Yadadri
-
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలు చౌటుప్పల్, వేములపల్లి, తిప్పర్తి మండలాల్లో చోటు చేసుకున్నాయి. చౌటుప్పల్ : జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం రాంగ్రూట్లో వచ్చి ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన అన్నెబోయిన మల్లేష్(45) మండల పరిధిలోని తూప్రాన్‌పేట గ్రామంలో గల హెచ్‌పీ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. రోజువారి మాదిరిగా డ్యూటీకి వెళ్లిన మల్లేష్.. శనివారం డ్యూటీ దిగి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో కై తాపురం గ్రామ స్టేజీ వద్ద విజయవాడ మార్గం నుంచి ఎదురుగా అతివేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో మల్లేష్ బైక్ పైనుంచి ఎగిరి రోడ్డుపై పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు అతడిని వెంటనే అంబులెన్స్‌లో చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ చింతలకుంటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మృతుడి భార్య అలివేలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ మన్మథకుమార్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మహిళ.. వేములపల్లి : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందింది. ఈ ఘటన శనివారం రాత్రి వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామ శివారులో గల నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై చోటుచేసుకుంది. వేములపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణం రంగన్న కాలనీకి చెందిన జిల్లేపల్లి మదనాచారి అతడి భార్య గిరిజ (51) తమ ఆటోలో శనివారం ఉదయం నల్లగొండ పట్టణంలోని తమ సమీప బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యారు. రాత్రి తిరిగి అదే ఆటోలో మిర్యాలగూడకు బయలుదేరి వస్తుండగా.. శెట్టిపాలెం గ్రామ శివారులోని నార్కట్‌పల్లి–అద్దంకి రహదారి వెంట గల హెచ్‌పీ బంక్ సమీపంలో రోడ్డుపై ఆపి ఉన్న లారీని గమనించకుండా వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ఘటనలో గిరిజ తలకు తీవ్ర గాయాలు కాగా.. మదనాచారి సైతం గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని 108 అంబులెన్స్ వాహనంలో మిర్యాలగూడకు తరలిస్తుండగా మార్గమధ్యలో గిరిజ మృతి చెందింది. తీవ్ర గాయాలైన మదనాచారి మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి కుమారుడు జిల్లెపల్లి వెంకటాచారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గిరిజ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. కారు ఢీకొని.. తిప్పర్తి : కారు ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాతపెల్లి వద్ద ఆదివారం చోటుచేసుకుంది. తిప్పర్తి ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ తాళ్లగడ్డకు చెందిన చేకూరి వనజ (36) ఈనెల 16న రాత్రి తనకు తెలిసిన వ్యక్తి కిరణ్‌తో కలిసి చెరువుగట్టులో నిద్ర చేసింది. తిరుగు ప్రయాణంలో మిర్యాలగూడకు వెళుతుండగా పాతపెల్లి సమీపంలో బైక్‌ను వెనుక నుంచి కారు ఢీకొంది. దీంతో వనజ, కిరణ్‌లకు గాయాలయ్యాయి. వీరిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వనజ మృతి చెందింది. కిరణ్ చికిత్స పొందుతున్నాడు. వనజ కుమారుడు మనోజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఉపయోగంలో లేని బోరు గుంతలు మూసివేయాలి
ఫ భువనగిరి డీఎస్పీ రవీందర్‌రెడ్డి భువనగిరి : గ్రామాల్లో ఉపయోగంలో లేని బోరు గుంతలను రైతులు వెంటనే మూసి వేయాలని భువనగిరి డీఎస్పీ రవీందర్‌రెడ్డి సూచించారు. బోరు గుంతలతో జరుగుతున్న ప్రమాదాలపై ఆయన ఆదివారం స్పందించారు. పొలాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్న బోరు గుంతల చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని, ఆ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. పిల్లలను ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూముల వద్ద ఒంటరిగా ఆడనివ్వరాదన్నారు. గ్రామాలలో, కాలనీల్లో బోర్ గుంతలను గుర్తించాలన్నారు. కొత్తగా తవ్విన బోర్ గుంతలను పని పూర్తయ్యాక భద్రంగా కప్పివేయాలని, ఎక్కడైనా నిర్లక్ష్యంగా వదిలిన బోర్ హోల్స్‌పై స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గ్రామ, పట్టణ స్థాయి అధికారులు తనిఖీలు నిర్వహించి ఉపయోగంలో లేని బోర్ హోల్స్‌ను మూసివేయించాలని సూచించారు. విద్యాలయాలే దీప స్తంభాలునల్లగొండ టూటౌన్ : విద్యాలయాలే దేశాభివృద్ధికి దీప స్తంభాలని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఎంజీయూలో నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంజీ యూనివర్సిటీలో విశ్వవిద్యాలయం స్వల్ప, దీర్ఘకాల ఇనిస్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్లాన్ ద్వారా కొత్త కళాశాలలు, హాస్టళ్లు, అకాడమిక్ బ్లాకులు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఆరోగ్య కేంద్రాలు, లైబ్రరీ, ఇంజినీరింగ్ విభాగ విస్తరణ వంటి పలు మౌలిక వసతుల అభివృద్ధి పనులను దశలవారీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన విద్యార్థి ప్రాజెక్టులు, డాక్టరల్ రీసెర్చ్ మెరుగుదలకు అధ్యాపకులు కీలకపాత్ర పోషించాలన్నారు. నాన్–టీచింగ్ సిబ్బంది పారదర్శక పరిపాలన, రికార్డు నిర్వహణ, విద్యార్థి సేవల బలోపేతంలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్ హరీష్‌కుమార్, శ్రీనివాసరెడ్డి, ఎస్ఓ బేగ్, శ్రీహరి పాల్గొన్నారు. -
గౌతమి జూనియర్ కాలేజీ ప్రభంజనం
నల్లగొండ : ఈఏపీసెట్ ఫలితాల్లో నల్లగొండ పట్టణంలోని గౌతమి జూనియర్ కాలేజీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఇంజనీరింగ్ విభాగంలో సాత్విక్‌రెడ్డి 873వ ర్యాంక్, సోమేశ్వరి 929, వైష్ణవి కె. 954, మలీహ తస్నీమ్ 1361, కె.సౌమ్య 2026, అనుఘ్నశ్రీ ఎం 2643వ ర్యాంక్ సాధించారు. బి.మధుప్రియ 3267, తితీక్ష వై. 3280, హీబా మైరుకు 3292, మదీహ తస్నీమ్ 3663, బుష్రా 4424, జి.శివ 5916, సింధూజ 6163, అజిజుర్ రహమాన్ 7339, నీరజ్ నారాయణ 9267, శ్రావ్య పి. 9384, ఎండీ.అయాన్ 9620, కె. లహరిక 10781, హేమచందర్ 10795, జి.అస్రిత 11271, సాయిప్రణిత్రెడ్డి 11970, శ్రీహన్ సంతోష్‌రెడ్డి బి. 13042, కె.తేజిత 13289, ఎం.మేఘన 13345, కె.భానుమతి 14459, డి.అను 14565, కె.అమూల్య 14745, ఎస్.సాయి హర్ష 15300, వి.నాగసంజన 15502,, కె.రాకేష్ 17428, ఎం.లహరి 17706, ఎన్.తేజస్విని 17944, ఎం.సిరి 18623, అఫియా నాజ్ 18838, శివదీక్షిత ఎం. 19000, ఇ. సుష్మ 19118, వై.యోగితరాజ్ 19256 ర్యాంకులు సాధించినట్లు కళాశాల యాజమాన్యం కాసర్ల వెంకట్‌రెడ్డి, చల్లా వెంకటరమణ, కొమ్మిడి రఘుపాల్‌రెడ్డి, పుట్టా వెంకటరమణారెడ్డిలు తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను వారు అభినందించారు. సత్తా చాటిన ‘ప్రగతి’ విద్యార్థులునల్లగొండ : ఈఏపీసెట్–2026 ఫలితాల్లో నల్లగొండ పట్టణంలోని ప్రగతి కాలేజీ విద్యార్థులు ప్రతిభ చూపారు. తేజ్వీర్ 1203వ ర్యాంక్, డి. భవాని 1818, ఎం.శ్రీవల్లి 3150, పి.భువిశ్రీ 3361, సీహెచ్.సుహాస్ 3469, కె.సాత్విక్ 3611, ఎస్.మణిదీప్ 3693, ఎం.శివ 3756, ఎం.అక్షిత 4221, బి.వెన్నెల 4487, ఎం.అనన్య 4494, కె.రంజిత 4614, ఎన్.గీతాంజలి 4791, ఎం.భానుక్రుతిక 5764, ఎం.శ్రీసాయితులసి 6103, ఎన్,వన్షిత 6229 ర్యాంకులు పొందారు. డి.అభిషేక్ 6767, తంజిల్లా ఫిర్దోస్ 6884, సీహెచ్. తేజస్విని 6931, ప్రియదర్శిని 8768, జి. స్నేహారెడ్డి 8983, కె.మానస 9476, కె.అక్షర 9893, ఎ.శ్రీజ 9933 ర్యాంకులు సాధించారు. మరో 40 మంది విద్యార్థులు 15 వేల లోపు ర్యాంకులు సాధించినట్లు కళాశాల చైర్మన్ చందాకృష్ణమూర్తి, డైరెక్టర్లు ఎ.నరేందర్‌బాబు, ఎన్.శశిధర్రావు, చందా శ్రీనివాస్, పైల్ల రమేష్‌రెడ్డిలు తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను వారు అభినందించారు. ‘జయ’ విద్యార్థుల జయకేతనంసూర్యాపేట : ఎప్‌సెట్–2026 ఫలితాల్లో సూర్యాపేట పట్టణంలోని జయ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. జి.శ్రీనిక రాష్ట్రస్థాయి 88వ ర్యాంకు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. అదేవిధంగా ఎస్కె.నేహ 145వ ర్యాంకు, ఎస్.అషువర్ధన్రెడ్డి 562, ఎం.రితిన్శెట్టి 590, ఎన్.సాయిరిత్విక్ 897, వి.గౌతమ్‌కుమార్ 1157, డి.సిరి 2625, జె.మానస 2723, వై.హరీనాశర్మ 2724, సీహెచ్.శివకుమార్ 2857, పి.జశ్వంత్ 2887, జి.వంశీ 3720, కె.సంతోష్ 3948, ఎన్.క్రిష్మా 4117, జె.లిఖిత 4296, జి.రంజిత్ 4323, ఎ.నాగనక్షత్ర 4353, పి.అభినవ్‌రెడ్డి 4700, బి.మన్విత్‌రెడ్డి 4782, యం.హర్షిత 4794, జి.మనోవర్షిత 4982వ ర్యాంక్ సాధించినట్లు కళాశాల కరస్పాండెంట్ జయవేణుగోపాల్ర తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ అభినందించారు. -
కూతుళ్లంటే ప్రాణం.. మనవడంటే పంచప్రాణాలు
మిర్యాలగూడ అర్బన్ : వేసవి సెలవుల్లో ఆటలాడుతూ ఆనందంగా గడిపేందుకు అమ్మమ్మ ఇంటిన వచ్చిన చిన్నారులకు.. బోరు గుంత రూపంలో వారి తాతను మింగేయడం కుటుంబంలో విషాదంగా నింపింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లిలో శనివారం బోరుగుంతలో పడిన మనవడిని కాపాడబోయి తాత కుంటు వెంకన్న (53) మృతిచెందడం హృదయ విదారకంగా మారింది. యాద్గార్పల్లి ఉప సర్పంచ్ కంటు నాగమ్మ–వెంకన్న(53)కి శ్రావణి, మౌనిక, జ్యోతి ముగ్గురు కూతుళ్లు. కూతుళ్లు అంటే వెంకన్నకు పంచప్రాణాలు. పదో తరగతి వరకు చదివిన వెంకన్న తన ముగ్గురు కూతుళ్లను బాగానే చదివించాడు. వీరిలో పెద్ద కుమార్తె శ్రావణి బీటెక్ పూర్తి చేయగా ఆమెను నిడమనూరు మండలం నారమ్మగూడం గ్రామానికి చెందిన నాగబోయిన శ్రీనివాస్‌కు ఇచ్చి వివాహం చేశాడు. వారికి లోహిత, హిమాన్ష్ సంతానం. వేసవికాలం కావడంతో ఇద్దరు చిన్నారులను తన ఇంటికి తీసుకెళ్లిన వెంకన్న ద్విచక్ర వాహనంపై తిప్పుతూ ఊరంతా చూపించేవాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం 8.30 గంటలకు పొలం వద్దకు మనవడు, మనవరాలిని తీసుకెళ్లిన వెంకన్న.. బోరు వద్ద విద్యుత్ మోటార్ వైర్‌ను తొలగించి స్టార్టర్ బాక్స్‌ను విడదీసి ఇంటికి తీసుకెళ్లేందుకు పూనుకున్నాడు. అక్కడే ఆడుకుంటున్న హిమాన్ష్ ఒక్కసారిగా బోరుగుంతలో పడిపోయాడు. గమనించిన తాత వెంకన్న బోరుగుంత వద్దకు వెళ్లి తన మనవడిని తీసేందుకు కిందకు వంగాడు. గుంతపక్కన మట్టి పెల్లలు కుంగి ఒక్కసారిగా బోరుగుంతలో తలకిందులుగా పడిపోయాడు. కిలోమీటర్ పరుగెత్తుకుటూ వెళ్లిన లోహిత..ఈ ఘటనలను అక్కడే ఉండి చూసిన మనవరాలు లోహిత ఆలస్యం చేయకుండా పొలం గట్ల పైనుంచి సుమారు కిలోమీటరు మేర ఉన్న రోడ్డు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లింది. అదే రోడ్డుగుండా వెళ్తున్న ఓ వాహనాదారుడిని ఆపి ఏడ్చుకుంటూ విషయం చెప్పడంతో అతడు బోరుగుంత వద్దకు వెళ్లి చూడగా.. అందులో నుంచి అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. లోహిత తాత సెల్‌ఫోన్‌ను లాక్ తీసి ఇవ్వగా డయల్ కాల్లో ఉన్న ఒక నంబర్‌కు ఫోన్‌చేసి విషయం చెప్పారు. నిమిషాల్లోనే ఈ వార్త గ్రామంలో తెలియడంతో గ్రామస్తులు పరుగెత్తుకుంటూ తాళ్లు, ఇతర సామగ్రితో పొలం వద్దకు వెళ్లారు. బోరు గుంతలో పడిన మనవడిని కాపాడబోయి తాత మృతి కిలోమీటర్ దూరం పరుగెత్తుకుంటూ వెళ్లిన మనుమరాలు కాళ్లకు తాడు కట్టుకుని బోరు గుంతలోకి దిగి సాహసించిన యువకుడుకాళ్లు పట్టుకుని పైకి లాగాను మాది యాద్గార్పల్లి గ్రామం చేపలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాను. గ్రామస్తులంతా పరిగెత్తుకుంటూ వెళుతుండగా గమనించి ఏమైంది అని అడిగాను. కంటు వెంకన్న, ఆయన మనువడు బోరుగుంతలో పడ్డారని తెలియడంతో అందరితో పాటు నేను అక్కడికి వెళ్లాను. బోరుగుంతలో పడిన వారిని ఎలాగైనా కాపాడాలని నిశ్చయించుకుని అక్కడికి వచ్చిన పోలీస్ వారితో మాట్లాడి కాళ్లకు తాడును కట్టుకుని బోరుగుంతలోకి తలకిందులుగా దిగాను. ఏడు ఫీట్ల లోతులో ఉన్న వెంకన్నను కాళ్లు పట్టుకుని పైకి లాగాను అప్పటికే వెంకన్న మృతిచెందగా బోరు గుంతలో బాబు ఏడుపు వినిపించింది. తిరిగి రెండవ సారి బోరుగుంతలోకి తలకిందులుగా దిగాను. 10 ఫీట్ల లోతులో తల కిందిభాగం వరకు నీటిలో మునిగి ఉన్న బాలుడిని చేతులు పట్టుకుని గట్టిగా అరిచాను. బయట ఉన్నవారు వెంటనే తాడును పైకి లాగారు. దేవుడి దయవల్ల బాబు బతికాడు. తన మనువడిని కాపాడాలనే తొందరలో వెంకన్న బోరు గుంతలో పడి మృతిచెందడం బాధ కలిగించింది. వెంకన్న ముగ్గురు కూతుళ్లను ఎంతో ప్రేమతో చూసుకునేవాడు. మనువడిని మరింతగా ప్రేమగా చూసుకునేవాడు. – చింతకాయల సైదులు, యాద్గార్పల్లి -
లారీల సమస్య తీర్చడంలో ప్రభుత్వం విఫలం
కేతేపల్లి : ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు లారీల కొరతతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ఆ సమస్యను తీర్చడంలో విఫలమైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. కేతేపల్లిలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కేంద్రాలు ప్రారంభించి రెండు మాసాలు కావొస్తున్నా సీఎం కానీ, సంబంధిత శాఖ మంత్రి గానీ మిల్లర్లతో సమీక్ష నిర్వహించలేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు ఇంకా భారీగా పేరుకుపోయాయన్నారు. మిల్లుల వద్ద లారీల్లో ధాన్యం దిగుమతి కాక, కేంద్రాలకు లారీలు రాక రైతులు రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. బీఆర్ఎస్ పక్షాన రైతుల ఇబ్బందులపై ఇటీవల కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించినా కొనుగోళ్లు వేగవంతంగా సాగడం లేదన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మారం వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
మార్కెట్‌కు తాళం వేసి నిరసన
ఆత్మకూరు(ఎం): తాము ధాన్యం తీసుకొచ్చి నలభై రోజులైనా నేటికీ కొనుగోళ్లు చేయడం లేదని ఆగ్రహానికి గురైన రైతులు ఆదివారం ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని వ్యవసాయ సబ్ మార్కెట్‌కు తాళం వేసి నిరసన తెలిపారు. అధికారుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీసు చందర్ గౌడ్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి దాదాపు 130 మంది రైతులు ధాన్యం తీసుకొచ్చారని, ఇప్పటివరకు కేవలం 30 మంది రైతుల ధాన్యం మాత్రమే తూకం వేశారని అన్నారు. మిగతా రైతులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తక్షణమే లారీలను ఏర్పాటు చేయాలని, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బీసు ధనలక్ష్మి, నాయకులు కోరె భిక్షపతి, బండారు సత్యనారాయణ, నాతి రాజు, యాస వెంకట్‌రెడ్డి, పిన్నింటి మోహన్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు. ఫ ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతుల ఆగ్రహం -
నిధుల్లేక డీలా
భువనగిరి : గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిధుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆస్పత్రుల నిర్వహణ, తాగు నీరు, పారిశుద్ధ్యం, భవన మరమ్మతులు, విద్యుత్ బిల్లులు, స్వీపర్‌కు వేతనాలు, ఫర్నచర్, వైద్య పరికరాలు, అత్యవసర మందులు కొనుగోలుకు ప్రతి సంవత్సరం హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ (హెచ్డీఎఫ్)ను ప్రభుత్వం అందిస్తుంది. కానీ మూడేళ్లుగా హెచ్డీఎఫ్ ఫండ్ విడుదల కాకపోవడంతో పీహెచ్‌సీల పరిస్థితి దయనీయంగా మారుతోంది. నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో రావాల్సిన నిధులు నిలిచి పోవడంతో ప్రతి చిన్న పనికి నిధుల కోసం దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. నిలిచిన నిధులు హెచ్డీఎఫ్ నిధులు విడుదల కాకపోవడంతో వైద్య పరికరాలు కూడా మరమ్మతులకు నోచడం లేదు. దాంతో ల్యాబ్ పరీక్షలపై ప్రభావం పడుతోంది. ఫలితంగా పీహెచ్‌సీల్లో మందులు, పరీక్షలు లేక రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. రోగుల తాకిడికి అనుకూలంగా వసతులు కల్పించే పరిస్థితి లేదు. కొన్ని పీహెచ్సీలలో కుర్చీలు విరిగినా, వైద్య పరికరాలు చెడిపోయినా మరమ్మతులు చేయడం లేదు. దాంతో పాటు విద్యుత్, తాగునీటి బిల్లులపై కూడా ప్రభావం పడుతోంది. రావాల్సినవి రూ.47.15 లక్షలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణకు కేంద్రం ఆర్థిక చేయూత అందిస్తోంది. ఒక్కో పీహెచ్‌సీకి సుమారు రూ.75వేల చొప్పున మంజూరు చేస్తోంది. జిల్లాలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు న్నాయి. దీని ప్రకారం 21 కేంద్రాలకు ఏడాదికి రూ. 15.75 లక్షలు చొప్పున మూడు సంవత్సరాలకు రూ. 47.25 లక్షలు విడుదల కావల్సి ఉంది. ఫ పీహెచ్‌సీలకు మూడేళ్లుగా నిలిచిన హెచ్డీఎఫ్ నిధులు ఫ ఆరోగ్య కేంద్రాలలో వసతులు కరువు ఫ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలపై ప్రభావం ఫ జిల్లాలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు -
తాపీమేస్త్రి అనుమానాస్పద మృతి
కనగల్ : దర్వేశిపురం స్టేజీ పర్వతగిరి వాయిలేరు వంపు బ్రహ్మంగారి ఆలయ సమీపంలోని ప్రకాశం జిల్లా ఉప్పలపాడుకు చెందిన తాపీమేస్త్రి చావల బెంజిమెన్ (38) ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలు.. బెంజిమెన్ కొంతకాలంగా నల్లగొండ చుట్టుపక్కల గ్రామాల్లో తాపీమేస్త్రిగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నాడు. శనివారం కనగల్ మండలం దర్వేశిపురం స్టేజీ వద్దకు వచ్చిన బెంజిమెన్.. పుష్కర ఘాట్ బ్రహ్మంగారి ఆలయ సమీపంలో గల వ్యవసాయ భూమిలో మద్యం తాగి అక్కడే నిద్రించాడు. కాగా తెల్ల వారేసరికి మృతి చెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కనగల్ ఎస్ రాజీవ్‌రెడ్డి సెలవులో ఉండడంతో చండూరు ఎస్ఐ శివప్రసాద్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతుడి వద్ద లభించిన రెండు సెల్ఫోన్లలోని నంబర్ల ఆధారంగా భార్య, పిల్లలకు సమాచారం చేరవేశారు. పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్ర ఆస్పత్రికి బెంజిమెన్ మృతదేహాన్ని తరలించారు. వడదెబ్బతో వ్యక్తి..భూదాన్‌పోచంపల్లి : వడదెబ్బతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సీతావానిగూడెం పరిధిలో జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతావానిగూడెం గ్రామానికి చెందిన ఒంటెద్దు సహదేవ్ (57) రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో గ్రామ సమీపంలో గల వ్యవసాయ బావుల వద్ద మేకలు మేపేందుకు ఇంటి నుంచి వెళ్లాడు. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రతకు వడదెబ్బకు గురై పొలం గట్టు పక్కనే కుప్పకూలి ప్రాణాలొదిలాడు. సాయంత్రం పశువులను మేపేందుకు అటుగా వెళ్లిన రైతులు సహదేవ్‌ను గమనించారు. లేపేందుకు ప్రయత్నించగా ఉలుకుపలుకు లేదు. దాంతో వారు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. గుర్తు తెలియని వ్యక్తి ..నార్కట్‌పల్లి : గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం నార్కట్‌పల్లి పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లి పట్టణంలోని హైస్కూల్ వెనుక భాగంలో నీటి ట్యాంకు వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉండడంతో గ్రామపంచాయతీ సిబ్బంది గమణించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించారు. మృతుడి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు. వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన దేవరకొండ డీఎస్పీ శ్రీనివాస్రావుకొండమల్లేపల్లి : వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని కొండమల్లేపల్లి పోలీసులు అరెస్ట్ చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం తన కార్యాలయంలో వెల్లడించారు. ఏప్రిల్ 9వ తేదీన కొండమల్లేపల్లికి చెందిన ఉపాధ్యాయుడు కర్రె ఆనంద్ ఇంటికి తాళం వేసి చైన్నెకి వెళ్లారు. ఏప్రిల్ 13న ఇంటికి వచ్చి చూడగా బీరువా తెరిచి ఉంది. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం పెండ్లిపాకల వద్ద కొండమల్లేపల్లి ఎస్ఐ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా రాంరెడ్డిపేట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ దాసరి విజయ్ అలియాస్ మాస్ విజయ్ అలియాస్ నాని అలియాస్ చరణ్‌ను అనుమానించి ప్రశ్నించగా పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అలాగే కొండమల్లేపల్లి, దేవరకొండ, చింతపల్లిలలో ఒకటి చొప్పున దొంగతనాలకు పాల్పడగా.. కల్వకుర్తిలో రెండు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. పట్టుబడిన వ్యక్తి నుంచి 8 తులాల బంగారు ఆభరణాలు, రూ.90 వేల నగదు, ద్విచక్ర వాహనం, సెల్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కొండమల్లేపల్లి సీఐ నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో కేసును చేధించిన ఎస్ఐ అజ్మీర రమేష్, క్రైం సిబ్బంది హేమునాయక్, భాస్కర్, కృష్ణారెడ్డిలను ఎస్పీ, దేవరకొండ డీఎస్పీ అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్ విద్యార్థి మృతి
ఆలేరు : రోడ్డు ప్రమాదంలో మెడికల్ విద్యార్థి దుర్మరణం చెందగా.. ఇద్దరు బీటెక్ విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు నివాసం ఉంటున్న పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గడసంతల మధుసూదన్–సరళ (ప్రభుత్వ టీచర్) దంపతుల కుమారుడు శ్రీసాహిత్(19) సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదేవిధంగా ఆలేరుకు చెందిన బీజేపీ నాయకుడు పులిపలుపుల మహేష్ కొడుకు రాఘవ జనగాంలో బీటెక్ ద్వితీయ సంవత్సరం, కొండోజు అక్షయ్ బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. వీరు ముగ్గురు స్నేహితులు. ఇంటికి బయలుదేరినట్టు తల్లిదండ్రులకు మేసేజ్..శనివారం శ్రీసాహిత్ కళాశాలలో జరిగిన పరీక్షలకు హాజరయ్యాడు. అదేరోజు తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సం ఉండడం, ఆదివారం సెలవు రావడంతో శ్రీసాహిత్ ఆలేరులోని ఇంటికి వెళ్లాలనుకున్నాడు. తల్లిదండ్రులు కారు పంపిస్తామన్నా బస్సులో వస్తానని వారితో చెప్పాడు. అనంతరం ఆలేరు నుంచి తన స్నేహితులు రాఘవ, అక్షయ్ స్కూటీపై సిద్దిపేటలోని సాహిత్ వద్దకు వెళ్లారు. సిద్దిపేట నుంచి సాయంత్రం శ్రీసాహిత్, రాఘవ, భార్గవ్‌లు ముగ్గురు స్కూటీపై ఆలేరుకు బయలుదేరారు. సిద్దిపేట నుంచి బయలుదేరినట్టు శ్రీసాహిత్ తల్లిదండ్రులకు మేసెజ్ పంపించాడు. శనివారం రాత్రి చేర్యాల పట్టణ శివారులోని గుర్జకుంట వాగు దాటిన తర్వాత ఇండేన్ పెట్రోల్ బంక్ సమీపంలో సెంట్రల్ డివైడర్ ఢీకొట్టడంతో స్కూటీ అదుపు తప్పి ముగ్గురు రోడ్డుపై పడిపోయారు. శ్రీసాహిత్కు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా.. రాఘవ, అక్షయ్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగ్రాతులను ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇందులో రాఘవ పరిస్థితి విషమంగా ఉండగా, అక్షయ్ కోలుకుంటున్నట్టు పోలీసుల తెలిపారు. శ్రీసాహిత్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామానికి తరలించి అంత్యక్రియలు చేశారు. నాటు సారా పట్టివేతమోతె : మోతె మండల పరిధిలోని సర్వారం గ్రామ శివారులో ఆదివారం నాటు సారా, బెల్లం పానకం పట్టుబడింది. వివరాలు.. సర్వారం గ్రామ శివారులో ఎకై ్సజ్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్‌పై 5 లీటర్ల నాటు సారాతోపాటు 100 లీటర్ల బెల్లం పానకం తరలిస్తున్న గుగులోతు జానిని అదుపులోకి తీసుకున్నారు. బైక్, బెల్లం పానకం, నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. జానిని రిమాండ్ నిమిత్తం ఎస్హెచ్ఓ సూర్యాపేటకు తరలించారు. తనిఖీల్లో ఎకై ్సజ్ సీఐ స్టివెన్‌సన్, ఎస్ఐ రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. ఇద్దరు బీటెక్ విద్యార్థులకు తీవ్ర గాయాలు అందులో ఒకరి పరిస్థితి విషమం -
లక్ష్మీనృసింహుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం నిత్య పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకువజామునే స్వామి వారిని మేల్కొలిపి, సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం స్వయంభువులకు నిజాభిషేకం, బిందె తీర్ధం, ఆరాధన, అర్చనలు చేశారు. ప్రధానాలయం ముఖమండపలంలోని ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన సేవలు చేపట్టారు. ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, కల్యాణోత్సవం, బ్రహ్మోత్సవ సేవలను నిర్వహించారు. సాయంత్రం జోడు సేవలను ఊరేగించారు. రాత్రి శయనోత్సవం జరిపించి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు. అవగాహన తోనే హెచ్ఐవీ నిర్మూలనభువనగిరి : సరైన అవగాహన తోనే హెచ్ఐవీని పూర్తిస్థాయిలో నిర్మూలించవచ్చని ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. అంతర్జాతీయ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్ర ఆస్పత్రి వద్ద హెచ్ఐవీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఏయిడ్స్‌తో మృతి చెందిన వారికి కొవ్వత్తులు వెలిగించి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కేంద్ర ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ కిరణ్‌కుమార్, సూపర్వైజర్ సంతానియా, స్కీడ్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు మేనేజర్ భానుకుమార్, ఐసీటీసీ కౌన్సిలర్లు ముత్యాలు, సైదులు, సతీష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ మార్కుల్లో మార్పులు
భువనగిరి : ఇంటర్మీడియట్ విద్యలో ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు సెకండియర్‌కు మాత్రమే ఉన్న ప్రాక్టికల్ పరీక్షలు ఇక నుంచి ఫస్టియర్ విద్యార్థులకు సైతం అమలు చేయనున్నారు. 2026–27 విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్ నుంచే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు పేర్కొంది. ప్రాక్టికల్ పరీక్షలకు ఫస్టియర్‌లో 15 మార్కులు, సెకండియర్‌లో 15 మార్కులు కేటాయించినట్లు బోర్డు ప్రకటించింది. అయితే ఈ ఏడాది ఫస్టియర్‌కు మాత్రమే ఈ సంస్కరణలు వర్తింపజేసి, 2027–28 నుంచి ద్వితీయ సంత్సరం వారికి సైతం అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు సెకండియర్లోనే బైపీసీ, ఎంపీసీ సబ్జెక్టుకు 30 మార్కులకు ప్రాక్టికల్స్ ఉండేవి. కానీ ఇక నుంచి ఫస్టియర్‌లో 15, సెకండియర్‌లో 15 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఎంపీసీలో భౌతిక, రసాయన శాస్త్రాలకు 15 మార్కుల చొప్పున 30 మార్కులు ఉంటాయి. బైపీసీ గ్రూపులో బోటని, జువాలజీలకు 15 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తారు గణితంలో తగ్గిన మార్కులు ఎంపీసీ విద్యార్థులకు ఇప్పటి వరకు గణితంలో 75 మార్కులకు రాత పరీక్ష ఉండగా ఈ సారి నుంచి 60 మార్కులకు మాత్రమే నిర్వహిస్తారు. మిగతా 15 మార్కులకు యాక్టివిటీ ఆధారిత అభ్యాసనానికి (ఏబీఎల్) కేటాయిస్తారు. గణితంలో రెండు పేపర్లు ఉన్నందున తొలి ఏడాది ఏబీఎల్‌కు 30 మార్కులు ఉంటాయి. ఇతర గ్రూపుల్లోని కామర్స్, అకౌంటెన్సీ, రాజనీతి శాస్త్రం, చరిత్ర, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిష్ట్రేషన్లకు 80 మార్కులుకు రాత పరీక్ష, 20 మార్కులకు ఇంటర్నల్ పరీక్షలు ఉంటాయి. అలాగే లాంగ్వేజ్ సబ్జెక్టులైన తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్, రాత పరీక్షలకు 80మార్కులు, 20 మార్కులు ఇంటన్నల్ మార్కులు ఉంటాయి. ఇంటర్మీడియట్లో ఈ ఏడాది నుంచి కొత్తగా ఏసీఈ గ్రూపును బోర్డు అమలులోకి తీసుకొచ్చింది. కొత్తగా ప్రవేశపెట్టనున్న ఈ గ్రూపులో అకౌంటెన్సీ, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టులు ఉంటాయి. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సును అందుబాటులోకి తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో ఏసీఈ గ్రూపును ప్రవేశపెట్టినట్లు బోర్డు ప్రకటించింది. ఈ కోర్సు చార్టెడ్ అకౌంట్‌కు పునాది లాంటిది. ఫ ఫస్టియర్ నుంచే ప్రాక్టికల్ పరీక్షలు ఫ ఎంపీసీ, బైపీసీలో ప్రాక్టికల్‌కు 15 మార్కులు కేటాయింపు ఫ 2026–27 విద్యాసంవత్సరం నుంచి అమలు -
ఆశలదీపం ఆరిపోయింది
విదేశాల్లో ఉన్నత చదువులు చదివి ప్రయోజకురాలై, తమకు చేదోడువాదోడుగా ఉంటుందనుకున్న కూతురు కానరాని లోకాలకు వెళ్లిపోయింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ ఇంటి దీపం శాశ్వతంగా ఆరిపోయింది. రూ.50 లక్షలు అప్పు చేసి మరీ అమెరికా పంపిన కౌలు రైతు దంపతులకు తీరని శోకం మిగిలింది. నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టుకు చెందిన నవ్య అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.నార్కట్‌పల్లి : ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన యువతి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. వివరాలు.. నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామానికి చెందిన గడుసు శ్రీనివాస్‌రెడ్డి–శోభ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వారిలో పెద్ద కూతురు నవ్య (24) బీటెక్ పూర్తి చేయడంతో ఎంఎస్ కోసం రెండున్నర సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లింది. చిన్న కూతురు ప్రస్తుతం బీటెక్ చదువుతోంది. నవ్య చికాగో రాష్ట్రంలోని రోజ్ వెల్ యూనివర్సిటీలో రెండున్నర సంవత్సరాల నుంచి ఎంఎస్ చదువుతోంది. శనివారం రాత్రి కారులో వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు వెనుక నుంచి మరో కారు ఢీకొట్టడంతో నవ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు స్నేహితురాలు ఆదివారం మధ్యాహ్నం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు .నవ్య మృతి విషయాన్ని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశానికి సమాచారం అందించారు. తక్షణమే వారి స్పందించి అమెరికా నుంచి నవ్య మృతదేహాన్ని సొంతూరికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు నవ్య తల్లిదండ్రులు తెలిపారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి..నవ్య 10వ తరగతి నల్లగొండలోని ఎంవీఆర్ స్కూల్లో, ఇంటర్ గీతాంజలి కాలేజీలో, బీటెక్ హైదరాబాద్‌లోని విజ్ఞాన్ కళాశాలలో పూర్తి చేసింది. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి ఎంఎస్ చదువుతోంది. తన కూతురు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వార్త తెలుసుకున్న శ్రీనివాస్‌రెడ్డి కుప్పకూలిపోయాడు. తన కూతురు ఉన్నత విద్యావంతురాలై విదేశంలో ఉద్యోగం చేసి ఇంటి దీపంగా వెలుగుతుంది అనుకుంటే రోడ్డు ప్రమాదం ఇంటి దీపాన్ని ఆర్పిందని నవ్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. చేసిన అప్పులు తీరకముందే..గడుసు శ్రీనివాసరెడ్డి, శోభ దంపతులు సొంతంగా భూమి లేకున్నా ప్రతి సంవత్సరం 10 నుంచి 15 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట పడిస్తూ తమ ఇద్దరు కూతుళ్లను చదివిపిస్తున్నారు. రెండున్నర సంవత్సరాల క్రితం పెద్ద కూతురు నవ్యను ఉన్నత విద్య కోసం అమెరికా పంపేందుకు రూ.30 లక్షలు బ్యాంకు రుణం, రూ.20 లక్షలు ప్రైవేట్ అప్పు చేశారు. చేసిన అప్పు తీరక ముందే కుమార్తె కానరాని లోకానికి పోయిందని తల్లడిల్లిపోతున్నారు. పెద్ద కూతురు ఉన్నత విద్య చదివి ఉద్యోగం చేస్తే చిన్న కూతురికి, తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటుంది అనుకుంటే అప్పులతో పాటు కన్నీరే మిగిలిందని రోదిస్తున్నారు. అమెరికాలో రోడ్డు ప్రమాదం చెర్వుగట్టుకు చెందిన యువతి దుర్మరణం శోకసంద్రంలో కుటుంబ సభ్యులు -
ఆస్తి కోసం ఆత్మీయుల అంతం
నాగార్జునసాగర్ : ఒకప్పుడు రక్త సంబంధం అంటే ఆప్యాయత, అనురాగం, అండగా నిలిచే బంధం. ప్రస్తుత సమాజంలో అదే బంధాలు ఆస్తి, స్వార్థం, అనుమానాల మధ్య నరమేధాలకు దారి తీస్తున్నాయి. ఆస్తి వివాదాలు, స్వార్థపూరిత ఆలోచనలు మనుషులను ఎంత క్రూరంగా మార్చుతున్నాయో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. ఆస్తి ముందు రక్త సంబంధం వెలవెలబోయింది. రక్త సంబంధాలు కాస్త కాటేసే రాక్షసాలుగా మారాయి. నల్లగొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్న ఘాతుకం మానవత్వానికే మచ్చ తెచ్చింది. ఆస్తి వివాదాల నేపథ్యంలో రక్త సంబంధాన్ని మర్చిపోయి తల్లి, కూతురిని అత్యంత క్రూరంగా హతమార్చారు. ఆస్తి తగాదాలే హత్యకు కారణం..ఇబ్రహీంపేట గ్రామానికి చెందిన రుద్రాక్ష సుమలత, ఆమె కుమార్తె రుద్రాక్ష లావణ్య ఆదివారం ఉదయం ఆయిల్‌పామ్ తోటకు వెళ్లారు. కొద్దిసేపటికే అనుమానాస్పద స్థితిలో మృతదేహాలుగా కనిపించారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక విచారణలో ఆస్తి తగాదాలే ఈ హత్యలకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బంధువులే కళ్లల్లో కారం చల్లి, చీరకొంగు, చున్నీతో ఊపిరాడకుండా చేసి తల్లీ కూతుళ్లను హత్య చేసినట్లు గ్రామంలో ప్రచారం జరుగుతోంది. సంఘటన స్థలాన్ని పోలీసులు క్లూస్‌టీమ్, డాగ్ స్క్వాడ్‌తో కలిసి పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్ ప్రభుత్వ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బంధాలు బలహీనమవుతున్నాయా..ఇటీవల కాలంలో కుటుంబ బంధాలు, ప్రేమ, మానవత్వం అన్నీ ఆస్తి అహంకారం, స్వార్థం ముందు కనుమరుగై పోతున్నాయని ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది. నవమాసాలు మోసి పెంచిన తలుల్లపైనే కొడుకులు దాడి చేసిన ఘనటనలు జిల్లాలో చోటు చేసుకున్నాయి. డబ్బులు ఇవ్వలేదనే కోపంతో వృద్ధ తల్లిని కొట్టడం, ఆస్తి రాసివ్వలేదని వేధించడం వంటి ఘటనలు కలవరపెడుతున్నాయి. పెద్దవూర మండలంలోని పిన్నవూరలో సొంత బాబాయిని హత్య చేసిన సంఘటన గతంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. దాంపత్య జీవితంలో అనుమానాలు, కుటుంబ కలహాలు కూడా నేరాలకు కారణమవుతున్నాయి. భార్యాభర్తలు, ప్రేమికుల మధ్య విభేదాలతో హత్యలు.. ఇప్పుడు ఈ దారుణం.. సమాజం ఎటు వైపు వెళ్తుందోనన్న ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.సమాజానికి హెచ్చరికడబ్బు కోసం బంధాలను మరచిపోతున్నారు. ఆస్తి కోసం ప్రాణాలు తీస్తున్నారు. ఈ పరిస్థితి సమాజానికి ప్రమాదకరం. కుటుంబాల్లో సంభాషనలు తగ్గిపోవడం, సహనం కోల్పోవడం, మానసిక ఒత్తిడులు పెరగడం కూడా ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నాయి. తప్పు చేసినవారు కచ్చితంగా శిక్షార్హులే. ఇబ్రహీంపేట సంఘటనలో నేరస్తులను వెంటనే పట్టుకుంటాం. – మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు కళ్లల్లో కారం చల్లి.. ఊపిరాడకుండా చేసి.. అనుముల మండలం ఇబ్రహీంపేటలో తల్లి, కూతురు దారుణ హత్య ఆస్తి ముందు వెలవెలబోతున్న రక్తసంబంధాలు -
యాదగిరి క్షేత్రానికి 30వేల మంది భక్తులు
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ క్యూకాంప్లెక్స్ సహా అన్ని ప్రాంతాల్లో భక్తుల సందడి నెలకొంది. స్వామి వారి ఉచిత ప్రవేశ దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. బ్రేక్ దర్శనానికి అర గంట సమయం పట్టింది. స్వామి వారిని సుమారు 30 వేలమందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. వివిధ పూజల ద్వారా ఆయా విభాగాల్లో స్వామి వారికి నిత్య ఆదాయం రూ..52,63,697 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లఢించారు. -
రైతన్నలూ జర జాగ్రత్త..!
కల్తీలను గుర్తించండి ఇలా.. ● యూరియా, కాల్షియం, అమ్మోనియం, నైట్రేట్ వంటి ఎరువులు గుళికల రూపంలో ఉంటాయి. ● ఎరువులు ఇసుక రేణువుల రూపంలో, పొటాష్, సూపర్ ఫాస్పేట్ పొడి రూపంలో ఉంటాయి. ● 5 మిల్లీలీటర్ల నీటిలో ఒక స్పూన్ ఎరువును వేసి బాగా కలపాలి. ఇది స్వచ్ఛమైన ద్రావణంగా తయారైతే నాణ్యమైన ఎరువుగా గుర్తించవచ్చు. యూరియా, అమ్మోనియా క్లోరైడ్ ఎరువుల పరీక్షకు 10 మిల్లీలీటర్ల పరిశుభ్రమైన నీటిని వినియోగించాలి. ● యూరియా వంటి ఎరువును ఒక స్ఫూన్ ఐదు మిల్లీలీటర్ల పరిశుభ్రమైన నీటిలో వేసి బాగా కలిపితే అడుగున మట్టి చేరితే కల్తీగా గుర్తించాలి. కొన్ని కాంప్లెక్స్ ఎరువులను ఇదే పద్ధతిలో పరీక్షిస్తే ఇసుక రేణువులు వచ్చే అవకాశం ఉంది. అలా వచ్చినా కల్తీ ఎరువుగా గుర్తించాలి.పెద్దవూర: మరో పది, పదిహేను రోజుల్లో వానాకాలం సాగు ప్రారంభం కానుంది. రైతులు తమ వ్యవసాయ పొలాలను వానాకాలం సీజన్‌కు సిద్ధం చేసుకుని బోర్లు, బావుల కింద పత్తి విత్తనాలు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు రైతులు పత్తి, మిరప విత్తనాలు సైతం కొనుగోలు చేశారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలులో రైతులు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. వానాకాలం సీజన్ వచ్చిందంటే చాలు నకిలీ, నాసిరకం విత్తనాలు మార్కెట్‌ను ముంచెత్తుతాయి. రైతులు ప్రైవేట్ కంపెనీల ప్రకటనలు, ప్రచార ఆర్భాటాలు చూసి విత్తనాలను కొనుగోలు చేయొద్దు. విత్తనాల ప్యాకెట్లపై ప్రభుత్వ నిబంధనలు, వివరాలు సరిచూసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలి. విత్తనాలు, పురుగుల మందు ఎంపిక, కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏఓ ఎన్. సత్యనారాయణ మాటల్లో.. విత్తనాల ఎంపికలో..● వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్ పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. ● విత్తనాల కొనుగోలు రశీదులపై నంబర్, విత్తన రకం, కొనుగోలు తేదీ, డీలర్ సంతకం, రైతు సంతకం ఉండేలా చూసుకోవాలి. ● గడువు దాటిన విత్తనాలు, వదులుగా, చిరిగిన ప్యాకెట్లు, తెరిచిన డబ్బాల నుంచి ఇచ్చిన ప్యాకెట్లు కొనుగోలు చేయొద్దు. ● రశీదుపై విక్రయదారుని పేరు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమ్మకాల పన్ను నంబరు, విక్రయదారుని గ్రామం పేరు, విక్రయదారుడి సంతకం, తేదీలు, విత్తన రకం పేర్లు, బ్యాచ్ నంబర్, గడువు తేదీలు, నికర తూకం, నికర ధర, కంపెనీ పేరు తప్పనిసరిగా నమోదు చేయాలి. ● కొనుగోలు చేసిన సరుకును డీలర్ వద్ద తూకం వేయించాలి. ● మొలకెత్తే దశ, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వ్యవసాయశాఖ అధికారి, శాస్త్రవేత్తలను సంప్రదించాలి. ● విత్తనాలు కొనుగోలు చేసిన రశీదును పంట కాలం పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ● విత్తనాలు తీసుకున్న వెంటనే మొలక శాతాన్ని చూసుకోవాలి. మొలక శాతం సంతప్తికరంగా ఉన్న వాటినే విత్తనాలుగా వాడాలి. పురుగు మందుల ఎంపికలో..● పంటలో చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించిన పురుగుల మందులు కొనుగోలు చేయాలి. ● అవసరానికి మించి కొనుగోలు చేసిన, నిల్వ ఉంచిన పురుగుల మందులను వాడొద్దు. లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే కొనుగోలు చేయాలి. ● పురుగు మందు డబ్బాలపై చక్రాకారంలో పురుగు మందు స్థాయిని తెలిపే రంగులు ఉంటాయి. అత్యంత విషపూరితమైతే నీలం రంగు, స్వల్ప విషపూరితమైతే ఆకుపచ్చ రంగు గుర్తులు ఉంటాయి. ● పురుగు మందులు రెండు, మూడు రకాలు కలిపి వాడకూడదు. వాడిన డబ్బాలు, సీసాలు ద్వంసం చేసి గుంతలో పూడ్చిపెట్టాలి. ● ఒక పంటకు వాడిన పురుగుల మందును మరో పంటకు శాస్త్రవేత్తల సూచనల మేరకు వాడాలి. ఎరువుల కొనుగోలులో..+ లైసెన్స్ దుకాణాల్లోనే కొనుగోలు చేయాలి. బిల్లులు, ఖాళీ సంచులను పంట కాలం పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. + మిషన్ కుట్టుతో ఉన్న ఎరువుల సంచులు మాత్రమే వాడాలి. ఒకవేళ చేతికుట్టుతో ఉంటే సీసం సీల్ ఉందో లేదో చూసుకోవాలి. ప్రామాణిక పోషకాల వివరాలు, ఉత్పత్తి సంస్థ, ఉత్పత్తిదారుడి పేరు కచ్చితంగా ఉండాలి. + కొనుగోలు సమయంలో డీలరు రికార్డులో రైతు విధిగా సంతకం చేయాలి. ఎరువుల నాణ్యతపై అనుమానం ఉంటే వెంటనే వ్యవసాయ అధికారి సహకారంతో పరీక్షలకు పంపాలి. + చిల్లులు పడి, చిరిగిన ఎరువుల బస్తాలు కొనుగోలు చేయొద్దు. ఇతర పదార్థాలు కలిస్తే ఆ ఎరువును కల్తీగా గుర్తించాలి. విత్తనాలు, ఎరువుల కొనుగోలులో భద్రం కంపెనీల ప్రకటనలతో మోసపోవద్దు గుర్తింపు పొందిన కంపెనీల విత్తనమే మేలు -
పంచ పాండవులు.. ముగ్గురు!
మా ఊర్లో బంటి అనే అబ్బాయి ఉండేవాడు. అతడు చదువులో కాస్త వెనుకబడి ఉన్నా, అతని మాటలు మాత్రం ప్రతిఒక్కరికి నవ్వులు పూయించేవి. అతడు ఏం మాట్లాడినా విచిత్రంగా ఉంటుంది. అతడికి, స్కూళ్లో మాస్టారు మధ్య స్కూల్లో జరిగిన ఓ సరదా సంభాషణను మీతో పంచుకుంటున్నా.. ఒకరోజు స్కూల్లో మాస్టారు అడిగాడు : ‘‘అరేయ్ బంటిం పంచపాండవులు ఎంత మంది రా..?’’ బంటి వెంటనే లేచి, చేతితో రెండు వేళ్లు చూపిస్తూ, ‘‘మంచం కోళ్ల లాగా ముగ్గురు అండి!’’ అన్నాడు. క్లాస్ మొత్తం ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయింది. మాస్టారు తల పట్టుకుని, ‘‘అబ్బా! పంచపాండవులు ఐదుగురు రాం’’అన్నాడు. అదే రోజు మళ్లీ మాస్టారు అడిగాడు : ‘‘సరే, 5 + 5 ఎంత?’’ బంటి కాస్త కన్ఫ్యూజ్ అయి, పక్కన కూర్చున్న చంటిని నెమ్మదిగా అడిగాడు. చంటి ‘‘పది’’ అని గుసగుసలాడాడు. బంటికి వినిపించకపోవడంతో బాగా గట్టిగా ‘‘పంది!’’ అన్నాడు. మాస్టారు కోపంతో, ‘‘ఇది స్కూల్ రా, పందుల బజారు కాదు!’’అన్నాడు. ఇంకో రోజు మాస్టారు: ‘‘సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు?’’ బంటి: ‘‘పుస్తకంలో అండి!’’ మాస్టారు: ‘‘ఎందుకు?’’ బంటి: ‘‘ఎప్పుడూ పుస్తకంలోనే చూస్తున్నాం కదా సార్ బయట చూడలేదు!’’ అన్నాడు. మరోసారి మాస్టారు: ‘‘నీ తండ్రి ఏం చేస్తాడు?’’ బంటి: ‘‘టీవీ చూస్తాడు సార్ం’’ మాస్టారు: ‘‘అది పని కాదు రా!’’ బంటి: ‘‘అయితే మా అమ్మ కూడా అదే పని చేస్తుంది సార్!’’ అన్నాడు. క్లాస్ అంతా మళ్లీ నవ్వులతో మార్మోగింది. చివరికి మాస్టారు ఇలా అనుకున్నాడు: ‘‘చదువు రాకపోయినా, నవ్వులు పంచడంలో బంటి మాత్రం ఫస్ట్ క్లాస్ – ఆముక్తమాల్యద కంచనపల్లి ఫ పచ్చగా.. చల్లగా.. నకిరేకల్ : పట్టణంలోని సుందరయ్య నగర్‌కు చెందిన షేక్ గఫూర్ తన రేకుల ఇంటిపై ప్రతి వేసవిలో జమ్మి లేదా తాటి కమ్మలు పరిచి ఎండ నుంచి ఉపశమం పొందేవాడు. ఆరేళ్ల క్రితం తన బంధువు ఇచ్చిన తీగ జాతి మొక్కను గఫూర్‌కు తన ఇంటి ఆవరణలో నాటగా.. ఆ మొక్క రేకుల పైకప్పు మొత్తం పరుచుకుంది. వేసవిలో ఇల్లు చల్లగా ఉంటుందని గఫూర్ చెబుతున్నాడు. అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లికి చెందిన కృష్ణకుమారి తన ఇంటి ఆవరణలో సుమారు 50 రకాలకు పైగానే పండ్లు, పూలు, కూరగాయలు, మనీ ప్లాంట్, వివిధ రకాల నీడనిచ్చే మొక్కలతో పాటు ఆకుకూరలు పెంచుతూ హరితవనంలా మార్చింది. ప్రస్తుత వేసవిలో ఈ మొక్కలు చల్లటి నీడనిస్తున్నాయి. -
ఏసీబీకి పట్టుబడిన అసిస్టెంట్ లైన్మెన్
మోటకొండూర్ : విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, స్తంభాలు ఏర్పాటు చేసేందుకు రైతు నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ అసిస్టెంట్ లైన్మెన్ శనివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నల్లగొండ రేంజ్ ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటకొండూర్ మండల కేంద్రానికి చెందిన ఓ రైతు తన వ్యవసాయ బావికి 7 విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని స్థానిక విద్యుత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే పని జరగాలంటే రూ.35 వేలు లంచం ఇవ్వాలని మోటకొండూర్ మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ లైన్మెన్ పప్పుల రమేష్ డిమాండ్ చేశాడు. దీంతో సదరు రైతు నల్లగొండ రేంజ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శనివారం సాయంత్రం సదరు రైతు ఇంటి అసిస్టెంట్ లైన్మెన్ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం స్థానిక విద్యుత్ కార్యాలయానికి వెళ్లి రికార్డులు పరిశీలించారు. ఆదివారం రమేష్‌ను హైదరాబాద్‌లోని నాపంల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ అధికారైనా లంచం డిమాండ్ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు లేదా వాట్సాప్ నంబర్ 94404 46106కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు సూచించారు. ఫ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, స్తంభాల ఏర్పాటుకు రూ.35 వేలు లంచం డిమాండ్ ఫ రైతు ఫిర్యాదుతో డబ్బు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు -
ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్టు
నల్లగొండ : తిప్పర్తి మండలం ఎర్రగడ్డలగూడెంలో ఇటీవల వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 11న ఎర్రగడ్డలగూడేనికి చెందిన చింతమల్ల సత్యమ్మ మర్రిచెట్టు కింద ఒంటరిగా కూర్చొని ఉండగా.. బాణాల హరిచంద్రప్రసాద్, మైనర్ బాలుడు ఆమె వద్దకు వచ్చి ఆమె మెడలోని 30 గ్రామలు బంగారు గొలుసు లాక్కుని బైక్‌పై పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేకు కేసు నమోదు చేసిన తిప్పర్తి పోలీసులు.. సీసీఎస్ బృందాలతో కలిసి నిందితులపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో వాహనాలు తనిఖీ చేస్తున్న తిప్పర్తి పోలీసులను చూసి ఇద్దరు నిందితులు పారిపోయేందుక యత్నించగా.. వెంబడించి పట్టుకున్నారు. వారి నుంచి రెండు సెల్ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. -
బైక్ అదుపుతప్పి మహిళ మృతి
భువనగిరి(బీబీనగర్) : బైక్ అదుపుతప్పడంతో కిందపడి మహిళ మృతిచెందింది. ఈ ఘటన బీబీనగర్ మండల కేంద్రంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం జూలూరు తండా గ్రామానికి చెందిన ధరావత్ పద్మ(32) తన బంధువు సుధాకర్‌తో కలిసి బైక్‌పై శనివారం ఉదయం హైదరాబాద్‌కు బయల్దేరారు. మార్గమధ్యలో బీబీనగర్ మండల కేంద్రంలోని ఫ్లైఓవర్ మీదుగా వెళ్తుండగా బైక్ అదుపుతప్పడంతో కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరిని భువనగిరిలో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే పద్మ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లి సోని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. టిప్పర్ ఢీకొని.. భువనగిరి : బైక్‌ను వెనుక నుంచి టిప్పర్ ఢీకొనడంతో మహిళ మృతిచెందింది. ఈ ఘటన భువనగిరి మండల పరిధిలోని మాసుకుంట వద్ద శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటకొండూరు మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన బరిగె నవనీత(46) శనివారం ఉదయం ఉపాధి హామీ పనికి వెళ్లింది. పని ముగిసిన తర్వాత తన భర్త నర్సింహతో కలిసి బైక్‌పై భువనగిరికి పని నిమిత్తం వెళ్తుండగా.. మార్గమధ్యలో భువనగిరి మండలం మాసుకుంట వద్దకు రాగానే వెనుక నుంచి వస్తున్న టిప్పర్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవనీత తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. నర్సింహకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నర్సింహను చికిత్స నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. నవనీత మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు భానుప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ అనిల్‌కుమార్ తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిభూదాన్పోచంపల్లి : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మార్కండేయనగర్కు చెందిన చేనేత కార్మికుడు శ్రీపతి సిద్దిరాములు (60) ఈ నెల 1వ తేదీ రాత్రి పనిమీద ద్విచక్ర వాహనంపై పోచంపల్లికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్కండేయనగర్ కాలనీ సమీపంలోని మూలమలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనం లైట్లు కళ్లపై పడటంతో దారి కనిపించక ద్విచక్ర వాహనం పైనుంచి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అతడి మెడ భాగంలో ఎముక విరగడంతో వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి శస్త్ర చికిత్స చేయించారు. 10 రోజుల తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. మూడు రోజుల క్రితం సిద్దిరాములు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందతూ శనివారం మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి.. చౌటుప్పల్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గుర్తుతెలియని వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. శనివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తి(సుమారు 49) ఈ నెల 12న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడిని పోలీసులు నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 81726 62505 నంబర్‌ను సంప్రదించాలని ఎస్ఐ కృష్ణమాల్ సూచించారు. డీసీఎంను ఢీకొట్టిన లారీచిట్యాల : లారీ టైరు పంక్చర్ కావడంతో అదుపుతప్పి ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టింది. ఈ ఘటన చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కొబ్బరి బొండాల లోడుతో వెళ్తున్న డీసీఎం గుండ్రాంపల్లి శివారులోకి రాగానే టైరు పంక్చర్ కావడంతో డ్రైవర్ రోడ్డు పైనే నిలిపాడు. అదే సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డివైడర్ పైకి ఎక్కి ఆగిపోయింది. లారీ డ్రైవర్ నిద్రమత్తులో అతివేగంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. -
వర్తక సంఘాన్ని రద్దు చేయాలి
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైన కొన్నేళ్ళుగా కొనసాగుతున్న వర్తక సంఘాన్ని రద్దు చేసి, ఆ సంఘం ద్వారా నడుస్తున్న దుకాణాలకు టెండర్లు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ఆర్అండ్ బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు శనివారం యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు వినతి పత్రం అందజేశారు. వర్తక సంఘం పేరిట దేవస్థానానికి 10 దుకాణాలకు ఏడాదికి కేవలం రూ.1.68కోట్లు మాత్రమే చెల్లిస్తున్నారని, అదే సెల్ ఫోన్ కౌంటర్ టెండర్ సంవత్సరానికి రూ.2.22కోట్లకు పైగా ఆదాయం వస్తుందని మంత్రులకు వివరించారు. అంతే కాకుండా ఇతర టెండర్ల ద్వారా కూడా దేవాలయానికి అధిక ఆదాయం వస్తుందని మంత్రులకు తెలిపారు. వినతి ఇచ్చిన వారిలో బండ రామస్వామి, కల్వకొలను సతీష్‌రాజ్, దేవపూజ అశోక్, బండి వాసు, కొన్నె సంజీవ, మాటూరి బాలయ్య, పబ్బాల ఉప్పలయ్య, మిర్యాల కృష్ణ, బండి అనిల్, కర్రె ప్రవీణ్, గుండు కుమార్, శ్రీనాథ్ ఉన్నారు. ఫ మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డికి యాదాద్రి పరిరక్షణ కమిటీ వినతి -
ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ ఫలితాలు
సాక్షి, యాదాద్రి : ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యుత్తమ ఫలితాలు వస్తున్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శనివారం భువనగిరి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు ఈ ఏడాది 98.30 శాతం ఉత్తీర్ణత సాధించాయన్నారు. విద్యారంగంలో మార్పు కోసమే ఇంటిగ్రేటెడ్, పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు చేస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటుకు దీటుగా విద్యాబోధన జరుగుతుందన్నారు. టెన్త్, ఇంటర్, స్కూల్ గేమ్స్‌లో ప్రతిభ కనబరిచిన 9 మంది విద్యార్థులకు రూ.10 వేల నగదు పారితోషకం అందించి వారి తల్లిదండ్రులను సన్మానించారు. మండలానికి ముగ్గురు టాపర్లను ఎంపిక చేసిన 51 మంది విద్యార్థులను సన్మానించారు. ఉపాధ్యాయులు, హెచ్ఎంలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితీ, టీజీఓ జిల్లా అధ్యక్షుడు మందడి ఉపేందర్‌రెడ్డి, గడసంతల మధుసూదన్, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఫ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి
భువనగిరిటౌన్ : పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం భువనగిరిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడుతోందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథకు సంబంధించిన అంశంపై కూడా అధికారంలో ఉన్నవారు స్పందించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన సదుపాయాలు కల్పించకుండా తేమ శాతం పేరుతో ధాన్యం తూకాల్లో ఆలస్యం చేస్తూ రైతులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. రైతులు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. గాదెగాని మాణిక్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, సహాయ కార్యదర్శులు బొలగాని సత్యనారాయణ, చేడె చంద్రయ్య, రాష్ట్ర సమితి సభ్యులు గోద శ్రీరాములు, కురిమిద్ద శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, ఎండీ ఇమ్రాన్, బండి జంగమ్మ, కొల్లూరి రాజయ్య, బచ్చనగోని గాలయ్య, చెక్క వెంకటేష్, ఉప్పల ముత్యాలు, పల్లె శేఖర్ రెడ్డి, చిగుర్ల లింగం, పేరబోయిన మహేందర్, యేశాల అశోక్, కళ్లెపల్లి మహేందర్, సోమన సబిత, అన్నెపు వెంకట్, మరుపాక వెంకటేష్, అన్నైమెన వెంకటేష్, ఇంజ హేమలత, చాపల అంజయ్య, కలకొండ సంజీవ, దాసరి లక్ష్మయ్య, బబ్బురి శ్రీధర్, మూల పోచయ్య, వడ్లకొండ భారతమ్మ, కాషపాక దయాకర్ తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం -
ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి
భువనగిరి (బీబీనగర్) : ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీబీనగర్ మండలం చిన్నరావులపల్లి గ్రామంలో రైతులు రోడ్డుపై ధాన్యం పోసి బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్ మాట్లాడారు. అధికార పార్టీకి చెందిన నాయకులు ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరించడం తగదన్నారు. కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 30 రోజులు కావస్తున్న కొనుగోలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో చింతల సుదర్శన్‌రెడ్డి, పిట్టల అశోక్, రైతులు పురుషోత్తంరెడ్డి, శ్రీశైలం, రమేష్,బాల్‌రెడ్డి పాల్గొన్నారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దని ధర్నా వలిగొండ : మండలంలోని ముద్దాపురం సమీపంలోని న్యూ బాలాజీ రైస్ మిల్లు యజమాని ధాన్యం దిగుమతిలో ఇబ్బంది పెట్టడాన్ని నిరసిస్తూ శనివారం అరూరు గ్రామ రైతులు వలిగొండ తొర్రూరు రోడ్డు ముద్దారం స్టేజి వద్ద ధాన్యం బస్తాలు వేసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అరూరు కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం లారీలు తరలించగా 4 రోజులుగా కొర్రీలు పెడుతూ 3, 4 కిలోలు కటింగ్ చేస్తేనే దిగుమతి చేసుకుంటామని మిల్లు యజమాని చెబుతున్నారని రైతులు వాపోయారు. ధర్నాలో జినుకల దానయ్య, ఆవుల స్వామీ, బండారు నర్సింహారెడ్డి, ఆలూరు కొండల్‌రెడ్డి, కోయగూర మధు, సామ రాంరెడ్డి, జక్కిడి జంగారెడ్డి, కశిరబోయిన మహేష్, కనకచారి, మహేద తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్ ప్రభుత్వానికి పాలనపై సోయిలేదు
ఆలేరు రూరల్ : రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి పాలనపై సోయిలేకుండా..ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి నియతృత్వంగా వ్యవహరిస్తోందని తెలంగాణ రాష్ట్రీయ్ లోక్ దళ్(ఆర్ఎల్డీ) పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ అన్నారు. శనివారం ఆలేరులోని రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన కమిటీకి కె.కేశవరావును చైర్మన్‌గా నియమించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. జూన్ 27న వరంగల్‌లోని కేఐటీఎస్ కళాశాలలో రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ) ఆధ్వర్యంలో రోజ్‌గార్, స్కిల్ అండ్ లోన్ మేళాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేరోజు లక్ష సైన్యం పేరుతో లక్షమందికి నియామకాల కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ నర్సంహారావు, ఆర్ఎల్డీ జిల్లా అధ్యక్షుడు జి.బీరప్ప, యూత్ జిల్లా అఽధ్యక్షుడు రాజ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఫ ఆర్ఎల్డీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ -
లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యను పరిష్కరించాలి
భువనగిరిటౌన్ : ప్రభుత్వం నిర్ణయించిన తక్కువ ధరలకు క్షేత్రస్థాయిలో పునఃపరిశీలన సర్వే పనులు చేయడం తమవల్ల కాదని లైసెన్స్డ్ సర్వేయర్లు శనివారం కలెక్టరేట్లో వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం ఎకరానికి నిర్ణయించిన రూ.50 ధర అత్యంత తక్కువగా ఉందని, ఈ ధరకు పనులు చేయడం వల్ల తీవ్రంగా నష్టపోతామని సంబంధిత అధికారి దృష్టికి తీసుకెళ్లారు. క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించి, సర్వేయర్ల సంక్షేమాన్ని కాపాడేలా సర్వే ధరలను పునఃసమీక్షించాలని వారు కోరారు. అధికారికి వినతిపత్రం సమర్పించిన వారిలో సర్వేయర్లు జె.డి.ప్రభాకర్ రెడ్డి, బి.నరసింహ, కందన చందు, వాకిటి శ్రీనివాస్‌రెడ్డి, వీరసాగర్, ఎస్.కె.అహ్మద్, కె.నాగరాజు, కె.బిచ్చానాయక్, పి.కుమారస్వామి, చిలువేరు నవీన్, రాజశేఖర్ రెడ్డి, నాజిక్ ఉన్నారు. -
సీఎస్‌ను కలిసిన ఎమ్మెల్యే కుంభం
భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావును శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా బస్వాపూర్ ప్రాజెక్టు పరిధిలో భూములు కోల్పోయిన భూ నిర్వాసతులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద నిధులు విడుదల చేయాలని వినతి పత్రం అందజేశారు. ‘సర్’ సర్వేను సమర్థంగా నిర్వహిస్తాంభవనగిరిటౌన్ : ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జూన్ 24 నుంచి జూలై 25 వరకు ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ (సర్) ఇంటింటి సర్వేను సమర్థంగా నిర్వహిస్తామని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి శనివారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎస్ఐఆర్ మ్యాపింగ్ పురోగతి ప్రక్రియ గురించి సమీక్షించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు. రైస్ మిల్లుల్లో తనిఖీలుభూదాన్పోచంపల్లి : మండలంలోని పిలాయిపల్లి గ్రామంలోని ఇంద్రకీలాద్రి ఆగ్రో రైస్ ఇండస్ట్రీస్, బాలాజీ రైస్‌మిల్లులో శనివారం ఇంటలిజెన్స్ ఎస్పీ రవికుమార్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఆయా రైస్ మిల్లుల్లో ఉన్న ధాన్యం స్టాక్, రిజిస్టర్లను పరిశీలించారు. పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. దోమకాటు వల్ల గట్టితాలు ఉన్నందున 42 కిలోలు కాంటా చేస్తున్నారని రైతులు తెలిపారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ధాన్యం కొనుగోళ్లు, ధాన్యం దిగుమతులకు మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారని పలు ఫిర్యాదు వస్తుండడంతో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో వాస్తవ పరిస్థితిని తెలుసుకొనేందుకు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. వీరివెంట సివిల్‌సప్లయ్ డీటీ బాలమణి, నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు. మానవ అక్రమ రవాణా చట్టరీత్యా నేరంభువనగిరిటౌన్ : మానవ అక్రమ రవాణా చట్టరీత్యా అత్యంత తీవ్రమైన నేరమని, దీనిని అరికట్టేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ ఎస్.సాయిశ్రీనివాస్, నారగోని రాజశేఖర్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.జయరాజు సూచన మేరకు భువనగిరి పట్టణంలోని తాతనగర్లో గల స్కీడ్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, స్కీడ్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో హెచ్ఆర్జీ కమ్యూనిటీ సభ్యులకు మానవ అక్రమ రవాణాతోపాటు సంబంధిత చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హెచ్ఐవీ ఎయిడ్స్ జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ వంశీకృష్ణ, ప్రాజెక్ట్ మేనేజర్ భానుకుమార్, కోఆర్డినేటర్ మిథున్, ఆర్గనైజర్ వెంకటేష్, కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎన్జీ కళాశాలలో కృత్రిమ మేధపై అవగాహనరామగిరి (నల్లగొండ) : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నల్లగొండ ఎన్జీ కళాశాలలో కృత్రిమ మేధపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లీగల్ ప్రాక్టీషనర్ సిద్దేశ్వర్‌రావు, కంప్యూటర్ సైన్స్ అధ్యాపకుడు వెంకటరమణ, టీఎస్కేసీ మెంటర్ ఎండీ.తౌసిఫ్, ఇంగ్లిష్ విభాగం అధ్యక్షుడు ప్రసన్నకుమార్ రిసోర్స్ పర్సన్లుగా వ్యవహారించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ – మెషిన్ లెర్నింగ్ నిత్యజీవితంలో వీటి ప్రాధాన్యత, పనితీరును వివరించారు. హెల్త్‌కేర్‌లో వ్యాధుల గుర్తింపునకు, వ్యవసాయంలో దిగుబడిని పెంచేందుకు ఏఐ సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చో వివరించే నమూనాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అంతటి శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణాధికారి డి.మునిస్వామి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
బోడుప్పల్ వరకే బస్సులు
ఉప్పల్ భగాయత్ రోడ్డు చాలా ఇరుకుగా ఉండడం వల్ల ఆ మార్గంలో బస్సులు, లారీలు వంటి భారీ వాహనాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు. కాబట్టి వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చే భారీ వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా హయత్‌నగర్ చేరుకుని, అక్కడి నుంచి హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించాలి. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే భారీ వాహనాలు ఎల్బీనగర్, హయత్‌నగర్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కి, ఘట్కేసర్ ద్వారా వరంగల్ హైవేకు చేరుకోవాలి. రోడ్డు నిర్మాణ పనులు సజావుగా సాగడానికి, ట్రాఫిక్ నియంత్రణకు వాహనదారులు, ప్రయాణికులు అందరూ పోలీసు శాఖకు పూర్తిగా సహకరించాలని ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. భువనగిరిటౌన్ : ఉప్పల్ రింగ్ రోడ్డు పరిధిలో చేపడుతున్న అత్యవసర నిర్మాణ పనుల దృష్ట్యా ఈనెల 17 (ఆదివారం) ఉదయం నుంచి ఉప్పల్ నుంచి వరంగల్ వైపు వెళ్లే ప్రధాన రహదారిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనదారులు, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను మళ్లించడమే కాకుండా బస్టాప్‌ను కూడా తాత్కాలికంగా మారుస్తున్నట్లు వెల్లడించారు. వరంగల్, హనుమకొండ, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు వైపు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటివరకు ఉప్పల్‌లోని జీహెచ్ఎంసీ కార్యాలయం పక్కన ఉన్న బస్టాప్‌ను బోడుప్పల్‌లోని నల్లచెరువు కట్ట సమీపంలో తాత్కాలిక బస్టాప్‌ను ఏర్పాటు చేశారు. చిన్న వాహనదారుల కోసం.. కార్లు, బైకులు వంటి చిన్న వాహనాల విషయానికి వస్తే, వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చే వారు మే ఫీల్ హోటల్ దాటిన తర్వాత ఉప్పల్ భగాయత్ మార్గం ద్వారా నాగోల్ చేరుకోవాలి. అక్కడ సర్వీస్ రోడ్డు ద్వారా ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకొని హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. అలాగే హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే వారు సర్వే ఆఫ్ ఇండియా జంక్షన్ వద్ద గల పిస్తా హౌస్ పక్క నుంచి బీరప్పగడ్డ మీదుగా ప్రయాణించి, జాతీయ రహదారి 163 ఎక్కి వరంగల్ వైపు వెళ్లాలి. ఫ ఉప్పల్ రింగ్ రోడ్డు పరిధిలో అత్యవసర పనుల దృష్ట్యా నిర్ణయం ఫ బోడుప్పల్‌లోని నల్లచెరువు కట్ట వద్ద వరంగల్, యాదగిరిగుట్ట బస్టాప్ ఫ ప్రయాణికులు గమనించాలని ఉన్నతాధికారుల విజ్ఞప్తి -
హత్యకేసులో నలుగురికి జీవిత ఖైదు
హుజూర్నగర్ : ఒక వ్యక్తిని నమ్మించి దారుణంగా హత్య చేసిన నలుగురు హంతకులకు జీవిత ఖైదు విధిస్తూ హుజూర్నగర్ రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ పి.శివరామ్ ప్రసాద్ శుక్రవారం తీర్పు చెప్పారు. పోలీసుల వివరాల ప్రకారం.. మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామానికి చెందిన చార్ల వెంకటేశ్వర్లు ఆటో డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన అతని సామాజిక వర్గానికి చెందిన ఒక అవివాహిత యువతితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. అంతకు మునుపు అదే గ్రామానికి చెందిన రెడపంగు కోటేశ్వరరావు అనే యువకుడు సదరు యువతితో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. తదుపరి అతను కంప్యూటర్ శిక్షణ కొరకు హైదరాబాద్ వెళ్లగా సదరు యువతి చార్ల వెంకటేశ్వర్లుకు దగ్గరై అతనితో సన్నిహితంగా ఉంటోంది. ఈ విషయాన్ని అదే గ్రామానికి చెందిన తన మిత్రులైన రెడపంగు శ్రీహరి, పెరిమి మహేష్, కొత్తపల్లి నాగసైదులు ద్వారా తెలుసుకున్న కోటేశ్వరరావు గ్రామానికి చేరుకుని తన మిత్రులతో సంప్రదించి ఎలాగైనా వెంకటేశ్వర్లును హత్య చేయడానికి తనతో సహకరించమని కోరగా అందుకు వారు అంగీకరించారు. హత్య చేయడానికి నలుగురు కలిసి పథకం పన్నారు. మత్తు మందు కలిపిన కూలిడ్రింక్ తాపించి..2016 ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో చార్ల వెంకటేశ్వర్లు తన ఇంటి వద్ద ఉండగా రెడపంగు శ్రీహరి అతనికి ఫోన్ చేసి రామాపురం నుంచి మేళ్లచెరువు వెళ్లి ఫ్రిజ్ తీసుకు రావడానికి ఆటో కిరాయికి కావాలని అడగగా అందుకు వెంకటేశ్వర్లు అంగీకరించి ఆటోను కిరాయికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో శ్రీహరి మత్తు మాత్రలు కలిపిన కూల్ డ్రింక్ తన వద్ద ఉంచుకొని మేళ్లచెరువుకు బయలు దేరారు. వీరి ఆటోను రెడపంగు కోటేశ్వరరావు, పెరిమి మహేష్, కొత్తపల్లి నాగ సైదులు మోటార్ సైకిల్‌పై వెంబడించారు. మేళ్లచెరువులో శ్రీహరి బీరు తాగగా చార్ల వెంకటేశ్వర్లుకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్‌ను తాపించాడు. తిరిగి రామాపురం వస్తుండగా మార్గమధ్యంలో రేవూరు గ్రామ శివారులో నిర్మానుష్య ప్రదేశంలో తనకు వాంతి వస్తున్నదనే నెపంతో శ్రీహరి ఆటోని ఆపమని కోరగా వెంకటేశ్వర్లు రోడ్డు పక్కన ఆటో ఆపాడు. మర్మాంగాలపై దాడిచేసి..ఇదే అదునుగా భావించిన రెడపంగు కోటేశ్వరరావు, పెరిమి మహేష్, కొత్తపల్లి నాగ సైదులు ఆటో వద్దకు వచ్చి మత్తులో ఉన్న వెంకటేశ్వర్లను బలవంతంగా ఎన్ఎస్పీ కాల్వ వద్దకు తీసుకువెళ్లి రాళ్లతో అతని మర్మాంగాలపై, శరీరంలో ఇతర భాగాలపై తీవ్రంగా కొట్టారు. తాడును మెడకు బిగించి అందరూ కలిసి హత్య చేశారు. అనంతరం శవాన్ని, ఆటోను భీమా సిమెంట్ క్వారీ వద్దవదిలేసి వెళ్లిపోయారు. వెంకటేశ్వర్లు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, రాత్రి కావడంతో తండ్రి లక్ష్మీపతి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మరుసటి రోజు ఉదయం రేవూరుకు చెందిన రైతులు భీమా సిమెంట్ ఫ్యాక్టరీ క్వారీ వద్ద ఆటో ఉన్నదని దాని పక్కన యువకుడి శవం పడి ఉన్నదని పలువురికి చెప్పగా ఆ విషయం తెలుసుకున్న లక్ష్మీపతి అక్కడికి వెళ్లి శవం తన కుమారుడిదేనని నిర్ధారించుకొని మేళ్లచెరువు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతి కింద కేసు అప్పటి హెడ్ కానిస్టేబుల్ సైదా అనుమానాస్పద కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. పోలీసుల విచారణలో రెడపంగు కోటేశ్వరరావు, రెడపంగు శ్రీహరి, పెరిమి మహేష్, కొత్తపల్లి నాగ సైదులు హత్యకు పాల్పడినట్లుగా నిర్ధారణ కావడంతో ఆ నలుగురిని అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేసి అప్పటి కోదాడ రూరల్ సీఐ రవి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. సాక్షుల విచారణ అనంతరం నలుగురిపై నేరం నిరూపణ కావడంతో హుజూర్నగర్ రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ పి.శివరామ ప్రసాద్ జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. నిందితులు ఒక్కొక్కరు రూ.వెయ్యి జరిమానా చెల్లించాలని చెల్లించని పక్షంలో 15 రోజుల సాధారణ జైలుశిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ బొబ్బ కోటిరెడ్డి వాదించగా సాక్షులను ప్రవేశపెట్టడంలో లైజన్ ఆఫీసర్లు ఆరుట్ల వెంకన్న, శ్రీకాంత్ సహకరించారు. వివరాలు వెల్లడించిన పోలీసులు -
శాంతిభద్రతలు లోపించాయి
నకిరేకల్ : తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందని, శాంతిభద్రతలు లోపించాయని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదు అయిన ఫోక్సో కేసులో వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నకిరేకల్ మెయిన్ సెంటర్లో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను దహనం చేసే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. రాస్తారోకోలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై ఫోక్సో కేసు నమోదై ఏడు రోజులు గడుస్తున్నా అరెస్టు చేయకపోవడం దుర్మార్గమన్నారు. మహిళల భద్రత, మైనర్ల రక్షణ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న బీజేపీ నాయకులు ఇలాంటి సంఘటనలపై సమాధానం చెప్పాలన్నారు. ఈ సంఘటనుకు పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేష్, నకిరేకల్, కేతేపల్లి మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, మారం వెంకట్‌రెడ్డి, నాయకులు పెండెం సదానందం, సైదిరెడ్డి, పల్రెడ్డి మహిందర్‌రెడ్డి, పల్లె విజయ్, గుర్రం గణేష్, పేర్ల కృష్ణకాంత్, నోమలు కేశవరాజులు, సామ శ్రీనివాస్‌రెడ్డి, రాచకొండ వెంకన్నగౌడ్, రావిరాల మల్లయ్య, దైద పరమేషం, జంగయ్యగౌడ్, విజయ్‌కుమార్, జానయ్య, ఇమడపాక వెంకన్న, నాగిల్ల వెంకటయ్య, అమీర్ పాష, లింగరాజు, స్టీఫెన్, శివమూర్తులు పాల్గొన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బండి భగీరథ్‌ను అరెస్టు చేయాలని రాస్తారోకో -
రోగుల ఆరోగ్య సంరక్షణలో నర్సుల పాత్ర కీలకం
భువనగిరి(బీబీనగర్) : రోగుల ఆరోగ్య సంరక్షణలో నర్సుల పాత్ర కీలకమని తెలంగాణ నర్సెస్ అండ్ మిడ్ వైవ్స్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్ ఫ్రొఫెసర్ విద్యులత అన్నారు. శుక్రవారం బీబీనగర్ ఎయిమ్స్‌లో నిర్వహించిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ముగింపు వారోత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నర్సులు దేవుళ్లకు ప్రతిరూపాలన్నారు. అంతకు ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో బీబీనగర్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లత, బీబీనగర్ ఎయిమ్స్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అమితా అగర్వాల్, డాక్టర్ రాహుల్‌నారంగ్, డీన్, నితన్ అశోక్, జీబి కుల్దీప్ పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్ల కోసం రోడ్డెక్కిన జనం సంస్థాన్ నారాయణపురం : వారం రోజులుగా గ్యాస్ రీఫిల్ సిలిండర్ల కొరత ఉండడంతో శుక్రవారం సంస్థాన్ నారాయణపురంలో భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద ప్రధాన రహదారిపై వినియోగదారులు రాస్తారోకో చేశారు. బుకింగ్ చేసుకున్న సమయం దాటుతున్నా స్టాక్ రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ రీఫిలింగ్ బుకింగ్ అవుతున్నప్పటికీ గ్రామాలకు గ్యాస్ వాహనాలు రావడం లేదని ఆరోపించారు. వేసవి కాలంలో గ్యాస్ సిలిండర్ల కోసం ప్రతిరోజూ ఏజెన్సీ చుట్టు తిరగాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని వినియోగదారులకు క్రమ పద్ధతిలో బుకింగ్ ప్రకారం సిలిండర్లు ఇవ్వాలని ఏజెన్సీవారికి సూచించారు. కాగా శుక్రవారం గ్యాస్ కోసం వచ్చిన గట్టుప్పల్‌కు చెందిన మహిళ సృహ తప్పి పడిపోవడంతో పోలీసులు చౌటుప్పల్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. రైతులు సేంద్రియ ఎరువులను వాడాలియాదగిరిగుట్ట రూరల్ : రైతులు సేంద్రియ ఎరువులను వాడాలని జయశంకర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మధు అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం గ్రామంలోని రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. వరిలో నారుమడి, యాజమాన్యం, నాణ్యమైన విత్తనాల ఎంపిక, సకాలంలో విత్తుకోవడంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు రసాయన మందుల వాడకాన్ని తగ్గించాలన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ రాకేష్, ఏఈఓ విరణ్, సర్పంచ్ కన్నాయి రోజా, ఉప సర్పంచ్ దుంబాల వెంకట్రెడ్డితదితరులు పాల్గొన్నారు. -
‘ఇక్కత్’ను ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం వచ్చింది
ఫ తెలంగాణ ఇక్కత్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్భూదాన్పోచంపల్లి : పోచంపల్లికి చెందిన కళాకారులు రూపొందించిన ఇక్కత్ చేనేత కళను ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం లభించినందుకు ఎంతో గర్వంగా ఉందని మిస్ ఏషియా ఇంటర్నేషనల్, తెలంగాణ ఇక్కత్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్ అన్నారు. ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు జరుగుతున్న 79వ కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్బంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫ్యాషన్‌షోలో పాల్గొనేందుకు శుక్రవారం ఆమె ఫ్యారీస్‌కు బయలుదేరి వెళ్తూ ప్రతిక ప్రకటన విడుదల చేశారు. 200 సంవత్సరాల తెలంగాణ వారసత్వాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారిగా పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలతో రెడ్ కార్పెట్‌పై నడవబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని, మగ్గంపై ఎంతో శ్రమకోర్చి కళాత్మక ఇక్కత్ వస్త్రాలను రూపొందించిన పోచంపల్లి నేతన్నలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. తనను తెలంగాణ ఇక్కత్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించి, మన దేశం నుంచి ఇంటర్నేషనల్ ఫ్యాషన్‌షోలో పాల్గొనే అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ చేనేత అభివృద్ధి కమిషనర్, వీవర్స్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్, పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపనీ లిమిటెడ్, పోచంపల్లి టై అండ్ డై సంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
మిల్లర్ల అక్రమ కోతలను అరికట్టాలి
భువనగిరిటౌన్ : మిల్లర్ల అక్రమ కోతలను అరికట్టి రవాణా భారం రైతులపై పడకుండా చూడాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి కలెక్టర్ అనురాగ్ జయంతికి కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 357 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 45 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు కనీసం 10 శాతం ధాన్యం కూడా కొనుగోలు చేయలేదన్నారు. కేంద్రాల్లో కాంటాలు సకాలంలో వేయడం లేదని, వర్షం వస్తే ధాన్యం తడవకుండా రైతులకు టార్పాలిన్లు కూడా ఇవ్వడం లేదన్నారు. నిబంధనల ప్రకారం బస్తాకు 40 కిలోలు తూకం వేయాల్సి ఉండగా.. 41 నుంచి 42 కిలోల వరకు తూకం వేస్తున్నారన్నారు. దీనికితోడు మిల్లర్లు తరుగు పేరిట క్వింటాలుకు రెండున్నల కిలోల నుంచి 5 కిలోల వరకు కోత విధిస్తున్నారని అన్నారు. లారీలు, డీసీఎంలు సకాలంలో రాకపోవడంతో మోత్కూరు మార్కెట్ వంటి కేంద్రాల్లో రైతులు సొంతంగా లారీలకు రూ.3,000, డీసీఎంలకు రూ.1,500 అదనపు కిరాయిలు భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలను అధికారులు పర్యవేక్షించడం లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఏవీ కిరణ్, మండల అధ్యక్షుడు జనగాం పాండు, కౌన్సిలర్ నాగు, చిన్న మహేష్, అతిఎకం లక్ష్మీనారాయణ గౌడ్, సుబ్బూరు బీరు మల్లయ్య, అజీముద్దీన్, సందుల సుధాకర్, జంజద్, గుజ్జ పవన్, రాకెల శ్రీనివాస్, సూరపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు ఫ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి -
కొనుగోళ్లు వేగవంతం చేయండి
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి భూదాన్‌పోచంపల్లి : ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శుక్రవారం భూదాన్‌పోచంపల్లి మండలంలోని జూలూరు పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సివిల్‌సప్లయ్ డీఎం హరికృష్ణతో కలిసి కలెక్టర్ సందర్శించారు. నిర్వాహకులతో మాట్లాడి ధాన్యం నిల్వ, కాంటాల వివరాలు తెలుసుకున్నారు. కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులను రైతులను అడిగి తెలుసుకున్నారు. కాంటాల్లో వేగం పెంచాలని, హమాలీల కొరత లేకుండా చూడాలని, మిల్లుల వద్ద త్వరగా ధాన్యం దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ముక్తాపూర్లోని ఓ రైస్‌మిల్లును సందర్శించారు. అక్కడ ఉన్న ధాన్యం స్టాక్‌ను పరిశీలించారు. హమాలీల సంఖ్య పెంచి వెంటవెంటనే ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని మిల్లర్లను ఆదేశించారు. నెలాఖరు వరకు కొనుగోళ్లు పూర్తి అనంతరం సివిల్ సప్లయ్ డీఎం హరికృష్ణ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లను ఈనెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. పోచంపల్లి మండలంలో ఈసారి పంట ఆలస్యంగా వచ్చిందని, దాంతో కాంటాలు వేయడం ఆలస్యమైందన్నారు. జిల్లాలో పోచంపల్లి, వలిగొండ, రామన్నపేట మండలాల నుంచే అధికంగా ధాన్యం వస్తుందని తెలిపారు. పోచంపల్లి మండలంలో ఇప్పటివరకు 14 వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. మిల్లుల్లో ధాన్యం నిల్వ చేయడానికి స్థలం కొరత ఉన్నందున రాజాపేట, తుర్కపల్లి, వలిగొండ, రామన్నపేట, చౌటుప్పల్‌లో 25 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాంలలో నిల్వ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ తహసీల్దార్ నాగేశ్వర్రావు, ఇన్చార్జ్ ఎంపీడీఓ ఏపాల సత్యనారాయణరెడ్డి, మండల వ్యవసాయ అఽధికారి శైలజ, ఎంఆర్ఐ గుత్తా వెంకట్‌రెడ్డి, సర్పంచ్ కాసుల అంజయ్యగౌడ్, పీఏసీఎస్ సీఈఓ రెబ్బాస్ నర్సింహ, అర్థం అశోక్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
కుక్కల దాడిలో చుక్కల దుప్పి మృతి
రాజాపేట : మేత కోసం వచ్చి తప్పిపోయి గ్రామం శివారుకు వచ్చిన చుక్కల దుప్పి కుక్కల దాడిలో మృతి చెందినట్లు ఫారెస్టు అధికారులు శుక్రవారం తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బేగంపేట గ్రామం శివారులో పక్కనే ఉన్న అడవి నుంచి మేత మేయడం కోసం మూడు చుక్కల దుప్పులు వచ్చాయి. వీటిని గమనించిన కుక్కలు వాటిని తరమడింతో మూడింటిలో రెండు పారిపోగా ఒక దుప్పిపై దాడి చేశాయి. దీంతో ఆ దుప్పి మృతి చెందినట్లు ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లు శేఖర్‌రెడ్డి, శాలిని, బీట్ ఆఫీసర్ మల్లేశం తెలిపారు. దుప్పికి మండల పశువైద్యాధికారితో పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్నకిరేకల్ : నకిరేకల్‌లో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నారు. శుక్రవారం నకిరేకల్‌లోని శ్రీనివాసా ఫంక్షన్ హాల్‌కు వెళ్తుండగా ఆటో డ్రైవర్ సుదర్శన్‌కు దారిలో నల్ల బ్యాగ్ కనిపించింది. ఆ బ్యాగ్‌ను పరిశీలించగా అందులో ఆరు తులాల బంగారం అభరణాలు, బ్యాంక్ లాకర్ కీస్ ఉన్నట్లు గుర్తించారు. సదరు ఆటో డ్రైవర్ సుదర్శన్ ఆ బ్యాగ్‌ను నకిరేకల్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు అప్పగించారు. అదే సమయంలో ఆ బ్యాగ్ పోగొట్టుకున్న బ్యాంక్ ఉద్యోగి శ్వేత పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. అక్కడే సదరు మహిళకు ఆ బ్యాగ్‌ను ఆటో డ్రైవర్ సుదర్శన్ అప్పగించి తన నిజాయితీని చాటుకున్నారు. దీంతో అతడని పోలీసులు అభినందించారు. విద్యుదాఘాతానికి బాలుడు బలి ● మామిడి కాయలు కోస్తుండగా ప్రమాదంమద్దిరాల : విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందిన సంఘటన మద్దిరాల మండలం గుట్టకింది తండా ఆవాసం షేట్రాం తండాలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం షేట్రాం తండాకు చెందిన నేనావత్ రాజు విజయ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు సంతోష్(16) మండలంలోని చిన్ననెమిలా ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల 10వ తరగతి పూర్తి చేశాడు. వేసవి సెలవులు కావడంతో చిన్ననెమిలా గ్రామానికి చెందిన దబ్బేటి సురేష్ అనే వ్యక్తి.. సంతోష్‌తో పాటు మరి కొందరిని ఐదు రోజులుగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన సంపెల్లి వెంకటేశ్వర్రావు మామిడితోటలో కాయలు కోసేందుకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సంతోష్ మామిడి తోటలో మామిడి కాయలు కోస్తున్నాడు. అతడు కోస్తున్న చెట్టు పైనుంచి వెళ్తున్న విద్యుత్ లైన్‌ను గమనించని సంతోష్ వాటికి తగిలి విద్యుత్‌షాక్‌కు గురై కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిన ట్లు వైద్యులు ధ్రువీకరించారు. మామిడితోట మధ్యలో నుంచి 11కేవీ విద్యుత్ వైర్లు ఉన్నా చెట్లకొమ్మలు తొలగించడంలో విద్యుత్ అధికా రుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు ఎల్సీ తీసుకోకుండా తోట యజమాని, కౌలుదారు కాయలు కోయించడంతో బాలుడు మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆస్పత్రి మార్చురీ వద్ద ఆందోళన చేపట్టారు. మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా అడ్డుకున్నారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పారు. కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
పెన్‌పహాడ్ : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన పెన్‌పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం చివ్వెంల మండలం కుడకుడకు చెందిన తూర్పాటి లక్ష్మయ్య(40), పర్వతం లక్ష్మయ్య, చింత అప్పలయ్యలతో కలిసి కారులో అన్నారంలోని ఓ పండుగకు వచ్చారు. ముగ్గురు కలిసి మద్యం తాగారు. తర్వాత తూర్పాటి లక్ష్మయ్య తన సొంత బామ్మర్థి పర్వతం లక్ష్మయ్య నిద్ర వస్తుందని అదే కారులో పడుకున్నారు. కొంత సేపటి తరువాత పర్వతం లక్ష్మయ్య లేచి వెళ్లాడు. తూర్పాటి లక్ష్మయ్య అనుమానాస్పదస్థితిలో మృతి చెంది ఉన్నాడు. దీంతో మృతుడి భార్య శాంతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా తూర్పాటి లక్ష్మయ్య మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. దీంతో మృతుడు సూర్యాపేటలోని 2వ వార్డు కుడకుడ జంగాల కాలానికి చెందిన వాడుకావడంతో ఆయన మృతిపై అనుమానం ఉందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. ఈ క్రమంలో తమకు తగిన న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నిందితులను పోలీసులు కాపాడుతున్నారని వారు ఆరోపించారు. మృతుడిని ఉదయం ఇద్దరు వ్యక్తులు ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఆందోళన వద్దకు చేరుకొని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
చెరువులో మునిగి బాలుడు మృతి
మర్రిగూడ : స్నేహితులతో కలిసి సరదాగా చెరువులో ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈఘటన శుక్రవారం మర్రిగూడ మండలం దామెరభీమనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన షేక్ హరీఫ్ నస్రీన్లకు ముగ్గురు కుమారులు ఉన్నారు. అందులో చిన్న కుమారుడు సిద్ధిఖ్(11)తో కలిసి గురువారం తన తల్లి మేనమామ కుమారుడి వివాహానికి వెళ్లారు. ఈ క్రమంలో సిద్ధిఖ్ తన స్నేహితులతో కలిసి గ్రామంలో గల చెరువు వద్దకు వెళ్లడంతో ప్రమాదవశాత్తు కాలు జారి నీటమునిగాడు. తోటి స్నేహితులు కేకలు వేయడంతో గమనించిన స్థానికులు సిద్ధిఖ్‌ను వెతకగా అప్పటికే బయటకు తీసి పరిశీలించగా మృతిచెందాడు. కాగా సిద్ధిఖ్ బోడంగిపర్తి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సిధ్ధిఖ్ 5వ తరగతి పూర్తి చేసుకున్నాడు. వివాహానికి హాజరై సరదాగా గడుపుతున్న సమయంలో సిద్ధిధఖ్ మృతిచెందడం పట్ల కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించాలి
భానుపురి (సూర్యాపేట) : స్థానికంగా అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ, ఆదాయ వనరులను పెంచుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. అనవసర వ్యయాన్ని తగ్గించుకొని, ఆదాయ వనరుల ద్వారా రాబడిని పెంచుకున్నప్పుడే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్లో.. తూర్పు తెలంగాణ జిల్లాల స్థానిక సంస్థల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులతో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి కాత్యాయని దేవి, సభ్యురాలు సుజానాయాదవ్, సభ్యుడు ఎస్.సుధీర్‌రెడ్డితో కలిసి చైర్మన్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ.. ఆదాయ వనరులు అభివృద్ధి చేసుకుని, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం శాసీ్త్రయ దృక్పథంతో పనిచేయాలన్నారు. అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపల్ వార్డులలో ప్రతి నివాస గృహానికి రక్షిత మంచినీరు సరఫరా, పారిశుధ్యం నిర్వహణ పక్కాగా కొనసాగేలా స్థానిక సంస్థలు పర్యవేక్షణ చేయాలన్నారు. నిధుల కోసం పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పైనే ఆధారపడకుండా స్థానికంగా ఆదాయం సమకూర్చే అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పన్ను వసూళ్లు, ప్రకటనలపై వచ్చే రాబడి, వృత్తి పన్ను, వ్యాపార వాణిజ్య సముదాయాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి నిర్ణీత రుసుము వసూలు చేస్తూ స్థానిక సంస్థలు ఆర్థిక పరిపుష్టి సాధించేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్‌తో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, డీపీఓలు, ఎంపీడీఓలు, నగర మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూర్యాపేటలో స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సు -
గ్రంథాలయాల పుస్తకాలను వినియోగించుకోవాలి
చౌటుప్పల్ : గ్రంథాలయాల్లోని పుస్తకాలను నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ఉపయోగించుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను అదనపు కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. గ్రంథాలయంలోని పుస్తకాలను వినియోగించుకుని పోటీ పరీక్షల్లో రాణించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పలువురిని ఆయన సత్కరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావనిరమేష్గౌడ్, కమిషనర్ వెంకటేశ్వరనాయక్, గ్రంథాలయ కార్యదర్శి సుధీర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన భువనగిరిటౌన్ : విద్యా వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎండీ అవైస్ ఉర్ రెహ్మాన్ చిస్తీ మాట్లాడుతూ.. గ్రంథాలయంలో ఉన్న వివిధ పోటీ పరీక్షల పుస్తకాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచేందుకు ప్రతి పాఠశాల నుంచి వారానికి ఒకరోజు గ్రంథాలయ సందర్శన ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఈ ఓ సత్యనారాయణరావు, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎంఈఓ నాగార్జునరెడ్డి, వైస్ చైర్మన్ మంజుల, కౌన్సిలర్ బొంతల నర్సింగ్ పాల్గొన్నారు. ఫ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు -
టెంపుల్ కారిడార్
సాక్షి, యాదాద్రి : నల్లగొండ–యాదగిరిగుట్ట టెంపుల్ కారిడార్ నిర్మాణంతో ఆధ్యాత్మిక, పర్యాటక రంగానికి సరికొత్త హంగులు అద్దేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో మెగాగ్రోత్ కారిడార్ల అభివృద్ధిపై సీఎం ఎ.రేవంత్‌రెడ్డి బుధవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రం నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టను కలుపుతూ ప్రత్యేక టెంపుల్ కారిడార్‌ను ప్రకటించారు. దీంతో ఆధ్యాత్మిక జిల్లాలుగా పేరున్న నల్లగొండ, యాదాద్రిభువనగిరిలో మరింత అభివృద్ధి జరగనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో డిజైన్ పెరుగుతున్న భక్తుల రద్దీ, 25 ఏళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో డిజైన్ చేయనున్నారు. ఇప్పటికే యాదగిరిగుట్ట, నాగార్జునసాగర్, భువనగిరి ఖిలా, చెర్వుగట్టు, నల్లగొండలోని ఛాయసోమేశ్వర క్షేత్రాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. నాలుగు లేన్లగా రహదారులు.. నల్లగొండ–యాదగిరిగుట్టతోపాటు రెండు జిల్లాల్లో ఉన్న పర్యాటక, ఆధ్యాత్మిక, పుణ్య క్షేత్రాల మధ్యన ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు, సురక్షితమైన ప్రయాణాన్ని అందించేలా అత్యాధునిక లింక్ రోడ్లు, రేడియల్ రోడ్లను నిర్మించనున్నారు. ఈ కారిడార్ కేవలం రహదారి విస్తరణణే కాకుండా, మార్గమధ్యంలో పర్యాటకులకు అవసరమైన అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, బస్ సౌకర్యం, ఈవీ వాహనాలను అందుబాటులోకి తేనున్నారు. గ్రీన్ జోన్ల అభివృద్ధితో కూడిన సమగ్ర ప్యాకేజీగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. మారనున్న ముఖచిత్రం.. టెంపుల్ కారిడార్‌తో నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో గల ప్రధాన పట్టణాలు, క్షేత్ర గ్రామాలు, మున్సిపాలిటీలు, సమీప మండలాల ముఖచిత్రం రూపురేఖలు మారనున్నాయి. మెగాగ్రోత్ కారిడార్‌లో భాగంగా టూరిజం, ఆధ్యాత్మిక కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ పాలన వ్యవహారాల కోసం టీటీడీ తరహాలో టెంపుల్ బోర్డు ఏర్పాటుకు చట్టం చేశారు. త్వరలో నూతన పాలక మండలి నియామకం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే యాదగిరిగుట్టలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడంతోపాటు కొత్త ప్రాజెక్టులను చేపట్టనున్నారు. సోలార్ ఎనర్జీ ప్లాంట్, పర్యాటక సదుపాయలకు మెరుగుపర్చనున్నారు. ఇప్పటికే ఎంఎంటీఎస్‌ను యాదాద్రి వరకు పొడిగించే పనులు వేగంగా జరుగుతున్నాయి. టెంపుల్ టూరిజం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని ప్రభుత్వం భావిస్తోంది. డీపీఆర్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఇటీవల సీఎం ఆదేశించారు. నల్లగొండ– యాదగిరిగుట్ట మధ్య నిర్మాణానికి ప్రణాళిక ఫ మెగాగ్రోత్ ప్లాన్‌లో ఆధ్యాత్మిక నగరాల అనుసంధానం ఫ 25 ఏళ్ల భవిష్యత్ అవసరాలే లక్ష్యంగా రోడ్ల అభివృద్ధి ఫ డీపీఆర్‌లు సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు -
పశ్చిమ బెంగాల్ వలస కూలీల అరెస్టు
భువనగిటౌన్ : కూలి పనుల కోసం వచ్చి అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే దురాశతో నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు అంతరాష్ట్ర నిందితులను భువనగిరి పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి సుమారు రూ.5 లక్షల విలువైన 50 గ్రాముల బ్రౌన్ షుగర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ ఎం.రమేష్ కేసు వివరాలను వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ సమీపంలో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో టౌన్ ఎస్ఐ లక్ష్మీనరసయ్య తన సిబ్బందితో కలిసి మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన హబీబుర్రహ్మాన్ (48), ఎస్.కె.ఖాదిర్ (30)ను అదుపులోకి తీసుకుని విచరించారు. స్థానికంగా కూలీ పనులు చేసుకునే వీరు ఇటీవల పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికల్లో ఓటేసెందుకు స్వగ్రామాలకు వెళ్లారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని మాల్దా జిల్లా నుంచి ఈ బ్రౌన్ షుగర్‌ను సేకరించారు. భువనగిరిలో అవసరమున్న వారికి విక్రయించి సొమ్ము చేసుకోవాలనే పథకంతో దీనిని ఇక్కడకు తీసుకొచ్చారు. వీరి వద్ద నుంచి ఒక్కొక్కటి 25 గ్రాముల బరువున్న రెండు బ్రౌన్ షుగర్ ప్యాకెట్లతో పాటు ఒక మొబైల్ ఫోన్, నగదును పోలీసులు సీజ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో గ్రాము ధర సుమారు రూ.10 వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ పట్టణంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తెలపాలని కోరారు. భువనగిరిలో బ్రౌన్ షుగర్ విక్రయిస్తుండగా పట్టుకున్న పోలీసులు -
యువకుడి గొంతు కోసి దారుణ హత్య
కోదాడ రూరల్ : ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కోదాడ మండలం గణపవరం స్టేజీ నుంచి బీక్యాతండా వెళ్లే మార్గంలోని మామితోట సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోదాడ మండలం గణపవరం గ్రామానికి చెందిన బలుగూరి మైసయ్య అలియాస్ మీరా సామ్రాజ్యం చిన్న కుమారుడు గణేష్(25) హోటల్ మేనేజ్మెంట్కు సంబంధించిన ఉద్యోగం చేస్తూ వంట గ్యాస్ కొరత వల్ల ఆ ఉద్యోగం మానేసి నెలరోజుల క్రితం ఏపీ నుంచి ఇంటికి వచ్చాడు. గ్రామంలో క్యాటరింగ్ నిర్వహిస్తున్న తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అయితే గురువారం రాత్రి భోజనం చేసి 10 గంటల సమయంలో గ్రామంలో జరిగిన ఓ శుభకార్యంలో జరుగుతున్న బరాత్ చూసేందుకు సత్యమ్మగుడి వద్దకు వెళ్తున్నాని చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రి అయిన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం వెతికినా ఎక్కడ లభించలేదు. దీంతో అనుమానమొచ్చి శుక్రవారం ఉదయం కోదాడ రూరల్ పోలీసు సేష్టషన్లో ఫిర్యాదు చేశారు. సాయంత్రం మూడున్నర గంటల సమయంలో బీక్యాతండా రోడ్డులో ఉన్న మామిడి తోట వెనుక వైపు చెట్టు కింద రక్తపు మడుగులో చేతులను వెనుకకు టీషర్టుతో చేతులు కట్టేసి ఉన్న గుర్తుతెలియని మృతదేహాన్ని అటుగా వెళ్లిన రైతులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ ఎస్ఐ గోపాల్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని అప్పటికే మిస్సింగ్ కేసు ఫిర్యాదు ఇచ్చిన వారికి సమాచారం ఇవ్వడంతో మృతదేహాం గణేష్దని నిర్ధారించుకున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో మద్యం బాటిళ్లు కూడా ఉన్నాయి. పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి మైసయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన ఎస్పీ హత్య జరిగిన ప్రదేశాన్ని శుక్రవారం సూర్యాపేట ఎస్పీ నరసింహ.. కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, మునగాల సీఐ రామకృష్ణారెడ్డిలతో కలిసి పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ సిబ్బందిని పిలిపించి ఆధారాలు సేకరించారు. మృతుడి, కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హత్యకు గల కారణాలను చేధించి నిందితులను వెంటనే పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. జాగిలాలు ఒకటి గణపవరం స్టేజీ నుంచి తొగర్రాయి వద్దకు మరొకటి మేళ్లచెరువు రోడ్లో కొంత దూరం వరకు వెళ్లి ఆగాయి. ఈ హత్య ఎందుకు జరిగిందో , ఎవరు చేశారోనని గణపరం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కోదాడ మండలం గణపవరం శివారులో ఘటన ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ నరసింహ -
గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురి అరెస్టు
నల్లగొండ : గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.లక్ష విలువ గల 2.2 కేజీల గంజాయి, 2 కత్తులు, 3 ఫోన్లు, 1 బైక్ స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. శుక్రవారం నల్లగొండలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. కనగల్‌లోని జీఎల్ గార్డెన్ దగ్గరలో గల వేప చెట్టు వద్ద ఐదుగురు వ్యక్తులు ఒక మోటార్ సైకల్పై ఉండి గంజాయి పంపిణీ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న కనగల్ ఎస్ఐ కె.రాజీవ్‌రెడ్డి తన సిబ్బందితో వెళ్లి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. నిందితులైన బొడ్డు చందు, కానుగు సాయిరామ్, జిల్లా చందు, చాడ క్రాంతికుమార్, బొమ్మరగోని అంజి అలియాస్ నిరంజన్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ నిందితులు మూడు నెలల నుంచి గంజాయి వ్యాపారం చేస్తున్నామని హైదరాబాద్‌లోని మన్నీ అనే మహిళ నుంచి కొనుగోలు చేసి అమ్ముతున్నట్లు తెలిపారన్నారు. కేసును ఛేదించి గంజాయిని నిందితులను అరెస్టు చేసిన కనగల్ ఎస్ఐ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. చివరి మజిలీలో మేమున్నామంటూ..రామగిరి (నల్లగొండ) : నల్లగొండలో ఓ అనాథ మృతదేహానికి సేవా భారతి ఆధ్వర్యంలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. సేవా భారతి కార్యకర్తలు కుటుంబ సభ్యుల్లా నిలబడి చివరి వీడ్కోలు పలికారు. మనిషి చివరి ప్రయాణానికి గౌరవం ఇవ్వడం ఒక గొప్ప సామాజిక బాధ్యత అనే భావనతో నిర్వహించిన ఈ కార్యక్రమం స్థానిక ప్రజలను భావోద్వేగానికి గురిచేసింది. కార్యక్రమంలో సేవా భారతి జిల్లా అధ్యక్షుడు శిరీష్, భీమనపల్లి శ్రీకాంత్, రాజు, గణేష్, ఎలేందర్, క్రాంతి, రాము పాల్గొన్నారు. మానవత్వం చాటుకున్న గ్రామస్తులు.. నూతనకల్ : బతుకుదెరువు కోసం వచ్చి మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు ఆ గ్రామస్తులు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సోను(53) పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం మండల కేంద్రానికి వలస వచ్చాడు. మండల కేంద్రంలో పానిపురి బండి నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురై శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి గ్రామంలో ఇల్లు లేకపోవడం.. మృతదేహాన్ని సొంత రాష్ట్రానికి తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో గ్రామంలోనే వైకుంఠ ధామంలో ఉంచారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఇమ్మారెడ్డి రాజాబహుదూర్రెడ్డి రూ.10వేలు, మరికొందరు తమకు తోచిన సహాయం అందించి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. -
బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో..సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలుఐబ్రోస్(త్రెడింగ్), వ్యాక్సింగ్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఫేస్‌ప్యాక్స్, హెయిర్ కట్స్, హెయిర్‌స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ అండ్ సెల్ఫ్ గ్రూమింగ్, శారీ డ్రాపింగ్. రిజిస్ట్రేషన్ స్వీకరించు తేదీలు : 16–05–2026 నుంచి 21–05–2026 వరకు సమయం : ఉదయం 10 గం. నుండి సాయంత్రం 6 గం.వరకు రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.2,500/– వర్క్‌షాపు షెడ్యూల్ తేదీలు: 22–05–2026 నుండి 21–06–2026 వరకు శిక్షణ సమయం : ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకుతన్విక బ్యూటీపార్లర్ అండ్ ట్రైనింగ్ సెంటర్, రోడ్ నెం.1బి, వీటి కాలనీ, నల్లగొండ. సంప్రదించవలసిన ఫోన్ : 8341151413, 9666013544రిజిస్ట్రేషన్ మరియు శిక్షణా స్థలం వివరాలుఫ కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేయబడతాయి -
ఆహార కల్తీపై ప్రత్యేక నిఘా పెట్టాలి
సాక్షి, యాదాద్రి : ఆహార కల్తీపై ప్రత్యేక నిఘాపెట్టి కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అధికారులను ఆదేశించారు. గురువారం భువనగిరి కలెక్టరేట్లోని తన కార్యాలయంలో జిల్లా ఆహార పరిరక్షణ నియమిత అధికారి పి.స్వాతి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఆహార భద్రత సలహా కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఆహార నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ముఖ్యంగా జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలల్లో ఆహారాన్ని వండే సిబ్బందికి తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించాలని, వంట చేసే వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే విద్యార్థులకు సురక్షితమైన భోజనం అందుతుందన్నారు. అంగనన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేసే గుడ్లు, ఇతర ముడి సరుకుల నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. జిల్లాలో ప్రధాన సమస్యగా మారిన పాల కల్తీపైనా దృష్టి సారించాలన్నారు. ఆహార భద్రత అధికారి పి.స్వాతి మాట్లాడుతూ జిల్లాలో కల్తీని అరికట్టేందుకు తమ బృందం నిరంతరం నిఘా ఉంచుతుందన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, భువనగిరి గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు -
రికార్డు స్థాయిలో ధాన్యం
నల్లగొండ : దేశంలోనే రికార్డుస్థాయిలో ధాన్యం పండించిన రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో లారీల కాంట్రాక్టర్లు ఇబ్బంది పెడితే సహించేది లేదని హెచ్చరించారు. గురువారం ధాన్యం సేకరణపై కలెక్టర్ ఛాంబర్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులతో ధాన్యం సేకరణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ లారీల సమస్యను అధిగమించేందుకు కలెక్టర్లు అన్ని రకాల వాహనాలను ధాన్యం సేకరణకు మళ్లించాలన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, ధాన్యం సేకరణలో భాగస్వాములైన అధికారులంతా రానున్న వారం, పది రోజులు పూర్తిస్థాయిలో దృష్టి పెడితే ధాన్యం సేకరణ ఇబ్బందులు లేకుండా సాగుతుందని అన్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ నాగార్జునసాగర్, మిర్యాలగూడ ప్రాంతంలో సన్నధాన్యం ఎక్కువగా వస్తున్నందున అక్కడ ఎలాంటి సమస్యలు లేవని, నల్లగొండ, నకిరేకల్, దేవరకొండ, తుంగతుర్తిలోని కొన్ని ప్రాంతాల నుంచి ధాన్యం ఎక్కువగా వస్తున్నందున సమస్యలు ఉన్నాయన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఎక్కువ లారీలు అవసరమైన సెంటర్లను గుర్తించి అక్కడికి లారీలు పంపించి త్వరగా ధాన్యాన్ని తీసుకువెళ్లే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, కలెక్టర్లు చంద్రశేఖర్, తేజస్ నంద్లాల్పవర్, అనురాగ్ జయంతి పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏమన్నారంటే.. ● ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం లారీలను వినియోగించాల్సిన అవసరం ఉందని, అలాగే ధాన్యం లారీలను ట్యాగింగ్ చేయాలని సూచించారు. ● తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యం లిఫ్ట్ చేసేందుకు లారీల సమస్య లేకుండా చూడాలన్నారు. ● ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. ● నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి మాట్లాడుతూ లారీలు, హమాలీ సమస్య లేకుండా చూడాలన్నారు. ● ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ మాట్లాడుతూ ధాన్యం సేకరణపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. ● భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో పండిన ధాన్యాన్ని గత సంవత్సరం జనగామ జిల్లాకు పంపేందుకు అనుమతించారు, ఈ సారి కూడా అనుమతి ఇవ్వాలని కోరారు. ● దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ మా ప్రాంతంలో వచ్చే ధాన్యాన్ని ఉంచేందుకు మిల్లులలో స్థలం అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. ● ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలును వేగంతం చేయాలన్నారు. ● మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ట్రాన్స్పోర్ట్ సమస్యను పరిష్కరించాలన్నారు. ఫ కొనుగోళ్లలో ఇబ్బందులు కలిగించొద్దు ఫ లారీ కాంట్రాక్టర్లు సతాయిస్తే సహించం ఫ అధికారులంతా భాగస్వాములై కొనుగోళ్లు సాఫీగా సాగేలా చూడాలి ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫ కలెక్టరేట్లో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, కోమటిరెడ్డితో కలిసి సమీక్ష మంత్రులు ముందుగా నల్లగొండ సమీపంలోని ఓ రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. మిల్లు యజమాని, హమాలీలతో ముఖాముఖి మాట్లాడారు. ఎక్కడి నుంచి వచ్చారని హమాలీలను ప్రశ్నించారు. వారు బిహార్ నుంచి వచ్చామని చెప్పాడంతో.. జిల్లాలో ధాన్యం ఎక్కువగా వస్తోందని.. ఇంకా బాగా కష్టపడి పనిచేసి సహకరించాలని కోరారు. -
నెలాఖరులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి
చౌటుప్పల్ : ఈ నెలాఖరులోగా ధాన్యం కొనుగోళ్లను పూర్తిచేస్తామని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం చౌటుప్పల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్యను అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. ధాన్యం నిలువ చేస్తున్న ఐఎంజీ గోదాము వద్దకు వెళ్లి చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సీజన్లో లక్ష్యానికి మించిన ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. ఇప్పటి వరకు 358 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 1.45లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 38 రైస్ మిల్లులకు తరలిస్తున్నామన్నారు. అనంతరం కలెక్టర్ అంకిరెడ్డిగూడెం గ్రామంలోని మల్లికార్జున రైస్‌మిల్లును ఆకస్మికంగా సందర్శించారు. పలు వివరాలు అడిగి తెలుసుకుని మాట్లడారు. ధాన్యం లారీలు మిల్లుల వద్ద ఆగవద్దన్నారు. హమాలీలను సరిపడా పెట్టుకోవాలని సూచించారు. ఏరోజు వచ్చిన లారీని అదే రోజున దిగుమతి చేసుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, ఎస్పీ అక్షాంష్యాదవ్, ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి పీవి.రమణారెడ్డి, డీఎస్పీ పటోళ్ల మధుసూదన్‌రెడ్డి, సీఐ మన్మథకుమార్, తహసీల్దార్ వీరాభాయి, మార్కెట్ వైస్‌చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీ వెంకటేశ్వర్లు, ఏఓ ముత్యాల నాగరాజు, ఆర్ఐ బాణాల రాంరెడ్డి, ఏఈఓ శ్రావ్య, రైతులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
సాగులో యూరియా వినియోగాన్ని తగ్గించాలి
చౌటుప్పల్ : రైతులు పంటల సాగులో యూరియా వినియోగాన్ని తగ్గించాలని, దానికి ప్రత్యామ్నాయంగా నానో యూరియా వాడాలని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రభావతి సూచించారు. చౌటుప్పల్‌లోని రైతువేదికలో బుధవారం రైతు ముంగింట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరికి ఎకరానికి రెండు బస్తాలకు మించి యూరియా వాడొద్దన్నారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, సింగిల్‌విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, వైస్‌చైర్మన్ చెన్నగోని అంజయ్య, ఏఓ ముత్యాల నాగరాజు, కౌన్సిలర్లు రాకేష్‌రెడ్డి, లక్ష్మీముత్తయ్య, గుండ్లబావి సర్పంచ్ నందగిరి వెంకటేష్, సింగిల్‌విండో మాజీ చైర్మన్ చీరిక సంజీవరెడ్డి పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికే మార్నింగ్ వాక్
యాదగిరిగుట్ట : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకే మార్నింగ్ వాక్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 9, 10, 12 వార్డుల్లో బుధవారం మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆయా కాలనీల్లో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, పారిశుధ్ద్యం, తాగునీటి వసతి వంటి సమస్యలపై అక్కడికక్కడే అధికారులతో చర్చించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్‌గౌడ్, కౌన్సిలర్లు బూడిద సురేందర్, ముక్కెర్ల మల్లేష్, సాధునేని ధనలక్ష్మి, బబ్బూరి శ్రీధర్, మున్సిపల్, ఇతర శాఖల అధికారులు ఉన్నారు. ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
వానాకాలం పంటలకు మద్దతు
భువనగిరి : రైతులు పండించిన పంటల మద్దతు ధరలను పెంచుతూ కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పెంచిన మద్దతు ధరలు వానాకాలం సీజన్ నుంచి వర్తించనున్నాయి. వరి, పత్తి, జొన్న, సజ్జ, రాగులు, కందులు, మొక్కజొన్న, మినుములు, పెసలు, పొద్దుతిరుగుడు, వెరుశెనగ, నువ్వులు, సోయాబిన్ ఽవంటి పంటల ధరలను ప్రభుత్వం పెంచింది. ఆదాయం పెంపే లక్ష్యం రైతులు ఆధాయాన్ని పెంచే లక్ష్యంతో వానకాలం పంటల కనీస మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. పంట పెట్టుబడి ఖర్చుకు అదనంగా 50 శాతం ఉండేలా కొత్త ధరలను నిర్ణయించారు. కానీ కొన్ని పంటల విషయంలో మద్దత ధరలు స్వల్పంగా ఉండటం రైతులకు కొంత నిరాశ కలిగించే విషయంగా ఉన్నట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు. వరి, పెసలకు నామమాత్రమే రాష్ట్రంలో వరి సాగు అధికంగా ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంటల మద్దతు ధరలో వరి పంటకు నామ మాత్రంగానే పెంచింది. దాంతో పాటు పెసలకు క్వింటాకు కేవలం రూ.12లను మాత్రమే పెంచింది. ఇటీవల కాలంలో వరికి తెగుళ్లు అధికంగా సోకుతుండడం, కూలీల రేట్లు, ఎరువుల ధరలు పెరగడంతో పెట్టుబడి ఖర్చులకు భారీగా పెరిగాయి. కానీ మద్దతు ధర మాత్రం తక్కువగానే ఉండడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. వరి పంటకు మద్దతు ధర రూ.72లు పెంచితే, పత్తికి మాత్రం రూ.557 పెంచడం రైతులకు కొంత ఊరటను కలిగించే అంశం. ఫ మద్దతు ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం ఫ స్వల్పంగా పెరిగిన వరి, పెసల ధరలు ఫ వచ్చే సీజన్ నుంచి వర్తింపు -
వలస కార్మికులపై.. పోలీసుల నిఘా
సాక్షి, యాదాద్రి : నేరాల నియంత్రణకు జిల్లా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఐపీఎస్ భార్య హత్య, జవహర్‌నగర్, కరీంనగర్ బ్యాంకుల్లో చోరీలు వంటి ఘటనల నేపథ్యంలో జిల్లా పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా వలస కార్మికులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఎస్పీ అక్షాంష్ యాదవ్ ఆదేశాల మేరకు భువనగిరి పోలీసులు హోటళ్లు, రిసార్టులు, వివిధ వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాలను సేకరిస్తున్నారు. వారి వేలిద్రలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అధునాతన సాంకేతికతతో నిఘా నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. నేపాల్, బీహార్, ఒరిస్సా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, యూపీ, రాజస్థాన్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన, పని చేస్తున్న కార్మికుల వివరాలను సేకరిస్తున్నారు. బుధవారం 30 మంది వివరాలను సేకరించారు. వలస కార్మికుల వేలిముద్రలను ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టంలో నిక్షిప్తం చేస్తున్నారు. దీనివల్ల గతంలో ఉన్న నేరచరిత్ర బయట పడుతుంది. భవిష్యత్‌లో సదరు వ్యక్తులు ఎక్కడైనా నేరాలకు పాల్పడితే, వారి వేలిముద్రల ఆధారంగా క్షణాల్లో గుర్తించే వీలుంటుంది. కార్మికుల స్థానికత, వారి బంధువుల వివరాలు, ఆధార్ నంబర్ వంటి వివరాలను సేకరించడంతో పాటు గుర్తింపు కార్డులను కూడా పోలీస్ రికార్డుల్లో భద్రపరుస్తున్నారు. గతంలో కూడా పట్టణ పోలీసులు వలస కార్మికుల వివరాలను సేకరించారు. జిల్లాలో వేలాది మంది భువనగిరి జిల్లా కేంద్రంతోపాటు పారిశ్రామికి వాడలు, కంపెనీలు, రైస్ మిల్లులు, ఇటుక బట్టీలు, భవన నిర్మాణ రంగం, హోటళ్లు, వ్యవసాయ పనులతో పాటు పలు రంగాల్లో వసల కార్మికులు వేల సంఖ్యలో పనిచేస్తున్నారు. భువనిగిరి, చౌటుప్పల్, బీబీనగర్, పోచంపల్లి, బొమ్మలరామారం, ఆలేరు ఇలా దాదాపు అన్ని మండలాల్లో వలస కార్మికులు వివిధ పనుల్లో ఉన్నారు. కొత్త వ్యక్తులను పనిలోకి తీసుకునే ముందు వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి నేర చరిత్ర తనిఖీ చేయించుకోవాలి. పోలీసుల క్లియరెన్స్ పొందిన తర్వాతే వారిని విధుల్లోకి తీసుకోవడం సురక్షితం. యజమానులు అశ్రద్ధ వహిస్తే, భవిష్యత్తులో జరగబోయే అనర్థాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి. లేదా డయల్ 100కు సమాచారం అందించాలి. ఫ నేరాల నియంత్రణకు చర్యలు ఫ కార్మికుల వేలిముద్రలు ‘అఫిస్’లో నమోదు ఫ పోలీసుల క్లియరెన్స్లేనిదే పనిలో పెట్టుకోవద్దు ఫ యజమానులకు ఎస్పీ ఆదేశాలుయజమానులు కొత్తవారిని పనిలో పెట్టుకునే ముందు పోలీస్ క్లియరెన్స్ తీసుకోవాలి. వివిధ రాష్ట్రాల నుంచి పనుల కోసం వస్తున్న వారిని ఎలాంటి విచారణ లేకుండా పనిలో పెట్టుకోవద్దు. ప్రధానంగా ఇళ్లలో, వ్యాపార సంస్థల్లో అపరిచితులను, ఇతర ప్రాంతాల వారిని పనిలో పెట్టుకునే ముందు అప్రమత్తంగా ఉండాలి. – ఎం.రమేష్‌కుమార్, ఇన్స్పెక్టర్, భువనగిరి -
ముగిసిన ఇళ్ల గుర్తింపు
ప్రజలు ఇచ్చే వ్యక్తిగత వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. జిల్లా అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో ఈ గణాంకాలు కీలకమని, అందుకే ప్రజలందరూ ఎన్యూమరేటర్లకు సహకరించి కచ్చితమైన సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు. భువనగిరిటౌన్ : జిల్లాలో 16వ జనగణన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సారి జనగణనను పూర్తిస్థాయిలో డిజిటల్ పద్ధతిలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నెల రోజుల పాటు కొనసాగే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ఇళ్ల గుర్తింపు ప్రక్రియను ఎన్యూమరేటర్లు చేపట్టారు. 14 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించనున్నారు. వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా అక్కడికక్కడే నమోదు చేయనున్నారు. ఇవి సిద్ధంగా ఉంచుకోవాలి జనగణన అధికారులు ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు వారికి పూర్తి వివరాలు అందించడంతో పాటు ప్రక్రియ వేగంగా పూర్తి కావడానికి తగిన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, మొబైల్ నంబర్, వయస్సు, చిరునామా దృవీకరణ కోసం ఓటర్ ఐడీ లేదా రేషన్ కార్డు. నివాస గృహం వివరాలు (సొంతమా? అద్దెదా?), ఇంట్లోని మౌలిక సదుపాయాలు (విద్యుత్, గ్యాస్, మరుగుదొడ్డి, ఇంటర్నెట్ మొదలైనవి), కుటుంబ సభ్యుల విద్యార్హతలు, వృత్తి లేదా వ్యాపారం వివరాలు. 6381 మంది స్వీయగణన జనగణన కోసం ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్లు ప్రజలు చెప్పే వివరాల కోసం వేచి చూడకుండా, ప్రభుత్వ పోర్టల్ ద్వారా తమ వివరాలను తామే నమోదు చేసుకునే సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు కేంద్ర ప్రభుత్వం ఈనెల 10వ తేదీ వరకు అవకాశం కల్పించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 6381 మంది స్వీయగణన చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వారు తమకు లభించిన ఎస్ఈ ఐడీని ఎన్యూమరేటర్లకు చూపిస్తే సరిపోతుంది.ఫ నేటి నుంచి గృహ గణన ఫ ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించనున్న ఎన్యూమరేటర్లు -
ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి
ఆత్మకూరు(ఎం) : జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా అమలవుతున్న పలు అభివృద్ధి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరి డాక్టర్ మూనా యాస్మిన్ అన్నారు. బుధవారం మండలంలోని సర్వేపల్లి గ్రామాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోనే మొట్టమొదటిగా నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని ఆమె పరిశీలించారు. ఈ భవనం ఎందుకు నిర్మించుకున్నారని మహిళలను ప్రశ్నించారు. గతంలో సమ భావన సంఘాల సభ్యులు చెట్లకింద, గ్రామపంచాయతీ కార్యాలయంలో సమావేశాలు నిర్వహించుకునేవారని, ప్రస్తుతం భవనం నిర్మించడంతో ప్రయోజనకరంగా ఉందని మహిళలు ఆమెకు వివరించారు. అనంతరం డిప్యూటీ సెక్రటరిని సర్పంచ్ కల్వకుంట్ల ఉపేందర్‌రెడ్డి శాలువాతో సన్మానించారు. ఆమె వెంట డీఆర్డీఓ నాగిరెడ్డి, అడిషనల్ డీఆర్డీఓ సురేష్, ఎంపీడీఓ రాములునాయక్, ఏపీఓ బి.రమేష్, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి రచ్చ పల్లవి, ఏపీఎం గోదాసు నర్సింహ, ఈసీ శ్రీనువాస్, పంచాయతీ కార్యదర్శి నరేష్, సీసీలు కొమురయ్య, హరిబాబు, వీఓఏ లావణ్య ఉన్నారు. మోటకొండూర్‌లో పర్యటన మోటకొండూర్ : కేంద్ర గ్రామీణాభివృద్ధి డిప్యూటీ సెక్రటరీ మూనా యాస్మిన్ బుధవారం మోటకొండూర్తో పాటు మండలంలోని మాటూర్, అమ్మనబోలు గ్రామాలలో పర్యటించారు. గ్రామాల్లో నర్సరీల నిర్వహణ, పీసీపీ వర్క్ , స్కూల్ టాయిలెట్స్, పీఎంజీఎస్‌వై రోడ్డులను పరిశీలించారు. డ్వాక్రా రుణంతో కొనుగోలు చేసిన ఆటో, పిండి గిర్నీని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఎంపీడీఓ ఇందిర, ఎంపీఓ చంద్రశేఖర్, ఈసీ గోవర్ధన్, సర్పంచ్‌లు భూమండ్ల జయమ్మ, జెన్నె సిద్దులు ఉన్నారు. ఫ కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ డిప్యూటీ సెక్రటరి మూనా యాస్మిన్ -
కేవీలో అడ్మిషన్లకు దరఖాస్తులు
భువనగిరి : పట్టణంలోని కేంద్రియ విద్యాలయంలో 5, 7వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ చంద్రమౌళి బుధవారం ఒక ప్రకనలో తెలిపారు. 5వ తరగతిలో 3, 7వ తరగతిలో 3 సీట్లు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారుల పిల్లలకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 15 లోగా వెబ్సైట్ ద్వారా లేదా నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పాలిసెట్‌కు 94 శాతం హాజరుభువనగిరి : పాలిసెట్–2026 పరీక్ష జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రశాంతంగా జరిగింది. పరీక్ష నిర్వహణకు మొత్తం 6 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరిగింది. మొత్తం 1,692 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1594 మంది హాజరయ్యారు. 98 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇందులో బాలురు 819, బాలికలు 775 మంది హాజరు కాగా 94.2 శాతం నమోదైంది. సంస్కరణలతో సవాళ్లకు పరిష్కారాలునల్లగొండ టూటౌన్ : సంస్కరణలతో సవాళ్లకు పరిష్కారాలు లభిస్తాయని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. బుధవారం ఎంజీ యూనివర్సిటీలో నిర్వహించిన విద్యా వారోత్సవాల్లో ఆయన మాట్లాడారు. విద్యారంగంలో నాణ్యత, నైపుణ్యం, పరిశోధన, సాంకేతికతల సమన్వయం ద్వారా మాత్రమే సమాజాభివృద్ధి సాధ్యమన్నారు. మారుతున్న కాలంలో భారతదేశానికి నిజమైన సంపద యువత అన్నారు. కార్యక్రమంలో వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. ఎన్జీలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభంరామగిరి(నల్గొండ): నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పరంగి రవికుమార్ తెలిపారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా బుధవారం అడ్మిషన్ బ్యానర్, పోస్టర్‌ను అధ్యాపకులతో కలిసి ఆవిష్కరించారు. దోస్త్ –2026 ఆన్లైన్ పోర్టల్ ద్వారా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సుల్లో చేరవచ్చన్నారు. కళాశాలలో ఆధునిక అవసరాలకు అనుగుణంగా డేటా సైన్స్, ఆర్టి ఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, బిజినెస్ అనలిటిక్స్ వంటి రీస్ట్రక్చర్డ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నెల 14న సీట్ల కేటాయింపు ఉంటుందని, 15 నుంచి 23 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలన్నారు. వివరాలకు కోఆర్డినేటర్ (9989897566), టెక్నికల్ అసిస్టెంట్ 9985824737 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
విద్య, వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం
సాక్షి యాదాద్రి : రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకే అంతర్జాతీయ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్‌స్కూల్స్ నిర్మిస్తున్నదని, వీటిలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన అందుబాటులో ఉంటుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి విద్యా వారోత్సవాల వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. జూన్ 2 నుంచి ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థులందరికీ ఉదయాన్నే అల్పాహారం, పాలు, రాగిజావ వంటివి అందించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగిందని, పదో తరగతి ఫలితాల్లో సైతం విద్యార్థులు ప్రైవేటుకు దీటుగా రాణించడం గర్వకారణమన్నారు. కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో జరుగుతున్న జనగణనలో ప్రజలందరూ ఎన్యూమరేటర్లకు సహకరించాలని సూచించారు. అనంతరం ‘అమ్మ ఆదర్శ పాఠశాల‘ కమిటీ చైర్ పర్సన్లను ఎమ్మెల్యే, అధికారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, డీఈఓ కె. సత్యనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీవాణి, వైస్ చైర్పర్సన్ పోతంశెట్టి మంజుల, సర్పంచ్‌లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నర్సింగ్ కళాశాల భవనానికి శంకుస్థాపన భువనగిరి : మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామ పరిధిలో రూ.26 కోట్లతో చేపడుతున్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవన నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల భవన నిర్మాణం పూర్తయితే స్థానిక యువతకు ఉన్నత విద్యతో పాటు విస్తృతంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. భవిష్యత్తులో భువనగిరి ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందే అవకాశం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ స్వరాజ్యలక్ష్మి, సర్పంచ్ రాంపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.ఫ నాణ్యమైన విద్యకోసమే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఫ భువనగిరి ఎమ్మెల్యే అనిల్‌కుమార్ రెడ్డి -
వైటీపీఎస్‌లో మూడో యూనిట్ సీఓడీ విజయవంతం
మిర్యాలగూడ : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని చేపట్టిన 4వేల మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్‌లో ఇప్పటికే మూడు యూనిట్ల ద్వారా 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని అందిస్తుండగా తాజాగా మూడో యూనిట్ బుధవారం రాత్రి వరకుకమర్షియల్ ఆపరేషన్ డేట్ (సీఓడీ)ని 72 గంటల్లో విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీంతో యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచి నాలుగు యూనిట్ల ద్వారా 3200 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది. పవర్ ప్లాంట్‌లో మొత్తం ఐదు యూనిట్లు ఉండగా ఒక్కో యూనిట్ ద్వారా 800 మెగావాట్లతో 4వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్లాంట్‌లో ఇప్పటి వరకు 1, 2, 4వ యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం మూడవ యూనిట్ పూర్తి కావడంతో మొత్తం నాలుగు యూనిట్ల ద్వారా 3200 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. మరో యూనిట్ పనులు పూర్తి కావాల్సి ఉంది. పవర్ ప్లాంట్‌లో మూడో యూనిట్ 72గంటల పాటు సీఓడీని విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో టీజీ జెన్కో సీఎండీ ఎస్.హరీష్, సీఈలు రమేష్‌బాబు, సురేష్‌వర్మ బుధవారం రాత్రి ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ట్రాక్టర్ ఢీకొని రైతు మృతి
రామగిరి(నల్లగొండ) : ట్రాక్టర్ ఢీకొని రైతు మృతిచెందాడు. ఈ ఘటన నల్లగొండ మండలం వెలుగుపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెలుగుపల్లి గ్రామానికి చెందిన బెలిదె శ్రీనివాస్(49) వ్యవసాయ పనులు ముగించుకుని స్కూటీపై ఇంటికి తిరిగి వెళ్తుండగా.. గ్రామంలోని సెంటర్ వద్ద నల్లగొండ వైపు వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదాబాబు తెలిపారు. చికిత్స పొందుతూ..పెన్‌పహాడ్ : అప్పుల బాధతో పురుగుల మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. పెన్‌పహాడ్ మండలం చినసీతారాంతండాకు చెందిన బాణోతు దస్రు(45) మినీ బోర్వెల్ కొనుగోలు చేసి దానిని నడపటానికి అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేక మనోవేదనకు గురై ఈ నెల 8న రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగాడు. విషయం భార్యకు చెప్పడంతో ఆమె వెంటనే దస్రును సూర్యాపేట ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి కుమారుడు బాణోతు సాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపారు. హోటళ్లలో ఫుడ్‌సేఫ్టీ అధికారి తనిఖీలునాంపల్లి : మండల కేంద్రంలోని పలు రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల్లో బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్. శివశంకర్‌రెడ్డి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 40 కిలోల కుళ్లిన మాంసం, 30 కిలోల పాడైన అన్నం, పెరుగు, అల్లం పేస్ట్, కృత్రిమ రంగులు, గడువు ముగిసిన మసాలాలను స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. అంతేకాకుండా కొన్ని హోటళ్లు ఫుడ్ లైసెన్స్ సర్టిఫికెట్ ప్రదర్శించడంలేదని గుర్తించారు. పలు ఆహార నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు. అనంతరం రోడ్డు పక్కన ఐదుగురు వ్యాపారులు విక్రయిస్తున్న మామిడి పండ్లను తనిఖీ చేశారు. కొందరు ఎన్‌రైప్, గోల్డ్రైప్ సాచెట్లను వినియోగించి మామిడి పండ్లను మగ్గబెడుతున్నట్లు గుర్తించారు. -
దైవాన్ని తోడుగా చేసుకొని ముందుకు సాగాలి
త్రిపురారం : ప్రతిఒక్కరూ తమ జీవితంలో దైవాన్ని తోడుగా చేసుకొని ముందుకు సాగాలని, తల్లి, తండ్రి, గరువు, దైవం ఆశీస్సులు ఉన్నప్పుడే మనిషి జీవితం సార్థకమవుతుందని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. త్రిపురారం మండలంలోని బొర్రాయిపాలెం గ్రామంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ, 16 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి త్రిదండి చినజీయర్ స్వామి ముఖ్యఅతిథిగా హాజరై మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డితో కలసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చినజీయర్ స్వామి వేంకటేశ్వర స్వామి వైభవం, ఆధ్యాత్మిక విషయాలు, ఆంజనేయస్వామి ప్రవచనాలను చెప్పారు. అంతకుముందు చినజీయర్ స్వామికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చైర్మన్ బిట్టు వసంతరవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఫ త్రిదండి చినజీయర్ స్వామి -
కాలుష్య కంపెనీలపై చర్యలు తీసుకోవాలి
భూదాన్‌పోచంపల్లి : ప్రజల జీవనాన్ని దెబ్బతీస్తున్న కాలుష్య కారక కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ప్రముఖ పర్యావరణవేత్త కుంభం పురుషోత్తంరెడ్డి కోరారు. భూదాన్‌పోచంపల్లి మండలం అంతమ్మగూడెంలో బుధవారం కంపెనీల కాలుష్యం నుంచి కాపాడాలని కోరుతూ అంతమ్మగూడెం కాలుష్య విముక్తి పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిబిరాన్ని పురుషోత్తంరెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన ప్రజల ప్రాథమిక హక్కులను హరించే కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు గతంలో సుప్రీంకోర్టు అనేక తీర్పులిచ్చిందని గుర్తుచేశారు. నష్టపరిహారం చెల్లించడంతో పాటు వారి ఆరోగ్య పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక హెజెలో కంపెనీ అత్యంత విషపూరితమైన పాస్జీన్ వాయువును గాలిలోకి విడుదల చేస్తుండం ఆందోళనకరమని అన్నారు. ఈ వాయువును పీల్చడం వల్ల క్రమంగా మనుషులు ప్రాణాలు కోల్పోతారని, గాలి, నీరు, నేలను కాలుష్యం చేస్తున్న కంపెనీలను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అంతమ్మగూడెం కాలుష్య విముక్తి పోరాట సమితి అధ్యక్షుడు గుమ్మి దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. రసాయన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు 32 సార్లు పిటిషన్ ఇచ్చామని, కానీ నేటికీ న్యాయం జరగలేదని అన్నారు. కంపెనీల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.52వేల పరిహారం చెల్లించాలని, గ్రామంలో గాలిలో ఉన్న కాలుష్యాన్ని నిర్ధారించే యంత్రాన్ని, ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని, తాగు, సాగునీటిని అందించాలని, రసాయన కంపెనీలను తరలించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్తలు ఇంద్రసేనారెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, పాకనాటి దామోదర్‌రెడ్డి, గ్రామ పోరాట సమితి నాయకులు గుమ్మి నరేందర్‌రెడ్డి, వస్పరి ప్రభ, రావుల రాంరెడ్డి, రేణుక, గుర్రం రాంచంద్రారెడ్డి, రావుల శశికిరణ్, నర్సిరెడ్డి, బాల్‌రెడ్డి, మహేశ్, శివరాజు, రమేశ్, లింగమ్మ, జంగమ్మ, కలమ్మ, ధనలక్ష్మి, ముత్తమ్మ, సురేందర్‌రెడ్డి, పకీరు పాల్గొన్నారు. ఫ పర్యావరణవేత్త కుంభం పురుషోత్తంరెడ్డి -
ఐఎఫ్ఎస్ ర్యాంకర్‌ను అభినందించిన డీజీపీ
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ యాదగిరి కుమార్తె చల్లా యామిని ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఆలిండియా ఫారెస్ట్ సర్వీస్‌లో 119వ ర్యాంకు సాధించింది. బుధవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో చల్లా యామినిని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్, లా అండ్ ఆర్డర్ డీజీపీ మహేష్ భగవత్ సన్మానించి అభినందించారు. కానిస్టేబుల్ కుమార్తె కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగం సాధించడం గర్వకారణమన్నారు. మందుబాబులకు జైలు శిక్ష, జరిమానాసూర్యాపేటటౌన్ : సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఆరుగురిని బుధవారం సూర్యాపేట కోర్టులో హాజరుపర్చినట్లు ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తెలిపారు. వారిలో ఒకరికి 2 రోజుల జైలు శిక్ష, రూ.2,000 జరిమానా, మరో ఐదుగురికి కలిపి రూ.2,600 జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ గోపు రజిత తీర్పు వెలువరించినట్లు పేర్కొన్నారు. బాలుడి అదృశ్యంమిర్యాలగూడ టౌన్ : ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు అదృశ్యమయ్యాడు. వివరాలు.. మిర్యాలగూడ పట్టణంలోని 19వ వార్డు ముత్తిరెడ్డికుంటకు చెందిన దేవరపల్లి లలిత, వేణు దంపతుల కుమారుడు శ్యాం పట్టణంలోని వినోభానగర్‌లో గల సెయింట్ మేరీ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం ఆడుకునేందుకు ఇంటి నుంచి వెళ్లిన శ్యాం తిరిగి రాలేదు. బాలుడి కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో అతడి దేవరపల్లి లలిత బుధవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగభూషణం తెలిపారు. ఈ బాలుడి ఆచూకీ తెలిస్తే 87126 70149 నంబర్‌కు సమాచారం అందించాలని సీఐ సూచించారు. -
జిత్తులమారి నక్క
ఫ ఎండల్లో హాయ్ హాయ్బామ్మ చెప్పిన నీతి కథ వేసవి సెలవుల్లో మా బామ్మ నాకు, మా చెల్లికి అనేక నీతి కథలు చెబుతూ మమ్మల్ని నిద్రపుచ్చేది. అందులో మాకు ఈ రెండు కథలు నచ్చాయి. వాటిని మీతో పంచుకుంటున్నాం. నల్లగొండ : చీమలు దూరని చిట్టడవిలో తిమ్మరాజు అనే జిత్తులమారి నక్క ఉండేది. అసలు కష్టపడకుండా మిగతా జంతువులను మోసం చేస్తూ కాలం గడిపేది. దాని మోసాన్ని గ్రహించిన మిగతా జంతువులు దానికి ఆహారం దక్కకుండా చేశాయి. కష్టపడడం చేతగాని ఆ నక్క ఆకులు తింటూ ఉండేది. కొన్నాళ్లకు బక్కచిక్కిపోయి నడవలేని స్థితికి వచ్చింది. ఒక రోజు ఆ మార్గంలో వెళ్తున్న పిల్లికి బక్కచిక్కిన నక్క కనిపించింది. అదేంటి నక్క బావా ఇలా బక్కచిక్కిపోయావు అని నక్కను పిల్లి అడిగింది. తన కష్టాన్ని చెప్పుకుంది నక్క. ఈ దగ్గరలో ఒక విందు ఉంది నేను వెళ్తున్నాను. నువ్వు వస్తే ఎవరి కంటపడకుండా కడుపునిండా తిని వద్దాం అని సలహా ఇచ్చింది. పిల్లితో వెళ్లిన నక్క అక్కడ ఆహారాన్ని కడుపునిండా తిని.. పిల్లిని ఇంటివాళ్లకు పట్టించాలనే ఉద్దేశంతో పెద్దగా ఊల పెట్టింది. ఇంతలో ఇంటి వాళ్లు వచ్చి పిల్లిని, నక్కను బంధించారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న పిల్లి ప్రాణాలతో బయటపడింది. పుష్టిగా తిన్న నక్క పరుగుపెట్టలేక వారి చేతిలో చావుదెబ్బలు తిన్నతి. నీతి : మంచి చేసే వారికి చెడు తలపెట్టాలని చూస్తే మనకే చెడు జరుగుతుంది. – మాయ్రా విఖార్, 4వ తరగతి, మాంట్‌ఫోర్ట్ స్కూల్, నల్లగొండ ఐకమత్యమే మహా బలం నల్లగొండ : ఒక ఊరి చివర పచ్చని మైదానంలో నాలుగు ఆవులు ఎంతో స్నేహంగా ఉండేవి. కలిసి గడ్డి మేయడం, కలిసి తిరగడం చేసేవి. ఇవి ఎప్పుడూ కలిసి మెలసి గుంపులుగా ఉండేవి. కాబట్టి పులి, సింహాలు వీటి జోలికి రాకపోయేవి. కొంత కాలానికి ఏదో విషయంలో వాటి మధ్య దెబ్బలాట జరిగి నాలుగు ఆవులు నాలుగు వైపులా గడ్డి మేయడానికి వెళ్లాయి. ఇదే సరైన సమయమని పులి, సింహం పొదల్లో దాక్కొని ఒక్కొక్క ఆవును దానిని చంపి తిన్నాయి. నీతి : మనం ఐకమత్యంగా ఉంటే ఎవరూ మనల్ని ఏమీ చేయలేదు. ఎప్పుడైతే మన ఐకమత్యం దెబ్బతింటుందో మన బలం తగ్గుతుంది. – జాయ్రా విఖార్, 2వ తరగతి, మాంట్‌ఫోర్ట్ స్కూల్, నల్లగొండ -
చెక్కుల పంపిణీలో రసాభాస
ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసాభాస చోటుచేసుకుంది. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతుండగా.. మధ్యలో బీఆర్ఎస్ నాయకులు జోక్యం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పాడి రైతులు అప్పుల పాలయ్యారని వాదించారు. మాజీ మదర్ డైయిరీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సభలో కాంగ్రెస్ నాయకులు తప్ప రైతులు ఉన్నారా అని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే లేచి ఇక్కడికి వచ్చిన వారందరూ రైతులే ఉన్నారు. నాయకులు ఎవ్వరూ కూడా లేరన్నారు. మీరు రైతులను అమానిస్తున్నారని, వెంటనే రైతులకు శ్రీకర్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని వాదించారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య కొద్దిపాటి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని ఎవరి సీటులో వారిని కూర్చోబెట్టారు. -
ఎన్డీడీబీ ఒప్పందంతో పాడి రైతులకు మేలు
ఆలేరురూరల్ : రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ)కు నార్ముల్(మదర్ డెయిరీ) మధ్య జరిగిన ఒప్పందంతో పాడి రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. బుధవారం ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక పాల శీతలీకరణ కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్డీడీబీ ద్వారా మంజూరైన రూ.10 కోట్ల ఆర్థికసాయాన్ని చెక్కుల రూపంలో పాడి రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమ అభివృద్ధికి, పాడి రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పాల రైతులు ఆర్థికంగా బలపడాలంటే పాల ఉత్పత్తి రంగాన్ని ఆధునీకరించడం అత్యంత అవసరమన్నారు. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నార్ముల్(మదర్ డెయిరీ)కి మొత్తం 311 సొసైటీలు ఉన్నాయని, ఒకప్పుడు విస్తృతంగా పాల వ్యాపారం సాగించిన మదర్ డెయిరీ ఇటీవల భారీ నష్టాల్లో వెళ్లిందని అన్నారు. ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి తీసుకున్న లోన్లు పెరిగిపోవడంతో రైతులకు పాల బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మొత్తంగా రూ.70 కోట్లు అప్పుల్లో కూరుకుపోయి వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చిందన్నారు. బిల్లులు రాక రైతులు ప్రైవేట్ డెయిరీలకు మారిపోయారన్నారు. డెయిరీని గట్టెక్కించేందుకు మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఆశ్రయించడంతో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు గుజరాత్ వెళ్లి ఎన్డీడీబీ చైర్మన్ మనీశ్ షా సహకారంతో ఒప్పందం జరిగిందన్నారు. దీంతో మదర్ డెయిరీ 15 సంవత్సరాలు ఎన్డీడీబీ ఆధీనంలో ఉంటుందన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు, బ్యాంకు అప్పులు కలిపి రూ.70 కోట్లు చెల్లించేందుకు అంగీకారం కుదిరిందన్నారు. రైతుల నుంచి పాల సేకరణ బాధ్యత మదర్ డెయిరీదే కాగా, ప్రొసెసింగ్తో పాటు పాల ఉత్పత్తుల నిర్వహణను ఎన్డీడీబీ ఆధ్వర్యంలోని ఢిల్లీ మదర్ డెయిరీ చూసుకుంటుందని తెలిపారు. సేకరించిన ప్రతి లీటర్ పాలకు మదర్ డెయిరీకి రూ.6.50 కమీషన్ ఇవ్వనుందన్నారు. ఈ నిధులతో పాల సేకరణ కేంద్రాల విస్తరణ, శీతలీకరణ కేంద్రాల ఆధునీకరణ, పాడి పరిశ్రమ విస్తరణ, పెండింగ్ బిల్లులు చెల్లింపులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మదర్ డెయిరీ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి, జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్లు, పాల సంఘం చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
ఉపాధి హామీ పథకంతో నీటి సంరక్షణ
భువనగిరి: ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులు నీటి సంరక్షణకు ఎంతో దోహదపడుతాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ డాక్టర్ మోనా యాస్మిన్ అన్నారు. మంగళవారం భువనగిరి మండలంలోని హన్మాపురం, తాజ్పూర్ గ్రామాలలో ఉపాధి హామీ పనులను వాటి నాణ్యతను పరిశీలించారు. ఉపాధి హామీ పథకం పనుల అమలులో నిబంధనలు తప్పనిసరిగా పాటించి ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరేలా కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. అంతకు ముందు ఇంకుడు గుంతలు, ఏరియా ఆఫీసర్ యాప్ లో నమోదు చేసిన ఫొటోలను పరిశీలించారు. ఈకార్యక్రమంలో డీఆర్డీఓ నాగిరెడ్డి, అడిషనల్ డీఆర్డీఓ జంగారెడ్డి, ఏపీడీ నవీన్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు ర్యాకల సంతోషశ్రీనివాస్, నాయిని సువర్ణకృష్ణ, ఎంపీఓ దినకర్ సిబ్బంది ఉన్నారు. మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలి భూదాన్‌పోచంపల్లి: ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ డిప్యూటీ సెక్రటరీ డాక్టర్ మోనా యాసిన్ సూచించారు. మంగళవారం సాయంత్రం ఆమె పోచంపల్లి మండలంలోని గౌస్‌కొండ, శివారెడ్డిగూడెం గ్రామాలను సందర్శించారు. గౌస్‌కొండలో మహిళ సంఘాలకు సబ్సిడీపై అందజేసిన ప్యాడీ క్లీనర్లను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద శివారెడ్డిగూడెం, దంతూర్ గ్రామాల మధ్యన చిన్నేటిపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణం వల్ల ఎన్ని గ్రామాలకు ఉపయోగకరంగా ఉంటుందని, పనుల్లో జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సర్పంచ్ బొక్క మల్లారెడ్డి ఆమెను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ నాగిరెడ్డి, భాస్కర్, అడిషనల్ డీఆర్డీఓ సురేశ్, కోట జంగారెడ్డి, డీఈ ప్రసాద్, ఏపీఎం తౌర్యానాయక్, ఏపీఓ కృష్ణమూర్తి, పీఆర్ ఏఈ జగపతిబాబు, ఉపసర్పంచ్ వాకిటి బాల్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు హరిత, రజిత, సీసీ మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.ఫ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ మోనా యాస్మిన్ -
లక్ష తమలపాకులతో సహస్ర నామార్చన
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను అర్చకులు మంగళవారం విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంలోని ఆంజనేయస్వామికి అర్చకులు అంతరంగింకంగా సంప్రదాయ పూజలు జరిపించారు. అనంతరం కొండపై విష్ణు పుష్కరిణి వద్ద, అనుబంధ పాతగుట్ట ఆలయాల్లో క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి అష్టోత్తర శతమన్యుసూక్త పారాయణాలతో అభిషేకం చేశారు. శ్రీస్వామి వారికి సింధూరంతో విశేషంగా అలంకరించి, లక్ష తమలపాకులతో నాగవళ్లీ (తమలపాకుల)లతో సహస్ర నామార్చన నిర్వహించారు. తరువాత హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేపట్టి, వేద పఠనం చేశారు. శ్రీస్వామి వేడుకల్లో ఈఓ భవానీ శంకర్, భక్తులు పాల్గొన్నారు. -
క్రీడల్లోనూ రాణించాలి
భువనగిరి: విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అన్నారు. మంగళవారం భువనగిరి పట్టణంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, నల్లగొండ క్రికెట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. వేసవిలో సమయాన్ని వృథా చేయకుండా క్రీడల్లో పాల్గొని తన ప్రతిభను ప్రదర్శించాలని సూచించారు. వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ టి. శ్రీవాణి, నిర్వాహకులు అమీనుద్దీన్, అబోతుల కేతన్, సతీష్, ఇబ్రహీం పాల్గొన్నారు. సేవలకు ప్రతిరూపం నర్సులుభువనగిరి: సేవలకు ప్రతిరూపం నర్సులు అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆస్పత్రిలో రోగులకు నర్సులు అందించే సేవలు వెలకట్టలేనిదన్నారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నర్సింగ్ అధికారులను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో డిప్యూటి డీఎంహెచ్ఓ డాక్టర్ యశోద, ప్రోగ్రాం ఆఫీసర్లు వీణ, రామకృష్ణ, డిప్యూటీ డెమో పద్మసత్యవతి, సిబ్బంది పాల్గొన్నారు. యాదగిరీశుడి క్షేత్రంలో గజవాహన సేవ యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గజవాహన సేవను వైభవంగా జరిపించారు. మంగళవారం వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాత సేవను నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులకు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా పాలతో నిజాభిషేకం జరిపించి, సహస్ర నామార్చన , అష్టోత్తరం వంటి పూజలను చేపట్టారు. ఇక ప్రఽథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణ వేడుక, బ్రహ్మోత్సవాన్ని భక్తుల మధ్య జరిపించారు. సాయంత్రం వేళ జోడు సేవలను ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. శ్రీస్వామి వారికి నివేదన జరిగిన తరువాత పవళింపు సేవను నిర్వహించి, ద్వార బంధనం చేశారు. శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి కారణజన్ములుచౌటుప్పల్ : శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కారణజన్ములని శ్రీజగద్గురు శ్రీకాంతేంద్రస్వామీజీ తెలిపారు. చౌటుప్పల్‌లో నూతనంగా నిర్మించిన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో శ్రీగోవిందమాంబ సమేత జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు మంగళవారం రెండవరోజు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా వేడుకల్లో పాల్గొన్న శ్రీజగద్గురు శ్రీకాంతేంద్రస్వామీజీ.. పోతులూరి బాషణం చేశారు. చిన్నపాటి బ్యాక్టీరీయా నుంచి మానవ రూపం వరకు ఎన్నో కోట్ల జన్మలు పొందిన గొప్ప భగవత్ స్వరూపులని తెలిపారు. ఈ వేడుకల్లో మనుమయ సంఘం అధ్యక్షుడు పంతంగి మదనాచారి, స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కందుకూరి కిషోర్కుమార్చారి, దేవాలయ కమిటీ అధ్యక్షుడు పోలోజు శ్రీనివాసచారి, భక్తులు పాల్గొన్నారు. -
పది ఫెయిలైన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
ఆలేరు: పదో తరగతి ఫెయిలైన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిసారించాలని జిల్లా విద్యాధికారి సత్యనారాయణ సూచించారు. మంగళవారం ఆలేరు పట్టణంలోని పీఎంశ్రీ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి ఫెయిలైన విద్యార్థుల కోసం శిక్షణ తరగతులను డీఈఓ ప్రారంభించి మాట్లాడారు. ఒకట్రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్థులను అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నట్టు, ఇందు కోసం జిల్లాలో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను రెగ్యులర్‌గా తరగతులకు పంపించాలని కోరారు. సమ్మర్ క్రీడా శిబిరాల్లో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు చేరవచ్చన్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు సోషల్ మీడియా ప్రభావానికి గురికాకుండా సమ్మర్ క్యాంప్‌లను సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు చొరవ చూపాలని సూచించారు.అనంతరం పర్యావరణ పరిరక్షణ అంశంపై నిర్వహించిన చిత్రలేఖనం, డ్యాన్స్, నాటిక తదితర పోటీల్లో గెలిచిన విద్యార్థులకు డీఈఓ సర్టిఫికెట్లు అందజేశారు. పాఠశాల ఆవరణలో ఆయన మొక్కను నాటారు. ఎంఈఓ ఎర్ర లక్ష్మి,జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్, హెచ్ఎం దాసరి మంజుల, ఉపాధ్యాయులు సత్యనారాయణరెడ్డి, మేఘరాజు, తిరుపతి, పీడీ పూల నాగయ్య, పీఈటీ కవిత పాల్గొన్నారు.ఫ డీఈఓ సత్యనారాయణ -
నర్సింగ్ కళాశాలకు శాశ్వత భవనం
భువనగిరి: ప్రభుత్వ నర్సింగ్ కళాశాల శాశ్వత భవన నిర్మాణానికి అడుగు పడింది. భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెంలో కేటాయించిన 5 ఎకరాల స్థలంలో రూ. 26 కోట్లతో నిర్మించనున్న నూతన భవనానికి బుధవారం మంత్రులు భూమిపూజ చేయనున్నారు. ఏడాది కాలంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న కళాశాలకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేసింది. అద్దెభవనంలో.. ప్రభుత్వం 2024లో జిల్లాకు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను మంజూరు చేసింది. కళాశాల మంజూరు అయిన ఏడాదిలోనే కళాశాలలో అడ్మిషన్లుసైతం జరిగాయి. దీంతో అప్పటికప్పుడు పట్టణంలో అద్దె భవనంలో కళాశాలను నిర్వహించారు. ఇప్పటివరకు కళాశాలకు రెండు బ్యాచ్‌ల విద్యార్థులు వచ్చారు. బ్యాచ్‌కు 60 మంది చొప్పున అడ్మిషన్లు పొందుతున్నారు. ప్రస్తుతం కళాశాలలో 120మంది విద్యార్థులు ఉండటంతో అద్దె భవనంలో ఇబ్బందులు ఎదురుకావడంతో మరో అద్దె భవనంలోకి మారారు. జీప్లస్ 3 విధానంలో.. ప్రస్తుతం అద్దెభవనంలో విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు అద్దె చెల్లింపువిషయాన్ని దృష్టిలో పెట్టుకుని కళాశాల ప్రిన్సిపల్ పలుమార్లు శాశ్వత భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని విజ్ఞిప్తిచేశారు. ఉన్నత అధికారుల సహకారంతో చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం జిల్లాకు చెందిన నర్సింగ్ కళాశాల నూతన భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వడంతోపాటు రూ. 26కోట్లు మంజూరు చేసింది. దీంతో భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామ పరిధిలో 5 ఎకరాల స్థలాన్ని పరిశీలించి భవన నిర్మాణానికి అనువుగా ఉంటుందని భావించి అక్కడే కళాశాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే టెండర్లు పూర్తి కాగా టీజీఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో ఈ భవనాన్ని జీప్లస్ 3 విధానంలో నిర్మించనున్నారు. సంవత్సరం వరకు భవన నిర్మాణాన్ని పూర్తిచేయాల్సి ఉంటుంది. సుమారు 240 మంది విద్యార్థులు ఉండేలా భవన నిర్మాణాలు జరగనున్నాయి. ఏ బ్లాక్‌లో బోధన గదులు, బీ బ్లాక్‌లో హాస్టల్ వసతి గల భవనాలను నిర్మించనున్నారు. ఫ ముత్తిరెడ్డిగూడెం గ్రామ పరిధిలో 5 ఎకరాల స్థలం కేటాయింపు ఫ భవన నిర్మాణానికి రూ. 26 కోట్లు మంజూరు ఫ నేడు మంత్రుల చేతులమీదుగా శంకు స్థాపన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణాకి బుధవారం శంకు స్థాపన చేయనున్నారు. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి హాజరు కానున్నారు. -
ధాన్యం దిగుమతిలో జాప్యం చేయవద్దు
సాక్షి, యాదాద్రి : కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం దిగుమతిలో జాప్యం చేయవద్దని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి ..ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ధనసరి అనసూయ (సీతక్క), అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు.కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని తక్షణమే కాంటా వేయాలన్నారు.తూకం పూర్తయిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలను పూర్తి చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద, మిల్లుల వద్ద హమాలీల కొరత లేకుండా చూడాలన్నారు. ధాన్యం రవాణాలో జాప్యం జరగకుండా కాంట్రాక్టర్లతో మాట్లాడి అదనపు లారీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రం, మిల్లు వద్ద ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామని వారు రోజూ నివేదికను సమర్పించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ నాగిరెడ్డి, జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ హరికృష్ణ, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి రోజా రాణి, జిల్లా కో–ఆపరేటివ్ అధికారి మురళి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
నిర్దేశిత గడువులోగా పనులు
సాక్షి, యాదాద్రి : గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ఆదేశించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్‌కు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం, స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ పనుల ప్రగతిపై ఆయన సమీక్షించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ రూల్ 2026 అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ముఖ్యకార్యనిర్వహణాధికారి శోభారాణి, డీఆర్డీఓ నాగిరెడ్డి , డీఆర్ఓ జయమ్మ, డీపీఓ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్ , వివిధ మండలాల ప్రత్యేక అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన భువనగిరి(బీబీనగర్): బీబీనగర్ మండల పరిధిలోని కొండమడుగు గ్రామ పంచాయతీ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు మంగళవారం పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో తాగునీరు, విద్యుత్, రోడ్ల సౌకర్యాలు కల్పించాలని అధికారులను అదేశించారు. మౌలిక వసతుల పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట హౌసింగ్ కార్పొరేషన్ పీడీ అలివేలు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ రవికిరణ్, రాకేష్‌కుమార్, ఏఈ గీత, తహసీల్దార్, ఎంపీడీఓలు శ్రీనివాస్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఫ అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు -
డెస్టినేషన్ వెడ్డింగ్‌కు కేంద్రంగా సాగర్
నాగార్జునసాగర్ : సాగర్‌ను దేశంలోనే మొదటి డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రంగా, బుద్ధవనాన్ని మరో తిరుపతిలా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి తెలిపారు. తన కుటుంబ సభ్యులతో కలిసి రెండు రోజులుగా నాగార్జునసాగర్‌లో పర్యటిస్తున్న ఆయన మంగళవారం లాంచీలో నాగార్జునకొండకు చేరుకుని పురావస్తు మ్యూజియాన్ని సందర్శించారు. అనంతరం నాగార్జునకొండపై పునర్నిర్మితమైన అశ్వమేధ యజ్ఞశాల, మహాస్థూపం, సింహళ విహారాలను పరిశీలించి వాటి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వదేశీ దర్శన్ పథకం కింద బుద్ధవనం పరిసర ప్రాంతాల అభివృద్ధికి సుమారు రూ.500కోట్లతో ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు. నాగార్జునకొండ పక్కనే గల చాకలి గట్టును అభివృద్ధి చేయడంతో పాటు హౌస్ బోట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. 20 నుంచి 30మంది పర్యాటకులు ప్రయాణించేలా ఆధునిక సౌకర్యాలతో బోట్లను త్వరలో అందుబాటులోకి తీసుకరానున్నట్లు పేర్కొన్నారు. వారికి టూరిజం గైడ్ సత్యనారాయణ నాగార్జునసాగర్, నాగార్జున కొండ మ్యూజియం చారిత్రక ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో టూరిజం డీఈ శ్రీనివాసరెడ్డి, బుద్ధవనం ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, హరిత విజయవిహార్ మేనేజర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఫ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి -
అట్రాసిటి కేసులో ఇద్దరికి జైలుశిక్ష
రామగిరి(నల్లగొండ): అట్రాసిటి కేసులో ఇద్దరికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి ఎన్. రోజారమణి మంగళవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. చందంపేట మండలం గన్నెపల్లి గ్రామానికి చెందిన నక్క పర్వతాలు డిండి మండలానికి చెందిన ఓ యువతితో పరిచయం పెంచుకుని మాయమాటలు చెప్పి ఆమెను శారీరకంగా లోబర్చుకున్నారు. తనను వివాహం చేసుకోవాలని యువతి కోరగా.. పెళ్లికి నిరాకరించడంతో పాటు పర్వతాలు, అతడి అత్త నీలం సత్తమ్మ కలిసి యువతిని కులం పేరుతో దూషించారు. దీంతో సదరు యువతి 2013లో డిండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నర్సింహ వాదనలతో ఏకీభవించిన జడ్జి ఎన్. రోజారమణి.. నిందితులు నక్క పర్వతాలుకు పలు సెక్షన్ల కింద 11 ఏళ్ల జైలుశిక్ష, రూ.500 జరిమానా, నీలం సత్తమ్మకు ఐదేళ్ల జైలుశిక్ష, రూ.3వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు కానున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. చెక్‌డ్యాంలో పడి ఎద్దు మృతిఅడ్డగూడూరు : మండల పరిధిలోని చిన్నపడిశాల గ్రామంలో బిక్కేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం నీళ్లలో పడి ఎద్దు మృతిచెందింది. ఈ ఘటన మంగళవారం జరిగింది. వివరాలు.. అడ్డగూడూరు మండలం జానకీపురం గ్రామనికి చెందిన గోడిశాల సోమయ్య ఎద్దు చెక్‌డ్యాంలో నీళ్లు తాగడానికి వెళ్లి ప్రమాదవాశాత్తు నీట మునిగి మృతిచెందింది. ఎద్దు విలువ సూమారు రూ.80వేలు ఉంటుందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు. వ్యక్తి అదృశ్యంకొండమల్లేపల్లి : భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. వివరాలు.. కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చెందిన గండూరి రఘుకుమార్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన తన భార్యతో గొడవ పడి సోమవారం రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. ఎంత వెతికినా రఘుకుమార్ ఆచూకీ లభించకపోవడంతో అతడి భార్య శైలజ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూదరుల అరెస్ట్ చిలుకూరు : మండలంలోని ఆర్లెగూడెం గ్రామ శివారులో పేకాట స్థావరంపై మంగళవారం సూర్యాపేట జిల్లా స్పెషల్ బ్రాంచి పోలీసులు దాడి చేపి నలుగురిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు పోలీసులను చూసి పారిపోయారు. పట్టుబడిన వారి నుంచి రూ.6500 నగదు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బైక్ చోరీ నాగారం : ఎరువుల దుకాణం ముందు పార్కింగ్ చేసిన బైక్ చోరీకి గురైంది. ఈ ఘటన నాగారం మండలం నాగారం బంగ్లాలో సోమవారం రాత్రి జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం మండల కేంద్రంలో వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ)గా పనిచేస్తున్న ఎన్. సాయిరాజ్ సోమవారం సాయంత్రం విధులు ముగించుకొని పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని మన గ్రోమోర్ ఎరువుల దుకాణం ముందు తన బైక్‌ను పార్కింగ్ చేసి వెళ్లాడు. మంగళవారం ఉదయం వచ్చి చూడగా బైక్ కనిపించలేదు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణంలో మామిడి పండ్లు విక్రయిస్తున్న బండ్లు, వాహనాలను మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల సందర్భంగా మామిడి పండ్లు మగ్గుబెట్టేందుకు వ్యాపారులు గోల్డ్ రైప్, ఎన్ రైప్ వంటి ఇథిలీన్ గ్యాస్ విడుదల చేసే సాచెట్లను వినియోగిస్తున్నట్లు గుర్తించామని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్. శివశంకర్‌రెడ్డి తెలిపారు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా ఇథిలీన్ వినియోగం అనుమతించబడిన విధానమని తెలిపారు. రెండు మామిడి పండ్లను సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపినట్లు వివరించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చౌటుప్పల్ : మండలంలోని తూప్రాన్‌పేట గ్రామ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూప్రాన్‌పేట గ్రామానికి చెందిన బక్కతట్ల జంగయ్య(57) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పని నిమిత్తం మంగళవారం ద్విచక్ర వాహనంపై హైదరాబాద్‌కు బయల్దేరాడు. ఈ క్రమంలో గ్రామ శివారులోని భాస్కర్ ఆగ్రో కెమికల్ పరిశ్రమ వద్దకు వెళ్లగానే గుర్తుతెలియని బిచ్చగాడు అకస్మాత్తుగా వచ్చి బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో బైక్ నడుపుతున్న జంగయ్య ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. బిచ్చగాడికి సైతం గాయాలయ్యాయి. మృతుడి కుమారుడు నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. చికిత్స పొందుతూ..చౌటుప్పల్ : బాత్రూంలో కాలుజారి కిందపడి తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని రత్నానగర్కాలనీకి చెందిన కొత్తూరు నరేందర్(62) కూలీ పనులు చేస్తుంటాడు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోని బాత్రూంలో ఆయన కాలుజారి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి కుమారుడు నాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. ఎయిమ్స్‌లో రక్తదాన శిబిరం భువనగిరి(బీబీనగర్) : అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బీబీనగర్ ఎయిమ్స్‌లో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. అంతకుముందు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ డాక్టర్ లత, మెడికల్ సూపరింటెండెంట్ కుల్దీప్ జీబీ, డిప్యూటీ డైరెక్టర్ రజనీస్ మిశ్రా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితా అగర్వాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మోదీ ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోవాలి
చౌటుప్పల్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఉచిత సలహాలు ఇవ్వడం మానుకొని విదేశీ వ్యవహారాలను చక్కదిద్దాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హితవు పలికారు. చౌటుప్పల్‌లో మంగళవారం నిర్వహించిన సీపీఎం జిల్లా విస్త్రతస్థాయి సమావేశానికి ఆయన హాజరై అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విదేశీ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తాయన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఉత్పత్తులతో పాటు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదలకు యుద్ధం కారణమైనప్పటికీ ఇందులో ప్రధానమంత్రి వైఫల్యం కూడా ఉందన్నారు. గతంలో చట్టసభల్లో చర్చలు జరుగుతున్నాయంటే ప్రజలకు ఎంతో మేలు జరిగేదని, ప్రస్తుతం చట్టసభలు ఏర్పాటు చేసి ప్రజలు సాధించుకున్న హక్కులను హరించేందుకు చట్ట సవరణలు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలోని 29చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్కోడ్లను అమలు చేస్తున్నారని, తద్వారా ప్రజల హక్కులపై దాడి జరిగిందన్నారు. డీలిమిటేషన్ పేరిట తమకు అనుకూలమైన ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను పెంచుకునేందుకు మహిళా బిల్లును బూచిగా పెట్టిందని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలలో మహిళలకు ఉచిత బస్సు మినహా ఇతర హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి ఘోరంగా విఫలమయ్యారన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య మాట్లాడుతూ ఇరాన్ దేశంపై ఇజ్రాయిల్, అమెరికా దేశాలు దాడులు చేస్తుంటే కనీసం ఖండించలేని దుస్థితిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నారని తెలిపారు. అమెరికాతో ఉన్న అంబానీ, అదానీల వ్యాపారాలను కొనసాగించేందుకే ట్రంప్‌కు దాసోహం అయ్యారని విమర్శించారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.డి.జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, గుంటోజు శ్రీనివాసచారి, కొండమడుగు నర్సింహ, కల్లూరి మల్లేశం, మాటూరి బాలరాజు, ఎం.డి.పాష పాల్గొన్నారు. ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి..
నిడమనూరు : ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు అదుపుతప్పి కిందపడి మృతిచెందాడు. ఈ ఘటన నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామ శివారులో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండల కేంద్రానికి చెందిన కన్నెబోయిన గోవిందు అలియాస్ గణేష్ (29)ముకుందాపురంలోని ఫంక్షన్హాల్లో వివాహానికి హాజరై ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వస్తుండగా.. గ్రామశివారులోని మూలమలుపు వద్ద అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గోవిందు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నిడమనూరు ఎస్ఐ ఉప్పు సురేష్ తెలిపారు. కాగా బుధవారం గోవిందు మొదటి వివాహ వార్షికోత్సవం అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. -
వేసవిలోనూ గురుతర బాధ్యత
నడిగూడెం : గత పదేళ్లుగా క్రీడాకారులకు వివిధ క్రీడల్లో ఉచితంగా శిక్షణ ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు నడిగూడెం మండల కేంద్రానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు పల్లపు నాగేశ్వరరావు. ప్రస్తుతం ఆయన మోతె మండలం తుమ్మగూడెం పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. నడిగూడెం మండల కేంద్రంలోని శ్రీ కొల్లు పాపయ్యచౌదరి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గత పదేళ్లుగా వేసవిలో ప్రత్యేక క్రీడా శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో నడిగూడెంతో పాటు చుట్టుపక్కల గ్రామాలైన బృందావనపురం, వేణుగోపాలపురం, చాకిరాల, చెన్నకేశవాపురంతో పాటు మునగాల మండలంలోని కృష్ణానగర్, నారాయణగూడెం గ్రామాలకు చెందిన విద్యార్థులకు పాల్గొంటున్నారు. పోలీసుల ఉద్యోగాలకు సన్నద్దమయ్యే అభ్యర్దులకు సైతం ఆయన ఉచితంగా శిక్షణ ఇస్తూ మెళకువలు నేర్పిస్తున్నారు. ఆయన ద్వారా శిక్షణ పొందిన పలువురు పోలీసు ఉద్యోగాలు సైతం సాధించారు. వేసవి వచ్చిందంటే చాలు నడిగూడెం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నాగేశ్వరరావు పేరు గుర్తుకు రావాల్సిందే. ప్రస్తుత వేసవిలో కబడ్డీ, వాలీబాల్ క్రీడల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఉదయం, సాయంత్రం క్రీడాకారులతో క్రీడా ప్రాంగణం కళకళలాడుతోంది. ఫ పదేళ్లుగా క్రీడాకారులకు ఉచిత శిక్షణ ఇస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు ఫ పోలీసు ఉద్యోగార్థులకు సైతం మెళకువలు -
పనికి వెళ్లమని మందలించినందుకు..
బొమ్మలరామారం : పనికి వెళ్లమని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బొమ్మలరామారం మండలంలో మంగళవారం జరిగింది. ఎస్ఐ బుగ్గ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామానికి చెందిన ఎండీ. నజీర్(21) ప్లంబర్ పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. కాగా.. కొంతకాలంగా నజీర్ పనికి వెళ్లకుండా గ్రామంలో ఖాళీగా తిరుగుతున్నాడు. దీంతో పనికి వెళ్లమని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన నజీర్ మంగళవారం బొమ్మలరామారం మండలం పక్కీరుగూడెం శివారులోని ఓ వ్యవసాయ పొలం వద్ద మామిడి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బుగ్గ శ్రీశైలం తెలిపారు. నజీర్ తండ్రి గతేడాది వాగులో చేపల వేటకు వెళ్లి మృతిచెందాడు. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య -
ఇద్దరు దొంగల అరెస్ట్
చిట్యాల : చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి ఆరు ద్విచక్ర వాహనాలు, పంచలోహా విగ్రహాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ డీఎస్పీ కె. శివరాంరెడ్డి తెలిపారు. చిట్యాల పోలీస్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసు వివరాలను వెల్లడించారు. జైలులో పరిచయంతో.. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కండ్లకోయకు చెందిన నీలపు నీలయ్య(26) బీకాం కంప్యూటర్స్ పూర్తిచేసి లాజిస్టిక్స్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేసేవాడు. జల్సాలకు అలవాటుపడి చోరీ కేసులో జైలుకు వెళ్లటంతో ఉద్యోగం కోల్పోయాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామానికి చెందిన బత్తిని నరేష్ అలియాస్ లవ్లీ నరేష్(29) వాహనాల చోరీ కేసులో జైలుకు వెళ్లాడు. వీరిద్దరికి జైలులో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి విడుదలైన తర్వాత వారిద్దరు హైదరాబాద్‌లో రూం అద్దెకు తీసుకున్నారు. ఇద్దరు కలిసి హైదరాబాద్, మేడ్చల్, దుండిగల్, అమీన్పూర్, సంగారెడ్డి, నల్లగొండ జిల్లా చిట్యాలలో బైక్‌లు, స్కూటర్లు చోరీ చేశారు. అంతేకాకుండా మెదక్ జిల్లా తూప్రాన్‌లోని అయ్యప్ప స్వామి ఆలయంలో చోరీకి పాల్పడి విలువైన పంచలోహా విగ్రహాన్ని, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. చిట్యాలలో పట్టుబడిన దొంగలు.. నరేష్, నీలయ్య స్కూటర్‌పై మంగళవారం ఉదయం విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి మీదుగా వెళ్తుండగా.. నల్లగొండ జిల్లా చిట్యాల రైల్వే స్టేషన్‌కు వెళ్లే రోడ్డు వద్ద పోలీసుల వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డారు. వారిని విచారించగా ఆరు ద్విచక్ర వాహనాలు, పంచలోహ దుర్గాదేవి విగ్రహం, టీవీ, ల్యాప్‌టాప్, ఐదు గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు నిజం ఒప్పుకున్నారు. చోరీ చేసిన సొత్తును వారు హైదరాబాద్‌లో అద్దెకు ఉంటున్న రూంలో ఉంచినట్లు తెలపడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.10లక్షలకు పైగా ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవటంలో చురుకుగా వ్యవహరించిన చిట్యాల ఎస్ఐ రవికుమార్‌ను డీఎస్పీ అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో సీఐ నాగరాజు, ఎస్ఐ రవికుమార్ పాల్గొన్నారు. ఫ రూ.10లక్షలకు పైగా సొత్తు స్వాధీనం -
ధాన్యం విక్రయించిన నగదు అపహరణ
ఫ బ్యాంకు నుంచి డ్రా చేసి ద్విచక్ర వాహనం డిక్కీలో పెట్టిన రైతు ఫ దారిలో ముంజలు కొంటుండగా.. చోరీ చేసిన గుర్తుతెలియని వ్యక్తి హుజూర్నగర్ : ద్విచక్ర వాహనం డిక్కీలో పెట్టిన నగదును అపహరించిన ఘటన మంగళవారం హుజూర్నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ మండలం అంజలీపురం గ్రామానికి చెందిన రైతు కార్లపూడి కాంతారావు ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులు అతడి యూనియన్ బ్యాంక్ అకౌంట్లో జమయ్యాయి. మంగళవారం రూ.80 వేలు డ్రా చేసుకుని తన ద్విచక్ర వాహనం డిక్కీలో పెట్టాడు. కానీ డిక్కీకి తాళం లేదు. పట్టణంలోని పొట్టి శ్రీరాములు సెంటర్లో ద్విచక్ర వాహనం దిగి తాటిముంజలు కొనుగోలు చేసి ఇంటికి వెళ్లాడు. తీరా ఇంటికి వెళ్లి చూసేసరికి డిక్కీలో ఉండాల్సిన రూ.80 వేల నగదు కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బ్యాంక్ అధికారులను సంప్రదించి పట్టణంలోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. తాటిముంజలు కొనే సమయంలో గుర్తుతెలియని వ్యక్తి డిక్కీలోని డబ్బులు దొంగించినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రాములునాయక్ తెలిపారు. మూగజీవాలను తరలిస్తున్న డీసీఎం పట్టివేత చౌటుప్పల్ : అక్రమంగా మూగజీవాలను తరలిస్తున్న డీసీఎంను చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చెన్నారెడ్డిగూడెం గ్రామానికి చెందిన డ్రైవర్ తన డీసీఎంలో ఏపీలోని జగ్గంపేట సంత నుంచి మూగ జీవాలను హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు డీసీఎంను ఆపగా.. అందులో ఆవులు 10, లేగ దూడలు 5, ఎద్దులు 4, కోడె దూడలు 4 ఉన్నట్లు గుర్తించారు. అనుమతులు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించి గోశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు -
పేదలందరికీ సంక్షేమ ఫలాలు
యాదగిరిగుట్ట: ప్రజా ప్రభుత్వంలో అర్హత కలిగిన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందుతాయని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో నూతన ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవంలో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత గూడులేని ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం నిర్మించి ఇస్తుందన్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మంచి గృహం ఉండాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ పథకాన్ని తీసుకువచ్చామన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వలేదని, కానీ ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అర్హులైన అందరికి ఇందిరమ్మ ఇళ్లను ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి, వైస్ చైర్పర్సన్ బరిగె రమ్య, కౌన్సిలర్లు కాటబత్తిని స్వప్న, ముక్కెర్ల మల్లేష్, బూడిద మధు తదితరులు పాల్గొన్నారు.ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి
చౌటుప్పల్ : రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట శివారులో ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు మండలం ఊకొండి గ్రామానికి చెందిన గురిజాల రాజశేఖర్(36) హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. భార్యాపిల్లలతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాజశేఖర్ బంధువు చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ పరిధిలోని ఆంథోల్ మైసమ్మ దేవాలయం వద్ద నిర్వహించిన శుభకార్యానికి అతడు వచ్చాడు. రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో తూప్రాన్‌పేట శివారులో ద్విచక్ర వాహనం నిలిపి.. విజయవాడ మార్గంలో ఉన్న చాచా దాబా వద్దకు వెళ్లి టీ తాగి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం వచ్చి రాజశేఖర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి అన్న నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. ద్విచక్ర వాహనం అపహరణవలిగొండ : ఇంటి ముందు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ ఘటన వలిగొండ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండల కేంద్రానికి చెందిన బతిని శెట్టయ్యగౌడ్ తన ద్విచక్ర వాహనాన్ని ఆదివారం రాత్రి ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. సోమవారం ఉదయం చూసేసరికి ద్విచక్ర వాహనం కనిపించలేదు. దీంతో సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. తాళం వేసిన ఇంట్లో చోరీఫ రూ.1.60లక్షల నగదు అపహరణ మోత్కూరు : తాళం వేసిన ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి నగదు అపహరించారు. ఈ ఘటన మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. బుజిలాపురం గ్రామానికి చెందిన దొంతి మత్స్యగిరి శనివారం తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి వలిగొండ మండలం మల్లేపల్లి గ్రామంలో బొడ్రాయి పండుగకు బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు మత్స్యగిరి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో దాచిన రూ.1,60,000 నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం మత్స్యగిరి ఇంటి వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. -
ఇళ్ల గణన ప్రారంభం
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి గృహ గణనలో భాగంగా ఎన్యుమరేటర్లు సరైన వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. గృహ గణన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ .. సోమవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని 30, 31 వార్డుల్లో సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు నిర్వహిస్తున్న గృహగణన ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. హెచ్ఎల్బీ సరిహద్దుల నిర్ధారణ, ఇంటింటి సమాచార సేకరణ, మ్యాపుల ఆధారంగా ఫీల్డ్ వెరిఫికేషన్ తదితర అంశాలపై అధికారులు, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు సూచనలు చేశారు. జాగ్రత్తగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. గృహగణన ప్రక్రియ పారదర్శకంగా, కచ్చితత్వంతో పూర్తిచేయడం ద్వారా భవిష్యత్ ప్రణాళికలు, సంక్షేమ పథకాల అమలుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రజలు కూడా జనగణన సిబ్బందికి సహకరించి సరైన సమాచారం ఇవ్వాలని కోరారు. భువనగిరిటౌన్ : జనగణన–2027 మొదటి దశ ప్రక్రియలో భాగంగా సోమవారం నుంచి గృహ గణనకు శ్రీకారం చుట్టారు. జూన్ 9 వరకు నెల రోజుల పాటు సాగే ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేటర్లు జిల్లాలోని ప్రతి గడపను తట్టనున్నారు. గృహ గణనతో పాటు నివాస వసతులు, ఇతర మౌలిక సదుపాయాల వివరాలను సేకరించనున్నారు. కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి, గణన తీరును పరిశీలించారు. పకడ్బందీగా యంత్రాంగం ఏర్పాట్లు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, మండలాల్లో ఇళ్ల గణన సజావుగా సాగేందుకు యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. జిల్లాను మొత్తం 1,748 బ్లాకులుగా విభజించి, ప్రతి బ్లాకుకు ఒక ఎన్యుమరేటర్ చొప్పున మొత్తం 1,461 మందిని నియమించింది. వీరి పనితీరు పర్యవేక్షణకు 257 మంది సూపర్వైజర్లను కేటాయించారు. ఎన్యుమరేటర్లు తొలి మూడు రోజులు తమకు కేటాయించిన పరిధిలోని ఇంటి నంబర్లను సరిచూసుకోవడం, సరిహద్దులను గుర్తించడం వంటి పనులు పూర్తి చేస్తారు. నాలుగో రోజు నుంచి మొబైల్ యాప్ ద్వారా అసలైన డేటా సేకరణ ప్రారంభమవుతుంది. ముగిసిన స్వీయ గణన ఈసారి జనగణనలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వీయ గణన ప్రక్రియ ఆదివారం ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 6,259 మంది పౌరులు ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకున్నారు. ఇలా నమోదు చేసుకున్న వారు ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు తమ రిఫరెన్స్ ఐడీని చూపిస్తే సరిపోతుంది. వలసలు.. ఇతర ప్రాంతాల్లో నమోదుపై స్పష్టత జిల్లాలో నివసిస్తున్న ఇతర జిల్లాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజల వివరాల నమోదుపై అధికారులు కీలక వివరణ ఇచ్చారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఇతర ప్రాంతాల వారు ఇక్కడ నమోదు చేసుకున్నా, తుది గణాంకాల ప్రకారం వారి వివరాలు సొంత జిల్లాల ఖాతాలోకే చేరుతాయి. అదేవిధంగా ఈ జిల్లాకు చెందిన వారు ఉపాధి, ఇతర కారణాల వల్ల వేరే ప్రాంతాల్లో ఉండి అక్కడ వివరాలు నమోదు చేసినా, అవి జిల్లా జనాభా లెక్కల్లోకే వస్తాయని అధికారులు తెలిపారు.గడపగడప లెక్క ఫ రంగంలోకి 1,461 మంది ఎన్యుమరేటర్లు, 257 మంది సూపర్వైజర్లు ఫ ఇంటింటికీ వెళ్లి వివరాల సేకరణ ఫ జూన్ 9వ తేదీ వరకు సర్వే ఫ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన కలెక్టర్ అనురాగ్ జయంతి -
రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ
భువనగిరి: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 17 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 11 ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ 3, ప్రైవేట్ కళాశాలల్లో 3 కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటికే పరీక్షల నిర్వహణపై సిబ్బందితో పాటు పలు శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఉన్నతాధికారులు సూచనలు చేశారు. పరీక్షలకు హాజరు కానున్న 5627 మందివిద్యార్థులు ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరగన్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 5,627 మంది హాజరుకానున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు 3,417 మంది, ఒకేషనల్ విద్యార్థులు 519 మంది ఉండగా, ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 1,342 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1,342 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణకు 17 మంది సీఎస్, డీఓలను నియమించారు. వీరితో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఒకటి,రెండు సిట్టింగ్ బృందాలు ఏర్పాటు చేశారు. వీరితోపాటు ఇద్దరిని కస్టోడియన్లుగా నియమించారు.అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈఓ సురేష్‌రెడ్డి తెలిపారు.విద్యార్థులు సకాలంలో పరీక్షలకు హాజరు కావాలని కోరారు.పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామని చెప్పారు.ఫ 21తేదీ వరకు పరీక్షల నిర్వహణ ఫ 17 కేంద్రాలు ఏర్పాటు ఫ హాజరు కానున్న 5,627 మంది విద్యార్థులు -
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు.. ఐదుగురికి గాయాలు
దేవరకొండ : ట్రాక్టర్‌ను కారు ఢీకొనడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన దేవరకొండ మండలం కొండభీమనపల్లి శివారులో సోమవారం జరిగింది. సీఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం తూర్పుపల్లి నుంచి కొండభీమనపల్లి ఽకొనుగోలు కేంద్రానికి ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ను కొండభీమనపల్లి శివారులో వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వెంకన్న, శివ, అర్జున్, వేణు, ఆనంద్‌కు గాయాలయ్యాయి. వీరు డిండి మండలం కందుకూర్లో పెళ్లికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానికులు దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని సీఐ తెలిపారు. సాగర్ బ్యాక్ వాటర్‌లో మునిగి యువకుడి మృతి చందంపేట : నేరెడుగొమ్ము మండలంలోని వైజాగ్ కాలనీ వద్ద సాగర్ బ్యాక్ వాటర్‌లో మునిగి యువకుడు మృతిచెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వంగపల్లి గిరిబాబు (28) ఆదివారం తన ముగ్గురు స్నేహితులతో కలిసి నేరెడుగొమ్ము మండలంలోని వైజాగ్ కాలనీకి వచ్చాడు. ఈ క్రమంలో సాగర్ బ్యాక్ వాటర్‌లో స్నానం చేస్తుండగా గిరిబాబు కాలు జారి నీటి గుంతలో పడి మృతిచెందాడు. మృతుడు హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగేంద్రబాబు తెలిపారు. చెరువులో మునిగి.. పెన్‌పహాడ్ : చెరువులో మునిగి వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన పెన్‌పహాడ్ మండలం లింగాలలో సోమవారం జరిగింది. లింగాల గ్రామానికి చెందిన గార్లపాటి సత్యనారాయణరెడ్డి(75) పాడి గేదెలు వారం క్రితం తప్పిపోయాయి. వాటిని వెతికే క్రమంలో గ్రామ శివారులోని ఎర్ర చెరువు వద్దకు వెళ్లిన అతడు చెరువు నీటిలోకి దిగి అప్పటికే అందులో ఉన్న గేదెలను బయటకు వెళ్లగొడుతుండగా.. ప్రమాదవశాత్తు నీట మునిగాడు. అక్కడే చెరువు కట్టపై ఉన్న తన మనుమడు మిర్యాల అరవింద్ చూసి గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తులు వచ్చి సత్యనారాయణరెడ్డి మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీశారు. మృతుడి కుమారుడు గార్లపాటి లచ్చిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేటకు తరలించినట్లు ఏఎస్ఐ రాములు తెలిపారు. -
మహిళా కమిషన్ సభ్యురాలిగా కాసోజు శంకరమ్మ
మోత్కూరు : మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన తెలంగాణ మలిదశ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి మాతృమూర్తి కాసోజు శంకరమ్మ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మితో పాటు ఏడుగురు సభ్యులను నియమించారు. ఏడుగురు సభ్యులలో కాసోజు శంకరమ్మ ఒకరు. రేపు పాలిసెట్ యాదగిరిగుట్ట: ఈ నెల 13వ తేదీన పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా కో ఆర్డినేటర్ ఎన్.రామానాయుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇందులో 4 కేంద్రాలు భువనగిరిలో, 2 కేంద్రాలు యాదగిరిగుట్టలో సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ ఆరు కేంద్రాల్లో 1,692 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలి పారు. పాలిసెట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కోఆర్డినేటర్ రామానాయుడు తెలిపారు. నేడు హనుమాన్ జయంతి వేడుకలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ సన్నిధిలోని విష్ణు పుష్కరిణి చెంత ఉన్న క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి వారి ఆలయంలో, అనుబంధ పాతగుట్ట ఆలయాల్లో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించనున్నారు. ఉదయం 9గంటలకు అష్టోత్తర శతమన్యుసూక్త పారాయణాలు, అభిషేకం, లక్ష తమలపాకులతో నాగవళ్లీ అర్చన, మహా నివేదన వంటి పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ భవానీ శంకర్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇక ప్రధానాలయంలోని ఆంజనేయస్వామికి అంతరంగికంగా హనుమాన్ జయంతి పూజలు జరిపిస్తామని తెలిపారు. విష్ణు పుష్కరిణి వద్ద ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహించే లక్ష తమలపాకుల అర్చనలో పాల్గొనే భక్త దంపతులకు రూ.516 టిక్కెట్ రుసుము ఉంటుందని పేర్కొన్నారు. పబ్లిక్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంభువనగిరిటౌన్ : హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్ (రామంతాపూర్, బేగంపేట)లో ఒకటో తరగతిలో ప్రవేశం పొందేందుకు జిల్లాలోని గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి ఇన్చార్జ్ అధికారి జయమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 2019 జూన్ 1 నుంచి 2020 మే 31 మధ్య జన్మించి ఉండాలని, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ 2 లక్షలకు మించకూడదని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు దరఖాస్తులు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు భువనగిరిలోని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. వచ్చిన దరఖాస్తుల నుంచి మే 22న కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిన విద్యార్థుల ఎంపిక ఉంటుందని మరిన్ని వివరాలకు 9985956225 లేదా 9849704132 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు. యువతకు ఉచితంగా ఉపాధి శిక్షణ భువనగిరిటౌన్ : జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, టీం సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి పి.సాహితి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భువనగిరి పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 12రోజుల శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి, 18 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. నవజాత శిశువుల మనుగడకే ఎన్ఎన్ఎస్భువనగిరి(బీబీనగర్): బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో సోమవారం జాతీయ ఎన్ఆర్పీ వేడుకల్లో భాగంగా ప్రాథమిక నవజాత శిశు పునరుజ్జీవన వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రిలకు చెందిన సుమారు 55 మంది నర్సులు హాజరయ్యారు. డాక్టర్ ఎస్కె మొహనసుందరి,ఎరా దీపిక దయాళ్ నర్సులకు ప్రసవానికి సన్నద్ధత, నవజాత శిశువు సంరక్షణ, పునరుజ్జీవ ప్రక్రియలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ తనిగైనాధన్,డాక్టర్ గుర్రార్ష్ సింగ్ పాల్గొన్నారు. -
బండి సంజయ్‌ని పదవి నుంచి బర్తరఫ్ చేయాలి
భువనగిరి: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ.. బాలికను వేధించి అత్యాచారానికి పాల్పడినందున సంజయ్‌ని ప్రధాని మోదీ తక్షణమే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.సోమవారం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లేనిపక్షంలో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. మంత్రి నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. లైగింక వేధింపులకు గురైన బాలిక ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే తీసుకోకుండా 8గంటల పాటు నిరీక్షింప చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పోక్సోచట్టం కింద కేసు నమోదైతే అరెస్టు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం వ్యహరిస్తుంటే ప్రభుత్వం చేస్తోందని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందాలుచేసుకుని రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. బాలిక వద్ద నుంచి సిట్టింగ్ జడ్జి చేత వాంగ్మూలం నమోదు చేయించిన తర్వాతనే విచారణ జరిపించాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ, మండల కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్‌కుమార్, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, జనగాం పాండు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు జక్కా రాఘవేందర్‌రెడ్డి, నాయకులు శెట్టి బాలయ్య యాదవ్, ర్యాకల శ్రీనివాస్, జెడ్పీ మాజీ సభ్యుడు బీరు మల్లయ్య, మున్సిపల్మాజీ చైర్మన్ పెంట నర్సింహ, కౌన్సిలర్ నగేష్, చెన్న మహేష్, ఎక్బాల్ చౌదరి, జహంగీర్, భిక్షపతి సుభాష్, అజీమొద్దీన్ పాల్గొన్నారు. ఫ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి -
పకడ్బందీగా ఇళ్ల గణన ప్రక్రియ
భువనగిరిటౌన్ : పకడ్బందీగా ఇళ్ల గణన ప్రక్రియ చేపట్టనున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పేర్కొన్నారు. సోమవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న హౌస్ లిస్టింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించి మాట్లాడుతూ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్‌లో ప్రతి ఇంటిని తప్పనిసరిగా కవర్ చేయాలన్నారు. ఏ ఒక్క కుటుంబం లేదా గృహ గణనలో వదలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలన్నారు. -
పదో తరగతి విద్యార్థులకు సువర్ణావకాశం
గరిడేపల్లి : టీజీ పాలిసెట్–2026 ప్రవేశ పరీక్ష మే 13న జరగనుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వ్యవసాయ మరియు ఉద్యాన విశ్వవిద్యాలయాల పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలల్లోనూ చేరవచ్చని గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) శాస్త్రవేత్త నరేష్ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ మరియు ఉద్యాన విశ్వవిద్యాలయాల కింద రెండు పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయని ఆయన తెలిపారు. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కంపాసాగర్‌లో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ఉన్నాయి. హార్టికల్చర్ పాలిటెక్నిక్.. గడ్డిపల్లిలోని ఘంటా గోపాల్‌రెడ్డి హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ విశ్వవిద్యాలయ పరిధిలో ఉంది. ఈ కాలేజీలో రెండేళ్ల డిప్లొమా కోర్సు అందిస్తున్నారు. ఉద్యాన డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ● ప్రభుత్వ శాఖల్లో ఉద్యాన విస్తరణ అధికారి మరియు ఫీల్డ్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు పొందవచ్చు. ● ఆయిల్ పామ్ కంపెనీల్లో డెవలప్మెంట్ ఆఫీసర్‌గా, విత్తనాలు, ఎరువులు మరియు పురుగు మందుల కంపెనీల్లో ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా పనిచేయవచ్చు. ● సొంతగా నర్సరీల స్థాపన, పురుగు మందుల దుకాణాలు, సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్ వంటి స్వయం ఉపాధి అవకాశాలు పొందవచ్చు. ● ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. ● పరిశోధన మరియు ఉన్నత విద్య (బీఎస్సీ హార్టికల్చర్) కొనసాగించేందుకు హార్టిసెట్ ద్వారా అగ్రశ్రేణి ఉద్యాన విశ్వవిద్యాలయాలు మంచి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. లేదా డిగ్రీ కోర్సుల్లో చేరాలంటే లేటరల్ ఎంట్రీ ద్వారా చేరి ఉన్నత విద్యను కొనసాగించవచ్చు. వ్యవసాయ పాలిటెక్నిక్..కంపాసాగర్‌లోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉంది. ఇందులోనూ రెండేళ్ల డిప్లొమా కోర్సు అందిస్తున్నారు. వ్యవసాయ డిప్లొమా కోర్సు ద్వారా విద్యార్థులు వ్యవసాయ శాస్త్రానికి సంబంధించిన అనేక అంశాల్లో శాసీ్త్రయ పరిజ్ఞానాన్ని పొంది ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. వ్యవసాయ డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులు స్వయంగా వ్యవసాయ పరిశ్రమలు, నర్సరీలు ప్రారంభించవచ్చు. సీడ్ కంపెనీలలో టెక్నికల్ అసిస్టెంట్, వ్యవసాయ పరికరాల కంపెనీలలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేయవచ్చు. ప్రభుత్వ నియమించే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఏఈఓ) చేరవచ్చు. అదేవిధంగా డిప్లొమా పూర్తయిన తర్వాత విద్యార్థులు బీఎస్సీ అగ్రికల్చర్(అగ్రిసెట్) విద్యను కొనసాగించవచ్చు. లేదా డిగ్రీ కోర్సులకు లేటరల్ ఎంట్రీ ద్వారా చేరి ఉన్నత విద్యను కొనసాగించవచ్చు. పాలీసెట్ ద్వారా వ్యవసాయ, ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం -
అర్జీలను పెండింగ్ పెట్టొద్దు
భువనగిరిటౌన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ పెట్టవద్దని కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్.. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి తో కలిసి 75 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. అనంతరం కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షిస్తూ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేయాలని, కొన్ని శాఖలు ఉద్యోగుల వివరాలు అందజేయలేదన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు. ట్యాబ్ ఎంట్రీలు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ జయమ్మ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి -
రసాయన జలాల శుద్ధి
రామన్నపేట: చేనేత వస్త్రాల అద్దకంలో వెలువడే రసాయన జలాల కాలుష్యానికి చెక్ పెట్టేందుకు రామన్నపేట మండలం సిరిపురం గ్రామం వేదికగా సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. రసాయన, మురుగునీటిని శాసీ్త్రయ పద్ధతిలో శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక నీటిశుద్ధి ప్లాంట్ ప్రారంభానికి సిద్ధమైంది. దేశంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్టు ప్రస్తుతం విజయవంతంగా ట్రయల్ రన్ జరుపుకుంటోంది. 2024లో శంకుస్థాపన సిరిపురం చేనేత వస్త్రాల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. చేనేత వస్త్రాల తయారీలో వివిధ డిజైన్లకోసం సహజసిద్ధమైన వాటితో పాటు రసాయన రంగులను ఉపయోగిస్తుంటారు. అలా ఉపయోగించిన కాలుష్య కారకమైన నీరు మురుగు కాలువల గుండా ప్రవహించి సమీపంలోని కుంటలోకి చేరుతుంది. దీని కారణంగా కుంటలోని నీటితోపాటు భూగర్భజలాలు కాలుష్యం అవుతున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు గ్రామంలో హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) వారు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ వారి రూ 2 కోట్ల ఆర్థిక సహకారంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. 2024 మార్చి 10వ తేదీన ఐఐసీటీ డైరెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, అప్పటి కలెక్టర్ జండగే హనుమంత్ దీని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. చేనేత వస్త్రాల తయారీ కోసం రంగుల అద్దకంలో వాడిన రసాయన నీటిని శుద్ధిచేసి తిరిగి వాడుకోవడం, జల కాలుష్యంను తగ్గించాలనే లక్ష్యంతో ఐఐసీటీ వారు దేశంలోనే మొట్టమొదటగా పైలట్ ప్రాజెక్టుగా దీనిని ఏర్పాటు చేశారు.ఫ సిరిపురంలో ఐఐసీటీ ఆధ్వర్యంలో రూ.2కోట్లతో పైలట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు ఫ దేశంలోనే తొలి రసాయన నీటి శుద్ధి ప్లాంట్ఫ ప్రారంభానికి సిద్ధంప్రస్తుతం ట్రయల్ రన్ దశలో.. గ్రామంలోని మెయిన్‌రోడ్డు వెంట అండర్‌గ్రౌండ్ డ్రెయిన్‌ను నిర్మించారు. గ్రామంలో రంగుల అద్దకంలో వాడే రసాయననీటితో పాటు, మురుగునీరు అండర్‌గ్రౌండ్ డ్రెయిన్‌లో కలిసే విధంగా ఏర్పాటు చేశారు. నీరంతా ఊరకుంట వద్ద ఏర్పాటు చేసిన ట్రీట్మెంట్ ప్లాంట్ వద్దకు చేరుతుంది. ప్రారంభంలో డ్రెయిన్గుండా వచ్చిన నీటిలోని వ్యర్థాలు, చెత్త, ప్లాస్టిక్ వస్తువులు, ఆకులను మొదటి బ్లాక్‌లో శుద్ధి అయిన తరువాత సంప్‌లోకి చేరుతుంది. నీటిలోని కాలుష్య కారక పదార్థాలు, రసాయనాలను వివిధ దశల్లో బ్యాక్టీరియా సహకారంతో శుద్ధి చేస్తారు. చివరి దశలో నీటిని పరీక్షించి శాసీ్త్రయ ప్రమాణాలకు అనుగుణంగా నీరు శుద్ధి అయితే బయటకు పంపుతారు. లేకుంటే తిరిగి రీ ట్రీట్ చేస్తారు. ప్రస్తుతం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. త్వరలో అధికారికంగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ ప్లాంట్ విజయవంతం అయితే దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఈ విధమైన ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. -
దేవుడి వరం.. అందుకే ఏడుస్తాం మనం
విజ్ఞానం.. వినోదం ఫ వేసవి సెలవుల్లో కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లిష్ నేర్చుకుంటున్న విద్యార్థులుభువనగిరి : సాధారణంగా వేసవి సెలవుల్లో విద్యార్థులంతా ఆటలు ఆడుతూ.. అమ్మమ్మ ఊరికి వెళ్లి సరదాగా గడుపుతుంటారు. కానీ ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో నెగ్గుకురావాలంటే సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరి అని భావించిన కొందరు విద్యార్థులు కంప్యూటర్, టైపింగ్, స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ కేంద్రాల వైపు అడుగులు వేస్తున్నారు. భువనగిరి జిల్లా కేంద్రంలో 6 నుంచి 14 ఏళ్ల లోపు విద్యార్థులు ఎక్కువగా ఈ శిక్షణ కేంద్రాల్లో చేరుతున్నారు. టైపింగ్ నేర్చుకోవడం వల్ల కంప్యూటర్ కీబోర్డుపై పట్టు వస్తుందని భావించి ముందుగా టైపింగ్ ఎంచుకుంటున్నారు. పిల్లల వయస్సు, వారి జ్ఞానానికి అనుగుణంగా శిక్షణ సంస్థలు వివిధ కోర్సులను అందిస్తున్నాయి. కంప్యూటర్, టైపింగ్ శిక్షణ కేంద్రాలు బిజీబిజీగా ఉంటున్నాయి.టైపింగ్ నేర్చుకుంటున్నా.. వేసవి సెలవులు వృథా చేయకూదడని నిర్ణయించుకున్నాను. ఏదో ఒక కోర్సు నేర్చుకోవాలని కంప్యూటర్, టైపింగ్ నేర్చుకుంటున్నా. మరోవైపు సమయం దొరికినప్పుడల్లా బ్యాడ్మింటన్ కూడా ఆడుతున్నా. – మెర్లిన్, 6వ తరగతి, భువనగిరి కంప్యూటర్ శిక్షణ బాగుంది ఉదయం స్నేహితులతో ఆడుకుంటూ నే.. సాయంత్రం రెండు గంటల పాటు కంప్యూటర్ నేర్చు కోవడం కోసం సమయం కేటాయిస్తున్నా. కోచింగ్ సెంటర్లో కంప్యూటర్ నేర్చుకోవడం బాగుంది. – అమ్జ, 5వ తరగతి, భువనగిరి స్పోకెన్ ఇంగ్లిష్‌పై పట్టు..చిట్యాల : పట్టణానికి చెందిన లెక్చరర్ కందుల గణేష్ ప్రతి వేసవిలో నామమాత్రపు ఫీజు తీసుకుని స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత వేసవి సెలవుల్లో ఆయన వద్దకు ప్రతిరోజు సుమారు 30మందికి పైగా విద్యార్థులు హాజరవుతూ ఇంగ్లిష్ మాట్లాడే నైపుణ్యాలను పెంచుకుంటున్నారు. ఇంగ్లిష్‌లో రోజువారి సంభాషణలు, ఉచ్ఛారణ, వాక్య నిర్మాణం, ఇంటర్వ్యూ వంటి అంశాలపై లెక్చరర్ గణేష్ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. -
హైవేపై డీజిల్ ట్యాంకర్, కారు బోల్తా
చిట్యాల : విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో సోమవారం డీజిల్ ట్యాంకర్, కారు ఒకదానికొకటి ఢీకొని బోల్తా పడ్డాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లి వైపు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్‌ను చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులోని ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో వెనుక నుంచి వస్తున్న కారు ఓవర్టేక్ చేయబోయి ఢీకొని అదుపుతప్పి హైవే పక్కన గల డివైడర్‌ను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీజిల్ ట్యాంకర్, కారు హైవేపై అడ్డంగా బోల్తా పడ్డాయి. కారులో ఏపీలోని నెల్లూరు నుంచి సంగారెడ్డికి వెళ్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని హైవేపై అడ్డంగా పడిపోయిన వాహనాలను క్రేన్ల సహాయంతో పక్కకు తొలగించారు.ఫ ఇద్దరికి స్వల్ప గాయాలు -
మహా శివుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. మహా శివుడికి ఇష్టమైన రోజు కావడంతో విశేషంగా అభిషేకం, బిల్వార్చన పూజలను జరిపించారు. ముఖ మండపంలోని శ్రీస్పటిక రామలింగేశ్వరుడికి పూజారులు బిల్వ పత్రాలతో పూజలు జరిపి, భక్తులచే అష్టోత్తర పూజలను నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయంలో శ్రీరామలింగేశ్వర సమేత పార్వతీ దేవి సేవను ఊరేగించారు. యాదగిరీశుడి ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలను అర్చకులు సంప్రదాయంగా జరిపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
అక్రమంగా తరలిస్తున్న మూగజీవాల పట్టివేత
చిట్యాల : నిబంధనలకు విరుద్ధంగా ఆవులను తరలిస్తున్న లారీని సోమవారం చిట్యాల పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ మామిడి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి హైద్రాబాద్ వైపు లారీలో సుమారు 52 ఆవులను తరలిస్తుండగా.. చిట్యాలలోని రైల్వేస్టేషన్ రోడ్డు వద్ద పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని కబేళాకు ఆవులను తరలిస్తున్నట్లు తేలడంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్ మున్నాను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఆవులను చింతపల్లిలోని గోశాలకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ఐదు ఆవుదూడలు.. హుజూర్నగర్ : ఆవుదూడలను తరలిస్తున్న వాహనాన్ని సోమవారం హుజూర్‌నగర్‌లో పోలీసులు పట్టుకున్నారు. హెడ్ కానిస్టేబుల్ రాములునాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున హుజూర్‌నగర్‌లో పోలీసులు వాహనాలు తనఖీ చేస్తుండగా.. ట్రాలీ వాహనంలో ఐదు ఆవుదూడలను హైదరాబాద్ తరలిస్తుండగా పట్టుకున్నారు. 8 మందిని అదుపులోకి తీసుకుని కారు, ట్రాలీ వాహనం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఆవుదూడలను గోశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. రెండు ఎద్దులు.. ఒక ఆవు.. కోదాడరూరల్ : ఏపీ నుంచి అక్రమంగా హైదరాబాద్ తరలిస్తున్న మూడు పశువులను సోమవారం కోదాడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ గోపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పల్నాడు జిల్లా కోసూరు నుంచి రెండు ఎద్దులు, ఒక ఆవును బొలేరో వాహనంలో హైదరాబాద్‌కు తరలిస్తుండగా కోదాడ మండల పరిధిలోని రామాపురం క్రాస్ రోడ్లో పట్టుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. పట్టుబడిన పశువులను గోశాలకు తరలించి వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
ఇందిరమ్మ ఇంట.. బిల్లుల తంటా
ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా నిధులను అనుసంధానం చేసింది.అయితే వీటి విడుదలలోనూ జాప్యం జరుగుతోంది.ఉపాధి హామీ 90 రోజుల పనికి సంబంధించి రూ. 27 వేలు రావాల్సి ఉండగా, నెలల తరబడి ఫొటోలు దిగుతున్నా పూర్తిస్థాయి డబ్బులు జమ కావడం లేదు.ఆవాస్ యోజన కింద రావాల్సిన రూ. 21 వేలు ఆలస్యం అవుతున్నాయి.స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి ఇచ్చే రూ. 12 వేల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సాక్షి యాదాద్రి: సొంతింటి కలను నిజం చేసుకునేందుకు అప్పోసొప్పో చేసి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకున్న నిరుపేదలకు ఇప్పుడు బిల్లుల కష్టాలు మొదలయ్యాయి. ఇంటి నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా.. ప్రభుత్వం నుంచి రావాల్సిన తుది విడత నిధులు అందకపోవడంతో లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వేలాది ఇళ్లు పూర్తయినా, బిల్లుల విడుదలలో జాప్యం జరుగుతుండటంతో అరువు తెచ్చిన సామగ్రికి డబ్బులు చెల్లించలేక, వడ్డీలు కట్టలేక లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బిల్లుల కుదింపు నిరుపేదల ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలను వందశాతం సబ్బిడీతో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రభుత్వం తొలుత నాలుగు దశల్లో బిల్లులు ఇస్తామని ప్రకటించింది. వీటిలో పునాది స్థాయిలో రూ. 1 లక్ష, పిల్లర్ల నిర్మాణం తర్వాత రూ. 2 లక్షలు, స్లాబ్ వేసిన తర్వాత ఇచ్చే మూడో బిల్లును రూ. 2 లక్షల నుంచి రూ. 1.40 లక్షలకు కుదించింది. నాలుగో దశలో రూ.60వేలను వివిధ పథకాలకింద ఇస్తారు. 9,618 ఇళ్లు మంజూరు జిల్లాలోని ఆలేరు, భువనగిరి, తుంగుతుర్తి, మునగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో గత సంవత్సరం తొలివిడత 9618 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి. వీటిలో 2087 ఇళ్లు పూర్తి అయ్యాయి. ఆలేరు నియోజకవర్గం ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలో ప్రథమ స్థానం, భువనగిరి ద్వితీయస్థానంలో ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇళ్ల నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా తుది బిల్లులు రావడంలేదు. దీంతో లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారు. బిల్లుల కోసం ఎదురు చూపులు ఇల్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు తెలిసిన వారి వద్ద అప్పులు చేయడం, సామగ్రిని అరువు కూడా తెచ్చుకున్నారు. నిర్మాణం పూర్తయితే బిల్లులు వస్తాయని, ఆ డబ్బుతో అప్పులు తీర్చవచ్చని ఆశించారు. కానీ, జిల్లాలో ఇప్పటికే 2,087 ఇళ్లు పూర్తయినా తుది బిల్లులు మంజూరు కాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతుండటంతో అధికారులను నిత్యం వాకబు చేస్తున్నారు. ప్రారంభించని ఇళ్లు రద్దు నిర్మాణాలు ప్రారంభించని ఇళ్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 1142 ఇళ్లు రకరకాల కారణాలతో ప్రారంభం కాలేదు. వీటిని అధికారులు రద్దు చేస్తున్నారు. ఫ ఇల్లు పూర్తయినా అందని తుది బిల్లు ఫ ఇప్పటివరకు పూర్తయినవి 2087 ఫ అప్పుల ఊబిలో లబ్ధిదారులు ఫ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు -
ధాన్యం కాంటా వేయడంలో అధికారుల నిర్లక్ష్యం
ఫ ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలి ఫ రైతు సంఘం నేతల డిమాండ్చౌటుప్పల్ : కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి పడిగాపులుకాస్తున్నా అధికారులు మాత్రం కాంటాలు వేయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు బూరుగు కృష్ణారెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వీడి వేగంగా తూకాలు వేయాలని, అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదురుగా జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూతూకాలు వేసిన ధాన్యం బస్తాలను సకాలంలో ఎగుమతి కూడా చేయడంలేదన్నారు. మిల్లుల వద్ద దిగుమతి చేసుకునే సమయంలో తరుగు పేరిట అధనంగా రైతులపై భారం మోపుతున్నారని ఆరోపించారు. అకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కొర్రీలు పెట్టకుండా పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు చీరిక అలివేలు, ఎండి.పాష, గోశిక కరుణాకర్, బండారు నర్సింహ, ఆకుల ధర్మయ్య, పర్నె ధర్మారెడ్డి, బొడ్డు అంజిరెడ్డి, పొట్ట శ్రీను, బొజ్జ బాలయ్య, జక్కిడి గోపాల్‌రెడ్డి, అంజిరెడ్డి, చీరిక సంజీవరెడ్డి, కృష్ణారెడ్డి, లింగయ్య, కృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
హుజూర్నగర్ : వ్యవసాయ పొలం వద్ద విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందాడు. ఈ ఘటన హుజూర్నగర్ మండలం సీతారాంపురం గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతారాంపురం గ్రామానికి చెందిన మేకపోతుల వీరస్వామి(48) పొలం వద్దకు వెళ్లి చాలాసేపటి వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతడి కుమారుడు వినయ్ పొలానికి వెళ్లి చూడగా బోరు మోటారు వద్ద వీరస్వామి విద్యుదాఘాతానికి గురై పడిపోయి కనిపించాడు. గ్రామస్తుల సహకారంతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ బంద్ చేయించి వీరస్వామిని హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడిఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కందాల లక్ష్మికి కన్నీటి వీడ్కోలు
నకిరేకల్ : నకిరేకల్‌లోని ఏవీఎం విద్యాసంస్థల అధినేత, ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి సతీమణి లక్ష్మి అనారోగ్యంతో శనివారం రాత్రి మృతిచెందగా.. ఆదివారం అంత్యక్రియలు ముగిశాయి. నకిరేకల్ పట్టణంలోని మార్కెట్ రోడ్డులో గల పాపిరెడ్డి నివాసం నుంచి లక్ష్మి భౌతికకాయానికి అంతిమయాత్ర నిర్వహించారు. అనంతరం వారి స్వగ్రామమైన శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో దహన సంస్కారాలు నిర్వహించారు. లక్ష్మి భౌతికకాయానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్నరాజ్, కాంగ్రెస్ మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య, నకిరేకల్ మున్సిపల్ మాజీ చైర్మన్లు రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, చౌగోని రజితాశ్రీనివాస్‌గౌడ్ తదితరులు నివాళులర్పించారు. -
నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్
యాదగిరిగుట్ట : ఆటోలో భక్తురాలు మరిచిపోయిన బంగారు ఆభరణాలను తిరిగి ఇచ్చి నిజాయితీ చాటుకున్నాడు ఓ ఆటో డ్రైవర్. వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తురాలు ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చింది. కొండ పైకి ఆటోలో ప్రయాణం చేస్తున్న సమయంలో సుమారు మూడు తులాల బంగారు పుస్తెలతాడు తెగి ఆటోలో పడిపోయింది. అది గమనించకుండా ఆమె ఆటో దిగి వెళ్లిపోయింది. బంగారు పుస్తెలతాడును గమనించిన ఆటో డ్రైవర్ మాటూరి హరిబాబు ఆ భక్తురాలిని గుర్తించి ఈఓ భవాని శంకర్, ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు ఆధ్వర్యంలో ఆమెకు పుస్తెలతాడు అప్పగించాడు. ఆటో డ్రైవర్ మాటురి హరిబాబును అధికారులు అభినందించారు. -
యాదగిరి క్షేత్రంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, టిక్కెట్ కౌంటర్, శివాలయం వంటి ప్రాంతాల్లో భక్తులు అధికంగా కనిపించారు. ధర్మ దర్శనానికి 3గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంటకు పైగా సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామిని 45వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.51,80,379 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. శివాలయంలో ఆర్జిత సేవలకు శ్రీకారం యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో నూతన ఆర్జిత సేవలను ఆలయ ఈవో భవానీ శంకర్ ఆదివారం ప్రారంభించారు. ప్రతి అష్టమి రోజున ఉదయం 8గంటల నుంచి 10 గంటల వరకు పర్వతవర్ధిని అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన పూజా కార్యక్రమం ఉంటుందన్నారు. టిక్కెట్ ధర రూ.500 నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ పూజలకు ఇద్దరికి మాత్రమే ప్రవేశం ఉంటుందని తెలిపారు. స్వామివారిని దర్శించుకున్న 45వేల మందికి పైగా భక్తులు -
సాధం విజయలక్ష్మికి ఉమెన్ ఐకాన్ అవార్డు
మేళ్లచెరువు : మండలంలోని రేవూరు గ్రామానికి చెందిన సాధం విజయలక్ష్మి ఉమెన్ ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సైకాలజీ అవార్డు అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో గల ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన తెలంగాణ సైకాలజిస్టు అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాలలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతులమీదుగా ఆమె ఈ అవార్డు అందుకున్నారు. ఆమెను గ్రామ సర్పంచ్ జూనెబోయిన గురవయ్యయాదవ్, మాజీ సర్పంచ్ సాధం గంగయ్య యాదవ్ అభినందించారు. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన భువనగిరి : మండలంలోని రాయగిరి గ్రామ పరిధిలో గల మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌కు చెందిన కూచిపూడి నాట్య గురువులు గిరీష్, దేవిల శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. సందర్శకులను కూచిపూడి నృత్యం ఎంతగానే ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కళాకారిణులు లోహిత, లీనా, సహస్ర, సాహితి, కమలిక, స్నేహిక తదితరులు పాల్గొన్నారు. -
స్నేహితుడి వివాహానికి వెళ్లొస్తూ..
నకిరేకల్ : వివాహానికి వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన నకిరేకల్ మండలం తాటికల్ గ్రామంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ మండలం తాటికల్ గ్రామానికి చెందిన అన్నెం ఆర్య(20) శనివారం శాలిగౌరారం మండలం మనిమద్దె గ్రామంలో తన స్నేహితుడి పెళ్లికి హాజరయ్యాడు. అర్ధరాత్రి తిరిగి తన స్వగ్రామానికి బైక్‌పై వస్తుండగా.. మార్గమధ్యలో నకిరేకల్–తాటికల్ మధ్యలో 565వ నంబర్ జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఆర్య ఇటీవలే ఇంటర్మీడియట్ పూర్తిచేసినట్లు సమాచారం. ఆదివారం మృతుడి తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హరిబాబు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం -
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి : జిల్లాలో ప్రసిద్ధి గాంచిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మిచెంచులక్ష్మిసమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్య కల్యాణాన్ని ఆదివారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభి షేకం చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్లలను నూతన పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేశారు. అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మదుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో నిత్య కల్యాణాన్ని వేద మంత్రోచ్ఛరణలతో వైభవంగా నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు, ఈఓ బి.జ్యోతి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
దుర్మార్గులతో స్నేహం ప్రమాదకరం
అమ్మమ్మ చెప్పిన నీతి కథనాకు మా అమ్మమ్మ చెప్పిన నీతి కథల్లో ఈ తోడేలు, కుక్క కథ బాగా నచ్చింది. ఆ కథను మీతో పంచుకుంటున్నాను.నార్కట్‌పల్లి : అడవిలో ఉండే తోడేలు దారి తప్పి ఊళ్లోకి వచ్చింది. అది తోవ వెంబడి వెళ్తుండగా ఒక కుక్క దానికి ఎదురొచ్చింది. తోడేలు ఆ కుక్కను ఆశ్చర్యంగా చూస్తూ.. ‘నీ మెడలో ఆ గొలుసు, ఆ బిళ్ల ఏమిటి?’ అని ప్రశ్నించింది. ఓహ్ అదా.. ‘నన్ను నా యజమాని పెంచుకుంటున్నాడు. వీధి కుక్కలతో పాటు నన్ను పట్టుకెళ్లి కాల్చివేయకుండా ఉండడానికి ఈ బిళ్లను నా మెడలో కట్టాడు’ అని కుక్క చెప్పింది. ఆశ్చర్యంగా ఉందే అంది తోడేలు. ‘నీవు అడవిలో ఉంటావు కాబట్టి నీకు తెలియదులే. మా యజమాని చాలా మంచివాడు. నన్ను తన ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటున్నాడు. నాకు మంచి మంచి రొట్టెలు, మాంసం, పాలు అన్నీ పెడతాడు. రోజూ వేడి నీళ్లతో స్నానం చేయిస్తాడు. నాకు తినడానికి ప్లేటు, పాలు తాగడానికి గిన్నె ఉన్నాయి. అంతేకాదు నిద్రించడానికి మెత్తటి పరుపు కూడా ఉంది’ అని చెప్పింది కుక్క. అంతేకాదు మా యజమాని దగ్గర బోలెడు పిల్లులు కూడా ఉన్నాయి. జాతి వైరం మరచి మేమంతా సరదాగా ఆడుకుంటాం’ అని చెప్పింది. మిత్రమా.. ఈరోజు నుంచి మనమిద్దరం స్నేహితులం. నన్ను కూడా మీ ఇంటికి తీసుకెళ్లు అంది తోడేలు. సరేనంటూ కుక్క ఆ తోడేలును తన ఇంటికి తీసుకెళ్లింది. యజమాని చూస్తే కొడతాడని తోడేలును పెరట్లో చెట్టు చాటున దాచి తన రొట్టెలు, మాంసం దానికి పెట్టసాగింది కుక్క. కుక్క తనకు చేసే అతిథి మర్యాదలను చూసి సంతోషించాల్సింది పోయి.. ‘నేను అడవిలో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉంటే ఈ కుక్కకు ఇన్ని సౌకర్యాలు, ఇంత వైభోగమా’ అని అసూయ చెందింది తోడేలు. ‘నీవొచ్చి చాలా రోజులైంది. నా యజమాని చూస్తే నిన్ను చంపేస్తాడు వెళ్లిపో’ అంది తోడేలుతో కుక్క. మిత్రమా నిన్ను వదిలి వెళ్లాలని లేదు ఇంకొక్క రోజు ఉండి వెళ్తాను అంది తోడేలు. మరుసటి రోజు అందరూ నిద్రపోతున్న సమయంలో తోడేలు.. అక్కడ ఉన్న పిల్లులను చంపి తిని ఎముకలు పడేసి వెళ్లిపోయింది. నమ్మకంగా ఉంటూ కుక్క ఇంతపని చేసిందని అనుకున్నాడు యజమాని. దీంతో ఆ కుక్కను చితకబాది ఇంటి నుంచి తరిమేశాడు. నీతి : దుర్మార్గులతో స్నేహం చేస్తే చివరికి మనకు ప్రాణాపాయం లేదా పెద్ద నష్టం కలుగుతుంది. అందుకే ఎప్పుడూ మంచివారితోనే స్నేహం చేయాలి. -
పంట మార్పిడితో అధిక దిగుబడులు
పెద్దవూర, త్రిపురారం : రైతులు పంట మార్పిడి చేయకపోవడంతో చీడపీడల వ్యాప్తి ఎక్కువై దిగుబడి తగ్గుతుంది. పంట మార్పిడి వల్ల కలిగే లాభాలపై కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) కంపాసాగర్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, పెద్దవూర మండల వ్యవసాయాధికారి సత్యనారాయణ సలహాలు, సూచనలు వారి మాటల్లోనే.. భూసారం పెరుగుతుంది..నేల భౌతిక స్థితి మెరుగుపడుతుంది. భూమిలో నీరు నిల్వ ఉండే శక్తి పెరిగి భూసారం వృద్ధి చెందుతుంది. చీడపీడలు దూరమవుతాయి. శిలీంధ్ర వ్యాధులను దూరం చేయవచ్చు. బీజాలు, వాటి అవశేషాలు, వానపాముల వృద్ధి కూడా ఎక్కువగానే ఉంటుంది. కీటకాల గుడ్లు వృద్ధి చెందకుండా చేసుకోవచ్చు. పాటించాల్సిన మెళకువలుపంట మార్పిడిలో నేల ఉపరితలాన్ని పూర్తిగా కప్పే పంటల్ని ఎంపిక చేసుకోవాలి. శనగ, బొబ్బెర, పెసర, మినుము పంటలను వేసుకోవడం వలన నేలను పూర్తిగా కప్పి ఉంచుతాయి. దీని వలన కలుపు మొక్కలను నివారించవచ్చు. వరి తర్వాత మినుము, పెసర, వేరుశనగ, చెరకు వేయడం వలన సుడిదోమ, తుంగ్రో వైరస్‌ను నివారించవచ్చు. పత్తి సాగు చేసిన నేలలో మినుము, పెసర వేయడం వలన తెల్లదోమ ఉధృతి తగ్గుతుంది. వేరుశనగ తర్వాత జొన్న, మొక్కజొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలి. దీని వలన వేరుశనగను ఆశించే ఆకుముడత ఉధృతిని తగ్గించవచ్చును. పసుపు తర్వాత వరి, జొన్న సాగు చేసుకోవాలి. దీనివలన నేలలో నెమటోడ్ల సంఖ్య తగ్గుతుంది. నులిపురుగుల సమస్య అధికంగా ఉంటే వేరుశనగ, మిరప, పొగాకు, వంగ పంటలను కొంతకాలం ఆపాలి. రైతులు పాటించాల్సినవిభూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ చేసే శక్తి ఉన్నప్పుడు పంట తర్వాత వేరే పంటను వేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి. తేలికపాటి నేలలు, ఎర్ర, ఇసుక నేలల్లో మిశ్రమ పంటలు వేసుకోవాలి. వర్షాకాలం రోజులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పంటకాలం కలిగిన కంది, నువ్వులు, వేరుశనగ వంటి పంటలను వేసుకోవాలి. బంకమన్ను శాతం ఎక్కువగా ఉంటే ఎర్రనేలలు, నల్లరేగడి నేలలు, పల్లపు ప్రాంతాల్లో పంట మార్పిడి చేసే ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి. ఇలా చేసుకోవచ్చు..యాసంగిలో వేరుశనగ సాగు చేసిన రైతులు తర్వాత వానాకాలంలో మొక్కజొన్న పంట వేసుకుంటే పైరుకు కొంత నత్రజని లభిస్తుంది. దీంతో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చును. కంది, శనగ పంటలను వరుసగా వేస్తే కాయతొలుచు పురుగుల తాకిడి అధికంగా ఉంటుంది. అందుకే ఈ పురుగులు తక్కువగా ఆశించే జొన్న, సోయాచిక్కుడు, నువ్వులు, మినుము, ఉలవ, మెట్ట వరి వంటి పంటలతో మార్పిడి చేసుకోవాలి. వరితో పంట మార్పిడి చేసుకుంటే వేరుశనగ పంటకు నులిపురుగుల బెడద తగ్గుతుంది. వరుసగా పొద్దుతిరుగుడు పంటను సాగు చేసేవారు కొర్ర, జొన్న, సజ్జ వంటి చిరుధాన్యాల పంటలను లేదా కంది, శనగ, మినుము వంటి ఆపరాల పంటలను లేదా వేరుశనగతో పంట మార్పిడి చేసుకోవచ్చు. వంగ తోట వేసిన రైతులు క్యాలీఫ్లవర్‌తో పంట మార్పిడి చేసుకుంటే వంగకు ఎండు తెగులు సోకదు. టమాట, ఆవాలు, బంతి ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేస్తే నులి పురుగుల ఉధృతి తగ్గుతుంది. ధాన్యం పంటలతో..దోస, కాకర, గుమ్మడి, పొట్ల, బీర, బూడిద గుమ్మడి, దొండ వంటి కూరగాయల పంటలను వరి పైరుతో, ఉల్లి సాగు చేసే రైతులు ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. ఒకసారి పసుపు సాగు చేసిన వారు రెండేళ్ల పాటు భూమిలో పసుపు సాగు చేయకూడదు. ఒకవేళ చేస్తే దిగుబడి తగ్గుతుంది. చీడపీడల బెడద పెరుగుతుంది. వరి, చెరుకు, అరటి, తమలపాకు, కూరగాయల పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. పసుపు తర్వాత వరి, జొన్న వేసుకుంటే నులి పురుగుల ఉధృతి తగ్గుతుంది. మిరప, వేరుశనగ, క్యాబేజీ పంటలను ఆశించే లద్దె పురుగుల తాకిడి అరికట్టాలంటే జొన్న, వరి, సజ్జ, రాగి, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలతో మార్పిడి చేయాలి. ఇలా చేయొద్దు..పంట మార్పిడికి అనుకూలమైన పంటనే ఎంచుకోవాలి. లేదంటే చీడపీడలు పెరుగుతాయి. బెండ తర్వాత పత్తి వేస్తే ఉపయోగం ఉండదు. ఈ రెండు పంటలకు ఒకే రకమైన చీడపీడలు ఆశిస్తాయి. జొన్న వేసిన పొలాల్లో మిరప వేయకూడదు. పసుపు తర్వాత మిరప, టమాటా, క్యాబేజీ, దోస, గుమ్మడి, సోర, బీర, పత్తి, ఆవాలు, బెండ వేసుకోకూడదు. ఆకుముడత ఆశించే ప్రాంతాల్లో వేరుశనగ, సోయాచిక్కుడు వేయకూడదు.ఎంపికలో జాగ్రత్తలుపంట మార్పిడి చేయాలంటే అంతకుముందు వేసిన పంటకు భిన్నంగా పెరిగే పంటను ఎంచుకోవాలి. కొన్ని పంటల వేరు వ్యవస్థలు నేల పొరల నుంచి పోషకాలన్నీ ఎక్కువగా గ్రహిస్తూ ఉంటాయి. కాబట్టి నువ్వులు, పొద్దు తిరుగుడు, మొక్కజొన్నకు బదులుగా అపరాల పంటలతో పంట మార్పిడి చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అపరాల పంటలు కరువు పరిస్థితులను తట్టుకుంటాయి. ఆకుల్ని రాల్చి భూమికి సేంద్రీయ పదార్థాన్ని అందిస్తాయి. అపరాల పంటల మీద ఉండే బుడిపెలు వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరిస్తాయి. సూక్ష్మజీవుల చర్య వల్ల ఎంజైముల ఉత్పత్తి పెరుగుతుంది. నల్లరేగడి నేలల్లో సోయాచిక్కుడు వేసుకుంటే పంట కోత సమయానికి ఆకులు పూర్తిగా రాలుతాయి. తద్వారా ఎకరానికి ఒకటి నుంచి రెండు టన్నుల సేంద్రీయ పదార్థం లభిస్తుంది. -
వాలీబాల్ నేర్చుకుందాం రండి..!
కోదాడ : వేసవి సెలవుల్లో కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయస్థాయిలో వాలీబాల్ ఆడిన పలువురు క్రీడాకారులు, పీఈటీల ఆధ్వర్యంలో వాలీబాల్ క్రీడలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు శిక్షణ ఇస్తారు. క్రీడాకారులకు కావల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు, సీనియర్స్ కూడా ఇక్కడకు రోజూ వస్తారు. వారి అనుభవాలతో మంచి వాలీబాల్ క్రీడాకారుడిగా ఎదగడానికి మంచి అవకాశం ఉంది. -
సూర్యక్షేత్రంలో సౌరహోమం
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. అలాగే క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. కాగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామి క్షేత్రానికి తరలివచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్ధన్, గణ పురం నరేష్, ఇంద్రారెడ్డి, అర్చకులు భీంపాండే, అంకిత్‌పాండే, శ్రీరాంపాండే, భక్తులు పాల్గొన్నారు. -
యాదగిరీశుడి ఆలయంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. ఉదయాన్నే ఆలయాన్ని తెరచిన అర్చకులు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలు చేపట్టారు. ముఖ మండపంలోని ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన పూజను విశేషంగా నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలను భక్తులతో చేయించారు. సాయంత్రం వేళ ఆలయంలో జోడు సేవను అర్చకులు ఊరేగించారు. రాత్రి శయనోత్సవం నిర్వహించి, ఆలయాన్ని ద్వారా బంధనం చేశారు. -
నైపుణ్యం ఉంటే ఉపాధి అవకాశాలు
భువనగిరి : నైపుణ్యాలను పెంపొందించుకుంటే నిరుద్యోగులు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. భువనగిరి పట్టణంలోని న్యూ డైమెన్షన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో కుంభం ఫౌండేషన్, 1ఎం1బీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన మెగా జాబ్‌మేళా ముగింపు కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. భువనగిరిలో యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉద్యోగ అవకాశాలకు అవసరమైన శిక్షణ అందించేవిధంగా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయాలని 1బీఎంను కోరారు. అనంతరం ఎంపికై న అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కుంభం ఫౌండేషన్ చైర్మన్ కుంభం కీర్తిరెడ్డి, 1బీఎం అసోసియేట్ డైరెక్టర్ ప్రసన్న నౌరి, డైరెక్టర్స్ అభిరామ్, వెంకటేష్, దీపిక తదితరులు పాల్గొన్నారు. 1500 మంది ఎంపిక ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన మెగా జాబ్‌మేళా ఆదివారం ముగిసింది. రెండు రోజులపాటు రిజిస్ట్రేషన్ చేసుకున్న మూడు వేల మంది అభ్యర్థులకు ప్రీ స్క్రీనింగ్ నిర్వహించి ఇంటర్వ్యూల కోసం 1800 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. 27 కంపెనీల్లో 3500 ఖాళీల భర్తీ కోసం ఆదివారం అభ్యర్థులకు ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యులు నిర్వహించారు. సాయంత్రం వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో మొత్తం 1500 మంది అభ్యర్థులను వివిధ విభాగాల్లో ఉద్యోగాల కోసం ఎంపిక చేశారు. డిప్లొమా పూర్తి చేశా. రెండు సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా. జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలు సుకుని దరఖాస్తు చేసుకున్నా. ఇంటర్వ్యూలో రాణించడంతో ఉద్యో గం కోసం ఎంపిక చేశారు. ఎలక్ట్రికల్ విభాగంలో ఎంపిక కావడం సంతోషంగా ఉంది. –కొండపురం పూజ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా. భువనగిరిలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. వెంటనే జాబ్‌కోసం దరఖాస్తు చేసుకున్నా. ఉద్యోగానికి ఎంపిక కావడం ఎంతో సంతోషంగాఉంది. నిరుద్యోగుల కోసం ఇలాంటి జాబ్ మేళా పెట్టివారికి, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కృషి చేస్తున్న వారికి నిరుద్యోగులు రుణపడి ఉంటారు. – శ్రీవాణి ఫ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య -
గూడున్నా.. రోడ్డుపైనే గోస!
భువనగిరిటౌన్ : అధికారుల అలసత్వం వల్ల భువనగిరి పట్టణంలో నిరాశ్రయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిరుపేదల నీడ కోసం నిర్మించిన ఆశ్రమం కేవలం ప్రారంభానికే పరిమితమైంది. నిర్వహణను గాలికొదిలేయడంతో ప్రజాధనం వృథా అవుతోంది. ఉండడానికి చోటు లేక వృద్ధులు, దివ్యాంగులు ఫుట్‌పాత్‌లను ఆశ్రయిస్తున్నారు. నిర్వహణ లోపం.. నిరాశ్రయులకు శాపం భువనగిరి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తా వద్ద రహదారి బంగ్లా ఆవరణలో నిరాశ్రయుల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వసతి గృహాన్ని నిర్మించింది. అయితే, భవన నిర్మాణం పూర్తయినా నిర్వహణ బాధ్యతలను ఎవరూ పట్టించుకోకపోవడంతో అది భూత్ బంగ్లాను తలపిస్తోంది. తలుపులు బార్లా తెరిచి ఉండడం, కనీస సౌకర్యాలు లేకపోవడంతో నిరాశ్రయులు లోపలికి వెళ్లేందుకు భయపడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ భవనం నేడు నిరుపయోగంగా మారింది. వినాయక చౌరస్తాలో దయనీయం.. వినాయక చౌరస్తాతోపాటు ఇతర రద్దీ ప్రాంతాల్లోని ఫుట్‌పాత్‌లే నిరాశ్రయులకు ఆవాసాలుగా మారాయి. పగలు మండుతున్న ఎండకు ఎండుతూ, రాత్రి వేళల్లో చలికి వణుకుతూ వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. వానొస్తే తలదాచుకోవడానికి చెట్ల కిందికో, దుకాణాల అరుగుల మీదకో వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఆకలి తీర్చుకోవడానికి ఆధారం లేక, ఉండడానికి నీడ లేక వృద్ధులు, దివ్యాంగులు పడుతున్న కష్టాలను చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. ప్రజాధనం వృథా ! లక్షల రూపాయలు ఖర్చు చేసి భవనాలు నిర్మించి, వాటిని వదిలేయడంపై భువనగిరి పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అలసత్వం వల్ల నిరాశ్రయులకు అందాల్సిన సాయం అందకుండా పోతోంది. ఇకనైనా జిల్లా యంత్రాంగం, మున్సిపల్ అధికారులు స్పందించి హైదరాబాద్ చౌరస్తా వద్ద ఉన్న వసతి గృహాన్ని తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని, నిరాశ్రయులను అక్కడికి తరలించి వారికి కనీస వసతులు కల్పించాలని పట్టణ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఫ నిరుపయోగంగా నిరాశ్రయుల వసతి గృహం ఫ లక్షల రూపాయలు పోసి కట్టారు.. గాలికి వదిలేశారు ఫ చౌరస్తాల్లోనే అభాగ్యుల అగచాట్లు ఫ పట్టించుకోని పాలకులు -
సబర్బన్ సాకారమయ్యేనా..
భూదాన్‌పోచంపల్లి : చేనేతకు ప్రసిద్ధి చెంది ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తింపు తెచ్చుకున్న భూదాన్ పోచంపల్లికి సబర్బన్ బస్సు సర్వీస్‌లు నడపాలని చాలాకాలంగా స్థానిక ప్రజలు కోరుతున్నా ఆ కల నెరవేరడం లేదు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీగా మారి పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్‌కు చేరువలో ఉండడంతో చీరలు కొనుగోలు చేయడానికి నిత్యం ప్రజలు పోచంపల్లికి వచ్చిపోతుంటారు. అంతేకాక పోచంపల్లి ఇక్కత్, చేనేత వస్త్ర తయారీ తీరుతెన్నులు, భూదానోద్యమ చరిత్రపై అధ్యయనం చేయడానికి విద్యార్థులతోపాటు దేశ, విదేశాల నుంచి పర్యాటకులువస్తుంటారు. ఇక్కడి గ్రామీణ వాతావరణంతో నిత్యం సినిమా, సీరియల్ షూటింగ్‌లు జరుగుతుంటాయి. ఇలా పోచంపల్లికి ఎన్నో ప్రత్యేకతలు ఉండి పర్యాటకుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నా సబర్బన్ బస్సు సర్వీస్‌లు మాత్రం నడపడం లేదు. 30 కిలోమీటర్లకు సబర్బన్ విస్తరణ హైదరాబాద్ చుట్టూ హెచ్ఎండీఏ పరిధిలోని మండలాల్లో 30 కిలోమీటర్ల వరకు సబర్బన్ పరిధిగా గుర్తించి ఆర్టీసీ అధికారులు సబర్బన్ బస్సు సర్వీసులను నడిపిస్తున్నారు. దిల్సుఖ్నగర్ నుంచి పోచంపల్లి పట్టణానికి 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 30 కిలోమీటర్ల దూరం అంటే జలాల్పురం గ్రామం వరకు సబర్బన్ పరిధిలోకి వస్తుంది. కానీ, ప్రస్తుతం సబర్బన్ బస్సులు మండల శివారులోని రంగారెడ్డి జిల్లా కొత్తగూడెం వరకే వస్తున్నాయి. మరోవైపు దిల్సుఖ్నగర్ నుంచి వయా దేశ్ముఖి మీదుగా పిలాయిపల్లికి వరకు సబర్బన్ బస్సులు నడుస్తున్నాయి. అదేమాదిరిగా మరో 5 కిలోమీటర్ల దూరాన్ని విస్తరిస్తే పర్యాటక కేంద్రమైన భూదాన్ పోచంపల్లికి సబర్బన్ బస్సులు నడిపించే అవకాశాలు ఉన్నాయి. రోజుకు 4 వేల మంది ప్రయాణం హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న పోచంపల్లికి దిల్సుఖ్నగర్, ఉప్పల్ డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుస్తుంటాయి. ప్రతిరోజూ పోచంపల్లి నుంచి సుమారు 4 వేల మందికిపైగా ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులతోపాటు వస్త్ర, పాలు, పండు, పూల వ్యాపారులు, ఉద్యోగులు హైదరాబాద్‌కు వెళ్తుంటారు. ప్రస్తుతం దిల్సుఖ్నగర్ డిపోనకు చెందిన 9 బస్ సర్వీసులు రోజుకు 3 నుంచి 4 ట్రిప్పుల చొప్పున వచ్చిపోతున్నాయి. ఫ పోచంపల్లి సబర్బన్ పరిధిలో ఉన్నా నడవని బస్సులు ఫ 30 నుంచి 35 కిలోమీటర్ల వరకు పరిధిని పెంచి నడపాలంటున్న గ్రామస్తులు ఫ రోజూ 4వేల మందికిపైగా రాకపోకలుహెచ్ఎండీఏ పరిధిలోని శివారు మండలాల్లో ఆర్టీసీ డిపోలను ఏర్పాటు చేయాలని గతంలో ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. దీంతో రాజధానికి చేరువలో ఉన్న పోచంపల్లికి కూడా డిపో మంజూరైంది. కానీ, మెయిన్ రోడ్డుకు సమీపంలో 5 ఎకరాల ప్రభుత్వ స్థలం లభించక డిపో వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి పోచంపల్లి పట్టణం వరకు సబర్బన్ బస్సులు నడిపితే రవాణా సౌకర్యాలు మెరుగుపడి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు అంటున్నారు. -
రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు
ఫ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి వలిగొండ : ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం వలిగొండ మండల కేంద్రంలో రైస్ మిల్లు యజమానులు, రైతులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లు, రవాణా, తూకాలు, చెల్లింపుల్లో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. కొనుగోళ్లలో ఎలాంటి అవక తవకలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్నదాతల సమస్యలు వెంటనే పరిష్కరించేవిధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో వలిగొండ తహసీల్దార్ దశరథ, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమానాయక్, పాశం సత్తిరెడ్డి, గరిషె రవి, సతీష్, చిలుగురి సత్తిరెడ్డి, అశోక్, పాలకూర్ల వెంకన్న, కొండూరు సాయి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో మోస్తరు వర్షం
భువనగిరిటౌన్ : జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. తెలంగాణ అభివృద్ధి ప్రణాళికా సంఘం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. జిల్లాలో అత్యధికంగా చౌటుప్పల్ మండల కేంద్రంలో 16.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే నారాయణపూర్ మండలంలో 12.0 మి.మీ, వలిగొండ మండలం వర్కట్‌పల్లిలో 8.8 మి.మీ, ఆలేరు మండలం శరాజ్పేటలో 7.3 మి.మీ వర్షం కురిసింది. అదేవిధంగా వలిగొండలో 5.8 మి.మీ, మోటకొండూర్‌లో 4.3 మి.మీ, ఆలేరు మండలం గొల్లంకొండలో 0.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. చౌటుప్పల్‌లో మోస్తరు వర్షం కురవగా.. మిగిలిన మండలాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. టెర్మినల్ ప్రారంభోత్సవం.. వీక్షించిన ఉద్యోగులుచౌటుప్పల్ : చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామంలో రూ.611 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐవోసీఎల్ టెర్మినల్‌ను ఆదివారం హైదరాబాద్ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాపురంలోని టెర్మినల్‌లో పండుగ వాతావరణం నెలకొంది. ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది వేడుకలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై వీక్షించారు. కార్యక్రమంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సీజీఎం టీకే ఎలమరన్, సీజీఎం ఆపరేషన్ సూరజ్‌కుమార్ పట్నాయక్, వివిధ విభాగాలకు చెందిన జీఎంలు అందె గణేశ్‌చక్రవర్తి, శ్రీహరినాథ్, హేమంతబైష్య, పాపిని కిరణ్‌కుమార్, శ్రీకాంత్, రాజశేఖర్, మల్కాపురం సర్పంచ్ గిర్కటి నిరంజన్, ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు, ధాన్యం దిగుమతిపై దృష్టిసారించాం చౌటుప్పల్ : కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని దిగుమతి చేసుకునే అంశంపై ప్రధానంగా దృష్టి సారించామని అదనపు కలెక్టర్ వెంకారెడ్డి తెలిపారు. చౌటుప్పల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయగా ఇప్పటివరకు జిల్లాలో 358 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.05 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరగడం లేదని అదనపు కలెక్టర్‌కు రైతులు విన్నవించారు. కొనుగోలు కేంద్రాల్లో హమాలీ చార్జీలు క్వింటాలుకు రూ.40 ఉండగా చౌటుప్పల్ మార్కెట్లో రూ.42 వసూలు చేస్తున్నారని తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన అదనపు కలెక్టర్.. హమాలీ చార్జీలు అదనంగా తీసుకోవద్దని నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెల్మ శేఖర్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సి పల్ చైర్పర్సన్ మొగుదాల పావని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వినయ్‌కుమార్, తహసీల్దార్ వీరాబాయి, ఏవో నాగరాజు పాల్గొన్నారు. -
‘కేన్స్’లో మెరవనున్న పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు
భూదాన్‌పోచంపల్లి : ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఈ నెల 17 నుంచి 21 వరకు 79వ కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షోలో తెలంగాణ ఇక్కత్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్ పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను ధరించి రెడ్ కార్పెట్ వాక్ చేయనుంది. అదేవిధంగా ప్రీ ఈవెంట్ పార్టిసిపేషన్, ర్యాంప్ అండ్ స్టైలింగ్ చేయనున్నారు. హౌజ్ ఆఫ్ వెండోమ్ ప్యారిస్, కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫ్యాషన్ షోకు మన దేశం నుంచి తెలంగాణకు చెందిన రష్మీ ఠాకూర్‌ను ఎంపిక చేశారు. ఫ్యాషన్ షోకు అవసరమైన ఇక్కత్ వస్త్రాలను పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ సీఈఓ తడక రమేశ్ ఆదివారం రష్మీ ఠాకూర్‌కు పంపించారు. ఈ సందర్భంగా తడక రమేశ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వీవర్స్ సర్వీస్ సెంటర్ ద్వారా తమకు ఇక్కత్ వస్త్రాలను అందించేందుకు అవకాశం కల్పించిందని అన్నారు. ఆదివారం రూ.లక్ష విలువైన ఎంపిక చేసిన ఇక్కత్ వస్త్రాలను అందజేశామని పేర్కొన్నారు. అంతేకాక తనకు కూడా ర్యాంప్ వాక్‌లో చేనేత కళాకారుడిగా పాల్గొనే అవకాశం కల్పించారని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు రష్మీఠాకూర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఫ్యాషన్ షోకు ఎంపిక చేసిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఇవే.. ఫ ఫిల్మ్ ఫెస్టివల్లో ధరించనున్న బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్ -
నృత్య వినోదం
చౌటుప్పల్ : పాఠశాలలకు వేసవి సెలవులు వచ్చాయంటే చాలు.. విద్యార్థుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి. సెలవుల్లో తమకు తోచిన ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే నేటి డిజిటల్ యుగంలో పిల్లలు సెల్‌ఫోన్, టీవీలకు అతుక్కుపోయి ఆటలకు దూరం అవుతున్నారు. ఈ ధోరణిని మారుస్తూ చౌటుప్పల్‌లో తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఇండోర్, అవుట్డోర్ ఆటలు నేర్పిస్తున్నారు. నృత్యం, స్విమ్మింగ్, కంప్యూటర్లో శిక్షణ, స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణకు పంపిస్తున్నారు. నృత్య శిక్షణపై చిన్నారుల ఆసక్తి వేసవి సెలవుల్లో ఆటపాటలతోపాటు విద్యార్థులు నృత్యం నేర్చుకునేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యార్థుల ఆసక్తిని గమనించిన చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని వారాహి డ్యాన్స్ స్టూడియో వారు విద్యార్థులకు నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైన నాటి నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక్కో బ్యాచ్‌కు గంట సమయం చొప్పున తరగతులు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్ల నుంచి 20 ఏళ్ల వరకు వయస్సు కలిగిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని నృత్య శిక్షణ పొందుతున్నారు. ఇక్కడ వెస్టర్న్, కూచిపూడి, ఫోక్, దాండియా, గర్భా డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే విద్యార్థులు అన్ని రకాల నృత్యాలపై శిక్షణ పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా కూడా తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షకులు ఎడ్ల హిమబిందురెడ్డి, సామినేని దీపిక విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శిక్షణ అందిస్తున్నారు. శారీరక వ్యాయామంతోపాటు ఏకాగ్రత.. నృత్యం నేర్చుకోవడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. విద్యార్థులకు ప్రధానంగా శారీరక వ్యాయామం అవుతుంది. దీంతో మంచి ఫిట్నెస్ లభిస్తుంది. ప్రతిక్షణం మనిషిలో ఉత్సాహం ఉండే విధంగా దోహదం చేస్తుంది. లక్ష్యంపై దృష్టి పెట్టేందుకు ఏకాగ్రతను పెరుగుతుంది. శిక్షణ శిబిరంలో నృత్యం నేర్చుకున్న విద్యార్థులు ఇంటికి వెళ్లిన తర్వాత గంటల తరబడి సాధన చేస్తూ సెలవులను అర్థవంతంగా గడుపుతున్నారు. ఫ వేసవి సెలవుల్లో నృత్య శిక్షణకు వెళ్తున్న విద్యార్థులు ఫ ఏకాగ్రతతోపాటు లక్ష్యంపై గురిపెట్టేందుకు దోహదం ఫ చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న తల్లిదండ్రులు -
భూసార పరీక్షలకు అనువైన సమయమిదే..
ఫ పొలంలో పోషకాల స్థాయి తెలుస్తుంది. ఫ ఆ పొలంలో ఏయే పంటలు పండించవచ్చో తెలుస్తుంది. ఫ ఎరువులు ఎంత మోతాదులో, ఎప్పుడు వేయాలో తెలుస్తుంది. ఫ నేలల సమస్యలు తెలుస్తాయి. దాని ప్రకారం ఎరువులను ఉపయోగించవచ్చు. ఫ ఎరువుల అనవసరపు ఖర్చు తగ్గించవచ్చు. సరైన సమయంలో భూసార పరీక్షలు చేయిస్తే సేంద్రియ ఎరువులను కూడా ఉపయోగించి నాణ్యమైన పంటలను పండించవచ్చు. నడిగూడెం : ప్రస్తుతం యాసంగి సీజన్ పూర్తయింది. వరి, ఇతర ఏ పంటలు కూడా సాగులో లేవు. ఈ పంటలు లేని సమయంలోనే మట్టి నమూనాలు తీసి, వాటిని పరీక్ష చేయించాలి. వాటి ఫలితాల ఆధారంగా ఎరువులను ఉపయోగించాలి. భూసార పరీక్షలకు అనువైన సమయమిదేనని గడ్డిపల్లి కేవీకే మృత్తికా విభాగం శాస్త్రవేత్త ఎ.కిరణ్ చెబుతున్న సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే.. భూసార పరీక్ష అంటే.. పొలం నుంచి సేకరించిన మట్టిని వివిధ భౌతిక, రసాయన పద్ధతుల ద్వారా విశ్లేషించి, దాని ఫలితాల ఆధారంగా ఎంత మోతాదులో ఎరువులను వాడాలో తెలుసుకోవడమే భూసార పరీక్ష. మట్టి నమూనాలు తీసే సమయం.. ఫ పంట కోత తర్వాత తీయవచ్చు. ఫ వేసవిలో పంటలు లేని సమయంలో తీయవచ్చు. మట్టి నమూనాలు తీయకూడని ప్రదేశాలు–సమయాలు.. ఫ ఎరువులు వేసిన తర్వాత నెల రోజుల వరకు సమూనా తీయరాదు. ఫ నీరు పెట్టిన తరువాత తీయరాదు ఫ నీడపడే ప్రదేశాలు, నీటి ముంపు ప్రాంతాలు, పెంటకుప్పల దగ్గర, గట్లు, చెట్లు, రోడ్ల దగ్గర తీయరాదు. మట్టి నమూనాలు తీయాల్సిన విస్తీర్ణం ఒక రకం పొలానికి ఒక నమూనా తీయాలి. పొలం మరీ పెద్దయితే ప్రతి ఐదు ఎకరాల్లో నమూనా తీయాలి. నేల నిర్మాణం, రంగు, మురుగు, పారుదల సౌకర్యం, నేల వాలు, చౌడు, క్షార, గుణాలు, పంటల సరళి విషయాల్లో ఏవేనా తేడా కనిపిస్తే అన్ని నమూనాలు ఆ పొలం నుంచి తీయాల్సి ఉంటుంది. నమూనాలు సేకరించాల్సిన లోతు ఫ పైరు పంటలకు 6 అంగుళాలు ఫ పండ్ల తోటల్లో 5 నుంచి 6 అడుగుల వరకు ప్రతి అడుగుకు ఒక నమూనా ఫ కారి, చౌడు, ఆమ్ల నేలలకు–అడుగు లోతులో ప్రతి 6 అంగుళాలకు ఒక నమూనా తీయాలి. నమూనాలు ఎలా సేకరించాలి.. ఫ నేలపై ఉన్న గడ్డి, చెత్త, కలుపు తీసివేయాలి. ఫ గొయ్యి అంచుల నుంచి పారతో గానీ, తాపీతో గానీ మట్టిని సేకరించాలి. ఫ పొలంలో 8 నుంచి 10 స్థలాల్లో ఈ పద్ధతిలో మట్టిని సేకరించాలి. ఫ సేకరించిన మట్టినంతటిని కలిపి నేలపై పరిచి దానిని 4 భాగాలు చేయాలి. మూలలకు ఎదురెదురుగా ఉన్న భాగాల మట్టిని తీసుకుని మిగిలిన మట్టిని పారవేయాలి ఈ విధంగా 500 గ్రాముల నమూనాలను సేకరించాలి. ఫ ఈ అరకేజీ మట్టిని గుడ్డ సంచిలో గానీ, పాలిథిన్ సంచిలో గానీ వేసి, రైతు పేరు, చిరునామా, సర్వే నంబరు, పొలం విస్తీర్ణం, మెట్ట, పల్లం, ఆరుతడి పంటలు, గత 3 సంవత్సరాలుగా వాడుతున్న ఎరువులు, రాబోయే సీజన్లో వేయాల్సిన పంటలు, సేకరించిన తేదీ వివరాలను జతచేయాలి. సమాచార పత్రంతో కూడిన మట్టి నమూనాలను సంబంధిత వ్యవసాయ అధికారులకు లేదా భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి. లేదా గడ్డిపల్లి కేవీకేకు పంపించినా పరీక్షలు చేసి, సాయిల్ హెల్త్‌కార్డు పంపిణీ చేస్తారు. -
ఏడు బిళ్లలాట
హుజూర్నగర్ : పాఠశాలలకు వెళ్లినన్ని రోజులు పుస్తకాలతో కుస్తీ పట్టిన చిన్నారులు.. వేసవి సెలవులు రావడంతో మైదానాల్లో, వీధుల్లో ఆటపాటల్లో మునిగి తేలుతున్నారు. హుజూర్నగర్ పట్టణంలోని 5వ వార్డులో చిన్నారులు ఏడు బిళ్లలాట ఆడుతూ ఉత్సాహంగా కనిపించారు. చిన్నారుల చేపల వేట హుజూర్నగర్ : వేసవి సెలవుల్లో కొందరు చిన్నారులు ఆటపాటల్లో మునిగి తేలుతుండగా.. మరికొందరు చెరువులు, వాగుల్లో ఈత కొడుతూ సరదాగా గడుపుతున్నారు. హుజూర్నగర్ పరిధిలోని గోవిందపురం పక్కనే చెరువు అలుగు ఉండడంతో చిన్నారులు ఆ అలుగులో చేపల వేట కొనసాగిస్తూ కనిపించారు. -
గంజాయి ముఠా అరెస్ట్.. నిందితుల రిమాండ్
సూర్యాపేటటౌన్ : గంజాయి సేవించడంతోపాటు సరఫరా చేసే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. గురువారం డీఎస్పీ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఈ నెల 6న సూర్యాపేట రూరల్ ఎస్ఐ బాలునాయక్ తన సిబ్బందితో సూర్యాపేట–దోసపహాడ్ రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై అనుమానాస్పదంగా వెళ్తుండగా పట్టుకుని విచా రించారు. సూర్యాపేట మండలం కుసుమవారిగూడెంకు చెందిన దేశగాని గణేశ్ అలియాస్ తీట శివ, పెన్‌పహాడ్ మండలం చీదేళ్ల గ్రామానికి చెందిన పశుల రాంచరణ్, పెన్‌పహాడ్ మండలంలోని మోర్సకుంట తండాకు చెందిన పోతరాజు బన్నిలుగా గుర్తించారు. వారి వద్ద ఉన్న సంచిలో కిలో గంజాయి లభ్యమైంది. ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీలేరుకు వెళ్లి అక్కడ గంజాయిని కిలో రూ.2000 చొప్పున కొనుగోలు చేసిన కొంత అమ్మి, కొంత తాగాలని నిర్ణయించుకున్నారు. వాటిని 10 గ్రాముల ప్యాకెట్లుగా చేసి ఒక ప్యాకెట్‌కు రూ.1000 చొప్పున అమ్మాలనుకున్నారు. పల్సర్ బైక్‌పై సూర్యాపేట బస్టాండ్, చుట్టుపక్కల అమ్మేందుకు వెళ్లగా ఎవరూ కొనలేదు. దీంతో తిరిగి కుసుమవారిగూడెం వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద కిలో 160 గ్రాముల గంజాయి, ఒక బైక్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. -
నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
కోదాడ రూరల్ : కోదాడ పట్టణంలో బస్టాండ్ ఎదుట ఉన్న టీస్టాల్ వద్ద బుధవారం రాత్రి భార్య శిరీషను భర్త మణిదీప్ హత్య చేసిన ప్రదేశాన్ని గురువారం ఎస్పీ నరసింహ పరిశీలించారు. హత్య జరిగిన తీరును అక్కడ ఉన్న దుకాణదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ హత్యకు పాల్పడిన నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుని రిమాండ్‌కు తరలించాలని పోలీసులను ఆదేశించారు. దర్యాప్తు వేగవంతం చేసి సాక్షులను, బాధిత కుటుంబ సభ్యులను విచారించి నేరాభియోగ పత్రాలను కోర్టుకు సమర్పించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ కలహాలు, ఏదైనా పంచాయితీలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని, క్షణికావేశంలో నేరాలు, ఘర్షణలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. కేసుల్లో సాంకేతిక నైపుణ్యంతో దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని అన్నారు. ఆయన వెంట డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ శివశంకర్, ఎస్ఐ సుధీర్, సిబ్బంది ఉన్నారు. బంధువులకు మృతదేహం అప్పగింత బుధవారం రాత్రి హత్యకు గురైన శిరీష మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచారు. మృతురాలికి మూడేళ్ల వయస్సు ఉన్న కుమారుడు ఉండడంతో అతడికి న్యాయం చేయాలని బంధువులు గురువారం డిమాండ్ చేశారు. దీంతో పెద్దమనుషులు నిందితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించగా.. వారు కోదాడలో అంత్యక్రియలు నిర్వహించారు. ఫ శిరీష హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన ఎస్పీ -
క్రిప్టో యాప్ పేరుతో ఘరానా మోసం !
త్రిపురారం : కష్టపడకుండానే కాసులు కురుస్తాయని ఆశపడ్డారు.. ఆన్లైన్ యాప్‌లో అధిక లాభాలు ఆర్జించవచ్చు అని మోసగాళ్లు చెప్పిన మాయమాటలు నమ్మారు. చివరకు కష్టపడి కూడబెట్టిన సొమ్మును కేటుగాళ్ల పాలుచేసి లబోదిబోమంటున్నారు. క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ పేరుతో సాగుతున్న ఓ భారీ స్కామ్ ఇప్పుడు నల్లగొండ జిల్లా త్రిపురారం మండలంలో కలకలం రేపుతోంది. డబుల్ ధమాకా ఆఫర్లతో సామాన్యులను ఆకర్షించి, వారి నుంచి లక్షలాది రూపాయలు కొల్లగొట్టినట్లు సమాచారం అందుతోంది. ఈ క్రిప్టో యాప్ మోసం వెనుక త్రిపురారం మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 30 రోజుల్లో డబ్బు రెట్టింపు ఈ దందాలో నిందితులు అనుసరించిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. ముందుగా రూ.50 వేలు పెట్టుబడిగా పెట్టించి ఒక ఐడీ కేటాయిస్తారు. అనంతరం వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో చేర్చి, ప్రతిరోజూ ఒక గజిబిజి కోడ్‌ను పంపిస్తారు. ఆ కోడ్‌ను యాప్‌లో వారు పంపిన లింక్ ఓపెన్ చేసి పేస్ట్ చేస్తే చాలు..డాలర్లు వచ్చినట్లు కనబడతాయి. చైన్ సిస్టమ్ తరహాలో మరికొందరిని చేర్పిస్తే అదనపు కమీషన్లంటూ ఆశ చూపారు. దీంతో మధ్యతరగతి ప్రజలు, రైతులు, చిరు వ్యాపారులు సైతం తమ వద్ద ఉన్న సొమ్మును ఈ యాప్‌లో కుమ్మరించి మోసపోయారు. 30 రోజుల్లో డబ్బులు రెట్టింపు అంటూ పలువురితో ఈ యాప్ ద్వారా పెట్టుబడులు పెట్టించినట్లు తెలిసింది. క్రిప్టో యాప్ పెట్టుబడుల్లో కొంత మందికి లాభాలు రావడంతో మరి కొందరు మంది ఈ యాప్‌లో పెట్టుబడులు పెట్టారని సమాచారం. ఒకరు యాప్‌లో పెట్టుబడి పెట్టి క్రిప్టో యాప్‌కు మరొకరిని పరిచయం చేస్తే సుమారు 500 నుంచి 650 వరకు డాలర్లు వస్తున్నట్లు ప్రచారం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, చిరు వ్యాపారులు, డ్రైవర్లు పలువురు వ్యవసాయదారులు ప్రజాప్రతినిధులను సైతం ఇందులో చేర్పించినట్లు తెలిసింది. క్రిప్టో యాప్‌లో మోసపోయినవారు బయటకు వస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. ఒక్కొక్కరు రెండు మూడు ఐడీలు.. ఈ యాప్‌లో పెట్టుబడి పెట్టినవారు ఒక్కొక్కరు రెండు మూడు ఐడీలు తీసుకుని లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఈ యాప్ ద్వారా వచ్చిన డాలర్లను ప్రత్యేకమైన వ్యక్తి కొనుగోలు చేయాల్సి ఉండడం గమనార్హం. ఆ వ్యక్తి మొదట కొందరికి మొదట లాభాలు కూడా అందజేసినట్లు తెలిసింది. కొందరికి ఈ యాప్ ద్వారా లాభాలు రావడంతో మండలంలోని చాలా గ్రామాల ప్రజలు యాప్‌లో పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. త్రిపురారం మండలంలో ఈ యాప్‌లో దాదాపు రెండు నుంచి మూడు కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టి మోసపోయినట్లు సమాచారం. ఫ మొదట రూ.50 వేలతో ప్రారంభం ఫ కోట్ల రూపాయల్లో పెట్టుబడులు ఉన్నట్లు సమాచారం ఫ మోసపోయిన ప్రజలు ఫ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాని బాధితులు త్రిపురారం మండలంలో క్రిప్టో యాప్ ద్వారా మోసపోయినట్లు మా దృష్టికి రాలేదు. బాధితులు ఫిర్యాదు కూడా చేయలేదు. ప్రజలు అనధికార యాప్‌లను నమ్మి పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు. యాప్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితులు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. –గైకూరి నరేష్, ఎస్ఐ, త్రిపురారం -
విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
చివ్వెంల(సూర్యాపేట) : విద్యుదాఘాతంతో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటనలు చివ్వెంల మండల పరిధిలోని వాల్యతండా, కోమటికుంట గ్రామాల్లో గురువారం జరిగాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండల పరిధిలోని వాల్యతండా గ్రామానికి చెందిన ధరావతు అనూష (25) ఇంట్లో ఉతికిన దుస్తులు అరవేస్తుండగా, దండెంకు విద్యుత్ సరఫరా జరిగి విద్యుదాఘాతానికి గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి భర్త రాంచంద్రు ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి.మహేశ్వర్ కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలికి భర్త, పిల్లలు ఉన్నారు. పెళ్లింట్లో విషాదం.. తెల్లవారితే పెళ్లి.. ఇంట్లో విద్యుత్ వైర్లు సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై పెళ్లి కుమార్తె తమ్ముడు మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండల పరిధిలోని కోమటి కుంట గ్రామానికి చెందిన పిట్టల దినేష్ (19) తన సోదరి పెళ్లి శుక్రవారం జరుగనున్న నేపథ్యంలో ఇంట్లో విద్యుత్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కిందపడి సృహ కోల్పోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పెళ్లింట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతుడి తండ్రి పిట్టల సైదులు ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి.మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన పిట్టల దినేష్ మృతురాలు అనూష (ఫైల్) ఫ దుస్తులు ఆరేస్తూ ఒకరు.. ఫ పెళ్లి పనులు చేస్తుండగా మరొకరు.. -
ప్రైవేట్ కళాశాలల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరిటౌన్ : జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి కార్పొరేట్ విద్యా పథకం కింద విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు అర్హత గల ప్రైవేటు జూనియర్ కళాశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఇన్చార్జ్ అధికారి పి.సాహితి తెలిపారు. హాస్టల్ వసతి, ఉత్తమ విద్యా ప్రమాణాలు కలిగి ఉన్న కళాశాలలు ఈ నెల 11వ తేదీలోపు ఈ–పాస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.గత ఐదేళ్ల అకడమిక్ ప్రొఫైల్‌తో కొత్త రిజిస్ట్రేషన్లు లేదా రెన్యువల్స్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆన్లైన్ దరఖాస్తుల హార్డ్ కాపీలను ధ్రువపత్రాలతో జతచేసి రాయగిరిలోని కలెక్టరేట్లో రూమ్ నంబర్ ఎస్ –17లో సమర్పించాలని, గడువు దాటిన తర్వాత దరఖాస్తులు స్వీకరించబోమని స్పష్టం చేశారు. యాదగిరీశుడికి సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. తెల్లవారు జామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. కేవీలో అడ్మిషన్లురామగిరి (నల్లగొండ): నల్లగొండలోని కేంద్రీయ విద్యాలయం (కేవీ)లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్ జి.శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సంర ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 20 సీట్లు, 3వ తరగతి 1 సీటు ఖాళీ ఉందని పేర్కొన్నారు. ఆసక్తి గల అర్హులైన వారు ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. బోయ జంగయ్య సాహిత్య సేవలు మరువలేనివి రామగిరి (నల్లగొండ) : తెలంగాణ కవి డాక్టర్ బోయ జంగయ్య సాహిత్య సేవలు మరువలేనివని ప్రముఖ కవి మేరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. తెలంగాణ సాహితీ నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో గురువారం నల్లగొండలోని యూటీఎఫ్ భవన్లో బోయ జంగయ్య వర్ధంతి సభను నిర్వహించారు. జంగయ్య చిత్రపటానికి కవులు, రచయితలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యాదగిరిరెడ్డి మాట్లాడుతూ బోయ జంగయ్య రచయితగా సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించడానికి ప్రయత్నం చేసిన సంఘ సంస్కర్త అని కొనియాడారు. కార్యక్రమంలో సినీ విమర్శకుడు డాక్టర్ ఎం.పురుషోత్తమాచార్య, పున్న అంజయ్య,రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ తండు కృష్ణకౌండిన్య, తెలంగాణ సాహితీ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్, జీవకవి మునాసు వెంకట్, డాక్టర్ హసేన పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం అర్వపల్లి: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. అర్వపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లారీల కొరతతో ధాన్యం ఎగుమతులు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మిల్లర్లు తాలు పేరుతో ధాన్యం తూకాల్లో కోతలు విధిస్తున్నారని పేర్కొన్నారు. -
పూడికతీత ముసుగులో మట్టి దందా
లారీల్లో మట్టి నింపుతున్న ఈ ఫొటో మోటకొండూరు మండలం వర్టూరు చెరువుది. అభివృద్ధి కమిటీ పేరుతో తీర్మానం చేసి, దానిని అడ్డంపెట్టుకొని మట్టి దందా కొనసాగిస్తున్నారు. అధికారికంగా 2 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తరలింపునకు మాత్రమే అనుమతి ఉండగా, దాదాపు 12 ఎకరాల మేర చెరువును తవ్వేస్తున్నారు. మీటరు లోతు తవ్వాల్సి ఉండగా 12 మీటర్ల లోతు తవ్వుతున్నారు. ఆరు టిప్పర్లకు అనుమతి తీసుకొని వందకు పైగా భారీ టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారు. హైదరాబాద్ చుట్టపక్కల, ఘట్కేసర్, చౌటుప్పల్, తిరుమలగిరి, చీకటి మామిడి, కాటపల్లి తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెరువుల పూడిక పేరుతో తీస్తున్న మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఐలయ్య, అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తదితరులుసాక్షి, యాదాద్రి : యాదగిరిగుట్ట, ఆలేరు ప్రాంతాల్లో సుమారు 40 వేల పేద, మధ్యతరగతి కుటుంబాల ఇళ్లు, స్థలాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ సమావేశ మందిరంలో మంత్రి పొంగులేటి అధ్యక్షతన ఉమ్మడి నల్లగొండ జిల్లా రెవెన్యూ, గృహనిర్మాణ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఐలయ్య, అనిల్‌కుమార్‌రెడ్డిలు తమ నియోజకవర్గాల్లోని దీర్ఘకాలిక సమస్యలను మంత్రి దష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా జిల్లాలోని యాదగిరిగుట్ట, ఆలేరు ప్రాంతాల్లో నిషేధిత జాబితాలో నమోదైన సుమారు 40 వేల పేద, మధ్యతరగతి కుటుంబాల ఇళ్లు, స్థలాలను ఆ జాబితా నుంచి తొలగించాలని కోరారు. దీనిపై మంత్రి పొంగులేటి సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అదేవిధంగా తుర్కపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో గతంలో నిర్మించిన ఇళ్లను అటవీ భూములుగా గుర్తించడం వల్ల నిలిచిన కొత్త నిర్మాణాల అనుమతులపై చర్చించగా, వాటిని అటవీ జాబితా నుంచి తొలగించాలని మంత్రి సూచించారు. యాదగిరిగుట్ట రిజిస్ట్రేషన్ కార్యాలయానికి కొత్త భవనం మంజూరుకు, తుర్కపల్లి మండలానికి అదనంగా మరో 50 ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు మంత్రి హామీ ఇచ్చారు. పెరిగిన ఆహార భద్రత కార్డుల సంఖ్యకు అనుగుణంగా కొత్త రేషన్ దుకాణాల ఏర్పాటుపై సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ధాన్యం సేకరణలో జాప్యం జరగకుండా వాహనాలను అందుబాటులో ఉంచాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, మండలి సభ్యుడు నెల్లికంటి సత్యం పాల్గొన్నారు. ఫ అడ్డూఅదుపులేని మాఫియా ఫ మీటరులోతుకు అనుమతి.. 12 మీటర్లు తవ్వకం ఫ పొలాల పేరుతో ఇటుక బట్టీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు ఫ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి -
తరుగు పేరుతో దోపిడీ
భువనగిరిటౌన్ : ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తరుగు పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రాలలో తరుగుపేరిట ధాన్యంలో కోత విధించడాన్ని నిరసిస్తూ గురువారం భువనగిరి పట్టణ శివారులోని తుక్కాపూర్ ఎక్స్‌రోడ్డు వద్ద నల్లగొండ– భువనగిరి రహదారిపై ధాన్యం బస్తాలు పెట్టి రైతులు ధర్నా చేశారు. దీంతో కిలోమీటర్‌మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కష్టపడి వస్తే మిల్లర్లు, దళారులు కుమ్మకై ్క తాలు పేరుతో బస్తాకు 2 నుంచి 5 కిలోల వరకు కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తేమ శాతం సాకుతో క్వింటాకు భారీగా నష్టం కలిగిస్తున్నారని, తూకం వేసిన ధాన్యాన్ని తరలించడానికి లారీలు కూడా రాకపోవడంతో రోజుల తరబడి కేంద్రాల వద్దే నిద్రపోవాల్సి వస్తోందని వాపోయారు. తుక్కాపూర్ గ్రామ సర్పంచ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు ఆధ్వర్యంలో నిర్వహించారు. ధర్నా వద్దకు భువనగిరి తహసీల్దార్ జగన్మోహన్ప్రసాద్, పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్‌కుమార్ వద్దకు వచ్చి రైతులకు సర్ది చెప్పడంతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నోముల మహేందర్ రెడ్డి, పుట్ట వీరేష్ యాదవ్, రాసాల మల్లేష్, సత్యనారాయణ గౌడ్, లింగస్వామి యాదవ్, సుధాకర్ రెడ్డి, రాజమోహన్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఫ రైతుల ఆగ్రహం ఫ భువనగిరి శివారులో రోడ్డుపై ధాన్యం బస్తాలు పెట్టి ధర్నా -
భువనగిరి మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక
భువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో గురువారం కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. స్థానిక కౌన్సిల్ హాలులో మున్సిపల్ చైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి అధ్యక్షతన నిర్వహించిన ఈ ప్రత్యేక సమావేశానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. మున్సిపల్ కమిషనర్ కె. చంద్రప్రకాష్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ ఎన్నికలో నలుగురు సభ్యులను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన కేటగిరీలో పల్లెర్ల యాదగిరి, బడుగు విజయ, అల్ప సంఖ్యాక వర్గాల కేటగిరీలో సుజాయత్ అలి కౌసర్, బట్టు వరలక్ష్మిలను ఎంపిక చేశారు. ఎమ్మెల్యే ఓటు హక్కుతో కలిపి మొత్తం 26 మంది సభ్యులు చేతులెత్తి ఈ ఎన్నికకు మద్దతు తెలిపారు. కొత్తగా ఎన్నికై న సభ్యులతో కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయించగా, ఎమ్మెల్యే, చైర్పర్సన్ వారికి డిక్లరేషన్ సర్టిఫికెట్లు అందజేసి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో భువనగిరి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద మౌలిక వసతుల పనులను ఈ నెలాఖరు లోపు పూర్తి చేసి, లబ్ధిదారులకు వెంటనే గృహప్రవేశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉదయం కోరం లేక సమావేశం వాయిదా .. అంతకుముందు ఉదయం 11 గంటలకు నిర్వహించాల్సిన సమావేశం కోరం లేక మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా పడింది. మధ్యాహ్నం జరిగిన సమావేశానికి కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 27 మంది హాజరుకాగా, బీజేపీ నలుగురు, బీఆర్ఎస్ నలుగురు, స్వతంత్ర అభ్యర్ధి 1 కౌన్సిలర్లు ఈ ఎన్నికకు గైర్హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పోతంశెట్టి మంజుల, కౌన్సిలర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
మేల్కోకపోతే అట్టడుగుకే..!
భువనగిరిటౌన్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీస్వచ్ఛ సర్వేక్షణ్–2026శ్రీ ర్యాంకింగ్ సాధనలో మున్సిపాలిటీలు వెనుకబడుతున్నాయి. సర్వే ప్రక్రియ ప్రారంభమై 14 రోజులు గడుస్తున్నా.. ప్రజల్లో అవగాహన కల్పించడంలో మున్సిపల్ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. అత్యంత కీలకమైన సిటిజన్ ఫీడ్‌బ్యాక్‌కు కేటాయించిన 1000 మార్కులను సాధించడంలో అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. గడువు సమీపిస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో, స్వచ్ఛ ర్యాంకింగ్‌లో భువనగిరి, ఆలేరు సహా జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు అట్టడుగున నిలిచే ప్రమాదం నెలకొంది. కానరాని ప్రచారం పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఇందులో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు గత నెల 25వ తేదీనే స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు. దీనిపై మున్సిపల్ అధికారులు పట్టణ ప్రజలకు కనీస అవగాహన కల్పించ లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ విడుదల చేసిన లింక్ ద్వారా పౌరులు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. కానీ, జిల్లాలోని ఆలేరు, భువనగిరి, యాదగిరిగుట్ట, మోత్కూరు, పోచంపల్లి, చౌటుప్పల్ మున్సిపాలిటీల్లో దీనిపై ప్రచారం ఎక్కడా కనిపించడం లేదు. ఆ 1000 మార్కులు చేజారేనా? ఈ సర్వేలో పౌరుల అభిప్రాయం (సిటిజన్ ఫీడ్‌బ్యాక్) అత్యంత కీలకం. మున్సిపాలిటీల పనితీరుపై పౌరులు ఇచ్చే సమాధానాలకు మొత్తం 1,000 మార్కులు కేటాయించారు. ఇందుకోసం రూపొందించిన 13 ప్రశ్నలకు ప్రజలు స్పందించాల్సి ఉంటుంది. ఎంత ఎక్కువ మంది ప్రజలు ఈ సర్వేలో పాల్గొంటే ఆ పట్టణానికి అంత మెరుగైన ర్యాంకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, అధికారుల ఉదాసీనత వల్ల ప్రజలకు ఈ విషయమే తెలియడం లేదు. ఫలితంగా జిల్లాలోని పట్టణాల ర్యాంకులు భారీగా పడిపోయే ప్రమాదం ఉంది. సర్వేలో ప్రాధాన్యతా అంశాలివే.. స్వచ్ఛ సర్వేక్షణ్–2026లో భాగంగా భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు, పోచంపల్లి, చౌటుప్పల్ మున్సిపాలిటీల్లో స్వచ్ఛ పోటీ మొదలైంది. కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ, స్వచ్ఛభారత్ అర్బన్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సర్వేలో పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాల శుభ్రత, తడి, పొడి చెత్త సేకరణ, డంపింగ్ యార్డులు, మరుగుదొడ్ల నిర్వహణ వంటి అంశాలను పరిశీలిస్తూ మొత్తం 12,500 మార్కులను కేటాయించారు. ఇందులో బహిరంగ మలమూత్ర విసర్జన రహిత సర్టిఫికెట్, క్షేత్రస్థాయి పరిశీలన, సర్వీస్ లెవల్ ప్రోగ్రెస్ వంటి విభాగాలకు ప్రాధాన్యతనిచ్చారు.ఫ స్వచ్ఛ సర్వేక్షణ్‌పై కదలని మున్సిపల్ యంత్రాంగం ఫ ప్రచారం లేక ఫీడ్‌బ్యాక్ ఇచ్చేందుకు ప్రజల అనాసక్తి ఫ ర్యాంకింగ్‌లో వెనుకబడుతున్న మున్సిపాలిటీలు ఫ 25వ తేదీతో ముగియనున్న గడువునిబంధనల ప్రకారం.. మున్సిపాలిటీల పరిధిలో కనీసం 20 శాతం జనాభా నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టాల్సి ఉంటుంది. జిల్లాలోని పలు మున్సిపాలిటీలలో ఇప్పటివరకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టకపోవడంతో ఆ 1,000 మార్కులు చేజారిపోయేలా ఉన్నాయి. ఈ నెల 25వ తేదీతో అభిప్రాయ సేకరణ గడువు ముగియనుంది. సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో, అధికారులు ఇప్పటికై నా స్పందించి ప్రచారం వేగవంతం చేయకపోతే స్వచ్ఛ ర్యాంకింగ్‌లో మన పట్టణాలు వెనుకబడటం ఖాయం. -
మెగా జాబ్ మేళాను వినియోగించుకోవాలి
భువనగిరి: ఈ నెల 8,9,10 తేదీల్లో భువనగిరిలో నిర్వహించే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కోరారు. గురువారం సాయంత్రం స్థానిక న్యూడైమెన్షన్ హైస్కూల్లో చేసిన ఏర్పాట్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. సుమారు 20 కంపెనీలకుపైగా పాల్గొని 3500 ఖాళీలను భర్తీ చేసుకునేందుకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట కుంభం ఫౌండేషన్ చైర్మన్ కీర్తిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ శ్రీవాణి, వైస్ చైర్పర్సన్ మంజుల, నాయకులు పోత్నక్ ప్రమోద్‌కుమార్, కూర వెంకటేశం, మంగ ప్రవీణ్, సాయి, సన్నీ ఉన్నారు. -
యాదగిరీశుడి సేవలో వేం నరేందర్‌రెడ్డి
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు బుధవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈఓ భవానీ శంకర్ ఆధ్వర్యంలో అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను వేం నరేందర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ మండపంలోని సువర్ణ పుష్పార్చన ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. వారికి అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ భవానీ శంకర్ స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. ఆయన వెంట ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, స్థానిక నాయకులున్నారు. -
రూ. 100 కోట్లేవి స్వామీ..!
సాక్షి, యాదాద్రి : అంతర్జాతీయ ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరుగాంచిన యాదగిరిగుట్ట అభివృద్ధికి నిధుల కొరత గుదిబండగా మారింది. ముఖ్యమంత్రి ఇచ్చిన రూ.100 కోట్ల హామీ ఏడాదైనా అమలుకు నోచుకోకపోవడంతో దుకాణాల సముదాయం, గండి చెరువు సుందరీకరణ, బస్టాండ్ వంటి కీలక పనులన్నీ పెండింగ్‌లోనే పడిపోయాయి. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పాలకమండలి ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన సైతం కార్యరూపం దాల్చ లేదు. దీంతో అధికారుల పాలనలో పర్యవేక్షణ కొరవడి అవకతవకలు చోటుచేసుకుంటూ దేవస్థానం ప్రతిష్టకు మచ్చ తెస్తున్నాయి. పెండింగ్‌లోనే పనులు యాదగిరీశుడి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆధ్యాత్మిక వాడలో నిర్మాణం చేపట్టిన దుకాణాల సముదాయం ఇంకా పూర్తి కాలేదు. శ్రీస్వామి వారి ప్రత్యేక ఉత్సవాల్లో తెప్పోత్సవాన్ని నిర్వహించేందుకు, భక్తులకు ఆహ్లాదాన్ని పంచేందుకు గండి చెరువు సుందరీకరణకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సరిపడా నిధులు లేకపోవడంతో ఆ పనులు పూర్తి కాలేదు. యాదగిరి కొండకు దిగువన ఉన్న కల్యాణ కట్ట సమీపంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన దేవస్థానం బస్టాండ్ అసంపూర్తిగానే మిగిలిపోయింది. ఇక మొదటి ఘాట్ రోడ్డులోని ఆర్యవైశ్య సత్రం నుంచి జీయర్ కుటీర్ వరకు నిర్మాణం చేస్తున్న ఎంట్రీ ఫ్లై ఓవర్ పనులు చివరి దశలో కొనసాగుతున్నాయి. ఇటీవల లండన్ నుంచి తీసుకువచ్చిన బ్రిడ్జిని అనుసంధానం చేసే పనులు పూర్తి చేశారు. టెంపుల్ సిటీపై విల్లాల నిర్మాణం ఇప్పటి వరకు చేపట్టలేదు. దాతల సహకారంతో అక్కడ విల్లాలు నిర్మాణం చేయాలని గత ప్రభుత్వం యోచించింది. ఇదిలా ఉండగా ఏడాది క్రితం తన పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యాదగిరిగుట్టకువచ్చారు. ఆ సందర్భంగా దేవస్థానం అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని ప్రకటించారు. కానీ ఇంతవరకు నిధులు కేటాయించలేదు. దీంతో అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయి. వేముల వాడ, భద్రాచలం, బాసర ఆలయాల మాదిరిగా నిధులు మంజూరు చేసి మరింత అభివృద్ది చేయాలని భక్తులు కోరుతున్నారు. ఫ ఏడాదైనా అందని నిధులు ఫ యాదగిరిగుట్ట ఆలయంలో ఎక్కడి పనులు అక్కడే ఫ పాలకమండలి ఊసే లేదు యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు అటకెక్కింది. ఏడాది క్రితం తిరుపతి తిరుమల దేవస్థానం తరహాలో యాదగిరిగుట్టకు పాలక మండలిని నియమిస్తామని సీఎం ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన నూతన చట్టం ప్రకారం 18 మంది సభ్యులతో యాదగిరిగుట్ట పాలకమండలి ఏర్పాటు కావాలి. ఇందులో ప్రభుత్వం తొమ్మిది మందిని నామినేట్ చేయనుంది. ఐఏఎస్ అధికారి ఈవోగా ఉంటారు. అధికారులు ఈ పాలక మండలిలో ఉంటారు. కానీ ఇంతవరకు పాలక మండలి ఏర్పాటు కాలేదు. దీంతో యాదగిరిగుట్ట క్షేత్రంలో అధికారుల పాలన భక్తులకు అవస్థలను మిగిల్చుతోంది. అఽధికారుల పాలనలో దేవస్థానంలో పలు అవకతవకలు జరుగుతున్నాయి. చింతపండు దొంగతనం, బంగారు డాలర్ల మాయం,గోదాం నుంచి ప్రసాదాల తయారీలో వాడే విలువైన పదార్థాల చోరీలు, ఇలా పలు సంఘటలు దేవస్థానానికి మచ్చ తెచ్చే విధంగా చోటు చేసుకుంటున్నాయి. పాలకవర్గం లేకపోవడం, అధికార యంత్రాంగం సరైన దృష్టి సారించడంలేదన్న ఆరోపణలుఉన్నాయి. -
ఆవు నిజాయితీ గొప్పది
మేము మోత్కూరులో ఉంటాము. వేసవి సెలవులు కావడంతో ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్‌పేటలో ఉంటున్న మా నానమ్మ ఇంటికి వచ్చాను. మా తాత చెప్పిన పులి, ఆవు కథ నాకు బాగా నచ్చింది.ఆత్మకూరు(ఎం) : ఓ ఆవు ఒక లేగ దూడను ఇంటి వద్ద వదిలి మిగిలన మందతో కలసి మేతకు పోతుంది. అక్కడ పులి ఎదురవుతుంది. ఎంతో ఆకలితో ఉన్న ఆ పులి ఆవును తినాలని చూస్తుంది. అప్పుడు ఆ ఆవు ఇంటి వద్ద చిన్నలేగ దూడ ఉంది. దానికి కడుపు నిండా పాలు ఇచ్చి వచ్చి నీకు ఆహారమై ఆకలి తీర్చుతానని చెబుతుంది. పులి ఆవు మాటలను నమ్మలేదు. ఆవు బతిమిలాడడంతో చివరకు పులి సమ్మతించి ఆవును వెళ్లమంది. దీంతో ఆవు పరుగు పరుగున ఇంటికి చేరి లేగ దూడను అక్కున చేర్చుకుంది. కడుపు నిండా పాలు ఇచ్చింది. కంట కన్నీరు కార్చుకుంటూ తిరిగి ఆవు అడవికి పయనమైంది. ఇచ్చిన మాట ప్రకారం పులికు ఆహారం అయ్యేందుకు దాని ఎదురుగా నిల్చుంది. కానీ పులి ఆవును తినకుండా.. మాటకు కట్టుబడి నిజాయితీగా తిరిగి వచ్చిన ఆవును మెచ్చుకుంటుంది. ఇంటికి వెళ్లి లేగ దూడతో సంతోషంగా ఉండు అంటూ పులి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. -
కొత్తగూడెం వద్ద ట్రాఫిక్ జామ్
భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లి మండల శివారులోని కొత్తగూడెం సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి మామిడికాయల లోడ్లతో లారీలు, ట్రక్కులు, ఆటోలు, మినీవాహనాలు కొత్తగూడెం వద్ద ఉన్న పండ్ల మార్కెట్‌కు వస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్డు వెంట అస్తవ్యస్తంగా పార్కింగ్ చేస్తుండటంతో పోచంపల్లికి నుంచి వచ్చే పోయే వాహనాలు, బస్సులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి గంటల తరబడి నిలిచిపోవడంతో హైదరాబాద్‌కు వెళ్తున్న ఉద్యోగస్తులు, విద్యార్థులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యను బుధవారం మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ యువజన నాయకుడు గుత్తి బాలశంకర్.. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఎంపీ వెంటనే స్పందిస్తూ వనస్థలిపురం ట్రాఫిక్ ఏసీపీ నవీన్‌కుమార్‌తో ఫోన్లో మాట్లాడి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. మైదానంలో వాహనాలను పార్కింగ్ చేయించి టోకెన్లు ఇచ్చి వాహనాలను ఒక్కొక్కటిగా పంపించాలని సూచించారు. ఎంపీ ఆదేశాల మేరకు ఏసీపీ వెంటనే ఘటన స్థలాన్ని సందర్శించారు. ట్రాఫిక్ సమస్యను గురువారంలోగా పరిష్కరిస్తామని చెప్పారు. -
వృద్ధురాలిని హత్య చేసిన నిందితుడి అరెస్టు
నార్కట్‌పల్లి : రెండేళ్ల క్రితం వృద్ధురాలిని హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్లో బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంలకు చెందిన రెబ్బ జానకమ్మ(72) ఇంట్లో ఉండగా 2024 ఆగస్టు 2న అర్ధరాత్రి అదే గ్రామానికి చెందిన కొలను కార్తీక్ ఇంట్లోకి ప్రవేశించి జానకమ్మ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారం దోచుకుని వెళ్లిపోయాడు. మృతురాలి కుమారుడు యాదగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్కట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేయగా.. డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో నార్కట్‌పల్లి సీఐ నాగరాజు, ఎస్ఐ విష్ణుమూర్తి, పోలీసు సిబ్బంది విచారణ చేపట్టారు. బుధవారం నిందితుడు కార్తీక్‌ను నార్కట్‌పల్లి శివారులోని మునుగోడు రోడ్డు ఫ్లైఓవర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. జానకమ్మ వద్ద తాను రూ.1.18లక్షలు అప్పు తీసుకున్నానని, ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని జానకమ్మ ఒత్తిడి చేస్తుండటంతో హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని డీఎస్పీ తెలిపారు. కార్తీక్ విజయవాడలోని ఓ హోటల్లో సప్లయర్‌గా పనిచేస్తున్నాడని, అతడు దొంగిలించిన ఆభరణాలను రూ.3.50లక్షలకు సికింద్రాబాద్‌లో ఓ వ్యక్తికి అమ్మి, ఆ డబ్బును జల్సాలకు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు. -
నిబంధనలు ఉల్లంఘించిన స్కూల్ బస్సులపై కేసు
భువనగిరి : విద్యార్థుల కోసం కేటాయించిన స్కూల్ బస్సులను ఇతర అవసరాలకు వినియోగిస్తున్న యాజమాన్యాలపై జిల్లా రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. స్కూల్ బస్సులను పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అద్దెకు పంపిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై జిల్లా రవాణా అధికారి సాయికృష్ణ ఆదేశాల మేరకు అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మక్తానంతారం వద్ద నిర్వహించిన తనిఖీల్లో బీబీనగర్‌కు చెందిన మహర్షి హైస్కూల్, చౌటుప్పల్‌కు చెందిన త్రినిటి స్కూల్ బస్సులను నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్నట్లు గుర్తించి అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎంవీఐలు శ్రీహర్షారెడ్డి, ప్రణీత్‌రెడ్డి మాట్లాడుతూ స్కూల్ బస్సులను కేవలం విద్యార్థుల రవాణాకే వాడాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.. కాగా ట్రావెల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల వెంకట్ జంగారెడ్డి ఆధ్వర్యంలో డీటీఓకు ఫిర్యాదు చేయడంతో దాడులు నిర్వహించారు. ఫిర్యాదు చేసిన వారిలో జిల్లా కార్యదర్శి అంబటి సుధాకర్, పన్నాల మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. -
సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి
దేవరకొండ : సమ్మర్ క్యాంపులను విద్యార్థులు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు ఉచిత కరాటే శిక్షణను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కరాటే నేర్చుకోవడం ద్వారా సెల్ఫ్ డిఫెన్స్‌తో పాటు శారీరక దృఢత్వం పెంపొందుతుందని పేర్కొన్నారు. క్రీడాకారులకు చేయూత అందిస్తున్న స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్వీటీని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉమామహేష్, పంతులాల్, ఐడీ ప్రసన్న, వైఎస్ కరుణాకర్, ఆంజనేయులు, వెంకటేష్, యాదగిరి, గోపి తదితరులు పాల్గొన్నారు. దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు -
ఉపాధికి ఫొటో కష్టాలు
రామన్నపేట: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్)పేరును వీబీజీ రామ్‌జీగా మార్పు చేసి అమలులో పారదర్శకత పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పనుల్లో పారదర్శకత కోసం తీసుకువచ్చిన ముఖ ఆధారిత హాజరు(నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం) కూలీలతో పాటు, క్షేత్ర సహాయకులకు శాపంగా మారింది. సాంకేతిక సమస్యలతో కూలీల హాజరు నమోదు పెద్ద తలనొప్పిగా మారింది. పలుమార్లు ఫొటో తీసినా అప్లోడ్ కాకపోవడంతో గంటల తరబడి ఎండలో నిరీక్షించాల్సి వస్తోంది. రోజుకూ రెండు సార్లు హాజరు ఉపాధిహామీ ఫథకం (వీబీజీ రామ్‌జీ)పనులకు వచ్చే కూలీల హాజరును రోజుకూ రెండు సార్లు నమోదు చేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఉదయం పనికి వచ్చిన వెంటనే కూలీల ఫొటో తీసి అప్లోడ్ చేయాలి. పని ముగిసిన తరువాత మళ్లీ రెండవసారి తీసి అప్లోడ్ చేయాలి. రెండు హాజర్ల మధ్య కాల వ్యవధి కనీసం నాలుగు గంటలు ఉండాలి. ఎండాకాలంలో త్వరగా పని ముగించుకొని వెళ్లాలనుకుంటే కుదరదు. నాలుగు గంటల వ్యవధిలోపల ముఖ చిత్రం తీసుకోదు. అంత వరకు ఎండలో వేచి ఉండాల్సిందే. ఏ మాత్రం తేడా ఉన్నా అంతే.. మూడేళ్ల క్రితం వరకు కూలీల హాజరును మస్టర్లలో నమోదు చేసే వారు. పని ప్రారంభించిన కొద్దిసేపటి తరువాత మేట్లు కూలీలతో మస్టర్లలో సంతకాలు చేసే వారు. రెండేళ్ల క్రితం హాజరు విధానాన్ని మార్చారు పనికి హాజరైన కూలీల గ్రూప్ ఫొటోను తీస్తే సరిపోయేది. ఇటీవల ప్రతీ కూలీ ఫొటోను ప్రారంభం, ముగింపు సమయాల్లో తీయాలనే నిబంధనను ప్రభుత్వం తీసుకు వచ్చింది. కూలీల ఆధార్‌ను అనుసంధానం చేసి కేవైసీ పూర్తి చేశారు. కూలీల ఫొటో, కనుపాపలను స్కాన్ చేశారు. హాజరు నమోదు సమయంలో ఫొటోలో ఏ చిన్నమార్పు ఉన్నా మిస్ మ్యాచ్ అంటూ తిరస్కరణకు గురి అవుతుంది. వెలుతురు సరిగా లేకపోయినా, ఇంటర్నెట్ రాకున్నా, ఫీల్డ్ అసిస్టెంట్ల మొబైల్ క్లారిటీ లేకున్నా హాజరు నమోదు కావడం లేదు. గతంలో ఫొటో తీసిన సమయంలో గడ్డంతో ఉండి ప్రస్తుతం లేక పోయినా, అప్పట్లో గడ్డం లేకుండా ఉండి ఇప్పుడు గడ్డం ఉన్నా ఫొటో తీసుకోవడం లేదని కూలీలు ఆవేదన చెందుతున్నారు. కొందరు కూలీలు సబ్బుతో ముఖం కడిగి పౌడర్ వేస్తే తప్ప ఫొటో తీసుకోవడం లేదు. ప్రతీ పనిప్రదేశంలో ఒకరిద్దరు కూలీల ఫొటో నమోదు కోసమైనా గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోందని, లేకుంటే ఆ రోజు హాజరు పడక వేతనం కోల్పోవాల్సి వస్తుందనే ఆవేదన కూలీల్లో వ్యక్తమవుతోంది.ఫ నెట్ రాక.. ఫొటో దిగక.. ఫ గంటల కొద్దీ ఎండలోనే నిరీక్షణ ఫ పని చేసినా పడని హాజరు -
నిధులు రాకుండా అడ్డుకుంటున్న ఎమ్మెల్యే
మోత్కూరు: దళిత బంధు నిధులు విడుదల కాకుండా ఎమ్మెల్యే మందుల సామేల్ అడ్డుకుంటున్నారని పలువురు లబ్ధిదారులు ఆరోపించారు. ఈవిషయంలో మోతూరులో ఎమ్మెల్యేతో వారు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా విలేకరులో వారు మాట్లాడారు. గత ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని మొదటి విడత విజయవంతంగా అమలు చేసిందని , 2023లో రెండో విడతలో భాగంగా మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు చెందిన 254 మంది లబ్ధిదారుల అకౌంట్లలో రూ.3 లక్షల చొప్పన జమ చేసిందన్నారు. అసెంబ్లీ ఎన్నికలు వచ్చి కోడ్ అమల్లోకి రావడంతో రూ.3 లక్షలు జమ చేసిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసిందన్నారు. అంతటితో పథకం ఆగిపోయిందని కానీ యూనిట్లు మంజూరైన వారికి గ్రౌండింగ్ పూర్తి చేయాలని 2025లో ఎస్సీ కార్పొరేషన్ ఎం.డీ ఆదేశాలు జారీ చేశారన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అమలుకు చర్యలు తీసుకున్నారుకానీ యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అడ్డగూడూరు, మోత్కూరు మండలాలకు చెందిన 254 మంది కుటుంబాల లబ్ధిదారులకు మాత్రం నిధులు విడుదల కాకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఒక దళిత ఎమ్మెల్యే అయి ఉండి దళితుల పొట్ట కొడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని గ్రౌండింగ్ పూర్తి చేసి నిధులు విడుదలయ్యేలా చూడాలని లేకుంటే రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత బంధు లబ్ధిదారులు కూరెళ్ల రమేష్, బండి వెంకటేష్, దాసరి నరేష్, బుషిపాక శ్రీకాంత్, ఆనంద్, నాగరాజు, ఆనందం తదితరులు పాల్గొన్నారు. ఫ దళిత బంధు లబ్ధిదారుల ఆరోపణ ఫ ఎమ్మెల్యే సామేల్‌తో వాగ్వాదం -
దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
భువనగిరిటౌన్ : రాష్ట్రంలోని దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మహిళా శిశు వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, వికలాంగుల సంస్థ, భారత ప్రభుత్వరంగ చమురు సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం దివ్యాంగులకు విడతల వారీగా పరికరాలను పంపిణీ చేస్తోందని, రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని, పంపిణీ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని స్పష్టం చేశారు. దివ్యాంగుల రక్షకుడు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దివ్యాంగుల కోసం పెద్ద ఎత్తున సహాయక పరికరాలు పంపిణీ చేయడం ఇదే మొదటిసారి అని కొనియాడారు. ఉద్యోగాల్లో నాలుగు శాతం, ఉన్నత విద్యలో ఐదు శాతం, ఇందిరమ్మ ఇళ్లలో ఐదు శాతం, యువ వికాస పథకంలో ఐదు శాతం కేటాయింపులు చేసి దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని కాపాడారని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రజా పాలన ప్రణాళికలో భాగంగా దివ్యాంగులకు పరికరాలు అందించడం మంచి పరిణామమని అన్నారు. జిల్లాలో మొత్తం 600 మందికి పైగా లబ్ధిదారులకు ఈ పరికరాలను అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తీ, శిశు అభివృద్ధి పథక అధికారులు వెంకట రమణ, శైలజ, స్వరాజ్యం, నాజీ, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.ఫ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి -
అధికారం పోయినా అహంకారం తగ్గలే
నకిరేకల్ : మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు అధికారం పోయినా అహంకారం తగ్గలేదని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్‌లోని తన నివాసంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్ధేశించి కేటీఆర్ మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆయనకు ఒంటి నిండా ఎంత అహంకారం ఉందో అర్థమవుతుందన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై నోటికొచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. పాలనకు పనికిరారని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టినా బీఆర్ఎస్ నాయకులకు అహంకారం తగ్గలేదన్నారు. వరంగల్‌లో శృతిని ఎన్కౌంటర్ చేయించింది మీరు కాదా.. వరి వేస్తే ఉరి అని చెప్పింది మీరు కాదా.. రుణమాఫీ చేస్తామని రైతుల్ని మోసం చేసంది మీరా కాదా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రాన్ని దోచుకుతిన్న కేసీఆర్ కుటుంబం దొర అహంకారాన్ని తెలంగాణ సమాజం ఎప్పుడూ క్షమించదన్నారు. కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చిన ప్రతి నల్ల చట్టం వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందని విమర్శించారు. ఈ సమావేశంలో నాయకులు పన్నాల రాఘవరెడ్డి, లింగాల వెంకన్న, చౌగోని శ్రీనివాస్, నంద్యాల వెంకట్‌రెడ్డి, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం -
అమూల్యమైనదే..
ప్రేమతో ఇచ్చేది ఏదైనావేసవి సెలవుల్లో మా అమ్మమ్మ వద్దకు వెళ్లినప్పడు ఆమె నాకు చాలా నీతి కథలు చెప్పేది. అందులో ఈ ఉడుత దూరదృష్టి కథ చాలా బాగా నచ్చింది. చిలుకూరు : అనగనగా ఒక అడవిలో చాలా జంతువులు ఉండేవి. ఆ జంతువులన్నీ కలిసిమెలిసి ఉంటున్నాయి. ఓ రోజు అడవికి రాజైన సింహం తన పుట్టినరోజుకు రావాలని మిగిలిన జంతువులకు ఆహ్వానం పంపింది. అడవికి సింహాం రాజు కావడంతో పుట్టినరోజుకు జంతువులన్నీ తప్పనిసరిగా వెళ్లాలని అనుకున్నాయి. ఈ క్రమంలో తమ తమ స్థాయిని బట్టి ఏదో ఒక బహుమతిని ఇవ్వాలని వేటికి అవే అనుకున్నాయి. దీంతో ఒక్కో జంతువు ఒక్కోరకంగా పూల గుత్తి, మిఠాయిలు, బంగారు కిరీటాలు, వెండి కడియాలు తదితర విలువైన బహుమతులు తీసుకెళ్లాయి. అయితే బహుమతి తీసుకెళ్లేంత స్థామత లేని ఉడుత ఏ బహుమతి తీసుకెళ్లాలో అర్ధంకాక బాధపడుతూ ఉంది. సింహం స్థాయికి తగిన బహుమతి ఇవ్వకపోతే ఏమైతుందో అని దీర్ఘాలోచనలో పడింది. ఈ క్రమంలో ఉడుతకు ఒక ఆలోచన తట్టింది. వెంటనే ఆ ఉడుత అడవిలో తిరుగుతూ ఎండిన చెట్ల గింజలను ఏరుకొని వచ్చి ఆ గింజలను వెదురు బొంగులో పోసి దానిని ఆకర్షణీయంగా తయారు చేసి సింహాంకు అందజేసింది. పుట్టినరోజు వేడుకల అనంతరం మిత్రులు తెచ్చిన బహుమతులను సింహం పరిశీలిస్తుండగా అన్నీ చాలా విలువైనవి కనిపించాయి. ఈ క్రమంలో ఉడుత ఇచ్చిన వెదురు బొంగు బహుమతి విచిత్రంగా కనిపించింది. దీంతో మిగతా జంతువులు నవ్వాయి. అయితే మిగతా జంతువులు ఇచ్చిన బహుమతులు తాత్కాలిక ఆనందాన్ని, ప్రయోజనాన్ని కలిగించేవి కాగా.. ఉడుత ఇచ్చిన బహుమతితో దీర్ఘకాలిక ప్రయోజనం ఉందని సింహం, మిగతా జంతువులు గ్రహించాయి. అదేమిటంటే వెదరు బొంగులోని విత్తనాలన్నీ నాటితే వృక్ష సంపద పెరిగి పండ్లు, ఫలాలు అందుతాయని, అంతేకాకుండా తమ మనుగడకు భవిష్యత్‌లో దట్టమైన అడవిని అందించగలవని గ్రహించాయి. వెంటనే జంతువులన్నీ కలిసి గింజలను భూమిలో నాటాయి. ఉడుత దీర్ఘ దృష్టిని మిగతా జంతువులు మెచ్చుకున్నాయి. మరి మీరు కూడా ఎండిన విత్తనాలను సేకరించి రాబోయే వర్షాకాలంలో భూమిలో నాటి మంచి వన సంపదను పెంపొందించాలని నేను ఆశిస్తున్నాను. నీతి : బహుమతి విలువ దాని ధరలో ఉండదు. అది ఇచ్చే వారి ప్రేమపై ఆధారపడి ఉంటుంది. చిన్నదైనా సరే ప్రేమతో ఇచ్చేది ఎంతో అమూల్యమైనది.అమ్మమ్మ చెప్పిన నీతి కథ -
యాదగిరి క్షేత్రంలో స్థానిక బదిలీలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఈఓ భవానీ శంకర్ పలు విభాగాలకు సంబంధించిన అధికారులను స్థానికంగా బదిలీలు చేశారు. సుమారు 25 మందిని బదిలీ చేశారు. వీరిలో ఏఈఓలు, సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిసెంట్లు, రికార్డు అసిస్టెంట్లు ఉన్నారు. వీరంతా వెంటనే తమకు కేటాయించిన విభాగాల్లో చేరాలని ఈఓ ఆదేశించారు. యాదగిరిగుట్టలో సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం వేకువ జామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరా ధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. 8న మత్స్యకారులకు అవగాహన సదస్సు భువనగిరిటౌన్ : రైతు వారంలో భాగంగా ఈ నెల 8న మత్స్యకారులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి రాజారాం ఒక ప్రకటనలో తెలిపారు. భూవనగిరి జిల్లా కలెక్టరేట్లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందని, మత్స్య శాస్త్రవేత్తలు పాల్గొనే ఈ సదస్సులో చెరువుల్లో కలుపు మొక్కల నివారణ, చేపల వ్యాధుల నియంత్రణ, అధికోత్పత్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారని వివరించారు. జిల్లాలోని మత్స్యకార సంఘాల సభ్యులు, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలిభువనగిరి: ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌లో జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభను జయప్రదం చేయాలని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కోరారు. భువనగిరి పట్టణంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు రూ. 7 వేల కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ప్రధాని వస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాయ దశరథ, నాయకులు పట్నం శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, రామకృష్ణ, నరసింహారావు, కృష్ణచారి, ఉడుత భాస్కర్, మల్లికార్జున్ పాల్గొన్నారు. -
ధాన్యం గ్రేడింగ్‌లో మాయ
కేంద్రంలో ‘ఏ’ గ్రేడ్‌గా నిర్ధారిస్తే మిల్లర్ వద్దకు వచ్చేసరికి ‘బి’ గ్రేడ్‌గా మార్పుబొమ్మలరామారం: ధాన్యం కొనుగోళ్ల పక్రియ పారదర్శకంగా వేగవంతగా నిర్వహిస్తున్నామంటున్న అధికారులు క్షేత్ర స్దాయిలో పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. కొనుగోలు కేంద్రాలలో ఏఈఓల రైతుల ధాన్యాన్ని పరిశీలించి ఏ గ్రేడ్‌గా ధృవీకరిస్తున్నారు. కానీ ఏఈఓ ధ్రువీకరణ మిల్లర్ ఆధిపత్యం ముందు ఓడిపోతోంది. బొమ్మలరామారం మండలంలోని కొనుగోలు కేంద్రాల నుంచి పలు మిల్లర్ల వద్దకు ధాన్యం లోడింగ్ లారీలు వెళ్లగా వారు నానా కొర్రీలు పెడుతున్నారు. బి గ్రేడ్ ధాన్యంగా నమోదు చేస్తేనే అన్లోడ్ చేసుకుంటామని, లేదంటే కొనుగోలు కేంద్రాలకు తిరిగి పంపుతామని స్పష్టం చేస్తున్నారు. దీంతో చేసేది లేక బి గ్రేడ్ ధాన్యం లోడ్లుగా రికార్డు చేసుకొని అన్లోడ్ చేసుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లేక.. మిల్లర్ల ఆధిపత్యం కొనసాగుతున్నా ఏ అధికారి వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. సకాలంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. ఏ గ్రేడ్‌ను బి గ్రేడ్‌గా మారుస్తున్నా, లారీల కొరత వేధిస్తున్నా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. 16వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు బొమ్మలరామారం మండలంలోని చీకటిమామిడి, ఫక్కీరు గూడెం, హాజీపూర్, మైలారం, మేడిపల్లి, రామలింగంపల్లి, పిల్లి గుండ్ల తండా, తిమ్మాపూర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. బుధవారం నాటికి 10,198 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో బొమ్మలరామారం, నాగినేనిపల్లి, మర్యాల, చౌదర్పల్లి, జలాల్పూర్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో 6 వేల క్వింటాళ్ల వరకు కొనుగోలు చేశారు. వీటిలో నాగినేనిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో 740 ధాన్యం బస్తాలు మాత్రమే ఏ గ్రేడ్, మిగిలిన ధాన్యం మొత్తం బి గ్రేడ్‌గానే పరిగణనలోకి తీసుకున్నారు. మొత్తం 16 వేల క్వింటాళ్లకు పైగా ధాన్యం బి గ్రేడ్‌గానే మిల్లర్లు పరిగణనలోకి తీసుకొని నమోదు చేసుకున్నట్లు తెలిసింది. వేధిస్తున్న లారీల కొరత బొమ్మలరామారం మండలంలోని కేంద్రాల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసేందుకు లారీల కొరత వేధిస్తోంది. తూకం వేసిన ధాన్యం రోజులతరబడి కేంద్రాల్లోనే మూలుగుతోంది. కాంటా అయిన ధాన్యం లోడింగ్ అయ్యే వరకు బస్తాలు తడవకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులదేనని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద కాపలాదారులుగా మారారు. -
వేగంగా అర్జీల పరిష్కారం
నేటి నుంచి డివిజన్ స్థాయిలోనూ ప్రజావాణిప్రభుత్వం ఆదేశాల మే రకు ఇక నుంచి ప్రతి సోమవారం రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజా వాణి కార్యక్రమం జరుగుతుంది. ఆర్డీఓ (రెవెన్యూ డివిజనల్ అధికారి) నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. అన్ని శాఖల డివిజన్ స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై, ప్రజల వినతులను స్వీకరించి, వాటి పరిష్కారానికి కృషిచేస్తారు. ప్రతి వినతిని తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసి యూనిక్ రిఫరెన్స్ నంబర్‌తో కూడిన రశీదు పత్రం ఇస్తాం. – అనురాగ్ జయంతి, కలెక్టర్ సాక్షి, యాదాద్రి : ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమంలో మార్పులు చేస్తూ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజావాణి ద్వారా వచ్చే అర్జీలను గరిష్టంగా 30 రోజుల్లోగా పరిష్కరించేలా కార్యాచరణ సిద్ధం చేసింది. దీంట్లో భాగంగా ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌తోపాటు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ప్రజావాణి నిర్వహించాలని ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి ప్రభుత్వ శాఖలో ప్రత్యేకంగా ప్రజావాణి విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో ఇకనుంచి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌తోపాటు భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల సమస్యలపై వినతులు స్వీకరిస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అధికారుల్లో జవాబుదారీతనం పెంచేలా.. ఇకనుంచి ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి డివిజన్ స్థాయిలో ఆర్డీఓ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. సబ్ కలెక్టర్ లేదా ఆర్డీఓ కార్యాలయాల్లో జరిగే ఈ కార్యక్రమనికి డీఎల్పీఓ, డిప్యూటీ డీఎంహెచ్ఓ, వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్, డిస్కం డీఈ, ఆర్ అండ్ బీ డీఈఈ, సీడీపీఓ తదితర అధికారులు హాజరై సమస్యల పరిష్కారానికి కృషిచేయాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రజలకు ప్రయాణ భారం తగ్గి, తమ నివాస ప్రాంతాలకు దగ్గరలోనే ఉన్నతాధికారులను కలిసే అవకాశం కలుగుతుంది. ఎప్పటిలాగానే జిల్లాస్థాయి ప్రజావాణికి కలెక్టర్ జిల్లా నోడల్ అధికారిగా, అదనపు కలెక్టర్ అదనపు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరై ప్రజల విజ్ఞప్తులను స్వీకరించాల్సి ఉంటుంది. డిజిటల్ పర్యవేక్షణకు సీజీజీ పోర్టల్ ప్రజావాణి ప్రక్రియలో పారదర్శకతను పెంచేలా ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని తప్పనిసరి చేసింది. ప్రజల నుంచి వచ్చిన ప్రతి పిటిషన్‌ను వెంటనే ‘సీజీజీ’ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) ప్రజావాణి పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి స్పష్టం చేశారు. ప్రతి వినతికి ఒక ప్రత్యేక ఐడీ (యూనిక్ రిఫరెన్స్ నంబర్)తో కూడిన రిసిఫ్ట్‌ను దరఖాస్తుదారుడికి అందజేస్తారు. దీనిద్వారా ప్రజలు తమ విన్నపం ఏ స్థితిలో ఉందో ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. గడువులోగా పరిష్కారం చూపకపోతే.. స్వీకరించిన ఫిర్యాదులను గరిష్టంగా 30 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆయా శాఖల అధికారులు తీసుకున్న చర్యలపై నివేదికలను కూడా పోర్టల్‌లో ఉంచాలని ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా పరి ష్కారం చూపకపోతే, ఆ కేసులు ఆటోమేటిక్‌గా ఉన్నతాధికారుల పర్యవేక్షణలోకి వాటికవే వెళ్తాయి. ఉన్నతాధికారులకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఫిర్యాదుదారులకు వసతులు డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కోసం ఆర్డీఓ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, కుర్చీలు, వఅత్యవసర వైద్యసేవలు వంటి వసతులు కల్పిస్తారు. కాగా భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయాలను ప్రజావాణి కోసం సిద్ధం చేశారు. ఫ కలెక్టరేట్‌తోపాటు భువనగిరి, చౌటుప్పల్‌లో నిర్వహణ ఫ గరిష్టంగా 30 రోజుల్లో పరిష్కరించేలా కార్యాచరణ ఫ సీజీజీ పోర్టల్ ద్వారా పర్యవేక్షణ ఫ మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం -
‘పది’ తప్పిన వారికి స్పెషల్ క్లాస్‌లు
భువనగిరి : పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను గట్టెక్కించేందుకు విద్యాశాఖ నడుం బిగించింది. జూన్ 5 నుంచి ప్రారంభమయ్యే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి ఇప్పటికే పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో జూమ్ మీటింగ్ నిర్వహించి, విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులు 152 మంది గత మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగాయి. ఆయా పరీక్షలకు మొత్తం 8,918 మంది విద్యార్థులు హాజరు కాగా 8,766 మంది ఉత్తీర్ణులయ్యారు. 152 మంది ఫెయిల్ అయ్యారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 105 మంది ఉన్నారు. సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు పాస్ అయ్యేలా రూపొందించిన కార్యాచరణను అమలు చేయనున్నారు. తెలుగు, ఇంగ్లీష్, ఆ తర్వాత గణితంలో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా తెలుగులో తడబడ్డారు. పరీక్షలకు తక్కువ వ్యవధి జూన్ 5 నుంచి 11వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అడ్వాన్స్డ్ సఫ్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. తక్కువ వ్యవధి ఉండటంతో విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు ప్రారంభించారు. ఫెయిల్ అయిన సబ్జెక్టుకు సంబంధించి ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చి విద్యార్థికి ప్రత్యేకంగా పాఠాలు బోధిస్తున్నారు. వృత్యంతర శిక్షణలో ఉపాధ్యాయులు ఈ నెల 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు జనగణన ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలో సుమారు 80 శాతం వరకు ఉపాధ్యాయులకు ఈ విధులు నిర్వహించేందుకు కేటాయించారు. ఇప్పటికే వీరికి జనగణన పై శిక్షణఇస్తున్నారు. ఇలాంటి సందర్భంలో సంబంధిత సబ్జెక్టు ఫెయిల్ అయిన విద్యార్థులకు సంబంధించి ఉపాధ్యాయులుంటే వారి పరిస్థితి ఎలా అన్ని సందేహాలు ఉన్నాయి. మండలాల వారీగా ఫెయిల్ అయిన విద్యార్థులను గుర్తించాలి. విద్యార్థి ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడో ఆ సబ్జెక్టుకు సంబంధించిన ఉపాధ్యాయుడు వారిని దత్తత తీసుకోవాలి. విద్యార్థులకు నేరుగా గానీ లేదా వీలును బట్టి వాట్సప్ ద్వారా ముఖ్యమైన అంశాలను వివరించడంతో పాటు చదువుకునేందుకు ముఖ్యమైన అంశాలు ఇవ్వాలి. ఎక్కువ మంది ఫెయిలైన విద్యార్థులకు నేరుగా పాఠశాలకు రప్పించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. ఫ ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యాశాఖ కార్యాచరణ ఫ ఫెయిల్ అయిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 105 మంది ఫ జూన్ 5వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలో సుమారు 70 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఇందులో ఒక్కో సబ్జెక్టు ఫెయిల్ అయిన వారు ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే సమావేశం నిర్వహించి ప్రధానోధ్యాయులకు ఆదేశాలు ఇచ్చాం. జనగణన నిర్వహించే వారు విధుల అనంతరం ఫోన్ ద్వారా ప్రత్యేకంగా సందేహాలు నివృతి చేయనున్నారు. – సత్యనారాయణ, డీఈఓ -
సమాజ సేవకు ముందుకు రండి
మోత్కూరు : సమాజ సేవ చేయాలనుకునే వారు రెడ్‌క్రాస్‌లో సభ్యులుగా చేరాలని రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ లక్ష్మీనర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మోత్కూరులో రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదు స్పెషల్ డ్రైవ్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 31 వరకు జిల్లాలో రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదు కోసం స్పెషల్ డ్రైవ్ కొనసాగనుందన్నారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఐఆర్సీఎస్ రాష్ట్ర చైర్మన్ దాన కిషోర్ నిర్ణయంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని రాయగిరి రోడ్డు పాత వివేరా హోటల్ పక్కన ఉన్న రెడ్‌క్రాస్ భవనంలో సభ్యత్వం తీసుకోవచ్చన్నారు. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డుతో పాటు రూ.1,160తో కార్యాలయంలో ఇవ్వాలని, పరిశీలించిన అనంతరం శాశ్వత సభ్యత్వాన్ని ఇవ్వడం జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు సెల్ : 8985960689, 99599 97750 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ యూత్ వింగ్ జిల్లా అధ్యక్షుడు బీసు మత్స్యగిరి, మోత్కూరు మండల ఉపాధ్యక్షుడు ముప్ప వెంకట్‌రెడ్డి, ముప్ప తిరుమల్‌రెడ్డి, అవిరేని శోభన్‌బాబు, శ్రీనివాసరావు, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. ధాన్యాన్ని ఎప్పటికప్పుడుదిగుమతి చేసుకోవాలిభువనగిరి : లారీల్లో తెచ్చిన ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకోవాలని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి ఆదేశించారు. ఆదివారం భువనగిరిలోని శివ రైస్ మిల్లును ఆర్డీఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం లోడుతో ఉన్న లారీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం దిగుమతి కోసం సరిపడా హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ధాన్యం దిగుమతిలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట రెవెన్యూ సిబ్బంది, మిల్లు యజమానులు ఉన్నారు. జాబ్‌మేళా విజయవంతంనల్లగొండ : నల్లగొండలో నిర్వహించిన మెగా జాబ్‌మేళా విజయవంతం అయ్యిందని జిల్లా యువజన సర్వీసులు, క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాలకు ఈ నెల 2న 125 కంపెనీలు, 2000 మంది నిరుద్యోగులు హాజరు కాగా, 3న 23 కంపెనీలు, 150 మంది నిరుద్యోగులు హాజరైనట్లు తెలిపారు. ఈ జాబ్‌మేళా ద్వారా అనేక మందికి ఉద్యోగాలు లభిచాయని తెలిపారు. సామాజిక ఉద్యమంలా ‘రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు’ నల్లగొండ టౌన్ : రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 27 నుంచి నిర్వహిస్తున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు, అన్నదాతల అవగాహన కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా నిర్వహిస్తామని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అందాస్ జానయ్య తెలిపారు. ఆదివారం నల్లగొండలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో యూనివర్సిటీ సైంటిస్టులు, వివిధ పరిశోధన కేంద్రాలకు చెందిన సైంటిస్టులు, వ్యవసాయ శాఖ అధికారులు భాగస్వాములు అవుతున్నారని చెప్పారు. ఎరువుల వాడకం, సాగు ఖర్చు తగ్గించడం, భూసారం పరిరక్షణ, పంటల మార్పిడి విధానంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కేవీకే కంపాసాగర్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.లింగయ్య, శాస్త్రవేత్తలు డాక్టర్ జి.శివప్రసాద్, కె.సంధ్యారాణి, జి.స్వాతి, ఎ.రాములమ్మ, హిమబింధు, సాయిప్రియ, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. -
శ్రీనృసింహుడి క్షేత్రంలో సుదర్శన హోమం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి పుణ్యక్షేత్రంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా జరిపించారు. ఆదివారం వేకువజామునే దేవాలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలను చేపట్టారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజను సంప్రదాయంగా జరిపించారు. దక్షిణ దిశలోని ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలను నిర్వహించారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాఢ వీధిలో శ్రీస్వామి అమ్మవార్ల జోడు సేవను ఊరేగించారు. -
నాలాల సర్వే ఎటుపోయింది!
ఆలేరు : ఆలేరు మున్సిపాలిటీలో ప్రధాన నాలాలు ఆక్రమణకు గురవుతున్నా అధికారుల్లో చలనం లేకుండా పోయింది. ఆక్రమణలను గుర్తించడంలో మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆక్రమణల గుర్తింపునకు సంయుక్త సర్వే చేపట్టనున్నట్టు రెండు శాఖల అధికారులు ప్రకటించి నెలలు గడుస్తున్నా పురోగతి శూన్యం. నాలాల కబ్జాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సూచించినా అధికారులు కాలయాపన చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముంపు సమస్యపై ప్రజాప్రతినిధులు, అధికారులు కేవలం ప్రకటనలు చేసి వదిలేయడంపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలాల ఆక్రమణలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లూ చేపట్టలేదు. దాంతో వచ్చే వానా కాలంలో ఎలాంటి ఉపద్రవం ముంచుకోస్తుందోనని ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ సమస్య.. ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని రంగనాయకుల వీధి, కుమ్మరివాడ, ప్రగతి స్కూల్, పాత పంచాయతీ కార్యాలయం, బ్రహ్మంగారి గుడి నుంచి ఈదమ్మ గుడి వరకు ప్రతి సంవత్సరం వానా కాలంలో వరదలు ముంచెత్తడంతో ఆయా ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ ప్రాంతంలో సుమారు మూడు వేల ఇళ్లు, ఆరు వేల జనాభా ఉంది. వర్షాలు కురిస్తే ఇళ్లలోకి నీరు చేరి సరుకులు, సామగ్రి పూర్తిగా తడిసి పోతాయి. ప్రజలు కూడా రాత్రంతా నిద్రలేకుండా గడపాల్సిన దుస్థితి నెలకొంటుంది. గత ఏడాది.. గత ఏడాది సెప్టెంబర్‌లో భారీ వర్షాలతో ఆయా కాలనీలు జలయమం అయ్యాయి. ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆర్డీఓ కృష్ణారెడ్డి ఇతర అధికారులు సందర్శించారు. ఈ సమయంలో నాలాల కబ్జాల వల్లే వరదలు ముంచెత్తి కాలనీలను అతలాకుతలం చేస్తున్నాయని ముంపు బాధితులు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే వరదలకు కారణమైన నాలాల ఆక్రమణల ను తొలగించి, ముంపు సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధికారుల పరిశీలనలో.. కొందరు రియల్టర్లు లేఅవుట్లు చేయడం, మరికొందరు నిబంధనలకు విరుద్ధంగా గృహనిర్మాణాలు చేపట్టడం వల్ల నాలాలు ఆక్రమణలకు గురైనట్టు అప్పట్లో అధికారులు గుర్తించారు. ఆక్రమణలతో నాలాలు కుంచించుకుపోయి వరద నీరు ముందుకు పోలేక ఇళ్లను ముంచెత్తుతున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. దాంతో మున్సిపల్, రెవెన్యూ అధికారులు నాలాల ఆక్రమణల గుర్తింపునకు సంయుక్తంగా సర్వే చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా నోటీసులు జారీ చేసి, సదరు యజమానుల నుంచి వివరణ తీసుకుంటామని ప్రకటించి ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పిచ్చిమొక్కలు, మట్టి దిబ్బలతో ఆనవాళ్లు కోల్పోయిన ఆలేరు పట్టణంలోని నాలా బృందావన్ కాలనీ సమీపంలో ఆక్రమణలతో కుంచించుకు పోయిన నాలాపట్టణ శివారులోని బైరవకుంట, పర్రెకాల్వ నుంచి శ్రీరామకృష్ణ విద్యాలయం వరకు దాదాపు 9 కిలోమీటర్ల పొడవుతో ఐదు ప్రధాన వరద నాలాలు ఉన్నాయి. ఎగువన ఉన్న రెండు కుంటలు నిండితే 10,11,12 వార్డుల పరిధిలోని కల్వర్టులు, నాలాల మీదుగా వరదనీరు వెళ్లి, బైపాస్ సమీపంలోని పెద్దవాగులో కలుస్తాయి. కానీ నాలాల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, మట్టి దిబ్బలు అడ్డుగా ఉండటంతో ప్రతి వర్షాకాలంలో వరద నీరు సాఫీగా ముందుకు వెళ్లక కాలనీలను ముంచెత్తుతోంది. రంగనాయకుల వీధి, కుమ్మరివాడ, ప్రగతి స్కూల్, పాత పంచాయతీ కార్యాలయం, బ్రహ్మంగారి గుడి నుంచి ఈదమ్మ టెంపుల్ వరకు ఉన్న ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. వరదలతో గత ఏడాది ఆస్తినష్టం కూడా వాటిల్లింది. వరద తీవ్రత ఎక్కువై ప్రాణనష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఫ ఆలేరు మున్సిపాలిటీలో ఆక్రమణల గుర్తింపులో జాప్యం ఫ రెవెన్యూ, మున్సిపల్ శాఖల మధ్య సమన్వయ లోపం ఫ ఇష్టానుసారంగా నిర్మాణాలు ఫ ప్రభుత్వ విప్ చెప్పినా కదలని యంత్రాంగం ఫ ముంపు గుప్పిట్లో కాలనీలు -
నేటి నుంచి రైతు వారం
భువనగిరి : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు రైతు వారం నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో వ్యవసాయ శాఖ, దాని అనుబంధ శాఖలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నాయి. పంటల సాగు, సస్యరక్షణ చర్యలు, సేంద్రియ వ్యవసాయం వంటి తదితర అంశాలపై సదస్సుల ద్వారా రైతులకు అవగాహన కల్పించనున్నారు. కార్యాచరణ ఇలా.. ● మొదటి రోజు : నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం–ప్రకృతి, పౌరసరఫరాల శాఖ వినయోగదారులు కోరుకునే సన్నవరి రకాల సాగుపై అవగాహన కల్పించి భూసార పరీక్ష ఫలితాల కార్డులు అందజేస్తారు. ● రెండో రోజు : నియోజకవర్గ స్థాయిలో ఉద్వాన పంటల సాగు–ఆయిల్ పామ్ సాగువిస్తీర్ణం పెంపుదల, ప్రత్యామ్నాయ పంటల సాగు విధానాలను వివరిస్తారు. ● మూడో రోజు : రైతు వేదికల్లో బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలు, సహకార సంఘాలు, ఎఫ్పీఓల ద్వారా రైతులకు అందించే సేవలను తెలియజేస్తారు. ● నాలుగో రోజు : నియోజకవర్గ స్థాయిలో వ్యవసాయ క్షేత్రాలు, సౌర విద్యుత్ కేంద్రాలు, పీఎం కుసుమ్, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్స్ వినియోగంపై వివరిస్తారు. ● ఐదో రోజు : పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో పాడి పరిశ్రమ–పశుజాతి అభివృద్ధి, దూడల ప్రదర్శన, గడ్డి విత్తనాలు–వేసవి పశుసంరక్షణ కార్యక్రమం, మత్స్యశాఖ ఆధ్వర్యంలో చెరువులలో కలుపు మొక్కల నివారణ, వ్యాధుల నివారణ, అధికోత్పత్తికి చర్యలు, నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో సమర్థ నీటి విడుదల, గేట్ల నిర్వహణ, కాల్వల్లో కంపచెట్లు, గుర్రపు డెక్క తొలగింపు కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తారు. ● ఆరో రోజు : గ్రామస్థాయిలో నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో సమతుల్య నీటి వినియోగం, కార్యాలయాల పరిశుభ్రతపై తెలియజేస్తారు. రైతు వారం కార్యక్రమాన్ని ఆరు రోజులపాటు నిర్వహిస్తాం. ఈ కార్యక్రమానికి రైతులు హాజరై వ్యవసాయ శాఖ, దాని అనుబంధ శాఖల అధికారులు అందించే సమాచారాన్ని తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలి. – రమణారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఫ సాగు పద్ధతులు, పథకాలపై అవగాహన కల్పించడమే లక్ష్యం ఫ వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో సదస్సులు ఫ తొలిరోజు భూసార పరీక్షఫలితాల కార్డులు అందజేత -
యాదగిరీశుడి ఆలయంలో 108 మందితో వీణా వాయిద్యం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్రంలో శ్రీనృసింహస్వామి వారి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని గురువారం రాత్రి 108 మంది వీణా వాయిద్యం కళాకారులు ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. శ్రీఅన్నమాచార్యులు ద్వాదశ తరము శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల శిష్య బృందం అన్నమయ్య సంకీర్తన సాహిత్య ప్రచార వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పెందుకు యాదగిరి క్షేత్రంలో 108 మంది కళాకారులు వీణా వాయిద్యం చేశారు. మీనాక్షి శ్రీనివాసు నిర్వహణలో తెలుగు రాష్ట్రంలోని కల్యాణి హేమలత, ఉమాదేవి, ప్రశాంతి శిష్య బృందాలు ఈ వేడుకలో పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో 108 మంది కళాకారులు వీణా వాయిద్యం ప్రదర్శించడం ఇదే మొదటి సారి. -
రైతులు పడిగాపులు కాస్తున్నా పట్టించుకోరా
యాదగిరిగుట్ట (తుర్కపల్లి): కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్‌రెడ్డి విమర్శించారు. తుర్కపల్లి మండలం ముల్కలపల్లిలో ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యంపై ఆగ్రామంలోని రహదారిపై రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి, రైతులతో కలిసి రాసారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి పది రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా కొనకపోవడంపై మండిపడ్డారు. శుక్రవారం వరకు కొనుగోళ్లు ప్రారంభించకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అంతకు ముందు ముల్క లపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించిన సునిత, రామచంద్రారెడ్డిలతో పోలీసులు మాట్లాడారు. కలెక్టర్ వచ్చే వరకు రాస్తారోకో చేస్తామని చెప్పడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ రాస్తారోకోలో మండల అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సాగర్ల పరమేష్, ఎంపీటీసీమాజీ సభ్యుడు గిద్ద కరుణాకర్, భిక్షపతి, ఇమ్మడి మల్లప్ప, రాజేష్‌నాయక్, బుక్యా రవి నాయక్, లక్ష్మణ్ నాయక్, మేకల బాలకృష్ణ, గుంటి శ్రీశైలం, గుగులోతు మోతీరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.ఫ ధాన్యం కొనుగోలులో జాప్యంపై మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత ఆగ్రహం ఫ ముల్కలపల్లిలో రైతులతో కలిసి రాస్తారోకో -
122 ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత
టెన్త్ ఫలితాల్లో జిల్లాలో అత్యధికంగా తెలుగులోనే ఫెయిల్ అయ్యారు. గత మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పబ్లిక్ పరీక్షలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 8,918 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 8,766 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో మొత్తం 152 మంది విద్యార్థులు ఫెయిల్ కాగా తెలుగులో 75మంది, హిందీలో ముగ్గురు, ఇంగ్లిష్‌లో 39, గణితంలో 36, సైన్స్‌లో 29, సాంఘిక శాస్త్రంలో ఐదుగురు అనుత్తీర్ణులయ్యారు. భువనగిరి: పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు సత్తాచాటాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జెడ్పీ ఉన్నత పాఠశాలలు, మోడల్, కేజీబీవీలు, టీఎస్‌ఆర్‌ఈఐఎస్,ఎస్టీ గురుకుల పాఠశాలలు కలిపి మొత్తం 176 ఉండగా 122 స్కూళ్ల వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. ఆయా పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టడం, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారు కనీసం ఉత్తీర్ణత సాధించేలా సన్నద్ధం చేయడంలో సఫలమయ్యారు. కొన్ని స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణతసాధించేందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కొంత మంది విద్యార్థులను దత్తత తీసుకుని వారి పై పర్యవేక్షణ చేయడం, ప్రభుత్వం పెట్టిన పరీక్షలు కాకుండా అదనంగా ఎగ్జామ్స్ నిర్వహించడం వంటి కార్యక్రమాలతో సక్సెస్ కాగలిగారు. ఈ సారి పరీక్షకు మరో పరీక్షకు మధ్య సుమారు నాలుగు రోజులు వ్యవధి ఇవ్వడం ఉపాధ్యాయులు, విద్యార్థులకు కలిసివచ్చింది. మూడు మండలాల్లోనూ.. జిల్లాలోని మూడు మండలాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాజాపేట మండలంలో 12 జెడ్పీహెచ్ఎస్లుండగా 431 మంది , గుండాల మండలంలో 6 జెడ్పీహెచ్ఎస్లుండగా 251మంది, నారాయణపురం మండలంలో 6 జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలుండగా ఇందులో 402 మంది ఉన్నారు. వీరంతా ఉత్తీర్ణత సాధించారు.


