసర్లు ఆ ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు హువాంగ్ చిత్రాలను చూసి ఆకర్షితులవుతారు. అలా శిథిలావస్థలో ఉన్న ఆ సైనిక స్థావరం సాంస్కృతిక ప్రాముఖ్యతను గుర్తించి..ఆ గ్రామాన్ని కూల్చివేయకుండా పరిరక్షించాలని తైచుంగ్ నగర ప్రభుత్వాన్ని కోరుతూ వారు ఒక ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమానికి ప్రజల నుంచి విస్తృత మద్దతు లభించడంతో, చివరికి అధికారులే పునరాభివృద్ధి ప్రణాళికలను విరమించుకున్నారు.అలా సైనిక విలేజ్ కాస్త రెయిన్బో విలేజ్‌గా సాంస్కతిక ఆకర్షణగా పరిరక్షించబడింది. అంతేగాదు హువాంగ్‌కి రెయిన్బో తాతగా పేరొచ్చింది కూడా. దీనివల్ల హువాంగ్ తన ఇంట్లోనే ఉండగలిగాడు, అదే సమయంలో ప్రపంచం నలుమూలల నుంచి సందర్శకులు వచ్చి అతని కళాఖండాలను ఆరాధించడం మొదలుపెట్టారు. అంతేగాదు అక్కడి తైవాన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకారం, హువాంగ్ చిత్రాలు ఒకప్పుడు నిర్మానుష్యంగా మారిన ఆ ప్రదేశాన్ని అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పర్యాటక కేంద్రంగా మార్చాయి. ఒకప్పుడు కనుమరుగవడానికి సిద్ధంగా ఉన్న ఒకగ్రామానికి అవి కొత్త జీవం పోశాయి. ఇదిలా ఉండగా దురదృష్టవశాత్తు హువాంగ్ యుంగ్-ఫు 2024 జనవరిలో తన 100వ ఏట కన్నుమూశారు. ఆయన వెళ్తూ.. వెళ్తూ..రెయిన్బో విలేజ్‌లోని రంగురంగుల గోడల కన్నా ఎంతో విశాలమైన వారసత్వాన్ని వదిలి వెళ్లారు. ఈ తాత హువాంగ్ కథ కళ కేవలం అందాన్ని ఇవ్వడానికే కాకుండా, భద్రపరచడానికి,ప్రజలను అనుసంధానించడానికి, సమాజాన్ని ప్రభావితం చేయడానికి ఉపయోగ పడుతుందని నిరూపించింది. అంతేగాదు నిరసనలు, రాజకీయాలు సాధించలేని దానిని సృజనాత్మకత కొన్నిసార్లు సాధించగలదని హువాంగ్ యుంగ్-ఫు కథ నిరూపించింది కదూ..!. View this post on Instagram A post shared by JOTA (@jackofftoart) (చదవండి: టీసీఎస్ ఉద్యోగాన్ని కాదనుకుని రైస్ వ్యాపారం..! కట్‌చేస్తే ఏడాదికి..) -
అడుగు పడితే, లైట్ పడుతుంది!
రోజూ చేసే చిన్న చిన్న పనులే ఎక్కువ సమయాన్ని తినేస్తుంటాయి! అలాంటి పనులను చిటికెలో పూర్తి చేసి, కాస్త స్మార్ట్‌గా మార్చే గాడ్జెట్లు ఇప్పుడు మార్కెట్లో బోలెడున్నాయి. వాటిలో కొన్ని ఆసక్తికరమైనవే ఇవి!సోలార్ వాల్ లైట్దొంగలను భయపెట్టి, బయటపెట్టే లైట్స్ ఇవి. రాత్రి అందరూ నిద్రలో ఉంటారు... కానీ ఈ లైట్ మాత్రం డ్యూటీలో ఉంటుంది! ఎవరైనా ఇంటి గుమ్మం దగ్గరకు రాగానే ‘ఇదిగో దొంగ.. దొంగ!’ అన్నట్లు టక్కున వెలిగిపోతుంది. మోషన్ సెన్సర్‌తో పనిచేసే ఈ సోలార్ వాల్ లైట్ దొంగలకు చిన్న షాక్ ఇవ్వడమే కాదు... ఇంటి చుట్టూ ఏ కదలిక జరిగినా వెంటనే వెలుతురు వెదజల్లుతుంది. పగలంతా సూర్యరశ్మితో చార్జ్ అవుతుంది కాబట్టి కరెంట్ బిల్లు పెరుగుతుందేమోనని ఆందోళన అక్కర్లేదు. వర్షం వచ్చినా, ఎండ మండినా వాటర్‌ప్రూఫ్ బాడీతో చక్కగా పనిచేస్తుంది. గుమ్మం, బాల్కనీ, తోట, మెట్లు– ఎక్కడ పెట్టినా వెచ్చని పసుపు వెలుతురుతో ఇంటికి అందాన్ని, భద్రతను ఒకేసారి అందిస్తుంది. ధర కేవలం రూ. 300 మాత్రమే!లెక్కలతో పాటు... లెటర్స్ కూడా!కాలిక్యులేటర్లో లెక్కలు వేసి... మళ్లీ పక్కన కాగితం కోసం వెతుకుతుంటారా? ఇక ఆ పని లేదు! ఈ టూ ఇన్ వన్ కాలిక్యులేటర్ ఒకేసారి లెక్కలూ వేస్తుంది, పక్కనే నోట్స్ కూడా రాస్తుంది. ఎంత ఖర్చయ్యింది? ఎంత బ్యాలెన్స్? వెంటనే రాసేసి, పని అయిపోయాక ఒక్క బటన్ తో చెరిపేయొచ్చు. కాగితాలు చింపాల్సిన పని లేదు, చిన్న చిట్టీలు పోగొట్టుకునే టెన్షన్ లేదు. మడతపెట్టే డిజైన్ తో జేబులోనో, బ్యాగులోనో హాయిగా సరిపోతుంది. స్టూడెంట్స్, టీచర్లు, ఆఫీస్ ఉద్యోగులు, లెక్కలతో పని ఉన్నవాళ్లందరికీ ఇది చిన్న సైజ్‌లో ఉండే పెద్ద హెల్పర్. కాలిక్యులేటర్ ఒకటి కొంటే, నోట్‌ప్యాడ్ కొనాల్సిన అవసరమే లేదు. ధర సుమారు రూ.600.కత్తెరకు కన్ను!కత్తిరిస్తుంటే... సరైనా కొలత ఒక వైపు, కత్తెర మరోవైపు వెళ్లిపోతున్నాయా? ఇక ఆ టెన్షన్ కు కట్! ఈ లేజర్ కత్తెర ముందే ఎర్రటి లేజర్ గీతను చూపిస్తూ ‘ఇదే దారి... ఇటే కట్ చెయ్!’ అని గైడ్ చేస్తుంది. కాబట్టి వంకర టింకరలు లేకుండా సూటిగా కత్తిరించొచ్చు. బట్టలు, గిఫ్ట్ పేపర్లు, కార్డ్‌బోర్డులు, క్రాఫ్ట్ పనులు... ఏది కత్తిరించినా ఫినిషింగ్ మాత్రం ప్రొఫెషనల్‌గా కనిపిస్తుంది. స్టెయిన్ లెస్ స్టీల్ బ్లేడ్లు పదునుగా ఉండటంతో ఎక్కువ శ్రమ కూడా ఉండదు. చేతికి నొప్పి కలగకుండా సౌకర్యవంతమైన పట్టుతో డిజైన్ చేశారు. ఇంట్లో చిన్న చిన్న క్రాఫ్ట్ పనులు చేసే వాళ్ల నుంచి టైలర్లు, బొటిక్ యజమానుల వరకు అందరికీ ఇది సూపర్ హెల్పర్. ఇకపై ముందు గీత గీసే పని లేకుండా, లేజర్ చూపించిన దారిలో కట్ చేయడమే! ధర కేవలం రూ. 350 మాత్రమే! -
జామపండ్లలో మనమే టాప్!
జామపండ్లు మన స్థానికమైనవే అనుకుంటాం గాని, ఇవి పదహారో శతాబ్దిలో పోర్చుగీసు నావికుల ద్వారా మన దేశానికి వచ్చాయి. అప్పటి నుంచి తోటల్లోనే కాదు, ఇళ్ల పెరళ్లలోనూ జామచెట్లను విరివిగా పెంచడం మొదలైంది.జామపండ్లను పండించడంలో ఇప్పుడు మన భారత దేశం అగ్రస్థానంలో కొనసాగుతోంది. జామపండ్లలో నాలుగువందలకు పైగా రకాలు ఉన్నాయి. వీటిలో 160 రకాలు మన దేశంలో పండుతాయి. పోషకాల గని అయిన జామపండ్లు ఎక్కువగా ఆగస్టు–ఏప్రిల్ మధ్యకాలంలో దొరుకుతాయి. కొన్ని రకాలు ఏడాది పొడవునా దొరుకుతాయి. జామపండ్ల గురించి గణాంకాల్లో తెలుసుకుందాం...జామపండ్లలో పోషకాలుజామపండ్లలో పిండిపదార్థాలు, చక్కెర, కొవ్వు పదార్థాలు, పీచు పదార్థాలు సహా కీలకమైన విటమిన్లు, ఖనిజాలు వంటి అనేక పోషకాలు ఉంటాయి. ప్రతి వందగ్రాముల జామపండ్లు 68 కిలోకేలరీల శక్తినిస్తాయి. వీటిలో నీరు 80 శాతానికి పైగా ఉంటుంది. ప్రతి వంద గ్రాముల జామపండ్లలో ఉండే పోషకాల వివరాలను గణాంకాల్లో చూద్దాం... -
కోడికూర రుచిచూడాలంటే అంకాపూర్ వెళ్లాల్సిందే..!
అంకాపూర్ ఊరి పేరు చెబితే భోజన ప్రియుల కళ్లలో మెరుపులు.. వేడివేడి మక్కవడ.. ఘుమఘుమలాడే దేశీచికెన్ రుచి చూడాలంటే అక్కడికి వెళ్లాల్సిందే అంటూ ఉత్సాహం చూపుతారు. 63వ నంబర్ జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే ఏ వాహనదారుడైనా అంకాపూర్‌లో ఆగిమరీ ఇక్కడి రుచులను ఆస్వాదిస్తారు. అలాగే ఇక్కడ విక్రయించే పచ్చి మక్కబుట్టలకు విపరీతమైన డిమాండ్ ఉంది. వ్యవసాయరంగంలో తనదైన ముద్రవేసుకున్న అంకాపూర్.. మక్కవడలు, దేశీచికెన్ రుచులతో భోజన ప్రియుల మదిలో ప్రత్యేక స్థానాన్ని పదిలపర్చుకుంది. పచ్చిబుట్టల విక్రయాలు జోరుగాసాగుతున్నాయి. వివిధ ప్రాంతాలకు ప్రతిరోజూ ట్రాలీల్లో పచ్చిబుట్టలు తరలుతున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు హైదరాబాద్ వంటి మహానగరంలో పచ్చిబుట్టలు విక్రయించే వారు సైతం ‘అంకాపూర్’ పేరుతోనే బిజినెస్ సాగిస్తుంటారు. కాల్చిన మక్కెన్లు..63వ నంబర్ జాతీయ రహదారికి వరువైపులా చిన్నచిన్న గుడిసెలు వేసుకుని మహిళలు మక్కెన్లను కాల్చి విక్రయిస్తున్నారు. మొక్కజొన్న పండే ఆరు నెలల కాలం వీరికి జీవనోపాధి ఇదే. రైతులు, మధ్య దళారుల నుంచి ముందుగానే పచ్చి బుట్టలు కొనుగోలు చేసి వాటిని బొగ్గులపై కాల్చి రూ.20కు ఒకటి చొప్పున విక్రయిస్తున్నారు. వాహనదారులు ఇక్కడ ఆగుతూ చల్లని వాతావరణంలో బొగ్గులపై కాల్చిన వేడి వేడి మక్కెన తింటూ మధురానుభూతిని పొందుతున్నారు. పచ్చి బుట్టలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉన్న అంకాపూర్ మొక్కజొన్న మార్కెట్ విక్రయదారులు, కొనుగోలుదారులతో కళకళలాడుతోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు ఇక్కడ ఆగుతూ రైతులు, వ్యాపారులు చెప్పిన ధరకే పచ్చి మక్కబుట్టలను కొనుగోలు చేస్తున్నారు. ఆర్మూర్ ప్రాంతంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పండించిన మొక్కజొన్న పంటను మధ్య దళారులు ముందుగానే కొనుగోలు చేస్తారు. లేదా రైతులు నేరుగా ఆటో ట్రాలీల్లో అంకాపూర్ మార్కెట్‌కు తీసుకొచ్చి రోడ్డు పక్కన కుప్పలుగా పోసి విక్రయిస్తున్నారు. కోడికూర అంకాపూర్ పేరు వింటేనే అందరూ ఠక్కున పలికేది ‘దేశీ కోడికూర’. మాంసం ప్రియుల నోరూరించే దేశీ కోడికూరకు అంకాపూర్ ఎంతో ప్రత్యేకం. మక్కవడలు, దేశీచికెన్ రుచి తెలిసిన భోజన ప్రియులు రెండింటిని కలిపి లాగిస్తున్నారు. మక్క వడలను దేశీ కోడి కూరలో నంజుకొని తింటున్నారు. పెద్ద పెద్ద స్టార్ హోటళ్లలో సైతం ఈ రుచి అందుబాటులో ఉండకపోవడంతో దేశీకోడి కూరతో మక్క వడలు తినడానికి ఎక్కువ మంది వస్తుండటంతో ఆర్డర్ మెస్‌లు, మక్క వడలు వేసే హోటళ్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. నోరూరిస్తున్న మక్కవడలుఅంకాపూర్ మక్కవడ అంటేనే ఎంతో స్పెషల్. గ్రామానికి చెందిన వారితోపాటు ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారుసైతం హోటళ్లలో పోటాపోటీగా ఎంతో రుచికరంగా మక్కవడలు వేస్తున్నారు. వాహనదారులు అంకాపూర్లోని జాతీయ రహదారికి ఇరువైపులా వాహనాలను నిలిపి వడలు తింటూ ‘ఆహా.. ఏమి రుచి’ అంటూ ఆస్వాదిస్తున్నారు. తాము తినడమే కాదు కుటుంబ సభ్యులు, మిత్రుల కోసం పార్సిల్లు తీసుకు వెళ్తున్నారు. నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాలవారు ఫోన్లలో ఆర్డర్ చేస్తూ పార్సిల్లు తెప్పించుకుంటున్నారు. పచ్చిబుట్ట కొంటున్నారు ఇతర పట్టణాలు, గ్రామాల నుంచి అంకాపూర్‌కు వచ్చిన వారు పచ్చి బుట్టను కొని తీసుకెళ్తున్నారు. ఇళ్ల లో మక్క వడలు వేసుకోవడానికి కొంటున్నామని చెబుతున్నారు. వాతావరణంలో మార్పు రావడంతో మార్కెట్ పుంజుకుంటోంది. – బోదాస్ లక్ష్మి, విక్రయదారు, అంకాపూర్ ఇక్కడ ఆగాల్సిందే.. అంకాపూర్ మీదుగా వెళ్లే వాహనాలు మాదగ్గర ఆగకుండా ముందుకు వెళ్లవు. కాల్చిన మక్కెన్ కొనుక్కొని ఉప్పు, నిమ్మకాయ దట్టించుకొని తిని మమ్మల్ని మెచ్చుకొని వెళ్తారు. చాలా ఆనందంగా ఉంటుంది. పదుల సంఖ్యలో ఇక్కడ షెడ్లు వేసుకొని మక్కెన్లు కాలుస్తున్నాం. గ్రామస్తులు కూడా మాకు సహకరిస్తున్నారు. – నర్సవ్వ, కాల్చిన మక్కెన్లు విక్రయించే మహిళ నిజామాబాద్ -
టీసీఎస్ ఉద్యోగాన్ని కాదనుకుని రైస్ వ్యాపారం..! కట్‌చేస్తే ఏడాదికి..
కొన్ని సమయాల్లో కంఫర్ట్ జోన్ కంటే రిస్క్ తీసుకుంటేనే గొప్ప విజయాలను సొంత చేసుకోగలం. అలా చేసి ఎందరో విజేతలుగా నిలిచిన ఘటనలు చూశాం. అంత ముక్తకంఠంలో మహారిస్క్ అన్నా..తగ్గేదేలే అంటూ ముందుకు సాగి..అందర్నీ ఆశ్చర్యపరిచేలా సక్సెస్‌ని అందుకున్నారు. అలాంటి కోవకు చెందని వాడే ఈ వ్యక్తి. చాలామంది కోరుకునే డ్రీమ్ జాబ్‌ని కాదనుకుని ఎలాంటి వ్యాపారం రంగంలోకి దిగాడో వింటే నోటమాటరాదు.అందుకు సంబంధించిన విషయాన్ని అంకిత్ పాండ్ సోషల్‌మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ఎక్స్పోస్ట్లో అంకిత్ పాండే ఇలా రాసుకొచ్చారు. తన స్నేహితుడు టీసీఎస్ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ని వద్దనుకుని మరి వ్యాపారం చేయాలి నిర్ణయించుకున్నాడు. మొదట అదడి నిర్ణయం విని స్నేహితులంతా తప్పు చేస్తున్నావంటూ విమర్శించారని చెప్పాడు. కానీ అతడు గ్రామాలు, రాష్ట్రాలలోని రైతుల నుంచి నేరుగా బియ్యాన్ని సేకరించి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నాడు. అందుకోసం ఆ వ్యాపారవేత్త రైతుల నుంచి నేరుగా బియ్యాన్ని కొనుగోలు చేసి, దాన్ని శుభ్రపరిచి, దానికి తన సొంత బ్రాండ్ప్యాకేజీ చేయించాడు. వాటిని సుమారు 200 రిటైల్ దుకాణాలకు సరఫరా చేశారు. మధ్యవర్తులను తొలగించి, ఒక స్థిరమైన రిటైల్ నెట్‌వర్క్‌ను నిర్మించడం ద్వారా, ఆయన లాభదాయకమైన, నిలకడైనా వ్యాపారాన్ని సృష్టించారని సమాచారం.వ్యాపారం ట్రిక్ ఏంటంటే..రైతుల నుంచి కిలో బియ్యాన్ని రూ. 35ల చొప్పున కొనుగోలు చేస్తారు. ప్యాకేజింగ్‌కు, కిలోకు రూ. 3లు, రవాణా ఖర్చుకు మరో రూ. 2 అదనం. దీంతో మొత్తం ఖర్చు కిలోకు రూ. 40 అవుతుంది. అంటే ప్యాకేజీ చేసిన బియ్యాన్ని రిటైలర్లకు కిలోకు రూ. 50 చొప్పున అమ్ముతారు. రిటైలర్లు దానిని వినియోగదారులకు కిలోకు సుమారు రూ. 55–57 చొప్పున అమ్ముతారు. దీంతో అమ్మిన ప్రతి కిలోపై వారికి రూ. 10 లాభం వస్తుందని వివరంగా చెప్పుకొచ్చారు పోస్ట్‌లో. ప్రస్తుతం ఈ వ్యాపారం ప్రతి నెలా తమ రిటైల్ భాగస్వాములకు సుమారు 200 క్వింటాళ్లు, అంటే 20 వేల కిలోగ్రాముల బియ్యాన్ని సరఫరా చేస్తోందని పాండే అనఆనరు. ఈ గణాంకాల ఆధారంగా తన స్నేహితుడు సుమారు రూ. 25 లక్షలు సంపాదిస్తున్నాడని అంచనా వేశారు. అయితే నెటిజన్లు తీసుకునే రిస్క్‌ని బట్టి ఫలితం కూడా ఆస్థాయిలో ఉంటుందని సదరు వ్యక్తిని ప్రశంసించగా, మరికొందరు పైకి చూడటానికి సునాయాసంగా కనిపిస్తున్నా..టీసీఎస్ ఉద్యోగంతో పోలిస్తే..వ్యాపారం నుంచి లాభం పొందడం అనేది కొంచెం కష్టమే అంటూ పోస్టులు పెట్టారు.(చదవండి: స్విగ్గీ రైడర్‌గా వైద్యవిద్యార్థి..! కట్‌చేస్తే కోటీశ్వరుడిగా..) -
శ్వేతమాధవుడు: పూర్వం కృతయుగంలో శ్వేతుడు..
పూర్వం కృతయుగంలో శ్వేతుడు అనే రాజు సమస్త భూమండలాన్నీ పరిపాలించేవాడు. అతడి పరిపాలనలో ప్రజలు సర్వసుభిక్షంగా జీవించేవారు. అతడి రాజ్యంలో మనుషులకు పదివేల ఏళ్ల పరమాయువు ఉండేది. అకాల మరణాలు ఉండేవి కాదు. రోజులిలా సాగుతుండగా, ఒకసారి అనుకోని విపత్తు సంభవించింది.శ్వేతుడి రాజ్యంలో కపాలగౌతముడు అనే బ్రహ్మర్షి ఉండేవాడు. అతడికి కొడుకు పుట్టాడు. ఆ బాలుడు ఇంకా నోట్లో దంతాలు రాకముందే అకాల మృత్యువు చెందాడు. దుఃఖితుడైన కపాలగౌతముడు తన పుత్రుని మృతదేహంతో రాజాస్థానానికి వచ్చాడు.పసిబాలుడి మృతదేహాన్ని చూసిన శ్వేతుడు చలించిపోయాడు. ‘ఈ బాలుడిని పునర్జీవితుడిని చేయలేకపోతే నేనే అగ్నిప్రవేశం చేస్తాను’ అని భీషణ ప్రతిజ్ఞ చేశాడు.అప్పటికప్పుడు పరమశివుడి కోసం శ్వేతుడు తపస్సు ప్రారంభించాడు. నీలపద్మాలతో పరమశివుడిని అర్చిస్తూ, ప్రార్థించాడు. శ్వేతుడి భక్తికి సంతసించిన పరమశివుడు పార్వతీ సమేతంగా అతడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ‘వత్సా! నీ భక్తికి సంతుష్టి చెందాను. వరమేమి కావాలో కోరుకో!’ అన్నాడు.శ్వేతుడు పార్వతీ పరమేశ్వరులకు భక్తిగా నమస్కరించి, ‘పరమేశ్వరా! అభం శుభం తెలియని ఈ పసిబాలుడు అకాలమరణం చెందాడు. ఇతడిని పునర్జీవితుడిని చేస్తానని ప్రతిజ్ఞ చేశాను. నా ప్రతిజ్ఞ మేరకు ఈ బాలుడిని తిరిగి బతికించు. నా రాజ్యంలో అకాల మరణాలు లేకుండా అనుగ్రహించు’ అని కోరాడు. పరమశివుడు ‘తథాస్తు’ అని పలికాడు. మరుక్షణమే యమకింకరులు ఆ బాలుడి ప్రాణాలను తీసుకువచ్చారు. నిద్రలోంచి మేల్కొన్నవాడిలా ఆ బాలుడు పునర్జీవితుడయ్యాడు. పుత్రుడు పునర్జీవితుడు కావడంతో కపాలగౌతముడు పరమానందం పొందాడు.శ్వేతుడు ఎలాంటి చీకుచింతలు లేకుండా పదివేల ఏళ్లు రాజ్యపాలన చేశాడు. లౌకిక ధర్మాలన్నీ నెరవేర్చాక ఐహిక సుఖాలపై విరక్తి చెందాడు. పురుషోత్తమ క్షేత్రంలో శేషజీవితాన్ని గడపాలని నిశ్చయించుకున్నాడు. పురుషోత్తమ క్షేత్రానికి చేరుకుని, జగన్నాథుడి సన్నిధానానికి సమీపంలో శ్వేతపర్వతంపై సువిశాలమైన ప్రాసాదాన్ని నిర్మింపజేశాడు. ఆ ప్రాసాద మధ్యభాగంలో మాధవమూర్తిని ప్రతిష్ఠించాడు. మాధవ ప్రతిష్ఠాపన సందర్భంగా వేలాది విప్రులకు, సాధువులకు, తపస్వులకు భూరి దానాలు చేశాడు.శ్వేతుడు అక్కడే నివాసం ఏర్పరచుకుని, ఒక తటాకం ఒడ్డున తపోనిష్ఠతో ద్వాదశాక్షర మంత్రం జపిస్తూ, మాధవుడిని ఆరాధించసాగాడు. కొన్నాళ్లకు పూర్తిగా నిరాహారుడై శ్రీమహావిష్ణువును ధ్యానించసాగాడు. ధ్యాన స్థితిలో శ్రీమహావిష్ణువును స్తుతిస్తూ ఆశువుగా స్తోత్రం పలికాడు. శ్వేతుడి భక్తికి శ్రీమహావిష్ణువు పరవశుడయ్యాడు. సకల దేవతా పరివారం వెంట రాగా, శ్రీమహాలక్ష్మీ సమేతంగా శ్వేతుడి ఎదుట సాక్షాత్కరించాడు. ‘వత్సా! నీ భక్తికి పరమానందం చెందాను. వరమేమి కావాలో కోరుకో!’ అని పలికాడు.‘భక్తవత్సలా! పుండరీకాక్షా! జగన్నాథా! పాహిమాం... పాహిమాం... నన్ను నీ భక్తులలో ఒకరిగా పరిగణించి, వైకుంఠవాస యోగ్యత కల్పించు. అంతకు మించి నాకంటూ నేను కోరేదేమీ లేదు’ అన్నాడు శ్వేతుడు.‘రాజా! నువ్వు మరికొన్నాళ్లు రాజ్యభోగాలను అనుభవించిన తర్వాత నా లోకానికి చేరుకోగలవు. నీ తపోమహిమతో ఈ ప్రదేశం పునీతమైంది. నీకు సన్నిహితంగా నేను ఇక్కడే సమస్త దేవతా పరివారంతో కలసి శ్వేతమాధవుడిగా కొలువుంటాను. ఈ తటాకం శ్వేతమాధవ తీర్థంగా ప్రసిద్ధి పొందుతుంది. శ్వేతమాధవ తీర్థంలోని జలబిందువులు కుశాగ్ర పరిమాణంలో తాకినా భక్తులను పునీతులను చేస్తాయి.’ అని శ్రీమహావిష్ణువు వరమిచ్చాడు. శ్వేతుడికి ఇచ్చిన వరం ప్రకారం అక్కడే శ్వేతమాధవుడిగా వెలిశాడు.కొంతకాలం రాజ్యపాలన సాగించిన తర్వాత శ్వేతుడు ఒకనాడు అనాయాసంగా కాలధర్మం చెందాడు. వైకుంఠం నుంచి విష్ణుభక్తులు వచ్చి, అతడిని తమతో పాటు దివ్యవిమానంలో వైకుంఠంలోని విష్ణు సన్నిధానానికి తీసుకుపోయారు.పురావిశేషం..ఇది వేదవ్యాసుడి గుహ. కృష్ణద్వైపాయనుడైన వేదవ్యాసుడు వినాయకుడి సాయంతో ఇదేచోట మహాభారత రచన చేశాడని భక్తుల నమ్మకం. ఇది బదరీనాథ్ క్షేత్రానికి చేరువలోని మాణా గ్రామంలో ఉంది. ఈ గ్రామాన్ని భారతదేశంలోని చిట్టచివరి గ్రామంగా చెబుతారు. సముద్ర మట్టానికి 10,600 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గుహను సందర్శించడం అంత తేలికకాదు. ఇక్కడ గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా జరుగుతాయి.- సాంఖ్యాయన -
నోబెల్ శిఖరమెక్కిన జాణపదం!
విశ్వకవి రబీంద్రనాథ్ టాగోర్ గీత రచనలో ప్రదర్శించిన ప్రతిభకు నోబెల్ సాహిత్య పురస్కారం ఇస్తున్నట్లు 1913 నవంబర్ 13న స్వీడిష్ ఎకాడెమీ ప్రకటించింది. ‘ప్రగాఢమైన మార్దవమూ, నవనవలాడే తాజాదనమూ, ముగ్ధమోహన సౌందర్యమూ నిండిన కవిత’గా టాగోర్ గీతరచనను అభివర్ణించింది స్వీడిష్ ఎకాడెమీ.పరిపూర్ణమైన కౌశలంతో నిండివుండే టాగోర్ కవితావేశం ఆయన (ఆంగ్ల) గీతాలను పాశ్చాత్య సాహితిలో భాగంగా మార్చిందని స్వీడిష్ ఎకాడెమీ తన ప్రకటనలో పేర్కొంది. నాటికి నూట మూడేళ్ళు మరో పదమూడు రోజుల్లో పూర్తి అవుతాయనగా– 2016, అక్టోబరు 13న– మరో గీతరచయిత బాబ్ డిలాన్ నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్నట్లు అదే ఎకాడెమీ ప్రకటించింది. ‘మహత్తరమైన అమెరికన్ గీతరచన సంప్రదాయ పరిధిలోనే కొనసాగుతూ, సరికొత్త కవితాత్మక భావప్రకటనలు చేసినందుకు’ ఆయనకు నోబెల్ సాహిత్య పురస్కారం ఇస్తున్నట్లు స్వీడిష్ ఎకాడెమీ తన అభినందన సందేశంలో ప్రకటించింది. అలా, నూరేళ్ళ తర్వాత, గీతరచనకు రెండోసారి నోబెల్ పురస్కారం సంపాదించిపెట్టిన వాగ్గేయకారుడిగా బాబ్ డిలాన్ చరిత్ర సృష్టించాడు.కెనడా సరిహద్దుల్లో వుండే అమెరికన్ స్టేట్ మిన్నెసోటా. అక్కడి ఆదివాసుల జానపద గీతాలు చరిత్రప్రసిద్ధాలు. పద్దెనిమిదో శతాబ్ది చివర్లో, జంతువుల చర్మాల కోసం ఇక్కడికి వచ్చే ఫ్రెంచ్ యాత్రికులు తమ గీతాల బాణీలతో ఇక్కడి స్థానిక గీతాలను మేళవించి కొత్తరకం జానపద గీతాల సంప్రదాయం సృష్టించారంటారు. బాబ్ డిలాన్ కోట్లాదిమంది హృదయాలను కొల్లగొట్టింది ఈ జానపద గీతాలు పాడే! సాధారణంగా జానపద బాణీలో రాసిన గీతాలనగానే, మనకి విశ్వనాథ ‘కిన్నెరసాని పాటలూ’, నండూరి ‘ఎంకి పాటలూ’, కొనకళ్ళ ‘బంగారిమామ పాటలూ’ గుర్తుకురావడం సహజం.అయితే, బాబ్ డిలాన్ గీతసాహితి ఆ బాపతు కాదు. 1960 దశకం మొదట్లో, 22 యేళ్ళ బాబ్ ‘ఉత్తరాది పల్లెటూరి పడుచు పిల్లా’, ‘కుండపోతగా వాన కురవనుంది పిల్లా’ లాంటి పాటలు రాసి పాడకపోలేదు. కానీ బాబ్ డిలాన్ బాణీకి పేరుతెచ్చిపెట్టినవి అలాంటి పాటలు కావు. అమెరికాలో యుద్ధ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్న తరుణంలో బాబ్ పాడిన ‘పెనుగాలి వీస్తోంది’, ‘కాలం మారుతోంది’ లాంటివే బాబ్ డిలాన్ బాణీ ఇలాంటిదనే గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆ పాటల్లో డిలాన్ లేవనెత్తిన ప్రశ్నలు, ఆ రోజుల్లో సామాన్య పౌరులందరి మనస్సులనూ కలవరపరుస్తున్నవే! వాటికి ఆయన సూటిగా సమాధానాలు చెప్పలేదనే విమర్శ లేకపోలేదు. అయితే, అది కవిగారి పని కాదనే వాదన కూడా వినవచ్చింది! పాయింటేమిటంటే, అప్పట్లో– 1965 నాటికి– బీజప్రాయంగా మాత్రమేవున్న ‘ప్రత్యామ్నాయ సంస్కృతి’ (కౌంటర్ కల్చర్) చాయలు ఆ పాటల్లో కొట్టొచ్చినట్లు కనిపించాయి. అదీ అసలు విశేషం! బాబ్ డిలాన్ అనేది కవిగారి పెట్టుపేరు– రాబర్ట్ యాలెన్ జిమ్మెర్మన్ అతగాడి పుట్టుపేరు. దాన్నిబట్టి, బాబ్ యూదు మతాన్ని అనుసరించే కుటుంబంలో పుట్టి పెరిగాడని అర్థమవుతుంది. అతని తండ్రి రష్యన్ జాతీయుడు కాగా, తల్లి లిథువేనియా జాతీయురాలు. (ఈ రెండు జాతులూ 1918 మొదలుకొని 1990 వరకూ సోవియెట్ యూనియన్‌లో భాగంగా వున్న సంగతి ఆధునిక రాజకీయ చరిత్ర తెలిసినవారికి వేరే చెప్పనవసరంలేదు! ఆ తర్వాత అవి తిరిగి ‘స్వతంత్ర’ దేశాలుగా ఆవిర్భవించాయి) రెండు ప్రపంచయుద్ధాల మధ్య కాలంలో బాబ్ తల్లితండ్రులు అమెరికా చేరి అక్కడే మనువాడారు. మతానికి సంబంధించి, బాబ్ డిలాన్ అభిప్రాయాలు క్రమంగా మారుతూ వచ్చాయి. 1970–’80 మధ్యకాలంలో బాబ్ క్రైస్తవమతంలోకి మారి, కొద్దికాలానికే తిరిగి యూదుమతంలోకి మారిపోయారు. దీనికి సంబంధించిన కథనాలు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయి– వాటినలా వదిలేయండి!దాదాపు ఏడు దశాబ్దాల చరిత్ర, అమెరికన్ జానపద– రాక్ సంగీత సంప్రదాయానికి చెందిన ఈ వాగ్గేయకారుడి సొంతం. పన్నెండున్నర కోట్ల రికార్డులను అమ్మి, బాబ్ డిలాన్ ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. అమెరికాకు పన్నెండో నోబెల్ సాహిత్య పురస్కారం సంపాదించి పెట్టిన అతగాడు. (అమెరికన్ రచయిత్రి లూయీజ్ గ్లిక్ –2020లో– పదమూడోసారి ఇదే పురస్కారాన్ని గెల్చుకున్న సంగతి చదువుకున్న మిత్రులకు తెలిసిన విషయమే!) ‘ప్రామాణిక సాహిత్యం అందించే మేధాసంపదతో సమృద్ధమైన సంస్కారం కలిగినవాడు బాబ్ డిలాన్. ఆయన 1960 దశకంలోనే, అమెరికన్ జానపద సాహిత్యాన్ని సుసంపన్నం చేశార’ని ఎన్సైక్లోపీడియా బ్రిటానికా శ్లాఘించింది. 85 సంవత్సరాల వయసున్న ఈ సుప్రసిద్ధ వాగ్గేయకారుణ్ణి, ఆధునిక పాఠక–శ్రోతలకు ఇప్పుడు పరిచయం చేయాలనుకోవడం దుస్సాహసమే!- మందలపర్తి కిషోర్ -
శత్రుత్వం వద్దు..
పైడి పర్వతం పక్కన ఉన్న కందర్ప రాజ్యం రాజు వివేక వర్మ సుపరిపాలన సాగిస్తూ, ప్రజలకు ఎంతో మేలుచేస్తూ, మంచి పేరు తెచ్చుకున్నాడు. పైడి పర్వతంలో పుట్టిన ధారావళి నది కందర్ప రాజ్యంలోని పొలాలను సస్యశ్యామలం చేస్తూ రాజ్యాన్ని పచ్చగా ఉంచుతోంది.ఆ సుభిక్షం వలన మంత్రి సుహస్తుడి ప్రణాళికల వలన పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందాయి. ధారావళి నది కందర్ప రాజ్యం నుంచి పక్కనే ఉన్న ప్లవంగ రాజ్యంలోనూ ప్రవహిస్తూ ఆ రాజ్యంలోని పొలాలను కూడా సస్యశ్యామలం చేస్తోంది.ప్లవంగ రాజ్యాన్ని విజయ వర్మ పాలిస్తున్నాడు. ఆయన కూడా ప్రజలలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్లవంగ రాజ్యంలోనే ఉన్న రసోపర్వతంలో అనేక రసాయన రాళ్ళు ఉన్నాయి. వాటితో మనుషులకు, జంతువులకు ఉపయోగపడే ఎన్నో మందులు ప్లవంగ రాజ్యంలో శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు. ఆ రాళ్ళను కందర్ప రాజ్య శాస్త్రవేత్తలు కూడా ఉపయోగిస్తున్నారు.విజయవర్మ ప్రధానమంత్రి దురోత్తుడికి కొంత వక్రబుద్ధి ఉంది. ఒకరోజు ఆయన రాజు గారితో, ‘మహారాజా ఆ రసోపర్వతం వలన మనరాజ్యం సుభిక్షంగా ఉంది కాని, మనం కందర్పరాజ్యం నుండి వచ్చే ధారావళి నది నీటిని ప్రజల అవసరాలకు ఉపయోగిస్తూ మన రాజ్యంలోని పొలాలు పండించుకుంటున్నాం. భవిష్యత్తులో వారు ధారావళి నది మీద ఆనకట్టలు కడితే మనకు నీటి కొరత రావచ్చు. అందువలన మనం కందర్ప రాజ్యాన్ని ఆక్రమిస్తే అటు నీటి లభ్యత, ఇటు మనరాజ్యం పరిశ్రమలతో ఒకే రాజ్యంగా శోభిల్లుతుంది’ అని మంత్రి తన దురాలోచనను రాజు విజయవర్మకు చెప్పాడు.మంత్రి చెప్పిన దానిమీద రాజు విజయవర్మ ఒకింత ఆలోచించి మూడు నెలలలో కందర్ప రాజ్యం మీద దండయాత్ర చేయాలని నిశ్చయించి, కందర్ప రాజ్యం రాజుగారు వివేకవర్మకి దూతద్వారా ఒక సందేశం ఈ విధంగా పంపాడు:‘మీరాజ్యాన్ని మాకు శాంతియుతంగా అప్పగించండి లేకపోతే ఉభయ రాజ్యాలకు యుద్ధం తప్పదు, రక్తపాతం తప్పదు’ఇట్లు,విజయవర్మ,ప్లవంగ రాజ్య రాజుఆ సందేశం చూసి వివేక వర్మ ఆశ్చర్య పోయాడు. ఇన్నేళ్లు శాంతియుతంగా ఉన్న ప్లవంగ రాజుకు ఈ బుద్ధి ఎలా పుట్టిందో వివేక వర్మకు అర్థం కాలేదు. వెంటనే మంత్రి సుహస్తుడిని ఈ విషయం మీద సలహా అడిగాడు.‘మహారాజా ఈ బుద్ధి విజయ వర్మకు పుట్టినది కాదు. ఎవరో ఆయన మెదడులో విషబీజం నాటారు. నేనే వెళ్ళి విజయవర్మతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను’ అని చెప్పాడు సుహస్తుడు.రెండో రోజే సుహస్తుడు ప్లవంగ రాజ్యానికి వెళ్ళి రాజు విజయవర్మను కలిసి ఈ విధంగా చెప్పాడు: ‘మహారాజా ఇన్ని సంవత్సరాలు మన రెండు రాజ్యాలు పాడి పంటలతో సుఖశాంతులతో ఉన్నాయి. ఇటువంటి సమయంలో మన మధ్య యద్ధాలు రక్తపాతాలు ఎందుకు? దానివలన ఇరు దేశాల ప్రజల జీవితాలు దెబ్బతింటాయి. మా వలన మీకు మీ రాజ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మా రాజు వివేకవర్మ సంగతి మీకుతెలుసు కదా! ఎవరికీ హాని చేయడు. ఎవరికైనా అవసరం ఉంటే సహాయమందించే మంచి మనస్తత్వం కల మంచి మనిషి. ఆలోచించండి మహరాజా!’ వివరించాడు సుహస్తుడు.సుహస్తుడి మాటలతో విజయవర్మను ఆలోచనలో పడ్డాడు.తన రాజగురువుతో మాట్లాడాక యుద్ధాన్ని ఉపసంహరించుకున్నట్లు రాజు వివేక వర్మకు సందేశం పంపించాడు. తరువాత తన మంత్రి దురోత్తుడితో, ‘మంత్రిగా తమరు అన్ని పరిస్థితులూ గమనించి లాభనష్టాలు బేరీజు వేసి నాకు సలహాలు ఇవ్వాలి. మీరు ఆలోచించకుండా సలహాలు ఇవ్వకండి’ అని మందలించాడు.విజయ వర్మ సందేశం చూసి వివేకవర్మ ఆనందించాడు. విజయవర్మను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు చెప్పి, మంచి బహుమతులు ఇచ్చాడు. వివేకవర్మ మంచి మనసుకు విజయవర్మ సంతోషించాడు. వివేకవర్మ తన మంత్రి సుహస్తుడు సమస్యను సామరస్యంగా పరిష్కరించినందుకు ఆయనకు కూడా మంచి బహుమతులు ఇచ్చాడు. ఆవిధంగా ఇరు రాజ్యాల ప్రజలు సంతోషాలను ప్రకటించారు.హితవచనం..అనిన్ద్యమపి నిన్దన్తి స్తువన్యస్తుత్యముచ్చకైఃస్వాపతేయకృతే మర్త్యాః కిం కిం నామ న కుర్వతే- మనుషులు డబ్బు కోసం చెయ్యరాని పనులన్నీ చేస్తారు. నిందిచరాని వాళ్లను నిందిస్తారు. పొగడతగని వాళ్లను పొగుడుతారు.- కంచనపల్లి వేంకట కృష్ణారావు -
98 కేజీల నుంచి 78 కేజీలకు..! హెల్ప్ అయిన డైట్‌ప్లాన్..
అధిక బరువు కొందరికీ జంక్‌ఫుడ్, అనారోగ్యకరమైన జీవనశైలి వంటివి ప్రధాన కారణాలు. మరికొందరు గంటలకొద్దీ కూర్చొని పనిచేసే డెస్క్ జాబ్‌లు, సరైన కదలికలు లేకపోవడంతో అధిక బరువు సమస్యను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత తగ్గడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినా..సక్సెస్ అయినవాళ్లు మాత్రం కొందరే. ఎందువల్ల అంటే ఇక్కడ నిలకడ, క్రమం తప్పకుండా చేయడం అనేవి అత్యంత కీలకం. ఇక్కడొక మహిళ కూడా లాక్డౌన్ కారణంగా కదలికలు లేక ఊహించిన విధంగా లావుగా అయిపోయింది. చివరికి కార్డియో వ్యాయమాలు, సరైన డైట్‌తో బరువు తగ్గడమే కాదు స్ఫూర్తిగా నిలిచింది. ఆ మహిళే..ఆనంద్ భార్గవ్. తాను 2020లో ఉన్నత విద్యను అభ్యసించడానికి మెల్బోర్న్ వెళ్లింది. మునుసటి నెలలోనే లాక్డౌన్ ప్రకటించారు. ఇంటి నుంచి కాలేజ్‌కి హాజరవడం వంటి కారణాల వల్ల కదలికలేని జీవనశైలికి దారితీసి, గణనీయంగా బరువు పెరిగిందామె. ఫలితంగా ఊబకాయ సంబంధిత లక్షణాలను అనుభవించింది. జిమ్‌లో చేరి తగ్గాలని చూసినా..పెద్దగా ప్రయోజనం లేకపోగా, మరింత ఆకలికి దారితీసి నియంత్రణ కోల్పయింది. దాంతో ఆయాసం, పాదాల వాపు వంటి సమస్యలు ఎదుర్కొంది. రక్తపరీక్షలన్నీ సాధారణంగానే ఉన్నా, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పి, ఒళ్లునొప్పులు వంటి ఊబకాయం సంబంధిత సమస్యలను ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. దాని ఫలితంగా కోపం, ఆందోళన వంటి మానసిక సమస్యలు కూడా ఎక్కువైనట్లు తెలిపింది. ఇక బరువు తగ్గగపోతే కష్టమనే పరిస్థితి ఎదురైంది ఆమెకు. దాంతో ఎలాగైన బరువు తగ్గాని డిసైడ్ అందుకోసం ప్రయత్నం మొదలుపెట్టినట్లు తెలిపింది. తనకు భారతీయ వంటకాలంటే మహా ఇష్టమని, అందుకని ఆ రుచిపోకుండా డైట్ ప్లాన్ చేసుకున్నట్లు వెల్లడించింది. తన అధిక బరువుని అమాంతం తగ్గేలా చేసిన సాధరణ డైట్ ప్లాన్‌ని కూడా పంచుకుంది. ఉదయం: చియా సీడ్ వాటర్, అల్లం-నిమ్మకాయ నీరు, సోంపు, వాము నీరు, గుప్పెడు నట్స్అల్పాహారం: అవకాడో టోస్ట్, పోహా, ఎయిర్-ఫ్రైడ్ బ్రెడ్ పకోరా, లేదా పీనట్ బటర్ టోస్ట్ఉదయం పూట చిరుతిండి: ఆయా కాలాల్లో లభించే పండ్లుమధ్యాహ్న భోజనం: రాజ్మా రైస్ లేదా కధి రైస్‌తో పాటు 100 గ్రాముల సలాడ్, 100 గ్రాముల పెరుగుసాయంత్రం చిరుతిండి: గ్రీన్ టీ లేదా కాఫీ, వేయించిన నట్స్, వేయించిన మఖానా, భేల్ లేదా ఖాఖ్రారాత్రి భోజనం: పప్పు అన్నం, రాగి లేదా బజ్రా రోటీ, కూరగాయలు, బీన్స్ లేదా పులావ్ఈ ఆహారంతో పాటు, ఆమె తగినంత నీరు తాగడంపై కూడా దృష్టి సారించింది. ఆమె ప్రతిరోజూ తప్పనిసరిగా నీరు తాగేది, దీనివల్ల బరువు పెరిగిన తర్వాత తరచుగా వచ్చే కండరాల నొప్పులను నివారించగలిగింది.ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామ దినచర్యను పాటించడం ద్వారా, ఆమె తన శక్తి స్థాయిలు పెరగడాన్ని గమనించడం ప్రారంభించింది. ఆమె మరింత చురుకుగా మారడమే కాకుండా, ఆదిత్య తన మొత్తం ఆరోగ్యం మెరుగుపడటాన్ని కూడా చూసింది. ఆమె గతంలో ఎదుర్కొన్న సమస్యలు వాటంతట అవే తగ్గడం ప్రారంభించాయి. క్రమంగా, ఆమె జిమ్‌లో చేరి, కార్డియో వ్యాయామాలు చేసి, చివరికి 20 కిలోల బరువు తగ్గింది. అలాగే ఆమె ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని కొనసాగిస్తూనే ఉండాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకుందామె.(చదవండి: అందమైన బుగ్గల కోసం..కుసుమ పూల రసం) -
వాయిదాల నవగ్రహాలకి.. భయమే అడ్డంకా?
సమయం దొరికితే చాలు పనులను రేపటికి వాయిదా వేస్తున్నారా? అయితే మీరు ఏ రకమైన ‘ప్రొక్రాస్టినేటర్’ (వాయిదా వేసే వ్యక్తి) అయి వుండవచ్చో కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కేవలం బద్ధకం వల్లే కాకుండా భయం, ఒత్తిడి, ఆలోచనా తీరు మొదలైన వాటి వల్ల పనులను వాయిదా వేసే 9 రకాల మనుషులను పరిశోధకులు గుర్తించారు.అయినా, సమయం దొరికితే చాలు పనులు చక్కబెట్టుకోవాలి కానీ, వాయిదా వేసుకోవటం ఏంటి?! ఈ అలవాటు మీ సమయాన్ని దొంగిలించకుండా, మీ కెరీర్‌ను దెబ్బతీయకుండా మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాలంటే, వాయిదా వేయకుండా ఈ రెండు ముక్కలూ చదివేయండి.టాక్స్ రిటర్న్‌లు దాఖలు చేయడాన్ని వాయిదా వేయటం, ముఖ్యమైన పనులను చివరి నిమిషం వరకు చేయకుండా వదిలేయడం లేదా అత్యవసరమైన ఈమెయిల్‌కు సమాధానం ఇవ్వకుండా దాటవేయడం.. ఇలా మనమందరం అప్పుడప్పుడు పనులను తాత్కాలికంగా ‘తప్పించుకుంటూనే’ ఉంటాం. అయితే, పనులను తాత్సారం చేయటం అనేది కేవలం ఉత్సాహం లేకపోవడం లేదా సమయం విలువ సరిగ్గా తెలియకపోవడం వల్ల మాత్రమే జరగదు.‘‘పనులను వాయిదా వేయడం అనేది – పని చేయవలసిన అవసరానికీ, చేయొచ్చులే అనే అలసత్వానికి మధ్య జరిగే ఒక రకమైన ‘తాడు లాగే ఆట’ (టగ్ ఆఫ్ వార్) లాంటిదిట’’ అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ రీసెర్చ్ అసోసియేట్ డాక్టర్ ఇటామర్ షాట్జ్ అంటున్నారు. ఆయన తన కొత్త పుస్తకం ‘సాల్వింగ్ ప్రొక్రాస్టినేషన్: ది సైన్స్ ఆఫ్ వై వి పుట్ థింగ్స్ ఆఫ్ అండ్ హౌ టు (ఫైనల్లీ!) స్టాప్’లో.. వాయిదా మనస్తత్వాల గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. వందలాది పరిశోధనా ఫలితాలను పరిశీలించిన మీదట, ఆయన.. ఈ వాయిదా వేసే వ్యక్తులను 9 భిన్నమైన రకాలుగా వర్గీకరించారు. (ఈ పుస్తకం ఆగస్టు 25న విడుదల అవుతోంది).వాయిదా తత్త్వాలు– పరిష్కారాలువాయిదా వేసే అలవాటును వదిలించుకోవడం అంటే రోజంతా పడీ పడీ చేస్తూనే ఉండటం కాదు, ఎలాంటి అపరాధ భావం లేదా ఒత్తిడి లేకుండా అనుకున్న పనిని అనుకున్న సమయంలో పూర్తి చేయటం. అయితే మీరు ఏ రకమైన స్వభావం గల వ్యక్తి అనే దానిని బట్టి మీ వాయిదా తత్వానికి పరిష్కారాలు మారుతుంటాయి. ఈ తొమ్మిది తత్వాలలో మీది ఏ తత్వమో చెక్ చేసుకోండి.1. వర్రీయర్లు (ఆందోళన చెందేవారు)లక్షణం: తాము ఏదైనా పని చేస్తే ఎక్కడ తప్పు జరుగుతుందో అని ఎప్పుడూ భయపడుతుంటారు. సమస్యల్లో పడకుండా ఉండటం కోసం అసలు చేయాల్సిన పనినే వదిలేస్తుంటారు.పరిష్కారం..మీ భయాలను స్పష్టంగా గుర్తించాలి. పెద్ద పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించుకోవాలి. అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలనే పట్టుదలను వదిలిపెట్టి, మీపై మీకు నమ్మకాన్ని పెంచుకోవాలి.2. పెసిమిస్ట్లు (నిరాశావాదులు)లక్షణం: తాము విజయం సాధించే అవకాశం చాలా తక్కువ అని ముందే ఊహించుకుంటారు. దీనివల్ల అసలు ప్రయత్నించడంలో కూడా ఎలాంటి అర్థం లేదని భావిస్తారు.పరిష్కారం..మీపై మీరు నమ్మకాన్ని పెంచుకోవాలి. భయాలను స్పష్టంగా గుర్తించి, మీకు మద్దతుగా నిలిచే సానుకూల వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి.3. పర్ఫెఫెక్షనిస్టులు (అన్నీ కచ్చితంగా ఉండాలనుకునేవారు)లక్షణం: ప్రతిదీ అక్షరాలా పర్ఫెఫెక్ట్గా చేయాలని అనుకుంటారు. కానీ, తప్పులు చేస్తామనే భయం వల్ల లేదా అందుకోలేని ప్రమాణాలను నిర్దేశించుకోవడం వల్ల ఏ పనీ చేయలేక అక్కడికక్కడే ఆగిపోతారు.పరిష్కారం..‘ఇది చాలు’ అనుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇతరుల ప్రమాణాల కంటే మీ సొంత లక్ష్యాలపైనే దృష్టి పెట్టాలి. మిమ్మల్ని మీరు విమర్శించుకోవటం మాని, మిమ్మల్ని మీరే సమర్థించుకోవాలి.4. డ్రీమర్లు (ఊహాలోకంలో విహరించేవారు)లక్షణం: ప్రస్తుతం చేయాల్సిన పనులను పక్కన పెట్టేసి, భవిష్యత్తు గురించి ఊహల్లో తేలిపోతూ సమయాన్ని గడుపుతుంటారు.పరిష్కారం..పగటి కలలు మీ ఉత్పాదకతను ఎప్పుడు దెబ్బతీస్తున్నాయో గుర్తించాలి. లక్ష్యాలను సాధించడానికి అనుసరించాల్సిన కచ్చితమైన అంశాలను విడమర్చి రాసుకోవాలి. అసలు ఊహాలోకంలో ఎందుకు చిక్కుకుపోతున్నారో (ఉదాహరణకు పర్ఫెక్షనిజం భయం) గుర్తించి సరిచేసుకోవాలి.5. జిగ్జాగర్స్ (ధ్యాస మళ్లేవారు)లక్షణం: తమ దృష్టిని ఆకర్షించే వేర్వేరు పనుల వైపు చాలా త్వరత్వరగా మారిపోతుంటారు. దీనివల్ల వారు నిజంగా చేయాల్సిన పనిపై ఎక్కువ సేపు నిమగ్నం కాలేరు. పరిష్కారం..కచ్చితమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వాటిని సాధించడానికి అవసరమైన పనులను కాగితంపై రాసి పెట్టుకోవాలి. మీ ధ్యాస మరలకుండా ఉండేలా చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకోవాలి. అవసరమైతే ఇతరుల సహాయం తీసుకోవాలి.6. థ్రిల్ సీకర్లు (సాహసాలు కోరుకునేవారు)లక్షణం: డెడ్‌లైన్ కంటే కాస్త ముందు మాత్రమే, ఎంతో ఒత్తిడి మధ్య చాలా వేగంగా పని చేయడాన్ని ఇష్టపడతారు. ఆ హడావిడి వీరికి ఒక థ్రిల్‌ను ఇస్తుంది.పరిష్కారం..కచ్చితమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. మీ ధ్యాస మరలకుండా ఉండేలా చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకోవాలి. అవసరమైతే ఇతరుల సహాయం తీసుకోవాలి.7. రెబెల్స్ (తిరుగుబాటు స్వభావం గలవారు)లక్షణం: తమ జీవితంపై తమకు తగినంత నియంత్రణ లేదని భావిస్తారు. అందుకే తమ స్వేచ్ఛను చాటుకోవడానికి, పైఅధికారులపై లేదా వ్యవస్థపై నిరసన చూపించడానికి పనులను వాయిదా వేస్తారు.పరిష్కారం..ఒక పనిని వెంటనే చేయడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో ఆలోచించాలి. ఇతరుల కఠినమైన నిబంధనలను పక్కన పెట్టి, మీ సొంత ప్రమాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మీపై ఇతరుల నియంత్రణ తక్కువగా ఉండే వాతావరణాన్ని ఎంచుకోవాలి.8. హెడోనిస్టులు (సౌఖ్య వాదులు)లక్షణం: ఆ క్షణంలో లభించే ఆనందానికి, తక్షణ సంతృప్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. భవిష్యత్తులో చేయాల్సిన పనుల గురించి చాలా తక్కువగా ఆలోచిస్తారు.పరిష్కారం..మిమ్మల్ని ముందుకు నడిపించే బాహ్య/అంతర్గత ప్రేరణలను కనుగొనాలి. మీ ధ్యాసను మళ్లించే ఆకర్షణలను మీ చుట్టుపక్కల నుండి పూర్తిగా తొలగించాలి.9. బర్న్అవుట్లు (తీవ్రంగా అలసిపోయినవారు)లక్షణం: చాలా ఎక్కువగా కష్టపడి ఉండటం వల్ల లేదా ఒత్తిడితో కూడిన, అర్థం లేని పనులు చేయడం వల్ల తీవ్రంగా అలసిపోయి ఉంటారు. అందుకే చేయాల్సిన పనిని చేయడానికి ఓపిక లేక వాయిదా వేస్తారు.పరిష్కారం..మీ ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. తగినంత నిద్ర, విశ్రాంతి లభించేలా చూసుకోవాలి. పని భారాన్ని తగ్గించుకోవాలి. ఈ ఏఐ యుగంలో వ్యక్తిగత ఉత్పాదకతకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. వాయిదా వేసే అలవాటు వినడానికి సాధారణ విషయంగా అనిపించినప్పటికీ, దీనిని నిర్లక్ష్యం చేస్తే జీవితాలను, కెరీర్లను తీవ్రంగా దెబ్బతీస్తుందని డాక్టర్ షాట్జ్ హెచ్చరిస్తున్నారు.గుణాల దశావతారాలు..పనులను వాయిదా వేసే స్వభావాలపై పరిశోధన వెలుగులోకి వచ్చిన కొద్ది రోజుల ముందే, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పొలిటికల్, సోషల్ థియరిస్ట్ డాక్టర్ మారియస్ ఓస్ట్రోవ్స్కీ మనుషుల ఆలోచనా సరళిపై మరో ఆసక్తికరమైన పరిశోధన చేశారు. సైకాలజీ, సోషియాలజీ ఆధారంగా ఆయన 10 రకాల ఆలోచనా విధానాలను (సిగ్నేచర్ థింకింగ్ స్టయిల్స్) వర్గీకరించారు. అవి..1. హ్యాపీ క్యాంపర్ : ఏ పరిస్థితినైనా సానుకూలంగా, మనస్ఫూర్తిగా తీసుకుంటూ ఎప్పుడూ ప్రశాంతంగా ఆలోచించే స్వభావం కలవారు.2. జోక్స్టర్ : క్లిష్టమైన విషయాలను కూడా హాస్యస్ఫూర్తితో, తేలికగా తీసుకుంటూ చుట్టూ ఉన్న వాతావరణాన్ని సరదాగా మార్చేవారు.3. హాట్హెడ్ : పరిస్థితులకు చాలా త్వరగా, తీవ్రంగా స్పందిస్తూ ఆవేశంతో లేదా కోపంతో నిర్ణయాలు తీసుకునే ఆలోచనా సరళి గలవారు.4. కీన్ బీన్ : ఏ పనిలోనైనా విపరీతమైన ఉత్సాహాన్ని, ఆసక్తిని చూపిస్తూ ఎల్లప్పుడూ చురుగ్గా పాలుపంచుకునేవారు.5. క్విబ్లర్ : ప్రతి చిన్న విషయానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, లోపాలను ఎత్తిచూపుతూ వాదించే స్వభావం గలవారు.6. గ్లూమ్స్టర్ : ఎప్పుడూ నిరాశావాదంతో ఉంటూ, ఏ పని చేసినా ఫలితం ప్రతికూలంగానే వస్తుందని ముందుగానే ఊహించేవారు.7. ఎగోనైజర్ : చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా తీవ్రంగా సతమతమవుతూ, విపరీతమైన మానసిక ఒత్తిడికి గురయ్యే ఆలోచనా విధానం కలిగినవారు.8. కూల్ క్యాట్ : ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా అస్సలు కంగారు పడకుండా ఎంతో స్థిరంగా, హుందాగా ఆలోచించేవారు.9. వర్రీవార్ట్ : జరగబోయే పనుల గురించి, లేనిపోని సమస్యల గురించి అనవసరంగా ముందే ఆందోళన చెందే స్వభావం కలవారు.10. రెవెలర్: జీవితాన్ని, ప్రస్తుత క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాలనుకుంటూ ఉల్లాసంగా, సంబరంగా ఆలోచించే వారు.అయితే ప్రతి ఒక్కరూ వీటిలో ఒకటి కంటే ఎక్కువ ఆలోచనా విధానాల మిశ్రమంగా కూడా ఉండే అవకాశం ఉందని మారియస్ ఓస్ట్రోవ్స్కీ వివరించారు. మనుషుల పెంపకం, వారి అనుభవాలు, వారు ఎదుర్కొనే పరిస్థితులు ఈ ఆలోచనా సరళిని ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు.ఇందులో మీరు స్వాభావికంగా ఏ రకానికి చెందిన వారో గుర్తించి, నేడే మార్పు వైపు అడుగులు వేయండి! వాయిదా వేసే అలవాటును వదులుకుని, మీ సమయాన్ని ఎలా గడపాలో మీరే నిర్ణయించుకునేలా మారటమూ గొప్ప విజయమే.- సాక్షి స్పెషల్ డెస్క్ -
తైలవర్ణ చిత్రం.. 'మీ అల్లుడికి హిమాచల్‌ప్రదేశ్‌లో..'
‘‘మీ అల్లుడికి హిమాచల్‌ప్రదేశ్‌లో చంబాకి బదిలీ అయింది.’’ సుధీర చెప్పింది. ‘‘అయ్యో! అంత దూరమా?’’ ఆమె తండ్రి వెంటనే చెప్పాడు. సాయంత్రం ఆయన సుధీరకి ఫోన్ చేసి చెప్పాడు.‘‘మీ మామయ్య దుర్గ గుడిలో అకౌంటెంట్ కదా. ఆయనకి మీ బదిలీ సంగతి చెప్తే, మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని, హిమాచల్‌ప్రదేశ్‌లో మంత్రతంత్రాలు తెలిసిన చాలామంది ఉన్నారని చెప్పారు. వాళ్ళు మనుషుల్ని వశీకరణ మంత్రాలతో ఆకర్షించి డబ్బు, బంగారం తీసుకోగలరట. ముఖ్యంగా నల్ల బట్టలు ధరించే అఘోరీలని అసలు నమ్మద్దని చెప్పమన్నారు. వాళ్ళ దగ్గర చాలా దుష్ట మంత్రశక్తులు ఉంటాయట.’’తన భర్త ఇంటికి రాగానే సుధీర ఆ సంగతులన్నీ చెప్పింది.‘‘అయితే మనం జాగ్రత్తగా ఉండాలి.’’ అతను చెప్పాడు.రెండు వారాల తర్వాత వాళ్ళు వరంగల్ నించి చంబాకి బయలుదేరారు.∙∙ సుధీర భర్త కొత్త బ్రాంచ్‌లోని సిబ్బందితో మాటల్లో తన మామగారు చెప్పింది చెప్పి అడిగాడు.‘‘అది నిజమా?’’‘‘అవును. ఎవరైనా పోయారని తెలిస్తే వచ్చి ఆ రాత్రికి శవాన్ని ఇవ్వమంటారు. సాధువుల్లా కనపడే కాషాయరంగు దుస్తులవాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. క్షుద్రపూజలో వారికి శవం అవసరం అవుతుంది.’’∙∙ చంబాకి వచ్చిన రెండేళ్ళల్లో వాళ్ళకి ఎలాంటి చేదు అనుభవం కలగకపోవడంతో క్రమంగా భయంపోయింది.రోజూ రాత్రి ఎనిమిదిలోగా ఇంటికి వచ్చే సుధీర భర్త ఓరోజు బ్రాంచ్ నించి రాత్రి పదకొండైనా రాలేదు. పదకొండుకి బ్రాంచ్‌కి ఫోన్ చేస్తే సెక్యూరిటీ గార్డ్ ఆన్సర్ చేశాడు.‘‘ఎవరూ లేరు మేడం. స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు.’’ చెప్పాడు.తెల్లవారుజామున మూడు దాకా ఆమె మేలుకునే ఉంది. తన భర్త రాకపోవడంతో ఉదయం పదిన్నరకి బేంక్‌కి ఫోన్ చేసింది. రాలేదని తెలిశాక పోలీసులకి ఫిర్యాదు చేసింది.ముందుగా పోలీసులు అతని బ్రాంచ్‌కి వెళ్ళి కేష్ సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకున్నారు. ఉందని తెలిశాక అతని కోసం వెదికారు. అతని జాడ తెలీలేదు.మర్నాడు మధ్యాహ్నం ఓ కాన్ స్టబుల్ వారింటికి వచ్చి అడిగాడు.‘‘మీవారి స్కూటర్ రోడ్ మీద ఎవరి ఇంటి ముందో ఉందట. అది దొంగిలించబడిందనే అనుమానంతో ఒకరు ఫోన్ చేశారు. చంపావతి నగర్లో మీకు బంధుమిత్రులు ఉన్నారా?’’ ‘‘లేరండి. అక్కడికి ఎందుకు వెళ్ళి ఉంటారు?’’ సుధీర ఆదుర్దాగా చెప్పింది. ఇద్దరూ అక్కడికి చేరుకున్నారు. వాళ్ళని చూసి ఎదురింట్లోంచి ఫిర్యాదు చేసిన ముసలాయన బయటికి వచ్చి చెప్పాడు.‘‘రాత్రి నించి ఇది ఇక్కడే ఉండటంతో ఎవరో దొంగిలించి ఇక్కడ వదిలారని అనుమానించాను.’’ ‘‘మీ ఎదురింట్లో ఎవరు ఉంటారు?’’ స్కూటర్ ఆ ఇంటివైపు పార్క్ చేసి ఉండటంతో పోలీస్ కానిస్టేబుల్ అడిగాడు. ‘‘అది ఖాళీ. అందులో ఎవరూ లేరు. అక్కడో సంఘటన జరిగాక ఎవరూ అద్దెకి రాలేదు.’’ ఆయన నెమ్మదిగా చెప్పాడు. ‘‘ఏమిటది?’’ సుధీర వెంటనే అడిగింది. ‘‘నాలుగైదేళ్ళ క్రితం ఆ ఇంటావిడ అకస్మాత్తుగా నెత్తురు కక్కుకుని మరణించింది. రాత్రుళ్ళు మగాళ్ళు ఆ ఇంటి పక్కనించి వెళ్తూంటే రమ్మని ఇంట్లోంచి ఆడవాళ్ళ పిలుపు వినిపిస్తుంది.’’కాన్ స్టబుల్ ఓ అపార్ట్మెంట్కి వీధివైపున్న సీసీటీవీ కెమెరాని గమనించి దాన్ని చెక్ చేస్తే, రెండు రోజుల క్రితం చీకటి పడుతూండగా సుధీర భర్త దాని డోర్ బెల్ నొక్కడం, తలుపు తెరుచుకున్నాక లోపలికి వెళ్ళడం కనిపించింది. తర్వాత రికార్డ్ అయినదంతా చెక్ చేశారు కాని, ఆ ఇంట్లోంచి సుధీర భర్త మళ్ళీ బయటకి రావడం కనిపించలేదు. ‘‘సందేహం లేదు. ఆయన ఏ కారణంగానో లోపలే ఉన్నారు.’’ సుధీర కంగారుగా చెప్పింది. ‘‘అదెలా జరుగుతుంది? దాని తాళంచెవులు నా దగ్గరే ఉన్నాయి. దాన్ని మా బాబాయి కొన్నారు.’’ ముసలాయన ఆశ్చర్యంగా చెప్పాడు. తాళం తెరిచి అంతా లోపలికి వెళ్ళగానే సుధీర గట్టిగా అరిచింది.‘‘ఏమండీ? ఉన్నారా?’’ పాతికేళ్ళ క్రితం కట్టిన ఆ ఆరు గదుల ఇంట్లోని ప్రతీ గదిని వెతికారు. బూజు. ఎవరూ లేరు. కాన్ స్టబుల్ ప్రతి అల్మరా తలుపులు తెరిచి చూస్తే లోపలా లేడు. పడక గదిలో గోడకి వేలాడే తైలవర్ణచిత్రంలో జలతారు చీరలోని అందమైన ఏభై ఏళ్ళ స్త్రీ కనిపించింది.‘‘ఆ తైలవర్ణచిత్రం మరణించిన ఆవిడది... అరే. ఈ బొమ్మలోకి కొత్తగా ఎవరో వచ్చారే? దీన్ని ఈ బొమ్మలో ఎవరు గీశారో?’’ ఎదురింటి ఆయన సంభ్రమంగా చెప్పాడు. ‘‘అది మా వారే.’’ సుధీర కెవ్వున అరిచి చెప్పింది.- మల్లాది వెంకట కృష్ణమూర్తి -
ఏమిటీ ఈ పిచ్చి? ఈమె ఎందుకు ఇలా డ్యాన్స్ చేస్తోంది?
అది 1518 జూలై– ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్ నగరం– ఆకాశం నిర్మలంగా ఉంది. నగర వీథులు ఎప్పటిలాగే జనసమ్మర్దంతో సందడిగా ఉన్నాయి. హఠాత్తుగా ఒక ఇరుకైన సందులోంచి ఓ మహిళ రోడ్డుపైకి పరుగున వచ్చింది. ఆమె పేరు ఫ్రావ్ ట్రోఫియా. ఆమె ముఖంలో ఏదో తెలియని భయం; కళ్లల్లో విపరీతమైన ఆందోళన. కానీ విచిత్రంగా ఆమె కాళ్లు మాత్రం అసంకల్పితంగా నర్తించడం ప్రారంభించాయి. చుట్టుపక్కల వాళ్లంతా ఆమెను ఆశ్చర్యంగా చూస్తున్నారు.‘ఏమిటీ పిచ్చి? పండగ లేదు, పబ్బం లేదు– ఈమె ఎందుకు ఇలా డ్యాన్స్ చేస్తోంది?’ అని గుసగుసలాడుకుంటున్నారు. కొంతమంది నవ్వుకుంటున్నారు. అయినా సరే ట్రోఫియా నృత్యం ఆపలేదు. సూర్యుడు అస్తమించాడు; చీకటి పడింది; తెల్లవారింది. అయినా ట్రోఫియా కాళ్లు ఆగడంలేదు. ఆమె శరీరం చెమటతో తడిసి ముద్దవుతోంది. ఊపిరి కూడా సలపడంలేదు. స్పృహ తప్పి కింద పడిపోతోంది. కానీ కళ్లు తెరవగానే, మెదడుకు ఏదో కరెంట్ షాక్ తగిలినట్లు మళ్లీ లేచి డ్యాన్స్ చేస్తోంది. అలా ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు– ఏకధాటిగా ఆరు రోజుల పాటు ఆమె మృత్యునృత్యం చేస్తూనే ఉంది.ట్రోఫియాను చూసి నగర ప్రజలు నవ్వుకుంటుండగానే, మొదటి వారం ముగిసేసరికి మరో 34 మంది వీథిలోకి వచ్చి ఆమెతో జత కలిశారు. వాళ్లకు కూడా ఏమైందో ఎవరికీ అర్థం కాలేదు. ఒకరిని చూసి ఒకరు– అలా కేవలం నెల రోజులు గడిచేసరికి దాదాపు 400 మందికి పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చి, పిచ్చిపట్టినట్లు నృత్యం చేయడం ప్రారంభించారు. వీరిలో ఎక్కువగా మహిళలు, చిన్నపిల్లలు, యువకులు ఉన్నారు. అదొక వింతైన అంటువ్యాధిలా మారిపోయింది. చూసేవాళ్లకు అది డ్యాన్స్‌లా లేదు. ఏదో అదృశ్య శక్తి వారి చేతులకు, కాళ్లకు దారాలు కట్టి బొమ్మలా ఆడిస్తున్నట్లు ఉంది.పగలూ రాత్రీ తేడా లేదు. ఎండా వానా తేడా అసలే లేదు. కాళ్లు అరిగిపోయి, పాదాలు చిట్లి నెత్తురోడుతున్నా, నర్తించడం మాత్రం ఆపలేకపోతున్నారు. విపరీతమైన డీహైడ్రేషన్, గుండెపోటు కారణంగా రోజుకు కనీసం 15 మంది వరకు రోడ్లపైన డ్యాన్స్ చేస్తూనే ప్రాణాలు విడిచారు. ఈ వింత పరిస్థితిని చూసి నగర పాలకులు, వైద్యులు తలలు పట్టుకున్నారు. ‘ఇది వేడి రక్తం వల్ల వచ్చే శారీరక సమస్య. దీనికి విరుగుడు ఒక్కటే– వాళ్లను ఇంకా ఎక్కువగా డ్యాన్స్ చేయనివ్వండి. రక్తం చల్లబడితే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది!’ అని కొందరు వైద్యులు సలహా ఇచ్చారు.అంతే! అధికారులు రంగంలోకి దిగారు. బాధితుల కోసం నగరంలో పెద్ద పెద్ద హాల్స్, స్టేజీలు ఏర్పాటు చేశారు. వాళ్లకు మరింత ఉత్సాహం ఇవ్వడానికి ప్రత్యేకంగా డ్రమ్మర్స్, సంగీతకారులను పిలిపించి మరీ వాయించారు. కానీ ఈ నిర్ణయం మరింత బెడిసి కొట్టింది. హోరెత్తించే డ్రమ్స్ శబ్దాలు వినబడటంతో నగరంలోని మరికొంతమంది సాధారణ ప్రజల మెదళ్లు కూడా పాడైపోయి, ఆ డ్యాన్స్ గ్రూప్‌లో చేరిపోయారు. మరణాల సంఖ్య మరింతగా పెరిగింది. చివరకు ప్రభుత్వం భయపడి నగరంలో డ్యాన్స్‌ను పూర్తిగా నిషేధించింది. బాధితులను బలవంతంగా ఒక పర్వత గుహలోని చర్చికి తరలించి, ప్రత్యేక పూజలు చేయించాక, సెప్టెంబర్‌లో ఈ కరాళ నృత్యం నెమ్మదిగా ముగిసింది.శతాబ్దాలుగా ఈ ‘డ్యాన్సింగ్ ప్లేగ్’పై ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఆధునిక శాస్త్రవేత్తలు దీని వెనుక రెండు ప్రధాన కారణాలు ఉండవచ్చని గట్టిగా నమ్ముతున్నారు. అప్పట్లో ప్రజలు తినే రాగులు, గోధుమల లాంటి ధాన్యాలకు ‘ఎర్గోట్’ అనే ఒక రకమైన ఫంగస్ పట్టేది. ఈ ఫంగస్ ఉన్న ఆహారాన్ని తింటే మనుషుల్లో భ్రమలు, ఫిట్స్, విపరీతమైన నరాల కదలికలు వస్తాయి. అంటే ఇది ఇప్పటి ఎల్ఎస్డీ వంటి ప్రమాదకరమైన డ్రగ్‌లా పనిచేస్తుంది. అందువల్లే వారు అలా భయంకరంగా నర్తించి ఉంటారనే అంచనాకు వచ్చారు. అలాగే 1518 కాలంలో ఆ నగరంలో తీవ్రమైన కరవు, భయంకరమైన రోగాలు ఉన్నాయి. ఆ విపరీతమైన మానసిక ఒత్తిడి తట్టుకోలేక, ప్రజల మెదడు ఒకేసారి ఆల్టర్నేట్ మోడ్‌లోకి వెళ్లిపోయి ‘మాస్ హిస్టీరియా’కు దారితీసి ఉండవచ్చనే వాదనలూ ఉన్నాయి.అయితే, ఒక ఫంగస్ వల్ల లేదా మానసిక ఒత్తిడి వల్ల మనుషులు ఏకధాటిగా రోజులు తరబడి ప్రాణాలు పోయేంత వరకు ఎలా డ్యాన్స్ చేయగలరు? అనే ప్రశ్నకు ఇప్పటికీ సైన్స్ దగ్గర పూర్తి స్పష్టమైన సమాధానం లేదు. తమ నియంత్రణలో లేని శరీరాలతో, మరణం వైపు అడుగులు వేస్తూ ఆనాడు ఆ నాలుగువందల మంది అనుభవించిన నరకం ఎలాంటిదో ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మనిషి మెదడుతో ప్రకృతి ఆడిన ఈ వింత ఆట చరిత్ర పుటల్లో ఎప్పటికీ ఒక వీడని మిస్టరీనే!- సత్యకిశోర్ -
బాలి దీవిలో ఘనంగా గాలిపటాల వేడుక..
బాలి దీవిలో ఆకాశంపైకి ఎటు చూసినా రంగు రంగుల గాలిపటాలు కనువిందు చేస్తాయి. జూలై నుంచి అక్టోబర్ వరకు ఇదే దృశ్యం బాలి దీవికి కళ తీసుకొస్తుంది. ఈ గాలిపటాల వేడుకను దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో బాలి దీవికి చేరుకుంటారు. ఇండోనేషియాలోని బాలి దీవిలో ఏటా జరిగే ‘బాలి కైట్ ఫెస్టివల్’ ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది.కైట్స్ ఫెస్టివల్ బాలి అంతటా వివిధ ప్రాంతాలలో జరుగుతుంది. అయితే, ఈ కైట్ ఫెస్టివల్ ప్రారంభ, ముగింపు వేడుకలు మాత్రం సనుర్ ప్రాంతానికి ఉత్తరాన ఉన్న పడంగ్గలక్ బీచ్‌లో నిర్వహిస్తారు. ఈ వేడుకలే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వీటితో పాటు మస్కెటి బీచ్, మెర్తాసరి బీచ్, కుటా, ఉబుద్, దెన్ పసార్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో కూడా ఈ ఉత్సవాలు ఆనందోత్సాహాలతో జరుగుతాయి. ఈ వేడుకల సమయంలో ప్రతిచోటా వినిపించే బాలి సాంప్రదాయ సంగీతమైన ‘గమేలాన్ ఆర్కెస్ట్రా’ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.హిందూ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం, ఈ గాలిపటాల పండుగ కేవలం ఒక వినోదం మాత్రమే కాదు. పంటలు సమృద్ధిగా పండినందుకుగాను దేవతలకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారి ఆశీస్సులు కోరుతూ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ‘బంజర్’ అని పిలిచే స్థానిక యువజన సంఘాలు, వారి ‘సెకా లాయంగన్’ అంటే గాలిపటాల బృందాలతో కలిసి ఈ పోటీల్లో పాల్గొని ప్రథమ బహుమతి కోసం తలపడతాయి. ప్రతి బృందంలో 70 నుంచి 80 మంది సభ్యులు ఉంటారు. వీరంతా కలిసి గాలిపటాలను సిద్ధం చేయడం, వాటిని గాల్లోకి ఎగరేయడం ఒక అద్భుతమైన టీమ్‌వర్క్. ఈ పోటీలలో అత్యంత సృజనాత్మకమైన, వినూత్నమైన గాలిపటానికి ‘న్యూ క్రియేషన్’ అవార్డుతో పాటు భారీ నగదు బహుమతిని కూడా అందజేస్తారు. త్రీ–డైమెన్షనల్ రూపాలు, వివిధ రకాల మస్కట్ల ఆకృతులలోని గాలిపటాలను ఇక్కడ ప్రదర్శిస్తారు.త్రిమూర్తుల సంకేతం..ఈ ఉత్సవాల్లో మూడు రకాల గాలిపటాలను తయారుచేస్తారు. జాంఘన్ అనే గాలిపటం పక్షి ఆకారంలో ఉంటూ, దాదాపు 100 మీటర్ల కంటే పొడవైన తోకను కలిగి ఉంటుంది. రెండవది బెబీయన్ అని పలిచే గాలిపటం. ఇది చేప ఆకారంలో ఉండి అన్నిటికంటే పెద్దగా ఉంటుంది. ఇక మూడోది పెకుకాన్ గాలి పటాలు. ఇవి ఆకు ఆకారంలో ఉండి గాలిలో స్థిరంగా ఉండవు. అందువల్ల దీన్ని గాలిలో ఎగురవేయడానికి 10 మందికి పైగా నిపుణులైన ఫ్లైయర్స్ అవసరమవుతారు.అంతేకాకుండా ఈ సాంప్రదాయ గాలిపటాలలో ఉపయోగించే రంగులకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఎరుపు, తెలుపు, నలుపు రంగులు హిందూ త్రిమూర్తులను సూచిస్తాయి. ఎరుపు రంగు సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుడిని, తెలుపు రంగు రక్షకుడైన విష్ణుమూర్తిని, నలుపు రంగు లయకారుడైన శివుడిని సూచిస్తాయి. అలాగే అష్టదిక్పాలకులను గౌరవిస్తూ పసుపు రంగును కూడా జోడిస్తారు. -
అందమైన బుగ్గల కోసం..కుసుమ పూల రసం
‘లూబ్రిటీ ఎలక్ట్రిక్ మజిల్ స్టిమ్యులేషన్, రేడియో ఫ్రీక్వెన్సీ స్కిన్‌కేర్ డివైజ్’– చర్మ సంరక్షణ కోసం తాజాగా అందుబాటులోకి వచ్చిన పరికరం ఇది. ఇందులోని రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీ చర్మం లోపలి పొరల్లో కొలాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించి, చర్మం బిగుతు సడలిపోకుండా చేస్తుంది. ఇక ఎలక్ట్రికల్ మజిల్ స్టిమ్యులేషన్ థెరపీ.. అతి తక్కువ విద్యుత్ ప్రేరణల ద్వారా చర్మ కండరాలను బలోపేతం చేసి ముఖంపై ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ డివైస్ ఇన్‌బిల్ట్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది గనుక దీనిని ప్రయాణాల్లో కూడా సులభంగా వాడుకోవచ్చు. అంతేకాకుండా క్లినిక్‌లలో లభించే ఖరీదైన ట్రీట్మెంట్లతో పోలిస్తే, ఇది చాలా తక్కువ ధరకే లభిస్తుండటం విశేషం. బ్యూటీ పార్లర్లు, క్లినిక్‌ల చుట్టూ తిరిగే పనిలేకుండా, ఇంట్లోనే కూర్చుని ప్రొఫెషనల్ స్థాయి చర్మ సంరక్షణను పొందేందుకు ఈ హ్యాండ్‌హెల్డ్ పరికరం ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.డార్క్ సర్కిల్స్‌కి ఇలా చెక్ పెట్టేయండి!కీరదోసలో చర్మాన్ని చల్లబరచడమే కాకుండా చర్మాన్ని బిగుతుగా చేసే గుణాలు కూడా ఉంటాయి. చల్లటి కీరదోస ముక్కలను కళ్లపై 10–15 నిమిషాల పాటు ఉంచడం వల్ల కళ్ల అలసట తగ్గి, రక్తప్రసరణ మెరుగవుతుంది. వాడేసిన గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ బ్యాగ్స్‌ను ఫ్రిజ్‌లో ఉంచి, చల్లబడిన తర్వాత కళ్లపై పెట్టుకోవాలి. టీలో ఉండే కెఫీన్, యాంటీ ఆక్సిడెంట్లు కళ్ల కింద ఉండే రక్తనాళాలను సంకోచింపజేసి, వాపును, నలుపును తగ్గిస్తాయి. అలాగే బంగాళాదుంపలో సహజసిద్ధమైన బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. ఇది చర్మంపై ఉన్న నలుపును తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. బంగాళదుంప రసంలో దూదిని ముంచి, కళ్ల కింద అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. హోం రెమెడీస్‌తో పాటు రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం. శరీరంలో నీటి శాతం తగ్గినా కళ్ల కింద చర్మం నిర్జీవంగా మారుతుంది. కాబట్టి రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. అలాగే నిద్రపోయేటప్పుడు ఒకటి లేదా రెండు దిండ్లను తల కింద ఉంచుకోవడం వల్ల కళ్ల కింద ద్రవాలు చేరకుండా నిరోధించవచ్చు. దీనివల్ల పొద్దున్నే లేచేసరికి కళ్లు ఉబ్బినట్లు ఉండవు. చక్కటి బుగ్గల కోసం..బుగ్గలకు సహజమైన, ఆరోగ్యకరమైన రంగును అందించడానికి ఉపయోగించే మేకప్‌లో ఫేస్ బ్లష్ కూడా ముఖ్యమైనది. ఇందుకోసం వేల సంవత్సరాల క్రితం ప్రాచీనా చైనాలో మహిళలు సహజసిద్ధమైన పూల రసంతో తమ బుగ్గలను ఎరుపు రంగులోకి మార్చుకునేవారు. క్రీస్తుపూర్వం 16 నుంచి 11వ శతాబ్దానికి చెందిన ‘షాంగ్ రాజవంశం’ కాలంలో ‘హాంగ్–లాన్ హువా’ (కుసుమ పువ్వుల) రసాన్ని గడ్డకట్టించి బ్లష్‌గా ఉపయోగించేవారు. దీనిని అప్పట్లో ‘యాన్–ఝీ’ అని పిలిచేవారు. ముఖానికి దోర గులాబీ రంగు మేకప్ లుక్ తీసుకురావడానికి, లిప్ కలర్ తయారుచేయడానికి మహిళలు దీనిని విరివిగా వాడేవారట! -
ప్రాంక్ కాల్..
బిజినెస్‌మేన్ సారథి ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాడు. సరిగా అదే సమయంలో ఒక గుర్తుతెలియని నంబర్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. సారథి ఫోన్ తీశాడు. అవతలి వ్యక్తి గొంతులో కరుకుదనం... ‘నీ కొడుకు రిత్విక్‌ను కిడ్నాప్ చేశాం. ఒక గంటలో పది లక్షల రూపాయలు తీసుకుని స్టార్ బేకరీ దగ్గరికి రా. పోలీసులకు చెబితే నీ కొడుకు ప్రాణాలు ఉండవు’ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు.రిత్విక్ తన ఫ్రెండ్ బెనర్జీ ఇంటికి వెళ్తానని చెప్పాడు. వెంటనే సారథి బెనర్జీకి ఫోన్ చేశాడు. రిత్విక్ తన దగ్గరికి రాలేదని చెప్పాడు.సారథికి కాళ్లూ చేతులూ ఆడలేదు. పెళ్ళైన పదేళ్లకు లేకలేక పుట్టిన కొడుకు. ఇంకేమీ ఆలోచించలేదు. డబ్బులు సూట్ కేసులో పెట్టుకుని స్టార్ బేకరీ దగ్గరికి వెళ్ళాడు. కానీ కిడ్నాపర్ జాడ లేదు. ఐదు... పది నిమిషాలు... అప్పుడే నవ్వుతూ ఎదురొచ్చాడు బెనర్జీ. వెంటనే ఆందోళనగా ‘నువ్వేంటి ఇక్కడ?’ అంటూ కొడుకు కిడ్నాప్ అయిన విషయం చెప్పి, పది లక్షలు ఉన్న సూటుకేసు చూపించాడు సారథి.వెంటనే బెనర్జీ నవ్వడం మొదలుపెట్టాడు.నిజానికి అది స్నేహితుడు బెనర్జీ ఆడిన ఒక క్రూరమైన ‘ప్రాంక్ కాల్’ నాటకం. రిత్విక్‌ను స్టార్ బేకరీకి తీసుకువెళ్లి, అక్కడ కూర్చోబెట్టి సారథిని భయపెట్టాలని బెనర్జీ ప్లాన్ వేశాడు.కానీ అప్పుడే అనూహ్య సంఘటన జరిగింది. రిత్విక్ నిజంగానే కిడ్నాప్ అయ్యాడు.∙∙ ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న రంగంలోకి దిగాడు.ప్రాంక్ కాల్ చేసిన ఫ్రెండ్ బెనర్జీని అదుపులోకి తీసుకుని విచారించాడు. బెనర్జీ ఏడుస్తూ, ‘సార్, నేను కేవలం సరదా కోసమే ఫోన్ చేశాను. బేకరీలోనే బాబు ఉన్నాడు, ఇంతలోనే ఏమైందో తెలియదు’ అని చెప్పాడు.ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న వెంటనే బేకరీలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించాడు. అందులో ముఖానికి మాస్క్ ధరించిన ఒక వ్యక్తి రిత్విక్‌ను తన వెంట తీసుకువెళ్లడం స్పష్టంగా కనిపించింది. ప్రద్యుమ్న చుట్టుపక్కల విచారణ మొదలుపెట్టాడు. కానీ ఎలాంటి ఆధారం లభించలేదు. అనుమానాస్పదంగా కూడా ఎవరూ కనిపించలేదు. వాడెవరా అని ఆరా తీసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.ప్రద్యుమ్న పోలీస్ బుర్ర శరవేగంగా పనిచేయడం ప్రారంభించింది. కిడ్నాప్ చేసినవాడికి ఏమైనా క్రిమినల్ రికార్డు ఉందా అని అనుమానించాడు. ఆ వ్యక్తి నడక, శైలిని బట్టి ప్రద్యుమ్న తన పోలీస్ డేటాబేస్‌ను తనిఖీ చేయగా, వాడు పాత క్రిమినల్ అని క్లూ దొరికింది. రిత్విక్ ఒంటరిగా బేకరీలో కనిపించేసరికి కిడ్నాప్ చేశాడు.కానీ వాడు ఎటు వెళ్లాడో తెలుసుకోవడం ఎలా? ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న ఒక అద్భుతమైన ప్లాన్ వేశాడు. కిడ్నాపర్ బేకరీకి వచ్చినప్పుడు కచ్చితంగా ఏదో ఒకటి ఆర్డర్ చేసి ఉంటాడని భావించి, ఆ సమయానికి సంబంధించిన బేకరీ బిల్స్, కౌంటర్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాడు. ప్రద్యుమ్న అనుకున్నట్లే, మాస్క్ ధరించిన ఆ క్రిమినల్ బేకరీలో బిల్లు చెల్లించడానికి తన మొబైల్ నుంచి ‘గూగుల్ పే’ చేసినట్లు గుర్తించాడు.వెంటనే ఆ ‘గూగుల్ పే’ లావాదేవీకి సంబంధించిన మొబైల్ నంబర్‌ను ట్రేస్ చేయాల్సిందిగా సైబర్ క్రైమ్ టీమ్‌ను ఆదేశించాడు ప్రద్యుమ్న.కేవలం పది నిమిషాల్లో ఆ నంబర్ లొకేషన్ నగర శివార్లలోని ఒక నిర్జన ప్రదేశాన్ని చూపించింది. ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న తన టీమ్‌తో కలిసి మెరుపు వేగంతో ఆ స్థావరంపై దాడి చేశాడు. రిత్విక్ నోటికి ప్లాస్టర్ వేసి బంధించిన ఆ పాత క్రిమినల్‌ను గన్ పాయింట్లో లొంగదీసుకుని, రిత్విక్‌ను సురక్షితంగా కాపాడాడు. అసలు కిడ్నాపర్‌ను అరెస్ట్ చేసిన తర్వాత, ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న బెనర్జీ వైపు సీరియస్‌గా చూశాడు. ‘చూశావా బెనర్జీ! కుటుంబ సభ్యులతో... స్నేహితులతో సరదాగా ఆడుకునే ఈ ప్రాంక్ కాల్స్ చాలాసార్లు ప్రమాదాలను తెచ్చి పెడుతుంది. సరదాకు ఒక లిమిట్ ఉంటుంది... నీ వెర్రి సరదా ఈరోజు ఒక పాత క్రిమినల్‌కు ఎంత పెద్ద అవకాశం ఇచ్చిందో!’ అని హెచ్చరించాడు ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న. బెనర్జీ తలదించుకుని క్షమాపణలు కోరాడు.- శ్రీసుధామయి -
ఓఆర్ఎస్ ఇస్తే... విరేచనాలు తగ్గిపోతాయా?
మా రెండేళ్ల బాబుకు నిన్నటి నుంచి విరేచనాలు అవుతున్నాయి. ఇంట్లో పెద్దలు తిండి ఆపేయాలని నీళ్లు తక్కువగా ఇవ్వాలని చెప్తున్నారు. మెడికల్ షాప్‌లో ఓఆర్ఎస్ పొడి, జింక్ మాత్రలు తీసుకోమన్నారు. నిజంగా ఇవి ఎంత అవసరం. ఓఆర్ఎస్ ఇస్తే విరేచనాలు వెంటనే తగ్గిపోతాయా?– కావ్య, చిత్తూరు. ఈ సందేహం మీ ఒక్కరిదే కాదు. దాదాపు ప్రతి పేరెంట్ మనసులో ఇదే ప్రశ్న ఉంటుంది. కానీ ముందుగా ఒక నిజం తెలుసుకోవాలి. ఇక్కడ పిల్లలకు వచ్చిన అసలైన ప్రమాదం విరేచనాలు కావు. శరీరంలో నీరు, లవణాలు వేగంగా తగ్గిపోవడమే (డీహైడ్రేషన్) పెద్ద ముప్పు. సమయానికి జాగ్రత్త తీసుకోకపోతే అది ప్రాణాపాయంగా మారే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రమాదం నుంచి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చిన్నారులను కాపాడిన అద్భుతమైన మార్గమే ఓఆర్ఎస్. అందుకే ప్రతి ఏడాది జూలై ఇరవై తొమ్మిదిని ప్రపంచ ఓఆర్ఎస్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సందేశం ‘ఓఆర్ఎస్: చిన్న పరిష్కారం– ఆరోగ్యమైన భవిష్యత్తు’ ఇక ప్రజారోగ్య నినాదం అయితే, ‘తెలివిగా తాగండి, బలంగా ఉండండి. ఓఆర్ఎస్ను ఎంచుకోండి’. అందుకే, ముందుగా ప్రతి తల్లిదండ్రులు ఓఆర్ఎస్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ చెప్తాను. ఓఆర్ఎస్ అంటే ఏమిటి?ఓఆర్ఎస్ అనేది చక్కెర, ఉప్పు, ఇతర శరీరానికి అవసరమైన లవణాల సరైన మిశ్రమం. చాలామంది అనుకునేలా ఇది విరేచనాలను ఆపే మందు కాదు. ఇది విరేచనాల వల్ల శరీరం కోల్పోయిన నీరు, సోడియం, పొటాషియం వంటి లవణాలను తిరిగి భర్తీ చేసి పిల్లలను డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది. అందుకే, చాలామంది డాక్టర్లు విరేచనాలు మొదలైన వెంటనే ఓఆర్ఎస్ ఇవ్వడం ప్రారంభిస్తే చాలా సందర్భాల్లో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం తగ్గుతుందని సూచిస్తారు. జింక్ ఎందుకు అవసరం?విరేచనాల సమయంలో పిల్లల శరీరంలో జింక్ స్థాయి తగ్గిపోతుంది. జింక్ ఇవ్వడం వలన పిల్లలు త్వరగా కోలుకుంటారు. అలాగే, విరేచనాలు ఉండే రోజులు తగ్గుతాయి. మళ్లీ విరేచనాలు వచ్చే అవకాశం తగ్గుతుంది. పేగులు త్వరగా బలపడతాయి. శరీర రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది. ఎన్ని రోజులు ఇవ్వాలి? ఆరు నెలల లోపు పిల్లలకు రోజుకు పది మిల్లీగ్రాముల జింక్ పద్నాలుగు రోజుల పాటు, ఆరు నెలలు దాటిన పిల్లలకు రోజుకు ఇరవై మిల్లీగ్రాముల జింక్ పద్నాలుగు రోజుల పాటు చాలు. లేదంటే, వైద్యుడి సూచించిన మోతాదులో మాత్రమే ఇవ్వాలి.ఎలా ఇవ్వాలి?బిడ్డ ఒకేసారి ఎక్కువగా తాగలేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి ఒకటి లేదా రెండు చెంచాల చొప్పున ఇవ్వండి. ఒకటి లేదా రెండు నిమిషాలకు ఒకసారి నెమ్మదిగా తాగించండి. వాంతి చేసినా ఐదు నుంచి పది నిమిషాలు ఆగి మళ్లీ ప్రారంభించండి. ఈ చిన్న చిన్న గుక్కిళ్లు పిల్లలకు పెద్ద రక్షణ.ఓఆర్ఎస్ ఎలా తయారు చేయాలి? ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్‌ను ఒక లీటరు శుభ్రమైన నీటిలో మాత్రమే పూర్తిగా కలపాలి. ముఖ్యంగా పాలు, పండ్లరసం లేదా సోడా పానీయాల్లో అసలు కలపకూడదు. తయారు చేసిన ద్రావణాన్ని ఇరవై నాలుగు గంటల్లోపు ఉపయోగించాలి. మిగిలిన ద్రావణాన్ని మళ్లీ వాడకుండా పారేయాలి.విరేచనాలు ఉన్నప్పుడు పిల్లలకు తిండి పెట్టాలా? తప్పకుండా పెట్టాలి. చాలామంది చేసే పెద్ద పొరపాటు తిండి పూర్తిగా ఆపేయడం. అలా చేయకండి. తల్లిపాలు, పెరుగన్నం, గంజి, అరటిపండు, ఇడ్లీ, ఖిచిడీ, సాధారణ ఇంటి ఆహారం ఇలా ఇవన్నీ పిల్లలకు ఇవ్వవచ్చు.వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితులు పిల్లలు నీళ్లు తాగలేకపోతే, పదేపదే వాంతులు అవుతుంటే, కళ్లు లోపలికి వెళ్లినట్లు కనిపిస్తే, నోరు పూర్తిగా పొడిగా ఉంటే, మూత్రం చాలా తగ్గిపోతే, చాలా నీరసంగా లేదా మత్తుగా ఉంటే, మలంలో రక్తం కనిపిస్తే, ఆరు నెలల లోపు శిశువుకు తరచు విరేచనాలు వస్తే, అధిక జ్వరం. ఈ లక్షణాల్లో ఒక్కటి కనిపించినా ఇంటి చిట్కాలపై ఆధారపడకుండా వెంటనే పిల్లల వైద్యుడిని సంప్రదించండి.చివరగా ఒక చిన్న ఓఆర్ఎస్ ప్యాకెట్, ఒక చిన్న జింక్ మాత్ర, ఒక తల్లి సరైన నిర్ణయం... ఈ మూడు కలిసి ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడగలవు. అందుకే, ఈ జూలై ఇరవై తొమ్మిది ప్రపంచ ఓఆర్ఎస్ దినోత్సవం సందర్భంగా ప్రతి కుటుంబం ఓఆర్ఎస్ గురించి తెలుసుకోవాలి. ఇంట్లో ఎప్పుడూ నిల్వ ఉంచుకోవాలి. అవసరం వచ్చిన వెంటనే ఉపయోగించాలి. ఎందుకంటే ఓఆర్ఎస్ సాధారణ ద్రావణం కాదు. లక్షలాది చిన్నారుల ప్రాణాలను కాపాడిన నమ్మకమైన జీవరక్షక మిత్రుడు. డా‘‘ కె. పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ (చదవండి: స్విగ్గీ రైడర్‌గా వైద్యవిద్యార్థి..! కట్‌చేస్తే కోటీశ్వరుడిగా..) -
దెయ్యం అనుకుని చంపాను...
మనిషి భయంతో ఉన్నప్పుడు తాడు కూడా పాములా కనిపిస్తుంది. ఒక్కోసారి ఎదురుగా ఉన్న మనిషిని కూడా దెయ్యంలా భ్రమింప చేస్తుంది. ఆ రాత్రీ సరిగ్గా ఇలానే జరిగింది. ఎదురుగా చీకట్లో కనిపిస్తున్న మహిళలే ఆ ఊరికి పట్టిన దెయ్యాల్లా ఓ వ్యక్తి భావించాడు. చేతిలో ఉన్న ఆయుధంతో దాడి చేశాడు.ఓ మహిళ ప్రాణం గాల్లో కలిసిపోయింది. కొంతసేపటికి అతని భ్రమ తొలగింది. వాస్తవం అర్థమైంది. భయం కారణంగా నేరానికి పాల్పడితే చట్టం రక్షిస్తుందా? భ్రమలో ప్రాణం తీస్తే శిక్ష ఉండదా? ఇదో అరుదైన కేసుగా నిలిచింది.ఆశ కేన్సర్ ఉన్న వాడ్ని కూడా బతికిస్తుంది. భయం ఏ రోగం లేని వాడిని కూడా చంపేస్తుంది. అలాంటి భయం– దెయ్యాలున్నాయనే ఓ గూర్ఖా నమ్మకం ఒక అమాయక మహిళ ప్రాణం తీసింది. మరో ఇద్దర్ని తీవ్రంగా గాయపరిచింది. అతడ్ని నిందితుడ్ని చేసింది. భ్రమలో జరిగిన నేరంగా పరిగణించాలని నిందితుడు, ఐపీసీ సెక్షన్ 79 ఇతడికి రక్షణ కల్పించదని ప్రభుత్వం – ఇరు పక్షాలు కోర్టులో వాదించాయి. చివరకు ఈ కేసును ఉన్నత న్యాయస్థానం పరిష్కరించింది.ఒడిశా బాలేశ్వర్ జిల్లాలోని రాసగోవింద్‌పూర్ గ్రామానికి సమీపంలో ఓ పాడుబడిన విమానాశ్రయం ఉంది. అక్కడ ఉన్న పాత వస్తువులను కొనేందుకు కలకత్తాకు చెందిన ఛటర్జీ అనే వ్యక్తి తన సేవకుడు, నేపాల్‌కు చెందిన గూర్ఖా రామ్ బహదూర్ థాపాతో అక్కడికి వెళ్లాడు. ఆ విమానాశ్రయ ప్రాంతాన్ని ‘దెయ్యాలు తిరిగే ప్రదేశంగా’ ఆ సమీప గ్రామాల ప్రజలు భావించేవారు. ఆ భయంతో రాత్రిపూట ఆ దారి గుండా తమ గ్రామాలకు ఒంటరిగా వెళ్లేందుకూ భయపడేవారు.చీకట్లో ఘోరం..సమీపంలోని తేల్కుండి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రాత్రిపూట ఒంటరిగా తన గ్రామానికి వెళ్లేందుకు భయపడి రాసగోవింద్‌పూర్ గ్రామంలోనే ఉండిపోయాడు. ‘నీ ఊరికి వెళ్లేందుకు మేము తోడుగా వస్తామ’ని చటర్జీ, థాపా ఆ వ్యక్తికి చెప్పారు. ముగ్గురూ కలిసి బయలుదేరారు. కొంత దూరం వెళ్లాక అటవీ ప్రాంతంలో మసక వెలుతురులో మూడు నల్లటి ఆకారాలు వీరి కంటపడ్డాయి. దీంతో వీరి పైప్రాణాలు పైనే పోయాయి. భయంతో వణికిపోయారు. అవి దెయ్యాలే అని బలంగా నమ్మారు. ఆ ఆకారాలు దగ్గరకు రాగానే వెంటనే థాపా కత్తితో ఆ ముగ్గురిపై దాడికి దిగాడు. హాహాకారాలు వినిపించడంతో తేరుకున్న థాపా– పరీక్షించి చూడగా వారు సమీప గ్రామానికి చెందిన మహిళలు. అడవిలో విప్ప పూలను సేకరించేందుకు అక్కడికి వచ్చారని తెలిసింది. అప్పటికే ఓ మహిళ చనిపోయింది. మిగిలిన ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.కోర్టులో విచారణ..థాపాపై ఐపీసీ 302, 326,324 సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. ‘తాను మనుషులపై కాకుండా దెయ్యాలపై దాడి చేస్తున్నాననే భ్రమలో ఈ చర్యకు పాల్పడినట్టు సెషన్స్ కోర్టుకు థాపా వివరించాడు. ఐపీసీ సెక్షన్ 79 ప్రకారం రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. హత్య చేయాలనే ఉద్దేశంతో దాడికి పాల్పడలేదు. మంచి విశ్వాసంతో జరిగిన పొరబాటు చర్యగా కోర్టు భావించింది. సెక్షన్ 79 వర్తిస్తుందని సెషన్స్ కోర్టు అతడ్ని నిర్దోషిగా విడుదల చేసింది.హైకోర్టులో వాదనలు..సెషన్స్ కోర్టు తీర్పుపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్లింది. దాడి జరిగిన సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తే ఈ ఘటన జరిగేది కాదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. అతని చేతిలోని టార్చ్ వేసి ఆ ఆకారాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదని ఆరోపించాడు. హత్య చేయాలనే ఉద్దేశం లేకపోయినా, అజాగ్రత్త కారణంగా ఓ వ్యక్తి మరణానికి, మరో ఇద్దరు గాయపడడానికి కారణం అయ్యాడని కోర్టుకు వివరించాడు. ఐపీసీ సెక్షన్ 304ఏ, 336 కింద శిక్షార్హుడని వాదించాడు. సాక్షుల విశ్వసనీయతపైనా కోర్టు పలు సందేహాలు వెలిబుచ్చింది. ఛటర్జీ సాక్ష్యం మాత్రమే స్థిరంగా, విశ్వసనీయంగా ఉందని దాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. ‘ఒక వ్యక్తి తాను చేస్తున్న పని చట్టపరంగా సరైందే అని అతను నమ్మితే సరిపోదు; ఆ నమ్మకం వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవడంలో పొరపాటు; ఆ పని నిజాయితీతో, తగిన జాగ్రత్తతో ఉండాల’ని కోర్టు పేర్కొంది. ‘జాగ్రత్త’ అనే ప్రమాణాన్ని అన్ని సందర్భాల్లో, అందరికీ ఒకేలా వర్తింప చేయలేమని పేర్కొంది. వ్యక్తులు, పరిస్థితులకు అనుగుణంగా మార్పులు ఉండొచ్చని వెల్లడించింది. వేర్వేరు కేసుల్లో ఇది మారొచ్చని చెప్పింది. ఈ కేసులో అక్కడి పరిస్థితులు, అతని మానసిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొంది. మరింత జాగ్రత్తగా, అప్రమత్తతో వ్యవహరించి ఉంటే ఈ ఘటనను నివారించగలిగే వాడనే కారణంగా సెక్షన్ 79 రక్షణను నిరాకరించలేమని కోర్టు స్పష్టం చేసింది. సెషన్స్ కోర్టు జడ్జి ఉత్తర్వులు సరైనవేనని ధ్రువీకరిస్తూ, అప్పీల్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది.- దిలీప్ మాదిరెడ్డి -
ఆ గదిలో... చీకటిలో...!
విశాలమైన మేడల్లో కాదు... ఇరుకైన ఇళ్లల్లోనే సుఖం ఉంటుందని చెప్పిందెవడో కానీ, వాడు కనిపిస్తే అడ్డంగా నరికేయాలని సూరిబాబుకి అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. కృష్ణానగర్, బీ బ్లాకులోని, పూర్ణా టిఫిన్ సెంటర్ దాటుకుంటూ వెళ్తే వచ్చే పన్నెండో నెంబరు పచ్చ రంగు బిల్డింగులో ఓ ఇరుకైన గదిలో అద్దెకు దిగినప్పటి నుంచి ఈ కోరిక మరింత బలంగా నాటుకుపోయింది. పెళ్లయి వారం తిరక్కుండానే గౌరిని తీసుకొని హైదరాబాద్ బయల్దేరబోతోంటే, అమ్మ ముత్యాలమ్మ కూడా సంచి సర్దేసుకుంది.‘కొత్తగా పెళ్లయిన జంట... మధ్యలో నువ్వెందుకు’ అని బంధువులంతా వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. ‘అమ్మకు నేను తప్ప ఎవరున్నారు.. నేనెక్కడుంటే తనూ అక్కడే’ అని సూరిబాబు అందామనుకొన్నాడు. కానీ ముత్యాలమ్మ ఆ అవకాశం తన కొడుక్కి ఇవ్వలేదు. ‘పెళ్లయి వారం అయ్యిందో లేదో.. నన్నూ నా బిడ్డనీ దూరం చేస్తారే.. ముదనష్టపు ముండల్లారా’ అని ఆరున్నొక్క రాగం అందుకుంది. అమ్మలక్కలు టీవీ సీరియల్ చూసినట్టు చూశారు. ఒకరిద్దరు ముత్యాలమ్మ నోటికి జడుసుకొని పారిపోయారు. ఓ అరగంట గ(ఏ)డిచాక.. ముత్యాలమ్మ ఏడుపులోనూ నిజం ఉందనిపించింది అందరికీ. దాంతో ఇద్దరు కాస్తా ముగ్గురయ్యారు.ఊర్లో రైలెక్కినప్పుడు ఏం అనిపించలేదు. సికింద్రాబాద్ స్టేషన్లో దిగి, 10హెచ్ బస్సు అందుకున్నప్పుడు కూడా ఏ భయమూ వేయలేదు. అరవై రూపాయల స్టీలు కోటింగు గోద్రేజ్ తాళం చాలా కష్టపడి తీస్తున్నప్పుడూ కంగారు పడలేదు. కానీ, ఒక్కసారి రూమ్‌లో అడుగుపెట్టేసరికి సూరిబాబు వాస్తవంలోకి రాలేక తప్పలేదు.‘దీన్ని కూడా ఇల్లంటారా’ అనబోయి ‘ఇదే మన ఇల్లా’ అని కాస్త డిగ్నిఫైడ్‌గా అడిగింది గౌరి.నాలుగ్గోడలు నిలబెట్టి, ఓ రేకు అడ్డంగా పరిస్తే తయారైన కుటీరం అది. దీనికంటే పిట్టలు కట్టుకొనే గూడే కాస్త పటిష్ఠంగా ఉంటుంది. మహానగరంలో మూడువేలకు ఇంతకు మించిన ఆవాసం దొరకడం ఎంత కష్టమో సూరిబాబుకి తెలుసు. బీటలు వారిన గోడలు, వాటి మధ్యే కాపురం ఉంటున్న బల్లులు, ‘ఇదే మన సామ్రాజ్యం’ అని యథేచ్ఛగా తిరిగేస్తున్న బొద్దింకలు. ఆ మూల ఎప్పుడూ మూడున్నర కేజీల గ్యాసే పట్టే ఐదు కేజీల సిలిండర్, ఈ మూల ఓ చాప, రెండు మాసిన దిండ్లు. ఆ మధ్యలో తన జీవితంలానే అస్తవ్యస్తంగా ఉన్న అల్మరా. ఇద్దరు అటూ ఇటూ తిరుగుతుంటే మూడో మనిషి నిలబడడానికే జాగా ఉండదు. అలాంటి చోట.. మూడో మనిషితో పాటు.. అది కూడా పెళ్లైన కొత్తలో కాపురానికి దిగాడంటే.. సూరిబాబుది ఎంత గట్టి గుండెనో అర్థం చేసుకోవొచ్చు.‘ఇదేం ఇల్లురా.. సూరి. ఇన్నాళ్లూ ఇక్కడే ఉన్నావా’ అంటూ ఊర్లో మధ్యలో ఆపేసిన ఏడుపు హైద్రాబాద్ మహానగరంలో కొనసాగించింది ముత్యాలమ్మ.‘నువ్వు ఏడుస్తూనే ఉండు.. నేను టిఫిన్లు తీసుకొస్తా..’ అని బయల్దేరబోతోంటే గౌరి ఆపింది. ‘ఇప్పుడు ఆ ఖర్చెందుకు.. నేను ఏదోటి చేస్తాగా’ అని చురుగ్గా కదిలింది. చిందరవందరగా ఉన్న వస్తువుల్ని చిటికెలో సర్దేసింది. చీపిరి అందుకొని చకచక ఊడ్చేసింది. తడిగుడ్డ పెట్టింది. స్నానం చేసి దేవుడి పటం ముందు దీపం వెలిగించింది. డబ్బాల్లో ఏమున్నాయో వెదికింది. అవన్నీ కలిపి ఓ వంటకం సిద్ధం చేసింది. అందులోనే కొంత మిగిల్చి మధ్యాహ్నం క్యారియర్‌కి సర్దింది. ‘తొమ్మిది వేల ఆరొందల జీతంతో జీవితం హాయిగా గడిచిపోతుందిలే’ అనే భరోసా భర్తకి ఇచ్చింది. గౌరిలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు తొలిసారి గర్వంగా ఫీలయ్యాడు సూరిబాబు.పొద్దస్తమానం కష్టపడి వస్తాడు సూరిబాబు. ఉన్నదాంట్లో రుచికరంగా వండుతుంది గౌరి. ‘నేనొండినట్టు ఎక్కడుంది’ అంటూ నిష్టూరపోతూనే మెతుకు మిగల్చకుండా లాగించేస్తుంది ముత్యాలమ్మ. ఆమెకు కాస్త పెందలాడే పడుకోవడం అలవాటు. చేతులు ఆరవు. కంచం కూడా తీయదు. తిన్న వెంటనే ముసుగేస్తుంది. ఆ ఇరుకైన గదిలోనే ముగ్గురికి పక్క సర్దుతుంది గౌరి. ముత్యాలమ్మ అటు తిరిగి పడుకొంటే.. ఇటు కొత్త దంపతులు సర్దుకుపోతారు.సూరి – గౌరి ఇద్దరూ కళ్లల్లో కళ్లు పెట్టి చూసుకొంటారు. మూగగా ప్రేమించుకుంటారు. అదే వారి ఏకాంతం. కాసేపు ఆ నాలుగు చేతులూ మాట్లాడుకుంటాయి. అరికాళ్లు ఆవిర్లు పంచుకుంటాయి. ఆ ఊపిర్లు వెచ్చగా పలకరించుకుంటాయి. అంతే వారి శృంగారం. గౌరిని దగ్గరకు తీసుకోవాలని ఉంటుంది. ముద్దు చేయాలని ఉంటుంది. కానీ ఎలా?అందుకే ‘ఇరుకింట్లోనే సుఖం ఉంది’ అన్నవాడిపై కోపం వస్తుంటుంది.బయట వాన పడుతుంటుంది. సూరి శరీరం వెచ్చబడుతుంటుంది. అప్పుడే స్నానం చేసి వచ్చిన గౌరిని చుట్టేసి కాస్త చల్లబడాలని ఉంటుంది. కానీ ఎలా?అందుకే ‘ఇరుకింట్లోనే సుఖం ఉంది’ అన్నవాడిని మర్డర్ చేయాలనిపిస్తుంది.సాయంత్రం వస్తూ వస్తూ బేరమాడకుండానే మూర మల్లెపూలు పట్టుకొస్తాడు. అదే తన విలాసం. అందులోనూ ముత్యాలమ్మ వాటాకొస్తుంది. ధర్మబద్ధంగా పావు మూర కోడలి కొప్పుకి చేరుతుంది. కనీసం ఆ మల్లెల వాసనైనా మనస్ఫూర్తిగా అనుభవిద్దాం అనుకుంటాడు. కానీ వెనకే ముత్యాలమ్మ నీడ వెంటాడుతూ ఉంటుంది. ఇది తన విలాపం.అందుకే ‘ఇరుకింట్లోనే సుఖం ఉంది’ అన్నవాడిపై పూట పూటకూ పగ పెరుగుతూనే ఉంటుంది.‘అసలే కొత్త జంట.. వాళ్లకు కాస్త ఏకాంతం ఇవ్వూ.. అన్నీ తెలిసినదానివి ఇంతకంటే ఏం చెబుతాం’ అని ఎవరో ముత్యాలమ్మకు ఫోనోపదేశం చేశారు ఓసారి. అప్పట్నుంచి రాత్రి భోజనాల తరవాత బయటకు వెళ్లి పచార్లు చేయడం అలవాటు చేసుకొంది. అదీ కా..సే...పే.ఎంత సేపంటే.. తలుపు వేసి గౌరిని అల్లుకునేంత సేపు.ఎంత సేపంటే.. ఆ బుగ్గల నునుపెంతో చూసేంత సేపు.ఎంత సేపంటే.. ఆ విరహం దూరమెంతో కొలిచేంత సేపు. అంతే!‘మాయిదారి నిద్ర.. మాయిదారి నిద్ర.. కళ్లు మూతలు పడుతున్నాయనుకో..’ అంటూ మూసి ఉన్న తలుపుల్ని గభాల్న తోసుకొంటూ వచ్చేస్తుంటుంది. అత్తగారికి ఎక్కడ దొరికిపోతామో అన్న భయం ఆ కోడల్ని వెంటాడుతుంటుంది. ‘కన్నతల్లిని పక్కన పెట్టుకొని ఏమిటీ రాసలీలలు’ అని ఆ కొడుకు మనసు క్షోభిస్తుంటుంది. కథ మామూలే! ఇలా ఎలాంటి రసాస్వాదన లేకుండా ఎన్నో రాత్రులు గడిచిపోయాయి.‘పట్నం ఎలా ఉందో చూసి రాకూడదమ్మా.. బస్సు కూడా ఫ్రీనే..’ అన్నాడు కొడుకు ఓ ఆదివారం పూట.‘కోడల్ని కూడా తీసుకెళ్తా.. తనక్కూడా ఫ్రీనే కదా’ అని వెంటబెట్టుకుపోయింది. ‘ఏనాడు చేసుకొన్న పాపమో ఇది..’ అని తల గోడకేసి కొట్టుకోబోయి.. అది ఎక్కడ పడిపోతుందో అని భయం వేసి ఆగిపోయాడు.‘పెద్దమ్మ గుడి పక్కనే... ఓసారి దండం పెట్టుకొని వచ్చేయ్’ అంటే ‘మీ నాన్న నన్ను వదిలిపెట్టి పోయినప్పుడే దేవుడిపై నమ్మకం పోయింది’ అంటూ ట్యాపు విప్పింది. అవి కన్నీళ్లు కావు. ఎండాకాలం కూడా ప్రవహించే కుళాయి.ఆ కొత్త పెళ్లికూతురు మాత్రం ఎన్నిరోజులు భరిస్తుంది? ఎంతని సహిస్తుంది? ‘ఇక జీవితాంతం ఇంతేనా?’ అని అలక‘చాప’ ఎక్కింది. అటు తిరిగి పడుకొని, తన నిరసన తెలిపింది. పాపం.. అంతకంటే ఏం చేయగలదు?‘నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మ.. నీ కాటుక కళ్లే నవ్వకపోతే కలలే రావమ్మా..’ కింది ఫ్లోరు నుంచి పాట వినిపిస్తోంది మంద్రంగా.∙∙ రెండు గదులున్న ఇంట్లోకి మారే స్తోమత తనకు ఇప్పట్లో లేదు. అదెప్పుడొస్తుందో కూడా తెలీదు. ఈలోపు గౌరిని శాంతపరచాలి. అందుకేం చేయాలి? అందుకే బాగా ఆలోచించి.. ‘ఓయోకి వెళ్దామా..’ ఏదైతే అది అయ్యిందని తెగించి అడిగేశాడు.‘ఓయోనా.. అదేంటి?’ అని తన అమాయకమైన మొహాన్ని మరింత అందంగా మార్చేస్తూ అడిగింది ఆ కొత్త పెళ్లి కూతురు. ఓయో అనగానేమి, అక్కడ దొరికే సౌలభ్యాలేమిటి అనేవి పూసగుచ్చినట్టు వివరించేశాడు.‘ఇదేం ఖర్మండీ మనకూ. నేను రానుగాక రాను..’ అని మొదట్లో నొచ్చుకొంది. కానీ కొన్ని రాత్రుల విరహం తనని కూడా కరిగించింది.ఓయో రెంటు తొమ్మిదొందలు. సూరిబాబుకి వచ్చే ఆ అరాకొరా జీతంలో తొమ్మిదొందలు ఒక్క పూట కోసం పక్కన పెట్టడం కష్టమే.‘రేపట్నుంచి మల్లె పూలొద్దు’ ఆర్డరేసింది గౌరి. ‘టీ’ తన టైమ్ టేబుల్ మార్చుకొని, ఒక్క పూటకు కుంచించుకుపోయింది. రెండు ఆదివారాలు కోడికూర లేకుండానే గడిచిపోయాయి.‘ఎందుకిదంతా..?’ అని అడిగితే... ‘రూపాయా, రెండ్రూపాయలా? తొమ్మిదొందలు. మన జల్సాలకు ఖర్చు చేస్తున్నాం కదా, ఈ మాత్రం ఆదా చేయకపోతే ఎలా’ అంది. దిగువ మధ్యతరగతివాడి సరసం కూడా విలాస వస్తువుల ఖాతాలో చేరిపోయిందన్నమాట.నెల రోజుల ఆదాతో ఆ తొమ్మిదొందలూ పూడాయి. ఆ ఆదివారం భార్యాభర్తలిద్దరూ టిప్పుటాపుగా రెడీ అవుతుండడం మూల నుంచి ముత్యాలమ్మ గమనిస్తూనే ఉంది.‘సినిమాకెళ్తున్నాం.. పెందలాడే వచ్చేస్తాంలే..’ అని తొలిసారి అబద్ధమాడాడు సూరి.‘సినిమానా.. నేనూ వద్దును కదర్రా.. ఎన్నాళ్లయ్యిందో చూసి’ అని తెగ బాధ పడిపోయింది ఆ తల్లి. ‘టికెట్లు రెండే దొరికాయి.. కొత్త సినిమా కదా..’ అంటూ మరో అబద్ధాన్ని అప్పటికప్పుడు అల్లి బయల్దేరారు ఇద్దరూ.దారి వెంబట ఎన్ని కలల్ని, ఎన్ని ఊహల్ని, ఎన్ని కోరికల్ని మోసుకెళ్లారో. మధ్యలో ఆగి ఓ మూర మల్లెలు కొన్నాడు. ఈసారి పూర్తిగా తన భార్యకే.ఓయో వచ్చింది. భయం, బిడియం కలిసిన అడుగులు తడబడుతూ హోటల్ మెట్లెక్కాయి.‘పేరేంటి..’ అడిగాడు ఓయో అబ్బాయి.‘సూరిబాబు..’‘ఎన్ని రోజులు ఉంటారు?’‘రోజులా.. ఈ ఒక్క పూటకే..’‘ఐడీ కార్డు..’‘ఐడీ కార్డా... మర్చిపోయా..’ అంటూ జేబులు తడుముకొన్నాడు. పాపం నిజంగానే మర్చిపోయాడు.‘సర్సరేలే.. ఇలాంటివన్నీ మామూలే..’ అనుకొంటూ గౌరి వంక కాస్త వంకరగా చూశాడు. ఆ చూపుల భావమేంటో గౌరికి అర్థం కానందుకు సూరిబాబు కాస్త స్థిమితపడ్డాడు. అడ్వాన్సు అందుకొన్న ఓయో అబ్బాయి ‘రూమ్ నెంబరు 203’కి దారి చూపిస్తూ తాళం అందించాడు. లిఫ్టు రెండో ఫ్లోరులో ఆగింది. ఎవరైనా చూస్తారేమో అనే కంగారు పడుతూనే 203లోకి దిగబడింది ఆ జంట. ఓ థర్డ్ క్లాస్ లాడ్జ్ అది. గోడలకు వేసిన రంగు మాసిపోయి చాలా కాలమైంది. ఆ దుప్పటి కూడా ఎప్పుడు ఉతికారో ఏమిటో? రూమ్ నిండా అదోరకమైన వాసన. కానీ గౌరి ఇవేం పట్టించుకోవడంలేదు. సూరికి కూడా ఇవేం అక్కర్లేదు.తాము కాపురం వెలగబెడుతున్న ఆ ఇరుకు గదితో పోలిస్తే ఈ రూము విశాలంగా ఉంది.‘ఇంత పెద్ద మంచమా..’ అంటూ గౌరి కళ్లు విప్పారాయి. ఆ రూమంతా ఓసారి ఇష్టంగా కలయితిరిగింది. నెత్తి మీద ఫ్యాను తిరుగుతోంది. టీవీ కూడా ఉంది. ఇంత కంటే విలాసం.. తాను చూడగలదా? ఆనందంతో భర్తని కౌగిలించుకుంది. తొలిసారి మల్లెపూలకు ఎంతటి మహత్తు ఉందో తెలుసుకుంటున్నాడు సూరి. పెళ్లయిన ఇంత కాలానికి తనకూ, తన భార్యకూ దొరికిన ఏకాంతం అది. ప్రతీ క్షణమూ మధురమే. ఈసారి సూరిబాబు కౌగిలి బిగించాడు. గౌరికి ఊపిరి ఆడడం లేదు. అయినా బాగుంది. సూరికి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. అయినా హాయిగానే అనిపిస్తోంది. కాసేపు పట్టు విడిచాడు. కళ్లల్లో కళ్లు పెట్టి చూశాడు. గౌరి పెదవులు తమని ఆక్రమించుకొమ్మని ఆహ్వానలేఖ పంపాయి. వాటిని అందుకోబోతుండగా...‘టింగ్’ అంటూ మోగింది కాలింగ్ బెల్. స్వప్నలోకాల నుంచి ఒక్కసారిగా పాతాళంలోకి పడినట్టు అనిపించింది. సూరి, గౌరి మొహమొహాలు చూసుకొన్నారు. తొలిసారి కంగారు పడ్డారు. గౌరి చీర సర్దుకొంది. సూరి తమాయించుకుంటూనే తలుపు తీశాడు. ఎదురుగా ఇద్దరు కానిస్టేబుళ్లు. ‘ఇద్దరు కరడుకట్టిన అల్‌కాయిదా తీవ్రవాదుల్ని పట్టేసుకున్నాం’ అనేంత గర్వం వాళ్ల కళ్లల్లో.∙∙ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎప్పటిలా చాలా రద్దీగా ఉంది. పోలీస్ స్టేషన్ చూడడం గౌరికి అదే తొలిసారి. అందుకే శరీరంలో అణువణువూ ఒణుకుతోంది. సినిమాల్లో పోలీస్ స్టేష¯Œ ని చాలాసార్లు చూశాడు సూరిబాబు. కానీ అవి ఇలా లేవు. అందుకే తాను కూడా కంగారు పడుతున్నాడు. కానీ బయటపడడం లేదు.‘మేమిద్దరం భార్యాభర్తలం సార్..’ అని హెడ్ కానిస్టేబుల్ దగ్గర వేసిన క్యాసెట్టే వేస్తున్నాడు. రైడింగ్‌లో పట్టుబడ్డోళ్లంతా ఇలానే చెబుతార్లే అన్నట్టు హెడ్డుగారు అసలు పట్టించుకోవడమే లేదు.‘ఏమిటండీ.. ఇదంతా.. ఇప్పుడు ఏం జరుగుతుంది’ గౌరి దాదాపు ఏడ్చినంత పని చేసింది. ‘నువ్వేం కంగారు పడకు.. నేను చూస్తాగా..’ అంటూ హెడ్ కానిస్టేబుల్ చుట్టూ ప్రదక్షిణాలు మొదలెట్టాడు.‘సార్.. నిజంగానే తను నా భార్య సార్’ ఈసారి దాదాపు కాళ్లు పట్టుకొన్నంత పని చేశాడు.‘మరి సాక్ష్యం’‘తాళిబొట్టు ఉంది కదా’‘అది సరిపోదు.. ఇంకేమైనా..’‘మా అమ్మ ఉంది..’‘ఎక్కడ..’సూరిబాబు అడ్రస్ చెప్పాడు. ఓ కానిస్టేబుల్ వెళ్లి కాసేపటి తరవాత ముత్యాలమ్మని వెంటబెట్టుకొచ్చాడు. స్టేష¯Œ లోకి అడుగు పెడుతూనే కొడుకూ కోడళ్లిద్దరి వైపు ముత్యాలమ్మ చూసిన చూపు ఈ హెడ్ కానిస్టేబుల్ మాటల కంటే భయంకరంగా అనిపించాయి. ఏం జరిగిందో ఇదంతా ఎందుకు జరిగిందో అర్థం చేసుకోవడానికి ముత్యాలమ్మకు ఎంతోసేపు పట్టలేదు. సంతకాలు పూర్తయ్యాక స్టేషన్ నుంచి బయటపడ్డారు ముగ్గురూ.అమ్మ కళ్లల్లోకి చూసే ధైర్యం లేదు సూరికి. అత్తతో మాట్లాడేంత తెగువ లేదు గౌరికి. వాళ్లద్దరినీ మళ్లీ కదిపే సాహసం చేయలేదు ముత్యాలమ్మ.‘నన్ను మన ఊరి బస్సెక్కించేయ్ రా’ పావుగంట తరవాత ముత్యాలమ్మ నోటి నుంచి వచ్చిన ఒకే ఒక్క మాట అది. సూరి ఏం మాట్లాడలేకపోయాడు.‘నేనూ మీ వయసు దాటొచ్చినదాన్నే.. మీ పరిస్థితి అర్థం చేసుకోవాల్సింది.. ఊరి నిండా మనోళ్లే కదా. నేనక్కడ బాగానే ఉంటా. అప్పుడప్పుడూ మీరే వస్తుండండి’అమీర్ పేటలో ముత్యాలమ్మని బస్సెక్కించి, ఆటోలో ఇంటికి బయల్దేరారు ఆ భార్యాభర్తలు. నెల రోజుల నుంచి పడుతున్న తపన.. ఈ రోజు జరిగిన తతంగం అంతా కళ్ల ముందు కదలాడింది. కాసేపు బాధ పడ్డారు. ఆ తరవాత చిన్నగా నవ్వుకున్నారు. స్టేషన్ నుంచి కూడా ఎలాంటి గొడవా లేకుండా బయటపడడంతో కాస్త రిలీఫ్‌గా అనిపించింది. ఇద్దరి కళ్లూ కలిశాయి. ఇంటికి వెళ్తే.. కావాల్సినంత ఏకాంతం దొరుకుతుందన్న ఆలోచన ఇంకాస్త ఆనందాన్ని కలిగించింది. మల్లెల దండ ఇంకా సువాసన వెదజల్లుతూనే ఉంది. సూరిలోని రొమాంటిక్ ఫెలో మళ్లీ నిద్ర లేచాడు. ఆటో యూసుఫ్‌గూడా రోడ్లు దాటుతూ కృష్ణానగర్‌లో ఆగింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదన్న తలపు.. వాళ్లిద్దర్నీ మరింత తొందరపెట్టింది. అరవై మెట్లు తొలిసారి ఆయాస పడకుండా ఎక్కేస్తున్నారు. ఫ్లోరు దాటుతున్న కొద్దీ ఒకరిపై మరొకరికి ప్రేమ పొంగి పొర్లుతోంది. త్వరగా ఒక్కటైపోవాలన్న తపన తొందర పెట్టిస్తోంది. ఐదు ఫ్లోర్లు పూర్తయ్యాయి. తమ గదికి చేరువైపోయారు. ఆఖరి మెట్టు దగ్గర ఇద్దరూ సడన్ బ్రేకు వేసినట్టు ఆగిపోయారు. ఎందుకంటే గుమ్మం ముందు ఓ శాల్తీ కాచుకొని కూర్చుంది. ఈ భార్యాభర్తల్ని చూసి ఒక్కసారిగా పైకి లేచింది.‘ఏమైపోయావ్ గౌరీ ఇంతసేపూ..’ అని రాగానే బలవంతంగా కావలించేసుకొంది.‘ఎవరీవిడ..’ అర్థం కానట్టు అడిగాడు సూరి.‘మా అనసూయత్త చిన్నప్పటి నుంచీ నన్ను పెంచి పోషించింది. మన పెళ్లికి కూడా వచ్చింది’‘ఇప్పుడిక్కడికెందుకు వచ్చినట్టు?’ మెల్లగానే అన్నా, ఆ మాట అనసూయకు వినిపించింది. ‘నాకు మీరు తప్ప ఎవరున్నారు గౌరీ.. మీ మావయ్య కూడా కాలం చేశాడు. ఒక్కదాన్నే ఊర్లో ఉండబుద్ది కాలేదు. కూతురులాంటి నువ్వు గుర్తొచ్చావు. కలో గంజో కలిసే తాగుదాం అనిపించి వచ్చేశాను..’ అంటూ ఇంకోసారి బావురు మంది.‘ఈ ఇరుకింట్లోనా?’ ఈసారి వినిపించేలానే అన్నాడు సూరి.‘సుఖమన్నది విశాలమైన మేడల్లో కాదు బాబూ.. ఇలాంటి ఇరుకైన ఇళ్లల్లోనే ఉంటుంది’ అంది పెద్ద తత్వవేత్తలా.ఆ ఒక్క మాటతో సూరిబాబు గుండెలో వంద గ్రెనేడ్లు పేలాయి.- మహమ్మద్ అన్వర్ -
చార్ధామ్ నుంచి పశుపతినాథ్ వరకు..
ఉత్తరాఖండ్‌కు చెందిన 23 ఏళ్ల యువకుడు చందూ కార్కి తన అసాధారణ సంకల్పంతో చరిత్ర సృష్టించారు. ఏకంగా 18,554 కిలోమీటర్ల సుదీర్ఘ దూరాన్ని కాలినడకన పూర్తి చేసి అందరినీ విస్మయానికి గురిస్తున్నాడు. కేవలం యాత్ర చేయడమే కాకుండా, దేశ ఆధ్యాత్మిక వైభవాన్ని, సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో ఆయన ఈ సాహసానికి పూనుకున్నారు. దాదాపు మూడేళ్ల కాలంలో 806 రోజుల పాటు ఆయన సాగించిన ఈ ప్రయాణం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆస్తికరంగా మారింది.యాత్ర వెనుక అసలు లక్ష్యంఉత్తరాఖండ్లోని బెరీనాగ్ తహసీల్ పరిధిలోని మానిఖేత్ గ్రామానికి చెందిన చందూ కార్కి, అల్మోడాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. భారతదేశాన్ని అత్యంత సన్నిహితంగా పరిశీలించాలని, ఇక్కడి సంస్కృతి, ఆధ్యాత్మిక సంపద, ప్రకృతి అందాలను స్వయంగా వీక్షించాలనే కోరికతో ఆయన ఈ సాహసానికి శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 19, 2023న తన స్వగ్రామం నుండి ఈ అఖిల భారత పాదయాత్రను ప్రారంభించారు.రికార్డు స్థాయిలో సాగిన ప్రయాణంఈ ప్రయాణంలో భాగంగా చందూ కార్కి భారతదేశంలోని దాదాపు అన్ని ప్రధాన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను చుట్టేశారు. ఎక్కడా వాహనాలను ఆశ్రయించకుండా పూర్తిగా కాలినడకనే ప్రయాణించారు. కేవలం 806 రోజుల్లోనే 18,554 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి అరుదైన మైలురాయిని చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన భిన్న సంస్కృతులు, భాషలు, జీవనశైలిని కలిగిన కోట్లాది మంది ప్రజలను నేరుగా కలుసుకున్నారు.పవిత్ర క్షేత్రాలు.. మహా యాత్రలుఈ సుదీర్ఘ యాత్రలో భాగంగా చందూ కార్కి ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ చార్‌ధామ్‌లను దర్శించుకోవడంతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న 12 జ్యోతిర్లింగాలను సందర్శించాడు. వీటితో పాటుగా హరిద్వార్ నుండి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళ్ వరకు అలాగే ఏకంగా నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయం వరకు అత్యంత కఠినమైన కావడి పాదయాత్రలను విజయవంతంగా పూర్తి చేశాడు.ఎదురైన భయానక, కఠిన పరిస్థితులుచందూకు ఈ పాదయాత్ర ఎప్పుడూ పూలబాటలా సాగలేదు. ప్రయాణంలో అనేకసార్లు జనావాసాలు లేని, కనీసం మనుషుల సంచారం కూడా లేని నిర్జన అడవులు, కొండ ప్రాంతాలు ఎదురయ్యాయి. కొన్నిసార్లు రెండు మూడు రోజుల పాటు ఎలాంటి దుకాణాలు లేదా గ్రామాలు కనిపించలేదు. ఆ సమయంలో తన బ్యాగులో ఉన్న కొద్దిపాటి బిస్కెట్లు, నీళ్లతోనే రోజంతా గడిపిన సందర్భాలు అనేకం ఉన్నాయని ఆయన తెలిపారు. నేపాల్ పశుపతినాథ్ యాత్ర సమయంలో అత్యంత భయానక అనుభవాలను ఎదుర్కొన్నట్లు ఆయన వెల్లడించారు.ప్రజల ఆప్యాయతలు - గుజరాత్ జ్ఞాపకాలుదేశవ్యాప్తంగా తాను తిరిగిన ప్రాంతాలలో ప్రజల నుండి లభించిన ప్రేమ, ఆదరాభిమానాలు ఎప్పటికీ మరచిపోలేనని చందూ చెప్పారు. ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంలో తనకు లభించిన ఆతిథ్యం, ప్రజల ఆప్యాయత ఎప్పటికీ మరచిపోలేనని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో భిన్నమైన ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ ఉన్నప్పటికీ, భారతదేశ ఆత్మ మాత్రం ఒకటేనని ఆయన తన ప్రయాణ అనుభవాల ద్వారా గ్రహించానని అన్నారు.భవిష్యత్ లక్ష్యాలు కేవలం రికార్డుల కోసమే కాకుండా, భారత్-నేపాల్ దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక అనుబంధాన్ని చాటిచెప్పడమే తన యాత్ర ముఖ్య ఉద్దేశమని చందూ స్పష్టం చేశారు. ప్రస్తుతం తన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా లక్షలాది మందికి చేరువ చేస్తున్న ఆయన, భవిష్యత్తులో దేశవిదేశాలలో మరెన్నో సాహసోపేతమైన యాత్రలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
థ్యాంక్యూ అమ్మా..నాన్నా!
అమ్మా నాన్నలది సెలవు లేని ఉద్యోగం... జీతం లేని షిఫ్ట్ప్రపంచంలో అన్ని ఉద్యోగాలకు జీతం ఉంటుంది. ఆఫీసు ఉంటుంది. వీకెండ్ ఉంటుంది. రిటైర్మెంట్ ఉంటుంది. కానీ అమ్మా నాన్నల ఉద్యోగానికి జీతం లేదు. సెలవు లేదు. రిటైర్మెంట్ అసలే లేదు. అయినా దాన్ని వదిలేయడానికి వీలు లేదు.నేడు ‘నేషనల్ పేరెంట్స్ డే’.అమ్మానాన్నలకు గిఫ్ట్‌లు, ఫోటోలు, సోషల్ మీడియా పోస్ట్‌లు.... మంచిదే. కానీ ఒక్క పది నిమిషాలు ఆపి, వాళ్ల ఉద్యోగపు ఫైల్ తిరగేద్దామా? ప్రతి పేజీలో ఒక త్యాగం, ఒక నిద్రలేని రాత్రి, ఒక దాచిపెట్టిన కన్నీరు ఉంటుంది.ఆ వేల పేజీల ఫైల్‌కి మనం ఇచ్చే రివార్డ్ ఏంటి?ఒకే ఒక్క మాట... ‘థ్యాంక్యూ అమ్మా, థ్యాంక్యూ నాన్నా’ఈ రోజు ఆ మాట చెప్పే రోజు.పిల్లలు చదువుకుంటారు. ఉద్యోగాల్లో చేరుతారు. పెళ్లిళ్లు చేసుకొని తమ పిల్లల పాలన, పోషణలో పడతారు. కాని తమ కోసం అప్పుడూ ఇప్పుడూ ఎడతెగని ఉద్యోగం చేస్తూనే ఉన్న అమ్మా నాన్నాల గురించి కొద్దిగా మరుపున పడతారు. బిజీలో కాస్త ఎడం జరుగుతారు. ప్రేమ ఉన్నా, ఎంతో గౌరవం ఉన్నా వీలు కాని స్థితిలో భుక్తి కోసం దూరం జరుగుతారు. అలాంటప్పుడు అమ్మా నాన్నలు ఏం చేసి మనల్ని ఇంత వరకూ తీసుకొచ్చారో గుర్తు చేసుకోవడానికి ఇలాంటి సందర్భాలు వీలు కల్పిస్తాయి.అమ్మ ఆఫీస్: ఇల్లు అనే ఫ్యాక్టరీగుర్తుందా... మన ఇంట్లో అమ్మ ఉద్యోగం ఉదయం అయిదు గంటలకే మొదలవుతుంది. అలారం మోగక ముందే ఆమె కళ్లు తెరుచుకుంటాయి. ఆమె ఒకేసారి వంటమనిషి, టీచర్, డాక్టర్, కౌన్సెలర్, న్యాయమూర్తి, అకౌంటెంట్. చిన్నప్పుడు మనకు జ్వరం వస్తే రాత్రంతా తల దగ్గరే కూర్చునే ‘నైట్ డ్యూటీ’ అమ్మదే! పరీక్షల భయంలో ‘భయపడకు, నేనున్నా’ అని వెన్ను తట్టే మోటివేషనల్ స్పీకర్ అమ్మే. మనం ఆఫీస్ నుండి అలసిపోయాక ‘కూర్చో, వేడిగా అన్నం పెడతా’ అనే స్టార్ హోటల్ షెఫ్ అమ్మే! ఇంత చేసినా నెలాఖరున ఆమె అకౌంట్లో ఒక్క రూపాయి కూడా జీతం పడదు. ‘అమ్మా, కూర సూపర్‌గా ఉంది’ అని మనం ఒక ముద్ద ఎక్కువ తింటే... అదే ఆమెకు వచ్చే అతిపెద్ద బోనస్! పండగకు కొత్త చీర కొనిపెడదామంటే, ‘నాకెందుకులే... ముందు నీకు కొత్త బూట్లు కొందాం’ అని వాయిదా వేసే త్యాగం ఆమెది. ఒంట్లో ఎంత బాగోలేకపోయినా ‘పిల్లలు ఆకలితో ఉంటారు’ అని కిచెన్ లోకి వెళ్లి ‘పంచ్’ కొట్టిన రోజులెన్నో! 58 ఏళ్లయినా, 70 ఏళ్లయినా ఆమెకు ‘అమ్మ’ ఉద్యోగం నుండి రిటైర్మెంట్ ఉండదు. ఈ రోజు ఆమె పక్కన కూర్చుని ‘అమ్మా, థ్యాంక్యూ! నువ్వు లేకుండా నేను లేను’ అని ఒక్క మాట చెబితే... అది ఆమెకు పదహారు పెండింగ్ డీఏల పెట్టు. నాన్న పని: అన్ని డిపార్ట్మెంట్ల ఇన్ ఛార్జ్!నాన్న చేసే ఉద్యోగం ఇంట్లో పైకి కనిపించదు. అది ఆయన మనసులో, జేబులో, కళ్ల వెనుక నిశ్శబ్దంగా సాగుతుంటుంది. ఉదయం ఆఫీసుకు వెళ్లే ముందే ఆయన తలలో లెక్కలు ఆన్. ఈ నెల ఈఎంఐ, స్కూల్ ఫీజు, కరెంట్ బిల్లు, ఇంటి అద్దె... ఎప్పుడూ మన చదువులు, మన భవిష్యత్తు అనే ‘టెన్షన్ షిఫ్ట్’లోనే ఉంటాడు. తన చెప్పులు అరిగిపోయినా పట్టించుకోడు కానీ మనం అడిగిన బైకో, లాప్టాపో కొనివ్వడానికి లోన్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతాడు. మనం పరీక్షలో ఫెయిలైనప్పుడు క్లాస్ టీచర్ కంటే ముందు బాధపడేది ఆయన గుండె. అయినా బయటికి గాంభీర్యం నటిస్తూ ‘పర్వాలేదురా, నెక్స్›్టటైమ్ చూసుకుందాం’ అని కొండంత భరోసానిస్తాడు. మనం సక్సెస్ అయితే సమాజంలో అందరికంటే ముందు గర్వంగా చెప్పుకునేది ఆయనే! మన ముందు మాత్రం ‘ఇంకా పైకి రావాలి’ అని హెచ్చరిస్తాడు. ఆఫీసులో బాస్ తిట్టినా, ప్రమోషన్ మిస్ అయినా ఆ బాధను ఇంట్లోకి రానివ్వడు. మరి ఆయనకు మనం ఇచ్చే శాలరీ ఏంటి? మనకు మంచి జాబ్ వచ్చిందని ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆయన గొంతులో కనిపించే గర్వం. ‘నాన్నా, నువ్వు చేసిన కష్టం వృథాకాలేదు’ అనే ఒక్క మాటే ఆయనకు కావాల్సిన లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు.రెండు షిఫ్ట్‌లు కలిసే చోటు: ‘మనం’అమ్మా నాన్న ఇద్దరివీ వేరువేరు డిపార్ట్‌మెంట్లే కావచ్చు... కానీ ఇద్దరి గోల్ ఒక్కటే, ‘మన పిల్లలు బాగుండాలి’. అమ్మ మనకు అన్నం తినిపిస్తే, నాన్న ఆ అన్నం కొనడానికి కష్టపడతాడు. అమ్మ మన కన్నీళ్లు తుడిస్తే, నాన్న ఆ కన్నీళ్లకు కారణమైన సమస్యలను తుడిచేస్తాడు. వాళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినా, పిల్లల భవిష్యత్తు విషయానికి వచ్చేసరికి ఎప్పుడూ ‘టీమ్ అమ్మా నాన్న’గానే నిలబడతారు.మనం పెద్దవాళ్లమయ్యాం. మనకు ఇప్పుడు జీతాలు, వీకెండ్స్, లీవ్ లెటర్లు అన్నీ వచ్చాయి. కానీ వాళ్లకు? ఇప్పటికీ అదే 24 బై 7 షిఫ్ట్. మనం ఫోన్ ఎత్తకపోతే టెన్షన్. సరిగా తినకపోతే టెన్షన్. ప్రపంచంలో ఏ ఉద్యోగానికైనా రిజైన్ చేయొచ్చు కానీ అమ్మానాన్నల ఉద్యోగానికి రిజిగ్నేషన్ లెటర్ ఉండదు. మనం పుట్టగానే మొదలయ్యే ఈ డ్యూటీ వారి చివరి శ్వాస వరకు కొనసాగుతుంది. ఒకరకంగా వారి చివరి శ్వాసే వారి రిజిగ్నేషన్ లెటర్! ఆ తర్వాత కూడా ఆకాశం నుండి మన కోసం వేయి కళ్లతో ప్రార్థించే డ్యూటీని వాళ్లు మానరు.అమ్మానాన్నలు పక్కన ఉన్నంత కాలం వారి విలువ తెలీదు. వృద్ధాశ్రమాల్లో కిటికీ పక్కన కూర్చుని గేటువైపు చూసే ఆ శూన్యమైన కళ్లను చూస్తే ఆ బాధ ఏంటో అర్థమవుతుంది. ఈ రోజు మన అమ్మానాన్నలను గట్టిగా హగ్ చేసుకుని ఏడ్చినా పర్లేదు. ఎందుకంటే ఆ కన్నీళ్లలోనే వారి జీవిత కాలపు అలసటంతా కరిగిపోతుంది. ఈ రోజు... ఆ సెలవు లేని నిజమైన ఉద్యోగులకు మనసారా ఒక సెల్యూట్చేద్దాం!అన్నీ ఇవ్వక్కర్లేదు.. అవసరమైన వి ఇస్తే చాలు..!తీరిక లేకుండా కష్టపడుతున్నాం.. ఎన్నో త్యాగాలు చేసి బాధ్యతలను మోస్తున్నాం..మంచి భవిష్యత్ ఇవ్వడానికి ఇంతకు మించి ఏం చేయాలి? అని ప్రతి తల్లిదండ్రులు భావిస్తారు. పిల్లల భవిష్యత్ బాగుండాలని తపన పడడంలో తప్పు లేదు..అయితే వారికి మంచి స్కూల్, గాడ్జెట్లు, ఆహారం ఇస్తే చాలు కదా అని అనుకోవడమే తల్లిదండ్రులు చేస్తున్న పెద్ద పొరపాటని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పిల్లల జీవితాన్ని మార్చేది డబ్బు కాదు.. వారితో తల్లిదండ్రులు గడిపే నాణ్యమైన సమయం మాత్రమేనని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, హార్వర్డ్ సెంటర్ ఆన్ ది డెవలపింగ్ చైల్డ్ వంటి సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.స్ఫూర్తి తేజాలు‘మా నాన్నగారు ఎంతో నిరాడంబరమైన వ్యక్తి. మంచితనం ఆయన రూపంలో వెల్లివిరుస్తుంటుంది. నాన్న వ్యక్తిత్వంలోనే ఆయన తేజస్సు ప్రతిబింబిస్తుంది. ఆయన నాకు నాన్న మాత్రమే కాదు స్ఫూర్తినిచ్చే రోల్ మోడల్. నేను డిప్రెషన్‌తో బాధపడుతున్నప్పుడు నాలోని డిప్రెషన్ లక్షణాలను మా అమ్మ గుర్తించి, ఆ సమస్య నుంచి బయటపడేలా చేసింది.– దీపికా పదుకొణె – కెఅన్నీ ఇవ్వక్కర్లేదు.. అవసరమైన వి ఇస్తే చాలు..!తీరిక లేకుండా కష్టపడుతున్నాం.. ఎన్నో త్యాగాలు చేసి బాధ్యతలను మోస్తున్నాం..మంచి భవిష్యత్ ఇవ్వడానికి ఇంతకు మించి ఏం చేయాలి? అని ప్రతి తల్లిదండ్రులు భావిస్తారు. పిల్లల భవిష్యత్ బాగుండాలని తపన పడడంలో తప్పు లేదు..అయితే వారికి మంచి స్కూల్, గాడ్జెట్లు, ఆహారం ఇస్తే చాలు కదా అని అనుకోవడమే తల్లిదండ్రులు చేస్తున్న పెద్ద పొరపాటని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పిల్లల జీవితాన్ని మార్చేది డబ్బు కాదు.. వారితో తల్లిదండ్రులు గడిపే నాణ్యమైన సమయం మాత్రమేనని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, హార్వర్డ్ సెంటర్ ఆన్ ది డెవలపింగ్ చైల్డ్ వంటి సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.పిల్లలు... తల్లిదండ్రుల కలల రూపాలుస్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ మంధాన ఒకప్పుడు జిల్లా స్థాయి క్రికెట్ ప్లేయర్. జాతీయస్థాయిలో రాణించాలనే ఆయన కల నెరవేరలేదు. అయితే తన పిల్లల్లో ఒకరు క్రికెట్లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారని గట్టిగా నమ్మారు. క్రికెట్ ఆడడంలో స్మృతిని ఆమె సోదరుడిని బాగా ప్రోత్సహించారు. తన కలను స్మృతి సాకారం చేయడంతో ఆయన గర్వపడే తండ్రి అయ్యారు. క్రికెటర్‌గా స్మృతి రాణించంలో తల్లి స్మిత పాత్ర ఎంతో ఉంది. ‘చదువు కావచ్చు, ఆటలు కావచ్చు... ఏ రంగం అయినా తల్లుల ప్రోత్సాహం, ఆశీర్వాదం ఉంటే పిల్లలు తప్పకుండా సాధించగలరు. అమ్మ ఆశీర్వాదం, ప్రోత్సాహం నా బలం’ అంటుంది స్మతి మంధాన.ఎంతో కష్టపడ్డారు‘నేర్చుకోవాలి. జ్ఞానాన్ని పెంచుకోవాలి’ అనే ధోరణిలో ఉండేవారు నా తల్లిదండ్రులు. వారు చెప్పింది నా మనసుపై గాఢమైన ప్రభావాన్ని చూపింది. ‘నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి’ అని తల్లిదండ్రుల నుంచి నేను విన్నది మా సంస్థ లక్ష్యాలలో ప్రధానమైనది. బాగా చదివించాలని, నన్ను ఉన్నతస్థానంలో చూసుకోవాలని నా కోసం అమ్మానాన్న ఎంతో కష్టపడ్డారు. ఎన్నో త్యాగాలు చేశారు. – సుందర్ పిచాయ్వెలకట్టలేని ప్రేమ– పారా అథ్లెటర్ దీప్తి జీవాంజీఅథ్లెట్ దీప్తి జీవాంజీది తెలంగాణలోని వరంగల్ జిల్లా కల్లెడ గ్రామం. పారా అథ్లెటిక్‌గా ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించింది. తల్లిదండ్రులు తమ కోసం పడుతున్న కష్టాలను చూస్తూ పెరిగింది. తల్లిదండ్రుల కష్టంలో పాలుపంచుకుంటూ క్రీడలో శిక్షణ తీసుకుంటూ తనను తాను మలుచుకుంటోంది. తమ ఎదుగుదలలో తల్లిదండ్రులు ఎంత మద్దతుగా నిలుస్తున్నారో వివరించింది.‘‘మా అమ్మానాన్నలకు నేను, చెల్లి సంతానం. మా అమ్మ ధనలక్ష్మి కూలి పనులకు వెళుతుంది. నాన్న యాదగిరి పైపుల కంపెనీలో పనిచేస్తాడు. చెల్లెలు కాలేజీకి వెళుతుంది. చిన్నప్పుడు స్కూల్లో స్పోర్ట్స్‌లో పాల్గొంటే చిన్న ప్రైజ్ వచ్చింది. మా అమ్మకు తీసుకొచ్చి చూపిస్తే నన్ను ముద్దుపెట్టుకొని తెగ సంతోషపడింది. నాన్న ‘కష్టపడితే ఏదీ వృథాగా పోదు’ అనేవాడు. నేను ఏదైనా అప్పటి నుంచి స్కూల్లో ఆటల మీద ఎక్కువ ఇష్టం చూపేదాన్ని. మా చుట్టుపక్కల వాళ్లు ఆడపిల్లలకు ఈ ఆటలు అవసరమా అన్నట్టు మాట్లాడేవారు. కానీ, మా అమ్మా నాన్న మాత్రం ‘అవన్నీ పట్టించుకోవద్దు. సాధించి నిలబడాలి’ అనేవారు. వాళ్ల మాటల వల్లే స్పోర్ట్స్ అన్ని బలహీనతలను దూరం చేస్తుందని.. గెలిచినా, ఓడినా.. ఎప్పడూ పాఠాలు నేర్చుకుంటూనే ఉంటామని ఇన్నేళ్లలో చాలాసార్లు రుజువు అయ్యింది. ఇప్పటివరకు నాలుగు వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్నాను. నాకు ఆరోగ్యం బాగలేక, ఇంటి సమస్యలు అధికమయ్యి ఉన్న రెండెకరాల భూమిని అమ్మారు అమ్మనాన్న. ఎంతో బాధపడేవారు. కానీ, మాకంట పడనిచ్చేవారు కాదు. వాళ్లకంటూ సొంతంగా ఇష్టాలు, అభిరుచులు ఉంటాయనే ద్యాసే లేదు. తమకంటూ మంచిబట్టలు కొనుక్కోవడానికి కూడా ఆసక్తి లేనట్టుగా చెబుతారు. అదే మా విషయంలో అయితే ‘మీకేం కావాలో తీసుకోండి’ అంటారు. అమ్మానాన్నల ప్రేమ అంతులేనిది. దానికి వెలకట్టలేం. మాకోసం భూమికి దూరమయ్యారని ఎప్పుడూ అనుకునేదాన్ని. క్రీడల ద్వారా వచ్చిన డబ్బుతో వాళ్లు అమ్మిన భూమిని తిరిగి కొనుగోలు చేశాం. ఆ రోజు అమ్మానాన్నల ఆనందం మాటల్లో చెప్పలేను. కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఊళ్లోనూ గొప్పగా చెప్పుకున్నారు. మరింతగా కృషి చేసి, వారిని బాగా చూసుకోవాలన్నదే నా ఆలోచన’ అని తెలిపారు దీíప్తి.– నిర్మలారెడ్డినా ప్రతిపాటలోనూ అమ్మానాన్నల త్యాగమే!– గాయని శ్రీలలితకర్ణాటక సంగీత గాయనిగా చిన్ననాటి నుంచే పేరు తెచ్చుకుంది భమిడిపాటి శ్రీలలిత. విజయవాడ వాసి అయిన శ్రీలలిత ‘పిల్లల కోసం తల్లిదండ్రులు పడే కష్టాలు, వారు చేసే త్యాగాల రుణం ఏ రూపంలోనూ తీర్చుకోలేం’ అని తెలిపింది.‘‘మా నాన్న బ్యాంకులో జాబ్ చేసేవారు. నేను గాయనిగా పేరు తెచ్చుకోవాలని మా నాన్న నా కోసం ఉద్యోగంలో వచ్చే ప్రమోషన్స్ వదులుకున్నారు. ప్రమోషన్స్ తీసుకుంటే ఎక్కువ గంటల ఉద్యోగంలోనే గడిచిపోతాయి, నాకు టైమ్ కేటాయించలేనని అనేవారు. కాస్త టైమ్ ఉన్నా, వెహికిల్ మీద తీసుకెళుతున్నా దారంతటా పాటలు పాడుతూ నా చేత పాడిస్తూ ప్రోత్సహించేవారు. అమ్మ నా ఎనిమిది నెలల వయసు నుంచే నన్ను వేదికల మీద చూడాలని తపన పడేది. నాన్న ఉద్యోగరీత్యా చెన్నైలో ఉంటే ఎవరూ తెలియని ఆ ప్రాంతంలో, రాని భాషతో ఇబ్బందులు పడినా నన్ను గాయనిగా నిలబెట్టాలని చూసేది. మా పేరెంట్స్ నా కోసం చేసిన త్యాగాలు అన్నీ ఇన్నీ కావు. గాయనిగా ఎదగాలంటే సమయం సరిపోదని, స్కూల్‌కి పంపకుండా ఇంట్లోనే చదివిస్తూ ఎగ్జామ్స్ రాయించేవారు. షూటింగ్స్ సమయంలో అసలు టైమ్ ఉండేది కాది. అర్ధరాత్రి అని కూడా చూడకుండా, గంటలు గంటలు ఓపికగా నా గురించి అలాగే ఉండేవారు. నాకు ఒక మంచి దారి వేయడానికి మా అమ్మనాన్నలు ఎంత చేశారో ఒక్క మాటలో చెప్పలేను. నా ప్రతి అడుగులో వాళ్లే ఉన్నారు. వాళ్లలో ఒక్క శాతం అయినా రేపు నా పిల్లలకు చేస్తే అదే గొప్ప అనిపిస్తుంటుంది’’ అని వివరించారు శ్రీ లలిత.మందలింపు కాదు.. మంచి మాట కావాలిపిల్లల తప్పులను మాత్రమే ఎత్తి చూపడం వల్ల వారు క్రమంగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే నిపుణులు సూచించే ‘5:1 రూల్’ ప్రకారం, ఒక్కసారి మందలిస్తే దాని తర్వాత కనీసం ఐదుసార్లు వారికి సానుకూలంగా స్పందిస్తూ వారిని ప్రోత్సహించాలి. హార్వర్డ్ పరిశోధనల్లో చెప్పిన ‘సర్వ్ అండ్ రిటర్న్’ రూల్ ప్రకారం పిల్లలు మాట్లాడినప్పుడు వెంటనే స్పందించడం, కళ్లలోకి చూసి మాట్లాడడం, నవ్వడం, అ΄్యాయంగా వినడం వంటి చిన్న పనులే వారి మానసిన పరివర్తనకి, మెదడు ఎదుగుదలకి ఎంతో కీలకమని వెల్లడైంది. పర్ఫెక్ట్ పేరెంట్ కావాలనే ఒత్తిడిలో చాలామంది తల్లిదండ్రులు జీవిస్తున్నారు. కానీ పిల్లలకు అవసరమైంది తప్పులు చేయని తల్లిదండ్రులు కాదు, అవసరమైనప్పుడు తమతో మాట్లాడే, వినే, అండగా నిలిచే తల్లిదండ్రులు మాత్రమే.అమ్మానాన్నల్లా కాదు.. ఫ్రెండ్స్‌లా! ‘ఈ రోజుల్లో అమ్మానాన్నలతో ఒక తరం గ్యాప్ అన్నట్టుగా కాకుండా మంచి స్నేహపూర్వకమైన బంధంలా ఉండాలి. మిస్టేక్స్ చేసినా అంగీకరించాలి. అర్థం చేసుకోవాలి. ఇది మా ఇంటి వాతావరణం. మా అమ్మనాన్నలు మమ్మల్ని అలాగే పెంచారు’ అని తెలిపారు ప్రకృతి, సంస్కృతి. ఈ ఇద్దరు ఐపీఎస్ అధికారి బి.సుమతి కూతుళ్లు. చదువుకుంటూనే సమాజంలో తమదైన ముద్రవేస్తున్న వీరు ఈ తరం ఆలోచనలను మన ముందుంచారు. ‘‘స్టూడెంట్‌గా చదువులో రాణించడానికి, ఎంట్రప్రెన్యూర్‌గా ఎదగడానికి, నా ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడానికి మా నాన్న శ్రీనాథ్‌రాజు చాలా సపోర్ట్ చేస్తారు. క్రియేట్ ఎడ్యుటెక్ ద్వారా యూత్ వెల్నెస్, డిజిటల్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. హ్యాండ్ మేడ్ జ్యువెలరీ పరిశ్రమలో గ్రామాల్లో ఉన్న స్వర్ణకారులకు చేయూతనిచ్చే ప్రోగ్రామ్స్ చేశాం. అమ్మ ఎంత బిజీగా ఉన్నా, మా చదువు, ప్రోగ్రామ్స్ గురించి గైడ్ చేస్తూనే ఉంటుంది. – ప్రకృతి‘‘అమ్మ మల్టిపుల్ రోల్స్ ప్లే చేస్తుంది. చాలా అద్భుతం అనిపిస్తుంది తనని చూస్తుంటే. తన నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. అమ్మ మా ప్రపంచంలో గ్రేట్ కన్నా ఇంకా ఎక్కువే. ధైర్యంగా ఉండటం, ఎంత బిజీగా ఉన్నా అవతలి వ్యక్తులతో ఎలా ఉండాలి... ఇంకా చాలా విషయాలు తనని చూసే నేర్చుకుంటాం. అమ్మను చూసే మేమూ పబ్లిక్ సెక్టార్లో వర్క్ చేస్తున్నాం. నేను సైకాలజీ చేస్తున్నాను. పేరెంట్ అంటే స్ట్రిక్ట్‌గా ఉండాలని అనుకుంటారు. కానీ, మా పేరెంట్స్ మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వారి స్ఫూర్తితోనే మల్టిపుల్ గవర్నమెంట్ సెక్టార్స్‌లో గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్, డిజటల్ సేఫ్టీ.. మొదలైన విభాగాలలో వర్క్ చేయగలుగుతున్నాం.’’ – సంస్కృతినా గెలుపు తమదే అనేంతగా ఆనందిస్తారు– చిత్రకారిణి ప్రియాంక ఏలెకన్న కలలకు కాన్వాస్‌పై రూపం ఇస్తూ తండ్రి కుంచెను స్ఫూర్తిగా తీసుకొని ఎదిగిన చిత్రకారిణి ప్రియాంక ఏలె. ప్రముఖ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలె కుమార్తె. ‘మా నాన్నే గురువుగా కళను సాధన చేశాను’ అని వివరించింది ప్రియాంక. ‘‘అమ్మాయిలను ఇలాగే పెంచాలి అని మా అమ్మానాన్నలు ఎప్పుడూ అనుకోలేదు. మేం ఇద్దరం ఆడపిల్లలమని ఎక్కడా ఆంక్షలు పెట్టలేదు. కావాల్సినంత స్వేచ్ఛనిచ్చారు. దాని వల్ల భవిష్యత్తును మాకు నచ్చినట్టుగా మలుచుకోగలిగాం. ‘మనం ఎలా ఉంటే ఎదుటివారు అలాగే స్పందిస్తారు’ అంటుంటారు నాన్న. క్రియేటివ్ రంగంలో ఉన్నందువల్ల మా జీవన విధానం చాలా భిన్నంగా ఉంటుంది. రోజువారీ జీవనంలో చాలా ప్రాక్టికల్‌గా ఉంటాం అనుకుంటాం. కానీ, చాలాసార్లు ప్రకృతితో ఎక్కువ కనెక్ట్ అవుతుంటాం. దీంతో మాదైన ప్రపంచంలో ఎక్కువ సమయం గడుపుతుంటాం. ఇలాంటప్పుడు జీవన విధానంలో మానవసంబంధాలు ఎంత ముఖ్యమైనవో అమ్మానాన్న ప్రతీసారి చెబుతుంటారు. చిన్నప్పటి నుంచి నాన్న పెయింటింగ్స్ చూసి, స్ఫూర్తిపొంది నేనూ ఆర్టిస్ట్‌ను అయ్యాను. దీంతో నాన్న ఆఫీస్ స్పేస్‌ను కూడా పంచుకుంటున్నాను. ఆ విధంగా అమ్మానాన్నలతో ఎక్కువ సమయం గడిపే అవకాశం నాకు లభించింది. మా ఆలోచనలు ఎప్పుడూ ఒక మంచి చర్చతో ఉదయాన్నే ప్రారంభమవుతాయి. తిరిగి పడుకునే ముందు ముగుస్తాయి. ఇప్పటికీ అమ్మానాన్నలను విడవకుండా ఉండేంతగా ఆర్ట్ మా మధ్యన ఉండిపోయింది. ఇదంతా నాన్న చూపిన ప్రేమ. నేను ఏదైనా సాధిస్తే మొదట ఆనందించేది మా అమ్మనాన్నలే. నా చిత్ర ప్రదర్శన ఉందంటే నాకన్నా ముందు నాన్ననే ఆ గ్యాలరీలో ఉంటారు. అమ్మ లలిత ప్రతి చిన్న పనిలో ఇప్పటికీ నాకు సహకరిస్తుంటారు. ఇంట్లో ఇద్దరు ఆర్టిస్టులను అమ్మ భరిస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదని చెబుతుంటాను. మా అవసరాలన్నీ తనే చూసుకుంటుంది. ఎంతో ఓపికగా తమ జీవితంలో పిల్లలకే అగ్రభాగాన్ని ఇచ్చే దేవుళ్లు అమ్మానాన్నలు. మనమేమీ అమ్మనాన్నల కోసం పెద్ద పెద్ద త్యాగాలు చేయనక్కర్లేదు. ఏదైనా కొత్త వర్క్ చేసినప్పుడు ఇలాంటిది అమ్మానాన్నలకు నచ్చదు అని వదిలేయకుండా, మన అభి ప్రాయాన్ని కూడా వాళ్లు అర్థం చేసుకునేలా చెప్పగలగాలి. మనల్ని మొదట అర్థం చేసుకునే అత్యంత ప్రాణస్నేహితులూ అమ్మానాన్నలే’ అంటూ వివరించారు ఈ చిత్రకారిణి. -
గాల్లోని దోమలు గాల్లోనే మటాష్!
అరచేతిలో తేలికగా ఇమిడిపోయే ఈ పరికరం ఒక మైక్రోడ్రోన్. ఇది గాల్లోని దోమలను గాల్లోనే మటాష్ చేసి పారేస్తుంది. దోమల బెడద నివారించడానికి ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన సాధనాలన్నీ ఒక తీరు అయితే, ఈ మైక్రోడ్రోన్ మరో తీరు. ఇది గాల్లో శరవేగంగా ఎగురుతూ కనిపించిన దోమనల్లా క్షణాల్లోనే వేటాడి మట్టుబెట్టేస్తుంది. ఏఐ సాంకేతికతతో రూపొందించిన ఈ మైక్రోడ్రోన్ కదలికలను స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా నియంత్రించే వెసులుబాటు ఉంది.దోమల నివారణ కోసం రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే ఈ ఏఐ మైక్రో డ్రోన్‌ను ‘టోర్న్యాల్’ అనే అమెరికన్ స్టార్టప్ కంపెనీ రూపొందించింది. ఈ డ్రోన్ల తయారీకి స్టార్టప్‌లను ప్రోత్సహించే ‘వై కాంబినేటర్’ ఆర్థిక సాయం అందిస్తోంది. కేవలం నలభై గ్రాముల బరువు ఉండే ఈ డ్రోన్ పనితీరుపై ‘టోర్న్యాల్’ ఇటీవల విడుదల చేసిన వీడియో జనాలను విశేషంగా ఆకట్టుకుంది. -
అంతరిక్షంలో లక్ష డేటా సెంటర్లు!
అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటుపై ఎలాన్ మస్క్ వంటి దిగ్గజాలు ఒకవైపు ఏర్పాట్లు చేసుకుంటుంటే, నిన్న మొన్న ప్రారంభమైన అమెరికన్ స్టార్టప్ కంపెనీ ఒకటి అంతరిక్షంలో ఏకంగా లక్ష డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధపడుతోంది. ఇందుకోసం ఏఐతో పనిచేసే లక్ష ఉపగ్రహాలను భూనిమ్న కక్ష్యలోకి పంపేందుకు లాస్ ఏంజెలెస్‌కు చెందిన ‘ఆర్బిటాల్’ అనే స్టార్టప్ కంపెనీ అమెరికా ప్రభుత్వాన్ని అనుమతి కోరింది.ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తే వంద కిలోవాట్ల సామర్థ్యం గల లక్ష డేటా సెంటర్ ఉపగ్రహాలను భూనిమ్న కక్ష్యలోకి పంపనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. ఈ కంపెనీ మాదిరిగానే ‘స్టార్‌క్లౌడ్’ అనే మరో స్టార్టప్ కంపెనీ కూడా అంతరిక్షంలో 88వేల డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుమతి కోరుతూ అమెరికన్ ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుంది. -
యూత్ క్వీన్
అమ్మ కలను తన కలగా మార్చుకున్న నటి మీనాక్షి దినేష్ (Meenakshi Dinesh). కెమెరా ముందు హీరోయిన్ గా మెరిసినా... కెమెరా వెనుక మాత్రం కొత్త రుచుల కోసం ఊరంతాచుట్టేసే ఫుడీ! గాసిప్స్‌ను నవ్వుతూ పక్కన పెట్టే ఈ ‘యూత్’ హీరోయిన్ మనసులోని ముచ్చట్లు... మీకోసం.ఆయన ఫ్యాన్ గర్ల్‌ని!సూర్య సర్ అంటే నాకు చెప్పలేనంత అభిమానం. ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే... టెన్షన్ లో నా డైలాగులే మర్చిపోతానేమో! అలాగే నాని సర్ సినిమాలు కూడా చాలా ఇష్టం. ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ సినిమాను నేను లెక్కలేనన్ని సార్లు చూశాను.నా కల కాదు!హీరోయిన్ అవ్వాలనేది నా ప్లాన్ కాదు... పూర్తిగా మా అమ్మ కల! నాలో ఏదో స్పార్క్ ఉందని మొదట గుర్తించింది ఆమే. నాతో ఆరేళ్ల వయసులోనే ఫొటోషూట్లు చేయించి, ఆడిషన్స్‌కు తీసుకెళ్లేది. పన్నెండేళ్లకే ‘పాండియన్ స్టోర్స్’ షోతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. అప్పుడు వచ్చిన నా తొలి పారితోషికం రూ.3,000. ఆ డబ్బు చూసి నేను ఆస్కార్ గెలిచినంతగా మా అమ్మ సంబరపడిపోయింది.క్యాట్ ఫైట్స్... అంతా కథే!నాతో పాటు అనిష్మ, ప్రియాన్షి లాంటి యంగ్ నటీమణులు ఉండటంతో మా మధ్య గొడవలు ఉన్నాయంటూ ఎన్నో గాసిప్స్ వచ్చాయి. కానీ సెట్స్‌లో మేమంతా ఒక ఫ్యామిలీలా ఉండేవాళ్లం. ఈ ఇండస్ట్రీలో ఎవరూ శత్రువులు కాదు... ప్రతి రోజూ కొత్తగా నేర్చుకునే సహనటులే. అందుకే నాకు ఎవరితోనూ పోటీ అనే భావనే లేదు.సెలెక్టివ్‌గా ఉండడంలో తప్పేంటి?‘యూత్’ విజయం తర్వాత నేను కథల విషయంలో చాలా కండిషన్స్ పెడుతున్నానని, డిఫికల్ట్‌గా మారానని రాస్తున్నారు. కానీ మంచి పాత్రలు కోరుకోవడం తప్పా? ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే పాత్ర కోసం ఎదురు చూడాల్సి వచ్చినా నేను సిద్ధమే. డైరీ నింపుకోవడానికి సినిమాలు చేయను... గుర్తుండిపోయే పాత్రల కోసమే ఎదురుచూస్తాను.ఎలాగోలా పాస్ అయ్యేదాన్ని!నా చిన్నతనం అంతా ఒకవైపు స్కూల్, మరోవైపు యాడ్ షూటింగ్స్‌తోనే గడిచిపోయింది. సినిమాల్లో చూపించినంత కలర్ఫుల్గా నా స్కూల్ లైఫ్ ఉండేది కాదు. పరీక్షల్లో ఎలాగోలా పాస్ అయితే చాలు అనుకునే సాధారణ స్టూడెంట్‌ని.డైటింగ్ నా వల్ల కాదు!నేను పక్కా ఫుడీని. ‘యూత్’ సినిమాలో నా పాత్రకు తిండి అంటే ఎంత ఇష్టమో... నిజ జీవితంలో నాకు కూడా అంతే. ప్రమోషన్స్ కోసం హైదరాబాద్‌కు వచ్చినప్పుడు అందరూ షెడ్యూల్స్‌లో బిజీగా ఉంటే... నేను మాత్రం బెస్ట్ బిర్యానీ, బెస్ట్ లోకల్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందా అని వెతికేదాన్ని. -
ఆకాశమే హద్దు.. జెన్ ఆల్ఫా
నిన్నటి వరకు పెద్దలు చెప్పిన మాటకు పిల్లలు ‘ఓకే’ చెప్పడమే తెలుసు. కానీ, నేడు ఏడేళ్ల పిల్లాడు సైతం ‘నాకు కాస్త స్పేస్ కావాలి’ అంటూ సరిహద్దులు గీస్తున్నాడు. చాట్ జీపీటీని చదివేస్తున్నాడు. ఏఐని ఏలేస్తున్నాడు. యద్ధాలు కాదు, ఉత్తేజమే కావాలంటున్నాడు. ఆకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాడు. రేపటి రోజున ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 200 కోట్లకు పైగా జనాభాతో అతిపెద్ద తరంగా రికార్డు సృష్టించబోతున్న ఈ ఆల్ఫా జనరేషన్‌ని.. అదుపు తప్పకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే!కొత్త ఎమోషనల్ వొకాబులరీ ‘నాకు కాస్త ప్రైవసీ కావాలి’ అనే మాట ఈ రోజుల్లో తల్లిదండ్రులకు తరచూ వినిపిస్తోంది. అలాగని వారు రూడ్గానూ ప్రవర్తించడం లేదు, కేవలం ‘నేను మళ్లీ మీతో మాట్లాడటానికి ముందు కాస్త ప్రశాంతంగా ఉండటానికి నాకు కొంత సమయం కావాలి’ అని మాత్రమే చెబుతున్నారు. అంటే వారు తమ భావాలను కొత్తగా ఫీలవడం లేదు. తమ భావాలను స్పష్టంగా, బహిరంగంగా వ్యక్తపరచడానికి వెనుకాడటం లేదు. డిజిటల్ సాంకేతికతతో చిన్నతనం నుంచే ఉన్న పరిచయం వల్ల ఈ తరం పిల్లలకు మరింత స్పష్టమైన, వేగవంతమైన కమ్యూనికేషన్ శైలి అలవడుతోంది.నేటి తరం అంటే 2010 నుంచి 2025 మధ్య జన్మించిన పిల్లలు తమ ప్రేమను ఎంత స్వేచ్ఛగా వ్యక్తపరుస్తున్నారో; తమకు నచ్చని విషయాలను, అసౌకర్యాలను కూడా అంతే నిర్భయంగా చెబుతున్నారు. వీరినే ‘జెనరేషన్ ఆల్ఫా’గా పిలుస్తున్నారు. వీరు ప్రధానంగా మిలీనియల్స్ (1981–1996), అలాగే కొంతమంది జెన్ జీ (1997–2012) తల్లిదండ్రుల పెంపకంలో పెరుగుతున్నారు. వీరి జీవితాలను శాసిస్తున్న ఉపాధ్యాయులు, అధికారులు మాత్రం ‘జెన్ ఎక్స్’ (1965–1980) తరానికి చెందినవారు.కొంచెం స్పేస్ కావాలి ప్లీజ్!⇒ మునుపటి తరాల్లోలా మొహమాటాలకు పోకుండా, చిన్న వయసులోనే ‘నాకు కొంచెం స్పేస్ కావాలి, ‘ట్రిగ్గర్డ్’, ‘బౌండరీస్’, ‘పాజిటివ్ మేనిఫెస్టేషన్‘ వంటి పదాలను అలవోకగా వాడుతున్నారు. తమకు నచ్చని విషయాలను నిక్కచ్చిగా చెప్పేస్తున్నారు. తాము కోరుకునే ప్రశాంతతను ఇవ్వమని నిర్మొహమాటంగా తల్లిదండ్రులకు చెబుతున్నారు.⇒ అప్పట్లో పెద్దలు ‘నేను చెప్పాను కాబట్టి చెయ్!’ అంటే పిల్లలు ఎదురుప్రశ్న వేసేవారు కాదు. కానీ మిలీనియల్స్ చేతుల్లో పెరుగుతున్న ఇప్పటి తరం íపిల్లలు ప్రతిదానికీ హేతుబద్ధతను కోరుకుంటున్నారు. ‘నేను హోంవర్క్ ఎందుకు ఇప్పుడే చేయాలి?’, ‘నువ్వు ఫోన్ చూస్తున్నప్పుడు నేనెందుకు చూడకూడదు?’ వంటి ప్రశ్నలతో తల్లిదండ్రులను లాక్ చేస్తున్నారు. పెద్దలు ఆదేశాలను గుడ్డిగా పాటించడం కాదు, వాటి వెనుక ఉన్న కారణాలను, స్పష్టతను కోరుకుంటున్నారు.⇒ ఈ తరానికి చిన్నప్పటి నుంచే టెక్నాలజీతో ఉన్న అనుబంధం వల్ల వారి కమ్యూనికేషన్ శైలి చాలా త్వరగా, సూటిగా మారుతోంది. ప్రతి విషయాన్ని వెరిఫై చేసుకోగలిగే సమాచార విప్లవం మధ్య వీరు పెరుగుతున్నారు. అందుకే ఏ విషయాన్నైనా గుడ్డిగా నమ్మకుండా ప్రశ్నిస్తున్నారు.⇒ అయితే, పిల్లలు తాము వాడుతున్న పదాలను పూర్తి క్లినికల్ అర్థంతో వాడటం లేదని, కేవలం తమ భావాలను అర్థం చేసుకోవడానికి అందుబాటులో ఉన్న భాషను వాడుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. కోరుకుంటున్నారు.అర్థం చేసుకోండి!1. టైమ్ కోరడం పిల్లలు అనే మాట: నాకు కాస్త టైమ్ కావాలి.పెద్దలు అనుకునేది: నన్ను దూరం పెడుతున్నాడు/తిరస్కరిస్తున్నాడు.అసలు అర్థం: ఇది పెద్దలను దూరం పెట్టడం కాదు. తనను తాను మానసికంగా స్థిమితపరచుకుని, ప్రశాంతంగా తిరిగి మాట్లాడటానికి ఆ చిన్నారి కొద్దిసేపు వ్యవధి కోరుకుంటున్నాడని అర్థం.2. ఒత్తిడిని వ్యక్తపరచడంపిల్లలు అనే మాట: నేను చాలా ఓవర్వెల్మ్డ్గా ఫీల్ అవుతున్నాను.పెద్దలు అనుకునేది: చిన్న విషయానికే అతిగా స్పందిస్తున్నాడు.అసలు అర్థం: ఒకేసారి చాలా పనులు లేదా విపరీతమైన విషయాలు తన దృష్టి్టని ఆకర్షించి, మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయని చెప్పే ప్రయత్నం ఇది.3. నియమాలను ప్రశ్నించడంపిల్లలు అనే మాట: ‘నేను ఆ పని ఎందుకు చేయాలి?’పెద్దలు అనుకునేది: ‘నా మాటను ప్రశ్నిస్తోంది.’అసలు అర్థం: సమాచార ప్రపంచంలో పెరుగుతున్న నేటి పిల్లలు గుడ్డిగా ఆ పనిని చేయకుండా, అందుకు గల కారణాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు.4. అసౌకర్యాన్ని తెలపడంపిల్లలు అనే మాట: ‘ఇది నాకు సరిగ్గా అనిపించడం లేదు’పెద్దలు అనుకునేది: ‘సతాయిస్తున్నాడు/ మొండిగా ప్రవర్తిస్తున్నాడు.’అసలు అర్థం: ఏదైనా ఒక పరిస్థితి తనకు అన్యాయంగా, శారీరకంగా అసౌకర్యంగా లేదా బాధాకరంగా ఉందని చెప్పడానికి పిల్లలు తమ సరిహద్దులను స్పష్టం చేస్తున్నారు.5. ఓవర్ స్టిమ్యులేషన్ పిల్లలు అనే మాట: ‘నేను ఓవర్ స్టిమ్యులేట్ అయ్యాను.’పెద్దలు అనుకునేది: ‘పని తప్పించుకోవడానికి సాకులు వెతుకుతోంది.’అసలు అర్థం: చుట్టూ ఉన్న రణగొణలు, గందరగోళం లేదా చదువు/సామాజిక ఒత్తిడి తట్టుకోలేనంత తీవ్రంగా మారాయని చెప్పే శారీరక, మానసిక అలసట అది.6. ట్రిగ్గర్ అవ్వడంపిల్లలు అనే మాట: ‘ఆ విషయం నన్ను ట్రిగ్గర్ చేసింది.’ పెద్దలు అనుకునేది: ‘ఈ మధ్య సైకాలజీ పదాలను బాగా వాడుతోంది.‘ అసలు అర్థం: ఏదైనా ఒక సంఘటన లేదా మాట వల్ల తనలో ఒక్కసారిగా బలమైన మానసిక ఆందోళన కలిగిందని, దాన్ని నియంత్రించుకోవడానికి తను ఇబ్బంది పడుతోందని అర్థం.పిల్లల మాటలను కేవలం సాకులుగానో లేదా ఎదురు సమాధానాలుగానో కొట్టిపారేయకుండా, వారి మాటల వెనుక ఉన్న అసలు మానసిక అవసరాన్ని గుర్తించి, ఆదరించడమే దీనికి ఏకైక పరిష్కారం.ఆర్థిక వ్యవహారాల్లో ముందంజజెన్ ఆల్ఫా పిల్లలు డిజిటల్ సాధనాలతో సంపాదనా మార్గాలనూ వెతుకుతున్నారు. కుటుంబ ఆర్థిక నిర్ణయాలను సైతం ప్రభావితం చేస్తున్నారు. చిన్న వయసులోనే స్వయంసమృద్ధిని సాధించడంలోను, సరికొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంలోను, పొదుపులోను ఈ తరం మునుపటి తరాల కంటే ఎంతో మెరుగ్గా ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.⇒ సుమారు 70 శాతం మంది పిల్లలు ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు వాడుకుంటూ క్రియేటివ్ ప్రాజెక్ట్స్, గేమింగ్, డిజిటల్ స్కిల్స్ ద్వారా డబ్బు సంపాదించే మార్గాలను వెతుకుతున్నారు.⇒ 31 శాతం మంది పిల్లలు తమకు దొరికే పాకెట్ మనీని పొదుపు చేస్తున్నారు.⇒ సుమారుగా 25 శాతం మంది పిల్లలు ఏదైనా కొనే ముందు ఇప్పటికీ తల్లిదండ్రుల అనుమతి తీసుకుంటున్నారు. ⇒కేవలం 17 శాతం మంది మాత్రమే అనాలోచితంగా వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.⇒ కేవలం 14 శాతం మంది మాత్రమే వీడియో గేమ్స్, ఇన్–యాప్ ఫీచర్స్ లేదా ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ల కోసం ఖర్చు చేస్తున్నారు. ⇒ దాదాపు 66 శాతం మంది పిల్లలు ఇంట్లోని రోజువారీ ఖర్చులు, వస్తువుల కొనుగోళ్లలో తమ తల్లిదండ్రులకు సలహాలు ఇస్తూ నిర్ణేతలుగా మారుతున్నారు.డిజిటల్ సవాళ్లు..⇒ హేతుబద్ధంగా వాస్తవాలను మాట్లాడటంలో, ఏఐ వంటి అధునాతన సాంకేతికతను వాడటంలో జెన్ ఆల్ఫా పిల్లలు తెలివైన వారే అయినా, మరోవైపు వారు తీవ్రమైన మానసిక, శారీరక ఎదుగుదల సమస్యలను ఎదుర్కొంటున్నారు. భావోద్వేగపరమైన చిన్న చిన్న ఇబ్బందులను కూడా పెద్ద సంక్షోభంలా భావించే ధోరణి ప్రదర్శిస్తున్నారు.⇒ సాధారణంగా మూడు నుంచి ఆరేళ్ల వయస్సు గల పిల్లలు సొంతంగా ఆలోచించడం, సృజనాత్మకంగా ఆడటం నేర్చుకుంటారు. అయితే, నిరంతరం స్మార్ట్ఫోన్లకు పరిమితం కావడం వల్ల వారిలో సామాజిక నైపుణ్యాలు లోపించి, బంధాలను ఏర్పరచుకోవడంలో వెనుకబడుతున్నారు.⇒ స్మార్ట్ఫోన్ల మితిమీరిన వాడకం వల్ల జెన్ ఆల్ఫా పిల్లల్లో ఏకాగ్రత దారుణంగా పడిపోతోంది. సొంత ఆలోచనా శక్తి, విమర్శనాత్మక పరిశీలన దెబ్బతింటున్నాయి. అలాగే, ఆటో–కరెక్ట్ ఫీచర్ల వల్ల సొంతంగా స్పెల్లింగులు రాయలేకపోతున్నారు. పుస్తకాలు చదవడం మానేసి, డిజిటల్ పదజాలానికి అలవాటు పడుతున్నారు. ఫలితంగా వీరిలో భాషా నైపుణ్యాలు లోపిస్తున్నాయి.⇒ సోషల్ మీడియాలో చూసే అంశాల వల్ల, తమకు దక్కని లగ్జరీల వల్ల వీరు చిన్న వయసులోనే తీవ్రమైన ‘యాంగై్జటీ’కి లోనవుతున్నారు. మునుపటి తరాల్లాగా ఓటమిని తట్టుకునే శక్తి వీరిలో ఉండటం లేదని చైల్డ్ సైకాలజిస్టులు చెబుతున్నారు.⇒ నిరంతర సోషల్ మీడియా పోలికలు, తల్లిదండ్రుల మితిమీరిన జోక్యం, ప్రపంచ పరిణామాల గురించి సమాచార దాడి వంటి ఒత్తిళ్లను వీరు ఎదుర్కొంటున్నారు. చిన్న చిన్న మానసిక ఇబ్బందులను కూడా పెద్ద సంక్షోభాలుగా మార్చుకోవడం వల్ల వారిపై ఒత్తిడి పెరిగి, సొంతంగా సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యాన్ని కోల్పోతున్నారు.ఆరోగ్యం అంతంతే!⇒ ముందు తరాలతో పోలిస్తే జెన్ ఆల్ఫా పిల్లల ఆరోగ్యం ఎంతో సంక్లిష్టంగా మారింది. ముఖ్యంగా కరోనా తరువాత పిల్లల్లో పూర్తిగా శారీరక శ్రమ లోపించడం, పాఠశాలల్లో ప్లే గ్రౌండ్లు లేకపోవడం వంటివి వారిని సున్నితంగా మార్చేస్తున్నాయి. ఈ జీవనశైలి వల్ల చిన్న వయసులోనే పిల్లలు ప్రీ–డయాబెటిక్, ఒబెసిటీ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. గతంలో పిల్లల్లో పోషకాహార లోపం ఒక సమస్యగా ఉండేది. కానీ ఇప్పుడు మితిమీరిన ఆహారం, నాణ్యత లేని ఆహారం పెద్ద సమస్యగా మారింది. తల్లిదండ్రుల కొనుగోలు శక్తి పెరగడం, మార్కెట్లో ‘రెడీ–టు–ఈట్’ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ విరివిగా లభించడమే దీనికి ప్రధాన కారణం. దీనివల్ల జెన్ ఆల్ఫా పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతోంది. ⇒ డిజిటల్ గాడ్జెట్ల వ్యసనం వల్ల పిల్లల్లో ప్రధానంగా కంటి సమస్యలు వస్తున్నాయి. ఇది వారి నిద్ర నాణ్యతను, చదువును కూడా దెబ్బతీస్తోంది. అలాగే గంటల తరబడి కూర్చోవడం లేదా పడుకుని మొబైల్స్ వాడటం వల్ల పిల్లల్లో మెడనొప్పి, వెన్నునొప్పి మామూలైపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే ఐదు పదేళ్లలో ఈ పిల్లలు తీవ్రమైన వెన్నెముక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.జెన్ ఆల్ఫా.. టీచర్లకు సవాల్!ఏఐ ప్రపంచంలో జన్మించిన జెన్ ఆల్ఫా– మునుపటి తరాల కంటే భిన్నమైన అంచనాలు, నైపుణ్యాలు, సవాళ్లతో తరగతి గదుల్లోకి అడుగుపెడుతోంది. వీరు పుట్టిందే మొదలు ఏఐ ఆధారిత పరికరాలతో సంభాషిస్తున్నారు. అక్షరాలు నేర్వడానికి ముందే ప్రాథమిక డిజిటల్ నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. అందుకే వీరు తక్షణ ఫీడ్‌బ్యాక్, ఇంటరాక్టివ్ కంటెంట్, మల్టీమోడల్ లెర్నింగ్ వాతావరణాన్ని కోరుకుంటున్నారు. అలా జెన్ ఆల్ఫా విద్యావ్యవస్థలో బోధనా పద్ధతులు, సిలబస్ రూపకల్పన, విద్యా సాంకేతికత వినియోగంలో వ్యవస్థాగత మార్పులకు కారణమవుతున్నారు. ప్రాజెక్ట్–ఆధారిత అభ్యాసం, గేమిఫికేషన్, పరిశోధనాత్మక బోధన వంటి క్రియాశీల అభ్యాస వ్యూహాలు ఈ తరానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. విద్యా రంగ పరిణామ క్రమంలో జెనరేషన్ ఆల్ఫా రాక టీచర్లకు ఒక సవాలు. అదే సమయంలో ఒక గొప్ప అవకాశం కూడా!కొత్తా కాదు.. వింతా కాదు.. మామూలే!⇒ ఈ తరం పిల్లలకు ఐప్యాడ్లు, స్మార్ట్ఫోన్లు, ఏఐ లేని ప్రపంచం తెలియదు. వీరు మాట్లాడటం నేర్చుకోవడానికి ముందే యూట్యూబ్‌లో వీడియోలు స్క్రోల్ చేయడం, అలెక్సా లేదా సిరితో మాట్లాడటం నేర్చుకుంటున్నారు. ⇒ సామాజిక శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, ప్రపంచ చరిత్రలోనే అత్యధిక జనాభా కలిగిన తరంగా ‘జెన్ ఆల్ఫా’ రికార్డు çసృష్టించబోతోంది. వీరి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్లకు పైగా చేరనుంది.⇒ ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ యాప్ లాంచ్ అయిన 2010 సంవత్సరంలోనే ఈ ‘జెన్ ఆల్ఫా’ తరం కూడా ప్రారంభమైంది.⇒ కోవిడ్–19 మహమ్మారి సమయంలో వీరు చిన్న పిల్లలు కావడం వల్ల, క్లాస్రూమ్ కంటే ముందే జూమ్ క్లాసులు, ఆన్లైన్ లెర్నింగ్ స్క్రీన్లకు అలవాటు పడ్డారు. ⇒ చాట్ జీపీటీ వంటి టూల్స్ అందుబాటులోకి వచ్చిన కాలంలో వీరు పెరుగుతున్నారు. కాబట్టి హోంవర్క్ చేయడం నుంచి కోడింగ్ నేర్చుకోవడం వరకు వీరు ఏఐని ఒక సాధారణ వస్తువులా వాడుకుంటున్నారు.⇒ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు వాడటం వల్ల వీరు చిన్న వయసులోనే వర్చువల్ కరెన్సీల గురించి తెలుసు కుంటున్నారు. మునుపటి తరాల కంటే వీరు డిజిటల్ లావాదేవీల పట్ల ఎక్కువ అవగాహన కలిగి ఉన్నారు.⇒ సవాళ్లు ఎన్ని ఉన్నా, జెన్ ఆల్ఫాలో ఒక ప్రత్యేకమైన సానుకూలత ఉంది. సాంకేతికతతో పెరగడం వల్ల వారి డిజిటల్ నాలెడ్జ్ అత్యద్భుతంగా ఉంది. కొత్త విషయాలను నేర్చుకునే తపన ఎక్కువగా ఉంది. అయితే, ఈ సాంకేతికత వారి పాలిట శాపంగా మారకుండా ఉండాలంటే తల్లిదండ్రులు కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోకూడదు. పిల్లల స్క్రీన్ టైమ్‌ను నియంత్రిస్తూ, వారిని డిజిటల్ వినియోగదారులుగా కాకుండా, క్రియేటర్లుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉంది. షాపింగ్ శైలిలోనూ మార్పు!జెన్ ఆల్ఫా తరం బ్రాండ్ల కంటే ఫీచర్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. టీవీ అడ్వర్టైజ్మెంట్లు చూసో, లేక షాపింగ్ మాల్స్‌కు వెళ్లో వస్తువులు కొనే రోజులకు స్వస్తి పలికింది. వీరు డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా రివ్యూల ఆధారంగానే షాపింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వస్తువు ప్యాకేజింగ్ లేదా అందాన్ని చూసి మోసపోవడం లేదు. ⇒ 42% మంది ఒక బ్రాండ్‌కు కట్టుబడి ఉండకుండా, అంతకంటే మెరుగైన ఫీచర్లు ఉన్న వేరే కొత్త బ్రాండ్ దొరికితే వెంటనే మారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు.⇒ 72% మంది ఆహారం, పానీయాలు ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. ⇒ 57% మంది ఆటబొమ్మలను ఆన్లైన్లో కొంటున్నారు. ⇒ 55% మంది దుస్తుల కొనుగోళ్లకు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లనే వాడుతున్నారు.నిఘా తప్పనిసరి!ఈతరం పిల్లలను పెంచడం నేటి తల్లిదండ్రులకు సవాలుగా మారింది. గత తరాల పెంపకానికి, ఇప్పటి పరిస్థితులకు అస్సలు పోలికే లేకుండా పోయింది.⇒ జెన్ ఆల్ఫా పిల్లలకు ఇంటర్నెట్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా వంటివి నిత్యావసరాలుగా మారిపోయాయి. ఇది వారి సృజనాత్మకతను పెంచుతున్నా, సమస్యలకూ కారణమవుతోంది. అందువల్ల తల్లిదండ్రులు పిల్లల డిజిటల్ స్క్రీన్ టైమ్‌పై గట్టి నిఘా ఉంచాలి. ఆన్లైన్ భద్రతపై వారికి అవగాహన కల్పించడంతో పాటు, కేవలం గాడ్జెట్స్కే పరిమితం కాకుండా శారీరక ఆటలు, పుస్తక పఠనం, వ్యాయామం వైపు వారిని మళ్లించాలి. ⇒ ఈ తరం పిల్లలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సామాజిక, పర్యావరణ అంశాలపై చాలా స్పష్టమైన అవగాహన కలిగి ఉంటున్నారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపును కోరుకుంటున్నారు. అందువల్ల పేరెంట్స్ పిల్లల ఆలోచనలను తక్కువ చేసి చూడకుండా, వారి అభిప్రాయాలను గౌరవించాలి. వారితో స్నేహపూర్వకంగా మాట్లాడటం ద్వారా జనరేషన్ గ్యాప్‌ను తగ్గించవచ్చు. మన అనుభవాలను వారితో పంచుకుంటూనే, వారి నుంచి సరికొత్త విషయాలను నేర్చుకోవడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలి.⇒ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాసిస్తున్న ఈ కాలంలో భవిష్యత్తులో ఉద్యోగాలు, నైపుణ్యాల స్వరూపమే మారిపోనుంది. ఆర్థిక ఒడిదొడుకులు, పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వంటి సవాళ్లను ఎదుర్కొంటూ ఈ పిల్లలు ఎదగాల్సి ఉంటుంది. అందువల్ల పిల్లలకు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకునే తత్త్వాన్ని, ఓటమిని తట్టుకునే మానసిక ధైర్యాన్ని, సరికొత్త విషయాలను అన్వేషించే జిజ్ఞాసను అలవాటు చేయాలి. వారి కలలను ప్రోత్సహిస్తూ సమాజానికి మేలు చేసే వ్యక్తులుగా తీర్చిదిద్దాలి.∙రమా జంబుల -
ఒక్క జత స్నీకర్స్... ఐదు స్టయిల్స్!
కొత్త డ్రెస్! అనిపించాలంటే ప్రతిసారి కొత్త బట్టలు కొనాల్సిన పనిలేదు. ఒక్క జత వైట్ స్నీకర్స్ ఉంటే చాలు! ఇవి మీ వార్డ్‌రోబ్‌లో ఉన్న ప్రతి డ్రెస్‌తో ఫ్రెండ్షిప్ చేసి, ప్రతిసారి కొత్తగా చూపిస్తాయి. క్యాజువల్ నుంచి సెమీ ఫార్మల్ వరకు... ఒక్క జతతో ఎన్నో లుక్స్ క్రియేట్ చేయొచ్చు. మరి వైట్ స్నీకర్స్‌ను స్టయిలిష్‌గా ఎలా ధరించాలో ఇక్కడ చూద్దామా!సింపుల్ సూపర్!కొన్ని లుక్స్ ఎక్కువ కష్టపడితే రావు... తక్కువ కష్టపడితేనే అదిరిపోతాయి! తెల్లటి టీషర్ట్, గ్రే డెనిమ్, వైట్ స్నీకర్స్... అంతే. ఈ కాంబినేషన్ ఎప్పటికీ ఔటాఫ్ ఫ్యాషన్ కాదు. సింపుల్‌గా కనిపించినా, అదే ఈ లుక్ ప్రత్యేకత. చేతికి ఓ వాచ్, కళ్లకు సన్ గ్లాసెస్ పెట్టుకుంటే... సింపుల్ లుక్ కూడా స్టార్ ఎంట్రీ ఇస్తుంది.ఓపెన్ షర్ట్... ట్రెండీ టచ్!వైట్ టీషర్ట్‌పై చెక్స్ షర్ట్ వేసుకోండి. కానీ ఓ చిన్న కండిషన్ ... బటన్లు మాత్రం వేయొద్దు! అదే ఈ లుక్‌లో అసలు ట్విస్ట్. బ్లూ జీ న్స్, వైట్ స్నీకర్స్‌తో బయటికి వస్తే... ‘ఈయన చాలా క్యాజువల్‌గా రెడీ అయ్యాడు... కానీ ఎందుకింత స్టయిల్‌గా ఉన్నాడు?’ అని జనాలు ఒక్కసారి చూసి మళ్లీ మళ్లీ చూస్తారు!కూల్ హీరో!షార్ట్స్‌తో ఏ షూ పడితే అది వేసుకుంటే... ‘వాకింగ్కా? వర్కౌట్కా?’ అనే డౌట్ వస్తుంది. అందుకే స్లిమ్, లో–కట్ వైట్ స్నీకర్స్ ఎంచుకోండి. సాక్స్ కూడా కనిపించకుండా చూసుకోండి. అప్పుడు సమ్మర్లో కూడా మీ స్టయిల్... ఐస్‌క్రీమ్‌లా కూల్‌గా ఉంటుంది!చినోస్‌తో స్మార్ట్ లుక్రోజూ అదే జీ న్స్నా? ఒక్కరోజు చినో ప్యాంట్‌ను బయటకు తీయండి. దానికి తెల్లటి షర్ట్ లేదా సాలిడ్ కలర్ షర్ట్ జత చేయండి. ఇంకో లెవల్‌కు వెళ్లాలంటే బ్లేజర్ కూడా వేసేయండి. ఆఫీస్‌లో అయినా... డేట్లో అయినా... ‘డ్రెస్ సె న్స్ బాగుంది!’అనే కామెంట్ గ్యారంటీ!సూట్‌తో స్నీకర్స్... కొత్త ట్రెండ్! సూట్ అంటే ఫార్మల్ షూలే అనుకునే రూల్‌కు ఇప్పటికే రిటైర్మెంట్ వచ్చేసింది! ఇప్పుడు సూట్‌తో వైట్ స్నీకర్స్ వేసుకోవడం హాట్ ట్రెండ్. అయితే ఒక చిన్న సీక్రెట్... లోపల తెల్లటి షర్ట్ లేదా వైట్ టీషర్ట్ ఉంటే మొత్తం లుక్ చాలా నీట్‌గా, క్లాస్‌గా కనిపిస్తుంది. ఫార్మల్‌లో కూడా ఫ్యాషన్ కి ఫుల్ మార్కులు కొట్టేయొచ్చు!స్టయిలింగ్ టిప్వైట్ స్నీకర్స్ అందంగా కనిపించాలంటే వాటిని తెల్లగానే ఉంచాలి! మట్టి, దుమ్ము పట్టిన స్నీకర్స్‌తో ఎంత ఖరీదైన డ్రెస్ వేసుకున్నా... స్టయిల్ కంటే ‘షూ కడుక్కోలేదా?’ అనే ప్రశ్నే ముందొస్తుంది. కాబట్టి... స్నీకర్స్‌ను క్లీన్ గా ఉంచి, మీరు అడుగులు ముందుకు వేస్తే, ఎందరి చూపులో మిమ్మల్నే ఫాలో అవుతాయి.∙కొండి దీపిక -
పెస్కటేరియన్ డైట్‌తో స్థూలకాయం దూరం!
ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే నేటి ఆధునిక జీవనశైలి వల్ల స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులు చిన్న వయసులోనే చుట్టుముడుతున్నాయి. అందువల్ల పెస్కటేరియన్ డైట్ అనుసరించడం వల్ల స్థూలకాయం తగ్గడమే కాకుండా ఆయుష్షు కూడా పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది.పెస్కటేరియన్ డైట్ అంటే...?శాకాహారంలో చేపలు, రొయ్యలు సంబంధిత సీఫుడ్లను చేర్చుకోవడాన్ని పెస్కటేరియన్ డైట్ అంటారు. శాకాహారంలోని పోషకాలతో పాటు చేపలలో ఉండే నాణ్యమైన ప్రోటీన్లు, ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు శరీరానికి లభించడం ఈ డైట్ ప్రత్యేకత.ఈ డైట్ పాటించడం వల్ల...స్థూలకాయం నియంత్రణలో ఉంటుంది.ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధించి, రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది.మధుమేహం వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.శరీరంలో అంతర్గత వాపులు, మంటలను తగ్గించి కణాల జీవక్రియను వేగవంతం చేస్తుంది.మాంసాహారులతో పోలిస్తే, పెస్కటేరియన్ విధానాన్ని పాటించేవారిలో అకాల మరణ ముప్పు దాదాపు 18% తక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా వృద్ధులకు, స్థూలకాయంతో బాధపడేవారికి ఇది ఉపయోగంగా ఉంటుంది. -
విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు
ఆషాడమాసంలో వచ్చే తొలి ఏకాదశిని మొదటి పండుగగా ప్రజలు జరుపుకుంటారు. దీనినే దేవశయన ఏకాదశి, హరిశయన ఏకాదశి, హరివాసరం అని కూడా అంటారు. అలాగే ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుంచి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు. అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఏకదశిని మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజున భక్తులు ఉపవాసం ఉండి, మరుసటి రోజు ద్వాదశిన పారణ చేస్తారు. ఏకాదశి సందర్భంగా జిల్లాలోని వైష్ణవ ఆలయాలు ముస్తాబయ్యాయి. ఆలయాల్లో భక్తులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మొక్కజొన్న పేలాలను మెత్త టి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం, యాలకులు కలిపి దేవుడికి నైవేద్యంగా సమరి్పంచి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. -
డ్రాగన్ ఫ్రూట్‌తో... సీజనల్ వ్యాధులకు చెక్!
చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ పోషకాల గని. క్యాలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉండే ఈ ఫ్రూట్‌ని ముఖ్యంగా వర్షాకాలంలో తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు...డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ ‘సి’ అత్యధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఇమ్యూనిటీని పెంచి, వర్షాకాలంలో వచ్చే రకరకాల సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి రక్షించి, ఊపిరితిత్తుల్లో కఫం పేరుకు పోకుండా కాపాడుతుంది.ఈ పండులో సహజసిద్ధమైన యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి వర్షాకాలంలో సాధారణంగా ఇబ్బంది పెట్టే ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.వర్షాకాలంలో చాలామందిని వేధించే గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలకు ఈ పండు చక్కని పరిష్కారం. ఇందులో ఉండే పీచుపదార్థం ప్రేగుల కదలికలను క్రమబద్ధం చేసి జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది.ఈ పండులోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కీళ్లనొప్పులు, అస్తమా, అలర్జీల వంటి సమస్యల తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయి.వాతావరణంలో పెరిగే తేమ, కాలుష్యం వల్ల చర్మం జీవం కోల్పోకుండా ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కాపాడతాయి. చర్మాన్ని ఆరోగ్యవంతంగా, కాంతివంతంగా ఉంచుతాయి. -
మధుమేహాన్ని తగ్గించే పరివృత్త త్రికోణాసనం..
శరీరాన్ని ముందుకు వంచి, వెన్నెముకను ఒక వైపుకు తిప్పి చేసే భంగిమ కనుక దీనిని పరివృత్త త్రికోణాసనం అంటారు.చేసే విధానం...ముందుగా మ్యాట్‌పై తాడాసనంలో నిటారుగా నిలబడాలి.రెండు కాళ్లను 3–4 అడుగుల దూరంలో ఉంచండి.కుడి పాదాన్ని ముందుకు, ఎడమ పాదాన్ని సుమారు 45 డిగ్రీలు లోపలికి తిప్పండి.రెండు చేతులను భుజాల స్థాయిలో చాపండి.శ్వాసను బయటకు వదులుతూ నడుము నుంచి ముందుకు వంగండి.ఎడమ చేతిని కుడి పాదం బయట లేదా లోపల నేలపై ఉంచండి.కుడి చేతిని నిటారుగా పైకి ఎత్తి, పై చేతి వేళ్లవైపు చూడాలి.వెన్నెముకను నిటారుగా ఉంచి, సాధారణ శ్వాసతో 20–30 సెకన్లు ఉండాలి.శ్వాసను లోపలికి తీసుకుంటూ నెమ్మదిగా పైకి లేవాలి.ఇదేవిధంగా మరోవైపున కూడా చేయాలి.ప్రయోజనాలు...బరువు నియంత్రణకు తోడ్పడుతుంది.వెన్నెముకకు మంచి ట్విస్ట్ లభించి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.కాళ్లు, తుంటి, హ్యామ్‌స్ట్రింగ్స్ బలపడతాయి.జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.పొత్తికడుపు అవయవాలకు మసాజ్ లభిస్తుంది.నడుము భాగంలోని కొవ్వు తగ్గించే వ్యాయామాలకు సహాయకంగా ఉంటుంది.శరీర సమతుల్యత, ఏకాగ్రత పెరుగుతుంది.ఛాతి విస్తరించి శ్వాస సామర్థ్యం మెరుగుపడుతుంది.భుజాలు, నడుము బిగుతు తగ్గుతుంది.పొత్తికడుపు భాగంపై మృదువైన ఒత్తిడి ఏర్పడి జీర్ణక్రియకు సహాయపడుతుంది.కండరాలు ఎక్కువగా పనిచేయడం వల్ల క్యాలరీల ఖర్చు పెరుగుతుంది.జాగ్రత్తలు...తీవ్రమైన వెన్నునొప్పి, స్లిప్ డిస్క్ ఉన్నవారు చేయ కూడదు.మెడ సమస్యలు ఉన్నవారు పైకి చూడకుండా ముందుకు చూడాలి.గర్భిణీలు ఈ ఆసనాన్ని చేయకూడదు.భోజనం చేసిన వెంటనే చేయకూడదు. కనీసం 3–4 గంటల విరామం ఉండాలి. శరీరాన్ని బలవంతంగా తిప్పకుండా మీ సామర్థ్యానికి అనుగుణంగా మాత్రమే చేయాలి.ప్రతి వైపు 20–30 సెకన్లు ఉండాలి.2–3 రౌండ్లు సాధన చేయాలి.- అనిత పాతర్ల, యోగా ట్రైనర్ -
గుండెకు సొంత ‘మెదడు’.. సరికొత్త అధ్యయనంలో వెల్లడి!
మనిషి శరీరంలో అత్యంత కీలకమైన గుండె కేవలం మెదడు ఇచ్చే ఆదేశాల ప్రకారం మాత్రమే పనిచేయదని, దానికి సొంతంగా ఒక చిన్న నాడీ వ్యవస్థ (బ్రెయిన్) ఉంటుందని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో కనుగొన్నారు. అమెరికాలోని ప్రముఖ యేల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ సంచలన విషయాన్ని వెల్లడించారు. ఈ పరిశోధనా ఫలితాలు ప్రతిష్టాత్మక సైన్స్ జర్నల్ ‘సెల్’లో ప్రచురితమయ్యాయి.సాధారణంగా గుండె అనేది మెదడు నుంచి వచ్చే సంకేతాలను స్వీకరించి పనిచేస్తుందని ఇప్పటివరకు భావిస్తుండేవారు. అయితే గుండె చుట్టూ ఉండే కొవ్వు కణజాలంలో ‘ఇంట్రిన్సిక్ కార్డియాక్ నెర్వస్ సిస్టమ్’ అనే ప్రత్యేకమైన నాడీ వ్యవస్థ ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. ఇది గుండె స్పందనలను స్థానికంగా నియంత్రించడంలో, తీవ్రమైన ఒత్తిడి సమయాల్లో ఆ అవయవాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.ఈ నాడీ వ్యవస్థలో ప్రధానంగా రెండు రకాల నరాల కణాలు (న్యూరాన్లు) ఉంటాయని పరిశోధకులు గుర్తించారు. వాటిలో ‘ఎన్‌పీవై’ (Npy+) న్యూరాన్లు గుండె వేగం మితిమీరకుండా నియంత్రిస్తాయని, ఈ కణాలు లేకపోతే గుండె ఆగిపోయే ప్రమాదం ఉందని తేలింది. ఇక రెండో రకమైన ‘డ్డాహ్1’ (Ddah1+) న్యూరాన్లు సాధారణ స్థితిలో నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ, శరీరం తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు గుండె సక్రమంగా పనిచేసేలా కాపాడటంలో అత్యంత కీలకమని నిరూపితమైంది. ఎలుకలపై జరిపిన ఈ ప్రయోగాల ఫలితాలు మానవులలో కూడా ఇదే రకమైన కణాలు ఉంటాయని సూచిస్తున్నాయి. ఈ సరికొత్త ఆవిష్కరణ భవిష్యత్తులో గుండె జబ్బుల చికిత్సకు నూతన మార్గాలను చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఆగస్టులో సూర్య, చంద్ర గ్రహణాలు.. భారత్‌పై ప్రభావం? -
అవును ఇది నిజమే.. వీటితో ఒత్తిడి అవుట్!
ఒత్తిడి నుంచి బయటపడటానికో, లేదంటే తగ్గించుకోవడానికో చాలామంది స్ట్రెస్ బాల్ కానీ, స్పిన్నర్ కానీ వాడుతుంటారు. ఇదే స్థానంలో జ్యువెలరీ చేరితే. అందానికి అందం.. ఒత్తిడి అవుట్. మానసిక ఆందోళన బయటకు కనిపించకుండా తగ్గించుకోవడానికి నేటి యువత ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంటోంది. అదే యాంటీ–యాంగ్జైటీ జ్యువెల్లరీ. దీనినే ఫిడ్జెట్ జ్యువెలరీగా కూడా పిలుస్తారు.స్పిన్నర్ల ఆధునిక, స్టైలిష్ రూపమే ఈ ఫిడ్జెట్ జ్యువెల్లరీ! రింగులు, చైన్లు, బ్రాస్లెట్ల రూపంలో లభించే ఈ ఆభరణాలు కేవలం అలంకారానికి మాత్రమే కాకుండా, మానసిక ప్రశాంతతను అందించే సాధనాలుగానూ ఉపయోగపడుతుండటంతో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. సాధారణ నగలకు భిన్నంగా, వీటిలో చిన్న΄ాటి కదలికలు ఉండేలా డిజైన్ చేస్తారు. ఈ ప్రత్యేకతే స్ట్రెస్‌ని తగ్గించడంలో తోడ్పడుతుంది.స్పిన్నర్ రింగ్స్: ఉంగరానికి పైన ఉండే సన్నని బ్యాండ్ లేదా పూసలు వేలితో తిప్పేలా ఉంటాయి. తీవ్ర ఆందోళనలో ఉన్నప్పుడు వేళ్లతో వాటిని తిప్పడం వల్ల మనస్సు క్షణాల్లో వేరే వైపు మళ్లుతుంది.బ్రీథింగ్ పెండెంట్లు: లాకెట్ లాంటి చిన్న ప్లాటినం లేదా స్టీల్ గొట్టాల డిజైన్‌తో వీటిని రూ΄÷ందిస్తారు. ఒత్తిడి పెరిగినప్పుడు సాధారణంగా ఊపిరి తీసుకుని, ఈ గొట్టం ద్వారా నెమ్మదిగా వదలడం వల్ల శరీరం వెంటనే ప్రశాంత స్థితికి చేరుకుంటుంది.అరోమాథెరపీ జ్యువెల్లరీ: నూనెలను పీల్చుకునే లావా స్టోన్స్ కలిగిన ఈ నగలు, సువాసనల ద్వారా మనసును ఆహ్లాదపరుస్తాయి. ఒకప్పుడు కేవలం అలంకారానికే పరిమితమైన ఆభరణాలు, నేడు మానసిక ఆరోగ్యానికి సైతం తోడ్పడుతుండటం విశేషం. ఇవి ప్లాస్టిక్ బొమ్మల వలే కాకుండా గోల్డ్, సిల్వర్, స్టెయిన్ లెస్ స్టీల్‌లో అత్యంత మినిమలిస్టిక్ డిజైన్లలో వస్తుండటంతో ఫ్యాషన్ ప్రేమికులనూ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. -
బోసి మెడ.. ఖాళీ చేతులు.. ఇదేం అలవాటు?
చేతికి వాచ్ లేదు.. వేళ్లకు ఉంగరాలు కనిపించవు.. మెడలో చైన్, చెవులకు ఆభరణాలు కూడా ధరించరు.. ఇలాంటి వారిని చూసినప్పుడు చాలామందికి ఒకే ప్రశ్న వస్తుంది.. “ఇదేం అలవాటు?” అని. కొందరు వీరికి ఫ్యాషన్‌పై ఆసక్తి ఉండదని అనుకుంటారు. కానీ ఆభరణాలకు దూరంగా ఉండటానికి కేవలం ఫ్యాషన్ కారణమే కాదు.. ఇతర కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.సైకాలజీ ప్రకారం.. ఒక వ్యక్తి ఏ వస్తువులు ధరిస్తారు.. ఏవి ధరించరు అన్నది వారి వ్యక్తిగత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించొచ్చు. కొందరికి చేతికి వాచ్, బ్రేస్లెట్, ఉంగరం వంటి వస్తువులు పెట్టుకోవడం అసౌకర్యంగా అనిపిస్తుంది. రోజువారీ పనుల్లో అవి ఇబ్బందిగా అనిపించడం, శరీరంపై అదనంగా ఏదైనా ఉండటం ఇష్టం లేకపోవడం వంటి కారణాలతో వాటికి దూరంగా ఉంటారు.ముఖ్యంగా సింపుల్ జీవనశైలిని ఇష్టపడేవారు తక్కువ వస్తువులతోనే ఉండాలని కోరుకుంటారు. వారికి ఆర్భాటం కంటే సౌకర్యం, స్వేచ్ఛ, సమయం ముఖ్యమని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు.ఫ్యాషన్ అంటే వ్యతిరేకత కాదు!ఆభరణాలు ధరించని వారంతా ఫ్యాషన్‌కు వ్యతిరేకమని భావించడం తప్పు. కొందరు తమ రూపాన్ని సహజంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. మరికొందరు దుస్తులు, అలంకరణ కంటే వ్యక్తిత్వం, పనితీరు, ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అలాగే కొందరికి చిన్నప్పటి నుంచి అలాంటి అలవాటే ఉండొచ్చు. కుటుంబ వాతావరణం, పెరిగిన తీరు, వ్యక్తిగత అనుభవాలు కూడా ఇలాంటి అభిరుచులపై ప్రభావం చూపుతాయి.ఆర్థిక కారణాలు కూడా ఉండొచ్చు!ఆభరణాలకు దూరంగా ఉండటానికి ఆర్థిక కారణాలు కూడా ఒక అంశం కావచ్చు. బంగారం, వెండి వంటి ఆభరణాలు కొనుగోలు చేయడం అందరికీ సాధ్యపడకపోవచ్చు. కొందరు అవసరమైన ఖర్చులకు ప్రాధాన్యం ఇస్తూ ఆభరణాల కొనుగోలును పక్కన పెడతారు. మరికొందరు ఆభరణాలు కొనుగోలు చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ.. వాటిపై డబ్బు ఖర్చు చేయడం కంటే పొదుపు, పెట్టుబడులు లేదంటే ఇతర అవసరాలకు ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి ఎవరైనా ఆభరణాలు ధరించకపోతే దాన్ని కేవలం వారి అభిరుచితోనే ముడిపెట్టలేమని నిపుణులు చెబుతున్నారు.తక్కువ వస్తువులు.. తక్కువ ఆందోళనకొంతమంది జీవితంలో మినిమలిజం (తక్కువ వస్తువులతో సరళంగా జీవించడం)ను పాటిస్తారు. ఎక్కువ వస్తువులను నిర్వహించడం కంటే అవసరమైన వాటితోనే జీవించడం వారికి ఇష్టం. ఇలాంటి వారు దుస్తులు, ఆభరణాలు, ఇతర వస్తువుల ఎంపికలో కూడా సరళతకు ప్రాధాన్యం ఇస్తారు.అయితే ఆభరణాలు ధరించని వ్యక్తి తప్పనిసరిగా అంతర్ముఖి అని, సామాజికంగా కలవలేడని చెప్పలేం. అదే విధంగా ఆభరణాలు ఎక్కువగా ధరించే వారు ఆర్భాటాన్ని ఇష్టపడతారని కూడా భావించకూడదు.అలవాటు వెనుక కారణం ఒక్కటే కాదు..మనిషి ప్రవర్తన అనేది అనేక అంశాల కలయిక. వ్యక్తిగత అభిరుచులు, సౌకర్యం, ఆర్థిక పరిస్థితులు, జీవన విధానం.. ఇలా ఎన్నో విషయాలు కలిసి ఒకరి అలవాట్లను నిర్ణయిస్తాయి. అందుకే బోసి మెడ, ఖాళీ చేతులు కనిపిస్తే దాని వెనుక ఒకే కారణం ఉందని భావించకూడదు. అది వారి స్వంత ఎంపిక కావచ్చు.. వారి జీవనశైలిలో భాగం కావచ్చు.(గమనిక: ఇవి సైకాలజీ, ప్రవర్తనా విశ్లేషణల ఆధారంగా చెప్పే సాధారణ అంశాలు మాత్రమే. ఒక్క అలవాటుతో ఒకరి వ్యక్తిత్వం లేదంటే ఆర్థిక పరిస్థితిని నిర్ణయించలేం.) -
ఇక్కడ.. ఎంత చిన్న వయసులో ప్రారంభించామన్నదే ముఖ్యం!
పొదుపు.. అనేది చిన్నమాటే అయినా జీవితంలో దీని విలువ వెలకట్టలేనిది. జీవితంలో ప్రతిదశలోనూ ఆర్థిక భద్రతనిస్తూ.. భవిష్యత్తుకి భరోసా కల్పిస్తుంది. అయితే ఇందుకోసం ముందుగానే ప్రణాళికను రూపొందించుకోవడం ముఖ్యం. అంతకన్నా ఖర్చులపై నియంత్రణ చాలా ముఖ్యం. అందుకోసం నిపుణులు సూచిస్తున్న కొన్ని ఆర్థిక సూత్రాలు..ఉద్యోగం వచ్చిన తొలినాళ్ల నుంచే పొదుపు చేయడం మంచిది. దీని వల్ల చక్రవడ్డీ రూపంలో అద్భుతమైన ప్రయోజనం పొందవచ్చు. ఇక్కడ ఎంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టామన్నదాని కంటే, ఎంత చిన్న వయసులో ప్రారంభించామన్నదే ముఖ్యం. 20 ఏళ్ల వయసులో చిన్న మొత్తంతో మొదలుపెట్టిన ఇన్వెస్ట్మెంట్, 40 ఏళ్ల వయసులో రెట్టింపు మొత్తంతో ప్రారంభించిన పెట్టుబడి కంటే దీర్ఘకాలంలో ఎక్కువ లాభాలను తెచ్చిపెడుతుంది.దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. అనేది ఎప్పటి నుంచో ఉన్న ముచ్చట. ఆ మాట ఇక్కడ చక్కగా సరిపోతుంది. అందుకే ఎక్కువ లాభాలొచ్చే మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే కంటే ముందుగా మన చుట్టూ ఒక రక్షణ వలయాన్ని నిర్మించుకోవాలి. అనుకోకుండా ఉద్యోగం పోయినా, ఆకస్మిక ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్లను ముందస్తుగా విక్రయించాల్సిన అవసరం రాకుండా ఈ ఎమర్జెన్సీ ఫండ్ మనల్ని కాపాడుతుంది. ముఖ్యంగా 40, 50 ఏళ్ల వయసులో ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉన్నందున, హెల్త్ ఇన్సూ రెన్స్ కలిగి ఉండటం తప్పనిసరి.భవిష్యత్తులో మనం ఇల్లు లేదా ఇతర అవసరాల కోసం లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు క్రెడిట్ రిపోర్ట్ మన ఆర్థిక పాస్‌పోర్ట్‌లా పనిచేస్తుంది. క్రెడిట్ స్కోర్ పేలవంగా ఉంటే బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవచ్చు, లేదా ఎక్కువ వడ్డీ వసూలు చేయవచ్చు. దీనివల్ల అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది.ఆర్థిక ప్రణాళిక అనేది ఇతరులతో పోల్చుకుని చూసేది కాదు. ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణం, అవసరాలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి, ప్రస్తుత వయసును బట్టి, సంపాదనను బట్టి సొంతంగా ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. అపుడే భవిష్యత్తులో మరింత ఆర్థిక స్వేచ్ఛను సాధిస్తారు. -
Sana Saeed: నేను బులీమియా సమస్యను ఎదుర్కొన్నాను..
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్‌ఖాన్‌తో ‘కుచ్ కుచ్ హోతాహై’ సినిమాలో నటించిన సనా సయిద్ ‘నేను బులీమియా సమస్యను ఎదుర్కొన్నాను’ అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలియజేసింది. ‘బులీమియా అంటే ఏమిటి?’ అనే ఆసక్తిని ఎంతోమందిలో రేకెత్తించింది....చాలా చిన్న వయసు నుంచే తనకు బులీమియా ఉన్నట్లు తెలియజేసింది సనా సయిద్. ‘నాకు బులీమియా అనే ఈటింగ్ డిజార్డర్ ఉన్నట్లు చాలా సంవత్సరాల వరకు తెలియదు. బులీమియా అనే మాట ఎప్పుడూ వినలేదు. అయితే ఒకానొక రోజు బులీమియా గురించి ఒక పుస్తకం చదివినప్పుడు నాకు ఏంజరుగుతుందో మొదటిసారి అర్థమైంది. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, నవ్వుకుంటారేమో అనే భయం వల్ల చాలా కాలం పాటు నా సమస్య గురించి ఎవరికీ చెప్పుకోలేదు’ అంటుంది సనా సయిద్.సాధారణ బరువుతోనే కనిపించడం వల్ల బులీమియాను గుర్తించడం అతి పెద్ద సవాలు. జన్యుపరమైన కారణాలతో పాటు మానసిక ఒత్తిడిలాంటి సమస్యలు...మొదలైనవి బులీమియాకు కారణం అవుతాయి. బులీమియా ఉన్న వ్యక్తులు డిప్రెషన్ బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.కొన్ని లక్షణాలు...భోజనం చేసిన వెంటనే టాయిలెట్‌కు వెళ్లడం.తమ శరీర బరువు, ఆకారంపై ఎప్పుడూ ఆందోళనతో ఉండడం.పదే పదే కఠినమైన ఆహార నియమాలను పాటించి ఆపై అతిగా తినడం.తిన్న తరువాత బరువు పెరగకుండా నిరోధించడానికి స్వయంగా వాంతులు చేసుకోవడం.మార్గం ఉంది...సనా సయిద్ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘నేను బులీమియా సమస్యతో బాధ పడ్డాను అని బహిరంగంగా చెప్పుకోవడానికి కారణం... ఇలాంటి సమస్యతో ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు సతమతమవుతుంటారు. తమకు పేరు కూడా తెలియని సమస్యతో బాధ పడుతూ ఉండవచ్చు. దానికి ఒక పేరు ఉందనే విషయం వారు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఒంటరి వారు కాదు. సమస్య నుంచి బయటపడే మార్గం ఉంది. సమస్య నుంచి నేను పూర్తిగా బయటపడ్డాను. మీరు ఇబ్బంది పడుతుంటే దయచేసి వైద్యులను సంప్రదించండి.నాకు ఈటింగ్ డిజార్డర్ ఉందని అంగీకరంచడం అత్యంత కష్టం కావచ్చు. కానీ తప్పదు. సమస్యను దాచివేస్తే, భయపడితే ఆ సమస్యతో మనం పోరాడలేము’ అంటుంది సనా సయిద్.బులీమియా అంటే...తక్కువ సమయంలో అసాధారణంగా, అధిక మొత్తంలో ఆహారం పదే పదే తీసుకునే రుగ్మతను బులీమియా నెర్వోసా అంటారు. బులీమియా ఉండే వ్యక్తులు తీవ్రమైన సిగ్గు, అపరాధ భావంతో ఉంటారు. ఎవరికీ చెప్పుకోకుండా అత్యంత గోప్యంగా ఉంచబడే మానసిక ఆరోగ్య సమస్యలలో బులీమియా ఒకటి. -
బరువు తగ్గడంలో పురుషులే ఫాస్ట్!
బరువు తగ్గే విషయంలో పురుషులకు, మహిళలకు పోటీ పెడితే.. విజేతలుగా నిలిచేది మగాళ్లే. ఔనండి.. మహిళల కంటే పురుషులే త్వరగా బరువు తగ్గుతారట. స్త్రీ, పురుషులిద్దరు ఒకే షెడ్యూల్లో ఒకే డైట్, ఒకే వ్యాయామం పాటించినా సరే.. పురుషులే వేగంగా బరువు తగ్గుతారు. అయితే, ఈ విషయంలో మహిళల తప్పిదం ఏమీ లేదు. ఇందుకు కొన్ని జీవ సంబంధిత కారణాలు ఉన్నాయి. తాజా అధ్యయనం ప్రకారం.. పురుషులు బరువును కోల్పోవడంలోనే కాదు.. దానివల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువేనట. మరి, పురుషులే త్వరగా బరువు తగ్గేందుకు గల కారణాలేమిటో చూద్దామా!బరువు తగ్గించడమంటే.. శరీరంలోని క్యాలరీని కరిగించడమే. అసలు విషయం ఏమిటంటే.. ఇతరులతో పోల్చితే ఎక్కువ సన్నని కండరాలు ఉన్నవారు ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తారు. పురుషులు వేగంగా బరువు తగ్గడానికి ఇది కూడా ఒక కారణం. మహిళలతో పోలిస్తే.. పురుషులు ఎక్కువ సన్నని కండర ద్రవ్యరాశిని కలిగి ఉంటారు. ఇది ఎక్కువ క్యాలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. కండర ద్రవ్యరాశిని పెంచాలంటే మహిళలు.. పురుషులు కంటే ఎక్కువసేపు శ్రమించాల్సి ఉంటుంది.బరువు తగ్గడంలో జీవక్రియ కూడా భారీ పాత్ర పోషిస్తుంది. జీవక్రియ ఎక్కువగా ఉంటే అధిక క్యాలరీలు ఖర్చవుతాయి. ఫలితంగా త్వరగా బరువు తగ్గుతారు. జీవక్రియ కూడా సన్నని కండరాల వల్లే ప్రభావితమవుతుంది. పురుషులు ఎక్కువ సన్నని కండరాలను కలిగి ఉన్నందున వారు అధిక జీవక్రియను కలిగి ఉంటారు. ఫలితంగా మహిళలతో పోలిస్తే వేగంగా బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది.పురుషులు, మహిళల్లో వేర్వేరు ్రపాంతాల్లో కొవ్వు నిల్వ ఉంటుంది. ఇది కూడా ఇరువురి బరువులపై ప్రభావం చూపుతంది. పురుషులకు ఎక్కువగా పొత్తి కడుపులో కొవ్వు పేరుకుపోతుంది. మహిళలకు తొడలు, పిరుదుల్లో కొవ్వు పెరుగుతుంది. పొత్తికడుపులో పేరుకుపోయే కొవ్వుతోనే ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం. అయితే, దీన్ని కరిగించడం సులభమే. తక్కువ వ్యాయామంతోనే త్వరగా పొట్టను తగ్గింవచ్చు.రోజూ ఎంత సేపు నడిస్తే మంచిదంటే..హార్మోన్ల వల్ల కూడా స్త్రీలు.. పురుషులు కంటే ఆలస్యంగా బరువు తగ్గుతారు. పురుషుల కంటే మహిళల్లో 6 నుంచి 11 శాతం కొవ్వు ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళల్లో ఉండే ఈస్ట్రోజెన్ వల్ల భోజనం తర్వాత క్యాలరీలు ఖర్చు చేసే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఈస్ట్రోజెన్ స్థాయి పడిపోతే బరువు పెరుగుతారు. పురుషులతో పోల్చితే మహిళలు తగిన డైట్ ΄్లాన్ పాటించలేరు. తమకు ఇష్టమైన ఆహారాన్ని చూడగానే కంట్రోల్ చేసుకోలేరు. అయితే, అత్యధిక శాతం మంది పురుషులు శ్రద్ధగా డైట్ పాటిస్తూ బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తారు. ఫలితంగా మహిళల కంటే వేగంగా పురుషులు బరువు తగ్గుతారు. -
యుగానుకూల మాతృత్వ శక్తి..
ప్రకృతిలో మాతృత్వం కేవలం ఒక బంధం మాత్రమే కాదు, అది ఒక అద్భుతమైన శక్తి. ఒక దేశ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు తరతరాలకు అందాలంటే ఆ బాధ్యతను మోసేది మాతృశక్తే. మాతృత్వాన్ని కేవలం కుటుంబానికే పరిమితం చేయ కుండా, దేశ నిర్మాణ శక్తిగా గుర్తించే దిశగా ‘విశ్వ మాంగళ్య సభ’ కృషి చేస్తోంది.2010లో స్థాపితమైన విశ్వ మాంగళ్య సభ, ఒక సామాజిక ఉద్యమంగా, సాంస్కృతిక పునరు జ్జీవన వేదికగా రూపాంతరం చెందింది. సంస్కార్ (విలువలు), సామర్థ్యం (శక్తి), సదాచారం (మంచి ప్రవర్తన), సేవ అనే నాలుగు సూత్రాల ప్రాతిపది కన ఈ సంస్థ పనిచేస్తోంది. ఆధునికత పేరుతో మనం కోల్పోతున్న భారతీయ విలువలను, కుటుంబ వ్యవస్థలోని సౌందర్యాన్ని తిరిగి నిల బెట్టడం ఈ సభ ప్రధాన ఉద్దేశ్యం. ఒక వ్యక్తికి మొదటి పాఠశాల కుటుంబం అయితే, మొదటి గురువు తల్లి. ఈ భావనతోనే, మహిళలను సాంస్కృతికంగా బలోపేతం చేసి, విలువలతో కూడిన ‘నవ భారత’ నిర్మా ణంలో వారిని భాగస్వామ్యం చేస్తోంది.ఒక మహిళ కేవలం ఒక వ్యక్తి కాదు, ఆమె ఒక వ్యవస్థ. మహిళ విద్యా వంతురాలైతే ఒక కుటుంబం బాగుపడుతుంది. మహిళ ఆలోచిస్తే ఒక సమాజం బాగుపడుతుంది. అదే మహిళ నాయకత్వం వహిస్తే ప్రపంచమే బాగుపడుతుంది. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడిని అధిగమించడానికి యోగా, ధ్యానం వంటి సంప్రదాయాలు ఏ విధంగా తోడ్పడతాయో అవగాహన కల్పిస్తూ, మహిళలను శక్తిమంతం చేయడం ద్వారానే మనం ‘విశ్వమాంగ ళ్యాన్ని’ (ప్రపంచ శ్రేయస్సును) సాకారం చేయగమని ఈ సభ నమ్ముతోంది.నేటి మహిళ, విజ్ఞాన శాస్త్రాన్ని ఆయుధంగా మలుచుకుంటూనే, సంస్కారాన్ని కవచంగా ధరించాలి. భారతీయ విలువల పునాదులను పటిష్ట పరచి వాటిపై ఆధునిక ప్రగతి సౌధాన్ని నిర్మించాలి. మాతృశక్తి మేల్కొన్న సమాజానికి ఓటమి లేదు; అది ఎప్పుడూ విశ్వ శ్రేయస్సును కాంక్షిస్తుంది. ఈ యుగానుకూల మాతృత్వ శక్తితోనే ఉత్తమ వ్యక్తి నిర్మాణం, కుటుంబ నిర్మాణం ఆ పై ఉన్నత నవభారత నిర్మాణం సాధ్యమవుతాయి.– డా. సంగీతా రెడ్డి, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ (రేపు హైదరాబాద్‌లో విశ్వ మాంగళ్య సభ సమావేశం సందర్భంగా...) -
శంకరుల బాట..
ఆదిశంకరుల రచనలైన కనకధారాస్తోత్రమ్, దక్షిణామూర్తి స్తోత్రమ్, గుర్వష్టకమ్, నిర్వాణ షట్కమ్, భజగోవిందం, సౌందర్యలహరి – దేన్ని చదివినా, వినినా మనసు ఆనందంతో నిండి పోతుంది. వాటి అర్థాన్ని గ్రహించి, తదనుగుణంగా జీవిస్తే మన జీవితాలే ధన్యమవుతాయనిపిస్తుంది. శంకరులవారి అన్నపూర్ణా స్తోత్రాన్ని ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పాడుతుంటే ఆనందం, ఆరోగ్యం పుష్కలంగా లభిస్తాయని పెద్దలంటారు. అందులో చివరి శ్లోకం మరీ ముఖ్యమైనది:‘‘అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే / జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ!మాతా చ పార్వతీ దేవీ పితాదేవో మహేశ్వరః / బాంధవా శ్శివ భక్తశ్చ స్వదేశో భువనత్రయమ్!!ఇందులో ఆది శంకరులవారు జ్ఞాన, వైరాగ్యాలను కాంక్షించటమేకాక తన తల్లి పార్వతీదేవి అనీ, తండ్రి మహేశ్వరుడనీ, శివ భక్తులందరు తన బంధువులనీ, మూడు లోకాలూ తనకు స్వదేశమనీ ప్రకటిస్తారు. శ్రేష్ఠులు దేన్ని ఆచరిస్తారో దాన్నే ప్రమాణంగా ఇతరులు తీసికొని ఆచరిస్తారని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతారు.మరి మనం ఆది శంకరుల అనుచరులం అని చెప్పుకొంటే సరిపోతుందా? ఆయన వలె మనమూ జ్ఞాన, వైరాగ్యాలనే కోరుకోవాలిగానీ ధన ధాన్యాలను, సంపదలను కాదు. లోకాలనన్నిటినీ, లోకులందర్నీ సృష్టించిన ప్రకృతి, పురుషులు మన తల్లి తండ్రులని, జీవులన్నీ మన బంధువులని, ముల్లోకాలూ స్వదేశమని గ్రహించి జీవిస్తే ఆధ్యాత్మిక శిఖరాన్ని ఆదిశంకరులవారు ఎలా అధిరోహించారో మనమూ అధిరోహించవచ్చు. – రాచమడుగు శ్రీనివాసులు -
పండుగల పర్వానికి నాంది.. తొలి ఏకాదశి వైభవం!
సమస్త లోకాలను కంటికి రెప్పలా కాపాడే జగత్ప్రభువు, శ్రీమన్నారాయణుడి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందేందుకు మన సనాతన సంస్కృతిలో లభించిన అత్యంత దివ్యమైన పర్వదినం తొలి ఏకాదశి. అది ఈ రోజే(జూలై 25).. సంవత్సరంలో వచ్చే సమస్త ఏకాదశి వ్రతాలలో ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఈ పవిత్ర దినం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, భగవంతునికి భక్తునికి మధ్య ఉండే అచంచలమైన ప్రేమకు, ఆత్మ నిగ్రహానికి ప్రతీక. ఈ శుభ సందర్భాన, తొలి ఏకాదశి విశిష్టత ఏమిటి? ఇది సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకు ఎందుకు అంతగా నచ్చింది? దీని వెనుక ఉన్న పరమార్థం ఏమిటో తెలుసుకుందాం..తొలి ఏకాదశి ప్రత్యేకత ఏమిటి?హిందూ చంద్రమాన కేలండర్ ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశినే ‘తొలి ఏకాదశి’ లేదా ‘ప్రథమ ఏకాదశి’ అంటారు. దీనిని ‘శయనీ ఏకాదశి’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ రోజే శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళతారని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువు నాలుగు నెలల పాటు యోగనిద్రలో ఉండే ఈ కాలాన్ని చాతుర్మాసంగా భావించి, భక్తులు ప్రత్యేక దీక్షలు, పూజలు ఆచరిస్తారు. తొలి ఏకాదశితోనే పండుగల పరంపర ప్రారంభమవుతుంది. చాతుర్మాస దీక్షలతో మొదలయ్యే ఈ వేడుకలు, వరుస పర్వదినాలతో ఏడాది పొడవునా ఇళ్లలో సందడిని నింపుతాయి.విష్ణువుకు ఎందుకు ప్రీతిపాత్రమైనది? పద్మపురాణంలో తెలిపిన కథనం ప్రకారం పూర్వం మురుడు అనే రాక్షసుడు దేవతలను, మునులను నానావిధాలుగా ఇబ్బంది పెట్టాడు. ఇంద్రుడు మొదలైన దేవతలందరూ ఆ రాక్షసుడి దాటికి తట్టుకోలేక శ్రీమహావిష్ణువును ఆశ్రయించారు. దేవతల రక్షణార్థం విష్ణువు ఆ రాక్షసుడితో సుదీర్ఘకాలం భీకరంగా యుద్ధం చేశాడు.దీంతో అలసిపోయిన మహావిష్ణువు బదరికావనంలోని ‘హేమవతి’ అనే గుహలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి (యోగానిద్రలోకి) ఉపక్రమించారు. అదే సమయాన్ని ఆసరాగా చేసుకుని, ఆ రాక్షసుడు నిద్రలో ఉన్న విష్ణువును అంతం చేయడానికి ముందుకు వచ్చాడు. ఆ అపాయాన్ని గమనించిన భగవానుని శరీరం నుండి ఒక దివ్యమైన, తేజోవంతమైన శక్తి ఉద్భవించింది. ఆ మహాశక్తి క్షణకాలంలోనే ఆ రాక్షసుడిని భస్మం చేసి అంతం చేసింది. కనులు తెరిచి చూసిన మహావిష్ణువు జరిగిన సంఘటనను గ్రహించి, ఆ దివ్య స్త్రీ శక్తిపై ఎంతో సంతోషించాడు. ఆ రోజు పదకొండవ తిథి (ఏకాదశి) కావడంతో ఆ శక్తికి ‘ఏకాదశి’ అనే నామకరణం చేశాడు. అంతేకాకుండా, ‘ఎవరైతే ఈ పవిత్ర రోజున భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి నన్ను పూజిస్తారో, వారి సమస్త పాపాలను హరించి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాను’ అని ఆ దేవతకు వరం ఇచ్చారు. నాటి నుండి ఈ తిథి సాక్షాత్తు శ్రీహరికి అత్యంత ఇష్టమైనదిగా మారింది.గొప్ప ఆధ్యాత్మిక శక్తి..ఏకాదశిని కేవలం ఒక మామూలు ఉపవాస దినంగానే కాకుండా, హిందూ సంస్కృతిలో మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్రమైన రోజుగా భక్తులు భావిస్తారు. నెలలో రెండుసార్లు వచ్చే ఈ పర్వదినం వెనుక ఒక పౌరాణిక రహస్యం, గొప్ప ఆధ్యాత్మిక శక్తి దాగి ఉన్నాయి. హిందూ చంద్రమాన కేలండర్ ప్రకారం ప్రతి నెలలో వచ్చే పదకొండవ తిథినే ఏకాదశిగా పిలుస్తారు. ఇది శుక్ల పక్షం, కృష్ణ పక్షం రెండింటిలోనూ వస్తుంది. ఈ పవిత్రమైన రోజును సమస్త లోకాలను రక్షించే మహావిష్ణువుకు ఇష్టమైన రోజుగా భావిస్తారు.ఆధునిక కాలంలో..ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం అనేది కేవలం ఆహారం మానివేయడం మాత్రమే కాదు, అది మహావిష్ణువుకు తమను తాము పూర్తిగా సమర్పించుకోవడమే. ఇది మనసులోని కోరికలను అదుపులో ఉంచుకోవడానికి, ఆధ్యాత్మిక సాధనను మెరుగుపరచుకోవడానికి సహాయపడుతుంది. ఈ వ్రతం చేయడం వల్ల గత జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉదయమే తలస్నానం చేసి, విష్ణువు ప్రతిమను పూలతో అలంకరిస్తారు. విష్ణు సహస్రనామం పఠిస్తూ, ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపిస్తారు. నేటి ఉరుకులు పరుగుల ఆధునిక జీవితంలో ఏకాదశి ఉపవాసం మన శరీరానికి, మనసుకు ఒక చక్కటి విశ్రాంతిని ఇస్తుంది. ఇది శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మానసిక ప్రశాంతతను,క్రమశిక్షణను అలవాటు చేస్తుంది. -
ఇవీ నిబంధనలు!
కృత్రిమ గర్భధారణ కోసం ఐవీఎఫ్ ప్రక్రియకు వెళ్లడం లో కేవలం చికిత్స మాత్రమే కాకుండా ఇంకా ఉద్వేగపరమైన అంశాలూ ముడిపడి ఉంటాయి. అందుకే దంపతుల హక్కులను కేంద్రప్రభుత్వం స్పష్టంగా నిర్ణయించిందీ, నిర్వచించింది. పిల్లల పట్ల దంపతులకు ఉండే సహజ ఉద్వేగాల కారణంగా వారు ఏ రకంగానూ ఎక్స్‌ప్లాయిట్ కాకుండా ఉండేందుకు ఇన్ఫెర్టిలిటీ సెంటర్లకు కొన్ని కీలకమైన బాధ్యతలనూ, మార్గదర్శకాలను రూపొందించింది. నేడు (జూలై 25న) ‘ఐవీఎఫ్ డే’ సందర్భంగా ఈ వరస కథనాల్లో చివరిదైన ఈ ఆర్టికల్‌లో ప్రభుత్వం నిర్దేశించిన ఆ మార్గదర్శకాలేమిటో చూద్దాం.కృత్రిమ గర్భధారణ అంశంలో ఇటు సంతాన సాఫల్య కేంద్రాలకూ, అటు ప్రజలకోసం భారతీయ కేంద్ర ప్రభుత్వం ‘ద ఏఆర్టీ (అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్) యాక్ట్ ఆఫ్ 2021’, అలాగే ‘సరోగసీ యాక్ట్ ఆఫ్ 2021’ కింద కొన్ని చట్టాలు చేసింది. కృత్రిమ గర్భధారణ చికిత్స తీసుకునే పేషెంట్లు (దంపతులు), అండాలను లేదా శుక్రకణాలను ప్రదానం చేసే దాతలు, అలాగే ఐవీఎఫ్ ద్వారా పుట్టే చిన్నారులకు మేలు కలిగేందుకే ప్రభుత్వం ఈ చట్టాలు చేసింది. నైతిక అంశాలకు ప్రాధాన్యమిస్తూ రూపొందించిన ఈ నియమ నిబంధనలను చట్టపరంగా అందరూ పాటించాలి. ఏఆర్టీ చట్టం 2021 ప్రకారం దంపతులకు ఉన్న హక్కులు... దంపతులందరికీ తమకు ఉన్న హక్కులపైనా అలాగే ఇన్ఫెర్టిలిటీ సెంటర్లలో నిర్వహించే ప్రక్రియల పైనా అవగాహన పొందేందుకుగాను దంపతులు ఏఆర్టీ (అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్) చట్టం గురించి తెలుసుకుని ఉండాలి. దేశంలోని ప్రతి ఐవీఎఫ్ సెంటర్... కేంద్రంతోపాటు రాష్ట్ర ఏఆర్టీ బోర్డు కింద తన సంస్థను నమోదు చేసుకుని ఉండాలి. → లెవల్ 1 కింద నమోదైన వారు – బేసిక్ ఫెర్టిలిటీ చికిత్సలు (ఐయూఐ)ల కోసం. → లెవల్ 2 కింద నమోదైన వారు – ఐవీఎఫ్, సరోగసీ క్లినిక్స్ కోసం. చట్టం నిర్దేశించిన నియమ నిబంధనలను ఐవీఎఫ్ డాక్టర్లు, ఎంబ్రియాలజిస్టులు, యాండ్రాలజిస్టులు తప్పనిసరిగా పాటించి తీరాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వసతులు: చట్టంలో నిర్దేశించిన ప్రకారం ఇన్ఫెర్టిలిటీ సెంటర్లలో ఉండాల్సిన వసతులూ, ఉపకరణాలూ, పరికరాలూ (ఇన్ఫ్రాస్ట్రక్చర్) అన్నీ తప్పక / ఖచ్చితంగా ఉండి తీరాలి. చట్టబద్ధంగా పేషెంట్లు ఇవ్వాల్సిన ఆమోద పత్రాలు (కన్సెంట్) ఆయా నియమ నిబంధనలకు అనుగుణంగా రూపొందిన ఫార్మాట్ (టెంప్లెట్స్)లో ఇవ్వాలి. వయసు: వయసు నిబంధనలను తప్పక పాటించాలి. అంటే మనదేశంలో ఐవీఎఫ్ చికిత్సలు పొందడానికి మహిళల వయసు 21 – 50 ల మధ్య; అలాగే పురుషులు 21 – 55 మధ్య ఉండాలి. ఇన్ఫార్మ్డ్ కన్సెంట్: ఐవీఎఫ్ చికిత్సకు తాము అంగీకరిస్తున్నట్టుగా దంపతులు ఆమోదపత్రం (కన్సెంట్) తప్పక ఇవ్వాలి – ఈ ప్రక్రియ నిర్వహిస్తున్న నిపుణులు... ‘ఐవీఎఫ్ ప్రక్రియ గురించీ, దానివల్ల ఉండే రిస్కులు, దుష్ప్రభావాలూ, ప్రయోజనాలూ, సక్సెస్ రేటూ... ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులూ’... వీటన్నింటి గురించి దంపతులకు తాము వివరంగా చె΄్పామనీ, దానికి వారు ఆమోదం తెలిపారంటూ పేషెంట్స్ నుంచి రాతపూర్వకంగా ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ తీసుకోవాలి. గోప్యత: తమ వద్ద చికిత్స తీసుకుంటున్న దంపతుల వివరాలూ, వారి మెడికల్ రికార్డులను ఇన్ఫెర్టిలిటీ క్లినిక్‌లు పూర్తిగా గోప్యంగా ఉంచాలి. వారి గోప్యతకు (ప్రైవసీకి) ఎట్టిపరిస్థితుల్లోనూ భంగం రానివ్వకూడదు.కౌన్సెలింగ్‌తో సహా అన్నీ అందుబాటులో.. ఏదైనా సలహాల కోసం లేదా తమకు వచ్చే సందేహాలను తీర్చుకోవడం కోసం అవసరమైన కౌన్సెలింగ్ సదుపాయాలు పేషెంట్లకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. ఆ కౌన్సెలింగ్ నిర్వహించేవారు ఐవీఎఫ్ గురించి అన్ని విషయాలూ పేషెంట్లకు వివరిస్తూ సహాయపడుతుండాలి. చికిత్స తీసుకునే/వద్దనే హక్కు: తాము ఐవీఎఫ్ తీసుకునేందుకు లేదా చికిత్స తీసుకుంటున్న ఏ సమయంలోనైనా తమకు వద్దనిపిస్తే చికిత్సనుంచి వైదొలగేందుకు పేషెంట్స్ ఎప్పుడూ హక్కు ఉంటుంది.ఫిర్యాదులకు ఓ కేంద్రం (గ్రీవెన్స్ సెల్) తమకు కలిగే అసౌకర్యాల విషయంలో ఫిర్యాదు చేసేందుకు లేదా తమ అసమ్మతిని తెలిపేందుకు ప్రతి క్లినిక్ తమ దగ్గర ఓ ఫిర్యాదుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో క్లినిక్పైన తమ అసౌకర్యాలను/ అసమ్మతిని... ఉన్నత వైద్యాధికారులకు ఫిర్యాదు చేసే హక్కు కూడా పేషెంట్స్‌కు ఎప్పుడూ ఉంటుంది. పేషెంట్స్ ఎవరికి ఫిర్యాదు చేయవచ్చో తెలిపే వివరాలను గ్రీవెన్స్ సెల్ దగ్గర రాసి ఉంచాలి. కృత్రిమ గర్భధారణ పొందడానికీ, ఈ ప్రక్రియలో కాబోయే తల్లిదండ్రులు తాము మోసపోకుండా ఉండటానికి ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలివి. తమకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో ప్రభుత్వం రూపొందించిన ఈ నియమ నిబంధనలనూ, నైతికాంశాలను కాబోయే దంపతులు తెలుసుకుని ఉండటం వారికి మేలు చేసే అంశం. పేషెంట్ల హక్కుతమకు జరుగుతున్న వైద్యపరీక్షలు (డయాగ్నోసిస్), చికిత్స ప్రణాళికలు (ట్రీట్మెంట్ ప్లాన్స్), అవి సఫలమయ్యేందుకు గల అవకాశాలు (ప్రొగ్నోసిస్)... వీటన్నింటి గురించి దంపతులు వివరంగా తెలుసుకోవచ్చు. క్లినిక్ నిర్వాహకులు/డాక్టర్లు కూడా ఈ అన్ని వివరాలను ఏమాత్రం దాపరికం లేకుండా పేషెంట్లకు వివరించాలి. పేషెంట్లకు ఇచ్చిన ఇంజెక్షన్లూ, నిర్వహించిన పరీక్షలూ (ఇన్వెస్టిగేషన్లు), నిర్వహించిన లేదా నిర్వహించబోయే ప్రక్రియల అన్ని వివరాలూ... అంటే అండాలు/ శుక్రకణాల/ పిండం (ఎంబ్రియోలు) వీటన్నింటి గురించీ... దాపరికం లేకుండా వివరించడంతోపాటు వీటికి సంబంధించిన అన్ని రికార్డులూ పేషెంట్లకు ఇవ్వాలి. ఈ విషయంలో పేషెంట్ల పట్ల పారదర్శకత పాటించడం క్లినిక్‌లు తప్పనిసరిగా చేసి తీరాలి. – నిర్వహణ: యాసీన్ -
నో మెయిల్... నో మొబైల్...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీప్రియుల్ని ‘ది ఒడిస్సీ’ సినిమా ఫీవర్ చుట్టేసింది. దేశీయ చిత్రాల కన్నా మిన్నగా ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లు సినీపండితుల అంచనాలను మించిపోతున్నాయి. సినిమాలో కుటుంబ భావోద్వేగాలకు పెద్దపీట వేసిన ఆ సినిమా దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ భారతీయ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో ఈ టాప్ డైరెక్టర్ గురించిన కొన్ని ఆసక్తికర విశేషాలు...క్రిస్టోఫర్ నోలన్ 1970 జూలై 30న ఇంగ్లాండ్‌లోని లండన్ లో జన్మించారు. ఏడేళ్ల వయసులో, తన తండ్రితో కలిసి తోటలో లఘు చిత్రాలు తీసేవారు. తన అద్భుతమైన, అత్యంత ఖరీదైన చిత్రాలకు క్రిస్టోఫర్ నోలన్ ప్రసిద్ధి చెందారు, కానీ 55 ఏళ్ల ఈ దర్శకుని వ్యక్తిగత జీవితం మాత్రం చాలా నిరాడంబరంగా ఉంటుంది. ఫ్యామిలీ బాండింగ్...‘ది ఒడిస్సీ’ సినిమాలో భార్యాభర్త, తండ్రీ కొడుకు... వంటి కుటుంబ బంధాలను బలంగా చూపించిన క్రిస్టోఫర్ నిజ జీవితంలోనూ అంతే బలమైన సెంటిమెంట్స్‌ను అనుసరించడం కనిపిస్తుంది. ఆయన తన కాలేజీ స్వీట్హార్ట్ అయిన ఎమ్మా థామస్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ జంట లండన్ లోని యూనివర్సిటీ కాలేజ్‌లో తొలిసారి కలుసుకున్నారు, కలిసి సింకాపీ ఇంక్ అనే నిర్మాణసంస్థకు సహ వ్యవస్థాపకులుగా పనిచేశారు. ఆయన దర్శకత్వం వహించిన ప్రతి ఫీచర్ ఫిల్మ్‌కు ఎమ్మా థామస్ నిర్మాత. నోలన్ సోదరుడు జోనాథన్ సహ–రచయితగా పనిచేస్తుంటాడు. మెమెంటోకు స్ఫూర్తినిచ్చిన లఘు కథతోపాటు, ది ప్రెస్టీజ్, ది డార్క్‌నైట్, ది డార్క్‌నైట్ రైజెస్, ఇంటర్స్టెల్లార్ చిత్రాలకు సహ–రచయితగా పనిచేశాడు. అతని నలుగురు పిల్లలు ‘ది ఒడిస్సీ’ నిర్మాణ సమయంలో వివిధ ప్రాక్టికల్ క్రూ విభాగాలలో తెర వెనుక పనిచేశారు. ఆయన కుమార్తె ఫ్లోరా ఇంటర్స్టెల్లార్, ఓపెన్ హైమర్ చిత్రాల్లో కనిపిస్తుంది. ఆయన కుమారుల్లో ఆలివర్ ది ప్రెస్టీజ్ చిత్రంలో, అలాగే రోరీ ది డార్క్ నైట్ రైజెస్లో, మాగ్నస్: ఇన్సెప్షన్ చిత్రంలో నటించారు. నో మొబైల్...టెక్నికల్‌గా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే దర్శకుల్లో ముందు వరుసలో ఉండే క్రిస్టొఫర్ నోలన్ నిజజీవితంలో కనీసం వ్యక్తిగతం గా ఈ మెయిల్ వాడకానికి కూడా ఇష్టపడరు. అంతేకాదు, స్మార్ట్‌ఫోన్ కూడా వినియోగించరంటే విశేషమే. ఇలా వ్యక్తిగతంగా డిజిటల్ వినియోగాలకు దూరంగా ఉండే ఆయన దినచర్య, పని అలవాట్లు ఒక విలక్షణమైన, పాతకాలపు జీవనశైలిని ప్రతిబింబిస్తాయి. ఆయన తన స్క్రీన్ ప్లేలను ఫొటోకాపీ చేయకుండా ఉండేందుకు, ఒక నల్లనోట్బుక్లో పెన్నుతో రాసుకుంటారు. అంతేకాదు, తన ప్రధాన నటీనటులకు స్క్రిప్ట్‌లను స్వయంగా చేతితో అందించడానికి ఇష్టపడతారు. అలాగే ఆయన ఎక్కడికి వెళ్లినా ఒక ఫ్లాస్క్‌నిండా టీ కూడా ఉంటుంది. సింపుల్‌గా నోలన్ పక్కా ఫ్యామిలీ మ్యాన్!– సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
'దేవశయని ఏకాదశి' ప్రాశస్త్యం..! ఆ రోజు ఏం చేయాలంటే..
శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర కాలమే చాతుర్మాసం. ప్రతి ఏడాది ఆషాఢ మాస శుక్ల పక్ష ఏకాదశిని దేవశయని ఏకాదశి(తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి) అంటారు. దీని అర్థం. దేవ్' అనగా దేవుడు, 'శయని' అనగా నిద్రించుట. విష్ణుమూర్తి క్షీరాసాగరంలో యోగనిద్రకు ఉపక్రమించే రోజే ఈ దేవశయని ఏకాదశి. ఈ ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి (ప్రబోధిని ఏకాదశి) వరకు గల నాలుగు నెలల కాలం చాతుర్మాసంగా పరిగణిస్తారు. అంటే ఈ నాలుగు మాసాల్లో విష్ణుమూర్తి యోగనిద్రలో ఉండగా, సృష్టి బాధ్యతలను పరమశివుడు చూసుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి. చాతుర్మాసం ఆధ్యాత్మిక సాధనకు, ఆత్మశుద్ధికి అత్యంత అనుకూలమైన సమయం. ఈ కాలంలో వివాహాలు, గృహప్రవేశాలు, మొదటి పుట్టువెంట్రుకలు తీయించడం వంటి శుభకార్యాలు చేయరు. అయితే, భక్తి, దానధర్మాలతో కూడిన కొన్ని పనులు చేస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మరి అత్యంత పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున విష్ణువుని ఎలా ఆరాధించాలంటే..విష్ణు అనుగ్రహం కలగాలంటే..మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే, సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని, ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. అంతేగాదు మహాసాధ్వి సతీ సక్కుభాయి, ఈ వ్రతాన్నే ఆచరించి, మోక్ష సిద్ధి పొందటం జరిగింది. వ్రతంలోని ప్రధాన నియమాలు..ఈ వ్రతాన్ని ఆచరించదలచిన వారు, దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం, శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి, భోజనం చేయాలి. తినకూడనవి..ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి విశిష్టతను గురించి, పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి, సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు, సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ, పద్మ పురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు.ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే, తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు, మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.(చదవండి: వైభవంగా జగదాంబిక బోనాలు..అక్కడే తొలి బంగారు బోనం..!) -
స్విగ్గీ రైడర్‌గా వైద్యవిద్యార్థి..! కట్‌చేస్తే కోటీశ్వరుడిగా..
లాక్డౌన్ కొన్ని జీవితాలను చిన్నాభిన్నం చేసింది గానీ..వాళ్ల విజయాన్ని ఆపలేకపోయింది. బహుశా ఆ మహమ్మారి ఇంట్లోనే బంధీగా చేసిందేమో గానీ విజేత కానివ్వకుండా నిలువరించలేకపోయింది. అందుకు ఉదాహారణే రచయితగా మారిన ఈ వైద్య విద్యార్థి కథ. నిజానికి కరోనా టైంలో ఎందర్ని నిరుద్యోగులుగా చేసి రోడ్డుమీదకు తీసుకొచ్చేసంది. అప్పటిదాక సంతోషంతో ఉన్న కొందరి జీవితాలు తలకిందులైపోయాయి. అలాంటి వారిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజిత్ కుమార్ కూడా ఒకడు. ఫరిదాబాద్‌లోని రోహ్తక్లోని మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థిగా చదువుకుంటున్న అజిత్ కుమార్ లైఫ్ కరోనాతో ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. తన చదువు కోసం చేసిన అప్పులు ఒకవైపు..చదువు కొనసాగన్వివకుండా మహమ్మారి ఇంకోవైపు. దాంతో చదువుని మధ్యలోనే ఆపేసి ఉపాధి వెతుక్కుంటూ స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌గా మారాడు. రోజుకు 16 గంటలు పనిచేస్తూ..ఏకంగా వందల కిలోమీటర్లు సైకిల్ తొక్కుతుండేవాడు. ఆ క్రమంలో ప్రమాదానికి గురై మంచానికే పరిమితమయ్యాడు. ఒక పక్క తీర్చాల్సిన అప్పులు నిద్రపట్టనివ్వకుండా చేస్తుండటంతో మళ్లీ ఉద్యోగాల వేట మొదలుపెట్టాడు. అప్పుడే పాకెట్ ఎఫ్ఎమ్లో రచయిత ఉద్యోగ ప్రకటన అతడి కంటపడింది. దాంతో అతడి పరిస్థితులన్నీ మారిపోయాయి. అనూహ్యంగా మూడు నెలల్లో అతని కథలలో ఒకటి పాకెట్ ఎఫ్‌ఎమ్‌ఎమ్ రచనల పోటీలో అగ్రస్థానంలో నిలిచింది. వెంటనే అతనికి రూ. 20 వేలు పారితోషికం లభించింది. ఆ తర్వాత రూ. 52 వేలు పారితోషకం లభించింది. అలా నెమ్మదిగా అతడికి అందే చెక్కులపై అంకెలు పెరగడం ప్రారంభించాయి. ఒక నెలలో అతనికి ఏకంగా రూ. 6.29 లక్షల పారితోషకం లభించింది. ప్రస్తుతం ఆయన పాకెట్ ఎఫ్ఎమ్ 'బ్రహ్మయోధ: ది డిస్ట్రాయర్' కార్యక్రమానికి ప్రధాన రచయితగా పనిచేస్తున్నారు. దీనికోసం ఏకంగా వెయ్యికిపైగా ఎపిసోడ్లు రాశారు. అలా అజిత్ ఇవాళ కోట్లు గడించే రచయితగా మారాడుఅతని లింక్డ్ఇన్ బయో ప్రకారం, 3 మిలియన్లకు పైగా వీక్షణలతో ప్రేక్షకుల ఆదరణను పొందారు. ఆ అకౌంట్లో అజిత్ కుమార్ తన గురించి ఇలా రాసుకొచ్చారు. "పురాణాల ఆధారిత కల్పనా కథలు రాసే చయితను. ప్రాచీన గాథలను భవిష్యత్ కాలపు మహాయోధుల ఇతివృత్తాలతో మేళవించి ఇతిహాస గాథలను రచించడం నా అభిరుచి. ప్రస్తుతం నేను బ్రహ్మయోధ: ది డిస్ట్రాయర్' అనే ఒక భారీ సీరియల్‌కి పనిచేస్తున్నాని, అది సుమారు 5 వేలకు పైగా ఎపిసోడ్లు కొనసాగనుందని అజిత్ రాసుకొచ్చారు. ఇది భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఆడియో-ఫిక్షన్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలుస్తుందని అన్నారు. అంతేగాదు తన చేతిలో ఐదు పెద్ద నవలల కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. నిజంగా అజిత్ కుమార్‌ని చూస్తే పడిలేచిన కెరటం అనొచ్చు కదా. అందరం కెరీర్ నిర్మించుకునే క్రమంలో కిందపడిపోతాం, కుదేలవుతాం..కానీ తట్టుకుని తిరిగి లేచి నిలదొక్కుకున్నవాడే విజేత అని నిరూపించాడు కదూ..!.(చదవండి: మెరిసే చర్మం కోసం న్యూటెల్లా జార్..! ఆ నటి బ్యూటీ సీక్రెట్..) -
మెరిసే చర్మం కోసం న్యూటెల్లా జార్..! ఆ నటి బ్యూటీ సీక్రెట్..
చర్మ సంరక్షణకు సంబంధించిన ప్రభావవంతమైన వంటింటి చిట్కాలనే అనుసరిస్తారు చాలామంది. సహజసిద్ధమైనవి కావడంతో వాటిపై ఉంటే గట్టి నమ్మకం ఉంటుంది. ముఖ్యంగా పొడి శనగపిండి, రోజ్ వాటర్, పసుపు వరకు మన వంటింట్లో లభించే వాటిని ఉపయోగిస్తారు. ఇలా సహజసిద్ధమైన చిట్కాలనే అనుసరించే వారిలో వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్ కూడా ఉంది. ఆమె మచ్చలేని చందమామలాంటి మోము రహస్యం తన వంటగదిలోనే ఉందని చెబుతోంది ఆమె వ్యక్తిగత బ్యూటీషియన్ డెబోరా మిచెల్. క్షణాల్లో కాంతి వంతమైన ముఖం కోసం వంటగదిలో ఉండే న్యూటెల్లా జార్‌ను ఉపయోగిస్తారని వెల్లడించింది. అంతేగాదు ఆమె మెరిసే చర్మం కోసం ఒక విచిత్రమైన పేస్ మాస్క్‌ని కూడా ఉపయోగిస్తారని చెప్పుకొచ్చింది. అంతేగాదు ఆమె సౌందర్యం కోసం ఓట్మీల్, కేల్, స్పిరులినా, మాచా, పాలకూర, రొమైన్ , బ్లూబెర్రీలతో తయారు చేసిన ఒక క్లాసిక్ గ్రీన్ స్మూతీ వంటివి తీసుకుంటుంది. తన చర్మాన్ని మృదువుగా ఉంచుకోవడానికి తాజా పదార్థాలన్నింటినీ తింటుందని చెప్పుకొచ్చింది. మధ్యాహ్నం లేదా సాయంత్రం పూట చిరుతిండిగా కూడా ఆమె పచ్చి పండ్లు, కూరగాయలతో పాటు సూపర్ ఫుడ్ అయిన గోజీ బెర్రీలను తీసుకుంటుందని తెలిపింది. అలాగే ఆ బ్యూటీషియన్ సహజంగా మెరిసే చర్మం కోసం నాలుగు సులభమైన ఇంట్లో తయారు చేసుకునే ఫేస్ మాస్క్‌లు గురించి కూడా వెల్లడించింది. అవేంటంటే..తేనె, పెరుగు ఫేస్ మాస్క్ (పొడి చర్మం కోసం)కావలసినవి: 1 టేబుల్ స్పూన్ సాదా పెరుగు, 1 టీస్పూన్ తేనెఉపయోగించే విధానం: ఈ రెండు పదార్థాలను కలిపి మెత్తని పేస్ట్ లా చేసి, ముఖానికి , మెడకు పట్టించండి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచి, గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఇది చర్మానికి తేమను అందించి, మృదువుగా ఉండేలా చేస్తుంది. చర్మం సహజ తేమ అవరోధానికి మద్దతు ఇస్తుంది.ఓట్మీల్, తేనె ఫేస్ మాస్క్ (సున్నితమైన చర్మం కోసం)కావలసినవి: 2 టేబుల్ స్పూన్ల మెత్తగా రుబ్బిన ఓట్స్, 1 టేబుల్ స్పూన్ తేనె, కొద్దిగా గోరువెచ్చని నీరుఉపయోగించే విధానం: అన్ని పదార్థాలను కలిపి చిక్కటి పేస్ట్ లా చేయండి. మెల్లగా అప్లై చేసి, 10–15 నిమిషాలు ఉంచి, ఆ తర్వాత సాధారణ నీటితో కడిగేయండి. ఇది పొడిబారిన మరియు సున్నితమైన చర్మానికి ఉపశమనం కలిగించి, తాత్కాలిక ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది. అలాగే, ఇది సున్నితమైన ఎక్స్‌ఫోలియేషన్‌ను అందిస్తుంది.కలబంద దోసకాయ ఫేస్ మాస్క్ (చల్లదనం, తేమ కోసం)కావలసినవి: 2 టేబుల్ స్పూన్ల తాజా కలబంద జెల్, 2 టేబుల్ స్పూన్ల దోసకాయ గుజ్జుఉపయోగించే విధానం: రెండింటినీ కలిపి శుభ్రమైన చర్మానికి అప్లై చేయండి. కడిగే ముందు 15 నిమిషాలు అలాగే ఉంచండి.ఇది చర్మానికి తాజా అనుభూతిని కలిగించి, తేలికపాటి తేమను అందించి, చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది.శనగపిండి, పెరుగు, పసుపు ఫేస్ మాస్క్ (జిడ్డు చర్మం కోసం)2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ సాదా పెరుగు మరియు చిటికెడు పసుపుఉపయోగించే విధానం: అన్ని పదార్థాలను కలిపి మెత్తని పేస్ట్ లా చేసి, చర్మానికి సమానంగా అప్లై చేయండి. కడిగే ముందు 10–15 నిమిషాల పాటు అలాగే ఉంచుకోండి.ఇది చర్మంలోని అధిక నూనెను తొలగించి, ఎక్స్ఫోలియేట్ చేసి, లోపలి నుంచి బయట వరకు తాజాగా కనిపించేలా చేస్తుందని అంటారు. -
అడ్వర్టైజ్మెంట్లు... మా రాంబాబుగాడి మూఢనమ్మకాలు!
మా రాంబాబుగాడికి కొన్ని మూఢనమ్మకాలున్నాయి. అవి అలాంటిలాంటి మూఢనమ్మకాలు కావు. అన్నీ అడ్వరై్టజ్మెంట్స్ గురించే. పాత రోజుల్లో... అప్పట్లో ఓ డ్రింక్ తాలూకు అడ్వర్టైజ్మెంట్ ఏదో వచ్చేదట... ‘టేస్ట్ ద థండర్’ అంటూ! అప్పటి నుంచి పిడుగు ఎక్కడ పడుతుందో తెలుసుకుని దాన్ని కాస్తంత టేస్ట్ చూడాలన్నది వాడి తాపత్రయం. ఎక్కడో ఫలానా చోట పిడుగుపడిందంటే ఎంత ఖర్చయినా పెట్టుకుని అక్కడికి వెళ్లేవాడు. ‘‘సార్... ఇక్కడ పిడుగు పడిందట. ఏమనుకోక΄ోతే... కాస్తంత పిడుగు రుచి చూపిస్తారా? ఒకే ఒకసారి కొద్దిగా టేస్ట్ చేస్తా సార్’’ అంటూ అక్కడివాళ్లను బతిమాలాడు. దాంతో ఆ అడ్వర్టైజ్మెంట్ తాలూకు బాటిల్‌ను వాడికి ఇచ్చి,.. ‘‘ఇందులో పిడుగును బంధించాం సార్. అదెంత పవర్ఫుల్ అంటే... జస్ట్ మీరు బాటిల్ మూత రుచి చూసినా టేస్టు తెలిసిపోతుంద’’న్నారు వాళ్లు. ‘‘ఏదో గొప్పగా ఉంటుందనుకున్నాగానీ... థండర్ రుచి చాలా పేలవంగా ఉంది సార్’’ అంటూ అక్కణ్నుంచి నిరాశగా వెళ్లిపోయాడు మన రాంబాబు. ∙∙ ఇక మరో అడ్వర్టైజ్మెంట్ ఏదో వచ్చేదట... ‘ఖడ్గంతో గడ్డం చేసుకోండి’ అని! అప్పట్నుంచి వాడిలో మరో మూఢనమ్మకం మొదలైంది. ‘మామూలు చిన్న బుజ్జి బ్లేడ్‌తో చేసుకుంటేనే ఇంత బాగుంది కదా. మరి ఖడ్గంతో చేసుకుంటే ఎంత స్మూత్‌గా ఉంటుందో’ అని. ‘‘ఒరేయ్ నాయనా... కొట్టడానికి సైకిల్ చైన్ ఫ్లెక్సిబుల్‌గా ఉండనట్టే... ఖడ్గంతో గడ్డం చేసుకోవడమూ కష్టమవుతుందిరా బాబూ’’ అంటే ఎంతకీ వినడే. దాంతో వాడి ఫ్రెండ్ ఒకడు ఒక బ్లేడ్ తెచ్చిచ్చి... ‘‘నీకు తెలుసా... ఖడ్గం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన మెటల్‌తోనే ఇది తయారైంది. ఖడ్గానికి మినీ వర్షన్రా ఇదీ! దీంతో గడ్డం చేసుకుంటే ఖడ్గంతో చేసుకున్నట్టే’’ అని వాడిని కన్విన్స్ చేశారు. అప్పట్నుంచి వాడు మామూలు బ్లేడ్‌నే ఖడ్గఖండమనే భ్రమలో ఉంటూ... అలా గడ్డం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తూ ఉన్నాడు. ∙∙ ఇక మరో దశలో వీడి పిచ్చి ఇంకాస్త పీక్స్‌కు చేరింది. అదేదో సబ్బు రుద్దుకోవాలంటే తప్పనిసరిగా జలపాతం కిందే స్నానం చేయాలన్నది వాడి మరో మూఢనమ్మకంగా మారింది. ఆ సబ్బు వాడటానికి జలపాతానికి వెళ్లాలంటూ రోజూ పొద్దున్నే ఒకటే గొడవ. చివరకు వాళ్ల నాన్న వాళ్లింట్లో షవర్ పెట్టించాడు. ‘‘ఒరే నాన్నా... అందరూ అడవిదాకా వెళ్లి జలపాతంలోనే స్నానం చేయాలంటే కుదర్దు కదా. అందుకే ఆ కంపెనీల వాళ్లు జలపాతానికి ఆల్టర్నేట్గా షవర్లను తయారు చేశారు. షవరంటే ఏమనుకున్నావు... జలపాతాన్ని మడిచి బాత్రూమ్లో పెట్టిన టెక్నాలజీ రా ఇదీ’’ అంటూ సముదాయిస్తూ... షవర్లో వాడి చేత ఆ సబ్బు రుద్దించారు. ∙∙ వీడి మూఢనమ్మకాలకు ట్రీట్మెంట్ ఇప్పించడానికి రాంబాబు వాళ్ల నాన్న చాలా మంది డాక్టర్లను కలిశాడు. చాలా హాస్పిటల్స్ తిరిగాడు. కానీ ఎక్కడా నయం కాలేదు. ఓరోజు రాంబాబుగాడి క్లోజ్ ఫ్రెండు దగ్గర తన గోడు వెళ్లబోసుకుంటుంటే... వాడో సింపుల్ సొల్యూషన్ చెప్పాడు. ‘‘ఇదంతా ఎందుకు అంకుల్. వాడు ఎట్టిపరిస్థితుల్లోనూ టీవీ చూడకుండా ఉండేలా వాణ్ణి బిజీ చేసేయండి. జస్ట్ ఇది చేస్తే అంతా సర్దుకుంటుంది చూడండి’’ అంటూ సలహా ఇచ్చాడు. – యాసీన్ (చదవండి: 20 ఏళ్లుగా భార్యతో మాటల్లేవ్.. కానీ కలిసే ఉన్నారు!) -
రంగుల అప్పడాలు రోగాలకు కేరాఫ్!
ఆకర్షణీయమైన రంగుల్లో, వివిధ ఆకారాల్లో ఉండే అప్పడాలను పిల్లలు ఎంతగానో ఇష్టపడుతుంటారు. అందుకని వారు అడిగిన వెంటనే కొనివ్వడమో, లేదంటే ఇంట్లోనే వేయించి ఇవ్వడమో చేస్తుంటారు. కానీ ఈ రంగుల అప్పడాలు ఆరోగ్యానికి తీవ్రమైన హాని చేస్తాయంటూ తమిళనాడు ప్రభుత్వం సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటనను విడుదల చేసింది. అప్పడాలను సాధారణంగా మినప్పప్పు లేదా బియ్యప్పిండితో తయారు చేస్తారు. ఆలుగడ్డ స్టార్చ్, సగ్గుబియ్యంతో చేసే వడియాల కంటే ఇవి చాలా పల్చగా ఉంటాయి. అయితే, ఈ అప్పడాలు ఆకర్షణీయంగా కనిపించడం కోసం పిండిలో ఫుడ్–గ్రేడ్ రంగులను కలిపి, ఆపై ఉడికించి, ఆరబెట్టి తయారు చేస్తారు. ఇలాంటి రంగుల అప్పడాలను తరచూ తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు, కిడ్నీలు దెబ్బతినడం, కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఈ రసాయన రంగుల వల్ల పిల్లల్లో అలర్జీలు రావడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయని తమిళనాడు ఆహార భద్రతా విభాగం అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ రంగురంగుల పాపడ్‌కి ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే మినప్పప్పు లేదా బియ్యప్పిండితో తయారుచేసిన సహజసిద్ధమైన అప్పడాలను వాడటం అందరి ఆరోగ్యానికి సురక్షితం. (చదవండి: జీవితాన్నే డాక్యుమెంట్ చేస్తూ..రూ. 8.35 కోట్లు..! కార్పొరేట్ ఉద్యోగం వదిలేసి మరి..) -
20 ఏళ్లుగా భార్యతో మాటల్లేవ్.. కానీ కలిసే ఉన్నారు! కారణం తెలిస్తే కంగుతింటారు
ఇటీవల కాలంలో భార్యభర్తల సంబంధాలు ఎంత దారుణంగా వికృతంగా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. కొన్నింటిని చూస్తే..మనసు కలిచివేస్తుంది కూడా. అలాంటి తరుణంగా ఈ ఇద్దరి భార్యభర్తల మధ్య చోటుచేసుకున్న అభిప్రాయ భేదం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఏ సంబంధంలోనైనా..పొరపొచ్చాలు సహజం. కానీ ఈ ఆలుమగలు..మధ్య ఎదురైనా అత్యంత సాధారణ అభిప్రాయభేదం వాళ్లను వేరు చేయలేదు..కానీ వారి మధ్యమాటలను దూరం చేసింది. ఇరువురి మధ్య భౌతికంగా దూరం లేదు గానీ మానసికంగా కలిసి లేరు, మాటల్లేవ్. పాపం వాళ్లని కలిపేందుకు సిద్ధమయ్యాడు కూమారుడు. మరి అతడి ప్రయత్నం ఫలించిందా అంటే..ఈ విచిత్ర ఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. దాదాపు దశాబ్దం క్రితం ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అద్భుతమైన ప్రేమకథ. అసాధారణ మలుపుతో భావోద్వేగంగా ముగిసినా..ఇప్పటికీ ప్రజలను ఆకర్షిస్తూనే ఉంది. 2017లో, 18 ఏళ్ల యువకుడు హోక్కైడోలోని ఒక టెలివిజన్ షోకు అసాధారణమైన విజ్ఞప్తి చేశాడు. తన జీవితంలో చాలా కాలంగా కొనసాగుతున్న ఒక కుటుంబ సమస్యకు సహాయం చేయమని కోరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తన తల్లిదండ్రులు దాదాపుగా 20 ఏళ్లుగా కలిసి జీవిస్తున్నప్పటికీ సరిగ్గా మాట్లాడుకోవడం ఎప్పుడు చూడలేదని అందువల్ల తాను మళ్లీ కలిపి చక్కగా మాట్లాడుకునేలా చేయాలనుకున్నట్లు తెలిపాడు. అందుకోసం సదరు టెలివిజన్ షోన్ని సహాయం చేయమని అర్థిస్తాడు. అతడి పేరెంట్స్ ఓటో కటాయమా ( యామా, భార్య యూమి ఒకే ఇంట్లో ఉంటున్నా..రెండు దశాబ్దాలుగా ఇద్దరి మధ్య మాటల్లేవ్. ముగ్గురు పిల్లలను పెంచారు, కలిసే భోజనం చేశారు. అయినా ఒకరితో ఒకరు అర్థవంతంగా ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. అంత నిశబ్ద వాతావరణం వెనుక ఇద్దరి మధ్య ఎలాంటి వాగ్వాదం గానీ తీవ్రమైన ద్రోహం గానీ చోటు చేసుకోలేదు. కానీ ఎందుకని ఇద్దరి మధ్య సైలన్స్ చోటు చేసుకుందంటే..పిల్లల పట్ల భార్య చూపిస్తున్న శ్రద్ధ చూసి అసూయతో కటాయామా మాట్లాడటం మానేశారట. యామీ మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడల్లా..అతను కేవలం తల ఊపడం, అవును అని మాత్రమే స్పందించి ఊరుకునేవారట. ఈ పరిస్థితిని చూసి వాళ్ల చిన్న కుమారుడు వాళ్లను తిరిగి కలిపేందుకు టెలివిజన్ సాయం కోరాడు. ఆ కార్యక్రమం నిర్వాహాకులు ఆ దంపతులు మొదట డేట్‌కు వెళ్లిన పార్కులోనే కలుసుకునేలా ఏర్పాటు చేసింది. ముగ్గురు పిల్లలు పేరెంట్స్‌ని దూరం నుంచి గమనిస్తూనే ఉన్నారు. దాదాపు 20 ఏళ్ల మౌనాన్ని వీడుతూ..కటాయమా తన భార్యతో ఇలా అన్నారు, "ఏదో తెలియని కారణం వల్ల మనం మాట్లాడుకుని చాలా కాలం అయ్యింది. నువ్వు పిల్లల గురించి చాలా ఆందోళన చెందావు. యూమి, ఇప్పటి వరకు నువ్వు చాలా కష్టాలను భరించావు. నేను ఎందుకు మాట్లాడటం లేదో నువ్వు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు పిల్లలను తనకంటే అత్యంత ప్రేమగా చూసుకోవడంతో అసూయపడ్డాను, అలిగాను. అందువల్ల మాట్లాడలేదు. జరిగిపోయినా కాలాన్ని వెనక్కి తేలేను కానీ..మళ్లీ మాట్లాడుకోవడం మొదలుపెట్టడం మాత్రం సాధ్యమే మరి మాట్లాడుకుందామా.. అని అతను అడగడంతో..ఆ షోని చూస్తున్నవాళ్ల ముఖాల్లో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. ఈ భావోద్వేగమైన పునః కలయిక నెట్టింట త్వరగా వైరల్ అయ్యి..అందర్నీ అమితంగా ఆకర్షించింది. చాలా ఏళ్ల నిశబ్దం తర్వాత మళ్లీ కలవడానికి ఆ జంట చూపిన సుముఖతను చాలా మంది ప్రశంసించారు. అంతేగాదు ప్రస్తుతం మారుతున్న సంబంధాల ధోరుణుల కారణంగా ఈ దంపతుల కథ అందరి మనసులను తాకింది.(చదవండి: జీవితాన్నే డాక్యుమెంట్ చేస్తూ..రూ. 8.35 కోట్లు..!) -
జీవితాన్నే డాక్యుమెంట్ చేస్తూ..రూ. 8.35 కోట్లు..!
కంటెంట్ క్రియేటర్‌గా క్లిక్ అవ్వడం అంతఈజీ కాదు. ఒక్కోసారివీడియోలకు జనాధరణ లభించక, విమర్శలతో విసుగొస్తుంటుంది. జస్ట్ ఒక్క వీడియో షేర్ చేయగానే విజయవంతం కారు. ఆ రంగంలో కూడా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాక గానీ..మనకంటూ ఒక గుర్తింపు..స్టార్డమ్ రాదని చెబుతోంది ఒక మహిళా కార్పొరేట్ ఉద్యోగి. తాను ఎలా కంటెంట్ క్రియెటర్‌గా మారి సక్సెస్ అయ్యిందో పంచుకోవడమే కాదు దాని సాయంతో ఏ రేంజ్లో సంపాదిస్తుందో వెల్లడిస్తూ అందర్నీ ఆశ్చర్యపర్చింది. పైగా ఔత్సాహిక కంటెంట్ క్రియేటర్లకు స్ఫూర్తిగా నిలిచింది.బల్గేరియాకు చెందిన అలెక్స్ పెట్రాకియేవా అమెరికాకు వెళ్లిన తర్వాత తన సోషల్ మీడియా ప్రయాణం అయ్యిందంటూ ఇన్స్టాగ్రామ్ వీడియో షేర్ చేస్తుంది. ఆ వీడియలో తాను 2023లో అమెరికాకు వచ్చాక..ఆన్లైన్లో వీడియోలు పోస్ట్ చేస్తూ తన కంటెంట్ క్రియేటర్ కెరీర్‌ని ప్రారంభించినట్లు తెలిపింది. తాను కార్పొరేట్ ఉద్యోగం చేస్తూనే ఈ జర్నీని ప్రారంభించినట్లు పేర్కొంది. ఆ క్రమంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నానని కూడా తెలిపింది. అయితే వాటిని అధిగమించేలా కొన్ని కీలకపాఠాలను కూడా నేర్చుకున్నట్లు చెప్పింది. అయితే ఎప్పుడు కూడా వదిలేద్దామని చేతులు ఎత్తేయాలని అనుకోలేదని..చివరి వరకు నిలకడగా ఉండేదుకు ప్రయత్నించానని వెల్లడించి. చివరిక తను కోరుకున్న విధంగా తన మార్గాన్ని మార్చుకుని కంటెంట్ క్రియేటర్‌గా సక్సెస్ అయ్యానని తెలిపింది. అందుకోసం తన జీవితాన్నే ఒక సీరిస్‌గా మార్చానని, వాటిని ఒక దృశ్యాల రూపంలో డాక్యుమెంట్ చేస్తూ వీడియోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రారంభించానని వెల్లడించింది. ఫలితంగా రెండున్నర ఏళ్లలోనే ఏకంగా రూ. 8 కోట్లు ఆర్జించే స్థాయికి చేరుకున్నానని వెల్లడించింది. తాను అమెరికాకు వెళ్లి కార్పొరేట్ ఉద్యోగంలో విసుగుచెంది..యాదృచ్ఛికంగా టిక్‌టాక్‌లో కంటెంట్‌ను పోస్ట్ చేయడం ప్రారంభించానని చెప్పుకొచ్చింది. ఆ క్రమంలో ప్రజలను ఆకట్టుకునేలా వీడియోలను కంటెంట్‌ని క్రియేట్ చేయాలనే ఆసక్తి పెరిగిందని తెలిపింది. 2024లో సుమారు 57 విలువ చేసే బ్రాండ్‌తో కుదిరిన డీల్ తన జీవితాన్ని మార్చిందని, అదే క్రమంగా సొంత డిజిటల్ ఉత్పత్తులను క్రియేట్ చేసే స్థాయికి దారితీసిందని పేర్కొంది. అలా తాను 2024 చివరి నాటికి ఏకంగా రూ 1 కోటి రూపాయల పైనే కంటెంట్ ద్వారా ఆర్జించానని వెల్లడించింది. దాంతో ఆ మరుసటి రోజే కార్పొరేట్ ఉద్యోగానికి స్వస్తి పలికి, భర్తను కూడా చేర్చుకుని ఇద్దరం కలిసి పనిచేసేందుకు రెడీ అయ్యామని తెలిపింది. ఆ తర్వాత జీవితంలో పరిస్థితులు మరింత మెరుగ్గా మారడం ప్రారంభించాయి. ఆ తర్వాత 2026 జూలైలో తన భర్తతో కలిసి రూ. 4 కోట్లు దాక పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. అంతేగాదు తనకు కంటెంట్ క్రియేషన్‌లో కెరీర్‌ను నిర్మించుకోవడానికి ఉపకరించిన మూడు విషయాలను కూడా వెల్లడించారు. అవి ఏంటంటే..సాధించాలనుకున్న లక్ష్యాలను స్పష్టంగా ఏర్పాటు చేసుకోవడం, మధ్యలో వదిలి పెట్టకూడదని నిర్ణయించుకోవడం, ఫ్లాప్ వచ్చినప్పుడల్లా..వ్యూహం మారుస్తూ ప్రయాగాలు చేస్తుండటం.. అవే తన సక్సెస్ సీక్రెట్ అని చెబుతోంది అలెక్స్. చివరగా సొంతంగా కంటెంట క్రియేటర్‌గా జర్నీని ప్రారంభించాలనుకునేవారికి చక్కటి సలహ ఇస్తూ తన పోస్ట్‌ని ముగించింది. అదేంటంటే ఒక వీడియో పోస్ట్ చేసేటప్పుడు చెడుగా ఏం జరుగుతుంది, మంచిగా అయితే ఏం జరుగుతుంది అనే దానిపై పూర్తి అవగాహనతో దిగండి అప్పుడు ఆటోపోట్లను అధిగమించే శక్తి వస్తుందని అంటోంది అలెక్స్. నెటిజన్లంతా ఆమెపై ప్రశంసలు వర్షం కురిపించడమే గాక అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చారంటూ పోస్టులు పెట్టారు.(చదవండి: నో లగ్జరీ కార్లు, నో బ్రాండెడ్ బట్టలు..! వైరల్‌గా ఆ జంట ఆర్థిక సూత్రాలు.. -
మట్టిలో మాణిక్యం.. 'సుష్మ'
పుట్టింది రైతు కుటుంబంలో అయినా పట్టుదల, క్రమ శిక్షణతో కూడిన విద్య ఆమెను ఉన్నతస్థాయికి తీసుకెళ్లింది. దేశ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికిన విక్రమ్ –1 రాకెట్ విజయంలో కీలక పాత్ర పోషించేలా చేసింది. జిల్లా ఖ్యాతిని దశ దిశలా చాటిన మారక సుష్మ విజయగాథపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ఇటీవల విక్రమ్–1 రాకెట్ విజయవంతంగా ప్రయోగించారు. భారత అంతరిక్ష రంగంలో ఒక ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపడం ఇదే తొలిసారి. ఈ విజయంతో భారత అంతరిక్ష రంగం మరో కీలక మైలురాయిని అధిగమించింది.హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన విక్రమ్–1 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ చారిత్రక ప్రయోగ విజయంలో రాప్తాడు మండలం ఎం. బండమీదపల్లికి చెందిన యువ ఇంజినీర్ మారక సుష్మ కీలక పాత్ర పోషించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. శభాష్.. సుష్మ అంటూ జిల్లా వాసులందరూ ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు.గ్రౌండ్ చెకౌట్ సిస్టమ్స్‌లో కీలక బాధ్యతలు స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థలో గ్రౌండ్ చెకౌట్ సిస్టమ్స్ అండ్ ల్యాబ్‌వ్యూ ఇంజినీర్‌గా పని చేస్తున్న మారక సుష్మ, రాకెట్ ప్రయోగానికి ముందు నిర్వహించే కీలక సాంకేతిక పరీక్షలు, గ్రౌండ్ చెకౌట్ సిస్టమ్స్, ల్యాబ్‌వ్యూ సాఫ్ట్వేర్ అభివృద్ధి వంటి విభాగాల్లో బాధ్యతలు నిర్వహించారు. విక్రమ్–1 ప్రయోగ బృందంలో సభ్యురాలిగా శ్రీహరికోటలో జరిగిన ప్రయోగ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.రైతు కుటుంబం నుంచి...మారక సుష్మ వయస్సు 26 సంవత్సరాలు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ఎం.బండమీదపల్లి గ్రామానికి చెందిన రైతు మారక సుబ్బారెడ్డి, మారక సుజాత దంపతుల కుమార్తె. రైతు కుటుంబంలో జని్మంచిన సుష్మ చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి కనబరిచి క్రమశిక్షణతో ముందుకు సాగారు. వారి కుటుంబం ప్రస్తుతం అనంతపురంలో నివాసం ఉంటోంది.అభినందనల వెల్లువరైతు కుటుంబంలో పుట్టి పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి, దేశ చరిత్రలో నిలిచిపోయే అంతరిక్ష ప్రయోగంలో భాగస్వామ్యం కావడంతో జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, యువత సుష్మను అభినందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రపంచస్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని సుష్మ నిరూపించిందంటున్నారు. దేశానికి సేవ చేయడమే లక్ష్యం : సుష్మభారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో చరిత్రాత్మకమైన విక్రమ్–1 ప్రయోగంలో భాగస్వామ్యం కావడం తనకు, తన కుటుంబానికి ఎంతో గర్వకారణమని సుష్మ తెలిపారు. భవిష్యత్తులో భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరిన్ని విజయవంతమైన ప్రయోగాల్లో పాల్గొని దేశానికి సేవలందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.లక్ష్యసాధనలో విజయంసుష్మ తన పాఠశాల విద్యను అనంతపురంలోని నారాయణ హైస్కూల్లో పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్ నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. తర్వాత కర్నూలు పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎల్రక్టానిక్స్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వరంగల్‌లో పవర్ సిస్టమ్స్‌లో ఎంటెక్ పూర్తి చేశారు. తర్వాత 2024 ఆగస్టులో స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థలో ల్యాబ్‌వ్యూ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచి గ్రౌండ్ చెకౌట్ సిస్టమ్స్‌కు సంబంధించిన సాంకేతిక పనుల్లో సేవలందిస్తున్నారు. -
డిగ్రీ ఓకే.. స్కిల్స్ డబుల్ ఓకే..!
కష్టపడి డిగ్రీ చదివేస్తే సరిపోదు.. రియల్ వరల్డ్‌లో పోటీకి తగినట్టు స్కిల్స్ పెంచుకోకపోతే వెనుకపడిపోతావ్.. మహా అయితే నీ డి గ్రీ ఒక్క ఉద్యోగాన్నిస్తుంది. కాని స్కిల్స్ ఉంటే కెరీర్ మలుపు తిరుగుతుంది.ఏఐ నీ శత్రువు కాదుప్రస్తుతం అంతా ఏఐ మాయలో ప్రపంచమంతా పయనిస్తోంది. దాని వల్ల వేలమందికి ఉద్యోగాలు పోయాయి..మరిన్ని లక్షల మందికి ఉద్యోగాలు పోనున్నాయి. కాని ఏఐ నీ శత్రువు కాదు. ఏఐ వాడగలిగేవాడు నీ ఉద్యోగాన్ని తీసుకుంటాడంతే...సోషల్ మీడియాతో స్నేహం చాలదు..రీల్స్ చూస్తూ, వీడియోలు షేర్ చేయడం మానేసి కంటెంట్ క్రియేటర్‌గా ఎదుగు.. యూట్యూబ్ ఛానల్, ఇన్‌స్టా రీల్, ఇన్ఫోటెయిన్మెంట్, బ్లాగ్స్ ఇలా నీ ట్యాలెంట్‌కి సూట్ అయ్యే ప్లాట్‌ఫాం ఎంచుకో. విస్తారమైన అవకాశాలు ఉన్నది ఒక్క సోషల్ మీడియాలోనేనని తెలుసుకో...జీతం కోసం కాదు జీవితం కోసం చూడుఏదో ఒక పని చేసి నెలజీతం తెచ్చుకుంటే చాలనుకోకు..ప్రభుత్వాలు మారినా, షేర్ మార్కెట్లు కుప్పకూలినా, కంపెనీలు దివాల తీసినా ముందుగా మూడేది నెలజీతగాళ్లకే...అందుకే నైపుణ్యాలు పెంచుకో బంగారు భవితని గెలుచుకో.భర్తీ కానివ్వకు..అందరూ చేసే పనిని నువ్వు చేయకు.. నీ ప్రత్యేకత ఉన్న పనేంటో శోధించి దానిలో ప్రతిభ చూపించి రాణించు..నిన్ను భర్తీ చేసి వేరొకరికి నీ స్థానాన్నివ్వాలన్న ఆలోచనని రానివ్వకు. -
84 కేజీల నుంచి 54 కేజీలకు..! ఈజీగా చేసే కార్డియో వ్యాయామాలివే..
బరువు తగ్గడం అంటే తక్షణ పరిష్కారాల కోసం చూడకుండా.. బదులుగా నిలకడగా చేయగలిగే అలవాట్లను అనుసరించడం అని నొక్కి చెబుతుంటారు ఫిట్నెస్ నిపుణులు. అందుకోసం సక్రమమైన జీవనశైలి, చక్కటి వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాల్సిందే. అలాగని కష్టతరమైనవి కాకుండా తేలిగ్గా చేసే వర్కౌట్లు, రిపిటేషన్స్ ప్రధానం అని అంటోంది ఫిట్నెస్ ఔత్సాహికురాలు అంజలి సచెన్. చేసే వ్యాయామాలు సెట్స్ వారిగా రిపిటేషన్ చేస్తే చాలు..కష్టతరమైన వాటి జోలికి పోనవసరం లేదంటోంది. అంతేగాదు తేలిగ్గా చేసే కార్డియో వ్యాయమాల వివరాలను కూడా ఆమె పంచుకున్నారు. అవేంటంటే..అంజలి సచెన్ అనే ఈ మహిళ, క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటిస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్లే తాను 84 కేజీల నుంచి 54 కేజీలకు తగ్గినట్లు తెలిపింది. అందుకోసం ఎలాంటి కార్డియో వ్యాయామాలు చేసేదో వెల్లడించారామె. అదనపు కొవ్వుని తగ్గించుకోవడానికి సహాయపడే వ్యాయామాలు ఇవే..హై నీస్ (మోకాళ్లకు వ్యాయామం)ఆమె 20 రెప్స్‌తో నాలుగు సెట్లు హై నీస్ చేయడంతో ప్రారంభించారు. ఈ డైనమిక్ కార్డియో వ్యాయామంలో, మోకాళ్లను తుంటి ఎత్తుకు తీసుకువస్తూ..చేతులను పంప్ చేస్తూ ఒకే చోట పరుగెత్తాలి లేదా నడవాలి. ఇది హృదయ స్పందన రేటును పెంచడానికి, శరీర దిగువ భాగం శక్తిని పెంపొందించడానికి, కోర్‌ను ఉత్తేజపరచడానికి ఒక అద్భుతమైన వ్యాయామం.జంపింగ్ జాక్స్తరువాత, ఆమె జంపింగ్ జాక్స్‌ను 50 రెప్స్‌తో మూడు సెట్లు చేయమని సిఫార్సు చేసింది. ఈ వ్యాయామంలో, ఆమె తన మోకాళ్లను కొద్దిగా వంచి గెంతింది, తన కాళ్లను బయటకు చాస్తూ, చేతులను బయటకు ఊపుతూ వాటిని ఒక వంపులో పైకి లేపింది.కిక్బ్యాక్స్ఆమె సిఫార్సు చేసిన తదుపరి వ్యాయామం కిక్బ్యాక్స్. ఉత్తమ ఫలితాల కోసం కనీసం 20 రెప్స్‌తో మూడు సెట్లు చేయమని ఆమె సలహా ఇచ్చింది. ఆమె తన చేతులను తుంటిపై ఉంచి నిలబడి, తన కాళ్లను వెనక్కి తన్ని, చేతులను తాకడానికి ప్రయత్నించింది.జంపింగ్ స్క్వాట్స్ఈ జంపింగ్ స్క్వాట్స్‌ను కూడా 12 రెప్స్‌తో మూడు సెట్లు చేయమని సిఫార్సు చేసింది. ఈ వ్యాయామం ఒక ప్రామాణిక బాడీవెయిట్ స్క్వాట్ను నిలువు జంప్‌తో మిళితం చేస్తుంది. అలాగే హృదయ స్పందన రేటును పెంచుతూ కాళ్ల బలాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది.జంపింగ్ లంజెస్సాధారణ లంజెస్ కు బదులుగా, జంపింగ్ లంజెస్లో కాళ్ళను రెండుగా చాపి నిలబడి, నిలువుగా పైకి ఎగిరి గాలిలోనే కాళ్ళ స్థానాలను మార్చుకుని, వేగంగా తిరిగి లోతైన లంజ్ భంగిమలోకి దిగాలి. ఈ వ్యాయామాన్ని 10 రెప్స్ చొప్పున మూడు సెట్లలో చేయాలని ఆ ఇన్ఫ్లుయెన్సర్ సలహా ఇచ్చారు.మౌంటెన్ క్లైంబర్స్చివరి వ్యాయామంగా, మౌంటెన్ క్లైంబర్స్‌ను 15 రెప్స్ చొప్పున మూడు సెట్లలో చేయాలని ఆమె సిఫార్సు చేశారు. ఆమె సాధారణ 'ప్లాంక్' (plank) భంగిమలోకి వచ్చి, ఒక మోకాలిని తన ఛాతీ వైపునకు లాగి, వెంటనే తిరిగి మొదటి స్థితికి తీసుకువచ్చింది. ఈ వ్యాయామం శరీర మధ్య భాగం (కోర్) బలాన్ని,భుజాల స్థిరత్వాన్ని పెంచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.చివరగా, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్, శీతల పానీయాలు, చక్కెర అధికంగా ఉండే పదార్థాలు కడుపు ఉబ్బరంగా కనిపించేలా చేస్తాయని ఆమె పేర్కొంది. వీటికి బదులుగా, అరటిపండ్లు, కొబ్బరి నీళ్లు, పాలకూర, అవకాడోలు, ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడే ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలని ఆమె సూచించింది. View this post on Instagram A post shared by Anjali Sachan (@_anjali_sachan_)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆయా వ్యక్తుల ఆరోగ్య చరిత్రని అనుసరించి.వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం చేయడం ఉత్తమం. (చదవండి: వర్షాకాలంలో బియ్యం పాడవ్వకూడదంటే..!) -
స్కామ్‌ని జామ్ చేసే షీల్డ్ ఇది..!
అకస్మాత్తుగా అపరిచిత వ్యక్తి నుంచి కాల్ రావడం. బంపర్ ప్రైజ్ వచ్చిందని, మొబైల్‌కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్తే సరిపోతుందని చెప్పి మోసం చేసిన ఘటనలు మన దేశంలోనే వేలల్లో ఉన్నాయి. వయసులో పైబడ్డవారు, టెక్నాలజీ మీద అవగాహన లేనివారే ఇలా ఆన్లైన్ స్కామర్ల చేతిలో మోసపోతుంటారు. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు రూపొందించిందే షీల్డ్ సీనియర్స్ వెబ్సైట్. దీనిని రూపొందించింది అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన 17 ఏళ్ల యువతి.ఆమె పేరు తేజస్వీ మనోజ్, భారతీయ సంతతికి చెందిన ఈమె రెండేళ్ల కిందట ఆన్లైన్ మోసగాళ్ల వల్ల తన తాతయ్య మోసం పోవడం గమనించింది. చిన్నప్పటి నుంచి కోడింగ్ మీద ఇష్టం ఉండడంతో ఆన్లైన్ స్కామర్లను అడ్డుకునేందుకు ఒక భద్రతావలయాన్ని రూపొందించాలని నిర్ణయించుకుంది. అప్పుడు వచ్చిందే ఈ షీల్డ్ సీనియర్ వెబ్సైట్. దీని ద్వారా కాల్స్, మెసేజెస్, సైట్ డొమైన్... ఇలా ప్రతి దాన్ని జల్లెడ పట్టి అసలు ఏదో నకిలీ ఏదో తెలుసుకోవచ్చు. తేజస్వీ ప్రతిభని గుర్తించిన టైమ్స్ మేగజైన్ 2025లో ‘కిడ్ ఆఫ్ ద ఇయర్’గా ప్రకటించింది. -
ఒక్క ఐడియా = 650 మంది కోటీశ్వరులు
బాగా చదువుకుని ఉద్యోగం చేసో, లేక వ్యాపారం చేసో డబ్బు సంపాదించాలని అనుకోవడం సహజం. కాని తాను వ్యాపారం చేస్తూనే తనతో పాటు క్లైంట్లను కూడా కోటీశ్వరులను చేసిన యువకుడి కథ ఇది. అమెరికాకి చెందిన 22 ఏళ్ల స్టీవెన్ ష్క్వార్జ్ మాత్రం చిన్న వయసులోనే వ్యాపారం గురించి ఆలోచించాడు. చిన్నప్పుడు నీటి సీసాలు అమ్ముతూ మొదలైన వ్యాపారం అతనిలో కొత్త ఆలోచనని పుట్టించింది. అదే వూప్(whop). ఇది ఒక ఆన్లైన్ డిజిటల్ మార్కెట్ ప్లేస్.ఈ ప్లాట్‌ఫాం ద్వారా కంటెంట్ క్రియేటర్లు, డిజిటల్ వ్యాపారవేత్తలు తమ ఉత్పత్తులు, సేవలను విక్రయించుకోవచ్చు. అచిర కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడం వల్ల అనేక మంది తమ కోట్ల డాలర్ల లావాదేవీలను వూప్ ద్వారా నిర్వహించారు. ఈ పరిణామంతో వూప్ సంస్థ బిలియన్ డాలర్ కంపెనీగా అవతరించింది. ఈ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా లావాదేవీలు సాగించే 650 మంది మిలియన్ల కొద్దీ ఆర్జించినట్టు ప్రముఖ గ్లోబల్ బిజినెస్ మేగజైన్ ఫార్చూన్ పేర్కొంది. -
నింగిని వదిలి.. మట్టితో మమేకమై!
ఆమె చదివింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్. ఆ తర్వాత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల కోసం శాటిలైట్ పేలోడ్స్ తయారు చేసే ఏరోస్పేస్ సంస్థలో ఉద్యోగం. కెరీర్ పరంగా ఎంతో ఉన్నతమైన స్థానం. కానీ, ఆ ఏసీ ల్యాబ్‌లు, కంప్యూటర్ స్క్రీన్లు ఆమెకు ఏ మాత్రం తృప్తినివ్వలేదు. తన మూలాల్లోకి తిరిగి వెళ్లాలని అనుకుంది. ఉద్యోగాన్ని వదిలేసి, మట్టితో మమేకమై, పర్యావరణానికి మేలు చేసే ఒక అద్భుతమైన ‘జీరో–వేస్ట్ కేఫ్’ను ప్రారంభించింది 27 ఏళ్ల నిష్ఠా చౌహాన్....నిష్ఠా చౌహాన్ ఒక సాధారణ గుజరాతీ కుటుంబంలో పెరిగింది. ఆమె తాత చిరుధాన్యాలను పండించేవారు. అలా ఆమె తన చిన్నతనంలోనే రాగులు, జొన్నలు, సజ్జల వంటి సంప్రదాయ ఆహార ప్రాముఖ్యతను తెలుసుకుంది.అహ్మదాబాద్‌లోని ‘సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్’ ప్రాంగణంలో నిష్ఠా మొదటి కేఫ్‌ను ప్రారంభించింది. ఈ కేఫ్‌లో మిల్లెట్ వంటకాలు మాత్రమే ఉంటాయి. ప్లాస్టిక్, డిస్పోజబుల్ వస్తువులు ఇక్కడ పూర్తిగా నిషేధం. గాజు పాత్రల్లోనే ఆహారాన్ని అందిస్తారు. పార్సిల్స్ కోసం అరెకా లీవ్స్, చెరకు పిప్పితో చేసే పాత్రలను వాడుతున్నారు. ఇక్కడ పర్యావరణానికి హాని చేసే ఎయిర్ కండిషనర్లకు బదులుగా, కేఫ్‌ను చల్లబరచడానికి వాటర్–కూలింగ్ సిస్టమ్స్, మిస్టింగ్ ఫ్యాన్లను ఉపయోగిస్తున్నారు.పిల్లలకు ఎకో వర్క్‌షాప్స్!నిష్ఠా చౌహాన్ పలు ఇంటర్నేషనల్ స్కూల్స్‌తో కలిసి 5 నుంచి 11 ఏళ్ల పిల్లల కోసం ప్రత్యేకంగా ఎకో–వర్క్‌షాప్స్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పిల్లలు నేరుగా తోటలోకి వెళ్లి మట్టిని తాకడం, మొక్కలను గుర్తించడం, కూరగాయలను స్వయంగా కోయడం నేర్చుకుంటారు. ఆపై వంటింట్లోకి వెళ్లి సొంతంగా మిల్లెట్ సలాడ్లు, జ్యూస్‌లు తయారు చేస్తారు. సంప్రదాయక ఆహారానికి, జంక్ ఫుడ్‌కి గల తేడాని గమనిస్తారు. -
విచారం వద్దు... అవి ఘోస్ట్ జాబ్స్ అయినా కావచ్చు!
అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ చాలామందికి ఉద్యోగం దొరకడం కష్టం కావచ్చు. దీనికి కారణం వారికి సరైన మార్గదర్శకత్వం లేకపోవడమే. ఈ నేపథ్యంలో దేవ్‌శ్రీ అనే టెకీ ‘జాబ్ సెర్చ్ టిప్స్’పై ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.‘జాబ్ సెర్చ్ టిప్స్ తెలుసుకోవడానికి నాకు చాలాకాలం పట్టింది. మీరు మాత్రం త్వరగా నేర్చుకుంటారు’ అంటున్న దేవ్‌శ్రీ శాలరీ... రెండు కోట్లు! మన దేశంలో ఒక కంపెనీలో సాధారణ జీతం నుండి అమెరికాలో అధిక ఆదాయం గల ఉద్యోగాన్ని ఎలా సంపాదించిందో వివరిస్తూ దేవ్‌శ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. పుణెలో డిగ్రీ చేసిన దేవ్‌శ్రీ ఒక చిన్న కంపెనీలో చేరి తన కెరీర్ ప్రారంభించింది. అయితే అక్కడే ఉండిపోవాలనుకోలేదు.ఒక్కో మెట్టు ఎక్కుతూ పెద్ద కంపెనీలో ఉద్యోగం సాధించింది. ప్రస్తుతం ఆర్థికంగా ఉన్నతస్థితిలో ఉంది. ‘నేను ఈ స్థితిలో ఉంటానని కలలో కూడా ఊహించలేదు’ అంటున్న దేవ్‌శ్రీ నిరుద్యోగులకు, తాము చేస్తున్న ఉద్యోగం నుంచి మరో మెట్టు ఎక్కాలనుకునేవారికి సోషల్ మీడియా వేదికగా సలహాలు ఇచ్చింది.వృత్తిపరమైన తన ఎదుగుదలను స్టెప్ బై స్టెప్ వివరించడమే కాదు...ఎవరైనా సరే తమ కెరీర్‌ను వేగవంతం చేసుకోవడానికి అనుసరించదగిన వ్యూహాల గురించి కూడా ప్రస్తావించింది.‘ఆ వ్యూహాలను అర్థం చేసుకోవడానికి నాకు మూడు సంవత్సరాలు పట్టింది. కాని మీరు వాటిని మూడు నెలల్లోనే అమలు చేయవచ్చు’ అంటుంది దేవ్‌శ్రీ. కేవలం ఉద్యోగ దరఖాస్తుపై మాత్రమే ఆధారపడకుండా రిక్రూటర్ల దృష్టిలో పడడం గురించి ఆమె ప్రస్తావించింది. ‘లింక్డ్ ఇన్ ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోమని మీకు చాలామంది చెబుతుంటారు.అయితే మీలోని ప్రతిభను గ్రహించి రిక్రూటర్లే మిమ్మల్ని సంప్రదిస్తే అది మీకు అదనపు ప్రయోజనం. మీరు దరఖాస్తు చేసుకునే ఉద్యోగాలలో దాదాపు 30 శాతం ఘోస్ట్ జాబ్స్. నిజానికి ఆ ఉద్యోగాలు ఖాళీగా ఉండవు. అయితే ఉద్యోగావకాశం రాకపోవడంతో తనను తిరస్కరించారని చాలామంది భావిస్తుంటారు’ అంటుంది దేవ్‌శ్రీ.రెజ్యూమ్ అనేది ఎలా ఉండాలి? ఇంటర్వ్యూ వ్యూహాలేమిటి?.... మొదలైన వాటి గురించి తన పోస్ట్‌లో ప్రస్తావించింది దేవ్‌శ్రీ. ‘ఏ కంపెనీకైతే ఇంటర్వ్యూకు వెళుతున్నామో, ఆ కంపెనీ గురించి అన్ని కోణాలలో తెలుసుకోవడం, ఆ కంపెనీ ఎదుర్కొనే సమస్యలపై అవగాహన ఉండడం అనేది మనకు ఉపకరిస్తుంది’ అని చెబుతోంది దేవ్‌శ్రీ.ఘోస్ట్ జాబ్స్ అంటే?ఘోస్ట్ జాబ్స్ లేదా ఫాంటమ్ జాబ్స్ అంటే... తక్షణమే భర్తీ చేయాలనే ఉద్దేశం లేకుండా కంపెనీలు ఆన్లైన్లో ఇచ్చే ఉద్యోగ ప్రకటనలు. ప్రతిభావంతులైన ఉద్యోగులను తీసుకుంటున్నట్లు భ్రమ కలిగించడం. పోటీ కంపెనీల జీతాల గురించి అధ్యయనం చేయడం... మొదలైన వ్యూహాత్మక కారణాల వల్ల ఘోస్ట్ జాబ్స్ లేదా ఉత్తుత్తి జాబ్స్‌ను కంపెనీలు సృష్టిస్తుంటాయి. -
బుర్జ్ ఖలీఫాలో ఆఫీస్ పెట్టిన 14 ఏళ్ల భారతీయుడు!
బహుశా పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో... నువ్వు 14 ఏళ్ల వయసులో ఏం చేసేవాడివి? అని మీ ఫ్రెండ్స్‌లో ఎవరినైనా అడిగి చూడండి... మహా అయితే ఎనిమిదో తరగతి చదువుతూ హోంవర్క్ చేస్తూ ఉండేవాడినని చెబుతారు కాని అదే వయసులో ఉన్న ఓ కుర్రోడు ఓ ఏఐ కంపెనీ స్థాపించాడు.అంతేకాదు ప్రపంచంలోనే అతి ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాలో ఏకంగా ఆఫీస్ పెట్టేశాడు. పుణేకు చెందిన జైనమ్ జైన్ ఐదేళ్ల వయసున్నప్పుడే అతని తల్లిదండ్రులు దుబాయ్‌కి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. చిన్నప్పటి నుంచి మంచి తెలివితేటలతో అందరినీ ఆశ్చర్యపరిచే జైన్ కేంబ్రిడ్జ్ కరికులమ్ ద్వారా 13 ఏళ్ల వయసులోనే పదో తరగతి పూర్తి చేశాడు. ఆ తర్వాత బిజినెస్ చేయాలన్న ఆలోచనతో ఏఐ సాంకేతికతపై దృష్టి పెట్టాడు.సరిగ్గా ఏడాది గడిచాక ‘మెంగో ఇంజిన్’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌ను స్థాపించాడు. కంపెనీల కంటెంట్ క్రియేషన్, మార్కెటింగ్, కస్టమర్ కమ్యూనికేషన్ వంటి పనులు ఆటోమేట్ చేయడానికి ఈ ప్లాట్‌ఫాం సహాయపడుతుంది. విశేషమేమిటంటే జైన్ సొంత ఆసక్తితోనే నేర్చుకుని చిన్న వయసులో కంపెనీని స్థాపించి ప్రపంచానికి తన సత్తా ఏంటో చూపించాడు. -
ఈ చెట్టుతో పాములు పారిపోతాయి..
కలిమి పండు చాలా మందికి తెలిసిన పండే. కానీ కొండ ప్రాంతాలు, బంజరు భూములు, పొలంగట్లు మొదలగు ప్రాంతాల్లో వచ్చే కలిమి మాత్రం అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు.వీటికాయలు వగరు రుచి కలిగి ఉంటాయి. ఇవి నేరుగా తినటానికి అంత అనుకూలంగా లేకున్నా ఇతర ఉపయోగాలెన్నో ఉన్నాయి. పండుగా మారినప్పుడు తియ్యగా ఉండి (నలుపు రంగుకు మారుతుంది) తినటానికి యోగ్యంగా ఉంటుంది. ఈ కాయలు కోసినప్పుడు తొడిమ దగ్గర పాలు కారతాయి. కాబట్టి పండ్లను కడిగి తినటం మంచిది. పండ్లు గుత్తులుగా, ఒకటి, రెండుగా కూడా ఉంటాయి. పండ్లు బఠాణీ గింజ సైజు ఉంటాయి. మేలు రకమైన కలిమి పండ్లను ‘వాక్కాయ’లు అంటారు. ఇవి గచ్చకాయంత ఉంటాయి.‘కలిమి కాస్తే కాలం అవుతుంది’ అంటారు. అంటే.. సుభిక్షంగా పంటలు పండుతాయని రైతులు, పల్లెవాసుల ప్రగాఢ నమ్మకం. కరువును తట్టుకొని నిలబడే సత్తా ఈ చెట్టుకుంది.శాస్త్రీయ నామం: క్యారస్స క్యరండస్కుటుంబం: ఆపోసైనేసికలిమి పండు పేర్లు: ఉరూ: కశౌండ ఒరియా: సుశేన కన్నడ: కవలి, హువు, కవలి కాయ్. గరిచే, గర్ని, గర్తి, కరండ, అస్సామీ: కరెంజా, కర్ణటెంగ ఇంగీష్: కరండస్ బెర్రి, క్రేన్ బెరీ, కరౌండ కరమకిరె తమిళం: కాలక్కాయి, కలక్కాయి తెలుగు: కలిమి, కలిమిక్కాయ, వాక్కాయ(పెద్ద పండ్లు) మరాఠీ: కర్వండ, కర్విండ, కాలిమైన, బోరోండ మలయాళం: కరక్కా పంజాబీ: గర్న బెంగాలీ: కరోంమ్చా హిందీ: కరోండ, కరౌండ, కరండ సంస్కృతం: కరమర్డ్, కరమర్ది, కరోండ అని పిలుస్తారు. ఇంగ్లాండ్‌లో కరండస్ ప్లం, ఇండోనేసియాలో కరండన్, కరెండంగ్ అని, చైనీస్‌లో కు హౌంగీ అని, పాకిస్తాన్లో గర్నే, కరండ, కక్రుండ అని, వియత్నాంలో క్యాసిరో, క్జోరో అని, మలేసియాలో బెరెండ, కరెండ, కరెండింగ్ అని పిలుస్తారు.పూత: ఏప్రిల్ – మే. పండ్లు కోత: నవంబర్– డిసెంబర్.ఉనికి:ఇది సతతహరిత ఆకులురాల్చే గుల్మం (పొదలాంటిది). నేల స్వభావాన్ని బట్టి 2–5 మీటర్ల ఎత్తు పెరగగలదు. గుబురైన మండలు (కొమ్మల), కురుచైన ముళ్లు ఉంటాయి. అందువల్ల దీన్ని క్రిష్ థార్న్ అని అంటారు.గుత్తులుగా తెలటి పూలు, అందంగా ఉంటాయి. కాయలు కూడా గుత్తుగా కాస్తాయి. పెద్ద వాక్కాయ పండు నల్లగా ఉంటుంది. కానీ రుచిగా ఉండదు. అదే కలిమి (చిన్నది) పండు నల్లగానే వుంటాయి. కానీ రుచిగా ఉంటాయి.ఈ చెట్లు మన దేశంలో తూర్పు, పడమటి కనుమల అడవుల్లో, నేపాల్, శ్రీలంక, సౌత్ ఈస్ట్ ఆసియాలోని దేశాల్లో ఉన్నాయి. వాక్కాయ చెట్లను మాత్రం రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో పండిస్తున్నారు.వాక్కాయి చెట్టు ఆకులు పశుగ్రాసంగా పనికొస్తాయి..కలిమి చాలా ఉపయోగకరమైన చెట్టు. పెద్ద ఎత్తుగా పెరగకపోయినా ఎక్కువ పంగలు/కొమ్మలతో గుబురుగా ఉంటుంది. ముళ్లతో కూడుకున్న ఈ చెట్లను పొలం చుట్టూ కంచెగా బాగా పని చేస్తాయి.దీని వేర్లను దంచగా వచ్చిన లేపనాన్ని పశువుల పుళ్లపై రుద్దితే పురుగులు చనిపోయి పుళ్లు త్వరగా మానిపోతాయి.దీని వేర్లతో చేసిన పౌడరు/పొడిని నీళ్లలో కలిపి చల్లితే ఆ ప్రదేశాల నుంచి పాములు పారిపోతాయి.వీటి ఆకులను పూల దండల్లో అందం కోసం పెడతారు. త్వరగా వాడిపోవు.కాయలను పచ్చడి తయారు చేయటానికి, అట్లే పూలిహోరలో కూడా వాడుతారు. దీని పచ్చడికి మంచి గిరాకీ ఉంది.ఈ పండ్లతో జామ్, జల్లీ, పానీయాలు తయారు చేస్తారు.ఆకులు గొర్రెలు, మేకలకు గ్రాసంగా ఉపయోగపడతాయి.ట్యానింగ్ పరిశ్రమల్లో ఎండిన ఆకులను వాడుతారు.పండ్లు రుచికరంగా ఉండటం వల్ల పిల్లలు బాగా ఇష్ట పడతారు.ఈ చెట్టు బెట్టెను తట్టుకోగలదు, అన్ని నేలల్లో వస్తుంది.దీని పండ్లను ఆయుర్వేదంలో విరివిగా వాడతారు. ముఖ్యంగా అసిడిటీ, అజీర్తి, పుండ్లు, చర్మవ్యాధులు, మూత్ర సంబంధిత, డయాబెటిక్ అల్సర్, కడుపు నొప్పి, అజీర్తి, రక్తహీనత, ఆకలి లేకపోవటం, పైత్యం, మనోవికల్పం మొదలగునవి నయం చేయటానికి వాడతారు.ఆకుల కషాయాన్ని, జ్వరాన్ని, విరేచనాలను, చెవి పోటును తగ్గించడానికి ఉపయోగిస్తారు.పోషక విలువలు మెండుకలిమి పోషక విలువలను గమనిస్తే చాలా విస్తృతంగా ఉంటాయి. విటమిన్–సి, విటమిన్ బిలు, ఇనుము ఉండటం వల్ల రక్తహీనత త్వరగా నయమవుతుంది. ఈ పండ్లలో మైరేడ్ యాంటిఆక్సిడెంట్స్, అవియే ఫ్లేవనాయిడ్స్, అల్కలాయిడ్స్, టానిన్స్, క్యారిస్సోన్, ట్రైటర్ ఫెనాయిడ్స్.. ఇవి ఉండటం వల్ల యాంటిపైరెడిక్, కార్డియోటానిక్, అనాల్జిన్ కారకాలుగా ఉపయోగపడతాయి.ఇందులోని పీచు పదార్థం ఉదర సంబంధిత రోగాల అదుపునకు ఉపయోగపడుతుంది. విటమిన్–సి జ్వరాలను అడ్డుకోడానికి, అదుపునకు ఉపయోగపడుతుంది. ఈ పండ్లలోని మెగ్నీషియం ఇతర విటమిన్లు, ట్రిప్టెఫాన్ వల్ల న్యూరోట్రాన్స్‌మిట్టర్ సెరటోనిన్ ఉత్పత్తి పెరిగి మానసిక వొత్తిడిని అదుపు చేసి ఆరోగ్యంగా ఉంచగలదు.కలిమి పండులో పెక్టిన్ అధికంగా ఉండడంవల్ల జాం, జెల్లీల తయారీలో ఉపయోగిస్తారు.కాయల రసం మధుమేహ రోగ నివారిణిగా ఉపయోగపడుతుంది. ∙ప్రతిరోజు వాక్కాయల రసం తీసుకోవటం వలన ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కొంతవరకు నివారించుకోవచ్చు. ∙దంతాలు పుచ్చిపోకుండా, నోటి నుంచి దుర్వాసన రాకుండా కలిమి పండు కాపాడగలదు. ప్రాంతాలను బట్టి పండ్ల పోషక విలువలలో వ్యత్యాసం ఉంటుంది. నల్లమలలో ఉండే పండ్ల విలువలపై విశ్లేషణ తరుచూ చేయడం అవసరం. ఈ కలిమి లేక వాక్కాయపై వైద్యపరంగా ఎంత పరిశోధన జరిగినప్పటికీ, వీటిలో అనువైన, అధిక దిగుబడులనిచ్చ వంగడాల తయారీలో క్షేత్రస్థాయి పరిశోధనలు తక్కువని చెప్పవచ్చు.పొలం చుట్టూ కంచెకలిమి తెలుగు రాష్ట్రాలలో విరివిగా పెరిగే గుల్మం లేక చిరు చెట్టు అనవచ్చు. నల్లమల అడవుల్లో కలిమి ఎక్కువగానే ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితుల వల్ల వీటి ఉనికికే ముప్పు పొంచి ఉంది. కాబట్టి పూత దశ నుంచి మొదలుకొని, పండు దశ వరకు పరిశీలించటం ముఖ్యం. అందులోని వేరియంట్స్‌ను గమనించి క్షేత్రస్థాయికి తీసుకురాగలిగితే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.ప్రస్తుతానికి రైతులు ఈ చెట్టును పొలం చుట్టూ కంచెగా వాడుతున్నారు. కాయలను (అడవి కలిమికాదు, వాక్కాయను) మార్కెట్ చేసుకోవచ్చు. అక్కడక్కడా వాక్కాయ తోటలు పెంచుతున్నట్లు దాఖలాలు ఉన్నాయి. కాబట్టి, అడవి కలిమిపై సరైన పరిశోధనలు చేపట్టి తినటానికి అనువుగా మార్చటం, నిల్వ సామర్థ్యాన్ని పెంచే దిశగా కృషి చెయ్యాలి. కలిమి పండ్లను అతిగా తింటే వాంతులు, విరేచనాలు రావచ్చు. కాబట్టి, ఎందుకైనా మంచిది మితంగా తినాలి.- డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఈ కుండీలో నాచు ఎందుకుందో తెలుసా?
మిద్దె తోటలు, ఇంటి పంటలు, పెరటి తోటల్లో మొక్కలు ఆరోగ్యంగా పెరగటానికి నీటి యాజమాన్యం చాలా ముఖ్యం. ముఖ్యంగా కుండీల్లో పెంచే మొక్కలకు నీటిని అందించేటప్పుడు అదనంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుండీల్లో మొక్కలకు నీరిచ్చే ఉత్తమ పద్ధతేమిటో తెలుసుకుందాం.మొక్కలకు నీటిని ఎప్పుడూ ఉదయం ఎండ రాకముందే లేదా సాయంత్రం వేళల్లో అందించాలి. దీనివల్ల నీరు ఆవిరి కాకుండా వేర్లకు చేరుతుంది.మొక్కలకు అవసరానికి మించి నీరు పెడితే బ్యాక్టీరియా అభివృద్ధి చెంది ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది, దీనివల్ల వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది.వేసవిలో కుండీల్లో లేదా నేల పైభాగంలో ఎండుటాకులు, గడ్డి లేదా పాత గోనె సంచులను కప్పటం ద్వారా మట్టిలోని తేమను ఎక్కువ కాలం నిలుపుకోవచ్చు.కుండీల్లో అడుగున రంధ్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. నీరు నిలిచిపోతే మొక్కలు వ్యాధుల బారిన పడతాయి.ఆకుకూరలు, పూల మొక్కలపై నీటిని తుంపర్లలా చల్లడం వల్ల ఆకులపై ఉన్న దుమ్ము పోవడమే కాకుండా మొక్కలు తాజాగా ఉంటాయి.మట్టిలో నీరు ఎక్కువగా ఉంటే వేర్లకు ఆక్సిజన్ అందదు. దీనివల్ల వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోతుంది.ఆకులు రంగు మారి, వాలిపోయినట్లు కనిపిస్తాయి. ఇది మొక్కకు నీరు ఎక్కువైందని చెప్పే ప్రాథమిక సంకేతం.ఎక్కువ నీరు పోయటం వల్ల మట్టిలోని ముఖ్యమైన పోషకాలు కొట్టుకుపోతాయి, ఫలితంగా మొక్క ఎదుగుదల ఆగిపోతుంది.తడిగా ఉన్న నేల బ్యాక్టీరియా, ఫంగస్ పెరగటానికి అనువుగా ఉంటుంది. దీనివల్ల మొక్కల మొదళ్లు, ఆకులపై తెగుళ్లు వస్తాయి.నిరంతరం నీటితో నిండి ఉండటం వల్ల మట్టిలోని రంధ్రాలు మూసుకుపోయి మట్టి గట్టిగా మారుతుంది, ఇది వేర్ల విస్తరణను అడ్డుకుంటుంది.కుండీలోని మట్టి నుంచి దుర్వాసన రావటం, మట్టి పైన పాచి పట్టటం, కొత్తగా వచ్చే ఆకులు లేదా చిగుర్లు నల్లగా మారి రాలిపోతుంటే.. ఈ మూడు సమస్యలకు కారణం ఒక్కటే కావచ్చు. అదేమిటంటే.. మొక్కల కుండీల్లో నీరు బయటకు సరిగ్గా వెళ్లటం లేదని. నీరు వెళ్లడానికి తగినంత రంధ్రం ఉందో లేదో ఒకసారి తనిఖీ చేయండి.మట్టిలో నీరు ఎక్కువగా నిలిచి ఉంటే వేర్లు ఊపిరి తీసుకోలేవు. ఈ ఒత్తిడి వల్ల మొక్క తనపై ఉన్న భారాన్ని తగ్గించుకోవటానికి పువ్వులు, మొగ్గలు, కాయలను రాల్చేస్తుంది.అధిక నీరు పోయడం వల్ల మట్టిలోని పోషకాలు కొట్టుకుపోతాయి. పూత నిలబడటానికి అవసరమైన కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు అందక పిందెలు రాలిపోతాయి.మట్టిలో నీరు ఎక్కువ ఉంటే శిలీంధ్రాలు చేరి వేర్లు కుళ్ళిపోతాయి. దీనివల్ల మొక్క బలహీనపడి పిందెలను పోషించలేక వాటిని రాల్చేస్తుంది.నీరు ఎక్కువవటం వల్ల మొక్కలో ఎథిలిన్ వంటి హార్మోన్లు పెరిగి, పూలు, కాయలు కాండం నుంచి∙విడిపోయేలా చేస్తాయి.మట్టి పై పొర 1–2 అంగుళాల వరకు ఆరితేనే నీరు పోయాలి, వేలితో తాకి చూస్తే ఇది తెలుస్తుంది.మొక్క పూత మీద ఉన్నప్పుడు నీటిని తగ్గించి, నేల తేమగా ఉండేలా మాత్రమే చూసుకోవాలి.మొక్క కాయను పెంచడానికి చాలా శక్తి కావాలి. నీరు ఎక్కువగా ఉండి వేర్లు సరిగ్గా పని చేయకపోతే, మట్టిలోని పోషకాలు కాయలకు చేరవు, ఫలితంగా కాయలు రాలిపోతాయి.కొన్నిసార్లు మట్టి బాగా ఎండిపోయినప్పుడు ఒక్కసారిగా ఎక్కువ నీరు పోస్తే, ఆ తేమలో వచ్చే మార్పును భరించలేక మొక్క కాయలను రాల్చుతుంది.కాయలు ఎదుగుతున్న దశలో నీరు సమానంగా అందాలి. ఒకరోజు తక్కువ, ఒకరోజు ఎక్కువ ఇవ్వకూడదు.మట్టిలో నీరు ఎక్కువగా ఉంటే వేర్లకు ఆక్సిజన్ అందదు. దీనివల్ల వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోతుంది. నీరు కుండీలో నిల్వ వుంటే మట్టిలోని పోషకాలు కాయలకు చేరవు, ఫలితంగా కాయలు రాలిపోతాయి.- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్: 94906 02366నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
పావు ఎకరంలో.. ప్రకృతి విప్లవం!
భగవతీ లాల్, రేఖ రసాయనాలు వాడకుండా ఏటా 30 రకాల పంటలు, పండ్లు, కూరగాయలు పండిస్తున్నారు. పశువుల పేడ, మూత్రంతో సేంద్రీయ ఎరువులు తయారుచేస్తూ, తక్కువ ఖర్చుతో పర్యావరణ పరిరక్షణ, మంచి ఆరోగ్యం, స్థిరమైన ఆదాయాన్ని పొందుతున్నారు.నీటి కొరతను జయించిన తీరుఎడారి సరిహద్దు ప్రాంతాల్లో నీటి కొరత, మారుతున్న వాతావరణ పరిస్థితులు వ్యవసాయానికి ప్రధాన అడ్డంకులు. ఈ సవాళ్లను అధిగమించడానికి భగవతీ లాల్ దంపతులు బహుళ అంతస్థుల్లో అనేక రకాల పంటలను కలిపి సాగు చేసే పద్ధతిని ఆశ్రయించారు.నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంచడానికి జనుము వంటి పచ్చిరొట్ట పైర్లను పెంచి, తిరిగి నేలలోనే కలియదున్నారు. దీనివల్ల మట్టిలో నీటిని పట్టి ఉంచే సామర్థ్యం గణనీయంగా పెరిగింది.వివిధ ఎత్తుల్లో పెరిగే బొ΄్పాయి, అంజీర వంటి పండ్ల చెట్లతో పాటు వాటి నీడలో వివిధ రకాల కూరగాయలను సాగుచేస్తున్నారు. దీనివల్ల నేరుగా ఎండ తగలకుండా భూమిలోని తేమ ఆవిరి కాకుండా కాపాడుతున్నారు.నీటి ఎద్దడి ఉన్న సమయాల్లో కూడా ఈ సమగ్ర సాగు విధానం వల్ల పంటలు ఎండిపోకుండా నిలదొక్కుకుంటున్నాయి.ఏడాదిలో 30 పంటలుఈ దంపతులు తమ చిన్న పొలంలోనే ఏడాది పొడవునా దాదాపు 30 రకాల ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలను పండిస్తున్నారు. మూడు ఆవులు, ఒక గేదెలను పెంచుకుంటూ పాలపై అదనపు ఆదాయం పొందుతున్నారు.ఎటువంటి పురుగుమందులు, రసాయనిక ఎరువులు వాడరు. ఆవు పేడ, మూత్రంతో జీవామృతం, కీటక నాశక కషాయాలను సొంతంగా తయారు చేసుకుంటారు. తమ పొలానికి కావలసిన దానికంటే ఎక్కువ సేంద్రియ ఎరువులను తయారుచేస్తున్నారు. తమ పొలంలో వాడగా మిగిలిన సేంద్రియ ఎరువులను పొరుగు రైతులకు అమ్ముతున్నారు.ఖర్చు తక్కువ రాబడి ఎక్కువఈ నమూనాలో అత్యంత ముఖ్యమైన అంశం పెట్టుబడి ఖర్చులను తగ్గించుకుంటూ నికర లాభం పెంచుకోవటమే.విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలు ఖర్చు సున్నాకు చేరింది. ఇంధన వినియోగం తగ్గడం వల్ల ఉత్పత్తి వ్యయం పడిపోయింది. ∙ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన కూరగాయలు, పండ్లు తినడం వల్ల కుటుంబ ఆరోగ్యం మెరుగైంది. ‘మాకు డాక్టర్లు, మందుల ఖర్చు పూర్తిగా లేకుండా పోయింది’ అని రేఖ ఆనందంగా చెబుతారు.రసాయనాలు లేని నాణ్యమైన పండ్లు, కూరగాయల కోసం కొనుగోలుదారులే నేరుగా వీరి పొలం వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో రవాణా ఖర్చులు, దళారుల కమీషన్ల భారం తప్పి అధిక నికరాదాయం లభిస్తోందని రేఖ వివరించారు.‘సేవా మందిర్’ అనే స్వచ్ఛంద సంస్థ అందించిన సాంకేతిక సహకారం, మెరుగైన విత్తనాలతో పునాది వేసుకున్న భగవతీ లాల్–రేఖ దంపుతుల ప్రకృతి వ్యవసాయ మోడల్, పరిమిత వనరులు ఉన్న ప్రతి చిన్నకారు రైతుకూ లాభదాయకమైన దిక్సూచిగా నిలుస్తోంది.భూమి విస్తీర్ణం చిన్నదైనా, ఆలోచన పెద్దదైతే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు రాజస్థాన్ లోని రాజ్‌సమంద్ జిల్లా సేమా గ్రామానికి చెందిన భగవతీ లాల్, రేఖ అనే రైతు దంపతులు. పావు ఎకరం (అర బిఘా) భూమి ఉంటే ‘దీనితో ఏం చెయ్యలం?’ అని చాలామంది రైతులు నిరాశపడతారు. కానీ ఈ దంపతులు అదే పావు ఎకరం పొలాన్ని పచ్చని ప్రకృతి నందనవనంగా, లాభసాటి వ్యవసాయ వ్యాపార నమూనాగా మార్చి గ్రామీణ ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచారు.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
మంచి పని చేస్తే... పాగల్ సాబ్ అంటున్నారు!
‘పరిసరాల పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత’ అనే విషయం చాలామంది మరిచిపోతుంటారు. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో నివసిస్తున్న ఐరీష్ తాత అలా కాదు. ఎక్కడ అపరిశుభ్రంగా ఉన్నా అక్కడ ప్రత్యక్షమవుతాడు. జోద్‌పూర్‌లోని పురాతన చెక్కడాలు, వాస్తుశిల్పాన్ని మెచ్చుకునే సందర్శకులు ఆ చుట్టుప్రక్కల ఉన్న చెత్తకుప్పలను మాత్రం పట్టించుకునేవారు కాదు. ఇది చూసి ఐరీష్ పెద్దాయనకు బాధగా అనిపించింది. ఆ చెత్తను తానే శుభ్రం చేశాడు.ఎనభై ఏళ్ల కారోన్ ర్యాన్స్లీ నగరంలోని శతాబ్దాల నాటి మెట్ల బావులను శుభ్రం చేస్తూ పునరుద్ధరిస్తున్నాడు. జోద్‌పూర్‌కు కారోన్ ఒక సందర్శకుడిగా వచ్చాడు. ఆ తరువాత ఆ నగర జీవులలో ఒకడయ్యాడు. నగరంలోని చారిత్రాత్మక బావులు (మెట్ల బావులు), ఝులారాలను (మెట్ల జలాశయాలు) పునరుద్ధరించడంలో ఆయనకు ఉన్న నిబద్ధత కారణంగా ఆయన ఎంతోమందికి ఇష్టుడయ్యాడుఇష్టం మాట ఎలా ఉన్నా ఐరిష్ తాతను అందరూ పాగల్ సాబ్’ (పిచ్చి వ్యక్తి) అని పిలుస్తారు!‘సామాజిక స్పృహ ఉండడం అనేది పిచ్చితనం అవుతుందా!’‘గతంలోకి వెళితే... ఎంతోమంది మహానుభావులను ప్రజలు పిచ్చివాళ్లుగానే చూశారు’ ఇలాంటి కామెంట్స్ నెటిజనుల నుంచి వచ్చాయి. -
విజయావకాశాలూ... కాంప్లికేషన్లు!
సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు కృత్రిమ గర్భధారణ నిజంగా ఒక వరమే. అయితే ఇందులోనూ అంతా పూర్తిగా సానుకూలంగానే జరుగుతుందని చెప్పడానికి లేదు. వందమంది దంపతులు ఐవీఎఫ్ ప్రక్రియకు వెళ్తే అందులో కేవలం 40% నుంచి 50% మందికే విజయావకాశాలు ఉంటాయి. కారణాలు తెలియని సంతాన లేమి ఉన్న దంపతుల్లో చాలామందికి ఈ ప్రక్రియ ఉపయోగపడకపోవచ్చు. అయితే ఇప్పటికి ఉన్న పరిజ్ఞానంతో దాదాపు సగం మంది దంపతులకు ఇది ఉపయోగపడుతుండటం నిజంగా శుభపరిణామమే. ఇప్పటివరకు సానుకూతలను మాత్రమే చూస్తూ వచ్చినవారికి ఇందులోనూ కొన్ని ప్రతికూలతలు ఉంటాయని చెప్పేందుకే ఈ కథనం.ఐవీఎఫ్ అనుసరించిన అందరికీ గర్భం రావాలనీ లేదా గర్భం నిలవాలని లేదు. అనేక రకాల కారణాల వల్ల కొందరికి గర్భం నిలవకపోవచ్చు. కొందరిలో పిండం నాణ్యత సరిగా లేకపోయినా, గర్భాశయంలో లేదా ఎండోమెట్రియమ్ పొరలో ఏవైనా బయటకు తెలియని... లేదా బయటకు కనిపించని అత్యంత సూక్ష్మమైన సమస్యలేవైనా ఉంటే గర్భం రాకపోవచ్చు. అలాంటప్పుడు... రెండుమూడు సార్లు ఐవీఎఫ్ పద్ధతిలోనూ గర్భం రానప్పుడు అవసరాన్ని బట్టి దాత నుంచి స్వీకరించిన అండాలను లేదా శుక్రకణాలను లేదా పిండాన్ని తీసుకుని ప్రయత్నించవచ్చు. ఇలా దాత నుంచి అండాలనో లేదా శుక్రకణాలనో స్వీకరించాల్సి వస్తే ఆ విషయాన్ని తప్పనిసరిగా ఆ దంపతులకు వివరించి, వారి అంగీకారం ఉంటేనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే దంపతులు ఈ దశలోనూ నిరాశ చెందాల్సిన అవసరం ఉండదు. అప్పటికీ కుదరకపోతే సరోగసీ కోసం ప్రయత్నించవచ్చు. ఎంబ్రియో ఫ్రీజింగ్: ఐవీఎఫ్ ప్రక్రియలో ఫలదీకరించి రూపొందిన పిండాల సంఖ్యను బట్టి, ఒకసారి ఒకటి లేదా రెండు పిండాలను గర్భాశయంలోకి పంపి, మిగతా వాటిని ‘విట్రిఫికేషన్’ అనే పద్ధతి ద్వారా ఫ్రీజ్ చేసి భద్రపరుస్తారు. ఇలా భద్రపరచడాన్ని ‘క్రయోప్రిజర్వేషన్’ అంటారు. ఐవీఎఫ్ ప్రక్రియ మొదటిసారి సఫలం కానప్పుడు, అలా భద్రపరచిన పిండాలను తీసుకొని మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. లేదా ఇంకొకసారి గర్భం దాల్చాలనుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు. పరిశోధనలకు ఇవ్వవచ్చు. లేదా వాటిని నిర్జీవపరచమని కోరవచ్చు. వీటిలో ఏది జరగాలన్నా దంపతుల పూర్తి అనుమతితో మాత్రమే చేయాలి.ఫ్రోజెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ (ఎఫ్ఈటీ): ఐవీఎఫ్ నిర్వహించాక పిండాలు ఏర్పడిన 3వ రోజు నుంచి 5వ రోజు లోపు వాటిని గర్భాశయంలోకి పంపుతారు. ఏవైనా కారణాలతో ఆ నెలలో గర్భం నిలవకపోతే, ముందుగా ఫ్రీజ్ చేసి ఉంచుకున్న ఎంబ్రియోను మరుసటి నెలలో పంపుతారు. దీనికంటే ముందు గర్భాశయపొర (ఎండోమెట్రియమ్) బాగా ఏర్పడటానికి మందులు ఇచ్చి, ఈ ప్రక్రియనంతా స్కానింగ్‌లో పర్యవేక్షిస్తూ, గర్భాశయంలోకి ఎంబ్రియోను పంపుతుంటారు. కొంతమందిలో ఐవీఎఫ్ చేసిన నెలలో హార్మోన్స్ సరిగా లేకపోయినా, గర్భాశయపొర సరిగా ఏర్పడకపోయినా, పిండాలను ఫ్రీజ్ చేసి, మళ్లీ ఆ తర్వాతి నెలలో గర్భాశయం లోపలికి పంపుతారు. అంటే.... ఫ్రోజెన్ ఎంబ్రియోను ట్రాన్స్ఫర్ చేస్తారు.ఐవీఎఫ్ – కాంప్లికేషన్లు.. ముందుగా చెప్పుకున్నట్టుగా ఐవీఎఫ్ పూర్తిగా సానుకూలంగానే జరిగే ప్రక్రియ కాదు. కొన్ని కొన్ని దుష్ఫలితాలూ కనిపించవచ్చు. ఔషధం తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ లాగే వాటిని చూడాల్సి ఉంటుంది. వాస్తవంగా సంతానం పొందే అంశంతో పోలిస్తే ఇవి అంత పెద్దవి కావని గ్రహించాలి. ఆ కాంప్లికేషన్లు చూద్దాం. → ఐవీఎఫ్ ప్రక్రియ కోసం వాడే మందుల వల్ల కొందరిలో కొన్నిసార్లు వారి వారి శరీర తత్వాలను బట్టి తలనొప్పి, వికారం, చిరాకు వంటి లక్షణాలు కనిపించవచ్చు.→ అండాలను బయటకు తీసేటప్పుడు కొందరిలో బ్లీడింగ్ కనిపించవచ్చు. కొందరిలో పేగులకు, మూత్రాశయానికి, రక్తనాళాలకు ఇన్ఫెక్షన్స్ రావచ్చు. → ఐవీఎఫ్‌లో కొందరిలో ఒక్కోసారి కవలపిల్లలు, ముగ్గురు పిల్లలు (ట్రిప్లెట్స్) కూడా పుట్టే అవకాశాలుంటాయి. ఈ కారణంగా కొందరిలో నెలలు నిండకుండానే కాన్పులు అవడం, పుట్టిన పిల్లలు బరువు తక్కువగా ఉండటం వంటి పరిణామాలూ కనిపించవచ్చు. అయితే ఒకే ఒక పిండాన్ని ప్రవేశపెట్టడం (సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్) ద్వారా కవలలు, ట్రిప్లెట్స్ పుట్టడాన్ని చాలావరకు నివారించవచ్చు. ఒవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్: కొందరిలో ఒక్కొక్కసారి శరీరతత్వాన్ని బట్టి మరీ ఎక్కువ అండాలు తయారై, వాటి విడుదలకు వాడే హెచ్‌సీజీ అనే ఇంజెక్షన్ వల్ల అండాశయాల వాపు, కడుపులోకి నీరు చేరడం, కడుపులో నొప్పి, వాంతుల వంటి దుష్ఫరిణామాలు కనిపించవచ్చు. మరికొందరిలో కడుపుబ్బరం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల తీవ్రమైన ఆయాసం వంటి దుష్ప్రభావాలు కనిపించవచ్చు. అయితే ఇటీవల డాక్టర్లు పాటించే కొన్ని జాగ్రత్తలు, మరికొన్ని వ్యూహాత్మకమైన చర్యల ద్వారా ఈ దుష్ప్రభావాలను (కాంప్లికేషన్లను) పూర్తిగా నివారించవచ్చు. ప్రస్తుతమున్న సాంకేతికతతో ఈ కాంప్లికేషన్లను చాలావరకు తగ్గించడం సాధ్యమే. గర్భాశయంలో కాకుండా ట్యూబుల్లో పిండం పెరగడం (ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ) : కొందరిలో ఐవీఎఫ్ ప్రక్రియలో భాగంగా గర్భాశయంలోకి పంపించిన పిండం కొద్దిగా ముందుకు వెళ్లి, ట్యూబ్‌లో అంటుకొని, అక్కడే పిండం పెరుగుదల జరిగే అవకాశాలూ ఉంటాయి. గర్భస్రావాలు: ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చినవాళ్లలో మొదటి మూడు నెలలలప్పడు (మొదటి ట్రైమిస్టర్లో) గర్భస్రావం (అబార్షన్) జరిగేందుకు అవకాశాలెక్కువ. ఈ పరిణామం జరగడానికి సాధారణ గర్భం దాల్చినవాళ్లలోనూ అవకాశమున్నప్పటికీ... సాధారణంగా మహిళకు కొంచెం ఎక్కువ వయసు ఉన్నప్పుడు, పిండం నాణ్యత సరిగా లేనప్పుడు ఇలాంటి అబార్షన్లకు అవకాశాలు కాస్త ఎక్కువ. మానసిక ఒత్తిడి: ఐవీఎఫ్ ప్రక్రియ కాస్త డబ్బు ఖర్చు, మానసిక ఒత్తిడితో కూడుకున్న ప్రక్రియ. ఓపిక కూడా చాలా అవసరం. ఒకపక్క డబ్బు పెట్టుకుంటూనే, సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ ఓపిగ్గా తిరుగుతూ కాస్త ఎక్కువ సమయాన్నే ఇందుకోసం వెచ్చించాలి. ఇంత చేశాక కూడా గర్భం తప్పక నిలుస్తుందన్న గ్యారంటీ ఉండదు కాబట్టి ఈ కారణాలతో కాబోయే దంపతుల్లో... ముఖ్యంగా తల్లికావాలని కోరుకుంటున్న మహిళకు ఆందోళన, టెన్షన్, కొన్ని సమయాల్లో డిప్రెషన్ వంటివి కలిగే అవకాశాలుంటాయని గుర్తుంచుకోవాలి.గర్భాశయ దానంఅన్ని దానాలలోకెల్లా గొప్పదేది అని అడిగితే అన్నదానం, నేత్రదానం, రక్తదానం అని చెప్పడం మనం తరచూ వింటూ ఉంటాం. కాని పిల్లల్ని కనాలని కలలుగని, కనలేకపోతున్నామని వ్యధ చెందే మహిళలకి మాత్రం గర్భాశయ దానం అన్నింటికన్నా మిన్న. యునైటెడ్ కింగ్డమ్లో గ్రేస్ డేవిడ్సన్ అనే మహిళ అరుదైన వ్యాధి కారణంగా పుట్టుకతోనే గర్భాశయం లేకుండా పుట్టింది. అయితే గ్రేస్ తన ఆశని వదులుకోలేదు. తన జీవిత భాగస్వామి ఆంగస్‌తో కలిసి ఐవీఎఫ్ ద్వారా ఎంబ్రియోలను రూపొందించి భద్రపరుచుకుంది. పిల్లలంటే ఎంతో ఇష్టపడే గ్రేస్ పరిస్థితి చూసి ఆమె అక్క ఏమీ పర్డీ తన గర్భాశయాన్ని చెల్లెలికి దానం చేయాలని నిర్ణయించుకుంది. ఏమీ అప్పటికే ఇద్దరు పిల్లల తల్లి కావడంతో ప్రాసెస్‌కి ఎవరూ అడ్డు చెప్పలేదు. 2023లో ఆక్స్‌ఫర్డ్‌లో గంటల తరబడి సాగిన ఆపరేషన్‌లో డాక్టర్లు గ్రేస్‌కు గర్భాశయాన్ని విజయవంతంగా అమర్చారు. ఆ తర్వాత 2025 ఫిబ్రవరిలో క్వీన్ చార్లెట్స్ అండ్ చెల్సియా హాస్పిటల్లో గ్రేస్ ఆడబిడ్డ(ఏమీ ఇసబెల్) కు జన్మనిచ్చింది. ఈ జననం యూకే వైద్యచరిత్రలో ఓ మైలురాయిలా నిలిచిపోయింది.మరణించినా, మాతృత్వం బతికింది..ఏడాది తిరగక ముందే ఇంగ్లాండ్‌కు చెందిన గ్రేస్ బెల్ అనే మహిళకి గ ర్భాశయం లేదు. అయితే మరణించిన ఓ మహిళ నుంచి గర్భాశయం సేకరించి ‘వూంబ్ ట్రాన్స్‌ప్లాంట్ యూకె ఎక్స్పెరిమెంట్’ కార్యక్రమం లో భాగంగా డాక్టర్లు ఆపరేషన్ చేసి గ్రేస్‌కి గర్భాశయాన్ని మార్పిడి చేశారు. మర ణించిన దాత నుంచి గర్భాశయాన్ని తీసి మార్పిడి చేయడం బ్రిటన్‌లో ఇదే తొలిసారి. ఆపరేషన్ జరిగిన కొద్దిరోజుల తర్వాత వైద్యులు ఫ్రీజ్ చేసి ఉంచిన ఎంబ్రియోల్లో ఒక దాన్ని గ్రేస్ గర్భాశయంలో ప్రవేశపెట్టగా ఆమె గర్భం దాల్చింది. 2025 డిసెంబర్ 12న గ్రేస్ బెల్ ఓ మగబిడ్డ(హ్యుగో రిచర్డ్ నార్మన్ పావెల్)కు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. పిల్లల్ని కనే భాగ్యాన్ని విధి ఇవ్వకపోయినా, బిడ్డల్ని కనాలన్న సంకల్పం ఈ ఇద్దరు మహిళల్ని మాతృమూర్తులుగా మార్చింది.డాక్టర్ పల్లవి చలసానిసీనియర్ కన్సల్టెంట్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ -
ప్లకార్డ్‌లో పంచ్‌లైన్... నిరసనలో రీల్ వైబ్
లాఠీలతో కొడితే థ్యాంక్యూలు చెప్తున్నారు. చెదరగొట్టడానికి వాటర్ కానన్ వాడితే రెయిన్ డాన్స్ చేస్తున్నారు. వాళ్ల పాటే నినాదం. వాళ్ల వ్యంగ్యమే ప్రశ్న. సెల్‌ఫోన్ పట్టుకున్న సైన్యంలా ఉంటున్నారు. జెన్ జి నిరసనకు ఫార్మాట్ మారింది. సీరియస్ ఇష్యూ + సినిమా పంచ్ + సోషల్ మీడియా... అదే ‘జెన్ జి కోడెడ్ ప్రొటెస్ట్’.ఢిల్లీ జంతర్ మంతర్‌లో ‘నీట్’ ప్రశ్నాపత్రానికి సంబంధించి తాజా నిరసనలో టియర్ గ్యాస్ గుప్పుమంది. అది చూసిన ఒక కుర్రాడు వెంటనే ప్లకార్డ్ మీద ఇలా రాశాడు. ‘గురూ... నేను యమునకు ఆ వైపున ఉంటా. ఇంతకన్నా కంపు రోజూ తెలుసు. ఇదసలు లెక్కే కాదు’....అక్కడే ఉన్న మరో కుర్రాడు ఇంకో ప్లకార్డ్ పట్టుకున్నాడు. దాని మీద గాంధీగారి బొమ్మ ఉంది. కింద కామెంట్– ‘ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే సీజన్1 హీరోని రంగంలో దించాల్సి వచ్చింది’... అంటే అహింసామార్గ ప్రదాతనే రంగంలోకి దించాల్సి వచ్చిందని అర్థం.మరో ప్లకార్డ్ ఒకమ్మాయి పట్టుకుంది. దాని మీద కామెంట్– ‘నాకు ఎవరూ ఫండింగ్ చేయలేదు. పేపర్ లీకేజీకి కారణమైన వారిని ఉచితానికే అసహ్యించుకుంటున్నా’...తమ నిరసనకు స్పందించని పెద్దలకు చురక వేస్తూ మరో పోస్టర్. దానిపై మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్‌లోని సర్క్యూట్ పాత్ర. కింద కామెంట్– ఓయ్ సర్క్యూట్. రాంగ్ పర్సన్‌ని ఎత్తుకొచ్చావ్ స్వామీ.మామూలుగా నిరసనల్లో లాఠీచార్జీ జరిగితే పారిపోతారు. కాని నిరసనకు దిగిన జెన్ జి తరం వెనక్కి తగ్గలేదు. వాటర్ కానన్ కొట్టినా బదులుగా ‘రెయిన్ డాన్స్’ చేశారు. ‘Fitness plan: Running from police’ అని బోర్డు పట్టుకున్నారు.జెన్ జి కోడెడ్ ప్రొటెస్ట్ఒకప్పుడు నిరసన అంటే నల్ల జెండాలు, గొంతు చించుకునే నినాదాలు. కానీ 2026లో జెన్ జి ఆ డెఫినిషన్ను చెరిపేసింది. వాళ్లకు ఆగ్రహం ఉంది. కానీ ఆ ఆగ్రహాన్ని మీమ్‌గా, రీల్‌గా, పాటగా మారుస్తున్నారు. పేపర్ లీక్, నిరుద్యోగం, అవినీతి– సీరియస్ ఇష్యూలే. కానీ చెప్పే తీరు మాత్రం క్రియేటివ్. ఢిల్లీ కావచ్చు, బెంగళూరు కావచ్చు, జైపూర్ కావచ్చు... జెన్ జికి కోపం వస్తే స్టయిల్ ఇదే. స్పందించని వ్యవస్థను ఎద్దేవా చేస్తూ ‘నా ఎక్స్ (బాయ్‌ఫ్రెండ్/గర్ల్‌ఫ్రెండ్) కూడా నన్ను ఇంతగా బాధించ లేదు’ అని ప్లకార్డు పట్టుకొని నిలబడుతున్నారు. ఇలా డిజిటల్ కల్చర్‌ను, మీమ్స్ భాషను నిరసనకు వాడుకోవడాన్నే ‘జెన్ జి కోడెడ్ ప్రొటెస్ట్’ అంటున్నారు. బాలీవుడ్ పాటలు పాడటం, సంగీత కచ్చేరీలు, ప్రబోధ గీతాల ఆలాపన.. అన్నీ అలౌడ్.గెట్ రెడీ విత్ మీ (G-RWM)జెన్ జి యువతీ యువకులు ఒక దగ్గరకు కూడటానికి రకరకాల పద్ధతులు ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు ఢిల్లీ ‘చలో సంసద్’ నిరసన కోసం ప్రిపరేషన్ అంతా సోషల్ మీడియా రీల్స్ నుంచే ప్లాన్ అయింది. ‘గెట్ రెడీ విత్ మీ’ అంటూ రీల్స్ చేస్తూ యువతను సమీకరించారు. టియర్ గ్యాస్‌ను తట్టుకోవడానికి స్విమ్మింగ్ గాగుల్స్, ఢిల్లీ ఉక్కపోతను తట్టుకోవడానికి మినీ యూఎస్బీ ఫ్యాన్లు, విసనకర్రలు దగ్గర పెట్టుకుని బయలుదేరి వచ్చారు. ఎయిర్‌పోర్టుల నుంచి, రైలు కంపార్ట్మెంట్లలో నుంచి స్టోరీలు పెడుతూ ఏదో మ్యూజిక్ కాన్సెర్ట్‌కు వెళ్తున్నంత ఊపుతో దేశ రాజధానికి తరలివచ్చారు. ‘మా గుండెల్లో ఇంక్విలాబ్.. మా చేతుల్లో ఇన్ స్టాగ్రామ్!’ అనే వన్–లైనర్ ఈ తరం నిరసన తత్వం. ధర్మాగ్రహం కలిగి, శాంతియుతంగా మార్పు తేవాలని ప్రయత్నిస్తున్న ఈ తరాన్ని, వ్యంగ్యమనే బాణాలతో ప్రత్యర్థి మనసు మార్చాలని చూస్తున్న ఈ భావితరం స్వరాన్ని ‘నో’ అని నొక్కేస్తే రేపు వాళ్లు మాట్లాడటమే మానేస్తారు. ‘మేమున్నాం’ అని భుజం తడితే ఈ దేశానికి క్రియేటివ్, కరేజియస్ లీడర్స్ దొరుకుతారు. పంచ్‌లైన్ తో మొదలైన ఈ నిరసన రేపు పాలసీతో అంతం కావాలి. అప్పుడే ఈ ‘సెల్‌ఫోన్ సైన్యం’ నిజమైన దేశభక్తి సైన్యంగా మారుతుంది. వారి దారి వినూత్నంఢిల్లీలో పోలీసుల లాఠీచార్జి జరిగి, సాయంత్రం వాళ్లు డ్యూటీ దిగుతుంటే లాఠీ దెబ్బలు తిన్న యువతీ యువకులంతా ‘థ్యాంక్యూ సర్... చాలా బాగా డ్యూటీ చేశారు’ అని రోడ్డు పొడుగునా నిలబడి చప్పట్లు కొడుతూ అభినందించారు. ఇలా చేయడం తిట్టడం కంటే చాలా ఎక్కువ. ‘ఇంటికెళ్లి గర్వంగా ముఖం చూపించండి’ అని కూడా అన్నారు. తమను కొట్టిన వారికే మంచి నీళ్లు అందించడం, గులాబీపూలు ఇవ్వడం జెన్ జి ప్రొటెస్ట్ స్టయిల్. పోలీసులు కొడుతుంటే జాతీయ జెండాను చుట్టుకుని నిలబడటం, సారే జహాసే అచ్ఛా పాడటం.... జనగణమన ఆలపించడం.... కచ్చితంగా గాంధీ మార్గం.– కె -
వర్షాకాలంలో బియ్యం పాడవ్వకూడదంటే..!
వర్షాకాలంలో ఆహార పదార్థాలను నిల్వ చేయడం అత్యంత కష్టం. ఎందుకంటే పురుగులు పట్టడం లేదా తొందరగా పాడైపోవడమో జరుగుతుంది. ముఖ్యంగా బియ్యం వంటి పెద్ద మొత్తంలో ఉండే వాటిని నిల్వ చేయడం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి.బియ్యంలో గడ్డలు లేదా పురుగులు కనిపించినంత మాత్రాన ఆ బియ్యాన్ని పారవేయకూడదు. బియ్యాన్ని పూర్తిగా ఎండబెట్టి, జల్లించి లేదా శుభ్రం చేసిన తర్వాత సురక్షితంగా ఉపయోగించవచ్చు. సాధారణంగా బియ్యపు పురుగు బియ్యపు గింజలో నేరుగా ఒక చిన్న రంధ్రం చేస్తుంది. అది ఆ తర్వాత ఆ రంధ్రంలో ఒక గుడ్డు పెట్టి, ఒక ప్రత్యేక పదార్థంతో దాన్ని మూసివేస్తుంది.కొన్ని రోజుల తర్వాత, గుడ్డు నుంచి లార్వా బయటకు వస్తుంది. ఆ తర్వాత అది గింజ లోపల నివశిస్తూ..దాన్ని తింటూ పెరుగుతుంది. దాంతో అది బియ్యపు గింజలా బయటకు కనిపించినా..లోపల బోలుగా ఉంటుంది. చివరకు ఆ బియ్యం గింజ నుంచి బయటకు వచ్చే సమయాలనికి బియ్యం మొత్తం పొడిపొడిగా, పిండిగా కనిపిస్తాయి. ఇలా జరగకూడదంటే ఈ టిప్స్ ఫాలో అయితే సరి. మరి అవేంటో చూసేద్దామా.!.ఎలా చెక్‌పెట్టాలంటే..బియ్యంలో పురుగులు (వీవిల్స్) ఉన్నట్లు గమనిస్తే, ముందుగా దానిని ఒక పెద్ద పళ్ళెంలో పరచి, 15 నుంచి 20 నిమిషాల పాటు ఎండలో ఉంచండి. ప్రకాశవంతమైన వెలుతురు, వేడి వల్ల చాలా వరకు పురుగులు బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత పురుగులను జల్లెడ ద్వారా లేదా చెరగడం ద్వారం వేరు చేయాలి. ఆ తర్వాత స్పష్టంగా రంధ్రాలు లేదా గుంటలు ఉన్న బియ్యపు గింజలను ఏరివేయండి!. వండడానికి ముందు బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి. పురుగులు మళ్లీ రాకుండా ఉండటానికి, శుభ్రం చేసిన బియ్యాన్ని 48 గంటల పాటు ఫ్రీజర్లోబిర్యానీ ఆకులు (తేజపత్ర), వేప ఆకులు, ఎండు మిరపకాయలు, పసుపును వంటి వాటితో దీనికి చెక్ పెట్టొచ్చు.అలాగే బియ్యాన్ని ఎప్పుడూ..గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయండి. ఒకవేళ అప్పటికే పురుగులు పట్టి ఉంటే..బియ్యాన్ని గోరువెచ్చని నీటితో రెండు మూడు సార్లు శుభ్రం చేయండి. దీనివల్ల పురుగులు చనిపోతాయి.బిర్యానీ ఆకులు, వెల్లుల్లి రెబ్బలు లేదా ఎండిన వేప ఆకుల వంటి సహజ పదార్థాలు వాటి బలమైన వాసన, ఔషధ గుణాలతో సహజంగా కీటకాలను తరిమికొట్టడానికి (నిరోధకంగా) సహాయపడతాయి.వర్షాకాలంలో బియ్యం నిల్వ చేసే తొట్టెల్లో వీటిని 3 నుండి 5 శాతం వేస్తే సరిపోతుంది. ఇవి కీటకాలకు నచ్చని బలమైన సువాసనను వెదజల్లుతాయి, కాబట్టి మీ ధాన్యం ఎటువంటి రసాయన అవశేషాలు లేకుండా తాజాగా మరియు పురుగుల బారి నుండి రక్షించబడుతుంది.లవంగాల ఆకులు, లవంగాలు, వెల్లుల్లి రెబ్బలు లేదా ఎండిన వేప ఆకుల వంటి సహజ పదార్థాలు వాటి బలమైన వాసన మరియు ఔషధ గుణాలతో సహజంగా కీటకాలను తరిమికొట్టడానికి (నిరోధకంగా) సహాయపడతాయి.(చదవండి: తామర పువ్వులు తినడం వల్ల నిజంగానే జ్ఞాపకశక్తిని కోల్పోతామా? నిపుణులు ఏమంటున్నారు) -
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేకపోవడం వల్లే ఇదంతా..!: సుప్రీం కోర్టు
మేఘాలయా హనీమూన్ కేసు యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సాంకేతికత ముసుగులో ఎటుపోతున్నాం, మానవతా విలువలు ఏమవుతున్నాయనే ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఈ కేసు ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి బెయిల్ రద్దు చేస్తూ గట్టి షాకివ్వడమే కాదు కోర్టు ఎదుట లొంగిపోవాలని ఆదేశాలిచ్చింది. అంతేగాదు ధర్మాసనం ఈ కేసు విచారణ నేపథ్యంలో మారుతున్న కుటుంబ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. పైగా యావత్తు సమాజాన్ని ఆలోచింప చేసేలా చక్కటి సందేశాన్ని ఇచ్చింది జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, పి.బి. వరలేలతో కూడిన ధర్మాసనం. ఇంతకీ సుప్రీంకోర్టు కుటుంబ వ్యవస్థ గురించి ఏం చెప్పిందంటే..ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో, దంపతుల మధ్య సమస్యలు తలెత్తినప్పుడు పెద్దలు వాటిని పరిష్కరించేవారు. చిన్న కుటుంబాల విషయానికొస్తే, వాళ్లు ఒంటరిగా మిగిలిపోతున్నారు, అందువల్ల విడిపోవడం పెరుగుతోందని పేర్కొంది. పైగా వారిలో డిప్రెషన్ కూడా పెరుగుతోంది. సోషల్ మీడియా వల్ల ప్రతిది ఇట్టే తెలిసిపోతున్నా..యువత మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని ధర్మాసనం వెల్లడించింది. అది కాస్తా తరుచుగా వ్యక్తిగత సంబంధాలు, కుటుంబ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈమేరకు జస్టిస్ ఎం ఎం సుందరేష్ మాట్లాడుతూ..మారుతున్న కుటుంబ వ్యవస్థలో ఇలాంటి సంఘటనలు జరగడం సహజం. వైవాహిక వివాదాలు పెరగడంతో వ్యక్తిగత చట్టాలతో సంఘర్షణలు కూడా పెరుగుతాయని అన్నారు. ప్రస్తుత తరం మనకంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉండొచ్చు, కానీ ఒత్తిడిలో మనకంటే బలహీనంగా ఉన్నారని చెప్పారు. ఆ వ్యాఖ్యలకు భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ..యువతకు "సమాచారం ఎక్కువగా ఉంది కానీ జ్ఞానం ఎక్కువగా లేదని అన్నారు. వాట్సాప్‌లలో పంచుకున్న ప్రతిదాన్ని జ్ఞానంగా పరిగణిస్తున్నారని, ఈ డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారం వల్లే పెను ప్రమాదాలు వాటిల్లుతున్నయని ఆవేదనగా చెప్పుకొచ్చారు. అంతేగాదు తాను ఇటీవల ఏడుస్తున్న ఒక చిన్నారిని చూశానని, ఆమెకు పేరెంట్స్ మొబైల్ ఇచ్చారని అన్నారు. అంటే ఇక్కడ తల్లిదండ్రుల స్థానాన్ని మొబైల్ భర్తీ చేస్తోందన్నమాట. ఇది రాను రాను ఒక విపత్తుగా మారుతుందని ఆ క్షణం ఏ తల్లిదండ్రులకు దీనిగురించి అంతగా తెలియదని అన్నారు జస్టిస్ ఎం ఎం సుందరేష్. ఇలాంటివి నిజానికి చాలా ప్రమాదకరమైనవని, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడంతోనే ఇలాంటి ఘోరాలు జరగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. అంతేగాదు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వహించడమే గాక, ఐక్యతకు ప్రతీకగా నిలిచేవని పేర్కొంది. ప్రస్తతం న్యూక్లియర్ (చిన్న) కుటుంబాల సంఖ్య ఎక్కువై బంధాల మధ్య మాధుర్యం లోపిస్తోందని అభిప్రాయపడింది. నవ సమాజానికి పునాది అయినా కుటుంబాలే గతితప్పడంతోనే..ఇలాంటి నేరాలు అంతకంతకు ఎక్కువ అవుతున్నాయని స్పష్టం చేసింది. కాగా, సోనమ్‌కు షిల్లాంగ్ ట్రయల్ కోర్టు ఏప్రిల్‌లో బెయిల్ మంజూరు చేసింది. అరెస్టు సమయంలో నిబంధనల ప్రకారం కారణాలు సరిగ్గా తెలియజేయలేదన్న సాంకేతిక అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అనంతరం మేఘాలయ హైకోర్టు కూడా ఆ బెయిల్ ఉత్తర్వులను సమర్థించింది. అయితే, బెయిల్ మంజూరును సవాలు చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అరెస్టు మెమోలోని తప్పు కేవలం టైపింగ్ లేదా క్లరికల్ పొరపాటు మాత్రమేనని, దాని ఆధారంగా బెయిల్ ఇవ్వడం సరికాదని ప్రభుత్వం వాదించింది.(చదవండి: కార్పెంటర్ కుమార్తె ఘనత..! శక్తిశాట్‌లో మెరిసిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని..) -
కార్పెంటర్ కుమార్తె ఘనత..! ఏకంగా అంతరిక్ష యాత్రలో..
టాలెంట్ ఉంటే ఎంతటి కుగ్రామంలో ఉన్నా..నింగికి ఎగిసిపోవచ్చు. అచంచలమైన పట్టుదల ఉంటే..ఎన్ని అడ్డంకులు ఉన్నా..అవకాశాల రూపంలో ఆకాశమంత లక్ష్యాని చేధించొచ్చు అని చాటి చెప్పి..అందరికీ స్ఫూర్తిగా నిలిచింది ఈ 14 ఏళ్ల విద్యార్థిని.ఆ అమ్మాయే ఆంధ్రప్రదేశ్‌లోని ధవళేశ్వరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల (ZPGHS)లో పదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల కందుల జెస్సీ. ప్రపంచంలోనే మొట్టమొదటి బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్లోబల్ లూనార్ క్యూబ్‌శాట్ మిషన్ అయిన 'మిషన్ శక్తిశాట్' కోసం భారతదేశం నుంచి మొతం 20 మంది ఎంపికవ్వగా వారిలో ఆంధ్ర నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థిని ఆమె. వడ్రంగి కుమార్తె అయిన జెస్సీ ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కోసం సుమారు 108 దేశాల నుంచి దాదాపు 12 వేల మంది బాలికలు నమోదు చేసుకోగా, వారిలో చోటు దక్కించుకున్న ఏకైక ఆంధ్రప్రదేశ్ విద్యార్థినిగా నిలిచింది. జెస్సీకి సైన్సు ఆవిష్కరణల పట్ట చిన్నప్పటి నుంచి అమితాశక్తి. ఆ ఆసక్తిని ఆమె భౌతిక ఉపాధ్యాయురాలు అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇన్చార్జి మణిమాల గుర్తించింది. గతేడాది ఆమెను ఆ ప్రోగ్రామ్‌లో నమోదు చేయించింది. ఆ అవకాశంతో స్ఫూర్తిపొందిన జెస్సీ..తన పాఠశాలలోని మరో ఎనిమిది మంది అమ్మాయిలను కూడా దరఖాస్తు చేసుకోమని ప్రోత్సహించింది. అయితే అప్పటికే ఆన్లైన్ కోర్సు వర్క్ ప్రారంభమైందని తెలుస్తుంది. అయితే మణిమాల ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లను సంప్రదించి తన విద్యార్థులకు మరో అవకాశాన్ని కల్పించారు, తద్వారా జెస్సీ ఎంపిక ప్రక్రియలో కొనసాగడానికి వీలు కలిగింది. అయితే ఆమె పదోతరగతి పరీక్షలకు సన్నద్ధమవుతూనే పాఠశాల అనంతరం ప్రతిరోజూ ఆన్లైన్ తరగతులకు హాజరై, దాదాపు 60 శాతం ప్రోగ్రామ్ కోర్సుని పూర్తి చేసింది. మిషన్ శక్తిశాట్ ప్రోగ్రామ్‌లో ఉపగ్రహ వ్యవస్థలు, ప్రొపల్షన్, థర్మోడైనమిక్స్, అంతరిక్ష సాంకేతికత వంటి అంశాలను కవర్ చేస్తూ సుమారు 550 సెషన్లు, 21 మాడ్యూల్స్ ఉన్నాయి. తన పాఠశాల పాఠ్యప్రణాళిక కంటే ఈ కోర్సు చాలా అత్యున్నత స్థాయిలో ఉందని, అర్థం చేసుకోవడం చాలా కష్టంగా అనిపించిందని చెప్పుకొచ్చింది జెస్సీ. అంతర్జాతీయ ఇంటర్వ్యూ కోసం మెరుగైన ఆంగ్లం..అంతర్జాతీయ నిపుణులతో జరిగే ఇంటర్వ్యూ కావడంతో..అందుకోసం తన ఉపాధ్యాయులు, విద్యా సంబంధిత వీడియోల సాయంతో ఆంగ్లం మెరుగుపరుచుకుని మరీ హాజరైంది. అయితే అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో మాట్లాడేటప్పుడు చాలా కంగారుడపడ్డానని, తనలాంటి ప్రభ్యుత్వ పాఠశాల విద్యార్థిని ఎంపికవుతుందని ఊహించలేదని అంటోంది. గర్వించే క్షణం..జెస్సీ ఎల్లప్పుడూ పాఠశాలలోని అటల్ టింకరింగ్ ల్యాబ్‌లో అత్యంత చురుకైన సభ్యులలో ఒకరిగా ఉండేదని, సైన్సు సంబందితన అన్ని కార్యకలాపాలు, పోటీల్లో నిరంతరం పాల్గొనేదని చెప్పుకొచ్చారు ఆమె గైడ్ మణిమాల. ఇక తల్లి అరుణ..ఆర్థిక ఇబ్బందులు కారణంగా కూతుర్ని ప్రైవేట్ పాఠశాలకు పంపలేకపోయామని..కానీ అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో తన కూతురు మాట్లాడటం చూసి చాలా గర్వంగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఇక జెస్సీ కూడా ఇస్రోలో చేరాలన్న తన కలను నెరవేర్చుకోవడానికి కష్టపడితే సాధ్యమవుతుందనే తన నమ్మకాన్ని ఈ ఎంపిక మరింత బలపరిచిందని ఆత్మవిశ్వాసంగా చెప్పింది. అంతేగాదు తాను తన పేరెంట్స్‌కి అండగా నిలబడాలని అనుకుంటున్నానని, అలాగే మా ఉపాధ్యాయులకు, పాఠశాలకు గర్వకారణంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పింది జెస్సీ. ఆగస్టు 23 నుంచి ఢిల్లీలో శిక్షణ..ఈ కార్యక్రమం తదుపరి దశ ఆగస్టు 23న న్యూఢిల్లీ ప్రారంభమవుతుంది. ఇందులో ప్రాక్టికల్ శిక్షణ, జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు ఉంటాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాల్లో హాజరుకానున్నారు కూడా. ఈ శిక్షణ సమయంలో, ఆమె శాస్త్రవేత్తలతో కలిసి ఉపగ్రహ రూపకల్పన, పేలోడ్ అభివృద్ధి, మిషన్ కార్యకలాపాలపై పనిచేస్తుంది. కాగా, విద్యార్థులు రూపొందించిన లూనార్ క్యూబ్‌శాట్‌ను అక్టోబర్ 11న శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు. ఈ స్టోరీలో జెస్సీ కేవలం చంద్రుడిని వెంబడించడం లేదు, ప్రభ్యుతం పాఠశాల అయినా..పరిస్థితులు ఎలా ఉన్నా..కష్టబడేతత్వం ఉంటే ఉన్నత శిఖరాలను చేరుకోవడం సాధ్యమే అని నిరూపించింది.(చదవండి: నో లగ్జరీ కార్లు, నో బ్రాండెడ్ బట్టలు..! వైరల్‌గా ఆ జంట ఆర్థిక సూత్రాలు..) -
నో లగ్జరీ కార్లు, నో బ్రాండెడ్ బట్టలు..! వైరల్‌గా ఆ జంట ఆర్థిక సూత్రాలు..
ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్, ఆఫర్ల పుణ్యమా అని..అవసరం ఉన్నా లేకపోయినా..కొనడం ఒక వ్యసనంగా మారిందని చెప్పాలి. దాంతో కొన్ని కుటుంబాలు ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని సతమవుతున్నాయి కూడా. అయినా కూడా ఈ జాడ్యం వదిలించుకోలేరు. చూడగానే కంటికి నచ్చితే చాలు కొనేయాల్సిందే అన్న మనస్తత్వం ఉంటే ..ఆర్థిక కష్టాలు కూడా ఆ రేంజ్‌లోనే ఉంటాయని చెబుతుంటారు ఆర్థిక నిపుణులు. ఇప్పుడిదంతా ఎందుకంటే ఓ జంట మాత్రం ఆర్థికంగా బేషుగ్గా ఉండాలంటే ఈ విధానం ఫాలో అయితే చాలు అంటూ చెప్పిన ఆర్థిక సూత్రాలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. వాళ్లు వేటి మీద పెట్టుబడులు పెడుతున్నారో చూస్తే విస్తుపోతాం కూడా. అంతా విలాసవంతమైన వాటి కోసం చూస్తే..వాళ్లు మాత్రం జీవితానికి కీలకమైన దానిపై పెట్టుబడులు పెడుతూ అందర్నీ ఆలోచింప చేశారు. ఇంతకీ ఆ దంపతులు వేటి మీద పెట్టుబడులు పెడుతున్నారంటే..డబ్బు విషయానికి వస్తే, ప్రతి ఒక్కరికీ వేర్వేరు ప్రాధాన్యతలు ఉంటాయి. కొందరు భవిష్యత్తు కోసం పొదుపు చేసి పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడితే, మరికొందరు తక్షణ ఆనందాల కోసం ఖర్చు చేస్తూ సంతోషంగా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తుంటారు. వర్తమానాన్ని సద్వినియోగం చేసుకోవాంటే నచ్చిన వాటిపై ఖర్చు చేయాల్సందేనన్నది కొందరి వ్యక్తుల నమ్మకం. అయితే చాలామంది రేపటికోసం ప్రణాళిక తోపాటు ప్రస్తుత జీవితాన్ని ఆస్వాదించేలా సమతుల్యతకు పెద్దపీట వేస్తారు. అలానే చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నా మేఘ, శుభమ్‌లు. ఒక పసిబిడ్డ, ఒక పెంపుడు కుక్క, రెండు పూర్తికాల ఉద్యోగాలతో తమ కుటుంబాన్ని ఎలా నడిపిస్తున్నారో ఇన్స్టాగ్రామ్ వీడియోతో పంచుకుంటూ అందర్నీ ఆకర్షించారు. ఆ దంపతులు అనుసరించే విధానం..అందరికీ నచ్చడం విశేషం. వాళ్లు తమ కుటుంబాన్ని నడిపించేందుకు ఫాలో అవుతున్న ఆర్థిక తత్వం గురించి మాట్లాడారు. తాము హోదాల కంటే సౌకర్యానికి, జీవన నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. విలాసవంతమైన కార్లు, డిజైనర్ దుస్తులు లేదా ఖరీదైన ఆభరణాలు కొనడానికి బదులుగా, తమ కుమార్తెతో ఎక్కువ సమయం గడిపే నివాస సముదాయంపై పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడతామని అన్నారు. ప్రతి వేసవిలో ఒక అంతర్జాతీయ విహారయాత్రను ప్లాన్ చేసుకోవడం, ఏడాదిలో అనేకసార్లు తమ ప్రాంతంలోని విహారయాత్రాలు చేయడం, ముఖ్యంగా పండుగల సమయంలో తల్లిదండ్రల ఇంటికి వెళ్లడం వంటివి ఒక నియమంగా పెట్టుకుంటామని చెప్పారు. ఇక ఆరోగ్యం, ఫిట్నెస్ అవసరమైన పెట్టుబడులుగా పరిగనిస్తామని అన్నారు. అందుకే ఆరోగ్యోకరమైన ఆహారం, జిమ్ సభ్యుత్వం, ఆరోగ్య సంరక్షణపై ఖర్చులు పెడతామని అన్నారు. ప్రతి ఏడాది పెట్టుబడులను పెంచుతూ..పెట్టుబడి ఫోర్టఫోలియో వృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. చివరగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా సంపదను నిర్మించడంపై దృష్టి పెడతామని చెప్పారు. అలాగే తాము తమ ఖర్చుల, ఆర్థిక బాధ్యతలను పంచుకుంటామని అన్నారు. మేఘా అద్దె, యుటిలిటీ బిల్లులు, గృహ సిబ్బంది జీతాలు వంటి స్థిరమైన నెలవారీ ఖర్చులు చూసుకుంటుండగా, శుభం కిరాణా సామాగ్రి, ప్రయాణం, క్రెడిట్‌తో సహా మారే ఖర్చులను చూసుకుంటాడని అన్నారు. ఈ ఆర్థిక నియమాలు అందరికీ వర్తించేవని చెప్పడం లేదని కేవలం ఆర్థికంగా ధీమాగా ఉండేందుకు, ఒక చిన్న కుటుంబానికి అత్యంత అనుకులమైన ఒక విధానమని చెప్పారు. View this post on Instagram A post shared by Megha & Shubham | Couple | Fitness journey (@the12absproject) (చదవండి: వెయ్యి ఇంజెక్షన్లు, రెండు గర్భస్రావాలు..! ఐవీఎఫ్ జర్నీపై నటి షాకింగ్ వ్యాఖ్యలు) -
ఆమె విద్యార్థి కానే కాదు!
జోరున వర్షం కురుస్తోంది.. చుట్టూ పోలీసులు ఉన్నారు.. ఎదురుగా ఆందోళనకారులను తీసుకెళ్తున్న పోలీస్ వ్యాన్ నెమ్మదిగా ముందుకు కదులుతోంది. లాఠీ దెబ్బలకు భయపడి యువకులంతా చెల్లాచెదురైపోతున్నారు. హఠాత్తుగా దూసుకొచ్చిన ఓ యువతి.. ఆ వ్యాన్‌కు అడ్డుగా నిలబడింది. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా తన నిరసనను వ్యక్తం చేసింది. ఆ ఒక్క క్షణం.. ఆమె ధైర్యం.. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.నీట్ సహా పోటీ పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు.. ఢిల్లీ నుంచి మిగతా రాష్ట్రాలకు విస్తరించాయి. ఈ క్రమంలో ముంబైలో జరిగిన ఆందోళనల్లో ఓ యువతి చూపించిన తెగువ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. విమర్శకులను పక్కనపెడితే.. ఆమె చూపిన ధైర్యం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. విద్యార్థులను తరలిస్తున్న పోలీస్ వాహనానికి అడ్డుగా నిలిచిన ఆమె వీడియో వైరల్‌గా మారింది.“వాళ్లు విద్యార్థులు.. వాళ్ల గొంతు వినాలి”బుధవారం దాదర్‌లోని శివాజీ పార్క్ సమీపంలో జరిగిన నిరసనల్లో రిహియా యాదవ్ పాల్గొన్నారు. విద్యార్థులను అదుపులోకి తీసుకుని తరలిస్తున్న పోలీస్ వ్యాన్‌ను ఆమె వర్షంలో నిలబడి అడ్డుకున్నారు. హూడీ, క్యాప్ ధరించిన ఆమె వ్యాన్ ముందు నిలబడగా.. చుట్టూ ఉన్న పలువురు ఆమెకు మద్దతుగా నినాదాలు చేశారు.ఈ ఘటనపై రిహియా మాట్లాడుతూ.. ‘‘పోలీసులు తమ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోతే.. ప్రజల బాధ్యతను ప్రజలమే తీసుకోవాల్సి వస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. తాను విద్యార్థిని కాకపోయినా.. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నానని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్య సరైంది కాదని ఆమె అన్నారు.Meet Rhiya Ahir [IG: rhiyaahir]👏One fearless young woman stood in front of a police van during the Mumbai student protests, refusing to back down.Courage can't be bought. Justice can't be silenced. Salute to her. 🫡🫡 pic.twitter.com/c9oAvhQPeq— زماں (@Delhiite_) July 22, 2026ఒక్క అడుగు.. ఓ సందేశంరిహియా చేసిన పని కేవలం ఓ నిరసన చర్యగా మాత్రమే కాకుండా.. మహిళల ధైర్యానికి ప్రతీకగా మారింది. సాధారణంగా ఆందోళనల్లో మహిళల పాత్రపై ఎన్నో చర్చలు జరుగుతుంటాయి. కానీ రిహియా మాత్రం “ప్రశ్నించేందుకు ధైర్యం ఉంటే మార్పు సాధ్యమే” అనే సందేశాన్ని ఇచ్చారు. ఆమె వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పలువురు ఆమెను అభినందించారు. కొందరు ఆమెను “ముంబై హీ(షీ)రో”గా అభివర్ణించారు. ప్రముఖ హాస్యనటుడు రోహన్ జోషి కూడా ముంబై యువత నిరసన తీరును ప్రశంసిస్తూ పోస్టు చేశారు.ఎవరీ రిహియా యాదవ్?రిహియా యాదవ్ కేవలం నిరసనకారిణి మాత్రమే కాదు. ఆమె ఓ నటి, మోడల్, వ్యాపారవేత్తగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం.. మ్యూజిక్ వీడియోల్లో నటించారు. అంతేకాకుండా చేతితో తయారు చేసే దుస్తుల కోసం ‘రిహియాసత్’ పేరుతో ఓ వ్యక్తిగత బ్రాండ్‌ను నిర్వహిస్తున్నారు. సృజనాత్మక రంగంలో తనదైన ముద్ర వేస్తూనే.. సామాజిక అంశాలపై కూడా స్పందించడం ఆమె ప్రత్యేకతగా నిలుస్తోంది.మహిళా సాధికారతకు ఓ ప్రతీకగా..మహిళా సాధికారత అంటే కేవలం అవకాశాలు పొందడం మాత్రమే కాదు.. అవసరమైన సమయంలో తన అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తం చేయడం కూడా. రిహియా యాదవ్ ఘటన అదే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. ఒక మహిళ ముందుకు వచ్చి నిలబడితే.. అది కేవలం ఒక నిరసన కాదు.. మరెందరికో ధైర్యాన్ని ఇచ్చే సందేశంగా మారుతుందనే దానికి రిహియా ఉదాహరణగా నిలించిందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. -
76 ఏళ్ల వయసులోనూ అంతే ఫిట్‌గా రాకేశ్ రోషన్..! ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం కోసం..
బాలీవుడ్ చిత్ర నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ రైటర్ రాకేష్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా తాను రాణించలేకపోయినా..కుమారుడు హృతిక్ రోషన్‌ని వెండితెరకు పరిచయం చేసి హీరోగా వెలుగొందేలా చేశాడు. అలాగే దర్శకుడిగా, మంచి స్క్రీన్ రైటర్‌గా, నిర్మాతగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. ప్రస్తుతం ఆయన వయసు 76 ఏళ్లు. ఈ వయసులో కూడా ఎంతో ఫిట్‌గా, స్మార్ట్‌గా ఉండటమే కాదు..యువ హీరోలకు తీసిపోని విధంగా గ్లామరస్‌గా కనిపిస్తుంటారు. ఆయన అంత ఏజ్‌లోనూ అంతలా ఎలా స్లిమ్‌గా చురుకుగా ఉన్నారు. అందుకోసం ఏం చేస్తుంటారు, ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు వంటి విషయాల గురించి సవివరంగా చూద్దామా!.ప్రముఖ చిత్ర నిర్మాత రాకేశ్ రోషన్ 76 ఏళ్ల వయసులో కూడా తన ఫిట్‌నెస పట్ల తనకున్న అచంచలమైన నిబద్ధతతో ఈ తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వృద్ధాప్యంలో కూడా ఎంతో చురుకుగా, శక్తిమంతంగా ఉండటానికి తనకు సహయపడిని అలవాట్ల గురించి తన కుమార్తె సునైనా రోషన్ ఇన్స్టాగ్రామ్ పేజీలో జరిపిన సంభాషణలో వెల్లడించారు. అంతేగాదు తాను అనుసరించే క్రమశిక్షణతో కూడిన జీవనశైలి గురించి కూడా చెప్పారు. వయసు పెరిగే కొద్దీ మరింతగా శిక్షణ పొందాలని, అదే మనల్ని ఫిట్‌గా ఉంచుతుందని అన్నారు. 65 లేదా 70 ఏళ్ల తర్వాత భుజాలు వంగిపోయి, పొట్ట ముందుకు పొడుచుకు వచ్చిన వారిని చూశానని అన్నారు. కఠినమైన డైట్ తోపాటు క్రమం తప్పకుండా జిమ్,వెయిట్ ట్రైనింగ్ చేస్తుతంటానని అన్నారు. మంచి ఆరోగ్యానికి వ్యాయామం కంటే ఆహారమే ముఖ్యమని అన్నారు. అంతేగాదు మనం ఆరోగ్యంగా ఉండటంలో వ్యాయామం కేవలం 10% మాత్రమేనని, మిగిలిన 90% తీసుకునే ఆహారమేనని అన్నారు. గత మూడేళ్లుగా ఇలాంటి జీవనశైలిని ప్రారంభించానని, ఇది తనలో చాలా మార్పు తీసుకొచ్చిందని చెప్పుకొచ్చారు. తాను బాగా నిద్రపోతానని, ఉత్సాహంగా మేల్కొంటానని చెప్పారు. అది ఇవాళ తనకొక దినచర్యగా మారిందని అన్నారు. వ్యాయామం చేయాలనే మూడ్ లేని రోజుల్లో ఏం చేస్తారని కుమార్తె అడగ్గా..అలా చాలా అరుదుగా జరుగుతుందని, ఆ టైంలో కూడా తనను తాను చేసేలా ప్రేరేపించుకుంటానని అన్నారు. తనకు బద్ధకంగా అనిపించి వ్యాయామం చేయాలనిపించకపోయినా..జిమ్‌లోకి అడుగుపెట్టి, తనకు సాధ్యమైనంత మేరకు వర్కౌట్లు చేస్తుంటానని అన్నారు. ఆయన అనేది శిక్షణ కంటే హాజరు ముఖ్యం అనుకుంటే..కనీసం వార్మప్ వ్యాయామాలైనా చేయగలుగుతామని అన్నారు. ప్రతిరోజూ ఎలాగైతే అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం చేస్తామో, వ్యాయామం కూడా మన దినచర్యలో ఒక భాగం కావాలని అన్నారు. అలా అనుకుని చేస్తే ఆరోగ్య సమస్యల బారిన పడరని, పైగా పోరాడే సామర్థ్యం పెరుగుతుందని అన్నారు. అయినా అంతర్గతంగా ఆరోగ్యంగా దృఢంగా ఉన్నప్పుడు జీవితం చాలా సులభం అవుతుందని అన్నారు. ఇక కుమార్తె సునైనా రోషన్ సైతం..తండ్రి మాటలకు మద్దతిస్తూ.తాను కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతోనో తన ఆరోగ్యంలో నిజంగా పెద్ద మార్పు చోటుచేసుకుందంటూ తన అనుభవాన్ని పంచుకుంది. అందువల్లే తనకు గ్రేడ్1 ఫ్యాటీ లివర్ సమస్య తగ్గిందని పేర్కొంది. కాగా, రాకేష్ రోషన్‌కు 2019లో గొంతు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. చికిత్స తర్వాత పూర్తిగా కోలుకున్నారు. అప్పటి నుంచి ఈ చిత్ర నిర్మాత క్రమం తప్పని వ్యాయామం, ఆలోచనాత్మకమైన ఆహారాన్ని తన దినచర్యలో భాగంగా చేసుకుని, మరింత క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకున్నారు. View this post on Instagram A post shared by Sunaina Roshan (@roshansunaina) (చదవండి: వెయ్యి ఇంజెక్షన్లు, రెండు గర్భస్రావాలు..! ఐవీఎఫ్ జర్నీపై నటి షాకింగ్ వ్యాఖ్యలు) -
మహాత్ముల చేష్టలు..
బాలోన్మత్త పిశాచవత్ సిద్ధానాం రీతిః మహాత్ములయిన సిద్ధపురుషుల పద్ధతంతా విపరీ తంగా ఉంటుంది. పిల్ల చేష్టలు చేస్తారు. పిశాచం పట్టిన వాళ్ళలాగా వింతగా ప్రవర్తిస్తారు. పిచ్చివాళ్ళలాగా సంచరిస్తారు. వాళ్ళ చూపులు, పనులు వంటివన్నీ పైకి అలాగే కనిపిస్తాయి. అలాంటి మహనీయుల గొప్పతనాన్ని మహాత్ములే గుర్తిస్తారు. సామాన్యులకు తెలియదు.గౌతమ మహర్షి మహామహితాత్ముడు. గొప్ప సిద్ధుడు. శ్రీవిద్యోపసనా దురంధరుడు. ముద్రోపాసనను, శైవ సిద్ధాంతాన్ని మనకందించిన పుణ్యమూర్తి. పెద్ద పెద్ద పండితులు, చక్రవర్తులు ఆయన ఆశ్రమానికి వెళ్ళి వారి దర్శనం చేసుకొని వెళ్ళేవారు. నిత్యం వేదపారా యణం, ఉపాసన, యజ్ఞయాగాది క్రతువులు, పూజలు, సంద్గ్రంథ పారాయణాలు జరిగేవి.ఒక ఉన్మత్తుడు ఆశ్రమంలోనే ఉంటూ అందరికీ తపో, ధ్యాన భంగం చేస్తూ ఉండేవాడు. గౌతముడు మాత్రం ఆ పిచ్చివాణ్ణి దగ్గరకు పిలిచి ఆదరించేవాడు. ఆశ్రమవాసులందరూ ఆ పిచ్చివాణ్ణి తిట్టేవారు. ఇలా ఉండగా ఒక రోజున పండితులు, రాజు గౌతముని సన్మానించటానికి, పూజా సామగ్రిని, కానుకలను తీసుకొనివస్తే ఆ పిచ్చివాడు ఆ సామగ్రినంతటినీ చిందరవందర చేసి అందరిచేత తన్నులు తిన్నాడు. అందుకు గౌతముడు చాలా బాధపడ్డాడు. పాపం పిచ్చివాడిలాగా తిరిగే అవధూత మరణించాడు. ఇది చూచి గౌతముడు కూడా ప్రాణం వదిలేశాడు. అది తెలిసి శుక్రాచార్యులు కూడా ప్రాణత్యాగం చేశారు.ఆ విషాదం చూచి భరించలేక దేవతలందరూ జగన్మాతను ప్రార్థించారు. శ్రీమాత వాళ్ళ ప్రార్థన విని గౌతముని బ్రతికించింది. గౌతముడు మంత్రజలం చల్లి అవధూతను బ్రతికించాడు. శుక్రాచార్యుని సైతం బ్రతికించాడు. అక్కడి వాళ్ళతో గౌతముడు ‘ఈయనను పిచ్చివాడనుకొంటున్నారు మీరు. ఇది భ్రమ తప్ప నిజం కాదు. ఈయనొక మహాయోగి. అవధూత! నా పూర్వజన్మలో నా గురుదేవుడు. ఈయన ఇంతవరకు మీ విషయంలో చేసిన వింతచేష్టలు మిమ్మల్ని అనుగ్రహించటానికే. కానీ ఈ యధార్థం మీకు తెలియదు’ అని చెప్పాడు.- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
స్వయం గురువుగా తయారు కావాలి..
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు స్సాక్షాత్ పరబ్రహ్మతస్మై శ్రీగురవే నమః...గురు మంత్రంలో చివరి మంత్రం చెప్పేటప్పుడు‘గురుః సాక్షాత్ పరబ్రహ్మ’ అని అంటారు. అంటే పరబ్రహ్మయే. మీరు ఆత్మసాక్షాత్కారం పొందిన తరువాత ఆ శక్తియే మీ ద్వారా ప్రవహిస్తుంది. కనుక అప్పుడు మీరు పరబ్రహ్మ సాధనంగా మారతారు. మీలో స్వయం గురుతత్వ స్థితిని పెంపొందించుకుంటారు.ఆదిగురువు అవతరమూర్తులందరూ పంచభూతాలపై ఆధిపత్యం కలిగివుంటారు. వారి ద్వారానే బ్రహ్మ వ్యక్తీకరింపడ్డాడు. ఈ ఆదిగురువు ముగ్గురి ద్వారా అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ద్వారా వ్యక్తీకరింపబడ్డాడు. ఆయన నాలుగు తలలుగల బ్రహ్మలా జన్మించాడు. మనకు పైకి కనబడే ఈ ముగ్గురు కాకుండా నాల్గవ తల శ్రీ గణేశునిది. ఈ విధంగా దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, గణేశ రూపంతో, శక్తులతో ఆది గురువయ్యాడు. గురువు కు వుండాల్సిన ఉత్తమ గుణాలు చాలా వున్నాయి. ఆ గుణాలన్నీ గురువులో వ్యక్తమవ్వాలి. ఈ గుణాలకు యజమాని శివుడు. శివ తత్వం అంటే గురుతత్వమే. అలా ఈ గుణాలన్నీ మీ ద్వారా ప్రస్పుటమవ్వాలి, ప్రకాశించాలి.అప్పుడు మీరు విరాటశక్తిలో ఒకరైపోతారు. ఇతరులకు ధర్మాన్ని బోధించగలుగుతారు. ఆత్మగా మారుతారు. ఆ విధంగా నిజమైన గురువుగా మారుతారు.ఒక గురువుగా మీరు మీ నిత్య జీవితంలో అనేక విషయాలకు అతీతంగా వుండగలగాలి. అదే మీరు చేరుకోవలసిన ఉన్నత స్థితి.‘‘యధా రాజా తధా ప్రజా’’ అన్నట్లుగా మీరు స్వయం గురువుగా తయారయిన్నప్పుడే ఇతరులకు గురువుగా మారి ఓ ప్రతీకగా, ఆదర్శ్ర΄ాయంగా నిలబడి నడిపించగలరు.. ఇక్కడ మన అర్థం చేసుకోవలసిన విషయమేమంటే – సమాజంలో మనం చూస్తున్న గురువులను, తమను తాము గురువులుగా చెప్పుకునే గురువులు మనకు ఆత్మసాక్షాత్కారం ఇవ్వగలుగుతున్నారా అన్నది. తమలో గురు తత్వం లేని గురువు కూడా ఇతరులకు గురువు కావాలనుకుంటారు. తాను స్వయంగురువుగా వ్యక్తీకరింపబడిన వ్యక్తి ఇతరులకు గురువు కావాలని ఎన్నడూ అనుకోడు.మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి ప్రయత్నించండి. ఆత్మగా రూపొందండి. ఎప్పుడు మీరు ఆత్మగా రూపొందుతారో అప్పుడు మీకు మీరు గురువు కాగలగుతారు. అదే స్వయం గురుతత్వం.గురువు ప్రప్రధమంగా మనల్ని భగవంతుడినితో అనుసంధాన పరచడానికి ప్రయత్నిస్తాడు. అంటే దానర్థం ఆయన మీ కుండలినీ శక్తిని జాగృత పరిచి, సర్వవ్యాపిత శక్తితో మిమ్మల్ని అనుసంధానం చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉండాలి.గురువుకి మించిన తత్వం లేదుగురువును మించిన తపస్సు లేదుగురువుని మించిన జ్ఞానం లేదుఅటువంటి గురుదేవునికి నమస్కరిస్తున్నాను అని గురుగీత స్తోత్రంలోని ఒక శ్లోకంలో గురువుకి వున్న ఉన్నత స్థాయి గురించి చెప్పారు.– డాక్టర్ ప్రతాని రాకేశ్, సహజ యోగసాధకులు, (పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా)శ్రీ మాతాజీ నిర్మలాదేవినిర్వహణ: డి.వి.ఆర్. -
దేవతలు కట్టిన కోవెల!
విష్ణుమూర్తి... సౌమ్యనాథస్వామిగా అవతరించి, చిరుమందహాసంతో, అభయహస్తంతో దర్శనమిస్తూ ..కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా పూజలు అందుకుంటున్న క్షేత్రం నందలూరు సౌమ్యనాథాలయం. విశాలమైన ప్రాంగణంలో... నాలుగు రాజగోపురాల మధ్య ఉన్న ఈ ఆలయం పది ఎకరాల విస్తీర్ణంలో, పూర్తిగా ఎర్రరాతిని ఉపయోగించి నిర్మించడం విశేషం.ఈ ఆలయంలోని 108 స్తంభాలపైనా భాగవతం చిత్రించి ఉండటం మరో విశేషం. 11 శతాబ్దం నుంచీ ఉన్న ఈ ఆలయాన్ని దేవతలే కట్టించారని పురాణాలు చెపుతున్నాయి. స్వయంగా నారదమహర్షి సౌమ్యనాథస్వామి మూలవిరాట్టును ప్రతిష్టించారని ఆలయ చరిత్ర వెల్లడిస్తోంది.స్వామి పాదాలపై సూర్యకిరణాలు...గర్భగుడికీ ఆలయ ప్రధాన ద్వారానికీ మధ్య 120 గజాల దూరం ఉన్నా.. ద్వారం నుంచి మూలవిరాట్టు రూపం చాల స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో స్వామి పాదాలపైన సూర్యకిరణాలు పడటమూ ఇక్కడ చూడొచ్చు.స్వామిపై అన్నమయ్య కీర్తనలు...తాళ్లపాకకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయాన్ని ఒకప్పుడు అన్నమాచార్యులు రోజు దర్శించుకునేవాడనీ, స్వామిపైన పదహారు కీర్తనలు కూడా రాశాడనీ అంటారు. ఇక్కడ స్వామికి ప్రతిరోజు నిర్వహించే పూజలు ఒకెత్తయితే, ఆషాఢమాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు ముక్కోటి ఏకాదశి నాడు చేసే లక్షతులసీ అర్చన మరొకెత్తు. ఇవే కాకుండా శ్రావణ, ధనుర్మాసాల్లో నిర్వహించే ఉత్సవాలు చూసేందుకు చుట్టుపక్కల ఊళ్లకు చెందిన భక్తులకు ఎక్కువగా చూస్తారు.వైభవంగా మొదలైన బ్రహ్మోత్సవాలు...ఈనెల 21, మంగళవారం అంకుర్పారణతో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి. బుధవారం ధ్వజారోహణం జరిగింది. 26న గరుడసేవ, 28న కళ్యాణోత్సవం, 29న రథోత్సవం, 30న చక్రస్నానం, 31న పుష్పయాగం నిర్వహించనున్నారు. స్వామివారు రోజుకొక వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఐదవరోజున గరుడోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలను స్వయంగా టీటీడీ దేవస్థానం వారే నిర్వహించడం సంప్రదాయం.– రామమోహన్ మోడపోతుల, సాక్షి, రాజంపేట, వైఎస్సార్ కడప జిల్లానిర్వహణ: డి.వి.ఆర్. -
క్రీస్తునందున్న యాత్రికులు, పరదేశులు
క్రీస్తు సిలువ మరణాన్ని బట్టి కొట్టివేయబడిన ధర్మశాస్త్రమను పాతనిబంధన దృష్టిలో నుండి చూస్తే, ఇశ్రాయేలు జనాంగం పూర్తి రక్షణ కొరకు మెస్సీయా రానేవచ్చాడు. క్రొత్తనిబంధన దృష్టికోణంలో నుండి చూస్తే పాపులను రక్షించుటకు, నశించిన దానిని వెదకి రక్షించుటకు అనగా యావత్తూ అన్య జనాంగాన్ని రక్షించుటకు క్రీస్తు ప్రత్యేకంగా రావడం జరిగింది.గురి కలిగిన క్రైస్తవుల గూర్చి ఎప్పుడూ ఘనంగానే చెప్పవచ్చు. ప్రభువైన క్రీస్తు ద్వారా అంది వచ్చిన క్రొత్త నిబంధన చట్టప్రకారం చూసినా, నేడు అమలులో ఉన్న అపొస్తలుల బోధను అనుసరించి చూసినా, ఈ భూమి మీద ఉన్న క్రైౖస్తవులు అనబడే క్రీస్తు సంబంధులు పరదేశులు, యాత్రికులుగా చెప్పబడుతున్నారు.‘నశించిన ఇశ్రాయేలు ఇంటివారైన గొర్రెల వద్దకే నేను పంపబడ్డాను’ అన్న యాత్ర జీవితం మెస్సీయాది.గొఱ్ఱెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకే వచ్చానని నిశ్చయముగా చెప్పుకున్న ఆయన, ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు ఉన్నాయి. వాటిని కూడా నేను తోడుకొని రావాలి అన్నది కూడా మొత్తానికి ఆయన స్పష్టం చేయడం అంతా విదితమే. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ఆయనను రోజు రోజూకు భక్షిస్తూ ఆయన్ను స్థిరంగా ఒక్కచోట నిలబడనివ్వని కారణం చేత ఉన్నతమైన ఉరుకులు పరుగుల జీవితం ఆయనది. తాను పుట్టినవేళ సత్రంలో స్థలం లేనందున పశువుల తొట్టిలో పడుకొన్న శిశువైన యేసుగా పెరిగి పెద్దవాడై తనను తాను రిక్తుడిగా చేసుకొనినందున ఆయనకు ఇల్లు వాకిలి లేకున్నా రోజూ నిలువ నీడలేని సంకట పరిస్థితి. రాత్రివేళ ఎక్కడో ఒకచోట తలదాచుకొని పగలు ఉన్నంత వరకు అవిశ్రాంతంగా దేవుని పనిచేయడం ఒక్క క్రీస్తుకే చెల్లింది.దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను చాటుతూ ఆ రాజ్యం ఇప్పుడు మీ చేరువలోకే వచ్చిందంటూ యేసు సామాన్యుల చెంత సామాన్యుడుగా కలిసిపోతూ సత్యాన్ని వివరాణాత్మకంగా మనస్సుకు హత్తుకొనేలా బోధించాడు. ఇశ్రాయేలు దేశపు ప్రతి ఇంటి గడపను, ప్రతి బాధితుడను దాటిపోని క్షేత్రస్థాయి విస్తృత పర్యటనలు చేస్తూ యేసు తనదైన దైవిక ప్రేమను బట్టి మానవాళిని తన దివ్య వాక్కులతో బోధలతో అలరించడం విశేషం. ధనికులు, పండితులు వద్దకే కాకుండా అట్టడుగు వర్గాలను ఆకట్టుకొనేలా కూడా యేసు ప్రభువు నేరుగా వారి ఇళ్ళవద్దకు వెళ్ళి పరామర్శలు చేస్తూ వాగ్దాన సంబంధ దేవుడు సత్యవంతుడని స్థాపిస్తూ ఆయన ఎంతో నమ్మదగినవాడని ప్రచారం చేసాడు.దేవుని ఉనికి, స్పృహ లేకుండా పోతున్న రోజుల్లో సత్యవంతుడైన వానిని మనం ఎరుగవలెనని మనకు వివేకం అనుగ్రహించాడు కూడా. ఇట్టి విధానంలో ఈ క్రమంలో ఆయన యాత్రజీవితం విజయవంతం కాకుండా ఎలా ఉంటుంది? నేను పరదేశినైన పరసంబంధుడను, ఈ భూమిమీద యాత్రికుడను అన్నది యేసు ఉన్నత జీవితపాఠం గొప్పగా చాటుతుండడం విశేషమనే చెప్పాలి.– జేతమ్నిర్వహణ: డి.వి.ఆర్. -
కోపాన్ని వదలండి..
రెండు పదాల ఈ చిన్న సలహా పాటించకపోతే జీవితం ఎన్నో మలుపులతో కలచి వేస్తుంది, సంతోషాన్ని కబళిస్తుంది.. తాత్కాలికం, క్షణికం అయినా కోపం శాశ్వతంగా బంధాల్ని తెంపివేస్తుంది..స్నేహన్ని చెడగొడుతుంది, చుట్టరికాలు చెడిపోతాయ్.. మనుషుల్ని దూరం చేస్తుంది. మమతల్ని చంపివేస్తుంది. ఆరోగ్యం మటు మాయం అయిపోతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు కోపం వలన వచ్చే కష్టనష్టాలు బేరీజు వేసుకునేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. అందుకే కోపం గూర్చి ఎన్నో శతకాల్లో నిక్కచ్చిగా, స్పష్టంగా చెప్పారు... కోప్పడకుండా చదవండి.‘తన కోపమే తన శత్రువుతన శాంతియె తనకు రక్ష దయ చుట్టంబౌదన సంతోషమే స్వర్గముతన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ’ఎన్నో సందర్భాలలో ఈ పద్యం వింటాం.. వేరే వివరణ అవసరం లేదు. కోపమే శత్రువు, శాంతమే రక్ష.. సంతోషం స్వర్గం బాధే నరకం... అన్నీ మనలోనే ఉన్నాయి ఈ పద్యంలోనే దయా గుణాన్ని అంటే ఇబ్బంది ఉంటే ఆదుకునే వాడే చుట్టం అని చె΄్తాడు. అందుకునే కాబోలు ‘అక్కరకు రాని చుట్టము... గ్రక్కున విడువంగ వలయు ‘ అని సలహా ఇస్తాడు బద్దెన కవి.వేమన కోపం గురించి అత్యధికంగా చెప్పాడుకోపము దుఃఖమునకు మూలము కోపము శత్రుభయంకరము కోపము కీర్తి నశింపజేయురా కోపము వదలిన సుఖియైతివిరా వేమా!అర్థం: కోపమే దుఃఖానికి మూలం. కోపం వల్ల శత్రువులు పెరుగుతారు. కీర్తి నాశనమవుతుంది. కోపం వదిలితేనే సుఖపడతావు.మరో పద్యం..కోపము వచ్చినప్పుడు కుయుక్తుల వచ్చురా కోపము వచ్చినప్పుడు కూటమి చెడురా కోపము వచ్చినప్పుడు కులమెల్ల చెడురా కోపము వదలరా వేమా!సుమతి శాంతంగా ఉండమని చెప్పాడుకోపము పాపమునకు మూలము కోపము దుఃఖమునకు మూలము కోపము అధోగతికి మూలము కోపము వదలి సుఖముండుము సుమతీ!అర్థం: కోపమే అన్ని పాపాలకు, దుఃఖాలకు, అధోగతికి కారణం. అందుకే కోపం వదిలి సుఖంగా ఉండు. భర్తృహరి సుభాషిత శతకం – ఏనుగు లక్ష్మణకవి చేసిన అనువాదంపద్యంక్షమయా భూషితః పురుషః క్రోధేన భూషితో నరః నీచోపచారైః నరకం వ్రజేత్ ఉత్తమో నరకాత్ పరమ్తెలుగు అనువాదంఓర్పుతో భూషితుడైన నరుడు ఉత్తముడు కోపముతో నుండు నరుడు నీచుడునీచుడు నరకమునకు పోవును ఉత్తముడు స్వర్గమునకు పోవునుకోపము కామము లోభము మదము మాత్సర్యము ఈ పంచ మహాపాములు దహించును వీనిని జయించినవాడే మానవుడు శ్రీరామ నీ దాసుడైతిని దాశరథీ!నీతి శతకంలో పద్యంకోపాత్ భవతి మూర్ఖత్వం మూర్ఖత్వాద్ వినశ్యతి వినాశాత్ నరకం యాతి తస్మాత్ కోపం వివర్జయేత్అంటే...కోపం వల్ల మూర్ఖత్వం వస్తుంది. మూర్ఖత్వం వల్ల నాశనం. నాశనం వల్ల నరకం. అందుకే కోపాన్ని వదలిపెట్టాలి. శతక రచయితలు భావ యుక్తంగా చెప్తే, త్యాగరాజుల వారు రాగయుక్తంగా ‘శాంతము లేక సౌఖ్యము లేద’న్నారు. చివరిగా చెప్పినంత సులువుగా కోపాన్ని వదులుకోగలమా..మాటకు మాట తూటాలాగా వదిలితే శాంతి ఎక్కడ.. శాంతం లేనిదే శాంతి.. సహనం, శాంతం ఉంటే కోపాన్ని దూరం చేసుకోవచ్చు... డాక్టర్లు కూడా ఆరోగ్యం బాగుండాలంటే కోపం వద్దు.. ఈ దిçశలో బయలు దేరితే మన ఆరోగ్యదశ బాగుంటుంది.. ఆ ప్రయత్నంలో అడుగులేద్దాం.– డా. కందాళ సత్యనారాయణ మూర్తినిర్వహణ: డి.వి.ఆర్. -
వర్షాల కోసం ‘ఇస్తిస్ఖా’... నమాజు
వర్షాలు పడక పొలాలు ఎండిపోతే, చెరువులు తడారిపోతే రైతు గుండె గొంతుకలోకి వస్తుంది. వాన చుక్క కోసం ఊరంతా ఆకాశం వైపు దీనంగా చూస్తుంది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మహమ్మద్ ప్రవక్త (స) కాలంలో ఏం చేసేవారో తెలుసా?ఊరి ప్రజలందరినీ ఒక చోటికి తీసుకెళ్లి వర్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయించేవారు. దాన్నే ‘నమాజ్–ఎ–ఇస్తిస్ఖా’ అంటారు. తప్పులు పెరిగితే తడారిపోయే నేల! మనిషి చేసే పనులకి, ప్రకృతి మారే తీరుకి దగ్గర సంబంధం ఉంటుంది. వ్యాపారంలో మోసాలు ఎక్కువైనప్పుడు, సమాజంలో పేదలకు ఇవ్వాల్సిన దానధర్మాలు (జకాత్) సరిగ్గా చేయనప్పుడు వర్షాలు ఆగిపోతాయని ప్రవక్త చె΄్పారు. కరువు రావడం అనేది కేవలం వాతావరణం మారడం వల్ల మాత్రమే కాదు, మనుషుల్లో నైతిక విలువలు తగ్గిపోతున్నాయని చెప్పే ఒక హెచ్చరిక.‘ఒకవేళ ఈ భూమి మీద మూగజీవాలు లేకపోతే, అస్సలు వర్షాలే పడవు’ అని ప్రవక్త చెప్పిన మాటలు మన అహంకారాన్ని ఆలోచనలో పడేస్తాయి. ఆడంబరం లేదు... కేవలం వినయం మాత్రమే! వర్షం కోసం వేడుకునేందుకు వెళ్లేటప్పుడు ఎలాంటి ఆడంబరాలు ఉండేవి కావు. చాలా సాధారణ బట్టలు వేసుకుని, భయభక్తులతో, వినయంగా ఊరి బయట ఉన్న ఈద్గాహ్ మైదానానికి వెళ్లేవారు. పండుగ నమాజ్ లాగే రెండు రకాతుల నమాజ్ చదివిన తర్వాత, ప్రవక్త చేతులను చాలా ఎత్తుకి ఎత్తి అల్లాహ్‌ను వేడుకునేవారు.సాధారణంగా దేవుడిని కోరుకునేటప్పుడు అరచేతులు ఆకాశం వైపు ఉంచుతారు. కానీ వర్షం కోసం అడిగేటప్పుడు అరచేతులు నేల వైపు, చేతుల వెనుక భాగం ఆకాశం వైపు ఉంచేవారు. అలాగే వేసుకున్న దుప్పటిని కూడా తిరగేసేవారు. మన కష్టాల కాలం మారి, మంచి రోజులు రావాలని కోరుకోవడానికి ఇది ఒక పద్ధతి. ‘ప్రభూ! నీ దాసులకు, మూగజీవాలకు నీళ్లు ప్రసాదించు... నీ కరుణను పంచు... ఎండిపోయిన ఈ భూమికి మళ్లీ ప్రాణం పోయ్!’ఇస్తిస్ఖా ప్రార్థన సారాంశం చిన్న చీమ... గొప్ప పాఠం! ఒకసారి ఒక ప్రవక్త వర్షం కోసం ప్రార్థన చేయడానికి వెళ్తూ, మార్గమధ్యంలో ఒక చిన్న చీమను చూశారట. ఆ చీమ తన కాళ్లను ఆకాశం వైపు ఎత్తి వర్షం కోసం వేడుకుంటోంది. అది చూసిన ప్రవక్త తన అనుచరులతో... ‘మనం వెనక్కి వెళ్లిపోదాం, ఆ చిన్న చీమ చేసిన ప్రార్థనను ఆలకించి దేవుడు మనకు వర్షం కురిపిస్తున్నాడు’ అన్నారట.దేవుడి దయ కేవలం మనుషులకే కాదు, భూమి మీద ఉన్న ప్రతి జీవికీ సమానంగా లభిస్తుందనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. వాన చినుకుల్లో పరవశం! ప్రార్థన ముగియగానే ఆకాశంలో దట్టమైన మేఘాలు పట్టి, ఉరుములు మెరుపులతో వర్షం పడేది. వాన పడటం ప్రారంభం కాగానే ప్రవక్త తన చొక్కాను కాస్త పక్కకి జరిపి, ఆ మొదటి వాన చుక్కలు తన ఒంటిమీద పడేలా నిలబడేవారు. ‘ఇది దేవుడి దగ్గర నుంచి ఇప్పుడే వస్తున్న కొత్త వర్షం’ అని సంతోషపడేవారు. నిజమైన పశ్చాత్తాపంతో, వినయంతో ప్రార్థిస్తే ఎండిపోయిన భూములైనా, మనుషుల మనస్సులైనా మళ్లీ చిగురిస్తాయనడానికి ఇస్తిస్ఖా ప్రార్థనే నిదర్శనం.– డా. అబ్దుర్రహీం బిన్ ముహమ్మద్ బిన్ మౌలానానిర్వహణ: డి.వి.ఆర్. -
తొలి పర్వం..
సంవత్సరంలో సాధారణంగా 24 ఏకాదశులు వస్తాయి (అధిక మాసం వస్తే 26). అయితే ఆషాఢ శుక్ల ఏకాదశికి ‘తొలి ఏకాదశి‘ అనే విశిష్ట నామం వచ్చింది. దక్షిణాయనం ప్రారంభం అయ్యాక వచ్చే మొదటి ఏకాదశి కనుక మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి అంటే ప్రారంభ ఏకాదశి అని చెప్పవచ్చు.ఈ ఏకాదశిని ఇంకా... దేవశయన ఏకాదశి, హరిశయనీ ఏకాదశి, పద్మ ఏకాదశి, ఆషాఢ శుక్ల ఏకాదశి .. అని కూడా వ్యవహరిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగనిద్రలోకి ప్రవేశిస్తారని, కార్తీక శుక్ల ఏకాదశి (ప్రబోధిని ఏకాదశి) నాడు మేల్కొంటారని ఆగమాలు, పురాణాలు వివరిస్తాయి.ఏకాదశి రోజున ఉపవాసం చేసి ద్వాదశి నాడు విధిగా పారణ చేసినవాడు సర్వపాపాల నుండి విముక్తి పొంది విష్ణులోకాన్ని పొందుతాడని పద్మ పురాణం తెలియజేస్తుంది. గాయత్రీ మంత్రం కంటే గొప్ప మంత్రం లేదు. తల్లి కంటే గొప్ప దైవం లేదు. కాశీ కంటే గొప్ప తీర్థం లేదు. ఏకాదశి వ్రతం కంటే గొప్ప వ్రతం లేదు అని స్కందపురాణం చెబుతోంది. భవిష్య పురాణం ప్రకారం చాతుర్మాస్య వ్రతం తొలి ఏకాదశి నుంచే ప్రారంభమవుతుంది.ఈ నాలుగు నెలలు జపం, ధ్యానం, దానం, విష్ణు ఆరాధన, పురాణ పారాయణం చేస్తే అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుందని పేర్కొంది.తొలి ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుని నామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పఠనం అత్యంత శ్రేయస్కరమని సంప్రదాయం.భీష్ముడు యుధిష్ఠిరునికి ఏకాదశి మహిమను వివరిస్తూ, ఉపవాసం, దానం, విష్ణుభక్తి ప్రాముఖ్యతను బోధించాడు. అతని ఉపదేశాలే తరువాత అనేక ధర్మగ్రంథాలకు ఆధారమయ్యాయి. గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో శ్రీ చైతన్య మహాప్రభువు ప్రతి ఏకాదశిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించేవారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో శ్రీ రామానుజులు ఏకాదశి ఆచరణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. మధుమేహం, గర్భధారణ, దీర్ఘకాలిక వ్యాధులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయవలసిన అవసరం లేదు.. ‘ఓం నమో నారాయణాయ’భారతీయ సనాతన ధర్మంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ, తాత్విక ప్రాముఖ్యత ఉంది. వాటిలో ఆషాఢ శుక్ల ఏకాదశి అనగా తొలి ఏకాదశిని అత్యంత పవిత్రమైన పర్వదినంగా పరిగణిస్తారు. ఈ రోజునే శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని, ఈ రోజు నుంచే చాతుర్మాస్య వ్రతాలు ప్రారంభమవుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి.తొలి ఏకాదశి రోజున చేయవలసినవి- బ్రహ్మముహూర్తంలో లేవాలి.- స్నానం చేసి విష్ణుపూజ చేయాలి.- ఓం నమో నారాయణాయ అనే నామ మంత్రాన్ని జపించాలి.- విష్ణు సహస్రనామం చదవాలి.- భగవద్గీత పారాయణం చేయాలి.- తులసి దళాలతో శ్రీమహావిష్ణువును అర్చించాలి.- ద్వాదశి రోజున అన్నదానం చేయాలి. విధిగా పారణ చేయాలి.చేయకూడనివి- కోపం, అసత్యం, పరనింద, మద్యపానం, మాంసాహారం, వ్యర్థ వాదనలు, అధిక నిద్రను త్యజించాలని శాస్త్రాలు చెబుతాయి.తొలి ఏకాదశి చెప్పే సందేశంతొలి ఏకాదశి మనకు కేవలం ఆహారాన్ని తగ్గించడం మాత్రమే కాదు, అహంకారం, కోపం, లోభం, అసూయ వంటి అంతరంగ దోషాలను తగ్గించుకోవాలని బోధిస్తుంది. భగవంతునికి దగ్గర కావడానికి ముందు మన మనస్సును పవిత్రం చేసుకోవాలనే సందేశాన్ని ఈ పర్వదినం అందిస్తుంది. తొలి ఏకాదశి అనేది ఒక పండుగ మాత్రమే కాదు; అది భక్తి, నియమం, ఆత్మపరిశీలన, ధర్మాచరణ, ప్రకృతితో సమన్వయ జీవన విధానానికి శ్రీకారం చుట్టే మహోన్నత దినం. పద్మ పురాణం, స్కంద పురాణం, భవిష్య పురాణం వంటి శాస్త్రాలు దీనిని అత్యున్నత వ్రతాలలో ఒకటిగా కొనియాడాయి.– మద్దికుంట శ్రీకాంత్ శర్మ, హిందూ ధర్మచక్రంనిర్వహణ: డి.వి.ఆర్. -
పగటి కలల వల్ల పనిలో వెనుకబడుతున్నాను!
నాకు 29 ఏళ్లు. ఒక ఎం.ఎన్.సి. లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. చిన్నప్పటి నుంచే క్లాసులో పగటినిద్ర పోతూ పాఠాలపై ఎక్కువసేపు దృష్టి నిలిపేవాడిని కాదు. రాత్రి బాగా నిద్రపోయినా ఉదయం క్లాసుకు వెళ్తే మళ్లీ నిద్రపోవాలనిపించేది. అలాగే ప్రతిపనీ చివరి వరకు వాయిదా వేయడం నా అలవాటు. అయినా చదువులో వెనుకబడలేదు. ఐఐటీలో సీటు కూడా సంపాదించాను. కానీ ఉద్యోగ జీవితంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యలు మరింతగా ఇబ్బంది పెడుతున్నాయి. ఆఫీసులో కూడా తరచూ పగటి కలల్లో మునిగిపోతూ ఉంటాను. చేయాల్సిన పనులను చివరి నిమిషం వరకు ప్రారంభించలేకపోతున్నాను. దాంతో కొన్ని ప్రాజెక్టు ల్లో తప్పులు జరుగుతున్నాయి. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఒకోసారి నాకు బాగా తెలిసిన వ్యక్తుల పేర్లు, వస్తువుల పేర్లు లేదా ఫోన్ నంబర్లు వెంటనే గుర్తుకు రావడం లేదు. దీనివల్ల నా వ్యక్తిగత జీవితంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నా స్నేహితులు, అలాగే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి కూడా ‘నీకు ఏదో సమస్య ఉన్నట్లుంది. ఒకసారి డాక్టర్‌ను కలవడం మంచిదని చెబుతున్నారు. దాంతో నేను పూణేలో ఒక న్యూరాలజిస్టును సంప్రదించగా ఆయన పరీక్షలు చేసి మెదడులో సమస్యేం లేదు కానీ ఒక సైకియాట్రిస్టును కలవాలని సూచించారు. అసలు నా సమస్య ఏంటి? దానికి చికిత్స ఉందా... వివరించగలరు. – సుధీర్, పూణేఐఐటి లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థలో చదివి, ప్రస్తుతం ఒక మంచి కంపెనీలో ఇంజినీర్ గా పనిచేస్తున్నారంటే మీరు అత్యంత మేధస్సు కలిగిన వారని అర్థమవుతోంది. మీరు న్యూరాలజిస్ట్‌ను కలిసినప్పుడు ఆయన మీ మెదడులో ఎలాంటి నిర్మాణపరమైన లోపాలు లేవని నిర్ధారించి,సైకియాట్రిస్ట్‌ను కలవమని సూచించారన్నారు. మీరు వివరించిన లక్షణాలను బట్టి మానసిక వైద్యశాస్త్రంలో దీనిని హై ఫంక్షనింగ్ ఏడీహెచ్‌డీ అండ్ ఇంటరాక్టివ్ టైప్ గా పిలుస్తారు. అంటే ఏకాగ్రత లోపించడం, పనులు వాయిదా వేయడం వంటి లక్షణాల సమాహారం. చాలామందిలో ఈ సమస్య చిన్న వయసులోనే గుర్తిస్తారు. మీకున్న తెలివితేటల వల్ల మీరు చిన్నప్పుడు సులువుగా ఈ సమస్యను ఎదుర్కొన్నారు, పరీక్షల్లో మంచి మార్కులు సాధించగలిగారు. చిన్న వయసు నుండి ఎక్కువగా పగటి కలలు కనడం అనేది ఈ రకం ఏడీహెచ్డీలో కనబడే అత్యంత ముఖ్యమైన లక్షణం. డెడ్‌లైన్ దగ్గరికి వచ్చినప్పుడు మెదడులో ‘అడ్రినలిన్’,‘కార్టిసోల్’ లాంటి స్ట్రెస్ హార్మోన్స్ విడుదలవుతాయి. ఎమర్జెన్సీలో మాత్రమే మీ మెదడు ఉత్తేజితమై పనిని పూర్తి చేయగలుగుతుంది. మీ తెలివితేటల వల్ల తక్కువ సమయం విన్నా పరీక్షల ముందు చదివి పాస్ అయిపోయారు. కానీ ఉద్యోగంలో అలా ఉండదు. ఇక్కడ రోజూ పరీక్షే! రోజూ కొత్త సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుంది. మీకున్న చివరి నిమిషం వరకు వాయిదా వేసే అలవాటు వల్ల మరింత నష్టం. అయితే మీరు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆధునిక వైద్య విధానంలో దీనికి అద్భుతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఒక మంచి సైకియాట్రిస్ట్‌ను కలిస్తే, మందుల ద్వారా మెదడులోని రసాయనాలను సమతుల్యం చేస్తే మీ ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది. బిహేవియర్ థెరపీ ద్వారా కూడా మంచి ‘టైమ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్’ నేర్పుతారు. పనులను వాయిదా వేసే అలవాటును ఎలా తగ్గించుకోవాలో, రోజువారీ పనులను ఎలా ప్లాన్ చేసుకోవాలో ప్రాక్టికల్‌గా గైడ్ చేస్తారు. మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూణేలోనే ఒక మంచి సైకియాట్రిస్ట్ ను సంప్రదించండి. సరైన చికిత్సతో మీ సమస్య పూర్తిగా అదుపులోకి వస్తుంది, మీ మేధస్సుకు తగ్గ స్థానాన్ని మీరు కెరీర్లో రీచ్ అవుతారు. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
ఇఆర్–100
వన్స్ అపాన్ ఏ టైమ్... మనిషి ఆకాశంలోకి ఎగరడమనే ఊహే నాన్సెన్స్గా అనిపించింది. ‘మనిషి చంద్రుడిపై అడుగు పెట్టడం పగటి కల. అసాధ్యం’ అన్నారు. ‘వృద్ధాప్యం స్పీడ్‌కు అడ్డుకట్ట వెయ్యడం, నిత్య యవ్వనం’ అనేది ఈ కాలం ఆలోచన. ఆచరణ సాధ్యం అవుతుందా? ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ప్రోగ్రామింగ్ ‘ఇఆర్–100’తో ‘అవును’ అనే అభిప్రాయం వినిపిస్తోంది...దావోస్‌లో ఒక ఇంటర్వ్యూయర్ ఎలాన్ మస్క్‌ను అడిగారు...‘వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయవచ్చని మీరు భావిస్తున్నారా?’సమాధానంగా... ‘వృద్ధాప్య సమస్యపై నేను ఎక్కువ సమయాన్ని వెచ్చించలేదు. అయితే అది చాలా సులభంగా పరిష్కరించగల సమస్య’ అన్నారు ఎలాన్ మస్క్.‘ఎలాన్ ఎన్నయినా చెబుతాడు. ఆయన శాస్త్రవేత్త కాదు కదా!’ అనుకుంటాం. అయితే ఆయన అభి్రపాయం తో హార్వర్డ్ ప్రొఫెసర్ డేవిడ్ సింక్లేర్ ఏకీభవించారు.మైలురాయి... బోస్టన్ లైఫ్ బయోసైన్సెస్ ఆర్గనైజేషన్, దెబ్బతిన్న కణాలలో కొంత భాగాన్ని రీసెట్ చేసే ప్రయోగాలు చేస్తోంది. దీర్ఘాయువుకు సంబంధించి ఇదొక మైలురాయిగా చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ ప్రయోగాలు, ఎప్పుడూ యవ్వనంగా కనిపించేలా చేయడం, శాశ్వతంగా జీవించేలా చేయడం లక్ష్యంగా పెట్టుకోలేదు. తీవ్ర కంటి వ్యాధులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాయి. దీనికి ఇఆర్–100 అని పేరు పెట్టారు.పాక్షిక ప్రోగ్రామింగ్... ఇఆర్–100 దీర్ఘకాలిక లక్ష్యం... పాక్షిక రీపోగ్రామింగ్. దీనిలో దెబ్బతిన్న కణాలను తిరిగి యవ్వన జీవస్థితికి తీసుకువస్తారు. ఇది విజయవంతమైతే, వృద్ధాప్యం, వ్యాధి, గాయాల కారణంగా మందగించిన కణాల పనితీరును పునరుద్ధరించవచ్చు. మొదటి దశ... ప్రస్తుతం చేసేది మానవులపై చేసే మొదటి దశ ప్రయోగం. ప్రయోగదశలో భద్రతను, సహనాన్ని పరీక్షించడం మొదటి దశ ముఖ్యోద్దేశం. ఇఆర్–100 ప్రయోగంలో పాల్గొనేవారికి సంబంధించి అయిదు సంవత్సరాల వరకు దీర్ఘకాలిక ఫాలో–అప్ ప్రణాళికలు రూపొందించారు. ఈ ఫాలో–అప్‌లో దుష్ప్రభావాలు, రోగనిరోధక ప్రతిస్పందనలు, దృష్టి పనితీరులో మార్పులను గమనిస్తారు. రీ ప్రోగ్రామ్ చేయబడిన కణాలు సరిగ్గా పనిచేస్తాయా లేదా అనే సందేహంతో పాటు కణాల గుర్తింపును మార్చడం వల్ల ఊహించని ప్రమాదాలు తలెత్తవచ్చు అనే ఆందోళన లేకపోలేదు.జపనీస్ స్టెమ్–సెల్ సైంటిస్ట్ షినకా యన్యమాకా కీలక ఆవిష్కరణ ఆధారంగా ఇఆర్–100 థెరపి పనిచేస్తుంది. ‘యమనకా ఫ్యాక్టర్స్’ అనే ప్రొటీన్ల సమూహాన్ని ఉపయోగించి, తిరిగి యవ్వన స్థితికి చేరేలా ‘ప్రోగ్రామింగ్’ చేయవచ్చునని రుజువైంది.చారిత్రక మలుపు... ‘జీవగడియారాన్ని వెనక్కి తిప్పే దిశగా అడుగులు వేస్తున్నారు. వృద్ధాప్యాన్ని జీవితంలో అనివార్యమైన మార్పుగా కాకుండా ఆరోగ్య సమస్యగా చూసే అవకాశాలు ఉన్నాయి’ అంటున్నారు ప్రముఖ లాంగ్విటీ సైంటిస్ట్ ప్రొఫెసర్ డేవిడ్ సింక్లేర్.‘ది సైన్స్ ఆఫ్ లివింగ్ లాంగర్ అండ్ బెటర్’ అంశంపై దుబాయ్‌లో జరిగిన సదస్సులోని ముఖ్యాంశాలు → బయోటెక్నాలజీ రంగంలో వస్తున్న పురోగతి శాస్త్రవేత్తల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తోంది. రాబోయే పది, ఇరవై సంవత్సరాలలో వృద్ధాప్యాన్ని నిరోధించే ప్రయోగాలు జరగనున్నాయి.→ వయసు సంబంధిత వ్యాధులలో ఎనభై ఏళ్లొచ్చేసరికి చాలామంది దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నారు. అన్నిరకాల క్యాన్సర్లను నిర్మూలించడం వల్ల ఆయుర్దాయం కేవలం 2.5 సంవత్సరాలు మాత్రమే పెరుగుతుంది, ఎందుకంటే ఇతర వ్యాధులు అప్పటికీ వస్తూనే ఉంటాయి. అందువల్ల ఎన్నోరకాల అనారోగ్యాలకు మూలకారణమైన వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయడంపై దృష్టి పెట్టాలి.→ వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయడానికి మా బృందం హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధమవుతోంది. కణాలను యవ్వనస్థితిలో పునరుద్ధరించే ఎపిజెనెటిక్ ప్రోగ్రామింగ్ చికిత్సలను పరీక్షిస్తాము. వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేసి వ్యాధులను నయం చేయవచ్చా లేదా– అనేది చరిత్రలో మొదటిసారి పరీక్షించబోతున్నాం. ఆర్థిక ప్రయోజనాలు కూడా... జీవవ్యవస్థ, కణాల పనితీరును మెరుపరచడానికి శాస్త్రవేత్తలు మార్గాలు కనుగొంటున్నారు. సింక్లేర్ బృందం కొన్ని వారాల్లోనే జంతుకణజాలాలలో వృద్ధాప్యాన్ని 75 శాతం వరకు తిప్పికొట్టగల సామర్థ్యాన్ని ఇప్పటికే ప్రదర్శించింది. ఎపిజెనెటిక్ ప్రోగ్రామింగ్ థెరపీ మొదటి మానవ ప్రయోగానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిస్ట్రేషన్ ఆమోదం తెలిపింది. ‘వృద్ధాప్యాన్ని నెమ్మదింపచేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి’ అంటున్నారు సింక్లేర్. ‘స్వచ్ఛమైన నీరు, వాక్సిన్ల ఆవిష్కరణల తరువాత మానవాళికి అత్యంత ముఖ్యమైన ప్రయోగం...ఇఆర్–100’ అంటున్నారు పరిశీలకులు.కోడ్ నేమ్ఇఆర్–100 అనేది లైఫ్ బయోసైన్సెస్ అనే సంస్థ రూపొందించిన సంకేత నామం. బోస్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ వ్యవస్థాపకులలో డేవిడ్ సింక్లేర్ ఒకరు. ‘ప్రోగ్రామింగ్’ అనే కాన్సెప్ట్ ద్వారా కంటి వ్యాధులకు చికిత్స చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కాన్సెప్ట్‌కు మంచి స్పందన లభించింది. విప్లవాత్మకమైన ‘ప్రోగ్రామింగ్’లో పెట్టుబడి పెట్టడానికి సిలికాన్ వ్యాలీలోని న్యూ లిమిట్, రెట్రో బయో సైన్సెస్‌లాంటి ప్రముఖ టెక్ కంపెనీలు ముందుకు వచ్చాయి! -
ఐవీఎఫ్‌లో ఏం జరుగుతుందంటే...
సామాన్య ప్రజలు టెస్ట్‌ట్యూబ్ బేబీ అని పిలిచే ఈ ప్రక్రియనే వైద్య పరిభాషలో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) అంటారు. దీని కంటే ముందుగా కొందరిలో ఇంటా యుటెరైన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ) ప్రక్రియను అనుసరిస్తారు. ఐయూఐలో మిగతాదంతా నేచురల్ పద్ధతిలోనే జరిగినప్పటికీ కేవలం వీర్యకణాలను నేరుగా యోని మార్గం గుండా సెర్విక్స్ ద్వారా గర్భాశయంలోకి పంపుతారు. దీనితో పోలిస్తే ఐవీఎఫ్ చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఇది కృత్రిమ గర్భధారణ ప్రక్రియలో దంపతులకు ఓ వరం. ఇందులో వరసగా ఏమేం జరుగుతుందో, స్టెప్ బై స్టెప్ చూద్దాం...ఐవీఎఫ్‌లో ముందుగా మహిళలో అండాల సంఖ్య పెద్దమొత్తంలో పెరిగేందుకు మందులిస్తారు. వాటిల్లోంచి బాగా ఆరోగ్యంగా ఉన్న కొన్నింటిని సేకరించి, పురుషుడి నుంచి సేకరించిన వీర్యకణాలతో ల్యాబ్‌లోని ‘టెస్ట్‌ట్యూబ్’లో ఫలదీకరణం చేస్తారు. ఇలా ఫెర్టిలైజ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ పిండాలూ పెరగవచ్చు.ఇలా రూపొందించిన పిండాల్లో ఆరోగ్యకరమైన వాటిని మహిళ గర్భంలోకి ప్రవేశపెడతారు. రెండు వారాలప్పుడు ఒకసారి చూసి... మళ్లీ నాలుగు వారాల తర్వాత అల్ట్రాసౌండ్ పరీక్ష చేసి, గర్భం నిలిచిందా లేదా అన్నది నిర్ధారణ చేసుకుంటారు. గర్భం నిలవకపోతే కారణాలను విశ్లేషించి, మళ్లీ ప్లాన్ చేస్తారు.వరుస క్రమంలో జరిగే ప్రక్రియలు.. (ఒవేరియన్ స్టిమ్యులేషన్) ఇందులో అండాశయాల నుంచి ఎక్కువ అండాలు తయారుకావడం కోసం హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు. దీన్నే ఒవేరియన్ స్టిమ్యులేషన్ అంటారు. ఈ టైములో వెజైనల్ స్కానింగ్ ద్వారా మహిళలోని అండాలను పర్యవేక్షిస్తూ, హార్మోన్ పరీక్షలు చేస్తూ, అండాల సంఖ్య, సైజు నిర్ణీత స్థాయికి వచ్చేవరకు వేచిచూస్తారు. అండాలను తీయడం అండాలు తగిన సైజుకు పెరిగాక... అనస్థీషియాతో మహిళకు నొప్పి తెలియకుండా యోని మార్గం నుంచి సన్నటి, పొడవాటి సూది ద్వారా అండాశయాల నుంచి అండాలను బయటకు తీస్తారు. దీన్ని ‘ఎగ్/ఊసైట్ రిట్రైవల్’ అంటారు. 3. ఫలదీకరణ (ఫెర్టిలైజేషన్): బయటకు తీసిన అండాలను మైక్రోస్కోప్‌లో పరీక్షిస్తూ, మంచి అండాలను వేరుచేస్తారు. వాటిని శుభ్రపరచి, వాటిల్లో నాణ్యమైనవిగా గుర్తించిన వాటిని శుక్రకణాలతో న్యూట్రిషన్ మీడియా ఉన్న ఓ చిన్న డిష్‌లో కలుపుతారు. ఇలా ఫలదీకరణ జరుగుతుంది. ఇది అనేక కణాలుగా విభజితమవుతూ, పిండంగా మారుతుంది. వీటిల్లో ఇలా కలిపిన అండాలన్నీ ఫలదీకరణ చెందకపోవచ్చు. కొన్ని మాత్రమే పిండంగా ఏర్పడతాయి. → ఐసీఎస్ఐఈ (ఇక్సీ): అండాలను, శుక్రకణాలతో కలిపే సమయంలో కొన్నిసార్లు వీర్యకణాలు వాటంతట అవే అండంలోకి వెళ్లలేకపోవచ్చు. అప్పుడు శుక్రకణాన్ని సన్నటి సూది ద్వారా అండంలోకి నేరుగా ఇంజెక్ట్ చేస్తారు. దీన్నే ‘ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్’ (ఇక్సీ) అంటారు. కణవిభజన (ఎంబ్రియో కల్చర్): ఫలదీకరణ జరిగిన ఆ అండాలను, న్యూట్రిషన్ మీడియా ఉన్న ఒక డిష్‌లో పెట్టి, ఇంక్యుబేటర్‌లో 3 – 5 రోజుల పాటు అలా ఉంచేస్తారు. వీటిలో కణాలు విభజన జరుగుతూ తయారైన పిండాన్ని 3 నుంచి 5 రోజులలోపు బయటకు తీసి, మైక్రోస్కోప్‌లో వాటి నాణ్యతను పరీక్షిస్తారు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్: ఇంక్యుబేటర్‌లో కాస్తంత పెరిగిన పిండాల్లోని నాణ్యమైన వాటిని వేరుచేసి, వాటిలో 2, 3 పిండాలను సన్నటి కాన్యులా ద్వారా గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. మిగిలిన పిండాలను ఫ్రీజ్ చేస్తారు. ఇలా గర్భాశయంలోకి ప్రవేశపెట్టడాన్ని ‘ఎంబ్రియో ట్రాన్స్ఫర్’ అంటారు. ఇంప్లాంటేషన్: ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ద్వారా గర్భాశయంలోకి పంపిన పిండాలు... గర్భాశయంలోని పొరలోకి అంటుకుపోయి, పెరగడం మొదలవుతాయి. ఇది అందరిలోనూ నార్మల్‌గా జరగకపోవచ్చు. ఈ ప్రక్రియ సజావుగా జరడానికి, గర్భాశయపొర బాగుండాలి. దానికి రక్తప్రసరణ, హార్మోన్లతో పాటు ఇంకా తెలియని అనేక అంశాలు సరిగా ఉండాలి. అప్పుడు మాత్రమే గర్భాశయం పిండాన్ని స్వీకరిస్తుంది. అలా స్వీకరిస్తేనే గర్భం నిలుస్తుంది. అయితే అందరిలోనూ పిండం ఎందుకు అతుక్కోదనే దానికి కారణాలు ఇంకా తెలియదు. అందుకే ఈ ఐవీఎఫ్ (టెస్ట్‌ట్యూబ్) పద్ధతిలోనూ గర్భం దాల్చే అవకాశాలు 40 – 50 శాతమే!ల్యూటియల్ ఫేజ్ సపోర్ట్→ పిండం గర్భాశయపొరలోకి అంటుకుపోయేలా చేసే ‘ఇంప్లాంటేషన్’ సక్సెస్ అయ్యేందుకు కొన్ని మందులను మాత్రలూ, ఇంజెక్షన్లూ, జెల్స్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది.→ దంపతుల్లో ‘టెస్ట్‌ట్యూబ్ బేబీ’ పద్ధతి ఒకసారి ఫలించకపోతే, మళ్లీ కొన్ని నెలలు ఆగి, మళ్లీ మళ్లీ ప్రయత్నించవచ్చు. ఇలా రెండుమూడు సార్లు ప్రయత్నించి చూస్తారు. ఒకసారి సఫలం కాకపోతే, మళ్లీ ఒకసారి దంపతులకు చేయించిన పరీక్షలన్నీ తిరిగి సరిచూసుకుంటూ, కారణాలను పునఃసమీక్షించుకుంటూ, ఇంకా ఏమైనా సమస్యలున్నాయా అంటూ విశ్లేషించుకుంటూ, అవసరమైన పరీక్షలేమైనా ఉంటే అవి కూడా చేయిస్తూ, చికిత్సల్లో కొద్దిపాటి మార్పులు చేస్తూ, డాక్టర్లు టెస్ట్ట్యూబ్బేబీ పద్ధతిని మళ్లీ ప్రయత్నిస్తారు.కన్నది మేమే కాని...కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని పాట వరకు పాడుకుంటాం కాని, నిజ జీవితంలో కొన్ని తికమకల వల్ల జీవితాలే తలకిందులవుతాయి. నవ మాసాలు మోసి కన్న తల్లికి పుట్టింది తన బిడ్డ కాదని అంటే? ఐవీఎఫ్ పద్ధతిలో జరిగిన తప్పిదాల వల్ల ఇప్పుడు అలాంటి వింతలే వినాల్సి వస్తోంది. అమెరికాలోని ఫ్లోరిడాకి చెందిన టిఫనీ స్కోర్, ఆమె భర్త స్టీవెన్ మిల్స్ ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐవీఎఫ్ ద్వారా తల్లిదండ్రులు కావాలని నిర్ణయించుకున్నారు. ఫెర్టిలిటీ సెంటర్ ఆఫ్ ఓర్లాండ్లో రూపొందించిన ఎంబ్రియోలలో ఒక దానిని టిఫనీ గర్భాశయంలో ప్రవేశపెట్టారు. 2025 డిసెంబర్ 11న టిఫనీ ఆరోగ్యవంతమైన ఆడబిడ్డ (షియా)కు జన్మనిచ్చింది. కాని ట్విస్ట్ ఏంటంటే, పుట్టిన బిడ్డకి జన్యుపరంగా టిఫనీ, స్టీవెన్‌లు తల్లిదండ్రులు కారు. డీఎన్ఏ పరీక్ష చేయించగా... ఆ బిడ్డకి బయోలాజికల్స్ పేరెంట్స్ తాము కాదని తెలిసింది. కాని టిఫనీ మనసు బరువైంది. జన్యుపరంగా తమ బిడ్డ కాకపోయినా నవ మాసాలు మోసింది తానే కదా.. ఆ మాతృత్వ భావన తనని, బిడ్డని వేరు చేయడానికి ఇష్టపడలేదు.. షియాని తామే పెంచుకుంటామని టిఫనీ, స్టీఫెన్లు నిర్ణయించుకున్నారు.మరో సంఘటనలో ఆస్ట్రేలియా బ్రిస్బేన్‌లోని ఓ ప్రముఖ ఫెర్టిలిటీ సెంటర్ మోనాష్ ఐవీఎఫ్ సెంటర్లో మానవ తప్పిదం కారణంగా ఒక మహిళకు మరో కుటుంబానికి చెందిన ఎంబ్రియో పొరపాటున బదిలీ అయ్యింది. ఇది తెలియక సదరు మహిళ గర్భం దాల్చి ఒక మగశిశువుకి జన్మనిచ్చింది. ఆ బిడ్డకి ఇప్పుడు రెండేళ్లు కావస్తోంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనపై విచారణ చేయగా పొరపాటు వల్లే ఇంతటి పెను సమస్య వచ్చిందని నిర్ధారించారు. ఈ రెండు కథలలో బిడ్డకు జన్యుపరంగా తల్లులు కాలేకపోయినా పేగుపాశం ఆ బంధాలను శాశ్వతం చేసింది. డాక్టర్ రాధికా గుప్తాసీనియర్ కన్సల్టెంట్ – ఫెర్టిలిటీ స్పెషలిస్ట్నిర్వహణ: యాసీన్ -
రీల్స్ దాటి రియల్ వరల్డ్‌లోకి
వారిని స్మార్ట్‌ఫోన్ తో పుట్టిన తరం అన్నారు. ‘స్క్రీన్ అడిక్ట్స్’ అని ముద్ర వేశారు. కాని నేటి జెన్–జి టీనేజర్లు మూస అంచనాలను ముక్కలు చేస్తున్నారు. కేవలం మార్కుల వేటలోనో ఆటల మైదానంలోనో వారు లేరు. సమాజంలోని తప్పులపై గొంతు విప్పుతున్నారు. సోషల్ మీడియాను అందుకు వేదికగా మలుస్తున్నారు. మరి ఇంతటి సామాజిక స్పందన గల పిల్లల పట్ల తల్లిదండ్రుల కర్తవ్యం ఏంటి? ‘గుడ్’ అనాలా? ‘నో’ అనాలా?హైదరాబాద్‌లో 10వ తరగతి చదివే అన్విత తన స్కూల్లో ‘నో ఫుడ్ వేస్ట్’ క్యాంపెయిన్ మొదలుపెట్టింది. లంచ్ అవర్‌లో మిగిలిన అన్నాన్ని అనాథాశ్రమానికి పంపే సిస్టమ్ వచ్చేలా చేసింది.బెంగళూరులో కొంతమంది టీనేజర్లు వృద్ధుల కోసం ‘డిజిటల్ సహాయ కేంద్రం‘ నడుపుతున్నారు. ఫోన్ లో యాప్ డౌన్ లోడ్ చేయడం దగ్గర నుంచి ఆన్ లైన్ పేమెంట్ వరకు వారికి నేర్పుతున్నారు. చెట్లను కొట్టేస్తున్న ప్రతిసారీ ‘సేవ్గ్రీన్’ పేరుతో టీనేజర్స్ రంగంలో దిగుతూనే ఉన్నారు.ఒకప్పుడు పిల్లలంటే ఉదయం స్కూలు, సాయంత్రం ట్యూషన్, ఆదివారం సినిమా అనుకునేవాళ్లం. కానీ 2026 నాటి టీనేజర్లు ఆ గీతలన్నీ చెరిపేశారు. అన్యాయం కనిపిస్తే గొంతు విప్పుతున్నారు. గతంలో సమాజంలో ఏం జరుగుతుందో పెద్దలు చెబితేనే పిల్లలకు తెలిసేది. కానీ నేడు డిజిటల్ విప్లవం వల్ల ప్రపంచంలోని ప్రతి చలనం పిల్లలకు తెలిసిపోతూ ఉంది. గ్లోబల్ వార్మింగ్, సామాజిక సమానత్వం, లింగ వివక్ష, జంతు సంరక్షణ వంటి విషయాలపై వారు కేవలం పోస్టులు చదివి ఊరుకోవడం లేదు. లేదా పోస్టులు పెట్టడంతో ఆగడం లేదు. ఆ కారణాల కోసం వీధుల్లోకి వస్తున్నారు. ఒక అన్యాయం జరిగితే డిజిటల్ పిటిషన్లు వేస్తున్నారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సేకరించి బాధితులకు సాయం చేస్తున్నారు. వారి ఆలోచనల్లో స్వార్థం లేదు, వ్యవస్థను మార్చాలనే పట్టుదల తప్ప. మార్పు తమతోనే మొదలు కావాలని వారు బలంగా నమ్ముతున్నారు.‘నో’ చెప్పాలా? ‘గుడ్’ అనాలా? పిల్లలు సామాజిక విషయాలపై తీవ్రంగా స్పందిస్తున్నప్పుడు ఇళ్లలో ఒక రకమైన నిశ్శబ్ద ఆందోళన మొదలవుతుంది. ‘ఇప్పుడే ఈ గొడవలు ఎందుకు? చదువు పాడు కాదా? కెరీర్ ఏమైపోతుంది? సమాజం మారదు, మన పిల్లలు ఇబ్బందుల్లో పడతారు’ అనే భయాలు తల్లిదండ్రులను వెంటాడుతుంటాయి. ఇది జనరేషన్ గ్యాప్ ఆందోళన. ఈ ఆందోళనతో పిల్లల ఉత్సాహాన్ని ‘నో’ అని నొక్కేయడం తప్పు. అలాగని ప్రతిదానికీ కళ్లు మూసుకుని ‘గుడ్’ అని వదిలేయడమూ ప్రమాదకరమే. ఇంటర్నెట్ ప్రపంచంలో ఎంత సమాచారం ఉందో, అంతకంటే ఎక్కువ తప్పుడు ప్రచారాలు (ఫేక్‌న్యూస్), అజెండాలు ఉంటాయి. ఇంకా మానసికంగా పూర్తిగా పరిణతి చెందని టీనేజర్లు సులభంగా భావోద్వేగాలకు లోనై తప్పుదారి పట్టే లేదా సైబర్ బుల్లీయింగ్‌కు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కావాల్సింది నిషేధం కాదు, వివేకంతో కూడిన మార్గదర్శకత్వం. మరి ఏం చేయాలి?అనుభవం అనే గేట్లుపిల్లల చైతన్యం ఒక స్వచ్ఛమైన ప్రవాహం లాంటిది. అయితే ఆ ప్రవాహానికి పెద్దల అనుభవం అనే గట్లు తోడైనప్పుడే అది సమాజానికి ఉపయోగపడే శక్తిగా మారుతుంది. రేపటి పౌరులను బాధ్యతాయుతంగా తీర్చిదిద్దడం అంటే వారి రెక్కలను కత్తిరించి పంజరంలో పెట్టడం కాదు. ఎటు ఎగరాలో, ఎలాంటి సుడిగాలులను తట్టుకోవాలో దిశను చూపించడం. జెన్–జి పిల్లల సామాజిక ఆరాటాన్ని గౌరవిస్తూ, వారికి అనుభవంతో కూడిన అండగా నిలవడమే నేటి పెద్దల అసలైన కర్తవ్యం. అప్పుడే ఈ తరం రీల్స్ ప్రపంచం నుండి రియల్ వరల్డ్ లీడర్స్‌గా ఎదుగుతుంది.పెద్దలు చేయాల్సిన 5 పనులునేటి పిల్లలకు ‘డిక్టేటర్స్’ (శాసించేవారు) అవసరం లేదు. వారికి కావాల్సింది ’మెంటర్స్’ (మార్గదర్శకులు). తల్లిదండ్రులు పిల్లల ఆలోచనలకు స్పేస్ ఇస్తూనే, రక్షణ కవచంగా మారాలి. → ముందు వినండి: పిల్లలు దేని గురించి మాట్లాడుతున్నారో, ఏ సమస్యపై ఆందోళన చెందుతున్నారో ముందు కూర్చోబెట్టి వినండి. వారి అభి్రపాయాలను చిన్నపిల్లల మాటలని కొట్టిపారేయకండి.→ లాజిక్‌తో సరిదిద్దండి: ఒకవేళ వారు తీసుకున్న స్టాండ్ ఆవేశపూరితంగానో లేదా తప్పుగానో అనిపిస్తే ‘వద్దు’ అని అరిచే కంటే, ఎందుకు వద్దో లాజికల్‌గా చెప్పండి. లీగల్ అంశాలను సున్నితంగా వివరించండి.→ డిజిటల్ హైజీన్ నేర్పండి: సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదీ నిజం కాదని చెప్పాలి. ఉద్వేగంలో పెట్టే ఒక్క పోస్ట్ వారి భవిష్యత్తును, కెరీర్‌ను ఎలా దెబ్బతీస్తుందో ఉదాహరణలతో వివరించండి.→ ఆచరణాత్మక మార్గం చూపండి: సమాజం కోసం ఏదో చేయాలనే వారి తపనను కేవలం ఆన్ లైన్ హ్యాష్‌ట్యాగ్‌లకే పరిమితం చేయకుండా, స్థానిక స్వచ్ఛంద సంస్థల్లో (ఎన్.జి.ఓ) సభ్యత్వం ఇప్పించడం, పర్యావరణ సేవల వంటి ప్రత్యక్ష కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా వారి ఎనర్జీని సరైన దిశలో మళ్లించవచ్చు.→ సమతుల్యత నేర్పండి: సామాజిక స్పందన మంచిదే అయినా, అది వారి చదువును, భవిష్యత్తును దెబ్బతీయకుండా సమతుల్యత పాటించాలని చెప్పండి. కెరీర్– కాజ్ రెండూ ముఖ్యమే అని చెప్పండి.కె. -
తామర పువ్వులు తింటే.. నిజంగానే జ్ఞాపకశక్తిని కోల్పోతామా?
బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న హాలీవుడ్ చిత్రం ఒడిస్సీ ఫస్ట్ వీకెండ్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 2 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ చిత్ర భారత్ బాక్సాఫీస్ వద్ద రూ. 7.78 కోట్లు వసూల చేయడం విశేషం. ఆ మూవీలో జన్ వార్ తర్వాత ఒడిస్సియస్ సైన్యంతో కలిసి తన రాజ్యం ఇథాకాకు యలుదేరతాడు. పది రోజుల్లో చేరుకోవాల్సిన ప్రయాణం పదేళ్లు పడుతుంది.ఆ మధ్యలో ఓగిగియా అనే పౌరాణిక ద్వీపంలో చిక్కుకోవడంతో ఇలా జరుగుతుంది. ఆ ద్వీపంలో కాలిప్సో అనే అప్సరస అతనిపై మనుసుపడి..అక్కడే ఉంచేసుకుందామనే దురుర్దేశంతో నీలి తామరపువ్వుని తినిపించడంతో జ్ఞాపకశక్తిని కోల్పోయి ఇబ్బంది పడినట్లుగా చూపిస్తారు. మరి ఇంతకీ నిజంగా తామరపువ్వులు లేదా కలువలు తింటే నిజంగానే జ్ఞాపకశక్తిని కోల్పోతామా?, నిజంగానే నీలి తామర పువ్వులు అనారోగ్యకరమైనవా అంటే..'ది ఒడిస్సీ' (The Odyssey) అనే ప్రసిద్ధ గ్రీకు పురాణ కథలో, తామర పూలు (Lotus-eaters) తిన్నవారు తమ గతాన్ని, జ్ఞాపకాలను మర్చిపోయి హాయిగా జీవిస్తారని రాశారు. అలాగే మన భారతీయ పురాణాల్లో సైతం దీనికి అగ్రస్థానం ఇచ్చారు. దేవతలను ఈ పూలతో పూజిస్తే వారి అనుగ్రహం సులభంగా లభిస్తుందనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. రామాయణ, భారత ఇతి హాసాల్లో సైతం ఈ పువ్వుల గొప్పతనం గురించి రాసి ఉంటుంది. అలాంటి ప్రాముఖ్యత కలిగిన దేవతాపుష్పాలు తింటే జ్ఞాపకశక్తి పోవడం ఖాయమా? అంటే..తామర పువ్వులు, వేర్లు మరియు గింజలు జ్ఞాపకశక్తిని కోల్పోయేలా చేయవు. వాస్తవానికి, ఆసియా దేశాల సాంప్రదాయ వైద్యంలో తామర మొక్కలోని వివిధ భాగాలను నాడీ వ్యవస్థను మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగిస్తారు.అయినప్పటికీ, బ్లూ లోటస్ (Blue Lotus) వంటి కొన్ని ప్రత్యేక తామర జాతులను అధికంగా తీసుకుంటే, వాటిలో ఉండే ఆల్కలాయిడ్స్ వల్ల కొద్దిసేపు స్పృహ తప్పినట్లు, హాయిగా లేదా కొద్దిగా మత్తుగా అనిపించవచ్చని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయిఈజిప్షియన్ బ్లూ లోటస్, దీనిని బ్లూ వాటర్ లిల్లీ అని కూడా పిలుస్తారు, ఇందులో న్యూసిఫెరిన్ మరియు అపోర్ఫిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మెదడులోని డోపమైన్ సెరోటోనిన్ రిసెప్టర్లతో సంకర్షణ చెందుతాయి. ఈ సమ్మేళనాలు తేలికపాటి ఉల్లాసం, విశ్రాంతి, ప్రశాంత, ఆందోళన, పారానోయా, మానియా, ఇతర న్యూరోసైకియాట్రిక్ లక్షణాల వరకు ప్రభావాలతో ముడిపడి ఉన్నాయి. అయినప్పటికీ, మానవులపై దాని ప్రభావంపై మరింత లోతుగా పరిశోధన చేయాల్సి ఉంది. అయితే, కొన్ని మొక్కలలో నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే కొన్ని ఆల్కలాయిడ్లు, మరికొన్ని సమ్మేళనాలు ఉన్నాయని గుర్తించారు. తామరపువ్వు ఇలాంటి ప్రమాదం చూపించనప్పటికీ..జ్ఞాపకశక్తి లోపం, గందరగోళం, మతిభ్రమణం , బ్రాంతులకు కారణమయ్యే ఇతర మొక్కలు ఉన్నాయనేది గుర్తురెగాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.(చదవండి: IVF journey.: వెయ్యి ఇంజెక్షన్లు, రెండు గర్భస్రావాలు..! ఐవీఎఫ్ జర్నీపై నటి షాకింగ్ వ్యాఖలు) -
వెయ్యి ఇంజెక్షన్లు, రెండు గర్భస్రావాలు..! ఐవీఎఫ్ జర్నీపై నటి షాకింగ్ వ్యాఖ్యలు
సూపర్ మోడల్, బాలీవుడ్ నటి తేజస్విని కొల్హాపూరే టెలివిజన్ సిరీస్‌తో కెరీర్ మొదలు పెట్టి..'తేరా జాదూ చల్ గయా మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. విలక్షణమైన నటనతో మెప్పించి విమర్శకులు ప్రశంసలందుకున్న దిగ్గజ నటి. ఆమె స్వయాన పద్మినీ కొల్హాపూరేకు సోదరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌కు మేనత్త. ఆమె చిత్ర నిర్మాత, నటుడు పంకజ్ సరస్వత్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ దంపతులకు ఒక కుమార్తె. ఆమె సిద్ధార్థ కన్నన్ పాడ్‌కాస్ట్ తన ఐవీఎఫ్ జర్నీ గురించి చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ ప్రక్రియ ఎంత కష్టమైందో ఆవేదనగా చెప్పుకొచ్చారు. అంతేగాదు యువతకు సంతాన విషయంలో చక్కటి సందేశం కూడా ఇచ్చారామె. తన జీవితంలో చాలా కష్టమైన దశ అంటూ ఉంటే అది ఐవీఎఫ్ జర్నీనే కన్నటీపర్యంతమైంది. అది మానసికంగా, శారీరకంగా ఎంతటి ఒత్తిడికి గురిచేస్తుందో పంచుకుంది. తాను ఐదుసార్లు ఐవీఎఫ్ చేయించుకున్నానని, నిస్సంకోచంగా వెల్లడించింది. ఎందుకు ఇంత ధైర్యంగా చెబుతున్నాననంటే ఆ ప్రక్రియలో ఉండే కష్టాలపై అదరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతోనే అంటూ తను ఎదుర్కొన్న బాధను వివరించారామె. నటిగా ఉన్నప్పడు ఇప్పటికీ తన ఆకృతిలో ఎంతో వ్యత్యాసం ఉందని అన్నారు. మానసికంగా ఇప్పుడు బలంగా ఉన్నానను, కానీ ఆ సమయంలో శారీరకంగా మానసికంగా ఇంజెక్షన్ల వల్ల తన శరీరాకృతి ఘోరంగా మారిపోయిందని చెప్పుకొచ్చింది. సుమారు వెయ్యికి పైగా ఇంజెక్షన్లు తీసుకున్నానని అన్నారు. గర్భం ధరించేంత వరకు వాటిని ఇస్తూనే ఉంటారని చెప్పారు. అలా ఐదు సార్లు ఆ ప్రక్రియ చేయించుకున్నా..సక్సెస్కాలేదని..చివరికి తన ప్రయత్నం ఫలించి నిలిచినా..రెండు సార్లు గర్భస్రావం అనంతరం..ప్రెగ్నెంట్ అయినట్లు వివరించింది. ఆ మధ్యలో పడే బాధ అలాంటి ఇలాంటిది కాదని, మానసికంగా కుంగిపోతామంటూ వేదనగా చెప్పుకొచ్చింది. కాగా తేజస్విని కొల్హాపూరే, పంకజ్ సరస్వత్‌లు జనవరి 30, 2015న వేదిక అనే కుమార్తె జన్మనిచ్చారు. వివాహం అయిన ఎనిమిదేళ్లకు ఆ దంపతులకు సంతానం కలిగింది.(చదవండి: ఒకేసారి ఎంబీబీఎస్, ఇంజనీరింగ్..! కట్‌చేస్తే..) -
ఒకేసారి ఎంబీబీఎస్, ఇంజనీరింగ్..! కట్‌చేస్తే..
చాలామంది విద్యార్థులు వైద్య వృత్తి లేదా ఇంజనీరింగ్ కోర్సులలో ఏదో ఒకటి ఎంచుకుంటారు. ఇది సర్వసాధారణం. అలా కాకుండా రెండు నేర్చుకోగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు ఒకదాన్నే ఎందుకు ఎంచుకోవాలి అని ప్రశ్నించి మరీ విభిన్న మార్గంలో ప్రయాణించి సత్తా చాటింది. వైద్య రంగంలో ఓ సరికొత్త ఒరవడిని సృష్టించింది. ఎవరా అమ్మాయ్ అంటే..ఆ యువతే బీవీఎస్ మాధవి. ఆమె ఆంద్ర మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడే ఐఐటీ మద్రాస్‌లో డేటా సైన్స్ అండ్ ప్రోగ్రామింగ్‌లో బీఎస్ డిగ్రీ కూడా చేశారు. మెడికల్ స్కూల్, ఆసుపత్రి విధులు, కోడింగ్ అసైన్మెంట్లు, పరీక్షలు,పరిశోధనలు సమన్వయం చేసుకోవడం అంత సులభం కాదు. కానీ వైద్యం, సాంకేతికతను అనుసంధానించగలిగిన వారికే భవిష్యత్తు ఉంటుందని ప్రగాడంగా నమ్మింది మాధవి.ఆ నమ్మకమే నిజమై ఆమె వృత్తికి సరైన రూపునిచ్చింది. ప్రస్తుతం ఆమె ఎన్ఫరెన్స్లో జూనియర్ క్లినికల్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. అక్కడ ఆమె ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి ఆంకాలజీలో వాస్తవ ప్రపంచ ఆధారాలను వెలికితీస్తున్నారు. ఇది పరిశోధకులు కేన్సర్‌ను మరింత బాగా అర్థం చేసుకోవడానికి రోగుల సంరక్షణను మెరుగుపరుచడానికి సహాయపడుతుంది. మరి రెండు విభిన్న కోర్సులను ఎలా చదవగలిగిందంటే..ఏఐని తెలుసుకోవాలని..చాలా మంది వైద్య విద్యార్థులకు, ఎంబీబీఎస్ పూర్తి చేయడమే ఒక కఠినమైన సవాలు. కానీ మాధవి ఈ జాబితాకు మరో డిగ్రీని జోడించాలని నిర్ణయించుకున్నారు. రాబోయే సంవత్సరాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఆరోగ్య సంరక్షణను రూపు మార్చుతాయని దృఢంగా నమ్మి, ఆమె 2021లో ఐఐటి మద్రాస్‌లోని డేటా సైన్స్ అండ్ ప్రోగ్రామింగ్‌లో బిఎస్ ప్రోగ్రామ్‌లో చేరారు.టెక్నాలజీని వైద్యం నుంచి వేరుగా చూడకుండా, రోగ నిర్ధారణలను మరింత కచ్చితంగా చేయడానికి, పరిశోధనను మెరుగుపరచడానికి, రోగులకు మెరుగైన ఫలితాలను అందించడానికి ఒక ఆవశ్యక సాధనంగా భావించారామె. ఆ నిర్ణయం వల్ల ఆమె లెక్చర్లు, క్లినికల్ పోస్టింగ్‌లు, వార్డ్ డ్యూటీలు, ప్రాక్టికల్ పరీక్షలు,ఐఐటి అసైన్మెంట్లు అన్నింటినీ ఒకే సమయంలో నిర్వహించాల్సి వచ్చింది. ఆ షెడ్యూల్ అలసట కలిగించినప్పటికీ, ఆమె రెండు విభాగాల నిబద్ధతతో సత్తా చాటిందామె.సాధించిన విజయాలు..ఆంధ్ర మెడికల్ కాలేజీలో తన క్లినికల్ ఇంటర్న్‌షిప్ సమయంలో, ఆమె జనరల్ మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, ప్రసూతి మరియు గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, సైకియాట్రీ, డెర్మటాలజీ,ఎమర్జెన్సీ మెడిసిన్‌తో సహా పలు ప్రధాన విభాగాలలో శిక్షణ పొందారు. అదే సమయంలో ఆమె రోగుల సంరక్షణ తోపాటు, మెషిన్ లెర్నింగ్, వైద్య పరిశోధనaలో తన నైపుణ్యాన్ని పెంచుకుంటూనే ఉన్నారు. స్టార్‌లైన్ ఏఐలో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఇంటర్న్‌గా, ఆమె ఛాతీ ఎక్స్-రేలు, డీప్ లెర్నింగ్ మోడల్లను ఉపయోగించి ఏఐ ఆధారిత న్యుమోనియా గుర్తింపు వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ ప్రాజెక్ట్ సుమారు 90% కచ్చితత్వాన్ని సాధించి, మహిళల కోసం నిర్వహించిన స్టార్టప్ ఐడియాథాన్లో గుర్తింపు పొందింది.అంతకుముందు, ఆంధ్ర మెడికల్ కాలేజీలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు, వ్యక్తిగత గుర్తింపులో పెదాల నమూనాలను విశ్లేషించడానికి మెషిన్ లెర్నింగ్ మోడల్లను అభివృద్ధి చేయడం ద్వారా ఫోరెన్సిక్ మెడిసిన్‌లో కృత్రిమ మేధ వినియోగాన్ని ఆమె అన్వేషించింది.అంతర్జాతీయ స్థాయికి..సిడ్నీలో జరిగిన అంతర్జాతీయ వ్యోమగామి కాంగ్రెస్ (IAC) 2025లో, మాధవి సూక్ష్మగురుత్వాకర్షణలో ఇంద్రియ గ్రహణశక్తిపై అంతరిక్ష వైద్యం కోసం 3D బయోప్రింటింగ్ సామర్థ్యంపై తన పరిశోధనను సమర్పించారు. తద్వారా సుదీర్ఘకాల అంతరిక్ష యాత్రల సమయంలో భవిష్యత్ ఆరోగ్య సంరక్షణపై జరిగిన చర్చలకు ఆమె తోడ్పడ్డారు.నిజానికి మాధవి ప్రయాణం ప్రపంచ ఆరోగ్య సంరక్షణలో పెరుగుతున్న ఒక కొత్త ధోరణిని తెలియజేస్తుంది. ప్రస్తుతం ఆసుపత్రులు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, పరిశోధనా సంస్థలు వైద్యం, సాంకేతికత రెండింటినీ అర్థం చేసుకోగల నిపుణులపై ఎక్కువగా ఆధారపడుతుండటం విశేషం. ఇది యువతకు ఒక పాఠంవిద్యార్థులను తరచుగా సైన్స్ లేదా టెక్నాలజీ, వైద్యం లేదా ఇంజనీరింగ్ వంటి ఒకే విభాగాన్ని ఎంచుకోమని ప్రోత్సహిస్తారు. భవిష్యత్తు ఎల్లప్పుడూ ఒకే వర్గంలోకి సరిగ్గా ఇమడదని మాధవి ప్రయాణం చూపిస్తుంది. కృత్రిమ మేధస్సు ఆరోగ్య సంరక్షణను పునర్నిర్మిస్తున్నందున, వైద్యం అంతకంతకూ డేటా-ఆధారితంగా మారుతోంది. సాంకేతికతను అర్థం చేసుకున్న వైద్యులు, వైద్యశాస్త్రాన్ని అర్థం చేసుకున్న సాంకేతిక నిపుణులు ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ సవాళ్లలో కొన్నింటిని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించగలరని నిరూపించే ఘటన ఇది. అంతేగాదు ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థలో సీటు సంపాదించడంతోనే ఆగిపోకూడదని మాధవి కథ చెబుతోంది. విభిన్నంగా ఆలోచించి సంప్రదాయ కోర్సులను మిళితం చేసేలా అభ్యసించి మరిన్ని అవకాశాలు సృష్టించుకోగలుగుతామని చెబుతోంది.(చదవండి: అత్యంత ఖరీదైన 'టీ'.. కిలో రూ. 9 కోట్లా..! ఐతే..) -
అత్యంత ఖరీదైన 'టీ'.. కిలో రూ. 9 కోట్లా..! ఐతే..
ఏ చాయ్.. చటుక్కున తాగరా భాయ్ అని పాడుకుంటూ ఆనందంగా ఉదయాన్నే ఆస్వాదిస్తుంటా. టీ అనేది నిత్యజీవితంలో ఒక భాగం అనేలా స్థిరపడిపోయింది. ఒక పూట సిప్ చేయకపోతే ఏదో వెలితి. ఆఫీస్ బాయ్ నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగుల వరకు అంతా మెచ్చే ఈ చాయ్‌లో అత్యంత విలాసవంతమైన రకం కూడా ఉందన్న విషయం తెలుసా!. అత్యంత ఖరీదు అంటే వేలల్లో ఉందనుకుంటున్నారేమో కాదు..ఏకంగా కోట్లు పైమాటే. గ్రాముల్లో కొనాలంటే లక్షలు వెచ్చించాల్సిందే. ఇంతకీ ఏంటా ఆ చాయ్ ప్రత్యేకత, ఎక్కడ పండిస్తారు తదితర విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.ప్రపంచంలో అత్యంత ఖరీదైన 'టీ' చైనాలోని మాండరిన్లో లభిస్తుంది. ఈ 'టీ' పేరు డా హాంగ్ పావో. దీని అర్థం ఎర్రని వస్త్రం. ఇదేం పేరు అనుకోకండి. ఎందుకంటే ఈ పేరు వెనుక గమత్తైన కథతో పాటు ఇది ఎక్కడ పండిస్తారో తెలిస్తే కంగుతింటారు. దీన్ని ఊలాంగ్ టీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే చైనాలో ఫుజియాన్ ప్రావిన్స్‌లో అద్భుతమైన వుయి పర్వతాల్లో పండటంతో దీనికి ఆ పేరు వచ్చింది. ఈ టీకి శతాబ్దాల నాటి చరిత్ర, రాజరిక వారసత్వం ఉంది. ఈ డా హాంగ్ పావో రుచి సాధారణంగా అర్థం కాదట. నెమ్మదిగా ఆస్వాదిస్తేనే దాని రుచి తెలుస్తుందట. గ్రీన్ టీ లేదా బ్లాక్ టీలా కాకుండా, ఈ రెండింటి రుచులకు మధ్యస్థంగా గాఢతను కలిగి ఉంటుందట. తాజా ఆర్కిడ్లతో పోల్చబడే పూల సువాసనలతో పాటు, వేయించిన, పండ్ల వంటి పొగ వాసనలతో మిళితమై ఉంటుంది. దీనికి సహజమైన తీపితో కూడిన రుచి ఉంటుందట. టీ ప్రియులు దీన్ని ఎంతో విలువైనదిగా అపురూపమైనదిగా చూస్తారట.ఎందుకంత ఖరీదు అంటే..వుయి పర్వతాల కొండచరియల మధ్య, పురాణ మాతృ వృక్షాలుగా ప్రసిద్ధి చెందిన ఆరు అసలైన డా హాంగ్ పావో పొదలు మాత్రమే ఉన్నాయి. ఈ పురాతన మొక్కలు వందల ఏళ నాటివని అక్కడ ప్రజలు విశ్వసిస్తారు. అంతేగాదు చైనా వీటిని వెలకట్టలేని జాతీయ సంపదగా అభివర్ణిస్తుంది. ఇవి కేవలం ఆరు మాత్రమే ఉండటం కారంణంగా తేయాకు ఉత్పత్తి కూడా పరిమితమే కావడంతో అత్యంత ఖరీదైనదిగా మారిందట. కిలో టీ ధర వచ్చేసి రూ. 9 కోట్లు పై మాటే. ఇప్పటివరకు జరిగిన అత్యంత ప్రసిద్ధ టీ వేలంపాటలలో ఒకదానిలో, 20 గ్రాముల అసలైన డా హాంగ్ పావో సుమారు రూ. 20 లక్షలు. ఒక గ్రాము అసలైన టీ ధర వచ్చేసి రూ. 1.2 లక్షలు. చెప్పాలంటే. ఇది బంగారం కంటే 30 రెట్లు విలువైనది. అయితే చైనా ప్రభుత్వం ఈ టీపై నిషేధం విధించింది. నిషేధం ఎందుకంటే..భవిష్యత్ తరాల కోసం ఆరు అసలైన మాతృ వృక్షాలను రక్షించడానికి, 2006లో చైనా ప్రభుత్వం వాటి నుంచి ఆకులను వాణిజ్యపరంగా సేకరించడాన్ని శాశ్వతంగా నిషేధం విధించింది. ఈ పురాతన పొదలు ఇప్పుడు చైనా సాంస్కృతిక వారసత్వంలో భాగంగా సంరక్షిస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ టీని సేకరించడానికి ఎవ్వరి అనుమతి లేదు. వాటి అపారమైన చారిత్రక, సాంస్కృతిక విలువ కారణంగా చైనా ప్రభుత్వం ఆ చెట్లకు సుమారు ₹142 కోట్లు బీమా కూడా చేయించిందట.అంతేగాదు ఈ మాతృ వృక్షాల నుంచి వచ్చిన చివరి పంటను బీజింగ్ ప్యాలెస్ మ్యూజియంలో భద్రపరిచారట. ప్రస్తుతం మార్కెట్లో లభించే డా హాంగ్ పావో, అసలైన మాతృ వృక్షాల నుంచి సేకరించిన టీ కాదట. ఆ గొప్ప రుచిని పునః సృష్టించడం కోసం అసలైన మాతృ వృక్షాల నుంచి జాగ్రత్తగా పెంచిన కృత్రిమ సంతతి (క్లోన్ల) నుంచి ఉత్పత్తి చేయబడుతుందట. ఈ చాయ్ వెనకున్న ఆసక్తికర కథనం..ఒక యువ పండితుడు చక్రవర్తి పరీక్షల కోసం బీజింగ్‌కు వెళ్లే మార్గంలో వుయి పర్వతాల గుండా ప్రయాణిస్తుండగా, అతను అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. సమీపంలోని ఒక ఆలయానికి చెందిన సన్యాసి కొండలపై పెరుగుతున్న ఒక ప్రత్యేకమైన టీ పొద నుంచి ఆకులను ఉపయోగించి టీ తయారు చేయగా, ఆ పండితుడు త్వరగా కోలుకున్నాడు. ఆ తర్వాత చక్రవర్తి పరీక్షలలో ప్రథమ స్థానం సాధించాడు. కొన్నేళ్లకు చక్రవర్తినే స్వయంగా అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో ఆ పండితుడు అదే టీని తయారు చేసి ఇవ్వగా చక్రవర్తి కూడా ఆ యువకుడిలానే కోలుకున్నారట. బహుమతిగా, చక్రవర్తి ఆ పండితుడికి ఒక అద్భుతమైన ఎర్రటి ఉత్సవ వస్త్రాన్ని బహూకరించారు. తమ ఇద్దరి ప్రాణాలను కాపాడిన ఆ తేయాకును గౌరవించాలనే ఉద్దేశ్యంతో, ఆ పండితుడు ఆ వూయి పర్వతాల వద్దకు వెళ్లి, చక్రవర్తి ఇచ్చిన వస్త్రాన్ని తేయాకు పొదలపై కప్పాడు. అప్పటి నుంచి, ఆ తేయాకును డా హాంగ్ పావో, లేదా “పెద్ద ఎర్ర వస్త్రం” అని పిలుస్తున్నారని చైనా జానపద కథనం. ఎలా తయారు చేస్తారంటే..సాధారణం 95-100°C వద్ద అప్పుడే మరిగించిన నీటిలో చాలాసారు నానబెట్టి తీసిని డా హాంగ్ పావో ఆకులను వేస్తారట. కనీసం మూడు సార్లు నానబెట్టి.. మరిగే నీటిలో వేస్తే అత్యంత గాఢమైన రుచులు బయటకు వస్తాయట. ప్రతిసారి నానబెట్టగానే పూల వంటి తీపిదనం వస్తుందని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: ఒత్తైన జుట్టు కోసం..! గాయని అరుణా సాయిరామ్ హెయిర్ టిప్స్) -
ఒత్తైన జుట్టు కోసం..! గాయని అరుణా సాయిరామ్ హెయిర్ టిప్స్
గాయని అరుణా సాయిరామ్ ప్రసిద్ధ కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, స్వరకర్త కూడా. ఆమె లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శన ఇచ్చిన మొట్టమొదటి కర్ణాటక గాయనిగా చరిత్ర సృష్టించారు. ఆమె భారత ప్రభుత్వ "పద్మశ్రీ" అవార్డు గ్రహీత. ఆమె సంగీత నాటక అకాడమీ వైస్ చైర్‌పర్సన్‌గా కూడా సేవలందించారు. ప్రస్తుతం ఆమెకు 72 ఏళ్ల వయసు. అయినా ఈ వయసులో కూడా తన సహసిద్ధమైన కురులతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఆ కురుల సౌందర్య కోసం తాను ఎలాంటి కేర్ తీసుకుంటుందో ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. తన ఆరోగ్యకరమైన జుట్టు కోసం తన అత్తగారి నుంచి సంక్రమించిన జుట్టుకు పోషణనిచ్చే తల నూనె రెసిపీని పంచుకున్నారు. ఇప్పటికీ తాను ఆ నూనెనే వాడతానంటూ..దాని తయారీ విధానం పంచుకున్నారు. తాము ఎల్లప్పుడూ ఇంట్లోనే లభించే మూలికలు, సుగంధద్రవ్యాలతోనే నూనెని తయారు చేసుకుంటామని కూడా చెప్పారామె.ఆ నూనె ఎలా తయారు చేయాలంటే..కావలసిన పదార్థాలుమెంతి గింజలుకలోంజి గింజలుచిన్న ఉల్లిపాయలుమందార పువ్వుల రేకులుమందార ఆకులుకరివేపాకుగోరింటాకు ఆకులులోపల గుజ్జుతో ఉన్న కలబందతయారీ విధానంఅన్ని పదార్థాలను కొబ్బరి నూనెలో వేసి, అవి బాగా కలిసే వరకు మెల్లగా వేడి చేయండి. ఆ తర్వాత స్టవ్‌ని ఆపేసి కాసేపు అలానే ఉంచండి. చల్లారిని తర్వాతన ఒక గాజు సీసాలోకి మార్చాలి.నిపుణులు ఏమంటున్నారంటే..మెంతి, కలోంజి, చిన్న ఉల్లిపాయలు, మందార పువ్వుల రేకులు , గోరింటాకు, కరివేపాకు, కలబంద వంటివి కొబ్బరి నూనెలో నానబెట్టడం ద్వారా జుట్టుకి పోషణనిచ్చే అమృతం తయారవుతుందని అంటున్నారు. ఈ సౌందర్య పద్ధతి తరతరాలు గౌరవించే సంప్రదాయపద్ధతిగా అభివర్ణించారామె. ఇలాంటి నూనెని క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు బలంగా తయారవ్వడమే కాకుండా, పొడిబారడాన్ని తగ్గిస్తుంది. అలాగే జుట్టుకి చక్కటి మెరుపు సంతరించుకుంటుంది. తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.ప్రయోజనాలు..ఈ నూనెను క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు కుదుళ్లు దృఢంగా ఉంటాయి. అలాగే పొడిబారడాన్ని నివారించి, చక్కటి మెరుపుని అందిస్తుంది.మందార మరియు కరివేపాకు జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయని అంటారు. మెంతి జుట్టు ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కలబంద వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇక ఉల్లిపాయలు జుట్టును బలపరచడంలో సహాయపడతాయి. ఇది కృత్రిమ సంకలితాలు లేకుండా లోతైన పోషణను అందిస్తుంది.అందరికీ సరిపోతుందా?ఈ రెసిపీ చాలా రకాల జుట్టుకు బాగా పనిచేస్తుంది. జిడ్డుగా ఉండే తల చర్మం ఉన్నవారు తక్కువ సమయం పాటు దీనిని ఉపయోగించవచ్చు, అయితే పొడి జుట్టు ఉన్నవారు రాత్రంతా నూనె రాసుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. ఇది సహజమైన పదార్థాలతో తయారు చేసినందున ఎవరికైనా ఎలాంటి దుష్ఫ్రభావాలు ఉండవని అన్నారు. అంతగా అనుమానం ఉంటే..చిన్న ప్యాచ్ టెస్ట్ చేసి రాసుకుంటే సరి అని అంటున్నారు నిపుణులు. View this post on Instagram A post shared by Aruna Sairam (@arunasairam)(చదవండి: ఒకటిన్న ఏడాదిలోనే 67 కిలోలు బరువు..! జస్ట్ ఒక్క నిమిషంలోనే..) -
ఒకటిన్న ఏడాదిలోనే 67 కిలోలు బరువు..! జస్ట్ ఒక్క నిమిషంలోనే..
