సాధం విజయలక్ష్మికి ఉమెన్‌ ఐకాన్‌ అవార్డు | - | Sakshi
Sakshi News home page

సాధం విజయలక్ష్మికి ఉమెన్‌ ఐకాన్‌ అవార్డు

May 11 2026 9:55 AM | Updated on May 11 2026 9:55 AM

మేళ్లచెరువు : మండలంలోని రేవూరు గ్రామానికి చెందిన సాధం విజయలక్ష్మి ఉమెన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ సైకాలజీ అవార్డు అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో గల ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో నిర్వహించిన తెలంగాణ సైకాలజిస్టు అసోసియేషన్‌ దశాబ్ది ఉత్సవాలలో హర్యానా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ చేతులమీదుగా ఆమె ఈ అవార్డు అందుకున్నారు. ఆమెను గ్రామ సర్పంచ్‌ జూనెబోయిన గురవయ్యయాదవ్‌, మాజీ సర్పంచ్‌ సాధం గంగయ్య యాదవ్‌ అభినందించారు.

ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

భువనగిరి : మండలంలోని రాయగిరి గ్రామ పరిధిలో గల మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌కు చెందిన కూచిపూడి నాట్య గురువులు గిరీష్‌, దేవిల శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. సందర్శకులను కూచిపూడి నృత్యం ఎంతగానే ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కళాకారిణులు లోహిత, లీనా, సహస్ర, సాహితి, కమలిక, స్నేహిక తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement