Bapatla
-
అంకెతో వేగానికి లంకె
స్పీడ్ కాదు.. టైర్‌పై నెంబర్ చూడు గురూ..జిల్లాలో ఐదేళ్లలో జరిగిన ప్రమాదాలు సంవత్సరం ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు 2021 1047 431 913 2022 1071 397 1011 2023 972 352 912 2024 1042 442 1143 2025 898 355 781 పట్నంబజారు: గుంటూరు జిల్లా రహదారులపై వేగం ఒక అలవాటుగా మారింది. వేగం ప్రాణాంతకం.. వేగాన్ని మోయలేని టైర్లే మృత్యు సంకేతం. అయితే ఆ వేగాన్ని మోయగల సామర్థ్యం వాహనాలకు ఉందాం లేదా అన్న ప్రశ్నే ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. జిల్లాలో ఏడాది కాలంలో నమోదైన రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే, సుమారు ప్రతి నాలుగింట ఒక ప్రమాదం టైర్ లోపాల కారణంగానే జరుగుతున్నట్టు రవాణాశాఖ, పోలీసులు అధికారుల ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం – టైర్లపై ఉన్న వేగ సూచిక అక్షరాలపై వాహనదారుల అవగాహన లేకపోవటమే అందుకు కారణమని సుస్పష్టమవుతోంది. ప్రమాదాలు ముఖ్యంగా టైర్ బరస్ట్ అవ్వటం, స్కిడింగ్, గ్రిప్ కోల్పోవటం వంటివి జరగటం వలనే జరుగుతున్నాయి. అంటే వాహనం ఎంత వేగంతో వెళ్తుందో తెలిసినా, ఆ వేగాన్ని మోయగల టైర్లు వాడకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. అంకె తేల్చేస్తుంది ప్రతి ద్విచక్ర వాహనం, కారు టైర్ పక్క భాగంపై కనిపించే నెంబర్లు ఉదాహరణకు 90/90–17 49పి, 165/70 ఆర్,14 81టి వంటి కోడ్లు సాధారణంగా ఎవ్వరూ పట్టించుకోరు. కానీ ఈ కోడ్‌లో చివర ఉన్న అక్షరమే ఆ వాహనం ఎంత వేగం వరకు సురక్షితంగా ప్రయాణించగలదో నిర్దేశిస్తుంది. ఉదాహరణకు ‘పి’ అక్షరం ఉన్న టైర్ గరిష్టంగా 150 కిలోమీటర్ల వేగం వరకు మాత్రమే భద్రత కల్పిస్తుంది. గుంటూరు–విజయవాడ, గుంటూరు–నరసరావుపేట, గుంటూరు–చిలకలూరిపేట హైవేల్లో చాలా మంది ద్విచక్ర వాహనదారులు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుండగా, వారి బైకుల్లో 100, 110 కిలోమీటర్ల వేగానికి మాత్రమే అనుకూలమైన జే, కే అక్షరాల టైర్లు ఉండటం ప్రమాదాలకు తావిచ్చినట్లు తెలుస్తోంది. వివరం తెలిసేది ఇలా... వాహనం టైర్ సైజ్ 120/80 ఆర్ 18 అని ఉంటే... అందులో 120 అనేది టైర్ వెడల్పు మిల్లిమీటర్లలో, 80 జరిగిన వెడల్పుతో కూడిన రేషియో, 18 అంటే టైర్‌కు సంబంధించి డైమీటర్ అంగుళాలలో ఉంటుంది. 18: టైర్ డైమీటర్ అంగుళాలలో ఉదాహరణకు ‘ఎం’ ‘వి’ అనే అక్షరాలు బండి టైర్లు ఎంత స్పీడు వెళ్ళవచ్చు అనే సామర్థ్యాన్ని తెలియజేస్తాయి. ఏ1 ఉంటే 5 కిలోమీటర్లు, ఏ2కు 10, ఏ3 15, బి 50, సీ 60, డి 65, ఈ 70, ఎఫ్ 80, జీ 90, జే 100, కె 110, ఎల్ 120, ఎం 130, ఎన్ 140, పి 150, క్యూ 160, ఆర్ 170, ఎస్ 180, టీ 190, యూ 200, హెచ్ 210, వి 240, డబ్ల్యూ 270, వై 300, జెడ్ 240 ప్లస్ వరకు గరిష్ట వేగంతో వెళ్ళ వచ్చని సూచికలు చెబుతున్నాయి. దీనిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టైర్లపై అంకెలు, పేర్లును జాగ్రత్తగా గమనించటం ద్వారా ప్రమాదాలు తగ్గవచ్చని ఆర్టీఏ, పోలీసు శాఖ అధికారులు చెబుతున్నారు. -
ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌పై కత్తితో దాడి
చీరాల: చీరాల ఆర్టీసీ డిపోలో అద్దె బస్సు డ్రైవర్‌పై కత్తితో దాడి చేసిన ఘటన ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో చోటుచేసుకుంది. బాధితుడి వివరాల మేరకు.. స్థానిక జయంతిపేటకు చెందిన వాసిమళ్ల హరీష్ చీరాల ఆర్టీసీ డిపోలో హైర్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ఆర్టీసీ బస్టాండ్‌లోకి వస్తుండగా చీరాల మండలం కీర్తివారిపాలేనికి చెందిన చుక్క సుబ్రహ్మణ్యం, ఏలిక రమేష్‌లు హరీష్ వద్దకు వచ్చి ఒక మహిళతో తనకు అక్రమ సంబంధం ఉందనే నెపంతో తనను చంపాలని ఉద్దేశంతో తనతో గొడవపడ్డారన్నారు. ఈ క్రమంలో ఇరువురు కులం పేరుతో దూషించారని, రమేష్ తనను కిందకు పడవేయగా సుబ్రహ్మణ్యం కత్తితో కడుపులో పొడిచారన్నారు. చుట్టుపక్కల వాళ్లు కేకలు వేయడంతో అక్కడ నుంచి పరారయ్యారన్నారు. చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించగా అవుట్‌పోస్టు పోలీసులు క్షతగాత్రుడి వద్ద నుంచి వివరాలను నమోదు చేసుకున్నారు. క్షతగాత్రుడి ఫిర్యాదు మేరకు చీరాల ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్‌కుమార్ తెలిపారు. గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ శనివారం అర్థరాత్రి మారువేషంలో ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. తలపాగా పెట్టుకుని, ముఖానికి మాస్క్ ధరించి, సాధారణ వ్యక్తి మాదిరిగా పలు వార్డుల్లో తిరిగి రోగులకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. డాక్టర్ యశస్వి రమణ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా 2024 అక్టోబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఆస్పత్రిలో పలు సమస్యలు ఉన్నాయని, వాటిని ఆస్పత్రి అధికారులు పరిష్కరించలేకపోతున్నారని మీడియాలో వరుసగా కథనాలు రావటంతో 2025 నవంబర్‌లో బిచ్చగాడి వేషం ధరించి రాత్రిళ్లు ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. మళ్లీ రెండోసారి 2025 డిసెంబర్లో మార్చురీ విభాగం వద్ద డబ్బులు తీసుకుంటున్నారని మీడియాలో కథనాలు రావటంతో మారు వేషంలో మార్చురీ వద్ద తనిఖీలు చేశారు. నేడు తాజాగా మూడోసారి ఆస్పత్రిలో మారు వేషంలో తనిఖీలు చేశారు. మూడుసార్లు మారువేషాల్లో తనిఖీలు చేసినా ఆయనకు ఏ విధమైన లోపాలు కనిపించకపోవటం, ఆస్పత్రిలో అందరూ విధుల్లో ఉండటం, రోగుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకపోవటం వంటి విషయాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. మారు వేషం వేసిన ప్రతిసారి సోషల్ మీడియాలో దానిని పోస్ట్ చేసి ఆయన వైరల్ అయ్యారే తప్పా రోగులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. మూడుసార్లు తూతూ మంత్రమే.. సాధారణంగా ఆస్పత్రిలో రాత్రిళ్లు విధుల్లో కొంత మంది వైద్య సిబ్బంది, వైద్యులు ఉండరనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఎమర్జెన్సీ వార్డులో డ్యూటీ అసిస్టెంట్ సర్జన్, డ్యూటీ అసిస్టెంట్ ఫిజీషియన్లు అందుబాటులో ఉండరనేది నగ్నసత్యం. ఒకవేళ ఎవరైనా బాధితులు చికిత్స కోసం వచ్చి ఎమర్జెన్సీ వార్డుల్లో మరణిస్తే దానిని ధ్రువీకరించి డ్యూటీ అసిస్టెంట్స్ డాక్టర్స్, సర్జన్స్ సంతకాలు చేయాల్సి ఉంది. కాని వీరు ఉండకపోవటంతో పీజీ వైద్యులతో సంతకాలు చేయించటం లేదా కొన్ని సార్లు ఉదయం డ్యూటీ డాక్టర్స్ వచ్చే వరకు భౌతిక కాయాలను ఉంచి సంతకాలు చేయించి తరలిస్తున్నట్లు ప్రతి ఒక్కరు చెవులు కొరుక్కుంటున్నారు. కాని సూపరింటెండెంట్ తనిఖీలు ఇలాంటి లోపాలు ఏమీ కనిపించలేదు. ఆయన తనిఖీలు చేసిన శనివారం, ఆదివారం సమయాల్లో సాధారణంగా పెద్ద డాక్టర్స్ రాకుండా జూనియర్స్పైనే పని వదిలి వెళ్లటం ఇక్కడ పరిపాటే. శనివారం రాత్రి వేళల్లో సూపరింటెండెంట్ తనిఖీలు చేసిన సమయంలో అందరూ విధుల్లో ఉన్నారనే విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మారువేషాల్లో తన సొంత పబ్లిసిటీ కోసం తనిఖీలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన చేసిన తనిఖీల్లో ఇప్పటి వరకు ఎలాంటి తప్పిదాలను గుర్తించలేదు. ఎవరిపైనా ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. మాచర్ల రూరల్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర సోషల్ మీడియా జనరల్ సెక్రటరీ నెమలిదిన్నె వెంకట రంగారెడ్డిని మాచర్ల రూరల్ పోలీసులు ఆదివారం అక్రమంగా అరెస్టు చేశారు. వెంకట రంగారెడ్డిది మాచర్ల మండలం కంభంపాడు గ్రామం కాగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామం వదిలి వెళ్లి విజయవాడలో నివాసం ఉంటున్నాడు. వెంకట రంగారెడ్డిని మాచర్ల రూరల్ పోలీసులు అరెస్టు చేసి మాచర్ల కోర్టులో హాజరుపరచనుననట్లు పోలీసులు తెలిపారు. వెంకట రంగారెడ్డిని మెజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరుపరచనున్నట్లు సమాచారం. ఇప్పటికే నెమలిదిన్నే వెంకట రంగారెడ్డిపై 14 అక్రమ కేసులు బనాయించి పోలీసులు అరెస్టు చేశారు. 15వ కేసును బనాయించి 15వ సారి జైలుకు పంపే పనిలో పోలీసులుఉన్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
ముగిసిన జాతీయస్థాయి నాటిక పోటీలు
పర్చూరు(చినగంజాం): మండలంలోని వీరన్నపాలెం గ్రామంలో మూడు రోజులుగా కొనసాగుతున్న తొమ్మిదో జాతీయ స్థాయి నాటిక పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. కళానికేతన్ వీరన్నపాలెం డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నాటిక పోటీలు ఆద్యంతం ఉత్కంఠంగా సాగాయి. ఆదివారం రాత్రి ప్రదర్శించిన నాటిక పోటీలకు సంబంధించి యార్లగడ్డ రాజేష్, పద్మజ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేయగా చిట్టినేని రవీంద్రబాబు, హరిచందన దంపతులు నటరాజ పూజ కార్యక్రమం నిర్వహించారు. దెబ్బ తింటున్న సంప్రదాయాలు.. ప్రదర్శనలో ముందుగు విశాఖపట్టణం తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘చిటికెన వేలు’ నాటిక అభివృద్ధి పేరుతో వస్తున్న కొత్త పుంతలకు అనుగుణంగా తమ పెద్దల చేతివేలు పట్టుకొని సాగే సంప్రదాయం దెబ్బతింది అనే సారాంశంతో సాగింది. కొండ ప్రాంతంలో జీవనం చేసే సోమన్న కుటుంబం భూమిని స్వేచ్ఛగా సాగు చేసుకొని పంటలు పండించుకుంటూ, తాగునీటి అవసరాలు తీర్చుకుంటూ పెద్దల నుంచి సంక్రమించిన భూమిని సాగుచేసుకుంటూ జీవిస్తున్నారు. ఆయన తన పెద్దల చిటికెన వేలు పట్టుకొని వారి అడుగుజాడల్లో నడచిన సోమన్న ఆయన కొడుకు రెంజింను కూడా అలాగే నడిపించాడు. నాగరి కథ అభివృద్ధి పేరుతో వారి మనవడు కొత్త పుంతలను ఆహ్వానించాడు. తండ్రి చిటికెన వేలు విడిచి ప్రభుత్వాధికారులకు తన భూమి హక్కులను, చిటికెన వేలు కూడా సమర్పించుకున్నాడనేది సారాంశం. ‘జనరల్ బోగీ’ల్లో ఎన్నో కష్టాలు.. రెండో ప్రదర్శన కొలకలూరు శ్రీసాయి ఆర్ట్స్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘జనరల్ బోగీలు’ అనే నాటిక రైలులో జనరల్ బోగీల్లో సామాన్యులు ఎదుర్కొనే సమస్యలను గురించి కొనసాగింది. రైలులో జనరల్ బోగీలలో ప్రయాణించే ప్రయాణికుల అవస్థలు గురించి తెలియజేస్తూ ప్రదర్శించిన నాటిక. రైలులో జనరల్ బోగీలలో ప్రయాణించే వారి వివరాలు రైల్వే వాళ్ల దగ్గర ఉండవు. ప్రమాదం జరిగిన సందర్భాలలో వారి కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది. జనరల్ బోగీలలో ప్రయాణించే ప్రయాణికులకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ అనే అంశానికి ప్రాధాన్యత ఇస్తూ సాగిన నాటిక. మూడో నాటిక దీపం కింద ‘చీకటి’ అనే నాటికను వీరన్నపాలెం గ్రామంలోని నటులు ప్రదర్శించారు. అనంతరం బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గోరంట్ల యమునా కుమార్ అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు జెట్టి హరిబాబు ఆహ్వానం పలుకగా ముఖ్య అతిథిగా కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ చైర్మన్ గూడూరి సత్యనారాయణ, గౌరవ అతిథులుగా పేర్ని వీరనారాయణ, గోరంట్ల రమేష్, యార్లగడ్డ రజిని, కొల్లా వెంకట్రావు, దండమూడి ఏలీషా చౌదరి, కఠారి రమేష్ నాయుడు పాల్గొనగా కళానికేతన్ కార్యదర్శి కొల్లా శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు. ప్రజల సమస్యలను ఎత్తిచూపిన ప్రదర్శనలు -
యువతలో క్రీడా స్ఫూర్తి పెరగాలి
ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ తాడేపల్లి రూరల్: యువతలో క్రీడా స్ఫూర్తి పెరగాలని ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. ఆదివారం తాడేపల్లి పట్టణ పరిధిలోని బ్రహ్మానందపురంలో ఫ్యాక్టరీ ప్రీమియర్ లీగ్ సీజన్–2 క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వద్దు బ్రో–క్రికెట్ ముద్దు బ్రో అనే నినాదంతో క్రీడలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల్లో సుమారు 40 వేల ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఒత్తిడిని అధిగమించడానికి, విజయాలను సాధించడానికి క్రీడలు ఎంతో అవసరమని స్పష్టం చేశారు. టోర్నమెంట్లో వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 50 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ కె.నగేష్‌బాబు, డీఎస్పీ ఏపీ పోలీస్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎ.శాంతిరాజు, శ్వాస ఆర్గనైజేషన్ ప్రతినిధి డాక్టర్ అనిత జ్యోతి పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): గుంటూరు జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యాన వేంకటేశ్వర బాల కుటీర్ పాఠశాలలో జరుగుతున్న మెన్ అండ్ విమెన్ టీమ్ చాంపియన్ షిప్– 2026 పోటీలు ఆదివారం ముగిశాయి. పురుషుల విభాగంలో ఆద్యంత రామన్ నాయుడు, కేజీ అఖిల్, కె.హర్షవర్ధన్, ముక్కుపాటి చేతన్, ఉమెన్ విభాగంలో తేజ అనూష తన్నీరు, జయ అహల్య తన్నీరు, అనన్య గొల్లపల్లి, కంచర్ల అంజుశ్రీలు విజయం సాధించారు. పోటీల నిర్వాహకుడు విజయ్‌కుమార్ మాట్లాడుతూ గెలుపొందిన ఎనిమిది మంది రాష్ట్ర పోటీల్లో పాల్గొంటారన్నారు. విజేతలకు జిల్లా చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవీంద్రరాజు, బాలకుటీర్ సీఏఓ దుర్గా రఘురామ్, ప్రిన్సిపాల్ సుధామాధవి బహుమతులు ప్రదానం చేశారు. అర్బిటర్‌గా అనిల్ వ్యవహరించారు. లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): కర్నూలులో ఈ నెల 24న జరిగే 12వ సీనియర్ రాష్ట్ర స్థాయి ఈత పోటీలకు గుంటూరు జిల్లా నుంచి పది మంది బాల బాలికలు ఎంపికయ్యారని జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి షేక్ ఖాజామొహిద్దీన్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని మెహబూబ్ షంషేర్ ఖాన్ మెమోరియల్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కోచ్ నాంచారమ్మ, నాగేశ్వరరావుల పర్యవేక్షణలో గుంటూరు జిల్లా జట్టు ఎంపిక చేశామన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు గుంటూరు జిల్లా నుంచి సీహెచ్ గౌతమ్, మేదర నాగచైతన్య, బి.నాగ చైతన్య, బి.స్వర్ణసుజిత్, కే అభినవసాగర్, అకిశెట్టి విష్ణుదేవరాయలు, షేక్ నస్రిన్, షేక్ నజరీన్, లక్ష్మీపావని, జి.జాన్వీలు ఫ్రీ స్టైల్, బ్యాక్ స్ట్రోక్, బ్రస్ట్ స్ట్రోక్, బటర్ ఫ్లై విభాగాలలో ఎంపికై నట్లు వెల్లడించారు. బాపట్ల: ఈవీఎంల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆదివారం బాపట్ల జిల్లా కేంద్రంలో భద్రపరిచిన ఈవీఎంల గోదామును జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్‌తో కలసి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ గోదాం వద్ద నిరంతర నిఘా ఉంటుందన్నారు. బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, తహసీల్దార్ షేక్ సలీమా, ఎన్నికల పర్యవేక్షకులు షఫీ తదితరులు పాల్గొన్నారు. -
మానసిక ప్రశాంతతకు క్రీడలు దోహదం
బాపట్లటౌన్: మానసిక ప్రశాంతతకు క్రీడలు ఎంతో దోహద పడతాయని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్పేరెడ్ గ్రౌండ్లో ఆదివారం జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బందితో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది పని ఒత్తిడిని అధిగమించి మరింత ఉత్సాహంగా విధులు నిర్వహించేందుకు క్రీడలు ఎంతో దోహద పడతాయన్నారు. టోర్నమెంట్లో గెలుపోటములు సమానమని తెలిపారు. క్రీడల వలన నాయకత్వ లక్షణాలు పెరగడంతోపాటు సమష్టి కృషి అలవడుతుందన్నారు. ఆడడం, వీక్షించడం మంచి అలవాట్లు అయినప్పటికీ బెట్టింగ్‌లు నిర్వహించడం ప్రమాదకరమని హెచ్చరించారు. బెట్టింగ్‌ల వలన అనేక మంది ఆర్థికంగా నష్టపోవడంతోపాటు తమ జీవితాలను అంధకారంలోకి నెట్టుకున్న ఉదాహరణలు ఉన్నాయన్నారు. ఇలాంటి పరిణామాలు చూస్తూనే కొంతమంది అత్యాశతో, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారని చెప్పారు. యువత బెట్టింగ్ అనే మహమ్మారికి దూరంగా ఉండాలని, క్రికెట్‌ను కేవలం క్రీడా స్ఫూర్తితో మాత్రమే చూడాలని పేర్కొన్నారు. దానిని జూదంగా మార్చి తమ అమూల్యమైన భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, ఎస్బీ సీఐ జి.నారాయణ, ఎస్బీ–2 సీఐ ఎం.రాంబాబు, సీసీఎస్ సీఐ పి. ప్రేమయ్య, ఆర్ఐలు మౌలుద్దీన్, ప్రదీప్, చీరాల 2 టౌన్ సీఐ శశికుమార్, ఇతర పోలీస్ అధికారులు, చీరాల సబ్ డివిజన్, జిల్లా హెడ్ క్వార్టర్స్ జట్ల సభ్యులు పాల్గొన్నారు. ఓవరాల్ చాంపియన్ హెడ్ క్వార్టర్స్ జట్టు ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన హెడ్ క్వార్టర్స్ జట్టు ఓవరాల్ చాంపియన్ షిప్‌ను కై వసం చేసుకుంది. చీరాల సబ్ డివిజన్ జట్టుపై బాపట్ల హెడ్ క్వార్టర్స్ జట్టు విజయం సాధించింది. టోర్నమెంట్లో చీరాల, బాపట్ల, రేపల్లె సబ్ డివిజన్లకు చెందిన మూడు జట్లు, ఏఆర్ జట్టు, హెడ్ క్వార్టర్స్ జట్టు పాల్గొన్నాయి. -
బాపట్ల
సోమవారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2026విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 524.00 అడుగులకు చేరింది. ఇది 156.6700 టీఎంసీలకు సమానం.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.3374 టీఎంసీలు. చీరాల అర్బన్: చంద్రబాబు పాలన తీరు ఇంట్లో ఈగల మోత.. వీధిలో పల్లకీల మోత అన్న చందంగా ఉంది. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని అప్పట్లో పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ధరలు తగించకపోగా పెంచుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ చార్జీలు పెంపు, గ్యాస్ ధరల పెంచి ప్రజలపై పెనుభారం మోపుతుతున్నారు. యుద్ధ సంక్షోభాన్ని బూచిగా చూపుతూ పాలకులు చమురు మంట పెట్టారు. లీటర్ పెట్రోల్‌పై రూ. 3.35, డీజిల్ పై రూ.3.16 చొప్పున ధర పెంచడంతో ప్రత్యక్షంగా వాహనదారులపై ఆ భారం పడింది. పరోక్షంగా నిత్యావసర వస్తువులు సహా అన్ని రకాల సామగ్రిపై పడుతోంది. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీనిపై సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బ్లాక్‌లో గ్యాస్ సిలిండర్ల విక్రయాలు పెరిగాయి. యంత్రాలతో చేసే వ్యవసాయ పనులకు బాడుగ ధరలు భారంగా మారాయి. ఆటో చార్జీల పెంపుతో ప్రయాణాలకు ప్రజలు వెనుకంజ వేస్తున్నారు. చంద్రబాబు రెండేళ్ల పాలన, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ప్రభుత్వపరంగా ఫోన్ ద్వారా సేకరిస్తున్న ప్రజాభిప్రాయంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. రైతులపై మరింత భారం ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో వ్యవసాయం దండగ అనే చందంగా పరిస్థితి మారింది. సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా కాలేదు. నకిలీ విత్తనాల బెడదతో రైతులు నష్టపోయారు. పంట రుణాలు మాటలకే పరిమితం అయ్యాయి. అన్నీ తట్టుకుని పండించిన పంటలకు మద్దతు ధరలు లేవని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపు పరోక్షంగా వ్యవసాయ రంగంపై పెను ప్రభావం చూపుతోంది. దీంతో ఈ ఏడాది ఖరీఫ్ పంటకాలం కూడా ప్రశ్నార్థకమేని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండెక్కిన కూరగాయల ధరలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక నిత్యావసర సరుకుల ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో మధ్యతరగతి, పేద వర్గాలకు ఆదాయం ఎంతున్నా కుటుంబ పోషణకే సరిపోవటం లేదని వాపోతున్నారు. కూరగాయల ధరలు కొండెక్కాయి. వాటిని పండించే రైతుకు మాత్రం గిట్టుబాటు కావడం లేదు. మధ్యలో దళారీ వ్యవస్థ లబ్ధి పొందుతోంది. వంట నూనెలు, పప్పుల ధరలు కూడా విపరీతంగా పెంచేశారు. సామాన్యుల ఇంటి బడ్జెట్ నానాటికీ పెరిగిపోతోంది. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు సర్కారు దారుణంగా విఫలమైందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయొద్దని డిమాండ్7 -
కాలువలోకి దూసుకెళ్లిన ఆటో
ఇంకొల్లు(చినగంజాం): ఆటో హ్యాండిల్ అదుపు తప్పడంతో పంట కాలువలోకి దూసుకెళ్లి డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన ఇంకొల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా మద్దిపాడు గ్రామానికి చెందిన అన్నపురెడ్డి ముసలయ్య (58) తన ఆటోలో ఒంగోలు నుంచి ఇంకొల్లు గ్రామానికి కొబ్బరి బొండాల లోడుతో వస్తున్నాడు. మరికొద్ది సేపట్లో ఇంకొల్లు చేరుకునే క్రమంలో కొణికి గ్రామం దాటిన తరువాత అతని ఆటో హ్యాండిల్ ఒక్కసారిగా అదుపు తప్పింది. దాంతో ముసలయ్య ఆటోను నియంత్రించలేకపోవడంతో ఆటో పక్కన ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆటో నీటిలో బోల్తా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. 30 ఏళ్లుగా ముసలయ్య ఆటో డ్రైవర్‌గా ఉన్నాడు. భార్య వెంకటేశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై జీ సురేష్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడి పోస్టుమార్టం నిమిత్తం చీరాల వైద్యశాలకు తరలించారు. ముగ్గురికి తీవ్రగాయాలు కారంచేడు: ఆటోను కారు ఎదురుగా ఢీకొట్టడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ ప్రధాన రహదారిలో కారంచేడు అంబేడ్కర్ కాలనీ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అందిన వివరాల మేరకు.. చీరాల మండలం పాత చీరాలకు చెందిన ఒక కుంటుంబ ఆటోలో ఏడుగురితో కలిసి పల్నాడు జిల్లా కోటప్పకొండ దైవ దర్శనం కోసం చేసుకొని తిరిగి చీరాల వస్తున్నారు. ఈ క్రమంలో చీరాల వైపు నుంచి పర్చూరు వైపునకు వస్తున్న కారు కారంచేడు అంబేడ్కర్ కాలనీ సమీపంలో వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. క్షతగాత్రులను 108 సిబ్బంది చీరాల ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బాపట్ల: బాపట్ల జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్), రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం తొమ్మిది నుంచి 10 గంటల వరకు గతంలో పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీల పరిష్కారంపై వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు. ఆన్లైన్లో కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. నరసరావుపేట టౌన్: ఆర్టీసీ బస్టాండ్‌లో చోటు చేసుకున్న హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వన్‌టౌన్ సీఐ షేక్ ఫిరోజ్ ఆదివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూజెండ్ల మండలం దాట్లవారిపాలెం గ్రామానికి చెందిన గొట్టం నాగిరెడ్డి (36) ఆర్టీసీ బస్టాండ్‌లో నిద్రిస్తుండగా ఈ నెల 16న అతనిపై మాచవరం మండలం చెన్నయపాలెం గ్రామానికి చెందిన భీమవరపు వెంకటేశ్వరరావు కర్రతో దాడి చేసి హత్య చేశాడు. మృతుడు, నిందితుడు ఇద్దరూ పట్టణంలో యాచిస్తూ రాత్రుళ్లు ఆర్టీసీ బస్టాండ్‌లో నిద్రిస్తూ ఉంటారు. గత కొన్ని రోజులుగా మృతుడు నాగిరెడ్డి, నిందితుడు వెంకటేశ్వరరావును మద్యం సేవించేందుకు డబ్బుల కోసం వేధిస్తూ అనేక మార్లు దాడికి పాల్పడ్డారన్నారు. దీంతో కక్ష పెంచుకొని అతనిపై విచక్షణ రహితంగా దాడి చేయటంతో నాగిరెడ్డి మృతి చెందాడన్నారు. హత్యకు ఉపయోగించిన కర్రను, రక్తపు మరకల దుస్తులను నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. తెనాలి: ఔత్సాహిక నటీనటులకు నటశిక్షణ ఒక వరమని ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ శ్రీనివాస నాయక్ అన్నారు. మా–ఏపీ ఆధ్వర్యంలో గత మూడురోజులుగా స్థానిక అంబేడ్కర్ కాలేజీలో జరిగిన సినీనటన శిక్షణ తరగతులు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ముగింపు సభకు మా–ఏపీ వ్యవస్థాపకుడు, సినీదర్శకుడు దిలీప్‌రాజా అధ్యక్షత వహించారు. -
విద్యాశాఖలో విభజన పర్వం
పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయుల విభజన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను ఆయా జిల్లాల వారీగా కేటాయించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్ మొదటి వారంలో ఉపాధ్యాయుల నుంచి ఏ జిల్లాకు ఎవరు వెళతారనే విషయమై ఆప్షన్లు నమోదుకు విద్యాశాఖాధికారులు చర్యలు చేపడుతున్నారు. గుంటూరు ఎడ్యుకేషన్ : కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంతో సంబంధం లేకుండా పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొత్తగా డీఈవో కార్యాలయాలను ఏర్పాటు చేశారు. పాఠశాలల నిర్వహణ, టెన్త్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ వంటి అంశాలు ఆయా డీఈవో కార్యాలయాల నుంచే నిర్వహిస్తున్నారు. అయితే ఉపాధ్యాయులకు సంబంధించిన సర్వీసు వ్యవహారాలు, నియామకాలు, ఉద్యోగోన్నతులు, బదిలీలను ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రాతిపదికన చేపడుతున్నారు. కొత్త జిల్లాలను కేంద్ర నోటిఫై చేసి, గెజిట్ విడుదల చేయడంతో ఆయా జిల్లాల వారీగా విద్యాశాఖలో విభజనకు అడుగులు పడుతున్నాయి. జాబితా ప్రకటన గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్, నగరపాలక సంస్థ, మున్సిపల్ యాజమాన్యాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఉపాధ్యాయ పోస్టులను ఆయా జిల్లాల వారీగా విభజించనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని కేటగిరీల వారీగా 15 వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వారిలో ఆయా జిల్లాల వారీగా ప్రభుత్వ వాస్తవంగా మంజూరు చేసిన పోస్టులు, ఉపాధ్యాయుల సంఖ్య వివరాలను విభజన ప్రక్రియలో పరిగణనలోకి తీసుకోనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న అన్ని కేటగిరీలకు చెందిన ఉపాధ్యాయులతో కూడిన సీనియార్టీ జాబితాను అధికారులు ప్రకటించారు. ప్రతిని గుంటూరు డీఈవో అధికారిక సైట్లో పొందుపర్చారు. దీనిపై అభ్యంతరాలను స్వీకరించేందుకు డీఈవో కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో మంజూరైన పోస్టులు, క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఉపాధ్యాయులు, ఖాళీలను పరిగణనలోకి తీసుకుని విభజన దిశగా ముందుకు వెళ్లనున్నారు. వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులు జూన్‌లో ఉపాధ్యాయులకు రెండు విడతలుగా వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఆ తరగతుల్లో భాగంగా ఏ జిల్లాలో పని చేసేందుకు ఎవరు వెళతారనే విషయమై ఉపాధ్యాయుల నుంచి ఆప్షన్లు నమోదు చేయించనున్నారు. దీంతో జిల్లాలవారీగా ఉపాధ్యాయ పోస్టులను కేటాయించి, ఇక పూర్తిగా జిల్లాస్థాయిలోనే ఉపాధ్యాయుల సర్వీసు సంబంధిత వ్యవహారాలు, ఉద్యోగోన్నతులు, బదిలీలు చేపట్టేందుకు ఆస్కారముంది. -
పాస్‌పోర్ట్ అప్పగించిన మాజీ మంత్రి రజిని
నరసరావుపేట టౌన్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు మాజీ మంత్రి విడదల రజిని తన పాస్‌పోర్ట్‌ను ఆదివారం డీఎస్పీ కార్యాలయంలో అందజేశారు. చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి విడదల రజినిపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తప్పుడు కేసును కొట్టివేయాలని ఆమె రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ, ప్రతి ఆదివారం చిలకలూరిపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సంతకం పెట్టటంతోపాటు పాస్‌పోర్ట్‌ను విచారణ అధికారి అయిన డీఎస్పీకి అప్పగించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. దీంతో విడదల రజిని మొదట చిలకలూరిపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సంతకం పెట్టారు. అనంతరం నరసరావుపేట డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. డీఎస్పీ ఎం.హనుమంతరావుకు పాస్‌పోర్టును అందజేశారు. ఆమె వెంట మైనార్టీ నాయకుడు దరియావలి, న్యాయవాది నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
అక్రమాలకు ‘సహకారం’
● అన్నవరం పీఏసీఎస్‌లో అవినీతిపై ఫిర్యాదులు ● విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ ● వెలుగులోకి సీఈవో శ్రీనివాసరావు అక్రమాలు, వేధింపులు ● సీఈవో వైఖరితో ఉద్యోగి ఆత్మహత్య ● విచారణ నిలిపివేయాలని సహకార మంత్రికి ఎమ్మెల్యే లేఖ ● అంగీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు ● పాలకుల తీరుపై అన్నదాతల తీవ్ర ఆగ్రహం నరసరావుపేట రూరల్: అన్నవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో జరిగిన అవినీతిపై జరుగుతున్న విచారణను నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. మూడు దశాబ్దాలుగా అన్నవరం సొసైటీలో తిష్ట వేసిన వ్యక్తి అందినకాడికి దండుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సిబ్బందిపై వేధింపులకు పాల్పడ్డాడు. వాటిని తట్టుకోలేక గుమస్తా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో మహిళా ఉద్యోగిని కూడా జీతాలు ఇవ్వకుండా వేధించాడు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మహిళా ఉద్యోగి.. సొసైటీలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరపాలని విన్నవించారు. దీంతో అక్రమాల డొంక కదిలింది. దీనిని ఆదిలోనే ఆపాలని సదరు ఉద్యోగి ఏకంగా కూటమి ఎమ్మెల్యేతో ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో విచారణను ప్రభుత్వం నిలిపివేసింది. రొంపిచర్ల మండలం అన్నవరం పీఏసీఎస్ అవినీతిపై జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు పలు మార్లు ఫిర్యాదులు అందాయి. సొసైటీ పరిధిలోని రైతులతోపాటు సిబ్బంది సైతం అవినీతి గురించి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్... జిల్లా సహకార అధికారిని విచారణకు ఆదేశించారు. సొసైటీ రికార్డులను పరిశీలించి రైతులను అధికారులు విచారించారు. పీఏసీఎస్‌లో అవినీతి నిజమేనని నిగ్గు తేల్చారు. విచారణలో రూ.16.86 లక్షల అవినీతి జరిగిందని నిర్ధారించారు. సెక్షన్ 52 ప్రకారం పూర్తి స్థాయి విచారణకు జిల్లా సహకార అధికారి నాగరాజు ఈ ఏడాది మార్చి 30వ తేదీన ఆదేశించారు. పీఏసీఎస్ సీఈవోగా పనిచేస్తున్న దొప్పలపూడి శ్రీనివాసరావు అవినీతిలో కీలక సూత్రధారి అని అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చారు. శ్రీనివాసరావు భార్య ఉషారాణిని సొసైటీ ఉద్యోగినిగా చూపిస్తూ 2014–19 కాలానికి రూ.6.12 లక్షలు వేతనంగా డ్రా చేశాడు. అయితే ఉషారాణిని కార్యాలయంలో ఎప్పుడూ చూడలేదని విచారణలో అధికారులకు రైతులు తెలిపారు. గతంలో శ్రీనివాసరావుపై అవినీతి ఆరోపణలు రావడంతో సస్పెండ్ అయ్యాడు. ఈ కాలానికి కూడా సొసైటీ నుంచి జీతాలు, పాత బకాయిలను సొసైటీ మినిట్ పుస్తకంలోని ఖాళీ పేజీలలో నకిలీ తీర్మానాలు సృష్టించి మొత్తం రూ.8.94 లక్షలు తన ఖాతాకు బదిలీ చేసుకున్నట్టు విచారణలో వెల్లడైంది. రైతు నుంచి వసూళ్లు చేసిన రూ.1.90 లక్షలను బ్యాంక్‌లో జమ చేయనట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా గతంలో సొసైటీలో పెయిడ్ సెక్రటరీగా పనిచేసిన జేపీ కుమార్‌కు ఇవ్వాల్సిన మొత్తం రూ.3.45 లక్షలను కూడా శ్రీనివాసరావు నకిలీ తీర్మానాలతో డ్రా చేసినట్టు అధికారులు గుర్తించారు. ఎమ్మెల్యే చదలవాడ అండ అన్నవరం పీఏసీఎస్‌లో జరిగిన అవినీతిపై పూర్తి స్ధాయి విచారణ జరిగితే మరింత అక్రమాలు వెలుగులోకి వస్తాయని భావించిన సీఈవో శ్రీనివాసరావు... ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబును ఆశ్రయించాడు. సీఈవోపై వచ్చిన ఆరోపణలపై జరుగుతున్న విచారణను నిలిపివేయాలని ఎమ్మెల్యే నేరుగా సహకార శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడుకు ఏప్రిల్ 2వ తేదీన లేఖ రాశారు. దీనిపై స్పందించిన మంత్రి తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అన్నవరం పీఏసీఎస్‌పై విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతికి వంతు పాడుతూ ఎమ్మెల్యే విచారణ నిలిపివేయాలని కోరడంపై రైతుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
బాపట్ల
ఆదివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2026పైకి ఆహారం.. తింటే విషమే – ప్రణీత్, ఆహార భద్రతాధికారి విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 524.10 అడుగులకు చేరింది. ఇది 156.8580 టీఎంసీలకు సమానం. ఆహారంలో విచ్చలవిడిగా రంగుల వాడకం తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం పండ్లను మగ్గించేందుకు కార్బైడ్ వాడకం తనిఖీల్లో బయటపడుతున్న వాస్తవాలు -
కేసుల పరిష్కారానికి ముందుకు రండి
నరసరావుపేట టౌన్: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా న్యాయ సేవలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సదస్సు నిర్వహించారు. సమాధాన్ సమరోహ 2026లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జియావుద్దీన్ మాట్లాడారు. సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నవారు ఆగస్టు 21, 22, 23 తేదీలలో జరగనున్న ప్రత్యేక లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని కోరారు. దీనికోసం ఈ నెల 31వ తేదీలోపు నిర్దేశిత గూగుల్ ఫారం పూరించి తమ అంగీకారం తెలియజేయాలన్నారు. ప్రజల అవగాహన కోసం ముద్రించిన ప్రత్యేక కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఏపీపీ కట్ట కాళిదాస్, మొదటి పట్టణ సీఐ షేక్ టి.ఫిరోజ్, ట్రాఫిక్ సీఐ లోకనాథం, ఎస్ఐ వంశీకృష్ణ, ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది, పలువురు ప్రజలు పాల్గొన్నారు. నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఏపీ ఐసెట్ ప్రవేశ పరీక్షలో పల్నాడు జిల్లా 87.30 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఐసెట్ ప్రవేశ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 511 మంది నమోదు కాగా పరీక్షకు 449 మంది హాజరయ్యారు. వీరిలో 392 మంది అర్హత సాధించినట్టు అధికారులు తెలిపారు. వీరిలో 201 మంది పురుషులు, 191 మంది మహిళలు ఉన్నారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు, గుర్తింపు పొందిన కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో చేరేందుకు అర్హులు. పథకాలను మాజీ సైనికులు సద్వినియోగం చేసుకోండి మాచర్ల రూరల్: మాజీ సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగపర్చుకోవాలని సైనిక సంక్షేమ ఉమ్మడి జిల్లా శాఖాధికారి ఆర్.గుణశీల కోరారు. శనివారం పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మాజీ సైనికుల కుటుంబాల కోసం ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తుందని సాగు భూమితో పాటు పిల్లల చదువులలో రిజర్వేషన్, క్యాంటీన్లో సబ్సిడీపై అందించే వివిధ వస్తువులను సకాలంలో తీసుకోవాలని కోరారు. విద్యకు స్కాలర్షిప్, కుమార్తె వివాహానికి నగదు, వైకల్య గ్రాంటు, ఈసీహెచ్ఎస్ ద్వారా నాణ్యమైన వైద్య సేవలను అందుకోవాలన్నారు. మృతిచెందిన మాజీ సైనికుల భార్యలకు గుర్తింపు కార్డులను అందించారు. ఇటీవల అంగవైకల్యం పొందిన ఇన్నారెడ్డి గృహానికి వెళ్ళి పరామర్శించారు. కార్యక్రమంలో అధ్యక్షులు కేపీ సిద్ధంరాజు, ప్రధానకార్యదర్శి తాటి వినోద్‌బాబు, కోశాధికారి ఆర్ గోపాల్ నాయక్, ఉపాధ్యక్షులు వి.మరియదాసు, సభ్యులు కారంకి శ్రీనివాసరావు, రామారావు, పి.బాబు, ఇన్నారెడ్డి, శేఖర్, రవి పాల్గొన్నారు.పొన్నూరు: మామిళ్లపల్లి రైతులపై టీడీపీ నాయకులు దాడి చేసి అక్రమ కేసులు బనాయించిన నేపథ్యంలో రైతులకు సంఘీభావం తెలియజేసేందుకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆదివారం రానున్నారని పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు మామిళ్లపల్లి అడ్డరోడ్డు నుంచి మామిళ్లపల్లి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. లక్ష్మీపురం: ఓ ఇంట్లో 25 సవర్ల బంగారం, రూ.2.50 లక్షల నగదు చోరీ అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. ముత్యాలరెడ్డినగర్ 8వ లైన్ ప్రాంతానికి చెందిన దుగ్గెంపూడి ప్రభాకర్‌రెడ్డి కన్స్ట్రక్షన్ పని చేస్తుంటారు. భార్య భూలక్ష్మి ఇంటి వద్దనే ఉంటుంది. ఇంట్లో బీరువాలో ఉన్న 25 సవర్ల బంగారం, అలాగే బీరువాలో ఉన్న రూ.2.50 లక్షల నగదు కనిపించలేదు. దీన్ని గమనించిన ప్రభాకర్‌రెడ్డి ఆయన సతీమణి భూలక్ష్మి, ఇంట్లో పని చేసే మహిళపై అనుమానం వ్యక్తం చేశారు. బాధితులు అరండల్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఢీకొని వ్యక్తి మృతి
చీరాల రూరల్: జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం వేటపాలెంలో చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్ఐ కొండయ్య తెలిపిన వివరాలు.. వేటపాలెం పందిళ్లమ్మ గుడి సమీపంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడనే సమాచారంతో సిబ్బంది పరిశీలించగా మృతుడి వద్ద ఎటువంటి సమాచారం లభించలేదని చెప్పారు. మృతుని వయస్సు 55 ఏళ్లు ఉంటాయని, 5.5 అడుగుల ఎత్తు చామన ఛాయ కలిగిన రంగు కలిగి ఉన్నాడని తెలిపారు. గడ్డంతో పాటు తల వెంట్రుకలు బాగా పెరిగి ఉన్నాయని, మృతుని శరీరంపై తెలుపు రంగు కలిగిన ఆఫ్ హ్యాండ్స్ టీషర్టు, బులుగు, తెలుపు మెరూన్ చెక్స్ కలిగిన లుంగీ ఉందని తెలిపారు. మృతుని చిరునామా ఎవరికై నా తెలిసినట్లయితే జీఆర్పీ పోలీసులకు 9247575633 సమాచారం అందించాలని సూచించారు. చేపల పట్టివేతపై రెవెన్యూ విచారణ ముప్పాళ్ల: ‘మట్టిపై కన్నేస్తే... చేపలు దొరికాయ్..’ అంటూ సాక్షిలో వచ్చిన కథనం పై రెవెన్యూ అధికారులు శనివారం విచారణ చేపట్టారు. మండలంలోని బొల్లవరం గ్రామ సమీపంలో ఉన్న ఏడు ఎకరాల భూమిలో తవ్విని చెరువులో మట్టి తవ్వకాలు చేసేందుకు గాను నీళ్లు వెళ్లే బెట్టే క్రమంలో దొరికిన చేపల ఆదాయం కోసం టీడీపీ నాయకులు పోటీ పడిన సంగతి తెలిసిందే. ఈ అంశం బయటకు పొక్కటంతో రెవెన్యూ అధికారులు చెరువు ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని ఫొటోలలో సేకరించారు. అక్కడి వారి నుంచి వివరాలు సేకరించి నివేదికలను ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు ఆర్ఐ ఆంజనేయులు, వీఆర్వోలు తెలిపారు. చెరువులో నీటిని బయటకు పంపినట్లుగా గుర్తించామని, పరిశీలించే సమయంలో చిన్నపాటి చేపలు బాక్స్‌ల్లో ఉండటాన్ని గుర్తించారు. అన్ని పనులు వెంటనే నిలిపివేయాలని, పంచాయతీ, రెవెన్యూ అధికారుల అనుమతితోనే తదుపరి చర్యలు చేపట్టాలని అక్కడ ఉన్న వారిని ఆదేశించారు. అనుమతులు లేకుండా పనులు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కోన ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రారంభం
కర్లపాలెం: క్రీడాకారులు తమ ప్రతిభను కనబరిచేందుకు క్రికెట్ పోటీలు దోహదపడతాయని వైఎస్సార్ సీపీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. కర్లపాలెం మండలం కట్టావాద గ్రామంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కోన ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడల వైపు ఆసక్తి పెంపొందించుకోవాలని చెప్పారు. గ్రామీణ క్రీడాకారులలో ఉన్న ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు ఆటల పోటీలు దోహదపడతాయన్నారు. క్రికెట్ పోటీలు స్నేహపూర్వక వాతావరణంలో సక్రమంగా నిర్వహించాలని నిర్వాహకులను ఆయన కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కర్లపాలెం మండల అధ్యక్షుడు యల్లావుల ఏడుకొండలు, అంబేడ్కర్ యువజన సేవా సమాఖ్య గౌరవ అధ్యక్షుడు మందపాటి పరమానందకుమార్, ప్రముఖ ఆక్వా వ్యాపారవేత్త చెన్ను జనార్థన్, నాయకులు మార్పు బెనర్జి, మార్పు రత్నం, వీరయ్య, సలగల మోక్షానందం, కొండమూది శ్యామ్యూల్, దాసరి బాబూరావు ఉన్నారు. -
హాస్టల్ జీవితం వ్యక్తిత్వ వికాసానికి పునాది
బాపట్ల: హాస్టల్ జీవితం వ్యక్తిత్వ వికాసానికి పునాది వంటిదని నిధి సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ జి.మోహన్ రావు అన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో నిర్వహించిన 81వ సంవత్సర హాస్టల్ డే సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థి జీవితంలో హాస్టల్ అనేది కేవలం నివాస స్థలం మాత్రమే కాదని, అది క్రమశిక్షణ, సమయపాలన, పరస్పర సహకారం, నాయకత్వ లక్షణాలను నేర్పించే జీవిత పాఠశాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులతో కలిసి జీవించడం ద్వారా భిన్న సంస్కృతులను అర్థం చేసుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. హాస్టల్ జీవితం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా సమస్యలను స్వయంగా పరిష్కరించుకునే నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ డీన్ అఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ డి.సంపత్ కుమార్ విద్యార్థులు హాస్టల్లో గడిపే ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకొని విద్యతో పాటు మంచి నడవడి, సేవాభావం, స్నేహసౌహార్దాలను పెంపొందించుకోవాలని సూచించారు. అసోసియేట్ డీన్, చీఫ్ వార్డెన్ డా. పి. ప్రసూన రాణి మాట్లాడారు. బాలికల హాస్టల్ వార్డెన్ డా.కె.జయలలిత, బాలుర హాస్టల్ వార్డెన్ డా. కె. చంద్రశేఖర్ హాస్టల్ నివేదికలను సమర్పించారు.హాస్టల్ సిబ్బందికి నూతన వస్త్రాల బహూకరణ కార్యక్రమాన్ని బాలికల అడిషనల్ వార్డెన్ డా.ఎం.తుషార నిర్వహించగా, కన్వీనర్ డా. కె.సుశీల లక్కీ డిప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలుర అడిషనల్ వార్డెన్ డా.పి.సుధా జాకబ్ వందన సమర్పణ చేసారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించగా బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నిధి సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ జి.మోహన్ రావు -
6.490 కిలోల గంజాయి స్వాధీనం
చినగంజాం: గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న నిందితుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. శనివారం చినగంజాం పోలీస్ స్టేషన్లో ఇంకొల్లు సీఐ ఎం రామానాయక్, ఎస్ఐ శీలం రమేష్‌లు నిందితుడి అరెస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు.. శుక్రవారం స్థానిక పోలీసులు, జీఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా రైళ్లలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా గంజాయి రవాణా చేస్తున్న కేరళం రాష్ట్రానికి చెందిన సుహైబ్ రెహమాన్ (30) అనే వ్యక్తిని పట్టుకున్నారు. చినగంజాం ఎస్ఐ శీలం రమేష్ తన సిబ్బందితో కలిసి నేరస్తుడిని అదుపులోనికి తీసుకొని విచారించగా ఒడిశాలోని రాయ్‌గఢ్‌లో ఓ వ్యక్తి వద్ద రూ.30 వేలకు 6.490 కిలోల గంజాయిని కొనుగోలు చేసి తన ట్రావెల్ బ్యాగ్‌లో దాచుకొని రైలులో కేరళంకు తరలిస్తున్నట్లు గుర్తించారు. అతనిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. గతంలో నిందితుడు గంజాయి అక్రమ రవాణా విక్రయాలకు పాల్పడినట్లు, కేరళంలోని హోస్బుర్గ్ పోలీస్ స్టేషన్లో నాలుగు గంజాయి కేసులు, ఒక దాడి కేసు నమోదైనట్లు గుర్తించారు. కోర్టు ఆదేశాలతో అతనిని రిమాండ్ కు పంపించారు. -
రూ.10 వేలు కొట్టు.. రూ.10 కోట్లు పట్టు
నరసరావుపేట రూరల్: పది వేలు చెల్లిస్తే పది కోట్లు ఇస్తామంటూ స్కీమ్‌ను ప్రారంభించి అమాయక ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని నరసరావుపేట రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణ శివారు ప్రాంతమైన కేసానుపల్లి పంచాయతీ పరిధిలోని ఎల్టీ నగర్లో రెండు రోజుల క్రితం చిలకలూరిపేట మండలం గొట్టిపాడుకు చెందిన నాగండ్ల వెంకట్రావు కార్యాలయాన్ని ప్రారంభించాడు. వెంకట్రావు కోకోనట్ మర్చంట్ పేరుతో ప్రారంభించిన కార్యాలయానికి ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుండటంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ సీఐ ఎంవీ సుబ్బారావు సిబ్బందితో కార్యాలయానికి చేరుకుని విచారణ చేపట్టడంతో విషయం వెలుగు చూసింది. పోలీసుల విచారణలో స్కీమ్‌లో సభ్యుల నుంచి నిర్వాహకులు ఈకేవైసీ తీసుకుంటున్నట్టు సేకరిస్తున్నట్టు గుర్తించారు. గిఫ్ట్ మనీ పేరుతో టోకరా.. రాకేట్ ల్యాబ్ పేరుతో వెంకట్రావు గత కొంతకాలంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో గిఫ్ట్ మనీ స్కీమ్‌ను నిర్వహిస్తున్నాడు. స్కీమ్‌లో చేరిన సభ్యులు మొదటగా రూ.10 వేలు చెల్లిస్తే రూ.10 కోట్లు వరకు లబ్ధిపొందవచ్చని నమ్మబలుకుతున్నాడు. తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయనే ఆశతో అధిక సంఖ్యలో స్కీమ్‌లో సభ్యులుగా చేరుతున్నారు. ఇందుకోసం 500 మంది వరకు ఏజెంట్లు ఈ స్కీమ్‌లో పనిచేస్తున్నారు. వీరంతా కలిసి దాదాపు నాలుగు వేల మందిని స్కీమ్‌లో సభ్యులుగా చేర్చినట్టు తెలుస్తుంది. స్కీమ్‌లో చేరి రూ.10 వేలు చెల్లించిన నాలుగు రోజుల తరువాత సింగపూర్‌లో వారి పేరుపై అకౌంట్ ప్రారంభించి రూ.3 లక్షలు జమ చేసినట్టు నమ్మించేందుకు నకిలీ సందేశాలు పంపుతారు. నెల రోజుల తరువాత రూ.10 కోట్లు జమ చేస్తామని నమ్మబలికి ఇప్పటికే రూ.కోట్లులో వసూలు చేసినట్టు సమాచారం. -
ఆలోచింపజేసిన నాటికలు
వీరన్నపాలెం(చినగంజాం): సామాజిక రుగ్మతలను ఎత్తి చూపించేవే నాటికలు అని వక్తలు పేర్కొన్నారు. శనివారం 9వ జాతీయ స్థాయి నాటిక పోటీలు మండలంలోని వీరన్నపాలెం గ్రామంలో కళానికేతన్ ఆధ్వర్యంలో నాటికలను ప్రదర్శించారు. చిట్టినేని అప్పయ్య, మక్కెన రామసుబ్బయ్య, ఇంకొల్లు గురుప్రసాదరావు కళాప్రాంగణంలో నిర్వహించిన ప్రదర్శనలను గోరంట్ల రత్తయ్య, ప్రసన్నాంజలి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేయగా, చిట్టినేని శ్రీనివాసరావు, శ్రీదేవి దంపతులు నటరాజ పూజ నిర్వహించి పోటీలను ప్రారంభించారు. మనిషిని గౌరవించని సమాజం.. ముందుగా హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారి ‘అమ్మచెక్కిన బొమ్మ’ నాటికను విభిన్న తత్త్వపు మనిషి సీ్త్ర, పురుషుడు కాని వారిని అవమానించడం, గౌరవించక పోవడం, అసహ్యించుకోవడం అనేది మానవజాతి దిగజారుడు తనానికి ఓ ప్రతీక చూపుతూ ప్రదర్శన సాగింది. పాలకుల మొసలి కన్నీరు.. ఆ తరువాత హైదరాబాద్ కళాంజలి ప్రదర్శన అన్నదాత నాటికను అన్నం పెట్టే రైతు నోట్లో అందరూ మట్టి కొట్టే వారే. ప్రకృతి వైపరీత్యాలు వల్ల నష్టాలు, గిట్టుబాటు ధర లేక పెట్టుబడులు రాబట్టుకోలేని స్థితిలో పాలకుల మొసలి కన్నీరు, దళారీల దోపిడి, వ్యాపారుల మోసాలు రైతు జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయనే కఠా సారాంశంతో సాగింది. చిన్నచిన్న సమస్యలకే విడాకులా ! తాడేపల్లి అరవింద ఆర్ట్స్ వారి ప్రదర్శన విడాకులు కావాలి నాటికను దాంపత్య జీవితంలో దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు, అపోహలు, చిన్నచిన్న సమస్యలు తలెత్తటం సహజం. అంత మాత్రాన కలిసి బతకలేమన్న తొందరపాటుతో పంతాలకు పోయి విడాకులు తీసుకోవడం ఎంతవరకు సమంజసం అనే అంశంతో నాటికను ప్రదర్శించారు. కార్యక్రమంలో నిర్వాహకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
వేధింపులకు ఉద్యోగి బలి
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మర్రిపాలెంలో ఉద్యోగంలో చేరిన శ్రీనివాసరావు తిరిగి అన్నవరం సొసైటీకి సీఈవోగా వచ్చాడు. అప్పటి నుంచి సిబ్బందిపై వేధింపులు ప్రారంభించాడు. జీతాలు ఇవ్వకుండా బెదిరించడంతో తట్టుకోలేక ఓరుగంటి శ్రీనివాసరెడ్డి అనే గుమస్తా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన మరణ వాంగ్మూలం ఆధారంగా రొంపిచర్ల పోలీస్ స్టేషన్లో శ్రీనివాసరావుతోపాటు సొసైటీ పీఐసీ నర్రా సురేంద్రబాబుపై కేసు నమోదు అయింది. సొసైటీ ఉద్యోగిని పచ్చవ భవానికి 18 నెలలు జీతం ఇవ్వకుండా అడ్డుకున్నాడు. దీనిపై ఆమె కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా జరిగిన విచారణలో అవినీతి వెలుగు చూసింది. -
డయేరియా కలకలం
చేబ్రోలు: కలుషిత ఆహారం తినటంతో కొత్తరెడ్డిపాలెం దళితవాడలో శుక్రవారం సుమారు వందమందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావటంతో స్థానికంగా కలకలం రేగింది. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం పాత దళితవాడ ప్రాంతంలో గత మూడు రోజులుగా ప్రార్థన కూటములు జరిగాయి. హాజరైన భక్తులకు మొదటి రెండు రోజులు శాకాహార భోజనం అందించారు. చివరి రోజు గురువారం రాత్రి చికెన్ బిర్యానీని అందజేశారు. బిర్యానీ తిన్న కొంతమంది అస్వస్థతకు గురవటంతో శుక్రవారం తెల్లవారుజామున రాజేష్, వజ్రం, జయరాణిలను 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. స్థానిక ప్రైవేటు వైద్యుని వద్ద మరి కొంతమంది చికిత్సలు పొందారు. ఉదయం నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరిగిపోయింది. ప్రత్యేక వైద్య శిబిరం స్థానిక తెలుగు బాపిస్టు చర్చిలో అత్యవసరంగా ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరంతో బాధపడుతున్న వారు అధిక సంఖ్యలో వచ్చారు. కుర్చీలలో, బల్లల మీద కూర్చోబెట్టి సైలెన్ ఎక్కించారు. తర్వాత సమీపంలోని పీహెచ్సీ నుంచి బెడ్లను తెప్పించి బాధితులకు సైలెన్ సీసాలు పెట్టారు. వైద్య చికిత్సలు మొదలు పెట్టారు. నీరసంగా ఉన్న మరో నలుగురిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చేబ్రోలు, వట్టిచెరుకూరు ప్రాంతాల నుంచి రెండు 108 వాహనాలను మెడికల్ క్యాంపు వద్ద అందుబాటులో ఉంచారు. అధ్వానంగా పారిశుద్ధ్యం దళితవాడ ప్రాంతంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. ఎక్కడ మురుగు అక్కడే, చెత్తా చెదారం నిల్వ ఉండటంతో దుర్గంధం వెదజల్లుతోంది. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు వస్తున్నారనే సమాచారంతో పంచాయతీ సిబ్బంది హడావుడిగా చర్చి పరిసర ప్రాంతాలను శుభ్రం చేసే పనిలో పడ్డారు. రోజూ తమ ప్రాంతానికి పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది రావటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైద్య సేవలకు ఆదేశం బాధితుల సంఖ్య అధికంగా ఉండటంతో శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పరిస్థితిని సమీక్షించారు. వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మూడు రోజుల పాటు ప్రార్థన కూటమి జరిగిందని, అక్కడ బిర్యానీ తిన్న తర్వాత గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం నుంచి అస్వస్థతకు గురైనట్లు బాధితులు వివరించారు. వైద్య సిబ్బందికి షిఫ్టులవారీగా విధులు కేటాయించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఇంటింటి సర్వే నిర్వహించటంతోపాటు అనుమానితులందరికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా పర్యవేక్షణ చేయాలని సూచించారు. బాధితులకు మంచి ఆహారం అందజేయాలన్నారు. బెడ్లు, పరుపులు, కూలర్లు అవసరం మేరకు ఏర్పాటు చేయాలని తెనాలి సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారిని ఆదేశించారు. ప్రస్తుతం 44 మంది అస్వస్థతకు గురైనట్లు కలెక్టర్‌కు అధికారులు వివరించారు. పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ గ్రామంలో పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ పెట్టాలని డీపీవో సాయికుమార్‌ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నీటి నమూనాలు సేకరించి నివేదికను అందజేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈకి ఆదేశాలు జారీ చేశారు. ప్రార్థన కూటమి నిర్వహించిన సంఘ పెద్దతో కలెక్టర్ మాట్లాడారు. చికెన్ ఎక్కడ కొనుగోలు చేశారు.. ఎన్ని గంటలకు తయారు చేసి, ఎప్పుడు భోజనాలు పెట్టారు.. వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. యడ్లపాటినగర్లోని షాపులో చికెన్ కొనుగోలు చేసినట్లు తెలపటంతో షాపులో తనిఖీ చేయాలని స్థానిక అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తహసీల్దారు కె. శ్రీనివాసవర్మ, ఎంపీడీవో ఊహారాణి తదితరులు పాల్గొన్నారు. అదుపులోనే పరిస్థితి గుంటూరు వెస్ట్: కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో 11, 12, 13 తేదీల్లో బాప్టిస్ట్ ప్రేయర్ హాలులో ప్రార్థన కూటములు జరిగాయన్నారు. 13వ తేదీ రాత్రి దాటిన తర్వాత భోజనాలు ఏర్పాటు చేశారని, అక్కడికి రాని వారి ఇంటికి ఆహారాన్ని పంపించినట్లు తెలిసిందన్నారు. 14న ఉదయం, కొంత మంది మధ్యాహ్నం కూడా తిన్నారని తెలిపారు. దాదాపు 100 మంది భోజనం చేయగా 44 మంది అస్వస్థతకు గురయ్యారన్నారు. నలుగురి పరిస్థితి ఇబ్బందిగా మారడంతో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి పంపామన్నారు. ముందు రోజు నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారు పదుల సంఖ్యలో వచ్చినప్పటికీ వైద్యసిబ్బంది స్పందించికపోవటంతో బాధితుల సంఖ్య అధికమైంది. తెనాలి, గుంటూరు వైద్యశాలలకు బాధితులు వెళ్లటంతో జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. డీఎంహెచ్‌వో కె.విజయలక్ష్మి, తెనాలి డిప్యూటీ డీఎంహెచ్‌వో అన్నపూర్ణమ్మలు మధ్యాహ్నం ఆ ప్రాంతానికి వ,చ్చారు. ఇంటింటికీ తిరిగి పరిస్థితిని అంచనా వేశారు. వైద్య సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాధితుల సంఖ్యను గుర్తించే పని చేపట్టారు. గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో 38 డయేరియా కేసుల నమోదుపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ శుక్రవారం అధికారులతో చర్చించారు. కలుషిత ఆహారం కారణంగా ఈ కేసులు నమోదైనట్లు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ పద్మావతి వివరించారు. ముగ్గురిని చేబ్రోలు పీహెచ్‌సీకి తరలించి, అనంతరం తెనాలి జిల్లా ఆసుపత్రికి తరలించామన్నారు. దీనికి ప్రధాన కారణం కలుషిత ఆహారమేనని మంత్రికి వివరించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు. -
వైఎస్సార్ సీపీ పదవుల్లో పలువురు నియామకం
బాపట్ల: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా అద్దంకి నియోజకవర్గానికి చెందిన జజ్జర ఆనందరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సోషల్‌మీడియా వింగ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా వేమూరుకు చెందిన దాసరి కిరణ్‌బాబును నియమించారు. వీరి నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. మరొకరికి గాయాలు మంగళగిరి టౌన్: బైక్‌ను కారు వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందడంతో పాటు మరొకరు గాయపడిన ఘటన శుక్రవారం పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు.. దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన పసుపులేటి మధుబాబు(50) శుక్రవారం పని నిమిత్తం ఆత్మకూరు వచ్చాడు. తిరిగి చిలువూరు వెళ్లే క్రమంలో నంబూరు మీదుగా వెళ్లేందుకు మంగళగిరి జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తున్నాడు. ఈ క్రమంలో విజయవాడ వైపు నుంచి వస్తున్న కారు మంగళగిరి పట్టణ పరిధిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీ జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి ఎదురుగా వెళుతున్న మధుబాబు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. కారు, బైక్ రెండూ అదుపుతప్పి సర్వీస్‌రోడ్ నుంచి కిందకు ఎగిరిపడ్డాయి. బైక్‌పై ప్రయాణిస్తున్న మధుబాబు అక్కడికక్కడే తీవ్ర గాయాలతో మృతి చెందగా, కారులో ప్రయాణిస్తున్న ఆదినారాయణకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మధు బాబు ఓ ప్రైవేటు బ్యాంకులో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. నేషనల్ హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంగళగిరి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు మధుబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
కర్లపాలెం: ఆటోను పశువుల సంచార వైద్యశాల వ్యాన్ ఢీకొనటంతో ఓ మహిళ మృతి చెందిన ఘటన చెరుకుపల్లి సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. కర్లపాలెం మండలం చింతాయపాలేనికి చెందిన ఆటో చెరుకుపల్లి వెళుతుండగా పెట్రోల్ బంక్‌ల వద్ద పశు సంవర్ధక శాఖకు చెందిన పశువుల సంచార వైద్యశాల వ్యాన్ ఢీకొట్టింది. క్షతగాత్రులను బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రులలో తోట పద్మావతి(50) మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆటో డ్రైవర్ ఏనుగు పోలీస్రావు, తన్నీరు కృష్ణమూర్తి తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు పెదమల్లు వెంకటరావు, పెదమల్లు శివకుమారి, తోట దుర్గ, యాజలి సాంబయ్య స్వల్పంగా గాయపడ్డారు. వీరందరూ బాపట్ల ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మృతురాలు తోట పద్మావతి కుమార్తె, పసుపులేటి కావ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెరుకుపల్లి ఎస్ఐ తిరుపతిరావు తెలిపారు. క్షతగాత్రులను పరామర్శించిన కోన.. ఆటో ప్రమాదంలో వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ సైనికుడు తోట వెంకటరమణ భార్య పద్మావతి మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఏరియా వైద్యశాలకు వెళ్లి పద్మావతి మృతదేహాన్ని పరిశీలించారు. వెంకటరమణను ఓదార్చారు. గాయాలైన వారిని పరామర్శించారు. గుంటూరు మెడికల్: డీఎంహెచ్ఓ కార్యాలయం పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎఫ్ఎన్ఓ, ఎల్జీఎస్ ఉద్యోగాలకు జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీహెచ్సీ, అర్బన్ పీహెచ్‌సీల్లో 45 పోస్టులకు గాను దరఖాస్తు చేసుకున్న వారి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును శుక్రవారం విడుదల చేశామన్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టును గుంటూరు.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ (సన్), కేవీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి 27వ తేదీ వరకు ఐఏఎస్ ఫౌండేషన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు, సన్ వ్యవస్ధాపకుడు కె.యశ్వంత్ తెలిపారు. శుక్రవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో శిక్షణ తరగతుల పోస్టర్లు ఆవిష్కరించారు. కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ అమరావతిరోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాలలో జరగనున్న శిక్షణ తరగతుల్లో 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులు హాజరు కావచ్చునని తెలిపారు. కె.యశ్వంత్ మాట్లాడుతూ 12 ఏళ్లుగా ఐఏఎస్ ఫౌండేషన్ తరగతులు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.ఆసక్తి గల విద్యార్థులు 94913 36996, 79895 70755, 93469 84938 నంబర్లలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి అశ్విన్ మణిదీప్, పాల్గొన్నారు. -
గుంటూరు జిల్లా జైలులో హెల్ప్ డెస్క్ ఏర్పాటు
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా కారాగారంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. డెస్క్‌ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం జిల్లా కారాగారాన్ని సందర్శించారు. ఆయన మాట్లాడుతూ హెల్ప్ డెస్క్ వల్ల ఖైదీలకు, వారి బంధువులకు ఉన్న సమస్యలకు త్వరితగతిన పరిష్కరించడానికి వీలు కలుగుతుందన్నారు. ఖైదీలు, వారి బంధువులు హెల్ప్ డెస్క్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా జైలు సూపరింటెండెంట్, స్టాఫ్, డెప్యూటీ లీగల్ ఎయిడ్ డెఫన్స్ కౌన్సెల్, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. అనంతరం గుంటూరు మహిళా ప్రాంగణంలోని శిశు గృహాన్ని సందర్శించి అక్కడ ఉన్న పిల్లలకు అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పట్టాభిపురంలోని మాతృశ్రీ పిల్లల ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న పిల్లలకు సురక్షితమైన బాల్యం, భవిష్యత్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. పిల్లలందరూ బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలలో ఉండాలని ఆకాంక్షించారు. వారికి అన్ని సదుపాయాలు అందుతున్నాయా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మేనేజర్ జీవన్ క్రాంతి, సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు రూరల్: వ్యవసాయ రంగంలో సమస్యలను పరిష్కరించేలా కృత్రిమ మేధపై ఆవిష్కరణలు ఉండాలని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ అన్నారు. చిన్న, సన్నకారు, కౌలు రైతుల జీవితాలలో గుణాత్మక మార్పులు తీసుకొచ్చే విధంగా ఉండాలని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా, సుస్థిరంగా మార్చే లక్ష్యంతో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇక్రిశాట్ సంయుక్త ఆధ్వర్యాన నగర శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంనందున్న సమావేశ మందిరంలో శుక్రవారం వ్యవసాయంలో కృతిమ మేధస్సుపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ వ్యవసాయం పూర్తిగా డేటా ఆధారిత నిర్ణయ వ్యవస్థల వైపు పయనిస్తుందని చెప్పారు. ఈ డేటా కచ్చితత్వం రైతు సేవ కేంద్రాలలో లభ్యమయ్యేలా చూడాల్సిన ఆవశ్యకతను వివరించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి.వి.సత్యనారాయణ, ఐకార్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ లీడర్ డాక్టర్ రవినారాయణసాహూ, సీఆర్ఐడీఏ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏవీఎం సుబ్బారావు వ్యవసాయ, అనువర్తనాలు విభాగంలో గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ వీఎం చౌదరి, ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన డాక్టర్ రాజేంద్ర మాచవరం మాట్లాడారు. కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సెక్రటరీగా డాక్టర్ మణి వ్యవహరించారు. నాబార్డు డిప్యూటీ జనరల్ మేనేజర్ డి.త్రిపాఠి, హైదరాబాద్ అటారీ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎన్ మీరా, డాక్టర్ ఎంవీ రమణ, యూనివర్సిటీ అధికారులు, వివిధ పరిశోధన సంస్థలు, స్టార్టప్ సంస్థలు, ప్రైవేట్ రంగానికి చెందిన నిపుణులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఏఎన్‌యూ(పెదకాకాని): పరిశ్రమల రక్షణలో శిక్షణ పొందిన సేఫ్టీ నిపుణుల పాత్ర ఎంతో కీలకమని వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ఆనర్స్ ఇన్ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ (4 సంవత్సరాలు), 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిప్లొమా కోర్సుల అడ్మిషన్ నోటిఫికేషన్‌న్‌ను శుక్రవారం విడుదల చేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ పి. బ్రహ్మాజీరావు, హెడ్ ఆప్ ది ఫైర్ అండ్ సేప్టీ విభాగం అరుణ్‌కుమార్ పాణిగ్రాహి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలి
బాపట్ల: విద్యార్థులు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టి ప్రపంచ స్థాయి పోటీలకు సిద్ధం కావాలి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి.వి.సత్యనారాయణ పేర్కొన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాల 81వ వార్షికోత్సవ సభ శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ విద్యకు బాపట్ల వ్యవసాయ కళాశాల ఒక చారిత్రాత్మక కేంద్రంగా నిలిచిందని చెప్పారు. ఎనిమిది దశాబ్దాలుగా అనేక మంది శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులను ఈ కళాశాల అందించిందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలు, నూతన పద్ధతులను రైతులకు చేరవేయడంలో కళాశాల కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, బ్యాంకింగ్, అగ్రి బిజినెస్ సంస్థలు, ఆహార పరిశ్రమలు, వ్యవసాయ సాంకేతిక సంస్థల్లో మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రైతులకు వ్యవసాయ విద్య ఎంతో తోడ్పడుతోందని పేర్కొంటూ, శాసీ్త్రయ పద్ధతుల ద్వారా దిగుబడులు పెంచడం, ఖర్చులు తగ్గించడం, నాణ్యమైన ఉత్పత్తులు సాధించడం సాధ్యమవుతోందన్నారు. విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గ్రామాలకు వెళ్లి రైతులకు ప్రత్యక్షంగా సూచనలు అందిస్తూ వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ, సేవాభావం, పరిశోధనా దృక్పథంతో ముందుకు సాగి రైతు సంక్షేమానికి తమ వంతు సేవ చేయాలని ఉపకులపతి పిలుపునిచ్చారు. అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ప్రసూనా రాణి కళాశాల గత ఏడాది విద్య రంగంలో సాధించిన విజయాలతోపాటు క్రీడలు, మరియు సాంస్కృతిక పోటీలలో సాధించిన ఓవర్ ఆల్ చాంపియన్ షిప్ వివరాలతో కూడిన వార్షిక నివేదికను సమర్పించారు. సభకు డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ సి.హెచ్. శ్రీనివాస రావు అధ్యక్షత వహించగా, విశిష్ట అతిధిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఆహార ప్రాసెసింగ్ సొసైటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ జి.శేఖర్ బాబు(ఏ.ఎఫ్.ఎస్.) ఆధునిక వ్యవసాయ చరిత్రలో బాపట్ల వ్యవసాయ కళాశాల చేస్తున్న సేవలను కొనియాడారు. అతిథిగా పాల్గొన్న ఐ.సి.ఏ.ఆర్. డైరెక్టర్, అటారీ సౌత్ జోన్ డాక్టర్ షేక్ ఎన్.మీరా మాట్లాడుతూ విద్యార్థులే వ్యవసాయ రంగ భవిష్య నిర్దేశకులని పేర్కొన్నారు. ఆఫీసర్ ఇన్చార్జి స్టూడెంట్ ఆక్టివిటీస్ డాక్టర్ ఎం.శ్రీరేఖ వందన సమర్పణ చేశారు. వైస్ చాన్సలర్ డాక్టర్ పి.వి.సత్యనారాయణ -
ప్రతి నీటి బొట్టును సంరక్షించాలి
కలెక్టర్ వినోద్కుమార్యద్దనపూడి: ప్రతి నీటి బొట్టును సంరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని మున్నంగివారిపాలెం గ్రామంలో జలధార–జలహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామంలో పర్యటించి రక్షిత మంచినీటి పథకాలు, ఇంకుడుగుంతలు, కంపోస్ట్ పిట్స్‌ను పరిశీలించారు. అనంతరం చెరువుకట్టపై కొబ్బరిమొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో చెరువుల పూడికతీత పనులు ఒక యజ్ఞంలా చేపట్టాలన్నారు. మనందరం పెట్రోలు, డీజిల్ ఆదా చేసినట్లుగానే నీటిని కూడా ఆదా చేయాలన్నారు. అందుకు ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సాగునీటి కాలువలు, చెక్‌డ్యాంలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా గ్రౌండ్ వాటర్ లెవల్స్ మరింత పెంచుకోవచ్చన్నారు. నీటి వనరుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో సమర్థవంతంగా అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నీటి వనరును సంరక్షించడం, వర్షం నీటి నిల్వలను పెంపొందించటంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అలాగే గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా, చెరువు కట్టలపై మొక్కలు నాటి గ్రామాలను పచ్చతోరణాలుగా తీర్చిదిద్దుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఎల్.ప్రభాకర్‌రావు, జలవనరుల శాఖ ఎస్ఈ గోపీనాథ్, డ్వామా పీడీ విజయలక్ష్మి, తహసీల్దారు రవికుమార్, ఎంపీడీఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
వెంచర్లకు రాజధాని మట్టి
తాడికొండ: రాజధానిలో వాగులు, రిజర్వాయర్ల పేరిట తొలగిస్తున్న నల్లమట్టిని అధికార పార్టీకి చెందిన నాయకులు వాటాలు వేసుకొని మరీ విక్రయిస్తున్నారు. తద్వారా రూ. కోట్లు కొల్లగొడుతున్నారు. నల్లమట్టికి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రధానంగా బడా బాబులకు చెందిన రియల్ ఎస్టేట్ వెంచర్లకు వేల లారీలలో మట్టి తరలించి స్థలాలను చదును చేస్తున్నారు. వీరికి తోడు రైతులు పంట పొలాలను చదును చేసుకునేందుకు అరకొరగా తోలించుకుంటుండగా ఖాళీ స్థలాలకు కూడా మట్టి భారీగా తరలిస్తున్నారు. పోలీసులు, విజిలెన్స్, మైనింగ్, రెవెన్యూ అధికారులకు ఇదేమీ కనిపించక పోవడం విడ్డూరంగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దూరాన్ని బట్టి ఒక్కో పెద్ద డంపర్ లారీకి రూ.6 వేలు – రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. పల్లపు ప్రాంతమైనా... ప్రభుత్వం సమీకరించిన భూములలో మట్టిని రాజధాని అవసరాలకు వదిలేసి పక్క మండలాలకు వేల ట్రిప్పుల్లో తరలించడం పట్ల పలువురు మండిపడుతున్నారు. రాజధాని ప్రాంతం అసలే పల్లం కావడంతో చినుకు పడితే చిత్తడిగా మారి జల సంద్రాన్ని తలపించి రోడ్లపై ప్రయాణాలు కూడా నిలిచిపోతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే రాజధాని ప్రాంతంలో పల్లపు ప్రాంతాలకు ఈ మట్టిని తరలిస్తే మంచిదే కానీ బయటకు విక్రయించి రూ. కోట్ల సంపాదనను ప్రైవేటు వ్యక్తులు జేబులో నింపుకోవడం పట్ల పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికే రాజధాని నిర్మాణం కోసం పేరేచర్ల ప్రాంతం నుంచి తరలించే కంకర, గ్రావెల్ ఇతర నిర్మాణ సామగ్రి తరలించే లారీలతో పాటు అక్రమ ఇసుక తరలింపు, ఇతర వాహనాల రాకపోకలతో రద్దీగా మారింది. దీనికి తోడు లారీల డ్రైవర్లు ఇష్టారీతిగా స్పీడు పెంచి నడుపుతుండటం స్థానికులకు ప్రాణ సంకటంగా మారింది. -
మెట్ల పూజ మార్గంలో జారిపడిన శ్లాబు పెచ్చులు
బాలిక తలకు గాయం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అమ్మవారి పాత మెట్ల మార్గంలో శ్లాబ్ పెచ్చులు ఊడిపడి ఓ బాలిక తలకు గాయమైంది. ఈ ఘటన శుక్రవారం ఇంద్రకీలాద్రిపై చోటు చేసుకుంది. గుంటూరుకు చెందిన పద్మావతి తన కుమార్తె స్నేహతో కలిసి అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. పద్మావతి మెట్ల పూజ చేసుకుంటూ కొండపైకి వెళ్తోంది. మహామండపం పక్కనే ఉన్న పాత మెట్ల మార్గంలో మెట్ల పూజ చేసుకుంటూ కొండపైకి చేరుకుంటుండగా, మెట్ల మార్గంలోని పాత స్టోర్ రూమ్ సమీపంలో కుళాయి వద్దకు వచ్చేసరికి బాలిక స్నేహ నిల్చున చోట పై నుంచి పెద్ద పెచ్చు ఊడిపడింది. ఆ పెచ్చు బాలిక తలపై పడటంతో గాయం అయి తీవ్ర రక్తస్రావం అయింది. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద ఉన్న దేవస్థాన ఆరోగ్య కేంద్రానికి బాలికను తీసుకొచ్చారు. అయితే అక్కడ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో నర్సు వైద్యం అందించింది. గాయం నుంచి రక్తస్రావం తగ్గడంతో వెంటనే దేవస్థాన అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలికకు వైద్యం చేసిన వైద్యులు ఐదు కుట్లు వేసినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ఆలయ ఈవో శీనానాయక్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు దేవస్థానం ఇద్దరు వైద్యులను నియమించింది. అయితే శుక్రవారం రద్దీ వేళ ఒక్క వైద్యుడు కూడా అందుబాటులో లేకపోవడంపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భక్తులు ఆలయ ఈవో శీనానాయక్ దృష్టికి తీసుకెళ్లారు. -
పారిశ్రామికంగా బాపట్ల జిల్లా అభివృద్ధి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ బాపట్ల: పారిశ్రామికంగా బాపట్ల జిల్లా అభివృద్ధికి, పరిశ్రమల స్థాపనకు మీ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహక జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి విధానంలో ప్రభుత్వం విరివిగా రాయితీలు కల్పిస్తుందని చెప్పారు. స్థిర పెట్టుబడి రాయితీ, విద్యుత్ రాయితీ, పావలా వడ్డీ రాయితీల్లో భాగంగా 49 పరిశ్రమలకు రూ.8.30 కోట్లు రాయితీ మంజూరు చేశారు. బాపట్ల జిల్లాలో టీ షర్డ్స్, క్యాప్, జనపనారతో వివిధ రకాల ఉత్పత్తుల యూనిట్ స్థాపనకు కృషి చేయాలన్నారు. బీచ్‌లలో ప్లాస్టిక్ వాడకం నిషేధం బాపట్ల జిల్లాలోని బీచ్‌లలో జూన్ నెల ఒకటో తేదీ నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ప్రత్యామ్నాయంగా జనపనార బ్యాగులు, సంచులు వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇందు కోసం జనపనార సంచులు, బ్యాగులు ఉత్పత్తి చేయాలని, వాటిపై ‘బే ఆఫ్ బాపట్ల‘ లోగో ముద్రించాలన్నారు. అలాంటి యూనిట్లను స్థాపించే వారికి యుద్ధ ప్రాతిపదికన రుణం మంజూరు చేయాలన్నారు. మార్టూరులో మాడ్యూల్ ప్యానెల్ ఉత్పత్తి జైట్ ఎనర్జీ సోలార్ పీవీ మాడ్యూల్ ప్యానెల్ ఉత్పత్తి కేంద్రం మార్టూరులో ఏర్పాటు కానుందని కలెక్టర్ వినోద్‌కుమార్ చెప్పారు. రూ.198.4 కోట్లతో పరిశ్రమ ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రాగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయన్నారు. ఆ పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన రుణ సదుపాయం కల్పించాలని, పర్యావరణ అనుమతులు పరిశీలించాలని సూచించారు. బాపట్ల మండలంలో ఎంఎస్ఎంఈ పార్కు కోసం భూమి గుర్తించాలని, ప్రభుత్వ భూమి లేకపోతే భూసేకరణతో కొనుగోలు చేయాలన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ వై రామకృష్ణ, ఎల్డీఎం శివకృష్ణ, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నరసింహారావు, ఏపీ ఎస్ఎఫ్సీ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ రామాంజనేయులు, ఆర్డీవో గ్లోరియా, ఫ్యాప్సియా రాష్ట్ర సీనియర్ సభ్యులు భక్తవత్సలం, కమిటీ సభ్యులైన వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ ద్వారా రూ.100కోట్లు జీఎస్టీ పన్నుల ద్వారా బాపట్ల జిల్లాకు రూ.100 కోట్లు ఆదాయం వచ్చిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ చెప్పారు. జీఎస్టీ పన్నుల వసూలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జీఎస్టీ పన్నుల వసూలులో బాపట్ల జిల్లా మంచి పురోగతి సాధించినట్లు చెప్పారు. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత సంవత్సరంలో 10శాతం పన్నులు వసూలు పెరిగిందన్నారు. ప్రొఫెషనల్ టాక్స్ కింద జిల్లాలో రూ.39.32 కోట్లు పన్ను వసూలు అయిందన్నారు. పర్యాటకరంగంగా బాపట్ల జిల్లా అభివృద్ధి చెందుతోందని కలెక్టర్ చెప్పారు. చిన్నగంజాం బీచ్‌ను శనివారం ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో జీఎస్టీ అధికారి మురళీకృష్ణ, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ వై రామకృష్ణ, కమిటీలోని అనుబంధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయంతో సాగు ఖర్చులు తగ్గించుకోవాలి
ప్రకాశం, బాపట్ల జిల్లాల నాబార్డ్ డీడీ రవికుమార్ ఇంకొల్లు (చినగంజాం): రైతులంతా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా రసాయనిక ఎరువుల వాడకం తగ్గించుకుని సాగు ఖర్చులు తగ్గించాలని ప్రకాశం, బాపట్ల జిల్లాల నాబార్డ్ డీడీ రవికుమార్ సూచించారు. ఇంకొల్లు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, బాపట్ల సెర్ఫ్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎఫ్పీసీ సెంటర్‌కు సంబంధించిన సమావేశాన్ని శుక్రవారం సాయంత్రం ఇంకొల్లు పంచాయతీ పరిధిలోని హనుమోజీపాలెం గ్రామంలో సాయి సేవా సమితి భవనంలో నిర్వహించారు. రైతులతో నిర్వహించిన ఈ సమావేశంలో డీడీ రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో రైతు ఉత్పత్తి కేంద్రాలకు భవిష్యత్‌లో ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. నాబార్డు ఆర్థిక సహాయ సహకారాలతో ఎఫ్పీసీ సెంటర్లను అందులోని సభ్యులంతా కలిసి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎఫ్పీసీ సెంటర్లపై రైతులు అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రధానంగా రైతులు పండించిన పంట ఉత్పత్తులను ఉమ్మడిగా ఎఫ్పీసీ ద్వారా అమ్ముకుని లబ్ధిపొందాలని సూచించారు. రైతులు పంటలు సాగుచేసేటప్పుడు బహుళ జాతి పంటలు ఒకే పొలంలో సాగు చేయటం వలన ఫలితం ఉంటుందని తెలిపారు. అనవసరంగా రసాయన క్రిమి సంహారక ఎరువుల వాడకం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేచురల్ ఫార్మేషన్ ద్వారా వ్యవసాయం చేసి ఖర్చులు తగ్గించుకుని నాణ్యమైన ఉత్పత్తులు పండించాలని తెలిపారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సందేహాలకు సమాధానాలు తెలిపారు. కార్యక్రమంలో సెర్ఫ్ సంస్థ కో ఆర్డినేటర్ శివ, ఇంకొల్లు ఎఫ్ఏసీ సెంటర్ ఎండీ ఎం.శ్రీనివాసబాబు. బీఓడీ సభ్యులు దేవబత్తిన దుర్గా ప్రసాద్, పాలేటి సుబ్బారావు, గుడివాడ ప్రసాద్, ఆరే మురళి, బత్తిన రాములు, ఆరే కోటేశ్వరరావు, ఆరే శరత్, ఆర్.వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
పరిహారానికీ ఏడుపే!
రైతుల సంక్షేమమే తమ ధ్యేయమని చెబుతున్న చంద్రబాబు సర్కారు... వారిని ఆదుకోవడంలో విఫలమైంది. గత అక్టోబర్ నెలలో సంభవించిన మోంథా తుపానుతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఏడు నెలలైనా బాధిత రైతులకు బాసటగా నిలవడానికి బాధపడుతోంది. అది తమ బాధ్యత కానట్టుగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొరిటెపాడు (గుంటూరు): గత ఏడాది అక్టోబర్ మాసంలో మోంథా తుపాను ధాటికి నష్టపోయిన వివిధ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి సర్వే అనంతరం నివేదిక రూపొందించారు. దానిని ప్రభుత్వానికి పంపారు. సుమారు ఏడు నెలలు కావస్తున్నా ఇంత వరకు నష్ట పరిహారం మంజూరు చేయలేదు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వస్తే అప్పుల నుంచి బయటపడతామని అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. మోంథా తుపాను ధాటికి జిల్లాలో సాగు చేసిన వరి, పత్తి, మినుము, కంది, సోయాబీన్ వంటి పంటలతోపాటు అరటి, కూరగాయలు, తమలపాకు, పువ్వులు వంటి ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అప్పట్లో 33 శాతం కన్నా ఎక్కువగా పంట నష్టం జరిగితే పరిహారం అందజేస్తామని టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. సర్వే చేసి పంట నష్టాన్ని గుర్తించారు. ప్రతి ఏడాది ఇవే అవస్థలు ఏటా ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోతూనే ఉన్నారు. అకాల వర్షాలు, తుపానుల కారణంగా చేతికొచ్చిన పంటలు దెబ్బతింటున్నాయి. మిగిలిన కొద్దిపాటి పంటలను విక్రయించుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. తుపాను పరిహారం వస్తే కొంత మేర నష్టం భర్తీ అవుతుందనే ఆశలో అన్నదాతలు ఉన్నారు. ఏడు నెలలు పూర్తవుతున్నా ప్రభుత్వం నష్టపరిహారం అందించలేదు. కనీసం ఆ దిశగా చర్యలేవీ తీసుకోకపోవడంతో రైతులు నిరాశలో కూరుకుపోయారు. ఇలాంటి గడ్డు పరిస్థితిలో కూడా ప్రభుత్వం ఆదుకోకుంటే ఎలా అని అన్నదాతలు వాపోతున్నారు. గతేడాది అక్టోబర్ మాసంలో సరిగ్గా పంట చేతికి వచ్చే సమయంలో తుపాన్ దెబ్బతీయడంతో రైతులకు కన్నీరే మిగిలింది. జిల్లాలో వరి 2,693.20, పత్తి 1,282.50, మినుము 1,243.55, సోయాబీన్ 234.61, కంది 10.02 ఎకరాల్లో సాగు చేశారు. అరటి 450.61, కూరగాయలు 123.27, తమలపాకులు 24.43, పువ్వులు 0.60 ఎకరాలలో నష్టపోయినట్లు గుర్తించారు. జిల్లాలో 3,800 మంది రైతులు సుమారు రూ.5,75 కోట్లు నష్టపరిహారం అందుకునేందుకు అర్హులుగా గుర్తించారు. నివేదికను ప్రభుత్వానికి పంపారు. నెలలు గడుస్తున్నా పరిహారం మాత్రం పైసా దక్కలేదు. ఇంకెప్పుడు ఇస్తారని ప్రభుత్వాన్ని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో... నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రకృతి అనుకూలించకపోయినా, వర్షాలు పడి పంటలకు నష్టం జరిగినా, వర్షాలు లేక పంటలు ఎండిపోయినా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడే పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో రైతులు ఇబ్బందులు పడకుండా, పెట్టుబడుల కోసం ఇతరులను ఆశ్రయించకుండా వ్యవసాయం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. ఎటు నుంచి ఎటు చూసినా చంద్రబాబు ప్రభుత్వం వల్ల రైతులకు నష్టం తప్పడం లేదు. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తానన్న రూ.20 వేల సాయాన్ని తొలి ఏడాది ఇవ్వలేదు. రెండో ఏడాది కూడా కౌలు రైతులకు అందజేయలేదు. ఖరీఫ్, రబీ సమయాల్లో రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మోంథా తుపాను కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు. ఈ ఏడాది మరో 20 రోజుల్లో ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్లో పెట్టుబడుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో పంటల సాగు కోసం అవసరమయ్యే ఖర్చుల కోసం బ్యాంకులు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ చివరిలో వచ్చిన మోంథా తుపాను తాకిడికి జిల్లా వ్యాప్తంగా సాగైన పంటలు దెబ్బతిన్నాయి. ఇంతవరకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారు. తక్షణమే నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలి. – కంచుమాటి అజయ్‌కుమార్, జిల్లా కార్యదర్శి, ఏపీ రైతు సంఘం -
విద్యార్థులు విజయాల వైపు సాగాలి
మంగళగిరి టౌన్: విద్యార్థులు ఉన్నత స్థానం నుంచి అద్భుత విజయాలవైపు ప్రయాణం సాగించాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. మంగళగిరి పట్టణ పరిధిలోని సీకే కన్వెన్షన్‌లో గురువారం ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌లతో కలసి పెమ్మసాని కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రభుత్వ స్కూళ్లలో అత్యధికంగా బాపట్లలోని కొల్లూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నుంచి దివ్యతేజశ్రీ 596 మార్కులు సాధించడం గర్వకారణమని మంత్రి తెలిపారు. 65 మంది విద్యార్థులకు రూ. 5 వేల చొప్పున నగదు ప్రోత్సాహకం, లెదర్ బ్యాగ్, పెన్నులతోపాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆయా జిల్లాలో మొదటి పది స్థానాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో లిడ్‌క్యాప్ చైర్మన్ మాణిక్యాలరావు, ఎన్ఆర్ఐ విద్యాసంస్థల ఈడీ తిలక్‌బాబు, ఆర్జేడీ నాగమణి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల విద్యాశాఖ అధికారులు సలీంబాషా, శ్రీనివాసరావు, రామారావు, చంద్రకళ, ఏలూరు, గుంటూరు, తెనాలి డీవైఈవో సుధాకర్ రావు, ఏసురత్నం, శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని -
తీర్మానం ప్రకారమే...
వేమూరు: చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు చేపట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు విక్రయిస్తూ జేబులు నింపుకొంటున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సహజవనరుల దోపిడీకి తమ్ముళ్లు తెగబడుతున్నారు. అక్రమార్జనే ధ్యేయంగా బరి తెగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంపాదనే ముఖ్యం అమృతలూరు మండలంలోని మోపర్రు గ్రామంలోని చెరువులో మట్టిని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులోని మట్టి తవ్వకాలు చేపట్టారు. మట్టిని ట్రాక్టర్ల ద్వారా ఇతర గ్రామాల వారికి అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు, మైనింగ్ అధికారులు మట్టి తవ్వకాల గురించి పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. మట్టి తవ్వకాలు నిలిపి వేసేందుకు ఒక మహిళ యంత్రాలు, ట్రాక్టర్లకు అడ్డుపడినా ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. చెరువులో మట్టిని తెలుగు దేశం నాయకులు సంపాదన కోసం ఇలా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు వెంటనే అక్రమ మట్టి తవ్వకాలను నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు అడ్డుకునేందుకు ఒక మహిళ ట్రాక్టర్లను, జేసీబీలను అడ్డుకుంది. దీంతో చుండూరు పోలీసులు హడావుడిగా చెరువులో తవ్వకాలు జరిగే ప్రాంతానికి వెళ్లారు. తెలుగు దేశం పార్టీలోని రెండు వర్గాలతో మాట్లాడారు. గొడవలు లేకుండా మట్టి తవ్వకాలు చేసుకోవాలని చెప్పినట్లు సమాచారం. బాపట్ల జిల్లా కేంద్రం నుంచి మైనింగ్ అధికారులు కూడా వచ్చి పరిశీలించారు. పెదగాదెలవర్రు గ్రామంలోని తెలుగు దేశం పార్టీలోని కంఠమనేని రాహుల్, మాజీ సర్పంచ్ కుమారుడు వేణుమాధవ్ రెండు వర్గాలు చీలారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు వేణుమాధవ్‌కు మద్దతుగా ఉన్నారు. రాహుల్ వర్గం మట్టి తవ్వకాలు నిలిపివేయాలని తహసీల్దారు కార్యాలయంలో, చుండూరు సర్కిల్ సీఐకి ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ మట్టి తవ్వకాలు నిలిపి వేయలేదు. రాహుల్ వర్గం చెరువు వద్దకు వచ్చి గొడవ చేయడంతో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు నిలిపివేశారు. చెరువుల్లో మట్టి తవ్వకాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో రెండు వర్గాలుగా చీలిక ఏర్పడింది. మోపర్రు గ్రామంలో పార్టీ సీనియర్ నాయకులను పక్కన పెట్టి జూనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్థానికులు చెప్పుకొంటున్నారు. చెరువు మట్టి తవ్వకాలు కూడా యువకులు చేస్తుండటంతో సీనియర్ నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మంగళవారం రెండు వర్గాలకు చెందిన వ్యక్తులను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పిలిపించి చర్చలు కూడా జరిపించారు. సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ఎంపీడీఓ మారుతి శేషాంబను చెరువు వద్దకు పంపించారు. మట్టి తవ్వకాలను ఆమె పరిశీలించారు. గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం మట్టి తవ్వకాలు చేస్తున్నారు. మట్టిని గ్రామంలో అభివృద్ధి పనులకు ఉపయోగిస్తున్నారు. మట్టి బయటి వారికి అమ్ముకుంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – నెహ్రూబాబు, తహసీల్దారు, చుండూరు మండలం. -
గ్రంథాలయాలు నడిచేదెలా!
బాపట్లశుక్రవారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2026 వేధిస్తున్న నిధుల లేమి, సిబ్బంది కొరత 7సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రూ.23 కోట్ల సెస్సు బకాయిలు నిధుల కొరతతో రెండు నెలలుగా అందని వేతనాలు వేసవి శిక్షణ శిబిరాలకు మంజూరు కాని నిధులు వైఎస్సార్ సీపీ హయాంలో గ్రాంటు విడుదల –పీవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘంతెనాలి: స్థానిక మార్కెట్‌యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3000, గరిష్ట ధర రూ.5200, మోడల్ ధర రూ.4000 వరకు పలికింది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.4206 టీఎంసీలు. ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై నిత్యాన్నదానానికి ఉండవల్లికి చెందిన కొండా బాలప్రదీప్, విజయశాంతి దంపతులు రూ.1,00,116 విరాళమిచ్చారు. -
21 నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు
గుంటూరు వెస్ట్(క్రీడలు): గుంటూరు జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన మెన్ అండ్ ఉమెన్ టీమ్ చాంపియన్‌షిప్ సెలక్షన్ పోటీలు స్థానిక శ్యామలానగర్‌లోని వెంకటేశ్వర బాలకుటీర్‌లో నిర్వహిస్తామని పోటీల నిర్వాహకుడు పి.విజయ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా చెస్ వచ్చిన ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. ఎంపిక చేసిన టీమ్‌ను ఈ నెల 27న బాటప్లలో జరగనున్న రాష్ట్ర పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. పోటీలకు సంబంధించిన బ్రోచర్‌ను జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ిసీహెచ్ రవీంద్ర రాజు, బాలకుటీర్ సీఏఓ దుర్గా రఘురామ్, ప్రిన్సిపల్ సుధామాధవి, విజయ్‌కుమార్ తదితరులు ఆవిష్కరించారు. మంగళగిరి టౌన్: ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన అఖిల భారత టేబుల్ టెన్నిస్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ బృందం ప్రతిభ కనబరిచింది. ఏపీ ఈగల్ బృందం గురువారం వివరాలను వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో ఏపీ ఈగల్ బృందం రెండు కాంస్య పతకాలను సాధించినట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ తరఫున పోటీల్లో పాల్గొన్న ఏపీ ఈగల్ చీఫ్ ఆకె రవికృష్ణ, అదనపు ఎస్పీ స్వరూపారాణి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ప్రతిభ కనబరిచి కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నట్లు వివరించారు. మహిళల విభాగంలో అప్పా ఎస్పీ శోభామంజరి, స్వరూపా రాణిలు ఉమెన్ డబుల్ విభాగంలో రాణించి మరొక కాంస్య పతకాన్ని రాష్ట్ర ఖాతాలో వేశారని తెలియజేశారు. అఖిల భారత పోలీస్ టేబుల్ టెన్నిస్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్‌శాఖకు చెందిన అధికారులు రెండు పతకాలు సాధించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషమని హర్షం వ్యక్తం చేశారు. పోటీల్లో పాల్గొనేందుకు ప్రోత్సహించిన డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాకు ఏపీ ఈగల్ చీఫ్ రవికృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 524.30 అడుగులకు చేరింది. ఈ నీరు 157.2340 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 900 క్యూసెక్కులు విడుదలఅవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
అధికారుల ఆదేశాలు బేఖాతరు
● ఆగని తవ్వకాలు ● ఆందోళనకు సిద్ధమవుతున్న రైతులు కొల్లూరు: అధికారుల ఆదేశాలను ఇసుకాసురులు బేఖాతరు చేస్తున్నారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పాపవినాశనం పరిధిలోని కృష్ణా నదిలో ఇసుక క్వారీ దక్కించుకున్న హైదరాబాద్‌కు చెందిన నిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ టీడీపీ నేతల అండదండలతో బాపట్ల జిల్లాలో ఇసుక తవ్వకాలకు పాల్పడుతోంది. అక్రమ తవ్వకాలపై బుధవారం ‘సాక్షి’లో ‘అక్రమాలకు హద్దే లేదు’ అనే శీర్షికన కథనం వెలువడింది. దీంతో స్పందించిన అధికారులు బాపట్ల జిల్లా పరిధిలో ఇసుక తవ్వకాలను తక్షణం నిలిపివేయాలని ఆదేశించారు. ఇసుక తవ్వకాలు చేపడుతున్న ప్రాంతాన్ని పరిశీలించిన రెవెన్యూ, పోలీసు, మైనింగ్, సర్వే శాఖల అధికారులు బాపట్ల జిల్లా పరిధిలో ఇసుక తవ్వకాలు చేపడుతున్నట్లు నిర్ధారించి తవ్వకాలు నిలిపివేయించారు. ఉమ్మడి సర్వే నిర్వహించి ఇరు జిల్లాల నడుమ హద్దులు నిర్ణయించిన అనంతరం తవ్వకాలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో అక్కడ నుంచి లారీలను, పొక్లెయిన్లను వెనక్కి పంపారు. జిల్లా యంత్రాంగ ఆదేశాలను పెడచెవిన పెట్టిన నిర్వాహకులు గురువారం తిరిగి బాపట్ల జిల్లా పరిధిలో ఇసుక తవ్వకాలు ఆరంభించారు. జిల్లా పరిధిలో ఐదు పొక్లెయిన్లు మోహరించి ఇసుక తవ్వకాలు చేపట్టడాన్ని పసిగట్టిన పోతార్లంక, తదితర లంక ప్రాంత రైతులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఆ ప్రాంతానికి వెళుతుండటాన్ని ముందుగానే పసిగట్టిన ఇసుకాసురులు హుటాహుటిన అక్కడ నుంచి యంత్రాలను కృష్ణా జిల్లా హద్దులలోకి తరలించారు. అధికార యంత్రాంగం తక్షణం స్పందించకుంటే ఆందోళనకు దిగేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. -
కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
ప్రత్తిపాడు: హైవేపై ముందు వెళుతున్న కార్డును వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. గురువారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో చిలకలూరిపేట డిపో నుంచి గుంటూరు డిపోకు ప్రయాణికులను ఎక్కించుకుని వెళుతున్న ఆర్టీసీ బస్సు, ప్రత్తిపాడు మండలం ఈదులపాలెం కాటూరి ఆస్పత్రి సమీపంలో పదహారవ నంబరు జాతీయ రహదారిపై విజయవాడ వెళుతున్న ఇన్నోవా కారును వెనుక నుం,ఇ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణీకులు అదృష్టవశాత్తూ బయటపడ్డారు. ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. హైవేపై ప్రమాదం జరగడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న హైవే సిబ్బందితో పాటు ప్రత్తిపాడు ఎస్ఐ నరహరి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. అదే సమయంలో బస్సులో కూడా ప్రయాణీకులు ఉండటం, ప్రమాదం తప్పడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. -
హానికర రసాయనాలు వినియోగిస్తే చర్యలు
ఫుడ్ సేఫ్టీ అధికారులుచీరాల: పలు రకాల పండ్లు త్వరగా పండడానికి హానికర రసాయనాలు వినియోగిస్తే చర్యలు తప్పవని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రణీత్ అన్నారు. గురువారం చీరాల కూరగాయల మార్కెట్ సమీపంలోని హోల్‌సేల్, రిటైల్ పండ్ల దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అరటి, దానిమ్మ, మామిడి, యాపిల్, బొప్పాయి వంటి పండ్ల నుంచి శాంపిల్స్‌ను సేకరించారు. ప్రస్తుతం వేసవిలో మామిడి పండ్లకు మంచి డిమాండ్ ఉందన్నారు. పక్వానికి రాకముందే త్వరగా పండేందుకు కార్బైడ్ వంటి రసాయనాన్ని వినియోగించడం వలన అవి త్వరగా పండిపోతాయన్నారు. అటువంటి పండ్లు చూడడానికి మంచి రంగుతో కనిపించి ఆకర్షిస్తాయన్నారు. పండ్ల వ్యాపారులు ఇదే అదనుగా హానికర రసాయనాలను వాడుతున్నారన్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కార్బైడ్ వంటి రసాయనాలను వాడుతున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. సేకరించిన శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపిస్తామని, నివేదిక వచ్చిన అనంతరం నిబంధనలు ఉల్లఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
యువకుడిపై హత్యాయత్నం
సత్తెనపల్లి: హత్యాయత్నానికి యత్నించిన యువకులకు దేహశుద్ధి చేసిన సంఘటన పట్టణంలోని వడ్డవల్లి చెక్క వంతెన వద్ద బుధవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని వడవల్లి చెక్కవంతెన ఏరియాకు చెందిన నల్లబోతుల నాగరాజు, భార్య భవానీ హోటళ్లలో కూలి పనులు చేసుకుని జీవిస్తుంటారు. వీరికి ముగ్గురు సంతానం. కాగా భవానీ ఆరు నెలల నుంచి పట్టణంలోని అచ్చంపేట రోడ్లో గల శివాలయం సమీపంలో నివాసముండే పమిడిగుంట్ల మహేష్‌ను రహస్యంగా కలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నాగరాజు తన భార్య భవానీని ప్రశ్నించడంతో మహేష్‌తో ఉన్న వివాహేతర సంబంధం అంగీకరించింది. నాగరాజు, తన కుటుంబ సభ్యులు చెప్పినా భవానీ ఖాతరు చేయకుండా మహేష్‌తో తిరుగుతుంది. నాగరాజు ప్రశ్నిస్తున్న విషయాన్ని మహేష్‌కు భవానీ చెప్పడంతో నెల రోజులుగా నాగరాజును చంపుతానంటూ మహేష్ ఇంటి పరిసరాల్లో కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు. భయపడిన నాగరాజు ఇంటికి రావడం మానేశాడు. కుటుంబ సభ్యులు నచ్చ చెప్పడంతో ఈనెల 13న సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఆ విషయాన్ని నాగరాజు భార్య భవానీ తన ప్రియుడైన మహేష్ కు ఫోన్ లో తెలియజేయగా మహేష్ బుధవారం రాత్రి 8 గంటల సమయంలో నాగరాజును హతమార్చేందుకు కత్తి తీసుకొని రాగా గమనించిన ఇరుగు పొరుగువారు మహేష్ దాడి చేస్తాడన్న భయంతో పట్టుకోవడానికి ప్రయత్నించగా అతను కత్తి చూపించి అందర్నీ బెదిరించాడు. నా తమ్ముడు, స్నేహితులతో మళ్ళీ వస్తానని, నాగరాజును కచ్చితంగా చంపుతానని, అడ్డొచ్చిన వారిని కూడా చంపుతానని మహేష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సుమారు 10:30 గంటల సమయంలో మహేష్ తమ్ముడైన ఆకాష్, అతని స్నేహితులైన మధార్వలి, షేక్ ఖాసిం సైదా అలియాస్ అండా ముగ్గురు మోటార్ సైకిల్ పై వచ్చారు. మహేష్ తమ్ముడు అయిన ఆకాష్ తను చేతిలో ఉన్న గొడ్డలితో ఇంటి సమీపముకు వచ్చి నాగరాజును హతమార్చేందుకు యత్నించగా నాగరాజు భయంతో పరుగులు పెట్టాడు. నాగరాజును వెంబడించారు. అప్పటికే అప్రమత్తంగా ఉన్న స్థానికులు అడ్డు పడటంతో ఆకాష్ పెనుగులాడి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. మిగిలిన ఇద్దరు మదార్‌వలి, ఖాసీం సైదా అలియాస్ అండా స్థానికులకు దొరకడంతో వారిరు వురికి దేహశుద్ధి చేసి విద్యుత్ స్తంభానికి కట్టేశారు. స్థానికులు డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. భవానీ, మహేష్‌ల మధ్య ఉన్న అక్రమ సంబంధానికి నాగరాజు అడ్డుస్తున్నాడనే ఉద్దేశంతో పథకం ప్రకారం నాగరాజును హతమార్చేందుకు యత్నించారు. దీనిపై నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు హత్యా నేరం క్రింద నల్లబోతుల భవానీ, పమిడి గుంట్ల మహేష్, పమిడిగుంట్ల ఆకాష్, మధార్వలి, ఖాసిం సైదా అలియాస్ అండా పై పట్టణ సీఐ ఎన్.నాగమల్లేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అక్రమ వసూళ్లను నిరసిస్తూ రైతుల ఆందోళన
నాదెండ్ల: మైనింగ్ శాఖకు చెందిన ఏఎంఆర్ కంపెనీ చెక్‌పోస్టు సిబ్బంది రైతుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లు గురువారం ఆందోళనకు దిగారు. సాతులూరు వద్ద గుంటూరు–కర్నూలు రహదారిపై ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి రాస్తారోకో నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామంలోని చందవరం సెంటర్లో ఉన్న ఏఎంఆర్ కంపెనీ చెక్‌పోస్టు సిబ్బంది రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లను వేధిస్తున్నారని విమర్శించారు. రైతులు తమ పొలాల్లో మెరక మట్టిని తోలుకుంటున్నారని, ట్రాక్టర్‌కు రూ.500 చెల్లించాలంటూ రైతులపై ఏఎంఆర్ సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడుతున్నారని అన్నారు. గ్రామంలోని ఓ మహిళ తన పొలంలోని మెరక మట్టిని ట్రాక్టర్లలో ఇతర పొలాలకు తోలించిందని, అందుకు ఏఎంఆర్ సిబ్బంది అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి ఒక్కో ట్రాక్టర్‌కు రూ.500 చెల్లించాల్సిందేనంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారని అన్నారు. డబ్బులు చెల్లించకుంటే కేసులు నమోదు చేయించి జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఏఎంఆర్ సంస్ధ నుండి రైతులను కాపాడాలని, ఈ సంస్థపై ప్రభుత్వం చర్యలు తీసుకుని చెక్‌పోస్టును తొలగించాలని డిమాండ్ చేశారు. రైతులు, ట్రాక్టర్ డ్రైవర్ల ఆందోళనతో రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం తెలుసుకున్న ట్రైనీ ఐపీఎస్ జె నిరంజన్, నరసరావుపేట రూరల్ సీఐ సుబ్బరావు, నాదెండ్ల, నరసరావుపేట రూరల్ ఎస్సైలు ఆర్ వెంకటేశ్వరరావు, కిశోర్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఏఎంఆర్ సిబ్బందిపై కేసులు నమోదు చేస్తామని హామీనివ్వటంతో రైతులు ఆందోళన విరమించారు. -
అవార్డులకు ఆరోగ్య కేంద్రాలు ఎంపిక
గుంటూరు మెడికల్: జిల్లా లోని పట్టణ ఆరోగ్యకేంద్రాలు, ఆయష్మాన్ ఆరోగ్య మందిర్ల అవార్డులు, పారితోషికాలకు ఎంపికై న ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు, సిబ్బందిని గురువారం డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అభినందించారు. ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో జాతీయ నాణ్యత అంచనా సంస్థ (ఎన్‌క్యూఏఎస్) రెండు రోజుల పాటు, నవజాత, మాతాశిశు, కౌమార బాలికల సంరక్షణ, సంక్రమణ, అసంక్రమణ వ్యాధుల నివారణ అంశాలపై నిర్వహించిన ప్రమాణాలలో మూడు పట్టణ ఆరోగ్యకేంద్రాలు, మూడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలకు అవార్డులు రావడం అభినందనీయమన్నారు. అవార్డులకు ఎంపికై న నందులపేట (తెనాలి) –88.23 శాతం, రెడ్డిపాలెం (గుంటూరు) – 89.56శాతం, అడవితక్కెళ్లపాడు (గుంటూరు) –93.79 శాతం, మూడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు మాచవరం, పాండ్రపాడు –92.44శాతం, ఉప్పలపాడు, పెదనందిపాడు 91.75శాతం, ఉప్పలపాడు, పెదకాకాని 82.49శాతంలు అవార్డులకు ఎంపికయ్యాయని తెలిపారు. ఒక్కో పట్టణ ఆరోగ్యకేంద్రానికి రూ.3లక్షల పారితోషికం, ఒక్కో ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్కు రూ.1.26 లక్షలు ఆరోగ్యకేంద్రాలకు అభివృద్ధి, సిబ్బంది ప్రోత్సాహకాల రీత్యా అందజేయడం జరుగుతోందన్నారు. అవార్డులు పొందిన ఆరోగ్యకేంద్రాల వైద్యాధికారులను, సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించి, మిగతా ఆరోగ్య కేంద్రాలు వీరిని ఆదర్శంగా తీసుకోవాలని, ఆరోగ్యకేంద్రాల నిర్వహణను, వైద్య సేవలను పూర్తి స్థాయిలో అందజేయాలని సూచించారు. -
తప్పిపోయిన మహిళ బంధువులకు అప్పగింత
పర్చూరు(చినగంజాం): మతిస్థిమితం లేక తప్పిపోయిన మహిళను గుర్తించి పర్చూరు పోలీసులు వారి బంధువులకు అప్పగించారు. పర్చూరు ఎస్సై పులి గోపి వివరాల మేరకు.. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఆవులవారిపాలేనికి చెందిన తిరుమల జంపారావు కుటుంబం ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలో ఇటీవల నిర్వహించిన పొలిమేర వీరాంజనేయస్వామి తిరునాళ్లకు వచ్చారు. జంపారావు కుమార్తె కూడా వచ్చింది. ఈమెకు మతిస్థిమితం లేదు. తిరునాళ్ల ముగిసిన అనంతరం తిరిగి వెళ్లే క్రమంలో పూసపాడు అడ్డరోడ్డు వద్ద కుటుంబ సభ్యులతో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సమయంలో అక్కడి నుంచి ఆ మహిళ ఒక్కతే నడుచుకుంటూ వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఎంత గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దాంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇదిలా ఉండగా బుధవారం పర్చూరు మండలంలోని జాగర్లమూడి గ్రామంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న మహిళను గమనించిన పోలీసులు ఎస్ఐ గోపి ఆధ్వర్యంలో ఆమెను అదుపులోనికి తీసుకొని విచారించారు. మహిళ మాటతీరు, పరిస్థితిని గమనించిన పోలీసులు ఆమె మతి స్థిమితం సరిగా లేదని గుర్తించారు. అనంతరం ఆమె వివరాలను సేకరించి చివరగా జంపారావు కుమార్తెగా గుర్తించారు. వెంటనే ఎస్ఐ క్రోసూరు ఎస్ఐ సహకారంతో ఆవులవారిపాలెం సర్పంచ్ సహకారంతో మహిళ కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మహిళ బంధువులను పర్చూరు పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. తప్పిపోయిన మహిళ విషయంలో ఎస్ఐ ప్రదర్శించిన చొరవను పలువురు అభినందించారు. -
టీడీపీ నేతల మధ్య వాటాల వివాదం
కొల్లూరు: కొల్లూరు మండలం చిలుమూరు వద్ద కృష్ణానదిలో 4.870 హెక్టార్ల విస్తీర్ణంలో 73,050 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలకు ఏప్రిల్ 24న జిల్లా అధికారుల నుంచి అనుమతులు మంజూరయ్యాయి. ఇసుక తవ్వకాలకు అనుమతులు పొందిన శ్రీనివాస ఇన్ఫ్రా అండ్ లాజిస్టిక్స్ కంపెనీ నేటి వరకు క్వారీని ఆరంభించలేదు. తవ్వకాలు ప్రారంభం కాకపోవడం వెనుక వాటాల వివాదమే కారణమన్న విషయం టీడీపీ శ్రేణులతోపాటు, ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇసుక తవ్వకాలకు అనుమతులు పొందిన పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి నేత అనుచరులు ఇసుక తవ్వకాల కోసం నదిలో గాలు మార్గం ఏర్పాటు చేసిన ప్రయత్నాలను నియోజకవర్గ స్థాయి నేత అనుచరులు అడ్డుకున్నారు. దీంతో పనులు నిలిపివేచినట్లు చర్చ నడుస్తుంది. పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి నేత ఇసుక క్వారీ నిర్వహణ అంశంపై మండల స్థాయి పలువురు నాయకులను సంప్రదించినప్పటికీ వేమూరు నియోజకవర్గ స్థాయి నేత కన్నెరజేస్తారన్న సంశయంతో వెనుకంజ వేస్తున్నట్లు వినికిడి. చివరకు ఇసుక క్వారీ నిర్వహణ పంచాయతీలో 60 శాతం వాటా తనకు కేటాయించాలని వేమూరు నియోజకవర్గ స్థాయి నేత డిమాండ్ చేసినట్లు టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వచ్చిన ఆధాయంలో 60 శాతం ఆయనకిస్తే తమకు మిగిలేదేంటంటూ.. ఈ వ్యవహారాన్ని టీడీపీ అధిష్టానం వద్దే తేల్చుకునేందుకు పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి నేత సమాయత్తమవుతున్నట్లు ఆ పార్టీ శ్రేణులలో చర్చలు నడుస్తున్నాయి. -
శుభ శకునానికని ఎదురొస్తే ప్రాణాలే పోయాయి
కిలేశపురం(ఇబ్రహీంపట్నం): ఇంటికొచ్చిన బంధువులను తిరిగి పంపించేందుకు కారుకు శుభ శకునానికని ఎదురు వచ్చిన మహిళను వెనుక వైపు నుంచి దూసుకొచ్చిన మరోకారు ఢీకొనగా ఆమె మృత్యువాత పడిన ఘటన మండలంలోని కిలేశపురంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. ఘటనలో ఆమె కుమారుడికి సైతం తీవ్ర గాయాలయ్యాయి. సేకరించిన వివరాల ప్రకారం... కిలేశపురం గ్రామానికి చెందిన గుంటుపల్లి రమేష్, గంగాభవాని(44) దంపతుల కుమార్తెకు ఇటీవల వివాహం జరిగింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి కుమార్తెను పుట్టింటికి కారులో తీసుకొచ్చిన బంధువులను తిరుగు ప్రయాణంలో పంపించేందుకు తన కుమారుడు వెంకట జితేంద్రతో కలిసి తల్లి గంగాభవాని శుభశకునం కోసం కారుకు డ్రైవర్ వైపు ఎదురు వచ్చింది. కారు ముందుకు సాగిన మరుక్షణం హైదరాబాద్ వైపు నుంచి దూసుకొచ్చిన మరో కారు వీరిద్దరినీ ఢీకొట్టింది. గంగాభవాని అక్కడికక్కడే మృత్యువాత పడగా, ఆమె కుమారుడు వెంకట జితేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన జితేంద్రను హుటాహుటిన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఈతకు వెళ్లి గుర్తుతెలియని యువకుడు మృతి
రేపల్లె: రేపల్లె మండలం రావి అనంతవరం గ్రామంలో మంగళవారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని పంట కాలువలో ఈతకు వెళ్లిన ముగ్గురు స్నేహితుల్లో ఒకరు మునిగి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ముగ్గురు యువకులు కాలువలో ఈతకు దిగగా వారిలో ఒకరికి ఈత రాకపోవడంతో అకస్మాత్తుగా మునిగిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసిన అతనితో పాటు ఉన్న మరో ఇద్దరు స్నేహితులు భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. తర్వాత స్థానికులు గమనించి కాలువలో మునిగిపోయిన యువకుడిని బయటికి తీసేసరికి మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి వయస్సు సుమారు 18 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండవచ్చని పట్టణ సీఐ అశోక్ కుమార్ తెలిపారు. అయితే ఇప్పటివరకు మృతుని ఆచూకీ తెలియరాలేదన్నారు. ఈ ఘటనపై పెనుమూడి వీఆర్వో జొన్న రామస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్ కుమార్ తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించామన్నారు. -
బగళాముఖి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న బగళాముఖి అమ్మవారిని బుధవారం ఏపీ హైకోర్టు న్యాయూమూర్తి జస్టిస్ ఉమామహేశ్వరరావు దంపతులు, ఏలూరు రిటైర్డ్ ఎస్పీ డీవీఎస్ మూర్తి దంపతులు దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ మేనేజర్ నరసింహమూర్తి, ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయం చుట్టూ వారు ప్రదక్షిణలు చేశారు. అనంతరం అమ్మవారి ఆలయంలో జరిగిన పూర్ణాహుతి పూజా కార్యక్రమాలలో న్యాయమూర్తి దంపతులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్నారు. న్యాయమూర్తి దంపతులకు, ఎస్పీ దంపతులకు వేద ఆశీర్వచనాలు అందజేసి ఈవో నరసింహమూర్తి అమ్మవారి ప్రసాదాలను, చిత్రపటాలను అందజేశారు. కార్యక్రమంలో పిట్టలవానిపాలెం తహసీల్దార్ డి.వెంకటేశ్వరరావు, బాపట్ల రూరల్ సీఐ హరికృష్ణ, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రాన్ని ఆస్ట్రేలియన్ కౌన్సిల్ జనరల్ హెచ్.ఇ.సిలాయ్జాకీ, ఆస్ట్రేలియన్ హై కమిషనర్ హెచ్.ఇ.ఫిలిప్లు బుధవారం సందర్శించారు. వారు విజయకీలాద్రిపై ఉన్న అన్ని ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 27 అడుగుల ఏకశిలా విగ్రహం విఘ్న విమోచక హనుమాన్ను దర్శించుకున్నారు. అనంతరం వారికి చిత్రపటాన్ని, స్వామి వారి శేషవస్త్రాన్ని నిర్వాహకులు బహూకరించారు. ఆలయ విశిష్టతను జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు వివరించారు. పెదకాకాని: పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వర స్వామిని కేంద్ర కమ్యూనికేషన్స్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బుధవారం దర్శించుకున్నారు. మంత్రికి అర్చకస్వాములు, వేదపండితులు వేద మంత్రోచ్ఛరణల నడుమ సాదర స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు, ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్ అందజేశారు. -
అభివృద్ధి పనులు వేగవంతం
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ బాపట్ల: జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువులోగా వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో శాఖల వారీగా పనుల పురోగతిని పరిశీలించి పలు సూచనలు చేశారు. సామాజిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో కొనసాగుతున్న నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఇప్పటికే పూర్తి చేసిన పనులను వెంటనే వినియోగంలోకి తీసుకురావడంతో పాటు, మిగిలిన ఎస్డబ్ల్యూ హాస్టల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా రేపల్లె ఎస్డబ్ల్యూ కళాశాల బాలుర హాస్టల్ నిర్మాణ పనులను ప్రాధాన్యంగా పూర్తి చేయాలని తెలిపారు. ఎస్డబ్ల్యూ బాలికల హాస్టళ్లలో మరుగుదొడ్ల నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. బాపట్ల, పర్చూరు హాస్టళ్లలో జరుగుతున్న పనులను త్వరగా పూర్తి చేసి విద్యార్థినులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. తురుమెళ్లలోని పీఎం అజయ్ ఎస్డబ్ల్యూ బాలికల హాస్టల్ పనులను కూడా నిర్దేశిత ప్రమాణాలతో పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఎంపీ ల్యాడ్స్ పనులు 15 రోజుల్లో ప్రారంభం కావాలి.. ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులన్ని 15 రోజుల్లో ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. ఎంపీ ల్యాడ్స్, డీఎంఎఫ్ నిధులతో నిర్మిస్తున్న పనులపై జిల్లా కలెక్టర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలకు 40 ల్యాబ్స్ నిర్మించడానికి ఎంపీ ల్యాడ్స్ మంజూరైనప్పటికీ పనులు మొదలు పెట్టకపోవడం ఏంటని కలెక్టర్ ప్రశ్నించారు. టెండర్ ప్రక్రియ వారం రోజుల్లో ముగించాలన్నారు. మొత్తం మీద 106 అభివృద్ధి పనులు ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టినప్పటికి పనులు మొదలు కాకపోవడంపై ఆరా తీశారు. మార్కెటింగ్ శాఖకు 60 గోదాములు మంజూరు కాగా, 30 గోదాములు పూర్తి చేయడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాలుగు గోదాములు రద్దు చేయడంపై ఆరా తీశారు. మంజూరైన వాటిని మిగిలిన ప్రాంతాలకు బదిలీ చేసి గోదాములు నిర్మించాలన్నారు. ఇప్పటివరకు నిర్మించిన గోదాములన్నింటిని సహకార శాఖకు అప్పగించాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ ఏఓ మల్లికార్జునరావు, సీపీఓ షాలేమురాజు, మైన్స్ ఏడీ శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, పీఆర్ ఈఈ రాజన్ బాబు, ఆర్అండ్బీ ఇంజినీర్లు నళిని, అరుణకుమారి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
మంగళగిరి టౌన్: నేషనల్ సబ్ జూనియర్ అండ్ జూనియర్ (మెన్ అండ్ ఉమెన్) క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు గుంటూరు జిల్లా నుంచి పవర్ లిఫ్టర్లు ఎంపికయ్యారని గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ భాస్కరరావు తెలిపారు. మంగళగిరిలోని అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం క్రీడాకారుల వివరాలు వెల్లడించారు. ఈనెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కోనసీమ జిల్లా, అమలాపురంలో పోటీలు జరుగుతాయని తెలియజేశారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన లిఖిత, విజయశ్రీ, కౌశిక్‌లు పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. పోటీలకు ఎంపికై న క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన చేసి పతకాలు సాధించాలని ఆశించారు. గుంటూరు మెడికల్: పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి సంబంధించి ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్న 211 ఉద్యోగాల ఎంపిక తుది జాబితాను విడుదల చేసినట్లు గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తుది జాబితాను గుంటూరు మెడికల్ కాలేజీ వెబ్‌సైట్‌తోపాటు జిల్లా కలెక్టర్ కార్యాలయ వెబ్సైట్లో కూడా పరిశీలించవచ్చని తెలిపారరు. ఎంపికై న అభ్యర్థులకు ఈనెల 14న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యోగాల నియామక ప్రకటనను మార్చి 26న విడుదల చేయగా, మొత్తం 4,791 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. మొదట ప్రాథమిక మెరిట్ జాబితాను విడుదల చేసి, అనంతరం అభ్యంతరాలు (గ్రీవెన్సెస్) స్వీకరించేందుకు తగిన సమయం కల్పించినట్లు చెప్పారు.అందిన అభ్యంతరాలను సమగ్రంగా పరిశీలించి, ధ్రువీకరణ అనంతరం తుది మెరిట్ జాబితా, తుది ఎంపిక జాబితాను విడుదల చేసినట్లు వివరించారు. ఎంపికై న అభ్యర్థులకు గుంటూరు మెడికల్ కాలేజీ సిబ్బంది ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం అందించినట్లు తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు నియామక ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, తుది ఎంపిక జాబితాను విడుదల చేసి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అండర్ గ్రాడ్యుయేషన్ పరీక్ష ఫలితాలను అదనపు పరీక్షల నిర్వహణ అధికారి ఎ వెంకటేశ్వర్లు బుధవారం విడుదల చేశారు. ఏఎన్‌యూ పరిధిలో 2026 మార్చి, ఏప్రిల్‌లో జరిగిన బీఏ, బీఎస్సీ, బీకాం జనరల్, కంప్యూటర్స్, బీబీఏ, బీసీఏ, బీహెచ్ఎం, బీఎఓఎల్ ఆరవ సెమిస్టర్ పరీక్షలకు 8790 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 8741 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు. 99.44 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. పూర్తి వివరాలు వర్స్డ్ఠిటీ అధికారిక వెబ్సైట్లో చూడవచ్చన్నారు. -
అక్రమ కేసులు బనాయించి వేధింపులు
పిడుగురాళ్ల: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తోందని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు సయ్యద్ జబీర్ అన్నారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైఎస్సార్ సీపీ కర్నూలు పట్టణ యూత్ అధ్యక్షుడు బాలుపై అక్రమ కేసులు పెట్టి, వేధించి ఆత్మహత్య చేసుకునేలా చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందన్నారు. అణిచివేతల వలన వైఎస్సార్ సీపీ యూత్ విభాగం ఆగదని, మీరు ఎంతగా ఇబ్బందులకు గురి చేస్తే అంత రెట్టించిన ఉత్సాహంతో పార్టీ శ్రేణులు పనిచేస్తారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీగా వివిధ మార్గాల ద్వారా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో వారిని ఇబ్బందులకు గురి చేయటం తగదన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లీం మైనార్టీ యువకులను టీడీపీ నేతలు టార్గెట్ చేసి అణిచివేయాలని చూస్తున్నారని, వాటి ఆటలు సాగవని హెచ్చరించారు. దాడులను నిరశిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించారు. పార్టీ గురజాల నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు సాంబశివరావు మాట్లాడారు. నియోజకవర్గ యువజన విభాగం అధక్షుడు బి. సాంబశివరావు, పిడుగురాళ్ల మండల యువజన విభాగం అధ్యక్షుడు ప్రసన్న ఉన్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ జబీర్ -
అమృతలూరు పీహెచ్‌సీకి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు
వేమూరు: అమృతలూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేద ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు అందించడం జరిగిందని వైద్యాధికారి డాక్టర్ పాలడుగు శృతి తెలిపారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన జాతీయ నాణ్యత ప్రమాణాల హామీ బృందం సభ్యులు ఈ ఏడాది ఏప్రిల్ 27 28 తేదీల్లో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించడం జరిగిందన్నారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు అందించే వైద్య సేవలు, కాన్పుల విభాగం పనితీరు, లేబొరేటరీ పనితీరును పరిశీలించారన్నారు. అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన బృంద సభ్యులు, బుధవారం గుర్తింపు పత్రం అందజేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్ర సిబ్బంది డాక్టర్ శృతిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి కొల్లి శ్రీనివాసరెడ్డి, ఆరోగ్య పర్యవేక్షకులు పుట్ట గుంట శ్రీనివాసరావు, హెల్త్ అసిస్టెంట్ మేకా శంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సంగీతంలో రెండోసారి గిన్నిస్ రికార్డ్
కర్లపాలెం: సంగీతంలో ఓ బాలుడు తన సత్తా చాటాడు. రెండోసారి గిన్నిస్ రికార్డు సాధించాడు. కర్లపాలెం మండలం బిడారుదిబ్బ గ్రామానికి చెందిన కట్టుపల్లి విల్సన్‌బాబు, ప్రత్యూషల కుమారుడు జోయల్ విల్సన్‌బాబు. 7వ తరగతి చదువుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న హైదరాబాద్‌లో 22 దేశాల నుంచి 2 వేల మంది కీబోర్డు వాయిద్య కళాకారులతో కార్యక్రమం ఏర్పాటైంది. నిమిషంలో సప్తస్వరాలు, గంటపాటు ఆపకుండా కీబోర్డు వాయించటంపై పోటీలు నిర్వహించారు. జోయల్ విల్సన్బాబుకు రికార్డులో స్థానం లభించింది. 2024 డిసెంబర్ 1న విజయవాడలో జరిగిన సంగీత పోటీలలో కూడా జోయల్ విల్సన్‌బాబు పాల్గొన్నాడు. ఈ నెల 9న విజయవాడలో జరిగిన హల్లెల్ సంగీత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధుల నుంచి దీనికి సంబంధించి జోయల్ విల్సన్ బాబుకు సర్టిఫికెట్, మెడల్ అందాయి. -
చిలకలూరిపేట ఆర్టీసీలో వీడని ప్రతిష్టంభన
● రెండోరోజూ ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు ● ఆర్ఎం రజితకుమారి ఆధ్వర్యంలో చర్చలు చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: చిలకలూరిపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్ల విధుల బహిష్కరణ రెండో రోజుకూ చేరడంతో ప్రయాణికుల ఇక్కట్లు వర్ణనాతీతంగా మారాయి. తోటి డ్రైవర్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ తమకు ప్రాణరక్షణ కల్పించే వరకు స్టీరింగ్ పట్టే ప్రసక్తే లేదని కాల్ డ్రైవర్లు భీష్మించుకోవడంతో అధికారులకు ఇది పెను సవాలుగా మారింది. మొత్తం 35 మంది డ్రైవర్లకుగాను ఐదుగురు మాత్రమే విధులకు హాజరుకావడంతో డిపో నుంచి బస్సులు కదలలేదు. సమస్య జఠిలం కావడంతో పల్నాడు జిల్లా రీజనల్ మేనేజర్ టి అజితకుమారి సోమవారం స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరిపినప్పటికీ ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం. నరసరావుపేట, సత్తెనపల్లి నుంచి ఇతర డ్రైవర్లను రప్పించి, అందుబాటులో ఉన్న వారితో డబుల్ డ్యూటీలు చేయిస్తూ ఆర్టీసీ అధికారులు నెట్టుకొస్తున్నారు. డిపో పరిధిలోని అద్దె ప్రాతిపదికన నడిపే 5 సర్వీసులు పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో చీరాల, మాచర్ల వంటి మార్గాల్లో కీలకమైన సర్వీసులు లేక సామాన్య ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కారం చేసేందుకు మంగళవారం తిరిగి ఆర్ఎం రజిత కుమారి చిలకలూరిపేట డిపోను సందర్శించారు. అయితే విధులను బహిష్కరించిన ఆన్‌కాల్ డ్రైవర్లంతా బాధిత డ్రైవర్ దుర్గాప్రసాద్‌కు అండగ నిలిచారు. తమ తోటి డ్రైవర్‌కు న్యాయం చేయాలంటూ దుర్గాప్రసాద్‌కు మద్దతుగా మంగళవారం ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ వద్దనే ఉన్నారు. దీంతో డ్రైవర్లతో ఆర్ఎం ఫోన్ ద్వారా రెండోరోజు చర్చలు జరిపారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులపై చర్యలు ఉంటాయని, గ్రామ పెద్దల మధ్యవర్తిత్వం తర్వాత కొంత సానుకూలత వ్యక్తమైనప్పటికీ, విధుల్లో భద్రతపై శాశ్వత భరోసా లభిస్తే తప్ప ఈ అనిశ్చితి పూర్తిగా తొలగేలా లేదని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. ఈ విషయంపై ఆర్ఎం అజిత కుమారిని వివరణ కోరగా బాధిత డ్రైవర్‌కు తప్పక న్యాయం జరిగేలా చూస్తామని, ఇదే విషయాన్ని కాల్డ్రైవర్లతో ఫోన్‌ద్వారా తెలియజేశామని వారు బుధవారం నుంచి విధులకు హాజరు కానున్నట్లు చెప్పారని వివరించారు. -
ఐఓబీ కార్యాలయ నిర్మాణానికి ఎన్బీసీసీతో ఒప్పందం
కొరిటెపాడు(గుంటూరు): అమరావతిలో ప్రాంతీయ కార్యాలయ నిర్మాణానికి ఎన్బీసీసీతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఓబీ) మంగళవారం అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. ఒప్పందంపై బ్యాంక్ చీఫ్ రీజినల్ మేనేజర్ హర్షిత్ సింగ్ సమక్షంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఏజీఎం) కె.ఆస్వథ్ రామన్ నిర్వహించారు. ఐఓబీ తరపున హర్షిత్ సింగ్ అవగాహన ఒప్పందంపై సంతకం చేయగా, ఎన్బీసీసీ ఇండియా లిమిటెడ్ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎస్ రావు, జనరల్ మేనేజర్ రాజారాం సంతకాలు చేశారు. అనంతరం అవగాహన ఒప్పంద పత్రాలను రెండు సంస్థలు పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. అమరావతిలో ప్రతిపాదిత ప్రాంతీయ కార్యాలయం బ్యాంక్ విస్తరిస్తున్న వ్యాపార కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడంతో పాటు ఈ ప్రాంతంలో వినియోగదారుల సేవలను మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషించనున్నట్లు ఐఓబీ బ్యాంక్ అధికారులు తెలిపారు. -
జాతీయస్థాయి పరీక్ష నిర్వహించే తీరు ఇదేనా?
జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక పరీక్ష నిర్వహించే తీరు ఇదేనా.. ? విద్యార్థులు పగలు, రాత్రి అహర్నిశలు కష్టపడి పరీక్ష రాసిన తరువాత హఠాత్తుగా రద్దు చేయడం వారిలోని మనోధైర్యం, ఆత్మ విశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 2024లో సైతం ఇదే విధంగా తప్పిదాలు చోటు చేసుకుంటే పరీక్షను రద్దు చేయకుండా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకున్నారు. దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైగా విద్యార్థులు హాజరైన నీట్ నిర్వహణలో ఎన్టీఏ ఘోరంగా విఫలమైంది. పరీక్ష నిర్వహణ పేరుతో విద్యార్థులకు కఠినమైన ఆంక్షలు విధించి, పరీక్ష నిర్వహణలో ఫెయిలయ్యారు. – బాదినేని హరిబాబు, ప్రిన్సిపాల్, భాష్యం మెడెక్స్ కళాశాల, గుంటూరు -
జాబితాలో పేర్లు లేనివారు దరఖాస్తు చేసుకోవాలి
చీరాల అర్బన్: చేనేత కార్మికులకు సంబంధించి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కోసం.. అర్హుల జాబితాలో పేరు లేనివారు హ్యాండ్లూమ్ ఏడీ కార్యాలయం ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని విద్యుత్‌శాఖ ఈఈ జాన్ థామస్ తెలిపారు. మగ్గం ఉన్న వారికి 200 యూనిట్లు, పవర్లూమ్ వారికి 500 యూనిట్లు ఉచితం అని ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులపై ‘నేతన్నకు గుండె గు‘బిల్లు’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. చేనేత ఉపవృత్తుల వారికి పథకం వర్తించదని ఈఈ స్పష్టం చేశారు. ఉపవృత్తుల వారికి కూడా మగ్గం ఉన్న చేనేత కార్మికులకు వర్తించే పథకాలు వర్తిస్తాయని తమకు ప్రభుత్వ పరంగా ఎలాంటి గైడ్‌లైన్స్ లేవని తెలిపారు. ఈ క్రమంలో ఉచిత విద్యుత్‌కు సంబంధించి అర్హుల జాబితాలో పేరు లేనివారు మళ్లీ హ్యాండ్లూమ్ ఏడీ కార్యాలయం ద్వారా తమకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వాటిని పునఃపరిశీలించి అర్హులకు ఇబ్బంది లేకుండా పథకం వర్తింప చేస్తామన్నారు. విద్యుత్ వినియోగానికి సంబంధించి 200 యూనిట్లు కన్నా అదనంగా వినియోగించినా మొత్తం యూనిట్లలో 200 యూనిట్లు పోను మిగిలిన యూనిట్లకు చెల్లిస్తే సరిపోతుందని వివరించారు. అయితే శ్లాబు ప్రకారం మిగిలిన యూనిట్లకు ధర చెల్లించాల్సి ఉంటున్నారు. కాగా రూ.399 విద్యుత్ బిల్లు వచ్చిన ఓ చేనేత కార్మికుడి నుంచి ఆ మొత్తం కట్టించుకున్నారు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ విషయన్ని ఈఈ దృష్టికి తీసుకెళ్లగా తమ జాబితాలో ఉన్నవారికి అలా జరిగితే పరిశీలించి తగిన చర్యలు చేపడతామన్నారు. ఎవరన్నా అద్దె ఇళ్లలో ఉంటే ఆ గృహ యమజాని నుంచి అనుమతి పత్రం పొంది దాఖలు చేయాలని చెప్పారు. విద్యుత్ శాఖ ఈఈ జాన్ థామస్ -
ఆగస్టు చివరి నాటికి సౌరవిద్యుత్ యూనిట్ల ఏర్పాటు
నరసరావుపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లాలోని 1.91 లక్షల ఎస్సీ, ఎస్టీలకు చెందిన గృహాలపై సోలార్ రూఫ్ టాప్ ప్యానెళ్లు ఏర్పాటు చేసే కార్యక్రమం వచ్చే ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేస్తామని ఏపీసీపీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి వెల్లడించారు. మంగళవారం జొన్నలగడ్డ రోడ్డులోని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశానికి హాజరై ఫీడర్ లెవెల్ సోలరైజేషన్, ఎస్సీ, ఎస్టీల సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు, పీఎం సూర్యఘర్ పథకం అమలు, రెవెన్యూ కలెక్షన్లు, లో ఓల్టేజ్ సమస్యలపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతి ఇంటిపై రెండు కిలోవాట్ల సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. అందుకు సంబంధించిన మెటీరియల్‌లో చాలా భాగం వచ్చాయన్నారు. పీఎం సూర్యఘర్‌కు సంబంధించి 40 వేల కనెక్షన్లు, వాటిలో జిల్లాలో మూడు వేల కనెక్షన్లు ఇచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఎం సూర్యఘర్ మరో పది వేల యూనిట్ల లక్ష్యాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నెలకు ఐదు వేల లక్ష్యంతో రెండు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. సాగు కనెక్షన్లపై దృష్టి రైతులకు రోజుకు 42 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామన్నారు. ఈ విద్యుత్ కోసం 12 సబ్స్టేషన్లలో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2027 మార్చి చివరికల్లా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. వచ్చే మూడు నెలల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పూర్తి చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో విద్యుత్ బకాయిలు కొంత ఉన్నాయని, వాటిని వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి రావాల్సిన రెవెన్యూ కూడా కొంత బాకీ ఉందన్నారు. నాగార్జునసాగర్ డ్యామ్, కాలనీల నుంచి విద్యుత్ బకాయిలు సుమారు రూ.40 కోట్ల వరకు రావాల్సి ఉందన్నారు. వాళ్లను కూడా చెల్లించాలని కోరామన్నారు. వేసవిలో ఎక్కడా లో ఓల్టేజ్ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో ఏడు నూతన సబ్స్టేషన్లు మంజూరయ్యాయని, నాలుగు చోట్ల పనులు మొదలు పెట్టారన్నారు. వచ్చే మూడు నెలల్లో మొత్తం పూర్తి చేస్తామన్నారు. మార్చి నెలలో వందశాతం రెవెన్యూ కలెక్షన్ సాధించామని, ఏప్రిల్ నెలలో ప్రభుత్వ కార్యాలయాల నుంచి బకాయిలు అందకపోవటంతో ఐదు శాతం రెవెన్యూ తగ్గిందన్నారు. టెక్నికల్ డైరక్టర్ మురళీకృష్ణ యాదవ్, ప్రాజెక్ట్ డైరక్టర్ టీవీఎస్ఎన్ మూర్తి, ఫైనాన్స్ డైరక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్ఈ పి.విజయకుమార్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. 1.91 లక్షల ఎస్సీ, ఎస్టీల గృహాలపై బిగించేందుకు చర్యలు -
విజయకీలాద్రిపై హనుమజ్జయంతి
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మంగళవారం హనుమాన్ జయంతి మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళా శాసనాలతో ఉదయం 9 గంటలకు యోగాంజనేయస్వామి వారికి తొమ్మిది కలశాలతో అభిషేకం, విశేష అలంకరణ, అనంతరం 27 అడుగుల ఏకశిల మూర్తి శ్రీ విఘ్నవిమోచక హనుమంతునికి 9 రకాల పుష్పాలతో, పండ్లతో విశేష సహస్రనామార్చన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు. బాపట్ల: సూర్యలంక బీచ్‌లో స్వదేశ్ దర్శిని 2.0లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మంగళవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): మహారాష్ట్రలోని పూణేలో ఈనెల 16 నుంచి 22 వరకు జరగనున్న జాతీయ సీనియర్ కుడో పోటీలకు గుంటూరుకు చెందిన ఆర్ సిద్ధార్థ ఎంపికయ్యాడని కుడో జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సిద్ధార్థ బంగారు పతకం సాధించాడన్నారు. దీంతో జాతీయ పోటీలకు ఎంపికయ్యాడని తెలిపారు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): యువత క్రీడల్లో రాణించడం ద్వారా జిల్లా, రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకు రావాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ తెలిపారు. గతనెల 26 నుంచి 28వ తేదీ వరకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన జాతీయ అన్ఎక్విప్డ్ ఓపెన్ సబ్ జూనియర్, జూనియర్ పవర్ లిఫ్టింగ్‌లో పతకాలు సాధించిన వారిని మంగళవారం కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ అభినందించారు. ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో తుపాకుల నాగజ్యోతి, జి.స్వాతి, కె.సత్యరామరాజు, ఎన్.ప్రణతిలు బంగారు పతకాలు సాధించారు. వినోద్‌కుమార్ రజత పతకం గెలుపొందారు. కోచ్ ఖమురుద్దీన్ ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిశారు. కలెక్టర్ క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అదికారి అఫ్రోజ్‌ఖాన్ పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 524.50 అడుగులకు చేరింది. ఇది 157.6100 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. -
వేగేశన.. భూదాహం తీరేనా!
బాపట్ల: బాపట్ల నడిబొడ్డులో విద్య, వైద్యం, ఆధ్యాత్మికత పెంపుదల కోసం క్రైస్తవ భూములైన ఏబీఎం (అమెరికన్ బాపిస్టు మిషన్) భూములపై బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ కన్ను పడింది. ఇంకేం అధికారం మనది.. మనల్ని ఆపేదెవరంటూ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 2016లో ఏబీఎం స్థలాన్ని ఆక్రమించేశారు. మళ్లీ అధికారం రావటంతో ఆ స్థలంలో మల్టీకాంప్లెక్స్ నిర్మాణానికి తెరతీశారు. ఏబీఎం ఆస్తుల జోలికి వస్తే సహించేదిలేదని మొదటి నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ అధికారం ఉంది కదా..ఏమైనా చేసుకోవచ్చనే ధోరణిలో ఎమ్మెల్యే వేగేశన ఉన్నారు. జిల్లా కేంద్రంలో నిత్యం కలెక్టర్, ఎస్పీ వంటి ఉన్నతాధికారులు తిరిగే ప్రదేశంలోనే అక్రమ కట్టడం జరుగుతున్నప్పటికీ అధికారులు ఆవైపు కన్నెత్తికూడా చూడకపోవటం చూస్తోంటే రెడ్‌బుక్ రాజ్యాంగం ఏవిధంగా సాగుతుందో ఇట్టే అర్ధమవుతుంది. స్థలం పొందింది ఇలా.. ఏబీఎం ఆస్తులకు సంబంధించి బాపట్లలో రూ.కోట్లాది విలువైన స్థలాలు ఉన్నాయి. ఇందులో అమెరికన్ బాప్టిస్ట్ మిషన్‌కు చెందిన 668/1లో 1.50ఎకరం స్థలాన్ని కాజేసేందుకు వేగేశన నరేంద్రవర్మరాజు 2016లో చక్రం తిప్పాడు. ఈమేరకు మున్సిపాల్టీలో ఖాళీస్థలం పన్ను వేయించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే అప్పటి రిజిస్ట్రార్ రిజిస్టేషన్ చేయించేందుకు అవకాశం లేదని చెప్పటంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు వివాదాలు లేకపోతే చట్టం ఏవిధంగా ఉంటే ఆవిధంగా చేయాలని చెప్పింది. ఈనిర్ణయం మేరకు ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ తన తనయుడు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆదే ప్రదేశంలో మల్టీకాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరగా.. మున్సిపల్ కౌన్సిల్ 2017 ఫిబ్రవరి 23వ తేదీన తీర్మానం నెంబరు 312పేరుతో కాంప్లెక్స్ నిర్మాణాన్ని రద్దు చేశారు. అయినప్పటికీ పనులు మొదలుపెట్టారు. దీంతో స్థానిక క్రైస్తవులు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించటంతో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి షేక్ ఆషిరీని విచారణ అధికారిగా నియమించారు. ఈమేరకు మే 16, 2016 నుంచి మే 19, 2016వరకు విచారణ చేపట్టి ఆర్సి నెంబరు 46/2016 పేరుతో అక్కడ ఎటువంటి కట్టడాలు చేయరాదని ఉత్తర్వులు ఇచ్చారు. ఈమేరకు అప్పటి తహసీల్దార్ తిరుమలశెట్టి వల్లయ్య సీఆర్పీసీ కింద 145 సెక్షన్ కింద నోటీసు కూడా జారీ చేశారు. ఏబీఎం స్థలంలో నిర్మిస్తున్న కట్టడాలుఅమెరికన్ బాప్టిస్ట్ ఫారిన్ మిషన్ కింద ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని క్రైస్తవ పెద్దలు డబ్ల్యూపీ నెంబరు 124/1994లో మద్రాసు హైకోర్టులో దావా వేశారు. ఈమేరకు 2000 సంవత్సరం నుంచి వీటిపై ఎటువంటి రిజిస్ట్రేషన్లు చెల్లవని, వాటిని పరిరక్షించాలని 2024లో మద్రాసు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే పెడచెవిన పెట్టి అక్రమ కట్టడానికి పూనుకున్నారు. ప్రజా సంఘాలు ఆందోళన చేసినప్పటికీ పట్టించుకో కుండా ముందుకుపోతున్నారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు తన కుమారుడు పేరుతో అక్రమంగా పొందిన ఏబీఎం ఆస్తుల్లో అక్రమ కట్టడాలు కట్టడం మానుకోవాలి. పేదల కోసం ఉన్న ఈ భూములను తన సొంతానికి అక్రమదారిలో చేజిక్కించుకోవటం సరి కాదు. ఈవిషయంలో అధికారులు సైతం మౌనంగా ఉండటం సరికాదు. పనులు నిలుపుదల చేసేవిధంగా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలి. – వేమవరపు విజయ్‌కుమార్, బాప్టిస్ట్ క్రిస్టియన్ ప్రాపర్టీస్ వెల్పేర్ సొసైటీ అధ్యక్షుడు -
బాపట్ల
బుధవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.4206 టీఎంసీలు.రాజుపాలెం: పెదనెమలిపురిలోని పోలేరమ్మ తిరునాళ్లను మంగళవారం వైభవంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి సారె, బోనాలు సమర్పించారు. నీట్‌ను రద్దు చేశారని తెలియడంతో విద్యార్థులంతా తీవ్ర ఆవేదనకు లోనయ్యాం. ఎవరో చేసిన తప్పిదానికి ఒక్క నిర్ణయంతో పరీక్ష మొత్తాన్ని రద్దు చేయడం తగదు. రెండేళ్లపాటు ఎన్నో ఆశలతో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొని పరీక్ష రాసి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో రద్దు నిర్ణయం కలచివేసింది. నీట్లో 720 మార్కులకు ప్రాథమిక ‘కీ’లో 691 మార్కులు వచ్చాయి. దీంతో జాతీయస్థాయిలో మెరుగైన ర్యాంకు వస్తుందని ఆశించాను. పరీక్ష నిర్వహించే సమయంలో పెట్టిన ఆంక్షలు, శ్రద్ధ పేపర్ లీకేజీ కాకుండా చూడడంలో ఎందుకు పెట్టలేదు. – వల్లెపు ధీరజ్కృష్ణ, విద్యార్థి, గుంటూరు ఎన్నో ఆశలతో మరెన్నో ఆకాంక్షలతో.. రాత్రనకా.. పగలనకా.. నిద్రాహారాలు మాని.. ఒకరకంగా ప్రాణం పెట్టి నీట్‌కు సిద్ధమయ్యారు.. సమయం కాకముందే కేంద్రాలకు చేరుకుని.. కఠిన ఆంక్షల పరీక్షలను దాటుకుని, పరీక్ష రాసి, హమ్మయ్యా.. అంటూ ఇంటికొచ్చారు.. తమకు రాబోయే ర్యాంకులు తలచుకుంటూ.. ఏఏ కళాశాలలో చేరాలో.. ఎక్కడెక్కడ సీటొస్తుందో నంటూ లెక్కలు వేసుకుంటూ.. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో నీట్ రద్దంటూ ఎన్టీఏ ప్రకటించడంతో విద్యార్థులు హతాశులయ్యారు. భవిష్యత్తుపై గంపెడాశలతో ఉన్న తమకు ఎన్టీఏ ప్రకటన శరాఘాత మైందని వాపోతున్నారు. రద్దు ప్రకటన తమ భవిష్యత్తుపై ఖచ్ఛితంగా ప్రభావం చూపుతుందని వ్యథ చెందుతున్నారు. పరీక్ష రోజు కఠిన ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టిన అధికారులు లీకేజీ విషయంలో ఎందుకు మిన్నకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. 7 -
ప్రభుత్వ స్థలం కబ్జాపై కలెక్టర్‌కు ఫిర్యాదు
మార్టూరు: రూ.కోట్లాది విలువైన ప్రభుత్వ భూమిని అధికార పార్టీ నాయకులు కాజేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని మంగళవారం జిల్లా కలెక్టర్‌కు రాజశేఖర్ అనే వ్యక్తి నుంచి ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదులోని వివరాల మేరకు.. స్థానిక జాతీయ రహదారికి పశ్చి వైపున పోలీస్ స్టేషన్, కూరగాయల మార్కెట్లకు మధ్య గల సర్వే నంబర్ ‘640ఏ’లో సుమారు మూడు ఎకరాల విస్తీర్ణం గల ప్రభుత్వ భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల మేరకు.. ఈ భూమి ప్రభుత్వానికి చెందినదే అయినప్పటికీ అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు గతేడాది పంట సాగు చేశాడు. ఈ విషయమై ప్రజా సంఘాలకు చెందిన పలువురు నాయకులు అప్పట్లో మండల తహసీల్దార్ టి.ప్రశాంతికి, బాపట్ల ఆర్డీవో గ్లోరియాకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేనందున మంగళవారం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్‌కు ఫిర్యాదు చేసినట్లు అర్జీదారు బాపట్ల జిల్లా అంబేడ్కర్ యూత్ ఫోర్స్ జిల్లా కార్యదర్శి చల్లూరి రాజశేఖర్ తెలిపారు. విచారణ తర్వాత తగిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. -
రాష్ట్రానికి జగన్ నాయకత్వం అవసరం
రేపల్లె: రాష్ట్ర అభివృద్ధికి దూరదృష్టి గల నాయకత్వం అవసరమని, అలాంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని కాంగ్రెస్ పార్టీ మాజీ ఇన్చార్జి, వ్యాపారవేత్త మోపిదేవి శ్రీనివాసరావు అన్నారు. ప్రజల మన్ననలు పొందిన నాయకుడిగా వైఎస్ జగన్ ఇప్పటికే నిరూపించుకున్నారని పేర్కొన్నారు. రేపల్లెలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చగల సామర్థ్యం వైఎస్ జగన్‌కే ఉందన్నారు. గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని గుర్తుచేశారు. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచాయని తెలిపారు. తాను రాజకీయంగా ముందుకు సాగేది కూడా వైఎస్ జగన్‌తోనేనని స్పష్టం చేశారు. ఈ నెల 14న వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో అధికారికంగా చేరనున్నట్లు ప్రకటించారు. వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రజల సేవలో నిబద్ధతతో పని చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాపట్ల: వైద్యరంగంలో వైద్యులతోపాటు నర్సుల పాత్ర కూడా కీలకమని జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ విజయమ్మ పేర్కొన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పీపీ యూనిట్లో నర్సులకు సన్మాన కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, రెడ్‌క్రాస్ చైర్మన్ బి.ఎస్.నారాయణభట్టు, నవనీతం, చల్లా లావణ్య, డీఎఫ్ఓ యశ్వంత్, జాషువా, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు టైం స్కేల్ అమలు చేయాలని వీసీ ఆచార్య కె.గంగాధరరావుకు వినతిపత్రం అందజేశారు. ఏఎన్‌యూలో మంగళవారం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ యూనియన్ అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ తిరుమలరావు ఆధ్వర్యంలో విన్నవించారు. ఆయన మాట్లాడుతూ ఆల్ ఇండియా ఎడ్వరైజ్మెంట్, యూజీసీ నిబంధనలు ప్రకారం ఏర్పాటు చేసిన ఫైవ్‌మెన్ సెలక్షన్ కమిటీ ద్వారా మెరిట్ ప్రాతిపదికన ఎంపికై 16 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నామన్నారు. ఈ నియామకాలు ఏఎన్‌యూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ద్వారా కూడా ఆమోదించబడ్డాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రకటించబడ్డ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నూతన నియామకాలు చేపట్టడానికి వర్సిటీ అధికారులు కార్యాచరణ ముమ్మరంగా జరుపుతున్నారన్నారు. కానీ దానికి ముందు జీఓ ఎంఎస్ నెంబరు 24 ప్రకారం యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌కు టైం స్కేల్ అమలు చేయడం లేదన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న వారికి పోస్టులను వారికి కేటాయించి మిగిలిన ఖాళీలను మాత్రమే రాబోయే రిక్రూట్మెంట్ ప్రక్రియలో నోటిఫై చేయాలన్నారు. అనంతరం వీసీ ఆచార్య కె.గంగాధరరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.సింహాచలంకు యూనియన్ నాయకులు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షుడు రవి, కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. యూటీఎఫ్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మోహనరావు నరసరావుపేట / నరసరావుపేట ఈస్ట్: వేసవి సెలవులు ప్రారంభం నుంచి రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల సెలవులు హరిస్తూ వివిధ కారణాలతో ఒత్తిడికి గురిచేస్తున్నారని యూటీఎఫ్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మోహనరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యా ప్రణాళిక రూపకల్పన, పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు రెమిడీయల్ తరగతుల పేరుతో ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యా ప్రణాళిక రూపొందించాలని షెడ్యూల్ విడుదల చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు విద్యా ప్రణాళికలు రూపొందించి 16వ తేదీన సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారని వివరించారు. విద్యాశాఖ వెకేషన్ డిపార్ట్మెంట్ అనే విషయాన్ని విద్యాశాఖ అధికారులు కొంత కాలంగా మరచినట్టు ఉన్నారని విమర్శించారు. గత నవంబర్లోనే రూపొందించాల్సిన విద్యా ప్రణాళికను అప్పుడు పట్టించుకోని అధికారులు వేసవి సెలవుల్లో షెడ్యూల్ జారీ చేయటం ఉపాధ్యాయులను వేధించటమేనని తెలిపారు. అధికారులు విద్యా ప్రణాళిక వాయిదా వేయాలని, లేకుంటే బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. -
‘నీట్’ కల చెదిరిన వేళ
గుంటూరు ఎడ్యుకేషన్: జాతీయ స్థాయి వైద్య విద్యా కోర్సుల ప్రవేశ పరీక్ష (నీట్ యూజీ–2026) రద్దు నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఏళ్ల తరబడి కష్టపడి సన్నద్ధమై నీట్ రాసి, జాతీయస్థాయిలో మంచి ర్యాంకు సాధిస్తామనే ధీమాతో ఉన్న విద్యార్థుల్లో ఎన్టీఏ నిర్ణయం ఆత్మ విశ్వాసాన్ని దిగజార్చింది. నీట్ నిర్వహణ సమయంలో దేశంలో ఏ ఒక్క పోటీ పరీక్షకు లేని విధంగా మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు, విద్యార్థుల వస్త్రధారణ, ఆభరణాలు, చేతికి పెట్టుకునే వాచీలపై ఆంక్షలు విధించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పేపర్ లీకేజీని అరికట్టడంలో ఘోరంగా విఫలమైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈనెల 3వ తేదీన జరిగిన నీట్‌కు గుంటూరు జిల్లాలో 8,299 మంది విద్యార్థులు హాజరయ్యారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను అధిగమించి, ఆత్మ విశ్వాసంతో పరీక్ష రాసిన విద్యార్థులు లీకేజీ కారణంగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ఎన్టీఏ ప్రకటించగానే తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు. నిరాశ, నిస్పృహలో విద్యార్థులు దేశ వ్యాప్తంగా ఎయిమ్స్ వంటి కేంద్ర ప్రభుత్వ వైద్య విద్యాసంస్థలతోపాటు, రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశించేందుకు జాతీయస్థాయిలో నిర్వహించే ఏకై క ప్రవేశ పరీక్ష నీట్‌కు తీవ్రమైన పోటీ నెలకొంటుంది. దేశ వ్యాప్తంగా భర్తీ చేసే లక్షా 12వేల సీట్లకు గానూ ఈనెల 3న జరిగిన నీట్‌కు 22 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. 720 మార్కులకు ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించే నీట్‌కు తీవ్రమైన పోటీ నెలకొనడంతో విద్యార్థులు 6వ తరగతి నుంచే నీట్ ఫౌండేషన్ శిక్షణ తీసుకోవడం ప్రారంభిస్తుంటారు. నీట్ రాసి ఫలితాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించడంతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. -
వసతి గృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
నరసరావుపేట: జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో ఉచిత ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో అందుకు సంబంధించిన కరపత్రాలను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భం ఆమె మాట్లాడుతూ 3 నుంచి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ చదివే విద్యార్థినులు, విద్యార్థులకు వేరు వేరు వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయన్నారు. దరఖాస్తులు గ్రామ సచివాలయం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వసతి గృహ సంక్షేమాధికారులు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారుల కార్యాలయాల్లో పొందాలని సూచించారు. ఇన్చార్జి జిల్లా ఎస్సీ సంక్షేమం, సాధికారత అధికారి కె.సంతోష్ కుమార్, వసతి గృహ సంక్షేమ అధికారులు జయప్రద, రాణమ్మ, రాజేశ్వరి, రామాంజనేయులు, వెంకటేశ్వర నాయక్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పొంగిపొర్లిన నిర్లక్ష్యం
వేమూరు: ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపమైంది. కాల్వల్లోకి నీరు అధికంగా విడుదల చేయడంతో పాటు, కాల్వలు మరమ్మతులు చేయకపోవడం, గుర్రపు డెక్క తొలగించకపోవడం వంటి కారణాలతో నీరు పొంగిపొర్లి పంటపొలాల్లో నిలిచాయి. వివరాల్లోకి వెళితే.. చుండూరు మండలంలోని తుంగభద్ర సైడ్ చానల్‌కు అధికారులు తాగు నీరు విడదల చేశారు. తుంగ భద్ర సైడ్ చానల్‌లోని కట్టలు బలహీనంగా ఉండటం, వంతెనల వద్ద తూటి కాడ నిలిచి పోవడంతో నీరు పారుదల కాకపోవడంతో నీరు నడిగడ్డవారిపాలెం పొలాల్లోకి చేరింది. దీంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా పొలం గట్ల నుంచి నీరు పొర్లి పక్కనే ఉన్న జగనన్న కాలనీలోకి సైతం వెళ్లి కాలనీ జలమయమయింది. ఇప్పటికై నా ఇరిగేషన్ అధికారులు కల్పించుకుని దుండిపాలెం గ్రామం వద్ద కోతకు గురైన కాల్వ కట్ట మరమ్మతులు చేపట్టాలని, అదేవిధంగా కాల్వలో గుర్రపుడెక్క, వ్యర్థాలు తొలగించాలని రైతులు కోరారు. ● ఘటనపై ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజినీరు రవీంద్రను వివరణ కోరగా.. దిగువ ప్రాంతాలకు తాగు నీరు అధికంగా విడుదల చేయడంతో చుండూరు మండలంలోని పొల్లాలోకి, జగనన్న కాలనీకి నీరు వెళ్లినమాట వాస్తవమేనని, తాగునీరు విడుదల తగ్గించడం జరిగిందని తెలిపారు. -
హెచ్‌పీవీ వ్యాక్సిన్ లక్ష్యాలు పూర్తి చేయాలి
కారంచేడు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సిన్ లక్ష్యాలను వైద్య సిబ్బంది ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని బాపట్ల జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ సీహెచ్ రత్నమన్మోహన్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని కారంచేడు, దగ్గుబాడు పీహెచ్‌సీల వైద్యాధికారులు, సూపర్వైజర్లతోపాటు పర్చూరు కో లొకేటడ్ పీహెచ్సీ వైద్య సిబ్బందితోనూ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 15వ తేదీలోగా మీ పీహెచ్‌సీల పరిధిలో ఉన్న 15 ఏళ్లలోపు బాలికలను గుర్తించి వారికి ఈ వ్యాక్సిన్ అందించాలన్నారు. బాలికలకు ఈ వ్యాక్సిన్ అందించడం వలన కలిగే మేలు తెలియజేయాలని సూచించారు. వ్యాక్సిన్ వేయించుకోవడం వలన సర్వైకల్ క్యాన్సర్నును నివారించుకోవచ్చని ఆయన తెలిపారు. మూడు పీహెచ్‌సీల పరిధిలోనూ చాలా తక్కువ మందికే వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందని వైద్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో కారంచేడు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ పృథ్వీరాజ్, పర్చూరు కో లోకేటెడ్ వైద్యాధికారి డాక్టర్ సాయిప్రశాంతి, దగ్గుబాడు పీహెచ్సీ వైద్యాఽధికారి డాక్టర్ డాక్టర్ హరిత, హెల్త్ సూపర్వైజర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
నూతన విద్యాసంవత్సరం ప్రారంభానికి ఏర్పాట్లు చేయండి
బాపట్ల: జిల్లాలో నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన విద్యారంగ సమీక్ష సమావేశంలో విద్యార్థులకు కిట్స్ పంపిణీ, పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల హాజరు, యూడైస్ డేటా, మధ్యాహ్న భోజన పథకం, ఎఫ్ఎల్ఎన్కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. పీఎంశ్రీ పథకం, సీసీ టీవీ ఏర్పాటు, అనీమియా నివారణ చర్యలు, నైపుణ్యాభివృద్ధి, కెరీర్ కౌన్సెలింగ్, హాస్టల్ నిర్వహణ, ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో స్కిల్ డెవలప్మెంట్, జాబ్‌మేళాలు, వయోజన విద్య, అక్షర ఆంధ్ర కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో డీఈవో శ్రీనివాస్ సింగ్, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారిని మాధవి అధికారులు పాల్గొన్నారు. నైబర్ హుడ్ వర్క్ స్పేస్ కల్పనకు దరఖాస్తులు ఆహ్వానం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ నైబర్ హుడ్ వర్క్ స్పెస్ పాలసీ 2025–30 కింద పని స్థలాన్ని లీజుకు ఇవ్వదలచిన వర్క్ డెవలపర్ల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ వి.వినోద్‌కుమార్ -
అంతర్జాతీయ పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులు
మంగళగిరి టౌన్: పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గుంటూరు జిల్లాకు చెందిన క్రీడాకారులు పతకాలు సాధించినట్లు గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ భాస్కరరావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళగిరిలోని తమ కార్యాలయంలో మంగళవారం విజేతల వివరాలు వెల్లడించారు. ఈనెల 10వ తేదీ నుంచి చైనాలో జరుగుతున్న ఏషియన్ సబ్ జూనియర్, జూనియర్ (మెన్ అండ్ ఉమెన్) క్లాసిక్ అండ్ ఎక్యూప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో తెనాలికి చెందిన వినయశ్రీ, జ్ఞాన దివ్య మహిళా పవర్ లిఫ్టర్లు పాల్గొని పతకాలు సాధించినట్లు తెలియజేశారు. వినయశ్రీ 84 కేజీల విభాగంలో సబ్ జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించిందని, జ్ఞాన దివ్య +84 కిలోల విభాగంలో జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీ ల్లో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించినట్లు వివరించారు. అంతర్జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారులను అసోసియేషన్ సభ్యులు అభినందించారు. పతకాలు సాధించిన క్రీడాకారులు -
న్యాయమూర్తులకు పదోన్నతులు
గుంటూరు లీగల్: రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు జూనియర్ సివిల్ జడ్జి న్యాయమూర్తులకు పదోన్నతులు కల్పించి బదిలీలు చేశారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా కోర్టుకు జూనియర్ డివిజన్ న్యాయమూర్తులుగా పి.రాజశేఖర్ రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి, తెనాలి నుంచి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, గుంటూరుకు వస్తున్నారు. పీడీఎం కోర్టు జడ్జి స్పెషల్ మొబైల్ కోర్టు, గుంటూరుకు బదిలీ అయ్యారు. జె.అంజయ్య ఉదయగిరి, నెల్లూరు జిల్లా నుంచి రైల్వే కోర్టు, గుంటూరుకు వస్తున్నారు. వి.రఘునాథ్ ఏలూరు నుంచి మూడవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, గుంటూరుకు వస్తున్నారు. వస్తున్నట్లు సమాచారం. దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయ వార్షికోత్సవ సంబరాలు సోమవారం ఐదో రోజుకు చేరాయి. అమ్మవారు గాయత్రిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఆలయ ఆవరణలో చండీ హోమం నిర్వహించారు. ఉదయం అమ్మవారి ఉత్సవ విగ్రహాలను చిలువూరు, తుమ్మపూడి, మంచికలపూడి, కంఠంరాజుకొండూరు గ్రామాలలో ఊరేగించారు. మహిళలు అమ్మవారికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనక తప్పెట్లు, మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామోత్సం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై హనుమజ్జయంతి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా త్రిదండి చిన్న జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో సోమవారం దాసాంజనేయస్వామి వారికి అభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగిందని తెలిపారు. కార్యక్రమానికి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌రావు విచ్చేసి స్వామివారి మంగళాశాసనాలు అందుకున్నారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు విజయకీలాద్రి దివ్యక్షేత్ర హనుమత్ విజయయాత్ర విజయవాడ రథం సెంటర్ నుంచి సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రం వరకు కొనసాగిందని, భక్తులు అధిక సంఖ్యలో ఈ విజయయాత్రలో పాల్గొన్నారని తెలిపారు. పొన్నూరు: పట్టణంలోని సహస్రలింగేశ్వరస్వామి, వీరాంజనేయస్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా సోమవారం తెల్లవారుజామున పంచామృత అభిషేకం, మధ్యాహ్నం లక్ష తమలపాకులు పూజ అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం స్వామి వారు ఒంటె వాహనంపై నిర్వహించిన గ్రామోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ ఆకురాతి శ్రీనివాసరావు, ధర్మకర్త సభ్యులు పర్యవేక్షించారు. మంగళవారం ఉదయం 4 గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకం, 7 గంటలకు విశేష అలంకరణ, 12 గంటలకు లక్ష తమలపాకుల పూజ, సాయంత్రం 7 గంటలకు స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు భక్తులు పాల్గొనాలని ఈఓ శ్రీనివాసరావు కోరారు. -
నేతన్నకు గుండె గుబిల్లు
చీరాల అర్బన్: గత ఎన్నికల ప్రచారంలో చేనేతలకు టీడీపీ వరాల జల్లు కురిపించింది. నేతన్నలు నమ్మారు. ఓట్లు వేశారు. తరువాత సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, సవితలు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. నేతన్న నేస్తం అమలు లేదు. మగ్గాలు ఉన్న వారికి 200 యూనిట్లు, మరమగ్గాల వారికి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అమలు రెండేళ్లు అటకెక్కింది. ఈ క్రమంలో ఏరు దాటేదాక ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా చంద్రబాబు సర్కార్ తమను చూస్తోందని నేతన్నలు పలు రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. దీంతో నేతన్నలకు ఉచిత విద్యుత్‌ను ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్పారు. అయితే అర్హుల జాబితా తయారీలో నిబంధనల పేరుతో వడపోత పోశారు. కోతలు పెట్టారు. అంతిమంగా జాబితాలో పేరున్నా పలువురికి ఏప్రిల్ నెల కరంట్ బిల్లులు కట్టాలని చెప్తున్నారు. కొందరుకి 200 యూనిట్లు కన్నా అదనంగా మీటర్ రీడింగ్ వచ్చిందని బిల్లులు చెల్లించమంటున్నారు. సాధారణంగా 2,3 తారీఖులలో తీసే మీటర్ రీడింగ్‌ను కూడా ఆలస్యంగా నమోదు చేశారు. మరి కొందరిని అనర్హులను చేయటమే లక్ష్యం. ఇక ఉపవృత్తుల వారికి మొండి చెయ్యి చూపారు. మాయ మాటలు చెప్పటం చంద్రబాబు నైజం. అతని మాటలు నమ్మి మోసపోవటం మన తప్పని పలువురు చేనేత కార్మికులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉచిత విద్యుత్ అమలు ఉందని మండిపడుతున్నారు. జిల్లాలో సుమారు 8వేల మగ్గాలు జిల్లాలో సుమారు 8వేల మగ్గాలు ఉన్నాయి. రెండేళ్లుగా నేతన్న నేస్తం ఊసే లేదు. నేతన్నల ఆందోళనల నేపథ్యంలో కంటి తుడుపుగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ను ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్పారు. అందుకు దరఖాస్తు చేసుకోమన్నారు. ఆదిలోనే హంసపాదు అన్నట్లు దరఖాస్తుల నమోదు ప్రక్రియలోనే బాలారిష్టాలతో పలువురు ఆ పథకానికి దూరమయ్యారు. నిబంధనల పేరుతో వడపోత...కోతలు జిల్లాలో 6,275 మంది నేతన్నలు ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అంటే దరఖాస్తు సమయంలోనే సుమారు 2వేల మంది దూరమయ్యారు. పరిశీలనల పేరుతో 6,275 దరఖాస్తులలో 310 దరఖాస్తులను తిరస్కరించారు. మొత్తం మీద చీరాల డివిజన్ పరిధిలోని సింహభాగం ఉన్నాయి. డివిజన్ పరిధిలో మొత్తం దరఖాస్తుదారులు 5,536 మంది కాగా అందులో 4,625 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. ఇలా వడపోతలు, కోతలే లక్ష్యంగా అంతిమంగా లబ్ధిదారుల జాబితా తయారైంది. మీటర్ రీగిండ్ నమోదులోను జాప్యం సాధారణంగా ప్రతి నెల 2,3 తేదీల్లో మీటర్ రీడింగ్ చూచి, ఎన్ని యూనిట్లు వినియోగించుకుంది నమోదు చేస్తారు. ఏప్రిల్ నెల రీడింగ్ మే 2,3 తేదీల్లో నమోదు చేయాలి. అక్కడ కూడా జాప్యం చేశారు. ఎందుకంటే రెండు, మూడు రోజులు తరువాత రీడింగ్ తీస్తే వినియోగించిన యూనిట్లు కొందరికై నా 200 దాటుతుందని. అంటే అంతిమంగా ఉచిత విద్యుత్ అని గొప్పగా ప్రచారం చేసుకుంటూ, అర్హుల సంఖ్యను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా ఆద్యంతం అధికారులు కష్టపడ్డారు. అలా పై నుంచి వారికి దిశా నిర్దేశం జరిగిందని ఆ శాఖలకు సంబంధించిన కొందరు చర్చించుకున్నారు. అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు .. ఉపవృత్తుల వారికి మొండిచెయ్యి అబద్ధాలు చెప్పటం టీడీపీ నేతలకు కొత్తేమీ కాదు. అయితే అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలను అమలు చేయకపోతారా అని ఉపవృత్తులు వారు ఒకింత ఆశ పడ్డారు. నేతన్నల దత్తపుత్రునిగా చెప్పుకున్న మంత్రి లోకేష్ చెప్పిన మాటలు, అసెంబ్లీలో చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ మగ్గం ఉన్న నేతన్నలకు అమలయ్యే పథకాలన్నీ, చేనేత ఉపవృత్తుల వారికి వర్తించే విధంగా చర్యలు చేపడతామని చెప్పటం. సీఎం చంద్రబాబు చేసిన వాగ్దానాలను మననం చేసుకుని మురిసిపోయిన తమకు మొండిచెయ్యి చూపారని చేనేత ఉపవృత్తుల వారు మండిపడుతున్నారు. మొత్తం మీద చేనేత రంగానికి చెందిన అందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డివిజన్ పరిధిలో 5,536 దరఖాస్తులు అందాయి. అంతిమంగా అందులో 4,625 మందిని అర్హులుగా గుర్తించాం. ప్రస్తుతం రీడింగ్ తీయడం పూర్తయ్యింది. అర్హుల జాబితాలో ఉన్నవారు ఒక వేళ 200 యూనిట్లు కన్నా ఎక్కువ వినియోగించుకుంటే వారు బిల్లు ఎప్పటి మాదిరిగానే చెల్లించాల్సిందే. అలా ఎంత మంది ఉంటారనేది 13వ తేదీ నాటికి తెలుస్తుంది. ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం పని చేస్తున్నాం. – జాన్ ధామస్, విద్యుత్‌శాఖ ఈఈ, చీరాల డివిజన్, చీరాల మాది ఆసుమిషన్ పని. అదే మాకు జీవనాధానం. చేనేత బట్ట తయారు ప్రాథమికంగా చేసే పని మాదే. ఉపవృత్తులకు కూడా మగ్గం ఉన్నవారితో పాటు అన్ని పధకాలకు అర్హత కల్పిస్తామన్నారు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదు. ఇదేం న్యాయం. – జానకిరామయ్య, చేనేత ఉపవృత్తిదారుడు,పేరాల -
వ్యక్తి అనుమానాస్పద మృతి
ఘంటసాల: మండలంలోని ఘంటసాలపాలెం గ్రామంలో ఓ వ్యక్తి సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్ఐ వేమన చందన కథనం మేరకు.. బాపట్ల జిల్లా, అమృతలూరు మండలం ముల్పూరు గ్రామానికి చెందిన ఇంటూరి రమేష్ (42) ఘంటసాల మండలం చిట్టూర్పు గ్రామానికి చెందిన ఓ మహిళతో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. వారు ఘంటసాలపాలెంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రెండు రోజుల క్రితం రమేష్‌తో సహజీవనం చేస్తున్న మహిళ అనారోగ్యం బారిన ఊపడి చిట్టూర్పు గ్రామానికి వెళ్లింది. రమేష్ ఒక్కడే ఇంటిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతను సోమవారం ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రమేష్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్య చేసుకునేందుకు గల కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని ఎస్ఐ చందన తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. గుంటూరు లీగల్: గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడిన వ్యక్తికి కోర్టు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామానికి చెందిన గుండిమెడ అంథోని గంజాయి విక్రయిస్తున్న సమయంలో మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును విచారించిన గుంటూరు మొదటి అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వి.ఎ.ఎల్.సత్యవతి నిందితుడికి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. కేసులో ప్రభుత్వం తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.అశోకవాణి వాదనలు వినిపించారు. -
పోలీసుల అదుపులో వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్
పెదకాకాని: ఇన్‌స్ట్రాగామ్‌లో స్థానిక ఎమ్మెల్యేపై పోస్ట్ చేశారనే ఆరోపణలతో వైఎస్సార్ సీపీ చేబ్రోలు మండల సోషల్ మీడియా కన్వీనర్, చేబ్రోలు 4వ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యుడు ఇంటూరి జైపాల్‌రెడ్డిని పెదకాకాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేబ్రోలు మండలానికి చెందిన జైపాల్‌రెడ్డి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌పై అసభ్యకరమైన పోస్టు పెట్టారని పెదకాకానికి చెందిన టీడీపీ కార్యకర్త దాసరి నరసింహారావు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కార్యకర్త ఫిర్యాదు మేరకు సోమవారం సాయంత్రం జైపాల్‌రెడ్డి అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా కన్వీనర్‌పై కేసు నమోదు చేసి ఉపయోగించిన రెండు ఫోన్లు, లాప్టాప్ సీజ్ చేసినట్లు పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామి తెలిపారు. అలానే ఎమ్మెల్యేపై మొక్కజొన్న దొంగల గ్యాంగ్ లీడర్ నరేంద్ర, రైతులు రేటు లేదు దొంగలకు డబ్బుల ముద్ద అనే పోస్ట్‌లు పెట్టారని రామాంజనేయులు, వినోద్‌లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు గుంటూరు లీగల్: బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి పోక్సో కోర్టు జైలు శిక్ష విధించింది. వివరాలు.. పల్నాడు జిల్లా కోసూరు మండలం పెరికపాడుకు చెందిన మందా నాగరాజు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో స్నేహంగా ఉన్నాడు. నాగరాజు మద్యం తాగేందుకు అతడిని పిలవడంతో భార్య మందలించింది. నాగరాజు ఒంటరిగా మద్యం తాగాడు. అనంతరం రాత్రి సుమారు 12 గంటల సమయంలో స్నేహితుడి ఇంటికి వెళ్లి, అందరూ నిద్రిస్తున్న సమయంలో అతడి కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, విచారణలో నిందితుడిపై నేరం రుజువు కావడంతో గుంటూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎస్.కె.షమీ పర్వీన్ సుల్తానా బేగం నిందితుడికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధించారు. కేసు దర్యాప్తులో ఎస్ఐలు ఎం.నారాయణ, బి. అనంతకృష్ణ, కోర్టు కానిస్టేబుల్(ప్రస్తుతం ఏఎస్ఐ) శ్రీనివాసరావు కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీగల దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీలు కొరిటెపాడు(గుంటూరు): విద్యుత్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి రూ.5.31 లక్షలు అపరాధ రుసుం విధించారు. విజిలెన్స్ విభాగం, ఆపరేషన్ విభాగం సంయుక్తంగా గుంటూరు పర్యవేక్షక ఇంజినీర్ సీహెచ్ రమేష్ ఆధ్వర్యంలో గుంటూరు డీ–1 సెక్షన్ పరిధిలోని బ్రాడీపేట, అరండల్‌పేటలలో సోమవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. 4,750 సర్వీసులను తనిఖీ చేశారు. అనుమతించిన లోడు కంటే అదనంగా విద్యుత్ వాడుతున్న 108 మందికి రూ.5.05 లక్షలు, అనుమతించిన కేటగిరి కాక ఇతర కేటగిరిలో విద్యుత్ వాడుకుంటున్న ఐదుగురికి రూ.26 వేలు కలిపి మొత్తంగా రూ.5.31 లక్షలు అపరాధ రుసుం విధించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఎస్ఏ కరీం, పఠాన్ హుస్సేన్ ఖాన్ మాట్లాడుతూ విద్యుత్ సర్వీసుల తనీఖీలు భారత విద్యుత్ చట్టానికి లోబడి ఉంటాయన్నారు. ఫిర్యాదుల కోసం 9440812263, 9440812361 నంబర్లును సంప్రదించాలని వారు కోరారు. తనిఖీల్లో డీఈఈలు షేక్ ముస్తాక్ అహ్మద్, మల్లికార్జున ప్రసాద్, రవికుమార్, ఏఈఈలు, కె.అక్కిరెడ్డి, శివశంకర్, సతీష్‌కుమార్ పాల్గొన్నారు. ఏఎన్‌యూ ప్రొఫెసర్‌కు అరుదైన గౌరవం ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, ఏఎన్‌యూ సోషియాలజీ సోషల్ వర్క్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సరస్వతి రాజు అయ్యర్, జెండర్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ కన్సల్టింగ్ వారి గ్లోబల్ రోస్టర్ ఆఫ్ జెండర్ ఎక్స్‌పర్ట్‌గా ఎంపికయ్యారు. ఆ సంస్థ యొక్క డైరెక్టర్లు, వ్యవస్థాపకులైన నికోలా, లీ నుంచి ఉత్తర్వులు అందుకున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య కె.గంగాధరరావు సోమవారం ప్రొఫెసర్ సరస్వతి రాజు అయ్యర్‌ను అభినందించారు. -
అంతర్ జిల్లాల బాస్కెట్ బాల్ జట్టు ఎంపిక
గుంటూరు ఎడ్యుకేషన్: బాస్కెట్ బాల్ అంతర్‌జిల్లాల సబ్‌జూనియర్ బాల, బాలికల జట్ల ఎంపిక ప్రక్రియ సోమవారం నిర్వహించారు. లక్ష్మీపురంలోని శ్రీ పాటిబండ్ల సీతారామయ్య సీబీఎస్ఈ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. ఎంపిక ప్రక్రియను ఏపీ స్టేట్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ కోశాధికారి రేవతి, జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్, చీఫ్ సెలెక్టర్ గుంటుపల్లి హరగోపాల్ సమక్షంలో శిక్షకులు కోరగంటి రవి, చావల శ్రీను, సురేష్, అనిల్ సూర్య నిర్వహించారు. అంతర్ జిల్లాల సబ్–జూనియర్ బాల, బాలికల బాస్కెట్ బాల్ చాంపియన్న్షిప్కు గుంటూరు జిల్లా జట్టు తరుఫున బాలుర విభాగం నుంచి లోహిత్ కుమార్, నిమేష్ రెడ్డి, అథర్వ్, లోహిత్, ప్రీతం పాల్, శశాంక్, తనీష్, ఇషాంత్, మోక్షిత్, సాయి శివ నాగ్, కార్తికేయ, నాగార్జున, అలీ, షాజాద్, బోడేశ్వర్, ధ్రువేష్ చౌదరి ఎంపికయ్యారు. బాలికల విభాగం నుంచి భూమి, మహిత, దీప్తి, దీక్షిత, పార్నవి, బృంద సాయి, సాన్విత, వేధన్షి, పల్లవి, రాగ వర్షిణి, తన్వి, కావ్య, యాషిక, లీష్మ లను ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు చిత్తూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో గుంటూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారు. -
వైభవంగా హనుమాన్ గ్రామోత్సవం
పట్నంబజారు: అంజనీ సుతుడు ఆంజనేయస్వామి గ్రామోత్సవం సోమవారం రాత్రి కనుల పండువగా నిర్వహించారు. గుంటూరు నగరం నాజ్ సెంటర్లోని ఆంజనేయస్వామి దేవస్థానం నుంచి ఆంజనేయ దీక్షాపరులు, భక్తులు భారీ ఊరేగింపు నడుమ ఆంజనేయస్వామి వారి ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు బ్రహ్మోత్సవాన్ని నిర్వహించారు. ప్రదర్శనలో భాగంగా క్రేన్‌తో ఏర్పాటు చేసిన హనుమాన్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, స్వామి వారి వేషధారణలు, డప్పులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నాజ్ సెంటర్లో ప్రారంభమైన ఊరేగింపు భాస్కర్ డీలక్స్, కొత్తపేట శనక్కాయల ఫ్యాక్టరీ సెంటర్, శివాలయం, భగత్ సింగ్ బొమ్మ సెంటర్ మీదుగా లాలాపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరుకుని తిరిగి అక్కడ నుంచి హిమని కూల్ డ్రింక్ సెంటర్, జిన్నాటవర్ సెంటర్ మీదుగా తిరిగి ఆంజనేయస్వామి దేవస్థానానికి చేరుకుంది. అశేష భక్త సందోహం మధ్య జరిగిన ప్రదర్శన కార్యక్రమంలో నగర ప్రజలు స్వామివారినీ మనసారా స్మరించుకుంటూ నమస్కరించుకున్నారు. ఆలయ ఈవో టి సుభద్ర పర్యవేక్షణలో, శ్రీ హనుమాన్ దీక్ష సమాజం గౌరవాధ్యక్షులు టీవీ సుబ్బారావు ఆధ్వర్యంలో గ్రామోత్సవం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో గ్రూప్ ఆలయాల పాలకమండల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేడు ఘటాభిషేకం హనుమజ్జయంతి పురస్కరించుకుని నాజ్‌సెంటర్‌లోని ఆంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం ఉదయం విశేష పూజలు నిర్వహించనున్నారు. ప్రతిఏటా సాంప్రదాయంగా నిర్వహించే ఘటాభిషేకం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతోందని నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ ఈఓ, దీక్ష సమాజం సభ్యులు కోరారు. -
మర్రిపూడి విద్యార్థికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం
బాపట్లటౌన్: చిన్నతనంలోనే గిన్నిస్ వరల్డ్ రికార్ట్స్‌లో స్థానం దక్కించుకున్న ఘనత మర్రిపూడి గ్రామానికి చెందిన అభిషేక్ పాల్‌కు దక్కింది. బాపట్ల మండలం మర్రిపూడి గ్రామానికి చెందిన డాక్టర్ గుమ్మడి సుధాకర్, స్వర్ణలత దంపతుల కుమారుడు అభిషేక్ పాల్ 9వ తరగతి చదువుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న హైదరాబాద్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు భారీ సంగీత కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా 22 దేశాల నుంచి 2000 మంది సంగీత కీబోర్డ్ వాయిద్యకారులు పాల్గొని నిమిషంలో సప్తస్వరాలు, ఒక గంటపాటు కీబోర్డు ఆపకుండా వాయించడంపై పోటీలు నిర్వహించారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన అభిషేక్‌పాల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకున్నారు. ఈనెల 9న విజయవాడలోని హల్లెల్ సంగీత పాఠశాలలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు అభిషేక్పాల్కు సర్టిఫికెట్, మెడల్ అందజేశారు. అభిషేక్పాల్ను గ్రామస్తులు, సంఘపెద్దలు ప్రత్యేకంగా అభినందించారు. -
అర్జీలను బాధ్యతతో పరిష్కరించాలి
బాపట్ల: బాధితుల నుంచి అందే అర్జీలను అధికారులు బాధ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ అన్నారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. తన పరిధిలోని వాటికి ఆయన అక్కడికక్కడే పరిష్కారం చూపగా, కొన్నింటిని పరిశీలన, మరికొన్నింటిని విచారణకు ఆదేశిస్తూ ఆయా శాఖల అధికారులకు పురమాయించారు. పీజీఆర్ఎస్ లో 138 అర్జీలు నమోదు అయ్యాయి. పీజీఆర్ఎస్ పరిష్కారంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని చెప్పారు. అర్జీలను క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలన చేయాలన్నారు. వేగంగా విచారణ జరపాలన్నారు. ఇకనుంచి ప్రతిరోజూ, వారానికి, నెల రోజులకు దశలవారీగా పర్యవేక్షణ, సమీక్ష సమావేశాలు జరుగుతాయన్నారు. మండల స్థాయి అధికారులంతా ప్రతి సోమవారం మండలాలలో జరిగే పీజీఆర్ఎస్లో హాజరుకావాలని ఆదేశించారు. గైర్హాజరైతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మండల స్థాయిలో అత్యధికంగా చెరుకుపల్లిలో 11 అర్జీలు పెండింగ్‌లో ఉండడంపై ఆరా తీశారు. దేవదాయ శాఖలో 48 అర్జీలు, జలవనరుల శాఖలో 11 అర్జీలు నమోదు కావడంపై సమీక్షించారు. కర్లపాలెం మండలంలో వచ్చిన అర్జీలను ఆన్లైన్లో నిక్షిప్తం చేయకపోవడంపై తహసీల్దార్‌ను మందలించారు. పీజీఆర్ ఎస్ అర్జీల పరిష్కారంపై వ్యక్తిగతంగా ప్రజల అభిప్రాయ సేకరణ చేపడతామన్నారు. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న 261 పీజీఆర్ఎస్ అర్జీలపై ఆడిట్ చేయాలని ఆదేశించారు. జన గణన వెంటనే ప్రారంభించండి జనగణన ప్రక్రియ నేటికీ మొదలుకాని ప్రాంతాలలో వేగంగా ప్రారంభించాలని సూచించారు. జనగణన ప్రక్రియ సమర్థంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. స్కిల్ హబ్‌లు సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు. నైపుణ్యాభివృద్ధి జిల్లా స్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 5,520 మంది యువతను నైపుణ్య అభివృద్ధి సంస్థలో నమోదు చేయించాలన్నారు. వారందరి నైపుణ్యాలపై విరివిగా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన స్కిల్ హబ్‌ల ద్వారా శిక్షణలు ప్రారంభించాలన్నారు. త్రైమాసిక ప్రణాళిక ఆధారంగా శిక్షణలు కొనసాగించాలన్నారు. ఇందులో ఎలాంటి జాప్యం ఉండరాదని పలు సూచనలు చేశారు. జిల్లాలోని యువతీ, యువకుల నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడం, జాబ్‌మేళా నిర్వహించడం కమిటీలోని అధికారులకు లక్ష్యం కావాలన్నారు. ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, ప్రభుత్వ ప్రాధాన్యతను గుర్తించి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో జి.గంగాధర్ గౌడ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.విజయమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సముద్రంలో ముగ్గురు గల్లంతు
బాపట్లటౌన్: సముద్రస్నానాలు చేస్తూ ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి ముగ్గురు గల్లంతైన ఘటన సోమవారం సూర్యలంక తీరంలో చోటుచేసుకుంది. కర్లపాలెం మండలం చింతాయపాలెం గ్రామానికి చెందిన గోవతోటి మణిషా, గోవతోటి పవిత్ర, గోవతోటి సంతోష్‌లతో కలిసి సోమవారం సముద్రస్నానాలు చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి సముద్రంలో కొట్టుకుపోయారు. తీరంలో విధులు నిర్వర్తిస్తున్న మైరెన్ పోలీసులు తక్షణమే స్పందించి ముగ్గురిని కాపాడారు. ముగ్గురు ప్రాణాలు కాపాడిన మైరెన్ ఏఎస్ఐ కె.వెంకటేశ్వర్లు, హెడ్‌కానిస్టేబుల్ టి.శ్రీనివాసరావు, హోంగార్డు కె.నాగరాజు, కె.ఆశీర్వాదంలను మైరెన్ సీఐ, డీఎస్పీలు ప్రత్యేకంగా అభినందించారు. సత్వరమే స్పందించి కాపాడిన మైరెన్ పోలీసులు -
ఇసుక భూముల్లో నమూనాల సేకరణ
చినగంజాం: ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి స్థానిక వ్యవసాయ భూముల రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా భగర్భ గనులు శాఖ అధికారులు సోమవారం ఇసుక నమూనాలు సేకరించారు. జిల్లా భూగర్భ గనుల శాఖ టెక్నికల్ అసిస్టెంట్ దమయంతి ఆధ్వర్యంలో చినగంజాం సర్వే నంబర్ 828, మోటుపల్లి సర్వే నంబర్ 128లో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపారని ఆరోపించిన ప్రాంతంలో మొత్తం ఆరు నమూనాలను సేకరించారు. మండలంలోని సోపిరాల గ్రామానికి చెందిన రైతులు అనుమాలశెట్టి శ్రీరామకృష్ణ తదితర రైతులు ఆ ప్రాంతంలో తమ వ్యవసాయ భూములున్నాయని ఇసుక అక్రమ తవ్వకాలు జరపడం వలన తమ భూములకు సాగు నీరు లేకుండా పోతుందన్నారు. గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో అప్పుడు విచారణ జరిపిన రెవెన్యూ అధికారులు ఆ భూములలో సాధారణ ఇసుక మాత్రమే ఉందని తవ్వకాలు జరగకుండా నిలిపివేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు నివేదిక పంపారు. అటు తరువాత స్థానిక రైతులు ఆప్రాంతంలో సాధారణ ఇసుక మాత్రమే కాదని విలువైన సిలికాన్ ఇసుక కూడా ఉందని భూగర్భగనులశాఖతో సర్వే చేయించాలని కోరడంతో సంబంధిత శాఖాధికారులు సోమవారం ఘటనా స్థలానికి వచ్చి నమూనాలను సేకరించారు. కార్యక్రమంలో భూగర్భ గనులశాఖ కార్యాలయ సబార్డినేట్ అధికారి మహేష్, రెవెన్యూ అధికారులు నాగరాజు, స్థానిక రైతులు పాల్గొన్నారు. -
14న నాట్కో సెంటర్లో పెట్ స్కాన్ ప్రారంభం
గుంటూరు మెడికల్: క్యాన్సర్ వైద్యంలో రాష్ట్రానికే తలమానికంగా ఉన్న గుంటూరు జీజీహెచ్ లోని నాట్కో సెంటర్ మరింత అధునాతన సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. నాట్కో సెంటర్ విభాగంలో ఈ నెల 14న పెట్ స్కాన్ సెంటర్ ప్రారంభించనున్నారు. సోమవారం దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ పరిశీలించారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కలిసి ప్రారంభిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, తదితరులు ఉన్నారు. -
‘ఇంజినీరింగ్’ పరీక్షలకు వేళాయె!
● రేపటి నుంచి 20 వరకు ఏపీ ఈఏపీసెట్–2026 ● 12 నుంచి 18వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు ● 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ● ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా హాజరు కానున్న 46,168 మంది విద్యార్థులు ● మూడు జిల్లాల్లో 21 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2026 (గతంలో ఎంసెట్) ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టులు (సీబీటీ) మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 18వ తేదీ వరకు ఇంజినీరింగ్, ఈనెల 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి. కాకినాడలోని జేఎన్టీయూ భాగస్వామ్యంతో ఏపీ ఈఏపీసెట్–2026ను నిర్వహిస్తోంది. ● గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన 21 పరీక్ష కేంద్రాల్లో ఆయా తేదీల వారీగా ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు రెండు విడతల్లో పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 46,168 మంది విద్యార్థులు ● ఏపీ ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షలకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 46,158 మంది హాజరు కానున్నారు. ● గుంటూరు జిల్లాలో 15 కేంద్రాల పరిధిలో మొత్తం 33,281 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 28,158, అగ్రి కల్చర్, ఫార్మసీ 5,068, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు 55 మంది ఉన్నారు. ● పల్నాడు జిల్లాలోని ఐదు కేంద్రాల పరిధిలో మొత్తం 4,059 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 2,899, అగ్రికల్చర్, ఫార్మసీ 1,159, రెండు కలిపి రాస్తున్న విద్యార్థి ఒక్కరు ఉన్నారు. ● బాపట్ల, చీరాలో ఏర్పాటు చేసిన మూడు కేంద్రాల పరిధిలో మొత్తం 8,828 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 7,684, అగ్రికల్చర్, ఫార్మసీ 1,120, రెండు కలిపి రాస్తున్న విద్యార్థులు 24 మంది ఉన్నారు. విద్యార్థులు వీటిని వెంట తీసుకెళ్లాలి ● విద్యార్థులు ఆన్లైన్లో దాఖలు చేసిన ఏపీ ఈఏపీ సెట్–2025 దరఖాస్తు ప్రింటవుట్ కాపీలో పొందుపర్చిన నిర్ణీత బాక్స్‌లో విద్యార్థి కలర్ పాస్‌పోర్ట్ సైజు ఫోటోను అతికించి, సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌తో సంతకం చేయించుకోవాలి. ● పరీక్ష జరిగే రోజున సదరు ప్రింటవుట్ కాపీతోపాటు హాల్ టికెట్ వెంట తీసుకుని వెళ్లాలి. బ్లూ, బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ను అనుమతిస్తారు.గుర్తింపు కోసం ఇంటర్ హాల్ టికెట్, పాస్‌పోర్ట్, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ఐడీలలో ఏదో ఒక ఒరిజినల్ తీసుకుని వెళ్లాలి. ఇవి మినహా ఇతర వస్తువులను అనుమతించరు. ● విద్యార్థి ఫోటో అతికించిన ఆన్లైన్ దరఖాస్తు కాపీపై పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేసి, ఎడమచేతి బొటన వేలి ముద్ర వేయాలి. -
వేధిస్తోన్న లస్కర్ల కొరత
● ఏడాది పొడవున అదనపు భారం మోస్తోన్న లస్కర్లు ● నీటి సరఫరా నిర్వహణ అస్తవ్యస్తం బాపట్ల: టీడీపీ ప్రభుత్వం వేసవిలో కాలువలకు మరమ్మతులు చేయించకపోవడంతో రానున్న ఖరీఫ్‌లో రైతులకు ఇక్కట్లు తప్పేలా లేవు. కాలువల ద్వారా వచ్చేనీరు ఆయకట్టు రైతులకు సరిపోయే అవకాశాలు కనిపించడం లేదు. సాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉండటంతో కాల్వల ద్వారా విడుదలయ్యే నీటిని అత్యంత జాగ్రత్తగా ఉపయోగించాల్సి ఉంటుంది. లేకుంటే సాగు ఇబ్బందులు ఎదురవుతాయి. మరోపక్కన నీటి సరఫరాలో కీలకంగా వ్యవహరించే జలవనరులశాఖను లస్కర్ల కొరత వెంటాడుతుంది. కాలువల నిర్వహణలో కీలకం.. సాగునీటి కాలువల నిర్వహణ, నీటి విడుదల, సరఫరా విభాగాల్లో లస్కర్లు రేయింబవళ్లు కాల్వలను పర్యవేక్షించే పనిలో కీలకపాత్ర పోషిస్తుంటారు. పొలాల్లో నీటి ఎద్దడి ఎర్పడినప్పుడు పంటలను కాపాడుకునే క్రమంలో కొందరు రైతులు కాలువలకు గండిపెట్టడం వలన పొలాలకు నీటి సరఫరా చేసుకుంటారు. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో లస్కర్లు వాటిని నిరోధించి క్షేత్రస్థాయిలో అన్ని పొలాలకు సాగునీటిని సక్రమంగా అందిస్తారు. సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న ప్రాంతం కావడంతో జిల్లాలోని పలు భూములు కాల్వలకు చివరభూములుగా ఉన్నాయి. నీటి ఎద్దడి వచ్చినా... ముమ్మరంగా నీరు విడుదలైనా ఇక్కడ కష్టమే. ఈసమయంలో లస్కర్ల పాత్ర కీలకంగా ఉంటుంది. ఒక్కోసారి నీటి రీడింగ్ తీయటం కొద్దిగా ఆలస్యమైనా కాలువలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. వీరి ప్రాధాన్యతను విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం ఖాళీగా ఉన్న లస్కర్ల పోస్టులను భర్తీపై దృష్టి పెట్టడంలేదు. ఉద్యోగ విరమణ చేసిన వారి స్థానాలను తిరిగి భర్తీ చేయటంలేదు. బాపట్ల జలవనరుల ఉపవిభాగంలో 48మంది లస్కర్ల అవసరం ఉండగా.. 19మందితో కాలం నెట్టుకొస్తున్నారు. చందోలు సాగునీటి సెక్షన్లో 30మంది లస్కర్లకు 8 మందే పనిచేస్తున్నారు. రైతులకు నీటి పారుదల శాఖ అధికారులకు అనుసంధానకర్తలుగా వ్యవహరించే లస్కర్ల కొరత ఏర్పడటంతో కాలువ కట్టలపై పర్యవేక్షణ లోపించింది. కాలువ కట్టలకు గండ్లు పడటంతో కొందరు కాలువ కట్టలను పొలాల్లో కలిపేసుకుంటున్నారే ఆరోపణలు ఉన్నాయి. కొన్నిచోట్ల కాలువ కట్టల మట్టిని, ఇసుకను అక్రమంగా తవ్వేసుకుని విక్రయించుకుంటున్నా అడిగేవారే లేకుండాపోయారు. డెల్టాలో అన్ని జలవనరుల విభాగాల్లో 50శాతం మందికి పైగా లస్కర్ల కొరత వెంటాడుతూనే ఉంది. కనీసం నీటి సంఘాలైనా లేకపోవటంతో కాలువ కట్టల నిర్వహణ నానాటికీ తీసికట్టుగా మారింది. ఒకప్పుడు వెడల్పుగా ఉన్నకాలువ కట్టలు బొందిగట్లుగా మారుతున్నాయి. రైతుల తలలో నాలుకగా ఉండే లస్కర్ల నియామకంలో నిర్లక్ష్యం వీడాలని.. వెంటనే లస్కర్ల నియామకం చేపట్టాలని రైతులు కోరుతున్నారు. -
ధనలక్ష్మీదేవిగా మహంకాళి అమ్మవారు దర్శనం
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మ వారి ఆలయ వార్షికోత్సవ సంబరాలు ఆదివారం నాలుగో రోజుకు చేరాయి. అమ్మవారు ధనలక్షీదేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధికసంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం పోటెత్తారు. ఆలయ ఆవరణలో చండీ హోమం నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కంఠంరాజుకొండూరు గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు. చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి ఆలయంలో ఆదివారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం ఇటీవల వైభవంగా జరిగిన నేపఽఽథ్యంలో భక్తుల కోసం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్న బగళాముఖి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం మొక్కులు తీర్చుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన మహాన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావటంతో ఆలయ ప్రాంగణంలో తిరునాళ్ల సందడి నెలకొంది. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చక్రధర్‌రెడ్డి, ఈవో నరసింహమూర్తి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పట్నంబజారు: గుంటూరు నగరంలోని నాజ్ సెంటర్లో వేంచేసి ఉన్న ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలలో భాగంగా ఆదివారం లక్ష మల్లెల పూజ నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వాహణాధికారి టి.సుభద్ర పర్యవేక్షణలో, శ్రీ హనుమాన్ దీక్ష సమాజం గౌరవాధ్యక్షులు తిరువల్లూరి వెంకటసుబ్బారావు ఆధ్వర్యంలో భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి లక్ష మల్లెలతో పూజలు నిర్వహించటంతోపాటు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారు సువర్చలా సమేత ఆంజనేయస్వామిగా నగర పురవీధుల్లో ఊరేగింపుగా భక్తులకు దర్శనం ఇచ్చారు. సాయంత్రం 8:30 గంటలకు వందలాది మంది భక్తులు, ఆంజనేయ దీక్షాపరులతో హనుమాన్ చాలీసా పారాయణం 108సార్లు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు అయినవోలు నరసింహచార్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో హనుమాన్ దీక్ష సమాజం సభ్యులు నాగేశ్వరరావు, సిహెచ్ రమేష్, మారుతి, వెంకటరమణ, బాపిరాజు, కిషోర్, పాలక మండల సభ్యులు పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 524.70 అడుగులకు చేరింది. ఇది 157.9860 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
స్టువార్టుపురంలో విద్యుత్ విజిలెన్స్ దాడులు
● అడ్డగించిన గ్రామస్తులు ● రూ.వేలల్లో బిల్లులు వస్తున్నాయంటూ ఆగ్రహం ● అధికారులు, గ్రామస్తుల మధ్య రెండుగంటలకు పైగా వాగ్వాదం ● పోలీసుల చొరవతో కొనసాగిన తనిఖీలు బాపట్లటౌన్: విద్యుత్ అక్రమ కనెక్షన్ల తనిఖీల్లో భాగంగా ఆదివారం విద్యుత్‌శాఖాధికారులు మండలంలోని వెదుళ్ళపల్లి, బేతపూడి, స్టువార్టుపురం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించారు. బేతపూడి, వెదుళ్లపల్లి గ్రామాల్లో సజావుగా సాగిన తనిఖీలు స్టువార్టుపురం వెళ్లేసరికి బెడిసికొట్టాయి. గ్రామంలో తామంతా గిరిజనులమని, గత ప్రభుత్వంలో తమకు ఎలాంటి విద్యుత్ బిల్లులు రాలేదని, చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయని, ఇదెక్కటి న్యాయం అంటూ గ్రామస్తులు ఒక్కసారిగా విద్యుత్‌శాఖాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు బిల్లులు లేకుండా చేసిన తర్వాతే తమ గ్రామంలోకి అడుగుపెట్టాలంటూ పట్టుబట్టారు. అధికారుల వాహనాలకు ద్విచక్రవాహనాలు అడ్డుపెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు గంటలకు పైగా అటు అధికారులు, ఇటు గ్రామస్తుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఒక్కో బృందంలో ముగ్గురు విద్యుత్ అధికారుల చొప్పున 30 మంది విద్యుత్ సిబ్బంది 10 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేశారు. ఏపీటీఎస్ చొరవతో తనిఖీలు.. అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారన్న విషయం తెలుసుకున్న యాంటీ పవర్ త్రెఫ్ట్ స్క్వాడ్ (ఏపీటీఎస్) ఎస్ఐ రెహ్మాన్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామానికి చేరుకుని గ్రామస్తులకు సర్దిచెప్పారు. గ్రామంలో తనిఖీలు నిర్వహించి మూడు గ్రామాల పరిధిలో విద్యుత్ మీటర్లు లేనివి 47 కేసులు, మీటర్లు పనిచేయకుండా చేసి విద్యుత్ వాడుకుంటున్న కేసులు 19 మొత్తం 66 కేసులు నమెదుచేసి వాటికి గానూ రూ.10.80 లక్షలు అపరాధ రుసుం విధించారు. తనిఖీల్లో విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మన్నెం భాస్కరరావు, విజిలెన్స్ డిప్యూటీ ఈఈ ఆర్.విజయ్ శ్రీనివాస్, ఆపరేషన్ డిప్యూటీ ఇంజినీర్ జి.శ్రీనివాస్, ఏఈలు పాల్గొన్నారు. విద్యుత్ తనిఖీల్లో భాగంగా స్టువార్టుపురం గ్రామానికి చేరుకున్న తమను గ్రామానికి చెందిన చుక్కా పాల్, రాగాల రాము, అంగడి రత్నకుమార్, మొగిలి మధు, రామారావులతోపాటు మరికొందరు అడ్డుకొని తమ విధులకు ఆటంకం కలిగించారని విద్యుత్‌శాఖ రూరల్ ఏఈ యల్లావుల కోటేశ్వరరావు వెదుళ్లపల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఏఈ ఫిర్యాదుమేరకు వెదుళ్ళపల్లి ఎస్ఐ కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బాపట్ల
సోమవారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.9640 టీఎంసీలు. 7ఇంద్రకీలాద్రి(విజయవాడపవ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి తెనాలి గాంధీనగర్‌కు చెందిన కె.మాధవరావు రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. వినుకొండ: వినుకొండ శ్రీనివాసనగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం లక్ష గోవింద నామ పారాయణం, శ్రీవారి మంత్ర హోమం నిర్వహించారు. -
తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు
ఎస్పీ బి. ఉమామహేశ్వర్ బాపట్లటౌన్: తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్పీ మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికల ద్వారా అసత్య వదంతులను, వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా, వాటిని వ్యాప్తి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్లాట్‌ఫామ్స్‌పై వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసేలా సందేశాలు పంపడం, ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి షేర్ చేయడం చట్టరీత్యా నేరమన్నారు. సమాజంలోని ప్రజల మధ్య సామరస్యం పెంపొందాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన పౌరులుగా మెలుగుతూ ఇతరుల మనోభావాలను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా గ్రూప్ అడ్మినన్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ గ్రూపుల్లో ఎవరైనా అభ్యంతరకరమైన, రెచ్చగొట్టే కంటెంట్‌ను పోస్ట్ చేస్తే, అడ్మినన్లు వెంటనే స్పందించి ఆ సందేశాలను తొలగించడంతో పాటు సంబంధిత వ్యక్తులను గ్రూప్ నుంచి తొలగించాలన్నారు. లేనిపక్షంలో, గ్రూప్‌లో జరిగే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్మిన్లను కూడా బాధ్యులుగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎక్కడైనా అసత్య ప్రచారాలు, వర్గాలు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు గమనిస్తే, వెంటనే దగ్గరలోని పోలీసులకు, 112 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. -
శోకసంద్రమైన ఎండుగుంపాలెం
నాదెండ్ల: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన కుమార్తె, తండ్రి మరణవార్త విని తిరిగివచ్చిన ఉదంతం ఎండుగుంపాలెం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎన్ఎస్పీ తుర్లపాడు మేజర్ కాలువ డీసీ అధ్యక్షుడు నెల్లూరి రామారావు (52), తన కుమార్తె అంజలిని విదేశీ విద్య కోసం శుక్రవారం హైదరాబాద్ విమానాశ్రయంలో సాగనంపి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విదితమే. దుబాయ్ విమానాశ్రయం చేరుకున్న అంజలి తన ప్రయాణ వివరాలు తెలిపేందుకు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. కుటుంబ సభ్యులెవరూ ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి బంధువులను ఆరా తీసింది. తండ్రి దుర్మరణ వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురైంది. కన్నీరుమున్నీరవుతూనే తదుపరి విమానంలో తిరుగు ప్రయాణమై ఆదివారం ఉదయం గ్రామానికి చేరుకుంది. అంజలి తండ్రి భౌతికకాయాన్ని చూసి విలపించిన తీరు చూపరులకు కంట నీరు తెప్పించింది. తల్లి రాంపూర్ణమ్మ, తమ్ముడు ఈశ్వరప్రసాద్లను ఓదార్చడం సాధ్యం కాలేదు. తనను ప్రయోజకురాలిని చేయాలన్న తండ్రి కలలను తలచుకుంటూ, దశదిన కర్మల అనంతరం తిరిగి విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసిస్తానని, అదే తన తండ్రికి ఇచ్చే అసలైన నివాళి అని అంజలి ధైర్యంగా చెప్పింది. మధ్యాహ్నం గ్రామస్తుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగియగా, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఎన్ఎస్పీ అధికారులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
జూన్ ఒకటి నుంచి ఏఐవైఎఫ్ శిక్షణ తరగతులు
లక్ష్మీపురం: అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కోటప్పకొండలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని కోరుతూ సీపీఐ కార్యాలయంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్ జీ మాట్లాడుతూ విద్య వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు జూన్ ఒకటి నుంచి ఐదో తేదీ వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. భారత రాజ్యాంగ విలువలు, లౌకికత, ప్రజాస్వామ్య పరిరక్షణ, శ్రమజీవుల హక్కులు, విద్య– ఉపాధి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వంటి కీలక అంశాలపై బోధనలు, చర్చలు ఉంటాయని వివరించారు. దేశంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా నిరుద్యోగ సమస్య తీవ్రమవుతూ యువతను తీవ్ర నిరాశకు గురిచేస్తోందన్నారు. ఫీజుల పెంపు, నిరుద్యోగ యువతకు సరైన ఉద్యోగ అవకాశాల లేమి, కాంట్రాక్టు ఉద్యోగుల అనిశ్చితి వంటి సమస్యలపై ప్రభుత్వాలు స్పందించడం లేదని అన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న ధరలు, విద్యుత్ చార్జీల భారాలు, ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి యువతపై మరింత ప్రభావం చూపుతోందని తెలిపారు. యువతను ఉద్యమ దిశగా తీసుకువెళ్లడం, వారి సమస్యలకు సంఘటిత పోరాటం నిర్మించడం ఈ శిక్షణ తరగతుల ముఖ్య లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎస్.సుభాని, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జంగాల చైతన్య, వలి మాట్లాడుతూ పల్నాడు జిల్లా కోటప్పకొండలో నిర్వహించనున్న ఈ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి యువజన సమాఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి బి.యశ్వంత్, అరుణ్, సద్దాం, మహేష్ పాల్గొన్నారు. -
అన్ని వర్గాలకు అందుబాటులో ఇగ్నో కోర్సులు
గుంటూరు ఎడ్యుకేషన్: ఇగ్నో దూర విద్య కోర్సులు అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటున్నాయని టీజేపీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీవీహెచ్ కామేశ్వరశాస్త్రి పేర్కొన్నారు. ఆదివారం పట్టాభిపురంలోని టీజేపీఎస్ ప్రాంగణంలోని ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయ (ఇగ్నో) అధ్యయన కేంద్రంలో 2026 జనవరి సెషన్లో చేరిన విద్యార్థులకు ఇగ్నో ఇండక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కామేశ్వరశాస్త్రి మాట్లాడుతూ వివిధ వర్గాలకు అవసరమైన విధంగా అన్ని రకాల కోర్సులను ఇగ్నో అందిస్తోందని చెప్పారు. యూజీ, పీజీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఉద్యోగాన్వేషణలో నెలకొన్న పోటీని తట్టుకుని నిలబడేందుకు వీలుంటుందని అన్నారు. స్టడీ మెటీరియల్స్, ప్రాజెక్టు వర్క్ గురించి వివరించారు. కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు మాట్లాడుతూ అసైన్మెంట్స్, పరీక్షలకు సన్నద్దత గురించి వివరించారు. అధ్యయన కేంద్ర సమన్వయకర్త డాక్టర్ డీవీ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇగ్నో అందిస్తున్న కోర్సులు, విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలు, అధ్యయన కేంద్ర సేవల గురించి వివరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సు కిందకు దూరిన బైక్ చిలకలూరిపేటటౌన్: ఆర్టీసీ బస్సు కింద ద్విచక్రవాహనం దూసుకెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పట్టణంలోని కృష్ణారెడ్డి డొంక చెందిన షేక్ బుజ్జి(41) బైక్‌పై చిలకలూరిపేట వైపుకు వస్తుండగా అదే సమయంలో చీరాల–సత్తెనపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురైంది. ప్రమాదవశాత్తూ బుజ్జి బైక్ ఆర్టీసీ బస్సు ముందుభాగం కిందకు దూసుకెళ్లింది. బుజ్జికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో అర్బన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుజ్జి మృతి చెందాడు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. మూడో అంతస్తులో వివాహాల సందడి సాయంత్రం పెరిగిన రద్దీ ఏర్పాట్లను పరిశీలించిన ఈఓ -
ప్రజా సమస్యలు పరిష్కరించాలి
లక్ష్మీపురం: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, అమరావతిని ప్రజా రాజధానిగా అభివృద్ధి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు సీహెచ్ బాబురావు డి మాండ్ చేశారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు అధ్యక్షతన పార్టీ జిల్లాస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కలెక్టర్ల సదస్సు నిర్వహించి ర్యాంకులు ఇస్తున్నారన్నారని, కానీ అసలు ర్యాంకులు ఇవ్వాల్సింది ప్రజలు అని అన్నారు. మీ పరిపాలన మీద సగం మార్కులు కూడా ఇవ్వడం లేదన్నారు. మొదటి ర్యాంకు ఇచ్చిన వ్యవసాయ రంగంలోనే రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, కనీసం గోనె సంచులు కూడా దొరకడం లేదన్నారు. ఈ సమస్యలు కలెక్టర్ల మీటింగ్‌లో కనీసం చర్చకు నోచుకోలేదన్నారు. ఇళ్ల స్థలాలు, పట్టాల సమస్యలు 2027 నాటికి పూర్తి చేస్తామని చెబుతున్నారే తప్పా నిర్ధిష్ట కార్యాచరణ లేదన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గాయని, గ్యాస్ ధరలు పెద్దఎత్తున పెంచినా రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం సరికాదన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వాగ్ధానం చేసిన విధంగా గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాలలో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. ఓ.ఆర్.ఆర్ వల్ల భూముల కోల్పోతున్న రైతులకు అమోధ్యయోగమైన ప్యాకేజీని ఇవ్వాలన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు, బూరుగు వెంకటేశ్వర్లు, కె.నళీనికాంత్, జిల్లా నాయకులు ఎన్.శివాజీ, పి.కృష్ణ, జి.రమణ, పి.బాలకృష్ణ, దండా లక్ష్మీనారాయణ, వై.కృష్ణకాంత్ పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబురావు -
మత విద్వేషపూరిత పోస్టులు వ్యాప్తి చేయవద్దు
నగరంపాలెం: సోషల్ మీడియాలో మతవిద్వేషపూరిత పోస్టులు, వదంతులు వ్యాప్తి చేయవద్దని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇటీవల కడప జిల్లాలో జరిగిన ఘటనల దృష్ట్యా సోషల్ మీడియా వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. వాట్సాప్ గ్రూప్‌లు, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్/ ఇతర సాషల్ మీడియా వేదికల్లో మతపరమైన ద్వేషపూరిత సందేశాలు, ఛాయచిత్రాలు, వీడియోలు లేదా రెచ్చగొట్టే కంటెంట్‌ను షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. సమాజంలో శాంతి, మత సామరస్యాన్ని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. గ్రూప్ అడ్మిన్న్లు ఆయా గ్రూప్‌ల్లో షేర్ చేసే ప్రతి సందేశం(మెసేజ్) నిశితంగా పరిశీలించాలని అన్నారు. ఏవైనా ద్వేషపూరిత, అభ్యంతరకరమైన లేదా రెచ్చగొట్టే కంటెంట్ ఉంటే వెంటనే ఆ సందేశాలను తొలగించి, సంబంధిత వ్యక్తులను గ్రూప్‌ల నుంచి తొలగించాలని సూచించారు. గ్రూప్ అడ్మిన్లు బాధ్యతాయుతంగా ఆలోచించాలని కోరారు. ప్రతి గ్రూప్ అడ్మిన్ తమ గ్రూప్‌ల్లో చట్టవిరుద్ధమైన ప్రచారం కాకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. తప్పుడు ప్రచారం, మతద్వేషపూరిత పోస్టులు, నకిలీ వార్తలు, మార్ఫింగ్ ఫొటోలు లేదా వీడియోలను సృష్టించే, ఫార్వార్డ్ చేసే లేదా ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఏ సోషల్ మీడియా వేదికలైనా సరే వదంతులను వ్యాప్తి చేయవద్దుని అన్నారు. ఏదైనా సమాచారాన్ని నమ్మే ముందు లేదా ఫార్వార్డ్ చేసేటప్పుడు సంబంధిత అధికారులు ద్వారా లేదా విశ్వసనీయ వార్తా సంస్థల ద్వారా వాస్తవాలు ధ్రువీకరించుకోవా లన్నారు. ఎవరైనా వదంతులు, మతద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే జిల్లా ఎస్పీ లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయాల దృష్టికి ప్రజలు తేవాలన్నారు. అటువంటి వారి వివరాలు చాలా గోప్యంగా ఉంటాయని చెప్పారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ -
చదువులమ్మ ఒడిలో..
మండంలోని వలపర్లలో 1950లో స్థాపించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వజ్రోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి 1960 దశకాలల్లో పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులతో పాటు ఇటీవల కాలంలో చదివిన విద్యార్థులు వేలాది మందిగా హాజరై పరస్పర పలకరింపులు, ఆలింగనాలతో అధ్యంతం పాఠశాల కళకళలాడింది. నాటి విద్యార్థులే నేటి తాతయ్యలు, అమ్మమ్మలుగా పాఠశాలకు రావటం తమ తమ బ్యాచ్‌ల వారీగా గ్రూప్ ఫొటోలు తీసుకోవడం సహపంక్తి భోజనాలతో ఒక్కసారిగా అలనాటి ఆ పాత స్మృతులను పూర్వ విద్యార్థులు నెమరు వేసుకున్నారు. ఉదయం 9 గంటలకు పాఠశాల విద్యార్థుల ర్యాలీతో ప్రారంభమైన కార్యక్రమం అనంతరం పాఠశాల పూర్వ విద్యార్థి ప్రస్తుత శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ పాఠశాల ఆవరణలో గల సరస్వతి దేవి విగ్రహం వద్ద పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుత, పూర్వ విద్యార్థులు, వారి వారసులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 1950లో పాఠశాల స్థాపించిన దాతలను స్మరించుకోవడం, తమకు విద్యాబుద్ధులు నేర్పి తమ ఉన్నతికి కారణమైన ఉపాధ్యాయులను సత్కరించి సన్మానించుకోవడం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలే లక్ష్యంగా పాఠశాల వజ్రోత్సవ వేడుకలు కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. వేలాదిమంది పూర్వ విద్యార్థులు హాజరైన వేడుకల కార్యక్రమానికి పాఠశాల దాతలను, ఉపాధ్యాయులను అతిథులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వలపర్ల మాజీ సర్పంచ్, పాఠశాల పూర్వ విద్యార్థి అయిన కార్యంపూడి వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు పాఠశాల అభివృద్ధి కోసం రూ.10 లక్షలు విరాళాన్ని ప్రకటించారు. మరో పాఠశాల పూర్వ విద్యార్థిని జీ విజయలక్ష్మి పాఠశాలకు అవసరమైన రోబోటిక్ ల్యాబ్ నిర్వహణకు అవసరమైన మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు. కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు,పూ ర్వ విద్యార్థులు కొమ్మి మహేష్, వేణు మాస్టర్, సయ్యద్ కరీముల్లా, కార్యంపూడి కోటి నాగులు, గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏడున్నర దశాబ్దాల తర్వాత మధుర జ్ఞాపకాలు వలపర్ల జెడ్పీహెచ్ఎస్ వజ్రోత్సవాలు సందడిగా వేడుకలు భారీగా హాజరైన పూర్వ విద్యార్థులుచదువులమ్మా తన బిడ్డల ప్రేమతో తడిసిముద్దయింది.. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అమృతోత్సవం జ్ఞాపకాల అమృతం కురిసింది. పిల్లల నుంచి పెద్దలు తరలిరావడంతో మురిసిపోయింది. కళ్లలో శుక్లపు పొరలు కంటి చూపునకు అడ్డుపడుతున్నా.. వారి కనుపాపల్లో ఆనందాల జ్యోతులు వెలిగాయి. ఆ నడకల్లో సత్తువ మందగించినా.. ఆ వేదిక తాకగానే వారి పాదాలు నాట్యమాడాయి. తాతా అని పిలుపునకు చేరువైనా.. ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఆ హృదయాలు 70 ఏళ్లు వెనక్కి నెట్టాయి. అక్షరాలు దిద్దించిన గురువుల జ్ఞాపకాలు మదిలో మెదులుతుండగా.. బాల్యపు స్నేహ మాధుర్యాలు అక్షర కుసుమాలై పరిమళించాయి. తమ చదువుల గుడికి దాతృత్వపు హారం వేసిన అపూర్వ ఘట్టాలు వలపర్ల జెడ్పీహెచ్‌లో ఆదివారం ఆవిష్కృతమయ్యాయి. –మార్టూరు -
రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారుల కోసం సమ్మర్ క్యాంపులు నిర్వహించాలి
నరసరావుపేట: బాలలకు విజ్ఞానం, వికాసం, వినోదం అందించే సమ్మర్ క్యాంపులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో నిర్వహించాలని చిల్డ్రన్స్ క్లబ్ రాష్ట్ర కన్వీనర్ కె.రమాప్రభ అన్నారు. స్థానిక కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ‘చిల్డ్రన్న్స్ క్లబ్ ఏర్పాటు–నిర్వహణ ఫలితాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సుకి ఐద్వా సీనియర్ నాయకురాలు గద్దె ఉమశ్రీ అధ్యక్షత వహించారు. రమాప్రభ మాట్లాడు తూ గతంలో ప్రభుత్వ, మిషనరీ పాఠశాలలే ప్రధానంగా ఉండేవని, ప్రస్తుతం కార్పొరేట్ విద్యావ్యవస్థ విస్తరించడంతో చిన్నారుల్లోని సహజ సృజనాత్మకత, కళలు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలే కార్పొరేట్ విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నాయని, పాలకవర్గాలే కార్పొరేట్ విద్యాసంస్థలను నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొందని విమర్శించారు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి విజ్ఞాన కేంద్రాలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాల కార్యకర్తలు ముందుకు వచ్చి సమ్మర్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. 1935లో కేరళలో ప్రారంభమైన చిల్డ్రన్స్ క్లబ్ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించిందని, ఈ వేదికల ద్వారా అనేక మంది ఉత్తమ పౌరులుగా ఎదిగారని గుర్తు చేశారు. పల్నాడు జిల్లాలో కూడా చిల్డ్రన్స్ క్లబ్‌లను విస్తృతంగా ఏర్పాటు చేసి చిన్నారుల్లో అభ్యుదయ భావాలు పెంపొందించాలని పిలుపునిచ్చారు. అనంతరం పల్నాడు బాలోత్సవాలపై సమీక్ష నిర్వహించారు. పల్నాడు విజ్ఞాన కేంద్రం వర్కింగ్ కమిటీ కన్వీనర్ షేక్ మస్తాన్‌వలి, పల్నాడు బాలోత్సవం కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు, టి.అంజిరెడ్డి, పల్నాడు విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ కార్యదర్శి అనుముల లక్ష్మీశ్వరరెడ్డి, విజ్ఞాన కేంద్రం వర్కింగ్ కమిటీ సభ్యులు బండారుపల్లి నాగేశ్వరరావు, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రజిని, అధ్యక్షులు అనూష, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు డి.శివకుమారి, కౌలు రైతు సంఘం నాయకులు కామినేని రామారావు, అంగన్వాడీ యూనియన్ నాయకులు జి.మల్లేశ్వరి, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకురాలు అమూల్య పాల్గొన్నారు. చిల్డ్రన్ ్స క్లబ్ రాష్ట్ర కన్వీనర్ కె.రమాప్రభ -
అగ్గి రేగితే.. బుగ్గే!
ఆరు మండలాలకు ఒక్కటే అగ్నిమాపక కేంద్రం అగ్ని ప్రమాదాలకు సంబంధించి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రాథమికంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయ ఉత్పత్తులు, మోటార్లకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. బీడీ, సిగరెట్లను కాల్చి ఆర్పకుండా చేలల్లో వేయకూడదు. అలానే ఇళ్లలో విద్యుత్ సరఫరాలో హెచ్చు, తగ్గులను నియంత్రించటానికి స్టెబిలైజర్ పనిచేస్తుంది. అలానే ప్రమాదం జరగకుండా విద్యుత్ సరఫరా ఆటోమేటిక్‌గా ఆగాలంటే ఎంసీబీ(మీనియేచర్ సర్క్యూట్ బ్రేక్)ను ఏర్పాటు చేసుకోవాలి. ప్రధానంగా గడ్డి వాములు దూరం, దూరంగా వేసుకోవాలి. ఒకే చోట ఉంటే ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే మిగిలిన వాటికి కూడా వ్యాపించకుండా ఉంటాయి. అపార్ట్మెంట్లు, ఆసుపత్రులు, భారీ దుకాణ సముదాయాల నిర్మాణంలోను అగ్నిమాపక నిబంధనలను తప్పకుండా పాటించాలి. – రామకృష్ణ, ఏడీఎఫ్‌ఓ, చీరాలచీరాల అర్బన్: ఒక వైపు మండే ఎండలు. మరో వైపు అగ్ని ప్రమాదాలు. దీంతో ప్రజలు భీతిల్లుతున్నారు. ఇటీవల మొక్కజొన్న పంట పొలాలు దగ్ధమయ్యాయి. తాజాగా చీరాల మండలం బోయినవారిపాలెంలో 15 ఎకరాల గడ్డి వాములు దగ్ధమయ్యాయి. ఓ అపార్ట్మెంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ క్రమంలో అగ్నిమాపక సిబ్బంది ఎంత అప్రమత్తంగా ఉన్నా, ప్రజలు వేసవిలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అగ్గిరేగితే.. మిగిలేది బుగ్గే. ఎందుకంటే చీరాల అగ్నిమాపక కేంద్రం ఆరు మండలాల్లో సేవలు అందించాల్సి ఉంది. విధులు ఎక్కువ. వనరులు తక్కువ. ఈ క్రమంలో చీరాల అగ్నిమాపక కేంద్రానికి ప్రస్తుతం ఉన్న వాహనాలతోపాటు మరో వాహనం అవసమనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. గతంలో జరిగిన కొన్ని భారీ అగ్ని ప్రమాదాల క్రమంలో ఇతర ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజిన్లు వచ్చే వరకు గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితిని గుర్తు చేసుకుంటున్నారు. ఆరు మండలాల పరిధిలో చీరాల అగ్నిమాపక కేంద్రానికి సంబంధించి ఆరు మండలాల పరిధిలో సేవలు అందించాల్సి ఉంది. చీరాల, వేటపాలెం, చినగంజాం, ఇంకొల్లు, పర్చూరు, కారంచేడు మండలాలు. ఈ ఆరు మండలాల పరిధిలో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా చీరాల అగ్నిమాపక కేంద్రం నుంచే ఫైర్ ఇంజిన్ వెళ్లాల్సి ఉంటుంది. ఏక కాలంలో వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగినా, ఒకే చోట భారీ అగ్ని ప్రమాదం జరిగినా పొరుగున్న బాపట్ల, చిలకలూరిపేటల నుంచి ఫైరింజన్లు రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఫైర్ ఇంజిన్‌కు నీరు నింపుకొనేందుకు .. అగ్నిమాపక కేంద్రంలో ఫైర్ ఇంజిన్‌కు నీరు నింపుకునేందుకు స్టానికల్ ట్యాంక్(నీరు నిల్వ ట్యాంక్)ఉండాలి. ప్రస్తుతం చీరాల అగ్నిమాపక కేంద్రం నూతన భవన నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలో అక్కడి నీరు నిల్వ ట్యాంక్ వినియోగంలో లేదు. నూతనంగా 25వేల లీటర్ల నిల్వ సామర్థ్యంతో ట్యాంక్‌ను నిర్మించనున్నారు. ఈ క్రమంలో ఎక్కడన్నా అగ్నిప్రమాదం జరిగితే సమీప మోటార్లు నుంచి ఫైర్ ఇంజిన్‌కు నీరు నింపుకోవాల్సిన పరిస్థితి ఉంది. విధులు ఎక్కువ, వనరులు తక్కువ ఆరు మండలాల పరిధిలో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా చీరాల నుంచే ఫైరింజన్ వెళ్లాలి. ప్రస్తుతం ఒక చిన్న వాహనం. మరో పెద్ద వాహనం, ఇరుకు గల్లీల్లోకి వెళ్లేందుకు ఓ బుల్లెట్ ఉన్నాయి. చిన్న వాహనం సాధారణంగా సీఎం, పీఎం, అత్యవసర ప్రొటోకాల్ కార్యక్రమాలు జరిగే సమయంలో అక్కడ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సిద్ధంగా ఉంచుతారు. పెద్ద ఫైరింజన్‌ను అగ్నిప్రమాదాల సమయంలో మంటలు ఆర్పేందుకు వినియోగిస్తారు. ఇక సిబ్బంది పరంగా ఒక ఏడీఎఫ్‌ఓ, ఒక ఎస్సై, ముగ్గురు డ్రైవర్లు, ఆరుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ఏడుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. ఈ క్రమంలో మరో పెద్ద ఫైరింజన్ అవసరమని ప్రజలు భావిస్తున్నారు. నష్టం కూడా గణనీయమే.. 2025–26లో 66 అగ్ని ప్రమాదాల జరిగాయి. అందుకు గాను రూ.రూ.2,70,90,000 ఆస్తి నష్టం జరిగ్గా, రూ.4,89,25,000ను కాపాడినట్లు, 2025–26లో 55 అగ్ని ప్రమాదాలు జరగ్గా రూ.2,50,96,000 ఆస్తి నష్టం జరగ్గా, రూ.2,16,89,000 ఆస్తిని కాపాడినట్లు అగ్ని మాపక కార్యాలయ గణాంకాలు చెప్తున్నాయి. -
భక్తిశ్రద్ధలతో హనుమజ్జయంతి
పట్నంబజారు(గుంటూరుఈస్ట్): హనుమజ్జయంతి పురస్కరించుకుని నాజ్‌సెంటర్‌లోని ఆంజనేయస్వామి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈనెల 8 నుంచి 12వ తేదీ వరకు జరిగే జయంత్యుత్సవాల్లో భాగంగా శనివారం పంచామృత స్నపన, లక్ష తులసి పూజ నిర్వహించారు. అర్చకులు నరసింహాచార్యులు ఆధ్వర్యంలో ఈ పూజ శాస్త్రోక్తంగా చేశారు. ఈఓ టి.సుభద్ర కార్యక్రమాలను పర్యవేక్షించారు. శ్రీహనుమాన్ దీక్ష సమాజం గౌరవ అధ్యక్షుడు తిరువల్లూరి వెంకటసుబ్బారావు ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం 8 గంటలకు గ్రామోత్సవ హనుమాన్ దీక్ష సమాజం వారిచే ఊరేగింపు నిర్వహించారు. పెద్ద ఎత్తున పురవీధుల్లో దీక్ష సమాజం సభ్యులు, దీక్షాపరులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో దీక్ష సమాజం సభ్యులు నాగేశ్వరరావు, సీహెచ్ మారుతి, వెంకట రమణ, వంశీప్రసాద్, బాపిరాజు, కిషోర్, ఆలయ పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
కుమార్తెను విమానం ఎక్కించి వస్తుండగా తండ్రి మృతి
నాదెండ్ల: కుమార్తెను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపాలన్న ఆ తండ్రి కల నెరవేరిన వేళ.. ఆ ఇంట సంతోషం అంబరాన్నంటింది. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ లండన్ వెళ్తుంటే, ఆ విమానం ఆకాశంలోకి ఎగిరే వరకు రెప్పవాల్చకుండా చూస్తూ కుటుంబసభ్యులు మురిసిపోయారు. కానీ, ఆ ఆనందం ఆవిరి కావడానికి ఎంతో సమయం పట్టలేదు. విధి ఆడిన వింత నాటకంలో వీడ్కోలు పలికి తిరిగి వస్తున్న తండ్రిని కొద్ది గంటల్లోనే మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాదెండ్ల మండలం ఎండుగుంపాలెం గ్రామానికి చెందిన ఎన్ఎస్పీ కెనాల్స్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ నెల్లూరి రామారావు(52) తన కుమార్తె అంజలిని ఎంఎస్ విద్యకోసం లండన్ పంపేందుకు కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం హైదరాబాద్ విమానాశ్రయానికి కారులో వెళ్లారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు కుమార్తెను విమానం ఎక్కించి, వారు తిరుగు ప్రయాణమయ్యారు. మిర్యాలగూడ సమీపంలోని వేములపల్లి వద్దకు రాగానే వీరి కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. పల్టీలు కొట్టిన కారు సమీపంలోని చెట్టును ఢీకొని ఆగింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా..కారు వెనుక సీటులో కూర్చున్న రామారావుకు అద్దాలు పగిలి తలకు బలంగా గుచ్చుకున్నాయి. తీవ్ర రక్తస్రావమై కొన ఊపిరితో ఉన్న రామారావును ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. కారు నడుపుతున్న కుమారుడు ఈశ్వరప్రసాద్, భార్య రామపూర్ణమ్మల కళ్లెదుటే ఈ ఘోరం జరగడంతో వారి రోదనలు మిన్నంటాయి. అదే కారులో రామారావు బావమరిది భార్య నాగలక్ష్మి, ఆమె ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. అటు లండన్ వెళ్తున్న కుమార్తెకు తండ్రి మరణవార్త తెలియక, ఇటు చేతికందిన కొడుకు తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. నల్గొండలో పోస్టుమార్టం అనంతరం రామారావు భౌతికకాయం శనివారం సాయంత్రం గ్రామానికి చేరుకోవడంతో ఎండుగుంపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
రాజరాజేశ్వరి దేవిగా మహంకాళి దర్శనం
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠం రాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు మూడో రోజుకు చేరాయి. శనివారం అమ్మవారికి సారెను మంచికలపూడి గ్రామస్తులు సమర్పించారు. అమ్మవారు రాజరాజేశ్వరిదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ ఆవరణలో చండీహోమం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు. మంగళగిరి టౌన్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లను శనివారం గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పలువురు అధికారులతో కలసి పరిశీలించారు. ముఖ్యమంత్రి వచ్చే మార్గం, ప్రజలు వచ్చే మార్గాలను వీక్షించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, సీఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవతేజ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఉన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ శంకర్ తదితర స్థానిక అధికారులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘం ఎన్నిక గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులుగా జి.రత్నకుమార్, కె.శ్రీధర్‌కుమార్‌లు ఎన్నికయ్యారు. శనివారం గుంటూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్రశాఖకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘ గౌరవాధ్యక్షుడిగా ఎన్.రాజేష్ ప్రభుకుమార్, సహాధ్యక్షుడిగా ఎన్.తిప్పేస్వామి, ఉపాధ్యక్షులుగా ఆర్బీవీ కృష్ణారావు, జి.రాంజీ అంబేడ్కర్, ఒ.చిట్టిబాబు, డీఎన్వీ కిరణ్, సంయుక్త కార్యదర్శులుగా కె.జగన్నాఽథ్, ఆర్.మధు వెంకటేశ్వరరావు, ఎస్పీ ప్రసన్నకుమార్, కె.సాయి ప్రకాష్, కోశాధికారిగా ఎస్.శ్రీనివాసరావు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా వి.సూరజ్, బి. రవికుమార్, ఎస్.వెంకటేష్, కో ఆప్షన్ సభ్యుడిగా బీఆర్ అంబేడ్కర్ ఎన్నికయ్యారు. తెనాలిటౌన్: స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీపద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. తొలి రోజున స్వామి వారిని పెండ్లి కుమారుడిని చేసిన విషయం తెలిసిందే. నాల్గవ రోజైన శనివారం ఉదయం 9.30 గంటలకు నిత్యహోమం, ఆలయ బలిహరణ చేశారు. సాయంత్రం 6.30 గంటలకు ఎదురుకోల ఉత్సవం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవం అత్యంత వేడుకగా నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ వి.అనుపమ పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. -
ఇసుకపల్లి చానల్ కట్టకు గండి
యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులురేపల్లె: మండలంలోని గుడ్డికాయలంక వద్ద ఇసుకపల్లి చానల్ కట్టకు శనివారం గండి పడింది. ప్రస్తుతం తాగునీటి చెరువులకు నీరు నింపుకునే నిమిత్తం కాల్వకు నీరు వదలడంతో బలహీనంగా మారిన కాల్వకట్టకు గండిపడింది. సమాచారం తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గండి పడిన స్థలాన్ని పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన గండి పడిన ప్రాంతంలో కట్టకు మరమ్మతు పనులు ప్రారంభించారు. ఇసుకబస్తాలతో గండి పడిన ప్రాంతాన్ని పూడ్చి కాల్వకట్టను బలపరిచారు. గండిపడిన ప్రాంతంలో నీరు సమీపంలోని పొలాలలోకి చేరినప్పటికి సాగుభూమిలో ఎటువంటి పైరులేకపోవటంతో నష్టం తప్పింది. కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పంతాని మురళీధరరావు, టీడీపీ నాయకులు అనగాని శివప్రసాద్‌లు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. రానున్న ఖరీఫ్‌ను దృష్టిలో ఉంచుకుని బలహీనంగా ఉన్న కట్టలను పరిశీలించి బలపరిచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 524.80 అడుగులకు చేరింది. ఇది 158.1740 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
నేరాల నియంత్రణలో బాపట్ల జిల్లా బెస్ట్
బాపట్లటౌన్: ఏపీ స్మార్ట్ పోలీసింగ్ యూనిట్ పెర్ఫార్మెన్న్స్లో బాపట్ల జిల్లా పోలీస్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 2వ ర్యాంక్ సాధించిందని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కలెక్టర్ల సదస్సులో బాపట్ల జిల్లా పనితీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్పీ వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణ, గంజాయి నిర్మూలన, సాంకేతిక పోలీసింగ్ అంశాల్లో బాపట్ల జిల్లా రాష్ట్ర స్థాయిలో ఆదర్శవంతమైన ఫలితాలు సాధించిందన్నారు. ఏపీ పోలీస్ వార్షిక గణాంకాల (2025–26) ప్రకారం, బాపట్ల జిల్లా నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో విశేషమైన ప్రగతిని సాధించిందన్నారు. జిల్లాలో మొత్తం నేరాల సంఖ్య 11.6 శాతం తగ్గగా, బాడీలీ ఆఫీసు 20.4 శాతం, అల్లర్లు 69.2శాతం మేర గణనీయంగా తగ్గుముఖం పట్టాయన్నారు. మహిళా భద్రతలో 12.1శాతం మెరుగుదల కనబరుస్తూనే, లైంగికనేరాల దర్యాప్తులో 95 శాతం పురోగతిని సాధించింది. ముఖ్యంగా, రహదారి ప్రమాదాల నివారణకుగానూ గుర్తించిన 100 శాతం బ్లాక్ స్పాట్స్‌ను సరిదిద్ది జిల్లా పోలీస్ యంత్రాంగం రికార్డు సృష్టించిందన్నారు. ఏపీ స్మార్ట్ పోలీసింగ్ యూనిట్ పెర్ఫార్మెన్న్స్ డ్యాష్‌బోర్డ్ (30.04.2026) గణాంకాల ప్రకారం, బాపట్ల జిల్లా పోలీస్ శాఖ రాష్ట్ర స్థాయిలో అద్భుత ప్రదర్శన కనబరిచి 2వ ర్యాంక్ సాధించింది. మొత్తం 19 రకాల సాంకేతిక పారామీటర్లలో మెరుగైన పనితీరును కనపరిచింది. సీసీటీఎన్ఎస్, ఈ–సాక్ష్య, డ్రోన్ల వినియోగం, డయల్ 112 వంటి విభాగాల్లో జిల్లా చూపిన చొరవ ఈ ఘనత సాధించడానికి దోహదపడిందన్నారు. రాష్ట్రంలోని టాప్–5 జిల్లాల్లో ఒకటిగా నిలుస్తూ, స్మార్ట్ పోలీసింగ్ అమలులో బాపట్ల జిల్లా ఆదర్శంగా నిలిచిందన్నారు. స్మార్ట్ పోలీసింగ్‌లో రాష్ట్రంలో జిల్లా పోలీస్ శాఖకు 2వ ర్యాంక్ లైంగిక నేరాల దర్యాప్తులో 95 శాతం పురోగతి రోడ్డు ప్రమాదాల నివారణలో 100 శాతం రికార్డు సొంతం జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ -
మహంకాళి అమ్మవారికి సారె సమర్పించిన భక్తులు
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసిన మహంకాళి అమ్మవారి ఆలయ వార్షికోత్సవ సంబరాలు శుక్రవారం రెండవ రోజుకు చేరాయి. చిలువూరు గ్రామస్తులు అమ్మవారికి సారె సమర్పించారు. అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఆవరణలో చండీ హోమం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు. నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరంలో లేబర్ అడ్డాలు (ఇంటిగ్రేటెడ్ లేబర్ ఆమెనిటీస్ కాంప్లెక్స్) ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ గంధం చంద్రుడు, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. హిందూ కాలేజ్ జంక్షన్, కంకరగుంట ప్రాంతాలను పరిశీలించారు. కార్మికులు పని కోసం రోడ్ల మీద వేచి ఉండకుండా లేబర్ అడ్డాల్లో కూర్చొంటారని తెలిపారు. పని లేని సమయంలో కార్మికులకు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇస్తారని అన్నారు. వివిధ ప్రాంతాల్లో పనుల నిమిత్తం ఒకచోట కార్మికులు వేచి ఉండే సంప్రదాయం ఉందని, ఆయా పనులకు వెళ్లగా మిగిలిన వారు ఆ ప్రాంతంలో ఖాళీగా ఉంటున్నారని చెప్పారు. ఇటువంటి వారిని గుర్తించి వారికి నైపుణ్య శిక్షణ ఇస్తారని తెలిపారు. అడ్డాల్లో తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ ఏ గాయత్రీ దేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. తెనాలి: స్థానిక వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. మూడోరోజైన శుక్రవారం సాయంత్రం గజవాహనంపై గ్రామోత్సవం జరిపారు. పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.పొన్నూరు: పట్టణంలోని సహస్ర లింగేశ్వర స్వామి, వీరాంజనేయస్వామి దేవస్థానంలో ఆదివారం నుంచి ఈనెల 13వ తేదీ వరకు హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జీవీ అమర్నాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఉత్సవమూర్తులకు తిరుమంజనం, అలంకరణ, రాత్రి విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, అంకురారోపణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 11న ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మన్యుసూక్త సహిత చతుర్దశ కలశ స్నపన, అలంకారాలు, మధ్యాహ్నం లక్ష తమలపాకుల పూజ, నివేదన, నీరాజనం, సాయంత్రం స్వామి వారి ఉష్ట్ర వాహనంపై గ్రామోత్సవం, 12న తెల్లవారుజామున విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పంచామృత విశేష అభిషేకం, అలంకరణ, మధ్యాహ్నం లక్ష తమలపాకుల పూజ, సాయంత్రం 4గంటలకు నివేదన, నీరాజనం, తీర్థ్ధప్రసాద వినియోగం జరుగుతుందన్నారు. రాత్రి సువర్చలా సమేత స్వామి వారికి దివ్య తిరుకల్యాణ మహోత్సవం ఉంటుందన్నారు. 13న స్వామివారి దివ్య రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనాలని కోరారు. -
13న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన
మంగళగిరి టౌన్: మంగళగిరి మండలం నిడమర్రు గ్రామం వద్ద నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమానికి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కార్యక్రమ ఇన్చార్జి అధికారి, గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ కోరారు. ఈనెల 13న నిడమర్రు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు కేంద్ర మంత్రులు శంకుస్థాపన చేయనున్న నేపథ్యలో వేదిక ప్రాంతాన్ని శుక్రవారం వివిధ శాఖల అధికారులతో కలసి పరిశీలించారు. మయూర్ అశోక్ మాట్లాడుతూ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి సోమన్న, కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరుకానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంటీఎంసీ డెప్యూటీ కమిషనర్ శ్రీకాంత్, డీసీపీ అశోక్‌కుమార్, రైల్వే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రసాదరావు, మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, రూరల్ సీఐ వెంకట బ్రహ్మం, తహసీల్దార్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఖాకీల వేధింపులకు దంపతుల ఆత్మహత్యాయత్నం
● మేం చనిపోతే మా కుమారుడిని కాపాడండి ● వీడియోలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మొర కొల్లూరు : బాపట్ల జిల్లా కొల్లూరు గాంధీనగర్‌కు చెందిన నంబూరు కృష్ణ, రమణ దంపతులు శుక్రవారం కలుపు నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి ప్రాంతానికి చెందిన ఓ యువతి కొద్ది రోజుల కిందట కొల్లూరులోని తమ బంధువులైన ఈ దంపతుల ఇంటికి వచ్చింది. వారి కుమారుడైన జయరాజును వివాహం చేసుకుంటానని, తమకు పెళ్లి చేయాలని యువతి కోరడంతో ఆమె ఆధార్ కార్డు ప్రకారం మేజర్ అని నిర్ధారించుకుని వివాహం జరిపించారు. కొన్ని వారాల కిందట యువతి తల్లి వచ్చి ఆమె మైనర్ అని, బలవంతంగా వివాహం చేశారని పోలీసుకలు ఫిర్యాదు చేసింది. కొల్లూరు ఎస్ఐ కోటేశ్వరరావు సూచన మేరకు చీమకుర్తి పోలీసుస్టేషన్‌కు యువకుడి తరఫు వారు వెళ్లారు. యువకుడిపై పోక్సో, లైంగికదాడి, కిడ్నాప్ కేసులు నమోదైనట్లు తెలిసింది. తమ బిడ్డను గొడ్డును బాదినట్లు బాదడంతోపాటు, రోజుల తరబడి స్టేషన్ వద్ద తమను వేధిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత కక్షలను మనస్సులో పెట్టుకొని రేణుక, సురేష్, వంశీ, నవీన, శ్రీను అనే వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతూ కేసులు నమోదు చేయించారని ఆరోపించారు. పెద్ద మనిషిగా వచ్చిన వ్యక్తి బెదిరించడంతో తమను బతకనివ్వరనే ఆందోళనతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. తాము చనిపోయినా పోలీసుల వద్ద ఉన్న తమ కుమారుడిని కాపాడాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు మొరపెట్టుకున్నారు. దంపతులు పురుగుల మందు తాగి, వీడియో రూపంలో తమ బాధను వెళ్లగక్కడాన్ని గమనించిన స్థానికులు వారిని 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దీనిపై ఎటువంటి సమాచారం అందలేదని కొల్లూరు ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు. -
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
మార్టూరు: మండల కేంద్రం మార్టూరులో శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి మతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సీఐ యార్లగడ్డ శ్రీనివాసరావు అందించిన వివరాలు.. మార్టూరు నుంచి గన్నవరం వెళ్లే మార్గంలోని వాగు సమీపంలోని చెక్ డ్యాం వద్ద నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న సీఐ మృతదేహాన్ని పరిశీలించి సిబ్బంది స్థానికుల సహాయంతో వెలికి తీయించారు. మృతుడి వయసు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యద్దనపూడి: గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని పూనూరులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు అందించిన వివరాలు.. గ్రామానికి చెందిన కొండా మాధవరెడ్డి వెంకటరత్నం దంపతుల కుమారుడైన కృష్ణారెడ్డి(7) రాత్రి 7 గంటల ప్రాంతంలో తన ఇంటి సమీపంలోని శివాలయం సమీపంలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఆ తరువాత కొంతసేపటికి అటుగా వెళ్తున్న కొందరు గమనించి రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారిని గుర్తించి 108 వాహనంలో చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి కృష్ణారెడ్డి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒక్కగాను ఒక్క కుమారుడు మృతిచెందటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొరిటెపాడు(గుంటూరు): ఆలిండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ నెల 25, 26 తేదీల్లో దేశవ్యాప్తంగా రెండు రోజుల సమ్మెకు ఎస్బీఐ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్, అమరావతి సర్కిల్– గుంటూరు మాడ్యూల్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంపాలెంలోని మెయిన్ బ్రాంచ్ వద్ద ‘సైలెంట్ సిట్ ప్రొటెస్ట్‘ కార్యక్రమం నిర్వహించారు. ఎస్బీఐ స్టాఫ్ ఫెడరేషన్ అమరావతి సర్కిల్ డెప్యూటీ జనరల్ సెక్రటరీ కె.కోటిరెడ్డి మాట్లాడుతూ బ్యాంకుల్లో తగిన సిబ్బంది నియామకం చేపట్టాలన్నారు. శాశ్వత ఉద్యోగులను ఔట్సోర్సింగ్ చేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్, వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని కోరారు. ఇంటర్ సర్కిల్ బదిలీల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలకు మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కేఆర్వీ జయకుమార్, వి.నరేంద్రకుమార్, రంగసాయి, ఇబ్రహీం షా, సంపత్, యూఎఫ్‌బీయూ అడ్వైజర్ పి.కిషోర్, స్థానిక సెక్రటరీలు, పలువురు ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. -
‘ఆట’విడుపు.. మేలుకొలుపు
● క్రీడలకు పూర్తిగా దూరమవుతున్న నేటి బాలలు ● ఇకనైనా కన్నవారు మేల్కొంటేనే బంగారు భవిష్యత్తు ● ఆటల్లోనే చిన్నారులకు ఆనందం... ఆరోగ్యం ● ఏదోకటి ఆడితేనే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగు ● వేసవిలోనైనా శిక్షణ శిబిరాల్లో చేర్చాలని వైద్యుల సూచన ● ఇప్పటికే వివిధ సంస్థల ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలు బాల్యం ఒక అద్భుతం -
బాపట్ల
శనివారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2026మత్స్యకారులపై పచ్చ ప్రతాపం ● పేద మత్స్యకారుల పొట్టకొట్టిన తెలుగు తమ్ముళ్లు ● అడిగినంత ఇవ్వలేదని తెప్ప లైసెన్స్ రద్దు ● మత్స్యశాఖ అధికారుల అండతో అరాచకాలు ● వేట సంధికాల జీవన భృతి కోల్పోయిన పేద జాలర్లు విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 524.90 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. సీఎం చంద్రబాబు తరహాలోనే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారు. సుపరిపాలన అని గొప్పలు చెప్పుకొంటున్న ప్రభుత్వం... దాడులు, దౌర్జన్యాలు చేస్తూ, బెదిరింపులకు దిగుతోంది. సంపద సృష్టిస్తామని చెబుతూ లంచాలు, అక్రమాల రూపంలో ప్రజాధనాన్ని పంచుకుంటున్నారు. లంచం ఇవ్వలేదని అధికారుల సాయంతో పచ్చనాయకులు మత్స్యకారుల తెప్ప లైసెన్స్‌లు లాగేసుకుంటున్నారు. వేట సంధి కాలంలో ప్రభుత్వం ఇచ్చే భృతి రాకుండా చేసి పేద మత్స్యకారుల పొట్టగొడుతున్నారు. -
ఆగస్టులో ప్రత్యేక లోక్ అదాలత్
గుంటూరు లీగల్: సుప్రీంకోర్టులో ఆగస్టు 21, 22, 23 తేదీలలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి శుక్రవారం తెలిపారు. సమాధన్ సమరో 2026లో భాగంగా నిర్వహించనున్న కార్యక్రమంలో భాగంగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఫిర్యాదుదారులు, కక్షిదారులు సుప్రీంకోర్టు అంగీకారంతో వారి న్యాయవాదులతో జిల్లాలోనే హాజరు కావచ్చునని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించే సెటిల్మెంట్ సమావేశాలకు ప్రత్యక్షంగా లేదా వర్చువల్‌గా హాజరు కావొచ్చని తెలిపారు. వివరాలకు టోల్ ఫ్రీ నంబరు 15100, 0863–222448 లను సంప్రదించవచ్చునని తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి -
బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు అరెస్ట్
తెనాలిరూరల్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. తెనాలి మార్కెట్ యార్డు వద్ద బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో త్రీ టౌన్ ఎస్ఐ షేక్ కరిముల్లా, సిబ్బంది గురువారం రాత్రి దాడులు నిర్వాహించారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఊట్ల భార్గవ్, మరో వ్యక్తి ‘లేసర్ 247’ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. వీరికి గూగల్ పే, ఫోన్‌పే ద్వారా నాగేశ్వరరెడ్డి, లక్ష్మీ చెన్నరెడ్డి, రామ, గుణ పవన్, రామకృష్ణ, అతని సోదరుడు, యశ్వంత్, భార్గవ్‌రెడ్డి, వివేక్‌రెడ్డి నగదు బదిలీ చేసి బెట్టింగ్‌లో పాల్గొంటున్నట్టు గుర్తించారు. బెట్టంగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశామని, మిగిలిన ఎనిమిది మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని ఎస్ఐ తెలిపారు. -
అధికారుల ఉరుకులు పరుగులు
తాడికొండ: ‘పరిహారానికి పదేళ్లా’ శీర్షికన ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనానికి అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. బాధితుడు చుండు నర్సిరెడ్డి, సోదరుడు చుండు వెంకటరెడ్డిలకు కలిపి ఉన్న 14 ఎకరాల భూమికి సంబంధించి సర్వే చేశారు. సర్వే రిపోర్టును అధికారులకు అందజేస్తామని తెలిపారు. ఈ భూమికి సంబంధించి 1962 లోనే వారు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకొని సుమారు 70 సంవత్సరాలుగా స్వాధీనంలో ఉంటున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు కూడా ఉన్నాయి, 1956 ఈనాం యాక్ట్ చట్టం ప్రకారం రైతువారీ పట్టా ఉంది, ఆ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకొని పంటలు పండించుకుంటూ ప్రతిఏటా పంట రుణం కూడా తీసుకుంటున్నారు. అయితే తమకు తెలియకుండా కనీసం నోటీసు ఇవ్వకుండా ఆన్లైన్లో భూమిని ఎలా తొలగిస్తారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రికార్డుల్లో ఎందుకు తొలగించారంటే తహసీల్దార్ సైతం తమకు తెలియదంటున్నారని, ఒక్క వడ్డమాను గ్రామంలోనే ఈనాంకు చెందిన 100 ఎకరాలను ఆన్లైన్లో ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తున్నారు. పూలింగ్‌కు ఇచ్చిన 2 ఎకరాల కోళ్ల ఫారం పరిహారం విషయంలో ఇంకా అధికారులు ఎలాంటి హామీ ఇవ్వలేదు. తన భూమిని తనకి తిరిగి ఇచ్చేయాలని బాధితుడు కోరుతున్నాడు. బాధితుడి ఈనాం భూములకు సర్వే నిర్వహించిన రెవెన్యూ, సర్వే సిబ్బంది 1962 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని తమ స్వాధీనంలోనే ఉన్నట్లుగా తెలిపిన బాధితులు -
అల్లూరి పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలి
గుంటూరు ఎడ్యుకేషన్: గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం బ్రిటిషు పాలకులను ఎదురించిన అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలని జెడ్పీ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. గురువారం ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అల్లూరి జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్రోద్యమ చరిత్రలో మరుపురానిదని, స్వాతంత్య్రం పొందడానికి సాయుధ పోరాటం ఒక్కటే మార్గమని నమ్మిన అల్లూరి తన పోరాటపటిమతో బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొన్నారని కొనియాడారు. అల్లూరి వంటి మహనీయుడు మన రాష్ట్రంలో జన్మించడం అందరికీ గర్వకారణమని చెప్పారు. అల్లూరి ఆశయ సాధనకోసం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ పరిపాలన అధికారులు రాజా రత్నం, ఉమా సుమంత్, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి ఆలయ వార్షికోత్సవాలు గురువారం ప్రారంభం అయ్యాయి. అమ్మవారు భక్తులకు లక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. చిలువూరు గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఊరేగింపుగా వచ్చి అమ్మ వారికి సారె సమర్పించారు. ఆలయ ఆవరణలో చండీహోమం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఉత్సవాల ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు. కొరిటెపాడు(గుంటూరు): స్పైసెస్ బోర్డు ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సంగీత విశ్వనాథన్ గురువారం గుంటూరు మిర్చి యార్డును సందర్శించారు. మిర్చి యార్డులో రైతులకు అందిస్తున్న సదుపాయాలు, ప్రస్తుత మిర్చి వ్యాపార పరిస్థితులు, నాణ్యత పరిరక్షణ చర్యలు, ప్రాసెసింగ్ విధానాలు, మిర్చి ఎగుమతులకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. రైతులకు మరింత మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై యార్డు అధికారులు, వ్యాపార వర్గాలతో అభిప్రాయాలు పంచుకున్నారు. నాణ్యమైన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు పెంచే దిశగా స్పైసెస్ బోర్డు చర్యలు తీసుకుంటుందని ఆమె పేర్కొన్నారు. ముందుగా సంగీత విశ్వనాథన్‌ను యార్డు చైర్మన్ కుర్రా అప్పారావు సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో స్పైసెస్ బోర్డు సభ్యుడు కొత్తూరి వెంకట సుబ్బారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతయ్య, పలువురు యార్డు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి: స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. తొలిరోజున స్వామి వారిని పెండ్లి కుమారుడిని చేసిన విషయం తెలిసిందే. రెండో రోజైన గురువారం ఉదయం 9.30 గంటలకు నిత్యహోమం, బలిహరణ చేశారు. సాయంత్రం 6.30 గంటలకు శేషవాహనంపై గ్రామోత్సవం జరిపారు. స్వామి వారి భక్తులు కనులారా దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక అంశాలను కళాకారులు ప్రదర్శించారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి
తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై వడ్డేశ్వరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం గుంటూరుకు చెందిన వై.హర్ష (20) వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్శిటీలో బీబీఏ రెండవ సంవత్సరం చదువుతోంది. బుధవారం సాయంత్రం 6.30 సమయంలో తన స్నేహితుడైన నిఖిల్ సిద్ధార్థతో కలసి ద్విచక్రవాహనంపై తాడేపల్లి వస్తుండగా 16వ నెంబర్ జాతీయ రహదారిపై వడ్డేశ్వరం వద్ద నిఖిల్ సిద్ధార్థ అతివేగంగా వాహనం నడుపుతూ ఎదురుగా ఉన్న మరో వాహనాన్ని ఢీకొనడంతో నిఖిల్ సిద్ధార్థ నడుపుతున్న వాహనం అదుపు తప్పి రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో హర్ష డివైడర్‌ను ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. జరిగిన సంఘటనపై హర్ష చెల్లి శ్రీ ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ అపర్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సోషల్ మీడియా యాక్టివిస్టుపై దాడి
పిడుగురాళ్ల: వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షుడు తమ్మిశెట్టి దుర్గారావుపై గురువారం టీడీపీ మూకలు దాడి చేసి గాయపరిచారు. తమ్మిశెట్టి దుర్గారావు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని గంగమ్మతల్లి దేవస్థానం ఎదురుగా గల ఓ టీ షాప్‌లో జ్యూస్ పాయింట్ నడుపుకునేందుకు టీ పాయింట్ యజమాన్ని అడగ్గా ఆయన అంగీకరించారు. దీంతో దుర్గారావు జ్యూస్ పాయింట్ పెట్టుకుని నడుపుకుంటున్నాడు. టీడీపీకి చెందిన షేక్ ఇంతియాజ్ టీ షాపు యజమానికి ఫోన్ చేసి వైఎస్సార్సీపీ సోషల్‌మీడియా యాక్టివిస్ట్‌కు ఎందుకు జ్యూస్ పాయింట్‌కు అనుమతి ఇచ్చారని ప్రశ్నించాడు. ఖాళీ చేయించాల్సిందేనని హుకుం జారీ చేశాడు. టీ షాపు యజమాని దుర్గారావుకు విషయం చెప్పగా ఖాళీ చేసేందుకు కొంత సమయం కోరాడు. రాత్రి సమయంలో అందరు నడిరోడ్డుపై ఉండగానే నలుగురు టీడీపీ కార్యకర్తలు దుర్గా జ్యూస్ పాయింట్ వద్దకు వచ్చి కర్రలతో దాడి చేశారు. దుర్గారావు తప్పించుకొని వైఎస్సార్ సీపీ కార్యాలయానికి చేరుకున్నాడు. సంఘటన తెలుసుకున్న వైఎస్సార్ సీపీ స్టేట్ బీసీ సెల్ జాయింట్ సెక్రటరీ శెట్టుపల్లి పూర్ణ దుర్గారావును నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొని వెళ్లి చికిత్స చేయించారు. దుర్గారావుకు కాసు మహేష్ పరామర్శ నరసరావుపేట: తమ్మిశెట్టి దుర్గారావుపై దాడిచేసిన టీడీపీ గుండాలపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. దాడిలో గాయపడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న పిడుగురాళ్ల సోషల్ మీడియా కన్వీనర్ తమ్మిశెట్టి దుర్గారావును గురువారం ఆయన పరామర్శించారు. సంఘటన జరిగిన విధానం అడిగి తెలుసుకున్నారు. -
అత్త ఇంట్లో దొంగతనం చేసిన అల్లుడు
చేబ్రోలు: భార్య పుట్టింటికి వెళ్లి నాలుగు నెలలు గడిచినా తిరిగిరాకపోవటంతో ఓ అల్లుడు అత్త ఇంట్లోనే చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కి కటకటాల పాలైన సంఘటన చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామంలో జరిగింది. చేబ్రోలు పోలీసుస్టేషన్లో పొన్నూరు రూరల్ సీఐ పి కృష్ణయ్య, స్థానిక ఎస్ఐ పి వీరనారాయణ గురువారం వివరాలను వెల్లడించారు. చేబ్రోలు మండలం గుండవరం గ్రామానికి చెందిన సాతర్ల గోపికి వేజండ్ల గ్రామానికి చెందిన తిరుపతమ్మతో 2010లో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. మద్యానికి అలవాటు పడిన గోపి భార్య మీద అనుమానంతో వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధలు భరించలేక నాలుగు నెలల కింద తిరుపతమ్మ వేజండ్లలోని పుట్టింటికి వెళ్లిపోయింది. పేకాట, మద్యానికి డబ్బులు అవసరమై, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న గోపి వేజండ్లలోని భార్య ఇంటికి వెళ్లాడు. ఐదు రోజుల కిందట భార్య తిరుపతమ్మతోపాటు వారి అత్త కలిసి ధూళిపాళ్లలోని బంధువుల ఇంటిలో జరిగే శుభకార్యానికి వెళ్లారు. 4వ తేదీన వేజండ్లలోని అత్త ఇంటికి వచ్చిన అల్లుడు గోపి ఇంటిలో ఎవరూ లేకపోవటంతో తలుపులు పగలకొట్టి లోపలికి ప్రవేశించి బీరువా తాళాలు పగలకొట్టి అందులోని బంగారు, వెండి వస్తువులను అపహరించుకొని పారిపోయాడు. సుమారు రూ.9 లక్షల విలువ చేసే బంగారు హారం, నెక్లెస్, చైన్లతో పాటు ఒక జత వెండి కాళ్ల పట్టీలను తీసుకువెళ్లిపోయాడు. ఇంటికి వచ్చి గమనించిన తిరుపతమ్మ చేబ్రోలు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ పి.వీరనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కొత్తరెడ్డిపాలెం అడ్డరోడ్డు వద్ద నిందితుడు సాతర్ల గోపిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు వివరించారు. త్వరతగతిని కేసును చేధించిన చేబ్రోలు ఎస్ఐ పి.వీరనారాయణ, సిబ్బందిని ఎస్పీ వకుల్ జింధాల్, తెనాలి డీఎస్పీలు అభినందించారు. రూ.9లక్షలు విలువచేసే బంగారు, వెండి నగల అపహరణ -
నిబంధనలకే తీరకాసు!
అక్రమ దందాలకు అడ్డాగా మారడంతో చీరాల నియోజకవర్గం పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతోంది. తీరం పరాధీనం అవుతోంది. అక్కడ సింహభాగం ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రభుత్వపరంగా సంబంధిత శాఖల అనుమతులు తీసుకోవడం లేదు. పచ్చనేత అనుమతి, యువనేత అండ ఉంటే చాలనే భావనకు వచ్చారు. అభివృద్ధి, ఉపాధి ముసుగులో అతిక్రమణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పర్యాటకులకు భద్రత కొరవడుతోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. చీరాల అర్బన్: చీరాల నియోజకవర్గంలో సమాంతర ప్రభుత్వం నడుస్తోంది. యువనేత అదృశ్య శక్తిగా వ్యవహరిస్తున్నారు. అంతిమంగా పర్యాటకుల భద్రతకు భంగం కలిగే విధంగా పరిస్థితులు మారుతున్నాయి. ఈ క్రమంలో తీరంలో నిర్మాణాలకు ఆయా శాఖల పరంగా అనుమతులకు సంబంధించి, చెల్లించాల్సిన రుసుం ప్రభుత్వ ఖజానాకు జమ కాకుండా గండి పడుతోంది. ఇవన్నీ బహిరంగ రహస్యాలు. వీటిపై అంతిమంగా ఎవరూ చర్యలు చేపట్టడం లేదు. ప్రతి చిన్న విషయం కంప్యూటర్లో ఉంటుందంటూ గొప్పలు చెప్పుకొనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వానికి ఈ విషయాలు తెలియదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అనుమతి లేకున్నా విద్యుత్ సరఫరా ప్రాథమికంగా భూమి కన్వర్షన్ నుంచి రెవెన్యూ, పంచాయతీ, ఒడా(ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్), సీఆర్‌జెడ్, సీజెడ్ఎంపీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇలా సంబంధిత అన్ని శాఖల అనుమతులు పొందాలి. కొందరు ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టారు. పూర్తి చేశారు. వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కొత్తవారు పలువురు ముందు వారి తరహాలో నడుస్తున్నారు. అలాంటి నిర్మాణాలకు విద్యుత్ శాఖ కూడా కరెంట్ సరఫరా ఎలా చేస్తున్నారనే ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది. అప్పుడే ఎందుకు అడ్డుకోరు? వాస్తవానికి అనుమతులు లేని నిర్మాణాలకు సంబంధించి వారు భూమి పూజ చేసే దగ్గర నుంచి అన్ని శాఖల అధికారులకు సమాచారం ఉంటుంది. కాకుంటే ఒక రోజు అటుఇటుగా. కానీ ఎవరూ వాటిని అడ్డుకోరు. పనులు ఆపరు. తరువాత నిబంధనల పేరుతో వ్యక్తిగత ప్రయోజనాలను ఆశిస్తారు. అంతకు ముందు పచ్చనేత అనుమతి ఉందా, లేదా అనేది ఆరా తీస్తారు. ఎవరన్నా ఇదేమని అడిగితే అంతా పై వారే చూసుకుంటున్నారని చెబుతున్నారు. ఆ పై వారెవరో, ప్రభుత్వ నిబంధనలు ఎందుకు పట్టించుకోరో వారికే తెలియాలి. భద్రత కరువు పర్యాటకంగా తీర ప్రాంతం అభివృద్ధిని అందరూ స్వాగతిస్తున్నారు. అయితే అభివృద్ధి ముసుగులో అతిక్రమణలను ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా రిసార్ట్స్, హోటల్స్‌కు వచ్చే వారి ఆధార్ లాంటి ధ్రువీకరణతో గదులు అద్దెకు ఇస్తుంటారు. కొన్నింటిలో అసాంఘిక కార్యకలాపాలకు కూడా చోటు ఉంటుందనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో నిర్ణీత అనుమతులు లేని రిసార్ట్స్, హోటల్స్‌లో భద్రత నామమాత్రంగా మారిందని పలు సందర్భాల్లో పర్యాటకుల నుంచి వినిపించిన విమర్శ. ప్రమదాలు జరగకుండా... ఇప్పటికే తీరంలో ఎన్డీపీ (నాన్ డ్యూటీ పెయిడ్) లిక్కర్, కొన్ని రకాల మత్తు పదార్థాల సరఫరా జోరుగా సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సముద్రంలో స్నానాలకు వెళ్లి పలువురు మృత్యువాత పడిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో రిసార్ట్స్, హోటల్స్‌లో బస చేసే వారితో పాటు విడిగా వచ్చే పర్యాటకులు అనేదే తేడా లేకుండా పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. పంచాయతీ అప్రూవల్తో సరి.. తీరంలో రిసార్ట్స్, హోటల్స్ నిర్మాణాలకు సంబంధించి కేవలం పంచాయితీ అప్రూవల్ ఉంటే సరిపోతుందా? మిగిలిన శాఖల అనుమతి అవసరం లేదా? దీనిపై స్పష్టత కొరవడుతోంది. ఈ క్రమంలో స్వామి కార్యం, స్వ కార్యం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. తీరంలో అతిక్రమణలపై కోర్టులో పిల్ వేసేందుకు ఓ మాజీ ఎమ్మెల్యే సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ప్రాథమికంగా అందుకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. -
రైతులకు మద్దతు ధర కల్పించండి
చీరాల అర్బన్: చంద్రబాబు ప్రభుత్వం రైతులను మాటలతో మభ్యపెడుతోందని, పండిన ధరలకు గిట్టుబాటు ధర లేదని, కనీసం రైతుల పంటల ఉత్పత్తులను మద్దతు ధర కన్నా వెంటనే కొనుగోలు చేయాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. రైతుల పంటలకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ గురువారం వైఎస్సార్ సీపీ చీరాల నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు ఆదేశాల మేరకు ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రైతాంగం కునారిల్లుతోందన్నారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో పంటలు నష్టపోయిన రైతన్నలకు నష్టపరిహారం ఇంత వరకు అందించక పోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న, ధాన్యం, అపరాలు ఏవి చూసినా కనీస మద్దతు ధర లేక పోవటంతో రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారన్నారు. ఇప్పటికై నా సీఎం చంద్రబాబు రైతుల పంటలను మద్దతు ధరలతో కొనుగోలు చేయించకపోతే ఆందోళన బాట పట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు జరిగిన మేలును వివరించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల బసవపున్నారెడ్డి, పట్టణ అధ్యక్షుడు యాతం మేరీబాబు, మండల అధ్యక్షుడు బక్కా అద్దంకి రెడ్డి, వేటపాలెం మండల అధ్యక్షుడు సాధు రాఘవ, పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు కావూరి రమణారెడ్డి, జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు చీమకుర్తి బాలకృష్ణ, లీగల్ సెల్ అధ్యక్షుడు రాజు వెంకటేశ్వరరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బొనిగల జైసన్‌బాబు, మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాసరావు, బొడ్డు సుబ్బారావు, మాజీ కౌన్సిలర్ బత్తుల అనీల్, ఆసాది అంకాళ రెడ్డి, షేక్ హుమాయూన్ కబీర్, వాసిమల్ల వాసు, గోలి గిరి, చెల్లి బాబు, తేళ్ల రాంబాబు నియోజకవర్గ పరిధిలోని వివిధ విభాగాల బాధ్యులు, శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు. చీరాల ఆర్డీఓ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ నాయకుల వినతిపత్రం -
ఉద్యోగుల పోరుబాట
ప్రభుత్వ పాఠశాల నిర్వహణ, విద్యాబోధన, చిన్నారుల ఆలనాపాలన, పాఠశాల నిర్మాణం .. ఇలా అనేక విధులు నిర్వహిస్తూ విద్యాశాఖ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ‘సమగ్ర శిక్ష’ ఉద్యోగులు పోరుబాట పట్టనున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సకుటుంబ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. సత్తెనపల్లి: జిల్లాలో మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఆర్సీ) నిర్వహణలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కీలకం. విద్యాశాఖ కార్యకలాపాలు అనేకం వీరి సేవలతోనే కొనసాగుతున్నాయి. అటువంటి ఉద్యోగులు ఏళ్ల తరబడి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తమ డిమాండ్లను చంద్రబాబు ప్రభుత్వానికి వివరించి సుమారు రెండేళ్లవుతోంది. అయినప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు ఉద్యమ బాట పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 373 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు. విసిగిపోయి.. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్ గతంలో యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తాము అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా డిమాండ్లను విస్మరించారు. మినిమం టైం స్కేల్ ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును సైతం చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడం లేదు. సమగ్ర శిక్ష ఉద్యోగుల వేతనాల పెంపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తానంటూ బడ్జెట్ సమావేశాల్లో చెప్పి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతను విస్మరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విసిగి వేసారిన సమగ్ర శిక్ష ఉద్యోగులు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్వర్యాన ఉద్యమించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యోగులు తమ కుటుంబసభ్యులతో కలసి ఈ నెల 15న విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంటికి మహా పాదయాత్రగా నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ దిశగా జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు కదులుతున్నారు. అందిస్తున్న సేవలివీ... మండల విద్యా వనరుల కేంద్రం నిర్వహణలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కీలకంగా ఉంటారు. మొత్తం కార్యకలాపాలకు సమన్వయకర్తగా మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఎంఐఎస్) కోఆర్డినేటర్ వ్యవహరిస్తారు. క్లస్టర్ పరిధిలోని పాఠశాలల నిర్వహణను క్లస్టర్ రీసోర్స్ పర్సన్ (సీఆర్పీ) పర్యవేక్షిస్తారు. మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఆర్సీ) కార్యాలయం నిర్వహణకు సహాయకారిగా మెసెంజర్ ఉపకరిస్తారు. భవిత కేంద్రంలో దివ్యాంగ చిన్నారులకు తోడ్పాటుగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్స్ (ఐఈఆర్టీ) నిలుస్తారు. వారికి కేర్‌వింగ్ వలంటీర్లు సహాయకులుగా ఉంటారు. పాఠశాలల్లో క్రాఫ్ట్, పీఈటీ, తదితర విధుల నిర్వహణలో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు సేవలందిస్తారు. సమగ్ర శిక్ష భవనాల నిర్మాణ వ్యవహారాలను జిల్లా కేంద్రంలో ఉండే సైట్ ఇంజినీరు పర్యవేక్షిస్తారు. ఇన్ని విధాలుగా సేవలందిస్తున్న తమ సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి. ● ఔట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలోకి మార్చాలి. ● రాజ్యాంగ పరంగా పౌరుల హక్కుగా ఉన్న సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. ● హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి ● మినిమం టైం స్కేల్, ఇంటి అద్దె, కరువు భత్యం ఇవ్వాలి. ● రూ. 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్, గ్రాట్యూటీ, ఈపీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలి. ● ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలి. ● వేతనంతో కూడిన మెడికల్ లీవులు, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు ఇవ్వాలి. ● మరణించిన ఉద్యోగి కుటుంబానికి చెల్లించే ఎక్స్‌గ్రేషియాను రూ.20 లక్షలకు పెంచాలి. ● కారుణ్య నియామకాలు చేపట్టాలి. ● డీఎస్సీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలి. -
రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ నారాయణ భట్టుకు అవార్డు
బాపట్ల: బాపట్ల జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ బీఎస్ నారాయణ భట్టుకు ఉత్తమ సేవ గవర్నర్ అవార్డు లభించింది. ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోక్‌భవన్‌లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో బాపట్ల జిల్లాలో రెడ్‌క్రాస్ చైర్మన్‌గా విశిష్ట సేవలు అందించినందుకు గాను ఉత్తమ సేవా అవార్డును రాష్ట్ర గవర్నర్, రెడ్‌క్రాస్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అవార్డును గురువారం అందుకున్నారు. బాపట్ల జిల్లాలో రక్తదాన శిబిరాలు నిర్వహించడం, యూత్ రెడ్‌క్రాస్ ద్వారా యూత్ కమిటీలను, జూనియర్ రెడ్‌క్రాస్ ద్వారా పాఠశాల విద్యార్థులలో సేవాభావాన్ని పెంపొందించడం, సేవా భావం కలిగిన వ్యక్తులను అధిక సంఖ్యలో సభ్యులుగా చేయటంలోనూ, ప్రకృతి విపత్తుల సమయంలో పేదలకు సహాయ కార్యక్రమాల అమలు, ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ, కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఫిర్యాదుల దినోత్సవంలో అర్జీదారులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయటంతో అవార్డు దక్కింది. ప్రధానమంత్రి జన ఔషధి మందుల షాపు ద్వారా అతి తక్కువ ధరలకు పేదలకు అందించే మందుల పంపిణీ కార్యక్రమం, జిల్లా కలెక్టర్ వి.వినోద్‌కుమార్ సహకారంతో జిల్లాలోని ప్రతి మండలంలో రెడ్‌క్రాస్ శాఖలను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందించడం వంటి కార్యక్రమాల నిర్వహణలో సేవా రంగంలో జిల్లాను బలోపేతం చేసినందుకు ఈ సేవా అవార్డు అందించారు. -
సర్కారు మద్దతే లేదయా..
నేలతల్లిని నమ్ముకున్న కర్షకుడి కంట చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కన్నీరే మిగిలింది. రెండేళ్లుగా ఏ పంట వేసిన కనీస మద్దతు ధర మాటలకే పరిమితం కావడంతో అన్నదాతలు కుదేలవుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. తమ గోడు చెప్పుకొనే దిక్కు లేక.. దయ లేని పాలకుల తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి రూరల్: కృష్ణా డెల్టా ప్రాంతమంటే పంటలు పండించడంలో ఎంతో పేరుంది. కానీ రెండు సంవత్సరాల నుంచి రైతులు నష్టాలపాలవుతున్నారు. అయినప్పటికీ నేల తల్లిని నమ్ముకున్న అన్నదాతలు ఇప్పుడైనా కలిసి రాకపోదా.. అనే ఆశతో సాగు కొనసాగిస్తూనే ఉన్నారు. వరి, మొక్కజొన్న, జొన్న, ఇతర పంటలను పండించిన వారికి ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర రాకపోవడంతో ఆవేదన తప్పడం లేదు. భూమి కలిగిన రైతుల కంటే కౌలు రైతులు ఎక్కువ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పంట చేతికి రాగానే గ్రామాల్లో అప్పులు ఇచ్చిన వారితోపాటు ఎరువులు, పురుగుమందుల దుకాణాల వారు నగదు కోసం అడగడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంట విక్రయించి బాకీలు తీరుద్దామన్నా చంద్రబాబు ప్రభుత్వం నుంచి మద్దతు ధరకు కొనుగోళ్లు లేకపోవడంతో దళారులకు అయినకాడికి అమ్మేస్తున్నారు. పెట్టుబడులు కూడా రాని దైన్యం మంగళగిరి ఒక్క నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న, జొన్న పంటలను వేలమంది రైతులు కౌలుకు తీసుకుని పండించారు. గతంలో వరి 70 కేజీల బస్తా రూ.1,900 నుంచి రూ.2,100 ఉంది. ప్రస్తుతం దాని ధర రూ. 1,250 నుంచి రూ. 1,350 పలుకుతోంది. బస్తాకు రైతు సుమారు రూ.700 నుంచి రూ. 800 వరకు నష్టపోతున్నాడు. ఎకరానికి 40 బస్తాలు దిగుబడి ఉంటే సగటున రూ.28 వేల నుంచి రూ.32 వేలు నష్టం వాటిల్లుతోంది. గతంలో మొక్కజొన్న రూ.2,600 ఉండగా ప్రస్తుతం క్వింటా రూ. 1,700 ఉంది,. బస్తాకు రూ.900 వరకు రైతులు నష్టపోతున్నారు. ఎకరానికి 35 బస్తాలు పండిస్తే రూ. 31,500 నష్టమే మిగులుతోంది. జొన్న గతంలో రూ. 2,400 ఉంటే ప్రస్తుతం రూ.1,500 ఉంది. క్వింటా బస్తాకు రూ.900 నష్టపోతున్నారు. అంటే ఎకరానికి 35 బస్తాలు అయితే రూ. 31,500 నష్టం తప్పడం లేదు. దీంతో ప్రతి రైతు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. ఇక బతుకు ‘సాగే’దెలా అంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేనే మూడు ఎకరాలలో మొక్కజొన్న పంట వేశాను. ఎరువుల నుంచి గిట్టుబాటు ధర, కొనుగోలు కేంద్రాలు అన్ని విషయాలలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. మొక్కజొన్న పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర రూ.2,400 ప్రకటించినా నేటికీ కొనుగోలు కేంద్రాల ఊసే లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాలు లేకుంటే రైతులకు అస్సలు ఏమీ ఖర్చులు కూడా రావు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి. లేదంటే దళారుల వల్ల రూ.900 నష్టంగా విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. – కొండూరి అబ్రహం, దుగ్గిరాలగ్రామంలో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. ఎకరం కౌలు రూ.40 వేలు చెల్లించాలి. కొంత డబ్బును వడ్డీ వ్యాపారుల నుంచి అప్పుగా తీసుకున్నా. కొనుగోలు కేంద్రాలు లేవు, గిట్టుబాటు ధర ఊసే లేదు. ఏమీ తోచని పరిస్థితి. దళారులకు అమ్మితే క్వింటాకు రూ.900 వరకు నష్టపోవాల్సి వస్తోంది. రైతులను ప్రభుత్వం పట్టించుకోవాలి. కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ ఇవ్వాలి. ఎరువులు కోసం ఎన్నో కష్టాలు పడి మరీ వ్యవసాయం చేశాం. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. – సిద్దాబత్తుని ఆంజనేయులు, దుగ్గిరాల -
15 నుంచి రంగస్థల నటనాభినయ ప్రత్యేక శిక్షణ శిబిరం
గుంటూరు ఎడ్యుకేషన్ భావితరాలకు భారతీయ రంగస్థల కళా వైభవాన్ని తెలియజేసే విధంగా ‘భవన్స్ అకాడమీ ఆఫ్ కల్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్‘ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు ప్రత్యేక రంగస్థల నాటనాభినయ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు భారతీయ విద్యాభవన్ కార్యదర్శి పి.రామచంద్రరాజు తెలిపారు. గురువారం కలెక్టర్ బంగ్లారోడ్డులోని భారతీయ విద్యాభవన్‌లో వర్క్‌షాప్ ఆన్ థియేటర్ ఆర్ట్ పోస్టర్లు ఆవిష్కరించారు. రామచంద్రరాజు మాట్లాడుతూ గుంటూరు నగర యువత, విద్యార్థులతోపాటు ఔత్సాహికులకు రంగస్థల నటన, ముఖాభినయం, గాత్ర, ధ్వని అనుకరణ కళ, నాటక సృజనాత్మకత, నైపుణ్యతపై లబ్ద ప్రతిష్టులైన రంగస్థల నిపుణులు, నంది పురస్కార గ్రహీతలతో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. వయస్సుతో నిమిత్తం లేకుండా ఆయా కళల్లో శిక్షణ పొందదలచిన అభ్యర్థులు రోజుకు మూడు గంటలు చొప్పున నాలుగు రోజులపాటు నిర్వహించే శిక్షణ శిబిరంలో శిబిరంలో పాల్గొనేందుకు 0863–2234802, 9124519444 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రముఖ రంగస్థల నటుడు డాక్టర్ ఎన్.రవికుమార్, రంగస్థల నటుడు, రచయిత కందిమళ్ల సాంబశివరావు, హిందూ కళాశాల పూర్వ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ దుర్గాప్రసాద్, పూర్వ తెలుగు విభాగాధిపతి డాక్టర్ వై.మల్లికార్జునరావు, రవిశంకర్, సీరియల్ నటులు ముత్తవరపు పద్మారావు, మల్లెల శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పాతకక్షల నేపథ్యంలో యువకుడిపై కత్తితోదాడి
చిలకలూరిపేటటౌన్: పాతకక్షల నేపథ్యంలో యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్ సమీపాన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సుభానినగర్‌కు చెందిన తాపీమేస్త్రి అయిన షేక్ జానీబాషా గుర్రాల చావిడికి చెందిన వెల్డింగ్ వర్కర్ బషీర్ల మధ్య గతంలో కుటుంబ కలహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పట్టణంలోని సాయికార్తీక్ సిటీ సెంటర్ సమీపంలో గురువారం సాయంత్రం టీ తాగుతున్న క్రమంలో బషీర్ కత్తితో దాడి చేశాడు. బాధితుడు తప్పించుకునే ప్రయత్నం చేసినా వదలకుండా పలుచోట్ల కత్తితో పొడిచాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై 108 సిబ్బందికి సమాచారం అందించారు. రక్తస్రావం తీవ్రంగా కావడంతో బాధితుడు బాషాను తొలుత స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిందితుడు బషీర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
ఏఎన్‌యూ పరీక్ష ఫలితాలు విడుదల
ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూ పరిధిలో జరిగిన ఎంబీఎ ఇంటర్నేషన్ బిజినెస్, ఎల్ఎల్బీ, ఎంపీఈడీ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు గురువారం విడుదల చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఫిబ్రవరిలో జరిగాయి. ఈ పరీక్షలకు 48 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 46 మంది ఉత్తీర్ణులయ్యారు. 2025 నవంబరులో జరిగిన ఎల్ఎల్బీ రీ వాల్యుయేషన్ పరీక్షల ఫలితాలు, 2025 డిసెంబరులో జరిగిన ఎంపీఈడీ మూడవ సెమిస్టర్ రీవాల్యేషన్ ఫలితాలను విడుదల చేశారు. పూర్తి వివరాలు వర్సిటీ అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సీఈ తెలిపారు. క్యాష్ డిపాజిట్ చేస్తామంటూ మోసం తెనాలిరూరల్: ఏటీఎం సెంటరులోని క్యాష్ డిపాజిటట్ మెషిన్లో డబ్బు వేసేందుకు వెళ్లిన వ్యక్తి మోసం చేసి రూ. 50 వేలు తీసుకెళ్లిన ఘటన తెనాలిలో గురువారం జరిగింది. పట్టణానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి తన కుమారుడి చదువు అవసరాల కోసం ఏటీఎంలో నగదు జమ చేస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు సహాయం చేస్తామంటూ అకౌంట్లో డబ్బులు వేస్తున్నట్టు నమ్మించారు. అనంతరం చాకచక్యంగా రూ.50 వేల నగదును తీసుకుని పరారయ్యారు. మోసపోయిన విషయం గుర్తించిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్లు తెలిసింది. ఏటీఎంలోని సెక్యూరిటీ గార్డు అని భావించి బాధితుడు మోసపోయినట్టు సమాచారం. రైలు నుంచి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి తెనాలిరూరల్: రైలు నుండి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన తెనాలి–విజయవాడ రైలు మార్గంలోని చిలువూరు స్టేషన్‌కు కిలోమీటరు దూరంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పట్టాల వెంబడి మృతదేహం ఉందన్న సమాచారంతో తెనాలి జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి గురువారం వెళ్లారు. సుమారు 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. రైలు నుంచి జారి పడడం వల్ల మృతి చెందాడని ప్రాథమికంగా భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జీఆర్పీ ఎస్ఐ ఎల్.సరస్వతి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఎరుపు టీషర్టు, ఎరుపు ప్యాంటు ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని కోరారు. -
రాజధాని అభివృద్ధికి రైతులు సహకరించాలి
తాడికొండ: రాజధాని అభివృద్ధికి రైతులు సహకరించాలని సీఆర్డీయే కమిషనర్ వి విజయరామరాజు అన్నారు. భూసేకరణ కార్యకలాపాలలో భాగంగా రాయపూడి, నేలపాడు గ్రామాలలో ఏపీ సీఆర్డీయే ఆధ్వర్యంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. రాజధాని నగరంలో నిర్మిస్తున్న రహదారులు, ఎల్పీఎస్ జోన్లు, పలు అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్ ) చేపట్టామని, సమీకరణకు కొందరు రైతులు, భూ యజమానులు ముందుకు రానందున పలుమార్లు చర్చించిన అనంతరం నిర్ణీత విధానంలో మాత్రమే భూసేకరణ ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. భూసమీకరణలో పాల్గొనేందుకు రైతులకు ఇప్పటికీ అవకాశం ఉందని, భూసేకరణ ప్రకటనలో పేర్లు ఉన్నప్పటికీ సంబంధిత రైతులు నిర్ణీత గడువులోపు భూసమీకరణలో పాల్గొనేందుకు అవకాశముందని కమిషనర్ తెలిపారు. రాజధాని అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నందున రాజధాని గ్రామాల రైతులు అధికారులకు సహకరించాలన్నారు. గ్రామ కంఠాల, లంక భూముల వ్యవహారంపై రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నా ఎలాంటి హామీ లభించలేదు. మా సమస్యలు తీర్చితే ఇస్తామని పలువురు బాధితులు మాట్లాడారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు ఏభార్గవ తేజ, కొల్లాబత్తుల కార్తీక్, గుంటూరు జిల్లా జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, డైరెక్టర్– ల్యాండ్స్(క్యాపిటల్ సిటీ) ఎన్ వసంతరాయుడు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కెఎస్ భాగ్యరేఖ, బి సాయి శ్రీనివాస నాయక్ ఇతర సీఆర్డీయే అధికారులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ఉద్యోగిపై పోలీసుల దాడి హేయం
గుంటూరు వెస్ట్: కలెక్టరేట్ కార్యాలయ ఆఫీస్ సబార్డినేట్ పై నగరపాలెం పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీఆర్ఎస్ఏ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సదరు పోలీసులపై తీవ్ర చర్యలు తీసుకోవాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవ, డీఆర్వోలకు వినతిపత్రం అందజేసారు. కిరణ్ కుమార్ మాట్లాడుతూ మంగళవారం రాత్రి కలెక్టరేట్ సమీపంలో (ఆఫీస్ సబార్డినేట్) వాచ్మెనన్గా పని చేస్తున్న జి.సురేష్ కార్యాలయానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. సురేష్ తాను కలెక్టరేట్ వాచ్‌మన్ అని, విధులకు ఆలస్యమవుతుందని చెప్పినప్పటికీ పోలీసులు వినలేదని, ఈ క్రమంలో బైక్ ముందుకు నడుపుతుండగా ఏఎస్ఐ కాలికి టైరు ఆనుకుందని వివరించారు. వెంటనే అక్కడ సివిల్ డ్రెస్సులో ఉన్న కానిస్టేబుల్ లాఠీతో సురేష్ చెవిపై బలంగా కొట్టడంతో తీవ్రగాయమైందని, సురేష్ చేతిలో ఉన్న ఫోన్, బైక్ లాగేసుకుని పంపించేసారన్నారు. వెంటనే కలెక్టరేట్ ఏఓకి సమాచారం అందడంతో సిబ్బందిని అప్రమత్తం చేసి గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారని చెప్పారు. సహచర ఉద్యోగుల పట్ల ఇటువంటి చర్యలు ఎంతమాత్రం తగవని, ఇవి ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనకు కారణమవుతాయని పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అని కలెక్టరేట్ ఉద్యోగస్తులు విస్తుపోతున్నారన్నారు. కొందరు పోలీస్ అధికారుల దుందుడుకు చర్యలు మొత్తం డిపార్ట్‌మెంట్‌కే చెడ్డపేరు తెస్తుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులపై దాడులను ఏపీఆర్ఎస్ఏ సహించబోదని స్పష్టం చేశారు. గాయపడిన సురేష్‌కు పూర్తి వైద్యం అందించాలని, దాడికి పాల్పడిన కానిస్టేబుల్‌పై, అనుచితంగా ప్రవర్తించిన ఏఎస్ఐల పై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీ స్పందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీఆర్ఎస్ఏ జిల్లా కార్యదర్శి వెంకట్రావు, రాష్ట కార్యదర్శి దివ్య దుర్గాదేవి, సిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్, సెక్రటరీ బాలాజీ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. చర్యలు తీసుకోవాలని జేసీకి ఉద్యోగ సంఘాల ఫిర్యాదు -
హనుమజ్జయంతి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
తాడేపల్లి రూరల్: ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు హనుమజ్జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు బుధవారం పేర్కొన్నారు. తాడేపల్లి పట్టణ పరిధి సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళాశాసనాలతో 10వ తేదీ ఉదయం సంపూర్ణ సుందరకాండ పారాయణ, 11న ఉదయం 9 గంటలకు శ్రీ దాసాంజనేయ స్వామి వారికి అభిషేక మహోత్సవం, మన్యుసూక్త హవనం, పూర్ణాహుతి, తీర్థ ప్రసాదగోష్టి కార్యక్రమాలు ఉంటాయన్నారు. 12న ఉదయం 9 గంటలకు యోగాంజనేయ స్వామి వారికి నవకలశ స్నపనం, విశేష అలంకరణ, 27 అడుగుల ఏకశిల శ్రీ విఘ్న విమోచక హనుమంతునికి 9 రకాల పుష్పాలతో విశేష సహస్రనామార్చన నిర్వహించనున్నామని తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు హనుమ అష్టోత్తర శతనామార్చన, హనుమాన్‌చాలీసా పారాయణ, తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలు జరుగనున్నాయని పేర్కొన్నారు. మూడు రోజులు కై ంకర్యాలు జరుగుతాయని, పుష్ప కై ంకర్యానికి రూ. 11,000, ప్రసాద కై ంకర్యానికి రూ. 5,000, ఉత్సవ కై ంకర్యానికి రూ. 3000గా నిర్ణయించామని వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. -
టెక్స్టైల్ రంగాన్ని ఆదుకోవాలి
కొరిటెపాడు: టెక్స్టైల్ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వాలు ముందుకురావడం అభినందనీయమని ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ చైర్మన్ సామినేని కోటేశ్వరరావు అన్నారు. గుంటూరు కాటన్ అసోసియేషన్ కార్యాలయంలో టెక్స్టైల్స్ హ్యాండ్లూమ్స్ నిపుణుల(ఢిల్లీ) బృందం బుధవారం భేటీ అయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పిన్నింగ్, జిన్నింగ్, వివింగ్ పరిశ్రమలకు అండగా నిలబడాలని అసోసియేషన్ చైర్మన్ సామినేని కోటేశ్వరరావు కోరారు. ఎగుమతులను 37 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు పెంపొందించేందుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాల అవసరమని తెలిపారు. 2030 నాటికి ఈ లక్ష్యాలను సులువుగా చేరుతాయని పేర్కొన్నారు. జిన్నింగ్ పరిశ్రమ ఏపీలో ఉండగా, పంట తెలంగాణలో ఉంటుందని, తద్వారా వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు వేర్వేరుగా సెస్సు చెల్లిస్తున్నామని తెలిపారు. దీంతో క్యాండీకి రూ.600కుపైగా వ్యాపారస్తులు నష్టపోతున్నారని అన్నారు. ఏపీలో చెల్లించే చెస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. పెరిగిన ముడి సరుకు ధర, విద్యుత్ ఛార్జీలతో వివింగ్ పరిశ్రమ తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. వాటిపై రాయితీచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. వివింగ్ పరిశ్రమకు ఎంఎస్ఎంఈ కేంద్ర మంత్రిత్వ మంత్రిత్వ శాఖ 2013–14 ఇచ్చిన 20 శాతం రాయితీలను పునరుద్ధరించాలని కోరారు. టెక్స్టైల్ రంగానికి గ్రీన్ ఎనర్జీ పవర్ బ్యాంకింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రాసెసింగ్ యూనిట్లకు స్థలాన్ని కేటాయించి, పరిశ్రమ ఏర్పాటుకు యాభై శాతం రాయితీ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. టెక్స్‌టైల్స్‌ను విద్యుత్ ఆధారిత పరిశ్రమగా గుర్తించాలని అన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రోత్సహకాలు ప్రకటిస్తే ఎగుమతులతోపాటు యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ఈ భేటీలో ఢిల్లీ ప్రతినిధి ధ్రువ మంగళ, హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ జేడీ రాజారావు, అసోసియేషన్ సభ్యులు ఉప్పుటూరి సాంబశివ రావు, మాఘం సురేంద్రబాబు పాల్గొన్నారు. ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ చైర్మన్ సామినేని కోటేశ్వరరావు -
గడువులోపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
బాపట్ల: జిల్లాలో కొనసాగుతున్న అన్ని అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన వారాంత ప్రాజెక్టుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఖనిజ ఫౌండేషన్ పనుల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, వీక్లీ డెవలప్మెంట్ ఫొటోలు ఎందుకు అప్డేట్ చేయలేదని గనుల శాఖ అధికారిని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మల్లికార్జునరావు, మార్కెటింగ్ శాఖ ఏడడీరమేశ్ బాబు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అనంతరాజు, జిల్లా గనుల శాఖ ఏడీ శ్రీనివాస్, విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు మంచి పేరు తేవాలి బాపట్ల: బాగా చదివి జిల్లాకు మంచి పేరు తెచ్చారని జిల్లా కలెక్టర్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమశాఖల వసతి గృహాలలో విద్యనభ్యసిస్తూ పది, ఇంటర్మీడియట్ పరీక్షలలో అధికంగా మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ బుధవారం అభినందించారు. ప్రశంసా పత్రాలు, పతకాలతో విద్యార్థులను ఆయన సత్కరించారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో ఉంటూ అత్యధిక మార్కులు సాధించడం అభినందనీయమని చెప్పారు. చిత్తశుద్ధితో పని చేయాలి స్వర్ణ బాపట్లలో వివరాలను గుర్తించి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. స్వర్ణ బాపట్ల సేవా సేతు, జాతీయ, రాష్ట్రీయ రహదారుల నిర్మాణాలపై అనుబంధ శాఖల అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. బాపట్ల సూర్యలంక బీచ్‌ను గోవా బీచ్‌ను మించిన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. బుధవారం పర్యాటక, వెనుకబడిన తరగతుల సంక్షేమ హాస్టల్, వికలాంగుల సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, విద్యాశాఖ లోని పలు ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. -
బాపట్ల
గురువారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 33.9760 టీఎంసీలు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 525.10 అడుగులకు చేరింది. ఇది 158.7393 టీఎంసీలకు సమానం. చంద్రబాబు సర్కారు వచ్చాక రైతులకు కన్నీరే మిగిలింది. విత్తనం నాటిన నాటి నుంచే ఎరువులు, పురుగుమందులు మొదలు పంట చేతికొచ్చే వరకు ఏదో ఒక సమస్య అన్నదాతలను అతలాకుతలం చేస్తోంది. పాలకుల అసమర్థతతో నేడు పంట విక్రయించాలంటే కొనే దిక్కు లేకుండా పోయింది. లాభం సంగతి దేవుడెరుగు... పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతులు కుదేలు అవుతున్నారు. విత్తనాలు కూడా వేరుశనగలో కోరుకున్న రకం దొరకడం లేదు. రైతులపై కనికరం చూపని చంద్రబాబు ప్రభుత్వం తీరుతో తీవ్ర ఆవేదనలో కూరుకుపోతున్నారు. జూన్ 15వ తేదీ నుంచి ఖరీఫ్ పంట కాలం ప్రారంభం అవుతుంది. అయితే చీరాల ప్రాంతంలో వేసవిలో కూడా వేరుశనగ సాగు చేపడతారు. స్పింక్లర్లతో రైతులు పంట పండిస్తారు. ఈ క్రమంలో ఏడాదికి వారికి మూడు పంటలు పండే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా వేరుశనగకు సంబంధించి టీఏజీ–24 రకం ఎక్కువ సాగు చేస్తుంటారు. సాగుదారుల్లో ఎక్కువ మంది ఆ రకాన్ని అడుగుతున్నారు. ఆ విత్తన రకం దీర్ఘకాలంగా సాగు చేస్తుండటంతో విశిష్ట అనే రకం విత్తనాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆ రకం ఒకింత దిగుబడి తగ్గుతున్న మాట వాస్తవమే. ప్రభుత్వానికి మా పరంగా ఇచ్చే సమాచారంలో ఆ విషయాన్ని పేర్కొంటున్నాం. మా వంతు బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నాం. – నిర్మలాదేవి, ఏఓ, చీరాల మండలం చీరాల అర్బన్: అదునులో పదును కావాలి. పదునులో విత్తనం పడాలి. ప్రకృతి అనుకూలించాలి. చీడపీడల నుంచి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అప్పుడు దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. వాటికి మద్దతు కాకుండా గిట్టుబాటు ధర దక్కాలి. అప్పుడే రైతులకు నాలుగు రూపాయలు మిగులుతాయి. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అందుకు పాలకులు, అధికారులు చిత్తశుద్ధి చూపాలి. కేవలం మాటలకే పరిమితమైతే రైతుకు ప్రయోజనమే ఉండదు,. ప్రస్తుతం మొక్కజొన్న రైతులకు లాభం సంగతి అటుంచి, కనీసం మద్దతు ధర కూడా లేదు. వరి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పంట నష్టపరిహారం ఊసే లేదు. వేరుశనగ రైతులకు కనీసం విత్తనాలు దొరకడం లేదు. జల్లులతోనే సాగు. చీరాల నియోజకవర్గంలో పలువురు రైతులు స్పింక్లర్ల సాయంతో నీటి తడులు ఇస్తూ వేరుశనగ సాగు చేస్తుంటారు. కోరిన విత్తనాలను మాత్రం ప్రభుత్వం సరఫరా చేయటం లేదు. సర్కారు విత్తనాలతో సరైన దిగుబడులు రావటం లేదు. దీంతో తాము అడిగినవి ఇవ్వకుండా... వద్దన్న వాటిని అంటగడితే ఎలా అని రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఖరీఫ్ నాటి కన్నా టీఏజీ–24 రకం విత్తనాలు సరఫరా చేయాలని పలువురు రైతులు వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళుతున్నారు. వేరుశనగకు సంబంధించి గత రెండు సంవత్సరాలుగా దిగుబడులు తగ్గుతున్నాయి. సాగు పరిస్థితులతోపాటు విత్తనాలు కూడా కొంత కారణంగా రైతులు చెబుతున్నారు. చీరాల ప్రాంతంలో కొందరు మూడు పంటలు పండిస్తారు. అందులో వేరుశనగ సాగు చేసేవారు టీఏజీ–24 రకం విత్తనాలను ఎద పెడుతుంటారు. దిగుబడి ఎకరాకు రమారమి 40 బస్తాలు (36 కేజీలు) వస్తుంటాయి. గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వపరంగా విశిష్ట రకం వేరుశనగ విత్తనాలను రైతులకు సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో దిగుబడులు తగ్గుతున్నాయని భావిస్తున్నారు. ఎకరాకు 25 నుంచి 28 బస్తాలు మాత్రమే దిగుబడి రావడం నిదర్శనమంటున్నారు. వేసవి సాగు ప్రారంభం వేసవి వేరుశనగ సాగును రైతులు ప్రారంభించారు. ప్రస్తుతం సుమారు 20 ఎకరాల్లో విత్తనాలు వెదపెట్టారు. మరో ఏడెనిమిది వందల ఎకరాలు విస్తీర్ణంలో సాగు కానుంది. అందుకు రైతులు సన్నద్ధంగా ఉన్నారు. చీరాల మండలం తోటవారిపాలెం పోలేరమ్మ వారి తిరునాళ్ల రేపటితో పూర్తవుతుంది. ఆ తరువాత వేసవి వేరుశనగ సాగు ప్రారంభిస్తామని రైతులు చెబుతున్నారు.ఖరీఫ్, రబీ సీజన్లతో పాటు స్పింక్లర్లు కింద వేసవిలో వేరుశనగ సాగు చేసే రైతులకు సంబంధించిన పంట వివరాలను ఈ – క్రాప్ చేస్తున్నారు. 7విత్తన మార్పిడి ముఖ్యంభూమి పరంగా ప్రతి సంవత్సరం ఒకే పైరు వేయకుండా పంట మార్పిడి జరిగితే బాగుంటుంది. చీడపీడలు తగ్గుతాయి. సరైన యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయశాఖ అధికారులు చెప్పటం పరిపాటి. అదే రీతిలో దీర్ఘకాలం ఒకే పంటకు రకం సంబంధించి ఒకే రకమైన విత్తనాలు వినియోగించటం కూడా సరైన పద్ధతి కాదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఆ క్రమంలో విత్తన మార్పిడి నేపథ్యంలో విశిష్ట రకం వేరుశనగ విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు. దిగుబడి తగ్గటాన్ని పరిగణనలోకి తీసుకుని మెరుగైన పంట వచ్చే విత్తనాలను తమకు సరఫరా చేయాలని వేరుశనగ రైతులు కోరుతున్నారు. -
కేంద్ర ప్రతినిధుల బృందం సందర్శన
తెనాలి: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పరిధిలోని జనాభా పరిశోధన కేంద్రం ప్రతినిధి బృందం తెనాలి చెంచుపేటలో గల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని జిల్లా సత్వర చికిత్సాలయం (డైక్) సెంటర్‌ను సందర్శించింది. ‘రాష్ట్రీయ బాల స్వస్థ’ కార్యక్రమం అమలుపై పరిశీలనకు నాలుగురోజులపాటు ఈ బృందం షెడ్యూలును నిర్ణయించింది. తొలిరోజున గుంటూరును సందర్శించింది. రెండో రోజైన బుధవారం తెనాలి ‘డైక్’ను పరిశీలించింది. అనంతరం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిపారు. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పరిధిలోని జనాభా పరిశోధన కేంద్రం సీనియర్ రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ వై.రమణ నేతృత్వంలోని బృందం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో నాలుగు ప్రధాన అంశాలపై సమీక్షించారు. పిల్లల పుట్టుకలో లోపాలు, వ్యాధులు, కొరతలు, ఎదుగుదల లోపాలు, వైకల్యం అంశాలను ముందుగా గుర్తించటంపై సమీక్షించారు. రిఫరల్ మెకానిజం బలోపేతం చేయటం ద్వారా నిర్ణీత సమయాల్లో పరిశీలన చేయటం, ‘డైక్’ ద్వారా మెరుగైన సేవలను అందించటం, క్షేత్రస్థాయి సవాళ్లపై చర్చించారు. అధికారుల సమన్వయం, నివేదించటంపై తగిన సూచనలు, సలహాలను ఇచ్చారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ అన్నపూర్ణ, ‘డైక్’ పీడియాట్రిషన్ డాక్టర్ మధుబాబు, డైక్ మేనేజరు శిరీష తదితరులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా ఎడ్లబండ లాగుడు పోటీలు
నందిగామ రూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో వేంచేసియున్న లక్ష్మీ పేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. బుధవారం రాత్రి జరిగిన ఒంగోలు జాతి సీనియర్ విభాగం ఎడ్ల బండ లాగుడు పోటీలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. మంగళవారం రాత్రి నిర్వహించిన న్యూ కేటగిరీ విభాగం ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీల్లో 20 నిమిషాల వ్యవధిలో 1.450 టన్నుల బరువును పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామానికి చెందిన మంగు రమాదేవి ఎడ్ల జత 4,050 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానం, గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండబాలవారిపాలెంనకు చెందిన గూడవల్లి లక్ష్మీదీక్షిత, పోతిన లక్షిత్కి చెందిన ఎడ్ల జత 4,006 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. పల్నాడు జిల్లా రెంట చింతల మండలం రెంటాలకు చెందిన పిన్నెబోయిన సతీష్ కుమార్ యాదవ్, బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన సుఖవాసి సతీష్‌బాబు ఎడ్ల జత 3,947 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం, సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామలక్ష్మీపురానికి చెందిన కొప్పుల హేమలతారెడ్డి, శ్రీనివాసరెడ్డి ఎడ్ల జత 3,750 అడుగుల దూరం లాగి నాలుగో స్థానంలో నిలిచినట్లు రైతు కమిటీ సభ్యులు తెలిపారు. విజేతల ఎడ్ల జత యజమానులకు వరుసగా రూ.50 వేలు, రూ.45 వేలు, రూ.40 వేలు, రూ.35 వేల నగదు బహుమతి, జ్ఞాపికను ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చిరుమామిళ్ల లక్ష్మీ సాయిబాబు, రైతు కమిటీ సభ్యులు అందజేశారు. -
ఉత్తమ విద్యార్థులకు గగనయానం
అచ్చంపేట: మార్చిలో జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ఇరువురు విద్యార్థులను బ్లూబెల్స్ పాఠశాల యాజమాన్యం బుధవారం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం మేరీ శ్రీలత మాట్లాతూ 595మార్కులు సాధించిన పెద్దింటి సైదేశ్వరరావు, 593 మార్కులు సాధించిన మద్దుల శ్రీలక్ష్మిలను ప్రోత్సహించేందుకు, మిగిలిన విద్యార్థులకు ప్రేరణ కల్పించడంలో భాగంలోనే విమాన ట్రిప్పు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి యేటా తమ పాఠశాల విద్యార్థులు నూరుశాతం విత్తీర్ణత సాధిస్తున్నారన్నారు. కారెంపూడి: బైక్ వరిగడ్డి ట్రాక్టర్ ట్రక్కును ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని వేపకంపల్లి గ్రామ రోడ్డు సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. కారెంపూడికి చెందిన నెమలికంటి రామాంజనేయులు తెలంగాణ రాష్ట్రం వాడపల్లి నుంచి బైక్‌పై స్వగ్రామం కారెంపూడి వస్తున్నారు. దాచేపల్లి రోడ్డులోని ఆంజనేయస్వామి గుడి సమీప ప్రాంతంలో ఆగి ఉన్న వరిగడ్డి ట్రాక్టర్ ట్రక్కును ఢీకొన్నారు. దీంతో బైక్‌పై ఉన్న రామాంజనేయులు (42) తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రామాంజనేయులుకు భార్య ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఘటనతో కారెంపూడి గ్రామంలో విషాదం అలుముకుంది. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మృతుని కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు. తిరుపతమ్మ ఆలయానికి రూ.4,37,500 ఆదాయం పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీతిరుపతమ్మవారి ఆలయానికి సంబంధించి సుబ్బాయిగూడెం గ్రామ పరిధిలో ఉన్న 17.53 ఎకరాల మెరక భూమిని రెండు సంవత్సరాల కాలపరిమితితో కౌలు చేసుకునేందుకు బుధవారం బహిరంగ వేలం నిర్వహించారు. పంచా యతీ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేలం ద్వారా ఆలయానికి రూ.4,37,500 ఆదాయం వచ్చిందని ఈఓ బి.మహేశ్వరరెడ్డి తెలిపారు. గత వేలంలో రూ.6,88,646 ఆదాయం రాగా ఈ సారి రూ.2,51,146 తగ్గింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ జంగం శ్రీనివాసరావు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. ముస్లిం విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం పెనమలూరు: ముస్లిం విద్యార్థులు ఉన్నత చదువులు చేరేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న తాలీం–ఎ–హునూర్ టాలెంట్ పరీక్షకు దరఖాస్తు చేయాలని వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ కరీముల్లాబాషా బుధవారం సూచించారు. ఈ టాలెంట్ టెస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 12వ తేదీ వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. -
రేపటి నుంచి మిర్చి యార్డుకు వేసవి సెలవులు
కొరిటెపాడు (గుంటూరు): గుంటూరు మిర్చి యార్డుకు శుక్రవారం నుంచి జూన్ 6 వరకు వేసవి సెలవులు ఉంటాయని యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా మిర్చి ఎగుమతి, దిగుమతి షాపుల కార్మిక సంఘాలు, మిర్చి యార్డు కాపలా వర్కర్స్ యూనియన్, ది గుంటూరు చిల్లీస్ కమీషన్ ఏజెంట్స్ అసోసియేషన్ల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రైతుల మిర్చి బస్తాలను గురువారం వరకే యార్డులోకి అనుమతిస్తామని తెలిపారు. జూన్ 7వ తేదీ నుంచి యార్డులో యథావిధిగా క్రయవిక్రయాలు జరుగుతాయని ఆమె వివరించారు. -
తండ్రికి అంత్యక్రియలు చేసిన తనయ
మంగళగిరి టౌన్: తండ్రి అంత్యక్రియలు కుమార్తె నిర్వహించిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. మంగళగిరి మండలం నూతక్కి గ్రామానికి చెందిన ఆళ్ల శంకరరెడ్డి(74) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. శంకరరెడ్డికి కుమారులు లేకపోవడంతో అంత్యక్రియలు చేసే విషయంలో బంధువుల మధ్య చర్చ జరిగింది. అయితే తన తండ్రికి అంత్యక్రియలు చేసే బాధ్యతను తనకు ఇవ్వాలని కుమార్తె నందీశ్వరి ధైర్యంగా ముందుకొచ్చింది. నందీశ్వరి అంగన్వాడీ సూపర్వైజర్గా పనిచేశారు. ఆమె భర్త బొంతు వీరారెడ్డి నూతక్కి గ్రామంలో ఆర్ఎంపీగా సుపరిచితులు. తండ్రికి కన్నీటి వీడ్కోలు పలుకుతూ తన తండ్రికి నందీశ్వరి అంత్యక్రియలు నిర్వహించారు. -
పవర్ లిఫ్టింగ్ జాతీయస్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులు
మంగళగిరి టౌన్: చైనాలో జరిగే పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీలకు భారత్ తరఫున గుంటూరు జిల్లాకు చెందిన క్రీడాకారులు ఎంపికై నట్లు పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు విజయ భాస్కరరావు తెలిపారు. స్ధానిక జిమ్‌లో బుధవారం వివరాలు వెల్లడించారు. ఈనెల 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చైనాలో జరిగే సబ్ జూనియర్ అండ్ జూనియర్(మెన్ అండ్ ఉమెన్) క్లాసిక్ అండ్ ఎక్యూప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీలు జరుగనున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ముగ్గురు మహిళా పవర్ లిఫ్టర్లు ఎంపికయ్యారని, క్రీడాకారులు బుధవారం భారతదేశం నుంచి పోటీలకు బయలుదేరి వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఎంపికై న మహిళా పవర్ లిఫ్టర్లు ఎం. షానూన్ 47 కేజీల విభాగం, జూనియర్ ఎక్యూప్డ్ పవర్ లిఫ్టింగ్, ఇ.ఎల్. వినయశ్రీ 84 కేజీల విభాగం, సబ్ జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్, నాగం జ్ఞాన దివ్య +84 కేజీల విభాగం,జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ విభాగాల్లో తలపడనున్నారని వివరించారు. -
సీ్త్రనిధి రుణాల పంపిణీ వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ బాపట్ల: జిల్లాలో సాంఘిక సంక్షేమ, డీఆర్డీఏ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ జీవనోపాధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ సమీక్ష నిర్వహించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్షలో ఆయా శాఖల పనితీరుపై ఆరా తీశారు. నిర్దేశిత లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫీజులు, నిర్వహణ భత్యాలు అర్హులైన ప్రతి విద్యార్థికి నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళల సాధికారత కోసం గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని తెలిపారు. డీఆర్డీఏ వెలుగు ద్వారా సీ్త్రనిధి రుణాల పంపిణీని వేగవంతం చేయాలని సూచించారు. రూ.94.14 కోట్ల లక్ష్యానికిగాను ఇప్పటివరకు రూ.11.62 కోట్లు మాత్రమే మంజూరు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొల్లూరు, చుండూరు, ఇంకొల్లు మండలాల సిబ్బంది రుణ వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించి లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఉన్నతి పథకాల కింద మంజూరు చేసిన వడ్డీ లేని రుణాల వసూళ్లు తక్కువగా ఉన్న చెరుకుపల్లి మండల ఏపీఓను వివరణ కోరారు. సముద్రపు మొక్కల పెంపకంపై అవగాహన కల్పించేందుకు తమిళనాడులోని రామేశ్వరం ప్రాంతానికి స్టడీ టూర్ ఏర్పాటు చేయాలని సూచించారు. గుర్రపు డెక్క , అరటినారు ఉత్పత్తులపై శిక్షణ అందించాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సింగయ్య, మండలాల ఏపీఎంలు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి రాజ దిబోరా, బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్ అర్జీలు మళ్లీ రాకుండా చూడండి జిల్లాలో మండలాలవారీగా జరుగుతున్న రెవెన్యూ క్లినిక్స్, రీ సర్వేకి సంబంధించి ప్రతిరోజు రిపోర్టు అందజేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ హల్లో జేసీ భావన వశిష్ట, డీఆర్ఓ జి.గంగాధర్ గౌడ్లతో కలసి పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్స్, రీ సర్వే, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, ప్రింటింగ్, రీసర్వే, మ్యానవల్ 1బీ తదితర అంశాలపై తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, వీఆర్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జూలైకల్లా గ్రౌండింగ్ రీ సర్వే పూర్తి చేయాలని ఆయన అన్నారు. అర్జీలకు సంబంధించి రీ ఓపెన్ కాకుండా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొల్లూరు మండలానికి సంబంధించి రీ ఓపెన్ చాలా అయ్యాయని గుర్తుచేశారు. బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, భూ రికార్డ్స్ సర్వే శాఖ ఏడీ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఎండలపై జాగ్రత్తలు తీసుకోవాలి జిల్లాలో ఎండ తీవ్రత అధికమవుతున్నందున విద్యాసంస్థలు, రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలను, తాటాకు పందిళ్లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. -
తీరని ఆక్రమణల దాహం..!
అసలు ఏం జరుగుతోంది...? గతం ఘనం... భవిష్యత్ ఆందోళనకరం సునామీ తరువాత వీఎస్‌ఎస్‌ల ఏర్పాటు శాఖల మధ్య సమన్వయ లోపం గతంలో పీఓఆర్లో కేసులు నమోదు తీరం పరాధీనం అవుతోంది. సీఆర్‌జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. తీరం వెంట ఉండాల్సిన చెట్లు దాదాపు కనుమరుగు అవుతున్నాయి. పర్యాటకం పేరుతో హద్దులు మీరుతున్నారు. దీనిపై ప్రాథమిక చర్యలు చేపట్టాల్సిన అటవీ, రెవెన్యూ శాఖలు చోద్యం చూస్తున్నాయి. డబ్బు, అధికారం అండతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. -
ఆచార్యా... అన్నీ అయినోళ్లకేనా!
ఏఎన్‌యూ (పెదకాకాని): ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తాత్కాలిక పరిపాలనలో సొంత సామాజిక వర్గానికే పదవులన్నీ పప్పుబెల్లాల్లా పంచుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏక కాలంలో ఒకరికి పలు బాధ్యతలు అప్పగించడం వలన వారు తరగతులు నిర్వహించలేకపోతున్నారనేది స్పష్టమవుతోంది. కూటమి పాలనలో ఎక్కువ పదవులు అనుభవిస్తున్న వారు ఆర్థిక అంశాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాత్కాలిక పాలకుల తీరు చూస్తే వర్సిటీలో పదవులు అనుభవించే వారు మనవారేనా... అయితే అప్పగించెయ్ అనేలా పరిస్థితి మారింది. సాక్షాత్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సొంత నియోజకవర్గంలో ఉన్న విశ్వవిద్యాలయంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కరికే 12 ఉద్యోగ బాధ్యతలు ఏఎన్‌యూలో రీసెర్చ్ సెల్ కో ఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి ఏకకాలంలో 12 ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సామాజిక న్యాయం ఏ విధంగా అమలు చేస్తున్నారో దీని వలన తెలుస్తోంది. ఈ వ్యక్తి 12 సంవత్సరాలుగా వర్సిటీలోని పరీక్షా భవన్లో యూజీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఏసీటీఏగా (డిగ్రీ జవాబు పత్రాల కోడింగ్) విధులు నిర్వహిస్తున్నారు. ఆయనే ఆన్లైన్ పరీక్షల ఇన్చార్జి, ఓ విభాగానికి విభాగాధిపతిగా, పీజీ అడ్మిషన్ సెట్ కో కన్వీనర్‌గా, వర్సిటీ సాంకేతిక విభాగం పర్యవేక్షకుడిగా, దూర విద్యాకేంద్ర రీజనల్ కో ఆర్డినేటర్‌గా, ఏపీపీఎస్సీ మూల్యాంకనంలో, రెగ్యులర్ దూర విద్యాకేంద్రాలకు తనిఖీ బృందం సభ్యుడిగా, ఎగ్జామ్ సెంటర్ల సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా, ఏఎన్‌యూ ఇంటర్ నెట్ వర్క్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదే వ్యక్తికి వర్సిటీ పనులపై పలుమార్లు ఢిల్లీ వెళ్లే బాధ్యతలు కూడా అప్పగించడం విశేషం. దీనిపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొకరికి ఇలా... ఏఎన్‌యూలోని అదే విభాగంలో ఐక్యూఏసీ కో ర్డినేటర్ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగికి కూడా పలు బాధ్యతలు అప్పగించారు. సీటీఏగానూ, రెగ్యులర్ దూర విద్యాకేంద్రాల్లో తనిఖీ సభ్యుడిగా, పీజీ, డిగ్రీ పరీక్షల పరిశీలకుడిగా, రెగ్యులర్ పరీక్షల తనిఖీ సభ్యుడిగా, ప్రాక్టికల్ పరీక్షల తనిఖీ సభ్యుడిగా బాధ్యతలు చూసుకుంటున్నారు. రెగ్యులర్ విధానంలోనే కాకుండా దూర విద్యా కేంద్ర పరీక్షల్లోనూ పరిశీలకుడిగా, తనిఖీ బృందం సభ్యుడిగా, ప్రాక్టికల్ పరీక్షల్లోనూ, దూర విద్యాకేంద్రాల తనిఖీల్లోనూ సభ్యుడిగా విధులు నిర్వహిస్తున్నారు. పలు వర్సిటీ అంతర్గత కమిటీల్లోనూ సభ్యుడిగా కొనసాగుతున్నారు. లెక్కకు మించిన బాధ్యతలు నిర్వహించే ఈ అధ్యాపకులు తరగతులు ఎప్పుడు నిర్వహిస్తున్నారో అప్పగించిన వారికే తెలియాల్సి ఉంది. దీంతో గెస్ట్ ఫ్యాకల్టీపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమయం ఉండదని తెలియదా? కొందరు అధ్యాపకులకు ఒకటి కంటే ఎక్కువ బాధ్యతలు కట్టబెడుతున్న తాత్కాలిక వీసీకి ఆయా అధ్యాపకులకు పాఠాలు చెప్పే వెసులుబాటు, సమయం ఉన్నాయా? అని ఆలోచించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అంతిమంగా విద్యార్థులు నష్టపోతున్నారు. దీనిపై విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే తాత్కాలిక వీసీ ఆచార్య కె.గంగాధరరావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాయి. కనీస చర్యలు కూడా లేవు. గతంలో వీసీలు తనిఖీలు చేసి అవసరమైతే కఠినమైన నిర్ణయాలు తీసుకునేవారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించడమే బాధ్యతగా భావించేవారని పలువురు విద్యావేత్తలు గుర్తు చేసుకుంటున్నారు. తాత్కాలిక వీసీ వచ్చిన 23 నెలల్లో ఏ రోజూ మచ్చుకై నా తనిఖీలు లేవని, బాధ్యులపై చర్యలు తీసుకోలేదని వర్సిటీ వర్గాల్లో సైతం చర్చ సాగుతోంది. వర్సిటీలోని ఓ కళాశాల ప్రిన్సిపల్ విభాగాధిపతుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులకు పలు తరగతులు జరగడం లేదని వాపోయారు. అధ్యాపకులకు తప్పనిసరిగా బోధన చేయాలని సూచించారు. అయినప్పటికీ వారిలో ఎటువంటి మార్పు లేదు. ఎక్కువ బాధ్యతలు నిర్వహిస్తున్న వారిలో కొందరు హోదాను చూసుకుంటుండగా... మరికొందరు ఆర్థిక సంబంధమైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వర్సిటీలోని తాత్కాలిక పాలకులకు సైతం విద్యార్థుల ఇబ్బందులు పట్టడం లేదు. దీనిపై పలువురు ప్రిన్సిపాల్స్ చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఐదు దశాబ్దాలుగా మంచి పేరున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం.. కొందరు అధికారుల పనితీరు, స్వార్థం, ఓ సామాజిక వర్గంపై ప్రేమతో నేడు దిగజారుతోంది. ఏ విద్యాకేంద్రంలోనైనా విద్యార్థులకు సామాజిక విలువలతో కూడిన విద్యాబోధనలు, నైతిక విలువలను నేర్పించడం ప్రథమ కర్తవ్యం. కానీ వర్సిటీలో 23 నెలల తాత్కాలిక పాలనలో విద్యార్థులకు తరగతులే సరిగా నిర్వహించడం లేదు. పాఠాలు చెప్పకుండా పరీక్షలు రాసేదెలా అంటూ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. -
బాపట్ల
బుధవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.9760 టీఎంసీలు. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 525.20 అడుగులకు చేరింది. ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. నిమ్మకాయల ధరలు తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,000, గరిష్ట ధర రూ.4,500, మోడల్ ధర రూ.3,500 వరకు పలికింది. 7 -
షేక్ షబీనాకు స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్
తెనాలి: తెనాలి పట్టణానికి చెందిన పవర్ లిఫ్టర్ షేక్ షబీనా రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్‌లో మరోసారి సత్తా చాటింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఈనెల ఒకటి నుంచి 3వ తేదీ వరకు జరిగిన 13వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సబ్–జూనియర్, జూనియర్, మాస్టర్స్ (పురుషులు, మహిళలు) ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో షబీనా జూనియర్ విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. జూనియర్స్‌లో 84 కిలోల విభాగంలో పోటీపడిన షేక్ షబీనా స్క్వాట్‌లో 200 కిలోలు, బెంచ్‌ప్రెస్‌లో 110 కిలోలు, డెడ్ లిఫ్ట్‌లో 200 కిలోల బరువును ఎత్తి ఓవరాల్‌గా 510 కిలోలు బరువులతో బంగారు పతకం కై వసం చేసుకోవటం విశేషం. అదనంగా ‘ఆంధ్రప్రదేశ్ స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్’ను కూడా సాధించారని గుంటూరుకు చెందిన పవర్ లిఫ్టింగ్ కోచ్ ఎం.అశోక్‌కుమార్ తెలియజేశారు. పట్టణానికి చెందిన క్రీడాకారులు పలువురకు షబీనాను అభినందించారు. గుంటూరు మెడికల్: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సీనియర్ రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ వై.రమణ ఆధ్వర్యంలో జనాభా పరిశోధన సంస్థ బృందం మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని సందర్శించింది. ఈ నెల 5,6,7,8 తేదీలలో సభ్యులు జిల్లాలో పర్యటించనున్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు, ఆర్బీఎస్కే కార్యక్రమంలో భాగంగా జరిగే స్క్రీనింగ్‌పై సమీక్షించారు. పుట్టుకతో వచ్చే రుగ్మతలు, వ్యాధులు, లోపాలు, ఎదుగుదలలో జాప్యం ఉన్న పిల్లలను పరీక్షించి, తక్షణ చికిత్సకై జిల్లా సత్వర చికిత్స కేంద్రాలకు రిఫర్ చేయడం, ఫాలో అప్ చేయడం, క్షేత్ర స్థాయిలో ఎదుర్కొనే సమస్యల గురించి సమీక్షించారు. జిల్లా ప్రగతికి తగిన మార్గదర్శకాలు సూచించారు. గుంటూరు, తెనాలిలో సత్వర చికిత్స కేంద్రాలను, గుంటూరు జీజీహెచ్‌ని, ఎన్ఆర్సీ (పౌష్టికాహార పునరావాస కేంద్రం)ని సందర్శించారు. పిల్లలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీసీహెచ్ఎస్ డాక్టర్ రంగారావు, ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర సుజాత, ఆర్బీఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీధర్, మేనేజర్ శిరీష పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు ఈ నెల 24న గుంటూరు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహిస్తామని జిల్లా అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నికలు గుంటూరులోని జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు నామినేషను స్వీకరిస్తారని, 10 – 11 గంటలకు పరిశీలన, 11 – 12 గంటలకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం కల్పిస్తామన్నారు. మధ్యాహ్నం 12 – ఒంటి గంట వరకు ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని తెలియజేశారు. ఎన్నికైన సభ్యుల వివరాలను ఎన్నికల అధికారి మధ్యాహ్నం 2 గంటలకు తెలియజేస్తారన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తగిన ఆధారాలతో ఫుట్‌బాల్ క్లబ్ రిజిస్ట్రేషన్ పత్రాలు, రెన్యువల్ పత్రాలు తీసుకురావాలని కోరారు. ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు విజయవాడ విద్యాధరపురానికి చెందిన అన్ని త్రివిక్రమ్‌బాబు కుటుంబం ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,00,116 విరాళాన్ని వారు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచన అనంతరంఆలయ అధికారి, ట్రస్ట్ బోర్డు సభ్యులు శంకరబాబు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. -
డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా మహిళా బిల్లు అమలు చేయాలి
నరసరావుపేట: డీలిమిటేషన్ ప్రక్రియతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సావిత్రి డిమాండ్ చేశారు. స్థానిక కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ఐద్వా పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటుపల్లి రజిని అధ్యక్షతన నిర్వహించిన డీలిమిటేషన్–మహిళా రిజర్వేషన్ బిల్లుపై అవగాహన సదస్సులో సావిత్రి మాట్లాడారు. డిలిమిటేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం బిల్లును అమలు చేయడంలో ఆలస్యం చేస్తుందన్నారు. ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ బిల్లును అమలు చేయడం కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతని స్పష్టం చేశారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టం అమలు విషయంలో ఆలస్యం జరుగుతుందని డీలిమిటేషన్‌తో అనుసంధానం చేయడం సరికాదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ అమలుకు మద్దతుగా ఈ నెల 7న విజయవాడలో 2కె రన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన మద్యం అందిస్తామని చెప్పే కూటమి ప్రభుత్వ పెద్దలు, అదేస్థాయిలో నాణ్యమైన విద్య, వైద్యం, ఆహారం జీవన ప్రమాణాల గురించి ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజకీయ నాయకుల మద్దతు లేకుండా గంజాయి సాగు జరగడం అది బహిరంగ మార్కెట్లో అందుబాటులో ఉండటం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వై. రాధాకృష్ణ, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి.శివకుమారి, సీఐటీయు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు జి.మల్లేశ్వరి, మహిళా సంఘం సీనియర్ నాయకురాలు జి.ఉమశ్రీ, జిల్లా అధ్యక్షురాలు జె.అనూషలు పలు అంశాలపై మాట్లాడారు. వివిధ మహిళా సంఘాలు ప్రజా సంఘాలు అధిక సంఖ్యలోమహిళలు పాల్గొన్నారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సావిత్రి -
చర్చి స్థలాల్లో అక్రమ నిర్మాణాలు
వినుకొండ: పురపాలక సంఘం పరిధిలో గల క్రైస్తవ మిషనరీ ఆస్తులు ఆక్రమణల పర్వానికి గురవుతున్నాయి. నకిలీ పత్రాలు సృష్టించి కొందరు వ్యక్తులు చర్చి స్థలాలను ఆక్రమించడమే కాకుండా హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను సైతం ఖాతరు చేయకుండా నిర్మాణాలు కొనసాగిస్తుండటంపై చర్చి కోశాధికారి పులిమల సునీల్‌కుమార్‌తో పాటు సంఘ సభ్యులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇమ్మానుయేలు తెలుగు బాప్టిస్ట్ చర్చికి సంబంధించిన విలువైన స్థలాలను కొందరు ఆక్రమణదారులు తప్పుడు ధ్రువపత్రాలతో పురపాలక సంఘం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అన్నపూర్ణ హోటల్ ఎదురుగా అక్రమంగా భవన నిర్మాణాలు చేపడుతున్నా బాధ్యత ఉన్న మున్సిపల్ అధికారులు, ఆక్రమణదారులతో చేతులు కలిపారని చర్చి సభ్యులు ఆరోపిస్తున్నారు. కోర్టు ఆర్డర్ కాపీని చూపించినా కమిషనర్ స్పందించకపోగా నేను ఏ చర్యలు తీసుకోను, మీకు చేతనైనది చేసుకోండి అంటూ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానం ఆదేశాలను తుంగలో తొక్కి అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న మున్సిపల్ కమిషనర్‌పై కఠినచర్యలు తీసుకోవాలని, తక్షణమే జిల్లా యంత్రాంగం స్పందించి మిషనరీ ఆస్తులను కాపాడాలని, కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులకు పుస్తక పఠనంపై అవగాహన పెంచుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మ తెలిపారు. మంగళవారం పట్టాభిపురంలోని శాఖ గ్రంథాలయంలో శిక్షణ శిబిరాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయ ప్రాముఖ్యత తెలుసుకోవాలని సూచించారు. పుస్తక పఠనంతో మేధస్సు అభివృద్ధి చెందడంతో పాటు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. గ్రంథాలయంలోని పుస్తకాలను చదవడం వలన మంచి అలవాట్లు చేకూరుతాయన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పడాల సుబ్బారెడ్డి, ఎన్జీవో పార్కు అసోసియేషన్ అధ్యక్షురాలు జె.సుబ్బాయమ్మ, గ్రంథాలయాధికారి పి.సత్య శిరీష పాల్గొన్నారు. -
ముగిసిన ఆహ్వాన నాటికల పోటీలు
తెనాలి: కొలంకపురి నాటక కళాపరిషత్, శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు సంయుక్త ఆధ్వర్యంలో కొలకలూరు పంచాయతి పరిధిలోని ఖాజీపేట కళావేదికపై జరుగుతున్న ఉభయ రాష్ట్రస్థాయి 12వ ఆహ్వాన నాటికల పోటీలు మంగళవారం రాత్రితో ముగిశాయి. చిటుమడుగుల సాంబయ్య కళాప్రాంగణంలో చిటుమడుగుల భాస్కరరావు జ్యోతి ప్రజ్వలనతో చివరిరోజు ప్రదర్శనలు ఆరంభించారు. రాత్రి ఏడుగంటలకు స్వర్ణ సూర్య డ్రామా లవర్స్, హైదరాబాద్ వారి ‘సీ్త్రమాత్రే నమః’ నాటికను ప్రదర్శించారు. పూర్ణిమ పెమ్మరాజు మూలకథకు ఉదయ్ భాగవతుల నాటకీకరించి, దర్శకత్వం వహించారు. రాత్రి 8 గంటలకు ఏర్పాటైన సభకు కళాపరిషత్ ఉపాధ్యక్షులు సుద్దపల్లి మురళీధర్ అధ్యక్షత వహించారు. సభలో గోపరాజు చక్రపాణి జీవిత సాఫల్య పురస్కారాన్ని కాకినాడకు చెందిన ప్రముఖ రంగస్థల, టీవీ, సినీనటుడు డాక్టర్ సీఎస్.ప్రసాద్‌కు బహూకరించారు. సభానంతరం స్నేహ ఆర్ట్స్–చంద్రమాంపల్లి, దివిలి వారి ‘పుట్టింటి సంపద’ నాటికను ప్రత్యేకంగా ప్రదర్శించారు. స్నిగ్ధ రచనకు, బి.రాజు దర్శకత్వంలో పి.బాలాజీనాయక్ పర్యవేక్షణలో ప్రదర్శించారు. నిర్వాహక కమిటి తరపున గోపరాజు రమణ, గోపరాజు విజయ్, సుంకర శ్రీనివాసరావు, సుద్దపల్లి మురళీధర్ పర్యవేక్షించారు. -
రసవత్తరంగా ఎడ్ల బండలాగుడు పోటీలు
నందిగామ రూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో వేంచేసియున్న లక్ష్మీ పేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. మంగళవారం రాత్రి న్యూ కేటగిరి విభాగంలో బండ లాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో మొత్తం ఎనిమిది జతలు పాల్గొన్నాయని రైతు కమిటీ సభ్యులు తెలిపారు. నలుగురు వ్యక్తుల సహకారంతో 20 నిమిషాల వ్యవధిలో 1.450 టన్నుల బరువు లాగినట్లు చెప్పారు. ఆరు పళ్ల విభాగంలో విజేతలు.. గ్రామంలో సోమవారం రాత్రి నిర్వహించిన ఆరు పళ్ల విభాగం ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీల్లో 15 నిమిషాల వ్యవధిలో 1.200 టన్నుల బరువును ప్రకాశం జిల్లా వేటపాలెంకు చెందిన దేవరపల్లి జాన్వికా రెడ్డి, హన్విక ఎడ్ల జత 4,551 అడుగుల దూరం ప్రథమ స్థానంలో నిలిచాయి. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువుకు చెందిన కొప్పుల గోవర్దన్ రెడ్డి, ప్రవలీష్ రెడ్డి ఎడ్ల జత 4,398 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరుకు చెందిన బత్తుల శ్రీనివాసరావు ఎడ్ల జత 4,250 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం, చందర్లపాడు మండలం చందర్లపాడు గ్రామానికి చెందిన గడిపూడి రాజా చౌదరి ఎడ్ల జత 4,029 అడుగుల దూరం లాగి నాలుగో స్థానంలో నిలిచాయి. విజేతల ఎడ్ల జత యజమానులకు వరుసగా రూ.40 వేలు, రూ.35 వేలు, రూ.30 వేలు, రూ.25 వేల నగదు బహుమతి, జ్ఞాపికను ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చిరుమామిళ్ల లక్ష్మీ సాయిబాబు, రైతు కమిటీ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు కమిటీ సభ్యులు వడ్లమూడి పెద్దశ్రీను, ఉమ్మనేని విక్రం, అత్తలూరి వెంకట్రావ్, దిగుమర్తి రాంబాబు, గంటా శివాజీ, చిరుమామిళ్ల రాంబాబు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. -
బడిబాటలో కలెక్టర్ సందడి
చిలకలూరిపేటటౌన్: మండలం పరిధిలోని గోపాలంవారిపాలెం గ్రామంలో జిల్లా కలెక్టర్ కృతికాశుక్ల మంగళవారం పర్యటించారు. ముందుగా గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్షరాలా ఒక ఉపాధ్యాయురాలిగా మారిపోయారు. పాఠశాల ప్రాంగణంలో చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ, వారి చదువుల పురోగతిని అడిగి తెలుసుకున్న కలెక్టర్.. ప్రభుత్వ బడుల్లో అందుతున్న కార్పొరేట్ స్థాయి వసతులను వినియోగించుకోవాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. అక్షర వెలుగులతో గ్రామం మెరవాలని ఆకాంక్షించారు. అనంతరం సమీపంలోని టెక్స్టైల్ పార్కును సందర్శించారు. అక్కడ పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించి, జిల్లా ప్రగతిలో వస్త్ర పరిశ్రమ పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తహసీల్దార్ మొహమ్మద్ హుస్సేన్, టెక్ట్స్‌టైల్స్ ప్రతినిధులు సామినేని కోటేశ్వరరావు, పలువురు పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. -
9,10 తేదీల్లో జాతీయస్థాయి డప్పుల పోటీలు
వినుకొండ: దరువు సాంస్కృతిక ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9,10 తేదీల్లో పట్టణంలోని ఎన్ఎస్పీ కాలనీ గ్రౌండ్స్‌లో జాతీయస్థాయి డప్పు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పోటీల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ పోటీల్లో పద్మశ్రీ అవార్డు గ్రహీత, కర్ణాటక వాసి నండోజ పిండి పాపన్ హళ్లి ముని వెంకటప్ప మాదిగకు సన్మానం జరుగుతుందన్నారు. పోటీలకు ఆరు రాష్ట్రాల నుంచి ఎంపికై న నిష్ణాతులైన 12 టీమ్‌లు పాల్గొంటాయని, విజేతలైన టీమ్‌లకు మొదటి బహుమతి రూ.లక్ష, రెండో బహుమతి రూ.50వేలు, మూడో బహుమతి రూ.30వేలు నగదు, పాల్గొన్న టీమ్‌లకు రూ.10వేలు నగదు, ప్రశంసాపత్రం, సన్మానం ఉంటుందన్నారు. కార్యక్రమాన్ని దరువు వ్యవస్థాపకులు ఎర్రగుంట్ల భాస్కర్‌రావ్, కన్వీనర్ ప్రసాద్, కో–కన్వీనర్ స్కైలాబ్ కిరణ్, కో–ఆర్డినేటర్ బేతం గాబ్రియేల్, మోజేస్, సలహాదారులు చాట్ల రామయ్య, ఆర్గనైజర్స్ బంక ఎలియాజర్, కూచిపూడి వినోద్‌కుమార్ తదితరులు పర్యవేక్షిస్తారని తెలిపారు. రెంటచింతల: మండలంలోని గోలి గ్రామానికి చెందిన వడితే చంద్రూ నాయక్(38) మిట్టగుడిపాడు–గోలి గ్రామాల మార్గ మధ్యలోని ఓ కల్వర్టు వద్ద మృతి చెందినట్లు మంగళవారం ఓ వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఏప్రిల్ 30న గురువారం అదే గ్రామానికి చెందిన గురవయ్యకు ఆ ప్రాంతంలోని పొలం గట్టున చంద్రూ నాయక్ కన్పించాడు. అప్పటి నుంచి మంగళవారం వరకు చంద్రూ నాయక్ జాడలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎండ తీవ్రతకు మంచినీరు లేక దప్పికతో మృతి చెందినట్లు పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్ఐ సీహెచ్ నాగార్జున కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నగరంపాలెం: భద్రత దృష్ట్యా హెల్మెట్ల వినియోగం చోదకులకు చాలా అవసరమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఆప్కా సాబ్‌కి అవాజ్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో హోంగార్డులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ప్రజా భద్రత కోసం నిరంతరం విధులు నిర్వర్తించే హోంగార్డులకు హెల్మెట్లను విరాళంగా పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. సంస్థ అందిస్తున్న సేవా కార్యక్రమాలు ఇతర సంస్థలకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. సమాజ సేవ చేయడం సంస్థ ప్రధాన ఉద్దేశమని సంస్థ నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్‌లో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో వెల్ఫేర్ ఆర్ఐ సురేష్, సంస్థ సభ్యులు శివ కుమార్, డాక్టర్ రాధమాధవి, కిరణ్ పాల్గొన్నారు. -
మంత్రి ఇలాకాలో పరేషన్
● తెనాలి ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో నిండుకున్న రేషన్ బియ్యం నిల్వలు ● నాలుగు రోజులైనా రేషన్ దుకాణాలకు చేరని వైనం ● దాదాపు 80 షాపులకు మూడో తేదీకి మాత్రమే చేరిన సరుకులు ● ఇంకా రేషను అందని 40 షాపులు ● బియ్యం కోసం వచ్చి తిరిగి వెళుతున్న పేదలు వైఎస్సార్ సీపీ హయాంలో ఠంఛనుగా.. గుడివాడ నుంచి తోలటమే జాప్యానికి కారణం ! -
వంటింట్లోకి యుద్ధం!
మంగళవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2026సత్తెనపల్లి: పశ్చిమాసియ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధాన్ని బూచిగా చూపించి మార్కెట్లో నిత్యవసరాల ధరలను అమాంతం పెంచేస్తున్నారు. దీంతో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల జీవనం కష్టంగా మారుతోంది. పప్పుల నుంచి నూనెల వరకు అన్ని రకాల వస్తువుల ధరలు పెంచేయడంతో పేద ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ధరలను అదుపు చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం గుడ్లప్పగించి చూస్తోంది. ఇదే అదునుగా వ్యాపారులు ధరలను అమాంతం పెంచేస్తూ నిలువునా దోచేస్తున్నారు. ధరలను కట్టడి చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. యుద్ధాన్ని బూచిగా చూపి.. అమెరికా–ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల నూనెల దిగుమతి తగ్గిపోయిందని చెబుతూ వ్యాపారులు ధరలను పెంచేస్తున్నారు. కొందరు వ్యాపారులైతే సిండికేట్‌గా మారి కృత్రిమ కొరత సష్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వల్ల నూనె ధర లీటరుకు రూ. 20 నుంచి రూ. 30 వరకు పెరిగింది. పామాయిల్ ధర లీటరుకు రూ. 20, రిఫైండ్ ఆయిల్ ధర లీటర్‌కు రూ. 30 వరకు పెరిగింది. వివిధ రకాల పప్పుల ధరలు కూడా కేజీకి రూ.10 నుంచి రూ. 20 వరకు పెంచేశారు. ధరల కట్టడిలో విఫలం... నిత్యావసర ధరలు రెండు నెలల నుంచి పెంచి సామాన్యులను దోచుకుంటున్నప్పటికీ యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ధరలను కట్టడి చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అసలు వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు అటుగా కనీసం చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకిలా వ్యవహరిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వ్యాపారులతో అధికారులు అంటకాగుతున్నారా? అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు పాలకులు యుద్ధప్రభావం ఏమీ లేదని చెబుతుంటేఏ మరోవైపు ఇలా ధరలు పెరగడం చూస్తుంటే అసలేం జరుగుతుందన్న ప్రశ్నలు సామాన్యుడిలో తలెత్తుతున్నాయి. ఏం కొనేటట్టు లేం.. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజల కొనుగోలు స్థితి పడిపోయింది. ఏ వంట చేయాలన్నా .. నూనె, గ్యాస్ కనీస అవసరం. నూనె లేనిదే, గ్యాస్ లేనిదే ఏ వంట చేయలేని దుస్థితి. ఈ పరిస్థితుల్లో నూనె ధరలు పెరగడం వల్ల వినియోగాన్ని తగ్గించుకుంటున్నారు. గ్యాస్ కొరత కారణంగా అసలు వంటకాలే తగ్గిస్తున్నారు. కొంత మంది రిఫైండ్ ఆయిల్ వాడిన వారు పామాయిల్‌తో సరిపెట్టుకుంటున్నారు. సామాన్యులకు వెజి ‘ట్రబుల్స్’... ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాన్నింటి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్కసారిగా కూరగాయల ధరలన్నీ పెరిగిపోయాయి. కొద్దిరోజులుగా కూరగాయల ధరలు రూ. 20 పైగా పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. కిలో వంకాయలు రూ.30 నుంచి రూ. 60 వరకు పెరిగాయి. డజన్ నిమ్మకాయలు రూ. 120 పైనే విక్రయిస్తున్నారు. కూరగాయలు రకాన్ని బట్టి రూ 10 నుంచి రూ. 30 వరకు పెరిగినట్లు వినియోగ దారులు చెబుతున్నారు. రకం పాతధర(కిలో) కొత్త ధర వంకాయలు రూ. 40 రూ. 60 టమాటా రూ. 30 రూ. 40 గోరుచిక్కుళ్లు రూ. 30 రూ. 40 బెండకాయలు రూ. 40 రూ. 50 దొండకాయలు రూ. 30 రూ. 40 పచ్చిమిర్చి రూ. 30 రూ. 50 బీరకాయలు రూ. 40 రూ. 60 పశ్చిమాసియా ఉద్రిక్తత కారణంగా ముఖ్యంగా హర్మూజ్ జలసంధి వద్ద రవాణా అంతరాయాలతో దేశంలో వంట గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఇదే అదునుగా కొందరు గ్యాస్ సిలిండర్లను మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గృహ వినియోగ సిలిండర్ ఇంకా పూర్తిస్థాయిలో అందడం లేదు. ఇదిలా ఉండగానే మరోవైపు కమర్షియల్ సిలిండర్ ఏకంగా రూ. 993 పెరిగింది. గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నా గ్రామాల్లో గ్యాస్ కష్టాలు మాత్రం తప్పడం లేదు ధరలను నియంత్రించడంతోపాటు గ్యాస్ సరఫరా పై ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. పప్పుల నుంచి నూనెల వరకు అదే తీరు సలసల కాగుతున్న వంట నూనెల ధరలు కూరగాయల ధరలకు సైతం రెక్కలు ఇంకా పూర్తిస్థాయిలో తీరని వంట గ్యాస్ కష్టాలు సామాన్య, పేద ప్రజలు బతికేదెలా? ఆందోళన వ్యక్తం చేస్తున్న పేదలు పట్టించుకోని కూటమి పాలకులు -
పశు ఔషధి కేందాల్లో చౌకగా మందులు
బాపట్ల: పశువుల కోసం జనరిక్ పశు ఔషధి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలపై జిల్లా అధికారులతో సోమవారం స్థానిక కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. పశువులకు తక్కువ ధరకే నాణ్యమైన ఔషధాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం జనరిక్ పశు ఔషధి విక్రయ కేంద్రాలను మంజూరు చేసిందని కలెక్టర్ చెప్పారు. జిల్లాకు నాలుగు కేంద్రాలు మంజూరయ్యాయన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక గొర్రెలు సహకార సంఘాల ద్వారా ఈ కేంద్రాలు నిర్వహిస్తామన్నారు. అత్యంత చౌక ధరలకే పశువులకు సంబంధించిన ఔషధాలన్ని ఈ కేంద్రాల్లో లభ్యమవుతాయన్నారు. ఒక ఔషధి కేంద్రం ఏర్పాటుకు రూ.3.61 లక్షలు ఖర్చు అవుతుందని, అందులో 25 శాతం ప్రభుత్వం నుంచి రాయితీ వస్తుందన్నారు. ఐదుగురు జిల్లా స్థాయి అధికారులతో నియమించిన కమిటీ ఔషధ కేంద్రాలకు అనుమతి ఇస్తుందన్నారు. జేసీ భావన వశిష్ఠ, డీఆర్ఓ జి.గంగాధర్ గౌడ్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వేణుగోపాల్ పాల్గొన్నారు. ● జిల్లాలో హెచ్ఐవీ నియంత్రణ మరియు నివారణ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో వైద్యాధికారులతో జిల్లాలో హెచ్ఐవీ నిర్మలన పై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ● కౌమార బాలబాలికల సాధికారత సాధనకు కిశోరి వికాసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కిశోర వికాసంపై రూపొందించిన వాల్‌పోస్టర్లను కలెక్టర్ సోమవారం విడుదల చేశారు. కిశోర వికాసం కార్యక్రమాలు వేసవిలో నిర్వహిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. మంగళవారం నుంచి జూన్ 11వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ -
రంగురాళ్ల కేసు నీరుగార్చేందుకు యత్నం
సాక్షి, టాస్క్ ఫోర్స్: రంగురాళ్ల కేసును నీరుగార్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండల పరిధిలోని శంకరాపురం అటవీ భూముల్లో టీడీపీ నాయకులు తవ్వితీసిన రంగురాళ్లను ఆ శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గత మూడు రోజుల క్రితం దాచేపల్లిలో ఓ గోడౌన్లో పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న రంగరాళ్లను వినుకొండకు తరలించి భద్రపరిచారు. అయితే స్వాధీన పరుచుకున్న రంగురాళ్ల వివరాలను నేటికీ పూర్తిస్థాయిలో అధికారులు వెల్లడించకపోగా... ఈ కేసుపై నీలినీడలు కమ్ముకునేలా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాచేపల్లిలో దొరికిన రంగరాళ్లను టీడీపీకి చెందిన కీలక నేతల పాత్ర ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీలో కీలకంగా ఉన్న సదరు నాయకులపై కేసులు పెట్టకుండా జోరుగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిసింది. రాష్ట్రస్థాయిలో ఓ ముఖ్య నేత ద్వారా ఫారెస్ట్ అధికారులపై ఒత్తిడి చేస్తూ టీడీపీ నాయకులను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తవ్వకాలు చేసే కూలీలపైనే కేసులు పెట్టేలా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. సూత్రధారులను విడిచిపెట్టేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు వినికిడి. అధికారుల పాత్రే కీలకం దాచేపల్లిలో పట్టుబడిన రంగురాళ్లు సుమారుగా రూ.కోటి పైనే ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇంత భారీ స్థాయిలో రంగురాళ్లు పట్టుబడటం ఇదే మొదటిసారి. అటవీ భూముల్లో యథేచ్ఛగా రంగురాళ్ల కోసం తవ్వకాలు నిర్విరామంగా జరుగుతుంటే అధికారులు చూడకపోగా.. కేసులు కూడా నీరుగార్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఆ శాఖ అధికారులు కూడా తాయిలాలు అందినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ కారులో లభించిన రంగురాళ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు కారును వదిలి పెట్టేందుకు భారీ స్థాయిలో ముడుపులు తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. శాఖాపరమైన విచారణ జరిగినట్లు కూడా సమాచారం. రంగు రాళ్లు తవ్వించే అక్రమార్కులకు పూర్తిస్థాయిలో అటవీశాఖ అధికారుల సహకారం ఉండటం వల్లనే కొండకు సొరంగాలు వేస్తున్నారు. సహజసిద్ధమైన సంపదను కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులతో చేతులు కలిపారు. శంకరాపురం కొండలలో రంగురాళ్ల తవ్వకాల వ్యవహారం పైస్థాయి అధికారులకూ తెలుసని సమాచారం. ఇకనైనా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్
నరసరావుపేట రూరల్: ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. అర్జీదారులు తమ సమస్య గురించి ఖచ్చితమైన, పూర్తి సమాచారంతో దరఖాస్తు చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరిస్తారని తెలిపారు. అలాగే ప్రతి సోమవారం కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ముగ్గురు రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల తహసీల్దార్లు పాల్గొని వినతులు స్వీకరిస్తారని వివరించారు. రూ.25 లక్షల ఆస్తి నష్టం గుంటూరు రూరల్: ప్రత్తిపాడు మండలం గొట్టిపాడులో భారీ అగ్నిప్రమాదం ఆదివారం చోటుచేసుకుంది. పొలం సమీపంలో నాలుగు వరిగడ్డివాములు, ఒక లారీ దగ్ధం కావ్వటంతో భారీ నష్టం జరిగిందని బాధితులు గరికపాటి లక్ష్మయ్య తెలిపారు. పందెం ఎద్దులకు చెందిన వరిగడ్డి వాములు కావటం, దానితోపాటు ఒక లారీ, లారీలోని ఎద్దుల పందేలకు వినియోగించే సామగ్రి దగ్ధమయ్యాయి. సుమారు రూ.25 లక్షల వరకూ ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని బాధితులు తెలిపారు. ఘటనపై ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): కుడొ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ ఆధ్వర్యంలో స్థానిక టీజేపీఎస్ కళాశాలలో జిల్లా నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించినట్లు ఎన్నికల పర్యవేక్షకుడు రిషి వర్మ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఆర్ఆర్ ప్రసాద్, కార్యదర్శిగా సిద్ధార్థ, కోశాధికారిగా రిషి వర్మ రాజు ఎన్నికయ్యారు. ఎన్నికల నిర్వహణకు డిస్ట్రిక్ట్ స్పోట్స్ అథారిటీ నుంచి అబ్జర్వర్‌గా బాక్సింగ్ కోచ్ రామిశెట్టి విశ్వనాథ్, స్టేట్ అసోసియేషన్ నుంచి కోటిరెడ్డి హాజరయ్యారన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్‌గా శ్రీనివాసరావు వ్యవహరించారని చెప్పారు. ‘మణిపాల్ లైవ్ బేరియాకాన్’లో ప్రముఖ వైద్యులు తాడేపల్లిరూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ‘మణిపాల్ లైవ్ బేరియాకాన్–2026’ పేరుతో ప్రత్యేక అకడమిక్ ఈవెంట్‌ను నిర్వహించారు. విజయవాడలోని వరుణ్ నోవాటెల్ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు, బేరియాట్రిక్ సర్జన్లు హాజరై తమ అనుభవాలను వివరించారు. మణిపాల్ హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు మాట్లాడుతూ ఊబకాయం ప్రధాన సమస్య కాదని, దీనికి సరైన ప్లానింగ్, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్‌తో చికిత్స అవసరమని తెలిపారు. మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ జె.రామాంజనేయరెడ్డి మాట్లాడుతూ బేరియాకాన్ ద్వారా ఆధునిక శస్త్రచికిత్స నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, రోబోటిక్ సర్జరీ సేవలు, వైద్య సమాజానికి దగ్గర చేయడం తమ లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు బత్తిని రాజేష్, రాజేష్ చండ్ర, వరుణ్ దాసరి, రవి దాస్యం, అమిత్ , భానుప్రవీణ్ నాయుడు, మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు రూరల్: మండుతున్న ఎండల వేళ ఆదివారం వర్షం కురిసింది. కాకుమాను, పెదనందిపాడు, గుంటూరు రూరల్ మండలాల్లో మబ్బులతో కూడిన వర్షం పడింది. కాకుమాను గ్రామంలో అక్కడక్కడ చిన్నపాటి వడగడ్లు పడ్డాయి.. -
మున్సిపల్ ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు
పిడుగురాళ్ల: మున్సిపల్ ట్రాక్టర్‌ను వెనుక నుంచి కారు ఢీకొనటంతో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలైన సంఘటన పిడుగురాళ్ల పట్టణంలోని బైపాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నరసరావుపేటకు చెందిన ఓ కుటుంబం కారులో తెలంగాణ రాష్ట్రంలోని జానపాడు దర్గా దర్గకు వెళ్తున్నారు. ఈక్రమంలో కొండమోడు డంపింగ్ యార్డులో చెత్తను వేసి పిడుగురాళ్లలోని ఓటర్ ట్యాంక్ వద్ద పార్క్ చేసేందుకు వస్తున్న ట్రాక్టర్‌ను పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి దగ్గరలో కారు వెనుకగా ఢీకొనడంతో కారు గాలిలో పల్టీలు కొట్టి కింద పడింది. ఘటనలో ఇమామ్ హుస్సేన్ (38) అక్కడిక్కడే మృతి చెందగా కరిముల్లా, షకీరా, నజీమా, నూర్జహాన్, హసీమా, జానీలకు గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు, ఎస్ఐ శివనాగరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. క్షతగాత్రులను పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం నరసరావుపేటకు తరలించారు. సీఐ శ్రీరాం వెంకట్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెద్దాసుపత్రికి నిర్లక్ష్య రోగం
గుంటూరు మెడికల్: జీజీహెచ్‌కు క్యాజువాలిటీ (ఎమర్జన్సీ వార్డు) గుండె లాంటిది. రోడ్డు ప్రమాదాల బాధితులు, దాడుల్లో గాయపడిన వారు, విషప్రభావానికి గురైన వారిని అత్యవసర సేవల విభాగంలో (ఎమర్జెన్సీ వార్డు) చేరుస్తారు. అయితే ఎమర్జెన్సీ వార్డులో సరైన వైద్య సౌకర్యాలు అందుబాటులో లేవు. ముఖ్యంగా డ్యూటీలో ఉండాల్సిన డ్యూటీ అసిస్టెంట్ ఫిజీషియన్లు (డీఏపీ), డ్యూటీ అసిస్టెంట్ సర్జన్లు (డీఏఎస్)లు అందుబాటులో ఉండటం లేదు. ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్టుమెంట్ ఉన్నప్పటికీ సదరు వైద్యులు సక్రమంగా విధులు నిర్వహించడం లేదు. ఎమర్జెన్సీ వార్డులో పర్యవేక్షణ చేయాల్సిన సివిల్ సర్జన్ ఆర్ఎంఓ ఆస్పత్రిలో నివాసం ఉండటం లేదు. రాత్రి వేళల్లో ఎమర్జన్సీ వార్డులో అందుబాటులో ఉండటం లేదు. నర్సింగ్ అధికారుల పర్యవేక్షణ మొక్కుబడిగా ఉంది. వైద్య పరీక్షల కోసం ఎదురు చూపులు.... జీజీహెచ్‌లో వ్యాధి నిర్ధారణ కోసం చేసే సిటీ స్కాన్, ఎమ్మారై స్కాన్, ఆల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్స్‌రే, రక్త పరీక్షలు ఇలా వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం రోగులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. స్ట్రక్చర్లపై, వీల్చైర్లలో ఆక్సిజన్ మాస్క్‌లు ధరించి సైతం రోగులు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. వైద్య పరీక్షల అనంతరం రిపోర్ట్‌లకు సైతం ఇదే తరహా కష్టాలు రోగులకు తప్పడం లేదు. ప్రైవేటు అంబులెన్స్‌లే దిక్కు..... పెద్దాసుపత్రికి వచ్చి చనిపోతే వారి భౌతిక కాయాన్ని తరలించాలంటే... ముఖ్యంగా రాత్రి వేళల్లో తరలించాలంటే బంధువులు రూ.వేలల్లో ప్రైవేటు అంబులెన్స్‌ల వారికి డబ్బులు చెల్లించాల్సిందే. మృతదేహాలను తరలించే కాంట్రాక్ట్‌ను మహాప్రస్థానం పేరుతో ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. వారు సాయంత్రం ఆరు గంటలు దాటితే సేవలు నిలిపివేస్తున్నారు. రాత్రివేళ చనిపోతే మరుసటిరోజు వరకు వార్డులో లేదా మార్చురీలో ఉండాల్సిందే. అర్ధాకలితో విధుల నిర్వహణ జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్లో పనిచేస్తున్న సుమారు 30 మంది వైద్య సిబ్బందికి ఏడాదిపైగా వేతనాలు చెల్లించలేదు. కాంట్రాక్ట్ స్టాఫ్‌నర్సులు, పారామెడికల్ సిబ్బంది సుమారు 700 మందికి పైగా రెండు నెలలుగా వేతనాలు చెల్లించలేదు. వేతనాలు రాక పలువురు వైద్య సిబ్బంది అర్ధాకలితో విధులు నిర్వహిస్తూ అవస్థలు పడుతున్నారు. శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి సైతం ప్రతినెలా వేతనాలు చెల్లింపులు జరగటం లేదు. ముట్టజెప్పాల్సిందే... కాన్పుల విభాగంలో, మార్చురీ వద్ద, ఆపరేషన్ థియేటర్ల వద్ద అధిక మొత్తంలో మామూళ్లు వసూలు చేసి రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నా ఆసుపత్రి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండిపోతున్నారు. రోగులకు కట్టుమార్చే వారు సైతం ముడుపులు తీసుకుని డ్రెస్సింగ్ చేస్తున్నారు. పెద్ద ఆసుపత్రిలో పుట్టినా, గిట్టినా ముడుపులు తప్పనిసరి అన్నట్లుగా కింది స్థాయి ఉద్యోగులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కార్యాలయంలోనూ మామూళ్ల రోగం తీవ్ర స్థాయిలో ఉందని ఆసుపత్రి ఉద్యోగులు వాపోతున్నారు. మందులు, సర్జికల్, ఆక్సిజన్, వర్క్‌షాపు బిల్లుల మంజూరుకు పర్సంటేజీలు ఇవ్వకపోతే సంతకాలు చేయడం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు. నీటి కష్టాలు తప్పడం లేదు ఎండలకు జీజీహెచ్‌లో రోగులు నీటి సరఫరా లేక అల్లాడిపోతున్నారు. తాగునీరు తప్పనిసరిగా బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. దాతల సాయంతో కూలింగ్ వాటర్ కూలర్స్ ఏర్పాటు చేసినా వాటిల్లో నీటిని నింపే ప్రక్రియ సక్రమంగా చేయడం లేదు. ఆసుపత్రిలో రోగులను వార్డులోకి తరలించేందుకు అవసరమైన వీల్చైర్లు, స్ట్రక్చర్లు అందుబాటులో ఉండటం లేదు. రోగుల సహాయకులే తరలించాల్సిన దుస్థితి నెలకొంది. నిబంధనల ప్రకారం జీజీహెచ్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ వైద్య సేవలు అందించాల్సి ఉంది. కానీ పెద్ద ఆసుపత్రిలో సీనియర్ వైద్యులు పనివేళలు పాటించడం లేదు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది.గుంటూరు జీజీహెచ్‌లో అవుట్ పేషెంట్ విభాగంలో (ఓపీ) చికిత్స పొందాలంటే తొలుత ఓపీ చీటీ తీసుకోవాలి. ఆసుపత్రి అధికారులు ఓపీ చీటీల ప్రక్రియను ఆన్లైన్ చేశారు. ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న సెల్‌ఫోన్, ఆధార్ కార్డు ఉండి గంటసేపు క్యూలో ఉంటే ఓపీ చీటీ చేతికందుతుంది. తీరా ఓపీ చిటీ తీసుకుని వైద్యుల వద్దకు వెళితే అక్కడ సీనియర్ వైద్యులు వార్డుల్లో బిజీగా ఉంటూ జూనియర్ వైద్యులతో ఓపీ వైద్య సేవలను మమా అనిపిస్తున్నారు. -
చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో సదస్సు
గుంటూరు మెడికల్: చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో బీపీ మండల్ ట్రస్ట్ అధ్యక్షుడు, గుంటూరుకు చెందిన ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు అనేకమంది మేధావులను, ఉద్యమకారులను కలిసి మద్దతు కోరారు. స్వరాజ్ అభియాన్ అధ్యక్షుడు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్, ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సుకుమార్, సీనియర్ జర్నలిస్ట్, రాజ్యసభ టీవీ మాజీ చైర్మన్ ఊర్మిలేష్, రాష్ట్రీయ జనతాదళ్ అధికార ప్రతినిధులు డాక్టర్ కాంచన యాదవ్, కుమారి ప్రియాంక భారతి, సమాజ్ వాది పార్టీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ లక్ష్మణ్, ఏఐసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ రాజేంద్రపాల్ గౌతమ్, ప్రొఫెసర్ సందీప్ తదితరులను డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు కలిశారు. ఈ సందర్భంగా తాను కలిసిన వారికి డాక్టర్ వెంకటేశ్వర్లు 1992లో ఆనాటి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు, కేపీ రెడ్డయ్య యాదవ్ ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన ప్రతిని వారికి అందజేశారు. లోక్ సభలోను , అనేక రాష్ట్రాల అసెంబ్లీలలో ఓబీసీల సంఖ్య చాలా తక్కువగా ఉన్నదని, రిజర్వేషన్లు కల్పించకపోతే రానున్న కాలంలో వారి సంఖ్య మరీ తగ్గిపోయే అవకాశం ఉన్నట్లు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ ఆందోళన వ్యక్తం చేసినట్లు డాక్టర్ ఆలా వివరించారు. ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కోసం ఆగస్టు 7న ఢిల్లీలో మేధావుల సదస్సును నిర్వహించనున్నట్లు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సందీప్ వివరించినట్లు చెప్పారు. -
ఊళ్లకు వెళ్తే సమాచారం ఇవ్వండి
బాపట్లటౌన్: వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పుడే దొంగతనాల నివారణ సాధ్యమని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. వేసవి సెలవుల సందర్భంగా అనేక కుటుంబాలు విహారయాత్రలు, తీర్థయాత్రలు, సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్న బంధువుల ఇళ్లకు వెళుతుంటారని, ఈక్రమంలో ఇళ్లల్లో చోరీలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఊళ్లకు వెళ్లేవారు ముందస్తుగా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇళ్లకు తాళాలు వేసి ఉండటం వల్ల, పరిస్థితులను గమనించి అపరిచితులు, దుండగులు తాళాలు వేసిన గృహాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. దొంగతనాలను నివారించేందుకు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విలువైన వస్తువులు, బంగారం, వెండి ఆభరణాలను తాళం వేసిన ఇంటిలో ఉంచకుండా బ్యాంక్ లాకర్లు, ఇతర సురక్షిత ప్రదేశాల్లో భద్రపరచాలన్నారు. సమాచారం అందినప్పుడు పోలీసులు ఆ గృహాలపై ప్రత్యేక నిఘా ఉంచి రాత్రి గస్తీ సమయంలో ఆ ఇళ్లను పర్యవేక్షిస్తారన్నారు. ఎక్కడైనా అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు, 112 నెంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. ప్రజల సహకారంతోనే దొంగతనాలను సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా చోరీలను నియంత్రించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న గృహాల వివరాలను సేకరించి, రాత్రి గస్తీ తిరిగే సిబ్బంది ఆ గృహాలను పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పోలీస్ సైరన్ వేస్తూ రాత్రి గస్తీ విధులు సమర్ధవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు భద్రతా భావన కలిగించాలన్నారు. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను క్షుణ్ణంగా విచారించి, అవసరమైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వారి వేలిముద్రలను సేకరించాలన్నారు. -
బంగారం వ్యాపారిపై దాడి కేసులో నిందితుల అరెస్టు
గురజాల: వ్యాపారిపై దాడి చేసి బంగారం దొంగిలించి పరారైన నిందితులను అరెస్టు చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు తెలిపారు. గురజాల డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. వినుకొండకు చెందిన బంగారం వ్యాపారి యక్కల శ్రీనివాసరావు రెడీమెడ్ బంగారం వస్తువులు అమ్మడం కోసం ప్రతి సోమవారం కారంపూడి వస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 27వ తేదీన కారంపూడికి వచ్చాడు. మధ్యాహ్నం సమయంలో అంకాళమ్మ దేవాలయం వద్ద యూనియన్ బ్యాంకు సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా పథకం ప్రకారం అతనిపై దాడి చేసి అతని వద్ద ఉన్న బంగారం వస్తువులను తీసుకుని పరారయ్యారు. కారంపూడిలోని శివరామకృష్ణ జ్యూయలర్స్‌లో గుమాస్తాగా పనిచేస్తున్న గోసుల సాంబయ్య పన్నిన పథకం ప్రకారం నాదెండ్ల మండలం సాతులూరు గ్రామం బండారు అజిత్, గుంటూరు అంబేడ్కర్ నగర్‌కు చెందిన కాండ్రగుంట శశికుమార్, కాండ్రకుంట సాయికిరణ్, అన్నం నిఖిల్, గుంటూరులోని గుజ్జనగుండ్లకు చెందిన గోగుల పవన్, పమిడిపాడు గ్రామానికి చెందిన గోసుల సాంబయ్యలు ఒక ప్లాను ప్రకారం వ్యాపారి యక్కల శ్రీనివాసరావుపై దాడి చేసి బంగారం వస్తువులను దొంగిలించి పరారయ్యారు. ఆ ప్రాంతంలోని సీసీ పుటేజీలు ద్వారా నిందితులను పోలీసులు గుర్తించి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను కారంపూడిలోని పేటసన్నెగండ్ల కాలువ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.60 లక్షల విలువ కలిగిన 566.60 గ్రాముల బంగారం, యమహా–ఎంటీ 15, హీరో గ్లామర్ ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులను చాకచాక్యంగా పట్టుకుని అరెస్టు చేసిన పోలీసులను ఎస్పీ అభినందంచారు. సమావేశంలో డీఎస్పీ ఎంఎ మహేశ్వరరావు, సీఐ పి శరత్‌బాబు, ఎస్ఐ ఎం వాసులు పాల్గొన్నారు.


