క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకే సీఎం కప్‌ | - | Sakshi
Sakshi News home page

క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకే సీఎం కప్‌

Feb 10 2026 7:24 AM | Updated on Feb 10 2026 7:24 AM

క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకే సీఎం కప్‌

క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకే సీఎం కప్‌

నర్వ: గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణాన్ని వెలికితీసేందుకే సీఎం కప్‌ పోటీలను ప్రభుత్వం నిర్వహిస్తోందని డీవైఎస్‌ఓ వెంకటేశ్‌ శెట్టి అన్నారు. సోమవారం పాథర్చేడ్‌ ఉన్నత పాఠశాల మైదానంలో నియోజకవర్గ స్థాయి సీఎం కప్‌ సెకండ్‌ ఎడిషన్‌ క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మక్తల్‌, ఊట్కూర్‌, కృష్ణా, మాగనూర్‌, ఆత్మకూర్‌, అమరచింత మండలాల నుంచి వచ్చిన క్రీడాకారులు మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించి.. క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలికల విభాగం వాలీబాల్‌ పోటీల్లో ఆత్మకూర్‌ ప్రథమ, ఊట్కూర్‌ ద్వితీయ, ఖోఖోలో కృష్ణా ప్రథమ, మక్తల్‌ అర్బన్‌ ద్వితీయ, కబడ్డీలో మక్తల్‌ అర్బన్‌ మొదటి, అమరచింత ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. బాలుర విభాగం వాలీబాల్‌ పోటీల్లో ఊట్కూర్‌ ప్రథమ, మక్తల్‌ అర్బన్‌ ద్వితీయ, ఖోఖోలో మక్తల్‌ అర్బన్‌ ప్రథమ, ఊట్కూర్‌ ద్వితీయ, కబడ్డీలో నర్వ ప్రథమ, మక్తల్‌ రూరల్‌ ద్వితీయ స్థానాలో నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంఈఓ రాంరెడ్డి, కాలేరు సురేష్‌, సర్పంచ్‌ లింగమ్మ, హెచ్‌ఎం భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement