భక్తిశ్రద్ధలతో గట్టుతిమ్మప్పస్వామి రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో గట్టుతిమ్మప్పస్వామి రథోత్సవం

Jan 26 2026 4:10 AM | Updated on Jan 26 2026 4:10 AM

భక్తిశ్రద్ధలతో గట్టుతిమ్మప్పస్వామి రథోత్సవం

భక్తిశ్రద్ధలతో గట్టుతిమ్మప్పస్వామి రథోత్సవం

మక్తల్‌: మండలంలోని మాద్వార్‌ గట్టుతిమ్మప్పస్వామి రథోత్సవం ఆదివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కొండపై నుంచి లక్ష్మీవేంకటేశ్వరస్వామిని తీసుకొచ్చి రథోత్సవంపై అలంకరించారు. వేలాది భక్తుల నడుమ రథోత్సవాన్ని బాల ఆంజనేయస్వామి ఆలయం లాగారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య, సర్పంచు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సంతోష్‌రెడ్డి, కట్ట సురేస్‌, మాజీ ఎంపీటీసీ బాల్‌రాంరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

కర్నిలో గుండురంగస్వామి రథోత్సవం

మండలంలోని కర్ని గ్రామ శివారులోని గుండురంగస్వామి రథోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. అంతకముందు కల్యాణోత్సవం చేశారు. భక్తులు ఉత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement