విశాఖపట్నం : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సంద్రం ఆధ్యాత్మిక సాగరంగా మారింది.
తెల్లవారుజాము నుంచే నగరవాసులు భక్తిశ్రద్ధలతో సముద్ర స్నానాలు ఆచరించారు.
ఆర్కే బీచ్ నుంచి అప్పుఘర్ వరకు తీరమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది.
చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు వేలాది మంది తరలిరావడంతో బీచ్ రోడ్డు జనసంద్రమైంది.
మహిళలు సముద్ర స్నానాల అనంతరం తీరంలో సైకత శివలింగాలను ప్రతిష్టించి, దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.
మాఘమాసం కావడంతో సూర్య భగవానుడికి అర్ఘ్యం వదిలి మొక్కులు తీర్చుకున్నారు.


