breaking news
Narayanpet District News
-
అంతర్రాష్ట్ర గంజాయి ముఠా పట్టివేత
● మక్తల్‌లో ముగ్గురి అరెస్ట్.. 1.4 కిలోల గంజాయి స్వాధీనం నారాయణపేట: మక్తల్‌లోని రాంలీలా మైదానం వద్ద శనివారం నిర్వహించిన తనిఖీల్లో గంజాయి తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు పట్టుకొని వారి నుంచి 1.4 కిలోల గంజాయి, రవాణాకు ఉపయోగించిన స్కూటీ, మూడు సెల్ఫోన్లు, రూ.7 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ డా. జి.వినీత్ వెల్లడించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.60 వేలు ఉంటుందని..నిందితులకు నిర్వహించిన డ్రగ్ పరీక్షల్లో ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. నిందితులు మహారాష్ట్రలో గంజాయిని కొనుగోలు చేసి రాయచూర్ మీదుగా మక్తల్‌తో పాటు పరిసర ప్రాంతాలకు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ అక్రమ రవాణా వెనుక మరికొందరి ప్రమేయం ఉందా? గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది? ఆర్థిక లావాదేవీలు ఎలా సాగుతున్నాయి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందన్నారు. అరెస్టయిన వారిలో కర్ణాటక రాయచూర్‌కు చెందిన ఓం అశోక్ కొరాడి, మహారాష్ట్రలోని దక్షిణ సోలాపూర్‌కు చెందిన రాజశేఖర్ రాంచందర్ హూనరావు, సోలాపూర్‌కు చెందిన ఎండీ యాసీన బందెనవాజ్ మఖానన్దార్ ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై మక్తల్ పోలీస్‌స్టేషనన్‌లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితాలతో పాటు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే సమీప పోలీస్‌స్టేషనన్‌లో తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. తనిఖీల్లో పాల్గొన్న మక్తల్ సీఐ రాంలాల్, ఎస్ఐ రాజు, టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ పురుషోత్తం, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. డీఎస్పీ నల్లపు లింగయ్య పర్యవేక్షణలో ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. -
వారాంతపు సంతకు రూ.500..
కూరగాయలు, నూనెలు, పప్పుదినుసుల ధరలు విపరీతంగా పెరిగాయి. వారాంతపు సంతకు రూ.500 తీసుకెళ్తె నాలుగైదు రోజుల కూరగాయలు కూడా రావడం లేదు. నిత్యం కూరల్లో వాడే ఉల్లిని ప్రస్తుతం దూరం పెట్టాల్సి వస్తోంది. పండుగ వేళ నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల ధరలు కూడా పెరగడంతో పండుగలు చేసుకోవాలంటేనే భయమేస్తోంది. – వరలక్ష్మి, పల్లెగడ్డ రూ.10 వేలు సరిపోవడం లేదు.. పెరిగిన నిత్యావసర సరుకుల ధరల కారణంగా గత ఆరు నెలలుగా వచ్చే నెల వేతనం రూ.10 వేలు సరిపోవడం లేదు. అంతకుముందు కుటుంబ అవసరాలుపోను రూ.3 వేలు మిగిలేవి. ఇప్పుడు పెరిగిన ధరలతో ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. దసరా పండుగకు పిల్లలకు కొత్త దుస్తులు కొనడం కూడా భారమైంది. పండుగ చేసుకోవాలంటే అప్పులు చేయాల్సిన అవసరం వచ్చింది. – బాలకృష్ణ, మరికల్ ● -
ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
● ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం తిప్పికొట్టాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు ● కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో డీసీసీ అధ్యక్షుడు ఎ.సంజీవ్ ముదిరాజ్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి గ్రాడ్యుయేట్‌ను కలిసి ఓటరుగా తప్పక నమోదు చేయించాలన్నారు. పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్‌రెడ్డి గెలుపు దీనిపైనే ఆధారపడి ఉందన్నారు. అందరూ బాధ్యతతో వ్యవహరించి వచ్చే నెల 6వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయించాలన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఎండబెట్టిన బీఆర్ఎస్, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వని బీజేపీ నేతలకు ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో వివిధ అంశాలపై ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. ఈ మూడేళ్ల ప్రజాపాలనలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో వివరించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యువత నిరాశ, నిస్పృహలకు గురి కావద్దని, త్వరలోనే రాజీవ్ యువ వికాస్ పథకం అమలు కానుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అన్ని విభాగాలు కలిసికట్టుగా పనిచేయాలి: చల్లా వంశీచంద్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని విభాగాల నాయకులు సమష్టిగా పనిచేసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి సీఎం రేవంత్‌రెడ్డికి ‘గిఫ్ట్శ్రీగా ఇవ్వాలని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల 6వ తేదీలోగా అన్ని గ్రామాల్లో ప్రతి పట్టభద్రుడిని కలిసి ఓటరుగా నమోదు చేయించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఉందన్నారు. ఈ మూడేళ్ల ప్రజాపాలనలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో 80 శాతం మంది ప్రజలు తమవైపే ఉన్నారని పేర్కొన్నారు. అందరూ నమోదు చేసుకోవాలి: అభ్యర్థి సామ రామ్మోహన్‌రెడ్డి పట్టభద్రులందరూ ఓటరుగా తప్పక నమోదు చేయించుకోవాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సావ రామ్మోహన్‌రెడ్డి కోరారు. ఈ ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకమని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్య, నాయకుడు తామే అభ్యర్థిగా భావించి కష్టపని పనిచేయాలన్నారు. తాను గెలిస్తే శాసనమండలిలో ఆయా సమస్యలను ప్రస్తావించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానన్నారు. ఈ ఎన్నికల్లో ఒక్కటి కావడానికి బీఆర్ఎస్, బీజేపీ లోపాయకారీ ఒప్పందం చేసుకుంటాయని ఆరోపించారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ ఎంపీ. డా.మల్లు రవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, మేఘారెడ్డి, డా.రాజేశ్‌రెడ్డి, వంశీకృష్ణ, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ఒబేదుల్లా కొత్వాల్, సరిత పాల్గొన్నారు. ఈ ఎన్నిక దిక్సూచి: మంత్రి వాకిటి శ్రీహరి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఆ తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు, శాసనసభ సాధారణ ఎన్నికలకు దిక్సూచి లాంటిదని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. వచ్చే నెల 6వ తేదీలోగా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు విస్తృతంగా తిరిగి ప్రతి గ్రాడ్యుయేట్‌ను కలిసి ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. గత ఎన్నికలు జరిగినప్పుడు 5.31 లక్షల మంది పట్టభద్రులు ఉండగా.. ఇందులో 55 శాతం ఉమ్మడి పాలమూరులోనే ఉన్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గ్రహించి ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. -
రైస్‌మిల్లుపై విజిలెన్స్ దాడి
● యజమానిపై కేసు నమోదు నర్వ: మండలంలోని రాంపూర్‌గేట్ వద్ద ఉన్న సాయిరాం రైస్‌మిల్లులో శుక్రవారం పౌరసరఫరాలశాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ధాన్యం నిల్వలు, రికార్డులను పరిశీలించగా రూ.10.92 కోట్ల విలువైన ధాన్యం కొరత ఉన్నట్లు గుర్తించామని పౌరసరఫరాల డీఎం సైదులు తెలిపారు. అధికారులు అందించిన వివరాల మేరకు.. 2022–23 నుంచి 2025–26 వరకు రబీ, యాసంగి సీజన్లో అప్పగించిన ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్‌ను అప్పగించాల్సి ఉంది. అయితే ఇందులో లక్ష ఆరు వేల 536 బస్తాల ధాన్యం (రూ.10,92,05,027) తక్కువగా ఉండటంతో మిల్లు యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నర్వ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ఎస్ఐ పబ్బతి రమేష్ కేసు నమోదు చేసి సీఐ భగవంతురెడ్డి సమక్షంలో మిల్లు యజమాని, కుటుంబ సభ్యులను అరెస్టు చేసి హాజరుపర్చినట్లు సమాచారం. ఆస్పత్రిలో చిన్నారి మృత్యువాత ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ నారాయణపేట: జలుబుతో బాధపడుతున్న మూడునెలల కుమారుడిని ఆస్పత్రికి తీసుకెళ్తే చివరకు విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతిచెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని బైరంకొండకు చెందిన వడ్డె బుజ్జమ్మ రెండో కుమారుడికి జలుబు చేయడంతో ఈ నెల 15న గురువారం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ చిన్నపిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లింది. చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం మహబూబ్‌నగర్‌లోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు సమాచారం. వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ మరణానికి కారణమంటూ నారాయణపేటలోని ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట కుటుంబసభ్యులు, బంధువులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఓ రాజకీయ నాయకుడి జోక్యం చేసుకొని ఇరువర్గాల మధ్య చర్చలు జరిపి రూ.2 లక్షల పరిహారానికి ఆస్పత్రి యాజమాన్యం అంగీకరించినట్లు సమాచారం. ఈ విషయంపై సంబంధిత ఆస్పత్రి వైద్యుడిని వివరణ కోరగా.. తమ ఆస్పత్రిలో చికిత్స అందించినప్పుడు బాలుడు బాగానే ఉన్నాడని, మెరుగైన చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లాలని సూచించినట్లు తెలిపారు. బాలుడికి అందించిన వైద్యంలో ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని చెప్పుకొచ్చారు. వివరాలు IIIలో..విద్యార్థుల ఆలోచనలకు పదును ప్రాజెక్ట్ వీర్ గాథా 6.0తో ప్రయోగం అన్ని యాజమాన్య పాఠశాలలకు అవకాశం విజేతలకు రూ.10 వేల నగదు పురస్కారం -
ఎమ్మెల్సీ సమరానికి సన్నద్ధం కండి : బీఆర్ఎస్
నారాయణపేట: త్వరలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని.. పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు క్షేత్రస్థాయిలో ముందుకు సాగాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని ఎన్నికల వ్యూహం, ఓటరు నమోదు, పార్టీ శ్రేణుల బాధ్యతలు, క్షేత్రస్థాయి కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ప్రతి వంద ఓట్లకు ఒక ఇన్చార్జిని నియమించి ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఓటర్లను కలుస్తూ ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తూ ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల సమయం దగ్గరపడే వరకు వేచి చూడకుండా ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగాలని, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ నిర్దేశిత లక్ష్యసాధనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ నాయకులు వేపూరి రాములు, విజయ్‌సాగర్, సుదర్శన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
నారాయణపేట: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటుతూ కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా మహిళ, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మహిళలు రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కలెక్టర్ ప్రియాంక వేడుకల్లో పాల్గొని బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజిస్తూ మహిళలు సామూహికంగా జరుపుకొనే పండుగకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. మహిళల ఐక్యత, ఆత్మీయతకు బతుకమ్మ వేడుకలు అద్దం పడతాయని తెలిపారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చడం తెలంగాణ సంప్రదాయ కళాత్మకతకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రకృతిపై గౌరవం, పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహనను పెంపొందిస్తుందని చెప్పారు. తరతరాలుగా కొనసాగుతున్న సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఉద్యోగుల మధ్య ఐక్యతను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. అనంతరం మహిళలు బతుకమ్మల చుట్టూ ఆడిపాడుతూ సందడి చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, పుర చైర్పర్సన్ కొండా శ్వేతా, వైస్ చైర్పర్సన్ మంజుల, డీడబ్ల్యూఓ రాజేందర్‌గౌడ్, ఏఓ అనిల్‌కుమార్, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. -
ఏడాదిలో పేట–మక్తల్ రహదారి పూర్తి చేయాలి
నారాయణపేట/మక్తల్/ఊట్కూరు: మాటలు కోటలు దాటుతున్నా.. మక్తల్–నారాయణపేట నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులు మాత్రం అడుగు ముందుకుపడటం లేదని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. శనివారం మక్తల్ నుంచి నారాయణపేటలోని సింగారం చౌరస్తా వరకు సుమారు 25 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన ఆయన సాయంత్రం అక్కడే నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకునే పాలకులు ప్రజలకు నిత్యావసరమైన రహదారి నిర్మాణాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు ప్రారంభించిన పనులు ఇప్పటికీ చేపట్టకపోవడం విచారకరమన్నారు. మూడేళ్లుగా రహదారి పనులు ముందుకు సాగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో ఏడాదిలో నిర్మాణం పూర్తిచేయకపోతే మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. రూ.237 కోట్లు మంజూరైనా పనులెక్కడ? మక్తల్–నారాయణపేట నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి రూ.237 కోట్లు మంజూరైనట్లు చెబుతున్నప్పటికీ పనులు ఎందుకు ముందుకుసాగడం లేదని రామ్మోహనరెడ్డి ప్రశ్నించారు. నిర్మాణ పనుల పురోగతిపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రహదారి పనులు ఆలస్యం కావడానికి కారణాలేమిటో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రహదారి పూర్తయితే రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు. ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో గ్రామాలు, తండాల్లో బీటీ రోడ్ల నిర్మాణం జరుగుతుండగా.. మక్తల్–నారాయణపేట రహదారి మాత్రం మూడేళ్లుగా ఎందుకు ముందుకుసాగడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులు ఆయన దృష్టికి చేరడం లేదా? ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, రహదారి నిర్మాణంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర సింగారం చౌరస్తాకు చేరుకున్న సందర్భంగా నారాయణపేట మాజీ ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, సంపత్, కౌన్సిలర్ భరత్, సుదర్శన్‌రెడ్డి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. -
సరుకులు.. చురుకులు!
మరికల్: నిత్యావసరాల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. నాలుగు నెలల కిందట వరకు అందుబాటులో ఉన్న నిత్యావసరాల ధరలు ఇప్పుడు చుక్కలను అంటుతుండటంతో ప్రతి నెలా ఇంటి బడ్జెట్ తలకిందులవుతోంది. స్వల్ప వ్యవధిలోనే బియ్యం ధరలు దాదాపు రెట్టింపయ్యాయి. ఎల్‌నినో ప్రభావంతో పంటల దిగుబడి అంతంత మాత్రంగా ఉండటం.. డిమాండ్ మేరకు సరకులు రాకపోవడంతో వ్యాపారులు సైతం సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దసరా పండుగ వేళ అమాంతం ధరలు పెరగడంతో కూలీ పనులు చేసుకునే పేదలు, ప్రైవేట్ ఉద్యోగులు, ఇతర సామాన్యులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పండుగ చేసుకోవాలంటేనే భయపడుతున్నారు. సరుకుల వారీగా ధరలు ఇలా.. (సుమారుగా రూ.లలో..) సరుకు గతం ప్రస్తుతం కందిపప్పు 140 160 పెసరపప్పు 100 120 శనగపప్పు 80 100 చక్కెర 48 60 ఉల్లి 25 70 అల్లం 50 100 వెల్లుల్లి 120 200 బియ్యం జైశ్రీరాం 6,500 9,000 సోనమసూరి 5,000 7,000 పండుగ వేళ మండుతున్న నిత్యావసరాల ధరలు నాలుగు నెలల్లో భారీగా పెరిగిన వైనం విలవిలలాడుతున్న సామాన్యులు రూ.80కిలో చేరువలో సన్నబియ్యం -
పాలమూరుకు పోయేదే మేలు..
మక్తల్ నుంచి నారాయణపేటకు వెళ్లేందుకు గంటకు పైగా సమయం పడుతోంది. గుంతల రహదారిపై అంబులెన్సుల రాకపోకలు ఇబ్బందికరంగా మారడంతో గర్భిణులు, అత్యవసర రోగుల తరలింపుపై ఆందోళన నెలకొంది. పేటకు వెళ్లే కంటే పాలమూరుకు వెళ్లేది మేలు. నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి రూ. 237 కోట్లు మంజూరైనట్లు ప్రకటించినా పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై స్పష్టత లేదు. – రామలింగం, రుద్రసముద్రం, మక్తల్ మండలం ● -
ప్రకటనలతోనే సరి..
మక్తల్ – నారాయణపేట నాలుగు లేన్ల రోడ్డుకు రూ.237 కోట్లు మంజూరయ్యాయని చెబుతున్నా, పనులు మాత్రం ప్రారంభం కాలేదు. 30 కి.మీ. దూరానికి 45 నిమిషాల్లో చేరుకోవాల్సి ఉండగా.. రోడ్డు గుంతల కారణంగా గంట సమయం పడుతోంది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ ప్రయాణం ఆలస్యమైతే రోగుల పరిస్థితి ఏమిటి. ప్రకటనలకే పరిమితం కాకుండా, వెంటనే పనులు ప్రారంభించాలి. – శ్రీనివాసులు, పెద్దపొర్ల, ఊట్కూరు మండలం త్వరలోనే పనులు ప్రారంభం నారాయణపేట – మక్తల్ రహదారి విస్తరణకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. సర్వే కొనసాగుతోంది. నాలుగు లైన్ల రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. – అభిలాష్‌రెడ్డి, ఆర్అండ్బీ ఏఈ, మక్తల్ ● -
జాప్యమెందుకో..?
ర్యాలంపాడు రిజర్వాయర్ గద్వాల: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో ప్రధానమైన ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మతుకు నోచుకోవడం లేదు. నాలుగేళ్ల కిందట ఆనకట్ట, తూముల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. ఫలితంగా 4 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ కాస్త 2 టీఎంసీలు మాత్రమే నిల్వ చేస్తున్నారు. దీంతో ర్యాలంపాడు జలాశయం కింద 1.12 లక్షల ఎకరాల ఆయకట్టుకు కేవలం వానాకాలంలో ఒకే పంటకు సాగునీరు అందుతుండగా.. యాసంగి సీజన్లో క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు. రూ.4.92 కోట్లు మంజూరు ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మతు కోసం ప్రభుత్వం రూ.4.92 కోట్లు మంజూరు చేసింది. అయితే పలుమార్లు హైదరాబాద్, పుణెల నుంచి ఇంజినీరింగ్ నిపుణుల బృందం రిజర్వాయర్‌ను సందర్శించి సర్వే చేశారు. మరమ్మతు చేసేందుకు ముందస్తుగా 7 రకాల శాంపిల్స్ సేకరించి నివేదిక కోసం హైదరాబాద్‌లోని టీఎస్ఈఆర్ఎల్ (తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్ రీసెర్చి ల్యాబ్)కు పంపారు. వీరు ఇచ్చే నివేదికను పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్సీ ల్యాబ్‌కు పంపించి అక్కడి నుంచి వచ్చే తుది నివేదిక ఆధారంగా పూర్తిస్థాయి రిపేర్లు చేయాల్సి ఉంటుంది. దీనిపై గత రెండు నెలలుగా ఎలాంటి నివేదిక రాలేదు. మరోవైపు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గుడ్డెందొడ్డి రిజర్వాయర్ స్థాయిని పెంచేందుకు ఆమోదం తెలిపింది. దీని కారణంగానే ర్యాలంపాడుకు మరమ్మతు చేపట్టేందుకు ప్రభుత్వం పునరాలోచనలో పడిందా అన్న ప్రచారం జరుగుతోంది. ఏజెన్సీలతో సర్వే.. ర్యాలంపాడు రిజర్వాయర్‌కు లీకేజీ ఏర్పడిన అనంతరం మరమ్మతు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మొదట రూ.60 లక్షలతో హైదరాబాద్‌కు చెందిన ఏజెన్సీకి సర్వే పనులు అప్పగించింది. ఆరు నెలలపాటు సర్వే చేసిన సదరు ఏజెన్సీ తుది నివేదికను గత ప్రభుత్వానికి సమర్పించింది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో మరోసారి పుణెకు చెందిన ఇంజినీరింగ్ బృందంతో సర్వే చేయించింది. పుణె ఇంజినీరింగ్ నిపుణుల బృందం రెండుసార్లు రిజర్వాయర్‌ను సందర్శించి.. ఆనకట్టలోని రాక్ టోల్ లేయర్లు, తూముల అడుగు భాగంలో ఏడు రకాల మట్టి శాంపిల్స్ సేకరించారు. వీటిని హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్ రీసెర్చి ల్యాబ్‌కు పంపారు. ఇక్కడి నుంచి వచ్చిన రిపోర్టును తుది నివేదిక కోసం పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్‌సీకి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి వచ్చే తుది నివేదిక ఆధారంగానే రిజర్వాయర్‌కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేపట్టే అవకాశం ఉంది. ర్యాలంపాడ్ జలాశయ మరమ్మతుల్లో తీవ్ర అలసత్వం ఆనకట్ట, తూముల రిపేర్ కోసం రూ.4.92 కోట్లు మంజూరు టీఎస్ఈఆర్ఎల్ నివేదిక ఆలస్యమే కారణమా? సాగునీటి ఇబ్బందులతో యాసంగిలో క్రాప్ హాలీడే -
స్వీయ గణనతో కచ్చితమైన సమాచారం
● సెన్సస్–2027లోప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి ● రాష్ట్ర సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హొల్లికేరి నారాయణపేట: జనాభా గణన–2027లో స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి, తక్కువ సమయంలో నాణ్యమైన సమాచారాన్ని సేకరించాలని రాష్ట్ర సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హొల్లికేరి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సెన్సస్ అధికారులు, ఛార్జ్ క్లర్కులు, సాంకేతిక సహాయకులకు జనగణన రెండో దశపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. జనగణనలో కచ్చితత్వం, సమన్వయం, సమయపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కుటుంబంలోని సభ్యుల వివరాలను సంబంధిత యాప్‌లో ప్రజలే ముందుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. స్వీయ గణన పూర్తయిన అనంతరం ఎన్యూమరేటర్లు ఆయా కుటుంబాలను సందర్శించి.. నమోదు చేసిన వివరాలను పరిశీలించాలని తెలిపారు. అవసరమైన చోట సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ విధానం ద్వారా ఎన్యూమరేటర్లకు పనిభారం తగ్గడంతో పాటు ప్రజలకు కూడా సమయం ఆదా అవుతుందన్నారు. జిల్లాలో సుమారు 6.5 లక్షల జనాభాను దృష్టిలో ఉంచుకొని నిర్దేశించిన సమయంలోగా స్వీయ గణన లక్ష్యాలు సాధించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గతంలో నిర్వహించిన హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (హెచ్ఎల్ఓ)లో సేకరించిన వివరాలను ప్రస్తుత క్షేత్రస్థాయి పరిస్థితులతో సరిపోల్చి పరిశీలించాలని ఆమె సూచించారు. జనాభా పెరుగుదల, కొత్త నిర్మాణాలు, వలసలు, నమోదు కాని నివాసాలు, సంస్థాగత గృహాలు, ఖాళీ ఇళ్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత ప్రొఫార్మాల్లో నమోదు చేయాలన్నారు. ప్రతి హౌస్ లిస్టింగ్ బ్లాక్ (హెచ్ఎల్బీ) పరిధిలోని జనాభాను అంచనా వేసి, అవసరమైన చోట మాత్రమే బ్లాక్‌ల విభజన చేపట్టాలని తెలిపారు. సరిహద్దులను యధాతథంగా ఉంచుతూ.. నిబంధనల ప్రకారం సూపర్వైజరీ సర్కిళ్లను పునర్వ్యవస్థీకరించాలని పేర్కొన్నారు. అలాగే పీఈ యాప్‌లో వివరాలను మార్గదర్శకాల ప్రకారం నమోదు చేయాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, అదనపు కలెక్టర్ శ్రీను, సీపీఓ రాఘవాహన్ ఉన్నారు. -
వంటా వార్పుతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
నారాయణపేట: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరాయి. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వివేకానంద పార్కు వద్ద ఎన్హెచ్ఎం ఉద్యోగులు వంటా వార్పు నిర్వహించి నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వారి నిరసనకు మద్దతు తెలిపిన వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఉద్యోగులు ఇప్పటికీ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాల్లో అభద్రత మధ్య పనిచేయాల్సి వస్తోందన్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఎన్హెచ్ఎం ఉద్యోగుల వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. ఉద్యోగుల రిలే దీక్షలకు డీఎంహెచ్ఓ కార్యాలయం తరఫున డా.సాయిరాం, డా.సత్యప్రకాశ్రెడ్డి, జిల్లా ఆస్పత్రి ఉద్యోగ సంఘం తరఫున డా.బాలాజీ, సత్యనారాయణ మద్దతు తెలిపారు. పీఆర్టీయూ మండల అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, టీఎన్జీవో చైర్మన్ నర్సింహారెడ్డి, ఉపాధ్యక్షులు ఉదయ్‌భాను, విజయ్‌కుమార్, యూటీఎఫ్ అధ్యక్షులు బాలాజీ, భీమయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గోవిందరాజులు, కార్యదర్శి బలరాం నిరసనకు సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో ఎన్హెచ్ఎం ఉద్యోగుల యూనియన్ గౌరవాధ్యక్షుడు బిక్షపతి, అధ్యక్షుడు ప్రసాద్, కోశాధికారి రాఘవేందర్, డా.నర్సింహారావు సగరి, శ్రీలత, వెంకటరమణ, అనురాధ, తిరుపతి, కిరీటి, విరోజ, చందన, శ్వేతశ్రీ, పుష్ప, సరస్వతి, డీడీఎం స్నేహలత, డీఏఎం మమత పాల్గొన్నారు. -
10 నుంచి కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు
● జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ● అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి ● కలెక్టర్ ఖుష్బూగుప్తా, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి జడ్పీ సెంటర్ (మహబూబ్‌నగర్): చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ సమీపంలోని శ్రీ కురుమూర్తిస్వామి దేవస్థానంలో నవంబర్ 10 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో వారు జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. ఎ మ్మెల్యే మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌక ర్యం కలగకుండా ముందస్తు కార్యాచరణతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని, వైద్య శిబిరాలు ఏర్పా టు చేసి 24 గంటల పాటు వైద్య సేవలు అందించాలని సూచించారు. పోలీసు బందోబస్తు పటిష్ఠం చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఘాట్ రోడ్డు పనులు కొనసాగుతున్నందున కొండపైకి వాహనాలను అనుమతించకుండా చూడాలని సూచించారు. నవంబర్ 16న జరిగే ఉద్దాల ఉత్సవానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలని, రహదారుల మరమ్మతులు పూర్తి చేయాలని తెలిపారు. నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుధ్య నిర్వహణ, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పా టు చేపట్టాలని, జాతర ప్రాంతంలో మద్యం విక్రయాలను నియంత్రించాలని అధికారులకు సూ చించారు. కురుమూర్తిస్వామి దేవస్థానాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తాగునీరు, పారిశుధ్యం, వైద్యం, రవాణా, భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించా రు. భక్తులకు సమాచారాన్ని అందించేందుకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, వివిధ శాఖల సమన్వ యం కోసం ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యమైన రోజుల్లో అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, విద్యుత్ అంతరాయాలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. అనంతరం బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను విడుదల చేశారు. సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ శివాని, అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ, ఏఎస్పీ రత్నం, డీఆర్ఓ నిర్మల, ఆలయ చైర్మన్ బత్తుల బాలరాజు, ఈఓ మదన్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
శంకుస్థాపనలతోనే సరి!
మక్తల్ – నారాయణపేట రహదారి విస్తరణకు గ్రహణం ● సీఎం, మంత్రులు రెండుమార్లు శంకుస్థాపన చేసినా మొదలుకాని పనులు ● రూ.237కోట్లతో రోడ్డు విస్తరణపై మీనమేషాలు ● 26 కి.మీ. రహదారిపై నిత్యం ప్రమాదాల ప్రయాణం నారాయణపేట: జిల్లాలోని ప్రధాన రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు శంకుస్థాపన చేసిన రోజు ఎంతో సందడి కనిపించింది. నిధుల ప్రకటనలు హోరెత్తాయి. రోడ్డు విస్తరణపై ప్రజల్లో ఆశలు చిగురించాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం మారలేదు. మక్తల్ – నారాయణపేట రహదారి ఎప్పుడు బాగవుతుందనే ప్రశ్నలు ప్రజలను వెంటాడుతున్నాయి. సుమారు 26 కిలోమీటర్ల మార్గంలో దాదాపు 700 గుంతలు ఉన్నా యని చెబుతున్న వాహనదారులు.. వాటిని తప్పించుకుంటూ, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్ర యాణిస్తున్నారు. రోగులను ఆస్పత్రులకు తరలించే అంబులెన్స్‌లకు సైతం రహదారి దుస్థితి ఇబ్బందిగా మారుతోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. రహదారి నిర్మాణానికి మొదట రూ.200 కోట్లు, అనంతరం రూ.237 కోట్లతో చేపట్టనున్నట్లు ప్రకటించారు. టెండర్ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు చెబుతున్న నేపథ్యంలో పనులు ప్రారంభించడంలో జాప్యానికి కారణమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రెండుసార్లు శంకుస్థాపన జరిగినా పనులు ముందుకు సాగకపోవడాన్ని చూస్తే.. అభివృద్ధి ప్రకటనలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపుతోందని ప్రజలు అంటున్నారు. వాహనదారులకు నిత్య పరీక్ష.. మక్తల్ నుంచి నారాయణపేటకు నిత్యం రాకపోకలు సాగించే ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు రహదారి దుస్థితితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతల కారణంగా ప్రయాణ సమయం పెరుగుతోందని.. ద్విచక్ర వాహనాలు అదుపుతప్పే ప్రమాదం ఉందని వాపోతున్నారు. అత్యవసర సమయంలో రహదారిపై ప్రయాణమే సమస్యగా మారుతుందని ఆవేదన చెందుతున్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
నారాయణపేట: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీను సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో నిర్వహించిన రోడ్డు భద్రతా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రహదారులపై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రమాద బాధితులకు సకాలంలో అత్యవసర వైద్యసేవలు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్అండ్బీ, రవాణా, పోలీసు, మున్సిపల్ శాఖల అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో గుర్తించిన బ్లాక్స్పాట్ల వివరాలను ఆర్అండ్బీ ఈఈ వెంకట రమణయ్య పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. జాతీయ, గ్రామీణ రహదారులపై అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు, ట్రాఫిక్ సూచికలు ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. మున్సిపల్ పరిధిలో రహదారులకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి.. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాల నిలుపుదలను నియంత్రించాలని ఆదేశించారు. మెడికల్ కాలేజీ ప్రవేశ మార్గాల్లో అడ్డంకులు తొలగించి, అంబులెన్సుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలుగకుండా చూడాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యసేవలు, ప్రమాద బాధితులకు అందించే చికిత్స, అంబులెన్స్‌ల లభ్యతపై వైద్యాధికారులు పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. పీఎం రాహత్ పథకం మార్గదర్శకాలపై సంబంధిత అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజల ప్రాణాల రక్షణే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్, ఆర్అండ్బీ, వైద్య ఆరోగ్య, రవాణా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్, డీఎంహెచ్ఓ డా.జయచంద్రమోహన్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా.సంపత్ కుమార్, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డా.మల్లికార్జున్, రవాణాశాఖ అధికారులు రాజేష్, మున్నీ, పీఆర్ ఈఈ అశోక్ కుమార్, డీఈఓ గోవిందరాజులు, ఆర్టీసీ డిపో మేనేజర్ యాకన్న తదితరులు ఉన్నారు. -
ప్రజలకు నష్టం లేకుండా అభివృద్ధి చేపట్టాలి
కోస్గి రూరల్: కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పేరుతో ప్రజలకు నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించడం సరైంది కాదని.. ప్రజా ఆమోదయోగ్యమైన అభివృద్ధి చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కోస్గి పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రులైన పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుగా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే గ్రామస్థాయిలో పట్టభద్రులను గుర్తించి ఓటరు నమోదుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గతంలో నమోదు చేసుకున్న వారు సైతం ఎన్రోల్మెంట్ చేసుకునేలా చొరవ చూపాలని తెలిపారు. కాగా, కొడంగల్ నియోజకవర్గంలో అనుమతులు లేకుండా క్వారీలు, క్రషర్ మిషన్లు కొనసాగుతున్నాయని.. టెక్స్టైల్స్ పార్కు ఏర్పాటుచేసి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో కాలుష్యం వెదజల్లే ప్రమాదం ఉందన్నారు. రేడియల్ రోడ్డు భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందించకుండా దౌర్జాన్యానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. సమావేశంలో నాయకులు వెంకటనర్సింహులు, నరేందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, సాయిలు, లాలప్ప, కృష్ణయ్య, నీలప్ప, వెంకటేశ్, శ్రీశైలం, రాజు, నర్సింహ ఉన్నారు. -
కోస్గి డిపో నుంచిప్రత్యేక బస్సులు
కోస్గి రూరల్: దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం కోస్గి డిపో నుంచి వివిధ రూట్లల్లో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ కొత్తపల్లి రాజయ్య శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 19వ తేదీ వరకు, తిరిగి 22 నుంచి 24వ తేదీ వరకు కోస్గి – మహబూబ్‌నగర్, కోస్గి – హైదరాబాద్ రూట్లలో ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పూర్తిగా తగ్గింది. శుక్రవారం కేవలం 300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు ప్రాజెక్టు ఏఈ సుదర్శన్ తెలిపారు. గురువారం నాటికి నారాయణపూర్ డ్యాం నుంచి రోజువారీగా 5వేల క్యూసెక్కుల నీరు నాలుగు రోజుల పాటు రావడం.. ఆపై 1,000 క్యూసెక్కుల నీరు రెండు రోజులపాటు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో పూర్తిగా తగ్గిందన్నారు. జూరాలపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాలతో పాటు ఆర్డీఎస్ లింక్ కెనాల్, సమాంతర కాల్వ, భీమా ఫేజ్–2కు పూర్తిగా నీటి సరఫరాను నిలిపివేశారు. అదే విధంగా జూరాల ఆయకట్టుకు నాలుగు రోజులుగా సాగునీటి విడుదల నిలిచిపోయింది. ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి నారాయణపేట: దసరా పండుగ సెలవుల్లో సొంతూరు, బంధువుల వద్దకు వెళ్లే వారు తమ ఇళ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్పీ డా.వినీత్ శుక్రవారం ఓ ప్రకటనలో సూచించారు. తాళాలు వేసిన ఇళ్లలో చోరీలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. బంగారు ఆభరణాలు, నగదు, ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. ఎక్కువ రోజుల పాటు ఇంట్లో ఎవరూ ఉండని సందర్భంలో స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని.. లేదా నమ్మకమైన పొరుగు వారికి ఇంటి భద్రతను గమనించాలని చెప్పాలన్నారు. అలాగే ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, భద్రతా అలారం వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ముందుగానే తనిఖీ చేసుకోవాలని సూచించారు. తాము ఊరికి వెళ్తున్నట్లు, ఇంట్లో ఎవరూ లేరనే విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో బహిరంగంగా వెల్లడించవద్దని హెచ్చరించారు. ద్విచక్ర వాహనాలు, కార్లను సురక్షిత ప్రాంతాల్లో పార్క్ చేసి, హ్యాండిల్ లాక్ వంటి భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. కాలనీలు, నివాస ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అత్యవసరమైతే డయల్ 112 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 87126 70399 నంబర్‌కు సంప్రదించాలని ఎస్పీ సూచించారు. -
‘జలసిరి’ లక్ష్యంపై దృష్టి సారించాలి
కోస్గి రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి ఆవశ్యకతను పెంపొందించేందుకు కేంద్రం తీసుకొచ్చిన జలసిరి లక్ష్యాన్ని గడువులోగా పూర్తి చేయాలని జె డ్పీ డిప్యూటీ సీఈఓ సుజాత ఆదేశించారు. గురువా రం కోస్గి ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మే టీలు, సాంకేతిక సహాయకులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. మండలానికి 59 ఫాంపాండ్ల ప్రతిపాదనలకుగాను 44 మంజూరు కాగా.. 15 పనులు కొనసాగుతున్నా యని వివరించారు. బోర్వెల్ రీచార్జ్ 9, ఇంకుడు గుంతలు 1,980గాను 980 మంజూరయ్యాయని మరో రెండ్రోజుల్లో పనులు చేపడతామన్నారు. పనుల్లో వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండలంలోని ముశ్రీఫాలో పాంపాండ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమావేశంలో ఎంపీడీఓ శ్రీధర్, ఏపీఓ జయప్రకాశ్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, రైతులు పాల్గొన్నారు. -
పంచాయతీ కార్మికులతో పనులు..
‘సాక్షి’లో కథనం రావడంతో అప్రమత్తమైన పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్ అప్పటికప్పుడు గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను నర్సరీకి పంపించి చక్కదిద్దే పనులు ప్రారంభించారు. గతంలో మట్టినింపిన సంచు లు చిందరవందరగా పడి ఉండటంతో వాటిని ఓ క్రమపద్ధతిలో అమర్చి ఎండిన నర్సరీని కృత్రిమంగా సృష్టించే ప్రయత్నం చేశారు. పంచాయతీ కార్మికులతో నర్సరీ పనులు చేయించిన విషయమై పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా కూలీలు అందుబాటులో లేకపోవడంతో నర్సరీ పనుల కోసం పంచాయతీ కార్మికులను పంపాల్సి వచ్చిందన్నారు. ఆగస్టులోనే వదిలేసిన నర్సరీలో ఈ నెల 7 వరకు పనులు చేసి బిల్లులు తీసుకున్న విషయమై కార్యదర్శిని అడుగగా గతంలో పనిచేసిన కూలీలకు బిల్లులు చెల్లించకపోవడంతో ఈ నెలలో చెల్లించామని ఓసారి.. ఈ నెలలో చెల్లించలేదని మరోసారి పొంతన లేని సమాధానాలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. కాగా గ్రామంలో నాలుగు నెలల కిందట చెరువు పనులు చేసిన ఉపాధి కూలీలకు నేటికి డబ్బులు చెల్లించకపోయినప్పటికీ ఎలాంటి పనులు జరగని నర్సరీకి సంబంధించిన బిల్లులు మాత్రం వెంటనే చెల్లించడం అధికారుల పనితీరుకు నిదర్శనం. -
పెట్టుబడి కూడా రాదు
తొమ్మిది ఎకరాలలో పత్తి పంట సాగు చేశాను. అంతా వర్షాధార పంటనే. వర్షానికి ఏదో మాయ రోగంవచ్చి కురవకపాయే. పంట ఎదుగలేదు. ఉన్న కాయలతో ఎకరానికి 2–3 క్వింటాళ్ల దిగుబడి రావచ్చు. ధర బాగుంది కానీ.. దిగుబడి లేకపాయే. పెట్టిన పెట్టుబడి సైతం చేతికి రాదు. – దేవ్‌సింగ్ రైతు, కమాల్‌పూర్ తండా అప్పు మిగిలింది.. నేను ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశా. తీవ్ర వర్షభావ పరిస్థితులతో పత్తి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. పంట దిగుబడి లేక కష్టం పోను రూ.1.50 లక్షల వరకు అప్పు మిగిలింది. కౌలు పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – బీర్ల శివ, రైతు, మిడ్జిల్ 22 నుంచి పత్తి కొనుగోళ్లు సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లకు దసరా పండుగ తర్వాత 22 నుంచి స్లాట్లు ఓపెన్ చేస్తాం. ప్రస్తుతం మార్కెట్ ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.8,667 కంటే చాలా ఎక్కువగా ఉంది. దీంతో రైతులు ఎవరూ సీసీఐ కేంద్రాల్లో విక్రయించడానికి రారు. క్వింటాకు రూ.100 వ్యత్యాసం ఉన్నా ఎక్కువ ఎక్కడ ధర ఉంటే అక్కడే అమ్ముతారు. ప్రస్తుతం తాము సీసీఐ ద్వారా కొనుగోళ్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. – రమేష్, సీసీఐ అధికారి ● -
నీటిఎద్దడి నివారణకు ముందస్తు కార్యాచరణ
నారాయణపేట: ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలమట్టాలు తగ్గి రానున్న వేసవిలో నీటిఎద్దడి తీవ్రమయ్యే అవకాశాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం కావాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్‌న్స్ హాల్లో విద్యుత్, వ్యవసాయ, నీటిపారుదల, మిషన్ భగీరథ, భూగర్భ జల వనరులు, పశుసంవర్ధక తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, సమస్యాత్మక గ్రామాలు, తండాలను గుర్తించి ప్రత్యామ్నాయ నీటి వనరులను సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. అక్టోబర్‌లోనే పలు ప్రాంతాల్లో బోర్లు ఎండిపోతున్నట్లు సమాచారం అందుతోందని, గతంలో ఏళ్ల తరబడి నీటిని అందించిన బోర్లు సైతం ప్రస్తుతం ఎండిపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. వేసవి నాటికి సమస్య మరింత తీవ్రమవకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులు, వాటి సామర్థ్యం, సరఫరా పరిస్థితులను అంచనా వేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత శాఖల సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నీటి సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలన్నారు. బోర్ల రీచార్జిపై ప్రత్యేక దృష్టి సారించాలని, మంజూరైన పనులను వేగవంతం చేసి లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నీటి నిల్వలు, భూగర్భ జలమట్టాల పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టి నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. తాగు, సాగునీటి అవసరాలకు విద్యుత్ కీలకమని సరఫరాలో తలెత్తే సమస్యలను వెంటనే పరిష్కరించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. తాగునీటిని వృథా చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని.. వాహనాల శుభ్రతకు తాగునీటిని వినియోగించడం, కొళాయిలను తెరిచి ఉంచడం వంటి చర్యలను నివారించేలా ప్రచారం చేయాలని సూచించారు. పత్రికలు, సామాజిక మాధ్యమాల ద్వారా నీటి సంరక్షణపై విస్తృత ప్రచారం చేపట్టాలని డీపీఆర్వో రషీద్‌ను ఆదేశించారు. తక్కువ నీటితో సాగు చేసే పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ, ఉద్యాన అధికారులకు సూచించారు. రైతువేదికలు, రైతు సదస్సుల ద్వారా నీటిపొదుపు, పంటల వైవిధ్యీకరణపై అవగాహన కల్పించాలని తెలిపారు. వేసవిలో నీటిఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో వ్యవసాయశాఖ అధికారి సక్రియానాయక్, ఉద్యాన అధికారి సాయిబాబా, విద్యుత్‌శాఖ ఎస్ఈ నవీన్, నీటిపారుదలశాఖ డీఈఈ సాల్మన్, పశుసంవర్ధకశాఖ అధికారి జగదీశ్వరి, హౌసింగ్ పీడీ శంకర్, మిషనన్ భగీరథ డీఈఈ రంగారావు, భూగర్భ జల వనరులశాఖ అధికారి, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
ప్రజావీరుడు పండగ సాయన్న : మంత్రి
మక్తల్: పేదల పక్షాన పోరాడిన ప్రజావీరుడు పండుగ సాయన్న అని.. ఆయన స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మండలంలోని ముస్లాయిపల్లిలో పండుగ సాయన్న విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి అ నంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. ముది రాజ్‌లతో పాటు బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. ధనవంతులు, పెత్తందారులు, భూస్వాముల దోపిడీని ఎదిరించి వారి ఆధిపత్యానికి సవాల్ విసిరిన ఽధైర్యశాలి అన్నారు. ఉన్నవారి సంపదను పేదలు, ఆకలితో అలమటిస్తున్న వారికి పంచి అండగా నిలిచి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని.. అందుకే ఆయనను ప్రజలు తెలంగాణా రాబిన్‌హుడ్‌గా గుర్తించారన్నారు. విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని.. రాజకీయ చైతన్యంతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని.. సీఎం రేవంత్‌రెడ్డికి ముదిరాజ్ సామాజికవర్గం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ వాకిటి మానస, బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, సర్పంచ్ పవిత్ర, మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్ద విజయకుమార్, మెట్టుకాడి ప్రభాకర్, చొప్పరి శంకర్, శివకుమార్, జేఏసీ ప్రధానకార్యదర్శి యాదగిరి ముదిరాజ్, బాబు, నాగరాజు, జానకిరాములు, మాజీ సర్పంచ్ మణివర్ధన్, సురేందర్, సర్పంచ్ సూర్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న ఎన్్హెచ్ఎం ఉద్యోగుల సమ్మె
నారాయణపేట: జిల్లాకేంద్రంలోని వివేకానంద పార్కు వద్ద జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె జిల్లాలో గురువారం మూడోరోజుకు చేరింది. మహిళా ఉద్యోగులు ముగ్గులు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ.. చేశారు. ప్రజారోగ్య పరిరక్షణకు అహర్నిశలు శ్రమిస్తున్నప్పటికీ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాల్లో అభద్రత మధ్య పనిచేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, ఏటా ఐదు శాతం వార్షిక ఇంక్రిమెంట్లు అమలు చేయాలని కోరారు. ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పించాలని, తగిన రిటైర్మెంట్ ప్రయోజనాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచి కుటుంబాల భవిష్యత్‌కు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి రాఘవేందర్, సభ్యులు డా. నర్సింహారావు సగరి, మోనేష్చారి, శ్రీలత, వెంకటరమణ, అనురాధ, తిరుపతి, కిరీటి, శ్వేతశ్రీ, విరోజ, చందన, పుష్ప, సరస్వతి, డీడీఎం స్నేహలత, డీఏఎం మమత తదితరులు పాల్గొన్నారు. -
లలిత త్రిపురసుందరిగా అమ్మవారి దర్శనం
నారాయణపేట: జిల్లాలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జిల్లాకేంద్రంలోని అశోక్‌నగర్‌లో కొలువుదీరిన మాతా మల్లాంబికాదేవి ఐదోరోజు గు రువారం లలిత త్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. నిర్వాహకులు అమ్మ వారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ధూల్‌పేట అంబాభవాని మందిర్‌లో ఎస్ఎస్కే సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరన్నవరా త్రి వేడుకల్లో అమ్మవారు లలిత త్రిపురసుందరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మ వారి దివ్యరూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. -
రూ.వేల కోట్లలో నష్టం!
ఉమ్మడి జిల్లాలో 7.50 లక్షల ఎకరాల్లో ఎకరాకు పది క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తే 75 లక్షల క్వింటాళ్ల పత్తి ఉత్పత్తి అయ్యేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాధార పంటల నుంచి ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదు. మొత్తం ఉత్పత్తి 36–45 లక్షల క్వింటాళ్లకు పరిమితమయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దీంతో 29–37 లక్షల క్వింటాళ్ల మేర దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ లోటు రైతులకు రూ.2,500 కోట్ల నుంచి రూ.3,400 కోట్ల వరకు ఆర్థిక నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉంది. -
తవ్వినకొద్దీ అక్రమాలే..!
–IIలో uకోస్గి: మండలంలోని మీర్జాపూర్లో తవ్వినకొద్ది అ క్రమాలు వెలుగు చూస్తున్నాయి. గ్రామానికి తాగు నీరు సరఫరా చేసే పంచాయతీ నీటిట్యాంకు నుంచి సీసీ రోడ్డు పనులకు నీటిని అమ్ముకోవడం, పంచా యతీ ట్రాక్టర్‌ను సొంత ప్రైవేట్ పనులకు విని యోగించిన ఉదాంతంపై ‘సాక్షిశ్రీలో గురువారం‘యథేచ్చగా దోచేస్తున్నారు..!’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ క్రమంలో గ్రామంలో జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గ్రామ శివారులోని శ్మశానవాటికలో ఏర్పాటుచేసిన నర్సరీలో అధికారికంగా 5 వేల మొక్కలు పెంచుతున్నట్లు రికార్డుల్లో నమోదు చేశారు. 2 వేల వరకు మొక్కలు పంపిణీ చేసి నీరు లేకపోవడంతో ఆగస్టులోనే నర్సరీని వదిలేసినట్లు పంచాయతీ కార్యదర్శి బసప్ప చెబుతుండగా.. ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సర్పంచ్ భర్త నర్సింహులు మాత్రం ఈ నెల 7 వరకు నర్సరీలో పనులు చేసినట్లు.. డబ్బులు సైతం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం విశేషం. అయితే నర్సరీకి సంబంధించిన కూలి డబ్బులు పొందిన వారు ఫీల్డ్ అసిస్టెంట్ బంధువులు కావడం మరో విశేషం. కోస్గి ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం మండల అధికారులతో జెడ్పీ డిప్యూటీ సీఈఓ సుజాత ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో మీర్జాపూర్ గ్రామస్తులు గ్రామంలో జరిగిన అక్రమాలపై పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన ఆమె పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని.. ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తిస్తే బాధ్యుల నుంచి రి కవరి చేయాలని ఎంపీడీఓ శ్రీధర్‌ను ఆదేశించారు. ఏ దేమైనా గ్రామంలో జరిగిన అక్రమాలపై సమ గ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మీర్జాపూర్లో నర్సరీ లేకపోయినా.. నిర్వహణ పేరుతో బిల్లుల చెల్లింపు ఈ నెల 7 వరకు కూలీలు పని చేసినట్లు మస్టర్లో నమోదు పొంతన లేని సమాధానాలిస్తున్న పంచాయతీ కార్యదర్శి ‘సాక్షి’ కథనంతో మరిన్ని వెలుగులోకి.. -
సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట : ఎస్పీ
నారాయణపేట: సిబ్బంది సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తున్నామని ఎస్పీ డా. వినీత్ తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాల యంలోని కాన్ఫరెనన్స్ హాల్లో జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందితో నిర్వహించిన పోలీస్ దర్బార్‌లో ఆయన పాల్గొన్నారు. సిబ్బంది సర్వీసుకు సంబంధించిన అంశాలు, విధుల కేటాయింపు, విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, ఇతర ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సిబ్బంది సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు పోలీస్ దర్బార్ మంచి వేదికగా ఉపయోగపడుతుందని తెలిపారు. పోలీస్‌శాఖలో క్రమశిక్షణ, సమయపాలన అత్యంత ముఖ్యమని, విధులకు సకాలంలో హాజరుకావడం, ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించడం, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని స్పష్టం చేశారు. యూనిఫామ్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు విధి నిర్వహణలో వృత్తిపరమైన హుందాతనాన్ని ప్రదర్శించాలని సూచించారు. ప్రవర్తన, క్రమశిక్షణ ప్రజల్లో పోలీస్‌శాఖపై నమ్మకాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రజలకు సేవచేసే అవకాశం పోలీస్‌శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరికీ లభిస్తుందని.. సమస్యలను ఓపికగా వినాలని, బాధితులకు న్యాయం జరిగేలా చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని.. వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ బాధ్యతాగా విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. సిబ్బంది అంకితభావంతో పనిచేస్తూ జిల్లా పోలీస్‌శాఖతో పాటు తెలంగాణ పోలీస్‌శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. సిబ్బంది సంక్షేమానికి అవసరమైన సహకారం అందించేందుకు జిల్లా పోలీస్‌శాఖ కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ ఉల్హక్, ఆర్ఐ విజయభాస్కర్, ఆర్ఎస్ఐ శిరీష పాల్గొన్నారు. -
ఆలయ అభివృద్ధికి కృషి : మంత్రి వాకిటి
మక్తల్: స్థానిక శ్రీ పడమటి ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం ఆలయంలో గరుడ స్తంభం, గడపరాయి ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆయన హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి సుమారు రూ.కోటి ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. రాజగోపురం నిర్మాణానికి రూ.50 లక్షలు, కోనేరుకు రూ.40 లక్షలు, మిగతా వాటికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఉత్సవాల వరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఉత్సవాలను గతంలో కంటే వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ప్రాణేష్‌కుమార్, రాఘవేంద్రస్వామి, బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, పుర చైర్పర్సన్ వాకిటి మానస, కాంగ్రెస్‌పార్టీ పట్టణ అధ్యక్షుడు రవికుమార్, కౌన్సిలర్లు సరిత, రహీం పటేల్, శ్రీవిద్య, జుట్ట అనిత, వాకిటి హన్మంతు, కట్ట సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎత్తిపోతల పనులు అడ్డుకున్న రైతులు నారాయణపేట: తమ భూములకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలంటూ బుధవారం జయమ్మ చెరువుకట్ట నిర్మాణానికి సంబంధించిన పనులను రైతులు అడ్డుకున్నారు. నిర్మాణ ప్రాంతానికి పొక్లెయిన్, వాహనాలు రాగా భూమిపూజ, ఇతర పనులు కొనసాగించవద్దని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి గ్రామంలోని రైతువేదికకు చేరుకొని రైతులతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భూములు కోల్పోతున్న ప్రతి రైతుకు పరిహారం అందించే బాధ్యత తనదేనని.. నష్టం జరగకుండా కృషి చేస్తానని, అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. భూమిపూజ కొనసాగించేందుకు రైతులు సహకరించాలని కోరారు. మీడియా చిత్రీకరణపై అభ్యంతరం.. రైతులతో సమావేశం జరుగుతున్న సమయంలో మీడియా ప్రతినిధులు ఫొటోలు, వీడియోలు తీయడంపై శివకుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తీసిన ఫొటోలు, వీడియోలను తొలగించాలని విలేకర్లకు సూచించారు. పెరపళ్ల రైతుల సమస్యలను ప్రచారం చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానిస్తూ.. మీడియా జో క్యం చేసుకోవద్దని అసహనం వ్యక్తం చేశారు. రేపు కొత్త బార్ల కేటాయింపు నారాయణపేట: జిల్లాలోని మక్తల్, మద్దూర్ ప్రాంతాలకు మంజూరైన బార్ల కేటాయింపునకు 16వ తేదీన శుక్రవారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్లో కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు ప్రొహిబిషన్న్ అండ్ ఎకై ్స జ్‌శాఖ సీఐ సైదులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులందరూ నిర్ణీ త సమయానికి హాజరుకావాలని సూచించా రు. ఎంపిక ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు సూచనలు పాటించాలని పేర్కొన్నారు. -
అప్రమత్తతతోనే సైబర్ నేరాల నియంత్రణ
నారాయణపేట: అప్రమత్తతతోనే సైబర్ నేరాలను నియంత్రించవచ్చని.. అనుమానాస్పద ఫోన్‌కాల్స్, సందేశాలు, లింకులకు స్పందించకుండా నిజానిజాలను నిర్ధారించుకోవాలని ఎస్పీ డా. వినీత్ సూచించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ‘ఆగండి.. ఆలోచించండి.. అడుగు వేయండి’ అనే సైబర్ భద్రత అవగాహన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. విద్యాసంస్థలు, మార్కెట్లు, షాపింగ్‌మాల్స్, సూపర్ మార్కెట్లు, నివాస సంక్షేమ సంఘాలు, మతపరమైన ప్రదేశాలు, జనసమూహ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. అవగాహన ర్యాలీలు, వాకథాన్‌లు, సైకిల్ ర్యాలీలు, వీధి నాటకాలు, స్కిట్లు, పోస్టర్ ప్రదర్శనలు, క్విజ్లు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు, సోషల్ మీడియా ప్రచారాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నట్లు చెప్పారు. -
ఎత్తిపోతల భూ సేకరణ వేగవంతం
నారాయణపేట: మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రియాంక రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్‌న్స్ హాల్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనుతో కలిసి భూ సేకరణ పురోగతిపై తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. భూ సేకరణకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వారితో చర్చల ద్వారా పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు. అవార్డులు, పరిహారం చెల్లింపులు, సర్వేనంబర్లకు సంబంధించిన వివాదాలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలన్నారు. రైతులతో సమన్వయం చేసుకుంటూ భూ సేకరణ ప్రతిపాదనలు, భూ సర్వే, పరిహారం చెల్లింపుల్లో ఉన్న అడ్డంకులను తొలగించి నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఎత్తిపోతల పథకానికి అవసరమైన ప్రభుత్వ భూములు, ఆక్రమణలు లేని భూములు, వాటి స్థితిగతులు, సర్వే వివరాలు తదితర సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. భూ సేకరణకు అనువైన భూములను గుర్తించి అవసరమైన ప్రతిపాదనలను ముందుగానే సిద్ధం చేయాలన్నారు. రానున్న రోజుల్లో ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించే అవకాశం ఉన్నందున భూ రికార్డులు, వివరాల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. రేడియల్ రోడ్డు భూ సేకరణను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని.. క్షేత్రస్థాయిలో సర్వే బృందాలను అందుబాటులో ఉంచి పనులకు ఆటంకం కలిగిస్తున్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు సమన్వయంతో పనిచేస్తూ పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఎదురవుతున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని సూచించారు. వచ్చే వారం మరోసారి సమీక్ష నిర్వహిస్తామని.. అప్పటిలోగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు పురోగతి సాధించాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్డీఓ రమేష్, ఏఓ అనిల్‌కుమార్, ల్యాండ్ సర్వే ఏడీ వేణుగోపాల్‌రెడ్డి, నారాయణపేట, ఉట్కూర్, దామరగిద్ద, మద్దూరు, గుండుమాల్, కోస్గి మండలాల తహసీల్దార్లు అమరేంద్రకృష్ణ, అశోక్‌కుమార్, తిరుపతయ్య, మహేష్, భాస్కరస్వామి, కళ్యాణి, సంబంధిత రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
నిరంతరాయంగా విద్యుత్ సరఫరా
● నల్లమలలో రూ.150 కోట్లతో మౌలిక వసతుల కల్పన ● రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అచ్చంపేట: ప్రజలకు ప్రాణవాయువు లాంటి విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం జిల్లాలోని నల్లమల ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన ఆయన.. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం అచ్చంపేటలోని బీఆర్ అంబేడ్కర్ ప్రజా భవన్లో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్‌వి పాటిల్, ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఇన్చార్జి కలెక్టర్ ఆదర్శ్ సురభి, అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని ఛాబ్రా, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్‌తో కలిసి విద్యుత్‌శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. నల్లమలలో విద్యుత్ వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. సుమారు రూ.150 కోట్లతో విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గంలో సుమారు రూ.78 కోట్ల విలువైన పనులు చేపట్టామని వివరించారు. రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితుల ప్రభావంతో వ్యవసాయం, తాగునీటి అవసరాలు పెరిగే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వీటికి అనుగుణంగా విద్యుత్ డిమాండ్ పెరిగినా.. సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలకు తావివ్వకుండా ఎప్పటికప్పుడు ప్రజలకు మెరుగైన విద్యుత్ అందించాలన్నారు. ఉద్యోగుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. తాగునీటి కొరత రానివ్వొద్దు.. ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. జిల్లాలోని రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని, అవసరమైన చోట్ల చెరువులు, కుంటలను నింపే చర్యలు చేపట్టాలని సూచించారు. రాబోయే రెండేళ్లకు అవసరమైన ఆహార ధాన్యాలు అందుబాటులో ఉన్నాయని.. ఆహార కొరత ఏర్పడుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నల్లమల ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్, బుల్లెట్ ట్రైన్, యంగ్ ఇండియా స్కూల్, దేశంలోనే అతిపెద్ద ఎకో టూరిజం వంటి అభివృద్ధి కార్యక్రమాలతో అచ్చంపేట నియోజకవర్గం అతిపెద్ద అభివృద్ధి జంక్షన్‌గా మారబోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమా ర్క అన్నారు. వీలైనంత త్వరలో ఎకో టూరిజం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఏ ప్రభుత్వలో రానన్ని ట్రాన్స్ఫార్మర్లు ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు. మన్ననూర్‌లో రూ. 74కోట్లతో ఏర్పాటుచేస్తున్న 220/33 కేవీ సబ్‌స్టేషన్‌తో మరో 50 ఏళ్ల వరకు విద్యుత్ సమస్య ఉండదన్నారు. -
యథేచ్ఛగా దోచేస్తున్నారు..!
ప్రైవేట్ పనులకు పంచాయతీ వాహనం.. సీసీ రహదారులకు నీటి విక్రయం‘ఈ ఫొటోలో కనిపిస్తున్న ట్రాక్టర్ కోస్గి మండలం మీర్జాపూర్ గ్రామపంచాయతీకి చెందినది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామంలో చెత్త సేకరణ, ఇతర ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాల్సి ఉంది. కాగా.. ఈ ట్రాక్టర్‌ను నిబంధలకు విరుద్ధంగా గ్రామంలో సీసీ రహదారులు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి కావాల్సిన సిమెంట్ బస్తాలను తరలించేందుకు వినియోగిస్తూ కాంట్రాక్టర్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.’ కోస్గి: గ్రామాభివృద్ధికి తోడ్పడాల్సిన సర్పంచ్ గ్రామానికి సరఫరా చేసే తాగునీటి ట్యాంకు నుంచి సీసీ రహదారుల క్యూరింగ్‌కు ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు నీటిని విక్రయిస్తూ యథేచ్ఛగా డబ్బులు దండుకుంటున్నారు. అలాగే పంచాయతీ ట్రాక్టర్‌ను సిమెంట్ బస్తాలను తరలించేందుకు వినియోగిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కోస్గి మండలం మీర్జాపూర్లో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న నర్సింహులు భార్య అర్చన ఈసారి ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలుపొందారు. దీంతో అటు ఫీల్డ్ అసిస్టెంట్‌గా, ఇటు అనధికార సర్పంచ్‌గా రెండుపాత్రలు పోషిస్తూ ఇష్టరీతిగా వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. మీర్జాపూర్ నుంచి పీసీతండా వరకు చేపట్టిన సీసీ రహదారి పనులకు గ్రామపంచాయతీ ట్యాంకు నుంచి పట్టపగలే ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయడంతో కొందరు యువకులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ భర్త నర్సింహులు అక్కడికి చేరుకోగా తాగేందుకు సరఫరా చేయాల్సిన నీటిని సీసీ రహదారులకు ఎలా అమ్ముకుంటావని అతడితో యువకులు వాగ్వాదానికి దిగారు. ఎవరికై నా చెప్పుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆ యువకులు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు అధికారులకు ఫిర్యాదు చేశారు. సీసీ రోడ్డు క్యూరింగ్ కోసం ట్యాంకర్‌కు రూ.వెయ్యి చొప్పున నీటిని విక్రయిస్తున్నారని.. నర్సరీ లేకపోయినా నర్సరీలో పనులు చేస్తున్నట్లు మస్టర్లో తనకు అనుకూలమైన కొందరు వ్యక్తుల పేరుతో బిల్లులు తయారు చేశారని, పంచాయతీ ట్రాక్టర్‌ను ప్రైవేట్ పనుల కోసం వినియోగిస్తున్నారని, పంచాయతీ నిధుల విషయంలో సైతం పలు అవకతవకలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయా విషయాలను పలుమార్లు పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, మీర్జాపూర్ పంచాయతీ నిధుల దుర్వినియోగం, నిబంధల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామపంచాయతీ వాటర్‌ట్యాంక్ నుంచి సీసీ రోడ్డు క్యూరింగ్‌కు నీటిని తరలించిన విషయం వాస్తవమే. తెలియగానే నీటి సరఫరా ట్యాంకర్‌ను ఆపి వేయించా. పంచాయతీ ట్రాక్టర్ ప్రైవేట్‌గా వినియోగం, ఇతర విషయాలపై విచారణ జరిపి అధికారులకు నివేదిక అందజేస్తాం. – బసప్ప, పంచాయతీ కార్యదర్శి మీర్జాపూర్లో చోటు చేసుకున్న ఘటనలపై గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించాం. సమగ్ర విచారణ అనంతరం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జిల్లా అధికారులకు నివేదిక ఇవ్వడంతో పాటు బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం. – శ్రీధర్, ఎంపీడీఓ, కోస్గి -
రైతులు నీళ్లడిగితే బేడీలు వేస్తారా..?
● ప్రభుత్వ వైఫల్యంతోనే రాష్ట్రంలో కరువు ● మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ● ఇందువాసిలో వలస కూలీల కుటుంబాలకు పరామర్శ గట్టు: పాలమూరు ప్రజలకు కరువు తెచ్చి, రైతులను కన్నీరు పెట్టించడంతో పాటు బేడీలు వేసిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. కర్ణాటకలోని యాదగిరి ప్రాంతానికి వలస వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గట్టు మండలంలోని ఇందువాసి గ్రామానికి చెందిన ఏసేపు, నాగన్న కుటుంబాలతో పాటు క్షతగాత్రులను బుధవారం ఆయన పరామర్శించారు. ఇందువాసికి చెందిన దళిత వలస కూలీ లు మృతి చెందితే సీఎం రేవంత్‌రెడ్డికి పట్టదని.. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులకు పరామర్శించేందుకు తీరక లేదంటూ ఆరోపించారు. కనీసం కలెక్టర్, ఇతర అధికారులు కూడా బాధిత కుటుంబాలను ఇప్పటికి దాకా పరామర్శించక పోవడం దారుణమన్నారు. ఓవైపు తుంగభద్ర, మరోవైపు కృష్ణానదులు ఉన్నా ఇందువాసి గ్రామానికి సాగునీరందని దుస్థితి ఉందన్నారు. అందుకే ఇక్కడ దళిత కుటుంబాలు వలస బాట పట్టాయని ఆరోపించారు. ఎండుతున్న పంటలను చూడలేక జూరాల వద్ద ఆందోళనకు దిగితే ప్రభుత్వం రైతులపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి, బేడీలు వేయిస్తోందని ఆరోపించారు. సాగునీరు లేకపోవడం, కరెంటు సక్రమంగా ఇవ్వక పోవడంతో కరువు వచ్చి వలసలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కూలీలకు రూ.12వేల సాయం ఏమైందని ఆయన ప్రశ్నించారు. కూలీలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వ దగా చేసిందని ఆరోపించారు. ఎల్‌నినో పేరుతో ప్రభుత్వం ప్రజలు, రైతులను భయపెడుతోందని ఆరోపించారు. రైతులకు ఉచితంగా విత్తనాలు అందించడంతో పాటు రైతుభరోసా నిధులు అందించాలని డిమాండ్ చేశారు. ● గట్టు సబ్‌స్టేషన్ నుంచి వ్యవసాయానికి అందిస్తున్న కరెంటుకు సంబంధించిన రికార్డులను హరీశ్‌రావు పరిశీలించారు. 7:16 గంటలు మాత్రమే కరెంట్ సరఫరా చేసిన విషయాన్ని గుర్తించారు. మద్య లో 3 పర్యాయాలు కరెంట్ కట్ చేసినట్లు స్పష్టమైంది. అక్కడి నుంచి రాయపురం స్టేజీ వద్ద ఎండిన వరిపంటను ఆయన పరిశీలించి, రైతుతో మాట్లాడారు. కరెంట్ సక్రమంగా లేకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నట్లు రైతులు హరీశ్‌రావు దృష్టికి తీసుకొచ్చారు. వ్యవసాయానికి పగలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారని.. అదీ కూడా మధ్య మధ్యలో కోతలు పెడుతున్న కారణంగా పంటలను కాపాడుకోలేక పోతున్నట్లు రైతులు వాపోయారు. కాగా, రాయాపురంలో అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ కోసం 60 ఎకరాలు సేకరిస్తున్నారని.. ఈ భూములను నమ్ముకుని తాము బతుకుతున్నామ ని.. సాగు భూములు ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమని రైతులు హరీశ్‌రావు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ విషయంపై కలెక్టర్‌తో మాట్లాడుతామని, రైతులు అధైర్యపడొద్దని సూచించారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అధ్యాపకులు వస్తున్నారు
● పీయూలో రెగ్యులర్ అధ్యాపక పోస్టులకు మోక్షం ● సుమారు పదేళ్ల తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ● జీఓ 21ని సవరించి కొత్తగా జీఓ 31 జారీ చేసిన ప్రభుత్వం ● అనుభవం ఉన్న అధ్యాపకులకు వెయిటేజీ ఇవ్వనున్న అధికారులు ● త్వరలోనే మెజార్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం పీయూతోపాటు జోగుళాంబ గద్వాల, కొల్లా పూర్, నాగర్‌కర్నూల్ పీజీ సెంటర్లతోపాటు కొత్తగా అందుబాటులోకి వచ్చిన లా, ఇంజి నీరింగ్ విభాగాల్లో 19 డిపార్ట్మెంట్లు ఉండగా.. వీటిలో మొత్తం 152 పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో ప్రస్తుతం 18 మంది రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తుండగా.. మిగతా 134 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలో గత కొన్నే ళ్లుగా యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు తమను రెగ్యులర్ చేయాలని, పే స్కేల్ ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వద్ద గురువారం రాష్ట్రస్థాయిలో నిరసన కార్యక్రమం సైతం చేపట్టనున్నారు. మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: యూనివర్సిటీలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా అందులో పనిచేసే అధ్యాపకులే కీలకం. ఈ క్రమంలో అధ్యాపకుల భర్తీ ప్రక్రియ ప్రొఫెసర్ భాగ్యనారాయణ వీసీగా ఉన్న 2014– 15 సంవత్సరాల్లో జరగగా.. ప్రస్తుతం సుమారు పదేళ్ల తర్వాత రెగ్యులర్ అధ్యాపకుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. యూనివర్సిటీ అధికారులు ఇటీవల ప్రభుత్వ అధికారులతో జరిపిన చర్చల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న పోస్టుల్లో మెజార్టీ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఏ యూనివర్సిటికీ ఆ యూనివర్సిటీ పోస్టులను భర్తీ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇందుకు అనుగుణంగా మరో ఐదారు నెలల్లో అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయనున్నట్లు సమాచారం. 80 శాతానికి పైగా మార్కులు.. డిగ్రీలో 80 శాతానికిపైగా మార్కు ఉంటే 15, 80 నుంచి 60 శాతం మధ్యలో ఉంటే 13, 55–60 శాతం ఉంటే 10 మార్కులు, పీజీలో 80 శాతంకన్నా ఎక్కువ ఉంటే 25, 60–80 మధ్యలో ఉంటే 23 మార్కులు, ఎంఫిల్‌లో 60 శాతం కన్నా పైగా ఉంటే 7 మార్కులు, పీహెచ్డీ ఉంటే 30 మార్కులు, నెట్‌తో జేఆర్ఎఫ్ ఉంటే 7, కేవలం నెట్ ఉంటే 5, స్లెట్, సెట్ ఉంటే 3, పబ్లికేషన్స్ 10 టీచింగ్‌లో ప్రతి సంవత్సరానికి 2 మార్కులు, నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్‌కు 3, స్టేట్ లెవల్ అవార్డ్స్‌కు 2.. ఇలా అకాడమిక్స్‌లో 80, రీసెర్చి పబ్లికేషన్స్‌లో 10, టీచింగ్ ఎక్స్‌పీరియన్స్‌లో 10 మార్కులు ఉండగా.. డెమోకు 10, పబ్లికేషన్స్‌కు 3 మొత్తం 100 మార్కులు కేటాయించనున్నారు. అయితే టెక్నికల్, ఇంజినీరింగ్ విభాగంలో మాత్రం మార్పులు చోటు చేసుకోనున్నాయి. డెమోతోపాటు పలు అంశాల్లో మార్కులు వేయనున్నారు. రోస్టర్ ఆధారంగా ఎంపిక.. అధ్యాపకుల నియామక ప్రక్రియ పూర్తిగా కమిటీల ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఇందులో పీయూ వైస్ చాన్స్‌లర్ నామినీగా ఉండడంతోపాటు ఒక సబ్జెక్టు ఎక్స్పర్ట్ ఉండనుండగా వారిని తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నియమించనుంది. బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్పర్సన్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. దరఖాస్తుల పరిశీలనలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ప్రత్యేకంగా ఇంటర్నల్ కమిటీలు కూడా ఉంటాయి. మొత్తం రోస్టర్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. పీయూలో అధ్యాపక పోస్టుల భర్తీ కోసం విధివిధానాలను ప్రభుత్వం జీఓ 31ని విడుదల చేసింది. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న పోస్టులలో ఎన్ని భర్తీ చేయాలనే దానిపై ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అనంతరం రోస్టర్ చేసిన తర్వాత నోటిఫికేషన్‌ను విడుదల చేసి భర్తీ ప్రక్రియ చేపడతాం. ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. అధ్యాపక పోస్టుల భర్తీ వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుంది. ఇదే సమయంలో యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు న్యాయం జరిగేలా చూస్తాం. – జీఎన్ శ్రీనివాస్, వీసీ, పీయూ -
ప్రభుత్వం తక్షణమే స్పందించాలి..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వర్షాభావ మండలాలను వెంటనే కరువు ప్రాంతాలుగా ప్రకటించి, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల చొప్పున పరిహారం చెల్లించాలి. వలసలను అరికట్టడానికి ఉపాధి హామీ పనిదినాలను 120 నుంచి 200 రోజులకు పెంచి పనులు కల్పించాలి. మండల కేంద్రాల్లో తక్షణమే ఉచిత పశుగ్రాస డిపోలు, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేసి పాలమూరును కరువు కోరల నుంచి కాపాడాలి. – వెంకటస్వామి, జిల్లా కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం (ఏఐకేఎస్) ● -
ప్రజావాణి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం
నారాయణపేట: ప్రజావాణి ఫిర్యాదులకు తగిన ప్రాధాన్యతనిస్తూ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆర్డీఓ రమేష్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను అధికారులకు వివరించి వినతులు సమర్పించారు. మొత్తం 20 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ప్రజావాణి అర్జీలను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి తలెత్తకుండా అర్జీలపై బాధ్యతాయుతంగా స్పందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్డీసీ రాజేందర్‌గౌడ్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
గాయత్రిదేవిగా మాతా మల్లాంబికాదేవి
జిల్లాకేంద్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని అశోక్‌నగర్‌లో వెలిసిన మాతా మల్లాంబికాదేవి రెండోరోజు సోమవారం గాయత్రిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు తరలివచ్చారు. అలాగే ధూల్‌పేటలోని అంబాభవాని మందిరంలో అమ్మవారు ఆదిశక్తి రూపంలో, బ్రాహ్మణవాడిలో చౌడేశ్వరి మాత అర్ధనారీశ్వర అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నారాయణపేటఅర్ధనారీశ్వర అలంకరణలో చౌడేశ్వరిమాత గాయత్రిదేవి అలంకరణలో మాతా మల్లాంబికాదేవి -
ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలి
నారాయణపేట: జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, తగ్గుతున్న భూగర్భ జలమట్టాలను దృష్టిలో ఉంచుకొని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు కు ప్రాధాన్యం ఇవ్వాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్.శ్రీను సూచించారు. సోమవారం మండలంలోని సింగారం రైతువేదికలో నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడా రు. నీటిలభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుంటూ, సమగ్ర వ్యవసాయ విధానాలు, సహజ వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తే తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చని తెలిపా రు. ప్రస్తుత వానాకాలంలో వర్షపాతం లోటు, ఎల్‌నినో ప్రభావం వంటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని రైతులు ముందస్తు ప్రణాళికతో సా గు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని 38 రైతువేదికల్లో నిర్వహించిన సమావేశాల్లో సుమారు 4,500 మంది రైతులు, 250 మంది ప్రజాప్రతినిధు లు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొని పంటల సాగు, నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటలపై చర్చించినట్లు పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే జిల్లాలో భూగర్భ జలమట్టాలు సగటున నాలుగు మీటర్ల మేర తగ్గిన నేపథ్యంలో నీటి వినియోగంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూ చించారు. వరికి బదులు కంది, పెసర, మినుము లు, శనగలు, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న వంటి పంటలను సాగు చేయాలన్నారు. పంటల ఎంపిక, సాగు ప్రణాళికలో వ్యవసాయశాఖ అధికారుల సలహాలు తీసుకోవాలని కోరారు. సమగ్ర వ్యవసాయ విధానం, నీటి సంరక్షణను సమన్వయం చేసుకుంటే వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవచ్చని తెలిపారు. ఈ విధానాలను అనుసరిస్తూ అదనపు ఆదాయం పొందుతున్న రైతు ప్రతాప్‌రెడ్డి అనుభవాన్ని ఆయన ప్రస్తావించారు. కార్యక్రమంలో డీఏఓ సక్రియానాయక్, జిల్లా ఉద్యాన అధికారి సాయిబాబా, మార్కెట్ కార్యదర్శి భారతి, సింగారం సర్పంచ్ నాగిరెడ్డి, ఏఓ దినకర్, రైతులు పాల్గొన్నారు. -
ప్రజావాణి వినతులు త్వరగా పరిష్కరించాలి
మరికల్: మండల కేంద్రాల్లో జరిగే ప్రజావాణికి వస్తున్న వినతులను త్వరగా పరిష్కరించేందుకు అన్నిశాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎంఓ ప్రజావాణి రాష్ట్ర కో–ఆర్డినేటర్ సహదేవ్ అధికారులను ఆదేశించారు. సోమవా రం స్థానిక మండల కాంప్లెక్స్‌లో నిర్వహించిన ప్రజావాణిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి వినతులను పరిశీలించారు. ప్రజా సమస్యల పరిష్కారానికే మండలాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నామని.. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ప్రజావాణికి అన్నిశాఖల మండల అధికారులు విధిగా పాల్గొనాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ రాంకోటి, ఎంపీడీఓ పృథ్వీ రాజ్, ఎస్ఐ రాంలాల్ తదితరులు ఉన్నారు. కొనసాగుతున్న రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలు దామరగిద్ద: మండలంలోని కాన్కుర్తి పీఎంశ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో 70వ ఎస్జీఎఫ్ అండర్–14 రాష్ట్రస్థాయి రెజ్లింగ్ టోర్నమెంట్ కం సెలెక్షన్స్ సోమవారం రెండోరోజు కొనసాగాయి. రాష్ట్ర నలుమూలుల నుంచి వచ్చిన 200 మందికిపైగా క్రీడాకారులు పాల్గొంటున్నారని మంగళవారంతో పోటీలు ముగుస్తాయని డీవైఎస్ఓ వెంకటేష్, రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నర్సింహులు తెలిపారు. ఆయా కేటగిరీల్లో గెలుపొందిన క్రీడాకారులు డిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. కార్యక్రమంలో రెజ్లింగ్ అసోసియేషన్ కార్యదర్శి నర్సింహులు కార్యనిర్వాహక కార్యదర్శి రామకృష్ణారెడ్డి, సాయినాథ్, కోచ్ శ్రీనివాస్, వెంకటప్ప, బాలరాజు, రాజశేఖర్, నర్సింహారెడ్డి, బస్వరాజ్, బీరప్ప, శశికాంత్‌రెడ్డి, రాజేష్, రమేష్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇన్స్పైర్ అవార్డులకు 428 నామినేషన్లు నారాయణపేట ఎడ్యుకేషన్: ఇన్స్పైర్ అవార్డులకు జిల్లాలో 428 నామినేషన్లు వచ్చినట్లు జిల్లా విద్యాధికారి డా. గోవిందరాజు తెలిపా రు. సోమవారం జిల్లాకేంద్రంలో ఆయన మా ట్లాడారు. మొత్తం 93 పాఠశాలల నుంచి నామినేషన్లు రాగా.. అందులో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 63, కేజీబీవీలు 12, టీజీ మోడల్ స్కూల్ 2, గురుకుల పాఠశాలలు 4, ప్రాథమికోన్నత పాఠశాలలు 3, ఉండగా.. ప్రైవేట్ పాఠశాలల నుంచి కేవలం నాలుగు మాత్రమే ఆన్లైన్ దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. పటిష్టంగా సమాచార హక్కు చట్టం నారాయణపేట: పాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనం పెంపొందించేందుకు సమాచార హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎలిగండ్ల వెంకటేష్ ముదిరాజ్ కోరారు. సోమవారం జిల్లాకేంద్రంలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా ఇన్చార్జి ఎడ్ల కురుమయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్‌చేసి మాట్లాడారు. కొందరు అధికారులు చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రజలకు సమాచారం అందించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. సమాచార హక్కు చట్టం–2005 ప్రజలకు ప్రభుత్వ పాలనకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కు కల్పించిందన్నారు. ప్రజలు అడిగిన సమాచారాన్ని నిబంధనల ప్రకారం అందిస్తూ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు. చట్టంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడమే వార్షికోత్సవం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వెంకటప్ప, జిల్లా ఉపాధ్యక్షుడు గణేష్, జిల్లా కార్యవర్గసభ్యుడు గణేష్, జిల్లా కార్యదర్శి మురళి, రవినాయక్, కొడంగల్ అసెంబ్లీ ఇనన్‌చార్జి అనంతయ్య, మున్సిపాలిటీ అధ్యక్షుడు నాగేష్, రాము, బాలప్ప, అంజి, ఉప్పరి నరేష్, రమేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఒకే వ్యక్తికి రెండు కుల ధ్రువపత్రాలా?’
నారాయణపేట: నర్వ మండలం సీపూర్కు చెందిన చంద్రశేఖర్ కుల ధ్రువీకరణ పత్రాల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు డా. మంత్రి నరసింహయ్య డిమాండ్ చేశారు. సోమవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రశేఖర్ 2022లో కన్వర్టెడ్ క్రిస్టియన్ బీసీ–సీ, 2025లో సర్పంచ్ ఎన్నికల సమయంలో ఎస్సీ మాదిగ కుల ధ్రువీకరణ పత్రం పొందినట్లు ఆరోపించారు. ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు కుల ధ్రువీకరణ పత్రాలు ఎలా జారీ అయ్యాయనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ విషయమై అదే గ్రామానికి చెందిన దాసరి ఆంజనేయులు ఏప్రిల్ 10న కలెక్టరేట్లో ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారని వివరించారు. విచారణ జరిపి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని హైకోర్టు కలెక్టర్‌ను ఆదేశించినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం నుంచి సోమవారం ఆంజనేయులుకు ఎండార్స్మెంట్ అందినట్లు వివరించారు. అయితే కుల ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధించిన రికార్డులు, సమర్పించిన ఆధారాలను అధికారులు మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని, వాటిని కూడా విచారణలో పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పాక్షికంగా విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలన్నారు. న్యాయం జరగకపోతే న్యాయపరమైన మార్గాలను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. -
తుది జాబితాకు కసరత్తు
● ముగిసిన ‘సర్’ అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ ప్రక్రియ ● పరిశీలనలో నిమగ్నమైన అధికార యంత్రాంగం ● ఉమ్మడి జిల్లాలో 19,307 కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు ● విదేశీ ఓటర్ల నమోదుకు స్పందన కరువు అచ్చంపేట: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా ఉమ్మడి జిల్లాలో దరఖాస్తులు అందాయి. జూన్ 15 నుంచి అక్టోబరు 7 వరకు దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరించడంతోపాటు ద్రువీకరణ పత్రాలు సమర్పించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 18 ఏళ్లు నిండి, ఇప్పటి వరకు ఓటర్ల జాబితాలో పేరు లేని వారు ఫారం–6 ద్వారా 19,307 మంది ఓటర్లు దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు 1,874 మంది అర్హులుగా నిర్ధారించారు. ఫారం–6ఏ ప్రవాస భారతీయ ఓటర్లుగా 33 మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు ముగ్గురిని అర్హులుగా తేల్చారు. ఇక ముసాయిదా జాబితాలో ఓటర్ల తొలగింపునకు 1,478 దరఖాస్తులు ఫారం–7 ద్వారా వచ్చాయి. ఇందులో 656 మంది ఓటర్లు అనర్హులుగా తేల్చి తొలగించారు. కొత్తగా నమోదు కానున్న ఓటర్లను సైతం పరిగణలోకి తీసుకుంటే నవంబరు 9న ప్రకటించనున్న తుది ఓటర్ల జాబితా కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఓటర్ల వివరాల్లో మార్పులు/ తప్పులు, దిద్దబాటు/ చిరునామా మార్పు కోసం ఫారం–8 ద్వారా 29,048 దరఖాస్తులు రాగా.. 1,2147 దరఖాస్తులు మార్పులు చేర్పులు చేశారు. ఓటరు వివరాల్లో మార్పులు, సవరణ, చిరునామా, ఎపిక్ మార్పిడికి దరఖాస్తులు ఎక్కువగా సమర్పించారు. ఈ దరఖాస్తులను నవంబర్ 5లోగా పరిష్కరించి ఆ మేరకు తుది ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు ఈసీ చర్యలు తీసుకోనుంది. వీటిని స్థానిక ఈఆర్వోలు/ ఏఈఆర్వోలు పరిశీలించి పరిష్కరిస్తారు. విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయ పౌరుల నమోదుకు సంబంధించిన ఫారం–6ఏకు ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో స్పందన అంతగా కనిపించలేదు. 13 నియోజకవర్గాల్లో కలిసి 33 దరఖాస్తులు రాగా వాటిలో మూడింటికి పరిష్కారం లభించింది. అలాగే ఓటర్ల వివరాల్లో తప్పులను సరిదిద్దడానికి, చిరునామా మార్పు, పేర్లలో దొర్లిన తప్పులకు సంబంధించి ఫారం–8 ద్వారా పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. పాలమూరులో 5,428 దరఖాస్తులు రాగా 1,869 దరఖాస్తులు సవరించారు. అచ్చంపేటలో 3,050, కొడంగల్‌లో 2,776, దేవరకద్రలో 2,439, నారాయణపేటలో 2,080 దరఖాస్తులు వచ్చాయి. -
413 మంది అభ్యర్థులు హాజరు : ఎస్పీ
నారాయణపేట: జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థుల ఉచిత శిక్షణ ఎంపిక ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాకేంద్రంలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ వినీత్ తనిఖీ చేశారు. మొత్తం 579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 413 మంది పరీక్షకు హాజరయ్యారు. పోలీస్ బందోబస్తు మధ్య పరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. త్వరలోనే ఫలితాలను వెల్లడించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థులకు టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జిల్లా లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు రవికుమార్‌గౌడ్ బృందం సహకారంతో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్‌హక్, డీఎస్పీలు మహేష్, నల్లపు లింగయ్య, సీఐలు శివశంకర్, రాంలాల్, భగవంత్‌రెడ్డి, సైదులు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
బీమా అమలు చేయాలి..
ప్రస్తుతం కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఫసల్‌బీమా యోజనను కచ్చితంగా అమలు చేయాలి. ఇప్పటికే వర్షాలు లేక పంటల సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి లేదు. కేంద్రం అమలు చేస్తున్న ఫసల్‌బీమాతో రైతులకు మేలు చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం మరో ఆలోచన లేకుండా పథకం అమలు చేసి రైతులకు న్యాయం చేయాలి. – వెంకట్‌రెడ్డి, రైతు, మరికల్ ఎండిన పంటలకు వర్తింపజేయాలి.. ఈ ఏడాది వర్షాలు లేక తీ వ్రమైన ఎండలకు భూగ ర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోవడంతో పంటలకు పెట్టిన పెట్టుబడులు చేతికందని పరిస్థితి నెలకొంది. ఎండిన పత్తి, వరి పంటలకు ఫసల్‌బీమా వర్తింపజేయాలి. ఇలాంటి పథకాలు అమలు చేసి రైతులను ఆదుకోవాలి. – వెంకటయ్య, రైతు, మరికల్ ఆదేశాలు రాలేదు.. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఫసల్‌బీమా పథకాన్ని రాష్ట్రంలోని గత ప్రభుత్వం నిలిపివేసింది. ప్రస్తుతం ఎల్‌నినో కారణంగా ఏర్పడిన కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో వచ్చే యాసంగి నుంచి ఫసల్ బీమా అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే రైతుల వివరాలు సేకరిస్తాం. – సక్రియానాయక్, జిల్లా వ్యవసాయ అధికారి -
రైతులకు ధీమా.. ఫసల్ బీమా
మరికల్: ప్రకృతి వైఫరీత్యాలు, అతివృష్టి, అనావృష్టితో పంటలు నష్టపోయిన అన్నదాతల కుటుంబాలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో 2018–19 అనంతరం నిలిపివేశారు. ప్రస్తుతం ఎల్‌నినోను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వచ్చే యాసంగి నుంచి ఈ పథకాన్ని పునరుద్ధరిస్తామని సూత్రప్రాయంగా ప్రకటించింది. తద్వారా జిల్లాలోని 4.50 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. యాసంగిలో ఆకాల వర్షాలు కురిస్తే వరితో పాటు ఇతర పంటలు దెబ్బతింటున్నాయి. వర్షాలు లేకపోతే వరి, మొక్కజొన్న, జొన్న తదితర పంటలకు నష్టం వాటిల్లుతోంది. జిల్లాలో ఏటా పంటలు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా వడగళ్ల వానతో అధిక నష్టం జరుగుతోంది. ఫసల్ బీమా యోజన అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకారం తెలుపడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో అమలు తీరు ఇలా.. గతంలో పంటల బీమాకు నోటిఫికేషన్ విడుదల చేసి రైతుల నుంచి ప్రీమియం వసూలు చేసేవారు. వరికి గ్రామం యూనిట్‌గా, మొక్కజొన్న, కంది, పెసర, మినుము, సోయా, వేరుశనగ పంటలకు మండలం యూనిట్‌గా బీమా వర్తింపజేశారు. వాతావరణ ఆధారిత బీమా పరిధిలో వానాకాలంలో పత్తి ఉంటుంది. వానాకాలం, యాసంగి సీజన్లో ఆకాల వర్షాలు కురిసి పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతుంటారు. అలాంటి వారికి ఊరట కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనను ప్రారంభించింది. అన్నదాతలు పంట రుణం తీసుకునే సమయంలోనే బ్యాంకర్లు పంట రకాన్ని బట్టి వానాకాలం సీజన్‌కు 2 నుంచి 5 శాతం, యాసంగిలో 105 నుంచి 5 శాతం ప్రీమియాన్ని తప్పనిసరిగా కంపెనీకి చెల్లించేవారు. రైతులు చెల్లించిన డబ్బులకు సమానమైన డబ్బులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంపెనీకి చెల్లించేవి. అప్పట్లో పంట నష్టపోతే వరి ఎకరాకు రూ. 37,484 పత్తికి రూ.36,282, మొక్కజొన్నకు రూ.18,742 పరిహారం ఇచ్చారు. సుమారు ఏడేళ్ల పాటు ఈ పథకాన్ని నిలిపివేయడంతో జిల్లా రైతులు ఎక్కువ సంఖ్యలో ఆర్థికంగా నష్టపోయారు. ప్రభుత్వం తాజా ప్రకటనతో జిల్లా రైతులకు ధీమా కలుగుతోంది. రాష్ట్రంలో నిలిపివేసిన గత ప్రభుత్వం వచ్చే యాసంగి నుంచి అమలుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు మళ్లీ చిగురిస్తున్న ఆశలు జిల్లాలో 4.50 లక్షల మంది రైతులు 2022–23 యాసంగిలో వడగళ్ల వానతో జిల్లావ్యాప్తంగా సుమారు 23 వేల ఎకరాల వరి పంట దెబ్బతింది. దీంతో నాటి రాష్ట్ర ప్రభుత్వం బాధిత రైతులకు పరిహారం చెల్లించేందుకు సర్వేను పూర్తి చేయించి ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇస్తామని ప్రకటించింది. అనంతరం అధికారం మారడంతో తమకేం సంబంధం లేదని ప్రస్తుత సర్కార్ చేతులు దులుపుకొంది. ఏదేమైనా రైతులు మాత్రం నష్టపోయారు.గతంలోనూ ఫసల బీమా అమ లై ఉంటే వారికి పరిహారం అంది ఉండేది. -
రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలు ప్రారంభం
దామరగిద్ద: మండలంలోని కాన్కుర్తి పీఎంశ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో 70వ ఎస్జీఎఫ్ అండర్–14 రాష్ట్రస్థాయి రెజ్లింగ్ టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భగా జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ విజయ్‌కుమార్, సర్పంచ్ నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు కాన్కుర్తి జెడ్పీ ఉన్నత పాఠశాల వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులకు అన్ని వసతులు కల్పించామని తెలిపారు. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి సహకారంతో అన్ని ఏర్పాటు చేశామన్నారు. డీవైఎస్ఓ వెంకటేష్ మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకే గ్రామీణ ప్రాంతం వేదికగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 200 మంది క్రీడాకారులు, 50 మంది కోచ్‌లు, మేనేజర్లు క్రీడల్లో భాగస్వాములైనట్లు వివరించారు. అనంతరం క్రీడాజ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నర్సింములు, ఎంఈఓ సురేష్, ఎస్జీఎఫ్ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, ఉప సర్పంచ్ యశోద, వెంకటప్ప, బాలరాజు, పీడీ, పీఈటీలు నర్సింహులు, రత్నయ్య, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. యానగుందిలో నవరాత్రి ఉత్సవాలు నారాయణపేట:యానగుంది క్షేత్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు స్వామివారి మూలవిగ్రహాన్ని రంగురంగుల పూలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక ఆలంకరణలో స్వామివారు -
రోజుకు 30 మందికి ఉపాధి..
1,050 మంది మహిళా సంఘాల సభ్యుల వాటాదారులతో పాటు ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ప్రాసెసింగ్ యూనిట్‌ను నిర్వహిస్తున్నాం. పండ్ల సేకరణ నుంచి గుజ్జు తయారీ వరకు వివిధ పనుల ద్వారా స్థానికులకు ఉపాధి లభిస్తోంది. ఈ యూనిట్ మహిళల స్వయం ఉపాధికి తోడ్పడుతోంది. – కావేరి, బోర్డు డైరెక్టర్, ఎఫ్పీసీ 40 క్వింటాళ్ల కొనుగోలు.. ఎనిమిది రోజుల్లో 40 క్వింటాళ్లకు పైగా సీతాఫలాలను కొనుగోలు చేశాం. ఇప్పటి వరకు 150 కిలోల గుజ్జును తయారుచేసి విక్రయానికి సిద్ధంగా ఉంచాం. ఆశించిన స్థాయిలో పండ్లు లభిస్తే మరింత మందికి ఉపాధి లభించడంతో పాటు మంచి లాభాలు సాధించవచ్చు. – సుజాత, చైర్మన్, ఎఫ్పీసీ ఉపాధే లక్ష్యంగా యూనిట్ ఏర్పాటు.. మహిళలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఎఫ్‌పీఓలను ప్రోత్సహిస్తున్నాం. రూ.10 లక్షల పెట్టుబడితో ఏర్పాటైన సీతాఫల ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా వచ్చిన లాభాలను వాటాదారులకు పంపిణీ చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో పండ్ల లభ్యత తగ్గినా కేంద్రాన్ని కొనసాగిస్తున్నాం. – నారాయణ, ఏపీఎం, నారాయణపేట అంతర్జాతీయ గుర్తింపే లక్ష్యం.. జిల్లాలో మాత్రమే ఈ యూనిట్ ప్రత్యేకంగా కొనసాగుతోంది. గతంలో మూడు యూనిట్లు ఉండగా.. వర్షాభావంతో ఈ ఏడాది సీతాఫలాల దిగుబడి తగ్గడంతో ఒకే కేంద్రాన్ని ప్రారంభించాం. సీతాఫల గుజ్జు ద్వారా నారాయణపేటకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యం. – వెంకట్రాములు, డీఆర్డీఓ, నారాయణపేట ● -
సిరుల పంట.. సీతాఫలం
జిల్లాలోని దామరగిద్దలో ప్రాసెసింగ్ యూనిట్ ● 1,050 మంది మహిళా వాటాదారులతో ఏర్పాటు ● వివిధ కంపెనీలకు గుజ్జు విక్రయం ● బెనిషా స్టేట్ ఫెడరేషన్ ద్వారా మార్కెటింగ్ ● గతేడాది రూ.22 లక్షల టర్నోవర్.. రూ.3 లక్షలకు పైగా లాభం ● కిలో పండ్లు రూ.16కు కొనుగోలు.. ఇప్పటి వరకు 150 కిలోల గుజ్జు తయారీ ● మహిళల చేతుల్లో ఉపాధి మంత్రం -
దసరాకు762 ప్రత్యేక బస్సులు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: దసరా పండుగ సెలవులను దృష్టిలో ఉంచుకుని మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఈ నెల 9 నుంచి 22వ తేదీ వరకు మొత్తం 762 ప్రత్యేక బస్సులను నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు. అయితే, ఈ వివరాలను శనివారం అధికారికంగా ప్రకటించడం గమనార్హం. డిపోల వారీగా బస్సుల వివరాలు.. ప్రత్యేక బస్సుల నిర్వహణలో భాగంగా ఈ నెల 9న 88, 10న 43, 11న 63, 12న 34, 13న 29, 14న 38, 15న 22, 16న 68, 17న 79, 18న 77, 19న 70, 20న 34, 21న 29 బస్సులను నడపాలని ప్రణాళిక రూపొందించారు. చివరి రోజైన ఈ నెల 22న మరో 88 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. డిపోల వారీగా నాగర్‌కర్నూల్ నుంచి 123, నారాయణపేట నుంచి 91, గద్వాల నుంచి 85, అచ్చంపేట, వనపర్తి డిపోల నుంచి 80 చొప్పున, మహబూబ్‌నగర్ నుంచి 78, షాద్‌నగర్ నుంచి 77, కల్వకుర్తి నుంచి 68, కొల్లాపూర్ నుంచి 52, కోస్గి నుంచి 28 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ రూట్లో అధిక ట్రిప్పులు.. హైదరాబాద్ రూట్లో ప్రయాణికుల రద్దీ ఎ క్కువగా ఉండటంతో ఈ మార్గంలో అధిక సంఖ్యలో అదనపు బ స్సులను నడుపుతున్నా రు. ఈ మార్గం ద్వారా ఆర్టీసీకి ఎక్కువ ఆదా యం వచ్చే అవకాశం ఉంది. కర్నూలు రూట్లోనూ అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని బస్టాండ్లలో అదనపు వాలంటీర్లను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం తాగునీరు, షెల్టర్లు, కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. బస్సుల వివరాలు, ప్రయాణ సూచనలను ఎప్పటికప్పుడు తెలియజేసేలా చర్యలు చేపట్టారు. ఆర్టీసీ ఆదాయం పెరిగే అవకాశం.. దసరా పండుగ నేపథ్యంలో సాధారణ రోజులతో పోలిస్తే మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్ ఆదాయం కొంత పెరిగే అవకాశం ఉంది. పండుగ ప్రారంభమైన తొలి మూడు రోజులు, పండుగ ముగిసిన తర్వాత రెండు రోజులు ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. దీంతో ఆర్టీసీ ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ రూట్లోనే అధికంగా అదనపు ట్రిప్పులు ఈ నెల 22 వరకుప్రత్యేక బస్సుల నిర్వహణ బస్టాండ్లలో తాగునీరు, షెల్టర్లు, కూర్చునేందుకు కుర్చీలు సద్వినియోగం చేసుకోవాలి దసరా పండుగను పురస్కరించుకొని ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు బస్సులు నడుపుతున్నాం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అనుమతి లేని ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించవద్దు. ఆర్టీసీ బస్సు ల్లో ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. బస్టా ండ్లలో వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. – పి.సంతోష్‌కుమార్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్, మహబూబ్‌నగర్ -
బతుకును ఇచ్చే తల్లి.. బతుకమ్మ!
● పాలమూరులో నాటి బొడ్డెమ్మ.. నేటి బతుకమ్మ ● వెయ్యేళ్ల చరిత్ర.. తరతరాల సాంస్కృతిక వారసత్వం ● కుప్పాంబిక కాలం నుంచే బొడ్డెమ్మ వేడుకలు ● వందమంది కవులతో ‘బతుకమ్మ మొగ్గలు’ ● ‘సాక్షి’తో పాలమూరు సాహితీ అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ స్టేషన్ మహబూబ్‌నగర్: పూలను పేర్చి బతుకును కొలిచే పండుగ.. ఆడబిడ్డల ఆటపాటల్లో ఆత్మీయతను పంచే వేడుక.. ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ అస్తిత్వాన్ని చాటే సాంస్కృతిక సంబురం బతుకమ్మ. తరతరాలుగా వస్తున్న ఈ పండుగకు పాలమూరుతో విడదీయలేని అనుబంధం ఉంది. నేటి బతుకమ్మ వేడుకల వెనుక నాటి బొడ్డెమ్మ సంప్రదాయం, సంస్థానాల కాలం నాటి చరిత్ర, సాహిత్య పరిమళాలు దాగి ఉన్నాయని పాలమూరు సాహితీ అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ వివరించారు. బతుకమ్మ పండుగ విశిష్టత, పాలమూరు సాహిత్యంలో దాని స్థానం గురించి ఆయన ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే.. నాటి బొడ్డెమ్మ.. నేటి బతుకమ్మ బతుకమ్మ పేరు విస్తృతంగా ప్రచారంలోకి రాకముందు దక్షిణ తెలంగాణలో బొడ్డెమ్మ సంప్రదాయం ప్రాచుర్యంలో ఉండేది. ఆడబిడ్డలంతా ఒకచోట చేరి ఆటపాటలతో సందడి చేసేవారు. కాలక్రమంలో ఈ సంప్రదాయం బతుకమ్మ వేడుకలతో మమేకమైందని చెప్పవచ్చు. ఈ పండుగకు సుదీర్ఘ చరిత్ర ఉంది. పాలమూరు ప్రాంతానికి చెందిన తొలి తెలుగు కవయిత్రిగా గుర్తింపు పొందిన కుప్పాంబిక 13వ శతాబ్దంలో తన రాజధాని బుద్ధపురం (నేటి భూత్పూర్)లో దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేవారు. ఆ ఉత్సవాల్లో బొడ్డెమ్మ వేడుకలకు ప్రత్యేక స్థానం ఉండేది. వేడుకల్లో పాల్గొన్న మహిళలకు చీరలు, బహుమతులు అందించి గౌరవించేవారు. సంస్థానాల్లోనూ ఘనంగా.. పాలమూరు ప్రాంతంలోని సంస్థానాల కాలంలోనూ దసరా ఉత్సవాలు అట్టహాసంగా జరిగేవి. జటప్రోలు, గద్వాల, వనపర్తి, ఆత్మకూరు, అలంపూర్, గోపాలపేట తదితర సంస్థానాల్లో మహిళలు బొడ్డెమ్మ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించేవారు. తెలంగాణలోని పలు సంస్థానాల్లోనూ ఈ సంప్రదాయం కొనసాగినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. తరతరాలుగా కొనసాగుతున్న ఈ వేడుకలు నేటి బతుకమ్మ పండుగలోనూ సంస్కృతి, సంప్రదాయాల వారసత్వాన్ని చాటుతున్నాయి. బతుకమ్మపై విస్తృత సాహిత్యం పాలమూరు సాహిత్య ప్రపంచంలో బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగ ఇతివృత్తంగా పలువురు కవులు, రచయితలు పద్యాలు, కవితలు, గేయాలు, కథలు రచించారు. 19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు వేపూరు హనుమద్దాసు రామాయణ గాథను బతుకమ్మ పాట రూపంలో రచించడం విశేషం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పాటల రూపంలో ప్రజలకు చేరువ చేయడంలో ఇలాంటి రచనలు కీలక పాత్ర పోషించాయి. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం రంగాపురం గ్రామానికి చెందిన ప్రముఖ కవి, పరిశోధకులు గుండోజు యాదగిరి ‘సమ్మక్క సారలమ్మ బతుకమ్మ పాట’ పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు. కల్వకుర్తికి చెందిన డా.ద్యాప విజితారెడ్డి ‘బతుకమ్మ పండుగ– పరిశీలన’ అంశంపై పరిశోధన చేశారు. వీరేకాక ఇంకా చాలామంది కవులు బతుకమ్మపై వివిధ ప్రక్రియల్లో రచనలు చేశారు. తెలంగాణ అస్తిత్వానికి పతాక రంగురంగుల పూలతో అలంకరించే బతుకమ్మ కేవలం పండుగ మాత్రమే కాదు.. ఊరువాడలను ఒక్కటి చేసే సామూహిక సంబురం. మహిళల ఆటపాటలు, ప్రకృతి ఆరాధన, ఆత్మీయత కలగలిసిన ఈ వేడుక తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక. బతుకమ్మ పాటల్లో ప్రకృతి సౌందర్యం ప్రతిఫలిస్తుంది. ఈ పండుగ మహిళా జీవితాలకు ఆనందాన్ని పంచుతూ తెలంగాణ అస్తిత్వాన్ని తరతరాలకు చాటుతోంది. వందమంది కవులతో ‘బతుకమ్మ మొగ్గలు’ బతుకమ్మ సాహిత్యాన్ని మరింత విస్తృతంగా పాఠకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో తన సంపాదకత్వంలో వందమంది కవులు రచించిన కవితలతో ‘బతుకమ్మ మొగ్గలు’ పుస్తకాన్ని పాలమూరు సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ప్రచురించాం. 2019లో వనపర్తిలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మహబూబ్‌నగర్‌లో మరో కార్యక్రమంలో మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు. బతుకమ్మపై మరింత సాహిత్యం రావాల్సిన అవసరం ఎంతో ఉంది. బతుకమ్మ మొగ్గలు రంగురంగుల పూలతో అందంగా అలంకరిస్తూనే ఊరువాడంతటినీ ఏకం చేసే పండుగ తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ. బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాల అంటూ పాడుతూనే మహిళామణులంతా ఆడుతూ వీనుల విందు చేస్తారు. మహిళా జాతికి మణిహారం బతుకమ్మ పండుగ. ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని కీర్తిస్తూనే తీరొక్క పూలతో బతుకమ్మను ఆరాధిస్తారు. తెలంగాణ అస్తిత్వానికి అసలైన పతాక బతుకమ్మ. – డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ -
దరఖాస్తుల ఆహ్వానం
నారాయణపేట: జాతీయ ఆయుష్ మిషన్ పబ్లిక్ హెల్త్ప్రోగ్రామ్ కింద జిల్లాలో 8 ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ప్రియాంక శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు నెలకు రూ.40 వేలు, ఒక ఫార్మసిస్ట్ పోస్టుకు రూ.15 వేలు, ఒక సైకోసోషియల్ కౌన్సిలర్ పోస్టుకు ఒక్కో సెషన్‌కు రూ.500, యోగా ప్రొఫెషనల్ పోస్టుకు నెలకు రూ.28 వేలు, రెండు మల్టీపర్పస్ వర్కర్ పోస్టులకు నెలకు రూ.15 వేల చొప్పున వేతనం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. 2026, జూలై 1 నాటికి 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు అర్హులని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు, రిజర్వేషన్లు వర్తిస్తాయని వివరించారు. ఈ నెల 12 నుంచి 22వ తేదీ వరకు పని దినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. దరఖాస్తును స్వయంగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా జిల్లా వైద్య, ఆ రోగ్య కార్యాలయం, సింగారం గేట్, నారాయణపేట–509210 చిరునామాకు పంపించా లని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయంపై కృషి సఖిలకు శిక్షణ నారాయణపేట: రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించే లక్ష్యంతో జిల్లా వ్యవసాయశాఖ, గ్రామభారతి ఫౌండేషనన్ సంయుక్తంగా జిల్లాకేంద్రంలోని జేసీ ఫామ్స్‌లో శనివారం కృషి సఖీలకు ఐదురోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్న్ లక్ష్యాలు, నేల ఆరోగ్య పరిరక్షణ, రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించడంతో కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను గ్రామస్థాయిలో రైతులకు చేరవేయడంలో కృషి సఖీలు కీలకపాత్ర పోషించాలని సూచించారు. గ్రామభారతి ఫౌండేషన్ చైర్మన్, డీఎంహెచ్ఓ డా. జయచంద్రమోహన్న్ మాట్లాడుతూ.. శిక్షణలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, ఆరోగ్యకర ఆహారం, వివిధ కషాయాలు, జీవామృతం తయారీ, వినియోగం, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై క్షేత్రస్థాయి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామాల్లోని రైతులకు వివరించి ప్రకతి వ్యవసాయ విస్తరణకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కోస్గి సహాయ వ్యవసాయ సంచాలకుడు రామకృష్ణ, నారాయణపేట ఏఓ దినకర్, గ్రామభారతి ఫౌండేషన్ సభ్యుడు సత్యనారాయణ, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సభ్యుడు ఉపేందర్, వివిధ మండలాలకు చెందిన కృషి సఖీలు, రైతులు పాల్గొన్నారు. -
పోలీసుల అంకితభావం అభినందనీయం
నారాయణపేట: ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసులు నిరంతరం విధులు నిర్వర్తిస్తున్నారని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అన్నారు. శుక్రవారం రాత్రి జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీసుల ఆత్మీయ సమ్మేళనం (బడాఖానా)లో కలెక్టర్‌తో పాటు ఎస్పీ డా. జి.వినీత్ దంపతులు, పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాపోటీలు, దాండియా, బతుకమ్మ పాటలు, నృత్యాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా విజయవంతంగా నిర్వహించడంతో ఎస్పీతో పాటు పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించారు. విధి నిర్వహణలో పోలీసులు తమ వ్యక్తిగత సమయాన్ని త్యాగం చేస్తుంటారని, వారికి కుటుంబ సభ్యులు అందించే సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. కుటుంబసభ్యుల సహకారంతోనే.. పోలీసుల విధి నిర్వహణ వెనుక కుటుంబసభ్యుల త్యాగం, సహకారం, ప్రోత్సాహం ఉన్నాయని ఎస్పీ డా. జి.వినీత్ పేర్కొన్నారు. ఏడాది కాలంగా కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు పోలీసు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అంకితభావాన్ని కొనసాగిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్‌హక్, డీఎస్పీలు మహేష్, నల్లపు లింగయ్య, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
పండ్ల సేకరణ నుంచి ప్యాకింగ్ వరకు..
ఈ నెల 2న గాంధీజయంతికి ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి సీతాఫలాలను సేకరించి గుజ్జు తయారీ ప్రక్రియ చేపడుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 40 క్వింటాళ్ల సీతాఫలాలను కొనుగోలు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మాగిన పండ్ల నుంచి ఇప్పటి వరకు 150 కిలోల గుజ్జును తయారుచేసి విక్రయానికి సిద్ధం చేశారు. సేకరించిన పండ్లను మాగబెట్టడం, గుజ్జు, విత్తనాలను వేరు చేయడం, ప్యాకింగ్ చేయడం, ఫ్రీజర్లలో నిల్వ చేయడం వంటి పనులు మహిళలే నిర్వహిస్తున్నారు. కిలో సీతాఫలాన్ని రూ.16 చొప్పున కొనుగోలు చేస్తుండటంతో స్థానికంగా పండ్లు సేకరించి తెచ్చేవారికీ ఆదాయం లభిస్తోంది. ప్రాసెసింగ్ కేంద్రంలో పనిచేసే వారితో పాటు పండ్ల సేకరణ, రవాణా వంటి పనుల్లోనూ గ్రామీణులకు ఉపాధి దొరుకుతోంది. రోజుకు సుమారు 30 మంది ప్రత్యక్షంగా పనిచేస్తుండగా, పండ్లు సరఫరా చేసే మరో 30 మందికి ఉపాధి లభిస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. -
ప్రశాంతంగా ముగిసిన ఆర్టీసీ ఎన్నికలు
నారాయణపేట: నారాయణపేట, కోస్గి డిపోల్లో శుక్రవారం టీఎస్ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. రాష్ట్ర, రీజియన్‌స్థాయి గుర్తింపు సంఘాల ఎంపికకు నిర్వహించిన ఎన్నికల్లో కార్మికులు పాల్గొని ఓటుహక్కు వినియోగించుకున్నారు. నారాయణపేటలో టీడబ్ల్యూయూ–ఎస్‌డబ్ల్యూఎఫ్ ఐక్య కూటమి, కోస్గిలో టీడబ్ల్యూయూ విజయం సాధించాయి. ఆయా డిపోల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ కార్మిక సంఘాల కూటములు ఎన్నికల బరిలో నిలవడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. పోలింగ్ ముగియడంతో అభ్యర్థులు, కార్మిక సంఘాల నాయకుల్లో ఫలితాలపై సాయంత్రం 7 గంటల వరకు ఉత్కంఠ నెలకొంది. రీజియన్ పరిధిలోని డిపోల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టి సంబంధిత అధికారులకు నివేదించగా.. తుది ఫలితాలను ఈ నెల 17న అధికారికంగా ప్రకటించనున్నారు. విధుల్లో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. నారాయణపేట డిపోలో.. నారాయణపేట డిపోలో మొత్తం 285 మంది ఓటర్లకుగాను 283 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 99 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. రాష్ట్రస్థాయి గుర్తింపు కోసం క్లాజ్–3, రీజియన్‌స్థాయి గుర్తింపు కోసం క్లాజ్–6 కింద ఓటింగ్ నిర్వహించారు. క్లాజ్–3లో 194 ఓట్లు, క్లాజ్–6లో 203 ఓట్లు పడ్డాయి. ఎన్నికల్లో టీడబ్ల్యూయూ–ఎస్‌డబ్ల్యూఎఫ్ ఐక్యకూటమికి 203 ఓట్లు సాధించగా.. టీజేఎంయూకు 72 ఓట్లు వచ్చాయి. 131 ఓట్ల ఆధిక్యంతో టీడబ్ల్యూయూ–ఎస్‌డబ్ల్యూఎఫ్ ఐక్యకూటమి విజయం సాధించింది. తెలంగాణ జాతీయ మజ్ధూర్ యూనియన్‌కు క్లాస్–3లో 66 ఓట్లు, క్లాస్–6 లో 72 ఓట్లు వచ్చాయి. అలాగే ఎంప్లాయీస్ యూనియన్‌కు క్లాజ్–3లో 20 ఓట్లు, తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు 4 ఓట్లు, సామాజిక తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు ఒక ఓటు వచ్చింది. కోస్గి డిపోలో బాణం గుర్తు విజయకేతనం ఎగురవేసింది. టీడబ్ల్యూయూకు 55 ఓట్లు రాగా.. ఎంప్లాయీస్ యూనియన్‌కు 46 ఓట్లు వచ్చాయి. 9 ఓట్ల ఆధిక్యంతో టీడబ్ల్యూయూ విజయకేతనం ఎగువేసింది. మొత్తం 110 మందికిగాను 107 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. బహుజన వర్కర్స్ యూనియన్‌కు క్లాజ్–3లో 1, క్లాజ్–6లో 1 ఓటు, ఉద్యోగుల సంఘానికి క్లాజ్–3లో 43, క్లాజ్–6లో 46 ఓట్లు, కార్మిక సంఘానికి క్లాజ్–3లో 1, క్లాజ్–6లో 1 ఓటు, తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సంఘానికి క్లాజ్–3లో 57, క్లాజ్–6లో 55 ఓట్లు, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్‌కు క్లాజ్–3లో 1 ఓటు వచ్చింది. అలాగే తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్‌కు క్లాజ్ 3లో 4 ఓట్లు, క్లాస్ 6లో 3 ఓట్లు వచ్చాయి. సామాజిక తెలంగాణ మజ్దూర్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్, కార్మిక పరిషత్, బహుజన కార్మిక యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్లకు ఒక్క ఓటు పడలేదు. నారాయణపేట, కోస్గి డిపోల్లో బాణం జోరు -
నవరాత్రి ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం
అలంపూర్: జోగుళాంబదేవి శరన్నవరాత్రి ఉ త్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆహ్వానించినట్లు అలంపూర్ క్షేత్ర ఆలయాల ఈఓ దీప్తి తెలిపారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ హన్మంతురావు, ఈఓ దీప్తి, గద్వాల సంస్థాన వారసులు కృష్ణ రాంభూపాల్ శుక్రవారం కలిశారు. ఆదివారం నుంచి జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి దేవస్థానంలో జరిగే దసరా ఉత్సవాలకు సీఎంను ఆహ్వానించినట్లు చెప్పారు. అలాగే జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామివారి జ్ఞాపికను సీఎంకు అందజేశారు. రేపు జిల్లాస్థాయి ఖో–ఖో జట్ల ఎంపికలు మరికల్: మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం జిల్లాస్థాయి బాల, బాలికల ఖో–ఖో జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు పీడీ వెంకటేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు ఆధార్‌కా ర్డు, బోనోఫైడ్ ధ్రువపత్రాలతో హాజరుకావా లని పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 15 నుంచి 17 వరకు రంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతానికి కృషి కోస్గి రూరల్: కొడంగల్ నియోజకవర్గంలో మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర మార్కెటింగ్ అదనపు సంచాలకుడు రవికుమార్, అదనపు జాయింట్ డైరెక్టర్ మల్లేషం అన్నారు. శుక్రవారం కోస్గిలోని మా ర్కెట్యార్ఢు ఆవరణలో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, రైతులు, ఎఫ్పీఓలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి మాట్లాడారు. స్థానిక మార్కెట్‌యార్డుకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. రూ.4. 50 కోట్లతో మార్కెట్‌యార్డు భవన నిర్మాణం, కవర్‌షెడ్, ఆవరణలో సీసీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. నియోజకవర్గ రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులను ప్రస్తుతం మహబూబ్‌నగర్, జడ్చర్ల, పరిగి, తాండూర్, నారాయణపేట ప్రాంతాలకు తరలించి విక్రయిస్తుండటంతో రవాణా ఖర్చులు భారమవుతున్నాయని.. సమస్య పరిష్కారానికి కోస్గి మార్కెట్‌యార్డును ఆధునికీకరిస్తున్నామని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కనీస మౌలిక వసతులు కల్పించడంతో పాటు సీసీ కెమెరాలు, ఆర్వోప్లాంట్, మురుగుడొడ్లు, వే బ్రిడ్జి, ఆధునాతన షెడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామని వివరించారు. వారి వెంట జిల్లా మార్కెటింగ్ అధికారి బాలమణి, మార్కెట్‌యార్డు కార్య దర్శి రాములు, ట్రేడర్లు వీరన్న, లింగమయ్య, మార్కెట్ సిబ్బంది ఉన్నారు. -
అసలేం జరుగుతోంది..?
నారాయణపేట: మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా మండలంలోని పేరపళ్లలో చేపడుతున్న భూ సేకరణ వ్యవహారం ఇప్పుడు అనేక ప్రశ్నలకు తావిస్తోంది. జాయమ్మ చెరువు పరిధిలో ముంపునకు గురయ్యే భూముల విస్తీర్ణం, రెవెన్యూ రికార్డుల్లో నమోదైన భూమి, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ విస్తీర్ణం మధ్య తేడాలపై రైతుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు భూముల హద్దులు, విస్తీర్ణంపై స్పష్టత కోసం రీ–సర్వే చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో చేపట్టిన సర్వేపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అధికారులు తిరిగి సర్వే నిర్వహించారు. సర్వేనంబర్ 87, 92, 111లో అసలు భూమి ఎంత? జాయమ్మ చెరువు రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న 87, 92, 111 సర్వేనంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమి ఎన్ని ఎకరాలు, అందులో రైతుల వద్ద ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలు, ధరణి/భూ భారతి రికార్డులు, పాత పహాణీలు, సర్వేనంబర్లు, సబ్–డివిజనన్ వివరాల ప్రకారం విస్తీర్ణం.. భూ సేకరణ సర్వేలో గుర్తించిన విస్తీర్ణంలో తేడా ఎందుకు వచ్చిందన్నది తేలాల్సి ఉంది. రైతులకు నష్టం కలగకుండా భూ వివరాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి పారదర్శకంగా సర్వే చేయాలని కలెక్టర్ ఓ వైపు అధికారులను ఆదేశిస్తూ వస్తున్నారు. సర్వే ప్రక్రియలో ఒక్క గుంట కూడా తేడా రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపారు. పరిహారమే అసలు పంచాయితీ.. ప్రాజెక్టు నిర్మాణంలో భూమి కోల్పోతున్న రైతుకు సరైన పరిహారం అందించేందుకే రీ–సర్వే ప్రాతిపదిన. భూ విస్తీర్ణం పెరిగితే పరిహారం లెక్క మారుతుంది. భూమి తగ్గితే రైతుకు నష్టం. తప్పుడు హద్దులు నమోదైతే వివాదం. ప్రభుత్వ భూమి, పట్టా భూమి గుర్తింపులో పొరపాటు జరిగితే మరింత పెద్ద సమస్య. అందుకే సర్వే రికార్డు నుంచి అవార్డు వరకు ప్రతి దశను బహిరంగంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. దళారుల పాత్రపై నిఘా ఉందా? భూ సేకరణ సమయంలో రైతులకు అందాల్సిన పరిహారం చుట్టూ మధ్యవర్తులు, పైరవీకారులు రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు ఓ వైపు ససేమిరా అంటున్నా.. మరోవైపు అధికార పార్టీ వత్తిళ్లతో సర్వేలో సర్దేస్తారనే ప్రచారం కొనసాగుతుంది. పేరపళ్ల జాయమ్మ చెరువు రిజర్వాయర్ ముంపు భూముల పరిహారం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కొంతమంది పేరపళ్ల రైతులను ఓ భవన్‌కు పిలిపించి పట్టాదారు పాసు పుస్తకాలు ఉండి ప్రస్తుతం భూమి లేని రైతులు.. భూమి సాగు చేసుకుంటున్న రైతుల మధ్య పరిహారం విషయంలో సర్దుబాటు చేసుకోవాలని అధికార పార్టీకి చెందిన దూత సూచించినట్లు తెలుస్తోంది. తమ సమస్య పరిష్కారానికి పిలిచారని భావించి వచ్చిన తమకు.. పరిహారం పంచుకునే అంశం తెరపైకి తీసుకురావడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. భూమి హక్కు ఎవరికి ఉందో రికార్డుల ఆధారంగా తేల్చాల్సింది పోయి.. పరిహారం విషయంలో రైతుల మధ్య సర్దుబాటు ఎందుకని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. జాయమ్మ చెరువు రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న గుట్ట ఇదే పేరపళ్ల జాయమ్మ చెరువు రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న గుట్టంతా సర్వేనంబర్ 92లోనే ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కానీ అదే గుట్టపై కొందరి పేర్లపై పట్టాదారు పాసు పుస్తకాలు.. మరికొందరుకాస్తులో లేకపోవడం పరిహా రం విషయంలో కొత్త ప్రశ్నలకు తెరతీస్తోంది. పట్టాదారు పాసు పుస్తకాలున్నా.. తమకు పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. అందరికీ న్యా యం చేయాలని.. లేకపోతే రిజర్వాయర్ పనులను అడ్డుకుంటామని కొందరు రైతులు హెచ్చరిస్తుండటంతో పరిహారం పంచాయితీ మొదలైందని చెప్పవచ్చు. పేరపళ్ల భూ సేకరణపై ఉత్కంఠ రికార్డులు, క్షేత్రస్థాయి విస్తీర్ణంలో తేడాలపై అనుమానాలు రైతుల పరిహారంపై ఒత్తిళ్లు.. మధ్యవర్తుల హడావుడి అర్హులకే చెల్లిస్తామంటున్న అధికారులు -
చేనేతకు పూర్వ వైభవం తీసుకొస్తాం
నారాయణపేట: తరతరాలుగా వస్తున్న నారాయణపేట చేనేత కళ కు పూర్వ వైభవం తీసుకొచ్చి నేత కార్మి కుల జీవన ప్రమాణాల మెరుగుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ సీహెచ్ ప్రియాంక తెలిపా రు. శుక్రవారం పట్టణంలోని మూ ల హనుమాన్ మందిరం సమీపంలో ఉన్న ఘనశ్యామ్ సరోదే లూ మ్స్‌ను ఆమె సందర్శించారు. చేనేత కార్మికుల నైపుణ్యాభివృద్ధి, చీరల నాణ్యత పెంపు, మార్కెటింగ్ అవకాశాల విస్తరణ లక్ష్యంగా నాబార్డు ద్వారా రూ.8 లక్షలు మంజూరయ్యాయని వెల్లడించారు. ఈ నిధులతో 60 మంది చేనేత కార్మికులకు 40 రోజుల పాటు ప్రత్యేక ఇకత్ నేత శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. శిక్షణ కార్యక్రమం అమలు, చేనేత ఉత్పత్తుల నాణ్యత మెరుగు, కొత్త డిజైన్ల రూపకల్పన, మార్కెటింగ్ అవకాశాలపై సంబంధిత ప్రతినిధులతో చర్చించారు. సంప్రదాయ నేతకు ప్రసిద్ధి చెందిన నారాయణపేట చీరలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయని, జీఐ ట్యాగ్ కూడా సాధించాయని పేర్కొన్నారు. అయితే మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా చేనేత రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లా మహిళా సమాఖ్య కలెక్టర్ సహకారంతో నాబార్డ్‌కు సమర్పించిన ప్రతిపాదనకు ఆమోదం లభించడంతో శిక్షణ కార్యక్రమానికి నిధులు సమకూరాయన్నారు. ఘనశ్యామ్ సరోదే ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ శిక్షణలో ఆధునిక నేత పద్ధతులు, నూతన డిజైన్లు, కలంకారి డిజైన్లు, నాణ్యత పెంపు, మార్కెటింగ్ అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. తద్వారా కార్మికుల నైపుణ్యాలు పెరిగి వారి ఆదాయానికి మెరుగైన అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
బాలికలు అన్నిరంగాల్లో రాణించాలి
నారాయణపేట: బాలికలు విద్యతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకొని అన్నిరంగాల్లో రాణించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారి రాజేందర్‌గౌడ్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లాకేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలికలు విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించే దిశగా పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. బాల్య వివాహాలను అరికట్టడంతో పాటు బాలికల హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి సంగీత మాట్లాడుతూ.. బాలికల అభ్యున్నతి, విద్య, భద్రత, సాధికారతకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, విద్యార్థినులు సద్వినియోగం చేసుకొని ఉన్నతస్థాయికి చేరుకోవాలని, తల్లిదండ్రులు, సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం వివిధ క్రీడాపోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి శ్వేత, జిల్లా మహిళా సాధికారత కేంద్రం జిల్లా కో–ఆర్డినేటర్ నర్సింహులు, జెండర్ స్పెషలిస్ట్ అనిత, ఇన్చార్జి డీసీపీఓ కరిష్మా, సఖి సీఏ క్రాంతి, లీగల్ కౌన్సిలర్ రమాదేవి, అధ్యాపకులు సునీత, పారిజాత, ప్రభావతి, వెన్నెల, విద్య, శైలజ తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమల అనుమతుల్లో జాప్యం వద్దు
నారాయణపేట: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సకాలంలో మంజూరు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ, టీఎస్–ఐపాస్ నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులు, వివిధ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న అనుమతులు, పారిశ్రామికవేత్తలకు అందించాల్సిన సేవలపై సమీక్షించారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను నిర్దేశిత గడువులోగా మంజూరు చేయాలని సూచించారు. వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను గుర్తించి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వ శాఖల నుంచి అందాల్సిన సేవలను పారదర్శకంగా, వేగవంతంగా అందించాలని పేర్కొన్నారు. అనుమతులు, ధ్రువపత్రాల జారీలో ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించి, పరిశ్రమల స్థాపనకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఎస్సీ ఎంటర్‌ప్రైజెస్‌కు సంబంధించి 16, ఎస్టీ ఎంటర్‌ప్రైజెస్‌కు సంబంధించి 5 యూనిట్లు మంజూరైనట్లు అదనపు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితే స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రామలింగేశ్వర్‌గౌడ్, డీఆర్డీఓ వెంకట్రాములు, ఎల్డీఎం సురే ష్ ఆత్రేయ, ఏఎంవీఐ సాయితేజ్‌రెడ్డి, అటవీశాఖ అధికారి రమేష్‌రెడ్డి, పుర కమిషనర్ శంకర్, విద్యుత్‌శాఖ అధికారి రాజునాయక్, ఏసీటీఓ సునీల్ సచిన్న్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సస్యరక్షణ చర్యలతోనే చీడపీడల నివారణ
కోస్గి రూరల్: కందిలో చీడపీడల నివారణకు పురుగు ఉధృతిని బట్టి శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు మందులు వాడాలని కేంద్ర బృందం పరిశీలకుడు, పప్పుధాన్యాల మిషన్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అరుణ్‌కుమార్ శివారే సూచించారు. ఆత్మనిర్భర్ భారత్ పప్పుధాన్యాల మిషన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని తోగాపూర్‌లో పలువురు రైతులు సాగుచేసిన కంది పంటలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎదుగుదల, చీడపీడల ఉధృతి, పంట ఆరోగ్య పరిస్థితులపై రైతులకు సూచనలు చేశారు. పురుగు ఉధృతిని బట్టి వ్యవసాయశాఖ సిఫారస్ చేసిన మందులను తగిన మోతాదులో వినియోగించాలని, పప్పుధాన్యాల సాగులో శారస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని కోరారు. కార్యక్రమంలో కమిషనరేట్ వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఏడీఏ రామకృష్ణ, వ్యవసాయ విస్తరణ అధికారులు అజయ్, వినోద్, పలువురు రైతులు పాల్గొన్నారు. -
ఎఫ్ఎంజీఈ వైద్యుల నిరసన
నారాయణపేట: రాత్రింబవళ్లు విధులు నిర్వర్తిస్తున్న ఎఫ్ఎంజీఈ ఇంటర్న్‌లకు తొమ్మిది నెలలుగా స్టైఫండ్ అందకపోవడంతో గురువారం జిల్లా జనరల్ ఆస్పత్రి ఎదుట నిరసన వ్యక్తం చే శారు. ఐఎంజీ ఇంటర్న్లతో సమానంగా వార్డు లు, అత్యవసర విభాగాలు, రోగుల సంరక్షణ, 24 గంటల డ్యూటీలు నిర్వహిస్తున్నా.. స్టైఫండ్ విషయంలో మాత్రం తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పని చేస్తున్నప్పుడు సమాన స్టైఫండ్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం నెలకు రూ.29,972 చొప్పున తొమ్మిది నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పల్లీ క్వింటా రూ.7,031 గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు గురువారం 67 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 7,031, కనిష్టంగా రూ. 5,796, సరాసరి రూ. 6,279 ధరలు లభించా యి. అలాగే 37 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 7,359, కనిష్టం రూ. 7,259, సరాసరి రూ. 7,319 ధరలు పలికాయి. -
రైతులపై కేసులు సరికాదు..
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలందరికి ఆహారం అందిస్తున్న రైతుల చేతులకు సంకెళ్లు వేసే రోజులొస్తే అది ఆ ప్రభుత్వానికి చివరి రోజులు. జూరాల ఆయకట్టు రైతులకు వానాకాలంలో పూర్తిస్థాయిలో సాగునీరు ఇవ్వకపోవడం ప్రభుత్వానిదే తప్పు. ఎగువ నుంచి వస్తున్న వరదను పూర్తిస్థాయిలో నిల్వ చేసుకోలేక ఆయకట్టు రైతులను ఆగం చేస్తామనడం సరైంది కాదు. సాగునీరు ఇవ్వమన్న రైతులపై అక్రమంగా కేసులు నమోదు చేయడం సరైంది కాదు. వెంటనే ఉపసంహరించుకోవాలి.. లేనిపక్షంలో రైతులతో కలిసి ఆందోళన చేపడతాం. – జాన్‌వెస్లీ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి -
పోలీసు, మీడియా సమన్వయం కీలకం : ఎస్పీ
నారాయణపేట: ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో పోలీస్–మీడియా సమన్వయం కీలకమని ఎస్పీ డా. వినీత్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని శాసన్‌పల్లి రోడ్లో ఉన్న ఓ బ్యాంకెట్ హాల్లో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్–ప్రెస్ గెట్ టు గెదర్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ శాఖలు ప్రజలకు అందించాల్సిన సేవలు సక్రమంగా అందుతున్నాయా? లేదా? అనే విషయాలను మీడియా ప్రజల దృష్టికి తీసుకెళ్తోందని పేర్కొన్నా రు. పోలీసుశాఖ విధుల్లో ఎదురయ్యే సమస్యలు, లోపాలను మీడియా నిర్మాణాత్మకంగా సూచిస్తే వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించడమే పోలీసుశాఖ లక్ష్యమని, ఇందుకు మీడియా సహకారం ఎంతో అవసరమని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలంటే పోలీసులపై విశ్వాసం ఉండాలని పేర్కొన్నారు. కరోనా సమయంలో పోలీసులు, వైద్యులు, మీడి యా ప్రతినిధులు ప్రజలకు సేవలందించేందుకు ముందుండి పనిచేశారని గుర్తుచేశారు. ఆ సమయంలో మీడియా సేవలను సైతం అత్యవసర సేవల్లో భాగంగా గుర్తించిన విషయాన్ని ప్రస్తావించారు. జిల్లాలో ఏడాది కాలంగా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని ఎస్పీ అభినందించారు. పోలీసుశాఖ సాధించిన విజయాలు ఏ ఒక్కరి కృషి ఫలితం కాదని, ప్రతి అధికారి, సిబ్బంది సమష్టి కృషితోనే సాధ్యమవుతున్నాయని తెలి పారు. రాత్రింబవళ్లు విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలందిస్తున్న పోలీసు సిబ్బందిని అభినందించారు. పోలీసుశాఖకు మీడియా అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపిన ఎస్పీ.. భవిష్యత్‌లో నూ ఇదే సమన్వయంతో కలిసి పనిచేసి జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందిద్దామని కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రియాజ్ ఉల్ హక్, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేశ్, డీపీఆర్వో రషీద్, వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ఎస్ఐ వెంకటేశ్వర్లు, జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
నీళ్లడిగితే కేసులా..!
జూరాల ఆయకట్టు రైతుల ఆక్రందన –8లో uఎడమ కాల్వకు సాగు నీళ్లు ఇవ్వలేమని అధికారుల ప్రకటన క్రమంలో గత నెల 16న ప్రాజెక్ట్ సమీపంలోని ఆత్మకూరు, అమరచింత మండలాలకు చెందిన రైతులు ఆందోళన బాటపట్టారు. 17, 18 తేదీల్లో సైతం నిరసనలు తెలిపినా.. ప్రజాప్రతినిధులు గాని, అధికారులు గాని పట్టించుకోలేదు. ఈ క్రమంలో 19న ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటరీ వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు సీపీఎం నాయకులు, శ్రేణులు మద్దతు తెలిపాయి. జూరాల ప్రాజెక్ట్ ముఖద్వారం వద్ద బీజేపీ సైతం రైతులకు సంఘీభావంగా ఆందోళనకు దిగింది. దీంతో అక్కడికి చేరుకున్న పీజేపీ అధికారులు నీరు విడుదల చేయలేమని చెప్పడంతో ఆగ్రహించిన రైతులు వారితో వాగ్వాదానికి దిగడంతోపాటు స్వయంగా ఎడమ కాల్వ పరిధిలో రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకోవడం.. తెరిచిన గేట్లు బంద్ చేయడం తెలిసిందే. ఆ తర్వాత రోజు బీఆర్ఎస్ ఆందోళనలకు పిలుపునివ్వగా.. పలువురు నేతలను గృహనిర్బంధం చేశారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఆరుగాలం కష్టపడి సాగుచేసిన పంట కళ్ల ముందే ఎండిపోతుంటే ఏ రైతు చూస్తూ ఊరుకోగలడు.. నాటిన పైరుకు నీరందించి బతికించుకునేందుకు నానా తంటాలు పడుతాడు. ఇదే కోవలో సాగునీటి కోసం అలమటిస్తున్న జూరాల ఎడమ కాల్వ ఆయకట్టు రైతులు చేసిన పని నేరమైంది. ఎల్‌నినో, వర్షాభావంతో ఎండిపోతున్న తమ పంటలను కాపాడుకునేందుకు ఆందోళనకు దిగిన ఆ అన్నదాతలు స్వయంగా నీటిని విడుదల చేసుకోగా.. వారిపై పోలీసులు నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. పోలీసుల చర్యలతో వనపర్తి జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్ మండలాల్లో ఉద్విగ్న పరిస్థితులు నెలకొనగా.. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా కలకలం రేగింది. సాగు నీరివ్వమని అడిగితే కేసులు పెడతారా అంటూ సదరు రైతులు ప్రశ్నిస్తుండగా.. ప్రభుత్వ తీరుపై రైతు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. గత నెల 19న జరిగిన ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం సదరు ఆందోళనకారులపై చర్యలు తీసుకోవాలనే ఆదేశంతో నందిమళ్ల డివిజన్ డీఈ అదే రోజు అమరచింత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆత్మకూర్ మండలంలోని ఆరేపల్లి, మూలమళ్ల, కత్తేపల్లి, వీరరాఘవపురం, అమరచింత మండలంలోని నందిమళ్ల, అమరచింత గ్రామాలకు చెందిన 14 మంది రైతులు (కృష్ణారెడ్డి– వీరరాఘవాపురం, రాజు– మోట్లంపల్లి, కురుమూర్తి– నందిమళ్ల, జీఎస్ గోపి– అమరచింత, ఎండీ జబ్బార్– పాన్‌గల్, షరీఫ్, నరేష్– మూలమళ్ల, శేఖర్‌రెడ్డి– గుంటిపల్లి, ఏటి భాస్కర్, ఏటి లక్ష్మణ్, దేవేందర్, వేణు– ఆరేపల్లి, నర్సింహ, సద్దల భాను)పై కేసులు నమోదు చేశారు. బీఎన్ఎస్ 132, 305(2), 352, 221, 126(2), 329(3), 189(2), 191(2), 324(4), 190 బీఎన్ఎస్ అండ్ సెక్షన్ 3 పీడీపీపీ, ఎసీటీ సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయడం 20 రోజుల తర్వాత ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. దీంతో బీఆర్ఎస్ నాయకులు ఆత్మకూరు సర్కిల్ కార్యాలయానికి చేరుకుని సీఐతో భేటీ అయ్యారు. రైతులపై అక్రమ కేసులు పెట్టడం దారుణమంటూ నిలదీశారు. రైతులపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయడంపై వివిధ రైతు, ప్రజా సంఘాలు, వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. అన్నదాతలను నేరస్థుల్లా చూడడం దారుణమని, పంటలకు నీరివ్వడం చేతకాకపోగా.. రైతులపై కేసులు బనాయించడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులపై పెట్టిన నాన్‌బెయిలబుల్ కేసులను తక్షణమే బేషరతుగా ఉపసంహరించుకోవాలని.. అలాగే చివరి ఆయకట్టు వరకూ ఎండిపోతున్న పంటలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో జూరాల ఆయకట్టుతోపాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఎడమ కాల్వకు నీరు విడుదల చేసిన రైతులపై నాన్‌బెయిలబుల్ కేసులు కలకలం రేపుతున్న పోలీసుల చర్యలు అమరచింత, ఆత్మకూర్ మండలాల్లో ఉద్విగ్న పరిస్థితులు భగ్గుమంటున్న ప్రజా, రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నేతలు ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ పరిధిలో కుడి, ఎడమ కాల్వల కింద జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో రైతులు ఈ వానాకాలం సీజన్లో సుమారు 1.15 లక్షల ఎకరాల వరకు సాగు చేశారు. అయితే వర్షాభావ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆరుతడి పంటలకే సాగు నీరందిస్తామని చెప్పినప్పటికీ.. లక్ష ఎకరాలకు పైగా వరి సాగైంది. ప్రస్తుతం పొట్ట దశలో ఉన్న పంటకు నీటి తడులు అవసరం కాగా.. భవిష్యత్‌లో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఎడమ కాల్వకు నీరివ్వలేమని అధికారులు ప్రకటించారు. ఈ ఆయకట్టులో వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు, అమరచింత, మదనాపురం, పెబ్బేరు, కొత్తకోట, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లో మొత్తం 85 వేల ఎకరాలు ఉండగా.. అధికారుల ప్రకటనతో రైతులు బెంబేలెత్తారు. -
నేడే పోలింగ్
● రీజియన్‌లోని 10 డిపోలలో ఓటేయనున్న 3,062 మంది ● ఆన్ డ్యూటీలో ఉన్న వారికి 14న పోస్టల్ బ్యాలెట్ పంపిణీ ●15న 5 జిల్లాకేంద్రాల్లోని డీసీఎల్‌లో అందజేతకు అవకాశం ● 17న అధికారికంగా తుది ఫలితాలు వెల్లడి ఎన్నికల ప్రచారం ఈ నెల 1 నుంచి 7 వరకు కొనసాగింది. మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలో అధికార పార్టీ కాంగ్రెస్ మద్దతుతో టీడబ్ల్యూయూ ఎన్నికల బరిలో నిలిచింది. ఈ కూటమిలో ఎస్‌డబ్ల్యూఎఫ్, టీఎంయూ (అశ్వత్థామరెడ్డి వర్గం) ఉండగా బాణం గుర్తు కేటాయించారు. మరో కూటమిలో ఈయూతోపాటు టీఎంయూ (థామస్‌రెడ్డి వర్గం), ఎన్ఎంయూ ఉండగా రాష్ట్రస్థాయిలో బస్సు, రీజియన్ స్థాయిలో నిచ్చెన గుర్తు కేటాయించారు. ఈ రెండు కూటములతోపాటు టీజేఎంయూ ఒంటరిగా గద గుర్తుతో పోటీ చేస్తోంది. ప్రచారంలో భాగంగా ఈ నెల 1, 2 తేదీల్లో ఈయూ అలయెన్స్‌కు చెందిన రాష్ట్రస్థాయి నాయకులు పది డిపోలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇక ఈనెల 5న టీడబ్ల్యూయూ కూటమికి చెందిన రాష్ట్రస్థాయి నాయకులు వనపర్తిలో ప్రచారం చేశారు. అలాగే వారం రోజులపాటు ఆయా డిపోలలో స్థానిక నాయకులు ప్రచారం చేశారు. వాస్తవానికి పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారం ముగిసినా.. ఈ నెల 8న ఓటర్లను వ్యక్తిగతంగా నాయకులు కలిసి తమకే ఓటు వేయాలని విన్నవించడం గమనార్హం. ప్రధానంగా ఈ రెండు కూటముల మధ్యే పోటీ ఉంటుందని భావిస్తున్నారు. వీరిలో ఏ కూటమి ఎక్కడెక్కడ గెలుస్తుందో 24 గంటల్లోనే అనధికారికంగా బయట పడనుంది. మొదట క్లాస్–3, ఆ తర్వాతే క్లాస్–6 ఓట్లను లెక్కించనున్నారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఉమ్మడి మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలోని పది డిపోలలో శుక్రవారం ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఆయా డీఎం కార్యాలయాల్లో ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. పోలింగ్ ముగిసిన 15 నిమిషాల తర్వాత ఎక్కడికక్కడే ఓట్లను కార్మిక శాఖ అధికారులు లెక్కించి ఉన్నతాధికారులకు నివేదించనున్నారు. అయితే అధికారికంగా ఈ నెల 17న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. అందుకు గాను ఈపాటికే అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారమే ఆయా ప్రాంతాలకు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల సామగ్రిని పంపించారు. ప్రతి డిపోలో ఒక్కొక్క పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. అదే శాఖకు చెందిన ప్రిసైడింగ్ ఆఫీసర్‌తోపాటు ఇద్దరు పోలింగ్ ఆఫీసర్లు విధుల్లో ఉంటారు. అవసరమైన చోట అదనంగా మరొకరు సిబ్బంది అందుబాటులో ఉంటారు. కాగా, ఆన్ డ్యూటీలో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోనున్నారు. ఈ నెల 14న ఆయా జిల్లాకేంద్రాల్లోని డీసీఎల్ కార్యాలయంలో వీరికి పోస్టల్ బ్యాలెట్ పంపిణీ చేయనున్నారు. మరుసటి రోజు పూర్తి చేసినవి తిరిగి అందజేయాల్సి ఉంటుంది. 3,062 మంది ఓటర్లు రీజియన్ పరిధిలోని పది డిపోలలో మొత్తం 3,098 మంది ఓటర్లు అర్హత సాధించినట్లు గత నెల 26న జిల్లా కార్మిక శాఖ అధికారులు ప్రకటించారు. అయితే వీరిలో కొందరు రిటైర్డ్ కావడంతో తాజాగా 3,062 మంది ఓటర్లుగా నిర్ధారించారు. వీరిలో మహబూబ్‌నగర్ డిపో పరిధిలో 410 మంది, ఆర్ఎం కార్యాలయ సిబ్బంది 41 మంది, వనపర్తి డిపోలో 389 మంది, గద్వాల డిపోలో 371 మంది, కల్వకుర్తి డిపోలో 354 మంది, అచ్చంపేట డిపోలో 307 మంది, నారాయణపేట, నాగర్‌కర్నూల్ డిపోలలో 285 మంది చొప్పున, షాద్‌నగర్ డిపోలో 284 మంది, కొల్లాపూర్ డిపోలో 226 మంది, కోస్గి డిపోలో 110 మంది ఉన్నారు. ఒక్కొక్కరు రెండేసి ఓట్లు వేయాల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయి (క్లాస్–3)లో తెలుపు రంగు, రీజియన్ స్థాయి (క్లాస్–6)లో ఆకుపచ్చ రంగులో బ్యాలెట్ పేపర్ ముద్రించారు. ఇక ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులతో గట్టి బందోబస్తు కల్పిస్తున్నారు. -
బోధనలో సాంకేతికతను వినియోగించాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: బోధనలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాలని జిల్లా విద్యాధికారి డా. గోవిందరాజు సూచించారు. గురువారం జిల్లాకేంద్రంలోని గురుకుల బాలికల పాఠశాలలో తెలంగాణ విద్యాశాఖ, ఎన్సీఈఆర్టీ సంయుక్తంగా రూపొందించిన ఏ బుక్ ఆన్ డిజిటల్ లర్నింగ్ కార్యక్రమంలో భాగంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధించే జిల్లాలోని 140 మంది భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రస్తుత విద్యా విధానంలో డిజిటల్ టెక్నాలజీ వినియోగం ఎంతో కీలకమని.. ఉపాధ్యాయులు డిజిటల్ సాధనాలు, డిజిటల్ కంటెంట్‌ను విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగుపర్చే సమర్థవంతమైన సాధనాలుగా వినియోగించాలన్నారు. అదేవిధంగా కోడింగ్, డాటా సైన్స్, గేమింగ్, స్టేమ్ వంటి అంశాలను ఉపాధ్యాయులు స్వయంగా నేర్చుకొని వాటిని విద్యార్థుల స్థాయికి అనుగుణంగా తరగతిగదిలో బోధనలో అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంఓ విద్యాసాగర్, జిల్లా సైన్స్ అధికారి భానుప్రకాష్, మధ్యాహ్న భోజన సమన్వయకర్త యాదయ్యశెట్టి తదితరులు పాల్గొన్నారు. -
వైద్యసేవల్లో నాణ్యత పెరగాలి
● పీహెచ్‌సీల పనితీరుకు ర్యాంకింగ్ ● వెనుకబడిన కేంద్రాలపై ప్రత్యేక దృష్టి ● కలెక్టర్ సీహెచ్ ప్రియాంక నారాయణపేట: జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖ సేవలను మరింత మెరుగుపర్చాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, మెడికల్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోగులకు వైద్య సేవలతో పాటు ఆరోగ్య కార్యక్రమాల అమలులోనూ నాణ్య త, ఫలితాలు పెరగాలన్నారు. పీహెచ్‌సీల పనితీరును వివిధ సూచికల ఆధారంగా పాయింట్ల వారీగా విశ్లేషించి ర్యాంకింగ్ ఇవ్వాలని సూచించారు. తద్వారా మెరుగ్గా పనిచేస్తున్న కేంద్రాలను గుర్తించడంతో పాటు వెనుకబడిన పీహెచ్‌సీలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందన్నారు. పీహెచ్‌సీల్లో వైద్యుల అందుబాటు, సిబ్బంది హాజరు, సేవల నాణ్యత, ఆరోగ్య కార్యక్రమాల అమలును పర్యవేక్షించాలని కోరారు. ఆరోగ్య మహిళ, ఇతర నివారణాత్మక కార్యక్రమాలను విస్తతం చేయాలన్నారు. మద్దూరులో ప్రత్యేక ప్రణాళికతో మహిళలందరికీ స్క్రీనింగ్ నిర్వహించి గ్రామాల వారీగా నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇమ్యూనైజేషన్, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్లో శతశాతం పురోగతి సాధించాలని సూచించారు. ఎన్సీడీ, డయాబెటిస్, బీపీ, క్యాన్సర్ స్క్రీనింగ్, టీబీ ముక్త్ భారత్ కార్యక్రమాల లక్ష్యాలను చేరుకోవాలని, డెంగీ, మలేరియా, చికునన్గున్యా నియంత్రణకు ఫ్రై డే– డ్రై డే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. వచ్చే సమీక్షకు పూర్తి గణాంకాలతో హాజరుకావాలని స్పష్టం చేశారు. సమీక్షలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. జయచంద్రమోహన్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. సిద్ధప్ప, డీపీఓ భిక్షపతి పాల్గొన్నారు. -
మాకు ఎంతో మేలు కలిగింది
మాకు ఏడు నెలల క్రితమే సెర్ప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బస్సును మంజూరు చేసింది. దీనిని గద్వాల డిపోలో 84 నెలల వరకు లీజ్‌కు ఇచ్చాం. ప్రతి నెలా రూ.69వేల పైచిలుకు మండల మహిళా సమాఖ్య ఖాతాలో జమ అవుతున్నాయి. దీని ద్వారా ఇప్పటివరకు అద్దె రూపంలో రూ.5.50 లక్షలు సమకూరింది. ఈ డబ్బుల నుంచి మహిళా సభ్యులకు అవసరమైన సమయంలో రుణం ఇస్తున్నాం. ఇలా మాకు ఎంతో మేలు కలిగింది. – మునెమ్మ, అధ్యక్షురాలు, మండల మహిళా సమాఖ్య, మల్దకల్ మాకు కేటాయించిన బస్సును హనుమకొండ జిల్లా పరకాల డిపోలో లీజ్‌కు ఇచ్చాం. దీని ద్వారా ప్రతినెలా వచ్చే అద్డె మొత్తంలో రూ.50 వేలను ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నాం. సామాజిక పెట్టుబడి నిధి (కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ –సీఐఎఫ్) రూపంలో రుణం కావాల్సిన మహిళా సభ్యులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన రూ.19 వేలను సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చులకు వెచ్చిస్తున్నాం. – గోవిందమ్మ, అధ్యక్షురాలు, మండల మహిళా సమాఖ్య, నారాయణపేట ● -
మహిళా సభ్యులకు వరం లాంటిది
అద్దె బస్సుల పథకం మహిళా సభ్యులకు వరం లాంటిది. రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ ద్వారా వివిధ పథకాల కింద మమ్మల్ని ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పటికే సీ్త్రనిధి, బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు పొందుతున్నాం. ఇక బస్సును మా పేరిట రిజిస్ట్రేషన్ చేసి యజమానులుగా మార్చడం ఎంతో బలం చేకూర్చింది. అద్దె రూపంలో వస్తున్న డబ్బులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. – వరలక్ష్మి, అధ్యక్షురాలు, మండల మహిళా సమాఖ్య, మహమ్మదాబాద్ -
పారదర్శకంగా భూ సేకరణ సర్వే
నారాయణపేట: భూ రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీసీ హాల్లో మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ సేకరణ, సర్వే పురోగతిపై రెవెన్యూ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా సర్వే పురోగతి, పెండింగ్ పనులు, ప్రభుత్వ భూముల గుర్తింపు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. గుండుమాల్‌లో భూ సేకరణ సర్వే పూర్తయినట్లు అధికారులు వివరించగా.. నాగిరెడ్డిపల్లి, లక్ష్మీపూర్‌లో కొనసాగుతున్న సర్వేను పక్కాగా పూర్తి చేయాలని సూచించారు. కోస్గి, దామరగిద్ద మండలాల్లో పెండింగ్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. మద్దూరులోని మూడు గ్రామాల్లో సర్వే పూర్తయినందున తదుపరి ప్రక్రియ చేపట్టాలని సూచించారు. రేడియల్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణకు ప్రాధాన్యతనిస్తూ పేరపళ్లలో సర్వే ప్రారంభించాలన్నారు. జనరల్ అవార్డు ప్రక్రియను నిబంధనల మేరకు పూర్తి చేయాలని, మద్దూరు, కోస్గి, కొత్తపల్లి ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి నివేదికలు సమర్పించాలని కోరారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెనన్స్కు అవసరమైన భూమిని గుర్తించి ల్యాండ్ రిపోర్టులు అందించాలని తహసీల్దార్లను ఆదేశించారు. రీ–సర్వే అవసరమైన గ్రామాల్లో నిబంధనల ప్రకారం జనరల్ నోటీసులు జారీ చేసి రికార్డులు, రిజిస్టర్లను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ప్రతి మండలంలో రెండు గ్రామాలను ప్రాధాన్యతగా ఎంపిక చేసి రీ–సర్వేకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. భూ సేకరణ పురోగతిపై రోజువారీ నివేదికను అదనపు కలెక్టర్ ఏర్పాటు చేసిన గ్రూపులో తప్పనిసరిగా సమర్పించాలని స్పష్టం చేశారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, అభివృద్ధి పనులకు అవసరమైన భూ సేకరణను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం చేపడుతున్న భూ సేకరణలో రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రమేష్, ఏవో అనిల్‌కుమార్, జిల్లా సర్వే ల్యాండ్ అధికారి గోవింద్, ఉద్యానశాఖ అధికారి సాయిబాబా, నారాయణపేట, ఊట్కూర్, దామరగిద్ద, మద్దూరు, గుండుమాల్, కోస్గి తహసీల్దార్లు అమరేంద్రకృష్ణ, అశోక్‌కుమార్, తిరుపతయ్య, మహేష్, భాస్కరస్వామి, కళ్యాణి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
10న జిల్లాస్థాయి సైక్లింగ్ పోటీలు
నారాయణపేట ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్ర స్కూల్ గేమ్ సెక్రెటరీ ఆదేశాల మేరకు ఈ నెల 10న మక్తల్‌లో ఎస్జీఎఫ్ జిల్లాస్థాయి అండర్–14, 17, 19 బాల బాలికల 5 కిలోమీటర్ల రోడ్ సైక్లింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారిని నెలాఖరున సిద్ధిపేట జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తిగల బాల బాలికలు బోనాఫైడ్, ఆధార్‌కార్డు, ఎస్ఎస్సీ మెమో, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, సొంత సైకిల్‌తో పాటు క్రీడాదుస్తులు ధరించి ఉదయం 9 గంటల వరకు విశ్రాంత పీఈటీ గోపాలంకు వివరాలు అందించాలని సూచించిరు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్ 77027 13139 సంప్రదించాలని కోరారు. వీబీజీ రాంజీ పనుల్లో నాణ్యత పాటించాలి ఊట్కూర్: వీబీజీ రాంజీ పనుల్లో నాణ్యత పాటించి గడువులోగా పూర్తి చేయాలని జెడ్పీ సీఈఓ వెంకట్రాములు అన్నారు. బుధవారం మండలంలోని పులిమామిడిలో కొనసాగుతున్న కందకాలు, నీటికుంటలు తదితర పనులను ఆయన పరిశీలించి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో నాణ్యత లోపించొద్దని.. నిర్లక్ష్యం సరికాదని అధికారులను హెచ్చరించారు. ఆయన వెంట ఎంపీడీఓ పావని, ఏపీఓ లక్ష్మారెడ్డి ఉన్నారు. రాష్ట్రస్థాయి యోగాసన పోటీలకు ఎంపిక నర్వ: ఎస్జీ ఎఫ్ ఉమ్మడి జిల్లా యోగా సన చాంపియ న్షిప్లో పెద్దకడ్మూర్ పీఎంశ్రీ జెడ్పీ ఉన్న త పాఠశాల విద్యార్థినులు అద్భుతమైన ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు జీహెచ్ఎం భాగ్యలక్ష్మి బుధవారం తెలిపారు. అండర్–17 ఆర్టిస్టిక్ యోగాసన విభాగంలో జానకి ప్రథమ స్థానం.. అలాగే అండర్–14 విభాగంలో జె.జానకి ద్వితీయ స్థానంతో పాటు ఆర్టిస్టిక్ యోగాసన విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు వివరించారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో సిద్దిపేటలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొననున్నారన్నారు. ఈ సందర్భంగా యోగా ట్రైనర్ రామాంజనేయులు, విద్యార్థులను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. -
ప్రశ్నించిన నేతలను అరెస్టు చేయడం తగదు
● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్: కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, ఇండియా కూటమి నాయకులను అరెస్టు చేయడం కేంద్ర పాశవిక చర్యకు నిదర్శనమని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం పట్టణంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని, ప్రతిపక్షాల ఆరోపణలు, ఓటరు జాబితా సవరణపై వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలంటూ కొనసాగుతున్న ఆందోళనలను అణిచివేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉండాలని, ఎన్నికల సంఘం పారదర్శకతపై వ్యక్తమవుతున్న సందేహాలకు సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటే అత్యంత శక్తివంతమైన ఆయుధమని.. ఓటుహక్కుపై ప్రజలకు పూర్తి విశ్వాసం కలిగేలా ఎన్నికల సంఘం పారదర్శకంగా పని చేయాలని కోరారు. నియోజకవర్గంలో 70 వేల ఓట్లు కోల్పోవడం జరిగిందని.. ఎస్సీ, ఎస్టీ ఓట్లను అధికంగా తొలగిస్తున్నారని తెలిపారు. సర్ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని.. దేశవ్యాప్తంగా ఓట్ల తొలగింపుపై అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఓటు హక్కు కాలరాయడం అంటే బతికున్న వ్యక్తిని చంపడమేనన్నారు. సమావేశంలో పుర చైర్పర్సన్ వాకిటి మానస, మాజీ ఎంపీపీ చంద్రకాంత్‌గౌడ్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, వైస్ చైర్మన్ గణేష్‌కుమార్, గాయత్రి అనిల్, కట్టా సురేష్, వాకిటి హన్మంతు తదితరులు పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనుల పరిశీల.. మండలంలోని గొల్లపల్లి శివారులో రూ.250 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులు బుధవారం మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. పనులు నాణ్యతగా, త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను కోరారు. -
మహిళలే యజమానులు!
బస్సే పెట్టుబడి.. దేశాభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యం నారాయణపేట: ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం గర్వించదగ్గ విషయమని ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా జిల్లాకేంద్రంలోని ఓ గార్డెన్స్‌లో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో ‘సేవా జ్యోతి’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగాన్ని డిజిటల్ స్క్రీన్‌పై పార్టీ నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. అనంతరం సత్యనారాయణ చౌక్ వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. సేవాభావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నాయకులు తెలిపారు. అంతకుముందు సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి, సంక్షేమం, రక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడంతో పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడటం కొంతవరకు తగ్గిందన్నారు. రక్షణరంగంలోనూ స్వయం సమృద్ధి సాధిస్తూ దేశంలోనే ఆయుధాలను తయారు చేసే స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు. పుర చైర్పర్సన్ కొండ శ్వేత, వైస్ చైర్మన్ మంజుల, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు రతంగ్‌పాండురెడ్డి, కొండయ్య, పున్నంచంద్ లాహోటి, సత్యయాదవ్, రఘురామయ్యగౌడ్, బలరాంరెడ్డి, లక్ష్మి, మహబూబ్ అలీ, కిరణ్ పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: గ్రామీణ మహిళా సంఘాల సభ్యులను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బస్సుల కేటాయింపుతో వారికి అదనపు ఆదాయం సమకూరుతోంది. ఇప్పటికే సీ్త్రనిధి, బ్యాంకు లింకేజీ కింద తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తోంది. అలాగే ఏటా విద్యార్థుల యూనిఫాం కుట్టే (స్టిచ్చింగ్) పనిని సైతం అప్పగించిన విషయం విదితమే. ఇందులో భాగంగా అద్దె బస్సుల పథకం కింద ఏకంగా సెర్ప్ నుంచి రూ.30 లక్షల గ్రాంట్ రావడం.. దీనిని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో మండల మహిళా సమాఖ్యలకు ఎంతో వెసులుబాటు కలిగింది. తమ వాటా కింద కేవలం రూ.6 లక్షలు మాత్రమే భరిస్తే చాలు ఏకంగా బస్సు యజమానులుగా రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. వీటిని ఆర్టీసీ 84 నెలల పాటు ఒక్కో బస్సును లీజుకు తీసుకుని ఏకంగా ప్రతి నెలా రూ.69,468 చొప్పున అద్దె రూపంలో చెల్లిస్తోంది. ఇక ఈ బస్సుల నిర్వహణకు అయ్యే ఖర్చులు సైతం సంస్థనే భరిస్తుండటంతో ఇది వారికి వరంగా మారింది. ఈ మొత్తం మండల మహిళా సమాఖ్య ఖాతాలో నేరుగా జమ అవుతుండటంతో అవసరమైన సభ్యులకు అత్యవసర సమయంలో కావాల్సిన రుణం ఇస్తూ ఎంతో ఆసరాగా నిలుస్తున్నారు. డిపోల వారీగా బస్సుల కేటాయింపు ఇలా.. మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలోని పది డిపోలలో ప్రస్తుతం ఆర్టీసీవి చెందినవి 455, ప్రైవేట్ కాంట్రాక్టర్లవి 360, మండల మహిళా సమాఖ్యలవి 65, జేబీఎంవీ 23 ఇలా మొత్తం 903 బస్సులు నడుస్తున్నాయి. వీటిలో షాద్‌నగర్ డిపోనకు 18, మహబూబ్‌నగర్‌కు 16, వనపర్తికి 14, నారాయణపేట, గద్వాలకు 4 చొప్పున, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్‌కు 2 చొప్పున; కోస్గికి 1 మండల మహిళా సమాఖ్యకు చెందిన బస్సులను ఆర్టీసీ అద్దెకు తీసుకుంది. భవిష్యత్తులో సంస్థకు చెందిన బస్సులు ఎక్కడైనా కాలం (15 ఏళ్లు దాటిన) చెల్లినవి ఉంటే వాటి స్థానంలో మండల మహిళా సమాఖ్యల ద్వారానే కొత్త బస్సులు అద్దెకు తీసుకుని నడిపించనున్నారు. ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు చెందిన అద్దె బస్సుకు ప్రతినెలా రూ.1.20 లక్షల నుంచి రూ.1.30 లక్షల వరకు చెల్లించాల్సి వస్తోంది. అలాంటి రాష్ట్ర ప్రభుత్వమే మండల మహిళా సమాఖ్యలకు గ్రాంట్ కింద బస్సులు కొనుగోలు చేసి ఇస్తోంది. వీటికి అద్దె రూపంలో కేవలం రూ.69 వేల పైచిలుకు మాత్రమే చెల్లిస్తున్నాం. ఈ పథకం అమలుతో మా సంస్థకు అద్దె బస్సుల భారం తగ్గినట్లే. కాలం చెల్లిన బస్సుల స్థానంలో దశల వారీగా మండల సమాఖ్య బస్సులనే వినియోగిస్తాం. – పి.సంతోష్‌కుమార్, ఆర్ఎం, మహబూబ్‌నగర్ రీజియన్ షాద్‌నగర్ డిపో పరిధిలో అత్యధికంగా 18 కొత్త బస్సుకు సెర్ప్ నుంచి రూ.30 లక్షల గ్రాంట్ మహిళా సమాఖ్య వాటా రూ.6 లక్షలు.. ఆర్టీసీ నుంచి నెలకు రూ.69,468 అద్దె అదనపు ఆదాయంతో ఆర్థికంగా చేయూత -
పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్
దామరగిద్ద: అదనపు తరగతి గదుల నిర్మాణాలు తుదిదశలో ఉన్నందున త్వరితగతిన పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ సీహెచ్ ప్రి యాంక ఆదేశించారు. మంగళవారం మండలంలో ని కస్తూర్బాగాంధీ విద్యాలయను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వసతులు, భోజనం, బోధనపై ఆరా తీశారు. భోజన నాణ్యత, రోజు వారీ మెనూ, స్టోర్ రూంను పరిశీలించారు. కళాశా ల, ఒకేషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులతో మాట్లాడి వారి లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. పాఠశాల ఆవరణలో నిరుపయోగంగా ఉన్న ఫర్నీచర్ గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాత భవనంలో పాఠశాల, కళాశాల నిర్వహణకు గదులు సరిపోవడం లేదని ఎస్ఓ స్వాతి కలెక్టర్ దృష్టికి తీసుకురాగా నిర్మాణం పూర్తయ్యే వరకు కింది అంతస్తులో ఉన్న అదనపు గదులను తరగతుల నిర్వహణకు వినియోగించుకోవాలని సూచించారు. డైనింగ్ షెడ్ ఎత్తు పెంచి పక్షులు లోనికి రాకుండా అవసరమైన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎస్ఓను ఆదేశించారు. పనులు త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షణ చేపట్టాలని డీఈఓ గోవిందరాజును ఫోన్లో సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ తిరుపతయ్య, ఎంపీడీఓ సాయిలక్ష్మి ఉన్నారు. -
అనుసంధానం.. వేగవంతం
నర్వ: గ్రామాల్లోని ఇళ్ల వివరాలను ఈ–పంచాయతీ ద్వారా తెలుసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంచాయతీ సేవలు, ఇళ్ల వివరాలు, పన్నుల న మోదు, చెల్లింపులు స్మార్ట్‌ఫోన్‌లో తెలుసుకునేందు కు యజమాని సెల్‌నంబర్లను వెబ్సైట్లో నమో దు చేయాలని ఆదేశించింది. దీంతో అధికారులు జిల్లా లోని 13 మండలాల్లోని 272 గ్రామపంచాయతీల్లో ఇంటినంబర్లను యజమాని మొబైల్ నంబర్లతో అనుసంధానం చేసే ప్రక్రియ చేపడుతున్నారు. కలిగే ప్రయోజనాలు.. ●ఇంటినంబర్‌ను మొబైల్ నంబర్‌కు అనుసంధా నం చేయటంతో గ్రామస్తులు ఇళ్ల వివరాలను ఆన్లైన్లో ఎక్కడి నుంచైనా చూసుకునే అవకాశం ఉంటుంది. ● రానున్న రోజుల్లో యజమానులు ఇంటిపన్నును మొబైల్‌ఫోన్ ద్వారా ఆన్లైన్ చెల్లింపు చేసే అవకాశం ఉంటుంది. ● ఇళ్ల వివరాలను ఆన్లైన్ చేయడంతో పారదర్శకత పెరుగుతోంది. ● ఇంటిపన్నులు, ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ప్రజలకు నేరుగా చేరవేయవచ్చు. జిల్లాలో ఇలా.. జిల్లాలో మొత్తం అసెస్మెంట్లు 1,28,547 ఉండగా.. 84,596 పూర్తి చేశారు. మిగిలిన అసెస్మెంట్లు 43,951 పూర్తి చేయాల్సి ఉంది. అతి తక్కువగా మక్తల్, ఊట్కూర్, నారాయణపేట మండలాల వివరాలు నమోదు చేశాయి. మద్దూర్ మండలం 97.72 శాతంతో ముందంజలో ఉండగా.. కొత్తపల్లి మండలం 90 శాతానికి పైగా నమోదైంది. వేగంగా అనుసంధాన ప్రక్రియ.. గ్రామాల్లోని ఇళ్లనంబర్లను మొబైల్‌ఫోన్ నంబర్లతో అనుసంధానం చేసే ప్రక్రియను పంచాయతీ అధికారులు వేగవంతం చేశారు. పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది సహకారంతో ఇంటింటికి తిరిగి ఫోన్‌నంబర్లను సేకరిస్తున్నారు. ఆ వివరాల ను ఎంపీడీఓ కార్యాలయాల్లోని ఈ–పంచాయతీ ఆపరేటర్ల ద్వారా అనుసంధానం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు యజమాని పేరు, ఆధార్ నంబరు, తండ్రిపేరు, చిరునామా, పిన్‌కోడ్ నంబర్, వృత్తి, ప్రదేశం తదితర వివరాలను నమోదు చేస్తున్నారు. ఇల్లు ఆబాది సర్వేనంబర్‌లో ఉందా, ప్రైవేట్ లేదా ప్రభుత్వ భవనామా అనే వివరాలు సేకరిస్తున్నారు. ప్రైవేట్, ప్రభుత్వ, శిఖం, ఎఫ్టీఎల్ ప్రాంతం, ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో నమోదు చేయాలి. పంచాయతీకి చెందిన ఎల్జీడీ కోడ్ ద్వారా గ్రామాల్లో ఉన్న ఇళ్ల వివరాలను సేకరించి మొ బైల్ నంబరుతో అనుసంధానం చేస్తున్నారు. గ్రామాల్లో కొనసాగుతున్న ఇంటినంబర్ల ఆన్లైన్ ప్రక్రియ జిల్లాలో ఇప్పటి వరకు 65 శాతం పూర్తి సకాలంలో పూర్తి చేసేందుకు అధికారుల కసరత్తు పూర్తయితే ఆన్లైన్లోనే పన్ను చెల్లింపునకు అవకాశం -
అర్హుల ఓట్లు తొలగిస్తే సహించం
నారాయణపేట: సర్ పేరిట అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించే కుట్రలను సాగనివ్వమని.. ఓటర్ల జాబితాతో చెలగాటమాడితే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లాకేంద్రంలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. సత్యనారాయణ చౌరస్తాలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) మాస్లైనన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఎన్నిక ల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సర్‌పై ప్రజల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు నోటీసు అందుకున్న ప్రతి ఓటరుకు తన వాదన వినిపించే అవకాశం కల్పించాలని కోరారు. ఎన్నికల సంఘం పారదర్శకత పాటిస్తేనే ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందన్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో పౌరుడి గొంతుకని.. దశాబ్దాలుగా ఓటు వేస్తున్న వారిని పాత రికార్డులు, పూర్వీకుల వివరాల పేరుతో ఇబ్బందులకు గురిచేయడం సరికాదని తెలిపారు. పేరు తొలగించే ముందు కారణాలను స్పష్టంగా తెలియజేయాలని, ఫారం–6, 7 ప్రక్రియలను నిబంధనల మేరకు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం సత్యనారాయణ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ‘ఓటు బచావో.. దేశ్ బచావో’, ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ అనిల్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా సీపీఐ నాయకుడు నర్సింహ, సీపీఐ(ఎం) నాయకుడు వెంకట్రామారెడ్డి, సీపీఐ(ఎంఎల్) నాయకులు హన్మేష్చారి, బి.రాము, కాశీనాథ్ మాట్లాడుతూ.. సర్ పేరిట అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా ఎన్నికల సంఘం పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీసీసీ జిల్లా ప్రధానకార్యదర్శి మహ్మద్ సలీం, మార్కెట్ మాజీ చైర్మన్లు ఆర్.శివారెడ్డి, బండి వేణుగోపాల్, జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు కాంతకుమార్, ఇండియా కూటమి నాయకులు గోపాల్, బాల్‌రాం, మహ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ పటిష్టతకు కృషిచేద్దాం : బీజేపీ
ఊట్కూర్: పార్టీ పటిష్టతకు కృషిచేద్దామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ కోరారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన మండల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోవు ఎమ్మెల్సీ ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలన్నారు. డిగ్రీ పూర్తయిన వారిని గుర్తించి ఆన్లైన్లో ఓటరుగా నమోదు చేయించే బాధ్యత కార్యకర్తలదేనని తెలిపారు. బీజేపీ కార్యకర్తలు క్రమశిక్షణకు మారుపేరని.. విభేదాలు పక్కనబెట్టి పార్టీ అభ్యర్థి గెలుపునకు కష్టపడి పనిచేయాలని సూచించారు. మండలంలో 8 మంది బీజేపీ మద్దతు సర్పంచ్‌లు ఉండటం అభినందనయమన్నారు. అనంతరం ఆయా సర్పంచ్‌లను సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు కొండయ్య, భాస్కర్, కర్నె స్వామి, బల్రాంరెడ్డి, చంద్రశేఖర్‌గౌడ్, నర్సింహారెడ్డి, భరత్, కృష్ణయ్యగౌడ్, ఆశప్ప తదితరులు పాల్గొన్నారు. -
వారాబందీ కుదింపు
మరోమారు ఆందోళనలకు సిద్ధమవుతున్న అన్నదాతలు.. ఆయకట్టుకు సాగునీరు అందించి పంటలను కాపాడాలంటూ రైతులు మరోమారు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. వరుసగా ఐదురోజుల పాటు కాల్వలకు నీటిని వదిలి నిలిపివేశారు. ఆరురోజులు అవుతున్నా తిరిగి నీటిని ఎందుకు వదలడం లేదని ఆందోళన చేస్తే తప్పా పంటలకు నీరందని పరిస్థితి ఉందని ఆయకట్టు రైతులు తెలిపారు. జలాశయం ఎగువ భాగంలో ఉన్న అమరచింత, ఆత్మకూర్ మండలాల రైతులకు సైతం సాగునీరు సమృద్ధిగా అందకపోవడంతో ఇక్కడి రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ నుంచి వరద పూర్తిగా నిలిచిపోవడంతో ఆయకట్టు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. జలాశయంలో ప్రస్తుతం 4.747 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండటంతో అతి కష్టం మీద ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు సాగుతోంది. గత వారం వారాబందీని ప్రకటించిన ప్రభుత్వం 5 రోజుల పాటు నిరంతరం కాల్వలకు నీటిని వదిలి మరో 5 రోజుల పాటు పూర్తిగా నిలిపివేసేందుకు సిద్ధమైంది. 5 రోజుల పాటు సాగునీరు పొందిన ఆయకట్టు రైతులు ప్రస్తుతం 6 రోజులవుతున్నా.. నీరు రాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఆయా మండలాల రైతులు సంబంధిత అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు తమ సమస్యలను విన్నవించగా.. కుడి, ఎడమ కాల్వలకు బుధవారం నీటిని వదులుతామని అధికారులు ప్రకటించారు. ఎడమ కాల్వ పరిధిలో 85 వేల ఎకరాలు, కుడికాల్వ పరిధిలో 30 వేల ఎకరాలు సాగులో ఉంది. ప్రస్తుతం వరి పంటలు పొట్ట దశలో ఉన్నాయని.. నిరంతరం నీరందిస్తేనే చేతికొస్తాయని అన్నదాతలు అధికారులకు విన్నవిస్తున్నారు. ప్రధాన ఎడమ కాల్వలో నిలిచిన నీటి ప్రవాహం జూరాల జలాశయంలో 4.747 టీఎంసీల నీటినిల్వ గత వారం 5 రోజులు.. ఈ వారం 4 రోజులే నీటి సరఫరా తడారుతున్న ఆయకట్టు పంటలు కుడి, ఎడమ కాల్వ పరిధిలో 1.15 లక్షల ఎకరాలు -
మరుగుదొడ్లకు మోక్షం!
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరతకు చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మరుగుదొడ్ల సదుపాయం లేని, ఉన్నా విద్యార్థుల సంఖ్యకు సరిపోని పాఠశాలలను గుర్తించి కొత్తగా 764 మరుగుదొడ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. ఇందులో 670 ప్రైమరీ పాఠశాలలు, 94 హైస్కూళ్లు ఉన్నాయి. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.4.80 లక్షల చొప్పున కేటాయించగా.. మొత్తం రూ.36.67 కోట్ల మేర నిధులు వెచ్చించనున్నారు. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు పూర్తిగా లేకపోగా.. మరికొన్ని చోట్ల పాతవి శిథిలావస్థకు చేరడం, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా లేకపోవడంతో అదనపు యూనిట్లను మంజూరు చేశారు. పాఠశాలల్లో వసతుల మెరుగుదలతో విద్యార్థుల హాజరు, అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మణికొండకు 8 టాయిలెట్లు మహబూబ్‌నగర్ రూరల్ మండలం యూపీఎస్ మణికొండలో 244 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాత మరుగుదొడ్లను తొలగించి కొత్తవి నిర్మించినా అవి ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో పాఠశాలకు ఏకంగా ఎనిమిది మరుగుదొడ్లు మంజూరయ్యాయి. గద్వాల యూపీఎస్ మెడికొండకు నాలుగు, యూపీఎస్ ఇందువాసికి ఐదు, యూపీఎస్ నందిన్నెకు ఆరు చొప్పున మంజూరయ్యాయి. 70 పాఠశాలలకు రెండు, 35 పాఠశాలలకు మూడు, 10 పాఠశాలలకు నాలుగు చొప్పున టాయిలెట్లు మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లాలో 764 టాయిలెట్ల నిర్మాణానికి సర్కారు గ్రీన్‌సిగ్నల్ 436 ప్రైమరీ, 73 హైస్కూళ్లకు మంజూరు ఒక్కో టాయిలెట్‌కు రూ.4.80 లక్షలు.. మొత్తం రూ.36.67 కోట్లు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు వసతులు అడ్మిషన్లు పెరిగే అవకాశం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం ఉపయోగకరమని అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతులు కల్పిస్తే పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. – డా. గోవిందరాజు, డీఈఓ, నారాయణపేట -
ఓపెన్ స్కూల్‌తో విద్యా ప్రమాణాలు మెరుగు
మరికల్: ఆర్థిక ఇబ్బందులతో మధ్యలో చదువు మానేసిన విద్యార్థులు ఓపెన్ స్కూల్ ద్వారా తమ విద్యా ప్రమాణాలను మెరుగుపర్చుకోవచ్చని రాష్ట్ర ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ క్రాంతిరెడ్డి అన్నారు. మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో మహిళా సమైఖ్య సభ్యులు, ఇతరులకు ఓపెన్ స్కూల్ విద్యపై హైదరాబాద్ కళాజాతతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సమైఖ్య సభ్యులు గ్రామాల్లో చదువు మధ్యలో మానేసిన వారిని గుర్తించి ఓపెన్ పది, ఇంటర్లో చేరేవిధంగా అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరి సహకారం ఉంటేనే నిరుద్యోగ సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. అనంతరం ఓపెన్ స్కూల్ ప్రవేశాల వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో ఓపెన్ స్కూల్ ఎడ్యుకేటెడ్ ప్రతినిధి ప్రణవ, ఉమ్మడి జిల్లా కో–ఆర్డినేటర్ శివయ్య, జిల్లా కో–ఆర్డినేటర్ శ్రీనివాస్, తహసీల్దార్ రాంకోటి, ఏపీఎం చంద్రశేఖర్, విద్యాసాగర్, చెన్నారెడ్డి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన అన్నదాతలు
దామరగిద్ద: విద్యుత్ కోతలను నిరసిస్తూ సోమవారం ముస్తాపేట, దేశాయపల్లి, అయ్యవారిపల్లి గ్రామాల రైతులు మండలంలోని క్యాతన్‌పల్లి సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతుసంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్యగౌడ్ మాట్లాడుతూ.. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో సరిపడా నీరందక సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయన్నారు. బోరుబావుల్లో ఉన్న కొద్దిపాటిని నీటితో పంటలను కాపాడుకుందామన్నా.. సమయపాలన లేకుండా విద్యుత్ కోతలు విధిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేపట్టి పంటలను కాపాడాలని లేనిపక్షంలో రైతులతో కలిసి పెద్దఎత్తున రాస్తారోకో చేపడతామని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వం కరువు జిల్లాగా ప్రకటించి నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. ఏఈ అనిల్‌కుమార్ ట్రాన్స్‌కో డీఈతో రైతులను మాట్లాడించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు రోషనప్ప, రైతులు చెన్నప్ప, బాలవర్ధన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, గోవిందరాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సత్తాచాటిన జిల్లా పోలీసులు
నారాయణపేట: హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026లో జిల్లా పోలీసులు సత్తా చాటారు. 50+తో పాటు ఓపెన్ కేటగిరీ సింగిల్స్‌లో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ ఉల్హక్ రెండు బంగారు, 40+ విభాగంలో కాంస్య పతకం కై వసం చేసుకున్నారు. అలాగే ఎన్జీవోస్ కేటగిరీలో ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్‌కానిస్టేబుల్ బాలరాజు అద్భుత ప్రతిభ కనబర్చి బంగారు పతకం సాధించారు. పతకాలు సాధించిన రియాజ్ ఉల్హక్, బాలరాజును సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డా. వినీత్ ప్రత్యేకంగా అభినందించారు. విధులతో పాటు క్రీడల్లో ప్రతిభ కనబర్చడం అభినందనీయమన్నారు. క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పోటీతత్వ స్ఫూర్తి పెంపొందుతాయని పేర్కొన్నారు. వచ్చే నెల బెంగళూరులో జరిగే నేషనల్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లోనూ ఇదే ఉత్సాహంతో పాల్గొని మరిన్ని పతకాలు సాధించి జిల్లా, తెలంగాణ పోలీస్‌శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలి నారాయణపేట: ఓటుహక్కు పరిరక్షణ, ఓటరు జాబితాలో అవకతవకలకు వ్యతిరేకంగా చేపడుతున్న ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఇండియా కూటమి పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లాకేంద్రంలోని సీవీఆర్ భవన్‌న్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వెంకట్రామారెడ్డి, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నాయకుడు కాశీనాథ్ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియ, ఓటరు జాబితాపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను ఎన్నికల సంఘం నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఓటర్ల పేరు జాబితా నుంచి తొలగించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్లకు సరైన అవకాశం కల్పించడంతో పాటు మరణించిన, డూప్లికేట్ నమోదును నిబంధనల ప్రకారం పరిశీలించాలని సూచించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న ఈవీఎం గోదాం నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని.. పాత బస్టాండ్, సివిల్లైన్న్ మీదుగా కలెక్టరేట్ వరకు కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇండియా బ్లాక్ మిత్రపక్షాలు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, ప్రజాస్వామ్యవాదులు అధికసంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఎండీ సలీం, శివారెడ్డి, బండి వేణుగోపాల్, సుధాకర్, సంతోష్‌కుమార్, వెంకటేష్‌గౌడ్, కోట్ల రవీందర్‌రెడ్డి, మహిమూద్ ఖురేషి, యూసుఫ్ తాజ్, బలరాం, కెంచి నారాయణ పాల్గొన్నారు. బీఎడ్ ఫలితాలు విడుదల మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: బీఎడ్ ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ సోమవారం విడుదల చేశారు. ఈ మేరకు రెగ్యులర్ సెమిస్టర్–2లో 80.45 శాతం, సెమిస్టర్–4లో 95.29 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరితోపాటు బ్యాక్లాగ్ 3వ సెమిస్టర్ 86.47 శాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడంపై వీసీ సంతృప్తి వ్యక్తం చేసి.. ఫలితాలు మరింత పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రిజస్ట్రార్ రమేష్‌బాబు, కంట్రోలర్ ప్రవీణ, ఎంఈడీ ప్రిన్సిపాల్ కరుణాకర్‌రెడ్డి, కోఆర్డినేటర్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీటీ పనులు పూర్తి చేయాలి..
అమ్మిరెడ్డిపల్లి నుంచి కోటకొండ వరకు మధ్యలో నిలిచిన బీటీ పనులను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్న్ జిల్లాకార్యదర్శి బి.రాము కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రోడ్డు పనులు పూర్తిగాక చుట్టుపక్కల సుమారు పది ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. గర్భిణులు, విద్యార్థులు, నిత్య ప్రయాణికులు అవస్థలు పడుతున్నారని, అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు చేరుకోవడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. రహదారి అధ్వానంగా ఉండటంతో ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయని వివరించారు. రోడ్డు పనులను త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. -
4 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి..
జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ ఆస్ప త్రిలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్న ఉద్యోగ పోస్టుల్లో దివ్యాంగులకు చట్టబద్ధంగా 4 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ది వ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కమిటీ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. రిజర్వేషన్ అమలు చేయకపోతే అర్హులైన ది వ్యాంగ అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు.నిబంధనల ప్రకా రం రిజర్వేషన్ అమలు చేసి న్యాయం చేయాల ని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో కాశప్ప, బస్వరాజ్, చంద్రశేఖర్, రవి, అరవింద్, ఫక్రుద్దీన్ ఉన్నారు. -
‘ప్రజావాణి’ ఫిర్యాదులకు ప్రాధాన్యం
నారాయణపేట: ప్రజావాణి ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 19 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా శాఖల వారీగా ఎప్పటికప్పుడు పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఫిర్యాదుదారులకు సంతృప్తికర పరిష్కారం అందేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ దందా!
రూటు మారిన.. రేషన్ బియ్యంలోని నూక లు వేరుచేసి పాలిషింగ్ చేసి వివిధ బ్రాండ్ల పేరిట బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. మిల్లులపై దాడులు నిర్వహించి తనిఖీలు చేపట్టి రేషన్ బియ్యమని తెలితే కఠిన చర్యలు తీసుకుంటాం. కిరాణ వ్యాపారులు ఇతర జిల్లాల మిల్లుల నుంచి రేషన్ బియ్యంతో పోలిన సన్నబియ్యం దిగుమతి చేసుకొని విక్రయించాలని చూసినా వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. – బాలరాజు, డీఎస్ఓ, నారాయణపేట మరికల్: అక్రమార్కులు ఇన్నాళ్లు రేషన్ బియ్యం కొనుగోలు చేసి రీ సైక్లింగ్ చేసేవారు. ప్రస్తుతం రూటు మార్చి రేషన్ బియ్యంలో నూకలు వేరుచేసి పాలిష్ చేసి వివిధ బ్రాండ్ల పేరిట బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న వరికి మద్దతు ధరతో పాటు క్వింటాకు అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తుండటంతో రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. దీంతో బహిరంగ మార్కెట్లో సన్న ధాన్యం కొరత నెలకొని బియ్యం ధరలు అడ్డగోలుగా పెరిగాయి. దీన్ని ఆసరగా చేసుకొని మిల్లర్లు తమ పంథా మార్చి రేషన్ బియ్యం కొనుగోలు చేసి వివిధ రకాల బ్రాండ్ల పేరిట బహిరంగ మార్కెట్లో బియ్యం విక్రయిస్తున్నారు. దీంతో రేషన్ లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చిన సన్నరకం బియ్యాన్ని తక్కువ ధరకు విక్రయిస్తూ అవే బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేస్తూ నష్టపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. చుక్కల్లో బియ్యం ధరలు.. గతంలో సన్నబియ్యం మార్కెట్లో కిలో రూ.30 నుంచి రూ.40 వరకు ఉండేది. ప్రస్తుతం వాటి ధర అమాంతం పెరిగింది. బీపీటీ కిలో రూ.52, జైశ్రీరాం రూ.67, హెచ్ఎంటీ రూ.64, ఆర్ఎన్ఆర్ రూ.62కు విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో 25 కిలోల సంచులుగా లభ్యం? ఇతర జిల్లాల నుంచి సరఫరా సంచి మార్చి.. కొనుగోలుదారులను ఏమార్చి... చుక్కలనంటుతున్న ధరలు పేదలకు సన్న బియ్యం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కాని చాలామంది వీటిని తినకుండా విక్రయిస్తుండటంతో అక్రమార్కుల దందా సులువవుతోంది. అధికారులు, పోలీసులు తనిఖీలు చేపడుతూ కేసులు నమోదు చేస్తున్నా అక్రమాలు ఆగడం లేదు. కొత్త తరహా దందాకు తెర లేపారు. రేషన్ లబ్ధిదారుల నుంచి కిలో బియ్యం రూ.16 నుంచి రూ.18 వరకు కొనుగోలు చేసి బడా వ్యాపారులకు రూ.20 నుంచి రూ.25 వరకు విక్రయిస్తున్నారు. వారు ఇతర రాష్ట్రాలకు తరలించి రూ.30 నుంచి రూ.35 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు మిల్లర్లతో మిలాకత్ అయి రూ.30 నుంచి రూ.33 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల్లో కొందరు మిల్లర్లు, బడా వ్యాపారులు దళారుల నుంచి రేషన్ బియ్యం కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో విక్రయించడం, సీఎంఆర్ కింద తిరిగి ప్రభుత్వానికి అందించి లబ్ధిపొందుతున్నట్లు సమాచారం -
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ
నారాయణపేట: సైబర్ నేరాలు రోజురోజుకూ కొత్త రూపాల్లో చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డా.వినీత్ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు, ఆన్లైన్ ఉద్యోగాలు, వర్క్ ఫ్రమ్ హోమ్, డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని తెలి పారు. ఆన్లైన్ పెట్టుబడుల్లో భారీ లాభాలు వస్తాయని నమ్మించి.. నకిలీ యాప్‌లు, వెబ్సైట్లలో పెట్టుబడులు పెట్టిస్తారన్నారు. ఆ తర్వాత ట్యాక్స్, జీఎస్టీ, ప్రాసెసింగ్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో మరింత డబ్బు వసూలు చేసి, చివరకు ఖాతాలను బ్లాక్ చేస్తా రని పేర్కొన్నారు. టాస్క్ లు, రివ్యూలు, రేటింగ్‌లు, పార్ట్‌టైమ్ ఉద్యో గాల పేరుతో తొలుత చిన్న మొత్తంలో రాబడి చూపించి.. తర్వాత పెద్ద మొత్తంలో పెట్టుబడు లు పెట్టాలని ఒత్తిడి చేస్తారన్నారు. ఉద్యోగం లేదా ఆన్లైన్ వర్క్ కోసం ముందుగా డబ్బులు అడిగితే అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీ సులు, సీబీఐ, కస్టమ్స్ తదితర దర్యాప్తు సంస్థల అధికారులుగా పరిచయం చేసుకుని వీడి యో కాల్స్‌లో బెదిరించడం పూర్తిగా మోస మని ఎస్పీ స్పష్టం చేశారు. ‘డిజిటల్ అరెస్ట్ చే శాం.. కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు పంపాలి’ అంటూ బెదిరించినా నమ్మవద్దని సూచించారు. బ్యాంకు, పోలీసు అధికారుల పేరుతో ఫోన్ చేసినా వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు వెల్లడించొద్దని తెలిపారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. త్వరగా ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును నిలిపివేయడానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. -
జాతీయస్థాయి పోటీలకు ఎంపికలు
నారాయణపేట ఎడ్యుకేషన్: హైదరాబాద్‌లో ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు జరిగే జాతీయస్థా యి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా అథ్లెట్లను ఆదివారం స్థానిక స్టేడియంలో ఎంపిక చేశారు. ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 200 మంది క్రీడాకారులు హాజరు కాగా.. రాష్ట్ర అథ్లెటిక్స్ పరిశీలకుడు శరత్చంద్ర ఆధ్వర్యంలో పలు విభాగాల్లో ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్–14 ట్రయాథ్లాన్ ఏ,బీ,సీ, అండర్–16 విభాగంలో 600 మీటర్ల పరుగుపందెం, 80 మీటర్ల హర్డిల్, షాట్‌ఫుట్, లాంగ్ జంప్, హైజంప్, జావెలిన్ త్రో, పెంటాథ్లాన్ పోటీలు నిర్వహించినట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ తెలిపారు. ఆయా విభాగాల్లో ప్రతిభకనబరిచిన 13 మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు పేర్కొన్నా రు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షు డు రవికుమార్‌గౌడ్, తపస్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గుంపు బాలరాజు, భీష్మరాజ్ ఫౌండేషన్ సభ్యుడు తిప్పన్న, కోచ్‌లు జగదీశ్, బీరప్ప, మహేశ్, భరత్, వ్యాయా మ ఉపాధ్యాయులు విద్యాసాగర్, యాదమ్మ, సౌమ్య, లావణ్య, శశికళ పాల్గొన్నారు. -
39వ సారి.. వాయిదా
కొల్లాపూర్: ఒకవైపు రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ.. దాదాపు 80 కి.మీ., మేర దూరభారం తగ్గించే రహదారి.. మరోవైపు ఎన్నో ఏళ్ల పోరాటం, కృష్ణానదిలో నాటు పడవ ప్రమాదాల్లో ఎంతోమంది మృతిచెందిన తర్వాత మంజూరైన వంతెన. ఈ రెండు పనులను ఒకే ప్రాజెక్టుగా అనుసంధానిస్తూ.. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి–167కే నిర్మాణానికి నిధులు కేటాయించింది. సుమారు ఐదేళ్ల క్రితం మంజూరైన రోడ్డు పనులు మూడేళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. ఇక కృష్ణానదిపై నిర్మించబోయే ఐకానిక్ వంతెన ఆసియా ఖండంలోనే అతిపెద్దది. ఈ వంతెన నిర్మాణానికి సంబంధించి టెండర్లను కూడా కేంద్రం మూడేళ్ల క్రితమే ఆహ్వానించింది. దీనికి ఎన్నో ప్రముఖ కంపెనీలు టెండర్ కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటికీ ఓపెన్ కావడం లేదు. ఇందుకు ప్రధానంగా రెవెన్యూ పరిధిలోని భూ సేకరణలో జాప్యమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా రెండు ప్రాంతాలు, లక్షలాది మంది ప్రజలకు మేలు చేసే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై పాలకులు, అధికారుల చిత్తశుద్ధిని వేలెత్తి చూపేలా చేస్తోంది. ఐదు ప్యాకేజీలుగా విభజన జాతీయ రహదారి–167కేను 2021లో మంజూరు చేశారు. ఐదు ప్యాకేజీలుగా పనులను విభజన చేశారు. మొదటి ప్యాకేజీలో భాగంగా అదే ఏడాది సెప్టెంబర్‌లో కల్వకుర్తి నుంచి సోమశిల రోడ్డు వరకు రహదారి విస్తరణ, బైపాస్ నిర్మాణాలకు సంబంధించిన టెండర్లు ఓపెన్ చేశారు. ఈ పనుల టెండర్‌ను రూ.436.91 కోట్లకు ఆర్కే ఇన్ఫ్రా అనే సంస్థ దక్కించుకుంది. వీరు 2023 జూలైలో అధికారికంగా పనులు ప్రారంభించారు. ఈ పనులు దాదాపుగా తుదిదశకు చేరుకున్నాయి. తాడూరు సమీపంలో బైపాస్ రహదారి నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 85 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన 4, 5 ప్యాకేజీల పనులు కూడా దాదాపుగా పూర్తి కావొస్తున్నాయి. 2023లో టెండర్ల ఆహ్వానం.. 2, 3వ ప్యాకేజీలలో కృష్ణానదిపై ఐకానిక్ సస్పెన్సివ్ కేబుల్ బ్రిడ్జితోపాటు అప్రోచ్ రహదారులు ఉన్నాయి. జాతీయ రహదారి–167కే మొత్తం పొడవు 185.90 కి.మీ., కాగా.. 87.360 – 88.437 కి.మీ., మధ్యభాగంలో ఐకానిక్ వంతెన నిర్మిస్తారు. ఈ పనుల కోసం రూ.963 కోట్లు కేటాయించి 2023 నవంబర్ 2న టెండర్లను నేషనల్ హైవే అథారిటీ ఆహ్వానించింది. పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. వంతెన పనులు చేపట్టే ప్రదేశానికి వెళ్లే దారిలో అటవీ, రెవెన్యూ భూములను సేకరించాల్సి ఉంది. భూ సేకరణలో జాప్యం కారణంగా మూడేళ్లుగా టెండర్ల ఓపెన్‌ను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు 39 సార్లు టెండర్ల ఓపెన్ గడువును వాయిదా వేస్తూ వచ్చారు. ఊగిసలాడుతున్న కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం టెండర్లు తెరిచేందుకే మూడేళ్లు గడిచిపోయిన పుణ్యకాలం వివిధ రకాల సాకులతో 39 సార్లు వాయిదాల పర్వం రెవెన్యూ పరిధిలో భూ సేకరణలో జాప్యమే ప్రధాన కారణం ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై అధికారులు, ప్రజాప్రతినిధుల్లో కొరవడిన చిత్తశుద్ధి నోటీసులు జారీచేశాం.. కొల్లాపూర్ సమీపం నుంచి కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మించే ప్రాంతం వరకు జాతీయ రహదారి నిర్మాణానికి 53 హెక్టార్ల భూ సేకరణ చేపడుతునున్నాం. ఇందులో 25 హెక్టార్ల అటవీ భూమి ఉండగా వారి నుంచి ఎన్ఓసీ వచ్చింది. రెవెన్యూ పరిధిలోని భూములు సేకరించేందుకు నోటిఫికేషన్ ఇచ్చాం. భూములు కోల్పోయే వారికి నోటీసులు జారీచేశాం. ఇటీవలే కొందరు రైతులకు పరిహారం డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. మిగిలిన వారికి కూడా త్వరలోనే పరిహారం చెల్లింపులు జరుగుతాయి. అయితే దాదాపుగా 70 మంది రైతులు మాత్రం ఇప్పటి వరకు తమ భూములకు సంబంధించిన పత్రాలు సమర్పించలేదు. వారికి కొన్ని రోజుల క్రితమే ఫాం–2 నోటీసులు ఇచ్చాం. నిర్ణీత సమయంలోగా వారు స్పందించకుంటే నిబంధనల ప్రకారం ఆయా భూములను స్వాధీనం చేసుకుంటాం. – భన్సీలాల్, ఆర్డీఓ, కొల్లాపూర్ భూ సేకరణలో తీవ్ర జాప్యం.. జాతీయ రహదారి పనుల కోసం కొల్లాపూర్ నియోజకవర్గంలోని రామాపురం, మల్లేశ్వరం, వరిదేల గ్రామాల శివార్లలో భూసేకరణ చేపట్టాలి. ఏడాదిన్నర క్రితం భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసి.. రైతులకు నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లింపులు జరగలేదు. భూ సేకరణ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో టెండర్ల గడువును పొడిగిస్తూ వస్తున్నట్లు నేషనల్ హైవే అధికారులు వెల్లడించారు. ఈ రహదారి నిర్మాణ ప్రాంతంలో 25 హెక్టార్ల అటవీ భూమి ఉండగా.. దాన్ని రోడ్డు నిర్మాణానికి వాడుకునేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అధికారులు కూడా అనుమతులు ఇచ్చారు. కానీ, రాష్ట్ర రెవెన్యూ శాఖ పరిధిలోని భూసేకరణ మాత్రమే పెండింగ్‌లో ఉంది. భూసేకరణ పూర్తయితే వంతెన వరకు రోడ్డు నిర్మించి, ఆ తర్వాత వంతెన పనులు చేపట్టాల్సి ఉంటుందని జాతీయ రహదారుల సంస్థ అధికారులు వెల్లడించారు. టెండర్లు ఓపెన్ చేస్తే కాంట్రాక్టు కంపెనీకి వెంటనే భూమిని అప్పగించాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు. -
‘సూర్యఘర్’తో విద్యుత్ బిల్లులు తగ్గించుకోండి
నారాయణపేట: పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవాలని ట్రాన్స్‌కో ఎస్ఈ నవీన్‌కుమార్ సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో విద్యుత్ అధికారులు, వినియోగదారులకు పీఎం సూర్యఘర్ పథకంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సోలార్ ప్యానెల్స్ ద్వారా ఇంటి అవసరాలకు విద్యుదుత్పత్తి చేసుకోవడంతో పాటు ఖర్చులు ఆదా చేసుకోవచ్చని తెలిపారు. సోలార్ విద్యుత్ ఎలా ఉత్పత్తి అవుతుంది.. దాన్ని ఎలా వినియోగించుకోవాలి.. పథకం నిబంధనలు ఏమిటి.. వెండర్ల ద్వారా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను వివరించారు. ప్రభుత్వ బ్యాంకుల ద్వారా లభించే రుణ సదుపాయాన్ని కూడా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అలాగే విద్యుత్ సరఫరా సమయంలో విద్యార్థులు, ప్రజలు తీసుకోవాల్సిన భద్రతా జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. జిల్లాలోని ప్రతి ఇంటికీ సౌర విద్యుత్ వినియోగం విస్తరించేలా ప్రజలు పథకంలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్ర మంలో డీఈటీ రాజునాయక్, ఆపరేషన్ డీఈ శ్రీని వాస్, ఏఈటీ వెంకటకృష్ణారెడ్డి, ఎల్ఐ యాషిన్ పా షా,ఆర్టిజన్ నర్సింహారావు, తాజుద్దీన్ పాల్గొన్నారు. -
కోయిల్‌సాగర్‌కు నీటి పంపింగ్ నిలిపివేత
మరికల్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో పూర్తిగా తగ్గడంతో ఆదివారం కోయిల్‌సాగర్‌కు అధికారులు నీటి పంపింగ్‌ను నిలిపివేశారు. రెండు రోజుల క్రితం ఉంద్యాల పంపుహౌజ్ వద్ద అధికారులు మోటార్లను నిలిపివేయడంతో కోయిల్‌సాగర్‌కు వచ్చే నీటి ప్రవాహం తగ్గింది. జూరాల నుంచి నీటి పంపింగ్ నిలిచిపోవడంతో తీలేర్ పంపుహౌజ్ వద్ద కూడా కోయిల్‌సాగర్‌కు పంపింగ్ చేస్తున్న మోటార్లను బంద్ చేశారు. ప్రస్తుతం కోయిల్‌సాగర్‌లో 20 అడుగుల మేర నీటిమట్టం ఉందని అధికారులు తెలిపారు. కాగా, గోటూర్, పూసల్‌పహాడ్, రాకొండ, పెద్దచింతకుంట గ్రామాల్లో సాగుచేసిన వరిపంటకు నీరు లేక ఎండుముఖం పట్టింది. అయితే ఆయకట్టు రైతులను దృష్టిలో ఉంచుకొని కోయిల్‌సాగర్ కుడి కాల్వ ద్వారా మరో రెండు రోజులపాటు నీరు వదులుతామని అధికారులు తెలిపారు. -
వైభవంగా రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి కోదండరామస్వామి ఆలయంలో ఆదివారం సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సీతారాములను అపురూపంగా ముస్తాబుచేసి వేదమంత్రాల నడుమ వైభవంగా కల్యాణాన్ని జరిపారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అదిక సంఖ్యలో బీచుపల్లికి చేరుకొని పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణంలో పాల్గొని కార్యక్రమాన్ని కనులారా తిలకించారు. కల్యాణోత్సవానికి హాజరైన భక్తులకు కలుకుంట్లకు చెందిన ఆంజనేయులుగౌడ్ కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు, అర్చకులు భువనచంద్ర, దత్తుస్వామి, భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్ పీఠం ఎవరికో?
● నారాయణపేట, కోస్గిలో ముగిసిన పాలకవర్గాల పదవీకాలం ● మక్తల్ మార్కెట్ కమిటీకి డిసెంబర్ వరకు గడువు ● పదవుల పొడిగింపుపై పాతవారి ఆశలు.. కొత్త కుర్చీలపై ఆశావహుల గురి ● జోరుగా రాజకీయ పైరవీలు నారాయణపేట: జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవులపై ఉత్కంఠ నెలకొంది. నారాయణపేట, కోస్గి వ్యవసాయ మార్కెట్ కమిటీల పదవీకాలం ముగియడంతో రాజకీయ పైరవీలు జోరందుకున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. జిల్లాకేంద్రమైన నారాయణపేట మార్కెట్ కమిటీ గడువు ముగిసి 18 రోజులు దాటగా.. పదవుల కొనసాగింపుపై ప్రస్తుత చైర్మన్, డైరెక్టర్లలో ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు కొత్త కమిటీ వస్తుందన్న ఆశతో ఆశావహులు తమ రాజకీయ లాబీయింగ్‌ను వేగవంతం చేసినట్లు అధికార పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎవరి లెక్కలు వారివే.. పదవి కొనసాగుతుందన్న ఆశతో ప్రస్తుత సభ్యులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తుండగా.. కొత్త కమిటీ ఏర్పాటైతే తమకు అవకాశం దక్కుతుందని పలువురు నాయకులు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మార్కెట్ కమిటీ పాలకవర్గాలు ప్రస్తుతం సాధారణ పరిపాలనా పదవులుగా కాకుండా, స్థానిక రాజకీయ సమీకరణాలకు కీలక కేంద్రాలుగా మారాయి. పాత కమిటీకి భరోసా! నారాయణపేట మార్కెట్ కమిటీ ప్రస్తుత పాలకవర్గం 2024 సెప్టెంబర్ 16న ప్రమాణస్వీకారం చేసింది. అయితే పదవీకాలం ముగియడంతో సభ్యులు తమ పదవుల కొనసాగింపుపై అధికార పార్టీ ముఖ్యుల వద్ద ఆరా తీస్తున్నట్లు చర్చ. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కుంభం శివకుమార్‌రెడ్డి వద్ద పలువురు సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావిస్తుండగా.. తొందరపడొద్దు, ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని భరోసా ఇస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కోస్గిలో ముగిసిన గడువు.. నారాయణపేట తర్వాత కోస్గి వ్యవసాయ మార్కెట్ కమిటీపైనే అందరి దృష్టి పడింది. 2026 అక్టోబర్ 3తో కోస్గి పాలకవర్గం గడువు పూర్తవ్వడంతో చైర్మన్ మడ్డి భీములు నేతృత్వంలోని ప్రస్తుత పాలకవర్గం భవిష్యత్‌పై స్పష్టత కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో కొత్తగా అవకాశం కోసం ఆశిస్తున్న నాయకుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. అయితే కోస్గి కమిటీ ప్రమాణ స్వీకారం, పదవీకాలం లెక్కలపై భిన్న అభిప్రాయాలు ఉన్నందున తుది స్పష్టత అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. అయితే ప్రస్తుత కమిటీ పదవుల కొనసాగింపు విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పాత వారికే పొడిగింపా.. కొత్తవారికి పట్టాభిషేకమా? మార్కెట్ కమిటీ పదవీకాలాన్ని ప్రభుత్వం చట్టపరమైన నిబంధనల మేరకు పొడిగించవచ్చు. ఒక్కసారి ఇచ్చే పొడిగింపు ఆరు నెలలకు మించకూడదు. మరోవైపు కమిటీ పునర్వ్యవస్థీకరణలో ఆలస్యం జరిగితే ప్రభుత్వం తాత్కాలిక నిర్వహణకు వ్యక్తి/వ్యక్తులను నియమించే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు నారాయణపేట, కోస్గి మార్కెట్ కమిటీల్లో పాలన కంటే పదవులపై చర్చ కొనసాగుతోంది. మార్కెట్ లావాదేవీల కంటే రాజకీయ లెక్కలే హాట్‌టాపిక్‌గా మారాయి. మక్తల్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం పదవీకాలం ఇంకా ముగియలేదు. కానీ ఆ కుర్చీ ఎవరికి సొంతమవుతుందనే చర్చ మాత్రం అప్పుడే మొదలైంది. రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న మక్తల్ మార్కెట్ కమిటీ పదవీకాలం 2026 డిసెంబర్ వరకు ఉన్నప్పటికీ.. కొత్తగా అవకాశం కోసం చూస్తున్న ఆశావహుల లెక్కలు తెరపైకి వస్తున్నాయి. నారాయణపేట కమిటీకి సెప్టెంబర్ 15తో, కోస్గి కమిటీకి అక్టోబర్ 3తో గడువు పూర్తయిన నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మక్తల్‌లోనూ ఆసక్తిని పెంచుతోంది. పాతవారికే మరో అవకాశం దక్కుతుందా? లేక కొత్త ముఖాలకు తలుపులు తెరుచుకుంటాయా? అన్నదానిపై చర్చ సాగుతోంది. -
ఫుట్‌బాల్ రన్నరప్‌గా నారాయణపేట
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం ఉమ్మడి జిల్లాస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాలుర ఫుట్‌బాల్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ నిర్వహించారు. ఈపోటీల్లో ఉమ్మడి జిల్లాల నుంచి ఐదు జట్లు పాల్గొనగా లీగ్ మ్యాచ్‌లు నిర్వహించారు. మహబూబ్‌నగర్ జట్టు విన్నర్‌గా, నారాయణపేట జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ఆడి జాతీయస్థాయికి ఎదగాలని సూచించారు. రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ ఫుట్‌బాల్ టోర్నీలో ఉమ్మడి జిల్లా జట్లు మెరుగైన ప్రతిభ కనబరిచి చాంపియన్లుగా నిలిచి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం విజేతలకు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో పెటాటీఎస్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్గౌడ్, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి భానుకిరణ్, సభ్యులు గజానంద్‌కుమార్, నందకిషోర్, ఇమ్మాన్యుయేల్ జేమ్స్, పీడీలు రామకృష్ణ, రాజు, నాగరాజు, చంద్రశేఖర్, రాంమోహన్‌గౌడ్, శ్రీనివాసులు తదతరులు పాల్గొన్నారు. -
జిల్లాల వారీగా స్పెషల్ ఎడ్యుకేటర్ల నియామకం ఇలా..
జోగుళాంబ గద్వాల 22మహబూబ్‌నగర్ 24నాగర్‌కర్నూల్ 24నారాయణపేట 19వనపర్తి 158వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి.. ఐదు నెలల కాలానికి గెస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్ల నియామకం చేపడుతున్నాం. స్పెషల్ బీఈడీ, బీఈడీ జనరల్, స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా, పీజీ డిప్లొమా చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 3 నుంచి 8వ తేదీ వరకు సంబంధిత పీఎం శ్రీ పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవాలి. – విజయకుమారి, డీఈఓ, మహబూబ్‌నగర్ ● -
ఇసుక అక్రమ రవాణాపై నిఘా..
జిల్లాలో మైనింగ్ ద్వారా వస్తున్న ఆదాయం, ఇసుక రవాణాకు ఇస్తున్న అనుమతిపై ఎంపీ వివరాలు కోరారు. ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదులు వస్తున్నాయని.. అడ్డుకట్ట వేయా లని అధికారులను ఆదేశించారు. ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ పటిష్టం చేయాలని కలెక్టర్‌కు సూచించారు. రోడ్లపై గుంతలు పూడ్చాలి.. ఊట్కూర్ మండలం వల్లంపల్లి రోడ్డు నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలని పీఆర్ ఈఈని ఆదేశించారు. నారాయణపేట–మక్తల్ రహదారి పనులు ప్రారంభమయ్యే వరకు రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద చేపడుతున్న, చేపట్టాల్సిన రహదారుల వివరాలను అధికారులు తెలియజేశారు. 4 వేల శస్త్రచికిత్సలు.. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలను వైద్య కళాశాల ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ డా. సంపత్‌కుమార్ వెల్లడించారు. 6,500 ఇన్‌పేషెంట్ కేసులు నమోదయ్యాయని, అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు సుమారు 4 వేల శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. సాంకేతిక, సాంకేతికేతర విభాగాల్లో 34 కేటగిరీలకు సంబంధించి 154 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి నియామక ప్రక్రియ పూర్తి చేసినట్లు వెల్లడించారు● సమావేశంలో పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ, విద్య, ఎస్సీ అభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, పౌరసరఫరాలు, నాబార్డు, మైనింగ్, పశుసంవర్ధక, మత్స్య, అటవీ, ఉద్యాన, ఇరిగేషన్, కార్మిక, జాతీయ రహదారులు, ఆర్అండ్బీ తదితర శాఖల అధికారులు తమ శాఖల సమగ్ర నివేదికలు సమర్పించారు. -
జిల్లాలో 30 పోలీస్‌యాక్ట్ అమలు : ఎస్పీ
నారాయణపేట: శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ నెల 31 వరకు జిల్లావ్యాప్తంగా 30 పోలీస్‌యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డా. వినీత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు, ధర్నాలు, సమావేశాలు, బహిరంగ సభలు, జన సమూహాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. ప్రజా జీవనానికి ఆటంకం కలిగించేలా కార్యక్రమాలు నిర్వహించినా, నిషేధాజ్ఞలను ఉల్లంఘించినా నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో మతాల మధ్య చిచ్చుపెట్టేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అనవసరమైన సమాచారం ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎలాంటి కార్యక్రమం నిర్వహించాలన్నా ముందస్తుగా పోలీసులకు దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని సూచించారు. 30 పోలీస్ యాక్ట్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. చట్టాలపై అవగాహన అవసరం నారాయణపేట ఎడ్యుకేషన్: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని.. చట్టం అంటే శిక్ష కాదు, రక్షణ అని జూనియర్ సివిల్ న్యాయమూర్తి అవినాష్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రాథమిక హక్కులు, విధులు, పోక్సో కేసులు, శిక్షలు, బాలకార్మిక వ్యవస్థ తదితర వాటిపై అవగాహన కల్పించారు. 18 ఏళ్లలోపు చిన్నారులపై లైంగిక వేధింపు జరిగితే పోక్సో చట్టం 2012 కింద 20 ఏళ్ల వరకు జైలుశిక్ష ఉంటుందని, అవసరమైతే ఉరి శిక్ష విధిస్తారన్నారు. గంజాయి, డ్రగ్స్, హెరాయిన్ వినియోగం నేరమని.. దీనికిగాను 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తారని వివరించారు. ఎవరైనా మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే టోల్‌ఫ్రీ నంబర్ 1098కు ఫిర్యాదు చేయాలని సూచించారు. బాలలతో పనులు చేయించడం నేరమని, అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలన్నారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ లక్ష్మీపతిగౌడ్, లైసన్ అధికారి కృష్ణయ్యగౌడ్, ప్రిన్సిపాల్ పద్మ, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన కీలకం నారాయణపేట: పోలీసు విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన, దేహ దారుఢ్యం అత్యంత కీలకమని ఆర్ఐ విజయ్‌కుమార్ అన్నారు. ఎస్పీ డా. జి.వినీత్ ఆదేశాల మేరకు శనివారం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీక్లీ పరేడ్‌తో శారీరక దారుఢ్యం, మాన సిక ప్రశాంతత సమకూరుతాయని పేర్కొ న్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యతను గుర్తించి అప్రమత్తంగా, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. అనంతరం సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకొని విధుల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ రోజూ వ్యా యామం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఐలు శివశంకర్, శిరీషతో పాటు ఏఆర్, సివిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మినిస్టర్ కప్ విజేత నర్వ నర్వ: నియోజకవర్గస్థాయి ఉపాధ్యాయుల మినిస్టర్ కప్ విజేతగా నర్వ ఉపాధ్యాయ జట్టు నిలిచింది. శనివారం మక్తల్‌లో నిర్వహించిన చివరి పోరులో ఊట్కూర్ జట్టుతో తలపడి విజేతగా నిలిచి ట్రోఫీని కై వసం చేసుకుంది. పాఠశాలల్లో నిరంతరం పాఠాలు బోధిస్తూ ఒత్తిడిని ఎదుర్కొనే ఉపాధ్యాయులకు శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలిగించేందుకు, క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో క్రికెట్ పోటీలు నిర్వహించామని డీవైఎస్ఓ వెంకటేష్‌శెట్టి తెలిపారు. పోటీల్లో మక్తల్, మాగనూర్, కృష్ణా, ఊట్కూర్, నర్వ మండలాల ఉపాధ్యాయ జట్లు పాల్గొన్నాయి. -
రైతుల ధర్నాతో..
జూరాల ప్రాజెక్టు కింద సాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తి పంటలు దెబ్బతినే పరిస్థితి తలెత్తడంతో రైతులు గతనెలలో పలుమార్లు రోడెక్కి ధర్నా చేశారు. చివరికి జూరాల కాల్వ గేట్లు సైతం తెరిచి నీటిని విడుదల చేసుకోవడంతో ప్రభుత్వంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. పరిస్థితిని అధిగమించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. జూరాల ఆయకట్టు పంటలను కాపాడేందుకు కర్ణాటక సీఎంతో మాట్లాడి ఒప్పించాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటీ శ్రీహరిలను పురమాయించారు. దీంతో వారు గత నెల 22న ఉమ్మడి జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలతో కలిసి కర్ణాటక వెళ్లారు. 23న సీఎం డీకే శివకుమార్, ఇరిగేషన్ శాఖ మంత్రి షర్వ రాజస్వామి, ప్రిన్సిపల్ సెక్రెటరీ షాల్వాతో మంతనాలు జరిపారు. జూరాల కింద సాగైన పంటల పరిస్థితిని వివరించి మొత్తానికి రోజుకు 5 క్యూసెక్కుల చొప్పున 50 రోజులపాటు 5 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకున్నట్లు మంత్రులు ప్రకటించారు. అయితే మంత్రులు చేసిన ప్రయత్నం మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఎగువ నుంచి వచ్చే నీరు ఈ నెల 2 నాటికే నిలిచిపోయింది. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
నారాయణపేట: సంక్షేమ పథకాలు అర్హులందరికి అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పనిచేయాలని మహబూబ్‌నగర్ ఎంపీ, జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) చైర్మన్ డీకే అరుణ కోరారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన దిశ సమావేశంలో కలెక్టర్ సీహెచ్ ప్రియాంకతో కలిసి పాల్గొని వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై శాఖల వారీగా వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేస్తే తదుపరి అభివృద్ధి పనులకు అనుమతులు, అదనపు నిధులు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, ఇతర వర్గాలకు ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. జిల్లా అభివృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. పీఎం సూర్యఘర్‌కు 151 రిజిస్ట్రేషన్లు.. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకానికి జిల్లాలో ఇప్పటి వరకు 151 రిజిస్ట్రేషన్లు అయ్యాయని విద్యుత్‌శాఖ ఎస్ఈ నవీన్ వివరించారు. వీటిలో 49 సర్వీసులు విడుదల కాగా.. 162.32 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పీఎం కుసుమ్ పథకం కింద 24 ప్రతిపాదనలు సమర్పించగా మూడు ప్రాజెక్టులకు అనుమతి లభించిందని తెలిపారు. సూర్యఘర్ పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. అర్హులకే ఇళ్లు.. జిల్లాలో అర్హులందరికి ఇళ్లు మంజూరు చేయాలని ఎంపీ సూచించారు. పీఎంశ్రీ పాఠశాలలకు సంబంధించి మొత్తం 15 పనుల్లో ఏడు పూర్తయ్యాయని, ఎనిమిది పురోగతిలో ఉన్నాయని అధికారులు వివరించారు. పెండింగ్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. అధికారులకు అభినందనలు.. పీఎండీకేవైలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమని ఎంపీ కొనియాడారు. రైతుల కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయికి చేరేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. సాధించిన ఫలితాలను కొనసాగిస్తూ జిల్లాను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. భారత్‌మాల పరిహారంపై సమీక్ష.. భారత్‌మాల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు చెల్లించాల్సిన పరిహారంపై ఎంపీ వివరాలు కోరారు. సుమారు 600 ఎకరాల్లో 1,500 మంది రైతులు ఉండగా.. 150 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆర్డీఓ రమేష్ తెలిపారు. మొత్తం రూ.217 కోట్ల పరిహారానికిగాను రూ.184 కోట్లు చెల్లించినట్లు వివరించారు. పరిహారం రేటు తక్కువగా ఉందన్న కారణంతో కొందరు రైతులు స్వీకరించలేదని తెలిపారు. భూ సేకరణ సమస్యను పరిష్కరించి పనుల్లో వేగం పెంచాలని, రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ఎంపీ సూచించారు. కాగితాలకే పరిమితం కాకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలి శాఖల మధ్య సమన్వయంతోనే లక్ష్య సాధన సాధ్యం దిశ సమావేశంలో మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ -
ప్రీప్రైమరీ బడుల సిబ్బందికి వేతనాలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం 2024–25 విద్యాసంవత్సరం నుంచి దశల వారీగా ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా ప్రీ ప్రైమరీ పాఠశాలలను ప్రారంభించింది. ఇందులో ముఖ్యంగా ఎల్కేజీ, యూకేజీ విద్యను అందించి, ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచేందుకు ఈ చర్యలు చేపట్టింది. మొత్తం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 292 ప్రైమరీ పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రమంలో అందులో పనిచేస్తున్న సిబ్బందికి నాలుగు నెలల వేతనాన్ని మంజూరు చేసింది. ఇందులో ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.8 వేలు, ఆయాకు రూ.6 వేలను మంజూరు చేసింది. ఈ నిధులు మొదట ఎంఈఓల ఖాతాలో జమ కాగా, అక్కడి నుంచి అమ్మ ఆదర్శ పాఠశాలు, పాఠశాల హెచ్ఎంల ఖాతాలకు వెళ్లిన అనంతరం ఆధార్‌లింక్ ఉన్న ఇన్స్ట్రక్టర్, ఆయా ఖాతాలో నేరుగా జమచేసే విధంగా ఆదేశాలు జారీ చేశారు. వేతనాల్లో ఆలస్యం లేకుండా నిధులు విడుదల చేయడంపై ఇన్స్ట్రక్టర్, ఆయాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై డీఈఓ విజయకుమారిని వివరణ కోరగా ఇటీవల ప్రా రంభించిన ప్రీ ప్రైమరీ బడుల సిబ్బందికి సంబంధించిన వేతనాలను ప్రభుత్వం విడు దల చేసిందని, వాటిని నిబంధనల ప్రకారం విడుదల చేయాలని సూచించారు. పాఠశాలల నిర్వహణ, ఇతర ఖర్చుల నిమిత్తం నిధులు ఉమ్మడి జిల్లాలో 292 ప్రైమరీ బడులకు రూ.1,69 కోట్లు విడుదల -
చివరికి.. దక్కేనా?
5 ఎకరాల్లో వరి.. నా కున్న ఎకరాల్లో వరిపంట సాగుచేశా. ఇప్పటికే ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టా. పంటపూర్తిగా చేతికి రావాలంటే డిసెంబర్ వరకు నీళ్లు కావాలి. వారాబందీతో నవంబర్ వరకు నీళ్లు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. మరి మేం వేసుకున్న పంటలు పరిస్థితి ఏం కావాలి. ప్రభుత్వం స్పందించి పంటలు కాపాడాలి. – ఆంజనేయులు రైతు, కొండేరు, ఎర్రవల్లి మండలం రూ.3 లక్షలు నష్టపోతా.. జూరాల ఎడమ కాల్వ కింద 9 ఎకరాల్లో వరిపంట సాగుచేశాను. ప్రస్తుతం వారాబందీ అంటూ మరోమారు కాల్వలకు సాగునీరు నిలిపివేశారు. ఇకపై కాల్వలకు సాగునీరు ఇస్తారో.. లేదోనన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈసారి పంట మాత్రం చేతికి అందే పరిస్థితి కనిపిస్తలేదు. అలా అయితే నేను రూ.3 లక్షల మేర నష్టపోతాను. – వెంకటేష్, రైతు, గుంటిపల్లి, ఆత్మకూర్ మండలం నవంబర్ వరకే.. జూరాల జలాశయంలో ప్రస్తుతం 8.5 టీఎంసీలు నీరు అందుబాటులో ఉంది. ఇందులో డెడ్‌స్టోరేజీ 3.7 టీఎంసీలు కాగా.. లైవ్ స్టోరేజీ కింద 4.5 టీంఎసీలు. ఈ క్రమంలో లైవ్స్టోరేజీ కింద ఉన్న 4.5 టీఎంసీల నీటి నుంచి వారాబందీ విధానంతో నవంబర్ వరకు సాగునీరు విడుదల చేస్తాం. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకుని పంటలు కాపాడుకోవాలి. – వెంకట్, డీఈ, నీటిపారుదలశాఖ గద్వాల: ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే వర్షాధారిత పంటలు పూర్తిగా దెబ్బతినగా.. జూరాల నీటి ఆధారంగా సాగు చేసిన వరిపంట చివరికి దక్కుతుందా.. లేదా.. అన్న మీమాంసలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. జూరాల జలాశయంలో లైవ్ స్టోరేజీ కింద 4.5 టీఎంసీల నీటి లభ్యతతోపాటు కర్ణాటక వదులుతామన్న 5 టీఎంసీల ఆధారంగా అధికారులు నవంబర్ వరకు వారాబందీ విధానంలో పంటలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. అయితే తాజాగా కర్ణాటక కృష్ణాబేసిన్‌లో జూరాలకు నీటి విడుదల నిలిపివేయడంతో జూరాల, నెట్టెంపాడు కింద సాగైన పంటల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. దీంతో సరిగ్గా చేతికొచ్చే దశలో సాగునీటి సమస్య ఎదురై పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. శుక్రవారం నుంచి అమలులోకి.. జూరాల ఎడమ, కుడి ప్రధాన కాల్వలతోపాటు, నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 2.50 లక్షల ఎకరాల్లో వరిపంట సాగైంది. అయితే జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు పూర్తిగా నిలిచిపోవడంతో జలాశయంలో అందుబాటులో ఉన్న 4.5 టీఎంసీల లైవ్ స్టోరేజీ ఆధారంగా వారాబందీ పద్ధతిలో పంటలకు సాగునీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించి.. శుక్రవారం నుంచి అమలులోకి తీసుకువచ్చారు. వాస్తవానికి సాగైన పంటలు పూర్తిస్థాయిలో చేతికి రావాలంటే కనీసం 5– 6 టీఎంసీల నీరు అవసరం కాగా.. అయితే ప్రస్తుతం జూరాలలో 4.5 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉంది. మరి వారాబందీ విధానంతో ఈ పంటలు పూర్తిస్థాయిలో పండుతాయా.. అన్న ప్రశ్న రైతుల్లో తలెత్తుతోంది. 30– 40 వేల ఎకరాల్లో.. వారాబందీ విధానంతో నవంబర్ వరకు సాగునీటిని సరఫరా చేస్తామని అధికారులు ప్రకటించారు. అయితే జూరాల కుడి ప్రధాన కాల్వ పరిధిలో ఎర్రవల్లి, ఇటిక్యాల మండలాలు, ఎడమ కాల్వ పరిధిలో పెబ్బేరు, శ్రీరంగాపురం, చిన్నంబావి, వీపనగండ్ల మండాలల్లోని చివరి ఆయకట్టు సుమారు 30– 40 వేల ఎకరాల్లో వరి పంట సాగుచేశారు. ఈ పంటలు పూర్తిస్థాయిలో చేతికి రావాలంటే డిసెంబర్ వరకు సాగునీరు ఇవ్వాలి. మరి వారాబందీ అమలు చేస్తున్న నేపథ్యంలో చివరి ఆయకట్టు పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. జూరాలకు నీటి విడుదల నిలిపివేసిన కర్ణాటక ప్రభుత్వం జూరాల, నెట్టెంపాడు కింద 2.50 లక్షల ఎకరాల్లో సాగు ప్రస్తుతం 4.5 టీఎంసీలు మాత్రమే లైవ్ స్టోరేజీ నవంబర్ వరకు వారాబందీతో సాగునీరు విడుదల అయోమయంలో చివరి ఆయకట్టు రైతులు -
ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి
దామరగిద్ద: ఈ ప్రాంతంలో ఉచితంగా లభించే సీతాఫలాలను సేకరించి విక్రయించడంతో రైతు కూలీలకు ఉపాధి లభిస్తుందని.. సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఓ వెంకట్రాములు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో సీతాఫల్ ప్రాసెసింట్ యూనిట్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఏ గ్రేడ్ కిలోకు రూ.15, బి– గ్రేడ్‌కు రూ.13 చొప్పున చెల్లిస్తున్నామని తెలిపారు. విక్రయించిన వెంటనే నగదు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కంపెనీ చైర్మన్ నాగమణి, వైస్ చైర్మన్ సుజాత, పీడీఎం జయన్న, డీఎల్పీఓ ఉదయ్‌శంకర్, సెర్ప్ మార్కెటింగ్ మేనేజర్ మారుతి, తహసీల్దార్ తిరుపతయ్య, ఎంపీడీఓ సాయిలక్ష్మి, సర్పంచ్ కన్కిరెడ్డి, సీఈఓ ప్రశాంత్, సీసీ కిష్టప్ప, అంజిలప్ప, హన్మంతు పాల్గొన్నారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి
నారాయణపేట: ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అన్నారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం మండలంలోని జాజాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో సర్పంచ్ సంగీత అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా గాంధీజీ విగ్రహం, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం గ్రామ వనరుల పటాన్ని పరిశీలించారు. గ్రామంలో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకొని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. వర్షపు నీటిని సంరక్షించడం, నీటిని పొదుపుగా వినియోగించడంపై ప్రతి కుటుంబానికి అవగాహన కల్పించాలన్నారు. స్వచ్ఛత ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని.. ప్రతి ఇంటి నుంచి ప్రారంభం కావాల్సిన సామాజిక బాధ్యతని స్పష్టం చేశారు. తడి, పొడి చెత్తను వేరుచేసి సక్రమంగా నిర్వహించేలా ప్రజలను చైతన్యపర్చాలని ఆదేశించారు. జాజాపూర్ ఇప్పటికే పాఠశాల నిర్వహణ, పరిశుభ్రత, విద్యా ఫలితాలు, ఎఫ్ఎల్ఎన్ అంశాల్లో ముందుందని అభినందించారు. అనంతరం నీటి సంరక్షణ, స్వచ్ఛత, బాల్య వివాహాల నివారణపై సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. జాజాపూర్ను బాల్య వివాహ రహిత గ్రామంగా ప్రకటిస్తూ గ్రామసభలో తీర్మానం చేశారు. కార్యక్రమంలో జిల్లా మ త్స్య సహకార సంఘం అధ్యక్షుడు కాంత్‌కుమార్, డీఆర్డీఓ వెంకట్రాములు, డీడబ్ల్యూఓ రాజేందర్గౌ డ్, నోడల్ అధికారి యాదయ్య, ఎంపీఓ బాలాజీ, ఉపసర్పంచ్ లక్ష్మణ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
సోలార్‌తో విద్యుత్ బిల్లుకు చెక్
నారాయణపేట: పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు సూర్యశక్తిని ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవాలని విద్యుత్‌శాఖ డీఈ (టెక్నికల్) రాజునాయక్ సూచించారు. శుక్రవారం నారాయణపేట విద్యుత్‌శాఖ సర్కిల్ కార్యాలయ ఆవరణలో సేవా సేతు అభియాన్‌లో భాగంగా సోలార్ వినియోగంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్బిజ్లీ యోజన ద్వారా ప్రతి ఇంటి పైకప్పుపై సోలార్ పలకలు ఏర్పాటు చేసుకొని విద్యుదుత్పత్తి చేసుకోవాలని సూచించారు. సోలార్ ఏర్పాటు, విద్యుత్ వినియోగం, బ్యాంకు రుణాలు, పరికరాల ఎంపిక తదితర అంశాలపై అధికారులు, బ్యాంకు ప్రతినిధులు, సోలార్ వెండర్లు అవగాహన కల్పించారు. సోలార్ ఏర్పాటుకు ప్రభుత్వం గరిష్టంగా రూ.78 వేల వరకు రాయితీ అందిస్తుందని.. బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కూడా ఉంటుందని వివరించారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించాల్సిన అవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. శని, ఆదివారం కూడా టీజీఎస్పీడీసీఎల్, టీఎస్ రెడ్కో మహబూబ్‌నగర్, ఎస్బీఐ, సోలార్ వెండర్ల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్ఈ బి.నవీన్‌కుమార్, డీఈ ఆపరేషన్న్స్ వి.శ్రీనివాస్, ఎస్బీఐ ఫీల్డ్ ఆఫీసర్ శరత్‌కుమార్, సోలార్ వెండర్లు వినయ్‌కుమార్, డి.చంద్రశేఖర్, ఎం.శ్రీకాంత్, ఏఈలు మహే ష్‌గౌడ్, వెంకటకృష్ణారెడ్డి, సతీష్ పాల్గొన్నారు. నిలువురాళ్ల స్థల అభివృద్ధికి సహకారం నారాయణపేట: జాతీయ ప్రాధాన్యం కలిగిన ముడుమాల్ నిలువురాళ్ల స్థల సమగ్ర అభివృద్ధి, పరిరక్షణకు అవసరమైన సహకారం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలంగాణ వారసత్వశాఖ సంచాలకుడు ప్రొ. అర్జునన్రావు, దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ ప్రొ. మణికొండ వేదకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సరిహద్దులను గుర్తించడం, పరిరక్షణకు అవసరమైన భూ సేకరణ, బీటీ అప్రోచ్ రోడ్డు నిర్మాణం వంటి అంశాలపై చర్చించి ప్రతిపాదనలు వివరించినట్లు పేర్కొన్నారు. అలాగే ప్రధానోపాధ్యాయులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, పర్యాటక మార్గదర్శకులకు శిక్షణ ఇవ్వడం, వారసత్వ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ముడుమాల్‌లో ఏటా రెండు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించే అంశాలపై చర్చించామన్నారు. ప్రతిపాదనలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని వారు పేర్కొన్నారు. రేపు ‘ఎస్జీఎఫ్’ జట్ల ఎంపికలు మహబూబ్‌నగర్ క్రీడలు: పాలమూరు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం ఉదయం 9.30కి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–17 ఉమ్మడి జిల్లాస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మిగతా వివరాలకు పీడీ భానుకిరణ్‌ను సంప్రదించాలన్నారు. అలాగే ఇండోర్ స్టేడియంలో ఈనెల 4వ తేదీన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14, 17 విభాగాల జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
ఉద్యాన సాగుపై అవగాహన
కొత్తపల్లి: కొత్తపల్లి, గుండుమాల్ మండలాల్లోని కొమ్మూరు, వీరారం, పెద్దాపూర్, లింగాల్చేడ్, నిడ్జింత గ్రామాల్లో శుక్రవారం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి వీవీఎస్ సాయిబాబా ఆయిల్‌పాం, కూరగాయలు, పండ్లతోటల్లో చీడపీడల నివారణ, సస్యరక్షణ చర్యలు, సమగ్ర యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తుంపర, బిందు సేద్యం పరికరాలను రాయితీపై అందిస్తోందని.. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే శాశ్వత పందిరి, పూల తోటలు, మల్చింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జాతీయ అత్యాపత్యా పోటీలకు ఎంపిక ధన్వాడ: మండలంలోని కొండాపూర్ గిరిజన గురుకుల పాఠశాల 10వ తరగతి విద్యార్థి శ్రీకాంత్ సబ్ జూనియర్ జాతీయ అత్యాపత్యా ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ రాజారాం శుక్రవారం తెలిపారు. ఈ నెల 4, 5 తేదీల్లో హైదరాబాద్‌లోని ఎల్బీ ఇండోర్ స్టేడియంలో జరిగే పోటీల్లో రాష్ట్రస్థాయి జట్టుకు శ్రీకాంత్ ప్రాతినిథ్యం వహిస్తారని చెప్పారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగిన జాతీయస్థాయి ఎంపిక శిక్షణా శిబిరంలో పాల్గొన్నారని వివరించారు. గతంలోనూ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రిన్సిపాల్‌తో పాటు పీఈటీ ఆంజనేయులు, నెట్‌బాల్ కోచ్ డా. రామ్మోహన్‌గౌడ్, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు. -
విద్యకు సాంకేతిక చేయూత
నర్వ: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదువులో వెనుకబడిన విద్యార్థుల విద్యా సామర్థ్యాల పెంపునకు మరో ముందడుగు పడింది. ఇప్పటికే ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం అమలు చేస్తున్నా ఆశించిన ఫలితాలు లేవు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ఏఎక్స్ఎల్ పేరిట ఏఐ ద్వారా అసిస్టెంట్ సహకారంతో విద్యా సామర్థ్యాలు మెరుగుపర్చేలా చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే ఆయా పాఠశాలలకు అవసరమైన కంప్యూటర్లు, సామగ్రిని రాష్ట్ర విద్యాశాఖ సరఫరా చేసింది. ఉమ్మడి జిల్లాలో 3.50 లక్షలు. ఉమ్మడి జిల్లాలో 3.50 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో ఆశించిన స్థాయిలో విద్యా సామర్థ్యాలు ఉండటం లేదని ఇటీవల కేంద్రం విడుదల చేసిన పీజీఐ సర్వేతో స్పష్టమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని 192 ప్రాథమిక పాఠశాలలను ఈ కార్యక్రమానికి ఎంపిక చేసి ఒక్కో పాఠశాలకు మూడు నుంచి 5 కంప్యూటర్ల చొప్పున మొత్తం 735 కంప్యూటర్లు సరఫరా చేశారు. వీటితో పాటు ఒక్కో కంప్యూటర్‌కు రెండు హెడ్సెట్లు, యూపీఎస్‌లు, టేబుళ్లు, కుర్చీలు, ఇంటర్నెట్ సౌకర్యం, విద్యుత్ సరఫరా పరికరాలు అందజేశారు. జిల్లాలో నీతి ఆయోగ్ సూచన మేరకు ప్రత్యేకంగా స్పార్క్ (స్కూల్ ప్రోగ్రామ్ ఫర్ ఏఐ రెడినెస్ అండ్ నాలెడ్జ్) ద్వారా ప్రాథమిక పాఠశాలలో ఏఎక్స్ఎల్ డిజిటల్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. ఇందుకోసం యాస్పిరేషన్ బ్లాక్ నర్వ మండలంలో ప్రతి ప్రాథమిక పాఠశాలను ఎంపిక చేసి ఏఐ కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. వీటి పనితీరును పరిశీలించేందుకు కొన్నిరోజుల కిందట నీతి ఆయోగ్ అధికారులు నర్వ మండలాన్ని సందర్శించారు. పాఠశాలల్లో కంప్యూటర్ల ద్వారా ఏఐ అసిస్టెంట్‌తో అందించిన విద్యాబోధన క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు ఇస్తుందని కితాబిచ్చారు. వెనుకబడిన విద్యార్థుల నైపుణ్యాలు పెంచేందుకు విద్యాశాఖ కృషి ఏఎక్స్ఎల్ పేరుతో సామర్థ్యాల పెంపునకు శ్రీకారం ఉమ్మడి జిల్లాలో 192.. జిల్లాలో 28 పాఠశాలలు ఎంపిక ఆయా పాఠశాలలకు కంప్యూటర్లు, సామగ్రి సరఫరా వెనుకబడ్డ విద్యార్థుల కోసమే.. ఏఎక్స్ఎల్ ప్రోగ్రామ్ ద్వారా జిల్లాలో ఎంపికచేసిన 28 పాఠశాలల్లో కంప్యూటర్ విద్యాబోధన అందిస్తున్నాం. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు వెనుకబడ్డ పాఠ్యాంశాల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా ఏఐ ద్వారా ఉపాధ్యాయులు బోధన అందిస్తున్నారు. ఎంపికై న పాఠశాలల్లో కార్యక్రమం పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకుంటాం. – విద్యాసాగర్, ఏఎంఓ, నారాయణపేట -
గ్రామాభివృద్ధితోనే దేశ ప్రగతి
● ఆశాలు, అంగన్వాడీలు,ఆర్పీల సేవలు అభినందనీయం ● మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ నారాయణపేట: గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశ సమగ్ర ప్రగతి సాధ్యమవుతుందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అన్నారు. మహాత్మాగాంధీ జయంతి, ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకొని నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప అభియాన్శ్రీలో భాగంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని శ్రీ గార్డెనన్స్‌లో నిర్వహించిన క్షేత్రస్థాయి మహిళా సిబ్బంది సన్మాన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి చేర్చడంలో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆర్పీలు, మహిళా సంఘాల ప్రతినిధుల సేవలు కీలకమని కొనియాడారు. ‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, రైతు సంక్షేమం వంటి రంగాల్లో సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం కావాలంటే గ్రామాల అభివృద్ధి అత్యంత కీలకమన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ఫ్రంట్‌లైన్ సిబ్బంది సేవలు ఎంతో విలువైనవని తెలిపారు. మహిళలు, చిన్నారుల ఆరోగ్యం, పోషణ, సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తున్న సిబ్బందిని అభినందించారు. నారాయణపేటను బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ కొండా శ్వేత, వైస్ చైర్పర్సన్ మంజుల, డీడబ్ల్యూఓ రాజేందర్‌గౌడ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. సిద్ధప్ప, బీజేపీ నాయకులు రతంగ్‌పాండురెడ్డి, సత్యయాదవ్, రఘురామయ్యగౌడ్, విమల తదితరులు పాల్గొన్నారు. -
గాంధీ జీవన విధానం ఆదర్శం
నారాయణపేట: మహాత్మాగాంధీ జీవన విధానం, ఆయన ఆచరించిన సత్యం, అహింస, సహనం, నిరంతర కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను అన్నారు. గాంధీజయంతిని పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని జ్యోతి వెలిగించి గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. లక్ష్య సాధనలో గాంధీజీ ఎప్పుడూ సులభ మార్గాలను ఆశ్రయించకుండా సత్యం, అహింసను ఆయుధాలుగా చేసుకొని ఓర్పుతో పోరాడారని గుర్తు చేశారు. క్విట్ ఇండియా, విదేశీ వస్త్రాల బహిష్కరణ వంటి ఉద్యమాలు ఒక్కరోజులో విజయవంతం కాలేదని, నిరంతర కృషి, ప్రజలను చైతన్యపర్చిన ఫలితంగానే విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. ఎన్నో కష్టాలు, జైలుశిక్షలు ఎదురైనా సిద్ధాంతాలను వీడకుండా పోరాటం కొనసాగించిన గాంధీజీ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, సమస్యలు, అవరోధాలను ధైర్యంగా ఎదుర్కొంటూ లక్ష్య సాధనకు నిరంతరం శ్రమించాలని సూచించారు. గాంధీజీ ఆశయాలు, ఆదర్శాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ రాజేందర్‌గౌడ్, కలెక్టరేట్ ఏఓ అనిల్‌కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం..
జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలు నేటితరానికి స్ఫూర్తిదాయకమని ఎస్పీ డా. వినీత్ అన్నారు. గాంధీ, శాస్త్రి జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సత్యం, అహింసను ఆయుధాలుగా చేసుకొని స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు. గాంధీజీ కలలుగన్న మాదక ద్రవ్యాలు, మద్యపానం లేని సమాజం, మహిళలకు భద్రత, గ్రామీణాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని సూచించారు. లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్.. జై కిసానన్ నినాదంతో దేశ రక్షణలో సైనికులు, ఆహార భద్రతలో రైతుల పాత్రను చాటిచెప్పారని అన్నారు. నిజాయితీ, నిరాడంబరత, దేశభక్తికి శాస్త్రి జీవితం ప్రతీకగా నిలిచిందని తెలిపారు. మహనీయుల ఆశయాలను స్మరించుకోవడంతో పాటు వాటిని నిత్య జీవితంలో ఆచరించడమే వారికిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు మహేష్, నల్లపు లింగయ్య, సీఐలు శివశంకర్, రాంలాల్, భగవంత్‌రెడ్డి, సైదులు, ఆర్ఐ విజయభాస్కర్, సాయుధ దళాలు, పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
మరింత చేరువలో న్యాయసేవలు
పాలమూరు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో న్యాయసేవలు మరింత చేరువ కానున్నాయి. కేసుల సంఖ్యకు అనుగుణంగా కోర్టులు లేకపోవడంతో పెరుగుతున్న పెండింగ్ కేసులకు కొంతమేర పరిష్కారం లభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 200 అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం విధానపరమైన అనుమతులు మంజూరు చేయగా.. ఉమ్మడి పాలమూరు పరిధిలో ఐదు జిల్లాలకు 11 కొత్త కోర్టులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో న్యాయస్థానాలపై పెరుగుతున్న పనిభారం తగ్గడంతోపాటు కేసుల విచారణ వేగవంతమయ్యే అవకాశం ఉంది. ఏళ్లుగా పేరుకుపోతున్న కేసులు ప్రతి ఏటా లోక్ అదాలత్‌ల ద్వారా పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారమవుతున్నా.. అదే సమయంలో కొత్త కేసులు కూడా కోర్టులకు వస్తున్నాయి. దీంతో పెండింగ్ కేసుల సంఖ్య పూర్తిస్థాయిలో తగ్గడం లేదు. కొన్ని కోర్టుల్లో న్యాయమూర్తులు, మౌలిక వసతుల కొరత కూడా విచారణ ప్రక్రియపై ప్రభావం చూపుతోంది. ఫలితంగా కేసుల పరిష్కారానికి ఎక్కువ సమయం పడుతోంది. విచారణ వేగవంతం అయ్యే అవకాశం కేసుల సంఖ్యకు అనుగుణంగా కోర్టుల సంఖ్య పెంచడం ద్వారా ఒక్కో న్యాయస్థానంపై ఉన్న భారాన్ని తగ్గించవచ్చని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. కొత్త కోర్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే కేసుల విచారణను విభజించడంతో పాటు కొత్తగా దాఖలయ్యే కేసులను కూడా త్వరగా స్వీకరించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు న్యాయసేవలు మరింత చేరువ కానున్నాయి. కేసుల సంఖ్యకు అనుగుణంగా కోర్టుల ఏర్పాటు, న్యాయమూర్తుల అందుబాటు పెరగడం వల్ల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి కూడా దోహదపడే అవకాశం ఉంది. కొత్త కోర్టుల ఏర్పాటుతో న్యాయం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం కొంతమేర తగ్గనుంది. ఉమ్మడి జిల్లాకు 11 అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు తగ్గనున్న కోర్టులపై కేసుల భారం వేగంగా పరిష్కారం కానున్న పెండింగ్ కేసులు -
వయసు పెరిగిందని విరామం ఇవ్వొద్దు
నారాయణపేట: కొత్త విషయాలు నేర్చుకోడానికి వయసు అడ్డంకి కాదని.. ఆరోగ్యం కాపాడుకుంటూనే ఆర్థిక స్వావలంబన, నైపుణ్యాభివృద్ధి, నిరంతర విద్యపై దృష్టి సారించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక సూచించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం మలుపు వద్ద ఉన్న వృత్తి నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో సెర్ప్ ఆధ్వర్యంలో వృద్ధుల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశా రు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. మహిళా స్వయం సహాయక సంఘాలు రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్నాయని.. పొదు పు, బ్యాంకు లావాదేవీలు, రుణ సదుపాయాల ద్వారా మహి ళలు స్వావలంబన సాధిస్తున్నారని తెలిపారు. వృద్ధుల మహిళా స్వయం సహాయక సంఘాలు కేవలం పొదుపు, రుణ కార్యకలాపాలకే పరిమితం కాకుండా పరస్పర సహకారం, ఆత్మీయత, ఆరోగ్యం, పోషకాహారం, జీవన విధానంపై చర్చించు కునే వేదికలుగా మారాలని సూచించారు. కుట్టు, అ ల్లికలు వంటి తమకు తెలిసిన నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసుకుని అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించాలని కోరారు. వయసు పెరిగిన త ర్వాత చదువు అవసరం లేదనే భావనను వీడాలని.. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే పరీక్షల్లో వృద్ధ మహిళలు పాల్గొనాలని సూచించారు. పరీక్షలంటే భయపడాల్సిన అవసరం లేదని, కొత్త విషయాలు నేర్చుకోవడంతో అభ్యసన సామార్థ్యాలను పెంపొందించుకోవచ్చని తెలిపారు. సంఘాల సమావేశాలు క్రమం తప్పకుండా, చురుగ్గా నిర్వహించేలా సెర్ప్, డీపీఎం, డీఆర్డీఓ, ఏపీఎంలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ వృద్ధుల వద్దకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వెంకట్రాములు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. సిద్ధప్ప, సెర్ప్ ప్రాజెక్ట్ మేనేజర్ బాలస్వామి, జిల్లా మహిళా సమాఖ్య అధ ్యక్షురాలు అరుంధతి, కోశాధికారి అంజమ్మ, జోగిని వ్యవస్థ నిర్మూలన సంస్థ సభ్యురాలు హాజమ్మ, డీపీఎంలు గోవిందు, మాసన్న, వైద్యులు డా. నర్సింహారావు సగరి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
వయోవృద్ధులకు అండగా ఉంటాం
నారాయణపేట: వయోవృద్ధులకు చట్టపరమైన సలహాలు, సూచనలు, న్యాయ సాయం అందించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని సీనియర్ సివిల్ జడ్జి వింధ్యానాయక్ భరోసానిచ్చారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై వయోవృద్ధుల హక్కు లు, సంక్షేమం, వారికి అందుబాటులో ఉన్న న్యా యసాయంపై అవగాహన కల్పించారు. వయోవృద్ధులు రాజ్యాంగం, చట్టాలు కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వయోవృద్ధులు ఆరోగ్యంగా, ఆనందంగా, గౌరవప్రదంగా జీవించేలా కుటుంబ సభ్యులు, సమాజం సహకరించాలని కోరారు. అనంతరం జిల్లా సంక్షేమశాఖ అధికారి రాజేందర్‌గౌడ్ మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలోని డే కేర్ సెంటర్లో వయోవృద్ధులకు రోజు భోజనం, అల్పాహారం అందిస్తున్నామని తెలిపారు. క్యారం, చెస్ తదితర క్రీడా సదుపాయాలు కూడా కల్పించినట్లు పేర్కొన్నారు. వయోవృద్ధుల కోసం ఓల్డ్ ఏజ్ హోమ్ అందుబాటులో ఉందని, అలాంటి వారిని గుర్తించి సంక్షేమశాఖకు సమాచారం ఇవ్వాలని కోరారు. పిల్లలు లేదా ఇతర కుటుంబ సభ్యులతో ఇబ్బందులు ఎదురైతే ఆర్డీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని, చట్టపరమైన హక్కుల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో క్షేత్రస్థాయి అధికారి సాయి, గుడ్ యూనివర్స్ ఎన్జీఓ ప్రతినిధులు, లయన్స్‌క్లబ్ చైర్మన్ రవికుమార్‌గౌడ్, సభ్యుడు ఆత్మారాం పాల్గొన్నారు. -
ఓటు.. ఒడిసిపట్టు!
గెలుపే లక్ష్యంగా వ్యూహాలు.. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి 2021లో జరిగిన ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓటర్ల సంఖ్య 5,17,883 కాగా.. మొత్తం పోలైన ఓట్లు 3,57,354. ఇందులో 3,37,039 ఓట్లు చెల్లుబాటయ్యాయి. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య పెరగనుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండగా.. అంతకు ముందుగా ఈ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుండడంతో మూడు ప్రధాన పార్టీలు ఈ పోరును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహప్రతివ్యూహాలు అమలు చేసేలా కసరత్తు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో రాజకీయ వేడి రాజుకోనున్నట్లు తెలుస్తోంది. ‘పట్టభద్రుల’ పోరుపై ప్రధాన పార్టీల కీలక కసరత్తు ● మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ స్థానం కై వసమే లక్ష్యంగా వ్యూహాలు.. ● బీఆర్ఎస్, బీజేపీలో అభ్యర్థిత్వాల జల్లెడ.. కాంగ్రెస్ నుంచి ‘సామా’ ఖరారు ● ఓటరు నమోదుపైనే నేతల ప్రధాన దృష్టి.. పార్టీల వారీగా సహాయ కేంద్రాలు ● గత ఎన్నికల్లో నమోదైన గ్రాడ్యుయేట్ ఓటర్లు 5,17,883.. పోలైన ఓట్లు 3,57,354 ● ఈసారి మరింత పెరిగే అవకాశం.. వాట్సాప్‌ల ద్వారా విస్తృత ప్రచారం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానంపై ప్రధాన రాజకీయ పార్టీలు నజర్ వేశాయి. ఇప్పటికే ఓటరు నమోదుకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో పోరు కసరత్తు ముమ్మరం చేశాయి. అధికార కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు కాగా.. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థిత్వాలను ఫైనల్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. దీంతో పాటు ఓటు ఒడిసిపట్టేలా ఓటరు నమోదుపై అన్ని పార్టీల ముఖ్య నేతలు దృష్టి కేంద్రీకరించారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటరు నమోదు కోసం ఆయా పార్టీల ఆధ్వర్యంలో సహాయకేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. పట్టభద్ర ఓటర్లను ఆకర్శించే లక్ష్యంతో పావులు కదిపేలా స్థానిక నాయకత్వం, తమ తమ అనుబంధ ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల ముఖ్యులకు దిశానిర్దేశం చేసే పనిలో నిమగ్నమయ్యారు. తెరపైకి పలువురి పేర్లు.. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశమై అభ్యర్థిపై చర్చించారు. మహబూబ్‌నగర్‌కు చెంది హైదరాబాద్‌లో ఓ ప్రధాన ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య సేవలందిస్తున్న ప్రముఖ డాక్టర్‌తో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి పేర్లు తెరపైకి వచ్చినట్లు సమాచారం. బీజేపీలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేరు వినిపిస్తున్నా.. ఆయన సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. గతంలో ఈ స్థానం నుంచి ఆయన గెలుపొందగా.. ఆ పార్టీలో దేవరకద్రకు చెందిన డోకూరి పవన్‌కుమార్‌తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ప్రత్యేక ఏర్పాట్లు.. విస్తృత ప్రచారం.. అభ్యర్థుల ఖరారును పక్కనబెడితే ప్రధాన రాజకీయ పక్షాలు ఓటరు నమోదుపైనే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాయి. గత ఎన్నికల్లో పట్టభద్ర ఓటర్లు అవగాహన లేకపోవడంతో ఓటు నమోదుకు దూరం కావడం, ఇతరత్రా లోపాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడా తప్పిదాలు జరగకుండా గ్రామ, మండల, పట్టణాల వారీగా అర్హులైన పట్టభద్రులను గుర్తించి.. ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగుతున్నాయి. పట్టభద్రులతో దరఖాస్తు చేయించే ప్రక్రియపైనే ప్రధానంగా నజర్ వేశాయి. పార్టీల వారీగా సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో కూడా ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉండగా.. ఇందుకు తగిన విధంగా మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో కార్యాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాయి. తగిన ధ్రువపత్రాలతో వచ్చేవారివి కంప్యూటర్లలో అక్కడికక్కడే నమోదు చేస్తున్నారు. అంతేకాదు.. పట్టభద్రులను ఆకర్షించేలా పార్టీల నేతలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పటినుంచే ప్రచారం మొదలుపెట్టారు. ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తున్నారు. పట్టభద్రుల ఫోన్ నంబర్లు సేకరించి ఓటు నమోదుకు కావాల్సిన ధ్రువపత్రాలు.. ఫారం–18 నింపే విధానంపై మెసేజ్, వీడియోల రూపంలో పంపుతున్నారు. కాంగ్రెస్ క్లియర్.. బీఆర్ఎస్, బీజేపీ ఆచితూచి.. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 2007 నుంచి ఇప్పటివరకు నాలుగు పర్యాయాలుగా ఎన్నికలు జరగగా.. ఆ పదవి ఒక్కసారి కూడా కాంగ్రెస్‌ను వరించలేదు. ప్రస్తుతం అధికారంలో ఉండడంతో ఆ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మేరకు ముందస్తుగా పార్టీ అభ్యర్థిగా రంగారెడ్డి జిల్లాకు చెందిన సామా రామ్మోహన్‌రెడ్డి పేరును ఖరారు చేయడమే కాకుండా.. జిల్లాల వారీగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగుతోంది. అయితే బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థిత్వాల ఖరారుపై ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. -
ధాన్యం సేకరణకు సన్నద్ధం
● జిల్లావ్యాప్తంగా 161 కేంద్రాలు ఏర్పాటు ● 1.37 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణే లక్ష్యం ● 34.38 లక్షల సంచులకుగాను 15 లక్షలే అందుబాటులో.. ● మూడోవారం నుంచే నారాయణపేట: వానాకా లం పంటలు చేతి కొస్తున్న వేళ.. వరి ధాన్యం కొనుగోళ్లకు కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక దిశానిర్ధేశంతో జిల్లా పౌరసరఫరాలశాఖ కసరత్తు ము మ్మరం చేసింది. జిల్లా వ్యాప్తంగా 1,50,825 ఎకరాల్లో వరి సాగుకాగా.. 3.61 లక్షల టన్నుల దిగుబడి రావచ్చని అధికారులు అంచనా వేశారు. కాగా.. ప్రభు త్వ కొనుగోలు కేంద్రాల ద్వారా 1,37,550 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకోసం 13 మండలాల్లో 161 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కాగా.. గన్నీ బ్యాగులు, తూకం, తేమ పరీక్ష, నాణ్యత పరిశీలనకు అవసరమైన పరికరాల కొరత సవాల్‌గా మారింది. 34.38 లక్షల గన్నీబ్యాగులు అవసరం కాగా..ప్రస్తుతం 15 లక్షలు మాత్రమే అందుబా టు లో ఉన్నాయి. రైతులు ధాన్యం తీసుకొచ్చే సమయా నికి ఏర్పాట్లు పూర్తిచేసి.. ఎక్కడా జాప్యం లే కుండా కొనుగోళ్లు సాగించాల్సిన అవసరం ఏర్పడింది. 13 మండలాలు.. 161 కేంద్రాలు వరి ధాన్యం సేకరణకుగాను ఐకేపీ ఆధ్వర్యంలో 83, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 65, మెప్మా 6, ఎఫ్పీఓలకు 7 కొనుగోలు కేంద్రాలు 161 కేటాయించారు.మక్తల్, మాగనూర్, కృష్ణా మండలాల్లో ఈ నెల మూడో వారంలో నే ధాన్యం రాక ప్రారంభమ య్యే అవకాశం ఉండగా.. నా రాయణపేట, ధన్వాడ, మరికల్, ఊట్కూ ర్, నర్వలో నాలుగో వారం నుంచి వచ్చే అవకాశం ఉంది. దామరగిద్ద, మద్దూర్, కొత్తపల్లి, కోస్గి, గుండుమాల్ మండలాల్లో నవంబర్ రెండో వారం ఉంటాయని అధికారులు అంచనా వేశారు. వెంటాడుతున్న పరికరాల కొరత.. ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కేంద్రాల్లో అవసరమైన పరికరాల కొరత వెంటాడుతోంది. టార్పాలిన్లు 4,830 అవసరం కాగా 2,761 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 161 ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లకు 158 అందుబాటులో ఉండగా.. మరో 3 కావాలి. ధాన్యం నాణ్యత పరిశీలనకు ఉపయోగించే గ్రెయిన్ క్యాలిపర్స్ 44, హస్క్ రిమూవర్లు 44 తక్కువగా ఉన్నాయి. తేమ శాతం నిర్ధారించే పరికరాలు 161 అవసరం కాగా 153 మాత్రమే ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్ 161 అవసరం కాగా 138 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ధాన్యం ఆరబెట్టేందుకు అవసరమైన 3 డ్రయర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది వానాకాలంలో 1.37 లక్షల ఎంటీఎస్ వరి ధాన్యం కొనుగోలు లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా 161 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నధాన్యం విక్రయించి మద్దతు ధరతో పాటు బోనస్ సైతం పొందాలని కోరుతున్నాం. – సైదులు, జిల్లా పౌరసరఫరాలశాఖ డీఎం కేంద్రాలకు చేరనున్న ధాన్యం 2025–26 వానాకా లం సీజన్లో జిల్లావ్యాప్తంగా 4.28 లక్షల మెట్రిక్ ట న్నుల ఉత్పత్తి అంచనా వేయగా.. స్థానిక వినియోగం, మిల్లర్ల కొనుగోళ్ల తర్వాత 2.10 లక్షల టన్నులు ప్రభుత్వ కొనుగోళ్లకు అవకా శం ఉందని అంచనా వేశారు. అయితే వాస్తవంగా 1,40, 266. 320 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఈసారి 1.37 లక్షల టన్నుల కొనుగోళ్లను సకాలంలో పూర్తి చేయాలంటే కేంద్రాల్లో అవసరమైన పరికరాలు, గన్నీ సంచులను ముందుగానే సమకూర్చడం కీలకంగా మారింది. -
నిరంతర సాధనతోనే విజయం
నారాయణపేట: క్రీడల్లో క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనే విజయానికి బాటలు వేస్తాయని ఇన్చార్జి డీవైఎస్ఓ వెంకటేష్ అన్నారు. జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియంలో మూడురోజులుగా కొనసాగుతున్న 70వ ఎస్జీఎఫ్ జిల్లాస్థాయి పోటీలు బుధవారం ముగిశాయి. చివరిరోజు కబడ్డీ పోటీలను ఆయనతో పాటు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడలతో విద్యార్థుల్లో శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. చదువుతో పాటు క్రీడలకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించాలని కోరారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు సరైన శిక్షణ, అవకాశాలు కల్పిస్తే ఉన్నతస్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. వాలీబాల్, ఖో–ఖో, కబడ్డీ విభాగాల్లో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా జట్టు తరఫున ఉమ్మడి పాలమూరు పోటీలకు పంపనున్నట్లు వెల్లడించారు. పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన వ్యాయామ ఉపాధ్యాయులు, జిల్లా విద్యాశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు గొడుగు నర్సింహులు, రత్నయ్య, వెంకటప్ప, సాయినాథ్, బాలరాజు, నర్సింహారెడ్డి, కతలప్ప, అనంతసేన, విష్ణువర్ధన్‌రెడ్డి, రాజేశ్వరి, వెంకటేష్, సౌమ్య, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భూ సమస్యల పరిష్కారానికే రీ–సర్వే
మాగనూర్: రాష్ట ప్రభుత్వం రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు రీ–సర్వే చేపడుతోందని.. సహకరించాలని కలెక్టర్ ప్రియాంక అన్నారు. బుధవారం మండలంలోని గజరందొడ్డిలో రీ–సర్వేపై నిర్వహించిన గ్రామసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సుమారు వంద ఏళ్లతర్వాత ప్రభుతం భూముల రీ–సర్వే చేపడుతుందని.. ఆన్లైన్లో నమోదు చేసి పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తుందని తెలిపారు. ప్రతి భూమికి భూధార్ సంబర్, సరిహద్దుల స్పష్టత వస్తుందని.. సర్వే చేసే సమయంలో రైతులు అందుబాటులో ఉండి సహకరించాలని కోరారు. భూ సరిహద్దులు, రికార్డుల్లో ఉన్న విస్తీర్ణం తేడాలను పరిశీలించి స్పష్టంగా నమో దు చేస్తారని వివరించారు. సర్వే పారదర్శకంగా ని ర్వహిస్తారని.. సర్వేయర్లు గ్రామానికి వచ్చినప్పడు అందుబాటులో ఉండి తమ భూముల సరిహద్దులు చూపించాలని కోరారు. గ్రామంలో సుమారు 450 ఎకరాల భూమి ఉన్నందున 30 ఎకరాల చొప్పున 15 నుంచి 20 రోజుల్లో సర్వే పూర్తి చేయాలన్నారు. ముందస్తు కార్యాచరణతో సర్వే తేదీలను రైతులకు ముందుగానే తెలియజేయాలని సూచించారు. రైతులకు ఏమైనా అభ్యంతరాలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని.. త్వరలో టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని, అ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. రీ–సర్వే విజయవంతానికి అందరూ సహకరించాలన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రం, పాఠశాలను తనిఖీ చేశారు. అంగన్వాడీ భవనం నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాములు, తహసీల్దార్ అబ్దుల్ రహమాన్, ఎంపీడీఓ శ్రీనివాసులు, రెవెన్యూ ఆర్ఐ సుధాకర్‌రెడ్డి, డైరెక్టర్ శంకర్లింగం పాల్గొన్నారు. ఊట్కూర్: విద్యార్థులకు పుస్తకమే గొప్ప ఆయుధమని.. చదువుతో ఆర్థిక స్వాతంత్య్రం వస్తుందని కలెక్టర్ ప్రియాంక అన్నారు. బుధవారం మక్తల్‌లోని ఊట్కూర్ ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాల, కళాశాలను ఆమె సందర్శించారు. తరగతి గదులు, డార్మెటరీ, మరుగుదొడ్లు, వంటగది, స్టోర్‌రూమ్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. స్టోర్‌రూమ్‌లో నిత్యావసరాల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటర్మీడియట్ రెండేళ్లు కష్టపడి చదివితే బంగారు భవిష్యత్ ఉంటుందని.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని కోరారు. పాఠశాల, కళాశాల సిబ్బంది విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఆమె వెంట పుర కమిషనర్ రాజయ్య, ప్రిన్సిపాల్ మంజుల తదితరులు ఉన్నారు. -
క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలి
గద్వాల న్యూటౌన్: క్రీడల్లో గెలుపోటమలు సహజమని, ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలని జిల్లా హకీ అసోసియేషన్ అధ్యక్షుడు త్యాగరాజు అన్నారు. స్థానిక నల్ల సోమనాద్రి స్టేడియంలో బుధవారం ఎస్జీఎఫ్ఏ ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ –17 హకీ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. టోర్నీలో గద్వాల జిల్లాతో పాటు వనపర్తి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ నుంచి సుమారు 100 మంది క్రీడాకారులు పాల్లొన్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయయన మాట్లాడారు. ఓటమిని నిరుత్సాహంగా భావించకుండా, మరింత పట్టుదలతో ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు. ప్రతిభ కల్గిన క్రీడాకారులను గుర్తించి, వారి భవిష్యత్‌కు ఉపయోగపడే విధంగా నిష్పక్షపాతంగా ఎంపికలు చేపట్టాలని సెలక్షన్ కమీటీకి సూచించారు. క్రీడాకారులు ఆటపై పూర్తి శ్రద్ధ పెట్టడంతో పాటు క్రమశిక్షణ పాటించాలన్నారు. గాయాలు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ టోర్నీ ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి భవిష్యత్‌లో ఉన్నత స్థాయి పోటీల్లో అవకాశాలు కల్పించేందుకు నిర్వాహకులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ ఆనంద్‌కుమార్, పీడీ నాగేష్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
వేటగాళ్లపై నజర్..!
గురువారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2026–8లో uనారాయణపేట: పచ్చటి పొలాల మధ్య స్వేచ్ఛగా సంచరించే కృష్ణజింకల భద్రతే అధికారులకు ప్రథమ ప్రాధాన్యంగా మారింది. ఇటీవల వెలుగు చూసిన వేట ఘటనతో అప్రమత్తమై జింకల సంచార ప్రాంతాలపై నిఘాను విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నారు. వేటగాళ్ల కదలికలకు తావులేకుండా జల్లెడ పడుతున్నారు. బుధవారం ఊట్కూర్ మండలంలోని నిడుగుర్తి, లక్ష్మీపల్లి, ఊట్కూర్ పెద్దచెరువు శివారు ప్రాంతాలతో పాటు నర్వ మండలం రాయికోడ్ శివారును సందర్శించారు. కృష్ణజింకల సంచారం, ఆయా ప్రాంతాల పరిస్థితిపై స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఊట్కూర్ మండలం నిడుగుర్తి–లక్ష్మీపల్లి శివారులో కృష్ణజింకల సంచారం అధికంగా ఉండటంతో వేటగాళ్ల కదలికలపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓ గణేష్ గుండు ఆధ్వర్యంలో నారాయణపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి కమాలుద్దీన్, సెక్షన్ అధికారి సత్యనారాయణ, ఎఫ్బీఓ సంతోష్ బుధవారం మరోసారి ఘటన జరిగిన ప్రాంతంతో పాటు జింకలు సంచరించే పరిసరాలను నిశితంగా సందర్శించి పరిశీలించారు. విస్తృత నిఘా.. కృష్ణజింకల వేట ఘటన నేపథ్యంలో అటవీశాఖ నిఘా మరింత పెంచింది. సాధారణ పర్యవేక్షణకే పరిమితం కాకుండా సంచరించే ప్రాంతాలను గుర్తించడం, వాటికి చేరుకునే మార్గాలపై ఆరా తీయడం, స్థానికుల నుంచి సమాచారాన్ని సేకరించడంపై అధికారులు దృష్టి సారించారు. జింకల సంచారం ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి విస్తరిస్తోంది? వాటి కదలికలకు అనుకూలమైన ప్రదేశాలేమిటి? అనే అంశాలను అధికారులు పరిశీలించారు. చెరువులు, పొలాలు, శివారు ప్రాంతాల్లో జింకల కదలికలు ఎలా ఉన్నాయి? వేటగాళ్లు ప్రవేశించేందుకు అవకాశం ఉన్న మార్గాలేమిటి? అనే అంశాలపై స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. కృష్ణజింకలు కేవలం అడవిలో కనిపించే వన్యప్రాణులు మాత్రమే కాదు.. ప్రకృతి సమతుల్యతలో భాగం. వాటి సంచార ప్రాంతాలను సురక్షితంగా ఉంచడం, వేటకు అవకాశం లేకుండా చేయడం, స్థానికుల్లో సంరక్షణ భావన పెంచడమే తమ లక్ష్యం. – గణేష్, ఫ్లయింగ్ స్క్యాడ్ డీఎఫ్ఓ, మహబూబ్‌నగర్ కృష్ణజింకల సంచార ప్రాంతాలపై అటవీశాఖ నిఘా కొనసాగించనుంది. ఘటన పునరావృతం కాకుండా అవసరమైన ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచడంతో పాటు స్థానికుల నుంచి వచ్చే సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. కృష్ణజింకల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వేటకు అవకాశం లేకుండా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. అప్పటి వరకు జింకల సంచార ప్రాంతాల్లో అప్రమత్తతే రక్షణకు కీలకం. కృష్ణజింకల భద్రతపై అటవీశాఖ ప్రత్యేక దృష్టి వేట ఘటనతో అప్రమత్తం.. సంచార ప్రాంతాలపై నిఘా ఊట్కూర్ నుంచి రాయికోడ్ వరకు జల్లెడ జింకల సంచార ప్రాంతాలపై స్థానికులతో ఆరా వేటగాళ్లు మళ్లీ ఆయా ప్రాంతాల్లోకి వస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు. కృష్ణజింకలు సంచరించే ప్రాంతాల సమీపంలో వ్యవసాయ పొలాలు ఉండటంతో రైతులు, గ్రామస్తుల సహకారం కీలకంగా మారింది. వేటగాళ్లకు ఎలాంటి సహకారం అందించవద్దని కోరారు. -
అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం : ఎస్పీ
నారాయణపేట: జిల్లాలో అక్రమ కార్యకలాపాలు నిర్వహించే వారి పై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ డా. జి.వినీత్ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయ కాన్ఫరెన్‌న్స్ హాల్లో శాంతిభద్రతలు, నేర నియంత్రణ, ఎనన్‌ఫోర్స్‌మెంట్, పెండింగ్ కేసులు, రోడ్డు ప్రమాదా ల నివారణ తదితర అంశాలపై డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో మద్యం అక్రమ విక్రయాలు, ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణా, గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగించాలని సూచించారు. రోడ్డు పక్కన ఉన్న దాబాలు, బార్లు, ప్రమాదకర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు విస్తృతం చేయాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. పోలీసు ఉద్యోగార్థులను ప్రోత్సహించేందుకు జిల్లాలో ఉచిత పోలీస్ రిక్రూట్మెంట్ కోచింగ్‌ను విస్తృతంగా నిర్వహించాలని కోరారు. ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా కనీసం 100 మందిని ఎంపిక చేసి ఉచిత శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ అందించాలని సూచించారు. ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేసేందుకు సిబ్బంది వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఫిర్యాదులు స్వీకరించి అక్కడికక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధానాన్ని ప్రోత్సహించాలని ఆదేశించారు. గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులను వేర్వేరుగా సమీక్షిస్తూ దర్యాప్తు పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. న్యాయ అధికారులతో సమన్వయం చేసుకుని పెండింగ్ కేసులను గణనీయంగా తగ్గించాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, ఎన్ఫోర్స్మెంట్, నేర నియంత్రణ, రోడ్డు భద్రత, ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాల్లో పనితీరును మెరుగుపర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి అధికారి, సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీఎస్పీలు మహేష్, నల్లపు లింగయ్య, సీఐలు శివశంకర్, రాంలాల్, భగవంత్‌రెడ్డి, సైదులు, ఎస్ఐలు భాగ్యలక్ష్మిరెడ్డి, పురుషోత్తం, కేటీ మల్లేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
బియ్యం ధరలకు రెక్కలు
నాగర్‌కర్నూల్: సన్నబియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. పది నెలల్లో క్వింటాకు రూ. 2,500 వరకు అధికం కాగా.. రెండు నెలల్లో మాత్రం రూ.1,700 పెరిగింది. ఎల్‌నినో ప్రభావంతో వరిసాగు విస్తీర్ణం తక్కువగా ఉందని.. ఆశించినంత దిగుబడి రాకపోవచ్చనని వ్యాపారులు అంచనా వేసి ధరలు పెంచేశారు. ఇటీవల కొన్ని రైస్‌మిల్లులు మూతపడటాన్ని కూడా వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. బియ్యం కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలతో సొమ్ము చేసుకుంటున్నారనే మిమర్శలు ఉన్నాయి. బియ్యం ధరల పెరుగుదలతో ఉమ్మడి జిల్లాలోనే రోజు రూ.15 లక్షల వరకు ప్రజలపై అదనపు భారం పడుతోంది. రేషన్ లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తుండటం కొంత ఉపశమనం కలిగిస్తుండగా.. ఇతర వర్గాలపై బియ్యం ధరల ప్రభావం బాగానే ఉంది. వానాకాలం వరికోతలు ప్రారంభమైతే కొంత మేర ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి.. తెలంగాణలో పండే సన్నబియ్యం (ఆర్ఎన్ఆర్) రకానికి మంచి డిమాండ్ ఉంది. ప్రధానంగా పాలమూరులో ఆర్ఎన్ఆర్ సాగుకు మంచి పేరుంది. ఇక్కడ పండే పంట ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. ప్రధానంగా కర్ణాటక రాష్ట్రానికి ఇక్కడి నుంచి ఎక్కువగా ఈ రకం బియ్యాన్ని వ్యాపారులు ఎగుమతి చేస్తుంటారు. దీంతో ఇక్కడ సన్నబియ్యానికి డిమాండ్ ఏర్పడి, రేట్లు పెంచారనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్, మిర్యాలగూడ ప్రాంత వ్యాపారుల ఆజమాయిషీలోనే బియ్యం రేట్ల నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. కారణాలు అనేకం.. వానాకాలంలో వరిసాగు చాలా తక్కువగా ఉంది. ఉన్న పంటకు సైతం కరెంటు కోతలు, నీటి సమస్యలతో ఆశించిన దిగుబడి వచ్చే అవకాశాలు లేవు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 6 లక్షల ఎకరాల్లో వరిసాగు అంచనా కాగా.. కాల్వలకు నీరు రావడంతో 4 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. అయితే వర్షాభావం, కేఎల్ఐ కాల్వలకు నీటి విడుదలలో అంతరాయం, కరెంటు కోతలతో పంట దిగుబడి తగ్గే పరిస్థితి ఏర్పడింది. దీంతో బియ్యం కొరత ఉంటుందనే అంచనాతో వ్యాపారులు ధరలు పెంచారు. ● ప్రభుత్వం రేషన్ దుకాణాలు, వసతి గృహాలు, పాఠశాలలు, కళాశాలలకు సన్నబియ్యం సరఫరా చేస్తోంది. సన్న వడ్లను సీఎంఆర్ కోసం మిల్లర్లు కొనుగోలు చేయడంతో మార్కెట్లో నిల్వలు తగ్గాయి. ఫలితంగా కొరత పెరిగి ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రజలపై రూ.లక్షల్లో భారం.. ఉమ్మడి జిల్లాలో రోజుకు 1,400–1,600 క్వింటాళ్ల బియ్యం విక్రయమవుతోంది. క్వింటాకు రూ.1,000 పెరిగితే రోజుకు సుమారు రూ.15లక్షల అదనపు భారం ప్రజలపై పడుతోంది. ధరల పెరుగుదల ప్రభావంతో హోటళ్లలోనూ ధరలు పెరిగాయి. పది నెలల్లో పెరుగుదల ఇలా.. పది నెలలుగా సన్నబియ్యం ధరలను పరిశీలిస్తే, ప్రజల గుండె గుభేలుమంటోంది. గతేడాది నవంబర్‌లో కింటా బియ్యం ధర రూ. 4,400 ఉండగా.. ప్రస్తుతం రూ. 6,400 నుంచి రూ. 6,600 వరకు విక్రయిస్తున్నారు. అయితే మార్చి నుంచి ధరల పెరుగుదల ప్రారంభమైంది. ఫిబ్రవరి వరకు రూ. 4,600 ఉండగా.. ఏప్రిల్‌లో ఏకంగా క్వింటాకు రూ. 300 పెరిగి, రూ. 4,900కి విక్రయించారు. మే నుంచి జూలై వరకు రూ.200 పెరుగుకుంటూ వచ్చింది. జూలైలో రూ. 5,500 ఉండగా.. ఆగస్టులో చివరి వారంలో రూ. 6,300కు చేరింది. సెప్టెంబర్‌లో రూ. 6,600 ధర పలుకుతోంది. ఈ రేట్లు కేవలం హోల్‌సెల్ వ్యాపారులకు మాత్రమే. వారికి హమాలీ, రవాణా ఖర్చుతో క్వింటాకు మరో రూ. 200 వరకు పెరుగుతుంది. ఈ లెక్కన ప్రజలకు రూ. 7,100 నుంచి రూ.7,300 వరకు బియ్యం విక్రయిస్తున్నారు. 10 నెలల్లోనే క్వింటాకు రూ.2,500 దాక పెంపు గతేడాది ఇదే నెలలో రూ 4,500 ధర.. ప్రస్తుతం రూ.7,100కు విక్రయం ఉమ్మడి జిల్లా ప్రజలపై రోజు రూ.15 లక్షల వరకు భారం ఎల్‌నినో ప్రభావంతో వరిసాగు విస్తీర్ణం తగ్గడమే కారణం -
20 ఏళ్లలో ఎప్పుడు చూడలే..
20ఏళ్ల నుంచి బియ్యం వ్యాపారం చేస్తున్నా. ఈ విధంగా ధరల పెంపు ఎప్పుడు చూడలేదు. గతంలో ప్రతినెలా క్వింటాపై రూ.100 పెరిగేది. ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటి సారి. బియ్యం కొనుగోలు చేసేవారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పండే సన్నరకం ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయకుండా ఉంటే కొంతమేర రేట్లు తగ్గే అవకాశం ఉంది. – గుబ్బ ఈశ్వర్, బియ్యం వ్యాపారి, కల్వకుర్తి ధరలు తగ్గించాలి.. కొన్ని రోజుల నుంచి బియ్యం రేట్లు విపరీతంగా పెరిగాయి. కిలో రూ. 60 నుంచి రూ. 70 వరకు అమ్ముతున్నారు. మధ్యతరగతి కుటుంబాలు కొనుగోలుచేసే పరిస్థితి లేదు. వాటితో పాటు నిత్యావసరాల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ధరలు తగ్గించాలి. – పరమేశ్వర్, నాగర్‌కర్నూల్ ● -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించం
నారాయణపేట: బాలలు, వృద్ధుల సంరక్షణలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వింధ్యానాయక్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు బుధవారం జిల్లాకేంద్రంలోని బోరంబావి సమీపంలో ఉన్న బాలల ఆశ్రమాలు, వృద్ధాశ్రమాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు పట్టికలను పరిశీలించి రోజూ విధులకు హాజరవుతున్నారా? అప్పగించిన విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారా? అని సిబ్బందిని ఆరా తీశారు. కొందరు సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇకపై ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదని నిర్వాహకులను హెచ్చరించారు. వివిధ రికార్డులను పరిశీలించి ఆశ్రమాలకు వచ్చిన ఆహార ధాన్యాల పరిమాణం, నాణ్యతను స్టాక్ రిజిస్టర్లతో సరిపోల్చి చూశారు. రోజూ సరుకుల నిల్వలు, కొనుగోలు చేసి స్టాక్ వివరాలను విధిగా రిజిస్టర్లలో నమోదు చేయాలని సూ చించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? అని తెలుసుకున్నారు. రోజూ తాజా కూరగాయలు కొనుగోలు చేసి వండా లని.. తాగునీరు, బెడ్షీట్లు, గదులు, బాత్రూమ్లు, వాష్‌రూమ్‌లను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఆశ్రమాల్లోని మందులు, సిరప్‌లను పరిశీలించి చివరి గడువులను తనిఖీ చేశారు. సొంత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల మాదిరిగా ఆప్యాయంగా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. బాలల స్నేహపూర్వక న్యాయసేవల పథకం–2024, సీనియర్ సిటిజన్లకు న్యాయసేవలు– 2016 పథకాలపై అవగాహన కల్పించారు. వృద్ధు లకు ఉచిత న్యాయ సాయం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సదరం సర్టిఫికెట్లు, బాలల హక్కుల గురించి వివరించారు. ఆమె వెంట చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సి ల్ కె.లక్ష్మీపతిగౌడ్, పోలీసు అధికారులు, సంబంధిత ఆశ్రమాల నిర్వాహకులు, సిబ్బంది ఉన్నారు. -
బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం
కొత్తపల్లి: మద్దూరు పురపాలికలో రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి అండగా ఉంటామని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మద్దూరులో బాధితులతో మాట్లాడారు. కనీసం ఇంట్లోని సామగ్రిని తీయడానికి సమయం ఇవ్వకుండా పోలీసు పహారాలో యంత్రాలతో కూల్చివేశారని బాధితులు తమ బాధను వ్యక్తం చేశారు. అనంతరం పాత బస్టాండ్ చౌరస్తాలో బాధితులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎవరి లబ్ధి కోసం పేదల ఇళ్లు కూల్చి రహదారి విస్తరణ చేపడుతున్నారని ప్రశ్నించారు. ఆదుకోవాల్సింది పోయి ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేయడం ఏమిటన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. బాధితులకు డబుల్ బెడ్రూం ఇల్లు, 200 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వంచర్ల గోపాల్, కౌన్సిలర్లు దినేష్, నర్సంహ, సంగీత శివకుమార్, మౌలానా, గోపాల్, నింగ్యానాయక్ నాయకులు అంజయ్య, బసిరెడ్డి, నందిపాడ్ నరేష్, భీంసేన్, దాసు గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై దృష్టి
నారాయణపేట: కాంప్లెక్స్ స్థాయి సమావేశాలు, పాఠశాలల తనిఖీలు, ఎఫ్ఎల్ఏ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యానికి తావులేకుండా పక్కా ప్రణాళికతో చేపట్టాలని కలెక్టర్ ప్రియాంక విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎంఈఓలు, హెచ్ఎంలు, విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన పాఠశాలల సందర్శనల్లో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి పాఠశాలను తప్పనిసరిగా సందర్శించి విద్యా కార్యక్రమాల అమలును పరిశీలించాలని సూచించారు. కాంప్లెక్స్ సమావేశాలను ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలు, విద్యార్థుల అభ్యసన ఫలితాల మెరుగుదలకు ఉపయోగపడేలా నిర్వహించాలన్నారు. ప్రతి కాంప్లెక్స్ హెచ్ఎం నుంచి సింగిల్‌పేజీ నివేదిక తీసుకోవాలని, అందులో ఎఫ్ఎల్ఏ అమలు, బెస్ట్ ప్రాక్టీసెస్, టీఎల్ఎం వినియోగం, ఇంగ్లిష్ రెమిడియల్ తరగతులు, ప్రత్యేక కార్యక్రమాల వివరాలను పొందుపర్చాలని ఆదేశించారు. టీఎల్ఎంలను ఎన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేశారు, ఏ బోధనా సామగ్రిని తయారుచేసి వినియోగిస్తున్నారనే వివరాలను ఫొటోలతో సమర్పించాలన్నారు. ప్రతి కాంప్లెక్స్‌కు రెండు పేజీల సమగ్ర నివేదిక రూపొందించాలని సూచించారు. విద్యార్థుల ప్రస్తుత అభ్యసన స్థాయిని గత ఫలితాలతో పోల్చి పురోగతిని నమోదు చేయాల తెలిపారు. ఏఆర్ నివేదికలు, గ్రేడింగ్, విద్యార్థుల పనితీరును విశ్లేషించి వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. పాఠశాలల తనిఖీ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి లోపాలు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యల నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎస్ఏ–1 పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఎఫ్ఎల్ఏ, మిడ్‌టర్మ్ రివ్యూలు, కాంప్లెక్స్ సమావేశాలు, పాఠశాలల తనిఖీలను సమన్వయంతో నిర్వహించేలా డీఈఓ కార్యాలయం నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. అనంతరం స్టూడెంట్స్ ప్రాక్టీస్ వర్క్‌షీట్ బుక్లెట్లను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ ఫణికుమార్, డీఈఓ గోవిందరాజు, ఏఎంఓ విద్యాసాగర్ పాల్గొన్నారు. -
అధికారులా..మజాకా!
●కోస్గి: రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరుల్ని చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమంటూ సీఎం రేవంత్‌రెడ్డి మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇప్పించడంతో పాటు రాయితీ రుణాలు మంజూరు చేస్తూ అన్నిరంగాల్లో పెద్దపీట వేస్తూ ఆర్థిక స్వాలంబన సాధించేలా ప్రోత్సహిస్తున్నారు. కానీ తన ఇలాకాలోని పుర అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ప్రభుత్వ నిబంధలు ఉల్లంఘించి ఇష్టారీతిన వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారి అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్న చందంగా ప్రభుత్వం మహిళా సంఘాలకు అందిస్తున్న రుణాలు కావాలంటే సంఘంలో ఉన్న సభ్యులందరూ ఇంటిపన్ను చెల్లించాల్సిందేనని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవలం కోస్గి పురపాలికలో కొనసాగుతున్న ఇంటి పన్ను వసూళ్ల వ్యవహారంతో మహిళలందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పన్ను చెల్లించాల్సిందేనంటూ.. మహిళా సంఘాలకు ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రభుత్వ రుణాలు అందించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంటుంది. కాని జిల్లాలో ఎక్కడా లేని విధంగా స్థానిక పుర అధికారులు మహిళా సంఘాల రుణాలు కావాలంటే తమ ఆధార్‌కార్డు ప్రకారం ఇంటిపన్ను చెల్లించాలనే కొత్త నిబంధన అమలు చేస్తున్నారు. కొందరు మహిళలు ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయి అద్దె ఇంట్లో ఉంటున్నప్పటికీ ఆధార్‌లో ఉన్న ఇంటినంబర్ ప్రామాణికమని, ఇంట్లో నివాసం లేకున్నా పన్ను చెల్లించాలని కఠిన నిబంధలు విధించి బలవంతంగా పన్ను వసూలు చేస్తున్నారు. గ్రూపులో ఉన్న ఏ ఒక్క మహిళా పన్ను చెల్లించకపోయినా గ్రూపు మొత్తానికి రుణం ఇవ్వకుండా నిలిపి వేయడంతో మహిళలు తమలో తాము గొడవ పడుతున్నారు. కొందరు మహిళలు గ్రూపులో ఉన్న సభ్యులకు భయపడి తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి పన్ను చెల్లిస్తున్నారు. మెప్మా ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆర్పీలకు మహిళా సంఘాల్లోని సభ్యుల ఇంటి పన్ను వసూళ్ల బాధ్యతను అప్పగించడం మరో విశేషం. జిల్లా అధికారులు స్పందించి ఇంటిపన్ను వసూళ్లపై విచారణ జరిపి ఎలాంటి షరతులు లేకుండా నిబంధల మేరకు రుణాలు అందించాలని సంఘం సభ్యులు కోరుతున్నారు. మున్సిపాలిటీ మొ.స. రు.అ.పొ.సం. రుణ మొత్తం రు.పొ.సం. పొ.రు. (రూ.కోట్లలో..) (రూ.కోట్లలో..) నారాయణపేట 763 123 21.55 37 5.30 కోస్గి 392 69 8.80 48 5.69 మక్తల్ 267 61 11.24 18 3.80 మద్దూర్ 265 26 3.10 16 2.02 మొ.స. : మొత్తం సంఘాలు రు.అ.పొ.సం: రుణానికి అర్హత పొందిన సంఘాలు రు.పొ.సం: రుణం పొందిన సంఘాలు పొ,రు.: పొందిన రుణం పురపాలిక వారీగా ఇలా.. మహిళా సంఘాల రుణాలకు ఇంటిపన్నుతో ముడి లోన్ కావాలంటే పన్ను చెల్లించాల్సిందే..! సభ్యులంతా పన్ను చెల్లిస్తేనే సంఘానికి రుణం అద్దె ఇంట్లో ఉన్నా పాత ఇంటి పన్ను వసూలు కోస్గి పుర అధికారుల వింత పోకడ గతంలో పుర పరిధిలోని మహిళా సంఘాలకు మెప్మా తరుఫున ఆర్పీలు అన్నిరకాల పత్రాలు సేకరించిన తర్వాత ఎంసీపీ (సూక్ష్మ రుణ ప్రణాళిక) ఫారంపై వివరాలను ధ్రువీకరిస్తూ మున్సిపాలిటీలో ఉండే మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్ సంతకం చేసి బ్యాంకులకు అప్పగిస్తే రుణాలు నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేసే వారు. ప్రస్తుతం కమ్యూనిటీ ఆర్గనైజర్‌తో పాటు పుర కమిషనర్ సంతకం కూడా ఉండాలనే నిబంధన తీసుకురావడంతో మహిళా సంఘాలకు ఇబ్బందులు మొదలయ్యాయి. దీనిని ఆసరాగా చేసుకుని కోస్గి మున్సిపాలిటీలో ఇంటిపన్ను చెల్లించిన తర్వాతనే మహిళ సంఘాలకు రుణాలు అందించే కొత్త నిబంధన అనాధికారికంగా అమలు చేస్తున్నారు. -
కొత్త నిబంధనలతో ఇబ్బందులు..
25 ఏళ్లుగా సంఘంలో ఉ న్నాం. గతంలో రుణాలు ఇవ్వడానికి ఎలాంటి నిబంధనలు ఉండేవి కాదు. ము న్సిపాలిటీ వారు కొత్తగా ఇంటిపన్ను చెల్లించాలంటూ కొత్త నిబంధన అమలు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత పద్ధతినే రుణాలివ్వాలి. – భాగ్యలక్ష్మి, సంఘం అధ్యక్షురాలు మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలకు సంబంధించి ఇంటిపన్ను వసూలు చేసే నిబంధన ఎక్కడా లేదు. జిల్లాలోని ఏ మున్సిపాలిటీకి పన్ను వసూలు చేసు కోవాలని మెప్మా తరుపున అధికారికంగా ఎ లాంటి ఆదేశాలు లేవు. కోస్గిలో జరుగుతున్న వ్యవహారంపై సమగ్ర వివరాలు తెలుసుకొని వాస్తవ పరిస్థితులను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – శంకర్, మెప్మా పీడీ -
స్వరాష్ట్రంలోనూ పాలమూరుకు అన్యాయమేనా?
ఇటీవల జూరాల ఆయకట్టు రైతులు ఎందుకు ఆందోళనలకు దిగాల్సి వచ్చిందో పాలకులు, ప్రతిపక్షాలు గ్రహించాలి. ఎల్ నినో, వర్షాభావం వల్ల అని భావించినా.. నీటి నిర్వహణ, ప్రా జెక్ట్లు, రిజర్వాయర్ల నిర్మాణంలో నిర్లక్ష్యం, ప్రభుత్వాల బాధ్యతారాహిత్యమే కారణాలు. స్వరాష్ట్రంలో 12 ఏళ్లు గడిచినా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తికాకపోవడం విచారకరం. జిల్లా రైతులకు మేలు చేసేలా ప్రాజెక్ట్‌లు, రిజర్వాయర్ల నిర్మాణంలో వేగం పెంచాలి. విమర్శలతోనే సమాధానం చెబుతామనుకుంటే వారికి ప్రజల చేతిలో గుణపాఠం తప్పదు. – రాజేందర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్ -
దర్యాప్తులో నాణ్యత పాటించాలి
నారాయణపేట: కేసుల దర్యాప్తులో శాసీ్త్రయ ఆధారాలు సేకరించాలని, పెండింగ్ కేసులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని డీఎస్పీ నల్లపు లింగయ్య ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని పట్టణ పోలీస్స్టేషనన్ను సందర్శించారు. తొలుత సిబ్బందితో మాట్లాడి విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్‌లోని రికార్డులు, క్రైమ్ వివరాలు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, సీసీటీఎన్ఎస్ నమోదు, బీట్ వ్యవస్థ, ఫిర్యాదుల స్వీకరణ, సీసీ కెమెరాలు, ఆయుధాలు, ప్రభుత్వ ఆస్తుల భద్రత తదితర అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, ప్రజలకు పోలీస్‌శాఖపై నమ్మకం పెరిగేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. సైబర్, ఎన్డీపీఎస్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, మహిళలు, పిల్లలు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆయన వెంట సీఐ శివశంకర్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, గాయత్రితో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
సీఈసీ రాజీనామా చేయాలి : కాంగ్రెస్
నారాయణపేట/కోస్గి రూరల్: ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కోస్గి పట్టణంలోని శివాజీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మ దహనం చేశారు. అదే విధంగా కలెక్టరేట్లో ఏఓను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. దేశ పౌరులకు ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును హరించే విధంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. సర్ ప్రక్రియలో కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు – పునరుద్ధరణ, ఎన్నికల డేటా నిర్వహణ తదితర అంశాలపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ఈ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించినట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో అర్హులైన ప్రతి ఓటరుకు అభ్యంతరం తెలిపే అవకాశం, పేరు సరిచేసుకునే సమర్థవంతమైన ప్రక్రియ కల్పి ంచాలని కోరారు. ఎన్నికల సంఘం వ్యవహారాలపై పూర్తి పారదర్శక విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయకుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సలీం, అధికార ప్రతినిధి వి.సంతోష్‌కుమార్, మండల అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నాగులపల్లి నరేందర్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎండీ గౌస్, శ్రీనివాస్‌రెడ్డి, విజయ్‌గౌడ్, కృష్ణారెడ్డి, అన్న కిష్టప్ప పాల్గొన్నారు. -
భూముల లెక్క పక్కాగా చేపట్టాలి
వనపర్తి: గత పాలకులు తీసుకొచ్చిన ధరణి దరిద్రాన్ని దూరం చేసేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభు త్వం భూముల రీ సర్వేకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.రీసర్వేను అధికారులు అత్యంత ప్రాధాన్యతతో, పూర్తి బాధ్యతతో నిర్వహించాలని ఆదేశించారు. ముందుగా గ్రామాల సరిహద్దులను పక్కాగా నిర్ధారించుకుని, ఆ తర్వాత భూముల సర్వేను పక్కాగా చేపట్టాలన్నారు. సోమవారం వనపర్తి ఐడీఓసీ సమావేశ మందిరంలో రెవెన్యూ, గృహనిర్మాణం, భూముల రీసర్వే అంశాలపై నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి సమావేశానికి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన హాజరై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా భూముల రీసర్వే ప్రక్రియ పురోగతిపై తహసీల్దార్లు, సర్వేయర్లతో ఆరా తీశారు. అలాగే రైతుల నుంచి వ్యక్తమవుతున్న అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్ష అనంతరం మంత్రి పొంగులేటి విలేకర్లతో మాట్లాడారు. సుమారు 120 ఏళ్ల క్రితం భూముల సర్వే నిర్వహించారని.. మళ్లీ ఇప్పుడు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర రీసర్వే ప్రక్రియను చేపట్టిందన్నారు. తహసీల్దార్ స్థాయి నుంచి కలెక్టర్ వరకు అధికారులందరూ క్షేత్రస్థాయికి వెళ్లి ఈ ప్రక్రియను తప్పనిసరిగా పర్యవేక్షించాలన్నారు. నవంబర్ 15వ తేదీలోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే విషయంలో అటవీ, రెవెన్యూశాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. రీసర్వే ప్రక్రియ కు సంబంధించి రైతులకు ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారాన్ని అందిస్తూ.. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అవినీతికి పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాగా, కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంపై మంత్రి అసంతృప్తిని వ్యక్తం చేశారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించగా.. రెండో విడతలో మరో 2వేల ఇళ్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. తొలి దశలో చేసిన తప్పులు రెండో దశలో పునరావృతం కానివ్వొద్దని అధికారులకు సూచించారు. మూడు, నాలుగో విడతల్లోనూ ఇళ్ల మంజూరు ఉంటుందన్నారు. రాష్ట్రంలోని ఏ జనావాస ప్రాంతంలో పూరిగుడిసె ఉండనియ్యమన్నారు. పరిష్కార మార్గాలు చూపాలి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చే అర్జీలను అధికారులు క్రమబద్ధమైన విధానంలో పరిశీలించి, పరిష్కార మార్గాలు చూపాలన్నారు. ప్రతి నెలలో ఒక్కో మండలానికి ఒక రోజు కేటాయించి, ఆ మండలానికి సంబంధించిన ప్రజా సమస్యలపై సమీక్షించాలన్నారు. అక్కడికక్కడే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అర్జీల స్వీకరణ కోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్ ఏర్పాటుచేసి ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలు వారం రోజులకు మించి పెండింగ్‌లో ఉండకూడదన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గంలో ప్రతిపాదిత పవర్ ప్లాంట్‌కు సంబంధించిన భూ సమస్యను పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ధరణి దరిద్రాన్ని దూరం చేసేందుకే రీ సర్వే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం నవంబర్ 15లోగా రీ సర్వే పూర్తి చేయాలి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతగా పనిచేయాలని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్ నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని.. అభివృద్ధి కార్యక్రమాల అమలుపై కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని కోరారు. సమావేశంలో కలెక్టర్లు ఖుష్బూగుప్తా, ఆదర్శ్ సురభి, రిజ్వాన్ బాషా షేక్, హేమంత కేశవ్ పాటిల్, సీహెచ్ ప్రియాంక, కార్పొరేషన్ చైర్మన్ సరిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి లోకేష్ కుమార్, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ హనుమంతు, గృహనిర్మాణశాఖ ఎండీ గౌతమ్, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. -
రోడ్డు విస్తరణతో ఉద్రిక్తత
● మద్దూరులో పరిహారం ప్రకటించకుండానే కూల్చివేతలు ● ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నాయకులు కొత్తపల్లి: మద్దూరు మున్సిపాలిటీలో చేపట్టిన రోడ్డు విస్తరణ ఉద్రిక్తతకు దారితీసింది. బాధితులకు పరిహారం ప్రకటించకుండానే కూల్చివేతలు ప్రారంభించడంతో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. మద్దూరు పాతబస్టాండ్ చౌరస్తా నుంచి చింతల్‌దిన్నె రోడ్డులో నిర్మిస్తున్న గురుకుల పాఠశాల వరకు 70 ఫీట్ల మేర రోడ్డు విస్తరణకు ప్రభుత్వం నిధులు మంజూరుచేసింది. ఈ రోడ్డు విస్తరణతో 84మంది వ్యాపార దుకాణాలు, నివాసగృహాలను కోల్పోతున్నారు. 50 ఫీట్లతో రోడ్డు నిర్మించాలని పలుమార్లు పాలకులు, ఉన్నతాధికారులకు విన్నవించారు. ఎట్టకేలకు 60 ఫీట్ల వెడల్పుతో త్వరగా పనులు ప్రారంభించాలని స్థానిక అధికారులకు ఆదేశాలు రావడంతో సోమవారం ఉదయం పోలీసు బందోబస్తుతో కూల్చివేతలు మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు నర్సింహ, దినేష్, సంగీత శివకుమార్, గోపాల్, మౌలానా, నాయకులు అంజయ్య, భీంసేన్ అక్కడికి చేరుకొని బాధితులకు ఎలాంటి పరిహారం ప్రకటించకుండానే ఎలా కూల్చివేస్తారని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పంచాయతీరాజ్ ఈఈ అశోక్, డీఈ అంజిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్‌తో వారు వాగ్వాదానికి దిగారు. రోడ్డు విస్తరణతో నష్టపోతున్న బాధితులకు న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అయితే బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీనిపై ఆగ్రహించిన నాయకులు.. కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్ర యత్నించగా, పోలీసులు వారిని అరెస్టు చేసి నారాయణపేట, మద్దూరు స్టేషన్లకు తరలించారు. పోలీ సు పహారా మధ్య కూల్చివేతలు చేపట్టారు. 0000724107-000001-SVS HOSPITAL 8.00x8.00 SVS HOSPITAL -
ఇంటి వద్దే ‘సర్’ విచారణ
అచ్చంపేట: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై ప్రజల్లో నెలకొన్న సందేహాలు, ఆందోళనలను తీర్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. నోటీసులు అందుకున్న వారు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని సూచించింది. అన్మ్యాప్డ్, వ్యత్యాసాల కారణంగా నోటీసులు అందుకున్న ఓటర్లు.. ఇకపై ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్ఓ) కార్యాలయానికి వెళ్లి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నోటీసులు అందుకున్న ఓటర్ల ఇంటికే బీఎల్ఓలు వెళ్లి వారి వివరాలు, పత్రాలు సేకరించాలని ఆదేశించారు. సేకరించిన పత్రాలను బీఎల్ఓలు ఈసీఐసెట్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తే వాటిని ఈఆర్ఓ పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణ (హియరింగ్)కు హాజరు కావాల్సి ఉంటుంది. హియరింగ్ కూడా ఆన్లైన్లో నిర్వహించేందుకు అవకాశం ఉండగా.. వ్యక్తి బదులు కుటుంబ సభ్యులు హాజరు కావొచ్చని పేర్కొంది. పేర్ల అనువాదంలో తప్పులు ప్రజలు సర్వే ఫాంలో తమ పేర్లను తెలుగులో స్పష్టంగా రాసిచ్చినప్పటికీ.. పాత రికార్డుల్లోని ఇంగ్లిష్ పేర్లను ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ ద్వారా తెలుగులోకి తర్జుమా చేయడం వల్ల తీవ్ర వ్యత్యాసాలు వచ్చాయి. చిన్నచిన్న తప్పులను కూడా సాఫ్ట్వేర్ తేడాగా గుర్తించి ఆటోమేటిక్‌గా నోటీసులు జనరేట్ చేసింది. అధికారులు క్షేత్రస్థాయిలో సేకరించిన కొత్త భౌతిక డిక్లరేషన్ ఫారాల డేటాను పక్కనబెట్టి, పాత ఆటోమేషన్ సిస్టంనే వాడటంతో సమస్య మొదటికి వచ్చింది. సర్టిఫికెట్ల కోసం.. ఎన్నికల సంఘం ఓటరు గుర్తింపు ధ్రువీకరణకు 14 రకాల కార్డుల్లో ఒకటి ఆధారంగా చూపవచ్చని తెలిపింది. అయితే క్షేత్రస్థాయి అధికారులు మాత్రం కులం సర్టిఫికెట్ తీసుకురావాలని ఒత్తిడి చేస్తుండటంతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. పరిశీలనతో పరిష్కారం.. పాత ఇంగ్లిష్– తెలుగు ఆటో– ట్రాన్స్‌లేషన్‌ను నిలిపివేసి.. ఏఐ ఆధారిత వాయిస్, తెలుగు టైపింగ్ టూల్స్ ద్వారా డేటా సరిచేయాలి. ఓటర్లు బీఎల్ఓలకు అందించిన భౌతిక డిక్లరేషన్ ఫారాల ఆధారంగానే సిస్టంలో మార్పులు చేపట్టాలి. సాఫ్ట్వేర్ పంపే నోటీసులపైనే ఆధారపడకుండా, నిజమైన దొంగ ఓట్లను అరికట్టేందుకు బీఎల్ఓలు, ఉన్నతాధికారులు స్వయంగా క్షేత్రస్థాయి విచారణ జరిపి సవరణ చేయాలి. సాఫ్ట్వేర్ లోపాలు.. సర్ ప్రక్రియలో చోటుచేసుకుంటున్న సాంకేతిక లోపాలు, సాఫ్ట్వేర్ అనువాద పొరపాట్లు గ్రామీణ ప్రాంత ప్రజలకు తీవ్ర ఇబ్బందులు సష్టిస్తున్నాయి. నోటీసులు రావడానికి గతంలో క్షేత్రస్థాయిలో సాఫ్ట్వేర్ వైఫల్యం వల్లే అనేది బహిరంగ రహస్యం. గ్రామాల్లో ఓటర్లు భౌతిక డిక్లరేషన్ ఫారాలను సరిగ్గా నింపి ఇచ్చినప్పటికీ.. సిస్టంలోని ఆటో– ట్రాన్స్లేషన్ లోపాల కారణంగా వేలాది మందికి నోటీసులు జారీ అవుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సమస్యను పరిష్కరించుకోవడానికి సామాన్యులకు గుర్తింపు కార్డులు చూపడం భారంగా మారింది. దశాబ్దాలుగా అదే ఊరిలో ఉంటూ ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారికి కూడా అదనంగా గుర్తింపు కార్డులు తీసుకురావాలని నోటీసులు ఇవ్వడం వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రజల్లో నెలకొన్న సందేహాలనేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం హియరింగ్ కోసం ఓటర్లు ఈఆర్ఓ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు బీఎల్ఓలే ఓటర్ల ఇంటికి వచ్చి పత్రాల పరిశీలన, వివరాల సేకరణ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నోటీసుల విచారణ వేగవంతం చేస్తాం. బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి పత్రాలు, వివరాలు సేకరించి ఈసీఐసెట్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తే వాటిని ఈఆర్వో పరిశీలించి పరిష్కరిస్తారు. డేటా నమోదులో ఎక్కడ లోపం ఉందో గుర్తించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓలు అందుబాటులో ఉంటారు. అన్మ్యాప్డ్, తేడాలుండి నోటీసులు అందుకున్న ఓటర్ల పత్రాలు సమర్పించి పరిష్కారం కోసం సహకరించాలి. – హేమంత కేశవ్ పాటిల్, కలెక్టర్, నాగర్‌కర్నూల్ -
జిల్లాలో ఇదీ పరిస్థితి..
● మక్తల్ మండలం జక్లేర్, గుడిగండ్ల శివారుల్లోని గుట్టల నుంచి గత కొంతకాలంగా మట్టిని తరలిస్తున్నారు. జాతీయ రహదారి పనుల పేరుతో గుడిగండ్ల గుట్ట నుంచి వారం రోజులుగా మట్టి రవాణా చే స్తున్నారు.అయినప్పటికీ ప్రజాప్రతినిధులు ప్రశ్నించడం లేదు. అధికారులు పట్టించుకోవడం లేదు. ●ధన్వాడ మండలం గున్ముక్ల, మంత్రోనిపల్లి, ఎ మ్మోనోనిపల్లి, కొండాపూర్ గుట్టల నుంచి మట్టి అ క్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఈ విషయంపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ● మరికల్ మండలంలోని పల్లెగడ్డ, తీలేర్, మాధవరం, అప్పంపల్లి, చిత్తనూర్ శివారుల్లో ఉన్న గుట్టలపై అక్రమార్కుల కన్ను పడింది. రాత్రి, పగలు తేడా లేకుండా పోలీస్‌స్టేషన్ ముందు నుంచే టిప్పర్ల ద్వారా ఎర్రమట్టిని తరలిస్తున్నారు. అలాగే జూరాల – కోయిల్‌సాగర్ అప్రోచ్ కెనాల్‌కు ఇరువైపులా ఉన్న మట్టిని టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అదే విధంగా ఊట్కూరు, నర్వ, మాగనూరు, మరికల్ మండలాల్లో మట్టి దందా జోరుగా సాగుతోంది. -
అందరి సహకారంతో ఉత్సవాలు ప్రశాంతం
నారాయణపేట: ప్రజల సహకారం, పోలీసుల స మన్వయంతో గణేశ్ నవ రాత్రి ఉత్సవాలు, తాఖీబాబా దర్గా ఉర్సు ప్ర శాంతంగా ముగిశాయని ఎస్పీ డా.వినీత్ సోమవా రం ఒక ప్రకటనలో తెలిపారు. వేడుకల సందర్భంగా ఉత్స వ కమిటీలు, మత పెద్దలు, హిందూ–ముస్లిం పీస్ కమిటీలు, ప్రజాప్రతినిధులు, యువత సమన్వయంతో వ్యవహరించారని పేర్కొన్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా పోలీసుశాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టి.. సీసీ కెమెరాలు, డ్రోన్, వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ నియంత్రణ, రూట్ భద్రత వంటి చర్య లతో నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించినట్లు తెలిపారు. విధుల్లో భాగస్వాములైన పోలీసు అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.ఉత్సవాల సందర్భంగా ప్రజ లు పరస్పర గౌరవం, సోదరభావంతో వ్యవ హరించడం శాంతి సామరస్యానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ప్రశాంతంగా ఉత్సవాల నిర్వ హణకు సహకరించిన ప్రజలు, నిర్వాహకులు, మత పెద్దలు, పీస్ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, యువత, మీడియా ప్రతినిధులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కళాశాలలకు పక్కా భవనాలు నిర్మించాలి నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలకు పక్కా భవనాలు నిర్మించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర్ కిరణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక వివేకానంద పార్కు వద్ద ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు భానుప్రసాద్ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ముందుగా భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కిరణ్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం శిథిలావస్థకు చేరడంతో చాలా మంది విద్యార్థులు అడ్మిషన్ కాకుండా ప్రైవేటు కళాశాలల వైపు వెళ్తున్నారన్నారు. అదే విధంగా మంచినీరు, మూత్రశాలలు సరిగ్గా లేకపోవడం, కళాశాల ఆవరణలో పిచ్చి మొక్కలు పెరగడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైతం ఇదే తీరు ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి వీలైనంత త్వరగా నూతన భవనాలు నిర్మించి, విద్యార్థుల కష్టాలు తీర్చాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నరహరి, పవన్‌కుమార్ పాల్గొన్నారు. -
గుట్టకాయ స్వాహా!
–8లో uమరికల్: జిల్లాలోని మట్టి మాఫియా గుట్టలను కొల్లగొడుతోంది. రాత్రి, పగలు తేడా లేకుండా తవ్వకాలు నిర్వహిస్తూ.. ప్రకృతి సంపదను కనుమరుగు చేస్తోంది. వివిధ ప్రాంతాలకు మట్టి అక్రమ రవాణాతో సొమ్ము చేసుకుంటోంది. మరికొన్ని ప్రాంతాల్లో గుట్టలతో పాటు చెరువులు, కుంటలను కూడా వదలడం లేదు. రోడ్డు మార్గాన ట్రాక్టర్లు, టిప్పర్లలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నప్పటికీ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అందుకు కారణాలు అనేకమనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అనుమతులు ఒకచోట పొందితే.. మరో చోట మట్టి తవ్వి తరలిస్తున్నారు. ఇందుకు అధికారులు వత్తాసు పలకడం విస్మయానికి గురిచేస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి గండి.. ప్రభుత్వ, ప్రైవేటు పనులకు మట్టి కావాల్సి వస్తే, నిబంధనల ప్రకారం టన్నుకు రూ.56 చొప్పున మైనింగ్ శాఖకు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎంతమేర కావాలో పేర్కొంటూ ఆ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత మైనింగ్‌శాఖ డీడీఓ కోడ్ పేరిట చలానా తీయాలి. ఈ మేరకు నిర్దేశిత సర్వే నంబర్లో చలానా చెల్లించిన మేరకు అధికారులు కొలతలు (పొడవు, వెడల్పు, లోతు) వేసి అనుమతి పత్రాలు ఇస్తారు. ఆ తర్వాతే తవ్వకాలు చేపట్టి, మట్టి తరలించాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఒకరిద్దరు మినహా అక్రమార్కులు నిబంధనలను తుంగలో తొక్కి దందా సాగిస్తున్నారు. రాయల్టీ ఎగవేస్తూ.. యథేచ్ఛగా గుట్టలను కొల్లగొడుతున్నారు. దీంతో పర్యావరణంపై ప్రభావం పడుతుండటంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. అనుమతులు లేకుండా గుట్టల నుంచి ఎర్రమట్టిని తరలించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. నిబంధనల ప్రకారం రాయల్టీ చెల్లించి మట్టిని తవ్వాలి. అలా కాకుండా అడ్డదారిలో మట్టిని తరలించే వారిపై నిఘా ఉంచి, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – సత్యనారాయణ, ఏడీ, మైనింగ్‌శాఖ జిల్లాలో చెలరేగిపోతున్న మట్టి మాఫియా రాత్రి, పగలు తేడా లేకుండా గుట్టల్లో తవ్వకాలు మట్టి రవాణాతో అక్రమార్జన కనుమరుగవుతున్న ప్రకృతి సంపద కొరవడిన అధికారుల నిఘా -
సారూ.. ఇదేమి తీరు!
నారాయణపేట: ‘నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలు రెండు కళ్లు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కొడంగల్‌కు ఒక్క రూపాయి ఇస్తే.. నారాయణపేటకు కూడా ఇస్తాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2023 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గంలోని ఆర్టీసీ బస్టాండ్ల రూపురేఖలు మార్చేందుకు సుమారు రూ.41.83 కోట్లు మంజూరు కాగా.. నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల బస్టాండ్లకు మాత్రం ఎదురుచూపులే మిగిలాయి. రూట్లు పెరుగుతున్నాయి.. ప్రయాణికులు పెరుగుతున్నారు.. కానీ బస్టాండ్ల దుస్థితి మాత్రం మారడం లేదు. మరికల్లో గుంతలమయం.. మక్తల్‌లో 43 ఏళ్ల నాటి బస్టాండ్.. ధన్వాడలో పునాదులకే పరిమితం.. దామరగిద్దలో అధ్వాన బస్‌షెల్టర్.. మాగనూర్‌లో రేకుల షెడ్.. ఊట్కూరులో పిచ్చిమొక్కల మధ్య బస్టాండ్. జిల్లాకేంద్రంలోనూ పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీ సమస్యలతో ప్రయాణికుల అవస్థలు. బస్టాండ్ల వారీగా పరిశీలిస్తే.. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఇది. నిత్యం వందల సంఖ్యలో బస్సుల రాకపోకలు.. వేలాది మంది ప్రయాణికుల ప్రయాణం. కానీ కనీస సౌకర్యాలు మాత్రం కరువయ్యాయి. వర్షం పడితే బస్టాండ్ ప్రాంగణమంతా నీటిమయంగా మారుతోంది. పందుల స్వైర విహారం.. దోమల బెడదతో పాటు మూత్రశాలలు, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పాలకులు స్పందించి, ఆర్టీసీ అధికారులు చొరవచూసి కనీస వసతులు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ● దామరగిద్ద మండల కేంద్రం.. మద్దూర్, కోస్గి, కానుకుర్తి, యానగుంది తదితర మార్గాలకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ బస్‌షెల్టర్ ఉన్నా.. నిర్వహణ లేక అధ్వానంగా మారింది. ప్రయాణికులు ఎండకు ఎండుతూ.. వానలో తడుస్తూ బస్సుల కోసం పడిగాపులు పడాల్సిన దుస్థితి. అధికారులు పట్టించుకోక.. పాలకులు స్పందించక తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ప్రయాణికులది. బస్టాండ్ మంజూరు చేసి ప్రయాణికుల కష్టాలకు చరమగీతం పాడాలని కోరుతున్నారు. ● మరికల్ బస్టాండ్ గుంతలమయంగా మారింది. బస్టాండ్ ఆధునికీకరణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పనులు ప్రారంభంగాక వెనక్కి వెళ్లిపోయాయి. బస్టాండ్ మళ్లీ పాత దుస్థితికే చేరింది. బస్సును లోనికి తీసుకెళ్లాలంటేనే డ్రైవర్లు జంకుతున్నారు. అలాగే ప్రయాణికులు దాహం తీర్చుకోవాలంటే బయటి దుకాణాలే దిక్కు. కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ● రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిథ్యం వహిస్తున్న మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. తాగునీటి ఎద్దడి, ఫ్యాన్లు లేకపోవడం, ఇరుకై న ప్రాంగణంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గకేంద్రమైనా బస్సు డిపో లేకపోవడంతో సమస్యలు మరింత తీవ్రంగా మారాయి. కొత్త బస్టాండ్ నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చినా.. నేటికీ నెరవేరడం లేదు. ● ఊట్కూరు బస్టాండ్ ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఏళ్లుగా అదే స్థితిలో ఉంది. 1994లో గ్రామపెద్దల సహకారంతో విరాళాలు సేకరించి భూమి కొనుగోలు చేసి ఆర్టీసీకి దానం చేశారు. అనంతరం సుమారు రూ.5 లక్షలతో 25 ఏళ్ల కిందట బస్టాండ్ నిర్మించారు. ఊరు మారుతున్నా.. కాలం మారుతున్నా.. బస్టాండ్ మాత్రం మారకపోవడంతో ప్రయాణికులు ఆధునిక సౌకర్యాల కోసం ఎదురుచూస్తున్నారు. ● నారాయణపేట ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డి సొంత ఊరు ధన్వాడలో పూర్తిస్థాయి బస్టాండ్ కలగానే మిగిలింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.50 లక్షలతో బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పునాదులు వేశారు. తర్వాత పనులు ముందుకు సాగక పునాదులకే పరిమితమైంది. చివరకు బస్షెల్టరే ప్రయాణికులకు ఆధారంగా మారింది. కొడంగల్ నియోజకవర్గ బస్టాండ్ల ఆధునికీకరణకు నిధులు నారాయణపేట, మక్తల్‌కు మొండిచెయ్యి కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు మండల కేంద్రాల్లో బస్‌షెల్టర్లే దిక్కు.. -
తెలంగాణ ఉద్యమంలో చెరగని ముద్ర
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని ఆర్ఐ విజయభాస్కర్ అన్నారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర ఉద్యమంతో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో బాపూజీ అలుపెరగని పోరాటం చేశారని గుర్తుచేశారు. తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి స్వశక్తితో ఎదిగిన ఆయన జీవితం నేటితరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ ఎస్ఐ శిరీష, ఏఆర్ ఎస్ఐ నర్సింహతో పాటు ఆర్మ్డ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఉల్లాస్ పరీక్షకు 16,945 మంది హాజరు
నారాయణపేట: జిల్లావ్యాప్తంగా ఆదివారం రెండోవిడత నిర్వహించిన ఉల్లాస్ పరీక్షకు 16,945 మంది అభ్యాసకులు హాజరయ్యారు. చదవడం, రాయడంతో పాటు లెక్కలపై మొత్తం 150 మార్కులకు పరీక్ష నిర్వహించగా.. 24,668 మందికిగాను 16,945 మంది హాజరయ్యారు. సెర్ఫ్, డీఆర్డీఏ, మెప్మా శాఖల సమన్వయంతో మహిళా సంఘాల్లోని నూతన అభ్యాసకులకు వివిధ పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి డా. గోవిందరాజు మరికల్, ధన్వాడ మండలాల్లోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట ప్రాజెక్టు అధికారి (వయోజన విద్య) శ్రీనివాసబాబు, జిల్లా కో–ఆర్డినేటర్ రఘునాథ్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు గోవిందు, మాసన్న, జయన్న, ఏపీఎంలు, సీసీలు, వీవోఏలు తదితరులు పాల్గొన్నారు. నేడు కోస్గిలో కాంగ్రెస్ నిరసన కార్యక్రమం నారాయణపేట: సర్ ప్రక్రియలో ఓటరు జాబితా సవరణ, పేర్ల తొలగింపు, కొత్త ఓటరు నమోదు తదితర అంశాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం 10 గంటలకు కోస్గిలో కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి కొడంగల్ నియోజకవర్గ ఇన్‌న్‌చార్జి ఎనుముల తిరుపతిరెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్ హాజరవుతున్నరని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. సాగునీటి వృథా.. తప్పని వ్యధ అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద వరద నీటిని తరలించేందుకు ఏర్పాటు చేసిన సమాంతర కాల్వ షట్టర్ల మరమ్మతు పూర్తిగాకపోవడంతో ప్రాజెక్టులో ఉన్న నిల్వనీరు వృథాగా పారుతోంది. ప్రభుత్వం మూడేళ్ల కిందట షట్టర్ల మరమ్మతుకు రూ.20 లక్షలు మంజూరు చేసింది. ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుముఖం పడుతున్న సమయంలో కాల్వ ప్రధాన హెడ్ రెగ్యులేటరీ వద్ద షట్టర్లకు నీటి సరఫరా నిలిపివేసేందుకు రింగ్‌బండ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రతిసారి రింగ్‌బండ్ ఏర్పాటు చేయడం.. వచ్చిన వరద ప్రవాహంతో మొర్రం కొట్టుకుపోవడంతో మరమ్మతు పూర్తి కావడం లేదు. ప్రస్తుత సమయంలో ఆయకట్టుకు నీటిని విడుదల చేయక చేతులెత్తేస్తున్న అధికారులు.. సమాంతర కాల్వ నుంచి రోజు 60 నుంచి 100 క్యూసెక్కుల నీరు లీకేజీ రూపంలో వృథాగా పారుతున్నా అరికట్టలేకపోతున్నారు. ఇప్పటికై నా స్పందించి సమాంతర కాల్వ షట్టర్ల మరమ్మతు పూర్తిచేసి నీటి వృథాకు అడ్డుకట్ట వేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
నారాయణపేట: విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమమే ప్రాధాన్యంగా నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి రషీద్ అన్నారు. జిల్లాకేంద్రం శివారులోని మైనార్టీ బాలుర జూనియర్ కళాశాలను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాబోధన, విద్యార్థుల హాజరు, వసతి, భోజన సదుపాయాలను పరిశీలించారు. అధ్యాపకులు, విద్యార్థుల హాజరు పట్టికలు, వివిధ రికార్డులను తనిఖీ చేసి వివరాలను ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. విద్యార్థులకు వడ్డించే ఆహారం తాజాగా ఉండేలా చూడటంతో పాటు పాలు, నూనె తదితర సరుకుల గడువు తేదీని తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశించారు. గడువు ముగిసిన, నాణ్యత లోపించిన ఆహార పదార్థాలను వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం స్టోర్‌రూమ్‌ను పరిశీలించి వంటసామగ్రి, ఆహార పదార్థాల నిల్వలను తనిఖీ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఆహార పదార్థాలను నిబంధనల ప్రకారం నిల్వ చేయాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట బీసీ సంక్షేమశాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, కళాశాల ప్రిన్సిపాల్ జగదీశ్వర్, అధ్యాపకులు పాల్గొన్నారు. పర్యాటకంతో ప్రాంతాలకు గుర్తింపు.. నారాయణపేట: చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలు, దేవాలయాలు, జానపద కళలు, సంప్రదాయాలను పర్యాటక ఆకర్షణలుగా అభివృద్ధి చేస్తే ఆయా ప్రాంతాలకు గుర్తింపు పెరగడంతో పాటు స్థానిక ప్రజలకు వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని డీపీఆర్వో, టూరిజంశాఖ ఇన్చార్జి అధికారి రషీద్ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లాకేంద్రం శివారులోని మైనార్టీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత పర్యాటక ప్రదేశాల విశిష్టతను తెలుసుకొని వాటి పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. పర్యాటక ప్రదేశాలను సందర్శించడంతో విద్యార్థులు పుస్తకాల్లో చదివిన చరిత్ర, సంస్కృతిపై ప్రత్యక్ష అవగాహన ఏర్పడుతుందన్నారు. పర్యాటక రంగంతో హోటళ్లు, రవాణా, హస్తకళలు, స్థానిక ఉత్పత్తులు, గైడ్ సేవలు తదితర రంగాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పర్యాటక ప్రదేశాలు, ప్రముఖ చారిత్రక కట్టడాలపై విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జగదీశ్వర్, బీసీ సంక్షేమశాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
డిండి ప్రాజెక్టు రద్దుచేసే దాకా పోరాటం
నాగర్‌కర్నూల్/ కల్వకుర్తి రూరల్: ఉమ్మడి పాలమూరు రైతుల పాలిట శాపంగా మారిన డిండి ప్రాజెక్టును రద్దుచేసే వరకు ఉద్యమిస్తామని పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ నేతలు పునరుద్ఘాటించారు. వంగూరు మండలం ఉల్పర నుంచి ఆదివారం ఉమ్మడి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రను ప్రొ.హరగోపాల్ జెండా ఊపి ప్రారంభించారు. రైతులు ప్లకార్డులు చేతబూని పాలమూరు నీరు ఇక్కడి రైతులకే దక్కాలని.. నల్లగొండ జిల్లాకు తరలించొద్దని నినదించారు. అక్కడి నుంచి పాదయాత్ర కోనాపూర్‌కు చేరుకోగా.. ఎమ్మెల్సీ కోదండరాం సంఘీభావం తెలిపారు. ఈ ప్రాంత రైతాంగం చేస్తున్న సాగునీటి సాధన ఉద్యమానికి ఎల్లవేళలా అండగా ఉంటానని ప్రకటించారు. కోనాపూర్ నుంచి రంగాపూర్ మీదుగా ఎల్లికల్ వరకు పాదయాత్ర సాగింది. అక్కడ ప్రజలకు పాదయాత్ర ప్రాధాన్యత, డిండి ప్రాజెక్టుతో జరిగే నష్టాన్ని జేఏసీ నాయకులు వివరించారు. ప్రజలు చైతన్యవంతులై ఉద్యమంలో కదం తొక్కాలని పిలుపునిచ్చారు. అక్కడి నుంచి కల్వకుర్తి సమీపానికి చేరుకున్న పాదయాత్రలో ఎంపీ డీకే అరుణ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అక్కడి నుంచి కల్వకుర్తి ఆర్డీఓ కార్యాలయానికి జేఏసీ నాయకులు చేరుకొని డీఏఓకు వినతిపత్రం అందజేశారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి స్వంత మండలం నుంచే రైతన్నలు సాగునీటి కోసం పోరుబాట పట్టడం చర్చనీయాంశంగా మారింది. పాదయాత్రకు వివిధ గ్రామాల నుంచి రైతులు వేలాదిగా తరలివచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, గువ్వల బాలరాజు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, జేఏసీ నాయకులు వెంకట్‌గౌడ్, సదానందంగౌడ్, వీరబ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. సీఎం స్వంత మండలం నుంచే మొదలైన పోరు పాలమూరును ఆగం చేయొద్దని జేఏసీ ఆధ్వర్యంలో కదిలిన రైతాంగం సంఘీభావం తెలిపిన ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్సీ కోదండరాం, ప్రొ.హరగోపాల్ ప్రాజెక్టు ఆపే బాధ్యత సీఎందే పాలమూరుకు అన్యాయం చేసే డిండి ప్రాజెక్టు ఆపే బాధ్యత ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిదే అని ఎంపీ డీకే అరుణ అన్నారు. గత ప్రభుత్వంలో ఆగిపోయిన డిండి ఎత్తిపోతల పథకాన్ని మొదలుపెట్టడం అంటే ఈ ప్రాంతానికి అన్యాయం చేయడమే అన్నారు. ఈ జిల్లా నుంచి సీఎంగా బాధ్యతలు చేపట్టి ఈ ప్రాంత రైతాంగానికి పూర్తిస్థాయిలో నీళ్లు ఇవ్వాల్సింది పోయి నల్లగొండకు తరలించాలని చూడటం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. పాలమూరుకు నష్టం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని.. ప్రజల తరపున ఉద్యమిస్తామని ఆమె హెచ్చరించారు. -
పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ
నారాయణపేట: కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఆర్డీఓ రమేష్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్డీవో బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశం కోసం పోరాడిన బాపూజీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, హక్కుల కోసం కూడా తన గళాన్ని వినిపించారని తెలిపారు. సమానత్వం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. బాపూజీ ఆశయాలను కేవలం జయంతి వేడుకలకే పరిమితం చేయకుండా ప్రజా సంక్షేమం, సామాజిక అభివృద్ధిలో ఆచరణలో పెట్టాలని సూచించారు. బాపూజీ జీవితం ప్రజాసేవ, త్యాగం, పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. నేటి యువత ఆయన జీవితాన్ని, ప్రజా ఉద్యమాల్లో ఆయన పోషించిన పాత్రను తెలుసుకోవాలని సూచించారు. సమాజంలో అసమానతలను తొలగించేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, డీపీఆర్వో రషీద్, వసతి గృహాల వార్డెన్లు, బీసీ సంక్షేమశాఖ ఉద్యోగులు, సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సాగునీరు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్
● వచ్చేది మన ప్రభుత్వమే.. రైతులకు అండగా ఉంటాం ● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కందనూలు: రైతులకు సాగునీరు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఆదివారం కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి దశదిన కర్మకు హాజరైన ఆయన తిరుగు ప్రయాణంలో మాజీ మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని దేశిటిక్యాల వద్ద మొక్కజొన్న, పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని కేటీఆర్ వద్ద వాపోయారు. వ్యాపారుల వద్ద మిత్తికి అప్పులు తెచ్చి పంటలు సాగు చేశామని, ఆ మిత్తి పైసలు కూడా వచ్చే పరిస్థితి లేదని తమ గోసను వెలిబుచ్చారు. ఒకపక్క సాగునీరు, కరెంట్ లేక ఇబ్బందులు పడుతుంటే.. మరోపక్క యూరియా దొరకక అవస్థలు పడుతున్నామని ఆవేధన వ్యక్తం చేశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడుతుంటే అధికార పార్టీకి చెందిన ఒక్క నాయకుడు కూడా వారిని పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదని, ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని సృష్టించిన విపత్తు అని దుయ్యబట్టారు. రైతుల పంటలకు సరిపడా నీరు ఇస్తే పంటలు పండితే ధాన్యాన్ని కొనాల్సి వస్తుందని, అలాగే వారికి డబ్బులు చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జిల్లాలో 8.30 లక్షల ఎకరాలకు నీరు అందించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూశామని గుర్తుచేశారు. నదులు, ప్రాజెక్టులలో పుష్కలంగా నీరున్నా.. రైతుల పంటలకు అందించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోతుంటే అధికార పార్టీకి చెందిన ఏ నాయకుడికి రైతులను పలకరించే తీరిక లేకుండాపోయిందని ఆవేదన వెలిబుచ్చారు. పాలమూరు జిల్లా రైతులకు ఎండబెట్టి ఆంధ్ర ప్రభుత్వానికి నీటిని ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల పక్షాన నిలబడి తప్పనిసరిగా న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామని, రాష్ట్రంలో వచ్చేది మన ప్రభుత్వమే.. అండగా ఉంటామని కేటీఆర్ రైతులకు భరోసానిచ్చారు. కేటీఆర్ వెంట ఉమ్మడి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులున్నారు. -
‘రాబోయేది కేసీఆర్ పాలనే..’
కొత్తపల్లి: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వచ్చేది కేసీఆర్ పాలనేనని.. అప్పటి వరకు సంయమనం పాటించాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని వాల్యానాయక్‌తండాలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని అక్కడే ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు, 420 హామీలిచ్చి రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేసిందని.. సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందని, రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని వివరించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వంశపారంపర్యంగా వచ్చిన భూములను నిషేధిత జాబితాలో చేర్చి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అలాగే కమీషన్ల కోసం నియోజకవర్గంలో అవసరం లేని చోటకూడా రహదారులు నిర్మిస్తున్నారన్నారు. రాష్ట్రంలో గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన 60 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, వంచర్ల గోపాల్, దౌల్తాబాద్ మాజీ జెడ్పీటీసీ మహిపాల్, పుర కౌన్సిలర్లు నర్సింహ, మౌలానా, గోపాల్, సంగీత, శివకుమార్, నాయకులు మహిపాల్‌గౌడ్, రాజురెడ్డి, అంజయ్య, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నలుగురు కూతుళ్లు.. అందరూ ఉద్యోగులే
క్రమశిక్షణతో పెంచి పట్టుదలతో చదివిస్తే ఆడపిల్లలు కూడా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని నిరూపించారు మక్తల్‌కు చెందిన విశ్రాంత పీఈటీ బి.గోపాలం, వెంకటమ్మ దంపతులు. వీరి నలుగురు కుమార్తెలు రూప, దీప, శిల్ప, పుష్ప ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తమ కాళ్లపై తాము నిలబడ్డారు. రూప పీఈటీగా, దీప ఉపాధ్యాయురాలిగా, శిల్ప వెటర్నరీ అసిస్టెంట్‌గా, పుష్ప పీఈటీగా విధులు నిర్వర్తిస్తున్నారు. కూతుళ్లను కొడుకులతో సమానంగా పెంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించామని గోపాలం తెలిపారు. నలుగురూ ఉద్యోగాలు సాధించడం మా జీవితంలో గొప్ప ఆనందమని పేర్కొన్నారు. -
చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం
నారాయణపేట: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి తరతరాలకు ఆదర్శమని రెవెన్యూ అదనపు శ్రీను అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ సామాజిక న్యాయం, హక్కుల కోసం ధైర్యంగా నిలిచారని తెలిపారు. మహిళా ధైర్యానికి, సామాజిక మార్పుకు ఆమె జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, రజక సంఘం నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ దామరగిద్ద: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. సిద్దప్ప శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఐశ్వర్యతో మాట్లాడి రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. వివిధ రికార్డులు, వ్యాక్సిన్ రూం ఐఎల్ఆర్ను పరిశీలించారు. చికిత్స పొందుతున్న గర్భిణులు, బాలింతలు, ఇతర రోగులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆయన వెంట డా. సోహెల్, ఫార్మసిస్ట్ వెంకట్రామారెడ్డి, సూపర్వైజర్ భానుప్రియ, స్టాప్‌నర్సులు, చైల్డ్ హెల్త్ కో–ఆర్డినేటర్ శ్రీనివాస్ ఉన్నారు. ఏటీ ల్యాబ్‌లను వినియోగించాలి నారాయణపేట ఎడ్యుకేషన్: విద్యార్థుల ఆవిష్కరణలకు ఏటీ ల్యాబ్‌లు ఎంతో కీలకమని జిల్లా విద్యాధికారి డా. గోవిందరాజు అన్నారు. సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర గ్రామీణ సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్‌లో అటల్ టింకరింగ్ ల్యాబ్‌పై రాష్ట్రస్థాయి సామర్థ్య నిర్మాణ శిక్షణ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. జిల్లాలో ఏటీ ల్యాబ్‌లు ఉన్న 23 పాఠశాలలకుగాను 21 పాఠశాలల ఏటీఎల్ ఇన్చార్జ్ ఉపాధ్యాయులు శిక్షణకు హాజరయ్యారు. పాఠశాలల్లోని ఏటీ ల్యాబ్‌లను పూర్తిస్థాయిలో వినియోగించి విద్యార్థుల్లో ఆవిష్కరణ స్ఫూర్తి, సృజనాత్మకతను పెంపొందించాలని, నూతన ఆవిష్కరణలకు ఏటీఎల్లు వేధిక కావాలని సూచించారు. ల్యాబ్‌లను సమర్థవంతంగా వినియోగించి విద్యార్థులలో ఆవిష్కరణ, సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. శిక్షణలో ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు, సెన్సార్లు, బ్రెడ్ బోర్డు అనుసంధానం, ఆర్డుయినో పరిచయం, బ్లాక్ కోడింగ్, బ్లూటూత్‌తో వైర్లెస్ కమ్యూనికేషన్, 3డి డిజైనింగ్, 3డి ప్రింటింగ్ వినియోగం, ఏఐ తదితర అంశాలపై శిక్షణనిచ్చారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి భానుప్రకాష్, ఏటీఎల్ ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు. కారణజన్ముడు ఎస్పీ బాలు నారాయణపేట: తెలుగుజాతి గర్వించదగ్గ గాయకుడు, బహుభాషా గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అని బాలు అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి కొనియాడారు. శనివారం బాలకేంద్రంలో బాలు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. బాలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. 50 వేలకు పైగా గీతాలను ఆలపించి తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహోన్నత గాయకుడు ఎస్పీ బాలు అన్నారు. ఆయన గాన ప్రతిభ, సేవలు కళాకారులకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో సంగ నర్సింహులు, వసంత్, రామకృష్ణ, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. -
వారసత్వ సంపద సంరక్షణ బాధ్యత
కృష్ణా: ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిలువురాళ్లను కాపాడుకోవడం అందరి బాధ్యతని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అన్నారు. శనివారం మండలంలోని ముడుమాల్ నిలువురాళ్ల ప్రాంతంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవానికి ఆమె హాజరయ్యారు. ముందుగా ముడుమాల్, ధన్వాడ, దామరగిద్ద మండలాల ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నిలువురాళ్లు యునెస్కో గుర్తింపు పొందింతే ఈ ప్రాంతం అన్నిరకాలుగా అభివృద్ధి చెందడంతో పాటు నారాయణపేట అంటే ముడుమాల్ నిలువురాళ్లు అనేవిధంగా ఉంటుందన్నారు. తను చిన్నప్పుడు తల్లిదండ్రులతో ఇతర దేశాలకు వెళ్లిన సమయంలో అక్కడ కేవలం 70 ఏళ్లకు చెందిన వాటిని కాపాడుకొని పర్యటక ప్రాంతాలుగా అభివృద్ధిపర్చారని తెలిపారు. ఇక్కడి నిలువురాళ్లు 3 వేల సంవత్సరాలకు చెందినవి అంటే ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడైనా పురాతన ఆలయాలు, ఇతర కట్టడాలు ఉంటాయి.. కాని ఇక్కడ ఓ విజ్ఞానానికి సంబంధించినవి, కాలగమనానిని చెందినవి, పూర్వీకులు అవలంబించిన ఆనవాళ్లు ఉండటం చాలా అరుదని తెలిపారు. ముడుమాల్ నిలువురాళ్లు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందడం గర్వంగా ఉందన్నారు. ముఖ్యంగా ముడుమాల్ ప్రజలు వీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. నిలువురాళ్ల ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తన సొంత నిధులతో వారంలోనే మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే ఈ ప్రాంత రైతులకు సంబంధించిన చిన్నచిన్న సమస్యలన్నింటిని పరిష్కరిస్తానని తెలిపారు. నిలువురాళ్లను సందర్శించాలి.. జిల్లాలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు చారిత్రాత్మకమైన నిలువురాళ్లను సందర్శించి వీటి ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించాలని డీఈఓ డా. గోవిందరాజు సూచించారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆ దిశగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషోర్‌కుమార్, ఎంఈఓ నిజాముద్దీన్, సర్పంచ్ బాలరాజు, మురహర్‌దొడ్డి సర్పంచ్ నర్సమ్మ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నాలుగు కీలక హోదాల్లో మహిళలే..
దారులు వేరైనా లక్ష్యం ఒక్కటే జిల్లాలో కీలక బాధ్యతల్లో ఉన్న మహిళలు పాలనలో తమదైన ముద్ర వేస్తున్నారు. విభిన్న హోదాలు.. భిన్న బాధ్యతలు.. కానీ లక్ష్యం ఒక్కటే.. ప్రజాసేవ. కలెక్టర్ సీహెచ్ ప్రియాంక పరిపాలనాధికారిగా జిల్లాను ముందుకు నడిపిస్తున్నారు. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పార్లమెంట్ వేదికగా ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్నారు. నారాయణపేట ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలపై శాసనసభలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నారాయణపేట పుర చైర్‌పర్సన్‌న్ కొండా శ్వేత పుర పాలనలో చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. -
మధ్యవర్తిత్వంతో కేసుల త్వరిత పరిష్కారం
నారాయణపేట: కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న రాజీపడదగిన కేసులను మధ్యవర్తిత్వం ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు సూచించారు. శనివారం జిల్లా న్యాయస్థానంలోని కాన్ఫరెనన్స్ హాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వింధ్యానాయక్, బార్ అసోసియేషన్‌న్ అధ్యక్షుడు దామోదర్‌గౌడ్, న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు 90 రోజుల పాటు మీడియేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఆరుగురు సీనియర్ న్యాయవాదులు మధ్యవర్తిత్వంపై శిక్షణ పొందారని.. వారి సమక్షంలో ఇరుపక్షాలు తమ వాదనలు వినిపించి పరస్పర అంగీకారంతో కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించిన కేసులకు చట్టబద్ధత ఉంటుందని, తక్కువ సమయంలో వివాదాలకు పరిష్కారం లభించే అవకాశం ఉందని తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, చెక్ బౌన్‌న్స్, కుటుంబ, వివాహ, పిల్లల సంరక్షణ, మోటారు, ప్రమాద పరిహారం, కార్మిక, వినియోగదారుల వివాదాలకు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం పొందవచ్చన్నారు. స్పెషల్ డ్రైవ్‌ను విజయవంతం చేసేందుకు న్యాయవాదులు, కక్షిదారులు సహకరించాలని కోరారు. న్యాయవాదులు మధు, కుర్మన్నగౌడ్, భీంరెడ్డి, కృష్ణయ్యగౌడ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి వెలుగులు.. కూతుళ్లు
● విజయాలకు చిరునామా ● ఇంటిని నడిపిన చేతులే.. పాలన సాగిస్తున్నాయి ● అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్న ఆడబిడ్డలు ● నేడు జాతీయ కుమార్తెల దినోత్సవం విశ్రాంత ఉపాధ్యాయుడైన తాత పర్యవేక్షణలో ఎలాంటి శిక్షణ లేకుండానే కష్టపడి చదివిన కొత్తపల్లి నందిని.. తండ్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రోత్సాహంతో గ్రూప్–1 ఉద్యోగం సాధించింది. గతంలోనే గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4లో ప్రతిభ చాటిన ఆమె.. తాజాగా గ్రూప్–1లో మల్టీజోనన్లో 152వ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 281వ ర్యాంకు సాధించింది. కుమార్తె విజయం పట్ల తండ్రి, కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ‘నాన్న కష్టాన్ని చూసి.. ఆయనకు గర్వంగా అనిపించేలా ఏదైనా సాధించాలనుకున్నా. ఈ విజయం మా కుటుంబం నాపై పెట్టుకున్న నమ్మకానికి ఫలితం’ అని నందిని భావోద్వేగంతో పేర్కొంది. తల్లిదండ్రులతో నందిని తాత పర్యవేక్షణ.. తండ్రి ప్రోత్సాహం... -
ఇక డింఢీ..!
● హాజరుకానున్న ఎమ్మెల్సీ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి డిండికి నీటి తరలింపుపై అగ్గి రాజుకోనుంది. పాలమూరు ప్రజలు, రైతాంగానికి నష్టం వాటిల్లుతుందని.. అడ్డుకోవాలంటూ ఇప్పటికే ప్రజాప్రతినిధులకు బహిరంగ లేఖలతో యుద్ధం మొదలు పెట్టిన ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్ట్‌ల సాధన జేఏసీ ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ప్రజల్లో చైతన్యం తేవడంతో పాటు లీడర్లలో చలనం వచ్చేలా ఆందోళన కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డిండి ప్రాజెక్ట్ పూర్వపరాలు, ప్రస్తుత పరిస్థితులు, జాయింట్ యాక్షన్ కమిటీ పోరు సన్నాహాలపై ‘సాక్షి’ ఫోకస్.. ఉమ్మడి ఏపీలో ఇలా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగు, తాగు నీరందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ)కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పంపింగ్ లేకుండా గ్రావిటీ ద్వారా నీటిని తరలించేలా ఎస్ఎల్బీసీ భూగర్భ టన్నెల్ తవ్వకానికి శ్రీకారం చుట్టారు. ఎస్ఎల్బీసీ ప్రధాన కాల్వ ద్వారా వచ్చే నీటిలో కొంత భాగాన్ని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి లింక్ కాల్వల ద్వారా ఎగువన ఉన్న డిండి రిజర్వాయర్‌కు మళ్లించేలా డిజైన్ చేశారు. అయితే టన్నెల్ నిర్మాణంలో అనేక అడ్డంకులు ఎదురుకావడం.. నిధుల విడుదలలో జాప్యంతో పనులు కొనసాగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్లో తెరపైకి.. అభ్యంతరాలతో వెనుకడుగు తెలంగాణ ఆవిర్భావం అనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా జలాల పునర్విభజన, రీడిజైన్ వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చింది. పాత డిండి లింక్ ప్రతిపాదనను రీడిజైన్ చేసి రూ.6 వేల కోట్లకు పైగా అంచనాతో ప్రత్యేక ఎత్తిపోతల పథకాన్ని రూపొందించింది. ఎస్ఎల్బీసీపైనే ఆధారపడకుండా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ఏదుల నుంచి డిండికి కృష్ణా జలాలను ఎత్తిపోసేలా మార్పు చేశారు. దీనిపై ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి అభ్యంతరాలు రావడంతో ప్రభుత్వం వెనుకడుగు వేసింది. కాంగ్రెస్.. వచ్చీ రావడంతో.. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. పీఆర్ఎల్ఐలో భాగంగా వనపర్తి జిల్లాలో నిర్మిస్తున్న ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి నీళు్ల్ తరలించేలా ప్రతిపాదించిన ఏదుల–ఉల్పర లింక్ పనుల కోసం గతేడాది రూ.1,800 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చింది. అయితే డిండికి నీటి తరలింపుపై తొలి నుంచీ వ్యతిరేకంగా ఉన్న పాలమూరు రైతులు, ప్రజలు, జల సాధన సమితి, అధ్యయన వేదిక రేవంత్ ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు వ్యతిరేకం, ఇప్పుడు మౌనమా? తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదుల నుంచి డిండికి నీటి మళ్లింపు తెరపైకి రాగా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో పార్టీలకతీతంగా రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు వ్యతిరేకిస్తూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనేది లేదని.. ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని విన్నవించడంతో పాటు హెచ్చరికలు సైతం జారీ చేశారు. అప్పుడు డిండికి పాలమూరు నుంచి నీటిని తరలించొద్దని జూపల్లి కృష్ణారావు లేఖ రాశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉండి.. ఏదుల నుంచి డిండికి నీటి తరలింపుపై నోరు మెదకపోవడంపై జేఏసీ నేతలు మండిపడుతున్నారు. ఉద్యమ తీవ్రత పెంచేలా.. డిండి ప్రాజెక్ట్‌కు వ్యతిరేక ఉద్యమంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు రాజకీయ పార్టీల నేతలు కలిసి వచ్చేలా జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, ప్రతినిధులు వీరబ్రహ్మచారి, బెక్కెం జనార్దన్, చెన్న కిష్టయ్య, బండెల రాంచంద్రారెడ్డి, పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి తదితరులు చర్చించుకుని తమ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసేలా ఆదివారం ఉల్పర నుంచి కల్వకుర్తికి పాదయాత్ర చేపట్టనుంది. ఈ యాత్రకు ఎమ్మెల్సీ కోదండరాంతో పాటు పాలమూరు అధ్యయన వేదిక రాష్ట్ర కన్వీనర్, ప్రొఫెసర్ హరగోపాల్ హాజరుకానున్నారు. యాత్ర వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి పేరిట బహిరంగ లేఖలు విడుదల చేయనున్నారు. కల్వకుర్తిలో ఆర్డీఓ తదితర అధికారులకు వినతిపత్రాలు అందించనున్నారు. దశల వారీగా ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి, వంటావార్పు, నిరసనలు.. ఇలా పోరు కార్యాచరణను వెల్లడించనున్నట్లు సమాచారం. పోరుకు శ్రీకారం చుట్టిన జేఏసీ డిండికి నీటి తరలింపునకు సంబంధించి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలలోని ఏదుల నుంచి 2.52 కిలోమీటర్ల మేర ఓపెన్ కాల్వతో పాటు 16 కి.మీల సొరంగం.. ఆ తర్వాత 3.05 కి.మీల మేర కాల్వను నిర్మించి దుందుభీ నదిలోకి నీళ్లు పోస్తారు. అక్కడ నీటిని మళ్లించేందుకు పోతిరెడ్డిపల్లి వద్ద రబ్బర్ డ్యాం నిర్మించనున్నారు. ఈ క్రమంలో ఆయా చోట్ల రిజర్వాయర్లు, కాల్వల పనులు మొదలు కాగా.. ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్ట్‌ల సాధన జేఏసీ పోరుకు శ్రీకారం చుట్టింది. పాలమూరు నీళ్లను డిండికి తరలించొద్దని కోరుతూ ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రజాప్రతినిధులకు బహిరంగ లేఖలు రాసింది. అంతేకాదు.. పోరు కార్యాచరణను రూపొందించుకుని ముందుకుసాగుతోంది. ఈ మేరకు డిండి పరిధిలో రిజర్వాయర్లు, కాల్వల సందర్శన చేపట్టి.. రైతులు, వివిధ సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చేలా పోరు సన్నాహాలు ముమ్మరం చేసింది. డిండికి పాలమూరు నీటి తరలింపుపై జేఏసీ పోరు బాట ప్రజల్లో చైతన్యంతోపాటు ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెంచేలా కార్యాచరణ ఇప్పటికే అడ్డుకోవాలని బహిరంగలేఖలు.. రైతులు, సంఘాల నేతలతో భేటీ నేడు ఉల్పర నుంచి కల్వకుర్తికి పాదయాత్ర... సీఎం పేరిట విజ్ఞాపన పత్రం


