breaking news
Narayanpet
-
రైతులకు సరిపడా యూరియా అందజేయాలి
మద్దూరు: రైతులకు సరిపడా యూరియా ప్రభుత్వం అందజేయాలని డిమాండ్ చేస్తూ గురువారం అఖిలభారత ఐక్య రైతు సంఘం అధ్వర్యంలో మద్దూరులోని వ్యవసాయశాఖ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ఽసంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు యూరియాను సరఫరా చేయడంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్రానికి కేంద్రం సరఫరా చేయాల్సిన యూరియా 9.91 లక్షల మెట్రిక్ టన్నులైతే ఇప్పటి వరకు సరఫరా చేసినా యూరియా 7 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అన్నారు. మోదీ ప్రభుత్వం యూరియా సరఫరాల రాజకీయ డ్రామాలు ఆడుతుందన్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా యూరియా కోసం కేంద్రపై ఒత్తిడి తీసుకురావడంలో పూర్తిగా విఫలమైందని, రైతుకు అవసరమైనప్పుడు యూరియా సరఫరా చేయకపోతే రైతు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. వెంటనే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అవసరమైన మేర యూరియాను అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐక్య రైతు సంఘం నాయకులు కొండ నర్సిములు, శ్రీహరి, అంజి, రాములు, కృష్న, వెంకటప్ప, హన్మప్ప, రాజు, తదితరులు పాల్గొన్నారు. -
కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
● ఇనాం భూమి ఓఆర్సీ కోసంరూ.40 వేలు లంచం డిమాండ్ ● ఆర్ఐ, డిప్యూటీ సర్వేయర్నుఅదుపులోకి తీసుకున్న అధికారులు కొత్తకోట రూరల్: రోజూ ఏదో ఒకచోట ఏసీబీ అధికారులకు ప్రభుత్వ అధికారులు చిక్కుతూనే ఉన్నారు. తాజాగా గురువారం వనపర్తి జిల్లా కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని నిర్వేన్‌కు చెందిన ఓ రైతు తన ఇనాం భూమి ఓఆర్సీ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్ విచారణకు ఎంఆర్ఐ వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్‌రెడ్డిని ఆదేశించారు. వీరిద్దరు భూమి చూడటానికి రూ.40 వేలు లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం మధ్యాహ్నం తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి ఎంఆర్ఐ వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారు. లంచం డిమాండ్ చేసినట్లు అన్ని ఆధారాలు లభించడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. వీరిని శుక్రవారం హైదరాబాద్ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నట్లు వివరించారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు లంచం అడిగితే హెల్ప్‌లైన్ నంబర్ 1064కు లేదా ఏసీబీ వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని, వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. దాడిలో ఏసీబీ సీఐలు లింగస్వామి, ఎస్కే జిలాని, కిషన్‌నాయక్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
మా కూలీ మాకివ్వాలి
● ‘ఉపాధి’ అవకతవకలపై విచారణకు వచ్చిన అధికారులను కూలీల అడ్డగింత ● పోలీసుల రంగ ప్రవేశం.. ఖానాపూర్‌లో ఉద్రిక్తత మక్తల్: ఉపాధి హామీ పనుల్లో ఫీల్డ్ అసిస్టెంట్ మరికొందరు అవినీతికి పాల్పడ్డారని, వారిని సస్పెండ్ చేయడంతోపాటు మా కూలీ మాకివ్వాలంటూ కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మక్తల్ మండలం ఖానపూర్ గ్రామంలో గురువారం ఉపాధిహామీ పనుల్లో అవకతవకలు జరిగాయని కలెక్టర్ ఆదేశాల మేరకు విచారించేందుకు అధికారులు వెళ్లగా కూలీలు వారిని అడ్డుకొని వారిని తిప్పి పంపారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో కార్యదర్శి, బీపీఎం, ఫీల్డ్ అసిస్టెంట్ ముగ్గురు కలిసి అవకతవకలు చేశారని గత నెల 30న మక్తల్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద కూలీలు ధర్నా చేశారు. ఈ నెల 1న కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేయగా.. నర్వ, మక్తల్ ఎంపీడీఓలు శ్రీనివాసులు, రమేష్‌కుమార్‌ను విచారించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో గురువారం వారితోపాటు ఏపీఓ సత్యప్రకాస్, ఈసి శ్రీనివాసులు గ్రామానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కూలీలంతా ఏకమై వారిని అడ్డుకున్నారు. మా కూలీ డబ్బులు మాకివ్వాలని, చే యని వారికి డబ్బులు ఇచ్చారని, అవినీతికి పాల్పడిన వారిని విధుల్లో తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అప్పటివరకు విచారణ చేసేదిలేదంటూ వెనక్కి వెళ్లాలంటూ గ్రామపంచాయతీ ఎదుట ధర్నా నిర్వహించారు. కూలీలు అధికంగా తరలిరావడంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. ఖానాపూర్‌లో విచారణకు వచ్చిన అధికారులతో వాగ్వాదానికి దిగగా.. కూలీలకు సర్దిచెబుతున్న ఎస్ఐ -
యాంటీ డ్రగ్ సోల్జర్స్‌గా మారాలి
నారాయణపేట: నేటి యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల వాడకాన్ని పూర్తిగా నిర్మూలించి భావితరాలకు బంగారు బాటలు వేసేందుకు యాంటీ డ్రగ్స్ సోల్జర్స్‌గా పనిచేయాలని, డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, ఎస్పీ యోగేష్ గౌతమ్ పిలుపునిచ్చారు. గురువారం డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం విద్యార్థి సేన ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో విద్యార్థులతో విద్యార్థి మహా ర్యాలీ నిర్వహించారు. వారు ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల బారిన పడితే భవిష్యత్ అంధకారమవుతుందని, యువత భవిష్యత్తు కోసం అందరం కలిసికట్టుగా పోరాడాలని పోలీస్ విభాగం మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టడంలో కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఎవరైనా డ్రగ్స్ బారిన పడిన, రవాణా చేస్తున్న, అమ్మిన అట్టి వ్యక్తుల సమాచారం లోకల్ పోలీసులకు లేదా డయల్ 100 కి లేదా 1908 టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌పై కఠినంగా పనిచేస్తుందని, చట్టపరమైన చర్యలతో పాటు ప్రజల్లో చైతన్యం కలిగించడమే ముఖ్య లక్ష్యం అని, ఇలాంటి విద్యార్థి ర్యాలీలు సమాజంలో మార్పు తీసుకొస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కొరకు అందరు పాటుపడాలని ఎమ్మెల్యే కోరారు. ఈమేరకు విద్యార్థులు పోస్టర్లు ప్లకార్డులు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. సిఐ శివ శంకర్,ఎస్ఐ రాముడు, ఎకై ్సజ్ సీఐ అనంతయ్య తదితరులు పాల్గొన్నారు. గాంధీ ఆశయాలను కొనసాగించాలి నారాయణపేట టౌన్: మహాత్మాగాంధీ ఆశయాలు కొనసాగించాలని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి సూచించారు. గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ స్వర్ణోత్సవాలలో భాగంగా లక్ష గాంధీజీ విగ్రహాల ప్రతిష్టాపన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఎమ్మెల్యే గురువారం ఆవిష్కరించారు. గాంధీ విగ్రహాలు గ్రామీణ, పట్టణాల ప్రాంతాలలో ప్రతిష్టించబడి శాంతి, సామరస్య చిహ్నాలుగా నిలిచి గాంధీవాద ఆదర్శాలైనా అంహిస, సత్యం , స్వదేశీలను ప్రజలలోకి ప్రవేశ పెట్టడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్ధేశమని సంస్థ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బండి వేణుగోపాల్, నరసింహారావు సగరి, యశ్వంత్ లాండ్గే పాల్గొన్నారు. -
రాకపోకలకు తప్పని తిప్పలు
ఇదిలాఉండగా, జిల్లా ఆస్పత్రి నారాయణపేట నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులు సమయపాలన పాటించకపోవడంతో ప్రజలు గంటల తరబడి ఎదురుచూపులు తప్పడంలేదు. జనరల్ ఆస్పత్రి నుంచి నారాయణపేటకు వెళ్లాలంటే ఆటోలో ఒక్కరికి రూ.20 చెల్లించాల్సిందే. లేదంటే బస్సు వచ్చేంత వరకు ఆగాల్సిందే. అసలే ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రికి వచ్చిన రోగులు వారి వెంబడి వచ్చే వారికి సమయానికి బస్సులు రాకపోవడంతో ఆటోలో వెళ్లక తప్పడం లేదు. గురువారం సైతం గంట తర్వాత రెండు బస్సులు ఒకేసారి జనరల్ ఆస్పత్రి ముందుకు వచ్చాయి. అవి రెండు సైతం మహబూబ్‌నగర్ నుంచి నారాయణపేటకు వేళ్లే బస్సులు. గంటసేపు తర్వాత బస్సు రావడం, బస్సు అప్పటికే నిండి ఉండడంతో ఆస్పత్రి వద్ద ప్రజలు ఇక్కేందుకు ఇబ్బందులు పడ్డారు. నారాయణపేట మండలం అప్పక్‌పల్లి గ్రామ సమీపంలోని జిల్లా జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ, జనరల్ వార్డు, చిన్నపిల్లల వార్డు దగ్గర బాత్రూమ్లలో నీరు లేకపోవడంతో తాగునీటికి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రి కోసం మిషన్ భగీరథ వాటర్ సంప్‌ను నింపి ఆస్పత్రి భవనంపై నిర్మించిన ట్యాంకులకు ఎక్కించి టాయిటెట్లు వాటికి నీటిని సరఫరా చేసేవారు. అయితే మోటార్ కాలిపోవడంతో నీటి సమస్య తలెత్తిందంటూ ఆస్పత్రి వర్గాలు ఓ వైపు చెబుతున్నాయి. మరో బోరు లేకపోవడంతో సమస్య జఠిలమైంది. గత వారం రోజుల నుంచి పడుతున్న ఇబ్బందులను ప్రజా, కార్మిక సంఘాలు జిల్లా వైద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మోటార్ మరమ్మతు చేయించి గురువారం వినియోగంలోకి తీసుకువచ్చినట్లు ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. ఒంటికి.. రెంటికీ బయటికే.. ఆస్పత్రిలోని రోగులు, సహాయకులు మంచినీటి బాటిళ్లు కొనుగోలు చేసి దాహం తీర్చుకుంటున్నారు. చివరికి వాడుకునేందుకు సైతం నీరు లేకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒంటికి, రెంటికీ బహిర్భూమికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అర్ధరాత్రి వేళల్లో బహిర్భూమికి వెళ్లేందుకు మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నీటి సమస్యను పరిష్కరించేందుకు అనుపత్రి వర్గాలు పట్టించుకోకపోవడంతో సమస్య తీవ్రతరమైందని అక్కడివారు వాపోతున్నారు. వాటర్ బాటిళ్లను కొనుగోలు చేసి తాగునీటికి ఇతర అవసరాలకు వినియోగించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరుగుదొడ్లు, సింకుల వద్ద పరిశుభ్రత లోపించడం, చెత్త డబ్బాలు మూలకు చేరాయని, వీటితో ఆదనపు రోగాలు వచ్చే అవకాశం ఉందంటూ రోగులు ఆందోళన చెందుతున్నారు. సహాయకురాలు వెంకటమ్మ సాయంతో కాలకృత్యాలకు వెళ్లి వస్తున్న వృద్ధురాలు నీలమ్మ గంట తర్వాత ఆస్పత్రి వద్దకు బస్సు రావడంతో జనం రద్దీ ఈ ఫొటోలో కనిపిస్తున్నది నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామానికి చెందిన నీలమ్మ. విరేచనాలతో జిల్లా ఆస్పత్రిలో మూడు రోజుల క్రితం అడ్మిట్ అయ్యింది. ఆమెకు సహాయకురాలిగా వెంకటమ్మ ఉంటుంది. అయితే, ఆస్పత్రిలో మరుగుదొడ్లకు తాళం వేయడంతో నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కాలకృత్యాల కోసం బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీటి సరఫరా చేసి ఆసుపత్రిలో మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాలని ఆవేదన వ్యక్తం చేసింది. రాత్రివేళల్లో విద్యుత్ సరఫరా లేక.. తాగునీరు రాక.. అత్యవసర సమయంలో డాక్టర్లు స్పందించక తీవ్ర దుస్థితిలో ఆస్పత్రి కొట్టుమిట్టాడుతుందని, పట్టించుకొనే నాథుడే కరువయ్యారంటూ రోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు సమస్యలు వస్తుండడంతో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోవడం, సమస్యలపై శ్రద్ద చూపకపోవడంతో పరిస్థితి మరింత దిగజారిందని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉండగా, మద్దూర్ మండలం రేనివట్లకు చెందిన రాజు తన కుమారుడుకి జ్వరం రావడంతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే రాసిచ్చిన మందుల్లో రెండు ఉన్నాయని మరొకటి లేదని, బయట తెచ్చుకోవాలని ఆస్పత్రి సిబ్బంది చెప్పడం గమనార్హం. జిల్లా ఆస్పత్రిలో సరిపడా మందులు అందుబాటులో లేకపోతే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
వేతనాల్లో కోత విధించడం తగదు
నారాయణపేట రూరల్: ముందస్తు సమాచారం లేకుండా గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వేతనాల్లో కోత విధిస్తూ జీవో విడుదల చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న టీజీటీ, పీజీటీ, జేఎల్ ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి నేలపై కూర్చొని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్తి సమయాన్ని పాఠశాలకు కేటాయించి విద్యనందిస్తున్న అధ్యాపకుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. గతంలో ఉన్న వేతనాలను భారీగా కోత విధించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. వెంటనే గతంలో చెల్లించిన వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. -
ఇబ్బందిగా ఉంది
మా బాబుకు ఒంట్లో ఆరోగ్యం సరిగా లేక వారం రోజులుగా జనరల్ ఆసుపత్రి చిన్నపిల్లల వార్డులో వైద్యం తీసుకుంటున్నాం. బాబుకు విరోచనాలు అవుతుండడంతో నీటి సదుపాయం లేక తాళం వేసి ఉండడంతో ఆసుపత్రి దిగువ భాగానికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులుపడుతున్నాం. తాగడానికి నీటి సదుపాయం లేదు.. వాడుకోవడానికి నీరు లేకపోవడంతో బయట నుండి నీటిని కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. – ఆనంద, నర్సపూర్, దామరగిద్ద మండలం ఆస్పత్రికి ఏర్పాటు చేసిన వాటర్ సంపులో మోటార్ చేడిపోవడంతో నీటి ఇబ్బందులు తలెత్తాయి. గురువారం మోటార్ మరమ్మతు చేయించి బిగించాం. నీటి ఇబ్బంది రాకుండా చూస్తాం. – ఆదిత్య గౌడ్, జిల్లా ఆస్పత్రి వైద్యాధికారి ● -
పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు
నారాయణపేట: పత్తి కొనుగోళ్లు సాఫీగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని రెవెన్యూ జిల్లా అదనపు కలెక్టర్ ఎస్.శీను అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వ్యవసాయ, మార్కెటింగ్, ప్రణాళిక శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతులకు మద్దతు ధర లభించేలా చూడాలని, తూకం, చెల్లింపుల్లో పారదర్శకత పాటించాలని, తగు వసతులు కల్పించాలని ఆదేశించారు. అలాగే పత్తి మార్కెటింగ్ సీజన్ 2025–26లో జిల్లా సగటు దిగుబడి అంచనాకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కమిటీ మండలాల వారీగా పత్తి సాగు విస్తీర్ణం, అంచనా ఉత్పత్తి వివరాలు సేకరించి వాస్తవికంగా సగటు దిగుబడిని లెక్కించనుందని తెలిపారు. రాష్ట్ర సగటు కంటే 10శాతం మించితే ప్రత్యేక ధ్రువీకరణతో మాత్రమే ఆమోదం ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)పై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, డీ ఆర్ డి ఓ మొగులప్ప, డిపీఎం సుధాకర్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు. నేరాల నియంత్రణకు చర్యలు నారాయణపేట: జిల్లాలో జరిగే నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని డీఎస్పీ ఎన్.లింగయ్య అధికారులకు సూచించారు. గురువారం డీఎస్పీ కార్యాలయంలో నారాయణపేట, కోస్గి సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులతో పెండింగ్ కేసులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముందుగా డీఎస్పీ పెండింగ్ లో ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాను గ్రేవ్ కేసుల గురించి సిఐ, ఎస్ఐలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని, పూర్తి పారదర్శకంగా కేసులో ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలని, ఇసుక అక్రమ రవాణా, గంజాయి, గుట్కా, పేకాటపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి సమూలంగా నిర్మూలించాలన్నారు. పోక్సో, ఎస్సీ ఎస్టీ, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి, 60 రోజుల్లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని, ప్రతి అధికారికి పూర్తి ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని, ప్రతిరోజు కేసులను ఆన్లైన్లో నమోదు చేయాలని, కేసుల చేదనలో అత్యాధునిక టెక్నాల జీ ఉపయోగించాలన్నారు. సమావేశంలో సిఐ సైదులు, బాలరాజు, విజయ్ కుమార్, స్టేషన్ రైటర్లు పాల్గొన్నారు. ఉద్యమం ద్వారానే సమస్యల పరిష్కారం నారాయణపేట రూరల్: ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి పద్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ భవన్ లో గురువారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అతి తక్కువ వేతనాలతో ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా కేజీబీవీ వర్కర్లను వెట్టి చాకిరీ చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు హామీలిస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రభుత్వాలకు సరికాదన్నారు. దాదాపు 14 గంటల పాటు విధులు నిర్వర్తిస్తూ ఇబ్బందులకు గురవుతున్నారని, అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించిన లాభం లేకుండా పోయిందని ఆవేద వ్యక్తం చేశారు. ఈనెల 22న హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ధర్నాకు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కిరణ్, కార్యదర్శి రాము, ఉపాధ్యక్షులు నర్సింలు, కాశీనాథ్, రామాంజనేయులు, రాములు, సుశాంత్, వెంకటయ్య, సలీం పాల్గొన్నారు. డీసీసీబీ సీఈఓ నియామకం నిలిపివేత సాక్షి, నాగర్‌కర్నూల్/ మహబూబ్‌నగర్ (వ్యవసాయం): మహబూబ్‌నగర్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ సీఈఓ నియామకాన్ని నిలిపివేస్తూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. సీఈఓ నియామకానికి అవసరమైన నిబంధనలు పాటించకపోవడంతో ఆయన నియామకాన్ని నిరాకరించినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ డీసీసీబీ సీఈఓగా డి.పురుషోత్తమరావును ఈ ఏడాది జూలై 14న నియమించాలని కోరుతూ కమిటీ పంపిన ప్రతిపాదనను ఆర్బీఐ తిరస్కరిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. దీనిపై మహబూబ్‌నగర్ డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి స్పందిస్తూ సీఈఓ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనను మాత్రమే ఆర్బీఐ తిరస్కరించిందని, నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదని పేర్కొన్నారు. -
స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలి
నారాయణపేట టౌన్: రైతులు పండిస్తున్న పంటలకు కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ సిఫారసులకు అనుగుణంగా ఎమ్మెస్పీ నిర్ణయించాలని అఖిల భారత ఐక్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్ భవన్లో ఏఐయూకేఎస్ డివిజన్ అధ్యక్షుడి సమక్షంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ రైతులు పెట్టిన పెట్టుబడిపై 50 శాతం కలిపి ధాన్యానికి ధర నిర్ణయించాలన్నారు. రైతులు పంట వేసినప్పటి నుంచి అతివృష్టి, అనావృష్టి, చీడపీడలకు, అడవి జంతువుల తాకిడి నుంచి కాపాడి తీర మార్కెట్‌కు అమ్మడానికి పోతే అడవి.. కొనడానికి పోతే కొరవి అనే పరిస్థితి నెలకొందన్నారు. పత్తి క్వింటాల్‌కు రూ.10,075 ధర నిర్ణయించి కాటన్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయలన్నారు. కార్యక్రమంలో సంఘం డివిజన్ కార్యదర్శి కొండ నర్సిములు, ఉపాధ్యక్షుడు నారాయణ, సహాయ కార్యదర్శి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విత్తనోతృత్తి సాధించాలి
ధన్వాడ: ప్రతి రైతుకు నాణ్యమైన విత్తనం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వావిద్యాలయం సమష్టిగా కార్యచరణ రూపొందిస్తున్నాయని వ్యవసాయ శాస్త్రవేత డా.జేడీ సరిత అన్నారు. ‘ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం’ కార్యక్రమంలో భాగంగా బుధవారం వ్యవసాయ శాస్త్రవేత్తల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంతో పాటు కంసాన్పల్లి, మందిపల్లి, పాతతండా గ్రామాల్లో రైతులు సాగు చేసిన పంటలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యమైన విత్తనం ద్వారానే అధిక దిగుబడులను సాధించడంతో పాటు పెట్టుబడి వ్యయం తగ్గించుకోవచ్చన్నారు. విత్తనోత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో ఏఓ నవీన్‌కుమార్, ఏఈఓ సైమన్ తదితరులు పాల్గొన్నారు. -
సస్యశ్యామలం చేద్దాం
● పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి భూ సేకరణ నోటిఫికేషన్ జారీ ● రైతులకు రూ.574 కోట్ల రుణమాఫీ ● కొత్తగా 23,411 రేషన్ కార్డుల మంజూరు ● సన్న వడ్లకు రూ.70.44 కోట్ల బోనస్ చెల్లింపు నారాయణపేట/మక్తల్: తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 కీలకమైన రోజు అని, హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనమై నేటికి 77 ఏళ్లు పూర్తి చేసుకుని 78వ వసంతంలోకి అడుపెడుతున్నందున రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, క్రీడలు యువజన సర్వీసులు, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు జిల్లావ్యాప్తంగా బుధవారం ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కలెక్టరేట్లో, మక్తల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి తోడ్పాటు అందించి అమరులైన తెలంగాణ సాయుధ, రైతాంగ పోరాట యోధులకు, స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పిస్తున్నామన్నారు. ప్రజాపాలనకు అంకురార్పణ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేర్చుతున్నామని మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా నారాయణపేటలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారని, ఇప్పటి వరకు వారికి రూ.15.02 లక్షల లాభం వచ్చిందన్నారు. స్వయం సహాయక బృందాలకు జిల్లాలో 4 కొత్త బస్సులు మంజూరయ్యాయని తెలిపారు. జిల్లాలో 1.87 కోట్ల మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకోగా.. వారికి రూ. 88.14 కోట్లు ఆదా అయ్యాయని పేర్కొన్నారు. 69,808 మంది లబ్ధిదారులకు 1.84 లక్షల సిలిండర్ల మీద సబ్సిడీ ఇవ్వడంతో రూ.4.66 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. పేదలకు సన్నబియ్యం ఏప్రిల్ నుంచి రేషన్ షాపుల ద్వారా జిల్లాలో 1,61,719 ఆహార భద్రత కార్డు లబ్ధిదారులకు 3,808 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేసినట్లు వెల్లడించారు. కొత్త రేషన్ కార్డులు 23,411 మంజూరు చేయగా.. 50,938 మందిని రేషన్ కార్డులో చేర్చారన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా 80,795 గృహ వినియోగదారులు లబ్ధి పొందుతున్నారని మంత్రి తెలిపారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా జిల్లాలో 19,146 మంది పేదలు చికిత్స తీసుకోగా రూ.51.89 కోట్లు చెల్లించామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.16.17 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. లక్ష ఎకరాలకు సాగునీరు నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగు, తాగునీరు అందించేందుకు రూ.4,350 కోట్లతో చేపట్టనున్న ఎత్తిపోతల పథకం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి, ఎస్పీ యోగేష్‌గౌతమ్, జిల్లా అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, శ్రీను, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయకుమార్, ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, ఆర్డీఓ రామచందర్‌నాయక్, మక్తల్ సీఐ రాంలాల్, తహసీల్దార్ సతీష్‌కుమార్, కమిషనర్ నర్సిములు, ఎంపీడీఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి తదితరులు జిల్లా కేంద్రంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న మంత్రి వాకిటి శ్రీహరి జిల్లాలో 65,631 మంది రైతులకు రూ.574 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రైతు భరోసా కింద 1,79,154 మంది రైతులకు రూ.260.56 కోట్లు చెల్లించామని తెలిపారు. 1,40,894 టన్నుల సన్న వడ్లు సేకరించి బోనస్ రూ.70.44 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. -
రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికల అధికారిగా శంకరాచారి
నారాయణపేట: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచీ కార్యవర్గ పదవీకాలం ముగియడంతో బుధవారం కలెక్టర్ సిక్తాపట్నాయక్ నారాయణపేట జిల్లా సహకార అధికారి జి. శంకరాచారిని ఎన్నికల అధికారిగా నియమించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఎన్నికల అధికారి, ఐఆర్సీఎస్ అడహక్ కమిటీతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణే ప్రధాన ఎజెండాగా ఐఆర్సీఎస్ మహాజన సమావేశాన్ని కనీసం 21 రోజుల ముందస్తు నోటీసుతో అక్టోబర్ 14, 2025 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో నిర్వహించడానికి నిర్ణయించారు. మహాజన సమావేశం 15 మంది కార్యవర్గ సభ్యుల ఎన్నిక, ఆఫీసు బేరర్లు అయిన వారిని చైర్మన్, వైస్ చైర్మన్, ట్రెజరర్, రాష్ట్ర కార్యదర్శి, నామినీల ఎన్నిక రహస్య బ్యాలెట్ విధానంలో నిర్వహిస్తామన్నారు. ఐఆర్సీఎస్లో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని కోరారు.మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలికోస్గి రూరల్: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల్లోని సభ్యులు తమ పొదుపులను పెంచుకొని ఆర్థికంగా చైతన్యవంతులుగా ఎదగాలని ఆర్బీఐ ఎల్డీఓ గోమతి, ఎల్డీఓ విజయ్‌కుమార్ అన్నారు. బుధవారం గుండుమాల్ మండల కేంద్రంలో మండల మహిళా సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక ఆక్షరాస్యత, కేంద్ర ఫ్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్ సేవలు, ఆర్థిక ప్రణాళిక, బడ్జెట్, జీవనోపాధి, సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా ఆవశ్యకత గురించి వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ శీల, ఎంపీడీఓ వేణుగోపాల్, బ్యాంకు మేనేజర్ హరినామశర్శ, సీసీ నర్సిములు తదితరులు ఉన్నారు.బీజేపీ జిల్లా కార్యవర్గం నియామకంనారాయణపేట రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ అన్నారు. రాష్ట్ర అధిష్టానం ఆదేశాల మేరకు బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన అధ్యక్షతన జిల్లా కమిటీని నియమించారు. జిల్లా ఉపాధ్యక్షులుగా కర్ని స్వామి (మక్తల్), ఎస్.ఉమేష్ (ధన్వాడ), కెంచె శ్రీనివాసులు (కోటకొండ), కొండ్రు నర్సింహులు (కొడంగల్), మేర్వ రాజు (అమరచింత), పి.చెన్నారెడ్డి (కోయిల్‌కొండ), ప్రధాన కార్యదర్శులుగా జి.బలరాంరెడ్డి (మక్తల్), లక్ష్మిగౌడ్ (నారాయణపేట), డి.తిరుపతిరెడ్డి (మరికల్), కార్యదర్శులు సుజాత (నారాయణపేట), హన్మంతు (మక్తల్), విజయభాస్కర్‌రెడ్డి (మద్దూరు), గోపాల్‌రావు (దామరగిద్ద), రవీంద్ర నాయక్ (కొడంగల్), కనకరాజు (మాగనుర్), కోశాధికారిగా సిద్ధి వెంకట్రాములు (నారాయణపేట), కార్యాలయ కార్యదర్శి సాయిబన్న (భైరంకొండ), సోషల్ మీడియా ఇన్చార్జి రమేష్‌యాదవ్ (కొడంగల్), మీడియా కన్వీనర్ కిరణ్ డగే (నారాయణపేట), ఐటీ ఇన్చార్జి బి.అనూష (నారాయణపేట)లను నియమించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా మాజీ అధ్యక్షుడు పి.శ్రీనివాసులు, మండల మాజీ అధ్యక్షుడు సాయిబన్న పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో విశ్వకర్మ భగవాన్ వేడుకలు
మక్తల్: విరాట్ విశ్వకర్మ భగవానుడి జయంతిని పురస్కరించుకొని బుధవారం పట్టణంలోని స్థానిక నల్లజానమ్మ ఆలయం నుంచి శ్రీమోనేశ్వరస్వామి ఆలయం వరకు విశ్వకర్మ పల్లకీసేవను భజనలతో ఊరేగించారు. ఆలయం వద్ద హోమం నిర్వహించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు పాలాభిషేకం చేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. చిన్నారులు చేసిన దాండియా నృత్యాలు, భజనలు పలువురిని ఆకట్టుకున్నాయి. సాయిజ్యోతి పాఠశాల తరఫున 2024– 2025 విద్యా సంవత్సరంలో ప్రతిభ చూపిన విశ్వకర్మ విద్యార్థులను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు పోర్ల విశ్వనాథ్, పోర్ల రాఘవేందర్, విశ్వకర్మ సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు రాఘవేంద్రచారీ, ప్రధాన కార్యదర్శి గట్టురవి ఆచారీ, కోశాధికారులు కడ్మూర్ రాజు, వి.రాజు తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ స్టేట్‌పై పోలీసు చర్య విద్రోహమే
నారాయణపేట: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన సాయుధ రైతాంగ పోరాటాన్ని నెహ్రూ యూనియన్ సైన్యాలు, రజాకార్ పోలీసులు, దొరలు, జమీందారులు కుమ్మకై ్క అణగదొక్కారని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి బి. రాము విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్ భవన్లో డివిజన్ కార్యదర్శి కాశీనాథ్ అధ్యక్షతన సెప్టెంబర్ 17 తెలంగాణ సాయుధ పోరాటానికి జరిగిన విద్రోహ దినంగా అభివర్ణిస్తూ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత యూనియన్ సైన్యాలు చర్య వలన ప్రజలు విముక్తి చెందకపోగా భూస్వామ్య దోపిడీ ఆధిపత్యాలకు బానిసలు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ సైన్యాలు సంస్థానాల్లోకి ప్రవేశించాక ప్రజలకు కొన్ని హక్కులు, భూ పంపకం, దోపిడీదారుల నుంచి రక్షణ లభిస్తుందని భావించినా.. అవేవి జరగ లేదని ఆరోపించారు. యూనియన్ సైన్యాలు ప్రజలపై సాగించిన హత్యాకాండ, అకృత్యాలను విమర్శిస్తూ ప్రజాసాహిత్యం వెలుగులోకి వచ్చిందన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు బి.యాదగిరి, బి.రాము, కిరణ్, చెన్నారెడ్డి, కొండ నర్సింలు పాల్గొన్నారు. -
నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు
పాలమూరు: పేద రోగులకు సంజీవనిగా పనిచేసే ఆరోగ్యశ్రీ సేవల్లో అంతరాయం ఏర్పడటంతో అవస్థలు తప్పడం లేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా ఓపీ సేవలతోపాటు ఖరీదైన సర్జరీలను పొందుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రులకు రావాల్సిన బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోవడంతో ఈ సేవలను కొనసాగించడానికి యాజమాన్యాలు విముఖత చూపుతున్నాయి. దీంతో సాధారణ, మధ్య తరగతి రోగుల జేబులకు చిల్లుపడే పరిస్థితి కనిపిస్తోంది. ఆస్పత్రుల వద్ద బ్యానర్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం జరిగింది. పాలమూరు పట్టణంలో చాలా ఆస్పత్రులకు రోగులు రాగా సేవలు బంద్ చేసినట్లు సిబ్బంది చెప్పడంతో వెనుదిరిగారు. అన్ని ఆస్పత్రుల ముఖద్వారాల దగ్గర ఆరోగ్యశ్రీ సేవలు బంద్ ఉన్నట్లు నోటీస్ బోర్డులు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేస్తున్న ఆరోగ్యశ్రీ కేసులకు సంబంధించిన నిధులు ప్రభుత్వ ఆస్పత్రులకు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక్కో ఆస్పత్రికి రూ.కోట్లలో బకాయిలు ఉండటం వల్ల ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగించడం భారంగా మారినట్లు ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. చివరగా గతేడాది మార్చి నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఆస్పత్రులకు బడ్జెట్ విడుదల కావడం లేదు. దీంతో ఈ విభాగం కింద కేసులను అడ్మిట్ చేసుకోవడంతోపాటు ఓపీ సేవలు అందించడం సవాల్‌గా మారింది. ప్రధానంగా మహబూబ్‌నగర్ పట్టణంలో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు అధికంగా ఉన్నాయి. ఒక్కో ఆస్పత్రికి రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేసిన సర్జరీలు, ఎస్టిమేషన్ వివరాలు జిల్లా చేసిన బకాయిలు సర్జరీలు (రూ.లలో..) గద్వాల 527 1,02,78,990 మహబూబ్‌నగర్ 19,032 46,95,71,170 నాగర్‌కర్నూల్ 133 34,03,362 నారాయణపేట 275 1,02,52,882 వనపర్తి 603 1,94,18,046 సేవలు అందుబాటులో లేకపోతే పేదలకు ఆర్థిక ఇబ్బందులే.. మొదటి రోజు ఆస్పత్రులకు వచ్చి తిరిగి వెళ్లిన రోగులు? -
స్వచ్ఛతా హీ సేవా వాల్‌పోస్టర్ విడుదల
నారాయణపేట: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతాయని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. బుధవారం జెడ్పీ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాలు–2025 కు సంబంధించిన వాల్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో పరిశుభ్రత, ప్లాస్టిక్ నిర్మూలన, చెత్తాచెదారం తొలగించడం వంటి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలన్నారు. ఎంపీడబ్ల్యూ వర్కర్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. సెప్టెంబర్ 25న ఉదయం 8 గంటలకు ఏక్ దిన్ ఏ ఘంటా ఏక్ సాత్ కార్యక్రమంలో భాగంగా యువకులు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు జాతీయ స్థాయి శ్రమదానం చేయాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 2 తో స్వచ్ఛభారత్ దివస్‌తో ముగుస్తుందని, ఈ సమాచారం మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్‌లో నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు. స్వచ్ఛతహీ సేవాలో భాగంగా కలెక్టర్ స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మొగులప్ప, స్వచ్ఛభారత్ మిషన్ జిల్లా మేనేజర్ మాలిక్ పాషా, భార్గవ్, సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళా ఆరోగ్యానికి రక్ష
● రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక వైద్యశిబిరాలు ● ప్రతి రోజు మూడు మండలాల్లో స్పెషలిస్టులతో పరీక్షలు నర్వ: నిత్యం ఇంటా బయట పని ఒత్తిడితో సతమతమయ్యే మహిళల ఆరోగ్యానికి మరింత భరోసా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వాస్థ్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్‌లో భాగంగా ప్రతి మహిళకు అన్నిరకాల వైద్యపరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ నెల 17నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వైద్యశిబిరాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోషణ్ మా కార్యక్రమానికి అనుసంధానంగా మహిళలకు వైద్యపరీక్షలు నిర్వహించి.. అనారోగ్య సమస్యలను గుర్తించనున్నారు. వారికి అవసరమైన మందులు అందించడంతో పాటు మెరుగైన చికిత్స అవసరమైన వారిని ఉన్నత శ్రేణి ఆస్పత్రులకు పంపించనున్నారు. జిల్లాలోని పల్లె దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో వైద్య పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్వహించే పరీక్షలు.. వైద్య కళాశాలల్లో పనిచేసే గైనకాలజీ, కంటి, చెవి, ముక్కు గొంతు, చర్మ, మానసిక, దంత వైద్యనిపుణులు పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్), క్యాన్సర్ స్క్రీనింగ్ (ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్), టీబీ పరీక్షలు నిర్వహించనున్నారు. మహిళలకు రక్తహీనత సమస్య ఉంటున్నందున.. దీనిపై యుక్త వయసులోని అమ్మాయిలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. గిరిజన తండాల్లో సికిల్ సెల్, ఎనీమియా పరీక్షలు చేసి, తగిన జాగ్రత్తలు వివరిస్తారు. సద్వినియోగం చేసుకోవాలి.. జిల్లాలో 15 రోజులపాటు మహిళల ఆరోగ్య సంరక్షణకు నిర్వహించే వైద్యశిబిరాల ను సద్వినియోగం చేసుకోవాలి. శిబిరాల్లో టీబీ, బీపీ, షుగర్, క్యాన్సర్ స్క్రీనింగ్, తలసేమియా, సికిల్ సెల్, ఎనీమియా వంటి పరీక్షలు నిర్వహించి.. తగిన మందులు ఇస్తారు. మెరుగైన చికిత్స అవసరమైన వారిని ఉన్నత శ్రేణి ఆస్పత్రులకు రెఫర్ చేస్తారు. దీంతో పాటు రక్తదాన శిబిరాలు, టీబీ ముక్త్ భారత్ కార్యక్రమాల ద్వారా దాతలచే పౌష్టికాహారం అందిస్తారు. – జయచంద్రమోహన్, డీఎంహెచ్ఓ -
ప్రజాపాలన వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
నారాయణపేట/నారాయణపేట రూరల్: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కలెక్టరేట్లో నిర్వహించే ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరై జాతీయ పతాకం ఆవిష్కరిస్తారని తెలిపారు. వేడుకల నిర్వహణలో భాగంగా అధికారులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, కలెక్టరేట్ ఏఓ జయసుధ, ఆర్డీఓ రామచందర్ నాయక్, డీఎస్పీ నల్లపు లింగయ్య తదితరులు ఉన్నారు.● ఇటీవల శ్రీహరి కోట (ఇస్రో)ను సందర్శించిన ఉపాధ్యాయులు అక్కడి విషయాలను తమ పాఠశాలల్లోని విద్యార్థులకు వివరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. జిల్లా సైన్స్ ఫోరం సభ్యులు కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెన్స్ ఫోరం మరింత సమర్థవంతంగా పనిచేయాలని.. శాస్త్ర సాంకేతిక నైపుణ్యలపై విద్యార్థుల్లో ఆసక్తి పెరిగేలా కార్యక్రమాలు రూపొందించాలని కలెక్టర్ వారికి సూచించారు. కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజులు, సైన్స్ ఫోరం సభ్యులు వార్ల మల్లేశం, రాములు, యాదయ్యశెట్టి పాల్గొన్నారు.‘విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకోవద్దు’నారాయణపేట రూరల్: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుంటోందని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ అన్నారు. స్థానిక భగత్‌సింగ్ భవన్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పథకానికి ప్రస్తుత పాలకులు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. పేద విద్యార్థులను చదువుకు దూరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు అజయ్, వెంకటేశ్, సురేశ్, రాజు, గణేశ్, అనూష, పౌర్ణమి, అనురాధ, శివకుమారి, సుధాకర్ ఉన్నారు.వేరుశనగ @ రూ.4,110గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు మంగళవారం 159 క్వింటాళ్ల విక్రయానికి వచ్చింది. క్వింటాల్ గరిష్టంగా రూ. 4,110, కనిష్టంగా రూ. 2,719 ధరలు లభించాయి. అదే విధంగా 56 క్వింటాళ్ల ఆముదాలు విక్రయానికి రాగా.. గరిష్టంగా రూ. 6,059, కనిష్టంగా రూ. 5,539, సరాసరి రూ. 6059 ధరలు వచ్చాయి. -
యూరియా కోసం మళ్లీ రోడ్డెక్కిన రైతులు
● టోకెన్లకు సైతం ఇబ్బందులుతప్పడం లేదని ఆందోళన ● పంటలకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ నారాయణపేట: యూరియా కోసం రైతులు మళ్లీ రోడ్డెక్కారు. యూరియా దొరక్క కొందరు, టోకెన్లు లభించక మరికొందరు రైతులు మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా – బస్టాండ్ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. యూరియా కోసం నిత్యం అవస్థలు పడుతున్నామని ఆందోళన వ్యక్తంచేశారు. యూరియా, టోకెన్ల కోసం గంటల తరబడి పడిగాపులు కాసినా దొరకడం లేదని వాపోయారు. వానాకాలంలో వ్యయప్రయాసాలకోర్చి సాగుచేసిన పంటలకు యూరియా వేయకపోవడంతో ఎదగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, రైతుల ఆందోళనతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ రాములు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. అరకొర పంపిణీపై ఆగ్రహం నారాయణపేట రూరల్: మండలంలోని సింగారం రైతువేదికలో అరకొరగా యూరియా టోకెన్లు పంపిణీ చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వాస్తవానికి వివిధ గ్రామాల రైతులు తెల్లవారుజామునే నారాయణపేటలోని పీఏసీఎస్ కార్యాలయానికి యూరియా కోసం వెళ్లారు. అయితే తమ క్లస్టర్ పరిధిలోని రైతువేదికల్లోనే టోకెన్లు ఇస్తారని అధికారులు చెప్పడంతో సింగారం రైతువేదిక వద్దకు చేరుకొని బారులు తీరారు. ఈ క్రమంలో ఏఈఓ అనిల్‌కుమార్ కేవలం 50 టోకెన్లు ఇచ్చి వెళ్లిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై ఏఓ దినకర్ స్పందిస్తూ.. యూరియా స్టాక్ మేరకు రైతులకు టోకెన్లు అందిస్తున్నట్లు తెలిపారు. -
సాయుధ పోరాటంలో.. పాలమూరు మట్టిబిడ్డలు
చిన్నచింతకుంట: ఆ ఊరి పొలిమెరలోకి అడుగుపెట్టగానే మాయని గాయమేదో బాధపెడుతుంది.. పల్లెలోకి పాదం మోపగానే ఉద్వేగ క్షణాలేవో తట్టిలేపుతాయి.. ఆ గ్రామం పేరు చూడగానే అమరుల త్యాగాలు యాదికొస్తవి. నేటికీ సాక్ష్యంగా మిగిలిన రావి చెట్టు, నాటి ఘటనను గుర్తు చేసి మనసును కకాలవికలం చేస్తుంది.. ఆ కిటికీ నుంచి కాల్పుల శబ్దాలు వినిపించినట్లుగానే ఉంటుంది.. రజాకార్ల రాక్షస క్రీడ గుర్తుకొచ్చి రక్తం సలసలా మరుగుతుంది.. వారి బూటు కాళ్ల చప్పుళ్లు.. పోరాట ఘట్టాలు కథలు కథలుగా వినిపిస్తాయి. చిందిన అమరుల రక్తం.. స్తూపమై మొలిచి వారి త్యాగాలను గుర్తు చేస్తూ జాతీయ పతాకాన్ని చేతబట్టి ఉద్యమ స్ఫూర్తిని నింపుతుంది.. తొలుస్తున్న గాయాని దిగమింగుకుని.. వీరులను గుర్తించని వైనాన్ని తలుచుకుని.. ధుఃఖిస్తోంది అప్పంపల్లి గ్రామం.. రజాకార్లపై తిరుగుబాటు బావుటా ఎగరవేసి ప్రాణాలు కోల్పోయిన అప్పంపల్లి అమరవీరులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తింపునకు నోచుకోలేకపోయారు. స్వాతంత్య్ర పోరాటం.. నిజాం వ్యతిరేక పోరాటం వేర్వేరు అని భావించిన ప్రభుత్వ వైఖరి ఏమిటో ఎవరికీ అంతుచిక్కడంలేదు. ఒకవైపు స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకుంటూ.. మరోవైపు నిజాం పోలీసు మూకలు సాగించిన అరాచకాలను ఎదురించి ప్రాణాలర్పించిన వారి త్యాగాలను కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు గుర్తించాలి. దుర్భర స్థితిలో ఉన్న అప్పంపల్లి అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నప్పుడే తెలంగాణ విమోచన దినోత్సవానికి నిజమైన సార్థకత లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తల్లడిల్లిన అప్పంపల్లి అమరవీరులకు గుర్తింపేది? -
నా జీవితం ప్రజా సేవకు పునరంకితం
నారాయణపేట: తన జీవితం ప్రజా సేవకే పునరంకితమని డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం తన జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని లింగయ్య, సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొని శివకుమార్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డితో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులకు అందించే పరిహారాన్ని రూ. 20లక్షలకు పెంచిన సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంత బిడ్డ రేవంత్‌రెడ్డి సీఎం కావడంతోనే భూ నిర్వాసితులకు ఎకరానికి రూ. 20లక్షలకు పరిహారం పెంచడంతో పాటు మరో రూ. 300కోట్ల ప్రాజెక్టుకు ఎక్కువ అయినా సాధించడం జరిగిందన్నారు. అదే విధంగా వికారాబాద్–కృష్ణా రైల్వేలైన్ ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి దృఢ సంకల్పంతో ప్రణాళికలు సిద్ధం చేయించినట్లు చెప్పారు. జాయమ్మ చెరువుకు సాగునీరు తీసుకురావడం సీఎన్ఆర్ కల అని.. నియోజకవర్గంలోని ప్రతి చెరువును నీటితో నింపేందుకు ఎమ్మెల్యే పర్ణికారెడ్డి కృషి చేస్తున్నారన్నారు. పర్ణికారెడ్డిని రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించి స్పీకర్ సీటులో కూర్చొబెట్టడమే తన లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్.శివారెడ్డి, వైస్‌చైర్మన్ కొనంగేరి హన్మంతు, మాజీ చైర్మన్లు బండి వేణుగోపాల్, సరాఫ్ నాగరాజు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కోట్ల మధుసూదన్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు కోట్ల రవీందర్‌రెడ్డి, నాయకులు రాజీరె డ్డి, రఘుబాబు, ఎండీ సలీం పాల్గొన్నారు. -
పేట–కొడంగల్ భూసేకరణ ప్రక్రియ వేగవంతం
● రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్: నారాయణపేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి రాంలీలా మైదానంలో చేపట్టిన కోనేరు ఆధునికీకరణ పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి రూ.4,500 కోట్లతో పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ పథకం పూర్తయితే నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల్లో 1.25లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న వారికి ఎకరాకు రూ. 20లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని తెలిపారు. మక్తల్ సెగ్మెంట్లో 800 ఎకరాలకు గాను 600 ఎకరాలకు రైతులు ఒప్పంద పత్రాలు సమర్పించినట్లు చెప్పారు. మిగతా రైతుల నుంచి ఒప్పంద పత్రాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని తెలిపారు. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా పథకం పనులు ప్రారంభిస్తామన్నారు. కాగా, మక్తల్‌లో పడమటి ఆంజనేయస్వామి జాతరలోగా కోనేరు ఆధునికీకరణ పనులు పూర్తిచేస్తామని మంత్రి చెప్పారు. అతి పురాతనమైన కోనేరును సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ప్రాణేశ్‌కుమార్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ గణేశ్‌కుమార్, కావలి తాయప్ప, రవికుమార్, ఈఓ శ్యాంసుందర్ ఆచారి, రవికుమార్, కట్ట సురేశ్, నాగశివ, హేమసుందర్, అరవిందు, డీవీ చారి పాల్గొన్నారు. -
అయిజలో లెవి సహాయ నిరాకరణోద్యమం
అయిజ: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటాల పురిటిగడ్డగా అయిజ నిలిచింది. ఇక్కడే లెవి సహాయ నిరాకరణోద్యమానికి బీజం పడింది. 1947 డిసెంబర్ 12న నిజాం నవాబు ప్రవేశపెట్టిన లెవి పన్నుకు వ్యతిరేకంగా అయిజ గ్రామ రైతులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ పోరాటాన్ని అణచివేసేందుకు నిజాం నవాబులు జరిపిన కాల్పుల్లో రైతులు నాయకి చిన్న తిమ్మప్ప, కల్లె బీచుగాడు, కొండాపురం నర్పప్ప, పాగుంట వెకటయ్య, బలిజ నాగయ్య వీరమరణం పొందారు. నిజాం నవాబుల దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు ఎంతో మంది పోరాటయోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. స్మరించుకోని పాలకులు.. నైజాం నవాబుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరులను నేటి పాలకులు స్మరించుకోకపోవడం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆనాటి అమరవీరులకు గుర్తుగా 1955లో అయిజలో స్తూపాన్ని నిర్మించారు. 1999లో ఆ స్తూపాన్ని ఆధునికీకరించి.. గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించే సమయాల్లోనూ నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరులను స్మరించుకోకపోవడం శోచనీయం. -
నాయకత్వం వహించాడు..
మా తండ్రి బెల్లం నాగన్న తెలంగాణ ఉద్యమ నాయకుడిగా నాయకత్వం వహించి నిజాం పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. నిజాం పాలనకు ఎదురుతిరిగాడు. అందుకు మా తండ్రిని పట్టుకోవడానికి గ్రామానికి వచ్చి గ్రామస్తులపై కాల్పులకు పాల్పడటంతో 11 మంది వీరమరణం పొందారు. ఉద్యమ సమయంలో మాకున్న వంద ఎకరాల భూమిని మా తండ్రి అమ్మేశాడు. – అంజన్న, ఉద్యమకారుని కుమారుడు, అప్పంపల్లి పోరాటంలో ఎంతో పాత్ర.. తెలంగాణ పోరాటంలో గ్రామ నాయకుల పాత్ర ఎంతో ఉంది. నిజాం సర్కారుకు వ్యతిరేకంగా ఎదురుతిరిగిన వీరులు బెల్లం నాగన్న, ఈడిగి బలరాంగౌడ్, తెలుగు ఆశన్న, దాసర్పల్లి బుచ్చారెడ్డి, ఆత్మకూర్ సంస్థానంపై జాతీయ జెండా ఎగరవేశారు. దీంతో ఉద్యమకారులను పట్టుకోవడానికి పోలీసులు మా ఊరికి వచ్చారు. సాయంత్రం సమయంలో చూస్తుండగానే రావి చెట్టు కింద పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పులకు గాయాలై అర్ధనాదాలు చేశారు. – సాయిలు, రిటైర్డ్ టీచర్, అప్పంపల్లి -
ఉద్యమానికి ఊపిరి..
ఆత్మకూర్ పల్లెల్లో రాజుకున్న చైతన్యం పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. 1947 అక్టోబర్ 7న భారీ ప్రదర్శనను అడ్డుకోవడంలో విఫలమైన పోలీసులు మహబూబ్‌నగర్ నుంచి అదనపు పోలీసు బలగాలను అప్పంపల్లికి తరలించారు. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న బెల్లం నాగన్న, బలరాంగౌడ్, తంగెడి నాగిరెడ్డి, తెలుగు ఆశన్నలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఏక్షణంలోనైనా తమ నేతలను అరెస్టు చేస్తారని భావించిన అప్పంపల్లి గ్రామస్తులు రావిచెట్టు కింద గుమిగూడి చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు భాష్పావాయువు ప్రయోగించారు. విడిది చేసిన ఇంటి కిటికీలో నుంచి ఉద్యమకారులపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో 11 మంది చాకలి కుర్మయ్య, ఈశ్వరయ్య, తంగేటి రాంరెడ్డి, నన్నేమ్మ, హరిజన్ కిష్టన్న, హరిజన్ తిమ్మన్న, లక్ష్మారెడ్డి, పెండేం సాయన్న, గజ్జలన్న, బాల్‌రెడ్డి, వడ్డేమాన్ నర్సయ్య అక్కడికక్కడే నేలకొరగగా.. భీంరెడ్డి, మాల కిష్టన్న, ఈడిగి తిమ్మక్క, పెండెం కుర్మన్న, కె.రామచంద్రయ్య, వాగుల గంగన్నతోపాటు మరో 25 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో 29 మందిపై పోలీసులు చార్జీషీట్ వేసి జైలులో నిర్బంధించారు. -
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
మక్తల్: అంగన్వాడీ సమస్యల పరిష్కరించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని సోమ వారం ముట్టడించారు. అనంతరం అంగన్వాడీ టీచర్లు, అయాలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్‌తోపాటు విద్యను నిర్వీర్యం చేస్తుందని, నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని తెచ్చిందని అన్నా రు. ప్రీప్రైమరీ, పీఎంశ్రీ విద్య పేరుతో ఐదేళ్లలోపు పిల్లలను విద్యాశాఖకు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రీప్రైమరీ పీఎం శ్రీవిద్య నడపాలని డిమాండ్ చేశారు. అలాగే, 24 రోజులు సమ్మె వేతనం వెంటనే చెల్లించాలని, పెంచిన రిటైర్మెంట్ బెన్ఫిట్ 2024 జూలై 1 నుంచి చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమస్యలపై క్యాబినెట్లో చర్చిస్తానని, వినతిపత్రంలో పేర్కొన్న అంశాలపై సీఎంతో చర్చిస్తానన్నారు. ఇంటి ముట్టడి కార్యక్ర మం వద్దని, మీరు మీ తమ్ముడు, మీ అన్న ఇంటికి వచ్చారని, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని లబ్ధిదారులు అందరికీ అందేలా చూస్తానన్నారు.నాయకులు ఆంజనేయులు, గోవిందురాజు, రమే ష్, మంజుల, విజయలక్ష్మి, రాధిక, గిరిజ పాల్గొన్నారు. -
హే కృష్ణా.. ఇకనైనా!
నారాయణపేటమంగళవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని రైతుల రోదన అరణ్య రోదనగా మిగులుతోంది. వేల సంఖ్యలో కృష్ణ్ణ జింకలు పంటలను నాశనం చేస్తుండడం ఏటేటా నిత్యకృత్యంగా మారింది. ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. ఫలితం లేకపోవడంతో బాధిత రైతుల్లో ఆందోళన నెలకొంది. కృష్ణ జింకలను పట్టుకుని అడవులకు తరలించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించినా.. రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటులో జాప్యం జరుగుతూనే ఉంది. అధికారుల్లో కొరవడిన ప్రణాళిక, పలు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లేమి వెరసీ రైతులకు తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం స్పందించినా.. కృష్ణాతీరంలో కృష్ణ జింకల బెడద నుంచి పంటలను కాపాడాలని రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. జింకలను పట్టి నల్లమల, కవ్వాల్ అడవులకు తరలించాలని ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలోనే నిర్ణయించి.. రూ.2.70 కోట్ల నిధులు సైతం కేటాయించింది. అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు అటవీ శాఖ ముందుగా రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. కృష్ణా మండలం ముడుమాల్ వద్ద అందుబాటులో ఉన్న భూమిని అధికారులు పరిశీలించారు. సర్వే నం.192లోని 18.29 ఎకరాలు, సర్వే నం.194లోని 55.21 ఎకరాలు మొత్తం కలిపి 74.10 ఎకరాల్లో రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. కానీ, ఇందులో తొలుత ఎనిమిది ఎకరాలు, ఆ తర్వాత సుమారు 30 ఎకరాల్లో చెరువు ఉండడం, రెవెన్యూ శాఖ తిరకాస్తు వంటి సమస్యలతో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు ముందడుగు.. కృష్ణ జింకల రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు దిశగా ముడుమాల్ వద్ద 74.10 ఎకరాల భూమి హద్దులను రెవెన్యూ అధికారులు గుర్తించి మార్కింగ్ చేశారు. ఇటీవల ఆ భూమిని అటవీ శాఖకు అప్పగిస్తూ ఆర్డర్లు సైతం జారీ అయ్యాయి. దీంతో అటవీ శాఖ ఎట్టకేలకు రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు పనుల కోసం టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతోంది. చెరువు పరిధిలోకి రాని సుమారు 44 ఎకరాల్లో శాశ్వత, చెరువు పరిధిలోకి వచ్చే 30 ఎకరాల్లో తాత్కాలికంగా పనులు చేపట్టేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికై నా ఎలాంటి జాప్యం లేకుండా చూసి.. జింకల సమస్య తీర్చాలని రైతులు వేడుకుంటున్నారు. కృష్ణజింకలతో పంట పొలాలు నాశనం కృష్ణానది పరివాహకంలో అన్నదాతల అగచాట్లు విజ్ఞప్తులు.. ప్రతిపాదనలు.. ఆదేశాలకే పరిమితం రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటులో జాప్యం నష్టంతోపాటు నిత్యం కాపలాతోరైతాంగానికి తప్పని తిప్పలు సుమారు 12 వేల జింకలు.. కృష్ణానది పరివాహకమైన మాగనూరు, కృష్ణా, నర్వ, మరికల్, మక్తల్ మండలాల పరిధిలో ప్రధానంగా వరి, పత్తి, కంది సాగవుతోంది. సుమారు 10, 12 ఏళ్ల క్రితం ఆయా ప్రాంతాల్లో వందలలోపే ఉన్న కృష్ణ జింకల సంతతి క్రమక్రమంగా పెరిగింది. ప్రస్తుతం 10 వేల నుంచి 12 వేల వరకు కృష్ణ జింకలు ఉన్నట్లు అటవీ శాఖ అంచనా. అవి ఆహారం కోసం మూకుమ్మడిగా పంట చేలల్లోకి వస్తుండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
‘ప్రజావాణి’కి 44 ఫిర్యాదులు
నారాయణపేట: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 44 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ఎస్ శ్రీను,ట్రైనీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్‌కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. చట్ట ప్రకారం పరిష్కరించాలి పోలీస్ గ్రీవెన్స్‌కు వచ్చిన ఫిర్యాదులను చట్ట ప్రకారం వెంటనే పరిష్కరించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 15 ఫిర్యాదులు రాగా ఎస్పీ పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచరాదని ఫోన్లో ఎస్పీ సూచించారు. -
చేపపిల్లలు చెరువుకు చేరేనా?
● మూడుసార్లు గడువు పెంచినా ముందుకురాని వ్యాపారులు ● ఆందోళనలో మత్స్యకారులు ● టెండరుదారుడి చేపపిల్లల విత్తనోత్పత్తి కేంద్రాన్ని పరిశీలించనున్న కమిటీ నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో వందశాతం సబ్సిడీపై చేపపిల్లల పంపిణీకి చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశానిర్దేశంతో జిల్లా మత్స్యశాఖ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. మొదటగా గతనెల 18నుంచి 30వ తేదీ వరకు సంబంధిత వ్యాపారుల నుంచి టెండర్లు ఆహ్వానించారు. అయితే ఒక్క టెండరు కూడా దాఖలు కాకపోవడంతో.. మరోసారి ఈ నెల 1నుంచి 8వ తేదీ వరకు పొడిగించారు. రెండో దఫా కేవలం ఒకే ఒక టెండరు దాఖలైంది. ఈ నేపథ్యంలో 12వ తేదీ వరకు మళ్లీ అవకాశం కల్పించగా.. ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ ఒక్క దరఖాస్తును పరిగణనలోకి తీసుకొని చేపపిల్లలు పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. గతేడాది సెప్టెంబర్ చివరి వారంలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో 50శాతం మాత్రమే చేప పిల్లలను సరఫరాచేసి మమ అనిపించుకున్నారు. ఈ ఏడాది సైతం చేపపిల్లల టెండర్ల ప్రక్రియ పూర్తి కావడానికి మరో 15రోజుల సమయం పట్టే అవకాశం ఉండటంతో.. ఈ సారి కూడా వందశాతం చేపపిల్లల పంపిణీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కమిటీ పర్యవేక్షణలో.. జిల్లాలోని మత్స్యకారులకు చేపపిల్లల పంపిణీకి సంబంధించి ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్‌గా అడిషనల్ కలెక్టర్, మెంబర్ కం కన్వీనర్‌గా జిల్లా మత్స్యశాఖ అధికారి రహిమాన్, సభ్యులుగా జిల్లా మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు కాంతికుమార్, పశుసంవర్ధక శాఖ అధికారి, ఈడీఎం, ఇరిగేషన్ ఈఈలు ఉన్నారు. ఈ కమిటీ పర్యవేక్షణలోనే చేపపిల్లల పంపిణీ చేపట్టనున్నారు. టెండరుదారుడి విత్తనోత్పత్తి కేంద్రాలను కమిటీ పరిశీలించిన తర్వాత ఆమోదించనున్నారు. -
ఆసియాలోనే మొదటిది..
ఆటోమేటిక్ సైఫన్ సిస్టం అంటే.. ప్రాజెక్టులోని నీరు పూర్తిస్థాయి మట్టానికి చేరుకోగానే సైఫన్లు వాటంతట అవే తెరుచుకుంటాయి. అప్పట్లో ఈ టెక్నాలజీతో నిర్మించిన ఆసియాలోనే మొదటి ప్రాజెక్టుకు కాగా.. ప్రపంచంలో రెండోది. 17 వుడ్ సైఫన్లు, 4 ప్రీమింగ్ సైఫన్లతో 391 అడుగుల వెడల్పుతో మెయిన్ సైఫన్ నిర్మించారు. ఒక్కో సైఫన్ 520 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుంది. మట్టికట్ట పొడువు 3,537 అడుగులు, రాతికట్ట పొడవు 520 అడుగులు, కట్ట గరిష్ట ఎత్తు 45.2 అడుగులు, నీటి విస్తరణ ప్రదేశం రెండు చదరపు మైళ్లు, కుడికాల్వ 8 కి.మీ., ఎడమ కాల్వ 20 కి.మీ.,లు ప్రవహిస్తూ ఆయకట్టుకు నీరందిస్తున్నాయి. అయితే ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన కట్ట ఇప్పటి రెండుసార్లు తెగిపోయింది. 1964లో మొదటిసారి, 2019 డిసెంబర్ 31న రెండోసారి కట్టకు గండిపడింది. వనపర్తి సంస్థానాధీశుల కాలంలో ఏడున్నర దశాబ్దాల క్రితం అమెరికాలోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ప్రాజెక్టు సరళాసాగర్. మదనాపురం మండలం శంకరమ్మపేట సమీపంలోని దీన్ని నిర్మించారు. దేశ స్వాతంత్య్రానికి ముందే ఇక్కడ ప్రాజెక్టు నిర్మించాలనే ఆలోచన అప్పటి వనపర్తి సంస్థానాధీశులు రాజారామేశ్వర్రావుకు వచ్చింది. తన తల్లి సరళాదేవి పేరుపై ఏదైనా ప్రత్యేకతతో దీన్ని నిర్మించాలనే ఆలోచనతో ఆయన అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆటోమేటిక్ సైఫన్ సిస్టం అనే టెక్నాలజీని ఇక్కడికి తీసుకొచ్చారు. అనధికారికంగా 1947 జూలై 10న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసినా.. స్వాతంత్య్రం అనంతరం అప్పటి మిలటరీ గవర్నర్ జేఎన్ చౌదరి 1949 సెప్టెంబర్ 15న తిరిగి శంకుస్థాపన చేశారు. పదేళ్లపాటు ప్రాజెక్టు నిర్మాణం కొనసాగింది. అప్పట్లో రూ.35 లక్షలతో పూర్తి చేసిన ఈ ప్రాజెక్టును 1959 జూలై 26న అప్పటి పీడబ్ల్యూడీ మంత్రి జేవీ రంగారావు ప్రారంభించారు. వర్షం నీరు ఊకచెట్టువాగులో నుంచి వృథాగా కృష్ణానదిలో కలిసిపోవడం, ఈ వాగు సమీపంలోని గ్రామాలను తరుచూ వరద ముంపునకు గురికావడంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు సరళాసాగర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. వనపర్తి సంస్థానం ఆధీనంలోని పది గ్రామాల్లోని సుమారు 4,182 ఎకరాలకు సాగునీరందించేలా 0.5 టీఎంసీ సామర్థ్యంతో సరళాసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. సరళాసాగర్ ప్రాజెక్టు నిర్మించేందుకు అమెరికా వెళ్లి టెక్నాలజీని తీసుకువచ్చిన ప్రాజెక్టు రూపకర్త ఎస్ఈ పీఎస్ రామకృష్ణరాజు (ఫైల్) -
కోయిల్‌సాగర్ @ రూ.84 లక్షలు
పాలమూరు జిల్లా వరప్రదాయిని కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ప్రారంభమై నేటికి 71 ఏళ్లు పూర్తయింది. 1947లో తెలంగాణ ప్రాంతానికి ఇంకా స్వాతంత్య్ర రాక ముందు ఆనాటి నైజాం ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేశారు. 1.20 టీఎంసీల సామర్థ్యంతో 26.6 అడుగుల ఎత్తు అలుగు ఉండే విధంగా ప్రాజెక్టుకు అప్పటి ఇంజినీర్లు రూపకల్పన చేసి నిర్మాణ పనులు ప్రారంభించి 1954లో పూర్తిచేశారు. కేవలం రూ.84 లక్షల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టు నుంచి మొదటిసారి 9 వేల ఎకరాలకు సాగునీరు అందించారు. 1984లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.91 లక్ష వ్యయంతో 6 అడుగుల మేర కట్టను బలోపేతం చేసి ఎత్తును పెంచి అలుగుపై 13 గేట్లు నిర్మించారు. ఆనాటి ఎమ్మెల్యే వీరారెడ్డి కృషి ఫలితంగానే గేట్ల నిర్మాణం జరిగింది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. 2.27 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఆయకట్టు కుడి కాలువ కింద 9 వేల ఎకరాలు, ఎడమ కాల్వ కింద 3 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా రూ.359 కోట్ల అంచనాతో కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకానికి 2006లో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ప్రాజెక్టు ఆయకట్టును 50,250 ఎకరాలకు పెంచుతూ జూరాల నుంచి కృష్ణా జలాలను కోయిల్‌సాగర్‌కు తరలించేలా రూపకల్పన చేశారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు గేట్ల నుంచి పరుగులు పెడుతున్న నీరు (ఫైల్)ఉమ్మడి పాలమూరు విభజన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఏకై క ప్రాజెక్టు కోయిల్‌సాగర్. గతంలో చిన్ననీటి తరహా ప్రాజెక్టుగా ఉండగా ఎత్తిపోతల పథకం ప్రారంభం తర్వాత భారీ నీటి పారుదల శాఖ కిందకు మార్చారు. సాగునీటితోపాటు పాలమూరు పట్టణానికి తాగునీటిని అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే నారాయణపేట జిల్లా, కొడంగల్ ప్రాంతానికి తాగునీటి వనరుగా ఉపయోగిస్తున్నారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద దేవరకద్ర నియోజకవర్గంలోని దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాలు ఉండగా.. నారాయణపేట నియోజకవర్గంలోని మరికల్, ధన్వాడ మండలాలకు సాగునీరు అందిస్తున్నారు. మక్తల్ నియోజకవర్గంలోని నర్వ, అమరచింత మండలాల పరిధిలోని కొన్ని గ్రామాలకు సాగునీరు అందుతుంది. అలాగే ప్రాజెక్టు కాల్వ ద్వారా గొలుసు కట్టు చెరువులను నింపుతున్నారు. నైజాం ప్రభుత్వ హయాంలో 1947– 54 మధ్య నిర్మించిన కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నేటికీ చెక్కు చెదరలేదు. కోయిలకొండ కోట సమీపంలో ఉండడం వల్ల ప్రాజెక్టుకు కోయిల్‌సాగర్ అని పేరు పెట్టారు. రెండు గుట్టల మధ్య ప్రాజెక్టును పటిష్టంగా సున్నం, గచ్చు ఉపయోగించి నిర్మించారు. కట్టకు రెండు వైపులా రాతి గోడ నిర్మించి.. బయటి నుంచి మట్టితో నింపారు. ఇక అలుగును సైతం సున్నం గచ్చు ఉపయోగించి నిర్మించారు. ఆనాడు ఉపయోగించిన పరికరాలు నేటికీ ప్రాజెక్టు సమీపంలోనే పడి ఉన్నాయి. ఇక ప్రాజెక్టు నమూనాను ముందుగా తయారు చేసి నిర్మాణం తర్వాత ప్రారంభించారు. ఆనాడు చేసిన నమూనా నేటికి ప్రాజెక్టు సమీపంలోనే కనిపిస్తుంది. ప్రాజెక్టును 10 జూలై 1954లో అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కేఎం ఖార్జు ప్రారంభించి ఆయకట్టుకు నీటిని వదిలారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల చిన్నబొల్లారం, పెద్ద బొల్లారంతోపాటు మరో రెండు చిన్న గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అయితే బాధితులకు ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఇళ్లను నిర్మించుకోవడంతో కొత్తగా బొల్లారం పేరుతో గ్రామం ఏర్పడింది. కొనసాగుతున్న ప్రాజెక్టు నిర్మాణం పనులు (ఫైల్) కట్టను నిర్మిస్తున్న ఆనాటి కూలీలు (ఫైల్) -
లక్ష ఎకరాలకు
● సీఎం రేవంత్‌రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టు పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం ● ఎకరాకు రూ. 20లక్షల పరిహారం పెంపు చారిత్రాత్మక నిర్ణయం ● విలేకర్ల సమావేశంలో రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి సాగునీరు అందించడమే లక్ష్యం భూ పరిహారం పెంచి తమకు న్యాయం చేయాలంటూ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు వద్ద భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను మంత్రి వాకిటి శ్రీహరి విరమింపజేశారు. భూ పరిహారం పెంచిన ప్రభుత్వానికి భూ నిర్వాసితుల సంఘం గౌరవాధ్యక్షుడు వెంకట్రామారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మశ్చందర్ ప్రత్యేకంగా ధన్యావాదాలు తెలిపారు. అనంతరం సీవీఆర్ భవన్‌కు చేరుకొని మంత్రి వాకిటి శ్రీహరి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డికి స్వీట్లు తినిపించి సంతోషం పంచుకున్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, వైస్ చైర్మన్ కొనంగేరి హన్మంతు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు బండి వేణుగోపాల్, సరాఫ్ నాగరాజు, జిల్లా మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు కాంతికుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సలీం పాల్గొన్నారు. నారాయణపేట: పేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల పథకంతో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సీఎన్ఆర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. 2014లో జీఓ 69 తీసుకొచ్చేందుకు కృషిచేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. నేడు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారని అన్నారు. అందులో భాగంగా భూనిర్వాసితుల ఆకాంక్ష మేరకు రూ.20 లక్షలకు పరిహారం పెంచినట్లు వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మక్తల్ ఎమ్మెల్యేగా ఉన్న చిట్టెం నర్సిరెడ్డి సంగంబండ రిజార్వాయర్‌తో పాటు జాయమ్మ చెరువుతో రైతాంగానికి సాగునీరు అందించేందుకు కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ ప్రాజెక్టు మూలన పడిందన్నారు. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. చిట్టెం నర్సిరెడ్డి మనుమరాలు డా.చిట్టెం పర్ణికారెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే కావడం.. కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్‌రెడ్డి సీఎం కావడంతోనే ఈ ప్రాజెక్టు సాధ్యమవుతుందన్నారు. 62 రోజుల్లోనే పరిహారం పెంపు.. రాష్ట్రంలో ఎక్కడైనా భూ పరిహారం పెంపు నిర్ణయాన్ని ఏ ప్రభుత్వం కూడా అంత త్వరగా తీసుకోలేదని.. కానీ జిల్లావాసి సీఎం రేవంత్‌రెడ్డి కావడంతోనే కేవలం 62 రోజుల్లోనే ఎకరాకు రూ. 20లక్షలకు పరిహారం పెంచడం అందరి అదృష్టంగా భావించాలని మంత్రి అన్నారు. మక్తల్ నియోజకవర్గంలోని నేరడగాం, భూత్పూర్, సంగబండ, అనుగొండ, జూరాల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతుల బాధ తనకు తెలుసన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్ష మేరకు పేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి తీరుతామన్నారు. సాగు, తాగునీరు లేక గోస.. ఈ ప్రాంతంలో ఏళ్లుగా సాగు, తాగునీరు లేక జనం గోస పడుతున్నారన్నారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను ఎల్లూరు నుంచి మహబూబ్‌నగర్, దేవరకద్ర, మన్యంకొండ మీదుగా మరికల్ వరకు తీసుకొచ్చి.. అక్కడి నుంచి మక్తల్, నారాయణపేటకు తాగునీరు అందిస్తున్నారన్నారు. నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతలతో తాగు, సాగునీటి గోస తీరుతుందన్నారు. అంతకుముందు డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి మాట్లాడారు. భూ నిర్వాసితులు తమకు రూ. 20లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 62 రోజులుగా చేపట్టిన ఉద్యమానికి తెర పడిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని మంత్రి వాకిటి శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డితో కలిసి వెళ్లి ఒప్పించడం జరిగిందన్నారు. రైతులకు ఎకరానికి రూ. 20లక్షల పరిహారం ఇచ్చేందుకు సీఎం ఒప్పుకోవడం సంతోషంగా ఉందన్నారు. -
అద్భుతం.. ఆ కట్టడాలు
నారాయణపేటసరళమైన కోయిల్‌సాగర్ ● ‘ఇంజినీర్’ నైపుణ్యతకు నిదర్శనంగా నిలుస్తున్న రెండు ప్రాజెక్టులు ● ఆసియా ఖండంలోనే మొదటిగా పేరుగాంచిన ఆటోమేటిక్ సైఫన్ సిస్టం ● అప్పట్లోనే సాంకేతికతను పరిచయం చేసిన వనపర్తి సంస్థానాధీశులు ● అతి తక్కువ వ్యయంతో కోయిల్‌సాగర్ నిర్మాణం ● ఉమ్మడి పాలమూరుకు తలమానికంగా నిలిచిన జలాశయాలు సోమవారం శ్రీ 15 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025 -
జాతీయ ఆయుర్వేద కాన్ఫరెన్స్‌కు జిల్లా వైద్యులు
నారాయణపేట రూరల్: విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ ఆయుర్వేద కాన్ఫరెన్స్‌లో ఎనిమిది మంది జిల్లా వైద్యులు పాల్గొన్నారు. వ్యాప్ కాన్ –2025 సదస్సులో భాగంగా యూసఫ్‌గూడలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ నిమ్స్ మే లో రెండు రోజుల పాటు వర్క్ షాష్‌లో ఆయుర్వేద వైద్యంపై విసృత అవగాహన కల్పించారు. యోగా, న్యాచురోపతి ద్వారా వైద్య సేవలు అందించే విధానంపై శిక్షణ ఇచ్చారు. చరక సంహిత, సుశ్రుత సంహిత వంటి వేల ఏళ్ల క్రితం నాటి గ్రంథాల ఉపయోగాలను వివరించారు. త్వరలో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆస్పత్రుల నిర్మాణం జరగనుందని తెలిపారు. సెమినార్లో జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్ విరోజ, మల్లికార్జున్, వినోద్, అనురాధ, భవాని, సుమన, చందన, శ్రుతి తదితరులు పాల్గొన్నారు. -
అర్హత..
8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులు. ఏడోతరగతి పరీక్షలో 55 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలైతే 50 శాతం మార్కులుంటే సరిపోతుంది. ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలలు, హాస్టల్ సౌకర్యం లేని ఆదర్శ పాఠశాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.50 ఫీజు చెల్లించాలి. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను ధ్రువీకరిస్తూ బోనఫైడ్ ఇవ్వాలి. అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్షల్లోపు ఉండాలి. -
పంటల దిగుబడికి శాసీ్త్రయ సర్వే
జిల్లాలోని 13 మండలాల్లో 51 గ్రామాలు ఎంపిక నర్వ: జిల్లాలో వానాకాలం సాగు.. పంట దిగుబడి అంచనాలను పక్కాగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మండలాల వారీగా ఎంపిక చేసిన గ్రామాలు, సర్వేనంబర్ల వివరాలను జిల్లా అధికారులకు పంపించారు. పంట కోత ప్రయోగాలు పకడ్బందీగా చేపట్టేందుకు సిబ్బందికి శిక్షణనిచ్చారు. కొత్తగా రూపొందించిన యాప్‌లో వివరాలు నమోదు చేయాల్సి ఉండగా వ్యవసాయ, ప్రణాళికాశాఖ సిబ్బంది సంయుక్తంగా ప్రయోగాలు నిర్వహిస్తారు. ఈ వానాకాలంలో జిల్లావ్యాప్తంగా 76 క్లస్టర్లలో 51 గ్రామాల్లో పంట కోత ప్రయోగాలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎంపిక చేసిన గ్రామాల్లో పంటల వారీగా శాసీ్త్రయంగా దిగుబడులను అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది వానాకాలంలో సాధారణ సాగు 4.20 లక్షల ఎకరాలు ఉండగా.. ఇప్పటికే 4 లక్షలు సాగు చేశారు. వివరాల నమోదు ఇలా.. గ్రామాల వారీగా కేటాయించిన పంట పొలానికి అధికారులు వెళ్లాలి. పంటకోత ప్రయోగాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కొత్తగా రూపొందించిన యాప్‌లో వివరాలు నమోదు చేయాలి. నిర్దేశించిన పంటతో పాటు దిగుబడులను ఫొటోతో అప్లోడ్ చేయాలి. మండల సాగు విస్తీర్ణం మేరకు 3 నుంచి 5 గ్రామాలను పంట కోత ప్రయోగాలకు ఎంపిక చేశారు. రైతు పొలంలో నైరుతి భాగాన్ని ఎంపిక చేసి అక్కడి పంటను విడిగా కోసి తూకం వేస్తారు. పంట కోత ఫొటోతో పాటు తూకం ఫొటోను అప్లోడ్ చేయాలి. సాగుకయ్యే పెట్టుబడి, వినియోగించిన ఎరువులు, పురుగు మందులు, ఆశించిన తెగులు తదితర వివరాలు నమోదు చేయాలి. మండలాల వారీగా ఎంపికై న గ్రామాలు.. మండలం గ్రామాలు దామరగిద్ద మొగుల్‌మడ్క, ఉల్లిగండం, అయ్యవారిపల్లి, పిడెంపల్లి నారాయణపేట ఎక్లాస్పూర్, కవరంపల్లి, అప్పక్‌పల్లి, కోటకొండ ఊట్కూర్ పెద్దజట్రం, ఊట్కూర్, సమస్తాపూర్, పగిడిమర్రి మాగనూర్ నేరెడుగాం, పెగడబండ, పుంజనూర్, మందిపల్లి కృష్ణా కున్సి, కృష్ణా, హిందూపూర్, ఐనాపూర్ మక్తల్ పస్పుల, చిన్నగోప్లాపూర్, సోమశ్వేరబండ, జక్లేర్ నర్వ రాజుపల్లి, యాంకి, కల్వాల్, ఎల్లంపల్లి మరికల్ రాకొండ, మరికల్, పూసల్‌పహాడ్, మాద్వార్ ధన్వాడ గోటూర్, ధన్వాడ, పాతపల్లి, కిష్టాపూర్ మద్దూర్ పల్లెర్ల, చింతలదిన్నె, మోమిన్‌పూర్, లక్కపల్లి గుండుమాల్ సారంగరావుపల్లి, గుండుమాల్, బోగారం, బలభద్రాయపల్లి కోస్గి లోదీపల్లి, సర్జఖాన్‌పేట, మీర్జాపూర్ కొత్తపల్లి నందిగాం, కొత్తపల్లి, మన్నాపూర్ సర్వే చేపట్టనున్న పంటలు.. వరి, జొన్న, మొక్కజొన్న, కంది, మిరప, పత్తి వ్యవసాయ, ప్రణాళిక శాఖ సంయుక్తంగా.. కొత్తగా రూపొందించిన యాప్‌లో వివరాల నమోదు శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులు జిల్లాలో వానాకాలం పంటల దిగుబడి అంచనా వేసేందుకు పంటకోత ప్రయోగ సర్వేను పకడ్బందీగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన డిజిటల్ జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే ఎలా నిర్వహించాలనే అంశాలపై సిబ్బందికి శిక్షణనిచ్చాం. సర్వేలో సేకరించిన వివరాలను యాప్‌లో ఎలా నమోదు చేయాలో వివరించాం. సర్వే ఆధారంగా ధరల నియంత్రణపై ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకునేందుకు దోహదపడనుంది. – సింగ్ యోగానంద్, చీఫ్ ప్లానింగ్ అధికారి, నారాయణపేట డిజిటల్ క్రాప్ సర్వేకు వచ్చే ఏఈఓలు, మండల ప్రణాళిక అధికారులకు రైతులు సహకరించాలి. ఎంపిక చేసిన గ్రామాల్లో పంటల దిగుబడిని అంచనా వేసేందుకు పంటకోత సమయంలో ప్రయోగాలు చేపట్టి వివరాలను యాప్‌లో నమోదు చేయాలి. – నగేష్‌కుమార్, ఏడీఏ -
జాతి పునర్నిర్మాణంలో విద్యార్థులే కీలకం
నారాయణపేట రూరల్: జాతి పునర్నిర్మాణంలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని బిజ్వార్ పీఠం స్వామీజీ ఆదిత్య పరాశ్రీ అన్నారు. శనివారం పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏబీవీపీ పాలమూరు విభాగ్ నిర్వహించిన అభ్యాసవర్గకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల్లో జాతీయ భావాలను పెంపొందించేందుకు విద్యాసంస్థలతో పాటు ఏబీవీపీ కృషి చేస్తోందన్నారు. విద్యా విధానంలో సంస్కృతాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు. విదేశీయుల దండయాత్రతో దేశ సంస్కృతి ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంగ్ల భాషను నేర్చుకోవడంతో పాటు మాతృభాషను విస్మరించరాదని.. కంప్యూటర్, ఖగోళశాస్త్రంపై దృష్టి సారించాలని సూచించారు. ఉన్నత చదువుల తర్వాత ఇతర దేశాలకు వెళ్లకుండా సొంత ప్రాంతానికి సేవ చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం తెలంగాణ ప్రాంత సహ సంఘటన మంత్రి విష్ణువర్ధన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరుణాకర్, సంయుక్త కార్యదర్శి నరేష్తేజ్, నరేంద్ర, పృథ్వి, జిల్లా కన్వీనర్ నరేష్, మహిళా ఇన్చార్జ్ రేణుక, సంఘం నాయకులు పాల్గొన్నారు. -
పరిహారం పెంపు చారిత్రాత్మక నిర్ణయం
● ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపినమంత్రి, ఎమ్మెల్యే నారాయణపేట: నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఎకరాకు రూ.20 లక్షల పరిహారం చెల్లింపునకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో శనివా రం మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణపేట ఎమ్మె ల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల ఆవేదనను అర్థం చేసుకొని వారికి న్యాయం జరిగేలా పరిహారం పెంచుతూ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో నారాయణపేట, కొడంగల్, మక్తల్ ప్రాంత రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. భూ సేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేసి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుంటుందన్నారు. నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతలతో సస్యశ్యామలంగా మారబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ప్రతిభకు ప్రోత్సాహం
జిల్లాలో ఇలా.. 8వ తరగతి విద్యార్థులు 5,153ఉన్నతపాఠశాలలు 75ప్రాథమికోన్నత పాఠశాలలు 86ఏడాది వారీగా ఎంపికై న విద్యార్థులు 2022–23 472023–24 462024–25 46నారాయణపేట రూరల్: పేద విద్యార్థులు ఆర్థిక సమస్యలతో విద్యాభ్యాసాన్ని మధ్యలోనే నిలిపివేయకుండా వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిభ ఉపకార వేతనం (ఎన్ఎంఎంఎస్) అందిస్తోంది. 2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించి అర్హత పరీక్ష ప్రకటనను ఇటీవల విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబర్ 6 వరకు అవకాశం కల్పించింది. నవంబర్ 23న జిల్లాకేంద్రంలో పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఇందులో ఎంపికై తే తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు నాలుగేళ్ల పాటు ఏటా రూ.12 వేల చొప్పున మొత్తం రూ.48 వేలు విద్యార్థుల బ్యాంకు ఖాతాలో జమవుతాయి. పరీక్ష విధానం.. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలుంటాయి. మెంటలెబిలిటీ (ఎంఏటీ), లాస్టిక్ ఎబిలిటీ (ఎస్ఏటీ), ఏడు, ఎనిమిదో తరగతికి సంబంధించిన గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. పూర్తి వివరాలకు బీఎస్ఈ తెలంగాణ వెబ్‌సైట్‌ను పరిశీలించాలి. ప్రణాళికతో చదివితే.. మొత్తం 180 మార్కులకు పరీక్ష నిర్వహించగా.. ప్రశ్నాపత్రం రెండు విభాగాలుగా ఉంటుంది. పార్ట్–ఏలో మానసిక సామర్థ్య పరీక్ష 90 మార్కులకు 90 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రీజనింగ్ ఎబిలిటీ, సంఖ్యాశాస్త్రం, పదాల భిన్న పరీక్ష, నంబర్ అనాలజీ, ఆల్ఫాబెట్ అనాలజీ, కోడింగ్, డీ కోడింగ్, లాజికల్ ప్రశ్నలు, వెన్ చిత్రాలు, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్‌కు సంబంధించిన అంశాలు ఉంటాయి. పార్ట్–బిలో ఏడు, 8వ తరగతికి సంబంధించి 90 ప్రశ్నలకు 90 మార్కులు కేటాయించారు. వాటిలో గణితం 20, సామాన్య శాస్త్రం 35, సాంఘిక శాస్త్రం 35 మార్కులు కేటాయిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. ప్రణాళికతో చదివి పరీక్షకు హాజరవుతే తప్పక విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది. నవంబర్ 23న ఎన్ఎంఎంఎస్ పరీక్ష ఎంపికై తే ఏటా రూ.12 వేల ఉపకార వేతనం ప్రతిభ చాటితే నాలుగేళ్ల పాటు అందజేత దరఖాస్తునకు అక్టోబర్ 6 వరకు అవకాశం -
ఇస్రోను సందర్శించిన ఉపాధ్యాయులు
నారాయణపేట రూరల్: దేశంలోనే ఎంతో ప్రత్యేకత కల్గిన శ్రీహరికోట సతీశ్ ధావన్ ఉపగ్రహ రాకెట్ల ప్రయోగ కేంద్రాన్ని శుక్రవారం నారాయణపేట జిల్లా సైన్స్ ఉపాధ్యాయులు సందర్శించారు. సీవీ రామన్ సైన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో 90 మంది ఉపాధ్యాయులు ఉపగ్రహ శాస్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన అనేక విషయాలపై అవగాహన పొందారు. ఇప్పటివరకు శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఉపగ్రహాలు పొందుతున్న ప్రయోజనాలు, భవిష్యత్‌లో చేయబోతున్న ప్రయోగాల వివరాలు అక్కడి శాస్త్రవేత్తలు వివరించారు. ఇస్రోలోని రాకెట్ లాంచింగ్ స్టేషన్స్‌ను, ప్రయోగ పర్యవేక్షణ కేంద్రాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజులు, సీఎంఓ రాజేంద్ర కుమార్, ఏఎంఓ విద్యాసాగర్, డి.ఎస్.ఓ భానుప్రకాష్, సెక్టోరియల్ అధికారులు నాగార్జునరెడ్డి, శ్రీనివాస్, యాదయ్యశెట్టి, ఫోరం సబ్యులు రాములు, శశికుమార్, వివిధ సంఘ బాధ్యులు షేర్ కృష్ణారెడ్డి, జనార్దన్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
దొడ్డు బియ్యం.. పురుగులపాలు
మద్దూరు: రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం ముక్కిపోతున్నాయి. ఈ ఏడాది మార్చి వరకు లబ్దిదారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేయగా.. ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. అంతకుముందు రేషన్ దుకాణాలకు సరఫరా చేసిన దొడ్డు బియ్యం ఐదు నెలలుగా వృథాగా ఉన్నాయి. దీంతో చాలా చోట్ల ఈ బియ్యం పురుగులు పట్టి, తుట్టెలు( చిట్టెం) కడుతున్నాయి. ప్రభుత్వం దొడ్డు బియ్యం ఆయా చోట్ల నుంచి ఖాళీ చేయకుండానే సన్నబియ్యం స్టాక్ పెట్టింది. దీంతో అప్పటికే నిల్వ ఉన్న దొడ్డుబియ్యం నుంచి పురుగులు సన్న బియ్యానికి పడుతున్నాయి. పేరుకుపోయిన బియ్యం నిల్వలు జిల్లాలోని రేషన్ దుకాణాలు, ఎంఎల్ఎస్ పాయింట్లు, గోదాముల్లో 1,255 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. సన్న బియ్యాన్ని పంపిణీ చేసే క్రమంలో రేషన్ షాపుల నుంచి మిగిలి ఉన్న దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం సేకరించలేదు. దీంతో డీలర్లు రేషన్ షాపులోనే ఓ మూలన పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ బియ్యం పురుగులు, తుట్టెలు పట్టి పనికి రాకుండా పోతుంది. జిల్లాలో 301 రేషన్ షాపులు జిల్లాలో 301 రేషన్ షాపులు ఉన్నాయి. ఏప్రిల్ నెలలో సన్న బియ్యం పంపిణీకి ముందు ఆయా రేషన్ షాపుల్లో మొత్తం 59.6695 మొట్రిక్ టన్నుల పైచిలుకు దొడ్డు బియ్యం ఉన్నట్లు అంచనా. అయితే బియ్యం కేటాయింపు నిల్వలంతా రాష్ట్రస్థాయి నుంచే ఆన్లైన్ విధానంలో కొనసాగుతుంది. సన్నబియ్యం పంపిణీ సందర్బంలో దొడ్డు బియ్యం నిల్వకు సంబంధించిన ఆన్లైన్ నిలిపివేసి.. సన్న బియ్యానికి సంబంధించిన ఆన్లైన్ విధానం అమలు చేశారు. దీంతో జిల్లా పౌర సరఫరాల శాఖ అధకారుల వద్ద ఏ రేషన్ షాపుల్లో ఎంత దొడ్డు బియ్యం ఉన్నాయనే సమాచారాన్ని సంబంధిత డీలర్ల నుంచి అధికారులు సేకరించారు. దొడ్డు బియ్యంపై పట్టింపేది? జిల్లాలోని గోదాములు, ఎంఎల్ఎస్ పాయింట్లతో పాటు రేషన్ షాపుల్లో 1,255 మెట్రిక్ టన్నుల వరకు దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. ఈ బియ్యంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వాటిని ఏమి చేయాలో తెలియక రేషన్ డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. వేలం ద్వార అమ్మడమా.. లేక ఇతర ప్రాంతాలకు తరలించడమా చేయాలని కోరుతున్నారు. మూడు ఎంఎల్ఎస్ పాయింట్లలోజిల్లాలో బియ్యం నిల్వలు ఇలా.. (మెట్రిక్ టన్నుల్లో) 171.022 రేషన్ షాపుల్లో ముక్కిపోతున్న దొడ్డు బియ్యం ఐదు నెలలుగా ఏ నిర్ణయం తీసుకోని అధికారులు సన్న బియ్యానికి చేరుతున్న పురుగులు ఇబ్బంది పడుతున్న రేషన్ డీలర్లు రేషన్ షాపుల్లో 59.6695 బఫర్ గోదాములో 1024.833 -
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
కోస్గి రూరల్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజేపి పార్టీ నాయకులు సత్తాచాటాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతికుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పార్టి కార్యాలయంలో కొడంగల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల ప్రతినిలధులతో ప్రత్యేక సమావేశాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి తోడ్పాటునందించాలని, ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగలన్నారు. కలిసికట్టుగా పని చేస్తే విజయం మనదేనని అన్నారు. ఆనంతరం పలు మండలాల ప్రతినిధులు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికై న సందర్భంగా శాంతికుమార్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మధన్ , నారాయణ , వెంకటేష్ , ప్రశాంత్ చ బద్రినాథ్ తదితరులు ఉన్నారు. హక్కుల సాధనకు పోరాడిన నాయకుడు.. నారాయణపేట టౌన్: పేదల హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాటం చేసిన గొప్ప నాయకుడు సీతారాం ఏచూరి అని, కార్మిక సమసమాజ స్థాపన చేయడమే ఆయనకు అందించే నిజమైనా నివాళి అని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో సీతారాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రజాతంత్ర లౌకిక శక్తుల ఐక్యత కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మనీయమన్నారు. దేశపార్లమెంట్ను ప్రజాసమస్యల చర్చవేదికగా మార్చిన మహోన్నత పార్లమెంటేరియన్ కామ్రేడ్ సీతారాం ఏచూరి అని కొనియాడారు. విద్యార్థి దశనుంచే పోరాటాలు నిర్వహించి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గోపాల్, బలరాం, అంజయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న వారిపై చర్య తీసుకోవాలి
నారాయణపేట: జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులను లక్ష్యంగా చేసుకొని కొందరు బ్లాక్ మెయిల్ పర్వాన్ని నడుపుతున్నారని, ఇది తగదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా అధ్యక్షులు డాక్టర్ మల్లికార్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రుల్లో నిబంధనలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు జరుగుతున్నాయని అంటూ డబ్బులు ఇవ్వాలని డాక్టర్లను బెదిరిస్తున్నారన్నారన్నారు. ఇటువంటి చర్యలు సమాజంలో విలువలకు తిలోదకాలు ఇచ్చేలా ఉన్నాయన్నారు. బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్ఒ జయచంద్రమోహన్, డా.కార్తీక్ గందే, డా. గీతా,డా. విశ్వనాధ్, డా. రంజిత్, డా. ప్రసాద్ శెట్టి,పద్మకళ, డా. మధుసూదన్ రెడ్డి ఉన్నారు. నేడు గద్వాలకు కేటీఆర్ రాక గద్వాల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం గద్వాలకు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటకు గద్వాలకు చేరుకుని పట్టణంలో భారీ ర్యాలీ తీసి.. అనంతరం 4 గంటలకు తేరుమైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. -
చిక్కులు సరిచేస్తేనే భూములిస్తాం
పరిహారం పెంపుతోపాటు సర్వే చేసి ఎవరి భూమి ఎంత పోతుందో తెలిపిన తర్వాతే భూములిస్తామంటూ మక్తల్ మండలంలోని కాట్రేవ్‌పల్లి గ్రామానికి చెందిన రైతులు తేల్చిచెప్పారు. అదే మండలంలోని మంతన్‌గోడ్, టెకులపల్లి, ఎంనాగన్పల్లి రైతులు మాత్రం సమ్మతి పత్రాలను అధికారులకు అందజేశారు. మిగతా గ్రామాల రైతులు ముందుకు వస్తున్నారు. ఇదిలాఉండగా, పరిహారం పెంచాలనే డిమాండ్‌తో కానుకుర్తిలో చేపట్టిన రిలేదీక్షలు శుక్రవారం నాటికి 37వ రోజుకు, జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు దగ్గర భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 60వ రోజుకు చేరుకున్నాయి. -
బియ్యం తరలించాలి
ఏప్రిల్ నుంచి ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుంది. మా వద్ద ఉన్న దొడ్డు బియ్యాన్ని ఇప్పటి వరకు తీసుకోలేదు. రేషన్‌షాపులో స్థలం లేక ఇబ్బంది కలుగుతోంది. దానికితోడు దొడ్డు బియ్యానికి పురుగు వస్తుంది. అది సన్న బియ్యానికి కూడా పట్టే ప్రమాదం ఉంది. వెంటనే దొడ్డు బియ్యం నిల్వలను తరలించాలి. – సంజీవరెడ్డి, రేషన్ డీలర్, మద్దూరు ప్రభుత్వానికి నివేదించాం బఫర్ గోదాం, ఎంఎల్ఎస్, రేషన్‌షాపుల్లో ఉన్న దొడ్డు బియ్యం నిల్వలపై ప్రభుత్వానికి నివేదిక అందజేశాం. ప్రభుత్వం నుంచి అదేశాల మేరకు వాటిని తరలించడం జరుగుతుంది. ఇప్పటి వరకు దొడ్డు బియ్యాన్ని తరలించడానికి అదేశాలు రాలేదు. – సైదులు, డీఎం ● -
లక్ష ఎకరాలకు సాగునీరుఅందించడమే లక్ష్యంగా..
సీఎం రేవంత్‌రెడ్డి నారాయణపేట – కొడంగల్ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఈ ప్రాంతానికి లక్షా ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంతో రూ.2950 కోట్లతో శ్రీకారం చుట్టారు. కాగా ప్రాజెక్టులో మరిన్ని చెరువులకు సాగునీరు అందించాలని అంచాన వ్యయాన్ని రూ.4,500 కోట్లకు పెంచారు. 2024 ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టు పునాదులు పడ్డాయి. అయితే ఈ ప్రాజెక్టులో భూ నిర్వాసితులు చేపడుతున్న ఆందోళనలతో సీఎంను ఒకింత కలవరానికి గురిచేస్తుండగా మరో వైపు పరిహారం పెంచకపోతే ప్రాజెక్టు పూర్తి అయ్యే పరిస్థితి కానరావడం లేదనేది సీఎం దృష్టికి వెళ్లడంతో ఏది ఏమైనా ఈ రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో సీఎం ఎకరానికి రూ. 20లక్షల పరిహారం ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. సమ్మతి పత్రాలు స్వీకరిస్తున్నాం పేట– కొడంగల్ ప్రాజెక్టులో భాగంగా ఎకరాకు రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని కోరుతున్న భూ నిర్వాసితుల నుంచి సమ్మతి పత్రాలు స్వీకరిస్తున్నాం. ఆ పత్రాలన్నీ ప్రభుత్వానికి నివేదిస్తాం. రూ.20లక్షల పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం నుంచి అధికార ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. – ఎస్.శ్రీను, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ ● -
కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి..
ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించేలా వ్యవహరించడం ఎవరికీ సమర్థనీయం కాదు. ప్రతిపక్షాలు మాట్లాడలేనప్పుడు కూడా ప్రజల సమస్యలు, ఇబ్బందులను పాలకుల దృష్టికి తీసుకొస్తాయి. అలాంటి పత్రికలు, మీడియాపై అణచివేతకు పాల్పడేలా దాడులకు దిగడం.. కేసులు నమోదు చేయడం అప్రజాస్వామిక చర్య. ప్రభుత్వాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఇప్పుడు ఒకరు అనైతిక చర్యలకు దిగారంటే.. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా అలానే వ్యవహరించాల్సి ఉంటుంది. ఇలా చేస్తూ పోతే అభివృద్ధి కుంటుపడడమే కాకుండా రాష్ట్రం రావణకాష్టగా మారుతుంది. రాజకీయాల మాటున కక్షసాధింపు చర్యలు రాష్ట్రానికి, దేశానికి మంచిది కాదు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. ఇప్పటికై నా పత్రికా స్వేచ్ఛను హరించే చర్యలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. – శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి, మహబూబ్‌నగర్ -
ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచాలి
నారాయణపేట/నారాయణపేట క్రైం/కోస్గి రూరల్/మద్దూరు: ప్రజల్లో సర్కారు వైద్యంపై నమ్మకం పెంచాలని వైద్యులకు, అసుపత్రికి సిబ్బందికి కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. గురువారం కోస్గి, మద్దూరు సీహెచ్‌సీలను తనిఖీ చేశారు. కోస్గి ఆస్పత్రి అభివృద్ధికి అవసరమైన సదుపాయాల నివేదికను అందించాలని డీసీహెచ్ఎస్ మళ్లికార్జున్ అదేశించారు. మద్దూరులో ఎక్స్‌రే సేవలను వీలైనంత త్వరగా ప్రారంభించాలని, మంజూరైన రూ.30 లక్షల జనరేటర్‌ను వినియోగంలోకి తీసుకురావాలని అదేశించారు. అసుపత్రి ప్రహారి నిర్మాణం కోసం కడా నుంచి మంజూరైన రూ.25లక్షల పనులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనులు ప్రారంభించాలని అదేశించారు. అంతకుముందు అసుపత్రిలోని చిన్నపిల్లవ వార్డు, జనరల్ వార్డును పరిశీలించి అక్కడి రోగులతో మాట్లాడారు. అందుతును వైద్య సేవలను రోగులను అగిడి తెలుసుకున్నారు. ఔట్‌పేషెంట్, ఇన్ పెషెంట్ల వివరాలను అడిగి తెలసుకున్నారు. ఆర్ఎంఓ పావని, తహసీల్దార్ మహేష్‌గౌడ్, డీసీహెచ్ఎస్ డాక్టర్ మల్లీకార్జున్, తదితరులున్నారు. అటవీ భూములను సంరక్షించాలి అటవీ భూములను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని లెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. కలెక్టర్ చాంబర్లో అటవీ శాఖపై సమీక్షించారు. జిల్లాలో అటవీ భూములు లింగంపల్లి, చిన్న జట్రం, బోయిన్పల్లి, కోటకొండ, అమ్మిరెడ్డిపల్లి, తిరుమలపూర్, అభంగాపూర్, ఎక్లాస్పూర్, బైరంకొండ, ధన్వాడ మండలంలోని కొండాపూర్ కిష్టాపూర్ , గోటూర్, మద్దూరు పల్లెర్ల తదితర గ్రామాలలో ఉన్నాయని, పీఓబీ భూభారతి కింద కొన్ని సరిపోలడం లేదని అధికారులు తెలిపారు. అసైన్మెంట్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్‌ను తహసీల్దార్లు సర్వే నెంబర్ ద్వారా రికార్డులు పరిశీలించాలని, వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ● దసరాలోగా హ్యాండ్లూమ్ ఎక్సలెన్స్ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ సెంటర్ ఆఫ్ హ్యాండ్లూమ్ ఎక్స్‌లెన్స్‌ను సందర్శించారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. టీజీఎంఎస్ ఐడీసీ ఈఈ రతన్‌కుమార్, టెస్కో ఓఎస్డి శ్రీలత, డి. బాబు పాల్గొన్నారు. ● ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో రోడ్లు, భవనాలు, కల్వర్టులు, స్కూల్ భవనాలు, వసతి గృహాలు, త్రాగునీటి సరఫరా పైప్లైన్ల్కు ఏమైనా నష్టం కలిగితే తాత్కాలిక మరమ్మతులకు సంబందించిన ప్రతిపాదనలనలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వరద నష్టంపై అధికారులతో సమీక్ష జరిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం అధికారులు తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. -
కలానికి సంకెళ్లుఅప్రజాస్వామికం
ఏపీలో ‘సాక్షి’ దినపత్రికపై కొనసాగుతున్న కేసులు, దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యంలో పత్రికలపై అక్రమ కేసులు పెట్టి అడ్డుకోవాలనుకోవడం సిగ్గుమాలిన చర్య. 30 ఏళ్ల సీనియారిటీ అని చెప్పుకొనే చంద్రబాబు ఇలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరైనది కాదు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్‌గా నిలిచి.. ప్రజాగొంతుకను వినిపించే పత్రికలపై దాడులు చేస్తూ, అక్రమ కేసులు బనాయించడం కలానికి సంకెళ్లు వేయడమే. దీనిని ప్రతిఒక్క ప్రజాస్వామికవాది ఖండించాలి. ఇప్పటికై నా చంద్రబాబు కక్షసాధింపు చర్యలు మానుకుని పత్రికా స్వేచ్ఛనుకాపాడాలి. – బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల -
యూరియా.. ఏదయా?
● తెల్లవారుజామున నుంచే క్యూలైన్లోనే రైతులు ఎదురుచూపులు ● కొందరికే టోకెన్లు దక్కడంతో నిరాశతో వెనుదిరిగిన వైనం నారాయణపేట రూరల్/నారాయణపేట టౌన్/ నర్వ/దామరగిద్ద: యూరియా కొరత రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తుంది. గ్రామాల్లోని రైతు వేదికలో యూరియా బస్తాలు అందిస్తామని ప్రకటించడంతో గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచే అన్నదాతలు వరుస కట్టారు. నారాయణపేట మండలంలోని కోటకొండ గ్రామంలో వరసలో నిలబడిన రైతులు కలిసి పాస్ పుస్తకాలను వరుసలో పెట్టి పక్కకు వెళ్లి సేదతీరారు. లోడ్ 300 బస్తాలు మాత్రమే రాగా రైతులు మాత్రం పెద్ద ఎత్తున తరలిరావడంతో ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్తా చొప్పున పంపిణీ చేశారు. యూరియా రానివారు నిరాశతో వెనుదిరిగారు. మరో లోడు తెప్పించి రెండు రోజుల్లో అందిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ● నారాయణపేట మినీ స్టేడియంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి వర్షంలోనే తడుస్తూ రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. మండలంలోని పలు గ్రామాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. గంటల తరబడి నిలబడి ఒకరికి ఒక టోకెన్, బక బస్తా యూరియా ఇవ్వడం ఎంత వరకు సమంజసమని పలువురు రైతులు ప్రశ్నించారు. ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి రైతులను సముదాయించి జిల్లా కేంద్రంలో నాలుగు క్లస్టర్లుగా పలు గ్రామాల వారికి ఏర్పాటు చేసి యూరియా అందజేశారు. ● నర్వ పీఏసీఎస్‌తో పాటు మన గ్రోమర్, నర్వలోని రెండు ప్రైవేటు, రాయికోడ్‌లోని ఓ ప్రైవేటు క్రిమిసంహారక దుకాణాలకు యూరియా రాగా.. రైతులు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ సందర్భంగా పోలీస్‌లు అక్కడికి చేరుకోని రైతులకు క్రమ పద్దతిలో యూరియా అందేలా చర్యలు చేపట్టారు. రైతులు ఎలాంటి అధైర్యపడాల్సిన పనిలేదని, సరిపడా యూరియా ప్రభుత్వం అందిస్తుందనిఏఓ అఖిలారెడ్డి పేర్కొన్నారు. ● దామరగిద్దలో తెల్లవారుజాము నుంచే యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఏఓ మణిచందర్ సమక్షంలో రెండు రోజుల క్రితం టోకన్ అందుకున్న రైతులకు యూరియా అందజేశారు. కాగా మిగిలిన రైతులకు టోకన్లను అందజేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ రాజు సమక్షంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు. -
సమన్వయంతో మెలగాలి..
పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడం, జర్నలిస్టులను భయబ్రాంతులకు గురిచేయడం అప్రజాస్వామిక చర్య. భావ ప్రకటనను ఎవరై నా వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ప్రభు త్వాలు కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడకుండా.. సమన్వయంతో మెలిగేందుకు ప్రయత్నించాలి. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేసే పత్రికలు, జర్నలిస్టులపై దాడులు చేయడం, కేసులు నమోదు చేయడం తగదు. – ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, దేవరకద్ర తీవ్రంగా ఖండిస్తున్నాం.. ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టడాన్ని మహబూబ్‌నగర్ ప్రెస్ క్లబ్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ చాలా ముఖ్యమైనది. అభిప్రాయాలను పంచుకునేందుకు, ప్రభుత్వానికి ప్రజల వాణిని వినిపించడంలో పత్రికలు కీలకపాత్ర పోషిస్తాయి. పత్రికలపై, సంపాదకులపై పనిగట్టుకొని కేసులు నమోదు చేయడం దారుణం. ప్రజల గొంతుకగా నిలిచే మీడియా గొంతు నులిమే ప్రయత్నం చేయడం సరికాదు. పత్రికలు తమ పని తాము స్వేచ్ఛగా చేసినప్పుడే సమాజంలోని అన్నివర్గాల అభిప్రాయాలు ప్రజలకు చేరువవుతాయి. – వి.నరేందర్‌చారి, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ ప్రతిపక్ష పాత్ర పోషించాలి.. జర్నలిస్టులు ఎక్కడైనా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఏపీ లో ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై దాడులు, కేసు లు నమోదు చేయడం వంటివి పత్రికా స్వేచ్ఛను హరించడమే. ప్రశ్నిస్తున్న ‘సాక్షి’ ఎడిషన్ సెంటర్లపై దాడులు, ఆస్తులను ధ్వంసం చేయడం హేయమైన చ ర్య. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు గెలిచిన తర్వాత నెరవేర్చకుంటే కచ్చితంగా జర్నలిస్టులు ప్రజల తరఫున ప్రశ్నించడం సహజం. జర్నలిస్టుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాల పేరుతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు. – చంద్రశేఖర్‌రావు, జిల్లా అధ్యక్షుడు, టీయూడబ్ల్యూజే (హెచ్–143), నాగర్‌కర్నూల్ -
జర్నలిజంపై దాడి సరికాదు
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్‌గా గుర్తింపు ఉన్న జర్నలిజంపై దాడి సరికాదు. ప్రజల పక్షాన గళం విప్పే పత్రికల గొంతు నొక్కడం ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ ప్రధానమైనది. రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపడం సరికాదు. పత్రికలలో వచ్చిన వార్తలు అభ్యంతరకరంగా ఉంటే వివరణ కోరాలే తప్ప అక్రమ కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు. జర్నలిజం విలువల పరిరక్షణకు ప్రభుత్వాలు పాటుపడాలి. ఏపీలో ‘సాక్షి’ ఎడిటర్‌పై అనుసరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉంది. – అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల -
పదవీ గండం?
కొత్త నిబంధనలతో పీఏసీఎస్ పాలకవర్గాల్లో ఆందోళన కోస్గి: వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లకు సంబంధించిన పాలక వర్గాల పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 14తో ముగిసింది. పాలకవర్గాల పదవీ కాలాన్ని రెండోసారి ప్రభుత్వం మరోమారు పొడిగించింది. ఇప్పటికే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ పాలక వర్గాల పదవీ కాలం ముగియడంతో గ్రామ పంచాయతీల్లోనూ, మున్సిపాలిటీల్లో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించి పాలన కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 6 నెలలపాటు పొడిగించిన పీఏసీఎస్‌ల పదవీ కాలం సైతం ఆగస్టు 14తో ముగియడంతో ప్రభుత్వం పీసీసీఎస్లతోపాటు డీసీసీబీ పాలకమండళ్ల పదవీ కాలన్ని సైతం పొడిగిస్తూ జీఓ 386 ను విడుదల చేసింది. సర్వత్రా ఆందోళన పదవీ కాలం పొడిగించిన ప్రభుత్వం తాజాగా కొత్త నిబంధనలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాలకవర్గాల్లో ఎవరైన పీఏసీఎస్ చైర్మన్ గాని, డైరెక్టర్ గాని రుణాలు తీసుకొని చెల్లించని పక్షంలో, నిధుల దుర్వినియోగంలో ప్రమేయం ఉన్న పాలకవర్గ ప్రతినిధులు, డైరెర్టర్లను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో కొన్ని పీఏసీఎస్ పాలకవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. జిల్లా అధికారులు బకాయిలు ఉన్న డైరెక్టర్లు, నిధుల దుర్వినియోగం చేసిన వారికి ముందస్తుగా నోటీసులు జారీ చేయడంతోపాటు సంబంధిత వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. కాగా ఇప్పటికే నోటీసులు అందుకున్న డైరెక్టర్లు తమ బకాయిలను చెల్లించి పదవి గండం నుంచి తప్పించుకున్నారు. జిల్లాలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఇద్దరు చైర్మన్లతోపాటు ఓ పీఏసీఎస్ కార్యదర్శిపై విచారణ కొనసాగుతుంది. ఒకవేళ ఏదేని సొసైటీకి పాలకవర్గం రద్దయితే ప్రత్యేక అధికారిని నియమించనున్నారు. పొంతన లేకుండా డీసీఓ సమాధానాలు పాలకవర్గాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన కొత్త ఉత్తర్వుల విషయమై ఇన్చార్జ్ డీసీఓ శంకరాచారిని అడగగా.. ఉత్తర్వులు వచ్చిన మాట వాస్తవమేనని, జిల్లాలో అలాంటి కేసులు లేవని, నోటీసులు ఇచ్చి తీసుకున్న రుణాలు వసూలు చేశామని, ఎమ్మెల్యేలు, కడా అధికారి చెప్పడంతో వారిని కొనసాగిస్తున్నామంటూ పొంతన లేని సమాధానం ఇచ్చారు. నిధుల దుర్వినియోగంతోపాటు బకాయిలు ఉన్న డైరెక్టర్ల సమగ్ర వివరాలు అడగగా అలాంటిదేమి లేదు అంతా ఓకే ఉంది, ఇంకేమి అడగొద్దు అంటూ ఫోన్ పెట్టేశారు. జిల్లాలో 10 పీఏసీఎస్‌లు.. 130 మంది డైరెక్టర్లు జిల్లాలో 13 మండలాలు, 276 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా మొత్తానికి ఒక డీసీసీబీ, ఒక డీసీఎంఎస్తోపాటు నారాయణపేట జిల్లాలో 10 పీఏసీఎస్‌లు ఉండగా మొత్తం 130 మంది డైరెక్టర్లు ఉన్నారు. వీరిలో ఇద్దరు చైర్మన్లు, ఓ కార్యదర్శి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం కొత్తగా విధించిన నిబంధనలతో పాలకవర్గాలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధికారులు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హత ఉన్న సంఘాల వివరాలను సేకరించి ప్రభుత్వానికి పంపించే పనిలో ఉన్నారు. రుణాలు చెల్లించని, నిధుల దుర్వినియోగం కేసులున్న వారి పదవులకు ఎసరు పదవీ కాలం పొడగిస్తూనే నిబంధనలతో ప్రభుత్వం మరో జీఓ విడుదల జిల్లాలోని 10 పీఏసీఎస్‌ల్లో ఇద్దరు చైర్మన్లకు పదవీ గండం..? -
10 లక్షల ఎకరాల్లో పెరిగిన సాగు విస్తీర్ణం..
ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా వానాకాలం సీజన్‌కు సంబంధించి 2014లో 8.50 లక్షల ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు సాగు కాగా.. ప్రస్తుతం 18.50 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. ఈ లెక్కన 11 ఏళ్లలో 10 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో సాగు నీటి వసతి ఇంకా పెరగాల్సి ఉన్నప్పటికీ.. విస్తారంగా వర్షాలు కురవడం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయం ఇస్తుండడం, రుణమాఫీ వంటి చర్యలు ఉమ్మడి జిల్లాలో సాగు గణనీయంగా పెరిగేందుకు దోహదపడ్డాయని వ్యవసాయరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాగు పెరిగింది..పంట మార్పిడి చేయాలి పంటల సాగు గణనీయంగా పెరిగింది. ఏటేటా వరి, పత్తినే అధికంగా పండిస్తున్నారు. ప్రతిసారి ఒకే రకమైన పంటలను సాగు చేయడం వల్ల భూమి చౌడు పొలంగా మారుతుంది. అన్ని రకాల పంటలు సాగు చేస్తేనే లాభదాయకంగా ఉంటుంది. జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ సీజన్లో మొక్కజొన్న సాగు పెరిగింది. పంట మార్పిడి చేసి కందులు, జొన్న, ఆముదం, ఇతర పంటలు కూడా సాగు చేస్తే.. భూసారం దెబ్బ తినదు. – బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, మహబూబ్‌నగర్ ● -
మానవ అక్రమ రవాణాను నిర్మూలించాలి
నారాయణపేట రూరల్: మానవ అక్రమ రవాణా నియంత్రించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డీఈఓ గోవిందరాజు అన్నారు. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని స్కూల్ అసిస్టెంట్లకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక కేజీబీవీ పాఠశాలలో నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన డిఈఓ మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తుందని, ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న నేరపూరితమైన చర్యను అడ్డుకునేందుకు చైతన్యం పెరగాలన్నారు. పేద, మధ్య తరగతి అమ్మాయిలు, మహిళలు ఎక్కువ గా గురి అవుతున్నారని, సమాజంలో ప్రజలతో, విద్యార్థులతో సన్నిహితంగా ఉండి గమనించి వారికి అవగాహన కల్పించాలని, పేరెంట్స్ మీటింగ్స్ చర్చించి సూచనలు చేయాలన్నారు. చిన్నతనం నుంచి ఫోన్ ఉపయోగించడం తగ్గించాలని, యాప్ ల ద్వారా పర్సనల్ ఫొటోస్ వీడియోస్ పంపడం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం సైబర్ ఆధారిత అక్రమ రవాణా చట్టాలు, సఖి భరోసా కేంద్రాలు, చైల్డ్ లైన్, పోలీస్ టోల్ ఫ్రీ నంబర్స్ 1098, 100, 181, 1930, 181లపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిసిడిఓ నర్మద, సంఘం కోఆర్డినేటర్ అంబర్ సింగ్, సిబ్బంది కృష్ణవేణి, నవనీత పాల్గొన్నారు. -
ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శం
నారాయణపేట/మక్తల్: చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మక్తల్‌లోని మంత్రి కార్యాలయంలో ఆమె చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సంఘసేవకురాలిగా, భూమి, సాయుధ రైతాంగ పోరాటంలో ప్రదర్శించిన పోరాటపటిమతో వీరవనితగా చరిత్రలో నిలిచి ప్రతిఒక్కరికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధపోరాటంలో దొరలు, రజాకార్ల దురాగాతాలను ఎదిరించిన గొప్ప వీరవనిత ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ సాయుధరైతాంగ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచి మహిళాశక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్పవీరవనిత అన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మారెడ్డి, గణేష్‌కుమార్, విష్ణువర్ధన్‌రెడ్డి, ఫయాజ్, రంజిత్‌కుమార్‌రెడ్డి, కోళ్ల వెంకటేష్, కట్టసురేస్, కట్టవెంకటేష్ పాల్గొన్నారు. ఆదర్శప్రాయురాలు.. తమ హక్కుల కోసం ఎలుగెత్తి చాటిన సాహస వీరనారి ఐలమ్మ అని, ఆమెను ఆదర్శంగా తీసుకుని ఆశయ సాధనకు కృషిచేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేందర్ గౌడ్ అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రజావాణి సమావేశపు మందిరంలో బుధవారం చాకలి ఐలమ్మ చిత్ర పటానికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఇతర జిల్లా శాఖల అధికారులు, వివిద కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకమైన పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారులు, ఉద్యోగులు, రజక సంఘం జిల్లా నాయకులు,వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
సర్దుబాటు సమంజసమేనా..?
నారాయణపేట రూరల్: ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు సర్కారు బడులకు తమ పిల్లలను పంపిస్తే బోధనా సిబ్బంది లేక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ఉపాధ్యాయుల కొరత మరింత ఎక్కువైంది. దీంతో పిల్లల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల కేటాయింపు లేక కనీసం వలంటీర్ల నియామకం చేపట్టక చాలా చోట్ల పాఠ్యాంశాల బోధనకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. క్రమబద్దీకరణ పేరుతో తక్కువ విద్యార్థుల అరకొర పాఠశాలల్లో ఉపాధ్యాయులను తొలగించి ఇతర పాఠశాలలకు పంపిన విద్యాశాఖ ఎక్కువ మొత్తంలో విద్యార్థులు కల్గిన పాఠశాలల్లో అందుకు తగిన నిష్పత్తిలో టీచర్ల నియామకం చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల సర్దుబాటు పేరుతో కొందరు టీచర్లను ఇతర పాఠశాలలకు డిప్యూటేషన్‌పై కేటాయించగా, కొన్ని చోట్ల విధుల్లో చేరారు. మరికొన్ని చోట్ల రాజకీయ నాయకులు, ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడితో డీఈఓ ఆదేశాలను బేఖాతరు చేస్తు పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. జిల్లాలో ఇటీవల ఒక సారి బదిలీలు, రెండుసార్లు పదోన్నతులు కల్పించడంతో ప్రాథమిక పాఠశాలలు, మారుమూల గ్రామీణ బడుల్లో టీచర్ల కొరత తీవ్రమైంది. దీనికితోడు చాలా చోట్ల పదవీవిరమణ పొందిన, మృతిచెందిన టీచర్ల స్థానంలో కొత్త వారు చేరలేదు. దీంతో జిల్లాలో వందల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సమస్య ఉన్న చోట నుంచే సర్దుబాటు వాస్తవానికి జిల్లాలో విద్యార్థుల, ఉపాధ్యాయుల నిష్పత్తి పరిశీలిస్తే ఇతర జిల్లాల కంటే చాలా ఎక్కువ ఉంది. టీచర్ల కొరత తీర్చేందుకు ప్రభుత్వం తాత్కాలిక పద్ధతిలో సర్దుబాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దాదాపు 90శాతంపైగా స్కూళ్లలో ఉపాధ్యాయులు అవసరం ఉంది. అయితే వాటి నుంచి టీచర్లను ఎంపిక చేసి మరో పాఠశాలకు డిప్యూటేషన్ ఇస్తున్నారు. మండల విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తి చేసి డీఈఓ కార్యాలయంలో అందించారు. ఇక ఆయా గ్రామాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో పాటు వినతిపత్రాలు, రాజకీయ నాయకుల ఒత్తిడులు వస్తున్నాయి. టీచర్లకు స్థానచలనం కల్పి ంచకుండా వలంటీర్లను ఇవ్వాలని కోరుతున్నారు. మచ్చుకు కొన్ని.. ● ఊట్కూరు మండలం చిన్నపొర్ల ప్రాథమిక పాఠశాలలో 180 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ పని చేస్తున్న హెచ్ఎం రిటైర్డ్ కాగా, మరో ఇద్దరు పదోన్నతిపై వెళ్లారు. ఒకరు స్పౌస్ బదిలీ చేసుకోగా మరొకరు ఎడ్యుకేషన్ లీవ్‌లో వెళ్లారు. చివరికి ఒకే ఉపాధ్యాయురాలు విద్యాబోధన చేస్తున్నారు. ● మరికల్ మండలం అప్పంపలిలో 40 మంది విద్యార్థులకుగాను ముగ్గురు ఎస్జీటీలు, ఒక స్కూల్ అసిస్టెంట్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇద్దరిని సర్దుబాటు చేయాల్సి ఉన్నా ఒకరితోనే సరిపెట్టారు. ● మరికల్ మండలం పెద్దచింతకుంట ప్రాథమిక పాఠశాలలో 54 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు సరిపోతారు. అయితే ఇక్కడ ఒక పీఎస్ హెచ్ఎంతో పాటు నాలుగు ఎస్జీటీలు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడి నుంచి ఏ ఒక్కరిని కూడా డిప్యూటేషన్ ఇవ్వలేదు. ● మాగనూర్ మండలం కొత్తపల్లి యూపీఎస్ స్కూల్లో 282మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 12 పోస్టులు మంజూరు కాగా ఆరుగురు టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆ స్కూల్లో ప్రాథమిక తరగతుల్లో 190 మంది విద్యార్థులు ఉంటే వారికి 7మంది ఎస్జీటీలు ఉండాల్సి ఉండగా ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు. వారిలో ఒకరిని డిప్యూటేషన్ ఇచ్చారు. ● మక్తల్ మండలం తిర్మలాపూర్ పీఎస్‌లో 51మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి. ఒకరిని చందాపూర్‌కు పంపించారు. ఒకే టీచర్ ఐదు తరగతులకు బోధించడం కష్టంగా ఉంది. ● నారాయణపేట మండలం బొమ్మన్‌పాడు పీఎస్‌లో బడిబాటలో 53మంది చేరారు. 173మంది విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులే పనిచేస్తున్నారు. టీచర్లను కేటాయించాలి మా పాఠశాలలో ఇటీవల పదోన్నతితో ఇద్దరు టీచర్లు ఇతర పాఠశాలలకు వెళ్లారు. ఎనిమిది తరగతులకు ముగ్గురు టీచర్లు మాత్రమే ఉన్నారు. దీంతో చదువు చెప్పడానికి ఉపాధ్యాయులకు ఇబ్బందిగా మారింది. వెంటనే ఇద్దరు రెగ్యూలర్ టీచర్లతో పాటు మరో ఇద్దరు వలంటీర్లను కేటాయించాలి. – భానుతేజ, విద్యార్థి, మద్దెల్‌బీడ్. అవసరం మేరకు సర్దుబాటు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న విద్యార్థులను బేరీజు వేసుకుని అత్యవసరమైన చోటికి టీచర్లను డిప్యూటేషన్‌పై పంపించాం. త్వరలో ప్రభుత్వం అకాడమిక్ ఇన్స్టక్టర్లను నియమించనుంది. జిల్లాలో 284మందికి ప్రతిపాదనలు పంపించాం. తప్పకుండా అవసరమైన చోట ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. బదిలీలపై ఇచ్చిన ఆదేశాల ప్రకారం టీచర్లు వారికి కేటాయించిన ప్రాంతాల్లో విధుల్లో చేరాలి. లేకపోతే శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం. – గోవిందరాజు, డీఈఓ ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య ప్రాథమిక పాఠశాలల్లో అరకొరఉపాధ్యాయులతో సమస్య తీవ్రం మూడు నెలలైన వలంటీర్లనియామకం లేని వైనం వర్క్ అడ్జెస్ట్మెంట్ పేరుతో టీచర్ల డిప్యూటేషన్‌లో తడబాటు -
నాడు బీళ్లు.. నేడు సిరులు
పదేళ్ల క్రితం ఎటు చూసినా ఎండిన పంటలు.. బీళ్లుగా మారిన భూములు. ఫలితంగా ఉపాధి కోసం కుటుంబాలతో సహా తట్ట, బుట్ట, పార పట్టుకుని ముంబై, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు బస్సుల్లో కిక్కిరిసి వెళ్తున్న హృదయ విదారక దృశ్యాలు ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతుంటాయి. అలా వలసలకు కేరాఫ్‌గా నిలిచిన పాలమూరు జిల్లా హరితవనంగా మారింది. సాగునీరు లేక నెర్రెలు బారిన వ్యవసాయ భూముల్లో సిరుల పంట పండుతోంది. ఏటేటా సాగు గణనీయంగా పెరుగుతుండగా.. భూమికి పచ్చని రంగు వేసినట్లు కొత్త శోభను సంతరించుకుంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్మూడేళ్లుగా 18 లక్షల ఎకరాలపైనేఉమ్మడి పాలమూరు జిల్లాలో వానాకాలం సాగుకు సంబంధించి మొత్తంగా అన్ని పంటలు కలిపి 18 లక్షల ఎకరాలకు పైగా సాగయ్యాయి. మూడేళ్లుగా కొంత అటు ఇటుగా స్వల్పంగా లెక్కలు మారుతూ వస్తున్నాయి. 2023లో 18,24,268 ఎకరాలు కాగా.. 2024లో 18,11,953 ఎకరాల్లో పంటలు సాగైనట్లు అధికారిక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సాగు స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 18,07,052 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. అదును దాటే సమయానికి అంటే వారం రోజుల్లో ఉమ్మడి జిల్లాలో మరో 50 వేల ఎకరాల్లో వరి నాట్లు పడే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.ఉమ్మడి జిల్లాలో రైతులు ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న సాగుచేస్తున్నారు. ఏటేటా వీటి సాగు గణనీయంగా పెరుగుతూ వస్తోంది. వరి 2023 ఖరీఫ్ సీజన్లో 7,76,311 ఎకరాలు, గతేడాదిలో 8,09,784 ఎకరాల్లో సాగు కాగా.. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 7,90,515 ఎకరాల్లో సాగైంది. మరో 50 వేల ఎకరాల్లో వరి సాగు కానుండగా.. 8.40 లక్షల ఎకరాలకు చేరుకోనుంది.ఉమ్మడి పాలమూరులో 2023లో 6,67,824 ఎకరాల్లో, 2024లో 6,04,004 ఎకరాల్లో పత్తి సాగు కాగా.. ఈ ఏడాది 7,05,739 ఎకరాల్లో రైతులు తెల్లబంగారం పంట వేశారు. గతేడాదితో పోలిస్తే 1,01,735 ఎకరాల్లో పత్తి సాగు పెరిగినట్లు తెలుస్తోంది.ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 2023 వానాకాలంలో 1,00,816 ఎకరాల్లో, 2024లో 85,476 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. ఈ ఏడాది ఇదే సీజన్లో 1,09,708 ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. గతేడాదితో పోలిస్తే 24,232 ఎకరాల్లో మొక్కజొన్న సాగు పెరిగినట్లు స్పష్టమవుతోంది.గతేడాదితో పోలిస్తే నాగర్‌కర్నూల్ జిల్లాలో 28,634 ఎకరాల్లో పంటల సాగు పెరిగింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 2,693 ఎకరాల్లో, నారాయణపేట జిల్లాలో 10,256 ఎకరాల్లో అధికంగా పంటలు సాగయ్యాయి. అదే వనపర్తిలో 28,216 ఎకరాల్లో, జోగుళాంబ గద్వాల జిల్లాలో 18,268 ఎకరాల్లో పంటల సాగు తగ్గినట్లు రికార్డులు చెబుతున్నాయి.గతేడాదితో పోలిస్తే మహబూబ్‌నగర్ జిల్లాలో పత్తి సాగు స్వల్పంగా తగ్గింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో 40 వేలకు పైగా, గద్వాల జిల్లాలో 50 వేలకు పైగా ఎకరాల్లో అధికంగా రైతులు సాగు చేశారు. మొక్కజొన్నకు సంబంధించి మహబూబ్‌నగర్ జిల్లాలో గతేడాది కంటే 14 వేల ఎకరాల్లో, నాగర్‌కర్నూల్ జిల్లాలో 10 వేల ఎకరాల్లో అధికంగా సాగైంది. -
యూరియా కోసం రాస్తారోకో
ధన్వాడ: యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉదయం 6 గంటలకే రైతులు రాస్తారోకో చేశారు. ధన్వాడలోని నారాయణపేట – హైద్రాబాద్ ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. ధన్వాడ ప్రాథమిక వ్యవసాయ సహకర సంఘం అధికారులు మూడు రోజులకు సరిపడా టోకెన్లు అందజేయగా.. రెండు రోజులుగా యూరియా సంచులు రాలేదని పంపిణీ చేయడం లేదు. దీంతో నిత్యం యూరియా కోసం కార్యాలయానికి తిరుగుతున్నా యూరియా అందించడం లేదని రైతులు వాపోతున్నారు. ఇచ్చే రెండు సంచులు కూడా ఇవ్వకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న ఎస్ఐ రాజశేఖర్ అక్కడికి చేరుకొని యూరియా వచ్చిన తరువాత సమాచారం అందజేస్తామని రైతులకు నచ్చజెప్పి పంపించి వేశారు. యూరియా కోసం ఎగబడిన రైతులు కొత్తపల్లి: మండల కేంద్రంలోని హాకా సెంటర్‌కు యూరియా వచ్చిందని తెలియడంతో రైతులు ఎగబడ్డారు. బుధవారం హాకా సెంటర్‌కు 300 బస్తాల యూరియా లారీ రావడం.. విషయం సమీప గ్రామాల రైతులకు కూడా సమాచారం చేరడంతో ఒక్కసారిగా కొత్తపల్లి గ్రామానికి రైతులు చేరుకున్నారు. ఆధార్, పట్టదార్ పాసుపుస్తకాలు భారీగా చేరుకున్నారు. అయితే, గంటలోపే యూరియా బస్తాలు అయిపోయాయి. ఆలస్యంగా వచ్చిన రైతులు యూరియా దొరకలేదు. ఒక్కో వ్యక్తికి రెండు బస్తాల యూరియాను సరఫరా చేశారు. -
కాళోజీ జీవితం.. స్ఫూర్తిదాయకం
మక్తల్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మక్తల్‌లోని మంత్రి కార్యాలయంలో ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సమసమాజ నిర్మాణానికి కాళోజీ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా జీవించిన ఆయన.. తెలుగుభాష, ప్రజల అవసరాల కోసం తన జీవితాన్నే త్యాగం చేశారన్నారు. ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. కాళోజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆత్మకూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రహిమతుల్లా, వైస్‌చైర్మన్ గణేశ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేశ్, సూర్యకుమార్, రవికుమార్, రాజేందర్, గోవర్ధన్, దండు రాము పాల్గొన్నారు. -
‘పాలమూరు’ను జిల్లా బిడ్డే ఎండబెడుతున్నారు..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సీఎం రేవంత్‌రెడ్డి 21 నెలల పాలనలో ఎక్కడ మాట్లాడినా.. నేను పాలమూరు బిడ్డను, నల్లమల బిడ్డను అని చెప్పుకుంటారని.. కానీ ఆయనే పాలమూరును ఎండబెడుతున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి భార్య శ్వేతారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయన మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలంలోని ఆవంచ గ్రామానికి వచ్చారు. శ్వేతారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. ఆ తర్వాత వారు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని లక్ష్మారెడ్డి ఇంట్లో భోజనం చేశారు. హరీశ్‌రావు తిరిగి హైదరాబాద్‌కు పయనమైన అనంతరం కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలమూరు వెనుకబాటుతనానికి టీడీపీ, కాంగ్రెస్ కారణమని ఆయన టీడీపీలో ఉన్నప్పుడే చెప్పారన్నారు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే తమ బతుకులు మారుతాయని.. ఆరు గ్యారంటీలు 100 రోజుల్లో అమలవుతాయనే ఆశతో ఇక్కడి ప్రజలు 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారన్నారు. 21 నెలలుగా పడావు పెట్టారు.. బీఆర్ఎస్ హయాంలో పాలమూరులో వివిధ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు నీళ్లు పారించినట్లు కేటీఆర్ వెల్లడించారు. పాలమూరును కోనసీమగా మార్చాలనే లక్ష్యంతో కేసీఆర్ నాయకత్వంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను 90 శాతం పూర్తి చేశామని.. కానీ పాలమూరుకు చెందిన సీఎం 21 నెలలు గడిచినా పనులు పూర్తిచేయడం లేదన్నారు. మిగతా పది శాతం పనులు పూర్తి చేసి.. నీళ్లు పారిస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందనే భయంతో పాలమూరును పడావు పెట్టారని మండిపడ్డారు. పైసా పని చేయకుండా అదే పాలమూరు ప్రాజెక్ట్‌కు వారి మామ జైపాల్‌రెడ్డి పేరు పెట్టుకోవడంపై ప్రజలే ఆలోచన చేయాలన్నారు. దురాలోచనతో కొడంగల్‌కు శ్రీకారం.. పాలమూరు ఎత్తిపోతల్లో భాగంగా ఉమ్మడి పాలమూరు, కొడంగల్ నియోజకవర్గంతో పాటు రంగారెడ్డి జిల్లాకు ప్రయోజనం చేకూరేలా ప్లాన్ చేసి.. ప్రాజెక్ట్‌ను 90 శాతం పూర్తి చేశామని తెలిపారు. అయితే హడావుడిగా కొడంగల్, రంగారెడ్డికి నీరందించే సోర్స్‌ను శ్రీశైలం నుంచి జూరాలకు మార్చి రూ.4 వేల కోట్లతో సీఎం రేవంత్‌రెడ్డి టెండర్లు పూర్తి చేశారన్నారు. మనసులో ఏదో దురాలోచనతో పర్యావరణ అనుమతుల్లేకుండా టెండర్లు పూర్తి చేయడంతో రైతులు ఎన్జీటీని ఆశ్రయించగా.. స్టే ఇచ్చిందన్నారు. కొడంగల్ ఎత్తిపోతల కింద రైతులు కూడా పరిహారం కోసం రోడ్డెక్కుతున్నారన్నారు. చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్ వాళ్లు వేధింపులకు గురి చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. దేవరకద్రలో మండల పార్టీ అధ్యక్షుడిపై లేని కేసు పెట్టి జైలుకు పంపించారని.. కాంగ్రెస్‌లో చేరితే కేసు తీసేస్తామంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారు, క్రషర్ నిర్వాహకులపై జీఎస్టీ, పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని పార్టీ నాయకులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను చైతన్యవంతం చేసేలా ఆలోచన చేసి ముందుకు సాగుతామన్నారు. ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మర్రిజనార్దన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. చెప్పుకోలేనిదురావస్థలో ఉన్నారు.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్ఎస్లోనే ఉన్నానని చెబుతున్నారు కదా అంటూ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. ‘కృష్ణమోహన్‌రెడ్డి సమక్షంలోనే కేసీఆర్‌పై మంత్రులు పొంగులేటి, జూపల్లి ఆరోపణలు, విమర్శలు చేస్తుంటే ఆయన ఎందుకు మౌనం వహించారు.. కాంగ్రెస్‌లో చేరిన కొందరు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేని దురావస్థలో ఉన్నారు’ అని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పనులు పూర్తి మిగిలిన 10 శాతం పనులు ఎందుకు పూర్తి చేయడం లేదు కేసీఆర్‌కు పేరు వస్తుందనే పడావు పెట్టారు సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం -
కళా ఉత్సవ్‌తో సృజనాత్మకత వెలికితీత
నారాయణపేట రూరల్: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు, కనుమరుగవుతున్న కళలకు జీవం పోసేందుకు ప్రభుత్వం కళా ఉత్సవ్ నిర్వహిస్తుందని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి విద్యాసాగర్ అన్నారు. మంగళవారం పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష ఆధ్వర్యంలో స్థానిక బాలకేంద్రంలో జిల్లాస్థాయి కళా ఉత్సవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కళాంశాల్లో పాల్గొని ప్రతిభకనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతి, సంప్రదాయ కళలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. కాగా, వివిధ విభాగాల్లో నిర్వహించిన జిల్లాస్థాయి కళా ఉత్సవ్‌లో చక్కటి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఒకల్ మ్యూజిక్‌లో చంద్రలేఖ (టీజీఎంఎస్జేసీ, ధన్వాడ), ఒకల్ మ్యూజి క్ గ్రూప్‌లో పూజ (టీజీడబ్ల్యూఆర్ఎస్, ఊట్కూర్), ఇను్టృమెంటల్ మ్యూజిక్ సోలోలో సంజన (టీఎస్బ్ల్యూఆర్ఎస్ ఊట్కూర్), ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ గ్రూప్‌లో హిమజ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ ఊట్కూర్), డాన్స్ సోలో క్లాసికల్లో చంద్రలేఖ (టీజీఎంఎస్జేసీ ధన్వాడ), డాన్స్ గ్రూప్ జానపదంలో మేఘన గ్రూప్ (శ్రీసాయి స్కూల్ నారాయణపేట), థియేటర్ గ్రూప్‌లో సవిత (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌జేసీ), విజువల్ ఆర్ట్స్ టు డీ సోలోలో సావి త్రి (జెడ్పీహెచ్ఎస్, పల్లెర్ల), విజువల్ ఆర్ సోలో 3–డీలో నాగవేణి (జెడ్పీహెచ్ఎస్, బిజ్వార్), విజువల్ ఆర్ట్స్ గ్రూప్ 3–డీలో కార్తీక (టీజీడబ్ల్యూఆర్ఎస్జేసీ ఊట్కూర్), ట్రెడిషనల్ స్టోరీ టెల్లింగ్‌లో స్వా తి (పీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ ఊట్కూర్) ఎంపికై నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బాలకేంద్రం సుపరింటెండెంట్ మహిపాల్‌రెడ్డి, సంగ నర్సింహులు, జ్ఞానామృత, వసంత్ కుమార్, పర్వీన్, శ్రీకాంత్, శ్రీనివాస్, సంతోష్ పాల్గొన్నారు. -
రేపు తుది ఓటరు జాబితా విడుదల
నారాయణపేట: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి తుది ఓటరు జాబితాను ఈ నెల 10న విడుదల చేయనున్నట్లు అదనపు కలెక్టర్ ఎస్.శ్రీను తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేశామన్నారు. ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు. వచ్చిన అభ్యంతరాల మేరకు అవసరమైన మార్పులు, చేర్పులు జరిపి తుది ఓటరు జాబితాను వెలువరిస్తామన్నారు. ఓటరు జాబితాను పక్కాగా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. సమావేశంలో డీఆర్డీఓ మొగులప్ప, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు సలీం, బీజేపీ మండల అధ్యక్షుడు సాయిబన్న, బీఆర్ఎస్, సీపీఎం, బీఎస్పీ నాయకులు సుదర్శన్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచండి
● అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి ● రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మాగనూర్, మదనాపురం, కృష్ణా, నర్వ, మక్తల్, అమరచింత, ఆత్మకూర్, ఊట్కూర్ మండలాల అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. మక్తల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వెనకబడ్డామని.. ఇందుకు అధికారుల నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తుందన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం మంజూరుచేసిన ఇందిరమ్మ ఇళ్ల పూర్తిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణాలు పూర్తిచేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా లబ్ధిదారులకు ఇసుక సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఇళ్ల పురోగతిని తెలుసుకోవాలన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2,080 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. 1,334 ఇళ్ల పనులను ప్రారంభించినట్లు వివరించారు. వీటిలో 13 ఇళ్లు పూర్తి కాగా.. మరో 8 ఇళ్లు చివరి దశలో ఉన్నాయన్నారు. అనంతరం మక్తల్ మండలం బోందల్‌కుంట, అంకెన్‌పల్లి, గుడిగండ్ల, రుద్రసముద్రం తదితర గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను మంత్రి తన నివాసంలో పంపిణీ చేశారు. నర్వ మండలం ఉందేకోడ్, నాగిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ● టీజీఎస్పీడీసీఎల్ ఎమర్జేన్సీ వాహనాన్ని మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్‌లో ప్రారంభించారు. ప్రజలకు వేగవంతంగా విద్యుత్ సేవలు అందించేందుకు ఎమర్జేన్సీ వాహనం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. కార్యక్రమాల్లో ఏడీఈ జగన్మోహన్రావు, హౌసింగ్ పీడీ శంకర్, డీఈ హరికృష్ణ, బీకేఆర్ చైర్మన్ బాలకిష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ హన్మంతు, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, ఏఈ రామకృష్ణ, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ గణేశ్‌కుమార్, కట్ట సురేశ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో అవినీతి అధికారి
● రైతు నుంచి రూ. 5వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన మద్దూరు ఆర్ఐ మద్దూరు: మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ వివరాల మేరకు.. మద్దూరు మండలం రెనివట్ల రెవెన్యూ గ్రామ పరిధిలోని అప్పిరెడ్డిపల్లికి చెందిన ఓ రైతు తన 5 గుంటల భూమి డీఎస్ పెండింగ్ సమస్యను పరిష్కరించాలని ఆర్ఐ కె.అమర్నాథ్ను సంప్రదించగా.. రూ. 5వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు రైతు ఏసీబీని ఆశ్రయించడంతో పక్కా ప్రణాళిక ప్రకారం దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు. రైతు నుంచి ఆర్ఐ డబ్బులు తీసుకొని మహబూబ్‌నగర్‌కు కారులో వెళ్తున్న క్రమంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట పట్టుకొని తనిఖీ చేశామన్నారు. రైతు నుంచి తీసుకున్న లంచం డబ్బులను రికవరీ చేసి ఆర్ఐని అదుపులోకి తీసుకున్నామన్నారు. మంగళవారం అతడిని ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు లింగస్వామి, సయ్యద్ అబ్దుల్ జిలానీ పాల్గొన్నారు. -
జీపీఓలు వచ్చేశారు..
● అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ సమక్షంలో కౌన్సెలింగ్ ● సొంత నియోజకవర్గాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో నియామకం ● సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై పెరగనున్న పర్యవేక్షణ ● గ్రామ రెవెన్యూ వ్యవస్థ మరింత పటిష్టం నేడు విధుల్లో చేరనున్న గ్రామ పాలన అధికారులు నారాయణపేట: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తు న్న గ్రామ పాలన అధికారులు మంగళవారం నుంచి విధుల్లో చేరనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5,016 మంది జీపీఓలను శుక్రవారం నియమించగా.. జిల్లాకు 124 మందిని కేటాయించారు. సోమవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశానిర్దేశంతో అడిషనల్ కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రాంచందర్‌నాయక్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. రెవెన్యూ గ్రామాలతో ఏర్పాటుచేసిన క్లస్టర్ల వారీగా జీపీఓలకు పోస్టింగ్ ఇచ్చారు. ఇకపై ప్రతి గ్రామ పాలన పకడ్బందీగా సాగనుంది. ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేసే సంక్షేమ పథకా లు నేరుగా అర్హులైన లబ్ధిదారులకు అందజేయడంలో జీపీఓలు కీలకపాత్ర పోషించనున్నారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థ మరింత పటిష్టంగా మారనుంది. 252 రెవెన్యూ గ్రామాలు.. 124 క్లస్టర్లు జిల్లాలోని 13 మండలాల్లో 252 రెవెన్యూ గ్రామా లను 124 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ఒక్కో క్లస్టర్లో మూడు నుంచి నాలుగు గ్రామాలు ఉన్నాయి. ఒక్కో క్లస్టర్‌కు ఒక్కొక్క జీపీఓను నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 124 రెవెన్యూ క్లస్టర్లకు కేటాయించిన జీపీఓలు తహసీల్దార్ల పర్యవేక్షణలో విధులు నిర్వర్తించనున్నారు. పక్కాగా కౌన్సెలింగ్.. కొత్తగా నియమితులైన జీపీఓలు తమ సొంత నియోజకవర్గాల్లో కాకుండా ఇతర నియోజకవర్గాల్లోని మండలాల్లో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు పక్కాగా కౌన్సెలింగ్ నిర్వహించినట్లు అడిషనల్ కలెక్టర్ శ్రీను తెలిపారు. ముందుగా 16మందికి స్పౌజ్, వికలాంగులు, సింగిల్ ఉమెన్, మెడికల్ సమస్యలు ఉన్నవారికి అవకాశం కల్పించారు. ఆ తర్వాత 108 మందికి వారు రాసిన జీపీఓ పరీక్షలో వచ్చిన ర్యాంకుల వారీగా కౌన్సెలింగ్ చేపట్టారు. జీపీఓల విధులు ఇలా.. జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ప్రభుత్వం నియమించిన జీపీఓలు 11 రకాల జాబ్‌చార్ట్ అనుసరిస్తారు. భూ భారతి చట్టంలో భాగంగా భవిష్యత్‌లో ప్రతి రిజిస్ట్రేషన్ – మ్యుటేషన్‌కు గ్రామ పటం జోడించడంలో జీపీఓల పాత్ర కీలకంగా మారనుంది. గ్రామస్థాయిలో భూ ఖాతా (విలేజ్ అకౌంట్) నిర్వహణ, పహాణీల నమోదు, రెవెన్యూ మాతృదస్త్రం నిర్వహణ, లావుణి, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వం సేకరించిన భూముల నిర్వహణ, నీటివనరుల కింద భూముల పరిరక్షణ, భూమి ఖాతాల నిర్వహణ, మార్పు, చేర్పుల నమోదు, భూ సర్వేకు దరఖాస్తు చేసుకుంటే సేవలు, ప్రకృతి విపత్తులు వాటిల్లితే నష్టం అంచనా, గ్రామస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపికలో విచారణ, జనన, మరణాల విచారణ, ఎన్నికల సమయంలో గ్రామస్థాయిలో సహకారం, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం తదితర విధులు నిర్వర్తించనున్నారు. సుస్థిర పాలన అందిస్తాం.. వీఆర్ఏ వ్యవస్థ రద్దుతో నారాయణపేట మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్‌గా పనిచేశా. ప్రభుత్వం జీపీఓలను నియమించడంతో తిరిగి తమ శాఖాలోకి వచ్చినట్లయింది. తమకు కేటాయించిన రెవెన్యూ గ్రామాల్లో సుస్థిర పాలన అందించేందుకు కృషిచేస్తాం. – జ్యోతి, జీపీఓ, బోయిన్పల్లి భూ సమస్యల పరిష్కారానికి కృషి.. భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. రైతులు, అధికారులకు సరైన సమాచారాన్ని అందించి పూర్తిస్థాయిలో సహకరిస్తాం. భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు అయ్యేందుకు కృషిచేస్తాం. – శ్రీనివాస్, జీపీఓ, శేర్నపల్లి ఆనందంగా ఉంది.. వీఆర్ఏగా 2012లో ఊట్కూర్ మండలం నిడుగుర్తిలో విధుల్లో చేరా. ఆ తర్వాత గత ప్రభుత్వ హయాంలో వీఆర్ఏ పోస్టులను రద్దు చేయడంతో నారాయణపేట మున్సిపాటీటిలో వార్డు అధికారిగా 2023 ఆగస్టు 8న పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం వీఆర్ఏలు, వీఆర్ఓలు మళ్లీ సొంత శాఖకు వచ్చినందుకు ఆనందంగా ఉంది. – ఆంజనేయులుగౌడ్, జీపీఓ, కొల్లంపల్లి మండలం రెవెన్యూ క్లస్టర్లు గ్రామాలు కోస్గి 17 7 గుండుమాల్ 10 4 మద్దూర్ 17 9 కొత్తపల్లి 11 5 దామరగిద్ద 27 13 నారాయణపేట 24 15 మాగనూర్ 20 9 కృష్ణా 14 8 ధన్వాడ 10 7 మరికల్ 14 7 మక్తల్ 39 20 ఊట్కూర్ 27 11 నర్వ 20 9 మండలాల వారీగా క్లస్టర్ల వివరాలిలా.. -
యూరియా కోసం తప్పని పాట్లు
ధన్వాడ/నర్వ: రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. రెండు బస్తాల యూరియా కోసం తెల్లవారుజామునే పీఏసీఎస్‌ల వద్దకు చేరుకొని గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. ధన్వాడ పీఏసీఎస్‌కు యూరియా రాకపోవడంతో నాలుగు రోజులుగా పంపిణీ చేయలేదు. సోమవారం యూరియా వస్తుందని తెలుసుకున్న వివిధ గ్రామాల రైతులు వేకువజామున 5 గంటలకే పీఏసీఎస్‌కు చేరుకొని చెప్పులు, రాళ్లను క్యూలో పెట్టారు. పీఏసీఎస్ గేటు ఎప్పుడు తెరుస్తారా అని గంటల తరబడి ఎదురుచూశారు. ఎట్టకేలకు పోలీసుల బందోబస్తు నడుమ పీఏసీఎస్ గేటు తీయగా.. ఒక్కసారిగా లోపలికి చొచ్చుకొచ్చారు. రైతులను నిలువరించే క్రమంలో పోలీసులు కిందపడ్డారు. రైతులను క్యూలో నిలబెట్టేందుకు శ్రమించాల్సి వచ్చింది. మొత్తం 580 బస్తాల యూరియాను రైతులకు పంపిణీ చేశారు. ● నర్వ పీఏసీఎస్‌కు రైతులు పోటెత్తారు. యూరియా కోసం గంటల తరబడి క్యూ కట్టారు. గంటల వ్యవధిలోనే యూరియా స్టాక్ ఖాళీ కావడంతో చాలా మంది నిరాశతో వెనుదిరిగారు. ఒక్క బస్తా యూరియా కోసం నిత్యం అవస్థలు పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా నాయకుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. -
పాలమూరుకు మరో మణిహారం!
జడ్చర్ల: పాలమూరు జిల్లాకు మరో మణిహారం దక్కనుంది. ఇప్పటికే హైదరాబాద్ చుట్టూ నిర్మించిన ఔటర్ రింగ్‌రోడ్డు తరహాలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో చేపట్టనున్న ఆర్ఆర్ఆర్ (రీజినల్ రింగ్‌రోడ్డు) పరిధిలోకి ఉమ్మడి జిల్లా గ్రామాలు కూడా వెళ్లనున్నాయి. బాలానగర్ మీదుగా ట్రిపుల్ ఆర్ రోడ్డు విస్తరణ పనులు సాగనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదిత నోటిఫికేషన్‌ను హెచ్ఎండీఏ ఇప్పటికే జారీ.. ఈ నెల 15వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణకు గడువిచ్చింది. రీజనల్ రింగ్‌రోడ్డు వంద మీటర్ల వెడల్పుతో ప్రతిపాదిత అలైన్మెంట్ కోసం మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, యాదాద్రి జిల్లాలో పరిధిలోని 33 మండలాలు, 163 రెవెన్యూ గ్రామ పంచాయతీలను కలుపుతూ హెచ్ఎండీఏ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అలైన్‌మెంట్‌కు సంబంధించి ఇప్పటికే డిజిటల్ మ్యాప్‌లతో పాటు సర్వే నంబర్లు తదితర పూర్తి వివరాలను హెచ్ఎండీఏ వెబ్సైట్లో ప్రజలకు అందబాటులో ఉంచారు. ప్రజలు, సంస్థలు తమ అభ్యంతరాలను, సూచనలను రాత పూర్వకంగా సమర్పించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన తర్వాత హెచ్ఎండీఏ తుది నోటిఫికేషన్‌ను విడుదలచేయనుంది. ● ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని ఆమన్‌గల్, మాడ్గుల, కేశంపేట, తలకొండపల్లి, ఫరూఖ్‌నగర్, కొందుర్గు మండలాల్లో ఆర్ఆర్ఆర్ విస్తరించనుంది. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా బాలాగనర్ మండలంలోని అప్పాజీపల్లి, బోడజానంపేట, చిన్నరేవల్లి, గౌతాపూర్, గుండేడు, మాచారం, పెద్దరేవల్లి, పెద్దాయపల్లి, సూరారం, ఉడిత్యాల్, వనమోనిగూడలు ట్రిపుల్ ఆర్ పరిధిలోకి వెళ్లనున్నాయి. గతంలో ఫరూఖ్‌నగర్ మండలం బూర్గుల గ్రామం వరకే ట్రిపుల్ ఆర్‌ను పరిమితం చేశారు. డిజైన్ మార్పుతో బాలానగర్ మండలంలోని కొన్ని గ్రామాలను కలిపి పెద్దాయపల్లి క్రాస్ రోడ్ వద్ద 44 వ నంబర్ జాతీయ రహదారి వరకు ఇది విస్తరించనుంది. దీని నిర్మాణం పూర్తయితే తెలంగాణలోని ఇతర ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గోవా, కేరళ, రాష్ట్రాలకు రాకపోకలు సాగించే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం ట్రిపుల్ ఆర్ నిర్మాణాన్ని కొందరు ఆమోదిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. రహదారి నిర్మాణానికి సేకరించే భూములకు సంబంధించి ఇప్పటికే ఆయా గ్రామాల వారీగా సర్వే నంబర్లను హెచ్ఎండీఏ విడుదల చేసింది. భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన పడుతున్నారు. పెద్దాయపల్లి క్రాస్‌రోడ్డు వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిని అనుసరించి ఏర్పాటయిన వెంచర్లు కూడా ట్రిపుల్ ఆర్ పరిధిలోకి రావడంతో ఆయా వెంచర్ల నిర్వాహకులు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారంగా పరిహారం అందించే పరిస్థితి ఉండడంతో తాము నష్టపోతామని వాపోతున్నారు. కాగా.. ఆర్ఆర్ఆర్ను అనుసరించి ఉన్న భూముల విలువలు అమాంతంగా మూడు–నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉండడంతో ఆయా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాల అభివృద్ధికి మహర్దశ పట్టనుందని భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ఏర్పాటుతో మరింత అభివృద్ధి బాలానగర్ మండలం గుండా ట్రిపుల్ ఆర్ ఏర్పాటు కావడం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. అలాగే విద్యాసంస్థలు, పరిశ్రమల రాకతో పాటు వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగవుతాయి. ఆర్ఆర్ఆర్ చుట్టూ మాల్స్, వాణిజ్య భవనాలు ఏర్పాటవుతాయి. జడ్చర్ల నియోజకవర్గంతో పాటు పాలమూరు జిల్లాకు లాభం చేకూరుతుంది. – జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్యేల, జడ్చర్ల ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ ఈ నెల 15 వరకు అభ్యంతరాలకు గడువు డిజైన్ మార్పుతో ఉమ్మడి జిల్లాలో మరికొన్ని గ్రామాలకు విస్తరణ జంక్షన్‌గా మారనున్న పెద్దాయపల్లి క్రాస్‌రోడ్ -
మిగిలింది ఒక్కరోజే!
చేపపిల్లల సరఫరాకు టెండర్ల దాఖలుపై సందిగ్ధం ● ఆగస్టు 18న నోటిఫికేషన్ జారీ.. ముందుకురాని వ్యాపారులు ● మరోసారి టెండర్లు ఆహ్వానించిన అధికారులు ● నేటి మధ్యాహ్నం 3గంటల వరకు గడువు ● చేపపిల్లల పంపిణీ ఆలస్యంతో మత్స్యకారుల్లో ఆందోళన చేప పిల్లలను జూలై, ఆగస్టులో పంపిణీ చేస్తే బాగా పెరిగేవి. సెప్టెంబర్, అక్టోబర్‌లో పంపిణీ చేయడం వల్ల ఆశించిన స్థాయిలో పెరగవు. మత్స్యకారులకు నగదు రూపంలో ఇస్తే సకాలంలో చేపపిల్లలను కొనుగోలు చేసి చెరువుల్లో వదులుకునేందుకు అవకాశం ఉంటుంది. – ఆంజనేయులు, మత్స్య సహకార సంఘం డైరెక్టర్, మాగనూర్ ప్రభుత్వం గతేడాది కూడా సకాలంలో చేప పిల్లలను సరఫరా చేయలేదు. మత్స్యసహకార సంఘం ఆధ్వర్యంలో సొంత డబ్బులు రూ. 9లక్షలతో 3లక్షల చేప పిల్లలను కొనుగోలుచసి ఊట్కూరు పెద్ద చెరువులో వదిలాం. ఈ ఏడాది చెరువు అలుగు పారి పక్షంరోజులు అవుతుంది. ఇప్పటివరకు ప్రభుత్వం చేప పిల్లలను పంపిణీ చేయలేదు. ఆలస్యంగా వదిలితే ఆశించిన స్థాయిలో చేప పెరగదు. – ఎం.నరేశ్‌కుమార్, మత్స్య సహకార సంఘం డైరెక్టర్, ఊట్కూర్ ప్రభుత్వ ధరకు చేప పిల్లలను సరఫరా చేసేందుకు గాను రాష్ట్ర మత్స్యశాఖ మరోసారి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు ఆన్లైన్లో టెండర్లు దాఖలు చేయవచ్చు. ఇదే రోజు 3:30 గంటలకు టెండర్లు ఓపెన్ చేస్తారు. – రహిమాన్, జిల్లా మత్స్యశాఖ అధికారి నారాయణపేట: మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేస్తోంది. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఏప్రిల్, మేలో మొదలై.. జూలై నుంచి ఆగస్టు చివరి వరకు జలాశయాలు, చెరువుల్లో నీటినిల్వ సామర్థాన్ని బట్టి చేపపిల్లలు వదిలేవారు. కానీ ఈ ఏడాది చేపపిల్లల పంపిణీ ప్రక్రియ మరింత ఆలస్యమైంది. ఇందుకు గుత్తేదారులు ముందుకు రాకపోవడమే కారణంగా తెలుస్తోంది. జిల్లాలోని జలాశయాల్లో చేపపిల్లల పంపిణీ కోసం ఆగస్టు 18న నోటిఫికేషన్ జారీ చేసి.. 30వ తేదీ వరకు గడువు విధించారు. గుత్తేదారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మరోసారి టెండర్లు ఆహ్వానించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్లు దాఖలకు గడువు విధించారు. ముందుకురాని వ్యాపారులు.. చేపపిల్లల సరఫరాకు సంబంధించి వ్యాపారుల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నారు. బిడ్ డాక్యుమెంట్‌ను డౌన్లోడ్ చేసుకొని బిడ్ దాఖలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు వ్యాపారులు ముందుకు వస్తారో లేదో అనే చర్చ కొనసాగుతోంది. గతేడాది చేప పిల్లలను సరఫరా చేసిన వ్యాపారులకు రాష్ట్రవ్యాప్తంగా బిల్లులు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, స్థానికంగా ఉత్పత్తి చేసిన చేప పిల్లలను మాత్రమే సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో టెండర్ల దాఖలుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. గతంలో స్థానికంగా ఉత్పత్తి చేయకుండా.. పొరుగు రాష్ట్రాల నుంచి చేపపిల్లలను దిగుమతి చేసుకోవడంతో ఆశించిన మేర దిగుబడులు రాక మత్స్యకారులకు నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. మరోవైపు నిబంధనలకు తిలోదకాలిస్తూ నాణ్యతలేని చేప పిల్లలను పంపిణీ చేస్తూ మమ అనిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో రెండు రిజర్వాయర్లు, 642 చెరువులు, కుంటలు ఉన్నాయి. చెరువుల్లో 35–40 ఎం.ఎం. చేపపిల్లలు 1.02కోట్లు వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మరో 82లక్షల 80–100 ఎం.ఎం. చేపపిల్లలు సరఫరా చేయాల్సి ఉంది. ఇందుకు గాను వ్యాపారుల నుంచి టెండర్లు ఆహ్వానించారు. జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువుల్లో చేపపిల్లలను వదలడం వల్ల 147 మత్స్య పారిశ్రామిక సంఘాల్లోని 11,039 సభ్యులకు జీవనోపాధి లభించనుంది. ఇందులో 6 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా.. 421 మంది సభ్యులు ఉన్నారు. -
యోగా పోటీల్లో 5 పతకాలు
మహబూబ్‌నగర్ క్రీడలు: నిర్మల్‌లో ఈనెల 5 నుంచి ఆదివారం ముగిసిన రాష్ట్రస్థాయి యోగాసన స్పోర్ట్స్ చాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటి పతకాలు సాధించినట్లు జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె.సురేష్, ప్రధాన కార్యదర్శి కె.సాయికుమార్, కోశాధికారి యూ.సురేష్ తెలిపారు. సబ్ జూనియర్, జూనియర్ క్రీడాకారులు బి.కవిత ఓ బంగారం, కాంస్య పతకాలు, కీర్తనారెడ్డి బంగారు, రజతం, సుప్రజ కాంస్య పతకం సాధించగా కె.సృజన నాలుగో స్థానం నిలిచినట్లు తెలిపారు. వీరికి కోచ్‌గా ఉన్న సాయికుమార్‌ను వారు అభినందించారు. -
918 టీఎంసీలు
వంద రోజుల్లోన్యూస్రీల్మతసామరస్యాన్ని చాటాలి : ఎస్పీ నారాయణపేట క్రైం: మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలో చేపట్టే ర్యాలీని శాంతియుతంగా నిర్వహించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మిలాద్ ఉన్ నబీ ర్యాలీ సందర్భంగా పటిష్ట పోలీసు బందోబస్తు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు కులమతాలకు అతీతంగా పండుగలు నిర్వహించుకొని మతసామరస్యాన్ని చాటాల ని కోరారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే, అనుచిత పోస్టులు పెడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. కృష్ణా బ్రిడ్జిపై స్తంభించిన ట్రాఫిక్ కృష్ణా: మండలంలోని కృష్ణా బ్రిడ్జిపై ఆదివారం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. శక్తినగర్, రాయచూర్ పట్టణాల నుంచి గణేశ్ విగ్రహాలను ఒక్కసారిగా కృష్ణా బ్రిడ్జిపైకి అధిక సంఖ్యలో తీసుకురావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఇటు టైరోడ్డు వరకు, అటు శక్తినగర్ వరకు దాదాపు 5 కి.మీ. మేర ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ క్లియర్ కావడానికి 3గంటల సమయం పట్టింది. గణేశ్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా కర్ణాటక పోలీసులు తగు ఏర్పాట్లు చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తేవి కావని వాహనదారులు ఆవేదన వ్యక్తంచేశారు. యూరియా పంపిణీలో ప్రభుత్వం విఫలం మద్దూరు: రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.వెంకట్రాంరెడ్డి విమర్శించారు. ఆదివారం మద్దూరులో సీపీఎం ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యయప్రయాసాలకోర్చి సాగుచేసిన వరిపంటకు అవసరమైన యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం మద్దూరు ఏరియా కార్యదర్శిగా గోపాల్‌ను ఎన్నుకున్నారు. సమావేశంలో నాయకులు అశోక్, అంజిలయ్య, అలీ, జోషి, శివకుమార్, హన్మంతు, రామకృష్ణ, లాలప్ప, అరుణ్, వెంకట్ ఉన్నారు. రామన్‌పాడులో పూర్తిస్థాయి నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో ఆదివారం సముద్ర మట్టానికి పైన 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 920 క్యూసెక్కుల వరద జ లాశయానికి చేరుతుండగా.. సమాంతర కాల్వ లో నీటి సరఫరా లేదన్నారు. ఇదిలా ఉండగా జ లాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875, కుడి, ఎడమ కాల్వలకు 55, ఎత్తిపోతల పథకాలకు 873, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. కోయిల్‌సాగర్‌లో 32.3 అడుగుల నీటిమట్టం దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నీటిమట్టం ఆదివారం సాయంత్రం వరకు 32.3 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా, మరో 0.3 అడుగుల మేర నీరు చేరితే పూర్తిస్థాయికి చేరుకుంటుంది. వర్షాలు పడకపోవడంతో ప్రాజెక్టు గేట్లను గతవారం నుంచి మూసివేశారు. ప్రాజెక్టు ప్రస్తుతం నిండుకుండలా ఉండడంతో సందర్శకుల సందడి కనిపించింది. జిల్లాకేంద్రం నుంచే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గద్వాల: ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తుండడంతో జూరాలకు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో ఉమ్మడి జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న కృష్ణానదిపై నిర్మించిన తొలి ప్రాజెక్టు జూరాలకు జలకళ సంతరించుకుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోస్తూ దానికిందున్న ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తున్నారు. ఈసారి జూరాలకు ముందస్తుగానే మే నెలలో 29వ తేదీన వరద మొదలవగా సెప్టెంబర్ 6వ తేదీ వరకు 918 టీఎంసీల వరద వచ్చింది. ● గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వానాకాలంలో ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో కృష్ణాబేసిన్‌కు భారీగా వరదనీటితో నిండిపోయింది. కృష్ణాబేసిన్‌లో ఉన్న మహారాష్ట్రలోని ఉజ్జయిని, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీ వరదనీరు వచ్చి చేరుతుండడంతో నీటిని దిగువనున్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు విడుదల చేస్తున్నారు. మన రాష్ట్రంలో కృష్ణాబేసిన్‌లో తొలిప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల పాజెక్టుకు మే 29వ తేదీన మొదటిసారిగా వరద మొదలైంది. అప్పటి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు ప్రాజెక్టుకు గరిష్టంగా 4.18 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరగా, ప్రాజెక్టులోని 44 గేట్లు ఎత్తి దిగువనున్న శ్రీశైలానికి నీటిని విడుదల చేశారు. జూరాలకు వరద మొదలైనప్పటి నుంచి ప్రాజెక్టుకు మొత్తం 918 టీఎంసీల నీరు వచ్చింది. జూన్, జూలైలో మాసాల్లో వర్షాలు లేకపోవడంతో చాలా రోజులు జూరాలకు వరద పూర్తిగా తగ్గిపోయింది. తిరిగి జూలై చివరి వారంలో వరద ప్రారంభం కావడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి, నీటిని విడుదల చేశారు. జూరాలకు భారీ వరద రావడంతో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశానిర్దేశంతో చేపపిల్లల పంపిణీకి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. టెండర్ల కమిటీ చైర్మన్‌గా అడిషనల్ కలెక్టర్, మెంబర్ కం కన్వీనర్‌గా జిల్లా మత్య్సశాఖ అధికారి, సభ్యులుగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, ఈడీఎం, ఇరిగేషన్ ఈఈలు ఉన్నారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో చేపపిల్లల టెండర్లు, మత్య్సకారులకు పంపిణీ, చెరువుల్లో వదిలేంత వరకు వారి పర్యవేక్షణలో ప్రక్రియ కొనసాగుతుంది. న్యాయమైన పరిహారం కోసమే ఆందోళన నారాయణపేట: తాము పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకం కాదని.. భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామని భూ నిర్వాసితుల సంఘం సలహాదారులు బండమీది బలరాం, కృష్ణ మడివాల్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పవన్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు వద్ద భూ నిర్వాసితులు చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం నాటికి 55వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వలసలు, కరువుకు నెలవుగా మారిన నారాయణపేట ప్రాంతానికి తప్పనిసరిగా ఈ ప్రాజెక్టు అవసరమన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూ నిర్వాసితులు ఎలాంటి అభ్యంతరం చెప్పడం లేదని.. న్యాయమైన పరిహారం కోసమే ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి ఎకరాకు రూ. 35లక్షలు ఇవ్వాలని కోరారు. రీలే దీక్షలు చేపట్టిన వారిలో అంజప్ప, నర్సింహులు, కాశప్ప, శివ, గోవర్ధన్, సుదర్శన్, భాస్కర్ ఉన్నారు. జాతీయస్థాయి శిక్షణకు జిల్లా ఉపాధ్యాయుడు నారాయణపేట రూరల్: కృష్ణా మండలం కున్సీ ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్న కుందేటి నర్సింహ జాతీయస్థాయి శిక్షణకు ఎంపికయ్యారు. సీసీఆర్టీ ఆధ్వర్యంలో ఈ నెల 10నుంచి 24వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించే శిక్షణకు ఆయన హాజరు కానున్నారు. జూన్‌లో రాష్ట్రస్థాయిలో జరిగిన శిక్షణ శిబిరానికి ఆయన హాజరై ప్రతిభ చాటడంతో జాతీయస్థాయికి ఎంపికయ్యారు. జాతీయ విద్యా విధానం–2020 అంశంపై 15 రోజుల పాటు శిక్షణ కొనసాగనుంది. కాగా, హెచ్ఎం కుందేటి నర్సింహ ఇటీవల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా అవార్డు అందుకోవడం విశేషం. ఈ మేరకు నర్సింహను డీఈఓ గోవిందరాజులు, ఎంఈఓ నిజాముద్దీన్ అభినందించారు. ఆత్మకూర్: జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో ఈ ఏడాది ఉత్పత్తి లక్ష్యాన్ని అధికారులు చేరుకున్నారు. ప్రాజెక్టు చరిత్రలో మొదటిసారి సెప్టెంబర్ మొదటి వారంలోనే లక్ష్యానికి చేరుకొని రికార్డు సృష్టించారు. ఈ ఏడాది మే నెలలో కురిసిన ముందస్తు వర్షాలకు విద్యుదుత్పత్తి ప్రారంభించగా.. ఆదివారం 613 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సాధించారు. కాగా ఈ ఏడాది విద్యుదుత్పత్తి లక్ష్యం 610 మిలియన్ యూనిట్లుగా ఉంది. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో వరద జలాశయానికి చేరడంతో ముందస్తు విద్యుదుత్పత్తి సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. ● జూరాల ఎగువ జల విద్యుత్ కేంద్రంలోని మూడో యూనిట్లో సాంకేతిక సమస్య తలెత్తగా రెండేళ్లుగా చైనా నుంచి వచ్చిన సాంకేతిక నిపుణులు మరమ్మతు చేపట్టారు. ఈ ఏడాది ఆగస్టు మూడో వారంలో సమస్య పరిష్కారమై వినియోగంలోకి రావడంతో విద్యుదుత్పత్తి మరింత పెరిగింది. ఈ యూనిట్ ముందు నుంచి వినియోగంలో ఉంటే ఆగస్టులోనే లక్ష్యాన్ని చేరుకునే వారమని అధికారులు చెబుతున్నారు. ● దిగువ జూరాలలో ఆరు యూనిట్లు ఉండగా ఒక్కొక్క యూనిట్లో 40 మెగావాట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. 24 గంటల పాటు 40 మెగావాట్ల ఉత్పత్తి చేపడితే 9,600 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. 100 ఓల్టేజీ గల పది బల్బులు ఒక గంటసేపు వాడితే ఒక్క యూనిట్ కరెంట్ ఖర్చు అవుతుంది. 10 లక్షల యూనిట్లకు ఒక మిలియన్ యూనిట్ అవుతుంది. ఒక మిలియన్ యూనిట్ విద్యుదుత్పత్తికి 0.78 టీఎంసీల నీటిని వినియోగిస్తారు. జూరాల ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో మే 30న ఉత్పత్తి ప్రారంభించి సెప్టెంబర్ 7వ నాటికే 613 మి.యూ. ఉత్పత్తి సాధించి ప్రాజెక్టు చరిత్రలోనే మొదటిసారి అతి త్వరగా లక్ష్యాన్ని చేరుకున్నాం. ముందస్తు వరదలు, సిబ్బంది సహకారంతోనే ఇది సాధ్యమైంది. ఈ ఏడాది రికార్డుస్థాయిలో విద్యుదుత్పత్తి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. – శ్రీధర్, ఎస్ఈ, జెన్కో, జూరాల ● 675 టీఎంసీలు నదిలోకి.. ఎత్తిపోతల పథకాల కోసం 17.2 టీఎంసీలు విడుదల సెప్టెంబర్ మొదటి వారంలోనే విద్యుదుత్పత్తి లక్ష్యం పూర్తి వానాకాలంలో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చిచేరుతుండడంతో ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. జూరాల నుంచి 17.2 టీఎంసీలు సాగునీటి ప్రాజెక్టులకు వినియోగించుకుని మిగతా 675 టీఎంసీల నీటిని నదిలోకి వదిలేశారు. ఇందులో నెట్టెంపాడు ప్రాజెక్టుకు (4.3 టీఎంసీలు), భీమా–1 (2.6 టీఎంసీలు), భీమా–2, (2.9 టీఎంసీలు) కోయిల్‌సాగర్‌కు (1.9 టీఎంసీలు), కల్వకుర్తి ఎత్తిపోతలకు (4 టీఎంసీలు), జూరాల కుడి, ఎడమ, సమాంతర కాల్వలకు (1.50 టీఎంసీలు) ఎత్తిపోయగా.. మిగిలిన 659టీఎంసీలను నదిలోకి వదిలేశారు. -
6 నెలలు.. రూ.13.82 లక్షల ఆదాయం
నారాయణపేట రూరల్: రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరా మహిళాశక్తి’ని పటిష్టంగా అమలు చేస్తోంది. నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్యలో 8,196 మహిళా సంఘాలు ఉన్నాయి. వీటిలో 91,369 మంది సభ్యులున్నారు. ఇందిరా మహిళాశక్తిలో భాగంగా జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం క్రాస్ రోడ్డులో రూ.1.30 కోట్ల వ్యయంతో జిల్లా మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. 20 ఏళ్లకు నెలకు రూ.10 వేల అద్దె ప్రాతిపదికన మహిళా సమాఖ్య ద్వారా ఈ పెట్రోల్ బంక్ నిర్వహణకు బీపీసీఎల్‌తో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఒప్పందం చేసుకుంది. మహిళలకు ముందస్తు శిక్షణ..బంక్ నిర్వహణకు సంబంధించిన 11 మంది మహిళలను ఎంపిక చేసి ప్రభుత్వం వారికి ముందస్తుగా జడ్చర్ల, షాద్‌నగర్‌లోని పెట్రోల్ బంక్‌లలో మేనేజర్, సేల్స్ ఉమెన్లుగా శిక్షణ ఇప్పించింది. మొత్తం వ్యయంలో మౌలిక వసతులు కల్పనకు రూ.15 లక్షలు ఖర్చు చేశారు. సీఎం ఆదేశాలు మేరకు ప్రతి 15 రోజులకోసారి పెట్రోల్ బంక్ నిర్వహణపై కలెక్టర్ సమీక్షిస్తున్నారు.∙మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్‌లో రోజుకు 4 వేల లీటర్ల పెట్రోల్, 6 వేల లీటర్ల డీజిల్‌ను విక్రయిస్తున్నారు. అందులో విధులు నిర్వర్తించే 10 మంది సేల్స్ ఉమెన్లకు ఒక్కొక్కరికి నెలకు రూ.13,200 చొప్పున, మహిళా మేనేజర్‌కు నెలకు రూ.18 వేలు వేతనంగా జిల్లా సమాఖ్య నుంచి తీసుకుంటున్నారు. మహిళా పెట్రోల్ బంక్ ద్వారా వేతనాలు, ఇతర నిర్వహణ ఖర్చులు పోను ఆరు నెలల్లో రూ.13.82 లక్షల ఆదాయాన్ని ఆర్జించారు.ఆర్థికంగా ఎదుగుదలకు..మహిళలు వంటింటికే పరి మితం కాదని నారాయణపేట మహిళా సమాఖ్య నిరూపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సా హం బాగుంది. 11 మంది మహిళలం కష్టపడి పనిచేసి రూ.13.82 లక్షల ఆదాయాన్ని గడించాం. – చంద్రకళ, పెట్రోల్ బంక్ మేనేజర్మహిళా స్వావలంబనకు తోడ్పాటు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇదొక ముందడుగు. తెలంగాణలోనే కాదు దేశం మొత్తంలో జిల్లా మహిళా సమాఖ్యచే నడిచే మొదటి పెట్రోల్ బంక్‌గా గుర్తింపు పొందింది. – సిక్తా పట్నాయక్, కలెక్టర్, నారాయణపేట -
ఇందిరమ్మ ఇళ్లతో పేదోళ్ల ఆత్మగౌరవం నిలబెడతాం
అడ్డాకుల: ‘పేదోడి ఆత్మగౌరవం, భరోసా, భద్రత, గుండె నిండా ధైర్యం కావాలంటే ప్రతి ఒక్కరికి చిన్న ఇళ్లు ఉండాలనేది చిరకాల కోరిక. ఆనాటి ప్రభుత్వం పదేళ్లలో 94 వేల ఇళ్లకు టెండర్లు పిలిచి 76 వేల ఇళ్లను మాత్రమే పూర్తి చేసింది. మిగతావన్ని మొండి గోడలతో ఉంటే వాటిని పూర్తి చేసి బేషజాలకు పోకుండా వాటిని లబ్ధిదారులకు ఇస్తున్నాం. పేదోడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ఇందిరమ్మ ఇళ్లను ఇస్తున్నాం.’ అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేటలో శనివారం ప్రమీల, పర్వతాలు దంపతుల ఇందిరమ్మ ఇళ్లును రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. లబ్ధిదారు ప్రమీలతో కలిసి గృహప్రవేశం చేయించారు. అనంతరం వారి కుటుంబసభ్యులకు కొత్తబట్టలిచ్చి.. పాయసం తినిపించారు. ఆ తర్వాత జరిగిన సభలో ఆయన మాటల్లోనే.. ‘రాష్ట్రంలో మొదటి విడత కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. ఒక్కసారి ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చి ఇక అయిపోయిందనే కార్య క్రమం ఇది కాదు. ఇంకా మూడు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. ఈ మూడు విడతల్లో అర్హులైన పేద వాళ్లను ఏ పార్టీ అని అడగం. మీది ఏ కులమ ని అడగం. ఇళ్లిచ్చిన తర్వాత మాకు ఓటేస్తావా అని కూడా అడగం. వాళ్ల గుండెల్లో మేమిచ్చింది మంచి అని అనుకుంటే మాకు ఓటేస్తారు. ఓటు కోసం ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే ప్రసక్తే లేదు. ఏప్రిల్ నెలలో మరో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తాం. ప్రతి సోమవారం నిర్మాణ దశల ప్రకారం బిల్లులను చెల్లిస్తున్నాం. ఆనాడు కమీషన్లు రావని డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టలేదు. ఆనాడు హౌసింగ్ డిపార్టుమెంట్‌ను ముక్క చెక్కలు చేసి కకా వికలం చేశారు. ఒక్కొక్క ఇటుక పేరుస్తూ హౌసింగ్ డిపార్టుమెంట్‌ను మరింత బలోపేతం చేస్తాం. ఆనాటి పెద్దలకు కళ్లు కుట్టే విధంగా చిన్న అవినీతికి తావు లేకుండా చేస్తాం. ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతిని తెచ్చాం. ఇప్పటికే జీపీఓలను ఇచ్చాం. దసరా నాటికి లైసెన్సుడు సర్వేయర్లను తెస్తాం. మీ కష్టార్జితంతో సంపాదించిన భూములకు భూభారతి ద్వారా భద్రత కల్పించే విధంగా రాబోయే రోజుల్లో భూభారతిని తీర్చిదిద్దుతాం’ అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. నియోజకవర్గానికి ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, మండల కాంప్లెక్స్‌లను త్వరలో మంజూరు చేసి వాటి శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని మంత్రి ప్రకటించారు. కేసీఆర్‌కు పదిసార్లు చెప్పినా పట్టించుకోలేదు.. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. కేసీఆర్ చేసిన అప్పులకు ఇప్పుడు సంవత్సవానికి రూ.75 వేల కోట్ల అప్పు కడుతున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంతో పాటు కుటుంబ పాలనతో ప్రజాస్వామ్యాన్ని పాతరేశారని చెప్పారు. మరో మూడు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రేవంత్‌రెడ్డితోనే జిల్లా సస్యశ్యామలం:మంత్రి వాకిటి శ్రీహరి -
నర్వ అభివృద్ధికిప్రతిపాదనలు ఇవ్వండి
నారాయణపేట: నర్వ మండల అభివృద్ధి కోసం అధికారులు కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా, వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక రూపంలో ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ చాంబర్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆస్పిరేషన్ నర్వ బ్లాక్ కింద చేపట్టాల్సిన వినూత్న ప్రాజెక్టులు, కొత్త ఆలోచనలపై చర్చ జరిగింది. కీలక పనితీరు సూచికలు సాధించడానికి ప్రతి శాఖ తమవంతుగా చురుకై న చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుల ఆదాయం పెంచే ప్రాజెక్టులు, స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనోపాధి కల్పించే కార్యక్రమాలు, నీటి సంరక్షణ చర్యలు, పాడి ప్రాజెక్టులు వంటి అంశాలపై అధికారులు విస్తృతమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలన్నారు. ఇక విద్య, వైద్య, పశు సంవర్ధక, వ్యవసాయ శాఖల అధికారులు తమ శాఖల్లో అత్యవసరమైన, ప్రజలకు ఉపయోగపడే సృజనాత్మక ప్రాజెక్టులను రూపకల్పన చేసి, డిటైల్డ్ రిపోర్ట్ రూపంలో ఇవ్వాలని కలెక్టర్ ప్రత్యేకంగా ఆదేశించారు. అధికారులు నిబద్ధతతో విధులు నిర్వహిస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరే ప్రాజెక్టులను ప్రాధాన్యతగా తీసుకోవాలి అని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, డిఆర్డిఓ మొగలప్ప, డిఎంఅండ్హెచ్ఓ జయచంద్రమోహన్, డిఏఓ జాన్ సధాకర్, డిఈఓ గోవిందరాజులు, నర్వ మండలంలోని అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి నారాయణపేట రూరల్: బాలికలు అన్నిరంగాల్లో రాణించాలని, విద్యావకాశాలను సద్వినియోగం చేసుకొని, ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సంయుతంగా నారాయణపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలికలు ఆరోగ్యం, స్వీయరక్షణకు మెళకువలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు బాలికా విద్యపై ప్రత్యేక శ్రద్ద, లింగ సమానత్వం , బాల్య వివాహాల నిర్మూలనకు బాధ్యతాయుతంగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. -
గంగమ్మ ఒడికి గణపయ్య..
నారాయణపేట రూరల్: నవరాత్రులు.. భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న గణనాథుడు అనంత చతుర్ధశి గడియల్లో గంగమ్మ ఒడికి చేరాడు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఎంతో పేరున్న నారాయణపేట వినాయక నిమజ్జనం శుక్రవారం రాత్రి మొదలై శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. దాదాపు 30 గంటలకు పైగా ప్రత్యేక వాహనాల్లో పట్టణ పురవీధుల గుండా జరిగిన శోభాయాత్రలో చారిత్రక, ఇతిహాసిక, రాజకీయ అంశాలతో కలిపి లంబోదరులను అలంకరించారు. మహిళలు, పురుషులు, చిన్న, పెద్ద తేడా లేకుండా నృత్యాలు చేశారు. కోలాటం, అడుగుల భజనలు బాగా ఆకట్టుకున్నాయి. చౌక్సెంటర్లో వీహెచ్‌పీ, ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో వినాయకులకు పూజలు చేసి మండప నిర్వహకులకు జ్ఞాపికలు అందించి వీడ్కోలు పలికారు. కొండారెడ్డిపల్లి చెరువు దగ్గర మున్సిపల్, రెవిన్యూ, వైద్య, పోలీసుశాఖల సమన్వయంతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిమజ్జనం పూర్తిచేశారు. చిన్న విగ్రహాలను నేరుగా జల ప్రవేశం చేయించగా.. భారీ ప్రతిమలను క్రేన్ సహాయంతో నిమజ్జనం చేశారు. ఎస్పీ యోగేష్‌గౌతమ్ భద్రతా ఏర్పాట్లు ప్రత్యేక్షంగా పర్యవేక్షించగా, కంట్రోల్ రూంలో పోలీసు సిబ్బంది సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. స్వచ్ఛంద సంస్థలు అన్నం ప్యాకెట్లు, తాగునీరు పంపిణీ చేశారు. ఉద్రిక్తతల వేళ నిరాడంబరంగా.. మద్దూరు: ఎంతో వైభోవంగా నిర్వహించాల్సిన వినాయకుడి నిమజ్జనోత్సవం ఉద్రిక్తతల నేపథ్యంలో నిరాడంబరంగా సాగింది. శుక్రవారం రాత్రి పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా వివాదం తలెత్తడం.. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో నిర్వాహకులు వినాయక విగ్రహాలను పాతబస్టాండ్ చౌరస్తాలో నిలిపి వెళ్లిపోయారు. దీంతో వాహనాలన్నింటిని పోలీస్, మున్సిపల్ సిబ్బంది కలిసి స్థానిక కాచెరువు వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. అలాగే బాలహనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 35 అడుగుల మహా గణపతిని కూడా డీఎస్పీ లింగయ్య దగ్గరుండి నిమజ్జనానికి తరలించారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల వరకు వినాయక నిమజ్జనం కొనసాగింది. ‘పేట’లో వినాయక నిమజ్జనం పూర్తి శోభాయాత్రలో ఆకట్టుకున్నఅలంకరణలు 30 గంటలపాటు కొనసాగినఊరేగింపు -
అందుబాటులోకి కొత్త కాలేజీలు
మైక్రో బ్రూవరీ ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం ● ఈ నెల 25వ తేదీ వరకు అవకాశం మహబూబ్‌నగర్ క్రైం: మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో మైక్రో బ్రూవరీ(చిన్న తరహా బీరు పరిశ్రమ) ఏర్పాటు చేసుకోవడానికి తెలంగాణ ఆబ్కారీ శాఖ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎకై ్సజ్ డీసీ విజయ భాస్కర్ రెడ్డి, మహబూబ్‌నగర్ ఎకై ్సజ్ సీఐ వీరారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మొదటిసారి జిల్లాకేంద్రంలో కార్పొరేషన్లలో బీరు తయారు చేసి విక్రయాలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మైక్రో బ్రూవరీ ఏర్పాటుకు వెయ్యి చదరపు మీటర్లతో కూడిన ప్రాంగణం అవసరం ఉంటుందని, దీనికి రూ.1లక్ష డీడీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. దీని ద్వారా బీరు తయారు చేసి అక్కడే విక్రయాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని, ఆసక్తి కలిగిన వారు దరఖాస్తుతో పాటు రూ.1లక్ష డీడీ, ఆధార్ కార్డు, ప్రస్తుతం బార్, క్లబ్, రెస్టారెంట్ ఉంటే వాటి లైసెన్స్ జిరాక్స్ జత చేసి 25లోగా వరకు ఎనుగొండలోని డీసీ కార్యాలయంలో అందజేయాలని, 87126 58872 సంప్రదించాలని సూచించారు. ●మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం పాలమూరు యూనివర్సిటీలో ఈ విద్యా సంవత్సరం నుంచే లా, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో పీయూలోని అకాడమిక్ భవనం పైభాగంలో ఎడమ వైపు ఉన్న తరగతి గదులు ఇంజినీరింగ్, కుడి వైపు ఉన్న గదులు లా కళాశాల విద్యార్థులకు కేటాయించారు. కాగా ఆరు నెలల క్రితమే గదుల నిర్మాణం ప్రారంభించగా ఇటీవల పూర్తయ్యాయి. వీటిలో విద్యార్థులకు అవసరమైన డ్యూయెల్ డెస్క్‌లు, టేబుళ్లు తదితర వాటిని అధికారులు ఏర్పాటు చేశారు. ఆయా కోర్సుల్లో కలిపి మొత్తం 191 మంది విద్యార్థులను ప్రభుత్వం అలాట్ చేసింది. ఇంజినీంగ్‌లో చేరిన విద్యార్థులకు కళాశాలతోపాటు హాస్టల్లో చేరేందుకు అధికారులు అవకాశం కల్పించారు. వీరికి కృష్ణవేణి బాలికల హాస్టల్ కొత్త భవనంలో వసతి ఏర్పాటు చేశారు. అలాగే వీరు కళాశాలలో ఎలా ఉండాలి.. ఎలా నడుచుకోవాలని అనే అంశాలపై ఓరియంటేషన్ కార్యక్రమాలు సైతం నిర్వహించారు. త్వరలో రెండు కళాశాలల తరగతులు ప్రారంభించనున్నారు. సిబ్బంది నియామకం.. లా, ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు తరగతులు బోధించేందుకు గెస్టు ఫ్యాకల్టీని అధికారులు నియమించారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం మూడు గ్రూప్‌లకు సంబంధించి 11 మందిని అధ్యాపకులకు ఇంటర్వ్యూలు, డెమో చేపట్టిన తర్వాత నియమించారు. అలాగే లా కళాశాలకు సంబంధించి 6 పోస్టుల భర్తీకి బుధవారం అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 6 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే 10 మందిని షార్ట్‌లిస్టు చేశారు. త్వరలోనే ఈ ఫలితాలు వెలువడనున్నాయి. వీటితోపాటు లా, ఇంజినీరింగ్ కళాశాలలకు నాన్ టీచింగ్ సిబ్బందిని వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్నవారిని సర్దుబాటు చేయనున్నారు. మొత్తం 6 మందిని కేటాయించనున్నట్లు తెలుస్తుంది. ఇక లా విద్యార్థులు మొత్తం 120 మంది లా సెట్ ద్వారా ఎంపికై , ఆన్లైన్ వెబ్ ఆప్షన్ పెట్టుకున్న వారి లిస్టును ప్రభుత్వం పీయూకు పంపించింది. 45 విద్యార్థుల బుధవారం సాయంత్రం నాటికి దరఖాస్తు చేసుకోగా.. మిగతా వారికి గురువారం వరకు పీయూలో చేరేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఇంజినీరింగ్ కళాశాలలో సిద్ధమైన తరగతి గదులు అధునాతన సౌకర్యాలతో.. పీయూలో నూతనంగా ప్రారంభించనున్న లా, ఇంజినీరింగ్ కళాశాలల్లో అన్ని వసతులు కల్పించి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాం. ఇంజినీరింగ్‌లో గదులతోపాటు డ్యూయెల్ డెస్కుల్, టేబుల్స్ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్వరలో తరగతులు కూడా ప్రారంభం కానున్నాయి. రెండు కళాశాలలకు సంబంధించి సిబ్బంది నియామకం ప్రక్రియ సైతం పూర్తయ్యింది. – శ్రీనివాస్, వైస్ చాన్స్‌లర్, పీయూ అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. పీయూ లా కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 120 మందితో పీయూను ఆన్లైన్లో ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే 45 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. విద్యార్థులకు కళాశాలలో పూర్తిస్థాయిలో నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నాం. – మాళవి, లా కళాశాల ప్రిన్సిపాల్ పీయూలో లా, ఇంజినీరింగ్ కళాశాలల ముస్తాబు పూర్తయిన తరగతి గదుల నిర్మాణం, డ్యూయెల్ డెస్కుల ఏర్పాటు ఆయా కోర్సులో ఇప్పటికేపూర్తయిన అడ్మిషన్ల ప్రక్రియ ‘లా’లో 45 మంది, ఇంజినీరింగ్‌లో 191 మంది చేరిక ఓరియంటేషన్ క్లాస్‌లు పూర్తి.. త్వరలో తరగతులు ప్రారంభం -
ఉపాధ్యాయులే మార్గదర్శకులు
నారాయణపేట రూరల్: ఉపాధ్యాయులు భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. స్థానిక ఆర్డిఓ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూజలు చేసి మాట్లాడారు. సమాజానికి ఉపాధ్యాయులు వెన్నెముక లాంటి వారిని, ప్రజలలో చైతన్యం తీసుకుని వచ్చి దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. ప్రతి విద్యార్థి గమ్యం చేరుకునేందుకు టీచర్ల పాత్ర ఎంతో ముఖ్యమైందన్నారు. అన్ని రంగాలను తయారు చేసేది ఉపాధ్యాయులేనని కొనియాడారు. వ్యవస్థను నిర్ణయించే అధికారం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుందన్నారు. వెనకబడిన నారాయణపేట లాంటి జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి టీచర్ల కృషి వెలకట్టలేనిది అన్నారు. అనంతరం 51 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఏఎంఓ విద్యాసాగర్, శ్రీనివాస్, నాగార్జునరెడ్డి, భాను ప్రకాష్ పాల్గొన్నారు. -
సోలార్‌పై నజర్
జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై ప్లాంట్ల ఏర్పాటు ● ఎక్కడి విద్యుత్ అక్కడే వినియోగం ● మిగిలిన విద్యుత్ డిస్కమ్‌కు.. ● జిల్లాలో 1.45 లక్షల విద్యుత్ కనెక్షన్లు.. నిత్యం 3.99 మి.యూనిట్ల విద్యుత్ వినియోగం మద్దూరు: సాంప్రదాయేతర ఇంధన వనరుల దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పంచాయతీ కార్యాలయం మొదలుకొని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్, సెక్రటేరియేట్ వరకు అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్ని జిల్లా కలెక్టర్లతో దీనిపై వీడియో సదస్సు నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి వినియోగం పెంచేందుకు రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని వివరించారు. భారీగా విద్యుత్ వినియోగం గ్రామస్థాయి నుంచి పట్టణ ప్రాంతాల వరకు నిత్యం విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. జిల్లాలో నివాస, వ్యవసాయ, రైస్ మిల్లుల, క్రషర్ మిషన్లు, ఇతర కర్మాగారాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు తదితరాలు కలిపి జిల్లాలో 1.45 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి నిత్యం 3.99 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుంది. ఈ సీజన్ మాత్రమే ఇంత విద్యుత్ అవసరం ఉంది. వేసవి కాలంలో దాదాపు 4.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుందని అధికారులు తెలిపారు. ప్రతీ ఏటా 10 శాతం నుంచి 20 శాతం విద్యుత్ వినియోగం పెరుగుతోంది. పదేళ్ల క్రితం జిల్లాలో 2 నుంచి 3 మిలియన్ యూనిట్లు అవసరం ఉండగా అది ప్రస్తుతం రెట్టంపు దశకు చేరుకుంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అఽథారటీ (సీఈఏ) అంచనాల ప్రకారం వచ్చే మూడేళ్లలో 2028 నాటికి మరింత డిమాండ్ ఏర్పడనుందని అంచనా వేసింది. ఇందుకోసం వచ్చే పదేళ్ల నాటికి థర్మల్ పవర్ కంటే సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించారు. నివేదిక అందజేశాం ప్రభుత్వా అదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ఏర్పాటు కోసం మా సిబ్బందిచే సర్వే నిర్వహించాం. ఈ నివేదికన ప్రభుత్వానికి పంపించాం. ప్రభుత్వం నిర్ణయం మేరకు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. – వెంకటరమణ, ట్రాన్స్‌కో ఎస్ఈ ఎక్కడికక్కడ విద్యుత్ ఉత్పత్తి సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా ఎక్కడికక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసి సదరు కార్యాలయాలకు వినియోగించుకోవాలని, మిగిలిన విద్యుత్‌ను డిస్కమ్‌కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిస్కమ్ వారు తీసుకున్న విద్యుత్‌ను వినియోదారులకు అందిస్తారు. ప్రతీ కార్యాలయం వద్ద మీటర్లను ఏర్పాటు చేసి ఇంపోర్ట్ (విద్యుత్ ఉత్పత్తి), ఎక్స్పోర్ట్( డిస్కమ్‌కు ఇవ్వడం) రీడింగ్‌ను నమోదు చేయనున్నారు. ప్రభుత్వానికి నివేదిక అందజేత జిల్లాలోని అన్ని శాఖల ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, జానియర్, డిగ్రీ కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థలు, మార్కెటింగ్ శాఖ పరధిలోని గిడ్డంగులు, అంగన్వాడీలు, జీపీభవనాలు భవనాలపై రూఫ్ టాప్ సోలార్ పవర్ప్లాంట్ల ఏర్పాటు కోసం రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన సర్వే బృందంతో కలిసి స్థానిక విద్యుత్ అధికారులు ప్రభుత్వ భవనాలపై రూప్టాప్ల ఏరియా కొలిచి పంపించారు. ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్లు అధికారులు తెలియజేశారు. -
మద్దూరులో ఉద్రిక్తత
● ఓ వినాయకుడి నిమజ్జనానికి తరలింపు విషయంలో నిర్వాహకుల మధ్య గొడవ ● పోలీసుల లాఠీచార్జ్.. పలువురికి గాయాలు మద్దూరు: నారాయణపేట జిల్లాలోని మద్దూరులో వినాయక నిమజ్జనం సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణంలో దాదాపు 40కిపైగా విగ్రహాలను ప్రతిష్టించగా.. ఇందులో పాతబస్టాండ్ దగ్గర రావులపల్లి రోడ్లో 35 అడుగుల విగ్రహాన్ని మొదటిసారి బాలహనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అయితే 9 రోజుల పాటు పూజలందుకున్న గణనాథులను గురువారం రాత్రి నిమజ్జనానికి తరలించి.. శుక్రవారం స్థానిక చెరువులో నిమజ్జనం చేయాలని తీర్మానించారు. ఈ క్రమంలో బాలహనుమాన్ యూత్ నిర్వాహకులు తాము శనివారం నిమజ్జనం చేస్తామని చెప్పడంతో తెలియజేడంతో గురువారం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌లో అన్ని మండలపాల నిర్వాహకులను పిలిచి ఎస్ఐ విజయ్‌కుమార్ మాట్లాడారు. శాంతియుతంగా చేసుకోవాలని ఎస్ఐ సూచించారు. అయితే బాలహనుమాన్ యూత్ నిర్వాహకులు శనివారం వేస్తామని తేల్చిచెప్పడంతో మండపాల నిర్వాహకుల మధ్య పోలీస్‌స్టేషన్‌లోనే గొడవ జరగగా ఎస్ఐ సర్దిచెప్పారు. పాతబస్టాండ్ చౌరస్తాలోకి విగ్రహాలు పట్టణంలోని వినాయకులన్నీ గురువారం రాత్రి నిమజ్జనానికి తరలించి శుక్రవారం సాయంత్రానికి పాతబస్టాండ్ చౌరస్తాకు చేరుకున్నాయి. ఈ క్రమంలో అన్ని మండపాల నిర్వాహకులు 35 అడుగుల విగ్రహం దగ్గరికి వచ్చి నిమజ్జనానికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న కోస్గి సీఐ సైదులు, స్థానిక ఎస్ఐ విజయ్‌కుమార్ వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఎంతకూ వినకపోవడంతో నారాయణపేట నుంచి ప్రత్యేక బలగాలను పిలిపించి 35 అడుగుల వినాయకుని దగ్గర ఉన్న యువకులపై లాఠీచార్జ్ చేయడంతో చాలామందికి గాయాలయ్యాయి. పోలీసుల లాఠీచార్జ్ అనంతరం విషయం తెలుసుకున్న డీఎస్పీ లింగయ్య ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. -
శోభాయమానంగా..
● గణనాథుడి ఊరేగింపులో అలంకరణలే ప్రత్యేకం ● సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ● జిల్లా కేంద్రంలో నేటి సాయంత్రం వరకు కొనసాగనున్న శోభాయాత్ర నారాయణపేటలో క్రేన్ సాయంతో గణనాథుడి నిమజ్జనం ఊట్కూరు పెద్దచెరువులో వినాయకుడిని నిమజ్జనం చేస్తున్న భక్తులు నారాయణపేట రూరల్: ఇతిహాసిక సన్నివేశాలు.. కదులుతున్న బొమ్మలు.. విద్యుద్దీపాల అలంకరణలతో శోభాయమానంగా గణేశ్ శోభాయాత్ర కొనసాగుతోంది. గణనాథులను శుక్రవారం రాత్రి 11గంటల తర్వాత శోభాయాత్రకు తరలించారు. జిల్లా కేంద్రంలో ఈ సారి సైతం ప్రత్యేక వాహనాల్లో ఆధ్యాత్మిక, ధార్మిక, రాజకీయ అంశాలతో పాటు సమాజ శ్రేయస్సును కాంక్షించే విషయాలతో అలంకరణలు చేసి ఊరేగింపులో ప్రత్యేకత చాటుకుంటున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు నృత్యాలు, బొడ్డెమ్మలు చేస్తూ ముందుకు కదిలారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. బాంబు స్కాడ్ బృందాలు అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. శనివారం రాత్రి వరకు జరిగే నిమజ్జనానికి కొండారెడ్డిపల్లి చెరువు దగ్గర ప్రత్యేకంగా క్రేన్లను ఏర్పాటు చేశారు. మద్దూరులో గణనాథుడి ఎదుట కోలాటం ఆడుతున్న మహిళలు జిల్లా కేంద్రంలో శాతవాహనకాలనీ శివసేన యువజన సంఘం అడుగుల భజన రూ.1.65 లక్షలు పలికిన గణేశ్ లడ్డూ మరికల్: రూ.1.65 లక్షలకు వేలం పాడి గణేశ్ లడ్డూను దక్కించుకున్నాడో భక్తుడు. మరికల్ ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూ వేలాన్ని శుక్రవారం నిర్వహించారు. రికార్డు స్థాయిల్లో రూ.1.65 లక్షలకు అడిగోని నర్సిములు దక్కించుకున్నాడు. అనంతరం విగ్రహాన్ని నిమజ్జనం నిమిత్తం జూరాలకు తరలించారు. అశోక్‌నగర్‌లో నరకాసురుడితో యుద్ధం చేస్తున్న శ్రీకృష్ణుడి అలంకరణలో.. -
ఆడపిల్లలు చదివితే సమాజానికి మేలు
మక్తల్: ఆడపిల్లలు చదువుకుకుంటే కుటుంబంతో పాటు సమాజం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ సిక్తాపట్నాయాక్ అన్నారు. గురువారం మండలంలోని సగంబండ శివారులో ఉన్న కేజీబీవీ, ఎస్సీ గురుకుల బాలికల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో నిర్వహణ రికార్డులు, స్టాక్ రూం, వంటగది మరుగుదొడ్లు తదితర వాటిని పరిశీలించారు. వంట గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నాణ్యమైన కూరగాయలు వాడాలని ఏజెన్సీ మహిళలకు సూచించారు. భోజనాన్ని ప్రతి రోజు పరిశీలించిన తర్వాతే విద్యార్థినులకు వడ్డించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పాఠ్యాంశాలను బోధించాలని, చదువులో వెనకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వం కల్పించిన వసతులను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకొని, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్‌కుమార్, ఎంపీడీఓ రమేష్‌కుమార్, ప్రిన్సిపాల్ రాధిక, చంద్రకళ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
లింగ వివక్ష లేని సమాజాన్ని నిర్మిద్దాం
నారాయణపేట టౌన్: లింగ వివక్షత లేని సమాజాన్ని నిర్మిద్దామని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, జిల్లా సంక్షేమాధికారి రాంజేంద్రగౌడ్ అన్నారు. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ఆదర్శ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో లింగ సమానత్వం, వివక్ష వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అందరికీ సమానమైనా హక్కులు భారత రాజ్యాగం కల్పించిందన్నారు. అనంతరం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు యాదయ్య బాలల హక్కులు, చట్టాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ అసోసియేట్ నరేష్ అధ్యాపకులు శ్రీకాంత్, రమణ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం కో ఆర్డినేటర్ నర్సిములు, జెండర్ స్పెషలిస్ట్ అనిత, భారతి, కమ్యూనిటీ ఎడ్యుకేటర్ లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి కొత్తపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని పీడీ శంకర్ నాయక్ సూచించారు. మండలంలోని భూనీడు గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను గురువారం ఎంపీడీఓ కృష్ణారావ్తో కలిసి పరిశీలించారు. గ్రామానికి మొదటి విడతలో 43 ఇళ్లు మంజూరు కాగా 31 మంది లబ్ధిదారులు నిర్మాణాలను ప్రారంభించారు. ఇందులో 8 మందికి మొదటి విడత బిల్లును వ్యక్తిగత ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే ఇసుక, కాంక్రీటు, స్టీల్ అందేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ శాంత కుమార్, పంచాయతీ కార్యదర్శి తిరుపతి గ్రామస్తులు పాల్గొన్నారు. అవినీతిని నిగ్గుతేల్చేందుకే సీబీఐ విచారణ: మంత్రి స్టేషన్ మహబూబ్‌నగర్: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ప్రజాధనం దుర్వినియోగం, అవినీతిని నిగ్గుతేల్చేందుకే సీబీఐ విచారణ కోరినట్లు రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలశాఖ మంతి వాకిటి శ్రీహరి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన ఎమ్మెల్యేలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందమని, చేతగాకనే కాళేశ్వరంను సీబీఐ విచారణకు ఇచ్చారని ఎంపీ డీకే అరుణ అనడం అర్థరహితమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్‌తో సమగ్ర విచారణ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక, విజిలెన్స్ కమిషన్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత అందరి సమ్మతితో సీబీఐకు అప్పగించినట్లు తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీల బంధం ఎలాంటిదో పార్లమెంట్ ఎన్నికల్లో చూశామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నూటికి నూరుశాతం కాళేశ్వరంలో జరిగిన అవినీతిని కూకటివేళ్లతో బయటకు తీస్తుందన్నారు. -
దరఖాస్తు చేసుకో.. అవార్డు పట్టుకో
నారాయణపేట రూరల్: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5న నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవానికి విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే వినూత్న బోధన, విధుల్లో అంకితభావం, విద్యార్థుల సంఖ్య పెంచడం, హరితహారం, డ్రాపౌట్స్ పిల్లలు స్కూల్‌కు తీసుకుని రావడం, విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేసిన ఉపాధ్యాయులకు అవార్డులను అందిస్తోంది. అవార్డులకు ఎంపిక ప్రక్రియ మాత్రం సంబంధిత టీచర్ ఆయా లక్షణాలు తనకు ఉన్నాయంటూ తెలుపుతూ దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పరిశీలించి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయాల్సిన బాధ్యత జిల్లా విద్యాశాఖ మీద ఉంది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 47 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేస్తున్నారు. బహిరంగ నోటిఫికేషన్ లేకుండానే.. ఆలస్యంగా నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు ఈ నెల 3 వరకు దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించగా చాలా మంది టీచర్లు ఆసక్తి చూయించలేదు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు పలువురు టీచర్లపై ఒత్తిడి పెట్టి పోటాపోటీగా నామమాత్రపు ఫొటోలు, కార్యక్రమ వివరాలతో కూడిన ఫైళ్లతో అప్లై చేయించారు. డీఐఈఓ, ఒక ఎంఈఓ, ఒక జీహెచ్ఎంతో కూడిన కమిటీ మార్కులు వేసినా చివరి వరకు జాబితాను బయటపెట్టకుండా విద్యాశాఖ అధికారులు తాత్సారం చేశారు. వాస్తవంగా క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే కాగితాలనే ప్రామాణికంగా తీసుకుని దరఖాస్తు చేసుకున్న అందరిని ఉత్తమ ఉపాధ్యాయులగా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఎక్కడ కూడా కనీసం పత్రిక ప్రకటన సైతం ఇవ్వకుండా లోపలలోపల ప్రక్రియ చేయడం విమర్శలకు తావిస్తోంది. ఆర్డీఓ కార్యాలయంలో సమావేశం.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలను విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10.30గంటలకు స్థానిక ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎమ్మెల్యే ఫర్ణికారెడ్డి హాజరుకానున్నారు. ఎంపికపై విమర్శలు ఉత్తమ ఉపాధ్యాయులుగా విద్యాశాఖ ఎంపిక చేసిన వారిలో చాలా మంది పాఠశాలకు ఆలస్యంగా రావడం, తరగతి గదిలో నిద్రపోయేవారు, పిల్లలను గాలికి వదిలి స్కూల్ బయట ఇతర పనులు చేసేవారు, పనిచేస్తున్న చోట తోటి ఉపాధ్యాయులతో సక్యతగా లేకుండా పిల్లల ముందే గొడవలు పడ్డవారు సైతం కొందరు ఉండటం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. రెండేళ్లుగా ఈ తంతును పరిశీలిస్తే 2023లో 53మంది, 2024లో 44మంది దరఖాస్తు చేసుకోగా అందరికీ ఇచ్చారు. అదే పరంపర కొనసాగిస్తూ ఈ ఏడాది సైతం నామమాత్రంగా కార్యక్రమం పూర్తి చేయాలనే లక్ష్యంతో జిల్లా విద్యాశాఖ పని చేసింది తప్పా.. నిజమైన టీచర్లకు గౌరవించాలనే ఉద్దేశంతో ముందుకు పోలేదని పలువురు ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. ఈ ఏడాది 47 దరఖాస్తులు.. ఈ విద్యా సంవత్సరంలో నిర్వహిస్తున్న టీచర్స్ డే కార్యక్రమానికి ఉత్తమ ఉపాధ్యాయులుగా 47మందిని ఎంపిక చేశారు. గతంలో నేరుగా డీఈఓ కార్యాలయంలో దరఖాస్తులు ఇచ్చేవారు. కానీ ఈ సారి మండలాల పరిధిలోనే ఎంఈఓ వాటిని స్వీకరించి డీఈఓ కార్యాలయానికి పంపించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన త్రిమెన్ కమిటీ దరఖాస్తులను పరిశీలించి అందరిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసింది. ఆ జాబితాను కలెక్టర్ పరిశీలను పంపించగా గురువారం వివరాలు వెల్లడించారు. అర్జీ పెట్టుకున్నవారందరూ ఉత్తమ ఉపాధ్యాయులే ప్రతి సంవత్సరం జిల్లా విద్యాశాఖ వింత పోకడ సర్వేపల్లి జయంతిని పురస్కరించుకొని టీచర్లకు అవార్డులు ఈ ఏడాది 47 దరఖాస్తులు -
యూరియా ఇవ్వరు.. గోస తీర్చరు!
మరికల్/ధన్వాడ: మండలంలోని తీలేర్ సింగిల్ విండో సొసైటీ వద్దకు గురువారం తెల్లవారుజాము 5 గంటల నుంచి రైతులు బారులు తీరారు. 900 బస్తాల యూరియా రావడంతో అంతవరకే టోకన్లు ఇచ్చి బంద్ చేయడంతో అక్కడే ఉన్నా వందలాంది మంది రైతులకు ఆగ్రహంతో రోడ్డెక్కి రాస్తోరోకో నిర్వహించారు. దీంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న సీఐ రాజేందర్‌రెడ్డి, ఎస్ఐ రాము రైతులతో మాట్లాడడంతో రాస్తారోకో విరమింపజేశారు. అనంతరం సీఐ, ఎస్ఐ రైతుల ఆధార్‌కార్డులు పరిశీలించి ఈ నెల 6న పంపిణీ చేసే యూరియా కోసం రైతుల బొటన వేలిపై ఇంకు అంటించి టోకన్లు అందజేశారు. సృహాతప్పి పడిపోయిన వృద్ధులు తీలేర్ సొసైటీ వద్ద యూరియా కోసం క్యూలైన్లో నిలబడిన వృద్ధులు మణెమ్మ, కుర్మన్న సృహ తప్పి కింద పడిపోయారు. గమనించిన తోటి రైతులు వారిరి పక్కకు కూర్చొబెట్టి నీళ్లు తాగించారు. అనంతరం పోలీసులు వారిని 108 అంబులైన్స్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బీఆర్ఎస్ నాయకులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధులను పరామర్శించారు. ఆరోపణలు తిప్పికొట్టండి యూరియా దొరకని రైతులకు టోకన్లు జారీ చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి పోలీసులకు సూచించారు. గురువారం తీలేర్ సొసైటీ వద్దకు వచ్చిన ఎమ్మెల్యే యూరియా పంపిణీపై సీఐ రాజేందర్‌రెడ్డితో ఆరా తీశారు. ప్రతిపక్షాలు యూరియా కొరతపై అపోహాలు సృష్టిస్తున్నారని, ఈ విషయంలో పోలీసులు శాంతియుత వాతవారణంలో యూరియా పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. ● ధన్వాడ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకర సంఘం వద్ద గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచే రైతులు బారులు తీరారు. కేవలం 300 సంచుల యూరియా రావడంతో.. ఒక్కో రైతుకు రెండు నుంచి మూడు బ్యాగులు మాత్రమే అందజేస్తున్నారు. తిండి తిప్పలు లేకుండా ఉదయం నుంచి లైన్లో నిల్చున్న రైతులకు మాజీ ఎంపీటీసీ గౌని శ్రీనివాసులు పండ్లు, వాటర్ పాకెట్లు పంపిణీ చేశారు. -
నిమజ్జనానికి ముస్తాబు..
● శోభాయాత్రలో అలంకరణలే ప్రత్యేకం ● నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ ● నేటి రాత్రి నుంచి గణనాథుల తరలింపు ● రేపు సాయంత్రం తర్వాత విగ్రహాల జలప్రవేశం నారాయణపేట రూరల్: చేనేత, బంగారానికే కాకుండా వినాయక ఉత్సవాల నిర్వహణలోనూ నారాయణపేటకు రాష్ట్రంలోనే ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఎక్కడైనా విశిష్ఠ రూపాల్లో గణనాథులను ప్రతిష్ఠించడం.. మండపాల్లో వివిధ రకాలైన అలంకరణలు చేయడం చూస్తుంటాం. కానీ పేటలో మాత్రం అందుకు భిన్నంగా శోభాయాత్రలో విద్యుత్ దీపాలతో, ఇతిహాసిక సన్నివేశాలు, కదులుతున్న బొమ్మలతో కూడిన అలంకరణలు చేస్తుంటారు. ఆగస్టు 27న చవితి గడియల్లో ప్రతిష్ఠించిన గణనాథులకు నవరాత్రులు ప్రత్యేక పూజలు చేసి, అనంత చతుర్ధశి గడియల్లో గంగ చెంతకు చేరనున్నాడు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, నైవేద్యాలను సమర్పించి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నదానం చేపట్టారు. నిమజ్జన శోభాయాత్రను తిలకించడానికి చుట్టు పక్కల జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. పటిష్ట బందోబస్తు ఉమ్మడి పాలమూర్ జిల్లాలోనే ఎంతో ప్రఖ్యాతి చెందిన నారాయణపేట పట్టణ గణేష్ నిమజ్జనానికి పోలీసు శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులతో పాటు రెండు స్పెషల్ బెటాలియన్ల సిబ్బందిని రప్పించారు. అదనంగా ఒక ఎస్పీతో పాటు ఒక అడిషనల్ ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, 15 మంది ఎస్ఐలతో పాటు 200 మందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అన్ని ప్రార్థనా మందిరాలు, ముఖ్య కూడళ్లు, గణేష్మార్గ్లో పోలీసులతో పాటు స్పెషల్ పార్టీ సిబ్బంది మోహరించారు. అదేవిధంగా అన్ని మండపాలతో పాటు ఊరేగింపు జరిగే ప్రాంతాలు, నిమజ్జనం చేసే కొండారెడ్డిపల్లి చెరువు, బారంబావి తదితర ప్రాంతాల్లో బాంబ్‌స్కాడ్ బృందం తనిఖీలు చేపట్టింది. సీసీ కెమెరాలు.. జియో ట్యాగింగ్లు గతంలో ఎన్నడూ లేని విధంగా గణేష్ ఉత్సవాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. పట్టణంలో 141 వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించగా.. వీటన్నింటికి జియో ట్యాగింగ్ చేశారు. అదే విధంగా అన్ని కూడళ్లు, గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరిగే రోడ్లపై సీసీ కెమరాలు ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అధికారులు, ఐటీ కోర్ సిబ్బందితో 24 గంటల పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. శుక్రవారం రాత్రి మండపాల నుంచి బయటకు వచ్చే గణనాథులను పట్టణ ప్రధాన రహదారి మీదుగా శనివారం సాయంత్రం వరకు కొండారెడ్డిపల్లి చెరువుకు నిమజ్జనానికి తరలిస్తారు. అక్కడ అవసరమైన క్రేన్లను ఏర్పాటు చేశారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీసు సిబ్బందితో పాటు వైద్య ఆరోగ్య శాఖల వారికి విధులు కేటాయించారు. ఉత్సవ సమితి, విశ్వహిందూ పరిషత్ నాయకులు సైతం సహకారం అందిస్తున్నారు. -
‘వినూత్న’ బోధకుడికి పట్టం
● ఎస్జీటీ విభాగంలో రాష్ట్రస్థాయి అవార్డు ● ఉత్తమ ఉపాధ్యాయుడిగాకుందేటి నర్సింహ నారాయణపేట రూరల్: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 5 న ప్రభుత్వం తరఫున విద్యాశాఖ ఏటా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి అవార్డులు ఇస్తుంది. ఈ క్రమంలో జిల్లా ఏర్పాటు తర్వాత ఆరు సార్లు ఈ ఎంపికలు జరగగా.. 2019, 2021, 2023లో పలువురు టీచర్లు దరఖాస్తు చేసుకోగా ఎవరూ ఎంపిక కాలేదు. అయితే 2020లో తొలిసారి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరుగురు ఎంపిక కాగా.. వారిలో ముగ్గురు నారాయణపేట టీచర్లు కావడం ప్రత్యేకం. 2022లో ఒక మహిళ ఉపాధ్యాయురాలికి అవార్డు వరించగా.. ఇప్పుడు ఉపాధ్యాయుడు నర్సింహ ఎంపికయ్యారు. ● నాగర్‌కర్నూల్ జిల్లా గగ్గలపల్లికి చెందిన కుందేటి నర్సింహ 2008 డీఎస్సీలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా ఎంపికై వెల్దండ మండలం గోకారం ప్రాథమిక పాఠశాలలో విధుల్లో చేరారు. 2015లో జరిగిన బదిలీల్లో నారాయణపేట జిల్లా కోస్గి మండలం బోలవానిపల్లి ప్రాథమిక పాఠశాలకు వచ్చారు. అక్కడే తొమ్మిదేళ్ల పాటు విధులు నిర్వహించి గ్రామస్తుల మన్ననలు పొందారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనంతో పాటు అసంపూర్తిగా ఉన్న అదనపు తరగతి గదులను కాంట్రాక్టర్‌తో మాట్లాడి సొంతంగా రూ.2లక్షలు ఖర్చు పెట్టి బాగు చేయించారు. తాగునీరు, టాయిలెట్స్ ఏర్పాటు చేయడంతో గోడలకు చక్కటి రంగులతో బొమ్మలు వేయించారు. ఏడాదిలోపే ఆ గ్రామం నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు స్థానిక ప్రభుత్వ పాఠశాలకు వచ్చారు. 20 మంది నుంచి 90 మందికి ఎన్రోల్మెంట్ పెంచారు. ఆవరణలో 50 మొక్కలను నాటి వాటిని సంరక్షించారు. కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజనానికి కూరగాయలు, ఆకుకూరలను పండించేవారు. బోధన విషయంలో ఆయన తీరు అందరు టీచర్ల కంటే భిన్నంగా ఉంటుంది. పాఠ్యాంశాలను కథలు, నాటికలు, ఆటపాటలతో ఏకపాత్రాభివినయం ద్వారా బోధన చేస్తారు. రెండుసార్లు హైదరాబాద్ రవీంద్రభారతిలో ఇక్కడి చిన్నారులు ప్రదర్శనలు ఇచ్చారు. 2024 జూన్‌లో బోలవానిపల్లి ప్రాథమిక పాఠశాల నుంచి బదిలీ అయ్యారు. అయితే రిలీవ్ చేయరాదని సీఎం రేవంత్‌రెడ్డి దగ్గరకు వెళ్లి గ్రామస్తులు వినతిపత్రం అందించడంతో ఆరు నెలలు పాత పాఠశాలలోనే విధులు నిర్వహించారు. వారం రోజుల క్రితం కున్సి ప్రాథమిక పాఠశాలకు పీఎస్ హెచ్ఎంగా పదోన్నతిపై వచ్చారు. ఆయనను కలెక్టర్ సిక్తాపట్నాయక్, డీఈఓ ఎండీ గోవిందరాజు, పీఆర్టీయూ, తపస్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యాద్గీర్ జనార్దన్‌రెడ్డి, శేర్‌కృష్ణారెడ్డి, నర్సింహ, రెడ్డప్ప అభినందించారు. -
ఉత్సాహంగా బ్యాడ్మింటన్ పోటీలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో 11వ రాష్ట్రస్థాయి జూనియర్ (అండర్–13) బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌కు సంబంధించి 225 క్వాలిఫైయింగ్ రౌండ్ మ్యాచ్‌లు గురువారం ఉత్సాహంగా జరిగాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ల్లో ప్రతిభ కనబరిచిన వారు శుక్రవారం నుంచి జరిగే మెయిన్ డ్రాకు అర్హత సాధించారు. శుక్రవారం ఉదయం ప్రారంభోత్సవం... రాష్ట్రస్థాయి అండర్–13 బ్యాడ్మింటన్ పోటీలు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్నాయని మహబూబ్‌నగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంసుందర్‌గౌడ్, రవికుమార్ తెలిపారు. ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లను వారు పరిశీలించారు. నాలుగు సింథటిక్ కోర్టుల్లో సింగిల్, డబుల్స్ పోటీలు జరుగుతాయని, ఈ నెల 7న చాంపియన్‌షిప్ ముగింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించామన్నారు. కార్యక్రమంలో టోర్నీ పరిశీలకుడు సుధాకర్, రెఫరీ కిషోర్, జిల్లా సంయుక్త కార్యదర్శులు నాగరాజుగౌడ్, విజయ్‌రెడ్డి, ఎంపీ.ప్రవీణ్, సభ్యులు శశాంక్ పాల్గొన్నారు. క్వాలిఫైయింగ్ రౌండ్ మ్యాచ్‌లు పూర్తి నేటి నుంచి మెయిన్ డ్రా పోటీలు ప్రేక్షకులతో కిటకిటలాడిన ఇండోర్ స్టేడియం -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
నవాబుపేట: పంట పొలానికి రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె ప్రమాదవశాత్తు తగిలి మహిళ మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. జంగమయ్యపల్లి గ్రామానికి చెందిన కంచె కిష్టమ్మ(40) రెండు రోజులుగా ఇంటి నుంచి అదృశ్యమైంది. గురువారం ఉదయం గ్రామ సమీపంలో కుమ్మరి రాములు వ్యవసాయ పొలంలో మొక్కజొన పంటకు వేసిన విద్యుత్ కంచె వల్ల షాక్‌కు గురై అక్కకక్కడే మృతి చెందింది. చుట్టు పక్కల వారు గమనించి ఆమె కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. ఆమె కుమారుడు నరేష్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలోవ్యక్తి మృతి జడ్చర్ల: పట్టణంలోని 44వ నంబర్ జాతీయ రహదారి ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై ముందు వెళ్తున్న కంటెయిర్ను వెనుక నుంచి కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు గాయాల పాలైన ఘటన గురువారం చోటు చేసుకుంది. సీఐ కమలాకర్ కథనం మేరకు హైదరాబాద్ వైపు నుంచి కర్నూల్ వైపునకు వెళ్తున్న కంటెయినర్‌ను బ్రిడ్జిపై వెనుక నుంచి అతి వేగంగా కారు ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్ పక్క సీటులో కూర్చున్న రోహిత్ (30) అక్కడికక్కడే మృత్యువాత పడగా.. డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారందరూ హైదరాబాద్‌లోని కొంపల్లికి చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
జగదీశ్వర్‌రెడ్డి సేవలు చిరస్మరణీయం
● రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ● ఆయనది ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నైజం: మంత్రి వాకిటి శ్రీహరి ● పాలమూరులో మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి విగ్రహావిష్కరణ స్టేషన్ మహబూబ్‌నగర్: మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పదేళ్లపాటు సుదీర్ఘకాలంగా పని చేశారని, పార్టీ యంత్రాంగాన్ని నడపాలంటే ఆయన్ను చూసి నేర్చుకోవాలని, పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్‌నగర్ పద్మావతీకాలనీలోని గ్రీన్‌బెల్టులో గురువారం మాజీ ఎమ్మెల్సీ ఎస్.జగదీశ్వర్‌రెడ్డి విగ్రహావిష్కరణలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ పార్టీ పరమైన అంశాల్లో, ఇతర సమస్యల్లో ఎవరి మనసు నొప్పించక ప్రజాస్వామికబద్దంగా వ్యవహరించేవారని అన్నారు. ఆనాడు పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో జిల్లా నుంచి ప్రధాన పాత్ర పోషించారని అన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ జగదీశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అంచలంచెలుగా ఎదిగారని అన్నారు. రాజకీయాలకు సరైన వ్యక్తిగా ఆయన జీవన ప్రయాణం కొనసాగిందన్నారు. జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయననే చూసే నేర్చుకోవడం జరిగిందన్నారు. ఎంపీ డాక్టర్ మల్లురవి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ జగదీశ్వర్‌రెడ్డి ఆదర్శప్రాయుడని, కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించారని అన్నారు. సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ జగదీశ్వర్‌రెడ్డితో తనకు ఎంతో ఆత్మీయత అనుబంధం ఉందన్నారు. మొదట్లో నాకు రాజకీయాలు వద్దని చెప్పారని, తర్వాత నాకున్న ఆసక్తితో రాజకీయాల్లో ఎంతో ప్రోత్సహించారని గుర్తుచేశారు. మాజీ ఎంపీ వి.హనుమంతురావు మాట్లాడుతూ జగదీశ్వర్‌రెడ్డి నిరుపేదలకు సహాయం చేయడంలో ముందుండేవారని అన్నారు. ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, యశస్వినిరెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు గురునాథ్‌రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, కోదండారెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు భానుప్రకాశ్, యాదవరెడ్డి తదితరులు జగదీశ్వర్‌రెడ్డి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, బెక్కరి మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ నందిని, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, సంజీవ్ ముదిరాజ్, వినోద్‌కుమార్, ఎన్పీ. వెంకటేశ్, చంద్రకుమార్‌గౌడ్, భగవంతురావు, సీజే బెనహర్, ప్రశాంత్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, జహీర్ అఖ్తర్, సాయిబాబా పాల్గొన్నారు. -
ఆనందగా ఉంది
చదువుకున్న కళాశాలలో పనిచేస్తున్న సమయంలోనే రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకుడి అవార్డు రావడం ఆనందంగా ఉంది. జూనియర్ లెక్చరర్‌గా దివంగత వైఎస్సార్ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నా. తిరిగి ఇన్నాళ్లకు డిగ్రీ కళాశాల స్థాయిలో అవార్డు రావడంతో నాపై మరింత బాధ్యత పెరిగింది. హిందీ విభాగంలో మరింత సేవలు అందించేందుకు అవార్డు స్ఫూర్తిగా నిలవనుంది. – డా.నర్సింహారావు కల్యాణి, అసోసియేట్ ప్రొఫెసర్, డిగ్రీ కళాశాల, జడ్చర్ల జడ్చర్ల టౌన్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ అధ్యాపకులలో పట్టణంలోని డిగ్రీ కళాశాల హిందీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా.నర్సింహారావు కల్యాణి ఎంపికయ్యారు. నారాయణపేటకు చెందిన డా.నర్సింహారావు ఇంటర్ వరకు అక్కడే చదవి డిగ్రీ జడ్చర్ల బీఆర్ఆర్ కళాశాలలో చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో హిందీ విభాగంలో ఎంఏ, ఎంఫిల్ పట్టాలు పొంది హింది సాహితీవేత్త డా.ప్రభాకర్ నవలల్లో సమకాలిన వాస్తవికత అంశంపై పరిశోధన చేసి పీహెచ్డీ పొందాడు. 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఇప్పటి వరకు 30హింది కథలను రాయగా.. హిందీ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పీయూ, ఎంవీఎస్ డిగ్రీ కళాశాల, ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల, హిందీ బోర్డు ఆఫ్ స్టడీస్ సభ్యుడిగా సేవలు అందిస్తున్నారు. అలాగే హిందీ, ఉర్దూ బోర్డు ఆఫ్‌స్టడీస్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. జిజ్ఞాసలో రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి, హిందీ వీడియో పాఠాలు బోధిస్తూ పలువురి ప్రశంసలు పొందుతున్నారు. రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికై నందుకు ప్రిన్సిపాల్ సుకన్య నేతృత్వంలోని అధ్యాపకబృందం గురువారం శాలువాతో సత్కరించి అభినందించారు. నర్సింహారావుకు ఉత్తమ అవార్డు -
రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: రాష్ట్రంలో అధిక వర్షా లు, వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ ఆహార ధాన్యాల పంటలకు ఎకరాకు రూ.25 వేలు, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలన్నారు. భారీ వర్షాల వల్ల దాదాపు 5,435 కోట్ల నష్టం వచ్చినట్లు ప్రభుత్వం అంచనా వేసిందన్నారు. చిన్ననీటి వనరులకు దాదాపు రూ.629 కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు 2.5 లక్షల ఎకరాలు వరద ముంపునకు గురైనట్లు తెలిపా రు. క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టి కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకొచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతులపై ఉన్న 11 శాతం పన్ను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో గ్రామాల్లో సభలు నిర్వహించి ప్రధానికి తీర్మానం కాపీలు పంపాలని పిలుపునిచ్చారు. జిల్లా ఉపాధ్యక్షుడు ఏ.రాములు, జిల్లా కార్యదర్శి లక్ష్మయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కడియాల మోహన్, హన్మంతు పాల్గొన్నారు. -
మైసమ్మ ఆలయానికి అటవీ భూమి
నవాబుపేట: జిల్లాలో ప్రసిద్ధిచెందిన పర్వాతాపూర్ మైసమ్మ ఆలయానికి అటవీ భూమి కోసం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ద్వారా ప్రత్యేక ప్రతిపాదన చేసినట్లు మైసమ్మ ఆలయ చైర్మన్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. మైసమ్మ ఆలయానికి అదనంగా 4.0889 హెక్టార్ల (దాదాపు పది ఎకరాలు)అటవీ భూమి కోసం ప్రత్యేక వినతిని జడ్చర్ల ఎమ్మెల్యే ప్రతిపాదించినట్లు తెలిపారు. దీనికి సంబంధించి కలెక్టర్ అటవీ భూమిలో సంబంధిత అధికారులతో సర్వే చేయించి అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాగా, కేంద్ర కార్యాలయం తుది అనుమతి రావాల్సి ఉందని.. దీనికి త్వరలోనే అనుమతులు తీసుకొచ్చేలా చేస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలియజేశారు. ఆలయ సిబ్బందికి పెరిగిన వేతనాలు కొన్నేళ్లుగా ఆలయంలో వివిధ రకాల పనులు చేస్తున్న వారికి కనీస వేతనాలు పనికి తగ్గట్లుగా అందేవి కావు. దీంతో వారు చాలా ఏళ్లుగా కనీస వేతనం కోసం జడ్చర్ల ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించడంతో తాజాగా 6 కూలీలకు కనీస వేతనం అందించే జీఓ బుధవారం వచ్చిందని మైసమ్మ ఆలయ చైర్మన్ తెలిపారు. దీంతో గతంలో నెలకు రూ.7500 అందించే వేతనాన్ని రూ.12వేలకు పెంచినట్లు పేర్కొన్నారు. అలాగే వంశపారంపర్యంగా ఆలయంలో పనులు చేసే మరో వ్యక్తికి సంబంధించి పర్మినెంట్ వేతనం మంజూరు చేస్తూ ప్రభుత్వం గజిట్ ఇచ్చిందని తెలిపారు. దీంతో ఆలయంలో ఉన్న పెండింగ్ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు చైర్మన్‌తోపాటు సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. -
మహిళ మెడలోమంగళసూత్రం చోరీ
జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట ఫ్రీజన్ రోడ్డులో గురువారం గోదా నాగలక్ష్మి అనే మహిళ మెడలో గుర్తు తెలియని దుండగులు పుస్తెలతాడు (బంగారుగొలుసు) చోరీ చేశారు. స్థానికంగా నివాసముంటున్న నాగలక్ష్మి రేషన్ దుకాణానికి వెళ్లి ఇంటికి తిరిగి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమెను ఫాలో అవుతూ వచ్చాడు. నిర్మానుష ప్రాంతంలో మెడలోని గొలుసు చోరీ చేసినట్లు బాధితురాలు తెలిపారు. అనంతరం ఎన్ఎస్125 బైక్‌పై సిద్ధంగా ఉన్న మరో దుండగుడితో కలసి పరారైనట్లు పేర్కొన్నారు. బాధితురాలు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ మల్లేష్ సంఘటనా స్థలానికి చేరుకొని సమీపంలోని సీసీ కెమెరాల రికార్డులు పరిశీలించారు. చోరీ అయిన గొలుసు మూడు తులాలు ఉంటుందుని బాధితురాలు వాపోయింది. చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు నవాబుపేట: చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతైన ఘటన మండలకేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దేపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ జావిద్ (35), బుచ్చయ్య ఇద్దరు బుధవారం చేపల వేటకు వెళ్లారు. కాగా జావిద్ చేపల పట్టుకునే క్రమంలో చెరువు లోపలికి వెళ్లి ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. బుచ్చయ్య గమనించి గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ విక్రమ్ గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి మరో సారి గాలింపుచర్యలు చేపట్టారు. రాత్రి వరకు గాలించినా ఆచూకీ లభించకపోవడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. కాగా జావిద్‌కు భార్య అన్విర్తో పాటు నలుగురు కుమార్తెలు ఉన్నారు. -
రైతులకు ఇబ్బంది లేకుండా పంపిణీ చేయాలి
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా పంపిణీ చేయాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం మహబూబ్‌నగర్ అర్బన్ మండల పరిధిలోని బోయపల్లిరోడ్లో గల హకా రైతు సేవా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా యూరియా పంపిణీ ప్రక్రియను మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసులును అడిగి తెలుసుకున్నారు. యూరియా కొరత లేకుండా చూసుకోవాలని, రైతులు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఒకరోజు ముందుగానే టోకన్లు ఇచ్చి యూరియా పంపిణీ చేస్తున్నామని అధికారులు కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. అందరికీ టోకెన్లు వచ్చేలా చూడాలని, మహిళలకు, వృద్ధులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. యూరియా పక్కదారి పట్టకుండా పంపిణీ చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారికి చైర్మన్ ఫోన్ చేసి యూరియా పంపిణీ, భూ భారతి చట్టం అమలు తీరుపై ఆరా తీశారు. రైతులకు ఒకే కేంద్రానికి కేంద్రానికి రాకుండా ఎక్కడి వారికి అక్కడే పంపిణీ జరిగేలా చూడాలని కలెక్టర్, డీఏఓలకు సూచించారు. రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా ప్రభుత్వం, అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్న విషయాల గురించి రైతులకు వివరించారు. కార్యక్రమంలో అధికారులు, సేవా కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి -
డైవర్షన్ పనులు పక్కాగా చేపట్టాలి
● కేంద్ర అటవీశాఖ డీజీ చంద్రశేఖర్ మహబూబ్‌నగర్ న్యూటౌన్: చిన్నదర్పల్లి ఫారెస్ట్ బీట్ పరిధిలోని జాతీయ రహదారి విస్తరణలో ఫారెస్ట్ డైవర్షన్ పనులు పక్కాగా చేపట్టాలని కేంద్ర అటవీశాఖ డీజీ చంద్రశేఖర్ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రానికి సమీపంలోని చిన్నదర్పల్లి ఫారెస్ట్ బీట్ పరిధిలో జాతీయ రహదారి విస్తరణలో కోల్పోతున్న అటవీ భూమి, చెట్లను ఆయన పరిశీలించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల నష్టానికి సంబంధించి ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా డైవర్షన్ పనులు పక్కాగా చేపట్టాలని డీఎఫ్ఓ సత్యనారాయణకు సూచించారు. విస్తరణలో పోతున్న అటవీ భూమికి బదులుగా మరోచోట ఇవ్వడం, చెట్లకు బదులుగా మరోచోట నాటడం వంటి పనుల్లో ఎలాంటి జాప్యం జరగరాదని సూచించారు. అనంతరం మహబూబ్‌నగర్ సమీపంలోని దొడ్డలోనిపల్లి ఫారెస్ట్ బీట్ పరిధి ప్లాంటేషన్, మయూరీ పార్క్‌ను సందర్శించారు. పార్క్‌లో ఏర్పాట్లు, మొక్కలు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో రేంజ్ అధికారి అబ్దుల్‌హాయ్, జాతీయ రహదారి ఈఈ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా కొనసాగుతున్న పోటీలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బందికి టీచర్స్ డేను పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఆటల పోటీలు రెండో రోజు ఉత్సాహంగా సాగాయి. సింధటిక్ ట్రాక్, ఇండోర్ స్టేడియంలో జరిగిన పోటీలను వీసీ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. పని ఒత్తిడి తగ్గించుకునేందుకు తప్పకుండా ఆటల్లో పాల్గొనాలన్నారు. ముఖ్యంగా మహిళా సిబ్బంది అధిక సంఖ్యలో పోటీల్లో పాల్గొనడం గొప్ప విషయమన్నారు. గెలుపోటములను సమానంగా తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం విజేతల వివరాలను పీయూ పీడీ శ్రీనివాస్ వెళ్లడించారు. పురుషుల విభాగం 100 మీటర్ల పరుగు పందెంలో ఈశ్వర్, విజయ్, కరుణాకర్‌రెడ్డి, షార్టపుట్ విభాగంలో శ్రీనివాస్, సాయికిరణ్, రాఘవేందర్, కరుణాకర్‌రెడ్డి, గాలెన్న, అర్జున్, రిజిస్ట్రార్ రమేష్‌బాబు, వీసీ శ్రీనివాస్, క్యారమ్స్‌లో రాజశేఖర్, శ్రీశైలం, రెండో బహుమతి విజయభాస్కర్, ఈశ్వర్‌కుమార్ గెలుపొందారు. టెన్నికాయిట్ మహిళా విభాగంలో మొదటి బహుమతి స్వాతి, శ్రీలత, రెండో బహుమతి రజిని, మధులిక, 100 మీటర్ల మహిళా విభాగంలో సంధ్యా, రామంజమ్మ, రజిని, చిన్నదేవి, అరుంధతి, పుష్పలత, షార్ట్‌పుట్ మహిళా విభాగంలో రామాంజమ్మ, స్రవంతి, రజిని, చిన్నాదేవి, మధులిక, శ్రీలత తదితరులు విజేతలుగా నిలిచారు. -
రిజర్వాయర్‌లో దంపతుల గల్లంతు
● చేపల వేటకు వెళ్లిన క్రమంలో చోటుచేసుకున్న ఘటన ● ఎన్డీఆర్ఎఫ్ బృందాల గాలింపు.. ఎమ్మెల్యే, ఎస్పీ పరిశీలన మల్దకల్: రిజర్వాయర్‌లో చేపలు పట్టేందుకు వెళ్లిన భార్యాభర్తలు ప్రమాదవశాత్తు పుట్టి బోల్తా పడడంతో గల్లంతయ్యారు. ఈ ఘటన మల్దకల్ మండలం తాటికొండ రిజర్వాయర్‌లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తాటికుంటకు చెందిన దుబ్బన్బోయి బోయ రాముడు(36), సంఽధ్య(34) భార్యభర్తలు. చేపలు పట్టుకొని విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. రోజులాగే మంగళవారం సాయంత్రం ఇరువురు చేపల వేటకు వెళ్లారు. రాత్రయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే రిజర్వాయర్ వద్దకు చేరుకుని పరిశీలించగా అక్కడ రాముడు బైక్, చెప్పులు, వస్తువులు లభించడంతో ఇద్దరు రిజర్వాయర్‌లో చేపల కోసం పుట్టీలో వెళ్లారని గుర్తించారు. రిజర్వాయర్‌లో అలల తాకిడి ఎక్కువ కావడంతో పుట్టి బోల్తా పడి ఉండవచ్చునని గ్రామస్తులు తెలిపారు. భార్యకు ఈత రాకపోవడంతో ఆమెను రక్షించే క్రమంలోనే భర్త మృతి చెంది ఉంటాడని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. మంగళవారం రాత్రి 11గంటల సమయంలో మల్దకల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు జిల్లా ఉన్నతాధికారులకు విషయాన్ని తెలిపారు. దీంతో బుధవారం ఉదయం గల్లంతైన వారి కోసం 50మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం రిజర్వాయర్‌లో గాలింపు చర్యలు చేపట్టింది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగులయ్య, సీఐ శ్రీను అక్కడికి చేరుకొని గాలింపు చర్యలను పర్యవేక్షించారు. చేపల వేటకు ఎప్పుడు వెళ్లారు, పూర్తి వివరాలను కుటుంబ సభ్యులు, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఇదిలాఉండగా, వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. సాయంత్రం వెళ్లిన తల్లిదండ్రులు ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆ చిన్నారుల రోదనలు మిన్నంటాయి. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. గల్లంతైన భార్యాభర్తలు రాముడు, సంధ్య (ఫైల్) అన్నివిధాలుగా ఆదుకుంటాం.. : ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వారి కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అందే రైతు బీమాతోపాటు ఇద్దరు చిన్నారులకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ఇద్దరి ఆచూకీ తెలిసే వరకు గాలింపు చర్యలు చేపడతామని ఆయనతోపాటు అధికారులు తె లిపారు. గాలింపు చర్యల్లో తహసీల్దార్ ఝాన్సీరాణి, గట్టు ఎస్ఐ మల్లేష్, ఆర్ఐ మద్దిలేటి, మహేందర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఫిర్యాదులు పరిశీలించిన జిల్లా రిజిస్ట్రార్
మెట్టుగడ్డ: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెలో ఫిర్యాదులను బుధవారం జిల్లా రిజిస్ట్రార్ డి.ఫణిందర్ పరిశీలించారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ఫిర్యాదుల పెట్టెను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గత మే నెలలో ఏర్పాటు చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రజల సౌకర్యార్థం ఫిర్యాదులు, సలహాలు ఇచ్చేందుకు ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మహబూబ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫిర్యాదులను పరిశీలించి, ప్రజల నుంచి వచ్చిన వినతులను చదివి కార్యాలయ సబ్ రిజిస్ట్రార్లను, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని, ప్రజల సౌకర్యార్థం కుర్చీలు బాత్రూంలను, ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి అసౌకర్యం కలిగి నా, సిబ్బంది ఇబ్బందులు పెట్టినా, ఈ ఫిర్యాదు పెట్టెలో ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. -
రైతులకు తప్పని యూరియా కష్టాలు
కొత్తపల్లి: రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. బుధవారం కొత్తపల్లి మండలం భూనీడులోని ఎరువుల దుకాణం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. మండల వ్యవసాయశాఖ అధికారి రమేశ్, ఎస్ఐ విజయ్‌కుమార్ సమక్షంలో ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున యూరియాను పంపిణీ చేశారు. అయితే అరకొరగా యూరియా అందిస్తుండటంతో నిత్యం ఎరువుల విక్రయ కేంద్రాల వద్దకు రైతులు చేరుకొని పడిగాపులు కాయాల్సి వస్తోంది. వరిపంటకు అనువైన సమయంలో యూరి యా వేయకుంటే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని రైతులు వాపోతున్నారు. కాగా, ఉమ్మడి మద్దూరు మండలానికి ఇప్పటికే 1,063 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని.. ఒకట్రెండు రోజుల్లో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఏఓ రమేశ్ తెలిపారు. -
మహిళల ఆర్థిక బలోపేతం దిశగా..
నర్వ: మహిళల ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) కొత్త సంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మహిళలు పొదుపుతో ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ముందుకు సాగుతోంది. అందులో భాగంగా కొత్త సభ్యులతో మరిన్ని స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది. గతంలో 18నుంచి 58 ఏళ్ల మహిళలకు మాత్రమే స్వయం సహాయక సంఘాల్లో చోటు కల్పించగా.. తాజాగా 15ఏళ్ల కిషోర బాలికల నుంచి 60ఏళ్ల వృద్ధుల వరకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 7,072 మహిళా సంఘాలు ఉండగా.. 91,065 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల మేరకు మరో 3,380 మంది కొత్తగా సంఘాల్లో చేరారు. ఈ నెల 30వ తేదీ వరకు కొత్త సంఘాల ఏర్పాటుకు గడువు ఉన్న నేపథ్యంలో మరింత మంది చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇవీ మార్గదర్శకాలు.. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన కిశోర బాలికలతో పాటు మహిళలు, దివ్యాంగులు స్వయం సహాయక సంఘాల్లో చేరేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వృద్ధాప్య, దివ్యాంగ పింఛన్లు తీసుకుంటున్న మహిళలు సైతం అర్హులుగా నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో గ్రామీణాభివృద్ధి సంస్థ, ఇందిరా క్రాంతి పథకం అధికారులు 20 రోజులుగా కొత్త మహిళా సంఘాల ఏర్పాటు కోసం అర్హులైన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. 15నుంచి 60 ఏళ్లలోపు వారు కొత్త సంఘాల్లో చేరే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఒక్కో గ్రూపులో 10మంది సభ్యులు తప్పనిసరిగా ఉండాలని నిబంధనలు ఉన్నప్పటికీ.. ఐదుగురు సభ్యులతోనూ కొత్త సంఘాలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కొత్త సంఘాల ఏర్పాటు.. కొత్త సంఘాల్లో ప్రభుత్వ మహిళా ఉద్యోగులతో పాటు ఉద్యోగుల భార్యాపిల్లలకు చోటు ఉండదు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికే ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. జిల్లాలోని డీపీఎం, ఏపీఎంలు, సీసీలు, వీఓలు గ్రామాల్లో పత్యేకంగా సమావేశాలు ఏర్పాటుచేసి.. కొత్త సంఘాల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారు. ఔత్సాహిక బాలికలు, మహిళలు సభ్యులుగా చేరేలా అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు కొత్త సంఘాలను ఏర్పాటుచేసి.. ఆన్లైన్లో గ్రూప్‌ల పేర్లు నమోదు చేస్తున్నారు. 15ఏళ్ల బాలికల నుంచి 60ఏళ్ల వృద్ధులకు అవకాశం ఇప్పటి వరకు 3,380మంది కొత్తగా చేరిక మహిళా ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుసాగుతోంది. జిల్లాలోని మహిళా సంఘాలకు పెద్దఎత్తున రుణాలు అందిస్తుండటంతో ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుతం 15ఏళ్ల బాలికల నుంచి 60ఏళ్ల వృద్ధుల వరకు మహిళా సంఘాల్లో చేరేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని జిల్లాలోని బాలికలు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. – మొగులప్ప, డీఆర్డీఓ -
ఏపీలో అదృశ్యమై.. తెలంగాణలో శవమై
నాగర్‌కర్నూల్ జిల్లా: భార్యతో గొడవపడి తన ముగ్గురు పిల్లలతో సహా అదృశ్యమైన వ్యక్తి మూడు రోజుల తర్వాత శవమై కనిపించాడు. తనతో పాటు వచ్చిన ముగ్గురు పిల్లల ఆచూకీ మాత్రం మిస్టరీగా మారింది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామశివారులో వెలుగుచూసింది. కుటుంబసభ్యులు, పోలీసుల వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పెద్దబోయలపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు (36) ఫర్టిలైజర్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. గతనెల 30న తన భార్య దీపికతో ఇంట్లో గొడవపడ్డాడు. ఈ క్రమంలో తన ముగ్గురు పిల్లలు మోక్షిత (8), రఘువర్షిణి (6), శివధర్మ (4) పాఠశాల నుంచి ఇంటికి రాగానే.. ద్విచక్ర వాహనంపై వారిని ఎక్కించుకొని బయలుదేరాడు. వారంతా శ్రీశైలం మీదుగా తమ ప్రయాణాన్ని సాగించారు. చివరకు నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ శివారులో హైదరాబాద్–శ్రీశైలం రహదారి పక్కనున్న వ్యవసాయం పొలంలో వెంకటేశ్వర్లు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమీప పొలాల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని వెల్దండ ఎస్ఐ కురుమూర్తి పరిశీలించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.బైక్ నంబర్ ఆధారంగా వివరాల గుర్తింపు..ఇంట్లో గొడవపడి పిల్లలతో సహా వెంకటేశ్వర్లు అదృశ్యం కావడంతో అతడి కుటుంబసభ్యులు అక్కడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామశివారులో వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడగా.. అక్కడ ఉన్న బైక్ నంబర్ ఆధారంగా ఇక్కడి పోలీసులు మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అప్పటికే వెంకటేశ్వర్లు, అతడి పిల్లల ఆచూకీ కోసం గాలిస్తున్న కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి వచ్చి చూడగా.. అక్కడ పిల్లలు లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. శ్రీశైలం నుంచి హైదరాబాద్ రోడ్డులో వారు ప్రయాణించినట్లు తెలుసుకొని మార్గమధ్యంలోని పలుచోట్ల సీసీ కెమెరాలను పరిశీలించారు. శ్రీశైలం–హైదరాబాద్ మార్గంలోని అజీపూర్ వద్ద ముగ్గురు పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లినట్లు గుర్తించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కోనేటీపూర్ టోల్‌ప్లాజా వద్ద మాత్రం పెద్ద కుమార్తెతో మాత్రమే కనిపించాడని పోలీసులు నిర్ధారించారు. మిగిలిన మరో కూతురు, కుమారుడు కనిపించకపోవడంపై విచారణ చేస్తున్నారు. వెల్దండ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తూ.. పిల్లల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు పిల్లల ఆచూకీ మిస్టరీగా మారింది. మృతుడి తమ్ముడు మల్లికార్జున్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. -
నేటి నుంచి రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో గురువారం నుంచి ఈ నెల 7వ తేదీ వరకు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అండర్–13 బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నారు. పట్టణంలో రెండోసారి మహబూబ్‌నగర్ జిల్లా బ్యాడ్మింటన్ (ఎండీబీఏ) ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇండోర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆరు కోర్టుల్లో మ్యాచ్‌ల నిర్వహణ రాష్ట్రస్థాయి అండర్–13 బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌కు మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలోని నాలుగు సింథటిక్ కోర్టుల్లో మ్యాచులు జరగనున్నాయి. గురువారం క్యాలిఫైయింగ్ రౌండ్, 5 నుంచి 7 వరకు సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో మెయిన్‌డ్రా పోటీలు జరుగుతాయి. పోటీలో ఉమ్మడి జిల్లాల నుంచి 350 మంది క్రీడాకారులు, 11 మంది అఫీషియల్స్ పాల్గొంటున్నారు. 5వ తేదీన ఉదయం 10 గంటలకు టోర్నీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి హాజరుకానున్నారు. స్టేడియంలో ఏర్పాట్లను మహబూబ్‌నగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. కార్యక్రమంలో టోర్నీ పరిశీలకుడు సుధాకర్, టెక్నికల్ అషీషియన్ జి.కిషోర్, రెఫరీలు తదితరులు పాల్గొన్నారు. 4రోజుల పాటు పాలమూరులోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో నిర్వహణ మొదటగా క్యాలిఫైయింగ్ రౌండ్ మ్యాచ్‌లు 5 నుంచి మెయిన్ డ్రా పోటీలు ఏర్పాట్లు చేసిన జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ -
జూరాలకు తగ్గుతున్న వరద
ధరూరు/ఆత్మకూర్/రాజోళి/దోమలపెంట: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. మంగళవారం 1.26 లక్షల క్యూసెక్కులు ఉండగా.. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో 1,02,950 క్యూసెక్కులకు తగ్గినట్లు చెప్పారు. దీంతో ప్రాజెక్టు 10 క్రస్ట్‌గేట్లను ఎత్తి 66,776 క్యూసెక్కులు దిగువకు వదిలామన్నారు. విద్యుదుద్పత్తికి 38,225 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 70, ఎడమ కాల్వకు 920, కుడి కాల్వకు 700, భీమా లిఫ్టుకు 750 క్యూసెక్కులు వినియోగించినట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.571 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు. 474 మెగావాట్ల విద్యుదుత్పత్తి.. జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో బుధవారం విద్యుదుత్పత్తి కొనసాగిందని ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 276.486 మి.యూ., దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 303.685 మి.యూ. ఉత్పత్తి జరినట్లు చెప్పారు. ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 580.171 మి.యూ. ఉత్పత్తి చేపట్టామన్నారు. సుంకేసు జలాశయం.. సుంకేసుల జలాశయం 18 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. బుధవారం ఎగువ నుంచి 80 వేల క్యూసెక్కుల వరద రాగా.. 18 గేట్లను మీటర్ మేర తెరిచి 76,356 క్యూసెక్కులు దిగువకు, కేసీ కెనాల్‌కు 2,095 క్యూసెక్కులు వదిలినట్లు వివరించారు. 10 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల -
‘జీవిత బీమా’తో ఆర్థిక భద్రత
జడ్చర్ల టౌన్: ప్రతి ఒక్కరికీ జీవిత బీమా ద్వారా రక్షణ కల్పించి వారికి ఆర్థిక భద్రతను ఇవ్వడమే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముఖ్య ఉద్దేశమని ఎల్ఐసీ ఆఫ్ ఇండియా ముంబై సెంట్రల్ కార్యాలయ క్లియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పైక్రే అన్నారు. బుధవారం జడ్చర్ల ఎల్ఐసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జడ్చర్ల ఎల్ఐసీ బ్రాంచ్ పరిధిలోని కేశంపేట మండలాన్ని రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన సందర్భంగా సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి ఒక్కరికీ బీమా సదుపాయం కల్పించాలనే సంకల్పంతో 1956లో కేంద్ర ప్రభుత్వం జీవిత బీమా సంస్థ ప్రారంభించిందన్నారు. నాటి నుంచి ఎంతగానో విస్తరించినా ఇంకా అనేక మందికి పాలసీని అందించలేక పోయిందన్నారు. ఈ నేపథ్యంలో కేశంపేట మండలాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికి చేసి ప్రతి ఇంట్లో ఒక పాలసీ నినాదంతో ముందుకెళ్తున్నట్లు ప్రకటించారు. ఎల్ఐసీ కుటుంబమంతా విశేషంగా కృషి చేసి ప్రాజెక్ట్‌ను విజయవంతం చేయాలన్నారు. 2026 మార్చి 26 నాటికి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని కోరారు. కార్యక్రమంలో హైదరాబాద్ జోనల్ మేనేజర్ పునీత్‌రాజ్‌కుమార్, డివిజనల్ మేనేజర్ సంధ్యారాణి, క్లియా ఆర్ఎం రాజశేఖర్, ఎంఎం ప్రసాదరావు, మేనేజర్ రవిశంకర్, బీడీబీఎస్ మేనేజర్ జగన్నాథం, జడ్చర్ల బ్రాంచ్ మేనేజర్ శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా కేశంపేట మండలం ఎంపిక ప్రతి ఇంట్లో ఒక పాలసీ ఉండాలి ఎల్ఐసీ ఆలిండియా క్లియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పైక్రే -
నీటి గుంతలో పడి అన్నదమ్ములు మృతి
ఊట్కూరు: నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలో ఇంటిపక్కన ఉన్న నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందిన సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. తిమ్మారెడ్డిపల్లి తండాకి చెందిన పూనియానాయక్, జయమ్మ దంపతులకు కుమారులు అభిషేక్(5) ఆకాష్(4) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లి జీవనం కొనసాగిస్తున్నారు. సొంత గ్రామం తిమ్మారెడ్డిపల్లి తండాలో వినాయక నిమర్జనం కోసం రెండు రోజుల క్రితం వచ్చారు. బుధవారం మధ్యాహ్నం ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇంటి పక్కనే కాస్త దూరంలో ఉన్న నీటి గుంతలో పడిపోయారు. పిల్లలు కనపడడం లేదంటూ కుటుంబసభ్యులు గ్రామం మొత్తం వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో ఇంటి పక్కనే ఉన్న గంత వద్దకు వెళ్లి చూడగా అందులో చిన్నారులు తెలుతూ కనిపించారు. వెంటనే వారిని బయటికి తీసి ఆస్పత్రకి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఒకేసారి ఇద్దరన్నదమ్ములు మృతిచెందడంతో తల్లిదండ్రులు దుఖఃసాగరంలో మునిగారు. ఈ ఘటనపై ఎస్ఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వినాయక నిమర్జనానికి వచ్చిన చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఎడ్యుకేషన్.. ఇరిగేషన్
ఇవే పాలమూరు తలరాతను మారుస్తాయి ● ఏ అవకాశం వచ్చినా మొదటి ముద్ద పాలమూరుకే.. ● ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా.. ● అప్పుడే వలసలు ఆగుతాయి.. ● ‘కొడంగల్’ భూనిర్వాసిత రైతులకు న్యాయం చేస్తాం ● ఎస్జీడీ ఫార్మా 2వ యూనిట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరుకే మొదటి ముద్ద.. పేదరికం, వలసలు, సమస్యలను చూపించడానికి నాటి పాలకులు ప్రపంచ నాయకులను పాలమూరు జిల్లాకు తీసుకొచ్చేవారు. భవిష్యత్‌లో మన అభివృద్ధి, పరిశ్రమలు, యూనివర్సిటీలు, సాగునీటి ప్రాజెక్ట్‌లను సందర్శించేలా అభివృద్ధి చేసుకోవాలి. వీటిని చూసేందుకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు రావాలి. పరిశ్రమలు కావాలంటే భూములు కావాలి. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో వాటి వివరాలను అధికారులు నాకు పంపాలి. ఏ పరిశ్రమ వచ్చినా మొదటగా పాలమూరుకు పంపుతాను. నాకు ఏ అవకాశం వచ్చినా మొదటి ముద్ద పాలమూరు ప్రజలకు పెడుతా. మంత్రి వర్గంలోని మంత్రులు ఏమనుకున్నా మంచిదే.సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘పాలమూరు జిల్లా అంటే ఒకనాడు వలసలకు మారుపేరు. ఈ దేశంలో భాక్రానంగల్, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ.. ఇలా ఏ మూలన ప్రాజెక్ట్‌లు కట్టినా తట్ట పని, మట్టి పని చేయాలంటే పాలమూరు బిడ్డలే కావాలి. వారి భాగస్వామ్యం లేకుంటే ఏ నిర్మాణాలు పూర్తి కాలేదు. దీనికి ప్రధానం కారణం చదువులో వెనకబాటు, సాగు నీరు అందుబాటులో లేకపోవడమే. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాల్లోని పెద్దలు ప్రయత్నం చేయకపోవడంతో ఇప్పటికీ వలసలు ఆగలేదు. అందుకే పాలమూరు బిడ్డగా నా బాధ్యత నెరవేరుస్తా. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ లక్ష్యంగా పాలమూరు జిల్లా ప్రజల తలరాతలు మార్చేందుకు కృషి చేస్తా.’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ముసాపేట మండలం వేముల శివారులోని ఎస్జీడీ ఫార్మా కార్నింగ్ టెక్నాలజీస్ రెండో యూనిట్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఫర్నేస్ లైటింగ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ‘పాలమూరు బిడ్డల చదువు కోసం ఏది కావాలన్నా.. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. పాలమూరు ప్రాజెక్ట్‌లకు గ్రీన్‌చానల్ ద్వారా నిధులు అందించి పూర్తి చేస్తాం. రాజకీయ కారణాలతో అభివృద్ధిని అడ్డుకుంటే మనకు మనమే మరణ శాసనం రాసుకున్నవాళ్లమవుతాం.’ అని పేర్కొన్నారు. ఇంకా రేవంత్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. కర్ణాటక సరిహద్దులో అత్యంత వెనుకబడిన ప్రాంతం మక్తల్, నారాయణపేట, కొడంగల్. ఈ ప్రాంతానికి నీళ్ల కోసం 2014లో ఉమ్మడి రాష్ట్రంలో 69 జీఓ ద్వారా తెచ్చుకుంటే ఎంపీగా పనిచేసిన కేసీఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి మా ప్రాజెక్టును తొక్కిపెట్టి అన్యాయం చేశారు. అందుకే సుమారు రూ.4 వేల కోట్లతో ఈ ప్రాజెక్ట్‌కు టెండర్లు పిలిచి ముందుకు వెళుతుంటే.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేసి అడ్డుకుంటున్నారు. కొడంగల్‌లో కోల్పోయినవి కమర్షియల్ భూములు కావడంతో అక్కడి వారికి ఎకరాకు రూ.20 లక్షలు ఇచ్చారు. మిగతా ప్రాంతాల్లో రూ.11 లక్షల వరకు ఇచ్చాం. నారాయణపేటలో రూ.14 లక్షలు ఇస్తున్నాం. భూసేకరణకు సంబంధించిన వివాదాలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. మంత్రి శ్రీహరి, ఎమ్మెల్యే, కలెక్టర్ రైతులతో మాట్లాడాలి.. భూసేకరణ విషయంలో వారంపాటు సమయం కేటాయించి రైతులతో మాట్లాడాలి. వారిని ఒప్పించి.. మంచి పరిహారం అందించాలి. భూములు కోల్పోతున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి. రైతులకు నష్టం జరిగితే మాకు జరిగినట్లే. మీకు న్యాయం చేసే బాధ్యత మాది. ఈ ప్రాజెక్ట్‌తో పాటు వికారాబాద్– కృష్ణా రైల్వేలైన్ పూర్తి చేసుకోకపోతే, పాలమూరు–రంగారెడ్డి, బీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్ట్‌లు పూర్తి చేసుకోకపోతే.. ఎప్పుడూ పూర్తి చేసుకోలేం. నిధుల ఇబ్బందులు ఉన్నా.. మన జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టి అందజేస్తున్నాం. రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, తూడి మేఘారెడ్డి, పర్ణికా రెడ్డి, వీర్లపల్లి శంకర్, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఎస్జీడీ టెక్నాలజీస్ ఎండీ దీపక్ సర్జిత్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
పేట–కొడంగల్ ఎత్తిపోతలకు వ్యతిరేకం కాదు
నారాయణపేట: పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని.. ఈ పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ. 35లక్షల పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన జల్ల్లా కేంద్రంలో విలేకర్లతో మాట్లాడారు. పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో జిల్లాలోని మక్తల్, ఊట్కూర్, నారాయణపేట, దామరగిద్ద, మద్దూర్ మండలాలకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుందని.. మిగతా మండలాలకు చుక్కనీరు అందనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాజెక్టుకు అడ్డు చెప్పడం లేదన్నారు. జిల్లాలోని అన్ని మండలాలకు ప్రయోజనం కలిగే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేస్తే జిల్లా మొత్తం సస్యశ్యామలమవుతుందన్నారు. ఇప్పటికే 95శాతం పూర్తయిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ● బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సస్పెన్షన్‌ను జిల్లా పార్టీ స్వాగతిస్తుందని రాజేందర్‌రెడ్డి అన్నారు. కొన్ని రోజులుగా కవిత చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని పదేపదే చెబుకునే కాంగ్రెస్, బీజేపీలకు కవిత సస్పెన్షన్ ద్వారా ఇది కుటుంబ పార్టీ కాదని కనువిప్పు కలిగిందన్నారు. బీఆర్ఎస్ ఒక క్రమశిక్షణ గల పార్టీ అని.. ఇందులో తప్పు చేసినవారు ఎంతటి వారైనా పార్టీ నుంచి పక్కకు తప్పించడం జరుగుతుందన్నారు. అనంతరం జిల్లా కేంద్రం సమీపంలోని కొండారెడ్డిపల్లి చెరువును ఆయన పరిశీలించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రూ. 4కోట్లతో కొండారెడ్డిపల్లి చెరువును సుందరంగా తీర్చిదిద్దగా.. ప్రస్తుతం అధ్వానంగా మారిందన్నారు. ఇప్పటికై నా చెరువు అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని అన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్‌చైర్మన్ కన్నా జగదీశ్, చెన్నారెడ్డి, నాయకులు ప్రతాప్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, వేపూరి రాములు, విజయ్‌సాగర్, మహిమూద్ అన్సారీ తదితరులు ఉన్నారు. -
చిన్నారికి తప్పిన ప్రమాదం
● కారులోపల నాలుగేళ్ల చిన్నారి ● ఆటోమెటిక్‌గా లాకయిన కారు ● అద్దాలు పగులగొట్టి డోర్లు ఓపెన్ జడ్చర్ల టౌన్: కారు ఆటోమేటిక్‌గా డోర్లు మూసుకుపోయిన నేపథ్యంలో నాలుగేళ్ల చిన్నారి ప్రమాదం నుంచి తప్పించుకొన్న ఘటన మున్సిపాలిటీ పరిధిలోని ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. బూరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రవితేజ భార్య, కుమారుడు తన్విక్రెడ్డితో కలిసి షాపింగ్‌కు ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో ఉన్న దుకాణానికి కారులో వచ్చారు. పిల్లాడిని కారులోనే విడిచి ఇంజిన్ రన్నింగ్‌లో ఉంచి భార్యతో కలిసి దుకాణంలోకి వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత కారు డోర్లు ఆటోమెటిక్‌గా లాక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పిల్లాడు కారు అద్దాన్ని కొడుతుండటంతో స్థానికులు గమనించి కారు తలుపు తీసేందుకు యత్నించారు. కారు లోపల నుంచి లాక్ కావడంతో చుట్టుపక్కల ఆరా తీశారు. విషయం తెలుసుకొన్న రవితేజ కారు వద్దకు చేరుకొని ఆటోమెటిక్ లాక్ కావటం గమనించారు. అనంతరం కారు అద్దం పగులగొట్టి పిల్లాడిని బయటకు తీశారు. దీంతో తల్లిదండ్రులతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
రోడ్ల మరమ్మతుకు చర్యలు: కలెక్టర్
నారాయణపేట: ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న బీటీ, మట్టిరోడ్ల మరమ్మతుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ పర్యటించి ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖలకు సంబంధించిన బీటీ, మట్టిరోడ్లను పరిశీలించారు. ముందుగా అంబేడ్కర్ చౌరస్తా నుంచి ఆర్డీఓ ఆఫీస్, పాత బస్టాండ్ మీదుగా పళ్లబ్రిడ్జి, ఎంబీ చర్చి వరకు ఉన్న ఆర్అండ్బీ రోడ్డును చూశారు. అటు నుంచి ఎక్లాస్పూర్ మార్గంలోని లోకపల్లి లక్ష్మమ్మ గుడికి వెళ్లే మట్టిరోడ్డు స్థితిగతులను తెలుసుకున్నారు. ఇటీవల లోకపల్లి లక్ష్మమ్మ జాతరకు ముందు ఆ రహదారిని మట్టివేసి చదును చేయగా.. వారం క్రితం కురిసిన వర్షాలకు మట్టి రహదారి దెబ్బతిందని.. ఎగువ నుంచి వచ్చే వర్షపునీరు రహదారిపైకి చేరకుండా చిన్న కల్వర్టు మాదిరిగా పైపులు వేయాల్సి ఉందని పీఆర్ ఈఈ హీర్యా నాయక్ కలెక్టర్‌కు వివరించారు. అయితే రహదారి పక్కన ఉన్న వెంచర్ యజమాని పైపులు వేసేందుకు నిరాకరిస్తున్నాడని తెలిపారు. స్పందించిన కలెక్టర్.. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఈఈకి సూచించారు. అనంతరం ఊట్కూరు మండలం వల్లంపల్లికి వెళ్లే మట్టి రోడ్డును కలెక్టర్ పరిశీలించా రు. చిన్నపాటి వర్షం కురిస్తే రోడ్డు మొత్తం చిత్తడిగా మారుతుందని.. తాత్కాలిక మరమ్మతు చేయిస్తా మని పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. అయితే గతంలో ఈ రోడ్డు మరమ్మతుకు ఎన్ని నిధు లు మంజూరయ్యాయి.. ఇంకా ఎన్ని మిగిలి ఉన్నా యనే వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. చివరగా పట్టణంలోని యాదగిరి రోడ్డు పక్కన కొత్త కాలనీకి వెళ్లే మార్గంలో ఉన్న లో లెవల్ కల్వర్టును కలెక్టర్ పరిశీలించారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఇక్కడ నీరు ఉధృతంగా ప్రవ హించడంతో రాకపోకలు నిలిచిపోయాయని.. స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి చొరవతో అవతలి వైపు నుంచి తాత్కాలిక దారిని ఏర్పాటు చేసినట్లు కాలనీవాసులు కలెక్టర్‌కు తెలిపారు. అయితే కల్వర్టులో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, నీటిపారుదలశాఖ అధికారులతో విపత్తు నిర్వహణ నిధుల వినియోగంపై కలెక్టర్ చర్చించారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, తెగిన చెరువులు, కుంటల మరమ్మతుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఈఈ వెంకటరమణ, డీఈ రాములు, నీటిపారుదలశాఖ ఈఈ బ్రహ్మానందరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నర్సయ్య పాల్గొన్నారు. -
గ్రామీణ ఓటర్లు 3,96,541మంది
నారాయణపేట: స్థానిక సంస్థల ఎన్నికలకు మరో ముందడుగు పడింది. ఎన్నికల నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా మంగళవారం తుది ఓటరు జాబితాను విడుదల చేసింది. జిల్లాలోని 272 గ్రామపంచాయతీల్లో 2,466 వార్డులకు గాను 2,470 పోలింగ్ కేంద్రాల పరిధిలో 3,96,541 మంది ఓటర్లు ఉన్నట్లు డీపీఓ సుధాకర్‌రెడ్డి వెల్లడించారు. వీరిలో పురుషులు 1,94,124 మంది, మహిళలు 2,02410 మంది, ఇతరులు ఏడుగురు ఉన్నారు. ఓటరు జాబితాను అన్ని గ్రామపంచాయతీలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. -
నేడు సీఎం రేవంత్ పర్యటన
మహబూబ్‌నగర్ క్రైం/ అడ్డాకుల: మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల శివారులోని ఎస్జీడీ ఫార్మా కార్నింగ్ టెక్నాలజీస్ రెండో యూనిట్‌ను బుధవారం ఉదయం 11.30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి పరిశ్రమ వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు మంగళవారం కంపెనీ ముందున్న స్థలంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను కలెక్టర్ విజయేందిర, ఎస్పీ జానకి, ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి పరిశీలించారు. అలాగే పరిశ్రమ లోపల జరిగే కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. సుమారు 1.45 గంటల పాటు సీఎం ఇక్కడ ఉండనున్నారు. మధ్యాహ్నం 12.45 గంటలకు హెలీకాప్టర్‌లో తిరిగి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమానికి వెళ్లనున్నారు. సీఎంతోపాటు పలువురు మంత్రులు, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. కాగా.. కొత్తగా ఏర్పాటు చేసిన రెండో యూనిట్ ద్వారా మరో 200 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. -
నానో యూరియాతో అధిక దిగుబడి
మాగనూర్: నానో యూరియాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని.. రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్ సుధాకర్ అన్నారు. మంగళవారం మాగనూర్‌లోని ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన పలు రికార్డులను పరిశీలించారు. దుకాణాల్లో ఎరువుల స్టాక్ వివరాలతో పాటు ధరల పట్టికను ప్రదర్శించాలని నిర్వాహకులకు సూచించారు. ఎరువులు, పురుగు మందులు కొనుగోలుచేసే రైతులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలన్నారు. రైతులు నానో యూరియా వినియోగంపై దృష్టిసారించాలని తెలిపారు. ఎకరాకు ఒక లీటర్ నానో యూరియా వినియోగించాలన్నారు. పంటల సాగులో ఏమైనా సందేహాలు ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఆయన వెంట ఏఓ సుదర్శన్‌గౌడ్ ఉన్నారు. -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
నారాయణపేట: జిల్లా కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. వివిధ ప్రాంతాల నుంచి రైతులు యూరియా కోసం స్థానిక పీఏసీఎస్‌కు పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే స్టాక్ లేదని.. మరుసటి రోజు వస్తుందని సిబ్బంది చెప్పడంతో ఆగ్రహానికి గురయ్యారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉన్న ప్రధాన రహదారిపైకి చేరుకొని ధర్నా చేపట్టారు. యూరియా కావాలి.. కలెక్టర్ రావాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. యూరియా స్టాక్ వస్తుందని.. బుధవారం వచ్చి తీసుకెళ్లాలని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. బకాయిలు విడుదల చేయాలి నారాయణపేట రూరల్: పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్‌కుమార్, రాష్ట్ర నాయకుడు నరహరి డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో విద్యార్థులతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక శ్రీసత్యనారాయణ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా విద్యాశాఖకు మంత్రి లేకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. విద్యారంగానికి అధిక బడ్జెట్ కేటాయించడంతో పా టు పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ రూ.8,650 కోట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలన్నారు. విద్యారంగ సమ స్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అశోక్, మహేశ్, నవీన్, కనకప్ప పాల్గొన్నారు. -
పకడ్బందీగా గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు
మక్తల్: గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. మంగళవారం మక్తల్‌లో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా ఆజాద్‌నగర్, యాదవ్‌నగర్, గాంధీనగర్ తదితర కాలనీల్లో ప్రతిష్ఠించిన గణనాథులను ఆయన దర్శించుకొని నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అనంతరం మినీ ట్యాంక్‌బంద్ వద్ద గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గణేశ్ ఉత్సవ కమిటీల సభ్యులు నిమజ్జన వేడుకల్లో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. శాంతియుతంగా శోభాయాత్ర నిర్వహించి.. నిమజ్జనం పూర్తిచేయాలని సూచించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని డీజేలను నిషేధించినట్లు చెప్పారు. ఎవరైనా డీజేలు వినియోగిస్తే సీజ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గణేశ్ శోభాయాత్ర రూట్లో విద్యుత్ వైర్లతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు సూచించారు. ప్రార్థనా మందిరాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ట్యాంక్‌బండ్ వద్ద చెత్తాచెదారం లేకుండా చూడాలన్నారు. ఎస్పీ వెంట మక్తల్ సీఐ రాంలాల్, ఎస్ఐ భాగ్యలక్ష్మీరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ గణేశ్‌కుమార్, రవికుమార్ ఉన్నారు. -
గాంధీనగర్ చేనేత కార్మికుల ఇళ్ల సర్వే
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ చేనేత సహకార సంఘం సభ్యుల ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేయాలని, కార్మికులకు సభ్యత్వాలు ఇవ్వాలని సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంలో నిరసనబాట పట్టడం.. అయ్యో నేతన్నా శీర్షికన 8న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. గాంధీనగర్ చేనేత సొసైటీలో నిజానిజాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం చేనేత జౌళీశాఖ అధికారి బాబురావు బృందం ఇంటింటి సర్వే చేపట్టింది. గాంధీనగర్ చేనేత సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్ల యజమానులు, వారి కుటుంబీకుల వివరాలు, చేనేత కార్మికులకు సభ్యత్వ నమోదుపై సమగ్ర విచారణ చేపట్టారు. నివేదికను త్వరలోనే కలెక్టర్‌కు అందించనున్నారు. 30ఏళ్ల తర్వాత గాంధీనగర్ చేనేత సొసైటీ కార్మికుల కష్టాలను తెలుసుకుంటున్న కలెక్టర్‌కు చేనేత కార్మిక కుటుంబాల తరఫున సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ పార్టీ పట్టణ కార్యదర్శి కెంచ నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. -
నిబద్ధతతో పనిచేస్తేనే ప్రగతి
● క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి ● కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట: అధికారులు నిబద్ధతతో విధులు నిర్వహిస్తేనే ప్రగతి సాధ్యమవుతుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆస్పీరేషన్ నర్వ బ్లాక్‌పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శాఖల వారీగా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. నర్వ మండలంలో రైతుల ఆదాయం పెంపు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు జీవనోపాధి కల్పించే ప్రాజెక్టులు, నీటి సంరక్షణ పద్ధతులు, పాడి ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు. ఈ నెల 3న నీతి అయోగ్ సీఈఓతో వీసీ ఉందని.. అంతలోగా వినూత్న ప్రాజెక్టు ప్రతిపాదనలను శాఖల వారీగా సంబంధిత అధికారులు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. 5న డీపీఆర్ పంపించాల్సి ఉంటుందన్నారు. ఇటీవలే నర్వ ఆస్పీరేషన్ బ్లాక్‌కు సంబంధించి నీతి అయోగ్ అవార్డు అందుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. ముందుగా అసిస్టెంట్ కలెక్టర్ ప్రణయ్‌కుమార్ ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో కలెక్టర్ అమలుచేస్తున్న ఉత్తమ పద్ధతులను వివరించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ శైలేష్ కుమార్, హౌసింగ్ పీడీ శంకర్, డీఏఓ జాన్ సుధాకర్, పీఆర్ ఈఈ హీర్యానాయక్, డీఈఓ గోవిందరాజులు, జిల్లా మత్స్యశాఖ అధికారి రహమాన్, మిషన్ భగీరథ డీఈ రంగారావు, డీపీఓ సుధాకర్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. మెరుగైన వైద్యం అందించాలి.. వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారికి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి.. సిబ్బంది హాజరు, మందుల స్టాక్ రిజిస్టర్లను చూశారు. ఓపీ, జనరల్ వార్డుల్లో వైద్యసేవలపై ఆరా తీశారు. ఆస్పత్రి ఆవరణ, బెడ్స్ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ● ప్రజాసమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై 45 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎస్.శ్రీను ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సంప్రదాయ పద్ధతిలో పండుగలు జరుపుకోవాలి
నారాయణపేట క్రైం/కోస్గి: జిల్లాలో డీజేలకు స్వస్తి పలికి.. సంప్రదాయ పద్ధతిలో పండుగలు జరుపుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. సోమ వారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో డీజేలను నిషేధించడం జరిగిందన్నారు. అయినప్పటికీ కొందరు కావాలని డీజేలను వినియోగిస్తుండటంతో జిల్లా కేంద్రంలో 8 డీజే వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. కర్ణాటక సరిహద్దు నుంచి జిల్లాలోకి డీజే వాహనాలు రాకుండా ఐదు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా డీజేలు వినియోగించినట్లయితే వాటిని సీజ్ చేసి.. సదరు వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ● గణేశ్ నిమజ్జన వేడుకల సందర్భంగా చేపట్టే శోభాయాత్రను ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. కోస్గి పట్టణంలోని వినాయక మండపాలను ఎస్పీ సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అనంత రం స్థానిక అధికారులతో కలిసి సర్జఖాన్‌పేట దండం చెరువులో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లతో పాటు రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. పెద్ద విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్లు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. మండలంలో 192, కోస్గిలో 35 విగ్రహాలు ఏర్పాటు చేశారని స్థానిక పోలీసులు వివరించారు. ఆయన వెంట సీఐ సైదులు, ఎస్ఐ బాల్‌రాజ్, పీఆర్ఓ వెంకట్ ఉన్నారు. ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి.. జిల్లా పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌లో ఉంచరాదని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం, భరోసా కలిగేలా విదులు నిర్వర్తంచాలని సిబ్బందికి సూచించారు. -
యూరియా కోసం తప్పని పాట్లు
ధన్వాడ/మద్దూరు: జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తొలగడం లేదు. ఎరువుల పంపిణీ కేంద్రాల వద్ద ఎదురుచూపులు తప్పడం లేదు. ధన్వాడ సింగిల్‌విండోకు ఆదివారం రాత్రి 350 బస్తాల యూరియా వచ్చిన విషయం తెలుసుకున్న రైతులు.. సోమవారం తెల్లవారుజామునే అక్కడికి చేరుకొని చెప్పులు, రాళ్లను క్యూలో పెట్టారు. చివరకు చాలా మంది రైతులకు యూరియా అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ఎలాగైనా యూరియా తీసుకోవాలని తమ భార్యాపిల్లలతో కలిసి క్యూలో ఉంటున్నామని రైతులు వాపోయారు. ● మద్దూరులోని పీఏసీఎస్ వద్ద రైతులు యూరియా కోసం నానా అవస్థలు పడ్డారు. తెల్లవారుజామునే పీఏసీఎస్‌కు చేరుకొని పట్టాదారు పాస్‌పుస్తకాలను వరుస క్రమంలో పెట్టి, యూరియా కోసం పడిగాపులు కాశారు. 600 బస్తాల యూరియా పీఏసీఎస్‌కు రావడంతో పోలీసుల బందోబస్తు మధ్య ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. -
ఎన్నాళ్లీ అవస్థలు..!
మరికల్: జిల్లాలోని అనేక చెరువులు, కుంటలు, పాటు కాల్వలు ఆక్రమణకు గురయ్యాయి. బఫర్ జోన్లో నిర్మించిన అక్రమ కట్టడాలు నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. ఫలితంగా వరద నీరు నివాసగృహాలు, రోడ్లపైకి చేరుతోంది. రోజుల తరబడి మునిగిన ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ బాధితులు కాలం వెల్లదీయాల్సిన దుస్థితి నెలకొంది. ఐదేళ్లుగా వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఉంటుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటమునిగిన ఇళ్లు, రోడ్లపైకి చేరే వరదను ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ తాత్కాలిక చర్యలు చేపడుతున్నారనే తప్ప.. సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని నీటి వనరుల వద్ద ప్రత్యేకంగా సర్వే చేపట్టి.. బఫర్ జోన్లు గుర్తించారు. అయితే చెరువులు, గొలుసుకట్టు కాల్వలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారికి అధికారులు నోటీసులు జారీ చేయడం లేదు. భారీ వర్షాలు కురిసి ఇళ్లు, రోడ్లపైకి వరద వచ్చినప్పుడే అధికారులు హడావుడి చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. హైదరాబాద్ తరహాలో ఆక్రమణలను తొలగించాలని కోరుతున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, 13 మండల కేంద్రాల్లో 890 చెరువులు, 235 కుంటలు ఉన్నాయి. వీటిలో నారాయణపేట, మక్తల్, కోస్గి, మరికల్ పట్టణాల్లోని ప్రధాన నీటివనరులు కబ్జాకు గురవుతున్నాయి. అసలు చెరువులు, కుంటలు లేకుండానే మాయం చేస్తున్నారు. ఈ ప్రభావంతో వర్షాకాలంలో కాలనీలు ముంపునకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మితిమీరిన రాజకీయ జోక్యం, అధికారుల ఉదాసీనత, అవినీతి కారణంగా చెరువులు, కుంటలు యథేచ్ఛగా కబ్జాకు గురికావడం వర్షాల సమయంలో ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. బఫర్ జోన్లో ఇళ్లు నిర్మిస్తే చర్యలు జిల్లాలో చెరువుల కింద ఉన్న బఫర్ జోన్లను గుర్తించడం జరిగింది. అలాంటి బఫర్ జోన్లో నిర్మించిన ఇళ్లు అక్రమం అని తేలితే నోటీసులు జారీ చేస్తాం. భారీ వర్షాలతో కాలనీలు, రోడ్లపైకి వస్తున్న వరద ప్రవహంపై సమీక్షించడం జరిగింది. భవిష్యత్‌లో ఇలాంటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటాం. – ప్రతాప్‌సింగ్, ఈఈ, ఇరిగేషన్‌శాఖ చెరువులు పారినప్పుడల్లానీటమునుగుతున్న కాలనీలు ఇళ్లు, రోడ్లపైకి చేరుతున్న వర్షపునీరు చెరువుల ఆక్రమణతో ముప్పు వరదల సమయంలోనే అధికారుల హడావుడి జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి -
హైవేపై ప్రమాద ఘంటికలు
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలోని జాతీయ రహదారి–44పై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల మధ్యలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రెట్టింపు అవుతున్నాయి. ప్రమాదాల్లో మొదటి స్థానంలో కార్లు ఉంటే ఆ తర్వాత బస్సులు, ద్విచక్ర వాహనాలు ఉంటున్నాయి. వర్షంలో డ్రైవింగ్, నిద్రమత్తు, ఓవర్ స్పీడ్ వంటి మూడు అంశాలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నా యి. అయితే ఆయా ప్రమాదాల్లో 70 శాతానికి పైగా యువకులే మృత్యువాతపడుతున్నారు. నా లుగు వరుసల రహదారి వెంట వేసిన అనుబంధ, ఇతర అంతర్గత రోడ్లలో నిబంధనలు పాటించకపోవడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎలాంటి రోడ్డునైనా సరే ప్రతి రెండేళ్లకోసారి మరమ్మతు చేయించాల్సి ఉన్నా ఆ దిశగా ఎవరూ పట్టించుకోవడం లేదు. అద్దంలా మెరవాల్సిన నాలుగు లైన్ల రోడ్లు చాలా చోట్ల గుంతలు, ప్యాచ్‌లు, ఎగుడు దిగుడుగా ఉంటూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మరోవైపు జాతీయ రహదారి–167పై కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా ఈ రోడ్డుపై జడ్చ ర్ల కల్వకుర్తి మధ్యలో, మహబూబ్‌నగర్ నుంచి దేవరకద్ర మధ్యలో ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. టాప్‌లో జడ్చర్ల.. జిల్లావ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో టాప్ ఐదు స్థానాల్లో నాలుగు జాతీయ రహదారిపై ఉన్న స్టేషన్స్ ఉండటం విశేషం. మూడేళ్లలో జడ్చర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో 127 మంది వాహనదారులు మృతి చెందగా.. మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 106, భూత్పూర్ 80, బాలానగర్ 47, రాజాపూర్ 45 మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాతపడ్డారు. అత్యల్పంగా నవాబ్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో 16 మంది, చిన్నచింతకుంటలో 17 మంది మృతి చెందారు. ఇష్టారాజ్యంగా నిలిపివేత.. ఉమ్మడి జిల్లాలోని అన్ని రహదారులపై నిబంధనలు అమలు కావడం లేదు. రోడ్ల వెంట ఉండే దాబాల ముందు లెక్కకు మించి భారీ వాహనా లు, కార్లు, బైకులు ఆపుతున్నారు. అక్కడే భారీ వాహనాలకు రిపేర్లు, పంక్చర్లు చేసుకోవడమే కాకుండా భోజనం వండుకుంటున్నారు. దీంతో రోడ్డుపై వెళ్లేవారికి ఇబ్బందులు తలెత్తి ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. రోడ్ల వెంట 24 గంటలు వాహనంలో తిరుగుతూ పర్యవేక్షించాల్సిన (హైవే పెట్రోలింగ్) అధికారులు, సిబ్బంది సక్రమంగా కనిపించడం లేదు. దీంతో రోడ్లపై వాహనదారులు వారికి సంబంధించిన భారీ వాహనాలను ఇష్టారాజ్యంగా నిలుపుతున్నారు. బాధ్యత లేని యంత్రాంగం జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలకు ఆర్టీఏ, పోలీస్ యంత్రాంగం, ఆర్అండ్బీ, ఎల్ఎన్టీ వారు ఎవరూ బాధ్యత తీసుకోవడం లేదు. కేవలం రోడ్డు ప్రమాదాల వారోత్సవాలు జరిగినప్పుడు మాత్రమే తూతూమంత్రంగా వ్యవహరించి ఆ తర్వాత మిన్నంకుండిపోతున్నారు. జాతీయ రహదారిపై ఎక్కడ కూడా అవసరమైనా సూచిక బోర్డులు లేకపోవడంతో రాత్రి 7 నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్య ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. జాతీయ రహదారిపై మలుపులు ఉన్న దగ్గర రేడియేషన్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.అడ్డాకుల మండల సమీపంలోని కాటవరం స్టేజీ వద్ద లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు జాతీయ రహదారిపైపెరుగుతున్న మరణాలు మూడేళ్ల వ్యవధిలో 670 మందిమృత్యువాత క్షతగాత్రులుగా మరో 1,243 మంది వాహనదారులు రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల మధ్యలోనే అత్యధిక ఘటనలు -
కబ్జాల తీరు ఇది..
● నారాయణపేట కొండారెడ్డిపల్లి చెరువుకు పట్టణం మీదుగా వెళ్లే నాలా ఇరువైపులా కబ్జాకు గురైంది. పళ్లబురుజు, పరిమళగిరి లాంటి ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపునీరు చేరుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ● కోస్గి ఎర్రగుంట చెరువు నాలా టీచర్స్ కాలనీ, విద్యానగర్‌తో, బృందావన్ కాలనీల్లో ఆక్రమణకు గురికావడంతో మూసాయినల్లి చెరువుకు వెళ్లాల్సిన నీరు పొంగి ఆయా కాలనీల్లోకి వస్తుంది. ● నారాయణపేట జిల్లాకు ముఖద్వారంగా ఉన్న మరికల్‌ను అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చింది. 37.39 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ చెరువు ఆయకట్టు 157 ఎకరాలు ఉంది. అయితే ఆనకట్ట కింద బఫర్ జోన్లో ఉన్న స్థలంలో ఇళ్లు, షెడ్లు, డబ్బాలు, ఇతర దుకాణాలను నిర్మించడంతో చెరువు నిండిన ప్రతీ సారి జాతీయ రహదారిపైకి నీరు రావడమే కాకుండా.. అక్కడ ఉన్న స్థానికుల ఇళ్లలోకి నీరుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా ధర్మన్నకుంట, కనకల్ చెరువుల అలుగు నీరు వస్తే కాలనీలు ముంపునకు గురికావాల్సిన దుస్థితి నెలకొంది. ● మక్తల్‌లో మూడు ప్రధాన చెరువులు, ఐదు నీటి కుంటలు ఉండేవి. అందులో ఐదు కుంటలు స్థిరాస్తి వ్యాపారుల చేతిలోకి వెళ్లి ఉనికిని కోల్పోయాయి. ప్రధానంగా ఎల్లమ్మకుంట ఒకప్పుడు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ఇప్పుడు అది కాలనీలా మారిపోయింది. ఫలితంగా అంబేడ్కర్ నగర్, భరత్‌నగర్, బాపూజీనగర్ ప్రజలు తరచుగా ముంపునకు గురవుతున్నాయి. మరో ప్రధాన సాగునీటి వనరైన పెద్దచెరువు ఎఫ్టీఎల్ 162.25 ఎకరాలు కాగా.. ఎఫ్టీఎల్తో పాటు బఫర్ జోన్ సైతం ఆక్రమించారు. ఈ చెరువు అలుగు జాతీయ రహదారి నుంచి ప్రవహిస్తుంది. అక్కడ ఏకంగా వాణిజ్య సముదాయమే వచ్చేసింది. మిగతా స్థలాన్ని కొందరు చదును చేస్తున్నా పట్టించుకునే వారే లేరు. దీంతో పాటు తిరుమలయ్య చెరువు మూడు సర్వేనంబర్లతో 46.18 ఎకరాల ఎఫ్టీఎల్ ఉండగా.. చెరువులో మొత్తం 30 ఎకరాల విస్తీర్ణం వరకు వెంచర్లు వెలిశాయి. ఇటీవల కురిసిన వర్షానికి చెరువు నిండటంతో.. అందులో స్థలాలు కొన్న వినియోగదారులు లబోదిబోమంటున్నారు. -
రైతులపై వివక్ష సరికాదు: బీఆర్ఎస్
మక్తల్: రైతులకు అవసరమైన ఎరువులను తక్షణమే సరఫరా చేయాలని, వివక్ష చూపితే సహించే ప్రసక్తే లేదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమమే ధ్యేయమన్న ప్రభుత్వం.. వారికి కావాల్సిన ఎరువులు సకాలంలో ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. యూరియా కొరతతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని.. చెప్పులు, పట్టాదారు పాసు పుస్తకాలను వరుస క్రమంలో పెట్టి పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి సారించడంతోనే గతంలో కంటే ఈసారి సాగు విస్తీర్ణం పెరిగిందని, ప్రస్తుత ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతోనే యూరియా కొరత నెలకొందని చెప్పారు. ఈ ప్రాంతానికి 5,800 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా.. 4,400 మె.ట. వచ్చిందని.. అందులో 3,841 మె.ట. లెక్క చెబుతుండగా, మిగతా యూరియా ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. చిట్టెం కుటుంబానికి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఉందని.. విమర్శలకు పాల్పడితే అదేస్థాయిల్లో తిరిగి సమాధానం చెప్పడం ఖాయమన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు ఇవ్వాలని.. లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ నర్సింహగౌడ్, పట్టణ అధ్యక్షుడు చిన్నహన్మంతు, రాములు, మొగులప్ప, అన్వర్, సాగర్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రంపై ఒత్తిడి..
మద్దిమడుగు వద్ద కృష్ణానదిపై బ్రిడ్జి ఆవశ్యకత గురించి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాం. కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే వంతెన, రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఇది నల్లమల ప్రజల చిరకాల ఆంకాక్ష నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణంలో చేర్చడంతో కేంద్రం పరిశీలనలో ఉంది. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట ప్రతిపాదనలు పంపించాం.. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణానదిపై మద్దిమడుగు వద్ద వంతెన అవసరం గుర్తించాం. ఇప్పటికే కొత్త జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాం. జాతీయ రహదారి– 44 నుంచి నాగర్‌కర్నూల్, అచ్చంపేట, మద్దిమడుగు మీదుగా ఏపీలోని చిరిగిరిపాడు(మాచర్ల) వరకు 165 కి.మీ., రోడ్డును ప్రతిపాదించాం. ఈ రోడ్డు మార్గంలో కృష్ణానదిపై వంతెన ఏర్పాటు ఉంది. – మల్లురవి, ఎంపీ, నాగర్‌కర్నూల్ ● -
అల్లంత దూరాన.. ఆశల వారధి
అచ్చంపేట: తెలంగాణ– ఆంధ్రప్రదేశ్‌లను కలిపే మద్దిమడుగు వంతెన నిర్మాణం ఎప్పుడెప్పుడా అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. నల్లమలలోని కృష్ణానదిపై వంతెన ఏర్పాటు దశాబ్దాలుగా పాలకులు చెబుతున్నా ఆచరణకు నోచుకోవడం లేదు. ఈ ప్రాంతం నుంచి ఎన్నికై న ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతిసారి ఎన్నికల సందర్భంగా వంతెన ఏర్పాటుపై హామీలు ఇస్తున్నారే తప్ప నెరవేర్చలేకపోతున్నారు. పదర మండలం మద్దిమడుగు సమీపంలోని కృష్ణానదిపై వంతెన నిర్మిస్తే కోస్తాంధ్ర ప్రాంతాలకు చేరువవుతుంది. నాగర్‌కర్నూల్ జిల్లా మద్దిమడుగు (కసన్రేవు)– గుంటూరు జిల్లా రామచంద్రాపురం తండా మధ్య కిలోమీటరు వంతెన నిర్మాణం చేపడితే మాచర్లకు 145 కి.మీ., దూరభారం తగ్గుతోంది. ఇందుకు సుమారు రూ.250 కోట్లు ఖర్చు అవుతుంది. మద్దిమడుగు వద్ద కృష్ణానదిపై వంతెన, జాతీయ రహదారి నిర్మాణానికి సహకరిస్తూ ప్రత్యేక చొరవ తీసుకోవాలని గతేడాది ఆగస్టులో, ఈ ఏడాది జూలై 8న అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీశైలం జలాశయం క్రస్ట్ గేట్లు ఎత్తేందుకు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో దీని ఆవశ్యకత గురించి మాట్లాడాలని గత నెలలో ఎంపీ మల్లురవికి విన్నవించారు. తగ్గనున్న దూరభారం.. జాతీయ రహదారి–44 భూత్పూర్ నుంచి నాగర్‌కర్నూల్, అచ్చంపేట, మద్దిమడుగు మీదుగా కృష్ణానదికి అవతల ఏపీ 12 కి.మీ., దూరంలోని గుంటూరు జిల్లా చిరిగిరిపాడు (మాచర్ల) వరకు 165 కి.మీ., జాతీయ రహదారి, కృష్ణానదిపై వంతెన నిర్మాణం చేపట్టాలనే అంశం తెరపైకి వచ్చింది. 2017 నుంచి ఇప్పటి వరకు పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ రహదారిని ప్రతిపాదిస్తూ కేంద్రానికి పంపించారు. అమ్రాబాద్, పదర మండలాల్లోని మద్దిమడుగు, ఇప్పలపల్లి, మారడుగు, ఉడిమిళ్ల, చిట్లంకుంట, వంకేశ్వరం, పదర తదితర గ్రామాల ప్రజలకు గుంటూరు, ప్రకాశం జిల్లాలతో సంబంధాలున్నాయి. చాలా ఏళ్ల కిందట ఆ ప్రాంతం నుంచి వచ్చిన వారు ఇక్కడ స్థిరపడ్డారు. అచ్చంపేట, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల మధ్య కృష్ణానది ప్రవహిస్తుండటంతో అచ్చంపేట, దేవరకొండ, కొండమల్లెపల్లి, నాగార్జునసాగర్ మీదుగా మాచర్ల 193 కి.మీ., ప్రయాణించాల్సి ఉంది. మద్దిమడుగు సమీపంలో వంతెన నిర్మాణం చేపడితే మాచర్ల 48 కి.మీ., దూరం మాత్రమే ఉంటుంది. ఫలితంగా 145 కి.మీ., దూరభారం తగ్గడంతోపాటు కోస్తా– తెలంగాణ ప్రాంతాల మధ్య వ్యాపార సంబంధాలు మెరుగుపడుతాయి. విజయవాడ, గుంటూరు జిల్లాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏర్పాటు కావడంతో ఈ వంతెన ఏర్పాటుతో తెలంగాణ ప్రాంతం రాజధానికి అతి సమీపంలో ఉండటం, మాచర్ల, కారంపూడి, దాచేపల్లి, గురజాల, దుర్గి, గుంటూరు, విజయవాడ, అమరావతి ప్రాంతాల నుంచి కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది. ప్రమాదకర ప్రయాణం.. పదర మండలం మద్దిమడుగు నుంచి కృష్ణానది వరకు బండ్ల మార్గం మాత్రమే ఉంది. మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు ఏపీ ప్రజలతోపాటు తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, కోదాడ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ ప్రాంతాల ప్ర జలు వస్తుంటారు. మాచర్ల, మద్దిమడు గు, ఇప్పలపల్లి, మారడుగు గ్రామాల ప్ర జలు కాలి నడకన కృష్ణానది వరకు చేరుకొని అక్కడి నుంచి బుట్టల ద్వారా అవ తలి ఒడ్డుకు చేరుకుంటారు. నిత్యం పశువుల వ్యాపారులు గొర్రెలు, పశువులను ప్రైవేట్ లాంచీల సాయంతో కృష్ణానదిలో ప్రమాదకరంగా దాటిస్తున్నారు. రెండు రాష్ట్రాల ప్రజలకు అవసరమై రోడ్డును ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. 2006లో మద్దిమడుగు నుంచి ప్రకాశం జిల్లాలోని కృష్ణానది ఒడ్డున ఉన్న అలాటంపెంట వరకు రోడ్డు నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం రూ.3.20 కోట్లు మంజూరు చేసింది. అప్పట్లో పర్యావరణ, అటవీశాఖ అనుమతి లభించకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుంటే ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని వంతెన, రోడ్డు నిర్మాణం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఎన్నికల హామీగా మారిన కృష్ణానదిపై వంతెన నిర్మాణం మూడు దశాబ్దాలకుపైగా తప్పని ఎదురుచూపులు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తగ్గనున్న 145 కి.మీ., దూరభారం అందుబాటులోకి వస్తే వ్యాపారాలు, అభివృద్ధికి దోహదం జాతీయ రహదారి ఏర్పాటుతోనైనా మోక్షం కలిగేనా? -
పేటకు చేరిన బైక్ యాత్ర
నారాయణపేట రూరల్: గిన్నిస్ బుక్‌లో చోటు కోసం ఓ వ్యక్తి బైక్‌యాత్ర చేస్తూ ఆదివారం జిల్లాకేంద్రానికి చేరుకున్నారు. కర్ణాటకలోని బెంగళూర్‌కు చెందిన దివాకర్‌రెడ్డి దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు సుమారు 806 జిల్లాల మీదుగా రెండేళ్ల పాటు రెండు లక్షల కిలోమీటర్ల యాత్రకు సిద్దపడ్డాడు. 2023, నవంబర్ 1న బెంగుళూర్లో ప్రారంభమైన యాత్ర ఉత్తర భారతంలో 657 రోజుల్లో 18 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా 88 వేల కిలోమీటర్లు ప్రయాణించి ఆదివారం రాత్రి జిల్లాకేంద్రానికి చేరుకున్నారు. ఒకే దేశంలో అత్యధిక దూరం ప్రయాణించిన వ్యక్తిగా చరిత్ర సృష్టించి గిన్నిస్ రికార్డు పొందాలన్నది తన ఆశయంగా చెప్పుకొచ్చారు. -
గంగమ్మ ఒడికి గణనాథుడు
కోస్గి: శివాజీ చౌరస్తాలో శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ, హిందూ ఉత్సవసమితి, పలు హైందవ సంఘాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనం ఆదివారం నిర్వహించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ ప్రజలకు సందేశమిచ్చేలా వినాయకుడిని ఏటా ఏర్పాటుచేయడం ఆనవాయితి. ఈసారి స్వదేశీ వస్తువులు మాత్రమే వినియోగిద్దామంటూ మట్టి గణనాథుడిని ప్రతిష్టించారు. ఊరేగింపులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కళాకారుల నృత్యంతో పాటు బహుబలి, హనుమాన్, మహావతార్ నరసింహ, అఘోరా 2.0 ప్రదర్శనలతో ప్రత్యేకత చాటుకుంది. నిమజ్జన వేడుకను చూసేందుకు పట్టణ ప్రజలతో పాటు మండలంలోని పలు గ్రామాల ప్రజలు తరలివచ్చారు. పోలీసు బందోబస్తును సీఐ సైదులు పర్యవేక్షించారు. శోభాయాత్ర రూట్ మ్యాప్‌ను ఎస్ఐ బాలరాజుతో కలిసి పరిశీలించారు. దండం చెరువులో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. -
చెరువులకు జలకళ
–8లో uనారాయణపేట: జిల్లావ్యాప్తంగా ఆగస్టులో కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జూనన్లో వరణుడు కరుణించకపోవడంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. జూలైలో అంతంత మాత్రంగానే కురిశాయి. ఈ రెండు నెలల్లో కురిసిన వర్షాలకు జిల్లావ్యాప్తంగా ఉన్న 769 చెరువుల్లో ఒక్కటి కూడా మత్తడి దూకలేదు. కానీ ఆగస్టులో కురిసిన వర్షాలతో 360 చెరువులు నిండి అలుగు పారాయి. జిల్లాలోని సంగంబండ రిజర్వాయర్ నిండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. భూత్పూర్ రిజర్వాయర్ నిండుకుండను తలపిస్తోంది. కృష్ణమ్మ పరవళ్లతో నది పరీవాహక ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆనందం.. ఆందోళన... ఆగస్టు మొదటి వారంలో కురిసిన వర్షాలకు పత్తి రైతులు ఊపిరి పీల్చుకున్నారు. అదే నెల 15 తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు పత్తి, కంది ఇతర మెట్టపంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు వరి సాగు చేసిన రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. జూన్‌లో లోటు.. ఆగస్టులో అత్యధిక వర్షపాతం నమోదు జిల్లావ్యాప్తంగా అలుగుపారిన360 చెరువులు 8 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు పెరిగిన సాగు విస్తీర్ణం -
యూరియా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు
మరికల్: యూరియా పంపిణీ చేసే కేంద్రాల వద్ద ఎలాంటి ఆటంకాలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ సిబ్బందికి సూచించారు. మరికల్ మండలం తీలేర్ సొసైటీ వద్ద జరిగిన ఘటన నేపథ్యంలో ఎస్పీ అక్కడికి చేరుకొని రైతులతో, యూరియా నిల్వలపై ఏఓ రహ్మన్‌తో వేర్వేరుగా ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. ఉదయం నుంచి యూరియా కోసం అధిక సంఖ్యలో రైతులు వచ్చారని, ఇక్కడే జాతీయ రహదారి ఉండటంతో రోడ్డుపై క్యూలో ఉన్న రైతులకు ప్రమాదం జరగకుండా స్థానిక ఎస్ఐ టోకెన్లు ఇస్తుండగా ఆయనపైకి రైతులు గుమిగూడి వచ్చారన్నారు. ఈక్రమంలో పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండేందుకు ఓ రైతుపై చెయ్యి లేపాడని, ఈ విషయంపై బాధిత రైతు కూడా తనతో మాట్లాడటం జరిగిందన్నారు. తీలేర్ సొసైటీలో యూరియా లేదని పుకార్లు రావడంతో రైతులు అధికసంఖ్యలో యూరియా కోసం వచ్చారని, ఈక్రమంలోనే తోపులాట జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా యూరియా పంపిణీ చేసే కేంద్రాల వద్ద ముందు జాగ్రత్త చర్యలు కింద పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేయాలని సూచించారు. ఈ విషయంపై కలెక్టర్‌తో కూడా చర్చించామన్నారు. జరిగిన ఘటనపై ఎస్ఐపై విచారణ జరిపి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. -
అనుమానాలెన్నో..?
వాతావరణం రోజంతా ఆకాశం మేఘావృతమైఉంటుంది. మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి బండ్రవల్లికి చెందిన రైతు రాములు. ఇతను కోయిల్‌సాగర్ ఆయకట్టు కింద పది ఎకరాల్లో వరి సాగు చేశాడు. 25 బస్తాల యూరియా అవసరం ఉండగా.. తీలేరు సొసైటీకి ఇప్పటివరకు ఆరుసార్లు వచ్చాడు. కానీ, టోకెన్ మాత్రం దొరకలేదు. ఈక్రమంలో యూరియా అయిపోయిందంటూ చెబుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి తమకు యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరాడు. నారాయణపేట: రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. గంటల తరబడి నిరీక్షిస్తు న్నా.. యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పీఏసీఎస్‌ల వద్ద పడిగాపులు గాసిన క్యూలో వారి లైన్ వచ్చేసరికి యూరియా దొరకకా వెనుదిరుగాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. యూరియా వచ్చిందనే తెలిస్తే చాలు రైతులు ఒక్కసారిగా అగ్రోస్, పీఏసీఎస్‌ల వద్దకు పరుగులు తీస్తున్నారు. రోజుల తరబడి ఎండనకా.. వాననకా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొనగా.. కొన్ని చోట్ల ఆగ్రహం కట్టలు తెంచుకొని రైతులు ఆందోళనకు దిగుతున్నారు. సరిహద్దు మండలాల నుంచి నారాయణపేట, మక్తల్, ఊట్కూర్, మాగనూర్, క్రిష్ణ, దామరగిద్ద, మద్దూర్ మండలాలు కర్ణాటకకు సరిహద్దుల్లో ఉన్నాయి. ఇటు తెలంగాణ, ఆటు కర్ణాటక రాష్ట్రాల్లో ఎరువుల ధరల్లో వ్యత్యాసం ఉండడంతో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటూ అక్రమ రవాణా జరగుతుండటం ఈ ప్రాంతంలో పరిపాటే. ధరల్లో వ్యత్యాసం కారణంగా కర్ణాటకకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న ఘటనలున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు మండలాల్లో సాగు విస్తీర్ణం పెరగకపోయినా యూరియా విక్రయాలు అధికంగా కావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు తప్పని నిరీక్షణ జిల్లాలోని పీఏసీఎస్‌కు యూరియా వచ్చిందంటే చాలు తెల్లారేసరికి రైతులు తమ పట్టా పాసుపుస్తకాలను పట్టుకొని క్యూలో గంటల తరబడి నిల్చుంటున్నారు. ఓ వైపు యూరియా అవసరమైన మేర ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నా.. మరో వైపు యూరియా కోసం రైతులు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. ఒకానొక సమయంలో అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగుతున్నారు. 4 లక్షల ఎకరాల్లో పంటల సాగు జిల్లాలో వానాకాలం సీజన్లో వివిధ పంటలు 4 లక్షల ఎకరాలు సాగు అయ్యాయని అధికారులు చెబుతున్నారు. అందులో 1.76 లక్షల ఎకరాలు వరి, 70 వేల ఎకరాలు కంది, 1.80 లక్షల ఎకరాల పత్తి, మిగతా పంటలు మరో 15 వేలు ఉండొచ్చు. ఈసారి మొత్తం 10 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముందని ముందుగా వ్యవసాయ శాఖ అంచనా వేసినప్పటికీ.. అంతకు మించి 15,031 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ కావడం గమనార్హం. జూరాలకు పెరుగుతున్న వరద జూరాల జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద శనివారం 2.10 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. –8లో u5వేల మె.టన్నులుఅధికంగా విక్రయాలు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న మండలాల్లో యూరియా విక్రయాలు ఈ సీజనులో గణనీయంగా పెరగడంతో వ్యవసాయ శాఖ అధికారుల్లో పలు అనుమానాలకు తావిస్తోంది. గతేడాది వానాకాలం సీజనుతో పోలిస్తే ఈ ఏడాది 5 వేల మెట్రిక్ టన్నులు అధికంగా విక్రయాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం ఏమైనా రెట్టింపు అయ్యిందంటే కాలేదు. వరి సాగు మాత్రం ఈ ఏడాది 10 వేల ఎకరాలకు అధికంగా అయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. మిగతా పంటలు గతేడాది స్థాయిలో సాగు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. యూరియా విక్రయాలుగణనీయంగా పెరగడంపై సందిగ్ధం జిల్లాకు అంచనా 10వేల మెట్రిక్ టన్నులు.. ఇప్పటివరకు పంపిణీ చేసింది 15,060 మెట్రిక్ టన్నులు సరిపడా యూరియా దొరక్క రైతుల అవస్థలు సరిహద్దు రాష్ట్రం కర్ణాటకకు అక్రమంగా తరలిస్తుండగా ఇటీవల పట్టివేత -
అక్రమ అరెస్టులనుఖండిస్తున్నాం
భూనిర్వాసితులు న్యాయమైన డిమాండ్‌తో ప్రభుత్వం తమకు పరిహారాన్ని పెంచాల ని కోరుతున్నారు. ప్ర భుత్వం ఓవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు భూసర్వేలు చేయడం సరికాదు. ఎకరాకు రూ.35 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇచ్చేంత వరకు భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతూనే ఉంటాం. – వెంకట్రామరెడ్డి, భూ నిర్వాసితుల సంఘం గౌరవ అధ్యక్షుడు 14 ఎకరాలు కోల్పోతున్నాం.. మా తాతల నాటి నుంచి ఈ భూమినే నమ్ముకొని బతుకుతున్నాం. సర్వే నంబర్ 355లో మాకు 14 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో వ్యవసాయంతో పాటు ఆయిల్‌పాం, కాస్మోటిక్ ఆయిల్ మిషన్, గేదెల షెడ్డు ఉన్నాయి. మార్కెట్ విలువ ప్రకారం ఎకరాలకు రూ.35 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం స్పష్టమైన హామీతో పరిహారం ఇస్తేగానీ భూములను వదులుకోలేం. – శ్రీనివాస్‌రెడ్డి, భూ నిర్వాసిత రైతు. కాన్కుర్తి భూమి పోతే బతుకుకష్టమౌతుంది.. ఉన్న ఎకరన్నర భూమి ని కోల్పోతే.. బతకడం కష్టమవుతుంది. మాది నిరుపేద కుటుంబం, భూమిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వం మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇస్తే చాలనుకున్నాం. ప్రాణాలైనా వదులకుంటాం.. కానీ భూమి వదలం. – భీమప్ప, భూ నిర్వాసిత రైతు, కాన్కుర్తి ● -
పల్లెగడ్డ ప్రజలు అధైర్యపడొద్దు
మరికల్: మండలంలోని పల్లెగడ్డ ప్రజలకు అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పల్లెగడ్డ గ్రామాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. గ్రామ ప్రజలు దేవాదాయ శాఖ భూమిలో ఇండ్లు నిర్మించుకున్నారని వాటిని వెంటనే తొలగించాలంటూ దేవాదాయశాఖ వారు కోర్టు నుంచి ఉత్తర్వులు పంపించడాన్ని ఖండించారు. వంద ఏళ్ల క్రితమే వారు ఇక్కడ ఇండ్లు నిర్మించుకున్నారని ప్రభుత్వానికి విద్యుత్ బిల్లులు, పంచాయతీకి పన్నులు కడుతున్న వారికి ఎలా నోటీసులు జారీ చేస్తారని ప్రశ్నించారు. కోర్టు నుంచి నోటీసులు వస్తే సొంతంగా లాయర్‌ను ఏర్పాటు చేసి పల్లెగడ్డ గ్రామస్తులకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తానన్నారు. గ్రామంలో ఇళ్లతోపాటు పాఠశాల గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా నిర్మించారని, ప్రభుత్వ ఆస్తులను కూడా కూల్చివేస్తారా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సురేఖరెడ్డి, నాయకులు తిరుపతయ్య, రాజవర్దన్‌రెడ్డి, సంపత్‌కుమార్, కృష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా ఆస్పత్రిలో సిటీ స్కాన్ సేవలు ప్రారంభం
నారాయణపేట: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ సేవలను శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇకపై సిటీ స్కాన్ కోసం మహబూబ్‌నగర్, హైదరాబాద్ నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా ఆస్పత్రిలో సిటి స్కాన్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎమ్మెల్యేతో పాటు మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు.ప్రతి గణేశ్ మండపానికి జియో ట్యాగ్నారాయణపేట క్రైమ్: జిల్లాలో మొత్తం 1485 గణేష్ మండపాలకు జియోట్యాగ్ చేయడం జరిగిందని, ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే డయల్ 100, పోలీస్ కంట్రోల్‌రూం నం.8712670399 కి సమాచారం ఇవ్వాలని ఎస్పీ యోగేష్‌గౌతమ్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటుచేసి వినాయకుడికి ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఉత్సవాలను సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ యండీ రియాజ్ హుల్ హక్, సీఐ శివ శంకర్,ఆర్ఐ నరసింహ,ఎస్ఐలు వెంకటేశ్వర్లు,నరేశ్,ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్,ఎస్బి,డీసిఆర్బి, డిపివో, స్టాప్ పాల్గోన్నారు.రాష్ట్రంలోనే అతిచిన్న జీపీ.. శంకరాయపల్లి తండా● గ్రామంలో 66మంది ఓటర్లు మాత్రమేజడ్చర్ల టౌన్: గ్రామపంచాయతీ వార్డుల వారీగా అధికారులు ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే జడ్చర్ల మండలంలోని శంకరాయపల్లి తండా పంచాయతీలో కేవలం 66 మంది ఓటర్లు మాత్రమే ఉండటం గమనార్హం. 2016–17లో శంకరాయపల్లి తండాను ప్రభుత్వం గ్రామపంచాయతీగా మార్చి అనుబంధ గ్రామంగా శంకరాయపల్లిని చేర్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో శంకరాయపల్లి తండాను జడ్చర్ల మున్సిపాలిటీలో విలీనం చేశారు. శంకరాయపల్లి మాత్రం శంకరాయపల్లి తండా జీపీ పేరుతోనే కొనసాగుతోంది. విభజన సమయంలో పక్కనే ఉన్న బండమీదిపల్లిలో శంకరాయపల్లిని విలీనం చేసి ఉంటే సమస్య వచ్చేది కాదు. ప్రస్తుతం అధికారులు విడుదల చేసిన ముసాయిదా జాబితాలో 66మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. దీంతో రాష్ట్రంలోనే అతి చిన్న పంచాయతీగా రికార్డుకెక్కింది. గ్రామంలో మొత్తం 14ఇళ్లు ఉండగా.. 90మంది జనాభా ఉంది. 8 వార్డులు ఉన్నాయి. ఒక్కో వార్డులో 8మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా యాదవ కులానికి చెందిన వారే కావడం విశేషం. -
కళాశాలలో ఏసీబీ బృందం తనిఖీలు
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని సింగారం చౌరస్తా సమీపంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో శుక్రవారం ఉదయం 6.40 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఏసీబీ అధికారుల బృందం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టింది. తూనికలు కొలతలు, శానిటేషన్, ఫెడ్ ఇన్స్పెక్టర్, అడిట్ అధికారులతో కలిసి ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ తనిఖీలు చేపట్టడంతో గురుకుల పాఠశాల సిబ్బంది, అధ్యాపకులు, ఉపాధ్యాయుల్లో ఒకింత ఆందోళన కానవచ్చింది. ఎక్కడైనా తప్పిదం జరిగినట్లు ఏసీబీ అధికారుల దృష్టికి వస్తే ఎవరిపై వేటు పడుతుందోనని భయంతో కనిపించారు. ఉదయం 6.40 గంటలకు చేరుకున్న ఏసీబీ బృందం విద్యార్థులతో మాట్లాడారు. రోజు వారి మెనూ ప్రకారం భోజనం వడ్డిస్తున్నారా, తరగతిగదులు తదితర వసతులపై ఆరా తీశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏసీబీ బృందానికి వివరించారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గురుకుల పాఠశాల, కళాశాలలో నిర్వహించిన తనిఖీల్లో తమ దృష్టికి వచ్చిన వాటిని ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. తనతో పాటు వచ్చిన వివిధ విభాగాల అధికారుల బృందం పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టిందన్నారు. ఆయా శాఖల అధికారుల నివేదికలను ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందన్నారు. ఏసీబీ డీఎస్పీతో పాటు ఎస్ఐలు జిలానీ, లింగస్వామి, సినియర్ అడిటర్ వెంకట్రాములు, శానిటరీ ఇన్స్పేక్టర్ శ్రీనివాస్‌జీ ఉన్నారు. -
భూమినే నమ్ముకొని బతుకుతున్నాం..
నారాయణపేట/దామరగిద్ద: భూమినే నమ్ముకొని బతుకుతున్న తమకు న్యాయమైన పరిహారంపై ప్రభుత్వం హామీ ఇవ్వకుండా రైతుల జీవితాలతో చలగాటం అడుతుందని, న్యాయమైన పరిహారం ఇచ్చే వరకు భూములను మాత్రం వదలబోమని భూ నిర్వాసిత రైతులు తేల్చిచెప్పారు. శుక్రవారం పేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో కాన్కుర్తి రెవెన్యూ పరిదిలో సర్వేకు వచ్చిన అధికారులను నిర్వాసితులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. పోలీసు బందోబస్తుతో ఆర్డీఓ సమక్షంలో తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది సర్వే చేపట్టేందుకు రాగా రైతులు సర్వే అధికారులను అడ్డుకుంటూ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఆర్డీఓ, అదనపు కలెక్టర్ సమదాయించినా ససేమిరా అనడంతో అధికారులు, పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు. కాన్కుర్తి, గడిమున్కన్పల్లి, మల్రెడ్డిపల్లి గ్రామాల భూ నిర్వాసిత రైతులు, పాల్గొన్నారు. నిర్వాసితుల అరెస్టును నిరసిస్తూ ఆందోళన నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం భూనిర్వాసితుల సంఘం నాయకులను అరెస్టును నిరసిస్తూ రైతులు ఆందోళనకు పూనుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున భూనిర్వాసితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ,జిల్లా నాయకులు గోపాల్, బండమీది బలరాం, అంజిలయ్య గౌడ్, మహేష్ కుమార్‌గౌడ్, జోషి, రామకృష్ణను బలవంతంగా అరెస్టు చేసి ధన్వాడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న భూ నిర్వాసితులు అరెస్టులను ఖండిస్తూ ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. హేయమైన చర్య న్యాయమైన పరిహారం ఇవ్వాలని 44 రోజులకు పైగా ఆందోళన చేస్తున్నా సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడడం హేయమైన చర్య అని భూనిర్వాసితుల సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు దగ్గర భూ నిర్వాసితులుచేపట్టిన రిలే దీక్ష శిబిరంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం తెల్లవారుజామునే పోలీసుల చేత ప్రభుత్వం అరెస్టులకు పాల్పడడం దారుణం అన్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే అది మరింత ఉవ్వెత్తున లేస్తదని హెచ్చరించారు. పరిహారం పెంపుపై స్పష్టత ఇవ్వాలి ‘పేట – కోస్గి’ ఎత్తిపోతల భూ సర్వేను అడ్డుకున్న రైతులు అక్రమ అరెస్టులకు నిరనసగా ఆందోళన -
సీఎం ఇలాకాలోభూసేకరణం!
సర్వే చేసేందుకు వచ్చిన అధికారి కాళ్లు మొక్కుతున్న రైతుసాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతల పథకానికి గ్రహణం వీడడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్ట్‌కు రూపకల్పన జరిగినా.. అప్పుడు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనూ అనేక అవాంతరాలతో అడుగు ముందుకు పడలేదు. ఎట్టకేలకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. ఈ పథకం అమలుకు కృషి చేసిన ఉమ్మడి పాలమూరుకు చెందిన రేవంత్‌రెడ్డి సీఎం కావడంతో ఈ ఎత్తిపోతలు మళ్లీ పురుడు పోసుకున్నాయి. అయితే.. పరిహారం పెంచాలనే డిమాండ్‌తో భూ నిర్వాసితులు చేపట్టిన ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎత్తిపోతలకు అడ్డంకులు.. భూసేకరణలో ప్రగతిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. ఉమ్మడి ఏపీలో రూపకల్పన.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని నారాయణపేట, మక్తల్‌తో పాటు కొడంగల్ (ప్రస్తుతం వికారాబాద్ జిల్లా) నియోజకవర్గ పరిధిలో 1.05 లక్షల ఎకరాలకు సాగు నీరు.. 5.50 లక్షల జనాభాకు తాగు నీరందించాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. రూ.1,450 కోట్ల అంచనా వ్యయంతో 2014లో జీఓ 69తో పరిపాలన అనుమతులు జారీ చేశారు. రూ.133 కోట్ల నిధులు విడుదల చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అప్పటికే నిర్మించిన రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకానికి కేటాయించిన నికర జలాలను ఈ ఎత్తిపోతలకు వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. డిజైన్‌లో మార్పు.. అయినా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాగా.. జీఓ 69 అమలు కోసం రైతులు, మేధావులు, ప్రతిపక్షాలు, జలసాధన సమితి నేతలు ఉద్యమాలు చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం ఈ పథకం డిజైన్ మార్చింది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ ద్వారా నారాయణపేట, కొడంగల్ సెగ్మెంట్లలో 1.80 లక్షల ఎకరాలకు సాగు నీరందేలా ప్రణాళికలు రూపొందించినా.. అమలుకు నోచుకోలేదు. ఎట్టకేలకు గత ఏడాది శంకుస్థాపన.. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. పాత డిజైన్ ప్రకారం కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతలకు మళ్లీ అడుగు పడింది. రూ.4,369 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 21న అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి కోస్గిలో నిర్వహించిన బహిరంగసభలో ప్రకటించడంతో పాటు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు జూరాల బ్యాక్ వాటర్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతలకు వినియోగించనున్నారు. 350 మంది రైతులకు పరిహారం అందజేత.. తొలి రెండు ప్యాకేజీల పనుల కోసం నారాయణపేట జిల్లాలోని మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1,957 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ఏడాది జూన్‌లో సేకరణ చేపట్టగా.. ఇప్పటివరకు కేవలం 590 ఎకరాల్లో మాత్రమే సర్వే పూర్తయింది. 134 ఎకరాలకు సంబంధించి అధికారులు 350 మంది రైతులకు ఎకరాకు రూ.14 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. 2 ప్యాకేజీలుగా పనులు.. ఎత్తిపోతల్లో భాగంగా నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని భూత్పూర్ నుంచి కానుకుర్తి చెరువు వరకు రెండు ప్యాకేజీల్లో అప్రోచ్ కాల్వలు, పంప్‌హౌస్‌లు, ప్రెషర్ మెయిన్లు, లీడ్ చానెల్, డెలివరీ సిస్టర్న్లతోపాటు సివిల్, ఎలక్ట్రిక్ పనులు చేపట్టనున్నారు. మొదటి ప్యాకేజీకి రూ.1,134.62 కోట్లు, రెండో ప్యాకేజీకి రూ.1,126.23 కోట్లు.. మొత్తం రూ.2,260.85 కోట్లు కేటాయించారు. మొత్తంగా 207 మెగావాట్ల సామర్థ్యం గల ఏడు పంప్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా.. 2026 ఆగస్ట్ నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. మలి దశలో కానుకుర్తి నుంచి కొడంగల్ నియోజవర్గ పరిధిలోని బొంరాస్‌పేట మండలంలోని చెరువు వరకు నీటిని తరలించనున్నారు. దీనికి టెండర్లు పిలవాల్సి ఉంది. -
ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
నారాయణపేట: జిల్లాలో ఎరువులను అధిక ధరలకు విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించినా చర్యలు తప్పవని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎరువుల డీలర్లతో సమావేశమయ్యారు. ఇప్పటికే జిల్లాలో 80 శాతం ఎరువుల విక్రయాలు సాఫీగా సాగాయని, మరో పక్షం రోజుల పాటు కొనసాగే 20 శాతం ఎరువుల విక్రయాలు అలాగే ఉండాలన్నారు. ఎరువులు తప్పని సరిగా ఈ – పాస్ యంత్రం ద్వారానే అమ్మాలని, ఎరువులు రైతులందరికి అందుబాటులో ఉండేటట్లు చూడాలని, ఒకే రైతుకు ఎక్కువ మొత్తంలో అమ్మరాదని ఆదేశించారు. డీఎస్పీ నల్లపు లింగయ్య మాట్లాడుతూ.. డీలర్లు ఉన్న స్టాక్ ను సక్రమంగా విక్రయించాలని, ఇటీవల జిలాల్‌పూర్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 34 బస్తాల యూరియాను పట్టుకుని కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. సమావేశంలో డీఏఓ జాన్ సుధాకర్, ఏఓలు, ఏఈవోలు పాల్గొన్నారు. జిల్లా సర్వే నివేదిక కమిటీ ఏర్పాటు జిల్లా సర్వే నివేదిక కమిటీని కలెక్టర్ సిక్తా పట్నా యక్ ఏర్పాటు చేశారు. ఆయా శాఖల అధికారులు పూర్తి సమాచారాన్ని నిర్ణీత గడువులోగా సమర్పించాలని ఆమె ఆదేశించారు. ఆ సమాచారాన్ని క్రోడీకరించి జిల్లా సర్వే నివేదికను రాష్ట్ర కాలుష్య మండలికి అందజేయాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలి జిల్లాకు చెందిన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి జిల్లాకు పేరు తీసుకురావాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ స్థాయిలో ప్రతిభచాటిన 52 మంది జిల్లా క్రీడాకారులను కలెక్టర్ శాలువా, మెమెంటోతో సన్మానించారు. ముందుగా కలెక్టరేట్లో ధ్యాన్ చంద్ చిత్రపటానికి అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పూల మాల వేసి నివాళులర్పించగా.. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జిల్లాకు చెందిన విద్యార్థులు వివిధ క్రీడా పోటీలలో పాల్గొని జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి వెండి, బంగారు పతకాలు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని, ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకొని అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటాలన్నారు. ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, డీవైఎస్ఓ వెంకటేష్ మాట్లాడారు. కార్యక్రమంలో పీజికల్ డైరెక్టర్లు సాయినాథ్, వెంకటప్ప, అనంతసేన,నరసింహులు రవికుమార్, స్వప్న, సౌమ్య, కోచ్‌లు రఘు, శ్రీనివాస్, హారిక, క్రీడాకారులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
మద్దూరు: విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. గురువారం మద్దూరు బాలికల గురుకుల పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు విద్యార్థులతో మాట్లా డి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోని ఆర్ఓ ప్లాంట్‌ను అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యా హ్న భోజనం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పెదిరిపాడ్ రోడ్డులో ఉన్న విద్యార్థుల వసతిగృహాన్ని ఇక్కడికే మార్చాలని అధికారులకు సూ చించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, ఎంపీడీఓ రహ్మతుద్దీన్ ఉన్నారు.నష్టపరిహారం చెల్లించండినారాయణపేట టౌన్: జిల్లాలోని పెద్ద చింతకుంట నుంచి గుడెబల్లూర్ వరకు చేపట్టిన భారత్‌మాల రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వాసిత రైతులు మాట్లాడుతూ.. భారత్‌మాల రోడ్డు కోసం ఐదేళ్ల క్రితం 19 గ్రామాల్లో సర్వే చేపట్టారని, ఇప్పటి వరకు 10శాతం మందికి కూడా నష్టపరిహారం చెల్లించలేదని తెలిపారు. భూ నిర్వాసితులకు వారం రోజుల్లో నష్టపరిహారం చెల్లించాలని.. లేనిచో జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గణేశ్, విజయ్, మారుతి, రంగారెడ్డి, శీను, శివకుమార్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.22 నుంచి ‘ఓపెన్’ పరీక్షలుమహబూబ్నగర్ ఎడ్యుకేషన్: వచ్చే నెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ ప్రవీణ్‌కుమార్, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ శివయ్య ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ సబ్జెక్టుల వారీగా తేదీల టైం టేబుల్ ఆన్లైన్లో అందుబాటులో ఉందని, విద్యార్థులు పరీక్షలకు సిద్దం కావాలన సూచించారు. ఉదయం సెషన్లో టెన్త్, మధ్యాహ్నం ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
వసతులున్నా.. ఆటలు అంతంతే..!
మహబూబ్‌నగర్ క్రీడలు: ఉమ్మడి జిల్లాలో క్రీడారంగాన్ని కోచ్‌ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అన్ని జిల్లాల్లో మైదానాలు ఉన్నప్పటికీ కోచ్‌లు లేకపోవడంతో ఔత్సాహిక క్రీడాకారులు శిక్షణకు దూరమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొందరు పీఈటీలు, సీనియర్ క్రీడాకారులు తమకున్న ఆసక్తితో క్రీడాకారులకు స్వచ్ఛందంగా శిక్షణనిస్తున్నారు. కాని కోచ్‌లు లేకపోవడంతో చాలా క్రీడల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు వెనుకబడుతున్నారు. ● మహబూబ్‌నగర్‌లోని ప్రధాన స్టేడియం ఉమ్మడి జిల్లాకే తలమానికం. ఇంత గతంలో కోచ్‌లతో కళకళలాడిన ఈ స్టేడియం ప్రస్తుతం నలుగురు కోచ్‌లతోనే నెట్టుకొస్తున్నారు. 18 ఏళ్లుగా కోచ్‌ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కేవలం అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, స్విమ్మింగ్ కోచ్‌లు మాత్రమే ఉన్నారు. వేసవి సెలవుల్లో స్విమ్మింగ్ కోచ్ శిక్షణ ఇస్తారు. ఖేలో ఇండియా ఫుట్‌బాల్ కోచ్ ఉండగా ఇండోర్ స్టేడియంలో పే అండ్ ప్లే పద్ధతిలో బ్యా డ్మింటన్ కోచ్ మాత్రమే ఉన్నారు. మిగతా క్రీడలకు శిక్షకులు లేకపోవడంతో ఔత్సాహిక క్రీడాకారులు నిరాశకు గురవుతున్నారు. కబడ్డీ, హాకీ, ఖో–ఖో, హ్యాండ్‌బాల్, ఇండోర్‌లో బాక్సింగ్, జూడో, టేబుల్ టెన్నీస్ తదితర క్రీడలకు కోచ్‌ల అవసరం ఉంది. ● 2007 నుంచి స్టేడియంలలో శాశ్వత పద్ధతిన కోచ్‌ల నియామకం చేపట్టలేదు. ఇప్పుడున్న కోచ్‌లు కూడా తాత్కాలిక పద్ధతిన పని చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా యువజన, క్రీడాశాఖ పరిధిలో జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంతో పాటు మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ఎంవీఎస్ కళాశాలలోని ఇండోర్ స్టేడియం, జడ్చర్లలోని మినీ స్టేడియం, సీసీకుంట అల్లీపూర్, భూత్పూర్ మండలం పోతులమడుగులో మినీ ఇండోర్ స్టేడియంలు ఉన్నాయి. మెయిన్ స్టేడియంలో ఐదుగురు, అల్లీపూర్లో కబడ్డీ కోచ్ మాత్రమే ఉన్నారు. ● వనపర్తిలో ఒక క్రీడా ప్రాంగణం, మరో ఇండోర్ స్టేడియం ఉండగా ఒక్క కోచ్ కూడా లేరు. హాకీ అకాడమీలో ఇద్దరు కోచ్‌లు ఉన్నారు. ● నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, అచ్చంపేటలో మినీ స్టేడియంలు, కల్వకుర్తిలో ఇండోర్ స్టేడి యం ఉన్నాయి. కొల్లాపూర్‌కు ఇటీవల అథ్లెటిక్స్ కోచ్ రాగా కల్వకుర్తిలో ఫుట్‌బాల్ కోచ్, ఖేలో ఇండియా కబడ్డీ కోచ్ ఉన్నారు. ● నారాయణపేట జిల్లా మక్తల్‌లో స్టేడియం ఉండ గా ఒక్క కోచ్ లేరు. ధన్వాడలో ఒక రెజ్లింగ్ కోచ్, నారాయణపేటలో ఖేలో ఇండియా అథ్లెటిక్స్ కోచ్ ఉన్నారు. ● గద్వాలలో స్టేడియం, ఇండోర్ స్టేడియం, ఎర్రవల్లి చౌరస్తాలో ఇండోర్ స్టేడియం ఉన్నాయి. గద్వాలలో ఖేలో ఇండియా ఫుట్‌బాల్ కోచ్ మాత్రమే ఉన్నారు. అయితే ఉమ్మడి జిల్లాలోని చాలా మైదానాల్లో వాచ్మెన్లు కూడా లేని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో క్రీడా శిక్షకులు కరువు కోచ్‌లు లేక వెలవెలబోతున్న మైదానాలు కొత్త క్రీడాపాలసీలో శిక్షకుల నియామకాలపై ఆశలు -
పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలి
నారాయణపేట క్రైం: జిల్లా ప్రజలు కులమతాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. గణేశ్ నవరాత్రులు, మిలాద్ ఉన్ నబీ వేడుకలను పురస్కరించుకొని గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. జిల్లా కేంద్రంలో వచ్చేనెల 5, 6 తేదీల్లో గణేశ్ శోభాయాత్ర, 8న మిలాద్ ఉన్ నబీ ర్యాలీ నిర్వహించేందుకు మతపెద్దలు నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. ఉత్సవాల సందర్భంగా పకడ్బందీగా పోలీసు బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవడంతో పాటు పూర్తిస్థాయిలో నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా అల్లర్లు సృష్టించాలని చూస్తే ఉపేక్షించేది లేదని.. వారు ఎంతటి వారైనా చట్టప్రకారం చర్యలు హెచ్చరించారు. శోభాయాత్ర సమయంలో ఇరువర్గాల మతపెద్దలు, పోలీసుల సమక్షంలో జెండాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలో డీజేలను నిషేధించినట్లు తెలిపారు. పోలీసు నిబంధనలను ఉల్లంఘించి డీజేలు వినియోగిస్తే సీజ్ చేస్తామన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్ హాక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐలు శివశంకర్, రాంలాల్ తదితరులు ఉన్నారు. -
అంకితభావంతో పనిచేయాలి
● విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దు ● కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట: ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో విద్యాశాఖ అధికారులు అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. విద్యార్థులకు నోట్, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ, ఉపాధ్యాయుల ముఖ హాజరు, అపార్ నమో దు, ఎఫ్ఎల్ఎన్, పాఠశాలల సందర్శన తదితర అంశాలపై గురువారం కలెక్టరేట్లో మండల విద్యాశాఖ అధికారులు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు మెళకువలు పాటించాలన్నారు. నవసమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత కల్పిస్తూ మరమ్మతు చేయిస్తున్నట్లు తెలిపారు. చిన్నచిన్న సమస్యలను అధిగమిస్తూ విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని సూచించారు. ఎఫ్ఎల్ఎన్ విధానాన్ని సక్రమంగా నిర్వహించాలని.. తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో విద్యార్థులు పట్టు సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విధి నిర్వహణలో భాగంగా చేపట్టే కార్యక్రమాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని కలెక్టర్ సూచించారు. ● కర్ని జీహెచ్ఎం బాదేపల్లి వెంకటయ్యగౌడ్ రచించిన ఉల్లాస్–అక్షరవికాసం ఆడియో, వీడియో పాటను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ పాటకు ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు నర్సింహాచారి సంగీతాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉల్లాస్ అనేది నవభారత్ సాక్షరతా కార్యక్రమమని తెలిపారు. పాఠశాల విద్యావకాశం కోల్పోయిన 15ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులకు జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రాథమిక అక్షరాస్యతా ప్రాథమిక విద్యతో పాటు డిజిటల్ అక్షరాస్యతలో కీలకమైన జీవన నైపుణ్యాలు, ఆర్థిక అక్షరాస్యత, వృత్తి నైపుణ్యాలు, నిరంతర విద్య అందిస్తున్నట్లు తెలిపారు. వయోజనులందరూ చదువుపై ఆసక్తి పెంచుకొని విద్యావంతులు కావాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్, డీఈఓ గోవిందరాజులు ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పనుల్లోవేగం పెంచండి నర్వ: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నర్వ మండలంలోని రాంపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణలను కలెక్టర్ పరిశీలించి.. లబ్ధిదారుల సమస్యలను తెలుసుకున్నారు. ఇసుక కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు కలెక్టర్‌తో వాపోయారు. అయితే ఇసుక కొరతను అధిగమించి ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ మల్లారెడ్డిని ఆదేశించారు. అంతకుముందు ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న భవిత కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులను నేలపై కూర్చొబెట్టడంపై కలెక్టర్ అసహనం వ్యక్తంచేశారు. అనంతరం ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులతో ఆరా తీశారు. కొందరు విద్యార్థులు భోజనం బాగులేదని కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో బియ్యాన్ని మార్చాలని ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ శ్రీనివాసులు ఉన్నారు. -
సరిహద్దు ప్రాంతాల నుంచి..
జిల్లాలోని మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాలు, పట్టణాలు తెలంగాణ–కర్ణాటక సరిహద్దుకు ఆనుకొని ఉన్నాయి. అయితే సరిహద్దులోని ఫర్టిలైజర్స్ దుకాణాల్లో కర్ణాటక ప్రాంత రైతులకు ఎరువులు విక్రయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రైతుల పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఆధార్‌కార్డులతో ఎరువులను పక్కదారి పట్టించినట్లు బహిరంగంగా చర్చ సాగుతోంది. ఇటీవల నారాయణపేట మండలంలోని జలాల్పూర్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా.. కాంప్లెక్స్ ఎరువులు, యూరియా పట్టుబడింది. కర్ణాటక ప్రాంతానికి ఎరువులను తరలిస్తున్న వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. దీంతో సరిహద్దు ప్రాంతాల్లోని దుకాణాలపై పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు నిఘా పెంచారు. -
మట్టి గణపతులను పూజిద్దాం
నారాయణపేట: పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి ప్రతిమలను ప్రతిష్ఠించి పూజించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్లో అధికారులు, సిబ్బంది, ప్రజలకు మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో తయారు చేసిన వినాయకుడి ప్రతిమలను కాలుష్య నియంత్రణ మండలి ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇతర రసాయనిక రంగులతో రూపొందించిన విగ్రహాల కారణంగా జలవనరులు కలుషితయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రజలందరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించి.. పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని పిలుపునిచ్చారు. బాల్యవివాహాల నిర్మూలన అందరి బాధ్యత బాల్యవివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మహిళా, శిశుసంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బాల్యవివాహాల నిర్మూలనకు సంబంధించిన పోస్టర్లను అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, శ్రీను, ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్కుమార్లతో కలిసి కలెక్టర్ విడుదల చేశారు. బాలికలను రక్షిద్దాం–బాలికలను చదివిద్దాం అనే నినాదంతో బాలికా విద్యపై ప్రత్యేక శ్రద్ధ, లింగ సమానత్వం, బాల్య వివాహాల నిర్మూలనకు బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై 40 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార మార్గం చూపాలన్నారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ఎస్.శ్రీను, మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు శ్రీలత, కరీష్మ, సాయి, నర్సింహులు, అనిత, నర్సింహ, లక్ష్మీకాంత్ పాల్గొన్నారు. -
పీయూలో సబ్‌స్టేషన్ వివాదం!
500 గజాలే కేటాయించామని పీయూ అధికారుల స్పష్టం పాలమూరు యూనివర్సిటీలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం కేటాయించిన భూమిపై వివాదం నెలకొంది. తాము 500 గజాల భూమిని కేటాయించామని పీయూ అధికారులు.. తమకు ఒక ఎకరా భూమిని కేటాయించారని ట్రాన్స్‌కో అధికారులు భిన్నవాదనలు వినిపిస్తున్నారు. తాజాగా ఎకరంన్నర భూమిని చదును చేయడంపై అటు పీయూ అధికారులు, విద్యార్థి సంఘాల నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వేలాది మంది విద్యార్థుల ఉన్నత చదువులకు బాసటగా నిలిచే పీయూకు నూతన హాస్టల్స్, ల్యాబ్స్, తదితర వాటి ఏర్పాటు నేపథ్యంలో మరింత భూమి సమకూర్చాల్సింది పోయి..ఉన్న భూమిని వేరే వాటికి కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: బండమీదిపల్లితో పాటు చుట్టుపక్కల ఉన్న కాలనీలకు నాణ్యమైన విద్యుత్‌ను అందజేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు అక్కడ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు స్థలం కోసం వెతికారు. సరైన స్థలం దొరక్కపోవడంతో పీయూలో పీజీ కళాశాల పక్కన..రాయచూర్ రోడ్డును ఆనుకుని ఉన్న స్థలాన్ని కేటాయించాలని అధికారులను కోరారు. ఈ క్రమంలో పీయూ అధికారులు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతితో విద్యుత్‌శాఖకు 500 గజాల భూమిని కేటాయిస్తూ అనుమతులు ఇచ్చారు. సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసేందుకు కొన్ని రోజులుగా పనులు సైతం ప్రారంభించారు. అయితే, వారికి కేటాయించిన భూమికి మించి ఎక్కువ భూమిని చదును చేసుకుని వినియోగిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. తాము కేవలం 500 గజాలు ఇచ్చామని పీయూ అధికారులు పేర్కొంటుంటే, విద్యుత్ శాఖ తమకు ఒక ఎకరా భూమి కేటాయించారని పేర్కొంటున్నారు. ఈనేపథ్యంలో ఎకరంన్నర భూమిని చదును చేయడంతో వివాదం మరింత రాజుకుంది. ఎక్కువ భూమిని ఎలా చదును చేసి వినియోగిస్తారంటూ ఇటీవల పీయూ వీసీ శ్రీనివాస్.. ట్రాన్స్‌కో అధికారులకు లేఖ రాశారు. కానీ అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. ఎకరా కేటాయించారని విద్యుత్ అధికారుల వాదన అధిక భూసేకరణపై వీసీ లేఖ.. నేటికీ స్పందించని ట్రాన్స్‌కో పీయూ భూమి కాపాడాలంటూ విద్యార్థి సంఘాల ఆందోళన పీయూకు ఆనుకుని ఉన్న వెటర్నరీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సుమారు 20 ఎకరాల భూమిని పీయూకు అధికారులు బదిలీ చేశారు. ఇందుకు 2019లో కలెక్టర్ రొనాల్డ్‌రోస్, వీసీ రాజతర్నం ఎంతో కృషి చేశారు. అయితే, గతేడాది భూత్పూర్– చించోలి రోడ్డు పనులు ప్రారంభం కాగా.. పీయూకు చెందిన భూమి సైతం పోయింది. పీయూ కాంపౌండ్ వాల్‌ను తొలగించి పనులు కొనసాగించారు. ఇటు రోడ్డు విస్తరణ, అటు సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం దాదాపు 5 ఎకరాల వరకు పీయూ భూమిని కోల్పోయినట్లు తెలుస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా పీయూకు ప్రభుత్వం మరింత భూమిని కేటాయించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో అధికారులు పీయూకు భూమిని సమకూర్చేందుకు ప్రయత్నం చేస్తే.. ప్రస్తుత అధికారులు ఉన్న భూమిని కాపాడే పరిస్థితి లేదన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇకనైన అధికారులు మేల్కొని పీయూ భూములను పరిరక్షించాలని విద్యార్థులు కోరుతున్నారు. పీయూలో సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసేందుకు అధికారులు ఒక ఎకరా భూమిని కేటాయించారు. అందులో భాగంగానే ఇక్కడ భూమిని చదును చేశాం. ఎకరం కంటే ఎక్కువ భూమిని ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకోం. – సుధీర్‌రెడ్డి, ఈఈ, ట్రాన్స్‌కో పీయూలో సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం విద్యుత్‌శాఖ అధికారుల విజ్ఞ్ఞప్తి మేరకు కేవలం 500 గజాల భూమిని మాత్రమే కేటాయించాం. వారు ఎక్కువ భూమిని చదును చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై సదరు డిపార్ట్మెంట్ వారికి లేఖ సైతం రాశాం. ఎక్కువ భూమిని వినియోగించుకోవడానికి అవకాశం లేదు. – శ్రీనివాస్, పీయూ వైస్‌చాన్స్‌లర్ -
పదోన్నతుల కోలాహలం
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న ప్రక్రియ ● సోమవారం వెలువడిన సీనియార్టీ, ఖాళీల జాబితా ● అభ్యంతరాలు సైతం పరిష్కరించిన తర్వాతే తుది జాబితా ● నేటి సాయంత్రం వరకు ఉపాధ్యాయులకు ఆర్డర్స్ ● ఆన్లైన్ విధానంతో సులువుగా మారిన కసరత్తు జిల్లా హెచ్ఎం ఎస్ఏలు మహబూబ్‌నగర్ 34 119 నాగర్‌కర్నూల్ 37 107 నారాయణపేట 21 80 మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయుల పదోన్నతుల కోలాహలం కొనసాగుతుంది. 2024లో కూడా ప్రభుత్వం పదోన్నతులను ఆన్లైన్లో చేపట్టినప్పటికీ కొందరు ఉపాధ్యాయులు స్పౌజ్, హెల్త్ వంటి అంశాలపై తప్పుడు సమాచారం ఇవ్వడంతో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకోవడంతో వివాదాలకు తావులేకుండా ప్రక్రియ సజావుగా సాగినట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ నెల 21న నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌లో 92 మంది ఎస్‌ఏలకు జీహెచ్ఎంలుగా పదోన్నతి కల్పించారు. తాజాగా ఎస్జీటీలకు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా, ఎస్ఏలుగా 306 మందికి పదోన్నతులు కల్పించే ప్రక్రియ చివరి దశకు చేరింది. ఇప్పటికే మూడు జిల్లాల్లోని పలు పాఠశాలల్లో ఉన్న ఖాళీలు, అర్హులైన ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను అధికారులు అందుబాటులో ఉంచారు. సీనియార్టీ జాబితాలో ఉన్న ఉపాధ్యాయులు సోమవారం రాత్రికి వెబ్ ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంది. వారు ఎంపిక చేసుకున్న పాఠశాలల వివరాల ఆధారంగా మంగళవారం సాయంత్రం వరకు ఆర్డర్స్ అందించనున్నారు. పొరపాట్లు సరిచేసి.. సీనియార్టీ జాబితా వెలువడిన వెంటనే అధికారులు ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలను సోమవారం స్వీకరించారు. ఇందులో మహబూబ్‌నగర్‌లో 3, నారాయణపేటలో 10, నాగర్‌కర్నూల్‌లో 5 అభ్యంతరాలు రాగా ఇందులో పుట్టినరోజు, స్పౌజ్, మెడికల్ తదితర చిన్నపాటి పొరపాట్లు ఉండగా వాటిని అధికారులు సరిచేశారు. దీంతో మూడు జిల్లాల్లో దాదాపు ప్రక్రియ ముగిసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో జీహెచ్ఎంలకు సంబంధించి మహబూబ్‌నగర్‌లో నలుగురు, నారాయణపేటలో ఏడుగురు, నాగర్‌కర్నూల్‌లో ఐదుగురు విధుల్లో చేరలేదని సమాచారం. ఈ పోస్టులకు తదుపరి సీనియార్టీ జాబితాలో ఉన్న వారికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తుంది. జిల్లావ్యాప్తంగా పదోన్నతుల ప్రక్రియను పకడ్బందీగా చేపడుతున్నాం. సీనియార్టీ జాబితాపై కొన్ని అభ్యంతరాలు వస్తే వాటిని సకాలంలో పరిష్కరించాం. ప్రస్తుతం వెబ్ ఆప్షన్ ఇచ్చుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మంగళవారం సాయంత్రంలోగా ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంది. – గోవిందరాజులు, డీఈఓ, నారాయణపేట -
క్రీడలకు అధిక ప్రాధాన్యం
● గ్రామీణ క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదగాలి ● రాష్ట్ర మత్స్య, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్‌లో 2కే రన్ ప్రారంభిస్తున్న మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్: ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర మత్స్య, క్రీడల యువజన సర్వీసులశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. జాతీయ క్రీడల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మక్తల్ పట్టణంలోని నల్లజానమ్మ ఆలయం వద్ద మంత్రి 2కే రన్ ప్రారంభించగా.. అంబేడ్కర్ చౌరస్తా వరకు ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడాకారులకు అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తోందన్నారు. రూ.కోట్లతో క్రీడా వసతులు కల్పించడంతో పాటు స్టేడియాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. క్రీడలు క్రమశిక్షణ, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని.. గ్రామీణ యువత క్రీడల్లో ప్రావీణ్యం పెంచుకొని రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలని సూచించారు. ఈ నెల 23నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ● అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జక్లేర్, కాట్రేవ్‌పల్లి, ఖానాపూర్, రుద్రసముద్రం, పారేవుల గ్రామాలకు చెందిన 78మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గంలో రూ. 175కోట్లతో 3,500 ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అందించే ఆర్థికసాయంతో లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్లను నిర్మించుకొని సొంతింటి కలను సాకారం చేసుకోవాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం లేకుండా.. అందరికీ సముచిత న్యాయం చేస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారుల నుంచి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమాల్లో డీవైఎస్ఓ వెంకటేశ్ శెట్టి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ గణేశ్‌కుమార్, ఎంపీడీఓ రమేశ్, తహసీల్దార్ సతీశ్‌కుమార్, నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేశ్, రవికుమార్, కట్ట సురేశ్, వెంకటేశ్, రాజేందర్, ఎండీ సలాం, శ్రీనివాసులు, నరేందర్, నారాయణ, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాధితులకు భరోసానివ్వాలి : ఎస్పీ
నారాయణపేట క్రైం: వివిధ సమస్యలపై పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు భరోసానిచ్చేలా పోలీసు సిబ్బంది వ్యవహరించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 10 అర్జీలు అందగా.. పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పంపించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు శాఖను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లో అందే ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం చేయరాదన్నారు. క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఎస్పీ సూచించారు. భూ తగాదాలకు సంబంధించిన ఫిర్యాదులను రెవెన్యూ అధికారుల సమన్వయంతో పరిష్కార మార్గం చూపాలని తెలిపారు. ఇంజినీరింగ్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు కోస్గి రూరల్: కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీ నిమిత్తం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్పరానికి గాను బీటెక్‌లోని సీఎస్ఈ, సీఎస్డీ, సీఎస్ఎం కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని.. ఆసక్తి, అర్హులైన విద్యార్థులు ఈ నెల 26నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 29న స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. టీజీఈఏపీసీఈటీ–2025 అర్హత సాధించిన విద్యార్థులకు ప్రాసెసింగ్ ఫీజు రూ. 1,300 కాగా.. అర్హత సాధించని విద్యార్థులు రూ. 2,100 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. పరిహారం పెంచాలి నారాయణపేట: నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించే విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలని భూ నిర్వాసితుల సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడు మశ్చందర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో భూ నిర్వాసితులు చేపట్టిన రిలే దీక్షలు సోమవారం 42వ రోజుకు చేరాయి. భూ నిర్వాసితులకు ఎకరానికి రూ.35 లక్షలు ఇవ్వాలని, ఇంటికి ఒక ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు, గురుకుల, సైనిక మాడ్రన్ పాఠశాలలో భూ నిర్వాసితుల కుటుంబాల పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రిలే దీక్షలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరాం, భూ నిర్వాసితుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ధర్మరాజుగౌడ్, సామాజిక కార్యకర్త కృష్ణా మడివాల్, మల్లేష్ శ్రీనివాస్, వెంకటప్ప ఉన్నారు అలసందలు క్వింటాల్ రూ.6,229 నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం అలసందలు క్వింటాల్ గరిష్టంగా రూ. 6,229, కనిష్టంగా రూ. 3,826 ధర పలికింది. అదే విధంగా పెసర గరిష్టంగా రూ. 9,859, కనిష్టంగా రూ. 4,322 ధరలు వచ్చాయి. -
కనులపండువగా శివపార్వతుల కల్యాణం
నారాయణపేట రూరల్: పట్టణంలోని శివలింగేశ్వర దేవాలయం 6వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకం, బిల్వర్చన, విశేష పుష్పాలంకరణ, మహా మంగళహారతి నిర్వహించారు. అనంతరం అర్చకులు జంగం మాడపటి మఠం శివకుమార్, రాయచూరు శివకుమార్ ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కర్ణాటక రాష్ట్రం కలబురిగి జిల్లా సావుళ్గిగి మఠం పీఠాధిప గురునాథ స్వామి హాజరై భక్తులకు ఆశీర్వచనం అందించారు. అనంతరం అన్నదానం చేశారు. అంతకుముందు శివపార్వతుల విగ్రహాలు పట్టణ పురవీధుల గుండా శోభాయాత్రగా ఖడ్గాలు చదువుతూ ఊరేగింపుగా తీసుకొచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రవికాంత్, మల్లికార్జున్, రవికుమార్, నాగభూషణం, రఘుబాబు, శంక్రన్న, కన్న జగదీష్, మల్లికార్జునమ్మ, మాజీ మున్సిపల్ చైర్మెన్ అనసూయ, చంద్రకాంత్, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు ఉమాకాంత్, ట్రస్మ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, చిట్టెం మాధవరెడ్డి పాల్గొన్నారు. -
ఇంకా పునరుద్ధరించలే!
శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో సిద్ధం కాని నాలుగో యూనిట్● 2020 ఆగస్టు 20 నాటి దుర్ఘటనలో 9 మంది ఉద్యోగుల మృతి ● ఏళ్లతరబడిగా సాగుతున్న మరమ్మతు ప్రక్రియ ● ఐదు యూనిట్లతోనే విద్యుదుత్పత్తి శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 2001 ఫిబ్రవరిలో ఒక యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ఈ కేంద్రంలో మొత్తం 6 యూనిట్లకు గానూ ఒక్కో యూనిట్ 150 మెగావాట్ల చొప్పున మొత్తం 900 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉంది. 2020 వరకూ ఈ కేంద్రంలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి కొనసాగింది. 24 గంటల వ్యవధిలో 6 యూనిట్ల ద్వారా 21 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసేవారు. అయితే ఐదేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో నాలుగో యూనిట్ పూర్తిగా ధ్వంసం కాగా.. ఇప్పటి వరకు ఈ యూనిట్ పునరుద్ధరణ పూర్తికాలేదు. అయితే భూగర్భ కేంద్రం చరిత్రలోనే ఇదే తొలి ప్రమాదం కావడం గమనార్హం. సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భజల విద్యుత్ కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాద ఆనవాళ్లు నేటికీ చెదిరిపోవడం లేదు. 2020 ఆగస్టు 20న రాత్రి నాలుగో యూనిట్లో చోటుచేసుకున్న షార్ట్‌సర్క్యూట్ కారణంగా.. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వెలుగులు ప్రసరింపజేసే భూగర్భ కేంద్రంలో చీకట్లు కమ్ముకున్నాయి. ప్రమాదం కారణంగా చెలరేగిన మంటలు, పొగలతో ఉక్కిరిబిక్కిరికి గురై డ్యూటీలో ఉన్న తొమ్మిది మంది ఉద్యోగులు మరణించారు. తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ అందిస్తున్న శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలోని నాలుగో యూనిట్ ప్యానెల్ బోర్డులో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగడం, చుట్టూ మంటలు, పొగలో చిక్కుకుని ఏడుగురు జెన్కో ఉద్యోగులు, ఇద్దరు అమరాన్ బ్యాటరీ కంపెనీకి చెందిన ఉద్యోగులతో సహా మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ప్రమాదం సంభవించిన నాలుగో యూనిట్‌ను నేటికీ పునరుద్ధరించకపోవడం కొసమెరుపు. -
రైతు ఆపదలో ఉంటే ప్రభుత్వాల నిర్లిప్తత
● ఏఐయూకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ మహబూబ్‌నగర్ న్యూటౌన్: దేశానికి అన్నం పెట్టే రైతు ఆపదలో ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లిప్తత చూపుతున్నాయని ఏఐయూకేఎస్ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి ప్రభాకర్ ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆండ్‌బీ అతిథిగృహం వద్ద అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర మహాసభల ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలను తుంగలో తొక్కి అందలం ఎక్కి ఆగం చేస్తున్నారని విమర్శించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ సిఫారసులను అమలు చేసి వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించే చట్టా న్ని, పంటలకు సాగునీటి వసతి కల్పించే వసతులను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈనెల 25, 26 తేదీల్లో జిల్లా కేంద్రంలో నిర్వహించే అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ, ఏఐయూకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాము, పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, నర్సింహ, టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రఫి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల దీవెనతో ప్రజాపాలన
● ‘పనుల జాతర’ కోసం రూ.20,200 కోట్లు మంజూరు ● మహిళలకు వడ్డీలేని రుణాలు ● అన్నిరంగాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి ● రాష్ట్ర పంచాయతీరాజ్, శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అమ్రాబాద్/ వెల్దండ: ప్రజా పాలనలో ప్రజల ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజల దీవెనలతో అన్నివర్గాల ప్రజలు, అన్నిరంగాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి అమ్రాబాద్ మండలంలోని కల్ములోనిపల్లి, జంగంరెడ్డిపల్లి, మాధవానిపల్లి, మొల్కమామిడి, తుర్కపల్లి గ్రామాల్లో గ్రామ పంచాయతీ, అంగన్వాడీ కేంద్రాల నూతన భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జంగంరెడ్డిపల్లిలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. పనుల జాతరలో భాగంగా మొత్తం 1,500 పనులకు గాను రూ.20,200 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలు తదితర అభివృద్ధి పనులు చేపట్టవచ్చన్నారు. ముఖ్యంగా మహిళా సంఘాల అభివృద్ధి కోసం ఇప్పటికే ప్రభుత్వం క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించే దిశగా ప్రోత్సహిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం మహిళలకు పావలా వడ్డీ రుణాలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, కానీ, తమ ప్రజల ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.17.81 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. గతంలో 60 ఏళ్లు దాటిన మహిళలను తొలగించారని, ఇప్పుడు వారిని కూడా చేర్చుకోవాలని తాము చెబుతున్నామన్నారు. అందరి సహకారంతో అభివృద్ధి ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచిన తాను అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించడంతోపాటు ముఖ్యమంత్రి, మంత్రుల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తున్నానని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. కృష్ణానదిపై బ్రిడ్జి, సాగునీరు, ఇతరత్రా అభివృద్ధి కోసం పాటుపడుతున్నానని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, డీఆర్డీఓ ఓబులేష్, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, ఎంపీడీఓ లింగయ్య తదితరులు పాల్గొన్నారు. మంత్రి పర్యటన సందర్భంగా డీఎస్పీ పల్లె శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.