సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా | Eesha Movie Telugu OTT Streaming Now | Sakshi
Sakshi News home page

OTT Movie: ఓటీటీలో తెలుగు హారర్ మూవీ స్ట్రీమింగ్

Feb 17 2026 9:52 AM | Updated on Feb 17 2026 12:34 PM

Eesha Movie Telugu OTT Streaming Now

ఈ వారం ఓటీటీల్లో చెప్పుకోదగ్గ తెలుగు రిలీజులు అయితే లేవు. ఉ‍న్నవి కూడా డబ్బింగ్, హిందీ చిత్రాలే. అలాంటిది ఇప్పుడు సడన్‌గా ఓ తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీలో అందుబాటులోకి ఉంది. ఇంతకీ ఏంటా మూవీ? ఎందులో చూడొచ్చు?

(ఇదీ చదవండి: తమిళ బోల్డ్ సినిమా.. ఒకేసారి ఆరు ఓటీటీల్లో స్ట్రీమింగ్)

గతేడాది క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన హారర్ సినిమా 'ఈషా'. త్రిగుణ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు, అఖిల్ రాజ్ ప్రధాన పాత్రలు చేశారు. శ్రీనివాస్ మన్నె దర్శకుడు. అయితే ఎప్పటికప్పుడు హారర్ మూవీస్ చూసేవాళ్లకు ఇదేమంత గొప్పగా అనిపించలేదు. కొందరికి మాత్రం నచ్చింది. ఓవరాల్ గా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించుకున్నారు. ఇప్పుడీ చిత్రం దాదాపు రెండు నెలలకు ఇ‍ప్పుడు అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. కాకపోతే ప్రస్తుతానికి విదేశాల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మన దేశంలో ఈ శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

'ఈషా' విషయానికొస్తే.. కల్యాణ్(త్రిగుణ్), నయన (హెబ్బా పటేల్), అపర్ణ (సిరి హనుమంతు), వినయ్ (అఖిల్ రాజ్) చిన్నప్పటి నుంచి స్నేహితులు. దెయ్యాలు, ఆత్మలు లేవని బలంగా నమ్ముతుంటారు. ఓ బృందంగా ఏర్పడి దొంగ బాబాలు, స్వామిజీల బండారాల్ని బయటపెడుతుంటారు. అలా ఓసారి ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉంటున్న ఆదిదేవ్ (బబ్లూ పృథ్వీరాజ్) బాబా గురించి తెలుసుకుంటారు. అతడి బాగోతం బయటపెట్టాలని, అక్కడికే వెళ్లి బాబాని కలుస్తారు. మాటల సందర్భంలో ఆత్మల విషయంలో ఈ నలుగురికి బాబా ఓ ఛాలెంజ్ చేస్తాడు. ఇంతకీ ఆ సవాలు ఏంటి? చివరకు వీళ్లు ఏం తెలుసుకున్నారు? ఈ నలుగురిని చంపాలనుకుంటున్న పుణ్యవతి ఎవరు అనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)

Advertisement
 
Advertisement
Advertisement