పట్నంబజారు(గుంటూరుఈస్ట్): హనుమజ్జయంతి పురస్కరించుకుని నాజ్‌సెంటర్‌లోని ఆంజనేయస్వామి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈనెల 8 నుంచి 12వ తేదీ వరకు జరిగే జయంత్యుత్సవాల్లో భాగంగా శనివారం పంచామృత స్నపన, లక్ష తులసి పూజ నిర్వహించారు. అర్చకులు నరసింహాచార్యులు ఆధ్వర్యంలో ఈ పూజ శాస్త్రోక్తంగా చేశారు. ఈఓ టి.సుభద్ర కార్యక్రమాలను పర్యవేక్షించారు. శ్రీహనుమాన్ దీక్ష సమాజం గౌరవ అధ్యక్షుడు తిరువల్లూరి వెంకటసుబ్బారావు ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం 8 గంటలకు గ్రామోత్సవ హనుమాన్ దీక్ష సమాజం వారిచే ఊరేగింపు నిర్వహించారు. పెద్ద ఎత్తున పురవీధుల్లో దీక్ష సమాజం సభ్యులు, దీక్షాపరులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో దీక్ష సమాజం సభ్యులు నాగేశ్వరరావు, సీహెచ్ మారుతి, వెంకట రమణ, వంశీప్రసాద్, బాపిరాజు, కిషోర్, ఆలయ పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