బరువు తగ్గడం అంటే కఠినమైన డైట్, కష్టతరమైన వ్యాయామాలు, అధిక సమయం జిమ్ సెషన్ అనే భావన అందరిలో ఉంటుంది. కానీ కొందరు అవేమీ అవసరం లేకుండా రోజువారీ సరదాగా చేసే వర్కౌట్లతోనే సాధ్యమని చూపిస్తారు. అయితే వాటి ఏదో ఒక్కసారి కాకుండా ఇన్నిసార్లు అని చేస్తే చాలు అధిక సంఖ్యలో కేలరీలు, కొవ్వుని తగ్గించుకోవచ్చని అంటోంది ఈ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్. అదెలాగో ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా.!.క్రమం తప్పకుండా చేసే చిన్నపాటి కదలికలు కూడా మిమ్మల్ని చురుకుగా ఉంచుతాయని చెబుతున్నారు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ రాజీ ఘంగాస్. ఆ వ్యాయామాలు ఒక నిమిషంలోనే గరిష్ట కేలరీలను తగ్గించగలదని అంటున్నారు. తాను సుమారు 155 కేజీల బరువు ఉండేదాన్ని అన్ని క్రమం తప్పకుండా చేసే తేలికపాటి వ్యాయామాలతోటే ఇంతలా బరువు తగ్గానంటూ తన వెయిట్‌లాస్ జర్నీ గురించి చెప్పుకొచ్చింది. అంతేగాదు రోజువారి దినచర్యలో సులభంగా చేర్చుకోగలిగే ఒక ఐదు సాధారణ కదలికల వ్యాయామాలను గురించి ఇన్స్టాగ్రామ్ వీడియోలో పంచుకుంది. బరువు తగ్గడం అంటే కేవలం జిమ్‌లో గంటల తరబడి గడపడం కాదు, క్రమం తప్పకుండా చేసే చిన్నపాటి కదలికలు కూడా అని అంటున్నారామె. చురుకుగా ఉంచడానికి, ఫిట్‌నెస్‌ని మెరుగుపరుచుకోవడానికి, కేలరీలను కరిగించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని అంటున్నారామె. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసేలా చూసుకోవడం, సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి వంటి వాటితోనే స్మార్ట్‌గా మారిపోవచ్చిన చెబుతోంది. తాను చెప్పబోయే చిన్న పాటి వర్కౌట్లు ఎంతటి బిజీ షెడ్యూల్లో అయినా సులభంగా చేయొచ్చని చెప్పుకొచ్చింది. అలా చేసే తాను సుమారు 67 కిలోలు పైనే తగ్గినట్లు తెలిపింది. అవేంటంటే..జంపింగ్ జాక్స్: పాదాలను కలిపి, చేతులను పక్కన ఉంచి నిలబడండి. కాళ్ళను దూరంగా చాపుతూ, చేతులను తల పైకి ఎత్తుతూ గెంతండి. తిరిగి ప్రారంభ స్థానానికి గెంతి, మళ్ళీ చేయండి.ఇలా కొద్దిసేపు రిపీట్ చేయాలి.హై నీ క్లాప్: నిటారుగా నిలబడి, ఒక మోకాలిని ఛాతీ వైపుకు పైకి లేపుతూ, పైకి లేపిన మోకాలి కింద లేదా పైన చేతులతో చప్పట్లు కొట్టండి. వేగంగా రెండు కాళ్ళ మధ్య మార్చి మార్చి చేయండి.స్టాండింగ్ క్రాస్-బాడీ క్రంచ్: మీపాదాలను భుజాల వెడల్పులో ఉంచి నిలబడి, చేతులను తల వెనుక ఉంచండి. ఒక మోకాలిని పైకి లేపుతూ, దానికి ఎదురుగా ఉన్న మోచేతిని దాని వైపుకు తీసుకురండి. తిరిగి ప్రారంభ స్థానానికి వచ్చి, రెండవ వైపున కూడా చేయండి.ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ జంప్: మపాదాలను కలిపి నిలబడండి. రెండు పాదాలతో ముందుకు గెంతి, వెంటనే తిరిగి ప్రారంభ స్థానానికి గెంతండి. మెత్తగా కింద పడటానికి మోకాళ్ళను కొద్దిగా వంచి ఉంచండి.స్పాట్ జాగింగ్: ఒకే చోట నిలబడి, ముందుకు కదలకుండా జాగింగ్ చేయండి. కదలికను సున్నితంగా, స్థిరంగా ఉంచడానికి, మచేతులను సహజంగా ఊపుతూ పాదాలను సౌకర్యవంతమైన వేగంతో పైకి లేపండి.చురుకుగా ఉండటం ఎల్లప్పుడూ సంక్లిష్టంగా ఉండనవసరం తన వర్కౌట్లతో చెప్పకనే చెప్పింది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ రాజీ. క్రమం తప్పకుండా చేసే కొన్ని సాధారణ కదలికలు కూడా ఫిట్నెస్ అలవాటును పెంపొందించుకోవడాన్ని సులభతరం చేస్తాయి. వ్యాయామం చేయడం కొత్తగా ప్రారంభిస్తున్నట్లయితే, నెమ్మదిగా మొదలుపెట్టి, సరైన భంగిమపై దృష్టి సారించి, శక్తి సామర్థ్యాలు మెరుగుపడే కొద్దీ రౌండ్ల సంఖ్యను పెంచుకోడం మంచిదని సూచిస్తోంది. కాబట్టి మరింత కష్టతరమైన మార్గం కాకుండా సులువుగా సునాయాసంగా చేసే వర్కౌట్లను ఎంచుకుని కిలోల కొద్దీ బరువు తగ్గేందుకు రెడీ అవుదామా మరి..!. View this post on Instagram A post shared by Rajii Ghanghas (@rajiighanghas) (చదవండి: పెళ్లిలో ప్రాంక్ తెచ్చిన తంట..!పాపం ఆ వధువు స్నేహితురాలు..) -
ఒకసారి రిజిస్టర్‌చేసిన పెళ్లి మళ్లీ రిజిస్టర్ చేస్తే జైలు తప్పదు!
నేను దుబాయ్‌లో ఉంటాను. మా ఆవిడ, పిల్లలు కడపలో ఉంటారు. వాళ్ళని డిపెండెంట్ వీసా మీద దుబాయ్‌కి తీసుకెళ్లాలనుకుంటున్నాను. మాది 2012లో మతాంతర వివాహం కావడంతో ప్రత్యేక వివాహ చట్టం క్రింద నమోదు చేసుకున్నాము. సర్టిఫికేట్లో తన పాత పేరే ఉంది. ప్రస్తుతం తన పేరు శ్రీ లక్ష్మి. గెజిట్ ద్వారా పేరు కూడా శ్రీ లక్ష్మి అని మార్పించాము. అయితే వీసా కోసం వెళ్ళినప్పుడు ఇక్కడి అధికారులు పాస్‌పోర్టులో ఉన్న పేరుతోనే పెళ్లి సర్టిఫికెట్ కావాలి – లేకుంటే కుదరదు అంటున్నారు. రిజిస్ట్రార్గారిని సంప్రదిస్తే పెళ్లి సర్టిఫికెట్లో మార్పు కుదరదని చెప్పారు. హైదరాబాదులో ఇంకోసారి పెళ్లి రిజిస్టర్ చేసుకోమని ఒక స్నేహితుడు సలహా ఇచ్చాడు. 2012లో జరిగిన పెళ్లిని ఇంకోసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎలాంటి పత్రాలు కావాలి, ఎలా చేర్పించాలి... సలహా ఇవ్వగలరు. – జగపతి, దుబాయ్ఒకసారి రిజిస్టర్ చేసుకున్న పెళ్లిని మరో రాష్ట్రంలో ఇంకోసారి రిజిస్టర్ చేసుకోవటం చట్టరీత్యా నేరం. అలా తయారు చేసిన రెండవ పెళ్లి పత్రం చెల్లదు. చెల్లని పత్రాలని విదేశాలలో ఉపయోగిస్తానంటున్నారు కాబట్టి – దొరికితే దుబాయ్‌లో జైలు తప్పదు – మీ ఆవిడతో ΄ాటు మీ వీసా కూడా రద్దయిపోతుంది. గెజిట్ ఉందన్నారు కాబట్టి – అన్ని పత్రాలతో పాటు మీ ఆవిడ చేత పేరు మార్పునకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత పత్రాలతో పాటు ఒక అఫిడవిట్‌ను కూడా జతపరిచి దుబాయ్‌లోని భారతీయ హై కమిషన్ ఆఫీసు ద్వారా ధ్రువీకరించుకోండి (అపాస్టిల్ అంటారు). అంతే కాక మీకు – మీ కుటుంబానికి ఉన్న సంబంధం కూడా ధ్రువీకరించవచ్చు. రిజిస్ట్రార్ ఆఫీసునుంచి మీ ఆవిడ పాత పేరు – కొత్త పేరు ఒకరివే అనే ధ్రువీకరణ ఇస్తారేమో అడగండి – లేనిపక్షంలో కోర్టును సంప్రదించి పరిష్కారం కోరటం గురించి ఆలోచించవచ్చు. మీరు పైన చెప్పిన విధంగా యూఏఈ అధికారులకి సరైన పత్రాలు అందజేస్తే పరిష్కారం ఉంటుంది. ఇవ్వన్నీ కాదు – కొన్నాళ్లు జైలుకి పోయినా ఫర్వాలేదులే అనుకుంటే, మీ స్నేహితుడు చెప్పినట్లుగా హైదరాబాదులో రిజిస్ట్రేషన్‌కి అప్లై చెయ్యండి.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసంsakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. -
ఆ‘ పాత’ మెరుపు
బంగారు ఆభరణం ఎంత పాతదైతే దాని విలువ అంత పెరుగుతుంది అనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. 16వ శతాబ్దం నాటి రాజరిక మొఘల్, పోల్కీడిజైన్ల నుండి 1970ల నాటి ముత్యాల గొలుసుల వరకు సినీ తారలు పెద్ద పెద్ద ఈవెంట్లలో వారసత్వ ఆభరణాలను ధరించి, మెరిశారు. ఇటీవల హాలీవుడ్ నటి జెండయా 3000 ఏళ్ల క్రితం నాటి ఇయర్స్ రింగ్స్ ధరించి విస్తృత చర్చకు దారితీశారు.ఈ క్రమంలో ప్రాచీన నగల వెలుగు మరింతగా మెరవనుందని నిపుణులు తెలియజేస్తున్నారు.హాలీవుడ్ సినిమా ‘ది ఒడిస్సీ’ సినిమా ప్రచార కార్యక్రమం ఇటీవల లండన్‌లో జరిగింది. ఈ ప్రీమియర్‌లో ఆ సినిమా నటి జెండయా ధరించిన 3,000 ఏళ్ల నాటి ఇరాన్ బంగారు ఇయర్ రింగ్స్ అంతటా చరిత్రపై ఆసక్తికి, చర్చకు దారితీశాయి. ఈ అసాధారణమైన ఇయర్రింగ్స్ అచ్చమైన బంగారు పలకలతో తయారుచేశారు.డ్రెస్‌ను డామినేట్ చేస్తూ...నటి జెండాయా తెల్లటి జాక్వెమస్ హాల్టర్ గౌనును ధరించింది. లండన్‌కు చెందిన ప్రాచీన ఆభరణాల వ్యా పారి బారన్ సేకరించిన ప్రాచీన కళాఖండాల బంగారు ఇయర్ రింగ్స్‌ను ఆ గౌన్‌కు జతగా ఎంపిక చేసుకుంది. రెడ్‌కార్పెట్‌పై ఆమె చూపిన ఈ ఇయర్ రింగ్స్ అత్యంత ఫ్యాషనబుల్‌గా ఉన్న డ్రెస్సును కూడా డామినేట్ చేశాయి. జ్యువెలరీ నిపుణులు పంచుకున్న వివరాల ప్రకారం ఈ ప్రాచీన బంగారు కళాఖండాలను 18 క్యారెట్ల బంగారంలో వజ్రాలను పొదిగి, సూర్యుని చిహ్నం వచ్చేలా రూ పొందించారు.కంచు శవపేటిక నుంచి...ఈ ఇయర్ రింగ్స్ 1947లో ఇరాన్‌లోని కుర్దిస్తాన్ ప్రాంతంలో జివియా దగ్గర కనుక్కొన్నారు. అక్కడి గ్రామస్థులు బంగారు కళాఖండాలతో నిండిన ఒక కంచు శవపేటికను వెలికితీసినట్టు తెలిసింది. ఆ సమయంలో పురావస్తు శాస్త్రవేత్తలు ఎవరూ లేకపోవడం, సరైన డాక్యుమెంటేషన్ జరగకముందే ఆ శవపేటిక నుంచి వివిధ వస్తువులను తీసి, అమ్మినట్టు తెలుస్తోంది. 1948లో ఫ్రెంచ్ పురావస్తు శాస్త్రవేత్త ఆండ్రే గొడార్డ్ పారిస్‌లో అనేక పురాతన వస్తువులను ప్రదర్శించినప్పుడు ఇవి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. ఆ తర్వాత జివియా నిధితో సంబంధం గల 600 వస్తువులను నమోదు చేశారు. ఈ వస్తువులన్నీ నేడు బ్రిటిష్ మ్యూజియం, నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇరాన్ వంటి సంస్థలలో భధ్రపరిచారు. అనేక వస్తువులు ఇప్పటికీ ప్రైవేట్ వ్యక్తుల చేతులలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉండగా నటి జెండయా ఈ పురాతన ఇయర్ రింగ్స్ ధరించడంతో విమర్శలూ వచ్చాయి. పురాతన సాంస్కృతిక కళాఖండాలు విలాసంతమైన ఫ్యాషన్ ఉపకరణాలుగా ధరించవచ్చా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సాంస్కృతిక వారసత్వంపై ఆన్లైన్లో చర్చలు కొనసాగుతున్న తరుణంలో జెండాయా ధరించిన ఇయర్ రింగ్స్ ఒక ఫ్యాషన్ ప్రకటనకు మించి ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ మోడల్ ఇయర్ రింగ్స్ ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో మరింతగా మెరవనున్నాయని తెలుస్తోంది.ఆదిమ మానవులు తమ అలంకరణ వస్తువుల తయారీకి ఎముకలు, రాళ్లు, దంతాలను ఉపయోగించేవారు. లక్షన్నర సంవత్సరాల క్రితం నాటి 33 గవ్వల పూసలు మొరాకోలోని ఎస్సౌయిరా సమీపంలో గల బిజ్మౌన్ గుహలో దాదాపు పదేళ్ల క్రితం జరిపిన తవ్వకాలలో బయటపడ్డాయి. అటు తర్వాత దాదాపు 70 వేల ఏళ్ల క్రితం నాటి పూసలు దక్షిణ ఆఫ్రికాలోని బ్లోంబోస్ గుహలో బయటపడ్డాయి. క్రీ.పూ వెయ్యేళ్ల క్రితం ఆభరణాలలో నక్షత్రం, సూర్యుని చిహ్నాలను ఉపయోగించినట్టు నాటి ఆభరణాలు వెలుగు చూసినప్పుడు తెలిశాయి.19వ శతాబ్దంలో ఖగోల ఆభరణాలు విపరీతంగా ప్రాచుర్యం పొందాయి. ఆభరణాలలో నక్షత్రాలు, నెలవంక ఆకారంలో బ్రోచ్లు, లాకెట్లు రూ పొందించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన బంగారు ఆభరణాలు క్రీ.పూ 4,500 ఏళ్ల కాలం నాటివి వార్నా పురావస్తు మ్యూజియంలో ప్రదర్శనలో ఉన్నాయి. ప్రాచీన మెసొపొటేమియాకు చెందినవారు బంగారం, వెండి లోహాలతో నగలు చేసేవారని చరిత్ర చెబుతోంది.అలనాటి నగలు... ∙నీతాఅంబానీ అన్‌కట్ డైమంట్స్, కుందన్, పోల్కీ సంప్రదాయ మొఘల్ డిజైన్‌తో రూ పొందించిన 100 ఏళ్ల క్రితం నాటి ఇయర్ రింగ్స్ ధరించి వార్తల్లో నిలిచారు. భారతీయ రాజరిక హస్తకళకు ఈ ఆభరణం అసలైన ఉదాహరణగా చెప్పచ్చు ∙కంగనా రనౌత్, మౌనిరాయ్ తారలు ఆక్సిడైజ్డ్ రాజస్థాన్, గుజరాతీ స్టైల్ ఆభరణాలను ధరించడం మనం చూస్తుంటాం. ఏళ్ల నాటి ఆ సిల్వర్ ఆభరణాలు వారి సేకరణలో భాగంగా చెబుతుంటారు ∙ఆలియాభట్ తన పెళ్లిలో 16వ శతాబ్దం నాటి అన్‌కట్ డైమండ్స్, కుందన్స్‌తో చేసిన ఆభరణాలను ధరించారు. మొఘల్ ఆభరణాల శైలిని ఆమె తన ఆభరణాల డిజైన్స్‌తో పునరుజ్జీవింపజేశారు.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కృత్రిమ గర్భధారణ ఎవరికి అవసరం?
మన దేశంలో దాదాపు 3 కోట్ల మంది దంపతులు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇందులోనూ పల్లెల్లో ఉండేవారి కంటే నగర, పట్టణ ప్రాంతాల్లో ఉండే దంపతులను సంతానలేమి సమస్య ఎక్కువగా బాధిస్తోంది. పట్టణ, నగర ప్రాంతాల్లోని 1.83% మందిలో ఈ సమస్య ఉండగా... పల్లెల్లో ఈ సంఖ్య కాస్త తక్కువగా అంటే 1.76%గా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఉండే ఒత్తిడితో కూడిన జీవనశైలి, ఎటూ కదలకుండా స్థిరంగా ఉండి చేసే ఉద్యోగాలూ, చాలా దూరాలు ప్రయాణాలు చేయడం వంటి అంశాలు సంతానలేమి సమస్యను పెంచేస్తున్నాయి. అయినప్పటికీ బిడ్డల కోసం ఆరాటం, ఉద్వేగాలూ ఎమోషన్స్ మాత్రం ఇటు పట్టణ ప్రాంతాల్లోనైనా అటు పల్లెల్లోనైనా ఒకేలా ఉంటాయి. కేవలం పిల్లలు లేకపోవడంతో పాటు ఈ కృత్రిమ గర్భధారణ ప్రక్రియలు అవసరమైన వారు ఎవరెవరు, ఏయే కారణాలు వారిని ఫెర్టిలిటీ సెంటర్లవైపునకు ఆకర్షిస్తాయో చూద్దాం...గర్భధారణ జరగకపోవడానికి కారణాల్లో మూడింట ఒక వంతు మహిళల్లో ఉంటే, మరో మూడింటి ఒక వంతు పురుషుల్లోనూ... ఇంకో మూడింట ఒక వంతు స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఉండవచ్చు. ఈ మొత్తంలోనూ దాదాపు 90% మందిలో లోపమేదో తెలుసుకోవచ్చుగానీ... సంతానలేమికి అసలు కారణాలేమిటో తెలియని కేసులు మరో 10% వరకు ఉంటాయి. సమస్యను ఈ కోణంలో చూసినప్పుడు సంతానం కలగకపోతే దంపతులు ఒకరినొకరు నిందించుకోవడం సరికాదు. అలాగే ఆ ఇంటి కుటుంబ సభ్యులు, సమాజం కూడా ఎవరినీ తప్పు పట్టకూదు.జడ్జ్ చేయడం అస్సలు సరికాదు. తగిన వైద్యపరీక్షల ద్వారా స్త్రీ, పురుషుల్లో ఈ లో పాలను కనిపెట్టినప్పుడు వాటిల్లో సరిదిద్దగల సమస్యలను చక్కదిద్దాక కూడా గర్భం రాలేదంటే అందుకు కారణాలేమిటో చెప్పలేని, ఏదీ తెలియని అంశాలు (అన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ) ఉండవచ్చు. అయితే ఇప్పుడున్న సాంకేతిక అభివృద్ధి, వైద్యరంగంలోని పురోగతితో తగిన కారణాలను తెలుసుకుని, వాటికి చికిత్స అందించడం లేదా వీలుకాని సందర్భాల్లో కృత్రిమ గర్భధారణను సుసాధ్యం చేస్తున్నారు. కృత్రిమ గర్భధారణ పద్ధతులు ఎవరి కోసమంటే... కృత్రిమ గర్భధారణ పద్ధతులు అందునా ప్రధానంగా ఐవీఎఫ్ వంటి ప్రక్రియలు ఎవరెవరికి బాగా ఉపకరిస్తాయో చూద్దాం...⇒ ఐయూఐ: పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం, కదలిక (మొటిలిటీ) అంతగా లేకపోవడం వంటి కారణాలతో గర్భం రాకపోతే... పురుషుల నుంచి వీర్యకణాలను సేకరించి ఇంట్రా యుటెరైన్ ఇన్సెమినేషన్ అనే పద్ధతి ద్వారా డాక్టర్లు వీర్యకణాలను నేరుగా యోని నుంచి సర్విక్స్ ద్వారా గర్భాశయంలోకి పంపుతారు. టెస్ట్‌ట్యూబ్ బేబీ ఎవరెవరిలోనంటే... ⇒ సాధారణ చికిత్సలూ, (ఐయూఐ)తోనూ గర్భం రాకపోవడంతో పాటు... ఇతరత్రా వేరే సమస్యలేవీ లేకుండా ఉండి, ఇంకా వేచిచూసేంత ఓపిక, సమయం లేనివాళ్లకి ⇒ మహిళ వయసు 38 – 40 ఏళ్లు దాటిన వారికి; అంతేకాకుండా 35 ఏళ్లు దాటి, మహిళల్లో వారి అండాల సంఖ్య, నాణ్యత బాగా తగ్గిపోతూ... సాధారణ చికిత్సతో గర్భం రాని సందర్భాల్లో ∙రెండు ట్యూబ్‌లూ మూసుకుపోయిన వాళ్లకి, ట్యూబెక్టమీ తర్వాత, ఏవో కారణాలతో మళ్లీ పిల్లలు కావాలనుకున్నప్పుడు; పురుషుల్లో వాసెక్టమీ చేయించుకున్న తర్వాత మళ్లీ ఏదైనా కారణాల వల్ల పిల్లలను కోరుకుంటూ అందుకోసం ‘రీకెనలైజేషన్’ చేయించుకున్నప్పటికీ సక్సెస్ కానప్పుడు⇒ ఎండోమెట్రియాసిస్ సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ⇒ వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత తక్కువగా ఉన్నప్పుడు. జన్యుపరమైన సమస్యలు: భార్య లేదా భర్తలో ఏవైనా జన్యుపరమైన సమస్య ఉండి, అది పిల్లలకూ వచ్చే అవకాశం ఉన్నప్పుడు... ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా రూ పొందించిన పిండాలలో ఒక దాన్ని తీసి, ప్రీ–ఇం΄్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నసిస్ ద్వారా పరీక్ష చేస్తారు. ఇలా చేశాక సమస్యలేవీ లేని పిండాలను వేరుపరచి, తల్లి గర్భాశయంలోకి పంపే ప్రక్రియ వల్ల జన్యు సమస్య లేని ఆరోగ్యకరమైన సంతానం దాదాపు సాధ్యమే. ⇒ క్యాన్సర్ చికిత్స: దేహంలోని ఏ భాగంలోనైనా క్యాన్సర్ వచ్చిందని తెలిశాక... అందుకు చికిత్సగా రేడియేషన్, కీమోథెరపీ చికిత్సకు వెళ్లేముందర, మహిళ తన అండాలను బయటకు తీసి, వాటిని ఫ్రీజ్ చేసుకోవచ్చు. లేదా అండాలను ఫలదీకరణ చేసుకొని, పిండాలను ఫ్రీజ్ చేసి, చికిత్స పూర్తయ్యాక వాటిని ‘ఫ్రోజెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్’ పద్ధతిలో గర్భాశయంలోకి పంపవచ్చు. ⇒ సామాజిక కారణాలు: కొందరు కెరియర్ కోసం లేదా వ్యక్తిగత కారణాల వల్ల గర్భధారణను వాయిదా వేస్తారు. వాళ్లలో కొందరు ముందుగానే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా తయారైన పిండాలను భద్రపరచుకొని, ఆ తర్వాత వీలైనప్పుడు ఫ్రోజెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ద్వారా గర్భశయంలోకి ప్రవేశింపచేయడం ద్వారా గర్భం ధరిస్తారు. మరికొందరు పెళ్లిని వాయిదా వేసుకొని, అండాలను ఫ్రీజ్ చేసుకుంటారు. ఫ్రీజ్ చేసిన అండాలు, పిండాలను ఆ తర్వాత ఉపయోగించుకుంటారు. ఇలాంటి వారందరూ కృత్రిమ గర్భధారణ ప్రక్రియల కోసం ముందుకెళ్లవచ్చు.నిర్వహణ: యాసీన్సాధారణ కారణాలు...మహిళల్లో: ⇒ అండం విడుదల సరిగా జరగకపోవడం⇒ గర్భాశయంలో సమస్యలు ⇒ ఎండోమెట్రియాసిస్ సమస్యలు⇒ ఫెలోపియన్ ట్యూబుల్లో లో పాలు⇒ ఫలదీకరణ సమస్యలు⇒ సికిల్‌సెల్ అనిమియా వంటి ఇతరత్రా ఆరోగ్య సమస్యలు.పురుషుల్లో...మగవారిలో... ⇒ వీర్యకణాల్లో లో పాలు⇒ వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం⇒ వీర్యకణాల కదలికలూ తగ్గడం ⇒ వీర్యం నాణ్యత బాగాలేకపోవడం.ముప్పై ఏళ్ల తర్వాత...అది 1992వ సంవత్సరం... అప్పట్లో ఒక ల్యాబ్‌లో ప్రాణం పోసుకున్న రెండు జీవకణాలు, బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు ఏకంగా ముప్పై ఏళ్ల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రానికి చెందిన రేచెల్, ఫిలప్ రిజ్డ్ దంపతులు ఐవీఎఫ్ ద్వారా పిల్లల కోసం నేషనల్ ఎంబ్రియో డొనేషన్ సెంటర్లో అప్లై చేశారు. ఫలదీకరణ చెందిన అండాలను డాక్టర్లు రేచల్ గర్భాశయంలోకి ప్రవేశపెట్టారు. కొన్ని నెలల తర్వాత రే^è ల్ పండంటి కవలలకు జన్మనిచ్చింది. ఆమె జన్మనిచ్చింది సాధారణ శిశువులకి కాదు... ఏకంగా ముప్పై ఏళ్ల పాటు ల్యాబ్‌లో పిండస్థ దశలో ఉన్న రెండు జీవాలకి... 1992లో ఓ అజ్ఞాత దంపతులకి ఐవీఎఫ్ ద్వారా పిండాలను సృష్టించారు. వారికి సంతానం కలిగిన తర్వాత మిగిలిన ఎంబ్రియోలను అలానే భద్రపరిచారు. 2007లో ఈ పిండాలను నేషనల్ ఎంబ్రియో డొనేషన్ సెంటర్‌కి దానం చేశారు. చివరికి 2022 మార్చిలో అంటే ముప్పై ఏళ్ల తర్వాత రేచల్, ఫిలిప్ దంపతులు ఈ ఎంబ్రియోలను దత్తత తీసుకోగా వాటిని yీ ఫ్రాస్ట్ చేసి తల్లి గర్భాశయంలోకి ప్రవేశపెట్టారు. 2022 అక్టోబర్ లో రేచల్ పండంటి కవలలు (ఆడ శిశువు లిడియా, మగ శిశువు థిమోతి)కు జన్మనిచ్చింది.ఈ జననంతో అప్పటివరకు ప్రపంచంలో అత్యధిక కాలం పిండస్థ దశలో ఉండి పుట్టిన కవల శిశువులుగా లిడియా, థిమోతి రికార్డ్ సృష్టించారు. ఇందులో మరో విశేషమేమిటంటే ఈ ఎంబ్రియోలను ఫ్రీజ్ చేసినప్పుడు అంటే 1992లో రేచల్‌కు అక్షరాలా ఐదేళ్లు. అప్పుడు తయారైన ఎంబ్రియోలకు అదే చిన్నారి పెరిగిన తర్వాత తల్లిగా మారింది. మానవ మేధస్సుతో ఆవిర్భవించిన జీవకణాలు కాలాన్ని జయించి జీవించగలవని ఈ జననం నిరూపించింది.డాక్టర్ వసుంధర చీపురుపల్లి సీనియర్ గైనకాలజిస్ట్ – ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ -
పెళ్లిలో ప్రాంక్ తెచ్చిన తంట..! పాపం ఆ వధువు స్నేహితురాలు..
పెళ్లిళ్లలో సరదాగా ఆటపట్టించడం అనేది మాములు. ఆ వేడుకకు వచ్చినవారందరి ముఖాల్లో నవ్వులు పూయిస్తే పర్లేదు..అది కాస్త సీరియస్ అయితేనే లేనిపోని తలనొప్పులు మొదలవుతాయి. అందుకే ఏదైనా శృతి మించకుండా ఆరోగ్యవంతంగా ఉండాలి. ఇక్కడ అది లోపించడంతో ఆ పెళ్లి బృందం, ఆ కొత్త దంపతులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఏ సరదా అయినా నష్టం చేకూర్చేలా ఉండకూదనే సత్యాన్ని నేర్పించే బాధకర ఘటన ఇది.చైనాలో చోటు చేసుకుంది ఈ ఘటన. అక్కడ పెళ్లిళ్లలో హున్నావో అనే పురాతన చైనీస్ ఆచారం ఉంది. ఇది వాస్తవానికి దుష్టశక్తులను తరిమికొట్టడానికి, నూతన వధూవరులు, అతిథుల మధ్య బిడియాన్ని తొలగించేందుకు ఏర్పాటు చేసిన సరదా ఆచారం. అయితే ఏళ్లు గడుస్తున్న కొద్ది అది కాస్తా ప్రమాదకరమైన చిలిపి పనిగా మారిపోయింది. గతంలో కూడా ఇలాంటి ఆచారంతోనే ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు కూడా. ఈసారి మాత్రం మరింత సీరియస్‌గా మారింది. 2023 అక్టోబర్‌లో ఒక జంట అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. వివాహ తంతులో భాగంగా ఓ ఫ్రాంక్ చేశారు. అది కాస్తా చూస్తుండగానే సీరియస్‌గా మారింది. ఆ ఫ్రాంక్‌లో భాగంగా వధువు స్నేహితురాలు జాంగ్ని పెళ్లి కొడుకు స్నేహితుల గదిలో ఒంటరిగా వదిలేశారు. ప్రాంక్‌లో భాగంగా ఆమెను అల్మరా నుంచి బయటకు లాగి మంచ మీదకు విసిరి ఆపై ఒక దుప్పటితో గాలిలోకి ఎగరవేస్తారు. ఆ క్రమంలోనే వధువు స్నేహితురాలిని ఒకసారి ఎగరువేసినప్పుడు పెళ్లికొడుకు బృందం పట్టుకుంది. ఆ తర్వాత విసిరినప్పుడు ఆమె నేల మీద సరాసరి పడిపోవడంతో వెన్నుముకకు తీవ్ర గాయమైంది. దాంతో జాంగ్ సుమారు 18 రోజుల పాటు ఆస్పత్రిలోనే చికిత్స పొందాల్సి వచ్చింది. ఆ ఫ్రాంక్ ఆమెకు తీవ్రమైన గాయంతోపాటు శాశ్వత వైకల్యాన్ని మిగిల్చిందామెకు. దాంతో జాంగ్ కోర్టుని ఆశ్రయించింది. ఆ నేపథ్యంలో ఆగస్టు 2024 ఫోరెన్సిక్ న్యాయ బృందం ఆమె గాయాన్ని విచారించి గ్రేడ్ 9 వైకల్యంగా వర్గీకరించింది. అంటే ఇది 20% శాశ్వత వైకల్య రేటింగ్‌కు సమానం. దాంతో ఈ ఘటనకు కారణమైన వధువువరులకు, మరో తొమ్మిది మందిపై వైద్య ఖర్చులు, మానసిక క్షోభకు పరిహారంగా 32 లక్షలు చెల్లించమని ఆదేశించింది చైనా కోర్టు. వివాహ నిర్వాహకులకు ఈ ఫ్రాంక్ గురించి తెలిసినప్పుడు తగిన జాగ్రత్తలు లేదా ఆపడంలో ఎందుకు విఫలమైందంటూ చురకలంటించింది. ఈ దుశ్చర్యకు గానూ ఆ నష్టపరిహారాన్ని.. ఆ నూతన వధువరులకు 40%, అలా చేయమని సూచించిన వ్యక్తికి 20%, ఆ సమయంలో ఉన్న మిగతా తొమ్మిది మందికి 40% వంతున చెల్లించాలని పేర్కొంది.(చదవండి: Dr Deepti Sharma: ఎవరీ డాక్టర్ దీప్తి శర్మ? వైద్య విద్యలో ఏకంగా 19 పతకాలు..) -
ఎవరీ డాక్టర్ దీప్తి శర్మ? వైద్య విద్యలో ఏకంగా 19 పతకాలు..
గోల్డె మెడలిస్ట్ గురించి విని ఉంటారు గానీ ఏకంగా ఇన్ని గోల్డ్ మెడల్స్ సాధించిన వాళ్లను ఉండరు. అత్యంత అరుదు. అలాంటి అరుదైన ఘనతను సాధించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ డాక్టర్. వైద్య విద్యలోనే ఇన్ని పతకాలు సాధించడం విశేషం. డాక్టర్ కావాలన్న చిన్న నాటి కోరికను సాకారం చేసుకోవడమే కాదు..వైద్య విద్యను అభ్యసిస్తున్న కాలేజీకే గర్వకారణంగా నిలిచేలా ప్రతిభను చాటుకుని ప్రశంసలందుకుంటోందామె.ఆ అమ్మాయే ఉత్తరప్రదేశ్‌లోని మజఫర్పూర్కు చెందిన రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి కుమార్తె దీప్తి శర్మ. ఇటీవలే కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (కేజీఎంయూ) నుంచి వైద్య విద్యను పూర్తి చేసిన యువ పట్టభద్రురాలు. ఆ ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఇతర ప్రముఖుల సమక్షంలో మొత్తం 19 మెడల్స్ అందుకుంది. ఇన్ని పతకాలు ఆమెనే ఎలా వరించాయంటే..ఎంబీబీఎస్ ఫైనల్ ప్రొఫెషనల్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించినందుకు ప్రతిష్టాత్మకమైన హెవెట్ గోల్డ్ మెడల్, అన్ని ఎంబీబీఎస్ ప్రొఫెషనల్ పరీక్షలలో అత్యధిక మొత్తం మార్కులు సాధించినందుకు ఛాన్సలర్ గోల్డ్ మెడల్, అన్ని MBBS పరీక్షలలో అత్యధిక సంఖ్యలో గౌరవాలు, సర్టిఫికేట్లు పొందినందుకు యూనివర్సిటీ ఆనర్స్ గోల్డ్ మెడల్‌తో సహా మొత్తం 19 పతకాలను సాధించింది. వాటిలో 11 బంగారు పతకాలే.అంతేగాదు విశ్వవిద్యాలయ చరిత్రలోఆ పతకాలలో హెవెట్ గోల్డ్ మెడల్, ఛాన్సలర్ గోల్డ్ మెడల్ రెండింటిని గెలుపొందిన ఏడవ విద్యార్థిగా నిలవడం విశేషం. ఈ మేరకు దీప్తి మాట్లాడుతూ..గడిపిన ప్రత గంట కష్టానికి దక్కిన ప్రతిఫలంగా పేర్కొందామె. ఇన్ని పతకాలు గెలుపొందడం కన్నా.. పేరెంట్స్ పొందుతున్న సంతోషమే తనని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పింది. తన వైద్య విద్య ప్రారంభమైన రోజులను గుర్తు చేసుకుంటూ..2021లో సరిగ్గా మహమ్మారి సమయంలో ఇంటర్ నీట్ రెండిటినీ పూర్తి చేశాను. నీట్లో తొలిప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించి కేజీఎంయూ (KGMU)లో సీటు సంపాదించడం ఒక కల నిజమైనట్లుగా ఎంత సంబరపడ్డానో మర్చిపోనంటోందామె. ఆ సమయంలో తన పేరెంట్స్ ఎలా సంబరాలు చేసుకున్నారో మర్చిపోనని భావోద్వేగంగా చెబుతోంది. ఇంటర్న్‌గా చేస్తున్నప్పుడూ.. తన దృష్టిని పాఠ్యపుస్తకాల నుంచి రోగుల సంరక్షణ వైపుకి ఎలా మళ్లించిదో కూడా వెల్లడించింది. ఈ ప్రశంసలన్నీ తన కెరీర్‌కు ఒక నాంది మాత్రమేనని అంటోందామె. అవార్డులు, సర్టిఫికెట్లు కేవలం ఒక ఆరంభం మాత్రమేన అనడానికి ఇదొక నిదర్శనం అని అంటోంది. ఒక ఇంటర్న్‌గా రోజుల రోగులను కలుస్తాను, వాళ్లు తమ డాక్టర్ని చూసినప్పుడు వాళ్ల కళ్లల్లో కనిపించే ఆశ అనే మెరుపు ఆ అంచనాలకు అనుగుణంగా జీవించడంపై ఫోకస్ పెట్టేలా చేస్తుందని చెబుతోంది. వాళ్లు నాపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేసేలా స్వస్థత చేకూరేలా చేయడం తన కర్తవ్యమని అంటోంది. అంతేగాదు గందరగోళం కన్నా..స్థిరత్వమే మేలు అని నొక్కి చెబుతోంది. ఏం చదివినా..పూర్తి ఏకాగ్రతతో చదవడం,పునశ్చరణే అత్యంత కీలకం అని చెబుతోంది. కేవల మనం వేసుకున్న ప్లాన్‌ని విజయవంతం చేయడం కోసమే ఆందోళన పడండి తప్ప..ఇంకేం అవసరం లేదని అంటోంది. అదనపు ఒత్తిడిని నివారించి, మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుంటే..ప్రతిదీ దానంతట అదే సర్దుకుంటుందని చెబుతోందామె. భవిష్యత్తులో పునశ్చరణే కీలకం! మాస్టర్స్ డిగ్రీని అభ్యసించినా, సొంత క్లినిక్‌ను ప్రారంభించినా, లేదా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవను కొనసాగించినా, ఒక విషయం మాత్రం నిశ్చయం..అది ఆమె ఇప్పుడే వైద్య ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్న వైద్యురాలు అనేది. View this post on Instagram A post shared by Dr. Deepti Sharma (@deepti._bhardwaj) (చదవండి: భర్త డ్రీమ్ కోసం..పేరెంటింగ్ బాధ్యతలన్నీ ఆమెపైనే! పోస్ట్ వైరల్) -
భర్త డ్రీమ్ కోసం..పేరెంటింగ్ బాధ్యతలన్నీ ఆమెపైనే! పోస్ట్ వైరల్
టెక్ ప్రపంచం రోజురోజుకి ఎలా మారిపోతోందో తెలిస్తే విస్తుపోతారు. ఏ ప్రపంచంలో ఉన్నామనే ఫీల్ కలుగుతుందని అంటున్నారు నెటిజన్లు. వృత్తి బాధ్యతల్లో నిష్టాతులు అవ్వడం కోసం వ్యక్తిగత జీవితమే చిక్కుల్లోకి వెళ్లిపోవాల్సిందేనా అనే ఆందోళలను మొదలవ్వుతున్నాయి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కాదు..కెరీర్‌నే ముఖ్యమా అనే సందేహాలు లేవనెత్తాయి. ఏఐ సాంకేతికత అన్నింటిని సులువు చేసిందా..లేక టెకీలను దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టేసి..ఆనందానికే దూరం చేసిందా అంటే అవుననే అంటున్నారు పలువురు. ఎందుకంటే నెట్టంట వైరల్ అవుతున్న పోస్ట్ ఈ ప్రశ్నలనే లేవనెత్తుతోంది. ఏఐ టెకీల వృత్తి జీవితాన్ని ఇంతలా మార్చేసిందా అని నెట్టింట చర్చలు మొదలయ్యాయి. అసలేం జరిగిందంటే..2008 ఆర్థిక సంక్షోభం తర్వాత దాదాపు రెండు దశాబ్దాల పాటు, మెటా, గూగుల్ లేదా మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలలో ఉద్యోగం సంపాదించడం అత్యంత సురక్షితమైన, ప్రతిష్టాత్మకమైన కెరీర్ మార్గాలలో ఒకటిగా పరిగణించారు. టెక్ రంగం అధిక జీతాలు, స్థిరత్వాన్ని అందించడం తోపాటు కంప్యూటర్ సైన్స్ రంగం బాగా అభివృద్ధి చెందింది. అయితే గత కొన్నేళ్లుగా ఏఐ కారణంగా జరిగిన ఉద్యోగకోతలు అవకాశాల గనిగా ఉన్న సిలికాన్ వ్యాలీకి ఉన్న పేరు ఎలా దెబ్బతిందో తెలిసిందే. ఆ నేపథ్యంలో ఓ టెకీ తీసుకున్న నిర్ణయం కుటుంబంపైన, వ్యక్తిగతంగానూ ఎంత ప్రభావం చూపిందో తెలిస్తే..వామ్మో అంటారు. నెట్టింట వైరల్ అవుతున్న వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం..శాన్‌ప్రాన్సిస్కోకు చెందిన 31 ఏళ్ల టెక్ ఉద్యోగి అయిన ఒక భార్య, తన భర్త ‘AI నేటివ్’ ఉద్యోగిగా మారాలనే తపన వల్ల పిల్లల పెంపకం బాధ్యతలన్నీ తన భుజాలపై మోయాల్సి వచ్చిందంటూ పోస్ట్‌లో తన గోడుని వెళ్లబోసుకున్నారు. పేరు చెప్పాడానికి ఇష్టపడని ఆమె తన భర్త ఆశయం తనపై కుటుబం నిర్వహణ భారం ఎలా మోయాల్సి వచ్చిందో వివరించారు. తన భర్త కొన్ని నెలలు క్రితం ఏఐ నేటివ్‌గా మారడంపై ఫోకస్ పెట్టడం కోసం పిల్లల పెంపకం బాధ్యతలన్నీ తననే చూసుకోమని కోరారని పోస్ట్‌లో పేర్కొందామె. ఏఐ నేటివ్ ఉద్యోగి అంటే..ఆటోమేషన్ సాధనాల ఆధారంగా తమ పని విధానాన్ని పూర్తిగా పునఃరూపకల్పన చేసుకున్న వ్యక్తి అని అర్థం. అప్పుడప్పుడు చేసే పనుల కోసం చాట్బాట్లను ఉపయోగించే సాంప్రదాయ నిపుణుడు లేదా AI-ఆసక్తి గల ఉద్యోగిలా కాకుండా, ఒక AI నేటివ్ కృత్రిమ మేధను ఒక ప్రధాన భాగస్వామిగా ఉపయోగిస్తారు.ఇక ఆమె తన భర్త AI ప్రాజెక్టులపై పనిచేస్తూ తన ఆఫీసులోనే తనను తాను బంధించుకున్నప్పుడు ఆ అనుభవం తనకు ఏదోలా అనిపించిందని తెలిపింది. అయితే ఆయన కోరుకున్నట్లుగా తన కంపెనీలో తానే అగ్రశ్రేణి ఏఐ వినియోగదారుడిగా మారాడు, అందుకు తనకు కృతజ్ఞతలు కూడా చెప్పారంటూ పోస్ట్‌ని ముగించింది. ఈ పోస్ట్ తల్లిదండ్రుల బాధ్యతలు వర్సెస్ వృత్తిపరమైన బాధ్యతలపై చర్చలు లేవెనెత్తి హాట్‌టాపిక్‌గా మారింది. నిజంగా ఇక్కడ మానవత్వం పూర్తిగా కోల్పోతున్నాం, చిన్న చిన్న ఆనందాలన్నీ వదులుకుంటూ గడుపుతున్నాం. ఇదేం జీవింతం అంటూ ఆందోళనలు వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు.This is pretty bleak. pic.twitter.com/dr0BYzr3NO— Alec MacGillis (@AlecMacGillis) July 20, 2026 (చదవండి: నిరసనల్లో షబానా అజ్మీకి ఆకస్మిక తలతిరుగుడు..! ఎందుకిలా అంటే..) -
నిరసనల్లో షబానా అజ్మీకి ఆకస్మిక తలతిరుగుడు..! ఎందుకిలా అంటే..
న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన శాంతియుత విద్యార్థి నిరసనలో పాల్గొంటున్నప్పుడు బాలీవుడ్ నటి షబానా అజ్మీ స్వల్ప అనారోగ్య సమస్యకు గురైనట్లు సమాచారం. నిరసన ప్రదర్శన వీడియోలలో వాలంటీర్లు, భద్రతా సిబ్బంది ఆ 75 ఏళ్ల నటికి సహాయం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది అక్కడ రద్దీగా ఉన్న పరిసరాలలో మద్దతుదారులు ఆమెకు విసనకర్రతో విసురుతుండగా, ఆమె విశ్రాంతి తీసుకుంటుండటం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. ఆ నటి ఆరోజు అంతకుముందు నిరసన ప్రదర్శనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పంచుకున్నారు. వాటిలో నటుడు ప్రకాశ్ రాజ్‌తో కలిసి ట్రక్కులో తోటి నిరసనకారులతో ప్రయాణిస్తున్న దృశ్యాలను కూడా పంచుకున్నారామె. ఈ ప్రదర్శన శాంతియుతంగా, విద్యా సంస్కరణకు మద్దతుగా జరిగిందని పునరుద్ఘాటించారు కూడా. అయితే ఆమెకు ఆ సమయంలో ఆకస్మికంగా తలతిరగడానికి గల కచ్చితమైన కారణం అధికారికంగా వెల్లడించినప్పటికీ..తరుచుగా నిర్లక్ష్యంగా చూసే ఈ ఆరోగ్య లక్షణం గురించి వెలుగులోకి వచ్చింది. ఇది చూడటానికి సాధారణ సమస్యే కానీ..ఒక్కోసారి ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ నేపథ్యంలో అసలు ఆకస్మిక తలతిరుగుడు అంటే ఏంటి? ఎందువల్ల వస్తుంది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.ఆకస్మిక తలతిరుగుడు అంటే..తల తేలిపోతున్నట్లుగా అనిపించి, స్పృహతప్పి పడిపోవడం, సమతుల్యత కోల్పోవడం అని అంటారు. లేదా చుట్టూ ఉన్న పరిసరాలు గిరగిర తిరుగుతున్నట్లు అనిపించడం వంటి అనుభూతులను ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా వృద్ధులలో అత్యంత వైద్య సంరక్షణ కోరడానికి అత్యంత సాధారణ కారణాలలో ఈ ఆరోగ్య సమస్య కూడా ఒకటి. చాలా సందర్భాలలో తల తిరగడం తాత్కాలికమే. అందుకోసం కేవలం విశ్రాంతి, తగినంత నీరు తాగడం లేదా మూల కారణానికి చికిత్స చేయడం ద్వారా తగ్గిపోతుంది. ఒక్కోసారి తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కూడా మారుతుంది. ఎందుకిలా జరుగుతుందంటే..ఎక్కువసేపు ఆరుబయట కార్యకలాపాలు చేసేటప్పుడు లేదా రద్దీగా ఉండే కార్యక్రమాలలో ఇలా జరుగుతుందిడీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గడం)వేడి వాతావరణం, అధికంగా చెమట పట్టడం, తగినంత ద్రవపదార్థాలు తీసుకోకపోవడం వల్ల రరక్తపోటు పడిపోయి, ఇది తల తిరగడానికి కారణమవుతుంది.ఎక్కువసేపు ఆరుబయట ఉండటం వల్ల హీట్ ఎగ్జాషన్ (వేడి అలసట) కలగవచ్చు. దీని లక్షణాలలో తల తిరగడం, అలసట, తలనొప్పి, వికారం, అధికంగా చెమట పట్టడం వంటివి ఉంటాయి.రక్తపోటు అకస్మాత్తుగా తగ్గడం - ముఖ్యంగా వేగంగా నిలబడిన తర్వాత - మెదడుకు రక్త ప్రసరణను తగ్గించి, తల తేలిపోవడానికి దారితీస్తుంది.భోజనం మానేయడం లేదా ఎక్కువసేపు శారీరక శ్రమ చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోయి, నీరసం, వణుకు, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.లోపలి చెవి రుగ్మతలు కారణంగా కూడా ఇలా జరగొచ్చు.రక్తపోటు మందులు, నిద్రమందులు కొన్ని యాంటీడిప్రెసెంట్లతో సహా కొన్ని రకాల మందులు వృద్ధులలో తల తిరగడానికి కారణం కావొచ్చు. వైద్య అత్యవసర పరిస్థితిగా ఎప్పుడు పరిగణిస్తారు..ఛాతీ నొప్పిఅకస్మాత్తుగా నీరసించడం లేదా తిమ్మిరిమాట్లాడటంలో ఇబ్బందితీవ్రమైన తలనొప్పిస్పృహ కోల్పోవడందృష్టి మసకబారడం లేదా రెండుగా కనిపించడంనిరంతర వాంతులుశ్వాస తీసుకోవడంలో ఇబ్బందిఎలా నివారించాలి?సాధారణ జీవనశైలి చర్యలు ప్రమాదాన్ని తగ్గించగలవు.ముఖ్యంగా వేడి వాతావరణంలో, తగినంత నీరు తాగండి.విరామం లేకుండా ఎక్కువసేపు నిలబడటం మానుకోండి.రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి, క్రమం తప్పకుండా సమతుల్య భోజనం చేయండి.కూర్చున్న లేదా పడుకున్న స్థితి నుంచి నెమ్మదిగా లేవండి.వెచ్చని వాతావరణంలో తేలికపాటి దుస్తులు ధరించండి.అత్యధిక వేడిలో నీడ లేదా ఎయిర్ కండిషన్డ్ ప్రదేశాలను ఆశ్రయించండి.తల తిరగడం తరచుగా జరుగుతుంటే, వైద్యుడి సలహాలు, సూచనలు తీసుకోవాలి. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Shabana Azmi (@azmishabana18) (చదవండి: వర్షాకాలంలోనే ఇన్ఫెక్షన్లు ఎందుకు అధికం.. ? వైద్యులు ఏమంటున్నారంటే..) -
వర్షాకాలంలోనే ఇన్ఫెక్షన్లు ఎందుకు అధికం.. ? వైద్యులు ఏమంటున్నారంటే..
వర్షాకాలం అంటేనే చాలు ఇన్ఫెక్షన్లు అధికమవుతాయి. అదీగాక చాలామంది పలానా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నామంటూ వాపోతారు. దాంతో ఈ కాలం వ్యాధుల కాలమా? అనే ఫీలింగ్ కలుగుతంది కూడా. అసలు ఈ కాలంలో ఎందుకిలా జరుగుతుంది? అందుకు గల కారణాల గురించి ఆరోగ్య నిపుణుల మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా.వర్షాకాలంలో అధిక తేమ, నీరు నిల్వ ఉండటం, ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గులు బ్యాక్టీరియా, వైరస్లు, దోమలు వేగంగా వృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. దీనివల్ల సులభంగా ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తాయి. అలాగే చాలా ప్రాంతాలు వరదల కారణంగా ముప్పుకి గురవ్వుతాయి. దీంతో నీటినిల్వలు అధికమై దోమలు వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ కలుషిత నీటి వల్ల తీసుకున్న ఆహారం సైతం పాయిజన్ అయ్యి, జీర్ణ సంబంధిత సమస్యలు, టైఫాయిడ్, హెపటైటిస్ఏ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు అధికమవుతాయని అంటున్నారు. అలాగే వాతావరణంలోని అధిక తేమ ఫలితంగా శిలింధ్రాలు లేదా బ్యాక్టీరియా వృద్ధికి దారితీసి మరిన్ని చర్మవ్యాధులకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. పైగా ఈ కాలంలో ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలలోనూ, ఇళ్లల్లోనే ఎక్కువగా ఉంటారు. ఫలితంగా ఈ వైరస్లు ఒకరి నుంచి ఒకరికి సులభంగా సంక్రమిస్తాయని అన్నారు. అందుకే ఈకాలంలో జలుబు, ఫ్లూ, వైరల్ జ్వరం వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..ఈ కాలంలో బాత్రూంలను ఉపయోగించిన తర్వాత తినడానికి ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం వంటివి చేయాలి. తాజా ఆహారాన్ని మాత్రమే తినండి, శుభ్రమైన ఫిల్టర్ చేసినా లేదా మరిగించిన నీటిని మాత్రమే తాగండిరోడ్డు పక్కన కోసిన పండ్లు, పచ్చి సలాడ్లు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువ, కావున నివారించండిపరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. ఇంటి సమీపంలో ఎక్కడ నీటి నిల్వలు లేకుండా చూసుకోండికీటక నివారిణులను ఉపయోగించడం, ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో దోమల నివారణ వలలను వాడటం, పూర్తి చేతుల కప్పి ఉంచేలా దుస్తులు ధరించడం ద్వారా కీటకాల కాటును నివారించండి.వర్షంలో బూట్లు లేదా దుస్తులు తడిస్తే, ఫంగల్ చర్మ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడానికి పొడి బూట్లు లేదా దుస్తులు మార్చుకోండి. మధుమేహం, ఆస్తమా, గుండె జబ్బులు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారు, చిన్నపిల్లలు లేదా వృద్ధులు ఇన్ఫెక్షన్ సంబంధిత సమస్యల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారు ఇన్ఫెక్షన్ను నివారించడానికి తగిన శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్లను తగ్గించకపోగా, యాంటీ బయోటిక్ నిరోధకతను పెంచుతుంది. రెండు రోజుల కంటే ఎక్కువ కాలం జ్వరం, తీవ్రమైన నొప్పి, నిరంతర వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మూత్రవిసర్జన తగ్గడం, రక్తస్రావం లేదా నీరసం వంటి లక్షణాలు ఉంటే తక్షణమే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. అదీగాక వ్యాధిని సకాలంలో గుర్తించగలిగితే, వైద్యులు సమస్యకు తగిని విధంగా చికిత్స అందించి ఇతర సమస్యలు తలెత్తకుండా నివారించగలరనే విషయం గుర్తించుకోండి అని నొక్కి చెబుతున్నారు వైద్యులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: జస్ట్ రెండేళ్లలో 142 కేజీల నుంచి 80 కేజీలకు..! నిలకడగా బరువు తగ్గాలంటే..) -
Health: తప్పొప్పుల ఉప్పు..
మనం ప్రతిరోజూ ఉప్పు వాడకుండా అస్సలు ఉండం. ఇందులో ఉండే రసాయనం పేరే ‘సోడియమ్ క్లోరైడ్’. సాంకేతికంగా సంక్షిప్తంగా ఎన్ఏసీఎల్ అంటూ చెబుతారు. ఇప్పుడు మార్కెట్లో రకరకాల ఉప్పులు దొరుకుతున్నాయి. వాటి ప్రయోజనాలూ, ప్రతికూలతలూ పరిశీలిద్దాం. ఉప్పు మోతాదు ఎక్కువైనా తక్కువైనా ముప్పు అన్న విషయాన్నీ తెలుసుకుందాం.- మన సంస్కృతిలో ఉప్పు భూమిక తక్కువేమీ కాదు.- మన వాడుకలో ఉప్పు వాడకం చిన్నదేమీ కాదు. అందుకే అది...- ‘ఉప్పు’కప్పురంబు అంటూ పద్యాల్లో ఉంటుంది. - పదునగు మంచికూర నలపాకం చేసి... అందు ‘ఉప్పు’ లేక రుచిపుట్టగ నేర్చునా అంటూ శతకాల్లో ఉంటుంది. - ఎంతటి ధనవంతుడైనా ఉప్పు భోజనమే తప్ప మెరుగుబంగారం మింగబోడంటూ జాతీయాల్లో ఉంటుంది. - ఒకప్పుడు వేతనం ఉప్పు రూపంలో ఉండటంతో ‘‘మీ ఉప్పు తిని బతికాం’’ అంటూ నుడికారాల్లోనూ ఉంటుంది. - ఉప్పు లేని కూర... చప్పిడి భోజనం అంటూ సామెతల్లోనూ ఉంటుంది. - వీటన్నింటికీ తోడు మన వంటల్లో ఎలాగూ ఉంటుంది. - సంస్కృతిలోనే కాదు... ఆరోగ్యం పేరిట ఇప్పుడు వంట దినుసుగా కూడా ఎన్నెన్నో రకాలుగా దొరుకుతోంది. ఆ ‘ఉప్పు’ స్వరూపాలేమిటో, వాటి ఉపయోగాలేమిటో చూద్దాం.1. ఫ్లేక్ సాల్ట్..ఇది పూర్తిగా సాధారణ టేబుల్ సాల్ట్ లాంటిదే. అయితే ఇది స్ఫటికాలలా కాకుండా చాలా పలుచని రేకుల్లా, తేలిగ్గా విరిగే (బ్రిటిల్) పొరలు పొరల రేకుల్లా, కొన్ని సందర్భాల్లో ఖాళీగా ఉండే పిరమిడ్‌లా కూడా ఉంటుంది. దీన్ని ఖరీదైన రెస్టారెంట్లలో వాడుతుంటారు. వంట చివర్లో చల్లుతారు.లాభాలు / లోపాలు ఫ్లేక్ సాల్ట్‌ను రుచి కోసం కంటే మంచి టెక్స్చర్ కోసం ఎక్కువగా వాడతారని చెప్పవచ్చు. వంటల్లో త్వరగా కరిగిపోతుంది. ఇది మినహా మిగతాదంతా దాదాపుగా టేబుల్ సాల్ట్ లాగే ఉంటుంది.2. స్మోక్డ్ సాల్ట్..ఇది కొన్ని ప్రత్యేకమైన కలప / చెక్కను కాల్చి ఆ పొగతో పొగచూరేలా చేసిన ఉప్పు. నిర్దిష్టమైన కొన్ని రకాల చెక్క బెరడును కాలుస్తూ ఆ పొగను దాదాపు 14 రోజుల పాటు పొగచూరేలా చేశాక ఆ ఉప్పు ఒక రకమైన (సు)వాసన వస్తుంటుంది. ఇలా ఉప్పును ‘స్మోక్డ్’ ఉప్పుగా మార్చడం కోసం సాధారణంగా ఓక్, ఆపిల్ ఉడ్, ఆల్డర్, హికరీ, మెస్క్వైట్ వంటి చెక్కలను కాలుస్తారు. ఇలా సరికొత్త ఫ్లేవర్‌తో రూపొందడంతో ఈ తరహా ఉప్పు బార్బెక్యూ వంటలకు బాగా సరిపోతుంది.లాభాలు / లోపాలుదీని వాడకం వల్ల జీర్ణక్రియ కొంత మెరుగుపడుతుందనే భావన ఉంటుంది. ఇందుకు శాస్త్రీయమైన రుజువులు పెద్దగా లేవు. అయితే పరిమితంగా వాడినప్పుడు అలాంటి ఫీలింగ్ కొంతమందిలో కనిపిస్తుంది. దీన్ని ఎక్కువగా వాడటం వల్ల కడుపు ఉబ్బరం వంటి ప్రతికూలతలు కనిపిస్తాయి. ఎక్కువగా వాడితే సాధారణ ఉప్పు వల్ల ఉండే దుష్పరిణామాలే ఉంటాయి.3. పొటాషియం ఉప్పు..(పొటాషియమ్ ఉప్పు) లేదా ‘లో–సోడియం సాల్ట్’ (సోడియమ్ తక్కువ మోతాదులో ఉండే ఉప్పు) ఇందులో సోడియం మోతాదును కొంత తగ్గించి పొటాషియం క్లోరైడ్ కలుపుతారు. ఎందుకంటే సోడియమ్ క్లోరైడ్‌కు బదులు పూర్తిగా పొటాషియమ్ క్లోరైడ్ ఉంటే అది ఒకరకమైన చేదైన రుచితో ఉండవచ్చు.లాభాలు / లోపాలుసాధారణంగా సోడియమ్ లవణాలు రక్తపోటు (బీపీ)ను పెంచితే... దీనికి భిన్నంగా పొటాషియమ్ బీపీని తగ్గిస్తుంది. అందుకే బీపీ ఉన్నవారికి ప్రయోజనకరంగా దీన్ని కొందరు ఉపయోగిస్తుంటారు. అయితే దీన్ని ఎక్కువగా వాడటం వల్ల రక్తంలో పొటాషియమ్ మోతాదు పెరిగి ‘హైపర్కెలామియా’ అనే ఆరోగ్యపరమైన అనర్థం కలగవచ్చు. దీనికి తోడు కిడ్నీ వ్యాధి లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు దీని వాడకంలో జాగ్రత్తగా ఉండటం అవసరం.4. సెలరీ సాల్ట్సెలరీ గింజల పొడిని ఉప్పుతో కలిపి బ్లెండ్ చేయడం వల్ల వచ్చే ‘ఉప్పు’ను ‘సెలరీ సాల్ట్’గా పేర్కొంటారు. ఇది పూర్తిగా మామూలు ఉప్పు లాంటిదే అయినప్పటికీ కొన్ని రకాల ఆహారాల్లో ఫ్లేవర్ కోసం దీన్ని వాడుతుంటారు. సాధారణంగా బేకరీ ఐటమ్స్ అయిన హాట్‌డాగ్‌లు, కొన్ని మాక్‌టెయిల్ పానియాల్లో, అలాగే కొన్ని రకాల సలాడ్స్‌లో దీన్ని వాడతారు. ఇక కొన్ని సూపులూ, రోస్టెడ్ వెజిటబుల్స్లోనూ ఉపయోగిస్తారు. సెలరీ గింజలను కలపడం తప్ప దీని మిగతా గుణాగణాలన్నీ సాధారణ ఉప్పువే.5. వెల్లుల్లి ఉప్పు (గార్లిక్ సాల్ట్) మూడు మోతాదుల ఉప్పుకు ఒక మోతాదు ఎండిన వెల్లుల్లి ΄ûడర్‌ను కలిపి తయారు చేసేదే ఈ గార్లిక్ సాల్ట్. వంటల్లో మంచి రుచికోసం దీన్ని వాడుతుంటారు. సాధారణంగా మంచి రుచి కోసం మాంసాహారాలూ, కొన్ని రకాల శాకాహారాలతో పాటు ముఖ్యంగా పాప్‌కార్న్ తయారీలో దీన్ని ఉపయోగిస్తుంటారు. ఇది మినహా దాదాపుగా ఇది సాధారణ ఉప్పు లాంటిదే.6. ఉల్లి ఉప్పు (ఆనియన్ సాల్ట్)వెల్లుల్లి ఉప్పులో వెల్లుల్లి కలిపినట్టే... ఇందులో మూడు మోతాదుల ఉప్పుకు ఒక మోతాదు ఎండబెట్టిన ఉల్లి ΄ûడర్‌ను కలిపి దీన్ని తయారు చేస్తారు. కాస్తంత మంచి ఫ్లేవర్ కోసం దీన్ని వాడుతుంటారు. ఇది మినహా ఇందులోనూ దాదాపు టేబుల్ సాల్ట్‌లో ఉండే గుణగణాలూ, లాభనష్టాలే ఉంటాయి. 7. అయోడైజ్డ్ సాల్ట్సాధారణ టేబుల్ సాల్ట్‌కు అయోడిన్ కలిపితే వచ్చేదే ఐయోడైజ్డ్ సాల్ట్. కొన్నేళ్ల నుంచి మనదేశంలో సామాజిక, సామూహిక ఆరోగ్యం కోసం వాడుతున్న ఉప్పు ఈ అయోడైజ్డ్ ఉప్పు.లాభాలు..- ఒకప్పుడు మన దేశంలో లక్షలాది మందికి అయోడిన్ లోపం వల్ల... గాయిటర్, థైరాయిడ్ సమస్యలు- పిల్లల్లో మెదడు ఎదుగుదలలో లోపాలు... కనిపించేవి. అందుకే మన ప్రభుత్వాల ఆధ్వర్యంలో అయోడైజ్డ్ ఉప్పుకు ప్రాధాన్యం,ప్రోత్సాహం దొరికింది. దాంతో పిల్లలూ, పెద్దల్లో ఆ ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టాయి.లోపాలు..ఒక్క అయోడిన్ కలపడం మినహా ఇది పూర్తిగా సాధారణ టేబుల్ సాల్ట్ లాంటిదే. అందుకే ఎక్కువ మోతాదులో వాడితే బీపీ పెరగడం వంటి అనర్థాలు ఏర్పడతాయి. రక్తం వడపోత సమయంలో మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావాలు కనపడతాయి.8. సీజనింగ్ సాల్ట్ ఇందులో సాధారణ ఉప్పుకు మిరియాల ΄ûడర్, వెల్లుల్లి ΄ûడర్, ఉల్లి ΄ûడర్, కొన్ని సందర్భాల్లో అజినమోటో వంటి (ఎమ్ఎస్జీ) ΄ûడర్, పాప్రికా (ఇది ఒకరకం కలరింగ్ అండ్ ఫ్లేవర్ ఏజెంట్)తో పాటు ఇతర రకాల మసాలాలు కలిపి తయారు చేస్తారు. మంచి రుచి కోసం వాడే ఉప్పు ఇది. ఇందులోనూ ప్రధానంగా రుచి కోసం కలిపే పదార్థాల గుణాలు తప్ప... ఎక్కువ మోతాదు సాధారణ ఉప్పే ఉంటున్నందున... పరిమితికి మించి వాడితే దానివల్ల కలిగే దుష్పరిణామాలే కనిపిస్తాయి.9. అజినోమోటో (ఎమ్ఎస్జీ)ఇది చైనీస్ వంటకాల్లో వాడే ఉప్పు అని చాలామందికి తెలిసిన విషయమే. సాధారణ ఉప్పులో ఉండే రసాయనం సోడియమ్ క్లోరైడ్ అయితే ఇందులో మోనో సోడియమ్ గ్లుటామేట్ అనే రసాయనం ఉంటుంది. దీనివల్ల సా«ధారణంగా మనకు తెలిసిన తీపి, ఉప్పు, చేదు, వగరు రుచులకు తోడుగా ‘ఉమామీ’ అనే ప్రత్యేకమైన రుచి వస్తుంది. అందుకే ఈ ప్రత్యేక రుచి కోసం జపనీయులు, కొరియన్లు... మరీ ముఖ్యంగా చైనీస్ తమ వంటకాల్లో ఈ తరహా ‘ఉప్పు’ను వాడుతుంటారు.10. పిక్లింగ్ సాల్ట్దీన్ని ఊరగాయల కోసం ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇందులో అయోడిన్, యాంటీ–కేకింగ్ పదార్థాలు ఉండవు కాబట్టి ఊరగాయ రంగు మారకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది.11. సాధారణ ఉప్పు (టేబుల్ సాల్ట్)ఇది దాదాపు మనందరమూ ప్రతిరోజూ కూరల్లో, వంటకాల్లో... భోజనం అయ్యాక పెరుగులో రోజూ వాడే తెల్లని ఉప్పు. ఇందులో ఉండేవి...- 97–99% సోడియం క్లోరైడ్.- ఉప్పు గడ్డకట్టకుండా ఉండటం కోసం కొద్దిగా యాంటీ–కేకింగ్ ఏజెంట్లు వాడతారు.- కొంతకాలం కిందటి నుంచి అయోడిన్ కలుపుతున్నారు. - లాభాలు.. చాలా చవక, దాదాపు చాలావరకు పరిశుభ్రంగా ఉంటుంది.- అయోడిన్ కలిపితే అయోడైజ్డ్ రూపంలో దొరుకుతుంది.- లోపాలు.. సోడియం మోతాదు ఎక్కువ. ఎక్కువగా తినడం వల్ల హై–బీపీ రావచ్చు. (బీపీ పెరగవచ్చు)12. రాక్ సాల్ట్ (సైంధవ లవణం)ఇది కూడా సాధారణ టేబుల్ సాల్ట్ లాంటిదే అయినా ఇది లభ్యమయ్యేది గనుల నుంచే. అందుకే కొన్ని ఇతర లవణాలు కలవడం వల్ల దీన్ని రంగు కాస్త వేరుగా ఉండవచ్చు. సాధారణంగా దీని రంగు... తెలుపు, గులాబీ, లేత బూడిద.- ప్రత్యేకత : ఇందులో కొద్ది మోతాదులో కొన్ని సహజ ఖనిజాలు ఉంటాయి. కానీ వాటి మోతాదు చాలా చాలా తక్కువ. అందువల్ల ‘రాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల దేహానికి కాల్షియం, మెగ్నీషియం బాగా అందుతాయి’ అనే మాటలో పెద్దగా వాస్తవం లేదు.13. కోషర్ సాల్ట్ ఇది పూర్తిగా సాధారణ ఉప్పులాంటిదే. అయితే దీని స్ఫటికాల సైజు, వాటి సాంద్రత వేరుగా ఉంటాయి. ఇందులో అయోడిన్, యాంటీ కేకింగ్ ఏజెంట్స్ ఉండవు.దీని ప్రత్యేకతలు..- దీని లభ్యత పెద్ద స్ఫటికాల రూపంలో.- చేతితో చల్లడానికి సులువుగా ఉంటుంది.- మాంసానికి బాగా అంటుతుంది. సాధారణ ఉప్పతో పోలిస్తే ఆరోగ్య పరంగా ప్రత్యేకమైన తేడా ఏమీ ఉండదు.14. బ్లాక్ సాల్ట్ (కాలా నమక్)ఇది భారతదేశంలో బాగా ప్రసిద్ధి. తెలుగులో దీన్ని ‘నల్ల ఉప్పు’ / ‘నల్లుప్పు’ అని పిలుస్తారు. ఇందులో గంధకం (సల్ఫర్) సమ్మేళనాలు ఉండటం వల్ల కొద్దిగా ఉడికించిన గుడ్డులాంటి వాసన లేదా కాస్తంత ఘాటైన వాసన వస్తుంటుంది. దీన్ని చాట్ మసాలాలు, పెరుగుచట్నీ (రాయితా), పండ్లపై చల్లుతారు.15. హిమాలయన్ పింక్ సాల్ట్ఇది కూడా ఒక రకం రాక్ సాల్టే. కాకపోతే ఇది హిమాలయ సానువులనుంచి లభ్యమయ్యే లవణం. దీనికి గులాబీ రంగు రావడానికి కారణం ఇందులో ఉండే ఐరన్ ఆక్సైడ్. అయితే దీన్ని మార్కెట్ చేసే కొన్ని కంపెనీలు ఇందులో ‘84 రకాల ఖనిజలవణాలు (మినరల్స్) ఉన్నాయంటూ పేర్కొంటుంటాయి. ఇది వాస్తవమే అయినప్పటికీ... నిజానికి ఆ మోతాదులు చాలా చాలా తక్కువ. ఆ 84 ఖనిజాలన్నీ చాలా సూక్ష్మ పరిమాణాల్లో మాత్రమే ఉంటాయి. అందువల్ల వాటి ద్వారా ఆరోగ్యానికి ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరతాయని చెప్పే మాటలకు బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు.16. సముద్రపు ఉప్పు (సీ సాల్ట్)దీన్ని సముద్రపు నీటి నుంచి తయారు చేస్తారు. సముద్రపు ఒడ్డున మడిలాగా చేసి అనేక మడులలో సముద్రపు నీటిని ప్రవహింపజేసి, ఆ నీరు క్రమంగా ఇగిరిపోయేలా / ఆవిరైపోయేలా చూస్తారు. ఇలా మడిలా చేసి తీస్తారు కాబట్టి దీన్ని సముద్రం నుంచి పండించే ‘‘ఉప్పు పంట’’గా అభివర్ణిస్తారు.ఇందులో ‘సోడియం క్లోరైడ్’తో పాటు ఉండేవి... మెగ్నీషియం – కాల్షియం ∙పొటాషియం... అనే ఈ లవణాలన్నీ కూడా కొద్ది కొద్ది మోతాదుల్లో ఉంటాయి. ఈ లవణాల కారణంగా రుచి కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ ఇది దాదాపు టేబుల్ సాల్ట్‌తో సమానమే. ఇందులోని అనుకూలతలూ, ప్రతికూలతలూ సాధారణ టేబుల్ సాల్ట్‌తో సమానం.ఇదొక ఉప్పు కాని ఉప్పు..వాస్తవంగా చెప్పాలంటే ఇది మామూలు ఉప్పు లాంటిది కాదు. ఈ మోనోసోడియం గ్లూటామేట్ రసాయనంలో గ్లూటామేట్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. దీనివల్లనే ఉమామీ అనే కొత్త రుచి వస్తుంది. ఈ తరహా ఉప్పు కాని ఉప్పులో కొన్ని రకాల మష్రూమ్ (పుట్టగొడుగుల) పొడి, సముద్రపు ఆల్గే తాలూకు పొడి, ఎండిన టమాటా, ఈస్ట్ నుంచి తీసిన ఎక్స్‌ట్రాక్ట్‌ల వంటివి కలిపి తయారు చేస్తారు. దీన్ని కొన్ని రకాల వంటల్లో ఒక సీజనింగ్ మిశ్రమాలతో తయారైన ‘ఉమామీ సాల్ట్’గా వాడుతుంటారు. అందుకే దీన్ని ఉప్పు అనడం కంటే... ఇదొక అనేక రకాల ఫ్లేవర్లను ఇచ్చే పదార్థాల ఒక ప్రత్యేకమైన మిశ్రమంగా చెప్పవచ్చు.ఒక సూచన: దీన్ని ఎక్కువగా వాడటం వల్ల ఆరోగ్యపరమైన అనర్థాలు ఎక్కువే. అందుకే దీన్ని చాలా పరిమితంగా మాత్రమే... అందునా చాలా అరుదుగా వాడటమే మంచిది.ఉప్పు... ముప్పు! చాలా కంపెనీలు తమ ఉత్పాదన తాలూకు ఉప్పులో 70 రకాల ఖనిజాలు, 84 ఖనిజాలు, ప్రాచీన సముద్రాల ఉప్పు‘, ‘డిటాక్స్ సాల్ట్’, ‘మినరల్ సాల్ట్‘ వంటి ఆకర్షణీయమైన పదాలతో ప్రచారం చేసుకుంటూ ఉంటాయి. వినడానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, ఆరోగ్యపరంగా వాటితో అంతగా ప్రయోజనం ఉండదన్న విషయం తెలుసుకోవాలి. అది ఏ రకమైన ఉప్పు అయినప్పటికీ అందులోని సోడియం మోతాదు ఎక్కువైతే అధిక రక్తపోటు, గుండె–రక్తనాళాల సమస్యల ప్రమాదాలు పెరుగుతాయి. అందుకే మనం ఏ రకమైనది అయినప్పటికీ ‘ఉప్పు పెరిగితే ముప్పు’ అని గుర్తుంచుకోవాలి.ఒక ముఖ్యమైన విషయం... సాధారణ ప్రజలలందరూ వాడుకోతగినది అయోడైజ్డ్ ఉప్పు. ఇక రక్తపోటు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు లో–సోడియం (పొటాషియం) ఉప్పు వాడుకోవచ్చు. అలాగే రాక్ సాల్ట్, పింక్ సాల్ట్, సీ సాల్ట్ వంటి వాటిని రుచి లేదా వంట అవసరాల కోసం వాడవచ్చుగానీ అవేవో ఆరోగ్యపరంగా అద్భుతాలు చేస్తాయన్నది కేవలం అపోహ మాత్రమే. చివరగా... ఆసక్తికరమైన విషయం చెప్పాలంటే... ఉప్పు (సోడియం క్లోరైడ్)లోని అయాన్ల వల్లనే మన మెదడు నుంచి కండరాలకు కదలికల కోసం అవసరమైన సంకేతాలు అందుతుంటాయి. ఈ ఉప్పు అనేదే లేకపోతే మన నరాల నుంచి విద్యుత్ తరంగాల రూపంలో సంకేతాలు అందవు. అప్పుడు కండరాలు కదలవు, గుండె సక్రమంగా కొట్టుకోదు. అందుకే ఎంత మోతాదులో అవసరమో అంత మోతాదులో ఉప్పు వాడాల్సిందే. అది ప్రతివ్యక్తికి రోజుకు 5 గ్రాములు మించకూడదు (డబ్ల్యూహెచ్ఓ ప్రకారమైనా లేదా మన ఐసీఎమ్ఆర్ సూచనల ప్రకారమైనా) అని గుర్తుంచుకోండి. అంతేతప్ప పూర్తిగా ఉప్పు మానేస్తే ‘హైపో నైట్రీమియా’ అనే ఆరోగ్యపరమైన అనర్థం ఏర్పడుతుందని గుర్తుంచుకోవాలి.- ఎస్. స్వాతి, క్లినికల్ డైటీషియన్నిర్వహణ: యాసీన్ -
సాగుబడి: వానను బట్టి పంట విస్తీర్ణం..
వాతావరణ మార్పుల నేపథ్యంలో వర్షాధార భూముల్లో పెట్టుబడి నష్టపోకుండా పంటలు పండించే వినూత్న మెళకువలను అంతర్జాతీయ మెట్ట ప్రాంత వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఐసీఏఆర్డీఏ) ఐక్యరాజ్యసమితితో కలిసి ప్రచారం చేస్తోంది. పంటకు పూర్తిగా సరిపడా వర్షపాతం కురిసే పరిస్థితి లేనప్పుడు, రైతు తనకున్న వర్షాధార భూమి మొత్తంలో పంటలు వేసుకుంటే తేమ చాలక పంట అసలేమీ చేతికి రాదు. దీనివల్ల రైతుకు పూర్తి నష్టం వాటిల్లుతుంది.దీనికి ప్రత్యామ్నాయంగా, వాన నీటి సంరక్షణ పద్ధతుల ద్వారా పొలంలో కురిసే వర్షాన్ని వీలైన పద్ధతిలో ఒడిసిపట్టుకోవాలని సంస్థ సూచిస్తోంది. పొలంలో కొంత భాగాన్ని ఖాళీగా ఉంచి, మిగతా భాగంలో పంట వేసుకుంటే ఆ కాస్త పంటయినా దక్కుతుంది. పొలంలో ఎత్తయిన ప్రాంతంలో కురిసి, లోతట్టు భాగంలోకి ప్రవహించే నీటిని మాత్రమే మనం సంరక్షించుకోగలమని, దీనివల్ల కరువును కొంతవరకు అధిగమించవచ్చని ఐసీఏఆర్డీఏ పేర్కొంది.ఉదాహరణకు.. ఒక రైతుకు 4 హెక్టార్ల భూమి ఉంది. ఏడాదికి 150 మి.మీ. వర్షపాతం కురిస్తే అక్కడ సాధారణంగా ఏ పంటా పండదు. కానీ వాన నీటిని బయటకు పోనివ్వకుండా సంరక్షించుకుంటూ.. సగం పొలాన్ని ఖాళీగా ఉంచి, రెండో సగంలో పంటలు వేస్తే ఆ భాగానికి 300 మి.మీ. నీరు లభిస్తుంది. ఆ నీటితో కరువును తట్టుకునే పంటలు చేతికొస్తాయి. అదేవిధంగా, ము΄్పావు వంతు (3 హెక్టార్లు) భూమిలో వాన నీటిని సంరక్షించుకొని, మిగిలిన పావు వంతు (1 హెక్టారు) భూమికి మళ్లిస్తే, అక్కడ ఏకంగా 600 మి.మీ. నీరు అందుబాటులోకి వచ్చి పంటలు సమృద్ధిగా పెరుగుతాయి. వర్షపు నీటి సేకరణ ద్వారా తక్కువ వర్షపాతంలోనూ లాభదాయక వ్యవసాయం చేయవచ్చన్నది ఐసీఏఆర్డీఏ భావన. నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
సాగుబడి: బత్తాయితో 'టీ' కూడా!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బత్తాయి తోటలు విస్తారంగా సాగులో ఉన్నాయి. ముఖ్యంగా అనంతపురం, కడప, నల్గొండ, మహబూబ్‌నగర్ వంటి పూర్వపు జిల్లాల్లో ఎక్కువగా ఈ తోటలు విస్తరించాయి. గిట్టుబాటు కాకపోవటం, క్లైమేట్ ఛేంజ్, చీడపీడల దాడి తదితర సమస్యలతో కొన్ని జిల్లాల్లో బత్తాయి సాగు విస్తీర్ణం తగ్గుతున్న పరిస్థితి.మార్కెట్లో ధర బాగా తగ్గినప్పుడు బత్తాయి రైతులు తీవ్రంగా నష్టపోతుండటాన్ని శివరామ్ దగ్గరగా గమనించారు. ఈ విపత్కర పరిస్థితి నుంచి రైతులకు విముక్తి కల్పించి, వారి ఆదాయ వనరులను పెంచాలనే ఆశయంతో శివరామ్ ‘సహస్తి సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట వినూత్న స్టార్టప్‌ను ప్రాంభించారు. బత్తాయి పంట ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు.శాస్త్ర, సాంకేతిక తోడ్పాటుఅనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ‘అటల్ ఇంక్యుబేషన్ సెంటర్’, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఐఆర్– సీఎఫ్టీఆర్ఐ), బయో–నెస్ట్ వంటి ప్రతిష్టాత్మక జాతీయ పరిశోధనా సంస్థల సాంకేతిక సహాయం, శాస్త్రీయ మార్గదర్శనంతో వినూత్న పరిష్కారాలను అన్వేషించారు. బాలారిష్టాలను అధిగమించి తన ఆలోచనలకు కార్యరూపం ఇవ్వటంలో విజయం సాధించారు.పండులో ప్రతిదీ పనికొచ్చేదే..బత్తాయి తోటల ఆధారంగా సరికొత్త ‘వాల్యూ యాడెడ్’ (విలువ ఆధారిత) వెల్నెస్ ఉత్పత్తులను తయారు చేసిన శివరామ్ మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. సాధారణంగా బత్తాయి పండును కేవలం జ్యూస్ తీసుకోవడానికే ఉపయోగిస్తారు, ఆ తర్వాత మిగిలిన తొక్కలను పారేస్తుంటారు. కానీ పండులోని ప్రతి భాగాన్నీ.. అంటే రసం, గుజ్జు, తొక్క, చివరికి విత్తనాలను కూడా వంద శాతం సద్వినియోగం చేసుకుంటూ అనేక ఉత్పత్తులను తయారు చేశారు. ‘జీరో–వేస్ట్ సర్క్యులర్ ఎకానమీ’ వినూత్న మోడల్‌ను విజయవంతంగా ఆవిష్కరించారు.ఈ సరికొత్త ప్రయోగాలలో అత్యంత ప్రజాదరణ ΄÷ందుతున్న ఆవిష్కరణలు ‘బత్తాయి ఇ¯Œ ఫ్యూజ్డ్ టీ క్యూబికల్స్’, బత్తాయి టీ బ్యాగులు, ప్రత్యేక హెర్బల్ టీ ΄ûడర్. బత్తాయి తొక్కలను సౌర శక్తితో ఎండబెట్టి, బయోటెక్నాలజీ సాంకేతికత ద్వారా శుద్ధి చేస్తు్తన్నారు. దీనివల్ల సహజసిద్ధమైన సిట్రస్ ఫ్లేవర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్–సి, ముఖ్యమైన పోషకాలు నశించిపోకుండా 95% పైగా సురక్షితంగా ఉంటాయి. వీటితో పాటు బత్తాయి స్క్వాష్, అత్యవసర సుగంధ తైలాలు, ఫేస్ ΄ûడర్లు, న్యూట్రాస్యూటికల్ బయో–్ర΄÷డక్ట్స్‌ను కూడా శివరామ్ తయారు చేస్తున్నారు. రైతులకు అదనపు ఆదాయంమార్కెట్లో బత్తాయి ధర కిలో ఆరు రూపాయలకు పడిపోయిన తరుణంలో సైతం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పీఓల) ద్వారా బత్తాయి తొక్కలను సేకరించి, వాటికి మంచి ధర చెల్లించటం ఈ ఆధునిక సాంకేతికత వల్ల సాధ్యమవుతోంది. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం సమకూరుతోంది. నల్గొండ, అనంతపురం జిల్లాల పరిధిలోని గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాలకు సోలార్ డీహైడ్రేషన్ ప్రక్రియలపై శిక్షణ ఇచ్చి, వారి ద్వారా ఈ ఉత్పత్తులను పాక్షికంగా ప్రాసెస్ చేయిస్తున్నారు. తద్వారా గ్రామీణ మహిళలకు పనుల్లేని కాలంలోనూ స్థిరమైన ఉపాధి లభిస్తోంది.పర్యావరణ పరంగా కూడా ఈ ఆవిష్కరణ ఎంతో మేలు చేస్తోంది. సాధారణంగా కుళ్ళిపోయే బత్తాయి వ్యర్థాలను చెత్తకుప్పల్లో వేయటం వల్ల ప్రమాదకరమైన మీథేన్ వాయువు విడుదలవుతుంది. ఈ వ్యర్థాలను సేకరించి వివిధ ఉత్పత్తులను తయారు చేయటం ద్వారా వాయు కాలుష్యాన్ని అరికడుతున్నారు. సాంప్రదాయ వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంగా మారుస్తూ, అటు రైతులకు, ఇటు పర్యావరణానికి మేలు చేస్తున్న ఈ ఆవిష్కరణ జాతీయ పురస్కారానికి ఎంపిక కావటం ప్రశంసనీయం.బత్తాయి (చీనీ) తోటలు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్నప్పటికీ గిట్టుబాటు ధర రాక రైతులు తరచూ ఇక్కట్ల పాలవుతున్నారు. బత్తాయి రైతుల కష్టాలకు ముఖ్య కారణం విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చెయ్యకపోవటమే. ఈ దిశగా క్రియాశీలకంగా కృషి చేసిన ఒక స్వతంత్ర వ్యవసాయ శాస్త్రవేత్త సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలతో రైతుల ఆర్థిక సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. ఆయనే తెలంగాణకు చెందిన బండారు ఉషన్న శివరామ్.అగ్రికల్చర్ బీఎస్సీ చదివిన శివరామ్ అనేక సంవత్సరాలు కృషి చేసి బత్తాయి ఆధారిత వెల్నెస్ ఉత్పత్తుల సాంకేతకతలను ఆవిష్కరించి గ్రామీణ పారిశ్రామికవేత్తగా మారారు. ఆయన కృషికి జాతీయ స్థాయిలో సముచిత గుర్తింపు లభించింది. నీతి ఆయోగ్‌కు చెందిన ‘అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం)’ ద్వారా ఈ ఏడాది ఎంపికైన ‘గ్రామీణ ఆవిష్కర్త’ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల 31న న్యూఢిల్లీలో పురస్కారాన్ని అందుకోబోతున్నారు బలరామ్.రైతులకు ఆదాయం... మహిళలకు ఉపాధిబత్తా కాయలతో రసం ఒక్కటే పనికొచ్చేది అనుకోవటం వల్ల రైతులకు పెద్దగా ఆదాయం రావటం లేదని గుర్తించి.. వాల్యూ ఎడిషన్‌పై పరిశోధనలు చేపట్టాను. ప్రతిష్టాత్మక సంస్థల శాస్త్ర,సాంకేతికతల తోడ్పాటుతో బత్తాయితో ఆరోగ్యదాయకమైన టీ క్యూబికల్స్, టీ బ్యాగులు, ప్రత్యేక హెర్బల్ టీ ΄÷డి, స్క్వాష్, సుగంధ తైలాలు, ఫేస్ ΄ûడర్లు, పోషకాలతో కూడిన బయో ఉత్పత్తులను తయారు చేసే సాంకేతికతలను ఆవిష్కరించాం. పైలట్ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే బత్తాయి రైతుల ఆదాయం సుమారు 20–35 శాతం వరకు పెంచాం.గ్రామీణ మహిళల ద్వారా ఈ ఉత్పత్తులను తయారు చేయిస్తూ ఉపాధి కల్పిస్తున్నాం. నీతి ఆయోగ్‌కు చెందిన ‘అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం)’ ద్వారా గ్రామీణ ఆవిష్కర్త జాతీయ పురస్కారాన్ని ఈ నెల 31న అందుకోనుండటం సంతోషంగా ఉంది. రాబోయే మూడు నుంచి ఐదేళ్లలో 5 వేల మందికి పైగా బత్తాయి రైతులకు లబ్ధి చేకూర్చటం, వందలాది మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించటమే ధ్యేయంగా కార్యకలాపాలను దేశవ్యాప్త విస్తరణకు సిద్ధమవుతున్నాం.– బండారు ఉషన్న శివరామ్ (99854 77736), వ్యవసాయ పట్టభద్రుడు, బత్తాయి ఉత్పత్తుల ఆవిష్కర్తనిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
వేగంగా తింటున్నారా? ఇది మీ కోసమే..
ఉదయం హడావుడి.. ఆఫీసుకు వెళ్లే తొందర.. సమయం సరిపోకపోవడం.. ఇలా కారణాలు ఏవైనా కావచ్చు. కానీ కొందరి భోజనం చేసే స్టైల్ మాత్రం అందరికీ కనిపిస్తుంది. పక్కన కూర్చున్న వారు ఇంకా మొదటి ముద్దలో ఉండగానే.. వీరు మాత్రం ప్లేట్ ఖాళీ చేసేస్తారు. ఒక్కో ముద్దను వేగంగా తీసుకుంటూ.. మధ్యలో పెద్దగా విరామం లేకుండా భోజనం ముగించేస్తారు. “త్వరగా తినడం ఒక అలవాటే కదా.. ఇందులో ఏముంది?” అనుకుంటాం. కానీ..మనం తినే వేగం కూడా మన ఆలోచనా విధానం, జీవనశైలి, కొన్ని ప్రవర్తనా లక్షణాలకు చిన్న సంకేతం కావచ్చట. సైకాలజిస్టులు చెబుతున్న విషయం ఆసక్తికరంగా ఉంది మరి. ఆ విషయాలు పరిశీలిస్తే.. వేగంగా తినే అలవాటు వెనుక కేవలం తొందర మాత్రమే కాకుండా.. సమయాన్ని చూసే విధానం, పనులను పూర్తి చేసే తీరు, రోజువారీ జీవితంలో ఉండే వేగం వంటి అంశాలు కూడా దాగి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది వ్యక్తిత్వాన్ని పూర్తిగా అంచనా వేసే పరీక్ష కాదని.. కేవలం కొన్ని ప్రవర్తనా ధోరణులను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే చిన్న సంకేతంగా మాత్రమే చూడాలని సూచిస్తున్నారు.లక్ష్యాలపై ఫోకస్ ఎక్కువగా ఉంటుందా?.. వేగంగా తినే వ్యక్తుల్లో.. కొంతమంది లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెట్టే స్వభావం కలిగి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. వీరికి సమయం చాలా విలువైనదిగా అనిపిస్తుంది. చేయాల్సిన పనుల జాబితాను త్వరగా పూర్తి చేసి.. తర్వాతి లక్ష్యానికి వెళ్లాలనే ఆలోచన ఎక్కువగా ఉండొచ్చు. అందుకే భోజనం కూడా ఆస్వాదించే సమయం కంటే.. పూర్తి చేయాల్సిన మరో పనిలా మారిపోయే అవకాశం ఉంటుంది.వేచి ఉండటం నచ్చదా?.. వేచి ఉండటాన్ని ఇష్టపడకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. క్యూలో నిలబడటం, ఆలస్యంగా జరిగే పనులు, నెమ్మదిగా సాగే చర్చలు వారికి అసహనాన్ని కలిగించవచ్చు. వారి జీవనశైలి కూడా వేగంగానే సాగుతూ ఉంటుంది. ఒక పని పూర్తయిన వెంటనే మరో పని మొదలుపెట్టాలనే ఆలోచన వారిలో కనిపించవచ్చు. అయితే ప్రతి వేగంగా తినేవారు అసహన స్వభావం కలిగిన వారే అని చెప్పలేం. సమయాభావం, పని ఒత్తిడి వంటి కారణాలు కూడా దీనికి కారణం కావచ్చు.ఎప్పుడూ తర్వాతి పని గురించే ఆలోచనా?.. కొంతమంది భోజనం చేస్తున్నప్పటికీ వారి మనసు అక్కడ ఉండదు. ఫోన్లో మెసేజ్‌లు చూడటం.. ఆఫీస్ పనుల గురించి ఆలోచించడం.. తర్వాత చేయాల్సిన పనుల జాబితా సిద్ధం చేసుకోవడం వంటి అలవాట్లు ఉండొచ్చు. సైకాలజిస్టుల ప్రకారం ఇది ‘టాస్క్-ఫోకస్డ్ మైండ్‌సెట్’ కావొచ్చు. అంటే ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం కంటే.. తర్వాతి పని పూర్తి చేయడంపై దృష్టి పెట్టే స్వభావం.👉..అయితే.. వేగంగా తినడం వల్ల శరీరం ఇచ్చే ముఖ్యమైన సంకేతాలను మనం పట్టించుకోకపోవచ్చు. ముఖ్యంగా “ఇక చాలు” అనే తృప్తి సంకేతం మెదడుకు చేరడానికి కొంత సమయం పడుతుంది. కానీ వేగంగా తినేవారిలో భోజనం అప్పటికే పూర్తవుతుంది. దీంతో అవసరానికి మించి తినే అవకాశం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే నెమ్మదిగా తినడం వల్ల ఆకలి, తృప్తి స్థాయిని మెరుగ్గా అర్థం చేసుకోవచ్చని సూచిస్తున్నారు.👉ఈ అలవాటు ఉన్నవారు బిజీ షెడ్యూల్స్కు త్వరగా అలవాటు పడే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. తక్కువ సమయంలో నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు, ఒత్తిడితో కూడిన పనులు, వేగంగా మారే పరిస్థితుల్లో వీరు సౌకర్యంగా పనిచేయగలరని నిపుణులు భావిస్తున్నారు. అయితే కొందరు కేవలం పరిస్థితుల వల్లే వేగంగా తింటారు. ఉదాహరణకు.. తక్కువ లంచ్ బ్రేక్, కుటుంబ బాధ్యతలు, చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాట్లు కూడా కారణం కావచ్చు.👉భోజనం చేసే సమయంలో ఆహారం రుచి, వాసన, ఆకలి, తృప్తిని గమనిస్తూ తినడాన్ని ‘మైండ్‌ఫుల్ ఈటింగ్’ అంటారు. వేగంగా తినే వారిలో ఈ అలవాటు తక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నెమ్మదిగా తినడం వల్ల ఆహారాన్ని ఆస్వాదించడంతో పాటు.. శరీరం ఇచ్చే సంకేతాలను కూడా మెరుగ్గా గమనించవచ్చు.ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే.. తినే వేగం ఆధారంగా ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ణయించలేం. చిన్ననాటి అలవాట్లు, కుటుంబ వాతావరణం, సంస్కృతి, పని ఒత్తిడి, జీవన పరిస్థితులు.. ఇలా ఎన్నో అంశాలు మన తినే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి వేగంగా తింటున్నారని మీరు తప్పనిసరిగా ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన వారని కాదు. కానీ మీ రోజువారీ అలవాట్లను గమనించడానికి ఇది ఒక చిన్న సంకేతం కావచ్చు. మరి మీరు ఏ రకం? ప్లేట్ అందరికంటే ముందే ఖాళీ చేసేవారా.. లేక నెమ్మదిగా ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినేవారా?. -
గురువే దేవుడి కన్నా ఉన్నతుడు..
భారతీయ సంస్కృతిలో గురువుకు ఉన్న స్థానం అద్వితీయం. అందుకు ఈ కథ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు: ఒక రోజు గురువు, దేవుడు ఇరువురూ కలిసి ఓ వ్యక్తి దగ్గరకు వచ్చారు. వెంటనే అతడు భగవంతుని పాదాలను తాకి నమస్కరించబోయాడు. భగవంతుడు అతణ్ణి ఆపి, ‘ముందు నీ గురువును పూజించు’ అన్నాడు. సరే అని, అతడు గురువును పూజించడం ప్రారంభించాడు. కానీ గురువు ‘శిష్యా, నేను భగవంతుడిని నీ ఇంటికి తీసుకువచ్చాను, కాబట్టి నువ్వు ముందు భగవంతుడిని పూజించాలి’ అన్నారు.గురువు సలహా విని, శిష్యుడు భగవంతునివైపు తిరిగాడు. ‘నీ జీవితంలోకి భగవంతుడిని తీసుకువచ్చింది నీ గురువే. నన్ను చేరుకోవడానికి సరైన మార్గాన్ని నీకు చూపింది ఆయనే, కాబట్టి నువ్వు ముందు ఆయనను పూజించాలి’ అన్నాడు భగవంతుడు. ‘నేను భగవంతుని వద్దకు మార్గం చూపినప్పటికీ, ప్రతిదానికీ ఆయనే బాధ్యుడు, కాబట్టి నువ్వు ముందు భగవంతుని ఆశీర్వాదం పొందడం మంచిది’ అన్నారు ఈసారి గురువు. దీంతో శిష్యుడు దేవుని ఉద్దేశించి ‘తండ్రీ, గురువుగారు చెప్పేదంతా నిజమే కదా’ అన్నాడు. అందుకు భగవంతుడు ‘కర్మఫలాలను బట్టి, నేను ఎలాంటి భేదం లేకుండా జనులకు సుఖదుఃఖాలను ఇస్తాను. నేను ఎవరికీ కీడుగానీ, మేలుగానీ చేయను. ప్రతి వ్యక్తికీ వారి కర్మఫలాన్నే ఇస్తాను. కానీ గురువు అలాంటివాడు కాదు. ఆయన పవిత్రుడు. నిరాడంబరుడు. ప్రేమమయుడు. గురువు మార్గదర్శకత్వం కోరిన శిష్యుడిని, అతను ఎలా ఉన్నాడో అలాగే స్వీకరిస్తాడు. నన్ను చేరే మార్గాన్ని అతనికి చూపించి ఆశీర్వదిస్తాడు. అతను ఎలా ఉన్నా సరే సరిదిద్దుతాడు. శిష్యుడి కర్మఫలాల నుండి అతడిని కాపాడుతాడు. అతనితో ఉండి మార్గనిర్దేశం చేస్తాడు. కానీ నేను అలా చేయను. అందువల్ల, గురువే దేవుడి కన్నా ఉన్నతుడు’ అన్నాడు.– యామిజాల జగదీశ్ -
టీవీల ముందు జనసంద్రం.. రోడ్లపై నిశ్శబ్దం!
భారతీయ టెలివిజన్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే అద్భుతమైన కాలం ఒకప్పుడు ఉండేది. ఓటీటీలు, వందలకొద్దీ ఛానెళ్లు లేని ఆ రోజుల్లో ఒకే ఒక్క షో కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూసేది. సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం దూరదర్శన్పై ప్రసారమైన ఒక అద్భుతమైన ధారావాహిక దేశంలోనే టెలివిజన్ విప్లవానికి నాంది పలికింది. ఆ కాలంలో ఈ షో వస్తోందంటే చాలు, పనులు అన్నీ పక్కన పెట్టి జనం టీవీల ముందు వాలిపోయేవారు.టెలివిజన్ చరిత్రలో..భారతీయ టెలివిజన్ రంగంలో సరికొత్త శకానికి తెరతీసిన ఆ అపూర్వ ధారావాహికే 'హమ్ లోగ్'. జూలై 7, 1984న దూరదర్శన్పై ప్రసారమైన ఈ మొదటి ఎపిసోడ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం వినోదం పంచడమే కాకుండా, ప్రతి ఇంట్లోనూ కుటుంబ సభ్యులందరినీ ఒకచోట చేర్చడంలో ఈ సీరియల్ కీలక పాత్ర పోషించింది. నాటి సమాజంలో టీవీ సీరియల్స్‌కు బలమైన పునాది వేసింది ఈ ధారావాహికే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.వీధుల్లో నిశ్శబ్దం.. ఇళ్లల్లో కోలాహలంఈ షో ప్రసారమయ్యే సమయంలో గల్లీలు, మురికివాడలు, ప్రధాన వీధులన్నీ పూర్తిగా ఖాళీ అయిపోయేవి. జనాలు ఎవరి ఇళ్లలో టీవీలు ఉంటే అక్కడికి లేదా పొరుగువారి ఇంట్లోకి పరుగులు తీసేవారు. రోడ్లపై ఒక్క మనిషి కూడా కనిపించకుండా కేవలం ఈ షో కోసం టీవీల ముందు వాలిపోయేవారు. ఆ రోజుల్లో ఏర్పడిన ఈ క్రేజ్ ధారావాహికలపై జనాలకు ఉన్న విపరీతమైన ఆసక్తిని ప్రపంచానికి చాటిచెప్పింది.మధ్యతరగతి కుటుంబాల దైనందిన పోరాటం1980ల నాటి దిల్లీలోని ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే కష్టాలు, ఆశయాలు, విజయాల నేపథ్యంలో ఈ కథ సాగింది. నిత్య జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, లింగ వివక్ష, మద్యపాన వ్యసనం వంటి సున్నితమైన సామాజిక అంశాలను ఇందులో చాలా వాస్తవికంగా ప్రతిబింబించారు. ప్రతి మధ్యతరగతి కుటుంబం తమ ఇంట్లోని కథే ఇదంటూ దీనికి కనెక్ట్ అయిపోయింది.విదేశీ ఫార్మాట్ స్ఫూర్తితో రూపకల్పనఈ వినూత్న ప్రయత్నానికి మెక్సికన్ టీవీ సిరీస్ ‘వెన్ కొన్మిగో’ (1975) స్ఫూర్తిగా నిలిచింది. విద్య, వినోదాన్ని జోడించి ‘ఎడ్యుటైన్మెంట్’ పద్ధతిలో దీన్ని మలిచారు. అప్పట్లో మెక్సికో పర్యటనకు వెళ్లిన కేంద్ర మంత్రి ఆలోచన నుంచి ఈ కాన్సెప్ట్ పుట్టుకొచ్చింది. దీనికి ప్రముఖ రచయిత్రి/రచయిత అయిన మనోహర్ శ్యామ్ జోషి మాటలు అందించగా, పి. కుమార్ వాసుదేవ్ అత్యద్భుతంగా డైరెక్ట్ చేశారు.17 నెలల ప్రయాణం.. 156 ఎపిసోడ్ల మెరుపులుసుమారు 17 నెలల పాటు నిర్విరామంగా కొనసాగిన ఈ సోప్ ఒపెరా మొత్తం 156 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. డిసెంబర్ 17, 1985న దీని చివరి ఎపిసోడ్ ప్రసారమైంది. వినోద రంగంలో నూతన ఒరవడిని సృష్టించిన ఈ షోలో వినోద్ నాగ్‌పాల్, జయశ్రీ అరోరా, రాజేష్ పూరి, సుష్మా సేత్ వంటి దిగ్గజ నటులు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.అపురూప జ్ఞాపకాలునాటి తరం ప్రేక్షకులకు కేవలం ఇదొక టెలివిజన్ షో మాత్రమే కాదు, భావోద్వేగాల ప్రయాణం. పాత్రల ద్వారా సమాజంలోని రుగ్మతలను ఎత్తిచూపుతూనే, ప్రతి ముగింపులోనూ అశోక్ కుమార్ ఇచ్చే సందేశాలు ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. ఆధునిక కాలంలో ఎన్ని వందల ఛానెల్స్ వచ్చినా, నాటి ‘హమ్ లోగ్’ సృష్టించిన చరిత్ర, దాని ప్రభావం భారతీయ టెలివిజన్ మైలురాయిగా చిరస్థాయిగా నిలిచిపోతుంది.ఇది కూడా చదవండి: అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా.. ప్రశాంత్ కిషోర్ సవాల్! -
చీకటిని జయించిన విజయగానం
కళ్లు లేకపోవడం శాపం కాదు, చూసే మనసు లేకపోవడమే అతి పెద్ద లోపం అని నిరూపించింది ఆ గొంతు. ప్రపంచాన్ని చూసే భాగ్యం ఆ కళ్లకు లేదు, కానీ తన అసాధారణ పాటతో ప్రపంచం తన వైపు చూసేలా చేసింది. మలయాళ చిత్రం ‘ఏ.ఆర్.ఎం’లో పాడిన అద్భుతమైన జోలపాటకు ‘జాతీయ ఉత్తమ గాయని’గా నిలిచిన వైకోమ్ విజయలక్ష్మి ప్రస్థానం అవార్డులకే పరిమితం కాని సుదీర్ఘ ఆత్మగౌరవ పోరాటం!‘కె.జె.ఏసుదాస్ గారు ఎక్కడ ఉన్నా నాకు ఫోన్ చేయక మానరు. ఆయనే నాకు ఎన్నో సంగీత మెళకువలు నేర్పిన గురువు’ అంటారు వైకోమ్ విజయలక్ష్మి. ‘చూపు లేని నాకు ఎస్.జానకి, వాణి జయరామ్ వంటి గాయనులే సంగీత సరస్వతులుగా కనిపించారు. వారి పాటలు వినే పాడటం నేర్చుకున్నాను’ అంటారామె.అంధులు గాయనీమణులుగా రాణించడం మనకు తెలిసిందే. కాని జాతీయగాయనిగా అవార్డు పొందడం మాత్రం విజయలక్ష్మికే సాధ్యమైంది. చూపు లేకపోయినా సినీ సంగీతంలో సంగీత దర్శకుడిగా రవీంద్ర జైన్ ఎన్నో విజయాలు సాధించారు. గాయనిగా వైకోమ్ విజయలక్ష్మి ‘ఏ.ఆర్.ఎం’ సినిమాలో ‘అంగు వాన కోనిలు’ అనే గొప్ప పాట పాడి నేషనల్ అవార్డు పొందారు. టివోలి థామస్ ఈ సినిమా హీరో.తోడుగా నిలిచిన తండ్రి... కేరళలోని కొట్టాయం జిల్లా వైకోమ్లో 1981 విజయదశమి నాడు మురళీధరన్, విమల దంపతులకు విజయలక్ష్మి జన్మించారు. పండుగరోజే పుట్టినా ఆ దంపతుల ఆనందం ఎంతోకాలం నిలవలేదు. పుట్టుకతోనే మెదడు నరాల బలహీనత కారణంగా ఆమెకు చూపు రాదని డాక్టర్లు తేల్చేశారు. ఆ సమయంలో మురళీధరన్ది మద్రాస్‌లో (చెన్నై) ఎలక్ట్రానిక్స్ వ్యాపారం. అయితే ఐదేళ్ల వయసుకే రేడియోలో వచ్చే ఇళయరాజా, ఎం.ఎస్. విశ్వనాథన్‌ల తమిళ పాటలను విని, అచ్చు గుద్దినట్టు హమ్ చేస్తున్న కూతురిని చూసి వ్యాపారాన్ని పక్కనబెట్టి, ఆమెకు సంగీతమే సర్వస్వం చేయాలని నిశ్చయించుకుని సొంత ఊరు వైకోమ్ తిరిగి వచ్చేశారు. గాయత్రి వీణలో మేటి... విజయలక్ష్మికి చూపు లేని కారణంగా పాఠశాల విద్య, సాంప్రదాయ అక్షరాస్యత సాధ్యపడలేదు. కానీ వినికిడి శక్తితో దాదాపు 100కు పైగా రాగాలను గురువు లేకుండా సొంతంగా నేర్చుకుంది. కూతురి ప్రతిభకు ఎలక్ట్రానిక్స్ రంగంలో తనకున్న అనుభవాన్ని జోడించిన మురళీధరన్ ఒక సాధారణ ‘తంబురా’ వాయిద్యాన్ని ఎలక్ట్రికల్ పద్ధతిలో మోడిఫై చేసి, కేవలం సింగిల్ స్ట్రింగ్ ఉండేలా డిజైన్ చేశారు. దీని శబ్దానికి ముగ్ధుడైన వయోలిన్ విద్వాంసుడు కున్నకుడి వైద్యనాథన్ దీనికి ‘గాయత్రీ వీణ’ అని నామకరణం చేశారు. ఈ ఇన్‌స్ట్రుమెంట్‌తో నిరంతరాయంగా 24 గంటల పాటు 67 పాటలు వాయించి విజయలక్ష్మి ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్’ను సొంతం చేసుకున్నారు.రికార్డింగ్ రూమ్ సవాళ్లు... సంగీత కచేరీలతో గుర్తింపు వచ్చినా సినిమా రంగంలోకి రావడం విజయలక్ష్మికి అంత సులువు కాలేదు. ‘కళ్లు లేని ఈమె రికార్డింగ్ థియేటర్లో మైక్ ముందు ఎలా నిలబడుతుంది?’ అంటూ ఎన్నో ఆడియో స్టూడియోల నుంచి తిరస్కరణలు, అవమానాలు ఎదురయ్యాయి. చివరకు 2013లో మలయాళ దర్శకుడు కమల్ తన ‘సెల్యులాయిడ్’ చిత్రంలో ‘కాట్టే కాట్టే’పాటతో ఆమెకు మొదటి బ్రేక్ ఇచ్చారు. ఆ మొదటి పాటకే ఆమెకు కేరళ స్టేట్ అవార్డ్ దక్కింది. అయితే బ్లైండ్ సింగర్‌గా రికార్డింగ్స్ చేయడం ఒక పెద్ద యుద్ధం. కంపోజర్ ట్యూన్ వినిపిస్తే, దాన్ని క్షణాల్లో మైండ్‌లో రికార్డ్ చేసుకోవాలి. మలయాళం కాకుండా తెలుగు, తమిళం భాషల్లో పాడేటప్పుడు పదాల ఉచ్చారణ మరింత కష్టమయ్యేది. ఒకవైపు హెడ్‌ఫోన్స్ లో మ్యూజిక్ ట్రాక్ రన్ అవుతుంటే, లయ తప్పకుండా, శృతి జారకుండా ఒకే టేక్‌లో పాడటం విజయలక్ష్మి అసాధారణ శైలి.‘పాట కావాలా? పెళ్లి కావాలా?’ శారీరక లోపాలున్న మహిళలను కట్టుబాట్ల పేరుతో అణచివేయాలని చూసే వారికి విజయలక్ష్మి జీవితం ఒక గుణపాఠం. 2016లో ఒక ఎన్నారైతో నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం కాగానే ఆ వ్యక్తి ఆమెపై ఆంక్షలు విధించాడు. ‘నువ్వు స్టేజ్ షోలు ఆపేయాలి, సంగీతానికి దూరంగా ఇంట్లోనే ఉండాలి’ అని కండిషన్ పెట్టాడు. విజయలక్ష్మి వెనక్కి తగ్గలేదు. ‘నా శ్వాస లాంటి సంగీతాన్ని వదులుకుని నేను బతకలేను’ అంటూ ఆ పెళ్లిని అక్కడికక్కడే రద్దు చేసుకుంటున్నట్లు ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించింది. ఆ తర్వాత 2018లో అనూప్ అనే సంగీత ప్రియుడిని వివాహం చేసుకున్నప్పటికీ మనస్పర్థల వల్ల 2021లో విడాకులు తీసుకుని ఒంటరిగానే సంగీత ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.పురుషాధిక్య సమాజపు ఆంక్షలను ధిక్కరించి, ఆత్మగౌరవాన్ని గెలిపించుకున్న ఆ నిర్ణయమే ఈ రోజు ఆమెను దేశంలోనే అత్యున్నత జాతీయ అవార్డు వేదికపై విజేతగా నిలబెట్టింది. -
ఎందుకీ సంతానలేమి?
మునపటితో పోలిస్తే ఇటీవల మనదేశంలో సంతానలేమి కేసులు పెరుగుతున్నాయి. అందుకే కృత్రిమ గర్భధారణ (ఫెర్టిలిటీ) సెంటర్లను సందర్శించే దంపతుల సంఖ్యా పెరుగుతోంది. ఒక అంచనా ప్రకారం చూస్తే... ప్రతి ఆరుగురు దంపతుల్లో ఒక జంటను సంతానలేమి సమస్య బాధిస్తోంది. ఇది కాస్త గడ్డు పరిస్థితే అని చెప్పవచ్చు. ఎందుకంటే ... జనాభాలో యువత శాతం తగ్గడం వల్ల అనేక ప్రతికూలతలు కనిపిస్తాయి. ఆ సమాజం వృద్ధసమాజంగా మారి మానవ వనరులు కొరవడతాయి. దాంతో ఆ దేశ ఆర్థిక సంపద తగ్గడం, జీవన నాణ్యతలు దిగజారడం వంటి అనర్థాలు ఏర్పడతాయి. ప్రస్తుతం జపాన్ వంటి కొన్ని దేశాలు ఇందుకు ఉదాహరణ. అలాంటి పరిస్థితి రాకుండా ఉండి ఓ సమాజం యౌవనంగా, ఆరోగ్యకరంగా ఉండాలంటే పనిచేసే సామర్థ్యం ఉన్న యువత సంఖ్య స్థిరంగా ఉండటమో లేదా పెరుగుతుండమో జరగాలి. ఇదే జరగకపోతే ఆ దేశం వంధ్యత్వ సంక్షోభం (ఇన్ఫెర్టిలిటీ) దిశగా పురోగమిస్తూ.. అభివృద్ధి పథంలో తిరోగమిస్తుంది.25న ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ డే సందర్భంగా కృత్రిమ గర్భధారణ విషయంలో అనేక అంశాలపై ‘సాక్షి’ వరుస కథనాలు...ఇటీవల మన సమాజంలో సంతానలేమి సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య పెద్ద ఎత్తున పెరగడానికి అనేక అంశాలు కారణమవుతున్నప్పటికీ వీటిని ప్రధానంగా రెండుగా చెప్పవచ్చు. అవి మొదటిది... సామాజిక , రెండు ఆరోగ్య కారణాలుగా చెప్పవచ్చు. → సామాజికం: ఒకప్పుడు మన సమాజంలో అబ్బాయిగానీ, అమ్మాయిగానీ పెళ్లీడుకు రాగానే కుటుంబసభ్యులు మొదట వివాహానికే ప్రాధాన్యమిచ్చేవారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసు లో జరగాలంటూ అబ్బాయి సంపాదన అంతంతమాత్రంగానే ఉన్నా పెళ్లికి సిద్ధపడేవారు. కానీ ఇటీవల యువత చదువులూ, ఉన్నత ఉద్యోగాలంటూ తమ కెరియర్‌కే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. పెద్ద పెద్ద లక్ష్యాలు ఏర్పరచుకొని... అవి పూర్తయ్యేవరకూ పెళ్లిళ్లను వాయిదా వేసుకోవడం వంటి పనులు ఇటు అబ్బాయిలూ, అటు అమ్మాయిలూ చేస్తున్నారు. దీనికి తోడు ఇటీవలి కొత్త ఉద్యోగాల్లో ఉండే తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడులూ, అర్ధరాత్రి అపరాత్రి అనకుండా పనిచేయడాలు, శారీరకంగా కదలికలు లేని ఒకేచోట కూర్చుని చేసే ఉద్యోగాలు, ఒబేసిటీ, మద్యం, పొగతాగడం వంటి దురలవాట్లు... ఇవన్నీ కలసి సంతానలేమికి దారితీస్తున్నాయి.→ ఆరోగ్య కారణాలు: గతంతో పోలిస్తే యువతులు సైతం తమ కెరియర్కోసం విపరీతంగా శ్రమిస్తున్నారు. దాంతో... ఆ ఒత్తిడుల ఫలితంగా యువతుల్లో హార్మోన్ల అసమతౌల్యత ఏర్పడి అవి సంతానలేమికి దారితీస్తున్నాయి. ఉదాహరణకు యువతుల్లో అనేక హార్మోన్లతో కూడిన ఓ నిర్దిష్టమైన ‘సైకిల్’ నడుస్తుంటుంది. ఈ హార్మోన్ల అసమతౌల్యత కారణంగా ఆ సైకిల్ దెబ్బతినడంతో ఈ అంశం కూడ సంతానలేమికి కారణమవుతోంది. ఇలా సైకిల్ దెబ్బతినడంతో అండం తయారీలో, ఫలదీకరణలో, పిండం ఇం΄్లాంటేషన్లో ఇబ్బందుల వంటివి మహిళలకు ప్రత్యేకంగా వచ్చే సమస్యల్లో కొన్ని. దీనికి తోడు కొన్నిసార్లు యువతుల్లో కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కూడా సంతానం కలగడంపై ప్రభావం చూపవచ్చు.→ పురుషుల విషయంలో: ఒకప్పుడు సంతానలేమికి మహిళలనే ఎక్కువగా బాధ్యులను చేసేవారు. కానీ ఇప్పుడున్న సామాజిక అంశాలూ, యువతలో దురలవాట్లూ, మారుతున్న జీవనశైలి కారణంగా యువకుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు (మొటిలిటీ), నాణ్యత తగ్గడం వంటి అనేక అంశాలు సంతానలేమికి దారితీస్తున్నాయి. అందుకే ఒక జంటకు సంతానం కలగని సందర్భాల్లో సదరు యువకుడిలో తన వీర్యంలోని శుక్రకణాల విషయంలో వాటి సంఖ్య, కదలికలు, నాణ్యత ఇవన్నీ బాగున్నాయా అనే అంశాలను తెలుసుకోడానికి మొదట పురుషుడే వైద్యపరీక్షలు చేయించుకోవడం ముఖ్యం, అవసరం... పైగా మహిళలతో పోలిస్తే పురుషులకు నిర్వహించే వైద్యపరీక్షలు తేలికా, చవకా!నిర్ధారణ ఇలా... సంతానలేమిని ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ, సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అని రెండు రకాలుగా చెప్పవచ్చు. .ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ... పూర్తి ఆరోగ్యంగా ఉన్న దంపతులు వివాహం అయ్యాక ఎలాంటి కుటుంబనియంత్రణ పద్ధతులను పాటించకుండా, కలిసి ఉంటూ ఏడాదిపాటు గర్భధారణ కోసం ప్రయత్నించినా గర్భం రానప్పుడు... ఆ జంటకు సంతానలేమి సమస్య ఉంటే దానిని ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు.సెకండరీ ఇన్ఫెర్టిలిటీ... జంటలో మొదటిసారి గర్భధారణ జరిగాక... మళ్లీ రెండోసారి గర్భధారణ కోరుకుని, ఏడాదిపాటు ప్రయత్నించాక కూడా గర్భం దాల్చకపోతే దాన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు.ఈ చికిత్స ఎవరెవరికి? ∙ప్రతినెలా పీరియడ్స్ సరిగా వస్తూ, ఏడాదిపాటు ప్రయత్నించాక కూడా గర్భం రానివాళ్లలో ∙ఆ మహిళ 30 ఏళ్ల వయసుకు చేరుకున్న తర్వాత కూడా ఇంకా గర్భం రాని సందర్భాల్లో... ∙సెకండరీ ఇన్ఫెర్టిలిటీ ఉన్న మహిళ వయసు 35 ఏళ్లు దాటుతున్నా... అప్పటికి ఆర్నెల్లుగా ప్రయత్నిస్తున్నా గర్భం రానప్పుడు... ఇలాంటి జంటలు ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదించడం అవసరం.ట్విన్స్ మూడేళ్ల తేడా!ఏం కోల్పోయిన తిరిగి సంపాదించుకోవచ్చు. కాని ఎంత ప్రయత్నించినా తిరిగి రానివి రెండే..ఒకటి కాలం రెండు ప్రాణం...కాని ఆ కాలాన్ని ఫ్రీజ్ చేస్తే..? అదెలా జరగుతుందనుకుంటే మీరు ఈ కథ చదవాల్సిందే..అమెరికాలోని ముస్సోరి రాష్ట్రానికి చెందిన కెన్సాస్‌లో టేలర్ గ్రీన్హాగెన్ డెంటల్ హైజెనిస్ట్, తన భర్త జస్టిన్ ఒక ఫార్మాసిస్ట్. వీరిద్దరు సంతానం కోసం 2022లో ఐవీఎఫ్ పద్థతిని ఎంచుకున్నారు. 2023లో వీరిద్దరికి మగ శిశువు జన్మించాడు. అదే ఐవీఎఫ్ సైకిల్లో ఏర్పడిన మరో ఎంబ్రియోను క్రయోప్రిజర్వేషన్ (పిండాన్ని ఘనీభవింపజేసే ప్రక్రియ) ద్వారా భద్రపరిచి, మూడేళ్ల తర్వాత గర్భాశయంలో ప్రవేశపెట్టారు. దీంతో 2025లో వీరికి ఓ కుమార్తె జన్మించింది. ఇక్కడ విశేషమేమిటంటే ఈ ఇద్దరు పిల్లలు ఒకే రోజున ఎంబ్రియోలుగా జీవం పొందినా, ఈ ప్రపంచంలోకి రావడానికి మాత్రం మూడేళ్ల కాలం పట్టిందన్నమాట. ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనడం ఇప్పుడు మామూలే అయినా ఒకేసారి రూపొందిన ఎంబ్రియోలను ఇలా కాలవ్యవధిలో పిల్లలుగా జన్మించడం విశేషం. తాజాగా ఈ ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్న వీడియో టేలర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.డాక్టర్ బి. సృజనసీనియర్ కన్సల్టెంట్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ -
జస్ట్ రెండేళ్లలో 142 కేజీల నుంచి 80 కేజీలకు..! నిలకడగా బరువు తగ్గాలంటే..
బరువు తగ్గడం కష్టం కాదు గానీ, మళ్లీ యథావిధిగా పెరగకుండా ఉండటమే అతి పెద్ద టాస్క్ అని అంటున్నారు పలువురు. అందుకే వెయిట్‌లాస్ జర్నీలో నిలకడగా బరువు తగ్గేందుకు ప్రాధాన్యత ఇవ్వమని నొక్కి చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు. అదే మిమ్మల్ని స్మార్ట్‌గా మార్చి వెయిట్‌లాస్ జర్నీలో విజయం సాధించేలా చేస్తుందని చెబుతున్నారు. అందుకు ఉదాహరణే..ఈ యువకుడు. బరువు తగ్గక మునుపు తన రూపం, ఆ తర్వాత ఉన్న మార్పులను ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియో షేర్ చేశారు.ఆ వ్యక్తే కువార్ కపూర్. ఆయన సుమారు 142 కేజీల బరువు ఉండేవాడినని అన్నారు. బరువు తగ్గక మునుపు ఏవిధంగా ఉన్నానో పంచుకుంటూ..ప్రస్తుతం సుమారు 62 కేజీల పైనే తగ్గి 80 కేజీలకు తగ్గినట్లు వెల్లడించారు వీడియోలో. ఈ మార్పుకి వెనుక రహస్యం క్రాష్ డైట్లు కాదని, సరైన మార్గంలో నిలకడగా చేయడమేనని అన్నారు. తాను సరైన మార్గంలో నిలకడగా కార్డియో దినచర్యపై దృష్టిసారించి రెండేళ్లలోనే ఇంతలా స్మార్ట్‌గా మారానని చెప్పుకొచ్చాడు. అందుకోసం ఎలా కార్షియో సెషన్లు చేయాలో చెప్పారు. ఆయన వీడియోలో చాలామంది నేరుగా పదివేల అడుగులతో వాకింగ్ ప్రారంభిస్తారు. దీంతో త్వరితగతిన అలిసిపోయి..రెండో వారానికల్లా స్కిప్ చేస్తారని అన్నారు. అస్సలు ఈ పద్ధతిని పొరపాటుగా అభివర్ణించారు. అందుకే అతడు కొవ్వు తగ్గడానికి నిలకడగా చేసే కార్డియో ప్రగతిని పంచుకున్నారు. ప్రారంభ అధిక బరువులో..ప్రారంభ దశలో నేరుగా పదివేలు అడుగులు కాకుండా నెమ్మదిగా మొదలు పెట్టానని చెప్పారు. నిర్వహించగలిగితే సాధారణంగా రోజుకు 3000 నుంచి 5000 అడుగులు సరి అని చెప్పారు. లేదా అంతకంటే తక్కువ నడిచినా పర్లేదని అన్నారు. ఇక్కడ అలిసిపోకుండా నిలకడగా ఉండటమే లక్ష్యం అని అన్నారు. అధిక బరువు దశలో..అధిక బరువు ఉన్నవారు వారానికి రెండు సెషన్లలో, ఒకే జోన్లో 8000 అడుగులతో ప్రారంభించాలని ఆయన సిఫార్సు చేశారు. ఆయన ప్రకారం, శరీరం అలవాటుపడినప్పుడు, కార్డియో మెరుగుపడుతుంది. సామర్థ్యానికి మించి ప్రయత్నించే బదులు, సాధారణ వేగంతో చేయాలని కూడా ఆయన సూచించారు.ఓ మోస్తారు మార్పు మొదలయ్యాక..వారానికి రెండు సెషన్లలో, రెండు జోన్లలో 10,000 నుంచి 12,000 అడుగులు వేయాలని ఆ వ్యక్తి సూచించారు. ఎందుకంటే, ఈ దశలో స్థూలకాయం లేదా అధిక బరువు దశలతో పోలిస్తే శరీరం సమర్థవంతంగా పనిచేసే సామర్థ్యం మెరుగుపడుతుందని అన్నారు.బరువు తగ్గే దశఈ దశలో, రెండు లేదా మూడు ప్రాంతాలలో వారానికి రెండుసార్లు 15,000 అడుగులు నడవాలని ఆయన సలహా ఇచ్చారు. ఇది కొవ్వు తగ్గే ప్రక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. ఒకవేళ జిమ్‌లో పనితీరు తగ్గితే, ఆహారాన్ని కాకుండా కార్డియోను తగ్గించడం మంచిదని కూడా ఆయన తెలిపారు.అత్యంత కీలకమైన దశఇందులో అధిక ఫలితాలు, గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి కాబట్టి, రెండు లేదా మూడు విడతలుగా (సెషన్లలో) మొత్తం 20,000 అడుగులు నడవాలని ఆయన సూచించారు. ప్రతి దశకు తగిన కార్డియో వ్యాయామాలను వివరించడంతో పాటు, ఏ దశలో ఉన్నవారైనా సరే వారానికి కనీసం మూడు లేదా నాలుగు సార్లు బరువులు ఎత్తే వ్యాయామాలు (వెయిట్ లిఫ్టింగ్) చేయాలని కూడా సూచించారు. ఇలా కార్డియోని పెంచుకుంటే మెరుగైన ఫలితాలు అందుకోవడమే గాక ఆటోమేటిగ్గా బరువు కూడా తగ్గుతారని చెబుతున్నారు కువార్ కపూర్. View this post on Instagram A post shared by Kuwar Kapur (@fitnessbykuwar)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: పదవిలో ఉండగా తండ్రైన తొలి ఉపాధ్యక్షుడు..హాట్‌టాపిక్‌గా ఆ శాపం..!) -
పదవిలో ఉండగా తండ్రైన తొలి ఉపాధ్యక్షుడు..హాట్‌టాపిక్‌గా ఆ శాపం..!
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ దంపతులు నాలుగో బిడ్డకు స్వాగతం పలికారు. ఆయన సతీమణి ఉషా వాన్స్ ఆదివారం ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు జేడీ వాన్స్ స్వయంగా తెలిపారు. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని, తన ముగ్గురు పిల్లలు తమ్ముడిని చూసి సంతోషిస్తున్నారని ఆయనే ఒక ప్రకటనలో వెల్లడించారు. అయితే ఇలా పదవిలో ఉండగా ఉపాధ్యాక్షుడి కుటుంబంలో ఒక చిన్నారి జన్మించడం 156 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడంతోనే ఈ విషయం అందర్నీ తెగ ఆకర్షిస్తోంది. ఎందుకంటే గత శతాబ్దల కాలంలో.. పదవిలో ఉన్న ఏ ఉపాధ్యాక్షుడికి ఇలా పిల్లలు కలగకపోవడంతో ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.రీజన్ ఏంటంటే..జేడీ వాన్స్లా పదవిలో ఉండగా పండంటి బిడ్డకు స్వాగతం పలికిన చివరి అమెరికా ఉపాధ్యక్షుడు స్కైలర్ కోల్ఫాక్స్. అప్పటి అధ్యక్షుడు యులిసెస్ ఎస్. గ్రాంట్ హయాంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న కోల్ఫాక్స్, తన రెండవ భార్య ఎల్లెన్ మారియా కోల్ఫాక్స్లు స్కైలర్ కోల్ఫాక్స్ జూనియర్ అనే మగబిడ్డకు జన్మనిచ్చారు. కానీ కోల్ఫాక్స్ తర్వాత వచ్చిన ఉపాధ్యక్షులందరూ బాధ్యతలు స్వీకరించే సమయానికి వయసు పైబడినవారు కావడం, లేదా పూర్తి కుటుంబం ఉండటం లేదా టీనేజ్‌పిల్లలు ఉండటం/వ్యక్తిగత కారణలు తదితరాలేనని చెప్పొచ్చు. అందుకు ఉదాహారణగా గతంలో ఎన్నికైన ఉపాధ్యాక్షులును పరిశీలిస్తే..2021 నుంచి 2025 వరకు జో బైడెన్ హయాంలో ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన కమలా హారిస్, ప్రమాణ స్వీకారం చేసే సమయానికి 56 ఏళ్ల వయసు. అంతకుముందు, 2017 నుంచి 2021 వరకు డొనాల్డ్ ట్రంప్ హయాంలో మైక్ పెన్స్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 57 ఏళ్ల వయసు. అంతకుముందు, బరాక్ ఒబామా హయాంలో బైడెన్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు (వారి పదవీకాలం 8 ఏళ్లు). ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు 46 ఏళ్ల వయసు. అప్పటికే ఆయనకు నలుగురు పిల్లలు ఉండటంతో, ఆ తర్వాత ఆయనకు పిల్లలు కలగలేదు. బైడెన్‌కు ముందు, జార్జ్ డబ్ల్యూ. బుష్ హయాంలో డిక్ చెనీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఆ పదవీకాలం కూడా 8 ఏళ్లే. చెనీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 60 ఏళ్ల వయసులో ఉన్నారు. ఆయనకు అప్పటికే ఇద్దరు కుమార్తెలు. మళ్లీ 156 ఏళ్ల తర్వాత అమెరికా ఉపాధ్యాక్షుడు జేడీ వాన్స్ పదవిలో ఉండగా తండ్రైనా తొలి ఉపాధ్యక్షుడిగా అరుదైన రికార్డు సృష్టించారు. ఇది యాదృచ్ఛికమైనదే అయినా..ఈ ఘటనతో నాటి అధ్యక్షుడి శాపం కథలు తెరమీదకు వచ్చాయి. అలా ఎన్నికైన ప్రతి అధ్యక్షుడు..అధ్యక్షుడి శాపంగా పిలిచే దీన్ని 'టిప్పకానూ శాపం' (curse of Tippecanoe) అని పిలుస్తారు. దీని వెనుక ఉన్న జానపద కథనం ప్రకారం..'0'తో ముగిసే సంవత్సరంలో లేదా 20తో భాగించబడే సంవత్సరంలో ఎన్నికైన ప్రతి అమెరికా అధ్యక్షుడు పదవిలో ఉన్నప్పుడే మరణిస్తారని నమ్ముతారు (ఈ రెండు అంశాలు ఒకదానికొకటి సరిపోలుతాయి). ఈ నమ్మకం, శాపం మూలాలు 1811 నాటి టిప్పకానూ యుద్ధం నాటివి. అప్పుడు షానీ తెగ నాయకుడు టెకుమ్సే సోదరుడు టెన్స్క్వటవా, విలియం హెన్రీ హారిసన్‌ను శపించారు. హారిసన్ 1840లో ఎన్నికయ్యారు - ఏడాది తర్వాత న్యుమోనియాతో మరణించారు. అబ్రహం లింకన్ 1860లో ఎన్నికయ్యారు. ఆయన 5 ఏళ్ల తర్వాత హత్యకు గురయ్యారు. జేమ్స్ ఎ. గార్ఫీల్డ్, విలియం మెకిన్లీలకు కూడా అదే గతి పట్టింది. వరుసగా 1880, 1900లో ఎన్నికై, అధ్యక్ష పదవి చేపట్టిన ఏడాది లోపే హత్యకు గురయ్యారు. రూజ్వెల్ట్ 1940లో ఎన్నికయ్యారు. ఆయన ఐదేళ్ల తర్వాత మెదడులో రక్తస్రావం (cerebral hemorrhage) కారణంగా మరణించారు. చివరికి, 1960లో జాన్ ఎఫ్. కెన్నెడీ ఎన్నికయ్యారు. ఆయన సరిగ్గా మూడేళ్ల తర్వాత హత్యకు గురయ్యారు. ఈ శాపం నిజమా అంటే..అది ఆయా వ్యక్తుల వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించిన అంశం. కానీ ఇప్పుడు అమెరికా వాసుల దృష్టి అంతా 2040లో ఎన్నికయ్యే అమెరికా అధ్యక్షుడిపైనే ఉండటం విశేషం. ఎందుకంటే అది 21వ శతాబ్దంలో కూడా ఈ 'శాపం నిజమవుతుందా లేదా అనే ఆసక్తితో వేచిచూస్తున్నారు. ఏదీ ఏమైనా ఇలాంటివి కాస్త గమ్మత్తుగా ఫన్నీగా అనిపిస్తున్నా.. ఆ కథలన్నీ వ్యక్తిగత నమ్మకాలకు సంబంధించినదే అంటూ కొట్టిపారేస్తున్నారు మానసిక నిపుణులు.(చదవండి: సాధారణ బైక్ నుంచి బీఎండబ్ల్యూ రేంజ్‌కి..! వైరల్‌గా ఎన్నారై పోస్ట్) -
సొంత ఇల్లు, కారు లేకపోయినా జీవితాన్ని ఇలా హాయిగా గడపొచ్చు..
సొంత ఇల్లు, కారు కొనడం, సంపద కూడబెట్టడం.. విజయానికి గుర్తులుగా భావించే ప్రపంచంలో ఓ 35 ఏళ్ల వ్యక్తి తన జీవితం గురించి నిజాయితీగా షేర్ చేసుకున్న విషయాలు ఆన్లైన్లో ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. తన దగ్గర లేని వాటిపై దృష్టి పెట్టకుండా, గత ఏడాదితో పోల్చితే తన జీవితంలో వచ్చిన మెరుగుదల గురించి చెప్పాడు. అతని ఆలోచనా విధానం ఎంతో కొత్తగా అనిపించిందని చాలామంది అభిప్రాయపడ్డారు.ఈ పోస్టును ఇన్స్టాగ్రామ్ యూజర్ ఆశిష్ జైన్ చేశారు. క్యాప్షన్‌లో ఆయన ఇలా రాశారు. "నేను 35 ఏళ్ల వ్యక్తిని. నా సొంత ఇల్లు లేదు. కారు లేదు. అంతగా బ్యాంకు బ్యాలెన్స్ లేదు. షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్లలో పెద్ద పెట్టుబడులు లేవు. గొప్ప ఉద్యోగం కూడా లేదు. కానీ మంచి అద్దె ఇంట్లో ఉంటున్నా. ఉబెర్‌లో ప్రయాణించే స్తోమత ఉంది. ఒక్క రూపాయి అప్పు లేదు. గత ఏడాదితో పోల్చితే నా శరీరం మరింత ఆరోగ్యంగా ఉంది. మానసికంగానూ గత ఏడాదికంటే మెరుగ్గా ఉన్నా.ఏడాది తర్వాత ప్రాధాన్యం లేని విషయాల గురించి ఇక ఒత్తిడి పడటం మానేశా. ఇల్లు, కారు కొనాలనే ఒత్తిడిని నాపై పెట్టుకోవడం లేదు. భవిష్యత్తు గురించి తక్కువగా ఆలోచిస్తున్నాను. శారీరక, మానసిక ఆరోగ్యంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాను. పొగతాగడం మానేశాను, జంక్ ఫుడ్ తినడం కూడా తగ్గించాను. పర్లేదు.. జీవితంలో ప్రతి విషయానికీ వెంటనే సమాధానం దొరకాల్సిన అవసరం లేదు. పర్లేదు.. వచ్చిన ప్రతి రోజును అలాగే జీవించండి. మీపైనే దృష్టి పెట్టండి" అని ఆశిష్ జైన్ పేర్కొన్నాడు.నెటిజన్ల స్పందన"అప్పు లేదు. రేపటి గురించి ఒత్తిడి లేదు. ధూమపానం మానేశారు. ఇతరులతో పోల్చుకోవడం కూడా ఆపేశారు. నాకు తెలిసిన చాలా మంది 35 ఏళ్ల వారి కంటే ఇది ఎంతో బలమైన జీవన పరిస్థితి. అభినందనలు ఆశిష్" అని ఒకరు కామెంట్ చేశారు.మరో వ్యక్తి స్పందిస్తూ.. "ఆశిష్, నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. కృతజ్ఞతతో జీవించడం, ఇతరుల జీవనశైలితో పోల్చుకోకుండా, మీతో మీరే పోటీ పడటం.. ఇదే అత్యంత ఆచరణీయ జీవన విధానం" అని పేర్కొన్నారు."35 ఏళ్ల వయసులో అప్పులు లేకపోవడం, ఆరోగ్యమైన శరీరం, ప్రశాంతమైన మనసు.. ఇదే నిజమైన విజయం. ఈ విషయాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. మన చేతిలో ఉన్న వాటిపైనే ప్రతి రోజు దృష్టి పెట్టడం.. పూర్తి చేయాల్సిన జాబితా వెంట పరుగెత్తడం కంటే ఎంతో గొప్పది. ఇలాగే ముందుకు సాగండి" అని మరొకరు కామెంట్ చేశారు.I am a 35 year old who doesn’t own a house, doesn’t own a car, doesn’t have a big bank balance, doesn’t have a huge portfolio of stocks or mutual funds, doesn’t have a great job, but live in a decent rented home, can afford traveling by uber, have zero debt, a better body than it…— Ashish Jain (@In_Sane_Saint) July 19, 2026 -
రేపటిని సొంతం చేసుకోవడానికి...
‘విద్య సమాజ భవిష్యత్తుకు పాస్‌పోర్ట్ లాంటిది. రేపు అనేది, ఈ రోజే దానికోసం సిద్ధపడే వాళ్లకే సొంతం’ అంటాడు అమెరికన్ పౌర హక్కుల ఉద్యమకారుడు మాల్కం ఎక్స్. ప్రపంచంలో మున్ముందు సంభవించగల సాంకేతిక మార్పులకు, ఉద్యోగ మార్కెట్ అవలంబించే కొత్త రిక్రూట్మెంట్ విధానాలకు అనుగుణంగా విద్యా నిపుణులు రూపొందించిన ‘ఫ్యూచర్ రెడీ కోర్సులు’ విద్యార్థులను రేపటిని సొంతం చేసుకోవడానికి సిద్ధం చేస్తాయి.మెరుగైన ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు డేటా సైన్స్, కృత్రిమ మేధ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ వంటి ఫ్యూచర్ రెడీ కోర్సులు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనూ అందుబాటులో ఉండటం గమనించాల్సిన సంగతి. ‘ఇరవై ఒకటో శతాబ్దంలో నిరక్షరాస్యులు అంటే చదవడం, రాయడం రానివారు కాదు; నేర్చుకోవడం, నేర్చు కున్నదాన్ని వదిలేయడం, మళ్లీ కొత్తగా నేర్చుకోవడం తెలియని వారే’ అంటాడు అమెరికన్ రచయిత, ఫ్యూచరిస్ట్ ఆల్విన్ టాఫ్లర్. ప్రస్తుతం డేటా సైన్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ ఇత్యాది కోర్సులు, టాఫ్లర్ చెప్పినట్టుగా విద్యార్థుల వ్యక్తిగత ప్రతిభకు తగిన గుర్తింపునూ, సరిపడా ఆదాయాన్నీ తెచ్చిపెడతాయి. అందుకే ఈ కోర్సు లకే యువకులు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మునుపటితో పోల్చితే పూర్తి అధునాతనమైన ఈ కోర్సుల్లో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత. కోట్ల కొద్దీ ఉన్న పాత సమాచారాన్ని అర్థంచేసుకొని, భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే ఊహించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. మనం యూట్యూబ్ లేదా నెట్‌ఫ్లిక్స్‌లో ఒక వీడియో చూడగానే ‘మీకు ఇది కూడా నచ్చుతుంది’ అంటూ కింద కొన్ని ఆప్షన్స్ వస్తుంటాయి. ఇది డేటా సైన్స్ మహిమే. మనుషుల్లాగే సొంతంగా ఆలోచించి నిర్ణ యాలు తీసుకునే తెలివితేటలు యంత్రాలకు వచ్చేశాయి. డ్రైవర్ లేకుండా దానంతటదే రోడ్లపై నడిచే ‘టెస్లా’ కార్లు, మనతో మనిషిలా మాట్లాడే ‘చాట్‌జీపీటీ’... కంప్యూటర్లకు కళ్ళు, చెవులు, మెదడు వచ్చేశాయి. ఇది ఏఐ పుణ్యమే!మారిన మార్కెట్ స్వరూపం మన డబ్బును, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించే ఒక అదృశ్య సైన్యం మనకు అందుబాటులో ఉంది. మన బ్యాంక్ అకౌంట్ హ్యాక్ కాకుండా వచ్చే ఓటీపీలు, ఫోన్ లాక్ చేసే బయోమెట్రిక్ సిస్టమ్స్ ఇలా చాలా విషయాల్లో ఈ అదృశ్య సైన్యం పర్యవేక్షిస్తూ అభయ హస్తం చూపుతుంది. ఇదే సైబర్ సెక్యూరిటీ. ఇట్లాంటి ఫ్యూచర్– ప్రూఫ్ కోర్సుల ఫలితంగానే కాలేజీలు కేవలం డిగ్రీలు ఇచ్చే ఫ్యాక్టరీ లుగా కాకుండా, విద్యార్థులను ఆధునిక సవాళ్లను ఎదుర్కొనే సమ ర్థులుగా రూపొందించే నైపుణ్య కేంద్రాలుగా నిలబడుతున్నాయి.ఈ కోర్సులను పూర్తి చేసి ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఎంపికైతే, ఫ్రెషర్ స్థాయిలోనే నెలకు 1.5 లక్షల నుండి 2 లక్షల పైనే ప్రారంభ వేతనం లభిస్తోంది. ఈ ‘ఫాంగ్’ సంస్థలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞా నాన్ని ఉపయోగించి, సంప్రదాయ వస్తుసేవల రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేశాయి. వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేసే విధానం నుండి సేవలను పొందే విధానం వరకు ఈ సంస్థలు సృష్టించిన డిజిటల్ ఎకోసిస్టమ్ మార్కెట్ స్వరూపాన్నే మార్చేసింది. ఒక్కమాటలో, ఈ ఫ్యూచర్ రెడీ కోర్సులు ‘నేర్చుకోండి, సంపాదించండి, ఎదగండి’ నినాదానికి ఆచరణాత్మక రూపాలు. – ప్రొ. బెల్లి యాదయ్య, ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నకిరేకల్ -
Sushila Nayyar: గ్రామీణ భారత ఆరోగ్యం కోసం...
స్వాతంత్య్ర సమరయోధగా, రాజకీయ నాయకురాలిగా, త్యాగ శీలిగా ప్రఖ్యాతురాలైన సుశీలా నయ్యర్ గొప్ప వైద్యులు కూడా. ప్రస్తుతం పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉన్న కుంజాలో 1914 డిసెంబర్ 26న ఆమె జన్మించారు. న్యూఢిల్లీలోని లేడీ హార్డింజ్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన సుశీల 1939లో గాంధీజీ కార్య దర్శిగా పనిచేసే తన అన్న ప్యారేలాల్ను కలవడానికి వార్ధా వెళ్లారు. అక్కడ కలరా సోకినప్పుడు సుశీల ఒక్కరే ఆ మహమ్మారిని లొంగ దీయగలిగారు. ఈ విజయాన్ని గాంధీజీ ఎంతో కొనియాడారు. పిమ్మట బి.సి. రాయ్ ఆమెను గాంధీ దంపతుల వ్యక్తిగత వైద్యు లుగా నియమించారు.క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీ, కస్తూర్బా దంపతులతో పాటు ఆమె కూడా ఆగాఖాన్ భవనంలో బందీగా ఉన్నారు. కస్తూర్బా మరణించిన తర్వాత, 1945లో సేవాగ్రామ్‌లో ‘కస్తూర్బా హాస్పిటల్’ను ప్రారంభించారు. అదే ఇప్పుడు ‘మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’గా అభివృద్ధి చెందింది.సుశీల ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి 1950లో భారతదేశం తిరిగి వచ్చి ఫరీదాబాద్‌లో ‘ట్యూబర్ కులోసిస్ శానిటోరియం’ ప్రారంభించారు. ‘గాంధీ మెమోరియల్ లెప్రసీ ఫౌండేషన్’కు సారథ్యం వహించారు. 1952లో రాజకీయాలలో ప్రవేశించారు. జవహర్లాల్ నెహ్రూ మంత్రి వర్గంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. ఈ హోదాలో ఢిల్లీలో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్‌ను ప్రారంభించడంతోపాటు, పలు రోగాల నిర్మూలనకు మౌలికమైన ఆరోగ్య పథకాలు ప్రారంభించారు. 1955లో ఢిల్లీ విధాన సభకు స్పీకర్‌గా ఎంపికయ్యారు.1962లో రెండవసారి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించి 1967 దాకా గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ నియంత్రణ, స్త్రీల, పిల్లల ఆరోగ్యం సంరక్షణా కార్యక్రమాలతో పాటు మలేరియా, సుఖరోగాలు, క్షయ, కుష్టు వంటి వ్యాధుల నిర్మూలనకు పలు పథకాలు చేపట్టారు. సమాజం పట్ల ఎంతో ఆర్తి ఉన్న సుశీల అవివాహితగానే ఉండిపోయారు. కుటుంబ నియంత్రణ, మద్యపాన నిషేధంలో స్త్రీల పాత్ర గురించి రెండు పుస్తకాలు వెలువరించారు. గాంధీజీ, కస్తూర్బాలకు సంబంధించి మరో ఎనిమిది పుస్తకా లను రచించిన డా‘‘ సుశీలా నయ్యర్ 2001 జనవరి 3న సేవాగ్రామ్‌లో గుండెపోటుతో 86 ఏళ్ల వయసులో కనుమూశారు.– డా. నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి విశ్రాంత ఉన్నతాధికారి -
ఐవరీ చీరలో ‘రాధమ్మ’ను తలపిస్తున్న నీతా అంబానీ!
నీతా అంబానీ ధరించే చీరలే సందర్భం ఏంటో చెప్పేస్తాయి. కార్యక్రమానికి అనుగుణమైన వస్త్రాధారణతో తన ఫ్యాషన్ అభిరుచి ఏంటో చెప్పకనే చెప్పేస్తారామె. ముఖ్యంగా భారతీయ గొప్ప వారసత్వాన్ని చాటిచెప్పేలా హస్తకళకు అద్దంపట్టే చీరలతో అందర్నీ ఆశ్చర్యపర్చడమే గాక మన కళాకారుల నైపుణ్యాన్ని ఎలుగెత్తి చాటుతారామె. ఈసారి కూడా అలాంటి అందమైన చీరలో దివ్యంగా కనిపించింది నీతా అంబానీ. తన శారీతో ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియోని మేకప్ ఆర్టిస్ట్ స్మారవ్ రాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్పర్సన్ నీతా అంబానీ తన ఇంట జరిగే కృష్ణుడి పూజ కోసం..శ్రీకృష్ణుడి స్ఫూర్తితో రూపొందించిన ఐవరీ చీరలో ప్రత్యేకంగా కనిపించింది. ఫ్యాషన్‌ని సందర్భానుసారంగా స్టైలిష్‌గా కనిపించడంలో నీతాకు సాటిలేరని చెప్పొచ్చు. ప్రకాశవంతమైన సంప్రదాయంతో ఫ్యాషన్‌ని చాటుతుందామె. ఈసారి కూడా అలానే ఇంట్లో జరిగే పూజ కోసం కృష్ణుడి స్ఫూర్తితో రూపొందించిన ఐవరీ రంగు చీరలో దివి నుంచి భువికి వచ్చిన దేవతాలా మెరిసింది. తెల్ల గన్నెరు రంగు చీరపై పురాతన బంగారు, వెండి జరీతో కృష్ణుడి రూపాన్ని అందంగా ఎంబ్రాయిడరీ చేశారు. చీర అంతటా ఆ చిన్న కృష్ణుడి మోటీప్లను ఆలోచనాత్మకం నేయడం విశేషం. ఆ శారలో అద్భుతంగా ఎంబ్రాయిడరీ చేసిన అంచు, క్లిష్టమైన పూల నమునాలు ప్రధాన ఆకర్షణగా కనిపించాయి. ఏక వర్ణంగా ఉండే ఈ చీరకు ఆ డిజైన్ అద్భుతమైన లుక్‌ని ఇచ్చింది. అలాగే పల్లు కూడా పారదర్శకమైన ఆర్గాంజా వస్త్రంతో కూడిన వంపుల అంచు ఆమె భుజాల మీద నుంచి అందంగా జాలువారింది. ఆ చీరకు మ్యాచింగ్‌గా నిరాడంబరైమన గుండ్రని మెడ, హాఫ్ హ్యాండ్స్..ఆ చీరపై ఉన్న క్లిష్టమైన హస్తకళా నైపుణ్యం స్పష్టంగా కనిపించేలా ఆకర్ణగా నిలిచింది. ఆ అందమైన లుక్‌కి అనుగుణంగా ధరించిన వజ్రాభరణాలు మరింత శోభను చేకూర్చాయి. ముఖ్యంగా ఎమరాల్డ్-కట్ రాళ్లతో కూడిన పొరల వజ్రాల నెక్లెస్, దానికి సరిపోయే పూల చెవిపోగులు, వరుసగా పేర్చిన వజ్రాల బ్రాస్లెట్లు, వరుసగా పేర్చిన వజ్రాల బ్రాస్లెట్లు, ఒక పెద్ద కాక్టెయిల్ ఉంగరం వంటి జ్యువెలరీ నీతాకు మిరుమిట్లు గొలిపే ప్రకాశవంతమైన లుక్‌ని అందించాయి. అలాగే కురులను ముడివేసి, ముఖానికి లైట్ మేకప్‌తో చక్కటి గుండ్రటి బొట్టుతో సంప్రదాయం మేళవింపుతో కూడిన ఆధునిక మహిళలా మెరిసింది నీతా అంబానీ. View this post on Instagram A post shared by Sourav Roy| Hair & Makeupartist (@souravv_roy_) (చదవండి: కాంచీపురం చీరలో దేవతలా సాయిపల్లవి..!) -
‘విక్రమ్–1’లో మన వినయ్!
శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) నుంచి తొలిసారి ప్రయోగించిన భారతీయ ప్రైవేట్ రాకెట్ విక్రమ్–1(ఆగమన్) ప్రయోగం ఇటీవల విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ ఈ రాకెట్‌ను రూపొందించగా.. ఈ బృందంలో ఖమ్మం జిల్లా యువకుడు వినయ్‌కుమార్ ఇంజనీర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.వ్యవసాయం కుటుంబం..జిల్లాలోని రఘునాథపాలెం మండల కేంద్రానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో వినయ్‌కుమార్ జన్మించాడు. పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్ మూడేళ్లు, ఆతర్వాత లేటరల్ ఎంట్రీగా ఇంజనీరింగ్ మూడేళ్లు పూర్తిచేశాడు. ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్‌లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆయన ఆతర్వాత ప్రయోగాలపై ఆసక్తి పెంచుకున్నాడు. ఈక్రమాన స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీలో చేరాడు.ఇందులో భాగంగానే విక్రమ్–1 ప్రయోగంలో పాలుపంచుకోగా విజయవంతం కావడంపై పలువురు అభినందిస్తున్నారు. కాగా, శ్రీచైతన్య కాలేజీ చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ తమ కాలేజీ పూర్వ విద్యార్థి వినయ్‌కుమార్ తొలి ప్రైవేట్ రాకెట్ తయారీ, ప్రయోగంలో పాలుపంచుకోవడం గర్వకారణమని తెలిపారు. ఆయనను శ్రీధర్‌తో పాటు డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య, ప్రిన్సిపాల్ ఎస్.లక్ష్మీనారాయణ, ఎగ్జిక్యూటివ్ డీన్ డాక్టర్ వి.సుదర్శన్, వివి విభాగాల అధిపతులు వైశాలి, డాక్టర్ చార్యులు, కుమార్ తదితరులు అభినందించారు. -
తీవ్రమైన చలి, బలమైన గాలుల మధ్య..
యూరప్‌లోని అత్యున్నత శిఖరమైన మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని నిజామాబాద్ జిల్లాకు చెందిన మాలావత్ పూర్ణ మరోసారి అధిరోహించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని చిన్న వయస్సులో అధిరోహించిన సిరికొండ మండలం పాకాలకు చెందిన పూర్ణ.. ప్రముఖ పర్వతారోహణ సంస్థ ట్రాన్స్సెంట్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో మౌంట్ ఎల్బ్రస్ను అధిరోహించిన బృందానికి ఎక్స్‌పెడిషన్ లీడర్‌గా వ్యవహరించారు. పూర్ణ నాయకత్వంలో భారతీయ బృందం ఈనెల 18వ తేదీన ఉదయం 9 గంటలకు (రష్యా కాలమానం) మౌంట్ ఎ్రల్బస్ను అధిరోహించింది. రష్యా లోని కాకసస్ పర్వత శ్రేణిలో ఉన్న మౌంట్ ఎ్రల్బస్ యూరప్‌లోని అత్యున్నత శిఖరం మాత్రమే కాకుండా ప్రపంచ ప్రఖ్యాత సెవెన్ సమిట్స్లో ఒకటి. తీవ్రమైన చలి, బలమైన గాలులు ఉంటాయి. -
400 ఏళ్ల నాటి ఆలయంలో బర్త్‌డే ప్రత్యేక పూజలు చేసిన నటి
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ (Bhumi Pednekkar) తన 37వ పుట్టినరోజు (జూలై 18) సందర్భంగా గోవాలోని తన పూర్వీకుల గ్రామమైన పెడ్నేలోని 400 ఏళ్ల నాటి సుప్రసిద్ధ శ్రీదేవి మౌళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించింది. తమ గ్రామంలోని మౌళి మాత కులదేవి అని స్వచ్ఛమైన మంచినీటి సెలయేటి పక్కన ఉన్న ఆమె పురాతన రాతి విగ్రహానికి ఔషధ గుణాలు ఉన్నాయని తెలిపింది. ‘‘నా వయసు మరో ఏడాది పెరిగింది. ఈ పుట్టినరోజును మా కులదేవి ఆశీస్సులతో ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఈమె మా అందరి జీవితాల్లో ప్రేమను, ఐశ్వర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాను." అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో అభిమానులు ఆమెకు అభినందనలుతెలిపారు. ఈ సందర్భంగా ఆలయానికి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశారు. View this post on Instagram A post shared by Bhumi Satish Pednekkar (@bhumisatishpednekkar)మౌళి దేవి ఆలయ విశిష్టతమాత మౌళి దేవి పెడ్నేకర్ వంశస్థులతో పాటు ఆ ప్రాంతంలోని అనేక కుటుంబాలకు కులదైవం.ఈమెను దుర్గాదేవి అవతారంగా పూజిస్తారు.ఇక్కడి ఒక స్పటిక నిర్మలమైన నీటి ప్రవాహం (జలపాతం) పక్కన కనీసం 400 ఏళ్ల నాటి పురాతన రాతి విగ్రహం ఉంది. ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని స్థానికుల నమ్మకం. ఇదే కాంప్లెక్స్‌లో ఒక కొత్త ఆలయాన్ని కూడా నిర్మించారు. ఇదీ చదవండి: 800 మందికి శాంసంగ్ ఝలక్ : కారణం ఇదే!ఈ ఆలయం నిర్మాణం ఇండో-పోర్చుగీస్ డిజైన్ శైలిని కలిగి ఉంటుంది. కొంకణ్ ప్రాంతానికి చెందిన అరుదైన ఎరుపు-గోధుమ రంగు క్లే ప్లాస్టర్ టెక్నిక్ అయిన 'కావి ఆర్ట్' (Kaavi art) తో ఇక్కడి గోడలను అలంకరించారు. ఇక్కడి మహిషాసుర మర్దిని శిల్పం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే ప్రాంగణంలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన కొన్ని పురాతన విగ్రహాలు, నందితో కూడిన రామేశ్వర లింగం కూడా ఉన్నాయి. భగవతి దేవి ఆలయం, రావల్ నాథ్ ఆలయం కూడా ఇక్కడి ప్రత్యేకత. రావల్ నాథ్ స్వామిని ఆ గ్రామ రక్షకుడిగా, పెడ్నేకర్ వంశ సంరక్షకుడిగా భావిస్తారు. పెళ్లిళ్లు, కొత్త ఇళ్ల నిర్మాణం లేదా కొత్త పనులు ప్రారంభించే ముందు ఇక్కడ 'ప్రసాదం' అడిగి అనుమతి తీసుకునే ఆచారం ఉంది.ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది -
సాధారణ బైక్ నుంచి బీఎండబ్ల్యూ రేంజ్‌కి..!
సాధారణ స్థితి నుంచి ఉన్నత స్థాయికి చేరుకుంటే ఆ ఫీల్ ఆ ఆనందం మాటలకందనిది. ఒక్కసారిగి వెనుతిరిగి చూసుకుంటే..ఇంత పెద్దస్థాయికి ఎలా చేరుకున్నాను అని ఆశ్చర్యం, గర్వం ఒకేసారి కలుగుతాయి. అంతేగాదు అందుకోసం మనవాళ్లు చేసిన త్యాగాలు కళ్లుముందు మెదలడమే కాదు..అందుకు తగ్గట్టుగా ప్రయోజకుడై వాళ్లను బాగా చూసుకుంటే..అంతకుమించిన సంతృప్తి ఇంకొకటి ఉండదు. ఆ ఆనందాన్నే ఓఎన్నారై ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది.మధురకు చెందిన ఎన్నారై అమిత్ కశ్యప్ షేర్ చేసిన వీడియో నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. భారతదేశంలోని సాధారణ బైక్ నుంచి అమెరికాలో బీఎండబ్ల్యూ కొనుగోలు చేసే రేంజ్‌కి తాను ఎలా చేరుకున్నాడో ఇన్స్టాగ్రామ్ రీల్లో పంచుకున్నాడు. ఒకప్పుడు భారతదేశంలో తన వద్ద ఒక బైక్ మాత్రమే ఉండేదని, కానీ ఈరోజు అమెరికాలో తన సొంత ఇంటి గ్యారేజ్‌లో కారుని పార్క్ చేస్తున్నానని అని చెప్పడం ఎంతో గర్వంగా ఉంది అన్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని మధురకు చెందిన తాను ప్రస్తుతం అమెరికాలో టెక్సాస్‌లో నివశిస్తున్నట్లు పేర్కొన్నాడు. తన పేరెంట్స్ కోసం అమెరికాలో ఒక ఇల్లు కొన్నట్లు తెలిపాడు. అమెరికా రోడ్లపై బీఎండబ్ల్యూ కారుని నడపడమే కాదు, అందులో మా అమ్మనాన్నలతో కలిసి ప్రయాణిస్తున్నానని అన్నారు. అంతేగాదు తాను కట్టిన ఇల్లుని అమ్మకు బహుమతిగా ఇచ్చినట్లు తెలిపారు కూడా. తను ఈ రోజు ఈ ఉన్నత స్థాయిలో ఉన్నానంటే అందుకు తన పేరెంట్స్ చేసిన త్యాగాలేనని గుర్తుచేసుక్న్ననారు. డబ్బు ఆదా చేసేందుకు తన తల్లి మట్టిపొయ్యి మీద వంట చేయడంతో సహా, ఎన్నెన్నో త్యాగాలు చేశారు. తమ సొత ఖర్చులు తగ్గించుకుని, అప్పులు చేసి మరి మంచి స్కూల్‌కి పంపించారని, అలాగే ఇంజనీరింగ్ ఫీజుల కోసం ప్రతి పైసాను ఎలా కూడబెట్టేవారో తాను ఇప్పటికీ మర్చిపోనని అన్నారు. అంతేగాదు అలా మట్టిపోయ్యి మీద వండుతున్నప్పుడు ఆ పొగతో ఆమె పడ్డ బాధ ఇప్పటికీ గుర్తుందని భావోద్వేగంగా మాట్లాడారు. అంతేగాదు ఆ పరిస్థితుల్లో ఏదో ఒక రోజు మంచి స్థాయికి చేరుకుని మా కుటుంబానికి ఉన్న మధ్యతరగతి అన్న ముద్రను మార్చేయాలని ఎంత బలంగా అనుకునేవాడో నాటి సంఘటనలను గుర్తుతెచ్చుకుని మరీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇవాళ తాను మంచిహోదాకు చేరుకుని ఆ కలను నిజం చేసుకున్నా.. అని సగర్వంగా చెబుతూ వీడియోని ముగించారు. అంతేగాదు కశ్యప్ సక్సెస్ జర్నీపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఓపికగా, నిలకడగా ఉంటే విజయ తథ్యం అదే కశ్యప్ చేసి చూపించారని పలువురు పొగడ్తల వర్షం కురిపించారు. View this post on Instagram A post shared by Amit Kashyap (@amitkashyap._) (చదవండి: రన్నింగ్ జస్ట్ ఫిట్నెస్ కాదు! అంతకుమించి..) -
రన్నింగ్ జస్ట్ ఫిట్నెస్ కాదు! అంతకుమించి..
ఆరోగ్యం కోసం వ్యాయామాలు, వాకింగ్ , రన్నింగ్ వంటివి అన్ని చేస్తుంటాం. ఇది సర్వసాధారణం. చాలామంది రోజువారి దినచర్యలో భాగం కూడా. కానీ అదొక జస్ట్ రోజు చేసే ఒక సాధారణ దినచర్య కాదని, అంతకుమించి అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నా అంటూ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నిజాయితీగా వెల్లడించిన ఆ అభిప్రాయం నెటిజన్ల మనసుని హత్తుకుంది. ఆ వీడియోలో ప్రఖర్ నేగి అనే ఇన్స్టాగ్రామ్ వినియోగదారుడు తనకు 29 ఏళ్లు అని, స్థిరమైన ఉద్యోగం కూడా ఉందని చెప్పాడు. గురుగ్రామ్‌లో రాత్రి 7:30 గంటలకు తాను 15 కిలోమీటర్లు పరుగెత్తడానికి కారణం ఏదో తప్పనిసరి పరిస్థితులు కాదని, తనను కాపాడటానికి ఎవ్వరూ రారని తెలుసుకోవడమేనని అన్నారు. తాను సాధించాల్సిన లక్ష్యాలు తనంతట తానే సాధించుకోవాలని అన్నారు. ఇది అంగీకరించేందుకు కష్టంగా ఉన్నా..ఇదే నిజం అని అన్నారు. ఆరోగ్యంగా ఉండాలనే ఆశావాదం పెంపొందించుకుంటే..ఏదైనా సాధ్యమేనని మనఃపూర్వకంగా విశ్వసించాలని అన్నారు. అలా రోజు చేయడం కాస్త కష్టం ఉన్నా..గొప్పగా లైప్ ఉండాలి, మరిన్ని చూడాలంటే తప్పదని అన్నారు. అలాంటి వాళ్ల గొప్ప విజయాలకు అర్హులని చెప్పారు. దయచేసి మీరు కూడా ఇలాంటి ఆశావాహ దృక్పథాన్నే అలవరుచుకోవాలని పిలుపునిస్తూ..అందరికీ "హ్యాపీ రన్నింగ్" శుభాకాంక్షలని చెప్పారు. నెటిజన్లకు ప్రఖర్ పంచుకున్న ఆలోచనలు ఎంతగానో ఆకట్టుకోవడమే కాదు..ఆరోగ్యంగా ఉండటంపై మంచి స్ఫూర్తినిచ్చారు, ధన్యవాదాలు అని పోస్టులు పెట్టడం విశేషం. View this post on Instagram A post shared by Prakhar Negi (@negisdayintheliferunning) (చదవండి: కేవలం ఆటో నడుపుతూ నెలకు రూ. 60 వేలు..!)


